పార్ల‌మెంటు సాక్షిగా విశాఖ ఉక్కుపై కేంద్రం దాడి

విశాఖ ఉక్కు అమ్మకంపై ప్రజల్లో వ్యక్త మౌతున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేని బిజెపి… దుష్ప్రచారానికి పార్లమెంటు వేదికగా పూనుకుంది. తన సన్నిహిత కార్పొరేట్‌ వర్గానికి దీనిని ధారాదత్తం చేయడానికి ప్రజల్లో విశాఖ ఉక్కు ఖ్యాతిని మసక బార్చేందుకు కుట్ర పన్నింది. మొన్న పార్లమెంటులో విశాఖ ఉక్కుపై సభ్యులు అడిగిన ప్రశ్నలను ఆసరా చేసుకొని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి విషం కక్కారు. వాస్తవాలకు పాతరేసితీవ్రమైన అబద్ధాలు వల్లించారు.అబద్ధం 1: విశాఖ ఉక్కుకు కేప్టివ్‌ మైన్స్‌ లేకపోవడం వల్ల నష్టాలు రాలేదు-డా॥ బి.గంగారావు
ఇది పచ్చి అబద్ధం. కేప్టివ్‌ మైన్స్‌ అంటే ప్రభుత్వం ఉక్కు పరిశ్రమలకు ముడిఇనుప గనులు కేటా యించడం.దేశంలో సొంతముడి ఇనుప గనులు లేని ఏకైక పరిశ్రమ విశాఖ ఉక్కు.అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ స్టీల్‌ పరిశ్రమలకు ప్రభుత్వం సొంత ఇనుప గనులు కేటాయించింది.ఇంకా నిర్మాణం జరగని బ్రాహ్మణి స్టీల్‌కి, పోస్కోకి కూడా సొంత ముడి ఇనుప గనులు కేటాయించారు.స్టీల్‌ ఉత్పత్తి వ్యయంలో ముడి ఇనుప ఖనిజంపై చేసే ఖర్చు చాలా కీలక మైంది.విశాఖ ఉక్కుకి సొంత ముడి ఇనుప గనులు లేకపోవడంవల్ల ప్రైవేట్‌ వారి నుండి కొనుగోలు చేస్తున్నది.ఈ ఏడాది ఒక టన్ను ముడి ఇనుప ఖనిజాన్ని సగటున సుమారు రూ.8500 కు కొనుగోలు చేశారు.టాటా,జిందాల్‌,మిట్టల్‌ తది తర పరిశ్రమలన్నీ సొంత గనులు ఉండటం వల్ల ఒకటన్ను ముడి ఇనుప ఖనిజాన్ని కేవలం రూ. 800కే సమీకరించు కోగలిగాయి.దీనివల్ల విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఇతర అన్ని స్టీల్‌ప్లాంట్ల కంటే రూ.2 వేల కోట్లకుపైగా అదనంగా ముడి ఖనిజంపై ఖర్చు భరించాల్సి వస్తున్నది.ఫలితంగా ఉక్కు ఉత్పత్తి వ్యయంలో56శాతం విశాఖ స్టీల్‌ ముడి పదార్ధాలకు ఖర్చవుతున్నది.ఇతర స్టీల్‌ప్లాంట్లకైతే ఈ వ్యయం 30శాతం మాత్రమే ఉంటుంది.మార్కెట్‌లో మా త్రం స్టీల్‌ అంతర్జాతీయ రేట్ల ప్రకారం అన్ని కంపె నీలు ఒకే రేటుకు అమ్మాలి.అయినప్పటికీ ఈ ఏడాది 2022జనవరి నాటికి రూ.739కోట్లు నికర లాభం ఆర్జించింది.సొంత ఇనుప గనులు కేటాయిస్తే ఏడాదికి 2 వేల కోట్లకు పైగా లాభాలు ఆర్జిస్తుంది.
అబద్ధం2 :విశాఖ ఉక్కుకు భారీగా నష్టాలు, రుణ భారం
గతఏడేళ్ళలో విశాఖఉక్కు రూ.7122కోట్లు నష్టాలు చవి చూసిందని, రుణ భారం కూడా రూ.22 వేలకోట్లు ఉందని మంత్రి వాపోయారు. విశాఖ ఉక్కు2015-16నుండిలాభాల్లోనే కొనసాగు తున్నది.ఇది వాస్తవం.అయితే విశాఖ ఉక్కుకు ఇటీవల నికర నష్టాలు ఎందుకు వస్తున్నాయంటే మొదటిది దీనికి సొంత ఇనుప గనులు లేకపో వటం.ముడి ఇనుప ఖనిజంధర ఈ ఆరేళ్లలో నాలుగురెట్లు పెరిగింది. రెండోదిప్లాంట్‌ 33 లక్షల టన్నుల నుండి 73లక్షల టన్నులకు విస్తరిం చింది. రాయబరేలిలో 500 కోట్లతో రైలు చక్రాల తయారి పరిశ్రమను నిర్మించింది. వీటికోసం ప్లాంట్‌కి ఉన్న మిగులు నిధులతో పాటు బ్యాంకుల నుండి అప్పులు తీసుకుని విస్తరణ చేపట్టింది.కేంద్ర ప్రభు త్వం ఈవిస్తరణకు ఒక్క రూపాయి పెట్టుబడి ఇవ్వ లేదు.అందువల్ల రూ. 22 వేల కోట్ల అప్పు చేయాల్సి వచ్చింది.పైపెచ్చు అప్పుపై14శాతం వడ్డీ చెల్లిం చాల్సి వస్తున్నది. ప్రైవేట్‌ స్టీల్‌ కంపెనీలకు బ్యాం కులకు ఇచ్చేవడ్డీ రేట్లు విశాఖ స్టీల్‌కి కూడా కేంద్ర ప్రభుత్వం వర్తింప చేస్తే ఏడాదికి కనీసం రూ.700 కోట్లు వడ్డీ ఆదా అవుతుంది.ఈ విస్తరణ ద్వారా సుమారు పదివేల మందికిఉద్యోగాలు కల్పించింది. దేశంలో ఏ ప్రైవేట్‌ స్టీల్‌ ప్లాంట్‌కి అప్పులు లేవు? అంతే కాదు దేశంలో ఉన్న 8 బడా స్టీల్‌ కంపెనీలు సుమారు రూ. 2లక్షల 15 వేల కోట్లు బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టాయి.కేంద్ర బిజెపి ప్రభుత్వం మద్ద తుతోనే రుణాల రద్దు జరిగాయి. విశాఖస్టీల్‌ ప్లాంట్‌ ఏ బ్యాంకుకు ఒక్క రూపాయి ఎగ్గొట్టలేదు. నికర నష్టాలున్నా గత ఏడేళ్ళలో సుమారు16 వేల కోట్లు కేంద్రానికి పన్నులు చెల్లించింది
అబద్ధం 3 : విశాఖ ఉక్కు ఉత్పాదకత, ఉత్పత్తి తగ్గింది. రెండేళ్ల నుండి జీతాలు ఇవ్వలేని స్థితి
గత రెండేళ్లు కోవిడ్‌ సంక్షోభం కొనసాగినప్పటికీ విశాఖ ఉక్కు తన ఉత్పత్తిని 60 లక్షల టన్నులకు పైగా చేయగలిగింది.అంతేగాక గతఆరేళ్లలో టర్నో వర్‌ రూ.12వేల కోట్ల నుండి రూ.24 వేల కోట్లకు పెంచుకోగలిగింది.ఉత్పాదకత బాగా ఉందని, 88 శాతం ఉత్పత్తి సామర్ధ్యాన్ని వినియోగించు కుంటు న్నదని సాక్షాత్తూ స్టీల్‌ పార్లమెంట్‌ స్టాండిరగ్‌ కమిటీ తన నివేదిక లోనే పేర్కొన్నది.వాస్తవంగా ఈ ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం 2025 నాటికి 120 లక్షల టన్నులకు పెంచుకోవాలి.కానీ కేంద్ర బిజెపి నుండి ఆర్థిక సహకారం లేకపోవడంతో ఈ విస్తర ణకు నోచుకోలేక పోయింది.అలా జరిగి ఉన్నట్ల యితే మరో50వేల మందికి ఉద్యోగాలు కల్పించ బడేవి.కోవిడ్‌ కాలంలో దేశంలోని అన్ని ప్రయివేటు స్టీలు పరిశ్రమలు కార్మికులను తొలిగించటం, జీతా ల్లో కోత పెట్టడం చేశాయి. కానీ విశాఖ ఉక్కులో మాత్రం ఈదారుణం జరగలేదు.అంతేకాదు ఏడా దికి రూ.2588 కోట్లు జీతాలకే చెల్లిస్తున్నది.
అబద్ధం 4 : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరిగినా ఇలాగే ఉంటుంది! ఉద్యోగాలు పెరుగుతాయి!!
ప్రైవేటీకరణ జరిగితే ప్లాంట్‌ ఎక్కడికి పోదు. అక్కడే ఉంటుందని పార్లమెంట్‌లో ఉక్కు మంత్రి వ్యం గ్యంగా చెప్పారు.విశాఖ స్టీలు ప్రైవేటీకరణ జరిగితే ఏమౌతుంది? తొలుత దీని విస్తరణకు ఉన్న ఏడు వేల ఎకరాల భూమిని రియల్‌ ఎస్టేట్‌ పేర అమ్మే స్తారు. ఉద్యోగులందరినీ వి.ఆర్‌.ఎస్‌ కింద తొలగి స్తారు.జీతాల్లోభారీగా కోతలు పెడతారు. కాంట్రా క్టు కార్మికులను సైతం తొలగిస్తారు. ఏఒక్కరికి ఉద్యోగ భద్రత ఉండదు.కార్మిక హక్కులు అమలు ఉండదు. ఈ చర్యలు మొత్తం విశాఖ నగర ప్రజల ఆర్థిక జీవనాన్ని దెబ్బతీస్తుంది.ఎయిర్‌ ఇండియాని, నీలాచల్‌స్టీల్‌ని టాటా కొన్నతరువాత జరిగిందేంటి? కార్మికులను కేవలం ఏడాది మాత్రమే కొనసా గిస్తాం, ఆ తరువాత వి.ఆర్‌.ఎస్‌ ద్వారా అందరినీ తొలగిస్తాం అని ప్రకటించారు. విశాఖఉక్కు ప్రైవేటీ కరణ చేస్తే ఇదే జరుగుతుంది.
అబద్ధం 5 : ఉక్కు నిర్వాసితులకు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేశాం !
విశాఖ స్టీల్‌ కోసం 16,500 కుటుంబాలు 22 వేల ఎకరాల భూమిని త్యాగం చేశారు,64 గ్రామా లు తొలగించబడ్డాయి. ఇప్పటివరకు ఇచ్చిన శాశ్వత ఉద్యోగాలు 8 వేలు మాత్రమే.ఇంకా సగం మందికి పైగా ఇవ్వాల్సి ఉంది.ఐదువేల ఉద్యోగాలకే ఒప్పం దం జరిగిందని ఇక ఎవరికీ ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరమే లేదని మంత్రితెగేసి చెప్పారు. నిర్వా సితుల ఉద్యోగాల కోసం అనేక పోరాటాలు జరిగా యి. కాలక్రమంలో నిర్వాసితులందరికి ఉద్యోగాల కల్పనకు అనేక ఒప్పందాలు,హామీలు జరిగాయి.ఈ వాస్తవాలను మంత్రి కప్పిపుచ్చారు. ఇటీవల ఉద్యోగాల భర్తీకిఇచ్చిన నోటిఫికేషన్‌ను కూడా బిజెపి దుర్మార్గంగా రద్దు చేయించింది.ఉక్కు ఉద్యమాన్ని చీల్చడానికి, నీరుగార్చడానికి బిజెపి అనేక కుట్రలకు పాల్పడిరది.నిర్వాసితులపైవల పన్నింది. నిర్వా సితులకు ఉద్యోగాలు ఇస్తామని, మేలు చేస్తామని నమ్మబలికింది.బిజెపి అగ్ర నాయకత్వం విశాఖలో వుండి కొందరిని తనవైపు తిప్పుకోవడానికి కూడా ప్రయత్నం చేసింది.అయినా ఉద్యమంలో చీలిక తీసుకు రాలేకపోయింది.చివరికి ఇప్పుడు నిర్వా సితుల పట్ల బిజెపి తన అసలు నైజాన్ని పార్ల మెంట్‌లో బయటపెట్టింది.నిర్వాసితు లకు అన్నీ ఇచ్చేశాం.ప్లాంట్‌కు నిర్వాసితులకు ఎటువంటి సం బంధం లేదనేవిధంగా దుర్మార్గంగా తెగేసి చెప్పింది
అబద్ధం6: నీలాచల్‌ స్టీల్‌ ప్రైవేటీకరణవల్లఉద్యోగుల జీతాలు రెట్టింపు అయ్యాయి
వాస్తవం ఏమిటంటే ఈ కంపెనీని టాటాకి గత నెల బిజెపి అమ్మేసింది. ఈఅమ్మకంలో నీలాచల్‌ కంపెనీ ఉద్యోగులను కేవలం ఏడాది మాత్రమే కొనసాగించ టానికి, తరువాత వి.ఆర్‌.ఎస్‌ తో వీరిని తొలగించ టానికి టాటాతో బిజెపి ఒప్పందం చేసుకుంది.అంటే త్వరలో పర్మినెంట్‌ ఉద్యోగులం దరినీ తొలగించటం ఖాయం.ఈ నిజాన్ని దాచిపెట్టి ఉద్యోగులకు జీతాలు రెట్టింపయ్యాయనడం ప్రజలను మోసగించడమే. పైగా,మోడీ అధికారం చేపట్టిన తరువాత పూర్తిగా ప్రభుత్వ కంపెనీలను అమ్మేసిన దానిలో నీలాచల్‌ స్టీల్‌ రెండోది.గత ఏడాది లక్షల కోట్ల విలువ చేసే ఎయిర్‌ ఇండి యాను18వేలకోట్లకుటాటా కి అమ్మేశారు. నీలాచల్‌ స్టీల్‌ ఆస్తుల విలువను కేంద్ర ప్రభుత్వం రూ.5616 కోట్లుగా నిర్ధారించి దీనిని రిజర్వు ధరగా ప్రకటిం చింది. టాటా స్టీల్‌ దీనిని ఏకంగా రూ.12,011 కోట్లకు కొనుగోలు చేసింది. ఇదెలా సాధ్యమైంది? ఈ కంపెనీకి వందేళ్ళకు సరిపడా 874 హెక్టార్లలో సుమారు 102 మిలియన్‌ టన్నుల ముడి ఇనుప గనులు ఉన్నాయి. ప్రస్తుత రేటు ప్రకారం ఈ గనులు అమ్ముకుంటే సుమారు రూ.80వేల కోట్లు ఆదాయం వస్తుంది. అంతేగాక ఈప్లాంట్‌ 100 లక్షల టన్ను ల తక్షణ విస్తరణకు అన్ని అవకాశాలు న్నాయి. 2500 ఎకరాల మిగుల భూమి ఉంది. పారదీప్‌ పోర్టుకి దగ్గరలో ఉంది.మోడీ ప్రభుత్వం అందుకే టాటా స్టీల్‌కి కట్టబెట్టింది. విశాఖ ఉక్కులో దీనిని కలిపివేయాలని డిమాండ్‌ చేసినా బిజెపి అంగీక రించలేదు.
అసలు కుట్ర ఏమిటి ?
దేశంలోని ప్రభుత్వ స్టీల్‌ కంపెనీ లన్నింటిని బడా కార్పోరేట్ల పరం చేయాలన్నదే బిజెపి కుట్ర. వామపక్షాలు మినహా దేశంలోని అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఈ విధానాలను బలపరుస్తున్నాయనేది వాస్తవం.90వ దశకంలో మొత్తం దేశీయ స్టీల్‌ ఉత్పత్తిలో ప్రభుత్వ స్టీల్‌ కంపెనీల వాటా 46 శాతం ఉండేది. నేడు 17 శాతానికి పడిపోయింది.గత 3 దశాబ్దాల ప్రైవేటీ కరణ విధానాల వలన టాటా,మిట్టల్‌,జిందాల్‌ వంటి 6బడా కంపెనీలు స్టీల్‌రంగంలో అతి పెద్ద కంపెనీలుగా అవతరించాయి.నేడు స్టీల్‌ ఉత్పత్తిలో వీటి వాటా 46 శాతానికి చేరింది. ఇప్పుడు ప్రభుత్వ స్టీల్‌ పరిశ్రమల న్నిటినీ తమ సొంతం చేసుకో వడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.అలాగే మొత్తంస్టీల్‌ ఉత్పత్తిలో నేడు చిన్నతరహా స్టీల్‌ కంపె నీల మొత్తం కంపెనీలవాటా42శాతం ఉంది.వీటిని కూడా ఈబడా కంపెనీలు మింగే యడానికి ప్రయత్నం చేస్తున్నాయి.అందుకు బిజెపి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది. ఫలితంగా జరగబోయే పరిణామం ఏంటంటే మొత్తం దేశీయ స్టీల్‌ రంగం కేవలం నాలుగైదు బడా కంపెనీల గుత్తాధిపత్యం లోకి వెళ్ళబోతున్నది. వ్యాసకర్త: గౌరవాధ్యక్షులు, స్టీల్‌ప్లాంట్‌ గుర్తింపు యూనియన్‌ (సిఐటియు)

మైదాన గిరిజ‌నుల‌కు మ‌ర‌ణ శాస‌నం

నాన్‌ షెడ్యూల్‌ ప్రాంత గిరిజన గ్రామాలను షెడ్యూల్‌ ప్రాంతాల్లో విలీనం చేయాలని మైదాన ప్రాంత గిరిజనులు చేస్తున్న ఉద్యమం ఉధృతం అవుతుంది. ఎన్నో ఏళ్ల నుంచి వారు చేస్తున్న ఉద్యమాన్ని ప్రజాప్రతినిధులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజన నేపధ్యంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విస్తరి స్తున్నారు. ఈనేపధ్యంలో ఏపీలో మైదాన ప్రాంతాల్లో ఉన్న సుమారు 800 గిరిజన గ్రామాలను విలీనం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అంతే కాకుండా విశాఖ జిల్లా నాతవరం మండలంలో ఉన్న నాలుగు మైదాన ప్రాంత పంచాయితీలను విశాఖ మెట్రో పాలిటిన్‌ రీజయన్‌ డవలప్‌మెంట్‌ అధారిటీ (వీఎం ఆర్‌డీఏ)లో విలీనం చేశారు. వాటిని షెడ్యూల్‌ ప్రాంతాల్లో కలపాలని కూడా ఆ ప్రాంత గిరిజనులు డిమాండ్‌ చేస్తూ ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలను కలసి వినతిపత్రాలు అందజేయడం జరుగుతుంది. ఫలితంగా మైదాన ప్రాంత గిరిజనుల గోడును గిరిజన సంక్షేమశాఖ మంత్రి పి.పుష్పశ్రీ ఆధ్వర్యంలో గిరిజన ప్రాంత శాసన సభ్యులు, పాడేరు ఎమ్మేల్యే కె. భాగ్యలక్ష్మీ,అరకు ఎమ్మెల్యే సిహెచ్‌. ఫాల్గుణ, శ్రీకాకుళం, విజయనగరం గిరిజన నియోజకవర్గాల శాసనసభ్యులు కలసి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మ్మోహన్‌ రెడ్డికి తెలియజేశారు. దానిపై ఆయన సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఎన్ని ఉద్యమాలు చేసినా ఎలాంటి ప్రతిస్పందన రాకపోవడంతో నాన్‌షెడ్యూల్‌ ఏరియా గిరిజనుల జీవనవిధానం మరణశాసనంగా మారింది. అడవినే నమ్ముకొని బ్రతుకుతున్న తాము ఆదివాసులమే అని చెప్పుకుంటున్నా పట్టించుకోని నాధుడు కరవయ్యారు. – సైమన్‌ గునపర్తి ఒకపక్క జిల్లాలు పునర్విభజన కార్యక్రమం ముమ్మ రంగా సాగుతున్నప్పటికీ మైదాన ప్రాంతాలు విలీనం ఒక్క కొలిక్కి రాకపోవడం, ప్రభుత్వం కూడా స్పష్టమైన హామీని ఇవ్వకపోవడంతో ఆ ప్రాంత గిరిజనులు ఉద్యమాన్ని తీవ్ర తరం చేస్తూన్నారు. ఈవిషయంపై అరకు పార్లమెంటు సభ్యురాలు గొడ్డేటి మాధవి పార్లమెంటు సమావేశాల్లో మార్చి 28న పార్లమెంటు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నో ఏళ్ల తరబడి మైదాన ప్రాంత మండలలో జీవనం కొనసాగిస్తున్న గిరిజనులను 5వ షెడ్యూల్‌ పరిధిలోకి తీసుకు రావాలని ఉన్న ప్రధానమైన డిమాండును మార్చి 28న పార్లమెంట్లో గళమెత్తి వినిపించారు.దేశంలో 5వ షెడ్యూల్‌ పరిధిలో ఉన్న అనేక రాష్ట్రాలో ఇదే పరిస్థి ఉందని మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సుమారు 50శాతంపైగా గిరిజనులు నివసిస్తున్న గ్రామలు మైదానప్రాంత మండలలో ఉండటం వల్లన ఆర్థికంగా వెనుకబడిన గిరిజనులు వారి జీవనం కొనసాగించడం కష్టతరమైన తరుణంలో వారికి ఐటిడిఏ నుండి ఎటువంటి సహాయ సహకారాలు అందకపోవడంతో మరింత వెనకబడిపోతున్నారని కావున వారినీ దృష్టిలో పెట్టుకుని ఐటీడీఏ నుంచి అన్ని రకాల సహాయ సహకారలు అందేరీతిలో రాజ్యాంగ భద్రత కల్పించవలసిందిగా కేంద్ర గిరిజన శాఖ మంత్రివర్యులు శ్రీ అర్జున్‌ ముండాను అరకు ఎంపీ కోరారు. నాన్‌ షెడ్యూల్‌ ఏరియాల్లో గిరిజనులకు హక్కులు ఎందుకు లభించట్లేదు?
వాళ్లంతా గిరిజనులు. రాజ్యాంగపరంగా గుర్తింపు పొందినా సరే.. వాళ్లకు ఏజెన్సీలో ఉన్న రాయితీలు అందడం లేదు. కనీసం రిజర్వేషన్లు కూడా వర్తించడం లేదు. అభివృద్ధి విస్తరణలో తమ హక్కుల్ని కోల్పోతున్న గిరిపు త్రుల దుస్థితి ఇది. గిరిజన ప్రాంతాల్లోనే ఉన్నా, కొన్ని గ్రామాలు ప్రభుత్వ రికార్డులలో నాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియాల్లో నమోదై ఉండటమే.
ఏజెన్సీ, షెడ్యూల్డ్‌ ఏరియా అంటే…
బ్రిటిష్‌ పాలనలో…గిరిజన తెగలు నివసించే అటవీ ప్రాంతాల్లో పరిస్థితులు, ఆచారాలు భిన్నంగా ఉన్నందున..కొండల్లో ఉండే గ్రామాలను షెడ్యూల్డ్‌ (నిర్దేశిత, ప్రత్యేక) ఏరియాలుగా పేర్కొన్నారు. అందుకోసం ూషష్ట్రవసబశ్రీవస ణఱర్‌తీఱష్‌ం Aష్‌1874 అమల్లోకి తెచ్చారు. మద్రాస్‌ ప్రెసిడెన్సీ నుంచి నియమి తులైన ప్రభుత్వ ఏజెంట్‌ పర్యవేక్షణలో ఈ ప్రాంతాల్లో పరిపాలన జరిగేది. ఏజెంట్‌ పరిపాలనలో ఉన్న ప్రాంతాలు కావడంతో ప్రభుత్వం నోటిఫై చేసిన ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు రాజ్యాంగం కల్పించిన హక్కులు పొందుతారు. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో ఏదైనా చట్టం అమలు చేసే ప్రక్రియలో గిరిజనుల ఆచార, సంప్రదాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. అయిదో షెడ్యూల్‌ లో ఉన్న గిరిజన ప్రాంతాలను తొలగించడం, లేదా కొత్తగా ఏర్పాటు చేయడం వంటి వాటిపై అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. ‘‘షెడ్యూల్డ్‌ ఏరియాలో ఉంటున్న గిరిజనులకు, నాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియాలో ఉంటున్న గిరిజ నులకు…హక్కులు, చట్టాలు, రక్షణ విషయాల్లో చాలా తేడా ఉంటుంది. షెడ్యూల్డ్‌ ఏరియా గ్రామాల్లో ఆదివాసి భూముల అమ్మకాలు, కొనుగోళ్లు ఆదివాసీల మధ్య మాత్రమే జరగాలని చెప్పే 1/70వంటి చట్టాలు అమ లులో ఉంటాయి. అదే నాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియాలో అయితే గిరిజనుల భూముల్ని ఎవరైనా కొనవచ్చు, అమ్ముకోవచ్చు. ఈ భూ ములపై సివిల్‌ కోర్టుల్లో కేసులు కూడా వేయ వచ్చు’’ అని నాన్‌-షెడ్యూల్డ్‌ గిరిజనుల సంఘం గిరిమిత్ర సంస్థ కార్యదర్శి బండి గంగరాజు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చే సబ్‌ ప్లాన్‌ నిధులు షెడ్యూల్డ్‌ ఏరియాకే వర్తిస్తా యని, గ్రామసభలకు అధికారాలిచ్చే పీసా చట్టం లాంటివి అమల్లో ఉంటాయని గంగరాజు వెల్లడిరచారు. మైనింగ్‌ అనుమతులు ఇవ్వాల న్నా గ్రామసభల అనుమతి కావాల్సిందేని ఆయన తెలిపారు. ‘’నాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియాలో పీసా చట్టం, గ్రామ సభల అనుమతులతో పని లేదు. ఇలా నాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియాలో ఉన్న గిరిజనులు రాజ్యంగం కల్పించిన హక్కులను, రక్షణను పొందలేకపోతున్నారు’’ అన్నారు.
షెడ్యూల్డ్‌ ప్రాంతంగా మారాలంటే…
విశాఖపట్నంలోని నాన్‌ షెడ్యూల్డ్‌ గిరిజన ప్రాంతాల్ని వీఎంఆర్డీఏలో చేర్చడాన్ని తప్పు పడుతూ గిరిజన సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. అయితే ఏవైతే షెడ్యూల్డ్‌ ఏరియాలో కలిపేందుకు అర్హతలున్న గ్రామాలను ఏజెన్సీలో కలిపేందుకు వివరాలు సేకరించి ప్రభుత్వానికి పంపించామని రావికమతం మండలం తహాశీల్దార్‌ కనకరావు చెప్పారు. ‘‘రావికమతం మండలంలో నాన్‌ -షెడ్యూల్డ్‌ ఏరియాలో 33రెవెన్యూ గ్రామా లున్నాయి. ఎస్టీ జనాభా 50శాతంకంటే ఎక్కువ ఉన్నగ్రామాలను షెడ్యూల్డ్‌ ఏరియాలో చేర్చవచ్చంటూ ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పని చేస్తున్నాం. జనాభాతో పాటు అక్షరాస్యత, సమీప షెడ్యూల్డ్‌ ప్రాంతం వంటి విషయాలను కూడా పరిగణలోకి తీసు కోవాలని ప్రభుత్వ గైడ్‌ లైన్స్‌ లో ఉంది. రావిక మతం మండలంలో 5 గ్రామాల్లో 50శాతం కంటే ఎక్కువ ఎస్టీ జనాభా ఉన్నారు’’ అని కనకరావు చెప్పారు.
‘ముఖ్యమంత్రులే ఉల్లంఘిస్తున్నారు’
రాజ్యాంగంలో ఆర్టికల్‌ 244(1) ఆర్టికల్‌, అయిదవ షెడ్యూల్‌ ద్వారా ఆదివాసీలకు ప్రత్యేకంగా ఎన్నో హక్కులున్నాయని, అయితే వీటిని అమలు చేయడంలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు విఫలమయ్యారని ఉమ్మడి రాష్ట్ర గిరిజన సంక్షేమ కార్యదర్శిగా పని చేసిన మాజీ ఐఏఎస్‌ అధికారి ఈఏఎస్‌ శర్మ అన్నారు. గిరిజనుల హక్కులు,సంక్షేమం,నాన్‌ షెడ్యూల్డ్‌ ఏరియాల అంశాలను ప్రస్తావిస్తూ…తెలంగాణా సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం జగన్‌లకు ఆయన లేఖలు రాశారు.‘‘ప్రాజెక్టుల విషయంలో పీసా, అటవీ హక్కుల చట్టాల కింద గ్రామ సభలు నిర్వహించి తగిన నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని రెండు ప్రభుత్వాలు గిరిజనులకు ఇవ్వడం లేదు. అనుమతులు లేకుండా రెండు రాష్ట్రాలలో ప్రైవేట్‌ వ్యక్తులు ఏజెన్సీ ప్రాంతా ల్లోని ఖనిజ సంపదను పెద్ద ఎత్తున కొల్లగొడు తున్నారు. ప్రభుత్వాలు గిరిజనే తరులతో కుమ్మక్కు అవుతున్నట్లు కనిపిస్తున్నది. ఈ విష యాలను గుర్తించి, మీరు తగిన చర్యలను తక్షణమే తీసుకుంటారని ఆశిస్తున్నాను’’ అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. జిల్లాలో మైదాన ప్రాంతంలో వున్న 13 మండలాలను విశాఖ మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్‌డీఎ)లో విలీనం చేయడం తో కొత్త వివాదానికి తెరలేచింది. ఏజెన్సీకి ఆనుకుని మైదాన ప్రాంతంలో వున్న గిరిజన గ్రామాలను వీఎంఆర్‌డీలో చేర్చడంపై గిరిజ నులు భగ్గు మంటున్నారు. తమ గ్రామాలను షెడ్యూల్డ్‌ ఏరియాలో చేర్చాలన్న రాష్ట్ర గిరిజన సలహా మండలి తీర్మానాన్ని ప్రభుత్వం బుట్టదాఖలు చేసిందని వాపోతున్నారు.జిల్లాలో మొత్తం 43 రెవెన్యూ మండలాలు వుండగా వీటిల్లో 19 మండలాలను గతంలోనే వీఎంఆర్‌డీఏ పరిధిలో చేర్చారు. తాజాగా ఏజెన్సీలోని 11 మండలాలు మినహా మైదాన ప్రాంతంలో మిగిలిన 13 మండలాలను కూడా వీఎంఆర్‌డీఏలో విలీనం చేశారు. అయితే జిల్లాలో ఏజెన్సీకి ఆనుకుని వున్న మైదాన ప్రాంతంలోని నాతవరం నుంచి దేవరాపల్లి వరకు ఎనిమిది మండలాల్లో 113 రెవెన్యూ గిరిజన గ్రామాలు ఉన్నాయి. వీటిల్లో లక్షా 60 వేల మంది గిరిజనులు నివాసం వుంటున్నారు. ఈ గ్రామాలు నాన్‌ షెడ్యూల్డు ఏరియాలో వుండడంతో ఐటీడీఏ పరంగా ఎటువంటి సహాయ సహకారాలు అందడం లేదు.
షెడ్యూల్‌ ఏరియాలో కలిపితే ఎంతో మేలు
గిరిజన జనాభా ఎక్కువ ఉన్న నాన్‌ షెడ్యూల్‌ ప్రాంతంలోని గ్రామాలను షెడ్యూల్డ్‌ ఏరియాలో కలిపితే గిరిజనులకు ఎంతో మేలు జరుగు తుందని పాడేరు, అరకు ఎమ్మెల్యేలు కె.భాగ్య లక్ష్మి, శెట్టి ఫాల్గుణ అన్నారు. 50శాతం కంటే ఎక్కువ గిరిజనులు నివసిస్తున్న నాన్‌ షెడ్యూల్‌ గ్రామాలను షెడ్యూల్డ్‌ ఏరియాలో కలిపేందుకు ఐటిడిఎ పిఒ గోపాలకృష్ణ రోణంకి ఆధ్వర్యంలో ఐటిడిఎ సమావేశ మందిరంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ఎన్నో ఏళ్ల నుంచి నాన్‌ షెడ్యూల్‌ ప్రాంతంలో ఉన్న గిరిజనులు తమ గ్రామాలను షెడ్యూల్డ్‌ ఏరియాలో కలపాలని కోరుతున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు వారికి అమలు కావడం లేదని పేర్కొన్నారు. ఐటిడిఎ పిఒ గోపాలకృష్ణ మాట్లాడుతూ గిరిజనుల కోసం రాజ్యాంగంలో 5వ షెడ్యూల్‌లో ప్రత్యేక హక్కులు కల్పించడం జరిగిందని, 2011 జనాభా ప్రకారం 50 శాతం పైగా గిరిజన జనాభా ఉన్న గ్రామాలను 5వ షెడ్యూల్‌ ప్రాంతంలో చేర్చేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పిస్తామని చెప్పారు. అర్హత కలిగిన గ్రామాలను గుర్తించి గ్రామసభల ద్వారా తీర్మానాలను తమ కార్యాల యానికి సమర్పించాలని నాన్‌ షెడ్యూల్‌ మండలాల తహశీల్దార్లు, ఎంపిడిఒలను ఆదేశించారు.

పోలవరం ముందుకు సాగేనా..?

ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్రం మరో మెలిక పెట్టింది. మరోసారి సామాజిక, ఆర్థిక సర్వేను నిర్వహించాలని రాష్ట్రానికి షరతు విధించింది. లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఎంపీలు బ్రహ్మానంద రెడ్డి, సత్యవతి, రెడ్డప్పలు అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయ మంత్రి బిస్వేస్వర్‌ రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్‌పై డీపీఆర్‌ తయారు చేయాల్సిందేనని నిబంధన విధించినట్లు జల్‌శక్తి శాఖ తెలిపింది. ప్రాజెక్టు నిర్మాణం ఎప్పుడు పూర్తి చేస్తారో గడువు షెడ్యూల్‌ చెప్పాలని కేంద్ర జలశక్తి శాఖ కోరింది. పోలవరం నిర్మాణంలో ప్రస్తుతానికి రూ.15668 కోట్ల వరకే తమ బాధ్యత అని కేంద్రం మరోసారి తేల్చి చెప్పింది. ఫిబ్రవరి 2022 వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు రూ. 14336 కోట్లు మాత్రమే అని.. దీనిలో రూ. 12311 కోట్లు కేంద్రం రాష్ట్రానికి తిరిగి చెల్లించిందని తెలిపారు. అలాగే రూ. 437 కోట్లకు పోలవరం అథారిటీ బిల్లులు పంపిందని కేంద్ర జలశక్తి శాఖ పేర్కొంది. కేంద్రం కొత్త నిబంధనలతో పోలవరం నిర్మాణం మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. కేంద్రం కొత్త మెలికపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.
ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెకు నిర్వా సతుల కథ మళ్లీ మొదటికి వచ్చేలా కనిపిస్తోంది. ఒకపక్క ప్రధాన ప్రాజెక్టు ఎర్త్‌కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ పనులు ఇంతవరకు మొదలెట్టలేదు. స్పిల్‌వే సుమారుగా పూర్తయింది. కానీ ఇంకా కొన్ని గేట్లు అమర్చాలి. ఎగువ కాఫర్‌డ్యామ్‌ గ్యాప్‌లను పూర్తి చేసి,ఇప్పటికే అక్కడ కొంత నీటిని నిల్వ చేసిన సంగతి తెలిసిందే. ఇక ప్రాజెక్టు ఏస్థాయిలో కదులు తుందో చెప్పలేని పరిస్థితి.ఎందుకంటే నిధు లు కొరత.ఇటీవల కేంద్రం మంజూరు చేసిన రూ. 320 కోట్లు తిరిగివెళ్లిపోయాయి. దీంతో ప్రధాన ప్రాజెక్టు సంగతి ఎలా ఉన్నా పోలవరం ముంపు గ్రామాల నుంచి బయటకు వచ్చిన వారికి ఇంకా రావలసిన సౌకర్యాలు ఇవ్వలేదు.
కొందరికి పునరావాస కాలనీలు నిర్మిం చారు. కానీ వారికి మనిషి ఒక్కరికి రూ.6.66 లక్షల వంతున రావలసిన సొమ్ము కూడా పూర్తిగా ఇవ్వలేదు.భూమికి భూమి ఇవ్వలేదు. అటు దేవీ పట్నం,మడుపల్లి,కె.వీర వరం తదితర గ్రామాలను గత జూన్‌లోనే ఖాళీ చేయించారు. కానీ ఇంత వరకూ వాళ్లకు కాలనీలు నిర్మించలేదు. పరిహార మూ పూర్తిగా ఇవ్వలేదు. ఇళ్ల పట్టాలు మాత్రం ఇచ్చారు. కానీ అక్కడ ఇళ్ల నిర్మాణం చేపట్టలేదు. పైగా అక్కడ పట్టాలు ఇవ్వడానికి సేకరించిన భూ మి యజమానికి సైతం ఇంకా డబ్బు ఇవ్వకపోవడం గమనార్హం. దీంతో నిర్వాసితులంతా, ఏజెన్సీలోని మిగతా ప్రాంతాల్లోనూ,గోకవరం వంటి ప్రాంతా ల్లోనూ అద్దె ఇళ్లలో ఉంటున్నారు. బలవంతంగా ఖాళీ చేయించిన అధికారులు కనీసం వాళ్లకు ఇళ్ల సౌకర్యం కూడా కల్పించలేదు. ఒక్కో కుటుంబం రూ.3వేల నుంచి అయిదు వేల వరకు అద్దె ఇచ్చి జీవనం సాగిస్తున్నారు. అక్కడ అడవిని, పొలాలను వదిలిరావడంతో వారికి జీవనోపాధి కూడా లేదు. పునరావాస కాలనీల్లో ఉంటున్న ప్రజల పరిస్థితీ దయనీయంగా ఉంది. పనులు లేకపస్తులు ఉం టున్నారు. ఈనేపథ్యంలో వారంతామళ్లీ తమ గ్రామాలకు వెళ్లి ఏదొక విధంగా బతుకుదామనే నిర్ణయానికి వచ్చారు. దేవీపట్నం, మడుపల్లి గ్రామ ప్రజలు ఇప్పటికే రెవెన్యూ అధికార్లకు ఈ విషయం చెప్పారు.ఈనేపథ్యంలోనే తమ సమస్యలు పరిష్కరిం చాలని కోరుతూ దేవీపట్నం సర్పంచ్‌ కుంజం రాజా మణి ఆధ్వర్యంలో గోకవరం మండలం కృష్ణుని పాలెంలో నిరశన దీక్ష కొనసాగిస్తుండగా,33వ రోజుకు చేరుకుంది.నిర్వాసితులు మాట్లాడుతూ ఇటీ వల మొదలెట్టినట్టు మొదలెట్టి, పనులు ఆపేసిన ఇళ్లు ఎప్పుడు నిర్మిస్తారు, ఎందుకు మా బతుకులతో ఆటలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెలాఖరు వరకూ ఆగుతాం,ఈలోగా పరిహారం ఇచ్చి,ఇళ్లను చూపించకపోతే తమ గ్రామాలకు తిరిగి వెళ్లిపోతామని దేవీపట్నం,పూడుపల్లికి చెందిన నిర్వాసితులు అల్టిమేటం ఇచ్చారు. వాస్తవానికి దేవీ పట్నం మండలంలో పోలవరం ముంపునకు గురయ్యే గ్రామాలు 44.అందులో 18గ్రామాలకు పునరావాసం కల్పించి అధికారులు ఖాళీ చేయిం చారు.కానీ వారికి కూడా ఇంకా పూర్తిగా పరిహారం అందలేదు. ప్రత్యామ్నాయ జీవనోపాధి కూడా చూపించలేదు. కొండమొదలు ప్రాంతంలోని 11 గ్రామాలప్రజలు అధికారుల మాట బేఖాతర్‌ చేశా రు. తమకు అన్ని పరిహారంతోపాటు భూమికి భూమిఇచ్చి,కాలనీలు నిర్మించిన తర్వాతే వస్తామని ఖరాఖండీగా చెప్పారు.మిగతా గ్రామాలను మా త్రం నయోనో భయానో ప్రభుత్వం ఖాళీ చేయిం చింది. ఎంత దారుణమంటే గత ఏడాది జూన్‌ తర్వాత వరద సమయంలో వరదతో ఊళ్లన్నీ మునిగిపోతే కనీస వరద సహాయం కూడా చేయ లేదు.ఎగువ కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం పూర్తి కావడం 32 మీటర్ల ఎత్తువరకూ వరద నీరు రావడంతో ఊళ్లన్నీ వరద గోదావరిగా మారిపోయాయి. దీంతో చాలామంది ఊళ్లు ఖాళీ చేశారు.
ఇక ప్రభుత్వ అధికారులు ఎవరినీ తిరిగి గ్రామాలకు వెళ్లనీయలేదు. దీనితో దిక్కులేని బతుకు బతుకుతున్నారు. ఇంతవరకూ పరిహారం అందక పోవడం,పునరావాస కాలనీలు కూడా పూర్తి కాక పోవడంతో,అసలు ఈప్రాజెక్టు పరిస్థితి అర్థం కాక, తిరిగి తమ గ్రామాలకు వెళ్లిపోవడానికి ప్రజ లు సిద్ధమవుతున్నారు. ఒకగ్రామంకదిలిందంటే మిగతా వారు కూడా కదిలే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో పోలవరంకథ మళ్లీ మొదటికి వస్తుందేమోననే అను మానం ఉంది.
నిర్వాసితులకు ఏ సమస్యా రానివ్వం
పోలవరం ప్రాజెక్టు కోసం నిర్వాసితుల త్యాగం మరవలేనిదని, అందుకు అనుగుణంగా గతంలో తామిచ్చిన హామీలన్నీ నెరవేర్చేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మరోపక్క అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాల్లోని ప్రజలకు జంగారెడ్డిగూడెం మండలం తాడువాయిలో రూ.488 కోట్లతో 3,905 ఇళ్లతో నిర్మిస్తున్న ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీ, తూర్పుగోదావరి జిల్లా దేవీ పట్నం మండలం ఇందుకూరు-1 పునరా వాస కాలనీలను కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో కలిసి పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఆయన లబ్ధిదారులతో మాట్లాడారు. పోల వరం ప్రాజెక్టుకోసంఎంతో మంది గిరిజనులు తమ గ్రామాలను,గృహాలను ఖాళీచేసి ప్రాజెక్టు నిర్మా ణానికి త్యాగం చేశారన్నారు. ప్రస్తుతం వారి కోసం గృహ నిర్మాణాలు చకచకా సాగుతున్నాయని, ప్రతి ఒక్కరికీ మంచి గృహ వసతి,పునరావాసం కల్పిం చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిర్వాసితులకు ఉపాధి కోసం నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను అమలు చేసేందుకు కేంద్రంతో కలిసి కార్యాచరణ రూపొందిస్తామని, ఇందుకు కేంద్ర మంత్రి కూడా సానుకూలంగా ఉన్నారని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖ రరెడ్డి గతంలో ఇచ్చిన రూ.1.50లక్షల నష్టపరి హారానికి మరో రూ.3.50లక్షలపరిహారాన్ని అద నంగాఅందించేందుకుచర్యలు తీసుకుంటామన్నారు. వ్యక్తిగత ప్యాకేజీకి సంబంధించి కేంద్రం రూ.6.80 లక్షలకు అదనంగా మరో రూ.3.20 లక్షలు కలిపి మొత్తంరూ.10లక్షలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటా మని చెప్పారు.‘పునరావాస పనులపై జిల్లా కలెక్టర్లు, ఆర్‌అండ్‌ఆర్‌ అధికారులు మరింత దృష్టి పెట్టాల్సిన అవసరముంది.కాలనీలో పర్యటించినప్పుడు నిర్వాసి తులు కొన్ని సమస్యలు చెప్పారు. వాటి పరిష్కారానికి అధికారులు చొరవ చూపుతుండటం సంతోషం. మిగిలిన అన్ని సమస్యల పరిష్కారానికి మరింత చొరవ తీసుకోవాలి’ అని సూచించారు.
గిరిజనులతో మాటామంతి
నిర్వాసితుల సమస్యలు ఆలకిస్తూ వారికి భరోసా కల్పిస్తూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర మంత్రి షెకావత్‌ల పర్యటనసాగింది. ఇందు కూరు-1 కాలనీ ముఖద్వారంవద్ద గిరిజనులు వారికి నుదుట బొట్టుపెట్టి, గిరిజన సంప్రదా యంగా కొమ్ములతో తయారు చేసిన తలపాగాలను ధరింపచేసి అభిమానాన్ని చాటుకున్నారు. కాసేపు వాటిని తలపై ఉంచుకుని సీఎం, కేంద్ర మంత్రి కాలనీలో నడుచుకుంటూ గిరిజనులను ఆనందింప చేశారు. కాలనీలో అభివృద్ధి కార్యక్రమాల గురించి రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రవీణ ఆదిత్యవారికి వివరించారు. కాలనీలోఉన్న ఏను గులగూడెంకు చెందిన తురసం లక్ష్మి ఇంటికి వెళ్లి మంచంపై కూర్చుని ఇంట్లో ఉన్న వారితో కాసేపు ముచ్చటించారు. సీఎం ఆఇంటిని ఆసాంతం పరిశీ లించారు. ఫొటో గ్యాలరీని తిలకించారు. కాలనీ లో ఉన్న 350ఇళ్లలో 40 మినహా మిగిలిన ఇళ్లల్లోకి నిర్వాసితులు అంతా వచ్చేశారని, భూమికి భూమిగా 161ఎకరాలు 87మంది నిర్వాసితులకు అంద జేసినట్టు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ చేవూరి హరికిరణ్‌ సీఎంకు వివరించారు. అనం తరం సీఎం, కేంద్ర మంత్రి లబ్ధిదారులతో ముఖా ముఖి నిర్వహించారు. వారు చెప్పిన సమస్యలను ఓపిగ్గా విన్నారు. మధ్యలో కేంద్రమంత్రి కల్పించు కుం టూ.. సొంత గ్రామ అనుభూతిని ఈ కాలనీలో పొందుతున్నారా.. అని ప్రశ్నించగా, లబ్ధిదారులు చాలా బాగుందని చెప్పారు. అనంతరం అందరి వినతులు స్వీకరించి అక్కడి నుంచి ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఇళ్లు బావున్నాయి: షెకావత్‌ ప్రశంసలు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజ శేఖరరెడ్డి పోలవరం ప్రాజెక్టు అవసరతను గుర్తించి, ప్రాజెక్టు నిర్మాణానికి ముందుకు కదిలారని కేంద్ర మంత్రి షెకావత్‌ అన్నారు. ఏపీవిభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తోం దన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌, ప్రధాని నరేంద్రమోదీ పోలవరం ప్రాజెక్టుపై ఇటీవల ఢల్లీిలో సుదీర్ఘంగా చర్చించారని, త్వరితగతిన ప్రాజెక్టు నిర్మాణం పూర్త య్యేలా నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తామని చెప్పారు.నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు సహకరిస్తా మని స్పష్టం చేశారు.అంతకు ముందు సీఎం, కేంద్ర మంత్రి..నిర్వాసితులు లక్ష్మీకాంతం, వెంకట స్వామి గృహాలను ప్రారంభించి, వసతులను పరిశీ లించి సంతృప్తి వ్యక్తం చేశారు. నిర్వాసితులకు అన్ని వస తులతో కూడిన గృహాలను రాష్ట్ర ప్రభుత్వం, సీఎం జగన్‌ నిర్మిస్తున్నారని అభినందించారు. ‘పునరా వాస కాలనీలో మౌలిక వసతులు చాలా బాగున్నా యి. నిర్వాసితులు మాదృష్టికి తెచ్చిన ఉపాధి, ఇతర సమస్యలను ఎలా పరిష్కరించాలని ముఖ్య మంత్రి జగన్‌, నేను మాట్లాడుకున్నాం. ఈ ప్రాజెక్టు కోసం ఏసహకారం కావాలని రాష్ట్రం అడిగినా సహాయ పడతాం.మరోసారి ఇక్కడికి వస్తాను’ అని చెప్పారు. నిర్వాసితుల డిమాండ్స్‌
ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ పెంచి రూ. పది లక్షలు ఇవ్వాలని.(దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం 244 జీ. ఓ. ను తేవడమే కాకుండా,500 కోట్లు విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించింది.) ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకే జీకి అర్హులుగా గుర్తించి సర్వేలో ఉన్న వారు మర ణించి నట్లయితే ఆ సొమ్మును వారి కుటుంబ సభ్యులకు ఇవ్వాలని. సర్వే రిపోర్టులో ఉన్న 18 సం.లు నిండిన ఆడపిల్లలపేర్లు పెండ్లి చేసుకు న్నారని తొలగించారని, వారికి కూడా ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఆర్‌ ఓఎఫ్‌ఆర్‌ చట్ట ప్రకారం గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు,భూమికి భూమిఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇంకా చాలా మంది గిరిజ నులు నుండి సేకరించిన భూమికి భూమి,నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పునరావాస కాలనీలలో చాలా సమస్యలు అసం పూర్తి గా ఉన్నాయి.చట్టప్రకారం 25రకాల సౌక ర్యాలు పూర్తి చేయాలనీ డిమాండ్‌ చేస్తున్నారు.
నిర్ణీతగడువులోగాపోలవరం ప్రాజెక్టు పూర్తి కావడం అసాధ్యం : కేంద్ర ప్రభుత్వం
ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. నిర్ణీత గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయడం అసాధ్య మని తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్న పార్ల మెంటరీ సమావేశాల్లో రాజ్యసభలో టీడీపీ సభ్యుడు కనకమేడల మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పనుల్లో జాప్యం గురించిప్రశ్నించారు. దీనిపై కేంద్ర జలశక్తిశాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్‌ తుడు లిఖిత పూర్వకంగా సమాధాన మిచ్చారు. 2022 ఏప్రిల్‌ నాటికి పోలవరం ప్రాజెక్టుపూర్తి కావాల్సి ఉందని… అయితే సాంకేతిక కారణాల వల్ల పనుల్లో జాప్యం చోటుచేసుకుంటోందని చెప్పారు. నిర్వాసితులకు పరిహారం, పునరా వాసం తో పాటు కరోనావల్ల కూడాజాప్యం జరిగిం దని బిశ్వేశ్వర్‌ తెలిపారు.డ్యామ్‌ స్పిల్‌ వే చానల్‌ పనులు 88శాతం,అప్రోచ్‌ చానల్‌ ఎర్త్‌ వర్క్‌ పనులు73 శాతం, పైలట్‌ చానల్‌ పనులు34శాతం మాత్రమే పూర్తయ్యా యని చెప్పారు.
అయితే ‘‘పోలవరం ప్రాజెక్టును 2018 మార్చి నాటికేపూర్తి చేస్తాం. రాసిపెట్టుకో..’’ అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మాట లివి. 2016 మార్చి 10న ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ లో ఆయన ఈ ప్రకటన చేశారు. ‘‘తొందరెందుకు కన్నా! 2021 డిసెంబర్‌ 1కే ప్రాజెక్టు పూర్తి చేస్తాం. 2022 ఖరీఫ్‌లో పోలవరం ప్రాజెక్టు నుంచి నీటిని అందిస్తాం’’ ఈ మాటలు ప్రస్తుత నీటిపారుదల శాఖ మంత్రి పి. అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అసెంబ్లీ లోనూ,వెలుపలా చెప్పినవి. 2020 డిసెంబర్‌లో ఆయన ఇలాంటి ప్రకటనలు చేశారు.ఈ ఇద్దరు మంత్రులుచెప్పినమాటలూ అమలుకి నోచు కోలేదు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాలేదు. ప్రాజెక్టులో కీలక పనులన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను చట్టం ప్రకారం కేంద్రమే అందించాలి. పార్లమెంట్‌ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రులు అదే సమాధానం చెప్పా రు. పోలవరం నిర్వాసితుల విషయంలోనూ ప్రభు త్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది’’అని ఎద్దేవా చేశారు.- జి.ఎన్‌.వి.సతీష్‌

ప్రజల భాగస్వామ్యంతోనే వికేంద్రీకరణ

జగన్‌గారి మాటల్లో గాని, వైఎస్సార్‌ సిపి వారి ప్రచారంలో గాని పరిపాలన వికేంద్రీకరణ అంటే రాజధానిని ముక్కలుగా చేసి ఒక్కొక్క ఆఫీసు ఒక్కోదగ్గర పెట్టడంగా ఉన్నది. అది వికేంద్రీకరణకు వికృత రూపం అవుతుంది తప్ప నిజమైన వికేంద్రీకరణ అవదు. అది ప్రజలకు కూడా అసౌకర్యంగా ఉంటుంది. పరిపాలన వికేంద్రీకరణ అంటే కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రాలకు ఎక్కువ హక్కులు రాజ్యాంగ పరంగా ఇవ్వడం, అది ఒక బలమైన ఫెడరల్‌ వ్యవస్థగా, ఐక్యంగా దేశం ముందుకు పోవడానికి తోడ్పడేది. అదే సమయంలో గ్రామ, పట్టణ స్థాయిలో స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేయడం ద్వారా ప్రజల వద్దకు నేరుగా పరిపాలనను తీసుకురావడం, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని, అభివృద్ధికి తక్షణం చర్యలు తీసుకోవాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అసెంబ్లీలో జరిగిన చర్చ, ఆ సం దర్భంగా ముఖ్యమంత్రి ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదు. ప్రజల్లో మరింత గందరగోళం పెంచుతోంది. అభివృద్ధి అంటే ఏమిటి? అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏమిటి? పాలనా వికేంద్రీకరణ అంటే ఏమిటి? రాజధాని వికేంద్రీకరణ అంటే ఏమిటి? ఇలాంటి అనేక అంశాలు ఈరోజు చర్చనీయాంశాలుగా మన ముందుకు వచ్చాయి. – (వి.శ్రీనివాసరావు)
అభివృద్ధి అంటే పెద్దపెద్ద రోడ్లు, విమానా శ్రయాలు, పోర్టులు మాత్రమే కాదు. ఈరోజు యువతకు ఉపాధి కల్పించగలిగిన పరిశ్రమల స్థాపన, ప్రజలందరికీ తిండి పెట్టగలిగిన వ్యవసాయ ఉత్పత్తి పెంపుదల ఈ రెండు లేకుండా అభివృద్ధి జరగదు. అలాంటి అభివృద్ధి జరిగినా అది గాలిబుడగలా ఏదో ఒకరోజు పేలిపోతుంది తప్ప ప్రజలకు ఫలితాలు ఇవ్వదు. ఈరోజు రాష్ట్రంలో చాలా జిల్లాలు, మండలాలు అత్యంత వెనుకబడి ఉన్నాయి. వెనుకబాటుకు ప్రధానమైన కొలబద్ద అక్కడ సహజ వనరులను ఉపయోగించుకుని పరిశ్ర మలు అభివృద్ధి చెందుతున్నాయా లేదా, వ్యవసా యానికి నీటి వనరులు ఉన్నాయా లేదా, ఆధునిక పద్ధతులలో వ్యవసాయం జరుగు తున్నదా లేదా? ఒక్క మాటలో చెప్పాలంటే పెట్టుబడి దారీ అభివృద్ధినే మనం ఈ రోజుఅభివృద్ధిగా భావిస్తున్నాం. పెట్టుబడిదారీ వ్యవస్థకు ముందున్న భూస్వామ్య వ్యవస్థ అవశేషాలు, అలాగే అత్యంత పురాతనమైన ఆదిమ వ్యవస్థ అవశేషాలు కూడా నేడు రాష్ట్రంలో కొనసాగు తున్నాయి. అటు ఆదిమ వ్యవస్థ, ఇటు కాలం చెల్లిన భూస్వామ్య వ్యవస్థ, మరొక వైపు ముందు కు పోలేక సంక్షోభంలో కొట్టుమిట్టా డుతున్న పెట్టుబడిదారీ వ్యవస్థ,ఈ మూడు మిశ్రమ రూపాలు మన రాష్ట్రంలో కనిపిస్తుం టాయి. కాబట్టి వెనుకబడినటువంటి భూస్వామ్య వ్యవస్థ అవశేషాలున్న ప్రాంతాల్లో కూడా పెట్టుబడిదారీ పద్ధతుల్లో వ్యవసాయం, పరిశ్ర మలు అభివృద్ధి అయితే దాన్ని మిగతా ప్రాంతాలతో ముందుకు పోవడంగా మనం భావిస్తాం.కానీ పెట్టుబడి దారీ అభివృధ్ధి కూడా పూర్తి స్థాయిలో జరగడం లేదు. అందులో ఉన్నటువంటి అంతర్గత వైరుధ్యాల మూలంగా సంపద కేంద్రీకరణ పెరిగి ఆర్ధిక వ్యత్యాసాలు తీవ్ర రూపంలో ముందుకు వస్తున్నాయి. ఫలితంగా ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయి మాంద్యం ఏర్పడుతున్నది. నిరుద్యోగం పెరుగుతున్నది. ప్రాంతీయ, సామాజిక వ్యత్యాసాలు కూడా పెరుగు తున్నాయి. ఈ వ్యత్యాసాల ఫలితమే ఆర్ధిక సంక్షోభం రూపంలో మనకు కనిసిస్తున్నది. అందువలన పెట్టుబడిదారీ వ్యవస్థ ముందుకు పోవాలనుకున్నా సాంకేతిక, యాంత్రిక విస్తరణకు అవకాశాలున్నా వాటిని ఉపయో గించుకోలేని స్థితికి ఈరోజు వ్యవస్థ చేరింది. మనం ప్రపంచంలో ఒక సూపర్‌ పవర్‌ కావాలని కోరుకుంటున్నా ఇప్పటికీ వెనుకబడే ఉన్నాం. మన జిడిపి మైనస్‌ల్లో నడుస్తున్నది. కనీసం ఈరోజు ప్రపంచ స్థాయిలో అభివృద్ధిలో పోటీ పడుతున్నామా అంటే 5జి టెక్నాలజీ మొదలుకొని మిషన్‌ లెర్నింగ్‌ల్లో కానీ, ఇంటర్నె ట్‌ ఐఒటి, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో గానీ ఎందులో కూడా మనం ముందుకు పోలేకపో తున్నాం. అన్నింటికీ మించి ఈరోజు టెక్నాలజీ లో కీలక స్థానం వహిస్తున్న సెమీ కండెక్టర్లను తయారు చేసుకోలేకపోతున్నాం. ఒక చిప్‌ను కూడా స్వతంత్రంగా తయారు చేసుకోలేని స్థితిలో మన దేశం ఈ రోజు దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. ఆయిల్‌, గ్యాస్‌ నిక్షేపాలున్నా దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది. విదేశీ మారకద్రవ్య లోటు ఏర్పడి అమెరికా లాంటి దేశాల పెత్తనానికి తలొగ్గాల్సిన స్థితి వస్తున్నది. అందు వల్ల ఒక సమగ్రమైన రూపంలో అభివృద్ధి చెందాలంటే ప్రజల ఆదాయాలు పెరగాలి. కొనుగోలు శక్తి పెరగాలి. ఆర్ధిక అసమానతలూ తగ్గాలి. ఈ అవగాహన పాలకులలో లోపించింది. కేవలం కంటికి కనబడే రోడ్లు, ఫ్లైఓవర్లను మాత్రమే అభివృద్ధిగా చూస్తే అది భ్రమ అవుతుంది. రెండవ అంశం అభివృద్ధి వికేంద్రీకరణ. ఈరోజు అబివృద్ధి వికేంద్రీకరణ ఎంత అవసరముందో మన రాష్ట్రం వెనుక బాటును చూస్తేనే అర్ధమవుతుంది. రాష్ట్ర విభజనకు కూడా ఇదొక ముఖ్యమైన కారణం. ఒకప్పుడు తెలంగాణ బాగా వెనుకబడి ఉన్న పరిస్థితుల్లో హైదరాబాద్‌లో ప్రభుత్వ రంగం పెద్దయెత్తున పరిశ్రమలు పెట్టిన తరువాత దానికి అనుబంధంగా చాలా ప్రైవేటురంగ పరిశ్రమలు వచ్చాయి. హైదరాబాద్‌ నగరం అభివృద్ధి కావడంలో ప్రభుత్వ రంగం పునాదిగా పని చేసింది. ఆ తరువాత 90వ దశకం నుండి ఐటి అభివృద్ధి కావడంతో కొత్త రూపం ధరించింది. ఫలితంగా రాష్ట్రంలో ఉన్న దేశీయ,విదేశీ పెట్టుబడులన్నింటికీ కేంద్రంగా హైదరాబాద్‌ రూపుదాల్చింది. ఈ క్రమంలో మొత్తం అబివృద్థి అంతా హైదరాబాద్‌, దాని చుట్టూ కేంద్రీకరించడం వల్ల తెలంగాణాలోని మిగతా ప్రాంతాలతో సహా ఆంధ్ర,రాయలసీమ ప్రాంతాలు కూడా వెనుకబడ్డాయి. ఈ అభివృ ద్ధిలో వచ్చిన వ్యత్యాసాల్లో నుండే తెలంగాణా ఉద్యమం కూడా వచ్చింది.ఈ అభివృద్ధిలో వచ్చిన కేంద్రీకరణ ఫలితంగానే కోస్తా, రాయలసీమ ప్రజలు సమైక్యాంధ్ర కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిరది. ఒక సమగ్రమైనటువంటి వికేంద్రీకరణ పద్ధతిలో అభివృద్ధి జరిగి ఉంటే రాష్ట్రం చీలిపోయే పరిస్థితి కూడా వచ్చి ఉండేది కాదు. హైదరాబాద్‌లాగే విశాఖపట్నంలో కూడా ప్రభుత్వ రంగం అబివృద్ధి అయ్యింది. కానీ క్రమంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటు పరం చేసి దాని అభివృ ద్ధిని దెబ్బకొడుతున్నారు. తాజాగా మోడీ ప్రధాన మంత్రి అయ్యాక విశాఖ నగరానికి జీవనాడిగా, అభివృద్ధికి పునాదిగా ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మేయడమో, మూసే యడమో చేస్తామంటున్నారు. అంతకుముందు హిందుస్థాన్‌ జింక్స్‌, ఇంకా కొన్ని పరిశ్రమలను మూసేశారు. అక్కడ ప్రైవేటు పెట్టుబడులు పెద్దయెత్తున రావడం లేదు. ఉన్న ప్రభుత్వ రంగమూ పోయింది. అత్యంత వెనుకబడిన ఏజెన్సీ ప్రాంతం, అత్యంత అభివృధ్ధి అయిన విశాఖ నగరం ఒకే జిల్లాలో పక్కపపక్కనే మనకు కనిపిస్తూ ఉంటాయి. చంద్రబాబు నాయుడు హయాంలో అమరావతిని రాజధా నిగా నిర్ణయించిన తరువాత 33 వేల ఎకరాలను తీసుకుని విద్య, వైద్యం తదితర అనేక రకాల హబ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. అమరావతి రాజధాని లక్ష కోట్ల వ్యయంతో అభివృద్ధి మొత్తాన్ని కేంద్రీకరించే మాస్టర్‌ప్లాన్‌ను ఆరోజే సిపియం వ్యతిరేకించింది. అమరావతిలో శాసన, పరిపాలన రాజధాని ఉండాలి తప్ప మిగతా అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ అన్ని వెనుకబడిన జిల్లాల్లో ఎక్కడ అవసరమైతే అక్కడ రాష్ట్ర మంతా విస్తరింపజేయాలని కోరాము. ఆరకం గా అభివృద్ధిని వికేంద్రీకరించడం ద్వారా వెనుక బడిన ప్రాంతాలు అభివృద్ధి చెందడమే కాకుం డా స్థానిక యువతకు ఉపాధి కల్పనకు కూడా ఒక మార్గంగా ఉంటుంది. లేనియెడల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లాగా మరొక చీలికకు పునాది ఏర్పడినట్లుంటుందని ఆరోజే హెచ్చరించాము. ఏమైనా అమరావతి రాజధానిగా ఉండాలన్న అంశంలో సిపిఎం ఆనాడే కచ్చితమైన వైఖరి ప్రకటించింది. అదే సందర్భంలో వైఎస్సార్‌ సిపితోపాటు అన్ని పార్టీలు దానిపై ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. ఆ రీత్యా ఈరోజు అమరావతి రాజధాని అనేది తెలుగు ప్రజల ఉమ్మడి భావంగా ఉన్నది అనడంలో సందేహంలేదు. ఇక మూడవ అంశం పరిపాలన వికేంద్రీకరణ. జగన్‌ గారి మాటల్లో గాని, వైఎస్సార్‌ సిపి వారి ప్రచారంలో గాని పరిపాలన వికేంద్రీకరణ అంటే రాజధానిని ముక్కలుగా చేసి ఒక్కొక్క ఆఫీసు ఒక్కోదగ్గర పెట్టడంగా ఉన్నది. అది వికేంద్రీకరణకు వికృత రూపం అవుతుంది తప్ప నిజమైన వికేంద్రీకరణ అవదు. అది ప్రజలకు కూడా అసౌకర్యంగా ఉంటుంది. పరిపాలన వికేంద్రీకరణ అంటే కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రాలకు ఎక్కువ హక్కులు రాజ్యాంగ పరంగా ఇవ్వడం, అది ఒక బలమైన ఫెడరల్‌ వ్యవస్థగా, ఐక్యంగా దేశం ముందుకు పోవడానికి తోడ్పడేది. అదే సమయంలో గ్రామ,పట్టణ స్థాయిలో స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేయడం ద్వారా ప్రజల వద్దకు నేరుగా పరిపాలనను తీసుకురావడం, తద్వారా పరిపాలన వికేంద్రీకరణ జరుగుతుంది. స్వాతంత్య్రోద్యమంలో గ్రామస్వరాజ్యం అనే భావన ఏర్పడిరది. కానీ దానికి భిన్నంగా స్వాతంత్య్రానంతరం దీర్ఘకాలం స్థానిక సంస్థలకు అధికారాలు, నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిన ఫలితంగా అభివృధ్ధి కూడా కేంద్రీకరించబడిరది. కేంద్రంలో, రాష్ట్రాల్లో నిరంకుశ ప్రభుత్వాలు ఏర్పడడానికి, ప్రజాస్వామ్యానికి కూడా ప్రమాదంగా పరిణమించిన విషయం మనకు తెలుసు. స్థానిక సంస్థలకు అధికారాలు, దానితోపాటు చట్టబద్ధంగా ఫైనాన్స్‌ కమిషన్‌ల ద్వారా నిధుల విడుదల జరిగితే గ్రామ, వార్డు స్థాయిల్లో జనసభలు జరిపి ప్రజలకు ఏది అవసరమో అక్కడ ఆ రకమైన అభివృధ్ధి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. పరిపాలనలో ప్రజలు ప్రత్యక్ష భాగస్వాములవుతారు. ఇదే వికేంద్రీక రణకు అసలైన అర్ధం. స్థానిక సంస్థల ద్వారా పాలనా వికేంద్రీకరణ అనే నమూనా కేరళలో అత్యంత జయప్రదంగా అమలైంది. ఐక్యరాజ్య సమితితో సహా అనేక అంతర్జాతీయ సంస్థలు దాన్ని ఒక ఆదర్శంగా అంగీకరి స్తున్నాయి. మన రాష్ట్రంలో పాలనా వికేంద్రీ కరణ అనే పేరుతో రాజధానిని ముక్కలు చేయడాన్ని సమర్ధించు కుంటున్నారు. నిజానికి రాష్ట్రంలో స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఈరోజు కూడా గ్రామ స్థాయిలో సచివాలయాలు పెట్టారు. వలంటీర్ల వ్యవస్థను పెట్టారు. వాళ్ళద్వారా నేరుగా రాష్ట్ర రాజధాని నుండి ప్రభుత్వమే వారికి ఆదేశాలు ఇచ్చి నడుపుతున్నది. రాష్ట్ర సెక్రటేరియట్‌లో ఉన్న వివిధ డిపార్ట్‌మెంట్‌లు,ఆ డిపార్ట్‌మెంట్‌ లకు సంబంధించిన వ్యక్తులు గ్రామ,వార్డు సచివాలయాల్లో వారికి అనుబంధంగాఉంటారు. వీరు క్రింది వారికి ఆదేశాలిచ్చి పనులు చేయిం చే పద్ధతి నడుస్తున్నది. సంక్షేమ పథకాలు అమలు చేయడానికి మాత్రమే కాకుండా పౌరుల మీద నిఘా పెట్టడానికి, ఆందోళన కారులను ఆపడానికి, నిరోధిం చడానికి, సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే పేరిట పాలక వర్గాలకు అనుగుణంగా ప్రజలను మలచడానికి, రాజకీయంగా ప్రభావితం చేయడానికి ఈ వ్యవస్థలు ఉపయోగపడు తున్నాయి. ప్రజలు ఎన్నుకున్న పంచాయితీలు, మున్సిపాలిటీలు నామమాత్రంగా మారాయి. కనీసం రోడ్లు వేసుకోగలిగిన పరిస్థితిగాని, కుళాయిలు పెట్టుకోగలిగిన పరిస్థితి గాని లేదు. దీనికి ‘మీరు పన్నులు వసూలు చేసుకోండి, ఆదాయాలు పెంచుకోండి’ అని వారికి సల హాలు ఇస్తున్నారు. తద్వారా కేంద్ర ప్రభుత్వ షరతులను రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలపై రుద్దుతున్నది. ఎక్కడికక్కడ ఆస్తి పన్ను, చెత్త పన్ను పెంచారు. నీళ్ళపన్ను పెంచుతున్నారు. ఎప్పుడో కట్టుకున్న ఇళ్ళకు ఇప్పుడు అపరాధ రుసుం వసూలు చేస్తున్నారు. కన్వర్షన్‌ పేరుతో అదనపు భారం మోపుతున్నారు. అలాగే వివిధ రకాలైన భారాలను ప్రజలపై వేస్తున్నారు. ఈ రకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వకుండా ప్రజలనుండి బలవంతంగా వసూలు చేసుకోమనడం వల్ల అవి ప్రజలకు భారంగా మారుతున్నాయి. అభివృద్ధికి తగిన నిర్ణయాలు చేసి వాటిని అమలు చేయడం కోసం స్థానిక సంస్థలు ఉండాలి తప్ప ప్రజల మీద భారాలు వేయడానికి ఒక సాధనంగా స్థానిక సంస్థలను మలిస్తే అప్పుడు కూడా వికేంద్రీకరణకు అర్ధం లేకుండా పోతుంది. స్థానిక సంస్థలకు నిధులు, విధులు, అధికారాలు కేటాయించడం ద్వారా మాత్రమే పాలనా వికేంద్రీకరణ జరుగుతుంది. ఈ రకంగా అభివృద్ధి వికేంద్రీకరణకు, పాలనా వికేంద్రీకరణకు ఒక స్పష్టమైన నిర్వచనం ఇచ్చుకుని తదనుగుణంగా విధానపరమైన నిర్ణయాలు చేయడం ద్వారా రాష్ట్రంలో ఉన్న గందరగోళ పరిస్థితుల నుండి బయట పడ వచ్చు. రాజధానిని ముక్కలు చేయకుండానే అమరావతిలోనే శాసన, పరిపాలన రాజధానిని ఉంచి దాని చుట్టూ మొత్తం వికేందీక్రకరణ చేయడం సహేతుకంగా ఉంటుంది. అదే సమయంలో శాసన, పరిపాలన వ్యవస్థకు, న్యాయ వ్యవస్థకు సంబంధం లేదు. న్యాయ వ్యవస్థ స్వతంత్రమైనది. రాజధానిలో అంతర్భాగంగా ఉండాలన్న నియమం లేదు. కొన్ని రాష్ట్రాల్లో హైకోర్టు ఒకచోట, హైకోర్టు బెంచ్‌లు మరొక చోట వివిధ ప్రాంతాలలో ఉండి ప్రజలకు హైకోర్టును అందుబాటులో ఉంచిన పరిస్థితి ఉంది. మన రాష్ట్రంలో కూడా ప్రజల వాంఛకు అనుగుణంగా హైకోర్టును కర్నూలులో పెట్టి మిగతా ప్రాంతాలలో అవసరమైన చోట్ల బెంచ్‌లను ఏర్పాటు చేయడం ద్వారా హైకోర్టును అందరికీ అందుబాటులో ఉంచవచ్చు. ఆ రకంగా న్యాయవ్యవస్థను విడిగా చూసి శాసన పరిపాలన రాజధానిగా అమరావతిని కొనసాగించి అభివృద్ధిని, పాలనను వికేంద్రీకరించి అమలు చేయడం రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తోడ్పడుతుంది.

ముస్లీం మ‌హిళ‌లు బాధితుల‌వుతున్న వేళ‌…

మితవాద శక్తుల అవిశ్రాంత దాడుల తర్వాత ముస్లింలను ఒక పక్కకు తోశారు. కొంతమంది మతపరమైన గుర్తింపును చెరిపి వేయడం ద్వారా సురక్షితంగా ఉండాలని నిర్ణ యించుకుంటే,వారిలో కొంతమంది గొంతెత్తి, రాజ్యాంగం కల్పించిన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, మత ప్రచారం చేసుకునే హక్కును ఉపయోగించు కోవడం ద్వారా తమ గుర్తింపును నొక్కి చెప్పాలని అనుకున్నారు. విద్యావంతులైన ముస్లిం యువతులు హిజాబ్‌ (తలకు ముసుగు/హెడ్‌ స్కార్ఫ్‌) ధరించడం ద్వారా వారికున్న హక్కును మితవాదులకు స్పష్టంగా చెప్పదలచు కున్నారు.
భారతదేశంలో…హిందూ మహిళల్లో కుల,మత,వర్గ బేధాలు ఉన్నట్లే…ముస్లింల మధ్య కూడా విభజనలు ఉన్నాయి. కానీ నేడు ముస్లిం మహిళలందరిలో కాదనలేని ఒక ఉమ్మడి అంశమే మంటే, రాజకీయ చదరంగంలో సంఘ పరివార్‌ వారిని పావులుగా వాడుకుంటున్నది. 2019లో బిజెపి ట్రిపుల్‌ తలాక్‌ను నేరంగా పరిగణిస్తూ కొత్తచట్టం చేసిన నాటి నుండి ఇటీవల కాలంలో కర్ణాటక విద్యాసంస్థల్లోకి హిజాబ్‌ ధరించిన మహి ళలను అనుమతించని వివాదం వరకు సంఘ పరివార్‌,ముస్లిం మహిళలను లక్ష్యంచేస్తూ వస్తున్నది. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ తనను తాను ముస్లిం మహిళల రక్షకుడిగా చెప్పుకున్నారు. తాను, తన పార్టీ ముస్లిం పితృస్వామిక బంధనాల నుంచి ముస్లిం మహిళలను కాపాడుతున్నామని చెప్పారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ లోని ఒక ఎన్నికల సభలో మాట్లాడుతూ, కాలేజీలకు వెళ్లే దారిలో ముస్లిం బిడ్డలు వీధి రౌడీల అల్లరి చేష్టలతో అనేక ఇబ్బం దులను ఎదుర్కొనేవారనీ, కానీ తమ ప్రభుత్వ చర్యల ఫలితంగా వారికి భద్రత ఏర్పడిరదని చెప్పారు. చరిత్ర తెలిసిన వారు ముఖ్యంగా, 2002లో నరేంద్ర మోడీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మితవాదుల మారణహోమానికి, దాడులకు గురైన మహిళలు ఆయన ప్రసంగాల్లో చెప్పిన విషయాలను విశ్వసించరు. దౌర్జన్యకారులు ప్రధానంగా ముస్లిం మహిళలను లక్ష్యం చేసుకుని దాడులకు పాల్పడ్డారు. వారిపై సామూహిక అత్యా చారాలకు పాల్పడి, వారి ఇళ్లను లూటీ చేసి, ధ్వం సం చేశారు. అహమ్మదాబాద్‌ లోని నరోదా పాటియా ఊచకోతలో గర్భవతి కౌసర్‌ బానూ షేక్‌ను మంటల్లో వేసి చంపారు. బతికి బయట పడ్డవారు,సాక్షులు ప్రాణాలను చేతబట్టుకొని సంవ త్సరాల పాటు శరణార్థ శిబిరాల్లో గడిపారు. మత ప్రాతిపదికన సమీకరణలు మారడం ద్వారా ఆ దాడుల ప్రభావం దేశ వ్యాప్తంగా ప్రతిధ్వనించింది. 2002 తరువాత పుట్టిన తరానికి చెందిన ప్రజలకు ఇప్పుడు ఓటు హక్కు లభించింది. ఆ హింసకు సంబంధించి వీరికెవరికీ తెలియనప్పటికీ,దాని ప్రభావంతో ఇప్పటికీ బాధపడుతున్నారు.
2014 తరువాత బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వంకేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత,మితవాద ప్రభుత్వం చేతిలో ఉన్న రాజ్యాం గ యంత్రాంగం,సంఘ పరివార్‌ శక్తులు ముస్లింలను భయకంపితులను చేస్తూ, నేరస్థులుగా పరిగణిస్తూ, నిర్బంధంలో ఉంచుతున్నారు. ముస్లిం పురుషుల జీవితాలు నాశనం కావడంతో,దాని కొనిసాగింపుగా వారి కుటుంబాలు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వ పాల నలో 2020 ఢల్లీి అల్లర్లు, గోరక్షక దళాల పేరుతో చట్ట విరుద్ధంగా అనేక మందిని చంపారు. ముస్లిం లకు వ్యతిరేకంగా హింసాత్మక చర్యలు నిత్యకృ త్యంగా మారాయి. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలను అణచివేసి, విద్యా ర్థులు, కార్యకర్తలను మూకు మ్మడిగా అరెస్ట్‌ చేశారు. వారిలో ఎక్కువగా ముస్లింలే ఉన్నారు. మితవాద శక్తుల అవిశ్రాంత దాడుల తర్వాత ముస్లింలను ఒక పక్కకు తోశారు. కొంతమంది మతపరమైన గుర్తింపును చెరిపి వేయడం ద్వారా సురక్షితంగా ఉండాలని నిర్ణయించుకుంటే, వారిలో కొంతమంది గొంతెత్తి, రాజ్యాంగం కల్పించిన భావ వ్యక్తీక రణ స్వేచ్ఛ, మత ప్రచారం చేసుకునే హక్కును ఉపయోగించుకోవడం ద్వారా తమ గుర్తింపును నొక్కి చెప్పాలని అనుకున్నారు. విద్యావంతులైన ముస్లిం యువతులు హిజాబ్‌ (తలకు ముసుగు/హెడ్‌ స్కార్ఫ్‌) ధరించడం ద్వారా వారికున్న హక్కు ను మితవాదులకు స్పష్టంగా చెప్పదలచుకున్నారు.
హిజాబ్‌ సమస్య దుష్ఫలితాలు
ఆన్‌లైన్‌ వేలం కేసుల విషయంలో అధి కారులు చర్యలు తీసుకుంటున్నా, కర్ణాటక లోని పాఠశాలల్లో హిజాబ్‌ చుట్టూ నడుస్తున్న వివాదం జాతీయ స్థాయిలో చర్చనీయాం శమైంది. కొన్ని రోజుల్లోనే హిజాబ్‌ సమస్య, సుదూరంగా ఉన్న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కూడా దాని ప్రభావాన్ని చూపింది. కానీ ముస్లిం ప్రజల్లో ఉన్న భిన్నత్వం వలన పదాలఅర్థాలు భిన్నంగా ఉన్నాయి. ఉదాహ రణకు,బెంగాల్‌ ముస్లిం జనాభా ఎక్కువ గా నివసించే ఢల్లీి మురికివాడల్లో ‘హిజాబ్‌’ అనే పదం విదేశీపదం.ఇళ్ళలోపని చేసే,నిర్మాణ రంగం లో పనిచేసే మహిళలు ఒక్కోసారి ముసుగు ధరి స్తారు. దానిని వారు ‘ఇస్కబ్‌’ అంటారు. ఇంటిపని చేసే తబస్సుమ్‌,అక్కడే నివాసం ఉంటున్న ఆమె స్నేహితులు…దాన్నిచున్నీ,దుపట్టా,పర్దా లేక పల్లూ (చీరకట్టినప్పుడు) అంటారు. వారు బయటికి వెళ్ళిన ప్పుడు తలను కప్పుకుంటారు.కానీపని చేసే సమ యంలో,ఇంట్లోఉన్నప్పుడు,సైకిల్‌ తొక్కే సమయంలో వివిధ సందర్భాలలో దానిని ధరించరు. దానితో పాటు పెళ్లికాని అమ్మాయిలు కూడా వాటిని ధరిం చరు. పది సంవత్సరాల వయసు నుంచి తబస్సుమ్‌ ఇస్కబ్‌ ను ధరించడంవల్ల అది ఆమెకు బాగా అలవాటైపోయింది. ఒకవేళ ఆ ముసుగు లేకుంటే ఏదో కోల్పోయిన భావన కలుగుతుందని ఆమె చెప్పింది. కానీ ఆమె బుర్కా అలవాటు కాకూడదనే ఉద్దేశ్యంతో ఇంత వరకు బుర్కాధరించలేదు. బుర్కా ధరిస్తే పని చెయ్యడం సాధ్యం కాదని,ఇంటి వద్దనే ఉండాల్సి వస్తుందని చెప్పింది. ఖురాన్‌ చెప్పింది నేను చేస్తాననీ, నేను మంచి వ్యక్తిగా ఉండే ప్రయ త్నం చేస్తాననీ, ఎవరో ఏదో అనుకుంటారని బాధ పడితే ఎలా సంపాదించి,ఎలా పిల్లలకు తిండి పెడతానని అంటుంది. భారతదేశంలో హక్కులూ, ఆచారాల మధ్య జరుగుతున్న సమీకరణ చర్చల్లో తబస్సుమ్‌ లాంటి శ్రామిక వర్గ ముస్లిం మహిళకు తన భావాలను వెల్లడిరచే కొద్దిపాటి స్థలమే ఉం టుంది. అదే నిజమైన విషాదం.
హిజాబ్‌పై కర్ణాటక హైకోర్టు తీర్పు : మౌలికంగానే లోపభూయిష్టం
హిజాబ్‌పై కర్ణాటక హైకోర్టు తీర్పు సహేతుకమైన సర్దుబాటు ఆవశ్యకతను గుర్తించడంలో విఫల మైంది. విద్యాసంస్థల్లో విద్యార్థులు తలకు కండు వాలు ధరించడంపై నిషేధాన్ని సమర్థిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు అనేక విధాలా తప్పు. ముస్లిం విద్యార్థినులు హిజాబ్‌ ధరించడంపై తలెత్తిన వివా దంపై ప్రశ్నలు లేవనెత్తిన తీరు రాజ్యాంగ సూత్రా లను దెబ్బతీసేదిగా ఉంది. నిర్దేశిత యూనిఫామ్‌కు అదనంగా ధరిస్తున్నారా? యూనిఫామ్‌ రంగుకు ఎలాంటి తేడా లేని హిజాబ్‌ ధరించడం వల్ల పాఠశాల లేదా కళాశాలలో ప్రవేశించేందుకు అనుమతి నిరాకరించడం సరైనదా? కాదా? అన్న విషయాన్ని పరిశీలించడంలో కోర్టు విఫలమైంది. ఇస్లాంలో హిజాబ్‌ ధరించడం తప్పనిసరి ఆచారమని, అందువల్ల, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25 కింద ప్రసాదించబడిన మత స్వేచ్ఛలో భాగంగా దీనికి రాజ్యాంగపరమైన రక్షణ ఉందని విద్యార్థులు చేసే వాదనతో విభేదిస్తూ ఖురాన్‌లోని చరణాలను బెంచ్‌ ఉటంకించింది. ఇదా అసలు సమస్య? విద్యార్థుల మధ్య సమానత్వ భావనను దెబ్బతీయకుండా సామాజిక వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా తరగతి గదిని బహుళత్వంతో కూడిన సమాజం అనుమతించే ‘సహేతుకమైన సర్దుబాటుకు అనుకూలమైన వాదనను కోర్టు తోసిపుచ్చింది. పాఠశాలల వంటి ‘’ బహిరంగ స్థలాల్లో ‘’ దుస్తులకు సంబంధించిన నియమాలు అవసరమే కావచ్చు. కానీ సూచించిన యూనిఫారానికి ఇబ్బంది కలిగించని రీతిలో అదనంగా చిన్న వస్త్రాన్ని ధరించే సర్దుబాటును సైతం తిరస్కరించడంలో హేతుబద్ధత ఏమిటో అర్థం కావడం లేదు. ‘మనస్సాక్షి స్వేచ్ఛ’పై ఆధారపడిన వాదనను తిరస్కరించిన కోర్టు అందుకు పిటిషన్లలో తగిన వివరణ లేకపోవడాన్ని ఒక సాకుగా చూపింది. యూనిఫామ్‌ ఆవశ్యకతను గురించి కోర్టు నొక్కి చెబుతూ, సమానత్వం, సజాతీయత యొక్క ఉల్లంఘించలేని చిహ్నం అని ఉద్ఘాటించింది. సజాతీయత అంటే సర్దుబాటుకు ఆస్కారమిచ్చే వాదనలను మొత్తంగా తోసిరాజ నడమన్నట్టుగా కోర్టు చూసింది. ఈ కేసులో ‘ఎసెన్షి యల్‌ ప్రాక్టీస్‌’ (మౌలికమైన ఆచరణ)ను పరీక్షకు పెట్టాల్సిన అవసరం ఉందా అనేది మరో ప్రశ్న. పూర్తిగా మతతత్వంతో కూడిన దురాచారమైతే, దానిని కేంపస్‌ వెలుపల ఉంచవచ్చు. ఏకరూపత, వేరుపరిచే భావనను తొలగించడం అనేవి మంచి లక్ష్యాలే. అయితే, ఇటువంటి అంశాలపై తలెత్తే చిక్కులను వేదాంతాల జోలికి పోకుండానే పరిష్కరించవచ్చు. ‘ మౌలికమైన మతపరమైన ఆచారాలు’ ను పరీక్షించడం మొదలు పెడితే దానికి ఇక హద్దు పద్దు ఉండదు. ఇటువంటి వాటిని నిర్ణయించడానికి సుప్రీంకోర్టు తిరుగులేని ప్రమాణాలను నెలకొల్పింది. మౌలికమైన ఆచారాలు అని దేనిని పిలుస్తామంటే, అది లేకపోయినా లేదా తొలగించబడినా మొత్తం మతమే నాశనమయ్యే ప్రభావాన్ని కలిగి ఉండేవాటిని మాత్రమే. .కొన్ని మౌలికమైన ఆచారాలు కాపాడబడితే కాపాడుకోనివ్వండి. అటువంటి వాటివల్ల ఏ మతపరమైన ఆచారమూ మనుగడ సాగించదు. దానికి బదులు సమానత్వం, గౌరవం, గోప్యత, ఆరోగ్యం, చట్టబద్ధ పాలన వంటి రాజ్యాంగ విలువలకు రక్షణగా ఆర్టికల్‌ 25ని క్లెయిమ్‌ చేయడాన్ని పరీక్షిస్తే ఎక్కువ ప్రయోజనం. ఏదేమైనప్పటికీ ఇటువంటి వాటిని’ మౌలిక ‘ పరీక్షకు ఎన్నడూ పెట్టకూడదు.. ఎందుకంటే ఇది వేదాంత భావనలను మిగతా వాటిపై స్వారీ చేయడానికి సిద్ధాంతపరంగా అనుమతిస్తుంది. ఆ భావనలు రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమా, కాదా అన్నదాంతో నిమిత్తం లేకుండా ఒక మతానికి ఆవశ్యకంగా పరిగణించబడుతూ ఉంటాయి. స్వేచ్ఛలు ముఖ్యం కాబట్టి మత స్వేచ్ఛ ముఖ్యమే.కానీ మతాలు కాదు ముఖ్యం. – దివ్యా త్రివేది

భారత రత్నం
డా ॥ బి.ఆర్‌. అంబేద్కర్‌

(భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బాబాసాహెబ్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 131వ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.)
ప్రపంచ మహా మేధావు ల్లో డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఒకరు. భారతీయ సమాజాన్ని సమూలంగా మార్చడానికి కృషి చేస్తూ, ఆ క్రమంలో అర్థశాస్త్రాన్ని అన్వయించి సామాజిక సాంస్కృతిక, రాజకీయ, నైతిక, ధార్మిక విషయాలను చర్చించారు. అంబేద్కర్‌ రచనలు, ప్రసంగాలు, సంభాషణలు ఇప్పుడు 23 సంపుటాలుగా లభ్యమ వుతున్నాయి. ఇప్పుడు అంబేడ్కర్‌ సమగ్ర దృక్పథం ఏమిటో తెలుసుకోవడానికి ఇవన్నీ అందు బాటులోకి వచ్చాయి. గతంలో గాంధీ, నెహ్రూలకు ఇచ్చిన ప్రాధాన్యత అంబేడ్కర్‌కు ఇవ్వకపోవడం వల్ల అంబేడ్కర్‌ సమగ్ర అధ్యయనం సాగలేదు. అంబేడ్కర్‌ భారతీయ సామాజిక వ్యవస్థను మార్చడం కోసం జీవితాం తం కృషి చేశారు. కులవ్య వస్థను రద్దు చేయ డానికి కులనిర్మూలనను ప్రతిపా దించారు. – Saiman Gunaparthi
సామాజిక విప్లవ స్ఫూర్తి ప్రదాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌. సోక్రటీస్‌,ప్లేటో, అరిస్టాటిల్‌, బుద్ధునితో పోల్చదగిన పాత్ర. అంబేద్కర్‌కు ముందు భారతదేశంవేరు, అంబేద్కర్‌ తరువాత భారతదేశం వేరు. అంబేద్కర్‌ ఆలోచన, కార్యాచరణ ద్వారా ఆయన భారతదేశ స్వరూపాన్ని మార్చగలిగాడు. అంబేద్కర్‌ గొప్ప మానవతావాది. గొప్ప హేతువాది. గొప్ప కరుణశీలి.తన జీవితంలో ఎదురైన అస్పృ శ్యతను, కులాన్ని నిర్మూలించడం కోసం ఆయన అహరహం కృషి చేశారు.అంబేద్కర్‌ బౌద్ధాన్ని స్వీకరించి దాన్ని సామాజిక మానవ తావా దంగా పునర్నిర్మించి నవయాన బౌద్ధాన్ని ప్రపంచానికి అందించాడు. అంబేద్కర్‌ బౌద్ధప్రబోధంలో జఠిలత్వాన్ని తగ్గించి గాంభీర్యాన్ని పెంచాడు. అంబేద్కర్‌ సామాజిక, రాజకీయ సిద్ధాంతాలన్నీ బౌద్ధంలో ఉన్న మైత్రీ భావంతో ముడిపడి ఉన్నాయి. ఆయన తన విద్యాసంపన్నతను, మేథోవిస్తృతిని అహం కారానికి,ఆధిపత్యా నికి, నియంతృత్వానికి దారి తీయకుండా కరుణ,ప్రేమ,ప్రజ్ఞలతో కూడిన నూత్న భారతాన్ని ఆవిష్కరించడానికి రాజ్యాంగ నిర్మాణం లో లౌకిక, ప్రజాస్వామ్య, సమతా భావాలను సమన్వయించాడు. భారతదేశంలో కులం నిర్మూలించబడటం వలన స్వేచ్ఛ, స్వాతం త్య్రం,సౌభ్రాతృత్వం ప్రజల్లో వెల్లి విరుస్తుందని,అప్పుడు కులభావం లేకుండా ప్రతిభనుబట్టి,జ్ఞానాన్ని బట్టి, క్రియను బట్టి ప్రజలకు విద్యా, పారిశ్రామిక,ఉద్యోగ వ్యవస్థల్లో స్థానం లబి స్తుందని ఆయన తన ఉపన్యాసాల్లో బోధించారు. కులం పునాదుల మీద ఒక జాతిని నీతిని నిర్మించలేరని వర్ణము,కులము ఇవన్నీ కూడా ఒకానొకనాడు రూపుమాస్తాయని అంబేద్కర్‌ సిద్ధాంతీకరించాడు.అంబేద్కర్‌ పోరాట యోధుడు.అణగారిన ప్రజలకు ఆయన బోధి స్తూ ‘మన హక్కులను అన్యాయంగా అపహరించిన వారి నుండి తిరిగి పొందడానికి నిరంతర పోరాటమే శరణ్యమని ‘నవసమాజ నిర్మాణం ప్రార్థనలతోను, నినాదాలతోను జరగ దని,దానికి విప్లవమే శరణ్యమని ఉద్భోదిం చాడు.ఆయన ఆర్థిక, వాణిజ్య ధర్మశాస్రాల్లో పరిశోధనలు చేసి పిహెచ్‌డి పట్టాలు పొందిన మేథావి. అందుకే ఆయన ‘యుగయుగాలుగా దాస్య శృంఖలాల తో మగ్గిపోతున్న పీడిత వర్గా లను నా జీవితకాలంలో పాలకులుగా చూడాలి, అదే నా జీవితలక్ష్యం అని తన జీవితలక్ష్యాన్ని వెలుగెత్తిచాటిన రాజకీయ,సామాజిక దార్శ నికుడు.ఆయన ఒక్క దళితుల కోసమే కాదు, మొత్తం భారతదేశంలోని అన్నివర్గాలకోసం పోరాడాడు. ముఖ్యంగా స్త్రీల గురించి మాట్లా డుతూ స్త్రీలను బానిసత్వపు సంకెళ్ల నుండి విముక్తి చేయాలంటే మనోవికాసం కలిగిన మహిళలంతా హిందూ మతం నియమించిన మూర?సిద్ధాంతాలపైన తిరుగుబాటుచేయాలి. వివాహం చేసుకున్న స్త్రీ, భర్తతో సమానంగా ఉంటూ భర్త స్నేహి తురాలిగా వ్యవహరిస్తూ, అతని బానిసగా లోబడకుండా జీవించాలి. అప్పుడే స్త్రీలు తమ గౌరవాన్ని పొందగలు గుతారు. స్త్రీజాతి అభివృద్ధిలోనే సమాజాభివృద్ధి ఉందని నా విశ్వాసం. గర్భవతిగా ఉన్నశ్రామిక స్త్రీకి విశ్రాంతి ఇవ్వవలసిన బాధ్యత మనపైన ఉంది. నేను ప్రతిపాదిస్తున్న ఈ బిల్లు ముఖ్యో ద్దేశం ఇదే. స్మృతులు స్త్రీలకు కల్పించిన హక్కులనే పొందుపరచి ఈ హిందూకోడ్‌ బిల్లును రచించాను.స్త్రీలసాంఘిక పురోగతికి అడ్డుగా ఉన్న ధర్మశాస్త్రాల అడ్డంకి తొలగిం చడమే ఈబిల్లు ధ్యేయం. సంపదపైనే స్వాతంత్య్రం ఆధారపడి ఉంది.కాబట్టి స్త్రీలు సంపాదనాపరులై హక్కులు సాధించుకొని తమ స్వాతంత్య్రాన్ని తిరిగి పొందాలనిస్త్రీ విముక్తి దాతగా ఆయన ప్రజ్వలించారు.1951 ఫిబ్రవరి5వతేదీన హిందూ కోడ్‌ బిల్లు పార్లమెంట్‌లో చర్చకువచ్చింది.అప్పటి కేంద్ర మంత్రి అయినఎన్‌.వి. గాడ్గిల్‌ ఈ బిల్లుద్వారా భారతదేశంలో స్త్రీలకు రాబోతున్నవిప్లవాత్మ కమైన భవిష్యత్తుకు కారణం డాక్టర్‌బి.ఆర్‌. అంబేద్కర్‌ అని,ఆయన భారతదేశంలో స్త్రీ సంస్కర్తలు ఎవరూ చేయలేనిపని చేశారని కొని యాడారు. దుర్గాభాయ్‌దేశ్‌ముఖ్‌ హిందూ కోడ్‌ బిల్లును సమర్ధిస్తూ డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ స్త్రీ దాస్య విమోచకుడని పేర్కొనడం జరిగింది. ఈ రోజున స్త్రీలు అనుభ విస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు,విద్య,గౌరవం,ఉద్యోగోన్నతులన్నీ అంబేద్కర్‌ హిందూకోడ్‌ బిల్లు ద్వారా తెచ్చినవే. హిందూకోడ్‌ బిల్లుపార్లమెంట్‌లో వీగిపోయి నప్పుడు అంబేద్కర్‌ ఎంతో ఆవేదన చెందారు. ఆయన తన న్యాయమంత్రిత్వ పదవికి ఈ కార ణంగా 1951 సెప్టెంబర్‌ 27న తేదీన రాజీనా మా చేశారు.అదికూడా భారతదేశంలో సంచల నాత్మక విషయమైంది. ఆ సందర్భంగా ఆయన ఎంతో ఆవేదన చెందాడు.ఎంతో మనోవేదనతో ఆయన హిందూకోడ్‌ బిల్లును త యారు చేయడంలో ఎంతో శ్రమకులోను కావాల్సి వచ్చింది.1947 ఏప్రిల్‌ 11వ తేదీన ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాను. 1949 ఏప్రిల్‌ 19న తేదీన ఈ బిల్లును సెలక్ట్‌ కమిటీకి పంపారు. 1950 ఫిబ్రవరి వరకు ఈబిల్లు నిర్లక్ష్యం చేశారు.1950 ఫిబ్రవరిలో జరిగిన పార్లమెంట్‌ సమావేశాల్లో ఈ బిల్లును వాయిదా వేశారు. 1951 ఫిబ్రవరి సమావేశంలో ఈ బిల్లులోని ఒక్కొక్క అంశం మీద చర్చించి 1951వ సంవత్సరం చివరకు బిల్లును అస్తిపం జరంలా చేసి చివరకు ఆమోదించలేదు. అందుకు నేను మనస్తాపం చెంది, స్త్రీలకు స్వేచ్ఛ కలిగించని ఈ పార్లమెంట్‌లోని క్యాబినెట్‌ మినిస్టర్‌కు రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ఆయన దళితుల కోసం ఎంత చేశాడో స్త్రీల విముక్తి కోసం కూడా అంతే చేశాడు. అంబేద్కర్‌ శూద్ర కులాల అభ్యున్నతి కోసం రాజ్యాంగంలో ఎన్నోచట్టాలను తీసుకు వచ్చారు. ఆయన శూద్రులకు, అతి శూద్రు లకు ఇద్దరికీ తమ కులబానిసత్వాల నుండి బయట పడటం కోసం బౌద్ధ స్వీకారాన్ని ప్రబోధిం చారు. ఆయన నిమ్నకులాల మధ్య ఉన్న అంటరానితనాన్ని పోగొట్టడం కోసం గొప్ప ప్రబోధనలు చేశారు. నిమ్నకులాల మధ్య ఉన్న అంటరానితనాన్ని నాశనం చేయాలంటే కులాం తర వివాహాలు తప్ప వేరే మార్గం లేదు. గుర్తుంచుకోండి, కులాంతర వివాహాలు జరిగితే ఉపకులాలు వాటంతట అవే నాశనమైతాయి. అంటరానివారు సాంఘిక వెలిని ఎలా అంత మొందించగలరు? అందుకున్న ఒకే ఒక మార్గం కులతత్వం లేని ఇతర వర్గాలతో సోదరత్వాన్ని, బంధుత్వాన్ని పెంచుకొని వారిలో లీనమవ్వ డం. ఈ సమాధానం చాలా తేలికైనది. కాని ఈ సమాధానపు విలువను చాలామంది ఒప్పు కోరు. కారణమేమిటంటే అతి తక్కువ మందికి మాత్రమే బాంధవ్యపు విలువ, ప్రాధాన్యత తెలుసు అని సమాజం మార్పును పైనుంచే కాకుండా కింద నుంచి కూడా ప్రారం భిం చాడు. కులం అనేది ఎక్కడ చిట్టెంగట్టుకు పోయినా దానిని బద్ధలు చేయడం కష్టం. కులంనుంచి బయటపడ్డవాళ్లు విస్తృత మైన సమా జంలో ప్రతిభావంతులుగా ముందుకు నడుస్తారు. తమ పిల్లలకు మొత్తం ప్రపంచంలో నచ్చినవారిని పెళ్లి చేయగలుగుతారు. ప్రపం చం మొత్తంలో ఎక్కడైనా విద్య చెప్పించగలు గుతారు. ఈ స్వేచ్ఛ లన్నీ మనం అంబేద్కర్‌ ద్వారా పొందినా ఆయనను జ్ఞాపకం చేసు కోలేకపోతున్నాం. అంబేద్కర్‌ గొప్ప రాజనీతి జ్ఞుడు. భారత రాజ్యాంగాన్ని రూపొందించే క్రమంలో ఆయన ప్రజాస్వామిక పునా దులను గట్టిపరిచాడు.ఆయన పరిపూర్ణ రాజ్యసిద్ధాం తాన్ని ప్రతిపా దించిన హాబ్స్‌,హెగెల్‌, బొసా న్క్వెట్‌ తదితరులతో ఆయన ఏకీభ వించలేదు. రాజ్య సమర్థుకులు భావించినట్లు రాజ్యమే అంతిమం అనే విధానాన్ని వ్యతిరేకించి రాజ్యం ఒక మానవ సంస్థగా భావించారు. ఎందు కంటే ఆలోచనకు ఆచరణకు రాజ్యమేగాక ఇతరంగా అనేకమైన మూలాలు ఉన్నాయని అంబేద్కర్‌ భావించారు. రాజ్యం ఒకసంస్థగా భావించి దాని లక్ష్యం ఈ విధంగా సూత్రీక రించారు. జీవనానికి, స్వేచ్ఛకు ఆనందంగా జీవించడానికి,స్వేచ్ఛగా మాట్లా డడానికి హక్కును కల్పించగలగాలి. సామాజిక, రాజకీయ,ఆర్థిక అసమానతలను తొలగించి అణచివేయబడిన వర్గాలకు చక్కని అవకాశా లు కల్పించాలి. భయం నుండి విముక్తిని కోరిక నుండి విముక్తిని అనుభవించే విధంగా ప్రతి వ్యక్తికీ అవకాశం కల్పించాలి. రాజ్యం మనిషినీ, సమాజాన్ని ఒక సేవకుడుగా సేవించాలే తప్ప యజమా నిలా ఆధిపత్యం వహించకూడదు. అందుకనే స్వాతంత్య్రానంతరం ఆయన ప్రజల హక్కుల పరిరక్షణ కోసం దృఢంగా నిల బడ్డాడు.ఆయన స్వతంత్రం కోసం మనషి నిరంతర పోరాటానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన ఉద్దేశంలో స్వతంత్రం అంటే కేవలం రాజకీయ స్వతంత్రం మాత్రమేకాదు. ఆర్థిక, రాజకీయ, సాంస్కృతి క, సామాజిక, తాత్త్విక స్వతంత్రం ఉంటేనే స్వాతంత్య్రం ఉన్నట్లు భావించాలని ఆయన నొక్కిచెప్పారు. ఆయన ఉద్దేశ్యంలో రాజ్యం అనేది మానవ్ఞల కోర్కెలను, ఆశయాలను సఫలీకృతం చేసే ఒక సాధనం మాత్రమే. రాజ్యానికి, వ్యక్తికీ మధ్య అంతస్సంబంధాలు ఈ దిశలోనే ఉండాలని ఆయన భావించారు. అంబేద్కర్‌ తన స్టేట్స్‌ అండ్‌ మైనారిటీస్‌లో పరిశ్రమలను భూములను జాతీయం చేస్తే దేశ సంపద పెరుగుతుందని చెప్పారు. వ్యవసాయ భూమి లేనివారికి వ్యవసాయ భూమి కల్పించడం వల్ల వాళ్లు ఆ భూమిని ఎంతో శ్రద్ధగా చేసుకుని ఉత్పత్తిని పెంచుతారని కొంత మంది చేతుల్లోనే ఎక్కువ భూమి ఉండడం వల్ల భూమి నిర్ల క్ష్యం అయ్యే ప్రమాదముందని అంబేద్కర్‌ ఆనాడే ప్రబోధిం చాడు. కానీ పాలకవర్గాలు నిరుపేదలకు భూమిని పంచటంలో ఇప్పటికీ నిర్లక్ష్యం చేస్తున్నా యి.అందువల్ల ఎక్కువమంది వ్యవసాయ కూలీలు మనకు ఏర్పడ్డారు. వ్యవసాయ కూలీల్లో కూడా దళితులు ఎక్కువగా ఉన్నారు. అస్పృశ్యులను కూడా ఆయన మీరు ఇతరుల కంటే తక్కు వనే ఆత్మన్యూనతా భావాన్ని వదులుకోవాలని పిలుపునిచ్చాడు. మిమ్మల్ని అన్ని రంగాల్లోకి రావడానికి సంబంధించిన ద్వారాలను తెరుస్తున్నారు.మీరు ప్రతిభావం తంగా సమర్థవంతంగా వాటిలోకి ప్రవేశించి మిమ్మల్ని మీరు నిరూపించుకోండి అని కూడా ఆయన చెప్పటం జరిగింది. అంబేద్కర్‌ దళితుల్లో ఉన్న తాగుడు వంటి దురా చారాలకు వ్యతిరేకంగా పోరాడాడు.మీలో వ్యక్తిత్వం రూపొందాలంటే మీరుబౌద్ధాన్ని స్వీకరిం చాలి.ఎటువంటి దుర్వ్యసనాలు లేకుండా మీ సంపదను పిల్లలకు విద్య నేర్పించడం కోసం ఉపయుక్తం చేయండని ఆయన పదేపదే తన ఉపన్యాసాల్లో చెప్పాడు. నేను ఒకతల్లి లేని పిల్ల వాడిగా ఎదిగి ఇవాళ వేల పేజీలు గ్రంథాలు రాయగలిగానంటే అక్షరం ఎవరి సొత్తు కాదు. అక్షరంద్వారా ఎవరైనా ప్రపంచ మానవ్ఞనిగా ఎదగొచ్చని ఆయన తన ప్రజలకు ప్రబోదం చేశాడు. అంబేద్కర్‌ తనప్రబోధాల్లో ప్రజలు భిక్ష గాళ్లుగా మార కూడదు. శ్రమద్వారా, ఆత్మ గౌరవం ద్వారా నిరంతరం ఉత్పత్తిలో పాల్గొ నడం ద్వారా మేథో సంపదను పెంచుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు పునర్నిర్మించుకోండని ఆయన బోధి స్తూ వెళ్లారు. ఆయనది ఆత్మ గౌరవ ఉద్యమం. మనిషికి ఆత్మగౌరవం ముఖ్యం. కులంద్వారానో,మతంద్వారానో, అధి కారం ద్వారానో,అనువంశికంగా సంపాదించిన సంపద ద్వారానో మనిషి ఉన్నతం కాలేదు. పాలకులు, ప్రజలు రాజ్యాంగంలో రూపొం దించిన లౌకిక,ప్రజాస్వామ్య, సమసమాజ భావజాలంతో,మానవ తావాదంతో సామాజిక విప్లవ స్ఫూర్తితో ముందుకు నడవాలని ఆయన ప్రబోధించిన బోధనలను ఆచరించటం ద్వారా భారత దేశంలో సామాజిక పునరుజ్జీవన ఉద్య మంలో మనమూ భాగస్వాములు అవుదాం.
భారతరత్న జీవిత విశేషాలు
అంటరానితనంపై ఎక్కుపెట్టిన ఆయుధం. అగ్రకుల దురహంకారంపై గొంతెత్తిన స్వరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌. 1891లో ఏప్రిల్‌ 14న మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని అంబవాడేలో (అప్పటి సెంట్రల్‌ ప్రావిన్సెస్‌లో సైనిక స్థావరమైన ‘మౌ’అన్న ఊరిలో) తల్లిదండ్రులు రాంజీ మలోజీ సాక్వా ల్‌,భీమాబాయ్‌ జన్మించారు. ఆయన పూర్తి పేరు భీమ్‌ రావ్‌ రాంజీ అంబేద్కర్‌. చదువు కోవాలన్నా మంచినీళ్ళు తాగాలన్నాకులమే అడ్డుగా నిలబడిరది. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. సమాజంలో వర్ణ,వర్గభేదాలు ఉండొద్దని రాజ్యాంగాన్ని ప్రత్యేకంగా రూపొం దించారు. ఎందరికో ఆరాధ్యుడయ్యారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కొందరివాడు కాదు అందరి వాడు, రాజ్యాంగాన్ని రచించి ప్రజలకు కావా ల్సిన అవసరాలను, హక్కులను తెలిపిన గొప్ప మహానాయకుడు. ప్రజలకు రిజర్వేషన్లు, హక్కులు కల్పించిన గొప్పనాయకుడు అంబేద్కర్‌. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎవరెవరికీ ఎంత రిజర్వేషన్ల ప్రకారం వేతనాలు తీసుకోవాలో, సమాజంలో ఎలా నడుచుకోవాలో, రాజ్యాం గంలో క్లుప్తంగా రచించి ప్రజలకు అందించిన గొప్ప మహనీయుడు. అంబేద్కర్‌ విభిన్న అం శాలపై ఎంతో విస్తృతంగా రచనలు చేశారు. ‘ప్రజాస్వామ్యం’, ‘అంటరానితనం’, ‘కుల నిర్మూ లన’, ‘మతమార్పిడి’,‘బౌద్ధమతం’, ‘హిందూ మతంలోని చిక్కుముడులు’, ‘ఆర్థిక సంస్కర ణలు-దళితులు’,‘భారతదేశ చరిత్ర’ మొదలైన వాటిపై ఆయన రచనలు ఎంతో ప్రఖ్యాతి చెందాయి. అంబేడ్కర్‌ భారతీయ సామాజిక వ్యవస్థను మార్చడం కోసం జీవితాంతం కృషి చేశారు. కులవ్య వస్థను రద్దు చేయడానికి కులనిర్మూలనను ప్రతిపాదించారు. కులం ఒక పెట్టుబడిగా,అదనపు సంపదగా,అదనపు విలువగా,అధికార కేంద్రంగా ఉందని స్పష్టం చేయడం ద్వారా అంబేడ్కర్‌ కులాన్ని కూడా అర్థశాస్త్రంలో భాగంగా చర్చించారు. తెలుగు నాట మొదటిసారిగా అంబేడ్కర్‌ను సాహిత్యం లో ప్రస్తావించిన ఘనత మహాకవి గుర్రం జాషువాకే దక్కుతుంది.1947లో వెలువరించిన ఆయన కావ్యం గబ్బిలంలో ‘జంబేడ్కరుండు సహోదరుండు’ అనే పద్యంలో గబ్బిలాన్ని అంబేడ్కర్‌ దీవెనలు అందుకోమంటారు. అప్పటి నుండి తెలుగు సాహిత్యంలో అంబేడ్కర్‌ శాశ్వత స్థానం సంపాదించుకున్నాడు.
బాబాసాహెబ్‌ ప్రత్యేకతలు-దక్కిన గౌరవాలు
బాబాసాహెబ్‌ తన జీవిత కాలంలో 527 ప్రసంగాలు చేసారు.ప్రతి ప్రసంగం అత్యంత ప్రభా వితం చేయగలిగేవే. లండన్‌ యూనివ ర్సిటీ లైబ్రరీలో ఉన్న పుస్తకాలు మొత్తం చదివిన ఒకే ఒక్కరు బాబాసాహెబ్‌. ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రభావశీలురైన ఆరుగురు మేధావు లలో బాబాసాహెబ్‌ ఒకరు. లండన్‌ విశ్వ విద్యాలయంలో తన ఎనిమిదేళ్ళ పీహెచ్‌డీని మూడు సంవత్సరాలలో పూర్తి చేసిన అత్యంత మేధావి.
అంబేద్కర్‌ విద్యాభ్యాసం
ా బీ.ఏ (బాంబే విశ్వవిద్యాలయం, 1912)
ా ఎం.ఎ. (కొలంబియా విశ్వవిద్యాలయం, 1915)
ా ఎమ్మెస్సీ (లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఏకనామిక్స్‌, 1921)
ా పీహెచ్‌డీ (కొలంబియా విశ్వవిద్యాలయం, 1927)
ా డీఎస్‌సీ (లండన్‌ విశ్వవిద్యాలయం, 1923)
ా బారిష్టర్‌ ఎట్‌ లా (గ్రేస్‌ ఇన్‌ లండన్‌, 1923)
ా ఎల్‌ఎల్‌డీ( కొలంబియా విశ్వవిద్యా లయం, 1952, గౌరవపట్టా)
ా డీ.లిట్‌ (ఉస్మానియా విశ్వవిద్యాలయం, 1953, గౌరవపట్టా)
కుటుంబ నేపథ్యం
మరాఠీ నేపథ్యం గల అంబేద్కర్‌ కుటుంబం. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో అంబేవాడ గ్రామంలో నివాసం ఉండేది. వీరి వంశీకులు మహార్‌ కులానికి చెందినవారు. తండ్రి రాంజీ బ్రిటీష్‌ ఇండియన్‌ ఆర్మీలో సుబేదారు. మొత్తం 13 మంది తోబుట్టువులలో తొమ్మిది మంది అకాల మృత్యువాత పడ్డారు. మిగిలినవారు.. ఇద్దరు అక్కలు.మంజుల, తులసి,ఇద్దరు అన్నలు బలరాం,ఆనందరావు మెహర్లను అస్పృశ్యులుగా పరిగణించడం వలన చిన్నతంలోనే అంట రానితనాన్ని ఎదుర్కొన్న అంబేద్కర్‌ పాఠశాలలో వేరే పిల్లలతో కలవకుండా,మాట్లాడకుండా పాఠశాల గదిలో ఒకమూల కూర్చోబెట్టేవారు. నీళ్ళు తాగాలంటే ప్యూన్‌ మాత్రమే వచ్చి ఇచ్చే పరిస్థితి.బరోడా మహారాజు శాయాజీరావ్‌ గైక్వాడ్‌ ఇచ్చిన 25రూపాయల విద్యార్థి వేతనంతో 1912లో బి.ఏ.పూర్తి చేశారు. విదే శాల్లో చదువు పూర్తి చేసిన తరువాత బరోడా సంస్థానంలో పదేళ్ళు పని చేసే షరతుపై 1913లో రాజాగారి ఆర్థిక సహాయం అందు కొని కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరిన అంబేద్కర్‌.1915లోఎం.ఏ.,1916లో పి. హెచ్‌.డి. డిగ్రీలను పొందిన అంబేద్కర్‌, 1917లో స్వదేశం వచ్చాక మహారాజా శాయా జీరావ్‌ సంస్థానంలో మిలిటరీ కార్యదర్శిగా నియామకం అయ్యారు. ఇక అంబేద్కర్‌ గాంధీ ఉద్యమము నుండి బయటకు వచ్చి ప్రత్యేకంగా దళిత సమస్యల పరిష్కారానికి ఆలిండియా డిప్రె స్స్‌డ్‌ క్లాస్‌ కాంగ్రెస్‌, ఆలిండియా షెడ్యూ ల్‌ కాస్ట్‌ ఫెడరేషన్‌ వంటి అనేక రాజకీయ పార్టీ లను ఏర్పాటు చేసి దేశ వ్యాప్తంగా దళితులను సమీకరించే ప్రయత్నం చేశారు. స్వాతంత్య్రం అనంతరం స్వాతంత్ర భారతావనికి తొలి న్యాయశాఖ మంత్రిగా పని చేశారు. దేశానికి రాజ్యాంగ రచన బాధ్యతలను అప్పగించిన నెహ్రూ..ప్రభుత్వం భారత రాజ్యాంగ పరిషత్‌ నియమించిన రాజ్యాంగ సంఘానికి అంబేద్కర్‌ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. అనేక దేశాల రాజ్యాంగాన్ని ఆధ్వయనం చేసి దృఢమైన రాజ్యాంగాన్ని తయారు చేయడంలో విజయం సాధించారు. తరతరాలుగా బడుగు,బలహీన వర్గాలను దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా వారి అభ్యున్నతికి రిజర్వేషన్లు కల్పించి వారి జీవి తాల్లో వెలుగులు నింపిన అంబేద్కర్‌. వ్యవసా యాభివృద్ధి దేశానికి ఊతమిస్తాయని బలంగా నమ్మిన అంబేద్కర్‌..వారసత్వ,వివాహ చట్టా లలో లింగ సమానత్వాన్ని వివరించడానికి ప్రయత్నించారు. హిందూ కోడ్‌ బిల్లు ముసా యిదాను పార్లమెంటులో నిలిపివేయడంతో.. 1951లో తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. 1956 అక్టోబరు14న నాగపూర్‌లో బౌద్ధమతాన్ని స్వీకరించిన అంబేద్కర్‌..తన జీవితంలోని ముఖ్యాంశాలను తన ఆత్మకథ ‘వెయిటింగ్‌ ఫర్‌ ఏ వీసా’లో రాసుకున్నారు. మధుమేహం వ్యాధితో బాధపడుతూ 1954లో డిసెంబర్‌ 6న తన ఇంట్లోనే కన్నుమూశారు అంబేద్కర్‌. దళితుల హక్కులు,అభ్యున్నతి కోసం జీవితకాలం పోరాటం చేసిన యోధుడిగా గుర్తింపు పొందారు. 1990లో అత్యున్నత భారతరత్న పురస్కారంతో భారత ప్రభుత్వం గౌరవించింది. (సేకరణ : థింసా ఎడిటోరియల్‌ డెస్క్‌)

థింసా దారిలో……!

ప్రముఖ పరిశోధక రచయిత, విశ్లేషకులు, డాక్టర్‌ అమ్మిన శ్రీనివాసరాజు థింసా పత్రిక కోసం ప్రత్యేకంగా రాస్తున్న ‘గిరిజన కథావిశ్లేషణ’ ధారావాహికంగా అందిస్తున్న ఈ నెల సంచికలో కథా విశ్లేషణ తెలుగు సాహితీలోకానికి సుపరిచితులైన యువ సాహితీవేత్త ‘శంభాన బాల సుధాకర మౌళి ’ కథా రచన ‘ థింసా దారిలో…’ కథా చదవండి..! – సంపాదకులు
ఉత్తరాంధ్ర ప్రాంతం విజయనగరం జిల్లా వాసి ఉపాధ్యాయ కథారచయిత, తాను నిత్యం చూస్తున్న అడవి బిడ్డల జీవనాన్ని చిత్రిక పట్టి వ్రాసిన సంపూర్ణ సంస్కృతి సంబంధ గిరిజన కథ థింసాదారిలో… ఇది ఏప్రిల్‌ 2012 సాహిత్య ప్రస్థానం మాస పత్రికలో తొలి సారిగా ప్రచురించబడిరది. ఉత్త రాంధ్ర మాండలిక భాషలో సంభాషణ యుతం గా సాగిన ఈకథద్వారా,రచయిత గిరిజన సంప్రదాయ పండుగలోని అంతరార్థం ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.
అడవి బిడ్డలు జీవనంలాగే వారిసంస్కృతి, సాంప్రదాయాలు,అబ్బురపరిచే విధంగా ఉంటాయి.సూక్ష్మంగా పరిశీలిస్తే అంతర్గతంగా ఏదో ఒక జీవనసూత్రం అందులో ముడిపడి కనిపిస్తుంది.బయటకు అంత త్వరగా కనిపిం చని ఆ జీవన సూత్రాలు తెలుసుకోవాలి అంటే గిరిజన బ్రతుకు చిత్రాన్ని అంతే చేరువుగా చూసిన వారికే సాధ్యం.
ఉత్తరాంధ్ర ప్రాంతం విజయనగరం జిల్లా వాసి ఉపాధ్యాయ కథారచయిత,‘‘శంభాన బాల సుధా కర మౌళి’’ తాను నిత్యం చూస్తున్న అడవి బిడ్డల జీవనాన్ని చిత్రిక పట్టి వ్రాసిన సంపూర్ణ సంస్కృ తి సంబంధ గిరిజన కథ ‘‘థింసాదారిలో…’’ ఇది ఏప్రిల్‌ 2012 సాహిత్య ప్రస్థానం మాస పత్రికలో తొలిసారిగా ప్రచురించబడిరది. ఉత్త రాంధ్ర మాండలిక భాషలో సంభాషణ యుతం గా సాగిన ఈకథద్వారా,రచయిత గిరిజన సంప్రదాయ పండుగలోని అంతరార్థం ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఇక కథ విషయానికొస్తే….అందమైన అడవి, సుందర సోయగాలను వర్ణిస్తూ మొదలైన ఈ కథలోని పాత్రల పేర్లు,ఊర్ల పేర్లు,ఉపయో గించిన భాష,జాతీయాలు,అన్ని స్థానికతకు అగ్రతాంబూలం ఇచ్చాయి.‘‘గుమిడిగూడ’’ గిరి జన గూడెంపెద్ద ‘‘ఉంబయ్య’’,అతని మొదటి భార్య ‘‘భూదేవమ్మ’’,ఆమె కొడుకు‘‘బుదరయ్య’’ రెండో భార్య కూతురు‘‘సుకిరి’’తల్లులు వేరైనా ఒకేతండ్రిబిడ్డలు కనుక అంతేగారాబంగా జీవిస్తూ ఉంటారు. గిరిజన గూడేల్లో ఏ సామూ హిక పండుగలు చేయాలన్న అందరూ ఒకచోట చేరి ముందుగా ప్రణాళిక చేసుకుంటారు.ఇది ఆ గ్రామ పెద్దల సమక్షంలో…ఇకపోతే ‘గుమిడిగూడ’గ్రామ పెద్ద‘ఈడ ఉంబయ్య’ రెండు తరాలుగా వస్తున్న ఆ గ్రామ పెద్ద మనిషి. తగువులు పంచాయతీ తీర్చడమే కాదు వైద్య సేవలు కూడా అందిస్తాడు. పాము కరిచిన, తేలు కుట్టిన,పసరు పోస్తాడు.చూడటానికి బానకడుపుతో లావుగా,నల్లగా,ఉంటాడు.
చెవికి బంగారు బావిలి, మొలతాడుకి ఒకపక్క చుట్టలు పెట్టుకోవడానికి వెదురు గొట్టం, మరో పక్క కత్తి పెట్టుకోవడానికి వరలాంటి రెండు జానల పొడవైన మరో వెదురు గొట్టం,అది అతడి అవతారం. అతను వాడే కత్తి లాగే మాట కూడా పదునే….!! ఆ గ్రామాన్ని రక్షిస్తున్న ‘కొండ భైరవుడు’ పంపిన రక్షకుడిగా ఉంబయ్యను నమ్ముతారు అక్కడి గిరిజనులు. అతని మాటే వేదం ఎవరు అతని మాట కాద నరు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎవరికి ఏకష్టం వచ్చినా ముందుండేది ఆ గ్రామ పెద్ద ఉంబయ్య. కూతురు సుకిరి‘అయ్య రమ్మంటున్నాడు’ అని చెప్పిన చిన్న మాట తోనే…గూడెం లోని ఇంటికొకరు అంత రాత్రి చీకటిలో వాన ముసురు కూడా లెక్కచేయకుండా గూడెం పెద్ద పిలుపును గౌరవిస్తూ అతని ఇంటి ముందుకు చేరుకుంటారు.దీని ద్వారా అడవి బిడ్డలు లోని క్రమశిక్షణ, నిజాయితీ తీరు తెన్నులు అర్థమవుతాయి. వచ్చిన వారిని అంద రినీ పలకరిస్తూ క్షేమసమాచారాలు అడిగి తెలుసుకున్న ఉంబయ్య ప్రవర్తన ద్వారా అతనిలోని అసలైన నాయకత్వ లక్షణాలు కనిపిస్తాయి. కొండ మీద నివసించే గిరిజనులు ప్రత్యేక అవసరం పడితే తప్ప కొండ దిగి ‘దిగువకు’రారు వారి ప్రయాణాలు కూడా సామూహికంగా,సమైక్యంగా సాగుతాయి. అలాంటి సాధారణ ప్రయాణానికి పండుగ సంప్రదాయం అన్వయించి చెప్పిందే ఈ‘థింసా దారిలో…’ కథ. ఈ కథరాయడంలో రచయిత సుధాకర్‌ మౌళి రెండు అంశాలను సూచించి నట్లు అనిపిస్తుంది, అందులో ఒకటి గిరిజనుల్లో గల భిన్నసాంప్రదాయాల్లో ఒకటైన థింసా ఆటకు,సంక్రాంతి పండుగకు గల అవినాభావ సంబంధం తెలపడం ఒకటి. పండుగ పేరుతో దిగువ ప్రాంతాలకు వెళ్లి అక్కడి మనుషుల్లోని చెడు బుద్ధులను నేర్చుకో వద్దని, సాంప్ర దాయాలను కలుషితం చేసుకోవద్దని మరోకటి. ముఖ్యమైన ఈహెచ్చ రికను నర్మగర్భంగా చెప్పే ప్రయత్నం రచయిత చేశారు అనిపిస్తుంది.ఇక ఈ థింసానృత్యం కథా శీర్షికగా,వస్తువుగా, రచ యిత ఎంచుకోవడంలో అతని రచన ప్రతిభ వెల్లడవుతుంది.చిన్న వస్తువు సాయంగా పెద్ద విషయం వెల్లడి చేయడం అనేఉత్తమ రచయిత భావాలు కూడా ఇందులో కనిపిస్తాయి.ఉత్తరాం ధ్ర ప్రాంతానికి చెందిన కొండదొర,గదబ, గిరిజనుల సాంప్రదాయాల నృత్య కేళి‘‘థింసా’’ సంక్రాంతి పండుగ రోజుల్లో ఈనృత్యాలు చేస్తూ కొండల మీద నివసించే కోయలు,దిగువ ప్రాంతాల్లోని గ్రామాల్లో తిరుగుతూ వారి థింసా ఆటపాటలతో అక్కడి వారికి ఆనందం అందిస్తారు.మైదాన ప్రాంత ప్రజలు అబ్బుర పరిచే ‘‘థింసా’’ సోయగాలు చూడటానికి ఆరు నెలల ముందు నుంచే ఎదురు చూస్తారు. ప్రకృతి సైతం అడవిబిడ్డల పాద స్పర్శ కోసం పరవశంతో ఎదురు చూస్తోందట!! అనుచరులు డప్పులు,పినలగర్రలు,కిరిడి,సన్నాయి, పిల్లన గ్రోవి,జోడుకొమ్ములు,వాయిద్యాలు వాయిస్తూ, చూపరులకు వీనులవిందు అందిస్తారు. సాధారణంగా దీపావళికి మొదలైన థింసా ఆటలు,పుష్య,పాల్గున,మాసాల్లో ముగుస్తాయి. పుష్యమాసపు సంక్రాంతి రోజుల్లో దీనికి ఉత్త రాంధ్రలో అధిక ప్రాధాన్యత ఉంటుంది. వాయిద్యాలకు అనుగుణంగా 14గతులలో గిరిజన జీవితాన్ని అభినయించేదే థింసా నృత్యం.
ఇక కథలోకి వెళితే….ఉత్తరాంధ్రకు చెందిన ‘గుమిడిదూడ’ అనే గిరిజన కొండ గ్రామంకు చెందిన గ్రామ పెద్ద కొడుకు ‘బుదరయ్య’ అతని సావాసగాడు ‘సువ్వాయి’ అడవికి కట్టెలకు వెళ్లి కట్టెలతో ఇంటి ముఖం పట్టి, దారిలో వర్షానికి తడిసి ఇల్లు చేరతాడు, తల్లి భూదేవమ్మ కొడుకును మందలిస్తుంది, ఆరోగ్యం పాడవు తుందనే భయంతో.!! కొండ దేవుడు భైరవుడు ఉండగా తన ఆరోగ్యానికి ఏమీ కాదంటూ తల్లికి భరోసా చెప్పి చెల్లెలు ‘‘సుకి రి’’ని బువ్వ పెట్ట మంటాడు.గోడకాని చెల్లి సిబ్బిలో పెట్టిన బువ్వ తింటాడు. సందకాడ వర్షం జోరు తగ్గాక సుకిరి గూడెంలోని వాళ్లకు తండ్రి చెప్ప మన్నా కబురు చెప్పి వస్తుంది.గ్రామపెద్ద‘ఉంబ య్య’ పిలుపు అందుకున్న వారంతా అక్కడికి చేరతారు, తాము ప్రతి సంక్రాంతి నెలలో చేయబోయే థింసా ప్రయాణం గురించి చెప్పగ అందరూ అందుకు సమ్మతించి,దానికి సంబం ధించిన సూచనలు, విని ఎవరి ఇళ్లకు వారు వెళతారు. తెల్లారి పొద్దుపొదుపు అయ్యాక ఉంబయ్య నాయకత్వంలో ఆగిరిజన గూడెం మగవాళ్ళంతా తమతమ వాయిద్యాలతో థింసా ఆటకు కొండదిగువ గ్రామాలకు ప్రయాణం అవుతారు.వారు ఇళ్లకు తిరిగి రావడానికి వారం పది రోజులు పట్టవచ్చని అంతవరకు ఇళ్ళల్లో ఉండే ఆడవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో గ్రామ పెద్ద చెబుతాడు. ఆడ వాళ్ళంతా ఒకరి చేతులు ఒకరు జట్టుగా పట్టు కుని మీరు వచ్చేవరకు అందరం గుట్టుగా ఉంటామంటూ వాళ్ల భర్తల కళ్ళల్లోకి సూటిగా చూస్తూ మాటిస్తారు.మగాళ్లంతా తమ తమ వాయిద్యాలతో కొండ దిగువకు పయనం కట్టడం వారి నాయకుడు కొండభైరవుడికి మొక్కి ప్రయాణం ప్రారంభిస్తూ ‘కొండ దిగువకు పోయేది అక్కడి రుచులు తినడానికి,తాగ డానికి, డబ్బులు సంపాదనకు కాదు,మన థింసాఆట ఉనికి అందరికీ పంచడానికి’ అంటూ అసలు విషయం చెప్పడంతో కథ ముగుస్తుంది.‘సాంప్రదాయాన్ని కొనసాగించే దారుల్లో కొండ బిడ్డలు’అన్న రచయిత ముగింపు వాక్యం తో ముగిసిన ఈ కథ ఆద్యంతం అంద మైన అటవీ వాతావరణంతో సాగుతూ గిరి బిడ్డల జీవన చిత్రాన్ని కళ్ళకు కడుతుంది. ఏమండి క్యారేజీ ఉండదని రచయిత శైలి కూడా భిన్నంగా అనిపిస్తుంది. కథలో సందర్భోచితంగా వాడిన ‘‘చేటలో చెరిగిన మెత్తని పిండిలా వెన్నెల పల్చగా కాస్తంది’’ వంటి జాతీయాలు రచయిత నూతనత్వానికి అద్దం పడతాయి. ఇక కథద్వారా రచయిత చెప్పదలుచుకున్నది ‘థింసాఆట’ద్వారా గిరి బిడ్డ లు తమ జీవన గతిని ప్రదర్శిస్తూ తమ సాంప్ర దాయ సంస్కృతులను కాపాడుకుంటూ,అందరికీ ఆనందం అందిస్తారు తప్ప తద్వారా వచ్చే డబ్బులు,ధాన్యాల కోసం ఆశ పడి చేసే‘‘యాచక పని’’ఎంత మాత్రం కాదు,అని ఉద్ఘాటిస్తారు.అదే విధంగా వారం పది రోజుల పాటు తమకు సొంతమైన అడవులను,కొండలను, భార్యా బిడ్డలను, వదిలి ఉండలేమనే భావంతో వెళ్లే సమయంలో ‘‘ఆ మగాళ్ళు కన్నీరు పెట్టు కున్నారు’’ అన్న వాక్యం ద్వారా అడవి బిడ్డలు తమ నివాసాల మీద ఎంతటి మమకారం కలిగి ఉంటారో రచయిత చెప్పకనే చెప్పారు. ఈ మమకారం మనుషులం దరికీ ఉంటుంది, కానీ అధికారులు,పాలకులు,అభివృద్ధి,ప్రాజెక్టులు, నెపంతో అడవి బిడ్డలను వారి జన్మభూమికి శాశ్వతంగా దూరం చేసే ప్రయత్నాలు చేయడం వల్ల వారి మనసుఘోష ఎలా ఉంటుందో ఎవ రికి వారు మనుషులుగా ఆలోచించుకోవాలి. చిన్ని ఇతివృత్తానికి అందమైన సృజన శైలి జోడిరచి ఆసక్తికరమైన కథనంతో కథను ఆసాంతం ఆహ్లాదంగా నడిపించడంలో రచ యిత ‘‘బాలసుధాకర్‌ మౌళి’’ కృషి అభినం దనీయం, వర్తమాన కథా రచయితలకు ఆచర ణీయం.
(వచ్చే నెల బలివాడ కాంతారావు గారి ‘‘నైజరు తేనె’’ కథా విశ్లేషణ మీకోసం)

ఈ ఇబ్బందులతో చదువు సాగేదెలా?

భారత రాజ్యాంగం విద్యను రాష్ట్రాల హక్కుల్లో పెట్టింది. ఇందిరా గాంధీ ఉమ్మడి జాబితాకు మార్చింది. ఇపుడు మోడీ ప్రభుత్వం ఉమ్మడి జాబితాలో గల విద్యను స్వాధీనం చేసుకొని శిశు విద్యతో సహా మొత్తం సిలబస్‌ తానే నిర్ణయించి రాష్ట్రాలపై రుద్దుతున్నది. మా హక్కుపై నీ పెత్తనం ఏమిటని కేంద్రాన్ని నిలదీయడానికి బదులు జగన్‌ ప్రభుత్వం కేంద్రానికి లొంగిపోయి బిజెపి ముదనష్టపు విద్యావిధానాన్ని మన రాష్ట్రంలోనే తొలుత అమలు చేస్తున్నది. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడం ప్రజలు, ముఖ్యంగా పేదలు, మధ్యతరగతి వారి బాధ్యత. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం, నాణ్యమైన విద్య కోసం పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది.
విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఫిబ్రవరి18నుండిమార్చి ఐదో తేదీ వరకు శ్రీకా కుళం నుండి అనంతపురం వరకు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యాన జాతా నిర్వహించడం జరిగింది. యాత్ర ప్రారంభానికి ముందు 17వ తేదీ రాత్రి 9 గంటలకు శ్రీకాకుళం పట్టణ ఎస్‌ఎఫ్‌ఐ కార్యా లయంలో ఉన్న నాయకత్వాన్ని ఈడ్చుకుంటూ పోలీ సులు అరెస్ట్‌ చేశారు. స్టేషన్లో పిడిగుద్దులు గుద్ద డంతో జిల్లా కార్య దర్శి రాజు స్పృహ తప్పి ఆస్పత్రి పాలయ్యారు. జాతా నిర్వహించడానికి పర్మిషన్‌ లేదంటూ యాత్ర కోసం అద్దెకు తీసుకున్న మినీ బస్సును 18 ఉదయం 10 గంటలకు పోలీసులు సీజ్‌ చేశారు.వాహనంలోఉన్న పుస్తకాలు, కర పత్రాలు, పోస్టర్లు, బ్యానర్లను పోలీసులు కాల్చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధం విధించినా విద్యార్థులను కలిసి సమస్యలు తెలుసుకుంటామని ఆర్‌.టి.సి బస్సులో ప్రయాణం చేసి పార్వతీపురంలో సభ జరిపారు. పోలీసులు మరలా రాత్రి 9 గంటల వరకు నాయకత్వాన్ని ఆఫీసులో నిర్బంధించారు. ఆర్‌.టి.సి బస్సులో విజయనగరం చేరుకొని విద్యా ర్థులు ర్యాలీ చేస్తే అడుగడుగున నాయకత్వాన్ని అరెస్టులు చేశారు. విజయనగరంలో విద్యార్థులు యాత్రలో పాల్గొనకుండా అడ్డుకునేందుకు ముం దస్తుగా ప్రతి కాలేజీ దగ్గరా పోలీసులను కాపలా పెట్టారు. నిర్బంధాన్ని అధిగమించి వందలాది మంది విద్యార్థులు ర్యాలీలో పాల్గొ న్నారు. విశాఖ పట్నంలో అడుగడుగునా చెకింగ్‌ చేసినా రాత్రి9 గంటలకు ఆంధ్ర యూని వర్సిటీ హాస్టల్‌ కి వెళ్లి మీటింగ్‌ పెట్టాము. రాజ మండ్రిలో ర్యాలీ మీటింగ్‌ పెట్టుకోడానికి అనుమతి లేదు. మీవాళ్లు ఏ వాహ నంలో వస్తున్నారో చెప్పండి అరెస్ట్‌ చేస్తామని స్థానిక నాయకత్వానికి పోలీసులు వార్నింగ్‌ ఇచ్చారు. భీమవరం నుండి ఏలూరు వచ్చే దారిలో మమ్మల్ని పట్టుకోవడం కోసం పోలీసులు ఎనిమిది చెక్‌పోస్టు లు పెట్టారు. ప్రతి వాహనాన్ని చెక్‌ చేశారు. పోలీ సుల నుండి తప్పించుకుని రాత్రికి ఏలూరు చేరు కున్నాం. అనేక నిర్బంధాల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర సాగింది. ప్రభుత్వం విద్యార్థుల మీద ఎందుకు ఇంత నిర్బంధం విధిస్తోంది? ప్రతిపక్ష నాయకునిగా జగన్‌ మోహన్‌ రెడ్డి ఓదార్పు యాత్ర, పాదయాత్ర చేయటానికి ప్రజాస్వామ్యం ఉంది. విద్యార్థి సమస్యలు పరిష్కరించాల్సిందిగా కోరుతూ యాత్ర చేస్తే అది అప్రజాస్వామ్యమా?
వసతులు లేవు.. టీచర్లు లేరు.. చదువుకునేదెలా?
అరకులో ఉమెన్స్‌ డిగ్రీ కాలేజ్‌ ఏర్పాటు చేసి నాలుగేళ్లు అవుతోంది. సొంత భవనం లేదు. ప్రిన్సిపాల్‌ ఒక్కరే ఉన్నారు. లెక్చరర్లు లేరు. పాడేరు బాలికల కళాశాల హాస్టల్లో 250 మంది విద్యా ర్థులు ఉన్నారు. ఒక్కో గదిలో 30 మంది విద్యార్థులు ఉంటున్నారు. మరుగుదొడ్లు లేవు. ఉన్న మరుగు దొడ్లకు తలుపులు లేవు. కాకినాడ ఐటిఐ కాలేజీలో వెయ్యి మంది విద్యార్థులున్నారు. 80 మంది అధ్యా పకులు కావాలి. కానీ 50 మంది ఉన్నారు. ఏలూరు జిల్లా కేంద్రం డిగ్రీ కాలేజ్‌ స్థాపించి పన్నెండేళ్లు అవుతుంది. 250 మంది చదువుతున్నారు. సొంత భవనం లేదు. చెట్ల కిందే పాఠాలు. రేపల్లె ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీ సొంత భవనం లేక ఫస్టియర్‌ సెకండియర్‌ విద్యార్థులు ఒకేక్లాసురూములో చదువు కోవాల్సిన పరిస్థితి. బాపట్లలో ఇంటర్మీడియట్‌ కళాశాల నాలుగు రూముల్లో క్లాసులు జరుగు తున్నాయి. హెచ్‌ఇసి, సిఇసి గ్రూపులకు ఒకే రూము లో క్లాసులు జరుగుతున్నాయి. సివిక్స్‌, కెమిస్ట్రీ సబ్జె క్టులకు అధ్యాపకులు లేరు. ఆలూరు నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వడిగ్రీకాలేజిస్థాపించి 31ఏళ్ళు అవుతుంది. సొంత భవనంలేదు. ఒక్క బిఏ కోర్సు మాత్రమే ఉంది. విద్యార్థులు ఇతర డిగ్రీ కోర్సులు చదవాలంటే అనంతపురం, కర్నూలు వెళ్లాలి.
సంక్షేమ హాస్టల్‌లో మెనూ అమలు చేయాలి
పేదవాళ్లు, తల్లిదండ్రులు లేని విద్యార్థులు హాస్టల్‌లో వుండి విద్యనభ్యసిస్తున్నారు. మెనూ ప్రకారం భోజనంలో వారానికి ఆరు సార్లు గుడ్లు వడ్డించాలి. కానీ మూడుసార్లు ఇస్తున్నారు. గుం టూరు బీసీ హాస్టల్‌లో ‘’మీరాకతో మంచి భోజనం అన్న’’ అన్నారు. పాడేరు గిరిజన బాలికల కళాశాల హాస్టల్‌లో ఉదయం పులిహోర పెట్టాలి. కానీ పసుపు అన్నం పెట్టారు. ప్రతిరోజు అరటి పండ్లు ఇవ్వాలి కానీ ఇవ్వటం లేదు. ప్రభుత్వం విద్యార్థికి రోజుకి 46 రూపాయలు ఖర్చు చేస్తుంది. విద్యార్థి మెస్‌చార్జి నుండి వర్కర్‌ జీతం కింద ఐదు రూపా యలు కట్‌ చేస్తారు. 41రూపాయలతో మూడు పూటలు భోజనం పెట్టాలి. ఎలా సాధ్యం? గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఎక్కడా మెనూ అమలు కావడం లేదు. మెస్‌ ఛార్జీలు పెంచి నేటికి ఐదు సంవత్సరాలవుతుంది. నిత్యావసర ధరలు 300 శాతం పెరిగాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమా ణాల ప్రకారం రోజుకి 2300కిలో క్యాలరీల శక్తి నిచ్చే ఆహారం తీసుకోవాలి. అప్పుడే ఆరోగ్య వంతులుగా ఉంటారని ఆ సంస్థ చెబుతుంది. ఈ మధ్యకాలంలో విశాఖ ఏజెన్సీ 11మండలాల్లో హాస్టల్‌లో చదువుతున్న బాలికలకు రక్తపరీక్ష చేస్తే 8 శాతం కంటే ఎక్కువ హిమోగ్లోబిన్‌ లేదు. రక్తహీ నతతో ఉన్నారని ఐటీడీఏ అధికారులు తెలిపారు. విద్యార్థులు ఆరోగ్యవంతంగా ఎలా ఉంటారు? ఎలా బాగా చదువుకోగలరు? అందుకనే ధరలకు అనుగుణంగా మెస్‌ చార్జీలు పెంచాలి. బాపట్ల బాలికల ఉన్నత పాఠశాలలో 576 మంది విద్యార్థులు ఉన్నారు. చాలీచాలని 12 రూముల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. ఆట స్థలం లేదు. నూతన విద్యా విధానం అమలులో భాగంగా చుట్టుపక్కల ఉన్న 8 ప్రాథమిక పాఠశా లల్లోని 3,4,5 తరగతుల 500 మంది విద్యార్థుల్ని వచ్చే విద్యా సంవత్సరం ఇక్కడికి పంపిస్తారట. ఇప్పటికే ఆ స్కూల్లో సరైన వసతులు లేక అనేక ఇబ్బందులతో చదువు తుంటే అదనంగా విద్యార్థు లను జాయిన్‌ చేసుకుంటే ఎలా చదువుకునేది? నెల్లూరు సిటీలో మున్సిపల్‌ (కెఎన్‌ఆర్‌) పాఠశాలల్లో 2 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. 20 క్లాస్‌రూములు ఉన్నాయి. రూములు చాలక ఉదయం 8,9తరగతులు మధ్యాహ్నం 6,7 తరగ తులు క్లాసులు నిర్వహిస్తున్నారు. టెన్త్‌ క్లాస్‌ విద్యా ర్థులు 370మంది 7 ఏడు సెక్షన్లు ఉన్నాయి. 25 మంది టీచర్లు ఉన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం1:30 ప్రకారం 66 మంది ఉపాధ్యాయు లు కావాలి. కానీ 25 మంది ఉన్నారు. కొందరపు, వీరపడుము, కొండపాయి, కొండపాయి మెన్‌ ప్రాథమిక పాఠశాలల్లో ఉన్న 3,4,5 తరగతులకు చెందిన 500 మంది విద్యార్థులను స్కూల్‌కి తరలిస్తున్నారు. మొత్తం 2,500 మంది విద్యార్థులు అవుతారు. చాలామంది విద్యార్థులు ఇబ్బందిపడి డ్రాపౌట్లు అవుతారు. ఇలా18వేల ప్రాథమిక పాఠ శాలలు మూసివేసి అక్కడున్న విద్యార్థులను హైస్కూ ల్‌కు తరలిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్లో చాలీచాలని రూముల్లో అరకొర టీచర్లతో నడుస్తున్న స్కూళ్లలో ఇంకా విద్యార్థుల సంఖ్య పెరిగితే నాణ్యమైన విద్యరాకపేద వాళ్లు చదువుకు దూరం అవ్వాలి. లేదా ప్రైవేట్‌ పాఠ శాలలో డబ్బు చెల్లించి చదువుకోవాలి.
రోగం వస్తే ఎవరికి చెప్పుకోవాలి?
సంక్షేమ హాస్టల్లో విద్యార్థికి అనారోగ్యం వస్తే వారి సంక్షేమం చూడటానికి ఒక ఏఎన్‌ఎం ని నియమించేవారు. ఈ ప్రభుత్వం ఆ అవకాశాన్ని తొలగించింది. గురుకులాల్లో ఏఎన్‌ఎంఉన్నా…విద్యార్థికి జ్వరం ఇతర వ్యాధులు వస్తే ఏ జ్వరం వచ్చిందో టెస్ట్‌ చేయడానికి కూడా కిట్లు లేని పరిస్థితి. గతంలో గురుకులాల్లో హెల్త్‌ కోసం ప్రభు త్వం లక్ష రూపాయలు ముందుగానే బడ్జెట్‌ కేటా యిం చింది. నేడు జీవో నెంబర్‌ 99విడుదల చేసి ఆరోగ్యం కోసం ఆ విద్యాసంస్థల యాజమాన్యం చేసుకోవాలని తెలిపింది. దీంతో ఏ ఒక్క విద్యార్థి అనారోగ్యం పాలైనా వారు తినే భోజనంలో కోత విధించి ఆ డబ్బుతో వైద్యం చేస్తున్నారు. పిఠాపురం ఎస్‌.సి గురుకులంలో పనిచేస్తున్న టీచర్‌, సిబ్బంది తమకు అందే జీతంలో రెండు వందల రూపా యలు తీసి విద్యార్థుల ఆరోగ్యం కోసం ఖర్చు పెడు తున్నారు. గతంలో విద్యార్థికి ప్రతి నెలా కాస్మొటిక్‌ ఛార్జీలు ఇచ్చేవారు. వాటితో అవసరం ఉంటే విద్యార్థి తీసుకునేవాడు. నేడు అమ్మ ఒడి పథకంతో 15 వేల రూపాయలు ఇస్తున్నాం కదా అని కాస్మొ టిక్‌ ఛార్జీలు కూడా ఇవ్వట్లేదు. దీంతోచాలా విద్యా సంస్థల్లో విద్యార్థులు జబ్బు పడిన సంద ర్భంలో తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడుతూనే ఉంది.
తెలుగు మీడియం కావాలి
మాతృభాషలో బోధించాలని విద్యాహక్కు చట్టం చెప్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఇంగ్లీష్‌ మీడియంలోనే అంటోంది. డిగ్రీ మొదటి సంవ త్సరం ఇంగ్లీష్‌ మీడియం చేయడం వల్ల ఇప్పటి వరకు ఇంటర్మీడియట్‌ తెలుగు మీడియం చదువు తున్న వాళ్ళు డిగ్రీలో ఇంగ్లీష్‌ చదవడం కష్టంగా ఉంది.ప్రభుత్వ ఉపాద్యాయుల్లో బోధన అర్హతలున్నా ఆంగ్లంలో చెప్పేంత సామర్ధ్యం వారిలో లేకపోవడంతో ఆంగ్ల విద్య పడకేసింది. నాడు`నేడు కార్యక్రమంలో పాఠశాలల అభివృద్ధిలో అవినీతి రాజ్యమేలుతోంది. దీనిపై అధికార్లు కన్నెత్తి చూడం లేదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పరీక్షలు మాతృ భాషలోనే పరీక్షలు నిర్వహి స్తుంది. నీట్‌ పరీక్షలను ప్రభుత్వం12 భాషలలో నిర్వహిస్తుండగా…మనం మాతృ భాషలో తరగతులు నిర్వహిస్తే తప్పేంటి?
జీవో నెంబర్‌ 77-పేదలు ఉన్నత విద్యకు దూరం
క్రిస్మస్‌ రోజున జగన్‌ ప్రభుత్వం జీవో నెం. 77 తెచ్చి ప్రైవేట్‌, ఎయిడెడ్‌ విద్యా సంస్థల్లో పి.జి, ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు విద్యా దీవెన, వసతి దీవెన నిలిపి వేసింది. యూనివర్సిటీ అనుబంధ కాలేజీ ల్లో ఎం.ఏ, ఎం.ఎస్సీ, ఎం.కామ్‌ వంటి సాధారణ పి.జి 22,830 మంది చదువుతుంటే… ప్రైవేట్‌, ఎయిడెడ్‌ కాలేజీల్లో 32,562 మంది చదువుతున్నారు. ఎం.టెక్‌, ఎం.సి.ఏ, ఎం.బి.ఏ, ఎల్‌.ఎల్‌.బి వంటి ప్రొఫెషనల్‌ కోర్సులు ప్రభుత్వ సంస్థల్లో 12,020 మంది చదువు తుంటే ప్రైవేట్‌, ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో 1,63,810 మంది చదువుతున్నారు.ఈజీవో వలన మొత్తం 1,96, 372 మందికి విద్యాదీవెన, వసతి దీవెన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదు. పేదల పిల్లలు వేలు, లక్షల రూపాయల ఫీజులు కట్టి ప్రైవేటు రంగంలో ఉన్నత విద్య ఎలా చదవగలరు?
ఫీజులు భారం
ప్రభుత్వం గతంలో స్కాలర్‌షిప్‌ను కళాశాల యాజమాన్యం అకౌంట్లో కొంత వేసేది. మరికొంత ఫీజు విద్యార్థి అకౌంట్లో జమ చేసేది. నేడు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పేరుతో సంవత్సరానికి 20 వేల రూపా యలు విద్యార్థి అకౌంట్లో జమ చేస్తామని తెలి పింది. కాబట్టి కళాశాల యాజమాన్యం విద్యా ర్థులపై ఫీజులు ముందుగానే చెల్లించాలని ఒత్తిడి తీసుకు వస్తున్నాయి. ప్రభుత్వం నుండి సకాలంలో విద్యా దీవెన, వసతి దీవెన పూర్తిస్థాయిలో రాక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అప్పులు చేసి ఫీజులు చెల్లి స్తున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ హాస్టల్లో గతంలో 2500 రూపాయలు మెస్‌ బిల్లు వచ్చేది. నేడు ఒక విద్యార్థికి 3500 రూపా యలు వస్తుంది. రాయలసీమ యూనివర్సిటీ హాస్టల్లో ఫీజులు చెల్లించలేదని150మంది విద్యార్థులను యూని వర్సిటీ రిజిస్ట్రార్‌ బయటికి పొమ్మన్నారు. భారత రాజ్యాంగం విద్యను రాష్ట్రాల హక్కు ల్లో పెట్టింది. ఇందిరా గాంధీ ఉమ్మడి జాబితాకు మార్చింది. ఇపుడు మోడీ ప్రభుత్వం ఉమ్మడి జాబితాలో గల విద్యను స్వాధీనం చేసుకొని శిశు విద్యతో సహా మొత్తం సిలబస్‌ తానే నిర్ణయించి రాష్ట్రాలపై రుద్దు తున్నది. మా హక్కుపై నీ పెత్తనం ఏమిటని కేంద్రాన్ని నిలదీయడానికి బదులు జగన్‌ ప్రభుత్వం కేంద్రానికి లొంగిపోయి బిజెపి ముదనష్టపు విద్యా విధానాన్ని మన రాష్ట్రంలోనే తొలుత అమలు చేస్తున్నది. మన హక్కును కేంద్రం స్వాధీనం చేసుకోవడాన్ని, జగన్‌ కేంద్రానికి లొంగిపోవటాన్ని టిడిపి, జనసేన ఖండిరచక మేమంతా ఒకటేని చెప్పకనే చెబుతున్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడం ప్రజలు, ముఖ్యంగా పేదలు, మధ్యతరగతి వారి బాధ్యత. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం, నాణ్యమైన విద్య కోసం పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. – ( ఎ.అశోక్‌ )

కోవిడ్‌ వల్ల అనాథలైన పిల్లలు అర కోటి

కోవిడ్‌ మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల మంది చిన్నారులు అనాథలైనట్లు లాన్సెంట్‌ చైల్డ్‌ అండ్‌ అడోలసెంట్‌ హెల్త్‌లో ప్రచురించిన కొత్త మోడలింగ్‌ అధ్యయనం చెబుతోంది. 20 దేశాల చిన్నారులపై చేసిన ఈ అధ్యయనంలో జర్మనీ నుంచి 2,400 మంది ఉంటే భారత్‌ నుంచి 19 లక్షల మంది చిన్నారులు ఉన్నట్లు తేలింది. అత్యంత ప్రమాదకర పరిస్థితి దక్షిణాఫ్రికా పెరూలో కనిపించింది. అక్కడ ప్రతి వెయ్యి మంది చిన్నారుల్లో 8 లేక ఏడుగురు అనాథలుగా మిగిలిపోయారు. 0-4 సంవత్సరాల మధ్య వయసు వారు ఐదు లక్షల మంది, 5-9 సంవత్సరాల మధ్య వాళ్లు 7.4 లక్షల మంది కోవిడ్‌ కారణంగా అనాథలుగా మారిపోయారు. 10-17 సంవత్సరాల పిల్లల్లో 21 లక్షల మంది ఈ మహమ్మారి వల్ల ఒంటరివారయ్యారు.
ప్రతి ముగ్గురులో ఇద్దరు కోవిడ్‌ వల్ల తల్లి లేక తండ్రిని కోల్పోయారు. సంతానోత్పత్తి, అదనపు మరణాలను పరిగణనలోకి తీసుకుని చేసిన ఈ సర్వే అధ్యయనం ప్రకారం… 52 లక్షల మంది చిన్నారులు 2020 మార్చి 1 నుంచి 2021 అక్టోబరు 31 మధ్యకాలంలో కోవిడ్‌ ప్రభావంగా సంరక్షకులను కోల్పోయి అనాథ లుగా మిగిలారు. మొదటి 14 నెలల కాలంలో జరిగిన మరణాలతో పోలిస్తే 2021 మే 1 నుంచి అక్టోబరు 31 మధ్య ఆరు నెలల్లో సంరక్షకుల మరణాల సంఖ్య రెట్టింపైందని సర్వేలో తేలింది. యు.ఎస్‌ సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌, ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌, యూనివర్శిటీ ఆఫ్‌ ఆక్స్‌ఫర్డ్‌, యూనివర్శిటీ ఆఫ్‌ కేప్‌టౌన్‌, వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనై జేషన్‌, ఇతర పరిశోధకులు ఈ అధ్యయనాన్ని చేపట్టారు. కోవిడ్‌ వల్ల జరిగిన మరణాల్లో పురుషుల సంఖ్య అధికంగా ఉందని గణాం కాలు తెలుపుతున్నాయి. ఈ లెక్కలనుబట్టి తండ్రులను కోల్పోయిన చిన్నారుల సంఖ్య అధికంగా ఉంది. మన దేశంలో ఈ అధ్యయనం ప్రకారం తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు కోల్పోయిన పిల్లల సంఖ్య 19.17 లక్షలని తేలింది. 10-17 మధ్య వయసు పిల్లల్లో 49 శాతం మంది తండ్రులను కోల్పోయారు. 15 శాతం మంది తల్లులను కోల్పోయారు. వాస్తవానికి 2021 జులైన సంరక్షకులను కోల్పోయిన చిన్నారుల వివరాలతో మొదటి సర్వే విడుదలైంది. దానిప్రకారం 15 లక్షల మంది చిన్నారులు 2020 మార్చి నుంచి 2021 ఏప్రిల్‌ మధ్యకాలంలో అనాథలైనట్లు వెల్లడైంది. అయితే న్యూ మోడలింగ్‌ చేసిన అధ్యయనంలో ఆ సంఖ్యను పున:పరిశీలించి (కోవిడ్‌ ప్రభావిత మరణాలను కూడా పరిగణనలోకి తీసుకుని) 27 లక్షలుగా తేల్చారు (మొదటి సర్వేలో 2021 జులైలో 15,62,000 ఉంటే తాజా సర్వేలో 27,37,300). తాజా ప్రపంచ నివేదికతో కోవిడ్‌, కోవిడ్‌ కారక మరణాలు మరోసారి పెరిగే అవకాశముందని అధ్యయన కర్తలు వెల్లడిస్తున్నారు. గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ఆఫ్రికా దేశాల్లో కోవిడ్‌ మరణాల నివేదికలు కచ్చితంగా ఉన్నాయని భావించింది. కాని వాస్తవ అంచనాలు ప్రస్తుతం నివేదించిన సంఖ్యకు మించి 10 రెట్లు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఈ గణాంకాలే కోవిడ్‌ ప్రభావంగా సంరక్షకులను కోల్పోయిన చిన్నారులను కూడా తక్కువ సంఖ్యలో అంచనా వేశాయి.
తాజా సర్వే అక్టోబరు 2021 నాటి అంచనాలను బట్టే ఉంది. ఆ తరువాత కూడా మనదేశంతో పాటు ప్రపంచ దేశాల్లో కోవిడ్‌ విజృంభించింది. కాబట్టి ఈ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఒక అంచనా ప్రకారం జనవరి 2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా అనాథలైన పిల్లల సంఖ్య 67 లక్షలకు చేరుకుందని భావిస్తున్నారు.ఈ అధ్యయనంలో తేలిన మరో బాధాకరమైన విషయమేమంటే హెచ్‌ఐవి/ఎయిడ్స్‌ బారినపడి సంరక్షకులు, తల్లిదండ్రులు మరణించి అనాథలైన పిల్లలు పదేళ్లలో 50 లక్షల మంది ఉంటే కోవిడ్‌ ప్రభావంగా కేవలం రెండేళ్లలోనే అంతమంది పిల్లలు అనాథలయ్యారు. ఈ సంఖ్యలు ఒమిక్రాన్‌ విజృంభించక ముందు నాటివి.
అనాథలైన ఈ పిల్లల సంరక్షణను జాతీయ కోవిడ్‌ ప్రతిస్పందన ప్రణాళికలో చేర్చాలి. ముఖ్యంగా వ్యాక్సిన్‌ వేయడం, నియంత్రణ, చికిత్సలపై దృష్టి పెట్టాలి. సంరక్షకుల మరణాలను నివారించాలి. బాధిత పిల్లలకు మద్దతుగా ఆయా కుటుంబాలను సిద్ధపరచాలి. పేదరికం, ప్రతికూలత, హింస వంటి ప్రమాదాల బారిన పడకుండా పిల్లలను రక్షించాలని అధ్యయనకర్తలు సూచిస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు
కరోనా మహమ్మారి కారణంగా ఎందరో ప్రాణాలు కోల్పోయారు. తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లలు దిక్కుతోచకుండా మిగిలిపోయారు. అనాధలై, సహారా కోల్పోయిన చిన్నారుల కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.కరోనా మహమ్మారి (జశీతీశీఅa ూaఅసవఎఱష) కారణంగా అనాధలైన పిల్లల కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా పిల్లల చదువుకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంది. 2020-21లో కోవిడ్‌ కారణంగా 6 వేల 8 వందలమంది చిన్నారులు తల్లి లేదా తండ్రిని లేదా ఇద్దరినీ కోల్పోయారు. అనాధలైన చిన్నారులు ఎక్కైతే చదువుతున్నారో అక్కడే కొనసాగించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రైవేటు పాఠశాలల్లో పిల్లల చదువుకు ఇబ్బంది కలిగితే ఉచిత నిర్భంధ విద్యాహక్కు చట్టం కింద అక్కడే చదువు చెప్పించనుంది. తల్లిదండ్రుల్ని కోల్పోయిన 6 వేల8 వందల మంది చిన్నారుల్లో 4 వేల 333మంది పిల్లల పూర్తి వివరాల్ని అధికారులు సేకరించారు. వీరిలో 1659 మంది ప్రభుత్వ పాఠశా లల్లోనూ,2 వేల150 మంది ప్రైవేటు విద్యా సంస్ధల్లోనూ చదువుతున్నారు. మరో 524 మంది శిశువులున్నారు. మరోవైపు ఈ నెల 16 నుంచి స్కూల్స్‌ ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కరోనా కారణంగా తల్లిదండ్రుల్ని కోల్పోయిన చిన్నారుల(ూతీజూష్ట్రaఅ జష్ట్రఱశ్రీసతీవఅ)వివరాల్ని ఆయా విద్యాసంస్థలు ప్రభుత్వ ఛైల్డ్‌ ఇన్ఫోలో నమోదు చేయాల్సి ఉం టుంది. పిల్లలు ఏ పాఠశాలల్లో చదువుతుంటే అక్కడే కొనసాగించాలి. ఫీజు చెల్లించలేదనే కారణంతో ప్రైవేటు విద్యాసంస్థలు విద్యార్ధుల్ని తొలగించకూడదు. లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే పిల్లల చదువును నిరాటంకంగా కొనసాగించేలా చూడాలి. జగనన్న విద్యాకానుక కింద మూడు జతల యూనిఫామ్‌, పాఠ్యపుస్తకాలు, నోట్‌ బుక్స్‌, స్కూల్‌ బ్యాగ్‌, షూ, సాక్స్‌, బెల్ట్‌, డిక్షనరీల్ని మొదటి ప్రాధాన్యతగా అందించాలి. ఇదే విషయమై ఇప్పటికే పిల్లల చదువులు నిరాటంకంగా కొనసాగేలా చూడాలని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు (Aజూ Gశీఙవతీఅఎవఅ్‌) మార్గదర్శకాలు జారీ చేసింది. జాతీయ బాలల హక్కుల సంరక్ష కమీషన్‌ కూడా ఈ అంశంపై ఆదేశాలు జారీ చేసింది.
పీఎం కేర్స్‌ ఫర్‌ చిల్డ్రెన్‌
కరోనా మహమ్మారి ఎంతో మంది ప్రాణాలను బలిగొన్న వారి పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం కేర్స్‌ ఫర్‌ చిల్డ్రన్‌ పథకం పవ్రేశ పెట్టింది. మహమ్మారి వల్ల అనాథలైన పిల్లల్ని ఆదుకోవడం కోసం పీఎం కేర్స్‌ ఫర్‌ చిల్డ్రెన్‌ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. కరోనా మహమ్మారి ఎంతో మంది ప్రాణాలను బలిగొంది. పిల్లలకు తల్లిదండ్రులను దూరం చేసింది. వారి భవిష్యత్‌ అంతా అగమ్యగో చరంగా మారింది. ఈ సమ యంలో కేంద్ర ప్రభుత్వం మహమ్మారి వల్ల అనాథలైన పిల్లల్ని ఆదుకోవడం కోసం పీఎం కేర్స్‌ ఫర్‌ చిల్డ్రెన్‌ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. మే 29, 2021న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ స్కీమ్‌ను లాంచ్‌ చేశారు. పీఎం కేర్స్‌ ఫర్‌ చిల్డ్రెన్‌ స్కీమ్‌ను మహిళల,శిశు అభివృద్ధి మంత్రి త్వ శాఖ నిర్వహిస్తోంది.ఈ స్కీమ్‌ ప్రధాన ఉద్దేశ్యం హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ద్వారా వారి సంక్షేమానికి పాటుపడటం, విద్యాబోధన ద్వారా సాధికారత కల్పించడం,23 సంవత్సరాలు వచ్చే నాటికి ఆర్థికంగా స్వావలంబన వచ్చేలా వారిని తీర్చిదిద్దడం తద్వారా వారికి సంక్షేమానికి పాటుపడటం. ఈ పిల్లలకు18ఏళ్ల వయసు నుంచి నెలసరి స్టయిఫండ్‌ను అందించడంతో పాటు 23 ఏళ్ల వయసు వచ్చే సరికి దాదాపు రూ.10 లక్షల మొత్తాన్ని అందించడం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఈ స్కీమ్‌ కింద అర్హులైన వారు ఎవరు..?కరోనా కారణంగా తల్లిదం డ్రులను ఇద్దరిని కోల్పోవడం తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని లేదా చట్టబద్ధమైన సంరక్షకు లను, దత్తత తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు. ఈ పథకం కింద ప్రయోజనం పొందా లంటే.. తల్లిదండ్రులు మరణించే నాటికి పిల్లల వయసు 18ఏళ్లు పూర్తి కాకుండాఉండాలి. ఇప్పటికే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కేర్‌ సెంట్రల్స్‌ నడుస్తున్నాయి. ఆయా రాష్ట్రప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
లభించే ప్రయోజనాలు..
ౌ 18 ఏళ్లు నిండినప్పటి నుంచి నెలసరి స్టయిఫండ్‌, 23 ఏళ్లు వచ్చాక రూ.10 లక్షల ఫండ్‌
ౌ కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఉచిత విద్య
ౌ ఉన్నత విద్య కోసం ఎడ్యుకేషన్‌ లోన్‌, పీఎం కేర్స్‌ నుంచి రుణాలకు వడ్డీ చెల్లింపు
ౌ ఆయుష్మాన్‌ భారత్‌ కింద ఉచితంగా రూ.5 లక్షల హెల్త్‌ ఇన్సూరెన్స్‌, ప్రీమియాన్ని కూడా పీఎం కేర్స్‌ ద్వారానే చెల్లింపు
ౌ ఉచిత భోజన, వసతి ప్రయోజనాలు
ౌ ఆరేళ్ల లోపు పిల్లలకు పౌష్టికాహారం, పాఠశాల విద్యకు ముందస్తు సాయం, వ్యాధి నిరోధక కార్యక్రమాలకు, ఆరోగ్య రక్షణకు, ఆరోగ్య పరీక్షలకు సంబంధించి అంగన్‌వాడీల ద్వారా సపోర్టు
ౌ పదేళ్ల లోపు పిల్లలకు సమీపంలోని పాఠశాలలో ప్రవేశం, ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాల, కేంద్రీయ విద్యాయాలు, ప్రైవేట్‌ పాఠశాలలో ప్రవేశానికి వీలు కల్పించడం
ౌ సమగ్ర శిక్షా అభియాన్‌ పథకం కింద పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందివ్వడం
ౌ ప్రైవేట్‌ పాఠశాలలో చేరే పిల్లలకు విద్యా హక్కు చట్టంలోని 12(1)(సీ) సెక్షన్‌ కింద వారికి బోధనా రుసం చెల్లింపుల నుంచి మినహాయింపులు కల్పించడం
ౌ 11 నుంచి 18 ఏళ్ల వయసున్న పిల్లలకు తమ కుటుంబీకుల సంరక్షణలో జీవిస్తే.. వారికి ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాల, కేంద్రీయ విద్యాయాలు, ప్రైవేట్‌ పాఠశాలలో ప్రవేశం కల్పిం చేందుకు జిల్లా మెజిస్ట్రేట్‌ చర్యలు తీసుకుంటారు.
ౌ ఉన్నత విద్య కోసం దేశంలోని ప్రొఫెషనల్‌ కోర్సులు లేదా ఇతర ఉన్నత విద్యా కోర్సులను అందించేందుకు అవసరమైన విద్యా రుణం సాయం అందిస్తుంది ప్రభుత్వం – (ఫీచర్స్‌ అండ్‌ పాలిటిక్స్‌, సౌజన్యంతో…) – జి.ఎన్‌.వి.సతీష్‌

ఏపీ బ‌డ్జెట్ స‌మావేశాలు-2022-2023


సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ) సూచీలో ఆంధ్రప్రదేశ్‌ గణనీయమైన పురోగతి సాధించి టాప్‌ -5 రాష్ట్రాల జాబితాలో నిలిచింది. 2018లో కేవలం 64 పాయింట్లను మాత్రమే సాధించిన ఏపీ తాజాగా 72 స్కోర్‌ పాయింట్లను పొందడం, అగ్రశ్రేణి కోవలో నిలవడం, పలు అంశాల్లో టాప్‌ స్కోర్లను దక్కించుకోవడం రాష్ట్రం సత్తాను, అభివృద్ధి పథంలో పరుగులను రుజువు చేస్తోంది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచీలో 75 శాతం స్కోర్‌తో కేరళ మొదటి స్థానంలో నిలవగా 74 శాతం స్కోర్‌తో హిమాచల్‌ప్రదేశ్‌, తమిళనాడు సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. 72 శాతం స్కోర్‌తో ఏపీ మూడో స్థానంలో నిలిచింది. మూడో విడత ఎస్డీజీ సూచీ నివేదికను నీతిఆయోగ్‌ గురువారం ఢల్లీిలో ఆవిష్కరించింది. ఆంధ్రప్రదేశ్‌లో పేదరిక నిర్మూలన, అసమానతలు తొలగింపు, జీవన ప్రమాణాలను మెరుగు పరచడం, సామాజిక భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘నవరత్నాలు’ ఇతోధికంగా దోహదం చేస్తున్నాయని నీతి అయోగ్‌ ప్రశంసించింది.
పేదరికం, ఆకలి లేని రాష్ట్రంగా..
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల మేరకు నవరత్నాల పథకాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. నవర త్నాలు పేదరిక నిర్మూలనతో పాటు ఆహార భద్రతకు ఎంతో దోహదం చేస్తున్నాయని నీతి అయోగ్‌ ప్రశంసించింది. పేదరికం, ఆకలి లేని రాష్ట్రంగా అవతరించే దిశగా ఆంధ్రప్రదేశ్‌ శరవేగంగా అడుగులు వేస్తోందని నివేదికలో పేర్కొంది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో మొదటిదైన పేదరిక నిర్మూలనలో ఆంధప్రదేశ్‌ 81 శాతం స్కోర్‌ సాధించి అగ్రగామి ఐదు రాష్ట్రాల సరసన నిలిచింది. ఆరోగ్యం,సంక్షేమంలో రాష్ట్రం 77శాతం స్కోర్‌ సాధించింది. అగ్రవర్ణ పేదలకు కూడా సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం కల్పిస్తూ అసమానతలను రూపు మాపుతున్నారని నీతి అయోగ్‌ ప్రశంసిం చింది. పురుషులతో సమానంగా అవకాశాలు కల్పిస్తూ లింగ సమానత్వంలో రాష్ట్రం 58 శాతం స్కోర్‌తో అగ్రగామి ఐదు రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. అసమానతలు రూపుమాపడంలో 74 శాతం స్కోర్‌తో దూసుకెళ్తోంది.ఏపీలో 2020లో వృద్ధి కనిపించిన ఇండికేటర్లు ఆకలి లేని స్థాయి లక్ష్యంలోని ‘వ్యవసాయ రంగంలో స్థూల అదనపు విలువ’లో పెరుగుదల నమోదు చేసుకుంది. ఆరోగ్యం, సంక్షేమం ఇండికేటర్‌లో ప్రసూతి మరణాలు, శిశు మరణాల రేటు తగ్గుదల, హెచ్‌ఐవీ కేసుల సంఖ్య తగ్గుదల నమోదైంది. ప్రతి పది వేల జనాభాకు వైద్య సిబ్బంది పెరుగుదలలో వృద్ధి కనిపించింది. లింగ సమానత్వం కేటగిరీలో మహిళలపై నేరాల సంఖ్య ఇండికేటర్‌లో తగ్గుదల నమోదైంది. పురుషులతో సమానంగా మహిళలకు వేతనాలు ఇవ్వడం పెరిగింది. పరిశుభ్రమైన నీరు, పారిశుద్ధ్యం పరిధిలో గ్రామీణ ప్రాంతాలకు సురక్షిత నీటి సరఫరా పెరిగింది. హత్యలు, వివిధ రకాల కేసుల సంఖ్య తగ్గింది.
సరసమైన ధరకు నాణ్యమైన విద్యుత్‌లో అగ్రగామి..
2019 డిసెంబరు 30న ఆవిష్కరించిన ఎస్డీజీ సూచీలో ఆంధ్రప్రదేశ్‌ 67 పాయింట్ల స్కోరుతో 3వ స్థానంలో నిలిచింది. అంతకుముందు ఏడాది 2018 మొదటి ఎస్డీజీ సూచీలో 64 పాయింట్ల స్కోరుతో నాలుగో స్థానంలో ఉంది. తాజాగా మూడో విడత సూచీలో చౌక, సురక్షిత ఇంధన శక్తిలో వందకు వంద పాయింట్లు సాధించి టాప్‌లో నిలవడం గమనార్హం. సరసమైన ధరకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడంలో అగ్రగామిగా నిలిచింది.
అత్యున్నత ప్రమాణాలతో విద్య.. నాణ్యమైన వైద్యం
అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందించడంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అత్యుత్తమంగా పనిచేస్తోందని నీతి అయోగ్‌ వెల్లడిరచింది. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు -నేడు ద్వారా పెద్దఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించి కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా తీర్చి దిద్దారు. ఆరోగ్యశ్రీతోపాటు ప్రభుత్వ ఆసుపత్రు లను అభివృద్ధి చేయడం, వైద్య సిబ్బందిని భారీ ఎత్తున నియమించడం ద్వారా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని.. కరోనాను సమర్థంగా ఎదుర్కోవడమే అందుకు తార్కాణమని పేర్కొంది. శాంతి భద్రతలకు పెద్దపీట వేస్తూ.. సుపరిపాలన ద్వారా ప్రజలకు సామాజిక భద్రత చేకూర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన పనితీరు కనబర్చుతోందని విశ్లేషిం చింది. 2030 నాటికి సుస్థిరాభివృద్ది లక్ష్యాల సాధన వైపుగా ఏపీ ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోందని పేర్కొంది.
పేదరిక నిర్మూలనలో ఏపీ ఐదో స్థానం.. నీతి ఆయోగ్‌ ఎస్టీజీ నివేదిక ప్రకారం పేదరిక నిర్మూలనలో ఏపీ ఐదో స్థానంలో కొనసాగు తోందని ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి అన్నారు. 2022-23 సంవత్సరపు వార్షిక బడ్జెట్‌ ను ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన.. విద్యా, ఆరోగ్య రంగాలకు ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. నాడు-నేడుతో పాటు అనేక కార్యక్రమాల ద్వారా ప్రజలకు మంచి విద్య, ఆరోగ్యాన్ని అందించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. అంతే కాకుండా 99.5 శాతం కాన్పులు స్థానికంగానే జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలోని వంద శాతం కుటుంబాలకు విద్యుత్‌ అందు తోందన్నారు మంత్రి. 2022 -23 ఆర్థిక సంవత్సరానికి గానూ 2,56,257కోట్లు రూపా యలతో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం అంచనా 2,08,261 కోట్లు, మూలధన వ్యయం అంచనా 47,996 కోట్లు, 2022-23 సంవత్సరంలో రెవెన్యూ లోటు 17,036 కోట్లు, ద్రవ్య లోటు 48,724కోట్ల రూపాయలని ప్రతిపాదించారు. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్రి జీఎస్డీపీ లో రెవెన్యూ లోటు 1.27శాతంగా, ద్రవ్య లోటు 3.64శాతంగా ఉండవచ్చని తెలి పారు. గత మూడు సంవత్సరాలలో ప్రభుత్వం నవరత్నాలు, ఇతర మేనిఫెస్టో పథకాల ద్వారా రాష్ట్రంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది. అంతేగాక ప్రభుత్వం చేస్తున్న నిరంతర కృషి, సంస్థాగత బలోపేతం, సామాజిక చేరకల వల్ల అన్ని ఏస్జీజీలలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్ధానం దిశగా పయనిస్తోంది. అంతకు ముందు వార్షిక బడ్జెట్‌కు సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశం ఆమోదం తెలిపింది. అసెంబ్లీ లో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో బడ్జెట్‌ ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. శాసనసభలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్‌రెడ్డి, మండలిలో మంత్రి సీదిరి అప్పల రాజు బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. శాసనసభ లో వ్యవసాయ బడ్జెట్‌ను ఆ శాఖ మంత్రి కన్న బాబు, మండలిలో వేణుగోపాలకృష్ణ ప్రవేశపెడ తారు. కేబినెట్‌ భేటీకి ముందుఆర్థిక మంత్రి ఛాంబర్‌లో బడ్జెట్‌ ప్రతులకు మంత్రి బుగ్గన, ఆర్థిక శాఖ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కల్తిసారా మరణాల,పెగాసెస్‌ల పై దద్దరిల్లిన అసెంబ్లీ
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం కల్తీసారా మరణాలపై మూడోరోజు శాసనమండలి దద్దరిల్లింది. శాసనసభను తప్పుదోవ పట్టించేలా అసత్యాలు చెప్పిన సీఎంపై సభాహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందనీ, దీనిపై ప్రవేశపెట్టిన వాయిదా తీర్మాణం చర్చకు అనుమతించాలని ప్రతిక్ష నేతలు పట్టుపట్టడంతో సభ సంభించింది. అలాగే పెగాసస్‌పై అసెంబ్లీ భగ్గుమంది. ఇప్పటికే దేశమంతా మార్మోగినన ఈఘటనపై అసెంబ్లీలో అధికార పార్టీనేతలు ప్రతిపక్షంపై ధ్వజమెత్తారు. పెగాసస్‌ స్పైవేర్‌తోపాటు వివిధ రకాలుగా నిఘా పెట్టారని అసంబ్లీ వ్యవహా రాలశాఖ మంత్రి బుగ్గన విమర్శించారు.
అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి
రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్‌ సమావేశాలు తమ ప్రాధాన్యత కోల్పోతున్నాయి. కేంద్ర బడ్జెట్‌ విషయంలోనూ ఇది స్పష్టంగా కనిపించింది. రాష్ట్రం కూడా అదే బాటలో నడుస్తున్నది. బడ్జెట్‌ అంటే కేవలం జమాఖర్చుల చిట్టా మాత్రమే కాదు. ప్రభుత్వ విధానాలు, ప్రజాసంక్షేమం,అభివృద్ధి ప్రాధాన్యతలు ఇందులో ప్రతిబింబిస్తాయి. అభివృద్ధి బాధ్యత నుండి ప్రభుత్వం తప్పుకుంటున్నది. ఈ రంగా న్ని బడా కార్పొరేట్‌ సంస్థలకు వదిలేసింది. వారికి కావలసిన సదుపాయాలు, ప్రోత్సాహం ఇవ్వడం ప్రభుత్వం తన బాధ్యతగా స్వీకరిం చింది. దానికే ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ అని పేరు పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో పోటీ పడడానికి ప్రోత్సా హకాలను ఇస్తున్నది. మరోవైపు అభివృద్ధికి మూలాధారంగా ఉన్న ప్రణాళికా సంఘాన్ని కేంద్రం రద్దు చేసింది. కార్పొరేట్‌ బోర్డుల తరహాలో నీతి అయోగ్‌ను నియమించింది. గతంలో ప్రభుత్వ రంగం అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది. హైదరాబాద్‌,విశాఖ, బెంగుళూరు లాంటి నగరాలు ప్రభుత్వ రంగం పునాదిగా అభివృద్ధి చెందాయి. ఇప్పుడు నగరాల నిర్మాణాన్ని కూడా ప్రైవేటు రంగానికి వదిలేశారు. రియల్‌ ఎస్టేటే పట్టణాల అభివృ ద్ధిని శాసిస్తోంది. అందువల్ల బడ్జెట్‌లో అభివృద్ధి నిధులు క్రమంగా తగ్గిపోయి నిర్వహణా వ్యయా లు మాత్రమే మిగులు తున్నాయి. బడ్జెట్‌లో కేటాయించిన నిధులు చివరిదాకా అలాగే ఉంటాయని గ్యారెంటీ కూడా లేదు. రివైజ్డ్‌ బడ్జెట్‌ పేరుతో అన్నీ తలక్రిందులవుతుంటాయి. అసెంబ్లీ ఆమోదించిన బడ్జెట్‌తో నిమిత్తం లేకుండా నిధుల కేటాయింపులు అధికారంలో ఉన్న పార్టీ ఇష్టాయిష్టాలపై ఆధారపడి జరుగుతున్నాయి. ఇది పార్లమెంటరీ ప్రజా స్వామ్య వ్యవస్థను బలహీనపరిచే పరిణామం. ఈ బడ్జెట్‌తోనైనా ఈ ఒరవడికి స్వస్తి చెప్పాలి. అసెంబ్లీ సమావేశాల ప్రారంభ రోజున గవర్నర్‌ ప్రసంగం పాలక పార్టీ ఆలోచనలకు అద్దం పడుతున్నది. ప్రభుత్వ పథకాల చిట్టాను ఆయన చదివేశారు. సంక్షేమ పథకాలతో ప్రజలు బ్రహ్మాండంగా జీవిస్తున్నారని, సంతృప్తికరంగా ఉన్నారని పాలక పార్టీ భ్రమల్లో ఉంది. అందువల్లే ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలను గాలికి వదిలేసింది. సంక్షేమ పథకాల నిర్వహణకు అదనపు ఆదాయాలను సమకూర్చుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. వివిధ ప్రభుత్వ శాఖలకు ఆదాయ కోటాలను ఇచ్చింది. డబ్బులు రాబట్టడానికి వారు ప్రజల మెడపై కత్తి పెట్టి వసూలు చేయాలని చెబుతోంది. ఈ మధ్యకాలంలో సంక్షేమ పథకాలతోపాటు ప్రజల నుండి అదనపు ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ‘’ప్రభుత్వ ధనార్జన స్కీము’’లను కూడా ప్రవేశపెట్టింది.– జె.వి.శ్రీనివాసరావు

1 18 19 20 21 22 48