అడవి తల్లి బిడ్డలం..ఆదివాసులం..

అడవే మా ఊరు..అడవే మాజీవితం…అడవితల్లే మాతల్లి.ప్రకృతిని పరిరక్షిస్తూ, కొండలుకోనలు, వాగులు వంకలతో మమేకమై తరతరాలుగా జీవిస్తున్నాం. అడవిపై హక్కు కోసం కాదు..అడవితో కలిసి బతికే హక్కు కోసం మా పోరాటం.జల, జంగల్, జమీన్‌నే మాజీవనాధారం అభివృద్ధి పేరుతో మానేల,మావనరులు,మా సంస్కృతి దూరమవుతున్న వేళ..అస్తిత్వాన్నికాపాడుకునేందుకు ఆదివాసీసమాజం చేస్తుపోరాటమే ఈ కథనం.- (డాక్టర్.సాగబోయిన పాపారావు)

అడవి తల్లి ఒడిలో ప్రకృతి దైవంగా జీవనాన్ని కొనసాగిస్తున్న వారే ఈదేశ మూలవాసులు అనే మాట కేవలం ఒకనినాదం కాదు.ఇది తరతరాలుగా అడవులు,కొండలు,వాగులు,నదులు,భూములతో సహ జీవనం చేస్తూ వచ్చిన ఆదివాసీ సమాజం యొక్క అస్తిత్వ ప్రకటన. ప్రకృతిని కాపాడుతూ,ప్రకృతితో కలిసి జీవిస్తూ,తమ ప్రత్యేక సంస్కృతి, భాష,ఆచారాలు,సంప్రదాయాలను తరతరాలకు అందించిన సమాజ మే ఆదివాసీ సమాజం.‘ఆదివాసి’ అనే పదం సాధారణంగా ఒకప్రాం తానికి చారిత్రకంగా మూలవాసులుగా ఉన్న ఆదివాసి సమా జాలను సూచిస్తుంది.భారత రాజ్యాంగంలో వీరిలో అనేక సమూహాలు షెడ్యూ ల్డ్ ట్రైబ్స్ (ST)గా గుర్తించ బడ్డాయి.తెలంగాణలో కోయ,గోండ్,కొండ రెడ్డి,నాయక్‌పోడ్, కొలాం,పర్దాన్,అందు,మన్య వార్,చెంచు తదితర అనేక ఆదివాసీ సమూహాలు నివసిస్తున్నాయి. ప్రతి తెగకు ప్రత్యేకమైన భాష, యాస,జీవనవిధానం,పండుగలు,ఆచారాలు,కళలు,జానపద సం ప్రదాయాలు ఉన్నాయి.ఈవైవిధ్యమే భారతదేశ సాంస్కృతిక సంపదలో ఒక ముఖ్యమైన భాగం.
ఆదివాసుల జీవితం అడవితో విడదీయలేనిది.అడవి వారికి కేవలం చెట్లు,కలపకు సంబంధించిన ప్రాంతంకాదు.అది వారి జీవ నాధారం,ఆహారం,ఔషధం,సంస్కృతి,ఆర్థికవ్యవస్థ,ఆధ్యాత్మిక విశ్వా సాలకు ఆధారం.చిన్న వన ఉత్పత్తులు, తేనె, చింతపండు, ఇప్పపువ్వు, పారేటాకులు,పండ్లు,విత్తనాలు వంటి అనేక వనరులు ఆదివాసీ కుటుం బాల జీవనంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ఆదివాసీ అభివృద్ధి అంటే అడవిని నాశనంచేసి అభివృద్ధి చేయడం కాదు. అడవిని కాపా డుతూ ఆదివాసుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం. ఆదివాసి ప్రజలకు నీరు,అడవి, భూమి హక్కులు అస్తిత్వం ఆదివాసీ సమాజానికి భూమి కేవలం ఆస్తికాదు.అది వారి కుటుంబం,సంస్కృతి,జీవన విధానం, భవిష్యత్తుతో ముడిపడి ఉంటుంది.ఈమధ్యకాలంలో ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజనేతరుల చొరబాటు అధికమై భూస్వామ్య సమ స్యలు, అక్రమ ఆక్రమణలు, బినామీ లావాదేవీలు,అభివృద్ధి ప్రాజెక్టులవల్ల నిర్వాసితులవడం వంటి సమస్యలు అనేక ప్రాంతాల్లో ఆదివాసీ కుటుంబాలపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో భూమిహక్కులు,అటవీ హక్కులు,సంప్రదాయ జీవనాధారాల రక్షణ అత్యంత ప్రాధాన్యమైన అంశాలకు ప్రమాదం పొంచి ఉంది.అనేకమంది ఆదివాసి పోరాట యోధులు ఆదివాసి ప్రజల రక్షణ కోసం ఉద్యమాలు,పోరాటాలు ప్రాణ త్యాగాలు చేసిన ఫలితంగా మొట్టమొదటి భారత స్వాతంత్ర సమరయోధుడు బిర్సాముండా స్ఫూర్తితో జైపాల్ సింగ్ ముండా ఆదివాసులకు రాజ్యాంగంలో ప్రత్యేకంగా 5,6వ షెడ్యూల్డ్‌లను రూపొందించిన భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఆదివాసీ సమాజం ప్రత్యేక పరిస్థితులను గుర్తించి ప్రత్యేక రక్షణలను కల్పించింది. ఆర్టికల్ 244ద్వారా 5వ మరియు 6వ షెడ్యూల్ ప్రాంతాల పరిపాలనకు రాజ్యాంగపరమైన వ్యవస్థను కల్పించారు. తెలంగాణలోని షెడ్యూల్డ్ ఏరియాలు 5వ షెడ్యూల్ పరిధిలోకి వస్తాయి.5వ షెడ్యూల్ ఉద్దేశం కేవలం పరిపాలన కాదు. ఆదివాసీ భూములు, సంప్రదాయ జీవన విధానం, సామాజిక ప్రయోజనాలు మరియు ప్రత్యేక హక్కులను రక్షించడం కూడా దాని ప్రధాన లక్ష్యాలలో ఒకటి.భూ బదలాయింపు చట్టం1/70యాక్ట్, PజుSA చట్టం1996,అటవీ హక్కుల చట్టం`2006 వంటి చట్టాలు కూడా షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గ్రామసభలకు మరియు అటవీ ఆధారిత ఆదివాసీ సమాజాలకు ముఖ్యమైన హక్కులను కల్పించారు. ఆదివాసులకు ప్రత్యేకమైన హక్కులు చట్టాలు ఉన్న వివిధ కారణాల చేత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ…ఆదివాసులకు దక్కవలసిన విద్య, ఉద్యోగ,ఉపాధి,రాజకీయ అవకాశాలను వలసవాదులు గెద్దల్ల తన్నుకు పోతున్నారు.అడవి బిడ్డలు ఆదివాసుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. మా హక్కులు అమలు చేయండి. మా బిడ్డ లకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి.మా భూములు రక్షిం చండి. మా జీవనం విధ్వంసం చేయకండి అని ఆదివాసుల ఆర్తనాదాలు ఆలకించే వారే లేరు. ఆదివాసీ సమాజం అభివృద్ధికి విద్య అత్యంత కీలకం. గ్రామీణ మరియు ఏజెన్సీ ప్రాంతాల్లో నాణ్యమైన పాఠశాలలు,ఉపాధ్యాయులు,వసతిగృహాలు,ఆశ్రమ పాఠశాలలు,ఇంటర్మీడియట్,డిగ్రీ,సాంకేతిక మరియు ఉన్నత విద్యా అవకాశాలు మరింత బలోపేతం కావాలి.“విద్య హక్క… విద్య అమ్మకపు వస్తువు కాదు.”ఆదివాసీ విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు నిరంతర విద్యను పొందేలా ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా బాలికల విద్య,హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు,ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు,పోటీపరీక్షల శిక్షణ వంటి అంశాలకు ప్రాధాన్యత అవసరం.ఏజెన్సీ ఆదివాసి ప్రజల కనీస ప్రాథమిక అవసరాలను తీర్చేందుకు ఏర్పాటుచేసిన ITణAలు ఉన్నా లేనట్లుగానే ప్రాజెక్టు అధికారుల పనితీరు కనిపిస్తుంది. ఉద్యోగ,ఉపాధి ద్వారానే యువత భవిష్యత్తు విద్యావంతులైన ఆదివాసీ యువతకు తగిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించకపోతే సామాజిక అభివృద్ధి అసంపూర్ణంగా ఉంటుంది.షెడ్యూల్డ్ ఏరియాల్లో రాజ్యాంగం, చట్టాలు మరియు ప్రభుత్వ విధానాల ప్రకారం స్థానిక ఆదివాసీ యువతకు లభించాల్సిన అవకాశాలు సమర్థవంతంగా అమలు కావాలి.ఉద్యోగ నియామకాల్లో చట్టపరమైన నిబంధనలు స్పష్టంగా ఉండాలి.నోటిఫికేషన్లలో గందరగోళానికి అవకాశం లేకుండా స్థానిక హక్కులు,రిజర్వేషన్లు,రోస్టర్ విధానం స్పష్టంగా ప్రకటించాలి.ఆదివాసులకు ఉన్న హక్కులు,చట్టాలను అమలు చేయకుండా ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి 100% రిజర్వేషన్ సాకుతో ఉన్న జీవో :3ని గిరిజనేతరుల కుట్రల వల్ల సుప్రీంకోర్టు కొట్టి వేసిందనే సాకుతో తెలంగాణ ప్రజా ప్రభుత్వం 2026 పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేసిన నోటిఫికేషన్లు స్థానిక ఆదివాసి నిరుద్యోగులకు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న పోలీస్ స్టేషన్ పరిధిలో (సివిల్) కానిస్టేబుల్ కు 75%రిజర్వేషన్ అమలు చేయాలని జీవో: 109 స్పష్టం చేసిన రేవంత్ సర్కార్ పెడచెవిన పెట్టింది. అన్నీ ఉన్నా ఆదివాసులకు అన్యాయం జరుగుతున్న మాట వాస్త వం.ఆదివాసీ సమాజం యొక్క గొప్ప సంపద వారి సంస్కృతి.గుస్సాడి, కోయ నృత్యాలు,జానపద గీతాలు, సంప్రదాయ వాద్యాలు,వేల్పుల జాతరలు, (సీజనల్) భూమి,కొత్తలు,పెద్దలు, ఇప్పపువ్వుల పండుగలు,వైద్యం,ఆహారసంస్కృతి, సంప్రదాయ జ్ఞానంఇవన్నీ తరత రాలు గా పూర్వీకుల నుండి వస్తున్న అమూ ల్య వారసత్వం.ఆధునికతను స్వీకరిం చడం అవసరమే.కానీ ఆధునికత పేరు తో భాషను,సంస్కృతిని,ఆచారాలను, సంప్రదాయ జ్ఞానాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు.ఆదివాసీ పిల్లలకు ఆధు నిక విద్యతో పాటు వారి మాతృభాష, చరిత్ర,సంస్కృతి గురించి కూడా అవగా హన కల్పించాలి.ఇప్పటి వరకు ఈ ప్రయత్నం అటు ప్రభుత్వాలుగానీ ఇటు ఐటిడిఏలుగాని చెయ్యకపోవడం సూచ నీయం.కేంద్ర,రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అధికారులు మాత్రం ఆదివాసుల అభివృద్ధి కోసం సంస్కృతి,సాంప్రదాయా లను ముందుకు తీసుకపోవడంలో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు కాగితాల మీద లెక్కలు చూపిస్తున్నారు.ఆదివాసీ సమాజంలో మహిళల పాత్ర అత్యంత కీలకం.కుటుంబ ఆర్థికవ్యవస్థ నుంచి వ్యవసాయం,అటవీ ఆధారిత జీవనో పాధి,పిల్లల సంరక్షణ,సాంస్కృతిక పరంపర కొనసాగింపు వరకు వారు కీలక పాత్ర పోషి స్తున్నారు.ఆదివాసీ మహిళలకు విద్య,ఆరోగ్యం,ఉపాధి, స్వయం ఉపాధి,భద్రత నిర్ణయాధి కారంలో మరింత అవకాశాలు కల్పిం చాలి.ఆదివాసీ ప్రాంతాల్లో అభివృద్ధి అంటే రోడ్లు,విద్యుత్,తాగునీరు,ఆసు పత్రులు,పాఠశాలలు,ఇంటర్నెట్,రవాణా వంటి మౌలిక సదుపాయాలు అవసరం. కానీ అభివృద్ధి పేరుతో ఆదివాసులను వారి భూమి,అడవి,జీవనాధారాల నుంచి దూరం చేయడం అభివృద్ధి కాదు.‘ఆదివాసుల కోసం అభివృద్ధి కావాలి; ఆదివాసులను తొలగించే అభివృద్ధి కాదు.’అభివృద్ధి ప్రణాళి కల్లో స్థానిక ఆదివాసి ప్రజల అభిప్రా యానికి,గ్రామసభల పాత్రకు,రాజ్యాంగ రక్షణలకు ప్రాధాన్యత ఉండాలి.కానీ అందుకు భిన్నంగా ఏజెన్సీ ప్రాంతాలలో రాజ్యాధికారం వలసవాదుల కబంధ హస్తాల్లో బందీ అయి ఉంది.అందుకే ఆదివాసులు అభివృద్ధికి నోచుకోవడం లేదు. నేటి ఆదివాసీ సమాజం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది.భూమి మరియు అటవీ హక్కుల సమస్యలు,విద్యా వెనుక బాటుతనం,పిల్లల డ్రాపౌట్లు,నిరుద్యోగం, ఆరోగ్య సదుపాయాల కొరత,పోషకాహార సమస్యలు,గిరిజనేతరల వలసలు,మౌలిక వసతుల కొరత,మాతృ భాషల పరిరక్షణ సమస్య,సంస్కృతి,సంప్రదాయాలపై పెరుగు తున్న ప్రభావాలుప్రభుత్వ పథకాల అమ లులో లోపాలు షెడ్యూల్డ్ ఏరియా హక్కు లు,చట్టాల అమలులో సమస్యలు ప్రభు త్వాలు ఈసమస్యలను ఒక్కోఅంశంగా కాకుండా సమగ్ర ఆదివాసీ అభివృద్ధి విధా నం ద్వారా పరిష్కరించాల్సిన అవసరం ఉం ది. ఆదివాసీ హక్కుల కోసం పోరాటం అంటే ఇతర సమాజాలకు వ్యతిరేకంగా పోరాటం కాదు. ఇదిరాజ్యాంగం కల్పిం చిన హక్కుల అమలు కోసం ప్రజాస్వా మ్య పోరాటం.ఆదివాసి ప్రజాసంఘాలు, ఉద్యో గులు,యువకులు,విద్యావంతులు, హక్కు లు,చట్టాలను,రాజ్యాంగం గురించి తెలుసు కుని,తమ హక్కులను ప్రజాస్వా మ్య పద్ధతుల్లో కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి తరం ఆదివాసి జెన్ జీ యువకులు, విద్యార్థుల పైన ఉంది.సమాజంలో ఐక్యత,విద్య, చైతన్యం,ఆత్మగౌరవం పెం పొందించాలి. అడవిని కాపాడిన వారసులం.భూమిని తల్లిగా భావించిన వారసులం.ప్రకృతిని దేవతగా ఆరాధిం చిన వారసులం.మన సంస్కృతిని తరతరాలకు అందించిన వారసులం. మనకు దానం అవసరం లేదు. రాజ్యాంగ హక్కులు అమలు కావాలి. మనపై కనికరం అవసరం లేదు.మనకు సమాన గౌరవం కావాలి.మన సంస్కృ తిని చెరిపివేయడం కాదు.మన సంస్కృ తిని గౌరవించాలి.మన భూములను కోల్పో వడం కాదు.మన భూమి,అడవి, జీవనాధా రాలను రక్షించాలి.మన యువతకు హామీలు కాదు.నాణ్యమైన విద్య,ఉపాధి,అవకాశాల కోసం ఆదివాసి యువత ఉద్యమించాలి.
వ్యాసకర్త : ఆదివాసి స్టూడెంట్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ.సెల్ నెంబర్ :9441288991

చట్టం అందరికీ సమానమే అయితే..

“ ఒక యువతి తన కుటుంబానికి అండగా నిలవాలని,తన కాళ్లపై తాను నిలబడాలని నర్సుగా ఉద్యోగంలో చేరింది. రోగులకు సేవ చేయాల్సిన చేతులు…చివరకు ఓమానవ మృగం చేతిలో చిదిమెయ్యబడిన ఆదివాసి యువతి ఊకే శిరీష సంఘటన సమాజాన్ని కలచివేసింది.” తుక్కుగూడలోని ప్రైమ్ కేర్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న 21ఏళ్ల ఊకే శిరీష హత్యాచారం,హత్య ఘటన ఇప్పుడు కేవలం ఒకకుటుంబం విషాదం కాదు.ఉద్యోగ ప్రదేశాల్లో మహిళల భద్రత, ప్రైవేట్ ఆసుపత్రుల బాధ్యత,పోలీసు దర్యాప్తు, ఆదివాసీ మహిళలకు న్యాయం వంటి అనేక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.కుటుంబ సభ్యులు,బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..ఊకే శిరీష తండ్రి మరణంతో తల్లి రేక్కాడితేనే డొక్కాడే నిరుపేద కుటుం బం ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న తన తల్లికి చేయూతనిచ్చేందుకు ప్రైమ్ కేర్ ఆసుపత్రిలో సుమారు ఏడు నెలలుగా నర్సు గా పనిచేస్తూ,ఆసుపత్రికి సమీపంలోని సిబ్బంది వసతి గృహంలో ఉంటున్నారు. విధులు ముగించుకుని గదికి వెళ్లిన ఆమె రాత్రి నిద్రిస్తున్న సమయంలో మాట వేసి ఓ మానవ మృగం వేటలో అత్యాచారం హత్య గావించబడిన సంఘటన తీవ్ర విషాదాన్ని మిగిలించింది.తోటి ఉద్యోగి గదికి వెళ్లి చూడగా మిగతాజీవిగా రక్తపు మడుగులలో శవమై కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తులో భాగంగా సీసీటీవీ పుట్టే జులు,క్లూజ్ టీం,డాగ్స్ స్కాడ్ తదితర ఆధారాల ఆధారంగా ఒకవ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా ఈ కేసులో అత్యాచారం,హత్య చేసినట్లుగా నేరా న్ని అంగీకరించడంతో అరెస్టు చేసిన పోలీ సులు వివిధ కోణాలలో దర్యాప్తుచేస్తున్నట్లుగా ప్రకటించడం హాస్యాస్పదంగా ఉంది.
చట్టం ముందు అందరూ సమానమే కదా?
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 స్పష్టంగా ‘చట్టం ముందు సమానత్వం, చట్టాల సమాన రక్షణ’ ప్రతివ్యక్తికీ ఉం టుందని చెబుతోంది.అదే రాజ్యాం గంలోని ఆర్టికల్ 15కులం,లింగం వంటి అంశాల ఆధారంగా వివక్షను నిషేధిస్తుంది.
అయితే ప్రశ్న ఒక్కటే
చట్టం అనే పుస్తకంలో అందరికీ సమా నంగా ఉండటం మాత్రమే సరిపో తుందా..?ఆచట్టం అమలులోనూ అదే సమానత్వం కనిపించకూడదా..?ఒక ప్రముఖ కేసు దేశవ్యాప్తంగా ప్రకం పనలు సృష్టిస్తే చట్టాల్లో మార్పులు, ప్రత్యేక చర్యలు, వేగవంతమైన దర్యాప్తు, ప్రజా చర్చలు జరుగుతాయి.అలాంటి ఘటనల నుంచి పాఠాలు నేర్చుకోవడం అవసరమే.కానీ అదే సమయంలో సమాజంలోని అట్టడుగు వర్గానికి చెందిన ఒక ఆదివాసి యువతి హింసకు హత్యాచారానికి హత్యకు గురై నప్పుడు ప్రభుత్వం,పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ అంతే తీవ్రతతో స్పందిస్తున్నాయా అనే ప్రశ్నకు ప్రభుత్వం ప్రజలకు స్పష్టమైన సమాధానం రావాలి. ఇది ఎవరి బాధను మరొకరి బాధతో పోల్చడం కాదు.
ప్రతి మహిళ ప్రాణం సమానమే.ప్రతి బాధితురాలి గౌరవం సమానమే.ప్రతి కుటుంబానికి న్యాయం పొందే హక్కు సమానమే. ఒక నేరానికి కులం లేదా తెగ కారణం కాకపోయినా, బాధితురాలు సామాజికంగా వెనుకబడిన వర్గానికి చెంది నప్పుడు ఆమె కుటుంబానికి న్యాయం అందే ప్రక్రియలో ప్రత్యేక సామాజిక, ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉం టుంది. అందుకే భారతదేశంలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సభ్యులపై జరిగే కొన్ని నేరాలకు ప్రత్యేక రక్షణ కల్పించేందుకు Act,1989 అమలులో ఉంది.ఈ చట్టం ప్రత్యేక న్యాయస్థానాలు,బాధితులు మరియు సాక్షుల హక్కులు,ఉపశ మనం,పునరావాసం వంటి అంశాలను కూడా కలిగి ఉంది. అయితే ఊకే శిరీష కేసులో ఈ ప్రత్యేక చట్టంలోని ఏ నిబంధనలు వర్తిస్తాయో అన్నది కేసు వాస్తవాలు,దర్యాప్తు ఆధారాలు, న్యాయపరమైన నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి కేవలం ఆమె ఆదివాసీ యువతి అన్న కారణంతో ఏదైనా నిర్దిష్ట చట్టాన్ని వర్తింపజేయాలని ముందుగానే తేల్చడం కాకుండా,దర్యాప్తు అధికారులు అన్ని వర్తించే చట్టపరమైన కోణాలను పరిశీలించాలి.
కొత్త క్రిమినల్ చట్టాలు ఏమి చెబుతున్నాయి?
2024 జూలై 1నుంచి భారతీయ న్యాయ సంహిత (దీచీS),భారతీయ నాగరిక సురక్షా సంహిత (దీచీSS),భారతీయ సాక్ష్య అధినియమం అమల్లోకి వచ్చాయి. మహిళలు,పిల్లలపై నేరాలకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ కఠినమైన శిక్షా నిబంధ నలు ఉన్నాయి. అత్యాచారం,సామూహిక అత్యాచారం వంటి నేరాలకు తీవ్రమైన శిక్షలు నిర్దేశించబడ్డాయి.ప్రభుత్వమే కొత్త చట్టాల లక్ష్యాల్లో దర్యాప్తులో పారదర్శకత, డిజిటల్ ఆధారాల శాస్త్రీయ సేకరణ, వేగవంతమైన న్యాయ ప్రక్రియ వంటి అంశాలను ప్రస్తావిస్తోంది. వ-Saksష్ట్రya వంటి వ్యవస్థల ద్వారా డిజిటల్ సాక్ష్యాలను భద్రపరచే చర్యలు కూడా చేపట్టినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.అందువల్ల ఊకే శిరీష కేసులో కూడా ఆధారాల సేకరణ,ఫోరెన్సిక్ పరీక్షలు,సీసీటీవీ ఫుటేజీ,డిజిటల్ ఆధా రాలు,సాక్షుల వాంగ్మూలాలు తదితర అంశాలను శాస్త్రీయంగా,ఎలాంటి రాజకీ య లేదా సామాజిక ఒత్తిడికి తలొగ్గకుండా పరిశీలించాలని సమాజం కోరుకుంటుంది.
ఆసుపత్రి యాజమాన్యం బాధ్యత ఏమిటి..?
ఇక్కడ మరో కీలక ప్రశ్న ఉద్యోగ ప్రదేశ భద్రతపై.ఒక యువతి రాత్రివేళల వరకు విధులు నిర్వహించే ఆసుపత్రిలో పని చేస్తుంటే, ఆమెకు సురక్షితమైన వసతి, ప్రవేశ నియంత్రణ,సీసీటీవీ,అత్యవసర సంప్రదింపు వ్యవస్థ,భద్రతా సిబ్బంది, ఫిర్యా దు వ్యవస్థ వంటి రక్షణ చర్యలు ఉన్నా యా..?ఉద్యోగం ఇచ్చిన సంస్థకు జీతం చెల్లించే బాధ్యత మాత్రమే కాదు సురక్షిత మైన పని వాతావరణం కల్పించే బాధ్యత కూడా ఉంది.అందువల్ల ఊకే శిరీష పని చేసిన ఆసుపత్రి,సిబ్బంది వసతిగృహం, భద్రతా ఏర్పాట్లు, ప్రవేశ నిష్క్రమణ విధానం,సీసీటీవీ నిర్వహణ తదితర అంశాలపై సమగ్ర విచారణ జరగాలి. ఏదైనా నిర్లక్ష్యం తేలితే,అది ఎవరిదైనా సరే, చట్టప్రకారం బాధ్యత నిర్ణయించాలి.
న్యాయం అంటే కేవలం నిందితుడికి శిక్ష కాదు
శిరీష కుటుంబానికి న్యాయం అంటే నింది తుడిని అరెస్టు చేయడం మాత్రమే కాదు న్యాయం అంటే దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలి. సాక్ష్యాలను ఎలాంటి లోపం లేకుండా సేకరించాలి.కుటుంబానికి కేసు పురోగతిపై సమాచారం ఇవ్వాలి.బాధిత కుటుంబానికి చట్టబద్ధమైన పరిహారం, పునరావాస సహాయం అందించాలి. సాక్షులకు రక్షణ కల్పించాలి.విచారణ వేగంగా,న్యాయబద్ధంగా జరగాలి.ఆసుపత్రి యాజమాన్యం లేదా ఇతరుల నిర్లక్ష్యం ఉం టే దానిపైనా చర్యలు తీసుకోవాలి.నింది తుడు దోషిగా తేలితే చట్టం నిర్దేశించిన అత్యంత కఠినమైన శిక్ష అమలు చేయాలి. S్పు/ST అత్యాచార నిరోధక చట్టం కింద ప్రభుత్వం బాధితులకు న్యాయం,న్యాయ సహాయం,పునరావాసం,భద్రత వంటి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యతలను కూడా చట్టం నిర్దేశిస్తుంది.ఉద్యోగ ప్రదేశాల్లో మహిళల భద్రత కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు వాస్తవంగా అమలవుతున్నాయా? ఇవన్నీ అడగడం న్యాయవ్యవస్థను ప్రశ్నిం చడం కాదు. న్యాయవ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మరింత బలపరచాలని కోరడం.ఎవరి కుమార్తె అయినా..ఆమె ప్రాణం విలువైనదే ఊకే శిరీష ఒక పేరు మాత్రమే కాదు. ఆమె ఒక కుటుంబానికి కుమార్తె.ఎవరికో అక్క లేదా చెల్లెలు.
ఒక కుటుంబ భవిష్యత్తుకు ఆశ.
సమాజానికి సేవ చేయాలనుకున్న ఒక నర్సు.ఆమె ఆదివాసీ యువతి కావడం వల్ల ఆమె ప్రాణానికి విలువ తగ్గదు. అదే విధంగా మరే మహిళ ప్రాణానికి కూడా విలువ తగ్గదు.న్యాయం ఎవరి కులం, వర్గం,ఆర్థిక స్థితి,రాజకీయ పరిచయాలను చూసి మారకూడదు.చట్టం సమానమైతే.. న్యాయం కూడా సమానంగా కనిపించాలి. చట్టం అందరికీ ఒకటే అని చెప్పడం సులభం.కానీ ఆచట్టం ఒకపేద కుటుంబం తలుపు తట్టినప్పుడు కూడా అదే శక్తితో పనిచేస్తుందా..?ఒక ఆదివాసీ కుటుంబం న్యాయం కోసం పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు వరకు తిరిగినప్పుడు కూడా అదే స్పందన ఉంటుందా..? ఒక సాధారణ యువతి హత్యకు గురైనప్పుడు కూడా సమాజం అదే స్థాయిలో ప్రశ్నిస్తుందా..?
ఇవే ప్రజాస్వామ్యానికి అసలు పరీక్షలు.
ప్రభుత్వం ఈ కేసును ప్రాధాన్యతగా తీసు కొని త్వరితగతిన దర్యాప్తు నిర్వహించాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించి విచారణ పూర్తి చేయాలి.ప్రజలలో పూర్తి విశ్వాసం కలిగేలా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపే అంశం పరిశీలించాలి. నిందితుడికి చట్టం అనుమతితో అత్యంత కఠినమైన శిక్ష విధించాలి.న్యాయం ఆలస్యమైతే న్యాయం నిరాకరించినట్టే అన్న భావన ప్రజల్లో కలగకూడదు.ఊకే శిరీష కేసులో ప్రభు త్వం,పోలీసు శాఖ,వైద్య,ఫోరెన్సిక్ అధికా రులు,న్యాయవ్యవస్థ తమ తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలి.దర్యాప్తు పారదర్శ కంగా సాగాలి.దోషి ఎవరో ఆధారాలతో నిర్ధారించాలి.నిర్దోషిపై అన్యాయం జరగ కూడదు.దోషి ఎలాంటి ప్రభావంతో తప్పించుకోకూడదు అదే నిజమైన న్యాయం.
చివరగా సమాజం అడుగుతున్న ప్రశ్న ఒక్కటే ్య“చట్టం అందరికీ సమానమే అయితే..న్యాయం కూడా అందరికీ సమా నంగా కనిపించాలి కదా..?”ఊకే శిరీషకు న్యాయం జరిగే వరకు ఈ ప్రశ్నకు సమా జం సమాధానం కోరుతూనే ఉంటుంది. – డాక్టర్ సాగబోయిన పాపారావు

ప్రమాద స్థాయిలో భూగర్భ జలాలు

“ జనాల జీవితమంతా జలంతోనే ముడి పడి ఉంటుంది.నిత్యం దాని చుట్టూనే తిరుగుతుంది.నీరు లేనిదే ఏపనీ ముందుకు సాగదు.ఎండా కాలంలో నైతే బోలెడు కష్టాలెదుర్కొవాలి. చెరువులు, కుం టలు, నీటి వనరులు లేని ఊళ్లు పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊరి చెంతనే నది పరుగులిడితే కలిగే ప్రయోజనాలు అన్నీఇన్నీ కావు.రైతులకు పంటలు,పండిస్తుంది. చేపలు పట్టే వారికి ఉపానిస్తుంది.ఎన్నో పనులకు భరోసాగా ఉంటుంది.ఆ జీవనదిలో ఉన్న అనుబంధాల్ని మరిచపో వద్దని తమ బిడ్డలకు ఆతల్లి పేరునే పెట్టుకుంటారు. గోదావరికి ఒడ్డునే ఉన్న పలు గ్రామాలకు వెళ్తే అక్కడి వారికి నది ఎంత మేలు చేస్తుందో తెలుస్తుంది ”
టా వర్షాకాలంలో వానలకు భూగర్భ జలాలు ఉబికిరావడం..వేసవిలో పడిపోవడం సహజ ప్రక్రియ.దీనికితోడు బోర్లు, బావుల ద్వారా భూగర్భ జలాల వాడకం అధికమైతే, అక్కడ నీటిమట్టం ఇంకా పడిపోవడం కూడా సహజమే. అయితే, రాష్ట్రంలో 2,617గ్రామాల్లో నీటిని తెగ తోడేస్తున్నారు. వీటిలో 300 గ్రామాల్లో మరీ దారుణంగా పిండుకుంటున్నారు.అక్కడ ఏటా రీఛార్జి అవుతున్న నీటి కంటే వాడుతున్న జలాల పరిమాణమే ఎక్కువ. భూగర్భాన్ని ఓ జలాశయ మలుచుకుని, వర్షాకాలంలో నీటిని ఒడిసిపట్టి, అవసరాలకు తగ్గట్టు వాడుకోవాల్సి ఉండగా, దారుణంగా తోడేస్తున్నారు. కేంద్ర భూగర్భ జలవనరుల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.కరవు కాలంలో, వేసవిలో తాగునీటికి తహతహలాడే పల్లెలు ఎన్నో. కిలోమీటర్ల దూరం నుంచి నీళ్లు తెచ్చుకునే చిత్రాలు చూస్తుంటాం.ఈ నేపథ్యంలోనే భూగర్భ జలాల రక్షణ, సమర్థ వినియోగంపై కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అధ్యయనం చేస్తుంటారు. ప్రభుత్వ పరంగా నివారణ చర్యలు తీసుకు నేందుకు ఈ అధ్యయనం ఉపయుక్తమవుతుంది. గతంలో మÖణ్నాలుగేళ్లకోసారి ఈ పరిశీలన జరిగేది.కొంతకాలంగా ఏటా,అంటే ప్రతి నీటి సంవత్సరంలోనూ అధ్యయనం చేసి భూగర్భ జలాల లభ్యత, వినియోగం తీరుపై నివేదికలు తయారుచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 21 శాఖల ద్వారా ఇచ్చే సమాచారాన్ని ఇందులో విశ్లేషిస్తున్నారు.ఉదాహరణకు ఒకనీటి సంవత్స రంలో ఒక గ్రామంలో సగటున 100యÖనిట్ల భూగర్భ జలాలు రీఛార్జి అయ్యాయనుకుందాం.ఆ ఊళ్లో ఆ ఏడాది 70 యÖనిట్ల కన్నా తక్కువగా భూగర్భ జలాలు వాడుకుంటే అక్కడ వినియోగం ‘సమర్థం’గా ఉన్నట్లు లెక్క. 70-90 యÖనిట్ల మధ్య జలాలను తోడేస్తుంటే ‘ప్రమాదకర (సెమీ క్రిటికల్)’ సంకేతం 90 నుంచి 100యÖనిట్ల మధ్య తోడేస్తుంటే ‘అంత్యంత ప్రమాదకర (క్రిటికల్)’ధోరణి. కొన్నిపల్లెల్లో 110 యÖనిట్లు కూడా తోడేస్తున్నారు. ఇది ‘అతి దారుణ’ స్థాయి. గత నీటి సంవత్సరంలో చేసిన అధ్యయనం మేరకు రాష్ట్రంలోని 300 గ్రామాల్లో అతి దారుణంగా భూగర్భ జలాలు తోడేస్తున్నట్లు తేలింది. ఇక్కడ రీఛార్జి అయిన పరిమాణానికి మించి, జలాలను తోడేశారు.450గ్రామాలు ప్రమాదకర పరిస్థితుల్లో ఉండగా,మరో 1,271 గ్రామాల్లో పరిధిని మించి నీళ్లు వాడుతున్నట్లు గుర్తించారు.
కఠినంగా వాల్టా అమలు
రీఛార్జికి మించి, నీటిని తోడేస్తున్న గ్రామాల్లో అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 93,శ్రీకాకుళం-76, శ్రీసత్యసాయి-51, బాపట్ల-18, ఎన్టీఆర్-16, అనంతపురం-13, అన్నమయ్య జిల్లాలో ఒకటి చొప్పున ఉన్నాయి. ఈ ఊళ్లలో వాల్టా చట్టాన్ని కఠినంగా అమలు చేయనున్నారు. అక్కడ కొత్తగా వ్యవసాయ, పారిశ్రామిక, వ్యాపార అవసరాలకు బోర్లు తవ్వుకునేందుకు అనుమ తులివ్వరు. తాగునీటికి మాత్రమే బోర్లు వేసే అవకాశముంటుంది. ఆయా గ్రామాల్లో కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు అనుమతి ఉండదు. ఆ దర ఖాస్తులను పరిశ్రమల శాఖకు పంపకుండానే తిరస్కరిస్తారు. విద్యుత్ సంస్థలు కూడా కొత్తగా కనెక్షన్లు ఇవ్వవు. ఈ గ్రామాల్లో పంచాయతీరాజ్, అటవీ, రక్షిత నీటి సరఫరా విభాగం భూగర్భ జలాల పెంపు, రక్షణకు అవసరమైన చర్యలు చేపడతాయి. ఉపరితల నీటి వనరుల అభివృద్ధిపై దృష్టి సారిస్తాయి.
మనం నివసించే భూగోళంలో 70శాతానికిపైగా నీరే.ఇందులో శుభ్రమైన నీరు చాలా స్వల్ప భాగం మాత్రమే.మొత్తం భూగోళంలోని నీటి లో దాదాపు 2.7శాతం మాత్రమే శుభ్రమైన నీరు కాగా, ఇందులోనూ75.2శాతం ధృవప్రాంతాలలో మంచు రూపంలో ఘనీభవించివుంటే,మరో 22.6 శాతంనీరు భూగర్భంలో వుంది.మిగతా నీరు సరస్సులు,నదులు,వాతావరణం,గాలిలోని తేమ, భూమిలోని చెమ్మ,చెట్టు చేమలలో వుంటుంది. ఇంతేకాదు,సరస్సులు,నదులు,భూగర్భ జలాలలో కూడా మానవ వినియోగానికి, ఇతర అవసరా లకు చక్కగా ఉపయోగ పడగలిగిన నీరు చాలా కొద్ది పరిమాణం మాత్రమే. ప్రపంచం మొత్తంలో లభ్యమయ్యే,పరిశుభ్రమైన నీటిలో,1శాతం కంటెకూడా తక్కువ పరిమాణంలో, (లేదా, భూమిపై లభించే మొత్తంనీటిలో దాదాపు 0.00శాతం మాత్రమే) నీరు మానవ విని యోగానికి నేరుగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజూ, మనకు కనీసం 30-50 లీటర్ల పరిశుభ్రమైన, సురక్షితమైన నీరు అవసరం.కాని, ఇప్పటికీ, 88.4కోట్ల మంది( 884 మిలియన్ల మంది)ప్రజలకు సురక్షితమైన నీరు అందుబాటులో లేదు.ప్రపంచవ్యాప్తంగా,ప్రతి ఏటా,1,500ఘనకిలోమీటర్ల పరిమాణంలో,వ్యర్ధ మైన నీరు వస్తుంటుంది.వ్యర్ధ పదార్ధాలను,వ్యర్ధ మైన నీటిని పునర్వినియోగ ప్రక్రియద్వారా, ఇంధనో త్పత్తికి,వ్యవసాయ అవసరాలకు వినియోగించ వచ్చు.కాని,సాధారణంగా, అలా జరగడం లేదు. అభివృద్ధిచెందుతున్న దేశాలలో, తగిన నిబంధనలు, వనరులు లేనికార ణంగా,80శాతం వ్యర్ధాలను పున ర్వినియోగ ప్రక్రియకు మళ్ళించకుండానే పారవేస్తు న్నారు.పెరుగుతున్న జనాభా,పారిశ్రామిక ప్రగతి కూడా,కొత్తరకాల కాలుష్యానికి మÖలమవుతు న్నాయి.ఇదే దామాషాలో,పరిశుభ్రమైన నీటి అవస రం పెరుగుతున్నది.ఈకారణంగా,ఇటు వర్త మానంలోను,అటు భవిష్యత్తులోను మానవ ఆరో గ్యానికి,పర్యావరణ స్వచ్ఛతకు ముప్పుపొంచి వుంది.వేసవి వస్తోందంటేనే భయమేస్తోంది.నీటి కొరత దడ పుట్టిస్తుంది.బిందెలతో బారులు తీరే జనాలు కనిపిస్తారు.మరి నీటి సమస్య అంత విస్తృతమైనది. నీరు లభించని ప్రాంతాలలో ఎదుర య్యే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. నేల తల్లి నెర్రె లిచ్చి నీటిచుక్కకోసం ఆబగా ఎదురుచూస్తుంటే ఇక మానవమాత్రులెంత! గొంతు తడుపుకునే చుక్క నీటికోసం మైళ్లకు మైళ్లు నడిచిపోవాల్సిన పరిస్థితి. పరిశుభ్రమైన నీళ్లు దొరక్క కుంటల్లో, గుంటల్లో అడుగుబొడుగు మురికి నీటినే తాగాల్సిన దుస్థితి. భూమండలంమీద లభించే నీటిలో ఉప్పు సుమద్రా ల వాటా 97శాతం. మిగిలిన దానిలో 69 శాతం హిమపాతం, మంచుగడ్డలే. భూమి మీద లభించే నీటిలో0.008శాతం మాత్రమే స్వచ్ఛమైన నీరు.క్రీశ 2025 నాటికి 48దేశాల్లో తీవ్రమైన నీటికొరత వస్తుందని చికాగోలోని జాన్ హాప్కిన్ యÖనివర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ హెచ్చరించింది.3.575 మిలియన్ల మంది ప్రతి సంవత్సరం నీటికి సంబం ధించిన వ్యాధులతో మరణిస్తున్నారు.నీటిమÖలంగా సంభవించిన 43శాతం మరణాలకు అతిసార వ్యాధే కారణం.పైన పేర్కొన్న మరణాలలో 84 శాతంమంది 14ఏళ్ల లోపువారే.98 శాతం మర ణాలు అభివృద్ధి చెందుతున్న దేశాలలోనే సంభవి స్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ ఆసుపత్రులలో చికిత్సపొందుతున్న రోగులలో సగం మంది నీటి సంబంధ వ్యాధులతో బాధపడుతున్నవారే. భూమి మీదున్న నీటిలో ఒక్క శాతానికంటే తక్కువ మొత్తం నీళ్లు మాత్రమే మానవాళి వెనువెంటనే వాడుకు నేలా వున్నాయి.అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని మురికి వాడల్లో నివసించే ఒకవ్యక్తి రోజు మొత్తం మీద ఉపయోగించే నీరు ఒక అమెరికన్ స్నానానికి వాడే నీటితో సమానం.లీటరు నీటికి మురికివాడల్లో నివ సించే పేదలు, అదే నగంలోని ధనికులకంటే 5-10రెట్లు అధికధర చెల్లిస్తున్నారు. ఆహారం లేకుండా మనిషి కొన్ని వారాలపాటు వుండగలడు. కానీ నీరు లేకుండా కొద్దిరోజులు మాత్రమే వుండగలడు. ప్రతి 15సెకన్లకు ఒక చిన్నారి నీటి సంబంధ వ్యాధితోచనిపోతోంది. లక్షలాది మంది మహిళలు,పిల్లలు రోజుమొత్తం మీద అనేక గంటల సమయాన్ని సుదూర ప్రాంతాల నుంచి నీళ్లు తేవడం కోసం వెచ్చిస్తారు. రోగాల నివారణలో దివ్య ఔషధం నీరు వాతావర ణంలోని హైడ్రోజన్, ఆక్సిజన్‌ల కలయిక వల్ల నీరు ఏర్పడు తుంది.ఈ రెండు వాయు పదా ర్ధాలు కలిస్తే ద్రవ రూపమైన నీరు ఏర్పడును. నిత్యజీవితంలో నీటిని అనేక రకాలుగా ఉపయో గిస్తాం.నీటిని ఉపయోగించి అనేక వ్యాధులను తగ్గిం చే అవకాశం ఉంది. నీరు లేని భూమిని ఒకసారి ఊహించుకోండి.పచ్చనిచెట్లు,పారే నదులు, జీవులు, మహా సముద్రాలు ఏమీ ఉండ వు.ఇవేవీ లేకుండా ఎండిపోయిన మట్టి గడ్డలా ఉంటుంది భూమి. అంతటి అమÖల్యమైన నీటి విలువను తెలుసు కోడానికి, దానిని వృథా చేయకుండా అవగాహన కల్పించడానికి ఈ రోజును కేటాయించారు. ఐక్య రాజ్య సమితి 1993 నుంచి ప్రతి ఏడాది మార్చి 22ను అంతర్జాతీయ జలదినోత్సవంగా గుర్తిం చాలని నిర్ణయించింది. మన భూమ్మీద నీటి గురిం చి కొన్ని నిజాలు తెలుసుకుంటే అదెంత విలువ్కెనదో అర్థం అవుతుంది. భూమి ఏర్పడినప్పుడు ఎంత నీరు ఉందో ఇప్పుడూ అంతే ఉంది.పెరగడం కానీ తరగడం కానీ కాలేదు. కానీ ఆనీటిని వాడుకునే వారి జనాభా మాత్రం విపరీతంగా పెరిగి పోయిం ది. అందుకే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది నీటి కోసం కటకటలాడుతున్నారు.భూమ్మీద ఉన్న నీరు ఎండకు ఆవిరవుతూ,మేఘాలుగా మారు తూ,వర్షంగా కురుస్తూ, భూమిలో ఇంకుతూ, సముద్రంలో కలుస్తూ వేర్వేరు రూపాల్లోకి మారుతూ ఉంటుంది.భూమ్మీద మÖడొంతులు నీరే ఉంది. కానీ అందులో 97శాతం ఉప్పునీరే. కేవలం 3శాతమే మంచి నీరు. ఇందులో కూడా 2శాతం మంచురూపంలోఉంది.మిగతా ఒక శాతం నీరులో 0.59శాతం భూగర్భంలో ఉంటే, మిగతాది నదు లు,సరస్సుల్లో ప్రవహిస్తోంది.ఉన్న మంచి నీటిని మనం పొదుపుగా వాడకపోగా కలుషితం కూడా చేస్తున్నాం. ప్రపంచంలో 500కు పైగా మంచినీటి నదులు కలుషితమై పోయాయి. ప్రపంచంలో భారీ యుద్ధాల్లో చని పోయిన వారి కన్నా, కలుషిత నీటి వల్ల మరణిం చినవారే ఎక్కువ. ఏడాదికి 40లక్షల మంది కలుషిత నీరు తాగి చనిపోతున్నారు. అమెరి కాలో ఒక వ్యక్తి తన అవసరాలకి రోజుకి 500 లీటర్ల నీటిని ఉపయోగిస్తుంటే,ఆఫ్రికాలోని గాంబి యా దేశంలో ఒకవ్యక్తి రోజుకి కేవలం 4.5 లీటర్ల నీటిని మాత్రమే వినియోగిస్తున్నాడు.గాంబియా లాంటి చాలాదేశాల్లో తాగేందుకు కూడా నీరు దొరకడం లేదు.మనమేం చేయాలి?ఎక్కడ్కెనా కొళా యిల్లోంచి నీరువృధాగా పోతున్నట్టు కనిపిస్తే వెం టనే కట్టేయండి.షవర్‌తో స్నానం చేయడం మానేసి, బకెట్ నీళ్లతో చేయండి.దీనివల్ల రోజులో150 లీటర్ల నీటిని కాపాడవచ్చు. పళ్లుతోముకున్నంత సేపూ సింక్‌లోని కొళాయిని వదిలి ఉంచకండి. ఇలా చేయడంవల్ల నెలకి 200 లీటర్ల నీరు వృథా అవుతుంది. టాయిలెట్ ఫ్లష్‌లో సుమారు 8లీటర్ల నీరు పడుతుంది.లీటర్ నీరుపట్టే రెండు బాటిళ్లు తీసుకుని దానిలో ఇసుక లేదా చిన్నచిన్నరాళ్లు నింపి, టాయ్‌లెట్ ఫ్లష్‌లో పెట్టేయండి. దీనివల్ల ఒకసారి వాడే నీటిలో రెండులీటర్ల నీళ్లు ఆదా అవుతాయి. అక్వేరి యంలోని నీళ్లు పారేయకుండా మొక్కలకి పోయండి.కొళాయిలకి లీకేజీలుఉంటే దానిని అరిక ట్టండి.దీనివల్ల నెలలో 300గ్యాలన్ల నీరుఆదా అవు తాయి.ఒక వార్తాపత్రికలో వాడే కాగితం తయారీకి 300లీటర్ల నీరుఖర్చవు తుంది.గాలితరువాత జీవ రాశికి నీరుచాలా ముఖ్యం.అందువల్ల నీటి వనరు లను పొదుపుగా ఉపయోగించుకోవాలి.ఈ నీరు భూఉపరితలములో నదులు,కాలువలు, చెరువులు, కుంటలు, సరస్సు లు మరియు భూగర్భజల రూపంలో ఉన్నది.
అడవుల నరికివేత వలన వర్షపాతం కూడా తగ్గిపోయింది. భారతదేశంలో సగటున ప్రతి మనిషి అన్ని అవసరాలకి కలిపి 680 క్యూబిక్ మీటర్ల నీటిని వాడుతున్నారు. 6గురు ఉండే ఇంటికి 250 లీ నీరు అవసరమవుతుంది మన దేశంలో నదుల్లో ప్రవహించే మÖడవ వంతు నీళ్ళు సము ద్రాల్లోకి నష్టపోతున్నాం.భూగర్భ, భూఉపరితల జలాలు రెండూ కలిపి దేశంలో వాడే మొత్తం నీటిలో 4శాతంవ్యవసాయానికి,12శాతం పరిశ్ర మలకి వాడుతున్నాం.ఇంతటి విలువైన నీటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత నేటి యువతరం పై ఉంది. ప్రస్తుతం ఉన్న వర్షా భావ పరిస్థితుల్లో ప్రతి నీటిచుక్కను ఒడిసి పట్టుకొని నిల్వ చేసుకో వాల్సిన అవసరం ఉంది.నానాటికి ఇంకిపోతున్న భూగర్భ జలాల సంరక్షణ పై దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో యువత నేటితరం కోసం భావితరాల కోసం కొన్ని బాధ్యతలను విధిగా నిర్వర్తించాల్సి వుంది.నీటి సం రక్షణలో మొదటగా చేయాల్సింది నీటి వృధా అరిక ట్టడం.దైనందిన జీవితంలో మనం చాలా నీటిని వృధా చేస్తూఉంటాం. ముందుగా ప్రతి వ్యక్తి నీటి వృధాను అరికట్టే ప్రయత్నం చేయాలి.ప్రతి నీటి చుక్కా అమÖ ల్యమైందే. మంచినీటిని పొదుపుగా వినియోగిం చాల్సిన అవసరం అందరిపై ఉంది. రోజువారీ అవసరాల్లో మనకు తెలియకుండానే నీటిని వృథా చేస్తుంటాం. నీటి వనరుల పర్యవేక్షణ లో యువత తీసుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది.– జీ ఎన్ వి సతీష్

వైద్య సేవలు ఉత్తిదే..

ప్రజలకు  వైద్య సేవలను మెరుగుపరచడం ద్వారా వారి ఆరోగ్య పరిరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి నిలిపిందని ప్రభుత్వం చెబుతున్నా.. వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. రాష్ట్రంలోని ప్రధాన ఆసుపత్రుల్లో మౌలిక వసతులను సైతం ప్రభుత్వం సమకూర్చడం లేదు. అత్యవసర సమయాల్లో అందుబాటులో ఉండాల్సిన 108 అంబు లెన్సులు ..ప్రజల అవసరాలకు తగిన సంఖ్యలో ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించలేదు. దీని వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు 108లు సకాలంలో సంఘటన స్థలానికి చేరుకోలేకపోతున్నాయని పీఎజీ అధ్యయనంలో తేలింది.
జనాభా అవసరాలకు అనుగుణంగా రాష్ట్రం లో ప్రభుత్వం 108అంబులెన్సులు నడపడం లేదు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ప్రతి50వేల మంది జనాభాకు ఒకఅంబులెన్సు ఉండాల్సి ఉన్నా.. రాష్ట్రంలో మాత్రం 65 వేల249 జనాభాకు ఒకటి మాత్రమే నడుపుతున్నారు. మాతా, శిశు మర ణాల సంఖ్య తగ్గింపు చర్యల్లో భాగంగా 279తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్‌లను నడుపుతున్నారు.ఈపథకం కింద ఇంటి నుంచి ఆసుపత్రికి గర్బిణులను..ప్రసవం అనం తరం ఆసుపత్రి నుంచి తల్లీబిడ్డను ఇంటికి చేర్చాలి. ప్రభుత్వా సుపత్రుల్లో 36 లక్షల 73 వేల ప్రసవాలు జరిగితే.. కేవలం 10లక్షల 17వేల మంది తల్లులను మాత్రమే ఈ వాహనాల ద్వారాఇళ్లకు చేర్చారు.26లక్షల 56వేల మంది తల్లులు ఈ సౌకర్యాన్ని పొందలేకపోయారని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ప్రధాన కార్యాలయం పేర్కొంది.రాష్ట్రంలో అత్యవసర సర్వీసుగా పిలిచే 108 సేవలు జనాభాకు సరిగ్గా అందడం లేదని పీఎజీ తాజా నివేదికల్లో తేలింది. పట్టణ ప్రాంతాల్లో 20నిమిషాలకు ప్రమాద ఘటన స్థలానికి అంబులెన్సు చేరుకోవాల్సి ఉన్నా..3.23 నిమిషాల ఆలస్యంగా చేరుకుంటుందని లెక్కలు చెబుతున్నాయి. దీనికి జరి మానాలు విధిస్తున్నాసమయానికి సంఘటన స్థలానికి అంబులెన్సులు చేరుకోకుంటే ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడతాయని పీఎజీ ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసినప్పుడు నిర్దేశిం చిన సమయం కంటే ముందుగానే వివరాల సేకరణ జరుగుతుందని పేర్కొంది.
కొండలు, గిరిజన ప్రాంతాల్లో నివసించే ప్రతి 20వేల జనాభాకు ఒక పీహెచ్‌సీని ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం159ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పని చేస్తు న్నాయి. గిరిజన ప్రాంతాల్లో 84అంబులెన్సులు, 122 ఫీడర్ అంబులెన్సులు నడుస్తున్నాయి. కానీ ప్రతి పీహె చ్‌సీకి ఒకటి చొప్పున 108అంబులెన్సు ఉండాల్సిన అవసరం ఉందని పీఎజీ వెల్లడించింది.సీతంపేట ఏరియా ఆసుపత్రిలోని బేసిక్ లైవ్ సపోర్టు అంబు లెన్సును పరిశీలించినప్పుడు అందులో ఎయిర్ ఫ్లో మీటర్ లేదు. రోగికి సిలిండర్ల ద్వారా ఆక్సిజన్ ఇచ్చే సమయంలో ఎయిర్ ఫ్లో మీటర్ ఉపయోగిస్తారని పీఎజీ తెలిపింది.
రోగితో వెళ్తున్న అంబులెన్స్ బ్రేక్ డౌన్
108కి అదనంగా బోధనాసుపత్రులకు అనుసం ధానంగా ఉన్న అంబులెన్సులు చాలా చోట్ల మరమ్మ తులకు గురై ఉన్నట్లు పీఏజీ తెలిపింది. అనంతపురం బోధనాసుపత్రిలో 8 అంబులెన్సుల ఉండగా వీటిలో ఆరు పనిచేయడం లేదు. శ్రీకాకుళం బోధనాసుపత్రిలో ఆరింటికి గాను మÖడు, నెల్లూరులో ఎనిమిదికి.. ఒకటి చొప్పున అంబులెన్సులు పనిచేయడం లేదు. అనంతపురం, నెల్లూరు బోధనాసుపత్రుల్లోని అంబు లెన్సుల్లో చీ.A.దీ.H. ప్రమాణాల ప్రకారం పరికరాలు లేవని పీఏజీ గుర్తించింది. కాల్ రీసివింగ్ రిజిస్టర్‌ను నిర్వహించడంలేదని తనిఖీల్లో తేలింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి జిల్లా ఆసుపత్రిలో వైరస్ రీసెర్చి అండ్ డయాగ్నస్టిక్ లేబరేటరీ ఏర్పాటు కోసం వచ్చిన సామ గ్రి వృథాగా పడి ఉందని అధికారులు గుర్తించారు. ఈలేబరేటరీ ఇక్కడ వద్దకున్నప్పటికీ ఖరీదైన సామగ్రిని మాత్రం అక్కడే ఉంచారు.సీతంపేట,నాయుడుపేట, సోంపేట ఆసుపత్రులకు అదనంగా పీడియాట్రిక్ ఐసీ యÖల కోసం వచ్చిన వెంటిలేటర్లు 2022 జనవరి, ఫిబ్రవరి నుంచి వృథాగా అక్కడే ఉన్నాయి. వీటిని ఉపయోగించే సామర్థ్యం కలిగిన సాంకేతిక నిపుణులు లేకపోవడం, స్థలాభావమే ఇందుకు కారణం. నెల్లూరు జిల్లాలో వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నడిచే ఆసుపత్రుల అవసరాల కోసం వచ్చిన 623ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను వినియోగించడంలేదు.వీటిని అవస రమైన ఇతర ఆసుపత్రులకు పంపడం లేదని పీఎజీ తనిఖీల్లో తేలింది. ఏపీవైద్య సేవలు, మౌలిక సదుపా యాల అభివృద్ధి సంస్థకు కాన్సన్‌ట్రేటర్లను అవసర మైన ఆసుపత్రులకు పంపించాలని లేఖ రాసినట్లు నెల్లూరు జిల్లా అధికారులు పీఏజీకి తెలియచేశారు. అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఏపీ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థతో సంప్రదించకుండానే నేరుగా 2020లో జాతీయ ఆరోగ్య మిషన్ నిధుల నుంచి 51 లక్షల 80వేలు వెచ్చించి 10ఎక్స్‌రే యÖనిట్లు, ఈసీజీ మిషన్లను కొనుగోలు చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి జిల్లా ఆసుపత్రికి 2021సెప్టెంబరులో ఆక్సిజన్ జనరేటర్ చేరుకున్నట్లు గుర్తించారు. ఆసుపత్రి సందర్శనలో ఇంకా వాడుకలోకి రాలేదు. కొనుగోలు ఆర్డర్ రానందున జనరేటర్‌ను ఇంకా అమర్చలేదని ఆసుపత్రి అధికారులు పీఎజీకి సమాధానం ఇచ్చారు. పీఏజీ పరిశీలించిన ఆసుపత్రుల్లో 10 ఆక్సిజన్ ప్లాంట్లలో ఆరు పనిచేయడం లేదు. నెల్లూరు, శ్రీకా కుళం బోధనాసుపత్రులు,నాయుడుపేట,కావలి, కదిరి, సీతంపేట ఏరియా ఆసుపత్రుల్లో ఈ పరిస్థితి కనిపించిందని పీఏజీ వెల్లడించింది.
ఆపదలో అంబులెన్స్‌లు
108 అంబులెన్స్‌లు కొన్నింటికి కాలం పరిమితి ముగియటంతో క్షతగాత్రులను గమ్యస్థానాలకు సరైన సమయంలో చేర్చలేకపోతున్నాయి. దీంతో బాధితులు నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వాటికి అదనంగా 146నూతన వాహనాలు కొనేం దుకు ప్రభుత్వం టెండరు ఖరారు చేసింది.104 అంబులెన్సులకు సంబంధించి 35 కోట్ల రూపాయలు సదరు సంస్థ పెండింగ్ ఉండటంతో వాహనాల రాక ఆలస్యం అవుతోంది.108 అంబులెన్సు వాహనాల్లో కొన్నింటి కాల పరిమితి ముగిసింది. దీంతో చాలా సందర్భాల్లో క్షతగాత్రులను, ఇతర బాధితులను సకా లంలో ఆసుపత్రులకు చేర్చడంలో జాప్యం జరుగు తోంది. పాతవి పని చేయక పోవడంతో పాటు కొత్త అంబులెన్సుల కొనుగోలుకు నిర్ణయం తీసుకోవడంలో జరిగిన జాప్యం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం ఉన్న వాటికి అదనంగా 146 అంబులెన్సులను ‘ఫోర్స’ నుంచి కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం టెండరు ఖరారు చేసినా…వాహనాలు యుద్ధప్రాతిపదికన సరఫరా అయ్యేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేయలేదు. మరో నెల రోజుల్లో ఇవి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆ సంస్థ ఇప్పటికే 260 కొత్త 104 అంబులెన్సుల (ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్)ను నాలుగు నెలల కిందట ప్రభుత్వానికి అందజేసింది. ఈ మేరకు ప్రభుత్వం చెల్లించాల్సిన సుమారు రూ.35 కోట్ల కోసం ఆ సంస్థ ప్రతినిధులు వైద్యారోగ్య శాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. బకాయిల చెల్లింపు పూర్తయితే తప్ప..108 అంబులెన్సులు త్వరిత గతిన అందుబాటులోనికి వచ్చే అవకాశాలు కనిపిం చడం లేదు.
దేశంలో గిరిజన జనాభా గిరిజనేతర సమÖహాలతో పోలిస్తే గణనీయమైన ఆరోగ్య సమస్యలను ఎదు ర్కొంటుంది, అంటువ్యాధులు, పోషకాహార లోపం మాతా శిశు ఆరోగ్య సమస్యలు అధికంగా ఉన్నాయి. గిరిజన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కమÖ్యనిటీ హెల్త్ వర్కర్ల ద్వారా ప్రాథమిక సంరక్షణను బలోపేతం చేయడం,సాంప్రదాయ వైద్యులను నిమగ్నం చేయడం, మౌలిక సదుపాయాలను విస్తరించడం అవసరం.
గిరిజన ఆరోగ్యంపై మరింత సమాచారం:
సవాళ్లు:..
పోషకాహార లోపం: గిరిజన జనాభాలో పోషకాహార లోపం గణనీయంగా ఉంది, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు మరియు పిల్లలలో.
అంటువ్యాధులు: గిరిజన ప్రాంతాల్లో అంటువ్యాధులు, మలేరియా, టైఫాయిడ్, డయేరియా వంటి వ్యాధులు అధికంగా ఉన్నాయి.
ఆరోగ్య మౌలిక సదుపాయాల కొరత: గిరిజన ప్రాం తాల్లో ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలు తక్కువగా ఉండటం, రోడ్లు, రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల గిరిజన ప్రజలువైద్య సేవలను పొందలేకపో తున్నారు.
సాంప్రదాయ వైద్యం: గిరిజన ప్రజలు సాంప్రదాయ వైద్య పద్ధతులను ఎక్కువగా అనుసరిస్తారు, కానీ ఆధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం చాలా అవసరం.
సామాజిక-ఆర్థిక కారకాలు: పేదరికం, నిరక్షరాస్యత, ఉపాధి అవకాశాల కొరత, సామాజిక వివక్షత వంటి సామాజిక-ఆర్థికకారకాలు గిరిజన ప్రజల ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం చూపుతాయి.
పరిష్కారాలు:
ప్రధాన ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయాలి: కమÖ్యనిటీ హెల్త్ వర్కర్ల ద్వారా ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయాలి, గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులను ఏర్పాటు చేయాలి.పోషకాహార లోపాన్ని నివారించాలి: గిరిజన ప్రజలకు పోషకాహారం అందించడం, గర్భిణీ స్త్రీలు మరియు పిల్లలకు ప్రత్యేకంగా పోషకాహార కార్యక్రమాలు నిర్వహించాలి. – జీ ఎన్ వి సతీష్ 

శ్రమ జీవులు గిరిజన మహిళలు

8మార్చి 2025న,‘‘అందరికీ మహిళలు మరియు బాలికల కోసం: హక్కులు అనే థీమ్‌తో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడానికి మాతో చేరండి. సమానత్వం. సాధికారత.’’ఈ సంవత్సరం థీమ్‌ అందరికీ సమాన హక్కులు, అధికారం మరియు అవకాశాలను అన్‌లాక్‌ చేయగల చర్యను మరియు స్త్రీవాద భవిష్యత్తును ఎవరూ వదలని చోటికి పిలుస్తుంది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది మహిళల సామాజిక,ఆర్థిక,సాంస్కృతిక రాజకీయ విజయాలను జరుపుకునే ప్రపంచ దినోత్సవం.లింగ సమానత్వాన్ని వేగవంతం చేయడానికి చర్యకు పిలుపుని కూడా సూచి స్తుంది. మహిళల విజయాలను జరుపుకోవ డానికి లేదా మహిళల సమానత్వం కోసం ర్యాలీ చేయడానికి సమూహాలు కలిసి రావడం తో ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన కార్యాచరణ కనిపిస్తుంది.ఏటా మార్చి 8న గుర్తు పెట్టబడు తుంది, ప్రపంచ మహిళా ఆర్థిక సాధికారతను కల్పిం చడం,మహిళా ప్రతిభను నియమిం చడం, నిలుపుకోవడం మరియు అభివృద్ధి చేయడం. మహిళలు,బాలికలను నాయకత్వం, నిర్ణయం తీసుకోవడం,వ్యాపారంలోకి మద్దతు ఇవ్వడం, మహిళలు,బాలికల అవసరాలకు అనుగు ణంగా మౌలిక సదుపాయాల రూప కల్పన, నిర్మాణం మహిళలు,బాలికలు వారి ఆరోగ్యం గురించి సమాచారం తీసుకునే నిర్ణయాలు తీసుకోవడంలో సహాయప డటం. స్థిరమైన వ్యవసాయం ఆహార భద్రతలో మహిళలు,బాలికలను చేర్చడం. మహిళలు మరియు బాలికలకు నాణ్యమైన విద్య,శిక్షణను అందించడం.క్రీడలో మహిళలు మరియు బాలికల భాగస్వా మ్యాన్ని మరియు విజయాన్ని పెంచడం. మహిళలు,బాలికల సృజనాత్మక,కళాత్మక ప్రతిభను ప్రోత్సహిం చడం.మహిళలు, బాలికల అభ్యు న్నతికి తోడ్పడే మరిన్ని రంగాలలో ప్రసంగిస్తారు.
సమానత్వం ఎక్కడుంది!..
ఆకాశంలో,అవకాశంలో సగం అన్నది నినాదంగా మిగిలాల్సిందేనా?ఇది చేవికి ఇంపు కలిగించ డమే తప్ప..నేత్రానందం ప్రసాదించే అవకా శమే లేదా?జనాబా లెక్కల ప్రకారం, పురుషు లతో పోలిస్తే మహిళల సంఖ్య తక్కువన్నది ప్రపంచ స్థితి.స్త్రీలు ప్రవేశించని రంగం లేదని, నిపుణత కనబరచని పని.లేదని పదేపదే చెప్పడం సరే.వారు నిలబడగలిగేలా చేస్తున్న మా,ఆత్మ విశ్వాసం కోల్పోకుండా చూస్తు న్నామా?అన్నదే మన దేశంలో నాటికీ నేటికీ ప్రశ్న.స్త్రీలంటే అప్పటికే ఇప్పటికీ చిన్నచూపే. విధి నిర్వహణ ప్రదేశాల్లో రక్షణ అంతంత మాత్రమే.శ్రమకు సరిపడా ప్రతిఫలం లభిస్తోందా అన్నది ఈనాటికీ సందేహాస్ప దమే.కాకుంటే..గతంలో కంటే వర్తమానంలో ప్రశ్నించే తత్వం పెరిగింది. నిలదీసి,నిగ్గదీసి నిలువునా కడిగి పారేసే ధీరత అలవాటుగా మారింది. ఆడవారిని కించపరిచే దుష్టశక్తుల పనిపట్టే తెగువా విస్తృతమవుతుంది. వీటన్నింటితో పాటు స్త్రీలపట్ల ఆలోచనా ధోరణిని ఇంకా మార్పుకావాల్సిన అగత్యమైతే ఇతర సమా జానికి చాలా ఉంది. ఆచరిస్తే సరి..!
సాధికారత గురించి మాట్లాడనివారు లేరు. మహిళలూ మీకు జోహార్లు అంటూ ఏటేటా కవితలల్లే వారికీ కొదవ లేదు.ఆకాశం, అవకాశం వివాదాల జోరు సరేసరి.టన్నుల కొద్దీ పదజ్ఞానం కన్నా,ఎంతో కొంతైనా ఆచరించి చూపడం మిన్న.అది సాకార మైనప్పుడే ఆడపిల్ల పెదవి మీద దరహాసం మెరుస్తుంది.అంతేకానీ,ఇంటా బయటా.. మాటలు చేతలూ ఆమె కన్నీటికి కారణ మైతే,జాతికి నిష్కృతి ఉండదు.ప్రాంతీయం నుంచి అంతర్జాతీయం దాకా ఇంతే!.
వరకట్న నిషేధ చట్టం-1961
భర్త, అతని తల్లిదండ్రులు, అడపడుచులు, అత్తింటి తరపున ఇతర బంధువులు ఎవరైనా వరకట్నం కోసం వేధిస్తే ఐదేండ్లకు పైగా జైలు,రూ.15 వేలకు తక్కువ కాకుండా జరి మానా విధిస్తారు.ఈ చట్టం ప్రకారం కట్నం ఇవ్వడం,తీసుకోవడం రెండు నేరమే. వరకట్న వేధింపులకు సంబంధించి మహిళలు నేరుగా సంబంధింత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. ఈ కేసులపై మొదటి శ్రేణి జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు విచారణ జరిపి శిక్షలు ఖరారు చేస్తుంది.
ర్యాంగింగ్‌ నిరోధక చట్టం-1997
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌ను నిషేధిస్తూ ప్రభుత్వం 1997లో ర్యాగింగ్‌ నిరోధక చట్టం నంబర్‌ 28ను తెచ్చింది. ఇందుకోసం జాతీయ స్థాయిలో హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేశారు. 1800 18022 18055 నంబర్లకు విద్యార్థినులు ఫోన్‌చేసి సమస్యలను చెప్పవచ్చు. ర్యాగింగ్‌ వ్యవస్థ నిర్మూలనకు కళాశాలల్లో కమిటీలను ఏర్పాటు చేసుకునే వీలు కల్పించారు. ర్యాగిం గ్‌కు పాల్పడినట్లు రుజువైతే ఆరు నెలల నుంచి పదేండ్ల వరకు జైలు శిక్షతోపాటు కఠిన చర్యలు తీసుకుంటారు.
మహిళకు స్వేచ్ఛ కొంతే!
అందరూ ఒప్పుకోదగిన పరిణామం నాటికి, నేటికి స్త్రిల పరిస్థితులు మారాయి. నాలుగు గోడలమధ్య వంటిల్లే స్వర్గంలా భావించే మహిళలు ఇప్పుడు జన జీవన స్రవంతిలో ఒక విశిష్టమైన శక్తిలా కలిసిపోయి అంచెలంచెలుగా ఎదుగుతు న్నారు.ముఖ్యంగా అభినందించవలసిన విషయం- విద్యారంగం లో పాఠశాల మొదలు కళాశాల వరకు బాలికలదే అగ్రస్థానం.చదువులకోసం తాత్కాలిక ఉద్యోగాలు (మెహంది,అల్లికలు,శుభ కార్యాలలో పిండివంటలు తయారీ దార్లుగాను, హస్తకళలు, వాహనాలు నడిపే డ్రైవర్లుగాను) ఇలా ఎన్నో మరెన్నో పనులు చేసుకుంటూ తమ కాళ్ళమీద తాము నిలబడుతూ ఉన్నత వ్యక్తిత్వంతో ప్రయో జకులైన మహిళలు నేటి భారతీయ సమాజంలో నిత్య ప్రకాశ దీపాలుగా చెమటను ఆజ్యంలా పోస్తూ దశదిశలా అఖండమైన కాంతులతో వెలిగిపోతున్నారు. ఆనందించవలసిన విషయం ఏమిటి అంటే వృత్తి విద్యాకోర్సులు, ఉద్యోగాలలో రాజకీయాలలో స్త్రిలకూ ప్రాముఖ్యం లభించడం. స్త్రిలు సమంగా నేర్పుగా అంకిత భావంతో గొప్పగా పనిచేయటం, వారు రాణించి నంత గొప్పగా పురుషులు రాణించలేకపోవడం ఆశ్చర్యం కాకపోతే మరేమిటి?
ఇలా పలు విధాలుగా వైద్య,విద్యా,విజ్ఞాన, రాజకీయ,క్రీడా,రక్షణ రంగాలలో ఎక్కడ చూసినా,ఏ నోటవిన్నా పదును పెట్టిన ఆయు ధంలా మహిళా శక్తి, యావత్‌ ప్రపంచం స్తంభించిపోయేలా ఉప్పెనలా పొంగి పొరలి నింగిని తాకుతున్న కెరటాలవలే ఎగసిన మహిళా స్ఫూర్తికి, ఎవరూ సాటిలేరు, పోటీ పడరు అనే విధం రాకెట్టులా ఆకాశంలో దూసుకుపోతున్న మహిళా చైతన్యం అందరూ హర్షించదగిన విషయం. ఈ ప్రపంచంలో మహిళలు రచయిత్రులుగా,కవయిత్రులుగా ఉపన్యాస కులుగా,ఉద్యమ కారిణులుగా ఉపాధ్యాయిని లుగా,గృహిణులుగా ఉన్నత ఉద్యోగస్తులుగా, మంత్రులుగా,శాసనస భ్యులుగా,న్యాయ మూర్తులుగా, న్యాయవాదు లుగా,ప్రాణాలను రక్షించే వైద్యులుగా,స్వచ్ఛంద సంస్థల అత్యున్నత అధికార సభలకు అధ్యక్షులుగా,ఆయా రంగాలలో వారు చేపట్టిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఎందరో మహిళలు ఆకాశంలో వెలిగే స్వయం ప్రకాశక నక్షత్రాలుగా వెలుగొం దుతున్నారు.
ఇకపోతే కొన్ని గమనించవలసిన ముఖ్య విషయాలు ఏమిటి అంటే- ఇన్ని రకాలుగా అన్ని విధాలుగా ఇంత గొప్పగా ఎంతో అద్భుతంగా ఆవిష్కరించబడుతున్న ‘మహిళ పాత్ర’ సమాజంలో మమేకమవుతున్న ‘స్త్రి అభ్యుదయం’ ఇంకా మొదట్లోనే వుంది. మొక్కగానే వుంది. ఎక్కడో ఒకచోట దాని కూకటి వేరు కత్తిరించబడుతూనే వుంది. బాలికగా విద్యార్థినిగా, గృహిణిగా.. ఉద్యో గి నిగా, మంత్రిగా ఇలా ఎన్నో విధాలుగా రూపొంతరాలు చెంది సమాజంలో భాగంగా మారినా స్త్రి యొక్క స్వయం నిర్ణయం ఇంకా పురుషుల చేతులలోనే వున్నది. స్త్రి పురుషులు ఇద్దరూ పరస్పర అవగాహనతో కలిసి నడవా ల్సిందే. కాని నియంతృత్వ ధోరణితో కట్టిపడే యటమే మహిళా స్వేచ్ఛకు ఇబ్బందిగా అభ్యం తరకరంగా ఉంది కాని అదే జరుగుతుంది కదా. కొన్ని చోట్ల అడుగడుగునా ఆటంకాలు. అలుపెరుగని మహిళా పోరాటాలు, మహిళల ఆత్మాభిమాన అణచివేతలు..ఆత్మవిశ్వాసానికి అవరోధం..ఇవన్నీ..కలిసి మహిళలను ఉప్పెనలా చుట్టుకుంటున్నాయి. తర తరాలనుండి వస్తున్న సంప్రదాయాలు, ఆచారాలు, కట్టు బాట్లు నరనరాల్లో జీర్ణించుకుపోయిన ఈ వ్యవస్థ కాలక్రమేణా పెను మార్పులు చోటుచేసుకున్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో మార్పులు జరగాలి. భార్య అంటే గృహిణిగా సేవలందించడమే కాకుండా ఉద్యోగినిగా ఆర్థిక సేవలందిస్తూ, మాతృత్వంతో సంసారాన్ని పెంచే త్రిపాత్రధారిణిగా ఉప యోగపడే యంత్రంలా ఉందనుకుంటారు. కొందరి పురుషుల ఆలోచనలు కాని అప్పుడు ఇప్పుడు ఒకే విధంగా స్త్రిలు శ్రమిస్తూనే వున్నారు. ఎలా అంటే నిరంతర నిత్య ప్రవాహంలా మహానదులై సముద్రాలై చరిత్రపుటంలో మహిళలు సువర్ణాక్షరాలతో లిఖించబడుతున్నారు. గృహ హింస, విడాకుల చట్టం- ఇలా ఇంకా ఎన్నో చట్టాలు స్త్రిలకి రక్షణ కవచాలుగా ఉన్నప్పటికి సగటు స్త్రి జీవితంలో రక్షణ కరువైందన్న కఠినమైన వాస్తవాన్ని అందరూ అంగీకరించ వలసిందే.వయస్సుతో నిమిత్తం లేకుండా స్త్రిలపైన జరిగే అత్యాచారాలను అరికట్టే వౌలికమైన మార్పు పురుషులలో రావాలి.ఈ మార్పు ముఖ్యంగా ప్రతి ఇంటినుండి మొదలవ్వాలి. చట్టసబలో మహిళ లంతా ఏకతాటిపైకొచ్చినప్పటికీ మహిళా బిల్లు ప్రవేశపెట్టడానికే ఎన్నెన్ని అవస్థలు పడ్డారో, ఎన్నెన్ని ఆటంకాలు ఎదుర్కొన్నారో యావత్‌ భారతావనికి తెలిసిన విషయమే. స్త్రిల యెడల ఇలాంటి పక్షపాత ధోరణి విడనాడాలి. మహిళా సాధికారత కార్యరూపం దాల్చాలి. మాటల రూపంలోనే మిగిలిపోకూడదు.
ఏది ఏమైనా సగటు స్త్రి జీవితంలో సంపూ ర్ణమైన, సమూలమైన మార్పు రావాలి. అత్యాచార కేసుల్లో దోషిని కఠినంగా శిక్షించాలి. ప్రతి మహిళా ఆత్మవిశ్వాసంతో బ్రతుకగలగాలి. నిర్భయంగా నిర్ణయాధి కారాలు చేపట్టగలగాలి. అటువంటి సమ సమాజంలో అద్భుత ప్రపంచాన్ని ఆవిష్క రించాలి.-(జి.ఎ.సునీల్‌ కుమార్‌)

మేమేమీ చేశాము పాపం?మాకెందుకీ శాపం?

విశాఖ ఉమ్మడి జిల్లాలో గల నాన్‌షెడ్యూల్డ్‌ గిరిజన గ్రామాలను పాడేరు ఐటీడీఏ పరిధిలో విలీనం చేస్తాం…అధికారం చేపట్టిన వెంటనే దీనిపై నిర్ణయం తీసుకుంటాం. నన్ము నమ్మండి…మీకు పూర్తి హామీ ఇస్తున్నా..2018లోవైసీపీనేత హోదాలో పాదయాత్ర చేస్తున్నప్పుడు బుచ్చెయ్యపేట మండలం వడ్డాది వద్ద మైదాన ప్రాంత గిరిజనులకు జగన్‌ ఇచ్చిన హామీ నీటిమూటగా మారింది.ఐదేళ్లు పాలించిన వైసీపీ ప్రభు త్వం గిరిజనులు నివసిస్తున్న నాన్‌షెడ్యూల్‌ ఏరియా లను షెడ్యూలు ఏరియాలుగా గుర్తించాలని ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలు పంప లేదు.జిల్లాల విభజన చేసినప్పటికీ నాన్‌ షెడ్యూల్‌ ఏరియా గిరిజన గ్రామాలను షెడ్యూల్‌ ఏరియాలో విలీనం చేయలేదు.కనీసం పాడేరు ఐటీడీఏలో కూడా విలీనం చేయలేదు.అల్లూరి సీతారామరాజు జిల్లాలో గల పాడేరు,అరకులోయ అసెంబ్లీ నియోజక వర్గా లకు ఆనుకుని మైదానప్రాంత మండలాల్లో (నాన్‌ షెడ్యూల్డ్‌ ఏరియా) గలగ్రామాల్లోని గిరిజనుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది.అటు ఐటీడీఏ పరిధి లో చేర్చక,ఇటు మైదానప్రాంత అధికారులు పట్టించు కోక పోవడంతో రెంటికీ చెడ్డరేవడిలా తయారైంది. విద్య, వైద్యం, తాగునీరు, విద్యుత్‌, రహదారులు,పక్కా ఇళ్లు వంటి మౌలిక సదుపాయాలు కొరవడి, సమస్య లతో సతమతం అవుతున్నారు. కొద్దోగొప్పో చదువు కున్నా…ఐటీడీఏ పరిధిలో ఉద్యోగాలకు అర్హులు కారు.మైదాన ప్రాంతంలోని ఇతర గిరిజనులతో పోటీ పడే పరిస్థితి లేదు. తమ గ్రామాలను ఐదో షెడ్యూల్‌లో చేర్చి, ఐటీడీఏ పరిధిలోకి తీసుకురావాలని సుమారు 300గ్రామాల గిరిజనులు దశాబ్దాలుగా ఆందోళనలు, పోరాటాలు చేస్తున్నారు. మన్యానికి ఆనుకుని మైదాన ప్రాంతంలో వున్న గిరిజనుల గోడు నాధుడు కరవ య్యారు.
ఏజెన్సీలో అత్యంత వెనుకబడిన గిరిజనులు, ఆది వాసీల హక్కులను కాపాడడానికి, భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండడానికి, ఇతరుల నుంచి రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు ఐదు దశాబ్దాల క్రితం ఆయా ప్రాంతాలను రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్‌లో చేరుస్తూ పార్లమెంటులో చట్టం చేసింది.దీంతో ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో 1/70చట్టం అమల్లోకి వచ్చింది. కానీ మైదాన ప్రాంతానికి ఆనుకుని వున్న సుమారు 300 గిరిజన గ్రామాలను ఐదో షెడ్యూల్‌లో చేర్చలేదు.
కొరవడిన మౌలిక సదుపాయాలు
అనకాపల్లి జిల్లాలో కోటవురట్ల, నాతవరం, గొలుగొండ,రోలుగుంట,రావికమతం,చీడికాడ,వి. మాడుగుల,దేవరాపల్లి మండలాల్లో 37గ్రామ పంచాయతీల్లోని సుమారు 300 గ్రామాల్లో గిరిజనుల జనాభా అధికంగా ఉంది.అధికారుల అంచనా మేర కు ఈ పంచాయతీల్లో వాల్మీకి,భగత,కొండదొర, గదబ,నూకదొర,కొండకమ్మరి,కోందు,మన్నెదొర తెగలకు చెందిన గిరిజనులు లక్ష మందికిపైగా ఉన్నారు. పోడు వ్యవసాయం, జీవాలు, పశువుల పెంపకమే వీరికి జీవనాధారం. 5వ షెడ్యూల్‌లో వున్న ఏజెన్సీ ప్రాంతంతో పోలిస్తే ఈ గ్రామాలు మౌలిక సదుపాయాలు, అక్షరాస్యత విషయాల్లో బాగా వెనుకబడ్డాయి. గిరిజన సబ్‌ప్లాన్‌ నిధులు కూడా మంజూరు చేయకపోవడంతో తాగునీరు, రహదారులు, విద్యుత్‌, పాఠశాలలు వంటి కనీస సౌకర్యాలు కొరవడ్డాయి. ఈ గ్రామాల్లో ఎక్కడా ఒక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా లేదు. ఆరోగ్య ఉపకేంద్రాలు ఉన్నప్పటికీ ఏఎన్‌ఎంలు అందుబాటులో ఉండరు. నెలకు ఒకటి, రెండుసార్లు చుట్టంచూపుగా వచ్చి వెళుతుంటారు. తీవ్ర అస్వస్థతకు గురైనా, గర్భిణులకు పురిటి నొప్పులు వచ్చినా…డోలీలో మోసుకుంటూ వాహనాలు నడిచే ప్రాంతం వరకు తీసుకురావాలి. తాగునీటికి ఊటగెడ్డలు, చలమలే ఆధారం. దీంతో కలుషిత నీటి వల్ల వ్యాధులు, జ్వరాలు, అతిసార బారిన పడుతున్నారు. సాగునీటి సదుపాయం లేదు. చేద్దామన్నా కూలి పనులు ఉండవు. ఒక్క ఉన్నత పాఠశాల కూడా లేదు. ఉదాహరణకు రావికమతం మండలం చీమలపాడు పంచాయతీలో చలిశింగం, రొచ్చుపణుకు, కడగడ్డ గ్రామాలకు చెందిన గిరిజన బాలబాలికలు హైస్కూల్‌ విద్య కోసం 14 కి.మీ. దూరంలో వున్న ఎంకేపట్నం ఉన్నత పాఠశాలకు వెళ్లాల్సి వస్తున్నది. ఏజెన్సీలో ప్రభుత్వ ఉద్యోగాలు సైతం దక్కడం లేదు. నిబంధనల ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో ఎస్టీలకు కేటాయించిన ఉద్యోగాలకు మైదాన ప్రాంత గిరిజనులు అనర్హులని అధికారులు అంటున్నారు. కనీస సదుపాయాలకు నోచుకోక తీవ్ర ఇబ్బందులు పడుతున్న తమను షెడ్యూల్డ్‌ ఏరియాలో చేర్చాలని ఏళ్ల తరబడి పోరాడుతున్నారు. మండల కార్యాలయాల వద్ద తరచూ ఆందోళనలు నిర్వహిస్తూ అధికారులు వినతిపత్రాలు అందజేస్తూనే ఉన్నారు.
గిరిజన సలహా మండలిలో తీర్మానం
రాష్ట్రంలో మైదాన ప్రాంత గిరిజన గ్రామాలను షెడ్యూల్‌ ఏరియాలో విలీనం చేయాలని 2020 జూలైలో అప్పటి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పాముల పుష్పవాణి నేతృత్వంలో గిరిజన సలహా మండలి (టీఏసీ) తీర్మానం చేసింది. ఈ మేరకు నాన్‌ షెడ్యూల్‌ ఏరియాలోని గ్రామాల్లో సభలు నిర్వహించి 50 శాతానికిపైగా గిరిజనులు నివసిస్తున్న గ్రామాల జాబితాలను తయారుచేశారు. ప్రస్తుత అనకాపల్లి జిల్లాలో 200 గ్రామాలను ఏజెన్సీలో విలీనం చేయాలని ప్రతిపాదనలు రూపొందించారు. అయితే అధికారులు చెప్పిన వాటికంటే ఎక్కువ గిరిజన గ్రామాలు ఉన్నాయని, వాటిని కూడా ఏజెన్సీలో విలీనం చేయాలని గిరిజన సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. గ్రామసభలు నిర్వహించి 22 నెలలు అయినా ఇప్పటివరకు ఎటువంటి కదలిక లేదు.
కేంద్రానికి చేరని ప్రతిపాదనలు
మైదాన ప్రాంత గిరిజన గ్రామాలను షెడ్యూల్‌ ఏరి యాలో (ఐటీడీఏ పరిధిలోకి) చేర్చేందుకు గల అడ్డం కులను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నం చేయలేదు. గిరిజనులు నివసిస్తున్న నాన్‌ షెడ్యూల్‌ ఏరియాలను షెడ్యూలు ఏరియాలుగా గుర్తించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎలాంటి ప్రతిపా దనలు పంపలేదని ఈ ఏడాది ఫిబ్రవరి పదో తేదీన పార్లమెంటులో కేంద్ర మంత్రి ప్రకటించారు. కనీసం జిల్లాల పునర్విభజన,కొత్తజిల్లాల ఏర్పాటు సమ యంలో అయినా తమను షెడ్యూల్‌ ఏరియాలో విలీనం చేస్తారన్న ఆశలు సైతం ఆవిరయ్యాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మైనింగ్‌, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల ఒత్తిళ్లే కారణమా?
మైదాన ప్రాంతానికి ఆనుకుని వున్న గిరిజన గ్రామా లను ఏజెన్సీలో విలీనం కాకుండా మైనింగ్‌, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఉన్నత స్థాయిలో తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్టు గిరిజన సంఘం నాయకులు ఆరోపిస్తు న్నారు.నాతవరం,గొలుగొండ,రోలుగుంట, రావిక మతం,వి.మాడుగులమండలాల పరిధిలో పెద్ద మొత్తం లో లేటరైట్‌, గ్రానైట్‌ నిక్షేపాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో మైనింగ్‌ లైసెన్సులు ఎవరైనా పొంద వచ్చు. అదే ఏజెన్సీ ఏరియాలో విలీనం చేస్తే గిరిజనే తరులకు అవకాశం లభించదు. మరోవైపు మైదాన ప్రాంతంలోని మండలాలను గత ఏడాది వీఎంఆర్‌డీఏ (విశాఖపట్నం మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ)లో చేర్చారు. ఈనేపథ్యంలో ఏజెన్సీని ఆను కుని వున్న మండలాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు పెద్దఎత్తున భూములు కొనుగోలు చేశారు.ఈ మండ లాల్లోని గిరిజన గ్రామాలను ఏజెన్సీ ప్రాంతంలో విలీనం చేస్తే గిరిజనేతరులు భూముల క్రయవిక్ర యాలకు అనర్హులవుతారు.ఈకారణాల వల్లనే మైదాన ప్రాంత గిరిజన గ్రామాలు ఏజెన్సీలో విలీనం కాకుం డా మైనింగ్‌, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు అడ్డుపడు తున్నారని గిరిజన సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.-గునపిర్తి సైమన్‌

ప్రజా స్వామ్యం ఎక్కడ …?

ప్రజా శేయస్సును పక్కన పెట్టి కార్పొరేట్‌ దోపిడీకి అనుకూలంగా వుండే అభివృద్ధి నమూనాను విధించే ప్రయత్నంలో అటవీ భూముల నుండి తమని నిర్వాసితులను చేయడానికి ప్రయత్నిస్తున్న రాజ్యంతో ఆదివాసులు పోరాడుతున్నారు . సాంప్రదాయకంగా జీవించే భారతీయ ఆదివాసులు జీవనోపాధి కోసం అడవులపై ఆధారపడుతూ నిరంతర పోరాటంలో చిక్కుకున్నారు. అనివార్యంగా విదేశీ మూలధనంపై ఆధారపడే ప్రాజెక్ట్‌ల కోసం, భారతదేశ సహజ వనరుల కార్పొరేట్‌ దోపిడీ కోసం అడవుల్లో నివసించేవారిని చట్టబద్ధంగా నిర్వాసితులను చేసేందుకు రాజ్యానికి అటవీ హక్కుల చట్టం 2006(ఫారెస్ట్‌ రైట్స్‌ యాక్ట్‌-ఎఫ్‌ఆర్‌ఎ), ఫారెస్ట్‌ కన్జర్వేషన్‌ యాక్ట్‌ 1980 (ఎఫ్‌సిఎ) వంటి చట్టాలు రాజకీయ సాధనాలుగా ఉపయోగపడుతున్నాయి.
‘‘పరిరక్షణ’’ అనే ముసుగు లేదా ‘‘నష్ట పరిహారం యిచ్చి అటవీ నిర్మూలన’’ వంటి ప్రహసనాల పేరుతో పర్యావరణంపై ఒత్తిడిని మరింత తీవ్రతరం చేసే సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనాను కూడా ఈ చట్టాలు సులభతరం చేస్తాయి. జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణుల, పులుల అభయారణ్యాలు వంటి ప్రత్యేక రక్షిత ప్రాంతాలను సృష్టించడం ద్వారా అటవీ భూముల్లోని విస్తారమైన ప్రాంతాలపై రాజ్యం తన నిర్దిష్ట ప్రభావాన్ని మరింతగా విస్తరిస్తుంది. ఎఫ్‌ఆర్‌ఎ, ఎఫ్‌సిఎ వంటి చట్టాలు ఆదివాసీలకు అందించడానికి ప్రతిపాదించబడిన ప్రజాస్వామిక అవకాశాలు కూడా బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం యుగంలో నిరంతరం క్షీణిస్తున్నాయి.
ఆదివాసీల అటవీ భూములపై ప్రాజెక్టులను ఆమోదించడానికి ముందస్తుగా గ్రామసభ సమ్మతి అవసరాన్ని తొలగించడానికి 2022 సవరణ తర్వాత ప్రభుత్వం అనుమతించిందిబీ ఇప్పటికే పలుచన చేయబడిన, పనికిరాని ఆదివాసీల చట్టపరమైన రక్షణలపై దాడి ఎఫ్‌సిఎ కోసం ప్రతిపాదించిన కొత్త సవరణలతో మరింతగా కొనసాగింది.
వార్తల్లో వున్న అటవీ (పరిరక్షణ) సవరణ బిల్లు-2023 ప్రజలలో గణనీయమైన వివాదాన్ని రేకెత్తించింది. ప్రస్తుతం రాజ్యసభలో చర్చ కోసం వేచి ఉంది. బహుశా జూన్‌లో దాదాపుగా ఎటు వంటి చర్చ లేకుండా లోక్‌సభ ఆమోదించిన తర్వాత అమలులోకి వస్తుంది.
కొత్త సవరణలు ప్రవేశపెట్టిన మార్పులు స్థూలంగా
మొదటిది,చట్టం కింద రక్షిత ప్రాంతంగా ఉండా లనే దానికి సంబంధించి కొన్ని సుప్రీం కోర్టు తీర్పులు మంజూరు చేసిన సడలింపులను తొలగించడానికి ‘‘అడవి’’ అనే పదాన్ని మారుస్తుంది.
రెండవది,‘‘జాతీయ ప్రాముఖ్యత కలిగిన వ్యూహాత్మక వరుస ప్రాజెక్టులను’’ చేపట్టేందుకు సరిహద్దు భూముల్లో అడవులను నిర్మూలించడానికి అనుసరించాల్సిన విధానపరమైన అవసరాలకు మినహాయింపును మంజూరు చేస్తుంది, అటు వంటి ప్రాంతాలలో అటవీ భూములను, అక్కడి జనాభాను తొలగించి రోడ్డు మార్గాలు, రైల్వేలు, పారిశ్రామిక ప్రాజెక్టులను నిర్మించడానికి వీలు కల్పిస్తుంది. అంతేకాకుండా,‘‘వామపక్ష తీవ్రవాద’’ ప్రభావిత ప్రాంతాల్లో’’జాతీయ భద్రత’’ పేరుతో ప్రజల ప్రతిఘటనను అణచివేయడానికి ప్రభుత్వానికి మినహాయింపునిస్తుంది.
మూడవది, అటవీ భూములలో జంతు ప్రదర్శనశాలలు, ‘ఇకో-టూరిజం(పర్యావరణ హిత)’ సౌకర్యాలు వంటి కొన్ని అటవీయేతర కార్యకలాపాలను బిల్లు అనుమతిస్తుంది. ప్రధానంగా వీటికి ప్రపంచ బ్యాంకు నిధులు సమకూరుస్తుందిబీ సామ్రాజ్యవాద సంపదకు సేవ చేస్తుంది. ఇది ఈ ప్రాంతాల పర్యావరణ వ్యవస్థలపై, అటువంటి ప్రాజెక్టుల ప్రయోజనాల కోసం నిర్వాసితులయ్యే / జీవనోపాధిని కోల్పోయే జనాభాపై హానికరమైన ప్రభావాలను చూపుతుంది.
‘ఫారెస్ట్‌’ (అడవి) పదంలో మార్పు అంటే అర్థం ఏమిటి?
భారతదేశపు చట్టపరమైన చట్రంలోపల ‘అడవి’ అనే పదానికి తిరిగి నిర్వచనం యివ్వడం చుట్టూ బిల్లు దృష్టి కేంద్రీకృతమై వుంటుంది. ఏదైనా సంబంధిత చట్టం లేదా అధికారిక ప్రభుత్వ రికార్డులతో సహా భారతీయ అటవీ చట్టం-1927 ప్రకారం ‘అడవులు’గా నమోదు అయినవి మాత్రమే ఈ చట్టం పరిధిలో ‘అడవులు’గా గుర్తింపు పొందాలనే నిబంధన యిందులో వుంది.
దీన్ని మరింతగా అర్థం చేసుకోవడానికి,టి ఎన్‌ గోదావర్మన్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు 1996 తీర్పును ప్రస్తావించడం చాలా అవసరం. భారతదేశంలో అటవీ, వన్యప్రాణుల సంరక్షణపై ఈతీర్పు కేంద్రీకృతమై ఉంది. అడవులలో చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ, వన్యప్రాణ సంరక్షణను ప్రోత్సహించడం, పర్యావరణ చట్టాలను అమలు చేయడం లక్ష్యంగా పెట్టుకున్న ఫలితంగా భారతదేశంలోని అటవీ ప్రాంతాలను సంరక్షించడానికి సుప్రీం కోర్టు ముఖ్యమైన ఆదేశాలు వచ్చాయి. తన నిఘంటువు నిర్వచనంని ‘‘అడవి’’కి అన్వయించడం ద్వారా ఈ తీర్పు అటవీ సంరక్షణ చట్టం పరిధిని విస్తృతం చేసింది. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం ఈ తీర్పు ఫలితం ఆదివాసీ సముదాయాలకు ఏ మాత్రం అందడం లేదు.
వాస్తవానికి, ఈ తీర్పు పర్యావరణం, పరిరక్షణ ప్రయత్నాలలో సుప్రీం కోర్టుని ఒక ఛాంపియన్‌గా చూపవచ్చు, కానీ వాస్తవానికి సుప్రీం కోర్టు 2019 తీర్పులో అడవుల్లో నివసించే ఆదివాసీలను చట్టబద్ధం చేయడానికి, అలా కానివారిని తొలగించాలని ఆదేశించడంపై కేంద్రీకరించింది. ఆ తీర్పు అటవీ భూమిపై సాంప్రదాయ అటవీ నివాసుల 11.8లక్షల దావాలను తిరస్కరించడం తోపాటు,అలా తిరస్కరించబడిన జనాభాను త్వరగా తొలగించాలని కూడా 16రాష్ట్రాలను ఆదేశించింది.
అటవీ పరిరక్షణ చట్టానికి చేసిన సవరణలు గోదావరమన్‌ తీర్పు ఆదివాసీలకు అందించినట్లు కనిపించే స్పష్టమైన, నిజాయితీ లేని చట్టపరమైన రక్షణలను కూడా పలుచన చేస్తాయి. అటవీ (పరిరక్షణ) సవరణ బిల్లు 2023 ప్రకారం, 1980 అక్టోబర్‌ 25 తరువాత నుండి ప్రభుత్వ పత్రాలలో అధికారికంగా అడవులుగా గుర్తించిన ప్రాంతాలకు చట్ట పరిధి పరిమితం అవుతుంది. అందువల్ల ప్రత్యామ్నాయ ప్రయోజనాల కోసం విస్తృతంగా అటవీ భూముల బదలాయింపులకు దారితీయడంలో ఈ ప్రభావం కనిపిస్తుంది. అడవి తొలగింపుకు అనుమతులను పొందడం, స్థానిక సముదాయానికి అవసరమైన సమాచారం యిచ్చి సమ్మతి కోరడం లాంటి చట్టం అందించిన రక్షణ లను 2022లో చేసిన సవరణ ఇప్పటికే తొలగించింది.
ప్రత్యేకించి హానికిగురయ్యే ఆదివాసీ సమూహం (పివిటిజి-పర్టిక్యులర్లి వల్నరబుల్‌ ట్రైబల్‌ గ్రూప్‌) డోంగ్రియా కోండ్‌ నివసించే ప్రాంతాలు వున్న ఆరావళి శ్రేణిలో సుమారు 40%, నియమగిరి కొండల శ్రేణిలో 95% పైన గణనీయంగా ప్రభావితమవుతాయి. ఈ సవరణలు అటవీ యేతర, కార్పొరేట్‌ ప్రయోజనాల కోసం అడవులను బదిలీ చేయడానికి సంబంధించి రాజ్యానికి మరింత అధికారాన్ని ఇవ్వడమే కాకుండా,సామ్రాజ్యవాద,వర్గ ఆధారిత అభివృద్ధిని తప్పనిసరిగా ప్రోత్సహించడానికి మన సహజ వనరులను, భూమిని దోపిడీ చేయడానికి చట్టాన్ని ఎలా ఉపకరణంగా ఉపయోగించవచ్చనేది కూడా చూపిస్తాయి.
‘‘అభివృద్ధి భారం’’: అభివృద్ధి ఎవరి కోసం?
అభివృద్ధికి సంబంధించి ప్రజా వ్యతిరేక నమూ నాను ప్రతిపాదిస్తున్నట్లు అటవీ (పరిరక్షణ) సవరణ బిల్లు ప్రాథమిక విశ్లేషణలో స్పష్టమవు తుంది. ఇది ఆదివాసీ సముదాయాలపై పరాన్న జీవి. వారి జీవనశైలికి హాని కలిగించే అభివృద్ధి నమూనాకు మద్దతుగా అటవీ భూముల నుండి వారిని నిర్వాసితులను చేయడంపై ఆధార పడిరది.‘‘అభివృద్ధి’’ అనే రాజ్య దృక్పథానికి మద్దతుగా భారతీయ అడవులలో చారిత్రాత్మకంగా నివసించే ఆదివాసీ సమూహాలపై ఉద్దేశ పూర్వకంగా చేసిన దాడి చరిత్రనే భారత దేశంలోని అటవీ ‘‘పరిరక్షణ’’ చట్టాల చరిత్ర.
వలసరాజ్యాల కాలంలో, భారతీయ అడవులను ఆ రాజ్యాల ‘‘అభివృద్ధి’’ని ముందుకు తీసుకువెళ్ళే ప్రాజెక్టులకు వనరులను సమకూర్చే అజ్ఞాత గనిగానూ, రైల్వేలు, కార్యాలయాలులాంటి వలసరాజ్యాధిపతుల మౌలిక సదుపాయాల నిర్మాణంలో సహాయపడేవిగానూ గుర్తించారు.
అందువల్ల, డైట్రిచ్‌ బ్రాండిస్‌ అభివృద్ధి నమూనాను భారతదేశంలోని అటవీప్రాంతాలలో ప్రవేశ పెట్టారుబీ ‘‘శాస్త్రీయ అటవీ’’ పేరుతో అటవీ భూములు నరికివేసారు, వలసరాజ్యాల అభివృద్ధికి కలపను అందించే ప్లాంటేషన్‌ నమూనాను ప్రవేశపెట్టారు. (భారతదేశంలోని బ్రిటీష్‌ ప్రభుత్వం ఒక జర్మన్‌ వృక్షశాస్త్రజ్ఞుడు డైట్రిచ్‌ బ్రాండిస్‌ను భారతదేశపు మొదటి జాతీయ అటవీ విభాగానికి అధిపతిగానూ, నిర్వహణాధికారిగానూ నియమించింది. అదే 1864లో స్థాపించబడిన ఇంపీరియల్‌ ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌. ఇంపీరియల్‌ ఫారెస్ట్‌ డిపార్ట్‌ మెంట్‌ స్థాపన,ఆతర్వాత ఏర్పడిన ఇంపీరియల్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ (1867)ల వల్ల రాజ్య-అటవీ సంబంధాలలో పెద్ద ఎత్తున పర్యవసానాలు జరిగాయి. మరీ ముఖ్యంగా, చారిత్రకంగా అటవీ భూమి, వనరులతో ముడిపడి ఉన్న వారి స్థితిగతులను ప్రభావితం చేసాయి. అటవీ భూమి, వనరులపై సాంప్రదాయ హక్కు లను అనుభవిస్తున్న అటవీ నివాస సముదాయాల స్థానంలో త్వరలోనే నిరంకుశాధికారులు,అటవీ శాఖ అధికారులు వచ్చి చేరారు.ఆతర్వాత, భారతదేశంలోని వారి సేవక (హిజ్‌ మెజెస్టి) ప్రభుత్వం చేసిన శాసనాలు అటవీ నివాసులను నేరస్థులుగా పరిగణించాయి, వారిపై అటవీ భూమి ఆక్రమణదారులుగా ముద్ర వేసాయి. ఆదివాసీ సమూహాల తొలగింపులు,రాజ్య ఏజెంట్లు చేసిన మానవ హక్కుల ఉల్లంఘనలు, కోల్పోయిన అటవీ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు పోరాటాలు కొనసాగుతూండడం వల్ల ఈ వలసవాద సిద్ధాంత ‘పరిరక్షణ’ ప్రభావం నేటికీ కొనసాగుతోంది.) కాలక్రమేణా, శతాబ్దాలుగా ఈ భూముల మూల నివాసులను ఆదుకున్న సహజ వనరులను వలసరాజ్యాల అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ఉపయోగించుకోవ డానికి, తద్వారా ఆదివాసీ సముదాయాలను నిర్వాసితులను చేయడానికి అటవీ చట్టాలు ఉపయోగపడ్డాయి.
బ్రిటీష్‌ ప్రభుత్వం క్రింద అటవీ హక్కుల చట్టం, కొన్ని అడవులను ‘‘రిజర్వ్‌’’గా వర్గీకరించింది. అటువంటి అడవులలో నివసించే ఆదివాసీ సముదాయాలు నిర్వాసితమయ్యాయి. వారి జీవనానికీ, జీవనోపాధికి ఆధారమైన అడవులలో లభించే వనరులను ఉపయోగించుకోడానికి అనుమతించలేదు. బస్తర్‌ ఆదివాసీ జనాభా తమ అడవిలో 2/3 వంతును ‘‘రిజర్వ్‌’’గా ప్రకటించ డానికి వ్యతిరేకంగా జరిపిన ఉద్యమ అణచి వేతలో,తమ భూమిని అన్యాయంగా స్వాధీనం చేసుకోవడానికి వ్యతిరేకంగా ప్రజలు చేసిన తిరుగుబాటులను బ్రిటిష్‌ సేనల క్రూర అణిచివేత కనపడుతుంది.
1947లో అధికార బదలాయింపు తర్వాత విస్తృత ప్రజానీకానికి కాకుండా రాజ్య ప్రయోజనాలకు ఉపయోగపడే, ఆదివాసీలను నిర్వాసితులను చేసే ఈ చారిత్రాత్మక అభివృద్ధి నమూనాను భారత రాజ్యం కొనసాగించింది.రాజ్యాంగం స్వయంగా ఆదివాసీ సముదాయాలు నివసించే కొన్ని ప్రాంతాలను ‘‘షెడ్యూల్డ్‌ ప్రాంతాలు’’గా గుర్తిం చింది.ఇవి ‘‘స్వపరిపాలన’’కు సంబంధించిన కొన్ని హక్కులను పొందుతాయి. ఏదేమైనప్పటికీ, ఈ నిబంధనయే రాష్ట్ర/కేంద్ర చట్టం ఈ ప్రాం తాలలో వర్తిస్తుందా లేదా అని నిర్ణయించే హక్కును రాష్ట్ర గవర్నర్‌కు యివ్వడంతో అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంచి నట్లయింది. ఆదివాసీ సముదాయాలకు స్వయంప్రతిపత్తి, ప్రజాస్వామ్యం వున్నాయనే అపోహను బహిర్గతం చేస్తూ, ఈ ప్రాంతంలో ‘‘స్వయంప్రతిపత్తి కమిటీ’’ రూపొందించిన చట్టాలకు రాష్ట్ర గవర్నర్‌ సమ్మతి అవసరం అనే నిబంధన మరోసారి హానికరమైన అధికారాన్ని కేంద్రం చేతుల్లో ఉంచింది.
తాము నివసించే భూమిపై రాజ్యం చేపట్టే చర్యల విషయంలో ఆదివాసీ ప్రజల ప్రజాస్వామిక స్వరాన్ని వినిపించవచ్చనే అపోహను శాసన పరమైన చర్యలు కూడా కలిగిస్తాయి. స్వాతంత్య్రా నంతరం అటవీ హక్కుల చట్టం, ప్రత్యేకించి 2006లో చేసిన సవరణ, వ్యక్తిగత లేదా సమాజపర దావాల ద్వారా అటవీ భూములపై ప్రభుత్వ గుర్తింపు పొందిన హక్కులను పొందేం దుకు వీలు కల్పించడం ద్వారా ఆదివాసీ భూమిపై ఆదివాసీ రైతులు తమ హక్కులను సాధించు కోవడంలో సహాయపడే ప్రజాస్వామిక చట్టంగా ప్రకటితమయింది.
అయితే,అటువంటి దావాల వాస్తవ చరిత్ర అటవీ భూములపై ఆదివాసీ సముదాయాలు చేసిన దావాలను గుర్తించడానికి ప్రభుత్వానికున్న విముఖతను సూచిస్తుంది- మొత్తం గుర్తించబడిన దావాలలో 3.9% మాత్రమే (ఎఫ్‌.ఆర్‌.ఎ స్టేటస్‌ రిపోర్ట్‌, 2018 ప్రకారం) సాముదాయిక భూమికి అనుకూలంగా ఉన్నాయి, కానీ వాస్తవానికి 68.9% జనాభా సాముదాయిక భూమిగా బావించే అటవీ భూమిలో నివసిస్తున్నట్లు డేటా సూచిస్తుంది.
అంతేకాకుండా, మైనింగ్‌ ప్రాజెక్టులను సుల భతరం చేయడానికి అటవీ భూములపై ఆదివాసీల దావాలను తిరస్కరించిన చరిత్ర ఉంది, ఇటీవల 2015లో మైనింగ్‌ ప్రాజెక్ట్‌ ను సులభతరం చేసేందుకు జార్ఖండ్‌లోని రించి గ్రామం నుండి వచ్చిన 72దావాలు తిరస్కరణకు గురయ్యాయి. ఆ ప్రాంతంలో బొగ్గు బ్లాకులు వుండడమే ఆ తిర స్కరణకు కారణం. ఆదివాసీ సముదాయాల శ్రేయస్సు, మనుగడ కోసం కాకుండా, దాని ద్వారా నిధులు సమకూరుస్తున్న ప్రాజెక్టుల గురించి, వనరులను అందించడం గురించి ప్రభుత్వం మరింత శ్రద్ధ వహిస్తుందని ఈ వాస్త వం స్పష్టంగా వివరిస్తుంది.
ప్రజాస్వామిక నిర్మాణంగా చెబుతున్న 2006 సవరణ, తరువాత వచ్చిన చట్టాలు దాని సారాం శాన్ని తీవ్రంగా పలుచన చేసి అసలు ఏమీ లేకుండా చేసాయి. అభివృద్ధి ప్రాజెక్టుల ఆమోదానికి ముందు గ్రామసభ సమ్మతి తీసుకోవాల్సిన అవసరాన్ని 2022 నిబంధనలకు చేసిన సవరణ తిరస్కరించిందని, అప్పటికే ఆమోదం పొందిన అభివృద్ధి ప్రాజెక్ట్‌లను ఆమోదించే దశకు అటువంటి ‘‘సమ్మతి’’ని తరలించిందని అటవీ పరిరక్షణ నియమాల శాసన చరిత్రను పరిశీలిస్తే స్పష్టంగా తెలుస్తుంది.
2022 సవరణ, ఇతర చట్టాల ప్రభావం 2006 ఎఫ్‌ఆర్‌ఎ అందించిన బలహీనమైన ప్రజాస్వామిక హక్కులను మరింతగా పలుచన చేయడం గురించి భారతదేశంలోని కొత్త అటవీ సంరక్షణ నియమాల రాజకీయ ఆర్థిక వ్యవస్థలో మరింతగా అన్వేషణ జరిగింది.
సామ్రాజ్యవాద పెట్టుబడి ద్వారా నిధులు సమ కూర్చే టాటా బిర్లా,అదానీ,అంబానీల వంటి దళారీ బూర్జువాల (రాజ్యం మద్దతుతో సామ్రా జ్యవాద పెట్టుబడికి సేవ చేసే బూర్జువ ాజీలో ఒక సెక్షన్‌) ప్రాజెక్టుల ప్రయోజనాలకు మద్దతు నివ్వడానికి భారత రాజ్యం పూర్తిగా సైనిక అణచివేతను ఉపయోగించింది. ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌ వంటి సైనిక కార్యకలాపాల ద్వారా యిచ్చిన మద్దతు పస్తుత ఆపరేషన్‌ సమాధాన్‌-ప్రహార్‌ ద్వారా పరిపూర్తి అయింది. రాజ్యం చేసే ఈ సైనిక దాడులు అటవీ ప్రాంతాలలో నివసించే ఆదివాసీ జనాభాపై దాడి. ఆపరేషన్‌ సమాధా నన్‌-ప్రహార్‌ కింద, వామపక్ష తిరుగుబాటును ఎదుర్కోవడానికి భారత రాజ్యం ఛత్తీస్‌గఢ్‌లోని తన సొంత పౌరులపై వైమానిక బాంబు దాడికి దిగింది.ఆదివాసీ జనాభాపై భారత ప్రభుత్వం చేస్తున్న ఈ మారణహోమ యుద్ధానికి అటవీ పరిరక్షణ చట్టానికి ప్రతిపాదించిన కొత్త సవరణలు సహాయపడతాయి. ‘‘జాతీయ ప్రాముఖ్యత కలిగిన వ్యూహాత్మక వరుస ప్రాజెక్టుల’’ కోసం సరిహద్దు భూములను, ముఖ్యంగా ప్రభుత్వం సవరించిన బిల్లులో ‘‘వామపక్ష తీవ్రవాద ప్రాంతాలు’’గా వర్గీకరించిన భూమిని మినహాయించడం ద్వారా, ‘‘జాతీయ భద్రత’’ అనే పురాతన కవచం కింద ప్రభుత్వం చేసే నిర్థారణ అటవీ భూములను, జనాభాను తొలగించగలుగుతుంది, సామ్రాజ్యవాద దోపిడీకి మరింత వనరులను సమకూర్చగలుగు తుంది. భారతదేశంలోని అడవులలో నివసించే ఆదివాసీ జనాభాకు వ్యతిరేకంగా జరుపుతున్నఈ సంపూర్ణ యుద్ధాన్ని ‘‘అభివృద్ధి’’ పేరుతో రాజ్యం సమర్థిస్తోంది. ఈ అభివృద్ధి దేశ భవిష్యత్తుకు దోహదపడుతుందని పట్టణీకరణకు, బహుళజాతి మైనింగ్‌ ప్రాజెక్టులకు సహాయం చేస్తుంది అని అంటోంది. హిరాకుడ్‌ డ్యామ్‌ ద్వారా నిర్వాసితులైన ప్రజలకు నెహ్రూ చెప్పినట్లుగా 1948 నాటికే ‘‘నిర్వాసితులను చేయడం ద్వారా అభివృద్ధి’’నమూనాకి నాంది పలికింది. ‘‘దేశ ప్రయోజనాలకు’’ సహాయం చేస్తుంది.2011లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, ‘అభివృద్ధి’ ప్రాజెక్టుల కారణంగా భారతదేశంలో 50 సంవత్సరాలలో దాదాపు అయిదు కోట్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.
వీటిలో,డ్యామ్‌లు,గనులు,పారిశ్రామిక అభివృద్ధి మొదలైనవాటి కారణంగా రెండు కోట్లకు పైగా ‘అభివృద్ధి’ ప్రేరిత అంతర్గతంగా నిర్వాసితులైన వ్యక్తులు (ఐడిపి-ఇంటెర్నల్లి డిస్‌ప్లేస్డ్‌ పర్సన్స్‌) ఉన్నారు. వీరిలో 40%గా ఉన్న ఆదివాసీలు మరింత దారుణగా ప్రభావితమవుతున్నారు.
ఆదివాసీల నిర్వాసిత్వానికి పారిశ్రామికీకరణ అతిపెద్ద కారణం. ఆదివాసీల ప్రాంతాల్లో గని తవ్వకాల ప్రాజెక్టుల కారణంగా 3.13 లక్షల మంది దౌర్జన్యంగా నిర్వాసితులయ్యారు.13.3 లక్షల మంది ఆదివాసీలు తమ పూర్వీకుల భూమి నుండి నేరుగా నిర్వాసితులయ్యారు.
ఈ గందరగోళ స్థితి ముఖ్యమైన ప్రశ్నలను వేస్తుంది-మనం ఏ అభివృద్ధి నమూనాను అనుసరిస్తున్నాం? ఈ అభివృద్ధి వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఈ అభివృద్ధి ఆలోచన ఆదివాసీలు, గ్రామస్తులు, ఒక ప్రాంతంలోని స్థానికులపై ఎందుకు అసమాన భారంగా ఉంది.
ఈ‘‘అభివృద్ధి ప్రాజెక్టుల’’ వెనుక ఉన్న కంపెనీలు, కార్పొరేషన్లు, సంస్థల స్వభావంలో పై రెండు ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయి. ఇంతకు ముందు వివరించినట్లుగా-ఈ ప్రాజెక్టులను భారతదేశంలోని దళారీ బూర్జువాలు చేపట్టాయి- ఇవి సామ్రాజ్యవాద పెట్టుబడికి సేవచేస్తాయి, అయితే సర్దార్‌ సరోవర్‌, తెహ్రీ వంటి పెద్ద ఆనకట్టల నిర్మాణానికి సంబంధించిన అనేక ప్రాజెక్టులు ప్రపంచ బ్యాంకు లాంటి సామ్రాజ్య వాద ఏజెంట్ల నుండి నేరుగా నిధులు పొందుతాయి.
ముందుగా చర్చించినట్లుగా, అటవీ పరిరక్షణ నిబంధనలకు ప్రతిపాదించిన సవరణలు భారత ప్రభుత్వానికి ‘‘జాతీయ ప్రాముఖ్యత’’, ‘‘జాతీయ భద్రత’’ మొదలైన ప్రాజెక్టుల ముసుగులో ఆదివాసీ జనాభాను చట్టబద్ధంగా తరలించడాన్ని సుల భతరం చేస్తాయి. ఇటువంటి నిర్వాసిత్వం జీవితాలను నాశనం చేస్తుంది ఆదివాసీ ప్రజలు- శతాబ్దాలుగా వారు కలిగి ఉన్న తమ సామాజిక జీవనాన్ని, జీవనోపాధిని, సాముదాయిక భూమిని కోల్పోతారు.
ఒకసారి నిర్వాసితులవుతే, వారికి ద్రవ్య పరిహారం తప్ప మరింకేమీ సహాయం అందించే సమర్థత రాష్ట్రానికి లేదు. అనేక అభివృద్ధి ప్రాజెక్టు లలో చూసినట్లుగా,చట్టపరంగా రావాల్సిన వాటిని యివ్వడంలో కూడా ప్రభుత్వం విఫలమైంది.
ఈ పరిహారం చట్టాల క్రింద,స్త్రీలు వారి మగ బంధువుల పొడిగింపులుగా పరిగణించబడతారు: వారికి ప్రత్యేక పరిహారం అందదు. నిర్వాసిత్వం వలన ఆదివాసీ సముదాయాలలోని మహిళలు మద్యపానం, వివాహాలలో హింసను లాంటి సమస్యలు ఎక్కువవుతాయి.బాల్య వివాహాలు, మనుగడ కోసం తరచూ వ్యభిచారం,మానవ అక్రమ రవాణాకు గురవుతారు.
నిర్వాసిత్వం చెందిన జనాభా తమ జీవనోపాధి వెతుకులాటలో నగరాలు, ఇతర పారిశ్రామిక ప్రాంతాలకు వలస వెళ్లవలసి వస్తుంది. వారు ఇక్కడ రాష్ట్ర ఇతర ‘‘అభివృద్ధి’’ ప్రాజెక్టులకు చౌక కార్మికులుగా మారతారు. నిర్వాసిత్వం చెందిన జనాభా తీవ్రమైన మానసిక వేదనతో పాటు పేదరికం, దీర్ఘకాలిక పోషకాహార లోపం, ఆకలిలాంటి అనారోగ్యాలకి కూడా గురవుతారు.
‘‘పరిరక్షణ’’ ముసుగులో పరిరక్షణ ముసుగులో, స్థానిక సముదాయాలను అడవుల నుండి బయటికి తరలిస్తున్నారు. వన్యప్రాణి పార్కులు, అభయారణ్యాలు నిర్మించినప్పుడు ఆదివాసీ సముదాయాలు నిర్వాసితులు కాకపోతే ఇది పర్యావరణానికి ఉత్తమమైనదని పరిరక్షకుల వాదనబీ అటవీ పరిరక్షణ పేరుతో తమ సాముదాయిక భూమిని చుట్టుముట్టినప్పుడల్లా తమ జీవనోపాధిని కోల్పోతున్నారు.
పరిరక్షణ ముసుగులో, స్థానిక సముదాయాలను అడవుల నుండి బయటికి తరిమికొడుతున్నారు. వన్యప్రాణుల పార్కులు, అభయారణ్యాలు సృష్టించినప్పుడు ఆదివాసీ సముదాయాలను నిరాశ్రయులను చేయకపోవడం పర్యావరణానికి మంచిది అని పరిరక్షకులు వాదిస్తున్నారు. అయితే అటవీ పరిరక్షణ పేరుతో వారిని తమ సాము దాయిక భూమి నుండి తరిమివేయనప్పటికీ, వారు జీవనోపాధిని కోల్పోతున్నారు. ఉదాహరణకు, ఒడిశాలోని సునాబేడ టైగర్‌ రిజర్వ్‌ను నిర్మించడం కోసం, రిజర్వ్‌ అడవుల నుండి ఆదివాసీ కుగ్రామాలను వేరు చేస్తున్నారు. తమ రోజువారీ జీవనానికి, జీవనోపాధికి ఆధారమైన అడవుల నుండి కలపేతర అటవీ ఉత్పత్తులను సేకరణను నిషేధిస్తున్నారు. అంతేకాకుండా, స్థానిక ఆదివాసీ సముదాయాలు అటవీ అధికారుల వేధింపులకు వ్యతిరేకంగానూ, వారి జీవనశైలి అడవులను అల్లకల్లోలం చేసిందనీ పోరాడారు. వాస్తవానికి, కొత్త నిబంధనల ద్వారా జరిగే జీవావరణ రిజర్వ్‌లు, జంతుప్రదర్శనశాలలు, అభయార ణ్యాలు, పర్యావరణ-పర్యాటక సౌకర్యాలు మొదలైనవాటి నిర్మాణం, అడవుల సహజ పర్యావరణ వ్యవస్థకు మరింత హానికరం అవుతుంది.
ఆదివాసీ సముదాయాలు నివసించే అటవీ ప్రాంతాలలో అంతకుముందు ఉన్న పర్యావరణ వ్యవస్థలు, ఈ అడవుల సహజ పర్యావరణ వ్యవస్థతో సామరస్యంగా జీవిస్తున్న సముదా యాలను కలిగి ఉంటాయి. పర్యావరణ-పర్యాటక సౌకర్యాలను ప్రవేశపెట్టడం, పరిరక్షణ పేరుతో ‘‘రిజర్వ్‌లు’’ నిర్మించడం ఈ అడవుల్లో నివసించే ప్రజలకు, వన్యప్రాణులకు పర్యావరణ వ్యవస్థకు భంగం కలిగిస్తుందని నిరూపితమైంది.
మెక్సికో పసిఫిక్‌ తీరంలో, ఆడ సముద్ర తాబేళ్లు గుడ్లు పెట్టడానికి తీరానికి రాకుండా నిరోధించే ప్రతికూల ప్రభావాన్ని పర్యావరణ పర్యాటకం కలగచేసింది(అవి ఇప్పుడు జనసమూహం, బీచ్‌లలో వెలుతురును చూసి భయపడుతున్నాయి), అందువల్ల ఇప్పటికే అంతరించిపోతున్న జాతులను మరింత ప్రమాదంలోకి నెట్టినట్లవు తుంది. పర్యావరణ పర్యాటక కార్యక్రమాలు సమాజంలోని పెటీ-బూర్జువా, ‘‘మధ్య’’ లేదా ఉన్నత తరగతులకు మాత్రమే ఆకర్షిస్తాయి.
జంతుప్రదర్శనశాలలు, సఫారీలు, బయో-పార్క్‌లు/రిజర్వ్‌లలో వారి వినోదం కోసం ఆదివాసీ సముదాయాలు కల్లోలభరిత నిర్వాసి త్వాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ కార్యక్రమాలు దేశంలోని విశాల ప్రజానీకానికి వినోద కారకాలు కాకపోయినప్పటికీ, అందుకోసం వారు నిర్వాసితులవుతున్నారు. అంతేకాకుండా, పర్యావరణ పర్యాటకాన్ని ప్రోత్సహించే ఈ ‘‘హరిత పెట్టుబడి’’ కార్యక్రమాలకు, ప్రత్యేకించి పర్యావరణ పర్యాటక ప్రాంతంలో ప్రైవేట్‌ రంగ వృద్ధిని పెంచే కార్యక్రమాలకు, చాలా వరకు ప్రపంచ బ్యాంక్‌, ప్రపంచ వాణిజ్య సంస్థ నిధులు సమకూరుస్తాయి. అందువల్ల, పర్యావరణ-పర్యాటక కార్యక్రమాల నుండి పొందిన మూలధనం నేరుగా భారత ఆర్థిక వ్యవస్థకు కూడా చేరదు, అది దాని సామ్రాజ్యవాద యజమానులకు సహాయం చేస్తుంది.
ఇప్పటికే పర్యావరణంతో సామరస్యంగా జీవిస్తున్న ఆదివాసీ ప్రజలను నిర్వాసితులను చేయడానికి పర్యావరణ పరిరక్షణ ఒక సమర్థనీయ కారణం కాదు, పర్యావరణాన్ని పరిరక్షించని లేదా దేశంలోని ప్రజలకు అందని పర్యావరణ స్థిరత్వ సామ్రాజ్యవాద నమూనాను ముందుకు తెచ్చింది.
ఈ నేపధ్యంలో, భారత రాజ్యం చేపడుతున్న ప్రస్తుత అభివృద్ధి నమూనాను పరిశీలిస్తే, అది సామ్రాజ్యవాద పెట్టుబడికి ప్రత్యక్ష సేవలో ఉన్నట్లు స్పష్టమవుతుంది. ఇది ‘‘భూ కబ్జా’’ చుట్టూ కేంద్రీకృతమై ఉన్న నమూనా మాత్రమే కాదు, స్థానిక జనాభా, శ్రామిక వర్గ హితాసక్తులపై ఆధారపడి జీవించే పరాన్నజీవి కూడా.
గత 77 ఏళ్లలో భారత పార్లమెంట్‌ గాని, శాసనసభలు గాని ఒక్క ‘శాసనం’ చేయలేదు. బ్రిటిష్‌వాడు వదిలి వెళ్లిన పాలనా పద్ధతులలోనే పాలన చేస్తున్నారు. ‘పాలనా అధికారంతో ఉన్న కొద్ది మంది’ బ్రిటిష్‌ పాలకుల వలే, మెజారిటీ సాధించిన రాజకీయ పక్షం ‘కేబినెట్‌’ రూపంలో ‘నిర్ణయాలు’ చేసి వాటిని చట్టాలుగా మారుస్తున్నారు. నిజమైన ప్రజాస్వామ్యంలో ఏదేనా ఒక విధానాన్ని రూపొందించాలంటే పలు కోణాల్లో సామాజిక అధ్యయనాలు నిర్వహించాలి. వాటి ఆధారంగా ఏ వ్యక్తికీ నష్టం లేకుండా అందరికీ సమానంగా వర్తించేలా విధానాలను రూపొందించాలి. సమాజంలోని ప్రతి వ్యక్తికీ సమాన అవకాశాలను కల్పించేదిగా, ప్రతి వ్యక్తి సామర్థ్యాన్ని బలోపేతం చేసే హక్కులను అందించేదిగా ఉండడమనేది ప్రజాస్వామ్య ప్రథమ సూత్రం. ఇటువంటి సమున్నత సూత్రాన్ని నిర్దేశించని రాజ్యాంగంతో ప్రజాస్వామ్య నిర్మాణం అసాధ్యం.
స్వతంత్ర భారత్‌లోని ప్రజాస్వామ్య పరిస్థితులు ఒక విషయాన్ని కొట్టొచ్చినట్లు తేటతెల్లం చేస్తున్నాయి: భారతీయులకు ‘శాసనం %-% హక్కు %-% చట్టం’ మధ్య ఉన్న అనుబంధం ఏమిటో తెలియదు. వాటిపై అవగాహన ఉన్న బ్రిటిష్‌ వాళ్ళు, మొదటి రెండిటిని తమకే పరిమితం చేసుకుని, చట్టాలను రచించి వదిలి వెళ్లారు. భారతీయులు వాటిని పట్టుకుని కాలం వెళ్లమారుస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేసే ప్రతి పైసాకు తిరిగి ఏ సేవ ‘హక్కుగా’ ఇవ్వడం జరుగుతుందో కూడా ప్రతి చోట లిఖితపూర్వకంగా తాను ఇచ్చే రసీదులో క్లుప్తంగా వెల్లడిరచి తీరాలి. ప్రభుత్వం ఇలా చేస్తున్న దాఖలాలు ఎక్కడా లేవు. ప్రజల హక్కులను తెలుపుతూ ప్రభుత్వ డబ్బు వసూళ్ల వలన ఉపయోగం అనే సదుద్దేశ్య వాతావరణం నెలకొల్పి ప్రజలను చట్టబద్ధులను చేసే బదులు, చట్ట ఉల్లంఘనకు పర్యవసాన జరిమానా/ శిక్షలను ప్రస్తావిస్తూ వసూళ్లు చేస్తుంటారు. రౌడీయిజం పంథాని ‘అధికారంతో అజమాయిషీ’ చేయడం అని భావిస్తున్నారు.
రాజకీయ పార్టీలు అధికారం కోసం రాజకీయాన్ని వ్యాపారంగా మార్చి వేశాయి. వ్యాపార రాజకీయంలో ఉన్న నాయకులకు శాసనం%-% హక్కులు అనేవి వారి ఆలోచనకి అంతుపట్టని విషయాలుగా ఉన్నాయి. ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచారో అదే హక్కుగాను, కోర్టులు ఏవైతే చెప్తాయో అవి ‘న్యాయం’గాను పరిగణిస్తున్నారు. అయితే ఎవడిది పై చేయి అయితే వాడిది ‘న్యాయం’ అనే ఆటవిక వ్యవస్థతో దేశం నడుస్తున్నది. అందుకే ఒకే కేసుకు పలు తీర్పులు పలు కోణాల్లో వెలువడుతున్నాయి. భారత రాజ్యంకి సామ్రాజ్యవాద యజమానులతో ఉన్న అనుబంధం, శ్రామిక ప్రజలపై దాని విధ్వంసక ప్రభావాల ఈ విశ్లేషణ వేసే ప్రశ్న- ప్రజల-కేంద్రీకృత అభివృద్ధి నమూనా ఎలా ఉంటుంది. ప్రస్తుత నమూనా నుండి అది ఎలా భిన్నంగా ఉంటుంది.
ప్రజల అవసరాల చుట్టూ కేంద్రీకృతమై ఉన్న నమూనా ప్రజల నుండి వస్తుంది. వారి సాంప్రదాయ భూమి నుండి జనాభాను నిర్వాసితులను చేయడంపై ఆధారపడి ఉండ డానికి బదులు అవసరమైన వనరులకు సమానమైన ప్రాప్యతను నిర్ధారించడం ద్వారా జనాభా శ్రేయస్సుపై దృష్టి పెడుతుంది.
ఎగుమతి మిగులు ద్వారా భారతదేశ ఖనిజాలు, విద్యుచ్ఛక్తి, సహజ వనరులను విదేశాలకు తరలించేబీ త్రాగునీరు, ఆహారం, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల వంటి ప్రాథమిక సౌకర్యాలు అట్టడుగు వర్గాల జనాభాకు, శ్రమించే కార్మికులకు అందని, ఒక క్రమపద్ధతిలో ఉన్నతవర్గాలకు మాత్రమే అందుబాటులో వుండే ప్రస్తుత నమూనా కంటే ఇది పూర్తిగా భిన్నంగా వుంటుంది.అటవీప్రాంతా ల్లోని సహజ వనరులను రాజ్యం స్వాధీనం చేసుకునే బదులు, అవసరాలకు అనుగుణంగా జనాభాకు సేవలందించేందుకు వినియోగిస్తారు. ఈ అభివృద్ధి నమూనాలో క్రూరమైన దోపిడీకి గురవుతున్నన కార్మికులు, చిన్న, భూమిలేని రైతులు, ఆదివాసీలు నిర్వాసితులై చౌక శ్రమ వనరులుగా మిగిలిపోయిన ఆదివాసీలు లేదా నిరుద్యోగులుగా కార్మిక రిజర్వ్‌ సైన్యంలోకి నెట్టబడ్డారు. ఈ కొత్త నమూనాలో కేంద్రంగా వుంటారు.విశాల శ్రామికవర్గ ప్రయోజనాలను రక్షిస్తుంది, సామ్రాజ్యవాద శక్తులతో అనుబంధం లో ఉన్న బూర్జువా వర్గానికి చెందిన ఒక చిన్న వర్గానికి కాకుండా శ్రామికవర్గ ప్రజానీక ప్రయోజనాలను రక్షించే విధంగా ఈ కొత్త నమూనాకు కేంద్రంగా ఉంటుంది.
ఎందుకంటే వరదలు,పర్యావరణ విపత్తులు, మారుతున్న వాతావరణం కారణంగా పంట నష్టం లేదా పర్యావరణ కాలుష్యం, క్షీణత వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు వంటి వాటి ద్వారా జరిగే నష్టం ఎక్కువగా ప్రభావితమవుతుంది కాబట్టి అటువంటి పర్యావరణ నష్టాన్ని నివారించడం, తగ్గించడం విస్తృత ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ఉండడంవల్ల ఈ నమూనా పర్యావరణానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దాని నిర్దిష్టతతో సంబంధం లేకుండా ఏ ప్రదేశంలోనైనా మూలధనం విస్తరణ, దండయాత్రల కోసం ప్రయత్నించే, విదేశీ మూలధనం విలువను పెంచే భారత రాజ్యం ప్రస్తుతం అనుసరిస్తున్న నమూనాకు ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుంది.
కొన్ని సమస్యలకు సరైన చట్టాలు లేనందువలన, కోర్టులు ఇచ్చే తీర్పులతో ‘న్యాయం’ ఏర్పడు తున్నది. పరిస్థితిని బట్టి న్యాయం మారుతున్నది, కానీ,హక్కు మాత్రం ఏర్పడటం లేదు. హక్కులు దిక్కులు లాంటివి,అవి మారవు.సమగ్ర, సహేతుక చట్టాలు లేని సందర్భాలలో కోర్టులు పార్లమెంట్‌కు కేసులను రిఫర్‌ చేస్తూ శాసనాలు అవసరం అని తెలియచేయడం లేదు. శాసన వ్యవస్థకు బదులు చాలా సందర్భాలలో ‘ప్రభుత్వాన్ని’ న్యాయస్థానాలు ప్రశ్నిస్తున్నాయి. మరి ప్రభుత్వమే ‘పాలనా అధికారంతో ఉన్న కొద్దిమంది కేబినెట్‌’గా మారిపోయింది కదా. మన రాజకీయ పార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యం, నాయకత్వ నిర్మాణం లేవు. వ్యక్తి పూజ, వ్యక్తి స్వామ్యం ఎన్నికల తంతు తరువాత ప్రభుత్వంలోకి చేరి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయి. నిజమైన ప్రజాస్వామ్య పార్టీ విధ్యుక్త ధర్మం ప్రజలకు అవసరమైన పనులను చేస్తూ గుర్తింపుపొంది తరువాత ప్రజల ఆమోదంతో అధికారంలోకి రావడమే కాదూ? ఇందుకు విరుద్ధంగా రాజకీయ పార్టీలు మందిని పోగేసుకుని, ఎవరి ప్రయోజనాలను వారు సాధించుకునే ఆశయంతో ఒక ముఠా మీద మరొక ముఠా కుట్రలు కుతంత్రాలు చేసుకుంటు న్నాయి. ఏమి చేస్తే పై చేయి అవుతుందో అవన్నీ చేస్తూ అధికారం కోసం అడ్డదారులు తొక్కుతూ దేశాన్ని నాశనం చేస్తున్నాయి.ఈ ముఠాల స్వప్రయోజన అపేక్షలకు ఒక ఉదాహరణ 77 సంవత్సరాల తరువాత కూడా కొనసాగుతున్న ప్రభుత్వ ఉద్యోగుల ‘కరువు భత్యం’. బ్రిటిష్‌ వలస పాలకులు తమ ఉద్యోగులకు, సమాజంలోని మిగతా వారి కన్నా అత్యధికంగా డబ్బు అందుబాటులో ఉంచాలని సంకల్పించి, ‘కరువు భత్యం’ అనే ఆర్థిక సదుపాయాన్ని కల్పించారు. సంపదలను సృష్టించే ఆర్థిక కార్యకలాపాలతో సంబంధం లేనిది ఈ ‘కరువు భత్యం’. ఇంతకూ బ్రిటిష్‌ వాడి ఉద్యోగులు ఎవరు? భారతీయులే. భారత సమాజం ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా, భారతీయుల నుంచి వసూలు చేసిన పన్ను రాబడిని కొద్ది మంది భారతీయులకు ఆదాయ మార్గంగా ఏర్పాటుచేశారు! ఇప్పటికీ కొనసాగుతోన్న ఇలాంటి అవకతవకలు దేశంలో కోకొల్లలు. ముఠాల ప్రయోజనాల కోసం ఇలాంటి దోపిడి పనులు భారత్‌లో ప్రతినిత్యం జరుగుతూ ఉన్నాయి. మరి మన భారతదేశంలో నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థలు ఎప్పటికైనా నిర్మాణమవుతాయా?
ప్రస్తుత నమూనా వైఫల్యం పర్యావరణానికి, ప్రజలకు కలిగించిన తీవ్ర నష్టంలో స్పష్టంగా కనిపిస్తుంది.జోషిమఠ్‌లో రాజధాని విస్తరణ పర్యావరణ నష్టం, మరణాలు, నిర్వాసిత్వానికి దారితీసిందిబీ లేదా అటవీ ప్రాంతాలలో, పర్యావరణ వ్యవస్థలు నాశనం అవుతున్నాయి, ఎఫ్‌సిఎ,ఎఫ్‌ఆర్‌ఎల ద్వారా చట్టబద్ధంగా ఆదివాసీలను నిర్వాసితులను చేస్తున్నారు లేదా విశాల ప్రజానీకం కోసం కాకుండా కొద్దిమందికి ఉద్దేశించిన అభివృద్ధి ప్రాజెక్టుల కోసం సైనిక దాడులు కూడా జరుగుతున్నాయి.
ముగింపు
అటవీ పరిరక్షణ సవరణ బిల్లు అనేది ఆదివాసీ జనాభాపై భారత రాజ్య అప్రకటిత యుద్ధాన్ని మరింతగా పెంచే ఒక ప్రజా వ్యతిరేక చట్టం. బిల్లును ఆమోదించిన విధానం, దాని వెనుక ఉన్న అంతర్లీన ఉద్దేశం ద్వారా బూర్జువా ప్రజాస్వామిక కాల్పనిక గాథ బహిర్గతమైంది.
ఈ వ్యాసంలో చర్చించినట్లుగా, ఈ అభివృద్ధి నమూనావల్ల స్థానిక సముదాయాలు మూల్యం చెల్లించే సమయంలో, భారతదేశ దళారీ బూర్జువా, వారి సామ్రాజ్యవాద యజమానుల ప్రయోజనాలను నెరవేర్చడంలో రాజ్యానికి ఈ సవరణల బిల్లు మరింత సహాయం చేస్తుంది. లాభదాయకమైన అభివృద్ధి ప్రాజెక్టులకు మార్గం సుగమం చేయడం కోసం స్థానిక సముదా యాలను నిర్వాసితులను చేయడం,ఓటు హక్కును రద్దు చేయడం, వారిపై బాంబుదాడి చేసేంత వరకుకూడా వెళ్ళే ఈ బిల్లు వివరించిన అభివృద్ధి నమూనా జాతి నిర్మూలన తప్ప మరొకటి కాదు.
రైతాంగ భూ యాజమాన్యాన్ని కాపాడాలని, దున్నేవాడికే భూమినివ్వాలని డిమాండ్‌ చేసే సంఘటిత ప్రజాపోరాటం మాత్రమే తన స్వంత ప్రజలపై భారత రాజ్యం చేస్తున్న బహిరంగ భీభత్స కేంద్ర భాగంలో దెబ్బ కొట్టగలదు. అన్నింటికంటే ముఖ్యంగా, భూమి పోయినప్పుడు, ఆదివాసీలు బొగ్గును తిని బతకరు కదా.
ప్రజలచే పాలన అనే స్ఫూర్తికి కాని, పౌరులకు తాము కోరుకునే, తమ గొంతు వినే వ్యవస్థగా కాని ఆధునిక ప్రజాస్వామ్యం కట్టుబడిలేదనాలి. అప్పుడప్పుడో, ఒక క్రమపద్ధతిలోనో, న్యాయ బద్ధంగానో అన్యాయబద్ధంగానో నిర్వహిస్తున్న ఎన్నికలు మాత్రమే ప్రజాస్వామ్యానికి నిదర్శనం, గీటురాయి అనే అపోహ కలుగుతున్నది. కఠోర వాస్తవం ఏమిటంటే, ప్రపంచం మొత్తం ప్రస్తుతం ‘నిరంకుశత్వాలు, ప్రజాస్వామ్యాలు’గా విడిపోయింది. వాస్తవానికి మనం అనుకుంటున్న మెజారిటీ ప్రజాస్వామ్యాలు కూడా దాదాపుగా అర్ధ నిరంకుశాలే. ప్రజాస్వామ్యం భవిష్యత్తు విషయంలో అసంతృప్తి సర్వత్రా వ్యక్తమవుతున్నది.
పరిపక్వత చెందిన ప్రజాస్వామ్యంలో నాయకులు ప్రజల భాగస్వామ్యాన్ని, సలహాలను, సూచనలను స్వాగతిస్తారు, ప్రోత్సహిస్తారు. అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి పుష్కలంగా అవకాశాలు కలిగించి, విభిన్న దృక్కోణాలకు విలువ ఇస్తారు. అలాంటి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం పాత్ర తక్కువ నియంత్రణలు కలిగిందిగా, ప్రజలు నమ్మినదాన్ని, కోరుకున్న దాన్ని సులభతరంగా పొందడానికి సహకరించేదిగా ఉంటుంది. ప్రజలు తాము ఎంపికచేసుకున్న రాజకీయ పార్టీలోకాని, ఇతర సమూహాలలోకాని నిరభ్యంతరంగా చేరే అవకాశం ఉంటుంది. ప్రజాస్వామ్యం పరిపక్వత చెందక, నియంతృత్వ ధోరణులు ఉన్న చోట పార్టీ, ప్రభుత్వం, దేశంపై సంపూర్ణ నియంత్రణ చేసే ఒకే ఒక్క నాయకుడు వుంటాడు.
‘నిరంకుశ తరహా ప్రజాస్వామ్య నాయకత్వం’, ‘ప్రజాస్వామ్య నియంతృత్వం’ అనే రెండు విచిత్ర ప్రజాస్వామ్య విధానాలు ఇటీవలికాలంలో ఆవిర్భవించి, పుంజుకుంటున్నాయి. ఈ రెండిరటిలోనూ నిర్ణయాధికారాలన్నీ ఒకే ఒక్క వ్యక్తి (నాయకుడు) చేతుల్లో కేంద్రీకృతమై ఉం టున్నాయి. క్యాబినెట్‌ సహచరులతో సహా, పౌర సంఘాల, బ్యూరోక్రాట్ల, మేధావుల, వివిధ రంగాలకు చెందిన నిపుణుల సూచనలు కూడా ససేమిరా పట్టించుకోని పరిస్థితి ఉంటున్నది.-(సంయుక్త కణ్ణన్‌)

ఆదివాసులకు తీరని ద్రోహం

టూరిజం అభివృద్ధి పేరుతో‘విజన్‌ 2047’లో భాగంగా 1/70 చట్ట సవరణకు రాష్ట్ర కుటమి ప్రభు త్వం రంగం సిద్ధం చేస్తున్నది.ఇటీవల జరిగిన టూరిజం ప్రాంతీయ పెట్టుబడిదారుల సదస్సులో సభాపతి అయ్యన్న పాత్రుడు మాట్లా డుతూ ఆదివాసీ ప్రాంతంలో టూరిజం అభివృద్ధి కోసం హోటళ్లు,రెస్టారెంట్లు, పార్కులకు పెట్టు బడులు పెట్టాలంటే 1/70 చట్ట సవరణకు రాష్ట్ర ప్రభుత్వం,అధికార యంత్రాంగం లోతైన అధ్య యనం చేయాలని ప్రకటించడం ఆదివాసీలకు తీవ్ర ద్రోహం చేయడమే. పైగా షెడ్యూల్‌ ఏరియా లో టూరిజం అభివృద్ధికి 1/70చట్టం అడ్డంగా ఉందని,చట్టం సవరించాలని కూడా అయ్యన్న పాత్రుడు పేర్కొనడం వ్యక్తిగత అభిప్రాయమో లేక కూటమి ప్రభుత్వ విధానమో స్పష్టం చేయడం అవసరం. 2000 సంవత్సరంలో నాటి ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు పాడేరు ఏజెన్సీలోని చింతపల్లి జర్రేలలో ఉన్న 515 మిలియన్‌ టన్నుల బాక్సైట్‌ నిక్షేపాల తవ్వకాలకు దుబారు కంపెనీతో ఒప్పందం చేసుకుని గిరిజన సలహా మండలిలో 1/70 చట్టం సవరించడానికి పూనుకున్నారు. అప్పటి సిపిఎం భద్రాచలం ఎంఎల్‌ఎ సున్నం రాజయ్య మాత్రమే 1/70 చట్టం రక్షణకు నికరంగా నిలబడ్డారు. ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ ఓట్ల కోసం బాక్సైట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా నిలబడి అధికారం వచ్చిన వెంటనే 2006లో ముఖ్యమంత్రి వై.ఎస్‌ రాజశేఖర రెడ్డి రూ.8000 కోట్లతో రాస్‌ ఆల్‌ ఖైమ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆదివాసి గిరిజన సంఘం, వివిధ ఆదివాసీ సంఘాలు,సిపిఎం,వామపక్ష పార్టీల అండతో చేసిన సుమారు 20ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో బాక్సైట్‌ తవ్వకాల ఒప్పందాలు రద్దు చేయడమైనది.1/70 చట్టం అమలులో ఉండగానే అరకు,పాడేరు,చింతపల్లి,రంపచోడవరం, జీలుగు మిల్లి,పార్వతీపురం,మన్యం జిల్లాలో,ఇతర ప్రాంతా లలో బినామీ పేర్లతో లాడ్జీలు,షాపింగ్‌ కాంప్లెక్సు లు,రిసార్టుల నిర్మాణాలు యథేచ్ఛగా జరుగుతు న్నాయి. అల్లూరి జిల్లా చింతపల్లి,ఎర్రవరం, పెదకోట,మన్యం జిల్లా సాలూరు,అనకాపల్లి జిల్లా చింతలపూడి దగ్గర హైడ్రో ఎలక్ట్రికల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌,ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం వంకాయవారిపాలెం దగ్గర ఆయుధ కర్మాగారం నిర్మాణానికి 1/70చట్టం ఉల్లంఘించి ఒప్పందం చేసుకుని వేల ఎకరాల భూములు,అడవులు ధారాదత్తం చేస్తున్నది.ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలో 3000ఎకరాల పరిధిలోని అదాని ఆయుధ కర్మాగారం నిర్మాణానికి ఆదివాసీల హక్కులను ఉల్లంఘించి నిర్మాణం ముమ్మరం చేసింది.గత ప్రభుత్వం చేసిన ఒప్పందాలనే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అమలు చేస్తూ ఆదివాసీల హక్కులను ధ్వంసం చేస్తున్నది. 1970లో ఆదివాసీల పోరాట ఫలితంగా ఆదివాసీ అభివృద్ధి కోసం 1/70చట్టాన్ని సాధించాం.నేడు పెట్టుబడిదారుల అభివృద్ధి కోసం ఆ చట్టాన్ని సవరించేందుకు కుట్ర చేస్తున్నారు. షెడ్యూల్‌ ప్రాంత చట్టమైన 1/70లో కలుగచేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు.షెడ్యూల్‌ ప్రాంతంలో చట్టాలు చెయ్యాలన్నా తొలగించా లన్నా రాష్ట్రపతికే అధికారం ఉన్నది.షెడ్యూల్‌ ప్రాంతంలో గ్రామసభ అధికారాలు,కేంద్ర అటవీ పర్యావరణ చట్టాన్ని సవరించి షెడ్యూల్‌ ప్రాంతంలో విస్తృతమైన అధికారాలు ఉన్న పీసా చట్టం అధికారాలు, 2006 వామపక్షాలు ఒత్తిడితో తెచ్చిన ఆటవీ హక్కుల చట్ట అధికారాలు ఇటీవలి కేంద్ర బిజెపి ప్రభుత్వం తొలగించింది.ఆ అంశా లనే ఇప్పుడు అయ్యన్న పాత్రుడు మాట్లాడారు. కేంద్ర బిజెపి, రాష్ట్ర తెలుగుదేశం కూటమి ప్రభుత్వం షెడ్యూల్‌ ప్రాంతంలో ఆదివాసీలకు రక్షణగా ఉన్న చట్టాలను తొలగించేందుకు చేస్తున్న కుట్రలను ఆదివాసీలు తిప్పి కొట్టాల్సిన సమయం ఆసన్నమైంది.
అరకు ఎన్నికల సభలో చంద్రబాబు నాయుడు జీవో నంబర్‌ 3చట్టబద్ధతకు హామీనిచ్చి ఏడు నెలలు గడిచినా అతీగతీ లేదు.ఎన్నికల హామీ ప్రకారం ఏజెన్సీ షెడ్యూల్‌ ఏరియాలో100శాతం ఉద్యోగ, ఉపాధ్యాయ నియామక సాధనకు,ఏజెన్సీ స్పెషల్‌ డిఎస్‌సి నోటిఫికేషన్‌ విడుదలకు పోరాటం చేస్తున్న ఆదివాసీల సమస్యలను పరిష్కరించనే లేదు.పైగా ఆదివాసీ భూములకు రక్షణ కవచంగా ఉన్న 1/70 చట్టాన్ని సవరించేందుకు రాష్ట్ర ప్రభు త్వం ప్రయత్నిస్తోంది. ఆదివాసీ భూములను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆదివాసీలతో పాటు అందరం ఐక్యంగా పోరాటానికి సిద్ధం కావాల్సి వుంది.
స్పీకర్‌ అయ్యన్న వ్యాఖ్యాలపై నిరసన గళం..
ఏజెన్సీలో అభివృద్ధి జరగాలంటే 1/70 చట్టాన్ని సవరించాలని శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ప్రకటించడాన్ని రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో నిరసన సెగలు రేకెత్తించాయి.ఒక రాజ్యాంగ బద్దమైన పదవులో ఉండి గిరిజనులకు రాజ్యాం గం కల్పించిన రక్షణ చట్టాలను సవరించడం అనడంపై గిరిజనవర్గాలు భగ్గుమంటున్నాయి. అల్లూరి,పార్వతీపురం మన్యం జిల్లా ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిరసనలు వెల్లువెత్తున్నాయి.
పార్వతీపురం: బెలగం కూడలి వద్ద రాస్తారోకో నిర్వహించారు.ఈ కార్యక్రమా నికి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.కృష్ణ మూర్తి సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భం గా ఆదివాసి గిరిజన సంఘం జిల్లా నాయకులు పాలమిట్ట రాము మాట్లాడుతూ ఆదివాసీ భూము లకు రక్షణ కల్పించే ఈ చట్టాన్ని పకడ్బం దీగా అమలు చేయాలని కోరారు. జనవరి 27వ తేదీన విశాఖ పట్నంలో జాతీయ టూరిజం ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ సందర్భంగా జరిగిన సభలో స్పీకర్‌ చేసిన వ్యాఖ్యలు ఆదివాసీల్లో తీవ్ర ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయని తెలిపారు. అనంతరం ఎం.కృష్ణమూర్తి మాట్లాడుతూ అల్లూరి సీతారామ రాజు,ఏలూరు,పార్వతీపురం మన్యం జిల్లాల్లోని ఏజెన్సీ రాజ్యాంగంలో 5వ షెడ్యూలు కిందకు వస్తుందని తెలిపారు.దీన్ని ధిక్కరించే అధికారం ప్రభుత్వానికి కూడా లేదని పేర్కొన్నారు. ఇప్పటికే టూరిజం అభివృద్ధి పేరుతో పలు ఉల్లంఘనలు జరుగుతున్నాయని,వీటిని వెంటనే అరికట్టాలని కోరారు. బినామీల పేరుతో గిరిజన భూముల్లో లాడ్జీలు పెట్టి గిరిజనులకు అన్యాయం చేస్తున్నా రని విమర్శించారు.ఇప్పుడు 1/70ని సవరిస్తే గిరిజనులకు భూమి దక్కకుండా పోతుందని, ఏజెన్సీలో లభించే సహజ వనరులను బడా కార్పొరేట్లకు కట్టబెట్టడానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎప్పటి నుండో పలు పథకాలు వేస్తోందని వివరించారు. అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు దీన్ని మరింత బలపరుస్తున్నాయని, 1/70 చట్టం 1970లో పెద్దఎత్తున జరిగిన ఆదివాసీ పోరాటాల ద్వారా సంపాదించుకున్నారని తెలిపారు. ఈ చట్టం మూలంగానే గిరిజనులకు ఎంతోకొంత భూమిపై అధికారం వచ్చిందని, 2006-07లో కేంద్రంలో ఉన్న యుపిఏ ప్రభు త్వంపై వామపక్ష పార్టీలు ఒత్తిడి తెచ్చి అటవీ సంరక్షణ చట్టాన్ని తీసుకువచ్చాయని వివరిం చారు. భూమిపై గిరిజనులకు హక్కులను ఈ చట్టం మరింత బలోపేతం చేసిందని, మోడీ ప్రభుత్వం ఈ నిబంధనలను సడలించి గిరిజనుల నుండి భూములను బలవంతంగా లాక్కోడానికి ప్రయత్నిస్తోందని తెలిపారు. పంప్డ్‌ స్టోరేజీ హైడల్‌ ప్రాజెక్టుల పేరుతో ఇప్పటికే వేలాది ఎకరాలను ఈ ప్రాంతంలో ఆదానీ పరం చేస్తున్నారు.
1/70 చట్టం జోలికొస్తే ఖబడ్దార్‌!
పాడేరు: ఏజెన్సీలో గిరిజన చట్టాల జోలికొస్తే తీవ్ర పరిణామాలు తప్పదని సిపిఎం అల్లూరి జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స మండిపడ్డారు.1/ 70 చట్టం అమలులో సడలింపులు ఇవ్వాలని అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిరచారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. విశాఖ పట్నంలో నిర్వహించిన ప్రాంతీయ పెట్టుబడి దారుల సదస్సులో అసెంబ్లీ స్పీకర్‌అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలను సిపిఎం అల్లూరి జిల్లా కమిటీ తరపున తీవ్రంగా ఖండిరచించారు.రిజన ప్రాంతంలో 1/70చట్టం సవరణ ద్వారానే ఏజెన్సీ ప్రాంతాల్లో పెట్టుబడులు వస్తాయని స్పీకర్‌ వ్యాఖ్యలు చేయడం సరికాద న్నారు. రాజ్యాంగబద్ధమైన ఉన్నత పదవిలో ఉండి, గిరిజనులకు హానికలింగేలా స్పీకర్‌ స్థాయిలో వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడమేనన్నారు. స్పీకర్‌ వ్యాఖ్యలు ప్రభుత్వ వైఖరిగానే ఆదివాసీ సమాజం భావిస్తున్న నేపథ్యంలో దీనిపై తక్షణమే స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. ఏజెన్సీ అభివృద్ధికి పర్యాటక రంగం ద్వారానే ్షధ్యమనే తప్పుడు అభిప్రాయంలో కూటమి పాలకులు ఉన్నారని మండిపడ్డారు. ఏజెన్సీలోని సహజ వనరులు, సంపదను కార్పొరేట్‌ కంపెనీలో అప్పగించే కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతోందని, దీన్ని సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. 1/ 70 అమలులో నిర్లక్ష్యం వల్లే ఇప్పటికే వందలాది ఎకరాలను టూరిజం పేరిట ఆక్రమించారని, ఇపుడు చట్టాన్ని సడలిస్తే మన్యం మొత్తంగా ఆదివాసీలకు దూరమై కార్పొరేట్ల పరమౌతుందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇది పూర్తిగా రాజ్యాంగ హక్కులను, ఆదివాసీచట్టాలను ధిక్కరించడమే అవుతుందన్నారు.ఏజెన్సీలో యువతకు ఉపాధి అవకాశాలు, చిన్నతరహా పరిశ్రమలను ఐటిడిఎ ద్వారా ఏర్పాటు చేయాలని కోరారు.మన్యంలో బాక్సైట్‌ తవ్వకాలకు అడ్డుగా ఉందని 1/70చట్టానికి సవరణలు చేయాలని నాటి టిడిపి ప్రభుత్వం గిరిజన సలహా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అప్పట్లో ఉన్న ఒకేఒక సిపిఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య తీవ్రంగా వ్యతిరేకించడంతో అడ్డుకట్ట పడిరదని గుర్తు చేశారు. మన్యవాసుల మనుగడకు నష్టం కలిగించే ఇటువంటి కుట్ర పూరిత విధానాలకు ప్రభుత్వాలు స్వసి చెప్పాలని హితవు పలికారు.పర్యాటకాభివృద్ధి ముసుగులో 1/70 చట్టం సవరణ తగదు.
అరకులోయ: ఆదివాసి ప్రాంతంలో టూరిజం అభివృద్ధి చెందాలంటే హోటళ్ళు,రెస్టారెంట్లు, పార్కులు నిర్మాణం కోసం 1/70 చట్టానికి సడలింపులపై రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలను ఆదివాసీ గిరిజన సంఘం అల్లూరి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్‌ ధర్మన్న పడాల్‌ పొద్దు బాలదేవ్‌ తీవ్రంగా ఖండిర చారు. అయ్యన్న ప్రకటన ఆదివాసి హక్కులు, చట్టాలకు తీవ్రమైన విఘాతం కలిగిం చేలా ఉం దని, ఆదివాసులకు ద్రోహం చేసే ఇటు వంటి వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
అయ్యన్న వ్యాఖ్యలపె ్కఆదివాసీల ఆందోళన
హక్కుంపేట :టూరిజం అభివృద్ధి పేరుతో 1/70 చట్టం సవరణ చేయాలని సాక్షాత్తు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ప్రకటించడం ఆదివా సుల హక్కులు చట్టాలకు తీవ్ర విఘాతం కలిగిం చడమే కాకుండా మన్యవాసులకు ద్రోహం చేయడమేనని ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్‌ మండిపడ్డారు.. ఆదివాసీ అభివృద్ధి అంటే హోటళ్లు,రిసార్ట్స్‌ నిర్మాణం కాదని, కాపీ, చింతపండు, అడ్డాకులు వంటి గిరిజన అటవీ వాణిజ్య ఉత్పత్తులకు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, జిఒ3 ప్రయోజ నాలను పునరుద్ధరించి, శతశాతం గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. స్పీకర్‌ అయ్యన్న వ్యాఖ్యలను నిరసిస్తూ ఆదివాసీ గిరిజన సంఘం అల్లూరి జిల్లా కమిటీ ఆధ్వ ర్యంలో హక్కుంపేట,అరకులలోని శరభగుడలో నిరసన చేపట్టారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్‌ మండల నాయకులు కిల్లో జగన్నాధం మాట్లాడుతూ, ఆదివాసులకు రక్షణ కవచంగా ఉన్న 1/70 చట్టం సవరణ చేస్తే షెడ్యూల్‌ ప్రాంతంలోని అడవీసంపద, గనులు, ఖనిజాలు, ప్రకృతి అందాలన్నీ బడా పెట్టుబడి దారులు కార్పొరేట్‌ కంపెనీల పరమౌతాయని, ఆదివాసుల జీవన విధానం, మనుగడ ప్రశ్నార్థర మౌతుందని ఆవేదన వెలిబుచ్చారు ఆదివాసీల హక్కుల పరిరక్షణలో గుండెకాయలాంటి 1/70 చట్టంపై అయ్యన్న చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
ఆదివాసీలకు ఉపాధి కల్పించే టూరిజం కావాలి
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో జనవరి 31 నుండి ఫిబ్రవరి 2 వరకు టూరిజం ప్రమోట్‌ చేసే భాగంగా దేశ, విదేశీ యాత్రికులను ఆకట్టు కునేందుకు టూరిజంశాఖ ఆధ్వర్యంలో చలి ఉత్సా వాలు నిర్వహిస్తున్నది. ఇందుకోసం కోట్ల రూపా యల ఖర్చుకు సిద్ధం అవుతున్నది.ఆదివా సులకు కావాల్సింది చలి ఉత్సవాలు కాదు.జీవో నెం.3కు చట్టబద్ధత కల్పిస్తూ ఏజెన్సీ స్పెషల్‌ డిఎస్‌సి నోటిఫ ికేషన్‌ విడుదల చేసి అరకు చలి ఉత్సవాలు నిర్వహించాలి. చలి ఉత్సవాల పేరుతో టూరిస్టు లకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే కన్నా చలి కాలంలో పాడేరు ఏజెన్సీలో సున్నా డిగ్రీల చలికి వణుకుతున్న 50 వేల మంది ఆదివాసీ హాస్టల్‌ విద్యార్థినీ విద్యార్థులకు చలి దుప్పట్లు పంపిణీ చేయాలి. ఆదివాసీలకు ఉపాధి కల్పించేలా టూరిజాన్ని అభివృద్ధి చెయ్యాల్సింది పోయి వారి సంస్కృతిని నాశనం చేసే విధంగా టూరిజాన్ని వృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తోంది ప్రభుత్వం. బినామీ పేర్లతో పెద్దపెద్ద లాడ్జీలు, రిసార్ట్స్‌ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసి వందలాది ఎకరాల ఆదివాసీల భూములను ధారాదత్తం చేస్తూ 1/70చట్టానికి తూట్లు పొడుస్తున్నది. చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నా రోజురోజుకు అక్రమ కట్టడాలు పెరుగుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడంలేదు. సోమవారం నాడు విశాఖలో జరిగిన టూరిజం ఇన్వెస్టర్స్‌ సదస్సులో పెట్టుబడు లను ఆకర్షించేందుకు 1/70 చట్టాన్ని సవరించా లని సాక్షాత్తు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు ప్రతిపాదించడం దారుణం.ఈ విషయ మై అధికారులు ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని కూడా చెప్పారు. అంటే 1/70ని మార్చి వేయాలన్నదే వారి నిశ్చితాభిప్రాయంలా వుంది. గిరిజనుల మనుగడకు ప్రమాదకరమైన ఈ ప్రయ త్నాలను గట్టిగా వ్యతిరేకించాలి.టూరిజంలో వచ్చే ఆదాయంలో 25 శాతం నిధులను స్థానిక ఆది వాసీ అభివృద్ధికి ఖర్చు పెట్టాలనే నిబంధన ఉంది. అయినప్పటికీ బేఖాతరు చేస్తూ చలి ఉత్సవాల కోసం రూ.కోట్లు ఖర్చు పెట్టడంపై ఆదివాసీ సమాజం తీవ్ర ఆందోళ చెందుతున్నది. ఏజన్సీ ప్రాంతంలో రోడ్లు, వంతెనలు లేనందున గర్భిణీలు,రోగులను హాస్పిటల్‌కు తరలించేందుకు అంబులెన్సులు రావడంలేదు.డోలీ మోతలతో మార్గ మధ్యలోనే మరణిస్తున్నారు. మరోవైపు సరైన పౌష్టికాహారం లేక రక్తహీనత, సికిల్‌ సెల్‌ ఎనీమియా,టైఫాయిడ్‌,మలేరియా తదితర వ్యాధు లతో పదుల సంఖ్యలో మరణిస్తున్నారు. వారి కోసం సరైన సదుపాయాలు కల్పించకపోగా ఆదివాసుల ప్రకృతి అందాలు చూపించి కోట్ల రూపాయల ఆదాయాలు పోగేసుకుంటూ దేశ, విదేశీ టూరిస్టులకు కోట్లు ఖర్చు పెట్టాలన్న ప్రభుత్వ ఆలోచనతో ఆదివాసీ సమాజం తీవ్ర ఆందోళ చెందుతున్నది. ఆదివాసీ యువతకు వంద శాతం ఉద్యోగావకాశాలు కల్పించే జీవో నెం 3 రద్దవడంతో గంజాయి సాగు మాయలో పడి జైలు పాలౌతున్నారు. ఏజన్సీలో ఉపాధి అవకాశాలు లేక మైదాన ప్రాంతాలైన విశాఖ, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్‌, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు వెళ్లి ఇటుక బట్టీల్లో, చేపలు, రొయ్యల చెరువుల్లో పనికి కుదిరి వంద లాది మంది మోసపోతున్నారు.ఆదివాసీల కళలు, సంస్కృతి రక్షణకు ఉత్సవాల నిర్వహణ పట్ల ప్రభుత్వం ఏమాత్రం దృష్టి సారించడంలేదు.పైగా వారి సంస్కృతి నాశనమయ్యే విష సంస్కృతిని ప్రమోట్‌ చెయ్యడంతో భవిష్యత్‌లో ఆదివాసీల హక్కులకు, వారి అస్తిత్వానికి తీవ్ర ప్రమాదం ఏర్పడుతుంది. ఆదివాసీ సమాజం, ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు కాపాడ్డానికి పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది.పాడేరు ఏజెన్సీలో ప్రముఖ పర్యాటక కేంద్రాలైన బొర్రా, ట్రైబల్‌ మ్యూజియం, పద్మపురం గార్డెన్‌, చాపరా యి, కొత్తపల్లి జలపాతం నుండి ఏడాదికి సుమారుగా రూ.20కోట్ల వరకు ఆదాయం వస్తున్నది. టూరిజంలో వస్తున్న ఆదాయంలో 25 శాతం నిధులు స్థానిక ఆదివాసుల అభివృద్ధికి, విద్యా వైద్యం మౌలిక వసతులపై ఖర్చు పెట్టడం లేదు. మరోవైపు టూరిస్టులకు కోట్లు ఖర్చు చెయ్యడం ఆదివాసులకు తీవ్ర అన్యాయం చెయ్యడమే అవుతుంది. ఆదివాసీల సంస్కృతి, రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, చట్టాల పరిరక్ష ణకు,టూరిజంలో వస్తున్న ఆదాయంలో 25 శాతం స్థానిక ఆదివాసీల అభివృద్ధికి నిధులు కేటాయించడం కోసం,జీవో నెం.3చట్టబద్ధత కోసం,ఏజెన్సీ స్పెషల్‌ డిఎస్‌సి నోటిఫికేషన్‌ సాధించుకునేందుకోసం ఆదివాసీలు ముందుకు రావాలి.- కిలో సురేంద్ర

వలస కూలీల అగచాట్లు

ఈ సంవత్సరం వర్షాలు సకాలంలో కురవడంతో రాష్ట్రంలో ప్రాంతాలను బట్టి, వాతావరణాన్ని బట్టి సకాలంలో వ్యవసాయ సీజన్‌ ప్రారంభమైంది. ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, కర్నూలు, ప్రకాశం ప్రాంతాలలో జులై, ఆగష్టు మాసాలలో, దక్షిణ ప్రాంతాలైన నెల్లూరు, చిత్తూరు, కడపలలో లేట్‌ ఖరీఫ్‌ అక్టోబర్‌, నవంబర్‌ నెలలో ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ ప్రాంతాలలో ముమ్మరంగా వ్యవసాయ పనులు జరుగుతున్నాయి. ప్రధానమైన పంట వరి. అలాగే మెట్ట ప్రాంతాలలో వివిధ రకాలైన పంటలు కూడా సాగవుతున్నాయి.
గ్రామాల్లో వరి నాట్లు ముమ్మరంగా సాగు తున్నా స్ధానిక వ్యవసాయ కూలీలకు మాత్రం పనులు దొరకడం లేదు.సంవత్సరం మొత్తం మీద 30 రోజుల కూడాకూలీపనులు వుండటం లేదు.కారణం ముఖ్యం గా వ్యవసాయంలో యంత్రాలు రావడం.పంటల సాగులో మార్పులు రావడం (ఉదా:డ్రమ్‌ సీడిరగ్‌ చల్లటం లాంటి పనులు).ప్రస్తుతం ‘వలస కూలీలు’ మరో ముఖ్య కారణం.బయట రాష్ట్రాల నుండి (బెం గాల్‌,బీహార్‌) కూలీలు రావడంతో స్ధానిక కూలీలకు పనులు దొరకడం లేదు. కూలీలు గ్రామాల్లో పనులు లేకపోవడంతో పట్టణ ప్రాంతాలకు వ్యవసా యేతర పనులకు వెళుతున్నారు.ప్రధానంగా ఇటుక బట్టీ పను లు,భవననిర్మాణపనులు,హోటళ్ళలో క్లీనింగ్‌ పనుల కు,అలాగే పట్టణాల్లో ఇళ్ళలో పాచి పనులకు (మహి ళలు) వెళుతున్నారు. ఒక వేళ కూలి దొరికినా కనీస వేతనం వచ్చే పరిస్ధితి లేదు.నారువేతలు మొత్తం కాంట్రాక్ట్‌ పద్ధతిలో ఎక్కువ శ్రమను ధారపోయాల్సిన పరిస్ధితి వస్తున్నది.ఉదయం 6.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు ఒళ్ళు హూనం అయ్యేలా పనిచేస్తే కేవలం రూ.500, రూ.600 వచ్చే పరిస్ధితి.ఇది ఊళ్ళో కూలీల పరిస్ధితి. వలస కూలీల పరిస్ధితి ఎక్కడో వేల కిలోమీటర్ల దూరం నుండి ప్రధానంగా బీహార్‌,బెంగాల్‌ ప్రాంతాల నుండి పేదలు పొట్టచేత పట్టుకొని మహిళలను,పసిబిడ్డలను తీసుకొని ఇక్కడి గ్రామాలకు వస్తున్నారు. మధ్యవర్తు లు,డీలర్లు చూపిన పశువుల కొట్టాలు,పాడుబడిన ఇళ్లు,బస్‌ షెల్టర్లు, మొండి గోడల మధ్య ప్లాస్టిక్‌ కవర్లు కప్పుకొని మురికి కూపాలలో, పురుగు, పుట్ర లెక్క చేయకుండా బిక్కు బిక్కుమంటూ దుర్భరంగా జీవిస్తూ కాయకష్టం చేస్తున్నారు.వీళ్ళు కూడా కాంట్రాక్టు పద్ధతులలోనే నాట్లు వేస్తున్నారు.ఒకఎకరా నారు పెరికి నారు మోసుకొని నాట్లు వేస్తే మధ్యవర్తి రైతు దగ్గర రూ. 4500 నుండి రూ.4600 తీసుకుంటారు. డిమాండ్‌ ఎక్కువైతే రూ.5000 వరకు తీసుకొని వీరికి మాత్రం కేవలంరూ.3200,రూ.3500 మాత్రమే ఇస్తున్నారు. మిగిలిన డబ్బులు వసతుల పేరు మీద(గ్యాస్‌, బియ్యం, గోధుమ పిండి,కూరగాయలు,ఆటో ట్రాన్స్‌ పోర్టు) మధ్యవర్తులు,డీలర్లు కాజేస్తున్నారు.ఒక్క నెల్లూరు జిల్లా లోనే ఈ లేట్‌ ఖరీఫ్‌లో 9లక్షల ఎకరాల వరి సాగు జరుగుతుంది.స్ధానిక కూలీలు 2లక్షల ఎకరాల వరకు నాట్లు వేస్తున్నారు. మిగిలిన పొలమంతాకూడా రైతాం గం బెంగాల్‌ కూలీలచేతనే నాట్లు వేయిస్తున్నారు. వీళ్ళ చేత నాట్లు వేయించుకుంటే రైతుకు ఎటువంటి – (పుల్లయ్య మంగళ/ఆకారపు మల్లేశం)

గొంతెండుతున్న …మన్యం

వేల కోట్లు అందుబాటులో ఉంటున్నా వేలాది మంది సిబ్బంది ఉన్నా గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంటుంది. ఒకవైపు రహదారి సౌకర్యాలు లేక అనునిత్యం డోలీ కష్టాలు వెంటా డుతుండగా,మరోవైపు స్వచ్ఛమైన తాగునీటికి కూడా గిరిజనులు నోచుకోలేకపోతున్నారు.నీటికోసం కేం ద్రం నుంచి,రాష్ట్రంనుంచి భారీగానిధులు కేటా యిం పులు జరుగుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పనులు మాత్రం జరగడం లేదు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి గిరిజన ప్రారతాల్లో అభివృద్ధికి పెద్ద మొత్తంలోనే ఏటా నిధుల కేటాయింపులు జరుగు తున్నాయి. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటిడిఏ)ల ద్వారా పనులకు నిధులు కేటాయిస్తున్నారు.విద్య, వైద్యం,ఆరోగ్యం,రోడ్లు,తాగునీరు,వ్యవసాయం వరటి అనేక రంగాలకు ఈ నిధులను కేటాయిస్తు న్నారు. ఇదే సమయంలో కేంద్రం నుంచి కూడా పలు రంగా లకు నిధులు వస్తున్నాయి.ఇందులోనే తాగునీటి అవసరాలకు కూడా నిధులు సమకూరుతున్నాయి. అయితే ఈనిధులను మాత్రం సక్రమంగా ఖర్చు చేయ లేకపోతుండడంతో అనేక మారుమూల గిరిజన గ్రామాల ప్రజలు ఇప్పటికే ఊట నీటికి, చెరువుల్లో నీటికి,వాగుల్లో ప్రవహించే నీటికే పరిమితమవుతు న్నారు.దీనివల్ల అనేక వ్యాధులు కూడా ప్రబలుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.తాజాగాఈ ఏడాది రాష్ట్రం లోని 9,934 గిరిజన ప్రారతాల్లో తాగునీటి కోసం 1,290కోట్లతో పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఈమొత్తం పనులను జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా చేయా లనిప్రతిపాదిరచారు.ఈ నిధులతో మొత్తం 12, 838 పనులను గుర్తిరచి పనులు ప్రారంభించారు. అయితే వాటిని పూర్తి చేయడంలో మాత్రం ఆశించిన ఫలి తాలు రావడం లేదు.ఇప్పటివరకు 5,718 పను లను మాత్రమే పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మరో 2,582 పనులు పలుస్థాయిలోఉండగా, 4,5 38 పనులను ఇంకాప్రారంభించడమే జరగలేదు. ఇక మొత్తం నిధుల్లో కేవలం 218కోట్ల రూపాయ లను మాత్రమే ఖర్చు చేయగలిగారు.
నీటివనరుల గుర్తింపులో అలసత్వం
గిరిజన ప్రాంతాల్లో తాగునీటిని అందించేందుకు ముందుగా నీటి వనరులను గుర్తించాల్సి ఉంటుంది. అయితే ఈప్రక్రియలో అలసత్వం, జాప్యం చోటుచేసు కుంటున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఉన్న వనరుల నుంచి నీటిని స్వచ్ఛంగా మార్చడం కూడా సక్రమంగా సాగడం లేదను భావన వ్యక్తమవుతోంది. పనులపై వారానికి ఒకసారి సమీక్ష చేయాలని గతంలోనే నిర్ణ యించినప్పటికీ అది కూడా అమలు కావడం లేదని తెలుస్తోరది.
అల్లూరి జిల్లా పాడేరు ప్రాంతంలో..
మన్యంలోని అధిక సంఖ్యలో గిరిజన గ్రామాల్లోని జనం తాగునీటికి అల్లాడిపోతున్నారు. ఎండాకాలం రాకుండానే నీటి సమస్య పెరుగుతుంది.కానీ గిరిజ నుల దాహం కేకలు పాలకులకు వినిపించని పరిస్థితి నెలకొంది.దీంతో గిరి పల్లెల్లోని జనానికి నీటి కష్టాలు కొనసాగుతున్నాయి. పాడేరు ఏజెన్సీ వ్యాప్తంగా 244 గ్రామ పంచాయతీల పరిధిలో 3,803గ్రామాల్లో లక్షా 55 వేల 756 గిరిజన కుటుంబాలున్నాయి. వాటిలో 2,025 గ్రామాల్లో పూర్తిగా,1,778 గ్రామాల్లో పాక్షిక తాగునీటి సదుపాయాలున్నాయని అధికారుల రికార్డులు చెబుతున్నాయి. అలాగే ఏజెన్సీలో ప్రస్తుతం అన్ని గ్రామాలకు ఏదో రకమైన తాగునీటి సదుపా యం ఉందనేది అధికారుల వాదన. కాగా ఇప్పటికీ సగానికిపైగా పల్లెల్లో తాగునీటి కోసం గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారనేది జగమెరిగిన సత్యం. వేసవి నేపథ్యంలో తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ వంటివి కాగితాలకే పరిమిత మవ్వగా, నిధులు సక్రమంగా విడుదల కాని పరిస్థితు ల్లో జల్‌ జీవన్‌ మిషన్‌ వంటివి ఆచరణలోకి రాని దుస్థితి ఏర్పడిరది.దీంతో అన్ని విధాలా గిరిజనానికి తాగునీటి కష్టాలు తప్పడంలేదు.ఇవే కాకుండా సోలార్‌ ఆధారంగా పని చేసే నీటి పథకాల పరిస్థితి మరీదారు ణం.వాటికి చిన్నపాటి మరమ్మతులు వచ్చినా పట్టిం చుకున్న దాఖలాలు లేవు.దీంతో అనేక గ్రామాల్లో తాగునీటి పథకాలున్నా వాటి నిర్వహణపై పాలకులు శ్రద్ధచూపని కారణంగా నిరుపయోగంగా మారుతు న్నాయి. ఫలితంగా గిరిజనులు ఊటగెడ్డలపై ఆధారప డాల్సిన దుస్థితి ఏర్పడుతున్నది.
మన్యం వాసులకు ఊటగెడ్డ నీరే ఆధారం
ఏజెన్సీలోని గిరిజన పల్లెలకు పక్కాగా రక్షిత నీటిని అందించని కారణంగా అధిక సంఖ్యలోని గిరిజన పల్లెల్లో ఊటగెడ్డలే ప్రధాన తాగునీటి వనరులుగా ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికా రుల బాధ్యతా రాహిత్యం, పంచాయతీల్లో పాలన పడకేయడం వంటి కారణాలతో గిరిజనులకు గుక్కెడు నీరు దొరకని దుస్థితి కొనసాగుతున్నది. ముఖ్యంగా ఏజెన్సీలో మత్స్యగెడ్డను ఆనుకుని ఉన్న ముంచం గిపుట్టు, పెదబయలు, డుంబ్రిగుడ, జి.మాడుగుల మండలాల్లోని గిరిజన పల్లెల్లో స్థితి మరీ దారుణం. మత్స్యగెడ్డ తీరంలోని చెలమలు చేసుకుని నీటిని పట్టుకుంటున్నారు.ఇతర మండలాల్లో పంట పొలా లకు సమీపంలోని ఊటగెడ్డలను ఆశ్రయిస్తు న్నారు. పెదబయలు మండలం బొడ్డగొంది, లింగేటి, పన్నెడ, గుల్లెలు, హుకుంపేట మండలం తీగలవలస పంచాయతీ పంతెలచింత, ముంచంగిపుట్టు మండలం చీపురుగొంది, దొరగూడ, డెంగాగుడ, కర్లాపొదర్‌ గ్రామాల్లోని గిరిజనులు దూర ప్రాంతంలోని ఊట గడ్డల నుంచే నీటిని మోసుకువస్తున్నారు. ఇలా ఏజెన్సీ లో వందల సంఖ్యలో గిరి పల్లెల్లో దాహం కేకలు వేస్తున్నా పాలకులకు అవేవీ వినిపించకపోవడం గమనార్హం.
పార్వతీపురం మన్యం జిల్లాలో
ఇంటింటికీ కుళాయిలు వేసి..తాగునీటి కష్టాలు తీరు స్తామని ప్రభుత్వాలు గుప్పిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్ధితి భిన్నంగా ఉంది.పది రోజులుగా పార్వతీపురం మం డలంలోని 65గ్రామాలకు తాగునీరురాక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో శ్మశానాల్లో ఉన్నబోర్లు,ఊరి చివరనున్న పాడైన బావుల నీటితో గొంతు తడుపుకొంటున్నారు. మక్కువ మండ లండి.శిర్లాంలోని సువర్ణముఖి నది నుంచి పార్వతీపు రం నియోజకవర్గంలోని పలు గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతుంది.ఇక్కడ ఇన్‌ఫిల్టర్‌ బావుల్లో మోటార్లు పదిరోజులు క్రితం పాడువడంతో 65 గ్రామాలకు సరఫరా ఆగిపోయింది.నర్శిపురం, బొండ పిల్లి ఎమ్మార్‌నగరం,డోకిశీల,ములగ తదితర గ్రామాల ప్రజలు ఒకటి,రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న బోర్లు,బావులకు వెళ్లాల్సిన పరిస్థితి.-జి.ఎన్‌.వి.సతీష్‌

1 2 3 15