అభివృద్ధి పేరుతో అప్పులు ఎవరి కోసం?

ఆర్థికాభివృద్ధికి లోటులేదు. మన వనరులు ఆదాయం ఆంద్రోళ్లుకొల్లగొట్టారని మనకు తిప్పలు.. ఇలా తెలంగాణ గూర్చి గొప్పలు చెప్పారు. నిజమే తెలంగాణ గూర్చి కేసీఆర్‌ చెప్పిందంతా నిజమే. అయితే, తెలంగాణ వచ్చిన తర్వాత రెండు లక్షల కోట్లకు అప్పు ఎలా పెరిగింది? ఆదాయం తగ్గిందిలేదు. పైగా పెరిగింది. హైదరాబాద్‌ ఆదాయం నలుబది శాతం మద్యం ఆదాయం, ఇరువై శాతం ఉంటుంది. అప్పుల భారతాన్ని, ఈ అప్పుల రాష్ట్రాన్ని ఆ ఊబి నుంచి ఎవరు బయటపడేస్తారు? లక్షల కోట్ల అప్పు ఎలా తీరుస్తారు? ఇన్ని లక్షల కోట్ల అప్పులు ఎందుకు చేసినట్టు? ఏ అభివృద్ధి పేరుతో ఎవరు తిన్నట్టు? ఎన్నో వనరులున్న భారతదేశ అభివ ృద్ధికి అప్పులు అవసరమా? అప్పులు చేసి అభివృద్ధి చేయాలా? లక్షల కోట్ల అప్పులున్న దేశాన్ని అభివ ృద్ధి చెందిన దేశంగా ఎలా శ్లాఘించగలం? అన్నీ ప్రశ్నలే..?
అభివృద్ధి పేరుతో జరిగిన లక్షల కోట్ల అప్పు కనిపిస్తోంది తప్ప అభివ ృద్ధి కనిపిస్తుందా? ఎక్కడ కనిపిస్తుంది? ఎవరి అభివ ృద్ధి కనిపిస్తుంది? ఇన్నిన్ని కోట్ల అప్పు చేస్తే మిగిలిందేమిటీ? పేదలపాలిట కన్నీళ్లు.. మరి ఇన్ని లక్షల కోట్ల అప్పు ఎవరికొరకు చేసారు? ఎందుకు చేసారు? అప్పుమూలంగా ఎవరు లాభపడ్డారు? అభివృద్ధి కనిపించదు. అప్పు కనిపిస్తుంది ఎందుకు?
అప్పు నిజం.. అభివ ృద్ధి అబద్ధం. ఇదీ మనదేశస్థితి… ఇదీ మన తెలంగాణ స్థితి. అన్నీ ఉండి అప్పులు చేసి.. అభివృద్ధి చేస్తామని గొప్పలు చేప్పుకోవటం ఇప్పటి ప్రభుత్వాలకు అలవాటయ్యింది. ఈ అభివ ృద్ధికి అప్పు చేసామంటే ఒక అర్థముంది. ఆ అభివృద్ధి కనిపించాలి. ఈ ప్రాజెక్టుకు అక్కడి నుంచి ఇక్కడి నుంచి ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తెచ్చామంటే ప్రజలు అర్థం చేసుకుంటారు. అన్నీ ఉండి సరిపోయే ఆదాయముండి లక్షల కోట్లు అప్పు చూపిస్తే ప్రజలేమనుకుంటారు? అభివృద్ధి పేరుతో అప్పు తెచ్చి.. తమ ఆస్తులు పెంచుకున్నారని.. కోట్ల రూపాయలు దోచుకొని, దాచుకున్నారని భావిస్తారు. వాస్తవం కూడా ఇదే!
పాలకుల మీద రాజకీయ నాయకుల మీద నిందలు వేయటం సరదాకాదు. నిజానికి ప్రజలు పాలకులు, రాజకీయ నాయకులు స్వచ్ఛందంగా, ఆదర్శంగా, కడిగిన ముత్యంలా ఉండాలని భావిస్తారు. ‘’మేము ఓటువేసి గెలిపించాం కానీ దొంగైతేలిండు అని చెప్పుకోవటం ప్రజలకు కూడా అవమానమే. అభివృద్ధి పేరుతో జరుగుతున్న వేల కోట్ల అవినీతి గూర్చి నేను రాయటం, మీరు చెప్పటం కాదు, ‘రాజకీయ పక్షాలే ఒకరి నొకరు ‘నీవు దొంగ నీవు దొంగ’ అని తిట్టుకుం టున్నాయి. రాళ్లు వేసుకుంటున్నాయి. దేశంలోని అత్యున్నత నేర పరిశోధనా సంస్థ సీబీఐలోని ప్రధమ ద్వితీయ అధికారులే ఒకరినొకరు అవినీతి పరులని ఆడిపోసుకుంటున్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భావం జరిగే సమయానికి తెలంగాణ రాష్ట్రం అప్పు యాబదివేల కోట్లు. మన రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్‌ పరిపాలనలో ఏడాది క్రితం తేలిన తెలంగాణ రాష్ట్ర అప్పు రెండు లక్షల కోట్లు.. ఇప్పుడు పత్రికల కథనాల ప్రకారం రెండు లక్షల ముప్పది వేల కోట్ల అప్పు… ఇంత అప్పు తెలంగాణ ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? చేసిన అప్పు అభివ ృద్ధిలో కనిపించాలి. కనిపిస్తుందా? రెండు లక్షల ముప్పదివేల కోట్లు అంటే మామూలు మాట కాదు. ఎందుకు చేసినట్టు? తెలంగాణలో ఏఅభవృద్ధి కనిపిస్తుంది? అప్పులతో కూడిన అభివృద్ధి సంత ృప్తికలిగించదు. అభివృద్ధి కనిపించినా కొంత సంత ృప్తి కనిపిస్తుందేమో.‘అభివృద్దే’ కనిపించక పోతే…ఏ రాష్ట్రానికి ఎంత అప్పు ఉందో తెలియదు కానీ, నూతన తెలంగాణ రాష్ట్ర అప్పు రెండు లక్షల ముప్పదివేల కోట్లు. తెలంగాణ రాష్ట్ర జనాభా ఎంత? నాలుకోట్లని కొందరంటారు. మనిషికి.. అంటే తలకు ఎంత అప్పు? అరువదివేల అప్పు.. భయం వేయటం లేదూ..? తెలంగాణ కొత్త రాష్ట్రాన్ని తెచ్చుకొని.. మన రాష్ట్రాన్ని మనం పాలిస్తున్న తృప్తిలో రెండు లక్షల ముప్పదివేల కోట్ల అప్పు పెంచుకున్నాం. అవసరమా? అవసరమైన అప్పుగా భావించాలా? ఈ లెక్కలు ఇలా ఉండగా.. భారతదేశ అప్పు 50 లక్షల కోట్లు అని ఎక్కడో చదివింది జ్ఞాపకమొచ్చింది. నిజమా? అబద్దమా? లెక్క తేలటానికి అవకాశం లేదు. రకరకాల అప్పులుంటాయి కాబట్టి లెక్క తేలటం కష్టం.. సమాచార హక్కు క్రింద ఈ లెక్కలు యివ్వకపోవచ్చు.. రాష్ట్రాలు సంస్థలు.. స్వయం ప్రతిపత్తి గల రాజ్యాంగం కాబట్టి లెక్క కష్టమే.. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ‘పరిశ్రమల’ పేరుతో ఉపాధి పేరుతో బిచ్చగాళ్లలాగా ప్రపంచం చుట్టూ తిరుగుతూ ఉంది. ఎవరిచ్చారు అధికారం? అప్పుల పేరుతో అభివ ృద్ధి పేరుతో ఎవరు దోచుకున్నారు? ఎవరు సంపన్నులయ్యారు? అప్పులు లక్షల కోట్లు కనిపిస్తున్నాయి. ప్రజలు నిరుపేదలుగా ఉన్నారు. ఎవరు అభివృద్ధి చెందినట్టు? రాఫెల్‌ అవినీతిలో 30వేల కోట్ల అవినీతి ఉందని దేశం సంపద అనిల్‌ అంబానీ జేబులోకి వెళ్లిందని కాంగ్రెస్‌ నేత రాహూల్‌ లెక్కలతో చెపుతున్నారు. బడా వ్యాపారులు బ్యాంకులను ముంచిన సొమ్ము పన్నెండు లక్షల కోట్లు. ఇట్టి డబ్బు ఏదో రూపంలో ప్రభుత్వం బ్యాంకులకు యివ్వాలి. ఒకవేళ బ్యాంకులను నింపకపోతే.. బ్యాంకులు దివాలా తీస్తాయి. బ్యాంకులకు నింపాలంటే ఎలా? ఘనమైన భారత సర్కారు అప్పు చేయవల్సిందే… లేకపోతే పన్నులు పెంచాలి.. లేకపోతే పెట్రోల్‌ డిజీల్‌పై మరో పది ఇరువది దోచుకోవాలి.. ఇదే భారతదేశ అభివృద్ధి. ఇన్ని లక్షల కోట్ల అప్పు ఎందుకయింది? దేశంలో ఉన్న 80శాతం పేద ప్రజలు, శ్రమజీవులు బాగుపడ్డారా? దేశం ప్రధాన ఉత్పత్తి, జీవనాధారం వ్యవసాయం. రైతులు బాగుపడ్డారా? ఇప్పటికీ దేశవ్యాప్తంగా వేల మంది రైతులు అప్పులతో మరి ఆత్మహత్య చేసుకుంటున్నారు.ఏఅభివృద్ధికి ఈ అప్పులు? భారతదేశం ఎన్నో వనరులున్న దేశం.. ఎన్నో సంపదలున్న విశాల భారతదేశం. మానవశక్తి విపరీతంగా ఉన్న దేశం. డెబ్బది ఏండ్ల స్వాతంత్య్రంలో యాబది కోట్ల లక్షల అప్పు చేసిన ఘనత మన ప్రజాస్వామ్య పరిపాలకులది. ఆంగ్లేయ పాలకులు దేశ సంపదను దోచుకొని ఇంగ్లాడు పంపిస్తే.. మన స్వాతంత్య్ర ప్రజాస్వామ్య పాలకులు లక్షల కోట్లు అప్పులు చేసి అభివ ృద్ధి పేరుతో కార్పొరేట్‌ సామ్రాజ్యాన్ని విపరీతంగా పెంచారు. ఆర్థిక అసమానతలకు తెరదీసారు.
నిజానికి భారతదేశానికి 50 లక్షల కోట్లు అప్పు ఎందుకయ్యిందో అర్థం కాదు. ఏ అభివృద్ధి జరిగిందో అర్థం కాదు. ఉద్యోగాల కల్పన లేదు. కొత్త నిర్మాణాలు లేవు. ఎవరితో యుద్ధం లేదు. అందరూ జీతాలు రెట్టింపు చేసుకోవటం తప్ప కొత్త ఉద్యోగాలు లేవు. ఆదాయం విషయంలో గతం కంటే రెట్టింపు కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి రకరకాల ఆదాయం పెరిగింది. పెట్రోల్‌ డీజిల్‌ రెట్టింపు రేట్ల అమ్మకం ద్వారా లక్షల కోట్ల ఆదాయం పెరిగింది. పైగా కొత్తగా బొగ్గు, మైనింగ్‌ ద్వారా, ఇంటర్నెట్‌ సేవల మూలంగా లక్షల కోట్ల ఆదాయం పెరిగింది. ప్రభుత్వ ప్రతిష్టాత్మక పన్నుల చట్టం జీఎస్‌టీ ఆదాయం ఉండనే ఉంది! మరి ఈ ఆదాయమంతా ఏమైనట్టు? లక్షల కోట్ల అప్పులు ఎందుకు అయినట్టు? ప్రతి ఏటా ఇరువది లక్షల పైన బడ్జెట్‌? ఎవరు తింటున్నట్టు? తెలంగాణ ఉద్యమంలో ఇదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ పదేపదే అన్నారు. తెలంగాణకు వనరులు న్నాయి. నదులున్నాయి. పచ్చని పొలాలున్నాయి. ఆర్థికాభివృద్ధికి లోటులేదు. మన వనరులు ఆదాయం ఆంద్రోళ్లుకొల్లగొట్టారని మనకు తిప్పలు.. ఇలా తెలంగాణ గూర్చి గొప్పలు చెప్పారు. నిజమే తెలంగాణ గూర్చి కేసీఆర్‌ చెప్పిందంతా నిజమే. అయితే, తెలంగాణ వచ్చిన తర్వాత రెండు లక్షల కోట్లకు అప్పు ఎలా పెరిగింది? ఆదాయం తగ్గిందిలేదు. పైగా పెరిగింది. హైదరాబాద్‌ ఆదాయం నలుబది శాతం మద్యం ఆదాయం, ఇరువై శాతం ఉంటుంది. లక్షకోట్లు కేంద్రం నుంచి ఇచ్చామని అమిత్‌షా అన్నారు. రెండు లక్షల కోట్లకు అప్పు ఎందుకు పెరిగినట్టు?ఎవరు బోంచేసినట్టు?- – సిహెచ్‌.మధు

అడవిపై ఆదివాసీకి హక్కు ఎక్కడ?

అడవిని చట్టబద్దంగా పొందవలసిన ఆదివాసీలనూ వారి హక్కులనూ కాల రాశారు. అడవిపై ఆదివాసీల హక్కులు పూర్తి కాలరాయడంతో అనేక పరిణామాలు సంభవించాయి. అడవిలో ఉండే ఆదివాసీలను ఆక్రమణదారులుగా గుర్తించారు. అడవిలో జీవించటం, జీవనాధారాన్ని పొందటం నేరపూరిత చర్యగా భావించారు. దీనితో ఆదివాసీలలో అభద్రతా భావం మొదలైంది! ఏజెన్సీలో ఈ విధంగా జరుగుతుండటంతో పోషకార లోపంతో, ఆకలి చావులతో ఆదివాసీలు చనిపోవడం నిత్యక ృత్యం అయింది. దీనితో నిర్వాసితం అనేది ఆదివాసీల జీవితంలో ఒక భాగం అయిపోయింది. దాదాపుగా 60శాతం పైగా షెడ్యూల్డ్‌ ప్రాంత భూములు అటవీశాఖ ఆధీనంలో ఉన్నాయి. జీవనాధారానికి కొద్ది భూభాగం మాత్రమే ఆదివాసీలకి దక్కింది. ఏజెన్సీలో 50శాతం పైగా భూములు ఆదివాసేతరుల చేతిలో ఉన్నాయి.వూకె రామకృష్ణ దొర
తరతరాలుగా ఆదివాసీలు అడవులతో మమే కం అయిపోయి అవినాభావ సంబంధంలో జీవనాన్ని గడుపుతున్నారు. అడవుల నుండి పండ్లు, దుంపలు, మూలికలు ఇతర ఆహార పదార్థాలను సమకూర్చుకుంటున్నారు. ఆదివాసీలు ఆర్థిక వ్యవస్థ అంతా అడవులపైనే ఆధారపడి ఉంటుంది. కేవలం ఆర్థిక వ్యవస్థే కాదు సామాజిక, సాంస్క ృతిక, సంప్రదాయ మత జీవనాలు కూడా అడవులతోనే ముడిపడి ఉంటాయి.
ఆదిమకాలం నుంచి అడవులను ఆదివాసీలు యథేచ్ఛగా ఉపయోగించుకుంటున్నారు. ఆదివాసీ ప్రాంతాలలోకి బ్రిటీషు వారి ప్రవేశంతో సమస్యలు తలెత్తాయి. బ్రిటీషు పాలకులు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి భూమికి శిస్తు వసూలు చేయడం ప్రారంభించారు. వనరులను తమ ఆదాయన్ని పెంచే సాధనాలుగా గుర్తించి అడవులనూ అమ్ముకోవచ్చు అనుకున్నారు.
అందుకనే ఆదివాసీలనూ అడవి నుంచి తరిమి వాటిని తమ సొంత ఆస్తిగా మార్చుకోవడానికి అటవీ హక్కుల విధానాలనూ రూపొందించి అడవులపై తన అధికార పరిధిని పెంచుకుంటూ దోపిడి చేయటం ప్రారంభించారు. అనాదిగా అడవులు తమకి చెందినవని భావిస్తున్న ఆదివాసీల పట్ల అటవీ విధానాలు ఆశనిపాతాలయ్యాయి. అడవికి ఆదివాసికి మధ్య అగాధాన్ని పెంచాయి.
1894లో మొదటిసారిగా బ్రిటీషు ప్రభు త్వం అటవీ హక్కుల విధానాన్ని ప్రకటించింది. దీనితో అటవీ శాఖ వెలుగులోకి వచ్చింది. అప్పటి నుండి క్రమంగా ఆదివాసీలపై ప్రభుత్వ అధికారం మొదలయ్యింది. భారతదేశ స్వాతంత్య్ర అనంతరం ప్రభుత్వం 1952లో నూతన అటవీ విధానాన్ని తీసుకవచ్చింది. దీనిలో ఆదివాసుల హక్కులు రాయితీల స్థానానికి దిగజారిపోయాయి.
1894 అటవీ విధానానికి భిన్నంగా 1952 అటవీ విధానంలో మొత్తం అటవీప్రాంతానికి ఒకేపద్ధతి అవలంభించారు. ఈచట్టంతో అడవి భూమిని వ్యవసాయ భూమిగా మార్చడం అంగీకరించారు. పచ్చిక బయళ్ళనూ అడవుల్లో పశువులకూ ఉచితంగా మేపుకునే స్వేచ్ఛనూ ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చారు.
1952లో జాతీయ అటవీ విధానం అడవులనూ వ్యాపారానికి వాడుకునేందుకు అనువైన పరిస్థితిని రూపొందించింది. ఈ విధానమే ఆదివాసీలను అడవికి పరాయివాళ్ళను చేసింది. పారిశ్రామిక అవసరాలకు అడవులను నరకకుండా ఆపలేకపోయారు. 1980లో అటవీ సంరక్షణ చట్టం తీసుకవచ్చారు. ఈచట్టం ఆదివాసుల జీవనాన్ని భవిష్యత్‌నూ మరింత ప్రమాదంలోకి నెట్టింది.
భారత అటవీ సంరక్షణ చట్టం ద్వారా మానవ సంచారం లేకుండా ఉండే అటవీ ప్రాంతాలుగా అడవిని పునర్నిర్వించడం జరిగింది. అడవిలో ఉండే ఆదివాసీలను ఆక్రమణదారులుగా గుర్తించారు. చట్టబద్ధంగా పొందవల్సిన అటవీ ప్రాంత ఆదివాసీల హక్కులు పూర్తిగా కాలరాయబడ్డాయి. అడవిని రిజర్వ్‌ చేసే క్రమంలో ఆదివాసీ గ్రామాలు, భూములు రిజర్వులలో కలిసిపోయాయి.
అటవీశాఖ ఏకపక్షంగా, గిరిజన సంక్షేమ శాఖ, రెవిన్యూ శాఖల మధ్య సమన్వయంతో భూములు సర్వే చేయకుండానే అనేక సాగుభూములనూ ‘రిజర్వ్‌’ గా నోటీపై చేసింది. అటవీ చట్టం ప్రకారం ఆదివాసీలు తమ సొంత భూమిలోనే ఆక్రమణదారులుగా గుర్తించబడ్డారు. అడవి, ఆదివాసులకి మధ్య మరింత దూరం పెరిగింది.
ఆదివాసీ ప్రజలకు అడవికి ఉన్న సంబంధాన్ని వారి సంప్రదాయ హక్కులనూ, అవసరాలనూ కాపాడాలని 1908లో భారత అటవీ విధానం గుర్తిం చింది. దానికి అనుగుణంగా 1990 సెప్టెంబర్‌ 18న కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ: 13-1/90 ఎఫ్‌పి 1,2,3,4,5 అనే సర్క్యులర్స్‌ జారీ చేసింది. అవి ఇప్పటి వరకు అమలు జరుగలేదు.
1996లో పంచాయితీరాజ్‌ షెడ్యూల్‌ ప్రాంతాల విస్తరణ చట్టం ద్వారా ప్రభుత్వం ఆదివాసీ ప్రాంతాల్లోని అటవీ వనరులపై ఆదివాసీలకే అధికారం ఉంటుందని అంగీకరించింది. అయితే ప్రభుత్వమే దానిని ఉల్లఘించి నిర్లక్ష్యం చేసింది. 1947లో అధికార మార్పిడి జరిగిన తరువాత రిజర్వు ఫారెస్ట్‌గా వర్గీకరించేటప్పుడు ఆదివాసుల భూములనూ, ఉమ్మడి భూముల్ని హక్కుల్ని నిర్ధారించకుండానే సెటిల్‌ చేయకుండానే అడవులుగా ప్రకటించారు. ఆదివాసీల సెటిల్‌మెంట్‌ హక్కుల గురించి పట్టించుకోలేదు. 1952 నాటి జాతీయ అటవీ విధానంను భారత ప్రభుత్వం సవరించి 1980 అటవీ సంరక్షణ చట్టం ద్వారా అడవి హక్కులపై భారత ప్రభుత్వానికి పూర్తి ఆదిపత్యం వచ్చింది. ఎవరైతే వ్యాపార పరంగా అడవులను ఆదివాసీలనూ దోచుకున్నారో ఆవర్గాల నుండి వచ్చిన వారే అడవి రక్షకులుగా మారి అడవులనూ భక్షించారు.
అడవిని చట్టబద్దంగా పొందవలసిన ఆదివాసీలనూ వారి హక్కులనూ కాల రాశారు. అడవిపై ఆదివాసీల హక్కులు పూర్తి కాలరాయడంతో అనేక పరి ణామాలు సంభవించాయి. అడవిలో ఉండే ఆదివాసీలను ఆక్రమణదారులుగా గుర్తించారు. అడవిలో జీవించటం, జీవనాధారాన్ని పొందటం నేరపూరిత చర్యగా భావించారు.
దీనితో ఆదివాసీలలో అభద్రతా భావం మొదలైంది! ఏజెన్సీలో ఈ విధంగా జరుగుతుండటంతో పోషకార లోపంతో, ఆకలి చావులతో ఆదివాసీలు చనిపోవడం నిత్యక ృత్యం అయింది. దీనితో నిర్వాసితం అనేది ఆదివాసీల జీవితంలో ఒక భాగం అయిపోయింది.
దాదాపుగా 60శాతం పైగా షెడ్యూల్డ్‌ ప్రాంత భూములు అటవీశాఖ ఆధీనంలో ఉన్నాయి. జీవనాధారానికి కొద్ది భూభాగం మాత్రమే ఆదివాసీలకి దక్కింది. ఏజెన్సీలో 50శాతం పైగా భూములు ఆదివాసేతరుల చేతిలోఉన్నాయి.
రచయిత : తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ రచయితల సంఘం అధ్యక్షుడు, 9866073866

మహనీయ.. ‘స్వామి వివేకానంద’

‘‘స్వామి వివేకానంద ప్రసంగాలను, రచనలు నేను క్షుణ్ణంగా చదివాను, ఆ తరువాత నా దేశభక్తి వేయి రెట్లు అయింది. యువకుల్లారా! ఆయన రచనల చదవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను’’ అని మహాత్మాగాంధి అన్నారు. వివేకానందుడు రామకృష్ణ మఠం స్థాపించి ‘‘పేదలకు, వెనుకబడ్డ వారికి సేవ చేయడం దీని ప్రధానోద్దేశాలలో ఒకటి‘ అని ఉద్భోదించి భారతీయ యువతకు దిశానిర్దేశం చేశారు. భారతదేశాన్ని పురోగమింప చేయడానికి సంఘ సంస్కరణలు అవసరమని సమాజ నేతలు అనేకులు నొక్కివక్కాణించిన సమయంలో, భారతదేశ పతనానికి ఉన్నత వర్గం వారు పేదలను బహిష్కరించడము, దోపిడీకి గురిచేయడమూ మొదటి కారణమని ఘోషించిన మొదటి నేత స్వామి’’ – డా. దేవులపల్లి పద్మజ
ఉన్నతమైన ఆశయాలు ఏదో ఒకరోజు సర్వజనాంగీకారాన్ని పొందుతాయి. కారణం ఆ భావనలు, ఆశయాలు ప్రతి కార్యరంగంలోనూ, ప్రతీఆలోచనా విధానంలోనూ ఉత్తేజం కలిగించేవి కాబట్టి. కాషాయాంబరాలు ధరించి, పద్మాసనస్థులై, ఒకదాని మీదమరొకటిగా కరకమలాలను ఒడిలో ఉంచుకుని, అర్థనిమీలనేత్రులై ధ్యానమగ్నులై వివేకమంతమైన ఆనందం అనుభవించే స్వామి వివేకానంద లోకానికి ప్రకాశానిచ్చే ఒకజగద్గురువు. సామాజికసృహతో కూడిన ఆధ్యాత్మికతను ప్రజలకు ఉపదేశించడం, ఇంద్రియాతీత విష యాలను వివేకించటం ద్వారా ఆధ్యా త్మికసౌధాన్ని నిర్మించడం, ఆసౌ ధంలో చైతన్యమూర్తులుగా జనులను విరా జిల్లింప చేయటంస్వామి వివే కానంద అపురూప ఆశయం. విశ్వాసంతో నిరంతరాభ్యాసాన్ని చేస్తూ, మనసు పొరలలో నిభిఢీకృతమైన కొత్త విష యాలను అనుభవిస్తూ, క్రొంగొత్త శక్తులు వశీకరింపచేసుకుంటూ ఊహాతీత వ్యక్తిత్వాన్ని వికసింపచేసు కోవటానికి దివ్య ప్రేరణ స్వామి వివే కానంద. 1863వ సం.లో కలకత్తా నగరంలో జన్మించిన స్వామి వివే కానంద ఆరేళ్ళ ప్రాయంనుంచే అంత ర్ముఖ అన్వేషణలో మనసు లగ్నం చేసి ధ్యానంలో నిమగ్నుడై ఉండేవారు. జ్యోతిర్మయ ప్రకాశంలో జీవిస్తూ చిరుప్రాయంలోనే సృజనాత్మకత, ఆత్మ ప్రతిష్ట, ఆత్మప్రేరణలో దివ్యదర్శనాలు అనుభవించారు. ప్రకృతితో తాదాత్మ్యం చెంది ఆ చైతన్యంలో విరాజిల్లే అంతర్ముఖ చైతన్య స్వరూపుడు.‘‘నేను భగవంతుడిని నిన్ను చూస్తునంత స్పష్టంగా చూశాను, మతం అనేది అనుభూతి పొందవలసిన సత్యం, లోకాన్ని మనం అర్దం చేసు కోవటంకన్నా అనేక రెట్లు లోతుగా గ్రహించవలసిన విషయం’’ అని ప్రవచించే శ్రీరామకృష్ణ పరమహంస దివ్య సాన్నిధ్యంలో ఙ్ఞాన,కర్మ,భక్తి,యోగ మార్గాలలో కానరాని వెలుగు ఆస్వాదించి వారివచనాలను విపులీకరించి లోకాన్ని ఆశ్చర్యచకితులను చేసారు. పశుప్రాయులుగా జీవిస్తున్న వారిని మానవ స్థాయికి ఎదగచేయడమే ప్రధాన ధ్యేయంగా లోకాన్ని ఉద్ధరించిన మనీషి స్వామి వివేకానంద. చికాగోలో జరిగిన స్వామి ప్రసంగం బాహ్యంగా ఎగసిన ఉత్సాహ పుటలలోనే కాక, ఉద్వేగ ప్రవాహాలలోనే కాక, నరనరాల్లోకి చొచ్చుకుని పోయిన నూతన కాంతి పుంజం. దానిని గురించి ఒక్క మాటలో చెప్పటానికో, వ్రాయటానికో కుదిరేది కాదు. చికాగో ప్రసంగం స్వామి వివేకానందకు అమెరికాలో గుర్తింపు రావడమే కాదు, సాక్షాత్తు భారత దేశం కూడా గర్వించేలా చేసింది. అమెరికాలో ఎగసిన ఒక అల భారతదేశంలో సహస్ర తరంగాలను ఉత్పన్నం చేసింది. ‘‘నేను ఎవరిని? ఆసియా వాసినా? ఐరోపా వాసినా? అమెరికా వాసినా? ఈ వ్యక్తిత్వాల వింత సమ్మేళనాన్ని నాలో అనుభూతి చెందుతున్నాను’’ అనేవారు స్వామి. ప్రతి మతంలోని, ప్రతి సిద్ధాంతంలోని మంచిని గ్రహించి హృదయంలో దీప్తిస్తున్న ఆత్మజ్యోతిని అవలోకనం చేసుకుంటే సర్వమత ఏకత్వాన్ని దర్శించవచ్చని ప్రగాఢంగా నమ్మిన వ్యక్తి శ్రీవివేకానంద. హిందూమతాన్ని కించపరిస్తే సహించేవారు కాదు. దానిని తీవ్రంగా ప్రతిఘటించి హిందూ మత ఔన్నత్యాన్ని చాటిచెప్పేవారు. జీవితంలో అన్ని విషయాలపైన కఠోర నియమం, నిఘా అవసరం అని చెప్పే వారు. ‘‘ఆహార నియంత్రణ ముఖ్యంగా పాటించాలి. ఆహార నియం త్రణ లేకుండా మనస్సుని నియంత్రించటం సాధ్యం కాదు. అవసరం కన్నా ఎక్కువ తినడం అనేక హానులకు దారితీస్తుంది. మితిమీరి తినడం వలన మనశ్శరీరాలు చెడిపోతాయి’’ అనేవారు. ప్రేమ తత్వా న్ని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని సడలనీయవద్దని గట్టిగా ప్రభోదించేవాడు. మతం అనేది సిద్ధాంత రాద్ధాంతములతో లేదు అది ఆచరణలే ఆధ్యాత్మికులుగా పరిణతి చెందడంలో మాత్రమే వుంది అని విశ్వసిం చేవారు. వివేకానందను విదేశాలలో అనేకులు కుమారునిగా, సోదరు నిగా భావించారని మనం తెలుసుకున్నప్పుడు మనకు ఆయన పరిణతి కనిపిస్తుంది. భారతదేశంలో ఇటువంటి బాంధవ్యాలు కొత్త కాదు. విదేశాలలో ఇటువంటివి ఉత్పన్నమైనప్పుడు ఆయన వైఖరి విశిష్టత అర్థం అవుతుంది. జాతిమౌఢ్య, వర్ణ మౌఢ్యం విలయతాండవం చేసే రోజులలో అప్పట్లో బానిస దేశంగా పరిగణించే భారతదేశం నుండి వెళ్ళి అసంఖ్యాక మనసులను దోచుకోవడం గమనార్హం. అహిం సలో నెలకొనివున్న వ్యక్తి సాన్నిధ్యంలో వైరాలకు చోటులేదు. సత్య నిష్టుని సాన్నిహిత్యంలో అసత్యం నశించిపోతుంది. అందుకే అన్ని ఎల్లలను అతిక్రమించిన స్వామి వివేకానంద ఆత్మఙ్ఞానంలో సుప్రతి ష్టులై ఉండగా ఎలాంటి వివక్షత తలెత్తడం సాధ్యంకాదు. వివేకానంద ఆధ్యాత్మిక శక్తి గురించి విన్న విదేశీయులు ఆయనతో సన్నిహితంగా మెలగటానికి మక్కువ చూపేవారు. తాను జన్మించిన కుటుంబాన్ని పరిత్యజించి ప్రపంచమనే పెద్ద కుటుంబాన్ని స్వీకరించారు. భారత దేశం కూడా తక్కిన దేశాలతో పాటు అభివృద్ధి పొందగోరితే పేదలు, పామరులు పురోగనమం చెందాలి. అందుకే పేదలకు కూడా విద్య గరపమని ఆయన నొక్కి వక్కాణించారు. భారతదేశపు గౌరవ మర్యాద లను విదేశాలలో ఇనుమడిరపచేయటానికి అహర్నిశలు కృషి చేశారు. అప్పటికే ప్రచారంలోవున్న భారత వ్యతిరేకతను తొలగించటానికి నడుం బిగించారు. భారతీయ ఆధ్యాత్మికతలోని వివిధ పరిణామాలు ఆయన ఉపన్యాసాలలో ప్రధానాంశాలు అయినప్పటికి, ప్రతి ప్రసంగంలోనూ మన వాస్తవిక చిత్రాన్ని ఆవిష్కరించేవారు. మతాల మధ్య వ్యత్యాసాలు ఉండపచ్చు కాని వాటి మధ్యగల సామాన్య మౌలికతను గుర్తించమని చెప్పేవారు. హైందవుల శాంతి కాముకత్వాన్ని తన అహింసా తత్వం తో వెల్లడిచేసేవారు. శక్తివంతమైన ఈభారతదేశం ప్రపంచాన్ని జయి స్తుంది. అందుకే ‘‘ఓ భారతమా! నీ ఆధ్యాత్మికతతో ప్రపంచాన్ని జయించు!’’ అంటూ స్వామి సింహనాదం చేసేవారు. ప్రశాంతత, పవిత్రత, త్యాగశీలత, సౌభ్రాతృత్వాల సందేశాలను వివరించి సహన రహిత చెవిటి చెవులలో ప్రతిధ్యనులు ఉద్భవింపచేయటంలో విజ యం సాధించారు. దుస్తరమైన అద్వైతాన్ని కళాత్మకమైనదిగానూ, సజీవమైనదిగానూ వర్ణించారు. భయం కలిగించే యోగ సంప్రదా యాలను అత్యంతశాస్త్రీయంగానూ, ఆచరణ యోగ్యంగానూ వివరించే మానసిక శాస్త్రంగా వివరించేవారు. సత్యమనేది మతానికి ఆపాదిం చటం మూర్ఖత్వం అని చెప్పేవారు. విదేశాలలో ధీరగంభీరత్వంతో ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని సత్యంవైపు అడుగులు వేసారు. మనలో నిద్రాణమైవున్న శక్తిని తట్టిలేపిన మహనీయుడు. ‘‘మన జాతీయ ఆత్మ న్యూనతాభావ జాఢ్యాన్ని వదిలించుకునేలా చేసిన వ్యక్తి వివేకానంద’’ అని రాజాజీ పేర్కొన్నారు. వివేకానందుని లేఖలు భారతీయులలో దాగివున్న శక్తిని వెలువరించి చింతనను జాగృతం చేసాయి. లేఖల మూలంగానే తమ భారతీయ మహత్కార్యాన్ని ప్రారం భించారు. భగవదనుగ్రహం వలన పావనత సంతరించుకున్న మనస్సులలో ఉద్భవించిన చింతనలే లోకాన్ని కదిలించి వేస్తాయ నటంలో అతిశయోక్తిలేదు. వివేకానందుడు నిరంతరం మననం చేసు కునే కఠోపనిషత్తులోని శ్లోకం
న తత్ర సూర్యోభాతి న చంద్రతారకం
నేమా విద్యుతో భాంతి కుతో2యమగ్నిః !
తమేవ భాంతమనుభాతి సర్వం
తస్వభాసా సర్వమిదం విభాతి !!
‘‘అక్కడ సూర్యుడు ప్రకాశించడు. చంద్ర తారకలు అసలే ప్రకాశించవు. మెరుపులు కూడా మెరవవు. ఇక ఈఅగ్ని మాట ఎందుకు! ఆత్మ ప్రకాశిస్తూ ఉంటే అన్నీ దానిని అనుసరించి ప్రకాశిస్తాయి. దాని వెలుగుతోనే ఇదంతా వెలిగింపబడుతున్నది.’’
‘‘స్వామి వివేకానంద ప్రసంగాలను, రచనలు నేను క్షుణ్ణంగా చదివాను, ఆతరువాత నాదేశభక్తి వేయి రెట్లు అయింది. యువకు ల్లారా! ఆయన రచనల చదవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను’’ అని మహాత్మాగాంధి అన్నారు. వివేకానందుడు రామకృష్ణ మఠం స్థాపించి ‘‘పేదలకు, వెనుకబడ్డ వారికి సేవ చేయడం దీని ప్రధానోద్దేశాలలో ఒకటి‘ అని ఉద్భోదించి భారతీయ యువతకు దిశానిర్దేశం చేశారు. భారతదేశాన్ని పురోగమింప చేయడానికి సంఘ సంస్కరణలు అవసరమని సమాజ నేతలు అనేకులు నొక్కివక్కాణించిన సమయంలో, భారతదేశ పతనానికి ఉన్నత వర్గం వారు పేదలను బహిష్కరించడము, దోపిడీకి గురిచేయడమూ మొదటి కారణమని ఘోషించిన మొదటి నేత స్వామి. తన 33 ఏళ్ళ వయసులోనే మరణించి భారతదేశాన్నే కాకుండా యావత్తు ప్రపంచాన్ని అనాధలుగా మార్చివేశారు. మనలో ధైర్యం సడలి, దౌర్భల్యం ఆవహిస్తే ‘‘నేను ధీరుణ్ణి, వీరుణ్ణి, కామినీ కాంచనాలను నిర్జించిన శ్రీరామకృష్ణుల శిష్యుణ్ణి నేను’’ అనే భావనలు మనసులో నింపుకుంటే సమస్త దౌర్భల్యాలు, అధైర్యము మటుమాయమయుతాయి అని సర్వులకు ప్రభోదించేవారు. శ్రీవివేకానందుని జన్మదినం పురస్కరించుకుని భారతప్రభుత్వం ‘‘జాతీయ యువజన దినోత్సవం’’గా ప్రకటించింది. ‘‘జనన మరణాలు సహజం, కాని నా భావనలు మావవాళికి కొంతవరకైనా అందించగలిగితే నా జీవితం వ్యర్థం కాలేదనుకుంటాను’’ అన్న స్వామి వివేకానందుని జీవితం ప్రతిఒక్కరికి ఆదర్శప్రాయం, సర్వదా ఆచరణీయం. రచయిత :ఆంధ్రాయూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఫోను. 9849692414

రాష్ట్రాన్ని వెంటాడుతున్న ప్రకృతి విఫత్తులు

ఏదోక ప్రాంతంలో తుఫాన్లు వెంటాడుతున్నాయి. కోస్తాంధ్ర, తీరాలను పెథాయ్‌ తుపాను వణికించింది. అక్టొబరులో తిత్లీ, డిసెంబరు 15న పిథాయ్‌, గత ఏడాదిలో గజ, 2014లో హూదూద్‌..ఇలా ఆంధ్రప్రదేశ్‌లో నిత్యం ఏదో ఒకప్రకృతి విపత్తు భయపెడుతూనే
ఉంది.- గునపర్తి సైమన్

‌రాష్ట్రంలో తుపాన్లు వెంటాడుతున్నాయి. ఏపీలో మూడు, నాలుగు నెలలకోసారి వచ్చి పలకరిస్తున్నాయి. రాష్ట్రంలో ఏదో ఒక చోట తుపాను తన ప్రతాపాన్ని చూపుతోంది. మొన్న తిత్లీ, నిన్న గజ, నేడు పెథాయ్‌.. ఇలా వరుసగా తుపాన్లు వస్తూనే ఉన్నాయి. తిత్లీ తుపానుతో శ్రీకాకుళం అతలాకుతలం కాగా, గజ తుపాను మరికొన్ని జిల్లాలను గజగజ వణికించింది. తాజాగా పెథాయ్‌ కూడా హాయ్‌ అని పలకరించింది. తుపాను తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ- రాజోలు మధ్య తీరం దాటి తన ప్రభావాన్ని తగ్గించుకుంది. అయితే తుపాను ధాటికి ఆ జిల్లా అతలాకుతలమైంది. భారీగా వీచిన గాలులు, జోరుగా కురిసిన వర్షంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. రోడ్డు రవాణా నిలిచిపోయింది. విద్యుత్‌ స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి. జిల్లా వ్యాప్తంగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తీర ప్రాంతాల్లో తుపాను ప్రభావం ఎక్కువగా కనిపించింది.
2014లో హుదూద్‌.. 2018లో తిత్లీ తుపాన్లు ఉత్తరాంధ్రను వణికించాయి. అక్టోబరు, నవంబరు తుపాన్ల సీజన్‌లో మళ్లీ తుపాను వస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర వాసులు హడలిపోతున్నారు. సర్వం కోల్పోయి రోడ్డున పడుతున్నారు. హుదూద్‌ మిగిల్చిన విషాదం నుంచి తేరుకోని కుటుంబాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. తాజాగా తిత్లీ తుపాను శ్రీకాకుళం, విజయనగరంల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో పంట పొలాలు, కొబ్బరి, జీడి, నివాసాలు, పశువుల పాకలు ఇలా అన్నింటినీ తుడిచిపెట్టింది. పది రోజులు దాటినా శ్రీకాకుళం ప్రజలకు తాగునీరు, విద్యుత్‌, ఆహారం వంటివి పునరుద్ధరించలేదు. అదే విధంగా డిసెంబరు 15న సంభవించిన పిథాయ్‌ తుఫాన్‌ ఉభయగోదావరి,కృష్ణ, కోస్తాతీరప్రాంతంలోని వ్యవసాయాన్ని విచ్ఛన్నం చేసింది. లక్షలాది ఎకరాల్లో చేతకందిన పంటలు నీటమునిగి సర్వనాశనమయ్యాయి. దీంతో కోట్లాది రూపాయల పంటనష్టం వాటిల్లింది. ఎంతోమంది రైతులు, రైతుకూలీలు మృత్యువాత పడ్డారు.
తుపాను బారిన పడిన వారిని ఆదుకోవడంలో అలసత్వం వహిస్తున్న ప్రభుత్వాలు నష్ట నివారణకు చర్యలు తీసుకోవడం లేదు. పైగా అపారనష్టం కలిగేలా తీరాన్ని ధ్వంసం చేసే విధానాలకు తెరతీస్తున్నాయి. తుపాన్లను ఎటూ అడ్డుకోలేం. కనీసం అవి కలిగించే నష్టాన్ని తగ్గించేందుకు తీర ప్రాంతాల్లో 500 మీటర్ల వరకూ మడ అడవులను పరిరక్షించాలి. ఉన్నవాటిని నరికేయకుండా ఉండటం, లేని చోట వాటిని పెంచడం వల్ల తుపాన్లు తీరాలను తాకేటప్పుడు సముద్రం నుంచివచ్చే తీవ్ర, పెనుగాలల వేగాన్ని అడ్డు కుని కొబ్బరి చెట్లు, నివాసాలు, ఇతరత్రా కూలిపోకుండా మడ అడవు లు రక్షిస్తాయి. వీటిని ద ృష్టిలో పెట్టుకునే 2011లో కేంద్ర అటవీ, పర్యావరణ, సాంకేతిక మంత్రిత్వశాఖ తీరప్రాంత నిర్వహణ (సిఆర్‌ జెడ్‌) పేరుతో పలు నిబంధనలను రూపొందించింది. అధిక పోటు పాటు (హెచ్‌టిఎల్‌) నుంచి 500 మీటర్ల వరకు పక్కా నిర్మాణాలు చేపట్టరాదని చట్టం చేసింది. అయినా కూడా ఫార్మా కంపెనీలు, హోటల్‌ యజమాన్యాలు వాటిని ఉల్లంఘించి ఎప్పటికప్పుడు కేంద్ర పర్యావరణ అటవీ శాఖ నుంచి జిఒలు పొంది యథేచ్ఛగా కట్టడాలు నిర్మిస్తున్నాయి. తాజాగా కేంద్రం ఆదేశాలతో ఎపికోస్టల్‌ జోన్‌ మేనేజ్‌ మెంట్‌ ప్లాన్స్‌ (సిజెడ్‌ఎంపి) ప్రకారం హెచ్‌టిఎల్‌ నుంచి 500 మీటర్ల వరకు పక్కా నిర్మాణాలు చేపట్టరాదన్న వాటికి స్వస్తి పలికి 100 మీటర్లు, కొన్ని చోట్ల 200 మీటర్లకు కుదించారు. వీటిపై తాజాగా ఎపిలోని అన్ని జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేపడుతున్నారు. వీటి వల్ల తీర ప్రాంత నిర్వహణ అస్తవ్యస్తమవుతోంది. తీరం అంచునే వందల అడుగుల లోతులో బోరు బావులు వేయడం, మడ అడ వులను నరికేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడు తున్నారు. వీటి వల్లే తుపాను సమయాల్లో సముద్రం ముందుకు రావడం, పెను గాలులు విరుచుకుపడటంతో అపారమైన నష్టాలను చవిచూడాల్సి వస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈవిపత్తులు ఎందుకు జరుగుతున్నాయి?
దేశంలో ఉన్న ప్రధాన పట్టణాలు సేఫ్‌ జోన్‌లో లేవా? ఎందుకు కేవలం పట్టాణాలే ముంపుగురవుతున్నాయి. కారణాలు ఎన్నో..కానీ బలవుతున్నది మాత్రం సామాజిక జనమే. కాంక్రిట్‌ జంగిల్‌, అల్ట్రా మోడ్రన్‌ సిటీగా మారుస్తామని చెబుతున్న ప్రజాప్రతి నిధులు, అధికారపార్టీలు..ఎందుకు ఈ విపత్తుపై సమగ్రంగా ఎదురు కోవడం లేదు అన్న ప్రశ్నలు సామాన్య జనంలో ఉత్పన్నమౌతున్నాయి. దేశంలో ఎన్ని పట్టణాలు సేఫ్‌జోన్‌లో ఉన్నాయి… అధికారుల నోటిలో సమాధానం ఉందా? అంటే దాదాపుగా దొరకదు. తాజాగా ఘోర విఫత్తు ఎదురుకుంటున్న చెన్నై,కేరళ ఇంతటి ధారుణానికి గురికా వడానికి పలు కారణాలు కూడా లేకపోలేదు. ఇందుకు గల కారణాలు పర్యా వరణ శాస్త్రవేత్తలు అంచనాలు వేచారు. ముఖ్యంగా చెన్నై లో మూడు నదులు ప్రవహిస్తాయి. కొసస్తతలయార్‌, కూవూం, అడయార్‌ నదులు ప్రవహిస్తాయి. అయితే ఈనది పరివాహక ప్రాంతాలు ఆక్రమణకు గురికావడం వల్ల నదులు యొక్క పరిమాణం తగ్గాయి. అంతే కాకుండా బ్రిటిష్‌ కాలంలో నిర్మించిన బంగింగ్‌ హామ్‌ కెనాల్‌ నిర్వహణ గురించి ప్రస్తుతం ఉన్న పాలకులు పట్టించుకోకపోవడం. చెన్నై నగరంలో డ్రైనేజీ సిస్టమ్‌ సరిగా లేకపోవడం, ఇకపోతే గత ప్రభుత్వ హాయాంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో వరదనీరు నేరుగా నదుల్లో పడే విధంగా కాలువలు తొవ్వారు, అయితే వాటిని తాజా ప్రభుత్వం అసంపూర్తిగా నిలిచిపోవడమే ప్రదాన కారణాలుగా కనిపిస్తు న్నాయి. చెన్నై నగరంలో దాదాపుగా 600 పైగా చెరువులు ఉండేవి, కానీ ప్రస్తుతం పదుల సంఖ్యలో కూడా కనిపించుకుంటా పోయాయి. దీనికి చెరువులు కూడా ఆక్రమణకు గురికావడమే ప్రధాన కారణం. అయితే ఇవ్వనీ సక్రమంగా ఉంటే చెన్నై లో ఇంత భీభత్సం ఉండక పోయేదని పర్యావరణ నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఓ ప్రణాళిక లేకుండా జరిపిన నిర్మాణాల వల్లనే ఈదుస్థితి నెలకొందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రతి పదేండ్లలో ఒకసారి ఇటువంటి భారీ వర్షాలు చెన్నై కి అనుభవమే. 1969, 1976, 1985, 1996, 1998, 2005, 2015 లో కుండపోత వర్షాలు కురిశాయి.
పెరుగుతున్న విఫత్తులు :
ఇటీవలి కాలంలో సంభవిస్తున్న అనేక ప్రకృతి విపత్తులకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అలాప్రకృతి విపత్తుల ప్రమాదం ఎక్కువగా పొంచి ఉన్న 15 దేశాల జాబితాను 2018 వరల్డ్‌ రిస్క్‌ రిపోర్ట్‌ ప్రచురిం చింది. ఆ జాబితాలో భారత్‌ పొరుగు దేశం బంగ్లాదేశ్‌ కూడా ఉంది. భూకంపాలు, సునామీ, తుపాన్లు, వరదల లాంటి విపత్తుల బారిన పడే ప్రమాదం ఉన్న 172 దేశాలను ఈ రిపోర్ట్‌ అధ్యయనం చేసింది. దాంతో పాటు ఆవిపత్తులకు ఆయా దేశాలు స్పందించే శక్తిని కూడా అంచనా వేసింది. జర్మనీకి చెందిన వివిధ సంస్థలు సంయుక్తంగా చేసిన ఈ అధ్య యనం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నలుగురు పిల్లల్లో ఒకరు ప్రకృతి విపత్తులు పొంచి ఉన్న ప్రాంతాల్లోనే జీవిస్తు న్నారు. గత ఏడాది ప్రకృతి విపత్తుల కారణంగా ఇళ్లను కోల్పోయి వలస వెళ్లిన వారిలో సగం మంది 18 ఏళ్ల లోపు వాళ్లేనని ఐరాస చెబుతోంది. ప్రమాదం పొంచి ఉన్నప్రాం తాలు (ఆధారం:వరల్డ్‌ రిస్క్‌ రిపోర్ట్‌ 2018)
వ.స దేశం ప్రమాద తీవ్రత సూచీ (100కు)

  1. వానువాటు 50.28
  2. టోంగా 29.42
  3. ఫిలిప్పీన్స్‌ 25.14
  4. సోలోమన్‌ దీవులు 23.29
  5. గుయానా 23.23
  6. పపువా న్యూ గినీ 20.88
  7. గ్వాటెమాలా 20.60
  8. బ్రూనే 18.82
  9. బంగ్లాదేశ్‌ 17.38
  10. ఫిజీ 16.58
  11. కోస్టారికా 16.56
  12. కంబోడియా 16.07
  13. ఈస్ట్‌ టైమర్‌ 16.05
  14. ఎల్‌ సాల్వడర్‌ 15.95
  15. కిరీబాటీ 15.42
    ఈ జాబితాలో ఎక్కువగా దీవులే ఉన్నాయి. వాతావరణ మార్పుల కారణంగా సముద్ర మట్టం క్రమంగా పెరుగుతుండటంతో, వాటికి పొంచి ఉన్న ప్రమాదం కూడా అంతకంతకూ పెరుగుతోంది. అన్నిటి కంటే దక్షిణ పసిఫిక్‌ సముద్రంలో ఉన్న వనువాటు దీవి పరిస్థితే మరింత ప్రమాదకరంగా ఉంది. ప్రకృతి విపత్తుల ప్రమాదంతో పాటు వాటిని ఎదుర్కొనే సన్నద్ధతను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ జాబితాను రూపొందించారు. అందుకే నిత్యం భూకంపాల బారిన పడే జపాన్‌, చిలీ లాంటి దేశాలు ఈ జాబితాలో కనిపించలేదు. అలాగే వందల ఏళ్ల పాటు పెరుగుతున్న సముద్ర మట్టం సమస్యతో పోరాడిన హోలాండ్‌ కూడా జాబితాలో 65వ స్థానంలో ఉంది. ఈ దేశాలు విపత్తుల ప్రమాదాన్ని తగ్గించలేకపోవచ్చు, కానీ వాటిని సమర్థంగా ఎదుర్కోగలవని ఆ నివేదిక చెబుతోంది. ఈఅధ్యయనం ప్రకారం అత్యంత తక్కువ ప్రమాదం పొంచి ఉన్న దేశం ఖతార్‌.
    ప్రకృతి విపత్తుల ప్రమాదం తక్కువ
    2030 నాటికి 32కోట్ల మంది ప్రజలు విపత్తులు ఎక్కువగా పొంచి ఉన్న ప్రాంతాల్లో జీవిస్తారని అంచనా. ఈ విపత్తులు ప్రజల జీవితాలను నాశనం చేయడంతో పాటు దేశాలను మరింత పేదరికంలోకి నెట్టేస్తాయి. ఇథియోపియాతో పాటు ఆంధ్ర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతా ల్లో అనారోగ్యం, వరకట్నాలతో పాటు కరవు లాంటి విపత్తులు కూడా ప్రజలను పేదరికంలోకి నెట్టేస్తున్నాయని ఓవర్సీస్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ నివేదిక చెబుతోంది. ‘గతంలో ఆంధ్ర ప్రదేశ్‌లో సంభవిం చిన ఫైలిన్‌ తుపానునే తీసుకుంటే ఆ తుపాను ధాటికి ఆస్తి నష్టం ఎక్కువగా ఉన్నా ప్రాణ నష్టం తక్కువే. కాబట్టి ఆప్రాంతానికి ఆర్థిక సాయం భారీగా అందలేదు. అది ప్రజల జీవన స్థితిగతుల మీద ప్రభావం చూపింది. చనిపోయే వారి సంఖ్యకూ, ఆర్థిక సాయానికీ ప్రత్యక్ష సంబంధం ఉంటుంది’ అని ఓవర్సీస్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఓడీఐ)కు చెందిన డాక్టర్‌ మిషెల్‌ వివరిస్తారు. ప్రకృతి విపత్తుల కారణంగా మరింత పేదరికంలో జారిపోయే దేశాల జాబితానూ ఓడీఐ తయారు చేసింది. అందులో బంగ్లాదేశ్‌ తొలి స్థానంలో ఉంది.
    ‘తిత్లీ’ తుపానుకు ఆ పేరు పెట్టింది పాకిస్తాన్‌
    2012 నాటి ‘మ్యాపిల్‌ క్రాఫ్ట్‌’ నివేదిక ప్రకారం…ఆసియాకు చెందిన బంగ్లాదేశ్‌, ఫిలిప్పీన్స్‌, మయన్మార్‌, భారత్‌, వియత్నాం లాంటి దేశాలకే ఎక్కువగా ప్రక ృతి విపత్తుల ప్రమాదం పొంచి ఉంది. విపత్తులను నివారించలేకపోయినా, వాటిని సమర్థంగా ఎదుర్కోగలిగితే నష్టాన్ని చాలా వరకు తగ్గించొచ్చు. ఆవిషయంలో ఒడిశాను స్ఫూర్తిగా తీసుకో వచ్చని పర్యావరణ నిపుణులు చెబుతారు. 1999లో ఒడిశాలో సంభ వించిన తుపాను ధాటికి పదివేల మందికి పైగా ప్రాణాలు కోల్పో యారు. ఆ తుపాను నుంచి ఒడిశా చాలా పాఠాలు నేర్చుకుంది. గత 20 ఏళ్లలో తుపాన్లను ఎదుర్కోవడానికి పక్కాగా సన్నద్ధమైంది. దానికోసం ప్రపంచ బ్యాంకు సహాయాన్ని సైతం తీసుకుంది. ఈ క్రమంలో ఖరగ్‌పూర్‌ ఐఐటీ సహకారంతో దాదాపు 900 తుపాను సహాయక శిబిరాలను నిర్మించింది. ‘1999 పెను తుఫాను తరువాత మేం పాఠం నేర్చుకున్నాం. ఆపైన ఎలాంటి విపత్తు ఎదురైనా సమర్థం గా ఎదుర్కోవాలని అప్పుడే నిర్ణయించుకున్నాం.
    1999 తరువాత ఒడిశా ఏమేం చర్యలు తీసుకుంది?
    ఐఐటీ-ఖరగ్‌పూర్‌ సహాయంతో 879 తుపాను, వరద సహాయక శిబిరాలను నిర్మించారు. లక్షమందికి పైగా బాధితులకు ఆవాసం కల్పించేందుకు 17వేలకు పైగా ప్రత్యేక కేంద్రాలను నిర్మించారు. తీర ప్రాంతాల్లో 122 సైరన్‌ టవర్లతో పాటు, తుపాను హెచ్చరికలకు సంబంధించిన పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 17 జిల్లాల్లో ‘లొకేషన్‌ బేస్డ్‌ అలారం వ్యవస్థ’ను ఏర్పాటు చేశారు. వీటి సాయంతో ప్రజలకు తుపాను ప్రభావానికి సంబంధించిన సమాచారంతో పాటు రక్షణ చర్యలకు సంబంధించిన వివరాలను అందించారు. బలమైన గాలులను తట్టుకునేలా తీరప్రాంతంలో ఇళ్ల గోడలు, పైకప్పులను పటిష్ఠ పరిచారు.మత్స్యకారుల కోసం ప్రత్యక వార్నింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. సామాజిక మాధ్యమాల సాయంతో ఎప్పటికప్పుడు వాతావరణంపై హెచ్చరికలు జారీ చేస్తున్నారు
    తుపాను వచ్చినపుడు ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?
    తుపాను వచ్చినపుడు ఏం చేయాలి? తుపాను నుంచి ఎలా తప్పించుకోవాలి? తుపాను రాకముందు ఎలాంటి జాగ్రత్తలు తీసు కోవాలి? భారత వాతావరణ శాఖ చెబుతున్న సూచనలు ఇచ్చాంది. తుపాను వస్తుందన్న సమాచారం అందిన వెంటనే ఇంటి నిర్మాణాన్ని తనిఖీ చేయాలి. పెంకులు,పైకప్పు,తలుపులు,కిటికీలు ఎలా ఉన్నాయో చూసి తగిన మరమ్మతులు చేయాలి. ఇంటి పరిసరాలనూ పరిశీలిం చాలి. ఎండిన చెట్లు, కూలిపోయే అవకాశం ఉన్న చెట్లను తొలగిం చాలి. గాలికి ఎగిరి వచ్చి పడే అవకాశమున్న హోర్డింగ్‌లు, ఇతర భారీ వస్తువులను తొలగించాలి. కిటికీల దగ్గర, గాజు పదార్థాలకు ముందు చెక్కలను అడ్డుగా పెట్టాలి. దీని వల్ల గాలికి కొట్టుకుని వచ్చి తగిలే వస్తువుల నుంచి వాటికి, ఇంటికి రక్షణ లభిస్తుంది. ఒకవేళ చెక్క పదార్థాలు లేకుంటే.. కిటికీలకు, గాజు పదార్థాలకు కాగితాలను అంటించాలి. కరెంటు పోయి నపుడు వెలుగు కోసం లాంథర్లు, కిరోసిన్‌ దీపాలు, ఇతర ఫ్లాష్‌ లైట్లు, బ్యాటరీలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. పాడైన, శిథిలావస్థకు చేరిన నిర్మాణాలను వెంటనే తొలగించాలి. కరెంటు పోయినపుడు టీవీలు పని చేయవు. మరి వాతావరణ సంబంధిత హెచ్చరికలు అందుకోవడం ఎలా? అందు కోసం మొబైల్‌ ఫోన్లను చార్జ్‌ చేసి పెట్టుకోవాలి. లేకుంటే రేడియోలను సిద్ధం చేసుకోవాలి. మీకు అందిన తుపాను సంబంధిత అధికారిక సమాచారాన్ని ఇతరులకూ చేరవేయాలి. విపత్తు సమయాల్లో వదం తులు వ్యాపించే అవకాశం ఎక్కువ. అందువల్ల మీకు అధికారిక వెబ్‌ సైట్లు వార్తా సంస్థలు అందించిన సమాచారాన్నే ఇతరులకు చేరవేయండి. అనుమానాస్పద సమాచారాన్ని ఫార్వర్డ్‌ చేయొద్దు. భారీ అలలు ఎగసి పడే అవకాశమున్న సముద్రతీరాల వద్ద తుపాను సమయంలో ఉండకూడదు. వరదవచ్చే అవకాశం ఉన్నచోట ఉంటే.. వెంటనే ఖాళీ చేసి పునరావాస శిబిరాలు, లేకుంటే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. విలువైన వస్తువులను వీలైతే తీసుకెళ్లాలి. లేకుంటే ఎత్తైన చోట ఉంచాలి.వండాల్సిన అవసరం లేకుండా వెంటనే తినేందుకు సిద్ధంగా ఉన్న ఆహారాన్ని రెండు మూడు రోజులకు సరిపడా సిద్ధం చేసుకోవాలి. అలాగే సురక్షిత తాగునీరు, దుస్తులు కూడా. గాలి బలంగా వీస్తున్నపుడు దానికి ఎదుటివైపు తలుపులను, కిటికీలను తెరవకూడదు. గాలి ప్రభావం లేని వైపు తలుపులు, కిటికీలు తెరవ వచ్చు. మీరున్న చోట నుంచి తుపాను తీరం దాటుతున్నా లేకుంటే తీరం దాటి వస్తున్నా కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. కొన్ని గంటల పాటు భారీ వర్షాలు, బలమైన గాలులకు సిద్ధంగా ఉంటూ సురక్షిత ప్రాంతంలో తలదాచుకోవాలి. చిన్నారులను మరింత సురక్షిత ప్రదేశాలకు పంపాలి. వేలాడే విద్యుత్తు తీగలు కనిపిస్తే వాటిన తాక వద్దు. ఆ ప్రదేశాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పరిస్థితి అదుపులోకి వచ్చాక రిపేర్లు చేయించుకోవచ్చు. మీరు జాగ్రత్తగా ఉన్న సమాచా రాన్ని మీ బంధువులకూ చేరవేయాలి. వాహనాలను నడుపుతున్నపుడు చాలా జాగ్రత్తగా డ్రైవింగ్‌ చేయాలి.

ఎడతెగని సామాజిక బంధం

‘‘భారతీయ సమాజంలో అత్యంత ప్రాధాన్యం ఉన్న సమూ హాలు గిరిజన తెగలు. వీటికి సామాజికంగా, సాంస్క ృ తికంగా ప్రత్యేకతలున్నాయి. వీటితోపాటు వైవిధ్య చరిత్ర, సంస్క ృ తులున్నాయి. జన జీవన స్రవంతిలో భాగంగా కొందరు.. దూరంగా ఇంకొందరు జీవనం సాగిస్తున్నారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లోనూ భిన్న తెగలకు చెందిన గిరిజనులున్నారు. భారత్‌లోని గిరిజన తెగల సంస్క ృతి.. సంప్రదాయాలు.. జీవన వైవిధ్యం..’’
ఆదివాసీలు, గిరిజనులు ఏదేశానికైనా మూలవాసులన్నది మానవ శాస్త్రవేత్తల భావన. ప్రస్తుత భారత జనాభాలో దాదాపు 8-9 శాతం ప్రజలు వివిధ గిరిజన సమూహాలకు చెందినవారే. భారతీ య సమాజంలో గిరిజన సమూహాలన్నీ ప్రత్యేకమైన మత విశ్వా సాలను కలిగి ఉన్నాయి. గిరిజన సమాజమనేది కొన్ని ప్రత్యేక లక్షణా లతో కూడుకున్న సమూహం. ఆంథ్రోపాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా అధ్యయనం ప్రకారం ఒక్కోగిరిజన తెగ ఒకనిర్దిష్టమైన భౌగోళిక ప్రాం తానికి పరిమితమై ఉంటుంది. ఒక గిరిజన తెగ విభిన్న రాష్ట్రాల్లో విస్తరించి ఉండటం అరుదు. ప్రతిగిరిజన సమూహానికి ఒక నిర్దిష్టమైన పేరుంటుంది. ఒకే రకమైన భాష, సంస్కృతి ఉంటాయి. ఒకేరకమైన ఆచార వ్యవహారాలు కలిగి ఉంటారు. ఒకే న్యాయం, ఒకే చట్టం ఉంటాయి. అంతర్వివాహ పద్ధతిని ఆచరిస్తారు. గిరిజన సమూహాలకు ప్రత్యేకమైన మతవిశ్వాసాలు, ఆరాధన పద్ధతులు ఉంటాయి. ముఖ్యం గా ప్రకృతి శక్తులను ఆరాధిస్తారు. వీటితోపాటు ప్రతిగిరిజన సముదా యానికి ఒక స్వయం ప్రతిపత్తి గల రాజకీయ వ్యవస్థ ఉంటుంది. ఈనాటికీ చాలా తెగలుప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థలో ప్రవేశించినా, తమనుతాము నియంత్రించుకునే స్వీయరాజకీయ వ్యవస్థను (ఆదివాసీ మండలి) కొనసాగిస్తున్నాయి. ఆయా తెగల పెద్దలు ఇందులో సభ్యులు గా ఉంటారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ కార్యకలాపాలను వీరే నియంత్రిస్తుంటారు. అన్నింటికీ మించి ఇవి ఏకరూపత కలిగిన సమూ హాలు. వీటన్నింటిలోనూ గోత్ర వ్యవస్థ అంతస్సూత్రంగా పనిచేస్తుంది. గిరిజన సమాజంలోని సభ్యుల ప్రవర్తనను గోత్రవ్యవస్థ నియంత్రి స్తుంటుంది. స్వగోత్రికులు రక్తబంధువులనే భావన కలిగి ఉంటారు. అందుకే స్వగోత్రీకులు పెళ్లిళ్లు చేసుకోరు.
పవిత్ర టోటెమ్‌
ప్రతి గోత్రానికి ఓటోటెమ్‌ ఉంటుంది. టోటెమ్‌ అంటే మతపరమైన చిహ్నం. గోత్ర సభ్యులంతా ఆమతపరమైన చిహ్నం నుంచి ఉద్భవించామనే భావనతో దాన్ని పవిత్రంగా భావిస్తారు.. ఆరాధిస్తారు. ఈచిహ్నం ఒక వ్యక్తి కావొచ్చు, జంతువు, చెట్టు లేదా ప్రకృతిలోని ఏదైనా కావొచ్చు. అది వారి తెగకు గుర్తు. మూడు రకాల తెగలు భారత్‌లో మనకు 3 రకాల గిరిజన తెగలు కనిపిస్తాయి.

  1. దట్టమైన అటవీ ప్రాంతాల్లో, పర్వత ప్రాంతాల్లో జీవించేవారు. వీరు జనజీవన స్రవంతికి దూరంగా ఉంటారు. అడవులు, అటవీ సంపదపై ఆధారపడి జీవిస్తారు. ఆర్థికంగా, రాజకీయంగా స్వతం త్రంగా జీవించినప్పటికీ ఆర్థికంగా వెనకబడిన తెగలివి.
  2. అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్నా, వ్యవసాయం ప్రధానంగా చేసే ఆదిమతెగలు. వీరికి పాక్షికంగా గిరిజనేతరులతో సంబంధాలుంటా యి. సామాజిక, వ్యాపార సంబంధాలుండే అవకాశముంది.
  3. మైదాన ప్రాంతాల్లోని గిరిజన సమూహాలు. జనజీవన స్రవంతిలో భాగంగా ఉండి ఆధునిక జీవన విధానానికి దగ్గరగా ఉంటారు. ప్రభు త్వం కల్పించే చాలా అభివృద్ధి పథకాలు ఈమైదాన ప్రాంతాల్లో స్థిర పడిన, గ్రామీణ ఆర్థికవ్యవస్థకు దగ్గరగా ఉన్న తెగలు ఎక్కువగా ఉపయోగించుకుంటాయి. అందుకే వారిలో విద్య, ఆర్థిక అభివృద్ధి కనిపిస్తుంది. ఉదాహరణకు ఉత్తర భారతదేశంలో తీసుకుంటే బిల్లులు, సంతాల్‌(మధ్యప్రదేశ్‌)లు, ముండాలు(బిహార్‌), మహారాష్ట్ర, తెలంగాణ ల్లోని రాజ్‌గోండులు, లంబాడీలు జనజీవన స్రవంతికి చాలా దగ్గరగా ఉండే సమూహాలు. అందుకనే వీరిలో రాజకీయ, ఆర్థిక, విద్యాపరమైన అభివృద్ధి కనిపిస్తుంటుంది. అదే చెంచు లాంటి తెగలను చూస్తే వారింకా జనజీవన స్రవంతికి దూరంగానే ఉన్నారు.
    ఈశాన్య భారతంలో..
    సామాజిక, మానవ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం భారత్‌లో దాదాపు 450కి పైగా గిరిజన సమూహాలున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో వీరి జనాభా శాతం ఎక్కువ. దాదాపు 80 నుంచి 90 శాతం దాకా ఈశాన్య రాష్ట్రాల మొత్తం జనాభాలో గిరిజనులే. వీటిలో జనాభా పరంగా చూస్తే, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, తెలంగాణల్లో విస్తరించిన గోండు తెగ అత్యధిక జనాభాతో ఉంది. ఈ గోండుల్లో కూడా రకరకాల వారున్నారు. ఉదాహరణకు మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రల్లో ఎక్కువగా కనిపించేవారు మరియా గోండులు. తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలో కనిపించే వారు రాజ్‌గోండులు. రాజస్థాన్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల్లో ప్రధానమైన తెగ భిల్లులు. బిహార్‌, ఒడిశా, పశ్చిమ్‌ బంగ, మధ్యప్రదేశ్‌ (పాక్షికంగా)ల్లో సంతాల్‌లుబీ రaార్ఖండ్‌లో ముండాలు అత్యధిక జనాభా ఉన్న గిరిజన సమూహాలు. మధ్యభారత ప్రాంతాల్లో ముఖ్యంగా మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, బిహార్‌, రaార్ఖండ్‌, ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్‌లలో గిరిజనజనాభా ఎక్కువగా ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం అక్కడి జనాభాలో అత్యధిక శాతం గిరిజన తెగకు చెందినవారే. ఉదాహరణకు మిజోరాంను చూస్తే స్థానిక జనాభాలో 95శాతం గిరిజన సమూహాలే. అరుణాచల్‌ప్రదేశ్‌, మేఘా లయల్లోని జనాభాలో 80 శాతం గిరిజనులే. నాగాలాండ్‌లో 85 శాతంపైగా, మధ్యప్రదేశ్‌, ఒడిశాల్లో 25 శాతం వంతున గిరిజన జనాభానే. గుజరాత్‌లో 14, రాజస్థాన్‌లో 12, అసోం, బిహార్‌ల్లో 10 శాతం గిరిజన జనాభా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
    గిరిజన సమూహాలు.. జోన్లు
    భారత్‌లో భౌగోళికంగా వివిధ గిరిజన సమూహాలు ఏవిధంగా విస్తరించి ఉన్నాయనేది ఆసక్తికరం. దీనిపై ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్స్‌ ఫర్‌ రిసెర్చ్‌ (ఐసీఎస్‌ఎస్‌ఆర్‌), ఎల్‌పీ విద్యార్థి అనే సామాజిక మానవ శాస్త్రవేత్త ఆధ్వర్యంలో ఓసర్వే నిర్వహిం చింది. భారత్‌లోని వివిధ గిరిజన సమూహాల భౌగోళిక విస్తరణను అధ్యయనం చేసిన విద్యార్థి వీరిని నాలుగు జోన్లుగా విభజించారు.
  4. హిమాలయ ప్రాంతం
  5. మధ్య భారత ప్రాంతం
  6. పశ్చిమ భారత ప్రాతం
  7. దక్షిణ భారత ప్రాంతం
    భారతదేశ జనాభాలో గిరిజన జనాభా 9-10 శాతం ఉంటుందని అంచనా. మొత్తం గిరిజన జనాభాలో.. హిమాలయ పర్వత ప్రాంతాల్లో 11 శాతం ఉంటే..57 శాతం మధ్య భారతంలోనూ, 25 శాతం పశ్చిమ భారతంలోనూ, 7శాతం దక్షిణ భారతంలోనూ ఉన్నట్లు విద్యార్థి అంచనా. ఇతడి సర్వే ప్రకారం ఆయా ప్రాంతాల్లోని ప్రధాన తెగలను చూస్తే..
  8. హిమాలయ ప్రాంతంలో..
    జమ్మూ కశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లలో ప్రధానంగా కనిపించేవి భోట్‌, గుజ్జర్‌, గద్ది తెగలు. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని తెరాయి ప్రాంతంలో ప్రధాన మైన తెగ తారూ. అసోంలో-మిజో, గారో, ఖాసీలతో పాటు బోడోలు.. మేఘాలయలో-ఖాసా, ఖాసీలు..నాగాలాండ్‌లో-నాగాలు.. మణిపూర్‌లో-మావో, కూకీలు.. త్రిపురలో-త్రిపురి తెగ.
  9. మధ్య భారత ప్రాంతంలో..
    పశ్చిమ్‌ బంగ, బిహార్‌, జార?ండ్‌ల్లో-సంతాల్‌, ముండా, ఒరావణ్‌, హో తెగలు.. ఒడిశాలో-ఖోండులు, గోండులు.
  10. పశ్చిమ భారత ప్రాంతంలో..
    రాజస్థాన్‌లో-భిల్లులు, మీనాలు ఘరాసియాలు..మధ్యప్రదేశ్‌లో- సంతాల్‌లు, భిల్లులు..గుజరాత్‌లో-భిల్లులు, దుబ్లాలు, ధోడియాలు.. మహారాష్ట్రలో-భిల్లులు,కోలీలు,మహదేవ్‌లు, కోక్నాలు ప్రధాన తెగలు.
  11. దక్షిణభారత ప్రాంతంలో..
    ఆంధ్రప్రదేశ్‌లో-కోయ, కొండదొర, సవర, కొండరెడ్డి..తెలంగాణలో- రాజ్‌గోండులు,లంబాడీలు,చెంచులు,ఎరుకలు,గుత్తికోయ,కోలమ్‌, నాయక్‌పోడ్‌.. తమిళనాడులో – ఇరుల, తోడా, కురుంబా, కడార్‌లు.. కర్ణాటకలో-నాయికాడ, మరాటీలు.. కేరళలో-కుళయన్‌, పనియన్‌.. అండమాన్‌, నికోబార్‌దీవుల్లో-అండమానీలు, జారవాలు, నికోబారీలు ప్రధాన తెగలు. రకరకాల కారణాల వల్ల జారవా అనే తెగతో పాటు అండమానీలు జనాభా పరంగా దాదాపు అంతరించే స్థితిలో ఉన్న తెగలు.
    కులం – తెగ
    ప్రతి తెగ సజాతీయ సమాజం. తెగలో ఏకరూపత ఉంటుంది. భౌగోళి కపరంగా ఉన్న సమూహమిది. కులం అలా కాదు. కులం ఏకరూపత కలిగిన సమూహం కాదు. కులానికి చెందినవారు వేర్వేరు భాషలు మాట్లాడొచ్చు. వారికి వేర్వేరు సంస్కృతులుండొచ్చు. కులానికి వార సత్వంగా ఉండే వ ృత్తి ఉంటుంది. కానీ గిరిజనులకు ఆయా భౌగోళిక ప్రాంతాల్లోని వనరులను బట్టి జీవనోపాధి ఉంటుంది. ప్రతి తెగకు ఓ నిర్దిష్టమైన భాష ఉంటుంది. గిరిజన భాషలకు చాలామేర లిపి లేదు. కులానికి నిర్దిష్టమైన భాష అంటూ ఉండదు. కులానికి, తెగలకు ఉన్న ఏకైక ప్రధాన సారూప్యత ఏమైనా ఉందంటే అది రెండూ అంతర్‌వివాహ సమూహాలే.
    తెలంగాణ గిరిజనం
    తెలంగాణలో దాదాపు 10-12 శాతం గిరిజనజనాభా ఉన్నట్లు అంచనా. ఇక్కడ నివసిస్తున్న ప్రధాన తెగలు-లంబాడీలు, రాజ్‌గోండులు,చెంచులు,ప్రధాన్‌లు,కోలమ్‌లు,నాయక్‌పోడ్‌, ఎరుకలు, గుత్తికోయలు. సామాజికంగా, సాంస్క ృతికంగా జనజీవన స్రవంతిలో సమ్మిళితమైన తెగలు-లంబాడీలు,గోండులు(రాజ్‌గోండులు). ఆదిలాబాద్‌ జిల్లాలోని రాజ్‌గోండులు తాము క్షత్రియసంతతి వారమని అంటుంటారు. వీరు కొంతమేరకు విద్యాపరంగా, ఇటీవలి కాలంలో రాజకీయంగా కూడా భాగస్వామ్యాన్ని పొందారు. వీరితో పాటు లంబాడీ తెగ కూడా ఆఫలాలను అందుకుంటోంది. తెలంగాణలోని చాలా జిల్లాల్లో విస్తరించిన తెగ లంబాడీ తెగ. ఇటీవలి కాలంలో లంబాడీలు కూడా తాము క్షత్రియులమనే వాదన తెస్తున్నారు. రాజ్‌ గోండులతో పాటు ఆదిలాబాద్‌లో ప్రముఖంగా ఉన్నవారు ప్రధా నులు, కోలమ్‌లు, నాయక్‌పోడ్‌లు. తెలంగాణలో బాగా వెనకబడిన తెగ చెంచులు. వీరు మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఉంటారు. ఇప్పటికీ ఆహార సేకరణ ప్రధానవృత్తిగా ఉన్న తెగ ఇది. వరంగల్‌లాంటి చోట ఎరుకల తెగవారెక్కువ. వీరు జన జీవన స్రవంతిలో భాగంగానే జీవనం గడుపుతున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో మథుర అనే తెగ ఉంది. రాజస్థాన్‌ నుంచి వలస వచ్చిన తెగకు చెందిన వారు. వీరి ప్రధాన వృత్తి పశుపోషణ. గోవులను పెంచడం, వ్యవసాయం వీరి ప్రధాన జీవనాధారం. వైష్ణవ సంప్రదాయాన్ని ఆచరించడం వీరి ప్రత్యేకత. శ్రీకృష్ణుడి సంతతి నుంచి వచ్చామని అంటుంటారు. కామారెడ్డి గాంధారి మండలంలో ఈమథుర తెగ కనిపిస్తుంది. తెలంగాణలోని చాలా తెగల్లో వెనకబాటుతనం కనిపిస్తుంది. ప్రభు త్వాలు గిరిజన తెగల అభివ ృద్ధి కోసం ఐటీడీఏ ద్వారా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఆదిలాబాద్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో దీనిద్వారా అభివ ృద్ధికి క ృషి చేస్తున్నారు. ఫలితంగా కొన్ని తెగల్లో అభివృద్ధి కనిపిస్తోంది.
    గోందులు40లక్షలకుపైగా భల్లులుదాదాపు 40లక్షలు సంతాల్‌లు30లక్షలు 2011 జనాభా లెక్కల ప్రకారంభారత్‌లో అత్యధికంగా గిరిజన జనాభా ఉన్న ప్రాంతాలు మధ్యప్రదేశ్‌, చత్తీసఘడ్‌, రaార్ఖండ్‌, బిహార్‌, మహారాష్ట్ర, ఒడిశా, గుజరాత్‌. – ఆచార్య గణేశ్‌

వేతనాల్లో వృద్ధిలేమి-ప్రభుత్వ నిర్లక్ష్యం

వివిధ దేశాల్లో చెల్లిస్తున్న వేతనాల వ ృద్ధిపై ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌(ఐఎల్‌ఒ) గత నెల26న విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం వేతనాల వృద్ధిలో, అసమానతల్లో, లింగవివక్షా పూరిత వేతనాల్లో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. సంపద ఏ స్థాయిలో పెరిగితే అదేస్థాయిలో దానికి కారకులైన వారి సంపాదనల్లోనూ మార్పు రావాలి. అలా రానప్పుడే సామాజిక సమతుల్యత దెబ్బ తింటుంది. ఐఎల్‌ఒ నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా, 2016లో 2.4శాతం వేతన వృద్ధి ఉంటే, 2017లో అది1.8శాతానికి పడిపో యింది. ఇవే వివరాల్లో చైనాను మినహా యించి చూస్తే, ప్రపంచ వేతన వృద్ధి, 2016లో 1.8శాతంగా ఉంటే 2017లో 1.1శాతానికి పడి పోయింది. చైనా ఎక్కువ జనాభా ఉన్నప్పటికీ కూడా తదనుగుణంగా ఘనమైన వేతన వ ృద్ధి సాధిస్తూ ప్రపంచ సగటుకు తోడ్పాటునిస్తున్నది. ఐఎల్‌ఒ వెలువరించిన ఈ వృద్ధి, నిజ వేతనం, అనగా ద్రవ్యోల్బణంతో సరిచూసి లెక్కించగా నమోదైంది. అయితే ఇది 2008 తరువాత అత్యంత తక్కువ వ ృద్ధిగా ఇప్పుడు నమోదయింది. అభివృద్ధి చెందిన జీ20 దేశాలలో 2015లో 1.7శాతంగా ఉంటే 2016లో 0.9 శాతానికి పడిపోయింది. 2017లో 0.4శాతానికి పడిపోయింది. ఐరోపాలో 2015లో 1.6శాతానికి, 2016లో 1.3శాతానికి, 2017 లో 0 (సున్నా)గా నమోదయింది. అమెరికాలో చూసినట్టయితే 2015 లో 2.2శాతం, 2016లో 0.7శాతం, 2017 లోనూ 0.7శాతం నమోదయింది. ఇలా తక్కువ వేతన వృద్ధి కనబరిచిన దేశాలన్నింటి లోనూ వారి వారి జీడీపీలు పెరుగుతున్నాయి. అయినప్పటికీ వేత నాలలో వృద్ధి ఎందుకు కనిపించడం లేదు? 2015లో అమెరికా సంపద 17ట్రిలియన్‌ డాలర్లు ఉంటే 2017లో 21ట్రిలియన్‌ డాలర్లకు చేరింది. మరి వేతనాలలో వృద్ధి ఎందుకు కనిపించడం లేదు? దీనిని బట్టి ఎక్కువ ఆదాయం కలిగిన దేశాలలో వేతన వృద్ధి మందగిం చిందని అర్థం. సంపద స ృష్టిస్తున్న కార్మికులకు సరైన వాటా రావటం లేదు. అందుకే గతేడాది వెలువడిన ఆక్స్‌ఫామ్‌ నివేదిక ప్రకారం ప్రపంచంలో సృష్టించిన సంపదలో 82శాతం సంపద ఒక శాతం ప్రజల దరికి చేరుతుంది అనే వాస్తవం దీనిద్వారా తేటతెల్లమవుతోంది. సంపద పోగు పడడానికి శ్రామికులకు చెల్లించకుండా ఉంటేనే సాధ్యమవు తుందనే సత్యం మళ్లీమళ్లీ రుజువుతోంది. వేతనాల వృద్ధి మందగించడానికి 3 కారణాలుగా ఐఎల్‌ఒ ప్రకటించింది. 1.ఉత్పత్తిలో గణనీయమైన నెమ్మది ఏర్పడిరది. 2. ప్రపంచ పోటీతత్వం పెరిగింది. 3. కార్మికులు బేరమాడే శక్తి కోల్పోయారు. ఉత్పత్తిలో నెమ్మదస్తత ఏర్పడటానికి కారణం సరైన డిమాండు లేకపోవడం, ఈ డిమాండు ఉండాలంటే ప్రజల్లో కొనుగోలుశక్తి ఉండాలి. ఈశక్తి ఉండాలంటే పనికిదగ్గ ప్రతిఫలం ఉండాలి. కానీ పెట్టుబడిదారుల అత్యాశను కట్టడి చేయనంత వరకు ఈసంక్లిష్టత అధిగమించడం కష్టమే. ఇక పోటీ తత్వం కారణంగా సంయోగాలూ సంలీనాలతో చిల్లర వర్తకాన్ని దెబ్బ తీయడంతో వినియోగానికి సరుకు అందుబాటు తగ్గి ఉత్పత్తి నెమ్మది స్తుంది. మొదటి రెండు కారణాలతో పాటు కార్మిక చట్టాలను నీరుగా ర్చటం, ఆశ్రిత పెట్టుబడిదారీతనం ఎక్కువవడం, పెరుగుతున్న నిరు ద్యోగం, పెరిగిన పెట్టుబడిదారీ ఆధిపత్యం దృష్ట్యా కార్మికులు బేర –జి. తిరుపతయ్య

కల్వకుంట్ల చంద్రశేఖర్‌ అనునేను

తెలంగాణలో రెండోసారి ప్రభుత్వం ఏర్పాటైంది. ఈఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌ నేతృ త్వంలోని కేసీఆర్‌కే మళ్లీ పట్టం కట్టారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు తెలంగాణ ఎన్నిక లను కూడా యావత్‌ దేశం ఆసక్తిగా పరిశీలించింది. కాంగ్రెస్‌, టీడీపీ తమ మధ్య ఉన్న వైరాన్ని పక్కనబెట్టి సీపీఐ, టీజేఎస్‌తో కలిసి ప్రజా కూటమిగా ఏర్పాటుకావడం ఒకటి కాగా..రెండోది గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు భారీ మొత్తంలో ధన ప్రవాహాన్ని పారించడం ఈఎన్నికల ప్రత్యేకతలు. ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్‌ కేంద్రాలకు పోటెత్తిన ఓటర్లు టీఆర్‌ఎస్‌కు భారీ మెజార్టీ ఇచ్చారు. మొత్తం 119 స్థానాలకు 88 సీట్లలో టీఆర్‌ఎస్‌ గెలిచింది. గత నాలుగున్నరేండ్లలో చేపట్టిన సంక్షేమ పథకాలు, సబ్సిడీలు కొనసాగించాలంటే స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే సాధ్యమవుతుందనే ఉద్దేశంతో తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు పట్టం కట్టారు. -ఎన్‌.వేణుగోపాల్‌
ప్రజలు ఇచ్చిన తీర్పును ఏరాజకీయ పార్టీ అయినా గౌరవించాల్సిందే. తెలంగాణ ప్రజలు ఇచ్చిన ఈ గొప్ప విజయంతో రెట్టింపు ఉత్సాహంతో ప్రభుత్వం పనిచేయాల్సిన బాధ్యత ఉంది. గత పర్యాయంలో ఇచ్చి నెరవేర్చలేకపోయిన హామీలను సైతం అమలు చేయడమే కాకుండా కొత్తగా మరిన్ని అభివ ృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపడితే తెలంగాణ సమాజానికి మేలు జరుగుతుంది. ప్రభుత్వ పనితీరును బట్టే ప్రజా తీర్పు ఉంటుందనే విషయాన్ని ఈఎన్నికలు స్పష్టంచేసినట్టు కనబడుతోంది. మిగతా నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు చాలా మెరుగైన ఫలితాలు వచ్చాయి. 2019 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా చెప్పుకొనే ఈ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలి వీచింది. ఎన్డీయే సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీతో పాటు నిత్యావసర ధరల పెంపుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వీటితో పాటు సీబీఐ, సుప్రీంకోర్టు, ఈడీ,ఐటీ తదితర స్వతంత్ర వ్యవస్థల్లో జోక్యం చేసు కుంటూ వాటిని నిర్వీర్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం ప్రవర్తిస్తోందనే విమర్శలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజలు ఇచ్చిన తీర్పు ఆయా రాజకీయ పార్టీలకు గుణపాఠం చెప్పేదే.
రెండోసారి గెలిచిన వెంటనే.. కోటిఎకరాల మాగాణికి సాగునీరందించడం, యువతకు ఉపాధి అవకాశాల కల్పనే తమ తక్షణ కర్తవ్య మని ప్రకటించిన కేసీఆర్‌.. ఆదిశగా సత్వరమే చర్యలు తీసుకోవాలి. విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేయాలి. ప్రజల మౌలిక అవస రాలకు సంబంధించిన అంశాల్లో కార్పొరేట్‌ వ్యవస్థల గుత్తాధిపత్యానికి చరమగీతం పాడే లా విప్లవాత్మక సంస్కరణలు తీసుకొస్తే యావత్‌ సమాజం హర్షిస్తుంది. ప్రజలు ఇచ్చి న ఈ గొప్ప అవకాశంతో రాష్ట్ర ప్రతిష్ఠను, ఆర్థిక అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేలా ప్రభుత్వం పనిచేయాలి. అలాగే, ప్రతిపక్ష పార్టీలు ఈ ఓటమితో నిరాశలో కూరుకుపో కుండా నిత్యం జనంలో తిరుగుతూ వారితో మమేకమవ్వాలి. ఓటమికి కారణాలను ఆత్మ పరిశీలన చేసుకుంటూ ప్రజలకు దగ్గరయ్యేం దుకు మరింత చొరవతో పనిచేయాలి. పాల నలో ప్రభుత్వానికి సహకరిస్తూ నిర్మాణాత్మక సూచనలు, సలహాలుఇస్తూ ముందుకెళ్లే దిశ గా ప్రయత్నం చేయాలి. ఎన్నికల్లో గెలుపోట ములు సహజం. సమైక్య రాష్ట్రంలో ప్రభు త్వాల పాలనలో తెలంగాణ గ్రామీణ ప్రజలు చాలా బలహీనపడిపోయారు. తెలంగాణ రాష్ట్రం కల సాకారమయ్యాక ఏర్పడిన ప్రభు త్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు, సబ్సిడీలు కల్పించాల్సిన అవసరాన్ని గుర్తించి.. వాటితో ప్రజలకు ఉపశమనం కలిగించింది. ఈతరు ణంలో తెలంగాణ ఓటరు ఇచ్చిన ఈగొప్ప విజయాన్నిస్ఫూర్తిగా తీసుకొని మరిన్ని సంక్షే మ కార్యక్రమాలు, సబ్సిడీలను కొనసాగించే దిశగా చర్యలు తీసుకుంటూనే ప్రజాకాం క్షలకు అద్దంపట్టేలా పాలన కొనసాగించాలి. దేశంలో ప్రతీ ఒక్కరూ తమ గురించి తామే ఆలోచించు కుంటున్నారు. సామూహిక పోరా టాలపై క్రమంగా విశ్వాసం సడలిపోతోంది. ఏప్రాంతం వారు ఆ ప్రాంతం గురించే ఆలో చించుకొనే ధోరణులు కనబడుతున్నాయి. ఇలాంటి పరిణామం ప్రజాస్వామ్య మను గడకు మంచిది కాదు. ఓవిశాలమైన దృక్ప థంతో ప్రతిఒక్కరూ ముందుకెళ్లాలి. రాజకీయ పార్టీలు కూడా సామూహికమైన అంశాలను తీసుకొని రాజకీయ ఉద్యమాలు చేపట్టాలి. అప్పుడే సామూహిక చైతన్యం వస్తుంది. సామూహిక ఉద్యమాలపై ప్రజల్లో నమ్మకం పెంచాలి. గెలుపు అనేది మనిషిలో కొత్త మార్పులను తీసుకొస్తుంది. దాంతో వచ్చిన పరిణామాలను సమతుల్యం చేసుకుంటూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలవ గలిగే వాడే గొప్ప నాయకుడు కాగలుగుతాడు. ఇప్పటి వరకు కేసీఆర్‌ సర్కార్‌ చేసిన అభి వృద్ధి పనులకు అభినందనలు. వచ్చే ఐదేండ్ల లో అభివృద్ధిపై కేంద్రీకరించండి. ఏయే అం శాలు ఆర్థిక రంగాన్ని పురోగమింప జేస్తాయో వాటిపై దృష్టి పెట్టండి. తెలంగాణ సమాజ శ్రేయస్సు కోసం ప్రభుత్వం చేపట్టే ఏ కార్యక్ర మంలోనైనా ప్రజాస్వామికవాదుల సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది.
కొత్త ప్రభుత్వానివి పాతవిధానాలేనా.. మార్పుంటుందా?
కారణాలు ఏవైనాగానీ, కారకులు ఎవరైనాగానీ, తెలంగాణ రాష్ట్ర సమితి మరొ కసారి పూర్ణ బహుమతి పొంది, ప్రభు త్వాన్ని ఏర్ప రచనున్నది. తెలంగాణ ప్రజా ఆకాంక్ష లలో, ఉద్యమ నినాదాల్లో అత్యధిక భాగాన్ని నెరవేర్చని పాలనానుభవంతో ఈ విజయం ఎలా సాధ్యమయిందని ప్రశ్నలు రావచ్చు. కౌలురైతులు, ఉద్యోగులు, కార్మి కులు, నిరు ద్యోగులు, ఆదివాసులు, ప్రజాఉద్యమ కార్య కర్తలు వంటి వివిధ ప్రజాసమూహాల అసం తృప్తిని మూట గట్టుకున్న తర్వాత కూడ ఈ విజయం ఎలా సాధ్యమయిందని సందేహాలు మిగలవచ్చు. ఎన్నికల ప్రచార సమయంలో మరొకసారి వినియోగించిన, రెచ్చగొట్టిన తెలంగాణ సెంటిమెంట్‌ ఈ విజయానికి కార ణం అనుకోవచ్చు. ప్రత్యర్థులకు విశ్వసనీయత లేకపోవడం, తప్పుడు వ్యూహాలు కారణమను కోవచ్చు. లేదా, పెన్షన్లు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ వంటి సంక్షేమ పథకాల లబ్ధిదా రులు పూర్తిగానూ, రైతుబంధు, రైతుబీమా లబ్ధిదారులు, నీటిపారుదల పథకాల కలలు కంటున్నవారు కొంతవరకు టీఆర్‌ఎస్‌కు వోటు వేశారనుకోవచ్చు. ఈఎన్నికల ఫలి తాలు ఎలా ఉన్నా, తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి నంతవరకు రానున్న ప్రభుత్వం ముందున్న సవాళ్లు, అవకాశాలు, కర్తవ్యాలు ఏమిటో చర్చించుకోవలసి ఉన్నది. ఇదేదో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం కోసం కాదు. అది ఈవిజయానికి తప్పనిసరిగా తనవిధానా లకు ప్రజల సంపూర్ణ ఆమోదం అనే తప్పుడు అర్థం చెపుతుంది. గత నాలు గున్నరేండ్ల పాల నలో అమలు చేసిన విధానా లనే యథాత థంగా కొనసాగిస్తుంది. కాని నిరంతర జాగ రూకతే ప్రజాస్వామ్యానికి చెల్లించవలసిన మూల్యం అనే విలువను నమ్మితే ప్రజానీకం నిరం తర జాగరూకంగా ఉండవలసిన అంశాలు ఇవి.
పెరిగిపోయిన రుణభారాన్ని తగ్గిం చడం, ప్రభుత్వవ్యయం పెరుగుదలను అరిక ట్టడం, విద్యారంగ అభివృద్ధి, పారిశ్రామి కాభి వృద్ధి, తద్వారానూ ఇతరంగానూ నిరు ద్యోగ సమస్య తగ్గింపు, అసంతృప్త వర్గాల సమ్మతిని చూరగొనడం వంటి ప్రధానమైన సవాళ్లు కొత్త టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముందున్నాయి. తెలం గాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రుణభారంలో తనవంతు వాటా గా రూ.61,711కోట్ల అప్పుతో ప్రారంభమ యింది. నాలుగేండ్లలో ఆ అప్పు రెండు లక్షల కోట్ల రూపాయలకు చేరింది. ఇది రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో నిష్పత్తిగా చూస్తే చట్టం అనుమ తించిన పరిధిలోపలే ఉన్నదనో, ఆఅప్పులను అభివృద్ధి పథకాలకే ఖర్చు పెడుతు న్నామనో టీఆర్‌ఎస్‌ చెప్పుకున్నది గాని బహుశా దేశం మొత్తంలోనే ఇంత తక్కువ కాలంలో ఇంత ఎక్కువ అప్పు చేసిన రాష్ట్ర ప్రభుత్వం మరొకటి లేదు. ఈఅప్పును కేంద్ర ప్రభుత్వ ఎఫ్‌ ఆర్‌బిఎం చట్టపు నిబంధనలకు లోబడే చేస్తు న్నామని ప్రభుత్వం పదే పదే చెప్పుకున్నది. అలా అది చట్టబద్ధంగా కనిపించి నప్పటికీ న్యాయబ ద్ధమైనది మాత్రం కాదు. ఎందుకంటే కాలం గడిచిన కొద్దీ తెచ్చిన అప్పంతా పాతఅప్పుల అసలు, వడ్డీల చెల్లింపుల కోసం మాత్రమే వెచ్చించవలసిన రుణభారపు విషవలయంలోకి రాష్ట్రం చేరుతుంది. ఆ అనుభవం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల, రాష్ట్రాల ప్రభుత్వాలకు ఉన్నదే. చివరికి స్వయంగా కంట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) తన 2018 నివేదికలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాత అప్పులు తీర్చడానికే కొత్త అప్పులు చేస్తున్నదని కూడ నిర్ధారిం చింది. కనుక కొత్త ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిశీలించవలసిన సవాల్‌ తన అప్పుల విధానాన్ని సమీక్షించుకోవడం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో అంతర్గత వనరుల సేకరణ సాధ్యం కాని అనివార్య పరిస్థితి లో మాత్రమే అప్పుకు వెళ్లాలని, అలా అప్పుకు వెళ్లేప్పుడైనా తక్కువ వడ్డీ అప్పులకే ప్రాధాన్యం ఇవ్వాలని తనకు తాను ముందస్తు జాగ్రత్త విధించు కోకపోతే, గత అనుభవాన్ని యథాతథంగా కొనసాగిస్తే రానున్న పదవీకాలంలో రాష్ట్ర ప్రజల మీద రుణభారం ఏనాలుగైదు లక్షల కోట్ల రూపాయలకో చేరి, రాష్ట్ర ఆర్థికవ్యవస్థ ఎన్నటికీ కోలుకోలేని స్థితికి చేరుకుంటుంది.
అలాగే ప్రభుత్వ వ్యయం పెరుగుదలను అరికట్టడం, ఇప్పటి వరకూ సాగుతున్న ప్రభుత్వ వ్యయాన్ని నిర్మొహమాటంగా సమీక్షించి, అనవసర, దుబారా వ్యయాన్ని తగ్గించడం, అవసరమైన రంగాలలో వ్యయాన్ని పెంచడం అనే ప్రక్రియ నిరంతరం జరగవలసి ఉంది. గత నాలుగున్నరేండ్ల టీఆర్‌ఎస్‌ పాలనానుభవంలో అటువంటి సమీక్ష జరిగిందో లేదో తెలియదు. కాని ప్రభుత్వ వ్యయం మాత్రం నానాటికీ పెరిగిపోయింది. అది కూడ ప్రజావసరాల మీద, ఉపాధి అవకా శాలను, ఆదాయ వనరులను పెంచే ఉత్పాదక పథకాల మీద కాకుండా వథా వ్యయంగా సాగింది. ఆడంబరాల కోసం, రక్షణ పేరు మీద పటాటోపాల కోసం సాగింది. ఎన్నికల సమయంలో ప్రజలను ఆకర్షిం చడానికి ఇచ్చే ప్రలోభాలకూ తాయిలాలకూ మరొక రూపుగా సంక్షేమ పథకాలను తయారు చేసి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుబారా చేయడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రోజుల నుంచి చూసినా ఎన్నడూ లేనంత ఎక్కువగా పోలీసు వ్యవస్థను దగ్గరికి తీసి, వారు అడిగినవీ, అడగనివీ కూడ ఇచ్చి వేలకోట్ల రూపాయలు దుబారా చేయడం జరిగింది.
ఇలా గత నాలుగున్నరేండ్లలో చేసిన ప్రభుత్వ వ్యయాన్నంతా ఒక్కసారి సమీక్షించి, వాటిలో ఏపద్దుల మీద కోత విధించవచ్చు, ఏ పద్దులను రద్దు చేయవచ్చు, ఏపద్దుల మీద వ్యయాన్ని పెంచవలసిన అవసరం ఉంది అని ఒకవివరమైన మదింపు అవసరం ఉంది. అది జరిగినప్పుడే, ప్రజలు చెల్లిస్తున్న పన్నులు, ప్రభుత్వానికి ఒనగూరు తున్న నిధులు సక్రమ వినియోగంలోకి వస్తాయి. అలా కాక, గతంలో కొనసాగిన విధానాలనే కొనసాగించవచ్చునని అనుకుంటే ఈ పదవీ కాలం ముగిసి, తర్వాతి పదవీకాలానికి వారే అధికారానికి వచ్చినా, మరొకరు అధికారానికి వచ్చినా ఆర్థిక వ్యవస్థను నిర్వహించలేని దుస్థితి ఏర్పడుతుంది. ఐదేండ్ల కొరకు ప్రజాధనానికి ధర్మకర్తగా ఉండవలసిన ప్రభుత్వానికి దాన్ని దుర్వినియోగం చేసే హక్కు లేదు. విద్యారంగ అభివృద్ధి విషయంలో గత నాలుగున్న రేండ్లలో కొన్ని గురుకులాలు ఏర్పాటు చేయడం మినహా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసినది చాల తక్కువ. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అనే నినాదం నాలుగున్నరేండ్లలో అటకెక్కింది. ఈపదవీకాలంలోనైనా ఆనినాదాన్ని సాకారం చేసే చర్యలు తీసుకోవలసి ఉంది. ఉపాధ్యాయుల నియామకం, పాఠశాలల మౌలిక సౌకర్యాలు మెరుగుపరచడం, ఎక్కువమంది పిల్లలను ప్రభుత్వ పాఠశా లలకు పంపేలా తల్లిదండ్రులను ప్రోత్సహించడం, సమాజంలో ప్రభు త్వ విద్యపట్ల ఆదరణ పెంచడం, ప్రభుత్వ పాఠశాలల పనితీరును మెరుగుపరచడం వంటి ఎన్నో చర్యలు తీసుకోవలసి ఉంది. విద్యా పరంగానూ, ఆర్థికంగానూ, సామాజికంగానూ, సాంస్కృతికంగానూ దుష్పరిణామాలకు దారి తీస్తున్న కార్పొరేట్‌ విద్యావ్యాపార సంస్థల ఉక్కు పిడికిలి నుంచి ఇంటర్మీడియట్‌ వ్యవస్థకు విముక్తి కలిగించడం, డిగ్రీ కళాశాలలను, యూనివర్సిటీలను బలోపే తం చేసి, ఎక్కువ నిధు లు కేటాయించి, మొత్తంగా ఉన్నత విద్యావ్యవస్థను తెలంగాణ అవస రాలు తీర్చేలా మెరుగు పరచడం ఈప్రభుత్వం ముందున్న సవాళ్లు. ఈ సవాళ్లను పరిష్కరించకుండా, గతనాలుగున్నరేండ్లలో అమలు చేసిన విధానాలనే కొనసాగిస్తే ఈ పదవీకాలం ముగిసేనాటికి తెలం గాణ రాష్ట్రం ప్రయివేట్‌ విద్యా వ్యాపారుల ఇష్టారాజ్యపు క్రీడాస్థలిగా మారిపోతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏవిద్యావకాశాలు కోల్పోయామని తెలంగాణ ప్రజానీకం తపన పడి ప్రత్యేక రాష్ట్రం కోరుకు న్నారో, అంతకు మించిన దుస్థితి తలెత్తు తుంది. టీఆర్‌ఎస్‌ మొదటి పదవీకాలంలో నాలుగున్నరేండ్ల పాటు పారిశ్రామికాభివృద్ధికి చేసినదేమీ లేదనే చెప్పాలి. అంతకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో మూసివేసిన తెలంగాణ పరిశ్రమలను పునరుద్ధరి స్తామని ఉద్యమకాలంలో చేసిన వాగ్దానాలను నెరవేర్చలేదు. కొన్ని ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కంపెనీలను ఆహ్వానించడం, వారికి రాయితీలు, సౌకర్యాలు ఇవ్వడం మినహా నిజంగా పారిశ్రామికాభివృద్ధి అని చెప్పదగిన పనులేవీ జరగలేదు. ఐటీ పరిశ్రమ స్వాభావికంగానే తెలంగాణ నిరుద్యోగులకు మాత్రమే ఉద్యోగకల్పన చేసే శక్తి ఉన్నది కాదు. రాయితీల వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఒరిగినదేమీ లేదు. పారిశ్రామిక ఉత్పత్తులను తయారుచేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దోహదం చేయడం, విరివిగా ఉద్యోగకల్పనకు అవకాశం ఇవ్వడం, నెలకొన్న ప్రాంతంలో మరెన్నో అనుబంధ పరిశ్రమలకు, చిన్న తరహా పరిశ్రమలకు, సేవా రంగ సంస్థలకు అవకాశం ఇవ్వడం పారిశ్రామికాభివృద్ధి ఫలితాలు కావాలి. అటువంటి పరిశ్రమలకు అవసరమైన ఖనిజ, అటవీ, వ్యవసాయ, జల, విద్యుత్‌,రవాణా వనరులన్నీ తెలంగాణలో విస్తారంగా ఉన్నాయి. మానవశక్తికైతే కొదవలేదు. కాని గత నాలుగున్నరేండ్లలో ఇటువంటి సమగ్ర విస్తత అభివ ృద్ధికి దారితీసే ఒక్క పరిశ్రమ ఏర్పాటు కూడా జరగలేదు. రానున్న పదవీకాలంలో ప్రభుత్వ రంగంలోనైనా, సంయుక్త రంగంలోనైనా, తప్పదనుకుంటే ప్రయివేటు రంగంలోనైనా ఇటువంటి పారిశ్రామికాభివృద్ధికి పూనుకోక పోతే, నిరుద్యోగం పెరుగుతుంది. రాష్ట్ర ఆర్థికవ్యవస్థకు ఆదాయం, పన్ను ఆదాయం పెరిగే వనరులు తగ్గిపోతాయి. నిరుద్యోగ సమస్యను తగ్గించడంలో పారిశ్రామికాభివృద్ధి ఒక కోణమైతే, అంతకు మించి ప్రభుత్వం చేయదగిన పనులు ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వోద్యోగాల ఖాళీలను భర్తీ చేయడం, జిల్లాల విభజన వల్ల అవసరమైన కొత్త ఉద్యోగాలను నింపడం, పదవీ విరమణ వల్ల ఏర్పడుతున్న ఖాళీలను వెంటవెంటనే భర్తీ చేయడం, ఉద్యోగ కల్పనా సంస్థలను ప్రోత్సహించడం, స్వయం ఉపాధి పథకాలు ఇబ్బడి ముబ్బడిగా రూపొందించడం తెలంగాణ ప్రభుత్వం చేయ వలసిన పనులు. కాని తన మొదటి పదవీకాలంలో టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం ఉద్యోగ కల్పనకు ఇవ్వవలసిన కనీస ప్రాధాన్యత కూడ ఇవ్వలేదు. ఉద్యమ కాలంలో ప్రధాన ఆకాంక్షగా ఉండిన ఉద్యోగకల్పన కోరికను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించు కోలేదు. రెండు, రెండున్నర లక్షల ఉద్యోగాలు రావచ్చునని ఉద్యమ సమ యంలో కన్న కలలను, ఒక లక్షా ఏడు వేలకు కుదించి, నాలుగున్న రేండ్లలో ఇరవై వేలఖాళీలు కూడా నింపని ఘనచరిత్ర టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిది. ఉన్న ఖాళీలన్నిటికి నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం, చివరికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చివరిరోజుల్లో వెలువడబోతున్న నోటిఫికేషన్‌ను ఆపు చేయించి, మేము రాగానే ఇస్తాము అని బీరాలు పలికి, నాలుగున్నరేండ్లు గడిచినా కనీసం ఆనోటిఫికేషన్‌ కూడా ఇవ్వని చరిత్ర టీఆర్‌ఎస్‌ పాలనది. కొత్త ప్రభుత్వం ఆ పాతవిధానాన్నే కొనసాగిస్తే నిరు ద్యోగుల నుంచి, ప్రజల నుంచి మరింత అసంతృప్తి మూటగ ట్టుకోవడం మాత్రమే అవుతుంది.
ఇవాళ సెంటిమెంటును రెచ్చగొట్టిఓట్లు, స్థానాలు సంపాంచ గలిగినా, గత పాలన ఎన్నోప్రజా సమూహాలను అసంతృప్తికి గురి చేసింది. ఆ అసంతృప్తి ఇవాళ వోట్లుగా మారి ఉండక పోవచ్చుగాని, రానున్న పాలనాకాలంలో ఆఅసంతృప్త సమూహాలను బుజ్జగించడా నికి, వారి ఆకాంక్షలను తీర్చడానికి ప్రయత్నించకపోతే ఆ అసంతృప్తి ఇతర రూపాల్లో విస్ఫోటనమవుతుంది. మరొకపక్క వారి ఆకాంక్షలను తీర్చడ మంటే తాయిలాలు ఇవ్వడమనో, ప్రభుత్వ వ్యయం పెంచడమనో అర్థం చెప్పుకుంటే అది మరిన్ని సమస్యలకు దారి తీస్తుంది. ఈప్రత్యక్ష ఆర్థిక సవాళ్లతో పాటు పరోక్షంగా ప్రభావం చూపే ఆర్థిక సవాళ్లు, అవి జనచైతన్యం మీద చూపే ప్రభావాలు ఉంటాయి. ఆప్రభావాలు ఎప్పటికప్పుడు వ్యక్త మయ్యే అవకాశాలు ఇవ్వకపోతే, అంటే వాక్సభాస్వాతంత్య్రాల మీద ఆంక్షలు విధిస్తే, గత పాలనాకాలంలో ప్రవర్తించినట్టు ప్రవర్తిస్తే, ఈ గెలుపు ఓటమికి సోపానమవుతుంది.

గత కాలపు ఆనవాళ్లు ఆదివాసీ పజ్రలు

ఆధునిక సమాజ గత కాలపు ఆనవాళ్లు ఆదివాసీ ప్రజలు. సమిష్టి జీవన పద్ధతు లు, సహజీవనం, పారదర్శ కతకు నిలువెత్తు సాక్షులు వారు. వ్యష్టి జీవన పద్ధతులు, పరస్పర అసహనం, కని పించ ని కుట్రలు నేటి పారి శ్రామిక సమాజ లక్షణాలు. బ్రెజిల్‌, పెరూ దేశాలలో వందకుపైగా ఆదివాసి తెగలు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్నారు. పెరూలోని ‘ముచి-పిచి’ పర్యావరణ పార్కుకు కేవలం 100 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో ఈ తెగలు ఇప్పటికీ జంతుప్రాయమైన జీవనాన్ని కొనసాగిస్తున్నారు. 50-60 వేల సంవత్సరాల నుంచి అటవీ దుంపలు ప్రధాన ఆహార వనరుగా జీవిస్తూ మొక్కజొన్న, బంగాళాదుంప సాగుకు ఈ తెగలు ఎంతో తోడ్పడ్డాయి. తాము వేటాడే జంతువులకు ఎరగా వేసే క్యురారే మొక్క నేడు ఓపెన్‌ హార్ట్‌ శస్త్రచికిత్సకు ఔషధంగా మారింది. గత సునామీలో అండమాన్‌ తెగలలో ఆదివాసి తెగలు ఎవరూ చనిపోలేదు. కారణం సముద్రం వెనక్కి వెళ్లగానే వారు ఎత్తైన కొండలపైకి వేగంగా కదిలి వెళ్లారు. జారవా, సెంటినిల్‌ తెగల ఆదివాసీల్లో కళ్లుతెరచి సముద్రపు నీటిలో చేపలవేటకు అనువుగా 50 శాతం మంది కళ్లు రూపాంతరం చెందాయి. ప్రపంచంలో సుమారు ఏడు వేల భాషలు ఉంటే అందులో ఆదివాసీ తెగలు మాట్లాడే బాషలే నాలుగు వేలు ఉన్నాయి. నేడు అత్యధికులు మాట్లాడే, వాడే ఆరు భాషలు (ఇంగ్లీషుతో సహా) గతంలో అంతరించిపోయిన ఆదివాసీ తెగలు వాడినవే.
బ్రతుకు పోరాటంలో ఆరితేరిన వారు ఆదివాసీలే. వారు నివసించే ప్రాంతాలు పుష్కలమైన సహజవనరులతో కళకళలాడుతుండేవి. నేడు ఆ వనరులు దోపిడీకి గురౌతున్నాయి. ‘అతి పురాతన సనాతన ప్రజల (మూలవాసులు) తెగలు అంతరించిపోతున్నాయి. సాటి మానవులుగా అనేక దేశాలలో వారికి తగిన గుర్తింపు, రక్షణ లేదు. ఆయా దేశాలలో కనీసపు చట్టాలు కూడా లేవు. ఫలితంగా వారు మానవులుగా జీవించడానికి పోరాడవలసిన స్థితి ఏర్పడిరది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ సనాతన ప్రజలను కాపాడవలసిన బాధ్యత మనపై ఉన్నది. అందుకు ప్రతి దేశం కొత్త చట్టాలు రూపొందించడం, వాటిని అమలుచేయడం, తద్వారా జీవించేహక్కుతో సహా ఆధునిక మానవునికి గల అన్ని హక్కులూ వారికి ఇవ్వవలసి ఉన్నది’ అని 1994 డిసెంబర్‌ 23న ఐక్కరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ 49/214 తీర్మానంలో పేర్కొన్నది. ఐక్యరాజ్యసమితి తీర్మానం మేరకు ప్రతి దేశం దశాబ్ద కాలంపాటు ఆదివాసీ తెగలను గుర్తించి, వారిని చట్టపరిధిలోకి తీసుకురావాలి. ఈ పదేళ్లపాటు ఆదివాసీ తెగలను మానవులుగా గుర్తించడం, వారి జీవన పరిస్థితులను మెరుగు పర్చడం, వారి నివాస ప్రాంతాలలోని సహజవన రులన్నింటినీ వారే సమిష్టిగా వినియోగించుకునే చట్టాలు చేయవలసి ఉన్నది. ఇది 1995 నుంచి 2004 వరకు వివిధ రూపాలలో ప్రచార కార్యక్రమాలు, అధ్యయనాలు చేయవలసి ఉన్నది. రెండవ దశాబ్దంలో 2005 నుంచి 2015 వరకు ఆదివాసీ తెగల అస్తిత్వం, తగిన హోదా కల్పించవలసి ఉంది.
పై తీర్మానంపై 148 దేశాలు సంతకాలు చేసినా, కొంతమేరకు అమలుచేసిన దేశాలు కేవలం 60 మాత్రమే. ఈ 60లో భారతదేశం లేదు. ప్రపంచవ్యాప్తంగానే తొలుత ఈ తీర్మానాన్ని అమలు చేయాలని ప్రయత్నించిన వారు ప్రపంచస్థాయి ఎన్‌జిఒలు మాత్ర మే. మనదేశంలో ఇప్పటికీ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రభుత్వాలు జరపడం లేదు. ఎన్‌జిఒలు చేసే కార్యకలాపాలకు కొన్ని రాష్ట్రాలలో కేవలం ఆర్థిక తోడ్పాటును మాత్రమే ప్రభుత్వాలు అందిస్తున్నాయి. మన దేశంలో సుమారు 600 ఆదివాసీ తెగలు గుర్తించబడ్డాయి. భారత రాజ్యాంగం వీరికి చట్టపరమైన రక్షణలు కల్పించింది. అవే 5వ, 6వ షెడ్యూల్‌గా ప్రాంతీయ, పరిమిత స్వయంపాలనా హక్కు ఇవ్వబడిరది. ఆచరణకు వీలుగా పీసా చట్టం (పి.ఇ.ఎస్‌.ఎ-1996) చేయబడిరది. అయినా బూర్జువా పాలకవర్గాలు మనదేశంలో గిరిజన తెగలకు స్వయం పాలనా హక్కులు ఇవ్వలేదు.
ఆదివాసీలు-హక్కులు
వలస కాలం నుంచి మనదేశంలో ఆదివాసీ తెగలు బూర్జువా, భూస్వామ్యవర్గాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నాయి. ఒక రాజీగా అనేక రక్షణ చట్టాలు వచ్చాయి. ముఖ్యంగా 1874లోనే ప్రత్యేక షెడ్యూల్డ్‌ జిల్లాల చట్టం చేయబడిరది. 1917లో ఆదివాసీ తెగల నివాస ప్రాంతాలలో ఉమ్మడి భూమి హక్కులు ఇవ్వబడ్డాయి. అవే భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. అనేక పోరాటాల అనంతరం ఆదివాసీ తెగలకు అటవీ భూములపై హక్కులు కల్పిస్తూ 2006లో చట్టం చేయబడిరది. చట్టం ప్రకారం అటవీ భూమిపై ఆధారపడి జీవిస్తున్న ప్రతి గిరిజన కుటుంబానికీ 10 ఎకరాల వరకూ పట్టా ఇవ్వవచ్చు. వారిపై గల కేసులను ఎత్తివేయాల్సి ఉంది. మన రాష్ట్రంలో దీని అమలు అరకొరగా జరిగింది. సుమారు 25 లక్షల ఎకరాలకు పట్టాలివ్వవలసిన భూమిని గుర్తించినప్పటికీ కేవలం 9 లక్షల ఎకరాలకు మాత్రమే పట్టాలిచ్చారు. దీనిలో లక్షా యాబై ఆరు వేల మందికి 3 లక్షల ఎకరాలు మాత్రమే దక్కింది. మిగతా 6 లక్షల ఎకరాలు 2 వేల విఎస్‌ఎస్‌ల పేర (వన సంరక్షణ సమితులు) పట్టాలిచ్చి అటవీశాఖ ఆధీనంలోనే ఉంచుకున్నారు. ఇన్ని చట్టాలు ఉన్నా, స్వాతంత్య్రం వచ్చి 68 ఏళ్లు అయినా ఆదివాసీ తెగలు తమ సంప్రదాయపు భూముల నుంచి, అటవీ ప్రాంతం నుంచి నెట్టివేయబడుతున్నారు. మన రాష్ట్రంలో 1/70 చట్టం అమలులో ఉన్నది. గిరిజనుల సాంప్రదాయక భూములు గిరిజన తెగలకే దక్కాలి. గిరిజనేతరులకు షెడ్యూల్డ్‌ భూమిపై ఎట్టి హక్కూ లేదు. కానీ మన రాష్ట్రంలో షెడ్యూల్డ్‌ ప్రాంతంలో 48 శాతం సంప్రదాయక గిరిజన భూములను గిరిజనేతరులు ఆక్రమించు కున్నారు. గిరిజన విద్య పేరుతో ప్రైవేటు, కార్పొరేట్‌ సంస్థలకు ఐటిడిఎలు దోచిపెడుతున్నాయి. ఈ సొమ్ముతో ఐటిడిఎనే జూనియర్‌ కాలేజీలను పెట్టవచ్చు లేదా తాము నడుపుతున్న రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీల్లో చేర్పించవచ్చు.
ఆదివాసీ చట్టాలు-అక్కరకురాని చుట్టాలు
ఆదివాసీ చట్టాలు అక్కరకురాని చుట్టాలుగా మారాయి. పోలవరం ప్రాజెక్టు వద్దని గ్రామసభలు, పంచాయతీలు, మండల పరిషత్తులు(ఇవన్నీ షెడ్యూల్డ్‌ ఏరియాలో, పీసా చట్టం పరిధిలో ఉన్నవి) చేసిన తీర్మానాలకు రాష్ట్ర ప్రభుత్వం విలువే ఇవ్వలేదు. బాక్సైట్‌ త్రవ్వకాలు వద్దని విశాఖజిల్లాలోని గ్రామసభలు, పంచాయతీలు, మండల పరిషత్తులు చేసిన తీర్మానాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రక్కనపెట్టి ఐటిడిఎల ద్వారా బాక్సైట్‌ త్రవ్వకాలు జరుపుతామని చెబుతున్న మా టలు సుప్రీంకోర్టు ‘సమతా తీర్పును’ వెక్కిరించడం కాదా? ఆదివాసీ హక్కులను కాలరాయడానికి రాష్ట్ర ప్రభుత్వం వెనుకాడడం లేదు. షెడ్యూల్డ్‌ ప్రాంతంలో జీవో 3ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖలలోని ఉద్యోగాలన్నింటినీ స్థానిక గిరిజన అభ్యర్థులతో నింపవలసి ఉన్నది. ప్రతి కార్యాలయంలో గుమస్తా నుంచి అధికారి వరకు ప్రతి స్కూలు, ఆసుపత్రి, వివిధ కార్యాలయాలలో నేడు స్థానిక అభ్యర్థులు 10 శాతం కూడా లేరు. స్థానికేతరులు, గిరిజనేతరులు, తాత్కాలిక ప్రాతిపదికపై గతంలో నియామకాలు జరిగాయి. ఈజీవోప్రకారం వారిని తొల గించి స్థానిక గిరిజన అభ్యర్థులతో నింపవలసి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం స్కీం వర్కర్లలో ఎక్కువమంది గిరిజనేతరులనే నియమిస్తున్నది. అర్హులైన గిరిజన అభ్యర్థులు నిరుద్యోగులుగా ఉన్నారు. ప్రభుత్వం జీవో 3ను పటిష్టంగా అమలుచేసి స్థానిక గిరిజన అభ్యర్థులకే ఉద్యోగ అవకాశం కల్పించాలనే డిమాండ్‌ ముందుకు వస్తున్నది. ఆదివాసీ తెగలు ప్రత్యేక భాషలు, విశిష్టమైన సంస్క ృతిని కలిగి ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనేతర భాషలను వారిపై బలవంతంగా రుద్దుతు న్నాయి. మన రాష్ట్రంలో ప్రతి గిరిజన కుటుంబం ఇంట్లో తమ తెగ భాష మాట్లాడుతున్నారు.
స్కూలుకు వెళ్తే తెలుగు, ఇంగ్లీషులో బోధన జరుగుతున్నది. భాషా పరిజ్ఞానమేకాక సాధారణ విషయాలను కూడా అవగాహన చేసుకోవడం గిరిజన విద్యార్థులకు కష్టంగా ఉన్నది. ఫలితంగా స్కూల్‌ డ్రాపవుట్స్‌ ఎక్కువ అవుతున్నాయి. యునెస్కో సూచన మేరకు 10 వేల మంది మాట్లాడే ప్రతి భాషకూ లిపి కనిపెట్టాలని, వాడుకలో దానికి రక్షణనివ్వాలని ఉన్నది. అయినా లక్షలమంది మాట్లాడుతున్న ఆదివాసీ భాషలకు లిపి కనిపెట్టకపోవడం దారుణం. భాషా పరిశోధన సంస్క ృతి రక్షణలో భాగం. ఆదివాసీ తెగల వాయిద్య పరికరాలు, వారి న ృత్యాలు ప్రభుత్వం ప్రోత్సాహం లేక అంతరించిపోతున్నాయి. ఆదివాసీ ప్రాంతాలలోకి టూరిజం ప్రవేశించాక ఆదివాసీ కళలు వ్యాపార సరుకులుగా మారిపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పాటించాలి. నేడు జరుగుతున్న ఉత్సవాలు పాలకవర్గాల అవసరాల కోసమే తప్ప ఆదివాసీలను కాపాడడానికి కాదు. నిజమైన ఆదివాసీ దినోత్సవం, ఆదివాసుల ‘అవసరాలు- ఆకాంక్షలు’ నెరవేర్చేదిగా ఉండాలి.- జి.ఎన్‌.వి.సతీష్‌

పసిడి బాల్యమంటే అదేనా..?

ఆ ఇల్లంతా బొమ్మలే. రంగుల పుస్తకాలే. ఫోన్ల నిండా పిల్లల ఫొటోలే. స్టోరేజీ నిండా మ్యాజిక్‌ వీడియో మిక్స్‌లే. ఇప్పుడు పిల్లల్ని సెలబ్రెటీల కన్నా గొప్పగా పెంచేస్తున్న తీరు పెరిగింది. ప్రతిదీ కొనివ్వడం వరకే తల్లిదండ్రుల, కుటుంబ పెద్దల అభిమానానికి ఓపిక. చిన్నారులతో కొన్ని విలువైన సమయాల్ని గడిపే తీరికే లేదు. వెలకట్టలేని పసిదనాన్ని అమ్మకమంటూ బోర్డులు పెట్టేసే టారు కొట్ల ముందో, థీమ్డ్‌ బడుల వద్దో పెద్దలు తచ్చట్లాడుతున్నారు. బాల్యాన్ని సెలబ్రేట్‌ చేయడమంటే.. ఎవరో అమ్ముతున్నది పిల్లలకు కొనివ్వడమనే అనుకుంటున్నారు. పసిడి బాల్యమంటే అదేనా..?
పిల్లలకు ఖరీదు తెలీదు. డాడీ.. అప్పుచేసి డ్రోన్‌ కొని రిమోట్‌ చేతిలో పెట్టక్కర్లేదు. దగ్గరుండి న్యూస్‌పేపర్‌తో పతంగి తయారుచేసి ఎగరేస్తే చాలు. మబ్బుల్ని పట్టుకునేంత ఎత్తుకు చిన్నారుల ఆనందం ఎగురుతుంది. కానీ, పెద్దలకు టైంలేదు. సోషల్‌ మీడియాలో అటెండెన్స్‌ లేటవుతుంది. అటెన్షన్‌ లాస్‌ అవుతుంది. బాలలకు విలువ అర్థం కాదు. కాస్ట్‌లీ చాక్లెట్లని మమ్మీ హ్యాండ్‌ బ్యాగ్‌లోంచి తీసి ‘సర్‌ప్రైజ్‌’లివ్వకర్లేదు. తను తినే అన్నం ముద్దల్లో ఒకటి పిల్లల నోట్లోను పెట్టేంత నిదానంగా తింటే చాలు. కానీ, పెద్దలతో బిజీ బతుకు. వర్క్‌ పెండిరగ్‌లో పడుతుంది. టీమ్‌లో పేరు వెనుకబడుతుంది. చాలా ఇళ్లల్లో ఇదే పరిస్థితి. తండ్రి చాటుకు పరుగెత్తి గోరు ముద్దల అల్లరి చేసే పిల్లలకు… సొంతంగా భోజనమెలా చేయాలో నేర్పిస్తామంటూ ఎల్‌కేజీ సిలబస్‌లో కలిపేసుకున్న ప్లేస్కూళ్లు పెరిగాయి. పేరెంట్స్‌కు వంటింట్లో సాయమెలా చేయాలో కూడా మంచిపాఠమే కానీ, తాము మిగిల్చిన కాలాన్ని పెద్దలు టచ్‌స్క్రీన్‌కు బదిలీ చేస్తే పిల్లలేం కావాలి? ఇదివరకు బడి ఎగ్గొట్టేందుకు పిల్లలకు దొంగ జ్వరాలొచ్చేవి. కడుపు నొప్పి వచ్చేది. కానీ, ఇప్పుడు తల్లిదండ్రులు ఓ పూట పని మానుకుని తమ వద్దే ఉంటారని పిల్లలు జబ్బు చేస్తున్నారు.
విరిగిన బొమ్మలు
సురేష్‌కు ఫేస్‌బుక్‌ ఓ లోకం. అందులోనూ అల్లరి చేసే పిల్లల పేజీల్నీ ఫాలో అవుతుంటాడు. ఫన్నీ వీడియోలు చూస్తూ పడిపడీ నవ్వుతుంటాడు. పనిచోట ఇది నడవదు కనుక, ఇంటికెళ్లే ప్రయాణంలో ఫోన్‌ను మెడ తిప్పకుండా చూస్తుంటాడు. తీరా ఇంటికెళ్లాక పడుతూ లేస్తూ ఎదురొచ్చే కూతురిని అంతెత్తున ఎగరేసి ఎత్తుకుని, ముద్దిచ్చి మీద నుంచి దింపేస్తాడు. చకచకా రిఫ్రెష్‌ అయ్యి మళ్లీ ఫోన్‌ పట్టుకుని ఓ మూలకు చేరుతాడు. కూతురొచ్చి ఎంత బన్నీ లాగినా ‘2 మినిట్స్‌ తల్లీ.. 2 మినిట్స్‌’ అంటూ రెండు గంటలైనా వదలకుండా ఫోన్‌తోనే గడిపేస్తాడు. చిన్నారులకు ఖరీదు తెలీదు. విలువ అర్థం కాదు.. అలానే, గుర్తు ఉండదు కూడా. ఇలా ఎన్నిరోజుల్నుంచి తండ్రి పట్టించుకోకున్నా ప్రతి సాయంత్రం కూతురు అలానే ఎదురుచూస్తుంటుంది. మౌనంగా తండ్రికి దూరం జరిగి ఒక్కతే.. విరిగిన బొమ్మను మరింత విరగ్గొడుతూ మూలన కూర్చుని ఆడుకుంటుంది. ఇదో భరించలేనంత ఒంటరితనం. ఆఇంటి అట్టపెట్టె నిండా ఇలాంటి విరిగిన బొమ్మలెన్నో. అవెందుకు అలా విరిగిపోతున్నాయనే పట్టింపే లేకుండా మరో బొమ్మతో మరో వీకెండ్‌ దాటేస్తాడు సురేష్‌.
అతకని మనసులు
సంధ్యకు పనే ఓప్రపంచం. అందులోనూ పిల్లలకు గొప్ప భవిష్యత్తు ఇవ్వాలని ర్యాట్‌ రేస్‌లో చలోమంటుంది. ఒక పనిచేసే సమయంలో రెండు మూడు ప్రాజెక్టులు పూర్తిచేసేంత శక్తిని నింపుకుంటుంది. పనిచోటే ఇది నడవదు కనుక ఇంటికెళ్లేపుడు ఇవే ఆలోచనల్ని వెంటతీసుకెళుతుంది. తీరా ఇంటికెళ్లాక కళ్లూమూస్తూ నిద్రకళ్లతో తూలుతూ వచ్చే కొడుకుని గట్టిగా హత్తుకుని తల నిమిరి పక్కకు జరుపుతుంది. చకచకా డిన్నర్‌ వగైరా కానిచ్చి ఫైళ్లో, మెటీరియలో ముందేసుకుని హాల్‌ మధ్యకు చేరుతుంది. కొడుకొచ్చి ఎంత చేయిలాగినా ‘అయిపోయింది.. అయిపోయింది’ అంటూ అర్ధరాత్రైనా వదలకుండా పనితోనే గడిపేస్తుంది. చిన్నారులకు పట్టింపు ఉండదు కదా! ఎంత కాలం నుంచి తల్లి తెలీకుండానే పనిలో కూరుకుపోయినా ప్రతి రోజూ కొడుకు అలానే వేచిచూస్తాడు. అమ్మ చెప్పే బైబైలతో తలుపునో, గేటునో బలంగా తన్ని ఒంటరిగా టీవీ సెట్‌కో, తన లోకానికో అతుక్కుపోతాడు. ఇదో చెప్పలేనంత ఒంటరిభావం. ఎన్నో ఇళ్ల గదుల నిండా ఇలాంటి అతకని మనసులెన్నో. అవెందుకు ముక్కలవుతున్నాయనే పట్టింపే లేకుండా మరో ప్రాజెక్ట్‌తో వీకెండ్‌ మొదలెట్టేస్తుంది సంధ్య.
దగ్గరుండి నేర్పాలి
దారెంట ఓగ్యాస్‌బెలూన్‌ బండి కనిపిస్తే.. లోనున్న పిల్లలు అడిగి మారాం చేయకముందే కొని తీసుకెళ్తున్నారు. కొన్ని రోజులకు ఇలాంటి సర్‌ప్రైజ్‌లన్నీ చప్పబడిపోయి.. పిల్లల్లో అస్సలు స్పందన ఉండని పరిస్థితి తయారవుతుంది. జేబులు మరింత పెద్దవి చేసుకుని మరింత పెద్ద బహుమతులు, ఖరీదైన సర్‌ప్రైజ్‌లు ఇవ్వడం వరకే నేటి చాలామంది పేరెంట్స్‌ అవగాహన. దానికోసం మరింత ఉద్యోగాలకు, పనులకు అంకితమవడం.. చేజేతులారా వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్స్‌ చెడగొట్టుకోవడం… పిల్లలకు మరింత దూరమవడం.. ఇదో ఒంటరి బాల్యపు చక్రం. వినిమయ ఛట్రంలో బందీ అయిపోయిన తమ లైఫ్‌స్టైల్‌నే చిన్నతనం నుంచే పిల్లలకూ వంటబట్టించేస్తున్నారు. తల్లిదండ్రుల సమక్షంలో ఓ స్కూల్‌ కాంపిటీషన్‌లో పాల్గొన్నా చాలనుకుంటారు పిల్లలు. విజేత ఎలాగూ ఒక్కరో, ఇద్దరో ఉంటారనే విషయం వాళ్లకు తెలీకున్నా తల్లిదండ్రులకు తమ పాటో, డ్యాన్సో, ప్రసంగమో, నటనో, ఆటో.. ఏదో ఒకటి చేసి అందరూ హీరోలైపోవాలని ముందు రాత్రి నుంచే కలత నిద్రపోతున్నారు. సైకిల్‌ కొనిస్తే సరిపోతుందని పేరెంట్స్‌ ఆలోచన. దాన్ని పక్కనే ఉంటూ నేర్పించడం బాలలు కోరుకునేది. చిట్టిపాదాలు సైకిల్‌ పెడల్‌ మీద స్థిరపడేలోపు ఎన్ని విలువైన క్షణాలు, మేమున్నామనే భరోసాలు.. కుదురుకుంటాయో తెలుసా..! చేతుల్ని గాల్లోకి వదిలేసి సైకిల్‌ ముందుకు నడిపించడంలో ఎన్ని సాహసాలు, ఉద్వేగాలు, కేరింతలు.. పేరెంట్స్‌ సాంగత్యంలో కోరుకుంటున్నారో తెలుసా..! పేరెంట్సే కనుక వీలు చేసుకుంటే.. సైకిల్‌ నేర్పేటపుడే ఎన్నేసి బతుకు పాఠాలు పిల్లలకు తేలిగ్గా తిప్పి చెప్పొచ్చో. నడిచేపుడే రెండు చక్రాల మీద సైకిల్‌ ఎలా బ్యాలెన్స్‌ అవుతుందో అనే విషయానికి ఓరోజు ఇష్టమైన క్లాస్‌ చెప్పుకోవచ్చు. బురదలో పడిన సైకిల్‌ని సరదాగా కలసి కడుగుతూ బంధాన్ని ఎంత శుభ్రం చేసుకోవచ్చో..! వెనుకే కూర్చుని అటు హ్యాండిల్‌ని కంట్రోల్‌ చేయడం నేర్పిస్తూ, ఇటు పెడల్‌కు ఆసరాగా పెద్దల కాళ్లబలాన్ని అందిస్తూ.. ఒక్కరిగా కాకుండా జట్టులో ఒకరిగా ఉంటే ఏం ప్రయోజనమో విడమర్చి చెప్పొచ్చు. ఎందుకు పక్కవాడు అవసరమో చిన్నారికి ఇట్టే తెలిసిపోతుంది. మీరెన్ని పుస్తకాలు కొనిచ్చినా.. ఎన్ని క్లాసులు తీసుకున్నా… ఆవలింతలొస్తాయి గానీ, బతుకు పాఠం ఆ చిట్టి బుర్రలకు బోధపడదు. పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ కాన్సెప్ట్‌ల్ని చిన్న వయస్సు నుంచే ఎక్కడో కొని పరిచయం చేస్తున్న తల్లిదండ్రులు పేరెంటింగ్‌ పాఠాల్ని నేర్వాలి.
అఆఇఈలు అద్దెకే…
అంతంత కళ్లేసుకుని పలకనే చూస్తూ.. విరిగేంత గట్టిగా బలపాన్ని పట్టుకుని తల్లి/ తండ్రి ఒళ్లో కూర్చుని అక్షరాలు నేర్చుకుంటున్న పిల్లల ద ృశ్యాల్ని ఇప్పుడు మనం తక్కువగా చూస్తున్నాం. సరిగ్గా అడుగులు కూడా వేయలేని వాడిని ఏదో మిలట్రీ ట్రైనింగ్‌కు పంపిస్తున్నట్టు బూట్లు, యూనిఫామ్‌, బ్యాగులతో ఏడిపిస్తూ ప్లేస్కూళ్లకు పంపిస్తున్న చిత్రవిచిత్రాల్నే ఎక్కువ చూస్తున్నాం. కిండర్‌గార్టెనే ఎక్కువనుకుంటే.. నర్సరీ, అంతకన్నా ముందే అనే వెనకబాటుకు ఇప్పటి బాల్యం బాటేస్తోంది. నిద్ర కూడా పనిష్మెంట్‌ అనే చోద్యం ఆ చిట్టి గదుల్లో చూస్తున్నాం. ఇల్లు అంటే ఓ భద్రభావన. తల్లి ఒడిలో ఉన్నంత హాయిదనం. దాన్ని బలవంతంగా తెగ్గోసేస్తున్నారు ఆధునిక విద్య పేరిట. ఇళ్లంటే తల్లిదండ్రులు ఒక్కరే అవ్వడమూ బాల్యానికి చెప్పలేనంత లోపమవుతోంది. అమ్మమ్మో, నాన్నమ్మో, తాతయ్యో.. ఇంకా కుదిరితే చిన్నాన్నో, అత్తమ్మో… కలసి ఉంటే తల్లిదండ్రులు ఇంట్లో లేని లోటుని భర్తీ చేస్తారు. అఆఇఈల నుంచి మరెన్నో విషయాల్ని చక్కగా నేర్పిస్తారు. అమ్మానాన్నల్ని కాసేపైనా మరిపిస్తారు. న్యూక్లియర్‌ ఫ్యామిలీలకెలానూ బంధాల్ని నాన్నీలు, ఆయమ్మల పేరిట అద్దెకు తెచ్చుకునే అవస్థ తప్పదు. కానీ, ఇంట్లో మరో పెద్ద దిక్కు ఉన్నా.. డబ్బులు తగలేసి అనేక పాఠాలకు వేరే దిక్కుకు చూస్తున్న పేరెంట్స్‌ తిప్పలేంటో ఓ పట్టాన అర్థం కాదు. నేటితరానికి తగ్గట్టు ఇంట్లోని పెద్దలు తయారవ్వలేదనే సాకు అయితే ఉండనే ఉంది. కంప్యూటరే ఆపరేట్‌ చేయలేకపోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లో యాప్‌లే సరిగ్గా అర్థం కాకపోవచ్చు. ఇంగ్లిష్‌నీ ఇరగదీసి మాట్లాడలేకపోవచ్చు.. పోటీతత్వాన్ని అరగదీసి ఎక్కించలేకపోవచ్చు.. కానీ, పిల్లలు మరింత రిమోట్‌గా, ఐసోలేట్‌గా కానీయకుండా.. నలుగురిలో ఎదిగేలా పదిమందిలో మెలగేలా చేయగలరు. ప్రతి సమస్యను, కష్టాన్ని పంచుకుంటూ, అర్థం చేసుకుంటూ చిన్ని హ ృదయాలకు జీవితం మీద ఆశ పెంచే ప్రయత్నమైతే చేస్తారు. టీనేజర్లకూ దిగులు రోగాలు, డిప్రెషన్‌లు, పోస్ట్‌మోడ్రనిజమ్‌ ఉనికిపోరు, సెలెబ్రెటీ సిండ్రోమ్‌లు చూస్తూనే ఉన్నాం. ఎన్నో బలవంతపు చావుల్ని దిగమింగలేకపోతున్నాం. వీటన్నింటికీ కారణం.. వందలాది సోషల్‌మీడియా స్నేహాల్లో ఒక్కరూ తమకు చాలా దగ్గరగా వచ్చింది లేదు. కనీసం బాధనైనా మాటల్లోనైనా పంచుకుంది లేదు. టీనేజ్‌ తరాన్ని రిపేర్‌ చేయడం అటుంచి… బాల్యం గురించి ఎంత ఎక్కువ పట్టించుకోవాలో అర్థం చేసుకోవాలి. తర్వాతి తరంవారైనా వాళ్లు మూడేళ్లైనా నిండకుండానే ఎంతటి ఒంటరితనంలోకి బలవంతంగా తోసేయబడుతున్నారో గమనించండి. ఇక్కడ అద్దెకు తీసుకునేది.. అ, ఆ, ఇ, ఈల్ని నేర్పే క్లాసుల్ని కాదు, ఇక్కడ కొనిచ్చేది పార్ట్‌టైం తోడుని కాదు… జీవితాంతం వెన్నంటే ఒంటరితనాన్ని, ఏకాకిభావనల్ని అని తెలుసుకోవాలి.
స్టేటస్‌ సింబల్స్‌, బ్రాండ్‌ మోడల్స్‌
సొసైటీలో బాగా బతుకుతున్నారని స్టాంప్‌ వేయించుకోవడానికి… తామెలాంటి బండి తీశారు, ఎలాంటి ఇంట్లో ఉంటున్నారు.. ఎంత కాస్ట్‌లీగా లైఫ్‌స్టయిల్‌ ఉంటుందనేది.. స్టేటస్‌ సింబళ్లుగా వాడుకునేవాళ్లు. ఇప్పుడు పిల్లల్ని అందుకు వాడేస్తున్నారు. తమ ఉనికికి వారిని బ్రాండ్‌ మోడల్స్‌ని చేసేస్తున్నారు. ఓ ఫంక్షన్‌కు వెళ్లినా, నలుగురితో ఓ విహార యాత్ర చేసినా… చివరకు ఏదో పని మీద రోడ్డు మీదకు వచ్చినా పిల్లల ఆహార్యం, చేష్టల మీద విపరీతమైన ఫోకస్‌ పెడుతున్నారు. నాలుగైదు పలుకుల ఇంగ్లిష్‌, అవాక్కయ్యే బ్రాండెడ్‌ బట్టలు, హుందాగా నడవడం, కూర్చోవడం, తిరగడం.. పిల్లలు ఇప్పుడు పిల్లల్లా ఉండటం లేదు. అల్లరల్లరిగా బాల్యం ఉండటం లేదు. పదుల కొద్దీ కామెంట్లు, వందలకొద్దీ లైకుల కోసం సోషల్‌ మీడియా గోడల నిండా వారిని అనేక రకాలుగా కుదించేసి, బాల్యాన్ని అందమైన బట్టల్లోకి దిగ్గొట్టేసి ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారంతే. పరుగులు తర్వాత కనీసం కదలకుండా ఓ మంచి పోజు కోసం సెలబ్రెటీ క్రేవింగ్‌తో నలిపేస్తున్నారంతే. కనీసం ఆఫొటో సెషన్లు సాగేంత సేపన్నా ఉండటం లేదు.. ఆతల్లిదండ్రుల దగ్గరితనం. పోస్ట్‌ పెట్టడం, కామెంట్లకు రిప్లైలు ఇవ్వడంతో బిజీ అయిపోతున్నారు. మూలమూలల్లో ఉన్నవారంతా ఫ్యామిలీ గ్రూప్‌ పేరిటో, ఇంటిపేరు గ్రూప్‌తోనో, స్కూల్‌ ఇయర్‌ గ్రూప్‌తోనో, కాలేజీ బడ్డీస్‌ గ్రూప్‌తోనో.. ఓచోట కలిసే చోట ఈపిచ్చి మరీ పీక్స్‌కు చేరింది. పోటాపోటీ పిల్లల ఫ్యాన్సీ డ్రెస్‌ కాంపిటీషన్లు ప్రతిరోజూ నడిచిపోతున్నాయి. తమ ప్రతిభ, నైపుణ్యం, విజయం, ప్రత్యేకత… వదిలేసి పిల్లల స్టేటస్‌తో తమ ఉనికిని చలామణీ చేయించుకోవాలనే ఉబలాటం చాలా ప్రమాదం. చైల్డ్‌ ప్రొడిగీ.. అదేనండి ఇప్పుడు బాలమేధావులే కాదు, పెద్దలకూ అసాధ్యమైన ఫీట్లని ఆటల్లోను, పాటల్లోనూ.. ఇంకా నానారకాల సరదాల్నీ సీరియస్సుగా బతుక్కి దిగ్గొట్టుకున్న పిల్లల శిక్షణ సంస్థలు ఎక్కువవుతున్నాయి. ఆకారాగారాలు, కర్మాగారాల్లోకి పిల్లల బాల్యాన్ని ముడిసరుకు చేసేసి లాభాల్ని తమ అకౌంట్‌లో వేసుకుంటున్నట్టే మనం దీన్ని చూడాలి. ఇప్పుడు ప్రతిచోట ప్రతి ఇంట్లో బాలకార్మికుడు కనిపిస్తున్నాడు. కానీ, వేర్వేరు రూపాల శిక్షణలతో, కొత్తకొత్త మోడల్‌ పేర్లతో పిలవబడుతున్న శిక్షణశిబిరాలకు తరలుతూ.
పిల్లలకు ఆటవస్తువు కావాలి, అందమైన బొమ్మ కొనాలి.. కానీ, పెద్దల తోడు, స్నేహం, ప్రేమ పక్కనే లేకుంటే బాల్యమే కాదు తర్వాతి జీవితమూ పరిస్థితులూ, ప్రభావాల చేత ఆటబొమ్మయి పోతుంది. బాల్యస్మ ృతుల నిండా ఒంటరితనపు రీలే తిరుగుతుంది. దారం కట్టిన తూనీగలు, రెక్కలు పట్టుకున్న సీతాకోకచిలుకలు, సంకెళ్లు వేసిన ఉడతలూ, గేలంకి చిక్కుకున్న చేప పిల్లలు… ఇప్పటి బాలలు. అవి వాటికి చిక్కుకుని గిజగిజ లాడుతున్నట్టే చిన్నారులూ అనేక పోటీ ప్రపంచపు శిక్షణలు, పెంపకపు ప్రయోగాలతో పిల్లల్లానే మిగిలే… గెలవలేని ప్రయత్నం చేస్తున్నారు. ఆ గేలాల్ని, సంకెళ్లనీ కొంటోంది పెద్దలు. బోనుల్లో జింకలు, ఫిష్‌ట్యాంక్‌లో తాబేళ్లు, పంజరంలో పిట్టలు…
ఇప్పటి పిల్లలు. అవి అక్కడక్కడే టపటపా కొట్టుకున్నట్టే చిన్నారులూ అనేక క ృత్రిమత్వాల మధ్య కష్టంగానే సహజాతాలకు, సహజత్వానికి దగ్గరగా ఉండే విఫలయత్నం చేస్తున్నారు. ఆ కృత్రిమత్వమంతా కొని వారి ప్రపంచంలో నింపేసేది పెద్దలే. నిజానికి బాల్యానందం కొంటే వచ్చేది కాదు, ప్రదర్శిస్తే పెరిగేది కాదు. అమ్మానాన్నలు ఆత్మీయంగా పంచాల్సింది.. ప్రేమా, స్పర్శలతో ప్రతి క్షణం పెంపొందించాల్సింది!
బాల్యం.. నాట్‌ ఫర్‌ సేల్‌.
ఇదీ పసిమిదనం
। ‘బాల్యమంటే, మనం తెలుసుకోలేం.. గొప్ప జ్ఞాపకాల్ని, మధుర స్మృతుల్నీ తయారు చేసుకునేదని. ఏదో సరదాగా దొర్లే ఓదశ మాత్రమే కాదది’.
। ‘మీ చిన్నారి ప్రేమించే సాధారణ హ ృదయాన్ని అలానే ఎప్పుడూ ఉండనీయండి.’
। మనం పెద్దోళ్లమైపోవాలని ఎప్పుడూ కోరుకుంటాం, కానీ చివరకి తెలుసుకుంటాం.. పగిలిన హ ృదయం కంటే.. విరిగిన పెన్సిళ్లు, పూర్తిచేయని హోమ్‌వర్క్‌లే ఉత్తమమని’.
। మీ జీవితంలో గొప్ప విషయమంటూ ఒకటుంటే అది ఆనందమయమైన బాల్యం, ప్రేమించే ఇల్లు.’
। ‘భర్తీ చేయలేనిదేదో బాల్యంలో ఉంది.’
। ‘ప్రతిమనిషిలో ఒకటిమాత్రమే ప్రత్యేకంగానిలిచే కథ బాల్యం.’
। ‘జీవిత రుతువుల్లో కన్నా బాల్యమే అత్యంత అందమైన రుతువు.’
। ‘ఎవరూ చనిపోని రాజ్యమంటూ ఉంటే అదే బాల్యం.’
। ‘ఒక్కోసారి కొన్ని చిన్నిచిన్ని సంగతులే మీ హృది గదినంతా ఆక్రమించేస్తాయి.’
। ‘ఓరోజుని ఉదయమోలా చూపిస్తుందో.. మనిషిని బాల్యమలా ఉదయిస్తుంది.’
। ‘ప్రతి వసంతంలో ప్రక ృతి విరిసినట్టే.. బాల్యం తిరిగిపూస్తే ఎంత బాగుండో కదా..!’
। ‘జీవితమంతా మనగలిగేది బాల్యమే..!’
। ‘సంగీతమని చెప్పలేని దానికి కూడా నాట్యం చేసేదే బాల్యం.’
। ‘మీ పాతింటికి తిరిగి వెళితే.. మీరు కోల్పోయిందని అనుకునేది ఆ కట్టడం కాదు, మీ బాల్యం.’
। ‘బాల్యానికంటూ దాని ప్రత్యేకమైన ద ృష్టి, ఆలోచన, భావన ఉంటాయి. మన (పెద్దల) విషయాలతో దాన్ని భర్తీ చేయా లను కునేంత మూర?త్వానికి మించింది మరొకటి లేదు.’
। ‘బాల్యమొక సంభ్రమాశ్చర్యాల ప్రపంచం.’
। ‘కొన్ని నిమిషాల బాల్యాన్ని కోల్పోతే నీ జీవితకాలమంతా ఆ విషయాన్ని మర్చిపోలేరు.’
। బాల్యాన్ని ప్రేమించే కొందరు పెద్దల మాటలివి.- అజయ్‌ కుమార్‌ వారాల

1 46 47 48