ఉక్కు పిడికిలి బిగుస్తోంది

విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కులి పోరాటం గడచిన 950 రోజులుగా కార్మికులు చేస్తున్నారు. అయినా మోడీ ప్రభుత్వం అమ్మేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నది. లిఉక్కు రక్షణ కోసం సి.పి.ఎం ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర 6 జిల్లాలు 1050 కిలో మీటర్లు బైక్‌ యాత్ర జరుగుతున్నదిలి. ఈ నేపద్యంలో విశాఖ ఉక్కు ను ఎందుకు కాపాడుకోవాలో..! ఒకసారి ఈ వ్యాసం చదవండి..` కె.లోకనాథ్‌
ఉక్కునగరం ఉద్యమిస్తోంది.విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అని నినదిస్తోంది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. జెండాతో పనిలేకుండా సింగిల్‌ ఏజెండాతో అన్ని పార్టీలు కదం తొక్కుతున్నాయి. కార్మిక, కర్షక, ప్రజా సంఘాలు ఏకతాటిపైకి వస్తున్నాయి. అన్ని పార్టీల నేతలు, ప్రజా సంఘాల నేతలు రోడ్డుమీదకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు. కేంద్ర నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. కేంద్రం వెనక్కి తగ్గకపోతే ఉద్యమం ఉదృతం చేస్తామని హెచ్చ రిస్తున్నారు.ఏపీలో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయం సెగలు పుట్టి స్తుంది. వైజాగ్‌ స్టీల్‌ ఫ్యాక్ట రీని ప్రయివేట్‌ పరం చేయ కుండా ఆపడం కోసం పెద్ద ఎత్తున ఉద్యమానికి రాజకీయ పార్టీలు,తెలుగు ప్రజలు సన్నద్ధం అవుతు న్నారు. ఈ విష యంలో ఒక్క బీజేపీ తప్పా అన్ని రాజకీయ పార్టీలు స్పందిస్తు న్నాయి. 32 మంది బలిదా నాలు, వందలాది మంది నిర్బంధాలు, లక్ష లాది మంది ఆందో ళనలు.. వారందరీ త్యాగాల ఫలితమే..విశాఖ ఉక్కు కర్మా గారం..ఈ ఉక్కు ప్లాంట్‌ 22వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. 17 వేల మంది పర్మి నెంట్‌, 16వేల మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులతో పాటు సుమారు లక్ష మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు.స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఒక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సాగుతున్న ఉద్య మంలో భాగంగా ఈబైక్‌ యాత్ర విజయ వంతం చేయాల్సిన అవశ్యకత ఉత్తరాంధ్ర ఆరు జిల్లాల ప్రజలపై ఎంతైన ఉంది.!
రాష్ట్రాభివృద్ధితో పాటు ఉత్తరాంధ్ర అభివృ ద్ధిలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కీలక పాత్ర పోషి స్తోంది. ఉత్తరాంధ్రలో అత్యధికంగా ఉన్న గిరిజనులకు రిజర్వేషన్ల ద్వారా ఇక్కడ ఉపాధి లభిస్తోంది. దీన్ని ప్రైవేట్‌పరం చేయడమంటే దళితులు,గిరిజనులు, బిసిలు ఉపాధి కోల్పోయి సామాజిక న్యాయం హరించుకు పోతుంది. నేటికీ ప్లాంట్‌లో ఉపాధి కోసం ఎదురు చూస్తున్న 8500 మంది నిర్వాసితుల ఆశలు అడియాశలు అవుతాయి. ప్లాంట్‌ పూర్తి స్థాయిలో నడిస్తే మరో పాతిక వేల మందికి ఉపాధి అవకా శాలు పెరుగుతాయి. దీనివల్ల ఉత్తరాంధ్ర మరింత మెరుగైన ఉపాధి అవకాశాలు పొందవచ్చు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తే ఉత్తరాంధ్ర వెనుకబాటులోకే నెట్టబడు తుంది.విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను అమ్మివేయాలని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని… తెలుగు ప్రజలు పోరాడి…32 మంది ప్రాణ త్యాగాలతో,16 వేల మంది రైతుల త్యాగ ఫలంగా సాధించుకున్న ఈ ప్లాంట్‌ను రక్షించుకుని తీరతామని… స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు, ఈ ప్రాంత ప్రజలు గత వెయ్యి రోజులుగా పోరాడుతున్నారు. అయినా కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు లేదు సరికదా దీనిని అమ్మడం సాధ్యం కాకపోతే మూసివేస్తామని పార్లమెంట్‌ సాక్షిగా కేంద్ర మంత్రి బెదిరింపులకు పూనుకున్నారు. ఆలస్యం అవుతున్న కొద్దీ ప్రజలు,కార్మికులు నీరసపడిపోయి,ఉద్యమాన్ని వదిలేస్తారని నరేంద్ర మోడీ ప్రభుత్వం భావించింది. అయితే వారి అంచనాలకు భిన్నంగా రెట్టిం చిన ఉత్సాహంతో,పట్టుదలతో కార్మికులు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి, దేశవ్యాప్తంగా కూడా వీరి పోరా టానికి మద్దతు లభిస్తోంది. మన దేశంలో ఒక ప్రభుత్వ రంగ సంస్థ పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాటానికి ఇంత విశాలమైన మద్దతు లభించడం చాలా అరుదు. విభజిత ఆంధ్ర రాష్ట్రంలోనే అతి పెద్ద పరిశ్రమగా ఉండి రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఇటువంటి సంస్థను రక్షించుకోవడం ద్వారానే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోగలం. కానీ దీనికి భిన్నంగా, చాలా విచిత్రంగా రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలైన అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి, జనసేన పార్టీలు వ్యవహరిస్తున్నాయి. అధికార వైసిపి మొక్కుబడిగా అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులిపేసుకుంది. కానీ రాష్ట్ర ప్రజలను సమీకరించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి కనీస ప్రయత్నం కూడా చేయడంలేదు. ప్రతిపక్ష టిడిపి రాష్ట్ర వైసిపిని విమర్శించడం తప్ప ప్లాంటును అమ్మేస్తామని తెగేసి చెప్పిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట కూడా అనడంలేదు. ఇక ప్రశ్నిస్తానని బయలుదేరిన జనసేన అధినేత ఆ పని వదిలేసి రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న కేంద్ర మోడీ ప్రభుత్వ పంచన చేరారు. తమలో తాము కలహించు కోవడం తప్ప రాష్ట్రానికి, ఉత్తరాంధ్రకు ఎంతో ద్రోహం చేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మాత్రం పల్లెత్తు మాట అనడానికి కూడా ఈ మూడు పార్టీలు సాహసించడం లేదు. దేశంలోనే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు బిజెపి ఎజెండాను అమలు చేసేవిగా వున్నాయి తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రయోజనాల కోసం లేవనే అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి. ఇదే అవకాశంగా భావించి కేంద్ర మోడీ ప్రభుత్వం విశాఖ పట్నం స్టీల్‌ప్లాంటును అష్టదిగ్బంధనం చేస్తోంది. ఉత్పత్తిని ఏకపక్షంగా తగ్గించి వేసింది. మూడవ బ్లాస్ట్‌ ఫర్నేస్‌ను నిలిపివేసింది. విడివిడిగా ముక్కలు చేసి అమ్మాలని కుట్రలు పన్నుతోంది. ఉన్నత స్థాయి అధికారులతో సహా ఉద్యోగుల ఖాళీలను నింపడం లేదు. రోజువారీ పనులకు అవసరమైన వర్కింగ్‌ క్యాపిటల్‌ కూడా లేకుండా చేస్తోంది. దేశంలోని ప్రైవేట్‌ రంగంతో సహా అన్ని స్టీల్‌ ప్లాంట్లకు సొంత ముడి సరుకులను, గనులను కేటాయించిన కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు మాత్రం సొంతగనులు కేటాయించడానికి ససేమిరా నిరాకరిస్తోంది. దీనికి తోడు ఇప్పటి వరకు తక్కువ ధర చెల్లించి ఇనుప ఖనిజాన్ని కొంటున్న ఛత్తీస్‌గఢ్‌ లోని ఎన్‌ఎండిసి నుండి ఇక మీదట కొనుగోలుకు అనుమతించకుండా, దూర ప్రాంతంలోని కర్ణాటక నుండి కొనుగోలు చేసుకోమని తెలిపింది. తద్వారా రవాణా ఖర్చులు పెరిగి స్టీల్‌ప్లాంట్‌ మరింత కష్టాల్లోకి నెట్టబడుతుంది. మరోపక్క విదేశాల నుండి దిగుమతి చేసుకున్న ముడి సరుకులు అన్‌లోడ్‌ చేయకుండా పక్కనే ఉన్న అదానీకి చెందిన గంగవరం పోర్టు విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ను ఇబ్బందులు పెడుతూ, పెనాల్టీలు విధిస్తోంది. ప్లాంట్‌ లోని కీలకమైన ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ప్రైవేటు పరం చేస్తున్నారు. మొత్తం ప్లాంట్‌ విలువను తగ్గించి చూపి, కారుచౌకగా తమ కార్పొరేట్‌ మిత్రులకు ధారాదత్తం చేయజూ స్తున్నారు. 1400 ఎకరాల స్టీల్‌ప్లాంట్‌ భూమిని ఇప్పటికే గంగవరం పోర్టుకు ఇచ్చేశారు. ఇప్పుడు మరలా మరింత భూమిని అమ్మేయడానికి పావులు కదుపుతున్నారు. అదానీ పోర్టుకి వెయ్యి ఎకరాల భూమిని కేటాయించాలని కేంద్ర బిజెపి ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నది.
ఈ రకంగా అన్ని విధాలుగా స్టీల్‌ప్లాంట్‌ను బలహీనపరిచే చర్యలకు కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పాల్పడుతోందని స్పష్టంగా తెలుస్తోంది. అదే సందర్భంలో ఈ కేంద్ర ప్రభుత్వ దుర్మార్గాన్ని రాష్ట్రం లోని ప్రధాన మూడు రాజకీయ పార్టీలు ఎదుర్కోలేవని, అంతే కాకుండా ఈ మూడు పార్టీలు కేంద్ర బిజెపికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహకరిస్తున్నాయని కూడా తేటతెల్లమై పోయింది. అందువల్ల పోరాడి సాధించుకున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవడం కేవలం తెలుగు ప్రజల చైతన్యం మీదనే నేడు ఆధారపడి ఉంది. తెలుగు ప్రజల పౌరుషాన్ని మరొకసారి చూపించాల్సిన సమయం ఆసన్నమైంది.
ఈ ప్లాంట్‌ను అమ్మేయడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎటువంటి సహేతుకమైన కారణం కూడా లేదు. ప్రపంచంలోనే అగ్రగామి స్టీలు ఉత్పత్తి చేసే సంస్థగా మన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉంది. అతి తక్కువ మంది కార్మికులతో దేశంలోనే అత్యధిక ఉత్పాదకత కలిగిన ప్లాంట్‌ మనదే. కేంద్ర ప్రభుత్వం పెట్టిన కేవలం రూ.4500 కోట్ల పెట్టుబడికిగాను ఇప్పటివరకు మన ప్లాంట్‌ కేంద్ర ప్రభుత్వానికి పన్నులు, ఇతర మార్గాల ద్వారా రూ.45 వేల కోట్లకు పైగా చెల్లించింది. అందువల్ల నష్టాలు వస్తున్నాయి కాబట్టి దీన్ని అమ్మేస్తున్నామనే వాదన పూర్తి అసంబద్ధం. లాభాలలో ఉన్న ప్రభుత్వ సంస్థలను కూడా తెగనమ్మడమే నేటి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానంగా ప్రకటించింది. రాష్ట్రాభివృద్ధితో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధిలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కీలక పాత్ర పోషిస్తోంది. ఒకప్పుడు ఉత్తరాంధ్ర వలస ప్రాంతంగా వుండేది. విశాఖ ఇండిస్టియల్‌ హబ్‌గా ఏర్పడిన తరువాత ఎంతో కొంత ఉపాధి అవకాశాలు కల్పించబడ్డాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని రైతులు, కూలీల కుటుం బాల నుండి అనేకమంది యువకులకు విశాఖ పట్నం స్టీల్‌ప్లాంట్‌ ఉపాధి కల్పిస్తోంది. ఉత్తరాంధ్రలో అత్యధికంగా ఉన్న గిరిజనులకు రిజర్వేషన్ల ద్వారా ఇక్కడ ఉపాధి లభిస్తోంది. దీన్ని ప్రైవేట్‌ పరం చేయడమంటే దళితులు, గిరిజనులు, బిసిలు ఉపాధి కోల్పోయి సామాజిక న్యాయం హరించుకు పోతుంది. నేటికీ ప్లాంట్‌లో ఉపాధి కోసం ఎదురు చూస్తున్న 8500 మంది నిర్వాసితుల ఆశలు అడియాశలు అవుతాయి. ప్లాంట్‌ పూర్తి స్థాయిలో నడిస్తే మరో పాతిక వేల మందికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. దీనివల్ల ఉత్తరాంధ్ర మరింత మెరుగైన ఉపాధి అవకాశాలు పొందవచ్చు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తే ఉత్తరాంధ్ర వెనుకబాటులోకే నెట్టబడుతుంది. ఇప్పటికే కేంద్ర బిజెపి ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టాన్ని సక్రమంగా అమలు చేయకుండా రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీ ఇచ్చి కూడా ఆచరణలో నిరాకరిస్తోంది. వెనుకబడ్డ ఉత్తరాంధ్ర, రాయలసీమల ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీలు ఒక ప్రహసనంగా మార్చివేసింది. ఫలితంగా ఈ తొమ్మిదేళ్ళ కాలంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి కాకపోగా మరింత వెనుకబాటులోనికే నెట్టబడిరది. పేదరికం పెరిగింది. వలసలు పెరిగాయి. ఇవి చాలదన్నట్లు రాష్ట్ర విభజన చట్టంలోని విద్యాసంస్థల నిర్మాణాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది. గిరిజన యూనివర్సిటీ నిర్మాణ శంకుస్థాపనకే ఇంత కాలం పట్టింది. ఇక నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. పెట్రో యూనివర్సిటీ ఇప్పటికీ పిట్టగోడల స్థితిలోనే ఉంది. విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్‌ కేవలం ప్రకటనలకే పరిమితమైంది తప్ప నేటికీ ఆచరణ రూపం దాల్చలేదు. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలోని విశాఖపట్నం మెట్రో రైల్‌ ప్రాజెక్టు ఊసే మరిచింది. ఈ విధంగా అన్ని రకాలుగా మన రాష్ట్రానికి, ప్రాంతానికి ద్రోహం చేస్తున్న కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఎండగట్టకపోవడం రాష్ట్రానికి, ఉత్తరాంధ్రకు అన్యాయం చేయడమే అవుతుంది. రాష్ట్రాభివృద్ధితో పాటు, ఈ ప్రాంత అభివృద్ధిలో విశేష పాత్ర పోషిస్తున్న విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను పరిరక్షించు కోవడం ద్వారానే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోగలం. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఈ పని చేయలేవని ఇప్పటికే స్పష్టమైంది. అందువల్ల తెలుగు ప్రజలు విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని పోరాడి సాధించుకున్న ప్లాంటును పరిరక్షించుకోవడానికి కూడా ప్రజలే ముందుకు రావాలి. ఈ కర్తవ్య నిర్వహణలో ప్లాంట్‌ పరిరక్షణకు విస్తృతమైన ప్రజా మద్దతు కూడగట్టాలనే లక్ష్యంతో సిపిఎం పార్టీ ఉత్తరాంధ్ర మోటార్‌ సైకిల్‌ యాత్ర చేపట్టింది. ఇచ్చాపురం నుండి పాయక రావుపేట వరకు మైదాన, పట్టణ, గిరిజన ప్రాంతాల గుండా ఈ యాత్ర ఈనెల సెప్టెంబర్‌ 20 నుండి 29 వరకు పది రోజుల పాటు సాగనుంది. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ప్రతిఘటన తప్పదని, ఇంత ద్రోహానికి పాల్పడిన నరేంద్ర మోడీ ప్రభుత్వం, వారికి మద్దతిచ్చే పార్టీలు ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదనే హెచ్చరిక ఈ యాత్ర ద్వారా ఈ ప్రాంత ప్రజలు చేయాలి.
వ్యాసకర్త : సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు(ప్రజాశక్తి సౌజన్యంతో..)

మన నైతిక విలువలెక్కడ?

ప్రతి సమాజంలో నైతిక నియమాలు (ఎథిక్స్‌) సమాజ మనుగడను ప్రత్యక్షంగా శాసిస్తాయి. సమాజంలోని ప్రతి వ్యక్తి నైతికతను పాటిస్తే సమాజం లో ఎలాంటి సంఘర్షణ, అలజడి, ఆందోళన కనపడదు. నైతిక ప్రవర్తనలు మంచి నడవడిని, సమాజ నియమాల పట్ల నమ్మకాన్ని కోరుకొంటాయి. అందువల్ల సమాజం లో నైతిక నియమాలు అనేక ప్రధాన సామాజిక నియం త్రణ సాధనాలుగా వ్యవహరిస్తాయని చెప్పవచ్చు.
ప్రస్తుతం మనం నైతిక విలువలు కన పడకుండా పోతున్న సమాజంలో ఉన్నాం.ఈ సమాజంలో మానవత్వంతో వ్యవహరించడం ఆడ,మగ అందరికీ అసాధ్యం అయిపోతోంది. ప్రభుత్వం సంగతిచూస్తే అది నిష్పక్షపాత వైఖ రితో,న్యాయబద్ధంగా, ధర్మంగా వ్యవహరిం చడం అనేది ఎప్పుడో మరిచిపోయింది. ఇక నాయకులు ప్రజలకు చేసిన వాగ్దానాలను నిలుపుకోవడంలో విఫలమౌతున్నారు. నిజానికి వాళ్ళు తమ వాగ్దా నాలను అమలు చేస్తారని ఎవరూ ఆశించడం లేదుకూడా. ఏ మాత్రం జంకు,గొంకు లేకుండా, మనస్సాక్షి అనేదే లేకుండా‘మాదే మెజారిటీ గనుక మా మాటే శాసనం’ అనే విధానాన్ని ప్రభుత్వం ఆచరిస్తోంది. ప్రాచీన నిర్మాణాలను అమూల్యమైన చారిత్రక సంపదగా పరిగణించి పరిరక్షించాల్సి నది పోయి వాటిని ఉంచాలా, కూల్చాలా అన్నది వాటిని నిర్మించిన వారి మతాన్ని బట్టి నిర్ణయిస్తు న్నారు. ఆఫీసులలో పని చేసేవారి పట్ల, ఇళ్ళల్లో నివసించేవారి పట్ల ఎలాంటి వైఖరి ఉండాలన్నది కూడా అదే మాదిరిగా నిర్ధారిస్తున్నారు. ప్రభు త్వాన్నిగాని,ప్రభుత్వపుదన్నుతో రెచ్చిపోతూ విద్వే షాన్ని రెచ్చగొట్టే ప్రదర్శనల్ని నిర్వహిస్తున్న అసాం ఘిక శక్తుల్ని గాని నువ్వు ప్రశ్నిస్తే ఇక అంతే. నువ్వే వాళ్ళకి ప్రధానలక్ష్యం అయిపోతావు. మారుమాట్లాడకుండా తల ఒగ్గడమే నేడు అనుస రించాల్సిన పద్ధతి. మానవత్వం, న్యాయం, స్వేచ్ఛ వంటివి ఇప్పుడు డీప్‌ ఫ్రీజ్‌లో ఉన్నాయి. భవిష్య త్తులో వాటిని బైటకు తెచ్చి నడిపించేదెన్నడో తెలీదు.
మారిపోతున్న విలువలు
యోగితా భయానా ఒక సామాజిక సేవకురాలు. గురుగ్రాంలో కొందరు గూండాలు ఒక ముస్లిం వ్యక్తికి చెందిన దుకాణాన్ని తగులబెడితే, దానిని తిరిగి నిర్మించుకోడానికి సహాయం చేసిందామె. ఆ సమాచారాన్ని, ఆమెకు కృతజ్ఞతలు తెలియ జేస్తున్న ఆదుకాణదారుడి వీడియో క్లిప్పింగ్‌ని సోషల్‌ మీడియాలో పెట్టారు. వెంటనే యోగితకు మొదలయ్యాయి ట్రోలింగ్‌ వేధింపులు. నష్టపోయిన వాళ్ళు మరో50,60 మంది ఉన్నారు, వాళ్ళం దరికీ కూడా పోయి సాయం చెయ్యమం టూ వెటకారంగా కొందరు కామెంట్స్‌ పెట్టారు. ఆమె ఇంటి చుట్టుపక్కల హిందూ మహిళలు ఇంకా ఉన్నారు కదా,వాళ్ళకి లేనిబాధ నీకెందుకు? అం టూ మరి కొంతమంది కామెంట్‌ చేశారు. బహు శా ఒకపది,పదిహేనేళ్ళ క్రితం ఇటువంటి సహా యాన్నే చేసివుంటే,ఆకాలంలో యోగితకు అభినం దనల పరంపర ఎదురై వుండేది. మత సామర స్యాన్ని నిలబెట్టినందుకు గౌరవం దక్కేది. కాని, ఇప్పుడాపరిస్థితి లేదు.మారిపోయింది.పాత కాల పు విలువలు ఇప్పుడులేవు.మతవిశ్వా సాలు వేరు వేరుగా ఉన్నా, అందరమూ కలిసి బతుకుదాం అన్న ఐక్యతాస్ఫూర్తిలో విశ్వాసం లేనివాళ్ళు ఇప్పు డు కోట్లలో తయారయ్యారు. ఇప్పుడు ఎవరికి వారే. పక్కవాడు ఎలాపోయినా పట్టించుకోన వసరం లేదు అన్న ధోరణి బాగా పెరిగింది. హర్యానా లోని నువాలో అనిస్‌ అనే వ్యక్తి ముగ్గురు హిందూ యువకులకు తన ఇంట రక్షణ కల్పించి వాళ్ళని వెంట తరుముతున్న మూకల నుండి కాపాడాడు.తమ ప్రాణాలు నిలబెట్టినందుకు ఆ ముగ్గురూ అతని పట్ల కృతజ్ఞత తెలిపారు. కాని, ఆమర్నాడు అనిస్‌ ఇంటిని బుల్‌డోజర్‌ తో నేల మట్టం చేసేశారు. హర్యానాలో బుల్‌డోజర్లతో విధ్వంసం చేయడం ఇప్పుడు పరిపాటి అయి పోయింది. ఆ విషయం మీద పంజాబ్‌-హర్యానా హైకోర్టు జోక్యం కల్పించుకుని ఈవిధంగా చెప్పిం ది.’ముందస్తుగా నోటీసులు ఏవీ జారీ చెయ్య కుండా,కూల్చివేతకు అనుమతించే ఉత్తర్వులు ఏవీ లేకుండా శాంతి, భద్రతల రక్షణ పేరుతో ఇలా భవనాలను కూల్చివేయడం తప్పు. శాంతి భద్రత ల సమస్య ఒక సాకుగా ఉపయోగించుకుని ఒకే మతానికి చెందిన వారి ఇళ్ళను కూల్చివేయడం జరుగుతోందా అన్న అంశాన్ని కూడా చూడాలి. కొన్ని జాతుల సమూహాలను నిర్మూలించే విధా నాన్ని ప్రభుత్వం అనుసరిస్తోందా అన్నది కూడా పరిశీలించాలి.’’
సమాజంలో నైతిక విలువల పతనం ఇదివరకే మొదలైంది.కాని మరీ ఇంత అథమ స్థితికి చేరు కోవడం గతంలో లేదు. అతి నీచంగా, పబ్లిక్‌గా ఆడబిడ్డల్ని మణిపూర్‌ వీధుల్లో అవమానపరచిన వైనం ఆ అథమ స్థితికి సూచన కాక ఇంకేమిటి? ఆ ఉదంతంపై అధికారంలో ఉన్న వారి స్పందన సంగతేమిటి?అది దేన్ని సూచిస్తోంది? ఆ బాధితు లను ఆ పాశవిక మూకలకు అప్పజెప్పినది ఆడ వాళ్ళేనంటూ ఆ దుర్మార్గాన్ని సమర్ధించే నైచ్యం దేనికి సంకేతం?కథువాలో జరిగినమరో ఉదం తం చూడండి! అక్కడ ఒక ఎనిమిదేళ్ళ ముక్కు పచ్చలారని పసిబాలికను ఘోరంగా రేప్‌ చేశారు. ఆ ఉదంతంలో నిందితులకు మద్దతుగా కొందరు జనాలు ఊరేగింపు తీశారు !
వెయ్యేళ్ళ క్రితమో,లేకుంటే నాలుగు వందల ఏళ్ళ క్రితమో ఎవరో ఒక రాజు, లేదా దండెత్తి వచ్చిన వాడు తలవంపులు తెచ్చే విధంగా వ్యవహరించా డంటూ ఇప్పుడు దానికి బాధ్యులుగా కొందరిని చేసి వారిపై దాడులకు దిగుతున్నారు.ఆ దాడు లను మనలో కొందరు సమర్ధిస్తున్నారు.కాని ఇప్పుడే,మనముందే మణిపూర్‌లో, హర్యానా లో జరుగుతున్న అన్యాయాలకు బలైపోయిన బాధి తులకు న్యాయం చేయాలని అడగడానికి మనం నోళ్ళు మెదపడం లేదు. ఫెవికాల్‌తో మన పెదవు లు అతుక్కుపోయాయి. ఎప్పుడో, ఎవరో దండెత్తి వచ్చినవాళ్ళు మన ప్రార్థనాస్థలాలను ఏ విధంగా అపవిత్రం చేశారో (ఆ ఘటనల్లో కొన్ని జరిగినవి, మరికొన్ని కేవలం కల్పితమైనవి కూడా ఉన్నాయి) చర్చించి, అప్పటి చారిత్రిక తప్పిదాలను ఇప్పుడు సరి చేయడానికి తయారయ్యాం. అది కూడా ఏ విధంగా?కొన్ని వందల సంవత్సరాల క్రితం చచ్చి పోయిన ఆ రాజు ఏ మతానికి చెందినవాడో ఆ మతానికి చెందిన ప్రార్థనా స్థలాలమీద ఇప్పుడు దాడులు చేయడం ద్వారా.అప్పుడు ఆ రాజు చేసినది తప్పు అయితే ఇప్పుడు మరి మనం చేస్తున్నదేమిటి? అదే తప్పుకాదా? ఉత్తర ప్రదేశ్‌ లో,ఢల్లీిలో,హర్యానాలో పదే పదే మసీదులమీద దాడులు జరుగుతూనే వున్నాయి. ‘’మసీదు అంటే ఏమిటి? మహా అయితే అదో కట్టడం. చాలా కట్టడాలను కూల్చివేసినట్టే వాటినీ కూల్చేస్తాం’’ అని బాబరి మస్జిద్‌ విధ్వంసం సందర్భంలో ఎల్‌.కె.అద్వానీ వ్యాఖ్యానించాడు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ జ్ఞానవాపి మసీదు వియంలో కూడా అదే వ్యాఖ్యా నం చేశాడు. జరిగినదానికి ఏ విధమైన విచారం గాని సిగ్గు గాని లేనే లేదు. ఇది చరిత్రను రీవైండ్‌ చేస్తున్నట్టు ఉంది. నైతిక దౌర్బల్యం తాండవిస్తున్న కాలం ఇది. ప్రతీ జాతీఅప్పుడప్పుడు మనో వైక ల్యానికి లోనవుతూ వుంటుంది. మన విషయంలో ఆ వైకల్యం షార్ట్‌ టర్మ్‌ అమ్నీషియా (స్వల్పకాలిక మతిమరుపు) రూపంలో వ్యక్తం ఔతున్నట్టుంది. జరుగుతున్న వాటిని మనం చూస్తూనే వున్నాం. కాని వెంటనే మరిచి పోతున్నాం. గోగూండాలు ఒక మనిషిని చితక్కొట్టి చంపేసినా, ఒక మహిళ సామూహిక అమానుషత్వానికి బలైపోయినా ఆ సంఘటనలు మన మనస్సుల్లోని జల్లెడ కన్నాల నుండి జారిపోతున్నాయి. చాలా కొద్ది విషయా లను మాత్రమే గుర్తుంచుకోగలుగుతున్నాం. రోజూ కళ్ళెదుట జరుగుతున్న నీచమైన సంఘటనలను చూసి చూసి అలసిపోయామా? బహుశా అంతే అయివుండాలి మరి. కాకపోతే మన రోజువారీ పనుల్లో మునిగిపోయి వాటిని పట్టించుకోలేక పోతున్నామా? అది కూడా అయివుండొచ్చు. కార ణం ఏదైనా,మన నుండి ప్రతిస్పందన లేక పోవడంవలన విద్వేష మూకలకి, అసహన పరులకి ధైర్యం పెరుగుతుంది. జరుగుతున్న దాడి అక్కడో మసీదు మీదనో, ఇక్కడో దుకాణం మీదనో అయితే, అంతవరకూ అయితే వాటిని అదుపు చేయవచ్చు.కాని ఇప్పుడు జరుగుతున్న దాడి అటు వంటి చెదురు మదురుదాడి కాదు.
జోక్యం కల్పించుకోకపోవడం
ఇప్పుడు త్రిశూలాలు, పలుగులు, గొడ్డళ్ళు పుచ్చు కుని దాడి చేసే మూకలు అవసరం లేదు. ఇప్పుడు బుల్‌డోజర్లు ఆ పని కానిచ్చేస్తున్నాయి. ఒక చిన్న దుకాణం నడుపుకుంటూ బతుకుతున్నవాడిపైన లేదా ఒకచిన్న ఇంట్లో కాపురం ఉంటున్న వాడ పౖిెన దాడి చేసి వాటిని కూల్చివేసినప్పుడు గతంలో అక్కడినుంచి మూకలు చెల్లాచెదురు అయిపోయేవి. కాని ఇప్పుడు ఆవిధ్వంసం ముందు దర్జాగా నిల బడి సెల్ఫీ తీసుకుంటున్నారు.వాటిని వీడి యోలు చేసి సోషల్‌ మీడియాలో పెడుతున్నారు. ఒక గోగూండా ఒక బక్కచిక్కిన పేద మీద విరుచుకు పడి, అతడిని వేధిస్తున్న వైనాన్ని, ప్రయోగిస్తున్న తిట్లను రికార్డు చేయిస్తున్నాడు. రైలులో ఒక పోలీ సు జవాను తన పై అధికారిని, మరో ముగ్గురు ముస్లిం ప్రయాణికులను కాల్చి చంపి, ఆ తూటా లకు బలై కొనవూపిరితో వాళ్ళు అతగాడి బూట్ల కింద కొట్టుమిట్టాడుతూ వున్నప్పుడే అక్కడే ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అందులో ప్రధాని నరేంద్ర మోడీకి, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కి జేజేలు పలికాడు. జనాలు కూడా జరుగుతున్న దారుణాన్ని ఆపే ప్రయత్నం చేయడం కన్నా దానిని వీడియోగా తీయడమే ప్రధానం అనుకుంటున్నారు. ఇక బుల్‌డోజర్‌ బాధితులు తమపై జరిగే దుర్మార్గాన్ని తామే కళ్ళారా చూస్తూ నిస్సహాయంగా ఉండిపోతున్నారు. కళ్ళ ముందే తాము కట్టుకున్న ఇల్లు ఒక్కో ఇటుకా, ఒక్కో రాయీ రాలి పడుతూంటే బిక్కచచ్చి కూలబడుతు న్నారు. మరోపక్క మీడియాలో కూడా కొందరు ఆ విధ్వంసాన్ని చూపిస్తూ క్షణాల్లో ‘న్యాయం’ ఏ విధంగా జరిగిందో చెప్తూ కీర్తిస్తున్నారు. బుల్‌ డోజర్ల విధ్వంసంలోని క్రూరత్వాన్ని,మూక దాడుల హత్యల్లోని ఆటవికతను, దేశ ప్రజల్లో ఒక పెద్దభాగం పశుప్రాయులుగా దిగజారి ప్రవర్తించడాన్ని మనం అందరం చూస్తున్నాం. ఏమీ పట్టనట్టు, లేదా ఇది రోజూ జరుగుతున్న దేలే అన్నట్లు చూస్తున్నాం.సామాజిక స్పృహ లేకుం డా బతికేయడం నేటి ప్రజానీకానికి అలవా టైపో యింది మరి!
నైతికతే శాంతిసమాజ నిర్మాణ పునాది
నైతిక విలువలు మన ఆలోచనలు, ప్రవర్తన మరియు నిర్ణయం తీసుకోవటానికి మార్గ నిర్దేశం చేసే నైతికతను కలిగి ఉంటాయి, ముఖ్యం గా నైతిక లేదా సామాజిక సందిగ్ధతలకు వచ్చిన ప్పుడు. నైతిక విలువలు సాంస్కృతిక భేదాలు, సామాజిక నిబంధనలు లేదా మతంలో లోతుగా పొందుపరచబడి,సమాజంలో ఒకరి స్థితిని నిర్వ చించే సమాచారంతో కూడిన ఎంపికలు చేయ డంలో సహాయపడే సరైన లేదా తప్పుపై వైఖరిని స్థాపించడానికి.పిల్లలకోసం, ఈ విలువలు సామా జిక బాధ్యత, తాదాత్మ్యం మరియు నైతిక నిర్ణయా త్మక నైపుణ్యాలను పెంపొందించడానికి అవస రం. బాల్య వికాస సమయంలో నైతిక విలువ లను పరిచయం చేయడం అనేది యుక్త వయస్సు లో యుక్తవయస్సులో భవిష్యత్తు వృద్ధి పథాన్ని రూపొందించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇతరులతో గౌరవప్రదంగా ప్రవర్తించేటప్పుడు మంచిగా లేదా పేలవంగా ప్రవర్తించడం వంటి ప్రాథమిక భావనలను అర్థం చేసుకోవడం వ్యక్తి గత ఎదుగుదలకు మాత్రమే కాకుండా సామాజిక సందర్భంలో కూడా అవసరమైన నైపుణ్యాలు.
-(జియా ఉస్‌ సలామ్‌)

ఆదివాసుల హక్కులకు రక్షణ కావాలి

‘‘ ఆదివాసీల హక్కులను గుర్తించేందుకు కేంద్ర బిజెపి ప్రభుత్వం నిరాకరిస్తున్నది. అడవులపై వారు సాధించుకున్న హక్కులను తొలగించి కార్పొరేట్‌ కంపెనీలకు ప్రవేశం కల్పించింది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటినా ఆదివాసీలు తిండి కోసం వలసలు పోవాల్సి వస్తోంది. వీరు విద్య, వైద్య సదుపాయాలు, ఉపాధి లేక దుర్భర జీవితం అనుభవిస్తున్నారు.ప్రపంచ వ్యాప్తంగా 40దేశాలలో సుమారు 40కోట్ల మంది ఆదివాసీ లు జీవిస్తున్నారు. ఆదివాసీల హక్కులను గుర్తిం చాలని 1994 ఆగస్టు 9నఐక్యరాజ్య సమితి డిక్ల రేషన్‌ పేర్కొంది.ఆదివాసీల హక్కులను గుర్తించ డానికి మాత్రం ప్రభుత్వాలు నేటికీ నిరా కరిస్తు న్నాయి. భారత దేశంలో 10కోట్ల మంది ఆది వాసీ ప్రజలు జీవిస్తు న్నారు. 700వందల ఆది వాసీ,75 ఆదిమజాతి తెగల హక్కులను గుర్తిం చేందుకు కేంద్ర బిజెపి ప్రభుత్వం నిరాకరి స్తున్నది. అడవులపై వారు సాధించుకున్న హక్కు లను తొలగించి కార్పొరేట్‌ కంపెనీలకు ప్రవేశం కల్పిం చింది. స్వాతంత్య్రం వచ్చి75ఏళ్లు దాటినా ఆది వాసీలు తిండికోసం వలసలు పోవాల్సి వస్తోం ది. వీరు విద్య, వైద్య సదుపాయాలు,ఉపాధి లేక దుర్భర జీవితం అనుభవిస్తున్నారు.’’
భారత రాజ్యాంగం5,6షెడ్యూల్‌ ప్రాంత అడవులలో నివసిస్తున్న ఆదివాసీలకు అక్కడి సహజ వనరులపై హక్కు కల్పించింది. ఆదివాసీలకు,గ్రామ సభలకు సర్వ అధికారాలు కల్పించింది.అయితే ఆదివాసీప్రాంతంలో ఉన్న అపారమైన సహజ వనరులను బడా కంపె నీలకు ధారాదత్తం చెయ్యడానికి,ఆదివాసీ ప్రాంత అడవు లను అదానీ,అంబానీ పరం చేయడానికి, విలు వైన బొగ్గు,బాక్సైట్‌,కాల్సైట్‌,లేటరైట్‌,మాంగనీస్‌, యురేనియం,గ్రానైట్‌,ఐరన్‌ ఓర్‌,వనమూలికలు, వృక్ష జంతు సంపదను ప్రైవేట్‌ బడా సంస్థలకు అప్పజెప్పడానికి కేంద్ర బిజెపి ప్రభుత్వం చెయ్యని ప్రయత్నం లేదు.ఆదివాసీల అభిప్రాయాలు, ప్రతి పక్ష పార్టీల అభ్యంతరాలను పట్టించుకో కుండా ఏకపక్షంగాఅటవీ సంరక్షణ చట్ట సవరణ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదింపచేసుకుంది. ఆదివాసీ ప్రాంతంలో ప్రవేట్‌ బడా సంస్థల ప్రవేశానికి తలుపులు బార్లా తెరిచింది.ఆదివాసీ ప్రాంతం లో ఆదివాసీలకు అడవులపై ఉన్న హక్కులను తొలగించింది.దీనివలన ఆదివాసీలకు తీవ్ర నష్టం జరుగుతుంది. ఇప్పటివరకూ ఆదివాసీలు సహజ సిద్ధంగా అటవీ ఫలసాయం పొందేవారు. ఇప్పుడది నేరం అవుతుంది. ఆదివాసీల అడవు లు, భూమి, సహజ వనరులకు రక్షణగా ఉన్న గ్రామసభకు అటవీ హక్కులు,1/70తదితర చట్టా ల అధికారాలు లేకుండా చేసింది. తక్షణమే ఈ సవరణ చట్టాన్ని రద్దు చేసి ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసీలకు అడవులు,భూమి,సహజ వనరులపై హక్కులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి.
జీవో నెం 3 అమలు చెయ్యాలి
ఆదివాసీ ప్రాంత గిరిజన హక్కులు, చట్టాల అమలుకు రాష్ట్రపతి, రాష్ట్ర గవర్నర్లకు భారత రాజ్యాంగం విస్త్రుతమైన అధికారాలు కల్పించింది.5వ షెడ్యూల్‌ ప్రాంతంలో ఆదివాసీ లకు వందశాతం రిజర్వేషన్‌ కల్పిస్తున్న జీవో 3 అమలు చేసి 20రకాల విభాగాలలో ఉపాధి కల్పించింది.అంతటి కీలకమైన జీవో నంబర్‌ 3ను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో ఆదివాసీ ప్రాం తంలో రిజర్వేషన్‌ ప్రశ్నార్థకంగా మారింది. రాజ్యాంగం ఆదివాసీలకు కల్పించిన రిజర్వేషన్లు, హక్కులను రద్దు చేసినట్లయింది. గిరిజనేతర జాతులైన బోయ వాల్మీకులకు ఆదివాసీలుగా గుర్తింపు కల్పించి రాజకీయ లబ్ధి పొందేందుకు కేంద్ర బిజెపి,రాష్ట్ర వైసిపి ప్రయత్నిస్తున్నాయి. ఆదివాసీ ప్రాంత అడవులు,సహజ వనరులను బడా కార్పొరేట్‌ కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నా యి. తక్షణమే జీవో నంబర్‌ 3అమలుకు చర్యలు తీసుకోవాలి. షెడ్యూల్డ్‌ ప్రాంతంలో ఆదివాసీలకు వంద శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి.
పోలవరం బాధితులకు సహాయక చర్యలు
గత సంవత్సరం జులై 11న వచ్చిన గోదావరి వరద వల్ల అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలకు చెందిన కూనవరం, వరరామ చంద్రాపురం, దేవీపట్నం, ఎటపాక, చింతూరు, కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం మండ లాల్లోని 200 గ్రామాలు పూర్తిగా నీట మునిగి పోయాయి. వంద రోజులపాటు ఈ గ్రామాలు వరద నీటిలో ఉన్నాయి. పోలవరం వద్ద కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణంవల్ల నీరు వెనక్కి తన్ని ఈ జల ప్రళయం సంభవించింది.ఈ మండలాల్లోని ఊళ్ళకు ఊళ్ళు నీట మునిగిపోయాయి. వేలాది కుటుంబాలవారు కొండలు, గుట్టలు ఎక్కి వారాల తరబడి అక్కడే నానా అగచాట్లు పడ్డారు. రెండు నెలల తర్వాత గ్రామాలకు చేరుకున్నారు. అదే పరిస్థితి నేటివరదల సమయంలో మరలా పునరావృతం అయ్యింది. మునక మండలాల గ్రామాలు గోదావరి, శబరి నదుల వరద వల్ల జల దిగ్బంధనంలో ఉన్నాయి. వరద ముంపు సమస్యపై సత్వరం ప్రభుత్వం స్పందించాలి. ముందస్తు చర్యలు తీసుకోవాలి.
1.గోదావరి వరద ముందస్తు చర్యలు సత్వరం తీసుకోవాలి.2. వరద బాధితులకు నిత్యావసర సరుకులు వెంటనే అందించాలి.3.వరద గ్రామా ల నుండి బాధితులను తరలించేందుకు వాహ నాలు ఏర్పాటు చేయాలి. పడవలు, లాంచీలు సిద్ధం చేయాలి.4.వరద బాధిత గ్రామాల ప్రజలు తాత్కాలిక గుడారాలు నిర్మించుకోవడానికి ప్రతి కుటుంబానికి టార్పాలిన్లు ఇవ్వాలి.5. ప్రత్యామ్నా య రహదారులను పునరుద్ధరించాలి.రోడ్లను మరమ్మతు చేయాలి.6.పాఠశాలలు మూత పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. 7.చింతూరులో ఐటిడిఎ ప్రాజెక్టు ఆఫీసరును వెంటనే నియమించాలి.
షెడ్యూల్‌ ప్రాంతంలో నాన్‌ షెడ్యూల్‌ ఆదివాసీ గ్రామాలు కలపాలి
రాష్ట్ర వ్యాప్తంగా1500ఆదివాసీ గ్రామాలను షెడ్యూల్‌ ప్రాంతంలో కలపాలి. షెడ్యూల్‌ ప్రాంతంలో లేనందున అక్కడ నివసి స్తున్న ఆదివాసీల భూములు, అడవులకు రక్షణ లేదు.గిరిజనేతర పెత్తందారులు,మైనింగ్‌ మాఫి యా మధ్య ఆదివాసీలు నలిగిపోతున్నారు. ఐటిడిఎ పర్యవేక్షణ, పథకాలు, నిధులు అందక… ఆదివాసీ గ్రామాలకు విద్య, వైద్యం ఉపాధి, మంచి నీరు,రోడ్లు తదితర మౌలిక సదుపాయాలు అందు బాటులోలేక…బిక్కు బిక్కుమంటూ గడుపుతు న్నారు.తక్షణమే నాన్‌ షెడ్యూల్‌ ఆదివాసీ గ్రామా లను షెడ్యూల్‌ ప్రాంతంలో కలపాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలి.
యుసిసి ని వ్యతిరేకిద్దాం
రాజ్యాంగం ఆదివాసీలకు ప్రత్యేక శాసనాలు చేసింది. వారి సంస్కృతి, ఆచారాలను గుర్తించింది. అయితే కేంద్ర బిజెపి ఆదివాసీలపై హిందూ భావజాలాన్ని రుద్దేందుకు, ఆదివాసీల ప్రత్యేక శాసనాలు, సంస్కృతి ఆచారాలు తొలగిం చేందుకు ఏకరూప పౌర స్మృతి (యుసిసి)ని అమలు చేయాలని చేస్తున్నది. ఆదివాసీ ప్రాంతం లో యుసిసి అమలును వ్యతిరేకించాలని ఆదివాసీ గిరిజన సంఘం పిలుపు ఇస్తున్నది.
హక్కుల దినోత్సవం ప్రాధాన్యత :
యుఎన్‌ఓ 1982 లో ప్రపంచంలోని ఆదివాసీలను విశ్వమానవులుగా గుర్తించినపుడు, వారికున్న ప్రత్యేక హక్కులను రక్షణ కల్పించాల్సిన బాధ్యతను ఈ హక్కుల దినోత్సవం గుర్తుచేస్తుంది. ఈ కమిటీ గుర్తించిన ముఖ్యమైన అంశాలు రాజకీయ,సామాజిక,ఆర్థిక సాధికారత, సంస్కృతి, సాంప్రదాయాలు,చరిత్ర,వేదాంతశాస్త్రం, వార సత్వ భూమి హక్కులు, స్థానిక వనరులు, అలాగే అన్ని రకాల వివక్షలు మొదలైన వారి హక్కులను రక్షించాల్సిన అవసరం ఉందని, వాటిని గౌరవిస్తూ ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని ఆ సమా వేశంలో తీర్మానించిన అంశాలను వెల్లడిర చిన అంతర్జాతీయ మానవ హక్కుల కౌన్సిల్‌ ను అనుస రిస్తూ సెప్టెంబర్‌ 13ను అంతర్జాతీయ ఆది వాసీ హక్కుల దినోత్సవంగా గుర్తించడం జరిగింది.
46 రకాల హక్కులను కల్పించి
ఈ డిక్లరేషన్‌ లో మొత్తం 46 ప్రకర ణలు పొందుపరిచారు.ఈ 46ప్రకరణలలో ముఖ్యమైనవి మచ్చుకు కొన్ని…(1):ప్రపంచ మానవ హక్కుల చట్టం ప్రకారం,ఆదివాసీలు స్వేచ్ఛగా మానవహక్కులు, ప్రాథమి క హక్కులను కలిగి వాటిని ఆనందంగా అనుభవించాలి. ఎటు వంటి వివక్షకు గురికావద్దు. అధికరణ(2): ఆదివాసీలు ఎటువంటి వివక్ష లేకుండా ఇతరులతో పాటు సమానంగా హక్కు లను అనుభవించాలి.
అధికరణ (3): ఆదివాసీలు సంకల్పంతో వారి ఇష్ట ప్రకారం, రాజకీయ, ఆర్థిక, సామాజిక మరియు సాంస్కృతిక అభివృద్ధికి తోడ్పడు అంశా లను వారి ఇష్టమైన రీతిలో నిర్వహించుకొని అభివృద్ది చెందవచ్చు.
అధికరణ (4): వీరు స్వయం ప్రతిపత్తి, స్వయం పాలనను వారి అంతరంగిక స్థానిక అంశాలలో నిర్వహించుకోవచ్చు. అదే విధంగా ఆర్థిక వనరు లు,సముపార్జనను వారుఇష్టమైన రీతిలో నిర్వ హించుకోవచ్చును.
అధికరణ(5): ఆదివాసీలకు రాజకీయంగా, ఆర్థికంగా,చట్టాలను బలోపేతం చేసుకునే అధికా రం కలదు.
అధికరణ(6): ప్రతి ఆదివాసీ ఏ దేశంలో నివసి స్తున్నప్పటికీ ఆదేశ పౌరసత్వము పొందే ఉండే హక్కును కలిగి ఉంటాడు.
ఆధికరణ(7):ప్రతి ఆదివాసీ మానసిక సమత గ్రతలో జీవితంలో స్వేచ్ఛ,రక్షణ హక్కును కలిగి ఎటువంటి మారణ హోమానికి గురికాకుండా, వృక్తిగతంగా,సమూహంగా,రక్షణతో కూడిన శాంతి,రక్షణ కలిగి బలవంతపు చర్యలు వీరిమీద, పిల్లల లేకుండా ఉండే హక్కు.
అధికరణ(8): జాతిపరంగా రెచ్చగొట్టే చర్యలు, వివక్ష ఉండకూడదు. వారి సంస్కృతి, సాంప్రదా యాలు రక్షణ కలిగి విలువలు కలిగి ఉండాలి. భూమిపై హక్కులు కాలరాయకుండా, వనరుల దోపిడి జరగకుండా బాధ్యతాయుతమైన యంత్రాం గాన్ని ఆయా రాష్ట్రాలే కల్పించాలి.
అధికరణ(9):ఆదివాసీలు సంస్కృతి, సాంప్ర దాయులకు అనుగుణంగా ఏదైనా జాతీయతను కలిగి వుండవచ్చును. వీటిపై ఎట్టివివక్ష చూ పరాదు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మన ఆది వాసీ సమాజాలకు ఆగస్టు 9 ఆదివాసీ దినోత్సవం గురించి తెలిసినంతగా ఆదివాసీ హక్కుల దినం గురించి తెలియక పోవడానికి కారణం నేటి ప్రభు త్వాల అలసత్వం.ఐక్యరాజ్య సమితి సూచన మేరకు దేశ మంతటా ఆదివాసీల హక్కులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రక్షణ కల్పించాలి.
వ్యాసకర్తలు :ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,తెలంగాణ ఆదివాసీ రచయి తల వేదిక, వ్యవస్థాపక కార్యదర్శి.(కిల్లో సురేంద్ర/గుమ్మడి లక్ష్మీ నారాయణ)

రాజకీయాలు`దళితుల దుస్థితి

స్వయం సేవకుల (కార్యకర్తలు) విస్తారమైన నెట్‌వర్క్‌తో ఆర్‌ఎస్‌ఎస్‌, దళిత సమాజంలో ఎన్నికల పునాదిని ఏర్పరుచుకున్నది.దళితుల్ని హిందువులుగాను,ఇతర పార్టీలు ముస్లింలను బుజ్జగించేవిగాను ఎన్నికలకు ముందు ‘ఆర్‌ఎస్‌ఎస్‌ పరివారం’ ప్రచారం చేస్తుంది. ఉత్తరప్రదేశ్‌లో ఇదే జరిగింది. ఎన్నికల ఇంటింటి ప్రచారంలో,హిందువుల ప్రయోజనాలు కాపాడే పార్టీ, ముస్లింలను సంతృప్తిపరచని పార్టీ బిజెపి మాత్రమేనని దళితుల్లో ప్రచారం సాగింది.ఈ వ్యూహం ద్వారా ఎస్సీలకు రిజర్వ్‌ అయిన స్థానాల్లో విజయం సాధించింది.
‘సబ్‌ కా సాథ్‌, సబ్‌ కా వికాస్‌’ (అంద రినీ కలుపుకొని అందరి అభివృద్ధి) అని భారతీయ జనతా పార్టీ నినాదమిస్తుంది కానీ సమాజంలో బడుగు బలహీన వర్గాల పరిస్థితి రోజురోజుకూ మరింతగా దిగజారుతున్నది. మెజార్టీ మతవాద రాజకీయాలకు ముస్లింలు ప్రధాన లక్ష్యంగా ఉం డగా,దళితులను అణచివేయడం కూడా అంతే సమానమైన ప్రధాన అంశం.ఓవైపు దళితుల సామా జిక,ఆర్థికపరిస్థితులు దిగజారుతుండడం, మరోవైపు దళితులకు బిజెపి,ఎన్నికలపరంగా దగ్గరవుతున్న విడ్డూర పరిస్థితులు పెరుగుతుండడం చూస్తున్నాం. ఈ ఆధిపత్య రాజకీయాలకు మూల విరాట్టుగా దళితుల్ని హిందూ జాతీయవాద స్రవంతిలోకి చేర్చుకోవాలనిచెప్పే రాష్ట్రీయస్వయం సేవక్‌ సంఫ్న్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌)ప్రభావం కూడా పెరుగుతున్నది. పందొమ్మిదవ శతాబ్దం మధ్యకాలంలో హిందూ మతంలో అణచివేతకు గురైన ప్రజల విద్య, ఇతర హక్కుల కోసం పాటుపడిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే ‘దళితుడు’ అనే పదాన్ని రూపొందించాడు. స్వామి వివేకానంద ‘’భారతదేశ భవిష్యత్తు’పై చేసిన ప్రసంగంలో ఆసక్తికరమైన విషయాన్ని పేర్కొన్నారు. ఇంతకు ముందు ఈ వర్గాల ప్రజలు చాలామంది కులవ్యవస్థ అణచి వేత కారణంగా ఇస్లాం మతాన్ని స్వీకరించారని ఆయనన్నారు.సామాజిక సమానత్వం,ఆర్థిక న్యా యం, అందరికీ తాగునీటి బావుల అనుమతి, దేవాలయాల్లోకి ప్రవేశించే హక్కు కోసం బి.ఆర్‌. అంబేద్కర్‌ చేపట్టిన అనేక అవిశ్రాంత పోరాటాల ద్వారా,ఇండిపెండెంట్‌ లేబర్‌ పార్టీ(1935) స్థాపన ద్వారా కొద్దిగా సానుకూల ఫలితాలు లభిం చాయి. విద్య, ఉద్యోగాలు, ఎన్నిక ల రంగంలో దళితులకు రిజర్వేషన్ల ద్వారా అవకాశాలు కల్పించే నిర్ణయా త్మక చర్యల కోసం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. దళితుల జీవితాల్లో దీనివల్ల కలిగిన ప్రభావం, కొద్ది మేరకు సంభవించిన మార్పులు నత్తనడకన సాగాయి. గడిచిన కొన్ని దశాబ్దాలలో దళితుల పరిస్థితులు మరీ అధ్వాన్నంగా మారాయి. వివిధ ఆర్థిక, సామాజిక, రాజకీయ సూచికలు ఈ క్షీణిం చిన పరిస్థితుల్ని తెలియజేస్తున్నాయి.‘నేషనల్‌ కొయలేషన్‌ ఆఫ్‌ స్ట్రెందెనింగ్‌ ఎస్సీస్‌ అండ్‌ ఎస్టీస్‌’ నివేదిక ప్రకారం షెడ్యూల్డ్‌ కులాల వారిపై నేరాలు 2021లో1.2 శాతం పెరిగాయి. అదే సంవత్స రంలో ఉత్తరప్రదేశ్‌లో ఎస్సీలపై అత్యాచారాలు అత్యధికంగా 25.8శాతం నమోదుకాగా,రాజ స్థాన్‌ 14.7శాతం, మధ్యప్రదేశ్‌ 14.1శాతంతో ఆ తరువాతి స్థానాల్ని ఆక్రమించాయి. బిజెపి హిం దూత్వ ఎజెండాతో సమాజాన్ని రెండుగా విభజించ డానికి, అట్టడుగు వర్గాలు ఎదుర్కొంటున్న ప్రధాన మైన సమస్యల్ని పక్క దోవపట్టించేందుకు అస్థిత్వ సమస్యల్ని లేవనెత్తుతున్నది. గోరక్షక దళాలు ముస్లిం సమాజాన్ని లక్ష్యంగా చేసుకొని, మూకదాడులతో మనుషుల ప్రాణాలు తీయడం నిత్యకృత్యమై పోయింది. ఈ ప్రచారాలతో రెచ్చిపోయిన మూకల ఆగ్రహానికి ప్రధానంగా బలవుతున్నది ముస్లిములై నప్పటికీ దళితులు సైతం పెద్ద సంఖ్యలో హత్యగా వించ బడుతున్నారు. ఉనా లో జరిగిన భయానక ఘటన వాస్తవంగా ఏం జరుగుతున్నదో మనకు తెలియచేస్తున్నది. చారిత్రక తప్పిదాలను సరిదిద్ద డానికి దళితులకు రిజర్వేషన్ల కల్పన ఒక సాధ నంగా వున్నమాట నిజమే కానీ, బిజెపి అధికారం చేపట్టిన నాటి నుండి ఇది కూడా దెబ్బతింటున్నది. ఆర్థిక ప్రాతిపదికపై రిజర్వేషన్లను ప్రవేశపెట్టడం ద్వారా వాటి లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నం జరుగు తున్నది. కేవలం 5 శాతం శ్రామిక దళిత జనాభా మాత్రమే రిజర్వేషన్ల నుండి ప్రయోజనం పొందు తున్నారని సామాజిక శాస్త్రవేత్త, సుఖ్‌దేవ్‌ థోరట్‌ అభిప్రాయపడ్డాడు. అస్పష్టమైన ఆర్థిక ప్రాతిపదికతో దళితేతరులకు రిజర్వేషన్ల కల్పించడంకూడా వారి అవకాశాల అందుబాటును కుదించేస్తుంది. ‘క్రీమీ లేయర్‌’ (మెరుగైన దొంతర)ను ప్రవేశపెట్టడం, కుటుంబాలలో వ్యక్తుల ఆదాయాల్ని కలగాలపు లగం చేయడం రిజర్వేషన్లకు ఒక వర్గాన్ని దూరం చేయడానికి దారి తీస్తుంది. 2018లో యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యుజిసి),అన్ని కళాశాలల్లో 700 ఖాళీలు ఉన్నాయని ఓ సర్క్యులర్‌ జారీ చేసింది. ఆ సర్క్యులర్‌లో దళిత అభ్యర్థులకు కేవలం 2.5 శాతం పోస్టులు కేటాయించగా, ఎస్టీ అభ్యర్థులకు అసలు ఎలాంటి పోస్ట్‌లు రిజర్వ్‌ కాలేదు. ఇలాంటి చర్యలే ఈవర్గాలను మరింత దుస్థితిలోకి నెడు తున్నాయి.
ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రణాళిక
భారతీయ జనతా పార్టీ ప్రతీ సందర్భం లోను దళితుల హక్కులు, నిబంధనలను నిర్వీర్యం చేసేందకు ప్రయత్నిస్తున్నదని స్పష్టంగా తెలుస్తోంది. ఇది అర్థం కావాలంటే బిజెపి మాతృసంస్థ అయిన ఆర్‌ఎస్‌ఎస్‌ చరిత్రను,అది ఏ పరిస్థితుల్లో స్థాపించ బడిరదో క్లుప్తంగా తెలుసుకోవాలి. వలస పాలనా కాలంలో భారతదేశంలో సామాజిక సంస్కరణల ప్రక్రియ పుంజుకోవడం, దళితుల్లో విద్యను ప్రోత్స హించడానికి జ్యోతిరావు ఫూలే చేసిన ప్రయత్నాలు, ఆ తరువాత సామాజిక సమానత్వం కోసం అంబే ద్కర్‌ చూపిన చొరవ దళితుల్లో మరింత సామాజిక అవగాహనకు, స్పృహకు దారితీసింది. ఈ అవగా హనే 1920లలో మహారాష్ట్రలోని విదర్భలో’ బ్రాహ్మణేతర ఉద్యమానికి’’బాట వేసింది, ఈ విధమైన మార్పులను అగ్రకులాలకు చెందిన వారికి మింగుడుపడలేదు. ఆర్‌ఎస్‌ఎస్‌ స్థాపనకు దారితీ సిన కారణాలలో అదీ ఒకటి. హిందూ రాష్ట్ర ఎజెండా ఓవైపు ముస్లింలను, క్రైస్తవులను ‘విదేశీ యులుగా’ పేర్కొంటూనే, మరోవైపున దళితులను బానిసలుగా పరిగణించిన మనుస్మృతి చట్టాల గురించి అదే పనిగా మాట్లాడ్డం మొదలుపెట్టింది. సమాజంలో సమానత్వం కోసం జరిగిన ప్రతి ఉద్యమాన్నీ అగ్రకులాలకు చెందిన వారు వ్యతి రేకించారు.భారత రాజ్యాంగం ఏర్పడినప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌,దాని మద్దతుదార్లు రిజర్వేషన్ల నిబంధ నలను తీవ్రంగా వ్యతిరేకించారు.రిజర్వేషన్ల అమలు చేయడం, ప్రభుత్వ రంగంలో విస్త్రతంగా ఉద్యో గాలు కల్పించడంవల్ల దళితులు సామాజిక రంగం లోకి రావడం మొదలైంది.1980లో దళిత సమా జం, సమానత్వం వైపు సాగించిన యాత్రను వ్యతి రేకించడంతోపాటు అహ్మదాబాద్‌లోదళిత వ్యతిరేక హింస కూడా చోటుచేసుకుంది. 1990లో మండల్‌ కమిషన్‌ నివేదికను అమలు చేయడంతో రథ యాత్రకు భారీ ఊపు లభించి,1992లో బాబ్రీ మసీదు కూల్చివేతకు దారితీసింది. వీటన్నిటి ద్వారా బిజెపికి పెద్దఎత్తున ఎన్నికల్లో పైచేయి సాధించ డానికి మార్గం తెరుచుకుంది. అదే సమయంలో బిజెపి ఆధిపత్య రాజకీయాలు,ఓవైపు దళిత సమా జాన్ని తొక్కిపడుతూనే వారిని సామాజిక, రాజకీయ, ఆర్ధిక స్థాయిలో ఆకర్షించేందుకు పనిచేశాయి. దళితులలో పని చేసేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ ‘సామా జిక సామరస్య వేదిక’ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ కుల వ్యవస్థను దెబ్బ తినకుండా ఆ పరిధిలోనే ‘’హిందూ ఐక్యత’’ కాపాడుకోవాలనే సందేశాన్ని చ్చింది. అంబేద్కర్‌ ‘’కుల నిర్మూలనకు’’ విరుద్ధంగా ఈ సంస్థ భిన్న కులాల మధ్య సామరస్యాన్ని పెంపొందించడానికి దళితుల్లో పని చేసింది. సోషల్‌ ఇంజనీరింగ్‌ ద్వారా దళిత సమాజంలో కొంత భాగాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ తిప్పుకోగలిగింది. దళితుల్ని మంచి చేసుకోవడానికి యు.పిలో సుహే ల్‌దేవ్‌ లాంటి ముఖ్యమైన దళిత వ్యక్తులను తీసుకొచ్చి, ముస్లిం వ్యతిరేకతను కూడా ఎక్కించడం మొదలు పెట్టింది. ఇది ఒక దెబ్బకు రెండు పిట్టలు వ్యవహారమే. దళితులను ప్రసన్నం చేసుకునేందుకు వారి ఇళ్ళలో బిజెపి భోజనాల తంతుతో,వారిలో ఒక వర్గాన్ని ఆకట్టుకుంది. ‘’సంస్కృతీకరణ’’ అనబడే ఈ తతంగం బాగా ప్రచారమైంది. స్వయం సేవ కుల (కార్యకర్తలు) విస్తారమైన నెట్‌వర్క్‌తో ఆర్‌ఎస్‌ ఎస్‌,దళిత సమాజంలో ఎన్నికల పునాదిని ఏర్పరు చుకున్నది. దళితుల్ని హిందువులుగాను, ఇతర పార్టీలు ముస్లింలను బుజ్జగించేవిగాను ఎన్నికలకు ముందు ‘ఆర్‌ఎస్‌ఎస్‌ పరివారం’ ప్రచారం చేస్తుంది. ఉత్తరప్రదేశ్‌లో ఇదే జరిగింది. ఎన్నికల ఇంటింటి ప్రచారంలో, హిందువుల ప్రయోజనాలు కాపాడే పార్టీ, ముస్లింలను సంతృప్తిపరచని పార్టీ బిజెపి మాత్రమేనని దళితుల్లో ప్రచారం సాగింది. ఈ వ్యూహం ద్వారా ఎస్సీలకు రిజర్వ్‌ అయిన స్థానాల్లో విజయం సాధించింది. ఇలాంటి వ్యూహాలతో బిజెపి 2014 సాధారణ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌ లోని మొత్తం84 సీట్లకు గాను 44 సీట్లను గెలుచు కుంది.
దళిత ముస్లిం సమస్య
ఇస్లాం మతాన్ని స్వీకరించిన దళితు లకు, రిజర్వేషన్లు కల్పించాలా,వద్దా అన్న మరో చర్చ ప్రాధాన్యతను సంతరించుకున్నది. ‘’దళిత ముస్లింలు’’ రెండు రకాల ఆగ్రహాన్ని ఎదుర్కొనాల్సి వస్తుంది.ముస్లింలుగా వారు మతపరమైన హింసను ఎదుర్కొంటున్నారు.దళితులుగా రిజర్వేషన్ల ప్రయో జనాలు పొందలేకపోతున్నారు. ‘ఇస్లాంలో కుల వ్యవస్థ ఉండదు, అందరూ సమానమే అని విశ్వసి స్తారు కాబట్టి వారికి రిజర్వేషన్లను ఎందుకు కల్పిం చాల’ని అనేకమంది దళిత రచయితలు, మేథావులు వాదిస్తున్నారు. ఖురాన్‌లో కుల వ్యవస్థను అనుమ తించలేదని కూడా వారు అంటున్నారు. ప్రముఖ దళిత మేథావులైన దిలీప్‌ మండల్‌, సూరజ్‌ యెంగ్డేలు ముస్లిం దళితులకు రిజర్వేషన్లను వ్యతిరేకి స్తున్నారు. ఇస్లాం పవిత్ర గ్రంథాల ప్రకారం, ఇస్లాం లో కుల వ్యవస్థ లేదు కాబట్టి రిజర్వేషన్ల వర్తింపులో దళిత ముస్లింలను పరిగణలోకి తీసుకోకూడదని వారు వాదిస్తున్నారు. మత గ్రంథాలు చదవడం ద్వారా సమాజాలు నడవవు. సమాజంలోని ఉన్న త వర్గాలు అనేక కారణాలతో అణగారిన వర్గాల స్థితిని నిర్ధారిస్తాయి.ఆవాస్తవం గుర్తించలేక పోవడ మే వారి వాదనలో ఉన్న లోపం. దక్షిణాసియా సమాజాలలో కులం అనేది అన్నిటినీ మించిన వాస్తవం. దీనికి ముస్లింలు కూడా మినహాయింపు కాదు.ముస్లింలకు ఆధునిక విద్యనందించే ఉద్దే శ్యంతో ప్రయత్నాలు ప్రారంభిం చినపుడు కూడా, అందులోని నిమ్న కులాల వృత్తికి ఎలాంటి ఆధునిక విద్య అవసరం లేదనే వాదన వచ్చింది. ఆవాదన తోనే ఆధునిక విద్యను అందిం చడంలో వారిని పరిగణలోకి తీసుకోలేదు.
కనుక మిగిలిన దళితులెంత దళితులో ముస్లిం దళితులు కూడా అంతే. నిర్ణయాత్మకమైన కనీస సానుకూల చర్యల నుండి దళిత ముస్లింలను దూరం చేయడమంటే జనాభాలో ఒక పెద్ద వర్గానికి అన్యాయం చేసినట్టే. అసలు సమస్య ఏమంటే, కేకును ఎక్కువ మంది అడిగినప్పుడు, దాన్ని మరింత పెద్దదిగా చేయాల్సి ఉంటుంది. ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియ, ఎస్సీ రిజర్వేషన్లను గణనీయంగా తగ్గిస్తున్నది, కాబట్టి సమస్య ఇక్కడే ఉంది. ముస్లింల ఎన్నికల రిజర్వేషన్లు సంబంధించినంతవరకు, ఎన్నికల రంగంలో ముస్లింల ప్రాతినిధ్యం ఇప్పటికే చాలా తక్కువ స్థాయికి, అంటే జనాభాలో వారి ప్రాతినిధ్యం కంటే చాలా తక్కువ స్థాయికి పడిపోయింది. దళిత ముస్లింలకు రిజర్వేషన్లు, ఎన్నికల్లో ముస్లిం రిజర్వేషన్లపై ప్రభావం చూపుతాయని, వారి ఎన్నికల నిబంధనల అవసరాల్ని కూడా పెంచుతాయని కొందరు మేథావులు వాదిస్తున్నారు. దళిత ముస్లింలకు రిజర్వేషన్లు విస్తరించే సందర్భంలో ఎన్నికలకు సంబంధించిన ఈ వాదనను పరిగణలోకి తీసుకోకూడదు.
(వ్యాసకర్త ఐఐటి మాజీ ప్రొఫెసర్‌, సామాజిక కార్యకర్త)(‘ద వైర్‌’ సౌజన్యంతో),- (రామ్‌ పునియానీ)

నిగ్గు తేలని..లేట్‌రైట్‌ క్వారీ అక్రమాలు

అనకాపల్లి,కాకినాడ జిల్లాల సరిహద్దు లను ఆనుకుని నాతవరం మండలం భమిడికలోద్దు లో121హెక్టార్ల విస్తీర్ణంలో లేట్‌రైట్‌ క్వారీ ఉంది. ఈక్వారీ అనుమతుల నుంచి నిర్వహణ వరకు అన్నీ ఉల్లంగనలు చోటు చేసుకున్నట్లు జాతీయ హరిత ట్రైబ్యూనల్‌(ఎన్‌జీటీ)కు ఉమ్మడి విశాఖ జిల్లా దళిత ప్రగతి సంఘాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు కొండ్రు మరిడియ్య ఏడాదిన్నర క్రితమే ఫిర్యాదు చేశారు.
ఒక ప్రభుత్వం పోయి మరో ప్రభుత్వం వచ్చినా వారి తలరాత మాత్రం మారడం లేదు. పచ్చని అడవులను నాశనం చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా అడవుల్లో ఉన్న అపారమైన లేట్‌రైట్‌ మైనిం గ్‌పైన మాఫియా కన్ను పడిరది.ఈ విలువైన ఖని జాన్ని తవ్వేందుకు ఎన్నో ప్రయత్నాలు జరుగుతు న్నాయి. గిరిజనుల పేరు మీదుగా అనుమతులు పొంది లబ్ధి పొందాలని చూస్తున్నారు. నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం సరుగుడు పంచాయితీ పరిధిలో లేట్‌ రైట్‌ ఖనిజం అపారం గా ఉంది. ఈ భూములపై చట్ట పరమైనహక్కులు, రాజ్యాగ పరమైన రక్షణలు ఈపంచాయితీలో నివసించే గిరిజనులకే ఉన్నాయి.ఇక్కడవున్న లేట్‌రైట్‌ తవ్వేందుకే తప్పా గిరిజన చట్టాలఅమలు,వారి సంక్షేమం ఏప్రభుత్వనికి పట్టడం లేదు.అసలు ఈతవ్వకపు అనుమతులు పొందాలంటే పిసా చట్టం ప్రకారం గ్రామసభ అనుమతి,అటవి హక్కుల చట్టం గ్రామ కమిటి అమోదం తప్పని సరిగా ఉండాలి.కానీ, కాంట్రాక్టర్లు అవేమీ పట్టించు కోకుండా బినామీల పేరు మీదుగా ఈ మైనింగ్‌ను తవ్వి ఖజనా నింపుకోవాలని చూస్తున్నారు. అభి వృద్ధి మాటే ఎరుగని గిరిజనులకు మైనింగ్‌ మాఫి యా చుక్కలు చూపిస్తున్నారు. ఎలాంటి అనుమతు లు లేకుండా అడవిని నాశనం చేసే మైనింగ్‌ తవ్వ కాలు జరిపితే తాము ఊరుకోమని ఆదివాసులు తెగేసి చెప్తున్నారు.
నాతవరం మండలం సుందరకోట పంచాయతీ పరిధి భమిడికలొద్దిలో121హెక్టార్ల విస్తీర్ణంలోఏటా10లక్షల క్యూబిక్‌ మీటర్ల లేటరైట్‌ను 15 ఏళ్లపాటు తవ్వుకునేందుకు జర్తా లక్ష్మణరావు అనే గిరిజనుడికి రెండు నెలల క్రితం ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కాలుష్య నియంత్రణ మండలి అంతకు ముందే ప్రజాభిప్రాయ సేకరణ చేసింది. తరువాత కేంద్ర అటవీ,పర్యావరణ మంత్రిత్వ శాఖకు సిఫారసు చేయగా అక్కడ నుంచి అనుమ తులు వచ్చాయి.ఈ మేరకు ఆఘమేఘాలపై లేట రైట్‌ తవ్వకాలు ప్రారంభించారు. అధికారుల లెక్కల మేరకు ఇప్పటివరకు 8,500క్యూబిక్‌ మీటర్ల మేర ఖనిజాన్ని తవ్వి తరలించారు. మైనింగ్‌లో అను భవం వున్న ఒకనిపుణుడిని స్వయంగా లీజుదారుడే నియమించుకున్నారు.అతని పర్యవేక్షణలో లేటరైట్‌ తవ్వకాలు చేస్తున్నారు.ఖనిజాన్ని పక్కనే వున్న కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలో జల్దాం వద్ద డంపింగ్‌ యార్డుకు ఏర్పాటు చేశారు.అక్కడ నుంచి ఇతర వాహనాల్లోకి లోడిరగ్‌ చేసి,తూకం వేసిన అనంతరం గమ్యస్థానాలకు రవాణా చేసే వారు.
అత్యాశే కొంప ముంచిందా..!
భమిడికలొద్దిలో జరుగుతున్న లైట్‌రైట్‌ తవ్వాకలను తరలించడానికి మాఫియా మరింత వేగాన్ని పెంచాలని ఆలోచించింది.దీనికి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు,సంబంధిత ఉన్నతాధికారు లను సంప్రదించి వారి కోరికున్నంత ముడిపులు చెల్లించేసింది.భమిడికలొద్దిలో జరుగుతున్న లేటరైట్‌ తవ్వకాలను గనులశాఖ అధికారులుగానీ, ఫారెస్టు, రెవెన్యూశాఖల అధికారులు గానీ ఇక్కడ తవ్వే లైట్‌రైట్‌ ఖనిజాలు ఏశాఖ పరిధిలోకి వస్తాయి.. ఏజిల్లా పరిధిలో ఉంది అనే అంశాలను పరిగణన లోకి తీసుకోలేదు సరికదా మచ్చు కైనా పర్యవేక్షించ లేదు. దీంతో మైనింగ్‌ మాఫియా రెచ్చిపోయి అత్యా శకు పోయింది.అడిగే నాధుడు,ప్రశ్నించే మేథావులు లేక అటూ కాకినాడ జిల్లా,ఇటు అనకాపల్లి జిల్లా సరిహద్దుల్లో ఉన్న దట్టమైన అటవీప్రాంతం మద్య లో నుంచి మైనింగ్‌ మాఫియా విశాలమైన రహ దారి నిర్మాణానికి ఉపక్రమించింది. లైట్‌రైట్‌ తరలింపునకు భమిడికలొద్దు నుంచి కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం సార్లంక వరకు 28 కిలో మీటర్ల రోడ్డు 30అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మా ణానికి పూనుకున్నారు.రోడ్డు నిర్మాణంలో వేలాది వందేళ్లు వయస్సుగల పచ్చని వృక్షాలు నరికేశారు. అనే పచ్చనిచెట్లు,వనకుమూలకులు నేలమట్టం చేశారు.ఫలితంగా పర్యావరణానికి తీవ్రమైన విఘాతంకలిగించారు.అడ్డొచ్చుని జంతవులు, జీవ రాశులను హతమార్చారు.అంతే కాకుండా రోడ్డు నిర్మాణానికి కాకినాడ జిల్లా ఉపాధి హామీ పథకం నిధుల నుంచి రూ.60లక్షలు ఖర్చు చేశారు. పైగా గిరిజన గ్రామాలకు రహదారి సదుపాయం కల్పిస్తు న్నామని,సాగునీటి వనరులను కప్పేశారు. భారీ వాహనాల రాకపోకలతో జీవజాతులు ప్రాణాలకు ముప్పుతెచ్చారు.తాగునీటికి ఆధారమైన ఊటగెడ్డ లను కలుషితం చేశారు. స్థానికులకు అధికార పార్టీనేతల ద్వారా తాయిలాలు ఆశ చూపించి క్వారీ నిర్వహణకు ఆటంకం లేకుండా చేసుకు న్నారు. ఈ లేట్‌రైట్‌ తవ్వకాలపై అప్పట్లోనే కొందరు స్థానికులు అధికారులకు ఫిరార్యదు చేసినా పట్టించు కోలేదు.దీంతో జాతీయ హరిత ట్రైబ్యూనల్‌ను ఆశ్ర యించాల్సి వచ్చింది. గతేడాది కాలంగా విచరణ కొనసాగుతుంది.సంయుక్త కమిటీ నివేదిక ఆధా రంగా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈనెల 24న ఎన్జీటీలో ఈ కేసు మరలా విచారణకు రానుంది. అప్పటిలోగా కమిటీ నివేదిక అందజేయ డానికి అధికారులు సన్నద్దమవుతున్నారు.
– గునపర్తి సైమన్‌

నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రణాలు నిలువెత్తు ప్రతిష్ట

మతానికి ప్రతీకారానికి మణిపూర్‌ రాష్ట్రం బలి యవుతుంటే ద్వేషంతో దేశ ప్రజలు విడిపో తున్నారు. ‘‘ఉపన్యాస విన్యాసాలతో దేశ ప్రజల శిరస్సులకు చేతబడి జరుగుతుంది’’ అంటూ జూకంటి జగన్నాథం అనే కవి పలికినట్లు.. మణిపూర్‌ ఘటనలు ఒక ఎత్తైతే దాని పర్యవసానాలు దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలపై చూపుతున్న ప్రభావం మరింత ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది.
ప్రస్తుత ఈ పదేళ్ల కాల పరిపాలనలో చోటు చేసుకుంటున్న ప్రధాన మార్పు ఏమంటే జరిగిన అన్యాయాన్ని వ్యతిరేకించిన వాళ్లపై దాడి జరుగుతుంది. వండి వార్చిన అభిప్రాయాలను ప్రజల ఆలోచనలపై నిండుకుండలా కుమ్మ రించి అంధ భక్తులను తయారు చేయడంలో నేటి మితవాద పాలకులు సఫలీ కృతం అవు తున్నారు. ఇద్దరు మహిళలను వివస్త్రులను చేసి అంగాంగ ప్రదర్శన చేయడమే కాకుండా వాటిని తమ వికృత చేష్టలతో తడుముతూ బహిరంగ మానభంగం చేసి హతమార్చిన సంఘటనను దేశం కళ్ళారా చూసింది. జరిగిన 72రోజుల తర్వాతగాని ఈ అంశం బాహ్య ప్రపంచం దృష్టికి రాలేదు.మే4వ తారీఖున సంఘటన జరిగితే మే18వతారీఖున భర్త పోలీసులకు ఫిర్యాదు చేసినా ఈ సంఘటన జూలై 19వ తారీఖున ఒక వీడియో ద్వారా ప్రజల ముందుకు వచ్చిన తర్వాత పోలీసులు రంగంలోకి దిగారు. జరిగిన అఘాయిత్యాలను, జరగని పోలీసుల చర్యలను ఖండిరచడం ఒక బాధ్యత.అలా సోషల్‌ మీడియాల ద్వారా ఖండిరచబడుతున్న వాటిని, అంధ భక్తులు ప్రతి ఖండిస్తూ విద్వేషాలతో ఊగిపోతున్నారు. ఇలాంటి సంఘటనలు మరొక రాష్ట్రంలో జరగలేదా, మానభంగాలు మర్డర్లు మరెక్కడా జరగలేదా? అంటూ సమర్ధించుకుంటున్నారు. అబలలపై జరిగిన ఆకృత్యాలను సమర్థించుకు నేదా సంస్కారం అంటే? ఇది ఒక్కటే కాకుండా మహిళలకు జరిగిన అన్యాయాలపై తిరగబడిన ఒక యువకుడి తల నరికి ఇంటి ముందున్న తడికె కు వేలాడదీసిన ఫోటో జూలై 22వ తారీకు ఆంధ్రజ్యోతిలో దర్శనమిచ్చింది. వెంటనే భక్తులు రంగంలోకి దిగి ‘‘కాశ్మీరీ పండిట్లకు జరిగిన అన్యాయం సంగతి చెప్పండి’’ అంటున్నారు. జరుగుతున్న అన్యాయాలన్నింటికీ చారిత్రక తప్పిదాలే సమాధానాలా? భాజపా నాయకురాలు విజయశాంతి తెలంగాణ ఐఏఎస్‌ అధికారిణి స్మిత సబర్వాల్‌ లాంటివాళ్ళు ట్విట్టర్‌ వేదికగా ఈ అంశాన్ని ఖండిస్తే వారిని అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. ఇదేనా సంస్కారం అంటే? జగన్మాత, భారత మాత, కాళీమాత అంటూ ఏవేవో పేర్లు పెట్టి మహిళలకు గౌరవం ఇస్తున్నట్టుగా ఫోజులు కొట్టేవాళ్ళు మహిళలపై జరుగుతున్న దాడులను కనీసం ఖండిరచడానికి మొహం చాటేస్తున్నారు ఇది సిగ్గుచేటు కాదా? మతాలు మత ఛాంద సవాదులు ముఖ్యంగా రాజకీయాలను మతంతో ముడిపెట్టి, మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయా లను నడిపిస్తున్న నేటి పాలకులు వారి అనుయా యులు మరియు వారి వార్తల మాధ్యమాలు ఎన్నడూ మహిళల గౌరవానికి ప్రాధాన్యతను ఇవ్వలేదు, ఇవ్వలేరు కూడా. ఎందుకంటే ఆధిపత్య భావజాలం లో అది అసాధ్యం.‘‘ఎత్తి చూపిన పాలిండ్లు కరుణ చూపని కఠిన శిలలయ్యే వరకూ, గగుర్పొడిచేలా గరళ బీజా లు నాటిన గర్భసంచుల్లో గన్నేరు కాయలు కాసే వరకూ, ఈ యాత్ర ఇలాగే కొనసాగుతోంది’’ అంటూ కవయిత్రి పాడిబండ్ల రజిని చెప్పిన ఆగ్రహ వాక్యాలు నిజమనిపిస్తున్నవి. ఇక తమ ఆగడాలను కప్పిపుచ్చుకోవడానికి దేశము, మతము అభద్రతలో ఉన్నాయనే ముసుగును కప్పుకుంటున్నారు. దేశంలోకి మయన్మార్‌ ప్రాంతం నుండి రోహింగ్యాలు చొరబడుతు న్నారు ఇది మయన్మార్‌ మరియు చైనా దేశాల కుట్ర అంటూ అసత్య ప్రచారాలతో ఊదరగొడు తున్నారు. పదేళ్ల నుంచి పాలిస్తున్న వారు, దేశ సరిహద్దులను తమ హద్దులలో పెట్టుకున్న వారు,ఈ మాట అంటుంటే నమ్మడానికి మన కున్న వివేకం ఏమైనాట్లు. ప్రతి సంఘటనను విదేశీ కుట్రతో ముడిపెట్టడం కుసంస్కారం కాదా? ఇక మణిపూర్లో హిందూ మతం అబద్రతలో పడిరదంటూ క్రైస్తవ మతం ఆధి పత్యం చాలాయిస్తుందంటూ మరో అసత్య వాదనకు నిస్సిగ్గుగా తెర తీస్తున్నారు. మైదాన ప్రాంతంలో నివసించే వారంతా మైతేయులని, వారంతా హిందువులని, అదేవిధంగా కొండ ప్రాంతాల్లో నివసించే వారంతా కుకీ జాతికి చెందిన గిరిజన క్రైస్తవులని తెలుస్తుంది. దేశం లో ఎక్కడైనా కొండ ప్రాంతంలో ఉన్న వారికి రిజర్వేషన్లు అమలులో ఉన్నవి. కొండ ప్రాంతం లో ఉన్న భూమిని ఇతరులు ఎవరు కొనకుండా 370అధికరణం కింద ఆంక్షలు ఉన్నవి. మరి ఈరోజు అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వం మైదానంలో ఉండే మైతేయులకు ఎస్టీ హోదా కల్పించడంలో ఉన్న ఆంతర్యం ఏమంటే కొండ ప్రాంతాల్లో కూడా వాళ్ళు భూమిని కొనవచ్చు, సొంతం చేసుకోవచ్చు. ఇలాంటి ఉద్దేశంలో సామాజిక అంశం ఉన్నదా,ఆర్థిక అంశం ఉన్నదా?కొండ లోయల్లో విరివిగా పండే నల్ల మందు వంటి వాణిజ్య పంటలను హస్తగతం చేసుకోవడం కోసమే కదా ఈ రకమైన రాజకీ య ఎత్తుగడ భాజపా ప్రభుత్వం వేసింది! పేదరికపు నిష్పత్తి గిరిజనులకు మించిన స్థాయిలో మిగతా సమూహాల్లో ఉన్నదా? అయినప్పటికిని భాజపా రిజర్వేషన్ల విధానానికి వ్యతిరేకంగా తన రాజకీయ నిర్ణయాన్ని ఏనాటి నుంచో ప్రకటిస్తూనే ఉన్నది. ఇది చాలదా వారి అసలైన అంతర్యాన్ని అర్థం చేసుకోవడానికి? ఈ అసలైన ఆర్థిక ఆధిపత్యపు అంశాన్ని పక్కనపెట్టి జాతుల మధ్య మతాల మధ్య జరుగుతున్న రచ్చ గా బాహ్య ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. ఇది తెలియని అంధ భక్తులు హిందూ మతం ప్రమాదంలో పడిరది, భవిష్యత్తులో ఇతర మతాలు ఆధిపత్యం చెలాయిస్తాయి, అనే న్యూనతాభావంతో అనవసర విద్వేషాలకు లోనవుతున్నారు.
మూడు నెలల నుంచి జరుగుతున్న ఈ సంఘటనలు ప్రపంచ దృష్టిని ఆకర్షించి భారతదేశ పరువును బజార్లో పెట్టాయి. భారతదేశంలో మతసహనం లేదని ఒక్క మణిపూర్‌ రాష్ట్రంలో 250చర్చిలకు పైగా కూల్చబడ్డాయని ఐక్యరాజ్యసమితిలో చర్చ జరిగింది. యూరోపియన్‌ యూనియన్‌ పార్లమెంట్లో, ఇంగ్లాండ్‌లోని హౌస్‌ ఆఫ్‌ కామన్‌ సభలో ఇదే రకమైన చర్చ జరుగుతోంది. ఇలాంటి పర్యవసానాలు దేశానికి నష్టదాయకం కావా?అసలు పరిస్థితి ఇంత దాకా ఎందుకు వచ్చింది.‘‘ఏ స్టిచ్‌ ఇన్‌ టైం సేవ్స్‌ నైన్‌’’ అనే ఇంగ్లీషు సామెత అర్థం ఏమంటే సరైన సమయంలో స్పందిస్తే సమస్య పెరిగి పెద్దది కాదు అని. సరైన సమయంలో స్పందించక పోవడమే కాక రాష్ట్ర ప్రభుత్వం వహించిన అలసత్వం, రిజర్వేషన్లపై కోర్టు తీర్పును పునః సమీక్షించని విధానం, ఈ దుస్థితికి దారితీ సాయి. ఒక రాష్ట్రంలోని ఎన్నికల దృష్ట్యా వ్యవసాయ సంస్కరణల నల్ల చట్టాలపై వెనక్కి తగిన కేంద్రం మణిపూర్‌ అంశంలో అదే చొరవ చూపలేకపోయింది. మణిపూర్‌ ప్రజలపై నిప్పుల వర్షం కురుస్తుంటే కర్ణాటక ఎన్నికల ర్యాలీలో పూలజల్లు కురిపించుకోవడానికి ఇష్టపడిన పెద్దలు దీనికి బాధ్యత వహించాలి. ఒక అమ్మాయిని దుశ్శాసనులంతా కలిసి నగ్నంగా ప్రదర్శిస్తున్న అంశాన్ని కళ్ళారా చూసిన తర్వాత గాని పెద్ద మనిషికి నోరు పెకల లేదు. తెరిచిన ఆనోటి తుంపరలు పక్క రాష్ట్రాల పై వెదజల్లెందుకు తాతహలాడాయి.ఈసందర్భం గా చరిత్రను ఒకసారి గమనించాలి.1946లో బెంగాల్‌ ప్రావిన్స్‌ లోని నొవాకలి ప్రాంతంలో జరిగిన మత ఘర్షణలు అత్యంత దారుణ మైనవి. ముస్లిం లీగ్‌ మరియు హిందూ మహాసభలు భారతదేశ వేరువేరు మత రాజ్యాలుగా ఉండాలని ప్రజల్లో నూరి పోయడంతో, క్షేత్రస్థాయిలో అవి మత ఘర్షణలకు దారితీసాయి. ముస్లింలు మెజారిటీగా ఉన్న ఆ ప్రాంతంలో అనేకమంది హిందువులను ప్రభుత్వ అండదండలతోనే ఊచకోత కోశారు. హిందువులు మైనారిటీలో ఉన్నప్పటికీ అనేకమంది హిందువులు భూస్వాములుగా చలామణి అవుతూ ఉండే వారు. కానీ హిందువులను ఏనాడు వారు రక్షించడానికి ప్రయత్నం చేయలేదు. అరకొరగా అందిన వార్తల ఆధారంగా మహాత్మా గాంధీ ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి ఎంక్వయిరీ చేయసాగారు. కానీ అప్పటి బెంగాల్‌ ప్రభుత్వం అసత్య సమాచారాన్ని ఇస్తూ అంతా సవ్యంగా ఉంది అనే సంకే తాలను పంపింది. ఒకానొక రోజు మహాత్మా గాంధీ ఆనాటి కాంగ్రెస్‌ అధ్యక్షులు జేబీ కృపలానిని బెంగాల్‌ సందర్శించడానికి ఆదేశించవలసి వచ్చింది. ఆయన తన సతీమణి సుచేత కృపలాని నీ వెంటబెట్టు కొని వెళ్లారు. అక్కడి దీన వ్యవస్థలోని ప్రజల ఆర్తనాదాలు అభ్యర్థనలు సుచేత కృపలాని నీ అక్కడే మరో ఆరు నెలలు ఉండేలా చేశాయి. పరిస్థితి సద్దుమణి వరకు సుచేత కృపలాని గారిని అక్కడే ఉంచి జేబీ కృపలాని ఢల్లీి వెళ్లారు. మనందరికీ తెలుసు దేశమంతా స్వాతంత్ర సంబరాల్లో మునిగి ఉంటే,మాత్మ గాంధీ బెంగాల్లోని మత కలహాలను తగ్గించేందుకు అక్కడికి వెళ్లి మకాం వేసి, ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రయత్నించారని. ఇలాంటి చరిత్రకు వారసులుగా ఉన్న నేటి పాలకులు నిమ్మకు నీరెత్తినట్లుగా తమకు గర్వభంగము అవునేమో ననే చీకటి గౌర వాన్ని తలపై మోస్తూ దేశాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నారు. ఇది దేశ ప్రజలలో విపరీత వైశమ్యాలకు దారితీస్తున్నది.‘‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా’’ అన్నట్లు పాలకులకే సమయమనం లేకుంటే సామాన్య ప్రజానీకానికి ఎందుకుంటుంది. అంచేత పంతాలు, పట్టింపుల కన్నా పరిష్కారానికి చొరవ చూపాల్సిన సమయం సందర్భం ఇది.-(జి.తిరుపతియ్య)

కుటిల రాజకీయాలతోనే మణిపూర్‌ మంటలు

బాధ్యులెవరైనా కఠిన చర్యలు తీసుకుం టామని గర్జించినవారు తమ అనుంగు ముఖ్యమంత్రిని మాత్రం ముట్టుకోరు, రాజీనామాకు ఆదేశించరు. మే 4న జరిగిన ఈ దారుణంపై మే 14న ఎఫ్‌ఐఆర్‌ నమోదైతే ఇంతకాలం ఏ గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నారని నిలదీయరు. ఇవన్నీ చేయకపోవడం ఒకటి, ఈ వీడియో ఇంతకాలం తర్వాత ఇప్పుడే రావడంలో కుట్ర వుందని ఆరోపిస్తారు. గతంలో జరిగిన మరికొన్ని అఘాయిత్యా లతో పోటీ పెట్టి మాట్లాడతారు. చర్చలు జరిపిస్తారు, వ్యాసాలు రాయిస్తారు. జరిగిందాన్ని కప్పిపుచ్చడానికి, తీవ్రత తగ్గించడానికి సకల శక్తియుక్తులూ వెచ్చిస్తారు. అందుకే ఇది డబుల్‌ హిపోక్రసీ. రెట్టింపు వంచన.
ఘనమైన మోడీ గారికి ఈ సమస్య పట్టించుకోవాలనే ఆలోచనే లేకుండా పోయింది. ప్రతిపక్షాలు ఆందోళన,ఆగ్రహం వెలిబుచ్చుతున్నా చీమ కుట్టి నట్టు లేకపోయింది.మణిపూర్‌ నుంచి బిజెపి తర పున రెండు ప్రతినిధి బృందాలు,ప్రతిపక్షాల తరపున ఒక బృందం ఆయనను కలుసుకోవడానికి ఢల్లీిలో నిరీక్షిస్తుంటే ఆయన మాత్రం అమెరికాలో భుజకీర్తు లందుకుంటున్నారు.అమెరికా,ఫ్రాన్స్‌ వంటి దేశాల లోనూ యూరోపియన్‌ పార్లమెంటులోనూ మణిపూర్‌ పరిస్థితిపై తీర్మానాలు చేస్తుంటే పట్టించుకోలేదు సరికదా చర్చ కూడా చేయకుండా మన పార్లమెం టును వాయిదా వేయించారు ! కనుక మణిపూర్‌ పుత్రికలంటూ ఆయన మాట్లాడటాన్ని మొసలి కన్నీరు కన్నా మోడీ కన్నీరు అంటే చాలదా ?
ఇటీవలి చరిత్రలో ఎన్నడూ లేనంతగా మణిపూర్‌ దురంతం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. కార్‌ వాషింగ్‌ వర్క్‌షాప్‌లో పని చేసుకుని బతికే ఇద్దరు ఆదివాసి యువతులను వివస్త్రలను చేసి వెంటాడి మానప్రాణాలు బలిగొంటున్న బీభత్స దృశ్యం జాతిని కలచివేసింది. ఘోరకలి జరిగాక రెండున్నర నెలలకు ఈ వీడియోలు బయిటకు వచ్చినా ఇంత ఆగ్రహావేదనలు ప్రజ్వరిల్లాయంటే జరిగింది ఎంత దారుణమో,వాస్తవ పరిస్థితి మరెం త ఘాతుకంగా వుందోననే సందేహం ప్రతివారిలో కలిగింది.దానికదే విషయం బహిర్గతమయ్యే వరకూ తెలియనట్టే ప్రవర్తిస్తున్న డబుల్‌ డబ్బా పాలకులకు ఘోర పరాభవం ఎదురైంది.మొన్ననే ఎన్‌డిఎ విస్త్రుత సమావేశంలో గజమాల వేయించుకుని సూక్తులు వినిపించిన విశ్వగురు ప్రధాని మోడీ బోనులో నిలబడాల్సి వచ్చింది. అయితే అలాంటి పరాభవాలు పట్టించుకునే ఘటం కాదు గనక పార్లమెంటు సమావేశాల సందర్భంగా చేసిన అని వార్య వ్యాఖ్యలలో ఆయన ఈ తప్పుకు దేశంలోని వంద కోట్లమంది ప్రజలదీ బాధ్యత అన్నట్టు మాట్లాడేశారు. దేశం, సమాజం సిగ్గుపడాలన్నారు. విశ్వగురుగా గజమాల వేయించుకోవడానికి నమో నమో కీర్తనలతో ఊరేగడానికి తాను, అమాను షానికి మాత్రం అందరిదీ బాధ్యత! ఇంతకన్నా విడ్డూరమైన,విపరీతమైన విషయం మరోటి వుం టుందా?కాని బిజెపి మోడీ పాలనల్ఱో అదే భారతీ య వాస్తవం.
చర్చకే దిక్కు లేదు, చర్య ఎక్కడ
మణిపూర్‌ లోనూ ఢల్లీి లోనూ పాలించేది అక్షరా లా వారు చెప్పే డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌. ఆపైన ఈశాన్య రాష్ట్రాలకు బిజెపి తరపున బాధ్యుడూ, మంత్రిగా ఈ శాఖకు బాధ్యుడు కూడా తన కుడి భుజమైన హోంమంత్రి అమిత్‌షా నే. మణిపూర్‌ పాలకుడైన బీరేన్‌ సింగ్‌ సరేసరి. అయినాసరే దేశ ప్రజలు వంద కోట్ల మంది సిగ్గు పడాలిగాని ఈ ఇద్దరు ముగ్గురు మనుషులు ఈషణ్మాత్రం సిగ్గు పడినట్టు కనిపించరు. తమకు నచ్చని రాష్ట్రాలలో చీమ చిటుక్కుమంటే ట్వీట్లు పెట్టి ఫీట్లు చేసే సంఘ పరివార్‌ పెద్దలెవరూ స్పందించరు.నూతన పార్ల మెంటు భవనం ముందు ఈ ఘోర వార్తపై స్పం దిస్తూ మణిపూర్‌ పుత్రికలకు జరిగిన ఘోరం పట్ల ప్రతివారూ విచారిస్తున్నారని,కారకులెవరైనా వదలిపెట్టే ప్రసక్తి లేదని గంభీర ప్రకటన చేసిన ప్రధాని ఆ సభలోనే ఈ సమస్యపై చర్చకు హాజరు కారు.సమగ్ర చర్చకాకుండా స్వల్ప వ్యవధితో సరి పెడతామంటారు. బాధ్యులెవరైనా కఠిన చర్యలు తీసుకుంటామని గర్జించినవారు తమ అనుంగు ముఖ్యమంత్రిని మాత్రం ముట్టుకోరు, రాజీనామాకు ఆదేశించరు.మే 4న జరిగిన ఈ దారుణంపై మే 14న ఎఫ్‌ఐఆర్‌ నమోదైతే ఇంతకాలం ఏగుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నారని నిలదీయరు. ఇవన్నీ చేయకపోవడం ఒకటి, ఈ వీడియో ఇంతకాలం తర్వాత ఇప్పుడే రావడంలో కుట్ర వుందని ఆరోపి స్తారు. గతంలో జరిగిన మరికొన్ని అఘాయి త్యాలతో పోటీపెట్టి మాట్లాడతారు. చర్చలు జరిపి స్తారు, వ్యాసాలు రాయిస్తారు.జరిగిందాన్ని కప్పి పుచ్చడానికి, తీవ్రత తగ్గించడానికి సకల శక్తియు క్తులూ వెచ్చిస్తారు. అందుకే ఇది డబుల్‌ హిపోక్రసీ. రెట్టింపు వంచన. టెలిగ్రాఫ్‌ పత్రిక 79మొసళ్ల కార్టూన్‌ వేసి ఆ పైన మోడీ విచారాన్ని పెట్టింది. ఎందుకంటే నవ వర్ష నమో పాలన తర్వాత వీటికి తేలిగ్గా లోబడిపోయే స్థితిలో దేశ ప్రజలు లేరు.
కాషాయ వ్యూహాల కరాళ ఫలితమే
ఈశాన్య రాష్ట్రాలు కూడా తమ ప్రాబల్యంలోకి రావడం మోడీ మహత్తులలో ఒకటని చెప్పుకునే బిజెపి అందుకు అనుసరించిన ఎత్తులు, జిత్తుల పర్యవసానమే ఈశాన్య జ్వాలలు. గుర్తు చేసుకుంటే కొంతకాలం కిందట అస్సాం, అరుణాచల్‌ ప్రదేశ్‌ల మధ్య సరిహద్దు వివాదం ప్రజ్వరిల్లడం ఎవరూ మర్చిపోలేదు. నిరంతరం తన మాటలతో వివా దాలు సృష్టించే అస్సాం ముఖ్యమంత్రి హిమంత్‌ విశ్వశర్మ పరిష్కారానికి ఏమీచేసింది లేదు ఎగ దోయడం తప్ప. తర్వాత మేఘాలయ తోనూ ఇదే తరహా ఘర్షణ చెలరేగి ఆరుగురు చనిపోయారు. ఇవి అస్సాం నుంచి విడదీయబడిన రాష్ట్రాలు కావడం గుర్తుంచుకోదగింది. ఎందుకంటే 1950 లో రాజ్యాంగం అమలులోకి వచ్చినపుడు ఈశా న్యాన మణిపూర్‌, త్రిపుర మాత్రమే కేంద్రపాలిత ప్రాంతాలుగా వుండేవి.1954లో అరుణాచల్‌ ప్రదేశ్‌,1963లో నాగాలాండ్‌,1969లో మేఘా లయ,1972లో మిజోరాం అస్సాం నుంచి విడదీసి ఏర్పాటు చేసినవే. మొదటి నుంచి వున్న మణిపూర్‌, త్రిపుర 1972లో పూర్తి రాష్ట్రాలయ్యాయి. ఈశాన్య ప్రాంతం నేరుగా బ్రిటిష్‌ వారి పాలనలో ఎన్నడూ లేదు.వారు కావాలనే చైనాకూ తమకూ మధ్య ఒక విడుపులాగా దాన్ని అట్టిపెట్టారు. అక్కడ అనేక జాతులు, ఉపజాతుల గిరిజనులు ఆదివాసులు జీవించేవారు. నాగా,కుకీ,మిసో తదితర తెగలు ఉపజాతులు అలాంటివే.గిరిజనులలో క్రైస్తవ మిషనరీల ప్రభావం కూడా ఎక్కువే. మణిపూర్‌ మైదానప్రాంతాలలో మైతేయిలు వుంటారు. కుకీలు మూలవాసులైనప్పటికీ రాజకీయ వ్యవస్థలో మైతే యిల ప్రాబల్యమే ఎక్కువ. ఈచిన్న రాష్ట్రంలో మొత్తం 36తెగలు, ఉపజాతుల వారు వుంటారంటే సమస్య అర్థమవుతుంది.మైతేయిలు ఇంఫాల్‌ లోయలో వుంటూ హిందూ మతాన్ని సనామహి అనే స్థానిక విశ్వాసాలను ఆచరిస్తారు. కుకీలు, నాగాలు అత్యధికంగా క్రైస్తవ మతానుయాయులు. ఈ తెగలు,ఉపజాతుల మధ్య స్వార్థ రాజకీయ శక్తులు పట్టించుకోని కేంద్రం కారణంగా నిరంతర ఘర్షణలు,తిరుగుబాట్లు జరుగుతూ వచ్చాయి. అందులో నాగా,కుకీల తగాదాలు ప్రధానమైనవి. 2017లో బిజెపి అధికారంలోకి రావడంతో ఆరెస్సె స్‌ రంగంలోకిదిగి హిందూవిశ్వాసాలు గల మైతే యిలను క్రైస్తవాన్ని అనుసరించే కుకీలకు వ్యతిరేకంగా కూడగట్టింది.దాంతో ఇది మత వివాదంలా కూడా మారిపోయింది.
ఎఫ్‌ఐఆర్‌ తెలియదా ?
పొరుగునే వున్న మయన్మార్‌లో 2021లో సైనిక నియంతృత్వం అధికారం కైవశం చేసుకున్నాక దాడి తట్టుకోలేక వేలాది మంది చిన్‌ శరణార్థులు వచ్చి పడటంతో పరిస్థితి మరింత దిగజారింది. వీరు కూడా కుకీలే. మిజోరాం, మణిపూర్‌ల లోని కుకీలు వారిని ఆహ్వానించి ఆశ్రయమిచ్చారు. కాని మోడీ ప్రభుత్వం వారికి ఆశ్రయం నిరాకరించి అక్రమ చొరబాటుదారులుగా ప్రకటించింది. ఇదే సమ యంలో బీరేన్‌ సింగ్‌ ప్రభుత్వం రిజర్వు అడవుల నుంచి కుకీలను భారీ ఎత్తున తొలగించడం మొద లెట్టింది. అడవులలో మాదక ద్రవ్యాల పంటలను నాశనం చేసేందుకు దాడి కూడా గిరిజనులను దూరం చేసింది. కుకీలు అక్రమ చొరబాటుదారులని ప్రచారంచేసే తీవ్రవాద మైతేయి వర్గాలకు ఆరెస్సెస్‌ వత్తాసునిచ్చింది.అస్సాం ముఖ్యమంత్రి శర్మ, బిజెపి ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ ఆప్రాంతంలో పని చేస్తున్న కాలంలోనే కుకీ తీవ్రవాద సంస్థ యుకెఎల్‌ఎఫ్‌ (యునైటెడ్‌ కుకీ లిబరేషన్‌ ఫ్రంట్‌)తో సంబంధం పెట్టుకుని నిధులు సమకూర్చినట్టు తర్వాత వెల్లడైంది. ఇందుకు ప్రతిగా వారు 2017 లోనూ 2019లోనూ బిజెపికి ఎన్నికల్లో మద్దతు నిచ్చారు.ఈవిషయం బయిటకు వచ్చాక ముఖ్య మంత్రి బీరేన్‌సింగ్‌కు మైతేయిలలో కూడా మద్దతు లేకుండా పోయింది. తమ సమస్యలకు మూల కారణంగా భావించిన ఆయనను కుకీలు ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే వున్నారు. బిజెపి లోనే వున్న పది మంది కుకీ ఎంఎల్‌ఎలు ప్రత్యేక పాలనా విభాగం కావాలని ఆందోళన మొదలెట్టారు. ఇప్పుడు మనం చూస్తున్న కల్లోలం వెనక ఇంత లోతైన నేపథ్యముం దని గుర్తుంచుకోవాలి.పులి మీద పుట్రలా ఈ పరిస్థి తులలో మైతేయిలను కూడా గిరిజనులుగా పరిగ ణించాలని మార్చి 27న మణిపూర్‌ హైకోర్టు తీర్పు చెప్పడం,దానికి అభ్యంతరం లేదని బీరేన్‌ సింగ్‌ హడావుడిగాప్రకటించడంతో ఈ ఘర్షణలు పరాకా ష్టకు చేరాయి.ఈ క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలు జోక్యం చేసుకోకపోగా కుటిల వ్యూహంతో మరింత రగలడానికి కారణమైనాయి.మే 4వ తేదీ మహిళలపై ఘోర కలి వీడియో జులై 20న బయిట కు వచ్చినప్పటికీ నిజానికి రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసులకు ఈవిషయాలు తెలియవని కాదు. మే రెండవ వారంలోనే వారు పోలీసు స్టేషన్‌లో ఫిర్యా దు చేయడం ఎఫ్‌ఐఆర్‌ నమోదు జరిగాయి. మే 29న అమిత్‌షా అక్కడ పర్యటించి వచ్చారు. ఇక ఘనమైన మోడీ గారికి ఈ సమస్య పట్టించుకోవాలనే ఆలోచనే లేకుండా పోయింది. ప్రతిపక్షాలు ఆందో ళన, ఆగ్రహం వెలిబుచ్చుతున్నా చీమ కుట్టినట్టు లేకపోయింది. మణిపూర్‌ నుంచి బిజెపి తరపున రెండు ప్రతినిధి బృందాలు, ప్రతిపక్షాల తరపున ఒక బృందం ఆయనను కలుసుకోవడానికి ఢల్లీిలో నిరీక్షిస్తుంటే ఆయన మాత్రం అమెరికాలో భుజకీర్తులందుకుంటున్నారు. అమెరికా, ఫ్రాన్స్‌ వంటి దేశాలలోనూ యూరోపియన్‌ పార్లమెంటులోనూ మణిపూర్‌ పరిస్థితిపై తీర్మానాలు చేస్తుంటే పట్టించుకోలేదు సరికదా చర్చ కూడా చేయకుండా మన పార్లమెంటును వాయిదా వేయించారు! కనుక మణిపూర్‌ పుత్రికలంటూ ఆయన మాట్లాడటాన్ని మొసలి కన్నీరు కన్నా మోడీ కన్నీరు అంటే చాలదా ?
జరగాల్సిందేమిటి ?
మాట్లాడితే వీర జవాన్లు, దేశభక్తి అంటూ ఊదరగొట్టే కేంద్ర పాలకులు కార్గిల్‌ యుద్ధంలో పాల్గొన్న సైనికుని భార్యకు ఈ దుర్గతి పడితే స్పందించకపోవడాన్ని ఏమంటాం? మే 4 రాత్రి దుష్ట మూకలు వేల సంఖ్యలో ఆ గ్రామాన్ని చుట్టుముట్టి కుకీ కుటుంబాలను తరిమేయడమే గాక ఇద్దరు యువతుల బట్టలూడదీయించి మృగాల్లా హింసిస్తూ ఈడ్చుకు పోయారు. ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. వాళ్లను కాపాడేందుకు వెళ్లిన వారిని చంపేశారు. రక్తసిక్తమైన శరీరంతో ఆ అభాగ్యురాళ్లు ఇద్దరినీ తీసుకుని వారు ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్‌కు చేరుకుంటే పరిధి సమస్య వచ్చింది. దాన్ని మరో స్టేషన్‌కు బదలాయించారు. ఇంత జరిగినా ఏ చర్య తీసుకున్నది లేదు, ఇంటర్‌నెట్‌ సెన్సార్‌ వుంది గనక బయిటకు రాలేదు. ఈ లోగా మహిళా కమిషన్‌కు, ముఖ్యమంత్రికి ఫిర్యాదు వెళ్లినా స్పందన లేదు. వందల సంఖ్యలో ఇలాంటివి వస్తుంటే ఏదని చూస్తామన్నది వారి అహంకారపూరితమైన జవాబు. ఇంకా ఆ ముఖ్యమంత్రిని ముట్టుకోని కేంద్రాన్ని ఏమనాలి? ఈ విషయంలో ముందే జోక్యం చేసుకుని తీవ్రంగా ఖండిరచిన సిజెఐ డి.వై.చంద్రచూడ్‌ ప్రభుత్వం చర్య తీసుకోకుంటే తాము రంగంలోకి దిగాల్సి వస్తుందన్నారు. అత్యు న్నత న్యాయమూర్తి స్పందనకూ ప్రభుత్వాధినేత స్పందనకూ తేడా కనిపిస్తూనే వుంది. వాస్తవానికి రాని స్పందనకోసం వ్యవధి ఇవ్వడం కంటే సుప్రీం కోర్టు వెంటనే రంగంలోకి దిగి చర్య తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ తక్షణం గద్దె దిగాలి. ఇప్పటికీ బయిటకు రాని ఘోరాలు మరెన్ని వున్నాయో ప్రత్యేకంగా దర్యాప్తు చేసేందుకు ఒక కమిటీని నియమించాలి. బాధితుల రక్షణ కోసం తక్షణం కేంద్రం రంగంలోకి దిగాలి. (ప్రజా శక్తి సౌజన్యంతో..)

మానవత్వానికే మచ్చ..!

మణిపూర్‌లో మూడు నెలలుగా పాలన గాడి తప్పింది.శాంతిభద్రతలు దిగజారాయి. కేంద్రంలో, ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు మౌనం వహించి నీచరాజకీయాలు చేస్తున్నాయి. ఇటీవల వెలుగులోకి వచ్చిన వీడి యోలు అసాంఘికశక్తుల అరాచకాలను స్పష్టంగా చూపుతున్నాయి. ప్రజల ధన, మాన, ప్రాణాలను రక్షించాల్సిన పోలీసులు,పారామిలటరీ దళాలు చేష్టలుడిగి చోద్యం చూస్తున్నారు.
మణిపూర్‌లో స్త్రీల మానాలకు, పురు షుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. మానవత్వం మంటగలిసింది.పశు ప్రవర్తన హెచ్చు మీరింది. మైనారిటీలకు రక్షణ లేకుండా పోయింది. దురాగతాల వీడియోలు ప్రపంచానికి మణిపూర్‌ దీనస్థితిని ఎలుగెత్తి చాటుతున్నాయి.బీజేపీ పాలన లో తప్ప గతం లో ఎన్నడూ దేశ ప్రతిష్ఠ ఇంతగా దిగజారిపోలేదు.
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలైన బీజేపీ డబు ల్‌ ఇంజిన్‌ సర్కారే మణిపూర్‌లో ఉన్నది.వారి పాల నలో ప్రభుత్వ అనుకూల మూకలు రెచ్చిపోతున్నాయి. రాక్షస ప్రవర్తనతో ప్రజాస్వామ్య వ్యవస్థకే మాయని మచ్చ తెస్తున్నాయి. గత రెండు నెలలుగా హింసా త్మక సంఘటనలు చెలరేగుతూనే ఉన్నాయి. గృహ దహనాలు కొనసాగుతున్నాయి. స్త్రీలు,పిల్లలు, వృద్ధు లు హాహాకారాలు చేస్తున్నారు. స్త్రీలపై అత్యాచా రాలు కొనసాగుతున్నాయి. తమను రక్షించమని, తమ ప్రాణాలను కాపాడమని దేవుడిని వేడుకుం టున్న వందలాది మంది క్రైస్తవులపై పోలీసులు లాఠీచార్జి చేశారు.పోలీసుల కాల్పులలో 86 మందికిపైగా మరణించారు. ప్రార్థనా మందిరాలైన వందలాది చర్చిలను ధ్వంసం చేశారు. మణిపూర్‌లో మతం మత్తులో హింస హద్దులు దాటింది.మరో గుజరాత్‌ మారణ కాండను తలపించేలా మైనారిటీ గిరిజనులపై హింసాకాం డ కొనసాగుతున్నది. అల్లరి మూకలు గిరిజనులను లక్ష్యం గా చేసుకుంటున్నాయి. కర్ర లు, కత్తులు, ఆయుధాలతో దాడులు చేస్తున్నాయి. చేతికి చిక్కిన మహిళల పట్ల దారుణంగా ప్రవర్తిస్తు న్నాయి. ఇద్దరు మహిళలపట్ల అమానుషంగా ప్రవర్తించారు. వారిని వివస్త్రలను చేసి, వీధులలో బహిరంగా ఊరేగించారు. ఆపై పొలాల్లోకి ఈడ్చు కళ్లారు. స్త్రీలపై సామూహిక లైంగికదాడులు జరుగుతున్నాయి.కాలేజీలో చదువుతున్న 21 ఏండ్ల అమ్మాయి కూడా బాధితుల్లో ఉన్నది. 19 ఏండ్ల ఆమె సోదరుడిని దారుణంగా కొట్టి హింసించి చివరికి చంపేశారు. రాక్షసుల కంటే హీనంగా ప్రవర్తించారు. మే4న జరిగిన ఈఅమానుష సంఘ టన వీడియో దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.ఒకవైపు అల్లర్లు, హింసాత్మక సంఘటన లతో మణిపూర్‌ మూడు నెలలుగా తగలబడు తుంటే,మరోవైపు బాధ్యతలేని ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారాలకు, విదేశీ పర్యటనలకు వెళ్లారు. దేశ,విదేశాల్లో బీజేపీ అనుకూల వర్గాలు ఆయనకు జేజేలు పలకడం అమానుషత్వానికి పరాకాష్ఠ. కనీసం బాధితులను ప్రధాని ఓదార్చలేదు. వారికి ధైర్యమైనా ఇవ్వలేదు.శాంతిభద్రతలపై సమీక్ష కూడా చేయలేదు. ప్రాణ భయంతో మణిపూర్‌ను వదిలి ఇతర ప్రాంతాలకు వలసలుపోతున్న వారికి భరోసానైనా కల్పించలేదు. పోలీసులకు మార్గదర్శక త్వమైనా చేయలేదు. వెలుగులోకి వచ్చిన వీడియోల ఆధారంగా కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఘాటైన హెచ్చరికలు చేసింది. ఇకనైనా మోదీ ప్రభుత్వం కనీ సం స్పందిస్తుందా?ఈ దురాగతాలకు బాధ్యత వహిస్తుందా? లేదాఎప్పటి మాదిరిగానే దున్నపోతు మీదవర్షం పడినట్లు స్తబ్ధుగా,మౌనంగా ఉండి పోతుందా? వేచిచూడాలి. మణిపూర్‌లో జరిగిన, జరుగుతున్న అరాచకత్వంపై మానవతావాదులు, ప్రజాస్వామిక వాదులు స్పందించాలి. అసమర్థ బీజేపీ పాలనను ఎండగట్టాలి.దేశ,విదేశీ మీడి యా కండ్లు తెరువాలి.సోషల్‌ మీడియా ప్రజాపక్షం వహించి మణిపూర్‌ దురాగతాలను ఖండిరచాలి. సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించాలి. మణిపూర్‌ సంఘటనలపై ప్రత్యక్ష పర్యవేక్షణలో సత్వర విచా రణ జరిపించాలి. కాలయాపన చేయకుండా దోషులపట్ల కఠినంగా వ్యవహరించాలి. న్యాయపర మైన శిక్ష విధించాలి.
స్త్రీల అస్తిత్వానికి పెను సవాల్‌ ` అనిశెట్టి రజిత
మాతృదేశానమాతృమూర్తులకు లబి óస్తున్న గౌరవమర్యాదలు చూసి సగటు స్త్రీగా, భారత పౌరురాలిగా మతిపోతున్నది. నిజంగా ఈ సమ యంలో మతితప్పి ఉంటే బాగుండుననిపి స్తున్నది. రాజ్యాంగస్ఫూర్తి విలువలు దహించివేయ బడిన పాలనలో ఉన్నామా అనిపిస్తున్నది. మైనారిటీలు, ఆదివాసీలు,కొన్నితెగల,సమూహాల పౌరస త్వాలూ, అస్తిత్వాలూ ప్రశ్నార్థకమవుతున్నాయి. దేశంలో స్త్రీల అస్తిత్వాలకు పెనుసవాల్‌ ఎదురవుతున్నది. భారతీ య సమాజాన్ని వేధిస్తున్న వ్యవస్థను చూస్తే విస్మ యం కలుగుతున్నది. దేశంలో మతతత్వం, కుల తత్వం, ప్రాంతీయ దురహంకారం ఉన్మాదంతో చెలరేగిపోతున్నది. వారి అరాచకాలను సమర్థించు కోవడానికి,ఓటు బ్యాంకులను కొల్లగొట్టి అధికారాన్ని సుస్థిరం చేసుకోడానికే ఈ రాజకీయ హత్యాకాండల న్నీ. అయినా దేశాన్ని, ప్రజలను ఉద్ధరిస్తున్నామని చెప్పే ప్రభుత్వానికి ఇవేం పట్టవు. మతం ఈరోజున దేశానికి ప్రధాన రాజకీయ వనరుగా మారింది. ఈర్ష్యాద్వేషాల ముసుగులను వేసుకొని నగ్నతాం డవం చేస్తున్నది. ఇదంతా చేస్తున్నది చేయిస్తున్నది మతవాదులే అని తేటతెల్లమైంది. మతమంటే మారణ హోమమా? మన భారతీయ సంస్కృతిని మనం ఎలా నిర్వచిం చుకుందాం? నాజ్ఞానానికి, అనుభవానికి తెలిసినంత వరకు మతం, ఆచారా లు, సంప్రదాయాలు,తంతులూ అన్నీ కూడా మన సంస్కృతిలో భాగం మాత్రమే. స్వార్థపర దుష్టశక్తులు తమ పగద్వేషాలూ, దుండ గాలు, దోపిడీల కోసం మతాన్ని సంస్కృతి నుంచి విడదీసి దాన్నొక ఆయు ధంగా వాడుకుంటున్నారు. సంఘ సమగ్రతను చిన్నాభిన్నం చేస్తూ రక్త క్రీడలను ప్రోత్సహిస్తు న్నారు. ఈ దేశాన్ని ‘భారతమాత’ అంటూ మోకరి ల్లుతూ ఆరాధిస్తున్నట్టుగా నటిస్తూ భరతమాతకు చెడ్డపేరు తెస్తున్నారు. ఒకభారత స్త్రీగా,పౌరురాలిగా,దేశ భక్తురాలిగా, సమతా సామ్యవాద శాంతి విలసిల్లే సమాజాన్ని ఆశిస్తున్నాను. కానీ నారీశక్తిగా నేను కలతల లోకంలో కల్లోలిత జీవితం గడపాల్సి వస్తున్నది. అమానుషత్వాల, అగౌరవానికి నిత్యం బలిపశువునై ఆక్రందనలు చేయాల్సి వస్తున్నది. అందుకే వెంటాడుతున్న మానవ మృగాల నీడలకు భీతిల్లి ప్రాణ,మాన రక్షణ కోసం పరితపించాల్సి వస్తున్నది. గాయపడిన దేహాలతో చిరిగిన పీలికల్ని చుట్టుకొని,అర్ధ నగ్నంగా పరిగెత్తుకుంటూ పోతున్న స్త్రీమూర్తుల వారసురాలిగా ఆందోళన చెందాల్సి వస్తున్నది.ఆడపిల్లగా పుట్టినందుకు లైంగిక దాడు లకు, ఆడజన్మనెత్తినందుకు అత్యాచారాలకు నన్ను వేదికగా చేసుకుంటున్నారు. గౌరవంతో, హుందా తనంతో జీవించే హక్కునూ, అర్హతను నిరాకరిస్తు న్నారు. ఇలాంటి వింత మృగాళ్ళ నడుమ ఉన్నందు కు నాలో విపరీత ఆలోచనలు కలుగుతున్నాయి. సిగ్గులేని మనుషుల నడుమ సిగ్గుతో తలవంచుకొని, నన్నూ నాదేహాన్ని లోలోపలికి కుచించుకొని బత కాల్సి వస్తున్నది. ఈ రోజున దేశానికీ ‘దేశమాత’కూ దిక్కు దిశ లేదు. రాజ్యాంగాన్ని చదువాల్సి వస్తుం దని,పాటించకుంటే ప్రశ్నిస్తారని ఏ చీకటి గుహల్లో నో సమాధి చేశారు. మానవీయ భావనలను మధ్య యుగాల్లోకి మళ్లించారు. ఆడవాళ్ల దేహాలపై నగ్న రాజకీయాల పచ్చబొట్లు పొడుస్తున్నారు.ఈ రోజున రాజకీయాలు సృష్టించిన‘మతం’తో జతగట్టి భారతమాత ప్రతినిధులైన స్త్రీల నగ్న దేహాలతో రాజకీయ కక్షలు తీర్చుకుంటున్నారు. తమ తమ మత ఉన్మాదాలకు రక్తసిక్త నగ్న చరిత్రలు రాసి వికృతత్వానికి పట్టం కడ్తున్నారు. మతం చిచ్చుకు తోడు ‘మర్దాంగీ’(మగతనం)లను మేల్కొల్పి స్త్రీలపై విరుచుకుపడి మృగ(మగ)తనాలను నిరూపించు కుంటున్నారు. నిజంగా వీళ్లు మతం అంటే ఏమిటో తెలిసినవాళ్లేనా? నిజంగా వీళ్లు భారతీయులేనా? దేశమన్నా, దేశభక్తియన్నా వీరికి అర్థం తెలుసా? నిజంగా వీళ్లు స్త్రీలను గౌరవించి పూజించే వ్యక్తు లేనా? స్త్రీలను ‘సతి’ చేసిగాని చల్లబడే మత రక్షకులే కదా, మూర్ఖ పాలకులే కదా. ‘భారత్‌ బచావో’ అన్న భావన నినాదమై ఈ రోజున దేశవ్యాప్తంగా అలజడిగా మారింది.పౌరసమాజం పాలకుల నేరా లపట్ల అట్టడుగు నుంచి ఉడికిపోతున్నది. భరత మాత కన్నీటి గంగలు ప్రవాహాలుగా ప్రళ యాలు సృష్టిస్తున్నవి.భేటీ బచావో, బడావో, పడావో మాట లు చిలుం పట్టి తుక్కులా రాలి పోతున్నవి.
అయ్యా! దేశ ఏలికల్లారా! పాలకుల్లారా! అధికార పీఠాలను అధిష్ఠించిన రాజకీయ, మత నేతల్లారా! మానవత్వం కన్నా ‘మహోన్నత మతం’ ఏదో,ఎక్కడుందో సెలవిస్తారా?మానవ సేవకన్నా మాధవ సేవంటూ ఉందా!దేశప్రజల క్షేమం, రక్షణ, వారికిచ్చే భరోసా, నమ్మకాలను మించిన సంక్షేమ శాంతి పరిపాలన ఇంకేమైన ఉన్నదా? లౌకికశక్తుల నిర్భంధం,అరాచకశక్తుల విశృంఖలత్వమే మీ సైద్ధాంతిక విధానమా? దాన్ని అరాచక అత్యాచా రాల పునాదులపై లేచిన కబేళాలతో నింపాలను కుంటున్నారా? అందుకు ఈ (మా) దేశపు స్త్రీలమైన మా దేహాలే మీకు వేదికలా? మా శవాలపైనే మీ సింహాసనాలా? అయ్యా అన్నీ కన్నీటి ప్రశ్నలే%ౌౌ% అంతా సంక్షుభిత పరిస్థితులే! అంతటా రక్తపు తడిలో తడిచి రెపరెపలాడున్న నెత్తుటి పతాకాలే! మీ దేశభక్తికీ మత ధర్మ ఉద్ధరణలకు ఒక నిరసన దండం! (వ్యాసకర్త : ప్రజాస్వామ్య రచయిత్రుల వేదిక జాతీయ అధ్యక్షురాలు)-(డాక్టర్‌ కోలాహలం రామ్‌కిశోర్‌)

ఎకో టూరిజంపై సమత శిక్షణ తరగతులు

స్థానిక వనరులపై స్థానికులకే హక్కు కలిగి ఉండాలనే లక్ష్యంతో సమత గిరిజన యువతకు ఏకోటూరిజంపై జూన్‌ 19నుంచి 26వ తేదీ వరకు ఆరురోజుల పాటు గిరిజన యువతకు శిక్షణ తరగతులు నిర్వహించారు.‘‘స్థానిక వనరులపై స్థానిక ఆదివాసులకే హక్కు ఉంది’’అనే అంశంపై శిక్షణ కార్యక్రమం జరిగింది.విశాఖ ఉమ్మడి జిల్లా ఐదువ షెడ్యూల్‌ ప్రాంతానికి చెందిన కటికి, కొల్లా పుట్‌,సరియా,సరుగుడు ఆదివాసీ ప్రాంత జలపా తాల వద్ద జరిగిన శిక్షణకార్యక్రమంలో సుమారు 30మంది యువతీ,యువకులు పాల్గొన్నారు. ఈ యువకులంతా ఒక్కో రోజు ఒక్కో ప్రాంతానికి వెళ్లి అక్కడ ఉన్న స్థానికంగాఉన్న వనరుల సద్విని యోగంపై అడిగి తెలుసుకున్నారు. అనంతిగిరి మండలం బొర్రా పంచా యితీ కటిక జలపాతం వద్ద నుంచి శిక్షణ కార్యక్ర మం ప్రారంభమైంది. కార్యక్రమాన్ని బొర్రాపంచా యితీ సర్పంచ్‌ జన్నిఅప్పారావు ప్రారంభించారు. సర్పంచ్‌ మాట్లాడుతూ కటికి వాటర్‌ ఫాల్స్‌ చరిత్ర ను వివరించారు.తర్వాత గ్రామపెద్ద గెమ్మెల దేవ కుమార్‌ మాట్లాడుతూ ఈ జలపాతాలు ద్వారా స్థానిక యువ కులు పొందుతున్న స్వయం ఉపాధి గురించి వివరించారు.వాటర్‌ ఫాల్స్‌ నిర్వహణ కమిటీ తరుపున గెమ్మెల రమేష్‌ మాట్లాడుతూ దీనివల్ల సుమారు 30మంది ఆదివాసీ కుటుంబాలు స్వయం ఉపాధిని పొందుతున్నట్టు చెప్పారు.ఆనాడు సమత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రవిరెబ్బాప్రగడ ఆద్వ ర్యంలో ఆనాటి ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌ శివశంకర్‌ ఏర్పాటు చేసిన కటికి వాటర్‌ ఫాల్స్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ నేడు మా ఆకలి తీర్చుతోందని వివరించారు. రెండోవరోజు కటికి,సరియా,సరుగుడు వాటర్‌ పల్స్‌ టీంలు కాటికి వాటర్‌పల్స్‌ పరిసర ప్రాంతాల్లో స్వచ్‌ భారత్‌ నిర్వహించారు.అక్కడ నుంచి మూడవ రోజు కొల్లాపుట్‌ ఎకో రిసార్టుస్‌కు చేరుకున్నారు. ఇక్కడ జరిగిన శిక్షణలోఐ.టి.డి.ఏ.నుంచి ఎకో టూరిజం కో-ఆర్డినేటర్‌ గణపతి నాయుడు రిసోర్స్‌ పెర్సన్‌గా హజరయ్యారు. ఆయన ఎకో టూరిజం ప్రాముఖ్య తను వివరించారు.ఎకో టూరిజం అంటే ప్రకృతిని పాడు చేయకుండా చేసే కార్యక్రమని అన్నారు. దీనిద్వారా స్థానిక యువకులకు స్వయం ఉపాధి లభిస్తోందని,నీరు కలుషితం కాకుండా చెత్త చెదరాలను లేకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే దీని లక్ష్యమన్నారు. పర్యా వరణాన్ని పరిరక్షించుకోవడానికి స్థానికులను చైతన్య వంతులను చేయాలని కోరారు.చెట్లను నరక కుండా అందంగా తీర్చిదిద్దాలి.ఎకోటూరిజంద్వారా ప్రకృతి సహసిద్దమైన కూరగాయలు,అటవీ ఉత్పు త్తులు లభిస్తాయని వాటి ద్వారా కూడా జీవనో పాధిని పెంపొదించుకోవచ్చని పేర్కొన్నారు. గ్రీనరీ ని పెంచడం ద్వారా టూరిస్టులు ఆకర్షితులు అవు తారని, వాటర్‌ పల్స్‌ దగ్గర ప్లాస్టిక్‌ కనిపించే కుండా టీం వర్కు చేయాలని పిలపు నిచ్చారు. అలాగే ఎత్తు పల్లాలుగా ఉన్న భూమిని అలాగే ఉంచి మనం క్రియేటివిటీగా ఆలోచించి అందంగా తీర్చి దిద్దినట్లుయితే అప్పుడు పర్యాటకులు ఇష్టపడ తారని సూచించారు.మొదట స్థానికంగా మనం ప్లాస్టిక్‌ని వాడకం తగ్గించాలని,తరువాత టూరిస్టు లకు చెప్పాలని సూచించారు. స్థానికంగా అటవీ ప్రాంతాల్లో లభించే ఆకులు,వెదురును వస్తువులుగా తయారు చేసి వినియోగించుకొని స్వయం ఉపాధి పొందవచ్చన్నారు.మట్టి కుండల్లో మంచినీటిని నింపి డోకులతో పర్యాటకులకు ఇవ్వడం అలవాటు చేయాలి.ఆదివాసీ సాంప్రదాయాలను,ఆచారా లను,మనం టూరిస్టులకు చూపించాలి.ఈ విధంగా ఉంటే మన ఆదాయం పెరుగుతుంది అని వివరిం చారు.చాపరాయి వాటర్ఫాల్స్‌ టూరిజం మేనేజర్‌ అప్పారావు కూడా పలు సూచనలు చేశారు.ఎకో టూరిజం-ఎకోఫ్రెండ్లీగా ఉండాలి. ఎకో టూరిజం మన ఆదివాసీప్రాంతాల్లో చాలాచక్కగా చేయవచ్చు న్నారు.నేచర్‌ ఎస్‌ టీచర్‌ ట్రైబ్‌ ఎస్‌ గైడ్‌ టీం వర్క్‌కి సొసైటీ కీ చాలా సంబంధం ఉంటుంది, మొదట టీం వర్క్‌ బలపడితే,దాని సొసైటీగా రిజిస్టర్‌ చేయ వచ్చు,ఈ సొసైటీలో ప్రెసిడెంటు, వైస్‌ ప్రెసిడెంట్‌, సెక్రటరీ,జాయింట్‌ సెక్రెటరీ, కోశాధికారి మరియు మెంబెర్స్‌ ఉంటారు. దీనికి ఒక బై లా ఉంటుంది. దాని ప్రకారం సొసైటీ ని నడపాలని సూచించారు. ముఖ్యంగా రికార్డ్స్‌ రాయాలి,ప్రతి సంవత్సరం అడిట్‌ చేయించాలి, టూరిజంలో ఎకోటూరిజం, అగ్రికల్చరల్‌ టూరిజం,హోమ్‌ స్టే టూరిజం ఇలా 75 రకాలు ఉన్నాయి. ఆతర్వాత 2016లో కొల్లా పుట్‌ రిసార్ట్‌ పేరుతో నిర్మించిన 8కాటేజీలద్వారా స్థానిక యువతీ, యువ కులు పొందుతున్న స్వయం ఉపాధిపై వివరిం చారు.అక్కడ నుంచి కొత్తపల్లి జలపాతంను సందర్శించారు.ఇక్కడ నవీన్‌ మేనేజర్‌ మాట్లాడుతూ ఇక్కడ 12మంది యువకులు పని చేస్తున్నారు వీరు అంతా ఆదివాసీ తెగ(పీటీజీ) గ్రూప్‌కు చెందిన గిరిజనులని వారు ఇక్కడ స్వయం ఉపాది పొందు తున్నట్టు తెలిపారు.అక్కడ నుంచి చింతపల్లి మండలం,పెదబారడా పంచాయతీ కృష్ణాపురం గ్రామానికి చేరుకున్నారు.ఇక్కడ చింతపల్లి వినియోగదారుల సంఘం అధ్యక్షుడు చిట్టిబాబు ఆధ్వర్యంలో చింతపల్లి అటవీశాఖ సబ్‌ డివిజినల్‌ అధికారి బెర్లాండ్‌రాజు,రేంజ్‌ అధికారిణి చిట్టితల్లి,సెక్షన్‌ ఆఫీసర్‌అప్పారావు బీట్‌ఆఫీసర్‌ వెంకటరావు గార్డులతో కలసి అవగాహన సదస్సు నిర్వహిం చారు.అటవీశాఖ అధికారులకు సమత కోఆర్డినేటర్‌ సతీష్‌ కుమార్‌ సమత నిర్వహిస్తున్న ఏకో టూరిజం శిక్షణపై వారికి వివరించారు. గత మూడు రోజుల నుండి కాటికి జలపాతం, కొల్లాపుట్‌ ఎకో టూరి జం,లంబసింగి టీం అందరు సందర్శించడం, అక్కడ వారు చేస్తున్న పని, ఎకో టూరిజం ద్వారా ఎలా జీవనోపాధి పొందుతు న్నారు, వంటి అంశాలు శిక్షణలో నేర్చుకోవడం జరిగిందన్నారు.షబ్‌ డివిజినల్‌ అధికారి మాట్లా డుతూ కృష్ణాపురం గ్రామం దగ్గరలో ఎకో టూరి జం,మీఅందరి సహకారంతో మొదలు పెడతాం. ఈటూరిజంలో మీ గ్రామస్తులు పని చేసుకొని ఉపాధి పొందడం మన ముఖ్య ఉద్దేశ్యమని వివరిం చారు. దీనికి అందరు సహకరించాలని ఆదివాసీల సహకారం లేకపోతేె ఈ ప్రాజెక్టుని తాము ముందుకు తీసుకెళ్లలేమని సూచించారు.అక్కడ నుంచి నాత వరం మండలం సరుగుడు పంచాయితీ సుందర కోటవాటర్‌ ఫాల్స్‌ సందర్శించారు. ఇక్కడకు కూడా చాలా మంది టూరిస్టులు రావడం జరుగుతుంది. ఇక్కడ గవర్న మెంటు కొంత సుందరంగా తయారు చేశారు ఫారెస్టు డిపార్టుమెంట్‌ కొంత పెన్సింగ్‌ కట్టడం సరుగుడు వాటర్‌ పల్స్‌ అనిబోర్డు పెట్టడం జరిగింది. ఇక్కడ టికెట్‌ కలెక్షన్‌ లాంటివి చేయడం లేదని స్థానికులు తెలియజేశారు.
ఈ శిక్షణ నాకు ఎంతో ఆలోచన ఇచ్చింది..!
మాది సరుగుడు గ్రామం నేను బి.టెక్‌ చదివాను. ఈఐదురోజులు చాలా ప్రాంతాలు సందర్శించడం వల్ల నాకు ఎంతో ఆలోచన వచ్చింది.సరుగుడు వాటర్‌ ఫాల్స్‌వద్ద టోల్‌గేట్‌ ఏర్పా టుచేసి ఇక్కడ నిరుద్యోగ గిరిజన యువకులం స్వ యం ఉపాధి పొందుతాం.అందుకు సమత సహకా రం అవసరం.
చిన్నా.సరుగుడు ఎకో టూరిజం పెట్టవచ్చు అనేది ఆలోచన మాది కాటికి గ్రామం. మేము దాదాపు 15 సంవ త్సరంల నుండి కాటికి వాటర్‌ఫాల్స్‌ని నిర్వహి స్తున్నాము. ఇందులో దాదాపు 20మందికి ఉపాధి దొరుకుతుంది. కొల్లాపుట్‌ రిసార్ట్‌ ద్వారావారు ఉపాధి ఎలాదొరుకుకుతుంది నేర్చు కున్నాము.అలానే ఫారెస్టు డిపార్టుమెంటు ద్వారా కూడా ఎకో టూరిజం పెట్టవచ్చు అనేది ఆలోచన వచ్చింది. తమాల మోహన్‌,కటిక గ్రామం.
ఎక్సపోసర్‌ విజిట్‌లో చాలా నేర్చుకున్నా..
మాది బొర్రా గ్రామం. ఈఎక్సపోసర్‌ విజిట్‌లో చాలా అవసమైన విషయాలు నేర్చుకున్నాము. ఒక ప్రొడక్టుని వేల్యూ ఎడిషన్‌ చేస్తేదాని డిమేండ్‌ ఎలా ఉంటాది అనేది అర్ధమైంది. అలానే ఏదైనా ఒక ప్రాజెక్టు లో టీంవర్క్‌పాత్ర దాని ప్రాముఖ్యత ఎలా ఉంటాది తెలు సుకున్నాం.మనకు ఉన్న వనరులపై హక్కు మనకే ఉంది అనేది అర్ధం అయ్యింది. అలానే స్థానికంగా దొరికే వెదురుతో తయారు చేసిన వస్తువులకు రంగులు పూసి వాల్యూ ఎడిషన్‌ చేస్తే ఆదివాసీ వ్యాపారులకు ఇంకా మెరు గ్గా డబ్బులు వస్తాయి. ముఖ్యంగా మనం టూరిస్టు లకు ఏదీ ఫ్రీగా ఇవ్వ కూడదు అనేది ఈ విజిట్‌ ద్వారా అర్ధం అయ్యింది.
`వంతుల మేరీ,బొర్రా
మహేష్‌ జర్ర: మాది సిరియా వాటర్‌ పల్స్‌, మేము ఒక్క టిక్కెటు కలెక్షన్‌ చేస్తూ 10 మంది ఉపాధి పొందుతున్నాము . మొదటిలో స్థానిక పంచాయతీ నుండి చాలా వత్తిడి వచ్చింది. వాటర్‌ పల్స్‌ పంచాయితీది అని చాలా ఇబ్బంది పెట్టారు. మేము అన్ని తట్టుకొని చేస్తున్నాము సమతా సతీష్‌ గారి ద్వారా కటికి వారు నిర్వహిస్తున్న వాటర్‌ పల్స్‌ ని సందర్శించడం జరిగింది, అలా నే వారిని చూసి మాకు కూడా కొంత దైర్యం వచ్చింది. సర్యా వాటర్‌ పల్స్‌ అనేదిచాలా ప్రమాద కరమైన ప్రదే శం,కాబట్టి మేము చాలా జాగ్రత్త పని చేయా లి, ముఖ్యంగా టూరిస్టులు విశాఖపట్నం నుండి వస్తారు.ఈ విసిట్‌ వలన మాకు కొత్త ఆలోచనలు వచ్చాయి,ఆదివాసీ సాంప్రదాయ పద్ధతులు టూరి స్టులకు చూపిస్తే వారు ఆకర్షితులు అవుతారు. మేము కూడా ఎకోటూరిజం ప్రాజెక్టు నాకు ఆలో చన చేస్తాము.-(కె.సతీష్‌ కుమార్‌)

పోలవరం పోరు కేక

పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తే ఆంధ్ర ప్రదేశ్‌ సస్యశ్యామలంగా ఉంటూ పంటలు సుభిక్షంగా పండు తాయని ఉద్దేశంతో వేల ఎకరాల భూ ములు గ్రామాలు ఖాళీ చేసి కట్టుబట్టలతో బయటికి వెళ్లిన అభాగ్యులు కన్నెర చేశారు.పోలవరం నిర్వాసితుల సమస్యలను గాలికి వదిలేసి ఇచ్చిన హామీలను నెరవేర్చ కుండా,సరైన పునరావాసం కల్పించకుండా కాలం గుడపుతున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ది చెప్పే విధంగా పోరు కేకతో నిర్వాసితులు మమా పాద యాత్రకు కదం తొక్కారు. జూన్‌ 20 అల్లూరి జిల్లా నెల్లిపాక నుంచి ప్రారంభమైన మహా పాదయాత్ర జూలై 4న విజయ వాడలో ముగిసింది.
జాతీయ ప్రాజెక్టును పూర్తి చేసిన బాధ్యత మొదట తమదేనన్న కేంద్రప్రభ/త్వం నిర్వాసితులకు ఇచ్చే ప్యాకేజీ విషయంలో ఎందుకు నిర్వక్ష్యం వహి స్తుందని నిలదీశారు. ప్రాజెక్టు నిర్మాణాలను అంగ రంగ వైభంగా చూపిస్తున్న ప్రభుత్వం.. నిర్వాసితుల వేదనలను ఎందుకు ప్రజలకు వివరించడం లేదని ప్రశ్నించారు. పునరావాసం పూర్తయ్యాకే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ మూరు మూరులో పాదయాత్ర కొనసాగుతుంది. కళ్లుండి చూడ లేని,చెవులుండీ వినలేని గుడ్డి,చెవిటి ప్రభు త్వాల్ని మనం ఎన్నుకున్నామని నిర్వాసితులు విమర్శి స్తున్నారు. వరదలోస్తే మురమూరు గ్రామాలు నీటి మునిగే ప్రమాదముందని,41కాంటూరులో కలపా లని కోరుతూ అధికారిక మెమోరాండం సమర్పిం చినట్లు నిర్వాసితుల తరుపున సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీ.శ్రీనివాసరావు ప్రకటించారు. మురు మూరులో మొత్తం 356 కుటుంబాలు ఉన్నాయని తెలిపారు.పాదయాత్రకు వైసీపీ కాచవరం నాయ కులు సంఫీు భావం పలికారు.అనంతరం పల్లూరు గ్రామంలో బహిరంగ సభ నిర్వహించారు.
నిర్వాసితుల డిమాండ్లు ఇవే
పోలవరం నిర్వాసితులకు పునరావాసంతోపాటు పూర్తి పరిహారం చెల్లించాకే గ్రామాలను ఖాళీ చేయించాలని మహా పాదయాత్ర డిమాండ్‌ చేస్తోంది. పునరావాసం పూర్తయ్యే వరకు ముంపు గ్రామాల్లో సంక్షేమ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగించాలని,1986,2022నాటి వరద ముంపు ఆధారంగా ముంపు గ్రామాలు రీ సర్వే చేయాలని,మండలాన్ని యూనిట్‌గా తీసుకొని పునరవాసం పరిహారం అర్హులందరికీ ఇవ్వాలని కోరింది.పునరావాసం ఏకకాలంలో అన్ని గ్రామా ల్లో పూర్తి చేయాలని,ప్రతి ఎకరానికి రూ.20లక్షలు చెల్లించాలని డిమాండ్‌ చేసింది. గ్రామాలు ఖాళీ చేయించే నాటికి18ఏళ్లు నిండిన వారికి ఆర్‌ అండ్‌ ఆర్‌ పరిహారం ఇవ్వాలని,నిర్వాసిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని కోరింది.
ఇలా సాగిన పాదయాత్ర
అల్లూరి సీతారామారాజు జిల్లా నెల్లిపాక నుంచి నిర్వాసితుల మహాపాదయాత్ర ప్రారంభమైంది. పోలవరం నిర్వాసిత గ్రామాల్లో 400కిలోమీటర్ల మేర 15రోజుల పాటు యాత్ర కొనసాగుతోంది. జూలై నాలుగో తేదీన విజయవాడలో మహా ధర్నాతో పాదయాత్ర ముగిసింది. పాదయాత్రలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు,కార్యవర్గ సభ్యులు మంతెన సీతారాం,వీ.వెంకటేశ్వర్లు పాల్గొ న్నారు.
పోలవరం పునరావాసం కోసం…
పోలవరం ప్రాజెక్టు చాలా సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ప్రధాన ఎజెండాగా వుంది. ఇదిబహుళార్థక సాధక ప్రాజెక్టు అని సాగు నీరు,తాగునీరు,విద్యుత్‌ ఉత్పత్తికి తద్వారా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని ప్రచారం చేశారు. ప్రాజెక్టుని మాహయాంలో పూర్తిచేస్తా మంటే మాహ యాంలో ప్రారంభిస్తామని గొప్పలకు పోయి మరీ మాట్లాడడం మనంచూస్తున్నాం. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వాలు,ప్రధాన ప్రతిపక్షాలు చెప్పింది చెబు తున్నది….ప్రాజెక్టు ఎత్తు, పొడవు,వాలు,డ్యామ్‌ నిధులు…వీటి గురించే. కానీ నేడు చర్చించాల్సింది సర్వం త్యాగంచేసిన నిర్వాసితుల గురించి. పోల వరం నిర్వాసితులకు న్యాయం చేయా లని సి.పి.యం ఆధ్వర్యంలో జూన్‌ 20వ తేదీ నుండి జులై 4వరకు చేపట్టిన‘మహా పాద యాత్ర’ గ్రామాల సరిహద్దులు దాటుకుంటూ చైతన్య పరుస్తూ జూలై 4న విజయవాడకు చేరికొని మహా సభతో ముగి సింది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 8 మండలాలు, 222 పంచాయతీలు, 373గ్రామాలు,1,06, 000 కుటుంబాలు నీట మునుగుతాయి. లక్షల జనాభా నీట మునిగి ఆస్తులు,సంపద పోగొట్టుకుంటున్నా వీరి సంక్షేమాన్ని, పునరావాసాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం అత్యంత విషాదం.2018 డి.పి.ఆర్‌. ప్రకారం ప్రాజెక్టుఖర్చు రూ.55.656 కోట్లు. ఇందులో పునరావాసం కోసం ఖర్చు చేయాల్సింది రూ.33,000కోట్లు కానీ ఖర్చుచేసింది రూ. 7000 కోట్లు మాత్రమే. ఎక్కువ శాతం నిర్మాణానికే ఖర్చు చేస్తున్నారు.మరి నిర్వాసితుల సంగతేంటి? సర్వస్వం త్యాగం చేసిన గిరిజనులు,అడవి బిడ్డల పరిస్థితి ఏంటి?అందుకే పునరావాసం పూర్తయిన తరువాతే ప్రాజెక్టు కట్టాలి.పోలవరం ప్రాజెక్టు ద్వారా చాలా ప్రయోజనాలు చేకూరతాయనేది ఎంత వాస్తవమో నిర్వాసితులు నష్టపోతారన్నది అంతే నిజం. 2013 భూసేకరణ చట్టం ప్రకారం 25 రకాల మౌలిక వసతులు కల్పించాలి. కానీ అవెక్కడా నిర్వాసితుల కాలనీల్లో కనిపించవు.ఏనిర్వాసిత కాలనీలో కూడా శ్మశానవాటికలు కనిపించవు.బుట్టాయిగూడెం, జీలు గుమిల్లి,జంగారెడ్డిగూడెంనిర్వాసిత కాలనీల్లో అధ్వా న పరిస్థితులున్నాయి.ఇళ్ళ శ్లాబులు వర్షం వస్తే కారిపోతున్నాయి.నిర్మాణ సంస్థలు కాసుల కక్కుర్తితో నాణ్యత లేకుండా నిర్మించాయి. విద్య, వైద్యం సదుపాయాలు లేవు. గడప గడపకు వైసిపి పేరుతో గత కొంత కాలంగా హడావుడి చేస్తున్నారు. కానీ రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి, పోలవరం ఎమ్మెల్యే బాలరాజు నిర్వాసిత కాలనీల్లో అడుగు పెట్టడం లేదు. ఈ గడపలకు ఎందుకు రావడం లేదు. నిర్వాసితులు నిలదీస్తారని భయమా ?
ప్రతి సంవత్సరం వరద వస్తుంది. 2022 జులైనెలలో వచ్చిన వరద వేరు. ఇది పాలకుల నిర్లక్ష్యం కారణంగా వచ్చిన వరద. కాం టూరు లెక్కలన్నీ తప్పని ఈ వరదలతో తేలిపో యింది. కాంటూరు లెక్కలతో సంబంధం లేకుండా వరద ప్రాంతాలను ముంపు ప్రాంతాల జాబితా లోకి చేర్చాలని ప్రజలు కోరుతున్నారు. వరదలో పశువులు కొట్టుకుపోయాయి.పంటపొలాలు మునిగిపోయాయి.33రోజులు ఎందరో ఇళ్ళు నానిపోయి పడిపోయాయి. విలువైన వస్తువులు పాడైపోయాయి. ఇంత నష్టం జరిగితే ప్రభుత్వం నుండి అందిన సహాయం రూ.2 వేలు మాత్రమే. ఇళ్ళు కూలిపోయినవారికి రూ.10వేలు అందిం చారు. అదికూడా అరకొరగానే అందించారు. అందులోను రేకులషెడ్డుకి ఇవ్వలేదు.ముంపు గ్రా మాల ప్రజలకష్టాలు ఇలాఉంటే ఊళ్లు ఖాళీ చేసి వచ్చిన నిర్వాసితకాలనీలో బతుకుతున్న గిరిజనుల పరిస్థితి ఘోరంగా తయా రైంది.వారు నిర్వాసిత కాలనీలకు వచ్చి2సంవత్సరాలైంది.రావాల్సిన ప్యాకే జీ డబ్బులు ఇంకారాలేదు.కనీస సౌకర్యాలు కల్పిం చడం లేదు.‘చూస్తాం ప్రభుత్వం ప్యాకేజీ డబ్బులు ఇవ్వకుంటే మరలా తిరిగి మా గ్రామాలకు వెళ్ళి పోతాం.పరిహారం ఇస్తుందో,మమ్మల్ని గోదారిలో ముంచేస్తుందో ప్రభుత్వమే తేల్చుకుంటుంద’ని ఆవేదన చెందుతున్నారు.సాధారణంగా తుఫాన్లు సముద్రాల్లో పుడతాయి.కానీ ప్రభుత్వం నిర్వాసితుల పట్ల ఇదే వైఖరి కొనసాగిస్తే, వదిలేస్తే, ఉదాసీనత ఇలాగే కొనసాగితే తుఫాన్‌ పుట్టేది సముద్రంలో కాదు. గోదారినదిలో.ఆ తుఫాన్‌పేరు నిర్వాసితుల ఉద్య మం.ఈ తుఫాన్‌ ప్రజల్ని ఐక్యం చేసి పాలకులను వణికించి అమరావతి దగ్గర తీరం దాటుతుంది జాగ్రత్త. ఇది హెచ్చరిక కాదు. వాస్తవం. గిరిజనులే కదా అణచివేద్దాం, తొక్కేద్దాం అంటే కుదరదు. ఎందుకంటే ఇది చరిత్ర. ఇదే గిరిజనులకు ప్రభుత్వ పెత్తందారులకి జరుగుతున్న అసలైన వర్గపోరాటం. పోలవరం ప్రాజెక్టు నిర్వాసి తులకు అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వరద సమస్య లపై ఒక్కొక్కరిది ఒక్కో వాదన.
1,నిర్వాసితు లేమో ప్రభుత్వం మా పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడు తుందని, మేము మాకు పూర్తిగా ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇవ్వాలని,పునరావాస కాలనీల లో అన్ని పూర్తి చేయాలని అడుగుతున్నాం అందుకే ఇలా చేస్తే మేమే వెళ్ళిపోతాం అని అధి కార్లు ఇలా చేస్తున్నారని అన్నారు. 2,ప్రభుత్వం నిర్వాసితులనుగాలికి వదిలేసింది అని, వారికి ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ 10లక్షలు, ప్రతీకుటుం బానికి రూ10వేలు,దోమతెరలు మూ డు,నెలలపాటు ఉచితంగా రేషన్‌ సరుకులు పంపిణీ చేయాలని, ప్రతిపక్షరాజకీయ నాయకులు కార్యకర్తలు డిమాండ్‌ చేస్తున్నారు.3,కొన్ని సంస్థలు,సంఘాలు ప్రజల కోసం భోజనాలు ఏర్పాటు చేశారు.4,ప్రభుత్వం ప్రతీ కుటుంబానికి25 కేజీల బియ్యం,కేజీ కంది పప్పు, కేజీ నూనె,కూరగాయలు ఇస్తున్నారు.అయితే ఇవి అందరికీ అందటం లేదని ప్రజలు కొట్టు కున్నారు. దీనిపై ఏలూరుజిల్లా కలెక్టరు,మండల అధికారులను ప్రజల ముందే హెచ్చరించారు.వెలేరు పాడు ముంపు గ్రామాలను పరిశీలించి వస్తున్న జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, ఎస్పీ లను ఎర్ర బోరు గ్రామం వద్ద నిర్వాసితులు అడ్డుకొని తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
అసలు ఈ భారీ వర్షాల గురించి ప్రభుత్వా నికి తెలియదా? సవంవత్సరం ముందుగానే అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇండియా మెటియో రాలాజికల్‌ డిపార్ట్‌ మెంట్‌ మే నెలలో నే చెప్పింది.ఈ శాఖ అధికారులు దేశవ్యాప్తంగా పడే వర్షాల గురించి, రుతు పవనాలు గురించి మే నెలలో నివేదిక విడుదల చేస్తుంది. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి తెలియకుండా పోతుం దా? ఇవన్నీ తెలిసి కూడా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టలేదు.అంటే ఇది పూర్తిగా నిర్వాసితుల పట్ల నిర్లక్ష్యధోరణి ప్రభుత్వం కనపరిచినట్లు అర్థమ వుతుంది.ముంపు ప్రాంతాలను అధికారులు ముం దస్తుగా సందర్శించి రాబోయే వరదల గురించి ప్రజలకు చెప్పి వారి వారి సామాన్లను,తరలించు కోవడానికి రవాణా ఏర్పాట్లు చేయ వచ్చు కానీ అలా జరగలేదు.ఈ సందర్భంగా ఒకటి చెప్పాలి. కుకునూరు మండల కేంద్రం ఎత్తు లో వుంటుంది కదా అని ఆ గ్రామ ప్రజలు మన ఊరు మునగదని ధీమాతో ఉన్నారు. రాత్రిపూట చడీ చప్పుడూ లేకుం డా గ్రామం అంతా తెల్ల వారే సరికి నీటి మయ మైంది. అప్పుడు ఆరాత్రిలో గ్రామప్రజలు సొం తంగా ప్రక్క గ్రామాల నుంచి ట్రాక్టర్‌లు 36 (తెలంగాణా గ్రామాలు సరిహద్దులో ఉన్నాయి). తెప్పించి కొంత మందిని సురక్షిత ప్రాంతాల కు తరలించారు. రెవెన్యూ అధికారులు కేవలం 7, ట్రాక్టర్‌లు ఏర్పాటు చేశారు. లేదంటే చాలా ప్రాణ నష్టం జరిగేది. ఇలా చేయడంవల్ల పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలు అనేక కష్టాలు పడితేనే రేపు వారికై వారే పునరావాస కాలనీల కు గత్యంతరం లేక వెళతారు.అంటే దానర్ధం పొ మ్మన కుండా పొగ పెట్టడం.ఇంకా ఇక్కడ ఉం డలేము అని విసుగు చెంది వెళ్ళిపోతారు. ప్రభుత్వం వైపున తప్పు లేదని ఇది ప్రకృతి వైపరీత్యం అనీ, ఎవరూ ఏమీ చేయలేరు అని సమర్ధించు కుంటుం ది.కానీ ఇది పూర్తిగా మానవతప్పిదంగానే భావిం చాలి.ఎందుకంటే ప్రతీ ఏడాది జూలై నెలలో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిసి కూడా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టలేదు.
ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వాటర్‌ రిసోర్స్‌ డిపార్ట్‌ మెంట్‌ వెబ్‌ సైట్‌ ఓపెన్‌ చేస్తే ఇలా ఉంటుంది.
ముంపు, నిర్వాసిత సమస్యను,తగ్గించటానికి ప్రత్యాయ మ్నాలను గుర్తించాలని,ప్రాజెక్ట్‌ భాధిత కుటుంబాలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పిం చాలని ఉంటుంది.కానీ వాస్తవానికి కనిపించేది వేరు. పై మాటలు ఆచరణకు నోచుకోవటం లేదు.
1986గోదావరి వరదలకు దీనికి పొంతన లేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కు ముందు ఎప్పుడు వరదలు వచ్చినా అవి కొన్నిరోజులుపాటు ఉండి తర్వాత దిగువకునీరు వెళ్ళేది. ఇప్పుడు అలా జరగ లేదు,కాఫ ర్‌ డామ్‌ నిర్మాణం వలన బ్యాక్‌ వాటర్‌ వచ్చి గ్రామాల్లో నిలిచి పోయింది. అందుకే భద్రా చలం కూడా వరద తాకిడికి గురైంది. దీని కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ 100 గ్రామాలు మునిగిపోతాయని సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.ఓ.ఎస్‌.నెంబర్‌బీ1ఆఫ్‌2019.అదే ఇప్పుడు పువ్వాడ అజయ్‌ కుమార్‌ మాట్లాడుతున్నది. మరల ఎటపాక గ్రామాలను తిరిగి తెలంగాణాకు ఇచ్చి వేయాలని వాదిస్తున్నారు.
ఆస్తి నష్టం అంచనా వేయరు!
సాధారణ పరిస్థితుల్లో అయితే ఇటువంటి వరదలు వచ్చినప్పుడు,అధికారులు పంటనష్టం, ప్రాణనష్టం, ఆస్తినష్టం అంచనావేసి,పరిహారం ఇస్తారు. కానీ, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుముంపు గ్రామాలలో అది సాధ్యంకాదు.ఎందుకంటే ఏదో ఒకరోజు ఈ ప్రాంతం నుంచి ఖాళీ చేయాలంటున్నారు. అప్పుడు మునిగిపోయినా,రోడ్లు తిరిగి వేయరు, కూలిపోయిన స్కూలు బిల్డింగ్స్‌ కట్టరు,ఇండ్లు కూలిపోతే తిరిగి ఐ.ఏ.వై.స్కీమ్‌లో కట్టరు.పంట దెబ్బతిందని వ్యవసాయశాఖఅధికారులు వచ్చిచెక్కులు ఇవ్వరు. (భూములు తీసుకున్నారు) కాబట్టి గత ముంపుకు ఇప్పటి ముంపుకు తేడాను ప్రజలు గ్రహించాలి. 1986 వరద నీరు వస్తుందని అనుకోలేదు. కానీ ఇప్పుడు రాలేదా? ఈ రోజు వచ్చింది రేపు రాదు అని గ్యారంటీ లేదు. ఇంత కంటే ఎక్కువ కూడా రావచ్చు. ప్రాజెక్ట్‌ నిర్మాణం పూర్తి అయితే, నీరు నిలిచి బ్యాక్‌ వాటర్‌ వస్తుంది.అటువంటప్పుడు మరలా కొన్ని పునరావాస కాలనీల ను అక్కడే కడుతున్నారు. అవి ఇప్పుడు వచ్చిన వరదల కు నీట మునిగిపోయాయి.రేపు ఆ గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ ఉండదు. ఆవిషయం అధికారులు కళ్ళారా చూస్తూనే ఉన్నారు.కాబట్టి దీనిపై ప్రజలూ ఆలోసిం చాలి, సమస్య ను ముందుగానే ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళాలి. ప్రజల మధ్యన పని చేసే అను భవంఉన్న మేధావులు కూడా నిర్వాసితులు ఎదు ర్కొంటున్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళాలి. ఇది ఏఒక్కరి సమస్యకాదు,మానవ సమా జంలోఉన్నఅన్ని వర్గాల ప్రజలదని నమ్ముతు న్నాను.-(వై.రాము/బాబ్జీ)

1 … 3 4 5 6 7 … 16