విశాఖలో సి ఎం పర్యటన 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిభ కలిగిన యువ క్రికెటర్లకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సాహం ఉంటుందని, అంతర్జాతీయ క్రికెటర్లను తయారు చేయడంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఒక్క రోజు పర్యటన నిమిత్తం గురువారం విశాఖపట్టణం చేరుకున్న ఆయన పోతిన మల్లయ్యపాలెం డా.వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీనిలో భాగంగా ముందుగా స్టేడియం ముందరి భాగంలో ఏర్పాటు చేసిన డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్టేడియం లోపల ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొని యువ క్రీడాకారలు, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, విశాఖపట్టణం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
ముందుగా క్రికెట్ క్రీడా చారిత్రాత్మక విశేషాలను తెలుపుతూ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ముఖ్యమంత్రి సందర్శించారు. అనంతరం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్ సభ్యులతో గ్రూప్ ఫోటో దిగారు. ఈ సందర్భంగా ప్రపంచ కప్ పోటీల్లో ప్రాతినిధ్యం వహించిన కె. అంజలి శర్వాణి, అండర్ -19 విభాగంలో ప్రాతినిధ్యం వహించిన శబనంకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున నగదు బహుమతి అందజేశారు. మెడల్స్తో సత్కరించి అభినందించారు. ఈ క్రమంలో అక్కడకు విచ్చేసిన సుమారు 100 మంది యువ క్రీడాకారులతో ముఖ్యమంత్రి ముచ్చటించారు. కుశల ప్రశ్నలు వేసి వారితో ఆత్మీయంగా మాట్లాడారు. భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వచనాలు అందించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంతో మంది ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారని, భవిష్యత్తులో జాతీయ స్థాయి క్రీడాకారులు మరింత మంది తయారయ్యేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. తగిన ప్రణాళికలు రచించి ముందుకు వెళుతున్నామని ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్కు అన్ని విధాలుగా సహకారం లభిస్తుందని అన్నారు. శక్తి సామర్థ్యాలు ఉండి ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి తగిన రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోపీనాథ్ రెడ్డికి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. అనంతరం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తరఫున ముఖ్యమంత్రిని రాష్ట్ర ఉపాధ్యక్షులు రోహిత్ రెడ్డి, కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ రాకేష్, సిఈఓ వెంకట శివారెడ్డి, ట్రెజరర్ చలం పురుషోత్తం తదితరులు దుశ్శాలువాతో సత్కరించారు. జ్ఞాపికను బహూకరించారు.
కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, తితిదే ఛైర్మన్ వై.వి సుబ్బారెడ్డి, రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్, రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె. రోజా, నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, బివి సత్యవతి, జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున, జివిఎంసి కమిషనర్ సాయికాంత్ వర్మ, ప్రభుత్వ విప్ లు కరణం ధర్మశ్రీ, కోరుముట్ల శ్రీనివాసరావు, శాసన మండలి సభ్యులు వరుదు కళ్యాణి, వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్, మాజీ ఉప ముఖ్యమంత్రి, నరసన్నపేట శాసన సభ్యులు ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి, భీమిలి శాసన సభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, తిప్పల నాగిరెడ్డి, వాసుపల్లి గణేష్ కుమార్, అదీప్ రాజ్, రెడ్డి శాంతి, వివిధ కార్పొరేషన్ అధ్యక్షులు కెకె రాజు, ఓబుల్ రెడ్డి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, విశాఖ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
నేతలకు ముఖ్యమంత్రి ఆత్మీయ పలకరింపు
పర్యటనలో భాగంగా స్థానిక ప్రజా ప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. వారిని ఆత్మీయంగా పలకరించి కుశల ప్రశ్నలు వేశారు. ఈ క్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు- జి ఎన్ వి సతీష్ 

ఏపీలో ఈ భాషల్లోనూ చదువు చేప్తారని మీకు తెలుసా?

ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలల్లో తెలుగు హిందీ, ఇంగ్లీష్‌,భాషల్లో భోదన జరుగు తుంటుంది. అక్కడ క్కడా ఉర్దూలోనూ బోధిస్తారు. ఇప్పుడు మరికొన్ని కొత్తభాషల్లోనూ భోదన జరగనుంది. రాష్ట్రంలోని గిరిజనుల ప్రయోజనం కోసం వారికి అర్ధమయ్యేలా వారి స్థానిక భాషల్లోనే భోదన జర పాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐతే ఇది పూర్తి స్థాయిలో అమలు కాలేదు. దీంతో ఆరు గిరిజన భాషల్లో ప్రత్యేకంగా విద్యార్థులకు భోదించాలని నిర్ణయించింది. ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, కర్నూలు జిల్లాల్లోనే ఏజెన్సీప్రాంతాల్లో గిరిజనులు నివాసముంటున్నారు. వీరు మాట్లేడే భాషలకు లిపి ఉండదు. వీటిలో కోయ, సవర, కువి, అదివాసీ, కొండ, సుగాలి భాషలు ముఖ్యమైనవి. ఇప్పుడు ఈ భాషల్లో విద్యార్థులకు బోధించనున్నారు. గణితం, సన్స్‌, సోషల్‌ వంటి సబ్జెక్టులు కూడా గిరిజన భాషల్లోనే బోధన జరగనుంది. లిపిలేని భాషలను సిలబస్‌ లో చేర్చడం ద్వారా గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్య అందనుంది.
ప్రాథమిక పాఠశాలల్లో చేరే గిరిజన విద్యా ర్థులకు మాతృభాషలో తప్ప తెలుగు, ఇతర భాషల్లో ఏ మాత్రం ప్రావీణ్యం ఉండదు. దీంతో వారికి విద్యాబోధన ప్రతిబంధకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో గిరిజన గూడేల్లోని అడవి బిడ్డలకు వారి మాతృభాష ఆధారిత బహుళ భాషా విద్యాబోధనను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్వశిక్షా అభియాన్‌ ద్వారా ఇకపై గిరిజన పాఠ శాలల్లో కోయ భాషలోని పదాలను తెలుగు అక్షరాలతో రాసేలా బోధన చేస్తూ..లిపి లేని ఆ భాషలకు ఊపిరి పోయాలని సంకల్పిం చింది. కొండకోనల్లో అంతరించిపోతున్న అరుదైన కోయ భాషలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. లిపి కూడా లేని వివిధ కోయ భాషలకు తెలుగులోనే అక్షర రూపం ఇచ్చి.. గిరిపుత్రులకు విద్యాబుద్ధులు నేర్పే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సాధారణంగా మూడొం తుల మంది గిరిజనులకు మాతృభాష తప్ప మరో భాష రాదు. దీంతో వారు విద్యకు దూర మై వెనుకబడిపోతున్నారు. ఉపాధికి కూడా దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గిరిజనులు మాతృ భాషను కొనసాగిస్తూనే తెలుగు భాషను అభ్యసిం చేలా వినూత్న ఆలోచనకు శ్రీకారం చుడు తోంది.6 భాషలు..920 పాఠశాలల్లో అమలు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో 8 జిల్లాల్లోని 920 పాఠశాలల్లో ఆరు రకాల కోయ భాషల్లో అమ లు చేయనున్నారు. ఈ విధానాన్ని‘కోయ భారతి’ పేరిట ఉభయగోదావరి జిల్లాల్లో ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రారంభించారు. అయితే, గత పాలకులకు దీనిపై చిత్తశుద్ధి లేకపోవడంతో ఏడాది తిరగకుండానే ‘కోయ భారతి’ కార్యక్రమం అటకెక్కింది. అయితే, ప్రస్తుత ప్రభుత్వం గిరిజనులకు వారి మాతృభాషలో తెలుగును సులువైన విధానంలో అలవాటు చేసేందుకు ప్రత్యేకంగా పాఠ్య పుస్తకాలు రూపొందించింది. తొలి దశలో ఒకటి నుంచి మూడో తరగతి వరకూ గిరిజన విద్యార్థుల కోసం ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ప్రారంభించింది. పాఠ్య పుస్తకాలు, మెటీరియల్‌ను గిరిజన భాషలోనే రూపొందించి పంపిణీ చేసింది. ఉభయ గోదావరి జిల్లాల్లో (కోయ),శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో (సవర),విశాఖపట్నం జిల్లాలో (కొండ,కువి,ఆదివాసీ),కర్నూలు, అనంతపురం జిల్లాల్లో (సుగాలి) భాషలకు అనుగుణంగా ప్రత్యేక పాఠ్య పుస్తకాలను తీసు కొచ్చింది. సర్వశిక్షా అభియాన్‌ సూచనల మేరకు ఐటీడీఏల్లో ఆరు భాషలపై పట్టున్న నిపుణుల తోడ్పాటు తీసుకున్నారు. వారి ఆలోచనల మేరకు 1నుంచి3వ తరగతి వరకూ తెలుగు, గణితం, పరిసరాల విజ్ఞానం పుస్తకాలను సిద్ధం చేశారు. రూ.60 లక్షల వ్యయంతో పాఠ్యాం శాలు రూపొందించారు. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా920పాఠశాలల్లో 18,795 మంది గిరిజన విద్యార్థులకు తెలుగు, ఇతర సబ్జెక్టులను గిరిజన భాషలోనే బోధిస్తారు. ఇందుకోసం గిరిజన ఉపాధ్యాయులతో పాటు వారు లేని చోట ఆ భాషపై కాస్తోకూస్తో పట్టున్న విద్యా వలంటీర్లను నియమించి, శిక్షణ ఇచ్చి నియామక పత్రాలు అందజేశారు.
కోయభాష విభిన్నం..
కోయ భాషలో అమ్మను యవ్వ అని..నాన్నను ఇయ్య అంటారు. అన్నను దాదా..అక్కను యక్క అంటారు. చెట్టును మరం అని.. ఈగను వీసి అని..కోడి పుంజును గొగ్గోడు అని..పిల్లిని వెరకాడు అని పిలుస్తారు.దోడ తిత్తినే (అన్నం తిన్నావా),బాత్‌ కుసిరి (ఏం కూర),దెమ్ము (పడుకో),ఏరు వాట (నీరు ఇవ్వు, పెట్టు), బెచ్చోటి (ఎంత పరిమాణం), మీ పెదేరు బాత (నీ పేరు ఏమిటి), కూడికేకు (కూడిక), తీసి వేతాకు (తీసివేత), వంటి పదాలు ఇకపై గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఈ పదాలు వాడుకలోకి రానున్నాయి.
గిరిజన విద్యార్థులకు ప్రత్యేక పాఠశాలలు
గిరిజన బిడ్డలకు నాణ్యమైన చదువులు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది. ఒక్క చదువులోనే కాకుండా ఆటలు, సాంస్కృతిక అంశాల్లోనూ వారిని నిష్ణాతులుగా తీర్చిదిద్దుతోంది. ఇప్పటికే గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల ద్వారా గిరిపుత్రుల సమగ్ర వికాసానికి బాటలు వేసింది. వీటితోపాటు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలను కూడా అందిపుచ్చుకుంటూ గిరిజనుల సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటోంది.ఏకలవ్య స్కూళ్ల ద్వారా ప్రతి విద్యార్థిని చదువుల్లో గురి తప్పని ఏకల వ్యులుగా తయారు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాలు మేలైన ఫలితాలు సాధిస్తుండగా ఏకలవ్య పాఠశాలలు మరింతగా ఊతమివ్వనున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో 19 ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలు ఉండగా కొత్తగా మరో 9 మంజూరయ్యాయి. 2021-2022 విద్యా సంవత్సరానికి మంజూరైన వీటిని విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల్లో నిర్మిస్తున్నారు.
ఏకలవ్య పాఠశాలల ప్రత్యేకతలు ఇవే..
?సీబీఎస్‌ఈ సిలబస్‌తో ఆరు నుంచి 12వ తరగతి వరకు ఏకలవ్య మోడల్‌ స్కూళ్లు ఉంటాయి. మొదటి ఏడాది ఆరో తరగతితో ప్రారంభించి ఆ తర్వాత ఏడాదికొక తరగతి చొప్పున 12వ తరగతి వరకు పెంచుతారు. ప్రతి తరగతికి 60మంది(బాలలు 30, బాలి కలు 30 మంది) ఉంటారు. 11,12 తరగ తుల్లో 90 మంది చొప్పున ప్రవేశాలు కల్పి స్తారు. ఒక్కో పాఠశాలను రాష్ట్ర ప్రభుత్వం 15 నుంచి 20 ఎకరాల స్థలంలో నిర్మిస్తుంది. విశాలమైన తరగతి గదులు, ప్రయోగశాలలు, కంప్యూటర్‌ ల్యాబ్‌లు, గ్రంథాలయాలు, ఆట స్థలం ఇలా సమస్త సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. 8బాలబాలికల కోసం వేర్వేరుగా ఆధునిక సౌకర్యాలతో ప్రత్యేక డార్మిటరీలు, ఆధునిక వంట గది, విశాలమైన భోజనశాల ఉంటాయి. 8 ఇండోర్‌ స్టేడియం, అవుట్‌డోర్‌ ప్లే ఫీల్డ్‌లను ఏర్పాటు ద్వారా క్రీడలు, సాంస్కృతిక రంగాల్లోనూ ప్రత్యేక శిక్షణ అందిస్తారు. గిరిజన భాషలకు ప్రోత్సాహమేదీ?
ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీ విద్యార్థులకు వారి సొంత గిరిజన భాషలో విద్య అందించే ందుకు ఏళ్ల తరబడి కొనసాగుతున్న భాషా వలంటీర్లను కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది రెన్యువల్‌ చేయలేదు. దీంతో, వేలాది మంది ఆదిమ తెగల విద్యార్థుల చదువు ప్రశ్నార్థకంగా మారింది.ఆదివాసీల్లో సవర,కువి,కొండ, కోయ, ఆదివాసీ ఒరియా తదితర భాషలు మాట్లాడే వారికి ఆ భాషతప్ప మరే భాషారాదు. తెలుగు కూడా తెలియదు. దీంతో,వారికి వారి గిరిజన భాషలోనే చదువు చెప్పడం,ఆట పాటల ద్వారా బమ్మలు చూపించి తెలుగు కూడా నేర్పించడం కోసం భాషా వలంటీర్ల నియామకం జరిగింది. సంబంధిత గిరిజన భాష మాట్లాడేవారు పది మంది ఉంటే,ఆ భాషను రక్షించేందుకు పాఠ శాలలను పెట్టి, ఉపాధ్యాయులను లేదా వలం టీర్లను నియ మించుకోవడానికి అవకాశంఉంది. వలంటీర్లు రెగ్యులర్‌ టీచర్లు మాదిరిగా పనిచేస్తున్నా, వారికి నెలకు రూ.5 వేలు మాత్రమే వేతనం ఇస్తున్నారు. గతేడాదికి సంబంధించి వలం టీర్లకు మూడు నెలల బకాయిలు ఉన్నాయి. తమను రెన్యువల్‌ చేయాలని, బకాయిలు చెల్లిం చాలని భాషా వలంటీర్లు పోరాడుతున్నా పాలకులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటిడిఎ పరిధిలోని గుమ్మలక్ష్మీపురం,కురుపాం మండ లాల్లో ఆదిమ తెగల గిరిజన విద్యార్థుల కోసం 176 ప్రభుత్వ ప్రత్యామ్నాయ స్కూళ్లు (జిపిఎస్‌) పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 1802 మంది విద్యార్థులు ఉన్నారు. 176 మంది సవర భాషా వలంటీర్లు ఉండేవారు. వీరిని రెగ్యువల్‌ చేయక పోవడంతో విద్యార్థుల చదువు సాగడం లేదు. విశాఖ ఏజెన్సీలోని ఆదివాసీల్లో వెనకబడిన కువి,కొండ,ఆదివాసీ ఒరియా భాషలు మాట్లాడే వారి కోసం 708 మంది భాషా వలంటీర్లు ఉండేవారు. వారిని రెన్యువల్‌ చేయకపోవడంతో సుమారు 7,500 మంది పివిటిజి విద్యార్థులు డ్రాప్‌ అవుట్‌ అయ్యే ప్రమాదం ఉంది. శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటిడిఎ పరిధిలో సీతంపేట, కొత్తూరు మండలాల్లోని పాఠశా లల్లో సవర భాష విద్యా బోధన155 స్కూళ్లల్లో జరిగేది.వీటిలో 75ప్రభుత్వ ప్రత్యామ్నాయ స్కూ ళ్లు (జిపిఎస్‌),56 మండల పరిషత్‌ స్కూళ్లు, 16ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, నాలుగు గురుకులాలు,రెండు మినీ గురుకులాలు ఉన్నా యి.వీటిలో వలంటీర్లే విద్యా బోధన చేసేవారు. సుమారు 4,500 మంది విద్యార్థులు ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో చింతూరు ఐటిడిఎ పరిధిలో కోయభాషవలంటీర్లు గత ఏడాది14 ఉండేవారు. వారందరినీ రెన్యువల్‌ చేయాలని ఉన్నతాధికారులకు జిల్లా అధికారులు నివేదిం చినా ప్రభుత్వంలో స్పందన లేదు. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం, జీలుగు మిల్లి, పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు గిరిజన మండలాల్లో 101 కోయ భారతి పాఠ శాలలు ఉన్నాయి. వీటిల్లో 101 మంది కోయ భాషా వలంటీర్లు రెన్యువల్‌ కోసం ఎదురు చూస్తు న్నారు.గిరిజన ప్రాంతంలోని భాషా వలంటీర్లను రెన్యువల్‌ చేయాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి అజశర్మ లేఖ ముఖ్యమంత్రికి లేఖ రాశారు.-(జి.ఆనంద్‌ సునీల్‌ కుమార్‌)

మన పంచాయితీ..మనదే రాజ్యాం

‘‘పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ, ప్రజలకు కావలసిన సౌక ర్యాల కల్పనలో వార్డు సభ్యుల పాత్ర చాలా కీలకం. వార్డు సభ్యులు పంచాయతీ సమావేశాల్లో, కార్యాచరణ కమిటీల్లో సభ్యులుగా తమ బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుంది. పంచాయతీ అంటే సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, వార్డు సభ్యులతో పాటు పంచాయతీ కార్యదర్శి ప్రభుత్వం తరపున ప్రధాన పరిపాలనా ఉద్యోగిగా ఉంటారు. పరిపాలనాపరమైన నిర్ణయాలను తీసుకునే అధికారం సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, వార్డు సభ్యులది కాగా, ఆ నిర్ణయా లను అమలు చేసే బాధ్యత మాత్రం కార్యదర్శిది. దీంట్లో భాగంగా గ్రామసభ విధివిధానాలను పాటిస్తూ విశాఖ జిల్లా అనంతగిరి మండలం బొర్రా పంచాయితీ గ్రామసభ సంర్పంచ్‌ జన్ని అప్పారావు అధ్యక్షతన జరిగింది. పలు అంశాలపై తీర్మాణాలు చేశారు. విశేషాధి కారులన్న పీసా చట్టంపై ప్రతి గిరిజన గ్రామం లోను గిరిజనులను చైతన్య పర్చడం, పంచా యితీకి ఆదాయవనరులపైన, గిరిజను లకు సమత తీర్పును అనుసరిస్తూ స్థానిక వనరులను కాపాడుకోవడం వంటి అంశాలను గ్రామసభలో తీర్మానించి ఆమోదించడం జరిగింది’’
బొర్రా గేటువలస పంచాయతీ సర్పంచ్‌ జన్ని అప్పారావు అధ్యక్షతన గ్రామసభ జరిగింది. పంచాయితీ పరిధిలో ఉన్న 15గ్రామాల నుంచి పంచాయితీ సభ్యులు,మరియు కొంతమంది గ్రామస్థులు,వివిధ శాఖల అధికారులు,మార్కెట్‌ యార్డ్‌ కమిటి డైరెక్టర్‌ దోనేరి పార్వతి, ఎం.పి. టి.సి.కురిసేలా అరుణ, పీసా ఉపాధ్యక్షులు దోనేరి డానియల్‌, మరియు బొర్రా స్కూల్‌ సిబ్బంది,ఉపాధి హామీ పధకం వి.ఆర్‌.పి సాంరెడ్డి గోపి,టెక్నీకల్‌ అసిస్టెంట్‌ జగన్‌,హెల్త్‌ సిబ్బంది,సచివాలయం సిబ్బంది హజర య్యారు.గ్రామసభలో పంచాయితీ సర్పంచ్‌ జన్ని అప్పారావు మాట్లాడుతూ బొర్రా పంచాయితీని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి అధికారులు,ప్రజలు సహకరించాలని కోరారు. అనంతరం సభ్యుల ఆమోదం,పంచాయితీ అభివృద్ధి చేయడానికి కావాల్సిన వనరులను రాబట్టేందకుగాను పీసా చట్టం ప్రకారం పలు అంశాలను తీర్మానిం చారు. బొర్రా గుహల వద్ద వాహన పార్కింగ్‌, ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక సంస్థ నుంచి పంచా యితీకి రావాల్సిన 20శాతం వాటా,వీధి దీపాలు ఆధునీకరణ,ఎన్‌ఆర్‌జీఎస్‌ పనిదినాలకు రావాల్సిన కూలీల సొమ్ములు, వేసవికాలం సమీపిస్తున్న నేపథ్యంలో గిరిజన ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా మంచినీటి సౌకర్యం కల్పించడం వంటి ముఖ్యమైన అంశాలను తీర్మాణించడం జరిగింది. తర్వాత సర్పంచ్‌ జన్ని అప్పారావు స్వాగతం పలికి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మేము ఆరోగ్య శ్రీ,రేషన్‌ కార్డు, పెన్షన్‌,పి.యం.కిసాన్‌, రైతు భరోసా మొదలగు పధకాల గురించి పంచాయతీ ఆఫీసు లో బోర్డు పెట్టియున్నాము. అది మీరు చదువుకొని ఏదైనా సమస్య ఉంటె మీరు సచివాలయం నకు పిర్యాదు చేయవచ్చు. అలానే మన సమస్యలు ఏమి ఉన్న ఇక్కడ చర్చించా వచ్చు. గతంలో మన గ్రామాల్లో నీటి సమస్య ఎక్కువగా ఉండేది. మరి ఇప్పుడు కొంతవరకు ఈ సమస్యను తగ్గించడం జరిగింది. ఇప్పుడు కొన్ని గ్రామాల్లో కరెంటు కొరత ఉంది. గ్రామాల్లో కరెంటు స్తంభాలు వేయాలి. ఆ సమస్య కూడా ఎలెక్ట్రిసిటీ వారితో మాట్లాడతానని చెప్పారు. సర్పంచిగా నేను మాట్లాడటం కాదు…అన్ని శాఖలు నుండి గవర్నమెంటు వారు వచ్చారు కాబట్టి ఒకొక్కరిని మాట్లాడమని పిలవడం జరిగింది. సంవత్స రానికి మూడు, నాలుగు గ్రామసభలు జరుగు తాయి. ఒకటి సాధారణ సమావేశం,మిగతావి గ్రామసభ ఇందులో మనకి ఉన్న సమస్యలు గురించి చర్చించు కోవడం. ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలకు తీర్మానాలు చేయడం జరుగుతుంది. ఈసందర్భంగా బొర్రా కేవ్స్‌ పార్కింగ్‌ గురించి ఒకతీర్మానం చేయడం జరిగింది. డి.పి.ఓ. డి.ఎల్‌.పి.ఓగారికి కూడా లెటర్‌ ఇవ్వడం జరిగింది. ఈరోజూ ట్రయిల్‌రన్‌ చేసి పి.ఓ గారి ద్వారా ఓపెన్‌ చేయడం జరుగుతుంది. పార్కింగ్‌ ఫీజు పంచాయతీ వాసులు చేస్తది. వ్యాసకర్త : కె.సతీష్‌కుమార్‌,సమత ఫీల్డ్‌కో`ఆర్డినేటర్‌

మొకం మల్లచ్చింది సారు

మానవతా దృక్పథం… సామాజిక స్పృహతో తన ఉద్యోగ ధర్మం నిర్వ ర్తించి గిరిజనుల గుండెల్లోనే కాదు.. తనలోని సృజనాత్మకత ఆసరాగా తెలుగు సాహితీ క్షేత్రంలో కథారచయితగా స్థానం సంపాదించారు. గిరిజన జీవితాలపట్ల సంపూర్ణ అవగాహన కలిగిన అధికారి గుర్తింపు పొందారు. ఆనేపథ్యంలో తన అనుభవాలు ఆలోచనలకు తనదైన సృజనాత్మకత జోడిరచి శాశ్వతత్వం తెచ్చే లక్ష్యంతో రాసిన 20కథలను ఏకం చేసి ‘భద్రాచలం మన్యం కథలు’ పేరుతో ప్రచురిం చారు . అందులోని కథే ‘నామొకంమల్లోచ్చింది సార్‌’ తెలుగు కథా సాహిత్యంలో గిరిజన కథలు అనగానే గుర్తుకు వచ్చే ఒకవిశిష్టమైన రచయిత ఎ. విద్యాసాగర్‌. వృత్తిరీత్యా ఆయన ఐఏఎస్‌ అధికారి,1988 నుంచి రెండేళ్ల పాటు పూర్వక ఖమ్మం జిల్లాలోని పాల్వంచ ఐటిడిఎ ప్రాజెక్టు అధికారిగా పనిచేసి దాని పరిధిలో గోదావరికి ఆవల ఈవల గిరిజనగూడేలతో,గిరిజనులతో ప్రత్యక్ష సంబంధాలు పెట్టుకున్నారు. పాలన అధికారిగా మొక్కుబడిగా గిరిజనుల అభివృద్ధి గురించి పనిచేయలేదు. మానవతా దృక్పథంతో సామాజికస్పృహతో తన ఉద్యోగధర్మం నిర్వ ర్తించి గిరిజనుల గుండెల్లోనే కాదు..తనలోని సృజనాత్మకత ఆసరాగా తెలుగు సాహితీ క్షేత్రం లో కథారచయితగా స్థానం సంపాదించారు. ఎ.విద్యాసాగర్‌గా సుపరిచితుడైన ‘అంగల కుర్తి విద్యాసాగర్‌’ పుట్టి పెరిగింది ప్రకాశంజిల్లా. స్వతహాగా తెలుగువాడు కావడం తెలుగు భాష మీద పట్టు ఉండటం గ్రూప్‌ వన్‌ పోటీ పరీక్ష ల్లో తెలుగు సాహిత్యం ప్రధానాంశంగా తీసు కోవడం,ఉద్యోగరీత్యా గిరిజన ప్రాంతాల్లో పని చేయడం ద్వారా గిరిజన జీవితాలపట్ల సం పూర్ణ అవగాహన కలిగింది ఆయనకు. ఆ నేపథ్యంలో తన అనుభవాలు ఆలోచనలకు తనదైన సృజనాత్మకత జోడిరచి శాశ్వతత్వం తెచ్చే లక్ష్యంతో రాసిన 20కథలను ఏకం చేసి ‘భద్రాచలం మన్యం కథలు’ పేరుతో ప్రచురిం చారు అందులోని కథే ‘నామొకంమల్లోచ్చింది సార్‌’.గిరిజనులు నిత్యం అడవుల్లో తిరగడం వల్ల అక్కడ ఉండేపెద్ద పులులు,ఎలుగు బంట్లు, బారినపడి గాయాలపాలవడం,ఒక్కోసారి ప్రాణాలు సైతం కోల్పోవడం సర్వసాధారణం. ఇక కథ విషయానికొస్తే రచయిత పాల్వంచలో సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారిగా పని చేస్తున్న కాలం, అక్కడికి సమీపంలోని ‘‘యానం బయలు’’ వద్ద గల గిరిజన గ్రామంకు చెందిన ఒక గిరిజనుడు తన అల్లుడుతో కలిసి అడవికి వెళ్లగా, అక్కడ అతని పై ఎలుగుబంటి దాడి చేయగా మొహం అంతాగాయమై, ఒకకన్ను కూడా పోగొట్టుకొని, రెండు రోజులపాటు వారికి తెలిసిన పసరు వైద్యం చేసుకుని గాయం నయం కాక ముంబై లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించుకోగా ప్రాథమిక చికిత్స చేసిన డాక్టరు ఖమ్మం పెద్ద ఆసుపత్రికి వెళ్ళమని సలహా ఇవ్వడంతో, దిక్కుతోచక నడిచి పాల్వంచరావడం, వీరి దీనస్థితి చూసిన కానిస్టేబుల్‌ అర్ధరాత్రి పూట దగ్గర్లోని ఐటీడిఎకి వాళ్ళని చేర్చి క్షతగాత్రుని భార్య సీతమ్మద్వారా పూర్తి వివరాలు తెలుసు కున్న కానిస్టేబుల్‌ ఆరాత్రి వేళప్రాజెక్టు అధి కారికి విషయం తెలియజేసి,అక్కడ గిరిజనుల సహాయార్థం ఏర్పాటు చేయబడిఉండే జీపు సాయం అడుగుతాడు.కార్యాలయం బయట వరండాలో జుగుత్సా కరమైన స్థితిలో పడుకొని ఉన్నా ఆముసలి గిరిజనుడి దయనీయ స్థితి చూసిన ప్రాజెక్టు అధికారి చలించిపోతాడు. దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మళ్లీ కట్టు కట్టించి తెల్లవారాక ఒకవ్యక్తిని సాయం ఇచ్చి ఖమ్మం కాకుండా సరాసరి హైదరాబాద్‌ ఉస్మానియా ఆసుపత్రికి పంపిస్తారు. అతడితో వచ్చిన అల్లుడు పెద్దాసుపత్రిలో ఉండేందుకు కావలసిన ఏర్పాట్లు చేసుకోవడానికి సొంత గ్రామం వెళ్లిపోతాడు. క్షతగాత్రునితో అతని భార్య ఒక్కతే వెడుతుంది.హైదరాబాద్‌ ఆసుప త్రికి పంపించిన నాలుగు రోజులు కూడా పూర్తి కాకుండానే పాల్వంచ ఐటీడీఏవరండాలో ప్రాజెక్టు అధికారి ముందు ప్రత్యక్షం అవుతారు ఆముగ్గురు.ఎలుగుబంటి దాడిలో గాయపడ్డ ముసలాడి పరిస్థితిలో ఏమార్పు లేదు.అదే జుగు త్సాకరమైన రూపం. చీము నెత్తురుతో చివికి పోయి వాసన వస్తున్న బ్యాండేజీ కట్టు. ఆదృశ్యం చూసిన ప్రాజెక్ట్‌ అధికారికి కోపం విసుగు ఒక్కసారిగా వచ్చిన,గిరిజనుల్లో ఉండే అమాయకత్వం, నిస్సహాయతలకు ఆచేతనుడవు తాడు. చివరికి అతని భార్య ద్వారా అసలు విషయం తెలుస్తుంది.‘ఆపెద్దపట్నం పెద్దాసు పత్రిలో తన ముఖంనయంఅయి మళ్ళీ వస్తదో రాదో కానీ ఒకవేళ ఇక్కడే చచ్చిపోతే..!! దేశం కాని దేశంలో అసలుచావ, నన్ను మన ఊరికి తీసుకుపోండి అనే ముసలోడు ఒకటే గోల చేసిండు.’అని చెబుతూనే ఆదావత్‌ దవాఖా నాల్లో బిట్లు లేక కిందనే పడుకోబెట్టి వైద్యం చేశారని ఒకసారి డాక్టర్‌ వచ్చి చూసి పోతే మళ్ళీ పొద్దుట ఆయన వచ్చి చూసే దాకా ఎవరూ రారని అడిగిన ఏది చెప్పరని,అక్కడి దయనీయ స్థితి సీతద్వారా తెలుసుకున్న ప్రాజెక్టు అధికారి.ఈవిషయాల గురించి తాను ముందు గా తెలుసుకోనందుకు తనలో తానే సిగ్గు పడ తారు.‘సరే అయిందేదో అయింది కానీ రేపు మీతో ఉండటానికి ఒక మనిషిని ఇచ్చి రెండు వారాలపాటు అక్కడ ఉండటానికి మీకు ఏర్పాటు చేస్తామని’ అంటారు. కానీ మళ్లీ పట్నం పోవడానికి,వాళ్ళు ససేమిరా ఒప్పుకోరు, సరే ఈరాత్రి ఇక్కడే ఉండి తెల్లవారాక చేయా ల్సిన దాని గురించి ఆలోచిద్దామని నచ్చచెప్తారు, కానీ తెల్లవారి వాళ్ళు అక్కడ కనిపించడం లేదని వాచ్‌ మెన్‌ చెప్పిన మాటలతో, కథకు డైన ప్రాజెక్టు అధికారిలో తను ఓడిపోయాననే భావం ఆవరిస్తుంది, పాపం అమాయకపు గిరిజనుడు ఏమవుతాడో!? అనే ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయింది. ఆరు నెలలయ్యాక ఒక రోజు పాల్వంచ మండలం లోని‘ఉలవనూరు’గిరిజన సదస్సులో పాల్గొన్న ప్రాజెక్టు అధికారి వద్దకు ముఖంపై కొంచెం మొర్రి ఉన్న ముసలాడు వచ్చి ‘‘నన్ను గుర్తుపట్టలేదా సారు నా మొకం మల్ల చ్చింది సారు’’ అంటూ తనను తాను పరిచయం చేసుకోవడమే కాదు….ఆస్పత్రిలో వైద్యం చేసిన డాక్టర్లు,తనకు సేవలు చేసిన తన భార్య సీతను, గుర్తుచేసుకుంటూ మీలాంటి గవర్నమెంట్‌ పెద్ద సార్లు మాలాంటి పేదలను ఆపదలో వున్నప్పు డు అట్ల ఆదుకుంటారని,డబ్బులు ఖర్చు పెడ తారని, నాకు అప్పుడు తెలియదు,మీ అందరి దయవల్లే బతికి మీ ముందు ఈరోజు ఇలా ఉన్నాను అంటూ అత్యున్నతమైన పశ్చాత్తాప గుణంతో ప్రాజెక్టు అధికారి ముందు కృతజ్ఞతా భావంతో నిలబడతాడు ఆగిరిజనవృద్ధుడు. ఆ గిరిజన ముసలాడి మాటలతో చలించిన ప్రాజెక్టు అధికారి ఆలోచనల సింహా వలోకనం తో ఈ కథ ప్రారంభమవుతుంది. కథ మొత్తం జ్ఞాపకాలు దారిలో నడిచిన, వాస్తవ సంఘట నల సమాహారంలా కనిపిస్తుంది. ప్రతి సంఘ టనలో సమకాలీన పరిస్థితులు, గిరిజనుల్లో ఉండే దయనీయ స్థితి, కష్టకాలంలో వారిలో ఉండే సహకారం, మానవ సంబంధాల గురించి, కథా రచయిత స్పష్టపరిచారు. ప్రస్తుత రోజు గడుపుకోవడానికే సతమతమయ్యే అరణ్య వాసులను భవిష్యత్తు గురించి ఆలోచించ మనడం,సబబు కాదనే భావన రచయిత ఇందులో వ్యక్తం చేస్తారు. తన కష్టాలకు తాను బాధపడుతున్న తన కర్తవ్యాన్ని, భార్యాభర్తల బంధాన్ని,మర్చిపోని గిరిజన స్త్రీ వ్యక్తిత్వం గురించి సీతమ్మ పాత్ర ద్వారా రచయిత చక్కగా ఆవిష్కరిస్తారు. తాను పూర్తిగా ప్రభుత్వం వారు అందించే వైద్య సాయం పొందక పోయినా, జన్మనిచ్చిన భూమి మీదే చనిపోవాలని కోరిక, పట్టణవాసపు వాసనలు,అక్కడి అసౌకర్యాలు, పడక వైద్యం చేయించుకోకుండా మధ్యలో పారిపోయి వచ్చితమదైన పసరు వైద్యంతో తన గాయం మాన్పుకున్నా…కొద్దిపాటి సాయాన్ని కూడా మరవ కుండా కృతజ్ఞతలు చెప్పిన గిరిజనవృద్దుడి లోని గొప్పదైన కృతజ్ఞతాభావం తన అనుభవసారం జోడిరచి చెప్పడంలో కథారచయిత పరిశీలనాశక్తి అర్థమవుతుంది. నిజానికి ఆగిరిజన వృద్ధుడికి చేయగలిగినంత సాయం చేయలేకపోయామని,పెద్దగా సాయం చేసింది ఏమీ లేదని,అవమానపడటంలో రచయిత పారదర్శకత స్పష్టమవుతోంది. చేసిన కొద్దిపాటి సాయాన్ని తమజీవితాంతం గుర్తు పెట్టుకునే కల్మషం ఎరుగని ఉన్నత వ్యక్తిత్వం అడవిబిడ్డల సొంతం,అనే గొప్ప విషయాన్ని రచయిత విద్యాసాగర్‌ ఇందులో అద్భుతంగా, అనుభవపూర్వకంగా,ఆవిష్కరించిన వైనం అభి నందనీయం.ఈ కథలో ఎలుగుబంటి దాడిలో గాయపడ్డ గిరిజన వృద్ధుడి స్థితి హృదయ విదారకంగా చెప్పబడి కరుణరస భరితంగా సాగిన,కష్టాల్లో సైతం ధైర్యంగా వాటిని ఎదు ర్కునే ధీరగుణం గిరిజనుల్లో ఎలా ఉంటుందో కళ్లకు కట్టింది. ప్రభుత్వాలు గిరిజనుల సమగ్రా భివృద్ధికి కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి ఐటీడీఏ లు ఏర్పాటు చేసిన దాని ఫలితాలు అందుకోవడంలో గిరిజనులు అందించడంలో అధికారులు పూర్తిగా విఫలం అవుతున్నారు అని దీనికి తెలియని అజ్ఞానం గిరిజనులది అయితే, వృత్తి పట్ల పూర్తి నిర్లక్ష్యం అధికారులది కావడం అని, నిర్మొహమాటంగా రచయిత చెబుతారు. తాను ఒకగిరిజన అభివృద్ధి అధికారి కూడా తమ శాఖల లోపాలను ఖచ్చితంగా తన రచన లో వెల్లడిరచడం ద్వారా ఈకథా రచయిత, ఉత్తమరచయిత గుణాలు సొంతం చేసుకుని ఆదర్శ రచయితగా నిలిచారు, ఇది రచయితలు అందరూ ఆచరించదగ్గ గొప్ప విషయం.కథ మొత్తం రచయిత తన జ్ఞాపకాల సాయంతో నడిపిన, సంబంధిత సంఘటనలు, పాత్రోచిత సంభాషణలు,రచయిత కథన శైలి, వెరచి పాఠకులకు మంచి కథ చదివామనే సంతృప్తి మిగులుతుంది. రచయిత తెలుగు భాషా నైపు ణ్యం కూడా కథమొత్తం విస్తరించింది.వాస్తవ సంఘటనలను కాకా చెబుతూనే భవిష్యత్తులో అడవిబిడ్డల మనుగడ కోసం మనం ఏంచే యాలో కూడా చెప్పిన ఈకథలో సంపూర్ణ కథా లక్షణాలు సలక్షణంగా కనిపిస్తాయి
-(వచ్చే మాసం మీకోసం స్వర్ణ ముఖి కథ ‘‘గోరపిట’’) -డాక్టర్‌ అమ్మిన శ్రీనివాసరాజు, ఫోను: 77298 83223

వేలంబస

ఉత్తరాంధ్ర పలుకులు.. జీవితాలు,భిన్న సంస్కృతులు, సామాజిక అసమ తౌల్యాలు, సమతమమతలను వడపోసిన విఖ్యాత కథారచయిత చింతకింద శ్రీనివాసరావుకు బాగా తలుసు. తెలుసు అనేకంటే వాటిని ఆయన గాఢంగా పరిశీలిస్తారని చెప్పవచ్చు. అటువంటి అక్షర కృషిలో భాగంగానే ‘‘వేలంబస’’ అని కథ అందించారు. దీని రచనా కాలం 2019 కాగా 2020 జనవరి 12 ప్రజాశక్తి ఆదివారం అనుబంధంలో తొలిసారి ప్రచురించబడిరది.
తూర్పు కనుమల్లో తిరుగాడే అడవి బిడ్డలకు ఉండే ఆచారాలు అలవాట్లు, ఆధునికులకు అబ్బురం కలిగించే విషయా లు,అందులో దాగి ఉండే ఆత్మీయతలు ఐక మత్యాలు అందరికీ ఆదర్శనియాలే…! విశాఖపట్నంకు చెందిన డాక్టర్‌ చింతకింది శ్రీనివాస రావు. తనదైన పత్రికా రచన వృత్తి రీత్యా పాత్రికేయులు. ఉత్తరాంధ్ర జిల్లాలోని గిరిజనులతో మమేకమై వారితో దగ్గరగా జీవించిన వ్యక్తి, ఆదివాసుల జీవన చిత్రాలు అంటేనే పోరా టాలు,మోస పోవడం,ఉద్యమాల్లో బలి కావడం,వంటి విష యాలే ఎక్కువగా గుర్తుకు వచ్చి ఆకథాంశాలతోనే తెలుగు గిరిజనకథ విస్తరించింది. అందుకు భిన్నంగా వారి సంస్కృతి,సాంప్రదాయాలు, కథావస్తువు లుగా వెలు వడుతున్న కథల రాశి. అటు వంటి భావి అవసరా లను గుర్తించి కథలు రాసే అతి కొద్ది మంది రచయి తల్లో శ్రీనివాసరావు ఒకరు. తను రాసిన వన జీవుల కథల సంఖ్య తక్కువే అయినా సూక్ష్మ పరిశీలన గుణం చక్కని సంభాషణ శైలితో పాఠకులను తన కథవెంట పరవశంతో నడి పించే సృజన కారుడు ఆయన. అటువంటి అక్షర కృషిలో భాగంగానే ‘‘వేలంబస’’ అని కథ అందించారు. దీని రచనా కాలం 2019 కాగా 2020 జనవరి 12 ప్రజాశక్తి ఆదివారం అనుబంధంలో తొలిసారి ప్రచురించబడిరది. తాను 40 సంవ త్సరాల క్రితం ప్రత్యక్షంగా చూసిన సంఘటనలు నేటికీ అరణ్యవాసుల జీవి తాల్లో సజీవంగా కనిపించడం సాంప్రదా యాల పట్ల వారు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో అర్థమవుతుంది,అందుకే ఈరచయిత తన కథావస్తువుగా ఆవిష యాన్ని ఎంపిక చేసుకుని ‘‘వేలంబస’’ కథ అందించారు. ఇక కథ విషయాని కొస్తే జంబారి,గుమ్మీలుఅనే ఇద్దరు గిరిజన ‘‘చెలిమి గాళ్ళు’’అడవికి వేటకు వెళ్ళడంతో ప్రారంభమైన ఈ కథ ఆసాంతం అడవిలోనే సాగుతుంది, ఏకఅంశం,ఏకకాలం, అనే రెండు గుణాలు ఇందులో నిండుగా ఉండి కథానిక లక్షణాలు కనిపిస్తాయి. మొత్తం కథ అంతా ఇద్దరి సంభాషణతో నడిపిం చడం,అది పాఠకులకు ఆసక్తిని కలిగిస్తూ కడదాకా కథను చదివింపచేయడం దీనిలోని విశేషాలు. కథలోని సంభాష ణలు తూర్పు మన్యం ప్రాంత గిరిజన యాస,పలుకుబడితో,కూడి ఉండటంతో పాటు,అచ్చమైన అటవీ వాతావరణం అడుగడుగునా కనిపిస్తుంది.అంతేకాదు అడవిబిడ్డలు చేసే వేటరకాలు,తొలకరి ఆరంభానికి ముందు ప్రతి గిరిజన గూడెంలో జరిగే వేటకు సంబంధిం చిన,’’ఇటిం పండుగ’’ విశేషాలు రచయిత ఇందులో సందర్భాలు గుణంగా వివరిస్తారు. ఈకథ కూడా ‘‘ఇటిం పం డుగ’’ నేపథ్యంలో కొనసాగుతుంది. విశాఖ మన్యంలోని గిరిబిడ్డలు ప్రతి ఏటా ఏప్రిల్‌,మే,నెలల్లో వేటకు సంబంధించిన ఈ పండుగ ఆనందోత్సాహాల నడుమ జరుపుకుంటారు. ప్రతి గిరిజన యువ కుడు పొద్దున్నే అడవికి వెళ్లి సాయంత్రం గూడెం చేరుకునే వేళకు, సొంతంగా చేసే ‘‘ఒబ్బిడి’’ వేట ద్వారా గాని, సామూహికంగా చేసే ‘‘సోపు’’ వేటద్వారా గాని అడవి జంతువులను వేటాడి తెచ్చి,
‘‘వేలంబస’’ అనే పేరు గల ఊరి బయట ఖాళీస్థలంలో ఉంచాలి. అలా లక్ష్యంలోగా ఒక్క జంతువునైనా వేటాడి తీసుకురాక పోతే ఆగూడెం లోని వరసైన యువ తులంతా …ఒట్టి చేతులతో వచ్చిన యువకులపై పేడనీళ్లు, రంగునీళ్లు, మామూలు నీళ్ళు,పోసి సరాగాలు హాస్యా లు ఆడతారు.ఈ పండుగనే కొన్ని ప్రాంతాల్లో ‘‘ఇటుకల పండుగ ‘‘అంటారు ఆనేపథ్యంలోనే ‘‘వేలంబస’’ కథ కొన సాగింది.ఇటుకల పండుగ నాడు అడవి జంతువుల వేటకు బయలుదేరుతారు జంబారి,గుమ్మీలు,అనే గిరిజన మిత్ర ద్వయం. అడవి తల్లి దయతోనే తమకు వేట జరిగి ఏదో ఒక జంతువు పక్షి దొరుకుతుందని తద్వారా గూడెంలో ఆడవారి ముందు పరువు దక్కించు కోవచ్చు అనే లక్ష్యంతో కొండ బాటన నడుస్తుంటారు. వేటలో జంభారి కాస్త చురుకైన వాడు, గుమ్మిలే మందకొడి, తను అడివంతా పొద్దుటి నుంచి తిరిగిన….ఎక్కడ ఏ జంతువు,పక్షి, చిక్కలేదు.మధ్యాహ్నం వస్తుండడంతో సాయంత్రం ‘వేలంబస’లో ఆడవాళ్లు చేసే వెక్కిరింతలు,అవమానాలు, గుర్తు కొచ్చి గుండెలు జల్లుమన్నాయి ఇద్దరికీ, దిప్ప (ఆనపబుర్ర)లో తెచ్చుకున్న చోడి అంబలి తాగి దాహం,ఆకలి,తీర్చుకుని మళ్ళీ వేట ప్రయత్నం మొదలు పెడ తారు.కిందటి రోజు గింజలు పోసి పెట్టిన ఉచ్చులో ఏమైనా పడ్డ ఏమో అన్న ఆశ కొద్ది అటువైపు వెడతారు. మూడో కం టికి తెలియకుండా గుర్తులు నాటిన, దగ్గరకు వెళ్లారు అక్కడి దృశ్యం చూసిన మిత్రద్వ యం ఆనందానికి హద్దులు లేకుండా అయ్యింది.వారు ఉంచిన ఉచ్చులో కుందేలు చిక్కుకొని ఉంది. వెంటనే లాఘవంగ దాన్ని తీసి సంచిలో వేసి, జాంబకు ఇచ్చి అంతకుముందే కోరింగ పొదలో పరిచిన వల వైపు కదిలారు ఇద్దరు.అదృష్టం వెంటవెంటనే మంది వచ్చినట్టు ఆ వలలో మరో రెండు కుందేళ్ళు చిక్కుకుని కనిపించడంతో వారి ఆనందం అడి వంత అయింది, కానీ అక్కడ వేట జరిగింది ‘జంబారి’ ఉచ్చులు,వలలు,వల్లే…!!మిగిలింది గుమ్మీలు వేట,అతను పెట్టిన ఉచ్చుల వైపు నెమ్మదిగా కదిలారు, కానీ అక్కడ వారి కళ్ళకు నిరాశే కనిపించింది.పెట్టిన ఉచ్చులు పెట్టినట్టే ఉన్నాయి. వేసిన దుం పలు వేసినట్టే ఉన్నాయి. గుమ్మీలు గుండె జారింది. బాధతో బావురుమన్నాడు అది చూసిన’’జంబారి’’ కళ్ళు చెమ్మగిల్లాయి.ఆ క్షణాన జంబారిలో అడవిబిడ్డల ఉండే సహజ గుణం సహకారం అనే మాటల ముందుకు వచ్చింది, వేటలో వారికుండే రెండు పద్ధతులు గుర్తు చేశాడు, ఇప్పుడు మనం చేసిన వేట నేను ఒక్కడినే చేసిన ‘ఒబ్బిడి’వేట కాదు,మనం సమానంగా పంచుకునే ‘‘సోపువేట’’ అన్నాడు ఆత్మీయంగా…అలా పంచుకున్న ఆనం దం తోడుతో గూడెం బాట పట్టి సాయం త్రం గూడెం బయట ఏర్పాటుచేసిన వేటలో తెచ్చిన జంతువులు, పక్షులు ప్రదర్శించే ‘‘వేలంబస’’కు చేరుకున్నారు. మిత్రులిద్దరూ వారి ఫలితాలను ప్రదర్శిం చబడే ముందు ఇద్దరు కలిసి చేసిన వేట అని చెప్పడం కన్నా ఇద్దరం వేరువేరుగా వేటాడి తెచ్చాము, అంటే ఆవిజయం తాలూకు అభినందనలు ఎవరికి వారుగా అందుకోవచ్చు, అనే స్వార్థం నిండిన ఆలోచన రావడంతో, కానుగ చెట్టు కింద కూర్చుని ఆనందంతో కలిసి వచ్చిన నిర్లక్ష్యం సాయంగా, నాలుగు కుందేళ్ళను రెండు గోనె సంచుల్లో సర్దబో తుండగా ..అవకాశం కోసం ఎదురు చూస్తున్న అవి ఒక్కొక్కటిగా గోనె సంచు ల బందీఖానా నుండి బయటపడతాయి. ఊహించని సంఘటన తో మిత్రులిద్దరూ తీవ్ర నిరాశలో కూరుకుపోయారు.మానవ ప్రయత్నంగా వెతికారు కూడా,, చేతికం దిన వేట చేజారి పోయిందన్న బాధ ఒకవైపు, కాగా…వేట పడలేదు అంటే కలిగే అవమానం దూషణల కన్నా పడ్డ వేట తన్నుకుపోయింది అంటే మరింత అవమానం కూడా…!! వేట జరగలేదన్న భయం బాధతో పాటు దొరికిన వేట సమానంగా పంచుకోలేక పోయాము అని బాధ మరోవైపు ఆవహించాయి. చివరికి వేట జరగలేదు అని మాత్రమే నిర్ధారించు కుని అందుకుగాను జరిగే అవమా నాలకు,అవహేళనకు సిద్ధపడ్డ ‘‘చెల్లిమ య్యలు’’ ఇద్దరూ ‘‘వేలంబస’’ వైపు తమకు జరగబోయే హేళనలు తలుచు కుంటూ నడిచారు.
ఇలా ముగిసిన ఈ కథలో కేవలం గిరిజన సంస్కృతి, సాంప్ర దాయాలు, మాత్రమే తీసుకుని కథ రాశారు అంటే పొరపాటే…!! దీనిలో అడవిబిడ్డల సాంప్రదాయాలను గౌరవి స్తూనే మానవులందరికీ ప్రస్తుతం అత్యవ సరమైన మానవసంబంధాల గురించి, అంతర్వాహినిగా రచయిత ఇందులో వ్యక్తపరిచారు. భాషా నానుడులు సంపూ ర్ణంగా స్థానికతకు దగ్గరగా ఉండేటట్లు తీసుకుని నిర్ణయం, కథ మొత్తానికి నిండుదనాన్ని ఇచ్చి రచయితలోని, ప్రతిభ,పరిశీలన,తేటతెల్లం అవుతాయి. కథ పేరు కూడా ఆసక్తిని సముచి తత్వాన్ని కలిగిస్తుంది. ఇలాఅన్ని విధాల ఉన్న తత్వం కలిగిన ఈకథ, కొత్త కథకులకు నిజంగా దారి దీపమే…!!!
-డాక్టర్‌ అమ్మిన శ్రీనివాసరాజు , ఫోను: 77298 83223

పొటెత్తిన జనసంద్రం

అందాల మన్యసీమను జల సమాధి చేసి పెట్టుబడి దారీ వ్యవస్థకు‘‘జలాభిషేకం’’ చేసే పోలవరం ప్రాజెక్టు ముంపుకుగురయ్యే గిరిజన గ్రామాలను సందర్శించిన సాహితీవేత్తల పర్యట నలో భాగస్వామి అయిన రచయిత జీవన్‌. అక్కడ చూసిన గిరిజనుల దీనావస్థకు అక్షర రూపమే ఈకథ. సహజంగా రచయితకు గిరిజన జీవన విధానాలు, పోరాటాలు, గిరిజనయోధుల వీరగాధలు, తదితర విషయాలపట్ల ప్రత్యక్షంగా అనుభవం వుంది. రచనా కాలం ఫిబ్రవరి 2006, ‘‘జీవన్మరణం’’ సంకలనం కోసం వ్రాయబడిరది.
నిత్యం సతతహరిత వనాల్లో జీవించే వన జీవులను సమస్యలు కూడా సదా వెంటాడు తూనే ఉంటాయి. ఒకసమస్య నుంచి బయటపడగానే మరోకొత్త సమస్య ఎదురురావడం ప్రతి మని షికి సర్వసాధారణం. సమస్యలను ఎదిరించి నిలిచి వాటినుంచి బయటపడటం తెలివైన మాన వులు లక్షణం. కానీఅడవులలో నివసించే గిరిజనులలోని మాయ,మోసంచేయడం, తెలియని ‘‘అమా యకపు గుణం’’తో ఆధునికులకు వారు తెలివిలేని దద్దమ్మలు చేతగానివాళ్ళు,చేతగాని వాళ్ళు. అయితే సాధు జంతువు అయిన పిల్లిని సైతం బంధించి స్థాయికి మించిన ఇబ్బంది పెడితే అది పులిలా క్రూరత్వంతో ఎలా ప్రతిఘటిస్తుందో తేటతెల్లం చేసే కథ’’పోటెత్తిన జన సంద్రం’’ జీవన్‌గా తెలుగు సాహితీలోకానికి సుపరిచితులు అయిన‘‘శేష భట్టార్‌ నరసింహాచార్యులు’’రాసిన కథల్లో ఇది ఒకటి. దీని రచనా కాలం ఫిబ్రవరి 2006,‘‘జీవన్మరణం’’ సంకలనం కోసం వ్రాయబడిరది.
నేపథ్యం అందాల మన్యసీమను జల సమాధి చేసి పెట్టుబడిదారీ వ్యవస్థకు‘‘జలాభిషేకం’’ చేసే పోలవరం ప్రాజెక్టు ముంపుకుగురయ్యే గిరిజన గ్రామాలను సందర్శించిన సాహితీవేత్తల పర్యట నలో భాగస్వామి అయిన రచయిత జీవన్‌ తానుఅక్కడ చూసిన గిరిజనుల దీనావస్థకు అక్షర రూపమే ఈకథ.సహజంగా రచయితకు గిరిజన జీవన విధా నాలు,పోరాటాలు,గిరిజనయోధుల వీరగాధలు, తదితర విషయాలపట్ల ప్రత్యక్షంగా అనుభవం వుంది.నివాస రీత్యా ఖమ్మంనగరం అయినా అధ్య యన రీత్యా,కథాశిల్పం పండిరచడంలోనూ,చేయితిరిగిన రచయిత కావడంవల్ల ఈ కథలోని ప్రతి ఘట్టం కళ్లకు కట్టినట్టు చూపిస్తూ రాయడంలో శతశాతం సఫలీకృతులయ్యారు జీవన్‌.
ఇక కథ విషయానికొస్తే శబరి గోదావరి సంగమ ప్రదేశం అయిన కూనవరం కేంద్రంగా సమీప అడవుల్లోని గిరిజనులు పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చేసిన పోరాట సమాయత్తం ఈ కథలోని వస్తువు, ఇతివృత్తం కూడా.కథలో ప్రధాన పాత్ర సోయం వెంకయ్య తన తలపుల ఆలోచనల ద్వారా కథ ఆసాంతం నడిపించి, చైతన్య నిండిన స్ఫూర్తివంతమైన ముగింపుతో కథను సుఖాంతం చేయడమే కాక తెలిసిన విషయాన్ని కూడా ఆసక్తిగా చదివించే శైలితో నడిపించడంలో రచయిత పరిణితి అడుగడుగునా కనిపిస్తుంది. కొత్త కథకులకు ఈ కథన శైలి మార్గదర్శిగా నిలుస్తుంది.చుట్టుపక్కల పది పన్నెండు గిరిజన గ్రామాల్లో అందరూ ‘‘ముసలోడు’’గా పిలవబడే సోయం వెంకయ్య,అతని భార్య రాజవ్వ. వెంకయ్య మంచి వేటగాడు తాతముత్తాతల నుంచి ఆస్తిగా వస్తున్నవేటను తన తండ్రి నుంచి తాను నేర్చుకున్నాడు.తండ్రి అతనికి వేట నేర్పిన గురువు. వెంకయ్య తండ్రి సాక్షాత్తు పెద్దపులినే తన బాణంతో మట్టుపెట్టిన ధైర్యశాలి. అంతటి ధీరుడి కన్న కొడుకు వెంకయ్యలో వేట నైపుణ్యంతో పాటు మానవత్వం,ప్రేమ,ప్రకృతిలోని పారవశ్యం,అనే మంచి గుణాలు అదనంగా వచ్చి చేరాయి. తాత ముత్తాతల నుంచి నివాసముంటున్న ఆ అడవి అన్నఅందాల గోదావరి అన్న ఇంకా ఎక్కువ అంతులేని ప్రేమ వయసు ఇచ్చారు కొంచెం వేగిన దృఢమైన దేహం శరీరంలో సత్తువ చావలేదు వేటకు వెళితే పరిగెత్తే జంతువు సైతం ఒకేఒక్క బాణంతో కొట్టగలడు. వాసనను బట్టి ఏజంతువు ఎక్కడ ఉందో చెప్పగలడు. కూతను బట్టి ఏపిట్ట ఈచెట్టు కొమ్మ మీద ఉందో కూడా చెప్పగలడు. పక్షుల కూతలను అనుకరించి వాటిని బురిడీకొట్టించే సత్తా,సోయంవెంకయ్య సొత్తు. ఇంతటి ధైర్యవంతుడు తెల్లదొరల ఇబ్బందులు నైజాం సర్కారు అనిపైశాచికత్వాన్ని అనుభవించిన దీనుడు వెంకయ్య ఇప్పుడు సొంత రాష్ట్రంలో సొంత పాలకులవల్ల రాబోతున్న‘‘విపత్తును’’తలుచుకున్నప్పుడల్లా భయం గోదావరి వరదల పొంగుకొస్తుంది..తల పగిలిపోతుంది..ఆలోచనలతో కళ్ళుబైర్లు కమ్ముతున్నాయి.కాళ్ళు తడబడుతున్నాయి….’’అంటూ రచయిత జీవన్‌ ముఖ్యపాత్ర వెంకయ్య మానసిక స్థితిద్వారా కథ ప్రారంభంలోనే విషయ వివరణలతో పాఠకులను కథ ప్రవేశం చేయించారు. వెంకయ్య మనోభావాలు నుంచి రచయిత సొంత భావాలకుకూడా కథను కాస్త మళ్ళించి గిరిజన గ్రామాల్లో మైదాన ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనేతరులు అక్కడి సారవం తమైన భూముల్లో పొగాకు,పత్తి,మిరప,వంటి వాణిజ్య పంటలు పండిస్తూ ఎలా కాసుల వర్షం కురిపిస్తున్నారో చెబుతూ మొదటి నుంచి వాస్తు మార్పిడి విధానానికి అలవాటు పడ్డ అడవిబిడ్డలకు ఈ కాసులు అనబడే డబ్బుల కరెన్సీ కంపంరంపుట్టి స్తుందని,వారిలో వ్యామోహం పెరిగి స్వార్థం నీనడు తుందని దానికి కారకులు గిరిజనేతరులు అంటూ రచయిత పరోక్షంగా ఎద్దేవాతో కూడిన హెచ్చరిక చేశారు.గోదావరి దాపున జీవనం సాగించే గిరిజ నులకు వానా కాలంలో సహజంగా వచ్చే గోదావరి వరదలు కొత్తేమీకాదు,వరదల నాలుగు రోజులు పిల్లాపాపలతో,గొడ్డు గోదా,తీసుకుని ఎత్తు గుట్టల మీద తలదాచుకుని గోదావరి శాంతించినాక, తిరిగి తమ తమ గుడేలకు చేరుకుంటారు ఆనం దంగా…గోదావరి వరద తమ గుండెలను ముం చింది అన్న బాధకన్నా పంట భూముల్లో సారవంత మైన ఒండ్రు మట్టి పంచిదన్న సంతోషమే వారికి ఎక్కువ.కానీ ఇప్పుడు రాబోతున్న వరద ముంపు అలాంటిది కాదు. వారి జీవితాలను వారి ఆవాసా లను శాశ్వతంగా జల సమాధి చేసే ఘోరమైన విపత్తు’’పోలవరం’’ వద్ద గోదావరి నదిపై కట్టబోయే బహుళార్ధక ఆనకట్ట ద్వారా మటుమాయమయ్యే 300 గిరిజన గ్రామాలతో పాటు వేలాది అడవి జంతువులు,పక్షులు,కనువిందుచేసే అందాలు అడవి చెట్లు,ఔషధమొక్కలు,కలప వృక్షాలు అన్ని శాశ్వ తంగా మానవతప్పిదం ద్వారా, అనాలోచిత చర్యల వల్ల,స్వార్థబుద్ధికి,బలైకనుమరుగు కాబోతున్నవిషాద సంఘటన,దేశ చరిత్రలో ఇదే పెద్ద మానవ తప్పిద చర్యగా నమోదు కాబోతున్న సంఘటన ఇది.ఆ విషయం తమ ప్రాంతానికి చెందిన చదువుకున్న పెద్ద దిక్కు పాయం కనకయ్య అనే గిరిజన యువ కుడు ద్వారా తెలుసుకున్న వెంకయ్య మనసు మనసు లో లేదు.తమ ప్రాంతానికి తమ జాతికి రాబోతున్న విపత్తును ఎలా ఎదుర్కోవాలన్న ఆలోచనలే తప్ప మరో ఆలోచన రావడం లేదు ఆఅమాయకపు బుద్ధి బుర్రకు, పాయం కనకయ్య తాను చదువుకున్న చదువుతో పాటు వచ్చిన విజ్ఞానం, స్నేహితుల బలగపు బలంతో కలిసి,తనకు జన్మనిచ్చిన గ్రామా లను సందర్శించి రాబోయే ప్రమాదం నుంచి ఎలా ఎదుర్కోవాలో తనవాళ్లకు చెప్పిన మాటలు తాలూ కు ధైర్యం వెంకయ్యలో తెలియని శక్తి నింపి ముం దుకు నడిపిస్తున్నాయి. అంతేకాదు ఆపాడు పోలవరం ప్రాజెక్టు కట్టి ఏడు సముద్రాల ఆవల నుంచి ఇక్కడకు వచ్చి,ఫ్యాక్టరీలు కట్టేవారికి నీళ్లు,కరెంటు,ఇచ్చి వారిసుఖం,లాభం, కోసం ఎప్పటి నుంచో ఈభూమిని నమ్ముకొని ఇక్కడే జీవించే వారిని అనాధలు చేసి నిలువ నీడ లేకుండా చేయ బోయే ఇక్కడి పాలకులపై, అధికారులపై, ఎలా తిరుగుబాటు చేయాలో కూడా కనకయ్య మాటల ద్వారా విన్న వెంకయ్యలో స్పూర్తి కలిగింది. నాటి అల్లూరి,గంటందొర,కొమరంభీమ్‌,సోయం గంగు లు,వంటి వీరులు వెన్ను చూపని ధైర్యంతో కొదమ సింహాలై గర్జించిన పోరాట చైతన్యం కూడా అతని కళ్ళముందు కదలాడిరది. అంతా అనుకున్న విధం గానే వ్యూహ రచన సాగింది. పోలవరం ముంపు ప్రాంతాలన్నీ ఏకమయ్యాయి, తూర్పుకొండలు ఎర్ర బారాయ్‌,’’కోయిద’’గ్రామంలో కొమ్ము బూర మో గింది,అది విన్న పక్క గ్రామంలోనూ మోగించారు. అలాఅలా ఒకరికొకరు కొమ్ము బూర మోగిం చడంతో,తంత్రీ నాధంలా ఆమోత అన్ని గ్రామాలకు సైరన్‌ మోతల, సమర శంఖల వ్యాపించింది. ముందే అనుకున్న విధంగా కోయ దొరలు, కొండరెడ్లు,కొండలు దిగారు చీమల బారుల కదిలారు. కొమ్ము బూర శబ్దాలు, డోల్లమోతలు మోగుతుండగా,అన్నిరకాల అడవి బిడ్డలు ఇంటిల్లపాది నేల ఈనినట్టుగా బారులుతీరారు,వాళ్ళందరికీ సంఫీు భావంగా బస్తీలో చదు వుకుంటున్న యువతీ వకులు,మేధావులు,రచయితలు,కూడా కదిలి వచ్చారు. చూస్తుండగానే శబరి గోదావరి సంగమ ప్రదేశం అయిన ‘‘కూనవరం’’ జన ప్రవాహంతో నిండిపోయింది. కొమ్ము బూరలు,డోలి,వాయి ద్యాల హోరు ఒకవైపు,అడవిబిడ్డలకు అనుకూలంగా నినాదాల జోరు మరోవైపు, ఆ ప్రదేశం మొత్తం ప్రతిధ్వనించింది. అక్కడ చేరిన వారి పాటలు,నృత్యాలతో అక్కడో ‘‘ఆదివాసి ఐక్యత జన సముద్రం’’ ఏర్పడిరది. అది మోసపూరిత పోల వరం ప్రాజెక్టును నామరూపాలు లేకుండా చేయ బోతుందా!? అన్నట్టు అగుపించింది. ‘‘పోటెత్తిన జన ప్రవాహాన్ని చూసి హడలెత్తి పోయారు అధికా రులు,మంత్రులు, వెంట వచ్చిన తుపాకులు, రైఫిల్లు, మూగబోయాయి’’ అన్న వాక్యాలతో ముగిసిన ఈకథ నిండా గిరిజనజీవన విధానం అడవుల్లోని అందాలు,గోదావరి గొప్ప తనం,దర్శనీయ మవుతాయి. సమకాలీన సామాజిక విషయాన్ని వస్తువుగా తీసుకున్న ఈ కథా రచయిత జీవన్‌కథను ఆసాంతం తనదైన శిల్పం సాయంగా పాఠకులకు ఎక్కడా విసుపు కలగకుండా ఆసక్తికరంగా కడదాకా కథను నడిపించారు. రచయిత కథ మొత్తం ఆదివాసి జీవన ఆచార పద్ధతులు సందర్భోచితంగా చెప్పడంలో చక్కని శ్రద్ధ కనబర్చారు. కథకు నామౌచిత్యం కూడా కలిసింది. ఒకమంచి కథను చూస్తూ చదివిన అను భూతి కలగడంతో పాటు మంచి స్ఫూర్తి నిండిన ముగింపుతో కథకు మరింత సంపూర్ణ చేకూరింది. (వచ్చే మాసం డా:చింతకింది శ్రీనివాసరావు, కథ ‘‘వేలం బస’’ విశ్లేషణ మీ కోసం)- డాక్టర్‌ అమ్మిన శ్రీనివాసరాజు,ఫోను: 77298 83223

అరణ్యపర్వం

‘బూర్జగూడా’’ అనే సవరగిరిజన గూడెంలోని,ఇస్రు,బొంతు, కొయ్యం,అనే ముగ్గురు అడవి బిడ్డలు ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, చెప్పిన ‘‘కామ దేను పాడి పథకం’’మాయలో పడి ఎలా మోస పోయి కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది..అక్కడ మెజిస్ట్రేట్‌ ముందు’’కొయ్యం’’ తమ తప్పిదానికి గల నేపథ్యం చెప్పి వేడుకోవడంతో ఈ ‘‘అరణ్య పర్వం’’ కథ ముగుస్తుంది. ఈకథ జరిగిన కాలం 1976 సంవత్సరం కాగా,రచనాకాలం1987 వ సంవత్సరం, అరుణ తార త్రై మాస పత్రిక (ఆగస్టు-అక్టో బరు 1987 సంచిక)లో తొలిసారి ప్రచురించ బడిరది.
తొలి తెలుగు కథానిక జన్మభూమి ఉత్తరాంధ్రకు చెందిన ఉత్తమ కథా రచయితల్లో ఒకరు ‘‘అట్టాడ అప్పలనాయుడు.’’ అనేక జీవన పోరాటాలను అరణ్యజీవుల సాక్షిగా అనుభవించి అంచెలంచెలుగా ఎదిగిన అక్షర శిఖరం ఆయన. అనేక చిరు ఉద్యోగాల పిదప చేతికందిన బ్యాంకు ఉద్యోగి గిరి చేస్తూనే తన అనుభవాలతో మదిలో మెదిలిన ఆలోచనలకు అక్షర రూపం ఇచ్చి అనేక కధలు నవలలు రచించిన సాహితీ నాయకుడు తను. జీవనం రీత్యా, ఉద్యోగరీత్యా, తన ప్రాంతంలో నిత్యం చూసే సవర జాతి గిరిజనుల జీవిత గాధలే అప్పలనాయుడు రాసిన కథలు. అరణ్య వాసుల అభివృద్ధి మీద,వారి ఎదుగుదల గురించి,ప్రభుత్వాలు అధికారులు చేస్తున్న స్వార్ధపు ఆలోచనవల్ల వారి ఎదుగుదల కన్నా నష్టాలతో కూడిన నష్టాలే అధికం అనే కొత్త ఆలోచనను,ఉదాహరణ పూర్వకంగా వివరిం చారు రచయిత తన ‘‘అరణ్యపర్వం’’ ద్వారా. ఈకథ జరిగిన కాలం 1976 సంవత్సరం కాగా,రచనాకాలం1987వ సంవత్సరం, అరుణ తారత్రై మాస పత్రిక (ఆగస్టు-అక్టో బరు 1987 సంచిక)లో తొలిసారి ప్రచురించ బడిరది. ఇక కథ విషయానికొస్తే ‘‘బూర్జగూడా’’ అనే సవరగిరిజన గూడెంలోని,ఇస్రు,బొంతు, కొయ్యం,అనే ముగ్గురు అడవి బిడ్డలు ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, చెప్పిన ‘‘కామ దేను పాడి పథకం’’మాయలో పడి ఎలా మోస పోయి కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది.అక్కడ మెజిస్ట్రేట్‌ ముందు’’కొయ్యం’’ తమ తప్పిదానికి గల నేపథ్యం చెప్పి వేడుకోవడంతో ఈ ‘‘అరణ్య పర్వం’’కథ ముగుస్తుంది. వాస్తవంగా కథలోని ఈ కొందరు గిరిజనులే కాదు..ఈదేశంలోని సమస్త అడవిబిడ్డల గోస,గోడుకు,ఈకథ అద్దం పడుతుంది.‘‘నమ్మకానికి ప్రతిరూపాలైన అడవి బిడ్డలు,తేడా వస్తే తిరుగుబాటుకు చిరునామాలుగా మారి పోతారు’’ అనే నిండు నిజం రచయిత ఈకథ ద్వారా చక్కగా చెప్పారు. కథలోని ప్రతి సంఘటననూ పలుకుబడులను గిరిజన సామాజిక చిత్రణ చేయడంలో నాయుడు శత శాతం విజయం సాధించారు.
సాధారణంగా అడవిలోని గిరిజనులు ఎవరిని నమ్మరు.నమ్మితే సర్వస్వం అర్పిస్తారు. ఆడిన మాట అస్సలు తప్పరు. తమ గూడెంలోకి కాకిబట్టల వారు వచ్చిన.. తెల్లబట్టల వారువచ్చిన… వారిని గూడెంలోకి రానివ్వరు. సరికదా వారు అడిగిన సమాచారం కూడా చెప్పారు. దానికి నిరూపణ కథ ప్రారంభంలో పోస్ట్‌ మేన్‌ కథకు కారకులైన ఇస్రూ,బొంతు, కొయ్యం,ల చిరునామాలు దొరికించు కోవడంలో పడ్డ ఇబ్బంది. చివరకు ఆగిరిజనులు తమకు వచ్చిన బ్యాంకు బాకీల బాపతు కోర్టు నోటీసులు చదువుకునే శక్తిలేక పోస్ట్‌ మేన్‌ను, బ్రటిమిలాడుకోవడం, నోటీసులు చదివి పెట్టినందుకు అతనికి ఇస్తామన్నా జీలుగకల్లు, కందులు,చిన్నకోడి,మాట తప్పకుండా అతనికి ఇవ్వడంలో అడవి బిడ్డల నీతి నిజాయితీ కళ్లకు కట్టారు రచయిత. కోర్టు నోటీసులు సారాంశం తెలుసుకున్న ఆఅడవి బిడ్డలు, రాబోయే ప్రమాదం తలుచుకుని దానికి గల కారణాలను,గతంలోకెళ్లి ఆలోచనలగుండా వెతుకులాట ద్వారా విషయాన్ని పాఠకులకు పరిచయం చేస్తారు రచయిత. గిరిజనులు ఆరుగాలం పడ్డ కష్టాన్ని బాకీలు,వడ్డీలు,రూపంలో దోచుకునే ‘‘వడ్డీ వ్యాపారులు’’ తక్కువ తూకాలు,నాసిరకం వస్తువులతో మోసం చేసే చిల్లర వ్యాపారులతో ఒకపక్క, నానా యాతనలు పడి అనేక విధాల నష్టం పోతుంటే అదిచాలదు అన్నట్లు.. మరోపక్క ప్రభుత్వ పథకాలు, ఉచితాలు,సబ్సిడీలపేరుతో బ్యాంకులు,గిరిజన అభివృద్ధిశాఖ వారు, గిరిజనుల అభివృద్ధి పేరుతో చేస్తున్న కార్యకలాపాల ద్వారా, ‘‘వారి వికాసం కన్నా వినాశనమే అధికంగా ఎలా జరుగుతుందో’’ రచయిత చెప్పే ప్రయత్నంలో ఈ కథ నడుస్తుంది. గిరిజనులకు జరుగుతున్న అన్యాయాల నుంచి వారిని రక్షించే నెపంతో వారిని సంఘ విద్రోహ శక్తులైన నక్సలైట్లు ఎలా ఆకర్షిస్తారు. వారిద్వారా గిరిజనులు పొందిన ఊరట తాలూకు విషయాలు కూడా ఇందులో ప్రస్తావించబడతాయి. ఒకరోజు బూర్జగూడెంకు అడవిదారి గుండా అష్టకష్టాలుపడి ప్రజా ప్రతి నిధి ఆప్రాంత రిజర్వుడు ఎమ్మెల్యే, సీతంపేట బ్యాంక్‌ అధికారులు,వచ్చి అక్కడి గిరిజనుల అందరినీ సమావేశపరిచి,వారు అనవసరంగా పని పాట లేక నక్సలైట్లు, అభ్యుదయ సంఘాల చెంతచేరి విలువైన సంసా రాలు నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వం గిరిజనుల మేలు కోరి వారి ఆర్థికఅభివృద్ధి ఆశించి పెట్టిన’’కామధేనుపథకం’’ గురించి వారికి నమ్మకం కుదిరేట్టు,ఒక్కొక్కరు వివరిస్తారు. తమ జాతి వాడే అయిన ఎమ్మెల్యే కూడా ప్రభుత్వం వారి ‘‘కామదేను పథకం’’కు అను కూలం అంటే ఇక ఆఅడవి బిడ్డలు మారు ఆలోచన చేయరు, గూడెం మొత్తం వారి అనుమానాలు పక్కనపెట్టి ఆ పధకంలో చేరిపోతారు. అధికంగా పాలు ఇచ్చే మేలు జాతి గేదెలు కొనుగోలు మొదలు ఆఖరికి ఆ పాలను కొనే పాలకేంద్రం వరకు, అందరి చేతుల్లో ఘోరంగా మోసపోయిన ఆడబిడ్డలు,చివరికి తమ ప్రాంతపు ఆహారం వాతావరణం పడక మేలుజాతి అనుకున్న గేదలు కూడా చనిపోవడంతో వారికి ఆదాయం బదులు అప్పులు మిగిలాయి,సరికదా అన్నకాలానికి అప్పు కట్టనినేరానికి కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుంది. పోస్ట్‌ మేన్‌అందించిన బ్యాంకు నోటీసు వల్ల వాళ్ళల్లో కలిగిన అలజడి ఆలోచనల ద్వారా గత నేపథ్యం తెలుసుకున్న పాఠకులు,వర్ధమానం లోకి వచ్చాక చివరి ఘట్టం కోర్టు భవంతిలోకి ప్రవేశిస్తారు. రుణ గ్రస్తులైన గిరిజనులను‘‘బ్యాంకు బాకీ ఎందుకు తీర్చలేదు? పథకంలో వచ్చిన గేదెలు ఏమయ్యాయి?’’ అని ప్రశ్నించిన న్యాయమూర్తి ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి ధైర్యం కూడా తీసుకుని తనదైన బాణిలో భాషలో ‘‘కుయ్యం’’ చెప్పుకు పోతాడు. గత నలభై ఏళ్ల నుంచి తాము మోసపోతున్న తీరు ఎవరు ఎలా మోసం చేసి తమ శరీర కష్టాలను దోచుకుంటున్నారు కొయ్య న్యాయమూర్తి కళ్లకు కట్టినట్టు ఒక్కొక్కటి చెప్పుకు పోతాడు. ఇలాంటి కష్టకాలంలో తమ కుల దేవత కనికరించి తమ గుండెలకు సంగాన్ని పంపిందని,దేవతల జెండాలు పక్కన సంగపు జెండాలు ఎగరే సామని, చెబుతూ షావుకార్లునుంచి అక్రమ బాకీల కోసం గుంజుకున్న భూములు విడిపించుకోవడం, వ్యాపారులు చేసే మోసాలను, ఎదుర్కొన్న తీరు. మొదలైనవి చెబుతూ సంగం వాళ్లబతుకుల్లో చీకటినితుడిచి వెలుతురు నింపిన తీరును అంత భయం లోనూ అంతమంది లోనూ ధైర్యంగా చెప్పుకు పోతాడు కొయ్యం.
‘‘ఇంత చేసినా లాభం ఏముంది? పాలకులు కన్నెర్ర చేసి సంఘ వ్యతిరేకులుగా ముద్ర వేసి గుడిసెలుతగలబెట్టి, మా గూడేల మీద తుపాకి గురి పెట్టారు, ఎందరినో నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపి నక్సలైట్ల ఖాతాలో జమ చేశారు, ఏసం ఘాల ఆదరువులేక దిక్కులేని పక్షులుగ మిగిలి పోయివలసలు పోయినం,ఆఖరికి ఏదో చేస్తామని ఆశ చూపి పథకాలని,సబ్సిడీలని, మాయమాటలు చెప్పి చివరికి మమ్ములను నేరగాళ్లను చేసి ఇక్కడకు రప్పించారు ‘‘…. అంటూ గుండెల్లో పొంగిపొర్లుతున్న బాధనంతా న్యాయమూర్తి ముందు చెప్పు పోయినాడు తను. తమకు పాలకేంద్రం వాళ్లు పాలు పోసినందుకు ఇచ్చిన రశీదు ముక్కలు తప్ప తమ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని, ప్రతినెల బ్యాంకు బాకీ పాలకేంద్రంవారే చెల్లిస్తామని చెప్పిన మాటలు నమ్ముకొని చివరికి అన్నీ కోల్పోయి తమ బతుకులు కోర్టుపాలయ్యాయి అని ఆవేదనతో చెపుతాడు. చివరికి ఈ ఆధునిక సమాజం తమకు వద్దని, తమదైన అడవి సమాజమే చాలని, ఈ కుట్రలు మోసాలను, పడలేమని ఇది తమ జాతి అందరి గోస అని గోడు పెట్టుకోవడంతో…… న్యాయమూర్తి ఆలోచనలో పడి, న్యాయశాస్త్రానికి చిక్కని జన జీవితం గురించి చెప్పిన గిరిజనుడి బాధ అర్థం చేసుకున్న న్యాయమూర్తి చలించినా….. కేసు వాయిదా వేయడంతప్ప, ప్రస్తుతానికి ఏమీ చేయలేని ఆయన అక్కడనుండి నిష్క్రమించడంతో…కధ ముగుస్తుంది .గిరిజనుల అభివృద్ధి లక్ష్యంతో ప్రభుత్వ పెద్దలు, అధికారులు, ప్రవేశపెడుతున్న పథకాలు ప్రయోజనకరమైనవి అయినా, స్వార్థపు బుద్ధిగల మధ్యవర్తుల ఆచరణ లోపాల కారణంగా, అభివృద్ధి పథకాలు నిర్వీర్యంఅయ్యి తద్వారా అడవి బిడ్డలు అనేక కష్టాలపాలై ఆర్థికంగా నష్టాల పాలవుతున్నారు, అనే ఇతివృత్తంతో చెప్పబడ్డ ఈ‘‘అరణ్యపర్వం’’ కథకు,.పేరు పెట్టడం మొదలు ముగింపు వరకు రచయిత ‘అట్టాడ అప్పలనాయుడు’ గారు తీసుకున్న శ్రద్ధ ఆచరణీయంగా సముచితంగాఉంది. ప్రతి సందర్భం విషయం కూడా కథకు అన్వయించడం, సందర్భోచితమైన నానుడులు ఉపయోగించడం… రచయితలోని పరిణితి, ప్రతిభకు, నిదర్శనాలుగా నిలిచాయి. మహాభారత కథ లోని పాండవులు అన్యాయంగా శిక్షించ బడి అరణ్యవాసం చేసిన సంఘటన మాదిరి అడవి బిడ్డలు కూడా అన్యాయాలకు గురైన అనవసరపు శిక్షలు అనుభవిస్తున్నారనే భావనతోనే రచయిత ఈ కథకు ‘‘అరణ్యపర్వం’’ అని పేరు పెట్టారు అనిపిస్తుంది. కథా లక్ష్యంలో …విషయాన్ని వివరించడమే తప్ప పరిష్కార మార్గం కానీ, చైతన్యం ఇవ్వడం కానీ కనిపించవు. కథ ముగింపు పాఠకుల ఆలోచనకే వదిలి వేయబడిరది. ఇది ఒక రకంగా ‘‘ఆరణ్య వాసుల జీవన చిత్రణ’’ను నూతనకోణంలో నమోదు చేయడం కోసమే వ్రాయబడిరది అనిపిస్తుంది. ఒక ప్రత్యేక జీవనంతో జీవించే అడవిబిడ్డల జీవనశైలిలోని భాగాలను ఇలా కథల రూపంలో నమోదు చేయడంవల్ల భావి కథ చరిత్ర పరిపుష్ఠం చెందడానికి ఎంతో దోహదం అవుతుంది.
(వచ్చే మాసం మీ కోసం జీవన్‌ కథ ‘‘పోటెత్తిన జన సంద్రం’’ విశ్లేషణ- డాక్టర్‌ అమ్మిన శ్రీనివాసరాజు, ఫోను: 77298 83223

నిజం

నేటి ఆధునిక సమాజపు ఆలోచన, కానీ అందుకు భిన్నమైన దృక్పథంతో కొత్తకోణంలో రాసిన గిరిజన కథ ‘‘నిజం’’. మనుషులు, సమాజం, దేశం,తరతమ భేదం లేకుండా ఏనాటికైనా మార్పు చెంది తీరా ల్సిందే.అనే ఆశాభావంతో.. ఆలోచించే రచయిత్రి కథలన్నీ అలాంటి నిర్మాణాత్మక దృక్పథంతో ప్రయో జనాత్మకంగా తీర్చిదిద్ద బడ్డాయి. తన క్షేత్ర పర్యటనల్లో భాగంగా సందర్శించే గిరిజన గ్రామాల్లోని వాస్తవ సంఘటనలు, ప్రత్యక్షంగా గమ నించిన పరిజ్ఞానంతో ‘‘నిజం’’ కథ రాశారు. రచనా కాలం మార్చి 20,2006 జాగృతి వార పత్రికలో మొదట ప్రచురించబడిరది. అడవిబిడ్డలకు ప్రత్యేకంగా మతం,దైవాలు, ఉండవు వారు వేటి ద్వారా జీవనం సాగిస్తారో అవే వారి పాలిట దైవాలు..అవి వారి మతం… అభిమతం. అడవి బిడ్డలు విశ్వసించినట్టు దేని ద్వారా తమ జీవనం గడుస్తుందో దానినే దైవంగా ఆరాధించే లక్షణం ఆధునిక మానవులు అలవర్చుకుంటే ఇప్పుడున్న ఇన్ని మతాలు..నాగరికత ముసుగులో మనిషి సృష్టించుకున్న ఇన్ని రకాల దైవాల అవసరమే ఉండదు. ` శివల పద్మ , రచయితి.

సాధారణంగా గిరిజనులుఅంటే, కొండ కోనల్లో కాపురముంటూ, నాగరిక ప్రపంచం, లోకం పోకడ తెలియక, మూఢనమ్మకాలతో మూర్ఖ త్వం నిండిన, విచిత్ర వేషధారణలతో చిత్రంగా ఉం టారు. అనేది నేటి ఆధునిక సమాజపు ఆలోచన, కానీ అందుకు భిన్నమైన దృక్పథంతో కొత్తకోణంలో శివల పద్మ రాసిన గిరిజన కథ ‘‘నిజం’’. విద్యార్హ తల రీత్యా తెలుగు, ఫిలాసఫీ,ల్లో మాస్టర్‌ డిగ్రీలు పొందిన వీరు. కథా రచయిత్రిగా ‘‘ఎన్నాళ్లీ మౌ నం?’’ ‘‘ఫలించిన స్వప్నం’’ లాంటి కథా సంపు టాలు ప్రచురించిన ఈమె ఆలోచనా ధోరణిలాగే, కథా శిల్పం కూడా అద్భుతంగా ఉంటుంది. ‘‘సాధనమున పనులు సమకూరు ధరలోన’’ అన్న నానుడిని నిండుగా నమ్మిన ఆమె తాను నిత్యం చూస్తున్న సంఘటనలు,సమస్యలను,అనుభవాలను, వస్తువులుగా ఎంచుకుని ఎం చక్కని శిల్పసౌందర్యం అద్ది, అందమైన ఆలోచించదగ్గ కథలు రాయడంలో తను అందెవేసిన చేయి.
మనుషులు,సమాజం,దేశం,తరతమ భేదం లేకుండా ఏనాటికైనా మార్పు చెంది తీరా ల్సిందే.అనే ఆశాభావంతో.. ఆలోచించే రచయిత్రి కథలన్నీ అలాంటి నిర్మాణాత్మక దృక్పథంతో ప్రయో జనాత్మకంగా తీర్చిదిద్దబడ్డాయి. కథా రచయిత్రి తన క్షేత్ర పర్యటనల్లో భాగంగా సందర్శించే గిరిజన గ్రామాల్లోని వాస్తవ సంఘటనలు, ప్రత్యక్షంగా గమ నించిన పరిజ్ఞానంతో ‘‘నిజం’’ కథ రాశారు. దీని రచనా కాలం మార్చి 20,2006 జాగృతి వార పత్రికలో మొదట ప్రచురించబడిన గిరిజన కథ లోని కథనం, పరిశీలిస్తే…..
‘‘వారిజ’’ అనే పత్రిక రచయిత్రి తన స్నేహితురాళ్ళు సుధ,సునీతలతో కలిసి గిరిజన ప్రాం తాలతో పరిచయంగల‘మూర్తి’అనే సోదరుని సాయంతో ఒకచిన్నగిరిజన గ్రామం వెళ్లడంతో ప్రారంభమయ్యే కథ,ఆద్యంతం అడవుల్లోని వన వాసుల సుందర జీవన చిత్రాన్ని పాఠకుల కళ్ళకు కడుతూ,అందమైన అనుభవం అనుభూతిని,ఇచ్చి ఒకకొత్త ఆలోచన కలిగిస్తూ ముగుస్తుంది.తనదైన ‘‘కవితాత్మక ఉత్తమ వాక్య నిర్మాణ శైలి’’ సొంతం చేసుకున్న శివలపద్మకథా పయనం మరింత ఉత్తమోత్తమంగా సాగుతుంది. నగర జీవితంలో ఎంత వెతికినా దొరకని అనుభూతి సోయగం ‘వారిజ’ స్నేహితురాళ్ళ త్రయానికి అక్కడ లభ్య మౌతుంది. కానీ..బాహ్యప్రపంచంతో సంబం ధాలు లేకుండా,పూర్వకాలపు అనాగరిక పద్ధతు ల్లో, కూనరిల్లిపోతున్న అక్కడి గిరిజనుల పట్ల తక్కు వ భావం కలిగిన సుధ,సునీతలకు తన పరిశోధన ద్వారా వారి పూర్వాపరాలు తెలుసుకుని వారికి నాగరికత నేర్పడమే తన లక్ష్యం అని తన స్నేహితు రాళ్లకు సగర్వంగా చెబుతుంది. కానీ అక్కడ తాను ప్రత్యక్షంగా చూసిన పరిస్థితితో ఆశ్చర్యపోతుంది వారిజ.గిరిజన గ్రామంలో మూర్తి సేవా కార్యక్ర మాలు నిర్వహిస్తూ అక్కడి గిరిజనులతో సహృదయ సంబంధాలు కలిగి ఉంటాడు. అక్కడి వారంతా తనని తమ బంధువుగా భావించి ఆదరిస్తారు, ఆ చదువుతోనే స్నేహితురాళ్ళ బృందాన్ని అక్కడికి తీసుకువెళతాడు.
ముందస్తు సమాచారంతో అక్కడకు వెళ్లిన వీరిని ఆగూడెం ప్రజలంతా ఎంతో ఆత్మీ యంగా పలకరించడం,ఆహ్వానించడం,ఆధునిక అమ్మాయిలకు ఆశ్చర్యంగా అనిపించినా అది అడవి బిడ్డల సహజగుణం. మూర్తి అక్కడ తులసి అనే ఒక గిరిజన యువతిని ‘వారిజ’కు పరిచయం చేస్తాడు. ఆమె కట్టు బొట్టు రూపం చూసి తనకు మొదట చులకన భావం కలుగుతుంది.కానీ ‘తులసి’ లోని ఆప్యాయత పలకరింపులేకాదు.తను విశ్వ విద్యాలయ విద్యపూర్తి చేసి ఆగ్రామంలో ఒకబడి కూడా నడుపుతూ..జర్నలిజం కూడా చదువు తుం దని,చక్కని నాయకత్వ లక్షణాలు కలిగి,మంచి చైత న్యం నిండిన యువతి అని మూర్తి మాటల ద్వారా తెలుసుకున్న వారిజకి ఆశ్చర్యం కలుగుతుంది. చివరకు గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుసుకునే పనిలో భాగంగా తులసి ఆధ్వ ర్యంలో అక్కడి గిరిజన మహిళలతో సమావేశం అయిన వారిజ స్నేహితురాళ్లకు చెంపలు చెళ్లు మనిపించేట్టు సమాధానాలు వస్తాయి.ప్రకృతితో ముడిపడి ఉండే వారి పండుగల గురించి, కట్న కానుకలు కనిపించని వారి పెళ్లిళ్లు, డబ్బు ప్రసక్తే లేకుండా సాగిపోయే వారి జీవనం గురించి, వృద్ధు లైన తల్లిదండ్రులను వారికొడుకులు కోడళ్ళు కాపా డే తీరు,ముసలి వారినినిర్లక్ష్యం చేస్తే గిరిజన కుటుం బాల్లో పాటించే,ఎలివేత,తదితర కట్టుబాట్లు, ఆచా రాల గురించి…ఆగిరిజన స్త్రీలు చెబుతూ ఉంటే ఈపట్టణ యువతులకు కళ్ళు బైర్లు కమ్ముతాయి, పేరుకు ఆధునిక ప్రాంతంలో నాగరికతతో జీవిస్తు న్నాము అని అనుకుంటున్నా,..అడవిబిడ్డల ఆత్మీయ సంస్కృతులతో పోల్చుకుంటే, మనం ఎంత అనాగరి కంగా జీవిస్తున్నామో నర్మగర్భంగా చెబుతూ రచ యిత్రి తనకు గల ‘మూలవాసి ప్రేమ’ను చెప్పకనే చెబుతారు.ఎంతో పటిష్టమైన కుటుంబ, సంఘ వ్యవస్థలకు, కట్టుబాట్లకు బద్ధులై జీవిస్తున్న ఈ వనవాసులు బాహ్యంగా అనాగరిక అవతారాల్లో అగుపించిన అంతర్గతంగా,మానసికంగా, నిజమైన మానవత్వం కలిగి జీవిస్తున్నారు అనే సందేశం ఈకథ ద్వారా అందించే ప్రయత్నం జరిగింది.
అడవిబిడ్డలకు ప్రత్యేకంగా మతం,దైవాలు, ఉండవు వారు వేటి ద్వారా జీవనం సాగిస్తారో అవే వారి పాలిట దైవాలు,అవి వారి మతం,అభిమతం. అడవి బిడ్డలు విశ్వసించినట్టు దేని ద్వారా తమ జీవనం గడుస్తుందో దానినే దైవంగా ఆరాధించే లక్షణం ఆధునిక మానవులు అలవర్చుకుంటే ఇప్పుడున్న ఇన్ని మతాలు,నాగరికత ముసుగులో మనిషి సృష్టించుకున్న ఇన్ని రకాల దైవాల అవ సరమే ఉండదు,అన్న భావన వ్యక్తం చేస్తుంది రచ యిత్రి. ‘‘వారిజ’’ తన గిరిజన ప్రాంత పర్యటనలో మనిషిని మనిషిగా గౌరవించే గొప్ప సుగుణాల సంపదలుగల అడవి బిడ్డలను…. వారిలో అడుగ డుగున అగుపించే అతిధి మర్యాదలు, నిష్కల్మష మైన, కాలుష్యరహిత జీవితాలు, చూసి మొదట తాము అనుకున్నట్టు వారికి ఏదో నాగరికత సంస్కా రాన్ని నేర్పి చైతన్యవంతుల్ని చేయాలి, అన్న ఆలోచ న మానుకుని వారినుంచే ఎంతో విలువైన సంస్కృతి సంప్రదాయాలు, తెలుసుకుని కొత్త ఆలోచనలతో తానేచైతన్యం చెందుతుంది.
గిరిజన సంస్కృతిని సంరక్షించడం అంటే వారికి ‘‘ఆధునిక మురికి సంస్కృతి’’ అంట కుండా చూడటంతోపాటు….వారిని వారిలాగే జీవింప జేసేస్తూ….మనమంతా వారికి అండగా తోడు ఉండటమే, నిజమైన గిరిజన సంస్కృతి సం రక్షణ, గిరిజన జాతి చైతన్య పతాక, అవుతుంది, అన్న వినూత్న అనుభవం ఐక్యసందేశం అంది స్తారు రచయిత్రి. దీనిలో గల క్లుప్తత,ఏకకాల, ఏకాంశ, లక్షణాల దృష్ట్యా ఇది అచ్చమైన ‘‘కథానిక’’ అనడంలో నిండు నిజం ఉంది. అలా..సార్థక నామధేయి అయింది కూడా.. కథానిక ప్రారంభం లో కనిపించే ఆసక్తి కథ నడపడం లో ఉండే సంబంధాలు చివరికి పాఠకులు ఊహించని ముగిం పు ఇలా ప్రతి విషయంలో రచయిత తీసుకున్న శ్రద్ధ కథకు మరింత వన్నె లద్దింది,నిజంగా ఈ ‘‘నిజం’’ కథ రచయిత్రి సంపూర్ణ రచనాపరిణితికి ఓమచ్చుతునక అనవచ్చు. (వచ్చే నెల సంచికలో మీ కోసం అట్టాడ అప్పలనాయుడు కథ అరణ్యపర్వం)
-డాక్టర్‌ అమ్మిన శ్రీనివాసరాజు,ఫోను: 77298 83223

కొండఫలం

భూమిమీద పుట్టిన ప్రతిజీవికి, భూమితో విడదీయరాని సంబంధం ఉంటుంది. అదే అడవి బిడ్డలకైతే!! ఆబంధంమరింత బలంగా ఉంటుంది. వారి బ్రతుకు బండికి జీవ నాధారమైన పంట భూములద్వారా ఆదివాసీలు అనుభవిస్తున్న ఇబ్బం దులు కథావస్తువుగా చేసుకుని ప్రముఖ కథా రచయిత్రి‘వాడ్రేవు వీరలక్ష్మిదేవి’రాసిన కథ‘కొండ ఫలం’.రచయిత్రి బాల్య అనుభవాలనుంచి,ఉద్యోగ రీత్యా,తూర్పు గోదావరి జిల్లా శరభవరం, కాకర పాడు,కొయ్యూరు,గిరిజనప్రాంతాల్లో గడిపిన జీవ నం నుంచి నేర్చు కున్న ప్రత్యక్ష అనుభవపాఠాల సారమే ఈ కథ. రచనా కాలం 1999. ఈమె తండ్రి గిరిజనగ్రామాల్లో కరణీ యకం వృత్తిచేయుడం,నిత్యం అక్కడి గిరిజ నులు, గిరిజనేతరులు,పేదలు,మధ్య జరిగే భూవివాదా లను ప్రత్యక్షంగా చూశారు. ఆయా సంఘటనల ద్వారా తమ భూములను కోల్పోవడం రాజ్యాంగం కల్పించిన రక్షణ చట్టాలున్నా సరే విలువైన ఆస్తులు ఎలా కోల్పోతున్నారో, వివరించారు. ప్రభుత్వాధి కారులు చేసేఅవినీతి,గిరిజన చట్టాలు ఈ సమస్యను మరింత తీవ్రతరం ఎలా చేస్తున్నాయో రచయిత్రి వెల్లడిస్తారు. భూ సమస్యల్లో ఆదివాసీ మహిళలు అనుభవిస్తున్న అగచాట్ల గురించి, కళ్ళకుకట్టినట్టు చెప్పడంలో శతశాతం విజయం సాధించారు. రచయిత్రి మిత్రురాలు యూనివర్సిటీ రీడర్‌ పద్మిని, గిరిజన సమస్యల మీదపరిశోధన చేసింది. ప్రస్తు తం గిరిజన భూసమస్యల మీదప్రాజెక్టు పరిశోధన చేయడం కోసం ఆమె నివసిస్తున్న ప్రాంతానికి తను రాకతో కథప్రారంభమై చివరికి సమస్య పరిష్కా రానికి గిరిజనస్త్రీ విద్యా వంతురాలు కావడమే మార్గమని పరిశోధకురాలు భావించడం తో ముగు స్తుంది.కథఆసాంతం చదివింప చేస్తూ పాఠకులను అడవి అందాలగుండా నడిపించి..అనిర్వచనీ యమైన అనుభూతిని అందిచారు. ఇక కథలోకి వెళితే…!! రచయిత్రి పొద్దున్న పనుల్లో ఉండగా ఏడుపు మొహంతో అక్కడకు చేరిన ‘కొండకాపు యువతి’సీతాలు తనకు జరగ బోతు న్న ప్రమాదం తాలూకు కోర్టువారిచ్చిన నోటీసు తనకు చూపించ వచ్చింది. ఆ గిరిజన గూడెంలో గంగరాజు అనే గిరిజనేతర యువ కునితో కలసి కాపురం చేస్తూ చిన్న హోటల్‌ నడుపుతుంది. రోజువారీ వచ్చే కొద్దిపాటి ఆదాయంతో బ్రతుకు బండి నడుపు కుంటుంది సీతాలు.సర్కారు వారు ఉచితంగా ఇచ్చే ఐదుఎకరాల భూమిని తన కులం సాయంగా పొం దిన ఆమె,భర్త సాయంతో దానిలో జీడిమామిడి పంట సాగు చేస్తూ.. భావి ఖర్చులకు ధనం కూడా పెట్టు కుంటుంది. కానీ సర్కారు వారుఇచ్చిన భూమి అసలు యజ మాని దళితవాడకు చెందిన ఫకీర్‌ రావు,అతను పెట్టుకున్న అర్జీతో ఆభూమిని తిరిగి అతనికే అప్పజెప్పనున్నట్టు, సీతాలుకు ‘గిరిజనకోర్టు వారి చ్చిన నోటీసు’ సారాంశం. సాగుకు పనికిరాని ఆభూమిని సీతాలు దంపతులు రెక్కలకష్టంతో ఒక దారికితెచ్చి జీడిమామిడిపంట సాగుతోదాని ఖరీదు పెంచుకుని సంతోషిస్తున్న వేళ,ఇప్పుడు పిడుగు లాంటి ఈ సంఘటన. గిరిజన గ్రామంలో టీచరుగ పనిచేస్తున్న రచయిత్రికి తన ప్రాంతంలోని గిరిజను లకు సాయపడటం,సలహాలు ఇవ్వటం,నిత్యకృ త్యం అందులో భాగంగానే సీతాలు ఇప్పుడు అక్కడికి వచ్చింది.బాధలోగల సీతాలును ఓదార్చి‘నీభూ మికి వచ్చిన ఇబ్బంది ఏమీలేదు, కోర్టుకు పోయి ‘స్టే’ తెచ్చుకోవచ్చు. అంటూ ఆమెకు సలహా ఇచ్చి ధైర్యం చెబుతుంది టీచరు. తను అక్కడి గిరిజను లతో ఎంతో చనువుగా ఉండేది. ముఖ్యంగా మహి ళల పట్ల అక్కడి వారంతా ఆర్థికంగా చితికి పోయి న, ఆచారాలు సాంప్రదాయాలు వదలలేక, అష్ట కష్టాలు పడేవారు. వారిఅమాయకత్వానికి రచయిత్రి టీచర్‌ జాలిపడేది. తాను ఆగ్రామానికి వచ్చిన కొత్తలో అక్కడి వారి పనులు, అలవాట్లు, చూసి ఆశ్చర్య పడిన, తరువాత తర్వాత అలవాటుపడి, తాను వారిలో ఒకటిగా ఉండడం, వాళ్ళ పెళ్లిళ్లకు అతిథిగా వెళ్ళటం చేసేది, అక్కడి గిరిజనుల పెళ్లిల్లలో పెద్ద వయసు వధూవరులు, పేరంటం అనబడే బట్టలు, వస్తువులు, బంగారం వెండి, నగల ప్రదర్శన అమ్మాయికి ఇంటివారు తినడం మానేసి అయినా బలవర్ధక ఆహారం పెట్టడం
వల్ల, వారి పెళ్లిల్లలో పెళ్లికూతుర్లు బలిష్టంగా కనిపించడం, మొదలైన ఆచారాలన్నీ అక్కడి గిరిజనులకు మాత్రమే సొంతమైనవిగా రచయిత్రి స్వీయ అనుభవం రంగరించి అందంగా చెప్పారు.
కానీ మరో విచిత్రమేమిటంటే ఆప్రదర్శనలో పెట్టిన నగలు,చీరలు, అన్ని ఎరువుగా తెచ్చిన వేనట! అది అక్కడ వారికి సాధారణ వ్యవహారమే!! అని చదివిన పాఠకులకు విచిత్రం కలగక మానదు. తను ఆ ఊరికి వెళ్ళిన కొత్తలో సావిత్రి అనే గిరిజన మహిళ తన పొలాన్ని గవర్నమెంట్‌ వారు స్వాధీనం చేసు కుంటారని అందుకుగాను తనకు అందిన కాగితాలు చూపించడానికి ఒక రాత్రివేళ ఆమె వద్దకు వస్తుం ది. టీచర్‌ అసలు విషయం తెలుసుకోవడానికి గ్రామాధికారి వద్దకు వెళ్ళగా..అతను చెప్పింది ఏమి టంటే,’సావిత్రి భూమి కొనుక్కున్నది గిరిజనేతరుల వద్దని గిరిజన వ్యవసాయ చట్టం ప్రకారం గిరిజను లు కానివారికి అక్కడ భూములు చెల్లుబాటు కావని వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని’. సావిత్రి గిరిజనేతరుడు అయిన కృష్ణమూర్తిని పెళ్లి చేసుకుని మొదట ఎంతో వైభవంగా అనుభవించిన, అది మూడునాళ్ళ ముచ్చటై…తన పెళ్లి పేరంటంలో పెట్టిన బట్టలు,నగలు,మాదిరి ఇప్పుడు తన భర్త భూమి తెచ్చుకున్నతాత్కాలిక వస్తువులెక్క అయి పోయింది. విషయం వివరించి తగిన సలహా టీచర్‌ ఇచ్చిన..ఆశ చావని కృష్ణమూర్తి కోర్టులో కేసు వేసి కోర్టుల చుట్టూ తిరుగుతూ తనఇంట్లోని, తన భార్య ఒంటి మీద,సంపద నగలు పోగొట్టుకుంటాడు. చివరికి ఆకుటుంబం పేదరికంలో కూరుకు పోతోంది. అలా..సావిత్రిభూమి దీనగాథకు సాక్ష్యం అయిన టీచరుకు ఇప్పుడు సీతాలు వ్యధ ఒకటి తోడైంది. గిరిజనేతరుని చేసుకున్న సీతాలుకు మొదట్లో ఆమె పేరు మీద గవర్నమెంట్‌ వారు ఐదు ఎకరాల పంటభూమికి పట్టాఇచ్చారు. గిరిజ నేతరులు బినామీ పద్ధతిలో భూములు సంపాదిం చడం అక్కడి అలవాటుపద్ధతి అయిపోతుంది. అంతేగాక అక్కడ నివసించే వాల్మీకితెగ వారిని మొదట్లో ఎస్సీలుగా గుర్తించి,ఆతర్వాత వారిని ఎస్టీలుగా గుర్తింపు ఇస్తూ ప్రభుత్వాలు, అధికారులు తీసుకున్న నిర్ణయాల వల్లే ఇలాంటి తగాదాలు వారి మధ్య చెలరేగి, కోర్టులచుట్టూ తిరిగి,భూస్వా మి కటికపేదవారుగా మారిపోతున్నారు. ఇప్పుడు జరిగిన విషయం అదే! సీతాలు అనే గిరిజన స్త్రీని ఆమె భూమికి ఆశపడి గంగరాజు అనే గిరిజ నేతరుడు ఆమెను చేరదీయడం, వాళ్లుకొన్న భూమి దారు ఫకీర్రావు భూమి అమ్మినప్పుడు ఎస్సీ వాల్మీకి జాతిగా, ఉండి ప్రస్తుతం యస్‌.టి వాల్మీకి సర్టిఫికెట్‌˜ సంపాదించడం,సీతాలు భర్తగంగరాజు గిరిజ నేతరుడు కనుక,అతడు ప్రస్తుత ‘యస్‌టి వాల్మీకి’ తెగకు చెందిన ఫకీరావు భూమినికొనే హక్కులేదు కనుక,అతని భూమిని అతనికిచట్టప్రకారం అప్ప గించాలి.వాస్తవానికి‘‘ఫకీర్‌ రావు’’చేసింది అన్యా యమే! అయినా తనకు గల సర్టిఫికెట్‌ వల్ల ప్రభుత్వ చట్టం ప్రకారం, అది న్యాయమైనపని అయి పోయింది ప్రస్తుతానికి.అసలు ఆధారాలు చూపించ టానికి గడువు కోరే సమయం అయిన ‘కోర్టుస్టే’ కోసం టీచరమ్మ సాయంతో సీతాలు పట్నం పోయింది.అక్కడ పడరాని పాట్లు పడుతుంది. లాయర్‌ కు విషయం చెప్పి ‘సీతాలు నువ్వు అక్కడే వుండు,వేరేపని గురించి పెళ్లి సాయంత్రానికి తిరిగి వస్తాను’అని చెప్పివెళ్లి వచ్చిన టీచరమ్మకు సీత స్థితి కన్నీరు పెట్టిస్తుంది. వెళ్ళిన కోర్టుస్టే పని కా లేదు,సరికదా పొద్దుటనుంచి తిండి,నీళ్లు, లేక అల మటిచడంతోపాటు అత్యవసరమైన’మూత్ర విసర్జన’ కు,కూడా లాయరు ఇంటివద్దచోటులేక, నరక యాతన పడ్డ సీతాలు స్థితిని రచయిత్రి కరుణ రసాత్మకంగా అక్షరీకరించి కన్నీరు పెట్టించింది. సీతాలు వారం పోయాక లాయర్ను కలవడానికి ఒక్కటే వెళ్లాలట. వెళ్ళేటప్పుడు రెండు వేలు తీసు కుని రమ్మన్నాడు’’అని చెప్పడంతో టీచర్లకు, గిరిజనులు,అటు గిరిజనేతరులు,అధికారులు, లాయర్ల,నుండి ఇలాంటి కష్టాలు పడి ఆస్తులు పోగొట్టుకుని పేదవాళ్లుమారుతున్నారో అర్థమవు తుంది.అటు పకీర్‌ రావు కూడా అప్పులు చేసే అతను ఎస్‌టి సర్టిఫికెట్‌ తెచ్చుకున్నాడు. సీతాలు తన భూమిని కాపాడుకోవడానికి అప్పులే చేసింది. ఇక ఇరువర్గాలు చేసుకున్న పనులవల్ల లాభపడిరది మాత్రం వడ్డీ వ్యాపారులు,అధికారులు, లాయర్లు, గిరిజనుల అభివృద్ధి పేరుతో చేసిన చట్టాలు సాయం తో స్వార్థపరుల ఎత్తులు పై ఎత్తులతోగిరిజనులు ఎలా నష్టపోతున్నారో వివరించబడిరది. చివరికి సీతాలు యస్టి సర్టిఫికెట్ను, ఫకీర్రావు నుంచి అధిక డబ్బులు పొందిన లాయర్‌ కోర్టుకు దాఖలు చేయక తాను గిరిజన జాతిగా కోర్టు ముందు నిరూపించుకో లేక తన పంట భూమిని కోల్పోవడం భూమి కోసమే చేరదీసిన గంగరాజు సీతాలును వదిలివేయడం జరుగుతుంది.ఈ ‘సీతాలు జీడిమామిడి తోట కథ’ని గిరిజన భూసమస్యలపై పరిశోధనకు వచ్చిన,తన స్నేహితురాలు పద్మినికి వివరిస్తుంది,రచయిత్రి టీచరమ్మ.గిరిజన ప్రాంతాల్లో నివసించే గిరిజనులు, గిరిజనేతరులు, ఇద్దరూ సమానంగా మోసగించ పడుతున్న విషయం గమనించిన పద్మిని కి ఇక్కడ పరిస్థితులు మార్చడానికి వారికి అందించాల్సిన ఆయుధం విద్య మాత్రమే అని రచయిత్రి సూచిం చటం,అందుకోసం పద్మిని ఆచరణాత్మకంగా ఆలో చించడంతో ఈకథముగిస్తోంది. –డాక్టర్‌ అమ్మిన శ్రీనివాసరాజు,
ఫోను: 77298 83223

అడవిలో వెన్నెల

కథ అంటే ప్రధాన పాత్ర దృష్టి కోణం లో కొనసాగి దాని ఆలోచనల ప్రకారం ముందుకు సాగినపుడే సంబంధిత కథకు వాస్తవి కత వస్తుంది అని బలంగా నమ్మే ప్రసిద్ధ తెలుగు కథకుడు బేతి శ్రీరాములు. కథల కర్మాగారంగా యువత చేత తలవబడే అనబడే శ్రీరాములు వారి అనుభవాల ఆలోచనల నుండి 1989 ప్రాంతంలో అక్షయ్‌ హరించబడి కథ ‘‘అడవిలో వెన్నెల’’.

ఆయన జన్మస్థానం కరీంనగర్‌ ప్రాం తపు జగిత్యాల,ఆపక్కనేగల అడవుల జిల్లా అయిన ‘ఆదిలాబాదు’తో అక్కడి గోండుల జీవన పరిస్థి తులతో ఆయనకు గల అవినాభావ సంబం ధాలు, అంతకు మించి ఆయన నిర్వహించిన, పాల్గొన్న అనేక ప్రజా ఉద్యమాలు మొదలైనవి. ఆయనలో అల్లుకుపోయి ఉన్న సామాజిక స్పృహ సృజనాత్మ కతలు,కలిసి అడవిబిడ్డల జీవితాలను సంస్కృతి సంప్రదాయాలను అనేక కథల రూపం లో ఆవిష్క రించారు. ఉద్యమాల నాయకుడిగానే కాక సాంఘిక సంక్షేమశాఖలో ఉద్యోగిస్తూనే.. విశాల సాహితి అకాడమీ సంస్థను స్థాపించి పలు పుస్తకాలు ప్రచు రణ చేశారు. అనేక సాహి త్య కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. అనం త రకాలంలో తెలంగాణ రాష్ట్ర తొలిబీస్సీ కమిషన్‌ చైర్మన్‌గా విధులు నిర్వహించారు. ఆయన కలం నుంచి జాలువారిన ‘అడవిలోవెన్నెల’ కథలోని విశేషాలేమిటో విశ్లేషించు కుందాం!
ఆదిలాబాద్‌ అడవితల్లి సందిట్లో అమాయక జీవనం గడుపుతున్న గోండుల జీవన విధానం,సంస్కృతి,వారు అణచివేతకు గురవుతున్న తీరు, కళ్ల ముందు కదలాడేటట్టు తనదైన సుదీర్ఘ శైలిలో రచయిత ఆవిష్కరించారు.కథ మొత్తం ఇస్రు అతని కొడుకు ఏసు,కూతురు మోతిల కేంద్రంగా నడుస్తుంది. అతి నిరుపేద అయిన ఇస్రు భార్య జ్వరం బారినపడి,అదే సమయంలో వచ్చిన నెలసరి కారణంగా వారి కులాచారం ప్రకారం ఊరి బయ ట ఉండే మైలపాకలో మూడు రోజులుఉండే క్రమంలో చలి గాలులు భరించలేక అక్కడే చనిపో తుంది.తల్లిలేని ఇద్దరు బిడ్డలను తనే పెంచు తూ ఉన్న కొద్ది జొన్న చేను పంట పండిరచుకుం టూ అయిన అప్పులు చెల్లించుకుంటు, తనశక్తికి మించిన శారీరక శ్రమ చేస్తుంటాడు ఇస్రు. యుక్తవయసుకు చేరిన కొడుకు బిడ్డల భవిష్యత్తు కోసం తనసుఖాన్ని వదులు కొని కష్టపడుతూఉంటాడు అతను. ఆరుగాలం కష్టపడుతూ వచ్చిన ఆదాయంతో షావుకారుల అప్పులకుగాను పండిరచిన పంట ధాన్యం, కొలవడం దానితో కూడా అప్పు తీరక పోతే అడవికి వెదురు బొంగులు నరికే కూలికి పోవడం, అక్కడి గోండుల నిత్యకృత్యం.అదే ఆన వాయితీ అయింది ఇస్రుకు అబ్బింది. ఇది చాలదు అన్నట్టు అడవిలో కలపనరికి అవసరాలకు ఉపయోగించుకుంటున్నారనే నెపంతో అటవీ అధికారులు పోలీసుల సాయంతో చేసే దాడులతో కూడా అక్కడి గోండ్లుగోస పడుతుంటారు. అవి వారికితరతరాలుగావస్తున్న తిప్పలు. బాధల నుండి బయటపడే మార్గం లేక అధికారులు షావుకార్లకు ఎదురు చెప్పలేక,నానా అగచాట్లు పడుతూ పేదరి కాన్ని కూడా భరిస్తూ.. తమ ఆచార సాంప్ర దాయా లు,కట్టుబాట్లు,ఎట్టిపరిస్థితుల్లోనూ తప్ప కుండా కాలానికి ఎదురీదుతుంటారు. అక్కడి గిరిజ నులు,అచ్చంగా అదే జీవితం మన కథాకర్త ఇస్రుది కూడా….!!
పేదరికానికి తోడు కాలికి తగిలిన దెబ్బ కు సంబంధించిన అనారోగ్యంతో మరింత ఇబ్బం దులు పడుతున్న ఇస్రు వేదనను రచయిత ఇందులో తనదైన కోణంలో ఆవిష్కరించారు.వాస్తవం ఎలా ఉందో చెప్పడంతో పాటు,ఎలా ఉంటే బాగుం టుందో అని చెప్పడం కూడా సోషలిస్టు వాస్తవి కత అన్నది రచయిత ప్రగాఢ విశ్వాసం. అందుకే అడవిలో వెన్నెల వృధాకాదు అది అడవి బిడ్డలకు ఉపయోగపడుతుంది అక్కడ ఉద్యమ మార్గంలో చైతన్యం వెల్లివిరిసి గోండు బిడ్డలకు ధైర్యంవచ్చి, వారు అందరిలా హాయిగా స్వేచ్ఛాగ జీవనం గడిపే రోజులు వస్తాయనే ఆశయం, ఆశతో కథ ముగించే నేపథ్యంలో భాగంగా తుపాకీ ఉద్యమ సంఘాన్ని వారికి పరిచయం చేసి కథ ముగిస్తూ… ఆలోచనాత్మక ముగింపును అందిస్తారు. కథలో రచయిత స్వీయ శైలి అయిన సుదీర్ఘత కనిపించిన, ఎక్కడ విసుగు రాకుండా గోండుల జీవనంలోని ఆచారవ్యవహారాలు అడుగడుగునా ఆసక్తిని కలిగిస్తూ పాఠకులను చేయిపట్టుకుని నడిపిస్తాయి. రచయితకు అడవిబిడ్డల సంస్కృతి,అలవాట్లపై అపారమైన గౌర వం,సమర్థింపు ధోరణి కనిపిస్తాయి. ఒకానొక సంద ర్భంలో వనవాసుల అలవాట్లుఅయిన లైంగిక స్వేచ్ఛ తదితరాలు,ఆధునిక దేశపు నాగరికుల అల వాట్లతో సరిపోల్చి చెప్పడం ఆశ్చర్యానికి లోనైన అది అసత్యంకాదు అనిపిస్తుంది.గిరిజనులకు సహజ సిద్ధంగా అలవాటైన చేపలవేట,వాటి రుచిపట్ల గల ఆపేక్ష గురించి ఇస్రుపాత్రద్వారా రచయిత అత్య ద్భుతంగా ఆవిష్కరిస్తారు, ఒకపక్క కాలిదెబ్బ పెడు తున్న భరించలేనిబాధను పడుతూనే చేపల వేటకు వెళ్లి తన లక్ష్యాన్ని అందుకోవడంతో ఇస్రుకుగల చేపలవేట ఇష్టత తెలుస్తుంది, ఎన్నో బాధలు భరిం చి ఇల్లు చేరిన తనకు ఇంటి వాతావరణం ఆందో ళన కలిగిస్తుంది. అడవిలో గిరిజనుల జీవాలు మేత మేసినందుకు,వారు ఇంటి అవసరాలకు అడవి నుంచి కర్రలు,కట్టెలు, తెచ్చుకున్నందుకు, వేర్వేరు కారణాలకు గాను ప్రతి కుటుంబం ఫారెస్ట్‌ వాళ్లకు ఏటా 50రూపాయలు చెల్లించాలి, డబ్బులు లేక పోతే అడవికి వెదురు బొంగు నరకడానికి వెళ్లాలి. ఆకూలీ డబ్బులతో వారి బాకీలు తీర్చుకుంటారు. అలా చేయడం ఆలస్యమైతే ఫారెస్టు అధికారులు ఇలా ఇళ్ళ మీద పడి దౌర్జన్యాలు చేయడం, బెదిరిం చడం,కొట్టడం,ఇంట్లో వస్తువుల కు నష్టం కలిగిం చడం విప్పసారా,కోళ్లు, కనిపించినవి కనిపించినట్టు ఎత్తుకుపోవడం, గోండు గూడేల్లో నిత్యం జరిగే తంతులే !! ఇస్రు ఇంట్లో ఆరోజు అదే జరిగింది, అది గతం నుంచి అలవాటైనతను, వారిని బ్రతి మాలి నచ్చజెప్పి అక్కడినుంచి పంపేస్తాడు.కానీ యువకుడైన కొడుకు ఏసుకు ఇదేమీ అర్థం కాదు, అంతకు ముందు ఫారెస్ట్‌ వాళ్ళుతనను కొట్టిన దెబ్బల బాధబరిస్తు తండ్రి నుంచి సరైన సమాధా నం రాక మౌనంగా రోదిస్తాడు. ఆదిలాబాద్‌ ప్రాం తంలోని మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో గోండుల ఆచారాలన్నీ కాస్త విభిన్నంగానే అగుపిస్తాయి. దగ్గరి లోని అహిరి మహారాజును వారి కష్టనష్టాలను కాపాడే పెద్దదిక్కుగా ఆరాధిస్తారు. ముఖ్యంగా దసరా పండుగకు గూడేల నుండి ఇంటికి ఒకరు చొప్పున మహారాజు వద్దకు విధిగా వెళ్లాలి. ఆడ వాళ్లు తప్పకుండా వెళ్లి అక్కడ నాట్యాలు చేయాలి. పేరుకు తమ కష్టనష్టాల గురించి మహారాజుకు చెప్పుకోవడం కోసం వెళ్లడమే కానీ వెళ్ళే ప్రతి ఒక్కరు ఏదోఒక వస్తువు,జంతువు,కానుకగా తీసుకు వెళ్లాలి. అక్కడ ఉండే రెండు రోజులకు సరిపడా తిండి కూడ ఎవరికి వారే తీసుకుపోవాలి. అయినా అక్కడి దసరా ఉత్సవాలకు పోవడానికి అందరూ ఇష్టపడతారు. కారణం వెళ్లకపోతే మనిషిని పది రూపాయల చొప్పున దండుగ పటేలుకు కట్టాల్సి ఉంటుంది. అలాగే ఆరోజు అక్కడ దొరికే లైంగిక స్వేచ్ఛకోసం గూడేలలోని యువత వెళ్లడానికి ఆరాట పడతారు. ఇస్రుకు ఈదసరా ఖర్చు ఒకటి గుర్తుకు వస్తుంది. తన కొడుకు ఏసు,పక్క గ్రామంలోని ధనికుడైన బాబురావు కూతురు లకింబాయి, ఒకరి కొకరు ఇష్టపడతారు.సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేయాలంటే కన్యాశుల్కం తదితర ఖర్చులతో అబ్బా యి తండ్రికి అధికఖర్చు అవుతుంది.అమ్మాయి తన ఇష్ట ప్రకారం ఇంట్లోకి వస్తే కాస్త ఖర్చు తగ్గుతుంది. ఇలాంటి కొత్త జంటలు ఏకం కావడానికి దసరా పండుగ,పంటకోతపండుగ,లాంటివి వారికి అను కూలంగా ఉంటాయి. అందుకే ఖర్చుకు భయపడ్డ ఇస్రు కొడుకు పెళ్లి ముందుగా చేయడానికి ఇష్టం చూపడు. ఎదిగిన తన కూతుర్ని తీసుకుని దసరా పండుగకు వెళ్లడానికి సిద్ధపడతాడు. అక్కడ కూతు రు మోతికి కావాల్సిన పూసల దండలు, పొడిపిం చాల్సిన పచ్చబొట్ల ఖర్చులకు డబ్బులు జమ చేసు కుంటాడు.ఏసు దసరాకు వెళ్ళలేకపోయినా.. తండ్రి లేనివేళ తన లకింబాయిని జొన్న చేనుకు రప్పించు కుని పండగలో పొందే ఆనందం ఇద్దరూ పొందు తారు. ఫారెస్ట్‌వారి దౌర్జన్యాలు జరిగిన ప్రతి రోజు రాత్రి గూడెం వాళ్ళు అంతా ఒక చోటచేరి మహారా జుకు ప్రజలకు మధ్యవర్తిగా ఉండే కుర్దుపటేలుకు తమ గోడువిన్నవించుకోవడం తను అంతా పరిష్కరి స్తానని సర్ది చెప్పడం ఎప్పుడూ పరిపాటే ! ఇలా ఉండగా దసరా ముగిసి పంట కోతల పండుగ వచ్చింది.రాత్రిగూడెం ప్రజలంతా పూజారి సమ క్షంలో పండుగలో పాల్గొంటారు. ముందే పథకం వేసుకున్న లకింబాయి జాకెట్‌ విడిచి ఆరాత్రి యేసు తో కలిసి ఆటపాటల్లో పాల్గొంటుంది, వారి ఆచా రం ప్రకారం అలాచేసి ఆఅబ్బాయి ఇంటికి వెళితే దాన్ని ఇష్టపూర్వకంగా ‘‘ఇల్లుజొచ్చు’’డుగా భావించి ఆఇద్దరికీ పెళ్లి చేస్తారు,పెళ్లి అయిన తరువాత ఛాతి మీద వేరే ఆచ్ఛాదన లేకుండా ఉండటం గోండు స్త్రీలకు ఆచారం. చాలా కొద్ది ఖర్చులతో ఏసు,లకింబాయి ఒక ఇంటివారు అవుతారు. కుల పెద్దలకు ఇచ్చిన బాపతులో భాగంగా ఇస్రు విప్ప సారా తాగి ఆనందం తెచ్చుకునే ప్రయత్నం చేస్తు న్నాడు కానీ కళ్ళముందు కనిపిస్తున్న అప్పులు,ఆడ బిడ్డపెళ్లి,బాధ్యతపట్టని కొడుకు, గురించి ఆలోచి స్తాడు ఆందోళనగ ఆనందానికి దూరమై… కొన్నాళ్లు గడిచాక అనుకున్నట్టే అప్పు పెట్టిన షావు కారు రాజారావు తన మందబలంతో ఇస్రు గుడి సెలమీద పడి దౌర్జన్యం చేసి పండిన జొన్నపంట మొత్తం ఎత్తుకు పోతాడు. కథ అచేతనంగా ముగిసి పోయింది అనుకుంటుండగానే ఊహించని మలుపుతో రచయిత సరికొత్త ముగింపును కలిపి స్తాడు. తుపాకీ దళంను కథలో ప్రవేశపెట్టడమే కాక,ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి అడవులను వేదికలుగ చేసుకుని కార్యకలాపాలు సాగిస్తున్న వారి బాధలు,కష్టాలు,తదితరాలు కూడా సవివరంగా చూపిస్తారు. చివరకు ఒకరాత్రి గూడెం చేరిన దళం కు గోండ్లు భోజనాలు పెట్టడం, తమ మధ్యవర్తి కుర్దు పటేల్‌ ద్వారా తమ గోడు వెళ్లబోసుకోవడం, దానికి వారి సహకారపు హామీ లభించడం, భవి ష్యత్తు మీద ఆశలు పెరగడం, ముఖ్యంగా ఏసు కు కమాండర్‌ తుపాకీ చూపించి ‘‘మనలను చంప వచ్చు మనుషులను కూడా దీనితో చంపవచ్చు’’ అని చెప్పిన మాటల ద్వారా అతని ఆలోచనల్లో మార్పు రావడం. ‘‘అడవి కాచిన వెన్నెల ఆకాశాన్ని కప్పేసిన వృక్షాల్ని చీల్చుకొని అడవినంతా పరుచు కుంటుంది, ఆ వెన్నెల్లో గూడెంలోని గుడిసెలన్ని తడుస్తాయి’’ అన్న వాక్యాలతో కథ ముగించడం, ఇవన్నీ రచయితలోని కట్టుబాట్లకు అర్థం చెబు తాయి, ఒక ప్రాంతపు గిరిజన ఆచారాలను ‘‘అక్షర నిక్షిప్తం’’ చేయడంతోపాటు, సంఘ చైతన్యాన్ని పురికొల్పడం వంటి ప్రయత్నాల ద్వారా రచయిత సఫలీకృతుడయ్యారు.
(వచ్చేమాసం మీకోసం వాడ్రేవు వీరలక్ష్మీదేవి కథ ‘‘కొండ ఫలం’’) – డాక్టర్‌ అమ్మిన శ్రీనివాసరాజు, ఫోను: 77298 83223

1 2 3