ఊహకందని విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదలు పెను విధ్వంసం సృష్టించాయి.ఇటు ఏపీలో బుడమేరు విజయవాడ,అటు తెలం గాణలో మున్నేరు ఖమ్మం ముంపు ప్రాంతాల వాసులను కోలుకోలేని దెబ్బ తీసింది.బుడమేరు ఉప్పొంగి ప్రవహించడంతో సింగ్‌నగర్ జలదిగ్బంధంలో చిక్కుకుంది.నిద్ర లేచేసరికి తరుముకొచ్చిన వరద..పుట్టెడు శోకాన్ని మిగి ల్చింది.కొందరు ఇళ్లపైకి ఎక్కి, సాయంకోసం హాహాకారాలు చేస్తున్నారు. మరికొందరు బంధువుల గృహాలు, పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. మున్నేరు శాంతించిన తర్వాత స్వగృ హాలకు చేరుకుని,ఆనవాళ్లు కోల్పోయిన ఇళ్లు,రూపరేఖలు మారిన కాలనీలను చూసి కన్నీరుమున్నీర వుతున్నారు. కట్టుబట్టలతో రోడ్డున పడ్డామని పలువురు బాధితులు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వర్షాలు కాస్త తగ్గినా వరద ప్రభావం మాత్రం తగ్గలేదు.పలు ప్రాంతాలు ఇంకా నీటిలో చిక్కుకుని ఉన్నాయి. ముమ్మరంగా సహాయక చర్యలు కొనసా గుతున్నాయి.విజయవాడ, ఖమ్మం,మహబూబాబాద్ ప్రాంతాల్లో వరద తీవ్రత చాలా ఎక్కువగా కనిపిం చింది.ఎటూ చూసినా రోడ్లపై పొంగుతున్న వాగులు, బురద ముంచెత్తిన నివాసాలు,అనేక గ్రామాల్లో కుప్ప కూలిన ఇళ్లు..కట్టుబట్టలతో రోడ్లపైకి చేరిన బతుకులు..వరద నీటి నుంచి ఇప్పడిప్పుడే బయటపడుతున్న బస్తీలు.. కాలనీలు.. పొలాల్లో మట్టి,ఇసుక మేటలు..ఛిద్రమైన రహదారులు.. మృత్యువాత పడిన పశువులే కన్పిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జనజీవనానికి ఆటంకంగా మారాయి.అటు ఆంధ్రప్రదేశ్,ఇటు తెలంగాణలో వానలతో ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారు.ఏర్లు,నదులకు భారీగా వరద నీరు చేరడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.బుడమేరు వరద ఉధృతితో విజయ వాడ జలదిగ్బంధంలో చిక్కుకుంది.భారీ వర్షాలు..వరదలతో రెండు తెలుగు రాష్ట్రాలు జనజీవనం కకావికలమైంది.ఏపీలో బుడమేరు వరద నుంచి విజయవాడ తేరుకోక ముందే.. కృష్ణా నదికి వరద పొటెత్తింది.తెలంగానలో కురిసిన భారీవర్షాల ప్రభావంతో ప్రకాశం బ్యారేజీ వద్ద11.43లక్షల క్యూసెక్కుల వరద ముంచెత్తింది.ఉమ్మడి గుంటూరు,కృష్ణా జిల్లాలో కృష్ణానది ఇరువైపులా లంక గ్రామాలు జల దిగ్బందంలోకి చేరాయి.అక్కడి ప్రజలను అధికారులు హూటాహుటిన ఖాళీచేయించి, పునరావాస కేంద్రాలకు తరలించారు.గుం టూరు జిల్లా పరిధిలో 18లంకగ్రామాలకు రాకపోకలు నిలిచాయి.విద్యుత్తు సరఫరా స్తంభించింది.మహిళలు,గర్భిణులు,వృద్దులు సహా వైద్యసాయం అవసరమైన వారిని పడవల్లో తరలించారు.రెండు విద్యుత్ సబ్స్టేషన్లు నీటి మునిగాయి.ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలవల్ల మొత్తం19మంది మరణించినట్లు అధికారిక సమాచారం.వీరిలోఎన్టీఆర్ జిల్లాలో ఎనిమిదిమంది మరణించగా,గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మిగిలిన వారు మరణిం చారు.తెలంగాణలో వరదలవల్ల ఇప్పటి వరకు 9మంది మరణించినట్లు అధికారిక సమా చారం.విజయవాడ నగరం వరుసగా రెండో రోజు కూడా నీటిలోనే ఉంది.బుడమేరు వరద ఈనగరాన్ని అతలాకుతలం చేసింది. నగరం లోని చాలాకాలనీల్లో ఒకఅడుగు నుంచి నాలుగు అడుగుల వరకు నీరునిలిచి పోయిం ది.అనేక ప్రభుత్వ శాఖలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.సింగ్ నగర్ ప్రాంతం తీవ్రంగా ప్రభావితమైంది. పలుచోట్ల ఆహారం,ఇతర అత్యవసర పదార్థాలను బోట్లు,ట్రాక్టర్ల ద్వారా సిబ్బంది అందిస్తున్నారు.చాలా మంది ఆవాన నీటిలోనే నానుతూ,వరదప్రభావం లేనిప్రాం తాల్లోని తమకు తెలిసిన వారిఇళ్లకు వెళ్లే ప్రయత్నం చేశారు.కృష్ణా,గుంటూరు జిల్లాల్లోని పలు ప్రదేశాల్లో ప్రవాహంలో ఇరుక్కున్న వారిని సహాయక బృందాలు రక్షించాయి.కోస్తాలోని మిగిలిన జిల్లాల్లో కూడా వరద,వర్షాల ప్రభావం తీవ్రంగా కనిపించింది.రాయల సీమలో వరద ప్రభావం కాస్త తక్కువగా ఉంది.
నేనున్నాననే..భరోసా..
వరద ప్రభావిత ప్రాంతాల్లో మోకాలి లోతు నీటిలో ఏపీసీఎం నారా చంద్రబాబునాయుడు ముంపు ప్రాంతాలు,పునరవాస కేంద్రాలు పర్యటిస్తూ బాధితులను పరామర్శిస్తున్నారు. సహాయక కార్యక్రమాలు స్వయంగా పర్య వేక్షిస్తున్నారు.బుల్డోజర్,బందరు పోర్టు నుంచి తెప్పించిన భారీ యంత్రంపై ఎక్కి,వరదలో పర్యటించారు.తనకు కొద్దిగా సమయం ఇవ్వాలని,పరిస్థితులు చక్కదిద్దుతామని బాధితులకు విజ్ఞప్తి చేశారు.ప్రతి డివిజన్‌కు ఓఐఏఎస్ అధికారిని ఇన్చార్జిగా నియ మించారు.మంత్రులందరూ విజయవాడలోనే మకం వేసి పునరావాస కార్యక్రమాలు వేగవంతం చేశారు.ఆహారం,మంచినీటి సరఫరాకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడు తున్నారు.ప్రాణనష్టం లేకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారు.హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదులు అందిన వేంటనే సిబ్బందిని ఆయా ప్రాంతాలకు పంపిస్తున్నారు.దాదాపు 10వేల మందిని పునరావాస శిబిరాలకు తరలించారు.ఆక్షయ పాత్రసంస్థ ద్వారా లక్షమందికి ఆహారం అందించారు.హోటల్స్ అసోసియేషన్ వారు మరో లక్షమందికి భోజనాలు సమకూర్చారు. పవర్‌బోట్లు పలు ప్రాంతాల్లో తిరుగుతూ బాధి తులను సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తున్నారు.
పంట నష్టం
కరకట్ట లోపల వ్యవసాయం,ఉద్యాన పంటలన్నీ కృష్ణార్పణమయ్యాయి.ఒక్కటి చేతికొచ్చే పరిస్థితి లేదు.అరటి,కంద,పసుపు,చామ,కూరగాయ పంటలన్నీ నీటమునిగాయి.ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణయ్య కరకట్ట అంచులను తాకుతూ ప్రవహిస్తోంది.తెనాలి,రేపల్లి నియోజ కవర్గాల్లో కరకట్ట బలహీనంగా ఉన్న ప్రాంతా లో మట్టి,ఇసుక బస్తాలు వేసి,ఎత్తు పెంచి నీరు పొర్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
వీడని వరద..
బుడమేరు ఉధృతికి నీట మునిగిన సింగ్‌నగర్ ప్రాంతంలో వరద కష్టాలు కొనసాగుతున్నాయి. ఐదారు అడుగుల ఎత్తున నీరు నిలవడంతో స్థానికులు బయటకు రాలేకపోతున్నారు. పడవ లు ఏర్పాటు చేసి కొందరిని పునరావాస కేంద్రాలకు తరలించినా,అధికశాతం మంది ఇంకా పైఅంతస్తుల్లో బిక్కుబిక్కుమంటూ జీవిస్తు న్నారు.ప్రధాన రహదారుల వెంబడి ఉన్న వారికి ఆహారం,తాగునీరు అందుతున్నా,లోపలి ప్రాంతాల్లోని వారు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు.బయటకు రావాలంటే పడవలు కూడా లేవు.విద్యుత్తు లేదు.తాగునీరు నిండుకుందన వాపోతున్నారు.
డ్రోన్ల ద్వారా ఆహారం,తాగునీరు..
బాధితుల్లో ఎక్కువ మందికి సురక్షితంగా ఆహారాన్ని అందించేందుకు డ్రోన్లను వినియోగించారు.మునిగిన ప్రాంతాలు,బహుళ అంతస్తుల భవనాలపైకి డ్రోన్ల ద్వారా ఆహార పొట్టాలు పంపించారు.పెట్టుబడులు,మౌళిక వసతులశాఖ కార్యదర్శి సురేష్‌కుమార్ ఈ డ్రోన్ పని విధానాన్ని ఎన్జీఆర్ కలెక్టరేట్లో సీఎం చంద్రబాబుకు ప్రయోగాత్మకంగా చూపించారు.డ్రోన్ల్ ద్వారా 8`10కిలోల బరువున ఆహారం,మందులు,తాగునీటిని సరఫరా చేయొచ్చని సూచించారు.దీంతో వీలైనన్ని ఫుడ్ డెవవరీ డ్రోన్లను సిద్దం చేసుకుని లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన బాధితు లకు అందజేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.ఆ వెంటనే సింగ్‌నగర్, గొల్లపూడిలోని బాధితులకు ఆహార పొట్లాలు, తాగునీటి ప్యాకెట్లును అధికారులు సరఫరా చేశారు.ఈ ప్రయోగం విజయవంతం కావ డంతో మున్ముందు మరిన్ని చోట్ల వినియో గించాలని అనుకుంటున్నారు.
కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి..
వరద సహాయక చర్యలపై మంత్రి లోకేష్ విజయవాడలోని కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి నిరంతరం సమీక్షించారు.వరద సహాయక చర్యల్లో పెద్దఎత్తున పాల్గొన్నాలని తేదేపా శ్రేణులకు పిలుపు నిచ్చారు.ముంపు ప్రాంతాల్లో హెలీకాప్టర్ల ద్వారా 7,220కిలోల ఆహారం,తాగునీరు మందులు జారవిడి చారు.వరద ప్రాంతాల్లోని ప్రజలకు పండ్లు సరఫరాకు మార్కెట్‌ంగ్‌శాఖ చర్యలు చేప ట్టింది.1.10లక్షల యాపిల్స్,90వేల అరటి పండ్లు సేకరించి ముంపు ప్రాంతాలకు పంపారు.రానున్న రెండు రోజుల్లో 2.5లక్షల అరటి పండ్లను పంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
కన్నీటి విపత్తు!
భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 19 మంది మృతి చెందారు. ఎన్టీఆర్ జిల్లాలో 9 మంది మృత్యువాత పడగా, గుంటూరు జిల్లాలో ఏడుగురు, ప్రకాశం జిల్లాలో ముగ్గురు మరణించారు.విజయవాడ మొగల్రాజుపురంలో కొండచరియలు విరిగిపడి ఐదుగురు, విజయవాడ రూరల్, జీ కొండూరు, రెడ్డిగూడెం, పైడూరుపాడులో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాత పడ్డారు.గుంటూరు జిల్లా.. పెదకాకాని మండలంలో ఇద్దరు సహా ఒక టీచర్, ఇద్దరు విద్యార్థులు కారులో కొట్టుకుపోయి మృతి చెందారు. ఒక యువ కుడు కొండవీటివాగులో పడి ప్రాణాలు కోల్పోయాడు. మంగళగిరిలో వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయారు.ప్రకాశం జిల్లాలో ముగ్గురు చిన్నారులు ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డారు. గుంటూరు-నందివెలుగు రోడ్డులో వరదనీటిలో గుర్తుతెలియనివ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు.విజయవాడలో 275 రైళ్లు రద్దు అయ్యాయి.149 రైళ్లను దారి మళ్లించారు.
4.68 లక్షల ఎకరాల్లో పంట మునక
వర్షాలు, వరదలకారణంగా 4,31,355 ఎకరాల్లో వ్యవసాయ పంటలు, 37,397 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని అధికారులు అంచనా వేశారు.3,18,220 ఎకరాల్లో వరి, 64,782ఎకరాల్లో పత్తి, 28,085 ఎకరాల్లో మొక్కజొన్న,6,477 ఎకరాల్లో మినుము,6,167ఎకరాల్లో కంది, 2,610 ఎకరాల్లో పెసర,1,945 ఎకరాల్లో వేరుశనగ,5,012ఎకరాల్లో ఇతర పంటలు ముంపుబారిన పడ్డాయని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు.ప్రాథమిక అంచనా ప్రకారం 20జిల్లాల్లో 365 మండలాలు వర్షాలు, వరదల ప్రభావానికి గురి కాగా, 2,475 గ్రామాల్లో 2లక్షల మంది రైతులకు నష్టం జరిగినట్లు భావిస్తున్నామని వ్యవసాయ శాఖ డైరెక్టర్ డిల్లీరావు తెలిపారు.
జల దిగ్బంధం..
తెలంగాణలో వరద తీవ్రంగా ఉంది. మహబూబాబాద్, ఖమ్మం పరిసరాల్లో అనేక జనావాసాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. ఖమ్మం నగరానికి, మహబూబాబాద్ పట్టణా నికిచాలా వైపుల నుంచి రాకపోకలు ఆగిపో యాయి.మున్నేరు వాగు వరదతో ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి కృష్ణా జిల్లాలు ప్రభావితం అయ్యాయి. పాలేరు దగ్గర ఒక కుటుంబం వరదల్లో చిక్కుకుపోయింది. యంత్రాంగం ప్రయత్నించినప్పటికీ వారిని కాపాడలేక పోయారు.ఖమ్మం పరిధిలోని భక్తరామదాసు ఎత్తిపోతల పథకంపంపు హౌసులు మునిగి పోయాయి.నల్లగొండ, సూర్యాపేట, మహ బూబ్‌నగర్, కొత్తగూడెం జిల్లాలపై కూడా వరద ప్రభావం ఎక్కువగా కనిపించింది. తెలంగాణలోని మిగిలిన ప్రాంతాల్లో చాలా చోట్ల వరద, వర్షం ప్రభావంతో జన జీవనానికి ఇబ్బంది కలిగింది.చాలాచోట్ల కాలనీలు,బస్తీలు,ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణాలు నీట మునిగాయి.అనేక చోట్ల హాస్టళ్లు జలదిగ్బంధమైపోవడంతో,ఆనీటిలో నుంచే విద్యార్థులు సామాన్లతో బయటకు వచ్చేశారు.తెలంగాణ ప్రభుత్వం సిబ్బందికి సెలవులు రద్దు చేసింది. పాలేరులో వరదలో చిక్కుకున్న ఒక కుటుంబాన్ని కాపాడలేక పోయినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.అన్ని ప్రయత్నాలూ చేసినప్పటికీ వాతావరణం అనుకూలించక రక్షించుకోలేక పోయినట్టు చెప్పిన ఆయన, ఆ ఘటనను గుర్తు చేసుకుని కంటతడి పెట్టారు.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి వర్షాలపై సమీక్ష నిర్వహించారు. భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాల్లో అధికారులు అలర్టుగా ఉండాలి. కలెక్టరేట్లలో కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలి. కమాండ్ కంట్రోల్ సెంటర్లో వ్యవస్థను సన్నద్ధంగా ఉంచుకోవాలి.వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం రూ.4లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచుతున్నాం.ప్రజలకు జరిగిన నష్టంపై తక్షణమే అధికారులు స్పందించాలి. ఈ వరద లను జాతీయ విపత్తుగా పరిగణనలోకి తీసుకో వాలని కేంద్రాన్ని కోరుతూ లేఖ రాస్తాం. ఖమ్మం,భద్రాద్రి కొత్తగూడెం,మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలకు తక్షణ సాయంగా రూ.5కోట్ల చొప్పున ఇస్తాం’’ అని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
లక్షల ఎకరాల్లో పంట నష్టం
రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోదీ,హోం మంత్రి అమిత్ షా మాట్లాడారు. తగిన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.రాష్ట్ర బృందాలకు సహాయంగా కేంద్ర బృందాలను పంపమని ఆదేశాలు జారీచేశారు.ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. రెండు రాష్ట్రాల్లో లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ముఖ్యంగా వరినాట్లు వేసిన సమయం కావడంతో ఆరైతులు బాగా నష్టపోయారు.ఇతర వాణిజ్యపంటలకూ పెద్ద ఎత్తున నష్టం వచ్చింది. ఇక అరటి వంటి పండ్ల తోటలు, కూరగాయల పంటలు కూడా బాగా దెబ్బతిన్నాయి.
200 గేదెలు కొట్టుకుపోయాయి
చెరువులు, వాగులకు గండ్లు పడిన చోట పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. ముఖ్యంగా కట్ట తెగిన చోట ప్రవాహ ఉధృతికి భవనాలు కొట్టుకుపోయాయి.ముందు జాగ్రత్త చర్యగా బడులకు సెలవులు ప్రకటించారు.చాలా చోట్ల ఇళ్ల డాబాలపైకి ఎక్కి కూర్చుని సమయం గడిపారు ముంపు బాధితులు.గుంటూరు జిల్లా తుళ్లూరు దగ్గర 200 గేదెలు కొట్టుకు పోయాయి. పలు చోట్ల లంక గ్రామాల్లో బాధి తులను కాపాడారు సహాయ సిబ్బంది.కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.విజయవాడలో సహాయ చర్యల్లో హెలికాప్టర్లు వాడనున్నట్టు విపత్తు శాఖ ప్రకటించింది.ఇవాళ, రేపు కూడా రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓమోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
కొట్టుకుపోయిన రోడ్లు, ధ్వంసమైన రైల్వే ట్రాకులు
భారీ వర్షానికి రవాణా వ్యవస్థ కూడా స్తంభిం చింది.ముఖ్యంగా విజయవాడ,ఉత్తర దక్షిణ భారతాలను కలిపే ప్రధాన నగరం కావడంతో ఆ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది.పలుచోట్ల హైవేలపై నీరు రావడంతో ట్రాఫిక్ ఆగిపో యింది.కొన్ని చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. ఇక రైల్వే ట్రాకుపై నీరు చేరడంతో,పెద్ద ఎత్తున రైళ్ల మళ్లింపుతో పాటు కొన్ని రైళ్లు రద్ద య్యాయి.వరంగల్ దగ్గర్లోని కేసముద్రం దగ్గర ట్రాక్ కింద ఉన్న నిర్మాణం మొత్తం కొట్టుకు పోయింది.అనేక చోట్ల వంతెనలపై నీరు పొంగి ప్రవహించింది.తాళ్లు, క్రేన్లు, ప్రోక్లెయినర్ల సహాయంతో ప్రజలు, నీరున్న ప్రదేశాలను దాటాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.విజయవాడ -హైదరాబాద్ హైవేపై కూడా రాకపోకలకు ఆటంకం ఏర్పడిరది.పలుచోట్ల రైలు ప్రయాణి కులను బస్సుల్లో తరలించారు.విజయవాడ శివార్లలో రైలు ప్రయాణికులను స్టేషన్ బయటకు తీసుకురావడం కూడా కష్టమైంది. రైళ్లు నిలిచిపోయినచోట ఆహార పదార్థాలు అందించారు.వందకు పైగా రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. రెండు రాష్ట్రాల ఆర్టీసీలూ పెద్ద ఎత్తున బస్సులను ఆపివేశాయి.
తెలంగాణలో వర్ష బీభత్సం: ఉప్పొంగిన మున్నేరు, రైళ్లు రద్దు
తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.జనజీవనం స్తంభించింది.రోడ్లు కొట్టుకుపోయి ఏపి, తెలంగాణ మధ్య రాకపోక లకు తీవ్ర అంతరాయం ఏర్పడిరది.పలుచోట్ల రైల్వే ట్రాక్‌లకు నష్టం కలగడంతో అధికారులు రైళ్లను దారిమళ్లించారు.భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా 9మంది చనిపోయినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తెలిపారు.ఖమ్మం జిల్లాలో మున్నేరు వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో వరదలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు హెలికాప్టర్లను రంగంలోకి దించుతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి హెలికాప్టర్‌ను రప్పిం చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్త పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు.పునరావాస,రక్షణ చర్యలపై సీనియర్ మంత్రులతో ఫోన్లో మాట్లాడి సూచనలు చేశారు.రెవెన్యూ, పోలీస్, పంచాయతిరాజ్,వైద్య ఆరోగ్యశాఖ వంటి అత్యవసర శాఖల ఉద్యోగుల సెలవులను రద్దు చేసి రంగంలోకి దించాలని, జిల్లాల్లో ఎప్పటి కప్పుడు పరిస్థితులను సమీక్షించి చర్యలు తీసు కోవాలని టెలికాన్ఫరెన్స్‌లో కలెక్టర్లను ఆదేశిం చారు సీఎం.ఎంపీ,ఎమ్మెల్యేలు నియోజక వర్గాల్లోనే ఉండి పరిస్థితులను సమీక్షించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
జలదిగ్బంధంలో ఖమ్మం,మహబూబాబాద్
భారీ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉమ్మడి ఖమ్మం,వరంగల్ జిల్లాలపై పడిరది.ఖమ్మం పట్టణంలో మున్నేరు ఉధృతికి పలు కాలనీలు జలమయం అయ్యాయి. ప్రకాశ్ నగర్ వద్ద మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. మహబూ బాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూ సపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో వరద ప్రవా హానికి రైల్వే పట్టాలకింద కంకర కొట్టుకు పోయింది.ట్రాక్ దెబ్బతినడంతో ఆరూట్లో రైళ్ల ను నిలిపివేశారు.మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో నిలిపివేసిన మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ ప్రయా ణీకులకు స్వచ్ఛంద సంస్థలు,పోలీసులు ఆహారపదార్ధాలు,నీరు అందించారు. ప్రస్తుతం ట్రాక్ పునరుద్ధరణ పనులు సాగుతు న్నాయి. ఏపీ, తెలంగాణలో ఏర్పడ్డ పరిస్థితులపై దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ సికింద్రా బాద్ రైల్ నిలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
వరద నీటిలో ఖమ్మం పట్టణం..
ఖమ్మం పట్టణాన్ని ఊహించని వరద చుట్టు ముట్టింది.మున్నేరు నది ఉధృతంగా పారు తోంది. ప్రస్తుతం 27.5అడుగుల ఎత్తులో మున్నేరు ప్రవహిస్తోంది.దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.పట్టణంలోని సగం కాలనీలు నీట మునిగాయి.ప్రకాశ్‌నగర్ ప్రాం తం జలదిగ్బంధంలో ఉంది. ప్రకాశ్ నగర్ బ్రిడ్జిపై తొమ్మిది మంది ఉదయం నుండి చిక్కుకుపోయారు.వారిని రక్షించేందుకు హెలి కాప్టర్‌ను రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే చీకటి పడటంలో బ్రిడ్జిపైన చిక్కుకున్న వారి భద్రతపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ‘‘ఖమ్మం పట్టణం గతంలో ఎన్నడూ చూడని వరద ఇది.సగం కాలనీలు మునిగిపోయాయి. నీరు చేరని ప్రదేశం అంటూ లేదు. పట్టణం నడిబొడ్డున 5అడుగుల నీరు ప్రవహిస్తోంది. వరద అంచనా,సహాయక చర్యల్లో అధికారులు విఫలం అయ్యారు. జిల్లా నుండి ముగ్గురు మంత్రులు ఉన్నా సమయానికి హెలికాప్టర్‌ను రప్పించ లేకపోయారు’’అని తన వివరాలు వెల్లడిరచడానికి ఇష్టపడని చెప్పారు.‘‘మున్నే రుకు ప్రొటెక్షన్‌వాల్ నిర్మాణ పనులు నత్తనడక కొనసాగుతున్నాయి.నాలాల కబ్జా, మున్నేరు వరద ఒత్తిడితో నీరు బయటికి పోవడం లేదు.’’ అని ఆయన అన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరిస్థితి
మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో పలు కాలనీలు జలమయం అయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించింది.నెక్కొండ మండలం వెంకటాపురం సమీపంలో40 మంది ప్రయాణీ కులతో ఉన్న ఆర్టీసీ బస్సు వరదలో చిక్కుకు పోగా,అధికారులు వారిని సురక్షితంగా బయ టకు తీసుకువచ్చారు.రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకుంటూ సహాయకచర్యల్లో పాల్గొంటున్నారు.మరోవైపు భారీ వర్షాలతో తెలంగాణ ప్రాజెక్టుల్లోకి భారీ వరద చేరు తోంది.మేడిగడ్డ బరాజ్ కు 1.57లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది.శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ లు 53వేల ఇన్ ఫ్లో వస్తుండగా ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి మట్టం 80.5 టీఎంసీలకు గాను 63టీఎంసీలకు నిల్వ చేరింది.– (గునపర్తి సైమన్)