అపూర్వ సాహితీ సింగిడి ఆదియోధులు

కప్పుడు మౌఖిక సాహిత్యంకే పరిమితమైన… మన ఆదివాసీ సాహిత్యం… అక్షరాస్యతలో వచ్చిన అభివృద్ధిలో భాగంగా .. వివిధ ప్రక్రియలలో పుస్తకాల రూపంలో… వస్తూ ప్రామాణికతకు చోటుచేసు కుంటుంది, ఈ గిరిజన సాహిత్యంలోని… పుస్తకాల వివరాలను ‘‘గవాక్షం’’ శీర్షికన… ‘‘థింసా పాఠకుల’’ కోసం ప్రతి నెల ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్న పరిశోధక రచయిత డా. అమ్మిన శ్రీనివాసరాజు గారు అందించిన ఈనెల పుస్తక పరిచయం ప్రముఖ రచయిత గుమ్మడి లక్ష్మీనారాయణ కలం నుంచి జాలువారిన ‘‘అపూర్వ సాహితీ సింగిడి ఆదియోధులు’’

Read more

బీటలు వారుతున్న రాజ్యాంగ సౌధం

ఈ ఎనిమిదేళ్ల పాలనలో దళితులకు భూములు పంచలేదు. దళితులపై జరిగే అత్యాచారాల విషయంలో ఎటువంటి విచారణ లేదు. అస్పృశ్యతా నివారణ చట్టాన్నే కాక,1989 ఎస్సీ,ఎస్టీ అత్యా చారాల నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేసే సకల ప్రయత్నాలు చేస్తున్నారు. భారతదేశం ఈనాడు రాజ్యాంగ సంక్షోభంలో ఉంది. దేశంలోని ప్రధాన పాలక వర్గాలు నిరంతరం రాజ్యాంగ ఉల్లంఘనకై ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. రాజ్యాంగం ఒక సామాజిక సాంస్కృతిక విప్లవ మార్గం. రాజ్యాంగం భారతదేశ నిర్మాణ సౌధం. భారతదేశానికి ఒక నిర్మాణాత్మక పరిపాలనా క్రమాన్ని ఇవ్వడానికి అంబేద్కర్‌ 1949 నవంబర్‌ 20వ తేదీన దేశాన్ని సర్వ సత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య రిపబ్లిక్‌గా ప్రకటించారు. రాజ్యాంగంలో ప్రధాన సూత్రం ప్రజలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం.

Read more

నిధులు లేకుండా విద్యాప్రమాణాలెలా?

‘దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది’ అంటారు. విద్యా వ్యవస్థకు ఉన్నతవిద్య ఆకాశ హర్మ్యమైతే, పాఠశాల చదువు పునాది. ఈ రెండిరటికీ సమతూ కంగా నిధుల కేటాయింపు ఉంటేనే సుస్థిర అభివృద్ధి సాధ్యం. విద్యాసంస్థల నాణ్యతా ప్రమాణాలు పెంచుకో వడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థికపర మైన ప్రోత్సాహం అవసరం. కానీ తెలంగాణ విద్యారంగ అభివృద్ధికి కేంద్ర బడ్జెట్‌లో ప్రతిసారీ నిరాశే ఎదురవుతున్నది. ఈసారైనా కేంద్రం తగిన నిధులను ఇవ్వాలి’

Read more

ఇక ఆ గ్రామాల్లో నివాసాలు కష్టమేనా?

‘‘పోలవరం ముంపు మండలాల్లో నివాసయోగ్యత కనిపించడం లేదు. ఈ వరదలు అదే చెబుతున్నాయి. వరద నీరు ఎగువన తగ్గినా మారుమూల గిరిజన గ్రామాలే కాకుండా మండల కేంద్రాలు కూడా కోలుకోవడం లేదు. నీరు తగ్గడం లేదు. గతంలో ఎంత వేగంగా వరద వస్తే అంతే వేగంగా తగ్గేది. ఈసారి మాత్రం వరద తగ్గడం లేదంటే ఇక మా ఇళ్లల్లో మేము ఉండాలంటే కష్టమే. అందుకే ఖాళీ చేస్తామని చెబు తున్నాం. కానీ పునరావాసం ఇవ్వడం లేదు. మాకు ప్యాకేజీ ఇవ్వకుండా మా ఊళ్లను ముంచేశారు. మేము ఏమి చేయాలి? ఎక్కడికి పోవాలి? ఎలా బతకాలి? కనీసం కూడా ఆలోచించరా.. వరదల్లో ఇచ్చే సహాయంతో మా కుటుంబాలు గడిచిపో తాయా? ప్రభుత్వం ఆలోచించాలి’’

Read more

రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎంపిక హర్షనీయం

భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము విజయం సాధించడం అభినందనీయం.జయాపజయాలు పక్కనపెట్టి ప్రజాస్వామ్య విలువలను,పౌర హక్కులను పరిరక్షించి సమాజ పురోభివృద్ధికి కృషి చేసేవారే సరైన పాలకులౌవుతారు.రాజ్యాంగ పరిరక్షణ బాధ్యతలు కలిగియున్న రాష్ట్రపతి పీఠానికి ప్రత్యేక విశిష్టతలూ,విశేషాధి కారాలూ ఉన్నాయి. స్వాతంత్య్రం అనంతరం జన్మించి రాష్ట్రపతి పీఠాన్ని అధిష్టించిన తొలివ్యక్తిగా,తొలి ఆదివాసీ మహిళగా నిలిచారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా..అణగారిన ఆదివాసీతెగల నుంచి అత్యున్నత రాష్ట్రపతి పీఠం అధిష్టించే స్థాయికి ఎదిగిన ముర్ముపై ఆయా తెగలు ప్రజలు, సామాన్యలు అనేక ఆశలు,ఆకాంక్షలు పెట్టుకున్నారు.ఇప్పటికైన తమకు రాజ్యాంగం కల్పించిన చట్టాలు,హక్కులు,వనరులకు రక్షణ ఉంటుందని ఆశిస్తున్నారు. ఆదివాసీగిరిజన జీవన విధానం ఇంతకు ముందు పూర్తి ప్రత్యేకతను సంతరించుకుంటే,ఈమధ్యన బయటి ప్రపంచంతో సంబంధాలు పెరిగిన తర్వాత మార్పులు వస్తున్నాయి. వాటిలో కొన్ని మంచిని కలిగించే మార్పులయితే,మరికొన్ని వారి ప్రాంతాలను,జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి. రాజ్యాంగపరంగా షెడ్యూల్డ్‌ తెగలకు కల్పించిన రక్షణలను పరిరక్షించుకోవడానికి నియమించబడిన భారత జాతీయ ఎస్టీ కమిషన్‌ పూర్తిస్థాయిలో నేటికీ భర్తీ కాలేదు.సగానికిపైగా ఖాళీలున్నాయి. ఆదివాసీ ప్రజ లను సమస్యల సుడిగుండంలోకి నెట్టేసి వారి గిరిజన ప్రజలసంపద, భూమి, అడవులు, సహజవనరులను కార్పొరేట్‌ కంపెనీలకు దోచి పెట్టే చర్యలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. ఆదివాసీలను బలిపీఠం ఎక్కించేలా కార్పొరేట్‌ అనుకూల సంస్కరణలతో అటవీ సంరక్షణ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు సర్కార్‌ కొన్ని కొత్త నిబంధ నలను తెరపైకి తెచ్చింది. దేశంలోని ఖనిజ తవ్వకాలు,పునరుత్పాదక విద్యుత్‌,పర్యాటకం,వన్యమృగాల పరిరక్షణ జోన్ల పేరుతో ఇప్పటికే అడవిబిడ్డలను అడవికి దూరం చేయడంతో వారంతా దోపిడికి గురవుతున్నారు.
రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత గిరిజన గ్రామాలను అయిదో షెడ్యూల్‌లో చేర్చారు.అదే సమయంలో కొన్ని గిరిజన గ్రామాలను వదిలేశారు. ఇలా ఐదో షెడ్యూల్‌లో చేరని గిరిజనులు నివాసముండే గ్రామాలను నాన్‌ షెడ్యూల్‌ ఏరియా గిరిజన ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 552 గ్రామాలు ఉన్నాయి.నాన్‌ షెడ్యూల్‌ ఏరియాను షెడ్యూల్‌ ప్రాంతంలో కలపాలనే ఈ సమస్యతో గతకొన్ని దశాబ్దాల నుంచి పోరాడుతున్నారు.భూరియా కమిటీ సిఫార్సుల అనంతరం షెడ్యూల్‌ ప్రాంతాలను స్థానిక పాలనా కోసం కేంద్రప్రభుత్వం పంచాయితీ విస్తరణ చట్టం (పెసా)`1996 చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ సిపార్సుల్లో మెసా (మున్సిపల్‌ ప్రాంతాలవిస్తీరణ చట్టం)చట్టం చేయలేదు. ప్రస్తుత ప్రభుత్వాలు మెసా చట్టం లేకుండానే కొన్ని గిరిజన ప్రాంతాలను మున్సిఫల్‌ పరిధిలోకి విలీనం చేయడానికి కుట్ర జరుగుతుంది. వాస్తవానికి గ్రామసభల ద్వారానే కొత్తవాటిని విలీనం చేసే అవకాశం ఉన్నప్పటికీ నిబంధనలను గాలికి వదిలేసి ప్రభుత్వాలు ఉదాసీనవైఖరి అవలంబిస్తున్నాయి. ఉదాహరణకు ఉమ్మడి విశాఖ జిల్లా సరుగుడు పంచాయితీలోని కొన్ని గ్రామాలను విశాఖమెట్రో పాలిటిన్‌ ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ)లో విలీనం చేస్తున్నారు.దీనవల్ల గిరిజనుల మనుగడ ప్రశాన్నర్ధంగామారే ప్రమాదంఉంది.వారిసంస్కృతి, సంప్రదాయాలకు విఘాతం కలిగే అవకాశాలు న్నాయి.ఈ విధంగా దేశంలోని పది రాష్ట్రాలలో ఈ సమస్య ఉంది.
ఈ నేపథ్యంలో ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలపట్ల కొత్త రాష్ట్రపతి ముర్ము ఎలాంటి విధానాన్ని అవలంబిస్తారనేదే ప్రస్తుతం కీలక ముఖ్యఅంశంగా మారింది. కార్పొరేట్‌ ప్రయోజనాల కోసం గిరిజనులను బలిపీఠమెక్కిస్తున్న కేంద్రప్రభుత్వం తమ విశేషాధి కారాలను వినియోగించుకొని అడవిబిడ్డలను,ప్రజాస్వామ్య విలువలను,రాజ్యాంగ పునాదులను పరిరక్షిస్తారని ఆదివాసీ సమాజం ఎదురు చూస్తోంది.ఎలాంటి పక్షపాతం లేకుండా రాజ్యాంగ సంరక్షకురాలిగా ముర్ము తన విధులు నిర్వహిస్తార’ని ఆశిద్దాం! – రెబ్బాప్రగడ రవి‍,ఎడిటర్

Read more

మొక్క‌లు నాటుదాం…ప‌ర్య‌వ‌ర‌ణాన్ని కాపాడుకుందాం..!

కాలుష్య కాసారం ప్రకృతినీ పర్యావరణాన్నీ, మానవ ఆరోగ్యాన్నీ అనేక రూపాల్లో ప్రభావితం చేస్తోంది. ఒకప్పుడు అందంగా… అహ్లాదం గా…. స్వచ్ఛంగా ఉన్న వాతావరణం క్రమంగా కనుమరగైపో తోంది. అవసరంలేని ఆధునికతతో, రకరకాల వ్యర్థాలతో, కాలుష్యాలతో జీవావరణ వ్యవస్థకు ప్రమాదం ఏర్పడుతోంది. ఇప్పటికే అది తీవ్రస్థాయికి చేరిందని పర్యావరణ ప్రేమికులు, శాస్త్రవేత్తలు, ఆందోళనవ్యక్తం చేస్తు న్నారు. మానవ మనుగడ సాఫీగా ఉండాలంటే ప్రకృతిని పదిలంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలు ప్రకృతి, పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సినన అవసరం ఉంది. పర్యావరణంలో రోజు రోజుకూ వస్తున్న మార్పులు, పొంచి ఉన్న ప్రమాదం, చేపట్టాల్సిన చర్యలు గుర్తించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
పర్యావరణం విషయానికొస్తే మీకు కొన్ని అంశా ల చెప్పాలి. నాచిన్నప్పుడు యింటి ముందు మట్టి రోడ్లే కానీ తారు రోడ్లు లేవు.స్నేహితులం దరం ఆ మట్టిలో గంటల తరబడి ఆడినా, ఆమట్టి ధూళి పీల్చినా ఏకొంచెం అనారోగ్యం కూడా కలిగేది కాదు. కారణం మట్టిలో ఉన్న సూక్ష్మ జీవులను,కీటకాలను పిచ్చుకలు,కోళ్ళు, పావురాలు పక్షి సమూహాలు ఎన్నో వచ్చి తినేసి పర్యావరణానికి ఎంతో మేలు చేసేవి.ఇక సరు కులకోసం షాపుకెళ్తే షాపు వాళ్ళు న్యూస్‌ పేపర్‌ కాగితాలలో చింతపండు,మిరప కాయలు పప్పు,ఉప్పు,అన్నీ పొట్లాలు కట్టి ఇచ్చేవాళ్ళు ఒక బట్ట సంచీలో వాటిని తెచ్చుకునే వాళ్ళం. కొబ్బరి నూనె అయిపోగానే ఖాళీ సీసా తీసుకు వెళ్తే అందులో.. నూనె కొలిచి ఇచ్చేవారు. కొంచెం సమయం పట్టినా సరుకులు ఇచ్చే విధా నంలో ఎక్కడా పర్యావరణానికి హాని జరిగేది కాదు. కాలుష్యం అనే కాసారానికి ఎంతో దూరంగా పర్యావరణ పరిరక్షణ జరుగుతూ ఎంతో బాగుండేది.అసలు పాలిథీన్‌ కవర్లు 19 80 వరకు మేము ఎన్నడూ చూడలేదు.1978-79లో అంటే అప్పుడు మే8వ క్లాసు/ 9వ క్లాసు లో ఉన్నప్పుడు ‘‘ప్లాస్టిక్కులు’’ అనే తెలుగు పాఠం ఉండేది. బహుశా అప్పటికే రాబోయే సునామీ అది అనే విషయం ఆరోజుల్లో తెలిసేది కాదు, పైగా ప్లాస్టిక్కులవల్ల ఎన్ని లాభాలో ఆపాఠం లో చదువుకున్నాం. ఆరోజుల్లో ఉదయం నిద్రలేపుతూ పాల సీసా బండివాడు బండిపై టక టకా శబ్దం చేస్తూ ..వచ్చేవాడు. వెంటనే పిల్లలమంతా అమ్మ ఇచ్చిన ఖాళీపాల సీసాలు రెండు తీసుకుని వీధిలోకి వెళ్లి బండి ఆయనకు ఇచ్చికొత్త పాల సీసాలు రెండు పట్టుకొచ్చే వాళ్ళం.అమ్మ ఆపాల సీసాల ఢక్కన్‌ (మూత)ను తెరవగానే దాన్నిండా వెన్న ఉండేది. ఆవెన్న తినటానికి మేము అప్పుడప్పుడూ పోటీపడే వాళ్ళం. పాలిథీన్‌ కవర్లలో పాలు అప్పట్లో మే ము ఎరగము..షాపు నుండి సరుకులు తెస్తే అన్నీ పాత ఒవల్టీన్‌/డాల్డా వంటివి చిన్న డబ్బా ల్లో పోసుకునేది అమ్మ. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా భూమిలో కరిగిపోని /కలిసిపోని ప్లాస్టిక్‌ కవర్లే. ప్రతి రెండు అడుగుల భూమికీ ఒకటి చొప్పున రోడ్డుపై కనబడుతున్నాయి. ఆ వ్యర్ధాలు తిని ఆవులు, గేదెలు అనారోగ్యం పావుతు న్నాయి. మొన్నీమధ్యే పేపర్‌లో వచ్చింది ఈవార్త ఏమి టంటే…ఆవ్యర్దాలన్నీ తిన్న ఆవుకు ఆపరే షన్‌ చేసి 25 కిలోల ప్లాస్టిక్‌వ్యర్ధాల చుట్టను బయటికి తీసిఆవుకుప్రాణంపోశారటపశు వైద్యు లు !!! అప్పట్లో చాటలో బియ్యం చేరుగుతూంటే వడ్లు/నూకలు (ఈ కాలం పిల్లలకు ఇవిఏంటో కూడా తెలియదు) తినటానికి పిచ్చుక లెన్నో వచ్చేవి కిచకిచమంటూ రెక్కలు అల్లల్లా డిరచు కుంటూ తినేవి అదిచూసి, మేము ఇంకా బియ్యం వేసే వాళ్ళం.మనసుకు ఎంతో ఆహ్లాదం గా, ఆనందంగా ఉండేది. అప్పట్లో ఇన్ని పెట్రోల్‌/డీసిల్‌ బండ్లెక్కడివి? ప్రతియింట్లో విధిగా సైకిల్‌ ఉండేది. 1980 వరకు స్కూటర్‌లు ఎక్కువ కనిపిం చేవి కావు, బైక్‌లు అసలే లేవు. చిన్న దూరాలకు వాకింగ్‌, పెద్ద దూరాలకు సైకిళ్ళు ఉండేవి. అప్పట్లో మేము ఆడ పిల్లలం కూడా సైకిల్‌ నేర్చుకోవటానికి ఉబ లాట పడే వాళ్ళం. అలా నేను కూడా సైకిల్‌ తొక్కడం నేర్చుకున్నాను. మా చిన్నప్పుడు 3మైళ్ళ దూరం వెళ్ళాల్సి వస్తే రిక్షల్లో వెళ్ళే వాళ్ళం. చార్జి కేవలం 2 రూపాయలు (ఇప్పటి పిల్లలకు అవి బొమ్మ గీసి చూపెట్టాల్సి వస్తున్నది). 1980-85 సమయంలో 5,7,రూపాయలకు దింపే వారు. ఇక వాహన కాలుష్యం ఎక్కడిది? అంతా స్వఛ్ఛమైన గాలే కదా! ఇకదానితో బాటుధ్వని కాలుష్యంకూడా లేదు. ఇప్పుడు ఈ వాహనాల మూలంగా, పొగవల్ల థైరాయిడ్‌ గ్రంథి ó పని తీరు అధ్వాన్న మైంది అందరికి ఇదే జబ్బు. ఇక అస్తమా, బ్రోన్కైతిస్‌ అయితే చెప్పనక్కర లేదు ఇవి చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు వస్తున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ప్రమాదంగా మారిందో చెప్పాల్సిన పనిలేదు. అలాఅవసరం లేకున్నా వాహనాలు చేసే ధ్వని కాలుష్యం (హార్న్‌ శబ్దాలు) వలన తలనొప్పి, అల్జీమర్స్‌, ఒత్తిడి ఆందోళన,మతి మరుపు, నరాల జబ్బులు వస్తున్నాయి ఇళ్ల మధ్యలో ఎక్కడా ఏ చిన్న ఫ్యాక్టరీ కూడా ఉండేది కాదు.పట్నం(హైదరా బాద్‌) మా చిన్నప్పుడు పల్లె శోభతో కళకళ లాడేది. తులసి కోటలోనే కాకుండా బయట కూడా చాలామొక్కలు తులసివనంలాఉండేది. దాంతో మంచి స్వచ్చమైన గాలి పీల్చే వాళ్ళం. వర్షం పడితేచాలువీధిలో గడ్డిపై వెల్వెట్‌ (ఆరు ద్ర పురుగులు) పురుగులు కనబడితే వాటిని అగ్గిపెట్టె లో పెట్టి అందరికీ చూపించే వాళ్ళం. ఇప్పుడు ఇళ్ళ మధ్యలో చిన్న చిన్న ఫ్యాక్టరీలు వెలుస్తు న్నాయి. గ్యాస్‌ ఫిల్లింగ్‌ వంటి వైతే పేలుడు కూడా జరిగే ప్రమాదం లేకపోలేదు. ఇళ్లలో ఉండే మొక్కలవల్ల మంచిగాలి పీల్చే వాళ్ళం. ఇప్పుడు ఫ్లాట్‌లలో ఒక్క చెట్టు కూడా కనబడటం లేదు. అసలే ఓజోన్‌ పొరతరిగి పోతున్నది. దాంతో భూమిపై వాతావరణం వేడెక్కి, భూతాపంవల్ల మనుషులకు డ్రైనెస్‌ గొంతులో,కళ్ళలో మంటలు,హైబిపి జబ్బులు వస్తున్నాయి. ఇప్పటికైనా విరివిగా మొక్కలు, చెట్లు పెంచితే కొంత వరకైనా ఈసమస్య నుండి అధిగమించవచ్చు.జలకాలుష్యం:నదులు, సరస్సు లు పూడుకు పోయాయి ఇసుకమట్టి మాత్రమే కాదు ప్లాస్టిక్కులతో నిండి పోయాయి. నాలాలు మరీ ఘోరంగా తయార య్యాయి ఒకవర్షం వస్తే డ్రైనేజ్‌ పొంగి వీధుల్లో యిళ్ళ మధ్య ప్రవహిస్తూ దోమలతో అనారోగ్యం కలిగిస్తున్నది. ప్లాస్టి కవర్లు భూమి పొరల్లో కరుగక, ఎండా` వానలకు రసాయనాలు విడుదల చేస్తూ కాలు ష్యాన్ని పెంచుతు న్నాయి.అవిపీల్చిన వాళ్లకి భయం కరమైన వ్యాధులు,ఆస్తమా,రక్తపోటు, గుండెదడ,ఉబ్బస వ్యాధులు కలుగుతున్నాయి. కొందరు అజ్ఞానంతో,చెత్తలలో టైర్‌లవంటివి కూడా కాలుస్తున్నారు.దీనివల్ల కీడు ఎక్కువ. ఇవన్నీ ప్రజలకు అవగాహన కలిగించాలి .
ఇలా చేయాలి:
ే నేటి తరానికి, పిల్లలకు మన అంత అందమైన బాల్యం కూడా ఇవ్వలేక పోయాం. కనీసం ఇప్పటి నుంచైనా కళ్ళు తెరిచి, పచ్చని వాతావరణం కల్పించి, ప్లాస్టిక్‌ వాడకం తగ్గించి బట్ట సంచులు వాడేలా చేయాలి.
ే దగ్గరి షాప్‌లకు నడిచో, సైకిల్‌ పై వెళ్ళేలాగో చర్యలు చేపట్టాలి. వాళ్లకి ఈ అవగాహన కల్పించాలి.
ే పిచ్చుకలు,కాకులు ఇతర పక్షి జాతులు మనచుట్టూ ఉండేలా చేసుకొనే ప్రయత్నం చేయాలి.తక్కువ నీరు పీల్చే మొక్కలను సత్వరమే పెంచాలి.
ే మళ్ళీ రిక్షాలను, ఆహ్వానించాలి. తద్వారా పేద వారికి ఉపాధి కూడా కలుగుతుంది.
ే ఇంటి బయట పావురాలకు కాస్త ధాన్యం వేసి, మంచి నీరు ఒక మూకుడులో పెట్టి, ఆకర్షించాలి
ే ప్లాస్టిక్‌ కవర్లు వాడ కూడదు. ప్లాస్టిక్‌ను వీధుల్లో ఎక్కడ బడితే అక్కడ వేసే వారికి జరిమానా వెయ్యాలి. అలాగే పేరుకున్న వాటన్నింటినీ వెంటనే తొలగించే చర్యలు చేపట్టాలి. కాలనీల వారీగా ఈ ప్రయత్నం చేయించాలి.
ే నాలాలను, చెరువులను వర్షా కాలం లోపలే చెత్త రహితంగా చేసుకోవాలి
ే ఇళ్లల్లో ,ఆఫీసుల్లో అవసర మైనంత మేరకే విద్యుత్తు వాడాలి/ స్విచ్‌ ఆఫ్‌ చేస్తూ ఉండాలి. సెల్‌ ఫోన్‌లను రోజుకో గంట స్విచ్‌ ఆఫ్‌ చేయాలి, రేడియేషన్‌ను తగ్గించాలి
ే సౌర శక్తిని విరివిగా ప్లేట్‌లుభవనాలపై నిర్మించి విద్యుత్‌ ఆదా చేయాలి.
ే బియ్యం, కూరలు కడిగిన నీటిని మొక్కలకు పోయాలి.
ే వాహనాల హారన్‌లు ఊరికే మోగించ కుండా చర్యలు చేపట్టాలి
ే ఇళ్ళ మధ్యలో, మైదానాల్లో పార్క్‌లు అభివృద్ధిపరిచే చర్యలు చేపట్టాలి. ఉదయం సాయం సంధ్యలలో వాకింగ్‌ చేస్తూ ప్రకృతిని ఆస్వాదించాలి. చీటికి మాటికి మందులు వేసుకోవటం కూడా తగ్గించినట్లు అవుతుంది
ే పిల్లలకు పట్టే పాలల్లో కూడా పురుగు మందుల అవశేషాలు ఉన్నాయని ఇటీవల జరిపిన పరిశోధనల్లో వెల్లడైనట్లు వార్తలొచ్చాయి సింథటిక్‌ పాలను, కృత్రిమ పాలనునిషేధించాలి.
ే కంపోస్ట్‌ ఎరువులనే వాడాలి.రసాయ నిక ఎరువులను వాడకుండాచర్యలు చేపట్టాలి
ే సేంద్రీయపధ్ధతిలోపెంచే కూరగాయా లనే వాడేలా, జనరిక్‌ మందులనే వినియోగించేలా ప్రజలకు అవగాహనా సదస్సులు పెట్టి వారిని చైతన్య వంతులను చేయాలి.
ే ధాన్యాల్లో కల్తీని అరికట్టే చర్యలు చేపట్టాలి. ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటే తప్పకుండా భావితరాలకు స్వచ్ఛమైన గాలిని, నీటిని, వాతా వరణాన్ని అందించ గలుగుతాం.
కార్భన్‌డయాక్సైడ్‌తో నష్టాలు:
వాతావరణంలో కర్బనం రెండు ఆక్సిజన్‌ అణువులతో కలిసి కార్బన్‌ డయాక్సైడ్‌గా మారుతుంది. కార్బన్‌ డయాక్సైడ్‌,గ్రీన్‌ హౌస్‌ ఎఫెక్టు కారణంగా భూమి గడ్డ కట్టుకుపోకుండా ఉంటుంది. కానీ ఇప్పుడు వాడే శక్తి అవసరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఎక్కువ మొత్తా ల్లో కార్బన్‌ డయాక్సైడ్‌ వాతా వరణంలో కలు స్తోంది.వాతావరణంలో ఇప్పుడు సగటున మిలి యన్‌కు 380పార్ట్‌ల కార్బన్‌ డయాక్సైడ్‌ ఉంది. పారిశ్రామిక విప్లవం మొదలు కావడానికి ముం దు ఇది280స్థాయిలో ఉండేది.అంటే ఇప్పుడు 36శాతం ఎక్కువైంది.శిలాజ ఇంధనాల నుంచి వెలువడే కాలుష్యాలను తగ్గించకపోతే గనుక 2100 సంవత్సరంనాటికి ఉష్ణోగ్రత3నుంచి 6డిగ్రీల సెల్సియస్‌ పెరుగు తుందని వాతా వరణ నిపుణులు పేర్కొం టున్నారు.భూమిమీద వేడి పెరిగితే మంచు పర్వతాలుకరిగి,సముద్ర మట్టాలు పెరుగుతాయి.దీనివల్ల తీరానఉండే ద్వీపాలు,లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయి. గ్లోబల్‌ వార్మింగ్‌ ఇంకా పెరుగుతుంది.ఇది లాగే కొన సాగితే భవిష్యత్తు ప్రమాదకరంగా ఉంటుంది.(జీ.ఏ.ఎస్‌. కూమార్‌ )

మాలి కొండపై ఆదివాసులు దండయాత్ర

ఒడిశాలోని కోరాపుట్‌ అడవుల్లో బాక్సైట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా నిరసనలు పెరుగుతున్నాయి, స్థానిక గిరిజన జనాభా వారి మాలి పర్బత్‌ (కొండ)లో మైనింగ్‌ కార్యకలాపాలను వ్యతిరేకిస్తున్నారు. గత వారం, నవంబర్‌ 22న, ఒడిశా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌కు దాదాపు 500 కిలోమీటర్ల దూరంలోని కంకదాంబ గ్రామంలో బాక్సైట్‌ తవ్వకాలపై బహిరంగ విచారణను నిర్వహించింది, దీనికి స్థానిక ఆదివాసీల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. స్థానిక నివాసుల ప్రకారం, జరిగిన బహిరంగ విచారణలో సాయుధ భద్రతా దళాలు మరియు అధికారుల సంఖ్య స్థానిక గిరిజన ప్రజల కంటే చాలా ఎక్కువ. విచారణ రోజున, మైనింగ్‌ ప్రాజెక్ట్‌ను అధికారులు రద్దు చేయాలని, కొండ, అటవీ ప్రాంతాన్ని రక్షించాలని డిమాండ్‌ చేస్తూ మాలి పర్వత సురక్షా సమితి (మలి కొండ రక్షణ కమిటీ) సభ్యులు నిరసన చేపట్టారు. ‘‘ఒడిశా స్టేట్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ కంపెనీకి %ళి%హిండాల్కో ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ నో అబ్జెక్షన్‌ సర్టిఫికేట్‌ ఇస్తే, మేము మా ఆందోళనను తీవ్రతరం చేస్తాము’’ అని నిరసన సమూహాలలో ఒకటైన లోక్‌ శక్తి అభియాన్‌ అధ్యక్షుడు ప్రఫుల్ల సమంత్ర గావ్‌ కనెక్షన్‌తో అన్నారు. ‘‘మైనింగ్‌ వల్ల ఈ ప్రాంతంలో భూగర్భజలాలు, గాలి మరియు మట్టికి అంతరాయం కలుగుతుంది. ఇది జరగడానికి మేము అనుమతించము, ’’అని అతను గట్టిగా చెప్పాడు. కోరాపుట్‌ జిల్లాలోని గిరిజనుల ప్రాబల్యం గల సెమిలిగూడ బ్లాక్‌లోని కంకదాంబ గ్రామం వద్ద మాలికొండ చుట్టుపక్కల మైనింగ్‌కు వ్యతి రేకంగా ఆందోళనకారులు నిరసన తెలిపారు. మాలి కొండ చుట్టుపక్కల ప్రాంతంలో 44 గ్రామాలలో నివసించే కొండ,పరాజ,గదబ గిరిజన సంఘాలు ఉన్నాయి. మైనింగ్‌ లీజు పరిధిలోకి వచ్చే ప్రాంతం 268.110 హెక్టార్లలో విస్తరించి ఉంది. మైనింగ్‌ లీజు మరియు పర్యావరణ క్లియరెన్స్‌ హిందాల్కో ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌కు 2003లో మంజూర య్యాయి. స్థానిక నివాసితులచే ప్రాజెక్ట్‌ గురించి రిజర్వేషన్లు ఉన్నప్పటికీ, స్థానిక ప్రతిఘటన ఆ ప్రాంతంలో మైనింగ్‌ కార్యకలాపాలను నిరోధిం చింది. లీజు మరియు పర్యావరణ అనుమతి 2013లో ముగిసింది.
ఇప్పుడు పరిశ్రమను తాజాగా 50ఏళ్లలీజుకు తీసుకోనున్నారు. అయితే ఇది స్థానిక ప్రజల నుండి ఆమోదం పొందాలి. దీని కోసం బహి రంగ విచారణ అవసరం.సెప్టెంబర్‌ 22న జరగాల్సిన బహిరంగ విచారణను జిల్లా యం త్రాంగం పెద్దఎత్తున హింసాత్మకంగా జరి గింది. దీంతో అప్పట్లో ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా వేశారు.తిరిగి నవంబర్‌ 22న పబ్లిక్‌ హియరింగ్‌ నిర్వహించారు. అది కూడా భారీ పోలీసు బందోబస్తు నడుమ పబ్లిక్‌ హీరింగ్‌ నిర్వహించారు. అది చెల్లదంటూ గిరిజనులు తమ అడవులను కాపాడాలని కోరుతున్నారు.
మాలికొండ ప్రాంతంలో నివసించే అడవులు ప్రజలు,వృక్షజాలం,జంతుజాలానికి ఏమి జరుగు తుందో అని స్థానిక ఆదివాసీ జనాభా గొంతుతో ఆందోళన వ్యక్తం చేశారు.ముప్పై ఆరు శాశ్వత ప్రవాహాలు మాలికొండ గుండా ప్రవహిస్తాయి మరియు చివరికి కోలాబ్‌ నదిని పోషిస్తాయి. గిరిజన సంఘాలు సాగునీటి కోసం నదీ జలా లను ఉపయోగించుకుంటున్నారు. కొండ లలో మైనింగ్‌ చేయడంవల్ల నది ఎండి పోతుందని ఆందోళన చెందుతున్నారు. ఈ మాలీపర్వా తాలు ఏనుగు కారిడార్‌తో పాటు అనేక విలువైన ఔషధ వృక్షాలతో దట్టమైన అడవిగా రూపంతరం చెంది ఉంది.బాక్సైట్‌ వెలికితీస్తే ‘‘అటవీ కొండలలో బాక్సైట్‌ తవ్వకం అనేక సహజ ప్రవాహాలు,జలపాతాలు, వాగు లు ఎండిపోవడానికి అవకాశం ఉందని, అంతేకాకుండా కాలుష్యకారకాలతోను,అనేక అనారోగ్యాలకు గురవుతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే మేము దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తు న్నాము’’ అని ఆదివాసీప్రజలు ఆవేదన చెందుతున్నారు.రాష్ట్రంలో ఏనుగు కారిడార్‌లు ధ్వంసం కావడానికి అడవిలో విపరీతమైన మైనింగ్‌ కూడా ఒక ప్రధాన కారణం. జంబోల సంరక్షణ మరియు రక్షణ కోసం డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో, ఈ ఏడాది ప్రారంభంలో, నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (చీGు) ఒడిశా ప్రభుత్వాన్ని రెండు నెలల్లో 14 ఏనుగు కారిడార్‌లను నోటిఫై చేయాలని ఆదేశించిందని ఒడిశా వైల్డ్‌లైఫ్‌ సొసైటీ కార్యదర్శి బిస్వైత్‌ మొహంతి తెలిపారు. ఇంతలో, అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌ మారీa ప్రకారం, బహిరంగ విచారణ సందర్భంగా నవంబర్‌ 22న ఈ ప్రతిపాదిత బాక్సైట్‌ మైనింగ్‌ ప్రాజెక్టుకు పెద్ద సంఖ్యలో స్థానిక నివాసితులు తమ సమ్మతిని తెలిపారు.‘‘ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు జిల్లా యంత్రాంగం ముప్పై ప్లాటూన్ల భద్రతా బలగాలను మోహరించింది. ఒడిశా స్టేట్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ త్వరలో పబ్లిక్‌ హియరింగ్‌ రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది’’ అని అధికారి తెలిపారు.
మలిపర్బత్‌ మైనింగ్‌ను అడ్డుకోవాలని గిరిజనులు
చైత్ర పండుగ సందర్భంగా కొండపై బాక్సైట్‌ వెలికితీతను వ్యతిరేకిస్తామని బాక్సైట్‌ ప్రభావిత ఆదివాసీ ప్రజలు మాలిపర్వతాలపైకి ఎక్కి ప్రమాణం చేశారు. కంకదాంబ గ్రామ సమీపం లోని చైత్ర పండుగ సందర్భంగా ఏప్రిల్‌ 27న మాలిపర్బత్‌ కొండ వద్ద బాక్సైట్‌ తవ్వకాలను వ్యతిరేకిస్తూ గిరిజనులలోని పర్వతాలపైకి సుదూర ప్రయాణం చేసి అక్కడ దేవతలకు పూజలు చేశారు. మలిపర్బత్‌ కొండ సమీపం లోని పాటలీ గుహలో మౌలిమా దేవత ముందు ప్రతిజ్ఞ చేశారు. మలిపర్బత్‌ సురాఖ్య సమితి(ఎంఎస్‌ఎస్‌)మరియు కోరాపుటియా జన సురాఖ్య మంచ్‌(కెజెఎస్‌ఎం)సభ్యులు,పలువురు సామాజిక సంస్థల కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. చైత్ర పండుగను జరుపుకోవ డానికి కోరాపుట్‌ మరియు రాయగడ జిల్లాల నుండి వేలాది మంది గిరిజనులు మలిపర్బత్‌ కొండ వద్దకు చేరుకున్నారు. మలిపర్బత్‌లో బాక్సైట్‌ తవ్వకాలపై ఉద్రిక్తత మధ్య వారు ఈ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించాలని ప్రార్థిస్తూ సంప్రదాయ ఆచారాలను నిర్వహిం చారు. ఈ పండుగను కోంద్‌, పరాజ మరియు గద్బా తెగలు జరుపుకుంటారు.చాసి మూలీయ ఆదివాసీ సంఘం అధ్యక్షుడు నాచిక లింగం కూడా ఉత్సవంలో పాల్గొని పూజలు చేశారు. ‘‘మేము చెట్లు, నేల, నీటి బుగ్గలు, వృక్షజాలం మరియు జంతుజాలాన్ని ప్రేమిస్తాము మరియు మన ఆచారాలు మరియు సంప్రదాయాలకు అనుగుణంగా జీవించాలనుకుంటున్నాము. గిరిజనులు ప్రభుత్వం నుండి ఎలాంటి సంపదను కోరుకోవడం లేదు. ప్రకృతితో, వనరులతో సహజీవనం చేయాలనుకుంటున్నాం. కానీ ప్రభుత్వ ఏజెంట్లు ఈ ప్రాంతంలో అశాంతిని సృష్టిస్తున్నారు. మైనింగ్‌ వ్యతిరేక మరియు అనుకూల వ్యక్తుల మధ్య విభేదాల కారణంగా గత రెండు నెలలుగా ఈ ప్రాంతం లో ఉద్రిక్తత నెలకొని ఉందని వర్గాలు తెలి పాయి. గిరిజనులకు ఆధ్యాత్మిక, సాంస్కృతిక మరియు జీవనోపాధికి ప్రాధాన్యతనిచ్చే మలిపర్బత్‌ కొండ నుండి బాక్సైట్‌ తవ్వడానికి హిందాల్కో కంపెనీకి ప్రభుత్వం లీజు మంజూ రు చేసింది. ఒడిశా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి మొదటి సమావేశం విఫలమైన తర్వాత విజయ వంతంగా పబ్లిక్‌ హియరింగ్‌ నిర్వహించింది. అయితే, విషయం కోర్టుకు వెళ్లడంతో రెండో పబ్లిక్‌ హియరింగ్‌ అనిశ్చితిలో పడిరది. జిల్లా యంత్రాంగం నాలుగు ప్లటూన్ల పోలీసు బలగాలను మోహరించి పండుగ ప్రశాంతంగా సాగింది.
మా కొండలు బంగారు కుండలు
కోరాపుట్‌లోని మాలి కొండలన్నీ బంగారు కుండలు. వాటి జోలికి వస్తే సహించబోం అంటూ గిరిజనులు హెచ్చరిస్తున్నారు. మాలిపర్వాతాలు అనేక ప్రవాహాలకు మూలం. ఔషధ చెట్లకు నిలయం. ఇది ఏనుగు కారిడార్‌. సెప్టెంబర్‌ 22, 2021న ఒడిశాలోని కోరాపుట్‌ జిల్లాలో ప్రతిపాదిత బాక్సైట్‌ మైనింగ్‌ ప్రాజెక్ట్‌ గురించి చర్చించేందుకు ఏర్పాటు చేసిన బహి రంగ సభ వేదికపై ఆదివాసీలు నినాదాలు చేస్తూ ధ్వంసం చేశారు. గిరిజనులు అధికంగా ఉండే కోరాపుట్‌లోని సిమిలిగూడ బ్లాక్‌లోని కంకదాంబ గ్రామంలోని వేదిక వద్ద పర్యా వరణ కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలు మరియు ఇతరులు కూడా ప్రాజెక్టును వ్యతిరేకిం చారు. హిండాల్కో ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (హిం డాల్కో)చే ప్రాజెక్ట్‌ యొక్క ప్రదేశం అయిన మాలి కొండ,అడవికి ముప్పు వాటిల్లుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. మాలి పర్వత్‌ సురక్షా సమితి (సేవ్‌ మాలి హిల్‌ కమిటీ) సభ్యులు ఆ స్థలంలో మైనింగ్‌ను అధికారులు రద్దు చేయాలని కోరుతూ ప్లకార్డులు పట్టుకుని నిరసన చేపట్టారు. మాలి మరియు అటవీ ప్రాంతంలో 44గ్రామాలలో విస్తరించి ఉన్న కొండ,పరాజ మరియు గదబ గిరిజనులు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు.సేవ్‌ మాలి హిల్‌ కమిటీ అధ్యక్షుడు బిజయ్‌ ఖిల్‌ మాట్లాడుతూ మాలి కొండ నుండి బాక్సైట్‌ తవ్వకాలకు ఏ కంపెనీని అనుమతించకుండా కొండను మరియు అడవిని రక్షించాలని ఒడిశా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి మరియు జిల్లా పరిపాలన అధికారులను మేము కోరాము. ఖిల్‌ తన బృందం కొండను రక్షించడానికి మరియు సంరక్షించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. బాక్సైట్‌ తవ్వకాల వల్ల ఆ ప్రాంత పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటుందని ఆయన అన్నారు. అటవీ ప్రాంతంలో బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతి ఇవ్వడం చట్ట విరుద్ధం,అనైతికం. ప్రతిపాదిత మైనింగ్‌ ప్రాజెక్ట్‌ టూత్‌ అండ్‌ నెయిల్‌ను మేము వ్యతిరేకిస్తాము’’ అని లోక్‌ శక్తి అభియాన్‌ అధ్యక్షుడు ప్రఫుల్ల సమంతర అన్నారు.మాలి కొండ 36శాశ్వత ప్రవాహాలకు మూలమని,ఇది కోలాబ్‌ నది జలాలను పోషిం చేదని ఆయన తెలిపారు. కోలాబ్‌ నీటితో గిరిజనులు తమ భూమికి సాగునీరు అందించారు. మలి కొండను గనుల తవ్వ కాలకు ప్రభుత్వం అనుమతిస్తే నది ఎండి పోతుందని సమంత అన్నారు. కొండ అనేక విలువైన ఔషధ వృక్షాలకు నిలయం అని ఆయన పేర్కొన్నారు. ఇది ఒక ముఖ్యమైన ఏనుగు కారిడార్‌ కూడా.మైనింగ్‌వల్ల పరిసరాల్లోని భూగర్భ జలాలు,గాలి,మట్టికి భంగం కలుగు తుంది. ఆందోళనకారులు ప్రభుత్వం మరియు కంపెనీ అధికారులకు హెచ్చరికలు చేశారు. తమ ప్రాణాలైనా ఇస్తాంగానీ,మాలి పర్వతాలపై బాక్సైట్‌ తవ్వకాలు చేపట్టనీయమని నినదించారు. ప్రభుత్వం,కంపెనీలు తమ జీవితాలతో ఆటలు ఆడుకోవద్దని, ఆవేదన చెందారు. ఎట్టి పరిస్థితిలోను బాక్సైట్‌ తవ్వకాలు చేయరాదని, చేస్తే తమ ఆందోళనలను మరింత ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు.-(కందుకూరి సతీస్‌ కుమార్‌)

ఉచితాల‌పై అనుచిత ప్ర‌చారం

‘కూత నేర్చినోళ్ళ కులం కోకిలంటారా!? ఆకలేసి అరిచినోళ్ళు కాకులంటారా!?.’’ ప్రాణం ఖరీదు సినిమాలో ఓ పాటలోనివి ఈ వాక్యాలు. ప్రభుత్వ ఉచిత పథకాలు, వ్యయాలపై నేడు వ్యక్తమవుతున్న అభిప్రాయాలు చూస్తుంటే ఇవి గుర్తుకు రాకమానవు. అంటే తమ చాతుర్యాలతో లక్షల కోట్ల దేశ సంపదను ఆశ్రిత అవకాశ వాదంతో కాజేస్తున్న వారేమో ఉన్నతులు, శ్రమకు దగ్గ ప్రతిఫలాన్ని ఆశించకుండా, అడిగినంత ధరలు చెల్లిస్తూ వస్తు సేవలను పొందుతున్న ప్రజలేమో అధములన్న మాట! దేశ సంపదనంతా సామాన్యులకిచ్చే ఉచితాల ద్వారా సర్వనాశనం చేస్తున్నారంటూ వ్యక్తమవు తున్న సదరు అభిప్రాయాలపై జాలి కలుగు తున్నది. ప్రజలని ‘’అలగా జనం’’ అని సంబో దించిన చోట ఇంతకన్నా ఎక్కువ ఆలోచనను ఆశించడం అత్యాశే కాబోలు!. జి.తిరుపతయ్య
ప్రభుత్వాలు ప్రకటిస్తున్న ఉచిత పథకాల వల్ల ఆర్థిక వ్యవస్థకు చాలా నష్టమని, ఇది ఇలాగే కొనసాగితే శ్రీలంక ఎదుర్కొంటున్న ఆర్థిక అత్యవసర పరిస్థితి భారత్‌కూ తప్పదని ప్రధానమంత్రి నిర్వహించిన ఉన్నత అధికారుల సమావేశంలో పలువురు వ్యాఖ్యానించినట్లు వార్తా కథనాలు వెలువడ్డాయి. లోక్‌సత్తా నాయకుడు జయప్రకాశ్‌నారాయణ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. వీటిని ఆధారం చేసుకుని బూర్జువా పార్టీల ఏజెంట్లు, ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ శ్రేణులు పేదలకు ఇచ్చే ఉచితాలే పెను భూతాలు అనే విధంగా సోషల్‌ మీడియాలో ప్రచారం మొదలు పెట్టాయి. ఇందులో నిజానిజాలను తెలుసు కోకుండానే దావానలంలా ఆ ప్రచారాన్ని విశ్వవ్యాప్తి చేస్తున్నారు మన మధ్య తరగతి సోషల్‌ మీడియా మిత్రులు! మొదటిది, ఉచిత పథకాలు ఇవ్వమని ప్రజలు ఎప్పుడూ కోరలేదు, లేదా అలాంటి పథకాల కోసమేం వారు ఉద్య మాలూ చేయలేదు. రెండవది, ఈ ఉచితాలను ప్రకటిస్తున్నది ఎన్నికల వాగ్దానాల రూపంలో బూర్జువా పార్టీలు మాత్రమే. నిజానికి ఓట్ల కోసం సామాన్య ప్రజానీకాన్ని ప్రలోభ పెట్టే పాలక పార్టీల పన్నాగాలే ఇవన్నీ. అయితే ఈ ఉచిత పథకాలను అనుభవిస్తున్నది పేదలు మాత్రమే కాదు. కేంద్రం ప్రవేశపెట్టిన కిసాన్‌ సమ్మాన్‌ గానీ, రాష్ట్రం ప్రవేశపెట్టిన రైతుబంధు గానీ భూమి కలిగి ఉన్న పట్టాదారులందరికీ ఇస్తున్నారు తప్ప అర్హులైన, పెట్టుబడికి కొరవడిన పేద రైతులకు మాత్రమే చేరుతున్నాయా? ఇప్పటికీ అత్యధిక భూమి కొందరి చేతుల్లోనే ఉన్నది. అలాంటి ఉన్నత అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు లాంటి వారందరికీ రైతుబంధు అందుతున్నది. ఇక చౌక ధరల దుకాణాల అవకతవకలు అటుంచితే, ఇక్కడ సప్లయి చేయబడుతున్న వస్తువులు ఏవీ ప్రభుత్వానికి భారం కాదు. ఎందుకంటే నేరుగా రైతుల దగ్గర నుంచి తీసుకొని వినియోగ వస్తువులుగా మార్చిన తర్వాత ఇస్తున్న రేటు దాదాపు మధ్యవర్తిత్వం లేకుంటే పెద్దగా సబ్సిడీ ఏమీ ఇవ్వట్లేనట్లే. చివరికి వృద్ధాప్య పింఛన్లు, వికలాంగ పింఛన్లు, వితంతు పెన్షన్లు ఇవేనా ప్రభుత్వాలకు భారమైంది? లేదా 39లక్షల కోట్ల దేశ బడ్జెట్‌లో కేవలం 70వేల కోట్ల రూపా యలు కేటాయించి గ్రామీణ నిరుపేదలకు పని కల్పిస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకమా? అరకొర నిధులు కేటాయించినప్పటికీ గ్రామీణ ఉపాధి హామీ పథకం వల్లనే గ్రామాలలో, కీన్స్‌ అనే ఆర్థిక వేత్త చెప్పినట్లుగా అందరి చేతిలో ఎంతో కొంత కొనుగోలు శక్తి మిగిలివుంది. ఉచిత పథకాల కన్నా వ్యవస్థీకృత లోపాలను సరిదిద్దే దీర్ఘ కాలిక మౌలిక వసతుల ప్రణాళికలు అవసరం. స్కూళ్ళల్లో పరిస్థితిని మెరుగుపరచ కుండా లాప్‌టాప్‌లు అందించడం అర్థరహితం. పాఠశాల విద్యార్థినుల హాజరు శాతాన్ని పెంచడానికి, వారు హాజరయ్యే విధమైన సౌకర్యాలను ఏర్పాటు చేయకుండా, సైకిళ్లను కొనివ్వడం అర్థరహితం. ఇక ఇలాంటి పథకాలకు నిధులు ఎక్కడి నుండి కేటాయించ బడుతున్నాయి, దాని పర్యవసనాలు ఎంటో కూడా పరిశీలించాలి. 2020-21సంవత్స రానికి గాను పరోక్ష పన్నులు స్థూల జాతీయ ఉత్పత్తిలో 5.4శాతం ఉంటే ప్రత్యక్ష పన్నులు 4.7శాతం మాత్రమే ఉన్నాయి. 2.7ట్రిలియన్‌ డాలర్ల(200 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థలో పరోక్ష పన్నుల ద్వారా 10.8 లక్షల కోట్ల రూపాయలు వస్తే ప్రత్యక్ష పన్నుల ద్వారా కేవలం 9.4లక్షల కోట్ల రూపాయలు వసూలు అయ్యాయి. అనేక అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థల్లో చూస్తే మొత్తం పన్ను రాబడిలో 67.4శాతం ప్రత్యక్ష పన్నుల వాటా ఉంటే భారత్‌లో అది 38.3శాతంగా నమోదు అవుతుంది. (మూలం బిజినెస్‌ స్టాండర్డ్‌ పత్రిక ) ఈ రెండు గణాంకాలను చూస్తే చాలా సులభంగా అర్థం అయ్యేది పరోక్ష పన్నుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువ అని. మరి అట్లాంటి పరోక్ష పన్నులను చెల్లిస్తున్నది ఎవరు? వినియోగదారులైన ప్రజలు. ఆక్స్‌ ఫామ్‌ నివేదిక ప్రకారం కిందిస్థాయి 58శాతం ప్రజలు కేవలం 13శాతం ఆదాయంతో ఉన్నారు. అనగా అత్యంత తక్కువ ఆదాయం కలిగిన వాళ్ళు అత్యంత ఎక్కువ పన్నులు చెల్లించే పరోక్ష పన్నుల జాబితాలో ఉన్నారు. నిశితంగా గమనిస్తే సామాన్య ప్రజానీకం రెండు రకాల మోసాలకు గురవుతున్నారు. మొదటిది వారికి చెల్లించవలసిన వేతనం చెల్లించకుండా పెట్టుబడిదారులు మధ్యవర్తులు కొట్టేస్తున్నారు. రెండవది వారి నుండి పరోక్ష పన్నుల రూపంలో అధిక పన్నులు వసూలు చేస్తున్నారు. ఈ వాస్తవాన్ని గమనించకుండా ఉచితాల రూపంలో ప్రజలకు పంచి పెట్టడం నేరమని, అది దేశానికి ఘోరమని విపరీత అర్ధాలు తీయడం సరైంది కాదు. అయితే ఉన్నతాధి కారులు చెప్పిన మాటలు అవాస్తవమా? వారికి ఆ మాత్రం అవగాహన లేదా అని మన పాఠకులకు సందేహం రావచ్చు. ఈ బూర్జువా రాజకీయ పార్టీలతో పాటు అత్యంతపై స్థాయిలో ఉన్న బ్యూరోక్రాట్లు కూడా ‘’ట్రికిల్‌ డౌన్‌ థియరీ’’నే (పై వాడి కడుపు నిండిన తరువాత మిగిలిందే క్రింది స్థాయికి చేరాలనేది) నమ్ముతారు. ఎందుకంటే డబ్బు కొందరి చేతుల్లోనే ఉండాలి, ప్రజలకు సౌకర్యాలు అలవాటు కాకూడదు, అలవాటైతే వాటిని తీర్చడం ప్రభుత్వ బాధ్యత కాకూడదు అన్నది వారి ఆలోచన. ఇలా అమాయక ప్రజలకు ఇచ్చే ఆ నాలుగు రూపాయల మీద పడి బాధపడే కన్నా రాబడి మార్గాలను ఎందుకు పాటించడం లేదో ఈ బ్యూరోక్రాట్లు రాజకీయ నాయకులు సమాధానం చెప్పాలి. అనగా ప్రత్యక్ష పన్నుల వాటా పెరగాలి అంటే ఆదాయపన్ను చెల్లించే వారి సంఖ్య పెరగాలి. 6కోట్ల మంది పిఎఫ్‌ ఖాతాదారులు ఉన్నట్లుగా గణాంకాలు చెబుతుంటే 3.7కోట్ల మంది మాత్రమే వ్యక్తిగత ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేస్తున్నారని ఆదాయపు పన్ను అధికారులు తేల్చుతున్నారు. మరి ఈ వ్యత్యాసం ఏంటి? రిటర్నులు దాఖలు చేసిన వారిలోనూ నామ మాత్రపు పన్ను చెల్లించే వారి సంఖ్యే గణనీయం! దీనికి బాధ్యులెవరు? ఇక వ్యాపార వర్గాల నుండి ఆదాయపన్ను రాబట్టడానికి సమగ్రమైన ప్రణాళిక ఇంతవరకు లేదు. వ్యాపార లావాదేవీల్లో లాభాలను ఆర్జిస్తున్న అనేక మందిని పన్ను పరిధిలోకి తీసుకురావడంలో కేంద్రం పూర్తిగా విఫలమైంది. జీఎస్టీ విధానం అమలులోకి వచ్చాక జీరో వ్యాపారాలు పూర్తిగా తగ్గిపోయాయా? అనగా బిల్లులు రాయకుండా నమోదు చేయబడిన నగదు రూపంలోని వ్యవహారాల వల్ల ప్రభుత్వానికి పన్ను రాబడి తగ్గడం లేదా? ఈ వ్యవహారాల వల్ల తప్పుడు మార్గంలో ఎందరికో లబ్ధి చేకూరడం లేదా? వీటిపై అనేక సందర్భాల్లో మేధావులనేకులు హెచ్చరికలు చేసినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు ఏమాత్రం దృష్టి పెట్టవు. ఇక కూత నేర్చిన వారు (సంపన్నులు) రెండు రకాలుగా దేశాన్ని, ప్రజలను మోసం చేస్తున్నారు. ఒకటి, బ్యాంకుల్లో అత్యంత తక్కువ వడ్డీ రేటుకు రుణాలు పొందడం, వాటిలో కొంత భాగాన్ని మాఫీ చేయించుకోవడం లేదా ఎగ్గొట్టడం…! ప్రభుత్వం దీనికి బాహాటంగా సహకరించడం జరుగుతోంది!! రెండవది, టాక్స్‌ కన్సెషన్స్‌ (పన్ను మినహాయింపు)గా లక్షల కోట్ల రూపాయలను పొందడం. వీరికోసం కేంద్ర బడ్జెట్‌లో దాదాపు 15శాతం పన్ను మినహాయింపునకు పోతుంది… అంటే ఆరు లక్షల కోట్లు సగటున ప్రతి ఏటా వీరికి రాయితీగా ఇస్తున్నారు. కొందరు వ్యాపారస్తులూ, పారిశ్రామిక వేత్తలకు ఇచ్చే ఈ మొత్తం దేశంలోని అన్ని రాష్ట్రాలు కలిపి అమలు చేస్తున్న ఉచిత పథకాల కన్నా చాలా ఎక్కువ. దీనిపై జయప్రకాశ్‌ నారాయణ, ఇతర మేధావులు నోరు మెదపరెందుకు? ఎందుకంటే వీరు కూడా ఆ ట్రికిల్‌ డౌన్‌ థియరీనే ఇష్ట పడతారు. ఇక ఆదాయ పన్నును క్రమం తప్పకుండా చెల్లించే వేతన జీవులకూ ఈ ఉచితాలపై చాలా కోపం వస్తుంది. అయితే తమ నుండి బలవం తంగా,పన్ను మినహాయిం పులేవీ ఇవ్వకుండా, ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్న ప్రభుత్వా లపై కాకుండా, తాము పని చేసేందుకు ఆధారమౌతూ పేదరికంలో మగ్గు తున్న సామాన్యులపై కోపం రావడం సరికాదు. అందువల్ల, ప్రజల మూలుగుల్ని పీల్చి లాభాలు సంపాదిస్తున్న కార్పొరేట్లకు ఇచ్చే పన్ను మినహాయింపులూ,రాయితీల వల్ల ఆర్థిక వ్యవస్థకు నష్టం తప్ప, వీరి సరుకుల అమ్మకాలకూ, ప్రజల కొనుగోలు శక్తికీ ఆధారమవుతున్న చిన్న చిన్న ఉచిత పథకాల వల్ల కాదు.నిజానికి ఇది ఆర్థిక వ్యవస్థకు రక్త ప్రసరణలా పనిచేస్తుంది.

ఆడ‌బిడ్డ‌ల‌కు ర‌క్ష‌ణ క‌రువు

‘‘ దేశంలో మహిళలు, చిన్నారులపై ఘాయిత్యాలకు అడ్డుకట్ట పడడం లేదు. కఠిన శిక్షలు విధిస్తున్నా కామాంధులు ఆగడాలు కొనసాగుతున్నాయి. చిన్న పిల్లలపై కూడా కొందరు కామంతో కళ్లు మూసుకు పోయి, లైంగిక దాడులకు పాల్పడు తున్నారు. ఆడపిల్లలను గౌరవించేవారు కానీ…వారిని రక్షించేవారుకానీ….వారి హక్కు లను పరిరక్షించేవారు కానీ…. నేటికాలంలో నానాటికీ తగ్గిపోతూ ఉండటం,ఆడపిల్లల పట్ల వివక్ష పెరిగిపోతుండడం చాలా దుర దృష్టకరం. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆడపిల్లలపై సామూహిక అత్యాచార ఘటనలు,లైంగిక వేధింపులు పెరుగుతుండటం బాధకరమైన విషయం ’’ జి.ఏ.ఎస్‌.కుమార్‌
‘మాకు సురక్షిత స్థలాలంటూ ఏమైనా ఉంటే అవి అమ్మ గర్భం, సమాధి మాత్రమే’ – నైతిక విలువలకు నిలువునా పాతరేస్తూ, ఆడబిడ్డలకు అడుగడుగునా నరకం చూపిస్తున్న సమాజంపై ఓ చిన్నారి ఛీత్కరింపు ఇది! గతేడాది డిసెం బరులో చెన్నరుకి చెందిన ఆ పదకొండో తరగతి విద్యార్థినిని ఒక ఉపాధ్యాయుడి కొడుకు అను నిత్యం వేధింపులకు గురిచేస్తుండగా.. సహించ లేక ఆత్మహత్య చేసుకుంది. బలవన్మర ణానికి ముందు భావోద్వేగంతో రాసిన లేఖ సమాజం లో మహిళల దుస్థితికి దర్పణం పట్టింది. ఆ చిట్టితల్లి మాటలను నిజం చేస్తూనే గుడిలో, బడిలో,బంధుమిత్రుల ఒడిలో,ఇప్పుడు ఆసు పత్రుల్లో,ఎక్కడైనా సరే,ఆడపిల్లలకు భద్రత లేని దౌర్భాగ్యపూరిత వాతావరణానికి విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మతిస్థిమితం లేని ఒక మహిళపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన అద్దంపడుతోంది. తరతరాలుగా అమ్మ దేవతలను ఆరాధిస్తూ,పరాయి స్త్రీల వంక కన్నెత్తి చూడటమే మహాపాపంగా భావించాలని చెప్పే నీతులన్నీ ఏమైపోతున్నాయి? దేశంలో మహిళ లకు రక్షణ కల్పించడమే ఒక ప్రధాన సమస్యగా మారిపోవడం సిగ్గుచేటు. మగపిల్లలను ముద్దు చేస్తూ ఆడపిల్లలను ఆంక్షల పంజరంలో బంధి స్తున్న పితస్వామ్య భావజాలం, వ్యక్తిత్వానికి వన్నెలద్దడంలో విఫలమవుతున్న విద్యా విధానం, నేరాల నియంత్రణలో ప్రభుత్వ యంత్రాంగపు ఘోర వైఫల్యాలు కలిసికట్టుగా మహిళలపై ఆకృత్యాలు పెరిగిపోవడానికి కారణ మౌతున్నాయన్న నిపుణుల మాటలు అక్షర సత్యాలు. హైదరాబాద్‌లో ‘దిశ’ ఘటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి దారు ణాలు జరగనివ్వబోమంటూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఆ క్రమంలోనే దిశ బిల్లు, దిశ పోలీసు స్టేషన్లు, దిశ వాహనాలు,దిశ యాప్‌ అంటూ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. వీటన్నింటి లోనూ ప్రచార్భాటం తప్ప ఆకృత్యాలను అడ్డుకునేందుకు చిత్తశుద్ధితో చేపట్టిన చర్యలు కానరావు. ఆదిశ బిల్లు నేటికీ చట్ట రూపం దాల్చలేదంటే పాలకుల చిత్తశుద్ధి ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఇలాంటి అకత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి. విచ్చల విడిగా సంచరిస్తున్న మానవ మగాల మాయల్లో చిక్కి విలవిల్లాడే మహిళలకు,చిన్నారులకు లెక్కే లేదు.దేశవ్యాప్తంగా నిత్యం ఇలాంటి ఘోరాలు నేరాల సంఖ్య అంతకంతకు పెరిగిపోతూనే ఉంది. చిన్నాపెద్దా తేడా లేదు..అడ్డూ అదుపూ అసలే లేదు..ఎన్ని రకాల చట్టాలు వచ్చినా, ఎంత గట్టి శిక్షలు అమలవుతున్నా అత్యంత పైశాచిక ప్రవత్తి కలిగిన మానవ మగాల పీడ వదలడం లేదు. ఉన్న చట్టాలకే చిన్నపాటి సవరణలు చేసి వాటికి నిర్భయ, దిశ అని పేర్లు పెట్టినంతనే మహిళలకు రక్షణ కల్పించినట్లు పాలకులు భావించడం వల్లే నేరస్తులు విచ్చలవిడిగా రాకాసి ప్రవత్తిని కొనసాగి స్తున్నారు. ఇలాంటి ఘటనల్లోని దోషులకు ఎలాంటి కాలయాపనా లేకుండా కఠినశిక్షలు పడేందుకు అవసరమైన చర్యలను ఇప్పటికైనా ప్రభుత్వాలు చేపట్టాల్సి వుంది. అలాగే నానాటికీ సమాజంలో విచ్చలవిడితనానికి ముకుతాడు వేసే చర్యలు చేపట్టాలి. పెడమార్గాలు పట్టిన యువత మత్తు పదార్ధాల ఊబిలో పడిపో తోంది. స్త్రీని ఒక వ్యాపార వస్తువుగా,ఆట బొమ్మగా పరిగణించే అత్యంత హేయమైన విష సంస్కతి నుంచి యువతను బయటపడేసేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. మాదక ద్రవ్యాలు, అమ్మాయిల అక్రమ రవాణా, తరచూ బాలల అదశ్యం వంటి సంఘటనల్లోనూ వాటి వెనుకనున్న అరాచక శక్తుల పీచమణిస్తే తప్ప ఇలాంటి ఘోరాలు తగ్గవు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో జరిగిన ఘటన అసాధారణమైనది. ప్రభుత్వ యంత్రాంగపు వైఫల్యం ఈ ఘటనలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. జనంతో రద్దీగా ఉండే ఆసు పత్రిలో ఒక గదిలో సామూహిక అత్యాచారానికి దుండగులు ఒడిగటుతుండే అక్కడ యంత్రాం గం ఏమైపోయింది? బాధిత తల్లిదండ్రులు ఆ బిడ్డ కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేస్తే నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసుల తీరు క్షంతవ్యం కాదు. రెండు రోజుల పాటు ఆసుపత్రిలో నిర్బంధించబడిరదన్న విషయం ఆమె తల్లిదండ్రులు చెబితే తప్ప గుర్తించలేని స్థితిలో ఆసుపత్రి, పోలీసు అధికార యంత్రాం గం మిన్నకుండడం దారుణం. వ్యవస్థలోని ఈ లోపాలన్నిటిని సరి చేస్తేనే మహిళలకు, చిన్నారు లకు రక్షణ దక్కేది. ఇలాంటి దురాగతాలు వెలుగులోకి వచ్చినప్పుడు హడావిడి చేయడం, నష్టపరిహారం ప్రకటించడంతో పాలకులు చేతులు దులిపేసుకుంటే సరిపోదు. ఇప్పటికైనా మహిళల రక్షణకు, చిన్నారుల సంరక్షణకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టాలి. ఇద్దరు పోలీసు అధికారులతోనే పరిమితం కాకుండా విజయవాడ దారుణ ఘటనటకు బాధ్యులైన వారందిరి పైనా కఠిన చర్యలు చేపట్టాలి.
స్త్రీ లేనిదే అసలు సృష్టే లేదు.
నేటి బాలికలే రేపటి స్త్రీమూర్తులు. స్త్రీ లేనిదే సమాజానికి అతీగతీ లేదు. స్త్రీ లేని సమాజాన్ని అసలు ఊహించలేం. ఒక్కమాటలో చెప్పాలంటే స్త్రీ లేనిదే అసలు సృష్టే లేదు. ఇవన్నీ అందరికీ బాగా తెలిసిన విషయాలే. తెలియనిదల్లా ఏమైనా ఉందంటే.. వారిని ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయకూడదన్నదే. ప్రపంచ మంతటా పురుషాధిక్యత పెరిగిపోయిన నేటిరోజుల్లో, ఆడపిల్లల పరిస్థితి నానాటికీ మరింత దయనీయంగానే ఉంటోంది. నేటికీ ప్రపంచంలో బడి చదువులకు దూరమైన బాలికలు కనీసం 40 మిలియన్ల మందికి పైగానే ఉన్నారని నిపుణుల అంచనా. అంతేకాదు బాల్య వివాహాలతో నరకప్రాయమైన జీవితాలను అనుభవిస్తున్నవారు ప్రపంచంలో కోట్ల సంఖ్యలోనే ఉన్నారని కూడా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.ఎంతో ఘనమైన సంస్కృతి సంప్రదాయలున్న మన దేశంలో కూడా స్త్రీల పట్ల ముఖ్యంగా బాలికల పట్ల ఎంతోకాలం నుంచి అంతులేని వివక్ష కొనసాగు తూనే ఉంది. ఆడపిల్లలు పుడితే పెద్ద భారంగా పరిణ మిస్తారని, వారిని పెంచి పెద్దచేయడం ఒక సమస్య అని, వారికి పెళ్ళి చేసి ఒక అయ్య చేతిలో పెట్టడం మరింత కష్టమని భావించే వారు పెద్దసంఖ్యలోనే ఉంటున్నారన్నది నిష్టుర సత్యం. మన కుటుంబవ్యవస్థలో బాలికల పట్ల చిన్నచూపు చూసేవారే అధికంగా ఉంటుండం బహిరంగ రహస్యం. అంతేకాదు మనదేశం లోనూ బాలికల పట్ల..మహిళలపట్ల లైంగిక దాడులు, అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలు నానాటికీ పెరిగిపోతూనే ఉన్నాయి. మహిళలపై నేరాలు ఘోరాలు,దౌర్జన్యాలు పెచ్చరిల్లిపోతూనే ఉన్నాయి. ముక్కుపచ్చలారని బాలికలపై కూడా అమానుషాలు కొనసాగుతూనే ఉన్నాయి. అనుక్షణం అభద్రతాభావంతో తల్ల డిల్లే పసిమొగ్గలు ఎందరో!..ఈ బాధలు పడలేక..’ఆడపిల్లగా పుట్టడం కంటే అడవిలో మానై పుట్టినా బావుణ్ణు’..అని మహిళాలోకం కన్నీరుపెట్టుకునే దుస్థితి ఎప్పటికి పోతుందో ఏమో!..ఆడపిల్లగా పుట్టడమే ఒక పాపంగానో, ఒక శాపంగానో భావించే దుర్గతి ఇలా ఇంకా ఎంతకాలం?పసిపాపగా పుట్టి..చెల్లిగా, ఇల్లా లిగా,తల్లిగా..ఈ కాఠిన్యపు ప్రపంచానికి ఆత్మీ యతాను బంధాలను ప్రేమానురాగాలను నేర్పేం దుకు వచ్చిన దేవతకు..ఈ లోకంలో ఎన్ని కష్టాలో..ఎన్ని కన్నీళ్ళో! చిన్నతనం నుంచే ఆడపిల్లలకు కష్టాలు ప్రారంభమవుతున్నాయి. వారి ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా వారిపై అధికారం చెలాయించడం, బాలికలు కదా అని చులకనగా చూడడం అనేక కుటుంబాల్లో సర్వ సాధారణ కృత్యమైపోతోంది. సమాజంలో ఎక్కడ చూసినా ఆడపిల్లల పట్ల చులకనభావమే కనపడుతోంది. అంతేకాదు, పుట్టినప్పుడే ఆడశిశువులను ఏ చెత్తకుప్పలోనే పారవేసే దయనీయ సంఘటనలు.. దృశ్యాలు కూడా మనం అప్పుడప్పుడూ వింటున్నవే..చూస్తున్నవే. బాలికలను అమానవీయంగా వ్యభిచారగృహాలకు తరలించే దౌర్భాగ్య ముఠాలకు కూడా కొదవ లేదనే సంగతి కూడా మనం వింటున్నదే. ఇక పేదింట్లో పుట్టిన ఆడపిల్లల సంగతి మరింత దారుణంగా ఉంటోంది. ఆడపిల్లగా పుట్టి చాకిరీకి, వంటింటి పనులకే పరిమి తమయ్యే వారి సంఖ్య లెక్కకు మిక్కుటంగానే ఉంటోంది. కుటుంబ పోషణను కూడా నెత్తినేసుకుని కూలిపనులకు కూడా వెళ్ళేవారు ఎందరో?.. సరైన పోషకాహారం కూడా లేక చిక్కి శల్యమ వుతున్న బాలికల సంఖ్య కోట్లల్లోనే ఉంది. కుటుంబ వ్యవస్థలో ఆడపిల్లలకు ప్రత్యేకస్థానంతో పాటు మంచి గౌరవం ఇవ్వడం, ఆప్యాయతానురాగాలతో వారిని పెంచి పెద్దచేయడం,వారి జీవితాలకు ఎల్ల వేళలా అండగా ఉంటూ వారిని సంరక్షించుకునే మంచిమనుషులు కూడా సమాజంలో లేక పోలేదు. అయితే పేదరికంతోనో,అవిద్య వల్లనో, అసమానత వల్లనో దేశంలో మరెంతోమంది బాలికల భవిష్యత్తు నేటికీ అంధకారమయంగానే ఉంటోంది.ప్రభుత్వాలు, పాలకులు ఎంతో మంచిమనసుతో బాలికల కోసం,మహిళల కోసం,స్త్రీల కోసం అనేక పథకాలు, వారి రక్షణ కోసం, వారి హక్కుల పరిరక్షణ కోసం ఎప్పటి కప్పుడు అనేకానేక చట్టాలు చేస్తూనే ఉన్నా.. సమాజంలో ఆడపిల్లల పట్ట, మహిళామతల్లుల పట్ల వివక్ష..అఘాయిత్యాలు తొలగిపోవడం లేదు. ఇకనైనా ఈ దుస్థితి..ఈ దుర్గతి మారాలి. ఆడపిల్ల లంటే మన ఇంటికి జీవనజ్యోతులని గ్రహించుకోవాలి. ఆడపిల్లలంటే కేవలం అబలలు కాదని,కాస్తంత ఆత్మవిశ్వాసాన్ని-ప్రోత్సాహాన్ని అందిస్తే చాలు..వాళ్ళు మనల్ని, మన కుటుంబగౌరవాన్ని,దేశ సౌభగ్యాన్ని కూడా నిలబెట్టే ధీరవనితలవుతారని,సమాజాన్ని ఆదర్శ వంతంగా,ప్రతిభావంతంగా తీర్చిదిద్దే ప్రతిభా మూర్తులని కూడా తెలుసుకోవాలి. కేవలం ప్రభుత్వాలు మాత్రమే ఇవన్నీ చూసుకోవాలనే ఆలోచనలు మానుకుని..మనవంతు బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఆడపిల్లలను, ముఖ్యంగా బాలికలను సంరక్షించుకోవాలి. ఆడపిల్ల పుట్టిందంటే మన ఇంట మహాలక్ష్మి పుట్టిందని సంతోషించాలి. వారి మనసును కష్టపెట్టకుండా మంచి చదువులు చెప్పించి, ఇష్టపడే రంగాల్లో ప్రోత్సహించి వారి అభివృద్ధికి బాటలు వేయాలి. ఈ పవిత్ర కర్తవ్యాన్ని నిండుమనసుతో నిర్వహించేందుకు ప్రతిఒక్కరూ చిత్తశుద్ధితో కృషిచేయాలి. బాలికల పట్ల ఇలాంటి సదవగాహన, సద్భావనలు కలిగించేందుకే ఐక్యరాజ్యసమితి ప్రపంచవ్యాప్తంగా ‘అంతర్జాతీయ బాలికల దినోత్సవం’గా ప్రకటిం చింది. అందుకు సార్థకత చేకూరేలా ప్రతి ఒక్కరూ కృషిచేసినప్పుడే మన జీవితాలూ సార్థకమవుతాయి. ముఖ్యంగా.. బాలికలు, మహిళలపట్ల మానవీయతతో.. ఆత్మీయతతో ఉంటూ, వారికి అన్నివిధాలా రక్షణ కలిగించాలి. అప్పుడు వారే కాదు మనం, మన కుటుంబం, మన చుట్టూ ఉన్న సమాజం, మన దేశం..మొత్తంగా ప్రపంచమంతా కూడా ఆనందంతో పల్లవిస్తుంది.. ఎనలేని సంతోష పౌభాగ్యాలతో వెల్లివిరుస్తుంది.కానీ నేటి ఆధునీక సమాజంలో ఆడపిల్లలకు రక్షణ అనేది కరువైంది. ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తెచ్చినా ఆచరణకు నోచుకోవడంలేదు. మహిళలు హక్కులను పరిరక్షించే నాధుడు కరువయ్యారు.-

ధరలు పెంపుపై ప్రజాగ్రహం

ఈ అస్తవ్యస్థ పరిస్థితి కారణంగా ప్రజలకు ప్రభుత్వం మీద నమ్మకం కాస్తా పూర్తిగా పోయింది. రేపేం కానుందోనన్న భయాందోళనలు పెరిగిపోయాయి. సరుకుల కోసం ఒక్కసారి సూపర్‌ మార్కెట్ల మీద పడ్డారు. అక్కడ అనివార్యంగా పెద్ద మొత్తంలో సరుకులను కొనకుండా ఆంక్షలు పెట్టవలసిన పరిస్థితి వచ్చింది. ‘’ఎక్కువ మొత్తంలో సరుకులను కొని మాత్రం ఏం చేయగలం? ఇంట్లో ఫ్రిజ్‌ లో దాచుకోడానికి వీల్లేకుండా పవర్‌ కట్‌ ఉంది కదా’’ ఇది ఒక గృహిణి బాధ అయితే మరొకరు ‘’ఏరోజు వంట ఆరోజే వండుకోవచ్చునని అనుకోలేకుండా వున్నాం. గ్యాస్‌ అయిపోతే పరిస్థితి ఏమిటి? పవర్‌ కట్‌ కూడా ఉంది. ఏమీ తోచడం లేదు’’ అని వాపోయారు.
చాలా కాలం నుండీ శ్రీలంకలో ఆర్థిక వ్యవస్థ చిక్కుల్లో కూరుకుపోయి వుంది.అయితే సకా లంలో తగు చర్యలు తీసుకోకుండా బాధ్యతారహి తంగా గొటబాయ రాజపక్స ప్రభుత్వం వ్యవహరిం చింది. ఆర్నెల్ల క్రితం అప్పుడే మేలుకున్నట్టు హడావుడిగా విదేశీ దిగుమ తులపై ఆంక్షలు ప్రకటించింది. తన వద్దనున్న విదేశీ మారక నిల్వలు పూర్తిగా అడుగంటి పోవడం దీనికి కారణం. ఐతే ఇటువంటి తొందరపాటు నిర్ణయాల పర్యవసానాలు ఎంత వినాశకరంగా పరిణ మిస్తాయో, ప్రజలు ఎటువంటి కష్టనష్టాలను చవిచూడవలసి వస్తుందో ఆ ప్రభుత్వం ఆలోచించే ప్రయత్నం చేయలేదు. పైగా ప్రజల్లో పెల్లుబుకుతున్న నిరసనలను అత్యంత నిరంకుశంగా అణచివేయడానికి పూనుకుంది. అత్య వసర పరిస్థితి ప్రకటించింది.
ఒకవైపు సంపన్నులపై విధించిన పన్నులను బాగా తగ్గించినందువలన ప్రభుత్వ ఆదాయం భారీగా పడిపోయింది. ఇంకోవైపు చర్చిల్లో వివిధ ప్రాంతాల్లో 2019లో జరిగిన పేలుళ్ళలో వందలాది మంది మరణించాక పర్యాటకులు బాగా తగ్గిపోయారు. శ్రీలంకకు వచ్చే విదేశీ మారకద్రవ్యం కూడా దానితో పడిపోయింది. పులి మీద పుట్రలా కోవిడ్‌ వచ్చిపడిరది. శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి ఇవి తక్షణ కారణాలు. ఆ దేశానికి కావలసిన ఇంధన అవసరాలన్నీ దిగుమతుల ద్వారా మాత్రమే తీరతాయి. అంతే కాక ఎరువులు, ఆహారధాన్యాలు. పప్పులు, ఖాద్యతైలాలు వంటివి కూడా దిగుమతుల ద్వారానే ఆ దేశం పొందు తుంది. ఎప్పుడైతే ఆ దిగుమతులకు కావలసిన విదేశీ మారక ద్రవ్యం లేకుండా పోయిందో ఒక్కసారి ఆ దేశ జనజీవనం ఛిన్నాభిన్నం అయిపోయింది. పెట్రోలు, గ్యాస్‌ తగినంత లేవు కనుక పని ప్రదేశాలకు ప్రయా ణించడం అసాధ్యం అయిపోయింది. ఇంధనం లేనం దున విద్యుత్తు కొరత తీవ్రం అయింది. రోజుకు 13 గంటల విద్యుత్తు కోత అమలవుతోంది. వంట గ్యాస్‌ కొరత వలన ఇళ్ళలో వంటలు వండుకోవడం సాధ్యం కావడం లేదు. ఈ అస్తవ్యస్థ పరిస్థితి కారణం గా ప్రజలకు ప్రభుత్వం మీద నమ్మకం కాస్తా పూర్తిగా పోయింది. రేపేం కానుందోనన్న భయాందోళనలు పెరిగిపోయాయి. సరుకుల కోసం ఒక్కసారి సూపర్‌ మార్కెట్ల మీద పడ్డారు. అక్కడ అనివార్యంగా పెద్ద మొత్తంలో సరుకులను కొనకుండా ఆంక్షలు పెట్టవలసిన పరిస్థితి వచ్చింది.‘ఎక్కువ మొత్తంలో సరుకులను కొని మాత్రం ఏం చేయగలం? ఇంట్లో ఫ్రిజ్‌ లో దాచుకోడానికి వీల్లేకుండా పవర్‌ కట్‌ ఉంది కదా’ ఇది ఒక గృహిణి బాధ అయితే మరొకరు ‘’ఏరోజు వంట ఆరోజే వండు కోవచ్చునని అనుకోలేకుండా వున్నాం. గ్యాస్‌ అయిపోతే పరిస్థితి ఏమిటి? పవర్‌ కట్‌ కూడా ఉంది. ఏమీ తోచడం లేదు’’ అని వాపోయారు. ‘ఇంట్లో డబ్బు పెద్ద మొత్తంలో తెచ్చిపెట్టుకుందామంటే ఈ అల్లక ల్లోలంలో దానిని ఎవరు లాక్కుని పోతారో అన్న భయం ఉంది. పోనీ ఎప్పటికప్పుడు బ్యాంక్‌ ఎటిఎం నుంచి తీసుకుందామంటే పవర్‌ కట్‌ తో ఆ ఎటిఎంలు ఎప్పుడు పని చేస్తాయో తెలియకుండా ఉంది.’’ అని ఓ మధ్యతరగతి కుటుంబీకుడు గోల పెడుతున్నాడు. శ్రీలంకలో ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు బాగా పాపులర్‌. కాని ఇప్పుడు పవర్‌ కట్‌ కారణంగా ఆ సెంటర్ల లోని ఓవెన్లు,హీటర్లు,పని చేయడం లేదు.మరీ పెద్ద సెంటర్ల లోనైతే జనరేటర్లు ఉన్నాయి. కాని వాటికి సరిపడా చమురు లభించడం లేదు. ఇక చిన్న సెంటర్లయితే ఎప్పుడు నడపాలో, ఎప్పుడు మూసేయాలో తెలియని స్థితి ఉంది.‘’పోర్టులో మా కంపెనీ ఆర్డరు చేసిన మెటీరి యల్‌ దిగింది. అక్కడే ఉంటే ఎక్కువ చార్జీలు చెల్లిం చాల్సి వస్తుంది అని ఆ సరుకుని మా గోడౌన్‌ లోకి తెచ్చి దింపాం. కాని ఇక్కడి నుంచి మా వర్క్‌ సైట్‌ కి దీని ని రవాణా చేయడానికి డీజిల్‌ దొరకడం లేదు. మా పని అంతా ఆగిపోయింది.’’ ఓ బడా కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ బాధ ఇది.‘’మా పౌల్ట్రీ లోని కోళ్ళు పూర్తిగా పెరిగిపోయాయి. వాటిని కోసి అమ్మేయకుండా వుంచి మేపాలంటే తడిసి మోపెడౌతోంది. పవర్‌ కట్‌ వలన ఫ్రీజర్లు పని చేయడం లేదు. అందుకే అన్నిం టినీ చంపి పూడ్చిపెట్టేశాం’’ అన్నాడో కోళ్ళఫారం యజమాని. ఇంకోవైపు మార్కెట్‌ లో కోడిమాంసం ధర మాత్రం ఒక్క నెలలోనే రెట్టింపు అయిపోయింది. శ్రీలంకలో మత్స్యకారుల సంఖ్య చాలా ఎక్కువ. కాని వాళ్ళు చేపల వేటకు పోవాలంటే బోట్లు నడవడానికి డీజిల్‌ గాని, కిరోసిన్‌ గాని కావాలి. అవి దొరకడం లేదు. ఒకవేళ అతి కష్టం మీద సంపాదించి చేపలు పట్టి తెచ్చినా,వాటిని అమ్మడానికి మరో వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్కెట్‌కి తీసుకెళ్ళాలి. దానికి రవాణా లేదు.అందుచేత చాలామంది మత్స్య కారులు చేపల వేట మానుకున్నారు. దీంతో చేపల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఏపనీ లేక పోయినా సెల్‌ ఫోన్‌ పట్టుకుని కాలక్షేపం చేసేయ వచ్చునను కునేవారి పరిస్థితీ ఏమాత్రం బాగులేదు. 13 గంటల పవర్‌ కట్‌ వలన ఆ సెల్‌ ఫోన్లు, సెల్‌ టవర్లు పని చేయడం లేదు. టీవీల్లో దూరి సమయం గడిపేయవచ్చుననుకునేవారి పరిస్థితీ అలాగే ఉంది. ‘మాకు రాజకీయాలు అనవసరం. దేశం ఏమౌతోందో నాకెందుకు? నా పరిస్థితి బ్రహ్మాండంగా సాగిపోతోంది. నా బ్యాంక్‌ బ్యాలెన్స్‌ చల్లగా ఉంటే చాలు’’ అనుకునే మధ్యతరగతి ప్రబుద్ధులంతా ఇప్పుడు అందరికన్నా ముందు రోడ్ల మీదకి వస్తున్నారు. అధ్యక్షుడి ఇంటి ఎదురుగా వేలాదిమంది నిరసన తెలపడానికి నిల బడితే వాళ్ళని పోలీసులు అరెస్టులు చేశారు. వారిలో ఓ 50 మంది మీద కేసులు పెట్టి కోర్టుకి తెచ్చారు. ఆ 50 మంది కోసం వాదించడానికి 300మంది లాయర్లు తయారైపోయారు. అయినా గొటబాయ రాజపక్స ప్రభుత్వానికి ఇంకా కళ్ళు తెరుచుకున్నట్టు లేదు. ‘’ఇదంతా కొంతమంది అరాచక మూకలు విదేశీ శక్తుల ప్రోద్బలంలో సాగిస్తున్న కుట్ర. దేశంలో అరబ్‌ వసంతం తీసుకొద్దాం అంటూ వాళ్ళు సోషల్‌ మీడియాలో మెసేజ్‌ లు పెడుతున్నారు.’’ అంటూ అధ్యక్షుడి భవనం అధికార ప్రతినిధి ప్రకటించాడు. కాని ఈ ప్రభుత్వాన్ని శ్రీలంకలో ఎవ్వరూ నమ్మడం లేదు. ప్రజలు ఎంత విసిగిపోయారంటే వాళ్ళు ఇప్పుడు ఏ ప్రత్యామ్నాయం గురించీ ఆలోచించడమే లేదు. ఈ గొటబాయ రాజపక్స కుటుంబం. ఈ ప్రభు త్వం దిగిపోతే చాలునని వాళ్ళు ముక్తకంఠంతో డిమాం డ్‌ చేస్తున్నారు. ప్రజలు అక్కడ ప్రతిపక్షాలనూ నమ్మడం లేదు. ప్రతిపక్షాలకు పగ్గాలు అప్పగించడం వలన ఏప్రయోజనమూ ఉండదని వారు భావిస్తున్నారు. ‘’ఒక చేతకాని ప్రభుత్వం బదులు మరో చేతకాని ప్రభుత్వం వస్తే ఏమిటి ఉపయోగం? అని ప్రశ్నిస్తున్నారు. ఆదేశానికి సహాయం కోసం భారత ప్రభుత్వం పంపు తున్న వస్తువులను అక్కడి ప్రభుత్వ అధికారులకు అప్పగించడం బదులు భారత ప్రభుత్వమే నేరుగా మాకు అందించడం మంచిది అని ఆ ప్రజలు అనుకుం టున్నారు. ప్రతిపక్షాలు బలంగా లేకపోవడంతో బాటు శ్రీలంక సైన్యం కూడా అధికారంలో ఉన్న ప్రభుత్వానికి పూర్తి అండగా ఉంది. ఐతే ఒకవేళ ఈ ప్రభుత్వానికి పార్లమెంటులో మెజారిటీ లేకుండా పోతే ఏంజరుగుతుందో చెప్పలే మంటున్నారు రాజకీయ పరిశీలకులు. గతంలో తమిళుల ఉద్యమానికి భారత దేశం అండదండలివ్వడం వలన శ్రీలంకలో సింహళీ యులలో ఎక్కువ మంది ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతదేశం నుండి వచ్చి శ్రీలంకలో భూముల్ని, ఆస్తుల్ని చౌకగా కొనేసి పెత్తనం చేస్తారేమోనన్న భయాలు కూడా ఉన్నాయి. మోడీ ప్రభుత్వం పొరుగు దేశాలు వేటితోనూ సత్సంబంధాలను నెలకొల్పు కోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం కూడా ఈ రకమైన అపనమ్మకాలు కలగడానికి దోహదం చేసింది. అయితే చైనా గురించి వీళ్ళ అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి. ‘’చైనాని ఎందుకు నిందించాలి? ఇక్కడి అస్తవ్యస్త పరిస్థితులకి మా ప్రభుత్వ నిర్వాకమే కారణం. ఇక్కడ ఎక్స్‌ప్రెస్‌ హైవే ని చైనా యే నిర్మించింది. కొలంబోలోకి ప్రవేశించే దగ్గర బ్రహ్మాండమైన జంక్షన్‌ (ఇంటర్‌ఛేంజ్‌) నిర్మించింది కూడా చైనా వారే. ఈ నగరానికి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచిన లోటస్‌ టవర్‌ కూడా వాళ్ళు నిర్మించినదే. నగరంలోని పెద్ద పెద్ద ప్రాజెక్టులను ఎన్నింటినో వాళ్ళు కట్టారు’’ అని చైనా గురించి అనుకూలంగానే అక్కడ ప్రజలు మాట్లా డుతున్నారు. 2009 వరకూ శ్రీలంకలో తమిళ ఉద్యమమే అన్ని ఇబ్బందులకూ కారణమని పాలకులు సాకు చూపించు కున్నారు. ఆతర్వాత కూడా కొంత కాలం అదే సాకుని చూపారు. 2019లో చర్చిల్లో బాంబు పేలుళ్ళ తర్వాత ఇప్పుడు ముస్లింల నుండి ప్రమాదం అని చెప్తున్నారు. అయితే ప్రస్తుత సంక్షోభ పరిస్థితిలో పాలకులు ఎన్ని సాకులు చెప్పినా, ఎవరిమీద నెపం మోపాలని చూసినా ప్రజలు మాత్రం నమ్మే పరిస్థితిలో లేరు. నిరంకుశంగా అణచివేయాలనను కుంటున్నరాజపక్సప్రభుత్వానికి…రాజపక్స కుటుంబ మూ, ఆ ప్రభుత్వం మాత్రమే సంక్షోభానికి కారణం అంటున్న ప్రజలకు మధ్య యుద్ధం జరుగుతోంది.
సామాన్యులే సమిధలా…!
రాష్ట్ర ప్రభుత్వం డీజిల్‌ సెస్‌ పేరుతో ఆర్‌టిసి బస్‌ చార్జీలను పెంచడం దారుణం. నిరుపేదల, సాధారణ ప్రజల ప్రయాణ సాధనాలుగావున్న పల్లె వెలుగు, సిటీ సర్వీసుల కనీస చార్జీలతోపాటు అన్ని స్టేజిలకూ భారం పెంచడం ద్వారా సర్కారు సామాన్యులను సమిధల్ని చేస్తోంది. పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీస్‌ ప్రయాణికులపై టిక్కెట్‌కు రూ.2, ఎక్స్‌ప్రెస్‌, సిటీమెట్రో ఎక్స్‌ప్రెస్‌, మెట్రో డీలక్స్‌ సర్వీసుల్లో రూ.5, సూపర్‌ లగ్జరీ, ఎసి సర్వీసుల్లో రూ.10 చొప్పున ఈ చార్జీలను వసూలు చేయాలని నిర్ణయించింది. పల్లెవెలుగు, సిటీ ఆర్డనరీ సర్వీసుల్లో కనీస ధర రూ.10గా చేయడంతో పాటు సేఫ్టీ సెస్‌ పేరుతో అదనంగా మరో రూపాయి వసూలు చేస్తున్నారు. రిజర్వు బ్యాంకుతో, కేంద్ర ప్రభుత్వంతోనూ చర్చించి చిల్లర కొరత నివారించ వలసిందిపోయి కొరత పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రౌండప్‌ చార్జీలను వసూలు చేస్తామనడం మోస పూరితం. తాజా పెరుగుదల వల్ల ఆర్‌టిసికి అదనంగా రోజుకు రెండు కోట్లు, లేదా ఏడాదికి రూ.720 కోట్లు ఆదాయం వస్తుందని అధికారులు చెబుతున్నా అది వాస్తవంలో పన్నెండు వందల కోట్లు దాటుతుందని కొందరు నిపుణులు అంటున్నారు. ఇప్పటికే విద్యుత్‌ చార్జీలను పెంచిన ప్రభుత్వం తాజాగా ఆర్‌టిసి ఛార్జీలు పెంచి జనానికి గోరుచుట్టుపై రోకటి పోటు వేసినట్టయింది. 2019లో చార్జీలు పెరిగాయని, అప్పుడు లీటర్‌ డీజిల్‌ ధర రూ.67గా ఉండగా ప్రస్తుతంరూ.107కి పెరిగాయని అధికారులు చెబు తున్న మాట నిజం. అయితే, ఈ పెరుగుదలకు కేవలం మోడీ ప్రభుత్వ విధానాలే కారణం తప్ప వేరేమీ కాదు. అలాంటిది కేంద్ర ప్రభుత్వంతోతలపడి, ప్రజా రవాణా వాహనాలకైనా తక్కువ ధరకు డీజిల్‌ సాధిం చుకు నేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నమూ చేయకుండా ఆ భారాన్ని ప్రజలపైకి మళ్లించడం సబబు కాదు. కనీసం కేంద్రంతో పోరాడి, సాధించలేని స్థితిలో దాన్ని ప్రజలముందు దోషిగా నిలిపినా కొంతవరకు సబబుగా వుండేది. సంస్థకు అదనపు ఆదాయం సమకూర్చుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగావున్న ఆర్‌టిసి ఖాళీ స్థలాలను బిఓటి పద్ధతిలో ప్రైవేటువారికి అప్పగించాలనడం మోసపూ రిత ఆలోచన. వివిధ నగరాలు, పట్టణాల నడిబొడ్డు నవున్న ఆర్‌టిసి స్థలాలను ప్రైవేటుకు దఖలుపర్చడం ప్రజల సంపదను అస్మదీయులకు కట్టబెట్టే దుష్ట తలంపే! కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మోనిటైజేషన్‌ పైప్‌లైన్‌ పథకానికి ఇది ప్రతిరూపమే. ఆర్‌టిసి స్థలాలను సంస్థ విస్తరణకు, ప్రయాణికుల సౌకర్యాలకు తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ, ఏ రూపంలోనూ ప్రైవేటుకు అప్పగించడానికి వీల్లేదు. ప్రభుత్వం అందుకు ప్రయత్నిస్తే ప్రజలు, ఆర్‌టిసి ఉద్యోగులు ఉద్యమించి ప్రజల ఆస్తిని కాపాడుకోవాలి. ఇప్పటికే ధరలు పెరిగి పన్నుల భారంతో సతమ త మవుతున్న ప్రజలకు ఇది కోలుకోలేని దెబ్బ. పేద, మధ్యతరగతి, నిరుద్యోగులు, విద్యార్థులు బస్సు ప్రయా ణాలపై ఎక్కువగా ఆధారపడుతున్నందున పెంచిన బస్సు చార్జీలను వెంటనే ఉపసంహరించు కోవాలి. సంస్థ నష్టాలకు కారణాలను పరిశీలించి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం అవసరం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం బల్క్‌ డీజిల్‌ ధర పెంచినపుడు ఆర్‌టిసి బస్సులకు తక్కువ ధరకు రిటైల్‌ బంకుల్లో డీజిల్‌ ఫిల్లింగ్‌ చేయించి ఎంతో కొంత పొదుపు చేయగలిగారు. సరుకు రవాణా (కార్గో)పై మరింత కేంద్రీకరిస్తే ఆదా యం పెరచుకో వచ్చు.
ముఖ్యంగా స్టేజి క్యారేజిలు గా తిరుగుతున్న ప్రైవేటు బస్సులను అదుపు చేస్తే ఆర్‌టిసి ఆక్యుపెన్సీ పెరగడంతోపాటు ఆదాయ మూ వృద్ధి చెందుతుంది. అలాగే లాభసాటిగా వుండే అంతర్రాష్ట్ర సర్వీసుల విస్తరణకు కృషి చెయ్యాలి. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో తగు ఒప్పందాలు చేసు కోవాలి. అన్ని విధాలుగా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి, సంస్థ ఆదాయం పెంచుకోవడం, దుబారా ఖర్చులు తగ్గించడానికి సకల చర్యలు చేపట్టడంతోపాటు అవినీతి, లీకేజిలను అరికట్టడంపై సర్కారు కేంద్రీకరిస్తే ప్రజలపై భారాలు వేయాల్సిన అవసరమే లేదన్న నిపుణుల మాట ప్రత్యక్షర సత్యం.-(వ్యాసకర్త : పాత్రికేయుడు ఇటీవల శ్రీలంక పర్యటించిన ప్రత్యక్ష కథనం ఆధారంగా) (ఆర్‌.కె.రాధాకృష్ణన్‌ )

1 16 17 18 19 20 48