రాష్ట్ర బడ్జెట్‌202526

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ అమరావతి లోని అసెంబ్లీలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.3,22,359.33 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌ సామాజిక సంక్షేమ పథకాలు, విద్య, ఆర్థిక వ్యవస్థ, సాంకేతిక అండ్‌ నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించింది. ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బడ్జెట్‌ కేటాయింపులు చూస్తే ముందుగా పాఠశాల విద్య ఇంకా అభివృద్ధి కోసం రూ.31,806 కోట్లు కేటాయించింది.
2025-2026 సంవత్సరానికి విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు ఇంకా హైదరాబాద్‌లలో పారిశ్రామిక కారిడార్‌ల కోసం రూ.837కోట్లు, పరిశ్రమలు, లు సహా ఆహార ప్రాసెసింగ్‌ కోసం రూ.1,400 కోట్లు కేటాయించింది.అలాగే 26 సంవత్సరానికి రాష్ట్రంలో ఆర్థిక,సాంకేతిక పురోగతి కోసం రూ.55,730 కోట్లు కేటాయించింది.ప్రభుత్వ హమీలోని తల్లికి వందనం పథకం కోసం బడ్జెట్లో రూ 9,407 కోట్లను ప్రతిపా దించారు. అలాగే రూ.15వేలు చొప్పున తల్లుల ఖాతా ల్లో మే నెలలో నిధులు జమ చేస్తామని ప్రభుత్వం తేలిపింది. అన్నదాత సుఖీభవ పథకం అమలు కోసం రూ 6300కోట్లు ప్రతిపాదించారు. రైతు అనుబంధ రంగాలకు13,487కోట్లు కేటాయింపు చేసారు. అన్నదాత సుఖీభవ పథకం మూడు విడతలుగా, కేంద్రం అమలు చేస్తున్న పీఎంకిసాన్‌ కలిపి ఈ పథకం అమలు కానుంది.
పెన్షన్ల కోసం ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్లు రూ.27,518 కోట్లు కేటాయించారు. అదే విధంగా చేనేత, నాయీ బ్రాహ్మణుల ఉచిత విద్యుత్‌కు రూ.450 కోట్లు ప్రతిపాదించారు. బడ్జెట్‌ లో పోర్టులు, ఎయిర్‌పోర్టులకి రూ.605 కోట్లు కేటాయింపులు చేసారు. మత్స్యకార భరోసా కోసం రూ 450 కోట్లను ప్రతిపాదించారు. తొలిసారిగా తెలుగు భాషకు నిధులను కేటాయిస్తూ తెలుగు భాషాభివృద్ధికి రూ.10 కోట్లు కేటాయించారు. మద్యపానం, మాదక ద్రవ్యాల వినియోగంప్కె వ్యతిరేక ప్రచారం కోసం బడ్జెట్టులో ప్రత్యేక కేటాయింపులు అలాగే నవోదయం 2.0స్కీం కిందమద్యపాన, మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారం కోసం కూడా నిధుల కేటాయింపు చేశారు.ఇక పోలవరం ప్రాజెక్టు నిర్మా ణానికి6,705కోట్లను,సాగునీటి ప్రాజెక్టులకు 11,314కోట్లను కేటాయించారు. ప్రకృతి వ్యవసా యం ప్రోత్సహించడానికి రూ.61 కోట్లు, మార్కెటింగ్‌ శాఖకు రూ.315 కోట్లు, సహకార శాఖకు రూ.239 కోట్లు, వ్యవసాయం యాంత్రీకరణ కోసం రూ.219 కోట్లు,పంట రుణాలపై వడ్డీ రాయితీ కోసం రూ.250 కోట్లు, ఎరువుల నిర్వహణకు రూ.40 కోట్లు, ఆదరణ పథకం కోసం రూ.వెయ్యి కోట్లు, ఆర్టీజీఎస్‌ కోసం రూ.101 కోట్లు,దీపం 2.కోసం రూ.2,601 కోట్లు, జల్‌జీవన్‌ మిషన్‌కోసంరూ.2,800కోట్లు కేటాయిం చారు.
తల్లికి వందనం
ఆంధ్రప్రదేశ్‌లో గత తొమ్మిది నెలలుగా ఎదురు చూస్తున్న తల్లికి వందనం కార్యక్రమం ఈ ఏడాది ప్రభుత్వం అమలు చేయనుంది. బడ్జెట్‌ లో నిధులు కేటాయింపులు చేసింది. 9,407 కోట్ల రూపాయలను కేటయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకాన్ని అమలు చేయనున్నట్లు బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రకటించారు. తల్లికి వందనం అమలు చేస్తామని ఇదివరకే ప్రకటించినా బడ్జెట్‌ లో నిధులు కేటాయింపు ఎలా ఉంటుదన్న దానిపై ఆసక్తిగా అందరూ ఎదురు చూస్తున్నారు.
మే నెల నుంచి…
వచ్చే ఏడాది పాఠశాలలు ప్రారంభం కాగానే తల్లికి వందనం పథకాన్ని అమలు చేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడానికి తల్లికి వందనం పథకాన్ని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గత వైసీపీ ప్రభుత్వంలో అమ్మవొడి పథకం కింద తల్లి ఖాతాలోనే నిధులను జమ చేసేవారు. అయితే చంద్రబాబు నాయుడు తన ఎన్నికల ప్రచారంలో భాగంగా తల్లికి వందనం పేరిట ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. ఇంట్లో ఎంత మంది విద్యార్థులున్నా వారికి ఈ పథకం వస్తుందని కూడా చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పారు. గత ప్రభు త్వం మాత్రం అమ్మఒడి ఇంటికి ఒక్కరికే ఈ పథకాన్ని అందించింది.
అర్హతలివే…దీంతో పాఠశాలలు జూన్‌ నెల నుంచి ప్రారంభం కానున్నాయి.మేనెల నుంచి తల్లికి వందనం కింద నిధులు జమ చేయాలని నిర్ణయిం చారు. ఇందుకోసం ప్రతి వాళ్లు రేషన్‌ కార్డు లేదా ఆధార్‌ కార్డు ఉండాల్సి ఉంటుంది. చదువుకునే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేలరూపాయలు ఇస్తా మని చెప్పడంతో ఇప్పటికే దీనిపై అధికారులు కసర త్తులు ప్రారంభించారు. హాజరుశాతం కూడా 75 శాతం పైన ఉంటేనే గత ప్రభుత్వం అమ్మఒడి పథకం నిధులు విడుదల చేసేది. దానిని ఈ ప్రభుత్వం అలాగే కొనసాగించే వీలుంది. దీంతో పాటు దారిద్య్ర రేఖకు దిగువ ఉన్న వారికే ఈ పథకం వర్తింప చేయను న్నారు. తెలుపు రంగు రేషన్‌ కార్డు తప్పనిసరి. కుటుం బంలో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా ఈ పథకం వర్తించదని అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అయితే త్వరలోనే దీనికి సంబంధించి విధివిధానాలను ప్రభు త్వం ప్రకటించనుంది.-(జిఎన్‌వి సతీష్‌)

జనావాసాల్లో జంతువులు

అడవుల్లో ఉండాల్సిన వన్య మృగాలు కొంత కాలంగా జనావాసాల బాట పడుతున్నాయి. దీంతో జనపథాలుగొల్లుమంటున్నాయి.తెగించి ఎదురునిలిచినా, తెలియక ఎదురుపడినా బతుకుపై భరోసా లేనట్టే. దీంతో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగులు తీయాల్సిన స్థితి. చిత్తూరు జిల్లాల్లో ఏనుగు దాడిలో ముగ్గురు మరణిం చినా,తిరుమల కొండల్లో అభం శుభం తెలియని పసిపాప చిరుతకు బలైనా, వందలాది ఎకరాల్లో పంటపొలాలు ధ్వంసమైనా.. ఆ మూల నుండి ఈ మూల వరకు ప్రతిరోజూ రాష్ట్రంలో ఏదో ఒకప్రాంతంలో వన్యమృగాలు సంచరిస్తు న్నట్లు వార్తలు వస్తున్నా కారణం ఒక్కటే.. అది మృగాలకి, మనుషులకి మధ్య పెరుగుతున్న ఘర్షణ. అనివార్యంగా మారుతున్న మనుగడ పోరాటం. ఎక్కడో కాకులు దూరని కారడవుల్లో ప్రశాంతంగా తమ మానాన తాము బతికే పులులు, చిరుతలు, ఏనుగులు, ఎలుగుబంట్లు నుండి వివిధ రకాల వన్యమృగాలు జనారణ్యంలోకి ఎందుకు వస్తున్నాయి? మనకు సమస్యగా ఎందుకు మారుతు న్నాయి? ఈ సంఘర్షణకు పరిష్కారం లేదా? అసలీ దుస్థితికి కారణం ఏమిటి? దీనిపై ప్రత్యేక కథనం..
వన్య మృగాలు జనావాసాల్లోకి రావడమనేది ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిన సమస్యేమీకాదు. అటవీ ప్రాంతాలకి సమీపంలో ఉండే గ్రామాల ప్రజలకు వన్యమృగాలు తారసపడటం అనేది సహజమే. అయి తే, అది మృగాలకు మనుషులకు మధ్య ఘర్షణగా మారే సందర్భాలు మాత్రం అరుదు. పొరపాటున గ్రామాల్లోకి వన్యమృగాలు వచ్చినా, మనిషి తారస పడగానే అవి వెనక్కి తగ్గేవి. అనివార్యంగా జనావా సాలను దాటాల్సి వచ్చినా.. సాధ్యమైనంత మేరకు మనిషి కంటపడకుండా వెళ్లిపోతాయి. అడవులకు సమీపంలో నివసించే చెంచులను, గిరిజనులను అడిగితే ఇటువంటి సంఘటనలను కోకొల్లలు చెబుతారు. కొన్ని సంవత్సరాలుగా ఈ పరిస్థితిలో మార్పు వస్తోంది. కిలోమీటర్ల దూరం జనావాసాల్లోకి వన్యమృగాలు వచ్చేస్తున్నాయి. ఆ మేరకు మనుషులకు మృగాలకు మధ్య జరుగుతున్న ఘర్షణలూ పెరుగు తున్నాయి. జంతువుల దాడుల్లో మనుషులు, మను షుల దాడుల్లో జంతువులు మరణిస్తున్న సంఘటనలూ పెరుగుతున్నాయి. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్సు బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2021 నుండి 2025 సంవత్సరాల మధ్య కాలంలో వన్యమృగాల బారిన పడి రాష్ట్రంలో 139మంది మరణించారు. మృతులలో పురుషులే ఎక్కువ. ఏ జంతువుల బారిన పడి ఈ మరణాలు చోటుచేసు కున్నాయి అన్నది ఎన్‌సిఆర్‌బి అధికారికంగా ప్రకటిం చలేదు. అయితే, అటవీ, పోలీస్‌ అధికారులు చెబు తున్న సమాచారం ప్రకారం ఏనుగులు, ఎలుగుబంట్ల దాడుల కారణంగానే ఈమరణాలు చోటుచేసు కున్నాయి. ఇటీవల కాలంలో చర్చనీయాంశమైన చిరు తలు,పులుల దాడుల్లో మనుషులు మృతి చెందిన సంఘటనలు దాదాపుగా లేవనే చెప్పవచ్చు. ఇటీవల తిరుమలలో జరిగిన దురదృష్టకర సంఘటన దీనికి మినహాయింపు. రాష్ట్రంలో రెండు మూడు జిల్లాలు ఏనుగుల గుంపుల బారిన తరచూ పడుతున్నట్లు ఎన్‌సిఆర్‌బి నివేదికలను పరిశీలిస్తే అర్థమవుతోంది. సంవత్సరానికి సుమారుగా 30 మంది వన్యమృగాల బారిన పడి, ప్రాణాలు కోల్పోతున్నారు. 2018 సంవత్సరంలో 31 మంది, 2019లో 25 మంది, 2020లో 32మంది మరణించారు. అనధికారికం గా మరికొన్ని సంఘటనలూ చోటుచేసుకుని ఉండ వచ్చు. శ్రీకాకుళం జిల్లాలో ఏనుగులు, ఎలుగుబంట్ల దాడులు తరుచూ చోటుచేసుకుంటున్నాయి. నాలుగు ఏనుగుల మంద ఈప్రాంతంలో తిరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. మన్యం పార్వతీపురం జిల్లాలో కొద్ది రోజుల క్రితం ఆరు ఏనుగులు కనిపించాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాల్లో గడిచిన ఐదు సంవ త్సరాల కాలంలో ఏనుగుల దాడిలో ఆరుగురు రైతులు మరణించారు.వీటిని బంధించడానికి వచ్చిన ఒక ట్రాకర్‌ కూడా మృత్యువాత పడ్డారు. శ్రీకాకుళం జిల్లా లో ఐదు సంవత్సరాల కాలంలో పదిమంది రైతులు మరణించినట్లు సమాచారం. విజయనగరం జిల్లాలో గత ఏడాది పెద్ద పులుల సంచారం కలకలం రేపగా, ఈఏడాది శ్రీకాకుళం జిల్లాలో కూడా పెద్దపులి కనిపించినట్లు వార్తలు రావడం చర్చనీయాంశంగా మారాయి.కౌండిన్య వైల్డ్‌లైఫ్‌ శాంచురీ నుండి చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లోకి ఏనుగుల రాకపోకలు కొనసాగుతున్నాయి. తమిళనాడు, కర్నాటక నుండి కూడా ఈ ప్రాంతంలోకి ఏనుగులు వస్తున్నాయి. ఇలా వచ్చిన ఓఒంటరి ఏనుగు బారిన పడి,చిత్తూరు జిల్లా లో కొద్దిరోజుల క్రితం ముగ్గురు మరణించిన సంగతి తెలిసిందే.-(తిరుపతి రెడ్డి మద్దిగెడ్డ)

వృద్ధి రేటుతో ఒరిగేదెంత?

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని, గత వైసిపి ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి అప్పులమయం చేసిందని, వస్తున్న ఆదాయంలో ఎక్కువ భాగం అప్పులపై వడ్డీలకే చెల్లించాల్సి వస్తోందని అందు వల్ల ప్రజలకిచ్చిన సంక్షేమ పథకాల వాగ్దానాలు వెంటనే అమలు చేయలేక పోతున్నామని ప్రచారంలో పెట్టారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడమే కూటమి ప్రభుత్వ ప్రధాన కర్తవ్యం అని, ఆతరువాతే సంక్షేమ పథకాలు అమలు అని తెగేసి చెబుతున్నారు.ఈధోరణి కేంద్ర ప్రభుత్వం యొక్క నయా ఉదారవాద స్వభావాన్ని తెలియజేస్తున్నది.ఈ విధానాన్ని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలుకు పూనుకున్నది. ప్రభుత్వ ఖర్చు తగ్గించుకొని, ప్రభుత్వ ఆదాయం పెంచుకోవాలనేది నయా ఉదారవాద విధానం యొక్క ముఖ్యమైన లక్షణం. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఏదో ఒక వంక చూపి అమలు వాయిదా వేస్తున్నది. ఒకవేళ అమలుకు పూనుకున్నా అనేక షరతులు పెట్టి లబ్ధిదారుల సంఖ్యను చాల పరిమితం చేస్తారు. ఇప్పుడు సామాజిక పెన్షన్‌ పథకంలో అనర్హులు ఉన్నారనే ప్రచారం చేసి లబ్ధిదారులను కుదించ టానికి పూనుకున్న విషయం తెలిసిందే. పారిశ్రా మికవేత్తలకు, వ్యాపార, వాణిజ్యవేత్తలకు మాత్రం ఎన్నడూ లేని విధంగా రూ.వేల కోట్లు పన్ను రాయితీలు ఇస్తున్నది.భూములు, గనులు, సముద్ర తీరం, అటవీ ప్రాంతం తదితర వాటిని ఈశక్తు లకు అభివృద్ధి పేర ధారాదత్తం చేస్తున్నది. ఈ చర్యల వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయానికి తీవ్ర గండి పడుతున్నది. ఉదాహ రణకు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసే పరిశ్ర మలకు, ఇతర వాణిజ్య సంస్థలకు పదేళ్లు రాష్ట్ర జీఎస్టి మినహాయిస్తున్నారు. భూములు ఉచితంగా బదలాయిస్తున్నారు. విద్యుత్‌, నీటి సరఫరా రాయితీలతో పాటు ఉత్పత్తి ప్రోత్సాహకాల పేర ప్రతి కార్మికుడికి నెలకు రూ. 7500 ప్రావిడెంట్‌ ఫండ్‌ రాయితీ పేర (యజమాని చెల్లించాల్సిన వాటా) చెల్లింపు, ఆ పరిశ్రమకు అవసరమైన ప్రధాన రోడ్లు, రైల్‌ వంటి మౌలిక సదుపాయాల కల్పన రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేయడం వంటి అనేక రాయితీలు కల్పిస్తున్నారు. ఈ చర్యల వల్ల రాష్ట్ర వృద్ధి రేటు బాగా పెరిగి రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుతుందని, ఉద్యోగ అవకాశాలు పెరుగుతా యని ప్రభుత్వం అంటున్నది. తదారా రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదాయం పెరుగుతుందని, దీనిద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టొ చ్చని వాదిస్తున్నది. కానీ రాష్ట్ర విభజన తరువాత గడిచిన దశాబ్దంలో ఈ పరిణామాలు చోటు చేసుకోవడం లేదనేది వాస్తవం.రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఈ పదేళ్ళలో మూడు రెట్లు అయ్యింది. రాష్ట్ర స్థూల వృద్ధి రేటు సగటున 9శాతం కొనసాగింది. కాని రాష్ట్ర ఖజానాకు ఈ సంపద పెరుగుదల వల్ల పన్నుల ఆదాయంలో గణనీయమైన పెరుగు దల రావాలి కాని రాలేదు. ఉదాహరణకు రాష్ట్ర జిడిపి 2024-15లో రూ.5.24 లక్షలకోట్లు వుండగా 2023-24కి రూ.14.39లక్షల కోట్లకు పెరిగింది. దాదాపు మూడు రెట్లు రాష్ట్ర స్థూల ఆదాయం పెరిగింది. ఇదే మోతాదులో కనీసం రాష్ట్రానికి పన్నుల రూపంలో ఆదాయం పెరగాలి. ఇది జరగలేదు. 2014 నుండి 2024 కాలంలో రాష్ట్ర సొంత పన్నుల నుండి (రాష్ట్ర జీఎస్టీ, అమ్మ కపు పన్ను, ఎక్సైజ్‌, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ డ్యూటీ వంటివి) వచ్చిన ఆదాయం కేవలం రూ. 42,618 కోట్లు నుండి రూ.78,026 కోట్లకు మాత్రమే పెరిగింది. మొత్తం రాష్ట్ర సొంత పన్నుల నుండి, కేంద్ర పన్నుల నుండి రాష్ట్రానికి వాటా రూపంలో వస్తున్న ఆదాయం మొత్తం కలిపి చూస్తే రాష్ట్ర జిడిపిలో 9శాతం లోపే పరిమితం అవు తున్నది. రాష్ట్ర బడ్జెట్‌ వ్యయం కూడా రాష్ట్ర జిడిపి పెరుగుదలలో పడిపోతున్నది. 2018-19లో రాష్ట్ర బడ్జెట్‌ వ్యయం రాష్ట్ర జిడిపిలో 17.2 శాతం ఉంటే 2022-23 నాటికి 15.96 శాతానికి పడిపోయింది. అలాగే ముఖ్యమైన మూలధన వ్యయం కూడా రాష్ట్ర జిడిపిలో 2018-19లో 2.2శాతం ఉంటే 20 22-23కి 0.13శాతానికి తగ్గిపోయింది. మరొక వైపు కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా మోడీ పరిపాలనా కాలంలో బాగా తగ్గి పోతున్నది. కేంద్రం ఇచ్చే గ్రాంట్లలో కూడా కోత పెడుతున్నది. కేంద్ర ప్రాయోజిత పథకాల్లో రాష్ట్రా ల వాటా ఏకపక్షంగా పెంచేస్త్తున్నది. రాష్ట్ర విభ జన హామీలు అనేకం అమలు చేయటం లేదు. ఈ నిరంకుశ చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపటం లేదు. రాష్ట్రాలకు అప్పులు సేకరించు కొనే అవకాశాలపై కూడా కేంద్రం ఆంక్షలు విధి స్తూ కోతలు పెడుతున్నది. దీనిపై కూడా స్పందిం చడంలేదు. గత వైసిపి ప్రభుత్వం సైతం ఇదే వైఖరి అవలంభించింది. అలాగే షరతులతో అప్పులు తీసుకొని ప్రజలపై భారాలు వేయటంతో పాటు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు, ప్రజలకు నష్టకర మైన ప్రమాదకర విధానాల అమలుకు పూను కున్నది.ఈ ప్రభుత్వం కూడా ఇదే వైఖరిని అమలు చేస్తూ రాష్ట్ర హక్కులను కేంద్రానికి తాకట్టు పెడు తూ అప్పుల కోసం కేంద్రం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నది. వైసిపి అమలు చేసిన కేంద్ర ప్రభుత్వ ఆదేశిత సంస్కరణలు చాలా వేగంగా అమలుకు పూనుకుంటున్నది. ఇటీవల నీతి ఆయోగ్‌ దేశం లోని అతి పెద్ద 18 రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై ఆర్థిక ఆరోగ్య సూచీ-2025 పేర ఒక నివేదికను విడుదల చేసింది.గత పదేళ్ళలో 2022-23 నాటికి ఉన్న ఆర్థిక పరిస్థితులు ఆధారంగా విడు దల చేసిన ఆర్థిక ఆరోగ్య సూచీలో ఆంధ్రప్రదేశ్‌ అట్టడుగున 17వ స్థానంలో ఉందనీ నివేదిక తెలి పింది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని గట్టెక్కించా లనే పేర ప్రజలపై భారాలకు వొడిగడుతున్నది. సుమా రు రూ.40వేల కోట్లపైబడి ప్రజల సంక్షేమంపై నిధులు ఖర్చు పెట్టకుండా దెబ్బ తీసింది. లక్షల మంది వాలంటీర్లను తొలగిం చింది. ట్రూ అప్‌ చార్జీల పేర రూ.18వేల కోట్లు విద్యుత్‌ చార్జీల భారం మోపారు.స్మార్ట్‌ విద్యుత్‌ మీటర్లు బిగింపు కొనసాగిస్తున్నారు.గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఆస్తి విలువ ఆధారిత ఆస్తి పన్ను విధానాన్ని సమీక్షించి ప్రజలకు మేలు చేస్తామని ఎన్నికల్లో చెప్పి ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదు. ఇప్పుడు రాష్ట్ర జీఎస్టీపై అదనంగా ఒక శాతం సర్‌ చార్జీ విధించాలని కేంద్రాన్ని కోరుతున్నది. ఇలాంటి పన్నుల భారాలు రాబోయే కాలంలో అనేక రూపాల్లో వస్తాయి. చెత్తపై యూజర్‌ చార్జీలు రద్దు చేసినా పీ4 (ప్రభు త్వ, ప్రైవేట్‌, పీపుల్‌ పార్టిసిపేషన్‌) పేర ప్రభుత్వ పౌర సేవలు, మౌలిక సదుపాయాలు,విద్య, వైద్యం వంటి సామా జిక సేవలు ప్రైవేట్‌ శక్తులకు బదిలీ చేయ టానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వంఈ బాధ్యతల నుండి పూర్తిగా వైదొలగబోతున్నది. అలాగే ప్రభు త్వం తప్పనిసరిగా రాష్ట్ర బడ్జెట్‌లో వేతనాలు, రిటైర్‌ అయిన వారికి పెన్షన్‌, వడ్డీ చెల్లింపులు, పరిపాలనా ఖర్చులు (కమిటెడ్‌ ఎక్స్‌ పెండిచర్‌)కు తగు వ్యయం చేయాల్సిఉం టుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో 64.6శాతం నిధులు వీటికి ఖర్చు పెట్టాల్సి వస్తు న్నది. ప్రస్తుత కూటమి ప్రభు త్వం వేతనాలు, పెన్షన్ల మీద పెట్టే ఖర్చు తగ్గించు కునే విధానాన్ని అమలు చేస్తున్నది.గత దశాబ్దంలో వేతనాలు, పెన్షన్లపై ఖర్చు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో 39.30 శాతం నుండి 37.90శాతానికి తగ్గి పోయింది.ఇప్పుడు ప్రభు త్వం ప్రజల సంక్షేమంపై వ్యయాన్ని కుదిస్తూ పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం, సంపన్నుల అవసరాల కోసం నిధులు ఖర్చు పెడుతున్నది. అదేమంటే 2047 నాటికి రాష్ట్ర జిడిపిని 2.4 ట్రిలియన్‌ డాలర్లలకు పెంచా లని తద్వారా రాష్ట్ర ప్రజలు అత్యంత సంపన్నల వుతారని ప్రచారం చేస్తున్నది. ప్రజలకు తక్షణ అవసరమైన మౌలిక సదుపాయాల కల్ప నకు ప్రాధాన్యత కాకుండా విమానాశ్రయాలు, భారీ స్టేడియంలు,బుల్లెట్‌ ట్రైన్ల వంటి వాటికి ప్రాధా న్యత ఇస్తున్నారు. తీసుకొ స్తున్న అప్పులు కూడా వీటి కోసం ఖర్చు చేస్తు న్నారు. చివరికి విద్య, వైద్యం వంటి సామాజిక సదుపాయాలకు కూడా ఖర్చు తగ్గించేస్తున్నారు. వ్యవసాయంపై కూడా ఖర్చు పెంచటానికి నిరాకరి స్తున్నారు.రాష్ట్ర ప్రభు త్వం అనుసరిస్తున్న ఈవిధా నాలవల్ల ప్రజల ఆదా యాలు పడిపోతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ శ్రామికుల ఆదాయాలు బాగా తగ్గిపోతున్నాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడం వల్ల ప్రజల కొనుగోలు శక్తి దారు ణంగా దెబ్బతిన్నది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత చిక్కుల్లో పడుతున్నది. ప్రభుత్వం ప్రస్తుత విధానాన్ని విడనాడి సంక్షేమ పథకాల అమలు, వ్యవసాయం, నీటి పారుదల, విద్య,వైద్యం వంటి సామాజిక రంగాలు, ప్రజా పంపిణీ వ్యవస్థ విస్తరణ,ప్రభుత్వ ఉద్యోగ కల్పన, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక నిధులు, ప్రజ లకు తక్షణం ఉపయోగపడే మౌలిక సదుపాయాల కల్పన వంటి వాటిపై ఖర్చులు పెంచాలి. శ్రామి కుల వేతనాలు పెంచాలి.ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ అదుపు,జోక్యం,వ్యయం పెంచాలి.దీనివల్ల ప్రజ లకు ఆదాయం పెరిగి కొనుగోలు శక్తి పెరుగు తుంది.ఈ ప్రక్రియ జరిగితేనే రాష్ట్రం ఆర్థిక వ్యవస్థలో పారిశ్రామిక సరుకులకు, సేవలకు డిమాండ్‌ పెరిగి పన్నుల ద్వారా రాష్ట్రానికి అద నంగా రెండు నుండి మూడు రెట్లు సొంత బడ్జెట్‌ ఆదాయం పెరుగు తుంది.అంతేగాక అదనపు ఉపాధి అవకాశాలు కూడా పెరుగు తాయి.కొంత మేరకైనా ఆర్థిక అసమానతలు తగ్గు ముఖం పడ తాయి.ఈదృష్టితో రాష్ట్ర ప్రభు త్వం క్రియాశీల విత్త విధానం అమలు చేపడితేనే రాష్ట్రం ప్రస్తుత ఆర్థిక సమస్యలనుండి బయట పడగలదు.-(బి.గంగారావు)

బడి మారుతోంది

కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ ఇటీవలనే జిల్లాల వారీగా విద్యా సంబంధమైన సమాచారాన్ని విడుదల చేసింది.దాంతోపాటే2023లో-24లో మొత్తం విద్యార్థు ల నమోదు డేటా కూడా వుంది.విద్యా రంగంలో ఏదో గొప్ప అభివృద్ధి వచ్చేసినట్టుగా ప్రభుత్వం చెప్పుకుంటున్న గొప్పల పసఏమిటో ఈసమాచారం తేల్చివేసింది. అంతకు ముందుతో పోలిస్తే 2023-24లో మొత్తం విద్యార్థుల నమోదు కోటికిపైగా తగ్గిపోయినట్టు చెబుతున్నది. 20 23-24లో మొత్తం విద్యార్థుల నమోదు 24.8 కోట్లు గా వుంది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 37లక్షల మందివిద్యార్థులు తక్కువగా నమోదయ్యారు. అయితే 2018-19లోసూళ్లలోనమోదు26.02కోట్లుగా వుంది. తర్వాతి ఏడాది అంటే 2019-20లో ఇది 1.6శాతం పెరిగి,26.45 కోట్లకు చేరుకుంది. అంటే 42లక్షల కంటే ఎక్కువ మంది అదనంగా చేరారన్నమాట. వెనక్కుపోతే 2012-13లో కూడా 26.3కోట్ల నమోదు వుంది. 2012-24 మధ్య దేశ జనాభా పెరుగుదలను కూడా లెక్కలోకి తీసుకుంటే ఈతగ్గుదల మరింత కొట్ట వచ్చినట్టు కనిపిస్తుంది.
2023-24లోమొత్తం విద్యార్థుల నమోదు 24.8 కోట్లుగా వుంది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 37 లక్షల మంది విద్యార్థులు తక్కువగా నమోదు కావడాన్ని ఈ నివేదిక విశ్లేషించింది. 21 లక్షల మంది పురుష విద్యార్థులు తక్కువగా నమోదు కాగా సంఖ్య 16లక్షల మంది విద్యార్థినులు విద్యా రంగాన్ని వదలివెళ్లిపోయినట్టు చెబుతున్నది. నమోదు సంఖ్యను లెక్కగట్టడంలో గతంకన్నా మెరుగైన పద్ధ తులు తీసుకువచ్చినట్టు మంత్రిత్వశాఖ చెబుతున్నది. బహుశా అంతకు ముందు సంవత్సరాలతో పోలిస్తే సంఖ్యలు తగ్గిపోవడానికి ఇది కారణమై వుండొచ్చు నంటున్నది. అయితే ఈతగ్గుదల ఆందోళనకర మైం దనీ ఈసమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించే చర్యలు తీసుకోవాలని ఆ శాఖే చెబుతున్నది.
నూతన విధానంతో పెద్ద ఎత్తున స్కూళ్ల మూత
బీహార్‌ ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర,ఆంధ్రప్రదేశ్‌ వంటి బిజెపి పాలిత రాష్ట్రాలలో ఈతగ్గుదల అత్యధి కంగా వుందని గమనించడం చాలా ముఖ్యం. 20 18-19లో బీహార్‌లో 2.49కోట్లమంది విద్యార్థులు నమోదుకాగా ఇప్పుడు2.13కోట్లకు తగ్గిపోయారు (అంటే35.65లక్షల కంటే ఎక్కువగాతగ్గారు).ఉత్తర ప్రదేశ్‌లో2018-19లో నమోదు 4.44కోట్లు కాగా తాజా నివేదికలో ఈసారి 28.26 లక్షల మంది తగ్గి ఇప్పుడు 4.16 కోట్లకు చేరుకున్నారు. మహారాష్ట్రలో గతంలో2.32కోట్ల మంది నమోదైతే తాజా నివేదిక లో ఆసంఖ్య 2.13కోట్లకు పడిపోయింది. ఈనివేదిక విడుదల తర్వాత ఈ తగ్గుదలకు కారణాలేమిటనే దానిపై వేర్వేరు నిపుణులు వేర్వేరు కారణాలు ముం దుకు తెస్తున్నారు.విద్యా విధానంలో మార్పులు, ఆర్థిక కడగండ్ల పెరుగుదల, స్కాలర్‌షిప్‌ మొత్తాలు సకాలంలో విడుదల చేయకపోవడమో ఎగవేయ డమో ముఖ్య కారణాలుగా వస్తున్నాయి. బిజెపి ప్రభు త్వం మూడేళ్ల కిందట ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం ప్రైవేటు విద్యకే పెద్ద పీట వేసింది. హర్యా నా వంటి బిజెపి పాలిత రాష్ట్రాలు ప్రైవేటు స్కూళ్లలో చేరిన విద్యార్థులకు సబ్సిడీలిచ్చి ప్రభుత్వ స్కూళ్లలో ఫీజులు పెంచాయి. బిజెపి పాలిత రాష్ట్రాలలో అత్య ధిక భాగం (కాంగ్రెస్‌,బిజెపి రెండిరటి సర్కార్లు నడి చిన రాజస్థాన్‌ వంటి రాష్ట్రాలతో సహా) ప్రభుత్వ స్కూళ్లను భారీ ఎత్తున మూసివేయడం లేదా కలిపే యడం జరిగింది.అంటే పిల్లలు మరీ ముఖ్యంగా పేదకుటుంబాలకూ దళితులకూ సంబంధించిన పిల్ల లు వెళ్లవలసిన స్కూళ్లు దూరమై పోయాయి. ఎంత దూరమంటే వారు వెళ్లడమే మానుకునేంత. ఇక బాలికల విషయంలో అంత దూరం ప్రయాణిం చడంలో భద్రతా సమస్యలు మరింత నిరుత్సాహ పరుస్తున్నాయి. 2018-19 మధ్య 50 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు మూత పడ్డాయని యు.డి.ఐ. ఎస్‌.సి (యుడైస్‌) 2022 నివేదిక పేర్కొం టున్నది. 2024లో యు.పి ప్రభుత్వం 27వేలపాఠశాలలు మూసివేసింది.ప్రత్యేకించి బీహార్‌,మహారాష్ట్రలో ప్రైవే టు స్కూళ్లు ఉధృతంగా ప్రారంభమవుతున్నాయి.ఈ రెండు రాష్ట్రాల్లో విద్యార్థుల నమోదు తగ్గడం, ఉత్తర ప్రదేశ్‌లో స్కూళ్ల మూతలు చూస్తుంటే కేవలం ప్రైవే టు స్కూళ్లలో నమోదు పెరగడం ఒక్కటే సమ స్యను పరిష్కరించలేదని అర్థమవుతుంది.
కేరళలో మెరుగైన ఫలితాలు
విద్యార్థుల నమోదు పెంచడానికే గాక వారు కొనసా గేలా చూడాలన్నా ఉచిత ప్రభుత్వ విద్య అందించడం ఏకైక మార్గమని కేరళ అనుభవం మనకు నొక్కి చెబు తుంది.విద్య నాణ్యత పెంచేందుకూ అదే మార్గం. 2021-22లో కేరళలోస్థూలనమోదు నిష్పత్తి (జి.ఇ. ఆర్‌) 41.3శాతంగా వుంది. జాతీయ సగటు 28.4 శాతం కన్నా ఇది చాలా ఎక్కువ. ఒక నిర్దిష్ట వయో బృందంలో ఉన్నత విద్యా భాగస్వామ్యం ఏ స్థాయిలో వుందో తెలుసుకోవడానికి జి.ఇ.ఆర్‌ కీలక సూచిక. తాజాగా2023-24 నివేదికలోకూడాకేరళ నమోదు సంఖ్యలు ఎంతో ప్రోత్సాహకరంగా వున్నాయి. ఈ రాష్ట్రంలో బాలికల చేరిక అబ్బాయిలను మించి వుం డటం నిజంగా ప్రశంసనీయమైన విషయం. విద్యా రంగంపై ప్రభుత్వ వ్యయం, ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల మెరుగుదల కోసం ప్రభుత్వం పెట్టే ఖర్చు, ఉపకార వేతనాలు సకాలంలో చెల్లించడం, స్కూళ్లలో ఆరోగ్యవంతమైన సుహ్రృద్భావ పూర్వకమైన వాతావ రణంకోసం కేటాయింపు ఇవన్నీ విద్యార్థుల నమోదు పెరగడానికి, నిలబడటానికి దోహదం చేస్తున్నాయి.
కనీస సదుపాయాల లేమి
యుడైస్‌ తాజా నివేదిక వెల్లడిరచే అంశాలు విద్యా ర్థుల సమస్యలకోణం నుంచి కూడా చూడాలి. ప్రత్యే కించి పేదలు సామాజికంగా అణగారిన వర్గాల పిల్లలు అనేక రాష్ట్రాల్లో ఎదుర్కొంటున్న పరిస్థితిని పరిశీలించాలి.చాలా స్కూళ్లలో అమ్మాయిలకు ప్రత్యే కంగా మరుగుదొడ్లు కూడా లేవని ఈ నివేదిక చెబు తున్నది. ఉన్నవాటిలో చాలా చోట్ల తలుపులు లేవు. చాలా బళ్లలో మంచినీటి సదుపాయం లేదు. అనేక స్కూళ్ల భవనాలు శిథిలావస్థలో వున్నాయి.తరగతి గదుల్లోకి వేటలుతురే రాదు. కుర్చీలు,టేబుళ్లు కూడా వుండవు. అనేక రాష్ట్రాల్లో ఉపాధ్యాయులు, ప్రిన్సి పాళ్లు, ఉద్యోగులు పిల్లలపై అత్యాచారాలకు, లైంగిక హింసకు పాల్పడిన ఘటనలు జరిగాయి. దేశంలో అత్యధిక చోట్ల స్కూళ్లలో కుల వివక్ష సంఘటనలు లెక్కలేనన్ని జరిగాయి.విద్యారంగంలో విచారకర మైన ఈ పరిస్థితికి ఇవన్నీ కారణాలే.
ఏకోపాధ్యాయులు, పారా టీచర్లు
చాలా రాష్ట్రాల్లో ప్రస్పుటంగా కనిపించే పెద్ద లోపం ఏకోపాధ్యాయపాఠశాలలు పెద్ద సంఖ్యలో వుండటం. ఉదాహరణకు ఒకేటీచరు నాలుగు నుంచి ఆరు క్లాసులు ఇంకా ఎనిమిది క్లాసులు కూడా చూసుకునే పరిస్థితి వుంది.ప్రభుత్వ నివేదికల ప్రకారం 2023-24లో భారత దేశంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు 1,10,971వున్నాయి.ఇలాంటి పాఠశాలల్లో 89 శా తం గ్రామీణ ప్రాంతాల్లోనే వున్నాయి. అరుణాచల్‌ ప్రదేశ్‌,గోవా,తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌,జార్ఖండ్‌,ఉత్త రాఖండ్‌,మధ్యప్రదేశ్‌,రాజస్థాన్‌లలో ఏకోపాధ్యా య పాఠశాలలు ఎక్కువగా వున్నాయి. హిమాచల్‌ ప్రదేశ్‌ లో ఏకోపాధ్యాయ పాఠశాలలు అధికంగా వుండగా కేరళలో కూడా కొన్నివున్నాయి.కానివాటిలో విద్యా ర్థుల సంఖ్య చాలా తక్కువ. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఏకోపాధ్యాయ పాఠశాలల్లో 20 మంది కన్నా తక్కువ గా పిల్లలున్నారు. కేరళలోనైతే వాటిలో సగటున పది మంది పిల్లలున్నారు. నిజానికి కేరళలో ఏకోపాధ్యా య పాఠశాలలు అతి తక్కువగా వుండగా వాటిలో పిల్లల సంఖ్య కూడా దేశంలోకెల్లా తక్కువగా వుంది. సగటున ఒకఏకోపాధ్యాయ పాఠశాలలో 70, బీహార్‌ లో నైతే 96 మంది పిల్లలు వున్న పరిస్థితితో పోలిస్తే ఇది చాలా మెరుగ్గా వుంటుంది.
అందువల్ల ఇక్కడ ప్రభుత్వ తాజా నివేదికలో ఆందోళన కలిగించేది పిల్లల నమోదు తగ్గిపోవడం ఒక్కటే కాదు. పాఠశాలల్లో వసతులు అధ్వాన్నంగా వుండటం,చాలా స్కూళ్లలో బోధనా ప్రమాణాలు కూడా దారుణంగా వుండటం. ఈ విషయంలోనూ కేరళ పరిస్థితి చాలా మెరుగ్గా వుంది. ఇక్కడ ముఖ్యం గా గమనించాల్సింది ఏమంటే కేరళలో ప్రభుత్వ పాఠశాలల్లో పారాటీచర్లు, కాంట్రాక్టు టీచర్ల నియా మకమే లేదు.అక్కడ టీచర్ల ఉద్యోగాలు పర్మనెంటు పోస్టులు. వారు తమ బోధనా నైపుణ్యాన్ని బోధనా పద్ధతులను నిత్యం మెరుగు పర్చుకుంటుంటారు. ఆ ప్రక్రియపై పర్యవేక్షణా నిరంతరంగా సాగుతుంటుం ది.దీంతో పోలిస్తే యు.పిలో24వేల మంది కాంట్రా క్టు పద్ధతిలో ఆదేశాల ఉపాధ్యాయులు వున్నారు. ఎనిమిదో తరగతి వరకూ బోధించేందుకుగాను వీరికి రూ.7000 ఇస్తారు. వారిలో చాలా మంది అవసరమైన అదనపు ఆదాయంకోసం టైలర్లు, ఆటో డ్రైవర్లు, దుకాణాలలో సహాయకులుగా పని చేస్తుం టారు. అంతేగాక 1,42,000 విద్యా మిత్రలను కూడా వార్షిక కాంట్రాక్టు పద్ధతిలో నియమించు కున్నారు.ఏ క్షణంలోనైనా ఉద్యోగం ఊడిపోవచ్చు ననే భయంలో కొట్టుమిట్టాడే వారు బోధనపై శ్రద్ధ పెట్టడం ఊహకందని విషయం. ఇంతేగాక ప్రభుత్వ పాఠశాలల్లో లక్షమంది ప్రిన్సిపాళ్లు, టీచర్ల పోస్టులు ఖాళీ పడి వున్నాయి. చాలా రాష్ట్రాల పాఠశాలల్లో నమోదు తగ్గిపోవడం, విద్యా ప్రమాణాలు నాసిగా వుండటం భవిష్యత్తుపై చాలా హానికర ప్రభావం చూపిస్తాయి.నమోదులోనూ పిల్లలను నిలబెట్టు కోవ డంలోనూ కేరళ విజయం ఉత్సాహకరంగా వుంది. దాంతోపాటే ప్రభుత్వ విద్యా వ్యవస్థలో నిరంతరం మెరుగుదల తీసుకురావడం, కూడా విస్తృతంగా ప్రచారం చేయవలసి వుంది. అత్యవసరమైన ఈ మార్పులు సాధించాలంటే ఆ విజయాలకు కారణ మైన అక్కడి పద్ధతులను అనుసరించడం కూడా కీలకమవుతుంది.
ఏపీలో పాఠశాలల పునర్‌వ్యవస్థీకరణకు
పాఠశాలల పునర్‌వ్యవస్థీకరణకు ఆంధ్ర ప్రదేశ్‌ కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆరు రకాల బడులు ఉండగా వాటి స్థానంలో ఐదు రకాలు తీసుకొచ్చేలా పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.దీనిలో భాగం గా ప్రాథమికోన్నత పాఠశాలల విధానాన్ని తొలగిం చింది.అలాగే ఫలితాలు దారుణంగా ఉంటున్న హైస్కూల్‌ ప్లస్‌ల స్థానంలో ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తోంది.కొత్తగా ఆదర్శ ప్రాథమిక పాఠశాలలను ప్రవేశపెట్టింది.అంగన్‌వాడీలను ప్రాథమిక పాఠశా లలకు అనుసంధానం చేసి ప్రీప్రైమరీ తరగతులు నిర్వహిస్తారు.బేసిక్‌ ప్రైమరీ స్కూళ్లలో ప్రీప్రైమరీ-1,2తో పాటు 1నుంచి 5తరగతులు ఉంటాయి. వీటిలో విద్యార్థుల సంఖ్యఆధారంగా టీచర్లను కేటా యిస్తారు.మోడల్‌ ప్రైమరీ స్కూళ్లలోనూ ఇవే తరగ తులు ఉంటాయి. వీటిని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రారంభించి, ప్రతి తరగతికి ఒకటీచర్‌ ఉండేలా చర్యలు తీసుకుంటారు.హైస్కూల్‌ ప్లస్‌లకు ప్రత్యామ్నా యంగా బాలికలకు ఇంటర్‌ విద్య అందించే ఉద్దే శంతో ఉన్నత పాఠశాలల్లో జూనియర్‌ కాలేజీల విధా నం తేవాలని భావిస్తున్నారు.దీంట్లో భాగంగా జిల్లాలో ప్రక్రియకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది.
హైస్కూల్‌ ప్లస్‌ వ్యవస్థ రద్దు..
విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఈ బడులను ఉన్నతీకరించడం,లేదంటే ప్రాథమిక బడులుగా మార్చడం చేస్తుంది.ఇంటర్మీడియట్‌తో ఏర్పాటు చేసిన హైస్కూల్‌ ప్లస్‌ వ్యవస్థను తీసేయనుంది.వీటిల్లోని ఇంటర్‌ను ఇంటర్మీడియట్‌ విద్యాశాఖఖు అప్పగించ నుంది.గతేడాది డిసెంబర్‌ 31వరకు ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిర్ణయం తీసుకోనుంది.జాతీయ రహదారులు,రైల్వే లైన్లు,వంతెనలు,పాఠశాల దూరాన్ని ప్రామాణికంగా తీసుకుని ఐదు రకాల విధానాన్ని అమలు చేయనుంది.ఈవిధానాలపై అవగాహన కల్పించేందుకు,ఇప్పటికే జిల్లా,క్లస్టర్‌, మండలస్థాయిలో ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేసింది. -(సుభాషిణీ అలీ)

వైవిధ్యాన్ని ప్రొత్సహిద్దాం..

‘ఒక పెద్ద దేశం చిన్న దేశాన్ని అణచి వేయా లని చూస్తే నేను ఆ చిన్న దేశం వైపు నిలబడతాను. ఆ చిన్న దేశంలోనే మెజారిటీ మతం చిన్న మతాన్ని అణగదొక్కాలనిచూస్తే నేను చిన్న మతం వైపు నిలబడ తాను. ఆమై నారిటీ మతంలో కులాలు ఉం డి అది ఒక కులం మరొక కులాన్ని అణగదొక్కాలని చూస్తే ఆఅణచివేతకు గురయ్యే కులం వైపు నిలబ డతాను.ఆణిచి వేతకు గురైన కులంలో ఒక యజ మాని తన నౌకరుని అణిచివేస్తుంటే నేను ఆ నౌకరు వైపు నిలబడతాను. ఆ నౌకరు తన ఇంట్లో తన భార్య హక్కుల్ని కాలరాస్తుంటే నేను ఆ నౌకరు భార్య వైపు నిలబడి గొంతెత్తుతాను. చివరికి నేను చెప్పేది అణిచివేత అనేది ఏ స్థాయిలో ఏస్థితిలో ఉన్నా అది నా శత్రువు!’అంటాడు పెరియార్‌ ఇ.వి. రామస్వామి. భారత దేశ నాగరికత అతి ప్రాచీనమైనది. కాల ప్రవా హంలో కొన్ని నాగరికతలు, సంస్కృతులు కాల గర్భంలో కలిసిపోతుంటాయి. కొత్త నాగరికతలు, సంస్కృతులు పుట్టు కొస్తుంటాయి. ఎన్నో మతాలు, సంస్కృతులసంగమం మనదేశం. అనేక సాంప్ర దాయాలు, చారిత్రక నేపథ్యాలున్న హిందూ, ముస్లిం, క్రైస్తవ, బౌద్ధ, జైనుల సహజీవనం మన సంస్కృతి. రాచరిక ప్రభువుల నిరంకుశత్వాన్నిదాటి, భూస్వాములఅరాచ కాలను, ఆగడాలను ఎదుర్కొని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మన జీవన విధా నంగా చేసుకున్నాం. భిన్న సంస్కృతులను విశాల దృక్పథంతో అర్థం చేసు కొనేవారితోనే సమానత్వం సిద్ధిస్తుంది. ఈ వైవిధ్యా న్ని సమాజ రక్షణ కోసం ఏర్పడిన రాజ్యం దాన్ని విస్మరిస్తూ విద్వేషం వెదజల్లు తున్న వేళ..న్యాయమూర్తులే విద్వేష వ్యాఖ్యలు చేస్తున్న సమయం. ఈ నేపథ్యంలో మైనార్టీల హక్కు ల దినోత్సవ ఆవశ్యకత ఎంతైనా ఉంది.
థీమ్‌..
ఈఏడాది మైనారిటీ హక్కుల దినోత్సవ థీమ్‌ ’’వైవిధ్యాన్ని ప్రోత్సహించడం,హక్కులను పరిర క్షిం చడం!’’ అని ప్రభుత్వం ఘనంగా ప్రకటించింది. ఇంతకుముందు కూడా థీమ్‌లను ప్రకటించారు. మాటలు కోటలు దాటాయే తప్ప ఆచరణ గడప దాట లేదు.కేంద్రంలో మోడీ పదేళ్ల పాలనలో మైనార్టీల హక్కులపై ఎడాపెడా దాడులు జరుగుతున్న నేపథ్యం లో ఈథీమ్‌ కార్యరూపం దాల్చాలంటే పోరాటం మినహా మరో మార్గం లేదు.
మనిషితనాన్ని కోల్పోయి..మనిషి రక్తాన్ని మరిగినప్పుడు-ఈ దుష్ట సంస్కృతిని,నిరంకుశత్వాన్ని ప్రశ్నిస్తూ..‘మేమూ మనుషులమే..ఈ గడ్డలో మేమూ భాగమే..మమ్మల్నీ బతకనీయండి’ అంటూ నినదించే పౌర సమాజ బృందాలు,కార్యకర్తల గొంతులను, బిగించిన పిడికిళ్లను బుల్డోజ్‌ చేస్తూ..అణచివేస్తుంటే.. ఆఅణచివేతను,ఆనిరంకుశత్వాన్ని ఎదిరించే పోరా టాలే మానవ హక్కులయ్యాయి.ఏదేశంలోనైనా హక్కు ల ఉల్లంఘన, అణచివేత.. ఆందోళన కలిగించే విష యమే.‘ప్రజల మానవ హక్కులను తిరస్కరించడం అంటే..వారిమానవత్వాన్ని సవాలు చేయడమే’ అంటా డు నెల్సన్‌ మండేలా.జాతీయత,మతం,వర్గం, జాతి నేపథ్యంతో సంబంధం లేకుండా సమాజ మంతటికీ లభించే సమానత్వం,గౌరవం,స్వేచ్ఛ కనీస అవసరం. నాగరికత ఎంత అభివృద్ధి చెందినా,అనేక దేశాల్లో మానవ హక్కులకు, ముఖ్యంగా మైనారిటీల హక్కులకు పూర్తి భరోసా లేని పరిస్థితి ఏర్పడిరది. అతిపెద్ద ప్రజా స్వామ్య దేశమని చెప్పుకుంటున్న భారత్‌లో సైతం మైనారిటీల హక్కుల హననం కొనసాగుతోంది.
ఇలా ఏర్పడిరది..
ఐక్యరాజ్యసమితి మొట్టమొదట మైనార్టీ హక్కుల దినోత్సవంగా1992,డిసెంబర్‌ 18వతేదీని పరిగ ణిం చింది.మతము,జాతి,భాషా,లింగం,సంస్కృతి పరంగా మైనారిటీ హక్కుల పరిరక్షణకు ఈ రోజును గుర్తిం చాల్సిందిగా ప్రకటించింది.మనదేశంలో కూడా డిసెం బర్‌ 18ను మైనార్టీ హక్కుల దినోత్సవంగా ప్రకటించి, చట్టం చేసి జాతీయ మైనారిటీల కమిషన్‌ (ఎన్‌ఎంసి -1992) నియమించింది.2024 మైనారిటీ హక్కుల దినోత్సవం యొక్క థీమ్‌ (ప్రమోటింగ్‌ డైవర్సిటీ అండ్‌ ప్రొటెక్టింగ్‌రైట్స్‌)వైవిధ్యాన్ని ప్రోత్సహించడం, హక్కు లను రక్షించడం.
రాజ్యాంగ హక్కు..
భారత జాతీయ మైనారిటీల కమిషన్‌ మనదేశంలోని ముస్లింలను (14.2) క్రైస్తవులను (2.3),సిక్కులను (1.7),బౌద్ధులను(0.7),పారశీలను(0.06), జైనులను (0.4) మైనార్టీలుగా గుర్తించింది. మైనార్టీలకు భద్రతా, సమానత్వం,సమన్యాయం అందించడం రాజ్యాంగ బద్ధమైన ఆదేశమే కాక సామాజిక అవసరం కూడా. గాంధీజీ అన్నట్లు’’ఒక దేశంగొప్పతనం అన్నది ఆ దేశంలో అణగారిన వారు ఎలా చూడబడు తున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది’’.ఈరోజు మతం పేరు తో మనదేశంలో జరుగుతున్న దాడులు కొద్దిమంది మతోన్మాదులకు తృప్తిని కలిగించవచ్చు. కానీ ప్రపంచ దృష్టిలో మాత్రం దేశ గౌరవ ప్రతిష్టలకు భంగం కలుగు తుందన్న స్పృహ అవసరం. గోరక్షణ పేరుతో మానవ హత్యలు గావించడం, మైనారిటీ మహిళలను నగంగా ఊరేగించి హత్యాచారాలు చేయించడం యథేచ్చగా కొనసాగుతోంది.హిజాబ్‌, హలాల్‌, అజాన్‌, నమాజ్‌ల పేర్లతో మతాచారాలపై, మైనారిటీల ఆస్తులపై బుల్డో జర్లను ప్రయోగించి నిరాశ్రయులను చేస్తోంది. ఇవన్నీ రాజ్యాంగ అతిక్రమణ చర్యలే కాదు అమానవీయ మైనవి.
మైనారిటీల స్థితిగతులు..
మనదేశంలోని మైనార్టీ స్థితిగతులపై నివేదిక కోసం 2005,మార్చి 9న ప్రధానమంత్రి జస్టిస్‌ రాజేందర్‌ సచ్చార్‌ నాయకత్వాన ఒకకమిటీ వేయడం జరిగింది. ఈదేశంలో ముస్లిం మైనార్టీలు,విద్యా,ఉపాధి, ఆర్థిక పరంగా ఎంత వెనుకబాటుతనంలో ఉన్నారో సమూల వివరణలతో ఆ కమిటీ రిపోర్టు సమర్పించింది. వీటిని అధిగమించటానికి సూచనలు కూడా చేసింది. కానీ కమిటీలు వేయడంలో ఉన్నంత చిత్తశుద్ధి, దాని సూచనలు అమలులో లేకపోవడం విచారకరం. ప్రధా నంగా విద్యను మాతృభాషలో అందించటానికి ప్రాధా న్యత నిస్తూ పాఠశాలలు ఏర్పాటు చేసినా,ఆంగ్ల భాష మీద చూపే ప్రేమ మైనార్టీ భాషనే కాదు మెజార్టీ స్థానిక భాషలపైనా ప్రభావం చూపుతుందన్నది సత్యం. ఈ పరిస్థితి మైనార్టీలను మధ్యలోనే విద్యకు దూరం చేసి, మరింత వెనుకబాటులోకి నెట్టివేస్తుంది. ఒకటి నుంచి 10వ తరగతి వరకు ఉన్న జాతీయ స్కాలర్‌ షిప్‌,విదేశీ విద్యకు అందే స్కాలర్‌షిప్‌లను కేంద్ర ప్రభు త్వం నిలిపివేసింది. ప్రాథమిక విద్యలోనే ఆటం కాలు ఏర్పడితే ఉన్నత విద్యకు వెళ్ళడం అసాధ్యమైన విష యంగా మైనార్టీలకు పరిణమించింది. దీంతో పిల్ల లను బడి మాన్పించి,పనుల్లోకి పంపడం జరుగు తోంది. బాలికలలో ఇది మరింత పెరిగి బాల్యవివాహా లకు దారితీస్తుంది.- (యం.డి.షకీలా బేగం)

ఆంధ్ర అభివృద్ధికి అండగా`ప్రధాని నరేంద్ర మోడీ

మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో తొలి పర్యటన సంద ర్భంగా,నరేంద్ర మోదీ విశాఖపట్నంలో రూ. 2.08లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడిన క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించారు. ఈ క్రమంలో నేడు విశాఖ పట్నంలో రూ.2.08 లక్షలకోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు.ఈ నేపథ్యంలో మాట్లాడిన ప్రధాని తన అభిమానాన్ని చూపించే అవకాశం ఇప్పుడు వచ్చిందని పేర్కొన్నారు. తెలుగులో ప్రసంగం మొదలు పెట్టిన ప్రధాని మోదీ..ఆంధ్ర ప్రజల ప్రేమ,అభిమానానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఐదేళ్ల తర్వాత ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని.. చంద్రబాబు స్పీచ్‌తో సిక్సర్‌ కొట్టారని పేర్కొన్నారు.60 ఏళ్ల తర్వాత దేశంలో మూడో సారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మోదీ గుర్తు చేశారు.
అండగా ఉంటాం..
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో చంద్రబాబు లక్ష్యాలకు మేం ఎప్పుడూ అండగా ఉంటామని ప్రధాని అన్నారు. ఏపీ ప్రజల ఆశలు, ఆశయాలకు మద్దతుగా నిలుస్తామని చెప్పారు. ఏపీకి అన్ని రంగాల్లో మద్దతుగా నిలుస్తున్నామని, ఏపీతో భుజం భుజం కలిపి నడుస్తామని మోదీ పేర్కొ న్నారు. ఇవాళ తలపెట్టిన ప్రాజెక్టులు రాష్ట్ర వికాసానికి తోడ్పడతాయని ప్రధాని వెల్లడిరచారు. దీంతోపాటు ఐటీ, టెక్నాలజీకి ఏపీ ప్రధాన కేంద్రం కానుందని ప్రధాని మోదీ అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ ప్రాజెక్టులు ఏపీ అభివృద్ధిని సరికొత్త శిఖరాలకు చేరుస్తాయని ప్రధాని మోదీ అన్నారు. 2030లోగా 5 మిలియన్‌ టన్నుల గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి చేయడమే మా లక్ష్యమని ప్రధాని తెలిపారు. నవయుగ పట్టణీకరణకు ఏపీ సాక్ష్యంగా మారబోతోందని ఈ సందర్భంగా మోదీ చెప్పారు. విశాఖ ప్రత్యేక రైల్వే జోన్‌ డిమాండ్‌ చాలా కాలంగా ఉందని, చిరకాల కోరిక ఈరోజు నెరవేరిందన్నారు. రైల్వే జోన్‌ రాకతో వ్యవసా యంతోపాటు అనేక వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందుతాయన్నారు. ఏపీ అభివృద్ధి మా విజన్‌ అని మరోసారి గుర్తు చేశారు ప్రధాని మోదీ.
చిరకాల వాంఛ నెరవేరుతుంది: ప్రధాని
‘దేశంలో రెండు గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌లు వస్తుంటే..అందులో ఒకటి విశాఖకు కేటాయిం చాం. గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ ద్వారా ఎంతోమం దికి ఉపాధి లభిస్తుంది. నక్కపల్లిలో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌కు శంకుస్థాపన చేశాం. 3 రాష్ట్రా ల్లోనే ఇలాంటి బల్క్‌ డ్రగ్‌ పార్కులు వస్తున్నాయి. చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో క్రిస్‌ సిటీ భాగం అవుతుంది. ఇప్పటికే శ్రీసిటీ ద్వారా ఏపీలో తయారీరంగం ఊపందుకుంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు పునాదిరాయి వేశాం. రాష్ట్ర అభివృద్ధిలో రైల్వే జోన్‌ కీలకం కానుంది. రైల్వే జోన్‌ ద్వారా రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతుంది. రైల్వే జోన్‌ వల్ల వ్యవసాయ,పర్యాటక రంగాలు ఊపందుకుంటాయి.’అని ప్రధాని మోదీ అన్నారు.
మేమంతా కష్టపడి పని చేస్తున్నాం`పవన్‌
‘అభివృద్ధికి ఆస్కారమే లేని ఆంధ్రప్రదేశ్‌ నుంచి.. అభివృద్ధి పుష్కలమైన ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్ద డానికి మేమంతా కష్టపడి పని చేస్తున్నాం. గత ఐదేళ్ల చీకటి రోజుల నుంచి,అరాచక పాలన నుంచి మళ్లీ వెలుగు రేఖలు రాష్ట్రంలో పూయిం చడానికి అడుగులు వేస్తున్నాం.దీనిలో భాగమే రాష్ట్రానికి ఒకేసారి రూ. 2.10లక్షల కోట్ల పెట్టుబడులు, సుమారు ఏడున్నర లక్షల మందికి ఉపాధి కల్పించే మార్గాలను గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ సహకారంతో తీసుకువచ్చాం. ఈ నిరంతర అభివృద్ధి యజ్ఞం కొనసాగాలి.ఎన్డీఏ కూటమిపై ప్రజలంతా ఉంచిన నమ్మకాన్ని నిలుపుకొంటూ వారికి మరింత అండగా నిలుస్తామ’ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్‌ కళ్యాణ్‌ స్పష్టం చేశారు.గత ఐదేళ్ల అరాచక, అభివృద్ధిరహిత పాలన నుంచి ఆంధ్రప్రదేశ్‌ మళ్లీ కొత్తగా తన ప్రయాణాన్ని అభివృద్ధి పథంలో మొదలుపెట్టబోతుందని చెప్పారు. జనవరి 8న విశాఖపట్నం వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రవ్యాప్తంగా రూ.2.08లక్షల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పూర్తయిన పలు జాతీయ రహదారులు, ప్రాజెక్టు లను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రా యూనివర్శిటీ ఇంజినీరింగ్‌ కాలేజీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆశేష జనవాహినిని ఉద్దేశించి పవన్‌ కళ్యాణ్‌ ప్రసంగిస్తూ ‘‘సదుద్దేశం..సదాశయం లేకుండా ఒకరు కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు నడిచినా అది నిరర్ధక నడకగా చరిత్రలో మిగిలిపోతుంది.
అభివృద్ధిలో అందరికీ సమాన వాటామోదీ సంకల్పం
అవినీతితో కూరుకుపోయి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు లేక రాష్ట్రం విలవిల్లాడుతున్న సమయంలో ప్రజలు కూటమికి అండగా నిలబడ్డారు. అందుకే ఈ రోజున రూ. రెండు లక్షల కోట్ల పైచిలుకు పెట్టుబడులతో ఏడున్నర లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. ఇవి కాకుండా కొత్త హైవేల నిర్మాణం, విస్తరణ, రాజధాని అమరావతికి పెట్టుబడులు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు,15వ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్రానికి ఇచ్చారు.జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా ప్రతి ఇంటికీ 24గంటలు తాగునీరు ఇవ్వాలన్న తపన గౌరవ ప్రధాన మంత్రి గారిది. ప్రజలు మా మీద పెట్టిన భరోసా..నమ్మకం..ప్రధాన మంత్రి గారిపై చూపిన నమ్మకం నేడు రూ. రెండు లక్షల కోట్ల పైచిలుకు పెట్టుబడులుగా ఇక్కడికి వచ్చాయి.70 ఏళ్ల పాలనలో మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు. ఆగ్రామాలకు ప్రధాన మంత్రి సడక్‌ యోజన పథకం కింద ఈరోజున రోడ్లు వేయగలుగుతున్నామంటే దానికి ప్రధాని ముందుండి వెన్నుతట్టి నిధులు సమకూరుస్తుం డడమే కారణం. భారత దేశంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి ఆయన ఆశయం. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌,ఉత్తరాంధ్ర,రాయలసీమ, కోస్తాంధ్ర ఏ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడకూడదు. అభివృ ద్ధిలో అందరికీ సమాన వాటా ఉండాలన్న ఆయన సంకల్పమే ఈ రోజుఈ పెట్టుబడులు. వారి సంకల్పానికి, సహకారానికి ఆయన మార్గదర్శక త్వానికి మనస్ఫూర్తిగా కృతజ్నతలు.
రాష్ట్ర అభివృద్ధికి రేయింబవళ్లు కష్టపడతాం
ఐదేళ్ల అవినీతి, అరాచక పాలనతో ఆంధ్రప్రదేశ్‌ అంధకారంలో కూరుకుపోయిన సమయంలో ఎన్డీఏ కూటమితో ముందుకు వచ్చి రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు తీర్చేందుకు మోదీ ఆశాజ్యోతిగా నిలిచారు.ఆంధ్ర ప్రదేశ్‌ అభివృద్ధికి అస్కారమే లేదు అనే పరిస్థితి నుంచి అభివృద్ధి అంటే ఆంధ్ర ప్రదేశ్‌ అని చెప్పుకొనేలాచంద్ర బాబునాయుడు నాయకత్వంలో, గౌరవ ప్రధాన మంత్రి నిర్దేశకత్వంలో ముందుకు వెళ్తున్నాం. వారి సూచనలు,సలహాలతో రాష్ట్ర అభివృద్ధికి రేయింబవళ్లు కష్టపడతాం.దేశ ప్రగతిలో భాగస్వా ములవుతాం. ప్రధాన మంత్రికి అండగా ఉంటాం. ప్రజలు నమ్మకం పెట్టారు.మీరు పెట్టిన నమ్మకానికి ఈ రోజున రూ.రెండు లక్షల పై చిలుకు పెట్టుబడులు తీసుకువచ్చారు. ప్రధాన మంత్రి గారు, సమర్ధవంతులైన చంద్రబాబు గారు నాయకత్వంలో మా సహచర మంత్రులు, కార్యకర్తలు అభివృద్ధిలో భాగస్వాములవుతాము. ప్రజలంతా ఇదే సహకారం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేశాన్ని మరింత ప్రగతి పథంలో నడిపించేలా గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి దీర్ఘాయుష్షు, ఆరోగ్యం ఇవ్వాలని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కోరుకుంటున్నాను’’ అన్నారు.ప్రజలు ఎన్డీఏ కూటమిని నమ్మారు.. వారి నమ్మకాన్ని నిలుపుకొన్నాము..
రాష్ట్రానికి ఆక్సిజన్‌ అందిస్తున్న ప్రధాని మోడీజీ!
గత ప్రభుత్వ అసమర్థత వలన వెంటిలేటర్‌ పైకి వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌ కు ప్రధాని నరేంద్ర మోడీ ఆక్సిజన్‌ అందిస్తున్నారని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేష్‌ అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి లోకేష్‌ మాట్లాడుతూ… ప్రస్తుతం ప్రతి నెలా రూ.4 వేల కోట్ల లోటు బడ్జెట్‌ తో ఏపీ ప్రభుత్వం నడుస్తోంది. వెంటిలేటర్‌ పై ఉన్న రాష్ట్రానికి గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆక్సిజన్‌ అందిస్తున్నారు. అమరావతికి రూ.15 వేల కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ. 12157 కోట్ల కేంద్రం నుంచి సాయం అందించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాతనే భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు వేగవంతం అయ్యాయి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకోవడానికి మన విజనరీ లీడర్‌ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌ పనిచేస్తున్నారు. వెయ్యి రూపాయల పెన్షన్‌ పెంచడానికి 5 ఏళ్లు తీసుకున్న గత ప్రభుత్వాన్ని చూసాం. కానీ చంద్రబాబు గారు ఒకే ఒక్క సంతకంతో వెయ్యి రూపాయల పెన్షన్‌ పెంచారు. మూసేసిన అన్న క్యాంటీన్లు తెరిచాం,దీపం పథకం ద్వారా ఉచి తంగా గ్యాస్‌ సిలిండర్లు ఇస్తున్నారు,త్వరలోనే మెగా డీఎస్సి, త్వరలోనే జాబ్‌ క్యాలెండర్‌ ఇవ్వ బోతున్నారు…దటీజ్‌ సిబిఎన్‌. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చరిత్రలో ఈరోజు సువర్ణాధ్యాయం.
వికసిత్‌ భారత్‌ స్పూర్తితోనే స్వర్ణాంధ్ర 2047
బ్యూటీఫుల్‌ సిటీ ఆఫ్‌ డెస్టినీ విశాఖపట్నం తరపున గౌరవ ప్రధాని నరేంద్రమోడీజీకి స్వాగతం.ప్రతి భారతీయుడి గుండెల్లో నరేంద్ర మోదీ. డీజీ కారణంగా ఈరోజు ప్రపంచమంతా భారత్‌ వైపు చూస్తోంది. నరేంద్రమోడీ పిఎం అనే పదానికి అర్థాన్ని మార్చేశారు, మామూలుగా పిఎం అంటే ప్రైమ్‌ మినిస్టర్‌,నరేంద్ర మోడీజీ పీపుల్స్‌ మ్యాన్‌.నరేంద్ర మోదీ జీ విజన్‌ గ్లోబల్‌. అయినా అతని హృదయం మాత్రం పేద ప్రజలతోనే ఉంటుంది. నమో అంటే పేదవాడి నమ్మకం, పేదవాడి భరోసా,దేశానికి ధైర్యం. పేదల చిరునవ్వు, మహిళల ఆత్మగౌరవం, యువత భవిత, అన్నదాత కళ్ళలో ఆనందానికి ప్రతిరూపం మోడీజీ.వికసిత్‌ భారత్‌ 2047విజన్‌ డాక్యు మెంట్‌ రిలీజ్‌ చేసి 2047కి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తయారు చెయ్యాలనే లక్ష్యంతో మోడీజీ పనిచేస్తున్నారు.2014నాటికి ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ నేడు 5స్థానానికి వచ్చింది.వికసిత్‌ భారత్‌ -2047లక్ష్యంతో టాప్‌ 1లేదా 2ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని మార్చేందుకు మోదీ కృషి చేస్తున్నారు. నరేంద్ర మోదీ వికసిత్‌ భారత్‌ స్ఫూర్తి తో మన సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర -2047 విజన్‌ డాక్యుమెంట్‌ రిలీజ్‌ చేసారు.వ్యవసాయం, విద్య, వైద్యం, పరిశ్రమలు, రెన్యువబుల్‌ ఎనర్జీ, పోర్ట్స్‌, ఎయిర్పోర్ట్స్‌, స్పోర్ట్స్‌ ఇలా అన్ని రంగాల్లో నిర్ణీత లక్ష్యాలతో ముందుకు వెళ్లడమే స్వర్ణాంధ్ర 2047 ముఖ్యోద్దేశం.
ప్రజల నీరాజనాలు
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖలో నిర్వహించిన రోడ్‌ షోలో విశాఖవాసులు అడుగ డుగునా బ్రహ్మరథం పట్టారు.ఒకరోజు జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం విశాఖపట్నం చేరుకున్న పీఎం ఐఎన్‌ఎస్‌ డేగా నుంచి సాయం త్రం స్థానిక వెంకటాద్రి వంటిల్లుకు చేరుకున్నారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఓపెన్‌ టాప్‌ వాహనంలో ప్రధాని నరేంద్ర మోదీ,రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌ కళ్యాణ్‌ రోడ్‌ షో నిర్వహించారు.ఈక్రమంలో ప్రధాని, ముఖ్య మంత్రి, ఉపముఖ్యమంత్రి ప్రజల నుంచి పూల వర్షంతో నీరాజనాలు అందుకున్నారు. సుమారు కిలో మీటరు మేర భారత ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు,పవన్‌ కళ్యాణ్‌ వాహనంపై నుంచి ఇరువైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేసి ముందుకు సాగారు. రోడ్‌ షోలో కూటమి నేతలు, పార్టీ శ్రేణులు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరు కాగా మోదీ.. మోదీ..అనే నామస్మరణతో విశాఖ ప్రాంతం మారుమోగింది. మోదీ, చంద్రబాబు, పవన్‌ రోడ్‌ షో పట్ల విశాఖ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.- జి.ఎన్‌.వి.సతీష్‌

వాయు కాలుష్యంలో ఢల్లీి..ప్రమాద అంచన జనజీవనం

దేశ రాజధాని ఢల్లీిలో వాయు కాలుష్యం నానాటికీ పెరిగిపోతుంది.దట్టమైన పొగమంచు కారణంగా గాలి నాణ్యత క్షీణిస్తోంది.దేశంలో అత్యంత ప్రముఖలుండే కీలక ప్రాంతంలోనే వాయు కాలుష్యం అంతలా పెరుగుతున్నా గట్టి చర్యలు కనిపించడం లేదు.ఈఏడాది మళ్లీ కొరలు చాస్తోంది.వాయు నాణ్యత సూచీలో ఇది 422గా సూచిస్తోంది.కొన్ని రోజులుగా వాయు కాలుష్యం తీవ్ర రూపం దాల్చడంతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఊపరితీసుకోలేకపోతున్నారు.కాలుష్యం దెబ్బకు విద్యాసంస్థలను మూసివేయాల్సి వచ్చింది.విమానాలకు అంతరాయం కలుగుతోంది.సాధారణ జన జీవనం ప్రభావితం అవుతోంది. ఉద్యోగులు ఇళ్ల నుంచే పనిచేస్తున్నారు.
దేశ రాజధాని ఢల్లీి నగరం కాలుష్య రాజధానిగా కూడా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఢల్లీితో పాటు, జాతీయ రాజధాని ప్రాంతం (నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌-ఎన్‌.సి.ఆర్‌)అంతా వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర రీతిలో పెరుగుతోంది.ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (ఎ.క్యు.ఐ)వరుసగా మూడు రోజుల పాటు 500మార్కును దాటడం ప్రమాద తీవ్రతకు నిదర్శనం. నిపుణులు ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా దీనిని అభివర్ణిస్తున్నారు.కొద్ది రోజుల నుండే దేశ రాజధానిలో విద్యాసంస్థలు మూతపడ్డాయి. జెఎన్‌యు ఆన్‌లైన్‌బాట పట్టింది. అనేక ప్రైవేటు సంస్థలు ఇప్పటికే వర్క్‌ ఫ్రం హోం విధానాన్ని అమ లు చేస్తుండగా,తాజాగా ఢల్లీి ప్రభుత్వం సైతం 50శాతం ఉద్యోగులను ఇంటి నుండే పని చేయాలని ఆదేశించింది.పెద్ద సంఖ్యలో ప్రజానీకం రోగాల బారిన పడటం,రోడ్లన్నీ పొగతోనిండి ఊపిరాడని పరిస్థితి నెలకొనడంతో అత్యవసర పనులుంటేనే ప్రజలురోడ్ల మీదకు రావాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.ఇళ్ల దగ్గర కూడా కిటికీలు మూసి ఉంచాలని, నాణ్యమైన ఎయిర్‌ ప్యూరిఫయర్లు వాడుకోవాలని సూచించింది.వీటన్నింటిని పాటించడం ఎందరికి సాధ్యమవుతుందన్న సంగతి అటుంచితే పరిస్థితి తీవ్రతకు నిదర్శనాలుగా భావించవచ్చు.ఈస్థాయి విపత్తును కూడా రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తుండటం, ఆప్‌ సర్కారుకు సహాయ నిరాకరణ చేస్తుండటం మోడీ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం.వర్షాలు కురిస్తే కాలుష్యం అదుపులోకి వచ్చే అవకాశం ఉండటంతో మేఘ మథనానికి అనుమతి ఇవ్వాలని ఆప్‌ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి మోడీ ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గం! రెండు సంవత్సరాల క్రితం ఇటువంటి పరిస్థితే నెలకొన్నప్పుడు వాయుకాలుష్యాన్ని రాజకీయ పోరుగా మార్చవద్దని సర్వోన్నత న్యాయ స్థానం సూచించింది. అయినా కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోవడం బాధాకరం. వాయు కాలు ష్యంతో ఢల్లీి ప్రజానీకం రెండు దశాబ్దాలకు పైగా పోరాటం చేస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా అనేకసార్లు జోక్యం చేసుకుంది.అత్యున్నత న్యాయస్థానం జోక్యంతో పంజాబ్‌,హర్యానాతో పాటు ఢల్లీి పరిసరాల్లో ఉన్న అనేక రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబట్టే సంఘటనలు గత రెండు సంవత్సరాల్లో కొంత మేర తగ్గిన్నట్లు చెబుతున్నారు.అయినా కాలుష్యం తగ్గకపోగా, మరింతగా పెరుగుతోంది. దీంతో ఇతర కారణా లనూ అధికార యంత్రాంగం అన్వేషిస్తోంది.ఉదాహరణకు ఈ నెల 12వ తేది ఒక్కరోజే ఢల్లీి నగరంలో 50 వేలకు పైగా పెళ్లిళ్లు జరిగినట్లు, ఆ సందర్భంగా పెద్ద ఎత్తున బాణాసంచాను కాల్చినట్లు అధికారులు గుర్తించారు. వ్యక్తిగత వాహనాల వినియోగం సాధ్యమైనంత మేర తగ్గించాలని, ప్రజా రవాణా వ్యవస్థను గణనీయంగా పెంచాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు పూర్తి స్థాయిలో అమలు కాలేదు. సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (సి.ఎస్‌.ఇ) అక్టోబర్‌లో చేసిన అధ్యయనం ప్రకారం ఢల్లీి స్థానిక వాయు కాలుష్యంలో రవాణా రంగ వాటా సగానికి పైగా ఉందని తేలింది. 2021లో విడుదలైన ఒకనివేదిక ప్రకారం జాతీయ రాజధాని ప్రాంతంలో కాలుష్యానికి పరిశ్రమలు, భవన నిర్మాణ రంగం కూడా ప్రధాన కారణాలే! 30శాతం ఢల్లీి నగరంలో నగర పాలక సంస్థ సేవలు అందకపోవ డంతో స్థానిక ప్రజలు చెత్తను ఎక్కడపడితే అక్కడ తగల బెడుతున్నారు. ఈ పరిస్థితులే ఢల్లీిని కాలుష్య రాజధానిగా మారుస్తున్నాయి. చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌ రెండు సంవత్సరాల క్రితం రూపొందించిన నివేదికలో కాలుష్య స్థాయి ఇదే మాదిరి కొనసాగితే ఢల్లీి ప్రజానీకం తమ జీవిత కాలంలో 11.9 సంవత్సరాలు కోల్పోతారంటూ హెచ్చరించింది. అయినా కేంద్ర ప్రభుత్వ వైఖరిలో ఎటువంటి మార్పులు రాలేదు. సమిష్టి చర్యల ద్వారానే కాలుష్య నియంత్రణ సాధ్యమవు తుందన్న అంశాన్ని కేంద్రం గుర్తించాలి. ఢల్లీి ప్రభుత్వం తీసుకునే చర్యలకు అవసరమైన సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందచేయాలి. ఎక్కడికక్కడ ప్రజలను చైతన్యవంతం చేయాలి.ఇప్పుడు కూడా ఈదిశలో కదల కపోతే, భవిష్యత్తులో చేయడానికి ఏమీ మిగలని పరిస్థితి ఏర్పడుతుంది.
గాలి కాలుష్యాన్ని ఎలా లెక్కిస్తారు? ఏక్యూఐ ఏ స్థాయికి పెరిగితే మనుషులకు ప్రమాదకరం?
విషపూరితమైన గాలి,పొగ కమ్మేసి,ఏమీ కనిపించని పరిస్థి తులతో దేశ రాజధాని దిల్లీతో పాటు చుట్టుపక్కల నగరా ల్లో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం,సురక్షిత స్థాయిగా భావిం చే గాలి నాణ్యత (ఏక్యూఐ)కన్నా దిల్లీ,చుట్టుపక్కల ప్రాం తాల్లో 30నుంచి35రెట్లు ఎక్కువగా కాలుష్యం ఉంది. నాసా అంతరిక్షం నుంచి తీసినశాటిలైట్‌ చిత్రాల్లో ఉత్త ర భారతదేశంతో పాటు పాకిస్తాన్‌ను కూడా దట్టమైన పొగ కమ్మేసినట్టు కనిపిస్తోంది.దట్టమైన పొగతో విమా నాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.కొన్ని విమానాలు రద్దవుతున్నాయి.స్విట్జర్లాండ్‌కు చెందిన ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌(ఏక్యూఐ)మానిటరింగ్‌ గ్రూప్‌ లెక్కల ప్రకారం, 2023లో ప్రపంచంలో అత్యంత కాలుష్యపూరితమైన రాజధాని దిల్లీ.అత్యంత కాలుష్యపూరితమైన దేశాల జాబి తాలో భారత్‌ మూడో స్థానంలో నిలిచింది. భారత్‌ కంటే ముందు స్థానాల్లో బంగ్లాదేశ్‌,పాకిస్థాన్‌ ఉన్నాయి.
ఏటా భారత్‌లో అక్టోబరు నుంచి జనవరి వరకు శీతాకాలంలో కాలుష్యం తీవ్రస్థాయికి చేరుతుంది.ఉష్ణో గ్రతలు పడిపోవడం,పొగ,దుమ్ము,చల్లని గాలులు, వాహ నాల నుంచి వచ్చే వ్యర్థాలు,చుట్టుపక్కల ప్రాంతాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడంవల్ల వచ్చే పొగ కలిసి ఈ పరిస్థి తిని సృష్టిస్తాయి.భారత్‌లో పరిస్థితి తీవ్రంగా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచ జనా భాలో 99శాతం మంది నాణ్యత లేని గాలిని పీల్చుక ున్నారు. పేద, వెనకబడిన దేశాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది.
గాలి కాలుష్యం ఎలా లెక్కిస్తారు?
మనుషులు చేసే పనుల వల్ల కొంతమేర గాలి కలుషిత మవుతోంది.వాహనాలకు ఉపయోగించే ఇంధనం, వంట నుంచి వచ్చే ఉద్గారాలతో గాలి నాణ్యత తగ్గిపోతోంది. ఇక ధూళి తుపాను, కార్చిచ్చులు, అగ్నిపర్వతాలు పేలడం వంటివి గాలి కాలుష్యానికి ప్రకృతి పరమైన కారణాలు. కాలుష్య స్థాయిని అంచనా వేయడానికి ఎయిర్‌ క్వాలిటీ మానిటర్లు సెన్సర్లను ఉపయోగిస్తాయని యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ తెలిపింది.గాలి కాలుష్యం తీవ్రతను గుర్తించడానికి కొందరు లేజర్లను ఉపయోగిస్తే, మరికొందరు భూమి నుంచి విడుదలయ్యే శక్తిని అంచ నావేయడానికి శాటిలైట్‌ చిత్రాలపై ఆధారపడతారు. మనుషుల ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని దెబ్బతీసే కాలుష్య కారకాలలో పీఎం 2.5, పీఎం 10,ఓజోనో, నైట్రోజన్‌ ఆక్సైడ్‌,సల్ఫర్‌ డయాక్సైడ్‌ వంటివి ఉన్నాయి. పీఎం 2.5లో 2.5మైక్రోమీటర్లు అంతకన్నా తక్కువ మందమైన సూక్ష్మ రేణువులు ఉంటాయి. వీటివల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుంది.ఈసూక్ష్మ రేణువులు మన రక్తనాళా ల్లోకి ప్రవేశించి అనేక రకాల ఆరోగ్య సమస్యలను కలిగి స్తాయి.గాలి నాణ్యత సూచిక(ఏక్యూఐ) స్కేల్‌ సున్నా స్థాయి నుంచి 500 వరకు ఉంటుంది. ఏక్యూఐ సున్నా ఉంటే గాలిలో ఎలాంటి కాలుష్యం లేదని అర్థం. 500 ఉంటే ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్టు లెక్క. గాలి నాణ్యతకు సంబంధించిన సంక్లిష్ట సమాచారాన్ని, ప్రజారోగ్యాన్ని రక్షించడానికి కావాల్సిన చర్యలు తీసుకోగ లిగే సమాచారంగా మార్చే కమ్యూనికేషన్‌ సాధ నం ఏక్యూఐ అని ఐక్యూఎయిర్‌ సంస్థ ప్రతినిధి అర్మన్‌ అరరా డియన్‌ చెప్పారు.
కచ్చితత్వం ఉందా?
ప్రభుత్వ కేంద్రాలు, ఇతర మార్గాలు, శాటిలైట్‌ మానిటర్ల నుంచి వచ్చే ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ సమాచారాన్ని సమ్మిళితం చేసి కాలుష్యాన్ని లెక్కిస్తారని యూఎన్‌ఈపీ తెలిపింది.వాస్తవ పరిస్థితులు, కాలుష్య కారకం ఆధారంగా ఎయిర్‌ క్వాలిటీ ఇండె క్స్‌ రీడిరగ్స్‌ ఉంటాయి.2001లో యూఎన్‌ ఈపీ,ఐక్యూఎయిర్‌ కలిసి తొలి రియల్‌ టైమ్‌ ఎయిర్‌ పొల్యూషన్‌ ఎక్స్‌పోజర్‌ క్యాలి క్యులేటర్‌ను ప్రారంభించాయి.ఇది117 దేశాలకు చెందిన6,475మానిటర్ల నుంచి వచ్చే రీడిరగ్‌లను ఒకేసారి లెక్కిం చగలదు. ‘పీఎం2.5స్థాయి పెరిగేకొద్దీ వృద్ధులు, పిల్లలు,శ్వాస,గుండెసంబంధమైన సమస్య లున్నవారిపై మొదట ప్రభావం పడుతుంది’’ అని అరరాడియన్‌ చెప్పారు.‘‘పీఎం2.5 రేణువులస్థాయి ఇంకా పెరిగే కొద్దీ జనాభా లో ఎక్కువమంది ఆరో గ్యంపై నాణ్యతలేని గాలి ప్రభావం పడు తుంది.పెద్ద సంఖ్యలో ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్య లకు గురయ్యే ప్రమాదముంది’’అని ఆయన చెప్పారు. ప్రత్యేక పర్యవేక్షణ కేంద్రాల నుంచి తీసు కున్న లెక్కల ఆధారంగా ఏక్యూఐఉంటుంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా బిజీరోడ్లు, పారిశ్రామిక జోన్‌ల వంటి ప్రాం తాల్లో గాలికాలుష్యం భిన్నంగాఉం టుంది. బిజీగాఉన్న ప్రాం తాల్లో గాలి కాలుష్యం స్థాయిని లెక్కిం చడా నికి నగరమంతా విస్తృత నెట్‌వర్క్‌ ఉన్న మానిట రింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయా లని అరరాడి యన్‌ సూచించారు.
ఏ స్థాయి కాలుష్యం మనుషులకు ప్రమాదకరం?
డబ్ల్యుహెచ్‌ఓ మార్గదర్శకాల ప్రకారం, ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌(ఏఐక్యూ) వంద లోపు ఉంటే..ఆగాలి మనిషికి సురక్షితమై నది. ఏఐక్యూ 400నుంచి 500ఉంటే గాలి లో కాలుష్యం చాలా ఎక్కువ ఉన్నట్టు.ఈ వారంలో దిల్లీలోని చాలా ప్రాంతాల్లో ఏక్యూఐ 500కు చేరింది. నోయిడా, గురు గ్రామ్‌ వంటి ప్రాంతాల్లో కూడా ఏక్యూఐ లెవల్స్‌ 500కి దగ్గరలో ఉన్నాయి. 2021 లో యూఎన్‌ ఈపీ రిపోర్ట్‌ ప్రకారం,గాలి నాణ్యత పర్యవేక్షణ ప్రపంచంలోని 37శాతం దేశాల్లో చట్టపరమైన అంశం లా లేదు.అనేక పద్ధతుల్లో గాలి నాణ్యత లెక్కించ డంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గాలి కాలుష్యాన్ని గుర్తించడం ప్రభు త్వాల బాధ్యతగా మారేలా చట్టపరంగా చర్య లు తీసుకోవాలని,సమాచారంలో కచ్చిత త్వాన్ని పెంచడానికి మౌలిక సదుపాల యాలు కల్పించాలని యూఎన్‌ఈపీ తెలి పింది.
గాలి కాలుష్యం వల్ల ఎలాంటి జబ్బులొస్తాయి?
సూక్ష్మకణాలు,ఇతర కాలుష్య కారకాలు ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తాయని, రోగనిరోధక వ్యవస్థను బలహీ నం చేస్తాయని,రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిని తగ్గిస్తా యని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. పిల్లలు, వృద్ధులు, పోషకా హార లోపం,సౌకర్యాల లేమితో బాధపడే పేదల్లో శ్వాస కోస సమస్యలు,గుండె సంబంధిత రోగాలు,గుండెపోటు, లంగ్‌ క్యాన్సర్‌ వంటివి వస్తాయని ఆయన తెలిపారు.ఉదాహ రణకు ఆస్తమాపై ఓజోన్‌,సల్ఫర్‌ డై ఆక్సైడ్‌, నైట్రో జన్‌ డై ఆక్సైడ్‌ వంటివి ఊపిరి తిత్తుల వాపు, ఊపిరితిత్తుల పనితీరు మందగించడం వంటి వాటికి కారణమవు తాయి.గర్భస్థ శిశువుల ఆరో గ్యంపైనా నాణ్యత లేని గాలి ప్రభావం ఉంటుందని, కొన్నిసార్లు చనిపోయిన పిల్లలు పుడతారని, అబార్షన్లు జరుగుతాయని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.గాలి కాలుష్యం ప్రభావంతో ప్రపం చవ్యాప్తంగా ఏటా70లక్షల మందితమ ఆయు ర్దాయం కన్నా ముందే చనిపోతు న్నారని డబ్ల్యూ హెచ్‌ఓ తెలిపింది. అందులో దాదాపు 85 శాతం మంది గుండె సంబంధిత వ్యాధు లు,గుండెపోటు,ఊపిరితిత్తుల క్యాన్సర్‌, ఆస్తమా,సీఓపీడీ,డయాబెటిస్‌,వంటి కారణా లతో మర ణిస్తున్నారని డబ్ల్యూహెచ్‌ఓ తెలి పింది. పొగా కు తర్వాత ఎక్కువ మరణాలకు కారణ మవు తోంది గాలి కాలుష్యమని, బహి రంగ ప్రదే శాల్లో గాలి కాలుష్యంవల్ల ప్రపంచ వ్యాప్తంగా చనిపోతున్నవారిలో 90శాతం పేద,అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందిన వారని తెలిపింది.ఆన్‌లైన్‌ కమ్యూనిటీ ప్లాట్‌ ఫామ్‌ లోకల్‌ సర్కిల్స్‌ నిర్వహించిన సర్వేలో దిల్లీ,చుట్ట పక్కల నగరాల్లో 81శాతం కుటుం బాల్లో ఎవరో ఒకరు గడిచిన మూడు వారాల నుంచి కాలుష్యంవల్ల అనారోగ్యంతో బాధ పడుతున్నారు.

కృత్రిమ మేథ ప్రపంచ భవిష్యత్తు

కృత్రిమ మేథ..ఇప్పుడిదే సర్వాంతర్యామి. ఇందుగలదందు సందేహం వలదన్న మాట కృత్రిమమేథకి సరిగ్గా సరిపోతుంది.ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌..అనగానే అదేదో సాప్ట్‌వేర్‌ ఇంజినీర్ల భాష,మనకు సంబంధం లేదనుకుంటాం.కానీ..తెల్లారి లేచిందగ్గర్నుంచి రాత్రి పడుకునేదాకా అడుగడుగునా అది మన వెన్నంటే ఉ ంటోంది.ఒక వస్తువైనా,సేవ అయినా కృత్రిమమేథని అదనంగా చేర్చితే దాని విలువ ఏకంగా రెట్టింపు అవుతోంది.అందుకే..విద్య నుంచి వైద్యం వరకూ,వ్యాపారం నుంచి వ్యవసాయం వరకూ ఇప్పుడు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రమేయం లేని రంగం లేదంటే అతిశయోక్తి కాదు. విద్య,ఉద్యోగం,పాలనా రంగం..అసలు కృత్రిమమేథ ప్రవేశించని రంగమంటూ ఏదీ కనిపించడం లేదు.ఉద్యోగుల హజరు నమోదు చేసే బయోమెట్రిక్‌ సిస్టమ్‌తో మొదలుపెట్టి శాంతిభద్రతను పరిరక్షణకు,ఆనకట్టల పర్యవేక్షణకు వాడే డ్రోన్ల వరకూ పరిపాలనలో కృత్రిమమేథ ఎప్పడో ప్రవేశిచింది.
పిల్లలు బడికెళ్లి చదువుకోవటానికి ఏఐతో ఏమిటీ సంబంధం అనుకుంటే పొరపాటే.మన విద్యారంగంలో ఏఐ మార్కెట్‌ విలువ గతేడాది 75వేల కోట్లు.అది ఏటా 40శాతం చొప్పున పెరుగుతుందట.ఆన్‌లైన్‌ చదువులు వచ్చాక,తరగతి గదిలో టీచరు చెప్పాల్సిన పాఠాలను రకరకాల ఆప్స్‌ ద్వారా ఫోన్‌ తెరమీద చెప్పడానికీ,ఆన్‌లైన్‌ పరీక్షల నిర్వహణకీ ఏఐ సాయం కీలకమవుతోంది.విద్యార్ది సామర్ధ్యాలనూ నైపుణ్యాలనూ బేరీజువేసి ఒక్కోక్కరి బలాబలాలను గుర్తించడం ద్వారా టీచర్లు వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేకశ్రద్ద తీసుకోవడానికి వీలు కలుగుతోంది.
తప్పులేకుండా ఉద్యోగానికి దరఖాస్తు రాయడమెలా అన్న సందేహం అక్కర్లేదిప్పుడు.గ్రామర్లీ లాంటి ఏఐ ఎనేబుల్డ్‌ సాప్ట్‌వేర్‌ తోడుంటే అది సాద్యమే.ఒక్కో వాక్యం రాసేటప్పుడే తప్పల్లేకుండా దరఖాస్తుని దిద్దిపెడుతుంది ఆ సాప్ట్‌వేర్‌.
కృత్రిమమేథ సాయంతో యంత్రాలు ఇప్పుడు చదవగలవు.రాయగలవు.మాట్లాడగలవు.మనిషి చేసే ఎన్నో పనుల్ని అవి చేయగలుగుతున్నాయి.కాబట్టి వాటికి ఆ పనులు అప్పజేప్పి మనుషులు అంతకన్నా పైస్థాయిలో సృజనాత్మకత,ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌ అవసరమైన పనులు చేసుకోవాలన్నది నిపుణుల సూచన.అంటే,ఇక ముందు ఏఐ అన్ని రంగాల్లోనూ మనకి కుడిభజంగా మారనుందన్న మాట.!
1950ల నుండి కృత్రిమమేధస్సు(ఎఐAI)విషయంలో అనేక పరిశోధనలు జరిగి,అది సిద్ధించి… ప్రస్తుతం మానవజాతిచేతిలో ఒక కొత్తసాధనం సమకూరింది.నవంబర్‌ 2022లో విడుదలైన చాట్‌ జిపిటి దీనికి ఒక తాజా ఉదాహరణ. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో ప్రపంచ భవితవ్యం ఏమి కానుంది అనే చర్చ కూడా మొదలయింది.ఇది కార్పొరేట్‌ ప్రపంచానికి అందివచ్చిన ఫాసిస్టు ఆయుధం అని కొందరు వ్యాఖ్యానించారు.కృత్రిమ మేధస్సు అంటే యంత్రాలు,ముఖ్యంగా కంప్యూటర్‌ వ్యవస్థల ద్వారా మానవ మేధస్సులో జరిగే ప్రక్రియలను అనుకరించడం.డేటాసేకరణ,డేటాఎంట్రీ,కస్టమర్‌ ఫోకస్డ్‌ బిజినెస్‌, ఇ-మెయిల్‌ ప్రతిస్పందనలు,సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌,ఇన్వాయిస్‌ జనరేషన్‌ వంటి యాంత్రికంగా పునరా వృతం చేసే సాధారణ(రొటీన్‌)పనులను ఆటోమేషన్‌చేసి పనిలో విసుగుదలను తగ్గించి మనిషి మరింత సృజనా త్మకంగా చేసుకోవాల్సిన పనులకు సమయం కల్పిస్తుంది.
పరిశ్రమల ఉత్పత్తులను పెంచడం,పునరుత్పాదక ఇంధన సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ది చేయడం, రవాణా సౌకర్యాలను సముచితంగా నిర్వహించటం,విద్యబోధన,ఆరోగ్య సంరక్షణ,వాతావరణ పరిరక్షణ వంటి అనేక రంగాల కోసం అవసరమైనమార్పులు సూచిస్తుంది.పేదరికం,ఆకలికి వ్యతిరేకంగా పోరాడటం లో కూడా సహాయపడుతుంది.ఆరోగ్యసంరక్షణలో ఎఐ,వ్యాధి నిర్ధారణను మెరుగుపరచడానికీ,కొత్త చికిత్సలను అభివృద్ధి చేయడానికీ సహాయపడుతుంది. ప్రాణాంతక వ్యాధుల నివారణలతో సహా ఔషధాలలో పురోగతికి ఇది తోడ్పడుతుంది.విద్యరంగానికి ఇదిమరింత ఆకర్షణీయమైన,అద్భుతమైన అభ్యాస అనుభ వాలను అందించగలదు.వర్చువల్‌,ఆగ్మెంటెడ్‌ రియాలిటీ టెక్నాలజీలవల్ల పరస్పర సంభాషణా రీతిలోను (ఇంటరాక్టివ్‌’,బోధనలో పూర్తిగా లీనమయ్యే పద్ధతిలోనూ (ఇమ్మర్సివ్‌) నేర్చుకోవడం జరుగుతుంది. చదువుకోవటం ఒక ఆకట్టుకునే ప్రక్రియగా మారుతుంది.
కృత్రిమ మేధ సమాజంలోను,దైనందిన జీవితంలోను అనేక మార్పులు తెస్తోంది.సిరి,గూగుల్‌ అసిస్టెంట్‌, అమెజాన్‌ అలెక్సా వంటి కృత్రిమ మేధ ఆధారిత వ్యక్తిగత సహాయక యాప్‌లు స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌ స్పీకర్లు,ఇతర పరికరాలతో అనుసంధానించబడి అనేక రకాల పనులనుచేస్తుంది. మన జీవితాలను సులభతరం,సౌకర్యవంతం,సౌఖ్యవంతం చేస్తుంది.కాకుంటే మానవులు యంత్రాలపై ఆధారపడటం మరింత పెరుగుతుంది.అది సోమరితనానికి దారి తీస్తుంది.పనిలో సృజనాత్మకత,భావోద్వేగం లేకపోవడం వంటి లోపాలు వుంటాయి.అంతేకాక సమాజపరంగా కొన్నినష్టాలు కూడా సంభవిస్తాయి.చాలా మంది ఉద్యోగాలు కోల్పోతారు.ఎక్కువగా సమాచార కార్మికుల ఉద్యోగాలకు,వైట్‌-కాలర్‌ ఉద్యోగాలకు ముప్పు వస్తుంది.కృత్రిమమేధ సాంకేతికపరిజ్ఞానం – (బప్పా సిన్హా,/ఆంజనేయ రాజు)

గ్రోత్‌ హాబ్‌గా మహావిశాఖనగరం

కణితి మార్కెట్‌ రోడ్లో జరిగిన దీపం -2 పథకం ప్రారంభోత్సవంలో కలెక్టర్‌ ఎం.ఎన్‌. హరేంధిర ప్రసాద్‌
గాజువాక ప్రాంతంలో ఇళ్ల క్రమబద్దీకరణ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ
విశాఖపట్టణం(గాజువాక) ః ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజల సహకా రంతో విశాఖ మహా నగరాన్ని గ్రోత్‌ హబ్‌ గా తీర్చిదిద్దుతామని, ప్రజల ఆకాంక్షలకు, ఆశయాలకు అద్దం పడుతూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌. హరేంధిర ప్రసాద్‌ పేర్కొన్నారు. నీతి ఆయోగ్‌ సహాయంతో ఇప్పటికే సమగ్ర ప్రణాళికలు రూపొందించామని గుర్తు చేశారు.కేంద్ర, రాష్ట్ర డబుల్‌ ఇంజన్‌ సర్కారులో ప్రజలకు సత్వర సేవలను అందించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందని, ప్రజా సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుం టున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన దీపం-2 పథకం ఉచిత గ్యాస్‌ సిలిం డర్ల పంపణీ జిల్లాస్థాయి కార్యక్రమం గాజు వాక పరిధిలోని కణితి మార్కెట్‌ రోడ్లో అట్ట హాసంగా జరిగింది. ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివా సరావులతో కలిసి జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌. హరేంధిర ప్రసాద్‌,జాయింట్‌ కలెక్టర్‌ కె.మ యూర్‌ అశోక్‌ భాగస్వామ్యమయ్యారు.ఈ సంద ర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ దీపం పథకం ద్వారా పేదల ఇళ్లల్లో కొత్త వెలుగులు వస్తా యని,శ్వాసకోస సంబంధిత వ్యాధులు దూరమ వుతాయని, మహిళలకు సాంత్వన చేకూరు తుందని అన్నారు.జిల్లాలో టీబీ కారణంగా ఎంతో మంది చనిపోయారని,దానికి ప్రధాన కారణం కట్టెల పొయ్యిల వినియోగమే అని గుర్తు చేశారు.డబుల్‌ ఇంజన్‌ సర్కారులో ప్రజ లకు సత్వరమే సేవలు అందుతున్నాయని, సంక్షేమం,అభివృద్ధికి మంచి అవకాశాలు ఉన్నా యన్నారు.దానిలో భాగంగా టీసీఎస్‌ విశాఖ పట్టణానికి వస్తోందని,మెగా డీఎస్సీ కూడా వస్తోందని పేర్కొన్నారు.ప్రభుత్వ విధానాల ఫలి తంగా జిల్లాకు పరిశ్రమలు కూడా వస్తున్నా యని గుర్తు చేశారు.స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రస్తావించిన ఇళ్ల స్థలాల క్రమ బద్దీకరణ,స్టీల్‌ ప్లాంటు విషయంలో అనుసరిం చే విధానాలపై కలెక్టర్‌ ఈ సంద ర్భంగా స్పందించారు.జీవో నెం.301విషయంలో సానుకూల నిర్ణయం తీసు కుంటామని, దీనిపై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించామని చెప్పారు.అలాగే స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో సానుకూలంగా ఉన్నామని దానిలో భాగంగా నే రెండో బ్లాస్ట్‌ ఫర్నేస్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని తెలి పారు.అందరి సహకా రంతో అందరికీ న్యాయం చేస్తామని, మంచి సేవలు అంది స్తామని,జిల్లా అభివృద్ధికి అవిరళ కృషి చేస్తామని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఇదిలా ఉం డగా జిల్లాలోని అన్ని నియోజక వర్గాల పరిధిలో ప్రస్తుతం 3,76,924గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయని వాటిలో అర్హులైన అందరికీ దీపం పథకంలో ఉచిత సిలిండర్ల పంపిణీ చేస్తామని జిల్లా సివిల్‌ సప్లై అధి కారి తెలిపారు.కార్యక్రమంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్సీ,ఎమ్మెల్యే, కలెక్టర్‌,జాయింట్‌ కలెక్టర్‌,డీఎస్వో తదిత రుల చేతుల మీదుగా ఉచిత సిలిండర్లను పంపిణీ చేశారు.కార్యక్రమంలో జిల్లా సివిల్‌ సప్లై అధికారి భాస్కరరావు,స్థానిక ప్రజా ప్రతినిధులు, ఇతర అధికారులు, అధిక సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు.-జి.ఎన్‌.వి.సతీష్‌

జాతీయ డ్రోన్‌ కాపిటిల్‌ అమరావతి

ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా అమరావతి డ్రోన్‌ సమ్మిట్‌ నిర్వహించడం సంతోషంగా ఉందని..ఇది భవిష్యత్తు నాలెడ్జ్‌ ఎకానమీలో గేమ్‌ ఛేంజర్‌ అని ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు అన్నారు. అక్టోబర్‌ 22న మంగళగిరిలోని సీకే కన్వెన్షన్స్‌లో కేంద్ర పౌర విమానయాన శాఖ,ఏపీ డ్రోన్స్‌ కార్పొ రేషన్‌ సంయుక్తంగా ఏర్పాటు చేసిన అమ రావతి డ్రోన్‌ సమ్మిట్‌ను కేంద్ర పౌర విమాన యాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, రాష్ట్ర మౌలిక వసతులు,పెట్టుబడుల శాఖ మంత్రివర్యులు బీసీ జనార్ధన్‌ రెడ్డి తది తరులతో కలిసి సీఎం చంద్రబాబు ప్రారంభిం చారు.అనంతరం ఆయన మాట్లాడుతూ… 1995లో నేను ఐటీ విధానం గురిం చి మాట్లాడితే ఆరోజు ఆమాటలు కొందరికి అర్థం కాలేదని..సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఐటీ రంగాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుని పెద్దఎత్తున ప్రమోట్‌ చేసినట్లు తెలిపారు.బెంగళూరులో ఉన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అక్కడ ఐటీ కంపెనీల ఏర్పాటుకు గతంలో పరిస్థితులు అనుకూలంగా ఉండేవని..తాను వివిధ ఐటీ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి హైదరా బాద్‌కు ఐటీ పరిశ్రమలు తెచ్చేందుకు కృషిచే శానన్నారు. వాటి ఫలితమే నేడు హైదరాబాద్‌ ఐటీ రంగంలో అభివృద్ధి పథంలో నడుస్తోందని తెలిపారు. పీపీపీ విధానంలో హైటెక్‌ సిటీని నిర్మించినట్లు తెలిపారు.ఆ సమయంలో అమెరికాలో 15రోజులు పాటు పర్యటించి అనేక మంది ఐటీ నిపుణులతో సంప్రదించి ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఇంకా ఏమన్నారంటే.. నాడు నేను ఒకటే చెప్పా…టెక్నాలజీలో ఇండియా బలమైన దేశమని. బ్రిటిష్‌ వారు మన దేశాన్ని వదిలివెళ్లేటప్పుడు దేశ సంపదతో పాటు కోహినూర్‌ వజ్రాన్ని తీసుకెళ్లారు.అయితే ఇంగ్లీష్‌ను వదిలివెళ్లారు.నేడు ప్రపంచంలోనే ఇంగ్లీష్‌ మాట్లాడేవారు ఇండియాలోనే ఎక్కువ మంది ఉన్నారు.గణితంలోనూ ఇండియా వారు బలమైనవారు. సున్నాను కనిపెట్టింది కూడా ఇండియా వారే.బిల్‌ గేట్స్‌ను కూడా గతంలో హైదరాబాద్‌కు ఆహ్వానించి ఇక్కడి పరిస్థితులు వివరించాం.టెలీ కమ్యూనికేషన్‌లో డీ రెగ్యు లేషన్‌ గురించి నాటి ప్రధాని వాజ్‌పేయ్‌ని ఒప్పించాం.సెల్‌ ఫోన్‌ అన్నం పెడుతుందా అంటూ వెకిలిగా మాట్లాడారు.ఐటీ రంగంలో భారతీయులు బలమైనవారు.బయో టెక్నాలజీ,ఫార్మాలో భారతీయులు సమర్థవం తులు.టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో తెలుగు ప్రజలు ఎప్పుడూ ముందుం టారు.అడ్వాన్స్‌డ్రోన్స్‌,సీసీటీవీ కెమెరాలు, యాప్‌లు,ఇతర టెక్నాలజీ పరికరాల విని యోగంలో ముందున్నాం.ఐటీ గురించి మాట్లాడిన సందర్భంలో ఉద్యోగాలు చేయడమే కాదు…ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వెళ్లాలని చెప్పాను.ప్రపంచంలో భారతీయులు ఎక్కువ తలసరి ఆదాయం పొందుతున్నారు. అందులో తెలుగువారు 30శాతం మంది ఉన్నారు. విమాన సదుపాయం లేని సమయంలో ఢల్లీి, ముంబైలో దిగి హైదరాబాద్‌ రావాలని చెప్పాను.వ్యాపారాలు చూసు కుని వెళ్లండని కోరాను…దానికి కారణం హైదరాబాద్‌కు నాడు సరైన విమాన సదుపాయం లేకపో వడమే.నాటి ప్రధాని వాజ్‌పేయిని ఒప్పించి ఓపెన్‌ స్కై పాలసీ తెచ్చేలా కృషి చేశాం. అప్పుడు మొదటి సారి ఎమిరేట్స్‌ నుండి హైద రాబాద్‌ విమానం నడిచింది.ఆ సమయంలోనే గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌ పోర్టుకు శ్రీకారం చుట్టాం. 32 సార్లు ప్రధానమంత్రి,విమానయాన శాఖ అధికారులతో చర్చించాం.
గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌ పోర్టు నిర్మాణం తర్వాత హైదరాబాద్‌కు ఔటర్‌ రింగ్‌రోడ్‌,బయోటెక్నాలజీ పార్క్‌,ఐటీ,ఫార్మా రంగాల్లో పెద్ద సంస్థలను తీసుకొచ్చాం. ఇప్పుడు దేశంలోనే హైదరాబాద్‌ బెస్ట్‌ నివాసయోగ్య సిటీ అని గర్వంగా చెప్తుకుం టున్నాం.మన దేశానికి ఒక డైనమిక్‌ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నారు. ఇండియన్‌ బ్రాండ్‌ ను ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్నారు. వికసిత్‌ భారత్‌ 2047 ద్వారా ఇండియాను ప్రపంచంలో నెంబర్‌ 1లేదా నెంబర్‌ 2 స్థానంలో ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నారని నేను బలంగా నమ్ముతున్నాను. నేడు ప్రపంచంలోనే డిజిటల్‌ కరెన్సీని ఎక్కువగా ఉపయోగించేది ఇండియన్స్‌.జన్‌ ధన్‌,ఆధార్‌ మొబైల్‌ (జామ్‌) అనుసంధానం చేస్తున్నారు.ఆయుష్మాన్‌ భారత్‌ వంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టారు.రాబోయే కాలం అంతా డేటాదే. ఎంత డేటా ఉంటే దేశానికి, పెట్టుబడిదారులకు అంత బాగుంటుంది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ),మెషీన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌)ద్వారా నిర్ధిష్టమైన సమా చారాన్ని పొందవచ్చు.డ్రోన్స్‌ను మనం ఎక్కడికైనా పంపవచ్చు…సరైన సమాచారాన్ని పొందవచ్చు. ఇటీవల విజయవాడలో పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి.ఆ సమయంలో బాధితులకు ఆహారం కలుషితం కాకుండా, వృధా కాకుండా అందించడానికి దేశంలోనే మొదటిసారిగా డ్రోన్లు వినియోగించి బాధితు లకు ఆహారం అందించాం.హెలికాప్టర్ల ద్వారా ఆహారం అందించిన సందర్భంలో పైనుంచి వేయడంతో ఆహార పొట్లాలు పగిలిపోయేవి. కానీ..డ్రోన్ల ద్వారా సురక్షితంగా1.50లక్షల మందికి ఆహారం అందించాం.
అంతేకాదు డ్రోన్లు సిటీలోకి పంపి ఎంత చెత్త ఎక్కడ పేరుకుపోయిందో కూడా సర్వే చేశాం. సరైన సమయంలో అన్నింటిని గుర్తించి 20 మెట్రిక్‌ టన్నుల చెత్తను నాలుగు రోజుల్లోనే తొలగించాం.రోడ్లు ఎక్కడ సరిగా లేకపోయినా డ్రోన్లు పంపి సమాచారం తెప్పించాం.ఏరోడ్డు పక్కన చెత్త ఉన్నా పరిశీలించి శుభ్రం చేయిం చాం.వరద నీరు బయటకు పోవడానికి కారణం డ్రెయిన్లు మూసుకుపోవడమని.. బ్లాక్‌లను గుర్తించి,వాటిని తొలగించి నీటిని బయటకు పంపాం.భవిష్యత్తులో డ్రోన్లు గేమ్‌ ఛేంజర్లుగా చెప్పొచ్చు.వ్యవసాయం, ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌ తదితరాల్లో వాటిని వినియోగించవచ్చు. విజిబుల్‌ పోలీసింగ్‌…ఇన్‌ విజిబిల్‌ పోలీస్‌కు ప్రాధాన్యమిస్తున్నాం.టెక్నాలజీ సహాయంతో నేరగాళ్ల ఆటకట్టిస్తాం. ప్రతి అంశంలోనూ ఖచ్చితత్వాన్ని సాధించడంతో పాటు చివరి మైలు వరకు అభివృద్ధి,సంక్షేమ ఫలాలు అందించడంలో టెక్నాలజీని వినియోగించు కుంటాం.భూసార పరీక్షలు, పురుగుమందుల పిచికారీ,భూసర్వే,భూసార పరీక్షలు తదితరా లను డ్రోన్ల ద్వారా నిర్వహించవచ్చు. కనీసం100నుండి 150వరకు డ్రోన్‌ అప్లికే షన్స్‌ (డ్రోన్‌యూజ్‌ కేస్‌లు)వినియోగం లక్ష్యంగా పనిచేస్తున్నాం.అప్లికేషన్స్‌ను క్షేత్ర స్థాయిలో పరీక్షించి ఆయా కంపెనీలకు సరైన విధంగా ఫీడ్‌బ్యాక్‌ ఇచ్చేలా పైలట్‌ ప్రాజెక్టులకు వీలుకల్పిస్తాం.నాకు కావాల్సింది డ్రోన్ల ద్వారా అభివృద్ధి. ఇండియాకు రెండంకెల వృద్ధిరేటు సాధించే సత్తా ఉంది.నాలెడ్జ్‌ ఎకానమీలో గ్లోబల్‌ సర్వీస్‌లు అందించగల సత్తా కూడా మన దేశానికి ఉంది.పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, విద్యావేత్తల నుండి సల హాలు,సూచలను తీసుకుని డ్రోన్‌ పాలసీని ప్రవేశపెడతాం.15రోజుల్లోనే డ్రోన్‌ పాలసీని ఆవిష్కరిస్తాం.కనీసం 35వేలకు పైగా డ్రోన్‌ ఫైలట్లకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టు కున్నాం.డ్రోన్‌ సిటీ ఆఫ్‌ ఇండియాగా అమ రావతిని తీర్చిదిద్దుతాం.ఏఐ,ఎమ్‌ఎల్‌.. ప్రతి ఒక్కరి జీవితాలను ప్రభావితం చేస్తాయి. మీఅందరికీ ఒక సూచన ఇస్తున్నా…థింక్‌ గ్లోబల్లీ..యాక్ట్‌ గ్లోబల్లీ విధానాన్ని అనుస రించాలి.ఓర్వకల్లు ఇండస్ట్రియల్‌ పార్కులో డ్రోన్‌ హబ్‌ కోసం 300ఎకరాలు కేటా యిస్తాం.అక్కడ డ్రోన్‌ హబ్‌ ఏర్పాటు చేస్తే పెద్ద నగరాలైన హైదరబాద్‌,చెన్నై,బెంగళూరు, అమ రావతికి దగ్గరగా ఉంటుంది.అక్కడ డ్రోన్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌కు సహకారం అందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాం.నేను డ్రోన్లు తయారీదారులకు కూడా చెప్తున్నా….మీకు నేను అంబాసిడర్‌ గా ఉంటాను….మీ మార్కెట్‌ ను ప్రమోట్‌ చేస్తా. నేను చాలా మంది ప్రధాను లను చూశాను కానీ టెక్నాలజీని ఇంతగా అర్థం చేసుకునే వ్యక్తి ప్రధాని మోదీ. స్నేహ పూర్వక వాతావరణంలో విధానాల రూపకల్ప నకు సిద్ధంగా ఉన్నాం.స్టూడెంట్స్‌,టీచర్స్‌, ప్రొఫెసర్స్‌కు కూడా చెప్తున్నా నాలెడ్జ్‌ ఎకానమీకి ఇది మంచి సమయం.ప్రతిదీ అందుబాటులో ఉంది. ప్రతి దాన్ని ఎలా వినియోగించుకోవాలో ఆలోచిస్తే ఇండియన్స్‌ను ఎవరూ ఎదుర్కోలేరు.నేడు మన దేశం యువ జనాభా తద్వారా యంగ్‌ టాలెంట్‌తో తొణికిస లాడుతోంది.కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం, రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ కూడా టెక్నాలజీ,ఇన్నోవేషన్‌లో భాగస్వాములవు తున్నారు. సమష్టి భాగస్వామ్యంతో రాష్ట్రాన్ని డ్రోన్‌ హబ్‌గా మారుస్తాం.రాష్ట్రంలోని యూనివర్సిటీలు కూడా థియరిటికల్‌ విద్యకే కాకుండా అప్లికేషన్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. నవ టెక్‌ ఆవిష్కరణలు దిశగా యువతను ప్రోత్స హించాలి. రాష్ట్రంలో5రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం.అమరావతిలో హెడ్‌ క్వార్టర్‌ ఉంటుంది..మిగతావి విశాఖ, రాజమండ్రి, తిరుపతి, అనంతపురంలో ఏర్పాటు చేస్తున్నాం.2047 నాటికి ఒక కుటుంబం…ఒక వ్యాపారవేత్త ఉండాలన్నది నా అభిమతం.25ఏళ్ల క్రితం ప్రతి కుటుంబంలో ఒక ఐటీ వ్యక్తి ఉండాలని ఆకాంక్షించాని..అదే విధంగా ఇప్పుడు చెప్తున్నా ఒక కుటుంబంలో ఒకవ్యాపారవేత్త, ఒక స్టార్టప్‌ కంపెనీ ఉండా లని చెప్తున్నా. ఇది సక్సెస్‌ అయితే భారత్‌.. టెక్నాలజీ,గ్లోబల్‌ సర్వీసెస్‌లో ముందుంటుంది. -జిఎన్‌వి సతీష్‌

1 2 3 11