పేదల చెంతకు శ్రీమంతుల చదువు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ విద్యా విధానంలో మరో విప్లవాత్మక ఘట్టం ఆవిష్కృతమవుతోంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడి యంలో బోధన సహా అనేక సంస్కరణలు తెచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి.. ఇప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రైవేటు పాఠ శాలల్లో శ్రీమంతుల పిల్లలు చదువుకునే ‘ఇంటర్నే షనల్‌ బాకలారియెట్‌’ (ఐబీ) సిలబస్‌ను కూడా పేద పిల్లలకు చేరువ చేస్తున్నారు.ఐబీ సిలబస్‌ అమలుపై బుధవారం సాయంత్రం ఏపీ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎస్సీఈఆర్టీ) అధికారులతో ఐబీ ప్రతినిధులు ఒప్పందం చేసుకోనున్నారు. దీంతో మన ప్రభుత్వ విద్యార్థులు ప్రపంచ స్థాయి లో పోటీపడి నెగ్గేలా తీర్చిదిద్దడంలో మరో కీలక అడుగు పడనుంది. 2024-25 విద్యా సంవత్స రంలో ఐబీ బోధ నపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. వారిలో బోధన సామర్థ్యం, నైపు ణ్యం పెంచేలా ఈ శిక్షణ ఉంటుంది. టీచర్ల తోపాటు మండల,జిల్లా విద్యాధికారులు, ఎస్సీఈఆర్టీ, డైట్‌ సిబ్బంది,ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్‌బోర్డు సిబ్బం దికి‘ఐబీ’పై అవగా హన, సామర్థ్యం పెంచేలా శిక్షణనిస్తారు.దీంతో వారంతా ప్రతిష్టాత్మక ఐబీగ్లోబల్‌ టీచర్‌ నెట్‌ వర్క్‌లో భాగమ వుతారు. 2025 జూన్‌ నుంచి ఒకటో తరగతిలో ఐబీ సిలబస్‌ బోధన ప్రారంభమ వుతుంది. ఏటా ఒక్కో తరగతికి ఈ సిల బస్‌ను పెంచుతూ 2035 నాటికి 10వ తరగతి,2037కి 12వ తరగతిలో అమ లు చేస్తారు. పరీక్షల అనంతరం ఐబీ బోర్డు, ఏపీఎస్సీఈఆర్టీ ఉమ్మడిగా సర్టిఫికెట్‌ను ప్రదానం చేస్తాయి. ఈ సర్టిఫి కెట్‌కు అంతర్జాతీయంగా గుర్తింపు సైతం ఉంటుంది.
2019 నుంచే గ్లోబల్‌ సిటిజన్స్‌ ప్రణాళిక
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను గ్లోబల్‌ విద్యార్థులుగా తీర్చిదిద్దే ప్రక్రియను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 2019 నుంచే ప్రారంభించింది. ప్రాథమిక స్థాయి నుంచి విద్యార్థులు ఉత్తమంగా ఎదిగేందుకు 56 నెలల్లో దాదాపు రూ.73 వేల కోట్లు విద్యా సంస్కరణల కోసం వెచ్చించింది. నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్‌ స్కూళ్లకంటే మిన్నగా తీర్చి దిద్దు తోంది.జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద తదితర విప్లవాత్మక కార్యక్ర మాలను అమలు చేసి విద్యార్థుల ఉన్నతికి బాట లు వేసింది. ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లిష్‌ మీడియంలో బోధన ప్రారంభించింది.
మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. పాఠశాలలను సీబీఎస్‌ఈ బోర్డుకు అనుసంధానించింది. విద్యార్థులకు బైలింగ్యువల్‌ టెక్టస్‌ బుక్స్‌ నుంచి ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ వరకు 9 వస్తువులతో కూడిన జగనన్న విద్యా కానుక కిట్‌ను అందిస్తోంది. పిల్లల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంచడంతో పాటు సులభంగా ఇంగ్లిష్‌ అర్థమయ్యేలా మార్పులు చేసింది. నాలుగు నుంచి 12వ తరగతి వరకు ఉచిత బైజూస్‌ కంటెంట్‌, 8వ తరగతి విద్యార్థులకు, టీచర్లకు బైజూస్‌ కంటెంట్‌తో ఉచిత ట్యాబ్స్‌ పంపిణీ చేసింది.
హై స్కూల్‌ స్థాయిలో ప్రతి తరగతి గదిలో డిజిటల్‌ బోధన కోసం 62 వేల ఐఎఫ్‌పీలు ఏర్పాటు చేస్తోంది. ప్రాథమిక పాఠశాలల్లో 45 వేల స్మార్ట్‌ టీవీలు, ఇంగ్లిష్‌ ల్యాబ్స్‌ ఏర్పా­టు చేసింది. ప్రాథమిక స్థాయి నుంచి విద్యార్థులు స్పోకెన్‌ ఇంగ్లిష్‌లో నైపుణ్యం సాధించేందుకు మూడో తరగతి నుంచి టోఫెల్‌ శిక్షణనిస్తోంది. ఐబీ సిలబస్‌ను సులభంగా అర్థం చేసుకునేందుకు, అంతర్జాతీయ ప్రమాణాలను
అందుకునేందుకు ఈ మార్పులు దోహదం చేస్తాయి.
ఐబీ విద్యా బోధనలో ఎన్నో ప్రత్యేకతలు
ఐబీ విద్య ప్రపంచంలోనే అత్యుత్తమ బోధన పద్ధతిగా గుర్తింపు పొందింది. బట్టీ చదువులకు స్వస్తి చెబుతూ థియరీతో పాటు ప్రాక్టికల్‌ అప్లికేషన్‌ పద్ధతిలో బోధన సాగుతుంది. విద్యార్థుల్లో నాయ కత్వ లక్షణాలను పెంపొందిస్తుంది. ప్రస్తుత, భావితరాల అవసరాలకు అనుగుణంగా సిలబస్‌, బోధన, మూల్యాంకనం ఉంటుంది. చదువుతో పాటు ప్రాక్టికల్స్‌, విద్యార్థుల్లో నైపుణ్యాల (స్కిల్స్‌) కు ప్రాధాన్యతనిస్తారు.
సంగీతం, నృత్యం, క్రీడలు వంటి ఇతర అంశాల్లో నూ తర్ఫీదు ఇస్తారు. ఇంటర్‌ డిసిప్టీనరీ కాన్సెప్ట్‌ (వాస్తవిక జీవిత అంశాలు) ఆధారంగా బోధన సాగుతుంది.ఈ సిలబస్‌ను అభ్యసించిన విద్యా ర్థులు ఇతరులతో పోలిస్తే ప్రపంచంలోని అత్యుత్తమ యూనివర్సిటీల్లో మూడు రెట్లు అధికంగా ప్రవేశాలు పొందుతు న్నారు. ప్రపంచ స్థాయి ఉద్యోగావకాశాలను సైతం వేగంగా అందుకుంటున్నారు.
కొత్తగా మారేదేంటి ? ప్రయోజనమెంత?
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులకు ఇప్పటికే ఇంగ్లీష్‌ మీడియం విద్య, అనలిటిక్స్‌ కోసం బైజూస్‌ కంటెంట్‌ వాడకం ద్వారా పోటీ తత్వాన్ని పెంచుతున్న ప్రభుత్వం.. ఇప్పుడు అంతర్జాతీయంగా వారు పోటీ పడేలా ఐబీ సిలబస్‌ ను అందుబాటులోకి తీసుకొస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ విద్యాపరిశోధనా మండలి ఎస్‌.సి. ఈ.ఆర్‌.టితో అంతర్జాతీయ విద్యాబోర్డు అయిన ఐబీని భాగస్వామిగా మారుస్తూ ఒకటో తరగతి నుంచి క్రమంగా ప్రవేశపెడుతున్న ఈ ఉమ్మడి సిలబస్‌తో ఎన్నో ప్రయోజనాలు ఉండబోతు న్నాయి.రాష్ట్ర ప్రభుత్వ స్కూళ్లలో ఐబీ సిలబస్‌ ప్రవేశపెట్టాలంటే ముందుగా ఉపాధ్యాయుల్ని అందుకు సిద్ధం చేయాలి. ఈ ప్రక్రియ చేపట్టేం దుకు వచ్చే విద్యాసంవత్సరాన్నివాడు కోనున్నారు. అనంతరం 2025-26 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో ఐబీ సిలబస్‌ ను ప్రవేశపెడ తారు. ఆ తర్వాత ఏడాది దాన్ని రెండో తరగతికి విస్తరిస్తారు. అలా 2035 నాటికి పదో తరగతికి, 2037 నాటికి పన్నెండో తరగతికి దీన్ని విస్తరి స్తారు. ఇలా ఐబీ సిలబస్‌ లో చదివిన వారికి ఐబీతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉమ్మడి సర్టిఫికెట్లు ఇస్తారు.ఐబీ సిలబస్‌ తో విద్యార్ధులు చదవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా అంతర్జాతీయంగా అత్యుత్తమ బోధనా పద్ధతులు ఇందులో ఉంటాయి. బట్టీ చదువులకు బదులు థియరీతో పాటు ప్రాక్టికల్‌ అప్లికేషన్‌ విధానంలో విద్యా బోధన ఉంటుంది. అంతే కాదు విద్యార్ధుల్లో నాయకత్వ లక్షణాలను ప్రోత్స హిస్తారు. సిలబస్‌ రూపకల్పనతో పాటు బోధనా పద్ధతులు, మూల్యాంకనం కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. ఐబీ సిలబస్‌లో భాగంగా క్లాస్‌ రూమ్‌ బోధనతో పాటు నైపుణ్యాలు (స్కిల్స్‌), ఎక్స్ట్రా కరికులర్‌ యాక్టివిటీస్‌, ప్రాక్టికల్స్‌ కు సమ ప్రాధాన్యత ఇస్తారు. అలాగే నిజ జీవిత అంశాలు వివిధ సబ్జెక్టుల దృష్టి కోణంలో అధ్యయనం కోసం ఇంటర్‌ డిసిప్లేనరీ కాన్సెప్ట్‌ అమలు చేస్తారు.ఐబీ సిలబస్‌లో విద్యా భ్యాసం చేసిన వారికి ఇతరులతో పోలిస్తే ప్రపం చంలోని అత్యుత్తమ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు లభించే అవకాశం మూడురెట్లు ఎక్కువగా ఉంటుందని అంచనా. అలాగే అంతర్జాతీయ స్ధాయిలో ఉద్యోగావకాశాలు కూడా లభిస్తాయి. ’’మన విద్యార్థులు పోటీ ప్రపంచంలో లీడర్స్‌గా ఎదగాలని, పిల్లల ఉన్నత చదువుల కోసం ఏ కుటుంబం అప్పుల పాలు కారాదని, అర్హత కలిగిన పేద విద్యా ర్థులు ధైర్యంగా విదేశాల్లో ఉన్నత విద్య చదివేలా మన ప్రభుత్వంలో ‘జగనన్న విదేశీ విద్య’పథకాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నా రు.పేద విద్యార్థుల చదువులకు ప్రభు త్వం ఆర్థిక తోడ్పాటు అందిస్తోందని, ఈ పథకం వల్ల పలువురు విద్యార్థులు విదేశాల్లోని టాప్‌ యూనివర్సిటీల్లో చదువుతుండటం చాలా ఆనం దంగా ఉందన్నారు. పేద విద్యార్థుల తలరాత మార్చేందుకు రూ.8 లక్షల వార్షికా దాయం లోపు ఉన్న వారందరికీ జగనన్న విదేశీ విద్యా దీవెన అందిస్తున్నా’’మని సీఎం జగన్‌ పేర్కొన్నారు. జగనన్న విదేశీ విద్యా దీవెన నిధులను తాడేపల్లి క్యాంపు కార్యాల యం వేదికగా సీఎం జగన్‌ విడుదల చేశారు. అర్హులైన 390 మంది విద్యార్థులకు రూ.41. 60 కోట్ల నిధులను నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. సివిల్స్‌ అభ్యర్థులకు జగనన్న ప్రోత్సాహకం అందిస్తున్నామన్నారు. సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పాసైన అభ్యర్థులకు రూ.లక్ష ప్రోత్సా హకం, మెయిన్స్‌ పాస్‌ అయితే రూ.లక్షా 50 వేలు అందిస్తున్నామని వెల్లడిర చారు. సివిల్స్‌లో క్వాలిఫై అయిన 95 మందికి విద్యా దీవెన కింద ప్రోత్సాహకాన్ని అందించారు.
అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా..
తల్లిదండ్రులు ఎలాంటి అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం, జగనన్న తోడుగా ఉంటుందన్న భరోసా ఈ కార్యక్రమం ద్వారా ఇస్తున్నామని సీఎం జగన్‌ పేర్కొన్నారు. శాచురేషన్‌ పద్ధతిలో పారదర్శకంగా ఎవరికైనా కూడా టైమ్స్‌ రేటింగ్‌, టైమ్స్‌ హైయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ర్యాంకింగ్స్‌ లో కానీ, క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌లోటాప్‌ 50 కాలేజీ ల్లో 350 కాలేజీల్లో సీట్లు ఎవరికి వచ్చినా కూడా ఏపీ నుంచి ఎంటైర్‌ ఫీజు కోటి 25 లక్షల దాకా ఇచ్చితోడుగా నిలబడే కార్యక్రమం ఇదని తెలిపారు.
మన పిల్లలకు మేలు చేయాలన్నదే నా కోరిక
ఈ ఏడాది దాదాపుగా 51మందికి కొత్తగా అడ్మి షన్లు వచ్చాయని,రూ.9.50కోట్లు వారికి ఇస్తున్నామని, విదేశాల్లో ఉన్నత విద్య కోసం ఇప్పటికే చదువుతున్న పిల్లలకు ఈ సీజన్‌లో ఫీజులు చెల్లించాల్సిన మొత్తం రూ.41.59 కోట్లు నేడు ఇస్తున్నామని తెలిపారు. ‘‘దాదా పుగా రూ. 107కోట్లు 408 మంది విద్యార్థు లకు ఈ పథకం ద్వారా ఖర్చు చేస్తున్నాం.ఈ పథకం ఎంత సంతృప్తి ఇస్తుందంటే..మిమ్మల్ని చూసి మిగిలిన వారు కూడా ఇన్‌స్ఫైర్‌ అయి టాప్‌ యూనివ ర్సిటీల్లో సీట్లు తెచ్చుకునేలా, మీరు గొప్పగా ఎదిగే దాకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు అందించిందో అది ఎక్కడో ఒక చోట మన రాష్ట్రానికి కూడా కొంత కాంట్రీబ్యూషన్‌ ఇచ్చి రాష్ట్రాన్ని గుర్తు పెట్టు కోవాలి. మన పిల్లలకు మేలు చేయాలన్నదే నా కోరిక’’ అని సీఎం జగన్‌ ఆకాంక్షించారు.
మీ అందరికీ ఆల్‌ దీ బెస్ట్‌
‘‘వార్షిక ఆదాయం రూ.8లక్షలు ఉన్న కుటుం బాలకు ఈ పథకం దేవుడిచ్చిన గొప్ప అవకాశం. మీ అందరికీ కూడా ఆల్‌ దీ బెస్ట్‌ విసెస్‌ తెలియ జేస్తూ మీరందరూ అత్యధికం గా బాగుపడాలని కోరుకుం టున్నాను. రాబో యే రోజుల్లో ఇంకా ఎక్కువ మంది ఉత్తీర్ణులై మన రాష్ట్రం పేరును, వారి కుటుంబాలను ఈ స్థాయి నుంచి మరో స్థాయిలోకి తీసుకెళ్లే పరిస్థితి రావాలని, దేవుడు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టే పరిస్థితి రావాలని కోరుకుంటున్నాను’’ అని సీం అన్నారు -జిఎన్‌వి సతీష్‌

జార్ఖండ్‌లో కొత్త ప్రభుత్వం

జార్ఖండ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేటితో ముగిసింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంపాయ్‌ సోరెన్‌ ఫిబ్రవరి 2న ప్రమాణ స్వీకారం చేశారు. రాంచీలోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ సిపి. రాధాకృష్ణన్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. కాంగ్రెస్‌ నేత అలంగీర్‌ ఆలం, ఆర్‌జెడి ఎమ్మెల్యే సత్యానంద్‌ భోక్తాలు మంత్రులుగా ప్రమాణం చేశారు. మనీలాండరింగ్‌ ఆరోపణలతో మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ను ఈడి బుధవారం రాత్రి అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. దీంతో 24 గంటలకుపైగా రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొంది. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై కొన్ని గంటల పాటు సందిగ్ధత నెలకొంది. చివరకు గురువారం అర్థరాత్రి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆమోదించారు.హేమంత్‌ సోరెన్‌ ప్రభుత్వంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా, రవాణా మంత్రిగా పనిచేసిన చంపాయ్‌ సోరెన్‌ శుక్రవారం నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.అయితే పదిరోజుల అనంతరం నిర్వహించే బలపరీక్షలో తన మెజారిటీని నిరూపించుకోవాల్సి వుంది. చంపాయ్‌ సోరెన్‌కు జార్ఖండ్‌ముక్తి మోర్చా-కాంగ్రెస్‌-రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్‌జెడి) కూటమికి చెందిన 43 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా ఉన్నారు. వీరిలో ఇద్దరు చంపాయ్‌తో పాటు నేడు ప్రమాణం చేశారు. 43మంది ఎమ్మెల్యేలు తనకు మద్దతు తెలిపారని, ఈసంఖ్య 46-48కి చేరుకోవచ్చని చంపాయ్‌ పేర్కొన్నారు.తమ కూటమి బలంగా ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. బలపరీక్ష కోసం తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు సంకీర్ణ కూటమి సిద్ధమైంది. కొంతమంది ఎమ్మెల్యేలను హైదరాబాద్‌ తరలించేందుకు సిద్ధమైంది.
సోరెన్‌కు ఐదురోజుల కస్టడీ
ఈడి అరెస్టును సవాలు చేస్తూ హేమంత్‌ సోరెన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.’’మేం జోక్యం చేసుకోలేం’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. హైకోర్టుకు వెళ్లాల్సిందిగా సూచించింది. కాగా,రాంచీలోని పిఎంఎల్‌ఎ కోర్టు ఐదు రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది.
చంపాయ్‌ సోరెన్‌ ఎవరు?
చంపాయ్‌ సోరెన్‌ సరైకెలా-ఖర్సవాన్‌ జిల్లాలోని జిలింగ్గోడా గ్రామానికి చెందిన రైతు సిమల్‌ సోరెన్‌ పెద్ద కుమారుడు. ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి వరకు విద్యనభ్యసించారు. చిన్న వయసులోనే వివాహం చేసుకున్న ఆయనకు నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 90వ దశకం చివర్లో శిబు సోరెన్‌ తో కలిసి జార?ండ్‌ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న సోరెన్‌ అనతికాలంలోనే ‘జార్ఖండ్‌ టైగర్‌ ‘గా ఖ్యాతి గడిరచారు. సరైకెలా స్థానానికి జరిగిన ఉప ఎన్నిక ద్వారా స్వతంత్ర ఎమ్మెల్యేగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.అర్జున్‌ ముండా నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో కేబినెట్‌ మంత్రిగా కూడా కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. 2010 సెప్టెంబర్‌ 11 నుంచి 2013 జనవరి 18 వరకు మంత్రిగా పనిచేశారు. రాష్ట్రపతి పాలన తరువాత,హేమంత్‌ సోరెన్‌ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు, చంపాయ్‌ సోరెన్‌ ఆహార మరియు పౌర సరఫరాలు మరియు రవాణా మంత్రి అయ్యారు.
జార్ఖండ్‌్‌ టైగర్‌గా పేరు..
చంపాయ్‌ సోరెన్‌ జార్ఖండ్‌ ముక్తి మోర్చా పార్టీ నుంచి సెరైకెలా అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కేబినెట్‌ మంత్రిగా హేమంత్‌ సోరెన్‌ ప్రభుత్వంలో రవాణా, షెడ్యూల్డ్‌ తెగలు, షెడ్యూల్డ్‌ కులాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ బాధ్యతలను బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చంపై 1974లో జంషెడ్‌పూర్లోని రామకృష్ణ మిషన్‌ హైస్కూల్‌లో 10వ తరగతి వరకు చదివారు. బీహార్‌ నుంచి ప్రత్యేక జార?ండ్‌ రాష్ట్రం కోసం డిమాండ్‌ వచ్చిన సమయంలో చంపై పేరు వార్తల్లో నిలిచింది. శిబు సోరెన్‌తో పాటు చంపై సైతం ప్రత్యేక జార?ండ్‌ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ప్రజలు ఆయనను ‘జార్ఖండ్‌ టైగర్‌’గా పిలుస్తూ వస్తున్నారు.
తొలిసారిగా 2005లో అసెంబ్లీకి..
చంపై తొలిసారిగా 2005లో జార్ఖండ్‌ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009లోనూ మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సెప్టెంబర్‌ 2010 నుంచి జనవరి 2013 వరకు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, లేబర్‌ హౌసింగ్‌ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. జూలై 2013 నుంచి డిసెంబర్‌ 2014 పౌర సరఫరాలు, రవాణా శాఖ మంత్రిగా పని చేశారు. 2014లో మూడోసారి జార్ఖండ్‌ అసెంబ్లీకి ఎన్నిక య్యారు. 2019లో నాలుగోసారి ఎమ్మెల్యే ఎన్నికయ్యారు. హేమంత్‌ సోరెన్‌ ప్రభుత్వంలో రవాణా, సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు.
భూకుంభకోణంలో ఇరుక్కోవడంతో..
హేమంత్‌ సోరెన్‌ భూ కుంభకోణంలో ఇరు క్కున్నారు. ఈ కుంభకోణంపై ఈడీ దర్యాప్తు చేస్తున్నది. పలుసార్లు ఆయనకు ఈడీ నోటీసులు జారీ చేయగా.. విచారణకు గైర్హాజరయ్యారు. ఇంతకు ముందు ఒకసారి విచారించింది. మళ్లీ బుధవారం సైతం ఈడీ అధికారులు ఆయన నివాసానికి చేరుకొని విచారిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఈడీ కస్టడీలో ఉన్నారు. అరెస్టు చేసే అవకాశం ఉండడంతో జార్ఖండ్‌ సీఎం పదవికి హేమంత్‌ సోరెన్‌ రాజీనామా చేశారు. ఈ క్రమంలో జార్ఖండ్‌్‌ ముక్తి మోర్చా కాంగ్రెస్‌ కూటమి శాసనసభా పక్ష నేతగా చంపై సోరెన్‌ను ఎన్నుకున్నాయి. తొలుత కల్పనా సోరెన్‌ను సీఎం చేస్తారని చెప్పినా.. చివరకు చంపై సోరెన్‌కు అవకాశం దక్కింది.హేమంత్‌ సోరెన్‌కు అత్యంత దగ్గరి వ్యక్తుల్లో చంపై సోరెన్‌ ఒకరు. శిబు సోరెన్‌తో పాటు హేమంత్‌ సోరెన్‌తో చాలాకాలంగా పని చేస్తూ వస్తున్నారు.జార్ఖండ్‌లో గడిచిన కొన్ని గంటలుగా ప్రభుత్వ అస్థితరత లేకపోవడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయని జార్ఖండ్‌ ముక్తీ మోర్చాసీనియర్‌ నేత చంపాయ్‌ సోరెన్‌ అన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ గవర్నర్‌ సీపీ రాధా కృష్ణన్‌ను కోరుతూ ఆయన లేఖ రాశారు. హేమంత్‌ సోరెన్‌ ముఖ్యమంత్రి సీఎం పదవి నుంచి వైదొలగడం, అవినీతి కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్టు చేసిన తర్వాత సోరెన్‌ నిన్న జార్ఖండ్‌ ముక్తి మోర్చా శాసనసభా పక్ష నేతగా ఎంపికయ్యారు.81 మంది సభ్యులున్న అసెంబ్లీలో మెజారిటీ జేఎంఎం, కాంగ్రెస్‌, ఆర్జేడీ కూటమికే ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు. మొత్తంగా తమ బలం 47గా ఉన్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి ఎమ్మెల్యేలు సంతకం చేసిన మద్దతు లేఖను గవర్నర్‌కు సమర్పించినట్లు గవర్నర్‌కు రాసిన లేఖలో తెలిపారు. ఎమ్మెల్యే లందరూ తనతో పాటు రాజ్‌భవన్‌కు వచ్చా రని, అయితే లోపలికి అనుమ తించలే దన్నారు. రాష్ట్ర తదుపరి ముఖ్య మంత్రిగా చంపాయ్‌ సోరెన్‌ ప్రమాణం చేసే అవకాశం ఉంది. ఆయన ప్రస్తుత ప్రభు త్వంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు.
ఇదీ కేసు..
జార్ఖండ్‌లో భూకుంభకోణం ఆరోపణలపై హేమంత్‌ సోరెన్‌పై ఈడీ దర్యాప్తు జరుగు తోంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు దర్యాప్తు సంస్థతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని జేఎంఎం నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సోరెన్‌ ఈడీ అధికారులపై కేసు పెట్టారు. -(బిర్సనాయక్‌ ముండా)

గరీబీ హఠావో..నినాదం వింటున్నాం..కానీ..

జనవరి 30వ తేదీ పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా.. దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా మోదీ సర్కారు సాధించిన విజయాలను గుర్తుచేశారు. యువశక్తి, నారీశక్తి,రైతులు, పేదలు అనే నాలుగు స్తంభాలపై దేశాభివృద్ధి ఆధారపడి ఉందని విశ్వసిస్తున్నాం. సరిహద్దు ల్లో ఆధునిక మౌళిక సదుపాయాలు కల్పిస్తు న్నాం.ఉగ్ర వాదం,విస్తరణవాదానికి మన దళాలు గట్టిగా బదులిస్తున్నాయి. నక్సల్‌ ఘటనలు భారీగా తగ్గాయి.జమ్మూకాశ్మీర్లఓ సురక్షిత పరిస్థితులను నెలకొన్నాం.గ్రీన్‌ మొబిలిటీని ప్రొత్సహిస్తున్నాం. సౌరవిద్యు దుత్పత్తిలో మన దేశం ప్రపంచం లోనే ఐదోస్థానంలో నిలిచింది.దేశంలో లక్షకు పైగా స్టార్టప్‌లు ఏర్పాటు చేశాం.పర్యాటక రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాం.అండమాన్‌,లక్షదీప్‌ వంటి ప్రాంతాలపై పర్యాటకులకు ఆసక్తి పెరిగింది. సవాళ్లు, ఆటుపోట్లను అధిగమించి భారత్‌ ముందుకెళ్తోందని, అంతరిక్షంలోనూ అద్భు తంగా దూసుకు పోతోందని ముర్ము తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అయోధ్య మందిర అంశాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. అలాగే, ఆర్టికల్‌ 370 రద్దును కూడా చారిత్రక నిర్ణయంగా చెప్పారు.కొత్త పార్లమెంట్‌లో ఇదే తన తొలి ప్రసంగం అని చెప్పారు. సభా కార్యకలాపాలు సజావు సాగేందుకు సహకరించాలని విపక్ష పార్టీలను రాష్ట్రపతి ముర్ము కోరారు. 21వ శతాబ్ధంలో నవ భారతం సరికొత్త సంప్రదాయాలను నిర్మించాలనే సంకల్పానికి ఈ భవనం ప్రతీక గా ఉంది. ఈనూతన పార్లమెంట్‌ భవనంలో విధవిధానాలపై అర్థవంతమైన చర్చలు జరుగు తాయని నేను విశ్వసిస్తున్నానని ఆమె అన్నారు.భారతీయ సంస్కృతి,సభ్యత ఎంతో చైతన్యవంతమైనవని,చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలిదేశం భారత్‌ అని రాష్ట్రపతి కొనియాడారు. ఆసియా క్రీడల్లో తొలిసారి వంద పతకాలను భారతీయ క్రీడాకారులు సాధించారని పేర్కొన్నారు. గతంలో గరీబ్‌ హఠావో నినాదాన్ని మాత్రమే విన్నామని, ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నామని ముర్ము అన్నారు.‘శాంతినికేతన్‌ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది..భగవాన్‌ బిర్సాముండా జన్మదినాన్ని జన్‌ జాతీయ దివస్‌గా జరుపుకొం టున్నాం..తెలంగాణలో సమ్మక్క-సారక్క గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుంది.. ఆదివాసీ యోధులను స్మరించు కోవడం గర్వకారణం.. గతేడాది మన దేశం ఎన్నో ఘనతలు సాధించింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన తొలి దేశంగా భారత్‌ చరిత్ర సృష్టించింది.. ఆదిత్య ఎల్‌-1 మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించింది.జీ20 సమావేశాలను విజయవంతంగా నిర్వహిం చుకున్నాం…ఆసియా క్రీడల్లో తొలిసారి భారత్‌ 107,పారా క్రీడల్లో 111 పతకాలు సాధించింది’ అని తెలిపారు.కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ను ఎత్తివేయడం చారిత్రాత్మక నిర్ణయ మని ముర్ము ప్రశంసించారు.పేదల కోసం 10కోట్ల ఉజ్వల్‌ కనెక్షన్ల అంద జేశాం..తొలి సారిగా నమోభారత్‌ రైలును ఆవిష్కరించాం.. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేలా నారీశక్తి వందన్‌ అధినియమ్‌ బిల్లును ఆమోదింపజేసుకున్నాం..‘గరీబీ హఠా వో’ నినాదాన్ని వింటున్నాం..కానీ, జీవితంలో తొలిసారి పేదరికాన్ని పెద్ద ఎత్తున పారదోల డం చూస్తున్నాం.గత 0ఏళ్లలో 25 కోట్లమంది పేదరికం నుంచి బయట పడ్డారు. పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా భారత్‌ ముందు కళ్తోంది.’అని మోదీ ప్రభుత్వాన్ని రాష్ట్రపతి అభినందించారు. ‘శతాబ్దాలుగా కలలు కంటున్న అయోధ్యలో రామమందిర నిర్మాణం సాకారమైంది..ఎన్నో ఆటంకాలను అధిగమిం చి ఆలయాన్ని ప్రారంభించాం..దేశంలో 5జీ నెట్‌వర్క్‌ వేగంగా విస్తరిస్తోంది..కొత్త క్రిమినల్‌ చట్టాలను తీసుకొచ్చాం.‘ఏక్‌ భారత్‌- శ్రేష్ఠ్‌ భారత్‌’ నినాదంతో ముందుకెళ్తున్నాం..రక్షణ, అంతరిక్ష రంగంలో కొత్త ఆవిష్కరణలు జరి గాయి.. ఉత్తర్‌ ప్రదేశ్‌, తమిళనాడులో రక్షణ కారిడార్‌లు ఏర్పాటుచేసుకున్నాం..ప్రపంచం లోనే అత్యుత్తమ బ్యాంకింగ్‌ వ్యవస్థల్లో భారత్‌ ఒకటిగా నిలిచింది.’అని రాష్ట్రపతిపేర్కొన్నారు.
బడ్జెట్‌కు ముందు.. నిర్మలమ్మ నోరు తీపి చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
2024-25 సంవత్సరానికి గానూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తాత్కాలిక బడ్జెన్‌ను మరికాసేపట్లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. జనవరి 30 ఉదయం 11 గంటలకు లోక్‌ సభలో బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభిం చనున్నారు. ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన ఆర్థిక మంత్రి.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి బడ్జెట్‌ సమర్పణకు అనుమతి తీసుకున్నారు. ఈ సందర్భంగా నిర్మలమ్మకు రాష్ట్రపతి నోరు తీపి చేశారు. స్వీటు తినిపించి గుడ్‌లక్‌ చెప్పారు. మరోవైపు మధ్యంత బడ్జెట్‌కే రాష్ట్రపతి,
కేబినెట్‌ ఆమోదం లభించింది.
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి ఒకటిన పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌ ఎలాంటి కొత్తదనం లేకుండా పేలవంగా ఉన్నది. పూర్తిస్థాయి బడ్జెట్‌ కాదు, కనుక ప్రజలు దీనిపై పెద్దగా ఆశలేమీ పెట్టుకోలేదు. కాకపోతే సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్నది కనుక ఏవైనా జనాకర్షక అంశాలు ఉంటాయేమో అనుకున్నారు. కానీ, ఎలాంటి ఉరుములు, మెరుపులు లేకుండానే చప్పగా సాగింది ఆర్థికమంత్రి బడ్జెట్‌ ప్రసంగం. మౌలికరంగం మెరుగుదల, ద్రవ్యలోటు తగ్గింపుపైనే ఆమె ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. పెట్టుబడి వ్యయం లక్ష్యాన్ని 11శాతం పెంచారు. ద్రవ్యలోటును 5.1శాతానికి తగ్గిస్తామన్నారు. ఆదాయ పన్ను పరిమితి పెంపు గురించి ఒకప్పుడు బీజేపీ నేతలు ఊదరగొట్టేవారు. కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పదేండ్లు పూర్తి చేసుకుం టున్న సందర్భంగా వెలువడిన ఈ చివరాఖరి బడ్జెట్‌లోనూ పన్ను పరిమితుల్లో గానీ, రాయితీల్లో గానీ ఎలాంటి వెసులుబాట్లు ప్రతిపాదించలేదు. ఇప్పటికే చేయాల్సినదంతా చేశాం.. ఇకపై చేయాల్సింది ఏమీ లేదనే ధోరణి ఆర్థికమంత్రి మాటల్లో వ్యక్తమైంది. ఎన్నికల వేళ తాయిలాల జోలికి పోకుండా, ఆర్థికాభివృద్ధి లక్ష్యాలను పెంచుకోవడం ప్రభు త్వంలో పెరిగిన ఆత్మవిశ్వాసానికి ప్రతీక అంటున్నారు బీజేపీ అనుకూల ఆర్థిక, రాజకీ య పరిశీలకులు. ఇక రూ.5లక్షల కోట్ల జీడీపీ లక్ష్యం ఓవైపు వాయిదా పడు తుండగానే, 2030 నాటికి రూ.7లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ సాధిస్తామంటూ ఆర్థికమంత్రి అరచేతిలో స్వర్గం చూపించే ప్రయత్నం చేశారు. ప్రజల తక్షణ సమస్యల కన్నా స్థూల ఆర్థికవృద్ధి మీదనే దృష్టి పెట్టడం బీజేపీ ప్రభుత్వానికి పరిపాటిగా మారింది.గత పదేండ్లలో భారత ఆర్థిక వ్యవస్థ సకారాత్మక పరిణామానికి గురైందని, ఆశలు పెరిగాయని ఆర్థికమంత్రి గొప్పగా చెప్పుకొన్నారు. జీడీపీ పెరిగినా తలసరి ఆదాయం పెరగని వింతైన, విలోమ పరిస్థి తిలో భారత్‌ ముందుకు సాగుతున్నది. ధనిక-పేద అంతరాలు అంతకంతకూ అధికమవు తున్నాయి. ఆదాయాల తరుగుదల, ధరల పెరుగుదల మధ్యన నలిగిపోతున్న పేద, మధ్యతరగతి ప్రజలకు ఎలాంటి ఉపశమ నమూ బడ్జెట్‌లో లేకపోవడం ప్రభుత్వ ప్రాధాన్యతలకు మచ్చుతునక. టూరిజం అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తామని చెప్తూ లక్షద్వీప్‌లో మౌలిక వసతుల అభివృద్ధిని ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం. అంతర్జాతీయ వివాదాలపై తెంపరితనపు స్పందనగా మారిన ఈ అంశం సున్నితమైన జీవావరణంతో ముడిపడి ఉన్నదనే విషయం విదితమే. పర్యాటక అభివృద్ధి పేరిట ప్రకృతి విధ్వంసం జరగకుండా చూడాలన్న పర్యావర ణవేత్తల హెచ్చరికలపై తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమున్నది. రైతులకు పెద్దపీట వేసినట్టు ఆర్థికమంత్రి చెప్పారు. కానీ, పలు కీలక అంశాల్లో రైతులకు నిరాశ కలిగించారు. పీఎం కిసాన్‌ యోజన కింద ఆర్థిక సాయాన్ని రూ.6 వేల నుంచి రూ.9 వేలకు, అలాగే పంటరుణాల లక్ష్యాన్ని పెంచు తారని ఆశించినప్పటికీ బడ్జెట్‌లో వీటికి చోటు దక్కలేదు. గత ఐదేండ్లలో రూ.లక్ష కోట్లకు పైగా వ్యవసాయ బడ్జెట్‌ నిధులను ప్రభుత్వం ఖర్చు చేయకుండా వెనక్కి తీసుకున్నదన్న విమర్శలు వచ్చిన నేపథ్యంలో వ్యవసాయ రంగంపై ప్రభుత్వ చిత్తశుద్ధి ప్రశ్నార్థకమవు తున్నది. రుణమాఫీకి అవకాశం ఉన్నప్పటికీ దాని జోలికి వెళ్లలేదు.పెట్రోల్‌,డీజిల్‌ ధరలు తగ్గించాల్సిన అవసరం ఇప్పుడు ఇదివరకటి కంటే ఎక్కువగా ఉన్నది. అందుకు అవసర మైన ఆర్థిక వెసులుబాటు కూడా ఉన్నప్పటికీ దానిని పట్టించుకోలేదు.ఇలా ప్రజల మీద భారం తగ్గించే అనేక అంశాలపై ఆర్థికమంత్రి శీతకన్ను వేయడంతో బడ్జెట్‌ అన్నివర్గాలకు అసంతృప్తినే మిగిల్చింది!
ఊరించి.. ఉసూరనిపించి..!
నిరుపేదలు, మహిళలు, యువత, రైతుల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించిన ఆర్థిక మంత్రి నిర్మల.. వారితోపాటు ఇతరులకూ నిర్దిష్టంగా ఎటువంటి వరాలూ ప్రకటించలేదు. అలాగే వాతలూ పెట్టలేదు. మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనన్న మోదీ సర్కారు ధీమా బడ్జెట్‌ ప్రసంగంలో ప్రతిఫలించింది! రాబోయే ఐదేళ్లలో మునుపెన్నడూ లేని అభివృద్ధి జరగనుందని, 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌ కల సాకారానికి ఇది స్వర్ణ యుగమని నిర్మల చెప్పారు. రాబోయే ఐదేళ్ల లో మధ్య తరగతి గృహ నిర్మాణానికి సంబం ధించి కొత్త పథకం ప్రకటిస్తామని నిర్మల ప్రకటించారు. ప్రధాన మంత్రి ఆవాస యోజన కింద మూడు కోట్ల మార్కుకు చేరు కుంటున్నామని, రాబోయే ఐదేళ్లలో మరో రెండు కోట్ల ఇళ్లను నిర్మిస్తామని వెల్లడిరచారు. రైల్వేలో మూడు (ఎనర్జీ, మినరల్‌, సిమెంట్‌) భారీ కారిడార్లను చేపట్టడంతోపాటు ఏకంగా 40 వేల సాధారణ బోగీలను వందే భారత్‌ స్థాయిలో తీర్చిదిద్దుతామని తెలిపారు. పోర్టు కనెక్టివిటీ కారిడార్లు, హై ట్రాఫిక్‌ డెన్సిటీ కారిడార్లనూ తీసుకొస్తామన్నారు. విమానాశ్ర యాలను విస్తరించడంతోపాటు కొత్తగా వెయ్యికిపైగా విమానాలను కొంటామని చెప్పారు. రూఫ్‌ టాప్‌ సోలార్‌ పథకం కింద దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్తు అందజేస్తామని ప్రకటించారు. టెక్నాలజీ అంటే చెవి కోసుకునే యువత స్టార్ట్‌పలను ప్రారంభించేందుకు చేయూత ఇస్తామని, తక్కువ వడ్డీకి లేదా వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చేందుకు లక్ష కోట్ల రూపాయలతో కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఐదు ఇంటిగ్రేటెడ్‌ ఆక్వా పార్కులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే, మహిళల ఆరోగ్యంపై నిర్మల ప్రత్యేకంగా దృష్టి సారించారు. 9-14 ఏళ్ల బాలికలకు సర్వైకల్‌ క్యాన్సర్‌ టీకా వేసేందుకు ప్రత్యేక పథకాన్ని తీసుకొస్తామని ప్రకటించారు. మాతా శిశు సంక్షేమానికి పెద్దపీట వేస్తామని చెబుతూనే..ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని అంగన్వాడీలు, ఆశాలకూ విస్తరించారు. మహిళలను లక్షాధికారుల (లాక్‌పతి దీదీ)ను చేసే పథకం కింద ఇప్పటికే కోటి మందిని లక్షాధికారులను చేశామని, రాబోయే ఐదేళ్లలో మరో తొమ్మిది కోట్ల మందిని చేయడమే తమ లక్ష్యమని వెల్ల డిరచారు. అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వ ఆస్పత్రులను నిర్మిస్తామని, మరిన్ని మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఉపాధి హామీ పథకం కేటాయింపులను 43 శాతం పెంచి 86 వేల కోట్లు చేశారు.ఎప్ప ట్లాగే రక్షణ బడ్జెట్‌కు పెద్దపీట వేశారు. గత బడ్జెట్‌తో పోలిస్తే 4శాతం పెంచి రూ.6.2 లక్షల కోట్లు కేటాయించారు. ఇక, ప్రత్యక్ష, పరోక్ష పన్నులు సహా దిగుమతి సుంకాల్లో ఎటువంటి మార్పులు చేయలేదు. అయితే, స్టార్ట్‌ప్సకు ఇచ్చే కొన్ని రాయితీలు, సావరిన్‌ వెల్త్‌ బాండ్స్‌, పింఛను నిధుల్లో పెట్టే పెట్టుబ డులకు ఇచ్చే రాయితీలు తదితరాలు వచ్చే ఏడాది మార్చి 31 వరకూ కొనసాగుతాయని తెలిపారు. ఏళ్ల తరబడి పేరుకుపోయిన 10 వేలుబీ 25 వేలలోపు వివాదాస్పద ఐటీ పన్ను డిమాండ్లను రద్దు చేశారు.తద్వారా,కోటి మందికి ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. విద్యుత్తు వాహన వ్యవస్థను బలో పతం చేస్తామని చెప్పిన నిర్మల..అందు కు సంబంధించి నిర్దిష్ట కార్యాచరణను మాత్రం బడ్జెట్లో ప్రకటించలేదు. సరికదా..ఫేమ్‌ పథ కం బడ్జెట్‌నూ 44శాతం కోత కోశారు.
మూలధన వ్యయానికి పెద్దపీట
ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, ద్రవ్యలోటును అదుపులో ఉంచడమే తమ ముందు ఉన్న ప్రధాన లక్ష్యమని పునరుద్ఘా టించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. బడ్జెట్లో ఆ దిశగానే అడుగులు వేశారు. ఇందులో భాగంగా మూలధన వ్యయం పెంపునకు పెద్దపీట వేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి మూలధన వ్యయాన్ని భారీగా 11.1శాతం పెంచి రూ.11,11,111కోట్లు కేటాయించనున్నట్లు ప్రకటించారు. తద్వారా, ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పన పుంజుకుంటాయని సంకేతాలు ఇచ్చారు. అయితే, గత ఏడాది రూ.10 లక్షల కోట్లు మూలధన వ్యయం కింద ఖర్చు చేస్తామని చెప్పినా.. రూ.9.5 లక్షల కోట్లకే పరిమితం కావడం గమనార్హం. రాష్ట్రాలకు కూడా మూలధన వ్యయం పెంచేందుకు ఈ ఏడాది రూ.1.3 లక్షల కోట్ల మేరకు వడ్డీ లేని రుణం కల్పిస్తామని, వికసిత్‌ భారత్‌ యాత్రలో భాగంగా సంస్కరణల అమలుకు రాబోయే 50 ఏళ్లలో మరో రూ.75 వేల కోట్ల వడ్డీ లేని రుణాలను రాష్ట్రాలకు అందిస్తామని వెల్లడిరచారు. ఆర్థిక కార్యకలాపాల్లో బలమైన వృద్ధి కారణంగా రెవెన్యూ వసూళ్లు పెరిగా యని, గత ఏడాది డిసెంబరుకు జీఎస్టీ వసూళ్లు రూ.1.65 లక్షల కోట్లు ఉన్నాయని వివరించారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో రూ.47.77 లక్షల కోట్ల మేరకు ఆదాయం లభిస్తుందని, ఇందులో కేవలం పన్ను రాబడులే రూ.26.99 లక్షల కోట్లు ఉంటాయని అంచనా వేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇవి రూ.30 లక్షల కోట్లు ఉంటాయని తెలిపారు. ఫలితంగా, సంక్షేమ పథకాలకు వ్యయాన్ని కూడా పెంచామని వివరించారు. గత పదేళ్లలో తీసుకున్న నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో పురోగతి చెందిందని గణాంక వివరాలతో సహా వివరించారు. 2023-24కు సవరించిన ఆర్థిక లోటు జీడీపీలో 5.8శాతానికి చేరుకుందని చెప్పిన నిర్మల..ఇది ఆర్థిక పటిష్ఠత దిశలో మోదీ ప్రభుత్వం చేపట్టిన చర్యలకు నిదర్శనమని తెలిపారు. వచ్చే ఏడాది కూడా ఆర్థిక లోటును తగ్గించి జీడీపీలో 5.1శాతానికే పరిమితం చేస్తామని చెప్పారు. మార్కెట్‌ రుణాలు గత ఏడాది కంటే తక్కువగా ఉంటాయని, వీటిని మరింత తగ్గిస్తామని అంటూనే.. నికర మార్కెట్‌ రుణాలు రూ.11.75 లక్షల కోట్లు ఉండ వచ్చునని తెలిపారు. విదేశీ ప్రత్యక్ష పెట్టు బడులకు సంబంధించి ఇది స్వర్ణయుగమని, 2005-14తో పోలిస్తే 2014-23లో రెట్టింపు ఎఫ్‌డీఐలు లభించాయని, ఈ ఐదేళ్ల లోనే 596 బిలియన్‌ డాలర్ల (రూ.4,172 వేల కోట్లు) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు దేశానికి వచ్చాయని వివరించారు.వచ్చే ఆర్థిక సంవత్సరంలో వాస్తవ జీడీపీ 7.3శాతం ఉం టుందని అంచనా వేశారు. 2027 నాటికి భారత్‌ ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఐఎంఎఫ్‌ సహా పలు అంతర్జాతీయ సంస్థలు అంచనా వేశాయని చెప్పారు. పన్నుల వాటా కింద చెల్లించే నిధులు, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు ఇచ్చే సొమ్ము, పలు గ్రాంట్లు/లోన్లు తదితర అవసరాల కోసం రాష్ట్రాలకు కేంద్రం రూ.22,22,264 కోట్లు చెల్లించనుంది. ఇందులో రాష్ట్రాలకు పన్నుల వాటా కింద రూ.12,19,783 కోట్లు కోట్లు, ఆర్థిక కమిషన్‌ నిధుల రూపంలో రూ.1,32,378 కోట్లు, కేంద్ర ప్రభుత్వ పథకాలకు రూ.6,81,480 కోట్లు ఇవ్వనుంది.వడ్డీ చెల్లింపులకు రూ.11, 90,440 కోట్లు,వివిధ అవసరాల కోసం తెచ్చిన రుణాలకు చెల్లించే వడ్డీల చెల్లింపుల కోసం సుమారు రూ.11,90,440 కోట్లు అవసరం అవుతుందని బడ్జెట్‌లో అంచనా వేశారు. 2023-24లో వడ్డీల చెల్లింపులకు 10,55,427 కోట్లు అవుతుందని అంచనా వేశారు. 2022-23లోరూ.9,28,517 కోట్ల నిధులను వడ్డీలకు చెల్లించారు.జీడీపీ రూ.3,27,71,808 కోట్లు వచ్చే ఏడాదికి గాను జీడీపీ రూ.3,27,71,808 కోట్లు ఉం టుందని అంచనా వేశారు. గత ఏడాదితో పోలిస్తే ఇది10్న అధికం.2023-24ఆర్థిక సంవత్సరంలో జీడీపీ రూ.2,96,57,745 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఆర్థిక మంత్రి మధ్యంతర బడ్జెట్‌లో ప్రధా నంగా నాలుగు వర్గాలపై దృష్టి సారించారు. తన దృష్టిలో ఈ నాలుగే అతి పెద్ద కులాలని ప్రధాని మోడీ గతంలో చేసిన ప్రకటనను దృష్టిలో పెట్టుకొని పేదలు, మహిళలు, యువత, రైతుల కోసం కొన్ని పథకాలు, కార్యక్రమాలు ప్రకటించారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోందని పలు సర్వేలు చెబుతున్నప్పటికీ దానిపై ఆర్థిక మంత్రి తన బడ్జెట్‌ ప్రసంగంలో ఒక్క మాట కూడా చెప్పలేదు. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ సాధనే లక్ష్యంగా ఉపాధి కల్పన కోసం ఏదైనా పథకమో లేక కార్యక్రమమో ప్రకటిస్తారని ఎదురు చూసిన నిరుద్యోగుల ఆశలు ఆవిరయ్యాయి. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద రాబోయే ఐదు సంవత్సరాల్లో మరో రెండు కోట్ల ఇళ్లను నిర్మిస్తామని నిర్మల తెలిపారు. విద్యుత్‌ బిల్లుల నుండి సామా న్యులకు ఊరట కల్పించే ఉద్దేశంతో కొత్తగా సౌరశక్తి పథకాన్ని ప్రకటించారు. ఇందులో భాగంగా కోటి ఆవాసాలకు ప్రతి నెలా 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ లభిస్తుందని చెప్పారు. ఇళ్లపై సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకునే వారికి ఏడాదికి రూ.15,000 నుండి రూ.18,000 ఆదా అవుతుందని తెలిపారు. పట్టణ పేదల కోసం కూడా ఆర్థిక మంత్రి ఓ పథకాన్ని ప్రకటించారు.‘అద్దె ఇళ్లు, మురికివాడలు, అనధికారిక కాలనీలలో నివసించే మధ్యతరగతి ప్రజలు ఇళ్లను కొనుగోలు చేసేందుకు లేదా నిర్మించుకునేం దుకు సాయం అందిస్తాం’ అని చెప్పారు. ఈ పథకం లక్ష్యాన్ని మాత్రం వివరించలేదు. 9-14 సంవత్సరాల మధ్య వయసున్న బాలికలు సర్వైకల్‌ క్యాన్సర్‌ బారిన పడకుండా వ్యాక్సిన్ల తయారీని ప్రోత్సహిస్తామని అన్నారు. దేశంలో మరిన్ని వైద్య కళాశాలల ఏర్పాటుకు కమిటీని ఏర్పాటు చేస్తామని, ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులకు కూడా వర్తింపజేస్తామని తెలిపారు. ప్రధానమంత్రి స్వనిధి ద్వారా ఇప్పటి వరకూ 78 లక్షల మంది వీధి వ్యాపారులకు రుణాలు అందించామని, రాబోయే కాలంలో మరో 2.3 లక్షల మందికి కొత్త రుణాలు ఇస్తామని ఆర్థిక మంత్రి చెప్పారు. పంటలకు నానో డిఎపి ఎరువులు అందజేస్తామని అన్నారు. చమురు గింజల రంగంలో ఆత్మ నిర్భరత సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. 2,3 తరగతులకు చెందిన నగరాలకు కొత్తగా విమాన సర్వీసులు ప్రారంభిస్తామని తెలిపారు. ఎలక్ట్రిక్‌ వాహనాల కోసం ఛార్జింగ్‌ స్టేషన్లు, ప్రజా రవాణా కోసం ఎలక్ట్రిక్‌ బస్సుల్ని ప్రోత్సహిస్తామని వివరించారు.
స్వల్పంగా పెరిగిన కేటాయింపులు
మధ్యంతర బడ్జెట్‌లో పలు కీలక పథకాలకు కేటాయింపులు పెద్దగా పెంచలేదు. గ్రామీణ ఉపాధి హమీ పథకానికి కేటాయింపులను కేవలం రూ.26,000 కోట్లు మాత్రమే పెంచారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ పథకానికి రూ.60,000 కోట్లు కేటాయించగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.86,000 కోట్లు (సవరించిన అంచనాలు) కేటాయించారు. ఇక ఆయుష్మాన్‌ భారత్‌ (పిఎంజెఎవై) పథకానికి కేటాయింపులు రూ.7,200 కోట్ల నుండి రూ.7,500 కోట్లకు అంటే కేవలం రూ.300 కోట్లు మాత్రమే పెరిగాయి.కీలకమైన ఆరోగ్యం, విద్య రంగాలకు సైతం మధ్యంతర బడ్జెట్‌లో కేటాయింపులు అరకొరగానే ఉన్నాయి. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయమేమంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ రంగాలకు జరిపిన కేటాయింపుల్ని సైతం పూర్తి స్థాయిలో ఖర్చు చేయలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్స రంలో విద్యపై రూ.1,16,417 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా రూ.1,08,878 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. అదే విధంగా ఆరోగ్య రంగంపై రూ.88,956 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా రూ.79,221 కోట్లు వ్యయం చేశారు.
కేటాయింపుల్లోనూ కోతలే
ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమం కోసం ఉద్దే శించిన కీలక పథకాలకు కూడా మధ్యంతర బడ్జెట్‌ కేటాయింపుల్లో కోత విధించారు. ఉదా హరణకు షెడ్యూల్డ్‌ కులాల వారి అభివృద్ధి కోసం ఒకే గొడుగు కింద సాయం చేసేందుకు ఉద్దేశించిన పథకానికి (అంబ్రెల్లా స్కీమ్‌) బడ్జెట్‌ అంచనాలు రూ.9,409 కోట్లు కాగా సవరించిన అంచనాలు రూ.6,780 కోట్లు. షెడ్యూల్డ్‌ తెగలకు బడ్జెట్‌ అంచనాలు రూ.4, 295 కోట్లు కాగా సవరించిన అంచనా లు రూ.3,286 కోట్లు. మైనారిటీలకు బడ్జెట్‌ అంచనాలు రూ.610 కోట్లు కాగా సవరించిన అంచనాలు రూ.555 కోట్లు. ఇతర బలహీన వర్గాలకు బడ్జెట్‌ అంచనాలు రూ.2,194 కోట్లు కాగా సవరించిన అంచనాలు రూ.1,918 కోట్లు.
పన్నులే ఆదాయం
ప్రభుత్వానికి ఇప్పుడు ఆదాయ పన్ను ద్వారానే అధిక ఆదాయం లభిస్తోంది. ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక వనరు అప్పులే అయినప్పటికీ అతి పెద్ద రెండో ఆర్థిక వనరు ఆదాయ పన్ను నుండి లభించే రాబడి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆర్థిక వనరుల్లో 19% రాబడి ఆదాయ పన్ను ద్వారా లభించేదేనని బడ్జెట్‌ పత్రాలు చెబుతున్నాయి. ప్రభుత్వ ఆర్థిక వనరుల్లో 17% కార్పొరేట్‌ పన్నులు, 18% జీఎస్టీ, 28% అప్పుల ద్వారా సమకూరుతోంది.
ద్రవ్యలోటును మరింత తగ్గిస్తాం
రాబోయే ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఉత్ప త్తి అయ్యే వస్తువులు, సేవల మొత్తం మార్కెట్‌ విలువ (నామినల్‌ జిడిపి) 10.5% పెరగ వచ్చునని ప్రభుత్వం భావిస్తోంది. తాజా బడ్జెట్‌ పత్రాల ప్రకారం ఈ విలువ రూ.3, 22,71,808 కోట్లు ఉండవచ్చునని అంచనా. ద్రవ్య లోటును 5.8%కి తగ్గించామని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి దీనిని 5.1%కి, 2025-26 నాటికి 4.5%కి తగ్గిస్తామని తెలిపారు. మూలధన వ్యయాన్ని రూ.10 లక్షల కోట్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకున్నప్పటికీ సవరించిన అంచనాలను బట్టి అది సాధ్య పడలేదని తేలింది. మూలధన వ్యయం రూ.9.5 లక్షల కోట్లకే పరిమితమైంది.
ప్రతిపక్షాలపై విసుర్లు
గంట పాటు సాగిన నిర్మలమ్మ బడ్జెట్‌ ప్రసంగంలో%ౌౌ% అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని ప్రస్తావించారు. అదేవిధంగా ప్రతిపక్షాల విమర్శలపైనా స్పందించారు. మోడీ ప్రభుత్వం లౌకికవాదాన్ని బలపరిచే చర్యలు చేపడుతోందని చెప్పుకున్నారు. ప్రతిపక్ష నేతలపైనే జరుగుతున్న కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణలను గురించి మాట్లాడుతూ ‘గతంలో సామాజిక న్యాయం ఓ రాజకీయ నినాదంగా ఉండేది. మా ప్రభుత్వానికి సంబంధించి అది సమర్ధ వంతమైన, అవసరమైన పరిపాలనా మోడల్‌. ప్రజలందరికీ సామాజిక న్యాయం అందేలా చూడాలి. అవినీతిని తగ్గించాలి. బంధుప్రీతిని రూపుమాపాలి’ అని అన్నారు.
రైలు బోగీలకు వందే భారత్‌ హంగులు
బడ్జెట్‌లో రైల్వే శాఖకు రూ.2.55 లక్షల కోట్లు కేటాయించారు. నలభై వేల సాధారణ బోగీల్లోనే వందే భారత్‌ రైళ్లలో ఉండే ప్రమాణాలు నెలకొల్పుతామని చెప్పారు. పెరుగుతున్న పట్టణీకరణను దృష్టిలో ఉంచు కొని ప్రయాణికుల కోసం మెట్రో, నమో భారత్‌ రైళ్లపై దృష్టి సారిస్తామని చెప్పారు. దేశంలో మూడు కొత్త రైల్వే ఆర్థిక కారిడార్లు ఏర్పాటు చేస్తామన్నారు. రైళ్ల రాకపోకలు ఎక్కువగా జరిగే మార్గాల్లో, ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే కారిడార్లలో మౌలిక సదు పాయాలను మెరుగుపరుస్తామని అన్నారు. ప్రధాని గతిశక్తి కార్యక్రమం కింద ఇంధనం- ఖనిజాలు -సిమెంట్‌ కారిడార్లు, ఓడరేవుల అనుసంధానం కారిడార్లు, రద్దీ అధికంగా ఉండే కారిడార్లు ఇలా మూడు ఆర్థిక కారిడార్లను ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి తన బడ్జెట్‌ ప్రసంగంలో వివరించారు. ప్యాసింజర్‌ రైళ్ల రాకపోకలను మెరుగుపరు స్తామని, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని ఆమె చెప్పారు. కారిడార్ల ఏర్పాటుతో రైళ్ల ప్రయాణ వేగం కూడా పెరుగుతుందని ఆర్థిక మంత్రి అన్నారు.
విషాద బడ్జెట్‌ 2024.. మరోసారి వంచనకు గురైన రాష్ట్రం..` సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరి గిందని.. మన రాష్ట్రానికి సంబంధించిన ఎలాంటి ప్రతిపాదనలు బడ్జెట్లో లేవని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఒక ప్రకట నను తెలిపారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగంలో కొనసాగించే విషయం గానీ, పోలవరం నిర్వాసితుల విషయం గాని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, కడప ఉక్కు ఫ్యాక్టరీ, అమరావతి రాజధానికి నిధులు, విభజన హామీల ప్రస్తావన వంటి ఏ అంశాలు ఈ బడ్జెట్లో లేకపోవడంతో మరొకసారి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను వంచించ టానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని స్పష్టమవుతుందన్నారు. మన రాష్ట్రం నుండి జిఎస్టీ వసూళ్ళు పెరిగినా రాష్ట్రం వాటా మాత్రం పెరగలేదన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ప్రజలంతా ముందుకు రావా లని..వైసిపి, టిడిపి, జనసేన సహా అన్ని పార్టీలు ఈ కేంద్ర ప్రభుత్వం విధానాలను వ్యతిరేకిస్తూ ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. కేంద్ర విద్రోహానికి వ్యతిరే కంగా ఫ్రిబవరి 7,8 తేదీలలో ఢల్లీిలో జరిగే ధర్నాను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ గత 10ఏళ్ల విషాద భారతం కొనసాగింపుగానే ఉందని.. ఈ బడ్జెట్‌లో 99శాతం ప్రజలకు ఎలాంటి ఉపశమనం లేదన్నారు. బడా కార్పొరేట్లకు వికాసం, సామాన్యులకు విషాదం మిగిల్చి.. ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రజల ఆస్తుల్ని అంబానీ, అదాని లాంటి బడాకార్పొరేట్‌లకు కట్ట బెట్టడంలో కేంద్ర ప్రభుత్వం జయప్రదం అయిందన్నారు. నిరుద్యోగులకి తీవ్రంగా అన్యాయం జరిగిందని.. ధరల పెంపుదలతో ప్రజలపై భారాలు పెరిగాయని తెలిపారు. జీఎస్టీ పేరుతో రెట్టింపు పరోక్ష పన్ను వసూలు చేయడమే దీనికి తార్కాణమన్నారు. ప్రత్యక్ష పన్ను రాయితీలన్నీ కార్పొరేట్‌ కంపెనీలకి ఇచ్చి పెంపుదల భారం అంతా మధ్యతరగతి, ఉన్నత మధ్యతరగతిపై, ఉద్యోగవర్గాలపై వేయటం ఈ కాలంలో వారు సాధించిన ’’ఘనత’’ అని పేర్కొన్నారు.విదేశీ పెట్టుబడి దారులకు పెద్దపీట వేసి చిన్న పరిశ్రమలను చిన్న వ్యాపారస్తులను దెబ్బతీశారని. సాధారణ ప్యాసింజర్‌ రైళ్ళను తగ్గించి వందేభారత్‌ రైళ్ల పేరుతో ప్రయా ణాల్ని భారంగా మార్చారని ధ్వజ మెత్తారు. ఈ అసంతృప్తిని పక్కదారి పట్టించ డానికి, అణచటానికి మతాన్ని ఉప యోగించుకొని రామనామస్మరణతో ప్రజల్ని మాయ చేయా లని చూస్తున్నారని మండి పడ్డారు. ప్రజల్ని మోసం చేయడానికి వేసుకున్న ముసుగు మాత్రమే ఈ రామనామ స్మరణ అని అన్నారు. దేశాన్ని మతరాజ్యంగా మార్చడం వారి ధ్యేయమని నిన్న రాష్ట్రపతి ప్రసంగంలో, నేటి బడ్జెట్‌ ఉప న్యాసంలో స్పష్టంగా వెల్ల డైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు ఆర్థిక భారాలు ప్రజలపై వేస్తూ కార్పొరేట్లకు దేశ సంపదను కట్ట బెడుతూ మరోవైపు మతోన్మాద భావోద్రేకాల ను రెచ్చగొట్టి దేశాన్ని బలహీనపరిచే బిజెపి వైఖరిని మేధావులు, లౌకికవాదులు,అన్ని పార్టీలు ఖండిరచాలని అన్నారు. ఈ ప్రజావ్య తిరేక బడ్జెట్‌ని వ్యతిరే కించాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు.-(జీవన ప్రతాప్‌)

గిరిజన భూముల్లో రైల్వేజోన్‌ చిచ్చు

మహావిశాఖనగర మున్సిపల్‌ కార్పోరేషన్‌ సంస్థ(జీవీఎంసీ)పరిధి శివారు కొత్త సెంట్రల్‌ జైల్‌ పక్కన శ్రీకృష్ణాపురం అనే ఓగిరిజన కుగ్రామం ఉంది. కొన్ని దశాబ్దాల నుంచి మన్నెదొరకు చెందిన 200 కుటుంబాలు ఇక్కడ నివాసముంటున్నాయి.వారికి 1977లో విశాఖ జిల్లా కలెక్టర్‌ 70మంది గిరిజన కుటుంబాలకు సర్వేనంబరు 26లో 77 ఎకరాలు భూమిని పంపిణీ చేసి వారికి అప్పటి ప్రభుత్వం డి`పట్టాలు మంజూరు చేసింది.నాటి నుంచి నేటివరకు సుమారు ఐదు దశాబ్దాలు(47 సంవత్సరాలు) నుంచి మామిడి,దుంప,సరుగుడు,జీడిమామిడి,ఉద్యానవన తోటలు వేసుకొని పంటలు పండిరచుకుంటున్నారు. దీంట్లో లభించిన ఫలసాయంతో వారంతా కుటుంబాలను పోషించుకుంటూ జీవనోపాధి పొందు తున్నారు. ఈనేపథ్యంలో విశాఖనగర పురపాలక సంస్థ 2007లో కార్పొరేషన్‌ సంస్థగా విస్తరించారు.వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి హాయంలో హనుమంతువాక నుంచి అడవివరం వరకు బీఆర్‌టీఎస్‌ ఆరులైన్ల రహదారి నిర్మించారు.దీంట్లో శ్రీకృష్ణాపురం గిరిజనలు సాగుచేసుకుంటున్న డి పట్టా భూముల్లో ఏడుగురు గిరిజన రైతులకు చెందిన ఏడు ఎకరాలు రోడ్డులో కలసిపోయి నిర్వాసితులయ్యారు.దీనిపై భూమిని కోల్పోయిన రైతులకు అప్పట్లో జీవీఎంసీ కమిషనర్‌ శ్రీకాంత్‌ ఆరిలోవ ప్రాంతంలో మూడు సెంట్లు చొప్పున ఏడుగురు రైతులకు నష్టపరిహారంగా ఇళ్ల స్థలాలు ఇచ్చి పట్టాలు కూడా మంజూరు చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వం రావడంతో గిరిజనులు సాగు చేసుకుంటున్న రైతులకు కష్టాలు మొదలయ్యాయి. రైల్వేజోన్‌ బూసితో ప్రశాంతంగా సాగు చేసుకుంటున్న 56ఎకరాల భూమిపై ప్రభుత్వం కుట్రపన్నింది.ఈ భూమిని రైల్వే జోన్‌కి అప్పగించామని కొన్ని సార్లు,ఇది జీవీఎంసీ పరిధి ముడసర్లలోవ రిజర్వాయర్‌ పరివాహాక ప్రాంతంలో ఉంది.తక్షణమే ఈ భూములను ఖాళీ చేయాలని చినగదలి విశాఖ రూరల్‌ రెవెన్యూ అధికార్లు రైతులను బెదిరిస్తూ మానసికమైన ఆవేదనలకు గురిచేస్తు న్నారు.నగరంలో చాలా చోట్ల వందలాది ఎకరాల భూములు ఖాళీగా ఉండగా మరి కొన్ని బడాబాబుల చేతుల్లో ఆక్రమణలకు గురయినప్పటికీ వాటిపై ప్రభుత్వ అధికారుల జోలికి వెళ్లలేదు.అమాయకులైన గిరిజనులు దశాబ్దాల క్రితం నుంచి సాగు చేసి జీవనోపాధి పొందుతున్న భూములను రైల్వే జోన్‌ కోసం కేటాయించడం అన్యాయమంటూ ఇక్కడ గిరిజనులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
గిరిజన భూములతో ప్రభుత్వం ఆటలు..
విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటుపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కపట నాటకాలతో పబ్బం గడుపుకుంటోంది. లేని భూ వివాదాన్ని పదేపదే తెరపైకి తెస్తూ ఎడతెగని జాప్యం చేస్తోంది. లోక్‌సభలో గురువారం 2024-25 మధ్యంతర బడ్జెట్‌ సందర్భంగా రైల్వే శాఖ మంత్రి వైష్ణవ్‌ మాట్లాడుతూ ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు రాష్ట్ర ప్రభుత్వమే స్థలం చూపకుండా మోకాలడ్డు తోంది. వివాదం లేని భూమి ఇస్తే జోన్‌ పనులు ప్రారంభిస్తాం’ అంటూ చెప్పడం చర్చనీయాంశంగామారింది. రైల్వే అధికారులు కూడా మంత్రి ప్రకటన పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఒకటి, రెండు స్థలాలు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో ఒకదానికి డిపిఆర్‌లో కూడా ఆమోదం లభించింది. దీంతో పాటు మడసర్లోవలో కూడా మరో స్థలం ఉంది. వీటిని మంత్రి విస్మరించారు. మరోవైపు పనులు కూడా ప్రారంభిస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేయలేదు. నామమాత్రపు సిబ్బందినీ కేటాయించలేదు. సాధారణంగా ఏ కార్యాల యాన్ని ఏర్పాటు చేయాలన్నా తాత్కాలిక ప్రాతిపదికన కొన్ని ఏర్పాట్లు , కొంత పనులు చేసుకునే విషయం తెలిసిందే! ఈ దిశలో ఒక్క అడుగుకూడా వేయని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా అసత్యాలు చెబుతున్నా రాష్ట్రానికి చెందిన ఒక్క ఎంపి కూడా పెదవి విప్పకపోవడం గమనార్హం. రైల్వే వైర్‌లెస్‌ కాలనీలో ప్రత్యామ్నాయ స్థలం 30 ఎకరా లకుపైనే ఉందని, దీనికి డిపిఆర్‌లో కూడా ఆమోదం లభించిందని రైల్వే అధికారులు చెబుతున్నారు . అదే సమయంలో విశాఖకు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చినప్పుడు రైల్వే జోన్‌ పనుల ప్రారంభానికి చిహ్నంగా శిలాఫలకం సిద్ధం చేసి, ఆ క్రెడిట్‌ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందన్న బిజెపి నేతల అభ్యంతరాల నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని రద్దు చేసిన విషయాన్ని కొందరు గుర్తుచేస్తున్నారు. అప్పట్లో బిజెపి నేతలు కూడబలుక్కుని జోన్‌ పనులు నిలిపివేశారు. ముడసర్లోవ రైల్వే స్థలంపై వివాదం ఎంత ? విశాఖలో బిఆర్‌టిఎస్‌ కోసం రైల్వే నుంచి గతంలో 26 ఎకరాలను జివిఎంసి తీసుకుంది. అందుకు బదులుగా రైల్వేకు ముడసర్లోవ వద్ద సర్వే నెంబరు 57 నుంచి 59 పి, 61పి, 62 పి, 63, 64, 65లో 52 ఎకరాలు కేటాయించింది. 2018లో ఆ స్థలం వద్ద కంచె వేసేందుకు రైల్వే అధికారులు వెళ్లగా ఆ భూముల్లో ఉన్న రైతులు అభ్యం తరపెట్టారు. ఆ సమయంలో సర్వే కూడా రైల్వే చేయగా 27ఎకరాలు క్లియర్‌గా ఉందని తేలింది. మిగిలిన స్థలం ఆక్రమణలో ఉన్నట్లు గుర్తించారు. దీనికోసం రైల్వే అధికారులు, జివిఎంసి కలిసి జాయింట్‌ సర్వే చేసేందుకు 2022 నవంబర్‌ 15న రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ నుంచి రైల్వే డిఆర్‌ఎం కార్యాల యానికి లేఖ రాశారు. రైల్వేకు అవసరమైన భూమిని తీసుకునేందుకు సర్వేలో పాల్గొనాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దఫదఫాలుగా పిలిచినా రైల్వే అధికారులు హాజరు కాలేదు. మరలా జివిఎంసి కమిషనర్‌ నుంచి 2023 డిసెంబరు 23న కూడా రిమైండర్‌ పంపారు. కానీ, రైల్వే స్పందిం చలేదు. నిజానికి వైర్‌లెస్‌ కాలనీలో ఐదు ఎకరాల్లో జోన్‌ కార్యాలయ భవనాల నిర్మాణానికి సరిపోతుంది. అయినా, ఇటువైపు రైల్వే శాఖ చూడడం లేదు. జాయింట్‌ సర్వేకు రాకుండా కాలయాపన చేస్తోంది. ఇప్పుడు భూ వివాదం అంటూ నెపం వేయడానికి కేంద్ర మంత్రి ప్రయత్నిస్తున్నారు.
ప్రభుత్వాల దొంగాట
కేంద్రం పితలాటకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకునే పరిస్థితి కనిపించడం లేదు. రెండూ కలిసే దొంగాట ఆడుతున్నాయంటూ విశాఖ వాసులు పేర్కొంటున్నారు. కేంద్రంలోని బిజెపి సర్కారు దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఇస్తున్నట్లు ప్రకటించి ఉన్న వాల్తేరు రైల్వే డివిజన్‌ను ఎత్తేసింది. 200 కిలోమీటర్లలోపు విజయ వాడ డివిజన్‌ ఉండగా, వాల్తేరు రైల్వే ఎందుకు? అంటూ బిజెపి పెద్దలు వాదించి విజయవాడ డివిజన్లో వాల్తేరు డివిజన్లోని సగభాగాన్ని కలిపించేశారు. మరి విజయ వాడకు 40 కిలోమీటర్ల దూరాన్నే గుంటూరు డివిజన్‌ లేదా? రాష్ట్ర ప్రభుత్వం ఈ వాదన కేంద్రం వద్ద చేయడంలేదెందుకు? జోనల్‌ హెడ్‌క్వార్టర్స్‌ వచ్చినంత మాత్రాన డివిజన్‌ ప్రధాన కార్యాలయాన్ని మూసె య్యాలా?కొల్‌కతాలో రెండు జోనల్‌ హెడ్‌ క్వార్టర్లు లేవా? ఒక జోన్‌,ఒక డివిజన్‌ ప్రధాన కార్యాలయం ఒకేచోట ఉంటే తప్పే మిటి? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.రైల్వే జోన్‌ స్థలంపై ఎలాంటి వివాదమూ లేదు. విశాఖపట్నం రైల్వే జోన్‌ స్థలానికి సంబం ధించి ముడసర్లోవలో ఎలాంటి వివాదమూ లేదని విశాఖ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లి కార్జున తెలిపారు. రైల్వే మంత్రి ఫిబ్రవరి 2న చెప్పిన నేపథ్యంలో ఆమరుచటి రోజు సాయంత్రం తన ఛాంబర్‌లో మీడియాతో కలెక్టర్‌ మాట్లాడారు.‘ముడస ర్లోవ సర్వే నెంబర్‌ 26లో సుమారు 52 ఎకరాలను గతంలో రైల్వేతో జివిఎంసి చేసుకున్న ఒప్పందం ప్రకారం సిద్ధం చేశాం. రైల్వే వారిని రావాలని, భూమి తీసుకోవాలని పలుమార్లు కోరినా స్పందన లేదు. వారెప్పుడు వచ్చినా స్థలం ఇస్తాం. ఈ విషయంపై 2023 డిసెంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వ సిఎస్‌ సమావేశం నిర్వహించి డైరెక్షన్‌ ఇచ్చారు. ల్యాండ్‌ హ్యాండ్‌ ఓవర్‌ చేయాలని జివిఎంసి కమిషనర్‌కి స్వయంగా నేను చెప్పాను. ఆయన కూడా ఈ ఏడాది జనవరి 2న రైల్వేకు లేఖ రాశారు. ట్రెంచింగ్‌ కూడా ఆ భూమిలో క్లియర్‌ చేశాం. భూ వివాదం లేదు’ అని వివరించారు. రైల్వే జోన్‌ ప్రధాన కార్యాలయం నిర్మాణం కోసం ముడసర్లోవ సమీపంలో 52 ఎకరాల స్వాధీనానికి సిద్ధమైన జీవీఎంసీ సిబ్బందిని అడ్డుకునేందుకు స్థానిక గిరిజనులు యత్నిం చారు. ఆ భూమిని తమకు ప్రభుత్వం ఎప్పుడో ఇచ్చిందని వాదనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. ముడసర్లోవ సర్వే నంబర్లు 53,55, 59, 60 61,62లో గల భూమి చుట్టూ కంచె నిర్మించేందుకు శుక్రవారం జీవీఎంసీ సిబ్బంది పోలీసుల సహాయంతో వెళ్లారు. ఈ విషయం తెలిసి స్థానికులు అక్కడకు చేరుకున్నారు. ఆ భూము లకు తాము హక్కుదారులమని, ఫలసాయాన్ని ఇచ్చే చెట్లను ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. ఇక్కడ కార్యాలయాలను కట్టడానికి ప్రభుత్వం సిద్ధమైతే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో గిరిజనులకు, పోలీసులకు నడుమ వాగ్వాదం జరిగింది. అనంతరం గిరిజనులు తమ ఆందోళన ొనసాగిస్తుండగానే…మరోవైపు అధికారులు తమ పని తాము చేసుకోసాగారు. ఈ భూమి గతంలోనే జీవీఎంసీకి దఖలు పడినట్టు చినగదిలి తహసీల్దార్‌ రమణయ్య తెలిపారు. కాగా ఈ భూమిని రైల్వే జోన్‌ కోసం కేటాయించనట్టు అధికారులు చెబుతున్నారు.-జిఎన్‌వి సతీష్‌

శుభ్రత..పరిశుభ్రత`ఆరోగ్యం

అందానికి రెండు కళ్ళు. దుమ్ము, ధూళి నిండిన ప్రపంచంలో పరిశుభ్రత ఒక తాజా పరిమళం. ఇది వ్యాధుల నుంచి దూరంగా వుంచుతుంది. జీవితాలను సంతోషమయం చేస్తుంది. శుభ్రత అంటే చేతులు కడుక్కోవడమో, స్నానం చేయడమొక్కటే కాదు మన పరిసరాలను కూడా శుభ్రంగా వుంచుకోవడం. ఇది ఆరోగ్యం నిండిన ప్రపంచానికి ఒక ఆనవాలు. ‘శుభ్రత విలాసం కాదు అవసరం. ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితానికి పరిశుభ్రత తొలి మెట్టు’ అంటాడో రచయిత. ఎంత మంచి ఆహారమైనా పరిశుభ్రంగా లేకపోతే అనారోగ్యానికి దారితీస్తుంది. అతిసార,శ్వాసకోస వంటి వ్యాధులతో ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది పిల్లలు చనిపోతు న్నారు. దీనికి కారణం పరిసరాలు శుభ్రంగా లేకపోవ డమేనని ప్రపంచ ఆరోగ్యసంస్థ చెబు తోంది. ఒక్క చేతులు శుభ్రపరుచుకుంటేనే దాదాపు 50 శాతం పైగా అతిసార సంబంధిత వ్యాధులు,20నుంచి 30శాతం శ్వాస సంబంధిత వ్యాధు లను నివారించవొచ్చునని వైద్య నిపుణులు చెబు తున్నారు.‘నీశరీరం ఒక దేవాలయం. దానిని శుభ్రంగా వుంచుకో’ అంటారు బికెఎస్‌ అయ్యం గార్‌. స్వచ్ఛ భారత్‌ అభియాన్‌ వంటి ప్రచారాలు ఎన్ని వచ్చినాపల్లెల నుంచి మహానగరాల వరకూ అపరిమితమైన చెత్త, ధూళి పేరుకుపోతోంది. ఇది పర్యావరణానికి హానికరంగా మారింది.
నేడు మన దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో పేరుకుపోతున్న చెత్త, వ్యర్థ పదార్థాలను ప్రధానంగా చెప్పుకోవాలి. వీధులు, పార్కులు, బహిరంగ ప్రదేశాల్లో చెత్తాచెదారం ఉండడం సర్వసాధారణం. దీనివల్ల పర్యావరణానికి, ప్రజా రోగ్యానికి ముప్పు వాటిల్లుతోంది. వీధుల్లో చెత్త వేయడమే కాకుండా బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం, మల మూత్ర విసర్జన చేయడం వంటివి కూడా పరిసరాల అశుభ్రతకు కారణ మౌతున్నాయి.పరిశుభ్రత కేవలం భౌతిక పరిస రాలకే పరిమితం కాదు. ఇందులో వ్యక్తిగత పరి శుభ్రత కూడా ఉంటుంది. వ్యాధుల వ్యాప్తిని నిరోధించడానికి,ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడానికి పరిశుభ్రతను పాటించడం అవసరం. ‘పరిశుభ్రత అనేది పరిపూర్ణ ప్రమా ణాల యొక్క ముఖ్య లక్షణం. అత్యుత్తమ నాణ్యతా ప్రమాణం’ అంటారు గాంధీజీ. అయితే, కంటికి కనిపించని రెండో కోణం కూడా వుంది. అదే, పారిశుధ్య కార్మికుల నిరంతర శ్రమ. తమ ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా వీధులను, ఇళ్లను శుభ్రం చేసే పనిలో వారి జీవితాలను మైనంలా కరిగిస్తుంటారు. మాన్యువల్‌ స్కావెం జర్లది మరీ దయనీయమైన గాథ.గత ఐదేళ్ల కాలంలో సెప్టిక్‌ ట్యాంక్‌ల్లో పడి, మురుగు కాల్వల్లో పడి 399మంది మాన్యువల్‌ స్కావెంజర్లు చనిపోయారని ప్రభుత్వ అధికారిక సమాచారం. ఊళ్లు, నగరాల పరిశుభ్రత కోసం వీళ్ల జీవితా లను ఫణంగా పెడుతున్నారు. అయినా లభించేది అరకొర వేతనాలే. ఇటీవల పారిశుధ్య కార్మికులు వేతనాలు పెంచాలని సమ్మె చేయాల్సి వచ్చింది. చివరకు రాష్ట్రప్రభుత్వం దిగొచ్చినా ఏ మేరకు వారి అవసరాలు తీర్చుతా రనేది చూడాల్సిందే.
పరిశుభ్రత ఆవశ్యకత, ప్రయోజనాల గురించి తెలిసినప్పటికీ, మన దేశం ఈ సమస్యతో పోరాడుతూనే ఉంది.‘స్వచ్ఛభారత్‌’ పథకం ప్రక టనలకే పరిమితమైంది. వీధుల్లో చెత్తాచెదారం, పొంగిపొర్లుతున్న చెత్త కుండీలు, అపరిశుభ్రంగా ఉన్న పబ్లిక్‌ టాయిలెట్లు నిత్యం కనిపించే దృశ్యం. చిన్నపాటి వర్షం వచ్చినా%ౌౌ%రోడ్లన్నీ అశుద్ధంతో నిండుకుంటాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి యేటా జనవరి30న ‘జాతీయ పరిశుభ్రత దినో త్సవం’ నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ పరిస రాలను పరిశుభ్రంగా, ఆరోగ్యంగా వుంచుకో వడం ప్రాథమిక కర్తవ్యంగా గుర్తు చేసేందుకు ఈ వేడుకను నిర్వహిస్తారు. ఇంటి నుంచి పని ప్రదేశం వరకు పరిసరాలను శుభ్రంగా వుంచడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తారు. ‘ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముంగిలి శుభ్రంగా వుంచుకుంటేదేశమంతా శుభ్రంగా వుంటుంది’ అంటారు మదర్‌ థెరిస్సా. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటామని ప్రతిజ్ఞ చేయా ల్సిన సమయం ఇది.అందరం చేయి చేయి కలు పుదాం మన పరిసరాలను పరిశుభ్రంగా, ఆరో గ్యకరంగా మార్చుకోడానికి కృషి చేద్దాం. -డా.దేవులపల్లి పద్మజ

సుస్తిర వ్యవసాయంతోనే ఆహార భద్రత

ఆహారం లేనిదే జీవం లేదు. కానీ తగినంత ఆహారం లేకుండా ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. నాగరిక సమాజంలో మానవులు తమకు అవసరమైన ఆహారాన్ని సంపాదించుకునే వీలుకూడా లేని ప్రదేశాలు ఇంకా ఉండడం మన అభివృద్ధికి అవమానం. అసలు అభివృద్ధి అన్న విషయమే అనుమానం. ప్రకృతితో సహజీవనం చేస్తున్నప్పుడు సమస్యలు తరచూ అనూహ్యంగా వస్తుంటాయి. అటువంటి సందర్భాలలో కూడా ఆహారం లభించడం ముఖ్యం. ఆ దిశలో ‘పాలకుల’ ధ్యాస ఉండాలి. ప్రణాళికలు తయారవ్వాలి. ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. పతకమూరు దామోదర్‌ ప్రసాద్‌
సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల్లో భాగంగా రసాయన ఎరువులు వాడకం విచ్చల విడిగా పెరిగిపోయింది. అటువంటి అశాస్త్రీయ, అసహజ పద్ధతులు సహజంగానే నేలల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. భూసారం తగ్గ డంతో లక్షలాది హెక్టార్ల విస్తీర్ణంలో పంట భూ ములు బీడు బారుతున్నాయి. దీంతో రానురాను ఆహార ఉత్పత్తులు మరింత తగ్గిపోయి మనిషి మనుగడే కష్టతరమయ్యే అవకాశం ఉంది. అం దుకే భూఆరోగ్యాన్ని మన కర్తవ్యంగా స్వీకరంచా లనేది నిపుణులు మాట.అనంతమైన జీవ వైవిధ్యానికి ఆరోగ్యకరమైన నేలలే పట్టుగొమ్మలు. ఒక ప్రాంతంలో ఉండే జీవ సమూహంలోని వ్యత్యా సాలను జీవ వైవిధ్యంగా పరిగణిస్తారు. నేలలో కోట్ల సంఖ్యలో సూక్ష్మజీవులు ఉంటాయి. వానపా ములు, కీటకాలు, ఎలికపాములు వంటి అనేక జీవరాశులతో ఇది నిర్ధారణ అవుతుంది. ఒక అంచనా ప్రకారం చదరపు మీటర్‌ వైశాల్యం లోని మంచి నేలలో వెయ్యి రకాల సూక్ష్మజీవుల జాతులు ఉండి జీవ వైవిధ్యానికి కారణమవు తున్నాయి.
ఆహారభద్రతకు నీటి సంరక్షణ కీలకం అనేక రాష్ట్రాలు ఇప్పటికే సూక్ష్మ సాగు పద్ధతులను అమలు చేస్తున్నాయి.భారత్‌కు సుస్థిర ఆహార భద్రత సమకూరాలంటే వివిధ స్థాయిలలో నీటిని పొదుపుగా వాడుకోవ డమేగాక, వల్లెస్థాయి నుండి నీటిసంరక్షణను పెద్ద ఎత్తున చేపట్టడం ఎంతో ముఖ్యం. మనకు లభ్యమయ్యే నీటిలో 2030నాటికి 87శాతం ఒక్క సేద్యపు రంగానికే కావలసి ఉంటుందని అంచనా, దేశానికి ఆహార భద్రత చే కూరాలంటే వ్యవసాయరంగంలో పంట అవస రాలకు అవసరమైనంత తప్ప ఎక్కువ నీటి వాడ కాన్ని నియంత్రించడానికి చర్యలు చేపట్టడం అవసరమని శాస్త్రజ్ఞుల అభిప్రా యం. వ్యవసాయ క్షేత్రాలలో నీటి వినియోగాన్ని, వృథాను నియం త్రించడానికి తాగునీటి యాజమాన్య పద్ధతులను పాటించక పోతే వచ్చే ఆరేళ్లలో భారత్కు 48 ట్రిలియన్‌ రూపాయల నష్టం వాటిల్లగలదని అంచనా. దేశంలో ఆహారం, ఇంధన అవసరాలు తీర్చడానికి నీరు ఎంతో అవసరం ఇటీవలి సంవత్సరాలలో అదనులో తగినంత వర్షం కురవకపోవడంతో రిజర్వాయర్లలో తగినంత నీరు చేరడం లేదు.గత ఏడాది కూడా వానల్లేక రిజర్వా యర్లలో అతి తక్కువ నీరు చేరడంతో జలవిద్యుత్‌ ఉత్పాదన కుంటు పడిరది. ఫలితంగా లక్షలాది ఎకరాల ఆయకట్టు భూములకు సాగునీటి సరఫరా సాధ్యం కాలేదు.చాలా జలాశయాలు అడు గంటాయి. వివిధప్రాంతాల్లో తాగునీటికి కొరత ఏర్పడుతున్నది. దేశంలో ఆహారభద్రత, జీవనోపాధుల మెరుగుదలకు ఒక ఉద్యమంలా నీటి సంరక్షణ చర్యలను చేపట్టి వృథాను అరికట్ట వలసిన అవసరం ఎంతో ఉంది. 2020నాటికి మన దేశీయ అవసరాలకు 54వేల బిలియన్‌ లీటర్ల నీరు అవసరమైంది. కాగా వచ్చే ఆరేళ్లలో సేద్యం, దేశీయ అవసరాలకు 76వేల బిలియన్‌ లీటర్ల నీరు అవసరం కావచ్చని జాతీయ ఇంధనం,నీరు, పర్యావరణ మండలి అంచనావే సింది. ఒక్క సేద్యపు రంగానికే లభ్యమయ్యే నీటిలో 87 శాతం నీరు అవసరమవుతుంది. అందువల్ల లభ్యమయ్యే పరిమిత నీటి వనరులను వివిధ అవసరాలకు జాగ్రత్తగా,పొదుపుగా వాడితేనే కొంతవరకు సర్దుబాటు చేయవచ్చు. లేదంటే వివిధ రంగాల్లో నీటి కొరతను ఎదుర్కోక తప్పదని నిపు ణులు హెచ్చరిస్తున్నారు. దేశీయ జనాభా నీటి అవసరాలకు, పరిశ్రమలకు, సేద్యానికి ముఖ్యంగా వేసవి కాలంలో మంచి నీటి కొరత ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి, ఇప్పటికీ ఓ శతాబ్ద కాలంగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య కావేరి నదీజలాల వివాదం రగులుతున్న విష యం విదితమే. కృష్ణా, గోదావరి నదీ జలాలపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు తెలెత్తడం తెలిసిందే. వాతావరణంలో సంభవి స్తున్న పెనుమార్పులు, ఒడిదుడుకుల వల్ల తగినంత వానలు కురవని సంవత్సరాలలో రిజర్వా యర్ల లో నీరు అడుగంటి జలవిద్యుత్‌ ఉత్పా దనకు, పారిశ్రామిక అవసరాలకు, మంచినీటికి కొరత ఏర్పడు తున్నది.భూమి, నీరు, ఇంధనం, ఆహార రంగాలు కీలకమైనవి. సహ సంబంధం కలిగి నవి.అందువల్ల ఇతర రంగాల అవసరాలు గుర్తించకుండా,సమన్వయం లేకుండా ఏ ఒక్క రంగంలో చర్యలు చేపట్టినా అవిప్రతికూల పరిణా మాలకు దారితీయవచ్చు. దేశంలో ఆహార రంగం లో స్వయం సమృద్ధి సాధనకు అమలుచేసిన హరిత విప్లవం వల్ల కూడా కొన్ని విపరీత పరిణా మాలు సంభవించాయి.ఆహారోత్పత్తి పెంచడానికి పంజా బ్‌, హర్యానా రాష్ట్రాలలో బోరుబావుల నుండి నీరు తోడే మోటార్లకు సబ్సిడీ, ఉచిత విద్యుత్‌ సరఫరావల్ల,పంటల అవసరాలకు మించి భూ గర్భ జలాలను తోడడంవల్ల ఉత్పన్నమైన దుష్ఫ లితాలు ఇప్పటికీ వెన్నాడుతూనే ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ భూగర్భ జలాలను అధికా దికంగా తోడడటంవల్ల భూగర్భ జల మట్టాలు పడిపోవడమే గాక, నీటిపొరలలోని రసాయనాల వల్ల కలుషితమై భూసారం క్షీణించి,పంట దిగు బడులు కూడా తగ్గినట్లు తేలింది. ఈ రెండు రాష్ట్రాలలో సేద్యపు రంగంలో విద్యుత్‌ సరఫరాపై రూ.91వేల కోట్ల విద్యుత్‌ సబ్సిడీలు ఇచ్చినట్లు భారత ప్రభుత్వం వెల్లడిరచింది. కనీస మద్దతుదా రులను భారత ప్రభుత్వం ఏటేటా ఎంతో కొంత పెంచుతూ ఉండటం వల్ల నీరు అధికంగా వాడే వరి,గోధుమ,చెరకు పంటలసాగు బాగా పెరి గింది. ప్రస్తుతం నీటి నియంత్రణ లేని సాగునీటి పద్ధతులు,విచక్షణా రహితంగా నీరు తోడటంవల్ల భూగర్భ జలమట్టాలు ఆందోళనకర స్థాయికి పడిపోవడంపై శాస్త్రజ్ఞులు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. సేద్యపు నీటి వాడకంలో ఉత్తమ యాజ మాన్య పద్ధతులు పాటించకపోవడం వల్ల, తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వాటిల్లే సష్టం వచ్చే ఆరేళ్లలో రూ.48వేల ట్రిలియన్లకు చేర గలదని,2050నాటికి ఆనష్టాలు రూ.138 ట్రిలి యన్లకు చేరుతుందని నిపుణులు అంచనా. దేశం లో ఆహార వ్యవస్థలను పటిష్టం చేయడానికి, నీటిభద్రత మెరుగుదలకు 3 చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. రాష్ట్రాలలో మెరుగైన సాగునీటి వాడకం, యాజమాన్య పద్ధతులు, నీటిని పొదుపుగా వాడుకోవడాన్ని ప్రోత్సహించాలి. ముఖ్యంగా బిందు, తుంపర్ల సేద్యం ద్వారా నీటిని పొదుపుగా అవసరమైన మేరకు వాడటాన్ని ప్రోత్స హించాలి. ఈ పద్ధతులు పాటిస్తే వచ్చేఆరేళ్లలో 47శాతం సాగునీటిని ఆదా చేయవచ్చని నిపు ణులు అంటున్నారు. ప్రతిబిందువుకూ మరింత పంట అనే జాతీయ కృషి వికాస్‌ యోజన పథకం కింద ఇందువల్ల 72లక్షల హెక్టార్ల భూమిలో సూక్ష్మ, సాగు పద్ధతులు అమలవుతున్నట్లు గణాం కాలు ఘోషిస్తున్నాయి. వాతావరణంలో ఏర్పడే ఒడిదుడుకులను తట్టుకుని నిలిచే సుస్ధిర సేద్యం, ఆహారవ్యవస్థల అభివృద్ధికి కృషి చేయాలని గత ఏడాది భారత్లో జరిగిన జి20 దేశాల అగ్రనాయక సమావేశం నిర్ణయించింది. నీటిపారుదల, వ్యవ సాయ రంగాలలో సుస్థిర పద్ధతులను అనుసరిస్తేనే అందుకు అవసరమైన పెట్టుబడులు వస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు అవసరమైన ప్రోత్సాహకాలు కల్పించి తగు సాంకేతిక ప్రక్రి యలను ప్రవేశ పెట్టడం అవసరం. ఆహారం, భూమి,నీరు,ఇంధన విధానాలను పరస్పర సమన్వ యంతో అమలు చేయాలి. విధానాల అమలును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సమన్వయం చేయ డానికి ఒకస్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలి. వ్యవసాయం, రైతు సంక్షేమం, జలశక్తి, సంప్రదా యేతర ఇంధన అభివృద్ధి శాఖ, విద్యుత్‌ శాఖలు సమన్వయంతోఈవిధానాల అమలును ఎప్పటిక ప్పుడు పర్యవేక్షించాలి. ఒడిశా ప్రభుత్వం ఇప్పటికే ఇందుకోసం ప్రణాళిక,అమలు విభాగాన్ని నెల కొల్పి సత్ఫలితాలు సాధించినట్లు వెల్లడైంది. సుస్థిర సేద్యాభివృద్ధి, తద్వారా ఆహార భద్రత సాధన కోసం భూమి, నీరు, ఇంధనశాఖల మధ్య సమన్వయం సాధించి మెరుగైన యాజమాన్య పద్ధతులను అమలు చేయాలి.పల్లెలలో పంచా యతీరాజ్‌ సంస్థల ద్వారా ప్రజా భాగస్వామ్యంతో భూగర్భ జలాలను సమర్థంగా వినియోగిం చడానికి ప్రోత్సహించాలి. వాతావరణంలో తీవ్ర ఒడిదుడుకులవల్ల కరువులు, దుర్భిక్షాలు, ఆకాల, అధిక వర్షాలు, వడగండ్లవానల వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నందున నీటి విని యోగంపై గాక, మెరుగైన నీటి సంరక్షణ పద్ధతులు పాటించే దృక్పథాన్ని అలవరచుకోవాలి. దేశంలో 62శాతం భూగర్భ జలాలను వాడుతున్నారు. ఇప్పటికే భూగర్భజలాల వాడకం ఎక్కువగా జరుగుతున్నట్లు గణాంకాలు ఘోషిస్తున్నాయి. నీటి వినియోగంపై స్థానిక గణాంకాలను ఎప్పటి కప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులకు అందు బాటులో ఉంచితే నీటి సంరక్షణ వద్దతులను మెరుగ్గా అమలుకు వీలవుతుంది. కేంద్ర ప్రభుత్వ ఆటల్‌ భూ యోజన పథకం అందుకు ఉపకరించ వచ్చు. గ్రామస్థాయిలో స్థానికులే నీటిభద్రతకు అవసరమైన గణాంకాలను సేకరించాలి.ఈ పథకం కింద పంచాయితీ స్థాయిలో స్థానికులకు నీటి సంరక్షణపై శిక్షణ ఇస్తారు. ఇలా ప్రజాభాగ స్వామ్యంతో భూగర్భ జలవనరుల పరిరక్షణను అమలుచేసిన చోట మెరుగైన ఫలితాలు వచ్చాయి. ఇతర పథకాలతో సమన్వయం చేస్తే మరింత మెరుగైన ఫలితాలను రాబట్టవచ్చు. ఉత్తమ నీటి యాజమాన్య పద్ధతులు అమలు చేస్తేనే వచ్చే ఆరేళ్లలో ఆహారభద్రత సాధించాలనే లక్ష్యం నెరవేరుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నో అత్యల్ప వర్షాలు, నీటికొరత ప్రాంతాలు ఉన్నం దున,మనవాగులు,వంకలు,చెరువులు, జలాశ యాలు, పరీవాహక ప్రాంతాలు ఆక్రమణ లకు గురికాకుండా, పర్యావరణ, నీటి సంరక్షణ కోసం ప్రభుత్వాలు, ప్రజా ప్రతినిధులు జాగ్రత్తలు తీసు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వ్యాసకర్త : సీనియర్‌ జర్నలిస్టు

సమ్మక్క సారక్కల చారిత్రిక వీరగాధ పోరుగద్దే మేడారం

ఒకప్పుడు మౌఖిక సాహిత్యంకే పరిమితమైన… మన ఆదివాసీ సాహిత్యం… అక్షరాస్యతలో వచ్చిన అభివృద్ధిలో భాగంగా .. వివిధ ప్రక్రియలలో పుస్తకాల రూపంలో… వస్తూ ప్రామాణికతకు చోటుచేసు కుం టుంది, ఈ గిరిజన సాహిత్యంలోని… పుస్తకాల వివరాలను ‘‘గవాక్షం’’ శీర్షికన… ‘‘థింసా పాఠకుల’’ కోసం ప్రతి నెల ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్న పరిశోధక రచయిత డా. అమ్మిన శ్రీనివాసరాజు గారు ప్రముఖ రచయిత ‘‘జయధీర్‌ తిరుమల రావు’’ కలం నుంచి జాలువారిన ‘‘ వీరుల పోరు గద్దె మేడారం’’ అనే పుస్తకంపై సమీక్ష -డా. అమ్మిన శ్రీనివాసరాజు
ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసి జన జాతరగా చరిత్రలో నిలిచిన మేడారం జాతరకు కారకురాలైన గిరిజన వీరవనిత ‘‘సమ్మక్క’’కు సంబంధించిన సంపూర్ణ చరిత్ర గాని, దానికి ఆధారమైన శాసనాలు, ఇతర ఏ ఆధారాలు ప్రామాణికంగా ఇంతవరకు ఎక్కడా లభ్యం కాలేదు. మరి అంత పెద్ద సంఘటనకు సాక్ష్యం గిరిజనుల విశ్వాసం,వారి పూర్వీకుల నుంచి మౌఖిక రూపంలో అందిన పుక్కిట పురాణ గాథలే..! సమ్మక్క పుట్టుక,జీవనం,వీర మరణాలకు సంబంధించి వివిధ కథనాలు వినిపిస్తూ కొన్ని తేడాలు అనిపిస్తున్న. అన్ని కథనాలు కాకతీయ ప్రభువు ప్రతాపరుద్రుని కేంద్రంగా తీసుకుని నడుస్తు న్నాయి. అయితే కాకతీయుల చరిత్రకు సంబంధించిన ఏశాసనాలు గ్రంథాలలో మేడారం సమ్మక్క ప్రస్తావనగాని,జరిగిన పోరాటం గురించి గానీ,ఉఠంకించబడలేదు. అంత పెద్ద కాకతీయ రాజ్యంలో మేడారం ప్రస్తావన, ఆనాటి వారికి అత్యంత చిన్న విషయం అయి ఉండవచ్చు. ఇక గిరిజనులు నిరక్షరాస్యులు కావడం చరిత్రలను భద్రపరు చుకునే శక్తి లేకపోవడం వంటి కారణాలతో నేటి ఇంత పెద్ద జన జాతరకు ఆనాటి చరిత్రలో చిరు స్థానం కూడా దక్కలేదు. అర్థ శతాబ్ద కాలం క్రితం ఈ మేడారం సమ్మక్క జాతర కేవలం కొన్ని గిరిజన కుటుంబాలకే పరిమితమై స్థానిక గిరిజన జాతర పండుగ మాత్రమే. ఇటీవల ఈజన జాతర విశ్వవ్యాప్తం కావడంతో అందరి దృష్టి దీని మీద నిలిచింది, దానితో ఊహాత్మకమైన కథలు,రచనలు,పాటలు,సినిమాలు,రావడం మొదలయ్యాయి. ఏ విశ్వవిద్యాలయాలు గాని ఇంతవరకు ప్రామాణికమైన పరిశోధనలు అందించలేదు. ఆ లోటు తీర్చే సంకల్పంతోనే ప్రముఖ రచయిత, గిరిజన సాహితీవేత్త, జయధీర్‌ తిరుమలరావు ఎంతో శ్రమతో తన క్షేత్ర పర్యటనల సాయంగా పూర్వ ఖమ్మం జిల్లా మణుగూరు మండలంలోని తోగ్గూడెం గ్రామానికి చెందిన డోలి వారితో పడిగె సాయంతో సకిన రామచంద్రయ్య బృందంతో గానం చేయించిన ‘‘సమ్మక్క సారలమ్మల వీర గాధ’’ను పుస్తక రూపంలో ప్రచురించారు. తరాలతరబడి డోలి కళాకారుల ద్వారా పాటల రూపంలో ప్రదర్శించబడుతున్న ఈ మౌఖిక సాహిత్యంకు అక్షర రూపం కలిగించటం అభినందనీయం ఉపయోగకరం. 136 పేజీల ఈ ఉపయుక్త పుస్తకంలో విషయం పాటల రూపంలో ఉన్న, వాటి దిగువ అందించిన వచన సమాచారం,కొన్ని గిరిజన భాష మాటలకు పాద సూచికల రూపంలో అందించిన వివరణతో సంపూర్ణ సమాచారం తెలుస్తుంది. గిరిజనులు పరమ పవిత్రంగా భావించి,పూజించే,‘‘పడిగె’’ సాయంగా ఈ వీర గాధ వివరించారు.కోయ వారి చరిత్రకు శాసనాల వంటివి ఈ పడి గెలు, త్రికోణకారంలో గుడ్డలతో తయారు చేయబడే వీటి మీద వివిధ రంగులు ఆకారా ల్లో చిత్రించబడే గుర్తులు ద్వారా ఆయా చరిత్రలకు సంబంధించిన గోత్రాలు గోత్రపు పురుషుడు ఇంటిపేర్లు ప్రాంతాలు వాహనాలు పోరాటాలు మహిమలు అన్ని చిన్నచిన్న రేఖా చిత్రాల రూపంలో ఈ పడిగెల మీద ఉంటా యి. వాటి సాయంగా డోలి వారు ఆయా చరిత్రల గాథలను చర్మ వాయిద్యం ఆయన ‘‘డోలు’’ వాయిస్తూ గేయ కథా రూపంలో గానం చేస్తూ ఉంటారు. గిరిజనుల ఆశ్రిత కులం వారైనా ఈ డోలీలను గిరిజనుల చరిత్ర గురువులుగా,పూజారులు,అడ్డెలు,గా ఇందులో అభివర్ణించారు. అభిప్రాయాలు మొదలు పాద సూచికల వరకు 8 విభాగాలతో పాటు అనుబంధంగా ప్రధాన సంపాదకుని అను భవాలు, చిత్రాలతో ఈ పుస్తకాన్ని పొందు పరిచారు. ప్రతి విభాగంలో ఎంతో విలువైన అనుభవైఖ్యమైన సమాచారం అందించారు. ముఖ్యంగా సమ్మక్క వంశవృక్షం దీనిలో ప్రాధాన్యత సంతరించుకుంది నాలుగో గట్టు కోయరాజులైన సాంబశివరాజు-తూలుముత్తి దంపతుల ఐదుగురు సంతానంలో పెద్ద కుమార్తె సమ్మక్క.ఆమె భర్త పగిడిద్దరాజు వారికి సారలమ్మ అనే కూతురు,జంపన్న అనే కుమారుడు ఉన్నారు. ఇది పడిగె సహాయంతో డోలీలు చెప్పిన ప్రామాణికమైన సమ్మక్క వివరాలు, అలాగే పగిడిద్దరాజు వంశవృక్షం కూడా ఇందులో మనం చూడవచ్చును. పడమటి దేశానికి చెందిన ఎడవగట్టు పారేడు కోయరాజు వంశానికి చెందిన,బాలసంద్రుడు శివమందాకిని దంపతులకు ఐదుగురు సంతా నం,వారు పగిడిద్దరాజు,గోవిందరాజు, గడి కామరాజు,కొండాయి,అనే నలుగురు కొడు కులు లక్ష్మీదేవి, అనే ఏకైక కుమార్తె ఆమెకే ‘‘ముయ్యాల’’ అని ముద్దు పేరు.పగిడిద్దరాజు కు సమ్మక్క నాగులమ్మ అనే ఇద్దరు భార్యలు, ఇద్దరినీ పెళ్లి చేసుకోవడానికి తటస్టించిన పరిస్థితులతో పాటు పగిడిద్దరాజు తన పరివారంతో ఇంద్రావతి నది దాటి తన ప్రాంతానికి పడమటి దిక్కు కదిలి ఓరుగల్లు వచ్చి అటు నుంచి ‘‘ఓయిమూల’’ ప్రాంతం చేరిన తీరు ఈడోలీల గానంద్వారా వివరించ బడిరది,నేటి చల్వాయి,తాడ్వాయి, మేడారం, ప్రాంతాలను కలిపి ఆనాడు కోయరాజులు ‘‘ఓయిమూల’’ అని పిలిచేవారు. ఈ ప్రాంతం లో తేనె,గడ్డలు,ఆకులు,అలములు,ఇప్ప పూల తో పాటు చల్లని నీడ చెట్లు, తోగులు, తాగే నీరు, పుష్కలంగా దొరికేవట ప్రతాపరుద్రుని రాజ్యంలో గల ఆ ప్రాంతంలో పగిడిద్ద రాజు తన సామంతరాజ్యం ఏర్పాటు చేసుకోవడం, కాలానుగుణంగా వచ్చిన ప్రకృతి వైపరీత్యాల వల్ల కరువు కాటకాలతో అక్కడివారు కాకతీ య ప్రభువుకు రకం సకాలంలో చెల్లించలేక పోవడం జరుగుతుంది. కోయ రాజుల మూల వంశానికి చెందిన కాకతీయ ప్రభూ తమ వారు అనే కృతజ్ఞత కూడా లేకుండా పగిడిద్ద రాజు సామంతరాజ్యం మీద తన బలగాలతో యుద్ధం ప్రకటించటం ఆ యుద్ధంలో మొదట పగటిదరాజు పరివారం ఓటమి అంచులకు చేరడం విషయం తెలిసిన సమ్మక్క ఆదిపరా శక్తిగా కోయల కుటుంబంలో ఇష్టంగా జన్మించడంతో తమ జాతి సంరక్షణార్థం అపర కాళీమాతల యుద్ధరంగంలో దునికి ఆధునిక కాకతీయ సైనికుల ఆయుధాలను కూడా నిర్వీర్యం చేసి సైనికులను అందర్నీ మట్టు పెట్టింది, క్షతగాత్రుడైన భర్త పగిడిద్ద రాజు,ను అక్కడ నుంచి తీసుకుని వెళ్లి చిలకలూరిగుట్టకు చేరిపోయింది,మూడేళ్ల కోసారి సమ్మక్క పగిడిద్దరాజు కళ్యాణం జరుగుతుందని డోలీలు ఈపాటలో పాడు తారు. మేడారం ఒకనాటి వీరోచిత యుద్ధ క్షేత్రం, సమ్మక్క గాధ ఒక కోయ వీరనారి పోరాట కథ, కొద్దిపాటి కాల్పనికత ఉన్న, ఈ డోలీలు పటం సాయంతో చెప్పే ఈ వీరగాథ లో ఆదివాసీల చరిత్ర మూలాలు కనిపి స్తాయి.గతంలో సమ్మక్క చరిత్రకు సంబంధిం చిన ప్రచార ఉదంతాలకి ఈ ‘‘డోలిగానకథ’’ పాఠ్యం ఒక క్రమరీతిని కలిగిస్తుంది అనడంలో సందేహం లేదు.ఈ వీర గాధల బృంద గానంలో..‘‘ఓరేలా..రే రేలా..రే రేలయ్యో…’’ అనే కూతతో ప్రారంభమై ‘‘అయ్యారే… యమ్మాలే.’’ అనే పల్లవులు పునరావృతం అవు తుంటాయి. ఆదిపరాశక్తి అంశ అయిన సమ్మక్క మొదట అన్ని కులాలలో వెలవాలని తలచి చివరికి కోయవారి కులం లోనే వెలిచింది అని చెప్పడానికి..‘‘కోమటోరిళ్ళల్లో నాకు కోరిన కొబ్బర్లు ు అయ్యారే/ అది నాకు గాని కావాలా అయ్యారే../బాపనోళ్ళ ఇళ్లల్లో అది బందీన తల్లిలే-అయ్యాలే ..’’అంటూ డోలీ గానం సాగుతుంది. గిరిజన మౌఖిక భాషకే పరిమితం అయిన తూర్పు దేశం (బస్తరు), రొట్టదంటు (పెద్ద అడవి), మాయ మందు (ఇప్ప సారా) కాలికొమ్మలు (సన్నాయి వాద్యాలు), పిట్టె పూరోడి పట్నం.(తాడ్వాయి దగ్గరి అంకన్నగూడెం గ్రామం), వంటి పదాలకు అర్థాలు పాద సూచికల ద్వారా అం దించడం చదువరులకు సౌలభ్యంగా ఉంది. అనుబంధంలో ఈ పుస్తక సంపాదకులు ‘‘జయధీర్‌ తిరుమల రావు’’ గారి గిరిజన క్షేత్ర పర్యటనల అనుభవ వ్యాసాలు మరింత అదనపు సమాచారం కలిగి ఉన్నాయి. బైండ్ల కథలో కాకతీయ రాజుల ఉదంతం, కోయ వీర గాథలు తెలిపే పగిడెలు, పటాలు, ఆరు కోయగాథలు వెలుగు చూసే రుతువు, నలు గురు కోయరాజులు 8 పడిగ కథలు ఈ అనుబంధంలో చదువుకోవచ్చు, భావి పరిశో ధకులు కోయ వీర గాథలు అధ్యయ నంకు పరిశోధనలకు ఈపుస్తకంఓ ప్రామా ణిక పునాదిగా ఉపకరిస్తుంది.
వీరుల పోరుగద్దె ‘‘మేడారం’’ (కోయ డోలీల కథ),సంపాద కుడు: జయధీర్‌ తిరుమలరావు, పేజీలు:136, ధర:80/- రూ, ప్రతులకు: సాహితీ సర్కిల్‌, హైదరాబాద్‌ – సెల్‌: 99519 42242.

దేవుడికి ప్రాణ ప్రతిష్ట దేశానికి అప్రతిష్ట

‘సర్వం సృష్టించిన దేవుడికి ఎవడో ప్రాణ ప్రతిష్ట చేయడ మేంటో? పిచ్చిగానీ-సర్వశక్తి సంపన్నుడైన దేవుడు తనకు తానే అందులో ప్రవేశిం చాలి కదా? ఒక తుచ్ఛ మానవ మాత్రుడు ప్రాణప్రతిష్ట చేయడమేమిటీ?’-అని సామా న్యులు ఆలోచనలో పడుతుంటారు. ’’మతతత్వాన్ని మట్టుబెట్టే పని ముస్లింలు,సిక్కులు, హిందువులు, క్రైస్తవుల వంటి వారందరిదీ- ఒకరకంగా భారతీయు లందరిదీ. దీని కోసం అన్ని మతాల వారు వారి మత తత్వ దృక్పధాన్ని అధి గమించి, నిజమైన సమైక్య జాతీయవాద మనస్త త్వాన్ని అలవరుచు కోవాలి!’’-అని పిలుపునిచ్చిన సుభాస్‌చంద్రబోస్‌ మాటలు ఈ దేశప్రజల మెదళ్లలో తాజాగా కదలాడు తూనే ఉన్నాయి.
పూల్వామా,బాలాకోట్‌లు గత ఎన్నిక లకు ఉప యోగపడ్డట్టు, అయోధ్య రామాలయ ప్రారంభో త్సవం రాబోయే ఎన్నికలకు ఉపయోగ పడాలన్నది అధికారంలో ఉన్న బీజేపీ పాలకుల ఉద్దేశం.మత రాజకీయాలు చేస్తున్న నేటి కేంద్ర ప్రభుత్వం అధి కారికంగా అయోధ్యరాముడికి ప్రాణప్రతిష్ట చేస్తోంది.ఎప్పుడూ లేనివిధంగా ఒక సెక్యులర్‌ దేశ ప్రధాని, రాజ్యాంగ స్ఫూర్తికి విరు ద్ధంగా రాముడికి ప్రాణప్రతిష్ట చేయడాన్ని ప్రతిపక్ష పార్టీల కూటమి ‘ఇండియా’ నిరసిస్తోంది. దేశం లోని అన్ని పీఠాల శంక రాచార్యులంతా తమకు పంపిన ఆహ్వానాల్ని తిప్పికొట్టారు.రాముడి స్థాయి తగ్గించి మోడీ తన స్థాయి పెంచుకుం టున్నాడని దూషించారు. అసలు అతనికి ఆ అర్హతే లేదని ఆగ్రహించారు. నిర్మాణదశలో ఉన్న ఆలయంలో రాముడికి ప్రాణప్రతిష్ట చేయడ మేమిటని దేశ ప్రజలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. నాలుగు పీఠాల శంకరాచార్యులు హిందూ విరోధులా? ఆహ్వానం తిరస్క రించినా అగ్రనాయకులెవరూ నోరు మెదపడం లేదెందుకూ?-అమిత్‌ షా ఆధ్వర్యంలోబీజేపీ కార్యకర్తలు ఇల్లిల్లు తిరిగి ఆయోధ్యరామాలయానికి రావాలని ఆహ్వానాలు, అక్షింతలు పంచి పెడుతున్నారు.ఆఆహ్వానం మూడు నెలల్లో ఎప్పుడైనా ఉపయోగించుకో వచ్చని అందులో ఒకసూచన కూడా ఉంది. ప్రాణ ప్రతిష్టకు ముహూర్తం ఏపండితుడో నిర్ణయించింది కాదనీ,రాబోయే ఎలక్షన్లను దృష్టి లో ఉంచుకుని రాజకీయ నాయకులు నిర్ణ యిం చిందేనని-పలువురు ఆధ్యాత్మికవేత్తలు దుయ్య బట్టారు.ఆలయాలకు రమ్మని ఎవరూ ఎవరినీ ఆహ్వానించరు. అది వ్యక్తిగత విషయం ఎవరికి వారు నిర్ణయించు కోవాల్సింది. దేవు డికీ, భక్తు లకు మధ్య కేంద్ర ప్రభుత్వం బ్రోకర్‌పని నెత్తిన వేసు కుందా? అయినా ఒక మతానికి సంబం ధించి ఒక రాజకీయ పార్టీ తనకు తానే అన్ని హక్కులూ,అధికారాలు బలవంతంగా లాగేసుకుం టుందా? ఈ గుత్తాధిపత్యం చాలా అసహ్యంగా, ఎబ్బెట్టుగా కూడా ఉంది. అధికార పార్టీకి మీడి యా సంస్థలు తమ హద్దులు దాటి మద్దతిస్తు న్నాయి. ఉత్తర భారతదేశంలో హిందీ పత్రికలు టెలివిజన్‌ ఛానళ్లు విపరీత ధోరణిలో పని చేస్తు న్నాయి. తమ వ్యాన్‌ల మీద ‘మందిర్‌ వహీ బనాయా హై’-అని పెద్ద అక్షరాలతో రాసుకు న్నాయి.కోర్టు ఆర్డరు ఉన్నా లెక్క చేయకుండా మందిరం అక్కడే కట్టారు-అని ధైర్యంగా ప్రచారం చేస్తున్నాయి. మోడీ బొమ్మతో ‘వన్‌ నేషన్‌ వన్‌ లీడర్‌’-అని మరో హిందీ దిన పత్రిక పోస్టర్లు వేసింది. ‘రామ్‌ ఆయెంగే’ అని ఒక హిందీ ఛానెల్‌ ప్రకటిస్తే, ‘శ్రీ రామోత్సవ్‌- పేరుతో ఒక మీడియా సంస్థ వేడుక జరిపింది. దానికి ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి హాజరయ్యాడు. ఈ రకంగా దేశంలో మీడియా ప్రజాస్వామ్య విలువల్ని కాల్చి బుగ్గిచేస్తోంది.ఒకరకంగా దేశంలో పత్రికా రంగపు అధర్మ కాలం నడుస్తోంది. ఇవన్నీ కాక, ఒకప్పుడు బాబ్రీ మసీదు కూలగొట్టిన కరసేవ కుల (నేరగాళ్ల)ఇళ్లు వెతికి వెతికి వారికి పూలదండలు వేసి బహి రంగ స్థలాలలో సన్మా నిస్తున్నారు. ఈ పని ఇంకెవరు చేయ గలరూ? ఆరెస్సెస్‌-బీజేపీ కార్యకర్తలే!ఇది ఇలాగే కొనసాగితే మనుస్మృతిని భారత రాజ్యాంగంస్థానంలో ప్రతిష్టించరనీ- సనాతన ధర్మాన్ని తిరగతోడరనీ నమ్మకమేమిటీ?దేశంలో కమలం ఒక విషపు ష్పంగా,విద్వేషపుష్పంగా చరిత్రలో నిలబడు తుంది. అనుమానమే లేదు. ఇప్పుడు బీజేపీ వారు వారి పార్టీ ఫుల్‌ఫాం మార్చుకున్నారు.బి-అంటే బాయిస్‌ (22)జె-అంటే జనవరి పి-అంటే ప్రాణ-ప్రతిష్ట-అని! ఇదే రామమందిర ఆహ్వా నాన్ని తిరస్కరించిన శంకరాచార్యులు 1. నిర్మలా నంద సరస్వతి.2.భారతీకృష్ణ.3.అభిముక్తే శ్వరానంద్‌.4.సదా నంద్‌ మహరాజా-నిర్మాణం పూర్తి కాని ఆలయాన్ని ప్రారంభిస్తు న్నారంటే- అది ఎన్నికల స్టంటేనన్నది వీరంతా ముక్తకంఠంతో ఘోషించారు. అయినా ఏ దేవుడు ఎవడికి కలలో వచ్చినా తనకు గుడి కట్టమని దేబరిస్తాడెందుకో? ఓ బడి, ఓ ఆసుపత్రి-లేదా ప్రజలకు ఉపయోగ పడేది మరేదైనా కట్టించమని అడగడెందు కూ అని మనతోటి సగటు మనుషులకు అనుమానాలు వస్తుం టాయి. ఒకరోమన్‌ చక్రవర్తి మార్కస్‌ అరీలి యస్‌ ఆంటోనిసన్‌ ఇలా అన్నాడు. ’’కాంతిని ఏది ప్రసరింపజేయలేదో అదితన చీకటిని తనే సృష్టిం చుకుంటుంది-’’ఇది కేంద్ర పాలకులకు సరి పోయే విధంగా లేదూ? ఉదాహరణకు గోవాలోని బీజేపీ సర్కార్‌ అక్కడి ప్రజలకు గొప్ప చీకటిని ఇలా ప్రసరించింది.-’’మంచి పంటల కోసం ప్రతి రోజూ పొలాల్లో వేద మంత్రాలు చద వండి!’’-అని న్యూఢల్లీిలో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ అనే గొప్ప కేంద్ర ప్రభుత్వ సంస్థ పని చేస్తోంది.ఇంకాదాన్నెందుకు ఉం చారూ? మూసెయ్యాలి కదా?’’ఇరవై ఒకటవ శతాబ్డపు విద్యావిహీనులు ఎవరంటే చదవడం. రాయడం రాని వారు కాదు-అవి వచ్చినా, లాభం లేని మందమతులు-కాలంతో పాటు కొత్త విష యాలు నేర్చుకోని వారు.పనికిరాని పాత విష యాలు వదిలేయని వారు. కేవలం మూఢత్వంలో బిగుసుకు పోయినవారు’’-అన్నాడు అల్విన్‌ టోప్లర్‌. అమెరికా రచయిత. ప్యూచర్‌ షాక్‌, ద ధర్డ్‌ వేవ్‌, పవర్‌ షిఫ్ట్‌ గ్రంథాల రచయిత. టోప్లర్‌ ప్రకారం విద్యా విహీనులకున్న నిర్వచనం మార్చుకోవాల్సి ఉంది.కరోనా వైరస్‌ను పారదోలడానికి చప్పట్లు చరచాలనీ, గంటెలతో కంచాలు మోగించాలని సూచించిన ఇదే ప్రభుత్వ పెద్దలు తాజాగా ఇప్పుడు జనవరి 22న ప్రతి ఇంటా రామ జ్యో తులు వెలిగించాలని దేశ ప్రజలకు సూచించారు. వాళ్ల మూర? త్వాన్ని దేశ ప్రజలందరికీ పంచి పెట్టాలన్నది వారి ప్రయత్నమన్న మాట! ఇందులో కొత్తవి నేర్చుకున్నదీ పాతవి వదిలేసిందీ ఎక్క డుందీ?ఇటీవల ఒకబీజేపీ పార్లమెంట్‌ మెంబర్‌ ఏమన్నారో చూడండి! ’’క్షత్రియులను క్షత్రియులంటే బాధపడరు.బ్రాహ్మణులను బ్రాహ్మ ణులంటే బాధపడరు. వైశ్యుల్ని వైశ్యులంటే కలత చెందరు. కానీ శూద్రుల్ని శూద్రులంటే మాత్రం బాధప డతారు.ఎందుకో తెలుసా? వారు అజ్ఞా నులు. సమాజ వ్యవస్థ కోసం ప్రాచీన హిందూ గ్రంథాల్లో నాలుగు కులాలనే ఏర్పాటు చేశారు’’- ప్రజ్ఞా టాగూర్‌.మనుషులంతా ఒక్కటి అనే విష యం గ్రహించని వారిని మేం మూరు?లు-అని అంటాం. భారతదేశ స్వాతంత్య్రంలో పాల్గొనని వారిని దేశ ద్రోహులంటాం-మరి ఆరె ప్సెస్‌, బీజేపీ వర్గాలెందుకు ఉలిక్కి పడతాయీ? ప్రాచీన హిం దూ గ్రంథాలేమైనా జ్ఞానాన్ని పంచే వైజ్ఞానికి గ్రంథాలా? కాదు గదా? అలా అని మీరనుకుంటే అది మీ ఇష్టం.అందరూ ఒప్పు కోవాలని అనుకో కండి.21శతాబ్దంలో బతుకుతూ అన్ని ఆధు నిక వసతులు అనుభవిస్తూ ఇంకా వేలఏళ్ల నాటి మైండ్‌ సెట్‌తో మాట్లాడుతాం. మేం అలాగే ప్రవర్తి స్తాం-అంటే వీలుకాదు.వారు ఏ హోదాలో ఉన్నా మా లెక్క ప్రకారం మూరు?ల కేటగిరి లోకే వస్తారు.పొరపాటున ఎవరైనా వీరి వలలో పడ్డా రంటే వారు. వారి ఇంగిత జ్ఞానాన్ని కోల్పోతారు. ఇటీవల వీరు ఆవుపేడ ఇంధనంగా నడిచే బస్సుల గురించి ప్రచారం చేశారు. ఆవు పేడతో నడిచే ఆ బస్సులు, ఒక రూపాయి ఖర్చుతో పదిహేను కిలోమీటర్లు పోగలవన్నది. ఆ ప్రకటన సారాం శం! అందుకే కాబోలు మోడీ భక్తులంతా అన్నా లు మానేసి ఆవు మూత్రం ఆవు పేడల మీద ఆధారపడి శక్తివంతులవుతున్నారూ??బీజేపీ యం.పి ప్రజ్ఞాటాకూర్‌ ప్రకటనకు స్పందించి క్షత్రి యుడైన పరిశోధకుడు డాక్టర్‌ సంగ్రాం పాటిల్‌ ఇలా వివరణ ఇచ్చాడు-క్షత్రియులనబడే వారు హిందువులుకారని వారు శ్రమ ణులనీ అన్నాడు. వారెప్పుడూ బ్రాహ్మ ణిజాన్ని నెత్తిన మోయ లేదని-అయితే మొఘలుల కాలంలో ముస్లిం రాజులు అందరినీ ఒకేవిధంగా ‘హిందువులు’’-అని అన్నారని దాన్నే తర్వాత కాలంలో బ్రిటీష్‌ వారు కొనసాగించారని అన్నాడు. బ్రాహ్మణ వర్గీ యులు కూడా పాలకుల మాటను అంగీకరించి తామంతా హిందువులమే అని అనడం ప్రారం భించారట. ఎందుకంటే తమ సంఖ్య పెద్దది. సమాజంలో తాము అధిక సంఖ్యాకులం అని చెప్పుకోవడానికి అలా కలుపుకున్నారట. మళ్ళీ అందరికీ సమాన స్థాయి లేకుండా అందులోనే నిచ్చెనమెట్ల వ్యవస్థను సృష్టించి జనాన్ని విభజిం చారట. అసలైతే అందరూ ఈదేశ మూల వాసు లు.మూలవాసుల్ని బానిసలుగా మార్చింది. ఇరాన్‌ ప్రాం తం నుండి వలస వచ్చిన ఆర్య బ్రాహ్మణు లు. విషయాలు లోతుగా తెలుసుకుంటే కళ్లు తెరుచుకుంటాయి. తామే ఉన్నత వర్గీయులమని శతాబ్దాలుగా ఏ పనీ చేయకుండా పరాన్నజీవు లుగా బతుకుతున్నదీ-తమ మనుగడ కోసం మూఢనమ్మకాల్ని వ్యాప్తి చేస్తున్నది. బ్రాహ్మ ణార్యులే అన్నది స్పష్టం! 12వ శతాబ్దం వరకు అసలు ‘హిందూ’ అనే శబ్దమే మన పూర్వీకులకు తెలి యదు. రాజ్‌పుట్‌, ఠాకూర్‌ వంటి నవక్షత్రియ శాఖలు తర్వాతకాలంలో ఏర్పడ్డాయట. ఇప్పుడు’ ’హిందూత్వ’’పేరుతో అదేబ్రాహ్మణ వాదం దేశం లో పెత్తనం కొనసాగిస్తుందని అన్నారు డాపప సంగ్రాం.ఆలోచనా విధానంలో తేడాలు ఎలా ఉంటాయో ఇద్దరు నాయకుల అభిప్రాయాలు గమనిద్దాం!స్త్రీలపట్ల ఆరెస్సెస్‌ వారి దృక్పథమే మిటో వారి చీఫ్‌ మోహన్‌ భగవత్‌ తెలియ జేశారు.ఇల్లాలు కేవలం ఇంటి పనులకోసమే, ఆమె భర్తను అన్ని విధా లా సుఖపెట్టాలి. అయితే ఆమె అవసరాలు భర్త తీర్చాలి. ఇదే సామాజిక ఒప్పందం! దీనికి కట్టుబడి ఉన్నంతవరకే కాపురం ఉంటుంది.ఉల్లంఘిస్తే భర్త-భార్యను విడిచి పెట్టొచ్చు’-అని చెప్పాడు. ఇందులో యజమాని బానిసల సంబంధం ఉందేగాని, జీవిత భాగస్వా ముల అనుబంధం ఎక్కడ ఉందీ? అయితే మరి, యశోదాబెన్‌ ఏవిషయాలు ఉల్లంఘించిందో, ఆమెను ఆమె భర్త అనధికారికంగా ఎందుకు విడిచిపెట్టాడో చెప్పాల్సిన బాధ్యత మోహన్‌ భగవత్‌కు లేదా? ఇక పుచ్చలపల్లి సుందరయ్య యువతీ యువకులకు ఇలా సలహా ఇచ్చారు’’.- భార్యాభర్తలి ద్దరూ ఉద్యోగాలలో,వృత్తులలో చేరితే బిడ్డల పోషణ,సంరక్షణ,ఇంటి పనుల నిర్వహణలో ఇబ్బందులు ఉండొచ్చు.కానీ,ఇద్ద రూ కలిసి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ-ఇరువురూ ఆ పనులన్నింటినీ పంచుకుని ఓపికగా చేసుకోవాలి.తమ స్త్రీల మీద బరువు తగ్గిం చాలనే ధోరణి పురుషులలో, ముఖ్యంగా యువ కులలో రావాలి’’ -అని అన్నారు. అర్థవంతమైన సూచన కదా? -(డాక్టర్‌ దేవరాజు మహారాజు)

రామరాజ్యమా..లౌకిక రాజ్యామా?

ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఓట్ల కోసం ప్రజల మనోభావాలతో చెలగాటమాడటం కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బిజెపికి అలవాటు. మతాన్ని అడ్డం పెట్టుకుని ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాన్ని చాప కింద నీరులా దేశం మొత్తం వ్యాప్తి చేసే కార్యక్రమాన్ని యథేచ్ఛగా అమలు చేస్తున్నది. అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ట సందర్భంగా ప్రధాని చేసిన ఉపన్యాసమే అందుకు నిదర్శనం. ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నది సాధువులు, సన్యాసులు, బడా వ్యాపారవేత్తలు, కోట్లాధిపతులు. ఎన్నికల ముందు రామ మందిరాన్ని ప్రారంభించి ప్రజల భావోద్వే గాలను తమ వైపు మరల్చుకోవా లన్నది బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ల ప్రధాన ఎత్తుగడ. ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, ప్రధాని మోడీ కలిసి రామమందిరాన్ని ప్రారంభిం చారు. దీన్నిబట్టి మనమేం అర్థం చేసుకోవాలి? మతం ముసుగులు తొలిగిపోయాయి. ఇక అంతా బహిరంగమే! ఎన్నికలయ్యేదాకా ఎక్కడ ఏం జరుగుతుందో, ఎలాంటి మత ఉద్రిక్తతలు చెలరేగుతాయో, ఘర్షణలు జరుగుతాయో తెలియని పరిస్థితి. మతాన్ని, రాజకీయాలను వేరుచేసి చూడటం లేదు. మతానికి రాజకీయాలను అనుసంధానం చేసి అధికారం కోసం తన ఎత్తుగడలను అనుసరిస్తున్నారు మోడీ. గత 75 ఏళ్లలో ఏ ప్రభుత్వాలు చేయలేని దానిని కేంద్రం అమలు చేస్తున్నది. 1990లో ఎల్‌కె అద్వానీ రామజన్మభూమి పేరుతో రథయాత్ర ప్రారంభించి 1984లో రెండు సీట్ల నుంచి 150 సీట్లకు తీసుకొచ్చారు. అప్పటినుంచే కాషాయపు జెండా తన ఎజెండాను పూర్తిగా మార్చుకున్నది. బిజెపిగా అవతరించింది. పేరు మార్చింది. ప్రజలను ఏమార్చింది. తన విధానాలను ఆ తర్వాత అదే కార్యక్రమాన్ని రామజన్మభూమితో కొనసాగించి అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ట అంకం పూర్తయింది. ఇక మధురలో కృష్ణ దేవాలయం, ఇతర దేవాలయాలపై దృష్టి సారించింది. నిరంతరం ప్రజలను మత ఉద్వేగాల వైపు మరల్చి ఓట్లు దండుకునే కార్యక్రమాన్నే బిజెపి పెట్టుకున్నది. మత విశ్వాసాలు వ్యక్తిగతమైనవి. పరమత సహనం పాటిస్తూ అందరినీ కలపుకుపోయేదే రాజనీతి. రాజకీయాలు లౌకికత్వానికి సంబంధించినవి. వర్తమానంలో రాజకీయాలలో మతం ప్రధాన పాత్ర వహించే విధంగా బిజెపి తన ఎత్తుగడలను కొనసాగిస్తున్నది. ఇప్పుడు రామజన్మభూమి, రామాలయం వంటి అంశాలను తీసుకువచ్చి ప్రజలను మభ్యపెడుతున్నది. రామాలయాలు దేశమంతటా ఉన్నాయి. రాముడు ప్రజా సంక్షేమాన్ని కాంక్షించాడని చెప్తారు. అన్న మాట కోసం అధికారాన్ని వదిలి అడవులకు పోయాడంటారు. అయితే రామ నామం జపించే పాలకులు చేసిన వాగ్దానాలను ఉట్టి మీదకు ఎక్కించారు. నిత్యావసర ధరలను ఆకాశమార్గం పట్టించారు. సగటు పేద ప్రజలు ఆ ధరలను అందుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇది మోడీ రాజ్యంలో ప్రజల పరిస్థితి.
పదేళ్ల కిందట అధికారంలోకి రాక ముందు మోడీ మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టారు. రైల్వేస్టేషన్‌లో చారు అమ్మినవాడిగా, వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన నాయకుడిగా, అందరి కష్టసుఖాలు తెలిసిన వ్యక్తిగా పరిచయం చేసుకుని ప్రచారార్భాటం ప్రారంభిస్తే ప్రజలు నమ్మారు. బిజెపి ని అధికారంలోకి తీసుకొచ్చారు. నాడు మోడీ చేసిన వాగ్దానాలేమిటి? నేడు చేస్తున్నదేమిటి? పేద ప్రజల, కార్మికవర్గ సంక్షేమం, బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు. రైతాంగం పట్ల దోపిడీ విధానాన్ని అనుసరించే చట్టాలను సంస్కరణల పేరుతో తీసుకొచ్చారు. కార్మిక వర్గాలను పరిశ్రమల అధిపతులకు, పెట్టుబడిదారులకు బానిసలుగా మార్చే చేదు మందు లాంటి సంస్కరణలకు చక్కెరపూత పూశారు. యాజమాన్యాలకు కార్మిక వర్గం బానిసలుగా పనిచేసేలా తిరోగమన సంస్కరణలను ముందుకు తెచ్చారు. పెట్టుబడిదారుల లాభాలకు, వారి సంతోషం కోసం ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉన్నామని మోడీ ఎప్పటికప్పుడు తన విధానాల ద్వారా తెలియజేస్తూనే ఉన్నారు. కోట్లాది టన్నుల ధాన్యం గోడౌన్లలో మూలుగుతున్నా పేద ప్రజలకు పంచడానికి చేతులు రావడం లేదు కానీ అదానీ, అంబానీ లాంటి వారికి లక్షల కోట్ల రూపాయలను రాయితీలిచ్చి ప్రోత్సహిస్తున్నారు. ఈ దేశంలో నిరుద్యోగాన్ని వేగంగా పెంచి పోషిస్తున్నది ఎవరు, మోడీ కాదా? ఏటా రెండు కోట్ల ఉద్యోగాల కల్పన ఊసెక్కడీ ఉన్న ఉద్యోగాలను ఊడ పీకడమే కాకుండా పకోడీలు అమ్ముకోవడం కూడా ఉద్యోగమే అని సెలవిచ్చిన మోడీ ఈ దేశానికి ‘మహా నాయకుడు’, ‘విశ్వగురు’!
ప్రభుత్వ రంగ పరిశ్రమలను టోకుగా అమ్మడం, బడా పెట్టుబడిదారులకు కట్టబెట్టడం లాంటి చర్యలను నిస్సిగ్గుగా కొనసాగిస్తున్నారు బిజెపి పాలకులు. ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మింది, బడా పెట్టుబడిదారులకు కట్టబెడితే ఎంత సంపద వచ్చింది గొప్పగా చెపుకుంటున్నారు. కానీ దేశాన్ని దోచుకుని సరిహద్దులు దాటించిన బడా పారిశ్రామిక వేత్తలను గురించి ఒక్క రోజు కూడా మాట్లాడరు! కోట్లాది రూపాయల ప్రజల సొమ్మును పట్టపగలే బ్యాంకు రుణాల ద్వారా దోచుకున్న విజరు మాల్యా, నీరవ్‌ మోడీ లాంటి వాళ్ళ గురించి అసలు తెలియ నట్లు వ్యవహరిస్తున్నారు. నేడు ప్రపంచంలో మూడవ కుబేరుడిగా గౌతమ్‌ అదానీ ఎది గాడు! ఇది ఎవరి చలువో అందరికీ తెలిసిం దే. కేవలం మోడీ ఈ పదేళ్ల పాలనలో అదా నీలు, అంబానీలు, టాటా బిర్లాలు కోట్లాది ఆస్తులను సంపాదిస్తూ వేగంగా ప్రపంచ కుబేరులను దాటిపోతున్నారు. దగా పడ్డ ప్రజల ఆదాయం, ప్రజల జీవన స్థితులు మాత్రం మారడం లేదు. కారణం, ప్రజల్ని మతం చుట్టూ భ్రమింపజేయడం ద్వారా అంతర్గత వ్యూహాల్ని అమలు చేస్తున్నారు. నూటికి ఎనభై శాతం వ్యవసాయ దేశంలో రైతుల బతుకులు చితికిపోతున్నా వారి గురించి పట్టించుకోరు. ప్రజల సంపద బడా కోట్లాధిపతుల చేతుల్లోకి వెళ్లిపోతున్నా మాట్లాడే పరిస్థితిలో లేరు. ప్రభుత్వ సంస్థలు నిర్వీర్య మైతున్నాయి, క్షీణిస్తున్నాయి. సంబంధ మే లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. బిజెపి పాలన లో ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను కూడా ఏర్పాటు చేయలేదు. గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ప్రజలకు ఉపయోగమైన దేశానికి ప్రయోజన కరమైన బడా ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేసి అమ్మి వేయడం లేదా అంగడి దుకాణాలు ఇచ్చినట్లు కిరాయిలకు ఇస్తున్నది. ఇది దేశానికి నష్టదాయకమే కాదు, భవిష్యత్తుకు శాపం! ప్రభుత్వ పరిశ్రమలను కొనుగోలు చేసిన పెట్టుబడిదారులు మాత్రం ఒకటికి పదింతలు కోట్లాది రూపాయలను ఆర్జిస్తున్నారు, డొల్ల కంపెనీలు సృష్టించి దోచుకుంటున్నారు. మన పాలకులు ఆనందపడుతున్నారు. ఇదే అసలైన అభివృద్ధిగా చెబుతున్నారు. మరి అదానీ అసలు స్వరూపాన్ని హిండెన్‌బర్గ్‌ బయట పెడితే దీనిపై స్పందించరేం? ఈ దేశంలో కోట్లాది మంది ప్రజల సొమ్మును కొంతమంది పెట్టుబడిదారులు దోచుకోవడం, దాచుకోవ డం పరిపాటిగా పెట్టుకున్నారు. అందుకు మోడీ అండదండలే కారణమన్నది దేశ పౌరులకు తెలియంది కాదు. ఓవైపు పన్ను ఎగవేతలు, మరోవైపు భారీ కుంభకోణాలు విజృంభిస్తుంటే వాటి నియంత్రణలో కేంద్ర పాలకులు విఫలమయ్యారు.మోడీ అధికారం లోకి వచ్చినప్పుడు రూ.65 లక్షల కోట్ల అప్పు ఉన్న మన దేశం నేడు రూ.కోటి 55 లక్షల కోట్లకు ఎగబాకింది. ఇది మోడీ పాలనలో జరిగిన అప్పుల అభివృద్ధి. అప్పులు తీర్చడానికే కేంద్ర బడ్జెట్‌లో అధిక శాతం వడ్డీలకు కట్టాల్సి వస్తుంది. దేశ ప్రజలపై ఎక్కడలేని భారాలను మోపుతున్నది. దేశ ఆదాయ వనరుగా ఈ దేశంలోని కోట్లాది పేద ప్రజ లను సరుకుగా మార్చుకుంటున్నది. దుడ్డుకర్ర లాంటి వివిధ పథకాలు తెచ్చి మధ్య తరగతి, పేద వర్గాల నడ్డి విరగ్గొడుతున్నది.అధికారం చేతిలో ఉందని తనకు తోచిన విధంగా వెనక ముందు చూడకుండా తిరోగమన విధానాలు అమలు చేస్తున్నది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి చర్యలు దేశాన్ని కుదేలు చేసింది అంద రికీ తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన కరోనా మహమ్మారిని అరికట్టలేక పోవడంతో కోట్లాది మంది అసంఘటిత కార్మికుల ఉసురు తీసింది. రెక్కాడితే గాని డొక్కాడని కార్మికుల, పేద ప్రజలను దిక్కులేని వాళ్ళని చేసింది. పెద్ద నోట్ల రద్దు ద్వారా ఈ దేశంలో ఉన్న నల్లధనం బయటికి తీసకొస్తామని జబ్బలు చరిచింది. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి ఈ దేశ ప్రజల జన్‌ధన్‌ ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని చెప్పింది. ఒక్క రూపాయి నల్లధనం కూడా బయట పెట్టలేక పోయింది. దీనికితోడు ధరల్ని అదుపు చేయడంలో, నిరుద్యోగాన్ని రూపు మాప టంలో, వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో మోడీ పూర్తిగా విఫలమయ్యారు.ఇది దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న మోడీ (రామ) రాజ్యం. ఈ రాజ్యంలో ప్రజా సంక్షేమం లేకపోగా పేదల బాధలు రెట్టింపయ్యాయి. నిరుద్యోగం, ధరల పెరుగుదల తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. కార్మికుల హక్కులు కాలరాయబడ్డాయి. చదువు, వైద్యం కార్పొరేట్ల పరమైంది. మోడీ ప్రభుత్వం వైఫల్యాలను ఎప్పటికప్పుడు సిపిఐ (ఎం) లాంటి వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు ప్రతిఘటి స్తున్నా, ప్రజల దృష్టిని మరల్చేందుకు బిజెపి-ఆరెస్సెస్‌ వేస్తున్న పాచికే రామరాజ్యం. ఇదే పదేళ్లలో మోడీ దేశానికి చేసిన నిర్వాకం. లోక్‌సభ ఎన్నికలకు సమయం ఆసన్నమైన సందర్భంగా మోడీ వేస్తున్న అడుగులను ఈ దేశంలోని యువకులు, ప్రజలు, విద్యావంతులు, మేధావులు గమనించాలి. భిన్నత్వంలో ఏకత్వానికి చిహ్నమైన భారత లౌకికత్వాన్ని ఓటు ద్వారా బలపరచాలి. అంధ విశ్వాసాల నుండి దేశాన్ని కాపాడుకోవాలి.
వ్యాసకర్త సెల్‌ : జూలకంటి రంగారెడ్డి – జూలకంటి రంగారెడ్డి

సమున్నత శిఖరం

విజయవాడలో ఆకాశమంత అంబేద్కరుడు.. ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం, విశేషాలివే..! దేశంలో అణగారిన వర్గాలకు స్వేచ్ఛ,అంటరానితనం నిర్మూలన,సమానత్వాలు ప్రసాదించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ మహా విగ్రహం ఆవిష్కరణకు సిద్ధమైంది. విజయవాడ నగరం నడిబొడ్డున స్వరాజ్య మైదానంగా పిలిచే పీడబ్ల్యూడి గ్రౌండ్స్‌లో ఏపీ ప్రభుత్వం సబ్‌ప్లాన్‌ నిధులతో నిర్మించిన 206 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని ఇవాళ సీఎం జగన్‌ ఆవిష్కరించనున్నారు. రూ.400 కోట్లతో నిర్మించిన ఈ విగ్రహం ప్రపంచం లోనే ఎత్తైన అంబేద్కర్‌ విగ్రహంగా (సామాజిక న్యాయ మహాశిల్పం) నిలవనుంది.ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మహా విగ్రహ విశేషాలెంటో ఇప్పుడు చూద్దాం.!
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 125 అడుగుల డా.బీ.ఆర్‌. అంబేద్కర్‌ ఎత్తైన కాంస్య విగ్రహాన్ని నగరం నడిబొడ్డులో ఏర్పాటు అంబేద్కర్‌ స్మృతివనం పేరుతో సరికొత్త అందాలతో సర్వాంగ సుందరంగా నిర్మించారు. దీంతో ఈ ప్రాంతం రానున్న రోజుల్లో పూర్తి పర్యాటక ప్రాంతంగా మార నుంది. నగరంలోని ఏ మూల నుండి చూసినా ఎత్తైన అంబేద్కర్‌ విగ్రహం మిలమిల మెరిసేలా ఏపీఐసీసీ,గిరిజన సంక్షేమశాఖ,పురపాక శాఖ సమన్వయంతో నిర్మాణాలు జరిగాయి.అంబేద్కర్‌ విగ్రహంతో పాటు,కన్వెన్షన్‌ సెంటర్‌,వాకింగ్‌ ట్రాక్‌,పార్క్‌ మ్యూజియంతోపాటు పలు నిర్మాణాల కోసం పీడబ్ల్యుడి గ్రౌండ్స్‌ లోని 18.81ఎకరాల స్థలాన్ని వినియోగించారు. దేశంలో మతాతీతమైన విగ్రహాల్లో ఇదే అతిపెద్దది కావడం విశేషం. విగ్రహం మ్నెత్తం
ఎత్తు 206 (81అడుగుల బేస్‌, 125 అడుగుల విగ్రహం) అడుగులు. మార్చి 21, 2022లో పనులు ప్రారంభం కాగా..విగ్రహ తయారీకి 120 టన్నుల కాంస్యం వాడారు. 400 మెట్రిక్‌ టన్నుల స్టీలు, 2,200 టన్నుల శాండ్‌ స్టోన్‌ వాడారు. విగ్రహం తయారీకి మ్నెత్తం అయిన ఖర్చు. రూ.404.35 కోట్లు.
18.`8 ఎకరాల్లో ఈ విగ్రహాన్ని రూపొం దించారు. ఇందులో అందమైన గార్డెన్‌, వాటర్‌ బాడీస్‌, మ్యూజికల్‌ ఫౌంటేన్లు, చిన్నపిల్లలు ఆడుకోవటానికి, వాకింగ్‌ చేసుకోవ టానికి వీలుగా ఏర్పాట్లు చేశారు.జీ ప్లస్‌ టూగా నిర్మించగా..గ్రౌండ్‌ ఫ్లోర్‌లో నాలుగు హాల్స్‌ ఉన్నాయి. ఇందులో ఓసినిమా హాలు, మిగిలిన మూడు హాళ్లు ఆయన చరిత్ర తెలిపే డిజిటల్‌ మ్యూజియంలు ఏర్పాటు చేశారు. ఫస్ట్‌ ఫ్లోర్‌లో 2,250 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన నాలుగు హాళ్లుంటాయి. ఒక హాల్లో అంబేద్కర్‌కు దక్షిణ భారతదేశశంతో ఉన్న అనుబంధాన్ని డిస్‌ప్లే చేస్తారు. రెండు హాళ్లలో మ్యూజియం, ఒక హాల్‌లో లైబ్రరీ ఏర్పాటుకు సిద్దం చేశారు. ఇక సెకండ్‌ ఫ్లోర్‌లో1,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు హాల్‌లున్నాయి. వీటిని లైబ్రరీకి వినియోగించాలనే ప్రతిపాదన ఉంది.మినీ థియేటర్లు,ఫుడ్‌కోర్టు,కన్వెన్షన్‌ సెంటర్‌,వెహికల్‌ పార్కింగ్‌ ఉన్నాయి. కన్వెన్షన్‌ సెంటర్‌ 6,340 చదరపు అడుగుల విస్తీర్ణంలో,2,000 మంది సీటింగ్‌ సామర్థ్యంతో నిర్మించారు. ఫుడ్‌కోర్టు 8,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. బిల్డింగ్‌ చుట్టూ నీటి కొలనులు,మ్యూజికల్‌, వాటర్‌ ఫౌంటేన్‌,ముందుభాగంలో ఉన్నాయి. నీటి కొలనుకు లైటింగ్‌, బబ్లింగ్‌ సిస్టం ఉన్నా యి. కాలచక్ర మహా మండల పీఠం బౌద్ధ వాస్తు శిల్పకళతో అంబేద్కర్‌ పీఠం(పెడస్టల్‌) ను రూపొందించారు.విగ్రహ బేస్‌ నిర్మాణానికి రాజస్థాన్‌కు చెందిన పింక్‌ రాక్‌ను ఉపయోగిం చారు.అంబేద్కర్‌ జీవిత చరిత్ర తెలిపే 38 ఘట్టాలను ప్రదర్శించేలా ఆర్ట్‌ వర్క్‌ ఏర్పాటు చేస్తున్నారు.అంబేద్కర్‌ జీవితంలో బాల్యం, విద్య, వివాహం,ఉద్యోగం,రాజకీయ జీవితం, పోరాటాలు, రాజ్యాంగ నిర్మాణం ఛాయా చిత్రాలను, ఇతర వస్తువులను ప్రదర్శించే మ్యూజియం ఏర్పాటవుతుంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా మనం ఏదైనా ప్రశ్న అడిగితే, ఆయనే సమాధానం ఇచ్చే అనుభూతి వచ్చేలా వీడియో సిస్టం ఏర్పాటుచేస్తున్నారు. విగ్రహాన్ని హనుమాన్‌ జంక్షన్‌ వద్ద శిల్పి ప్రసాద్‌ ఆధ్వర్యంలో కాస్టింగ్‌ చేశారు. స్థానిక కూలీలతో పాటు, ఢల్లీి, బిహార్‌, రాజస్థాన్‌ నుంచి వచ్చిన కూలీలు రెండేళ్ల పాటు మూడు షిఫ్ట్‌ల్లో పనిచేశారు.ఈ పనులను 55 మంది సాంకేతిక నిపుణులు పర్యవేక్షించారు.
ఆంధ్రా తలెత్తుకునేలా.. సమున్నత అంబేద్కర్‌ విగ్రహం : సామాజిక న్యాయ ప్రదాత, రాజ్యాంగ రూప శిల్పి,సమసమాజ నిర్మాత డా.బీఆర్‌ అంబే ద్కర్‌ అతి పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ సరికొత్త చరిత్రను లిఖిం చేందుకు సిద్ధమైంది. ప్రపంచమే తలతిప్పి చూసేలా రాష్ట్రం నడిబొడ్డున 125 అడుగుల సమునన్నత విగ్రహం కొలువుదీరింది. అన్ని వర్గాల ప్రజలు దైవంలా కొలిచే అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటుతో విజయవాడ నగరం సరికొత్త శోభను సంతరించుకుంది. ఓట్ల కోసం గత ప్రభుత్వం అమరావతిలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్న హామీ నీటిమూటగా మిగిలిపోయింది. కానీ వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తొలి నాళ్లలోనే విజయవాడలో అంబేద్కర్‌ స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించడమే కాకుండా కార్యాచరణకు పూనుకుంది. భారీ పీఠాన్ని నిర్మించి,పలు లోహాల సమ్మేళనంతో అతిపెద్ద విగ్రహాన్ని సగర్వంగా నిలిపింది.
సామాజిక న్యాయ మహా శిల్పం
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో అంబేద్కర్‌ మహా శిల్పం ఆవిష్కరణ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఏపీ ప్రజలకు ఒక సందేశాన్ని ఇచ్చారు..ఈ సందర్భంగా సీఎం జగన్‌ విజయవాడలో మాట్లాడుతూ మనం ఏర్పాటు చేసుకున్నటువంటి అంబేద్కర్‌ గారి మహా శిల్పం మన రాష్ట్రానికే కాకుండా దేశానికి తలమానికం అంటూ తెలియజేశారు. ఇది స్టాట్యూ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌ అంటూ కూడా తెలియజేశారు.ఈ శిల్పం ఒక సామా జిక న్యాయ మహా శిల్పం అంటూ కూడా తెలియజేయడం జరిగింది.
దేశంలో మూడో పెద్ద విగ్రహం..
ఈ విగ్రహం ప్రపంచంలోనే అతి పెద్దదైన అంబేద్కర్‌ విగ్రహం కాగా..దేశంలోని అతి పెద్ద విగ్రహాల్లో మూడవది. మొదటిది స్టాట్యూ ఆఫ్‌ యూనిటీగా ఉన్న సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహం 597అడుగుల ఎత్తులో ఉంది. రెండవది శంషాభాద్‌ పరిధిలో నిర్మించిన స్టాట్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ సమతామూర్తి విగ్రహం 216 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆ తర్వాత విజయ వాడలో ప్రారంభం కానున్న 210 అడుగుల ఎత్తులోని స్టాట్యూ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం.
అంబేద్కర్‌ స్ఫూర్తిని భావితరాలకుఅందించాలి జాతికి స్ఫూర్తి ప్రధాత డా. బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ అని, ఆయన స్ఫూర్తిని భావిత రాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని విశాఖ జిల్లా రెవెన్యూ అధికారి కె.మోహన్‌ కుమార్‌ పేర్కొన్నారు. అమరావతిలో 125 అడుగుల డా.బి.ఆర్‌. అంబేద్కర్‌ సామాజిక న్యాయ మహా శిల్పం ఆవిష్కరణ సందర్భంగా సామాజిక సమతా సంకల్పం పేరిట మానవహారం కార్యక్రమం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జనవరి 23న విశాఖపట్నం రామా టాకీస్‌ వద్ద జరిగింది.జిల్లా రెవెన్యూ అధికారి మానవ హారంలో పాల్గొని, రాజ్యాంగ పీఠికపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం అంబేద్కర్‌ భవన్‌ వరకు కొనసాగిన సమైక్యత ర్యాలీలో పాల్గొన్న ఆయన డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ దంపతుల విగ్రహాలకు వివిధ కులసంఘాల నాయకులు, జిల్లా అధికారులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదుపరి అంబేద్కర్‌ భవన్‌ లో ఏర్పాటు చేసిన డా.బి.ఆర్‌. అంబే ద్కర్‌ చిత్ర పటానికి పూలమాలను వేసి జ్యోతి ప్రజ్వలనతో సామాజిక సమతా సంకల్పం చైతన్య కార్యక్రమాన్ని డీఆర్వో పారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమ సమాజ స్థాపన కోసం అంబేద్కర్‌ చేసిన కృషి, పోరాటం భావి తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఆయన స్ఫూర్తిని వాడవాడలా తీసుకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు గుర్తుచేశారు. నేడు అనుభవి స్తున్న స్వేచ్చా వాయువులను మనకు అందిం చేలా చేసిన మహోన్నత వ్యక్తి డా.బి.ఆర్‌. అంబేద్కర్‌ అని కొనియాడారు. సమసమాజ స్థాపన కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిద న్నారు. అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం భారత దేశానికి దిశా నిర్దేశం చేస్తుందన్నారు. ఆయన రూపకల్పన చేసిన రాజ్యాంగం ఏ దేశంలో లేదని, అటు వంటి రాజ్యాంగాన్ని పరిరక్షించు కోవలసిన అవసరం మనందరిపై ఉందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆర్డీవో హుస్సేన్‌ సాహెబ్‌ మాట్లాడుతూ అంబేద్కర్‌ ఆశయాలను ముందుకు తీసుకు వెళ్ళాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన భావజాలాన్ని ప్రజలకు అందించాల్సిన బాధ్య త అందరిపై ఉందని తెలిపారు. కార్యక్ర మం అనంతరం వెంకటరావు సమర్పిం చిన ఇంటిం టా రాజ్యాంగం పుస్తకాలను,అండ మాన్‌ కు చెందిన బతుకుల అప్పారావు సమర్పించిన అంబేద్కర్‌ జీవిత చరిత్ర పుస్తకాలను ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి పంపిణీ చేశారు.ప్రముఖ వక్త, యూపీఎస్సీ మెంబర్‌, ద్రవిడ యూనివర్సిటీ విశ్రాంత ఛాన్సలర్‌ ఆచార్య కె.ఎస్‌. చలం అంబేద్కర్‌ అందించిన సామాజిక న్యాయం గురించి వివరించగా, ఏ.యు. ఆంత్రోపాలజీ హెచ్‌ఓ డి ఆచార్య సత్యపాల్‌ అంబేద్కర్‌ విద్యా విశేషాల ప్రాము ఖ్యతను తెలిపారు. ఏ.యు.పొలిటి కల్‌ సైన్స్‌ ప్రొ.డా.వీర్రాజు అంబేద్కర్‌ రాజ్యాంగం గురించి వివరంగా తెలియ జేశారు.ఈ సంద ర్బంగా ఏర్పాటు చేసిన బి.ఆర్‌. అంబేద్కర్‌ జీవిత విశేషాల ఛాయాచిత్ర ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్ర మాలు అహుతులను అలరించాయి. కార్యక్ర మంలో రాష్ట్ర రెల్లి కార్పొరేషన్‌, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్లు వి. మధు సూధనరావు, భాస్కర రావు, జీవీ ఎంసీ అడిషనల్‌ కమిషనర్‌ శ్రీనివాసరావు, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు కె. రామారావు,డీఎల్డీవో ఆర్‌.పూర్ణిమాదేవి, డీఈఓ చంద్రకళ, డీవీఎంసీ మెంబర్లు బొడ్డు కళ్యాణరావు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. – గునపర్తి సైమన్‌

1 17 18 19 20 21 75