చెట్లు విలువ ఎంత..?

సమాజానికి,పర్యావరణానికి సేవ చేస్తు మానవ జాతికి ఆక్సిజన్‌,సూక్ష్మపోషకాలు ఇతరాత్ర విలువైన సంపదను అందిస్తున్న మన వారసత్వవృక్షాలు అభివృద్ధిపేరుతో గొడ్డలి వేటుకు బలైపో తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో ఐదు రైల్వే ఓవర్‌బ్రిడ్జిల నిర్మాణం కోసం 356 చెట్లను నరికేశారు.దీనిపై ఓఎన్జీఓ సుప్రింకోర్టును ఆశ్రయించారు.ఆకేసును విచారించిన కోర్టు,నిషికాంత్‌ ముఖర్జీ (టైగర్‌ ఎన్విరాన్‌ మెంట్‌ సెంటర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌),సోహంపాండ్యా (కార్యదర్శి)లతో ఐదుగురు నిపుణులతో కూడిన కమిటీని నియమించింది. ఈకమిటీ కోర్టుకు నివేదించిన నివేదికలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడిరచారు.డబ్బు చెట్లను పెంచదుని తెలిపింది.చెట్టు యొక్క ఈద్రవ్య మదింపును నిపుణుల బృందం ఇటీవల సుప్రీం కోర్టుకు సమర్పించిన నివేదికలో నిపుణుల కమిటీ చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఎ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనానికి తెలిపింది.
ఒకచెట్టు ధరను దాని వయస్సుతో గుణించి రూ.74,500గా నిర్ణయించింది.చెట్ల మదింపుపై మార్గదర్శకాలను రూపొందించడానికి ఒక నివేదికలో ఒక చెట్టు ద్రవ్య విలువను ప్యానెల్‌ పేర్కొంది.ఒక వారసత్వ వృక్షం పౌరసమాజానికి,పర్యావరణానికి సేవచేస్తుందని,ఆక్సిజన్‌,సూక్ష్మపోషకాలు, కంపోస్ట్‌, బయో-ఎరువులతో సహా వివిధ గణనలపై దాని విలువను చేరుకోవచ్చని నిపుణుల కమిటీ చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఎబోబ్డే నేతృత్వంలోని ధర్మాసనానికి తెలిపింది.ప్రాజెక్టుల కారణంగా నరికివేయబడుతున్న ఈ చెట్ల ఆర్థిక,పర్యావరణ విలువ అధికం.2021లో దాఖలు చేసిన నివేదిక బహిరంగపరిచారు.ఇది భారతదేశంలో మొదటిసారి జరిగింది.
అన్ని ఖర్చులను చెట్టు యొక్క మిగిలిన వయస్సుతో కలిపి గుణిస్తే,ప్రస్తుత సందర్భంలో 100సంవత్సరాలలో,మొత్తం చెట్టు సంవత్సరానికి రూ.74,500అవుతుంది. ఇందులో ఒక్క ఆక్సిజన్‌కే ఏడాదికి రూ.45వేలు,ఆ తర్వాత బయోఫెర్టిలైజర్ల ధర రూ.20వేలు.సూక్ష్మపోషకాలు,కంపోస్ట్‌ ఖర్చులను జోడిరచడంద్వారా,జీవించేచెట్లు వాటిని నరికివేయబడుతున్న ప్రాజెక్టుల ప్రయోజనాల కంటే ఎక్కువగా ఉంటాయని నివేదిక పేర్కొనడం విశేషం.హైవే ప్రాజెక్టులకోసం చెట్లను నరికివేయడానికి బదులు, ట్రాఫిక్‌,రవాణా మౌలికసదుపాయాలను సులభతరం చేయడానికి ఇప్పటికే ఉన్న జలమార్గాలు, రైలు మార్గాలను ఉపయోగించడంవంటి ఈ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వాలు మొదట ప్రత్యామ్నాయ ఎంపికలను అన్వేషించాలని కూడా కమిటీ సూచించింది. చెట్లను నరికితే మొదటి ప్రయత్నంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వాటిని తరలించడమే కాకుండా చెట్లనునరికివేస్తే ఆస్థలంలో ఐదు మొక్కలు నాటితే సరిపోదని కమిటీ స్పష్టంచేసింది. సుప్రీంకోర్టు ప్యానెల్‌ ముందు సమర్పించిన నివేదిక బాధిత రైతులకు భూమి,చెట్లకు ముఖ్యంగా ఫలాలను ఇచ్చే చెట్లకు న్యాయమైన నష్టపరిహారాన్ని కోల్పోయినందున వారికి సహాయకరంగా ఉండవచ్చు అని నిపుణల నివేదిక భావించింది.
అయితే జీ`20పేరుతో విశాఖాని సుందరంగా తీర్చిదిద్దడానికి అనేక వృక్షాలను విచాక్షణ రహితంగా నరికేశారు.దేశంలోనే పేరుగాంచిన ఆంధ్రా విశ్వవిశ్వవిద్యాలయంలో శతాబ్దల సంవత్స రాలకుపైగాఉన్న వారసత్వ వృక్షాలను సైతం నరికేశారు.అదేవిధంగా షెడ్యూల్‌ ప్రాంతమైన ఏజెన్సీలో నిర్మిస్తున్న హైవే రహదారి నిర్మాణం కోసం దట్టమైన అడవిలో ఉండే వేలాది వృక్షాలను నరికివేయడం గమనార్హం.సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ ప్రకారం..గుత్తేదారు కంపెనీ, అటవీ అధికారుల నుండి ఖర్చులను పరిపాలన ఇప్పుడు గుర్తించగలదా?నిపుణుల నివేదికను పరిశీలిస్తే ఇప్పటి వరకూ ఇక్కడ ఎంతో వారసత్వ సంపద గల విలువైన వృక్షాలను కోల్పోయాం అనేది తెలుస్తోంది.ఇప్పటికైనా ప్రభుత్వ పరి పాలన సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలు చేయడంలో ముందుండాలి.ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించాల్సిన అవశ్యకత ఉంది.!– రెబ్బాప్రగడ రవి,ఎడిటర్ 

శ్రీ రవీంధ్రుని స్మరణలో..

భారత దేశానికి జాతీయ గీతాన్ని అం దించిన కవి,రవీంద్రనాథ్‌ ఠాగూర్‌(మే 7,1861-ఆగస్టు7,1941).ఠాగూర్‌గానూ, రవీంద్రుని గాను ప్రసిద్ధుడైన ఈయన తన గీతాంజలి కావ్యానికి సాహిత్యంలో నోబెల్‌ బహుమతిని అందుకున్నాడు. నోబెల్‌ బహుమతిని అందుకున్న మొట్టమొదటి ఆసియావాసి. స్వాతంత్య్ర పోరాటంలో జాతీయ చైతన్యాన్ని పెంపొందించడంలో రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేబేంద్రనాథ్‌ ఠాగూర్‌,శారదా దేవి దంపతులకు పదమూడు మంది సంతానంలో చిన్నవాడైన రవీంద్ర నాథ్‌ ఠాగూర్‌1861 మే 7న జన్మించారు. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ ప్రాథమిక విద్య మొత్తం ఇంట్లోనే.. కానీ సాహిత్య ప్రతిభ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. తన రచనలతో తక్కువ కాలంలోనే గొప్ప పేరును సంపాదించుకున్నారు. ఆయన కవిత్వంలో అధిక ప్రతిభను కనబర్చారు. రవీంద్రనాథ్‌ రాసిన కవితా సంకలనం గీతాంజలి 1910లో పబ్లిష్‌ అయ్యింది. ఇది సాహిత్యంలో ప్రతిష్టాత్మక నోబెల్‌ బహుమతిని గెలుచుకుంది. ఠాగూర్‌ అనేక ఇతర ముఖ్యమైన రచనల్లో మానసి(1890), సోనార్‌ తారి (1894), గితి మాలయ(1914),రాజా(1910),పోస్టాఫీసు (1912) మొదలైనవి ఉన్నాయి.రవీంద్రనాథ్‌ ఠాగూ ర్‌ ఎన్నో చిత్రాలను గీశారు. ఆయనకు సంగీతంపై ఆసక్తి ఉండడంతో కొన్నిపాటలు రాసి వాటికి సంగీ తం కూడా అందించారు.జాతీయస్వాతంత్య్రో ద్యంలో రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ బ్రిటీష్‌ సామ్రాజ్య వాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.జలియన్‌ వాలా బాగ్‌ మారణకాండకు నిరసనగా అతడికి బ్రిటీష్‌ అధికారులు ఇచ్చిన ‘నైట్‌హుడ్‌’ బిరుదును కూడా తిరిగి ఇచ్చేశారు. జాతీయ భావాలు అధికంగా ఉన్న రవీంద్రుడు అనేక హిందూ మేళాలో దేశ భక్తి గీతాలను పాడేవారు.తన పాటలద్వారా ప్రజల్లో చైతన్యాన్ని తట్టిలేపేవారు. బ్రిటీషర్లు బాల గంగాధర్‌ తిలక్‌ ను బంధించినప్పుడు తీవ్రంగా వ్యతిరేకించారు. బ్రిటీష్‌ ప్రభుత్వాన్ని విమర్శించారు. బెంగాల్‌ విభజనను వ్యతిరేకించారు.
మనం జాతీయ గీతంగా పిలుచుకునే ‘జనగణమణ’ను ఆయనే రచించారు.‘వందే మాత రం’ గేయాన్ని1896లో జరిగిన కాంగ్రెస్‌ సదస్సులో తొలిసారిగా ఆలపించారు.దీనిని బక్రించంద్ర చటర్జీ రచించారు.స్వాతంత్య్ర అనంతరం ఈ రెండిరటిలో దేనిని జాతీయ గీతంగా ప్రకటించాలని పెద్ద చర్చ జరిగింది. కానీ 1950 సంవత్సరం జనవరి 24వ తేదీన ‘జనగణమణ’ను జాతీయ గీతంగా ప్రకటించారు.1913 సంవత్సరంలో రవీంద్ర నాథ్‌ ఠాగూర్‌ తన కవితా రచన ‘గీతాం జలి’కిసాహిత్యంలో నోబెల్‌ బహుమతిని అందు కున్న మొదటి భారతీయుడు,అలాగే మొదటి యూరోపియనేతరుడు కూడా ఆయనే. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ పిల్లల కోసం శాంతినికేతన్‌ అనే విశ్వవిద్యా లయాన్ని స్థాపించారు.దీనిని విశ్వభారతి విశ్వ విద్యాలయం అని కూడా పిలుస్తుంటారు. ఇందులో ప్రాచీన గురుకుల విద్యను అందించేవారు.
భారత జాతీయ గీతం-జన గణ మన, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ రచించారు. బ్రిటీష్‌ రాజ్‌లో జార్జ్‌ ప్రశంసలతో జాతీయ గీతాన్ని కంపోజ్‌ చేశా రానే ఆరోపణలు కూడా ఉన్నాయి. బంగ్లాదేశ్‌ జాతీయ గీతం‘అమర్‌ సోనార్‌బంగ్లా’ కూడా ఆయన స్వరకల్పన చేసిందే. శ్రీలంక జాతీయ గీతం ‘శ్రీలంక మాత’కూడా ఠాగూర్‌సృష్టి నుండి ప్రేరణ పొం దింది. దీన్ని రచించిన ఆనంద్‌ సమర్కూన్‌ రవీంద్ర నాథ్‌ ఠాగూర్‌తో శాంతినికేతన్‌లో నివసించారు. ఆనంద్‌ సమర్కూన్‌ ఒకసారి మాట్లాడుతూ ఠాగూర్‌ స్కూల్‌ ఆఫ్‌ కవిత్వం తనని బాగా ప్రభావితం చేసిందని చెప్పారు. ఠాగూర్‌ కవిత్వం సంగ్రహావ లోకనం అందులోని ఒక పేరాలో కనిపిస్తుంది. ‘జనగణమన అధినాయక జయహే’ అనే మన జాతీయ గీతాన్ని అందించిన రవీంద్రుడు ప్రపం చానికంతటికీ ఎత్తయిన హిమాలయములో వున్న మానస సరోవరంలో వికసించిన పద్మం. ఆ పద్మ మే కవీంద్రుడు రవీంద్రనాథ్‌ ఠాగూర్‌.మేరు పర్వ తంలా పెరిగి తారల తాకునట్టి కీర్తి కిరీటం అలంక రించిన విశ్వకవి. హిందువుల మానసిక సౌంద ర్యాన్ని చూపించిన గీతాంజలి సృష్టికర్త మన రవీం ద్ర కవి. విశ్వ భారతి నిర్మాతసత్యం,శివం,సుం దరం త్రిగుణాత్మక తత్త్వగీతిగీతాంజలి. ఈ లోకా నికి ముముక్షువు వంటి కవి మన రవీంద్రుడు. ద్వంద్వాతీత, కళాసంపత్తి, సహితానాం భావము కలిగిన కవి. వీరు ప్రకృతి ప్రేమికులు. సమయము దొరికినప్పుడు తోటల్లోను,బహిరంగ ప్రదేశాల లోను విహరిస్తూ ప్రకృతిని ఆరాధించేవారు. చిన్నతనంలో వీరికి చదువుపై పెద్దగా మక్కువ ఉండేదికాదు. నిరాడంబరుడు. తన ఊహలకు కలలో రెక్కలు తొడిగి వాటిపై విహరిస్తూ, విచిత్ర లోకంలో గడిపేవాడు. విశ్వంలోని విచిత్రాలను తెలుసుకోవాలనే కుతూహలముతో ఉండేవారు. వారు పాఠశాలలోని చదువు కంటే, ఇంటిలోనే విధ్యాభ్యాసము చేయుటకు ఇష్టపడేవారు. సమ యపాలన అన్న అమిత మక్కువ. చదువవలసిన అంశాలను పద్దతి ప్రకారము అభ్యసించెడివారు. గణితము,చరిత్ర,భూగోళశాస్త్రము,సంస్కృత వ్యాకర ణము ఇష్టంగా చదివెడివారు.ప్రతి దినము వ్యాయా మము చేసెడివారు. చిత్రలేఖనము, సంగీతము, పుస్తక పఠనములపై ఇష్టపడేవారు. అనేక నాటకా లను వీక్షించేవారు. మాతృభాషపై ఎనలేని గౌరవ ము. రచనా వ్యాసంగముపై కూడా వారికి పట్టు అమితము.వారు అనేక వ్యాసాలు, పద్యాలు, విమర్శ లు వ్రాసేవారు.అవి వివిధ పత్రికలలో ప్రచురితమ య్యేవి.కాళిదాసు, షేక్సుఫియరు మొదలుగు వారి రచనలపై అభిరుచిని కలిగి వుండేవారు.కాని చదు వుల నిమిత్తమై ఇంగ్లండులోనిఒకపబ్లిక్‌ స్కూలు లోచేరి,అక్కడి ప్రొఫెసర్‌ మార్లేగారు ఆంగ్ల ఉప న్యాసములు విని, ఆంగ్ల సాహిత్యముపై మక్కువ పెంచుకున్నారు.18 నెలలు విధ్యాభ్యాసము కొరకు లండన్‌లో గడపినా తన మనసుకు నచ్చిన విధ్య ఏదీ పొందలేదు. ఎటువంటి విద్యార్హతలతో తిరిగి రాలేదు. తండ్రి సహాయముతో అనేక భక్తి గీతాలను ప్రచురించారు. రవీంద్రుడు ‘‘భగ్న హృదయము’’, ‘‘నిర్గరేర్‌ స్వప్నభంగ’’,ప్రభాతసంగీత’’ అనే కావ్యాలను రచించారు.రవీంద్రునికి అమితిమైన పేరు ప్రఖ్యా తులు తెచ్చిన రచన ‘‘గీతాంజలి’’.బెంగాలీ భాషలో రచించిన కొన్ని భక్తిగీతాలను ఆంగ్లములోనికి అనువదించి పొందుపరిచారు.ఈ రచన అనేక ప్రపంచభాషలలోనికి అనువదింపబడినది. నిరా శా, నిస్పృహలను దూరం చేస్తూ,సకల సృష్టిని ప్రేమ భావముతో చూచే శ్రమ తత్త్వాన్ని ముఖ్యాంశముగా గల గీతాంజలి నోబెల్‌ బహుమతిని సాధించినది. విశ్వకవిగా గుర్తింపబడినారు. ఆనాటి నుంచి వారి రచనలు విశ్వవ్యాపితమైనాయి.ఒక్క చిటికె కాల పరిమితిలో అయినా నీ సమీపంలో సేదదీరుటకు అనుమతి ఇవ్వమని భక్తిభావంతో భగవంతుని వేడుకున్న రవీంద్రునిలో ఆధ్యాత్మికత కనిపిస్తుంది. ప్రకృతిని తన స్నేహితుడుగా తలుస్తూ చక్కని భావ ప్రకటన ఈ కవితలో కనపడుతుంది.
తాను చిన్నతనంలో ప్రకృతి ఒడిలో పెరిగిన విధంగా,పిల్లలందరూ తమ బాల్యాన్ని ప్రకృతి సహజీవనంతో గడిపితే మానసిక వికా సానికి దోహదం చేస్తుందని నమ్మేవారు. అందుకు అనుగుణంగా కలకత్తా నగరంలో ‘శాంతి నికేతము’ స్థాపించారు. ఇది పూర్వకాలపు గురుకులాన్ని పోలి వుండేది. విధ్యార్థులు బయట పచ్చికపై కూర్చుని విద్యను అభ్యసించెడివారు.ఇందులో చేరిన విధ్యా ర్థులు క్రమశిక్షణకు మారుపేరుగా పెరిగేవారు. ఉదయం మేల్కాంచినప్పటి నుండి, తిరిగి రాత్రి నిద్రించు వరకు చేయవలసిన దిన చర్యలను పద్దతి ప్రకారం ఆచరించే విధంగా విధి విధానాలను రూపొందించారు. వ్యాయామము, శుభ్రత పాటిం చుట, శాకాహార భోజనము,కాలినడక, పెద్దలను గురువులను గౌరవించుట,సత్యమునే పలుకుట, చెడు పనులను చేయకుండుట, ఆరోగ్య పరిరక్షణ మొదలగు ఉన్నత లక్షణాలను నేర్పుతూ నేటికీ క్రమ శిక్షణతో ముందుకు కొనసాగుతున్న గురుకులం శాంతినికేతనము.గ్రామాలు దేశానికి పట్టుగొమ్మలు అని నమ్మిన రవీంద్రుడు, గ్రామాభ్యుదయానికి కూడ తమ వంతుగా గంగాతీరంలో‘శ్రీనికేతన్‌’ స్థాపిం చారు. పరమత సహనాన్ని ప్రబోధించారు. ప్రపం చము ఆనందమయమనీ, మనసుతో అనుభవిం చెడివారికి అవగతమౌతుందని భావించెడివారు. ఉన్నతమైన జాతీయ భావాలు ప్రదర్శించెడివారు. వీరి భావనలకు జవహర్‌లాల్‌ నెహ్రూ ముగ్ధుల య్యెడివారు.బెంగాల్‌ విభజనను తీవ్రంగా వ్యతి రేకించారు. ఈ సమయంలో ఎంతో కీలకంగా వ్యవహరించారు. బకింగ్‌ చంద్రచటర్జీ రచించిన ‘వందేమాతరం’జాతీయ గేయంగా గుర్తింపు పొం దగా, రవీంద్రుడ రచించిన ‘జనగణమన’ జాతీయ గీతంగా గుర్తింపు పొందాయి. భారత రాజ్యాంగ ములో వీటికి సమాన ప్రతిపత్తి కల్పించారు. శ్రీ రవీంద్రులు మనకు స్వాతంత్య్రము వచ్చునాటికి మన మధ్య లేకపోవటం తీరనిలోటు. ఆయన రచించిన జాతీయగీతాన్ని నిత్యం మనము ఆలాపి స్తున్నాము. వీరు రచించిన పుస్తకాలలో అనేక ఉత్తమ ప్రభోధాత్మక భావాలు ఉండేవి. ‘చెడుగా ఆలోచించే గుణం సగం సమస్యలకు కారణం’, ‘ఎక్కడవ్ఞినం స్వేచ్చగా మనగలుగుతుందో’,‘ఎక్కడ మనసు నిర్భయంగా వుంటుందో’, ‘ప్రేమించే వ్యక్తికి దండిరచే అధికారం కూడా వుంటుంది’, ‘మూఢత్వ ము మరణానికి దారితీస్తుంది’,‘గడచిన ప్రతీ రోజు నుండి మనము కొత్త విషయాలు నేర్చుకోవాలి’, ‘వైఫల్యాల నుండి గుణపాఠాలు నేర్చుకోవాలి’ వంటి సూక్తులు మనకు వీరి రచనలలో కనబడతాయి. వీరు తత్త్వదర్శి,దార్శినికులు శ్రీరవీంద్రనాథ్‌ ఠాగూర్‌.ఆయనన నిధి.వారి మాటలను అనుసరిం చుట మన విధి.రెండవ ప్రపంచ యుద్ధ సమ యంలో మానసింగా కృంగిపోయిన రవీంద్రనాథ్‌ ఠాగూర్‌,ఏవైద్యానికి కోలుకోలేదు. వారు భారతదేశ మును శోకసంద్రములో ముంచి 1942, ఆగస్టు 7వ తేదీన పరమపదించారు. `జై భారత్‌-(డా.దేవులపల్లి పద్మజ)

నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రణాలు నిలువెత్తు ప్రతిష్ట

మతానికి ప్రతీకారానికి మణిపూర్‌ రాష్ట్రం బలి యవుతుంటే ద్వేషంతో దేశ ప్రజలు విడిపో తున్నారు. ‘‘ఉపన్యాస విన్యాసాలతో దేశ ప్రజల శిరస్సులకు చేతబడి జరుగుతుంది’’ అంటూ జూకంటి జగన్నాథం అనే కవి పలికినట్లు.. మణిపూర్‌ ఘటనలు ఒక ఎత్తైతే దాని పర్యవసానాలు దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలపై చూపుతున్న ప్రభావం మరింత ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది.
ప్రస్తుత ఈ పదేళ్ల కాల పరిపాలనలో చోటు చేసుకుంటున్న ప్రధాన మార్పు ఏమంటే జరిగిన అన్యాయాన్ని వ్యతిరేకించిన వాళ్లపై దాడి జరుగుతుంది. వండి వార్చిన అభిప్రాయాలను ప్రజల ఆలోచనలపై నిండుకుండలా కుమ్మ రించి అంధ భక్తులను తయారు చేయడంలో నేటి మితవాద పాలకులు సఫలీ కృతం అవు తున్నారు. ఇద్దరు మహిళలను వివస్త్రులను చేసి అంగాంగ ప్రదర్శన చేయడమే కాకుండా వాటిని తమ వికృత చేష్టలతో తడుముతూ బహిరంగ మానభంగం చేసి హతమార్చిన సంఘటనను దేశం కళ్ళారా చూసింది. జరిగిన 72రోజుల తర్వాతగాని ఈ అంశం బాహ్య ప్రపంచం దృష్టికి రాలేదు.మే4వ తారీఖున సంఘటన జరిగితే మే18వతారీఖున భర్త పోలీసులకు ఫిర్యాదు చేసినా ఈ సంఘటన జూలై 19వ తారీఖున ఒక వీడియో ద్వారా ప్రజల ముందుకు వచ్చిన తర్వాత పోలీసులు రంగంలోకి దిగారు. జరిగిన అఘాయిత్యాలను, జరగని పోలీసుల చర్యలను ఖండిరచడం ఒక బాధ్యత.అలా సోషల్‌ మీడియాల ద్వారా ఖండిరచబడుతున్న వాటిని, అంధ భక్తులు ప్రతి ఖండిస్తూ విద్వేషాలతో ఊగిపోతున్నారు. ఇలాంటి సంఘటనలు మరొక రాష్ట్రంలో జరగలేదా, మానభంగాలు మర్డర్లు మరెక్కడా జరగలేదా? అంటూ సమర్ధించుకుంటున్నారు. అబలలపై జరిగిన ఆకృత్యాలను సమర్థించుకు నేదా సంస్కారం అంటే? ఇది ఒక్కటే కాకుండా మహిళలకు జరిగిన అన్యాయాలపై తిరగబడిన ఒక యువకుడి తల నరికి ఇంటి ముందున్న తడికె కు వేలాడదీసిన ఫోటో జూలై 22వ తారీకు ఆంధ్రజ్యోతిలో దర్శనమిచ్చింది. వెంటనే భక్తులు రంగంలోకి దిగి ‘‘కాశ్మీరీ పండిట్లకు జరిగిన అన్యాయం సంగతి చెప్పండి’’ అంటున్నారు. జరుగుతున్న అన్యాయాలన్నింటికీ చారిత్రక తప్పిదాలే సమాధానాలా? భాజపా నాయకురాలు విజయశాంతి తెలంగాణ ఐఏఎస్‌ అధికారిణి స్మిత సబర్వాల్‌ లాంటివాళ్ళు ట్విట్టర్‌ వేదికగా ఈ అంశాన్ని ఖండిస్తే వారిని అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. ఇదేనా సంస్కారం అంటే? జగన్మాత, భారత మాత, కాళీమాత అంటూ ఏవేవో పేర్లు పెట్టి మహిళలకు గౌరవం ఇస్తున్నట్టుగా ఫోజులు కొట్టేవాళ్ళు మహిళలపై జరుగుతున్న దాడులను కనీసం ఖండిరచడానికి మొహం చాటేస్తున్నారు ఇది సిగ్గుచేటు కాదా? మతాలు మత ఛాంద సవాదులు ముఖ్యంగా రాజకీయాలను మతంతో ముడిపెట్టి, మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయా లను నడిపిస్తున్న నేటి పాలకులు వారి అనుయా యులు మరియు వారి వార్తల మాధ్యమాలు ఎన్నడూ మహిళల గౌరవానికి ప్రాధాన్యతను ఇవ్వలేదు, ఇవ్వలేరు కూడా. ఎందుకంటే ఆధిపత్య భావజాలం లో అది అసాధ్యం.‘‘ఎత్తి చూపిన పాలిండ్లు కరుణ చూపని కఠిన శిలలయ్యే వరకూ, గగుర్పొడిచేలా గరళ బీజా లు నాటిన గర్భసంచుల్లో గన్నేరు కాయలు కాసే వరకూ, ఈ యాత్ర ఇలాగే కొనసాగుతోంది’’ అంటూ కవయిత్రి పాడిబండ్ల రజిని చెప్పిన ఆగ్రహ వాక్యాలు నిజమనిపిస్తున్నవి. ఇక తమ ఆగడాలను కప్పిపుచ్చుకోవడానికి దేశము, మతము అభద్రతలో ఉన్నాయనే ముసుగును కప్పుకుంటున్నారు. దేశంలోకి మయన్మార్‌ ప్రాంతం నుండి రోహింగ్యాలు చొరబడుతు న్నారు ఇది మయన్మార్‌ మరియు చైనా దేశాల కుట్ర అంటూ అసత్య ప్రచారాలతో ఊదరగొడు తున్నారు. పదేళ్ల నుంచి పాలిస్తున్న వారు, దేశ సరిహద్దులను తమ హద్దులలో పెట్టుకున్న వారు,ఈ మాట అంటుంటే నమ్మడానికి మన కున్న వివేకం ఏమైనాట్లు. ప్రతి సంఘటనను విదేశీ కుట్రతో ముడిపెట్టడం కుసంస్కారం కాదా? ఇక మణిపూర్లో హిందూ మతం అబద్రతలో పడిరదంటూ క్రైస్తవ మతం ఆధి పత్యం చాలాయిస్తుందంటూ మరో అసత్య వాదనకు నిస్సిగ్గుగా తెర తీస్తున్నారు. మైదాన ప్రాంతంలో నివసించే వారంతా మైతేయులని, వారంతా హిందువులని, అదేవిధంగా కొండ ప్రాంతాల్లో నివసించే వారంతా కుకీ జాతికి చెందిన గిరిజన క్రైస్తవులని తెలుస్తుంది. దేశం లో ఎక్కడైనా కొండ ప్రాంతంలో ఉన్న వారికి రిజర్వేషన్లు అమలులో ఉన్నవి. కొండ ప్రాంతం లో ఉన్న భూమిని ఇతరులు ఎవరు కొనకుండా 370అధికరణం కింద ఆంక్షలు ఉన్నవి. మరి ఈరోజు అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వం మైదానంలో ఉండే మైతేయులకు ఎస్టీ హోదా కల్పించడంలో ఉన్న ఆంతర్యం ఏమంటే కొండ ప్రాంతాల్లో కూడా వాళ్ళు భూమిని కొనవచ్చు, సొంతం చేసుకోవచ్చు. ఇలాంటి ఉద్దేశంలో సామాజిక అంశం ఉన్నదా,ఆర్థిక అంశం ఉన్నదా?కొండ లోయల్లో విరివిగా పండే నల్ల మందు వంటి వాణిజ్య పంటలను హస్తగతం చేసుకోవడం కోసమే కదా ఈ రకమైన రాజకీ య ఎత్తుగడ భాజపా ప్రభుత్వం వేసింది! పేదరికపు నిష్పత్తి గిరిజనులకు మించిన స్థాయిలో మిగతా సమూహాల్లో ఉన్నదా? అయినప్పటికిని భాజపా రిజర్వేషన్ల విధానానికి వ్యతిరేకంగా తన రాజకీయ నిర్ణయాన్ని ఏనాటి నుంచో ప్రకటిస్తూనే ఉన్నది. ఇది చాలదా వారి అసలైన అంతర్యాన్ని అర్థం చేసుకోవడానికి? ఈ అసలైన ఆర్థిక ఆధిపత్యపు అంశాన్ని పక్కనపెట్టి జాతుల మధ్య మతాల మధ్య జరుగుతున్న రచ్చ గా బాహ్య ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. ఇది తెలియని అంధ భక్తులు హిందూ మతం ప్రమాదంలో పడిరది, భవిష్యత్తులో ఇతర మతాలు ఆధిపత్యం చెలాయిస్తాయి, అనే న్యూనతాభావంతో అనవసర విద్వేషాలకు లోనవుతున్నారు.
మూడు నెలల నుంచి జరుగుతున్న ఈ సంఘటనలు ప్రపంచ దృష్టిని ఆకర్షించి భారతదేశ పరువును బజార్లో పెట్టాయి. భారతదేశంలో మతసహనం లేదని ఒక్క మణిపూర్‌ రాష్ట్రంలో 250చర్చిలకు పైగా కూల్చబడ్డాయని ఐక్యరాజ్యసమితిలో చర్చ జరిగింది. యూరోపియన్‌ యూనియన్‌ పార్లమెంట్లో, ఇంగ్లాండ్‌లోని హౌస్‌ ఆఫ్‌ కామన్‌ సభలో ఇదే రకమైన చర్చ జరుగుతోంది. ఇలాంటి పర్యవసానాలు దేశానికి నష్టదాయకం కావా?అసలు పరిస్థితి ఇంత దాకా ఎందుకు వచ్చింది.‘‘ఏ స్టిచ్‌ ఇన్‌ టైం సేవ్స్‌ నైన్‌’’ అనే ఇంగ్లీషు సామెత అర్థం ఏమంటే సరైన సమయంలో స్పందిస్తే సమస్య పెరిగి పెద్దది కాదు అని. సరైన సమయంలో స్పందించక పోవడమే కాక రాష్ట్ర ప్రభుత్వం వహించిన అలసత్వం, రిజర్వేషన్లపై కోర్టు తీర్పును పునః సమీక్షించని విధానం, ఈ దుస్థితికి దారితీ సాయి. ఒక రాష్ట్రంలోని ఎన్నికల దృష్ట్యా వ్యవసాయ సంస్కరణల నల్ల చట్టాలపై వెనక్కి తగిన కేంద్రం మణిపూర్‌ అంశంలో అదే చొరవ చూపలేకపోయింది. మణిపూర్‌ ప్రజలపై నిప్పుల వర్షం కురుస్తుంటే కర్ణాటక ఎన్నికల ర్యాలీలో పూలజల్లు కురిపించుకోవడానికి ఇష్టపడిన పెద్దలు దీనికి బాధ్యత వహించాలి. ఒక అమ్మాయిని దుశ్శాసనులంతా కలిసి నగ్నంగా ప్రదర్శిస్తున్న అంశాన్ని కళ్ళారా చూసిన తర్వాత గాని పెద్ద మనిషికి నోరు పెకల లేదు. తెరిచిన ఆనోటి తుంపరలు పక్క రాష్ట్రాల పై వెదజల్లెందుకు తాతహలాడాయి.ఈసందర్భం గా చరిత్రను ఒకసారి గమనించాలి.1946లో బెంగాల్‌ ప్రావిన్స్‌ లోని నొవాకలి ప్రాంతంలో జరిగిన మత ఘర్షణలు అత్యంత దారుణ మైనవి. ముస్లిం లీగ్‌ మరియు హిందూ మహాసభలు భారతదేశ వేరువేరు మత రాజ్యాలుగా ఉండాలని ప్రజల్లో నూరి పోయడంతో, క్షేత్రస్థాయిలో అవి మత ఘర్షణలకు దారితీసాయి. ముస్లింలు మెజారిటీగా ఉన్న ఆ ప్రాంతంలో అనేకమంది హిందువులను ప్రభుత్వ అండదండలతోనే ఊచకోత కోశారు. హిందువులు మైనారిటీలో ఉన్నప్పటికీ అనేకమంది హిందువులు భూస్వాములుగా చలామణి అవుతూ ఉండే వారు. కానీ హిందువులను ఏనాడు వారు రక్షించడానికి ప్రయత్నం చేయలేదు. అరకొరగా అందిన వార్తల ఆధారంగా మహాత్మా గాంధీ ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి ఎంక్వయిరీ చేయసాగారు. కానీ అప్పటి బెంగాల్‌ ప్రభుత్వం అసత్య సమాచారాన్ని ఇస్తూ అంతా సవ్యంగా ఉంది అనే సంకే తాలను పంపింది. ఒకానొక రోజు మహాత్మా గాంధీ ఆనాటి కాంగ్రెస్‌ అధ్యక్షులు జేబీ కృపలానిని బెంగాల్‌ సందర్శించడానికి ఆదేశించవలసి వచ్చింది. ఆయన తన సతీమణి సుచేత కృపలాని నీ వెంటబెట్టు కొని వెళ్లారు. అక్కడి దీన వ్యవస్థలోని ప్రజల ఆర్తనాదాలు అభ్యర్థనలు సుచేత కృపలాని నీ అక్కడే మరో ఆరు నెలలు ఉండేలా చేశాయి. పరిస్థితి సద్దుమణి వరకు సుచేత కృపలాని గారిని అక్కడే ఉంచి జేబీ కృపలాని ఢల్లీి వెళ్లారు. మనందరికీ తెలుసు దేశమంతా స్వాతంత్ర సంబరాల్లో మునిగి ఉంటే,మాత్మ గాంధీ బెంగాల్లోని మత కలహాలను తగ్గించేందుకు అక్కడికి వెళ్లి మకాం వేసి, ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రయత్నించారని. ఇలాంటి చరిత్రకు వారసులుగా ఉన్న నేటి పాలకులు నిమ్మకు నీరెత్తినట్లుగా తమకు గర్వభంగము అవునేమో ననే చీకటి గౌర వాన్ని తలపై మోస్తూ దేశాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నారు. ఇది దేశ ప్రజలలో విపరీత వైశమ్యాలకు దారితీస్తున్నది.‘‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా’’ అన్నట్లు పాలకులకే సమయమనం లేకుంటే సామాన్య ప్రజానీకానికి ఎందుకుంటుంది. అంచేత పంతాలు, పట్టింపుల కన్నా పరిష్కారానికి చొరవ చూపాల్సిన సమయం సందర్భం ఇది.-(జి.తిరుపతియ్య)

విద్వేషాలలో సమిధలవుతున్న మహిళలు

మహిళలకు విలువ ఇవ్వని ఈ మనువాద పాలకులు అధికార పీఠాలు పొందారు. కడుపులో చేయిపెట్టి తిప్పినట్లు ప్రతి నిముషం ఎక్కడో ఒకచోట ఆడపిల్ల ఆర్తనాదం. దీనిని ఆపాలని మొత్తుకుం టున్నాం. ఆలకిం చడంలా? వదిలేద్దామా? వదిలేస్తే మనం బతగ్గలమా? రక్షణ ఉందా? మన బతుకుల కోసం మన బిడ్డల బతుకుల కోసం కదలాలి. బహు రూపాలలో. వంటరిగా కాదు. సమూహంగా. పాలకులకు చెవికెక్కే వరకు. వారు చెవినెక్కించుకోకపోతే గద్దె దించేందుకు.
మణిపూర్‌లో మహిళలను నగంగా ఊరేగించిన ఘటన భారతీయ ప్రజానీకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. వెన్నులో వణుకు పుట్టించింది. స్త్రీలను గౌరవిస్తాం. మన భారతీయ సంస్కృతి ఇది అని చెప్పుకునే చోట…ఇంతగా బరి తెగించి బహిరంగంగా మహిళలను నగ్నంగా ఊరేగించే దుర్మార్గం ఏరకంగా సాగింది?‘’న స్త్రీ స్వాతంత్య్ర మర్హతి’’ అంటూ కాలి కింద చెప్పు మాదిరి అణిచివేయాలనేదుర్మార్గపు సాంస్కృతిక నేపథ్యం దీనికి కారణం కాదా? ఈ దుర్మార్గపు సంస్కృతిని ముసుగులా వేసు కున్న పురుషాధిపత్యభావజాలాన్ని, భూస్వామ్య ప్రవృత్తిని మూలాలకంటా ఛేదించాల్సిన అవ సరాన్నిమణిపూర్‌ ఘటనలు వెలుగులోకి తెచ్చా యి.ఆర్‌.ఎస్‌.ఎస్‌ సాంస్కృతిక సంస్థ అని చెప్పుకుంటూ కాలం చెల్లిపోయిన భూస్వామ్య పురుషాధిపత్యాన్ని పున:ప్రతిష్టించే ప్రయత్నం చేస్తున్నది.బిజెపి అధికారంలోకి వచ్చేవరకు తన భావజాలాన్ని జనం మీద రుద్దడానికి ఆర్‌ఎస్‌ఎస్‌కు పెద్దగా అవకాశం దొరకలేదు. చాప కింద నీరు మాదిరి పని చేస్తున్నా కోరలు పెరగలేదు.కానీ నయవంచక బిజెపి కేంద్రంలో అధికారంలోకి రావడంతో వారి ఎజెండాను అత్యంత చురుగ్గా అమలు చేయడం ప్రారం భించారు. తమ మిత్రులైన క్రోనీ క్యాపిటలిస్టుల లాభాల కోసం భూస్వామ్య సంస్కృతిని జోడిరచి మరీ ఈదేశంలో దళితులపై, ఆదివాసీలపై, వెన కబడిన శూద్ర తరగతులపై బుల్డోజర్‌ నడిపిస్తు న్నది. ఈ బడుగు బలహీనులను అణిచివేసేందుకు, సమస్త వనరులను కబ్జా చేసేందుకు పూనుకున్నది. కాశ్మీర్‌ భూభాగాన్ని క్రోనీ క్యాపిటలిస్టులకు అప్ప జెప్పేందుకు 370ఆర్టికల్‌నిరద్దు చేయడం చూశాం. ఆర్టికల్‌ 370 రద్దుకు ముందు ఓ ముస్లిం బాలికపై గుడిలో అత్యాచారానికి తెగబడడం గుర్తుండే వుం టుంది. అక్కడ భూమిని కబ్జా చేసేం దుకే మైనారిటీ తెగకు చెందిన ఆచిట్టితల్లిని చిది మివేశారు. నేడు మణిపూర్‌ కొండల్లో ఉన్న విలువైన ఖనిజ సంపద కోసం రావణ కాష్టం రగిలించారు.
ఆజ్వాలల్లో ఆడపిల్లలు సమిధలవు తున్నారు. ఒకరా? ఇద్దరా? ముగ్గురా? ఎందరు? లెక్కలు తేలాల్సి ఉంది. అసలు తేలుతాయా? అన్నది ఈరోజు అందరూ అడుగుతున్న ప్రశ్న. ఈ ఘటనలు చోటుచేసుకున్న రెండు నెలల వరకు, వీడియో వెలుగులోకి వచ్చేవరకు, సుప్రీంకోర్టు హెచ్చరికచేసే వరకు ప్రధానికి తెలియదా? తెలుసని ఈదేశ ప్రజలు ఈరోజు నమ్ముతున్నారు.తెలియ డం మాత్రమే కాదు, వాటికి ప్రధాని, ఆయనను నడిపించే ఆర్‌ఎస్‌ఎస్‌ ఆమోదం కూడా ఉందని. ఆమోదం లేదా?దీనికి వారు సమాధానం చెప్ప గలిగే ఖలేజా ఉందా?బిల్కిస్‌ బానో మన ఆడప డుచు.పోరాడి గెలిచింది.ఏం చేశారు? ఆగస్టు 15 అమృతోత్సవాల సంబరాల్లో నిందితులకు స్వేచ్ఛని చ్చారు. పైగా ఏమన్నారు? బ్రాహ్మణులు-సంస్కార వంతులు. అంటే ఏమిటి అర్థం. ఇతర కులాలకు చెందిన వారు సంస్కారవంతులు కారనా! అత్యాచా రానికి పాల్పడిన వారు సంస్కారవంతులెలా అవు తారు? ‘ఈ దేశంలో స్త్రీ బ్రాహ్మణులకు మొదటి హక్కు.స్త్రీకి స్వతంత్రత లేదు’-అని మనుధర్మం చెప్తుంది. దాన్నే వీరు తమ చేతల్లో చూపిస్తున్నారు. సంఫీుయుల ప్రకారం కోర్టులు మను ధర్మాన్ని తప్ప ఐపిసిని అనుసరించకూడదు.హత్రాస్‌లో కోర్టు ఆ మనుధర్మాన్నే పాటించింది. ఎవరైనా చని పోయి నప్పుడు కొన్ని సాంప్రదాయాలు పాటిస్తుంటాం. అయితే అవి అందరికీ లేవు.దళితులకు అసలే లేవు.అందుకే మనీషా వాల్మీకిని అర్థరాత్రి దహనం చేశారు. ప్రజాప్రతినిధి సింగార్‌ అత్యాచారం చేసిన కేసులో జైలుకు వెళ్ళాడు. కానీ బిజెపి నాయకత్వం పూలదండలతో స్వాగతించి భుజాన మోశారు. రెజ్లర్లు మన బిడ్డలు.కఠోర దీక్షతో విజయాలను ముద్దాడిన ప్రియపుత్రికలు.ఈదేశ ప్రతిష్టను ప్రపం చ పటంలో నిలబెట్టిన ఆడపిల్లలు.భద్రంగా కాపా డుకోవాల్సిన బిడ్డలు. తమ మీద లైంగిక దాడి జరిగిందని,న్యాయం చేయమని వారు రోడ్డెక్కినా ప్రధాని మోడీ మాట్లాడలేదని మన దేశ ప్రజలు ఆశ్చర్యపోయారు.ఔరా!ఇంతటి దుర్మార్గానికి పాల్పడిన తమ సొంత పార్టీ మనిషిని మోడీ వెన కేసుకొస్తున్నాడేమని ఆశ్చర్యపోయారు అమాయకపు ప్రజలు. స్త్రీలు నో అంటే నో అనే అర్థమని అమితా బ్‌ బచన్‌ సినిమాలో చెప్తే మాకేంటి? మేం కోరుకున్న మహిళ మాచెంత ఉండాల్సిందే! అనే ధోరణే దీనికి కారణం కాదా.ఈ రోజు గుంటూరులో ఓరమ్య, విశాఖలో ఓవరలక్ష్మి, విజయవాడలో ఓ దీపిక… ఇలా ఎన్నిపేర్లని చెప్పుకోవాలి?ఆడపిల్లను కోరుకు న్నప్పుడు కాదంటే చంపటం ఈభావజాలం వల్లే కదా! మహిళలకు విలువ ఇవ్వని ఈ మనువాద పాలకులు అధికార పీఠాలు పొందారు. కడుపులో చేయిపెట్టి తిప్పినట్లు ప్రతినిముషం ఎక్కడో ఒకచోట ఆడపిల్ల ఆర్తనాదం. దీనిని ఆపాలని మొత్తుకుం టున్నాం.ఆలకించడంలా? వదిలేద్దామా? వదిలేస్తే మనం బతగ్గలమా? రక్షణ ఉందా? మన బతుకుల కోసం మనబిడ్డల బతుకుల కోసం కదలాలి. బహు రూపాలలో. వంటరిగాకాదు. సమూహంగా పాల కులకు చెవికెక్కే వరకు. వారు చెవి నెక్కించుకోకపోతే గద్దె దించేందుకు. మహిళల రక్షణ కోసం ఆర్తితో, ఆవేదనతో,ఆగ్రహంతో మహిళా సంఘం ఓ బృహ త్తర కార్యక్రమం చేపట్టింది. మహిళా సంఘాలు కలిసి రూపొందించిన కోర్కెల పత్రాన్ని ప్రజల ఎజెండాగా ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహిళల రక్షణ కోసం నేడు పోరాట గడ్డ ఉక్కు నగరం విశాఖ నుండి ఒకయాత్ర, హిం దూపురం నుండి మరో యాత్ర ప్రారంభమైంది. హింస లేని సమాజంకోసం అన్ని జిల్లాల్లోనూ విస్తృ తంగా ప్రచార సభలు జరగనున్నాయి. ఆగస్టు 8న విజయవాడలో జరగనున్న బహిరంగ సభ నుంచి మహిళా రక్షణకోసం చేయిచేయి కలిపి నడుద్దాం.ఈ మహఉద్యమంలో భాగస్వాముల మవుదాం. మనువాద రాచరిక సంస్కృతిని, దానిని కాపాడే వారిని నిలదీద్దాం.వెలివేద్దాం.
ఇవి డిమాండ్లు …
జు మహిళలపై జరుగుతున్న నేరాలను అధ్యయ నం చేయటానికి, చర్యలు తీసుకోవడా నికి రాష్ట్ర ప్రభుత్వం న్యాయ నిపుణులతో కమి షన్‌ ఏర్పాటు చేయాలి.
జు మహిళలపై హింసను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని మహిళా సంఘాలు స్వచ్ఛం ద సంస్థలను ఆహ్వానించి కార్యాచరణను రూపొందించాలి.
జు మహిళలకు,చిన్నారులకు రక్షణ కల్పించే చట్టాలను కఠినంగా అమలు చేయాలి.
జు నిందితులను ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుల ద్వారా త్వరితగతిన విచారణ జరిపి కఠినమైన శిక్షలు విధించాలి. చెరుకుపల్లి మండలంలో అమర్నాథ్‌ హత్య కేసును ఫాస్ట్‌ ట్రాక్‌కు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేయాలి.
జు ప్రభుత్వం మీడియా మానిటరింగ్‌ కమిటీ ఏర్పాటు చేయాలి.హింస,అశ్లీలత, అసమాన తలను ప్రేరేపించే చలనచిత్రాలు,టీవీ సీరి యల్స్‌,ఇంటర్నెట్‌కార్యక్రమాలను నిషేధిం చాలి.
జు సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌లపై చర్యలు ఉండాలి.
జు కాలేజీల్లో,పని ప్రదేశాల్లో వేధింపులను నిరో ధించేందుకు అంతర్గత ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు చేయాలి,అమలు చేయాలి.
జు అన్ని విద్యాలయాల్లో లింగ సమానత్వాన్ని పెంపొందించే సిలబస్‌ను రూపొం దించా లి.బాలబాలికల మధ్య స్నేహపూర్వక అవ గాహనను కల్పించాలి.
జు పాఠశాలల్లో శారీరక దారుఢ్యాన్ని పెంచే ఆటలు, ఆత్మరక్షణ శిక్షణ కార్యక్రమాలు… అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి.
జు వన్‌ స్టాప్‌ సెంటర్లు, హెల్ప్‌ లైన్లు ఉమ్మడిగా సమన్వయంతో పని చేసే ఏర్పాటుచేయాలి. తగిన సిబ్బందిని నియమించాలి.ఏ నెలకా నెల జీతాలు చెల్లింపు చేయాలి.
జు మద్యం, మత్తు పదార్థాలను నియంత్రిం చేందుకు చర్యలు చేపట్టాలి. మండలానికి ఒక మద్యం షాపును మాత్రమే అనుమ తించాలి.
జు మద్యం,మత్తుమందులకు వ్యతిరేకంగా ప్రభుత్వం విస్తృతప్రచారం చేయాలి.మద్యం మీద వస్తున్న ఆదాయంలో కనీసం ఒక్కశాత మైనా మద్య నియంత్రణకు కేటాయించాలి.
జు బాల్య వివాహాల నిరోధానికిగాను బాలిక లకు నిర్బంధ విద్య 19 సంవత్సరాల వరకు పెంచాలి.
జు ఒంటరి మహిళలకు, వారి కుటుంబాల్లోని పిల్లలకు అదనపు రక్షణ సదుపాయాలు ఏర్పాటు చేయాలి.
జు అనాథ బాలలు, ఆడపిల్లలు ఉన్న హాస్టళ్లలో, గెస్ట్‌ హౌస్‌లో పురుష సిబ్బంది ఉండరాదు.
జు పోలీసులకు జండర్‌ సెన్సిటివిటీ పెంచడా నికి క్రమబద్ధంగా శిక్షణ కార్యక్రమాలు ఉండాలి.సక్రమంగా లేని పోలీసు ఆఫీసర్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి.
జు మహిళల సమానత సాధనకు చర్యలు ము మ్మరం చేయడం ద్వారానే హింసను కూడా అరికట్టడం సాధ్యమవుతుంది. కనుక అన్ని రంగాల్లో సమానత సాధనకు ప్రభుత్వం పూనుకోవాలి.
జు బాధితుల పునరావాసం కోసం కంపెన్సేషన్‌ ఇవ్వవలసిన నిధులను నెలలోగా అందించే విధంగా చర్యలు తీసుకోవాలి.
జు ఉపాధి గ్యారంటీ పథకాలు రూపొందించి అమలు చేయాలి. పెద్ద సంఖ్యలో ఉన్న అసంఘటిత మహిళా కార్మికులకు కార్మిక చట్టాలు అమలు పరిచేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి.
జు ప్రతివారం ఒకప్రాంతంలో మండల అధికా రులు మహిళల హక్కులను వివరిస్తూ అమలుకు పూనుకునే విధంగా ప్రచారం, కార్యాచరణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలి.
జు మహిళలకు విద్య,రక్షణ, ఉపాధి భద్రత కల్పించేందుకు రాజ్యాంగ విలువలను కాపాడే పద్ధతులను అమలు చేసేందుకు ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించి అమలు చేయాలి. వ్యాసకర్త:ఐద్వా రాష్ట్ర కార్యదర్శి

జాతి వజ్రాలు..జాగృతి తేజాలు

దేశ స్వతంత్ర పోరాటంలో భాగంగా తమ సర్వాన్నీ త్యాగం చేసిన భరతమాత ముద్దుబిడ్డలు ఎందరో.జైలు జీవితాన్నీ సంతోషంగా అనుభవించిన ఉదాత్తులు ఎందరో. వారం దరికీ దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ వేనవేల వందనాలు. అలాంటి వారిలో కొందరి గురించి క్లుప్తంగా స్మరించు కుందాం..!
ఉరితాళ్లు ముద్దాడిన..మన్యం వీరులు
బ్రిటిష్‌ పాలకులను గడగడలాడిరచి దేశ స్వాతం త్య్రం కోసం ఉరితాడును ముద్దాడిన ఎందరో మన్యం పోరాటయోధుల త్యాగాలు నేటికీ వెలుగు లోకి రాకుండా మరుగునపడటం విచారకరం. ప్రథమార్థంలోనే బ్రిటిష్‌ వారిని ఎదురించిన మన్యం వీరులు చాలా మందే పశ్చిమ ఏజెన్సీలో ఉన్నారు. ఇందులో పోలవరం తాలూకా కొరు టూరుకు చెందిన కారుకొండ సుబ్బారెడ్డి ప్రథ ముడు. అలాగే కొండమొదలుకు చెందిన కుర్ల సీతారామయ్య,కుర్ల వెంకట సుబ్బారెడ్డి, గురుగుంట్ల కొమ్మిరెడ్డి ఉరితాళ్లకు బలైనవారే. వీరిలో సుబ్బా ండ్డినే బ్రిటిష్‌వారు టార్గెట్‌ చేశారు. ఇప్పుడు పిలవ బడే పోలవరం, బుట్టాయగూడెం మండల ప్రాంతాల్లోని 20 పరగణాల ప్రాంతాలను బ్రిటిష్‌ వారికి సమాంతరంగా సుబ్బారెడ్డి కుటుంబీకులు పాలన సాగించేవారు. వ్యవసాయ కుటుంబం నేపథ్యం ఉన్న వీరు అన్ని రకాల పన్నులు వసూలుచేసి ప్రజల అవసరాలను తీరుస్తూ ఉండేవారు.సుబ్బారెడ్డి కుటుంబీకుల పాలనలో ఉన్న ప్రాంతాన్ని కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని బ్రిటిష్‌వారు ప్రయ త్నించినా..యుక్తవయస్సులో దేశభక్తి మెండుగా ఉన్న సుబ్బారెడ్డి తన అనుచరులతో కలిసి వారిని ఎదురించాడు.దీంతో పగబట్టిన బ్రిటిష్‌వారు సుబ్బా ండ్డిని పట్టుకుని ఉరితీయడానికి ఆదివాసీలనే లోబ ర్చుకునేందుకు పన్నాగంపన్నారు. విచిత్ర మేమి టంటే ఇతనికి అత్యంత సన్నిహితుడే సుబ్బా రెడ్డి మరణానికి కారకుడయ్యాడు. సుబ్బారెడ్డిని పట్టించిన వారికి అప్పట్లో 500 నుంచి 2500రూపాయలు రివార్డు ఇస్తామని బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రకటించిం దంటే ఆయనపోరాట స్ఫూర్తి ఎలాంటిదో నేటితరం గుర్తుంచు కోవాలి. లొంగిపోయిన చింతపల్లికి చెంది న వేట్ల దాసిరెడ్డి ద్వారా ఆచూకీ తెలుసుకుని సుబ్బా రెడ్డిని పట్టుకుని ప్రస్తుతం బుట్టా యగూడెం మండల కేంద్రంలో బ్రిటిష్‌వారు నిర్మించిన జైలులో బంధిం చారు.1858 అక్టోబర్‌ ఏడోతేదీన సుబ్బారెడ్డి,కుర్ల సీతారామయ్య,తూటిగుంటలో కుర్ల వెంకట సుబ్బా రెడ్డి,పాత పోలవరం దివానం వద్ద గురుగుంట్ల కొమ్మిరెడ్డిను బ్రిటిష్‌ పాలకులు ఉరి తీసినట్టు చరిత్ర చెబుతోంది.చరిత్ర ఆధారాలు లేకపోయినా సుబ్బా రెడ్డి తలను రాజమండ్రి కోటగుమ్మానికి వేలాడ దీశారనే కథనాలూ ఉన్నా యి. మొండెంను మాత్రం కుటుంబ సభ్యులకు ఇవ్వకుండానే బ్రిటిష్‌వారు దహనం చేశారని చరిత్ర ఆధారాలు లేకపోలేదు. ప్రముఖ బ్రిటిష్‌ ఛానల్‌ బీబీసీ 1858 నాటి స్వాతంత్య్ర పోరాటంపై సర్వే చేయగా కోరుకొండ సుబ్బా రెడ్డితోపాటు మరికొం దరి పోరాటాలు,మరణ విషయాలు బహిర్గత మైనట్టు వెలుగులోకి వచ్చాయి. సూర్యుడస్తమించని బ్రిటిష్‌ సామ్రా జ్యాన్ని గడగడ లాడిరచిన ఆదివాసీ పోరాటయోధుడు సుబ్బారెడ్డి నాల్గోతరానికి చెందిన పూర్వీకులు నేటికీ ఉన్నారు. సుబ్బారెడ్డి మునిమ నవడు కోరుకొండ అబ్బాయిరెడ్డి ప్రస్తుతం జీలుగు మిల్లి మండలం కామయ్యపాలెం వద్ద పోలవరం నిర్వాసితులకు నిర్మించిన పునరా వాస కాలనీలో ఉంటున్నాడు. అబ్బాయిరెడ్డి అల్లుడు బోనపు శ్రీనివాసరెడ్డి కుటుంబసభ్యులు అక్కడేఉంటున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో పాత కొరుటూరు మునిగి పోవడంవల్ల వారంతా ఇక్కడ కు వచ్చారు. విచిత్రమేమిటంటే సుబ్బారెడ్డి గురించి వీరికి ఒక్క విషయం కూడా తెలీదు.గ్రామంలో పాతతరం వారు తమ పూర్వీకులు పోరాట యోధు లు అంటుంటే వినేవారమే తప్పా..తెలియదని చెప్పారు.
ఎందరో మన్నెం వీరులు
మన్యం పోరాటంలో అల్లూరి సీతారామరాజుకు అండగా నిలిచిన, తుదివరకూ ఉద్యమించిన, ప్రాణాలర్పించిన ఎందరో మన్నెం వీరులు ఉన్నారు. వారిలో గాం గంటందొర,గామ్‌ మల్లుదొర, ఎండు పాగాలు,గోకిరి ఎర్రేసు,మోది గాడు తదితరులు ఉన్నారు. గూడెం తాలూకా మాకవరం ముత్తాలోని బట్ట పనుకుల గ్రామానికి చెందిన మహాయోధులు గామ్‌సోదరులు. బట్టు వణుకుల మునస బు గిరీ నుంచి గంటందొరను అప్పటి డిప్యూటీ తహసీల్దార్‌ బాస్టియన్‌ దుర్మార్గంగా తొలగించాడు. గంటందొర, మల్లుదొర సాగుచేస్తున్న భూములను ముఠాదారుని చేత ఇతర రైతులకు ఇప్పించాడు.వారిపై కక్షకట్టి బిచ్చ మెత్తు కోవాల్సిన దుస్థితికి బ్యాస్టియన్‌ తీసు కొచ్చాడు.గామ్‌ సోదరుల్లో పెద్దవాడు గంటయ్య దొర ఇలా చెప్పాడు..‘బాస్టియన్‌ చాలా క్రూరంగా వ్యవహరించాడు. ఈతాలూకా ప్రజల పట్ల అనేక తప్పిదాలు చేశాడు.బ్యాస్టియన్‌ నాభూమిని లాక్కొని, సెమర్ల పెద్దబ్బికి ఇచ్చాడు. నన్ను నాశనం చేయొద్దని ప్రాధేయపడ్డాను. అతడు నన్ను తన బూటుకాలితో తన్నాడు.దాంతో నేను జీవితం పట్ల విరక్తి చెందా ను. నాభార్యాబిడ్డలను మాగ్రామం నుంచి పంపేశాను. నేడు రాజు గారి కాళ్ల మీదపడ్డాను. బ్రిటీష్‌ వాళ్ల అంతం చూడాలని గట్టిగా నిర్ణయించు కున్నాను.’ గామ్‌ సోదరులు మాకవరం ముత్తాలో చాలా పలుకుబడి ఉన్న వారు.వారిపట్ల బాస్టియన్‌ దుర్మార్గం ఆముత్తా ప్రజలసానుభూతిని కల్పిం చింది. వారు రాజుకు అనేకమంది అనుచ రులను, సానుభూతిపరులను సమకూర్చారు. ఎంతో నమ్మకస్తులైన,స్థానికంగా పూర్తిస్థాయి పరిజ్ఞానం ఉన్న వీరిచ్చిన సమా చారం ఆధారంగానే విప్లవ కారులను అల్లూరి ఎంపిక చేసుకున్నాడు. మిగిలిన ప్రధాన అనుచరుల్లో అగ్గిరాజు,ఎండు పడాల్‌ ఉన్నారు.బ్రిటీష్‌ వారిని పార దోలేందుకు సీతారా మరాజు150 మంది గెరిల్లా యోధులను తయారు చేసి, మూడు దళాలు ఏర్పాటు చేశాడు.వాటికి గంటం దొర, మల్లుదొర, ఎండు పడాల్‌లను దళ నాయకులుగా నియమించాడు.
గాము మల్లుదొర`స్వాతంత్ర సంగ్రమంలో పాత్ర
దొరతనం వారి తాబేదారుల అక్రమ చర్యలను గాము సొదరులు నిరసన తెలిపారు. గూడెం తాసీ ల్దారు బాస్టియన్‌ ప్రభుత్వాన్ని ధిక్కరిస్తున్నారనే వ్యాజ్యంతో గంటందొరను మునసబు పనినుండి తొలగించాడు. వారి భూములను సైతం ప్రభుత్వ పరం చేశాడు. మన్యంలో విప్లవం చెలరేగడానికి ఇదొక బలమైన కవ్వింపు చర్యగా కొందరు భావించారు. గాము సోదరులపై జరిగిన అన్యా యాన్ని ప్రతిఘటించవలసిందిగా మన్యం ప్రజల ఆరాధ్య దైవమైన అల్లూరి సీతారామరాజును కోరారు. బ్రిటిష్‌ వారి ఆగడాలను అంతమొం దించడానికి విప్లవవీరులు ఇతని నేతృత్వంలో 150 మంది సైనికులతో గాము సోదరులు ప్రథములు. వీరు పోలీసు స్టేషన్లపై దాడిచేసి ఆయుధాలను సేకరించేవారు. వాటిని ఉపయోగించే విధానాల్ని రాజు మన్యం వీరులకు నేర్పించాడు. ఆంగ్లేయ ప్రభుత్వం సీతారామరాజుని పట్టి ఇచ్చిన వారికి పదివేల రూపాయలు, గంటందొర, మల్లుదొరలను పట్టుకున్నవారికి ఒక్కొక్కరికి వెయ్యేసి రూపాయలు ఇవ్వగలమని ప్రకటించింది. మహాసాహసి అయిన మల్లుదొరకు మద్యపానం,స్త్రీ వ్యామోహం బలహీ నతలు ఉండేవి. అందుచేత అతని చర్యలను రాజు ఒక కంట కనిపెడుతూ ఉండేవాడు. కల్లు తాగిన మైకంలో తన రహస్యాలను ప్రభుత్వ గూఢచారికి తెలుపుతున్నట్లు మల్లుదొరను రాజు గూఢచారులు చూడడం తటస్థించింది.వెంటనే ప్రభుత్వ ఉద్యోగిని కాల్చివేసి విషయంరాజు దృష్టికి తెచ్చారు. ఆయు ధాలను అప్పచెప్పి దళాన్ని విడిచి వెళ్ళవలసిందిగా మల్లుదొరనురాజు ఆజ్ఞాపించాడు. మల్లుదొర రాజు ఆజ్ఞను శిరసావహించి 1923 సెప్టెంబరు 17న నడిరపాలెం వెళ్ళాడు. అక్కడ తన ప్రేయసి గృహం లో ఉండగా పట్టుబడ్డాడు. రాజు ఆచూకీ తెలుప మని మల్లుదొరను దారుణంగా హింసించినా అత నేమీ తెలియజేయలేదు. వాల్తేరు ఏజన్సీ న్యాయ మూర్తి మల్లుదొరకు మరణ దండన విధిస్తూ 1924 అక్టోబరు 23న తీర్పు చెప్పారు. మల్లుదొర అప్పీలు చేయగా మరణ శిక్షను ద్వీపాంతర వాస ఖైదుగా మార్చబడిరది.మే8,1924తేదీనరాజువీర మరణం తో అతని అనుచరులు విజృంభించారు. బ్రిటిష్‌ ప్రభుత్వం అధికారంగా పలువురు యోధులను హతమార్చింది. గంటందొర, కొద్దిమంది అనుచ రులు సైనికులతో భీకరంగా పోరాడి వీరమరణం పొందారు. సీతారామరాజు ప్రధాన అనుచరులలో బ్రతికి బయట పడిరది మల్లుదొర ఒక్కడే.
లోక్‌ సభ సభ్యునిగా
అండమాన్‌ జైలులో పదమూడున్నర ఏళ్ళు గడిపిన మల్లుదొరను1937లో ఏర్పడిన కాంగ్రెసు మంత్రి వర్గం విడుదల చేసింది. భారతదేశానికి స్వాతం త్య్రం సిద్ధించిన తర్వాత లంక సుందరం గారి చొరవతో 1952 ఎన్నికలలో విశాఖపట్నం నుండి గెలుపొంది మల్లుదొర లోక్‌సభ సభ్యుడయ్యాడు. ఆయన తొలిసారిగా పార్లమెంటులో మాట్లాడి నప్పుడు సభ యావత్తు పెద్ద పెట్టున హర్షధ్వానాలు చేసింది.ప్రధాని నెహ్రూ స్వయంగా ఆయన త్యాగ నిరతిని కొనియాడారు.
మన్యం యోధుడు మర్రి కామయ్య
భారత స్వాతంత్య్ర సమరంలో నిప్పురవ్వలై ఎగిసి పడుతున్న పోరుబాటలో నేలకొరిగిన ఎందరో అగ్ని కెరటాలున్నారు. ఆ వీర చరిత్రలో విస్మరించబడిన గిరిజన వీరయోధులెందరో స్వాతంత్య్రపోరాట నంతరం కూడా పోరాటాలు కొనసాగించిన ఘన చరిత్రలో మరొక గిరిజన పోరుబిడ్డ మర్రి కామ య్య.విశాఖ మన్యంలో సాగిన తెల్లదొరలదాడిలో అమరుడైన అల్లూరి సీతారామారాజు (1924) తర్వాత రెండువ మన్నెం వీరుడుగా ప్రసిద్దికెక్కింది.. మర్రి కామయ్యే.వీరి పోరాటం చరిత్రలో చిరస్థాయి గా నిలిచింది. కొండతెగకు చెందిన కామయ్య విశాఖపట్నం జిల్లా పాడేరు రెవెన్యూ డివిజన్‌లోని హుక్కుంపేట మండలంలో గరుడాపల్లిలో జన్మిం చారు. తీగలవలస పంచాయితీలోని గరిడేపల్లి పరిసర గ్రామాల్లో భగత,కొండదొర,వాల్మీకి, నూక దొర,కొండకుమ్మరి తెగ గిరిజనులు నివసి స్తున్నారు. కామయ్య మోతుబరి రైతు.స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో ఏజెన్సీ ప్రాంతాలలో కొనసాగుతున్న ఉద్యమాలే కామయ్యను ఉద్యమకారుడిగా మార్చా యి.గిరిజనుల్లో అజ్ఞానం,దుర్భరాన్ని తొలగిం చేందుకు మాడుగుల,అనంతగిరి మండలంలోని గ్రామాలు కొండజాతివారి సంఘాలు ఏర్పాటు చేసి బదులు నిర్వహించారు. జీవనోపాధి పనులు కల్పించడం వంటి సంక్షేమ కార్యక్రమాలు కామయ్య చేశారు. ప్రజలు వ్యవసనాలకు దూరంగా ఉండి, అణిచివేతల నుంచి విముక్తి చెందాలని కామయ్య భౌద్ద మతాన్ని అనుసరించారు. అది సహించలేని ప్రభుత్వం ముఠాదారులు ఏకమై గరిడెపల్లి గ్రామాన్ని తగులబెట్టారు. కామయ్య భూములను, పశువులను,ఆస్తులను స్వాధీనం చేసుకుని వేలం వేసి చాలా ఇబ్బందులకు గురిచేశారు.అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన కామయ్య కొండకోనల్లో తలదాచుకుంటూ ఉద్యమాన్ని కొనసాగించారు. తనను నమ్ముకున్న 360కుటుంబాలను చేరదీసి గరిడెపల్లి,పరిసరాలలోని బీటుగరువు వద్ద వీరికి నివాసాలు ఏర్పాటు చేశారు. ఆ ఊరు కామయ్య పేటగా మారింది. కానీ బ్రిటీష్‌ పోలీసులు వారిని ఎలాగైనా అణచివేయాలని కుట్రపన్నిన ముఠాదారు లతో కలసి కామయ్య కుటుంబసభ్యులపై,అతని అనుచరులపై దాడులు చేసేవారు.చివరికి వారి గుడిసెలను కూడా తగలబెట్టారు.కామయ్య కుటుం బతోపాటు ప్రజలందరూ చెల్లాచెదరైపోయారు.
ప్రభుత్వ ముసుగులో ముఠాదారులు చేస్తున్న పాశవిక చర్యలను సహించలేని ప్రజలు కామయ్య నాయకత్వంలో మద్దతుదారులుగా చేరడంలో50దళాలు ఏర్పడ్డాయి.ఉబ్బేట్‌ రంగయ్య, డుంబేరి వీరన్న,జర్సింగిమంగన్న,కులబిర మోదు న్న,బొడ్డు కొండలరావు,కంబిడి బాలన్న,గుల్లేని పెద్దబ్బాయి11రోజులు జైలు జీవితం గడిపారు. మర్రి దన్ను(కామయ్య కుమారుడు)రేగం భీంరావు, కొర్ర బాలన్న కంఠమచ్చలు మొదలగు వారు కామ య్యకు ప్రధాన అనుచరులు.ఎన్ని కుయుక్తులు పన్నినా కామయ్య అరెస్టు కాకపోవడం అనాటి బ్రిటీష్‌ ప్రభు త్వం జీర్నించుకోలేపోయింది. అటవీ అధికారులు పోలీసులు ముఠాదారులు కలసి 1940లో కామ య్యను బంధించారు. విడుదలయ్యాక గ్రామాల్లోని వనవాసుల్లో ఆశించిన మార్పు రాలేదు.ప్రజలు పండిరచిన పంటకు గిట్టుబాటు ధరలు లేక షావు కారు వద్ద మోసపోవడం వారి సామాజిక వెనుక బాటు చూసి,తప్పనిసరిగా మళ్లీ ఉద్యమించాల్సి వచ్చింది. ప్రభుత్వ నిర్బంధం పెరగడంతో మళ్లీ కామయ్య అజ్ఞాతంలోకి వెళ్లారు.నాటి తెల్లదొరల నుంచి పెత్తందార్లు వరకు అటవీ సందపను కొల్ల గొట్టిడాన్ని జమిందారీ వ్యవస్థను వ్యతిరేకిస్తూ అడవిపై అధికారం గిరిజనలకే చెందాలని ఉద్య మించిన మన్నెం యోధుడు మర్రి కామయ్య 1959 మే 5న మరణించాడు.
అల్లూరి సహచరుడికి అరుదైన గౌరవం
అల్లూరి సీతారామరాజు తెల్లదొరలతో అలు పెర గని పోరాటమే చేశారు. ఆపోరాటంలో ఆయన వెంట ఉన్నది గిరిజనుడైన గంటం దొర. అల్లూరిని వెన్ను దన్నుగా నిలిచి ఆంగ్లేయులను ముప్పతిప్పలు పెట్టారు. అల్లూరితో పాటు గంటం దొరకు గుర్తిం పు వచ్చిందా అంటేలేదు అనే గిరిజనులు అంటారు. ఇటీవల కాలంలో గంటం దొరను తలచుకోవడం ఆయన జయంతి వర్ధంతులను ఘనంగా ఉత్స వాలుగా నిర్వహించడం వంటివి చేస్తున్నారు. అరకు ఎంపీ గొడ్డేటి మాధవి బుధవారం అరకులో గంటం దొర వర్ధంతి వేడుకలను నిర్వహిస్తూ గిరిజనంలో ఆయన లాంటి నాయకుడు లేడు అని కీర్తించారు. గంటం దొర విగ్రహాన్ని కొయ్యూరు మండలంలో ఏర్పాటు చేశారు. దాన్ని ఎంపీ ఆవిష్కరించారు. గంట దొర స్పూర్తి గిరిజనానికి అవసరం అన్నారు. ఆ రోజుల్లోనే ఆయన చూపిన చొరవ ధైర్యం నేటి తరానికి ఆదర్శప్రాయం అన్నారు. ఆయనను దేశం కోసం పోరాడిన యోధుడిగా అంతా గుర్తుంచు కోవాలని అన్నారు.గంటం దొర గురించి గిరిజనా నికి తెలియచేయాల్సిన అవసరం ఉంది అన్నారు. అల్లూరితో పాటు ఉంటూ ఆయన అడుగు జాడ లలో నడుస్తూ గంటం దొర ఆనాడే గిరి సీమలలో అగ్గి పుట్టించారని వైసీపీ నేతలు నివాళులు అర్పి స్తున్నారు.ఒకపుడు అల్లూరి విగ్రహాలే పెద్దగాఉం డేవి కావు.ఇపుడు అల్లూరిని అంతా కీర్తిస్తున్నారు. స్మరిస్తున్నారు. ఆయనతో పాటు గంటం దొరకు గిరి సీమలలో నీరాజనం పలుకుతున్నారు. వారు వందేళ్ళక్రితం చేసిన త్యాగాలను ఈ తరం ఆసక్తిగా తెలుసుకుంటోంది.అది అవసరం కూడా అని మేధా వులు అంటున్నారు.
కొమురం భీమ్‌.. జల్‌ జంగల్‌ జమీన్‌ అంటూ..
గిరిజన హక్కులు,మనుగడ కోసం పోరాటం సాగిం చిన కొమరం భీమ్‌ ఇప్పటికీ తమ ప్రాంతంలోని గోండులచే గౌరవించబడే ఒక ఉద్యమ వీరుడు. యావత్‌ భారతావని ప్రత్యేకంగా కొలుచుకునే స్వాతంత్య్ర సమరయోధుడు. జల్‌,జంగల్‌,జమీన్‌ అంటూ నిజాం,బ్రిటిష్‌ పాలకులకు ఎదురొడ్డి పోరాటం సాగించిన యోధుడు..గిరిజన హక్కుల కోసం ప్రాణాలర్పించిన అమర వీరుడు కొమురం భీమ్‌.తెలంగాణ,ఆంధ్రఆదివాసీ ఉద్యమాల్లో చాలా కాలంగా లేవనెత్తిన ప్రసిద్ధ నినాదం జల్‌ జంగల్‌ జమీన్‌…మొట్టమొదట ఈనినాదం చేసింది కొమరం భీమ్‌.నిజాంల పాలన లో ఉన్న హైదరాబాద్‌ రాజ్యానికి చెందిన గోండు తెగకు చెందిన యోధుడు ఆయన. భీమ్‌ తన తెగ హక్కుల కోసం బ్రిటిష్‌, నిజాం రాజులు, భూస్వాము లకు వ్యతిరేకంగా పోరాడి చివరకు ప్రాణాలర్పిం చిన అమరవీరుడు. భీమ్‌ ఉత్తరహైదరాబాద్‌లోని ఆసి ఫాబాద్‌లోని సంకేపల్లిలోని గోండు కుటుంబం లో జన్మించాడు. స్థానిక జమీందార్లతో కుమ్మక్కై నిజాం పోలీసులు ఆదివాసీలపై దోపిడీకి, చిత్రహిం సలకు గురిచేస్తూ..అపఖ్యాతి పాలైన చందా-బల్లార్‌పూర్‌ అటవీ ప్రాంతంలో భీమ్‌ పెరిగాడు. అధిక పన్నులు విధిం చేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలను, గిరిజనులను వెళ్లగొట్టేందుకు మైనింగ్‌ లాబీ చేస్తున్న ప్రయత్నాలను గోండులు ప్రతిఘటించారు. ఆ పోరాటా ల్లోనే కొమరం భీమ్‌ తండ్రి చనిపోయారు.ఈ నేప థ్యంలో భీమ్‌,అతని కుటుంబం కరీంనగర్‌ ప్రాం తానికి వెళ్లారు. కానీ నిజాం, జమీందార్‌ దళాల దురాగతాలు అక్కడ కూడా భీమ్‌కోసం వేచిఉన్నా యి.ఎందుకంటే ఆరోజుల్లో ఒకపోలీసు భీమ్‌ చేతిలో చంపబడ్డాడు. దీని తర్వాత.. భీమ్‌ చంద్రాపూర్‌కు పారిపోయాడు, అక్కడ అతను బ్రిటిష్‌, నిజాంకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రచురణకర్త విఠోబా రక్షణలో వచ్చాడు. విఠోభా భీమ్‌కు ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్‌ నేర్పించారు.కానీ విఠోభాను అరెస్టు చేయ డంతో,భీమ్‌ అస్సాంకు వెళ్లిపోయాడు. అస్సాం భీమ్‌లోని తేయాకు తోటలలో పని చేస్తూ కార్మిక పోరాటాలను నిర్వహించారు. ఇది భీమ్‌ అరెస్టుకు దారితీసింది. ఈ క్రమంలోనే అరెస్టు కాగా, జైలు గోడను దూకి అక్కడి నుంచి తప్పించుకుని హైద రాబాద్‌ వచ్చాడు. భీమ్‌ తన సంఘం పోరాటాలలో పాల్గొన్నాడు.స్వతంత్ర గోండుభూమి కోసం డిమాం డ్‌ను లేవనెత్తాడు.భూస్వాములకు వ్యతిరేకంగా గెరిల్లా పోరాటాలకు నాయకత్వం వహించాడు. అతడిని బుజ్జగించేందుకు నిజాం ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను భీమ్‌ తిరస్కరించాడు. అలాగే నిషే ధిత కమ్యూనిస్టు పార్టీతో కలసి తెలంగాణ పోరా టానికి కృషి చేశారు. భీమ్‌ని పట్టుకోవడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. నిజాంలతో పాటు బ్రిటిష్‌ వారు 1940లో వారికోసం వెతుకుతున్న నేపథ్యంలో భీమ్‌, అతని సహచరులు జోడేఘాట్‌ గ్రామంలో దాక్కున్నారు. కొద్దిసేపటికే రైఫిల్స్‌తో ఉన్న పోలీసుల సైన్యం గ్రామానికి చేరుకుని భీమ్‌, ఆయన సహచరులు ఉన్న గుడిసెలను చుట్టుము ట్టింది. పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.భీమ్‌,అతని సహచరులు 15మంది అక్క డికక్కడే మరణించారు. భీమ్‌ దాక్కున్న ప్రాంతం గురించి అతనికి చెందిన ఒకరు పోలీసులకు లీక్‌ చేయడంతో ఈవిషయం తెలిసింది. గిరిజన హక్కు లు,మనుగడ కోసం పోరాటం సాగించిన కొమరం భీమ్‌ ఇప్పటికీ తమప్రాంతంలోని గోండులచే గౌర వించబడే ఒకఉద్యమ వీరుడు.ఆదివాసీ భూరక్షణ చట్టం 1/70 చట్టాన్ని అమలుపర్చడంలేదు. అన్యాక్షి కాంతమవుతున్న అడవులను, భూములను పట్టించు కోదు. గోండు తెగకు సంబంధించిన ప్రధాన్‌, తోటి, మన్నె,కోయ తెగలే కాకుండా నాయక్‌పోడ్‌, ఆంధ్‌ ఇతర ఆదివాసీ తెగలు ఆదిలాబాద్‌లో నివసిస్తు న్నాయి. ఇప్పుడు వీరి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.ఆదిమ సమాజం వీరివల్ల రక్షణలను కోల్పోతున్నది. ఇలాంటి పరిస్థితిలో ఆదివాసీల మనుగడ కష్టమేనని ఆదివాసీ నాయకులు మదనప డుతున్నారు.ఆదివాసీల రక్షణ ప్రభుత్వానిదే అయిన ప్పుడు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్న ప్రభుత్వాల వైఖరిలో మార్పు రావడంలేదు. భీం పోరాటం చేసిన ప్రాంతంలో (జోడేఘాట్‌) నేటికి తాగడానికి నీళ్ళులేవు. సరైన సదుపాయాలు లేకపోవడంతో ఆదివాసీ సమాజాల జీవన ప్రమాణాలు క్షీణిస్తు న్నాయి. అతని ముందు చూపు వివిధ ఉద్యమాలకు ప్రేరణగా నిలుస్తున్నది.యావత్‌ భారతా వని ప్రత్యే కంగా కొలుచుకునే స్వాతంత్య్ర సమర యోధుడు. ఆయన గుర్తుగా ఆసిఫాబాద్‌కు కొమరం భీమ్‌ జిల్లా అని పేరు పెట్టారు. -(గునపర్తి సైమన్‌/పోతుల మోహన సిద్ధార్థ్‌)

కుటిల రాజకీయాలతోనే మణిపూర్‌ మంటలు

బాధ్యులెవరైనా కఠిన చర్యలు తీసుకుం టామని గర్జించినవారు తమ అనుంగు ముఖ్యమంత్రిని మాత్రం ముట్టుకోరు, రాజీనామాకు ఆదేశించరు. మే 4న జరిగిన ఈ దారుణంపై మే 14న ఎఫ్‌ఐఆర్‌ నమోదైతే ఇంతకాలం ఏ గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నారని నిలదీయరు. ఇవన్నీ చేయకపోవడం ఒకటి, ఈ వీడియో ఇంతకాలం తర్వాత ఇప్పుడే రావడంలో కుట్ర వుందని ఆరోపిస్తారు. గతంలో జరిగిన మరికొన్ని అఘాయిత్యా లతో పోటీ పెట్టి మాట్లాడతారు. చర్చలు జరిపిస్తారు, వ్యాసాలు రాయిస్తారు. జరిగిందాన్ని కప్పిపుచ్చడానికి, తీవ్రత తగ్గించడానికి సకల శక్తియుక్తులూ వెచ్చిస్తారు. అందుకే ఇది డబుల్‌ హిపోక్రసీ. రెట్టింపు వంచన.
ఘనమైన మోడీ గారికి ఈ సమస్య పట్టించుకోవాలనే ఆలోచనే లేకుండా పోయింది. ప్రతిపక్షాలు ఆందోళన,ఆగ్రహం వెలిబుచ్చుతున్నా చీమ కుట్టి నట్టు లేకపోయింది.మణిపూర్‌ నుంచి బిజెపి తర పున రెండు ప్రతినిధి బృందాలు,ప్రతిపక్షాల తరపున ఒక బృందం ఆయనను కలుసుకోవడానికి ఢల్లీిలో నిరీక్షిస్తుంటే ఆయన మాత్రం అమెరికాలో భుజకీర్తు లందుకుంటున్నారు.అమెరికా,ఫ్రాన్స్‌ వంటి దేశాల లోనూ యూరోపియన్‌ పార్లమెంటులోనూ మణిపూర్‌ పరిస్థితిపై తీర్మానాలు చేస్తుంటే పట్టించుకోలేదు సరికదా చర్చ కూడా చేయకుండా మన పార్లమెం టును వాయిదా వేయించారు ! కనుక మణిపూర్‌ పుత్రికలంటూ ఆయన మాట్లాడటాన్ని మొసలి కన్నీరు కన్నా మోడీ కన్నీరు అంటే చాలదా ?
ఇటీవలి చరిత్రలో ఎన్నడూ లేనంతగా మణిపూర్‌ దురంతం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. కార్‌ వాషింగ్‌ వర్క్‌షాప్‌లో పని చేసుకుని బతికే ఇద్దరు ఆదివాసి యువతులను వివస్త్రలను చేసి వెంటాడి మానప్రాణాలు బలిగొంటున్న బీభత్స దృశ్యం జాతిని కలచివేసింది. ఘోరకలి జరిగాక రెండున్నర నెలలకు ఈ వీడియోలు బయిటకు వచ్చినా ఇంత ఆగ్రహావేదనలు ప్రజ్వరిల్లాయంటే జరిగింది ఎంత దారుణమో,వాస్తవ పరిస్థితి మరెం త ఘాతుకంగా వుందోననే సందేహం ప్రతివారిలో కలిగింది.దానికదే విషయం బహిర్గతమయ్యే వరకూ తెలియనట్టే ప్రవర్తిస్తున్న డబుల్‌ డబ్బా పాలకులకు ఘోర పరాభవం ఎదురైంది.మొన్ననే ఎన్‌డిఎ విస్త్రుత సమావేశంలో గజమాల వేయించుకుని సూక్తులు వినిపించిన విశ్వగురు ప్రధాని మోడీ బోనులో నిలబడాల్సి వచ్చింది. అయితే అలాంటి పరాభవాలు పట్టించుకునే ఘటం కాదు గనక పార్లమెంటు సమావేశాల సందర్భంగా చేసిన అని వార్య వ్యాఖ్యలలో ఆయన ఈ తప్పుకు దేశంలోని వంద కోట్లమంది ప్రజలదీ బాధ్యత అన్నట్టు మాట్లాడేశారు. దేశం, సమాజం సిగ్గుపడాలన్నారు. విశ్వగురుగా గజమాల వేయించుకోవడానికి నమో నమో కీర్తనలతో ఊరేగడానికి తాను, అమాను షానికి మాత్రం అందరిదీ బాధ్యత! ఇంతకన్నా విడ్డూరమైన,విపరీతమైన విషయం మరోటి వుం టుందా?కాని బిజెపి మోడీ పాలనల్ఱో అదే భారతీ య వాస్తవం.
చర్చకే దిక్కు లేదు, చర్య ఎక్కడ
మణిపూర్‌ లోనూ ఢల్లీి లోనూ పాలించేది అక్షరా లా వారు చెప్పే డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌. ఆపైన ఈశాన్య రాష్ట్రాలకు బిజెపి తరపున బాధ్యుడూ, మంత్రిగా ఈ శాఖకు బాధ్యుడు కూడా తన కుడి భుజమైన హోంమంత్రి అమిత్‌షా నే. మణిపూర్‌ పాలకుడైన బీరేన్‌ సింగ్‌ సరేసరి. అయినాసరే దేశ ప్రజలు వంద కోట్ల మంది సిగ్గు పడాలిగాని ఈ ఇద్దరు ముగ్గురు మనుషులు ఈషణ్మాత్రం సిగ్గు పడినట్టు కనిపించరు. తమకు నచ్చని రాష్ట్రాలలో చీమ చిటుక్కుమంటే ట్వీట్లు పెట్టి ఫీట్లు చేసే సంఘ పరివార్‌ పెద్దలెవరూ స్పందించరు.నూతన పార్ల మెంటు భవనం ముందు ఈ ఘోర వార్తపై స్పం దిస్తూ మణిపూర్‌ పుత్రికలకు జరిగిన ఘోరం పట్ల ప్రతివారూ విచారిస్తున్నారని,కారకులెవరైనా వదలిపెట్టే ప్రసక్తి లేదని గంభీర ప్రకటన చేసిన ప్రధాని ఆ సభలోనే ఈ సమస్యపై చర్చకు హాజరు కారు.సమగ్ర చర్చకాకుండా స్వల్ప వ్యవధితో సరి పెడతామంటారు. బాధ్యులెవరైనా కఠిన చర్యలు తీసుకుంటామని గర్జించినవారు తమ అనుంగు ముఖ్యమంత్రిని మాత్రం ముట్టుకోరు, రాజీనామాకు ఆదేశించరు.మే 4న జరిగిన ఈ దారుణంపై మే 14న ఎఫ్‌ఐఆర్‌ నమోదైతే ఇంతకాలం ఏగుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నారని నిలదీయరు. ఇవన్నీ చేయకపోవడం ఒకటి, ఈ వీడియో ఇంతకాలం తర్వాత ఇప్పుడే రావడంలో కుట్ర వుందని ఆరోపి స్తారు. గతంలో జరిగిన మరికొన్ని అఘాయి త్యాలతో పోటీపెట్టి మాట్లాడతారు. చర్చలు జరిపి స్తారు, వ్యాసాలు రాయిస్తారు.జరిగిందాన్ని కప్పి పుచ్చడానికి, తీవ్రత తగ్గించడానికి సకల శక్తియు క్తులూ వెచ్చిస్తారు. అందుకే ఇది డబుల్‌ హిపోక్రసీ. రెట్టింపు వంచన. టెలిగ్రాఫ్‌ పత్రిక 79మొసళ్ల కార్టూన్‌ వేసి ఆ పైన మోడీ విచారాన్ని పెట్టింది. ఎందుకంటే నవ వర్ష నమో పాలన తర్వాత వీటికి తేలిగ్గా లోబడిపోయే స్థితిలో దేశ ప్రజలు లేరు.
కాషాయ వ్యూహాల కరాళ ఫలితమే
ఈశాన్య రాష్ట్రాలు కూడా తమ ప్రాబల్యంలోకి రావడం మోడీ మహత్తులలో ఒకటని చెప్పుకునే బిజెపి అందుకు అనుసరించిన ఎత్తులు, జిత్తుల పర్యవసానమే ఈశాన్య జ్వాలలు. గుర్తు చేసుకుంటే కొంతకాలం కిందట అస్సాం, అరుణాచల్‌ ప్రదేశ్‌ల మధ్య సరిహద్దు వివాదం ప్రజ్వరిల్లడం ఎవరూ మర్చిపోలేదు. నిరంతరం తన మాటలతో వివా దాలు సృష్టించే అస్సాం ముఖ్యమంత్రి హిమంత్‌ విశ్వశర్మ పరిష్కారానికి ఏమీచేసింది లేదు ఎగ దోయడం తప్ప. తర్వాత మేఘాలయ తోనూ ఇదే తరహా ఘర్షణ చెలరేగి ఆరుగురు చనిపోయారు. ఇవి అస్సాం నుంచి విడదీయబడిన రాష్ట్రాలు కావడం గుర్తుంచుకోదగింది. ఎందుకంటే 1950 లో రాజ్యాంగం అమలులోకి వచ్చినపుడు ఈశా న్యాన మణిపూర్‌, త్రిపుర మాత్రమే కేంద్రపాలిత ప్రాంతాలుగా వుండేవి.1954లో అరుణాచల్‌ ప్రదేశ్‌,1963లో నాగాలాండ్‌,1969లో మేఘా లయ,1972లో మిజోరాం అస్సాం నుంచి విడదీసి ఏర్పాటు చేసినవే. మొదటి నుంచి వున్న మణిపూర్‌, త్రిపుర 1972లో పూర్తి రాష్ట్రాలయ్యాయి. ఈశాన్య ప్రాంతం నేరుగా బ్రిటిష్‌ వారి పాలనలో ఎన్నడూ లేదు.వారు కావాలనే చైనాకూ తమకూ మధ్య ఒక విడుపులాగా దాన్ని అట్టిపెట్టారు. అక్కడ అనేక జాతులు, ఉపజాతుల గిరిజనులు ఆదివాసులు జీవించేవారు. నాగా,కుకీ,మిసో తదితర తెగలు ఉపజాతులు అలాంటివే.గిరిజనులలో క్రైస్తవ మిషనరీల ప్రభావం కూడా ఎక్కువే. మణిపూర్‌ మైదానప్రాంతాలలో మైతేయిలు వుంటారు. కుకీలు మూలవాసులైనప్పటికీ రాజకీయ వ్యవస్థలో మైతే యిల ప్రాబల్యమే ఎక్కువ. ఈచిన్న రాష్ట్రంలో మొత్తం 36తెగలు, ఉపజాతుల వారు వుంటారంటే సమస్య అర్థమవుతుంది.మైతేయిలు ఇంఫాల్‌ లోయలో వుంటూ హిందూ మతాన్ని సనామహి అనే స్థానిక విశ్వాసాలను ఆచరిస్తారు. కుకీలు, నాగాలు అత్యధికంగా క్రైస్తవ మతానుయాయులు. ఈ తెగలు,ఉపజాతుల మధ్య స్వార్థ రాజకీయ శక్తులు పట్టించుకోని కేంద్రం కారణంగా నిరంతర ఘర్షణలు,తిరుగుబాట్లు జరుగుతూ వచ్చాయి. అందులో నాగా,కుకీల తగాదాలు ప్రధానమైనవి. 2017లో బిజెపి అధికారంలోకి రావడంతో ఆరెస్సె స్‌ రంగంలోకిదిగి హిందూవిశ్వాసాలు గల మైతే యిలను క్రైస్తవాన్ని అనుసరించే కుకీలకు వ్యతిరేకంగా కూడగట్టింది.దాంతో ఇది మత వివాదంలా కూడా మారిపోయింది.
ఎఫ్‌ఐఆర్‌ తెలియదా ?
పొరుగునే వున్న మయన్మార్‌లో 2021లో సైనిక నియంతృత్వం అధికారం కైవశం చేసుకున్నాక దాడి తట్టుకోలేక వేలాది మంది చిన్‌ శరణార్థులు వచ్చి పడటంతో పరిస్థితి మరింత దిగజారింది. వీరు కూడా కుకీలే. మిజోరాం, మణిపూర్‌ల లోని కుకీలు వారిని ఆహ్వానించి ఆశ్రయమిచ్చారు. కాని మోడీ ప్రభుత్వం వారికి ఆశ్రయం నిరాకరించి అక్రమ చొరబాటుదారులుగా ప్రకటించింది. ఇదే సమ యంలో బీరేన్‌ సింగ్‌ ప్రభుత్వం రిజర్వు అడవుల నుంచి కుకీలను భారీ ఎత్తున తొలగించడం మొద లెట్టింది. అడవులలో మాదక ద్రవ్యాల పంటలను నాశనం చేసేందుకు దాడి కూడా గిరిజనులను దూరం చేసింది. కుకీలు అక్రమ చొరబాటుదారులని ప్రచారంచేసే తీవ్రవాద మైతేయి వర్గాలకు ఆరెస్సెస్‌ వత్తాసునిచ్చింది.అస్సాం ముఖ్యమంత్రి శర్మ, బిజెపి ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ ఆప్రాంతంలో పని చేస్తున్న కాలంలోనే కుకీ తీవ్రవాద సంస్థ యుకెఎల్‌ఎఫ్‌ (యునైటెడ్‌ కుకీ లిబరేషన్‌ ఫ్రంట్‌)తో సంబంధం పెట్టుకుని నిధులు సమకూర్చినట్టు తర్వాత వెల్లడైంది. ఇందుకు ప్రతిగా వారు 2017 లోనూ 2019లోనూ బిజెపికి ఎన్నికల్లో మద్దతు నిచ్చారు.ఈవిషయం బయిటకు వచ్చాక ముఖ్య మంత్రి బీరేన్‌సింగ్‌కు మైతేయిలలో కూడా మద్దతు లేకుండా పోయింది. తమ సమస్యలకు మూల కారణంగా భావించిన ఆయనను కుకీలు ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే వున్నారు. బిజెపి లోనే వున్న పది మంది కుకీ ఎంఎల్‌ఎలు ప్రత్యేక పాలనా విభాగం కావాలని ఆందోళన మొదలెట్టారు. ఇప్పుడు మనం చూస్తున్న కల్లోలం వెనక ఇంత లోతైన నేపథ్యముం దని గుర్తుంచుకోవాలి.పులి మీద పుట్రలా ఈ పరిస్థి తులలో మైతేయిలను కూడా గిరిజనులుగా పరిగ ణించాలని మార్చి 27న మణిపూర్‌ హైకోర్టు తీర్పు చెప్పడం,దానికి అభ్యంతరం లేదని బీరేన్‌ సింగ్‌ హడావుడిగాప్రకటించడంతో ఈ ఘర్షణలు పరాకా ష్టకు చేరాయి.ఈ క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలు జోక్యం చేసుకోకపోగా కుటిల వ్యూహంతో మరింత రగలడానికి కారణమైనాయి.మే 4వ తేదీ మహిళలపై ఘోర కలి వీడియో జులై 20న బయిట కు వచ్చినప్పటికీ నిజానికి రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసులకు ఈవిషయాలు తెలియవని కాదు. మే రెండవ వారంలోనే వారు పోలీసు స్టేషన్‌లో ఫిర్యా దు చేయడం ఎఫ్‌ఐఆర్‌ నమోదు జరిగాయి. మే 29న అమిత్‌షా అక్కడ పర్యటించి వచ్చారు. ఇక ఘనమైన మోడీ గారికి ఈ సమస్య పట్టించుకోవాలనే ఆలోచనే లేకుండా పోయింది. ప్రతిపక్షాలు ఆందో ళన, ఆగ్రహం వెలిబుచ్చుతున్నా చీమ కుట్టినట్టు లేకపోయింది. మణిపూర్‌ నుంచి బిజెపి తరపున రెండు ప్రతినిధి బృందాలు, ప్రతిపక్షాల తరపున ఒక బృందం ఆయనను కలుసుకోవడానికి ఢల్లీిలో నిరీక్షిస్తుంటే ఆయన మాత్రం అమెరికాలో భుజకీర్తులందుకుంటున్నారు. అమెరికా, ఫ్రాన్స్‌ వంటి దేశాలలోనూ యూరోపియన్‌ పార్లమెంటులోనూ మణిపూర్‌ పరిస్థితిపై తీర్మానాలు చేస్తుంటే పట్టించుకోలేదు సరికదా చర్చ కూడా చేయకుండా మన పార్లమెంటును వాయిదా వేయించారు! కనుక మణిపూర్‌ పుత్రికలంటూ ఆయన మాట్లాడటాన్ని మొసలి కన్నీరు కన్నా మోడీ కన్నీరు అంటే చాలదా ?
జరగాల్సిందేమిటి ?
మాట్లాడితే వీర జవాన్లు, దేశభక్తి అంటూ ఊదరగొట్టే కేంద్ర పాలకులు కార్గిల్‌ యుద్ధంలో పాల్గొన్న సైనికుని భార్యకు ఈ దుర్గతి పడితే స్పందించకపోవడాన్ని ఏమంటాం? మే 4 రాత్రి దుష్ట మూకలు వేల సంఖ్యలో ఆ గ్రామాన్ని చుట్టుముట్టి కుకీ కుటుంబాలను తరిమేయడమే గాక ఇద్దరు యువతుల బట్టలూడదీయించి మృగాల్లా హింసిస్తూ ఈడ్చుకు పోయారు. ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. వాళ్లను కాపాడేందుకు వెళ్లిన వారిని చంపేశారు. రక్తసిక్తమైన శరీరంతో ఆ అభాగ్యురాళ్లు ఇద్దరినీ తీసుకుని వారు ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్‌కు చేరుకుంటే పరిధి సమస్య వచ్చింది. దాన్ని మరో స్టేషన్‌కు బదలాయించారు. ఇంత జరిగినా ఏ చర్య తీసుకున్నది లేదు, ఇంటర్‌నెట్‌ సెన్సార్‌ వుంది గనక బయిటకు రాలేదు. ఈ లోగా మహిళా కమిషన్‌కు, ముఖ్యమంత్రికి ఫిర్యాదు వెళ్లినా స్పందన లేదు. వందల సంఖ్యలో ఇలాంటివి వస్తుంటే ఏదని చూస్తామన్నది వారి అహంకారపూరితమైన జవాబు. ఇంకా ఆ ముఖ్యమంత్రిని ముట్టుకోని కేంద్రాన్ని ఏమనాలి? ఈ విషయంలో ముందే జోక్యం చేసుకుని తీవ్రంగా ఖండిరచిన సిజెఐ డి.వై.చంద్రచూడ్‌ ప్రభుత్వం చర్య తీసుకోకుంటే తాము రంగంలోకి దిగాల్సి వస్తుందన్నారు. అత్యు న్నత న్యాయమూర్తి స్పందనకూ ప్రభుత్వాధినేత స్పందనకూ తేడా కనిపిస్తూనే వుంది. వాస్తవానికి రాని స్పందనకోసం వ్యవధి ఇవ్వడం కంటే సుప్రీం కోర్టు వెంటనే రంగంలోకి దిగి చర్య తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ తక్షణం గద్దె దిగాలి. ఇప్పటికీ బయిటకు రాని ఘోరాలు మరెన్ని వున్నాయో ప్రత్యేకంగా దర్యాప్తు చేసేందుకు ఒక కమిటీని నియమించాలి. బాధితుల రక్షణ కోసం తక్షణం కేంద్రం రంగంలోకి దిగాలి. (ప్రజా శక్తి సౌజన్యంతో..)

మానవత్వానికే మచ్చ..!

మణిపూర్‌లో మూడు నెలలుగా పాలన గాడి తప్పింది.శాంతిభద్రతలు దిగజారాయి. కేంద్రంలో, ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు మౌనం వహించి నీచరాజకీయాలు చేస్తున్నాయి. ఇటీవల వెలుగులోకి వచ్చిన వీడి యోలు అసాంఘికశక్తుల అరాచకాలను స్పష్టంగా చూపుతున్నాయి. ప్రజల ధన, మాన, ప్రాణాలను రక్షించాల్సిన పోలీసులు,పారామిలటరీ దళాలు చేష్టలుడిగి చోద్యం చూస్తున్నారు.
మణిపూర్‌లో స్త్రీల మానాలకు, పురు షుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. మానవత్వం మంటగలిసింది.పశు ప్రవర్తన హెచ్చు మీరింది. మైనారిటీలకు రక్షణ లేకుండా పోయింది. దురాగతాల వీడియోలు ప్రపంచానికి మణిపూర్‌ దీనస్థితిని ఎలుగెత్తి చాటుతున్నాయి.బీజేపీ పాలన లో తప్ప గతం లో ఎన్నడూ దేశ ప్రతిష్ఠ ఇంతగా దిగజారిపోలేదు.
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలైన బీజేపీ డబు ల్‌ ఇంజిన్‌ సర్కారే మణిపూర్‌లో ఉన్నది.వారి పాల నలో ప్రభుత్వ అనుకూల మూకలు రెచ్చిపోతున్నాయి. రాక్షస ప్రవర్తనతో ప్రజాస్వామ్య వ్యవస్థకే మాయని మచ్చ తెస్తున్నాయి. గత రెండు నెలలుగా హింసా త్మక సంఘటనలు చెలరేగుతూనే ఉన్నాయి. గృహ దహనాలు కొనసాగుతున్నాయి. స్త్రీలు,పిల్లలు, వృద్ధు లు హాహాకారాలు చేస్తున్నారు. స్త్రీలపై అత్యాచా రాలు కొనసాగుతున్నాయి. తమను రక్షించమని, తమ ప్రాణాలను కాపాడమని దేవుడిని వేడుకుం టున్న వందలాది మంది క్రైస్తవులపై పోలీసులు లాఠీచార్జి చేశారు.పోలీసుల కాల్పులలో 86 మందికిపైగా మరణించారు. ప్రార్థనా మందిరాలైన వందలాది చర్చిలను ధ్వంసం చేశారు. మణిపూర్‌లో మతం మత్తులో హింస హద్దులు దాటింది.మరో గుజరాత్‌ మారణ కాండను తలపించేలా మైనారిటీ గిరిజనులపై హింసాకాం డ కొనసాగుతున్నది. అల్లరి మూకలు గిరిజనులను లక్ష్యం గా చేసుకుంటున్నాయి. కర్ర లు, కత్తులు, ఆయుధాలతో దాడులు చేస్తున్నాయి. చేతికి చిక్కిన మహిళల పట్ల దారుణంగా ప్రవర్తిస్తు న్నాయి. ఇద్దరు మహిళలపట్ల అమానుషంగా ప్రవర్తించారు. వారిని వివస్త్రలను చేసి, వీధులలో బహిరంగా ఊరేగించారు. ఆపై పొలాల్లోకి ఈడ్చు కళ్లారు. స్త్రీలపై సామూహిక లైంగికదాడులు జరుగుతున్నాయి.కాలేజీలో చదువుతున్న 21 ఏండ్ల అమ్మాయి కూడా బాధితుల్లో ఉన్నది. 19 ఏండ్ల ఆమె సోదరుడిని దారుణంగా కొట్టి హింసించి చివరికి చంపేశారు. రాక్షసుల కంటే హీనంగా ప్రవర్తించారు. మే4న జరిగిన ఈఅమానుష సంఘ టన వీడియో దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.ఒకవైపు అల్లర్లు, హింసాత్మక సంఘటన లతో మణిపూర్‌ మూడు నెలలుగా తగలబడు తుంటే,మరోవైపు బాధ్యతలేని ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారాలకు, విదేశీ పర్యటనలకు వెళ్లారు. దేశ,విదేశాల్లో బీజేపీ అనుకూల వర్గాలు ఆయనకు జేజేలు పలకడం అమానుషత్వానికి పరాకాష్ఠ. కనీసం బాధితులను ప్రధాని ఓదార్చలేదు. వారికి ధైర్యమైనా ఇవ్వలేదు.శాంతిభద్రతలపై సమీక్ష కూడా చేయలేదు. ప్రాణ భయంతో మణిపూర్‌ను వదిలి ఇతర ప్రాంతాలకు వలసలుపోతున్న వారికి భరోసానైనా కల్పించలేదు. పోలీసులకు మార్గదర్శక త్వమైనా చేయలేదు. వెలుగులోకి వచ్చిన వీడియోల ఆధారంగా కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఘాటైన హెచ్చరికలు చేసింది. ఇకనైనా మోదీ ప్రభుత్వం కనీ సం స్పందిస్తుందా?ఈ దురాగతాలకు బాధ్యత వహిస్తుందా? లేదాఎప్పటి మాదిరిగానే దున్నపోతు మీదవర్షం పడినట్లు స్తబ్ధుగా,మౌనంగా ఉండి పోతుందా? వేచిచూడాలి. మణిపూర్‌లో జరిగిన, జరుగుతున్న అరాచకత్వంపై మానవతావాదులు, ప్రజాస్వామిక వాదులు స్పందించాలి. అసమర్థ బీజేపీ పాలనను ఎండగట్టాలి.దేశ,విదేశీ మీడి యా కండ్లు తెరువాలి.సోషల్‌ మీడియా ప్రజాపక్షం వహించి మణిపూర్‌ దురాగతాలను ఖండిరచాలి. సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించాలి. మణిపూర్‌ సంఘటనలపై ప్రత్యక్ష పర్యవేక్షణలో సత్వర విచా రణ జరిపించాలి. కాలయాపన చేయకుండా దోషులపట్ల కఠినంగా వ్యవహరించాలి. న్యాయపర మైన శిక్ష విధించాలి.
స్త్రీల అస్తిత్వానికి పెను సవాల్‌ ` అనిశెట్టి రజిత
మాతృదేశానమాతృమూర్తులకు లబి óస్తున్న గౌరవమర్యాదలు చూసి సగటు స్త్రీగా, భారత పౌరురాలిగా మతిపోతున్నది. నిజంగా ఈ సమ యంలో మతితప్పి ఉంటే బాగుండుననిపి స్తున్నది. రాజ్యాంగస్ఫూర్తి విలువలు దహించివేయ బడిన పాలనలో ఉన్నామా అనిపిస్తున్నది. మైనారిటీలు, ఆదివాసీలు,కొన్నితెగల,సమూహాల పౌరస త్వాలూ, అస్తిత్వాలూ ప్రశ్నార్థకమవుతున్నాయి. దేశంలో స్త్రీల అస్తిత్వాలకు పెనుసవాల్‌ ఎదురవుతున్నది. భారతీ య సమాజాన్ని వేధిస్తున్న వ్యవస్థను చూస్తే విస్మ యం కలుగుతున్నది. దేశంలో మతతత్వం, కుల తత్వం, ప్రాంతీయ దురహంకారం ఉన్మాదంతో చెలరేగిపోతున్నది. వారి అరాచకాలను సమర్థించు కోవడానికి,ఓటు బ్యాంకులను కొల్లగొట్టి అధికారాన్ని సుస్థిరం చేసుకోడానికే ఈ రాజకీయ హత్యాకాండల న్నీ. అయినా దేశాన్ని, ప్రజలను ఉద్ధరిస్తున్నామని చెప్పే ప్రభుత్వానికి ఇవేం పట్టవు. మతం ఈరోజున దేశానికి ప్రధాన రాజకీయ వనరుగా మారింది. ఈర్ష్యాద్వేషాల ముసుగులను వేసుకొని నగ్నతాం డవం చేస్తున్నది. ఇదంతా చేస్తున్నది చేయిస్తున్నది మతవాదులే అని తేటతెల్లమైంది. మతమంటే మారణ హోమమా? మన భారతీయ సంస్కృతిని మనం ఎలా నిర్వచిం చుకుందాం? నాజ్ఞానానికి, అనుభవానికి తెలిసినంత వరకు మతం, ఆచారా లు, సంప్రదాయాలు,తంతులూ అన్నీ కూడా మన సంస్కృతిలో భాగం మాత్రమే. స్వార్థపర దుష్టశక్తులు తమ పగద్వేషాలూ, దుండ గాలు, దోపిడీల కోసం మతాన్ని సంస్కృతి నుంచి విడదీసి దాన్నొక ఆయు ధంగా వాడుకుంటున్నారు. సంఘ సమగ్రతను చిన్నాభిన్నం చేస్తూ రక్త క్రీడలను ప్రోత్సహిస్తు న్నారు. ఈ దేశాన్ని ‘భారతమాత’ అంటూ మోకరి ల్లుతూ ఆరాధిస్తున్నట్టుగా నటిస్తూ భరతమాతకు చెడ్డపేరు తెస్తున్నారు. ఒకభారత స్త్రీగా,పౌరురాలిగా,దేశ భక్తురాలిగా, సమతా సామ్యవాద శాంతి విలసిల్లే సమాజాన్ని ఆశిస్తున్నాను. కానీ నారీశక్తిగా నేను కలతల లోకంలో కల్లోలిత జీవితం గడపాల్సి వస్తున్నది. అమానుషత్వాల, అగౌరవానికి నిత్యం బలిపశువునై ఆక్రందనలు చేయాల్సి వస్తున్నది. అందుకే వెంటాడుతున్న మానవ మృగాల నీడలకు భీతిల్లి ప్రాణ,మాన రక్షణ కోసం పరితపించాల్సి వస్తున్నది. గాయపడిన దేహాలతో చిరిగిన పీలికల్ని చుట్టుకొని,అర్ధ నగ్నంగా పరిగెత్తుకుంటూ పోతున్న స్త్రీమూర్తుల వారసురాలిగా ఆందోళన చెందాల్సి వస్తున్నది.ఆడపిల్లగా పుట్టినందుకు లైంగిక దాడు లకు, ఆడజన్మనెత్తినందుకు అత్యాచారాలకు నన్ను వేదికగా చేసుకుంటున్నారు. గౌరవంతో, హుందా తనంతో జీవించే హక్కునూ, అర్హతను నిరాకరిస్తు న్నారు. ఇలాంటి వింత మృగాళ్ళ నడుమ ఉన్నందు కు నాలో విపరీత ఆలోచనలు కలుగుతున్నాయి. సిగ్గులేని మనుషుల నడుమ సిగ్గుతో తలవంచుకొని, నన్నూ నాదేహాన్ని లోలోపలికి కుచించుకొని బత కాల్సి వస్తున్నది. ఈ రోజున దేశానికీ ‘దేశమాత’కూ దిక్కు దిశ లేదు. రాజ్యాంగాన్ని చదువాల్సి వస్తుం దని,పాటించకుంటే ప్రశ్నిస్తారని ఏ చీకటి గుహల్లో నో సమాధి చేశారు. మానవీయ భావనలను మధ్య యుగాల్లోకి మళ్లించారు. ఆడవాళ్ల దేహాలపై నగ్న రాజకీయాల పచ్చబొట్లు పొడుస్తున్నారు.ఈ రోజున రాజకీయాలు సృష్టించిన‘మతం’తో జతగట్టి భారతమాత ప్రతినిధులైన స్త్రీల నగ్న దేహాలతో రాజకీయ కక్షలు తీర్చుకుంటున్నారు. తమ తమ మత ఉన్మాదాలకు రక్తసిక్త నగ్న చరిత్రలు రాసి వికృతత్వానికి పట్టం కడ్తున్నారు. మతం చిచ్చుకు తోడు ‘మర్దాంగీ’(మగతనం)లను మేల్కొల్పి స్త్రీలపై విరుచుకుపడి మృగ(మగ)తనాలను నిరూపించు కుంటున్నారు. నిజంగా వీళ్లు మతం అంటే ఏమిటో తెలిసినవాళ్లేనా? నిజంగా వీళ్లు భారతీయులేనా? దేశమన్నా, దేశభక్తియన్నా వీరికి అర్థం తెలుసా? నిజంగా వీళ్లు స్త్రీలను గౌరవించి పూజించే వ్యక్తు లేనా? స్త్రీలను ‘సతి’ చేసిగాని చల్లబడే మత రక్షకులే కదా, మూర్ఖ పాలకులే కదా. ‘భారత్‌ బచావో’ అన్న భావన నినాదమై ఈ రోజున దేశవ్యాప్తంగా అలజడిగా మారింది.పౌరసమాజం పాలకుల నేరా లపట్ల అట్టడుగు నుంచి ఉడికిపోతున్నది. భరత మాత కన్నీటి గంగలు ప్రవాహాలుగా ప్రళ యాలు సృష్టిస్తున్నవి.భేటీ బచావో, బడావో, పడావో మాట లు చిలుం పట్టి తుక్కులా రాలి పోతున్నవి.
అయ్యా! దేశ ఏలికల్లారా! పాలకుల్లారా! అధికార పీఠాలను అధిష్ఠించిన రాజకీయ, మత నేతల్లారా! మానవత్వం కన్నా ‘మహోన్నత మతం’ ఏదో,ఎక్కడుందో సెలవిస్తారా?మానవ సేవకన్నా మాధవ సేవంటూ ఉందా!దేశప్రజల క్షేమం, రక్షణ, వారికిచ్చే భరోసా, నమ్మకాలను మించిన సంక్షేమ శాంతి పరిపాలన ఇంకేమైన ఉన్నదా? లౌకికశక్తుల నిర్భంధం,అరాచకశక్తుల విశృంఖలత్వమే మీ సైద్ధాంతిక విధానమా? దాన్ని అరాచక అత్యాచా రాల పునాదులపై లేచిన కబేళాలతో నింపాలను కుంటున్నారా? అందుకు ఈ (మా) దేశపు స్త్రీలమైన మా దేహాలే మీకు వేదికలా? మా శవాలపైనే మీ సింహాసనాలా? అయ్యా అన్నీ కన్నీటి ప్రశ్నలే%ౌౌ% అంతా సంక్షుభిత పరిస్థితులే! అంతటా రక్తపు తడిలో తడిచి రెపరెపలాడున్న నెత్తుటి పతాకాలే! మీ దేశభక్తికీ మత ధర్మ ఉద్ధరణలకు ఒక నిరసన దండం! (వ్యాసకర్త : ప్రజాస్వామ్య రచయిత్రుల వేదిక జాతీయ అధ్యక్షురాలు)-(డాక్టర్‌ కోలాహలం రామ్‌కిశోర్‌)

మా గ్రామాలను షెడ్యూల్డు ప్రాంతాలుగా గుర్తించాలి

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గం శంఖవరం మండలంలోని ఉప ప్రణాళికా ప్రాంతం పెదమల్లాపురం గిరిజన గ్రామంలో ఆది వాసీల సదస్సును జూలై 25న నిర్వహించారు. స్థానిక సామాజిక భవనం నుంచి రామాలయం వద్ద అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. అల్లూరి విగ్రహా నికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పిం చారు. అల్లారికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంత రం గిరిజన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు 5వ షెడ్యూల్‌ సాధన సమితి సమన్వయకర్త పీ.ఎస్‌. అజయ్‌ కమార్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగిం చారు.1950లో భారతదేశంలోని షెడ్యూల్డ్‌ ప్రాం తాలను నాటిరాష్ట్రపతి ప్రకటించినపుడు అందులో చాలా ఆదీవాసీ గ్రామాలను చేర్చలేదని, ఆ కార ణంగా నాన్‌ షెడ్యూల్డ్‌ గ్రామాల ఆదివాసీలు సుమా రు 73సంవత్సరాలుగ వివక్షతకు, దోపిడీకి గురౌతు న్నారని అజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు.ఈ అన్యాయా న్ని1976లోని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి, ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోని 805 గ్రామాల్నీ కలపి షెడ్యూ ల్డు ప్రాంతాలుగా గుర్తించమని తీర్మానించి, ఆ ప్రతిపాదనను కేంద్ర మంత్రి మండలికి నివేదిం చిందని అజయ్‌ కుమార్‌ వెల్లడిరచారు. 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌. రాజశేఖరరెడ్డి నాన్‌ షెడ్యూల్డు గిరిజన గ్రామాల ప్రజలకు న్యాయం చేస్తామని శాసన సభలో హామినిచ్చి ఇప్పటికి 16 సంవత్సరాలు గడుస్తున్నాయని అజయ్‌ కుమార్‌ గుర్తు చేసారు. తండ్రి రాజశేఖరరెడ్డి ఇచ్చిన హామీని ఆయన తనయుడైన ముఖ్యమంత్రి జగన్‌ ఇప్పటికైనా సరే నెరవేర్చాలని అజయ్‌ కుమార్‌ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.
జూలై 30న శంఖవరం తహాసిల్దార్‌ కార్యాలయం వద్ద ధర్న
గిరిజన సమస్యలకూ పరిష్కారాన్ని కోరుతూ జూలై30న శంఖవరం తహాసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.ధర్నాలో అఖిల భారత ఆదివాసీ సంఘం గౌరవ అధ్యక్షులు రేచుకట్ల సింహాచలం రంప చోడవరంలోని సమగ్ర గిరిజనా భివృద్ధి సంస్థ తన సేవలను కాకినాడ జిల్లాలోని ఉపప్రణాళికా ప్రాంత గిరిజన సమాఖ్య ప్రతినిధి బాలరాజు,జర్తా ముసలయ్య తదితర్లు పాల్గొన్నారు. పెదమల్లాపురం కేంద్రంగా గిరిజన మండలాన్ని ఏర్పాటు చేయా లని, గిరిజన గ్రామాల ప్రజల సమస్యలు అన్నింటినీ పరిష్కరించాలనే అజెండాతో అధికారులకు మెమోరాండం అందజేశారు.
ఆగస్టు 14న విజయవాడలో ధర్నా
విజయవాడలోని ధర్నా చౌక్‌ వద్ద ఆగస్టు 14 న ఒక్క రోజు నిరసన ధర్నా చేపడుతున్నామని ఘాట్స్‌ సంస్థ డైరెక్టర్‌ జర్తా ముసలయ్య తెల్పారు. కాకినాడ జిల్లాతో బాటు మన్యం శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లా నాన్‌- షెడ్యుల్డు ఆదివాసీలు పాల్గొంటారని ఆయన తెల్పారు. కాగా నేటి గిరిజన సదస్సులో మహిళా సంఘాల ప్రతినిధి కించి అప్పలకొండ, అలాగే గిరిజన సంఘాల ప్రతినిధులు బూసరి బాలరాజు, ధారజగన్నాధపురం, జల్దాం పంచాయతీ ఉప సర్పంచ్‌ కాకూరి రాము, గిరిజన పెద్దలు, ఆమూరి చంద్రయ్య, కొపూరు చిన్నప్ప, కించి తమ్మారావు, ముద్ర దొంగబ్బాయి తోపాటు శంఖవరం మండలంలోని ఆరు ఆదివాసీ పంచా యితీల నుంచి గిరిజనులు హాజరయ్యారు.-(జనాస)

డబ్బు చెట్లను పెంచదు..?

మొట్టమొదట, సుప్రీంకోర్టు నియమించిన కమిటీ భారతదేశంలో ఒక చెట్టు ధరను దాని వయస్సుతో గుణించి రూ.74,500గా నిర్ణయించింది.చెట్ల మదింపుపై మార్గదర్శకాలను రూపొందించడానికి ఒక నివేదికలో ఒక చెట్టు యొక్క ద్రవ్య విలువను ప్యానెల్‌ పేర్కొంది. ఒక వారసత్వ వృక్షం పౌర సమాజానికి మరియు పర్యావరణానికి సేవ చేస్తుందని మరియు ఆక్సిజన్‌, సూక్ష్మ పోషకాలు, కంపోస్ట్‌ మరియు బయో-ఎరువులతో సహా వివిధ గణనలపై దాని విలువను చేరుకోవచ్చని నిపుణుల కమిటీ చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఎ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనానికి తెలిపింది.
వారసత్వ వృక్షం అనేది పెద్ద చెట్టు, ఇది పరిపక్వం చెందడానికి దశాబ్దాలు లేదా శతాబ్దాలు పడుతుంది.100 సంవత్సరాలకు పైగా జీవితకాలంఉన్న వారసత్వ వృక్షం విలువ రూ.1కోటి కంటే ఎక్కువ ఉంటుందని, వందలాదిచెట్లను నరికివేయడానికి ప్రతిపాదించబడిన ప్రాజెక్ట్‌యొక్క ద్రవ్య విలువ చాలా తక్కువఅని కమిటీ తననివేదికలో జోడిరచింది.ప్రాజెక్ట్‌ కారణంగా నరికి వేయ బడుతున్న ఈచెట్ల ఆర్థిక,పర్యావరణ విలువ కంటే.ఫిబ్రవరిలో దాఖలు చేసిన నివేదిక బహిరంగపరచబడిరది.అన్ని ఖర్చులను చెట్టు యొక్క మిగిలిన వయస్సుతో కలిపి మరియు గుణిస్తే..ప్రస్తుత సందర్భంలో 100 సంవత్సరాలలో, మొత్తం చెట్టు సంవత్సరానికి రూ.74,500అవుతుంది. ఇందులో ఒక్క ఆక్సిజన్‌కే ఏడాదికి రూ.45వేలు, ఆ తర్వాత బయోఫెర్టిలైజర్ల ధరరూ.20వేలు.సూక్ష్మ పోషకాలు,కంపోస్ట్‌ ఖర్చులను జోడిరచడం ద్వారా, జీవించే చెట్లు వాటిని నరికివేయబడుతున్న ప్రాజెక్టుల ప్రయోజనాల కంటే ఎక్కువగా ఉంటాయని నివేదిక పేర్కొంది.హైవే ప్రాజెక్టుల కోసం చెట్లను నరికివేయ డానికి బదులు, ట్రాఫిక్‌,రవాణా మౌలిక సదుపాయా లను సులభతరం చేయడానికి ఇప్పటికే ఉన్న జలమా ర్గాలు మరియు రైలు మార్గాలను ఉపయోగించడం వంటి ఈప్రాజెక్టులకోసం ప్రభుత్వాలు మొదట ప్రత్యామ్నాయ ఎంపికలను అన్వేషించాలని కూడా కమిటీ సూచించింది.చెట్లను నరికితే మొదటి ప్రయత్నంగా ఆధునికసాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వాటిని తరలించడమే కాకుండా చెట్లను నరికివేస్తే ఆ స్థలంలో ఐదు మొక్కలు నాటితే సరిపోదని కమిటీ స్పష్టం చేసింది.100ఏళ్ల వృక్షాన్ని,అటువంటి చెట్టును కొన్ని తాజా మొక్కలతో పోల్చలేము. ఒక కిరీటం పరి మాణం ఉన్న చెట్టు కోసం,10మొక్కలు నాటాలని కూడా సూచించిందిబీ మధ్యస్థ కిరీటం పరిమాణంకలిగిన చెట్టుకు 25మొక్కలు మరియు పెద్ద కిరీటం పరిమాణం ఉన్న చెట్టుకు 50 మొక్క లు.కమిటీ నివేదికను భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు సమర్పించింది,ఇది జనవరి 2020లో కమిటీ సభ్యుడిని చెట్ల ద్రవ్య విలువను, అవి విడు దల చేసే ఆక్సిజన్‌ ధర మరియు ఇతర ప్రయోజ నాల ఆధారంగా నిర్ణయించాలని పర్యావరణ శాఖను కోరింది. పశ్చిమ బెంగాల్‌లో ఐదు రైల్వే ఓవర్‌బ్రిడ్జిల నిర్మాణం కోసం 356చెట్లను నరికి వేసిన కేసును విచారించిన కోర్టు,నిషికాంత్‌ ముఖర్జీ (టైగర్‌ ఎన్విరాన్‌మెంట్‌ సెంటర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌), సోహం పాండ్యా (కార్యదర్శి) ఐదుగురు నిపుణు లతో కూడిన కమిటీని నియమించింది.సెంటర్‌ ఆఫ్‌ సైన్స్‌ ఫర్‌ విలేజెస్‌లో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, సునీతా నరైన్‌ (డైరెక్టర్‌,సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌),బికాష్‌ కుమార్‌ మాజి (అసిస్టెంట్‌ చీఫ్‌ ఇంజనీర్‌, Rూదీయూనిట్‌, పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం)మరియు నిరంజితమిత్ర (డివిజన్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌,నార్త్‌ 24 పరగణాలు) నివేదిక ఆధారంగా, సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం,పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం మరియు కేసులో ప్రమేయం ఉన్న ఎన్జీ వోల ప్రతిస్పందనలను కోరింది.‘‘కమిటీ సిఫార్సు ప్రతి ప్రభుత్వాన్ని దివాళా తీస్తుంది.కాబట్టి, మేము కొన్ని సూచనలను చక్కదిద్దాలి,’’అని సుప్రీంకోర్టు బుధవారం వ్యాఖ్యానించింది.
ట్రీ వాల్యుయేషన్‌పై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఆశాకిరణాన్ని అందిస్తున్నాయి
ఇది భారతదేశంలోమొదటిసారి జరి గింది. సుప్రీంకోర్టు నియమించిన సాంకేతిక కమిటీ ఒక చెట్టు విలువను దానివయస్సుతో గుణిస్తే 74,500 రూపాయలుగా అంచనా వేసింది. చెట్టు యొక్క ఈ ద్రవ్య మదింపును నిపుణుల బృందం ఇటీవల సుప్రీంకోర్టుకు సమర్పించింది. భూసేకరణ ప్రక్రియల సమయంలో గొడ్డలిపెట్టిన చెట్ల అంచనా మరియు మదింపుపై మార్గదర్శకాలను రూపొం దించడానికి నివేదిక సహాయం చేస్తుంది. ఒక వార సత్వ వృక్షం సమాజంతో పాటు పర్యావరణానికి కూడా ఉపయోగపడుతుందని, ఆక్సిజన్‌, సూక్ష్మ పోషకాలు, కంపోస్ట్‌ మరియు బయో ఫెర్టిలైజర్‌లతో సహా వివిధ గణనలపై దాని విలువను చేరుకో వచ్చని నిపుణుల బృందం ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఎ బోబ్డే నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనా నికి తెలిపింది. హెరిటేజ్‌ ట్రీ అనేది పెద్ద చెట్టు, ఇది పరిపక్వం చెందడానికి దశాబ్దాలు లేదా శతా బ్దాలు పడుతుంది మరియు మర్రి,పినస్‌,చినార్‌ మరియు అనేక ఇతరరకాల చెట్ల జాతులను కలిగి ఉంటుంది. భారతదేశంలో వివిధ భూసేక రణ ప్రక్రియల సమయంలో ఫలాలు లేదా ఫలాలు లేని చెట్లను గొడ్డలితో నరకడం వల్ల ప్రభావితమైన ప్రజలకు ముఖ్యంగా రైతులు,తోటల పెంపకందా రులకు ఈ నివేదిక సహాయం చేస్తుంది. కాశ్మీర్‌లోని బాధిత రైతులు-ముఖ్యంగా బుద్గామ్‌ మరియు శ్రీనగర్‌లలో-ఇప్పుడు శ్రీనగర్‌ రింగ్‌ రోడ్‌ ప్రాజెక్ట్‌ అలైన్‌మెంట్‌లో వచ్చే చెట్లకు న్యాయమైన పరిహారం లభిస్తుందని భావిస్తున్నారు. సుప్రీంకోర్టు ప్యానెల్‌ ముందు సమర్పించిన నివేదిక బాధిత రైతులకు భూమి మరియు చెట్లకు ముఖ్యంగా ఫలాలను ఇచ్చే చెట్లకు న్యాయమైన నష్టపరిహారాన్ని కోల్పోయి నందున వారికి సహాయకరంగా ఉండవచ్చు. సుప్రీం కోర్టు నియమించిన ప్యానెల్‌ రూపొందించిన ద్రవ్య మదింపు బాధిత పండ్ల పెంపకందారులకు లేదా ఈ ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణానికి మార్గం సుగమం చేయడానికి పాప్లర్‌, విల్లోలు, కిక్కర్లు మొదలైన పండ్లను పండిరచని వారికి కూడా సహాయం చేస్తుంది’’అని శ్రీనగర్‌ కేంద్రంగా ఉన్న పర్యావరణ విధాన గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడు సయ్యద్‌ నసరుల్లా అన్నారు. ‘‘భూమికి సంబంధించి నంతవరకు, ఇప్పటికీ అనేక గ్రామాలలో రైతుల ఆధీనంలో ఉంది, ముఖ్యంగా వత్తూరు ప్రాంతంలో పరిహారం చెల్లించలేదు. రద్దు చేయబడిన జె.కె భూసేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వం భూమిని లాక్కోవాలనుకుంటోంది.ఇది ఆమోదయోగ్యం కాదు. 31 అక్టోబర్‌ 2019 నుండి జెకెలో వర్తించే న్యాయమైన పరిహారం చట్టంప్రకారం తాజా నోటిఫికేషన్‌ జారీ చేయవలసి ఉందని నస్రుల్లా చెప్పారు. జమ్మూ మరియు కాశ్మీర్‌ హైకోర్టు కూడా ఈ విషయంలో ఇప్పటికే మధ్యంతర ఉత్తర్వులో ఒక దిశానిర్దేశం చేసింది ‘‘కానీ గత నాలుగు నెలలుగా,జెకె పరిపాలన దాని ప్రతిస్పందనను సమ ర్పించడంలో విఫలమైంది’’ అని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు నియమించిన కమిటీ తన నివేదికలో 100 సంవత్సరాలకు పైగా జీవితకాలం ఉన్న వారసత్వ వృక్షం విలువ 1 కోటి కంటే ఎక్కువ ఉంటుందని మరియు వందలాది చెట్లను నరికి వేయడానికి ప్రతిపాదించబడిన ప్రాజెక్ట్‌ యొక్క ద్రవ్య విలువను కూడా పేర్కొంది.ప్రాజెక్ట్‌ కారణంగా నరికివేయబడుతున్న ఈచెట్ల ఆర్థిక మరియు పర్యా వరణ విలువ కంటే చాలా తక్కువ. సోనామార్గ్‌ అడవుల్లో కొనసాగుతున్న జోజిలా టన్నెల్‌ ప్రాజెక్ట్‌ కోసం ముందస్తు అనుమతి లేదా సమాచారం లేకుండానే ఓ ప్రైవేట్‌ కంపెనీ ఇటీవల వందలాది చెట్లను నరికివేయడం గమనార్హం. గైడ్‌లైన్స్‌ ప్రకారం, కంపెనీ మరియు అటవీ అధికారుల నుండి ఖర్చులను పరిపాలన ఇప్పుడు గుర్తించ గలదా? కమిటీ నివేదిక ప్రకారం, అన్ని ఖర్చులను కలపడం మరియు ఒకచెట్టు యొక్క మిగిలిన వయస్సుతో గుణిస్తే, ప్రస్తుత సందర్భంలో 100 సంవత్సరాలలో,మొత్తం చెట్టు సంవత్సరానికి 74,500 రూపాయలు అవుతుంది. ఇందులో ఒక్క ఆక్సిజన్‌కే ఏడాదికి 45,000రూపాయలు, ఆ తర్వాత బయోఫెర్టిలైజర్‌ల ధర 20,000 రూపా యలు. సూక్ష్మపోషకాలు మరియు కంపోస్ట్‌ ఖర్చులను జోడిరచడం ద్వారా, జీవించే చెట్లు వాటిని తగ్గించే ప్రాజెక్ట్‌ల ప్రయోజనాల కంటేఎక్కువగా ఉంటాయని నివేదిక పేర్కొంది. బుద్గాం,శ్రీనగర్‌ జిల్లాల్లోని వథూరా,గుడ్‌సథూ,ఇచ్‌గాం,రణ్‌బీర్‌గ్రాప్‌ా గ్రామా ల రైతులు యాపిల్‌, రేగు,పియర్‌ తదితర పండ్ల చెట్లను ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం అంచనా వేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.కానీ బాధిత రైతు లకు కొన్ని సంవత్సరాల క్రితం 1995 నాటి రేట్ల ప్రకారం చాలా తక్కువ పరిహారం చెల్లించబడిరది -కిలోఆపిల్‌కు 16రూపాయలు మరియు కిలోగ్రాము ప్లంకు 13రూపాయలు. వాల్యుయేషన్‌ సమయంలో ఒక్కోచెట్టుకు పండిన పండ్ల పరిమా ణాన్ని కూడా సరిగ్గా లెక్కించలేదని కొందరు రైతులు ఆరోపించారు.జెకెపరిపాలన సుప్రీంకోర్టు మార్గ దర్శకాలను అమలు చేయడంలో ముందుండాలి. ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించాలి. (ద న్యూ మినిట్స్‌ డాట్‌ కమ్‌ సౌజన్యంతో..)-గునపర్తి సైమన్‌

తెలంగాణ గిరిజనులు`భాషా సాహిత్యాలు

గిరిజన భాష అనగానే అది ఒక ఆదిమ భాష లిపిలేని మౌకిక సాహిత్యానికే పరిమి తమైన పేద భాషగా చెప్పుకుంటాం కానీ కాలానుగుణంగా వస్తున్న మార్పులు, విద్యాసాయంగా గిరిజన యువతలో పెరిగిన ఆలోచన తద్వారా గిరిజన జన జాతికి చెందినవారు విశ్వవిద్యాలయ స్థాయి విద్యలు పూర్తిచేసుకుని తమలోని పరిశోధన శక్తిని వెలికి తీసుకుని, తమ జాతి భాషా సంస్కృతుల ఉన్నతి కోసం కృషి చేస్తున్న శుభ సమయం ఇది.
దీనికి తోడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రోద యం తరువాత తెలంగాణ సాహితీ సంస్కృతుల గురించి జరుగుతున్న ప్రత్యేక అధ్యయనాలలో భాగంగా రాష్ట్రంలోని రచ యితలు,విద్యావేత్తలు,విద్యాలయాలు సంస్థలు విశ్వవిద్యాలయాలు తెలంగాణ భాషా సంస్కృతల వికాసమే లక్ష్యంగా కృషి ప్రారంభించాయి.అందులో భాగంగానే 2015లో నాటి ఆంధ్ర సారస్వర పరిషత్‌ అయిన నేటి తెలంగాణ సారస్వత పరిషత్‌ తాను ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భాషా సాహిత్య వికాసం పనిలో భాగంగా‘‘తెలం గాణ గిరిజన భాషా సాహిత్యాలు’’అనే ఉపయుక్త గ్రంథం ప్రచురించింది. నాటి పది జిల్లాల తెలంగాణలో గల గిరిజన జాతులు వాటికి చెందిన ప్రజల భాషలు,వారి విశిష్ట జీవనశైలి గురించి విస్తృతంగా వివేచనాత్మకంగా చర్చించడం కోసం పరిషత్‌ ఒక సదస్సు ఏర్పాటు చేసి పరిణితి గల భాష సంస్కృతుల వికాసం కోసం సుదీర్ఘ కాలంగా కృషి చేస్తున్న భాషా సేవకులను వక్తలుగా ఆహ్వానిం చింది.వీరితోపాటు గిరిజన భాష సాహిత్యాల గురించి విభిన్నమైన కోణాల్లో పరిశోధనలు చేసిన వారు చేస్తున్నవారు ఈభాషా సదస్సులో పాల్గొని వారి వారి విలువైన అభిప్రాయాలు అనుభవాలు ప్రసంగ వ్యాసాలు ద్వారా అందించారు, వాటి అన్నిటిని అమూల్యమైన గ్రంథంగా వెలువరించారు.నాటి సంస్థ అధ్యక్షులు డా: సినారె.ప్రధాన కార్యదర్శిడా:జె.చెన్నయ్య గారి ఆధ్వర్యంలో ఈపుస్తకం వెలువడిరది. తెలంగాణలోని వివిధ గిరిజనభాషల వైలక్ష్యాన్ని ఇందులో వ్యాసాలు ప్రతి భావంతంగా ఆవిష్కరించాయి అనడంలో అక్షర సత్యం ఉంది.దీనిలో మొత్తం 30 అంశాల గురించి 30మంది నిష్ణాతులైన వ్యాస రచయితలు అందించిన వ్యాసాలు ఇందులో నిక్షిప్తం చేయబడ్డాయి. తెలంగాణలోగల గిరిజనజాతి వారైనా గోండులు,ప్రధాన్‌లు,బంజారాలు, కొండరెడ్లు,ఆంధ్‌లు,కోయలు,ఎరుకల, యానాదులకు సంబంధించిన భాషలు సంస్కృతులు సామెతలు పొడుపు కథలు, జాతీయాలు,అలంకారాలు,గేయ సాహి త్యం,అంశాల గురించి కూలంకుశమైన చర్చలు విశ్లేషణలు ఈవ్యాసాల్లో మనకు కనిపిస్తాయి.ప్రాంతాలవారీగా విస్తరించి నివసిస్తున్న గిరిజన జాతుల గురించి ఆయా వ్యాసకర్తలు వివరించారు,సోయం భీంరావు,‘‘గోండి భాష సాహిత్యాలు’’అనే అంశం గురించి వ్రాసిన సుదీర్ఘ వ్యాసంలో గోండిభాష గురించిన సంపూర్ణ విశ్లేషణ చేస్తూ తరతరాలుగా అంతరించిపోతున్న గోండు భాష గురించి చెబుతూ…65 సంవత్సరాలు పైబడ్డ గోండుగిరిజనులు తమ మాతృభాషను స్వచ్ఛంగా అధికంగా మాట్లాడుతున్నారని,15-20సంవత్సరాల మధ్యవారంత తమసంభాషణల్లో ఆంగ్లం, హిందీ,తెలుగు,భాషలపదాలు కలగలిపి మాట్లాడుతూ తమదైన గోండు మాతృ భాషను నిర్వీర్యం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తపరిచారు.
అలాగే ఆధునిక పద్ధతుల్లో గోండిభాష విస్తరిస్తున్న తీరు కూడా వివరించారు. ఇంటర్నెట్లో గోండిసాహిత్యం,సంగీతం, పాటలు,పొందుపరిచి విశ్వవ్యాప్తం చేసిన వైనం గురించి కూడా పేర్కొన్నారు. వార్తా పత్రికల ప్రచురణలో గోండిభాష పాత్రను వివరించారు.
గిరిజన జాతులు అన్నిటిలోనూ ఉన్నతమైన గోండు జాతికి 17,18వశతాబ్ధాంల్లోనే లిపి ఉన్నట్టు చెబుతూ గోండు లిపి చదివిన పెందోర్‌లింగోజి,ఆత్రంరాంజీ, ఆత్రం మాన్కు,కోట్నకజంగు,ఆత్రం కమ లాబాయి,అనే మూడు తరాలకు చెందిన వ్యక్తులపేర్లు పేర్కొన్నారు.
గుండు భాషలోని పాటలు గోండిభాష మాట్లాడే ప్రాంతాలతో పాటు భాషాప రమైనవ్యాకరణం నామాచకాలు కొలతలు చెట్లు,గృహోపపకరణలు వంటి వాటికి తెలుగు అనువాదాలతో కలిపి వివరణలు ఇచ్చారు.
‘‘తెలంగాణ గిరిజనభాషా సాహిత్యాలు’’ అనే అంశం గురించి ‘‘పసుల బుచ్చయ్య’’ రాసిన మరో సుదీర్ఘ వ్యాసంలో నాయక పోడు గిరిజన తెగకు సంబంధించిన భాషా సాహిత్యాల గురించి సుదీర్ఘ వివరణ చారిత్రక ఆధారాలతో అందించబడిరది. గిరిజన తెగల్లోనే ఒక విశిష్టమైన ‘‘ఎరుకల’’జనజాతి గురించి కె.వివేక్‌ వినా యక్‌ రాసిన ఆంగ్ల వ్యాసం,పరిశోధక విద్యార్థిని బి.భీమమ్మ వ్రాసిన‘‘ఎరుకల వారి సంస్కృతి సాహిత్యం’’అనే వ్యాసం ఎరుకల సాహిత్యం భాషల గురించి తెలియజేశాయి.
ఇక కొండ రెడ్ల గురించి వారి జీవన విధానం నివాసం,ఆహారం,పండుగలు, తదితర సాధారణ విషయాలు తప్ప సాహి త్యం భాషల జోలికి పోలేదు. గోండుల తర్వాత అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తున్న వలస గిరిజన జనజాతి అయిన ‘‘బంజా రాలకు’’సంబంధించి దీనిలో అనేక విషయాలు చర్చించబడ్డాయి. బంజారా భాషలో అలంకారాలు, సామెతలు,పొడుపుకథలు,గేయసాహిత్యం, బంజారాభాషా స్వరూపం వైశిష్యం సంస్కృతి సాహిత్యం ప్రపంచీకరణలో మాయమవుతున్న బంజారా సంస్కృతి, తెలుగు బోధన భాషవల్ల బంజారా విద్యా ర్థుల సమస్యలు,తదితరాల గురించి అధిక వ్యాసాలు అగ్రస్థానంలో నిలిచాయి. వీటితోపాటు తెలంగాణ కథా సాహి త్యంలో గిరిజన స్త్రీ,తెలంగాణసాహిత్యం గిరిజనజీవితం,కొండాకోనల్లో కనిపించిన కోయ జీవితం,అనేవ్యాసాల ద్వారా తెలంగాణ తెలుగుసాహిత్యంలోగల నవలలు,కథల్లో గిరిజనులస్థానం గురించి పరిశోధనాత్మకంగావివరించడం జరిగింది. అన్ని గిరిజన జనజాతులకు సంబంధించి ఒకే ఒక సమస్య ఆభాషకు లిపి లేక పోవడం ఉన్నకొద్ది మాత్రంది కార్య క్రమంలో అంతరించిపోవడం ఈప్రధాన విషయాల గుండానే ఈ30వ్యాసాల పరిశ్రమ కొనసాగింది.
తెలంగాణ గిరిజన భాషాసాహిత్యాలపై పరిశోధన చేసే వారికి ఈగ్రంథం చక్కని దారిదీపంగా ఉంటుందని చెప్పవచ్చు మనకు గల అతితక్కువ తెలుగు గిరిజన భాషా సాహిత్య గ్రంథాలలో ఇది అత్యంత ఉన్నతమైనదిగా పేర్కొన వచ్చు.
చక్కటి పరిశోధనాత్మకమైన కృషితో సదస్సు నిర్వహించడమే కాక దాన్ని అంతటిని అక్షరబంధం చేసి గ్రంథరూపం తీసుకు రావడంలో తెలంగాణ సారసత పరిషత్‌ కృషి అభినందనీయం ఆచరణీయం, రేఖామాత్రంగా గల ఈఅంశాలు భవిష్య త్తులో మరింత కూలంకషంగా వివరణ తీసుకురావడమే కాక భాషా శాస్త్రవేత్తలు త్వరలోనే ఈఆదిమ భాషలకు లిపిని తయారు చేయడంలో సఫలీకృతులు కావాలని కోరుకుందాం.
డా. అమ్మిన శ్రీనివాసరాజు (సెల్‌ : 7729883223)

1 2