ప్రమాద అంచుల్లో ప్రజాస్వామ్యం

ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం ఉండడం ఎంతైనా అవసరం..పాలక పక్షం ఎలా గైతే ప్రజల పనుపున ఏలుబడి సాగిస్తుందని అను కుంటామో ప్రతిపక్షం అలాగే ప్రజల తరపున ప్రశ్నించే గొంతుగా వ్యవహరిస్తుంది.ఈ రెండూ సజావుగా నడిస్తేనే పాలన..దానిని అనుసరించి అభివృద్ధి..ప్రజాసంక్షేమం తదితరాలు సక్రమంగా సాగుతాయి.అయితే దురదృష్టవశాత్తు ప్రస్తుతం కేంద్రంలో,రాష్ట్రంలో కూడా ప్రతిపక్షం నామ మాత్రంగా మిగిలిపోవడంతో పాలన ఏకపక్షంగా మారిపోయి ఇంచుమించు నియంతృత్వ పోకడలో ఏలుబడి సాగిపోతోంది.కేంద్రంలో ఈ తరహా పరిస్థితులు 2014 నాటి నుంచే కొనసాగుతుండగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మొన్న 2019 ఎన్నికలలో చోటుచేసుకున్న పరిణామాలు గతంలో ఎప్పుడూ కనీవినీ ఎరగని క్రొంగొత్త పోకడలకు తలుపులు తెరిచాయి..
మన దేశంలో జవహర్‌ లాల్‌ నెహ్రూ,లాల్‌ బహదూర్‌ శాస్త్రి ఏలుబడి తర్వాత ఇందిరా గాంధీ శకం మొదలైన పిదప తొలిసారిగా ఏకపక్ష విధా నాలు..ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే నియంతృత్వ పోకడలు ఊపిరి పోసుకున్నాయి.శాస్త్రీజీ అకాల మరణం తర్వాత పగ్గాలు అందుకున్న ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ రోజుల వరకు తాను చెప్పిందే వేదం.. చేసిందే శాసనం అనే రీతిలో ఏలుబడి సాగించారు. ప్రజల్లో తనకుగల అసాధారణమైన ఆకర్షణ కారణంగా ఎన్నికల్లో ఘనవిజయం సాధించడం, తాను అనుకున్న రీతిలో పాలన సాగించడం ఇది వరకు పరిపాటిగా మారిపోయింది.అయితే అంతటి ఇందిరాగాంధీ కూడా ప్రతిపక్ష నాయకు లను విశ్వాసంలోకి తీసుకుని వారికి సముచిత రీతిన గౌరవం ఇస్తూ కొన్ని కీలక నిర్ణయాలు తీసు కునే సందర్భాల్లో వారితో సలహా సంప్రదిం పులు జరుపుతుండే వారు..ఒకరకంగా ఎమర్జెన్సీ దేశానికి కొంతమేలుచేసింది.అదేమిటంటేఎమర్జెన్సీ చీకటి రోజుల తర్వాత దేశంలో ఏకపక్ష విజయాలకు.. ఏలుబడులకు తెరపడిరది…అత్య వసర పరిస్థితుల అనంతరం దేశంలో తొలిసారిగా కాంగ్రేసేతర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.అటు తర్వాత కూడా కాంగ్రెస్‌ ఆధిపత్యం తగ్గి ఇతర పక్షాలు, కూటములు అధికారంలోకి రావడం మొదలైంది. ఇక రాజకీయాల్లోకి ఎన్టీ రామారావు ఆగమనం.. స్వరాష్ట్రంలో సంచలనాల తర్వాత జాతీయ రాజకీ యాల్లోకి ప్రవేశం అనంతరం కాంగ్రెస్‌ పరిస్థితి మరీ దిగజారింది.అప్పటినుంచి కేంద్రంలో ఏపార్టీ కైనాగాని ఇంచుమించు పరిపూర్ణ ఆధిక్యత రావ డం.. ఏకపక్షంగా ఏలుబడిసాగడం అనేరోజులు చెల్లిపోయాయి. ఇదిగో..మళ్లీ ఆపరిణామాలు కేంద్రంలో 2014ఎన్నికల నుండి మొదల య్యాయి. వరస రెండు ఎన్నికల్లో తిరుగులేని ఆధిప త్యంతో గెలిచిన భారతీయ జనతా పార్టీ దేశంలో మరో సారి ఏకపక్ష పాలనకు,ఒంటెత్తు పోకడలకు తెర ఎత్తింది. పెద్ద నోట్ల రద్దు, ప్రభుత్వ రంగ సంస్థల విక్రయం..ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న కొన్నివ్యవస్థల నిర్వీర్యం,అస్మదీయులకు అవాం చిత ఉపకారాలు..రాష్ట్రాలకు కల్పించే ప్రయో జనాల విషయంలో అసమానతలు, పారద ర్శకత లోపం.. ఇలాంటి ఎన్నో కీలక అంశాల్లో ఎన్డీఏ ప్రభుత్వం అవలంబిస్తున్న ఏకపక్ష ధోరణులపై ప్రశ్నించే గొంతులు కరవయ్యాయి.. చట్టసభల్లో, బయటా కూడా నిలదీసే విపక్షాల గొంతుకలను ప్రభుత్వంలోని పెద్దలు మెజారిటీ ఇచ్చిన బలంతో పట్టించు కునే పరిస్థితి గడచిన ఏడు సంవత్సరాల కాలంలో ఏదశలోనూ కనిపించలేదు..చేసిన తప్పుల వల్లనైతె నేమి..అధికారంలోఉన్న రోజుల్లో అవలంబించిన ఇదే తరహా ఏకపక్ష ధోరణుల ఫలితం అయితేనేమి కాంగ్రెస్‌ పూర్తిగా చచ్చుబడిపోయింది.ఇక కమ్యూ నిస్టుల సంగతి సరేసరి..ఎప్పుడూ వారి పోరాటాలు సరాసరే..పార్టీల కేడర్లు,శ్రేణులు బలంగానే ఉన్నా ఏ దశలోనూ చట్టసభల్లో తగినంత బలం లేకపోవ డంతో వామపక్షాలది స్వతంత్ర భారతంలో ఆది నుంచి అరణ్యరోదనే..ప్రభుత్వాలను నిలదీసే వారి గొంతు సమ్మెలు,బందులు..ఇత్యాదులకే పరిమితం అయిపోయింది. నరేంద్ర మోడీ సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కమ్యూనిస్టులు.. ఇతర రెగ్యులర్‌ ప్రతిపక్షాలతో సహా మొన్నటి వరకు దేశంలోనే మహాశక్తిగా విరాజిల్లిన కాంగ్రెస్‌ పరిస్థితి కూడా నానాటికీ తీసికట్టు అయిపోయింది..ఇక ఆంధ్రప్రదేశ్‌ సంగతి..ఇక్కడ ఏంజ రిగినా అడిగే నాథుడులేని పరిస్థితి దాపురిం చింది. ఈ రాష్ట్రం లో గతంలో అయితే కాంగ్రెస్‌, లేదంటే తెలుగు దేశం ప్రభుత్వాలు పెద్దశక్తులుగా అసెంబ్లీలో ఆవి ర్భవించి అధికారం చెలాయించిన సందర్భా ల్లో ప్రతిపక్షాల పరిస్థితి ఇప్పుడున్నట్టు లేదు.ఒకనాడు కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు వెంగళరావు, చెన్నారెడ్డి.. వైఎస్‌ రాజశేఖరరెడ్డి వంటివారు ఎదురులేని సంఖ్యాబలంతో అధికారం చేసినా ప్రతిపక్షాలకు తగిన గౌరవం ఉండేది.అదే పరిస్థితి ఎన్టీ రామా రావు.నారా చంద్రబాబు నాయుడు హయాంలో కూడా సాగింది.ప్రతిపక్షానికి దక్కే గౌరవాన్ని మొన్న టి వరకు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి కూడా అనుభవించిన వారే. ఇక వర్తమానానికి వస్తే.2019ఎన్నికల్లో రాష్ట్రంలోని175సీట్లకుగాను 151 సీట్లు గెలుచుకుని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధికార పగ్గాలు అందుకున్న నాటి నుంచి పూర్తిగా అధికార పక్షం పెత్తనం లో ఏలుబడి సాగుతోంది. నంది అంటే నంది. తీరులో..ఏనిర్ణయం అయినా..అది ఎలాంటిదైనా మారు మాటాడే పరిస్థితి లేదు..వైసిపి ప్రభుత్వం అధికారం లోకి వస్తూనే గత తెలుగు దేశం ప్రభుత్వం అమలు చేసిన ఎన్నో పథకాలను రద్దు చేసి..కొన్ని కట్టడాలను కూల్చి వేసి గందర గోళం సృష్టించింది. పరా కాష్టగా మూడు రాజధా నుల నిర్ణయం..ఆపై ఉచి తాలు.. ఇంచు మించు రాష్ట్రప్రభుత్వం దివాలాతీసే పరిస్థితి.. వీటిపై ప్రధానప్రతిపక్షం తెలుగుదేశం ప్రశ్నిస్తూ.. నిలదీ స్తూ.. ఆందోళనలు చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నా సంఖ్యాబలం లేకపోవడం సైకిల్‌ పార్టీకి అతి పెద్ద మైనస్‌ పాయింట్‌!ఒక దశలో కేవలం ప్రతిపక్షం మీద దుగ్ధతో ప్రభుత్వం అకార ణంగా కౌన్సిల్‌ను కాన్సిల్‌ చేయాలని చూసినా అడిగే దిక్కు లేకుండా పోయింది.అఫ్కోర్స్‌..అది జరగ లేదు..ప్రభుత్వం ఏం చేస్తున్నా రాష్ట్రంలో ప్రతిపక్షం అడ్డుకునే పరిస్థితి ఎటూ లేకపోయినా కేంద్రం కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కాన రావడం లేదు..దీంతో వైసిపి ప్రభుత్వం ఎదురే లేని రీతిలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుం టున్న పరిస్థితి..కోర్టు కేసులను సైతం లెక్క చేయని విధం గా కొన్ని నిర్ణయాలు జరుగుతున్నాయి.
2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిచిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అటు తర్వాత జరిగిన పంచాయతి.. మునిసి పల్‌ ఎన్నికల్లో కూడా అదే ఆధిపత్యాన్ని కొనసా గిస్తూ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఆవిర్భవిం చింది..అదే రీతిలోప్రశ్నించే నాథుడే ఉండని స్థాయి లో ఏలుబడి సాగిస్తోంది.దానివల్ల రాష్ట్రంఎటు పోతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది..అసలు ఇంచుమించు రెండు సంవత్సరాలకు పైగా రాష్ట్ర రాజధాని ఏదో తెలియని అయోమయ పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు.రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు రాక పోగా ఉన్నవి చేజారిపోతున్న దుస్థితి.అలాగే కేంద్రం నుంచి పోలవరం వంటి పెద్ద ప్రాజెక్టులకు నిధులు తీసుకువచ్చే పరిస్థితి లేదు.అంతేకాకుండా రాష్ట్రానికి గుండెకాయ వంటి విశాఖ ఉక్కు కర్మా గారాన్ని ప్రైవేటుపరం చేస్తున్నా అటు పార్లమెం టులో కూడా మంచి బలం ఉన్న వైసిపి అడ్డుకో లేకపోవడం విచారించదగ్గ మరో విషయం. ఇలాం టి అంశాల్లో రాష్ట్రంలోని అన్నిపార్టీలు కలిసి పోరా టాలు చేయాల్సిన అవసరం ఉంటుంది.కానీ ఆ పరిస్థితి కనిపించడం లేదు.అసలు ప్రతిపక్షాన్ని కలుపుకుపోయే ధోరణి అధికార పక్షానికి కిమ్మ న్నాస్తి..ఇక పోతే పంపిణీలపేరిట ఖజానాఖాళీ అవుతూ జీతాలు కూడా సరిగ్గా ఇచ్చుకోలేని..పెన్షన్లు సకాలంలో చెల్లించలేని దుస్థితిఏర్పడి ప్రభుత్వ ఆస్తు లు తాకట్టుపెట్టే దారుణచర్యకు సర్కారు తెగబడినా అడిగేనాథుడు లేడు..ఇది గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని దయనీయ పరిస్థితి. నిజానికి మోడీ ప్రభు త్వం ప్రతిపక్ష మంటేనే లెక్కలేని విధంగా వ్యవ హరిస్తోంది. ప్రతిపక్షం లేవనెత్తే ఏ అంశాన్ని కూడా మోడీ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. తీర్మానాల అంశం లోనూ ఇదే ధోరణి. పార్లమెం టులో ప్రతిపక్షానికి అనుకూలంగా ఉండే నిబం ధనలను సైతం అమలు చేయడానికి అంగీ కరిం చదు, ఖరారైన సభా కార్య క్రమాలను సస్పెండ్‌ చేసి సభ్యుడు లేదా సభ్యులు లేవనెత్తిన అంశాలను చర్చకు పెట్టే కీలకమైన అధికారాన్ని 267వ నిబంధన సభాధ్యక్షుడికి కట్టబెట్టింది.
రాజ్యసభ ఛైర్మన్‌ హోదాలో వెంకయ్య నాయుడు ఒక్కసారి కూడా ఈనిబంధన కింద చర్చకు అవకా శం ఇవ్వనేలేదు.రాజ్యసభ రికార్డుల ప్రకారం 2016 నవంబర్‌16నఈ నిబంధన ప్రకా రం రాజ్య సభలో చివరి సారిచర్చ జరిగింది. ఆగస్టు 10వ తేదికి వెంకయ్య నాయుడి పదవీకాలం ముగుస్తున్న సంగతి తెలిసిందే! ప్రతిపక్షం గొంతు ఈ స్థాయిలో నొక్కిన తరువాత ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధ మంటూ చేసే సవాళ్లకు అర్ధమేమిటి? మోడీ పాలనలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఈ స్థాయికి పడిపోయింది కాబట్టే జోక్యం చేసు కోవాలంటూ ప్రతి పక్ష పార్టీలన్నీ కలిసి రాష్ట్రపతి ముర్ముకు లేఖ రాయాల్సి వచ్చింది. 15వ రాష్ట్రపతి గా ఎన్నికైనం దుకు శుభాకాంక్షలు తెలిపిన లేఖలోనే ఈ విష యాన్ని విపక్షాలు ప్రస్తావించాల్సి రావడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం.ముర్ముఈ లేఖపై ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ప్రజా సమస్యలు కూడా చర్చకు రాకుండా మోడీ ప్రభుత్వం వ్యవ హరిస్తున్న ఈ తీరు ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం. ఒకవ్యూహం ప్రకారం,మంద బలం తో ప్రజాస్వామ్యంపై చేస్తున్న ఈదాడిని ఐక్య పోరాటాలతోనే నిలువరించగలం.ఆ దిశలో విస్తృత ప్రజానీకాన్ని సమీకరించాలి. దీనికోసం ప్రజాస్వా మ్యవాదులు, లౌకిక,అభ్యుదయ,పురోగామి శక్తులు ఏకతాటిపై కదలాలి.ప్రజాస్వామ్య పరిరక్షణకోసం జరిగే పోరాటంలో ప్రతిఒక్కరూ భాగస్వా ముల వ్వాలి. ఇలా కేంద్రంలో,రాష్ట్రంలోఅధికార పార్టీ లుపూర్తి మెజారిటీతో ఏకపక్ష ధోరణిలో పాలన సాగిస్తుంటే ప్రజాస్వామ్యం ఉనికి ప్రమాదంలో పడుతోందా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తం అవు తున్న పరిస్దితుల్లో కొన్ని రకాలైన ప్రమాదాల అంచున మన దేశంలో వ్యవస్థలు నడుస్తున్నాయనేది నిస్సందేహం..!!-(ఇ.సురేష్‌ కుమార్‌)

బి.ఆర్‌.అంబేద్కర్‌ మహోన్నత వ్యక్తి

దేశ ప్రజలందరికీ సామాజిక, రాజకీ య న్యాయాన్ని చేరువ చేసే సదాశయంతో లిఖించు కున్న రాజ్యాంగం అమలులోకి వచ్చి నిన్నటికి డెబ్భై ఏళ్లు దాటాయి.! నిబంధనలు,విధినిషేధాలు, దిశా నిర్దేశాలు,ఆశయాలు,ఆదర్శాలు,హితోక్తుల సమా హారమైన రాజ్యాంగం చూపిన బాటలో ఏడు దశా బ్దాల భారతావని ప్రస్థానాన్ని సమీక్షించు కోవడం నేటి అవసరం. ఒక దేశంగా ఏడు పదుల భారతా వని ప్రస్థానంలో విజయాలను, వైఫల్యాలను,కీలక మైలురాళ్లను,పాఠాలను,గుణపాఠాలను తరచి చూసుకోవడం తప్పనిసరి.రాజ్యాంగ నిర్మాతల ఆదర్శాలు,ఆకాంక్షల నేపథ్యంలో రాజ్యాంగ పని తీరు మదింపు కీలకం. భారతరాజ్యాంగం ఎదు ర్కొన్న టువంటి సమస్యలు,సవాళ్లుబహుశా ప్రపం చంలో మరేదేశరాజ్యాంగానికీ ఎదురెఉండవు. అమల్లోకి వచ్చిన తొలిఏడాదే రాజ్యాం గానికి సవరణలు అవసరపడ్డాయి. ఆ తరవాత క్రమంగా వందకుపైగా సవరణలతో రాజ్యాంగాన్ని ఎప్పటి కప్పుడు మార్చుకుంటూ వచ్చారు. భూసంస్క రణలు రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల పునర్వ్యవస్థీక రణ ప్రాంతీయ అసమానతలను సరి దిద్దడంబీ ఆదేశిక సూత్రాల్లో ప్రవచించిన లక్ష్యాలను సాకారం చేసు కోవడం,కొన్నిరాష్ట్రాల్లో రాష్ట్రపతిపాలన విధిం చడం, ఎస్సీ,ఎస్టీ,బీసీ జాతీయ కమిషన్లకు రాజ్యాంగ బద్ధత కల్పించడం, ఆస్తిహక్కును ప్రాథమిక హక్కుల జాబితానుంచి తొలగించి దానిని చట్టబద్ధ హక్కుగా గుర్తించడం, పౌరుల ప్రాథమిక విధులకు సంబం ధించి కొత్త అధ్యాయాన్ని జతపరచడం, ఫిరాయిం పుల నిరోధకచట్టం,జాతీయ జుడిషియల్‌ నియా మక కమిషన్‌ ఏర్పాటు, జీఎస్‌టీ అమలు, ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు 10శాతం రిజర్వే షన్లు కల్పించడం వంటి అనేక కీలక సవరణలకు కాలానుగుణంగా రాజ్యాం గం వేదికగా మారింది.
అంబేడ్కర్‌ సూచనలు శిరోధార్యం
రాజకీయ ప్రజాస్వామ్య సాధనకోసం మాత్రమే కాకుండా సామాజిక ప్రజాస్వామిక సంస్కృతిని పాదుకొల్పడం కోసం కృషి చేయాలనిబీ వ్యక్తి పూజ కు తిలోదకాలు వదలాలని1949, నవంబరు 25న రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ పిలుపిచ్చారు. దేశ పురోగతి సాధనలో అసమాన త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకోవడం సహేతుకమే అయినప్పటికీ- ఆ ఆరాధన ఒక స్థాయిని దాటితే మూఢభక్తిగా పరిణమించే ప్రమాదం ఉంది. దాని వల్ల అంతిమంగా వ్యవస్థలు పతనమై నియం తృత్వం కోరసాచే ప్రమాదం కొట్టిపారేయలేనిది. సామాజిక ప్రజాస్వామ్యమే పునాదిగా రాజకీయ ప్రజాస్వామ్యం శాఖోపశాఖలుగా విచ్చుకోవాలని ఆయన అభిలషించారు. కులాలు అన్న భావనే జాతి వ్యతిరేకమని స్పష్టం చేసిన అంబేడ్కర్‌, అంత రాలను అధిగమిస్తూ సవాళ్లను ఎదుర్కొంటూ భారతావని ఒక పరిపూర్ణ దేశంగా రూపుదాల్చాల్సి ఉందని ఆకాంక్షించారు. ఆ మహనీయుడి పలుకులే శిరోధార్యంగా భారతావని భవిష్యత్తును తీర్చిదిద్దు కోవాల్సి ఉంది. గడచిన ఏడు దశాబ్దాల రాజ్యాంగ పరిణామ క్రమంలో రాజకీయనేతలు అప్పు డప్పుడూ కట్టుతప్పిన ఉదాహరణలు కనిపిస్తాయి. ఏడో దశాబ్దం తొలినాళ్లనుంచి దేశంలో రాజకీయ నాయకత్వం అడపాదడపా నియంతృత్వం బాట తొక్కిన ఆనవాళ్లు పొడగడతాయి. గోలక్‌నాథ్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌ (1967) కేసులో పార్ల మెంటుకు రాజ్యాంగాన్ని సవరించే హక్కు లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రాథమిక హక్కులు సహా రాజ్యాంగాన్ని సవరించే విషయంలో పార్ల మెంటు సమున్నతాధికారాన్ని చాటిచెప్పేందుకు (1971లో తీసుకువచ్చిన 24వరాజ్యాంగ సవరణ) ప్రయత్నించింది. అయితే మెజారిటీ తీర్పు ద్వారా సుప్రీం కోర్టు ధర్మాసనం ఒకవైపు ఆరాజ్యాంగ సవరణకు మద్దతు పలుకుతూనే మరోవంక రాజ్యాం గ మౌలిక స్వరూపం, ప్రాథమిక హక్కులపై రాజ్యాంగ సవరణల ప్రభావం ఉండబోదని విస్ప ష్టంగా తేల్చిచెప్పింది. ఫలితంగా 1973నుంచీ తలపెట్టిన ఏరాజ్యాంగ సవరణకైనా ‘రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చరాదు’ అన్న సూత్రమే ప్రాతిపదికగా నిలుస్తోంది. ప్రధానమంత్రితోపాటు రాజ్యాంగ బద్ధ పదవుల్లోని వ్యక్తుల ఎన్నికలను న్యాయ సమీక్షకు అతీతంగా తీర్మానిస్తూ 39వ రాజ్యాంగ సవరణ తీసుకువచ్చారు. ఇందిరాగాంధీ వర్సెస్‌ రాజ్‌ నారాయణ్‌ (1975) కేసులో న్యాయ స్థానం ఆ సవరణ రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భిన్నంగా ఉందని, స్వేచ్ఛగా నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగే వాతావరణాన్నిదెబ్బతీస్తోందని వ్యాఖ్యానించి దాన్ని కొట్టివేసింది. 42వ సవరణ ద్వారా కీలక మైన ప్రాథమిక విధులకు చేటు కల్పించడంతో పాటు, చట్టాల రూపకల్పనలో ప్రాథమిక హక్కుల కంటే ఆదేశిక సూత్రాలకే అధికప్రాధాన్యం ఇవ్వ డం, సామ్యవాద, లౌకికవాద పదాలను చేరు స్తూ రాజ్యాంగ పీఠికను సవరించడం వంటి మార్పు లు తీసుకువచ్చారు.
జనతా ప్రభుత్వ జమానాలో 43,44 రాజ్యాంగ సవరణల రూపంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకువచ్చిన కొన్ని నిబంధనలు సవరించారు. మినర్వా మిల్స్‌ వర్సెస్‌ భారత ప్రభు త్వం(1980)కేసులో రాజ్యాంగాన్ని సవరించ డానికి పార్లమెంటుకు పరిమిత అధికారాలు మాత్రమే ఉన్నాయని తేల్చి చెప్పిన సుప్రీం కోర్టు- ప్రాథమిక హక్కులు,ఆదేశిక సూత్రాల మధ్య సామ రస్యాన్ని రాజ్యాంగ మౌలిక స్వభావంగా వ్యాఖ్యా నించింది. మనేకా గాంధీ వర్సెస్‌ భారత ప్రభుత్వం కేసులో న్యాయస్థానం పౌర స్వేచ్ఛకు మరింత విశాలమైన పరిధులు గీస్తూ తీర్పు చెప్పింది. దేశంలో పరోక్ష పన్నుల విధానాన్ని మరింత నిర్మాణాత్మకంగా తీర్చిదిద్ది సహకార సమాఖ్య విధా నానికి పెద్దపీట వేసే క్రమంలో వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)కు లాకులెత్తుతూ 101వ రాజ్యాంగ సవ రణ తీసుకువచ్చారు. 103వ సవరణ ద్వారా ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు 10శాతం రిజర్వేష న్లు తెరపైకి తీసుకువచ్చారు. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370ని ఎత్తివేయ డంతోపాటు- లద్దాఖ్‌, జమ్ము కశ్మీర్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారుస్తూ రాజ్యాంగాన్ని సవరించడం ఇటీవలి పరిణామం.
కదలాలిక క్రియాశీలకంగా…
భారత రాజ్యాంగానికి ఏడు దశాబ్దాల కాలంలో వందకుపైగా సవరణలు జరిగాయి. అమెరికన్‌ రాజ్యాంగాన్ని 1789నుంచి ఇప్పటివరకు కేవలం 27 సందర్భాల్లో మాత్రమే సవరించారు. మరోవంక 1900సంవత్సరంలో అమలులోకొచ్చిన ఆస్ట్రేలియా రాజ్యాంగానికి ఇప్పటివరకూ ఎనిమిది సవరణలు జరిగాయి. మనదేశ రాజ్యాంగానికి మాత్రమే ఎందుకిన్ని సవరణలు తీసుకువచ్చారు అన్న ప్రశ్నకు జవాబు వెదకడం అంత సులభం కాదు. చైతన్య భరితమైన రాజ్యాంగ స్వభావానికి ఈ సవరణలు దర్పణం పడుతున్నాయా లేక రాజకీయ అవసరాల మేరకు దఖలుపడిన అనివార్యతలకు ఇవి సూచికలా అన్న విషయంలో లోతైన చర్చ తప్ప నిసరి. దేశ ప్రజాస్వామ్య గమనాన్ని, పాలన వ్యవ స్థలను కాలానుగుణంగా తీర్చిదిద్దుకునే క్రమంలో రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతిఫలిస్తూ చేయాల్సిన మార్పు చేర్పులు మరెన్నో ఉన్నాయి. పార్టీఫిరాయింపు నిరోధక చట్టాన్ని ప్రభావశీలంగా మార్చడంబీ సంకీర్ణ ప్రభుత్వాల ప్రక్రియను కట్టుదిట్టంగా రూపు దిద్దడం, రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు కట్ట బెట్టడం, ఆదేశిక సూత్రాలకు అగ్రాసనమేస్తూ ఉమ్మడి పౌరస్మృతిని సాకారం చేయడం, న్యాయ వ్యవస్థకు జవాబుదారీతనాన్ని మప్పే నిబంధనలకు బాటలు పరవడం,అవినీతి కట్టడికి పటుతర వ్యవస్థలను రూపొందించడం వంటి క్రియాశీల చర్యలన్నీ రాజ్యాంగం ప్రాతిపదికగా అమలులోకి రావాల్సి ఉంది. రాజ్యాంగానికి మేలిమి భాష్యాలు చెబుతూ చురుకైన పాత్ర నిర్వహించడం ద్వారా న్యాయస్థానాలు ఈఏడు దశాబ్దాల కాలంలో క్రియా శీలకంగా వ్యవహరించాయి. రాజ్యాంగ మౌలిక స్వభావం అనే భావనను వెలుగులోకి తీసుకు రావడం, రాష్ట్రపతిపాలన దుర్వినియోగం కాకుం డా నియంత్రణలు విధించడం, సహజ వనరులను విచ్చలవిడిగా తవ్వితీయకుండా గనుల లైసెన్సుల విషయంలో పకడ్బందీగా వ్యవహరించడం, మానవహక్కుల ఉల్లంఘనలను సాధ్యమైనంత మేర అడ్డుకోవడం వంటివన్నీ మన దేశంలో న్యాయ వ్యవస్థ చైతన్యవంతమైన చొరవకు దాఖలాలుగా ప్రస్తావించుకోవచ్ఛు ఏడు దశాబ్దాలనాటితో పోలిస్తే నేడు సమాజం మరింతగా చీలికలు పేలికలై ఉంది. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్‌ అంబే డ్కర్‌ పరితపించిన సమానత్వం,సౌభ్రాతృత్వ సిద్ధాం తాలు ఆచరణలో కనుమరుగవుతున్న చేదు వాస్త వాలు ఎల్లెడలా దర్శనమిస్తున్నాయి. రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కేందుకుపాలకులే నిర్లజ్జగా సిద్ధపడుతున్న తరుణమిది. దీర్ఘకాలంలో దేశ గమనాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసే పరిణామాలివి.‘ఎన్నికైన ప్రజాప్రతినిధులు సమర్థు లు, నిజాయతీపరులైతే రాజ్యాంగంలో లోపాలు ఉన్నప్పటికీ వారి చర్యలవల్ల మెరుగైన ఫలితాలే సాకారమవుతాయి. కానీ పాలకులు సమర్థులు కాక పోతే రాజ్యాంగం ఎంత గొప్పదైనా ఉపయోగమే లేదు’-డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ వ్యాఖ్యలివి. జాతి గమనాన్ని శాసించే పాలకులు ఈ మాటలను ప్రతిక్షణం మననం చేసుకొంటూ అడుగు ముందుకు వేసినప్పుడే రాజ్యాంగ స్ఫూర్తి ఆచరణలో ప్రతిఫలి స్తుంది.
రాజ్యాంగ విలువలు – శాస్త్రియ దృక్పథం
అఖండ భారతదేశంలోకోట్లాది ప్రజల అధిశాసన గ్రంథంగా‘భాÛరతరాజ్యాంగం’ అమల్లోక ిరావడంతో సర్వసత్తాక,సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య,గణతంత్ర రాజ్యంగా భారతదేశం అవతరించడం జరిగింది. రాజ్యాంగం అనే గ్రంథంలో భారతీయ పరిపాలన వ్యవస్థను స్పష్టం గా లిఖింపచేసి స్వేచ్ఛ, సమాన త్వం,సోదరభావం అనే గొప్పవిలువలను భారతీయ పౌరులకు అందిం చడం జరిగింది. డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్క ర్గారు రాజ్యాంగ రచన కమిటీ అధ్యక్షులుగా వ్యవహ రించి ప్రపంచ దేశాల రాజ్యాంగాలను అధ్యయ నంచేసి భారతీయుల ఆర్థిక,సామాజిక, రాజకీయ, సాంస్కృతిక అవసరాలకు అనుగుణంగా అత్యుత్తమ మైన విలువల కలయికతో రాయడం జరిగింది. ప్రజాస్వామ్య దేశాలలో భారత రాజ్యాంగం వైవిధ్య మైన వ్యవస్థల సమాహారంతో విశిష్టలక్షణాల కలయికతో ప్రపంచంలోని అతిపెద్ద లిఖిత రాజ్యాం గంగా గ్రంథస్థం కాబడిన ఒకసమున్నత గ్రంథం. రాజ్యాంగం అనేగ్రంథం చారిత్రకంగా సృష్టించిన మానవ నిర్మిత అడ్డుగోడలైన కుల, మత, భాష, ప్రాంతం మరియు లింగ బేధాలను కూకటివేళ్ళతో పెకలించి కోట్లాది ప్రజలకు విముక్తి కల్పించింది. దేశతలరాతనుమార్చే ‘ఓటుహక్కు’అనే ఆయుధం ద్వారా దేశంలోని పౌరు లందరికీ భాగస్వామ్యం కల్పిస్తూ, ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలతోపాటు దేశ సంపదను సమానంగా పంచాలని ఆదేశిస్తూ, హక్కులను, బాధ్యతలను సమపాళ్ళలో పంచిన సమున్నత గ్రంథం. పార్లమెంటరీ వ్యవస్థ, కార్య నిర్వాహక వ్యవస్థ మరియు న్యాయ వ్యవస్థల మధ్య అధికార విభజనతో భారత రాజ్యాంగాన్ని నిర్మిం చడం జరిగినది.తద్వారా రాజ్యాంగంఅనే గ్రంథం ‘‘నవమాసాలు మోసిన తల్లి ప్రసవించిన వెంటనే మనల్ని నమోదుచేసుకుని 90ఏళ్లపాటు తన భుజాలకెత్తుకొని రక్షణకల్పిస్తున్న అదిశాసన గ్రం థం’’గా వ్యవహరించడం జరుగుతుంది.
42వ రాజ్యాంగ సవరణ-1976 ద్వారా చేర్చిన పదాలు
ా సార్వభౌమాధికారం : భారతదేశం ఏఇతర దేశానికి లొబడి ఉండదు. ఎవరి ఆజ్ఞలను పాటించదు,అంటే దేశం యొక్క నిర్ణయాలు దేశం మాత్రమే తీసుకొంటుంది. భారత దేశంలో ఉన్న సంస్దలు మీద, పౌరులమీద భారత దేశానికికి మాత్రమే హక్కు ఉంటుంది.భూభాగాన్ని ఏవిదేశీ రాజ్యానికైనా ఇవ్వవచ్చు. వదులుకోవచ్చు..ఇటువంటి నిర్ణయాలన్నీ తీసుకోవడాన్ని సార్వభౌ మాధికారం అంటారు.
ా సామ్యవాదం : భారత దేశంలో ఉన్న వనరులు అన్నీ ఉత్పత్తి, పంపిణీ అన్నీ కూడా రాజ్యమే చేపట్టడం., అంటే ప్రయివేటీజేషన్‌ ఉండదు. అంతా ప్రభుత్వమే చేపడుతుంది కానీ భారత దేశం అనుసరించేది ప్రజా సామ్య సామ్యవాదాన్ని అనుసరిస్తుంది. ఇందులో ప్రభుత్వం మరియు ప్రయివేటు కూడా ఉంటాయి. దీనికి కారణం ఆర్ధిక సంస్కరణలు రావడం.
ా లౌకిక వాదం : భారతదేశం ఏ అధికార మతం కలిగి లేకపోవడం, అన్ని మతాలకు సమాన ఆధారణ ఇస్తుంది ఏమతానికి ప్రత్యేకమైన విలువ ఇవ్వదు,అన్ని మతాలూ సమానంగా అనుసరిస్తుంది.
ా ప్రజాస్వామ్యం : భారతదేశం ప్రాతినిధ్య పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అనుసరి స్తుంది. ప్రాతిధ్యం అంటే ప్రజలు ప్రత్యక్షంగా ప్రతినిధులను ఎన్నుకొంటారు, వారు పార్లమెంటులో ఉంటూ వారు శాసనాలు చేసి మనల్ని పరిపాలిస్తారు. ఇందులో మనం ఎన్నికల్లో పాల్గొంటాం ఓట్లు వేస్తాము. మనం కూడా ఎన్నికల్లో పోటీ చేస్తాము.దీన్నేప్రజాస్వామ్యం అంటారు.
ా గణతంత్ర రాజ్యము : చాలా దేశాల్లో రాజ్యానికి రాజులు కానీ రాణులు కానీ ఉంటారు, వీరు వంశ పారంపర్యంగా కొనసాగుతారు. కానీ మన దేశంలో మనమే రాజ్యా అధ్యక్షుడుని ఎన్నుకుంటాము. అంటే మనం ప్రతినిధులను ఎన్నుకుంటాము, మన ప్రతినిధులు రాజ్య అధ్యక్షుడుని ఎన్నుకుంటారు అలా ప్రజలే రాజ్యాధ్యక్షుడుని ఎన్నుకొంటే ఆరాజ్యాన్ని గణతంత్ర రాజ్యము అంటారు.
ా సాంఘికన్యాయం: కులం,మతం,జాతి,జన్మ లింగవివక్షత లేకుండా ఉండడం, రాజ్యాంగం ముందు అందరూ సమానులే కానీ కొన్ని ప్రత్యేక సదుపాయాలు కొన్ని వర్గాలకు కేటాయించడం ద్వారా వారిని మిగతా వారితో సమానంగా తీసుకు రావడా నికి ప్రోత్సాహకాలను ఇస్తుంది, ఇది కూడా సామాజిక న్యాయం కిందికి వస్తుంది. అలాగే రాజకీయ న్యాయం అంటే భారతదేశ పౌరులు అందరూ రాజకీయంలో పాల్గొన డం,ఓట్లు వేయడం18సంవత్సరాలు నిండిన వారంతా ఓటు హక్కును కలిగి ఉంటారు. ఇది అంతా రాజకీయ న్యాయ కిందకు వస్తుంది. అంతస్తుల్లోను అవకాశాల్లోను సమాన హక్కులు కల్పించారు ఆలోచన, భావప్రకటన,విస్వాసం,ధర్మం,ఆరాధన ఇవి అన్నీ కూడా స్వేచ్ఛను పొంపొందిస్తాయి. వీటన్నిటిని భారత రాజ్యంగంలో హక్కులుగా కల్పించారు.స్వేచ్ఛ,సమానత్వం, సౌబ్రా త్రుత్వం అనే భావనలు ఫ్రాన్సు దేశం నుండి గ్రహించారు. అలాగే స్వేచ్ఛకు కొన్ని పరిమితులు ఉన్నాయి. జాతీయ సమగ్రత సమైక్యతా అంటే మనం ఒకచోట గమనించవచ్చు, మన అందరికి ఒకటే సిటిజన్‌ షిప్‌ ఉంటుంది. రాష్ట్రానికి కానీ దేశానికి కానీ వేరుగా ఉండదు. అంటే భారత దేశంలోఉన్న పౌరులు అందరికి ఒకే గుర్తింపు ఉంటుంది, ఇదే భారతదేశ సమైక్యత అనవచ్చు .
ా సౌబ్రాత్రత్వం : సౌబ్రాత్రత్వం అంటే పౌరుల మధ్యసోదరభావాన్ని పెంపొందిం చడం.భారతదేశంలో ఉన్న ప్రజలు అందరూ సోదరి భావంతో మెలగాలి
భారత రాజ్యాంగం – ముఖ్య లక్షణాలు
భారత రాజ్యాంగ పరిషత్‌ భారత రాజ్యాంగాన్ని రూపొందించింది.1949 నవంబర్‌ 16న ఆమో దం పొందిన భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. రాజ్యాంగ నిర్మా ణంలో రాజ్యాంగ నిర్మాతలు ఆధునిక ప్రపంచం లోని తాత్విక పునాదులను అనుసరించారు. ఉదారవాదం, ప్రజాస్వామ్య సామ్యవాదం, లౌకిక వాదం, గాంధీవాదం మొదలైన మూల సూత్రాలను రాజ్యాంగంలో పొందుపర్చారు. సమన్యాయ పాలన, ప్రాథమిక స్వేచ్ఛలు ప్రజలకు ఉండాలని భావించారు. ప్రజలందరికీ ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం జరగాలని ప్రతిపాదించారు. వీటన్నింటి ఆధారంగా రాజ్యాంగ మౌలిక లక్షణా లు రూపొందాయి, కానీ అవి నేడు దేశభక్తి పేరుతో పెను ప్రమాదంలో చిక్కు కున్నాయి. ప్రపంచంలో భారత రాజ్యాంగం అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. రాజ్యాంగ పరిషత్‌ రాజ్యాంగ రచనకు రెండు సంవ త్సరాల 11 నెలల 18 రోజుల పాటు తీసుకుంది. భారతదేశంలోని భిన్నత్వం, అన్ని తరగతుల ప్రయోజనాలు రక్షించాలనే దక్పథం రాజ్యాంగంలో కనిపిస్తుంది. భారత రాజ్యాంగ లక్ష్యాలను పీఠికలో పొందుపర్చారు. పీఠికలో ‘సర్వసత్తాక, ప్రజా స్వామ్య, గణతంత్ర రాజ్యంగా’ పేర్కొన్నారు. 1976లో42వ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్య వాద,లౌకిక, సమగ్రత అనే పదాలను నూత నంగా చేర్చారు. దీంతో పీఠిక ‘సర్వసత్తాక, సామ్య వాద, లౌకిక,ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా’ రూపొం దింది. ప్రజలందరికీ ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం చేకూరాలని పీఠిక చెప్పింది. ప్రజ లకు స్వేచ్ఛ కల్పించడానికి రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను చేర్చారు. ప్రజలకు సమానత్వం కల్పించ డానికి రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలను పొందు పర్చారు. భారతదేశంలో రాజ్యాధినేత ఎన్నుకో బడట ంతో దేశం గణతంత్ర రాజ్యంగా రూపొం దింది. పౌరులకు మత స్వేచ్ఛను కల్పించ డంతో లౌకిక రాజ్యంగా ఉంది. భారతదేశంలో అధికా రానికి మూలాధారం ప్రజలు అని పీఠిక తెలిపింది. భారత రాజ్యాంగంలో మౌలిక స్వరూ పం గురించి పేర్కొనలేదు. కానీ 1973లో కేశవా నంద భారతి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని వివరించి, దాన్ని కాపాడుకోవాలని చెప్పింది. వివిధ కేసుల్లో జస్టిస్‌ సిక్రి, జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ హెగ్డే మొదలైనవారి తీర్పులను పరిశీలిస్తే రాజ్యాంగ మౌలిక స్వరూప లక్షణాలు తెలుస్తాయి.
రాజ్యాంగ ఆధిక్యత, ప్రజా స్వామ్య, సమాఖ్య విధానం,లౌకిక విధానం, సమ న్యాయం ,సార్వభౌమాధికారం మొదలైనవాటిని మౌలిక లక్షణాలుగా పేర్కొన్నారు. మినర్వామిల్స్‌ కేసు (1980), వామన్‌రావ్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా(1981)కేసుల్లోనూ సుప్రీంకోర్టు రాజ్యాం గ మౌలికస్వరూప ప్రాధాన్యతను తెలి పింది. రాజ్యాంగం మూడో భాగంలో 12 నుంచి 35 వరకూ ఉన్న నిబంధనల్లో ప్రాథమిక హక్కులను పొందుపర్చారు. భారత పౌరులకు స్వేచ్ఛ కల్పిం చడానికి ఈహక్కులు దోహదపడతాయి. సుప్రీంకోర్టు 32వ నిబంధన ద్వారా హైకోర్టు 226వ నిబంధన ద్వారా పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడటానికి ఐదురకాల రిట్‌లు జారీ చేస్తాయి. 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 21-ఎనిబంధన చేర్చి ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా పొందుపర్చారు.అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో ప్రాథమిక హక్కులు తాత్కా లికంగా సస్పెండ్‌ అవుతాయి. రాజ్యాంగం నాలుగో భాగంలో 36 నుంచి 51 వరకూ ఉన్న నిబంధనల్లో ఆదేశిక సూత్రాలను పొందుపర్చారు. ఆదేశిక సూత్రాలు భారతదేశాన్ని ఒక సంక్షేమ రాజ్యంగా రూపొందించడానికి తోడ్పడ తాయి. భారత ప్రజల ఆర్థిక, సామాజిక, జీవన ప్ర మాణాలు పెంపొందిం చడానికి ఆదేశిక సూత్రాలను అమలు చేయాలని రాజ్యాంగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిం చింది. వీటికి న్యాయస్థానాల సంరక్షణ ఉండదు. సంపద పంపిణీ, సమాన పనికి సమాన వేతనం, కార్మికులకు సౌకర్యాలు మొదలైన అనేక అంశాలను ఆదేశిక సూత్రాల్లో పొందుపర్చారు. అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీలు, తమ రాజకీయ సిద్ధాం తాలతో నిమిత్తం లేకుండా ఆదేశిక సూత్రాలు అమలు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు రాజ్యాం గంలో 11ప్రాథమిక విధులు న్నాయి. రాజ్యాంగాన్ని, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవిం చడం, హింసను విడనాడటం, ప్రభు త్వ ఆస్తులను కాపాడడం, శాస్త్రీయ దృక్పథాన్ని పెం పొందించు కోవడం వంటి అంశాలు ప్రాథమిక విధు ల్లో ఉన్నాయి. భారత పౌరుల్లో బాధ్యతాయిత ప్రవర్తనను పెంపొందించే ఆశయంతో ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో చేర్చారు. భారత రాజ్యాం గం దేశంలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టింది. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ పార్ల మెంటరీ తరహా ప్రభుత్వం కొనసాగుతుంది. సమిష్టి బాధ్యత, కార్యానిర్వాహక వర్గం,శాసన నిర్మాణ శాఖకు బాధ్యత వహించడం పార్లమెంటరీ విధానం ముఖ్య లక్షణాలు. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం రాష్ట్రాల హక్కులను హరించి జమ్మూ కాశ్మీర్‌ ప్రజల, రాష్ట్ర శాసనసభ అభిప్రాయం తీసుకో కుండానే ఆరాష్ట్ర ప్రత్యేక స్వయం ప్రతిపత్తిని రద్దు చేసింది. భారత రాజ్యాంగం దేశంలో స్వతంత్ర న్యాయవ్యవస్థను ఏర్పాటు చేసింది. న్యాయవ్యవస్థ న్యాయ సమీక్ష అధికారాన్ని కలిగి ఉంటుంది. ఐదు దశాబ్దాలుగా న్యాయవ్యవస్థ క్రియాశీలకంగా కొనసాగుతోంది.
దేశంలో పౌరుల ప్రాథమిక హక్కుల ను కాపాడడంలో న్యాయవ్యవస్థ క్రియా శీలక పాత్ర వహిస్తోంది. ఇటీవల కాలంలో ప్రజా ప్రయో జనాల వ్యాజ్యం ప్రాధాన్యత తగ్గిపోయింది. కొన్ని తీర్పులను అధికారవర్గాలు ప్రభావితం చేస్తున్నాయన్న అభిప్రాయాలకు ప్రజలు రాక తప్పడంలేదు. డాక్టర్‌ బిఆర్‌అంబేద్కర్‌ భారతదేశాన్ని ఏకకేంద్ర స్ఫూర్తితో పనిచేస్తున్న సమాఖ్య రాజ్యంగా వర్ణించారు. ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు కె.సి.వేర్‌ భారతదేశాన్ని ‘అర్ధసమాఖ్య’ అనివర్ణించాడు. ఏకకేంద్ర లక్షణాలైన ఒకే పౌరత్వం, ఏకీకృత న్యాయవ్యవస్థ, అఖిలభారత సర్వీసుల పాత్ర, కేంద్ర ఆధిక్యత మొదలైనవి కూడా రాజ్యాంగంలోఉన్నాయి.
భారత రాజ్యాంగం పౌరులందరికీ సార్వ జనీన ఓటు హక్కు ప్రసాదించింది. స్త్రీ, పురుషులందరికీకుల,మత,వర్గ,లింగ,జాతి బేధాలు లేకుండా1988లో61వ రాజ్యాంగ సవరణద్వారా ఓటు హక్కు వయస్సును21 నుంచి18 ఏండ్లకు తగ్గించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ విజయం సాధించడంలో ఓటు హక్కు ముఖ్యపాత్ర పోషిం స్తుంది అని, రాజ్యాంగ నిర్మాతలు ప్రజలందరికీ ఓటు హక్కు ఇవ్వడం ద్వారా ప్రజా సార్వభౌమాధి కారంకొనసాగుతుందని విశ్వసించారు.
కానీ డబ్బున్న వారే రాజ్యాన్ని చేజిక్కిం చుకొని తమ పెట్టుబడులను విస్తరించు కుంటూ ప్రజలు నిరు ద్యోగులుగా, పేదవారిగా..ఉపాధి కోసం, ఎన్నికల సమయంలో నాయకులు విసిరే ఎంగిలి మెతుకుల కోసం అమలు కాకపోయినా ఉచిత హామీల కోసం ఎదురు చూసే నిర్భాగ్యులుగా మార్చివేయబడ్డారు. రైతు గిట్టుబాటు కోసం కాకుండా,నిరుద్యోగి ఉపాధి కోసం కాకుండా, కార్మి కుడు కనీస వేతనం కోసం కాకుండా అణిచివేయ బడ్డ వర్గ ఆత్మగౌరవం కోసం కాకుండా ఎన్నికల సమయంలో అభ్యర్థులు పంచే నోట్ల కోసం ఎదురు చూసే దుస్థితి ఏర్పడిరది. గతంలో లేనంతగా భారత్‌లో ప్రజాస్వామ్య విలువలు పతనమ య్యాయి. నిరసన ప్రదర్శనలపై కాల్పులు, లాఠీ ఛార్జీలు, పోలీసుల అక్రమ అరెస్టులు సర్వసాధారణ మయ్యాయి. -(జి.ఆనంద్‌ సునీల్‌ కుమార్‌ )

అంతరించిపోతున్న భాషల సంరక్షణ

శాస్త్ర సాంకేతిక రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మన దేశంలో మాతృభాషల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ప్రపంచీకరణ, సరళీకృత, ఆర్థిక విధానాలు, మరో ప్రక్క అమెరికన్‌ సామ్రాజ్య వాద సంస్కృతి తాకిడికి బలవుతున్న మాతృభాషల ఉనికి, మనుగడ కనుమరుగవక తప్పని పరిస్థితి దాపురించింది. ఆంగ్ల భాష నేడు అంతర్జాతీయంగా రూపాంతరం చెందడం కూడా వారి చలువే నన్నది జగమెరిగిన సత్యం. అందుకే ప్రపంచ వ్యాప్తంగా వేల సంఖ్యలో మాతృభాషలు అంతరించి పోతున్నాయి. అందుకు నిలువెత్తు సాక్షంగా ఆంధ్ర,తెలంగాణ రాష్ట్రాలల్లో తెలుగు భాషను ఆంగ్ల భాష అధిక మించినట్లు, తెలుగు కూడా అదే రీతిలో ఇతర భాషలను గిరిజన భాషలను సైతం అధిక మిస్తున్నాయి. ఆదిమ గిరిజన భాషలకు నేటికీ గుర్తింపు లేదు. లిపి లేదు. వీరు మాట్లాడే భాషలు మౌఖికంగా నోటికే పరిమితం కావడం మూలాన అత్యంత నిరాదరణకు గురవుతు న్నాయి. పర్యవసానంగా ఆదివాసీ తెగల ప్రత్యేక సాంస్కృతిక సాంప్రదాయాలు కనుమరుగవుతున్నాయి.
ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఆదివాసీలు ఆస్ట్రేలియా (అబోరి జన్లు), న్యూజిలాండ్‌ (మావోరీలు),జపాన్‌ (అయినీలరు),ఉత్తర దక్షిణ అమెరికా (రెడ్‌ ఇండియన్‌) ఉత్తర యూరప్‌ (సామీలు), ఆఫ్రికా (బుష్‌మెన్‌), ధృవ ప్రాంతాలు (ఇన్‌ విత్‌), అండమాన్‌, నికోబార్‌ (జారువా),ఇండియా (ఆదివాసీ గిరిజనులు),అరేబియా,మలేసియా, సూడాన్‌,అమెజాన్‌,రొడీసియా,ఇండోనేసియా, లక్షద్వీప్‌ మొదలైన 70దేశాలలో5వేల తెగలకు చెందిన 37కోట్ల మంది ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 6700భాషలను మాట్లాడుతున్నారు. ఆఫ్రికా,ఇండోనేసియా,అండమాన్‌,నికోబార్‌ వంటి దీవుల్లో నివసించే బుష్‌మెన్‌, జారువా వంటి ఆదిమ తెగల వారి సంస్కృతితో పాటు భాషలు, ఉనికి అంతరించిపోతున్నాయి.భారత రాజ్యాంగంలోని 5,6 షెడ్యూల్‌లో పేర్కొన్న గిరిజన రాష్ట్రాల్లో 698 తెగలకు చెందిన 10 కోట్ల మంది జనాభా వుంది. మన దేశంలో మొత్తం 1652 భాషలుండగా, గిరిజనులు మాట్లాడే భాషలే సుమారుగా 600 దాకా ఉన్నాయి.భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్‌లో ఇప్పటికి 22 భాషలు అధికా రికంగా గుర్తించబడగా, అందులో గిరిజనులు మాట్లాడే మణిపురి, డోంగ్రీ, బోడో, కొంకిణి, సంథాలీ భాషలకు మాత్రమే చోటు దక్కింది. మిగిలిన ఆదిమ భాషలు అంతరించే దశలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో తెలుగు ప్రజలతో పాటు అటవీ సమీపాల్లో, కొండకోనల్లో నివసించే సవర,గదబ,జాతపు, గోండు,కోలాం,పర్ధాన్‌,తోటి,కోయ,కొండ, రెడ్లు, చెంచు,నాయక్‌ పోడు,యానాది మైదాన ప్రాంతాల్లో బంజార,ఎరుకల,నక్కల,కుర్వికరన్‌, పైకో పుతియా వంటి 35 తెగలు,మరో 30ఉప తెగలకు చెందిన 59,64,680 మంది (2011 జనాభా లెక్కల ప్రకారం) గిరిజనులు ఉన్నారు. వీటిలో చాలా గిరిజనతెగలకు వారి వారి మాతృభాలున్నాయి.కొన్ని భాషలకు (సవర, గోండీ, ఆదివాసీ,ఒరియా) అరుదుగా లిపి ఉన్నాయి.భాషకు,సంస్కృతికి అవినాభావ సంబంధం ఉంది.కాని వారి మాతృ భాషలకు లిపికి ఎటువంటి సంబంధం లేదు. అయినా ప్రపంచంలో సంస్కృతీ సాంప్రదాయాలు పాటి స్తున్నది కేవలం ఆదివాసీలేనన్నది ఆది(మ) సత్యం. భాష ద్వారానే సంస్కృతీ సాంప్రదా యాలు ఆచారాలతో ఆదివాసులు అస్తిత్వాన్ని కాపాడుకుంటున్నారు. కాని పాలక వర్గాలు ఆదిమ జతుల భాషలకు లిపి లేదన్న సాకుతోనే ఇతర భాషలను వారిపై రుద్దడంతో విద్యా భివృద్ధికి, సమగ్రాభివృద్ధికి దూరమవుతున్నారు. ప్రపంచీకరణ పేరుతో పాలక వర్గాలు ఆదిమ జాతుల ఉనికిని ఆటంక పరుస్తూ ఒకే స్థాయి సంస్కృతిని స్థాపించడానికి నిరంతరం ప్రయత్ని స్తున్నారు. అందువల్ల మాతృభాషల,ఆదిమ భాషల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. ఒక భాషను, మరొక లిపిలోనూ రాయవచ్చు. ఆ భాషా భివృద్ధి నిర్దిష్ట ప్రణాళిక, చిత్తశుద్ధితో అమలు పరచడం అవసరం. మాతృభాషల సంరక్షణలో భాగంగా నిజాంరాజు ఉస్మాన్‌ అలీఖాన్‌ ఆదివాసీల ప్రత్యేక సంస్కృతిని గుర్తించి పాఠశాల స్థాయిలో తెలుగు లిపిలోనే శిక్షణ నిప్పించి మొదట గోండు భాషను పరిచయం చేశాడు. అప్పటి నిజాం ప్రభుత్వంలో మానవ పరిణామ శాస్త్రవేత్త హైమండార్ప్‌ పరిశోధనా కృషి ఫలితంగా గోండు భాష శిక్షణ కోసం ఆదిలాబాద్‌ జిల్లా జైనూరు మండలంలోని మార్లవాయిలో ‘టీచర్‌ ట్రైనింగ్‌ సెంటర్‌’’ స్థాపించబడినది.1956 హైదరాబాద్‌ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌లో విలీనమై భాషా ప్రయుక్త రాష్ట్రంగా అవతరించిన తరువాత ఆదివాసీ గిరిజన పిల్లల మీద తెలుగు బలవంతంగా ‘రుద్ద’బడిరది. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేళ్ల క్రితం రాజీవ్‌ విద్యామిషన్‌ (ఆర్‌.వి.ఎం)ద్వారా గోండు, కోయ,సవర,చెంచు,ఒరియా,కొలామి,కొండరెడ్డి, బంజార వంటి భాషలలో తెలుగు లిపితో ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు వాచకాలను ముద్రించి ప్రత్యేక పాఠశాలను నెలకొల్పింది. ఆయా భాషా సంబంధ బోధకు లను కూడా నియమించింది. కాని కొన్ని సాంకే తిక లోపాల వల్ల నేడు పాఠశాలలు పని చేయడం లేదు.
గోండీ భాష లిపి
గోండు గిరిజనులు మాట్లాడే భాషగోడీ.గోండు అంటే జంతువును కాపాడేవాడు అని అర్థం. మధ్య భారత దేశంలో గోండ్వానా రాజ్యాన్ని ఏలిన గోండు గిరిజనుల జనాభా సుమారు 20 లక్షలు. మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌, రాష్ట్రాల్లో సగం మంది గోండులు నేటికీ గోండి భాషలోనే సంభాషి స్తున్నారు. ఇది వారికి అమ్మ భాష. లిఖిత భాషను గర్భ భాష అంటారు. వీరి సాంస్కృతిక నృత్యం గుస్సాడీ గిరిజన గోండి భాషపై అలనాడు ప్రాకృతం, ఆ తర్వాత సంస్కృతం, అరబీ, పారసీకం, ఉర్దూ, హిందీ, మరాఠీ, తెలుగు భాషలు పెత్తనం చెలాయించాయి. అందుకు సాక్షమే.. గోండీకి లిపి ఉందనే అక్షర సత్యం. 2014 మార్చి నెలలో ఆదిలాబాద్‌ జిల్లాలోని నార్నూరు మండలం గుంజాల గ్రామంలో 12 పురాతన గోండీ లిపి రాత ప్రతులు అభ్యమయ్యాయి. దాదాపు పది వేల సంవత్సరాల క్రితం సింధూ నది పరివాహక ప్రాంతంలో విలసిల్లిన హరప్పా, మొహంజ దారో కాలం నాటి నుంచి గోండులకు లిపి, ప్రత్యేక సంస్కృతి ఉన్నట్లు చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తుంది. ఈ రాత ప్రతులలో ఆదిమ గిరిజనుల సంస్కృతీ,సాంప్రదాయాలు,ఆచార వ్యవహారాలు,చరిత్ర,గణితం,జ్యోతిష్యం,కథలు, గోండు రాజుల పాలన,గోండీ సాహిత్యం, దేశంలో ఆంగ్లేయుల పాలన,రాంజీ గోండు పోరాటం వంటి వివరాలున్నాయి. ఈరాతలను చదివే పెద్ద మనుషులు ప్రస్తుతం ముగ్గురు (కొట్నాత్‌ జంగు, అర్క జయవంతరావు, పెంథోల్‌ భీం రావు) మాత్రమే ఉన్నారు. గోండీ భాషాధ్యయన కేంద్రాన్ని రాష్ట్ర రాత ప్రతుల సంస్థ పూర్వ సంచాలకులు ఆచార్య జయధీర్‌ తిరుమల రావు ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
కోయ భాష లిపి
కోయ గిరిజనులు అనగానే తెలంగాణలో అత్యంత వైభవంగా జరిగే మేడారం సమ్మక్క సారక్క జాతర గుర్తుకొస్తుంది. ఇది ఆసియాలోనే కోయ గిరిజనులు జరుపుకొనే అతి పెద్ద జాతర. కాకతీయుల కాలం (13 శతాబ్దం)లో కోయ గిరిజనులు వారికి కప్పం కట్టలేని పరిస్థితుల్లో సమ్మక్క సారక్కలు కాకతీయ సైన్యాన్ని ఎదిరించారు. ఆ పోరులో వీరత్వం పొందిన తరువాత సమ్మక్క సారక్క, జంపన్నలు దైవత్వం పొందారని కోయ గిరిజనుల ప్రగాఢ నమ్మ కంతో జాతర నిర్వహిస్తున్నారు. కోయ గిరిజ నులు ఒక నిర్దిష్టమైన తెగ.చరిత్రకారులు చెబుతున్నట్టు కోయ జాతి మూలాలు క్రీ.పూ. 25,000 నుండి 10,000 లోపల, మధ్య శిలా యుగంలోనే ఉన్నట్లు శిలా యుగపు అవశేషాలు కొన్ని ఖమ్మం జిల్లాల్లో (200708 మధ్య) లభించాయి. దీని ద్వారా ఆస్ట్రలాయిడ్‌ జాతికి చెందిన కోయ, సవరలకు చెందిన ఆదివాసీలు గిరిజన జాతులుగా పరిణమించాయి.గోదావరి నదికి అనుసంధానమైన శబరి,కిన్నెరసాని, మున్నేరు,పాలేరు వైరా వంటి ఉప నదులు గల సారవంతమైన ప్రాంతాల్లో కోయ,కొండరెడ్ల తెగలు స్థిరపడినవి.వీరి మాతృభాష కోయ భాష. రేలా అనేది వీరి సాంస్కృతిక నృత్యం. వరంగల్‌,ఖమ్మం,కరీంనగర్‌ దండకారణ్యంలో నివసించే వీరి జనాభా 20లక్షలదాకా ఉం టుంది. ప్రస్తుతం వీరి భద్రాచలం,చింతూరు, కూనవరం,పోచారం,బూర్గుంపాడు,పినపాక, అశ్వాపురం, మణుగూరు ప్రాంతాల్లో వున్న కొందరు మాత్రం (20శాతం)కోయ భాష మాట్లాడుతున్నారు. కాకతీయుల కాలంలో సాగు భూములకు శిస్తులు కట్టలేకపోవడంతో ఇతరులకు తెలియని కోయ భాషను అంతరింప జేశారనేది ఒక వాదన. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతర పెత్తందార్ల వలసలు పెరిగిపోవ డంతో అర్థం కాని కోయ భాషపై దాడి జరిగిం దనేది మరొక వాదన. ఏదేమైనా ఈ మౌఖిక భాషకు లిపిగాని, ముద్రణగాని లేకపోవడంతో ఆదివాసీ భాషలు అంతరించిపోతున్నాయి అనే భాషావేత్తల అభిప్రాయంతో ఏకీభవించక తప్పదు. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం తెలుగు నేల మీద ప్రభుత్వం గుర్తించిన 34 ఆదివాసీ తెగల భాషలు అంతరించే దశకు చేరుకున్నాయి. ఈ భాషలకు లిఖిత రూపం లేకపోవడం వల్ల నోటి భాషలుగా మిగిలి పోతున్నాయి. వీటికి తోడు ముద్రణ, నిరంతర భాషణం ఉంటేనే భాషకు సజీవత్వం ఉం టుంది. ప్రభుత్వం గాని, భాషా పండితులు గాని,రాష్ట్ర రాత ప్రతుల సంస్థగాని ఈ పురా తన ఆదిమ భాషల పరిరక్షణఖు అధ్యయనం జరపటం లేదు. 2013 తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహా సభల ఫలితంగా ప్రభుత్వం తెలుగు భాషకు ప్రత్యేక సాంస్కృతిక, మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడం శుభ పరిణామం. కాని ప్రాంతీయ భాషలు, మాతృభాషల లిపి గురించిన ప్రస్తావన రాలేదు. తక్షణావసరంగా వాంఛనీయమైన ప్రాంతీయ భాషలను మాతృభాషలుగా, అధికార భాషలుగా గుర్తించాల్సిన అవసరమున్నది. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న మాతృభాషల్లోనే ముఖ్య పరిపాలనా వ్యవహారాలు కొనసాగాలి. న్యాయ స్థానాల్లోనూ కోర్టు తీర్పులు వారివారి మాతృభాషల్లో వెలువడినట్లయితే గ్రామీణులు, ఆదిమ తెగల గిరిజనులు సైతం న్యాయం పొందుతారు. నేడు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో అంత రించిపోతున్న కోయ, గోండీ, రోలాం,సవర, చెంచు, గడబ, కొండరెడ్ల భాషల లిపి, భాషా భివృద్ధిపై పరిశోధన చేసే వారికి ప్రభు త్వం చేయూత నివ్వాలి. కనీసం ప్రాథమిక స్థాయి నుండి మాధ్యమిక స్థాయి వరకు విద్యా బోధన మాతృభాషలోనే కొనసాగించుటకు తగిన నిధులు కేటాయించాలి. ఆయా భాషలకు చెంది న బోధకులను నియమించి,ప్రత్యేక ఆశ్రమ పాఠ శాలలు నెలకొల్పితే ప్రయోజనం ఉంటుంది.
సవరి భాషలిపి భారతావనిలో ఆదిమ జాతుల పేరు చెప్పగానే గుర్తుచ్చేది ఆది తెగ సవర.ఆర్యుల మన దేశా నికి రావడానికి పూర్వమే ఈ గిరిజన తెగ మధ్య భారతదేశంలో నివసించేరని చారిత్రక, పురావస్తు ఆధారాలను బట్టి తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో సుమారు ఐదులక్షల మంది సవరల జనాభా ఉంది నేడు సవరలు ఇతర గిరిజన తెగలతో కలసి మిశ్ర జాతిగా ఏర్పడ్డారు. సవరల నృత్యంను,థింసా అని,చిత్రకళను ఎడిసింగ్‌/తింగోర్‌ అని అంటారు. ఆదిమ సవరల భాష అతి ప్రాచీన భాష. సవరభాషకు లిపి నిఘంటువుని రూపొం దించిన గిడుగు రామ్మూర్తి పంతులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సవరలకు అక్షర బ్రహ్మగా వెలుగొందారు. బాహ్య సమాజం అంటే ఏమిటో తెలియని ఆదిమ ప్రపంచం సవరలది. వీరు ఆధునిక సమాజంలో జీవింమచాలంటే వీరి భాషలనే బోధించాల్సి ఉంటుందని గిడుగు సవర భాషను నేర్చుకున్నారు. సవర వాచకా లను,కథలపుస్తకాలను,పాటల పుస్తకాలను, తెలుగుసవర,సవర`తెలుగు నిఘంటవులను తయారు చేశారు. 1911లో ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం ఈ పుస్తకాలకు పారితోషికం ఇవ్వజూపితే ఆడబ్బుతో ఒక మంచి బడిపెట్ట మని ప్రభత్వాన్ని కోరారు. ఆయన కోరిక ప్రకారమే ప్రభుత్వం ప్రత్యేక సవర శిక్షణా పాఠశాలలను ప్రారంభించింది.సవర గిరిజ నులు, గిరిజనేతరులు కలిసి నివసిస్తున్న శ్రీకాకుళం జిల్లాలోని పర్లాకిమిడి పట్టణానికి 200 గ్రామా లను 1935లో తెలుగు రాష్ట్రం నుంచి ఒడిషా రాష్ట్రంలో చేర్చడాన్ని గిడుగు నిరసించారు. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం తెలుగు నేల మీద ప్రభుత్వం గుర్తించిన 34 ఆదివాసీ తెగల భాషలు అంతరించే దకు చేరుకున్నాయి.ఈ భాషలకు లికిత రూపం లేకపోవడంవల్ల నోటి భాషలుగా మిగిలిపోతున్నాయి. ప్రభుత్వంగానీ, భాషా పండితులుగాని,రాష్ట్రరాత ప్రతుల సంస్థగాని,ఈ పురాతన ఆదిమ భాషల పరిరక్షణకు అధ్యయన జరపట లేదు. తక్షణా వసరాలుగా వాంఛనీ యమైన ప్రాంతీయ భాషలను మాతృభాషలుగా, అధికారభాషలుగా గుర్తించాల్సిన అవసర ముంది. నేడు ఏపీ,తెలంగాణ రాష్ట్రాలోని ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో అంతరించిపోతున్న కోయ,గోండీ, కోలాం, సవర,చెంచు, గదబ, కొండరెడ్ల భాషల లిపి,భాషాభివృద్ధిపై పరిశోధన చేసేవారికి ప్రభుత్వం చేయూత నివ్వాలి.ఆయా భాషలకు చెందిన బోధకులను నియమించి ప్రత్యేక ఆశ్రమ పాఠశాలలు నెల కొల్పతే ఆదిమ భాషలు సజీవంగా ఉంటాయి.
భాషను రక్షించుకునే సామాన్యులు
అయితే, అంతరించిపోతున్న తమ భాషలను సంరక్షించుకునేందుకు కొన్ని కమ్యూనిటీలు కూడా బాధ్యత తీసుకుంటాయి. అలాంటి ఒక ప్రయత్నాన్ని ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఓ గ్రామానికి చెందిన రైతు వాంగ్లంగ్‌ మొసాంగ్‌ చేపట్టారు. మొసాంగ్‌ ఈశాన్య భారతదేశంలోని అనే సినో-టిబెటన్‌ భాష కుటుంబానికి టాంగ్సా అనే భాషను మాట్లాడే తెగకు చెందిన వారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని టాంగ్సా తెగ 40 ఉపజాతులుగా కనిపిస్తుంది. ప్రతి ఉపజాతికి దాని సొంత యాస ఉంటుం ది.టాంగ్సా కమ్యూనిటీ జనాభా దాదాపు 100,000.అయితే విభిన్న మాండలికాల కార ణంగా భాషా అంతరించిపోయే ప్రమాదంలో పడిరది.కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ 2013 లో అంతరించిపోతున్న భాషల రక్షణ, సంరక్షణ పథకం (ఎస్‌పిపిఇఎల్‌)ను ప్రారంభించింది. అంతరించి పోతున్న, భవిష్యత్తులో అంతరించి పోయే ప్రమాదం ఉన్న భాషలను డాక్యుమెంట్‌ చేయడం దీని లక్ష్యం.అంతరించిపోతున్న భాష లను డాక్యుమెంట్‌ చేయడానికి అలాంటిదే ఒక ప్రోగ్రామ్‌ను సిక్కిం యూనివర్సిటీలోని అంత రించిపోతున్న భాషల కేంద్రం తీసుకుంది. ఈ కేంద్రాన్ని 2016లో స్థాపించారు.
-జిఎన్‌వి సతీష్‌

గృహ హింస బాధితులకు రక్షణ నిచ్చే చట్టాలు

మన దేశంలో స్త్రీల పైన హింస రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా.. న్యాయ వ్యవస్థ బాధితులకు అండగా నిలబడుతున్నా.. హింసకు గురయ్యే వారి సంఖ్య మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. చాలామందికి తమకు చట్టం సహాయం చేస్తుందన్న విషయం కూడా తెలీదు. అందుకే దాన్ని భరిస్తూ ఉండిపోతారు. ఇలాంటి వారిలో గృహ హింస బాధితులు ఎక్కువ మంది ఉంటారు. కొందరు కుటుంబ గౌరవం కోసం, మరికొందరు బయటకు వస్తే తమ పిల్లల పరిస్థితి ఏంటి అని ఇలా రకరకాల కారణాలతో వారు గృహ హింస ను భరిస్తుంటారు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. హింసను భరించిన కొద్దీ అది పెరుగుతూ పోతుంది. ఒక రోజు మన జీవితాన్నే నాశనం చేస్తుంది. అందుకే మొదటిసారి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే చట్టాల సాయంతో మీ కుటుంబ సభ్యులను మార్చుకునే ప్రయత్నం చేయాలి. గృహ హింస బాధితులకు చట్టం ఎలాంటి సహకారం అందిస్తుందో తెలుసుకుందాం..!- (రుచిరా గోస్వామి)
మహిళలకు వ్యతిరేకంగా అన్ని రూపా ల్లో జరుగుతున్న హింసను నిర్మూలించడానికి ఏర్పడిన అంతర్జాతీయ దినోత్సవానికి (నవంబర్‌, 25) కొన్ని రోజుల ముందు ఒక యువతిని తన జీవిత భాగస్వామి అనాగరికంగా హత్య చేసి, అవయవ విహీనురాలిని చేశాడు. ఈ సంఘటన, ‘ఆప్తుడైన భాగస్వామి హింస’వైపు దృష్టిని మర ల్చింది.‘ప్రొటెక్షన్‌ ఆఫ్‌ విమన్‌ ఫ్రమ్‌ డొమెస్టిక్‌ వయోలెన్స్‌ యాక్ట్‌ 2005’ (పీడబ్ల్యూడీవీఏ)చట్టం వర్తించే గృహ హింసగా కూడా దీనిని గుర్తించారు. ఆమె అతడ్ని ఎందుకు ఎంపిక చేసుకుంది? అతడ్ని ఎందుకు వదిలేయలేదు?లాంటి అనేకరకాల ప్రశ్న లు తలెత్తుతున్నాయి.భారతీయ చట్టాల నిబంధనల ప్రకారం గృహహింస శిక్షార్హమైననేరం.ఇది మానవ హక్కుల ఉల్లంఘన కూడా. అయిన ప్పటికీ,18-49 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న 32శాతం మంది వివాహిత మహిళలకు వ్యతిరేకంగా హింస కొనసాగుతున్న సమాజంలో మనం బతుకుతున్నా మని ఇటీవల జరిగిన ‘నేషనల్‌ ఫ్యామిలీహెల్త్‌ సర్వే-5’ నివేదిక తెలియజేస్తుంది. ఈ మహిళలు, వారి భర్తలు పాల్పడుతున్న భావోద్వేగపూరితమైన, భౌతిక,లైంగిక హింసలకు గురవుతున్నారు.ఈ గృహ హింసలను అనుభవిస్తున్న వారిలో పట్టణ ప్రాంత మహిళలకంటే గ్రామీణ ప్రాంత మహిళలే ఎక్కువ గా ఉన్నారు.ఈసర్వే ఇతర కుటుంబ సభ్యులు పాల్ప డే హింసపైదృష్టిని కేంద్రీకరించడంలేదు. పదిహేడు సంవత్సరాల క్రితం,ప్రగతిశీల చట్టమైన పీడబ్ల్యూ డీవీఏను ఆమోదించారు.భర్తల నుండి మాత్రమేకాక ఇతర కుటుంబ సభ్యుల హింసనుంచి కూడా మహి ళలకు మద్దతుగా,రక్షణగాఉండే విధంగా చర్యలు తీసుకుంటామని ఈచట్టం హామీ ఇచ్చిం ది. కానీ,ఈ చట్టం కాగితాలపై ఉన్నప్పటికీ, ఇప్పటికీ మహిళలు ఆచట్టం అమలుకు చేరువలో ఉండలేక పోతు న్నారు. దాని హామీలు,నిబంధనలు అసమానం గా అమలవుతూ,భారతీయ మహిళలకు అందు బాటులో లేకుండా పోతున్నాయి.అత్యంత నిరుత్సా హమైన వాస్తవమేమంటే,మూడిరట ఒకవంతు మహిళలు గృహహింస కారణంగా ఇబ్బంది పడు తున్నప్పటికీ, గృహహింసను అనుభవిస్తున్న వారిలో కేవలం 14శాతం మంది మాత్రమే సహాయాన్ని కోరుతున్నారు.ఈసంఖ్య గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా తక్కువగా ఉంటుందని నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వేనివేదిక తెలుపుతుంది.
గృహ హింస అంటే..
ఒక వ్యక్తి శారీరక, మానసిక ఆరోగ్యానికి హాని కలిగించే లేదా గాయపరిచే ప్రమాదానికి గురి చేసే ఎలాంటి చర్య అయినా గృహహింస కిందకే వస్తుంది. అవతలి వ్యక్తి మిమ్మల్ని శారీరక, మానసిక,ఆర్థిక, లైంగిక దాడుల్లో దేనికి గురి చేసినా అది గృహహింస కిందకే వస్తుంది.ఇలాంటి హింసకు గురవుతున్న వారు ముఖ్యంగా మహిళలకు చట్టం చాలా రక్షణ కల్పిస్తుంది.
కేసు ఎలా ఫైల్‌ చేయాలంటే..
గృహహింసకి గురైన మహిళ స్థానిక మహిళా కోర్టు,మహిళా పోలీస్‌ స్టేషన్‌ లేదా ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ వద్ద తనపై జరిగిన హింస గురించి వివరిస్తూ కేసుఫైల్‌ చేయవచ్చు.నిందితులపై కేవలం క్రిమినల్‌ కేసులు మాత్రమే కాదు..సివిల్‌ కేసు పెట్టే అవకాశం కూడా ఉంటుంది.
ఇన్సిడెంట్‌ రిపోర్ట్‌ అంటే..
గృహ హింస బాధితులు కేసు ఫైల్‌ చేయగానే ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ ఎంక్వైరీ ప్రారంభిస్తారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి దగ్గర సమాచారం సేకరించి..ఆ తర్వాత జరిగిన సంఘ టనల గురించి సాక్షులను ప్రశ్నించి రిపోర్ట్‌ తయారు చేస్తారు. ఈ రిపోర్ట్‌ నే ఇన్సిడెంట్‌ రిపోర్ట్‌ అంటారు.
గృహ హింస బాధితులకు సాయం చేసే చట్టాలు..
గృహ హింస బారిన పడిన మహిళలకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం 2005లో గృహ హింస నిరోధక చట్టం తీసుకొచ్చింది.అంతేకాదు.. సెక్షన్‌ 498ఎ,406,323,354 ల ప్రకారం గృహ హింస కేసులో నిందితులకు శిక్ష పడుతుంది.ఈ నిందితుల్లో ఆడవారు ఉంటే వారిపై కూడా ఈ చట్టం ద్వారా శిక్ష అమలు చేసే వీలుంటుంది.
ఎవరికి రక్షణ ఉంటుంది?
కేవలం వివాహం అయిన మహిళలకే కాకుండా లివ్‌ ఇన్‌ రిలేషన్‌ షిప్‌లో ఉండేవారికి కూడా గృహహింసచట్టం రక్షణకల్పిస్తోంది. పెళ్ల యిన లేదా లివ్‌ ఇన్‌ రిలేషన్‌ షిప్‌లో ఉన్న స్త్రీని ఇల్లు వదిలి వెళ్లిపోవాలని హింసించడం కూడా గృహహింస కిందకే వస్తుంది.ఈచట్టం కింద ఎల్‌ జీబీటీ లకు కూడా రక్షణ ఉంటుంది.
ఎలాంటి సాక్ష్యాలు అవసరం..
గృహ హింస జరిగిందని నిర్ధారించేందుకు దాన్ని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి వాంగ్మూలం,డాక్యు మెం టరీ ప్రూఫ్‌,ఆడియో,వీడియోప్రూఫ్‌వంటివి సాక్ష్యా లుగా పనికొస్తాయి.
మగవారు గృహ హింసకి గురైతే ఏం చేయాలి?
మగవారిపై కూడా గృహ హింస జర గొచ్చు.ఇలాంటప్పుడు వారు వెంటనే ఈ విషయాన్ని స్థానిక పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేసి %ఖీIR% కాపీ తీసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం మెడికల్‌ డాక్యుమెంట్స్‌ వంటి ఆధారాలు కూడా సమర్పిం చాల్సి ఉంటుంది.
498ఎకి గృహహింస చట్టానికి మధ్య తేడా ఏంటి?
గృహహింసచట్టం అనేది కేవలం వరక ట్నం కోసమే కాకుండా ఎలాంటి సందర్భాల్లో అయినా..ఎందుకోసమైన ఒకవ్యక్తి తన కుటుంబం లోని మరోవ్యక్తి ముఖ్యంగా స్త్రీలను హింసిస్తే వారికి వర్తించే చట్టం.మానసికంగా,శారీరకంగా,ఆర్థికం గా, సామాజికంగా ఎలా హింసించినా అది గృహ హింస కిందకే వస్తుంది.ఒక స్త్రీవరకట్నం తీసుకురా వాలని డిమాండ్‌ చేస్తూ అది తీసుకురానప్పుడు హింసిస్తే దానికి 498ఎ కింద కేసు నమోదు చేస్తారు.
గృహహింస వెంటాడుతూనే వుంది…
పరిస్థితులు మారతాయి. ఆ పరిస్థితులు తమ భర్తల ప్రవర్తనను మార్చుతాయని మహిళలు ఆశించారు.ఇతరులకు, ముఖ్యంగా తమ కుటుం బాలకు ‘భారం’ కావడానికి మహిళలు ఇష్టపడలేదు. ‘మా అమ్మకుచాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆమె కంటూ స్వంతజీవితం ఉంటుంది.అందువల్ల ఆమె ఇబ్బందులకు నా ఇబ్బందులు తోడవడం నాకిష్టం లేదు’వంటి సమాధానాలు వారి నోటెంట వచ్చాయి. తామెదుర్కొన్న హింసనునిర్దిష్టంగా చెప్పడం ద్వారా, వారి కుటుంబాలకు ఒక ‘సమస్య’గా లేదా ‘మానసిక వ్యధ’కు కారణంగా మారకూడదని…వారి కుటుం బాలకు తలవంపులు, అగౌరవం తేకూడదని… గృహహింస నుండి బయటపడిన మహిళలు విద్యా స్థాయి,కులం,వర్గంతోనిమిత్తం లేకుండా భావిస్తు న్నారు.భారతీయ చట్టాలు, నిబంధనల ప్రకారం గృహహింస శిక్షార్హమైన నేరం.ఇది మానవ హక్కుల ఉల్లంఘన కూడా.అయినప్పటికీ,18-49 సంవత్స రాల మధ్య వయసులో ఉన్న 32శాతం మంది వివాహిత మహిళలపై హింస కొనసాగుతున్న సమాజంలో మనం బతుకుతున్నామని ఇటీవల జరిగిన‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5’ నివేదిక తెలియజేస్తుంది.
సహాయం కోరడానికి సంబంధించి ….
గృహహింసకు గురైన మహిళలు సహా యం కోరే విషయంలో రెండు రకాలుగా స్పందిస్తు న్నారు. మొదటిది,హింస జరిగిన ఆరు నెలల్లోపు చెప్పేవారు. రెండవది హింస జరిగిన ఐదు సంవ త్సరాలు లేదా ఆతర్వాత చెప్పేవారు.మొదటి సమూహానికి చెందిన మహిళలు సహాయం కోసం తమ తల్లిదండ్రుల దగ్గరకెటళ్ళారు. భర్తతో సర్దుకుని పోవడం ద్వారా కుటుంబాన్ని/సంసారాన్ని కాపాడా ల్సిందిగా తమ కుమార్తెలను ఒత్తిడి చేసిన కేసులు అనేకం.‘కుటుంబసంతోషం’కంటే కూతురు క్షేమానికే ప్రాధాన్యత ఇచ్చిన కేసులు తక్కువగా నమోద య్యాయి. అలాంటి కేసుల్లో మధ్యవర్తిత్వం వహించే చర్యలు చేపట్టడం లేదా తెగతెంపులు చేసుకోవడం జరిగాయి.సమస్య పరిష్కారానికి పోలీసులు, లాయ ర్లను కలవడంలాంటివి చాలాఅరుదుగా జరిగాయి.
గృహహింసకుగురై దాని నుండి బయట పడిన చాలా కాలానికి సహాయంకోరే వారి విష యానికి వస్తే…హింసకు సాక్షులుగా ఉన్న బంధు వులు, ఇరుగు పొరుగు వారి (పరిస్థితులను మార్చ డంలో) ప్రాధాన్యత చాలానే వుంది. బాధితురాలి పిల్లల సంరక్షణ, భర్త వివాహేతర సంబంధాన్ని గుర్తించడం,హింస తీవ్ర స్థాయిలో వున్నప్పుడు వైద్య సహాయం అందించడంలో వారి పాత్ర చాలా కీలకంగా వుంది. స్తి యాజమాన్యానికి సంబంధిం చిన పితృస్వామిక నిబంధనలు, ఆర్థిక అభద్రత కారణంగా తెగతెంపులు చేసుకునే విషయమై ఎదురైన మానసిక సంఘర్షణల కారణంగానే… బాధితురాలు సహాయం కోరడానికి అంతకాలం ఎదురుచూసి ఉంటుంది. స్త్రీపురుష అసమానతల విషయంలో సామాజిక నియమాలు ఎంత లోతుగా పాతుకుపోయాయంటే భార్యను కొట్టే విషయాన్ని పురుషుల కంటే మహిళలే ఎక్కువగా సమర్థిస్తారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 నివేదిక తెలియ జేస్తున్నది.‘మామీద పెట్టేషరతులు ఎలా వుంటా యంటే… మేము ఎలాంటి బాధను గురించైనా ఫిర్యాదు చెయ్యలేనంత కష్టంగా ఉంటాయ’ని ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మహిళ చెప్పింది. బాధిత మహిళలు తాము ఎదుర్కొన్న గృహహింస గురించి మిత్రులు, బంధువులకు చెప్పుకున్న తర్వాత ‘ఉపశమనం పొందినట్లు,భారమంతా తగ్గినట్లు, పరిస్థి తులు మారిపోతాయానే ఒకకొత్త ఆశకలిగిన భావన పొందినట్లు చెప్పారు. మహిళలుగృహహింస గురించి ఇతరులతో పంచుకోవాలని అనుకోవడమే వారు తీసుకునే అత్యంత ముఖ్యమైన నిర్ణయం. సాయం,మద్దతు పొందడంలో వారు అనిశ్చితి, భయం,నిరాశ,నిస్పృహలకు లోనుకావాల్సి వచ్చింది. భారతదేశంలో ఉన్న వాస్తవపరిస్థితి ఏమంటే అనేక మంది మహిళలు తమ గోడును వెళ్ళబోసుకోడానికి ఎటువంటి వేదిక లేదు. కేవలం ధనవంతులైన కొందరు మహిళలు, స్వచ్ఛంద సంస్థలతో సంబంధా లు కలిగి ఉన్న కొద్దిమంది మహిళలు మాత్రమే కోర్టుల ద్వారా న్యాయం కోసం ప్రయత్నం చేశారు. కొత్త నైపుణ్యాలను, జీవనాధార అవకాశాలను సాధించడం ద్వారా ఆర్థిక స్వావలంబన పొంద డంతో గృహహింస బాధితు లు కొంతవరకు తమ పరిస్థితులను మార్చుకోగలుగుతారు. పోలీసుల పాత్ర
తాము ఎదుర్కొన్న గృహహింస గురిం చి పోలీసులకు చెప్పినప్పుడు వారు స్పందించిన తీరు పట్ల మహిళలు పెదవివిరిచారు.ఏదో కొద్ది మంది అనుకూలమైన ఫలితాలు పొందినప్పటికీ…’ హింసకు పరిష్కారం చూపడం కంటే కూడా అసలు సమస్యలో పోలీసుల పాత్ర ఎక్కువైంద’ని మేము ఇంటర్వ్యూ చేసిన మెజారిటీ మహిళలు చెప్పారు. పోలీసులే బాధిత మహిళలను హింసకు పాల్పడిన వారితో రాజీ చేశారు. వారిని తిరిగి అదే ఇళ్లకు పంపించారు. అధికారికంగా ఫిర్యాదు నమోదు చెయ్యకుండా లేదా పిడబ్ల్యుడివిఎ మార్గదర్శకాల ప్రకారం సంరక్షణ అధికారులకు అప్పజెప్పకుండా హింసకు పాల్పడిన వారిపై హింసను ప్రయోగించి నట్లు మేము అనేక రాష్ట్రాల్లో విన్నాం.సిబ్బంది కొరత కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పితృస్వా మిక భావజాల ప్రయోజనాలనే ప్రభుత్వం నెరవేరు స్తుందన్న విషయం మహిళలకు తెలుసు. చట్టాలు వున్నప్పటికీ…బాధితలను తిరిగి గృహహింసకు కారణమైన కుటుంబాలకే అప్పజెప్తున్నారు. ఇది నేడు మహిళలపై జరుగుతున్న అతి పెద్ద నేరం.
భారత్‌లో 29శాతం మహిళలకు తప్పని హింస
భారత్‌లోస్త్రీలపై హింస రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఎన్ని చట్టాలు వస్తున్నా వారిపై దాడులు మాత్రం తగ్గడం లేదు. చాలా మందికి తమకు చట్టం సహాయం చేస్తుందని తెలియక ఆ హింసను భరిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మహిళలపై జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఓ నివేదికను వెల్లడిరచింది. ఆ నివేదిక ప్రకారం, భారతదేశంలో 29శాతం మహిళలు (18-49 ఏళ్ల మధ్య) గృహ హింసను ఎదుర్కొంటున్నారు. దీని ప్రకారం కర్ణాటకలో 44.4శాతం,బీహార్‌లో 40%, మణిపూర్‌లో39.6శాతం,తమిళనాడులో 38 శాతం,తెలంగాణలో36.9శాతంమంది మహిళలు గృహహింసను ఎదుర్కొంటున్నట్లు నివే దించింది.అయితే లక్షద్వీప్‌(1.3శాతం),గోవా (8.3శాతం), కేరళ(9.9శాతం),సిక్కిం (12శాతం) , మేఘాలయ (16శాతం) మహిళలపై అతితక్కువ గృహ హింస ను ఎదుర్కొంటున్నట్లు తేలింది.
పురుషులూ వేధింపులకు గురవుతారు…
గృహహింసకు సంబంధించిన కేసులో కొన్ని నెలల క్రితం మద్రాస్‌ హైకోర్టు పురుషులు కూడా గృహహింసకు గురవుతారా అనేప్రశ్న లేవ నెత్తింది. ఇటీవల,దీనికి ఒక ఉదాహరణ కూడా కనిపించింది. హర్యానాలోని హిసార్‌కు చెందిన ఒకవ్యక్తి తనభార్యను హింసించిన కారణంగా 21 కిలోల బరువు తగ్గాడు. దీనిఆధారంగా, అతను హైకోర్టు నుండి విడాకుల ఆమోదం పొందాడు. ఇలాంటి కేసులుఇటీవల పెరుగుతున్నాయి. పురు షులపై హింస జరుగుతుందని చాలామంది అను కోవడం కూడా నమ్మశక్యం కాదు.కారణం,పురు షులుఎప్పుడూ బలంగా,శక్తివంతంగా భావి స్తారు. కానీ,కుటుంబ వివాదాలను పరిష్కరించ డానికి అన్ని కౌన్సెలింగ్‌ కేంద్రాల గణాంకాలు పురుషులు కూడా మహిళలపై వేధింపులకు గురవుతున్నారన డానికి నిదర్శనం. గృహ హింసకు సంబంధించిన ఫిర్యాదులలో40శాతం పురుషుల నుండి వచ్చినవే. విడాకులు మాత్రమే మహిళలకు ఏకైక ఎంపిక అని కూడా తెరపైకి వచ్చింది. అయితే పురుషులు కౌన్సెలింగ్‌కి ప్రాధాన్యతనిస్తారు. అంటే, కౌన్సెలింగ్‌ ద్వారా లేదాఏవిధంగానైనా పురుషులు సంబం ధాన్ని కొనసాగించాలనుకుంటున్నారు.
గృహహింస చట్టం నుండి రక్షణ పురుషులకు ఉండదా?
నేషనల్‌ క్రైమ్‌రికార్డ్స్‌ బ్యూరో (చీజRదీ) నివేదిక ప్రకారం, మహిళల కంటే ఎక్కువ మంది పురుషులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణాలలో ఒకటి కుటుంబంలో కొనసాగు తున్న విభేదాలు, సంబంధాలవల్ల తలెత్తే డిప్రెషన్‌ కూడా. అదే సమయంలో, 2019 సంవత్సరంలో ‘ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ కమ్యూనిటీ మెడిసిన్‌’ పరిశోధన ప్రకారం, హర్యానా గ్రామీణ ప్రాంతాల్లో 21-49 సంవత్సరాల వయస్సు గల1000 మంది వివాహిత పురుషులలో,52.4 శాతం మంది లింగ ఆధారిత హింసను అనుభవించారు. ఈగణాంకాలను చూస్తే,లింగం, కులం,మతం ఆధారంగాఎలాంటి వివక్షను రాజ్యాం గం అంగీకరించనప్పుడు, గృహహింస నుండి రక్షణ చట్టం పురు షులకు ఎందుకు రక్షణ కల్పించదు? అభివృద్ధి చెందిన దేశాలలో లింగరహిత చట్టం మహిళల వంటి గృహ హింస నుండి పురుషులను రక్షించడమే కాకుండా,పురుషులు కూడా వేధిం పులకు గురవుతున్నారని గుర్తించిచట్టపరమైన రక్షణ కల్పిం చాయి. (‘ద హిందూ’ సౌజన్యంతో) (వ్యాసకర్తలు ‘సర్వైవింగ్‌ వయొలెన్స్‌ రీసెర్చ్‌ ప్రాజెక్ట్‌’లో సభ్యులు),ఫిలిప్పా విలియమ్స్‌,స్వర్ణ రాజగోపాలన్‌ గిరిజా గాడ్బోలే, .)

మహిళల్లో పెరుగుతున్న ఎనీమియా సమస్య

ఐరన్‌లోపం ఉండడంవల్ల ఎనీమియా మొదలు ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీ స్తుంది. ఐరన్‌ తక్కువగా ఉండటంవల్ల తల నొప్పి, శ్వాస సంబంధిత సమస్యలు,అలసట మొదలైన సమస్యలు కూడా వస్తాయని తెలుస్తోంది. వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ చెప్పిన దాని ప్రకారం ఐరన్‌ లోపం 33శాతం మహిళల్లో కనబడు తుందని 40శాతం గర్భిణీలలో..42శాతం పిల్లల్లో కన బడుతోందని మనకి తెలుస్తోంది. అందుకనే నిపుణులు ఐరన్‌ ఎక్కువగా ఉండే ఆహార పదా ర్థాలు గురించి తెలియజేశారు. కనుక ఈ ఆహార పదార్థాలను రెగ్యులర్‌ డైట్‌లో తీసు కుంటే మంచిది. చాలా మంది ఐరన్‌ ఏ కదా అదే వస్తుందిలే అని టెక్‌ ఇట్‌ ఈజీగా తీసుకుం టారు. కానీ అలా చెయ్యడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఆరోగ్యం విషయం లో ఎప్పుడు కూడా లైట్‌ తీసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే సమస్య చిన్నగా ఉంటేనే సాల్వ్‌ చెయ్యడానికి కుదురుతుంది. పెద్దది అయితే దాని నుండి బయటకి రావడం నిజంగాకష్టం. ఇది ఇలా ఉంటే ఐరన్‌ లోపం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయని తెలుసుకోవాలి. ఈ సమస్యల బారిన పడకుండా ఉండాలంటే కచ్చితంగా ఐరన్‌ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలని నిపుణులు చెప్తున్నా రు. మరి ఆలస్యం ఎందుకు ఐరన్‌ వల్ల కలిగే ప్రయోజనాల గురించి, ఐరన్‌ ఎందులో ఉం టుంది అనే దాని గురించి తెలుసుకుందాం.! -జిఎన్‌వి సతీష్‌
ఆహారం కంటే ముఖ్యమైనది మంచి నీళ్లు.నీళ్ళే కదా అని పట్టించుకోవడం మానేయద్దు. నీళ్లు నిజంగా బాడీకి చాలా అవసరం.ఎక్కువగా నీళ్లు తీసుకోవాలిఅని చాలా మంది చెప్తూ ఉం టారు అయితే నిజంగా నీళ్లు అంత ముఖ్యమా అని ఆలోచిస్తున్నారా..? అవునండి మనం తీసుకునే నీళ్లు కూడా మన ఆరోగ్యాన్ని ఎఫెక్ట్‌ చేస్తాయి. సరిగ్గా నీళ్లు తీసుకుని హైడ్రేట్‌గా ఉంటే ఎనిమియా సమస్యకు దూరంగా ఉండ వచ్చు. ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌ బులెటిన్‌ రీసె ర్చర్లు చెప్పిన దాని ప్రకారం చూస్తే…మంచి నీళ్లు తీసుకోవడం వల్ల ఐరన్‌ లోపం కలగదని అంటున్నారు కాబట్టి హైడ్రేట్‌గా ఉండడం చాలా ముఖ్యం అని తెలుసుకుని..ప్రతి రోజూ ఏడు నుండి ఎనిమిది గ్లాసులు నీళ్ళు తాగండి. మీరు కనుక వట్టి మంచి నీళ్లు తాగ లేకపోతే నీటి యొక్క ఫ్లేవర్‌ని మార్చుకోవచ్చు. ఉదాహ రణకు అందులో రెండు తులసి ఆకులు వేసు కుని రుచి మార్చుకోవచ్చు లేదా పుదీనా, నిమ్మ రసం ఇలా ఏదైనా మీరు ట్రై చేయొచ్చు. కాబట్టి ఎప్పుడూ కూడా నీళ్ళని వీలైనంత ఎక్కువగా తీసుకోండి. దీంతో మీరు ఆరోగ్యంగా ఉం డొచ్చు. పైగా చాలా సమస్యలు మీకు రావు. ముఖ్యంగా ఐరన్‌ సమస్యలు కూడా ఉండవు.
ఆకుకూరలు తీసుకోండి:
చాలా మంది ఆకు కూరలు అంటే ఆమడ దూరం పారిపోతున్నారు. కానీ నిజంగా చెప్పాలంటే ఆకు కూరల్లో ఎన్నో పోషక పదార్థాలు ఉంటాయి. పోషక పదార్థాలు సమృద్ధిగా ఉండే ఆకు కూరలు తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు తరిమికొ ట్టొచ్చు. అయితే ఆకు కూరల్లో ఐరన్‌ కూడా ఉంటుంది అని గ్రహించండి. పాలకూర కాలే మొదలైన ఆకు కూరల్లో ఫోలేట్‌ సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎనిమియా సమస్య రాకుండా చూసుకుంటుంది.కాబట్టి వీలైనంత వరకు ఆకు కూరలను కూడా మీ డైట్‌ లో చేర్చండి. ఆకుకూరల తో మనం వివిధ రకాల రెసిపీస్‌ని మనం తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకు పాల కూర తో పాలక్‌ పన్నీర్‌ వంటివి ఎంతో రుచిగా చేసుకోవచ్చు. కాబట్టి మీరు కొత్త కొత్త రెసిపీలని కూడా ఆకు కూరలతో ప్రయత్నం చేసి ఏదో రూపం లో తీసుకోవడం ఉత్తమం. కాబట్టి ఇలా ప్రయత్నం చేయండి. తద్వారా ఆరోగ్యం గా ఉండొచ్చు. అకాడమీ ఆఫ్‌ న్యూట్రిషన్‌ అండ్‌ డైటటిక్స్‌ ప్రకారం సమతుల్యమైన ఆహారం తీసు కోవడం చాలా ముఖ్యం. అందులో విటమిన్‌ సి కూడా తప్పక ఉండేటట్లు చూసుకోండి. ఐరన్‌ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలతో పాటు విటమిన్‌ సి కూడా తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. ఇలా విటమిన్‌-సి ని తీసుకోవ డంవల్ల ఐరన్‌ లోపం కలగదు అని చెబుతు న్నారు. కాబట్టి విటమిన్‌ సి సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను కూడా మీరు డైట్‌లో తీసుకోండి. ఎనిమియా సమస్య లేకుండా వుండండి.
మాంసం మరియు పౌల్ట్రీ
చికెన్‌, మటన్‌ మొదలైన వాటిలో ఐరన్‌ ఎక్కువ గా ఉంటుంది. అదే విధంగా వాటిలో ఫోలేట్‌ కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎనిమియా సమస్య రాకుండా చూసుకుంటుంది. అదే విధంగా ఐరన్‌ లోపం కలగకుండా కూడా ఇది జాగ్రత్తగా చూసుకుంటుంది. కాబట్టి వీటిని కూడా తప్పకుండా డైట్‌ లో తీసుకోండి.
ఐరన్‌ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను కాల్షియంతో పాటు తీసుకోకండి
ఈ తప్పు కనుక మీరు చేస్తుంటే సరిదిద్దుకోండి. ఎందుకంటే ఐరన్‌ తో పాటు క్యాల్షియం ఉండే ఆహార పదార్థాలను కలిపి తీసుకోవడం మంచిది కాదు. కాబట్టి ఎప్పుడైనా క్యాల్షియం ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే ఐరన్‌ తీసుకో వద్దు. అదే ఐరన్‌ ఉండే ఆహార పదార్థా లను తీసుకుంటే కాల్షియం ఉండే ఆహార పదార్థాలు తీసుకోవద్దు. ఎందుకంటే ఐరన్‌ ఎక్కువ గా ఉండే ఆహారపదార్థాలను క్యాల్షి యం ఉండే ఆహార పదార్థాలతో కలిపి తీసుకో వడం వల్ల క్యాల్షియం ఐరన్‌ యొక్క అబ్సర్ప్షన్‌ని బ్లాక్‌ చేస్తుంది కాబట్టి ఈ తప్పులు చేయొద్దు. మరి నిపుణులు చెప్పిన అద్భుతమైన చిట్కాలను చూశారు కదా మరి ఈ ఆహార పదార్థాలను తప్పక తీసుకోండి ఐరన్‌ వల్ల ఎలాంటి సమస్యలు లేకుండా ఐరన్‌ ఉండే ఆహార పదార్థాలను రెగ్యులర్‌గా తీసుకోండి. తద్వారా మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉం డచ్చు. ఎనిమియా వంటి సమస్యలకి కూడా దూరంగా ఉండచ్చు.
దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో ఎనీమియా బాధితులు` ఎన్‌ఐఎన్‌అధ్యయనంలో వెల్లడి
దేశంలోని ప్రజలు తీసుకొనే ఆహారంలో పోషకాలు లోపిస్తున్నాయి. పేద, ధనిక తేడాలే కుండా కడుపు నిండేందుకు ఏదో ఒకటి తినేస్తు న్నారు. కానీ, అవి శరీరానికి తగినంత పోష కాలను అందించడం లేదు. సరైనపోషకా హారం లేక అనారోగ్య సమస్యల బారిన పడుతు న్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల్లో లోపిస్తున్న పోషకాలు వారీ జీవనశైలిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తేలింది. జాతీయ పోషకాహార అధ్యయన సంస్థ (ఎన్‌ఐఎన్‌) దేశ వ్యాప్తంగా ఉన్న ఆహారపు అలవాట్లు, పోషకా లపై పరిశోధించి దేశంలోని ఆయా ప్రాంతాల వారీగా సమతుల ఆహార విలువను గుర్తిం చింది. ఆహారంలో ఎక్కువగా కార్బోహైడ్రేట్లు ఉండగా, మైక్రో న్యూట్రియన్లు లోపించాయని సర్వేలో వెల్లడైంది.
8 రాష్ట్రాల్లో ఐరన్‌ లోపం
ఆహారంలో పోషకాలు లోపిస్తే వచ్చే రుగ్మత లపై అధ్యయనం చేయగా ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.18ఏండ్లు నిండిన పురుషులకు సగటున ప్రతిరోజు 8.7మిల్లీగ్రాముల ఐరన్‌ అవసరం ఉంటుంది.19-50ఏండ్ల లోపు మహిళలకు 14.8 మిల్లీగ్రాముల ఐరన్‌ను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, దేశంలోని 8 రాష్ట్రాల్లో ఐరన్‌తో కూడిన ఆహారం ఉండటం లేదని తేలింది. దీంతో ఎనీమియా(రక్తహీనత) బారిన పడుతుండగా హార్మోనల్‌ సమస్యలు తలెత్తుతున్నట్టు వెల్లడైంది. అస్సాంలో 70శాతం,ఒడిశాలో 55శాతం, మధ్యప్రదేశ్‌లో 45.4,గుజరాత్‌లో 33.8, తమి ళనాడులో 23.9,పశ్చిమ బెంగాల్‌లో 20.2, తెలంగాణలో 16.8, మేఘాలయలో 12.1 శాతం మంది ఎనీమియా బారినపడ్డారని నివే దికలో పేర్కొన్నది. ఇందులో తెలంగాణ ప్రాం తంలో ఎనీమియా సోకిన వారి కంటే బీ12 లోపంతో బాధపడుతున్నవారి సంఖ్య 24.6 శాతంగా అధికంగా ఉన్నదని గుర్తించారు.
కార్బోహైడ్రేట్లే ఎక్కువ..
జాతీయ పోషకాహార సంస్థ 2020-21లో దేశంలోని ప్రజలు తీసుకొనే ఆహారంలో ఉన్న పోషకాలను నివేదించింది. ఈ రిపోర్టు ప్రకారం పట్టణ ప్రాంతవాసులు 1,943 కిలో క్యాలరీ లను ప్రతిరోజు తీసుకుంటుండగా, ఇందులో 289 గ్రాముల కార్బోహైడ్రేట్లు, కొవ్వులు 51.6 గ్రాములు, ప్రోటీన్లు 55.4 గ్రాములను ఆహారం లో తీసుకొంటున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 2,081 కిలోక్యాలరీల ఆహారాన్ని తీసుకుంటే ఇందులో కార్బోహైడ్రేట్లు 368గ్రాములు, కొవ్వు లు 36 గ్రాములు, ప్రోటీన్లు 69 గ్రాములుగా ఉన్నట్లుగా తేలింది.
ఈ ఆహారాలు తీసుకోండి చాలు..
విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు మన శరీరానికి చాలా అవసరం. ఈ పోషకాలలో ముఖ్యంగా ఐరన్‌ఉండాలి. వివిధ వ్యాధులతో పోరాడటా నికి మన శరీరంలో ఐరన్‌ చాలా ముఖ్యం. ఐరన్‌ లోపం వల్ల హిమోగ్లోబిన్‌ రక్తహీనత వంటి వ్యాధికి దారితీస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని కూడా ప్రభావితం చేస్తుంది.వాస్తవానికి, శరీరంలో ఇనుము లోపం ఉన్నప్పుడు, శరీరం లో ఎర్రరక్తకణాలు తగ్గి అనేక ఆరోగ్య సమస్య లు ఎదురవుతాయి. అటువంటి పరిస్థితిని నివారించడానికి మీరు మీ ఆహారంలో ఐరన్‌ అధికంగా ఉన్న ఆహారాలను చేర్చాలి. పాలకూ రవల్ల ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజ నాలు లభిస్తాయి. పాలకూరలో ఇను ముతో పాటు అనేక విటమిన్లు, ఖనిజాలు పుష్క లంగా ఉంటాయి. ఇది క్యాన్సర్‌ వ్యతిరేక, యాంటీ ఓవర్సిటీ లక్షణాలతో రక్తంలో చక్కెర తగ్గించే లక్షణాలను కలిగిఉంది. పాలకూరలో కనిపించే లక్షణాల కారణంగానే చాలా మంది వైద్యులు ఆహారంలో పాలకూరలో చేర్చాలని సిఫారసు చేస్తారు.అదేవిధంగా చిక్కుళ్లు ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటాయి. వీటి వల్ల గుండె జబ్బులు, హైపర్‌ టెన్షన్‌, టైప్‌ 2 మధుమేహం వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమా దాన్ని కొంతవరకు తగ్గుతాయి. చిక్కుల్లో ఫైబర్‌, ప్రోటీన్‌,కార్బోహైడ్రేట్లు, విట మిన్‌ బి,ఐరన్‌, కాపర్‌,మెగ్నీషియం, మాం గనీస్‌, జింక్‌, ఫాస్ఫ రస్‌ వంటి పోషకాలు ఉంటాయి.
ఎండు ద్రాక్ష
మీశరీరంలో ఐరన్‌ లోపం ఉంటే మీరు ఎండు ద్రాక్ష ఆహారంలో చేర్చుకోవాలి. ఎండుద్రాక్షలో తగినంత మొత్తంలో ఇనుము లభిస్తుంది. రక్తం ఏర్పడటానికి విటమిన్‌ బి కాంప్లెక్స్‌ అవసరం. ఎండుద్రాక్షలో విటమిన్‌ బి కాంప్లెక్స్‌ తగినంత పరిమాణంలో కనిపిస్తుంది. అటువంటి పరిస్థి తిలో రక్తహీనత మరియు ఐరన్‌ లోపం ఉన్న వారు ఎండుద్రాక్ష తీసుకోవడం చాలా ప్రయో జనకరంగా ఉంటుంది.ముఖ్యంగాగుడ్లలో కుడా పోషకాలు సమృద్ధిగా ఉంటాయి దాదాపు అన్ని విటమిన్లు మరియు ఖనిజాలు ఉంటాయి. గుడ్ల లో విటమిన్‌ డి,ఐరన్‌ కూడాచాలా ఉంటుంది. గుడ్లలో ప్రోటీన్‌ మరియు కాల్షియం కూడా సమృద్ధిగా ఉంటాయి. అధికంగా గ్రామీణ ప్రాంత రాష్ట్ర సగటు కంటే ఎక్కువగా 60 నుంచి 69శాతం మంది మహిళల్లో రక్త హీనత సమస్య ఉంది. సాధారణ మహిళల్లో ఈ స్థాయి లో రక్త హీనత సమస్య ఉండడంపై డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గర్భిణుల్లో ఒక డెసీలీటర్‌ రక్తంలో 11గ్రాముల కంటే తక్కువ గా హిమో గ్లోబిన్‌ ఉంటే రక్తహీనతగా భావి స్తారు. సాధారణ మహిళల్లో 12 గ్రాముల కంటే తక్కువగా హిమోగ్లోబిన్‌ ఉంటే, రక్తహీన తగా భావిస్తారు. యువతుల్లో రక్త హీనత సమ స్య ఉంటే, వారు గర్భం దాల్చినప్పుడు పరిస్థితి మరింత సీరియస్‌ అవుతుందని, గర్భ స్రావం వంటి దుష్పరి ణామాలు ఎదుర్కోవలసి వస్తుం దని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
న్యూట్రిషన్‌ కిట్లు
రక్త హీనత నుంచి పిల్లలు, గర్భిణులను రక్షిం చేందుకు అంగన్‌వాడీల ద్వారా పోషకాహార పంపిణీ చేస్తున్నప్పటికీ పెద్దగా ఫలితం కనిపిం చడం లేదు. 2015-16 నాటి నేషనల్‌ ఫ్యామి లీ హెల్త్‌ సర్వే ప్రకారం రాష్ట్రంలోని మహిళ్లల్లో (ప్రెగ్నెంట్‌, నాన్‌ ప్రెగ్నెంట్‌ కలిపి)48.2 శాతం మందిలో రక్త హీనత సమస్య ఉంటే, 2020 నాటికి 53.2 శాతానికి పెరిగింది.దీన్ని బట్టి పోషకాహార పంపిణీ ఆశించి ఫలితాలను ఇవ్వ డం లేదన్న విషయం స్పష్టమవుతోంది.ఈ నేప థ్యంలోనే ఇప్పుడు అందజేస్తున్న పోషకాహార పథకాన్ని కొనసాగిస్తూనే, ఏటా 1.5లక్షల మం ది గర్భిణు లకు న్యూట్రిషన్‌ కిట్లను అంద జేయా లని ప్రభుత్వం నిర్ణయించింది. రక్తహీనత సమ స్య ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఈ కిట్లు పంపిణీ చేయను న్నారు. నేషనల్‌ ఇనిస్టిట్యూల్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ సైంటిస్టులు తయారు చేసిన ఈ కిట్‌లో హిమోగ్లోబిన్‌ శాతం మెరుగయ్యేందుకు అవసరమైన ఆహార పదార్థాలు ఉంటాయని హెల్త్‌ ఆఫీసర్లు చెప్తున్నారు.

విశాఖలో అడ్డగోలుగా భూ ఆక్రమణ

గతంలో తెలుగుదేశం ప్రభుత్వం వున్నప్పుడే భూమి ఆక్రమణలకు గురైంది. ల్యాండ్‌ ట్యాంపరింగ్‌ అయింది. ఆ సందర్భంగానే సిట్‌ను వేసి దర్యాప్తు చేశారు. మరలా వైఎస్‌ఆర్‌సిపి అధికారంలోకి రాగానే మరో సిట్‌ వేసి దర్యాప్తు చేశారు. ఈ రెండు సిట్‌ ల నివేదికలను నేటికీ ఎందుకు బహిర్గతం చేయడంలేదు? నాడు చంద్రబాబు, నేడు జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వాలు భూ కబ్జాదారులను కాపాడే పనిలో నిమగమ య్యాయనేది జగమెరిగిన సత్యం. ఈ భూముల కుంభకోణంలో అధికార, ప్రతిపక్ష పార్టీ పెద్దలం దరూ భాగస్వాములుగా ఉన్నారు కాబట్టే నివేదికలు బయటకు రానివ్వకుండా పరస్పరం సహకరించు కుంటున్నారు.
పరిపాలనా రాజధాని ప్రకటనకు ముందు,తరువాత విశాఖలో భూకబ్జాదారుల ఆగ డాలు విపరీతంగా పెరిగాయి. ఇటీవల కాలంలో భూకబ్జాలలో రాజకీయ నాయకులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల బంధం మరింత పెనవేసుకుంది. అది వైసిపి లేదా టిడిపి ఏపార్టీ అధికారంలో వున్నా భూ దోపిడీ యథేచ్ఛగా సాగిపోతోంది. బిల్డర్లు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు రాజకీయ నాయకుల అవతారం ఎత్తి తమ వ్యాపారాలను మూడు పువ్వులు,ఆరు కాయలుగా అభివృద్ధి చేసుకుం టున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా భూ కుంభకోణా లకు నిలయంగా మారింది. రాజకీయ నాయకులు ప్రజల ఆస్తులను కొల్లగొడుతూ తమ ఆస్తులు, బంధువుల ఆస్తులు పెంచుకొనే పనిలో నిమగమై వున్నారు. తీగ లాగితే డొంక కదిలినట్లు ఉమ్మడి విశాఖలో ఒక్కొక్కటిగా భూ కుంభకోణాలు బయట కొస్తున్నాయి. చివరకు భూ కుంభకోణాలు పత్రికల్లో, ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తలు చూసి లోకా యుక్త సుమోటోగా తీసుకుందంటేనే భూ కబ్జాలు ఏ స్థాయిలో జరిగాయో మనం అర్ధం చేసుకోవచ్చు. కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూము లను కాపాడాల్సిన అధికార పార్టీ పెద్దలే కబ్జాలు చేస్తున్నారు. ప్రభుత్వరంగ కేంద్రంగా,ఆర్థిక రాజ ధానిగా ఉన్న విశాఖలో భూ కబ్జాదారులు స్వాహా చేసిన భూముల వివరాలు క్లుప్తంగా పరిశీలిద్దాం.
రుషికొండ విధ్వంసం
విశాఖలో రుషికొండ పర్యాటకులకు అత్యంత ఆకర్షణీయమైన ప్రాంతం. గతంలో ఈ కొండ చుట్టూ టూరిజం డిపార్టుమెంట్‌ ఆధ్వర్యం లో అనేక రిసార్టులు నడిచాయి. పచ్చని ప్రకృతి నిలయాలుగా ఉన్న ఈ రిసార్టులు దేశ, విదేశాల నుంచి వచ్చిన పర్యాటకులకు ఎంతో ఆహ్లాదాన్ని అందించేవి. నేడు ఈపచ్చని కొండలను తవ్వి పర్యా వరణ విధ్వంసానికి కారకులయ్యారు. ఈ కొండల విధ్వంసంపై హైకోర్టు అనేక దఫాలు హెచ్చరించి నా రాష్ట్ర ప్రభుత్వం, భూకబ్జాదారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దీనిని పరిశీలించ డానికి వచ్చిన హైకోర్టు ప్రముఖ న్యాయవాది కె.ఎస్‌.మూర్తిపై అక్రమ కేసులు బనాయించారు. కొండల విధ్వంసం కొనసాగుతూనే వుంది. అదే రుషికొండ స్వర్ణభారతి నగర్‌ సర్వే నెంబర్‌ 17/1,2,5లో ఆర్థికంగా వెనుకబడిన ఈడబ్ల్యుఎస్‌ స్కీం కింద400 మందికి 60గజాల చొప్పున లేఅవుట్లు వేసి రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. వీటితో పాటు పార్కులు,రోడ్లు తదితర మౌలిక సదుపాయా లకు కేటాయించిన భూమి సుమారు 1.5 ఎకరాలు కబ్జాకు గురైంది.
దసపల్లా భూములు ప్రభుత్వానివి కావట !
దసపల్లా భూములు ప్రభుత్వ భూములు కావని స్వయానా ఎం.పి విజయసాయిరెడ్డి చెబుతు న్నారు. అత్యంత ఖరీదైన ఈ 15ఎకరాల భూముల విలువ సుమారు రూ.2000కోట్లు.దసపల్లా భూ ముల యజమానులుగా చెప్పుకుంటున్న 64 మంది ఒకే మాటపై వచ్చి తమకు 29శాతం వాటా, బిల్డర్‌కు 71శాతం అని అంగీకరించారు. దసపల్లా భూములు సీలింగ్‌ భూములు. సీలింగ్‌ భూము లంటేనే ప్రభుత్వ భూములు. ప్రభుత్వ భూములు కానప్పుడు దశాబ్దాలుగా ప్రభుత్వం ఎందుకు కోర్టులు చుట్టూ తిరిగింది?ఆ భూములకు 22(ఎ)గా ఎందుకు ప్రకటన చేసింది? సుప్రీం కోర్టు తీర్పు ఆ భూములను భూ యజమానులకు కట్టబెట్టాలని చెప్పిందా? తీర్పు రాకముందే దసపల్లా భూములకు సంబంధించి 22(ఎ)ను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఎత్తివేసింది? దశాబ్దాలుగా ఈ భూములు కొనుగోలు చేసిన యాజమాన్యాలు ఏదోరకంగా సమస్య పరిష్కారం అయితే మంచిదని భావించిన తరుణం లో ఎష్యూర్‌ ఎస్టేట్స్‌ డెవలపర్స్‌ ఎల్‌ఎల్‌సి సంస్థతో ఒప్పందం ఎందుకు కుదుర్చుకున్నారు? 22 (ఎ) భూముల సమస్య ఒక్కవిశాఖలోనే కాదు, రాష్ట్రంలో అనేకప్రాంతాల్లో వుంది. ఆ ప్రాంతాల్లో 22 (ఎ) ఎత్తివేయకుండా దసపల్లా భూముల విషయంలోనే ఎందుకు ఎత్తివేసి ఇంతప్రేమ చూపించారు? ఇతర భూములలో వున్న వారు ప్రజలు కాదా? దసపల్లా భూముల వ్యవహారం ఇలా వుంటే…విశాఖ ఎం.పి కూర్మన్నపాలెంలో నిర్మిస్తున్న భారీ వెంచరు కథ మరోలా వుంది. భూ యజమానులకు కేవలం 1 శాతం మాత్రమే వాటా ఇచ్చి తమ డెవలప్‌మెంట్‌ వాటాగా 99 శాతం తీసుకున్నారు. ప్రజాసేవకు అంకితం అవ్వాల్సిన ఎంపీలు ప్రజల ఆస్తులను లూటీ చేయడం ఎంతవరకు సమంజసం !
దబ్బంద గ్రామ భూములు స్వాహా
ఆనందపురం మండలం, మామిడి లోవ పంచాయతీ దబ్బంద గ్రామం సర్వే నెంబర్‌ 23లో 1970వ దశకంలో ప్రభుత్వం 120 మంది పేదలకు 80ఎకరాల సాగుకోసం భూమిని కేటా యించింది. 2015లో ప్రభుత్వం టిడ్కో ఇళ్ల కోసం దళితులు, గిరిజనులైన వీరి నుండి ఈ భూమిని తిరిగి ల్యాండ్‌ పూలింగ్‌ చేసింది. వీటిలో 66 ఎకరాలను టిడ్కో ఇళ్లు మరియు అర్బన్‌ హౌసింగ్‌ కోసం కేటాయించారు. మిగతా 14ఎకరాలను ఒక బడా వ్యక్తి స్వాధీనం చేసుకొని తోటలు వేసుకొని అనుభవిస్తున్నాడు. వీటితోపాటు సర్వేనెంబర్‌ 10లో ఉన్న నరసింహ చెరువును ఆక్రమించి సుమారు 6.8 ఎకరాల్లో జీడి, మామిడి, కొబ్బరి తోటలు వేశాడు.సర్వే నెంబర్‌9/1, 12/4,13/1,13/2,14/2లో సుమారు12.50ఎకరాల భూమి ఈ పెద్ద మనిషికబ్జాÛలోనే ఉన్నది. ఇవి దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులకు చెందిన భూములు.
కుసులవాడ భూములపై పెద్దల కన్ను
ఆనందపురం మండలం కుసుల వాడలో 1970వదశకంలో ల్యాండ్‌ సీలింగ్‌ మిగు లు భూమి సుమారు 43 ఎకరాలు సర్వే నంబరు 98,108లో ఎస్‌సి,బిసిలు43కుటుంబాలకు ప్రభు త్వం కేటాయించింది.పద్మనాభం,శొంఠ్యాం ప్రాం తాల మధ్య ఉన్న ఈభూమి విలువ సుమారు రూ. 100కోట్లు ఉంటుంది. వీటిపైఅధికార పార్టీ పెద్దల కన్ను పడిరది. పేదలను బెదిరిస్తూ ల్యాండ్‌ పూలిం గ్‌కు పథకం వేశారు.పేదలను లొంగదీసుకొని ఎక రాకు రూ.13లక్షల చొప్పున చెల్లించి భూములు లాక్కోవాలని చూస్తున్నారు.
బయ్యవరం భూముల బలవంతపు కొనుగోళ్లు
ప్రస్తుత అనకాపల్లి జిల్లా కశింకోట మండలం బయ్యవరం రెవెన్యూ పరిధిలోని విస్స న్నపేట పరిసర ప్రాంతాల్లో సుమారు500 ఎకరాల డీపట్టా, అసైన్డ్‌ భూములను రైతుల నుండి బలవం తంగా కొనుగోలు చేయడమే కాకుండా ఈ భూము ల చుట్టూ ఉన్న వాగులు, ఇతర ప్రభుత్వ భూములు కూడా ఆక్రమించారు. అక్కడున్న కొండలను కూడా అక్రమంగా తవ్వేశారు. సర్వే నెంబరు 624లో రెండు కొండల మధ్య ఉన్న వాగును పూడ్చేశారు. ఆ ప్రాంతంలో 403ఎకరాల భూమిలో 230 మౌంట్‌ విల్లాలు పేరుతో రిసార్ట్స్‌ నిర్మించాలనే లక్ష్యంతో భూ వ్యాపారులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ భూముల్లో అనేక అక్రమాలు జరిగాయని నాడు ఆర్డీవో,గనులశాఖఏ.డి,తహశీల్దార్‌, ఇనాం తహ శీల్దార్‌ గుర్తించారు.అందులో నీటి వాగులు, గోర్జీలు వంటివి కూడా కబ్జాకు గురి అయ్యాయని తెలియ జేశారు. అసలు అసైన్‌మెంట్‌ చట్టం ప్రకారం ఆ భూములకు సంబంధించి ఎటువంటి అమ్మకాలు, కొనుగోలు జరపరాదు. దీనికి భిన్నంగా విస్సన్న పేటలో జరిగిందని, రాజకీయ నాయకుల ప్రమే యం వుందని తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించు కోలేదు.
రెండు సిట్‌ నివేదికలు బహిర్గతం చేయాలి
గతంలో తెలుగుదేశం ప్రభుత్వం వున్న ప్పుడే విశాఖఅర్బన్‌,రూరల్‌ మండలాలు, భీమిలి, ఆనందపురం,పెందుర్తి,గాజువాక, పెదగంట్యాడ, సబ్బవరం,పరవాడ,అనకాపల్లి ప్రాంతాల్లో 1 లక్ష 6వేల 239ఎకరాల భూమి ఆక్రమణలకు గురైంది. ల్యాండ్‌ ట్యాంపరింగ్‌ అయింది. మాజీ సైనికుల భూములకు జిల్లా కలెక్టర్లు ఎన్‌ఒసిలు ఇచ్చారనే కథనాలు వచ్చాయి. ఆ సందర్భంగానే సిట్‌ను వేసి దర్యాప్తు చేశారు. మరలా వైఎస్‌ఆర్‌సిపి అధికారం లోకి రాగానే మరో సిట్‌ వేసి దర్యాప్తు చేశారు. ఈ రెండు సిట్‌ల నివేదికలను నేటికీ ఎందుకు బహిర్గతం చేయడంలేదు? నాడు చంద్రబాబు, నేడు జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వాలు భూ కబ్జాదా రులను కాపాడే పనిలో నిమగమయ్యాయనేది జగమెరిగిన సత్యం. ఈ భూముల కుంభకోణంలో అధికార, ప్రతిపక్ష పార్టీ పెద్దలందరూ భాగస్వాము లుగా ఉన్నారు కాబట్టే నివేదికలు బయటకు రానివ్వ కుండా పరస్పరం సహకరించుకుంటున్నారు. డి-ఫామ్‌ పట్టా భూములకు ఎంత రక్షణ ఉందో ఎక్స్‌ సర్వీస్‌మెన్‌కు కేటాయించే భూములకు అన్ని నిబంధనలూఉన్నాయి. అయినప్పటికీ రాష్ట్ర రెవెన్యూ మంత్రి సిఫార్సుతో ఎన్‌ఓసిలు ఇచ్చి భూములు అమ్మకాలు,కొనుగోళ్ళు జరిగాయని రెవెన్యూ మంత్రి పై ఆరోపణలు ఎదుర్కొంటు న్నారు. అనేకచోట్ల మంత్రులు,ఎమ్మెల్యేలు బినామీలతో భూములు అక్ర మంగా స్వాధీనం చేసుకుంటున్నారు. కబ్జాలకు గురైన భూముల వివరాలను రెండు సిట్‌ కమిటీలకు సిపిఎం ఆధారాలతో సహా ఇచ్చింది. పారదర్శకత కోసం రోజూ మాట్లాడే వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వానికి చిత్తశుద్ధి వుంటే వెంటనే రెండు సిట్‌ నివేదికలను బహిర్గతం చేస్తే భూకబ్జాదారులెవరో ప్రజలకు అర్ధ మౌతుంది. ఉమ్మడి విశాఖ నగరానికి ఆనుకొని ఉన్న గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టిన ల్యాండ్‌ పూలిం గ్‌లో కూడా అనేక భూబాగోతాలకు పాల్పడ్డారు.
ప్రశాంతతకు మారు పేరుగా ఉన్న విశాఖ నేడు భూ బకాసురుల కంబంధ హస్తాల్లో చిక్కుకొని వుంది. దాని నుండి రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై వుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూములను పరిరక్షించే నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలి. కబ్జాకోరుల చేతుల్లో చిక్కుకు పోయిన పేదల భూములన్నింటినీ తిరిగి పేదలకు అప్పగించాలి.
వందేళ్ల సమస్యకు పరిష్కారం
బ్రిటీష్‌ హయాంలో రీసెటిల్మెంట్‌ ఖాతా పేరుతో భూ కేటాయింపులు యాజమాన్య హక్కులే ధ్యేయంగా సమగ్ర భూ సర్వే రీ సెటిల్మెంట్‌ బుక్స్‌ నుంచి భూముల డిజిటలైజేషన్‌ భూ సమస్యలకు సీఎం జగన్‌ చరిత్రాత్మక పరిష్కారం చూపించారు. స్వాతంత్య్రం రాక ముందు కేవలం సాగు చేసుకునే తాత్కాలిక హక్కుతో కేటాయించిన భూములు అవి. సదరు భూములపై ఇప్పటికీ రైతన్నలకు యాజ మాన్య హక్కులు లేవు. వందేళ్లు గడిచిపోయినా యాజమాన్య హక్కులకోసం నిత్యం రెవెన్యూ కార్యా లయాల చుట్టూ రైతన్నల పడిగాపులు కాస్తూనే ఉన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా.. తరాలు మారుతున్నా.. ఎన్ని ప్రభుత్వాలు మారినా సమస్యకు పరిష్కారం మాత్రం చూపలేకపోయాయి. కానీ ఆర్థిక అవసరాలకోసం క్రయవిక్రయాలకు వీలులేని అసైన్డ్‌భూములు (22ఏ) సమస్య పరిష్కా రం కోసం వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం నడుం బిగిం చింది. సీఎం జగన్‌ దార్శనికతతో చిక్కుల్లేని భూ రికార్డుల కోసం సమగ్ర భూసర్వే పథకాన్ని తీసు కొచ్చారు. దీంతో అసైన్డ్‌ భూముల నిజమైన హక్కు దారులకు యాజమాన్య హక్కుల లభించనున్నాయి.
బ్రిటీష్‌ హయాంలో భూముల కేటాయింపులు
ప్రస్తుతం మార్కెట్‌ లో భూముల క్రయ విక్రయాల ప్రక్రియ 1908 రిజిస్ట్రేషన్‌ చట్టం ప్రకాం మే జరుగుతోంది.బ్రిటీష్‌ పాలనలో రైతులకు సాగు కోసం షరతులతో కూడిన భూమలను కేటాయిం చారు. ఈ భూములు కేవలం సాగు చేసుకునేలా మాత్రమే రికార్డుల్లో నమోదు చేశారు. భూయాజ మాన్య హక్కులను రైతులకు కల్పించలేదు. బ్రిటిష్‌ ప్రభుత్వం హయాంలో 1930 వరకు షరతులతో కూడిన భూ పట్టాల పేరుతో వివిధ వర్గాల రైతులకు భూ కేటాయింపులు జరిగాయి. ఆయా భూములను రకరకాల కేటగిరీల పేరుతో రికార్డుల్లో చేర్చారు. మెట్ట,తరి,డొంక,వంక,వాగు,గ్రామ కంఠం, ప్రభు త్వ భూములుగా రెవెన్యూ రికార్డుల్లో పేర్కొన్నా రు1932 నుంచి1934 మధ్యలో రికార్డులన్నీ కూడా రీసెటిల్‌మెంట్‌ బుక్స్‌లో చేర్చారు. పట్టా దారుల భూముల వివరాలను,సర్వే నంబర్లను ఈ పుస్తకాల్లో నమోదు చేశారు. అటువంటి భూములను 1932-34 నుంచి రైతుల తరాలు అనుభవిస్తు న్నారు. ఏళ్ల కొద్దీ సాగు చేస్తున్నా ఈ భూములపై రైతన్నలకు యాజమాన్య హక్కుల లభించడం లేదు.
ప్రత్యేక కమిటీలతో పరిశీలన..
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలు పెండిరగ్‌ లో ఉన్న ప్రతి కేసును కూలంకుషంగా అధ్యయనం చేస్తాయి. వాటికి సంబంధించి ఉన్న అన్ని రికార్డులను అధికారుల సమక్షంలో పరిశీలి స్తాయి. కమిటీలు గుర్తించిన అంశాలతో నివేదికలు రూపొందించి జిల్లా కలెక్టర్లకు సిఫారసు చేస్తాయి. కలెక్టర్‌ స్థాయిలో పరిశీలించి వాటిని నిషేధిత జాబితా నుంచి తొలగించేలా సిఫార్సులు ఉండాలి. ఒకవేళ కలెక్టర్‌ స్థాయిలో పరిష్కరించలేనివి ఉంటే వాటిని ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది. అదే విధంగారూ.50కోట్లకు పైగా విలువైన భూ ములుంటే వాటిని సీసీఎల్‌ఏ ద్వారా ప్రభుత్వానికి తెలపాలి. ఈవిధంగా వందేళ్లుగా పెండిరగ్‌లో ఉన్న అసైన్డ్‌ భూముల సమస్యలను పరిష్కరించి, నిషేధిత జాబితా నుంచి భూములను తొలగిం చాలనే చిత్తశుద్ధితో ప్రభుత్వం పని చేస్తోంది. తద్వారా లక్షలాది మంది తమ భూముల క్రయవిక్ర యాల కోసం రిజిస్ట్రేషన్ల విషయంలో ఎదుర్కుం టున్న సమస్యలను పరిష్కరించాలని భావిస్తోంది. అతి త్వరలో ప్రభుత్వం నియమించిన కమిటీలు సమావేశమై యుద్ధప్రాతిపదికన ఫిర్యాదులను పరిశీలించి నివేదికలు రూపొందించనున్నాయి.
శాశ్వత పరిష్కారమే ధ్యేయం
ప్రభుత్వం మాత్రం అన్ని రకాల అవకా శాలను పరిశీలించి వందేళ్ల చుక్కల భూముల సమస్యకు శాశ్వతపరిష్కారం కల్పించాలని నిర్ణయిం చింది. అందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి జోన్లవారీగా కమిటీలు నియ మించి,క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయాలని ఆదేశిం చారు. తొలి దశలో విజయవాడ, తిరుపతి, విశాఖ పట్నం కేంద్రాలుగా ఈ కమిటీలు అధ్యయనం చేయనున్నాయి.ఈ కమిటీల్లో విశ్రాంత జిల్లా న్యాయ మూర్తి, విశ్రాంత స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌, భూరికార్డులశాఖ విశ్రాంత ఏడీ, సర్వే విభాగం ఏడీ, సంబంధిత జిల్లాల జాయింట్‌ కలెక్టర్‌, సబ్‌ కలెక్టర్‌ లేదా ఆర్డీవో, జిల్లాల రిజిస్ట్రార్లు సభ్యులుగా వ్యవహరిస్తారు.ఈ కమిటీలకు ప్రభుత్వమే వేతనాలు చెల్లించేలా జీవో 681ని విడుదల చేశారు. ఈ భూముల రీసర్వే కోసం ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురుకాదు ఏకంగా15 వేల మందిని సర్వేయ ర్లను రిక్రూట్‌ చేసి, కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక పరికరాలను కొనుగోలు చేశారు. అంతే కాకుండా ఆధునిక టెక్నాలజీ.. కోర్స్‌(కంటిన్యూస్‌ ఆపరేటింగ్‌ రిఫరెన్స్‌ సిస్టం) బేస్‌ సిస్టంను తీసుకొచ్చి, విమానాలను, హెలీకాప్టర్‌లను, డ్రోన్లను, రోవర్లను ఉపయోగిస్తున్నారు. రీ-సర్వేలో భాగంగా హద్దు లను మళ్లీ కొత్తగా మార్కు చేసి, రికార్డులన్నింటినీ అప్‌డేట్‌ చేసి,సబ్‌డివిజన్‌లు,మ్యుటేషన్స్‌ పక్కాగా చేపట్టనున్నారు.రాష్ట్రంలో మొత్తం 17వేలకు పైగా గ్రామాలుండగా నవంబరులో 1500 గ్రామాలలో సర్వే పూర్తి చేసి,హద్దులు రీమార్క్‌ చేసి,అక్కడ ఉన్న సమస్యలు పరిష్కరించి అందరికీ భూహక్కు పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవన్నీ పూర్తి చేసి అక్కడే సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం కూడా గ్రామాల్లో ఉండేటట్టుగాఅడుగులు వేస్తోంది. నవంబరు నుంచి 1500 గ్రామాల్లో మొదలుపెట్టే ప్రతి నెలా కొన్ని వందల గ్రామాలను చేరుస్తూ వచ్చే ఏడాది(2023) చివరి నాటికి మొత్తం 17 వేల పై చిలుకు గ్రామాల్లో పూర్తి చేసే కార్యక్రమం జరుగుతుంది.
2023 చివరికల్లా సంపూర్ణంగా రీ సర్వే..
రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూ సర్వే కార్యక్రమం వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తి కానుంది. అనంతరం షరతులు గల పట్టా పేరుతో నిషేధితజాబితాలో అంటే 22(ఏ)1 లో ఉన్న ఈభూముల సమస్యలను పరిష్కరిస్తూ.. రైతు లకు క్లియరెన్స్‌ పత్రాలను జారీ చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 355గ్రామాలలో 22 (ఏ) నిషేధిత జాబితాలో ఉన్న18,889 సర్వే నం బర్లకు సంబంధించి మొత్తం 35,669 ఎకరాల భూముల సమస్యకు పరిష్కారం చూపింది. అవనిగడ్డలో ఆయా భూముల్లో సాగుచేసుకుంటున్న 22,042 మంది రైతులకు తమ భూములపై వారికి హక్కు కల్పించడం జరిగింది. వ్యాసకర్త :సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు-(కె.లోకనాథం)

హరిస్తున్న వలస కార్మికుల హక్కులు

అత్యధిక మంది వలస కార్మికులు వ్యవసాయం, పరిశ్రమలు, నిర్మాణ రంగాలలో కనిపిస్తారు. దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో10శాతం వలస కార్మికుల శ్రమ నుండే వస్తోంది.అయితే, వలస కార్మికులు ఎంతమందివున్నారు? వారు ఏ రంగంలో పని చేస్తున్నారు? ఎక్కడ నుండి ఎక్కడకు వెళ్తున్నారు? తెలుసుకునే వ్యవస్థ లేదు. పర్మినెంట్‌ వర్కర్ల కంటే ఏడు రెట్లు అధికంగా వలస కార్మికులు వున్నట్లు జాతీయ శాంపిల్‌ సర్వే ఆర్గనైజేషన్‌ గణాంకాలు తెలియ జేస్తున్నాయి. దుర్బలమైన, ప్రమాదకరమైన, ఎటువంటి భద్రత లేని పరిస్థితులు ఈ రంగం లో నెలకొన్నాయి.2011జనాభా లెక్కల ప్రకారం45కోట్ల 60లక్షల మంది వలస కార్మి కులు ఉన్నారు. వీరిలో 41శాతం మంది తమంతట తాముగా వలస కార్మికులుగా మారలేదు. తమ ప్రాంతాలలో నెలకొన్న నిరుద్యోగం వలస వెళ్ళాల్సిన పరిస్థితికి నెట్టింది. వీరి జనాభా లెక్కలు సరిగా వుండవు. వాటి మీద ఆధారపడలేం. ఐక్యరాజ్యసమితిలో భాగంగా ఉన్న విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ 2013లో దేశంలో అంతర్గతంగా తిరిగే వలస కార్మికులు కోటిన్నర నుండి10కోట్ల మంది ఉన్నట్లు అంచనా వేసింది. ఏరకంగా చూసినా భారతదేశంలో వలస కార్మికులు అసంఘటిత రంగంలో అత్యధికంగా ఉన్నట్లు తేలుతుంది. అందుకని వీరి పట్ల అధిక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది.ముఖ్యంగా పేదరికం,దుర్బలత,అభద్రత,ఉద్యోగంలో పెట్టుకునే పద్ధతికి…ఈ కార్మికుల సామాజిక స్థాయికి మధ్య ఉన్న సంబంధాన్ని అర్ధం చేసు కోవాలి. ఈ కారణంగా వీరు ప్రమాదక రమైన,అతి తక్కువ వేతనాలున్న పనులను చేయాల్సి వస్తోంది. కుల,లింగవివక్షలను ఎదుర్కొంటున్నారు.కీలక రంగాలైన వ్యవ సాయం,పరిశ్రమలు,నిర్మాణరంగాల కార్య కలాపాలు వీరు లేనిదే నడవవు. కానీ వీరి కనీస భద్రత, న్యాయమైన వేతనాలను పట్టించు కునే దిక్కులేదు. వలస కార్మికులకు వర్తించే ప్రస్తుత చట్టాలు లేబర్‌ కోడ్లలో భాగం కాను న్నాయి. లేబర్‌ కోడ్‌లు అమలులోకి వచ్చే లోపు ‘అంతర్‌ రాష్ట్ర వలస కార్మికుల చట్టం-1979, భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల (పని మరియు సర్వీసు కండిషన్ల క్రమబద్ధీకరణ) చట్టం-1996, అసంఘటిత కార్మికులసామాజిక భద్రతా చట్టం-2008 అమలులో వుంటాయి. కోవిడ్‌ సమయంలో వలస కార్మికులు ఎదు ర్కొన్న విషాదకర పరిస్థితులను, ఆరోగ్య-సామా జిక భద్రతా వైఫల్యాలను గమనించిన అత్యు న్నత న్యాయస్థానం తనంత తానుగా వీరి తరపు న కేసు తీసుకొని అనేక నిర్ధారణలకు వచ్చింది. అయితే ఈలోగా వలస కార్మికుల చట్టం-1997ను ప్రభుత్వం రద్దు చేసినప్పటికీ, ప్రభుత్వానికి అనేక ఆదేశాలను, సిఫార్సులను పంపింది.అత్యున్నత న్యాయస్థానం 2020 మే 28న, 2020 జూన్‌ 9న ఇచ్చిన తీర్పుల ద్వారా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యాలను, లోపాలను ఎత్తిచూపింది. ఈ కార్మికుల సంక్షేమాన్ని మెరుగుపర్చటానికి అనేక ఆదేశాలు ఇచ్చింది. కాని ఇవి ప్రధానంగా వలస కార్మికులకు ఉన్న పథకాలు, విధానాలకు పరిమితమైనవి. స్వస్థలాలకు తిరిగి వెళ్ళిన కార్మికుల సంఖ్యను గుర్తించమన్నది. 2020, జులై 31న ఇచ్చిన ఆదేశాలలో మాత్రం పైన పేర్కొన్న కార్మిక చట్టాల అమలు వివరాలను కూడా అన్ని ప్రభుత్వాలు తనకు సమర్పించమని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించిన సందర్భాలలో రాష్ట్ర ప్రభుత్వాలు వలస కార్మికులకు ఉపశమనం కలిగించాయి. తమ ఖర్చుతో రైళ్ళు,బస్సులను నడిపించాయి. తాను ఇచ్చిన ఆదేశాల అనంతరం…రాష్ట్ర ప్రభు త్వాలు,కేంద్ర పాలిత ప్రాంతాలు సమర్పించిన సమాచారంలో…వాస్తవాలను,గణాంకాలను పేర్కొనలేదని సుప్రీంకోర్టు గుర్తించింది. అందు కని చట్టాల అమలులో భాగంగా వలస కార్మికు లను పెట్టుకునే సంస్థలను రిజిస్టర్‌ చేయాలని, లైసెన్సులను జారీ చేయాలని ప్రభుత్వాలను ఆదేశించింది. ‘వలస కార్మికుల కష్టాలు-సమస్యలు’లో భాగంగా అసంఘటిత కార్మికుల రిజిస్ట్రేషన్‌ స్థితిపై ప్రమాణ పత్రాన్ని దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు (2021మే 24న) ఆదేశించింది. అంతకు ముందు కేంద్ర ప్రభుత్వం స్పందించిన తీరుపై సుప్రీంకోర్టు సంతృప్తి చెందకపోవటంతో ఈ ఆదేశాలు ఇచ్చింది. దీనితో కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో 2021 ఆగస్టు 26న రూ.704 కోట్ల ఖర్చుతో వలస కార్మికులతో సహా అసంఘటిత కార్మికుల రిజిస్ట్రేషన్‌కు ‘ఈ-శ్రమ’ వ్యవస్థను ప్రవేశ పెట్టింది. 2021 డిసెంబర్‌ ఆఖరులోగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అసంఘటిత కార్మికులు/వలస కార్మికుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది.ఈ-శ్రమ’ రిజిస్ట్రేషన్‌కు కార్మికుల నుండి స్పందన చాలా పరిమితంగా వుంది. అందులో వారికి ఎలాంటి ప్రయెజనం కనపడకపోవడం అందుకు కారణం. పైగా‘ఈ-శ్రమ’ నెట్‌ సౌకర్యంతో కూడుకున్నది కావడంతో కార్మికులు దీనిలో తమంత తాముగా రిజిస్ట్రేషన్‌ చేసుకోలేరు.ఇప్పటికే నిర్మాణ (సెస్సు-సంక్షేమ పథకాలు), వ్యవసాయ రంగాలలో (రైతు బంధు పథకం) పరిమితమైన ఇతర పథకాలు ఉన్నాయి.140 రకాల వృత్తులలో కార్మికులు పనిచేస్తున్నట్లుగా గుర్తించామని మోడీ ప్రభుత్వం చెప్పింది. కానీ తాము ఏరకమైన సామాజిక భద్రతను ప్రవేశపెట్టేదీ ఇంత వరకు నిర్ణయిం చలేదు. ‘ఈ-శ్రమ’ లో రిజిస్ట్రేషన్‌కు ఇ.పి.ఎఫ్‌, ఇ.ఎస్‌.ఐ ఉన్న వారు అర్హులు కారు. సంఘటిత రంగంలో పని చేసే లక్షలాది మంది కాంట్రాక్టు వర్కర్లు, చిన్న మధ్యతరహా సంస్థల్లో పని చేసే కార్మికులకు ఈ రెండూ ఇప్పటికే ఉంటాయి. కాబట్టి వారు రిజిస్ట్రేషన్‌ చేసుకోలేరు. వలస కార్మికులకు సామాజిక భద్రతను కల్పించాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకుండా ‘వలస కార్మికుల చట్టం-1979’ రద్దును ప్రకటించింది. దీనికి బదులుగా వచ్చేటటువంటి కోడ్‌ కాంట్రాక్ట్‌ కార్మికుల కష్టాలను పెంచుతుంది. 1979 చట్టం యజమానులకు, కాంట్రాక్టర్లకు, సబ్‌ కాంట్రాక్టర్లకు నిర్ద్ఱేశిత ఆదేశాలు ఇచ్చింది. కాంట్రాక్టు కార్మికులను పెట్టుకోవాలంటే ముందుగా వీరు రిజిస్టరై ఉండాలి. ప్రతి వలస కార్మికుని సమాచారాన్ని, వారికి చెల్లించే వేతనాల వివరాల నమోదును స్పష్టీకరించింది. ఇవన్నీ ఇప్పుడు కోడ్‌లో లేవు. ఇటీవల అగ్ని ప్రమాదాలలో కార్మికులు చనిపోయినప్పుడు వారి గుర్తింపుకు వ్యక్తిగత రికార్డులు లేక పోవటం ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడు తుంది. వారు పలానా వారు అని గుర్తించ టానికి వంశీకుల డిఎన్‌ఎ లను పరీక్షించాల్సి వచ్చింది. యజమానులు తమ దగ్గర ఉన్న వలస కార్మికుల నియామకం,నమోదు, రవాణా, నివాసం,కనీస వేతనం,కాలనుగుణ వేతనాలు తదితర సమాచారాన్ని తప్పకుండా నిర్వహిం చాలని 1979చట్టం నిర్దేశించింది.వేతనాల చెల్లింపు,ఆరోగ్య సౌకర్యాల కల్పన,పని ప్రదేశం లో రక్షణ కల్పించే డ్రస్సులు,మంచినీటి సౌక ర్యం,క్యాంటిన్‌,మరుగుదొడ్లు, విశ్రాంతి గదుల ఏర్పాటు, ప్రయాణ ఖర్చులను గ్యారంటీ చెయ్య టానికి-అయ్యే మొత్తం ఖర్చులో40శాతాన్ని సెక్యూరిటీ డిపాజిట్‌గా లైసెన్సింగ్‌ అధికారి తీసుకుంటారు. కాంట్రాక్టర్లుగానీ, ముఖ్య యజమాని గానీ వేతనాలు చెల్లించకపోతే ఈ నిధి నుండి చెల్లిస్తారు.ఈహామీలను లేబర్‌ కోడ్‌లో ఉపసంహరించారు.1979 చట్టంలో ఇంకొక ముఖ్యమైన నిబంధన ప్రకారం వలస కార్మికులు పారిశ్రామిక వివాదాల పరిష్కార యంత్రాంగాన్ని…తాము పనిచేసే ప్రాంతాలు, స్వస్థలాలు రెంటిలోనూ వినియోగించుకునే అవకాశం ఉంది. ఈ విధంగా వలస కార్మికు లకు వర్తించే ఇటువంటి 4 చట్టాలను కూడా కోడ్‌ ఒక్క కలం పోటుతో స్వాహా చేసింది.వీధి వ్యాపారులతో సహా అందరికీ సామాజిక భద్రత కల్పించబడుతుందని కేంద్ర కార్మిక మంత్రి ప్రకటించారు. ఇంత వరకు దానికి సంబం ధించిన ఎటువంటి పథకం తయారు కాలేదు. కానీ వలస కార్మికుల రిజిస్ట్రేషన్‌ పరిమితి 5 నెలల నుండి 10 నెలల వరకు పొడిగించారు. రిజిస్ట్రేషన్‌ వలన వలస కార్మికులకు పెద్దగా ఒరిగిందేమీ లేదు.పెద్ద సంఖ్యలో వలస కార్మి కుల హక్కులు నిరాకరించబడ్డాయి. అంతకు ముందున్న అనేక సౌకర్యాలను వలస కార్మికులు కోల్పోతారు.
మీకు ఉద్యోగం కావాలా, హక్కులు కావాలా?’’
ఒక నిరుద్యోగి ఉద్యోగం కోరుకుంటాడా, హక్కు లు కోరుకుంటాడా? భారత్‌లో కులవ్యవస్థ కార్మి కులపై ఎలాంటి ప్రభావం చూపుతోంది? కార్మి కుల హక్కులు, సంక్షేమం, ఐక్యత కోసం సుదీర్ఘ కాలం కృషిచేసిన భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ ఈఅంశాలపై ఏమన్నారు?
‘‘ఒక నిరుద్యోగికి ఎంతో కొంత వేతనమున్న, నిర్దిష్టమైన పనిగంటలు లేని ఒక ఉద్యోగం ఆఫర్‌ చేశారు. అతడికి ఒక షరతు పెట్టారు. ఉద్యోగ సంఘంలో చేరే హక్కు, భావ ప్రకటనా హక్కు, నచ్చిన మతాన్ని ఆచరించే హక్కు, ఇతర హక్కులు ఉండవని చెప్పారు. ఇప్పుడు ఆ నిరుద్యోగి ఏ నిర్ణయం తీసుకుంటారనేది స్పష్టం. ఆకలి భయం, ఇల్లూవాకిలీ కోల్పోతాననే భయం, ఏమైనా పొదుపు చేసుకొనుంటే ఖర్చయి పోతుందేమోనన్న భయం ఆ నిరుద్యోగికి కలుగు తాయి. ఈ భయాందోళనలు చాలా బలమైనవి. వీటివల్ల ఎవరూ తమ ప్రాథమిక హక్కుల కోసం నిలబడలేరు’’ అని అంబేడ్కర్‌ చెప్పారు. కేవలం లాభార్జనే ధ్యేయమైన ఆర్థిక వ్యవస్థ పౌరుడి ప్రాథమిక హక్కులను ఎలా దెబ్బ తీయగలదో సోదాహరణంగా చెబుతూ ఆయన ఒక సందర్భంలో ఇలా రాశారు. ఎనిమిది గంటల పనిగంటలు మొదలుకొని, ప్రసూతి సెలవుల వరకు కార్మికుల ప్రయోజ నాలు కాపాడేందుకు ఆయన చూపిన చొరవ ఫలితా లను కార్మిక వర్గం నేటికీ పొందుతోంది. లాభా ర్జనే ధ్యేయమైన ఆర్థిక వ్యవస్థ రెండు రాజకీయ ప్రజాస్వామిక సూత్రా లకు విఘాతం కలిగిస్తుం దని అంబేడ్కర్‌ చెప్పారు. వ్యక్తుల జీవితాలను రాజ్యవ్యవస్థ కాకుండా, ప్రైవేటు యాజమా న్యాలు నిర్దేశిస్తాయని, అలాగే జీవనోపాధి కోసం పౌరులు తమ రాజ్యాంగ హక్కులను కోల్పో వాల్సి రావొచ్చని పేర్కొన్నారు.‘కుల వ్యవస్థ పనినే కాదు, కార్మికులనూ విభజిస్తుంది’ భారత సమాజ తీరును లోతుగా పరిశోధించిన అంబే డ్కర్‌, కులానికి, పనికీ సంబంధముందని గుర్తించారు. కుల వ్యవస్థ పని విభజనకు సంబంధించినదనే వాదనను ఆయన తిరస్క రించారు.ఈ సమాజం పనినే కాకుండా కార్మికు లను కూడా విభజించి చూస్తోందని, ఇది అసహజమైనదని, ఏ నాగరిక సమాజంలోనూ ఇలా ఉండదని వ్యాఖ్యానించారు. కార్మికుల విభజనను హిందూ సమాజ నిర్మాణమే ఆమో దించి, కొనసాగిస్తోందని, ఈ విభజనలో ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అనే వర్గీకరణ ఉందని చెప్పారు. కార్మికులను ఇలా చూసే పని విభజన మరే దేశంలోనూ లేదన్నారు.పని విభజన వ్యక్తుల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉండాలని, కానీ కుల వ్యవస్థ సృష్టించిన కార్మిక విభజన వ్యక్తుల ఇష్టాయిష్టాలపై ఆధారపడినది కాదని అంబేడ్కర్‌ వివరించారు.వ్యక్తి తన సామ ర్థ్యాల ప్రాతిపదికన కాకుండా అతడు పుట్టిన కులం ప్రాతిపదికగా పని చేయాల్సి వస్తోందని చెప్పారు. అంటరాని కులాలుగా పిలిచే కులాలకు అపరిశుభ్రమైన,తక్కువ స్థాయి పనులను, ఇతర కులాలకు శుభ్రమైన, గౌరవప్రదమైన పనులను కుల వ్యవస్థే కేటాయిస్తుందని ఆయన ప్రస్తావించారు.– అమితవ్‌ గుహ

అటవీ సంరక్షణ చట్ట సవరణ అటవీ హక్కుల నిరాకరణ

గుండుగుత్తుగా కార్పొరేట్లకు అడవులపై చట్టబద్దత కల్పించడానికి మోడీ ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. వంద నుంచి వెయ్యి హెక్టార్లకు పైగా అటవీ భూమిని అటవీయేతర భూమిగా మార్చడానికి ప్రయత్నిస్తున్నది. దీనివల్ల రాబోయే కాలంలో అటవీ ప్రాంత విస్తీర్ణం తగ్గనుంది. అటవీ భూమిని ఇతర అవసరాలకు మళ్ళిం చాలంటే అటవీ హక్కుల గుర్తింపు చట్టం కింద అటవీ హక్కులను సంపూర్ణంగా అమలు జరపాలని 2009లో కేంద్ర ప్రభుత్వ అటవీ మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొన్నది. అయితే ఈ అవసరం లేకుండానే ప్రభుత్వ, ప్రయివేట్‌ కంపెనీలకు అటవీ భూమిని మళ్లించేందుకు నూతన అటవీ సంరక్షణ చట్టంలో వీలు కల్పిస్తున్నది. ఈ నియ మాలు అమలైతే అడవి నుండి ఆదివాసీలు నెట్టివేయబడతారు. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇటీవల జారీ చేసిన నూతన అటవీ సంరక్షణ నియమాలు ఆదివాసుల అటవీ హక్కులను దెబ్బతీసే విధంగా వున్నాయి. ఆది వాసుల అటవీ హక్కులను తుంగలో తొక్కి, కార్పొరేట్లకు ప్రయోజనం చేకూర్చడానికి కేంద్ర ప్రభుత్వం అటవీ సంరక్షణ చట్టం సవరణ చేస్తున్నది.
అడవిలో లీనియర్‌ ప్రాజెక్టుల నిర్మాణం ఐదో షెడ్యూల్‌ ప్రాంతంలో అంతర్జాతీయ సంస్థలు,బహుళ జాతి కంపెనీల ప్రవేశానికి అటవీ చట్టాలు అడ్డంకిగా వున్నాయి. విలువైన సహజ వనరులు, ఖనిజ సంపదను కార్పొరేట్లకు అప్పగించేందుకు ఆటంకంగా వున్న చట్టాలను వారికి అనుకూలంగా సవరించే పని మోడీ ప్రభుత్వం నెత్తినెత్తుకుంది. అందుకు కొత్త నియమ నిబంధనలు ప్రతిపాదించారు. అటవీ ప్రాంతంలో లీనియర్‌ ప్రాజెక్టులను (జాతీయ రహదారులు, పైపులైన్లు, ట్రాన్స్‌మిషన్‌…) ప్రైవేటు, కార్పొరేట్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. లీనియర్‌ ప్రాజెక్టుల నిర్మాణానికి గిరిజన గ్రామ సభ అనుమతి అక్కర్లేదని 2013లో కేంద్ర అటవీ మంత్రిత్వశాఖ జారీ చేసిన ఉత్తర్వులను 2019లో ఎ.పి హైకోర్టు కొట్టేసింది. గిరిజన గ్రామసభకు వున్న విస్తృత అధికారాన్ని న్యాయ స్థానం గుర్తించడంతో, ముసాయిదా బిల్లులో గ్రామసభను సంప్రదించాలని మాత్రమే కేంద్ర బిజెపి ప్రభుత్వం పేర్కొంది.అటవీ సంరక్షణ చట్టం 1980 ప్రకారం అటవీ భూమిని ఇతర ప్రయోజనాలకు వినియో గించాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ కింది నిబంధనలు పాటిం చాలి.1.ముందుస్తు గ్రామసభ అనుమతి తీసుకోవాలి.2. నిర్వా సితులకు నష్టపరిహారం చెల్లించాలి.3.అడవు లు పెంచడానికి ప్రత్యేక భూమి కేటాయించాలి. ఈ నిబంధనలు కార్పొరేట్‌ శక్తులకు అడ్డుగా వుండడంతో వాటిని సవరించబూనుకుంది. మైనింగ్‌ కోసం ఐదు హెక్టార్ల భూమిని డి-రిజర్వ్‌ చేయడానికి, ఆక్ర మణ భూమిని క్రమబద్ధీకరించడానికి కేంద్ర ప్రభుత్వ సలహా కమిటీ సిఫార్సు అవసరమని, 2003లో జారీ చేసిన నియమాలను పక్కనబెట్టి, మోడీ సర్కారు కొత్త నియమాలు తీసుకొస్తోంది. క్లాజ్‌ 9(బి)-1 ప్రకారం గ్రామసభ లేదా హక్కుల పరిష్కార ప్రస్తావన లేదు. క్లాజ్‌ 9(బి)-2 ప్రకారం డి-రిజర్వుడు ఆర్డర్‌ను జారీ చేయడానికి గ్రామసభకు వున్న అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం బలవంతంగా లాక్కొన్నది. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే ఆదివాసుల హక్కులు హరించ బడతాయి. అటవీ హక్కుల చట్టానికి తూట్లు తీవ్రవాద కార్యకలాపాలు జరిగే ప్రాంతంలో అవుట్‌ పోస్టు నిర్మాణానికి అటవీ భూమి వినియోగ పరిమితి విషయంలో ఒక హెక్టార్‌ భూమిని రిజర్వ్‌ ఫారెస్టు భూమి నుండి మినహాయించడం 2005లో ప్రారంభమైంది. ఈ మినహాయింపు క్రమంగా 40 హెక్టార్లకు పెరిగింది. గుండు గుత్తుగా కార్పొరేట్లకు అడవులపై చట్టబద్దత కల్పించడానికి మోడీ ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. వంద నుంచి వెయ్యి హెక్టార్లకు పైగా అటవీ భూమిని అటవీయేతర భూమిగా మార్చడానికి ప్రయత్నిస్తున్నది. దీనివల్ల రాబోయే కాలంలో అటవీ ప్రాంత విస్తీర్ణం తగ్గనుంది. అటవీ భూమిని ఇతర అవసరాలకు మళ్ళించా లంటే అటవీ హక్కుల గుర్తింపు చట్టం కింద అటవీ హక్కులను సంపూర్ణంగా అమలు జరపాలని 2009లో కేంద్ర ప్రభుత్వ అటవీ మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొన్నది. అయితే ఈ అవసరం లేకుండానే ప్రభుత్వ, ప్రయివేట్‌ కంపెనీలకు అటవీ భూమిని మళ్లించేందుకు నూతన అటవీ సంరక్షణ చట్టంలో వీలు కల్పిస్తున్నది. ఈ నియ మాలు అమలైతే అడవి నుండి ఆదివాసీలు నెట్టివేయబడతారు.
చట్ట సవరణ సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధం
ఆదివాసుల సాంప్రదాయ హక్కులతో ముడిపడిన హక్కుల నిర్ధారణ తర్వాతే…అటవీ భూమి మళ్లింపు అనుమతులను పరిశీలించాలని ఒడిశా మైనింగ్‌ కార్పొరేషన్‌కు కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ మధ్య నడిచిన కేసులో…2013 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అటవీ హక్కుల అమలు విషయంలో గ్రామసభ పాత్రను, అటవీ భూమి మళ్లింపు విషయంలో వాటి అనుమతి అవసరాన్ని తీర్పులో స్పష్టం చేసింది. అయినా మోడీ మొండిగా గ్రామసభ, అటవీ హక్కుల చట్టాన్ని నీరుగార్చుతూ సుప్రీంకోర్టు ఉత్తర్వులను లెక్క చేయకుండా రాజ్యాంగ హక్కులను హరిస్తున్నారు. రాజ్యాంగ శాసనంగా పేర్కొన్న పీసా చట్టానికి భిన్నంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాసనాలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసినా, నూతన అటవీ సంరక్షణ చట్టసవరణలతో రాజ్యాంగ లక్ష్యాలకు తూట్లుపొడుస్తున్నది. వనరుల నిర్వహణ, హక్కుల నిర్ధారణ, అమలు చేసే అధికారం గ్రామసభలకు ఉంటుందని 2010 లో కేంద్ర గిరిజన సంక్షేమశాఖ ఉత్త ర్వులు జారీ చేసింది. నూతన అటవీ సంరక్షణ చట్ట నియమాల్లో కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ పాత్రను కనీసం ప్రస్తావించ లేదంటే ఆదివాసీ లపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి వుందో అర్ధమవుతుంది. మైనింగ్‌ యేతర పనులకు భూమి వినియోగానికి వంద రోజుల్లో, మైనింగ్‌ కార్యకలాపాలకు 150 రోజుల్లో అటవీ, పర్యావరణ అనుమతి జారీ చేసేలా స్క్రీనింగ్‌ కమిటీకి అధికారం అప్పగిస్తూ నియమాలు రూపొందించారు. రక్షిత అడవుల్లో లినియర్‌ ప్రాజెక్ట్లు నిర్మాణమవుతాయని, భూమిని పూర్తిగా వినియోగించే అవకాశం వుంటుందని పేర్కొంది. అటవీ పెంపకం కోసం ల్యాండ్‌ బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలని పేర్కొనడం సరికాదు. క్షీణించిన అటవీ భూమిని ప్లాంటేషన్‌ కోసం ప్రైవేట్‌ కంపెనీలకు లీజుకిచ్చే అంశంపై గతంలో ప్రణాళిక సంఘం ఏర్పాటు చేసిన ఎస్‌.సి సక్సేనా కమిటీ చాలా విలువైన సూచనలు చేసింది. అడవులు కోట్లాది మంది ప్రజలకు జీవనోపాధిని కల్పిస్తాయని నిర్ధారించినా… నేడు ఈ లక్షలాది మంది ప్రజలకు ఏమౌతుందో నిబంధనలలో ప్రస్తావించనేలేదు. జాతీయ మోనెటైజేషన్‌ పథకం అమలు రైల్వే శాఖకు అభయారణ్యాలు, నేషనల్‌ పార్క్‌లలో కొన్ని నిబంధనల నుండి 2009 లోనే మినహాయింపు ఇచ్చారు. ప్రభుత్వ, సామాజిక ఆస్తులను ప్రైవేటు, కార్పొరేట్‌ కంపెనీలకు లీజుకు ఇవ్వడానికిగాను జాతీయ మోనెటైజేషన్‌ పథకం 2022-2025 అమలుకు కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. రైల్వే శాఖ, రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖల పరిధిలో సుమారు 18 లక్షల ఎకరాల అటవీ భూమిని మోనెటైజేషన్‌ చేయదగ్గవిగా గుర్తించారు. దానికి వీలుగా అన్ని రకాల నిబంధనల నుంచి మొత్తం మినహాయింపు ఇవ్వాలని, ప్రభుత్వ భూములకు ఇచ్చే మినహాయింపులన్నీ, ప్రైవేటు కార్పొరేట్‌ సంస్థలకు కూడా వర్తింపజేయాలని నిబంధనలలో ప్రతిపాదించారు. కేంద్రం ఆధీనంలోని అనేక గనులను మోనెటైజేషన్‌ ద్వారా కార్పొరేట్‌ సంస్థలకు లీజుకిచ్చి రూ.28,747 కోట్లు ఆర్జించాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వరంగ గనులను ప్రవేట్‌ పరం చేసేందుకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చేయడం పభుత్వ లక్ష్యంగా కనబడుతున్నది. ఇది ఆదివాసుల రాజ్యాంగ హామీలకు పూర్తిగా విరుద్ధం. అంతేగాక ఐదవ, ఆరవ షెడ్యూల్డ్‌, పీసా, సవరించిన వన్య ప్రాణుల రక్షణ చట్టం, అటవీ హక్కుల గుర్తింపు చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది.-పి. అప్పలనర్స

కౌలు రైతుల క‌ష్టాలు

తగినంత భూమి లేని రైతులు పొలాన్ని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. సొంత భూమి ఉన్న రైతులే పంటలు చేతికి రాక, వచ్చిన పంటలకు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారు. అప్పుల పాలవుతున్నారు. బ్యాంకుల సాయం అందక కౌలు రైతుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కౌలు రైతులకు రుణాలు ఇప్పించి ఆదుకుంటామని ప్రభుత్వం చెప్పడమే కానీ ఆచరణలో లేదు. భూమిని కౌలుకు తీసు కొని సాగుచేస్తున్నా, సాగుదారుగా గుర్తింపు లేకపోవటం వలన కౌలుదారులు రైతుగా పొందవలసిన ఏ మేలు అందుకోలేక పోతు న్నారు. కౌలు ఒప్పందాలన్నీ నోటి మాట మీదే ఇప్పటికీ జరుగుతున్నాయి. కౌలు రైతులు భూమి సాగుచేస్తున్నా పంట రుణాలు, రైతు బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీలు,పంట నష్ట పరిహారం-ఇలా రైతులకు అందే ఏ సహాయం వారికి అందడం లేదు. కౌలు కాగితమో, రికార్డు లలో పేరో ఉంటేనే ఏ మేలైనా వారికి దక్కేది. నకిలీ విత్తనాలు, ప్రకృతి బీభత్సాలు, గిట్టుబాటు ధర లేకపోవడం మొదలైన అంశాల వలన కౌలు రైతులూ నష్టపోతున్నారు. సొంత భూమి కలిగి సేద్యం చేస్తున్న వారికయ్యే సగటు ఖర్చులతో పోల్చితే కౌలుదారులకు రెట్టింపు పెట్టుబడి అవుతుంది. -గునపర్తి సైమన్‌
భారతదేశంలో 60శాతం పైగా జనాభాకు ప్రధాన ఆధారమైన వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలో ఉన్నది. గత మూడు దశాబ్దాలుగా అమలు జరుగుతున్న ఆర్థిక సంస్కర ణలు వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని ఊబిలోకి నెట్టాయి. అనేక రాష్ట్రాలలో వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు తగ్గిపోవటం, సబ్సిడీలలో కోత, గిట్టుబాటు ధర లభించక పోవటం, నీటిపారుదల రంగంపై నిర్లక్ష్యం మొదలగు అంశాల న్నీ సంక్షోభాన్ని తీవ్రతరం చేశాయి. ఈ రెండు దశాబ్దాలలో విస్తృతంగా పెరిగిన కౌలురైతాంగం కూడా ఎటువంటి రక్షణ లు లేక తీవ్ర సమస్యలు ఎదుర్కొం టున్నది. స్వంత భూమి కలిగిన రైతులే సేద్యం లాభసాటిగా లేక సంక్షోభం ఎదుర్కొం టుంటే, కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా రూపొందింది. ఆంధ్రప్రదేశ్‌లో 26 జిల్లాలలో సుమారు 35లక్షల మంది కౌలు రైతులు ఉం టారని అంచనా. పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు వంటి జిల్లాలలో 70శాతం సాగు భూమిని కౌలురైతులే పండిస్తున్నారు. భూమిని కౌలుకు తీసుకొని సాగుచేస్తున్నా, సాగుదారుగా గుర్తింపు లేకపోవటం వలన సాగుదార్లుగా పొందవలసిన ఏ మేలు అందుకో లేకపోతు న్నారు. కౌలు ఒప్పందాలన్నీ నోటి మాట మీదే ఇప్పటికీ జరుగుతున్నాయి. కౌలు రైతులు భూమి సాగుచేస్తున్నా పంట రుణాలు, రైతు బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీలు, పంట నష్ట పరిహారం-ఇలా రైతులకు అందే ఏ సహాయం వారికి అందడం లేదు. కౌలు కాగితమో,రికార్డులలో పేరో ఉం టేనే ఏమేలైనా వారికి దక్కేది. నకిలీ విత్తనాలు, ప్రకృతి బీభత్సాలు, గిట్టుబాటు ధర లేకపోవడం మొదలైన అంశాల వలన కౌలు రైతుల్షు నష్టపో తున్నారు. సొంత భూమి కలిగి సేద్యం చేస్తున్న వారికయ్యే సగటు ఖర్చులతో పోల్చితే కౌలు దారులకు రెట్టింపు పెట్టుబడి అవుతుంది. కొన్ని ప్రాంతాలలో, కొన్ని పంటలకు భూయజమానికి కౌలు ముందే చెల్లించవలసి ఉంటుంది.
కౌలురైతు – సామాజిక ఆర్థిక కారణం
సాగునీటి పారుదల ప్రాంతాలలోని పెద్ద రైతులు 1970,80దశకాలలో వ్యవసాయ రంగంలో హరిత విప్లవం వలన లబ్ధి పొంది ఆపై అధిక లాభసాటైన వ్యవసాయేతర రంగా లకు వలసపోయారు. ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో అనేక మంది రైతులు సాగును వదిలి ఇతర రంగాలకు మళ్లి, భూములను కౌలుకు ఇచ్చారు. రైతుబిడ్డలు చదువుకుని తమ గ్రామంలో కాకుండా విదేశాలలో,పెద్దపెద్ద నగరాలలో స్ధిరపడి తమ భూములు కౌలుకు ఇస్తున్నారు. ఆదాయపు పన్ను మినహాయింపు తదితర కారణాల వలన కొంతమంది సంప న్నులు స్థిరాస్తులుగా భూములు కొనుగోలు చేసి కౌలుకిస్తున్నారు. కౌలు రైతులలో 80శాతం వెనుకబడిన తరగతులు,దళిత కుటుంబాలకు చెందిన వారే.ఈసామాజిక కోణాన్ని విశాల దృక్ప థంతో రాజకీయ పార్టీలు, ప్రభుత్వం, అధికారులు అర్థం చేసుకోవాలి. గ్రామాల్లో చిన్న, సన్నకార రైతులు, భూమి లేని వ్యవసాయ కూలీలు, పేదలు వ్యవసాయమే దిక్కుగా ఈ భూములను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. వ్యవసాయాన్ని వదిలేస్తున్న భూ యాజమానుల నుండి సొంత భూమిలేని రైతులు, కూలీలు కూడా పొలాలను కౌలుకు తీసుకొని సేద్యం చేస్తున్నారు. పట్టా భూము లున్న రైతులకన్నా కౌలుదారుల సంఖ్య క్రమేణా పెరుగుతున్నది. మొత్తం సాగుభూమిలో 50 శాతంపైగా కౌలుదారులే సాగు చేస్తున్నారని వ్యవ సాయ శాస్త్రవేత్తలు నిర్వహించిన అనేక అధ్యయ నాలు వెల్లడి చేస్తున్నాయి. అయితే కౌలు రైతులకు ఎటువంటి హక్కులు లేకపోవడంవలన వీరికి బ్యాంకు రుణాలు లభించలేదు. కౌలు రైతుల కోసం ప్రత్యేక చట్టాలు చేయవలసిన అవసరం ఏర్పడిరది.
2011-అధీకృత సాగుదారుల చట్టం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాటి ప్రభుత్వం కౌలు రైతుల కోసం 2011లో అధీకృత సాగుదారుల చట్టం ఆమోదించి, అమలు చేసింది. ఈచట్టం ప్రకారం కౌలు రైతులకు ఎల్‌ఇసి కార్డులు ఇచ్చి, లక్ష రూపాయల వరకు రుణం ఇచ్చే అవకాశం బ్యాంకర్లకు ఉన్నది. ఎల్‌ఇసి కార్డు ఉన్నప్పుడే రుణం పొందడానికి,ఇన్‌పుట్‌ సబ్సిడీ,పంటల బీమా నష్ట పరిహారం పొందడానికి అర్హులు అవుతారు. కాని ఆచరణలో రుణ అర్హత కార్డులు ఇవ్వడంలో ప్రభుత్వాలు విఫలం చెందాయి.ఈచట్టం ద్వారా 2011లో5లక్షల మందికి,2012లో నాలుగు లక్షల మందికి, 2016లో4లక్షల మందికి, 2018-19లో ఆరు లక్షల మందికి రుణ అర్హత కార్డులు ఇచ్చారు. వీరిలో40శాతం మందికి మాత్రమే బ్యాంక్‌ల ద్వారా రుణాలు లభించాయి.ఈరుణాలు కూడా ఎక్కువ భాగం జాయింట్‌ లైబిలిటీ గ్రూపుల ద్వారా ఇచ్చారు. ఎక్కువ సందర్భాలలో భూ యజ మాని అప్పటికే ఆ భూమిపై రుణం పొంది ఉండడం వలన బ్యాంక్‌ అధికారులు కౌలు రైతుకు పంట రుణాలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు.ఆరుణాలు కూడా ఎకరానికి సగటున 5 వేలకు మించి ఇవ్వలేదు. చట్టం అమలుపై చిత్తశుద్ధి లోపించటం,రాజకీ య సంకల్పం లేకపోవడం, బ్యాంకర్ల భయాలు మొదలగు అంశాల వలన 2011-అధీకృత సాగుదారుల చట్టం తగిన ఫలితాలు ఇవ్వలేదు.
2019-కౌలు రైతుల చట్టం
వై.ఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వం పాత చట్టాలను రద్దు చేసి 2019-కౌలు రైతుల చట్టం చేసింది. ఈచట్టం వలన కౌలు రైతు పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడినట్లు అయింది. భూయజమాని సంతకం తప్పనిసరి చేస్తూ చట్టంలో నిబంధనలు విధించటంతో సమస్య జటిలమైంది. భూ యజమానులు సంతకం పెట్టకపోవడంతో అధికారులు సిసిఆర్‌సి కార్డులు మంజూరు చేయడం లేదు. రాష్ట్రంలో దాదాపు 35లక్షల మంది కౌలు రైతులుఉండగా,ఈ సంవత్సరం 5,74,000 కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుని, ఇప్పటకీ రాష్ట్రం మొత్తం 3 లక్షల కార్డులు మాత్రమే ఇచ్చారు. ఉదాహరణకు గుంటూరు విడిపోయిన జిల్లాలో లక్షమందికి పైగా కౌలు రైతులు ఉండగా 37,228 మంది రైతులకు సిసిఆర్‌సి కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటి వరకు 12,418 కార్డులు మంజూరు చేయడం జరిగింది. రైతు భరోసాలో కూడా కౌలు రైతు లకు అన్యాయం జరుగుతున్నది. భూమిలేని ఒ.సికౌలు రైతులకు రైతుభరోసా ఇవ్వడం లేదు.ఈ సంవత్సరం కార్డు లేని కౌలు రైతులకు ‘ఇ-క్రాపింగ్‌’ కూడా చేయడం లేదు. దీని వలన కౌలు రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారు. సిసిఆర్‌సి కార్డులను భూ యజ మానులు తమ బంధువులకు, స్నేహితులకు, అను చరులకు ఇప్పిస్తున్నారు. వాస్తవంగా కౌలు చేస్తున్న వారిలో కొద్ది మందికే సిసిఆర్‌సి కార్డులు ఇస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం చేసిన కౌలు దారుల రక్షణ చట్టం ఘోరంగా విఫలమైంది. చట్టంలో అనేక నిబంధనలు మార్చాలి.
కౌలురైతులు – వివిధ కమిటీలు

  1. మారిన పరిస్థితులలో భూ యాజమాన్య హక్కులకు భంగం వాటిల్లకుండా భూకమతాల గరిష్ట పరిమితికి లోబడి కౌలుదారీ చట్టాన్ని చేయాలని, కౌలు రైతులకు బ్యాంక్‌ రుణాలతో సహా అన్ని సౌకర్యాలు అందించాలని…2016లో ఆంధ్రప్రదేశ్‌లో సమ్మిళిత, సుస్థిర వ్యవసాయ అభివృద్ధి కోసం వేసిన ప్రొఫెసర్‌ రాధాకృష్ణ కమిషన్‌ చెప్పింది.
  2. దేశంలో వ్యవసాయ భూమి కౌలులో సమత్వం,సమర్థత లక్ష్యంగా కౌలు చట్టాలు రూపొందించాలని…నీతి ఆయోగ్‌ ప్రొఫెసర్‌ టి.హక్‌ నేతృత్వంలో నియమించిన కమిటీ…అన్ని రాష్ట్రాలకు సూచించింది. వీరి సూచనల ప్రకారం కౌలు వలన భూమిపై యాజమాన్య హక్కులకు ఎలాంటి ప్రమాదం ఉండదు. కౌలుదారు బ్యాంక్‌ రుణం, ఇతర రాయితీలు పొందవచ్చు.
  3. వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా వ్యవసాయంపై నియమించిన ప్రొఫెసర్‌ జయతీ ఘోష్‌ కమిషన్‌ కౌలురైతుల రక్షణకు అనేక సూచనలు చేసింది. ప్రభుత్వం వాటిని అధ్యయనం చేయాలి.
  4. కౌలురైతుల గురించి వ్యవసాయ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ స్వామినాథన్‌ కమిషన్‌ చేసిన సిఫార్సులు అమలు జరపాలి.
    రాష్ట్రంలో ఏం జరగాలి?
    ఆంధ్రప్రదేశ్‌లో సాగు 70-80శాతం కౌలురైతులపై ఆధారపడి ఉన్నది.కౌలు రైతు లకు ప్రభుత్వం న్యాయం చేయటం లేదు. గుంటూరు జిల్లాలో గత నాలుగు సంవత్సరాలలో ఆత్మ హత్యలు చేసుకున్న రైతులలో 90 శాతం కౌలురైతులే. కౌలు రైతులకు న్యాయం జరగాలంటే దిగువ అంశాలను పరిశీలించాలి.ఈ నేపథ్యంలో భూ యజమానులు కౌలుపెంచి రైతుల కష్టార్జితాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం జిఓ 425 తెచ్చి పేదలు సాగు చేస్తున్న దేవాలయ భూములకు బహిరంగవేలం పెట్టి ఎకరాకు రూ.30 వేల నుండి 60 వేలు పెంచారని పేర్కొన్నారు. దేవుని పేరు చెప్పి నిరుపేదలకు అన్యాయం చేస్తున్నారని వివరించారు. అనాలోచితంగా తీసుకొచ్చిన నూతన కౌలుచట్టం సబ్సిడీ పథకాలు పొందడానికి అవకాశం లేకుండా చేసిందని, సెంటు భూమి కూడా సాగుచేయని భూ యజమానులే పంట రుణాలు పొందుతున్నారని వివరించారు. కౌలు రైతులు ఎనిమిది లక్షల మంది ఉంటే రైతు భరోసా 50 వేల మందికి మించి ఇవ్వడం లేదని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో పంటలు అమ్ముకునే పరిస్థితి లేదని తెలిపారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వడం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఏ పథకాలూ కౌలు రైతులకు వర్తింపజేయడం లేదని, ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు, వ్యవసాయ యంత్ర పరికరాలు ధరలు 30 నుండి 50 శాతం పెరిగాయని తెలిపారు. ట్రాక్టర్‌ డీజిల్‌ ధరలు పెరగడంతో అద్దెలు పెరిగి సాగు ఖర్చులు గతం కంటే ఈ ఏడాది రూ.ఐదువేల నుండి రూ.ఏడువేలు అదనంగా పెరిగిందని వివరించారు. రైతులకు మాత్రం పంటలకు కనీస మద్దతు ధర కూడా అందడం లేదని వివరించారు. రైతుల నష్టాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇప్పటికే ముందుగా కౌలు చెల్లించిన వారికి వచ్చే ఏడాదికి జమచేసుకునే విధంగా చూడాలని కోరారు.
    రుణాలకు బ్యాంకుల విముఖత
    కౌలు రైతులు కష్టాల కడలిలో ఎదురీదు తున్నారు. బ్యాంకులు రుణాలు ఇవ్వక, ప్రభు త్వాల సాయం అందక పెట్టుబడుల కోసం అవస్థలు పడుతున్నారు. వడ్డీలకు తెచ్చి పంటలు సాగు చేస్తున్నారు. కష్టాలకోర్చి పంటలు సాగు చేసినా చివరి దశలో ప్రకృతి కన్నెర్ర చేయడం, మద్దతు ధర లభించకపోవడం, ధాన్యం విక్ర యాల్లో ఇబ్బందులు ఎదురవడం వంటివి కౌలు రైతులను అప్పుల ఊబిలోకి నెడుతున్నాయి. రైతుబంధు, పీఎం కిసాన్‌ పథకాలు పట్టా దారులకే వరంగా మారాయి.కౌలు ధరలు కూడా పట్టాదారు రైతులకే లాభాలు చేకూరు స్తున్నాయి. భూ తల్లిని నమ్ముకున్న కౌలు రైతులు మాత్రం ఆర్థిక భరోసా లేక దిగుబడిపై నమ్మ కంలేక ప్రకృతిపై భారం వేసి సాగుబడి చేస్తు న్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో దాదాపు 60 వేల మందికిపైగా కౌలు రైతులు ఉపాధి పొందుతున్నారు. కౌలురైతులను ప్రభుత్వ పథకాలకు పరిగణలోకి తీసుకోవడం లేదు. పంట పెట్టుబడి రుణాలు కూడా అందని పరిస్థితి. దీంతో పంట పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. కౌలు రైతులను అధికారికంగా గుర్తిస్తామన్న హామీ కూడా నేరవేరడం లేదు. కౌలు రైతులను గుర్తించి రుణ అర్హత కార్డులు అందజేస్తే బ్యాంకుల ద్వారా రుణాలు పొందే అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పట్టాదారులు, ధనిక రైతులు నగరాల్లో ఉంటూ భూములను కౌలుకు ఇస్తున్నారు. కనీసం కౌలు ధరలు కూడా తగ్గించడం లేదు. ఏటా పెంచుతూనే ఉన్నారు. భూమి, నీటి వసతిని బట్టి కౌలు డిమాండ్‌ పెరుగుతుంది. ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం కౌలు విధానం కూడా చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కావడంతో భూములను కౌలుకు తీసుకుంటున్నారు. కౌలు ధరలతోపాటు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల ధరలు పెరిగిపోతున్నాయి. దీనికి తోడు వరికోతలు, పత్తి ఏరడం, కలుపు తీయడం వంటి సమయాల్లో కూలీల కొరత అదనపు భారంగా మారింది. పంట చేతికి వచ్చే సమయంలో నష్టాన్ని చవిచూసే రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారు.
    ఏడాదంతా కష్టపడి వ్యవసాయం చేసినా కౌలు రైతులకు నోటికి.. చేతికి దూరం తగ్గడం లేదు. కౌలుతో సహా విత్తనాలు, ఎరువులు, పురుగుమందులకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇంత వెచ్చించినా ప్రకృతి విపత్తులతో పంట చేతికి రాని సందర్భాలే ఎక్కువ. దీంతో భారీగా కౌలు రైతులు నష్టపోతున్నారు. వీరికి సీసీఆర్‌ (క్రాప్‌ కల్టివేటర్‌ రైట్‌) కార్డులు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం కనీసంగా అందించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా జిల్లా వ్యాప్తంగా 90 శాతం మంది కౌలు రైతులు గుర్తింపునకు నోచుకోవడం లేదు. పెట్టుబడి సాయం, పంట ఉత్పత్తులను అమ్ముకోవడం, నష్ట పరిహారం లేదా ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంటల బీమా, పంటల రుణం ఇలా ఏది వర్తించాలన్నా సీసీఆర్‌ కార్డు ఉండాల్సిందే. వీటన్నిటికి ఈ కార్డు ఉంటేనే కౌలు రైతులకు అర్హత ఉంటుంది. కానీ ఉన్నతాధికారులు జిల్లావ్యాప్తంగా కౌలు రైతులందరికీ సీసీఆర్‌ కార్డులు ఇవ్వడానికి చర్యలు తీసుకోవడం లేదు. ఖరీఫ్‌ సీజన్‌ మొదలైందని… ఈసారైనా అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తే తమకు సీపీఆర్‌ కార్డులు అందుతాయని కౌలు రైతులు అంటున్నారు.
    సకాలంలో అందేనా?
    జిల్లాలో ఖరీఫ్‌ సాగు పనులు మొదలయ్యాయి. సొంత భూమి ఉన్న రైతులు ప్రభుత్వం అందించే అరకొర రాయితీ విత్తనాలకు తోడు, ఇప్పటికే వారి ఖాతాలో జమ అయిన రైతు భరోసా చేదోడుతో సాగుకు సిద్ధమవుతున్నారు. కానీ కౌలు రైతుల పరిస్థితి అగమ్య గోచరం. వారికి ఏ ఆసరా లేదు. ప్రభుత్వం ఏటా వారికి అందించే సీసీఆర్‌సీ పత్రాలు ఇప్పటికీ అందలేదు. గతంలో కార్డులు ఉన్న రైతులు కూడా మళ్లీ రెన్యువల్‌ చేయించుకుంటేనే మనుగడలోకి వస్తుంది. భూ యజమాని అనుమతితో కార్డును రెన్యువల్‌ చేయించు కోవాలి. ఈ ప్రక్రియ మొత్తం మే నెలాఖరు వరకు ముగించి ఖరీఫ్‌ ప్రారంభమయ్యే జూన్‌ నెల మొదటి రెండు వారాల్లో రైతులకు కార్డులు ఇవ్వాలి. కానీ జిల్లా వ్యవసాయ శాఖ ఈ పనిని ఇప్పుడు మొదలుపెట్టింది. సంబంధిత పత్రా లను కౌలు రైతులు సమర్పిస్తే వీఆర్వో ఆమో దంతో కార్డులు కౌలు రైతులకు అందుతాయి. ఈ ప్రక్రియ అంతా జరిగి కార్డులు అందేసరికి జూన్‌ ముగిసిపోవడం ఖాయం. దీని వల్ల కౌలు రైతుల సాగుకు అవసరమైన రాయితీ విత్తనాలు, రైతు భరోసా సాయం కూడా అందదు. సొంత భూమి ఉన్న రైతులే ఖరీఫ్‌ పెట్టుబడుల కోసం నానా అగచాట్లు పడుతోంటే సీసీఆర్‌ కార్డులు లేని కౌలు రైతుల కష్టాలు ఊహించవచ్చు.
    అవగాహన లేకపోవడమే..
    సీసీఆర్‌ కార్డులు అందరికీ అందకపోవడానికి కారణం భూ యజమానులకు వీటిపై అవగాహన లేకపోవడమే. కౌలుదారులకు న్యాయం చేయాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే ముందు భూ యజమానులకు సీసీఆర్‌ కార్డులపై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలి. కౌలు రైతులకు ఈ కార్డు ఇవ్వడానికి అంగీకరిస్తే తమ భూహక్కుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలియజెప్పాలి. ఈ కార్డు మనుగడలో ఉండేది కేవలం 11 నెలలే కాబట్టి తరువాత యజమాని కౌలుదారును మార్చుకున్నా లేక కౌలును రద్దు చేసుకున్నా ఎలాంటి ఇబ్బంది ఉండదని వివరించాలి. కానీ క్షేత్ర స్థాయిలో వీటి మీద అవగాహన కల్పించాల్సిన యంత్రాంగం అంతగా శ్రద్ధ చూపడం లేదు. దీనివల్ల జిల్లా వ్యాప్తంగా 10 శాతం మంది మాత్రమే కౌలు రైతులుగా గుర్తింపు పొందుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తే కౌలు రైతులకు మేలు జరుగుతుందని రైతు సంఘ నాయకులు అంటున్నారు.
    ఏటికేడు తగ్గుతున్న కౌలు రైతులు..
    వ్యవసాయం లాభసాటి కాకపోవడంతో భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేయడం దుర్భరంగా మారింది. దీని వల్ల కౌలు రైతుల సంఖ్య జిల్లాలో బాగా తగ్గిపోతోంది. నీటి సౌకర్యం బాగా ఉంటే ఎకరాకు వేలకు వేలు కౌలు కట్టాలి. తీరా ప్రకృతి విపత్తులతో నష్టం వచ్చినా కౌలు చెల్లించాల్సిందే! మార్కెట్‌లో ధర లేకపోయినా నష్టపోవాల్సిందే. ఈ బాధలు పడలేక చాలామంది కౌలు వ్యవసాయం చేయడానికి సాహసించడం లేదు.
    అంతంత మాత్రంగానే..
    జిల్లా వ్యాప్తంగా దాదాపు మూడు లక్షల మంది రైతులు ఉన్నారు. వీరిలో 25 నుంచి 30 వేల మంది కౌలు రైతులు ఉంటారని అంచనా. వారిలో సీసీఆర్‌ కార్డులు చాలా కొద్ది మందికే ఉన్నాయి. గత ఏడాది ఉమ్మడి జిల్లాలోనే ఈ సంఖ్య 35 వేలు దాటలేదు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు.. కార్డుల జారీ ప్రక్రియ ఎంత లోపభూయిష్టంగా ఉందో. సీసీఆర్‌ కౌలు రైతుల కష్టాలన్నింటినీ తీర్చే సంజీవని అని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. కానీ క్షేత్రస్థాయిలో వాస్తవాలు మరోలా ఉన్నాయి. వాతావరణ పరిస్థితుల వల్ల పంట నష్టపోతే అందించే బీమా…దిగుబడు లకు ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర అన్నింటికీ సీసీఆర్‌సీ లింకు తప్పనిసరి. గత ప్రభుత్వంలో ఈ మెలిక లేకపోవడంతో కౌలు రైతులకు కొన్ని ఫలాలు అందేవి. రైతు సంక్షేమమే తమ ధ్యేయ మని వల్లె వేసే వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణలు, ప్రక్షాళనల వల్ల కనీ సంగా కూడా తమను మేలు జరగడం లేదని కౌలు రైతులు ఆవేదన చెందుతున్నారు.

మానసిక ఒత్తిడిళ్లుల్లో ఉపాధ్యాయులు

ఉపాధ్యాయుల సమయమంతా ‘యాప్‌’లతోనే గడిచిపోతున్నది. ఇటీవల ప్రవేశపెట్టిన ‘ముఖ చిత్ర అటెండెన్స్‌ యాప్‌’ను ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నాడు-నేడు పనులు, మధ్యాహ్న భోజన పనులతో ఉపాధ్యా యులు బోధనపై దృష్టి పెట్టలేకపోతున్నారు. టెక్నాలజీ వినియోగించాలంటే ఇంటర్నెట్‌తో సహా సౌకర్యాలు అవసరం. ఆంధ్రప్ర దేశ్‌లో 670 మండలాలలో దాదాపు 400 మండ లాల్లో ఇంటర్నెటట్‌ సరిగా పనిచేయని పరిస్థితి ఉన్నది. ఉపాధ్యా యులను బోధనేతర పనుల నుంచి విముక్తులను చేయాలి.
ప్రముఖ తత్వవేత్త ఎపిక్యూరస్‌ ‘’విద్య మనిషి నుండి వేరు చేయలేని సంపద’’ అనిపేర్కొన్నా డు.‘’విద్య అనే వృక్షం వేళ్లు చేదుగాను,ఫలాలు తియ్యగాను ఉంటాయని’’ గ్రీక్‌ తత్వవేత్త అరి స్టాటిల్‌ చెప్పాడు. మనిషి తన మనుగడ కోసం ప్రకృతి శక్తులతో పోరాడే క్రమంలో పొందిన అనుభవ పూర్వకమైన జ్ఞానమే విద్య. మానవ సమాజం ఆవిర్భవించిన నాటి నుండి మాన వుడు తాను తెలుసుకున్న జ్ఞానాన్ని, సాధించిన నైపుణ్యాలను తరువాత తరాలకు అందించ టానికి విద్య ద్వారా ప్రయత్నంచేస్తూనే ఉన్నాడు. మానవ సమాజం సామూహికంగా సంపా దించిన జ్ఞాన, అనుభవాలసారాన్ని అందించ టమే విద్యగా నిర్వచించవచ్చు.అటువంటి విద్య ప్రజలందరికి అందుబాటులో ఉండాలి. భారత రాజ్యాంగంలో 45వ నిబంధన ప్రకారం 14 సంవత్సరాల లోపు పిల్లలందరికి ఉచిత, నిర్బం ధ విద్య అందించాలి. 2002లో చేసిన 86వ రాజ్యాంగ సవరణ ప్రాథమిక హక్కులలో 21-ఎ నిబంధన చేర్చి, ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా మార్చింది. 2010లో అమలులోకి వచ్చిన జాతీయ విద్యా హక్కు చట్టం కూడా 14 సంవత్సరాల లోపు పిల్లలందరూ బడిలో ఉండాలని చెప్పింది. కానీ, ప్రజలందరికి అందుబాటులో ఉండవలసిన విద్య భారత దేశంలో,ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ చెందింది. ముఖ్యంగా 1991 లో ప్రవేశపెట్టిన ప్రైవేటీకరణ-సరళీకరణ-ప్రపంచీకరణ విధానాల ప్రభావం విద్యారం గంపై పడి రెండు సమాంతర వ్యవస్థలు ఏర్ప డ్డాయి. పేద విద్యార్థులు, అణచివేతకు గురైన వర్గాల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో ఉండగా, ఆర్థిక సామాజిక స్తోమత కలిగిన వారి పిల్లలు ప్రైవేట్‌,కార్పొరేట్‌ పాఠశాలలో సంస్థలలో చదువుతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ పాఠ శాలల్లో 73 లక్షల మంది పిల్లలు చదువుతుం డగా వారిలో 40లక్షల మంది ప్రభుత్వ పాఠ శాలల్లో,33లక్షలమంది ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠ శాలల్లో చదువుతున్నారు. రాష్ట్రంలో 1,90,0 00 మంది ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశా లల్లో పనిచేస్తుండగా,1,20,000 మంది ప్రైవేట్‌ పాఠశాలల్లో పనిచేస్తున్నారు. విద్యారంగంలో వచ్చిన మార్పులకు ఉపాధ్యాయులు కూడా తీవ్ర మైన ఒత్తిడికి గురవుతున్నారు.
ఉపాధ్యాయుడు -సృజనాత్మకత
ప్రాచీన కాలం నుండి ఇప్పటిదాకా విద్య నేర్పటంలో ఉపాధ్యాయుడు ప్రాధాన్యతగల సృజనాత్మక పాత్ర పోషిస్తు న్నాడు. విద్యార్థి సామాజికీకరణ చెందటంలో సామాజిక విలువ లు పెంపొందటంలో ఉపాధ్యాయుడే ముఖ్య పాత్ర కలిగి ఉంటా డు. ఉపాధ్యాయుడు ‘విద్యా ర్థి కేంద్రీకృత’ బోధన చేయడంతో పాటు విద్యార్థిలో ప్రశ్నించేతత్వాన్ని పెంపొందించాలి. తరగతి గదిలోని ప్రతి విద్యార్థిపై ఉపాధ్యా యుడికి అవగాహన ఉండాలి. విద్యార్థులలో స్ఫూర్తిని కలిగిస్తూ విద్యార్థులకు లక్ష్యాలను నిర్దేశించాలి. ఉపాధ్యాయులు వృత్తిపరమైన నైపుణ్యాలు పెంచు కుంటూ, బోధన పరికరా లు, అవసరమైన టెక్నాలజీ వినియోగిం చుకో వాలి. విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథం,లౌకిక భావనలు, ప్రజాస్వామ్య ఆలోచనలు పెంపొం దించటానికి కృషి జరగాలి.
టెక్నాలజీ ప్రత్యామ్నాయం కాదు
వేగంగా పెరుగుతున్న టెక్నాలజీ, వర్చువల్‌ క్లాస్‌రూం విధానం ఉపాధ్యాయులకు ప్రత్యా మ్నాయంగా మారుతుందని కొంతమంది భావించారు.కాని టెక్నాలజీ ఉపాధ్యాయుడిగా సహాయకారిగా ఉపయోగపడుతుందిగాని, ప్రత్యామ్నాయం కాదని ఆచరణలో రుజువైంది. కరోనా వలన గత రెండేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా మన దేశంలో ఉపయోగించిన ‘ఆన్‌లైన్‌’ టీచింగ్‌ విధానంతో విద్యార్థులలో విపరీతమైన ‘ప్రవర్తనా పరమైన’ ఇబ్బందులు తలెత్తాయి. తల్లిదండ్రులు ముక్తకంఠంతో ఆన్‌లైన్‌ విధానం కంటే ఉపాధ్యాయుల బోధనే అవసరమని అంగీకరిస్తున్నారు. ఇటీవల జరిగిన అనేక అధ్యయనాలు కూడా ఈ విషయాలను ధృవీకరించాయి. అనేక పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ‘స్మార్ట్‌ క్లాస్‌రూం’లు కూడా ఉపాధ్యా యుడు ఉపయోగిం చిన చోటే విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఇటీవల ప్రపంచబ్యాంక్‌ నివేదికలో విద్యారంగంలో మానవ వనరుల కంటే టెక్నాలజీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నది. దీని అర్థం ఉపాధ్యాయుల సంఖ్య తగ్గించటమే. ప్రభుత్వాలు ప్రపంచబ్యాంక్‌ విధానాలను అమలు చేస్తూ ఉపాధ్యాయుల సంఖ్య తగ్గించటానికి భిన్నమైన పద్ధతులలో ప్రయత్నిస్తున్నాయి.
తీవ్ర ఒత్తిడి…
విద్యారంగంలో ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంస్కరణల వలన ఉపాధ్యాయులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. బోధన కంటే బోద óనేతర పనులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తు న్నది. ఉపాధ్యాయులు 14రకాల యాప్‌లు ఉప యోగించవలసిన పరిస్థితి ఏర్పడిరది. ఉపాధ్యా యుల సమయమంతా ‘యాప్‌’లతోనే గడిచిపో తున్నది. ఇటీవల ప్రవేశపెట్టిన ‘ముఖచిత్ర అటెం డెన్స్‌ యాప్‌’ను ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరే కిస్తున్నారు. నాడు-నేడు పనులు, మధ్యాహ్న భోజన పనులతో ఉపాధ్యాయులు బోధనపై దృష్టి పెట్టలేకపోతున్నారు. టెక్నాలజీ వినియో గించాలంటే ఇంటర్నెట్‌తో సహా సౌకర్యాలు అవసరం. ఆంధ్రప్రదేశ్‌లో 670 మండలాలలో దాదాపు 400 మండలాల్లో ఇంటర్నెట్‌ సరిగా పనిచేయని పరిస్థితి ఉన్నది. ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి విముక్తులను చేయాలి.
3,4,5 తరగతుల తరలింపు
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను దగ్గరలోగల హైస్కూళ్లకు తరలించాలనే నిర్ణయం వివాదా స్పదమైనది. నిర్ణయాన్ని పేద తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పాఠశాల విద్యా పరిరక్షణ కమిటీ శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి అనంతపురం జిల్లా పెనుగొండ వరకు నిర్వహించిన బడి కోసం బస్సు యాత్ర కూడా ఈ ఆందోళనను గమనించింది. 3,4,5 తరగ తుల తరలింపు జాతీయ విద్యా హక్కు చట్టానికి పూర్తిగా విరుద్ధమైనది. దీని వలన బలహీన వర్గాలకు చెందిన పిల్లలు, బాలికలు డ్రాపౌట్లు గా మారే ప్రమాదమున్నది. తరగతులు తరలించకుండా ప్రాథమిక పాఠశాలలను పటిష్టపరచాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ సంస్కరణల ద్వారా పాఠశాలల సంఖ్యను 45 వేల నుంచి15 వేలకు తగ్గించటానికి, 50 వేల ఉపాధ్యాయ పోస్టులు తగ్గించటానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది.
ప్రైవేట్‌ ఉపాధ్యాయులు
రాష్ట్రంలో దాదాపు16 వేల ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో 1,20,000 వేల మంది ప్రైవేట్‌రంగ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు.వీరిలో ఎక్కువ మంది అతి తక్కువ వేతనాలతో,ఉద్యోగ భద్రత లేకుండా, సామాజిక భద్రత లేకుండా పనిచేస్తున్నారు. కరోనా కాలంలో దాదాపు 15నెలలపాటు వీరికి వేతనాలు లేక కూలీలుగా మారవలసిన పరిస్థితి ఏర్పడిరది. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రైవేట్‌ ఉపాధ్యాయుల రక్షణకోసంచట్టం చేసి, గుర్తింపు కార్డులు ఇవ్వని వారికి వేతన భద్రత, ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రభుత్వ సహాయం అందించాలి.
కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉపాధ్యాయులు
రాష్ట్రంలో 352 కస్తూరిబా విద్యాలయాలలో దాదాపు 4 వేల మంది కాంట్రాక్టు ఉపాధ్యా యులు, ఆంధ్రప్రదేశ్‌ గురుకుల పాఠశాలలలో 2 వేల మంది కాంట్రాక్టు, గెస్ట్‌ ఉపాధ్యాయులు గా, సాంఘిక సంక్షేమ-గిరిజన సంక్షేమ-బి.సి సంక్షేమ గురుకుల పాఠశాలల్లో దాదాపు 3 వేల మందికి పైగా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీరికి ఉద్యోగ భద్రత లేదు. తక్కువ వేతనాలతో పనిచేస్తు న్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 3,400 మంది కాంట్రాక్టు అధ్యాపకులు, డిగ్రీ, పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 1000కి పైగా కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారు. రాష్ట్రంలో వివిధ విశ్వవిద్యాలయాలలో 5 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉపాధ్యాయులను, అధ్యాపకులను క్రమబద్ధీకరించవలసిన అవస రమున్నది. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి వాగ్దానం చేసిన విధంగా కాంట్రాక్టు ఉపా ధ్యాయులకు, ఔట్‌సోర్సింగ్‌, పార్ట్‌టైం, గెస్ట్‌ ఉపా ధ్యాయులకు కూడా న్యాయం చేయాలి.
రాజ్యాంగ లక్ష్యాలు -విద్య
విద్యా రంగంలో మార్పులు,సంస్కరణలు రాజ్యాంగ లక్ష్యాలు నెరవేర్చేవిగా అందరికీ విద్య అందించేవిగా ఉండాలి. కాని ఆంధ్రప్రదేశ్‌లో సంస్కరణలు విద్యా రంగాన్ని ‘మార్కెట్‌’ దిశగా తీసుకువెళుతున్నాయి. విద్య ద్వారా ‘సామాజిక మనుషులను’ కాకుండా ‘మార్కెట్‌ మనుషులను’ తయారుచేస్తున్నారు. మార్కెట్‌కు అవసరమైన కోర్సులు మాత్రమే ప్రవేశ పెడుతున్నారు. పాఠశాల స్థాయిలో కూడా మార్పులు, గ్రేడ్‌ పాయింట్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ పరి ణామాల నేపథ్యంలో ఉపాధ్యాయులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. ప్రభుత్వం ఉపాధ్యా యులను బోధనకే పరిమితం చేసి, వారి చేత సృజనాత్మకంగా బోధన చేయించే వాతావరణం నెలకొల్పాలి.- (కె.ఎస్‌.లక్ష్మణరావు)

1 2 3 4 5 11