ఆరోగ్యం రాజ్యాంగ హ‌క్కు కావాలి

రాజ్యాంగ పరమైన ఆరోగ్య హక్కువల్ల, వెంటనే ఆర్థిక పరమైన రక్షణ లభిస్తుంది. అధికపెట్టు బడివల్ల, కుటుంబ పొదుపు, ఉద్యోగ అవకాశాలు ఒక వైపు,సుదూర భవిష్య త్తులో,ఉద్వేగపూరితమైన, మానసిక పరమైన,సామాజిక పరమైన రక్షణ విషయం లో ప్రజలపై చెప్పుకోదగ్గ ప్రభావాన్ని గమనించ గలం. ప్రపంచంలోని,చిన్న,పెద్ద దేశాలు కూడా మహమ్మారి నుండి కోలుకోవ డానికి,విధాన నిర్ణయాలలో,పెట్టుబడుల విషయంలో ముందు చూపుతో అనేక చర్యలు చేపడు తున్నాయి. భారత దేశం ఈ విషయంలో వెనుకబడరాదు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత నిర్భంధ విద్య నిస్సందేహంగా విలువైన వారసత్వాలలో ఒకటి. ధైర్యమైన నాయక త్వానికి నిజమైన నిదర్శనం.మానవునికి ఉన్న పరిమితమైన జ్ఞాపక శక్తి, తరచుగా మన సమిష్టిబాధల నుండి ఉపశ మనం పొందడానికి ఉపకరిస్తుంది. కానీ, బాధల నుండి నేర్చుకునే గుణపాఠాలు మరింత కీలకమైనవి. నోవెల్‌ కరోనావైరస్‌ మహమ్మారి ఫలితంగా,మన ప్రజలు వ్యక్తిగతంగా,సమిష్టిగా ఎదుర్కొంటున్న విషాదకరమైన పరిస్థితులను దృష్టిలోఉంచుకుని, ముందు చూపుతో అవసర మైన గుణపాఠాలను తీసు కోవడం మన నాయ కత్వం యొక్క నైతిక బాధ్యతకావాలి. దీని నుండి తీసుకోవాల్సిన గుణపాఠం ఏమంటే ‘అందరికీ ఆరోగ్య హక్కు’ అవసరాన్ని గుర్తిం చడం. కరోనా మహమ్మారి మన ఆరోగ్య రక్షణ వ్యవస్థలోని లోపాలను బహిర్గతం చేసింది.ఈ సమస్యను మనం నిర్లక్ష్యం చేయడంగానీ,నేర్చుకో కుండా ఉండడంగానీ చేయలేము.

ఆరోగ్యాన్ని ఒక ప్రాథమిక హక్కుగా ప్రకటిం చడం కోసం,రాజ్యాంగంలో అత్యవసరమైన చర్యలతో,అవసరమైన మార్పులు చేయడానికి పార్లమెంటులో అనుకూలంగా మద్దతు లభించింది. ప్రస్తుతం ఈ అనుకూలతను,మన దేశ ప్రజల కోసం ఆచరణలోకి తేవడానికి సమయం ఆసన్నమైంది. దీనివల్ల మన ప్రజలు గతంలో పడిన బాధలు మరెప్పుడూ పడ కూడదు. భారత పౌరులకు రాజ్యాంగపరమైన ఆరోగ్య హక్కు అంటే ఏమిటి? అనే ప్రాధ మికమైన ప్రశ్న ఎదురైంది. మూడు రకాల పౌరులను దష్టిలో ఉంచుకొని నేను వివరిం చడానికి ప్రయత్నిస్తాను. వారిలో రైతులు, అసంఘటిత కార్మికులు,స్త్రీలు,పిల్లలు ఉన్నారు. మనం జీవించడానికి గల ప్రాథమిక హక్కులను పరిరక్షించగలిగిన వారు రైతులు మాత్రమే. అయినా,అత్యధిక శాతం రైతులు, వారి హక్కులు,సంక్షేమం, కుటుంబాల విషయానికి వచ్చినప్పుడు ఈనాటికీ వెనుక బడే ఉన్నారు. తీవ్రమైన రోగాలతో జబ్బున పడిన సమ యంలో,తరాలుగా చిన్న పిల్లలు, భూమి లేని రైతులు,అసంఘటిత కార్మికులు, వలస కార్మి కులు,కాలానుగుణంగా పని చేసే కార్మికులు, తమ పరిమితమైన సంపాదన నుండి వైద్య ఖర్చులు భరిస్తూ, భరింపరాని అప్పుల ఊబి లోకి,బానిసత్వంలోకి నెట్టబడ్డారు. ఉపాధి కల్పనా పధకాలు వారి దరికి చేరడంలేదు. చేరినా,అవన్నీ కాగితాలకే పరిమితమవుతున్నా యి.‘ఆరోగ్య హక్కు’ను కల్పించినట్లయితే అలాంటి ఆరోగ్య సంరక్షణ అవసరమైన వారికి, సాధారణమైన,పారదర్శకమైన,నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడానికి వీలువుతుంది. మన ఆరోగ్య వ్యవస్థలో ఉన్న లోపాలు, అసమాన తలవల్ల,స్త్రీలు విపరీతమైన భారాన్ని భరించ వలసి వస్తున్నది. వారి ఆరోగ్యం చుట్టూ అలము కొని ఉన్న నిషేధాలు,పరిమితులు, పితృ స్వామిక నిబంధనలవల్ల,అధిక మించగల్గిన ఎన్నో ఇబ్బందుల నుండి కూడా బయట పడలేని స్థితిలో ఉన్నారు. దీనితో పాటు,వారికి సమాజికంగా,ఆర్థికంగా ఉన్న సవాళ్లు, స్వేచ్ఛగా తమకు లభ్యమయ్యే పరిమితమైన సంరక్షణలు పొందడంలో కూడా అవరోధం అవుతున్నాయి. ‘ఆరోగ్య హక్కు’ అంటే అర్థం,ఎప్పుడైనా ఎక్కడైనా స్త్రీలకు అవసరమైనప్పుడు వైద్య సేవలు వారికి అందుబాటులో ఉండటమే. మనదేశంలో అత్యంత పేదలైన .అట్టడుగు వర్గాలకు చెందిన, అధిక సంఖ్యాకులైన పిల్లలు పొలాల్లో, గనులలో,ఇటుక బట్టీలలో, కర్మాగా రాలలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులలో పనిచేస్తూ పెరుగుతున్నారు. వారు,వత్తిడితో కూడిన కుటుంబ ఆర్థిక అవసరాలరీత్యా, పాఠశాలలలో నమోదు చేసుకోవడంగానీ, హాజరు కావడంగానీ, జరగడంలేదు. తరచుగా వైద్య ఖర్చులకోసం జేబులో నుండి డబ్బులు ఖర్చు చేయవలసి రావడంవల్ల కూడా ఈ పరిస్థితి నెలకొంటున్నది. అలాంటి బాలకార్మిక వ్యవస్థ నుండి,వెట్టి చాకిరీ నుండి,అక్రమ రవాణా నుండి లక్ష మంది పిల్లలను రక్షించాము. ఆ సమయంలో,ఈ పిల్లలు క్లిష్టమైన పనుల ప్రభావంవల్ల ప్రాధమికంగా క్షయ,చర్మ వ్యాధులు దష్టి లోపం పౌష్ఠికాహార లోపంతో పాటు, మానసిక ఆరోగ్య సమస్యలకు కూడా గురవుతున్నారు. ఈ పిల్లలకు,బాల్యపు ప్రారంభదశలో, అవసరమైన సంరక్షణలు నిరాకరించబడ్డాయి. దీనివలన ఈ సమస్యలను జీవిత కాలం వారు అనుభవించవలసి వస్తున్నది. ఆరోగ్య హక్కును కల్పించినట్లయితే, పిల్లలు దోపిడీ చేయబడే స్థాయినుండి రక్షణతో కూడిన భవిష్యత్‌ వైపుగా మార్పు చెందడానికి వీలవుతుంది.రాజ్యాంగ పరమైన ‘’ఆరోగ్య హక్కు’’ కేవలం మన ఆరోగ్యాన్ని మెరుగు పర్చడంతోపాటు, మన ప్రజలయొక్క సంక్షేమానికీ,అభివద్ధికర, సత్వర ఆర్థిక పురోభివద్ధికి దోహదపడుతుంది. ప్రస్తుత పరిస్థితులలో,ఆరోగ్య సంరక్షణకు సంబంధించి ప్రభుత్వం పెడుతున్న ఏరకమైన పెట్టుబడు లైనా,భారత ప్రజలలో భద్రతా భావాన్ని పెంచడంలోగానీ,వారు రక్షణ కవచంగా నిలువ డంలో గానీ విఫలమయ్యాయి. దీనితో పాటు, ఇప్పటికే సంక్లిష్టంగాఉన్న ఆరోగ్య సంరక్షణలను, అనైతికమైన పద్దతులలో వినియోగించడంవల్ల, ప్రజలకు ఉపశమనం కలగకపోగా మరిన్ని ఇబ్బందులు ఎదురవు తున్నాయి. ఆరోగ్యానికి రాజ్యాంగ పరమైన హక్కులు కల్పించి నట్లయితే,ఆయుష్మాన్‌ భారత్‌ యొక్క లక్ష్యం బలపడుతుంది. రాజ్యాంగ పరమైన ఆరోగ్య హక్కువల్ల, వెంటనే ఆర్థిక పరమైన రక్షణ లభిస్తుంది. అధికపెట్టుబడివల్ల, కుటుంబ పొదుపు, ఉద్యోగ అవకాశాలు ఒక వైపు, సుదూర భవిష్యత్తులో,ఉద్వేగపూరితమైన, మానసికపరమైన,సామాజిక పరమైన రక్షణ విషయంలో ప్రజలపై చెప్పుకోదగ్గ ప్రభావాన్ని గమనించగలం. ప్రపంచంలోని,చిన్న,పెద్ద దేశాలు కూడా మహమ్మారి నుండి కోలుకోవ డానికి,విధాన నిర్ణయాలలో,పెట్టుబడుల విష యంలో ముందు చూపుతో అనేక చర్యలు చేపడుతున్నాయి. భారత దేశం ఈవిషయంలో వెనుకబడరాదు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత నిర్భంధ విద్య నిస్సందేహంగా విలువైన వారసత్వాలలో ఒకటి. ధైర్యమైన నాయకత్వానికి నిజమైన నిదర్శనం. విశ్వాసవ్యక్తీకరణతో మరింత మంచికోసం, ప్రజా ప్రయోజనాల కోసం, సమయానుకూలంగా సానుభూతిని చూపే నాయకుని ధైర్యమైన నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.రాజ్యాంగ సవరణ ద్వారా, భారతదేశంలో ‘ఆరోగ్య హక్కును’ ప్రవేశపెట్టడం ఈ ప్రభుత్వానికి వారసత్వపు ఆస్థిగా ఉంటుంది.

ఆరోగ్యం మన హక్కు
ఆరోగ్యం మానవ హక్కుల్లో ఒకటి. జీవించే హక్కు అంటే ఆరోగ్యంగా జీవించడం అని అర్ధం. మానవ హక్కులను కాపాడే బాధ్యత ప్రభుత్వాలదే. కాని,కరోనా వచ్చాక ప్రజలను కాపాడే బాధ్యతను పక్కనబెట్టి కార్పొరేట్లను కాపాడే పనిలో కేంద్రమూ, అత్యధిక రాష్ట్రాలూ పడ్డాయి. ఒక్క కేరళ మాత్రం దీనికి మినహా యింపు. ఇంతలా కార్పొరేట్ల సేవలో మునిగి పోయినా ఫలితం వచ్చిందా అంటే అదీ లేదు. ఈ జూన్‌ త్రైమాసాంతానికి భారత స్థూల జాతీ యోత్పత్తి (జిడిపి) ఏకంగా 23.9శాతం పడి పోయిందని కేంద్ర గణాంకాల సంస్థ అధికా రికంగా ప్రకటించింది. ఇంత భారీగా జిడిపి పతనం కావడం ఏఇతర పెద్ద ఆర్థిక వ్యవస్థ లోనూ లేదు. కరోనాను కట్టడి చేయడమే గాక, ఈ ఏడాది రెండో త్రైమాసాంతానికి చైనా 3.2 శాతం వృద్థి రేటు సాధించింది. మూడు నెల ల్లోనే కరోనాను కట్టడి చేయగలగడంతో ప్రజ లతో ముమ్మరంగా ఉత్పత్తి కార్యకలాపాల్లో నిమగం కాగలిగారు. వారి వినిమయం పెరగ డంతో సరుకులకు డిమాండ్‌ పెరిగి ఆర్థిక వ్యవస్థ పుంజుకుంది. అంటే కరోనాను కట్టడి చేస్తే ఆర్థిక వృద్థి సాధ్యపడుతుంది తప్ప ప్రజ లను గాలికొదిలేస్తే ఆర్థిక పరిస్థితి అథోగతే అవుతుంది. క్యూబా,వియత్నాం వంటి సోష లిస్టు దేశాలతోబాటు న్యూజిలాండ్‌ కూడా కరోనాను కట్టడి చేస్తేనే ఆర్థిక వృద్ధి అని గుర్తించి ఆ దిశగా నడుస్తోంది. కాని, అందుకు భిన్నంగా అమెరికా, బ్రిటన్‌, స్వీడన్‌ వంటి దేశాల్లో ప్రభుత్వాలు ప్రజారోగ్యాన్ని గాలికొది లేశాయి. అక్కడ అటు కోవిడ్‌ అదుపు కాలేదు, ఇటు ఆర్థిక వ్యవస్థ పుంజుకోలేదు సరికదా మరింత క్షీణిస్తోంది. పాశ్చాత్య దేశాల వినా శకర మార్గంలోనే నరేంద్ర మోడీ సర్కారు పయ నించడం దేశ ప్రజలకు అత్యంత ప్రమాదకరం. కేంద్ర ప్రభుత్వం వలస కార్మికుల వెతలను పట్టించుకోకుండా అమానవీయంగా వ్యవహరిం చింది. ఆతర్వాత ‘ఆత్మ నిర్భర భారత్‌’ అని రూ.21లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించినా దాంతో ప్రజలకు ఒరిగిందేమీ లేదు. ఆ ప్యాకేజీ లో సింహభాగం కార్పొరేట్లకే ఉపయోగ పడిరది.‘పి.ఎంకేర్స్‌’కు ప్రజల నుండి విరాళం గా వచ్చినది ఎక్కువ. ఆనిధి నుండి ప్రజలను ఆదుకోవడానికి చేసిన ఖర్చు తక్కువ. అనేక ప్రజా సంఘాలు లేవనెత్తిన డిమాండ్లలో ఏఒక్కటీ అమలు చేయలేదు. ఈ పరిస్థితుల్లో ప్రజలు చేసే ఖర్చు రాను రాను తగ్గిపోతుంది. దాంతో సరుకుల డిమాండ్‌ తగ్గిపోతుంది. కమ్యూనిస్టులు, అనేక మంది మేధావులూ చెప్పిన ఈ మాటను సంప న్నుల సంస్థ అయిన ‘ఫిక్కీ’ కూడా తాజాగా ముందుకు తేవడం గమనార్హం. కేంద్రప్రభుత్వం ఇప్పటికైనా వాస్తవాలు గుర్తిం చాలి. ప్రజారోగ్యం కాపాడడం ప్రథమ, ప్రధాన కర్తవ్యం అని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ముందు గా గుర్తించాలి. దానికనుగుణంగా చర్యలు చేపట్టాలి. కుటుంబానికి రూ.7,500 నగదు బదిలీ, మనిషికి పది కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వాలకు నిధు లను మంజూరు చేయడంతోపాటు జిఎస్‌టితో సహా అన్ని బకాయిలను విడుదల చేయాలి. కోవిడ్‌ను అదుపు చేయడం, ప్రజలను ఆదుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పరిస్థితి తీవ్రతకు ఏమాత్రం చాలదు. రోజుకు సుమారు పది వేల పాజిటివ్‌ కేసులు నమోదు కావడం,వంద మంది వరకూ ప్రాణా లు కోల్పోవడం రాష్ట్రంలో వ్యాధి విజృంభణకు నిదర్శనం. పేదలకు ఉచిత రేషన్‌ సరఫరా,మే నెల చివరి నుండి టెస్టుల సంఖ్య పెంచడం వంటివి తప్ప ప్రభుత్వం అంత పటిష్ట చర్యలేమీ తీసుకోలేదు. హోం ఐసొలేషన్‌లో వున్న కోవిడ్‌ బాధితులకు సర్కారు ద్వారా అందవలసిన వైద్య సేవలు అందడంలేదని సాక్షాత్తూ వైద్య ఆరోగ్య శాఖ తాజాగా నిర్వహించిన సర్వే లోనే తేట తెల్లమైంది. ఇప్పటికైనా ప్రభుత్వం కదలాలి. అందుబాటులో వున్న స్టేడియంలు, ఫంక్షన్‌ హాళ్ల వంటి వాటిని కోవిడ్‌ కేంద్రాలుగా మార్చి బాధితులకు వైద్య సేవలందించాలి. అవసర మైనన్ని ప్రైవేటు ఆసుపత్రులను టేక్‌ ఓవర్‌ చేసుకొని ప్రభుత్వ ఖర్చుతో ప్రజలకు వైద్యాన్ని అందించాలి. కార్పొరేట్‌ ఆసుపత్రుల నిలువు దోపిడిని అరికట్టాలి. ప్రైవేటు వైద్యులు, ఆర్‌ఎం పి ల సేవలను వినియోగించుకోవడంతో పాటు స్వచ్ఛంద సేవకులనూ ఈకృషిలో భాగస్వా ములను చేయాలి. టెస్టు ఫలితాలను త్వరితంగా ఇచ్చి, కాంటాక్టులను గుర్తించి వైరస్‌ విస్తరణను అరికట్టాలి. గతంలో కంటెయిన్‌మెంట్‌ జోన్‌ లలో అయినా ముమ్మరమైన శానిటేషన్‌ చర్యలు చేపట్టేవారు ఇప్పుడు అది కూడా లేదు.కోవిడ్‌ యేతర వ్యాధులకు వైద్యం అందని దుస్థితి నెలకొంది. సీజనల్‌ వ్యాధులు వ్యాపించే ఈ తరుణంలో ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలల్లో రోగులకు సేవలందేలా చూడడం సర్కారు బాధ్యత. ఆదిశగా చర్యలు చేపట్టాలి. ఆరోగ్య విధా నంలో అన్ని రాష్ట్రాలలోనూ ప్రజారోగ్య నిర్వహణ కార్యకర్తలను నియమిస్తామని చెప్ప డం సానుకూలమైన అంశమే. సామాజిక, ఆర్థిక,నర్సింగ్‌,ఆసుపత్రుల నిర్వహణ రంగాల వారిని కూడా ఆరోగ్య పరిరక్షణా కార్యకర్తలుగా నియమించాలని ప్రతిపాదించడం మంచిదే. ప్రస్తుతం అమలులో ఉన్న విధానం ప్రకారం కేవలం వైద్య రంగానికి చెందిన వృత్తి నిపు ణులనే కార్యకర్తలుగా నియమిస్తున్నారు. జిల్లా స్థాయి, అంతకన్నా తక్కువ స్థాయి ఆసుపత్రు లను పటిష్ఠం చేయడం, కొన్ని జిల్లా స్థాయి ఆసుపత్రులను బోధనా ఆసుపత్రుల స్థాయికి పెంచడం కూడా ఆహ్వానించదగ్గ విధానమే. ప్రాథమిక ఆరొగ్య కేంద్రాలను బలోపేతం చేయడంలో భాగంగా ఆయుష్‌ వైద్య సేవలు అందించే వారిని కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో భాగస్వాములను చేస్తామంటు న్నారు. వీరు మధ్య స్థాయిలో సేవలు అంది స్తారు. వైద్య సంబంధిత సేవలు అందించే వారు కూడా వీరిలో ఉంటారు. ఆరోగ్య పరిరక్షణ,అనారోగ్యాన్ని నివారించడం కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల బాధ్యత అవు తుంది. 2017ఆరోగ్య విధానం ప్రకారం డాక్టర్లు గ్రామీణ ప్రాతాలలో పని చేయడం తప్పనిసరి అవుతుంది. కుటుంబ వైద్యం, సాధారణ వైద్యంలో ఎం.డి.కోర్సులకు అధిక ప్రచారం కల్పిస్తారు. ఈ అంశాలను కనక వెంటనే అమలులోకి తెస్తే సమగ్రమైన ఆరోగ్య సదుపాయాలు అందించడానికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఈసదుపాయాలు అందుబాటులోకి తేవడానికి చాలా ఉపకరి స్తుంది. అయితే ఈ విధానంలో ఆరోగ్య రంగంలో ప్రైవేటు రంగానికి ఎక్కువ పాత్ర కల్పించడం, ఉదాహరణకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రైవేటు రంగం వారి వెలుపలి సేవలకు అవకాశం కల్పించడం,ఆరోగ్య బీమా పాలసీల ‘‘వ్యూహాత్మక కొనుగోలు’’లో ఆరంగా నికి స్థానం కల్పించడం వంటివి ఆందోళన కలిగించేవే. ఆరోగ్య సదుపాయాలు కల్పించ డానికి సాధారణ పన్నుల మీదే ఆధారపడ తామని,ప్రభుత్వ రంగం ఆరోగ్య సేవలు అందించడానికి ప్రాధాన్యం ఇస్తుందని, ఆ తర్వా త లాభాపేక్ష లేని విధానాన్ని ప్రోత్సహిస్తామని, ప్రైవేటు రంగానికి స్థానం కల్పిస్తామని ఈ విధానంలో తెలియజేశారు. ఆరోగ్యం కోసం ప్రభుత్వ వ్యయాన్ని తప్పించుకోనంత మేరకు ప్రైవేటు రంగానికి స్థానం కల్పించకపోతే ఇది మంచి పద్ధతే. లేకపోతే ప్రజారోగ్యం కొన సాగడం సాధ్యం కాదు. అయితే విద్యా హక్కు, ఆహార హక్కు లాగా ఈవిధానంలో ఆరోగ్య హక్కు ప్రస్తావన లేకపోవడం దురదృష్టకరం. జాతీయ ఆరోగ్య హక్కు చట్టానికి సంబంధించిన ప్రస్తావననే ఈ విధానంలో నుంచి తొలగిం చారు.ఆరోగ్యాన్ని హక్కుగా మార్చాలంటే ఆరోగ్య మౌలిక సదుపాయాలు అత్యధిక స్థాయిలో ఉండాలని ఈ విధానంలో చెప్పారు. ఈ కార ణం చూపితే సరిపోదు. ఇది ఆరోగ్యాన్ని ప్రాథ మిక హక్కుగా మార్చడానికి ఉపకరించదు. ఆరోగ్యాన్ని హక్కుగా పరిగణిస్తే తప్ప దీన్ని ప్రత్సహించడం కుదరదు, రాజకీయ సంకల్పమూ సాధ్యం కాదు. –(మల్లెంపాటి వీరభద్రరావు/ కైలాష్‌ సత్యార్థి)