అడవే తిండి పెడుతోంది..

అమ్మ ఉన్న చోట ఆకలి ఉండదనేది ఎంత నిజమో! అడవి తల్లి ఉన్నచోట ఆకలి ఉండదనేది కూడా అంతే నిజం. కరువు కాటేసినా అడవి తల్లి చేరదీస్తుంది. తిండి ఇచ్చి ఆదుకుంటుంది. సాగు చేయకుండానే పంటనిస్తుంది. అందుకే దండకారణ్యంలో ఉంటున్న అడవి బిడ్డలకు తిండి ఎప్పుడూ దొరుకుతుంది.
ఆదివాసులకు అడవే ఆహార భద్రత ఇస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌,చత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లోని దండకారణ్యంలో ఎంతోమంది ఆదివాసులు బతుకుతున్నారు. వాళ్లందరికీ అడవే ఆధారం. సాగు చేయ కుండానే అనేక రకాల ఆకుకూరలు,దుంపలు పండుతాయి. అడవిలో ఎటు వెళ్లినా ఒక పండో,దుంపో దొరుకుతుంది.సంతల్లో 21 రకాల ఆకుకూరలు,పండ్లు, కాయలు, దుంపలు, చిన్న చేపలు,చిన్న రొయ్యలు,కొక్కులు అమ్ము తుంటారు ఆదివాసులు. నాలుగు రాష్ట్రాల సరిహద్దుల్లోని కుంట(ఛత్తీస్‌గఢ్‌),చింతూరు (ఆంధ్ర ప్రదేశ్‌), చర్ల(తెలంగాణ),మోటు (ఒడిశా) సంతలకు కాలాల వారీగా దొరికే కాయలు,ఆకుకూరలు తెస్తారు. వాటిని అమ్మితే వచ్చిన డబ్బుతో వాళ్లకు కావాల్సినవి కొనుక్కుంటారు. ప్రకృతిని ప్రేమించాలి. దండ కారణ్యంలో సాగు చేయకుండా దొరుకుతున్న వాటిపై జన వికాస్‌ సొసైటీ స్టడీ చేసింది. ఆ రిపోర్టు ప్రకారం…కొన్నేండ్ల నుంచి అడవులు నాశనం అవుతు న్నాయి. ముందు ముందు తిండి కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. పరిశ్రమలు, ఆర్గనైజేషన్‌, డిస్‌ప్లేస్‌మెంట్‌, క్లైమేట్‌? ఛేంజ్‌, అభివృద్ధి పేరిట ఆదివాసులను అడవులకు దూరం చేస్తే..వాళ్ల మనుగడకే ముప్పు వచ్చే ప్రమాదం ఉంది. ప్రకృతిని ప్రేమించడం, పూజించడం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. వ్యవసాయంలో సింథటిక్‌ రసాయనాల వాడకం వల్ల తేనెటీగల క్షీణత పెరిగింది. ఇలాగే మరి కొన్నేండ్లు కొనసాగితే ఎక్కడా తిండి దొరకదు.
ఇవి దొరుకుతున్నయ్‌
మిర్చిలో బొబాయి,బోరాయి,చిన్ని కోర్‌ మిడియా పెద్దకోర్‌ మిడియా,నల్ల మిర్చి రకాలు దొరుకుతాయి.వీటితోపాటు తపిడి చిక్కుడు, పెర్మ, తెల్ల చిక్కుడు, కిసీర్‌జాట,బామ్‌జాట, కిసీర్‌ జాట-2,లుగ్గి జాటా తెల్ల వంకాయ, పెద్ద రాముల్క,చిన్న రాముల్క, బుడమ కాయలు, వెదురు కొమ్ములు, పుట్టకొక్కులు, తమిర్‌?మీట,నారదుంప,అడవి ఎలేరి దుంప, నాగేల్‌మాటి దుంప,నోస్కా మాటి దుంప, అడ్డపిక్కలు, ఆకు కూరల్లో తొండుకుసీర్‌?, ఇత్తోడ్‌కుసీర్‌, కుక్కాళ్‌ కుసీర్‌,దోబకుసీర్‌, పండ్లలో తోలె,పరిగి,ఎర్క,వెలగ,పుసుగు.. సీజన్‌ బట్టి దొరుకుతాయి.
ఆహార భద్రతకు ముప్పు
ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన (పిఎంజికెవై) పథకాన్ని ఆహార భద్రత చట్టం (ఎఫ్‌ఎస్‌ఎ)-2013లో విలీనం చేస్తూ కేంద్రం ప్రభుత్వం ఇటీవల తీసుకున్న ‘ఉచిత రేషన్‌’ నిర్ణయం ఒకే దెబ్బకు రెండు పిట్టలు వ్యూ హంగా కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దేశ జనాభాలో మూడిరట రెండొంతుల ప్రజానీకానికి (81.35 కోట్ల మంది) ఏడాది పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు అందజేస్తామని ప్రకటించి సబ్సిడీ ఆహార ధాన్యాల పంపిణీ కొనసాగించబోమని ప్రకటించడంతో నిరుపేదలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయి. ప్రపంచ ఆహార సూచీలో భారత్‌ అట్టడుగున నిలిచిన నేపథ్యంలోనూ ఆహార ధాన్యాలను కుదించడం ఒక ఎత్తుగడ కాగా, రెండోది ‘ఉచితం’ ప్రచార హోరుతో సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లకు గాలం వేయవచ్చున్నది సర్కారు ఎత్తుగడ. 81.35కోట్ల మందికి ఒక్కొక్కరికి 5 కిలోలు చొప్పున మాత్రమే ఇక నుంచి ఉచిత ఆహార ధాన్యాలు అందుతాయి. ఇదే సమయంలో ఆహార భద్రత చట్టం కింద ఒంటరి మహిళలు, వికలాంగులు, నిరాశ్ర యులు,వితంతు ఫించను పొందేవారు, ఏ ఆస రా లేని నిరుపేదలు, నిరుద్యోగులు,వయో వృద్ధులు వంటి లక్షిత కుటుంబాలకు రాయితీ ధరకు లభించే బియ్యం (కిలోరూ.3), గోధు మలు (కిలో రూ.2), ఇతర తృణ ధాన్యాలు (కిలో రూ.1) ఇక అందవు. కేవలం ఉచితంగా ఇచ్చే 5 కిలోల బియ్యం మాత్రమే అందుతాయి. పర్యవసానంగా ఈ నిరుపేదలంతా పౌష్టికా హారం కోసం ప్రయివేటు మార్కెట్‌పై ఆధార పడాల్సివస్తుంది. బయట మార్కెట్లో తక్కువలో తక్కువ కిలో గోధుమల ధర రూ.30గాను, కిలో బియ్యం ధర రూ.40గాను ఉంటోంది. రెక్కాడితే కానీ డొక్కాడని శ్రమ జీవులకే నోటి ముద్ద గగనమైపోతున్న ధరాఘాత సమయంలో ఏ ఆసరా, ఏ పని చేయలేని నిస్సహాయ జీవితా లకు రాయితీ తిండి గింజలు నిరాకరించడం దుర్మార్గం. ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగించేందుకు ప్రజలందరికీ అన్ని వేళలా అవసరమైన ఆహార ధాన్యాలను తగిన మోతాదులో అందుబాటులో ఉండేలా చూడటం, పౌష్టికాహారం తీసుకునేలా ప్రజలను ప్రోత్సహించడం, సహకరించడం ప్రభుత్వాల బాధ్యత. తద్వారా ఆహార సుస్థిరతను సాధించడమనేది ఆహార భద్రతకు విశ్వ వ్యాప్తంగా ఆమోదయోగ్యమైన నిర్వచనం. ఆహార భద్రత హక్కును మన రాజ్యాంగంలో నేరుగా ప్రస్తావించలేదు. కానీ రాజ్యాంగంలోని అధికరణ 21 ప్రకారం కల్పించిన ‘జీవించే హక్కు’ అర్థంలోనే హుందాగా జీవించడమని స్పష్టతనిచ్చింది. హుందాగా జీవించడమంటే అర్థాకలితో అనికాదు కదా. అందుకనే ఆహారం, మనిషి జీవనానికి అవసరమైన ప్రాథమిక అవసరాలు అనేవి కూడా రాజ్యాంగ కల్పించిన హక్కులే. 2013లో ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చింది కూడా ఈ నేపథ్యంలోనే. కానీ ప్రపంచ ఆహార సూచీలో దేశం ఏటికేడూ దిగజారిపోతోంది. పాలకుల ‘అమృతోత్సవ భారతావని’ గొప్పలు ఎంత ఘోరమైనవో.. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ వంటి రాష్ట్రాల్లో తరుచూ వెలుగుచూస్తున్న ఆకలి చావులు స్పష్టం చేస్తు న్నాయి. మోడీ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆహార భద్రత హక్కు, ఉపాధి హామీ వంటి పేదలకు సంబంధించినవాటిపైనే కన్నేసి వాటిని నీరుగార్చే కుట్రలు సాగిస్తూనే వుంది. ఇప్పుడు ఉచిత ఆహారధాన్యాల ఎత్తుగడ కూడా అలాంటిదేనన్న విమర్శకుల విశ్లేషణ సమంజసంగానే కనిపిస్తోంది.కోవిడ్‌ సంక్షోభం, లాక్‌డౌన్‌ నిర్బంధాల నేపథ్యంలో 2020 మార్చి లో పిఎంజికెవైని మోడీ సర్కార్‌ అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పథకానికి ముందు ‘జాతీయ ఆహార భద్రతా చట్టం’ కింద ఆహార ధాన్యాల సబ్సిడీ కోసం కేంద్ర ప్రభుత్వం 2021-22లో రూ.1.85 లక్షల కోట్లు ఖర్చు చేసింది. సబ్సిడీ ఆహార ధాన్యాల్ని నిలిపివేయడం అంటే ఈ మేరకు పేదలందరిపై భారం వేయడమేన్న మాట. గర్భిణీలకు, తల్లులకు, చిన్నారులకు పౌష్టికాహరం అందించే ఐసిడిఎస్‌లకు, మధ్యాహ్న భోజన పథకాలకు కూడా కేంద్రం నిధులను తెగ్గోస్తోంది.ఆ మేరకు రాష్ట్రాలపై భారాలు పెరిగి ఆ పథకాలు క్రమంగా నీరుగారిపోతున్నాయి. కోవిడ్‌ కారణంగా ఉపాధి కోల్పోయి పేదరికం కోరలు చాచిన నేపథ్యంలో పాలకులు ఆహార ధాన్యాల సబ్సిడీ కవరేజీని విస్తృతం చేయాల్సిన అవసరముంది. అలాంటి సమయంలో కోటాకు కోత పెట్టడం అమానుషం. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పున్ణ పరిశీలించడం అవసరం. ఉచిత ధాన్యా లతో పాటు సబ్సిడీ ఆహార ధాన్యాలను కూడా కొనసాగించాలి.
ఆహార భద్రత అందరి బాధ్యత
ప్రతి మనిషి మనుగడకు ఆహారం ఎంతో ముఖ్యం. కానీ నేడు ఆహారం అందరికీ అందుబాటులో లేకపోవడం, ఆకలి కేకలు మిన్నంటడం ఆందోళన కలిగిస్తున్నది. ఆహార పదార్థాల ధరలు పెరగడం ఇందుకు ముఖ్య కారణమైతే, ఆహార వృథా మరొక కారణం. ఆహారం వృథా చేయకపోతే సంపదను సృష్టించి నట్లే! ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తవుతున్న ఆహార ధాన్యాలలో 35శాతం వరకు వృథా అవుతు న్నాయి. భారత్‌లో ఏటా సుమారు రూ.58 వేల కోట్ల విలువైన ఆహార పదార్థాలు వృథా అవుతున్నాయని అంచనా. ప్రపంచ వ్యాప్తంగా 82.2 కోట్ల మంది పోషకాహార లోపంతో బాధ పడుతున్నారు.ఈ లోపంవల్ల ప్రతి ఐదు నిమిషాలకు ఒక పసి బిడ్డ పొత్తిళ్లల్లోనే చనిపోతున్నాడు. బడి మానేసే పిల్లల సంఖ్య పెరుగుతున్నది.భారత్‌లో 5కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు గోదాముల్లో మూలుగుతున్నాయి. వీటిని అవసరమైన వారికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంచితే ఆకలి కేకలు, పోషకా హార లోపాలు తగ్గుతాయి. ప్రపంచ జనాభాకు సరిపడా ఆహారం అందుబాటులో లేకపో వడానికి అనేక కారణాలు ఉన్నాయి. పంటలు పండిరచే భూమి విస్తీర్ణం తగ్గడం, వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోవడం, వ్యవ సాయ రంగంపై ఆశించిన పరిశోధనలు జరగకపోవడం, ఆహార ధాన్యాలు, పదార్థాలు సరిగా నిల్వ చేయకపోవడం, నగరీకరణ, పట్టణీకరణ పెరగడం, వ్యవసాయం లాభసాటిగా లేకపోవడం ప్రధానమైనవి. 2050 నాటికి ప్రపంచ జనాభా 1000 కోట్లు దాటుతుందని అంచనా. ఇప్పటికే 750 కోట్ల ప్రపంచ జనాభాలో ఒక్క పూట తిండికి కూడా నోచుకుని వారి సంఖ్య 150కోట్ల పైమాటే. దీంతో కొన్ని దేశాల్లో ఆకలి చావులు కూడా సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన ఆహారం, వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఏవో) 2030 నాటికి ఆకలి లేని ప్రపంచాన్ని ఆవిష్కరించాలని ప్రయత్నం చేస్తున్నది. ఆహార కొరతను తీర్చాలంటే చాలా కాలంపాటు ఆహార ధాన్యాలు, ఆహార పదార్థాలు పాడైపోకుండా ఉండేలా నిల్వ సదుపాయాలు పెంచాలి. ప్రజలకు ఆహార వృథావల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలి. సరైన ప్యాకింగ్‌ పద్ధతులు పాటించాలి. ఆహారశుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించాలి. నిల్వ ఉంచిన ఆహార ధాన్యాలపై రైతులకు 90% రుణాలు ఇవ్వాలి. వ్యవసాయాన్ని, వ్యవసాయ పరిశోధనలను ప్రోత్సహించాలి. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. ద్రవ్యోల్బణాన్ని అరికట్టాలి. అప్పుడే ఆహార భద్రత సాధ్యమై అందరికీ ఆహారాన్ని అందించగలం.
ఆహార భద్రతా చట్టం అమలయ్యేనా?
గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని పౌరసమాజం, ప్రజాసంఘాలు ఆహార హక్కు అమలు జరిపించడానికి పెద్దఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తేనే ప్రభుత్వాలు కదిలి ఆయా చట్టాలను, పథకాలను రాజకీయ సంకల్పంతో అమలు జరపడానికి అవకాశం ఉంటుంది. ఆకలి వ్యతిరేక పోరాటంలో అగ్రభాగాన నిలిచినందుకు ఈ బహుమతి ఇవ్వ బడిరది. తద్వారా ప్రపంచ పటంపై ఆకలిని అంత మొందించే బృహత్‌ కార్యక్రమం ప్రాధాన్యాన్ని నోబెల్‌ కమిటీ మొత్తం మాన వాళి ముందుం చింది.ఉత్పత్తి జరిగినప్పటికీ పంపిణీ వ్యవ స్థలు సమాజంలోని బాధిత కుటుంబాలకు అను కూలంగా లేవనే వాస్తవాన్ని మనం గుర్తించాలి. 2020లో ప్రపంచ వ్యాప్తంగా ఆహార భద్రత పోషణపై ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌.ఏ.ఒ) ఇచ్చిన నివేదిక 2019 నాటికి దాదాపు 200 కోట్ల మంది ప్రజలు సురక్షితమైన, పుష్టికర, సరిపోయేంత ఆహారం అందుబాటులో లేదని తెలిపింది.పూర్తిగా ఆకలితో అలమటించే పేదలు 2030 నాటికి 84 కోట్లను మించిపోతారని చెప్పింది. ఈ సంవత్సరం కరోనా కాలంలో 13 కోట్ల మంది అదనంగా చేరతారని అంచనా వేసింది. వీరిలో అత్యధి కులు అసంఘటిత రంగంలో పనిచేసే కార్మి కులు, మురికివాడల్లో నివసించేవారు, ఉపాధి కోల్పోయిన వలస కూలీలు అని పేర్కొంది. మనదేశంలో లాక్‌డౌన్‌ అనంతరం కనబడని ఆకలిచావ్ఞలు కరోనా మృతుల కంటే ఎక్కువగా ఉంటా యనే అభిప్రాయం కూడా వినిపిస్తుంది. పౌష్టికాహారలేమితో ఉన్న పిల్లల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వలన వాళ్లే ఎక్కువగా అంటువ్యాధులకు, మరణాలకు గురవడానికి ఆస్కారం ఉంది.
ముఖ్యంగా ఉపాధి కోల్పోయిన కుటుంబాల్లో ఈ సంఖ్య ఎక్కువ. యూనిసెఫ్‌ సంస్థ ఈ ఆరు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 12లక్షల మంది పిల్లలు చనిపోవడానికి ఆస్కారం ఉంటే అందులో మూడు లక్షల మంది భారత దేశంలోనే ఉంటారని హెచ్చరించింది. 2019లో విడుదల చేసిన భౌగోళిక ఆకలి సూచిక ప్రకారం భారతదేశం 117దేశాల్లో 102వ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్‌,నేపాల్‌లు మన కంటే మెరుగ్గా ఉన్నాయి. మన పొరుగు దేశమైన చైనా 25వ స్థానంలో ఉంది. 2017 జాతీయ ఆరోగ్య సర్వే మనదేశంలో 19కోట్ల మంది ప్రజలు ప్రతిరోజు ఆకలితో అలమ టిస్తున్నారని, 4,500 మంది ఐదు సంవత్స రాలలోపు పిల్లలు ఆకలి పోషకాహార లోపం వలన మరణిస్తున్నారని తెలిపింది. ఆహారభద్రత చట్టం ఆవిర్భావం, అమలు ఆహార హక్కు ఐక్యరాజ్యసమితి 1948లో వెలువరించిన మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనలో గుర్తించబడి, 1966లో ఆమోదించబడిన ఆర్థికసామాజిక సాంస్కృతిక హక్కుల అంతర్జాతీయ ఒప్పందంలో స్పష్టపరచబడిరది. ఈ ఒప్పందం అమలు కమిటీ 1999లో ప్రతి ఒక్కరికి ఆకలి నుండి విముక్తి పొందే హక్కును గుర్తించాలని ఆయా దేశాలను ఆదేశించింది. 2000 సంవత్సరంలో భారతదేశం ఆమోదిం చిన ఐక్యరాజ్యసమితి సహస్రాబ్ధి ప్రకటనలో 2015 నాటికి ఆకలి,దారిద్య్రాన్ని తగ్గిం చాలని పేర్కొనబడిరది. తదనంతరం 2015లో ఆమోదించబడిన ప్రకటనలో 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో ఆకలి దారిద్య్రాలను గణనీయంగా తగ్గించాలని ఆదేశించబడిరది. మన దేశం రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్‌ 21 ప్రకారం జీవించే హక్కులో భాగంగానే ఆహార హక్కు గుర్తించబడిరది. అలాగే ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్‌ 47 ప్రకారం ప్రజలందరికీ పౌష్టికా హారాన్ని అందచేయడం,జీవన, ఆర్థిక,ఆరోగ్య ప్రమాణాలను మెరుగుపరుచుటకు రాజ్యం ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పబడిరది.
2001లో దేశంలో ఒకవైపు ఆహార నిల్వలు పేరుకు పోయి మరొకవైపు ఆకలి అంతటా అలుముకున్న సందర్భంలో పిపుల్స్‌ యూనియన్‌ ఆఫ్‌ సివిల్‌ లిబర్టీస్‌ (పియు.సి.యల్‌) స్వచ్ఛంద సంస్థ భారత ప్రభుత్వం, భారత ఆహార కార్పొరేషన్‌, ఆరు రాష్ట్రాల ప్రభుత్వాలపై తక్షణం ప్రజలకు ఆహార సహాయాన్ని అందించాలని సుప్రీంకోర్టులో ప్రజాప్రయో జనాల వ్యాజ్యాన్ని వేసింది.ఆ వ్యా జ్యంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టి కేంద్ర ప్రభుత్వానికి,రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీం కోర్టు చొరవ, ప్రజాఉద్యమాల ఒత్తిడి కార ణంగా భారత ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకా లను, కొన్ని చట్టా లను తీసుకువచ్చింది. అందులో ముఖ్యమైనవి.2005లో తీసుకొ చ్చిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి గ్యారెంటీ చట్టం.ఈ కొవిడ్‌ సందర్భంగా గ్రామాలకు తరలివచ్చిన వలస కార్మికులకు ఈ పథకం సంజీవనిగా పనిచేసింది. తదనం తరం 2013లో జాతీయ ఆహార భద్రత చట్టం తీసుకురాబడిరది. ఈ చట్టంలోని నాలుగు ప్రధాన అంశాలలో ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాల పంపిణీ,6-14 సంవ త్సరాల మధ్య వయసు బాలలకు స్కూల్లో మధ్యాహ్న భోజన పథకం, ఆరు నెలలు-ఆరు సంవత్సరాల మధ్య వయసు పిల్లలకు అంగన్‌ వాడీ కేంద్రాలలో పౌష్టికాహారం,నేటికి కూడా కోట్లాది వలస కూలీ లను, ఇల్లులేని వారిని, అనాధలను, గిరిజనులను గుర్తించడంలో ప్రభుత్వాలు సఫలీకృతం కాలేదు. బయోమెట్రిక్‌ విధానంలోచాలా మంది అర్హతను కోల్పోయారు. -జి ఏ సునీల్ కుమార్ 

ప్రకృతి రణం

సీజన్‌తో సంబంధం లేకుండా ప్రవర్తిస్తున్న ప్రకృతి మనిషిని అల్లకల్లోలం చేస్తోంది. నిజానికి భూమ్మీద ప్రతిజీవి ప్రకృతి మీదే ఆధారపడి బతుకుతుంది. మూడు కాలాలు, ఆరు రుతువులు టైం టు టైం ఉంటేనే ?జీవన చక్రం కరెక్ట్‌గా ఉంటుంది. అలాకాకుండా ఎండా కాలంలో వానలు,చలికాలంలో ఎండలు కాస్తే! వాతావరణంలో వచ్చే మార్పులకు మనిషితో సహా భూమ్మీద ఉన్న ఏప్రాణీ తట్టు కోలేదు. ఆ విషయం ఇప్పటికే ఎన్నోసార్లు రుజువైంది. అయితే, అంతటి విపత్తుల వెనక బోలెడన్ని కారణాలు?ఉండొచ్చు. వాటన్నింటికి ముఖ్య కారణం మాత్రం మనిషే. పెరుగుతున్న టెక్నాలజీ మనిషి లైఫ్‌స్టైల్‌లో మార్పులు తెస్తోంది. దాంతో వాతావరణంలో విషవా యువులు పెరిగిపోతున్నాయి. ఆ ప్రభావం ప్రకృతి మీద తీవ్రంగా ఉంటోంది. కొంత కాలంగా వాతావరణంలో వస్తున్న మార్పులు గమనిస్తే ఆ విషయం అర్థమవుతుంది. అకాల వర్షాలు, వరదలు,భూకంపాలు,కరువు..ఇవి సహజంగా వచ్చే మార్పులు కావు. అసహజం గా ముంచుకొస్తున్న ప్రకృతి విలయాలు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రకృతి ప్రకోపానికి బలవ్వాల్సిందే.
ఇది మింగుడుపడని విషయమే.అయితే ఇప్పటికైనా ఒంటిమీదకు కాస్త తెలివి తెచ్చుకుని నడుచుకోకపోతే పర్యావరణాన్ని కాపాడుకోవడం కష్టం. అంతెందుకు మనల్ని మనమే రక్షించుకోలేం. జీవనానికి సరిపడా వనరులు ఉంటే చాలు. కానీ, అవసరమైనదానికంటే ఎక్కువైతేనే విపరీత పరిణామాలు ఎదురవు తుంటాయి. ఇక్కడా అదే జరిగింది. నిజానికి వానలు లేకపోతే తాగు, సాగు నీరు ఉండదు. కానీ, ప్రకృతి లైఫ్‌?సైకిల్‌?లో మార్పులు వచ్చి ఏకధాటిగా వానలు కురిస్తే మాత్రం ఇలాంటి నష్టాలే జరుగుతాయి. వానల్ని కంట్రోల్‌? చేయడం సాధ్యం కాదు కదా? మన చేతుల్లో ఏముంది? అనొచ్చు. కానీ, వాతావరణంలో వచ్చే మార్పులకు పరోక్షంగా మనమే కారకులవుతున్నాం అన్నది అక్షర సత్యం. అసలు వాతావరణ మార్పులకు కారణాలేంటి? వాటి వల్ల ఏం జరుగుతుంది?
వాయు కాలుష్యం..
శిలాజ ఇంధనాల(ఫాజిల్‌ ఫ్యూయల్స్‌)ను కాల్చడం ద్వారా వచ్చే పొగ వల్ల భూగ్రహం వేడెక్కింది. దాంతో గ్లేసియర్స్‌ ఐస్‌?క్రీంలా కరిగిపోతున్నాయి. అంతేకాకుండా వాటి నుంచి నల్లని మసి, రేణువులను విడుదల చేస్తాయి. ఆ రేణువులు గాలి ద్వారా పైకి వెళ్లి మంచుపై పడతాయి. అక్కడ అవి మంచు కంటే ఎక్కువ వేడిని గ్రహిస్తాయి. దీనివల్ల మంచు వేగంగా వేడెక్కి కరిగిపోతోంది. వాయు కాలుష్యాన్ని తగ్గించడం వల్ల గ్లేసియర్స్‌ను రక్షించొచ్చని ఎక్స్‌పర్ట్స్‌ అంటున్నారు. ఇటుక బట్టీలు, కలప నుండి వచ్చే పదార్థం ఈప్రాంతంలో మూడిరట రెండు వంతుల బ్లాక్‌ కార్బన్‌ను కలిగి ఉం టుంది. రెండవ అతిపెద్ద కాలుష్య కారకాలు డీజిల్‌ వాహనాలు.ఇవి 7-18 మధ్య కాలు ష్యానికి కారణమవుతున్నాయి.
2021 రిపోర్ట్‌ చెప్పే నిజాలివి
2021లో ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు పెరిగాయని స్టేట్‌ ఆఫ్‌ ది క్లైమెట్‌ రిపోర్ట్‌ చెప్తోంది. వాతావరణంలో గ్రీన్‌హౌస్‌ గ్యాస్‌ ఎమిషన్స్‌ సాంద్రత రికార్డు స్థాయికి చేరుకుంది. దాంతో గత ఏడేండ్లుగా టెంపరేచర్‌ పెరుగు తోందని ఈ స్టడీలో తెలిసింది. అదే విధంగా గ్రీన్‌ల్యాండ్‌లో మంచుకు బదులు మొదటిసారి వాన కురిసింది. కెనడా, అమెరికా రాష్ట్రాల్లో తీవ్ర వడగాలులు చెలరేగాయి. వాటి వల్ల కొన్నిచోట్ల టెంపరేచర్‌ అమాంతం పెరిగింది. చైనాలోని ఒక ప్రాంతంలో నెలలో కురవాల్సిన వాన కొన్ని గంటల్లో కురిసింది. యూరప్‌?లో వచ్చిన వరదల కారణంగా ప్రాణ,ఆర్థిక నష్టాలు చాలా జరిగాయి. దక్షిణ అమెరికాలో వరుసగా రెండో ఏడాది కరువు వచ్చింది.దాంతో నదుల్లో నీటిమట్టం తగ్గింది. అగ్రికల్చర్‌,ట్రాన్స్‌పోర్ట్‌, ఫ్యూ యల్‌ ప్రొడక్షన్స్‌ బాగా దెబ్బతిన్నాయి.1990లో శాటిలైట్‌ బేస్డ్‌ సిస్టంతో సముద్ర మట్టాన్ని కొల వడం మొదలైంది.1993 నుంచి 2002మధ్య సముద్ర మట్టాలు ఏడాదికి 2.1మిల్లీమీటర్ల చొప్పున పెరిగాయి. కానీ, 2013 నుంచి 2021 మధ్యలో ఈ లెక్క రెట్టింపయింది. ఏడాదికి 4.4 మిల్లీమీటర్ల చొప్పున పెరిగాయి. ముఖ్యంగా మంచు కరిగిపోవడంతో సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయి.‘‘గత రెండు వేల ఏండ్లలో ఇలా పెరిగింది లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2100 కల్లా సముద్ర మట్టాలు 2 మీటర్లు దాటిపోవచ్చు. అదే జరిగితే ప్రపంచ వ్యాప్తంగా 63కోట్ల జనాభా ఇండ్లు కోల్పోతారు. ఇంకెలాంటి పరిస్థితులు వస్తాయో ఊహిం చలేం’’ అంటున్నారు ఎక్స్‌పర్ట్స్‌
ముందే పసిగట్టారు
పాకిస్తాన్‌లోని పర్వత ప్రాంతంలో 70 లక్షల మంది ప్రజలు మరింత వరదల బారిన పడే ప్రమాదం ఉందని సైంటిస్ట్‌ల అంచనా. కానీ, భూమి వేడెక్కకుండా చేయగల శక్తి మనలో లేదు. పాకిస్తాన్‌లో విడుదలయ్యే వాయువులు కేవలం1% వాతావరణాన్ని దెబ్బతీస్తాయి. అఫ్గానిస్తాన్‌, నేపాల్‌ వంటి దేశాలు కూడా అందుకు తక్కువే కారణమవుతున్నాయి. కానీ ఇప్పటికీ ఆ దేశాలే వాతావరణ మార్పులకు ఎక్కువగా నష్టపోతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో మనదేశమే కాదు.. ప్రపంచం మొత్తం ప్రమా దం అంచున ఉన్నట్లే అనిపిస్తోంది. వాతా వరణ మార్పులు వల్ల జీవరాశులు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మనుషులకు శారీరక, మానసిక ఇబ్బందులు తలెత్తుతాయి. వాటిలో మొదటిది వేడి వాతావరణం.
వేడి పెరిగితే కష్టమే
ఓమాదిరి వేడి వరకు మాత్రమే శరీరం తట్టుకోగలుగుతుంది. అంతకంటే ఎక్కువైతే తట్టుకోలేదు. వేడి తీవ్రత పెరిగిపోతే ఆ వేడికి కండరాలను బ్రేక్‌ చేసేంత శక్తి ఉంటుంది. అందుకనే ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు బయటకి వెళ్లకూడదు అంటారు. ఎందుకంటే ఆ వేడికి గుండె కండరాలు, కణాలు చనిపోయే ప్రమాదం ఉంది. అలాగే వేడి ఎక్కువైతే ఒత్తిడికి కూడా లోనవుతారు. అప్పుడు గుండె.. రక్తాన్ని వేగంగా సరఫరా చేస్తుంది. అదే టైంలో చెమట రూపంలో సోడియం, పొటాషియం శరీరం నుండి బయటకు వచ్చేస్తాయి. ఇలాంటప్పుడు హార్ట్‌ ఎటాక్‌ వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే ఎండ ఎక్కువగా ఉంటే డీహైడ్రేషన్‌ బారిన పడతాం అనే విషయం తెలిసిందే. దానివల్ల కిడ్నీలు డ్యామేజ్‌ అయ్యే అవకాశం ఉంది. అప్పటికే కిడ్నీల కండిషన్‌ సరిగా లేకపోతే వేడి తీవ్రతవల్ల ప్రాణం పోయే అవకాశంఉంది. ఈ విషయంలో వృద్ధులు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. భూమి వేడెక్కేకొద్దీ, దోమలు వాటికి అనుకూలమైన ప్రాంతాలకు ఎక్కువ సంఖ్యలో చేరి…జికా వైరస్‌,డెంగీ,మలేరియా వంటి వ్యాధులకు వాహకాలుగా పనిచేస్తాయి. ఇవేకాకుండా కలరా,టైఫాయిడ్‌,పారాసైట్లు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి.
తిండి కూడా దొరకదు
వాతావరణంలో మార్పులవల్ల ఫుడ్‌ ప్రొడక్షన్‌ తగ్గుతుంది. సరఫరాపై ప్రభావం పడుతుంది. దానివల్ల మనిషికి అవసరమైన పోషకాలు కూడా తగ్గిపోతాయి. ఇంటర్‌ గవర్నమెంటల్‌ పానెల్‌ ఆన్‌ క్లైమెట్‌ ఛేంజ్‌ (ఐపిసిసి) స్పెషల్‌ రిపోర్ట్‌ ప్రకారం..ఉష్ణోగ్రతలు పెరగడంవల్లే పంటలు సరిగా పండడం లేదు. అంతేకా కుండా వాతావరణంలో ఉన్న కార్బన్‌%-డై -ఆక్సైడ్‌ పెరగడంవల్ల మొక్కల్లో ఉన్న జింక్‌, ఐరన్‌, ప్రొటీన్‌ వంటి న్యూట్రియెంట్లు నాశనం అవుతున్నాయి.పోషకాలు లేని ఫుడ్‌ ఎంత తిన్నా వేస్టే. పోషకాలు తగ్గితే అనారోగ్యాలు, క్యాన్సర్‌, డయాబెటిస్‌, గుండె జబ్బులు వంటివి వచ్చే ప్రమాదం ఉంది. అలాగైతే నీళ్లలో పెరిగే జలచరాల్ని తిందాంలే అనుకుంటున్నారా అదికూడా లాభంలేదు. ఎందుకంటే వేడి వాతావరణాన్ని తట్టుకోలేక అవి ధృవ ప్రాంతాలకు వలసపోతున్నాయి. దాంతో చేపలు, రొయ్యల వంటి వాటి నుంచి వచ్చే పోషకాలు కూడా మనిషికి అందకుండా పోతాయి.
ఆరోగ్యం మీద పెద్ద దెబ్బ
అడవులు కాలిపోవడం, సునామీల వంటి ప్రకృతి విపత్తులు ఈ మధ్య ఎక్కువ కావడం వల్ల ఊహించని నష్టాలు జరుగుతున్నాయి. ఇలాంటి వాతావరణ మార్పులు మనుషుల ఆరోగ్యానికి పెద్ద ముప్పు తెస్తాయని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. ఆగస్ట్‌లో అమెరికా యూరప్‌, సైబీరియా దేశాల్లో అడవులు కాలిపోయాయి. దాంతో గాలిలో కాలుష్యం పెరిగి పోయింది. ఆగాలి పీల్చడం వల్ల ఊపిరితిత్తులు, రక్తంలోకి కలుషితాలు చేరిపోతాయి. శరీరంలోని అవయ వాల మీద నేరుగా ప్రభావం చూపకపోయినా, ఇమ్యూనిటీ సిస్టమ్‌ మీద దాని తాలూకా ప్రభావం తప్పక పడుతుంది. దీనివల్ల ఏటా3.6 నుంచి 90లక్షల వరకు అకాల మరణాలు జరుగుతున్నాయని అంచనా. అంతేకాకుండా 65ఏండ్లు పైబడిన వాళ్లకు కాలుష్యం వల్ల ఇన్ఫెక్షన్‌ కలిగించే వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి.
మానసికంగా కూడా…
ప్రకృతి విపత్తులవల్ల శారీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఉదాహరణకు విదేశాల్లో అడవులు తగలబడ టాన్నే తీసుకుందాం.అప్పుడు అక్కడ నివసించే వాళ్లలో కొందరు తమ ఇండ్లు, ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. కొందరైతే సొంతవాళ్లను కోల్పోయారు. మనదేశంలో వరదలు వచ్చిన ప్పుడు కూడా ఇదే పరిస్థితి.సునామీలవల్ల స్ట్రెస్‌,యాంగ్జైటీ పెరిగి పోస్ట్‌ ట్రమాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌కి దారితీస్తుంది.దీన్నే ‘సొలా స్టాల్జియా’ అంటారు. ఈ జబ్బు పోను పోను సూసైడ్‌ చేసుకునే వరకు తీసుకెళ్లే ప్రమాదం ఉంది.
ఏం చేయాలి?
భౌగోళికంగానే కాకుండా శారీరకంగా, మానసికంగా ఎదురవుతున్న ఇన్ని అనర్థాలను ఎలా ఆపాలి? అందుకేం చేయాలని ఎవరిని వాళ్లు ప్రశ్నించుకోవాల్సిన టైం వచ్చేసింది. అలాగే ప్రకృతికి మనం చేస్తున్న నష్టాల గురించి అవగాహన పెంచుకోవాలి కూడా. చెట్లు నరికితే వర్షాలు పడవు. భూములు ఎండిపో తాయి. పంటలు పండవు. ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. వీటన్నింటి వల్ల తినడానికి తిండి, తాగడానికి నీళ్లు కరువు అవుతాయి. ఇవన్నీ తెలిసి కూడా చెట్లు నరకడం మనిషి అజ్ఞానానికి నిదర్శనం. అలాగే వాహనాలు.. వాటి నుంచి వెలువడే పొగ గాలిని కలుషితం చేస్తుంది. మనిషి తెలివితేటల్ని ఉపయోగించి లైఫ్‌?ని ఈజీ చేయాలన్న ఆలోచనతో ఏసీలు, ఫ్రిజ్‌?లు కనిపెట్టాడు. కానీ, వాటి నుంచి విడుదలయ్యే గాలి చాలా ప్రమాదకరం. నిజానికి వీటినుంచి వెలువడే విషగాలులవల్లే ఓజోన్‌ పొరకు రంధ్రం పడిరది. కానీ, అవి లేకుండా బతకలేనంతగా ఆ వస్తువులకి అలవాటు పడిపోయాం.ఆ అలవాటుకు దూరమవ్వాలంటే….ఇంటి పరిసరాల్లో మొక్కలు పెంచాలి. ఇంటికి మంచి వెంటిలేషన్‌ ఉం డాలి. ఇంటినుంచి బయటకు అడుగుపెడితే టూవీలర్‌ లేదా కార్‌ ఎక్కకుండా.. ఎక్కువ దూరాలు జర్నీ చేయాలంటేనే వెహికల్స్‌ వాడాలి. వీలైనంత వరకు నడిచి వెళ్లాలి. నడిచి వెళ్లే దూరం కాదంటే సైకిల్‌ మీద వెళ్లడం మంచిది. ఇప్పటికే కొన్ని దేశాలు, మనదేశంలో కొన్ని రాష్ట్రాలు సైకిల్‌ వాడకాన్ని పెంచాయి. దీనివల్లగాలి కాలుష్యంతో పాటు సౌండ్‌ పొల్యూషన్‌ కూడా తగ్గుతుంది.
సముద్రాలు పొంగితే అంతా నాశనమే
మధ్య ఆసియా పర్వత ప్రాంతాన్ని-‘హై-మౌం టైన్‌ ఆసియా’ అని కూడా పిలుస్తారు. ఈ ప్రాం తంలో హిమాలయన్‌, కారకోరం,హిందూ కుష్‌ పర్వతాలు ఉన్నాయి. చైనా నుండి అఫ్గానిస్తాన్‌ వరకు విస్తరించి ఉన్నాయి. మధ్య ఆసియా పర్వత ప్రాంతంలో 55,000 గ్లేసియర్‌లు ఉన్నాయి. ఉత్తర, దక్షిణ ధృవాల బయట మరెక్కడా లేని విధంగా ఎక్కువ మంచి నీటి నిల్వలు ఉన్నాయి. ఇక్కడ కరిగే నీరు ఆసియాలోని10 అతిపెద్ద నదులకు ఆధారం. దీని బేసిన్లలో దాదాపు రెండొందల కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. 2015 ప్రపంచ బ్యాంకు రిపోర్ట్‌? ప్రకారం75 కోట్ల ప్రజల జీవనోపాధికి గంగా,సింధు,బ్రహ్మపుత్ర నదులు మాత్రమే నీటి వనరులు. చైనాలోని యాంగ్జీ నది ఖండంలోనే అతిపెద్దది-ఆగ్నేయాసి యాలోని మెకాంగ్‌ కూడా హిమాలయ జలాలపై ఆధారపడిరది. కానీ,వేడి ఉష్ణోగ్రతలు వాటిని ప్రమాదంలో పడేస్తాయి. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం,హిమాలయాల్లో ఉష్ణో గ్రతలు ప్రపంచ సగటు కంటే రెండిరతలు వేగంగా పెరుగుతున్నాయి. దాంతో మంచు కరుగుతుంది. గ్లోబల్‌ వార్మింగ్‌ను అదుపు చేయడంలో విఫలమైతే, మధ్య ఆసియాలోని పర్వతాల్లోని మంచు కరిగి, వందేండ్లు పూర్తయ్యేనాటికి మూడిరట రెండు వంతుల భాగం కనుమరుగైపోతుంది. జర్మన్‌ క్లైమెట్‌ రిస్క్‌ ఇండెక్స్‌ ప్రకారం-వాతావరణ మార్పుల వల్ల అత్యంత ప్రమాదకరమైన పది దేశాల్లో నేపాల్‌, పాకిస్తాన్‌ ఉన్నాయి. అయితే మొదటి ఇరవై దేశాల జాబితాలో భారతదేశం కూడా ఉంది. ‘హిమానీనదాలు కచ్చితంగా కరిగిపోతాయి. ప్రస్తుతానికి సరిపడా మంచినీరు ఉంది. కానీ, ముందుముందు ఎంత నీరు ఉంటుందో తెలి యని పరిస్థితి. మన దగ్గర ప్రజలకు వ్యవసా యం ప్రధాన ఆదాయవనరు. మెరుగైన నీటి నిర్వహణ, నీటి శుద్ధిలో పెట్టుబడి పెట్టకపోతే కష్టాలు కొనితెచ్చుకున్నట్టే’ అని కోల్‌కతా, జెఐ ఎస్‌ యూనివర్సిటీ సైంటిస్ట్‌ భట్టాచార్య హెచ్చరించారు.
చల్లటి దేశాల్లో వేడి!
చల్లటి వాతావరణం ఉండే అమెరికా, యూరప్‌లోని దేశాల వాతావరణంలో కూడా కొన్నేండ్లుగా మార్పులొచ్చాయి. ఇవి సంపన్న దేశాలు కావడంతో అక్కడ ఫ్యాక్టరీలతోపాటు వెహికల్స్‌, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు ఎక్కువ. దాంతో కార్బన్‌ ఎమిషన్స్‌ గాల్లో ఎక్కువగా కలుస్తాయి. దానివల్ల గాలిలో కాలుష్యం, టెంపరేచర్స్‌ పెరుగుతాయి. ఇలాంటి పరిస్థితుల వల్లే రెండుమూడేండ్లుగా అమెరికా,యూరప్‌ దేశాల్లో వేడి తీవ్రత ఎక్కువై అడవులు కార్చిచ్చులతో మండిపోతున్నాయి. అలాగే అక్కడి మంచు కూడా కరిగిపోతోంది.చలి కాలంలోనూ టెంపరేచర్స్‌ బాగా పెరిగి,ప్రజలు ఏసీలు వేసుకోవాల్సిన పరిస్థితి ఉంటోంది.
మనదేశంలో..
తూర్పు పసిఫిక్‌ గాలులు బలంగా ఉంటే, అప్పుడు బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో వీచే గాలులు బలహీన పడతాయి. ఇలాంటప్పుడు నార్మల్‌గా కాకుండా ‘లా నినా’ లేదా ‘ఎల్‌ నినో’ కండిషన్స్‌ ఏర్పడతాయి. తూర్పు పసిఫిక్‌లో వేడి వాతావరణం ఉంటే, ఎల్‌ నినో కండిషన్‌,చల్లగా ఉన్నప్పుడు లా నినా కండిషన్‌ ఏర్పడుతుంది. అంటే ఎక్కువ వాల్యూ వస్తే ఎల్‌ నినో,తక్కువ వస్తే లా నినా వస్తుంది. ఇవి ఐదారేండ్లకు ఒకసారి వస్తాయి. ఇలా వచ్చినప్పుడు గాలి దిశలో మార్పులు వస్తాయి. పసిఫిక్‌? సముద్రం మీద వీచే గాలుల్లో తేడా వచ్చినప్పుడు అవి బలహీనంగా ఉండి, మన దేశాన్ని తాకకపోతే ఎల్‌? నినో కండిషన్‌ ఏర్పడి వర్షాలు తగ్గిపోతాయి. అన్ని ఎల్‌ నినో సంవత్సరాలు కరువు తీసుకురావు. కానీ.. నార్మల్‌ రోజుల కంటే తక్కువ ఉన్న సంవత్స రాలు కూడా ఉన్నాయి. అది ఎల్‌ నినో లక్షణం. చాలావరకు ఎల్‌? నినో ఇయర్స్‌ కరువు తీసుకొస్తాయి. అప్పుడు మన దేశంలో వర్షాలు పడాల్సిన ప్రాంతాల్లో వర్షాలు పడవు.లా నినా కండిషన్‌లో తీవ్రమైన గాలులు వీస్తాయి. దాంతో సముద్రం నుంచి తేమ ఎక్కువగా వాతావరణంలోకి రావడంతో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. అన్ని లా నినా కండిషన్స్‌?లో వరదలు వచ్చే సూచన ఉండదు. కానీ.. లా నినా కండిషన్‌లో వరదలు ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయి. ఇలాంటి పరిస్థితులు లోకల్‌గా ఎఫెక్ట్‌ చూపిస్తాయి. ప్రస్తుతం లా నినా కండిషన్‌ మనదేశం మీద ఇంకా ఉంది.ఈపరిస్థితి ప్రపంచమంతటా ఇలాగే ఉంటుంది. యూరప్‌ వంటి దేశాల్లో వాతావరణం వేరేగా ఉంటుంది.కానీ..లా నినా కండిషన్‌ ఎక్కువ అవ్వడంవల్ల గ్లోబల్‌ సర్క్యులేషన్‌లో మార్పులు వచ్చాయి. దాంతో టెంపరేచర్స్‌ ఆపోజిట్‌గా పనిచేశాయి. మన రాష్ట్రం విషయానికొస్తే..రెండేండ్ల నుంచే లా నినా కండిషన్స్‌ వల్ల వర్షాలు ఎక్కువగా వస్తు న్నాయి. మిగతా టైంలో వర్షాకాలంబాగానే ఉంది.ఎంత వర్షపాతం ఉండాలో అంతే ఉంది.
ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
ప్రకృతి విపత్తులు అకస్మాత్తుగా వచ్చినవి కాదు. కొన్నేండ్ల నుంచి ఉన్నవే. మొదటి సారిగా1992లో జర్మనీలోని రియో డి జెనిరోలో ‘వరల్డ్‌ ఎర్త్‌ సమ్మిట్‌’ జరిగినప్పుడే దీన్ని డిక్లేర్‌ చేశారు. అది డిక్లేర్‌ చేసి,ఇప్పటికే 30 ఏండ్లు అయింది. అప్పటి నుంచి ‘ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్యానెల్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌’ (ఐపీసీసీ) రిపోర్ట్స్‌రావడం మొదలైంది. దీన్ని మొదలుపెట్టడానికి కారణం…ప్రాంతీయంగా పర్యావరణ అంశాలను పట్టించుకోకుండా ప్రవర్తించడం, డెవలప్‌మెంట్‌ చేస్తున్నామంటూ గుడ్డిగా వెళ్లడం, నేచర్‌ని నిర్లక్ష్యం చేయడం. వీటివల్లే ఇలాంటి విపత్తులు ఎదుర్కోవాల్సి వస్తోంది. మనదగ్గరే కాదు..ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి ఉంది. స్థానికంగా వాతావరణ పరిస్థితులు కూడా మారాయి. ఉదాహరణకు హైదరాబాద్‌నే చూస్తే…ఒకప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేదు. బిల్డింగ్‌లు, ఫ్యాక్టరీలు,వెహికల్స్‌ పెరిగిపోయాయి. కాలుష్యం కూడా రోజు రోజుకు పెరిగిపోతోంది. వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణలో 2000 సంవత్సరంలో కురిసిన భారీ వర్షం గుర్తుందా ఏ ప్రభావం వల్ల అలా జరిగిందనేది తెలుసుకోవాలి. కానీ, 20 ఏండ్లుగా దాని సంగతే పట్టించుకోలేదు ప్రభుత్వాలు.ఆ తర్వాత 2005లో,2016లో ఇలాంటి విపత్తులే వచ్చాయి. గత ఐదేండ్ల నుంచి ఏటా వానలు, వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అయితే, విపత్తు వచ్చినప్పుడు మాత్రమే అధికారులు హడావిడి చేస్తున్నారు. తర్వాత దాని ఊసే ఉండదు. దీనికి ముఖ్య కారణం వాటర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌(నీటి మౌలిక సదుపాయం) సరిగా లేకపోవడం. వాటర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అంటే.. మంచి నీటి సరఫరా ఎలా జరగాలి వాన నీళ్లు, మురికి నీళ్లు ఎలా వెళ్లాలి అనే వాటి గురించి ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. దాంతో వరద, మురికి నీళ్లు రెండూ కలిసి ప్రవహిస్తున్నాయి. -జిఎన్‌వి సతీష్‌

మన్యం విప్లవం..మహోద్యమం..!

‘‘ బ్రిటిష్‌ దమనకాండకి వ్యతిరేకంగా కొండకోనలలో అడవిబిడ్డలు చేసిన త్యాగాలనీ, రక్త తర్పణలనీ గౌరవించినప్పుడు భారత స్వాతంత్య్ర పోరాటం మరింత మహోన్నతంగా, మహోజ్వలంగా దర్శనమిస్తుంది. వింధ్య పర్వతాలకు ఆవల బ్రిటిష్‌ వ్యతిరేక నినాదాలతో ప్రతిధ్వనించిన కొండలూ, అడవులూ ఎక్కువే. దక్షిణ భారతదేశంలో మాత్రం అంతఖ్యాతి ఉన్న గిరిజనోద్యమం విశాఖ మన్యంలోనే జరిగింది. ఆ మహోద్యమానికి నాయకుడు అల్లూరి శ్రీరామరాజు (జూలై 4,1897-మే7,1924). భారత స్వాతంత్య్ర చరిత్రలో ఒక మహోజ్వల శక్తి అల్లూరి సీతారామరాజు. ఈ విప్లవ యోధుడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్య్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు.’’– గునపర్తి సైమన్‌
భారతీయ చరిత్రలో ఆయన మహో జ్వల శక్తి.మన్యం విప్లవం.. మహోద్యమ శీలి. అడవి నుంచి ఆకాశానికి ఎగిసిన విప్లవ కెరటం అల్లూరి సీతారామారాజు. సమర నాదానికి ప్రతిరూపం..విప్లవ నినాదానికి ఆయువు. బ్రిటీషర్ల పాలిట సింహస్వప్నం. తనను నమ్ముకున్న ప్రజల కోసం ప్రాణ త్యాగం చేసిన విప్లవ వీరుడు అల్లూరి. కేవలం 27ఏళ్ళ వయసులోనే నిరక్షరా స్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడు. రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని గడగడలాడిరచిన అల్లూరి సీతారామరాజు అమాయ కులు,విద్యా విహీ నులైన కొండజాతి ప్రజలను ఒక్క తాటిపై నిలిపి, వారిని విప్లవ వీరులుగా తీర్చిదిద్ది, బ్రిటిష్‌ ప్రభుత్వంపై యుద్ధం చేసిన అల్లూరి వంటివారు భారత విప్లవ చరిత్రలో మరొకరు కానరారు. సీతారామరాజు విప్లవం విజయ వంతం కాకపోయినా, ఆయన ధైర్యసాహసాలు, ప్రాణత్యాగం ఎందరో భారతీయులను ఉత్తేజ పరచి,వారిలో జాతీయతా భావాన్నీ, దేశభక్తినీ పురిగొల్పాయి. సన్యాసి జీవితం గడిపిన రాజు, తన స్వీయ ముక్తి కంటే, అణగారిన ప్రజల సాంఘిక, ఆర్థిక విముక్తికికృషి చేయడమే తన విద్యుక్త ధర్మమని భావించాడు. భారతదేశ చరిత్రలో సన్యసించి, విప్లవ కారునిగా మారిన వారు అరుదు. అరవింద్‌ ఘోష్‌,అల్లూరి సీతా రామరాజు మాత్రమే మనకు కనిపిస్తారు.మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు అసలు చరిత్ర చూస్తే..ఆయన 1897వ సంవత్సరం జూలై 4వ తేదీన విజయనగరం జిల్లా పాం డ్రంగి గ్రామంలో జన్మించాడు. ఆయన తండ్రి వెంకట రామరాజు,తల్లి సూర్యనారాయణమ్మ. పశ్చిమ గోదావరిజిల్లాలోని మోగల్లు వారి స్వగ్రామం. అయితే, తాతగారైన మందలపాటి శ్రీరామరాజు ఇంట సీతారామరాజు జన్మించాడు. గోదావరి పుష్కరాల సమయంలో ప్రబలిన కలరా వ్యాధి తో సీతారామరాజు తండ్రి 1908లో మరణిం చాడు.అప్పుడు రామరాజు ఆరోతరగతి చదువు తున్నాడు. తండ్రి మరణంతో కుటుంబం చాలా కష్టాలు పడిరది. స్థిరంగా ఒకచోట ఉండలేక నివాసం పలు ప్రాంతాలకు మార్చాల్సి వచ్చింది. చివరికి 1909వ సంవత్సరంలో భీమవరం దగ్గరి కొవ్వాడ గ్రామానికి సీతారామరాజు తమ కుటుంబం నివాసం మార్చారు. భీమవరంలో మిషన్‌ ఉన్నత పాఠ శాలలో చేరినా..తొలియేడాదే పరీక్ష తప్పాడు. ఆ తర్వాత కూడా చదువు విషయంలో సీతారామరాజు చాలా ఒడిదొడుకులు ఎదుర్కొ న్నాడు. తండ్రి లేకపోవడం, పేదరికం, నివా సం తరచూ మార్చడం వంటి పరిస్థితులు సీతా రామరాజు చదువుపై చాలా ప్రభావం చూపిం చాయి. 1918 వరకు సీతారామరాజు కుటుం బం తునిలోనే నివాసం ఉంది. ఆ కాలంలో చుట్టుపక్కల కొండలు,అడవులు తిరుగుతూ గిరిజనుల జీవన విధానాన్ని గమనిస్తూ ఉండే వాడు. వత్సవాయి నీలాద్రిరాజు దగ్గర జ్యోతి ష్యం,వాస్తు శాస్త్రం,హఠయోగం,కవిత్వం నేర్చు కున్నాడు. సూరి అబ్బయ్యశాస్త్రి దగ్గర సంస్కృ తం, ఆయుర్వేదం నేర్చుకున్నాడు. పసితనం నుంచే రామరాజులో దైవ భక్తి, నాయకత్వ లక్షణాలు,దానగుణం ఎక్కువగా ఉండేవి. తుని సమీపంలోని గోపాలపట్టణంలో సీతమ్మ కొండపై ఉన్న రామలింగేశ్వరాలయంలో కొంతకాలం తపస్సు కూడా చేశాడు. తన మిత్రుడు పేరిచర్ల సూర్యనారాయణ రాజుతో కలిసి మన్యంలో పర్యటించాడు. దేవాలయాల్లో, కొండలపై, శ్మశానాలలో రాత్రిపూట ధ్యానం చేసేవాడు. సీతారామరాజు అంటేనే ఓ మహో జ్వల శక్తి అనే విషయం అతి తక్కువ కాలం లోనే స్థానికులకు,బ్రిటిష్‌వాళ్లకు బోధపడిరది. ఆయన బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని ఢీకొన్నాడు. సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్య్రం సాధ్యమని నమ్మాడు. ఆ సమయంలో నిరక్షరా స్యులు, నిరుపేదలు, అమాయకులైన తన అను చరులు, అతి తక్కువ వనరులతోనే సంగ్రామం లోకి దూకాడు. ఇలా..భారత స్వాతంత్య్ర సాయుధ పోరాటంలో అల్లూరి సీతారామరాజు పాత్ర ఓప్రత్యేక అధ్యాయం. రెండు సార్లు ఉత్తర భారతదేశ యాత్ర సాగించాడు సీతారా మరాజు. తొలిసారి 1916 ఏప్రిల్‌ 26వ తేదీన బెంగాల్‌ వెళ్లారు. ఆతర్వాత లక్నోలో కాంగ్రె సు మహాసభకు హాజరయ్యాడు.కొంతకాలం కాశీలో ఉండి సంస్కృతం నేర్చుకున్నాడు. తొలి సారి యాత్రలో బరోడా,ఉజ్జయిని,అమృత్‌సర్‌, హరిద్వార్‌,బదరీనాథ్‌,బ్రహ్మకపాలం వంటి ప్రముఖ ప్రదేశాలు చూశాడు.బ్రహ్మకపాలంలో సన్యాసదీక్ష స్వీకరించి, యోగిగా తిరిగివచ్చాడు సీతారామరాజు.తొలియాత్రలో అనేక భాషలు, విద్యలు కూడా నేర్చుకున్నాడు.గృహవైద్య గ్రంథము,మంత్రపుష్పమాల,అశ్వశాస్త్రము, గజశాస్త్రము, రసాయన ప్రక్రియలు వంటి విషయాల గ్రంథాలను అధ్యయనం చేశాడు. 1918లో రెండోసారి ఉత్తరభారతయాత్రకు వెళ్లిన సీతారామరాజు బస్తర్‌,నాసిక్‌,పూనా, బొం బాయి, మైసూరు వంటి ప్రాంతాలు పర్యటిం చాడు. తిరిగొచ్చిన తర్వాత కొంగసింగిలో ఒక మోదుగ చెట్టు కింద మండల దీక్ష నిర్వహిం చాడు. దీంతో రాజుకు అతీంద్రియ శక్తులు న్నాయని స్థానికులు భావించేవారు. అలూరి సీతారామరాజుకు తల్లి అంటే అపారమైన భక్తి. ఎక్కడికి వెళ్లాలన్నా ఆమెకు పాదాభివందనం చేసి బయలుదేరేవాడు. ఆ సమయంలో ఏజెన్సీ ప్రాంతంలో బ్రిటిష్‌ వాళ్ల దురాగతాలు, దోపిడీ లు, అన్యాయాలు ఎక్కువగా చోటుచేసుకునేవి. స్త్రీలపై అకృత్యాలు నిత్యకృత్యంగా ఉండేవి. పోడు వ్యవసాయం,అటవీ ఉత్పత్తుల సేకరణతో జీవనం సాగించే తెల్లదొరలు ఘోరాలకు పాల్ప డేవారు. తోటి గిరిజనుల కష్టాలు చూడలేక వాళ్లకు అండగా నిలవాలని సీతారామరాజు నిర్ణయించుకున్నాడు వాళ్లలో చైతన్యం తీసు కొచ్చాడు. సమయం దొరికనప్పుడల్లా హక్కుల గురించి చెబుతూ ధైర్యం నూరిపోసేవాడు. దీంతో,గిరిజనులు సలహాలు,వివాద పరిష్కా రాలకు సీతారామరాజును ఆశ్రయించే వారు. క్రమంగా దాదాపు 40గ్రామాల గిరిజనులకు రాజు నాయకుడైపోయాడు. యువకులకు యుద్ధ విద్యలు, గెరిల్లా యుద్ధ తంత్రాలు నేర్పి పోరా టానికి సిద్ధం చేశాడు. ఆక్రమంలో గంటందొర, మల్లుదొర,కంకిపాటి ఎండు పడాలు సీతారామ రాజుకు ముఖ్య అనుచరులైపోయారు. అంతేకాదు..దాదాపు 150మందిని మెరికల్లా తయారుచేశాడు సీతారామరాజు.1922 ఆగస్టు 19వ తేదీన మహారుద్రాభిషేకం చేసి చింతపల్లి పోలీసు దోపిడీకి ప్లాన్‌ చేశాడు.1922 ఆగష్టు 22న మన్యంలో తిరుగుబాటు ప్రారంభం అయింది. రంపచోడవరం ఏజన్సీలోని చింతపల్లి పోలీసు స్టేషనుపై 300మంది విప్లవ వీరులతో రాజు దాడిచేసి, రికార్డులను చింపి వేసి, తుపాకులు, మందుగుండు సామాగ్రిని తీసుకువెళ్ళారు. మొత్తం 11తుపాకులు,5 కత్తు లు,1390 తుపాకీ గుళ్ళు,14బాయొనెట్లు తీసుకువెళ్ళారు. ఏమేం తీసుకువెళ్ళారో రికార్డు పుస్తకంలో రాసి,రాజు సంతకం చేసాడు. ఆ సమయంలో స్టేషనులో ఉన్న పోలీసులకు ఏ అపాయమూ తలపెట్టలేదు. మరుసటిరోజే అంటే ఆగష్టు 23న కృష్ణదేవు పేట పోలీసు స్టేషన్‌ను ముట్టడిరచి, ఆయుధాలు తీసుకెళ్ళారు. అక్కడ 7 తుపాకులు, కొన్ని మందుగుండు పెట్టెలు లభించాయి. వరుసగా మూడోరోజు అంటే.. ఆగస్టు 24న రాజవొమ్మంగి పోలీసు స్టేషనుపై దాడి చేసారు. అక్కడ పోలీసుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. అయినా పోలీసు లను ఎదుర్కొని బందీగా ఉన్న వీరయ్య దొరను విడిపించారు. ఈ మూడు దాడులలో మొత్తం 26 తుపాకులు, 2వేల 500కు పైగా మందు గుండు సామాగ్రి సీతారామరాజు బృందానికి లభించాయి.వరుసదాడులతో ఉక్కిరి బిక్కిరైన బ్రిటీషు అధికారులు రాజు నేతృత్వంలోని విప్లవ దళాన్ని మట్టుబెట్టడానికి కబార్డు,హైటర్‌ అనే అధికారులను చింతపల్లి ప్రాంతంలో నియ మించింది. సెప్టెంబర్‌ 24వ తేదీన సీతా రామరాజు దళం గెరిల్లా యుద్ధరీతిలో దాడి చేసి, ఆ అధికారులిద్దరినీ హతమార్చింది. అది చూసి మిగిలిన పోలీసులు చెల్లాచెదురై పోయారు. ఆ ఇద్దరు అధికారుల శవాలను అధికారులు తీసుకువెళ్ళడానికి స్థానికులు మధ్యవర్తిత్వం వహించాల్సి వచ్చింది.1922 అక్టోబర్‌ 15వ తేదీన సీతారామరాజు దళం అడ్డతీగల పోలీసు స్టేషన్‌పై చేసిన దాడి చారిత్రాత్మకమైనది. ఇంతకుముందు చేసిన దాడులకు భిన్నంగా ముందే సమాచారం ఇచ్చి మరీ దాడి చేశారు. కానీ, అప్పటి అధికారులు ముందు జాగ్రత్తగా రక్షణ ఏర్పాట్లు చేసుకున్నా.. ఈ దళాన్ని ఎదుర్కోలేకపోయారు. కేవలం ఆయుధాలు వీరికి చిక్కకుండా దాచిపెట్టడం మినహా ఏమీ చేయలేకపోయారు. ఇక,అక్టోబర్‌ 19వ తేదీన రంపచోడవరం పోలీస్‌స్టేషన్‌ను పట్టపగలే ముట్టడిరచినా ఆయుధాలు దాచి పెట్టడంతో దళానికి ఆయుధాలు దొరకలేదు. అయితే అక్కడి ప్రజలు అసంఖ్యాకంగా వచ్చి రాజుపట్ల తమ అభిమానాన్ని తెలియజేశారు. జ్యోతిశ్శాస్త్రాన్ని నమ్మిన సీతారామరాజు..తాను పెట్టుకొన్న ముహూర్తాన్ని ముందుగా తెలియజేసి ముట్టడిరచి విజయం సాధించడంతో ఆయన సాహసాల గురించి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కథలు కథలుగా చెప్పుకొనేవారు. కొన్ని సార్లు తను ఫలానా చోట ఉంటానని, కావా లంటే యుద్ధం చేయమని కూడా సీతారామ రాజు సవాలు విసిరేవాడు. ఈ పరిణామాలతో సీతారామరాజును వాంటెడ్‌ లిస్టులో చేర్చిన బ్రిటిషు ప్రభుత్వం అక్టోబర్‌ 23న సాండర్స్‌ సేవాని అనే అధికారి నేతృత్వంలో ప్రత్యేక సైనిక దళాలను పంపింది. సాండర్స్‌ దళంతో రాజు దళానికి ముఖాముఖి యుద్ధం జరిగింది. పరిస్థి తులు అనుకూలంగా లేవని సాండర్స్‌ వెనుదిరి గాడు. తమకు పట్టుబడిన బ్రిటిష్‌ పోలీసుల్లో భారతీయులు ఉంటే సీతారామరాజు దళం మందలించి వదిలేసేవారు. అదే ఏడాది డిసెంబర్‌ 6వ తేదీన అల్లూరి విప్లవదళానికి మొదటి ఎదురుదెబ్బ తగిలింది. సీతారామరాజు దళానికి, బ్రిటిష్‌ సైనికులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో బ్రిటిష్‌ వాళ్లు శక్తివంతమైన ఫిరంగులు ప్రయోగించారు.ఆరోజు జరిగిన పోరాటంలో మొత్తం 12 మంది అల్లూరి దళ సభ్యులు మరణించారు. ఆ పరిణామం తర్వాత దాదాపు 4నెలలపాటు దళం కార్యకలాపాలు తగ్గిపోయాయి. సీతారామరాజు ఆ పోరులో చనిపోయాడని,విప్లవం ఆగిపోయిందని పుకార్లు పుట్టాయి. అయినప్పటికీ బ్రిటిష్‌ ప్రభుత్వం మాత్రం అల్లూరి సీతారామరాజును, ఆయన అనుచరులను పట్టి ఇచ్చిన వారికి బహుమతులు ప్రకటించింది. సరిగ్గా ఐదు నెలల తర్వాత 1923ఏప్రిల్‌ 17వ తేదీన ఒక్కసారిగా సీతారామరాజు కొద్దిమంది అనుచరులతో అన్న వరంలో ప్రత్యక్షమయ్యాడు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా ఆయుధాలేమీ దొరకలేదు. అన్నవరం సత్యనారాయణస్వామిని దర్శించుకున్నాడు. అక్కడ పత్రికా విలేఖరులతో మాట్లాడారు. ఆ సంభాషణ 1923 ఏప్రిల్‌ 21వ తేదీన ఆంధ్రపత్రికలో ప్రచురించారు. అప్పటినుంచి సీతారామరాజును ఎలాగైనా పట్టుకోవాలని బ్రిటిష్‌ ప్రభుత్వం గూఢచారుల ద్వారా ప్రయ త్నాలు సాగించింది. సీతారామరాజు దళం టార్గెట్‌గా బ్రిటిష్‌ ప్రభుత్వం మన్యానికి రూథర్‌ఫర్డ్‌ను కలెక్టర్‌గా నియమించింది. కృష్ణదేవుపేటలో సభ నిర్వహించిన రూథర్‌ ఫర్డ్‌..విప్లవకారుల ఆచూకీ వారం రోజుల్లో చెప్పకపోతే..ఆ ప్రాంతంలోని ప్రజలందరినీ కాల్చివేస్తామని హెచ్చరించాడు. ఇది తెలిసిన సీతారామరాజు..తాను లొంగిపోయి మన్యం ప్రజలకు విముక్తి కల్పించాలని భావించాడు. కానీ,స్థానిక మునసబు అందుకు ఒప్పుకోలేదు. దీంతో,1924 మే 7వ తేదీన కొయ్యూరు గ్రామ సమీపంలో ఒక ఏటి వద్ద కూర్చొని, ఒక పశువుల కాపరి ద్వారా సీతారామరాజు తాను ఉన్న చోటు గురించి పోలీసులకు కబురు పంపాడని చెబుతారు. ఏటి ఒడ్డున స్నానం చేస్తూండగా పోలీసులు సీతారామరాజును బంధించారు. కొయ్యూరులో విడిది చేసిన మేజర్‌ గుడాల్‌ వద్దకు సీతారామరాజును తీసుకెళ్లగా.. ఆయ నను ఓ చెట్టుకు కట్టేసి గుడాల్‌ కాల్చి చంపాడు. మే 8వ తేదీన సీతారామరాజు దేహాన్ని ఫోటో తీయించి దహనం చేశారు. ఆయన చితా భస్మాన్ని సమీపంలోని వరాహనదిలో కలిపేశారు. అలా..కేవలం 27 ఏళ్ళ వయసు లోనే అల్లూరి సీతారామరాజు అమరుడయ్యాడు. 1922 ఆగస్టు 22వ తేదీన ఆరంభమైన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విప్లవ పోరా టం 1924 జూలై మొదటివారంలో అంతమైంది.
ఉద్యమానికి అనేక ప్రత్యేకతలు
శ్రీరామరాజు ఉద్యమానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. 1745 నాటి చౌర్స్‌ (బెంగాల్‌) తిరుగు బాటు భారతభూమిలో తొలి గిరిజ నోద్యమం. 1922-24 మధ్య విశాఖ మన్యం లో జరిగినది తుది గిరిజన పోరాటం. కానీ మిగిలిన ఉద్యమాల చరిత్ర మీద ప్రసరించిన వెలుగు రామరాజు పోరు మీద కానరాదు. చోటానాగ్‌పూర్‌, రాంచీ పరిసరాలలో ముండా గిరిజన తెగ బ్రిటిష్‌ ప్రభుత్వం మీద తిరుగు బాటు చేసింది. దీనినే ఉల్‌గులాన్‌ అంటారు. బీర్సా ముండా ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. ఇది 1899-1900 మధ్య కొన్ని నెలలు జరిగింది.బీర్సా జీవితం,ఉద్యమం అద్భు తమైన విషయాలు. కానీ ఆయన ఉద్యమం పది నెలలు మాత్రమే సాగింది. రెండు జిల్లాల పోలీసు యంత్రాంగాన్ని సమీకరించి ఆ ఉద్య మాన్ని బ్రిటిషర్లు అణచివేశారు. కానీ రామ రాజు ఉద్యమం ఆగస్ట్‌ 22,1922న చింతపల్లి (విశాఖ మన్యం) పోలీసు స్టేషన్‌ మీద దాడితో మొదలై, మే 7,1924 వరకు ఉదృతంగా సాగింది.ఆ తరువాత కూడా మరో నెలపాటు రామరాజు ప్రధాన అనుచరుడు గాము గంతన్న ఉద్యమాన్ని నడిపించాడు. కానీ, దీనిని గుర్తించ డానికి గొప్ప ప్రయత్నమేదీ జరగలేదు.విశాఖ మన్య విప్లవం తెలుగువారి చరిత్రలో, ఆమాట కొస్తే భారత గిరిజనోద్యమ చరిత్రలోనే అద్భుత ఘట్టం. రామరాజు చరిత్ర, ఉద్యమం తనకు ప్రేరణ ఇచ్చిందని ఆదిలాబాద్‌ ప్రాంత గోండు ఆదివాసీ ఉద్యమనేత కొమురం భీం (1940) కూడా ప్రకటించాడు. మరణానంతరం రామ రాజు ఔన్నత్యాన్ని గాంధీజీ, సుభాశ్‌బోస్‌, భోగ రాజు పట్టాభిసీతారామయ్య, మద్దూరి అన్న పూర్ణయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు వంటి వారంతా గుర్తించి నివాళులర్పించారు.నిజానికి సాంప్రదాయిక ఆయుధాలను వాడుతూ బ్రిటిష్‌ దమనకాండకు వ్యతిరేకంగా పోరాడడం విశాఖ మన్యానికి కొత్త కాదు. అక్కడ 1790 తరువాత అలాంటి పరిణామాలు జరిగాయి. పోలీసు స్టేషన్లను దగ్ధం చేయడం కూడా ఉండేది. ద్వారబంధాల చంద్రారెడ్డి (1875 ప్రాంతం) ఇందుకు ప్రసిద్ధుడు. మన్యంలో పాత పద్ధతు లను రామరాజు యథా తథంగా తీసుకోక పోయినా కొన్నింటిని అనుసరించారు. ఆగస్టు 19, 1922న శబరి కొండ మీద అమ్మ వారికి అభిషేకం చేయించి రామరాజు ఉద్యమానికి లాంఛనంగా శ్రీకారం చుట్టారు. ఆగస్టు 22న చింతపల్లి స్టేషన్‌ మీద దాడి చేసి తుపాకులు ఎత్తుకు రావడంతో ఉద్యమం వాస్తవంగా మొదలైంది. 23వ తేదీన కృష్ణదేవిపేట, 24వ తేదీన రాజవొమ్మంగి స్టేషన్‌ను రామరాజు లక్ష్యంగా చేసుకున్నారు. మొత్తం 21 తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే మద్రాస్‌ ప్రెసిడెన్సీని గడగడలాడిరచింది. ఇరవై ఒక్క తుపాకులు కలిగి ఉండడమంటే దాదాపు ఒక ఆధునిక పోలీసు పటాలం తయారైనట్టే.

విశాఖ ఉక్కుతో కేంద్రం పరిహాసం

ఇటీవల కాలంలో మొత్తం తెలుగు రాష్ట్రాలను రెండు వివాదాలు కుదిపేశాయి. అందు లో ఒకటి పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకోవడం. రెండవది ఇరు రాష్ట్రాల ప్రభుత్వాధినేతలు లేదా పాలక పార్టీలూ మొదలెట్టిన వృథా వివాదాన్ని ఆపడం. ఇందులో మొదటిది ఇరు రాష్ట్రాల సుహృద్భావానికి, ఉమ్మడి వారసత్వానికి ప్రతీకగా నిలిస్తే రెండవది రాజకీయ పార్టీల సంకుచితత్వానికి అవాంఛనీయ వ్యూహాలకు అద్దం పట్టింది. వాస్తవానికి మొదటి సమస్యపై కూడా రెండో సమస్య తరహాలోనే స్పందనలు రాకపోలేదు. కాని ఇరు రాష్ట్రాలకు శూన్యహస్తమే చూపిస్తున్న మోడీ ప్రభుత్వం విశాఖ ఉక్కు విషయంలోనూ క్రూర పరిహాసమే చేసింది. ఈ స్వల్వ వ్యవధిలోనే ఇరు రాష్ట్రాలనూ పాలిస్తున్న గతంలో పాలించిన పెద్ద పార్టీలకు మర్చిపోలేని పాఠాలు నేర్పించి తన ఆధిక్యతనూ ఏకపక్ష బాధ్యతా రాహిత్యాన్ని తనే వెల్లడిరచుకుంది.
ఆగిన గత ప్రయత్నాలు
2021 అక్టోబరు ప్రాంతంలో కేంద్రం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ లేదా రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ను వంద శాతం ప్రైవేటీకరించాలని నిర్ణయించింది. దీన్ని ఎవరికి ఎంతకు కట్టబెడతారనే దానిపైనా చాలా కథనాలు వచ్చాయి. ఇప్పుడు పూర్తిగా భ్రష్టుపట్టిన అదానీ సామ్రాజ్యంలో ఉక్కు ఫ్యాక్టరీని కలిపేస్తారనే వార్తలు వచ్చాయి. ఇంకా దక్షిణ కొరియా కంపెనీ పోస్కో, టాటా వంటి పేర్లన్నీ కూడా వినిపించాయి. 1966లో తెలుగు ప్రజల పోరాటాలు, కమ్యూనిస్టు ఎంఎ ల్‌ఎల రాజీనామాలు, యువత ప్రాణార్పణలతో ఆవిర్భవించింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది నాడు మార్మోగిన నినాదం. ఇందుకోసం తాము కూడా పోరాడామని తెలంగాణ ప్రభుత్వం అంటున్న మాట కూడా నిజమే. దానికి భూమిని సమకూర్చడం కోసం వేలమంది నిర్వాసితుల య్యారు. ఇప్పటికీ వారిలో అనేకులకు సరైన పరి హారం దొరికింది లేదు. ఆ ఫ్యాక్టరీని ప్రారంభించ డానికి చాలాకాలం పట్టినా ప్రజలు ఓపికగా నిరీక్షించారు. దాన్ని జయప్రదంగా నడిపించడంలో కార్మిక వర్గం ముఖ్యపాత్ర వహించింది. అనేక త్యాగాలు చేసింది. అనతి కాలంలోనే విశాఖ ఉక్కు ప్రపంచ చిత్ర పటంలో చోటు సంపాదించగలి గింది. పెట్టిన పెట్టుబడికి మించి లాభాలు అందిం చింది. అయితే దాని పురోగమనానికి చేయి కలపక పోగా కేంద్రం సైంధవ పాత్ర పోషించింది. సుదీర్ఘ సముద్ర తీరం, నిపుణులైన కార్మిక ఉద్యోగ అధికార బృందంతో మంచి విజయాలు సాధించే ఈ ఫ్యాక్ట రీకి ఇనుప గనులు కేటాయించకుండా తొండి చేసింది. దశాబ్దాల పాటు ఇదే పరిస్థితి కొనసాగు తున్నా రాష్ట్రంలో పాలకపార్టీలేవీ కేంద్రంలో తాము వున్నప్పుడు కూడా మార్పు తెచ్చింది లేదు. పైగా ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ సంకేతాలివ్వడం, కార్మిక సంఘాల నిరసనతో వెనక్కు తగ్గడం జరుగు తూ వచ్చింది. విస్తరణకు నిధులివ్వకపోగాఉత్పత్తిని కుదించడం, కావాలని నష్టాల పాలు చేయ డం వాటి వ్యూహంగా అర్థమైంది. సరళీకరణతో ఈ ధోరణి మరింత ముదిరింది. అయినా కార్మిక సంఘాల ఐక్య ప్రతిఘటన కారణంగా కేంద్రం ఆ పని చేయలేకపోయింది. ఇందుకు అనేక ఉదాహరణలున్నాయి.
మోడీ సర్కారు ఏకపక్ష దాడి
నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక పెట్టుబడుల ఉపసంహరణ అనే ప్రక్రియను పెద్ద ఆర్భాటంగా సాగించడం, అదానీ వంటి ఆశ్రిత పెట్టుబడిదారులకు కట్టబెట్టడం నిత్యకృత్యమైంది. అయినా మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడే విశాఖకు ఎసరుపెట్టే చర్యలు తీసుకున్న కేంద్రం మలి దఫా గద్దెక్కాక నేరుగా దాడి తీవ్రం చేసింది. వంద శాతం ప్రైవేటీకరణ చేయనున్నట్టు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. వాజ్‌పేయి హయాం లోనే ఇలాంటి ప్రతిపాదన వస్తే తాము అడ్డుకున్నా మని చంద్రబాబు నాయుడు తరచూ చెబుతుం టారు. కానీ మోడీ ప్రభుత్వంలో దీర్ఘకాలం పాటు భాగస్వామిగా వున్న ఆ పార్టీ నేతలు ఈ విషయమై సంకేతాలు వస్తున్నా నిరోధించే తీవ్ర ప్రయత్నమేదీ చేయలేదు. ఇప్పుడున్న వైసిపి జగన్‌ ప్రభుత్వం కూడా ముందస్తుగా అడ్డుకోకపోగా ప్రకటన వచ్చాక కూడా నీళ్లు నములుతూ కూర్చుంది. ప్రైవేటీకరణ తరహాలో వాటాలు విడుదల చేయాలని, భూములు అమ్మి అప్పులు కట్టాలనీ ముఖ్యమంత్రి మొదట్లోనే విడ్డూరమైన ప్రతిపాదనలతో లేఖ రాశారు. మరో వైపున కార్మిక సంఘాలు, వామపక్షాలు నిశితంగా వ్యతిరేకించడమే గాక సమరశీల పోరాటం మొదలె ట్టాయి. ఆ దశలో విశాఖ వచ్చిన ముఖ్యమంత్రి తాము గట్టిగా మాట్లాడతామంటూ వారితో నమ్మబలికారు గాని ఆ దిశలో జరిగింది శూన్యం. టిడిపి,వైసిపి ఒకరినొకరు విమర్శించుకోవడమే తప్ప కేంద్రంపై ఏకోన్ముఖ పోరాటానికి సిద్ధం కాలేదు. బిజెపి ఎ.పినాయకులు రకరకాల మాటలతో గంద రగోళం పెంచడమేగాక ప్రైవేటీకరణ వల్ల ఉద్యో గాలకేమీ ముప్పు రాదని సమర్థన ఎత్తుకున్నారు. రామతీర్థం వంటి మతపరమైన అంశాలతో దృష్టి మళ్లించే ప్రయత్నం చేశారు. బిజెపి మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కేంద్రంతో మాట్లాడుతున్నానంటూనే రాష్ట్రానిదే తప్పని వింత వాదన తెచ్చారు. అఖిల పక్షాన్ని తీసుకువెళ్లడానికి జగన్‌ సిద్ధం కాకపోవడం వల్లనే ఇదంతా జరిగిం దన్నారు. ఈవిధంగా మూడు పార్టీలు అవకాశవాద రాజకీయాలు అనుసరించడం బిజెపికి కొమ్ములు తెచ్చింది. కార్మిక సంఘాలు మాత్రం ఎవరి విధా నం ఎలా వున్నా అందరినీ కలుపుకొని లక్ష్యం సాధించడమే తమ మార్గమంటూ అందరికీ సహకారం అందించారు. మరో వంకన ఫ్యాక్టరీ స్థాపనకు దారితీసిన పరిస్థితులు మొదటి నుంచి కేంద్రం సాగించిన నయవంచన, లెక్కల టక్కుటమారం బహిర్గతం చేయడం ద్వారా గొప్ప సైద్ధాంతిక పోరాటం కూడా చేశాయి. స్వంత ప్రత్యేక గనులు (క్యాప్టివ్‌ మైన్స్‌) కేటాయించక పోవడం వెనక గల దుష్ట తంత్రం ఏమిటో, నష్టాలు ఎందుకు వచ్చాయో తెలియజెప్పాయి. ఈ చర్చ మొదలైన తర్వాత కూడా జరిగిన గనుల కేటాయిం పు సమయంలో ఒరిస్సా లోని గనుల కోసం ఒత్తిడి తెచ్చాయి. విశాఖ యాజమాన్యం కూడా వేలం పాటలో పాల్గొంది.కాని కేంద్రం కావాలని ప్రైవే టు కంపెనీలకే ప్రాధాన్యతనిచ్చింది.విశాఖ ఉక్కు అభ్యర్థనను పట్టించుకోలేదు.
మోడీ మొండి చేయి!
కార్మిక సంఘాల పోరాటం తీవ్రమైన కొద్దీ తమ నిర్ణయంలో మార్పు లేదని చెప్పడం పనిగా పెట్టుకుంది. ఇందుకోసం లీగల్‌,అసెస్‌ మెంట్‌,బిడ్డింగ్‌ కమిటీలను ఏర్పాటు చేసింది. మొదట్లో అదానీ,టాటా,దక్షిణ కొరియాకు చెందిన పోస్కో వంటి కంపెనీలు తీసుకోవచ్చనే కథలు వినిపించాయి. వ్యూహాత్మకంగానే టాటాల పేరు తెచ్చినట్టు కూడా చెప్పారు. కొద్ది మాసాల కిందట ప్రధాని మోడీ విశాఖ వచ్చినప్పుడు పాల్గొన్న బహి రంగసభ వేదికపై ముఖ్యమంత్రి జగన్‌ మొక్కుబడిగా విశాఖ ఉక్కు ప్రస్తావన తెచ్చారే గాని గట్టిగా మాట్లాడిరది లేదు. ఆయన స్పందన అంతకన్నా లేదు. అప్పుడే ప్రధానితో స్వల్ప సమావేశం జరిపిన పవన్‌ కళ్యాణ్‌ కూడా మంచిరోజులు వస్తాయని చెప్పడం తప్ప దీనిపై సాధించింది లేదు. కాకపోతే ఈ లోగా అదానీ బండారం బయిటపడిపోయింది. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి గనక కొంతకాలం కొత్త ఎత్తులతో కాలక్షేపం చేయొచ్చని బిజెపి వర్గాలు వెల్లడిరచాయి.
బిడ్ల ప్రహసనం, గడువు పెంపు
మొదటి నుంచి ఈప్రైవేటీకరణను గట్టిగా వ్యతిరేకిస్తున్న కెసిఆర్‌ ఈ దశలో రంగంలోకి దిగి అమ్మకమే జరిగేట్టయితే తాము కూడా వేలంలో పాల్గొని కొనుగోలు చేస్తామనడంతో కొత్త వివాదం మొదలైంది. తెలంగాణ సర్కారు చూపిన పాటి తెగువ కూడా జగన్‌ ఎందుకు చూపడం లేదనే ప్రశ్న వచ్చింది.అత్యుత్సాహవంతులైన వైసిపి మంత్రులు బిఆర్‌ఎస్‌పై దాడి చేసేవరకూ వెళ్లారు. అయితే అక్కడ అమ్మకమే లేదని ఆసక్తి వ్యక్తీకరణ పేరిట వర్కింగ్‌ పెట్టుబడిని మాత్రమే ఆహ్వానిస్తు న్నారని ఎ.పి సర్కారు సలహాదారు సజ్జల రామ కృషా ్ణరెడ్డి సమర్థించారు. తాము విశాఖ ఉక్కు కొనుగోలు చేయడం కోసమనిగాక అక్కడ పరిస్థితిని, అవకాశాలను అధ్యయనం చేయడం కోసం అధికా రుల బృందాన్ని పంపుతామని కెటిఆర్‌ ప్రకటిం చారు. ఇది విశాఖ ఉక్కుపై జగన్‌ ప్రభుత్వ స్పంద నా రాహిత్యానికి సవాలేనని అందరూ భావించారు. కార్మిక సంఘాలూ ఆహ్వానించాయి. ఈదశలో సందర్శనకు వచ్చిన కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగన్‌ సింగ్‌ కులస్తే తాము ఇప్పుడు ప్రైవేటీ కరణ కోసం గాక నిర్వహణ సామర్థ్యం పెంచే పెట్టుబడి కోసమే ప్రయత్నిస్తున్నామని సన్నాయి నొక్కులు నొక్కారు. దీన్నిబట్టి తమవల్లనే కేంద్రం వెనక్కు తగ్గిందని, ఇది తెలంగాణ దెబ్బ అని కెటి ఆర్‌తో సహా బిఆర్‌ఎస్‌ నాయకులు నిన్న మధ్యా హ్నానికి హడావుడి మొదలెట్టారు. ఉక్కు ఫ్యాక్టరీ కార్మిక సంఘాలు అంతగా తొందరపడకపోగా సాయంత్రం సమావేశంలో అదే కేంద్ర మంత్రిని స్పష్టత కోసం నిలదీశారు. దాంతో తానేమీ చెప్పలేనని ఆయన గొంతు మార్చారు. ప్రజాశక్తిలో నిన్న ఉదయమే కేంద్రం వంచన అంటూ పతాక శీర్షిక వచ్చింది. దాంతో సూటిగా తాము ప్రైవేటీ కరణకే కట్టుబడి వున్నట్టు కేంద్రం మొండి వైఖరిని పునరుద్ఘాటించింది. దాంతో ఒకప్రహసనం ముగి సింది. ఈ రోజు తెలంగాణ లేదా సింగరేణి తర పున బిడ్‌ దాఖలు కాలేదని సమాచారం. ఆ గడు వును మరో ఐదు రోజులు పొడగించినట్టు చెబుతు న్నారు. విశాఖ నుంచి మళ్లీ లోక్‌సభకు పోటీ చేస్తానని ప్రకటించిన సిబిఐ మాజీ జె.డి లక్ష్మీనారా యణ కూడా బిడ్‌ వేసి క్లౌడ్‌ఫండిరగ్‌తో ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవచ్చని చెబుతున్నారు. ఇవేవీ కూడా సమస్యకు అసలైన పరిష్కారాలు కావు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాల చొరవతో మరో సమైక్య ఉద్యమం జరిపి దాన్ని ప్రభుత్వరంగంలోనే కొనసాగించేలా కేంద్రం మెడ వంచాల్సిందే. అందుకు భిన్నంగా ఎ.పి ప్రాంతీయ పార్టీలు తమ మెడలు వంచి మోడీకి వంత పాడుతుండటం దారుణం.20వ తేదీ తర్వాత కూడా ఈ పరిస్థి తిలో మార్పు ఆశించలేము. పైగా విశాఖ ఉక్కు సమర్థత పెంచడానికి వర్కింగ్‌ పెట్టుబడి సమకూ ర్చడం మరింత పటిష్టం చేసి ప్రైవేటు కార్పొరేట్‌కు కట్టబెట్టే కుట్రమాత్రమే.
వివాదాలు హానికరం
విశాఖ ఉక్కు అమ్మకంలో సాంకేతి కంగా తెలంగాణ సర్కారు లేదా సింగరేణి వారు పాల్గొనవచ్చునా, నిబంధనల మేరకు అందుకు కేంద్రం అనుమతినిస్తుందా అనేది ఇంకా అస్పష్టమే. అందుకు ఆటంకం కలిగించే నిబంధనలు కొన్ని వున్నాయి. అయితే విశాఖ ఉక్కును కాపాడుకో వడం కోసం ఇరు రాష్ట్రాల ప్రజల బలీయమైన ఆకాంక్షకు బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చొరవ తీసుకోవడం ఆహ్వానించదగిందే. ఇలాంటి సమయంలో తెలం గాణ మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యలు వాటిపై ఎ.పి మంత్రుల ప్రతిసవాళ్లు వివాదానికి దారితీయ డం దురదృష్టకరం.ఎనిమిదేళ్ల కిందటే విడిపోయి ఇంకా విభజన సమస్యలు కూడా పరిష్కారం గాని రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పర వ్యతిరేక భావాలకు ఆస్కారం ఇవ్వడం సరైంది కాదు. బిఆర్‌ఎస్‌, వైసిపి లు పార్టీలుగా వాదించుకోవచ్చు గాని సోదర రాష్ట్రా లుగా సవాళ్లు, ప్రతి సవాళ్లతో రెచ్చగొట్టుకోవడం ఉభయులకూ శ్రేయస్కరం కాదు. తమ తమ పథకాలను ఎవరైనా కీర్తించుకోవచ్చు గాని అంతిమ తీర్పరులు ప్రజలే. (ప్రజాశక్తి సౌజన్యంతో..)

ప్రజాస్వామ్యం బలహీనపడుతుందా?

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ప్రజాస్వామ్యం బలహీనపడు తోందని స్వీడన్‌కు చెందిన వీ-డెమ్‌ ఇన్‌స్టి ట్యూట్‌ ఒక నివేదికలో పేర్కొంది. భారత్‌తో పాటు ప్రపంచంలోని ఇతర దేశాల్లో కూడా ప్రజాస్వామ్యం క్షీణిస్తోందని ఈ నివేదిక చెప్తోంది. స్వీడన్‌లోని గూటెన్‌బర్గ్‌ విశ్వవిద్యా లయానికి అనుబంధంగా వీ-డెమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ పనిచేస్తోంది.‘ఉదారవాద ప్రజా స్వామ్య సూచీ’ (లిబరల్‌ డెమొక్రసీ ఇండెక్స్‌) పేరుతో మొత్తం179 దేశాలకు ఈ సంస్థ ర్యాంకులు ఇచ్చింది. ఇందులో భారత్‌ 90వస్థానంలో నిలవగా,డెన్మార్క్‌ మొదటి స్థానం పొందింది. భారత్‌ పొరుగు దేశాలైన శ్రీలంక 70వ స్థానంలో, నేపాల్‌ 72వ స్థానంలో, పాకిస్తాన్‌ 126 స్థానంలో, బంగ్లాదేశ్‌ 154వ స్థానంలో నిలిచాయి. మోదీ ప్రభుత్వ పాలనలో మీడియా, పౌర సమాజం, ప్రతిపక్షాలకు స్థానం సన్నగిల్లు తుండటంతో భారతదేశం ప్రజాస్వామ్య హోదాను కోల్పోయే దిశలో ఉందని ఈ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలను, స్థానిక సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుని దీన్ని తయారుచేసినట్లు వీ-డెమ్‌ ప్రతినిధులు తెలిపారు. సంక్లిష్టమైన డాటా ఆధారంగా ఈ రిపోర్ట్‌ తయారు చేశామని, అందువల్ల ఇది, మిగతా రిపోర్టుల కన్నా భిన్నమైందని తెలిపారు.
ప్రజాస్వామ్యం అంటే…
‘‘ప్రజాస్వామ్యానికి ఎనిమిది లక్షణాలు ఉండాలి. అవి…భావ ప్రకటన స్వేచ్ఛ, లౌకికవాదం (సెక్యులరిజం), మత జోక్యం లేని ప్రభుత్వం, గణతంత్ర వ్యవస్థ, చట్టం ముందు అందరికీ సమానత్వం, ప్రాథమిక హక్కులు, ఓటు హక్కు’’ ఉండాలని ప్రసార భారతి మాజీ ఛైర్మన్‌ ఎ.సూర్య ప్రకాశ్‌ అన్నారు. ఇతర దేశాలతో పోల్చుకుంటే భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో వైవిధ్యం ఎక్కువగా కనిపిస్తుందని ఆయన అన్నారు.‘‘ప్రతి దేశంలోనూ ఏదో ఒక లోపం ఉంటూనే ఉంటుంది. మొత్తం తప్పును మోదీ ప్రభుత్వంపై మోపుతున్నారంటే, వాళ్లకి మన రాజ్యాంగం అర్థం కాలేదనే అనుకోవాలి. ప్రస్తుతం దేశంలో 28 రాష్ట్రాల్లో సగం వాటిలో వివిధ పార్టీలు అధికారంలో ఉన్నాయి. 28 రాష్ట్రాల్లో 42 పార్టీలు ప్రభుత్వాల్లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఒక కూటమే! అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌తో సహా పలు దేశాల నేతలు భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రశంసిస్తున్నారు’’ సూర్య ప్రకాశ్‌ అన్నారు. ‘‘భారత్‌లో తగ్గిపోతున్న ప్రజాస్వామ్య విలువలు, ముఖ్యంగా ఉదారవాదం క్షీణిస్తున్న పరిస్థితిని చాలావరకూ వీ-డెమ్‌ నివేదిక తెలియజేస్తోంది. భావ ప్రకటన స్వేచ్ఛ, మీడియా స్వతంత్రకు ముప్పు, భిన్నాభిప్రాయాలను అణచివేయడం లాంటి విషయాల్లో ప్రభుత్వ అసహనం కనిపి స్తోంది’’ అని అబ్జర్వర్‌ రిసెర్చ్‌ ఫౌండేషన్‌ ప్రజాస్వామ్య నిపుణులు నిరంజన్‌ సాహూ అన్నారు. ‘‘భారత్‌లో మీడియాకు స్థానం తగ్గిపోతోందని ఈ నివేదికలో తెలిపారు. గత ఎనిమిది, పదేళ్లల్లో మన దేశంలో ఏం జరిగిందనే వీళ్లకు తెలీదు. ‘రిజిస్టార్‌ ఆఫ్‌ న్యూస్‌ పేపర్స్‌’ ప్రతి సంవత్సరమూ కొన్ని గణాంకాలను విడుదల చేస్తుంది. వీటి ప్రకారం 2014లో దినపత్రికల సర్క్యులేషన్‌ 14 కోట్లు ఉండగా, 2018కి అది 24 కోట్లకు పెరిగింది. దేశంలో ఉన్న 800 టీవీ ఛానళ్లలో 200 న్యూస్‌ ఛానల్స్‌ ఉన్నాయి. ఐదేళ్లల్లో ఇంటర్నెట్‌ కనెక్షన్లు 15 కోట్ల నుంచీ 57 కోట్లకు పెరిగాయి. నియంతృత్వమే ఉంటే మీడియా ఇంతలా ఎలా విస్తరిస్తుంది? రోజూ టీవీ ఛానళ్లల్లో అనేకరకాల చర్చలు జరుగు తుంటాయి. ఒకరోజంతా సోషల్‌ మీడియాలో మోదీని దూషిస్తూ ఉన్న హాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవ్వడం గమనించాను. మీడియా స్వేచ్ఛ లేకపోతే ఇవన్నీ ఎలా జరుగుతాయి?’’ అని సూర్య ప్రకాశ్‌ అన్నారు. ‘‘పశ్చిమ బెంగాల్‌, ఉత్తర ప్రదేశ్‌, మహారాష్ట్రవంటి కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ట్వీట్ల ఆధారంగా అరెస్టులు జరిగాయి. కానీ దానికి మోదీ బాధ్యులు ఎలా అవుతారు? రాష్ట్రాల్లో న్యాయ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుందని తెలీదా?’’ అని ఆయన సందేహం వ్యక్తం చేశారు.
భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో లోపమా?
‘‘ఒకప్పుడు భారతదేశంలో ప్రభుత్వ ఒత్తిడికి లొంగని న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం ఉండేవి. వీటి పనితీరు ప్రపంచ దేశాల ప్రశంసలు పొందింది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ సంస్థలన్నిటినీ ప్రభుత్వానికి అనుగుణంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కార్యకర్తలను, ప్రతిపక్ష నాయకులను నెలల తరబడి, బెయిల్‌ కూడా ఇవ్వకుండా నిర్బంధంలో ఉంచుతున్నారు. వీటన్నింటినీ చూస్తూ న్యాయ వ్యవస్థ ముఖం తిప్పుకుంటోంది. ఇలాంటి చర్యలకు జవాబు దారీతనం ఉండేలా చూసే యంత్రాంగం మాయమైపోయింది’’ అని నిరజంన్‌ సాహూ అన్నారు. ‘‘మత రాజకీయలకు పెద్ద పీట వేశారు. సోషల్‌ మీడియా ద్వారా మత రాజకీయలు ఎక్కువగా నడుస్తున్నాయి. దీనివల్ల పాలక వర్గం రాజకీయ లబ్ధి పొందుతోంది. ప్రజాస్వామ్య విలువలు, స్వేచ్ఛకు ప్రతికూలత ఏర్పడుతోంది. దేశంలో రాజకీయ వాతావరణం విషపూరితం అవుతోంది. మైనారిటీలను, ప్రతిపక్ష నాయకులను విలన్లుగానూ, దేశ ద్రోహులుగానూ చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి’’ అని ఆయన అభిప్రా యపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్య పరిస్థితిపై ఇంతకుమునుపు కూడా కొన్ని నివేదికలు వచ్చాయి. వీ-డెమ్‌ ఒక్కటే కాదు, గత కొన్ని సంవత్సరాలుగా మరి కొన్ని సంస్థలు కూడా ఇలాంటి నివేదికలను సమర్పించాయి.
అమెరికాకు చెందిన ‘ఫ్రీడం హౌస్‌’ సంస్థ 2019 ఘటనల ఆధారంగా విడుదల చేసిన నివేదిక… ‘‘మోదీ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్య విలువలు తగ్గిపోతున్నాయి. వ్యక్తిగత స్వేచ్ఛ, భిన్నత్వానికి భంగం కలుగుతోంది. ఇలా అయితే ప్రజాస్వామ్య వ్యవస్థ ఎక్కువకాలం మనుగడ సాగించలేదు’’ అని పేర్కొంది.2017లో సివికస్‌ అనే సంస్థ విడుదల చేసిన నివేదికలో…. ‘‘భారతదేశంలో పౌర సమాజం స్థానం క్షీణిస్తోంది. 2014లో మోదీ ప్రభుత్వం పాలనలోకి వచ్చినప్పటినుంచీ ప్రజాస్వామ్యం నాణ్యత తగ్గుతోంది. ప్రతిపక్షాల స్థానం సన్నగిల్లుతోంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తినవారిని లక్ష్యంగా చేసుకునే అవకాశాలున్నాయి’’ అని పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా ఇలాగే ఉందా?
జీ-20లోని అన్ని ప్రధాన దేశాలూ, అన్ని రంగాల్లోనూ నియంతృత్వ పోకడలను కనబరు స్తున్నాయని..భారత్‌, అమెరికా, టర్కీ, బ్రెజిల్‌ వంటి దేశాలలో ఈ ధోరణి స్పష్టంగా కనిపిస్తోందని వీ-డెమ్‌ నివేదికలో పేర్కొన్నారు. ‘‘భారతదేశంలో కనిపిస్తున్న నియంతృత్వం, ప్రపంచంలో కొనసాగుతున్న నియంతృత్వంలో భాగమే. ప్రపంచ మార్గాన్నే భారతదేశం కూడా అనుసరిస్తోంది. ఈ ధోరణి కొనసాగితే ప్రపం చంలో 80 శాతం దేశాలు నితంతృత్వ దేశాలుగా మారే అవకాశాలున్నాయి. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం’’ అని వీ డెమ్‌ అధ్యక్షులు స్టాఫన్‌ లిండ్బర్గ్‌ అభిప్రాయపడ్డారు.‘‘దీనికి కారణం మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థలోనే లోపాలున్నాయని అనుకునే అవకాశం ఉంది. అది మరింత ప్రమాదకరం. పోలాండ్‌, టర్కీ, భారత్‌, బ్రెజిల్‌, హంగేరీ, అమెరికా వంటి దేశాలలో నియంతృత్వ పోకడలు పెరుగుతున్నాయన్న విషయంలో సందేహం లేదు. అయితే ఈ ధోరణి గత దశాబ్దాలలో కూడా ఉందనే చెప్పాలి’’ అని నిరంజన్‌ సాహూ అభిప్రాయపడ్డారు.
‘‘నియంతలు రాజ్యాంగం, చట్టం, ప్రజాస్వామ్యంలోని అన్ని నిబంధనలను ఉపయోగించి అధికారంలోకి వస్తారు. అధికారంలో ఎక్కువకాలం కొనసాగడానికి చట్టాన్ని దుర్వినియోగం చేస్తారు’’ అని లిండ్బర్గ్‌ అన్నారు.ఇందుకు టర్కీని ఆయన ఉదాహరణగా ప్రస్తావించారు. టర్కీ అధ్యక్షుడు ఎర్దోవాన్‌ పార్లమెంటును ఉపయోగించి రెండుసార్లు రాజ్యంగాన్ని మార్చివేశారు. ‘‘కరోనా మహమ్మారి కాలంలో భారతదేశంలో కొన్ని ప్రజాస్వామిక విలువలు దెబ్బతిన్నాయన్నది వాస్తవమే. కొన్ని రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ తప్పుదారి పట్టింది. కొన్ని అకారణ అరెస్టులు జరిగాయి. అయితే, ప్రజాస్వామ్య మూలాలు ఇప్పటికీ బలంగానే ఉన్నాయి. అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేయలేదు’’ అని సూర్య ప్రకాశ్‌ అభిప్రాయపడ్డారు.
ప్రజాస్వామ్యం అనేది గ్రీకు పదం, ‘‘డెమోస్‌’’ నుండి వచ్చింది, అంటే ప్రజలు. ప్రజాస్వా మ్యంలో, శాసనసభ్యులు మరియు ప్రభుత్వంపై సార్వభౌమాధికారాన్ని కలిగి ఉన్నవారు ప్రజలే. ప్రపంచంలోని వివిధ ప్రజాస్వామ్యాలకు సూక్ష్మ నైపుణ్యాలు వర్తింపజేసినప్పటికీ, కొన్ని సూత్రాలు మరియు పద్ధతులు ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఇతర ప్రభుత్వాల నుండి వేరు చేస్తాయి.
ా ప్రజాస్వామ్యం అంటే అధికారం మరియు పౌర బాధ్యతను పౌరులందరూ నేరుగా లేదా వారి స్వేచ్ఛగా ఎన్నుకోబడిన ప్రతినిధుల ద్వారా వినియోగించుకునే ప్రభుత్వం.
ా ప్రజాస్వామ్యం అనేది మానవ స్వేచ్ఛను రక్షించే సూత్రాలు మరియు అభ్యాసాల సమితిబీ అది స్వేచ్ఛ యొక్క సంస్థాగతీకరణ.
ా వ్యక్తిగత మరియు మైనారిటీ హక్కులతో పాటు మెజారిటీ పాలన సూత్రాలపై ప్రజాస్వామ్యం ఆధారపడి ఉంటుంది. అన్ని ప్రజాస్వామ్యాలు, మెజారిటీ ఇష్టాన్ని గౌరవిస్తూ, వ్యక్తులు మరియు మైనారిటీ సమూహాల ప్రాథమిక హక్కులను ఉత్సాహంగా పరిరక్షిస్తాయి.
ా ప్రజాస్వామ్యాలు సర్వశక్తిమంతమైన కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రక్షణ కల్పిస్తాయి మరియు ప్రాంతీయ మరియు స్థానిక స్థాయిలకు ప్రభుత్వాన్ని వికేంద్రీకరిస్తాయి, స్థానిక ప్రభుత్వం ప్రజలకు వీలైనంత అందుబాటులో మరియు ప్రతిస్పందించేదిగా ఉండాలి.
ా వాక్‌ స్వాతంత్య్రం మరియు మతం వంటి ప్రాథమిక మానవ హక్కులను పరిరక్షిం చడం వారి ప్రధాన విధుల్లో ఒకటి అని ప్రజాస్వామ్యాలు అర్థం చేసుకున్నాయి. చట్టం ప్రకారం సమాన రక్షణ హక్కు, సమాజం యొక్క రాజకీయ,ఆర్థిక మరియు సాంస్కృతిక జీవితంలో పూర్తిగా నిర్వహించడానికి మరియు పాల్గొనడానికి అవకాశం.
ా ప్రజాస్వామ్యాలు పౌరులందరికీ బహిరంగంగా ఉచిత మరియు న్యాయమైన ఎన్నికలను నిర్వహిస్తాయి. ా ప్రజాస్వామ్యంలో ఎన్నికలు నియంతలు లేదా ఒకే పార్టీ వెనుక దాక్కున్న ముఖద్వారాలు కావు, కానీ ప్రజల మద్దతు కోసం ప్రామాణికమైన పోటీలు.
ా ప్రజాస్వామ్యం ప్రభుత్వాలను చట్ట పాలనకు లోబడి చేస్తుంది మరియు పౌరులందరికీ చట్టం క్రింద సమాన రక్షణ లభించేలా మరియు వారి హక్కులు న్యాయ వ్యవస్థ ద్వారా రక్షించబడుతున్నాయని నిర్ధారిస్తుంది.
ా ప్రజాస్వామ్యాలు విభిన్నమైనవి, ప్రతి దేశం యొక్క ప్రత్యేక రాజకీయ, సామాజిక మరియు సాంస్కృతిక జీవితాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రజాస్వామ్యాలు ప్రాథమిక సూత్రాలపై ఆధారపడి ఉంటాయి, ఏకరీతి పద్ధతులపై కాదు.
ా ప్రజాస్వామ్యంలో పౌరులకు హక్కులు మాత్రమే కాదు, వారి హక్కులు మరియు స్వేచ్ఛలను రక్షించే రాజకీయ వ్యవస్థలో పాల్గొనే బాధ్యత కూడా వారికి ఉంది.
ా ప్రజాస్వామ్య సమాజాలు సహనం, సహకారం మరియు రాజీ విలువలకు కట్టుబడి ఉంటాయి. ఏకాభిప్రాయానికి రాజీ అవసరమని ప్రజాస్వామ్యాలు గుర్తించాయి మరియు అది ఎల్లప్పుడూ సాధించబడకపోవచ్చు. మహాత్మా గాంధీ మాటలలో, ‘‘అసహనం అనేది హింస యొక్క ఒక రూపం మరియు నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తిని పెంపొందించడానికి ఒక అడ్డంకి.’’
ప్రజాస్వామ్యం ద్వారా పొందిన అధికారాన్ని శాశ్వతం చేసుకునేందుకు భారతీయ జనతా పార్టీ కుట్ర పన్నుతోంది. దేశాన్ని నియంతృత్వం వైపు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. దీని కోసం ‘గోప్యత నిర్వీర్యం..అణచివేత..నిఘా..’ అనే ఫార్ములాను అనుసరిస్తోంది. ఓ వైపు రాజ్యాంగ బద్ధ వ్యవస్థలను క్రమక్రమంగా నిర్వీర్యం చేస్తూనే..ప్రజా ఉద్యమాలను అణచి వేస్తోంది. నిర్బంధాలను అమలు చేస్తోంది. ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభాలైన చట్టసభలు, ఎగ్జిక్యూటివ్‌ వ్యవస్థ, న్యాయ వ్యవస్థతోపాటు మీడియాపై నిఘా పెట్టి.. ఎవరైనా తమకు అనుకూలంగా లేనట్టు తేలితే వారిని ముప్పు తిప్పలు పెడుతోంది. అదే విధంగా ప్రభుత్వం వైపు నుంచి పారదర్శకంగా ఉండాల్సిన విధానాల పట్ల గోప్యతను పాటిస్తోంది. 2014లో అధికారాన్ని చేపట్టినప్పటి నుంచి కాషాయ పార్టీ పాటిస్తున్న విధానాలను చూస్తే ఇది స్పష్టమవుతోంది.-(మహమ్మద్‌ ఆరిఫ్‌/జుబేర్‌ అహ్మద్‌)

పెట్టుబడిదారీ వ్యవస్థ పట్ల భ్రమ

పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధి చెందితే మొదట్లో కార్మికులు నష్టపోయినా, ఆ తర్వాత వారూ ప్రయోజనం పొందుతారన్న అభిప్రాయం పూర్తిగా తప్పు. సామ్రాజ్యవాద దోపిడీ పద్ధతుల కారణంగా ఒకానొక ప్రత్యేక, చారిత్రిక పరిస్థితుల్లో యూరప్‌ ఖండంలోని కార్మికుల స్థితిగతులు పైన వివరించిన విధంగా మెరుగు పడడం సంభవించిందే తప్ప అదేదో పెట్టుబడి దారీ అభివృద్ధి క్రమంలో జరిగినది కాదు. పెట్టుబడిదారీ విధానం మొదలైన తొలి కాలం లో అది నిరుద్యోగాన్ని పెంచుతుందని, దాని వలన పేదరికం పెరుగుతుందని…కాని, మొదట్లో కలిగిన ఈ నష్టాన్ని ఆ తర్వాత అది అభివృద్ధి చెందుతున్న కాలంలో పూడ్చివేస్తుందని చాలామందిలో ఒక అభిప్రాయం ఉంది. మొదట్లో ఉపాధి పోగొట్టుకున్నవారంతా ఆ తర్వాత కాలంలో ఉద్యోగాలు పొంది కార్మికులుగా తిరిగి పనుల్లో చేరుతారని, నిరుద్యోగం తగ్గడంతో వేతనాలు పెరగడం ప్రారంభమౌతుందని, వేతనాలు పెరుగుతున్న కొద్దీ కార్మికుల ఉత్పాదకత కూడా పెరుగు తుందని వారు భావిస్తారు. గత చరిత్ర అనుభవాలు కూడా ఈ అభిప్రాయాన్నే బలపరుస్తున్నట్టు పైకి చూస్తే అనిపిస్తుంది కూడా. మార్క్సిస్టు చరిత్రకారుడు ఎరిక్‌ హాబ్స్‌బామ్‌ అంచనా ప్రకారం పారిశ్రా మిక పెట్టుబడిదారీ విధానం మొదలైన తర్వాత బ్రిటన్‌ లో నిరుద్యోగం పెరిగింది. కాని 19వ శతాబ్దపు నడిమి కాలం నాటికల్లా పరిస్థితులు మెరుగుపడ్డాయి. కార్మిక వర్గానికి అనుకూలంగా మారాయి. ఈ విధమైన దృక్పథం ఉంటే పెట్టుబడిదారీ విధానానికి పరివర్తన చెందే సమయంలో ఎన్ని కష్టాలు కలిగినా, ఆ తర్వాత పెట్టుబడిదారీ విధానం వలన కార్మికులకు కూడా ప్రయోజనాలు ఉంటాయి అన్న నిర్ధారణకి వస్తాం.ఈ విధమైన అవగాహన మొత్తంగానే తప్పు. పెట్టుబడిదారీ విధానం తాను తొలుత కార్మికవర్గానికి కలిగించిన నష్టాన్ని ఆ తర్వాత కాలంలో పూడ్చి వారికి మెరుగైన పరిస్థితులు కల్పిస్తుంది అని భావించడానికి ఎటువంటి సిద్ధాంత ప్రాతి పదికా లేదు. కార్మికుల స్థితిగతులలో తర్వాత కాలంలో కనిపించిన మెరుగుదలకు, పెట్టుబడి దారీ విధానపు సహజ సద్యోజనిత స్వభావానికి ఎటువంటి సంబంధమూ లేదు. ఇంగ్లీషు ఆర్థిక శాస్త్రవేత్త డేవిడ్‌ రికార్డో పరిశ్రమల్లో యంత్రా లను వినియోగించడం మొదలుపెట్టిన తొలిరోజుల్లో ఈ విధమైన వాదన ముందుకు తెచ్చాడు. మొదట్లో యంత్రాల వలన కార్మికులు ఉద్యోగాలు కోల్పోయి కష్టాలపాలౌతారని, కాని ఆ తర్వాత లాభాలరేటు పెరిగి పెట్టుబడి ఎక్కువగా పోగుబడుతుందని, దానితో మరిన్ని ఎక్కువ పరిశ్రమలు వస్తాయని, వాటిలో గతంలో ఉద్యోగాలు పోగొట్టుకున్న వారందరికీ మళ్ళీ ఉపాధి లభించడమేగాక వారి స్థితిగతులు బాగా మెరుగు పడతాయని రికార్డో ప్రతిపాదించాడు. కార్మికుల జనాభా మరీ ఎక్కువగా పెరిగిపోకుండా ఉండేవిధంగా వాళ్ళు తమను తాము నియంత్రించుకుంటే వారి వేతనాలు పెంచుకోవచ్చునని కూడా ఆయన చెప్పాడు. రికార్డో వాదనలో రెండు లోపాలు ఉన్నాయి. పరిశ్రమల్లో యంత్రాలను ప్రవేశపెట్టడం అనేది ఒకే ఒక్కమారు జరిగే ప్రక్రియగా ఆయన అభివర్ణించాడు. కాని వాస్తవంగా పెట్టుబడిదారీ వ్యవస్థలో కొత్త కొత్త యంత్రాలను, నూతన ఉత్పత్తి ప్రక్రి యలను ప్రవేశపెట్టడం అనేది నిత్యం జరుగుతూనే వుంటుంది. యంత్రాలను మొదట ప్రవేశపెట్టినప్పుడు పెట్టుబడిదారుల లాభాల రేటు పెరగడం అనేది జరిగినా, వారి వద్ద పెట్టుబడి ఎక్కువగా పోగుబడినా, దాని ఫలితంగా అంతకు ముందు కోల్పోయిన ఉద్యోగాలన్నీ మళ్ళీ రావడం అనేది ఎన్నటికీ జరగదు. ఎందుకంటే ఈ లోపునే మళ్ళీ కొత్త యంత్రాలను ప్రవేశపెట్టడం అనేది జరిగిపోతూ వుంటుంది. అందుచేత ఈ విషయాన్ని నిరంతరం మారుతూ వుండే క్రమంలోనే చూడాలి. పరిశ్రమల్లో పెట్టే పెట్టుబడి వృద్ధి చెందే రేటు ‘జి’ అనుకుందాం. అప్పుడు ఉత్పత్తి వృద్ధిరేటు కూడా ‘జి’ యే ఉంటుంది (ఒకవేళ సాంకేతిక పరిజ్ఞానం పెంచడం కోసం అదనపు పెట్టుబడి పెట్టినా, దాని వలన శ్రామికులకు చెల్లించే వేతనాలు ఆ మేరకు తగ్గుతాయే కాని ఉత్పత్తి అయ్యే సంపదలో వృద్ధిరేటు మాత్రం పెట్టుబడిలో వృద్ధిరేటు ఎంత ఉంటుందో, అదే మోతాదులో ఉంటుంది). శ్రామిక ఉత్పాదకత వృద్ధిరేటు ‘పి’ అనుకుందాం. అప్పుడు అదనపు కార్మికుల అవసరం పెరిగే రేటు జి-పి ఉం టుంది. కార్మికుల జనాభా పెరిగే రేటు ‘ఎన్‌’ అనుకుంటే జి-పి కన్నా ఎన్‌ తక్కువ ఉన్నప్పుడే నిరుద్యోగం తగ్గుతుంది. పెట్టుబడిదారీ వ్యవస్థలోజి-పి విలువ ఎన్‌ ను దాటి ఉండేట్టు చూసే ఏర్పాటు ఏదీ లేదు. కార్మికుల ఉత్పా దకత పెరుగుతూ మరోవైపు నిరుద్యోగం రేటు కూడా పెరుగుతూ వుంటే (అప్పుడు వేతనాల రేటు కనీస స్థాయిలోనే ఎప్పుడూ ఉండిపో తుంది) లాభాల రేటు పెరుగుతూ పోతుంది. దానివలన అదనపు పెట్టుబడి పోగుబడుతుంది. దానిని వినియోగించినప్పుడు కొత్త ఉద్యోగాలు వస్తాయి. అప్పుడు నిరుద్యోగం పడిపోతుంది.- రికార్డోను సమర్ధించేవారి వాదన ఈ విధంగా ఉంటుంది. ఇక్కడే రికార్డో వాదనలోని రెండో సమస్య ముందుకొస్తుంది. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉత్పత్తి అయే సరుకులకు డిమాండు ఎప్పుడూ పెరుగుతూనే వుంటుంది అని రికార్డో భావించాడు. అందువలన ఉత్పత్తి పెరిగితే దాని ఫలితంగా లాభాలు పెరుగుతాయని, దానివలన అదనపు పెట్టుబడి పోగుబడు తుందని, ఈ ప్రక్రియకు ఎటువంటి ఆటంకమూ ఉండదని అతను భావించాడు. ‘’సరుకులు ఎంత ఎక్కువగా మార్కెట్‌ లోకి వస్తే అంత ఎక్కువ డిమాండ్‌ వాటికి ఉంటుంది’’ అన్న సూత్రాన్ని అతను విశ్వసించాడు. కాని లాభాలు రావాలంటే ఎక్కువ సరుకులు ఉత్పత్తి చేసినంత మాత్రాన సరిపోదు. అవన్నీ అమ్ముడు పోయినప్పుడే వాస్తవంగా పెట్టుబడిదారుడికి లాభం పోగుపడుతుంది. ఉత్పత్తి అయిన సరుకులన్నీ అమ్ముడుపోవాలంటే అది కొనుగోలు శక్తిని బట్టి ఉంటుంది. కొనుగోలుశక్తి వేతనాల రేటుని బట్టి ఉంటుంది. మరి వీలైనంత తక్కువ స్థాయిలో వేతనాలను ఉంచాలని పెట్టుబడి దారులు నిరంతరం ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు మార్కెట్‌ లో డిమాండ్‌ నిరంతరం పెరగడానికి గ్యారంటీ ఏమిటి? అందుచేత సాంకేతిక పరి జ్ఞానం పెరిగి దాని ఫలితంగా నిరుద్యోగం పెరిగితే, ఆ విధంగా ఉద్యోగాలను పోగొట్టు కున్నవారిని తిరిగి ఉద్యోగాలలో పెట్టుకోడానికి పెట్టుబడిదారీ వ్యవస్థలో ఎటువంటి ఏర్పాటూ లేదు. అందుచేత పెట్టుబడిదారీ విధానం ప్రారంభదినాల్లో కార్మికులకు నష్టం కలిగిం చినా, తర్వాత అది పుంజుకున్నాక కార్మికులకు మేలు జరుగుతుందన్న రికార్డో వాదనకు ఎటువంటి సైద్ధాంతిక ప్రాతిపదికా లేదు.కాని వాస్తవ చరిత్ర చూస్తే సంపన్న పెట్టుబడిదారీ దేశాల్లో పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధి చెందడం జరిగాక అక్కడి కార్మికుల స్థితి గతులు మెరుగుపడ్డాయి. దీనిని ఎలా అర్ధం చేసుకోవాలి? యూరప్‌ ఖండం లోని కార్మి కులు చాలా భారీ సంఖ్యలో ‘’కొత్త ప్రపంచానికి’’ (అంటే అమెరికా ఖండానికి) వలసలు పోయారు. ఈ వలసలు మొదటి ప్రపంచ యుద్ధం మొదలయ్యేదాకా (1914) కొనసాగాయి. 19వ శతాబ్దంలో నెపోలియన్‌ యుద్ధం నాటినుండి మొదటి ప్రపంచయుద్ధం దాకా మధ్య కాలంలో దాదాపు 5కోట్ల మంది యూరోపియన్‌ కార్మికులు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా వంటి దేశాలకు వలసలు పోయారని ఆర్థికవేత్త ఆర్థర్‌ లూయిస్‌ అంచనా వేశాడు. ఈ వలసలు ‘’అధిక వేతన’’వలసలు. అంటే ఆ కార్మికులు అంతవరకూ ఉండిన స్వస్థలాల్లోనూ, అదే విధంగా వాళ్ళు వలసలు పోయిన కొత్త ప్రదేశాల్లోనూ వేతనాలు అధికస్థాయిలో ఉన్నా యి. ఇదే కాలంలో ‘’అల్ప వేతన’’ వలసలు కూడా మరోవైపు కొనసాగాయి. ఈ రెండో తరహా కార్మిక వలసలు ఉష్ణ, సమశీతోష్ణ ప్రదేశాలైన ఇండియా, చైనా వంటి దేశాల నుండి ఫిజీ, మారిషస్‌, వెస్ట్‌ ఇండీస్‌, తూర్పు ఆఫ్రికా, నైరుతి అమెరికా వంటి ఉష్ణ, సమశీ తోష్ణ ప్రదేశాలకు జరిగాయి. ఇక్కడ ఆ కార్మి కుల స్వంత దేశాలలోనూ, వాళ్ళు వలసలు వచ్చిన దేశాల్లోనూ వేతనాల స్థాయి తక్కువగానే ఉంది. ఈ కార్మికులను శ్వేతజాతి కార్మికులు వలసలు వచ్చిన ప్రదేశాలకు రానివ్వలేదు (ఇప్పటికీ కోరుకున్న వారందరినీ అక్కడికి వలసలు రానివ్వడం లేదు). ఇలా ఒకవైపు అధిక వేతన వలసలు, మరోవైపు అల్పవేతన వలసలు ఎందుకు జరిగాయి? దీనికి లూయిస్‌ చెప్పిన సమాధానం ఏమిటంటే, ఆ కాలంలో బ్రిటన్‌ లో వ్యవసాయ విప్లవం జరిగి, తక్కిన యూరప్‌కంతటికీ విస్తరించింది అని, దాని వలన గ్రామీణ కార్మికులకు యూరప్‌ లో ఆదాయాలు బాగా పెరిగాయని అతను అన్నాడు. కాని ఆ విధమైన వ్యవసాయ విప్లవం ఏదీ బ్రిటన్‌ లో జరిగిన దాఖలాలు లేవు. మరి అసలు కారణం ఏమిటి? అధిక వేతన వలసల విషయంలో జరిగినదేమంటే యూరప్‌ నుండి వలసలు పోయినవారు అమెరికా, ఆస్ట్రేలియా తదితర ప్రదేశాలలోని స్థానికులను వారి వారి భూముల నుండి తరిమివేసి ఆక్రమించుకుని వ్యవసాయదారులుగా స్థిరపడి అధిక ఆదాయాలు ఆర్జించసాగారు. మరోవైపు యూరప్‌ లో కార్మికవర్గం సంఖ్య వలసల కారణంగా తగ్గిపోయింది. అందుచేత ఇక్కడ కూడా కార్మికుల వేతనాలను పెంచక తప్పలేదు. ఒక శీతల దేశం నుండి మరొక శీతల దేశానికి జరిగిన వలసలు భారీ స్థాయిలో ఉన్నాయి. 1820 నుండి 1915 మధ్య బ్రిటన్‌ లో ఎంత మేరకు జనాభా పెరిగిందో, అందులో సగం మేరకు అక్కడి నుండి వలసలు పోయారు. ఇటువంటి స్థాయిలోనే మన దేశంలో కూడా వలసలు జరిగివుంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటివకూ దాదాపు 50 కోట్ల మంది వలసలు పోయివుండాలి (యూరప్‌ లో జరిగిన వలసల ప్రభావం ఎంత బలంగా ఉండిరదో బోధపడడానికి ఈ పోలిక చూపడం జరిగింది.). ఆ విధంగా ఇతర దేశాలకు తరలిపోవడానికి యూరోపియన్‌ కార్మికులకు లభించిన అవకాశాలు వారి స్థితిగతులు బాగా మెరుగుపడడానికి దోహదం చేశాయే తప్ప పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి క్రమంలో స్వత:సిద్ధంగా కార్మికుల స్థితి గతులను మెరుగుపరిచే ఏర్పాటు అంటూ ఏదీ లేదు. ఇలా వేరే దేశాలకు పోయి అక్కడి స్థానికులను వెళ్ళగొట్టి వారి భూములను ఆక్రమించుకునే అవకాశం సామ్రాజ్యవాద దురాక్రమణ స్వభావం నుంచి వచ్చింది.సామ్రాజ్యవాద దోపిడీ పద్ధతుల కారణంగా సంపన్న దేశాలలోని కార్మికుల స్థితిగతులు మెరుగుపడే అవకాశం వచ్చింది. ఇది కేవలం స్థానికుల నుండి భూములను లాక్కోవడం ద్వారా మాత్రమే కాదు. సంపన్న దేశాలలో ఉత్పత్తి అయిన సరుకులకు డిమాండ్‌ కల్పించడానికి, తద్వారా సంపన్న దేశాలలో అదనపు ఉద్యోగాలు కల్పించడానికి సామ్రాజ్యవాదులు తాము ఆక్రమించుకున్న వలసలలో చేతివృత్తిదారులను, చిన్న తరహా ఉత్పత్తిదారులను భారీ స్థాయిలో దెబ్బ తీశారు. అంటే ఒకవిధంగా సామ్రాజ్యవాదం సంపన్న దేశాలలోని నిరుద్యోగాన్ని వలస దేశాలలోకి ఎగుమతిచేసిందన్నమాట. ఆ వలస దేశాలకు తమ తమ ఆర్థిక వ్యవస్థలను కాపాడుకోగలిగిన సత్తా లేదు. అవన్నీ సంపన్న దేశాల ఆధీనంలోనే ఉండేవి. అందుచేత పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధి చెందితే మొదట్లో కార్మికులు నష్టపోయినా, ఆ తర్వాత వారూ ప్రయోజనం పొందుతారన్న అభిప్రాయం పూర్తిగా తప్పు. సామ్రాజ్యవాద దోపిడీ పద్ధతుల కారణంగా ఒకానొక ప్రత్యేక, చారిత్రిక పరిస్థితుల్లో యూరప్‌ ఖండంలోని కార్మికుల స్థితిగతులు పైన వివరించిన విధంగా మెరుగుపడడం సంభవించిందే తప్ప అదేదో పెట్టుబడిదారీ అభివృద్ధి క్రమంలో జరిగినది కాదు. దీనిని బట్టి యూరప్‌ ఖండంలోని కార్మికులు సామ్రాజ్యవాద దోపిడీ పట్ల మెతకగా ఉంటారన్న అభిప్రాయానికి రాకూడదు. సామ్రాజ్యవాద దోపిడీ విధానం నడిచే తీరు ఇలానే ఉంటుంది. వ్యాసకర్త : సీనియర్‌ పాత్రీకేయులు(ప్రజాశక్తి సౌజన్యంతో..)

ఎన్‌ఆర్‌జీఎస్‌ పథకం గొంతు నులమొద్దు

ఈ పథకంలో ఈ ఏడాది సగటు పనిదినాల సంఖ్య కేవలం 47 మాత్రమే. కనీసం ఏడాదిలో వంద రోజులు పని కల్పించాలని చట్టం పేర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం పని కల్పించింది అందులో సగం కూడా లేదు. ప్రాణాంతకంగా మారిన ఈ ఆంక్షలకు తోడు, తక్కువ వేతనాలు. అది కూడా సమయానికి సరిగా అందని వేతనాలు, డిజిటల్‌ అడ్డంకులు, సరిపడా పని దినాలు లేకపోవడం…ఇవన్నీ కలిసి ఈ పథకం కింద పని దొరకబుచ్చుకుంటున్న కుటుంబాల సంఖ్య తగ్గిపోవడానికి దారితీసింది. – (ఉదయ్‌భాష్కర్‌ రెడ్డి)
మోడీ ప్రభుత్వం 2014లో ఏర్పడినప్పటి నుండి గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎం.జి.ఎన్‌. ఆర్‌.ఇ.జి.ఎస్‌) గొంతు నులిమేందుకు ఏదో రకంగా ప్రయత్నిస్తూనే వుంది. ఆర్థిక వ్యవస్థ మరింత ‘సమర్ధవంతంగా’, ‘ఉత్పాదకంగా’ పని చేసేలా మార్గనిర్దేశనం చేయాలంటే ప్రైవేటు రంగాన్ని అనుమతించాలని, అందుకుగాను ప్రభుత్వ వ్యయంలో కోత పెట్టాలని నయా ఉదారవాద సిద్ధాంతం పేర్కొంటున్నది. దీనికి కట్టుబడిన మోడీ ప్రభుత్వం క్రమం తప్పకుండా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో సహా వివిధ సంక్షేమ పథకాలకు బడ్జెట్‌ కేటాయింపుల్లో కోత పెడుతూ వస్తోంది. అంతేకాకుండా పథకాల గొంతు నులిమేందుకు ఇతర మోసపూరిత చర్యలను కూడా చేపడుతోంది.
ఎం.జి.ఎన్‌.ఆర్‌.ఇ.జి.ఎస్‌ విషయానికి వస్తే, 2022-23 సంవత్సరానికి బడ్జెట్‌లో రూ.73 వేల కోట్లు కేటాయింపులు జరపాలని ప్రతిపాదించబడిరది. కానీ, వాస్తవానికి రూ.89,400 కోట్లు ఖర్చు చేసి వుంటారని అంచనా. అంతకు ముందు సంవత్సరం 2021-22లో ఖర్చు పెట్టిన రూ.98,467.85 కోట్లలో దాదాపు పది శాతం తక్కువ. అయితే 2023-24 బడ్జెట్‌లో కేవలం రూ.60 వేల కోట్లు మాత్రమే కేటాయించారు. గతేడాది సవరించిన అంచనా కేటాయింపులో ఏకంగా 33 శాతం కోత పెట్టారు.
ప్రభుత్వం ఈ పథకానికి కేటాయింపులు తగ్గించడం ఒక్కటే కాదు. పలురకాల కొర్రీలు పెడుతోంది. ఈ ఏడాది జనవరిలో, ఎం.జి.ఎన్‌.ఆర్‌.ఇ.జి.ఎస్‌ కార్మికులు తప్పనిసరిగా అటెండెన్స్‌ (హాజరు) నమోదు చేయాలంటూ నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సర్వీస్‌ (ఎన్‌.ఎం.ఎం.ఎస్‌) పేరుతో మొబైల్‌ యాప్‌ను ప్రవేశపెట్టింది. దీంతో దేశవ్యాప్తంగా పని ప్రదేశాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇంటర్‌నెట్‌ కనెక్టివిటీ సరిగా లేకపోవడంతో కార్మికులు తమ హాజరును నమోదు చేయడం కోసమే గంటల తరబడి ప్రయాస పడాల్సి వస్తోంది. హాజరు పడకపోతే, ఆ రోజుకు వారి వేతనం నష్టపోతారు కాబట్టి ఇది వారికి జీవన్మరణ సమస్యగా మారింది. పథకంలో జరుగుతున్న మోసాన్ని ఎదుర్కొనడానికంటూ ఈ తరహా హైటెక్‌ చర్యలను కార్మికులపై బలవంతంగా రుద్దడం ప్రభుత్వ కుట్ర మినహా మరొకటి కాదు. పిడిఎస్‌ పంపిణీలో కూడా గతంలో ఇదే పద్ధతిని రుద్దారు. ప్రభుత్వ పాఠశాల టీచర్ల హాజరు విషయంలోనూ ఇలాగే చేశారు. వీటన్నిటివల్లా ప్రజలకు గందరగోళ, విచారకర పర్యవసానాలే కలుగుతున్నాయి. కనెక్టివిటీ సమస్యలతో పాటుగా ఆధార్‌ సరిపోలడం లేదని,బ్యాంక్‌ ఖాతా నెంబరు కలవడం లేదని,చేతి వేళ్ళ గుర్తులు పడడం లేదని, ఇంకా ఇలాగే అనేక సమస్యల కారణంగా పిడిఎస్‌ రేషన్‌ వేలాది మందికి అందకుండా పోయింది. ఎం.జి.ఎన్‌. ఆర్‌.ఇ.జి.ఎస్‌ కార్మికులు సైతం ఇలాంటి సమస్యలనే ఎదుర్కొంటున్నారు. ఇటువంటి నిబంధనల కారణంగా కార్మికులు పని కోసం ఎం.జి.ఎన్‌.ఆర్‌.ఇ.జి.ఎస్‌ ను ఆశ్రయించడం తగ్గిపోతున్నది.
వేతనాల్లో నిరంతరం జరుగుతున్న జాప్యం కార్మికులకు ఎదురవుతున్న మరో సమస్య. ఒకోసారి అనుమతించిన 15 రోజుల వెసులుబాటును కూడా మించి జాప్యం జరుగుతోంది. ప్రస్తుత సంవత్సరంలో 15 అంతకుమించి రోజుల జాప్యం తర్వాత రూ.3630 కోట్ల వేతనాలు చెల్లించారు. ఇంకా రూ.1010 కోట్ల వేతనాలు పెండిరగ్‌లో వున్నాయని ప్రభుత్వ డేటా పేర్కొంటోంది. చాలా తక్కువ కూలికి పని చేసే కార్మికులకు ఈ స్థాయిలో ఇలా వేతనాలు పెండిరగ్‌లో పెట్టడమనేది ఏ మాత్రమూ సహించరాని విషయం. దీంతో వారు తరచుగా తక్షణమే డబ్బులు చేతికి అందివచ్చే పనులను ఎంచుకుంటున్నారు. ఎం.జి.ఎన్‌.ఆర్‌.ఇ.జి.ఎస్‌ వేతనాల కన్నా తక్కువే వచ్చినా వారు దానికే మొగ్గు చూపుతున్నారు. ఈలోగా ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకం వేతనాలను 2 నుండి 10 శాతం మధ్య పెంచుతున్నట్లు చాలా అట్టహాసంగా ప్రకటించింది. అంటే రోజుకు రూ.7 నుండి రూ. 26 వరకు పెరుగుతాయి. గత అనేక మాసాలుగా ద్రవ్యోల్బణం 6-8 శాతం మధ్యలో వుంది. ఆహార ద్రవ్యోల్బణం ఇంకా ఎక్కువగా 8-10 శాతం మధ్య వుంది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఈ అధిక ద్రవ్యోల్బణం తగ్గుతుందని విశ్వసించడానికి ఒక్క కారణం కూడా కనిపించడం లేదు. ఇక కార్మికుల వేతనాల పెంపు అమలు కూడా రాబోయే ఆర్థిక సంవత్సరం నుండే. వాస్త వానికి, వ్యవసాయ కార్మికులకు అలాగే వ్యవసాయేతర కార్మికులకు ప్రస్తుతమున్న వేతనాల రేట్ల కన్నా ఎం.జి.ఎన్‌.ఆర్‌.ఇ.జి.ఎస్‌ వేతనాలు చాలా తక్కువగా వున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఎం.జి.ఎన్‌. ఆర్‌.ఇ.జి.ఎస్‌ పనులకు సంబంధించి సగటు దినసరి వేతనం కేవలం రూ.217.87. అదే సమయంలో పురుష వ్యవసాయ కార్మికులకు రూ.349.77 అని ఆర్‌బిఐ పేర్కొంది. అలాగే ఈ పథకంలో ఈ ఏడాది సగటు పనిదినాల సంఖ్య కేవలం 47మాత్రమే. కనీసం ఏడాదిలో వంద రోజులు పని కల్పించాలని చట్టం పేర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం పని కల్పించింది అందులో సగం కూడా లేదు. ప్రాణాంతకంగా మారిన ఈ ఆంక్షలకు తోడు, తక్కువ వేతనాలు. అది కూడా సమయానికి సరిగా అందని వేతనాలు, డిజిటల్‌ అడ్డంకులు, సరిపడా పని దినాలు లేక పోవడం…ఇవన్నీ కలిసి ఈ పథకం కింద పని దొరకబుచ్చు కుంటున్న కుటుంబాల సంఖ్య తగ్గిపోవడానికి దారితీసింది.
అధికారిక సమాచారం ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద పని దొరికిన వారు 8.6 కోట్ల మంది వుండగా, గతేడాది ఈ సంఖ్య 10.6 కోట్లుగా వుంది.అంటే గతేడాది కన్నా 2 కోట్లు (దాదాపు 20శాతం) తగ్గింది. పైగా ఈ పథకంలో పని కోసం దరఖాస్తు చేసుకున్న దాదాపు 1.6 కోట్ల మంది కార్మికులు తర్వాత పని లోకి వెళ్లకుండా వెనుదిరిగారు. అలాంటి వారిని పరిగణన లోకి తీసుకోకుండా వేసిన లెక్క ఇది.
తక్కువ వేతనాలు, సరిపడా పని దినాలు లేకపోయినా ఎం.జి.ఎన్‌.ఆర్‌.ఇ.జి.ఎస్‌ అనేది కోట్లాదిమంది కుటుంబాలకు జీవనాధారంగా వుంది. ఈ పథకంలో ఇచ్చేది అతి తక్కువ వేతనాలే అయినప్పటికీ అవే వారికి ఎంతో విలువైనవి. ఎందుకంటే దేశంలో ఎలాంటి ఉపాధి అవకాశాలు లేవు. పైగా పెరుగుతున్న ధరలు కుటుంబాల బడ్జెట్‌ను ధ్వంసం చేస్తున్నాయి. ఫలితంగా ఆర్థిక సంక్షోభమనేది ఎడతెగకుండా వుంది. వేతనాలు, పని దినాలు పెంచుతూ, పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తూ, ఉపాధి హామీ పథకాన్ని మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఇప్పుడు నెలకొంది. దీనితో పిల్లికి చెలగాటం, ఎలకకు ప్రాణ సంకటంగా మారిన ఆటకు అంతం పలకాలి.
ఉపాధిపై కుంటిసాకులుయూపీఏ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ఉపాధి హామీ పథకానికి గడచిన ఎనిమిది సంవ త్సరాలుగా ప్రస్తుత ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. పైగా గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగిత తగ్గిందంటూ వితండవాదన చేస్తోంది. నిజానికి ఈ పథకం పనులకు గిరాకీ తగ్గి 34 నెలల కనిష్ఠానికి చేరింది. పనులకు గిరాకీ తగ్గడం వల్ల నిరుద్యోగం తగ్గినట్టేనని కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది. ఈ వాదనలో లాజిక్‌ ఉన్న మాట నిజమే కానీ, గ్రామీణ ప్రాంతాలలో ఉద్యోగార్థులకు చేతినిండా పని దొరకుతోందా? అలా దొరికితే గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకులు నగరాలు, పట్టణాలకు ఎందుకు తర లివస్తున్నారు. గతంలోకంటే పట్టణాలు, నగరాలకు గ్రామాల నుంచి వచ్చిన, ఇప్పటికీ వస్తున్న జనాభా పెరు గుతోంది. వీరంతా గ్రామాలలో పనులు దొరకకపోవ డంవల్లనే పట్టణాలు, నగరాలకు తరలివస్తున్నారు. గ్రామాల్లో హుందాగా, గౌరవంగా జీవించే యువత, ముఖ్యంగా ఉద్యోగార్థులు నగరాలు, పట్టణాలలో అమా నవీయ వృత్తులకు సైతం సిద్ధపడుతున్నారు. ఉపాథి హామీ పనులకు గిరాకీ తగ్గిందన్న ప్రభుత్వ వాదనలో వాస్తవం లేదు. గత ఏప్రిల్‌లో 3 కోట్ల 23 లక్షల మంది ఈ పనుల కోసం దరఖాస్తు చేసుకోగా, జూన్‌లో వారి సంఖ్య 4 కోట్ల 32 లక్షలకు చేరింది. అంతకుముందు రెండు సం వత్సరాలు కరోనా దెబ్బవల్ల ఉపాథి హామీకి గండిపడిన మాట వాస్తవమే. కరోనా తగ్గిన తర్వాత గ్రామాలలో వ్యవసాయ, చేనేత వస్తు కళా రంగాలలో పనులు పుంజు కుంటున్నాయి. ఎంఎస్‌ఎంఈ రంగంలో పనులు పెరుగుతూండడమే ఇందుకు ఉదాహరణ. గ్రామీణ ఉపాథికి డిమాండ్‌ తగ్గిందనుకుంటే అందుకు కారణం వెంటనే బిల్లులు చెల్లించకపోవడమే. నైపుణ్యం అవసరం లేని పనులలో పనిచేసేందుకు ముందుకు వచ్చేవారికి ఒక ఆర్థిక సంవత్సరంలో వంద రోజులు పాటు పని కల్పించాలి. కానీ 2021-22 సంవత్సరంలో 60.70 రోజులు మాత్రమే పనులు కల్పించారు. నిధుల కేటా యింపును బట్టే పనుల కకేటాయింపు ఉంటుంది. అంటే నిధుల కేటాయింపు తగ్గడం వల్లనే ఇలా జరుగు తోంద న్నమాట. ఈ విషయాన్ని మరుగుపర్చి ఉపాధి కోరేవారి డిమాండ్‌ తగ్గిపోయిందంటే నమ్మడానికి ప్రజలు అంత అమాయకులా? పెద్ద పారిశ్రామికవేత్తలు చెల్లించాల్సిన బ్యాంకు రుణాల బకాయిలను వందల కోట్లలో మాఫీ చేసిన, ఇప్పటికీ చేస్తున్న ప్రభుత్వం ఉపాధి పనుల నిధులలో కోత విధించడం ముమ్మాటికీ తప్పే. పైగా ఉపాథి పనులకు గిరాకీ తగ్గిందనడం ఓ కుంటిసాకు మాత్రమే. ఉపాథి హామీ పనులకు 15 రోజుల లోపు నిధు లు విడుదల చేయాలి. కానీ అలా జరగడం లేదు. నిధుల విడుదల అనేది నిరంతర ప్రక్రియ. దానికోసం రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారులు రోజుల తరబడి ఢల్లి%స%లో తిష్టవేసి లాబీయింగ్‌ చేయాల్సి వస్తోంది. అలా చేసినా పూర్తిస్థాయిలో నిధులు విడుదల కావడం లేదు.
కూలీలకు ‘ఉపాధి’ కష్టాలు
పేద, బడుగు, బలహీన వర్గాల వారికి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రభుత్వాలు పనులు కల్పిస్తుంది. కాని కేంద్ర ప్రభుత్వం ఉపాధి పనుల్లో ఎన్‌ఎంఎంఎస్‌ నూతన సాంకేతకత యాప్‌ ప్రవేశ పెట్టడంతో ఉపాధి కూలీలకు కష్టాలు తప్పడం లేదు. వాస్తవంగా పనులు చేసిన గ్రామం నుండి వేతనదారుల పనులకు సంబంధించి కూలీల హాజరు, ఫోటో తప్పనిసరిగా ఆయా సంఘాల మెట్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు యాప్‌ ద్వారా పంపించాలి. సిగల్‌ సమస్య తలెత్తడంతో పాటుగా మేట్లు కొన్ని సందర్భాల్లో తప్పుడు నివేదిక ఇవ్వడంతో ఈ యాప్‌ ద్వారా ఎన్నో గ్రామాల్లో పనులు చేస్తున్న కూలీలు వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. పనులు చేసినప్పటికీ బ్యాంకు ఖాతాలో కూలి జమ కాలేదని పలువురు కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2019 ముందు వేతనదారులకు తాగునీటి అలవెన్స్‌, టెంట్లు, ప్రథమ చికిత్స కిట్లు అప్పటి ప్రభుత్వాలు అందించేవని, గత ఏడాది నుంచి ఎంఎంఎస్‌ యాప్‌ కొత్త విధానం రావడంతో ఉపాధి కూలీలకు పనులు వద్ద ఎటువంటి సౌకర్యాలు లేవని కూలీలు వాపోతున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో పనులు చేస్తున్న ఉపాధి హామీ పథకం కూలీలు మండల, డివిజన్‌, జిల్లా కేంద్రాలకు స్పందనలో ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ యాప్‌ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టడంతో అధికారులు ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది.. దీంతో ఉపాధి కూలి అందక వేతన దారులు లబోదిబోమం టున్నారు.
సుదీర్ఘకాల డిమాండ్‌
గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉపాధి హామీ కల్పించే చట్టం చేయాలని సుదీర్ఘకాలం పాటు కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తూ వచ్చాయి. మధ్యలో పనికి ఆహార పథకం వంటి కార్యక్రమాలు కొంత మేరకు అమలు చేశారు. చివరకు కాంగ్రెస్‌ సారథ్యంలోని యూపీఏ హయాంలో 2005లో పార్లమెంటులో చట్టం రూపొందించి 2006 నుంచి అమలు ప్రారంభించారు. ఆ సంవత్సరం ఫిబ్రవరి నుంచి దేశంలో వెనకబడిన 200 జిల్లాల్లో మొదట అమలు చేశారు. ఈ పథకానికి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటికే కరువు సమస్యతో సతమతమవుతున్న అనంతపురం జిల్లా నుంచి శ్రీకారం చుట్టారు. నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియా గాంధీ కూడా బండ్లపల్లి వచ్చి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఆ సందర్భంగా కూలీలతో మాట్లాడారు. స్థానికుల రాగి సంకటి ఆరగించి సంతృప్తి వ్యక్తం చేయడం అందరినీ ఆకట్టుకుంది.

పాలకుల విధానాలు ప్రకృతి శాపాలు

మార్చి నెలలో రాష్ట్రంలో ఎనిమిది జిల్లాల్లో భారీ గాలులు, వడగళ్ల వర్షాలు రైతులను నిట్టనిలువునా ముంచాయి. చేతికి వచ్చిన పంటలు కొద్ది నిమిషాల్లోనే నేలపాలయ్యాయి. కోట్ల రూపాయల రైతుల పెట్టుబడి మట్టిలో కలిసిపోయింది. దాంతో రైతు కుటుంబాల భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, హర్యానా, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు కూడా ఈ వడగళ్ల వర్షాలకు తీవ్రంగా నష్టపోయాయి. ప్రకృతి వైపరీత్యాల పేరుతో తరాల నాడు రూపొందించుకున్న నిబంధనలే నేటికీ అమలవుతున్నాయి. అసాధారణ పరిస్థితుల వల్ల రైతు అసాధారణంగా నష్టపోతే ప్రభుత్వాలు చేసే సహాయం కూడా అసాధారణంగా వుండాలనే కనీస విజ్ఞతను పాలకులు పాటించడంలేదు.
రాష్ట్రంలో వడగళ్ల వానల వల్ల 3 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక అంచనాలు వేసి ప్రభుత్వానికి నివేదించారు. అనంతపురం జిల్లాలో కురిసిన భారీ వర్షాలు, వడగళ్ల వానల వల్ల అరటి, మామిడి, బత్తాయి, పుచ్చకాయ, బొప్పాయి, టమోటా, మిరప, మొక్కజొన్న, వరి పంటలు భారీగా నష్టపోయాయి. ఇందులో ఉద్యానవన పంటలు 4,843 ఎకరాలు, ఇతర పంటలు 7,525 ఎకరాల్లో నష్టపోయినట్లు జిల్లా అధికారులు ప్రాధమిక అంచనా వేశారు. వాస్తవ పరిస్థితి ఇంతకు రెండిరతలు వుంటుంది. శ్రీసత్య సాయి, కృష్ణా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో లక్షల ఎకరాల్లో పంటల నష్టం జరిగింది. పొరుగున వున్న తెలంగాణ రాష్ట్రంలో పంట నష్టం అంచనా వేసి, ఎకరాకు రూ. పది వేల నష్టపరిహారాన్ని ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. మనకు మాత్రం పరిహారం ఎంత ఇస్తారో ఎప్పుడు ఇస్తారో స్పష్టత ఇవ్వడంలేదు.
పంట నష్టం అంచనా – ద్వంద్వ ప్రమాణాలు
అనంతపురర జిల్లాలో 16 మండలాల్లోని 46 గ్రామాల్లో 4,843 ఎకరాల్లో ఉద్యానవన పంటలు నష్టపోయాయి. ఇందులో ఒక్క అరటి పంట 2,769.4 ఎకరాల్లో నష్టపోయినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఒక ఎకరా అరటి సాగుకు కనీస పెట్టుబడి ఖర్చు రూ.లక్ష 30 వేలు అవుతుంది. ఈ లెక్కన ప్రస్తుత పంట పెట్టుబడి నష్టం రూ.36 కోట్లు. ప్రస్తుత ధర ప్రకారం దిగుబడి ఆదాయం కలిపితే సుమారు రూ.వంద కోట్లకు పైగా వుంటుంది. అయితే రూ. 6,655 కోట్లు మాత్రమే నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. పంటల పెట్టుబడి ఖర్చు ఆధారంగా ఇచ్చే బ్యాంకు రుణాలు, పంటల నష్టం ఆధారంగా ప్రభుత్వాలు లేదా ఇన్సూరెన్స్‌ కంపెనీలు చెల్లించే పరిహారాల విషయంలో ద్వంద్వ ప్రమాణాలను ప్రభుత్వాలు రూపొందించుకున్నాయి. ఉదా: అరటి పంట ఎకరా సాగుకు బ్యాంకులు ఇచ్చే రుణ సదుపాయం స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ఆధారంగా ఎకరాకు రూ.లక్ష 25 వేలు, పంట నష్టం అంచనా మాత్రం హెక్టారు (రెండున్నర ఎకరాల)కు రూ.25 వేలు. వరి ఎకరా సాగుకు రూ. 35 వేలు ఖర్చు అవుతుంటే, పంట పూర్తిగా నష్టపోతే రూ. 8,433గా అంచనా వేశారు. కోస్తా జిల్లాలో మిర్చి పంట సాగుకు ఎకరాకు రూ.2.50 లక్షల నుండి రూ.3 లక్షల వరకు ఖర్చు అవుతుంది. కాని ప్రభుత్వం రూపొందించుకున్న నిబంధనల ప్రకారం నామమాత్రపు పరిహారం అందేలా వుంది. చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో భీకర గాలులతో మామిడి కాయలు పెద్ద ఎత్తున రాలిపోయాయి. నేల రాలిన మామిడి కాయల ఆధారంగా పంట నష్టం అంచనా వేయడానికి నిబంధనలు అంగీకరించవు. ఇలాగే మొక్కజొన్న తదితర పంటల నష్టానికి, పరిహారం అందించేందకు రూపొందించుకున్న నిబంధనలకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా వుంది. అనంతపురం జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు వేసిన అంచనాల విలువ మొత్తాన్ని ప్రభుత్వం అరటి రైతులకు చెల్లించిన రైతు నష్టంలో కేవలం ఆరు శాతం మాత్రమే అవుతుంది. నష్టంలో ఆరు శాతం మాత్రమే చెల్లించి రైతులను ఆదుకుంటామనే ప్రభుత్వాలు రైతు ప్రభుత్వాలు ఎలా అవుతాయి? ఉద్యానవనశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం అంచనా వేశారు. ఈ క్రాప్‌ బుకింగ్‌ ఆధారంగా రైతుల పేర్లు నమోదు చేస్తున్నారు. ముందస్తు కౌలు చెల్లించి, పంట పెట్టుబడి పెట్టే వాస్తవ సాగుదార్లయిన కౌలు రైతులకు…ప్రభుత్వాలు చెల్లించే నష్టపరిహారం ఒక్క రూపాయి కూడా అందదు.
పంటల బీమా రైతులకా? కంపెనీలకా? రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని దేశ ప్రజలకు హామీ ఇచ్చి బిజెపి వారు అధికారంలోకి వచ్చారు. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా లాంటి వాటి ద్వారా పంటల నష్టానికి పరిహారం చెల్లించడం, రైతులకు బ్యాంకుల ద్వారా వ్యవసాయ రుణాలు భారీగా ఇవ్వడం తమ విధానంగా ప్రకటించారు. బిజెపి నేతల మాటలకు చేతలకు ఎంత వ్యత్యాసం వుంటుందో అనేక విషయాల్లో రుజువవుతూనే వుంది. వ్యవసాయ రంగంలో మరింత స్పష్టంగా బట్టబయలవుతున్నది. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోతే…పంటల బీమా కోసం 2017-18 సంవత్సరంలో ప్రారంభించిన ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (పి.ఎం.ఎఫ్‌.బి.వై) ద్వారా పరిహారం చెల్లిస్తామన్నారు. ఈ బీమా పథకం అమలు కోసం 13 ప్రయివేటు సంస్థలతో సహా 18 సాధారణ బీమా కంపెనీలను ప్రభుత్వం ఇందులో చేర్చుకున్నది. ఈ పథకం కింద ఖరీఫ్‌ పంటలకు ప్రీమియంలో 2 శాతం, రబీ పంటలకు 5 శాతం రైతులు చెల్లించాలి. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చెల్లిస్తాయి. 2016-17 నుండి 2020-21 వరకు ప్రయివేటు బీమా కంపెనీలు ప్రీమియంగా రూ. 69,667 కోట్లు పొంది, రూ. 45,317 కోట్లు పరిహారంగా రైతులకు చెల్లించి, రూ. 24,350 కోట్ల రూపాయలు లాభపడ్డాయి. ఇందులో ఒక్క అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ అత్యధికంగా రూ. 4,731 కోట్లు లాభపడిరది.
వ్యవసాయ రుణాల విధానాలను పరిశీలిద్దాం. 2019-20లో రూ.9 లక్షల కోట్లు, 2020-21లో రూ.11 లక్షల కోట్లు, 2021-22లో రూ. 16 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలను ప్రకటించారు. ఆచరణలో గౌతమ్‌ అదానీ లాంటి ఐదు బడా కార్పొరేట్‌ కంపెనీలు నిర్మిస్తున్న కోల్డ్‌ స్టోరేజ్‌లు, మాల్స్‌, సోలార్‌, విండ్‌ మిల్లుల విద్యుత్‌ కంపెనీలకు ఇచ్చే రుణాలను కూడా వ్యవసాయ రుణాలుగా మార్చారు. ప్రతి బ్యాంకు తన వ్యాపార ధనంలో 40 శాతం వ్యవసాయ రుణాలు ఇవ్వాలని, అందులో 18 శాతం పంట రుణాలు వుండాలని 1965లో రూపొందించుకున్న రిజర్వుబ్యాంకు విధానాన్ని 1991 వరకు అమలు చేశారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద, మధ్య తరగతి ర్కెటతులకు అందాల్సిన వ్యవసాయ రుణాల్లోకి బడా కంపెనీలు జొరబడి దోచుకునేటట్లు విధానాలను మార్చారు.
కేంద్ర విధానాలపై నోరెత్తని రాష్ట్ర పాలకులు
రైతులకు తీవ్ర నష్టం కలిగించే కేంద్ర ప్రభుత్వ విధానాలను ఏ మాత్రం ప్రశ్నించక పోగా, వ్యవసాయ విద్యుత్‌ మీటర్ల ఏర్పాటు లాంటి విధానాలను అమలు చేసి రైతులపై భారాలు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడుతున్నది. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ శక్తులకు అప్పగించే మూడు నల్ల చట్టాలను పార్లమెంట్‌లో బలపరచి, వీధుల్లో రైతు ఉద్యమాలను బలపరిచే ద్వంద్వ విధానాలను రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు అనుసరించాయి.
పంట నష్టపోవడం అంటే రైతు పెట్టుబడి నష్టంతో పాటు…అప్పుల భారం, ప్రజలకు ఆహార సరుకుల కొరత, ధరల పెరుగుదల వంటి అనేక రూపాల్లో దీని ప్రభావం వుంటుంది. అందుకే రైతుకు పరిహారం అందించడం సామాజిక బాధ్యత. పంటల నష్టానికి న్యాయమైన పరిహారం కోసం పోరాడాలి. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో జీవిస్తున్న 14.57 కోట్ల మంది రైతులు, 20 కోట్ల మంది వ్యవసాయ కూలీలను ఐదారు కార్పొరేట్‌ కంపెనీలకు బలిపెట్టే ప్రభుత్వ విధానాలను ఐక్యంగా ప్రతిఘటించడం ద్వారానే వ్యవసాయాన్ని కాపాడుకోగలం.
తెలంగాణలో గత 8 ఏండ్లలో 8 వేలకు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం వెనుక ప్రకృతి వైపరీత్యాలు సృష్టించిన విధ్వంసం ఉంది. విపత్తులతో నష్టాలు ఎక్కడైనా సహజమే. కొన్ని సార్లు ఈ నష్టాలను అరికట్టడం రైతులకు, ప్రభుత్వాలకు కూడా సాధ్యం కాదు. అందుకే ఆయా దేశాల్లో ప్రభుత్వాలు రైతులను, ప్రజలను ఆదుకోవడానికి నష్టపరిహారం చెల్లిస్తాయి. లేదా బీమా పథకాలు అమలు చేస్తాయి. అమెరికా, యూరప్‌, చైనా, జపాన్‌ లాంటి దేశాల్లో కూడా ఇలాంటి పథకాలు ఉన్నాయి. రైతులు, ప్రజలు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వాలు చేయాల్సిన కనీస పాలనా బాధ్యత ఇది.
మన దేశంలో జాతీయ స్థాయిలో 2005 జాతీయ విపత్తు చట్టం అమలులో ఉంది. జాతీయ ప్రకృతి వైపరీత్యాల పరిహార నిధి (ఎన్‌?డీఆర్‌ఎఫ్‌) కూడా కేంద్ర బడ్జెట్‌ లో భాగంగా ఉంది. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ నుంచి ఏటా ఎస్‌డీఆర్‌ఎఫ్‌ కు నిధులు అందుతాయి. వీటికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర బడ్జెట్‌ లో నిధులు కేటాయించుకొని, ప్రజలకు నష్టాలు వాటిల్లిన సందర్భాల్లో తక్షణ పరిహారం
(ఇనపుట్‌ సబ్సిడీ) అందించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఇన్‌ పుట్‌ సబ్సిడీగా నిర్ణయించింది తక్కువ మొత్తమే, అయినా కనీసం ఆ పద్ధతి అమలులో ఉంది. నష్ట పోయిన రైతులకు ఎకరానికి కనీసం రూ.10 వేలు పరిహారంగా అందించాలని 2013 లోనే ‘‘హుడా కమిషన్‌’’ సిఫారసు చేసినా , తెలంగాణలో 2015 లో వచ్చిన జీవో ప్రకారం ఎకరానికి కేవలం రూ.4 వేల పరిహారం మాత్రమే నిర్ణయించారు. ఇది కూడా పంట సగటు ఉత్పత్తిలో 33 శాతం మించి నష్టపోతే మాత్రమే అందుతుంది.
కోర్టు తీర్పు ఇచ్చిన అమలు చేయక..
పరిహారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రశ్నిస్తూ.. రైతు స్వరాజ్య వేదిక కోర్టు తలుపులు తట్టింది. 2020 ఖరీఫ్‌ లో భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ 2020 సెప్టెంబర్‌ లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. వర్షాల వల్ల జరిగిన నష్టాలను వివరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి 2020 అక్టోబర్‌ 15న కేంద్రానికి ఉత్తరం కూడా రాశారు. కేంద్ర బృందం వచ్చి పరిశీలించి వెళ్లింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ కూడా 2021 నాటికే నష్టం వివరాలతో ఫైనల్‌ రిపోర్ట్‌ కేంద్రానికి పంపింది. ఈ వ్యాజ్యంపై ఏడాది పాటు విచారణ జరిపిన రాష్ట్ర హైకోర్టు 2021 సెప్టెంబర్‌ 28 న రైతులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.3 నెలల్లో రైతులను గుర్తించి 2022 జనవరి 28 నాటికి పరిహారం అందించాలని, పంటల బీమా పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు కాబట్టి, సన్న, చిన్న కారు రైతులకు బీమా పరిహారం కూడా చెల్లించాలని తీర్పు ఇచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్పును అమలు చేయకుండా, పచ్చి అబద్ధాలతో సుప్రీం కోర్టు అప్పీల్‌ కు వెళ్లింది. ప్రస్తుతం విచారణ జరుగుతున్నది.
ప్రభుత్వమే బీమా అమలు చేయాలె..
ప్రజాస్వామిక పరిపాలన అంటే, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పరిపా లించడం. కనీసం కోర్టు ఆదేశాలను పాటించడం. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సూత్రాలను పాటించడం లేదు. ఇప్పటికే రాష్ట్ర రైతులకు జరిగిన నష్టాలను అర్థం చేసుకుని 2023 ఖరీఫ్‌ నుంచి రాష్ట్రంలో పంటల బీమా పథకాలు అమలు చేయడానికి ప్రభుత్వం పూనుకోవాలి. అన్నిపంటలను, గ్రామం యూనిట్‌ గా బీమా పరిధిలోకి తీసుకు రావాలి. సన్న, చిన్నకారు రైతుల ప్రీమియం మొత్తాన్ని కానీ, లేదా ఆంధ్రప్రదేశ్‌ లాగ మొత్తం రైతుల ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. 2020 సంవత్సరానికి పంట నష్ట పరిహారం చెల్లింపు విషయంలో, సుప్రీంకోర్టులో అప్పీల్‌ ను ఉపసంహరించుకుని రాష్ట్ర హైకోర్టు తీర్పును అమలు చేయాలి. ఎప్పుడు ప్రకృతి వైపరీత్యం సంభవించినా, వెంటనే నష్టపోయిన వారి వివరాలు సేకరించి,పరిహారం అందించాలి. ఈ మేరకు రాష్ట్ర బడ్జెట్‌ లో కూడా నిధులను కేటాయించాలి.
పంటల బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ
జాతీయ స్థాయిలో అమలవుతున్న పంటల బీమా పథకాలకు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రీమియం భారాన్ని భరించే విధానం ఉంది. బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకున్న రైతులు ఆటోమాటిక్‌ గా పంటల బీమా పరిధిలోకి వచ్చే వాళ్లు. 2019 వరకు రైతులు కొద్దిపాటి ప్రీమియం చెల్లిస్తే, మిగిలిన ప్రీమియం మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం భరించేవి. పంట నష్టం జరిగినప్పుడు బీమా పరిధిలోకి వచ్చిన రైతులకు ఎంతో కొంత బీమా పరిహారం అందేది. కానీ 2020లో కేంద్రం బీమా మార్గదర్శకాల్లో మార్పులు చేసి, తన వాటా ప్రీమియం చెల్లిం పును 30 శాతానికి పరిమితం చేసుకుంది. గత మూడేండ్లుగా రాష్ట్రంలో భారీ వర్షాలతో రైతులు పంటలు నష్టపోతూనే ఉన్నారు. ప్రభుత్వం అత్యంత బాధ్యతా రహితంగా వ్యవ హరిస్తూ, కనీసం గ్రామాల వారీగా పంటలు నష్టపోయిన రైతుల వివరాలను కూడా సేకరిం చడం లేదు. నష్టపోయిన రైతుల వివరాలతో కేంద్రానికి నివేదికలు పంపి సాయం కూడా అడగడం లేదు.
వ్యాసకర్త : సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు.- (వి.రాంభూపాల్‌)

ఇతర కులాలను ఎస్టీలో చేర్పు వెనుక అంతర్భాగ కుట్రే

ఈ వ్యాసం తేది 30.12.2022 న పాడేరు జూనియర్‌ కళాశాల మైదా నంలో ఆదివాసి జెఎసి నిర్వహించిన ‘‘ఆదివాసి గర్జన’’ బహిరంగ సభను ఉద్దేశించి తయారు చేసిన ప్రసంగ పాటవానికి చిన్నపాటి మార్పులతో ఆదివాసు లంటేనే ఇష్టపడని ఇతర కుల సమాజన్ని నేడు ఎస్టీ జాబితాలో చేర్చడానికి చేస్తున్న కుటీల యత్నాల వెనక చాలా భయం కరమైన అంతర్గత ఎజెండా దాగిఉంది. ఆ అంతర్గత ఎజెండా గురించి పాలకులు మనకు చెప్పరు. మనమే గ్రహించాలి. అర్థం చేసుకోవాలి. ఇతర కులాలను ఎస్టీ జాబితాలో చేర్చడానికి చేస్తున్న కుట్రల వెనక చాలా భయంకరమైన అంతర్గత ఎజెండా దాగిఉంది. బి.రామారావుదొర

ఈగర్జనసభకు వివిధ ప్రాంతాల నుంచి జిల్లా నలుమూలల నుంచి ఎన్నో ప్రయసలకు ఓర్చి విచ్చేసిన మీఅందరికీ ఉద్యమా భివందనాలు తెలుపుకుంతున్నాను.గత 12రోజులుగా (డిసెంబర్‌12 నుండి 22వరకు) నిర్వహించిన ఆదివాసి హక్కుల పరిరక్షణ యాత్రతో మీ గ్రామాలకు వఛ్చినయాత్ర బృందాలకు అన్నం పెట్టి ఆదరించిన ఆదివాసులందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పాలకులు దాచిపెడుతున్న ఆ అంతర్గత ఎజెండా ఏమిటంటే! రాజ్యాంగం ద్వారా ఆదివాసులు సాధించుకున్న రక్షణ చట్టాలు, హక్కుల ప్రకారం ఏజేన్సి ప్రాంతాలలో నిక్షిప్తమై ఉన్న అపరమైన ప్రకృతి సంపాదను కొల్లగొట్టడానికి ప్రభుత్వాలకు/పాలకులకు సాధ్యం కావాడం లేదు. కావున ఆదివాసులకంటే ఎక్కువ జనాభా కలిగి,వారికి విధేయులుగా ఉండే కులాలను, ఆదివాసులకంటే అభివృద్ధి చెందిన అగ్ర కులాలను ఎస్టీ జాబితాలో చేర్చి మనకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను వారికి పంచిపెట్టి తద్వారా ఏజేన్సి ప్రాంతాలను చిన్నభిన్నం చేయడానికి ప్రస్తుత ప్రభుత్వాలు/పాలకులు పూనుకున్నారు.చరిత్రలో చూడండి స్వతంత్రం వచ్చిన తర్వాత దేశంలో గాని రాష్ట్రంలో గాని ఆదివాసి ప్రాంతాల్లో ఉన్న అపారమైన ఖనిజ సంపద విదేశీ పెట్టుబడుదారి కంపెనీలకు కట్టబెట్టినప్పుడు ఆదివాసి చట్టాలు మాత్రమే కాపాడిరది. ఆరక్షణ చట్టాలు నాశనం చేయాలంటే! పాలకులకు అసలైన ఆదివాసులు చేత ఆ పని చేయించడం సాధ్యం కాకావడం లేదు. ఆయా సందర్బాలలో ఎంతో కొంత మంది చైతన్య వంతులై పాలకుల కుటీల ప్రయత్నాలను అడ్డుకున్న సందర్బాలున్నాయి. అదే ఇతర కులాలను మన ఆదివాసి జాబితాలో చేర్పించి మన రాజ్యాధికారాన్ని వారికి కట్టబెట్టి అసలైన భూమి పుత్రులను అచేతనవస్తలో పెట్టి ఆదివాసిల మనుగడను దెబ్బతీయడానికి పూనుకున్నదీ ప్రభుత్వం. ఒకసారి మనం గమనించినట్లైతే ఎస్టి జాబితాలో కలపడానికి ప్రతిపాదిత కులాలవారికి 30శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నది. అదే మనకు (ఆదివాసులకు) 6శాతం రిజర్వేషన్‌ మాత్రమే అమలులో ఉంది. ఎవరైనా తక్కువ రిజర్వేషన్‌ నుండి ఎక్కువ రిజర్వేషన్‌ లో చేరాలనుకుంటారు. చేర్చుతారు కూడా. కానీ మన విషయంలో ఎక్కువ రిజర్వేషన్‌ ఉన్నవాళ్ళను తక్కువ రిజర్వేషన్‌ లోకి చేర్చడానికి కారణం ఏమిటి? అంటే జగన్మోహన్‌ రెడ్డి గాని, ఇతర పాల కులకుగాని ‘బోయవాల్మికి, నకిలీ బెంతు ఒరియా (వడ్డీ) కులాలపై వల్లమాలిన ప్రేమ గాని, ఆదివాసు లపై ఒర్వలేనంత ద్వేషం గాని ఎందుకు? వారి మీద ప్రేమ లేదు. వీరి మీద ద్వేషమూ లేదు. స్వతహగా జగన్మోహన్‌ రెడ్డి గారు వ్యాపారవేత! కావుననే ఈ కపట నాటకాలాడుతున్నారు. ఆదివాసుల పాదాల కింద, అడవి తల్లి గర్బంలో బాధ్రంగా ఉన్న అపారమైన ఖనిజ సంపాదనను పెట్టుబడిదారులకు కట్టబెట్టడానికి చేస్తున్న కుటిల ప్రయత్నమని ఆదివాసులు మరియు ఇతర కుల సమాజం (అగ్రకులాలు) కూడా గమనించాలి.6శాతం రిజర్వేషన్లు కలిగి ఉన్న ఆదివాసులు ఇప్పటివరకు కనీసం పాఠ శాలలలు, తాగు నిరు,రోడ్లు,కరెంట్‌ లేని గ్రామాలు ఎన్ని ఉన్నాయి? దానిని పరిగణలోకి తీసుకుంటే సరిపోతుంది. ఆదివాసులు ఎంత అభివృద్ధి చెంది ఉన్నరో..2017 డిసెంబర్‌ 2నచంద్రబాబు నాయుడు బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాడు. జగన్మోహన్‌రెడ్డి తనపాదయాత్రలో బోయలకు ఇచ్చిన మాట ప్రకారం 52జీవోద్వారా శ్యామ్యూల్‌ ఆనంద్‌ ఏక సభ్య కమీషన్ను నియమించి ఆ కమిటి రిపోర్టు ఆధారంగా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయడానికి సిద్ధపడ్డాడు. జనసేన అదినేత పవన్‌ కళ్యాణ్‌ మత్స్యకారులను కూడా ఎస్టీలలో కలపడానికి మద్దతు ఇచ్చాడు. కాంగ్రెస్‌ పార్టీ 1976లో వివిధ రాష్ట్రాల్లో వివిధ హోదాలు కలిగి ఉన్న లంబాడాలను తన రాజకీయ అవసరాల కోసం ఎస్టీలలో కలిపి తెలుగు రాష్ట్రాల ఆదిమతెగలను కోలుకో లేని దెబ్బతీశారు. బిజెపి ఎలాగో రిజర్వే షన్లు అమలు ఇష్టం లేక ప్రభుత్వ రంగ సంస్థ లన్నీ ప్రైవేటుపరం చేస్తుంది.ప్రభుత్వ సంస్థలే లేకుండా చేస్తే, రిజర్వేషన్లన్న సంగతే ఉండదు. ఇది ఆదివాసులు, దళితులు వంటి అణగారిన వర్గాలకు పెద్ద బ్దెబ్బ.చివరికి కమ్యూనిస్టులు సైతం ఓటు బ్యాంకు రాజకీయాలనే అనుసరి అనుసరిస్తున్నారు. జగన్మోహన్‌ రెడ్డి కుటుంబం ఆదివాసులను వెంటాడుతూనే ఉంది.బాక్సైటు తవ్వకాలకు చంద్రబాబు నాయుడు చేసిన తీర్మానాలతోనే జర్రెల కొండలను తవ్వి తన బావమరిది పెన్నా ప్రతాపరెడ్డికి కట్టబెట్టాలని దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రయత్నించాడు. అది సాధ్యం కాక 2009న పాడేరు పర్యటించి ఎజేన్సిలో నాన్‌ ట్రైబల్స్‌కు మూడుసెంట్లు భూమి ఇస్తున్నమని ప్రకటిం చాడు.నేడు జగన్మోహన్‌ రెడ్డి గారు ఆదివా సేతరులకు షెడ్యుల్డ్‌ ప్రాంతంలో ఒకటిన్నర సెంట్లు భూమి ఇవ్వడానికి ఉత్తర్వులు జారీ చేశాడు.ఈ అన్ని సందర్భాలలో ఆదివాసుల సంక్షేమం ఎక్కడుంది? అదిమజాతుల వినా శము కోరే సంక్షోభం తప్ప. అదే మనలను బయపెడుతుంది. ఉన్న చట్టాలను సక్రమంగా అమలు చేయడం లేదు.చదువుకున్న యువ తులకు ఉద్యోగాలు లేవు. యువత పక్కదారి పట్టి గంజాయి స్మగ్లర్ల చేతిలో చిక్కి సాగుదా రులుగాను, రవాణాదారులుగాను ముద్ర పడి వేలాది మంది బంధిలై జైల్లో మగ్గుతున్నారు. మొన్నటి వరకు జీవో నె.3 షెడ్యూల్‌ ప్రాం తంలో స్థానిక ఆదివాసి యువతకు వందశాతం ఉపాధి అవకాశాలు కల్పించే జీవోగా పెద్ద బరోసాగా ఉండేది. ఈ జివో రద్దు చేసారు. చట్టపరంగా మనకు వచ్చిన ఎస్టి సబ్‌ ప్లాన్‌ నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇతర సంక్షేమ పథకా లకు మళ్ళించి మన కోసం ఖర్చుపెట్టవలసిన డబ్బును అమ్మ ఒడి, వైఎస్సార్‌ చేయూత, వసతి దీవెన వంటి ఇతర పథకాలకు మళ్ళించి రాష్ట్ర ప్రజలందరికి పంచిపెదితున్నారు. ఆదివాసులు పండిరచే పంటలకు గిట్టుబాటు ధర లేదు. మార్కెట్‌ సదుపాయం లేదు.పరిశ్రమలు లేదు. కష్టపడి పండిరచిన పంటలను అదివాసేతర దళారులు కొల్లగొడుతున్నారు. అంతర్జా తీయంగా గుర్తింపు పొందిన కాఫీని పందిం చమని ప్రోత్సహిస్తున్నరే! తప్ప మార్కెట్‌ సదుపా యాలు కల్పించడం లేదు.ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయడం లేదు. ఆపంట అంత ప్రభు త్వమే (ఐటిడిఎ కాఫీ బోర్డు ద్వారా) ప్రైవేటు దళారులకు గంపగుత్తగా అప్పజేప్పు తుంది.విద్యాలయాలు కాస్త దాణా కేంద్రాలు (టవవసఱఅస్త్ర షవఅ్‌తీవం)గాను,నిరుద్యోగ ఉత్పత్తి కేంద్రాలు (బఅవఎజూశ్రీశీవఎవఅ్‌ జూతీశీసబష్‌ఱశీఅ షవఅ్‌వతీం)గా మాత్రమే పనికొస్తున్నాయి. తప్పితే! ఆదివాసి నిరుద్యోగ యువతకు ఉపాది మార్గాలు చూపించడం లేదు.300 నుండి 500 మంది విద్యార్థిని విద్యార్థులకు మాత్రమే సరిపడ్డ సౌకార్యాలు ఉన్న వసతి గృహాలు/పాఠశాలలలో 700నుండి 1500 మంది వరకు బలవంతంగా కుక్కుతున్నారు. పిల్లలకు ఆలనా పాలన కూడా సరిగలేక మంచి చదు వులు సంగతి ఏమోగాని,పాఠశాలలలోనే మృత్యువాతపడుతున్నారు. ఈ మద్య కాలంలో పాడేరు ఐటిడిఎ పరిధిలో మూడు నెలల కాల వ్యవధిలో 8మంది విద్యార్థిని విద్యార్థులు మృత్యువాత పడ్డారు.స్వాతంత్రం రాకముందు బ్రిటిష్‌ వారు ఆదివాసుల రక్షణ కొరకు బలమైన చట్టాలు చేసి పగడ్బందీగా అమలు చేయడం వలన కొంత వరకు న్యాయం జరిగింది. అంతేకాకుండా నేటికి ఆ చట్టాలే రక్షణగా ఉంటున్నాయి.ఉదా: 1914-17మద్య కాలంలో కారం తమ్మన్న దొర నడిపిన లాగరాయి తిరుగుబాటు ఫలితంగా అతని మరణాంతరం ఆగస్టు 4,1917నుష్ట్రవ Aస్త్రవఅషవ ుతీaష్‌ం Iఅ్‌వతీవర్‌ ూaఅస ుతీaఅంటవతీ Aష్‌ -1917’’ను రూపొందించారు. ఆ చట్టమే ‘‘1/70 భూ బదలాంపు నియంత్రణ చట్టం’’గా రూపొందించారు. దీనిని అమలు చేయవలసిందిపోయి నిర్వీర్యం చేసి ప్రకృతి సంపదనంత అంబానీ, అధానిలకు అప్ప జెప్పడానికి సిద్ధమయ్యారు.1935 - దీతీఱ్‌ఱంష్ట్ర Iఅసఱa Aష్‌ ద్వారా212ుతీఱపaశ్రీ స్త్రతీశీబజూం ను గుర్తించి వారిని కాపాడడానికి చేసిన చట్టాలను సామాజిక న్యాయం పేరిట నిర్వీర్యం చేస్తు న్నారు. ఇతర కుల ప్రభావాలకు లోనైన తెగలు తమ ఉనికిని కోల్పోతున్నాయి. అందులో భాగంగానే బీసీ కులాలైన బోయ,బోయ వాల్మీకి,ఒడ్డి(నకిలీ బెంతు ఒరియా) కులాలను ఎస్టీ జాబితాలోకి చేరుస్తున్నారు. ఈ మధ్య కాలంలో బ్రెజిల్‌ దేశంలో ఆదిమజాతీ సమూ హానికి చెందిన చిట్టచివరి మనిషి మరణించిన విషయం తెలిసిందే. స్వాతంత్రం వచ్చిన తర్వాత చేసిన పెసా చట్టం,అటవీకుల చట్టం ఎంత మేరకు అమలవుతుందో! ఎంత చిత్తశుద్ధితో పాలకులు అమలు చేస్తున్నారో! కళ్ళారా చూస్తున్నాము. ఆదివాసులు ఆధారపడ్డ అడవుల నుంచి వారిని గెంటివేయడానికి, ఆ అడవులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టదానికి, చట్టం చేసిన అనతి కాలంలోనే అంటే గత రెండున్నర దశబ్దాల కాలంలో కేంద్ర రాష్త్ర ప్రభుత్వాలు వాటిని నిర్వీర్యం చేయడానికి కుట్రలు పన్నుతున్నాయి.చింతపల్లి మండలం ఎర్ర వరంలో హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌, జాతియా రహదారి నిర్మాణం, టూరిజం పేరిట ఆదివాసులను భూమి లేని పేదలుగా మార్చివేస్తుంది. ఉమ్మడి విశాఖ ఎజేన్సి ప్రాంతంలో గత నాలుగు దశబ్దాలుగా (Gూఖ) (గిరిజన విద్యార్ధి సంఘం) ూూGR (ూతీస్త్రaఅఱఓa్‌ఱశీఅ టశీతీ ూతీశ్‌ీవష్‌ఱశీఅ శీట Gఱతీఱjaఅa/ుతీఱపaశ్రీ Rఱస్త్రష్ట్ర్‌ం) చేసిన పోరాటాల ఫలితంగా షెడ్యూల్డ్‌ ప్రాంతాలలో నివసిస్తున్న స్థానిక ఆదిమ తెగలకు ఉద్యోగాలు కల్పించే జీవోనె.3 వచ్చింది. అది ఇప్పుడు పాలకుల సహకారంతో రాద్దాయి పోయింది. ఆ జీవోను కాపాడడానికి పాలకుల ద్వారా కనీస ప్రయత్నం కూడా చేయబడి ఉండలేదు. Gూఖ, ూూGR సంస్థల పోరాట స్ఫూర్తితోనే ఆదివాసుల గొంతుగా మనం నేడు ‘‘ఆదివాసిని అనివార్యంగా ఏర్పాటు చేసుకోవలసి వచ్చింది. దీనిని కూడా లేకుండా చేయడానికి కుటీల ప్రయత్నలు జరుగుతుంది. జెఎసి అంటే ఏ రాజకీయ ప్రమేయం లేకుండా ఆదివాసులు తమకు తాముగా సవరించుకున్న గొంతు. ఈ సంస్థ కొన్ని తరాల వరకు ఆదివా సులు తమ మనుగడను కొనసాగించ డానికి బరోసగా..స్తూర్తిగా ఉండాలని ఆశిస్తు న్నాను.ఆ స్పూర్తిని కొనసాగించడానికి మీ అందరి సహకారం ఉండాలని కోరుకుంటున్నాను. ఏ ప్రభుత్వం లేదా పాలకుడైన తమ రక్షణ చట్టాలు, హక్కులకు బంగం కలిగిస్తే చట్టసభల్లో ప్రశ్నించి సరి చేసుకునే అవకాసం ఉంటుందన్న గొప్ప ఆశయంతో రాజ్యాంగంలో అణగారిన కులాలకు, తెగలకు ప్రత్యేక రిజర్వేషన్ల ద్వారా ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎంపిపిలు, చైర్మన్లులు, సర్పంచులు, వార్డు మెంబర్లుగా ఆయా స్థానాలలో వారిని మాత్రమే ఎన్నుకునే అవకా శం కల్పించబడిరది. ఆయా సందర్బా లలో వారిని ప్రశ్నించే అవకాశం కల్పించాలనే ఇంగిత జ్ఞానం పాలకుడికి ఎలాగో ఉండదు. ఉన్న అవకాశం ఇవ్వరు. మన ప్రతినిదులులు కూడా కనీస బాద్యత తీసుకోవడం లేదు. అందువలనే పాలకులు ‘‘కాకులను కొట్టి గద్దలకు వేసినట్టు’’ అల్పసంఖ్యాకులైన మన రిజర్వేషన్‌ హక్కులు మనం అనుభవించకుండా చేయడానికి ఇతర కులాలను ఎస్టిలలో కలపడానికి పూను కుంటున్నారు. ఈ అన్ని సందర్భాలలో ఏ ఒక్క సందర్భంలో కూడా ఆదివాసి ప్రజా ప్రతి నిధులు వారి యొక్క కనీస బాధ్యత నిర్వహించకపోవడం వలన ఈరోజు జేఏసీ ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది.మీరేగాని ఈబాధ్యత తీసుకుంటే మీ అందరి జెండాలు కలిపి మోయడానికి నేను సిద్ధంగా ఉంటాను. విజ్ఞులైన మేధావులు జాగ్రత్తగా లేకపోతే నిజమైన ఆదివాసుల మనుగడకే ప్రమాదం మంచుకొస్తుందని ముగిస్తున్నాను. వ్యాసకర్త : జిల్లా కన్వినర్‌,ఆంధ్రప్రదేశ్‌ ఆదివాసి జాయింట్‌ ఏక్షన్‌ కమిటి,అల్లూరి సీతారామారాజు జిల్లా

సహజ వనరులు..ఖనిజనిక్షేపాలు వరమా?శాపమా?

ఎంత పెద్ద ఎత్తున సహజ వనరులు, ఖనిజ నిక్షేపాలు దొరికినా..పూర్తి స్థాయిలో వాటిపై ఆధారపడకపోవడమే మంచిది. ఆ నిక్షేపాల వద్ద ఒకరిద్దరు వ్యాపారులు మాత్రమే లాభపడేలా కాకుండా…సరైన ప్రణాళికలు రూపొందించి ప్రజలందరికీ లాభం జరిగేలా చర్యలు చేపట్టాలి. ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి లాభాలను విద్య, మౌలిక సదుపాయాల కల్పనలో ఖర్చు చేయాలి. అంతేకాకుండా వివిధ రంగాల్లో పెట్టుబడులు పెడుతూ దేశ ఆర్థిక వ్యవస్థను వైవిధ్యపర్చాలి. అవినీతికి ఆస్కారం ఇవ్వొద్దు. అప్పుడే అన్ని పరిస్థితులను ఎదుర్కొనేలా దేశ ఆర్థిక వ్యవస్థను తయారు చేయవచ్చు. లేకుంటే ఆ సహజ వనరులు, ఖనిజ నిక్షేపాలే దేశానికి శాపంగా మారుతాయి.
సహజ,ఖనిజ నిక్షేపాలే కొన్ని దేశాలకు శాపంగా మారినట్టు చరిత్ర చెబుతున్న వాస్తవం. ‘డచ్‌ డిసీజ్‌’పేరుతో నెదర్లాండ్స్‌ ఎదుర్కొన్న పరిస్థి తులు ప్రపంచానికి ఇప్పటికీ ఒకఉదాహరణగా ఉన్నాయి.1959లోనెదర్లాండ్స్‌లో భారీఎత్తున గ్యాస్‌ నిల్వలను కనుగొనగా అప్పటి నుంచి ఆదేశం వాటిని పెద్ద ఎత్తున ఎగుమతి చేయడం ప్రారం భించింది. ఇన్‌స్టంట్‌గా అది దేశఆర్థిక వ్యవస్థకు ఎంతో లాభం చేకూర్చినా,దీర్ఘకాలిక వృద్ధిలో తీరని నష్టాన్ని మిగిల్చింది. ఓ దశాబ్దం తర్వాత అంటే 1970-77 మధ్యలో పరిశీలిస్తే ఆ దేశ నిరుద్యోగ రేటు 5.1 శాతానికి చేరుకున్నది. అంతకు ముందు అది ఒక శాతానికి మాత్రమే పరిమితమై ఉన్నది. ఎందుకంటే పెట్టుబడులంతా ఒకే రంగంలో కేంద్రీకృతం కావడం, ఇతర రంగాలు, తయారీ పరిశ్రమలను పట్టించుకోకపోవడంతో ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైందని ఆర్థిక విశ్లేషకులు నిర్ధారించారు. బ్యాటరీ తయారీలో కీలకమైన లిథియమ్‌ నిల్వలను జమ్మూకాశ్మీర్‌లో ఇటీవల కనుగొన్నట్లు కేంద్ర గనుల శాఖ ప్రకటించింది. 59 లక్షల మెట్రిక్‌ టన్నుల లిథియం ఉన్నట్లు అంచనా వేసింది.ఈ అంచనా నిజమైతే ప్రపం చంలోనే అత్యధిక లిథియమ్‌ నిల్వలున్న దేశాల్లో భారతదేశం రెండో స్థానంలో ఉంటుంది. అంతే కాకుండాజమ్మూ కాశ్మీర్‌, ఏపీ,ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, జార్ఖండ్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, ఒడిశా, రాజస్థాన్‌, తమిళనాడు,తెలంగాణల్లో 51చోట్ల ఖనిజనిల్వ లను గుర్తించారు. వాటిలో 5బంగారు గనులు సైతం ఉన్నాయి.అంతేకాకుండా పొటాష్‌, మాలిబ్డినం వంటి లోహాలను గుర్తించారు. అయితే ఇలాంటి సహజ, ఖనిజ నిక్షేపాలు ఆయా ప్రాంతా లకు, దేశ ఆర్థిక వ్యవస్థకు, భవిష్యత్తుకు వరమా? శాపమా? అనే చర్చ అవసరమవుతున్నది.
పర్యావరణంపై తీవ్ర ప్రభావం
లిథియమ్‌ అయినా ఇతర ఖనిజ నిక్షేపాలైనా వాటిని మైనింగ్‌ చేసి, వెలికి తీయాలంటే ప్రకృతి, పర్యావ రణంపై తీవ్ర ప్రభావం పడుతుంది. నేల, నీరు, గాలి కలుషితమవుతాయి. ఉదాహరణకు ఒక టన్ను లిథియమ్‌ను ఉత్పత్తి చేయడానికి 2.2 మిలియన్‌ లీటర్ల నీరు అవసరమవుతుంది. పర్యావరణంపై పడే ప్రభావాన్ని పట్టించుకోకుండా లిథియమ్‌ను వెలికి తీయడానికి ప్రయత్నిస్తే ‘జోషి మఠ్‌’ లాంటి సంఘటనలు మరింత పెరిగే ప్రమాదముంటుంది. ఎలక్ట్రిక్‌ వాహనాల్లో వాడే బ్యాటరీల్లో లిథియమ్‌ను వినియోగిస్తున్నారు. దీంతో కర్బన ఉద్గారాలు ఎంతో మేర తగ్గించవచ్చని వాదించే వారూ ఉన్నారు. అయితే లిథియమ్‌ మైనింగ్‌ ద్వారా ఉత్పత్తి అయ్యే కర్బన ఉద్గారాలను కూడా మనం తోసిపుచ్చలేం. లాభనష్టాలను బేరీజు వేసుకొని, అన్నింటిని సమతుల్యం చేసి ముందుకు సాగితేనే ఫలితముం టుంది. పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతుం డడంతో లిథియమ్‌ వెలికితీతపై ఇప్పటికే అర్జెం టీనా,బొలీవియా వంటి దేశాల్లో పెద్ద ఎత్తున నిర సన కార్యక్రమాలు జరుగుతున్నాయి.
దేశ ఆర్థిక వ్యవస్థపై..?
కేంద్ర గనుల శాఖ అంచనా వేసినట్టు జమ్మూ కాశ్మీర్‌లో 59లక్షల టన్నుల లిథియమ్‌ నిల్వలు ఉండి, పర్యావరణంపై కనీస ప్రభావంతో వాటిని వెలికితీసినా..అది దేశ ఆర్థిక వ్యవస్థకు, భౌగోళిక పరిస్థితులకు ఏ మేరకు లాభసాటిగా ఉంటుందనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.చమురు నిల్వలను కనుగొన్నప్పుడు గల్ఫ్‌ దేశాలు జాక్‌ పాట్‌ కొట్టినట్టే భారతదేశ పరిస్థితి ఉండబోతున్నదనే వాదనా ఉన్నది.
చరిత్రను పరిశీలిస్తే…
ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే వివిధ దేశాల్లో పెద్ద ఎత్తున సహజ నిక్షేపాలను కనుగొన్నప్పుడు ఆ దేశా లపై పడ్డ ప్రభావాన్ని చూస్తే అనేక ఆసక్తికర విష యాలను మనం గమనించవచ్చు. కొన్ని దేశాలు సానుకూల పరిస్థితులను సృష్టించుకొని అభివృద్ధి దిశలో పయనించగా, సరైన ప్రణాళికలు లేకుండా మరికొన్ని దేశాలు దీర్ఘకాలికంగా అనేక రంగాల్లో వెనకబాటుకు గురయ్యాయి.గతంలో గల్ఫ్‌ దేశాలతోపాటు నార్వే, ఆస్ట్రేలియా, రువాండా లాంటి దేశాల్లో పెద్ద ఎత్తున చమురు నిల్వలను కనుగొన్నారు.వీటివల్ల ఆదేశ ఆర్థికవ్యవస్థ రూపు రేఖలే మారిపోయాయి. అదే సమయంలో వీటికి భిన్నమైన ఉదాహరణలు సైతం మనకు కనిపి స్తాయి.
‘డచ్‌ డిసీజ్‌’ ఒక ఉదాహరణ
సహజ, ఖనిజ నిక్షేపాలే కొన్ని దేశాలకు శాపంగా మారినట్టు చరిత్ర చెబుతున్న వాస్తవం. ‘డచ్‌ డిసీజ్‌’ పేరుతో నెదర్లాండ్స్‌ ఎదుర్కొన్న పరిస్థితులు ప్రపం చానికి ఇప్పటికీ ఒక ఉదాహరణగా ఉన్నాయి. 1959లో నెదర్లాండ్స్‌లో భారీ ఎత్తున గ్యాస్‌ నిల్వ లను కనుగొనగా అప్పటి నుంచి ఆ దేశం వాటిని పెద్ద ఎత్తున ఎగుమతి చేయడం ప్రారంభించింది. ఇన్‌స్టంట్‌గా అది దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో లాభం చేకూర్చినా,దీర్ఘకాలిక వృద్ధిలో తీరని నష్టాన్ని మిగిల్చింది. ఓ దశాబ్దం తర్వాత అంటే 1970-77మధ్యలో పరిశీలిస్తే ఆ దేశ నిరుద్యోగ రేటు 5.1శాతానికి చేరుకున్నది. అంతకు ముందు అది ఒకశాతానికి మాత్రమే పరిమితమై ఉన్నది. ఎందు కంటే పెట్టుబడులంతా ఒకే రంగంలో కేంద్రీకృతం కావడం, ఇతర రంగాలు, తయారీ పరిశ్రమలను పట్టించుకోకపోవడంతో ఇలాంటి పరిస్థితి ఉత్ప న్నమైందని ఆర్థికవిశ్లేషకులు నిర్ధారించారు. అంతే కాకుండా 1908లో ఇరాన్‌లో ఆయిల్‌ నిల్వలను కనుగొన్నారు. అక్కడ ఇతరరంగాలు అభివృద్ధి చెందకపోవడం, అక్షరాస్యత అంతంతమాత్రంగానే ఉండడంతో పెట్టుబడులు, మానవ వనరులన్నీ ‘ఆయిల్‌’ రంగం వైపు మళ్లాయి. దీంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం ఒకే వనరుపై ఆధారపడి నడపాల్సి వచ్చింది. దీంతో మిగిలినరంగాలు భారీ నష్టాలను చవిచూశాయి. ఎన్నో సహజ వన రులు, ఖనిజ నిక్షేపాలున్నా అవినీతి,సరైన ప్రణాళిక లేకపోవడంతో కాంగో,జింబాబ్వే లాంటి దేశాలు ఇప్పటికీ పేదరికంలోనే మగ్గుతున్నాయి.
ఇతర దేశాలను పరిశీలిస్తే…
గల్ఫ్‌దేశాల కరెన్సీ పూర్తిస్థాయిలో పెట్రో ఉత్పత్తులపై ఆధారపడి ఉన్నది. ఇతర ఎలాంటి వస్తువులను ఆ దేశాలు ఎగుమతి చేయవు. దీంతో ‘డచ్‌ డిసీజ్‌’ లాంటి పరిస్థితులను అవి ఎదుర్కోలేదు. అదే సమ యంలో ఆస్ట్రేలియా, నార్వే దేశాలను పరిశీలిస్తే ఖనిజ నిక్షేపాలతోపాటు ఇతర రంగాలపై కూడా దృష్టి సారించాయి. విద్య, మౌలిక సదుపాయాల కల్పనలో పెద్ద ఎత్తున ఖర్చు చేసి ‘డచ్‌ డిసీజ్‌’ లాంటి పరిస్థితులు రాకుండా తప్పించు కోగలి గాయి. అంతేకాకుండా సౌది, దుబాయి, యుఎఇ వంటి దేశాలు తమ ప్రాంతాలను టూరిస్ట్‌ హబ్‌ లుగా మార్చి తమ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ఎంత పెద్ద ఎత్తున సహజ వనరులు, ఖనిజ నిక్షేపాలు దొరికినా..పూర్తి స్థాయిలో వాటిపై ఆధారపడకపోవడమే మంచిది. ఆ నిక్షేపాల వద్ద ఒకరిద్దరు వ్యాపారులు మాత్రమే లాభపడేలా కా కుండా…సరైన ప్రణాళికలు రూపొందించి ప్రజలం దరికీ లాభం జరిగేలా చర్యలు చేపట్టాలి. ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి లాభాలను విద్య, మౌలిక సదుపాయాల కల్పనలో ఖర్చు చేయాలి. అంతే కాకుండా వివిధ రంగాల్లో పెట్టుబడులు పెడుతూ దేశ ఆర్థిక వ్యవస్థను వైవిధ్యపర్చాలి. అవినీతికి ఆస్కారం ఇవ్వొద్దు. అప్పుడే అన్ని పరిస్థితులను ఎదుర్కొనేలా దేశఆర్థిక వ్యవస్థను తయారు చేయవచ్చు. లేకుంటే ఆ సహజ వనరులు, ఖనిజ నిక్షేపాలే దేశానికి శాపంగా మారుతాయి. – (ఫిరోజ్‌ ఖాన్‌)

1 … 4 5 6 7 8 … 16