బంజరు నేలలో మొలకెత్తిన బంగారం..

నేలను నమ్ముకొంటే రైతుకు బంగారు భవిష్యత్తు ఉంటుందని మరోసారి రుజువు చేశారు వన్నూరమ్మ. కష్టాలెన్ని ఎదురైనా స్థైర్యం కోల్పోని ఆమె… బీడు భూమిలో బంగారు పంటలు పండిరచారు. దేశంలోని ఆదర్శ రైతుల్లో ఒకరుగా గుర్తింపు పొందారు. ప్రధాని మోదీతో ముఖా ముఖి మాట్లాడే అవకాశాన్ని పొంది,ఆయన ప్రశంసలు అందుకున్నారు. ‘ప్రకృతి వ్యవసాయమే రైతు సమస్యలకు పరిష్కారం’ అని చెబుతున్న ఆమె జీవన ప్రస్థానం ఇది…
కుటుంబాన్ని ఎలా పోషించాలనే ప్రశ్నకు నేను వెతుక్కున్న సమాధానం వ్యవ సాయం.ఉపాధి కరువైన సమయంలో వ్యవ సాయాన్నే జీవనాధారంగా ఎంచుకున్నాను. మాది అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని దురదకుంట గ్రామానికి చెందిన నిరుపేద దళిత కుటుంబం. ఆరేళ్ళ కిందట నాభర్త గోవిందప్ప అనారోగ్యంతో చనిపోవడంతో పరిస్థితులన్నీ తల్లకిందులయ్యాయి. నా నలు గురు పిల్లలకు దారి చూపించే బాధ్యత నా మీద పడిరది.
ఎగతాళి చేశారు…
మా కుటుంబానికి ముప్ఫై ఏళ్ళ కిందట ప్రభుత్వం 4.3ఎకరాల బంజరు భూమి ఇచ్చింది. ఒకప్పుడు అది పంటలు పండే భూమే. అయితే భవన నిర్మాణాల కోసం రాళ్ళ తవ్వకాల వల్ల బీడుగా మారిపోయింది. అందు లో సాగు సాధ్యం కాకపోవడంతో మా పెద్దలు దాన్ని అలాగే వదిలేశారు. భర్త పోయాక కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని గడిపేదాన్ని. మూడేళ్ళ కిందట ప్రకృతి వ్యవసాయం గురించి నాకు మొదటిసారి తెలిసింది. ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్ట్‌ మేనేజర్‌ లక్ష్మీ నాయక్‌ మా గ్రామానికి వచ్చి, రైతులతో సమీక్ష జరిపారు. రైతులు, భూముల వివరాలు సేకరించారు. సరైన పద్ధతులు పాటిస్తే ఏడాదికి మూడు పంటలు పండిరచవచ్చని చెప్పారు. ఆయన చొరవతో గ్రామంలో 64రైతు సంఘాలు ఏర్పాటయ్యాయి. ఈ స్ఫూర్తితో నేను కూడా వ్యవసాయం చెయ్యా లని నిర్ణయించుకున్నాను. ఆ మాట చెప్పగానే ఎంతోమంది నన్ను చూసి ఎగతాళిగా మాట్లా డారు. కానీ నేను వెనుకంజ వేయలేదు. మా భూమిలో ఉన్న కంప చెట్లనూ, మొక్కలనూ తొలగించాను. వ్యవసాయ యోగ్యంగా మార్చాను. తొలి పంట మొలకలెత్తగానే నాలో కలిగిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. క్రమంగా పంటలను పెంచుతూ వెళ్ళాను. రెండు ఎకరాల్లో చిరు ధాన్యాలు, వేరుశెనగ, కూరగాయలు, ఆకుకూర పంటలు వేశాను. దీనికి 27వేల రూపాయల పెట్టుబడి పెట్టాను. రూ.1.4 లక్షల ఆదాయం వచ్చింది. .మూడేళ్ళలో తొమ్మిది రకాల పంటలను విజయవంతంగా సాగు చెయ్యగలిగాను.
ఒకరికి ఒకరం సాయపడతాం…
పంటల సాగులో నేను ఎలాంటి రసాయనిక ఎరువులూ, మందులూ ఉపయోగించలేదు. ఆవు పేడ, గోమూత్రం, మట్టి, బెల్లం, పప్పుల పిండితో తయారు చేసిన ఘన జీవామృతాన్నీ, ద్రవరూపంలోని జీవామృతాన్నీ మాత్రమే వాడాను. ప్రకృతి వ్యవసాయం ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి. ఇలా పండిన పంటల్లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. పౌష్టికాహార వినియోగం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అందుకే దీనికి మంచి డిమాండ్‌. పంట దిగుబడి ఎంత ఉన్నప్పటికీ కొనుగోలుకు చాలామంది సిద్ధంగా ఉన్నారు. మార్కెటింగ్‌ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ పద్ధతిలో పంటలు ఎవరు పండిస్తున్నారో తెలుసుకొని ముందుగానే అడ్వాన్సులు ఇస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం వల్ల భూముల్లో సారాన్ని కాపాడుకోవచ్చు. మా పొలంలో పండిస్తున్న ధాన్యాలు,కూరగాయలు, ఆకుకూరల వల్ల మా కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా బాగుంది. ఇప్పుడు నామీద ఆర్థిక భారం తగ్గింది. అప్పులన్నీ తీర్చేశా. ప్రస్తుతం టొమాటో పంటను సాగు చెయ్యడానికి పొలాన్ని సిద్ధం చేస్తున్నాను. సరైన మార్గదర్శకత్వం రైతులకు లభిస్తే సానుకూల ఫలితాలు లభిస్తాయి. నా నేతృత్వంలో నడుస్తున్న స్వయంసహాయక బృందంలోని మహిళల నుంచి నాకు ఎంతో ప్రేరణ లభిస్తోంది. మేం ఒకరికి ఒకరం సాయం చేసుకుంటాం. పొదుపు చేసుకుంటాం. రుణాలు తీసుకుంటాం. విత్తనాలను పంచు కుంటాం. ఒకరి పొలంలో మరొకరం పని చేస్తాం. కష్టకాలంలో ఒకరిని ఒకరు ఆదుకుంటూ ఉంటాం. ప్రస్తుతం మా గ్రామాన్ని రసాయన రహిత వ్యవసాయ గ్రామంగా… అంటే బయో గ్రామంగా మార్చడానికి నేనూ, మా గ్రామస్తులూ పని చేస్తున్నాం.
రైతులకు శిక్షణ ఇస్తున్నా….
సాక్షాత్తూ దేశ ప్రధానితో మాట్లాడే అవకాశం వస్తుందనీ, ఆయన ప్రశంసలు అందుకుంటాననీ కలలోనైనా ఊహించలేదు. సుమారు అయిదు నిమిషాలు ఆయన మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయంలో నా అనుభవాలను ఆయన స్వయంగా తెలుసుకున్నారు. ‘‘వన్నూరమ్మ మేడమ్‌! మీరు దేశ రైతులకు ఆదర్శం కావడం అభినందనీయం’’ అని మోదీ ప్రశంసించారు. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను.‘అతి తక్కువ వర్షపాతం ఉన్న జిల్లాలో వ్యవసాయాన్ని సుసాధ్యం చేసిన ఆదర్శ రైతు’ అంటూ అందరూ అంటూ ఉంటే ఎంతో సంతోషంగా అనిపిస్తోంది.పట్టుదలతో పని చేస్తే ఏదైనా సాధించవచ్చు.పేద దళిత కుటుంబంలో పుట్టిన నేను ఎన్నో కష్టాలు పడ్డాను. అవేనాకు పాఠాలుగా మారాయి. ఇప్పుడు ఐసిఆర్‌పి (ఇంటర్నల్‌ కమ్యూనిటీ రిసోర్స్‌పర్సన్‌)గా పని చేస్తున్నాను. బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానిపల్లి వంకతండాలో దాదాపు 170 మంది మహిళా, ఆదివాసీ రైతులకు ప్రకృతి వ్యవసాయంలో శిక్షణ ఇస్తున్నాను.దీనికి గౌరవవేతనం కూడా లభిస్తోంది. మా అబ్బాయిల్లో ఒకడైన అనిల్‌ వ్యవసాయం చేస్తున్నాడు. ఏది ఏమైనా ప్రకృతి వ్యవసాయం ప్రయోజనాలపై అన్ని గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నదే నా ఆశయం.’’

  • శంకర్‌నాయక్‌, కళ్యాణదుర్గం
    సహజ వ్యవసాయం వల్లే సాధ్యం!
    ‘‘శీతల దేశాల్లో తప్పితే మిగిలిన ప్రాంతాలన్నింటిలోను గాలిలో తేమ ఉంటుంది. దీనిని ఆధారంగా చేసుకొని వ్యవసాయం చేయగలిగితే బంజరు భూములలో కూడా మంచి దిగుబడి తేవచ్చు. సహజ వ్యవసాయం పద్ధతిలో మేము ఈ తరహా ప్రయోగాలను 2018 నుంచి అనంతపూర్‌ ప్రాంతంలో చేస్తున్నాం. సాధారణంగా ఈ ప్రాంతంలో బంజరు భూములు ఎక్కువ. నీటి వసతి తక్కువ. అందువల్ల లభ్యమయ్యే అతి తక్కువ నీరు, గాలిలో తేమల ఆధారంగా వ్యవసాయ పద్ధతులను రూపొందించాం. వన్నూరమ్మ కూడా ఈ పద్ధతిలో సేద్యం చేశారు. ఈ పద్ధతిలో ఏడాది పొడుగునా రకరకాల కూరగాయలు పండిరచటం జరుగుతుంది. దీని వల్ల రైతులకు సంవత్సరం పొడుగునా ఆదాయం ఉంటుంది. రెండోది సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులు కావటంతో పోషకాలు కూడా ఎక్కువ ఉంటాయి. పంటలు మార్చి మార్చి వేయటం వల్ల నేలకు పోషకాలు అందుతాయి. ఈ రెండిరటితో పాటుగా- ఈ పంటలు పండిరచే ప్రాంతంలో ఉష్ణోగ్ర తలు తక్కువ ఉంటాయి. ఈ విషయాన్ని గమనించి ప్రపంచంలోని అనేక మంది శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం లక్షకు పైగా రైతులు ఈ తరహా వ్యవసాయ పద్ధతిని అనుసరిస్తున్నారు.
  • టి. విజయ్‌ కుమార్‌, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్మన్‌, రైతు సాధికార సంస్థ
    తెలుగు రైతులు ఆదరిస్తున్నారు!
    సహజ వ్యవసాయ పద్ధతులను మిగిలిన వారితో పోలిస్తే తెలుగు రాష్ట్రాల రైతులు ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనే దాదాపు రెండు లక్షల ఎకరాలలో ప్రకృతి కృషి పద్దతిలో సాగు జరుగుతోందంటే- దీనికి లభిస్తున్న ఆదరణను మనం గమనించవచ్చు. రైతు సాధికార సమితి కేవలం ఆంధ్రాలో మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా నోడల్‌ ఏజన్సీగా వ్యవహరిస్తోంది. ఇక మహిళా రైతులకు వ్యవసాయంతో పాటు కుటుంబ బాధ్యతలు కూడా తెలుసు. కనుక తమ కుటుంబానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలని ఎలా అనుకుంటారో.. సమాజానికి కూడా అలాంటి ఆహారాన్ని అందించాలనే తపన వారిలో కనిపిస్తూ ఉంటుంది. ఎరువుల వల్ల కలిగే కష్టనష్టాలు వారికి బాగా తెలుసు కాబట్టి- సహజ వ్యవసాయ పద్ధతులను అనుసరించటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. వారికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల సహకారం అందిస్తోంది. 2015 నుంచి సహజ వ్యవసాయ పద్దతులపై కేంద్రం అమలు చేసిన పధకాలన్నీ విజయం సాధించాయి. ఈ ఏడాది సాగు పద్ధతులపైనే కాకుండా.. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌పైన దృష్టి పెడుతున్నాం. సేంద్రీయ రైతు ఉత్పత్తి సంస్థ (ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్స్‌-ఎఫ్‌సీఓ)లను ఏర్పాటు చేస్తున్నాం. వీటివల్ల రైతులు తమ ఉత్పత్తులను లాభసాటి ధరలకు విక్రయించుకోగలుగుతారు. ఎఫ్‌సీఓల వల్ల దేశంలో సేంద్రీయ వ్యవసాయానికి కొత్త ఊపు వస్తుందని ఆశిస్తున్నాం.’- అడిదం నీరజ శాస్త్రి, జాయింట్‌ సెక్రటరీ, కేంద్ర వ్యవసాయ శాఖ-(ఆర్‌.కె.రాఘవ రమణా రెడ్డి)

చిరు సేధ్యం..ఆరోగ్య భాగ్యం

మారుతున్న ఆధునిక పోకడలు.. నిత్యం పని ఒత్తిడిలో పడ ఆరోగ్యాన్ని ఆశ్రద్ద చేయడం.. తీరిక లేకుండా బిజీగా గడుపుతూ దొరికిన జంక్‌ఫుడ్‌ తినడానికి నగర ప్రజలు అలవాటు పడిపోతున్నారు.దీంతో కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపధ్యంలో ఆరోగ్యానికి అవసరమయ్యే పోషకాలుఉన్న తిండి తినేందుకు ఆసక్తి చూపుతున్నారు. చిరుధాన్యాల్లో మంచి పోషక విలువలు ఉంటున్నాయి. వీటిని సాగు చేస్తున్న రైతులకు సైతం సిరులు కురిపిస్తు న్నాయి. అంతేకాకుండా వీటి సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. మద్దతు ధరను కూడా ప్రకటించింది.రైతులు పండిరచిన దిగుబడులను పౌరసరఫరాశాఖ ద్వారా కొనుగోలు చేసేందుకు సన్నాహాలు చేసింది. దీంతో చాలా మంది రైతుల చిరుధాన్యాల సాగుకు ఆసక్తి చూపుతున్నారు.
నేటి పోటీ ప్రపంచంలో అధిక దిగుబడులే లక్ష్యంగా రసాయనిక ఎరువులు,పురుగు మందుల వినియోగం పెరిగిపోయింది. ఫలితంగా భూమిలో రసాయన అవశేషాలు నిండి ఏటికేడాది పంట దిగుబడులు పడిపోతున్నాయి.ఇలా సాగు చేసిన ఆహారం పంటల్లో కూడా రసాయనాల అవశేషాలు ఎక్కువ ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫలితంగా జనాల్లో వ్యాధుల సంఖ్య ఎక్కువ అవుతున్నట్లు తెలుస్తోంది.వీటికి చెక్‌ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది.చాలా మంది ఇప్పుడు చిరుధాన్యాలను ఇష్టపడుతున్నారు. ఇప్పటికే చాలా ఏళ్ల నుంచి నగరంలోని రైతు బజార్లులో ప్రత్యేక కౌంటర్ల పెట్టి విక్రయాలు సాగిస్తున్నారు.నగర ప్రజలపై అవగాహన కల్పించేందుకు గత రెండేళ్ల నుంచి కొన్ని స్వచ్చంధ సంస్థలు కలసి చిరుదాన్యాల జాతర కార్యక్రమాలను ఏర్పాటు చేసి ప్రజలను అవగాహన కల్పిస్తున్నారు.ఇందుకు సంబంధించి ఇటీవలే ఐక్యరాజ్యాసమితి కూడా 2023ను అంతర్జాతీయ మిల్లెట్స్‌ సంవత్సరంగా ప్రకటించింది. దీనికి అనుగుణంగా రాష్ట్రప్రభుత్వం సాగును ప్రొత్సహించేంఉదకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో సదస్సులను నిర్వహిస్తూ రైతులకు అవగాహన కల్పిస్తోంది.
మినుకు మినుకు..
వర్షాధార,సారవంతం కాని భూముల్లో ఆహార పంటలుగా చెలామణి అవుతున్న వరి,గోధుమ,మొక్కజొన్న లాంటివి పండిరచలేము. దాంతో ఆయా భూముల్లో ఇప్పటికీ మిల్లెట్స్‌ సాగు మినుకు మినుకు మంటోంది. అంటే పాక్షిక ఉష్ణమండల ప్రాంతాలలో సాగు చేస్తున్నారు. ప్రధాన ఆహార ధాన్యాలలో కంటే వీటిలో పోషకాలు, ఫైబర్‌ అధికంగా ఉంటాయి. ఆరోగ్య భద్రతనిస్తాయి. అంతేకాక తీవ్రమైన వాతావరణ అననుకూల పరిస్థితులను తట్టుకునే శక్తి ఈ మిల్లెట్స్‌కు ఉంది. పర్యావరణ అభివృద్ధికి తోడ్పడతాయి.
2023 అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం..
చిరుధాన్యాలు..సిరిధాన్యాలుగా పిలువబడే మిల్లెట్స్‌ పూర్వకాలం నుంచి మన దేశంలో ప్రధాన ఆహారపంటగా ఉండేది. ప్రస్తుతం వరి, గోధుమ, ఇతర ఫాస్ట్‌ఫుడ్స్‌ జనజీవన సరళితో మమేకమయ్యాయి. కంటికింపుగా పిల్లలను, పెద్దలను ఆకర్షిస్తున్న ఫాస్ట్‌ఫుడ్స్‌ లాంటి ఆహార పదార్ధాలు జిహ్వచాపల్యాన్ని తీర్చడం తప్ప ఆరోగ్యహేతువులు కావు. కోవిడ్‌లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి రోగ నిరోధక శక్తి అవసరం. అన్ని తరగతుల ప్రజలకు పౌష్టికాహారం అందించాల్సిన అగత్యం ఏర్పడిరది. వీటన్నింటి దృష్ట్యా మన ప్రభుత్వం 2023ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితికి ప్రతిపాదించింది.
రిఫైన్డ్‌ డైట్‌ కల్చర్‌కు ప్రత్యామ్నాయంగా..
మారిన జీవనశైలితో ప్రజలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. ఇప్పుడిప్పుడే ప్రజల్లో చైతన్యం పెరిగి,‘రిఫైన్డ్‌ డైట్‌ కల్చర్‌’కు ప్రత్యామ్నాయంగా పోషకాలు అధికంగా ఉండే మిల్లెట్స్‌ను స్వీకరించే స్థితిలో ఆలోచిస్తున్నారు. పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ప్రజలు రోగనిరోధక శక్తిని పెంపొందించు కోవడానికి మిల్లెట్స్‌ వినియోగంపై దృష్టి పెడుతున్నారు. ప్రకృతి ప్రేమికులు ప్రజల్లో మీడియా ద్వారా వీటిపై అవగాహన కల్పిస్తున్నారు.
పోషకాలు మెండు..
మిల్లెట్ల ఉత్పత్తి, వినియోగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో కేంద్రప్రభుత్వం2018 ఏప్రిల్‌లో మినుములను న్యూట్రి-తణధాన్యాలుగా ప్రకటించింది.వాటిలోజొన్న (జోవర్‌),పెరల్‌ మిల్లెట్‌ (బజ్రా),ఫింగర్‌ మిల్లెట్‌ (రాగి/మాండువా) మైనర్‌ మిల్లెట్‌బీ ఫాక్స్‌టైల్‌ మిల్లెట్‌ (కంగని/కాకున్‌),ప్రోసో మిల్లెట్‌ (చీనా),కోడోమిల్లెట్‌ (కోడో),బార్న్యార్డ్‌ మిల్లెట్‌(సావా/సన్వా/జంగోరా),లిటిల్‌ మిల్లెట్‌ (కుట్కి)లు కూడా ఉన్నాయి.గ్రామీణస్థాయిలో వ్యవసాయం,చిన్నతరహా,కుటీర పరిశ్రమలు, హస్తకళలు,ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో జాతీయ అభివద్ధి బ్యాంకుగా బాధ్యత వహించే నాబార్డ్‌ కూడా ఈ థీమ్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించింది.
చిరుసేధ్యం కేరాఫ్‌ ఏజెన్సీ ప్రాంతం..
చిరుధాన్యాలు ఒకప్పుడు పేదలు,మధ్య తరగతి ప్రజల ప్రధాన ఆహారం.మూడు,నాలుగు దశాబ్దాల క్రితం వరకూ వీటి వినియోగం అధికంగానే ఉండేది.ముఖ్యంగా ఉమ్మడి జిల్లా ఏజెన్సీ ప్రాంతాలైన 11మండలాలల్లో చిరు సేధ్యం ఉత్పత్తులు అధికంగా ఉండేవి.వీటికి రసాయనిక ఎరువులు,పురుగుమందులు వాడకుండా పశువుల ఎరువు, చెరువు మట్టి,సేంద్రియ ఎరువులతో పండిరచే వాళ్లు. పలితంగా వీటిని వాడే ప్రజల్లో రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉండేది. అనంతరం వచ్చిన మార్పులతో ఏడాదికేడాది చిరుధాన్యాల సాగు తగ్గుతూ వచ్చింది.చాలా మంది రైతున్నలు అధిక ఆదాయం కోసం వరి,పత్తి,మిరప,ఉల్లి వంటి పంటల సాగుపై ఆసక్తిని కనబరచ డంవల్ల చిరుధాన్యాల సాగు కనుమరుగువుతూ వచ్చింది.వీటితోపాటు అధిక దిగుబడులను సాధించాలనే పోటీతత్వంతో రైతులు విచక్షణా రహితంగా ఎరువులు,పురుగు మందులు వాడటం మొదటు పెట్టారు. ఫలితంగా సాగు ఖర్చులు పెరిగి పంట దిగుబడులు తగ్గాయి. భూమి కూడా విషతుల్యంగా మారుతోంది. దీనిని తగ్గించేందకు రాష్ట్ర ప్రభుత్వం చిరుధాన్యాల సాగును ప్రొత్సహిస్తోంది. ఇందులో భాగంగా జొన్నలు,రాగి పంటలకు మద్దతు ధరను ప్రకటించింది.
ఈ ఏడాది 9.85 వేల హెక్టార్ల సాగు లక్ష్యంగా…
ఉమ్మడి జిల్లా అనకాపల్లి,అల్లూరి సీతారామ రాజు,విశాఖపట్నం జిల్లాలో మిల్టెట్స్‌ సాగను ప్రొత్సహించే లక్ష్యంలో భాగంగా ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 9.85 హెక్టార్లలో సాగు చేసేందుకు వ్యవసాయ అధికారులు ప్రణాళికలను సిద్దం చేశారు. అందులో 2664 హెక్టారులో జొన్న,2050 హెక్టార్లలో సజ్జలు,2010హెక్టాలో రాగి,1872 హెక్టారలలో కొర్రలు సాగు లక్ష్యంగా నిర్ధేశించారు. రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) పరిధిలో మిల్లెట్స్‌,క్లస్టర్స్‌ ఏర్పాటు చేసి ప్రతి నెలా మొదటి శుక్రవారం వ్యవసాయ అధికారులతో రైతులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ సాగను ప్రొత్సహిస్తున్నారు.
మద్దతు ధరలు ఇలా..
రాష్ట్ర ప్రభుత్వం మిల్లెట్స్‌ సాగు ప్రొత్సహించే కార్యక్రమంలో భాగంగా జొన్న,రాగులకు మద్దతు ధరలను కూడా ప్రకటించింది. హైబ్రీడ్‌ జొన్నలకు క్వింటా రూ.3,180కాగా సాధారణ జొన్నకు క్వింటా 3225,అలాగే రాగులకు క్వింటాకు రూ.3846గా ప్రకటించింది. రైతులు పండిరచిన పంటలకు మద్దతు ధరను కల్పించి పౌరసరఫరాశాఖ తరుపున కొనుగోలు చేయనుంది.చిరుధాన్యాలు.. సిరి ధాన్యాలుగా పిలువబడే మిల్లెట్స్‌ పూర్వకాలం నుంచి మన దేశంలో ప్రధాన ఆహారపంటగా ఉండేది. ప్రస్తుతం వరి, గోధుమ, ఇతర ఫాస్ట్‌ఫుడ్స్‌ జనజీవన సరళితో మమేకమయ్యాయి. కంటికింపుగా పిల్లలను, పెద్దలను ఆకర్షిస్తున్న ఫాస్ట్‌ఫుడ్స్‌ లాంటి ఆహార పదార్ధాలు జిహ్వచాపల్యాన్ని తీర్చడం తప్ప ఆరోగ్యహే తువులు కావు. కోవిడ్‌లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి రోగ నిరోధక శక్తి అవసరం. అన్ని తరగతుల ప్రజలకు పౌష్టికాహారం అందించాల్సిన అగత్యం ఏర్పడిరది. వీటన్నింటి దృష్ట్యా మన ప్రభుత్వం 2023ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితికి ప్రతిపాదించింది. ఐదు వేల సంవత్సరాల క్రితం నుంచి భారత ఉపఖండంలో చిరుధాన్యాలు పండిరచబడుతున్నాయని సూచించడానికి పాలియోం టలాజికల్‌ ఆధారాలున్నాయి. గడ్డి కుటుంబానికి చెందినవి చిరుధాన్యాలు. ఏడాదంతా ఉష్ణమండల వాతావరణంలో పెరిగే తృణధాన్యాలు. తక్కువ నీటి సౌకర్యంతో,అతి తక్కువ కాలంలోనే పంట కోతకు వచ్చి, దిగుబడిని ఇస్తాయి. సైజులో చిన్నవే కానీ పోషకాలు మెండుగా ఉంటాయి. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫైబర్‌, అమైనో ఆమ్లాలు,వివిధ రకాల ఖనిజాలను కలిగి ఉం టాయి. రాగులు (ఫింగర్‌ మిల్లెట్‌),జొన్నలు (జోవర్‌),బజ్రా (పెర్ల్‌ మిల్లెట్‌),ఊదలు, కొర్రలు, అండుకొర్రలు, ప్రోసో (చీనా),కోడో (కొడ్రా, అరికెలు), ఫాక్స్‌ టెయిల్‌ (కంగ్ని/కొర్ర), బార్న్యార్డ్‌ (వరై, సావా), లిటిల్‌ మిల్లెట్‌ (కుట్కి) మనదేశంలో పండిరచే మిల్లెట్లు.
ఆకుపచ్చ విప్లవం..
ఎమ్‌ఎస్‌ స్వామినాథన్‌ ఆధ్వర్యంలో (1960) వచ్చిన గ్రీన్‌ రివల్యూషన్‌ దశాబ్ద కాలం మనగ లిగింది. తద్వారా భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా అధిక దిగుబడినిచ్చే గోధుమ, వరి లాంటి రకరకాల విత్తనాలు వ్యవసాయంలో ప్రాధాన్యతను సంతరించు కున్నాయి. గ్రీన్‌ రివల్యూషన్‌ నేపథ్యంలో యాంత్రిక వ్యవసాయ ఉపకరణాలు, నీటి సౌకర్యం, పురుగుమందులు, ఎరువులు అభివృద్ధి రూపంలో వినియోగంలోకి వచ్చాయి. వ్యవసాయం ఆధునిక పారిశ్రామిక వ్యవస్థగా మారింది. ఆహారధాన్యాల ఉత్పత్తి, ఉత్పాదకత పెరిగింది. వాణిజ్య, వ్యాపార ధోరణిలో క్రమంగా వరి, గోధుమ ప్రాముఖ్యత పెరిగి, మిల్లెట్స్‌ ఉనికి మరుగున పడిపోయింది.
నాబార్డ్‌ ప్రమేయం..
గ్రామీణస్థాయిలో వ్యవసాయం, చిన్న తరహా, కుటీర పరిశ్రమలు, హస్తకళలు, ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో జాతీయ అభివద్ధి బ్యాంకుగా బాధ్యత వహించే నాబార్డ్‌ కూడా ఈ థీమ్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించింది.-(జి.ఎ.సునీల్‌ కుమార్‌)

ఎకో టూరిజం తగ్గేదెలా 

నగరవాసుల మధ్య (స్వచ్ఛసర్వేక్షణ్‌2023) పరిశుభ్రతను పెంపొందించడానికి ముమ్మర ప్రయత్నాలు సాగిస్తోంది.స్వచ్ఛ సర్వేక్షణ్‌2023 లో టాప్‌ ర్యాంక్‌ సాధించడమే లక్ష్యంగా జీవీఎంసీ దృష్టి కేంద్రీకరించింది. దీని కోసం నగర ప్రజలకు అవగాహన కల్పించడానికి ఏకో వైజాగ్‌ పేరుతో ప్రపంచ పర్యావరణ దినోత్స వం సందర్భంగా గతనెల 5న ప్రచారాన్ని ప్రారంభించింది.గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జివిఎంసి) పౌరులలో పరిశుభ్రతను పెంపొందించడానికి,నగరంలో కాలు ష్యంతో పాటు ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా పోరా టాన్ని కొనసాగించడానికి ‘ఈ ఎకో-వైజాగ్‌’అనే కొత్త ప్రచారాన్ని ఆర్‌కే బీచ్‌లో మున్సిపల్‌ అడ్మిని స్ట్రేషన్‌శాఖ మంత్రిఎ.సురేష్‌, జిల్లాఇన్‌ ఛార్జి మంత్రి వి.రజినితోపాటు మేయర్‌ జి.హరివెంకట కుమారి, ఇతర స్థానిక ప్రజా ప్రతినిధులు లాంఛనంగా ప్రారంభించారు. ప్రచారంలో భాగంగా పర్యావరణ పరిశుభ్రత,పచ్చదనం,నీటి సంరక్షణ,ప్లాస్టిక్‌ నిషేధం, కాలుష్యాన్ని తగ్గించ డం వంటి ఐదు అంశాలపై జీవీఎంసీ కమిష నర్‌ సాయి కాంత్‌ వర్మ దృష్టి సారించారు.ఎకో క్లీనింగ్‌లో భాగంగా వ్యర్థ పదార్థాల నిర్వహణ, వేరు చేయడాన్ని ప్రోత్సహిం చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జివిఎంసి బహిరంగ డంపింగ్‌,పరిశుభ్రతను నిర్వహించ డంవల్ల కలిగే దుష్ప్రభావాల గురించి అవగా హన కల్పిస్తుంది. డ్రైవ్‌లో భాగంగా కార్పొరేషన్‌ పరిధిలో పచ్చదనాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టనున్నారు.నీటి సంరక్షణలో భాగంగా బీచ్‌ క్లీనింగ్‌ కార్యకలాపాలు,రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ మెళుకువలు భారీస్థాయిలో కొనసాగుతాయి. దీంతోపాటు ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా ఉత్పత్తులను తీసుకు రావడానికి కార్పొరేషన్‌ కృషి చేస్తుంది.దీనికి సంబంధించి ఎకోమేళా కూడా నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఇప్పటికీ జీవీఎంసీ 10ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ బృందాలను సిద్ధం చేసి ఆ బృందాలకు ప్రత్యేక వాహనాలు కొనుగోలు చేసి అందజేశారు. ప్రతి బృందంలో ఇద్దరు అధికారులు నియమించారు.వారు తనిఖీలు, ఆలోచనలు,ఫిర్యాదుల పరిష్కారం, కార్యక్రమా లను నిర్వహిస్తున్నారు. నగర ప్రజల అలవాట్లను మార్చడం,పచ్చదనాన్ని పెంపొందించడం,నీటి సంరక్షణ, కాలుష్య నియంత్రణ చర్యలు,సింగిల్‌ యూ జ్‌ ప్లాస్టిక్‌పై కఠినమైన నిషేధం వంటి అంశాలపై ఈ టాస్క్‌ స్క్వాడ్‌లు చర్యలు తీసుకుంటారు.అవసరమైతే ఈఎన్‌ఫో ర్స్‌మెంట్‌ బృందాలు జరిమానాలు కూడా విధిస్తాయి. 56 కిలోమీటర్ల బీచ్‌ తీరప్రాంతంలోని నగర పరిమితుల్లో కాలు ష్యానికి వ్యతిరేకంగా పోరాడేందుకు నగర ప్రజలు మద్దతు ప్రకటిస్తూ ఉత్సహంగా భాగస్వామ్యం అవుతున్నారు.బీట్‌ ప్లాస్టిక్‌ పొల్యూషన్‌ అనే నినాదంతో ప్లాస్టిక్‌ కాలుష్యానికి పరిష్కారాలపై దృష్టి పెడుతూ విస్త్రత ప్రచారం చేస్తోంది.
స్వచ్ఛ సర్వేక్షణ్‌2023లో టాప్‌ ర్యాంకే లక్ష్యం గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ)స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2023-మేరా షెహర్‌,మేరీ పెహచాన్‌ (ఎస్‌ఎస్‌-2023) ఎనిమిది ఎడిషన్‌ కోసం సిద్ధమవుతోంది.దీని కోసం దేశవ్యాప్తంగా 3,000మంది మదింపు దారులతో జూలై ఒకటి నుండి ఫీల్డ్‌ అసెస్‌ మెంట్‌ ప్రారంభించారు.ఈనెల రెండోవారంలో వైజాగ్‌కు అసెస్సర్‌లు రానున్నారు. విశాఖ పట్నంతో సహా4,500ప్లస్‌ నగరాల పనితీరును 46సూచికలపై ఒక నెలలోపు మదింపుదారులు అధ్యయనం చేస్తారు. అంచనా నివేదిక ప్రతి పారామీటర్‌లో స్కోర్‌ల రూపంలో విడుదల చేయబడుతుంది.మొత్తం మార్కులు9,500. ఇందులో పౌర సేవలకు 4,525మార్కులు, సర్టిఫికెట్లు,అవార్డులకు 2,500,ప్రజల అభిప్రాయానికి 2,475మార్కులు ఉన్నాయి. ఎస్‌ఎస్‌2023 పౌరుల నుండి టెలిఫోనిక్‌ ఫీడ్‌బ్యాక్‌తో 2022లో మే 24న ప్రారంభి చింది. మూల్యాంకనం నాలుగు త్రైమాసికాల్లో నిర్వహించబడుతుంది. మొదటి మూడు త్రై మాసికాలు పూర్తయ్యాయి. బృందాలు సాక్ష్యం కోసం రెండు స్థాయిల నాణ్యత తనిఖీలు, ప్రత్యేక క్షేత్ర సందర్శనలను ఉంటాయి. స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2022 సర్వేలో విశాఖపట్నం నాలుగో స్థానంలో నిలిచింది.2021లో నగరం తొమ్మిదో స్థానం నుండి పైకి ఎగబాకింది. ఇది2017లో మూడవ పరిశుభ్రమైన నగరంగా ప్రకటించ బడిరది.ఇది ఇప్పటివరకు అత్యుత్తమ ర్యాంకింగ్‌ స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2022 ర్యాంకింగ్స్‌ ప్రకారం విశాఖపట్నం దేశంలో నాల్గవ పరిశుభ్రమైన నగరంగా (10లక్షలకు పైగా జనాభా విభాగం లో) ఎంపికైంది. నగరం 2021సంవత్సరంలో తొమ్మిదవ స్థానం నుండి 2022లో నాల్గవ స్థానానికి తన ర్యాంకింగ్‌లను మెరుగుపరిచింది. మొదటి నాలుగు స్థానాల్లో నగరానికి స్థానం దక్కడం ఇదిరెండోసారి.స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2017లో,నగరం మూడవ పరిశుభ్రమైన నగరంగా గుర్తింపు పొందింది. ఇది ఇప్పటి వరకు అత్యుత్తమ ర్యాంకింగ్‌గా ఉంది. ఇదికాకుండా,జీవీఎంసీ స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2022లో మరో రెండు అవార్డులను కైవసం చేసుకుంది. ఒక అవార్డు చెత్త రహితనగరాల్లో (జిఎఫ్‌సి)ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌ను పొందినందు కుగాను, మరోకటి 10నుండి 40 కేటగిరీలో ‘క్లీన్‌ బిగ్‌ సిటీ’ అవార్డును పొందడం విశేషం.
స్వచ్ఛ సర్వేక్షణ్‌ ఫలితాల్లో విశాఖ టాప్‌
దేశ వ్యాప్తం గా 73లక్షల 95 వేల 680 మంది ఆన్‌లైన్‌లో ఫీడ్‌ బ్యాక్‌ సేకరించారు. 2701 మంది క్షేత్ర స్థాయిలో పర్యటించి 17,030 వాణిజ్య ప్రాం తాలు,24,744 నివాస ప్రాంతాలు, 16,501 చెత్త శుద్ధి కేంద్రాలు, 1496 రెమిడియేషన్‌ సైట్లను సందర్శించి క్షేత్ర స్థాయిలో తీసిన 22.26లక్షల ఫోటోలను విశ్లేషించి ర్యాంకుల్ని ఖరారు చేశారు.లక్షకు పైబడిన నగరాల్లో విశాఖ పట్నం7500మార్కులకు 6701మార్కు లతో నాలుగో స్థానంలో,6699 మార్కులతో విజయవాడ 5స్థానంలో,6584 మార్కులతో తిరుపతి ఏడో స్థానంలో,4810మార్కులతో 75వ ర్యాంకుతో కర్నూలు,4688 మార్కులతో 81వ స్థానంలో నెల్లూరు పట్టణాలు స్వచ్ఛ భారత్‌ ర్యాంకుల్ని దక్కించుకున్నాయి.జాతీయ స్థాయిలో స్థానిక సంస్థల విభాగంలో పెద్దనగ రాల జాబితాలో 10నుంచి 40లక్షల జనాభా కింద ఈసారి పలు నగరాలను అవార్డు కోసం ఎంపిక చేయగా,మధ్యస్థాయి నగరాల జాబితా లో,3 నుంచి 10లక్షల జనాభా విభాగంలో మరికొన్ని నగరాలు, పట్టణాలను చేర్చారు.స్టేట్‌ క్యాపిటల్‌ జాబితాలో మరికొన్ని నగరాలకు అవార్డులు ప్రకటించగా,విజయవాడ మొదటి స్థానంలో నిలిచింది.అంశాలవారీ స్కోరింగ్‌.. స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుకు సంబంధించి మొత్తం వివిధ విభాగాల కింద 7,500 మార్కులు కేటా యించారు. అందులో విజయవాడ 6,699 మార్కులు మాత్రమే సాధించింది.
వాలంటీర్లకు టార్గెట్లు
గత ఏడాది చెత్త రహిత శుభ్రమైన నగరంగా మూడో స్థానాన్ని దక్కించుకున్న విజయవాడకు వాటర్‌ ప్లస్‌ సిటీస్‌ క్యాటగిరీలో కూడాఅవార్డులు దక్కాయి. చెత్తసేకరణ, నిర్వహణ, రిసైక్లింగ్‌, తడిపొడిచెత్తల వేర్వేరు సేకరణ,నిర్మాణ వ్యర్థాల వినియోగంలలో నగరానికి మంచి ఫీడ్‌ బ్యాక్‌ లభించింది. కొన్నేళ్లుగా నంబర్‌ వన్‌ స్థానాన్ని దక్కించుకునేందుకు విజయవాడ తీవ్రంగా శ్రమిస్తోంది.అందుకే ఈసారి స్వచ్ఛ్‌ భారత్‌ అవార్డుల్లో నంబర్‌ వన్‌ స్థానం పొందడానికి ఓ ప్లాన్‌ వేశారు. ప్రజల్లో అవగాహన కార్యక్రమాల నిర్వహణతో పాటు అదనంగా పాయింట్లు పొందేందుకు ఉద్యోగులు, ాలంటీర్లకు టార్గెట్లు పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి గ్రామంలో, పట్టణాల్లో ప్రతి వార్డులో క్లస్టర్ల వారీగా వాలంటీర్ల ద్వారా పౌరసేవలు అందిస్తున్నారు. ఇప్పుడు స్వచ్ఛ్‌ సర్వేక్షణ్‌ బాధ్యతల్ని కూడా విజయవాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌ అధికా రులు వాలంటీర్లకు అప్పగించారు. ప్రతి వాలంటీర్‌ తన పరిధిలో ఉన్న కుటుంబాల తరపున సర్వే పూర్తి చేసేస్తున్నారు. వాలంటీర్ల వద్ద తన పరిధిలో ఉండే కుటుంబాల మొబైల్‌ ఫోన్‌ నంబర్లు ఉండటంతో వాటి ద్వారా సర్వే పూర్తి చేస్తున్నారు. మొబైల్‌ రిజిస్టర్‌ చేసి ఆ ˜ోన్లకు వచ్చే టీపీలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇలా కనీసం 100మంది తరపున సర్వే పూర్తి చేయాలని ఒక్కోక్కరికి టార్గెట్‌ పెట్టారు.
ప్రచారం ఎక్కువ ఫలితం తక్కువ…
స్వచ్ఛ్‌ భారత్‌ ద్వారా ప్రజోపయోగ కార్యక్ర మాలు విస్తృతంగా చేపడుతున్నా వాటి ఫలి తాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. విజయవాడ వంటి నగరాల్లో పబ్లిక్‌ టాయిలెట్లు పేరుకే ఉంటున్నాయి. నిర్వహణాలోపాలు ఎక్కువగా ఉంటున్నాయి. అయినా సర్వేలలో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం విజయవాడ మునిసిపల్‌ కమిషనర్‌గా నివాస్‌ ఉన్న సమయంలో సర్వేలో పాల్గొనేం దుకు కన్సల్టెంట్లకు బాధ్యతలు అప్పగించారని వార్తలు రావడంతో విజయవాడ నగరాన్ని ర్యాంకుల నుంచి మినహాయించారు. ఆ తర్వాత మెరుగైన ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు వాలం టీర్లే ప్రజల తరపున సర్వేలు పూర్తి చేసే బాధ్యత అప్పగించారు. స్వచ్ఛ్‌ భారత్‌ కార్యక్ర మాల కోసం కేంద్రం భారీ ఎత్తున ఖర్చు చేస్తోంది. కేంద్ర బృందాలు పర్యటించే సమయంలో ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో పెద్ద ఎత్తున హోర్డింగులు, ప్రచార కార్యక్రమాలు కనిపించేలా ఏర్పాట్లు చేస్తారు. ఆ బృందాలు నగరాల్లో పర్యటించకుండానే ఈ హంగామా చూసి బాగా పనిచేస్తున్నాయనుకుని వెనుదిరిగిపోతాయి. మొత్తంమ్మీద ఏపీలో స్వచ్ఛ్‌ సర్వేక్షణ్‌ అవార్డుల కోసం నగరపాలక సంస్థలు పడుతున్న పాట్లు ప్రచారాలకు పనికొస్తున్నాయి. ఈ ఏడాది విశాఖకు ర్యాంకు రావడానికి రాజకీ య కారణాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.
టాప్‌ వన్‌ ర్యాంక్‌ సాధనే లక్ష్యం..
ఈ సంవత్సరం ప్రారంభంలో నగరంలో జరిగిన జీ-20సమ్మిట్‌ వర్కింగ్‌ గ్రూప్‌ కమిటీ సమావేశానికి, జీవీఎంసీ మౌలిక సదు పాయాల అభివృద్ధి పనుల కోసం సుమారు 110కోట్లు ఖర్చు చేసింది మరియు సుమారు 1.5లక్షల మెట్రిక్‌ టన్నుల లెగసీ వేస్ట్‌ల బయో మైనింగ్‌ను కూడా పూర్తిచేసింది.మూల్యాంకనంలో మంచి స్కోర్‌ కోసం అవసరమైన అన్ని రంగాలను మేము కవర్‌ చేసాం.ఈ సంవత్సరం టాప్‌ 1ర్యాంక్‌ సాధిస్తామనేది మా ఆకాంక్ష.
` సాయి క్రాంత్‌ వర్మ,కమిషనర్‌,జీవీఎంసీ-గునపర్తి సైమన్‌

పొగ మహామ్మారిని తరిమెద్దాం..!

సిగరెట్‌ తాగడం వల్ల 12 రకాల క్యాన్సర్‌లు వస్తాయని తేలింది. సరదాగానో, మిగిలిన వారిని చూసిన ఉత్సా హంలోనో పొగతాగడాన్ని అలవాటు చేసుకున్న వారు ఆ మత్తు నుండి బయటపడలేకపోతున్నారు. ఏం చేయాలన్నా ‘ఒకసారి పొగతాగాల్సిందే’ అన్నట్టు వారి వ్యవహార శైలి మారిపోతుంది. చాలామంది వైద్యులు పొగతాగేవారిని ప్రశ్నిస్తే- తాము చిన్నతనంలో పదేళ్ల ప్రాయంలోనే సరాదాగా స్నేహితులతో పందెం కాసి పొగతాగడం మొదలుపెట్టానని చెబుతుంటారు. కాని పొగతాగేవారి వల్ల వారికే కాదు, వారి చుట్టూ ఉన్న వారు కూడా ప్రమాదంలో పడుతున్నారు. వ్యక్తులకు, ఆరోగ్యానికి, సమాజానికి కూడా నష్టాన్ని కలిగిస్తున్నారు. ‘ పొగతా గడం మానేయండి, పొగాకు వదిలి వేయండి’ అనే నినాదం అంతా పాటిస్తే అంతా సుఖమయంగా జీవిస్తారు. పొగతాగడం ద్వారా ఎన్నో హాని కరమైన, విషతుల్యమైన వాయువుతో ఊపిరితిత్తులను ఉదయం నుండి రాత్రి దాకా నిర్వి రామంగా కాలు స్తూనే ఉంటే మన జీవితం వెలుగు తున్న కొవ్వొత్తి మారిది కరిగి వెలుగులేకుండా ఆరిపో వడం ఖాయం. పొగతాగడం మానాలి అంటే మీ నేర్పు, మీ మనో ధైర్యం, పోరాట శక్తి, పొగమానాలనే బలమైన కోరిక తో దానిని జయించాలి. హానికరమైన వ్యస నాన్ని కలిగించే పదార్థాలే క్యాన్సర్‌ కరకాలు అని గుర్తించాలని… గత 20 ఏళ్లగా పొగాకు నియంత్రణపై ప్రచార ఉద్యమం చేపడుతున్న తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ఓ డిప్యూటీ తాహశీల్దార్‌ ‘‘ మాచన రఘునందన్‌’’ మే 31న పోగాకు నియంత్రణ దినోత్సవం సందర్భంగా ‘థింసా’కి ఇచ్చిన ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇదీ!
మేడ్చల్‌ జిల్లా కేశవరంకు చెందిన ‘‘మాచన’’.. రంగారెడ్డి జిల్లాలో ఆంగ్లభాషా పండితుడిగా పనిచేసి ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాష్ట్రపతి పురస్కారాన్నందుకున్న అభిమన్యు కుమారుడు. సాధారణంగా పండిత పుత్ర పరమశుంఠ అని నానుడి. కానీ..మాచన అందుకు భిన్నం. ఇప్పుడు తన కుటుంబం మొత్తం గర్వించదగ్గ రీతిలో తన ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తూనే…పొగాకుపై ఉద్యమం చేస్తున్న పోరాటశీలి. అందుకే జాతీయస్థాయిలో పొగాకు నియంత్రణకు కృషి చేస్తున్న రిసోర్స్‌ సెంటర్‌ ఫర్‌ టుబాకో కంట్రోల్‌ రఘునందన్‌ని ‘‘టుబాకో కంట్రోల్‌ స్టాల్‌ వర్ట్‌’’గా గుర్తించింది. అమెరికాకు చెందిన హెల్త్‌ మ్యాగజీన్‌ పల్మనరీ మెడిసిన్‌ కూడా రఘునందన్‌ విజయగాధను వావ్‌..వెల్డన్‌. అని కొనియాడిరది. ఈమధ్యే రఘునందన్‌ విధి నిర్వహణలో కనబరుస్తున్న చొరవతో పాటే…ఆయన ఆశయాలు..వాటికై ‘‘మాచన’’ పోరాటం గురించి తెలుసుకున్న పలు వురు రఘునందన్‌ను అభినందించడంతో తన బాధ్యత మరింత పెరిగిందంటారు ‘‘మాచన’’. రఘునందనంటే ఓనిబద్ధత గల ఉద్యోగి…తన విధులను బాధ్యతగా నిర్వహిస్తూనే…తమ హక్కులకై పాత పింఛన్‌ విధానంపై పోరాడే ప్రచార కార్యదర్శి…పొగాకును కూకటివేళ్లతో పెకిలించే చైతన్యం సమాజం నుంచే రావాలని పోరాడుతున్న ఉద్యమశీలి.. వీటన్నింటినీ మించి సామాన్యుల పాలిట సాటి మనిషిగా స్పందించే మానవీయకోణం..మొత్తంగా మన రాష్ట్రం వాడు..మనవాడు…నిత్యం అందరిలో ఒకడు.
పొగాకు పై ఇరవయ్యేళ్ల పోరాటం
సిగరెట్‌ తాగకు..పొగాకు మంచిది కాదు అని వైద్యులు చెప్పడం సాధారణం. అదే ఓ వైద్యే తర రంగానికి చెందిన వ్యక్తికి మాత్రం జీవితమే పొగాకు పై రణం. ఇది ఓనమ్మ లేనినిజం. మాచన రఘునందన్‌ది పౌర సరఫరాలశాఖలో ఎన్ఫోర్స్‌ మెంట్‌ డిప్యూటీ తాసిల్దార్‌ ఉద్యోగం. అందరు ఉద్యోగుల్లా డ్యూటీ అయిపోగానే ఇంటికి, లేదా కాలక్షేపం కోసం క్లబ్బుకు చేరే రకం కాదు మనం చెప్పుకుంటున్న మాచన రఘునందన్‌.తన జీవితంతో మారాలి ఎన్నో జీవితాలు అని పొగాకు నియంత్రణ పథంలో ప్రయాణిస్తూ..మేం సిగరెట్‌,బీడీ,తంబాకు మానేస్తాం అని ప్రమాణం చేయిస్తున్నారు. సమాజ సేవ ఎలా చేయాలో స్ఫూర్తినిస్తున్నారు. ఎందరి జీవితాలనొ పొగాకు నుంచి విముక్తి చేస్తున్న ఓ అసాధారణ ఉద్యమం తన జీవితం అని చెప్పకనే చెబుతున్నారు. రఘునందన్‌ నగరంలో నివసించే తన ద్విచక్ర వాహనంపై పర్యటిస్తారు. ఎక్కడ ఎవరు దమ్ము కొట్టినా.. ఒక్క క్షణం ఆగి కంఠంలో ప్రాణాన్ని పొగాకు కు బలి చేయొద్దు అని తన కంఠ శోషగా హితవు చెబుతున్నారు. ప్రజారోగ్యం కాంక్షించే వైద్యులకు, ఆసుపత్రులకు వరల్డ్‌ క్యాన్సర్‌ డే, నో స్మోకింగ్‌ డే, వరల్డ్‌ నో టబాకో డేలు ఓ అవగా హన కలిగించే సందర్భాలు మాత్రమే. నగరం లో నివసించే, పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్‌ మెంట్‌ డిప్యూటీ తాసిల్దార్‌ మాచన రఘునందన్‌ గత ఇరవై ఏళ్ల నుంచి పొగాకు నియంత్రణ కోసం కృషి చేస్తున్నారు. ఆయన ఇలా తన వాహనం పై స్మోకింగ్‌ కిల్స్‌,క్విట్‌ టుబాకో ఆన్న సందేశం తో రాష్ట్ర వ్యాప్తంగా 5000 కిలో మీటర్లు ప్రయాణించి,500 గ్రామాల్లో వేలాది మంది ని పొగాకు, ధూమపానం మానేస్తాం అని ప్రతీణ చేయించారు. పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. శుక్రవారం నాడు ఆయన నగరంలో పలు ప్రాంతాలలో ఇలా బైక్‌పై తిరుగుతూ పొగాకు కాన్సర్‌ కారకం అని అవగాహన కలిగించారు. ఎంతో నిస్వార్థ సేవ చేస్తున్నా..ఎటువంటి అవా ర్డులు ఆశించరు. పరిమాణం ముఖ్యం కాదు పరిణామం ప్రధానం అంటారు మాచన రఘునందన్‌.
సామాజిక ఉద్యమశీలి
వాస్తవానికి నా వృత్తి డిప్యూటీ తహశీల్దార్‌ హోదా ఉన్న వ్యక్తికి…ప్రవృత్తిగా సమాజం కోసం ఏదో సాధించాలన్న తపన..ఆ తపనకు తగ్గ కమిట్మెంట్‌ ఉండట మంటే కాస్తా అరుదే. అలా ..అని ఎవరూ ఉండరని కారు. అలాంటి వారిలో ఒకరే మనమిప్పుడు చెప్పుకునే రఘు నందన్‌ మాచన. పౌరసరఫరాలశాఖలో ఓ విజిలెన్స్‌ ఆఫీసర్‌గా ఎక్కడో ఓచోట నిత్యం దాడులు,తనిఖీలు నిర్వహించే క్రమంలో… ఎందరో అధికారుల్లాగే లంచాలకు మరిగి తానూ ఆర్థికంగా అందలమెక్కొచ్చు. కానీ అలా అయితే రఘునందన్‌ గురించి చెప్పుకోవడ మెందుకు..? తన సర్వీస్‌లో మాచన రఘు నందన్‌కు ఉద్యోగ బాధ్యతే కావచ్చు..కానీ అందులో మానవత్వం ఉంది. సమాజాన్ని మార్చాలన్న తపన కనిపిస్తుంది. అందుకే ఈ అరుదైన అధికారికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోంది. పొగాకు నియంత్రణలో రఘు నందన్‌ డెడికేషన్‌ జర్మనీ దేశాన్నీ టచ్‌ చేసింది. ఇప్పుడు రఘునందన్‌ ను ఆ దేశ ప్రతినిధులు తమ వద్దకు రావాలని ఆహ్వానిస్తున్నారు. సామా జిక మాధ్యమాల ద్వారా పుకార్లు, ఫార్వర్డ్లు, తమకు గిట్టనివారిని ఉతికారేసే ఇష్టారీతి ద్వేషపు రాతలురాసే వాళ్లేకనిపించే రోజుల్లో… పొగాకు నియంత్రణపై రఘునందన్‌ అదే సామాజిక మధ్యమాలనుపయోగించుకుని కల్పిస్తున్న అవగాహన అంతర్జాతీయ సమాజాన్నీ చేరుతోంది. వైద్యుడు కానప్పటికీ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్‌..తన కార్యక్రమా లకు రఘునందన్‌ ను ఆహ్వానిస్తోంది. అయితే ఇంతేనా.. మాచన అంటే…? పంజాబ్‌ ఛండీ గడ్‌లో జరిగిన పొగాకు నియంత్రణ అంతర్జా తీయ సదస్సులోనూ ‘‘మాచన’’నే భారత్‌ నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ గౌరవ ప్రతినిధిగా పాల్గొనడమంటే దానివెనుక ఆయన అవిరళ కృషే కారణం. పొగాకు ఉత్పత్తుల వల్ల ఆరోగ్యానికీ, ఐశ్వర్యానికీ ముప్పు కలగక ముందే.. టుబాకో కు గుడ్‌ బై చెప్పే అవగా హన ప్రతి ఒక్కరిలో కల్గాలని ఆశిస్తున్న వ్యక్తి మాచన. మాచన రఘునందన్‌ సుమారుగా రెండు దశాబ్దాల కృషి. అయితే ఆఫలాలు ఇప్పుడు అందుతున్నాయి. ఆయన ఆశించిన మార్పు ఆయనెంచుకున్న లక్ష్యాల్లో కనిపిస్తోంది. ఆయన పేరూ హైదరాబాద్‌ జిల్లా దాటి..రాష్ట్ర వ్యాప్తమై.. దేశం గుర్తించి…అంతర్జాతీయ సమాజానికీ వినిపిస్తోంది. ఇలా రఘునందన్‌ అటు వృత్తిలోను ఇటూ ప్రవృత్తిలోనూ తనకంటూ ఓ ప్రత్యే’కథను’ సంతరించు కుంటున్నవారు.
ప్రతిభకు పట్టాభిషేకం
రఘునందన్‌ విద్యదశలో ఉన్న సమయంలో కూడా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలపై తనదైన ప్రతిభను చాటుకున్నారు. ఉత్తమ జర్నిలిస్టుగా,సామాజిక కార్యకర్తగా తెలంగాణా రాష్ట్రంలో మంచి గుర్తింపు పొందారు. ఈనేపధ్యంలోనే ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌ (2009)లో కేంద్ర ప్రజా సంబంధాల సమాచార బోర్డు కాష్టింగ్‌,మంత్రిత్వశాఖ ఏపీ తరుపున ఉత్తమ సామాజిక/పాత్రికేయడుగా ఎంపిక చేసింది. దాంట్లో భాగంగా రాష్ట్రంలో మొత్తం 15మంది టీమ్‌ను దేశంలోని ఈశాన్య రాష్ట్రాలైన అరుణచల్‌ ప్రదేశ్‌, అస్సాం, మేఘా లయ,త్రిపుర,మిజోరాం,వంటి రాష్ట్రాల్లో పర్యటించి అక్కడ ఆదివాసీ గిరిజన ఆచార వ్యవహారాలపై పరిశోధన చేశారు.ఆ బృం దంలో రఘునందన్‌ ప్రత్యేక గుర్తింపు పొం దాడం విశేషం. స్థానికంగా రఘునందన్‌ చేస్తున్న సామాజిక కృషిని రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా ఉన్నతాధికారులు సైతం తన ప్రతిభకు పట్టాభిషేకం కడుతూ ప్రశంసలు కురిపిస్తూన్నారు. రఘునందన్‌ చేస్తున్న ఈ జర్నీ మరింత ముందు కెళ్లాలని…మరెందరో అధికారులకు,సామాన్యులకు ఈయన స్ఫూర్తి ఓప్రేరణ కావాలనీ ఆశిద్దాం.! – గునపర్తి సైమన్‌

భద్రచలం మన్నెంకతలు

తెలుగు సాహిత్యంలో గిరిజన సాహిత్య విభాగం ఒక ప్రత్యేకతను కలిగి ఉంది. అటువంటి ప్రత్యేక స్థానం గల గిరిజన సాహిత్యాన్ని కథలు, కవితలు, వ్యాసాలు, పరిశోధనలతో ఎందరో మేధావులుసు సంపన్నం చేశారు. అటువంటి రచయితల్లో ఒక కథా రచయిత, ఆయన సాధారణ రచయిత మాత్రమే కాదు..పోటీ పరీక్షల్లో తెలుగు సాహిత్యం ప్రధాన అంశంగా తీసు కుని విజయం సాధించి ఐ.ఏ.ఎస్‌ అధికారి అయిన అపరమేధావి.. ఆయనే ‘‘అంగలకుర్తి విద్యాసాగర్‌’’ ఆయన ఉద్యోగ జీవనంలో భాగంగా ఐ.టి.డి.ఎ.ప్రాజెక్ట్‌ అధికారిగా 1988 – 1990 మధ్యకాలంలో రెండు సంవత్సరాల పాటు భద్రాచలం ఏజన్సీ ప్రాంతంలో పాల్వంచ కేంద్రంగా పనిచేశారు. స్వతహాగా సాహితి పిపాసి అయిన విద్యాసాగర్‌కు సృజనాత్మకత కూడా అలవడిరది రెండేళ్ల పాటు నిత్యం అడవుల్లోని ఆదివాసులతో మమేకమై తిరిగారు. వారి జీవితాలను దగ్గరగా గమనించారు. అలా కలిగిన అనుభవం సాయంగా 20 కథలు రాశారు. కొన్ని కథలుగా అనిపించవు అయినా కథను చదువుతున్న అనుభూతి కలుగుతుంది. ఆ అనుభవాల అనుభూతులను ‘‘భద్రాచలం మన్నెంకతలు’’ పేరుతో ప్రచురించారు. ఆధునిక తెలుగు కథ సాహిత్యంలో అత్యంత పాఠ కాదరణ పొందిన గిరిజన కథలుగా వీటిని చెప్పవచ్చు. ఈ కథా సమూహంలోని కథలన్ని గిరిజన జీవితాల మధ్యే తిరుగాడుతాయి. ప్రతికథ రచయిత అనుభవించిన ఒకవ్యధగా చెప్పవచ్చు. ఆ రెండేళ్ల కాలంలో విద్యాసాగర్‌ గారు చేసిన క్షేత్ర పర్యటనలు, గిరిజనాభివృద్దికోసం ప్రభుత్వాలు,అధికారులు,చేస్తున్న కృషి క్షేత్ర స్థాయిలో అమలవుతున్న తీరు ప్రత్యక్షంగా కళ్ళకు కట్టి చూపించడంలో రచయిత సఫలీకృతులయ్యారు.
కొన్ని ఆశయాలు ఆశలు నెరవేరకుండానే ఆయన బదిలీ అయి వెళ్లిపోయిన, తర్వాత కాలంలో అవి కార్యరూపం దాల్చడం వంటివి గమనిస్తే గొప్ప పనులు ఏనాటికైనా లక్ష్యాలు సాధిస్తాయనే నమ్మకం ఈకథలు చదవడం వల్ల కలుగుతుంది.
ఈ కథల్లో రచయిత తాను ప్రభుత్వ అధి కారిని అన్న భావన ఎక్కడ చూపించరు. అంతటా మానవతావాదంనిండి ఉంటుంది. అందుకే ఒక్కోచోట గిరిజన అభివృద్ధి పనుల్లో ప్రభుత్వాలు చేస్తున్న తప్పులను కూడా ఎత్తిచూపుతారు.
‘‘నామొకంమల్లొచ్చింది సారు’’ కథలో అడవుల్లోని క్రూర మృగాల బారిన పడి గిరిజనులు అనుభవిస్తున్న హృదయ విదారక బాధలను రచయిత ఎంతో హృద్యంగా ఆవిష్కరించారు. గిరిజనుల ఆరోగ్యం పట్ల ప్రభుత్వ ఆసుపత్రులు అవలంబిస్తున్న అలసత్వం గురించి నిర్మొహమాటంగా రచయిత ఇందులో చెప్పారు. అంతేకాక గిరిజనులకు పుట్టిన భూమి మీద ఉండే మమకారం కూడా అంతర్లీనంగా చెబుతు,అడవి బిడ్డలు ఎలాంటి పరిస్థితుల్లోనూ పుట్టిన ప్రాంతాలు విడిచిపోవడానికి ఇష్టపడరు. అందునా కన్న భూమి మీదే కన్నుమూయాలనే తత్వం వారి సొంతం.ఇక గిరిజన యువత చదువులకు ఎలా దూరం అవుతున్నారు? ఉన్నత చదువులు ఎందుకు చదవలేక పోతున్నారు? వాటి పరిస్థితులను అనుసరించి వ్రాసిన కత ‘‘ఇవి కూడా జరిగి ఉంటే…’’ దీనిలో గిరిజన గుడాలు వెనుకబాటుకు కారణాలు అన్వేషించిన రచయిత తన ఆలోచనలు కార్యరూపం దాల్చకుండానే కార్య స్థానం నుంచి బదిలీ అయిపోయిన అవినేటి కాలంలో అమలు కావడం, ముఖ్య ప్రణాళికలోని ప్రామాణికతను స్పష్టం చేస్తుంది.గిరిజన వివాహం వ్యవస్థను తెలుపుతూ… ‘‘మనిషిని మనిషి వంచించ నంతవరకు మనిషిని మనిషి హింసించనంత వరకు ఏఆచారము ఏ నమ్మకము తప్పు కాదు’’ అనే విలువైన సందేశాన్ని అందిస్తూ… , బిడియం,భయం,అనే లక్షణాలు గల అడవి బిడ్డల్లో సరైన అవగాహన,శిక్షణలు కల్పించడం ద్వారా వారిలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఆవిష్కరించబడతాయి.
అనే సత్యాన్ని కూడా చెబుతారు రచయిత ‘‘ఇద్దరుండాల సారు’’ కథ ద్వారా ….. అదేవిధంగా సొంత భూముల్లో గిరిజనులు కూలీలుగా మారుతున్న వైనం వివరించే ‘‘ప్రశ్నల శర్మగారు’’ కథ,. మూడు దశాబ్దాల క్రితం గోదావరి వరదలు, వానాకాలం సమయంలో గిరిజన గుడాలు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రయాణ ఇక్కట్లు, వరదల బాధలు,గురించి వివరించడంతోపాటు నాటి అధికారులు అంకితభావంతో పడ్డ పాట్లు గురించి హృదయ విదారకంగా చెప్పిన కథ ‘‘ఆకాశ వాణి నందిగామ! రోడ్డు మీద లాంచి!!’’ తమ సొంత అడవుల్లో పరాయి బ్రతుకులు బతుకుతున్న గిరిజనుల వింత పరిస్థితిని వివరించే కథ ‘‘శాపలు దాగితే సెరువెండు ద్దాసారు?!’’ నిజంగా అధికారుల అనాలోచిత చర్యలకు చెంపపెట్టు లాంటిదిఈ కత. గిరిజన జీవన విధానాలు మార్పు కోసం ప్రభుత్వాలు అధికారులు చేస్తున్న కృషి ద్వారా జరుగుతున్న పరిణామాల గురించి వ్యాస కథనంగా చెప్పిన’’ ప్రొఫెసర్‌ హేమండార్ప్‌’’ కత.దీని ద్వారా ఖమ్మం జిల్లాకు డార్ప్‌కు గల అనుబంధం అవగతం అవుతుంది. వెనుకబడిన గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో అవలంబించాల్సిన ఆచరణాత్మక క్రియల గురించి మార్గదర్శనం చేసే మంచి కథ ‘‘చీకటి మండలం’’ ఇలా ప్రతి కథ విద్యాసాగర్‌ గారి అనుభవాల దొంతరల గుండా, గిరిజన స్థితిగతుల మీదుగా,మూడు దశాబ్దాల క్రితం భద్రాచలం మన్యంలోని గిరిజన గ్రామాల దుస్థితికి అద్దం పడుతుంది. ప్రతి కథలో కాలం, ఆనాటి మనుషులు,గ్రామాల పేర్లు, యదాలాపంగా నమోదు చేశారు రచయిత, ఒకానొక సందర్భంలో విద్యాసాగర్‌ గారి ‘‘స్వీయకథ’’గా అనిపిస్తుంది ఈ కథ సంపుటి, కారణం ప్రతి కథకు రచయిత ఒక పాత్ర కావడమే..!
కథల పేర్లు కూడా విచిత్రంగా ఆసక్తికరంగా ఉండి పాఠకులను కథల్లోకి ఆహ్వానిస్తాయి, అలాంటి వాటిల్లో ముఖ్యమైనవి చెట్టు కింద ఆఫీసు, కొండకు కట్టెలు మోయమంటారా సారు?, కూసున్నకొమ్మ కొట్టుకుంటామా సారు??, మొదలైన కథలు.
ఇక కథల్లో వాడిన భాష కూడా పాత్రో చితంగా స్థానిక గిరిజనుల భాష ఉపయో గించడం అభినందనీయం,రచయిత విద్యాసాగర్‌ గారు పుట్టిన ప్రకాశం జిల్లా యాస అక్కడక్కడ వున్న, తెలుగు భాష మీద, సృజనాత్మకత పట్ల ఆయనకు గల పట్టు ప్రతి చోటా కనిపిస్తుంది.ప్రతి కథలో రచయిత గొంతు, అడవి బిడ్డల ఆవేదన స్వరాలు మేళవించబడి వినిపిస్తాయి. 1990 సం:లో రాసిన ఈ ‘‘భద్రాచలం మన్నెంకతలు’’ తెలుగు కథా సాహిత్యపు గిరిజన కథా విభాగంలో ఒక ప్రత్యేకతను సంతరించుకున్న ప్రామాణిక కథలుగా చెప్పవచ్చును. అనుభవాలకు కథల రూపం ఎలా ఇవ్వాలో తెలుసుకోవాలి అనుకునే వారితో పాటు, కథా ప్రియులంతా తప్పక చదివి తీరాల్సిన కథా సంపుటి ఇది.- డా. అమ్మిన శ్రీనివాసరాజు (సెల్‌ : 7729883223)

నిండైన సహచర్యంతో నేనూ సైతం

అర్థ శతాబ్ద కాలం పాటు అడవి బిడ్డలతో మమేకమై జీవించి వారి అభివృద్ధి లక్ష్యంగా పనిచేసిన అత్యున్నత అధికారి అనుభవాల నిధి ‘గిరిజనాభివృద్ధికి నేను సైతం’పుస్తకం రచయిత డాక్టర్‌ వి.ఎన్‌.వి.కె.శాస్త్రి రాసిన ఈ పుస్తకం బహుముఖ ప్రయోజనకారి అనడంలో అతిశ యం లేదు. బాహ్యంగా చూడటానికి ఒక అధికారి స్వీయ అనుభవాలు పొందుపరిచిన సాధారణ పుస్తకమే అన్నట్టు కనిపించిన, ఇందులోని ప్రతి విషయం భావి పరిశోధకులకు విలువైన సమాచార దిక్సూచి. అంతేకాక గిరిజనులు అభివృద్ధికి పాటుపడాలి అనుకునే వారికి మంచి మార్గదర్శి కూడా.. ప్రస్తుతం మనం చూస్తున్న పలు గిరిజన చట్టాల నేపథ్యం గురించి తెలుసుకోవాలి అంటే విధిగా నేను సైతం చదవాల్సిందే. ఎంతో విలువైన గిరిజన సమాచారం గల ఈ పుస్తకాన్ని గిరిజన పోరాట యోధుడు ‘కుంజా బొజ్జి’ గారికి అంకి తం ఇవ్వడంలో రచయిత శాస్త్రి గారి విశాల హృదయం ఎంతటిదో అర్థమవుతుంది.
స్థానిక గిరిజనులే ఉపాధ్యాయులు,గిరిజన గురుకుల పాఠశాలల నిర్వహణ కోసం ప్రత్యేక సొసైటీలు,జీవో నంబరు 3 కొట్టివేత పర్యవ సానాలు, మొదలైన ప్రధాన వ్యాసాల సమా హారంగా ప్రచురించబడిన ఈ ‘…నేను సైతం’ పుస్తకం చదువుతుంటే ఒక మేధావి స్వీయ చరిత్ర చదువుతున్న మధురానుభూతి కలుగుతుంది. ప్రారంభం అంతా డాక్టర్‌ శాస్త్రి గారు గిరిజన సంక్షేమానికి వచ్చిన తీరే ఆసక్తిగా సాగిపోయి పాఠకుల కళ్ళు అక్షరాల వెంట పరుగులు పెడతాయి.‘మానవ శాస్త్రం’ అనబడే ‘ఆంత్రోపాలజీ’ విద్యార్థి పరిశోధక విద్యార్థిగా గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణా సంస్థలో చేరి తనకు ఇష్టమైన రంగంలో కష్టం లేకుండా మునుముందుకు దూసుకుపోయి మూలాలనుంచి విషయ సేకరణ చేయడం ఈ రచనలో మనకు అడుగడుగునా ఆగుపిస్తుంది. శాస్త్రి గారు తన అర్థ శతాబ్ది ఉద్యోగ ప్రస్థానం లో తను చూసిన క్షేత్రస్థాయి విషయాలను క్రోడీకరిస్తూ ఇప్పటికే 9 పుస్తకాలు రాశారు, ప్రస్తుతం జరుగుతున్న గిరిజన అభివృద్ధికి ఎదురవుతున్న సవాళ్లు నేపథ్యంగా ‘…నేను సైతం’ వ్యాస సంపుటి రాయడం జరిగింది. 1968 70 సం: మధ్య కాలంలో ఆంథ్రో పాలజీ విభాగంలో రెండేళ్లపాటు పరిశోధక విద్యార్థిగా, అనంతరం1970-1971మధ్య పరిశోధన సహాయకుడిగా సేవలు అందించారు, అనంతరం 1971నుంచి 2005 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సంక్షేమ శాఖలోని గిరిజన సంస్కృతి పరిశోధనా శిక్షణా సంస్థలో పని చేశారు. ఈ ఉద్యోగ ప్రస్థానంలోనే ఏటూరు నాగారం, ఉట్నూర్‌, శ్రీశైలంలో ఐటిడిఎల ప్రాజెక్ట్‌ అధికారిగా సేవలు అందించారు,అలా ఆయన ఆసక్తి, ఉద్యోగరీత్యా ఆదివాసులతో సహచర్యం చేసే భాగ్యం కలిగింది అలా సంగ్రహించిన అనుభవ సారంతో రాయడం వల్ల ఈ పుస్తకానికి మరింత ప్రామాణికత, ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రస్తుతం ఆధునిక కాలంలో పరిశోధన చేయాలి అంటే అంత కష్టం కాదు..కానీ 1968 ప్రాంతంలో పరిశోధన చేయాలంటే గొప్ప సాహసంతో కూడుకున్న పనే..!! అలాంటి సాహసాన్ని సునాయాసంగా చేసి డాక్టరేట్‌ సాధించారు శాస్త్రిగారు.వీరి అనుభవాలద్వారా వ్రాసిన ఈ వ్యాసం సంపుటి ద్వారా గిరిజనులు వారి జీవన విధానాల్లో అంచలంచెలుగా వచ్చిన మార్పులు కనిపిస్తాయి.
అడవి బిడ్డల జీవన సరళిలో వచ్చిన ఈ మార్పు కు ప్రధాన కారణం వారి చదువే అని స్పష్టం చేశారు రచయిత. నేను సైతం వ్యాస సంపుటిలో మొత్తం 11 వ్యాసాలు వేటికవే భిన్నమైన సమాచారం కలిగి ఉన్నాయి,గిరిజన సంక్షేమానికి ఎలాగ వచ్చాను మొదలు జీవో నెంబరు 3కొట్టివేత పర్యవ సానాలు, వరకు ఈ వ్యాసావళి కొనసాగింది.
1986 సంవత్సరంలో నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం స్థానిక గిరిజన యువతకు ఉపాధ్యాయ ఉద్యోగాలు ఏర్పాటు చేసిన వైనం దాని నేపథ్యం. 1986 87 సంవత్సరంలో పదవ తరగతి అర్హతతో గిరిజన యువతకు స్థానికత ఆధారంగా అందించిన ఉపాధ్యాయ ఉద్యోగాల ద్వారా గిరిజన యువతలో వచ్చిన సామాజిక,ఆర్థిక,మార్పులు పర్యవసానాలు డాక్టర్‌ శాస్త్రి అక్షర బద్దం చేసిన వైనం ఆసక్తిగా సాగుతుంది.
ఏ ఉద్యోగైన తన ఉద్యోగ ప్రస్థానంలో విజయం సాధించాలి అంటే ముందు సమైత విషయం మీద ఆసక్తి ఆపైన తన చదువుకు సంబంధించిన ఉద్యోగం అయినప్పుడు దానిని ఇష్టంతో విసెషష్క్ప్డతతో ప్రామాణిక బద్ధంగా పూర్తి చేయగలరు.అచ్చంగా శాస్త్రిగారి ఉద్యోగ ప్రస్థానం ఆ విధంగా సాగింది కనుక తన ఉద్యోగ జీవితంలో గిరిజనుల సమగ్ర అభివృద్ధి కోసం అనేక ప్రణాళికలు రచించి అమలు అయ్యేటట్టు కృషి చేయగలిగారు ఇది అన్ని రంగాల ప్రభుత్వ ఉద్యోగులకు ఆదర్శనీయం. భారత రాజ్యాంగంలో గిరిజ అభివృద్ధికి ఎన్నో ప్రత్యేక వ్యవస్థషసౌకర్యాలు కల్పించిన, అధికార వ్యవస్థలో మాత్రం అడుగడుగున వ్యతిరేకత కనిపిస్తుంది, అందుకు అధికార ఘనంలోనే వ్యతిరేకత తదితర విషయాలు గిరిజనులకు జరుగుతున్న నష్టం గురించి కూడా శాస్త్రి గారు ఇందులో నిర్మొహమాటంగా వివరించారు . చివరిగా ‘జీవో నెంబర్‌ 3 కొట్టివేత పర్యవసనాలు’ గురించి వివరిస్తూ అది రాక ముందు గల జీవో నెంబర్‌ 275 / 1986 ఉంది దీని ప్రకారం గిరిజన ప్రాంతాల్లో 100% ఉపాధ్యాయ పోస్టులు స్థానిక గిరిజనులకు రిజర్వ్‌ చేయబడ్డాయి దానిని ట్రిబ్యునల్‌ కొట్టివేసిన తర్వాత సుప్రీంకోర్టులో వేసిన వ్యాజ్యాన్ని వెనక్కి తీసుకుని దొడ్డి దారిన జీవో నెంబర్‌ 3/2000 జారీ చేసినట్టు సుప్రీంకోర్టు అభిప్రాయపడినట్లు తాను భావిస్తు న్నట్టు రచయిత అభిప్రాయం వ్యక్తం చేశారు, చిత్రంగా ఈ రెండు జీవోలు వెలువడే సమయంలో అప్పటి ప్రభుత్వ సెక్రటరీలకు డాక్టర్‌ శాస్త్రి సహాయకుడిగా ఉండటం ఒక విశేషం. ఇలాంటి ప్రామాణిక స్వాను భావిక విషయాలు ఎన్నో ఈ పుస్తకంలో మనకు అడుగడుగున అగుపిస్తాయి, అచ్చంగా గిరిజనుల సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేసే స్వచ్ఛంద సంస్థలు, సంఘాలతో పాటు గిరిజన సామాజిక వర్గాలపై పరిశోధన చేసే వారికి ఈ ‘…నేను సైతం’ పుస్తకం ఒక దారి దీపం లాంటిది.
50 సంవత్సరాల పూర్వం నాటి గిరిజన గ్రామాలు, అప్పటి గిరిజనుల వెనుకబాటు తను, అందుకు ప్రభుత్వాలు చేసిన కృషి, అధికార గణం అలసత్వం, తదితర ఎన్నో విషయాలు నిర్మొహమాటంగా నిజమైన రచయిత దృష్టి కోణంతో ఈ పుస్తకం వ్రాశారు రచయిత ‘డాక్టర్‌ వట్టిపల్లి కృష్ణశాస్త్రి’. ఈ గిరిజన సమాచార దర్శని ప్రతి విద్యావేత్త విధిగా చదవదగ్గన్న పుస్తకం అనడంలో ఎలాంటి అతిశయం లేదు. –డా. అమ్మిన శ్రీనివాసరాజు (సెల్‌ : 7729883223)

అవునూ వారే స్వయంగా రోడేస్తున్నారు

ఆంధ్రప్రదేశ్‌ అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రావికమతం మండలం ఓ చిన్న చీమలపాడు పంచాయితీలో జీలుగులోవ గిరిజనగ్రామం. ఇది కొండ శిఖరంపై ఉంటుంది. ఇక్కడ పది కుటుంబాలు. మాడుగుల నియోజకవర్గం అవురువాడ పంచాయతీ కొండ శిఖర గ్రామమైన పశువులు బంద గ్రామంలో 7 కుటుంబాలవారు 38 మంది జనాభా కలిగిన కొందు ఆదివాసి గిరిజనులు కొండ శిఖర్‌ గ్రామం పై జీవనం సాగిస్తున్నారు. అనారోగ్యం వస్తే డోలు కట్టుకొని రోడ్డు మార్గం నుండి వెళితే రెండు రోజుల సమయం పడుతుంది. బైకు రాకపోకల కోసం రోడ్డు ఏర్పాటు చేసుకుంటే మంచిదని గ్రామస్తులు సమావేశం ఏర్పాటు చేసుకొని తీర్మానం చేసుకున్నారు. జిల్లా కలెక్టర్‌ని సంప్రదించి తమకు ఉపాధి హామీ కార్డులు ఇవ్వాలని, రోడ్డు పనులు చేసుకుంటామని వేడుకున్నారు. చాలాసార్లు కలెక్టర్‌ చుట్టూ తిరిగి బతిమాలారు. నర్సీపట్నం ఆర్డిఓ గిరిజన గ్రామాన్ని సంద ర్శించి వారికి ఉపాధి కార్డులు ఇస్తామని చెప్పారు. కార్డులు ఇచ్చినట్టు రిపోర్టులో రాసుకున్నారే తప్ప ఇంతవరకూ ఎవ్వరికీ ఉపాధి హామీ కార్డులేవీ అందలేదు. కనీసం పాదం పని కూడా ఇవ్వలేదు. ఎంత విన్న వించుకున్నా.. అధికారుల నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో గిరిజనులంతా నడుం బిగించారు. వారే సొంతంగా గత 15 రోజుల నుండి శ్రమదానంతో రోడ్డు నిర్మాణం చేసు కుంటున్నారు. అధికారులు గిరిజన ఉత్స వాల పేరు మీద, టూరిజం అభివృద్ధి పేరు మీద కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు తప్ప తమ గిరిజన గ్రామాలకు కనీసం నడవడానికి తోవలేని పరిస్థితి ఉందని గుర్తించడం లేదంటూ గిరిజనులు వాపోయారు. ఈ మధ్య కాలంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ గర్భిణీ స్త్రీలను డోలిలో తీసుకురావడానికి వీల్లేదని అన్నారు. మండల అధికారి బృందం వచ్చి గిరిజనుల గ్రామాన్ని సందర్శించారు. రోడ్డు మార్గం దగ్గరగా ఉందని..కొర్ర సంధ్య (20) గర్భిణీ స్త్రీ అమ్మగారి ఊరైన ఎదురిపల్లి వెళ్ళి పోయింది. కానీ ఈ గిరిజన గ్రామంలో ఎవ రికైనా అనారోగ్యం వస్తే, ఇతర నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్నా శనివారం పెట్టే సంతనాడు మాత్రమే వెళ్ళాలి మిగతా సమ యాల్లో వెళ్లాలంటే కనీసం 15 కిలోమీటర్లు కాలి నడకన కొత్తకోటకు చేరుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అందరూ కలిసి తమ కోసం తామే నడుం బిగించారు. పలుగూ పారలు పట్టుకున్నారు. నిర్విరామంగా 15 రోజులు కష్టపడుతూ రోడ్డు మార్గాన్ని సరిచేసు కుంటున్నారు. 3 నెలల్లోపు ఈ రోడ్డు నిర్మా ణాన్ని పూర్తి చేయాలనే సంకల్పంతో తీర్మానం చేసుకున్నారు. ఇప్పటికైనా అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ తమ గ్రామానికి ఉపాధి పథకం ద్వారా రోడ్డును మంజూరు చేయాలని ఆ గిరిజనులు కోరుతున్నారు. తమకు ఉపాధి పథకం ద్వారా పనులు కల్పించాలని జిల్లా కలెక్టర్‌ని వేడుకుంటున్నారు.-జిఎన్‌వి సతీష్‌

మహా విశాఖ మధ్యలో ఓ అడవి..
మహానగరం మధ్యలో

అభయారణ్యం… అందులో రహస్య గిరిజన గ్రామం…విశాఖ నగరం అద్దాల మేడలు, ఆకాశాన్నితాకుతున్నట్లు ఉండే భవనాలతో కాంక్రీట్‌ జంగిల్‌గా మారిపోయింది. అయితే ఇదే నగరం నడిబొడ్డున ఓ గిరిజన గ్రామం కూడా ఉంది. అది కూడా దట్టమైన అడవి మధ్యలో.విశాఖ మహానగరంలో ఈ గ్రామం ఉన్నట్లు కూడా చాలా మందికి తెలియదు. అసలు నగరంలో అడవి ఎలా ఉంది? ఆ అడవిలో ఊరు ఎందుకుంది?-
గ్రేటర్‌ విశాఖ మునిసిపల్‌ కార్పొరేషన్‌లోని 98 వార్డులలో 25 లక్షల మంది జనాభా ఉన్నారు. అందులో 350 మంది జనాభాతో శంభువా నిపాలెం ఉంది. ఇది ఒక గిరిజన గ్రామం. మన్నెందొర అనే గిరిజనం ఇక్కడ ఐదు తరాలుగా ఉంటున్నారు. కంబాలకొండ అభయారణ్యం మధ్యలో ఉన్న ఈ గిరిజన గ్రామం…జీవీఎంసీ 6వ వార్డు పరిధిలోకి వస్తుంది.
చెక్‌ పోస్టు పడతాది…
జీవీఎంసీ విస్తీర్ణం దాదాపు 680 చదరపు కిలోమీటర్లు. ఈ పరిధిలో ఎక్కడికి వెళ్లాలన్నా ఎటువంటి అడ్డుకులు ఉండవు. అయితే శంభు వానిపాలెం వెళ్లాలన్నా… వెళ్లిన తరువాత బయటకు రావాలన్నా కూడా చెక్‌ పోస్టు తనిఖీలు ఎదుర్కోవాల్సిందే. పీఎం పాలెం నుంచి ఐదు కిలోమీటర్లు లోపలికి వెళ్తే అక్కడొక చెక్‌ పోస్టు కనిపిస్తుంది. శంభువానిపాలెం వెళ్లేందుకు రెండు కిలోమీటర్ల ముందే అటవీశాఖ చెక్‌ పోస్టు ఏర్పాటు చేసింది. గ్రామస్థుల రాకపోకలపై కూడా నిఘా ఉంటుంది. అందుకే ఈ గ్రామానికి అక్కడ నివాసం ఉండేవాళ్లు తప్ప ఇంకెవరు వెళ్లలేరు. దీంతో ఈ గ్రామం ఉన్నట్లు కూడా చాలా మందికి తెలియదు. ‘‘మా గ్రామం ఎప్పుడు పుట్టిందో మాకు తెలియదు. మేం మన్నెందొర గిరిజనులం. ఐదు తరాలుగా మా తెగ ఇక్కడే ఉంటున్నట్లు మా పెద్దలు చెప్పారు. ఇప్పుడు ఈ గ్రామంలో ఉన్న వాళ్లంతా ఇక్కడ పుట్టినవాళ్లమే. ఎన్నికల సమయంలో తప్ప, మా గ్రామానికి అధికారులు, రాజకీయ నాయకులు పెద్దగా ఎవరు రారు. అసలు మేం ఇక్కడ ఉంటున్నట్లు చాలా మందికి తెలియదనే అనుకుంటున్నాం’’ అని చెప్పారు శంభువానిపాలేనికి చెందిన సీతారాం.
‘‘మాకు ఏ అవసరమున్నా…దగ్గర్లోని హనుమంతవాక, మధురవాడ, పోతిన మల్లయ్యపాలెం వెళ్తుంటాం. మేం గ్రామం బయలకు వెళ్లాలన్నా…తిరిగి లోపలికి రావా లన్ని చెక్‌ పోస్టులో వివరాలు చెప్పాలి. మా గ్రామానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్లు ఎవరూ ఉండరు. అలాగే మా గ్రామంపై నుంచి రాకపోకలు చేసేందుకు కూడా అవకాశం లేదు. అడవిలో ఉన్నాం మేం’’ అంటూ ఆయన మాట్లాడుతుండగానే, ‘రాముడు’ అని కేక వినిపించింది. ఫోన్‌ సిగ్నల్‌ వచ్చినట్లుందంటూ నీటి ట్యాంక్‌ వైపు పరుగు తీశారు సీతారాం.
బేసిక్‌ మోడల్‌ ఫోన్‌… వాటర్‌ ట్యాంక్‌
శంభువానిపాలెంలో జీవీఎంసీ నిర్మించిన ఎత్తైన నీటి ట్యాంక్‌ ఉంది. ఈ ట్యాంక్‌ పై ఎప్పుడూ ఇద్దరు, ముగ్గురు కచ్చితంగా కనిపిస్తుంటారు. చేతిలో బేసిక్‌ మోడల్‌ ఫోన్‌ పట్టుకుని…దాని వైపు తదేకంగా చూస్తూ ఉంటారు…ఫోన్‌లో సిగ్నల్‌ కనిపించగానే వారి ముఖంలో ఆనందం కనిపిస్తుంటుంది. ఎందుకంటే ఇక్కడ సెల్‌ ఫోన్‌ సిగ్నలే ఉండదు. సిగ్నల్‌ రావాలంటే నీటి ట్యాంక్‌ ఎక్కాల్సిందే.
‘‘మా ఊర్లో సెల్‌ ఫోన్‌ సిగ్నల్‌ ఉండదు. అడవి మధ్యలో ఉండటం…అటవీశాఖధికారులు అనుమతులు ఇవ్వకపోవడంతో సెల్‌ టవర్లు వేయలేదు. అయితే మధురవాడ,పీఎం పాలెం, జూ పార్కు పరిసరాల్లో ఉన్న టవర్ల నుంచి వచ్చే సిగ్నలో…ఏమో…బేసిక్‌ మోడల్‌ సెల్‌ ఫోన్లకు అప్పుడప్పుడ సిగ్నల్‌ వస్తుంది. అది కూడా వాటర్‌ ట్యాంక్‌, ఎత్తైన మేడలు ఎక్కితేనే. దాంతో మా ఊర్లో ఫోన్లు మాట్లాడాలి అనుకునే వారంతా ఈ ట్యాంకులు, మేడలపైనే కనిపి స్తారు. ఇప్పుడంతా ఆన్‌ లైన్‌ చదువులు వచ్చినా…సెల్‌ ఫోన్‌ పని చేయకపోవడంతో మా పిల్లలకు అది కూడా వీలుకావడం లేదు’’ అని ఫోన్‌ మాట్లాడేందుకు వాటర్‌ ట్యాంక్‌ ఎక్కిన పరశురాం చెప్పారు.
ఇది మరో ప్రపంచం
శంభువానిపాలెం జీవీఎంసీ 6వ వార్డు పరిధిలోకి వస్తుంది. అక్కడికి వెళ్లాంటే ఫారెస్ట్‌ సిబ్బంది అనుమతి తప్పనిసరి.‘‘మా గ్రామం భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఇది 7,200 హెక్టార్లున్న కంబాల కొండ అభయారణ్యంలో ఉంది. నగరంలోకి అడవి వచ్చిందా…? అడవే నగరంగా మారిందా…? తెలియదు కానీ… మేం నగరానికి చెందిన గిరిజనుల్లా జీవిస్తున్నాం. కంబాలకొండ రిజర్వ్‌ ఫారెస్ట్‌లోనే సెక్యూరిటీ గార్డులుగా, స్వీపర్‌లుగా మాలో కొందరికి పనులు ఇచ్చారు. మిగతా వారు ఊర్లో మేకలు కాసుకుని జీవనం సాగిస్తుంటారు’’ అని కంబాల కొండలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న శంభువానిపాలెం నివాసి ఒకరు చెప్పారు. గ్రామంలో ప్రాథమిక పాఠశాల, అంగన్‌ వాడీ కేంద్రం తప్పితే ఇక్కడ ప్రభుత్వానికి సంబం ధించిన ఏ భవనమూ లేదు. ఆసుపత్రి లేదు. వైద్యం కోసం ఐదారు కిలోమీటర్లు వెళ్లాల్సిందే. సిగ్నల్‌ సమస్య కారణంగా రేషన్‌ కూడా ఊరి బయట సిగ్నల్‌ ఉన్న చోటుకి వెళ్లి తీసుకుంటాం. మా ఊరు రావడానికి కూడా మా బంధువులు ఇష్టపడరు. వస్తే వారికి ప్రపంచంతో సంబం ధాలు కట్‌ అయిపోతాయి. ఎందుకంటే శంభు వానిపాలెం మరో ప్రపంచం’’ అని ఆయన అన్నారు.
కొండ జమీందార్లు… సేవకులు
ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని 11మండలాల్లో అనేక గిరిజన తెగలున్నాయి. అయితే విశాఖ నగర పరిధిలో గిరిజన తెగలు ఉండటం ఆశ్చర్యంగానే ఉంటుంది. ఇప్పుడంటే నగరం కానీ…ఒకప్పుడు విశాఖ అంటే 50 శాతం అడవే. కొన్ని తెగల గిరిజనులు వ్యాపారం కోసం లేదా విడిది కోసం కూడా… వారు ఉండే ప్రాంతాలకు దూరంగా వచ్చేవారని ఏయూ చరిత్ర విభాగం రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ కొల్లూరి సూర్యనారాయణ చెప్పారు. ‘‘జమీందార్ల కాలంలో మైదాన జమీందార్లు, కొండ జమీందార్లు అని ఉండేవారు. గిరిజన తెగల్లో ఉండే పెద్ద తెగలను కొండ జమీందార్లు అనేవారు. వీరు కొండల్లో దొరికే ఉత్పత్తులతో వ్యాపారం చేసేందుకు మైదాన ప్రాంతాలకు వస్తుండేవారు. అలా వచ్చిన వీరు కొందరు మైదాన ప్రాంతాలకు సమీపంగా ఉండే అటవీ ప్రాంతాల్లోనే తాత్కలిక నివాసాలు ఏర్పాటు చేసుకునే వారు. అలా కొందరు మైదాన ప్రాంతాల్లోనే స్థిరపడిపోయారు’’ అని ఆయన వివరించారు. ‘‘కొన్ని గిరిజన తెగల్లో వాళ్లు మైదాన ప్రాంతంలో ఉండే జమీందార్లకు సేవకులుగా ఉండేందుకు వచ్చేవారు. వారు వ్యవసాయం అటవీ ఉత్పత్తుల సేకరణకు వీలుంటుందని స్థానిక అటవీ ప్రాంతాల్లోనే నివాసం ఏర్పాటు చేసుకునేవారు. తరాలు గడుస్తున్న కొద్దీ వారు మైదాన ప్రాంతాల ప్రజలతో కలిసిపోయారు. విశాఖ ఒకప్పుడు పెద్ద వ్యాపార కేంద్రం, అలాగే ఎక్కువ అడవులున్న ప్రాంతం కావడంతో శంభు వానిపాలెం గిరిజనులు అలా వచ్చినవారై ఉంటారు’’ సూర్యనారాయణ తెలిపారు.
ప్రవేశం నిషిద్ధం
శంభువానిపాలెం వెళ్లాలంటే చెక్‌ పోస్టు వద్ద అటవీశాఖ సిబ్బంది అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి…ఊరిలోని ఎవరైనా తెలిసినవారు ‘మావాళ్లే’ అని చెప్తే అన్ని వివరాలు తీసుకుని లోపలికి అనుమతిస్తారు. థింసా బృందం కూడా అటవీ శాఖ అనుమతితో శంభువానిపాలెంలోకి ప్రవేశించింది. చెక్‌ పోస్టు నుంచి రెండు కిలోమీటర్లు ప్రయాణం చేసిన తరువాత శంభువానిపాలెం గ్రామం కనిపిస్తుంది. గ్రామంలోకి వెళ్తుండగానే తుమ్మిగెడ్డ రిజర్వాయర్‌ కనిపిస్తుంది. అది దాటు తుండగా…సెల్‌ ఫోన్‌ సిగ్నల్‌ కట్‌ అయి పోతుంది. జీవీఎంసీ పరిధిలో ఉండటంతో చెక్‌ పోస్టు నుంచి గ్రామం వరకూ తారురోడ్డు వేశారు.
‘‘శంభువానిపాలెంలోకి ప్రవేశం నిషిద్ధం. ఎందుకంటే ఇది కంబాలకొండ అభయా రణ్యంలో ఉంది. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం ఇది పూర్తిగా అటవీశాఖ అధ్వర్యంలో ఉంది. శంభువానిపాలెంలో అటవీశాఖ తరపున బేస్‌ క్యాంపు కూడా ఏర్పాటు చేశాం. అభయారణ్య ప్రాంతంలో ఇది ఉండటంతో…ఇక్కడ చేపలు పట్టడం, వన్యప్రాణులను వేటాడటం, తుపాకీ ఉప యోగించడం,చెట్లు తగలబెట్టడం,చెత్త వేయడం,మద్యం తాగడం,రిజర్వాయర్‌లో ఈతకొట్టడం వంటి పనులు చేయకూడదు. అది వన్యప్రాణి చట్టం సెక్షన్‌ 51 ప్రకారం నేరం. నగరపరిధిలో ఉన్న ప్రత్యేకమైన గ్రామం ఇది’’ అని విశాఖపట్నం ఫారెస్ట్‌ డివిజనల్‌ ఆఫీసర్‌ అనంత్‌ శంకర్‌ చెప్పారు. – గునపర్తి సైమన్‌

ఆదివాసులను విస్మరిస్తున్న నాగరికత

మానవ సమాజం 21వ శతాబ్దంలో ఆధునిక హంగులతో ఉరకలు వేస్తున్నవేళ అంతరించి పోతున్న ఆదివాసీ భాషలు, సంస్కృతులను స్మరించుకోవాల్సిన అవసరం ఈరోజు ఎంతైనా ఉంది. సాంకేతిక పరిజ్ఞానంపై విరివిగా ఆధారపడిన ప్రస్తుత తరుణంలో వీరు ఇప్పటికీ సహజవనరులైన భూమి, నీరు, అడవులపై, సంప్రదాయ వ్యవసాయం, ఫలసాయం తదితరాలపై ఆధారపడి ఎంతో ఆత్మవిశ్వాసంతో జీవిస్తున్నారు.చెట్టు,పుట,్టనీరు వంటివాటిని పూజిస్తూ వాటితో ఒక అవినాభావ సంబంధం ఏర్పరచుకున్నారు. స్థిర అభివృద్ధి అనేది వీరి జీవనశైలిలో భాగమైంది. ఇంత గొప్ప సంస్కృతీ సంప్రదాయాలు కలిగిన ఆదివాసుల జనాభా, భాష క్రమంగా అంతరించిపోతుండటం ఎంతో బాధాకరం!
త్యాగాల చరిత్ర కనుమరుగు
స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నవారు,పాల్గొ నని వారు కూడా వజ్రోత్సవాల పేరుతో ఎన్ని కల లబ్ధి ఎంత పొందవచ్చు అని మాత్రమే పోటి పడుతున్నారు.విచిత్రం ఏమిటంటే భారత దేశం మీద ఏ విదేశీయులు దాడి చేసినా మొట్టమొదట తిరుగుబాటు జెండా ఎగుర వేసింది స్వేచ్ఛా ప్రియులైన ఆదివాసులే . భారతదేశ స్వాతంత్య్ర పోరాట చరిత్రలో ఆది వాసుల పోరాటాల చరిత్రను విస్మరించి నట్లుగనే ఇప్పుడు కూడా మొత్తం ఆదివాసులనే విస్మరిస్తున్నారు .
ఉత్సవాలను పట్టించుకోని పాలకులు
ఐక్య రాజ్య సమితి 1994 నుండి ప్రపంచ ఆదీవాసీ దినోత్సవాన్ని,ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోవాలని ప్రకటించింది.1995 నుండి ఐక్యరాజ్య సమితి నాయకత్వంలో ప్రపంచ ఆదీ వాసీ దినోత్సవాన్ని జరుపుకుంటు వస్తున్నారు. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా90దేశాలలో దాదాపు48కోట్ల మంది ఆదివాసులు ఉన్నారని అంచనా.వారు ప్రపంచ జనాభాలో 5శాతం కంటే తక్కువనే.కానీ పేదలలో 15శాతం ఉన్నా రు.మొత్తం ప్రపంచంలో ఉన్న 7000 భాష లలో ఎక్కువ భాషలు మాట్లాడుతారు.5000 విభిన్న సంస్కృతులకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఇవన్నీ ఐక్యరాజ్య సమితికి చెందిన సంస్థలు మొత్తం ప్రపంచం గురించి ఇచ్చిన అంచనాలు మాత్రమే. పేదరికం ఇంకా ఎక్కువగనే ఉంటుంది. సాంప్రదయక జ్ఞానాన్ని రక్షించడంలోనూ ప్రసారం చేయడంలోనూ ఆదివాసీ మహిళల పాత్ర ఈసంవత్సర ఆదివాసీ దినం యొక్క విషయం. ప్రతి సంవత్సరం ఆదివాసులకు చెందిన ఏదో ఒక విషయాన్ని చర్చించడానికి ఎంచుకుని ప్రపంచ ఆదీవాసీ దినోత్సవాన్ని జరుపుతూనే ఉన్నారు. మరో వైపు ఆదివాసుల పరిస్థితి ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు దిగజారుతూనే ఉన్నది .
ఆదివాసీల పరిస్థితి అధ్వాన్నం
మన దేశ విషయానికి వస్తే ఆదీవాసుల పరిస్థితులు మరింత ఘోరంగా ఉన్నాయి . భారతదేశ జనాభాలో ఆదివాసులు దాదాపు 9 శాతం ఉంటే,అందులో 40శాతం పేదరి కంలోనే ఉన్నారని ఒక అంచనా.ఈ పరిస్థితిని సరిదిద్దాల్సింది పోయి ఇప్పుడు కేంద్రంలో అధికారం కలిగి ఉన్న పార్టీ,అసలు ఆది వాసులను,ఆదివాసులుగానే గుర్తించని ఆలో చనతో ఉన్నది.ఆదివాసులను,అడవులలో ఉంటున్న హిందువులే అని చెప్పుతూ వారిని వనవాసులు అని పిలుస్తున్నది. ఇప్పటికే జనభా లెక్కింపు సందర్భంగా చాలా రాష్ట్రాలలో తెలిసీ తెలవక, స్పష్టమైన కోడ్‌ లెకపోవడం వలన ఆదీవాసులను, హిందువులుగా లెక్కిస్తు న్నారు. దీనితో ఆదివాసులు ఎక్కువగా ఉన్న ప్రాంతలు కూడా 5వషెడ్యూల్‌ లోకి రాకుండా పోతున్నాయి. ఆదివాసులకు దక్కాల్సిన అవకా శాలు,హక్కులు,రక్షణలు దక్కకుండా పోతు న్నాయి.1871నుండి1951వరకు జనభా లెక్కలలో స్పష్టంగా మతం కాలమ్‌లో ఆదివా సులగా గుర్తించే కోడ్‌ ఉండిరది.కానీ1951 తరువాత జనాభా లెక్కలలో మతం కాలమ్‌ కింద ఉన్న ఆదివాసుల ఆప్షన్‌ తీసివేసి, ‘‘ఇతరులు’’అని చేర్చడం జరిగింది.చివరికి 2011 వరకు ఉండిన ‘ఇతరులు’అనే ఆప్షన్‌ ను కూడా తీసివేశారు.మతం కాలమ్‌లో ఆరు మతాలనే ఉంచారు.1) హిందూ,2) ముస్లిం, 3)క్రిస్టియన్‌,4) బౌద్ధులు,5) జైనులు,6) సిక్కులు. జనాభా లెక్కింపులలో ఇలా చేస్తూ వచ్చిన మార్పులతోనే ఆదివాసీల జనాభా తక్కువగా లెక్కించబడుతూ వస్తున్నది. అంటే భారత దేశ ఆదివాసులు అందరూ 6 మతా లలో ఏదో ఒకదానిని ఎంచుకోవాలన్న మాట. విచిత్రం ఏమిటంటే బౌద్ధులు జైనులు కంటే మన దేశంలో ఆదివాసుల సంఖ్యనే ఎక్కువగా ఉన్నది.కానీ ఆదివాసులకు జనాభా లెక్కలలో తమ మతం గురించి, తమ విశ్వాసాలను గురించి ప్రకటించుకునే, గుర్తించే అవకాశమే ఇవ్వలేదు.ఆదివాసులందరిని హిందువులుగా లెక్కించే కుట్రనే ఇది.అయితే 2019లో 19 రాష్ట్రాలకు చెందిన ఆదివాసులు వారి ప్రతి నిధులు,2021 జనాభా లెక్కింపులో మతం కాలమ్‌లో ఆదివాసులను గుర్తించే కోడ్‌ పెట్టాలని డిమాండు చేస్తూ డిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా కూడా చేశారు.జార్ఖండ్‌ అసెంబ్లీ ఈ సందర్భంగానే, జనభా లెక్కింపులో ఆదివాసులను గుర్తించడానికి,ఆదివాసుల మతం అయిన సర్నాను మతం కాలమ్‌ లో పెట్టాలని తీర్మానం కూడా చేసింది. కేంద్ర ప్రభుత్వ అంగీ కారం లేకుండా అది అమలు అయ్యే విషయం కాదు. కాని ఆదీవాసులను హిందువులగా మాత్రమే గుర్తించే ప్రభుత్వం వాళ్ళను పట్టించుకోనే లేదు. ఇతర పార్టీలన్ని గట్టిగా కళ్ళు మూసుకుని మౌన వ్రతం పాటించాయి.
మతముద్రకు కుతంత్రాలు
ఇక జరిగేదెమిటంటే,ఆదివాసులు అందరూ హిందువులే కావున వారి ప్రాంతాలకు ప్రత్యేక చట్టాలు ప్రత్యేక రక్షణలు, హక్కులు అవసరం లేదంటారు. ఇటువంటి రక్షణ చట్టాల వల్లనే ఆదివాసీ ప్రాంతాలు అభివృద్ధి చెందడం లేదని ఇప్పటికే కొందరు వాదిస్తున్నారు. అందుకే తెలంగాణా ఆంధ్రాలో1/70చట్టాన్ని ఎత్తి వేయా లని చర్చలు,వాదనలు కూడా చేస్తున్నారు. ఇక ఇప్పుడు అందరం హిందువులమే పేరు మీద ఇటువంటి చట్టలన్నింటిని తుంగలో తొక్కవచ్చు. అంబానీ అదానీలకు ఆదివాసి ప్రాంతాలలోని ఖనిజాలను,ఇతర సంపదలను ఎటువంటి చట్టపరమైన అడ్డంకులు లేకుండా తరలించుకు పోవడానికి అవకాశం ఏర్పడు తుంది. ఆదివా సులను వారి ప్రాంతాలనుండి తరిమి వేయ వచ్చు. ఇప్పటికే మన దేశంలో కట్టిన పెద్ద ప్రాజెక్టుల వలన గనుల వలన నిర్వాసితులు అయ్యింది 70శాతం మంది ఆదివాసులే. యురేనియం లాంటి గనుల వలన అకాల మరణాలకు గురవుతున్నదీ,అంతుపట్టని రోగా లకు బలి అవుతున్నది ఆదివాసులే. ఒక ప్రణా ళిక లేకుండా ఎటువంటి పర్యావరణ జాగ్రత్తలు తీసుకోకుండా చిత్తం వచ్చినట్లు గనుల తవ్వకా లు చేపడుతూ ఆదివాసులను నిర్వాసితులను చేస్తున్నారు. రోగాలపాలు చేస్తున్నారు. పర్యా వరణ సమస్యలను సృష్టిస్తు న్నారు. అటవీచట్టా లలో పారిశ్రామిక అధిప తులకు అనుకూలంగా సవరణలు చేసి వేల ఎకరాల అడవులను నరికి వేయడానికి అను మతులు ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఇటువంటి చట్టాలు ఇంకా కొత్తవి చేయడానికి ప్రభుత్వం పూనుకుంటున్నది. ఇవన్నీ ఆదివాసుల అస్తి త్వాన్ని ప్రశ్నార్ధకం చేస్తుండగా,అన్ని ఇబ్బం దులను ఎదుర్కొంటూ ఆదివాసులు తమ అస్తిత్వం కొరకు రాజీలేని పోరాటం చేస్తున్నారు. అందుకే ఇప్పుడు వారి అస్తిత్వ పోరాటాలకు పునాదే లేకుండా చేయడం కొరకు,జనాభా లెక్కలలో ఆదివాసుల గుర్తింపు నే మాయం చేస్తున్నారు. ఇది వారి మొదటి అడుగు మాత్రమే .
సంఘటితమే హక్కుల రక్షణకు మార్గం
ఆదివాసుల హక్కులను రక్షించడం,విద్య వైద్య సంస్కృతులను అభివృద్ధి చేయడం కొరకే ప్రపంచ ఆదివాసి దినోత్సవాలను జరుపు కుంటున్నట్లుగా ఐక్యరాజ్యసమితి చెప్పు కుంటున్నది.కానీ ముందే చెప్పినట్లు ఆదివాసులు నిర్వాసితులు అవుతుండగా వారి సంస్కృతిపై అన్ని దిక్కుల నుండి దాడి జరుగుతున్నది. ఆది వాసుల భాషల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాలలో ఆదివా సులలో చాలామందికి వారి మాతృభాష రాకుండా పోయింది.ఏ రాష్ట్రంలో ఏభాష అధికార భాషగా ఉంటే ఆ భాషను ఆ రాష్ట్రం లోని ఆదివాసుల పైన రుద్ద పడుతున్నది. చత్తీస్గఢ్‌,మధ్యప్రదేశ్‌లో ఆదివాసీలపై హిందీ రుద్ద పడుతున్నది. తెలుగు రాష్ట్రాలలో తెలుగు రుద్ద పడుతున్నది.ఒరిస్సాలో, ఒడియా రుద్ద పడుతున్నది.భారతదేశం అంతటా పరిస్థితి ఇదే విధంగా ఉన్నది.కనీసం1980 వరకు మధ్య ప్రదేశ్‌ రాష్ట్రం లోనూ కొన్ని ఇతర రాష్ట్రాల లోనూ హిందీ లిపిలోనే అయినా,ఆదివాసులకు ప్రాథమిక విద్య వారి మాతృభాషలోనే బోధించ బడిరది.కానీ తరువాత అది కూడా ఎత్తి వేశారు.ఇప్పటికే భారతదేశంలో ఎన్నో ఆది వాసుల భాషలు అంతరించి పోయాయి. మిగిలిన ఆదివాసి భాషలు కూడా అంతరించి పోయే పరిస్థితిలో ఉన్నాయి.విద్య,ఆరోగ్యం విష యంలో ఈ రోజుకు కూడా ఆదివాసీ ప్రాంతా లు వెనకపడే ఉన్నాయి. సులువుగా తగ్గించ గలిగే మలేరియా వైద్యాన్ని కూడా సరిగా అందించపోవడం వలన ప్రతి యేడు ఆది వాసులు చనిపోతునే ఉన్నారు. ఇక, ఒక ప్రాం తంలో ఒకప్పుడు ఆదివాసులు ఉండే వారని గుర్తించడానికి కూడా వీలు లేకుండా వారి గుర్తులు అన్నింటినీ కూడా తుడిచివేయ చూస్తున్నారు. ప్రాంతాల పేర్లను గ్రామాల పేర్ల ను మనుషుల పేర్లను నదుల పేర్లను చివరికి కొండల పేర్లను అన్నింటినీ అన్నింటిని మార్చి వేస్తున్నారు. మరో వైపు ఆదివాసుల మతం మార్చడానికి వివిధ మత సంస్థలు, ముఖ్యంగా క్రైస్తవ,హిందూ సంస్థలు పోటీ పడి పని చేస్తు న్నాయి. చివరికి ఈ మత సంస్థలు ఆదివాసులను కులాలుగా చీల్చుతున్నాయి. ఏ కులంలోకి మతంలోకి వెల్లని ఆదివాసులను అంటరానివారుగా చూస్తున్నారు,మారుస్తు న్నారు.మొత్తంగా ఆదివాసీ సమాజాన్ని ధ్వసం చేయడానికి కార్పోరేట్‌ వర్గాలు,పాలకవర్గాలు, పార్టీలకు అతీతంగా ఒక్కటై పని చేస్తున్నాయి. ఆదీవాసి సమాజం కూడా పార్టీలకు,మతాలకు అతీతంగా ఐక్యం అయ్యి తమ అస్తిత్వం కొరకు ఒక్కటిగా పోరాడాల్సి ఉంది.అప్పుడే ఆదివాసి సమాజం తన అస్తిత్వాన్ని కాపాడుకో గలుగు తుంది.
కొండెక్కుతున్న గిరిజన సంస్కృతులు
మానవ సమాజం 21వ శతాబ్దంలో ఆధునిక హంగులతో ఉరకలు వేస్తున్నవేళ అంతరించి పోతున్న ఆదివాసీ భాషలు, సంస్కృతులను స్మరించుకోవాల్సిన అవసరం ఈరోజు ఎంతైనా ఉంది. సాంకేతిక పరిజ్ఞానంపై విరివిగా ఆధార పడిన ప్రస్తుత తరుణంలో వీరు ఇప్పటికీ సహజవనరులైన భూమి, నీరు, అడవులపై, సంప్రదాయ వ్యవసాయం, ఫలసాయం తదిత రాలపై ఆధారపడి ఎంతో ఆత్మవిశ్వాసంతో జీవిస్తున్నారు.చెట్టు,పుట,్టనీరు వంటివాటిని పూజి స్తూ వాటితో ఒక అవినాభావ సంబంధం ఏర్ప రచుకున్నారు. స్థిర అభివృద్ధి అనేది వీరి జీవన శైలిలో భాగమైంది. ఇంత గొప్ప సంస్కృతీ సంప్రదాయాలు కలిగిన ఆదివాసుల జనాభా, భాష క్రమంగా అంతరించిపోతుండటం ఎంతో బాధాకరం!
ఐక్యరాజ్య సమితి చొరవ
ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం మొత్తం ప్రపంచంలో 47.60కోట్ల ఆదివాసులు సుమారు 20 దేశాల్లో నివసిస్తున్నారు. ప్రపంచంలో వీరి జనాభా సుమారు ఆరు శాతం. ఏడు వేలకు పైగా భాషలు, అయిదు వేలకు పైగా సంస్కృతులు వీరి సొంతం. యునెస్కో అంచనాల ప్రకారం ఈ శతాబ్దం చివరకు సుమారుగా మూడు వేలకు పైగా అంటే నలభై భాషలు అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఇంతటి అసాధారణ చరిత్ర, సంస్కృతి, భాషలు కలిగిఉన్న ఆదివాసులను కాపాడుకునేందుకు ప్రజల్లో చైతన్యం పెంచేం దుకు ఐక్యరాజ్య సమితి ఏటా ఆగస్టు 9న అంతర్జాతీయ ఆదివాసీ హక్కుల దినంగా నిర్వహిస్తోంది.2019ను అంతర్జాతీయ ఆదివాసీ భాష సంవత్సరంగా,2022-2032 కాలాన్ని అంతర్జాతీయ ఆదిమ భాషల దశాబ్దంగా ప్రకటించడం ద్వారా వీరి సంస్కృతులను పరిరక్షించాల్సిన ఆవశ్యకతను ప్రపంచానికి చాటింది. ఆదివాసుల భాష, వారి సంస్కృతి సంప్రదా యాలను భావితరాలకు అందజేయాల్సిన అవసరం ఈ తరంపై ఉంది. ఈ భాషలకు లిపి లేదు.మరో తరానికి అవి మౌఖికంగానే బదిలీ అవుతున్నాయి. ప్రపంచీ కరణ యుగంలో వచ్చిన సాంకేతిక విప్లవం, ఆధునికత,సైనిక ఆక్రమణలుబీ సామాజిక, ఆర్థిక,రాజకీయ,మతపరమైన అణచివేతలుబీ ఇతర బాహ్య కారణాలు,ఆత్మన్యూనత వంటి అంతర కారణాలవల్ల ఈ భాషలు క్రమక్ర మంగా అంతరిస్తున్నాయి. వీటి ప్రభావం వారి అస్తిత్వంపై ప్రభావం చూపడమే కాకుండా, దీంతో ముడివడిన ఆచారాలు, కట్టుబాట్లు, ఆహారపుటలవాట్లు,సంప్రదాయాలు మొదలైనవీ కాలగర్భంలో కలిసిపోతున్నాయి. యునెస్కో- ప్రపంచంలోని 6,912 భాషల్లో 2473 భాష లు వివిధ రూపాల్లో కనుమరుగు అవుతున్నా యని అంచనా వేసింది.భారత్‌లో10.45కోట్ల ఆదివాసులు(130 కోట్ల దేశజనాభాలో 7.5 శాతం)ఉన్నారు.700కు పైగా విభిన్న జాతు లున్నాయి. యునెస్కోకు చెందిన ‘అట్లాస్‌ ఆఫ్‌ వరల్డ్‌ లాంగ్వేజెస్‌’ ప్రకారం ఇండియా 197 భాషలతో మొదటిస్థానంలో ఉంది.అమెరికా 192 భాషలతో, ఇండొనేసియా147భాషలతో తరవాతి స్థానాలను ఆక్రమించాయి. ఇటీవలి కాలంలో అండమాన్‌ ద్వీపంలో నివసించే ‘గ్రేట్‌ అండమానీస్‌’ ప్రధాన భాష అక-జెరు-తం బొల అనే వ్యక్తి మృతితో అంతరించిపోవడం బాధాకరం.జరావా,సెంటీనేలే,షోపెన్‌,ఓనగీ, బిరహోర్‌,గదబా,పహరియా,బొండోలు మాట్లా డే భాషలూ అంతరించే దశలో ఉండటం ఆందోళనకరం.
యుద్ధప్రాతిపదికన చర్యలు
ఆదివాసుల సంరక్షణ, అభివృద్ది కోసం రాజ్యాంగంలోఆర్టికల్‌ 16(4),46,275,330, 332,243డి,5,6షెడ్యూళ్ల ప్రకారం గిరిజన ప్రాంతాల్లో ఉండే గవర్నర్లకు విచక్షణ అధికా రాలను కల్పించారు. వీటిని ఉపయోగించి జాతీయ, రాష్ట్ర చట్టాలను క్షుణ్నంగా పరిశీలించి, వాటివల్ల ఆదివాసుల సంస్కృతికి ఏమన్నా ముప్పు సంభవిస్తే, వాటిని ఆపే హక్కు ఉంది. అయితే గిరిజనేతరుల ఆశయాలమేర చట్టాలు అమలు పరుస్తుండటం దురదృష్టకరం. వివిధ రాష్ట్రాల్లోని గిరిజన మంత్రిత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ వంటివి నిరంతరం పనిచేస్తున్నప్పటికీ- వారి భాషను, సంస్కృతులను కాపాడలేకపోతున్నాయనడానికి అంతరిస్తున్న భాషలే నిదర్శనం. వీటి సంరక్షణ కోసం మానవ వనరుల శాఖ 2013లో అంతరించే భాషల సంరక్షణ, పరిరక్షణ పథకాన్ని భారతీయ భాషల సంస్థ, విశ్వవిద్యాలయాలు, భాష పరిశోధన సంస్థల సమన్వయంతో ప్రారంభించింది. ప్రమాదపుటంచున ఉన్న భాషలను గుర్తించి వాటిని సేకరించి భద్రపరచడం (డాక్యుమెంట్‌) ఈ పథకం ప్రధాన ఉద్దేశం. గిరిజనుల భాషా సంస్కృతుల పరిరక్షణ కోసం దేశంలో గిరిజన విశ్వవిద్యా లయాలను, సాంస్కృతిక కేంద్రాలను యుద్ధప్రాతి పదికన ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచంలోని అనేక దేశాలతో పాటు, భారత్‌ కూడా ఆదిమ భాషలను కాపాడుకోవడం కోసం మాతృభాషను తప్పనిసరి చేస్తూ 2020 నూతన విద్యా విధానాన్ని రూపొందించింది. గిరిజన భాషల లిపి తయారు చేయడం,వాటిని భారత రాజ్యాం గంలో పొందుపరచడం వంటి చర్యల ద్వారానే ఆదివాసీ సంస్కృతి, భాషలను కాపాడగలు గుతాం.తద్వారా భారత జాతి గొప్పతనాన్ని భావితరాలవారికి అందించాలి!-(లంకా పాపిరెడ్డి/డాక్టర్‌ డి.వి.ప్రసాద్‌)

ఆర్టీఐ స్పూర్తికి తూట్లు

పౌరులే అసలైన పాలకులని, ప్రభుత్వానికి వారే యజమానులని సమాచార హక్కు చట్టం ఉద్గాటిస్తోంది. వాస్తవంలో అలాంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం నుంచి అవసరమైన సమాచారాన్నే ప్రజలు నిక్కచ్చిగా పొందలేకపోతున్నారు. ఈ పరిస్థితి మారాల్సిందే. సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ)2005 అక్టోబరు 12న విజయదశిమి నాడు అమలులోకి వచ్చింది. భారత ప్రజాస్వామ్యం మరింత పరిణతి చెందుతుందని ఈ చట్టం ఆశలు రేకెత్తించింది. లోపభూయిష్ట భారత ప్రజాస్వామ్యం నిజమైన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంగా ఎదగడానికి సమాచార హక్కు చట్టం(సహ)చట్టం తోడ్పడుతుందని చాలామంది ఆశించారు. `– సైమన్‌ గునపర్తి
సమాచార హక్కు చట్టానికి అధికార యంత్రాంగం తూట్లు
‘హమార పైసా హమారా హిసాబ్‌’ అంటూ రాజస్థాన్‌ లో పురుడు పోసుకున్న నినాదం మహోద్యమమై సమాచార హక్కు చట్టంగా రూపాంతరం చెంది ప్రస్తుతం దేశవ్యాప్తమైంది. పాలనలో పారదర్శకతను, జవాబుదారీతనంను పెంపొందించడంతో పాటు ప్రజలకు ప్రశ్నించే తత్వాన్ని నేర్పింది. వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మార్గదర్శిగా నిలిచింది. గ్రామ పంచాయతీ మొదలుకొని పార్లమెంట్‌ వరకు ఒక్క దరఖాస్తుతో కావాల్సిన సమాచారం పొందే హక్కును కల్పించింది. కానీ అమలు చేయాల్సిన అధికార యంత్రాంగం, సమాచార కమిషన్‌ చట్టాన్ని చట్టబండలు చేయడానికి ప్రయత్నిస్తున్నది. పెండిరగ్‌ దరఖాస్తులు, అప్పీళ్లు, ఫిర్యాదులతో సామాన్యుడికి సమాచారం అందడం గగనంగా మారింది. ఒక పక్క ప్రభుత్వ యంత్రాంగం సవరణలతో సహ చట్టానికి తూట్లు పొడుస్తుంటే మరోపక్క సమాచార కమిషన్‌ ఉదాసీన వైఖరి వల్ల చట్ట స్ఫూర్తికి భంగం వాటిల్లుతున్నది.
సవరణలతో బలహీనపరిచే యత్నం
ప్రభుత్వ పనితీరు సామర్థ్యాన్ని మరింత పెంచడం ద్వారా పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడానికి 2005 అక్టోబర్‌ 12 నుంచి సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చింది. చట్టంలోని సెక్షన్‌ 6 ప్రకారం ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు ఇస్తే ప్రజా సమాచార అధికారులు తమ దగ్గర ఉన్న సమాచారాన్ని క్రోడీకరించుకొని సెక్షన్‌ 7(1) ప్రకారం 30 రోజుల్లో సమాచారం ఇవ్వాలి. ఒక వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఉంటే 48 గంటల్లో సమాచారం ఇవ్వాలని చట్టంలోని నిబంధనలు చెబుతున్నాయి. ఒకవేళ అధికారుల నుంచి సహాయ నిరాకరణ ఎదురైతే ఆ శాఖలోని సీనియర్‌ అధికారులకు మొదటి అప్పీల్‌ చేస్తారు. అక్కడ కూడా స్పందన లేకపోతే సమాచార కమిషన్‌ కు రెండో అప్పీలు చేసుకుని సమాచారం పొందవచ్చు.
జవాబుదారీతనం పెంచాలి
సహ చట్టం అమలుకు కొత్తగా సమాచార కమిషన్లను నెలకొల్పారు.సమాచారం గురించి పౌరులకు,అధికారులకు మధ్య విభేదాలు ఏర్పడినప్పుడు మధ్యవర్తిత్వం వహించే బాధ్యతను ఈ కమిషన్లకే అప్పగించారు. మినహాయింపులు ప్రకటించిన పది విభాగాల సమాచారాన్ని తప్ప మిగతాదాన్ని ప్రభుత్వం పౌరులతో పంచుకోవలసిందేనని చట్టం చెబుతోంది. పౌరుడు కోరిన సమాచారాన్ని 30రోజుల్లో అందించాలని పేర్కొంది. సమాచారాన్ని అందించడంలో చేసిన జాప్యానికిగాను ప్రభుత్వ ఉద్యోగికి రోజుకు రూ.250చొప్పున జరిమానా విధించవచ్చు. ఆ మొత్తం జరిమానా రూ.25వేలు మించకూడదు.దీన్ని సంబంధిత ఉద్యోగి జీతం నుంచే వసూలు చేయాల్సి ఉంటుంది. ఆర్టీఐ చట్టం గురించి ప్రజల్లో అవగాహణ పెరగడం తో మొదట్లో దాన్ని ఉత్సాహంగా ఉపయో గించుకున్నారు.అయితే,అధికారంలో ఉన్నవారి నుంచి మాత్రం వ్యతిరేకత పెరిగింది.ఎక్కువగా పదవీ విరమణ పొందిన ప్రభుత్వ అధికారులనే సమాచార కమిషనర్లుగా నియమిస్తున్నందువల్ల వారు సమాచారాన్ని అందించడానికి మొండికేసే ఉద్యోగులకు జరిమానా విధించడానికీ మొగ్గు చూపడం లేదనే విమర్శలున్నాయి. సమాచార కమిషనర్ల నియామకంలోనూ పారదర్శకత కరవైంది. వారి అలసత్వంవల్ల సహాచట్టం సరిగ్గా పౌరుల ప్రాథమిక హక్కులను గౌరవించాలనే స్పృహ వారిలో కనబడటం లేదు. అందుకే నిర్ణయాలు తీసుకోవడంలో ఏళ్ల తరబడి ఆలస్యం చేస్తున్నారు. సహచట్టం పకడ్బందీగా అమలు కావడానికి కొన్ని రకాల పద్దతులు పాటించాలి. సమాచార కమిషనర్ల నియామకానికి నిర్ధిష్ట అర్హతలు,అనుభవాలను ప్రమాణాలుగా నిర్ణయించి,వాటిని కమిషన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలి. ప్రభు త్వం పరిష్కరిస్తున్న కేసుల సంఖ్య ఏడాదికి సగటున రెండువేల లోపుగానే ఉంటోంది. ఒక్కో కమిషనర్‌ ఆరువేలదాకా,వీలైతే అంతకన్నా ఎక్కువ కేసులు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి. కేసులను 90రోజుల్లోగా పరిష్కరించాలనే నిర్ధిష్ట పరిమితుల్నీ విధిం చాలి.ప్రతి కమిషనర్‌ పనితీరును ఆరు నెలలకు ఒకసారి సమీక్షించాలి. తదుపరి రెండేళ్లలో సమాచారం కోసం అందే దరఖాస్తులు,వాటి పరిష్కారం గురించి అంచనా వేయాలి.దాన్ని వెబ్‌సైట్‌లో ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రతి నెలా అందుకుముందు నెలలో కమిషనర్‌ పనితీరు గురించి వెల్లడిచేయాలి. అవసరాన్ని బట్టి ఎందరు సమాచార కమిషనర్లను నియ మించవలసిందీ ప్రభుత్వం ఆరునెలల ముందే ప్రకటించాలి. ఈ పదువులకు ప్రముఖులు నుంచీ దరఖాస్తులు స్వీకరించవచ్చు. ఇతరులు నామినేట్‌ చేసినవారినీ పరిశీలించి ఎంపిక చేయవచ్చు.అందుబాటులో ఉన్న సమాచార కమిషనర్‌ పదవులకు మూడురెట్లు ఎక్కువ పేర్లతో జాబితాను రూపొందించే పనిని యూపీఎస్సీ సభ్యులతో ఏర్పాటయ్యే కమిటీకి అప్పగించాలి. లేక మరేదైనా పద్దతినీ అనుసరించవచ్చు. ఆజాబితా నుంచి ఎవరిని ఎందుకు ఎంపిక చేసిందీ స్పష్టంగా వివరిం చాలి. పదవుల కోసం దరఖాస్తు చేసుకున్న వారితో సంబంధిత అన్వేషణ కమిటీ బహిరంగంగా ముఖాముఖి నిర్వహించాలి. పౌరులు,మాధ్యమాల అభిప్రాయాలనూ స్వీకరించాలి. తర్వాత అందుబాటులో ఉన్న సమాచార కమిషన్‌ పదవులకు రెట్టింపు సంఖ్యలో అభ్యర్థుల పేర్లను సిఫార్సు చేయాలి. ప్రధానమంత్రి/ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ఒక మంత్రితో కూడిన కమిటీ ఈ జాబితా నుంచి తుది నియామకాలు జరపాలి. సమాచార కమిషనర్లలో సగం మంది వయస్సు 60ఏళ్లకన్నా తక్కువ ఉండాలి. సమాచార హక్కు అమలుకు పాటుపడుతున్న ఉద్యమాకారులలో అరునలైన వారిని కమిషనర్లుగా నియమించాలి. సమాచార కమిషనర్ల ఎంపికను పారదర్శక ప్రక్రియను పాటించి,వారు తమ విధులను పకడ్బంధిగా నెరవేర్చలా నిరంతరం ఒత్తిడి తెస్తూ జవాబు దారీతనం పెంచినట్లుయితే సహచట్టం నుంచి మెరుగైన ఫలితాలను సాధించగలుగుతాం. అలాంటి ప్రక్రియనే ఇతర అనేక కమిషన్లకూ వర్తింపచేయవచ్చు.
సరైన ఫలితాలు శూన్యం
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం పనితీరును తనికీ చేసి,పొరపాటు జరిగితే సరిదిద్ది సమతూకం సాధించే బాధ్యత సంబంధిత కమిషన్లపై ఉంది. ప్రస్తుతం పలు కమిషన్లు ఆశించిన స్థాయిలో విధులను నిర్వహించడం లేదు. చాలా కమిషన్లు సీనియర్‌ పౌరుల క్లబ్బుల్లా తయారయ్యాయి. పనిలేకుండా పదివిని, దాంతోపాటు వచ్చే సౌకర్యాలు,పారితోషకాలను అనుభవించే మార్గాలుగా మారాయి. నేడు మానవ హక్కుల కమిషన్‌,మహిళా కమిషన్‌, లోకాయుక్త వంటి కమిషన్లు ఉన్నా..వాటి నుంచి ఆశించిన ఫలితాలు లభించడం లేదు. సము చిత అర్హతలున్న వ్యక్తులను కమిషన్లుగా నియమిస్తూ,వారి పనితీరును ఎప్పటికప్పుడు మదింపు చేస్తూ సమాచార కమిషన్లను సమర్ధంగా పనిచేయించడంపై దృష్టి కేంద్రీకరించాలి.
సమీక్ష అవసరం
పౌర సమాజం సైతం సమాచార కమిషనర్ల పనితీరును ఎప్పటికప్పుడు మదింపు చేయాలి. వారి నిర్ణయాలను ప్రతినెలా పారదర్శకంగా సమీక్షించాలి. ప్రతి కమిషనర్‌ పనితీరుపై మూడు నెలలకు ఒకసారి మూల్యాంకన పత్రాన్ని ప్రచురించాలి. సమాచార కమిషనర్ల నిర్ణయా లను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ మూల్యాం కన పత్రాన్ని రూపొందించే పనిని న్యాయ కళాశాల విద్యార్ధులకు అప్పగించ వచ్చు.
జీవోలు ఇచ్చి వెనక్కి తగ్గిన సర్కారు
తెలంగాణ ప్రభుత్వం నిరుడు అక్టోబర్‌లో విడుదల చేసిన మెమో నంబర్‌ 3476 ప్రకారం సహ చట్టం కింద ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చిన దరఖాస్తులకు సమాచారం ఇవ్వాలంటే సదరు ప్రజా సమాచార అధికారి వారి ప్రభుత్వ విభాగానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి లేదా ముఖ్య కార్యదర్శి అనుమతి తప్పనిసరి అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. హైకోర్టు ఆ ఉత్తర్వు లను నిలిపివేసింది. దీనిపై ఉన్నత న్యాయస్థానం వివరణ కోరడంతో ప్రభుత్వం ఆ ఉత్తర్వులను రద్దు చేసి వాటి స్థానంలో నవంబర్‌12 న అంతర్గత ఆదేశాలను జారీ చేసింది. దీని ప్రకా రం కోరిన సమాచారం తన వద్ద పూర్తిగా లేదని ప్రజా సమాచార అధికారి భావిస్తే ఉన్నతాధికారుల సహకారం తీసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. ఈ రెండు ఉత్తర్వుల్లో కొన్ని పదాలు మారినప్పటికీ ప్రభుత్వ లక్ష్యం మాత్రం ఒకటే అన్నది స్పష్టమవుతున్నది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ ప్రభుత్వమైనా ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన ఆర్థిక వనరు లను,నిధుల వివరాలను పబ్లిక్‌ డొమైన్‌లో అప్‌లోడ్‌ చేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం సర్కారు జీవోలను దాస్తూ పారదర్శకతకు తిలోదకాలు ఇస్తున్నది. అలాగే సమాచార హక్కు చట్టం నిబంధనల ప్రకారం ప్రతి రాష్ట్ర సమాచార కమిషన్‌ లో11 నుంచి-12 మంది సమాచార కమిషనర్లు పనిచేయాలి. కానీ మన రాష్ట్ర కమిషన్‌ లో ప్రస్తుతం కేవలం ఆరుగురు సమాచార కమిషనర్లు మాత్రమే ఉన్నారు. మిగతా కమిషనర్లను నియమించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదు.
పనితీరు సరిగా లేక..
2017 సెప్టెంబర్‌లో కొత్తగా తెలంగాణ సమాచార కమిషన్‌ ఏర్పాటైంది. బదిలీ అయిన పిటిషన్లు 6,825 కలుపుకొని మొత్తం38 వేల పిటిషన్లు కమిషన్‌?కు అందగా ఇప్పటివరకు 31 వేల పిటిషన్లను పరిష్కరించామని కమిషన్‌ చెబుతున్నది. కానీ క్షేత్రస్థాయిలో లెక్కలు మరోలా ఉన్నాయి. కొందరు సమాచార కమిష నర్ల షోకాజ్‌ నోటీసులు, జరిమానాల విషయం చూస్తే అర్థమవుతుంది. 2017 సెప్టెంబర్‌ నుంచి జూన్‌ 2022 వరకు సమాచార కమిషన్‌ 27,877 కేసుల్లో 753 కేసులకు సంబంధించి షోకాజ్‌ నోటీసులు ఇచ్చింది. వాటిలో కేవలం 38 మంది ప్రజా సమాచార అధికారులపై రూ.1,13,000 జరిమానాలు మాత్రమే విధించారు. ఒక్క కేసులో కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అప్పీళ్లు, ఫిర్యాదులు పరిష్కరించడానికి రెండు సంవత్సరాల సమయం పడుతుందని ‘సతార్కు నాగరిక్‌ సంఘటన్‌’ నిరుడు అక్టోబర్‌ నెలలో విడుదల చేసిన తన నివేదికలో స్పష్టం చేసింది. కమిషన్‌ ఏర్పడిన ఈ ఐదేండ్లలో వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర స్థాయిలో సమాచార కమిషన్‌ ఒక్క సమీక్ష సమావేశం కూడా నిర్వహించలేదు. చట్టం అమలుకు సంబంధించి కమిషన్‌ ఏటా వార్షిక నివేదిక విడుదల చేయాల్సి ఉంటుంది. ఇందులో మొత్తం కేసులు, పరిష్కరించినవి ,పెండిరగ్‌లో ఉన్నవి, జరిమానాలు విధించినవి, క్రమశిక్షణ చర్యలు తీసుకున్న విషయాలను ప్రస్తావించాలి. కానీ కమిషన్‌ ఏర్పడిన ఐదేండ్ల లో ఒక్కసారి కూడా వార్షిక నివేదికను విడుదల చేయలేదు.
స్వచ్ఛంద సమాచార వెల్లడి ఎక్కడ?
సమాచార హక్కు చట్టంలో సెక్షన్‌ 4(1)బి చట్టానికి గుండెకాయ వంటిది. ఇందులో 17 అంశాలు ఉన్నాయి. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోని అధికారుల వివరాలు వారి విధులు, నిర్వర్తించాల్సిన బాధ్యతలు, ఆ కార్యాలయానికి వస్తున్న నిధులు, వాటి ఖర్చు వివరాలు వీటన్నిటిని సంబంధిత ప్రభుత్వ యంత్రాంగమే స్వచ్ఛందంగా ప్రజలకు తెలియజేయాలనేది నిబంధన. రాష్ట్రంలో దాఖలవుతున్న దరఖాస్తులు 60 శాతం ఈ సెక్షన్‌ పరిధిలో సమాచారం కోరుతూ వస్తున్నవే. కానీ చాలా ప్రభుత్వ కార్యాల యాల్లో అయిదారేండ్ల కిందటి పాత సమాచారాన్ని ఇంకా కొనసాగిస్తున్నాయి. ఈ విషయంపై ప్రభుత్వ శాఖలను ప్రశ్నించాల్సిన సమాచార కమిషన్‌ ప్రేక్షక పాత్ర పోషిస్తున్నది. ప్రజా సమాచార అధికారుల నిర్లక్ష్యం వల్ల తమ కార్యాలయ సమాచారాన్ని సరైన విధంగా డిజిటలైజ్‌ చేయలేకపోతున్నారు.అన్ని ప్రభుత్వ విభాగాలు తమ బడ్జెట్‌లో ఒకశాతాన్ని డిజిటలైజేషన్‌తో పాటు,సమాచారం మెరుగ్గా నిర్వహించడానికి వ్యయం చేయాలని మార్గదర్శకాలు ఉన్నప్పటికీ దాన్నెవరూ పట్టించుకోవడం లేదు.జాగృత జన వాహిని పిడికిలి బిగించకుంటే సమాచార హక్కుకు గ్రహణం తథ్యమని యూఎఫ్‌ఆర్టీఐ రాష్ట్ర కో కన్వీనర్‌ అంకం నరేష్‌ అభిప్రాయపడ్డారు.
సహ చట్టాన్ని నీరుగారుస్తున్నారు – నార్నె వెంకట సుబ్బయ్య
ప్రభుత్వ యంత్రాంగంలో పారదర్శకత, జవాబుదారీతనం తెచ్చేందుకు,అందుబాటులో ఉన్న సమాచారాన్ని ప్రజలకు తెలియచెప్పేం దుకు, పౌరులకున్న హక్కును చట్టబద్దం చేసేందుకు సమాచార హక్కు (సహ) చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దీనికోసం పెద్ద పోరాటమే జరిగింది. ఈ చట్టం రాకముందు ఆఫిస్‌కి వెళ్ళి బల్ల మీద చెయ్యి పెట్టడానికి కూడా వుండేది కాదు. ఈ చట్టం వచ్చిన తరు వాత ఖచ్చితంగా అడిగిన సమాచారం ఇవ్వా ల్సిన అవసరం వచ్చింది. పౌరునికి చదువు రాకపోయినా వారు కోరినవిధంగా అధికారులే ఫిర్యాదు రాసి అప్లికేషన్‌ పూర్తిచేసి పెట్టాలి. ఒకవేళ ఫిర్యాదులో అచ్చుతప్పులు దొర్లినా, భాషా పరిజ్ఞానం లేకపోయినా విషయం అర్ధమైతే చాలు. సమచారం ఇవ్వాలి.అలాంటి చట్టం వున్నప్పటికీ ఈరోజు అధికారులు కావల సిన సమాచారం ఇవ్వకుండా తప్పించు కుంటున్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. కొంతమంది అధికారులు కావాలని, ‘మీరు అడిగింది సెక్షను 8.1లోకో రెండు లోకో వస్తుంది కనుక సమాధానం ఇవ్వం’ అంటూ తప్పించుకుంటున్నారు. దేశ రక్షణకు సంబంధించినది అయితే ఇవ్వకూడదు. ఒక ప్రభుత్వ కార్యాలయంలో జరిగిన అవి నీతి గురించి మీరేం చర్యలు చేపట్టారు,సదరు పని జరగకపోవటానికి కారణాలు తెలపండి అనడిగితే అవి చెప్పటానికి ఇష్టంలేక ‘దీనికి సమాధానం మా కార్యాలయంలో లేదు. మా పరిధి లోకి రాదు’ అని తిప్పి పంపుతున్నారు. వారి దగ్గర లేకపోతే ఎవరి దగ్గరవుందో, వారికి ఫిర్యాదు పంపి, ఐదు రోజులలోపు ఆ సమాచారం ఫిర్యాదుదారునికి తెలపాలి. అంతేగాని ఇవ్వకుండా వుండకూడదు. దీనికంతటికి కారణం సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించిన వారిపైన ఆర్‌టిఐ కమిషన్‌ వారు సరైన చర్యలు తీసుకోకపోవటం. దీంతో అధి కారులు తప్పుడు సమాచారం ఇచ్చి సహ కార్య కర్తలను నిరుత్సాహ పరుస్తూ, చట్టాన్ని నీరుగారు స్తున్నారు. కనుక ఇకనైనా చట్టాన్ని, అందులోని సెక్షన్లను ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకొని జరిమానా విధించాలి. అప్పుడే సహ చట్టం బతుకుతుంది.

1 2 3 6