ఉచిత ఉపాధ్యాయులు ఆదివాసులు

ఒకప్పుడు మౌఖిక సాహిత్యంకే పరిమితమైన… మన ఆదివాసీ సాహిత్యం… అక్షరాస్యతలో వచ్చిన అభివృద్ధిలో భాగంగా .. వివిధ ప్రక్రియలలో పుస్తకాల రూపంలో… వస్తూ ప్రామాణికతకు చోటుచేసు కుం టుంది, ఈ గిరిజన సాహిత్యంలోని… పుస్తకాల వివరాలను ‘‘గవాక్షం’’ శీర్షికన… ‘‘థింసా పాఠకుల’’ కోసం ప్రతి నెల ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్న పరిశోధక రచయిత డా. అమ్మిన శ్రీనివాసరాజు గారు ప్రముఖ రచయిత ‘ ప్రో ॥ కంచ ఐలయ్య షెఫర్డ్‌ ’ కలం నుంచి జాలువారిన ‘ ఉచిత ఉపాధ్యాయులు ఆదివాసీలు’ అనే పుస్తకంపై సమీక్ష -డా. అమ్మిన శ్రీనివాసరాజు
సంచల రచయిత కంచ ఐలయ్య గారి కలం నుంచి వెలువడిన పుస్తకం ‘ఉచిత ఉపాధ్యా యులు ఆదివాసీలు’ పేరుకు తగ్గట్టుగానే అందులోని అంశాలు కూడా ఆసక్తికరంగా ఉండి నూతన అంశాలను ఆవిష్కరించారు. పూర్వకాలం నుంచి లిపిలేని భాషలో సంభాషించుకుంటున్న అడవి బిడ్డలంతా ఆధునిక ఆంగ్ల భాష నేర్చుకుంటే అన్ని రంగాల్లో ఘనమైన అభివృద్ధి సాధించేవారు అన్నది రచయిత ప్రొఫెసర్‌ ఐలయ్య గారి భావన.పేర్లు సంస్కృతి,ఆదివాసి వ్యక్తిత్వం, ఆహార సంస్కృతి, శాఖాహార ఉద్దేశం, మద్యం ఆధ్యాత్మిక వాదం,పోడు ఉత్పత్తి ఆదివాసి సృజనాత్మకత,ఆదివాసి సాంకేతిక పరిజ్ఞానం, ఆదివాసి విత్తన వ్యవస్థలు, ఆదివాసి సజీవ నాయకత్వం,ఆధ్యాత్మికత,ప్రతికూల జాతీయ వాదం, సజీవ కథానాయకులు,స్వీయ ఆరాధన,స్త్రీ పురుష సంబంధాలు, ఆదివాసి వివాహం,అనే ఉప విభాగాలుగా సాగిన ఈ పుస్తక అక్షర ప్రయాణంలో ప్రతి అంశం ఒక కొత్త కోణంలో ఆవిష్కరించబడిరది. ఆదివాసీలు వ్యక్తిత్వం రీత్యా వారి జీవన విధానంద్వారా సమాజానికి ఎంతో కొంత నేర్పే వారే అన్న భావన అందించారు. మన సంస్కృతి నాగరికతలకు పునాదులు వేసింది ఆదివాసీలే అన్న విషయాన్ని ఇందులో రచయిత స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆదివా సీలు తినే మాంసాహారంలోని ఆరోగ్య కారకాలు మనిషి మనుగడకు ఎలా దోహద పడుతున్నాయో వివరిస్తూనే వారు అలవాటు చేసిన మాంసాహారాన్ని నేటి ఆధునిక సమా జం అనుసరించి ఆధునికమైన కొత్త రుచు లతో ఆరగిస్తున్నారు అంటారు ఐలయ్య గారు. పోడు వ్యవసాయానికి చిరునా మాదారులైన గిరిజనులు వ్యవసాయ కార్యకలాపాల్లో తమదైన భుజశక్తికి ప్రాధాన్యత ఇస్తూ కర్ర ఇనుము కలగలిసిన వ్యవసాయ సాధనాలను కళాత్మకంగా ఉపయోగిస్తూ తమదైన సృజనాత్మకతతో పోడు వ్యవసాయం చేసుకోడాన్ని భిన్న కోణంలో ఆవిష్కరిస్తూ తద్వారా కూడా గిరిజనులు ఆధునిక సమాజానికి బోధకులు ఎలా అయ్యారో నిరూపించారు. ఆదివాసీలు త్రాగే ఆహార పానీయాల్లోని వినూత్న విషయం గురించి చెబుతూ చెట్లనుంచి కల్లు తీయడం వారికి మాత్రమే తెలిసిన గొప్ప ప్రక్రియగా అభివర్ణించారు. అంతేగాక అందులోని ఆరోగ్య కారకాలు శరీర ఆరోగ్యానికి ఎలా దోహద పడుతున్నాయో కూడా వివరించారు తాటిచెట్టు కల్లుతో పాటు ఈత,జీలుగ,వేప,చెట్ల నుంచి వారు తీసే కల్లు ఆరోగ్యానికి ఎలా సహకరిస్తుందో సవివరంగా సెలవిచ్చారు,అలాగే వారు ఆరాధించే దేవుడు సైతం ఈ మద్యాన్ని ఆరగిస్తారని మద్యానికి సైతం ఆధ్యాత్మిక వాదం అనుబంధం చేశారు రచయిత. నేటి మన ఆధునిక పద్ధతులకు ఆధారం ఆదివా సులు అవలంబించే పద్ధతులే కారకం అన్న రచయిత బలమైన వాదనఈ పుస్తకం లోని ప్రతిభాగంలో కనిపిస్తుంది.కొండారెడ్డి లంబాడాలు చెంచులు కోయలు ఉంటే సొంత సామాజిక పేర్లు కలిగి ఉన్న వీరిని ఆధిపత్య ధోరణిలో అందరిని ఒకే గాటిన కట్టేస్తూ గిరిజనులు, వనవాసులు,అని పిలవడం సరైన విధానం కాదు అన్నది రచయిత వాదనే కాదు,అలా పిలిపించు కోవడం వారికి ఇష్టం ఉండదు అని కూడా తేల్చి చెప్పారు దీనిలో వాస్తవికత లేకపోలేదు. ఇక ఆదివాసుల ఆహార నియమాల గురించిన వివరణ కూడా ఇస్తూ కొన్ని రకాల ఆహారం మాత్రమే పవిత్రమైనది మరికొన్ని రకాల ఆహారం అపవిత్రమైనది అనే భావన సరైనది కాదని అంటూనే పవిత్రంగా భావించే శాఖాహారం పట్ల ఆదివాసులు ఇష్టం చూపరు అని కాదు కానీ వారు ఇష్టంగా తినే మాంసా హారంలోని ఔషధ గుణాలను రచయిత కూలం కషంగా వివరించారు.అందులోని ఆదివాసుల పరిజ్ఞానాన్ని సహేతుకంగా చెప్పడంలో రచయిత పరిశీలన శక్తి అర్థమవుతుంది. ఆదివాసీలలో గల సాంకేతిక పరిజ్ఞానం గురించి చెబితే నేటి ఆధునికులకు నమ్మబుద్ధి కాకపోవచ్చు!! కానీ దీనిని సామరస్యంగా తెలుసుకుంటే అడవి బిడ్డల్లో దాగి ఉన్న సాంకేతిక పరిజ్ఞానం అర్థం అవుతుంది. ఇక్కడ మరో విషయం గమనించాలి వీరి సాంకేతిక పరిజ్ఞానం అంతా సహజసిద్ధంగా వారి శారీరక శ్రమనుంచే ఆవిర్బవిస్తుంది తప్ప కృత్రిమంగా యాంత్రిక శక్తుల సాయంతో మాత్రం కాదు. ఈ విషయంలో కూడా ఆధునికులమైన మనం వారి నుంచి నేర్చు కోవలసినది చాలా ఉంది అన్నది రచయిత వాదన ఆవేదన.విత్తనాల వ్యవస్థకు ఆదివా సీలకు గల సంబంధం గురించి చెబుతూ అటవీ ప్రాంతానికి, మైదాన ప్రాంతానికి గల వ్యత్యాసం ఇందులో వివరిస్తూ అటవీ ప్రాంతానికి చెందిన విధానాలు మైదాన ప్రాంతం వారివిగా అన్వయించుకొని అటవీ ప్రాంతం వారికి ఎలాంటి నైపుణ్యాలు తెలియవు అనే ముద్ర వేసిన తీరును కూడా ఇందులో వివరించారు.అగ్రవర్ణాల వారి ఆధిపత్య ధోరణుల వల్ల ఆదివాసీలకు జరిగిన అన్యాయాలు నష్టాలు గురించి సహేతుకంగా ఆలోచింపజేసే విధంగా వివరించారు.రాజ్యం అనే ప్రభుత్వాల వలే, పౌర సమాజం కూడా ఆదివాసీల్లోని సామాజిక శక్తుల సాంకేతికతల నైపుణ్యాలు ఎప్పుడు గుర్తించలేదు, మౌర్యుల కాలంలో చంద్రగుప్తునికి ఆదివాసీల పట్ల సరైన అభిప్రాయం లేకపోవడం కౌటిల్యునికి ఆది వాసీలపట్ల గల తీవ్ర వ్యతిరేకత కారణం గానే తన మంత్రి పదవిని వదిలి రాజ్యతంత్ర గ్రంథమైన ‘అర్థశాస్త్రం’ రచించాడు అనే చారిత్రక వాదన వినిపించారు రచయిత ఐలయ్య.
హిందూ సమాజంలో గల కుల వ్యవస్థ కారణంగా ఆదివాసీలు అందులో ఎమడలేక తమకు సమన్నత స్థానం దక్కక తమకు సము చిత స్థానం కలిగిస్తున్న ఇతర మతాలలోకి వలసలు పోతున్న వైనాన్ని కూడా ఇందులో కూలంకషంగా చెప్పుకు వచ్చారు రచయిత. భారత జాతీయ ఉద్యమంలో ఆదివాసులు చేసిన వీరోచిత పోరాటాలను సైతం జాతీయ వాద వర్గం గుర్తించిన పాపాలపోలేదు అసలు మన దేశంలో బ్రిటిష్‌ పాలకులపై తొలి తిరుగు బాటు ఎజెండా ఎగరవేసింది ఎన్నో ప్రాణ త్యాగాలు చేసింది ఆదివాసి వీర యోధులే కానీ చరిత్రలో ఎక్కడ వారి వివరాలు కనిపించ కుండా జాగ్రత్త పడిరది, అగ్రవర్ణాల వారైన ఆధునిక చరిత్ర రచయితలే!! అన్న విషయం ఈ పుస్తక రచయిత కులంకషంగా వివరిం చారు. ఇలా అనేక విధాలుగా అనేక రంగాల్లో అగ్ర భాగాల నిలిచిన ఈ ఆదివాసి అడవి బిడ్డల ప్రతి పని మనకు ఆదర్శనీయమైన బోధన అంశమే అలా అన్ని విషయాలు మనకు బోధించిన ఉచిత ఉపాధ్యాయులు ఆదివాసి బిడ్డలే అన్న చారిత్రక సత్యాన్ని ముందు తరాలకు అందించిన ఈ పుస్తకం అందరు చదవదగ్గది.
పుస్తకం పేరు : ఉచిత ఉపాధ్యాయులు ఆదివాసీలు
రచయిత :ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య, పేజీలు :30, ధర 30/- రూ, ప్రతులకు :ప్రజాశక్తి బ్రాంచీలు
సెల్‌ :94900 99057, సమీక్షకుడు :డా:అమ్మిన శ్రీనివాసరాజు

నీటి అన్వేషణలో వన్యప్రాణులు

వేసవిలో ఎండల తీవ్రత పెరుగుతోంది. అడువుల్లోని నీటి వనరులు ఎండిపోతున్నాయి. దాహార్తి కోసం వన్యప్రాణులు విలవిలాడే ప్రమాదం ఉంది.తాగునీటి కోసం ఆరుబయట కొచ్చిన అడవి జంతువులు వేటగాళ్ల ఉచ్చుకు బలవుతున్న క్రమంలో అడవుల్లోని వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు అటవీశాఖ ప్రణాళిక రూపొందించింది.అడవుల్లో సాసర్‌పిట్స్‌, చిన్ననీటి కుంటల్లో నీరు నింపే చర్యలు చేపట్టారు.అనుమానిత ప్రాంతాల్లో నిఘా తీవ్రతరం చేస్తున్నారు.వేటగాళ్ల బారినుంచి వన్యప్రాణులను సంరక్షిస్తున్నారు. గ్రామాల్లోకి తాగునీటి కోసం వన్యప్రాణులు వస్తే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చేలా చైతన్యం కల్పిస్తున్నారు.
దేశంలోనే పెద్దపులులకు ఆవాస కేంద్రం నల్లమల్ల అటవీ ప్రాంతం. ఆత్మకూరు డివిజన్‌ పరిధిలో వేసవి కాలం వచ్చిందంటే ముందస్తు గానే అటవీశాఖ అధికారులు నామ మాత్రపు చర్యలు చేపట్టి వన్యప్రాణుల దాహార్తిని తీర్చేం దుకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తారు. అయితే అడవిలో వన్య వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు నీరు ఏ మాత్రం సరి పోవడం లేదు. అభయారణ్యంలో ఉండా ల్సిన పెద్దపులి దాహం తీర్చుకునేందుకు జనావాసం లోకి వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు అటవీశాఖ నిధులను ఎంత ఖర్చు చేస్తుంది అనే లెక్కల్లో నేటికీ స్పష్టత లేదు. కేంద్ర ప్రభుత్వం దేశంలో పెద్ద పులుల సంరక్షణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నల్లమల అటవీ ప్రాంతం లోని నాగార్జు నసాగర్‌.. శ్రీశైలం పెద్దపులుల అభయా రణ్యంగా ప్రకటించింది.దేశవ్యాప్తంగా పరిచయమైన ఈ శాంచారి నల్లమల సొంతం. వాస్తవంగా ఇక్కడ పెద్దపులుల సంతతి తగ్గి పోతుండగా.. ప్రతి సంవత్సరం అటవీశాఖ అధికారులు పులుల లెక్కింపు చేస్తారు. వేసవిలో పెద్ద పులుల మనుగడ దినదినగండంగా మారు తోంది. అడవుల్లో నీటి లభ్యత ఆవాసాలు లేకపోవడంతో జనారణ్యంలోకి వస్తున్న సంద ర్భాలు ఆత్మకూరు అటవీ డివిజన్‌ పరిధిలో ఎన్నో ఉన్నాయి. ఆ సమయంలో వాహనాలు ఢీకొని మృత్యువాత పడుతున్నాయి. వన్యప్రాణి సంరక్షణ కోసం నిధులు పుష్కలంగా ఉన్నప్ప టికీ అటవీశాఖ అధికారులు అరకొర చర్యలు తీసుకుంటున్నారు. నల్లమల అటవీ ప్రాంతం లోని నంద్యాల జిల్లా పరిధిలో గల ఆత్మకూరు డివిజన్‌ ఆత్మకూరు, వెలుగోడు, బైర్లూటి, నాగలూటి, శ్రీశైలం రేంజిలో పెద్ద పులుల సంతతి అధిక సంఖ్యలో ఉంటుందని అటవీ శాఖ అధికారుల గణాంకాలు తెలుపు తున్నా యి. ఈ వేసవిలో మాత్రం నీటి కొరత తక్కువ గానే ఉన్నట్లు కనిపిస్తోంది. 40 డిగ్రీల ఉష్ణోగ్ర తతో ఎండలు మండుతున్న ఈ పరిస్థితుల్లో నంద్యాల, కర్నూల్‌, ప్రకాశం, గుంటూరు జిల్లాలలో గల నల్లమల్ల పై తీవ్ర ప్రభావం చూపుతోంది. అభయారణ్యంలో 3,568 చదరపు కి.మీ విస్తరించి ఉన్న తమ ఆవాసా లను పెద్ద పులులు వీడి నీటి కోసం మైదానం ప్రదేశాల వైపు వస్తున్నాయి. ఈ వలస పయ నంలో వన్యప్రాణుల మధ్య నీటి యుద్ధం, సరిహద్దుల వివాదం నెలకొంటోంది. ఆధిపత్య పోరులో పెద్ద పులులు చిరుతలు ఎలుగుబంట్లు ఇతర వన్యప్రాణులు మరణిస్తున్నాయి.
వన్యప్రాణుల సంరక్షణే లక్ష్యం..
వన్యప్రాణుల రక్షణకు అటవీశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. వేసవిలో దప్పిక తీర్చేందుకు అడవుల్లో నీటి గుంతలు, చెక్‌ డ్యామ్‌లు, సాసర్‌లు అవసరాన్ని బట్టి సోలార్‌ బోర్లను ఏర్పాటు చేసింది. నీటి లభ్యత ఉన్న ప్రాంతా లకు దాహర్తిని తీర్చుకునేందుకు వచ్చే జంతువులు వేటగాళ్లకు చిక్కకుండా సీసీ కెమెరాలు, బెస్‌ క్యాంపులు ఏర్పాటు చేస్తు న్నారు. అడవుల జిల్లాలుగా పేరున్న ములుగు, భూపాలపల్లి జిల్లాలో వన్యప్రాణులను కాపాడేం దుకు అధికారులు కాంపా నిధులతో ప్రత్యేక చర్యలు చేపట్టారు.
వేసవి దప్పికతో విలవిల..
మండుతున్న ఎండలతో అడవుల్లో ఆకులు రాలిపోతున్నాయి. వాగులు, వంకలు, గుంటల్లో నీళ్లులేక పగుళ్లు పారుతుంటాయి. దీంతో అటవీ ప్రాంతం లో గొంతు తడుపుకునేందుకు నీటిచుక్క కూడా కష్టమే. ఇలాంటి పరిస్థితుల్లో వన్యప్రాణుల దప్పికతో విలవిలలాడు తుం టాయి. దుప్పులు, అడవి పందులు, కృష్ణ జింకలు, అడవిదున్న, కొండ గొర్రెలు, ఎలుగుబంట్లు, నెమళ్లు, కుందేళ్లు తదితర అడవి జంతువులు నీళ్ల కోసం వేసవిలో దాహర్తితో అల్లాడుతుంటాయి. అడవి జంతువులు నీటి జాడలు వెతుక్కుంటూ గ్రామాల్లోకి వస్తున్నాయి.వేటగాళ్ల దృష్టిలో పడితే ఇక వన్యప్రాణులు గాలి లో కలిపి పోవాల్సింది. ఇప్పటికే భూపాలపల్లి జిల్లా పలిమెల, మహాముత్తారం, ఆజాంనగర్‌, ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు, ఏటూరునాగారం,కన్నాయిగూడెం, తాడ్వాయి మండలాల్లోని అడవుల్లో అడవి జంతువులు వేటగాళ్లకు ఆహారంగా మారుతున్నాయి. నీటి లభ్యత ఉన్న ప్రాంతా లకు వచ్చే జంతువులపై వేటగాళ్లు గురి పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వన్య ప్రాణులను కాపాడుకునేందుకు ప్రభుత్వం అడవుల్లోనే నీటి వసతులను కల్పించేందుకు కాంపా పథకం ద్వారా నిధులు కేటాయిస్తోంది.
అడవుల్లో నీటి గుంతలు..
వన్యప్రాణులను వేసవి దప్పిక నుంచి కాపా డేందుకు ప్రభుత్వం దృష్టిసారించింది. 2016 నుంచి భూపాలపల్లి, ములుగు జిల్లాలో సుమారు రూ.30 కోట్ల కాంపా నిధులతో అటవీశాఖ ఆధ్వర్యంలో వన్యప్రాణుల సంరక్షణ కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. భూపాలపల్లి జిల్లా అటవీశాఖ పరిధిలో 52 నీటి గుంతలు, 119 మినీ పీటీ (పెర్కోలేషన్‌ ట్యాంకు)లు, 65 పెర్కోలేషన్‌ ట్యాంకులు, 134 చెక్‌డ్యాంలు, 102 సాసర్‌పిట్స్‌,9 సోలా ర్‌ బోర్లు,151 రాక్‌ఫిల్‌ డ్యాంలు, 28 చెలి మెలు తదితర నీటి వసతులను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలో 100కు పైగా నీటిగుంతలు, 55 సిమెంట్‌ నీటి తొట్టెలు,.660 చిన్నరాతి కట్టడాలు, 50 పెర్కులేషన్‌ ట్యాంకులు, 6 సోలార్‌ బోర్‌ వెల్స్‌ ఏర్పాటు చేశారు. అడవిలో నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వీటిని నిర్మించారు. వీటిలో ట్రాక్టర్లు, మిని వాటర్‌ ట్యాంకుల ద్వారా నీటిని నింపుతున్నారు. గ్రామాలకు దూరంగా ఉన్న వాజేడు, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, పలిమెల, మహాముత్తారం అడవుల్లో సోలార్‌ ఆధారిత బోర్లు ఏర్పాటు చేశారు. ఈ బోర్లతో చుట్టుపక్కల చెక్‌ డ్యామ్‌లు, నీటి గుంతలు, నీటితొట్టే (సాసర్‌) లతో నీటిని నింపుతున్నారు. వారానికి ఒకటి రెండు సార్లు తప్పకుండా నీటిని నింపేలా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారని ఓ అటవీశాఖ అధికారి తెలిపారు. వన్యప్రాణులకు అడవిలో నీటిని అందించటంతో నీటి జాడలు వెతుక్కుంటూ గ్రామాల్లోకి వచ్చే అవకాశం తగ్గుతుందని అధికారులు పేర్కొంటున్నారు. పైగా నీటి లభ్యత ఉండే ప్రాంతాల్లో గడ్డి కూడా మొలిచే అవకాశం ఉంటుందని, ఈ గడ్డి జంతువులకు ఆహారంగా ఉపయోగ పడుతుందని భావిస్తున్నారు. అలాగే వన్య ప్రాణులు ఆకలి, దప్పిక కోసం ఎంచుకున్న ప్రదేశాల్లో కృత్రిమంగా నీరునిల్వ ఉండేలా చెక్‌డ్యాంలు నిర్మించారు. నీటి వనరులు లేని చోటబోర్లు వేసి సోలార్‌తో నడిచే మోటర్లను బిగిస్తున్నారు. తద్వారా వన్యప్రాణుల కోసం నీరు, గడ్డి కొరత తీర్చగలుగుతున్నారు.
వేటగాళ్లకు పండుగే..
వేసవి వచ్చిందంటే వేటగాళ్లకు పండుగే. వేసవిలో నీటి లభ్యత ఉండే ప్రాంతాలపై వేటగాళ్లు దృష్టి సారిస్తారు. గోదావరి తీరంతో పాటు అడవుల్లో నీటి లభ్యత ఎక్కువగా ఉండే ప్రాంతాలలో వేటగాళ్లు ఉచ్చులు, వలలు వేయటంతో పాటు బాణాలు, నాటు తుపాకీలు, మందుగుండు సామగ్రితో జంతువులపై దాడికి వ్యూహలు అమలు చేస్తుంటారు. అడవిశాఖ అధికారులు వన్యప్రాణుల కోసం అడవిలో ఏర్పాటు చేసే నీటి గుంటలు, చెక్‌ డ్యామ్‌లు, సాసర్‌లు, సోలార్‌ బోర్ల సమీపంలోను వేటగాళ్లు దాడులకు పాల్పడుతుంటారు. దీనికి చెక్‌పెట్టి వన్యప్రాణులను కాపాడేందుకు అటవీశాఖ అధికారులు అడవుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పలిమెల, మహదేవపూర్‌, మహముత్తారం, తాడ్వాయి, ఏటూరునాగారం, కన్నాయిగూడెం,వాజేడు అడవి ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశా రు. వీటితో పాటు ఏటూరునాగారం అభయారణ్యం, పలిమెల, మహముత్తారం అడవుల్లో బెస్‌ క్యాంపులతో పాటు రాత్రి వేళల్లో ప్లాయింగ్‌ స్క్వాడ్‌లు తిరిగేలా ప్రణాళిక రూపొందించారు. ఇటీవల కాలంలో ములుగు, భూపాలపల్లి జిల్లాలో పలుచోట్ల అడవి జంతువు లను వేటాడిన వారిని అడవిశాఖ అధికారులు పట్టుకున్నారు. సీసీ కెమెరాలతో పర్యవేక్షణ వన్యప్రాణులకు రక్షణ కవచంగా మారిందనే టాక్‌ వినబడుతోంది…
అటవీశాఖ అధికారుల చర్యలు ఇంతేనా..
జనవరి నెల వచ్చిందంటే అటవీశాఖ అధికారులు వరల్డ్‌ వ్డైల్లఫ్‌ నిధులతో వన్య ప్రాణుల దాహార్తిని తీర్చేందుకు నిధులు కేటాయిస్తారు. ఇందులో భాగంగా ప్రత్యేక నీటి వసతి ఏర్పాటు- చేయాలి. ఆయా అటవీ రేంజ్‌లలో క్రూ త్రీయ సాసర్‌ పిట్‌లను నిర్మించి వాటిని నీటితో నింపాలి, జంతువుల శరీరాలు జీర్ణ వ్యవస్థ శరీరంలో నీటి శాతం తగ్గకుండా సాల్‌ టు లిరిక్స్‌ (ఉప్పు దిమ్మలను) ఏర్పాటు చేస్తూ 24 గంటలు సిబ్బంది పెట్రోలింగ్‌ చేస్తూ వాటి కదలికలను గమనిం చాలని ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న వేసవి కాలంలో వేటగాళ్లు మాటువేసి జంతువులను మట్టి పెడుతున్నారు.
పక్షులు,పశువులు ఇతర జీవుల కోసం నీరు అందుబాటులో ఉంచండిసెల్వి, సిస్టర్‌, విశాఖ మరియా మేక్స్‌
పక్షులు, పశువులు ఇతర జీవుల కోసం నీరు అందుబాటులో ఉంచండి అని ఆరిలోవ లోని విశాఖ మరియా మేక్స్‌ సంస్థ ప్రతినిధి సిస్టర్‌ సెల్వి పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం ఉదయం సంస్థ కార్యాలయం వద్ద ఎకో వైజాగ్‌ జివిఎంసిలో భాగంగా గ్రీన్‌ క్లైమేట్‌ టీం ఎన్‌ జిఒ పక్షులు, జంతువులు, ఇతర జీవుల కోసం నీరు ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ ఎకో వైజాగ్‌ గురించి 5వేల కుటుంబాలకు అవగాహన కల్పించేందుకు కృషి ప్రారంభించామన్నారు. ఈ వేసవిలో పక్షులు, పశువులు ఇతర జీవుల కోసం నీరు అందుబాటులో ఉంచాలన్నారు. విశ్వం లో ఇంత వరకూ శాస్త్రవేత్తల పరిశో ధనల ప్రకారం ఒక్క భూగోళం మీద మాత్రమే జీవరాశి ఉందన్నారు. మానవాళి మనుగడ సమస్త జీవరాసులతో పెనవేసి ఉందని,ఏజీవి అంతరించినా దాని ప్రభావం మానవాళి మను గడకు ఇబ్బంది కలిగిస్తుంది అని హెచ్చరిం చారు. ఏక్షన్‌ ఎయిడ్‌ ఫెలోషిప్‌ ప్రతినిధి కృష్ణకుమారి మాట్లాడుతూ పిచ్చుకల పరిరక్షణకు గూళ్ళు ఏర్పాటు చేయాలని, ధాన్యం, చిరుధాన్యాలు అందుబాటులో ఉంచా లని కోరారు. ప్రతి ఒక్కరూ తాము తినే పండ్ల విత్తనాలు ఆర బెట్టండి.వర్షాకాలంలో కొండల్లో జల్లుదాం అని ఆయన కోరారు. పండ్లు జాతి మొక్కలు, ఔషధ గుణాలు కలిగి ఉన్న మొక్కలు, పక్షులు, జంతువులకు ఆహారం అందించే, ఆశ్రయానికి ఉపకరించే చెట్లు అధికంగా పెంచాలని కోరారు. గ్రీన్‌ క్లైమేట్‌ టీం ఎన్‌జి ఒ వ్యవ స్థాపక కార్యదర్శి జెవి రత్నం మాట్లా డుతూ జల వనరులు దుర్వినియోగం కాకుండా చర్యలు చేపట్టాలనిలని, ప్రతి ఒక్కరికీ అవగా హన కల్పించేందుకు కృషి చెయ్యాలి అని ఆయన కోరారు. బెంగళూరు లో ప్రజలు నీటి కోసం అల్లల్లాడి పోతున్నారని, ఆ పరిస్థితి విశాఖ నగరంలో రాకముందే అందరూ భూగర్భ జలాలు పెంపొందించేందుకు కృషి చెయ్యాలి అని అన్నారు. నీరు, చిరుధాన్యాలు పక్షులు జంతువులకు అందుబాటులో ఉంచే మీ పిల్లలు, మనవళ్ళ ఫొటోలు, మీ ఇంటి వద్ద నీరు తాగుతున్న, ఆహారం తింటున్న పశు, పక్ష్యాదుల ఫొటోలు మీ స్టేటస్‌ లో పెట్టండి, మీ మిత్రులకు, బంధువులకు షేర్‌ చేయమని చెప్పండి అన్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టి ప్రతి ఒక్కరినీ స్పందింప చేయండి అని కోరారు. -(జి.ఎ.సునీల్‌ కుమార్‌)

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌..

‘ఈ చట్టం అమలైతే అన్ని రకాల భూముల రికార్డుల స్థానంలో ఒకే ఒక టైటిల్‌ రిజిస్టర్‌ వస్తుంది. వ్యవసాయభూమి,వ్యవయేతర భూమి, ఆ భూమి ఏశాఖదైనా,ఏవ్యక్తిదైనా, ఏభూమైనా సరే దాని హక్కుదారు ఎవరనేది ఒకే రిజిస్టర్‌ లో ఉం టుంది. వేర్వేరు రికార్డుల్లో ఉన్న పేర్లలో పలు వ్యతాసాలు, తేడాలు,తప్పులు, ఇతర సమస్యలన్నీ కొత్త చట్టం వస్తే పరిష్కారమవు తాయి.ఈ టైటిల్‌ రిజిస్టర్‌నే చట్ట పరంగా కన్‌క్లూజివ్‌ రికార్డు అని పిలుస్తారు.అదే తుది రికార్డు కింద లెక్క..ప్రస్తుతం ఉన్నవన్నీ ప్రిజెంటివ్‌ రికార్డులు మాత్రమే.వాటిని ఎవరైనా తమదని చెప్పి కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది.ఒకసారి కన్‌క్లూజివ్‌ రికార్డు తయారైతే దానిపై ఎవరూ అభ్యంతరం చెప్పడానికి ఆస్కారం ఉండదు..’
ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌-2023ను రాష్ట్రంలో ఎంపిక చేసిన 16రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు.ఈ మేరకు ఏపీ రిజిస్ట్రేషన్‌ కమిషనర్‌ ఇటీవలే ఆదేశాలు జారీ చేశారు. ఎంపిక చేసిన ఈ16 సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసుల పరిధిలో స్థిరాస్తుల కొనుగోలుదారులకు ఒరిజినల్‌ డాక్యుమెంట్లకు బదులు జిరాక్స్‌ పత్రాలు ఇచ్చేలా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై వివాదం రాజుకుంటోంది. దేశంలో తొలిసారి అమలవు తోన్న ఈచట్టం వల్ల తమ భూములకు రక్షణ లేకుండా పోతుందనే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది.ఈ చట్టం భూకబ్జాదారులకు వరంగా మారుతుందని విపక్షాలు ఆరోపిస్తు న్నాయి. అధికారులు చేసిన తప్పిదాల కారణంగా.. స్థిరాస్తుల వివాద పరిష్కారం కోసం కోర్టులకు వెళ్లిన ప్రజలు..ఇప్పుడు పరిష్కారం కోసం తిరిగి అధికారుల దగ్గరకే వెళ్లాల్సి వస్తోందని లాయర్లు ఆరోపిస్తున్నారు. పారిశ్రామికవేత్తలు పెద్ద మొత్తంలో భూములను సేకరించాలనుకుంటే..ఇబ్బందులు తలెత్తుతు న్నాయనే ఉద్దేశంతో..భూమిపై వివాదాలు కోర్టుల పరిధిలో ఉండొద్దనే ఉద్దేశంతో కేంద్రం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని న్యాయవాదులు చెబుతున్నారు. భూమి క్రయవిక్రయాల సమయంలో జరిగే అవకతవకలను ట్రైబ్యు నళ్లలో ప్రభుత్వం నియమించే టీఆర్వోలు పరిష్కరిస్తారని ప్రభుత్వం చెబుతుండగా..దీని వల్ల ప్రజలకు లాభం కంటే నష్టమే ఎక్కువని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
మీ భూమి మీది కాకుండా పోతుందా..?
‘‘మీ పేరు మీదున్న భూమి..తెల్లారే సరికే వేరే ఎవరి పేరు మీదో మారుతుంది.. మీ ఆస్తులకు మీరు యజమాని కాకుండా పోతారు.. భూయాజమాన్య వివాదాలపై విచారణ జరిపి తీర్పులిచ్చే అధికారం సివిల్స్‌ కోర్టులకు లేకుండా చేశారు.. కేవలం అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ను మాత్రమే ఆశ్రయించాలి. మీ భూమి ఎవరి పేరిట మారిందనేది మీకు మీరుగా తెలుసుకోవాలి. 90రోజుల్లోగా తెలుసు కోలేకపోతే ఇక అంతే సంగతులు’’ అని ప్రచారం చేస్తున్న విపక్షం ప్రజల ఆందోళనను మరింత పెంచుతోంది. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ కారణంగా పట్టాదారు పాస్‌ బుక్‌, అడంగల్‌ లాంటి రెవెన్యూరికార్డులు ఎందుకు పని రాకుండా పోతాయని..ఈ ఆధారాలు ఏవీ లేకుండాపోతే..భూములు ఎవరి చేతుల్లోకైనా వెళ్లే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.చిన్న, సన్నకారు రైతుల దగ్గర్నుంచి భూములను చట్ట ప్రకారం కొట్టే యడానికి వైసీపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది..తాము అధికారంలోకి వచ్చాక ఈ చట్టం లేకుండా చేస్తామని విపక్ష కూటమి చెబుతోంది.
ప్రభుత్వం ఏం చెబుతోందంటే..?
అయితే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ విషయంలో ప్రభుత్వ స్పందన మరోలా ఉంది.ఈ చట్టం అమల్లోకి వస్తే 99 శాతం భూవివాదాలు పరిష్కారం అవుతాయని ప్రభుత్వం చెబుతోంది. ఈ చట్టం అమల్లోకి వస్తే వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమి.. ఇలా అన్ని రకాల భూములకు సంబంధించి ఒకే ఒక టైటిల్‌ రిజిస్టర్‌ వస్తుందని సర్కారు చెబుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో భూములకు సంబంధించి 30కిపైగా రికార్డులున్నాయి.అయితే ఈ రికార్డుల్లో పేరున్నా..వేరే వ్యక్తులు భూమి తమ దని అప్పీల్‌ చేసుకునే అవకాశం ఉందని.. కానీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ అమల్లోకి వస్తే భూమి యజమానులకు భరోసా వస్తుందని ప్రభుత్వం చెబుతోంది. వివాదాలు ఉన్న భూములను ప్రత్యేకంగా వివాదాల రిజిస్టర్‌లో నమోదు చేస్తారని.. అభ్యంతరాలు లేని పేర్లే టైటిల్‌ రిజిస్టర్‌లో నమోదు చేస్తారని.. వివా దాల పరిష్కారం కోసం జిల్లా స్థాయిలో ఒక ట్రైబ్యునల్‌, రాష్ట్ర స్థాయిలో మరో ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్ర ట్రైబ్యునల్‌ తీర్పు మీద అభ్యంతరాలు ఉంటే హైకోర్టును ఆశ్రయించొచ్చని చెబుతోంది.ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ప్రకారం భూ యజమానిని ఒకసారి నిర్ధారిస్తే అదే ఫైనల్‌ అని..భూ వివాదం కారణంగా భూము లను కోల్పోయే అవకాశం ఉండదని ప్రభుత్వం చెబుతోంది. టైటిల్‌ రిజిస్టర్‌లో పేరు నమోదైన తర్వాత.. రెండేళ్లలోపే అభ్యంతరాలు వ్యక్తం చేయాలని.. ఒకవేళ రెండేళ్లలోపు అభ్యంత రాలేవీ లేకపోతే..ఆతర్వాత కోర్టుకు వెళ్లే అవ కాశం కూడా ఉండదని ప్రభుత్వంచెబుతోంది. మార్చి తొలి వారంలో ప్రభుత్వం ప్రధాన సలహాదారు అజయ్‌ కల్లం ఈచట్టం గురించి మాట్లాడుతూ..దేశంలోని 12రాష్ట్రాలు ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను అమలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయన్నారు.ఈచట్టం అమల్లోకి వస్తే ఎవరైనా భూరికార్డుల్లో మార్పులు చేయాలని భావిస్తే..వెంటనే ప్రభుత్వానికి సమాచారం అందుతుందని..దీంతో తప్పులు జరిగేందుకు అవకాశం ఉండదన్నారు.
మరి ఈ విషయాల సంగతి ఏంటి..?
అయితే టీఆర్వోలుగా ఎవరిని నియమిస్తారు..? దీనికి సంబంధించిన మార్గదర్శకాలేంటి..? ఈ ట్రైబునళ్లు స్వయంప్రతిపత్తితో పని చేయ గలవా..?ప్రభుత్వంలోని కీలక నేతల నుంచి వచ్చే ఒత్తిళ్లను టీఆర్వోలు ఎలా అధిగమి స్తారు..?కోర్టుల పరిధి నుంచి భూ వివాదాలను తప్పించడం వల్ల తలెత్తే పర్యవసనాలేంటి..? భూ యజమాన్య హక్కులు మారినప్పుడు.. పాత యజమానికి సమాచారం ఇస్తారా..?యజ మానికి వేరే ప్రదేశంలో ఉంటే ఎలా..?ఇలా చాలా ప్రశ్నలకు సమాధానం ఇస్తేనే..ఈ చట్టం పట్ల ప్రజల్లో నమ్మకం కలుగుతుంది. ప్రజలకు పూర్తి అవగాహన వచ్చాకే ఇలాంటి చట్టాలను అమలు చేస్తే అటు ప్రజలు, ఇటు అధికారంలో ఉన్నవారికి కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండ వనే భావన వ్యక్తం అవుతోంది.
ఈ చట్టం అమలైతే అన్ని రకాల భూముల రికార్డుల స్థానంలో ఒకే ఒక టైటిల్‌ రిజిస్టర్‌ వస్తుంది. వ్యవసాయ భూమి,వ్యవసాయేతర భూమి,ఆ భూమి ఏ శాఖదైనా,ఏ వ్యక్తిదైనా, ఏ భూమైనా సరే దాని హక్కుదారు ఎవరనేది ఒకే రిజిస్టర్‌లో ఉంటుంది.వేర్వేరు రికార్డుల్లో ఉన్న పేర్లలో పలు వ్యత్యాసాలు, తేడాలు, తప్పులు, ఇతర సమస్యలన్నీ కొత్త చట్టం వస్తే పరిష్కార మవుతాయి. ఈ టైటిల్‌ రిజిస్టర్‌నే చట్ట పరంగా కన్‌క్లూజివ్‌ రికార్డు అని పిలుస్తారు. అదే తుది రికార్డు కింద లెక్క. ప్రస్తుతం ఉన్నవన్నీ ప్రిజెం టివ్‌ రికార్డులు మాత్రమే. వాటిని ఎవరైనా తమదని చెప్పి కోర్టుకు వెళ్లే అవకాశం ఉం టుంది. ఒకసారి కన్‌క్లూజివ్‌ రికార్డు తయారైతే దానిపై ఎవరూ అభ్యంతరం చెప్పడానికి ఆస్కారం ఉండదు. దేశంలోనే మొట్ట మొదటి సారిగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంతో రాష్ట్రంలో భూముల చరిత్రలో కొత్త శకం నమోదు కానుంది.భూ యజమానులకు భరోసా ఇచ్చే ఈ చట్టాన్ని తేవడానికి దేశంలోని పలు రాష్ట్రాలు చాలా ఏళ్లుగా చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో దీన్ని సాధ్యం చేసి చూపించింది. అత్యంత సంక్లిష్టమైన భూ హక్కులచట్టం తెచ్చిన మొట్ట మొదటి రాష్ట్రంగా చరిత్ర సృష్టించింది.వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2019 జూలైలో ల్యాండ్‌ టైట్లింగ్‌ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపింది. పలు మా ర్పుల తర్వాత ఇటీవలే దానికి కేంద్రం ఆమోద ముద్ర వేసింది. వాస్తవానికి అన్ని రాష్ట్రాల్లో ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం తేవాలని కేంద్ర ప్రభుత్వం చాలా సంవత్సరాలుగా చెబుతోంది. ఈ ఆలోచనలను అందిపుచ్చుకుని దాన్ని ఆచర ణలోకి తీసుకు రావడంలో ఆంధ్రప్రదేశ్‌ సఫలీ కృతమైంది. గత నెల అక్టోబర్‌ 31వ తేదీ నుంచి ఏపీ ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌-2023 అమల్లోకి వచ్చింది.
ప్రస్తుత వ్యవస్థలో భూమి హక్కులకు సంబంధించి రాష్ట్రంలో 30కిపైగా రికార్డు లున్నాయి. గ్రామ స్థాయిలో 1బీ,అసైన్‌మెంట్‌, ఈనాం వంటి 11రిజిష్టర్లు ఉన్నాయి. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో కొన్ని, సర్వే కార్యాల యంలో మరికొన్ని, సబ్‌ రిజిస్ట్రార్‌, పంచా యతీ, మున్సిపాల్టీ కార్యాలయాల్లో భూములకు సంబంధించి వివిధ రికార్డులను నిర్వహిస్తు న్నారు.అటవీ, దేవాదాయ,వక్ఫ్‌ వంటి పలు శాఖల్లోనూ భూముల రికార్డులు ఉన్నాయి. ఇన్ని రికార్డులు ఉన్నా, చట్టపరంగా ఏదీ కూడా తుది రికార్డు కాదు. ఈ రికార్డుల్లో పేరున్నా వేరే వాళ్లు అది తనదని అప్పీల్‌ చేసుకునే అవ కాశం ఉంది. భూ యజమానికి తన భూమి తనదనే పూర్తి భరోసా లేదు. టైట్లింగ్‌ చట్టంలో భూ యజమానులకు తమ భూములపై భరోసా వస్తుంది.
వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునళ్ల వ్యవస్థ భూములకు సంబంధించి ఏవైనా వివాదాలు ఉంటే వాటిని ప్రత్యేకంగా వివాదాల రిజిస్టర్‌లో నమోదు చేస్తారు. ఎటువంటి అభ్యంతరాలు లేని పేర్లే టైటిల్‌ రిజిస్టర్‌లో ఉంటాయి. వివా దం ఉన్న భూముల వివరాలను వివాదాల రిజిస్టర్‌లో నమోదు చేస్తారు.ఈ చట్టం ప్రకా రం టైటిల్‌ నిర్ధారించే క్రమంలో భూ సమస్య లు ఏర్పడితే పరిష్కారం కోసం ట్రిబ్యునళ్ల వ్యవస్థ ఏర్పాటవుతుంది.ప్రస్తుత వ్యవస్థ మాది రిగా రెవెన్యూ,సివిల్‌ కోర్టులకు వెళ్లే అవకాశం ఉండదు.జిల్లా స్థాయిలో ఒక ట్రిబ్యునల్‌,రాష్ట్ర స్థాయిలో ఒక ట్రిబ్యునల్‌ ఏర్పాటవుతుంది. రాష్ట్ర స్థాయి ట్రిబ్యునల్‌ తీర్పు మీద అభ్యం తరం వస్తే అప్పుడు హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది.అంతేతప్ప కింది స్థాయిలో ఏ రెవె న్యూ అధికారికి,ఏ సివిల్‌ కోర్టుకీ వివాదాన్ని పరిష్కరించే అధికారాలు ఉండవు. ఈ చట్టం ప్రకారం భూమి యజమానిగా ఒకసారి నిర్ధారణ అయితే అదే ఫైనల్‌.ఆ భూమి వివాదంలో పడి భూములు కోల్పోయే పరిస్థితులు ఉండవు. టైటిల్‌ రిజిస్టర్‌లో పేరు నమోదయ్యాక ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే రెండు సంవత్సరాల లోపే చెప్పాలి. రెండేళ్ల లోపు ఎటువంటి అభ్యంతరం రాకపోతే ఆ తర్వాత కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉండ దు. టైటిల్‌ నిర్థారణ అయిన రెండేళ్లలోపే దాన్ని ఛాలెంజ్‌ చేయాలి.అలా చేయని పక్షంలో టైటిల్‌ రిజిస్టర్‌లో ఉన్న పేరే ఖరారవుతుంది.
భూ యజమాని హక్కులకు పూచీ ప్రభుత్వానిదే
టైటిల్‌ రిజిష్టర్‌లో నమోదైన వివరాలకు ప్రభు త్వం పూర్తి బాధ్యత వహిస్తుంది.ప్రస్తుతం రికార్డులో ఉన్న వివరాలకు ప్రభుత్వ గ్యారంటీ లేదు.1బిలో ఉన్నా,అడంగల్‌లో ఉన్నా, ఆర్‌ఎస్‌ ఆర్‌లో ఉన్నా ప్రభుత్వ గ్యారంటీ ఉండదు.ఈ గ్యారంటీ లేకపోవడాన్నే ప్రిజెంటివ్‌ రైట్స్‌ అనేవారు.1బిలో ఉన్న పేరుపైన ఎవరైనా కోర్టుకు వెళ్లి అది తప్పని నిరూపించే వరకు అది కరెక్ట్‌ అని భావించేవారు. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పుల్లో రెవెన్యూ రికార్డుల్లో పేరున్నంత మాత్రాన అతను భూ యజమాని కాదని, రెవెన్యూ రికార్డులు యాజ మాన్య హక్కులకు సాక్ష్యంగా పనికి రావని స్పష్టం చేసింది. ఎందుకంటే అవన్నీ శిస్తు వసూలు చేయడానికి బ్రిటీష్‌ హయాం నుంచి రాసిన లెక్కల పుస్తకాలు.అందులో పన్ను ఎంత కట్టాలో ఉంటుంది తప్ప ఆభూమి ఎవరిదో ఉండదు. టైటిలింగ్‌ చట్టం కింద రూపొందిన రిజిస్టర్‌ ప్రకారం ప్రిజెంటివ్‌ రికార్డు వ్యవస్థ స్థానంలో టైటిల్‌ గ్యారంటీ వ్యవస్థ వస్తుంది. పాత రికార్డులేవీ చెల్లవు. భూమి హక్కుల చరిత్ర కొత్తగా మొదలవుతుంది. ఒకసారి టైటిల్‌ రిజిస్టర్‌లో పేరు వచ్చిన తర్వాత ఏదైనా నష్టం జరిగిందని భూయజమాని నిరూపించుకోగలిగితే బీమా సైతం ఇస్తారు. భూమి హక్కులకు ఇబ్బంది కలిగితే టైటిల్‌ ఇన్సూరెన్స్‌ ఇవ్వాలని చట్టంలో పేర్కొన్నారు. టైటిల్‌ రిజిస్టర్‌గా మారనున్న ఆర్‌ఓఆర్‌ రికార్డు
ఈ చట్టం అమలు కోసం రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖల్లో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంది.ఆ శాఖలను పునర్వ్యవస్థీకరించాల్సి ఉంటుందని భావిస్తున్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో టైటిల్‌ గ్యారంటీ అథారిటీలు ఏర్పాటవుతాయి. టైటిల్‌ రిజిస్టర్‌లను నిర్ధిష్ట విధానంలో ఈ అథారిటీలే ఖరారు చేస్తాయి. వారి ఆధ్వర్యంలోనే రిజిస్టర్‌లు నిర్వహిస్తారు. భూముల రిజిస్ట్రేషన్‌ ఎక్కడైనా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇప్పటి వరకు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో దస్తావేజుల రిజిస్ట్రే షన్‌ మాత్రమే జరుగుతోంది. హక్కుల రిజిస్ట్రే షన్‌ జరగడం లేదు.
పాత వ్యవస్థ స్థానంలో టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ వ్యవస్థ వస్తుంది. భూముల రిజిస్ట్రేషన్‌ జరుగుతున్నప్పుడే టైటిల్‌ వెరిఫికేషన్‌ నిర్వహిస్తారు.అమ్మేవాడికి టైటిల్‌ ఉంటేనే కొనేవాడికి వస్తుంది.రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో టైట్లింగ్‌ అథారిటీలు,గ్రామ స్థాయి నుంచి పై వరకు రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు,భూ వివా దాల పరిష్కారానికి ట్రిబ్యునల్‌ వ్యవస్థలు ఏర్పాటవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న భూముల రీ సర్వేలో తయారవుతున్న కొత్త రికార్డులను ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం కింద నోటిఫై చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం రీ సర్వేలో రూపొందించిన డిజిటల్‌ రికార్డులను ఆర్‌ఓఆర్‌ (రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌) చట్టం కింద నోటిఫై చేస్తున్నారు. టైటిల్‌ గ్యారంటీ చట్టం ప్రకారం ఆర్‌ఓఆర్‌ రికార్డు టైటిల్‌ రిజిస్టర్‌గా మారుతుందని చెబుతున్నా­రు.ఎంతో ప్రతిష్టా త్మకమైన ఈచట్టం ఇప్పటికే అమల్లోకి వచ్చింది.ఈ నేపథ్యంలో ప్రభుత్వం త్వరలో విధివిధానాలు రూపొందించనుంది.
గొప్ప ముందడుగు
ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం తేవడం చాలా గొప్ప ముందడుగు.రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది. టైటిల్‌కు భద్రత ఉంది కాబట్టి వేరే ప్రాంతంలో ఉన్న వాళ్లు కూడా ఆంధ్రాలో భూమి కొనుక్కునే ప్రయత్నం చేస్తారు.వివాదాలు తగ్గిపోయి ఆర్థిక ప్రగతి బాగా పుంజుకుంటుంది.భూ యజమానికి భరోసా ఉంటుంది. ఈ ఫలితాలు అందరికీ దక్కాలంటే ప్రభుత్వం పలు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి.దీనిపై ప్రజలకు విస్తృతమైన అవగాహన కల్పించాలి.ఇది ఒక ల్యాండ్‌ మార్క్‌ చట్టం కాబట్టి ఇందులో కొన్ని ఇబ్బం దులు కూడా ఉంటాయి. చట్టం అమలు లో పేదల కోసం పారా లీగల్‌ వ్యవస్థ వంటిది ఏర్పాటు చేసుకోవాలి. ఈ చట్టాన్ని అమలు చేసే యంత్రాంగానికి పూర్తి స్థాయిలో రీఓరి యెంటేషన్‌ అవసరం. ఇది ఆర్‌ఓఆర్‌ చట్టం లాంటిది కాదు. దీనిపై అధికారులకు పూర్తి అవగాహన కల్పించాలి. ఇవన్నీ చేస్తే ఐదేళ్లలో ఆర్థిక ప్రగతిలో ఏపీ అద్భుతంగా దూసుకుపోయే అవకాశం ఉంటుంది.-వ్యాసకర్త : భూ చట్టాల నిపుణుడు, నల్సార్‌ లా వర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌-(ఎం. సునీల్‌కుమార్‌)

తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ భగలు

భానుడు నిప్పులు కురిపిస్తూనే ఉన్నాడు. మధ్యలో ఒకసారి పలుచోట్ల జల్లుల పడి కాస్త ఉపశమనం ఇచ్చినా మళ్లీ బాదుడు కొన సాగుతూనే ఉన్నది. మే నెలంతా ఈ మండే ఎండలు తప్పవని, ఆతర్వాత కాస్త మళ్లీ జల్లులు కురిసే అవకాశం ఉన్నదని ఐఎండీ అంచనా వేసింది. ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్‌ మార్క్‌ను దాటొచ్చని పేర్కొంది. వేసవి ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు ఉదయించిన గంటల వ్యవధిలోనే తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మధ్యాహ్నం కాకముందే మాడు పగిలిపోయే నిప్పులు కురిపి స్తున్నాడు. వీటికితోడు వడగాలులు కూడా వీయడంతో దప్పికలు,నీరసం,డీహైడ్రేషన్‌లు వెంటనే చుట్టుముడుతున్నాయి. అందుకే అవసరం ఉంటే తప్పితే గడప బయట కాలు పెట్టొద్దని హెచ్చరికలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా వృద్ధులు,చిన్నారులు ఇంటి పట్టునే ఉండటం మంచిది. తాజాగా,వాతావరణ శాఖ మరో హాట్‌ న్యూస్‌ చెప్పింది. ఈఏడాది టెంపరేచర్‌లు రికార్డులు బ్రేక్‌ చేస్తాయని ఐఎండీ అంచనాలు వేసింది. ఈఏడాది వేసవి తాపం 50 డిగ్రీల సెల్సియస్‌లు దాటొచ్చని పేర్కొంది. ఇప్పటికే ఉష్ణోగ్రతలు దారుణంగా పెరిగాయని,పలు ప్రాంతాల్లో 45డిగ్రీల సెల్సి యస్‌లు క్రాస్‌ చేసి టెంపరేచర్‌లు రికార్డు అవుతున్నాయని ఐఎండీ తెలిపింది. వడగా లులు కూడా https://dhimsa.net/wp-admin/post.php?post=2563&action=editభయంకరంగా వీస్తున్నాయి. సాధారణంగా మే నెలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని, ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మెటీయరాలజీ డాక్టర్‌ ఎం మోహపాత్రా తెలిపారు. కాబట్టి,పశ్చిమ రాజస్తాన్‌లోఉష్ణోగ్ర తలు 50డిగ్రీల సెల్సి యస్‌లను తాకొచ్చని వివరించారు. ఓప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మోహపాత్రా మాట్లాడుతూ,పశ్చిమ మధ్య భారతం, వాయవ్య భారతంలోనూ సాధారణానికి మించి టెంప రేచర్‌లు రికార్డు అవుతాయని తెలిపారు.ఉత్తర, ఈశాన్య భారతంలోనూ సాధారణానికి మించి వేడిగా రోజులు గడవచ్చని వివరించారు. మన దేశంలో పలుచోట్ల ఉష్ణోగ్రతలు 46డిగ్రీల సెల్సియస్‌ మార్క్‌ను దాటేశాయి. కాగా,ఏప్రిల్‌ నెలలో యూపీలో అలహాబాద్‌ (46.8డిగ్రీలు), రaాన్సీ(46.2డిగ్రీలు), లక్నో (45.1డిగ్రీలు)లు ఆల్‌ టైం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వీటితోపాటు హర్యానాలోని గురుగ్రామ్‌ (45.9 డిగ్రీలు), మధ్యప్రదేశ్‌ సత్నా (45.3 డిగ్రీలు)లు ఆల్‌ టైం హై టెంపరేచర్‌లు ఈ నెలలో రికార్డ్‌ చేశాయి. ఇక మే నెలలో అంచనాలు చూస్తే.. మే నెలలో దేశంలో చాలాచోట్ల సాధారణం నుంచి సాధారణాని కంటే గరిష్టంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అంచనా.దేశాన్ని భారీ ఉష్ణోగ్రతలు వణికిస్తున్నాయి. ఏప్రిల్‌లో సగటు ఉష్ణోగ్రతలు122ఏళ్ల రికార్డును బ్రేక్‌ చేసి నట్టు భారత వాతావరణశాఖ వెల్లడిరచింది. మే నెలలో ఉత్తర భారతంలో ఉష్ణోగ్రతలు 50డిగ్రీలు దాటిపోయే అవకాశం ఉందని పేర్కొంది. హీట్‌వేవ్‌ నేపథ్యంలో ఏప్రిల్‌ నెల ఉష్ణోగ్రతలు రికార్డుల మోత మోగించాయి. వాయువ్య భారతం,మధ్య భారతంలో ఉష్ణోగ్ర తలు సగటున 35.90డిగ్రీలు,37.78డిగ్రీలు నమోదయ్యాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా విద్యుత్‌ డిమాండ్‌ భారీగా పెరిగిందని, ఫలి తంగా దేశంలో పవర్‌ కట్‌లు పెరిగాయని పేర్కొంది. దేశరాజధాని ఢల్లీిలోఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయని,72ఏళ్ల రికార్డు..దేశంలో హీట్‌వేవ్‌ పరిస్థితులపై యూఎన్‌ ఏజెన్సీ డబ్ల్యూఎంఓ ఆందోళన వ్యక్తం చేసిందని వివరించింది.
మునుపెన్నడూ లేనంత వేడిగాలు
మానవుని కార్యకలాపాలవల్ల ఏర్పడిన గ్లోబల్‌ వార్మింగ్‌తో ప్రాణహాని సంభవిస్తోంది. ఇది ఇప్పటికే రుజువైన సత్యం కూడా. గ్లోబల్‌ వార్మింగ్‌ వల్ల ప్రపంచవ్యాప్తంగా పక్షులు, జంతువుల మనుగడ కష్టతరమౌతోంది. దీంతో యావత్‌ జీవరాశి దెబ్బతినడంతో పాటు… మనుషుల మీద కూడా ఆ ప్రభావం పడుతుంది. గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగానే.. మన దేశంలో మే నెల రాకముందే అత్యంత తీవ్రమైన వేడిగాలులు వీస్తున్నాయి. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల కంటే.. ఉత్తరాది రాష్ట్రాల్లో మునుపెన్నడూ లేనివిధంగా తీవ్రస్థాయిలో వడగాలులు వీస్తున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడిరచింది. ఇప్పటికే దేశరాజధాని ఢల్లీిలో ఎల్లో అలర్ట్‌ అమల్లో ఉంది. ఎండ తీవ్రత ఏస్థాయిలో ఉందో దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. వాతావరణ మార్పుల వల్ల.. ప్రపంచంలోని మిగతా దేశాలకంటే.. భారతదేశమే మరిన్ని సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తు న్నారు. ఇక భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపిన వివరాల ప్రకారం.. రాబోయే రోజుల్లో సగటు గరిష్ట ఉష్ణోగ్రత 4.5-6.4 డిగ్రీల సెల్సియస్‌ నమోదవుతుందని అంచనా వేసింది. బహుశా మైదాన ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్‌, తీర ప్రాంతాల్లో 37 డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువగా వేడిగాలులు వీస్తాయని ఐఎండి పేర్కొంది.గత కొన్ని సంవత్సరాలుగా దేశ రాజధాని ఢల్లీి ఉష్ణోగ్ర తలను పరిశీలిస్తే..1981-2010ల మధ్య గరిష్టంగా 39.5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదయితే…ఈ సంవత్సరం ఏప్రిల్‌ 28 నుండే.. అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతోంది. రోజువారీగా సగటున 44 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదవుతున్నదని, ఇలా కొద్దిరోజులపాటు అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశముందని ఐఎండి తెలిపింది. అందుకే ఢల్లీిలో ఎల్లో అలర్ట్‌ను ప్రభుత్వం జారీ చేసింది. ఇక 1979 నుండి 2017 వరకు సేకరించిన వాతావారణ సమాచారం మేరకు..’తూర్పు తీర ప్రాంత భారతదేశం, వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో అత్యధికంగా 31 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైనట్లు న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితిని పరిశీలిస్తే.. ఇప్పటికే మధ్య అమెరికా, ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్య, వాయువ్య-ఆగేయ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో 35 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. 2010 కంటే.. 2023 తర్వాతి సంవత్సరాల్లో ఉష్ణోగ్ర తల్లో తీవ్రమైన మార్పులు చోటుచేసు కుంటు న్నాయని స్పష్టమవుతున్నది. ఇది భవిష్యత్‌ లో మరింత పెరిగే అవకాశముందని పరిశోధ కులు అంచనా వేస్తున్నారు. మన దేశంలో గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రభావంతో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వడం వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు సంభవిస్తోంది. పనికి వెళ్తే గాని పూట గడవని పేదలు ఎండల్లో కూడా బయటకు వెళ్లడం వల్ల.. ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే ప్రజల ప్రాణాల్ని కాపాడే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
మే నెలలో 50డిగ్రీలు…!
వేసవి కాలంలో సాధారణంగా మే నెలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. కానీ ఈసారి మార్చి నుంచే భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక ఏప్రిల్‌లో ఎండలు మరింత తీవ్రంగా ఉన్నా యి. ఇప్పుడు..మే నెలంటనే ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. ‘‘వాయువ్య భారతదేశంలోని చాలా ప్రాంతాలు హిమాచల్‌,పంజాబ్‌, హైర్యానా,రాజస్థాన్గుజరాత్‌-మేలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా.‘‘దేశంలో 2022 మేలో సగటు వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది’’ అని మోహపాత్ర చెప్పారు.అయితే, వాయువ్య మరియు ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలతో పాటు తీవ్ర ఆగ్నేయ ద్వీపకల్పంలో మేలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని మోహపాత్ర చెప్పారు. పశ్చిమ రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలలో 50డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోద వడాన్ని కూడా మోహపాత్ర తోసిపుచ్చలేదు. ఎందుకింత తీవ్రంగా ఉన్నాయి?
ఈ ఏడాది కనిపిస్తున్న ఉష్ణోగ్రతలు సాధారణం కాదు.1901 నుంచి చూస్తే, 2022 మార్చిలో అత్యంత ఉష్ణోగ్రతలు కనిపించడం ఇది మూడో సారి.ఈ ఏడాది మార్చిలో భారత్‌లో 26 రోజులపాటు వేడిగాలులు వీచాయి. తూర్పు, మధ్య,ఉత్తర భారత ప్రాంతాలకు వాతావరణ శాఖ ‘ఎల్లో అలర్ట్‌’ జారీ చేసింది.
కారణం ఏంటి?
ఈ రెండు నెలల్లో వానలు,ఉరుములతో కూడిన వర్షం, వడగళ్ల వానలు కురిసిన దాఖలాలు లేకపోవడమే ఈ అధిక ఉష్ణోగ్రత లకు ప్రధాన కారణం.గతంలో ఈ నెలల్లో సగటు వర్షపాతం 30.4మిల్లీ మీటర్లుఉండగా, ఈఏడాది కేవలం 8.9మి.మీ. వర్షపాతం మాత్రమే నమోదైంది. దేశంలోని పశ్చిమ ప్రాంతం నుంచి వచ్చే గాలులు దక్షిణ,మధ్య భారతదేశ పవనాలను తాకినప్పుడు వర్షం, తుపానులు వస్తాయి. ఈసారి అది కూడా చాలా తక్కువ. సాధార ణంగా,వడగాలులు దశ ఏప్రిల్‌ చివరిలో ప్రారంభమై మే నెలలో గరిష్ఠ స్థాయికి చేరు కుంటుంది. ఈఏడాది మార్చి 11 నుంచే హీట్‌ వేవ్‌ కనిపించింది. ఇది హోలీ పండు గకు ముందే కనిపించింది.మరోవైపు, వాతా వరణ శాస్త్రవేత్తలు మార్చి, ఏప్రిల్‌లో వీచే బలమైన వేడి గాలులు అసాధారణంగా ఉంటా యని హెచ్చరిస్తున్నారు. వాతావరణం నుండి కర్బన ఉద్గారాలను తగ్గించకపోతే, వాతావరణ మార్పుల కారణంగా ఈవేడి గాలులు వాతా వరణంలో సాధారణంగా మారిపోయే అవకాశ ముందని అంటున్నారు.వాతావరణ మార్పుల కారణంగా ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఇటువంటి తీవ్రమైన హీట్‌వేవ్‌ ఉండ వచ్చని ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌ ఇనిస్టి ట్యూట్‌కు చెందిన మరియం జకారియా, ఫ్రెడ రిక్‌ ఒట్టో చేసిన పరిశోధన చెబుతోంది. ‘‘ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరగడానికి మానవ చర్యలు కారణమవ్వడానికంటే ముందు, భారతదేశంలో మనం ఈ నెల ప్రారంభంలో చూసిన లాంటి ఉష్ణోగ్రతలను 50ఏళ్ల క్రితమే అనుభవించాం. కానీ ప్రస్తుతం ఇది సాధారణ విషయంగా మారింది. ఇది భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది’’ అని మరియం జకారియా అన్నారు. ఏది ఏమైనప్పటికీ, వాతావరణం మరియు భూ వినియోగ మార్పు గతంలో భౌగోళికంగా-వివిక్త జాతుల వన్యప్రాణుల మధ్య వైరల్‌ షేరింగ్‌ కోసం కొత్త అవకాశాలను సృష్టిస్తుంది3,4. కొన్ని సందర్భాల్లో, ఇది జూనోటిక్‌ స్పిల్‌ఓవర్‌ను సులభతరం చేస్తుంది-ప్రపంచ పర్యావరణ మార్పు మరియు వ్యాధి ఆవిర్భావం మధ్య యాంత్రిక లింక్‌. ఇక్కడ, మేము భవిష్యత్తులో వైరల్‌ షేరింగ్‌ యొక్క సంభావ్య హాట్‌స్పాట్‌లను అనుకరిస్తాము, క్షీరద-వైరస్‌ నెట్‌వర్క్‌ యొక్క ఫైలోజియోగ్రాఫిక్‌ మోడల్‌ని ఉపయోగిస్తాము మరియు 2070 సంవత్సరానికి వాతావరణ మార్పు మరియు భూ వినియోగ దృశ్యాలలో 3,139 క్షీరద జాతుల కోసం భౌగోళిక శ్రేణిని మార్చాము. ఎత్తైన ప్రదేశాలలో, జీవవైవిధ్య హాట్‌స్పాట్‌లలో మరియు ఆసియా మరియు ఆఫ్రికాలో మానవ జనాభా సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో కొత్త కలయికలలో, వాటి వైరస్‌ల యొక్క నవల క్రాస్‌-స్పీసీస్‌ ట్రాన్స్‌మిషన్‌ను 4,000 సార్లు అంచనా వేస్తుంది. వాటి ప్రత్యేకమైన చెదరగొట్టే సామర్థ్యం కారణంగా,గబ్బిలాలు నవల వైరల్‌ షేరిం గ్‌లో ఎక్కువ భాగం,మానవులలో భవిష్య త్తులో ఆవిర్భావానికి దోహదపడే పరిణామ మా ర్గాల్లో వైరస్‌లను పంచుకునే అవకాశం ఉంది. ఆశ్చర్యకరంగా,ఈ పర్యావ రణ పరివర్తన ఇప్పటికే జరుగు తోందని మేము కనుగొన్నాము శతాబ్దంలో 2ళీజకంటే తక్కువ వేడెక్కడం భవిష్యత్తులో వైరల్‌ షేరింగ్‌ను తగ్గించదు. జాతుల శ్రేణి మార్పులను ట్రాక్‌ చేసే జీవవైవిధ్య సర్వేలతో వైరల్‌ నిఘా మరియు ఆవిష్కరణ ప్రయత్నాలను జత చేయాల్సిన తక్షణ అవస రాన్ని మాపరిశో ధనలు హైలైట్‌ చేస్తాయి, ప్రత్యే కించి అత్యధిక జూనోస్‌లను కలిగి ఉన్న ఉష్ణ మండల ప్రాంతాలలో వేగవంతమైన వేడెక్కడం జరుగుతోంది.
వేడి గాలుల ప్రభావం
ఈఅధిక ఉష్ణోగ్రతల వల్ల దేశవ్యాప్తంగా విద్యు త్‌ వినియోగం అకస్మాత్తుగా,వేగంగా పెరిగింది. ప్రస్తుతం భారతదేశంలో థర్మల్‌ పవర్‌ ప్లాంట్ల లో అత్యధిక విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారు.దీంతో బొగ్గు అవసరం విపరీ తంగా పెరిగింది. డిమాండ్‌ ఒక్కసారిగా పెరగడంవల్ల బొగ్గు సరఫరాపై ఒత్తిడి పెరిగింది. బొగ్గు కొరత కార ణంగా,రాబోయే రోజుల్లో విద్యుత్‌ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడ వచ్చని దిల్లీ ప్రభు త్వం ప్రకటించింది. ఇదే జరిగితే మెట్రో రైళ్లు, ఆసుపత్రుల వంటి ముఖ్యమైన సేవలపై కూడా ప్రభావం చూపు తుందనేది ఆందోళన కలిగించే అంశం.‘‘వేడి పెరిగినప్పుడల్లా బొగ్గు సరఫరాపై ప్రభావం పడుతోంది. కానీ రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్‌ వినియోగం,ఆ స్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తి పెరగకపోవడం,డిమాండ్‌-సరఫరా మధ్య అంతరం పెరగడం సహజం’’ అని ఎన్‌టీపీసీ మాజీ జనరల్‌ మేనేజర్‌ బీఎస్‌ ముఖియా అన్నారు.సుదీర్ఘ వేడిగాలులు,విద్యుత్‌ సరఫరా అంతరాయాలు ప్రధానంగా పారిశ్రా మిక ఉత్పత్తి, పంటలపైనా ప్రభావం చూపి స్తాయి.వేడిగాలుల కారణంగా ఉత్పన్నమవు తున్న విద్యుత్‌ సంక్షోభం గురించి కేంద్ర ప్రభుత్వం,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. భారత్‌లో బొగ్గు నిల్వలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని దిగుమతి కూడా చేసుకుంటుందనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బొగ్గు ధరలు కూడా పెరిగాయి. బొగ్గుకు డిమాండ్‌ కూడా పెరిగింది.వాతావరణపరంగా భారత దేశంలోని అనేక ప్రాంతాల్లో రాబోయే కొన్ని వారాలు పెద్ద సవాలుగా మారవచ్చు.‘‘హీట్‌ యాక్షన్‌ ప్లాన్‌లో భాగంగా బహిరంగ శీతలీ కరణ ప్రాంతాలు,తక్కువ విద్యుత్‌ కోతలు, స్వచ్ఛమైన తాగునీరు,కార్మికుల పని వేళల్లో మార్పు ఉండేలా చూసుకోవాలి. మండుతున్న వేడిలో పనిచేసే బడుగు బలహీన వర్గాల కోసం మనం ఈ చర్యలు తీసుకోవాలి’’ అని గుజరాత్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ప్రోగ్రామ్‌ మేనేజర్‌ అభియంత్‌ తివారీ చెప్పారు.
వేడిని ఎలా ఎదుర్కోవాలి
ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచాలి: చాలా మందికి దీని గురించి తెలుసు. శరీరం 40 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతతో బాధపడుతుంటే, హీట్‌ స్ట్రోక్‌కు గురయ్యే అవకాశాలు పెరుగు తాయని గుర్తుంచుకోవడం ముఖ్యం. అటువంటి పరిస్థితిలో, తక్షణ వైద్య సహాయం అవసరం. వైద్య సహాయం వెంటనే అందని పరిస్థితుల్లో ఒక్కోసారి అపస్మారక స్థితికి దారి తీసి అవయ వాలకు కూడా హాని కలగొచ్చు. కొన్ని సార్లు ప్రాణాలు కూడా పోవచ్చు.చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడినా కూడా ప్రమాద సంకేతాలే. ఆహారం,నీరు : శరీరంలో నీటి కొరత ఏర్పడకుండా నీరు తాగుతూ ఉండాలి. నీరు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల సులభంగా జీర్ణం అవుతుంది.- (గునపర్తి సైమన్‌)

స్వేఛాయత వాతావరణంలో ఎన్నికలు`2024

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ, విశాఖ జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో 2024 మే13న జరుగు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో స్వేచ్ఛా యుత వాతావరణంలో సాధారణ ఎన్నికలు జరిగేం దుకు సహకరించాలని జిల్లాఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్‌ డా.ఎ.మల్లిఖార్జున అన్ని రాజకీయ పక్షాలకు పిలుపునిచ్చారు.ఎన్నికల ప్రవర్తన నియమావళి,నామినేషన్లు,ప్రచారం, పోలింగ్‌,కౌంటింగ్‌ తదితర ఎన్నికల ప్రక్రియపై రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులతో స్థానిక వుడా చిల్డ్రన్స్‌ ఎరీనాలో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన మార్చి 20నవిస్తృత అవగా హన సదస్సు జరిగింది.ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మార్చి 16న కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసిన రోజు నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని గుర్తు చేశారు. నాటి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు అనగా జూన్‌ 6వ తేదీ వరకు ఈకోడ్‌ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. కేంద్ర ఎన్ని కల సంఘం,రాష్ట్ర ప్రధానఎన్నికల అధికారి ఆదే శాల మేరకు జిల్లాలోని ప్రతి రాజకీయ పక్షం నడుచుకోవాల్సి ఉంటుందని తెలిపారు. స్వేచ్చా యుత వాతావరణంలో, పారదర్శకంగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేలా రాజకీయ పక్షాలు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన క్షణం నుంచి జిల్లాలోని వివిధ రాజకీయ పక్షాలకు చెందిన విగ్రహాలకు ముసుగులు వేశామని,ఏడు వేలవరకుకటౌట్లు,జెండాలు, హోర్డింగులను తొలగించామని పేర్కొన్నారు. ప్రభుత్వ,ప్రభుత్వ రంగ సంస్థల ప్రాంగణాల్లోని వాణిజ్య స్థలాల్లో ఎటువంటి రాజకీయ ప్రకటనలు, హోర్డింగులు,పోస్టర్లు, బ్యానర్లను అనుమతించబో మని తేల్చిచెప్పారు. హైవేలు, ప్రధాన రహదారులు సమీపంలో ఇప్పటి వరకు ఉన్న హోర్డింగులను సమాన ప్రాతిపదికన అన్ని రాజకీయ పార్టీలకు రిటర్నింగ్‌ అధికారి అనుమతితో కేటాయిస్తామని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున నూతన ప్రదేశాల్లో హోర్డింగులు పెట్టు కునేందుకు అనుమతులు ఇవ్వమని స్పష్టం చేశారు. ఇంటి పైకప్పులపై కటౌట్లు, జెండాలు వంటివి ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి తీసుకోవా లన్నారు. ర్యాలీలు, పాఠశాల, కళాశాల మైదానాలు, అతిథి గృహాలు వంటివి వినియోగించుకోవాలన్నా రిటర్నింగ్‌ అధికారి అనుమతి తప్పనిసరి అని, అయితే ఇందుకోసం సువిధ యాప్‌ ఉందని, అందు లో ముందుగా 48గంటల ముందు నమోదు చేసుకున్నవారికి రాజకీయ పక్షాలపై వివక్ష లేకుండా తొలి ప్రాధాన్యతను ఇవ్వనున్నామని కలెక్టర్‌ స్పష్టం చేశారు. పార్లమెంటు అభ్యర్ధి రూ.95 లక్షల వరకు, అసెంబ్లీ అభ్యర్ధి రూ.40లక్షల వరకు వ్యయం చేసుకునే వెసులుబాటు ఉందని, అయితే ఎన్నికల నియమావళి అమలు నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం వరకు చేసిన ఖర్చులన్నీ ఆయా పార్టీ ఖాతాల్లో నమోదు చేస్తామని, నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం నుంచి వ్యక్తిగత ఖాతాల్లో నమోదవుతా యని చెప్పారు. రాజకీయ పక్షాలకు చెందిన ప్రతి అభ్యర్ధిపై నిఘా ఉంటుందని,వారు ఖర్చుచేసే ప్రతి పైసాను ఎన్నికల వ్యయంలో లెక్కిస్తామని పేర్కొ న్నారు.ఆర్‌ఓ అనుమతి లేకుండా బైకు ర్యాలీ, ఇతర ర్యాలీలను నిర్వహించరాదని, అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహిస్తే ఉపేక్షించేది లేదని, కోడ్‌ ఉల్లంఘనగా భావించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేంద్ర ఎన్నికల సంఘం,రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు వాలంటీర్లు ఎన్నికల్లో పాల్గొనరాదని, ఒకవేళ ఎక్కడైనా పాల్గొన్నట్లు తమ దృష్టికి వస్తే వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రభు త్వ ఉద్యోగులు,ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఎన్నికల విధుల్లోతప్ప,ఇతర కార్యక్రమాల్లో పాల్గొన రాదని,అలా పాల్గొన్నారని తమ దృష్టికి వస్తే ఏమా త్రం ఉపేక్షించబోమని,అవసరమైతే కేసులు పెడతామని హెచ్చరించారు.పౌరులు కోడ్‌ ఉల్లం ఘన సంబందించి చర్యలు గుర్తించినచో సి.విజల్‌ యాప్‌ నందు తమ ఫిర్యాదులను నమోదు చేయ వచ్చని,నమోదు చేసిన 100 నిమిషాల్లో స్పందించి ఫిర్యాదుదారునికి తీసుకున్న చర్యలు గురించి తెలియజేస్తామని చెప్పారు. సి-విజిల్‌ యాప్‌ లో ఇప్పటి వరకు 12 ఫిర్యాదులు అందాయని, వాటిపై వివరాలు తెలియజేసినట్లు కలెక్టర్‌ వివరించారు. అభ్యర్ధి, ఏజెంట్లు, అనుచరులు వద్ద రూ.50 వేలకు మించి నగదు ఉండరాదని, అలాగే వస్తు రూపేణా రూ.10వేలకు మించి ఉండరాదని,డొనేషన్స్‌ రూపేణా రూ.20వేలకు మించి స్వీకరించరాదని కలెక్టర్‌ తేల్చిచెప్పారు.లక్ష రూపాయలకు మించి నగదు బదిలీ చేసినట్లయితే నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. జిల్లా యంత్రాంగానికి, ఆదాయపు పన్నుశాఖ వారికి తెలుస్తుందని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు.
పెయిడ్‌ ఆర్టికల్స్‌ విషయంలో అటు అభ్యర్థులు,ఇటు మీడియా ప్రతినిధులు అప్రమ త్తంగా ఉండాలని,అటువంటి వాటిని ఎం.సి. ఎం.సి.(మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మీడియా మోన టరింగ్‌) కమిటీ పరిశీలించి తదుపరి చర్యలకై ఆర్‌.వో.కు రిఫర్‌ చేస్తుందని పేర్కొన్నారు. ఎన్నికల సమాచారాన్ని ఎప్పటికపుడు ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రా నిక్‌ మీడియాకు అందిస్తామని తెలిపారు. ఊహాగా నాలకు తావిస్తూ ధృవీకరణ చేసుకోకుండా తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని, వార్తలను ప్రచారం చేసేముందు జిల్లాఎన్నికల అధికారి లేదా రిటర్నింగ్‌ అధికారి వద్ద నుంచి సరైన సమాచారాన్ని పొందిన తదుపరి మాత్రమే ప్రచారం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి మీడియా ప్రతినిధులకు సూచిం చారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ః జీవీఎంసీ కమిషనర్‌ నోడల్‌ అధికారి- సీ.ఎం.సాయికాంత్‌ వర్మ : రాజకీయ పార్టీ లేదా వ్యక్తులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా ఎన్నికల వేళ ప్రజలు నచ్చిన విధంగా ఓటు హక్కు ను వినియోగించుకునేలా చేయడం ఎన్నికల ప్రవర్త నా నియమావళి ప్రధాన ఉద్దేశమన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఎన్నికల షెడ్యూ లుతో ఎం.సి.సి.అమల్లోకి వచ్చిందన్నారు. పర్య వేక్షణ నిమిత్తం ప్రతి నియోజకవర్గంలో ఎనిమిది బృందాలను నియమించామని, జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఇటువంటి బృందాలు పని చేస్తున్నట్లు చెప్పారు. ఎం.సి.సి. అమల్లోకి వచ్చిన నాటి నుంచి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన హోర్డింగులు,కటౌట్లు,జెండాలను తొలగిం చామ ని,విగ్రహాలను మూసివేశామని గుర్తు చేశారు. ఇకపై రాజకీయ పక్షాలు హోర్డింగులు, జెండాల కొరకు రిటర్నింగ్‌ అధికారి ముందస్తు అనుమతి తప్పనిసరిఅని,కరపత్రాలు,గోడపత్రికలపై ఆర్‌.ఓ. అనుమతితో పాటు ప్రచురించిన ముద్రణ సంస్థ పేరు తప్పనిసరిగా ఉండాలని తేల్చిచెప్పారు. ఏ విధంగానైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజకీయ పక్షాల అభ్యర్ధులు గుర్తించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వాహనాలు,ర్యాలీలు,సభల నిర్వహణ కోసం వినియోగించుకునే ప్రాంగణాల కోసం సువిధ యాప్‌ నందు దరఖాస్తు చేసుకోవాలని లేదా ూఱఅస్త్రశ్రీవ ఔఱఅసశీష జశ్రీవaతీaఅషవ జవశ్రీశ్రీ ద్వారా సంబంధిత Rూనుండి అనుమతులు తీసుకో వచ్చు ను. ముందుగా చేసుకున్న వారికి తొలి ప్రాధాన్యత ఉంటుందన్నారు. 10 వాహనాలను ఒక యూనిట్‌ గా వినియోగించుకోవాలని, పది వాహనాలకు దాటితో 100అడుగులు డిస్టెన్స్‌ మెయింటైన్‌ చేయా లని స్పష్టం చేశారు. వాహనాలు ఎవరి పేరున తీసుకున్నారో,వారు మాత్రమే వినియోగించు కోవాలని,వేరే వ్యక్తులు వినియోగించినట్లయితే కోడ్‌ ఉల్లంఘన కింద వాహనాలను సీజ్‌ చేస్తామన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా సమావేశాలు, లౌడ్‌ స్పీకర్లను వినియోగించరాదన్నారు.పోలీసు అధికా రులు చెప్పిన ప్రకారం రోడ్‌ షోలు, ర్యాలీలు చేసుకో వాలని సూచించారు. ఓటర్ల స్లిప్పులను బి.ఎల్‌.ఓ లు పంపిణీ చేస్తారని, పార్టీల ప్రతినిధులు చేయాల్సి వస్తే తెల్ల కాగితంపై ఉన్న ఓటరు స్లిప్పులనే విని యోగించాలే తప్ప,ఇతర రంగులు వినియో గించ రాదని,అలా చేస్తే కోడ్‌ ఉల్లంఘన కింద పరిగణి స్తామని పేర్కొన్నారు. పోలింగ్‌ సమయంలో హో టళ్లు, అతిథి గృహాల్లో బయట వ్యక్తులు ఉండరాదని సూచించారు. ఎటువంటి చీరలు,నగదు, వస్తువులు ఇతరులకు పంపిణీ చేయరాదని,అలా చేస్తే ఆ వాహనాన్నిసీజ్‌ చేస్తామని అన్నారు.మంత్రులు అధికారులతో సమావేశాలు, సమీక్షలు నిర్వహించ రాదని, అధికారిక పనులను ఎన్నికలకు వినియోగిం చుకునేలా చేస్తే అటువంటి వాటిని కూడా కోడ్‌ ఉల్లంఘన కింద పరిగణిస్తామని పేర్కొన్నారు. కుల, మతాల మధ్య గొడవలు సృష్టించరాదని,దేవాల యాలు,చర్చిలు,మసీదులను రాజకీయాలకు వినియో గించరాదని స్పష్టం చేసారు. ఓటరును ప్రలోభాలకు గురిచేయడం, భయపెట్టడం చేయరాదని, అలాగే అభ్యర్థుల ఇళ్ల ముందు ధర్నాలు చేయరాదన్నారు. ఒక పార్టీ సమావేశాలను ఇతర పార్టీలు ఆటంకం కలిగించేలా వ్యవహరించరాదని, ఎటువంటి ఆయు ధాలు కలిగి ఉండరాదని ఆయన రాజకీయ పక్షా లకు వివరించారు.
శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా వ్యవహ రించాలి ః సీపీ డా.ఎ.రవిశంకర్‌ : జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా రాజకీయ పక్షాలు వ్యవహరించాలని, ఎన్నికలు సజావుగా జరిగేలా సహకరించాలని పోలీస్‌ కమిషనర్‌ డా. ఎ. రవిశంకర్‌ విజ్ఞప్తి చేశారు. రాజకీయ పక్షాలు నిర్వహించే సమావేశాలు, సభలు, ర్యాలీలు, లౌడ్‌ స్పీకర్లు వినియోగించుకునే ముందు ఆయా రిటర్నింగ్‌ అధికారుల ముందస్తు అనుమతి తప్పనిసరి అన్నారు. ఇందుకోసం సువిధ యాప్‌ ఉందని, సువిధలో నమోదు చేయలేని వారు రిటర్నింగ్‌ అధికారి వద్ద అనుమతి పొందవచ్చ న్నారు. సమావేశాలు నిర్వహించే తేదీ, సమయం, ర్యాలీలో పాల్గొనే వ్యక్తుల సంఖ్య తదితర వివరాలు స్పష్టంగా ఉండాలని, అన్ని పార్టీల దరఖాస్తులను పరిశీలించిన పిదప అనుమతిని మంజూరు చేస్తా మని తెలిపారు.రాజకీయ పక్షాల చేసే ప్రతి పనినీ సర్వేలైన్స్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌,ఎం.సి.సి.,తదితర బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తాయని అన్నారు. వీటిలో పోలీసు అధికారులు ఉంటారని, అయితే ఈ బృందాలకు ఆయా మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ అధిపతిగా వ్యవహ రిస్తారని చెప్పారు. రాజకీయ పక్షాలు ముందుగా నమోదు చేసిన రూటులో కాకుండా వేరే మార్గాన ర్యాలీలు నిర్వహిస్తే వాటిని కోడ్‌ ఉల్లంఘనగా గుర్తిస్తూ, పంచనామా చేసి ఎంపీడీవో నివేదిక ఇస్తారన్నారు. ఆధారాలు లేకుండా ఫిర్యాదులు చేస్తే అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలింగ్‌ బూత్‌ లలో హాజరయ్యే వారి వివరాలు ముందుగా ఇవ్వాలని, వారి వివరాలు పరిశీలించి అనుమతి ఇస్తామని తేల్చిచెప్పారు. మతపరంగా గొడవలు, వ్యక్తిగత తగాదాలు ఉం డరాదని, ముగ్గురు వ్యక్తులతో కూడిన గ్రీవెన్స్‌ కమిటీ జిల్లాలో ఉందని,ఎన్నికలకు సంబంధించిన ఎటు వంటి ఫిర్యాదులనైనా చేయవచ్చని పేర్కొన్నారు.-(జి.ఎ.సునీల్‌ కుమార్‌)

గిరిజన ప్రగతికి చిహ్నం ఈ గిరిజన సాహిత్యం

ఒకప్పుడు మౌఖిక సాహిత్యంకే పరిమితమైన… మన ఆదివాసీ సాహిత్యం… అక్షరాస్యతలో వచ్చిన అభివృద్ధిలో భాగంగా .. వివిధ ప్రక్రియలలో పుస్తకాల రూపంలో… వస్తూ ప్రామాణికతకు చోటుచేసు కుం టుంది, ఈ గిరిజన సాహిత్యంలోని… పుస్తకాల వివరాలను ‘‘గవాక్షం’’ శీర్షికన… ‘‘థింసా పాఠకుల’’ కోసం ప్రతి నెల ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్న పరిశోధక రచయిత డా. అమ్మిన శ్రీనివాసరాజు గారు ప్రముఖ రచయిత ‘‘ ఆచార్య ఎం.గోనా నాయక్‌ ’’ కలం నుంచి జాలువారిన ‘‘ గిరిజన సాహిత్యం ’’ అనే పుస్తకంపై సమీక్ష -డా. అమ్మిన శ్రీనివాసరాజు
పూర్వపు గిరిజన సాహిత్యం అంతా గిరిజనేతరులు రాసిన ‘‘అనుభూతి సాహిత్యం’’ నేటి ఆధునిక కాలంలో విద్యావంతులైన గిరిజన జన జాతి రచయితల రాస్తున్న ‘అనుభవ పూర్వక సాహిత్యం’ దీనిలో మరి కాస్త ప్రామాణికత ఉంటుంది అనేది విశ్లేషకులు మాట.
అచ్చంగా ఆ కోవకు చెందింది ఈ ‘గిరిజన సాహిత్యం’ అనే ప్రామాణిక పుస్తకం. రచయిత ఆచార్య యం.గోనా నాయక్‌ గిరిజన సామాజిక వర్గంకు చెందిన అత్యు న్నత విద్యాభ్యాసం పూర్తి చేసుకుని విశ్వ విద్యాలయ ఆచార్యునిగా వృత్తి జీవితం గడుపుతున్నారు.
ఆచార్య నాయక్‌ లక్ష్యం తమ గిరిజన సంస్కృతి భాషా సాంప్రదాయాలను ప్రామాణికంగా విశ్వవ్యాప్తం చేయాలని, అందులో భాగంగానే విశ్వవిద్యాలయ స్థాయిలో అధ్యయనం చేస్తూ, రాస్తూ, విద్యార్థుల పరిశోధనలకు చేయూతనిస్తున్నారు.
ఆయన రాసిన అనేక గిరిజన భాషా పరమైన రచనల్లో ఒకటి ఈ ‘గిరిజన సాహిత్యం’ అనే పుస్తకం.దీనిలో గిరిజన మూలాలు,గిరిజన తెగలు,గిరిజనులు సాంఘిక ఆచారాలు,గిరిజనసాహిత్యం, పొడుపు కథలు, అనే విభాగాలు ఉన్నాయి.
మానవ శాస్త్రవేత్తల్లో ప్రముఖుడైన మోర్గాన్‌ చెప్పిన సిద్ధాంతాన్ని అనుసరించి ఆది మానవుని కన్నా ముందుతరం నుంచి నాటి ఆటవిక యుగంలోనే ఆదిమ గిరిజనులు ఈ భూమి మీద నివసించారని ఆధుని కాలం నుంచి తమదైన సంస్కృతిని పరిరక్షించుకుంటూ నాగరిక సమాజానికి దూరంగా అడవుల్లో మైదాన ప్రాంతాల్లో తమదైన ప్రత్యేక జీవన శైలిలో నేటికీ వీరు జీవిస్తున్నారు.
మానవ శాస్త్రవేత్తల నిర్వచనాలను అనుసరించి గిరిజనుల నామౌచిత్యాల వివరణ చేసి వివిధ శాస్త్రవేత్తల నిర్వచనాలను క్రోడీకరించి అందులోని సారూప్యతల ఆధారంగా గిరిజనుల లక్షణాలు భాషా తదితరాలను అభివ్యక్తీకరించారు.
రెండవ విభాగంలో గిరిజన తెగల గురించిన వివరణ దేశంలోని రాష్ట్రాలు ప్రాంతాల వారీగా ఆయా తెగల వివరణలు అందించి మొత్తం 35 తెగలుగా నిర్ధారించారు. ప్రతి తెగకు సంబంధించిన ముఖ్యమైన లక్షణాలను కూడా ఇందులో సంక్షిప్తంగా తెలపడం ఉపేత్తంగా ఉంది ప్రాచుర్యమైన గిరిజన తెగతో పాటు రోనా,మూకదొర,కూలియ, మాలీలు,వంటి మరికొన్ని గిరిజన తెగల వివరాలు కూడా ఇందులో పొందు పరిచారు.దీనిలో ఆయా గిరిజనులకు సంబంధించిన వర్గీకరణ శాస్త్రీయంగా అందించారు.గిరిజనుల సాంఘిక ఆచారాల విషయానికి వస్తే గృహ నిర్మాణం మొదలుకుని వారి వేట,వేట సాధనాలు,పండుగలు,నృత్యాలు, రీతులు వివరించారు దీనిలో ఆయా గిరిజనులు చేసే నృత్యాల రకాలు సవివరంగా వ్రాశారు వీటిలో జాతావులు చేసేగజ్జల నృత్యం,గొలుసు నృత్యం,కోంధ్‌లు చేసే మయూరి నృత్యం, భగత, వాల్మీకి,తెగల వారు చేసే గుమ్మలాట నృత్య విశేషాలు గురించి ఆసక్తికరంగా వివరించారు.
నమ్మకానికి చిరునామాదారులైన ఆదివాసీల్లోని విభిన్న రకాల నమ్మకాలను క్షుణ్ణంగా సహేతుకంగా రచయిత గోనా నాయక్‌ వివరించారు
ఆదివాసీల నమ్మకాలు ఎక్కువగా ప్రాకృతిక శక్తుల నుంచి తమను తాము రక్షించు కోవ డానికి, సులభంగా వేటాడుకోవడానికి,వారి జీవనం సక్రమంగా సాగిపోవడం కోసం, ప్రకృతిలో కనబడని శక్తుల్ని పూజించటం, బలు లు ఇవ్వడం చేస్తారు.వీరిజీవితంలో జరిగే ప్రతి సంఘటన ఏదో ఒక నమ్మకాన్ని సూచిస్తుంది.
కలలకు సంబంధించి, ఆరోగ్య సంబంధం, గృహ సంబంధిత, వ్యవసాయ సంబంధిత,దైవ సంబంధిత, వార వస్తు, వేటకు సంబంధించిన వీరి నమ్మకాలు చాలా చిత్ర విచిత్రంగా ఉంటా యి. వీటిపూర్వకాల పద్ధతులు సంఘటనలు ముడిపడి ఉన్న సామాజిక శాస్త్రీయతలు కల గల్సి ఉంటాయి. గిరిజనుల్లో కనిపించే వైద్య విధానంలో నాటు పద్ధతులు కనిపించిన అంతర్గతంగా శాస్త్రీయత ఆగుపిస్తుంది వీరి వైద్యంలో ప్రధానంగా అనేకుల అనుభవాల సమ్మేళనం కనిపిస్తుంది వీరు ఎక్కువగా అడవుల్లో లభ్యమయ్యే వనమూలికలు,చెట్ల ఆకులు,బెరడు,అడవి జంతు వులను మందులుగా ఉపయోగిస్తారు.
పాల చెక్క పచ్చిపసుపుల మిశ్రమం నీళ్ళ విరోచనాలు తగ్గడానికి, బర్నిక చెట్టు పాలను దగ్గు తగ్గడానికి, మూర్ఛ వ్యాధి నయం కావడానికి పులి కొవ్వు, నడుం నొప్పికి ఉడు మాంసం ఒళ్ళు నొప్పులకు ఎలుగుబంటి కొవ్వు తాగించడం వంటి అనేక గిరిజన వైద్య విధానాలు ఇందులో తెలుసుకోవచ్చును.
ఇక ‘గిరిజనుల సాహిత్యం’ గురించి నాలుగో విభాగంలో వివరించారు, వీరి సాహిత్యమంతా మౌఖికంగా నృత్య గీతాలలో నిక్షిప్తం అయినట్టు ఇందులో చెప్పబడిరది.సాధారణంగా గిరిజనుల జీవన విధానం అంతా సంఫీుభావంతో ముడిపడి ఉంటుంది, వివిధ సామాజిక శాస్త్రవేత్తల నిజ నిర్ధారణ ద్వారా వీరి సంగీత నృత్య రీతులను నిర్ధారించి వివరించారు.
జానపద సంగీతం, శాస్త్రీయ సంగీతం,సృష్టి రూపాన్ని సంతరించుకోవడానికి ఎన్నో సంవత్స రాలకు ముందే ఈ గిరిజన సాహిత్యం పుట్టిం దని సంగీతానికి తొలి రూపం గిరిజనుల ఆటపాటలే అని నిర్ధారించారు.
నృత్య గీతాలు రకాలు నృత్య గీతాల అర్థ వివరణ వర్గీకరణ తదితరాలు ఇందులో క్రోడీకరించారు, దీనిలో వివిధ తెగల పాటలు అర్ధ వివరణలతో అందించడం వల్ల అందరికీ ఉపయోగంగా ఉంది.
అదేవిధంగా లంబాడాలు అని పిలవబడుతున్న బంజారాల మూలస్థానం గురించిన పూర్తి వివరణ సహేతుకంగా ఇచ్చారు.
వీరిలో కనిపించే సాంప్రదాయాల ఆధునీకరణ పద్ధతులు వారిలోని సంస్కృతి సాహిత్యాల అభివృద్ధి కారణాలు గురించి కూడా మనం ఇందులో కూలంకషంగా చదవవచ్చు.
సాహిత్యంలో భాగమైన పొడుపు కథలను చివరిదైనా ఐదవ భాగంలో ప్రస్తావించారు, గిరిజన తెగల్లో కూడా ఈ పొడుపు కథలు ప్రముఖ పాత్ర వహిస్తాయి ఇందులో వ్యవ సాయ,వివాహ,సామాజిక, పరిస్థితులకు సంబంధించిన వాటిని వర్గీకరించి వివరించారు.బంజారా భాషలోని పొడుపు కథలను తెలుగీక రించి ఇందులో రచయిత వివరించడం ఉపయుక్తదాయకం.
ఈ పుస్తకం నిడివిలో చిన్నదైన విషయ వివరణలో చాలా పెద్దది అనాలి,దీనిలో ప్రతి విషయాన్ని పరిశోధక రచయిత గోనా నాయక్‌ అత్యంత శ్రద్ధగా బాధ్యతాయుతంగా ప్రామా ణికంగా రాయడం అభినందనీయం.
నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభల ప్రచురణలో భాగంగా 2012లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రచురణగా వెలువడ్డ ఈ పరిశోధనాత్మక పుస్తకం పరిశోధకుల పాలిట కల్పవృక్షంగా చెప్పవచ్చును. పరిశోధకులతో పాటు గిరిజన సాహిత్య అధ్యయన విద్యార్థులు, ఆసక్తిగల ప్రతి ఒక్కరూ విధిగా చదవదగ్గ విలువైన పుస్తకం ఇది.
పుస్తకం పేరు : గిరిజన సాహిత్యం, రచన : ఆచార్య యం.గోనా నాయక్‌, పేజీలు :124, వెల:30/- రూ,
ప్రతులకు : తెలుగు అకాడమీ, హిమాయత్‌ నగర్‌,హైదరాబాద్‌.
సమీక్షకుడు : డా:అమ్మిన శ్రీనివాసరాజు, సెల్‌ : 7729883223.

దేశంలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల కల్పన

దేశంలో ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయ డంలో మౌలిక సదుపాయాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. ప్రాథమిక పెట్టుబడులలో కూడా ఇవే కీలకం. శ్రామిక, మూలధన రూపంలో ఉన్న విస్తారమైన వనరుల కార ణంగా.. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం ఒకటిగా నిలిచింది.భారతదేశ ఆర్థిక వ్యవ స్థలో ఎంఈఐఎల్‌ ముఖ్యపాత్ర పోషిస్తోంది. పారిశ్రా మిక, వ్యాపార మౌలిక సదుపాయాలలో స్థిరమైన వృద్ధిని అందిస్తూ దేశ ఆర్థిక వృద్ధికి తోడ్పడుతోంది ఎంఈఐఎల్‌. మౌలిక సదుపాయాల్లో భాగంగా చేపట్టే ప్రాజెక్టులు స్థానిక యువతకు ఉపాధిని అందిస్తూ..ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతున్నాయి. మారుమూల ప్రాంతాలకు ప్రత్యేక నీటి పథకాల ద్వారా సాగు, తాగు నీటిని అందిస్తోంది.భారీ విద్యుత్‌, రోడ్‌ టన్నెల్‌ ప్రాజెక్టులు చేపట్టి..వాటిని నాణ్యతా ప్రమాణా లతో పూర్తి చేస్తూ..దేశ వృద్ధిని పెంపొందిస్తోంది. దేశం లో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అందిస్తూ ఎంఈఐఎల్‌ తన సత్తా చాటుకుంటోంది.మౌలిక సదు పాయాలు, పెట్టుబడులకు సంబంధించి బడ్జెట్‌ అనంతర వెబినార్‌ను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ ప్రసంగించారు..సారాంశం ఇదీ..!!
‘‘దేశ ఆర్థిక వ్యవస్థకు మౌలిక సదుపాయాల అభి వృద్ధి ఒక చోదకశక్తి’ : ‘ప్రతిఒక్కరూ నూతన బాధ్య తలు,నూతన అవకాశాల విషయంలో గొప్ప నిర్ణ యాలు తీసుకోవడానికి ఇది తగిన సమయం’’ ‘భారతదేశంలో శతాబ్దాలుగా జాతీయ రహదారు లకు గల ప్రాధాన్యతను గుర్తించడం జరిగింది’ ‘పేదరికం ఒక శాపం అనే ఆలోచనను తుడిచిపెట్ట డంలో మనం విజయం సాధించాం.‘ఇప్పుడు మనం మన వేగం పెంచాలి. మరింత దూసు కళ్ళాలి.పి.ఎం.గతిశక్తి నేషనల్‌ మాస్టర్‌ ప్లాన్‌ భారతదేశ మౌలికసదుపాయాలు, దాని బహుళన మూనా లాజిస్టిక్స్‌ రూపురేఖల్ని మార్చనుంది. ‘పి.ఎం.గతిశక్తి మాస్టర్‌ప్లాన్‌ దేశ ఆర్థిక, మౌలికసదు పాయాల ప్లానింగ్‌ను అభివృద్ధితో అనుసంధానం చేస్తుంది.నాణ్యత,మల్టీమోడల్‌ మౌలికసదుపాయా లతో,మనలాజిస్టిక్‌ల ఖర్చురాగల రోజులలో మరిం త తగ్గనుంది. మౌలికసదుపాయాల బలంతో,దేశ సామాజిక మౌలిక సదుపాయాలుబలంగా ఉండ నున్నాయి.మీరు కేవలం దేశ అభివృద్ధికే కాదు, భారతదేశ పురోగతివేగం పెంచేందుకు దోహద పడుతుందన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ‘ మౌలికసదుపాయాలు,పెట్టుబడులు: పిఎం గతిశక్తి నేషనల్‌ మాస్టర్‌ ప్లాన్‌ తో లాజిస్టిక్‌ సామర్ధ్యాలను మెరుగుపరచడం’ అనే అంశంపై బడ్జెట్‌ అనంతర వెబినార్‌ను నిర్వహించారు.బడ్జెట్‌ అనంతరం నిర్వహించే 12 వెబినార్‌లలో ఇది 8 వ వెబినార్‌. 2023 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన పలు కార్యక్ర మాలను సమర్ధంగా అమలు చేసేందుకు ప్రజల నుంచి ఆలోచనలు, సూచనలను స్వీకరించేందుకుఈ వెబినార్‌లను నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా వెబి నార్‌లో పాల్గొన్న వారినుద్దేశించి మాట్లాడుతూ ప్రధానమంత్రి, ఇవాల్టి వెబినార్‌లో వందలాది మంది పాల్గొంటుండడంపట్ల సంతోషం వ్యక్తం చేశారు.సుమారు 700 మంది సిఇఒలు, మేనేజింగ్‌ డ్కెరక్టర్లు ఇందులో పాలుపంచుకున్నారు.దీనిని బట్టి ఈ వెబినార్‌ ప్రాధాన్యత తెలుస్తోంది.వివిధ రంగా లకు చెందిన నిపుణులు, స్టేక్‌హోల్డర్లు ఈ వెబి నార్‌ను విజయవంతం చేశారని అన్నారు.మౌలిక సదుపాయాల రంగానికి ఈ ఏడాది బడ్జెట్‌ నూతన శక్తిని ఇస్తుందని ఆయన అన్నారు.బడ్జెట్‌కు సర్వత్రా ప్రశంసలు లభించిన విషయాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. బడ్జెట్‌ లో తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలకు నిపుణుల నుంచి ప్రధాన మీడియా సంస్థలనుంచి ప్రశంసలు లభించాయన్నారు. భారతదేశపు కాపెక్స్‌ 2013`14 సంవత్సరంతో పోలిస్తే 5 రెట్లు పెరగిందన్నారు. ప్రభుత్వం జాతీయ మౌలికసదుపాయాల పైప్‌ల్కెన్‌ కింద 110 లక్షల కోట్లరూపాయల పెట్టుబడుల లక్ష్యంతో ముందుకు పోతున్నదని చెప్పారు.నూతన అవకాశాలకు, నూతన బాధ్యతలకు, గొప్ప నిర్ణయాలు తీసుకోవ డానికి ఇదిఎంతో అనువైన కాలమని ప్రధానమంత్రి అన్నారు. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచు కున్నప్పుడు,ఏ దేశ సుస్థిరాభివృద్ధిలో అయినా మౌలిక సదుపాయాలు కీలక పాత్ర పోషిస్తాయని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.మౌలిక సదుపాయాల చరిత్రకు సంబంధించిచన పరిజ్ఞానం కలవారికి ఈవిష యం బాగాతెలుసునని ఆయన అన్నారు. చంద్రగుప్త మౌర్యుడు ఉత్తరాపథ్‌ నిర్మించగా, అశోకుడు దానిని మరంత ముందుకు తీసుకువెళ్లారని, షేర్‌ షా సూరి దానిని అప్గ్రేడ్‌ చేశారని అన్నారు. దానిని బ్రిటిషర్లు జి.టి.రోడ్‌గామార్చారని చెప్పారు.జాతీయ రహదా రుల ప్రాధాన్యతను శతాబ్దాల క్రితమే భారత దేశంలో గుర్తించారని ప్రధానమంత్రి చెప్పారు. జలమార్గాలు,రివర్‌ ఫ్రంట్‌ల గురించి ప్రస్తా విస్తూ ప్రధానమంత్రి,బెనారస్‌ ఘాట్‌ ల గురించి ప్రస్తావిం చారు.ఈఘాట్లు జలమార్గాలద్వారా నేరుగా కల కత్తాతో అనుసంధానమై ఉండేవని చెప్పారు. తమిళనాడులోని 2000 సంవత్సరాల క్రితం నాటి కలనై డ్యామ్‌ ఇప్పటికీ నీటిని అందిస్తోందని ప్రధాన మంత్రి తెలియజేశారు. దేశ మౌలిక సదుపాయాల రంగం అభివృద్ధికి పెట్టుబడుల విషయంలో గత ప్రభుత్వాలకు అడ్డంకులు ఎదురయ్యాయని ఆయన అన్నారు.పేదరికం ఒకశాపమన్న భావనను తొల గించి,ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రస్తుతం రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెడుతు న్నట్టు ప్రధానమంత్రి తెలిపారు.మౌలిక సదు పాయాల రంగంలో పెట్టుబడులకు సంబంధించి పరిస్థితి మెరుగుపడినట్టు ప్రధానమంత్రి వివరిం చారు.2014 నాటికి ముందు ఉన్న పరిస్థితితో పోల్చినపుడు,జాతీయ రహదారుల నిర్మాణం సగ టున రెట్టింపు అయిందని ప్రధానమంత్రి తెలిపారు. అలాగే 2014కు ముందు సంవత్సరానికి 600 రూట్‌ కిలోమీటర్లు మాత్రమే విద్యుదీకరణ జరిగిం దని, అది ప్రస్తుతం సంవత్సరానికి 4000 కిలో మీటర్లకు చేరుకున్నదన తెలిపారు. అలాగే దేశంలో విమానాశ్రయాల సంఖ్య, సముద్ర పోర్టుల సామ ర్ధ్యం రెట్టింపు అయినట్టు ప్రధానమంత్రి తెలి పారు.‘‘మౌలిక సదుపాయాల అభివృద్ధి దేశ ఆర్థిక వ్యవస్థకు చోదకశక్తిగా’’అని అంటూ ప్రధాన మంత్రి, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశం రూపుదిద్దుకునే లక్ష్యం నెరవేరుతుందని చెప్పారు.ఇందుకు అనుగుణమైన మార్గాన్ని భారత దేశం అనుసరిస్తున్నట్టు ఆయన తెలిపారు.ఇప్పుడు మనం వేగాన్ని మెరుగుపరచుకుని టాప్‌ గేర్లో ముందుకు పోవాలని అన్నారు. పి.ఎం.గతిశక్తి మాస్టర్‌ ప్లాన్‌ అనేది,ఎంతో కీలకమైనది అని అంటూ ప్రధానమంత్రి, సమీకృత ఆర్ధిక,మౌలికక సదుపాయాల ప్రణాళికకు ఇది ముఖ్యమైనదని అన్నారు. గతి శక్తి జాతీయ మాస్టర్‌ ప్లాన్‌ భారతదేశ మౌలిక సదుపాయాల రంగం, మల్టీ మోడల్‌ లాజిస్టి క్‌ ల ముఖచిత్రాన్ని మార్చివేయనున్నదని చెప్పారు. పి.ఎం.గతి శక్తి మాస్టర్‌ ప్లాన్‌ ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ప్రధానమంత్రి తెలిపారు.లాజిస్టక్‌ ల సమర్ధతపై ప్రభావం చూపుతున్న అంశాలను ,లోపాలను గమనించడం జరిగిందని ప్రధాన మం త్రి తెలిపారు.అందువల్ల ఈఏడాది బడ్జెట్‌లో 100 కీలక ప్రాజెక్టులను ప్రాధాన్యతా ప్రాతిపదికన చేపట్టి నట్టు తెలిపారు. ఇందుకు 75,000 కోట్ల రూపా యలు కేటాయించినట్టు ఆయన తెలిపారు. నాణ్యతతో కూడిన,మల్టీ మోడల్‌ మౌలిక సదు పాయాలతో,మన లాజిస్టిక్‌ ఖర్చులు రాగల రోజు లలో మరింత తగ్గనున్నాయి. ఇది భారతదేశంలో తయారయ్యే ఉత్పత్తులపై సానుకూల ప్రభావాన్ని చూపనుంది అనిఆయన అన్నారు.లాజిస్టిక్‌ రంగం తోపాటు సులభతర జీవనం,సులభతర వ్యాపారం విషయలోనూ పరిస్థితి మరింత మెరుగుపడనున్న దని చెప్పారు.మౌలికసదుపాయాల రంగంలో పెట్టు బడులు పెట్టాల్సిందిగా ఆయన ప్రైవేటు రంగాన్ని ఆహ్వానించారు.రాష్ట్రాల పాత్ర గురించి వివరిస్తూ ప్రధానమంత్రి,50 సంవత్సరాల వడ్డీలేని రుణాలను మరో ఏడాది పొడిగించినట్టు తెలిపారు. ఇందుకు బడ్జెట్‌ వ్యయం 30శాతానికి పెంచినట్టు ప్రధాన మంత్రి తెలిపారు.మౌలిక సదుపాయాల రంగం అభివృద్ధికి వివిధ మెటీరియల్స్‌ అవసరం ఉన్నం దున,ఆయా రంగాల అవసరాలకు సంబంధించి ముందస్తు అంచనాలు రూపొందించాలని ప్రధాన మంత్రి సూచించారు.భవిష్యత్‌ సుస్పష్టంగా ఉన్నందున మనం సమీకృత విధానాన్ని అనుసరిం చాలని ప్రధానమంత్రి సూచించారు. ఇందులో పి.ఎం.గతిశక్తి మాస్టర్‌ ప్లాన్‌ కీలక పాత్ర పోషి స్తుందని ఆయన అన్నారు.ఈరంగంతో సర్కులర్‌ ఎకానమీని సమీకృతం చేయాల్సిన అవసరం ఉం దని ఆయన అన్నారు.కచ్‌ ప్రాంతంలో భూకం పం వచ్చినప్పడు తన అనుభవాలను ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు.సహాయ కార్యక్రమాల అనం తరం కచ్‌ ప్రాంతంలో పూర్తిగా నూతన అభివృద్ధి విధానాన్ని అనుసరించినట్టు ఆయన తెలిపారు. మౌలక సదుపాయాల అభివృద్ధి తో కూడిన అభివృ ద్ధిని ఈ ప్రాంతంలో చేపట్టినట్టు ప్రధానమంత్రి తెలిపారు. రాజకీయంగా అవసరార్థం నిర్ణయాలు తీసుకోవడం కాకుండా కచ్‌ ప్రాంతాన్ని ఒక గొప్ప ఆర్ధిక కార్యకలాపాలక్షేత్రంగా మార్చినట్టు ప్రధాన మంత్రి తెలిపారు.దేశ సామాజిక మౌలిక సదుపా యాలను బలోపేతం చేయాలంటే,భారతదేశపు భౌతిక మౌలిక సదుపాయాలు కూడా ఎంతో ముఖ్యమైనవని ఆయన అన్నారు.బలమైన సామా జిక మౌలిక సదుపాయాలు,మరింత ప్రతిభ కలిగిన, నైపుణ్యం కలిగిన యువత దేశానికి సేవ చేయ డానికి ముందుకు రావడానికి వీలు కల్పిస్తాయని అన్నారు.నైపుణ్యాల అభివృద్ధి, ప్రాజెక్టు యాజమా న్యం,ఆర్ధిక నైపుణ్యాలు, ఎంటర్ప్రెన్యుయర్‌ షిప్‌, ఈ లక్ష్యాలు నెరవేర్చడానికి ఉపకరిస్తుందని చెప్పారు.నైపుణ్యాల కు సంబంధించిన సమాచారం అందించడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకో వాలని సూచించారు.ఇది వివిధ రంగాలలోని చిన్న,పెద్ద సంస్థలకు ఉపయోగపడుతుందని చెప్పా రు.ఇది దేశమానవ వనరుల శక్తి సద్విని యోగానికి ఎంతో ఉపకరిస్తుందని తెలిపారు. ఈదిశగా ప్రభు త్వంలోని వివిధ మంత్రిత్వశాఖలు సత్వరం కృషి చేయాలని ప్రధానమంత్రి సూచించారు.ఈ వెబి నార్‌ లోని ప్రతి స్టేక్‌ హోల్డర్‌ ఇచ్చే సూచనలు ఎంతో ప్రాధాన్యత కలిగినవని అంటూ ప్రధాన మంత్రి,వీరు దేశ అభివృద్ధికి తోడ్పడడమే కాకుండా, భారత దేశ ప్రగతి వేగం పరుగులు పెట్టడానికి దోహదపడుతున్నారని అన్నారు.మౌలిక సదుపా యాల అభివృద్ధి రైలు, రోడ్డు, పోర్టులు, విమానాశ్ర యాలకు మాత్రమే పరిమితం కాదని,ఈ ఏడాది బడ్జెట్‌ లో భాగంగా భారీ ప్రాజెక్టులను చేపట్టినట్టు ప్రధానమంత్రి తెలిపారు.గ్రామాలలో రైతుల పంట ను నిల్వచేసే సదుపాయాలకు సంబంధించి భారీ ప్రాజెక్టులు చేపడుతున్నట్టు చెప్పారు. నగరాలు, గ్రామాలలో వెల్‌ నెస్‌ సెంటర్లను అభివృద్ధి చేస్తున్న విషయాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు.నూతన రైల్వే స్టేషన్ల నిర్మాణం జరుగుతోందని, ఇళ్లు లేని పేదలకు పక్కా గృహాల నిర్మాణం జరుగుతోందని ప్రధానమంత్రి తెలిపారు.ఈ వెబినార్లో వివిధ స్టేక్‌ హోల్డర్లు ఇచ్చే సూచనలు, సలహాలు, వ్యక్తం చేసిన అభిప్రాయాలు.వారి అనుభవాలు అన్నీ ఈ ఏడాది బడ్జెట్‌ వేగంగా,చురుకుగా అమలు చేయడానికి పనికి వస్తాయని ప్రధానమంత్రి అన్నారు. నాలుగో పారిశ్రామిక విప్లవానికి సంబంధించి ఒక పదాన్ని మీరు గనక తొలగించినట్లయితే అది అర్థ రహితం అవుతుంది.ఆ పదమే ‘డిజిటల్‌’బీ న్యూ ఇండియా ఆవిష్కారంలో దానికి ప్రతీకగా మారిన పదం ఇదే.ఈడిజిటల్‌ ఇండియా ఉద్యమం ఫలితం గా టెలికాం డేటా అన్నది భారతదేశం లోని మారు మూల గ్రామీణ ప్రాంతాలకు సైతం అందుబాటు లోకి వచ్చింది. గత నాలుగున్నర సంవత్సరాల లో టెలికమ్‌ మౌలిక సదుపాయాల కల్పన రంగం లో మునుపటి తో పోల్చితే మా ప్రభుత్వం ఆరు రెట్లు అధికం గా పెట్టుబడులను ప్రవహింపజేసి, దానిని మరింత బలోపేతం చేసింది.-జి.ఎన్‌.వి.సతీష్‌

అన్నపురాజులు ఒకచోట..ఆకలి మంటలు ఒకచోట

అన్నపు రాశులు ఒకచోట.. ఆకలి మంటలు ఒకచోట.. హంస తూలికలు ఒక చోట.. అలసిన దేహాలు ఒకచోట..సంపద అంతా ఒకచోట.. గంపెడు బలగం ఒకచోట..’ అంటూ కొన్ని దశాబ్దాల క్రితం ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు అసమానతలపై ధర్మాగ్రహం వ్యక్తం చేసినప్పటికీ.. నేటికీ అవి పెచ్చుమీరుతూనే ఉన్నాయి. అనంతపురం కలెక్టరేట్‌కు సమీపంలోనే దళిత మహిళ అంజలి ఆకలితో అలమటిస్తూ.. కన్నుమూసింది. మరోవైపు భారత్‌ బ్రిటీష్‌ రాజ్‌ నుంచి బిలియనీర్‌ రాజ్‌గా మారిందని ప్రపంచ అసమానతల ల్యాబ్‌ నివేదిక ఎత్తిచూపింది.
ప్రభుత్వ ఆదాయమంతా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలకే ఖర్చు చేసెస్తున్నా యని,ప్రజలను బిచ్చగాళ్లుగా చేస్తున్నారని కార్పొ రేట్‌,మీడియాలో ప్రచారం నిత్యం హోరెత్తి పోతూ నే ఉంది. మీడియాలో సింహభాగాన్ని ఆక్రమించిన గోడీ మీడియా సంగతి ఇక చెప్పనక్కరేలేదు. మద్యా నికి బానిసై వేధించుకుతినే భర్త, తిండి లేక అలమ టిస్తూ అడుక్కుంటున్న ముగ్గురు బిడ్డలు,రోజుల తరబడి ఆహారం లేక బక్కచిక్కి ఆకలితో మరణిం చిన అంజలి ఉదంతం.ఆ ప్రచారంలోనూ,నేటి సంక్షేమ పథకాల అమలులోనూ ఉన్న డొల్లతనాన్ని ఎత్తిచూపుతున్నాయి.అంజలి, ఆమె పిల్లలకు ఆధార్‌ కార్డే లేదు. ఇంటింటికీ సంక్షేమ పథకాలంది స్తున్నా మంటున్న ప్రభుత్వాలకు, అధికారులకు, వాలంటీర్ల కు ఇల్లేలేని ఆమె కనిపించనేలేదు. కనీసం బియ్యం అందినా అంజలి ప్రాణం నిలబడేదని చెబుతున్న స్థానికుల మాటలు చేదు నిజాలను కళ్లముందుంచు తున్నాయి.77ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో..మరీ ముఖ్యంగా2000నుంచీ విపరీతంగా పెరిగి పోయి న ఆర్థిక అసమానతలు పేదల ఆకలిచావు లకు, రైతుల ఆత్మహత్యలకు కారణభూతమవుతున్నాయి. 15 కోట్ల మంది నిరుపేదలు ఒక్కపూట తిండికోసం అల్లాడుతున్నారని తాజా నివేదిక ఎత్తిచూపింది. 144 కోట్ల మంది ప్రజలు నా అక్కచెల్లెల్లు, అన్నద మ్ములు అని నిత్యం ప్రధాని మోడీ వల్లెవేస్తుండగానే ప్రపంచ ఆకలి సూచీలో 125దేశాలకుగాను అట్ట డుగున111వ స్థానానికి మనదేశం దిగజా రింది. 2015 నుంచి పురోగతి శూన్యమని గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ తేల్చిచెప్పింది. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లోనే 38శాతం మంది పోషకా హార లోపంతో బాధపడుతున్నారు.ఇబ్బడిము బ్బడి గా పెరుగుతున్న కార్పొరేట్ల ఆదాయం, వారి దురాశే పేదరికాన్నిరోజురోజుకూ వృద్ధి చేస్తోందని ఆక్స్‌ ఫామ్‌ తేల్చిచెప్పింది.1947నుంచి 80 వరకూ అస మానతలు తగ్గుముఖం పట్టగా, నయా ఉదారవాద ఆర్థిక విధానాల అమలుతో అసమానతలు పెరి గాయి. 2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంపద కేంద్రీకరణ మరింత పెరిగి పోయింది.1951లో 11.5శాతం జాతీయాదా యం మాత్రమే వారి చేతుల్లో ఉండేది. 10 శాతం సంపన్నుల చేతిలో1951లో 36.7శాతం సంపద ఉండగా,2022నాటికి57.7శాతానికి పెరిగి పోయింది. అంతేలే పేదల గుండెలు.. అశ్రువులే నిండిన కుండలు అని మహాకవి శ్రీశ్రీ అన్నట్లు పేదలబతుకులు రోజురోజుకూ తీసికట్టుగా మారి పోతున్నాయి.దిగువన ఉన్న 50శాతం మంది ఆదాయం 1951లో20.6శాతం ఉండగా, 2022 నాటికి 15శాతానికి పడిపోయింది. జనాభాలో దాదాపు 40శాతంగా ఉన్న మధ్యతరగతి ఆదా యం కూడా 42.8 శాతం నుంచి 27.3 శాతానికి తగ్గిపోయింది.2022లో మనదేశ జాతీయాదాయం లో 22.6 శాతం, 40.10శాతం ఆస్తి ఒకశాతం సంపన్నుల చేతిలో ఉంది.1991లో ఒకే ఒక శత కోటీశ్వరుడు ఉంటే 2022 నాటికి 162కి పెరిగి పోయింది. ఆరోగ్యం, విద్య, పోషకాహారం వంటి విషయాలలోనూ ప్రభుత్వ పెట్టుబడులు సగటు భారతీయుల స్థితిగతులను మార్చేకన్నా సంపన్నులకు కట్టబెట్టేందుకు దోహదం చేస్తున్న దుస్థితిని నివేదిక ఎత్తిచూపింది.
‘ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) అనుమతిస్తే, ప్రపంచానికి ఆహార నిల్వలను అందిం చేందుకు భారత్‌ సిద్ధం’.గత ఏప్రిల్‌లో గుజరాత్‌ పర్యటనలో ప్రధాని నరేంద్రమోదీ ఎంతో ఆర్భా టంగా చేసిన ప్రకటన ఇది. ప్రధాని అలా చెప్పారో లేదో.. ప్రపంచానికి భారత్‌ అన్నపూర్ణగా మారి పోయిందంటూ కమలశ్రేణులు గప్పాలు కొట్టాయి. అయితే,భారత్‌లో ఆహార సంక్షోభం, పోషకాహార లోపం, శిశు మరణాల రేటు ప్రమాదకరస్థాయికి చేరిం దంటూ నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు అదే నిజమైంది. ప్రపంచ ఆకలి సూచీలో భారత్‌ దారుణమైన స్థితికి పడిపోయింది. ఎంతలా అంటే.. కటిక పేద దేశాలుగా పరిగణించే సూడాన్‌, రువాం డా,నైజీరియా,ఇథియోపియా,రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోతోపాటు యుద్ధంతో కకావికలమై, తినడానికి గింజలు లేక అల్లాడుతున్న ఉక్రెయిన్‌ కంటే కూడా హీనమైన ర్యాంకును నమోదు చేసింది.మోదీ 10ఏండ్ల పాలనలో ఆకలిసూచీలో భారత్‌.. ఏకం గా 52 స్థానాలను కోల్పోయింది.
దారుణమైన పరిస్థితి
వివిధ దేశాల్లో ఆకలి స్థాయులు, పోషకాహార లోపాలను సూచించే ప్రపంచ ఆకలి సూచీ (గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌-జీహెచ్‌ఐ)లో భారత్‌ స్థానం మరింతగా దిగజారింది.2022 సంవత్సరానికిగానూ మొత్తం 121దేశాలను పరిగణలోకి తీసుకొంటే 29.1 హంగర్‌ స్కోరుతో భారత్‌ 107వస్థానంలో నిలిచింది. గత కొంత కాలంగా తీవ్ర ఆహార సంక్షోభం ఎదుర్కొంటున్న పొరుగు దేశం శ్రీలంక, ఆర్థిక సంక్షోభానికి దగ్గర్లో ఉన్న పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌, పేద దేశాలుగా పిలిచే సూడాన్‌, రువాండా, నైజీరియా, ఇథియో పియా,రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోతో పాటు యుద్ధంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఉక్రెయిన్‌ (36) తో పోలిస్తే భారత్‌ దారుణమైన ర్యాంకుకు పడి పోవడం గమనార్హం. ఈ మేరకు జీహెచ్‌ఐ వార్షిక నివేదికను కన్‌సర్న్‌ వరల్డ్‌వైడ్‌, వెల్త్‌ హంగర్‌ హిల్ఫ్‌ సంస్థలు శనివారం సంయుక్తంగా ప్రచురించాయి. భారత్‌లో ఆకలి స్థాయి చాలా తీవ్రంగా ఉన్నదని హెచ్చరించాయి. సూచీలో చైనా, కువైట్‌, టర్కీ సహా 17దేశాలు 5కంటే తక్కువ స్కోర్‌తో అగ్ర స్థానంలో నిలిచాయి.ఎంతదారుణమంటే.. దక్షిణా సియాలోని అన్ని దేశాలకంటే కూడా దిగువ స్థానా నికి భారత్‌ చేరుకొన్నది.
మోదీ నిర్వాకం ఇది
పైకి ఉత్తుత్తి మాటలు చెప్పాలంటే మోదీ ఆయన వందిమాగధ జనం ఎంత పెప్ప మన్నా చెప్తారు. కానీ..మోదీ ఆయన మంత్రిగ ణానికి ఎలాంటి దూరదృష్టి కానీ, దార్శనికత కానీ సున్నాశాతం కూడా లేదు.ముఖ్యంగా ఆహార భద్రత విషయంలో ఎంతమాత్రం ప్రణాళిక లేదు. దేశం లో ఒకవైపు ఆకలి కేకలు వినిపిస్తుంటాయి. మరో వైపు ఏరాష్ట్రంలోనైనా రైతులు కష్టపడి ధాన్యం పండిస్తే..తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలఆహారభద్రత హక్కును పణంగా పెడతారు.
పండిన ధాన్యాన్ని కొనరు. ఇదేమయ్యా అంటే.. ఓప్‌ా మాదగ్గర నాలుగేండ్లకు సరిపడా ధాన్యం నిల్వలున్నాయని చెప్తారు. ధాన్యం బాగా పండుతున్నప్పుడు నిల్వల సామర్థ్యాన్ని పెంచవచ్చు కదా అంటీ అదీ చేయరు. ఉన్న నిల్వలను పేదలకు పంచాలి కదా..అంటే అదీ చేయరు.ధాన్యం నిల్వల నిర్వహణకు ఒక విధానమంటూ ఉండదు. బోలెడు నిల్వలు ఉన్నయనిచెప్పి నాలుగైదు నెలలైనా కాలేదు. ఎఫ్‌సీఐ గోదాముల్లో నిల్వలు నిండుకున్నయి. లబోదిబోమంటూ..గోధుమలు,బియ్యం, నూకలు.. ఇలా అన్నింటి దిగుమతులపైనా నిషేధం విధిం చారు.ఓపక్క పండిరచడానికి రైతుసిద్ధంగా ఉన్న ప్పటికీ అతనికి మోదీ సర్కారు నుంచి మద్దతు కొరవడిరది సరికదా.. వ్యవసాయాన్నే దారుణంగా దెబ్బతీసే దిశగా మోదీ దుందుడుకు విధానాలు సాగుతున్నాయి. విచిత్రమేమిటంటే.. ఎగుమతులపై నిషేధం విధించటమే ఆలస్యం..దేశంలోని గోధు మల్లో సింహభాగం ముకేశ్‌ అబానీ కొనుగోలు చేసినట్టు వార్తలు వచ్చాయి.ఇదొక్క నిదర్శనం చాల దా మోదీ దర్శనం కార్పొరేట్ల కోసమేనని చెప్ప డానికి..
ఏమిటీ సర్వే? నిర్వహించేదెవరు?
ప్రపంచదేశాల్లో నెలకొన్న ఆకలి స్థాయి లు, పిల్లల్లో పోషకాహారలోపం,శిశుమరణాలు తదితర గణాంకాలు ఆధారంగా చేసుకొని జీహె చ్‌ఐ వార్షిక నివేదికను ఐర్లాండ్‌కు చెందిన కన్‌సర్న్‌ వరల్డ్‌వైడ్‌, జర్మనీకి చెందిన వెల్త్‌ హంగర్‌ హిల్ఫ్‌ సంస్థలు ఏటా సంయుక్తంగా వెలువరిస్తాయి. ఎక్కువ స్కోర్‌ సాధించిన దేశంలో ఆకలి సంక్షోభం తీవ్ర రూపంలో ఉన్నట్టు పరిగణించాలి.
భారత్‌ ఖండిస్తుందని ముందే తెలిసి..
ఆకలి సూచీలో కిందటేడాది116 దేశా ల్లో భారత్‌ 101స్థానంలో నిలిచింది.అయితే అప్పు డు కేంద్రం ఈ నివేదికను తప్పుబట్టింది. ఆకలి స్థాయుల్ని లెక్కించడానికి ఉపయోగించే పద్ధతి అశాస్త్రీయంగా ఉన్నదనని నివేదికను ఖండిరచింది. ఈ క్రమంలో నివేదికను వెలువరించే సమయం లోనే సదరు సంస్థలు ప్రత్యేక వివరణ ఇచ్చాయి. ప్రధాని మోదీ హయాంలో గడిచిన ఎనిమిదేండ్లలో జీహెచ్‌ఐలో భారత్‌ స్కోరు దారుణంగా పతన మైంది. చిన్నారుల్లో కనిపిస్త్తున్న పోషకాహార లోపం, ఆకలి, ఎదుగుదల లోపం, కుంగుబాటు వంటివాటి పై ప్రధాని మోదీ ఎప్పుడు స్పందిస్తారో చూడాల్సి ఉన్నది. దేశంలో 22.4కోట్ల మంది ప్రజలు పోష కాహార లోపంతో బాధపడుతున్నారు. ఆకలి సూచీ లో భారత దాదాపు అట్టడుగు స్థానానికి చేరు కొన్నది.
బడా పారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వా నికి మధ్య సంబంధాలు పెరిగిపోవడాన్ని,ఏక వ్యక్తి కేంద్రంగా నిరంకుశ పాలనకు దారితీస్తుందని హెచ్చరించింది. హిందూ మతతత్వ రాజకీయాలు, కార్పొరేట్‌ క్యాపిటల్‌ కలిసి దేశాన్ని లూటీ చేసిన పరిస్థితుల్లో ప్రముఖ ఆర్థిక వేత్తలు థామస్‌ పికెట్టి, లూకాస్‌ ఛాన్సెల్‌,నితిన్‌కుమార్‌ భారతి,అన్మోల్‌ సోమంచి తదితరులు రూపొందించిన ఈ నివేదిక ప్రస్తుత పరిస్థితిని కళ్లకు కట్టాయి. తాజాగా ఎన్నికల బాండ్ల విషయంలోనూ మోడీసర్కారుకు,కార్పొ రేట్లకు ఉన్న అనుబంధాన్ని తేటతెల్లం చేసింది. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మతతత్వ, కార్పొరేట్‌ రాజ్‌ను మట్టికరిపించాలి.అందుకు ఉక్కు సంకల్పం తీసుకోవాలి.- (వ్యాసకర్త : ఇండిపెండెంట్‌ సీనియర్‌ పాత్రికేయులు`న్యూఢల్లీి)

ఆర్దిక అంతరాలకు అంతమెన్నడు.

కొంతమంది ప్రపంచ స్థాయి ఆర్థిక వేత్తల అభిప్రాయం ప్రకారం భారత్‌లో నేడు ఆర్థిక అంతరాలు బ్రిటిష్‌ పాలనలో కన్నా ఘోరంగా ఉన్నాయి. గణాంకాల ఆధారంగా వారు చెప్పిన విషయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో సంపద సృష్టి బాగానే జరుగుతున్నా, అది కొద్ది మంది చేతిలోనే కేంద్రీకృతమౌతుంది. దేశ సంపద లో 44శాతం ఒక్కశాతం ధనికుల చేతిలోఉంది. ఆఒక్క శాతం మంది జాతీయ ఆదాయంలో 22 శాతం మేరకు పొందు తున్నారు.ఏభై శాతం ప్రజలు జాతీయ ఆదాయంలో 15శాతానికి మించి పొందలేక పోతున్నారు. అంటే జాతీయ ఆదాయం ఎంత పెరిగినా జనాభాలో సగం మందికి దక్కేది అందులో 15పైసల వాటానే. ఇలా అసమానతలు పెరగడానికి ఇప్పటి ప్రభుత్వ విధానాలే కారణం. ధనికులపై విధించే పన్నులు తక్కువ. వారు పొందే రాయితీలు ఎక్కువ. పేదలు ప్రత్యక్షంగా, పరోక్షంగా కట్టే పన్నులు ఎక్కువ. వారికి దొరికే ఊరట. ధరల నియంత్రణ ద్వారానో, మరోలానో తక్కువ. అయితే అసమానతలు తగ్గే విధానాల్ని అమలు చేస్తామని ఎవరూ మాట్లాడకపోవడం గమనార్హం. వృద్ధి వైపు దేశాన్ని పరుగులు పెట్టిస్తామని అందరూ అంటున్నారు తప్పించి, ఆ వృద్ధి ఫలాలు అందరికీ అందేలా విధానాలు రూపు దిద్దగలమని జాతీయ పక్షాలు మాట్లా డడం లేదు.బహుశా దాని వల్ల ధనికులు దూరమై, వారి విరాళాలు అందవని భయ మేమో? చూశాం కదా, ఎన్నికల బాండ్ల రూపంలో దివాళా కంపెనీలు కూడా పార్టీలకు ఎలా నిధులు ఇచ్చాయన్నది. ఇకపోతే ఆర్థిక అంతరాలు మరీ వారు చెప్పినంత ఘోరంగా లేవని వాదించవచ్చు. కానీ అసమానతలు దండిగా ఉన్న వాతావరణంలోనే ఉన్నామన్నది ఎవరూ కాదనలేరు. వేరే వేరే నివేదికల ప్రకారం 2000 సంవత్సరంలో 35 శాతం ఉన్న నిరుద్యోగిత నేడు 65 శాతం అయ్యింది. పేదరికం, పోషకాహార లేమి గణనీయంగా ఉన్నాయి. ఇప్పటికీ వైద్యం, విద్యపై పౌరులు భరించాల్సిన ఖర్చు ఎక్కువే. వాటివల్ల అప్పులు పాలయ్యే వాతావరణం. ఈ సమస్యల్ని గమనం లోకి తీసుకోకుండా వృద్ధిలో ముందంజ వేయడం సాధ్యమా? పేదలకి, అధిక సంఖ్యలో ఉన్న మధ్యతరగతికి భారమైన విద్య, వైద్యం చవకగా అందుబాటులోకి రావాలి. అప్పుడే నాణ్యమైన భవితకు, ఆర్థిక వృద్ధికి పూచీ. యువత గణనీయంగా ఉన్న భారత్‌ శక్తిమంతం కావడమే కాదు అసమానతలు లేని సమాజంగా మారాలి. ఇప్పుడున్న విధానాలతో అది సాధ్యం కాదు. మెరుగైన విధానాల కోసం, అవి ఎన్నికల్లో ప్రాధాన్యత గల అంశాలుగా మారడం కోసం నడుం కట్టాల్సింది పౌర సమాజమే. దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశా బ్దాలు గడిచినా ప్రజల మధ్య ఆర్థిక అసమాన తలు తీవ్రస్థా యిలో ఉన్నాయి. నిత్యం పెరుగు తున్న ధరలు, ఇతర కారణాలతో కోట్ల మంది కూడు,గూడు, గుడ్డ కోసం ఇంకా బతుకు పోరా టం చేస్తుండగా..మరోవైపు ఇదే సమ యంలో సంపన్నులు పోటీపడి మరీ లగ్జరీలైఫ్‌ అనుభవిం చడంతో పాటు విలువైన వస్తువుల కొనుగోలు చేస్తున్నారు. ఇందుకు ఇటీవల ముంబైలో ప్రారంభమైన యాపిల్‌ స్టోర్‌కు పలు వురు పోటెత్తడమే ఉదాహరణ.ఈ తరహా ఆర్థిక అంతరాలు దేశానికి ఎంత మాత్రం మంచిది కాదని, దేశాభివృద్ధికి ఆటంకం అని ఆర్థిక నిపుణు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక అంతరాలు అధికంగా ఉన్నదేశాల జాబితాలో భారత్‌ ఉన్నదని వరల్డ్‌ ఇన్‌ఈవ్వాలిటీ ఇండెక్స్‌-2022 పేర్కొన్నది. భారత్‌లో దేశ ఆదాయంలో టాప్‌ 10శాతం లేదా 1శాతం సంపన్నుల వద్ద వరుసగా 57శాతం, 22శాతం సంపద ఉన్నద నే ఆందోళనకర విష యాన్ని వెల్లడిరచింది. ఇటీ వల యాపిల్‌ సంస్థ ముంబైలో తన తొలి రిటైల్‌ స్టోర్‌ను ప్రారంభిం చింది. అక్కడ ఒక్కొ క్కటి రూ.లక్ష అంతకంటే ఎక్కువ ఖరీదు చేసే విలువైన ఫోన్ల కోసం స్టోర్‌ ముందు సంపన్నులు క్యూ కట్టారు. కాగా, మునుపటి ఏడాది కంటే 2022లో భారత్‌లో లగ్జరీ కార్ల అమ్మకాలు పెరిగాయి.ఇదే సమ యంలో మధ్య తరగతి ప్రజలు వినియో గించే బైక్‌లు,దేశీయ తయారీ సంస్థ బజాజ్‌ ఆటో అమ్మకాలు 10 శాతం పడిపోయాయి. భారత్‌ను తమ వేగవం తమైన మార్కెట్‌గా భావిస్తున్న లగ్జరీ కార్ల సంస్థ మెర్సి డెస్‌ బెంజ్‌ అమ్మకాలు గణనీయంగాఉంటా యని అంచ నా వేస్తున్నది. పైన పేర్కొన్న దానికి విరుద్ధంగా దేశంలో 63శాతం పేద,మధ్య తరగతి వినియోగ దారులు అనవసరమైన వస్తు వులు,సేవలపై ఖర్చులను పరిమితం చేసు కొంటున్నారని 2023 పీడ బ్ల్యూసీ గ్లోబల్‌ కన్జ్యూ మర్‌ ఇన్‌సైట్స్‌ పల్స్‌ సర్వే పేర్కొన్నది. తమ వ్యక్తిగత ఆర్థిక పరిస్థితులపై ఆందోళన చెందు తున్నామని సర్వేలో పాల్గొన్న74శాతం మంది పేర్కొ న్నారు. కలరా,తట్టు,పోలియో,మెదడు వాపు, మశూచి, సార్స్‌,ఎబోలా, ప్లేగు వంటి మహమ్మారులు సైతం వేధించి కనుమరుగయ్యాయి. కరోనా గతీ రేపు ఇంతేకాక తప్పదు. ఈలోపు అది సృష్టించే విలయం నుంచి ప్రజలను కాపాడుకోవడానికి పాలకులు శక్తివంచన లేకుండా కృషి చేయాలి. దాంతోపాటు జాతిని వేధిస్తున్న మరో మహ మ్మారిపైనా వారు దృష్టి సారించాల్సిన కీలక తరుణమిది. మానవాళిని వేధిస్తూ ఎప్పటికి అంతమవుతుందో తెలియని ఆ మహమ్మారి- ‘ఆర్థిక అసమానత’!
అసమానతలకు అంతంలేదా?
కరోనా భూతంలానే వందేళ్ల క్రితం 1920లో స్పానిష్‌ ఫ్లూ ప్రపంచాన్ని వణికించింది. అన్ని కాలాల్లోనూ నిరంతరాయంగా మహమ్మా రులు పీడిస్తూనే ఉన్నాయి.అసమానత అనే రుగ్మ తకు మాత్రం మందు కనుచూపు మేరలో లేదు. నిజానికి శ్రేయోరాజ్య భావన ప్రపంచంలో తొలుత 1880లో మొగ్గతొడిగింది. 1945 రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరవాత ఏర్పడిన ఆర్థిక సామా జిక కష్టాలతో దాని అవసరం మరింత ఏర్పడిరది. స్వాతంత్య్రం వచ్చి 73 ఏళ్ల అవుతున్నా ఆర్థిక అంతరాలు మాత్రం సమసిపోలేదు. శ్రేయోరాజ్య పాలన అందించే ప్రభుత్వాలు దాని మూలసూ త్రాలైన సమాన ఉపాధి అవకాశాలు, సంపద పంపిణీ వంటివాటిని విస్మరించాయి. అనవసర వ్యయాల బారినపడి అవినీతిని నిర్మూలించకుండా అమ లు చేసే పథకాలు, కార్యక్రమాలు మరింత అంతరాలకు కారణమవుతున్నాయి. దేశ ప్రజల ఆరోగ్య, ఆర్థిక సామాజిక భద్రత కోసం ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలు దోహదం చేసినప్పుడే శ్రేయోరాజ్య భావన సఫలీకృత మవుతుంది. ‘ఫోర్బ్స్‌’ లెక్కల ప్రకారం దేశంలో 102 మంది, ప్రపంచం లో 2,095 మంది బిలియనీర్లు ఉన్నారు. ప్రపంచ, దేశ జనాభాతో పోలిస్తేఇది సంఖ్యాపరంగా తక్కువే కావచ్ఛు కానీ మొన్నామధ్య ప్రముఖ ఆర్థికవేత్త పద్మ భూషణ్‌ కౌశిక్‌ బసు ‘ఆక్స్‌ఫామ్‌’ నివేదికను ఉటంకిస్తూ-73శాతం సంపద ఒక శాతం ప్రజల చేతిలో ఉందని ఓఇంటర్వ్యూలో చెప్పినప్పుడు ఆర్థిక అంతరాలు ఎంతగా పెరిగి పోయాయో స్పష్టమైంది. దురదృష్ట వశాత్తు ప్రభుత్వాలు చేపను పట్టడం నేర్ప కుండా… తెచ్చి నోట్లో పెట్టినట్లు తాత్కాలిక పథకాలు, కార్యక్రమాలతో తమ అధికారాన్ని కాపాడు కోవడం కోసం యత్నిస్తున్నాయి. అధిక సంఖ్యలో ఉన్న నిర్ణాయక శక్తిని ప్రభావితం చేస్తు న్నాయి. ఫలితంగా ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగు పడటం లేదు.
ఆర్థికంగా చితికిపోయింది..
బ్రిటిష్‌ పరిపాలనకు ముందు మనది స్వయం సమృద్ధ దేశం.వారి ఏలుబడిలో ఆర్థికంగా చితికిపోయింది.తదనంతర కాలంలో దేశాన్ని నిల బెట్టడం కోసం ప్రభుత్వాలు అనేక విధానా లను రూపొందించి అమలు చేశాయి. జనాభా పెరిగి అవసరాలూ మారిన తరవాత 1965లో హరిత విప్లవం దిశగా సాగి దిగుబడులు సాధించింది. 1990లో ప్రపంచీకరణకు తలు పులు తెరిచింది. అయినప్పటికీ స్వావలం బన అనేది ఇప్పటికీ ఇంకా సుదూరంలోనే ఉంది. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం జీడీపీలో 23.64శాతం దిగుమతులు ఉంటే,19.74 శాతం ఎగుమతులు ఉన్నాయి. మందులు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, రక్షణ సామగ్రి, చమురు, సెమీకండక్టర్ల వంటివాటికి ఇప్పటికీ ఇతర దేశాలమీదే ఆధారపడుతున్నాం. అందుకే స్వావ లంబన మంత్రాన్ని జపిస్తున్నాం. కరోనా, లాక్‌ డౌన్‌, సడలింపులు వంటి వాటితో మన వైద్య, ఆర్థిక వ్యవస్థలోని డొల్లతనం బయటపడిరది. వలస కూలీల వెతలే ఇందుకు నిదర్శనం. బ్రూకింగ్స్‌ నివేదిక ప్రకారం7.30కోట్ల ప్రజలు కటిక పేదరి కాన్ని అనుభవిస్తున్నారు. ఆపైన ఉన్నవారు, మధ్యతరగతి ప్రజలు అరకొర ఆదాయాలు, చుక్క లంటుతున్న ధరలతో జీవితాలను నెట్టుకొస్తున్నారు. సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ నివేదిక ప్రకారం 1917-18లో 4.6శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు 2018-19లో6.3 శాతానికి 2019-20లో 7.6శాతానికి ఎగబా కింది. అసంఘటితరంగం ఆసాంతం, సంఘటిత రంగంలోని చిన్న మధ్యతరహా సంస్థలు తీవ్రం గా దెబ్బతిన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉపాధి కోసుకుపోయి, ఆదాయాలు అడుగంటినవేళ ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ ఏ మేరకు పని చేస్తుందో చూడాలి. ఉపాధి, ఆదాయం,కొనుగోలు శక్తి,ఈ మూడిరటి మధ్య సంబం ధాన్ని గుర్తించ నంత కాలం, ఉపాధిలో స్వావలం బన సాధించ నంత కాలం అంతరాలు అలాగే ఉంటాయి. అందువల్ల ఆర్థిక అంతరాలు తగ్గే విధంగా, సంపద సృష్టి సమాజంలో అందరికీ విస్తరిం చేలా ఉపాధి కల్పన పథకాలు, కార్యక్రమా లను అమలుచేసే విధంగా ప్రభుత్వాలు తమ విధానా లను మార్చుకోవాల్సిన అవసరం ప్రస్తుత కరోనా క్లిష్టకాలంలో ఎంతైనా ఉంది! `(వ్యాసకర్త : సీనియర్‌ జర్నలిస్టు, అమరావతి – (పొడిశెట్టి సత్యనారాయణ)

  

జలమే జనానికి అమూల్య సంపద

‘‘జనాల జీవితమంతా జలంతోనే ముడి పడి ఉంటుంది.నిత్యం దాని చుట్టూనే తిరుగుతుంది.నీరు లేనిదే ఏపనీ ముందుకు సాగదు.ఎండా కాలంలో నైతే బోలెడు కష్టాలెదుర్కొవాలి.చెరువులు, కుం టలు, నీటి వనరులు లేని ఊళ్లు పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊరి చెంతనే నది పరుగులిడితే కలిగే ప్రయోజనాలు అన్నీఇన్నీ కావు.రైతులకు పంటలు,పండిస్తుంది. చేపలు పట్టే వారికి ఉపానిస్తుంది.ఎన్నో పనులకు భరోసాగా ఉంటుంది.ఆ జీవనదిలో ఉన్న అనుబంధాల్ని మరిచపో వద్దని తమ బిడ్డలకు ఆతల్లి పేరునే పెట్టుకుంటారు. గోదావరికి ఒడ్డునే ఉన్న పలు గ్రామాలకు వెళ్తే అక్కడి వారికి నది ఎంత మేలు చేస్తుందో తెలుస్తుంది’’
మనం నివసించే భూగోళంలో 70 శాతానికిపైగా నీరే.ఇందులో శుభ్రమైన నీరు చాలా స్వల్ప భాగం మాత్రమే.మొత్తం భూగోళంలోని నీటి లో దాదాపు 2.7శాతం మాత్రమే శుభ్రమైన నీరు కాగా,ఇందులోనూ75.2శాతం ధృవప్రాంతాలలో మంచు రూపంలో ఘనీభవించివుంటే,మరో 22.6 శాతంనీరు భూగర్భంలో వుంది.మిగతా నీరు సరస్సులు,నదులు,వాతావరణం,గాలిలోని తేమ, భూమిలోని చెమ్మ,చెట్టు చేమలలో వుంటుంది. ఇంతేకాదు,సరస్సులు,నదులు, భూగర్భ జలాలలో కూడా మానవ వినియోగానికి, ఇతర అవసరాలకు చక్కగా ఉపయోగ పడగలిగిన నీరు చాలా కొద్ది పరిమాణం మాత్రమే. ప్రపంచం మొత్తంలో లభ్యమయ్యే,పరిశుభ్రమైన నీటిలో,1శాతం కంటెకూడా తక్కువ పరిమా ణంలో, (లేదా,భూమిపై లభించే మొత్తంనీటిలో దాదాపు 0.00శాతం మాత్రమే) నీరు మానవ విని యోగానికి నేరుగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజూ, మనకు కనీసం 30-50 లీటర్ల పరిశుభ్రమైన, సురక్షితమైన నీరు అవసరం.కాని, ఇప్పటికీ, 88.4కోట్ల మంది( 884 మిలియన్ల మంది)ప్రజలకు సురక్షితమైన నీరు అందుబాటులో లేదు.ప్రపంచవ్యాప్తంగా,ప్రతి ఏటా,1,500ఘనకిలోమీటర్ల పరిమాణంలో,వ్యర్ధ మైన నీరు వస్తుంటుంది.వ్యర్ధ పదార్ధాలను,వ్యర్ధ మైన నీటిని పునర్వినియోగ ప్రక్రియద్వారా, ఇంధనో త్పత్తికి,వ్యవసాయ అవసరాలకు వినియోగించ వచ్చు.కాని,సాధారణంగా, అలా జరగడం లేదు. అభివృద్ధిచెందుతున్న దేశాలలో, తగిన నిబంధనలు, వనరులు లేనికారణంగా,80శాతం వ్యర్ధాలను పున ర్వినియోగ ప్రక్రియకు మళ్ళించకుండానే పారవేస్తు న్నారు.పెరుగుతున్న జనాభా,పారిశ్రామిక ప్రగతి కూడా,కొత్తరకాల కాలుష్యానికి మూలమవుతు న్నాయి.ఇదే దామాషాలో,పరిశుభ్రమైన నీటి అవస రం పెరుగుతున్నది.ఈకారణంగా,ఇటు వర్త మానంలోను,అటు భవిష్యత్తులోను మానవ ఆరో గ్యానికి,పర్యావరణ స్వచ్ఛతకు ముప్పుపొంచి వుంది.వేసవి వస్తోందంటేనే భయమేస్తోంది. నీటి కొరత దడ పుట్టిస్తుంది.బిందెలతో బారులు తీరే జనాలు కనిపిస్తారు.మరి నీటి సమస్య అంత విస్తృతమైనది. నీరు లభించని ప్రాంతాలలో ఎదుర య్యే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. నేల తల్లి నెర్రె లిచ్చి నీటిచుక్కకోసం ఆబగా ఎదురుచూస్తుంటే ఇక మానవమాత్రులెంత! గొంతు తడుపుకునే చుక్క నీటికోసం మైళ్లకు మైళ్లు నడిచిపోవాల్సిన పరిస్థితి. పరిశుభ్రమైన నీళ్లు దొరక్క కుంటల్లో, గుంటల్లో అడుగుబొడుగు మురికి నీటినే తాగాల్సిన దుస్థితి. భూమండలంమీద లభించే నీటిలో ఉప్పు సుమద్రా ల వాటా 97శాతం. మిగిలిన దానిలో 69 శాతం హిమపాతం, మంచుగడ్డలే. భూమి మీద లభించే నీటిలో0.008శాతం మాత్రమే స్వచ్ఛమైన నీరు.క్రీశ 2025 నాటికి 48దేశాల్లో తీవ్రమైన నీటికొరత వస్తుందని చికాగోలోని జాన్‌ హాప్కిన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ హెచ్చరించింది.3.575 మిలియన్ల మంది ప్రతి సంవత్సరం నీటికి సంబం ధించిన వ్యాధులతో మరణిస్తున్నారు.నీటిమూలంగా సంభవించిన 43శాతం మరణాలకు అతిసార వ్యాధే కారణం.పైన పేర్కొన్న మరణాలలో 84 శాతంమంది 14ఏళ్ల లోపువారే.98 శాతం మర ణాలు అభివృద్ధి చెందుతున్న దేశాలలోనే సంభవి స్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ ఆసుపత్రులలో చికిత్సపొందుతున్న రోగులలో సగం మంది నీటి సంబంధ వ్యాధులతో బాధపడుతున్నవారే. భూమి మీదున్న నీటిలో ఒక్క శాతానికంటే తక్కువ మొత్తం నీళ్లు మాత్రమే మానవాళి వెనువెంటనే వాడుకు నేలా వున్నాయి.అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని మురికి వాడల్లో నివసించే ఒకవ్యక్తి రోజు మొత్తం మీద ఉపయోగించే నీరు ఒక అమెరికన్‌ స్నానానికి వాడే నీటితో సమానం.లీటరు నీటికి మురికివాడల్లో నివ సించే పేదలు, అదే నగంలోని ధనికులకంటే 5-10రెట్లు అధికధర చెల్లిస్తున్నారు. ఆహారం లేకుండా మనిషి కొన్ని వారాలపాటు వుండగలడు. కానీ నీరు లేకుండా కొద్దిరోజులు మాత్రమే వుండగలడు. ప్రతి 15సెకన్లకు ఒక చిన్నారి నీటి సంబంధ వ్యాధి తో చనిపోతోంది.లక్షలాది మంది మహిళలు, పిల్ల లు రోజుమొత్తం మీద అనేక గంటల సమయాన్ని సుదూర ప్రాంతాల నుంచి నీళ్లు తేవడం కోసం వెచ్చిస్తారు.రోగాల నివారణలో దివ్య ఔషధం నీరు వాతావరణంలోని హైడ్రోజన్‌, ఆక్సిజన్‌ల కలయిక వల్ల నీరు ఏర్పడు తుంది.ఈ రెండు వాయు పదా ర్ధాలు కలిస్తే ద్రవ రూపమైన నీరు ఏర్పడును. నిత్యజీవితంలో నీటిని అనేక రకాలుగా ఉపయో గిస్తాం.నీటిని ఉపయోగించి అనేక వ్యాధులను తగ్గిం చే అవకాశం ఉంది. నీరు లేని భూమిని ఒకసారి ఊహించుకోండి.పచ్చనిచెట్లు,పారే నదులు, జీవులు, మహా సముద్రాలు ఏమీ ఉండవు. ఇవేవీ లేకుండా ఎండిపోయిన మట్టి గడ్డలా ఉంటుంది భూమి. అంతటి అమూల్యమైన నీటి విలువను తెలుసు కోడానికి, దానిని వృథా చేయకుండా అవగాహన కల్పించడానికి ఈ రోజును కేటాయించారు. ఐక్య రాజ్య సమితి 1993 నుంచి ప్రతి ఏడాది మార్చి 22ను అంతర్జాతీయ జలదినోత్సవంగా గుర్తిం చాలని నిర్ణయించింది. మన భూమ్మీద నీటి గురిం చి కొన్ని నిజాలు తెలుసుకుంటే అదెంత విలువ్కెనదో అర్థం అవుతుంది. భూమి ఏర్పడినప్పుడు ఎంత నీరు ఉందో ఇప్పుడూ అంతే ఉంది.పెరగడం కానీ తరగడం కానీ కాలేదు. కానీ ఆ నీటిని వాడుకునే వారి జనాభా మాత్రం విపరీతంగా పెరిగి పోయిం ది. అందుకే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది నీటి కోసం కటకటలాడుతున్నారు.భూమ్మీద ఉన్న నీరు ఎండకు ఆవిరవుతూ,మేఘాలుగా మారు తూ,వర్షంగా కురుస్తూ, భూమిలో ఇంకుతూ, సముద్రంలో కలుస్తూ వేర్వేరు రూపాల్లోకి మారుతూ ఉంటుంది.భూమ్మీద మూడొంతులు నీరే ఉంది. కానీ అందులో 97శాతం ఉప్పునీరే.కేవలం 3 శాతమే మంచి నీరు. ఇందులో కూడా 2 శాతం మంచురూపంలోఉంది.మిగతా ఒక శాతం నీరులో 0.59శాతం భూగర్భంలో ఉంటే, మిగతాది నదు లు,సరస్సుల్లో ప్రవహిస్తోంది.ఉన్న మంచి నీటిని మనం పొదుపుగా వాడకపోగా కలుషితం కూడా చేస్తున్నాం. ప్రపంచంలో 500కు పైగా మంచినీటి నదులు కలుషితమైపోయాయి. ప్రపంచంలో భారీ యుద్ధాల్లో చనిపోయిన వారి కన్నా, కలుషిత నీటి వల్ల మరణించినవారే ఎక్కువ. ఏడాదికి 40 లక్షల మంది కలుషిత నీరు తాగి చనిపోతున్నారు. అమెరి కాలో ఒక వ్యక్తి తన అవసరాలకి రోజుకి 500 లీటర్ల నీటిని ఉపయోగిస్తుంటే,ఆఫ్రికాలోని గాంబి యా దేశంలో ఒకవ్యక్తి రోజుకి కేవలం 4.5 లీటర్ల నీటిని మాత్రమే వినియోగిస్తున్నాడు. గాంబియా లాంటి చాలాదేశాల్లో తాగేందుకు కూడా నీరు దొరకడం లేదు.మనమేం చేయాలి?ఎక్కడ్కెనా కొళా యిల్లోంచి నీరువృధాగా పోతున్నట్టు కనిపిస్తే వెం టనే కట్టేయండి.షవర్‌తో స్నానం చేయడం మానేసి, బకెట్‌ నీళ్లతో చేయండి.దీనివల్ల రోజులో150 లీటర్ల నీటిని కాపాడవచ్చు.పళ్లుతోముకున్నంత సేపూ సింక్‌లోని కొళాయిని వదిలి ఉంచకండి. ఇలా చేయడంవల్ల నెలకి 200 లీటర్ల నీరు వృథా అవుతుంది. టాయిలెట్‌ ఫ్లష్‌లో సుమారు 8లీటర్ల నీరు పడుతుంది.లీటర్‌ నీరుపట్టే రెండు బాటిళ్లు తీసుకుని దానిలో ఇసుక లేదా చిన్నచిన్నరాళ్లు నింపి, టాయ్‌లెట్‌ ఫ్లష్‌లో పెట్టేయండి. దీనివల్ల ఒకసారి వాడే నీటిలో రెండులీటర్ల నీళ్లు ఆదా అవుతాయి. అక్వేరియంలోని నీళ్లు పారేయకుండా మొక్కలకి పోయండి.కొళాయిలకి లీకేజీలుఉంటే దానిని అరిక ట్టండి.దీనివల్ల నెలలో 300గ్యాలన్ల నీరుఆదా అవు తాయి.ఒక వార్తాపత్రికలో వాడే కాగితం తయారీకి 300లీటర్ల నీరుఖర్చవుతుంది.గాలితరువాత జీవ రాశికి నీరుచాలా ముఖ్యం.అందువల్ల నీటి వనరు లను పొదుపుగా ఉపయోగించుకోవాలి.ఈ నీరు భూఉపరితలములో నదులు,కాలువలు, చెరువులు, కుంటలు, సరస్సులు మరియు భూగర్భజల రూపం లో ఉన్నది.
అడవుల నరికివేత వలన వర్షపాతం కూడా తగ్గిపోయింది. భారతదేశంలో సగటున ప్రతి మనిషి అన్ని అవసరాలకి కలిపి 680 క్యూబిక్‌ మీటర్ల నీటిని వాడుతున్నారు. 6గురు ఉండే ఇంటికి 250 లీ నీరు అవసరమవుతుంది మన దేశంలో నదుల్లో ప్రవహించే మూడవ వంతు నీళ్ళు సము ద్రాల్లోకి నష్టపోతున్నాం.భూగర్భ, భూఉపరితల జలాలు రెండూ కలిపి దేశంలో వాడే మొత్తం నీటిలో 84శాతంవ్యవసాయానికి,12శాతం పరిశ్ర మలకి వాడుతున్నాం.ఇంతటి విలువైన నీటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత నేటి యువతరం పై ఉంది. ప్రస్తుతం ఉన్న వర్షా భావ పరిస్థితుల్లో ప్రతి నీటిచుక్కను ఒడిసి పట్టుకొని నిల్వ చేసుకో వాల్సిన అవసరం ఉంది. నానాటికి ఇంకిపోతున్న భూగర్భ జలాల సంరక్షణ పై దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడిరది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో యువత నేటితరం కోసం భావితరాల కోసం కొన్ని బాధ్యతలను విధిగా నిర్వర్తించాల్సి వుంది.నీటి సం రక్షణలో మొదటగా చేయాల్సింది నీటి వృధా అరిక ట్టడం.దైనందిన జీవితంలో మనం చాలా నీటిని వృధా చేస్తూఉంటాం.ముందుగా ప్రతి వ్యక్తి నీటి వృధాను అరికట్టే ప్రయత్నం చేయాలి.ప్రతి నీటి చుక్కా అమూల్యమైందే. మంచినీటిని పొదుపుగా వినియోగించాల్సిన అవసరం అందరిపై ఉంది. రోజువారీ అవసరాల్లో మనకు తెలియకుండానే నీటిని వృథా చేస్తుంటాం. నీటి వనరుల పర్యవేక్షణ లో యువత తీసుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది.
మరికొన్ని బాధ్యతలు :-
చెట్ల పెంపకం కార్యక్రమంపై యువత దృష్టి సారించాలి.
బీడు బావులను, జలశయాలను పునద్ధరించే చర్యలు చేపట్టడం.
ప్రతి వర్షపు చుక్కను ఒడిసి పట్టుకునేలా, నిల్వ చేసుకునేలా,భూగర్భ జలాలు పెంపొం దించేందుకు సాధ్యమైన చర్యలన్నింటినీ చేపట్టడం.
ఉపాధి పథకంలో భాగంగా కందకాల నిర్మా మం బండరాళ్ళ తొలగింపు,భూఉపరితల నీటి గుంటల నిర్మామంపట్ల దృష్టిసారించాలి.
నీటి వినియోగంపట్ల ప్రజల్లోఅవగాహన కలి గించేలా గ్రామగ్రామాన సదస్సులు నిర్వహిం చాలి.
సేద్యపు బావుల్లో పూడికతీత,కొత్తగా సేద్యపు బావుల తవ్వకం,ఎండిన బావులకు పునరు జ్జీవం కల్పించడం,చెక్‌ డ్యాంలలో పూడికతీత, చిన్న నీటి పారుదల చెరువుల చుట్టూ కందకా లు తీయడం తదితర చర్యలను చేపట్టాలి.
ఇళ్ళలో,కాలనీలలో,పాఠశాలలో,ప్రభుత్వ కార్యాలయాలలో వాననీటిని సేకరించి, దాచు కునే వ్యవస్థలను నెలకొల్పడం.
ఏడాది వర్షాలు బాగా కురుస్తాయని వాతా వరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి.ఎల్‌నినో ప్రభావం సన్నగిల్లుతుందని,వర్షాతిరేకంవెల్లి విరుస్తుందన్న అంచనాల నేపథ్యంలో రాష్ట్రం లో చెరువులు,కుంటల సముద్ధరణ,సంరక్షణ పై తక్షణం దృష్టి సారించాల్సి ఉంది. ఊరూ రా చెరువులు,కుంటల సంరక్షణచర్యలు చేపడి తే రాష్ట్రం సస్యశ్యామలమవుతుందనడంలో సందేహం లేదు.జూన్‌-సెప్టెంబర్‌ మధ్య కాలంలో దేశంలో 89సెంటీమీటర్ల వర్ష పాతం కురుస్తుందని భారతవాతావరణ సంస్థ,అమెరికాలోని అంతర్జాతీయ వాతా వరణ పరిశోధన సంస్థ,దక్షిణ కొరియా సంస్థ ఏపీఈసీ వాతావరణ కేంద్రం, ‘స్కయిమెట్‌ వెదర్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ సంస్థలన్నీ శుభం పలుకుతున్నాయి.
ప్రతి బోరు యజమాని కనీసం 2ఎకరాల క్యాచ్‌మెంట్‌ కుంటలు,ఫారం ఫాండ్స్‌ నిర్మిం చాలి.
పూర్వం కాకతీయ రాజులు, నిజం నవాబులు, కృష్ణదేవరాయలు వంటి పాలకులు తక్కువ శ్రమశక్తితోనే చెరువులు, కుంటలు తవ్వు కోగలిగారు. అప్పట్లోనే రాజులు లోత్కెన చెరు వులు తవ్వి భావితరాలకుగొప్ప మేలుచేశారు. కానీ నేడు ఇంత జనాభా,ఆధునిక యంత్రాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉండి కూడా ఆచెరువుల్లో కనీసం పూడిక తీసుకోలేని దురవస్థలో నేటి ప్రభుత్వాలున్నాయి. అయి దారు వందల ఏళ్ల కిందట గానుగ సున్నంతో నిర్మించిన తూములు ఇప్పటికీ చెక్కుచెదర కుండా నిలిచి ఉండగా,నేడు అత్యాధునిక పరిజ్ఞానంతో,సాధనాలతో,సిమెంట్‌ కాంక్రీటు లతో నిర్మించే నిర్మాణాలు మూణ్నాళ్ల ముచ్చ టగా మిగులుతున్నాయి.లోపం ఎక్కడ జరుగుతోందో పసిగట్టి పరిహరించాల్సిన పాలక గణం కేవలం పదవులను నిలబెట్టుకు నేందుకే ప్రాధాన్యమిచ్చి మిన్నకుండటం దుర దృష్టకరం.నేటి పాలకుల నిర్లక్ష్య ధోరణి పట్ల యువత తమ నిరసనను తెలియజేయాలి. ప్రభుత్వ పనితీరును ప్రశ్నించాలి.
సోషల్‌ మీడియా,పత్రికలు-టివీఛానల్స్‌ ద్వారా కూడా యువత నీటి వనరుల పరిరక్షణ పట్ల ప్రజలలో అవగాహన పెంపొందించే ప్రయ త్నం చేయాలి.
వ్యవసాయశాఖ అధికారులు కూడా క్షేత్ర స్థాయి సందర్శనలకువెళ్ళి పంటల పై, నీటి వినియోగ తీరుతెన్నుల పై రైతులకు అవగా హన కలుగజేసే ప్రయత్నం చేయాలి.
వాన నీరువృథా కాకుండా తక్కువ పెట్టు బడితో ఎక్కువ ప్రయోజనం పొందే పద్ధతిది. వర్షపు నీరు ఎండిన బావి వైపు వచ్చేలా కాల్వలు తవ్వుకోవాలి.ఈ కాల్వలో మట్టి వడపోసి కేవలం నీరు మాత్రమే వచ్చే ఏర్పాటు చేయాలి. నాలుగు అంగుళాల వ్యాసం ఉన్న పైపు ద్వారా బావిలోకి నీరు చేర్చాలి.ఎండిన బావిని వర్షపు నీటితో నింప డంతో బోరు బావుల్లోకి నీరు వస్తుంది. బావి వెడల్పు తక్కువ గనుక ఎండకు ఆవిరై పోవడం అంతగా ఉండదు.
పట్టణ ప్రాంతాలలో బోరు బావులు, కుళా యిలు పక్కన నేల నీటిని గ్రహించడానికి వీలుగారాళ్ళు,కంకర,దొడ్డు ఇసుకతో ఇంకుడు గుంతల్ని ఏర్పాటు చేయాలి. పట్టమాలు, నగరాల్లో డాబాలపై కురిసిన వర్షపు నీరు వృథా పోకుండా ఈ గుంతలలో చేర్చడం వల్ల భూగర్భ జలమట్టం పెరుగుతుంది.
భూమి ఎత్తు కన్నా కొంచెం తక్కువ ఎత్తులో ఉండేలా పొలాల్లో గుంతలు తవ్వాలి. పొలంలోపడ్డ వర్షపు నీరు ఈగుంతల్లోకి చేరుతుంది.చిన్న పొలాలకయితే ఆ నీరు ప్రాణాధారంగా ఉపయోగపడుతుంది. పశు వులకు తాగు నీరుగా వాడుకోవచ్చు. గుంత పరిధి,వైసాల్యం చిన్నది కావడంవల్ల ఎక్కువ నీరు ఆవిరి రూపంలో వృథాగా పోకుండా ఉంటుంది.ఇలా చేయడంవల్ల భూగర్భ జల మట్టం పెరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రప్రభుత్వం నీరు-చెట్టు అనే పథ కాన్ని ప్రవేశపెట్టింది.ఈ పథకంలో చెరువుల్లో మట్టి పూడిక తీయడం,చెట్లు నాటడం లాంటి పనులు చేయాలి.దీనివల్ల వర్షపు నీటిని సంరక్షించుకో వచ్చు నని ప్రభుత్వ ఉద్దేశ్యం.కానీ ఈకార్యక్రమం సవ్యంగా జరిగిన దాఖలాలు లేవు.నీటి సంరక్షణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. విజ్ఞత గల పౌరులందరూ ఈవిషయంపైదృష్టి సారించాల్సిన అవసరం, ఆవశ్యకతఉంది. నేడు ప్రపంచంలో చాలా దేశాల లోను,మరి ముఖ్యంగా భారతదేశంలో చాలా రాష్ట్రాలలోను నీటి కొరత సమస్య అధికంగా ఉం ది.నీటి వనరుల పర్యవేక్షణ లో ప్రజలు-ప్రభు త్వాలు సమిష్టిగా చర్యలుతీసుకొని ముందుకు సాగా లి. లేనియెడల ఈసమస్య మరెంత జఠిలమై మాన వ జీవనమే ప్రశ్నార్ధకమై పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉంది.చైతన్యవంతమైన యువత బాద్య తగా వ్యవహించి ఈసమస్య పరిష్కార మార్గా లను అన్వేషించే ప్రయత్నం చేయాలి. ‘‘జలో రక్షితి రక్షతః – జలంతోనే జగతి’’.- (యం.రాంప్రదీప్‌)

1 14 15 16 17 18 75