పుడమి తల్లిని కాపాడుకుందాం!

ఓవైపు కాలుష్యం పెరుగుతుంటే, మరో వైపు తరుగుతున్న వనరులు మానవాళికి ఆవాసంగా నిలిచిన పుడమితల్లికి కడుపు కోత మిగుల్చు తున్నా యి. అభివృద్ధి పేరుతో జరిగే మితిమీరిన చేష్టలు భూమాతను నిలువునా దహించి వేస్తున్నాయి. తాగే నీరు..పీల్చేగాలి..నివసించే నేల…ఇలా పంచ భూ తాలు కాలుష్యంలో చిక్కుకున్నాయి. పచ్చద నంతో పరిఢవిల్లాల్సిన భూతల్లి ఎదపై ప్రకృతి అందాలను కోల్పోయి మూగ రోదనతో కన్నీరు కార్చుతోంది. ఈదుస్థితి నుంచి భూమాతను కాపాడి..మానవ మనుగడకు తోడ్పాటునందించే సమయం ఆసన్న మైంది.మనిషి స్వార్థపరుడు..చెట్లను నరికేసి పక్షు లకు గూళ్లు లేకుండా చేశాడు.అడవుల్ని మాయం చేసి జంతువులకు నిలువనీడ లేకుండా చేస్తు న్నాడు. ప్రగతి పేరుతో పరిశ్రమలు స్థాపించి అడ్డూ అదుపూ లేకుండా ప్రకృతి వనరుల్ని దోచేశాడు. నేల,నదులు,సముద్రాలు ఒకటేమిటి ఆఖరికి ఆకా శాన్ని సైతం తన అదుపులోనే ఉంచుకోవాలన్న అత్యాశతో మొత్తంగా భూమండలాన్ని కలుషితం చేశాడు.అలా తాను సృష్టించుకున్న కాలుష్యానికి తానే బలవుతున్న వేళ…వచ్చింది ఓ మహమ్మారి. నీ సత్తా ఏమిటో చూపమని సవాలు విసిరింది. ఊహించని ఈ ఉత్పాతం మనిషిని వణికించింది. ఇంటి నాలుగుగోడల మధ్య బందీని చేసింది. పెరిగిపోతున్న భూతాపం, వాతావరణ కాలుష్యం తో అల్లాడుతున్న భూమాతను కాపాడుకునే దారేది? పర్యావరణ పరిరణక్ష విషయమై ప్రజల్లో అవగా హన పెంచే అవకాశమే లేదా? అంతరించి పోతున్న జీవజాతులను కాపాడుకోలేమా?ఈ ప్రశ్నలకు సమా ధానమే ‘ప్రపంచ ధరిత్రి దినోత్సవం’ దీనికి 1970 లో బీజం పడిరది.1969 జనవరి 28న శాంటా బార్బరా సముద్రతీరం చమురు తెట్టులతో నిండి పోయి తీరమే ఆలంబనగా బతకుతున్న వందలాది జీవజాతులు మృత్యువాతపడ్డాయి.సుమారు నాలుగు వేల పక్షులు ఆ తెట్టులో చిక్కుకొని ఎగిరే దారిలేక ప్రాణాలొదిలాయి. జీవ వైవిధ్యం కొడిగట్టిన ఆనాటి సంఘటన ప్రపంచ ధరిత్రి దినోత్సవానికి పునాదిగా మారింది.అమెరికన్‌ సెనేటర్‌ గెలార్డ్‌ నెల్సన్‌ పర్యా వరణ పరిరక్షణకు పిలుపునివ్వగా దాదాపు 20 లక్షల మంది ఏప్రిల్‌ 22న ధరిత్రి దినోత్సవంలో పాల్గొన్నారు. నేల అంటే మట్టి అన్న అర్థం మాత్రం కాదు,భూమంటే 84 లక్షల జీవరాశుల సముదా యం. మొదటిసారిగా ధరిత్రి దినోత్సవం 1970 ఏప్రిల్‌ 22న పాటించారు.
మానవ మనుగడకు పంచభూతాలే ఆధారం
మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా దీనికి ఆధారం భూమి.గాలి,నీరు,నింగి,నిప్పు,నేల అనే పంచభూతాల వల్లే మానవ మనుగడ సాధ్యమవు తుంది.వీటిలో ఏఒక్కటి లోపించినా జీవనం అస్త వ్యస్తమవుతుంది.భూమిపై అన్ని వనరులూ సక్ర మంగా ఉంటేనే మానవ అభివృద్ధి నిజమవుతుంది. కానీ,అంతులేని ఆధిపత్య దాహంవల్ల భూమం డలం కాలుష్యకాసారంగా మారిపోయింది.ఉపరి తలంపై ఉన్న వనరులే కాదు,భూగర్భ జలాలు, ఖనిజ వనరులను పలుదేశాలు విచక్షణారహితం గా వాడుకోవడంవల్ల భూతాపం పెరిగి రాబోయే కొన్నిదశాబ్దాలలో ముడిచమురు నిల్వలు అంతరించి పోయే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరి స్తున్నారు.రోజురోజుకూ భూగోళంపై హరితదనం తగ్గిపోవడం,కొన్ని రకాల జీవరాశులు నశించిపో వడంవల్ల భూతాపం పెరుగుతూ వస్తోంది. నానా టికీ పెరుగుతున్న భూతాపంతో ప్రకృతి సమతౌల్యత దెబ్బతిని జీవరాశి మనుగడకు ముప్పు ఏర్పడు తోంది.
పరిశ్రమలు,వాహనాలు తదితరాల నుంచి వెలువడుతోన్న క్లోరోఫోరో కార్బన్‌లు భూగ్ర హాన్ని మరింత వేడెక్కిస్తూ పలుకాలుష్యాలకు కారణ మవుతున్నాయి.భూతాపం పెరగడంవల్ల పర్యావర ణంలో పెనుమార్పులు చోటుచేసుకుని జీవరాశుల మనుగడకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మరో వైపు వాతావరణంలో మార్పుల కారణంగా జీవ వైవిధ్యం దెబ్బతింటోంది. వృక్షాలను విచక్షణారహి తంగా నరికివేస్తున్నందున అడవులు అంతరించి పోతున్నాయి. సరైన వర్షాలు లేక కరువుకాటకాలు సంభవిస్తున్నాయి. దీంతో జల వనరులు నానాటికీ తీసుకట్టుగా మారుతున్నాయి. తత్ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. అకాల వర్షాలు, విపరీతమైన వేడిమి కారణంగా గ్లోబల్‌ వార్మింగ్‌తో ఓజోన్‌ పొర దెబ్బతింటోంది
భూమాతను శాంతింపజేసే చర్యలు
మొత్తం193దేశాలు ‘ఎర్త్‌’ డేలో భాగా మవుతున్నాయి. ప్లాస్టిక్‌ వాడకపోవడమే మంచిది. ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టి, వృథాను అరికట్టాలి. వీలైనన్ని మొక్కలు నాటి వన సంరక్షణ చేపట్టాలి. తొమ్మిదో దశకం నుంచిప్రపంచవ్యాప్తంగా సుమారు 12.9 కోట్ల హెక్టార్ల విస్తీర్ణంలో అటవీ భూములు కనుమరుగయ్యాయి.ఈ చిన్న సూచనలు పాటిస్తే భూతాపం కొంత తగ్గించవచ్చు.బయటకు వెళ్లే సమయంలో వాహనాలు కాకుండా నడిచి వెళ్ళడం లేదా సైకిల్‌ను ఎంచుకోవడం. దూర ప్రాంతాలకు వెళ్లటేప్పుడు స్వంత వాహనాలు కాకుండా ప్రజా రవాణను ఆశ్రయించడం.మాంసాహారానికి దూరం గా ఉండటంవల్ల కూడా కార్బన ఉద్గారాల ప్రభా వాన్ని తగ్గించవచ్చు.పర్యావరణ అనుకూల ఉత్పత్తు లను ఉపయోగించాలి.చెత్తను ఎప్పటికప్పుడు తొల గించాలి. పునర్వినియోగ ఇంథనాలు, వస్తువులను వినియోగించాలి.స్థానికంగా దొరికే ఆహారాన్నే విని యోగించాలి.
వాతావరణ చర్య.. అపారమైన సవాళ్లు
ఏటా ధరిత్రీ దినోత్సవాన్ని ఒక ప్రత్యేక అంశాన్ని ఎంపిక చేసుకుని కార్యక్రమాలను నిర్వ హిస్తారు.ఈఏడాది‘వాతావరణ చర్య.. అపా రమైన సవాళ్లు…కానీ అనేక అవకాశాలు’ అనే నినాదాన్ని ఎత్తుకున్నారు.వాతావరణ మార్పులపై చర్య 50 వ వార్షికోత్సవం సందర్భంగా చాలా ముఖ్యమైన అంశంగా గుర్తించింది. వాతావరణ మార్పు మాన వాళి భవిష్యత్తుకు, ప్రపంచాన్ని నివాసయోగ్యంగా మార్చే జీవిత-సహాయక వ్యవస్థలకు అతిపెద్ద సవాల్‌ను సూచిస్తుంది. పెరుగుతున్న భూతాపం, పలు ఉపద్రవాలకు కారణమవుతున్న వాతావరణ మార్పులను పట్టించుకోకుండా పరుగులు పెడుతున్న మనిషికి కరోనా వైరస్‌ ఇచ్చిన రaలక్‌…భూమా తకు మాత్రం గొప్ప వరమే అయింది. ఏకంగా భూమిపైనా లోపలా కూడా కనీవినీ ఎరుగని మార్పు లు చోటుచేసుకుని ఈ యాభయ్యో ధరిత్రీ దినోత్సవ సందర్భంగా మానవాళికి మరువలేని గుణపాఠంగా మారుస్తున్నాయి.
సమాధానం చెప్పిన ప్రకృతి
వాతావరణ మార్పులు, శిలాజ ఇంధ నాల వాడకంపైనా గత మూడేళ్లక్రితం ప్రపంచ వ్యాప్తంగా యువతరం పెద్దఎత్తున ఆందోళన చేసి దేశాధినేతలనే నిలదీశారు. ప్రకృతే వారికి సమాధా నం చెప్పిందా అన్నట్లుంది నేటి పరిస్థితి. ప్రపంచా న్ని ప్రస్తుతం కరోనా వైరస్‌ మహమ్మారి వణికిస్తోం ది. దీంతో పలు దేశాలలో లాక్‌డౌన్‌వల్ల అన్ని పనులు ఆగిపోవడంతో కర్బన ఉద్గారాలూ తగ్గా యి. భారతదేశంలోనూ ప్రజా రవాణా నిలిచిపోయి ఇంధనాల వాడకం దాదాపు 66 శాతం తగ్గింది. ఇంధనానికి డిమాండు తగ్గడంతో చమురు ఉత్ప త్తీ,బొగ్గు తవ్వకాలు తగ్గిపోయాయి.చరిత్రలో ఎన్న డూలేని విధంగా చమురు ధరలు పాతాళానికి పడిపోయాయి.ఫలితంగా చరిత్రలో కనీవినీ ఎరగని రీతిలో అన్ని రకాల కాలుష్యాలకూ అడ్డుకట్ట పడిర ది.ఈ మార్పు ఎంత కాలం ఉంటుందో తెలియదు. ఎందుకంటే 2008-09లో పెద్దఎత్తున ఆర్థిక మాం ద్యం ఏర్పడినప్పుడు ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాల విడుదల ఒకశాతం తగ్గింది. అప్పుడు ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి ప్రభుత్వా లన్నీ ప్రోత్సాహకాలను ప్రకటించడంతో తర్వాత ఏడాది ఉద్గారాలు ఏకంగా 5 శాతం మేర పెరిగా యి.ఆ పొరపాటు ఇప్పుడు జరగకుండా చూసు కోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదైతే, అవసరానికీ విలాసానికీ మధ్య గీత గీసుకుని వ్యవహరించాల్సిన బాధ్యత ప్రజలది.
కరోనా ఎఫెక్ట్‌.. తేరుకుంటున్న నదులు
భారతీయులకు పవిత్రమైన గంగానది తీరం పొడవునా ఉన్న పరిశ్రమల నుంచి వచ్చే రసాయన వ్యర్థాలతో, యాత్రికులు పడేసే చెత్తతో కలుషితమైపోయి, తాగడానికి కాదు కదా, స్నానానికి కూడా పనికిరాని పరిస్థితికి చేరుకుంటోంది. గంగా నదిని శుభ్రం చేయాలంటూ ఎందరో ఆందోళనలు చేస్తూసే ఉన్నారు. ప్రభుత్వాలు కూడా ప్రక్షాళనకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా పరిస్థితిలో ఇసుమంత కూడా మార్పు లేదు. అలాంటిది లాక్‌ డౌన్‌తో ఫ్యాక్టరీల మూసివేయడంవల్ల వ్యర్థాలు నదిలోకి రావడం ఆగిపోయి గంగమ్మ కొత్త అందా లను సంతరించుకుంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గంగానది పొడవునా ఏర్పాటుచేసిన 36 కేంద్రాలతో లాక్‌డౌన్‌ తర్వాత పది రోజులకే వాటి ల్లో 27 కేంద్రాల వద్ద నీటి నాణ్యత బాగా మెరుగు పడిరది. అక్కడి నీరు మనుషులు స్నానం చేయడా నికీ జలచరాలు ఆరోగ్యంగా బతకడానికీ అనువుగా ఉన్నాయనీ నీటిలో ప్రాణవాయువు పరిమాణం పెరిగిందనీ ఈ పరీక్షలు చెబుతున్నాయి. దేశంలోనే కాదు, ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ నగరాల మీదుగా ప్రవహిస్తూ పరిశ్రమల వ్యర్థాలను మోస్తున్న నదులన్నీ లాక్‌డౌన్‌ దెబ్బకి కాస్త తేరుకుంటున్నాయి.
లాక్‌డౌన్‌తో నెమ్మదించిన భూమాత
లాక్‌డౌన్‌తో అన్ని రవాణాలు నిలిచి పోగా..నిర్మాణాలు,గనుల తవ్వకాలు ఆగిపోయా యి.నిత్యం హోరెత్తే ఈపనులు భూమాతకు ఊపిరి సలపనివ్వడం లేదేమో…మన ఉరుకులు పరుగు లతో ఆమె కూడా అలసి పోతుందేమో…లాక్‌డౌన్‌ వేళ తానూ కాస్త నెమ్మదించింది.లాక్‌డౌన్‌ ప్రభా వం భూమి మీద ఎలా ఉందోనని భూకంప శాస్త్రవే త్తలు పరిశోధించారు.భూమి పొరల లోపల నుంచి అనునిత్యం విన్పించే హోరూ, ప్రకంపనలూ (సీస్మిక్‌ నాయిస్‌,వైబ్రేషన్స్‌)బాగా తగ్గినట్లు రాయల్‌ అబ్జర్వే టరీ ఆఫ్‌ బెల్జియంకి చెందిన శాస్త్రవేత్తలు గుర్తిం చారు. కరోనా వైరస్‌ వ్యాప్తికి మూల కేంద్రమైన వూహాన్‌ పారిశ్రమిక నగరం.దీంతో అక్కడ లాక్‌ డౌన్‌ ప్రకటించిన కొద్దిరోజులకే అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. అక్కడ ఎంతో శుభ్రంగా దృశ్యాలన్నీ స్పష్టంగా కనిపించడం నాసా శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురి చేసింది.గొడార్డ్‌ స్పేస్‌ ఫ్లైట్‌ సెంటర్లో గాలి నాణ్యత మీద పరిశోధన చేస్తున్న ఫెయ్‌ లియు అనే శాస్త్రవేత్త లాక్‌డౌన్‌ అనే ఒకే ఒకచర్యతో నగరం చుట్టూ ఉన్న వాతావరణం ఇంతగా మారిపోవడాన్ని చూడ డం ఇదే మొట్టమొదటిసారి అని పేర్కొన్నాడు.
మనిషి కనపడకపోతే వాటికి స్వేచ్ఛ దొరికింది
మనిషి కనపడకపోతే పక్షులూ జంతు వులూ ఎంతస్వేచ్ఛగా తిరుగుతాయో తెలిపే దృశ్యా లుగమనిస్తూనే ఉన్నాం.అపార్ట్‌మెంట్‌ బాల్కనీ గోడ లపై కువకువలాడుతున్న పక్షుల జంటల ఫొటోలూ నడివీధిలో పురివిప్పి నాట్యమాడుతున్న నెమళ్లు, కోయిలమ్మ పాటలు, పిచ్చుకల కిలకిలలు సందడి చేస్తున్నాయి. కేరళలోని ఓపట్టణంలో నడివీధిలో నిదానంగా నడుస్తున్న ఓపునుగు పిల్లి,ఒడిశా తీరం లో హాయిగా ఆడుకుంటున్న ఆలివ్‌రిడ్లీ తాబేళ్లు, ముంబయి తీరంలో అలలపై కేరింతలు కొడుతున్న డాల్ఫిన్లూ,తిరుమలలో సంచరిస్తున్న జంతువులు, ఇజ్రాయెల్‌లోని కార్మేలియా నగరం మధ్యలో పార్కు లో గడ్డి మేస్తున్న అడవిపందులు,జపాను వీధుల్లో షికారు చేస్తున్న జింకలూ,టెల్‌ అవీవ్‌ విమానాశ్ర యంలో వాకింగ్‌కి బయల్దేరిన బాతులు,వేల్స్‌ లోని ఒకనగరం వీధుల్లో గొర్రెల మంద వాహ్యాళీ… ఇలాంటి ఎన్నో వీడియోలు గత కొన్ని వారాలుగా ప్రసారా మాధ్యామాల్లో దర్శనమిస్తూ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.మానవుడి జోక్యం లేకపోతే ప్రకృతి ఎంత సహజంగా,ఎంత అందంగా ఉంటుందో చెప్పడానికి నిదర్శనాలు ఇవన్నీ.1.వాహానాల వాడకం తగ్గిద్దాం.2.అనవసర విద్యుత్‌ వాడకాన్ని తగ్గిద్దాం.3.అడవులను నాశనం చేయకుండా.. చెట్లనుపెంచడం అలవరచుకుందాం.4.భూమికి హాని చేసే ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా నిషేదిద్దాం. మనిషి మనుగడకు నష్టం చేసిన కరోనా మాత్రం పుడమి తల్లికి మంచి చేస్తుందనే చెప్పు కోవాలి. మనిషి సృష్టించిన కాలుష్యం నుంచి ధరణి బయట పడేలా చేస్తుంది. మనిషిని నాలుగు గోడల మధ్య బందించి..అలాగే వ్యర్థా లతో నిండిపోయిన నదు లు మళ్లీ స్వచ్చంగా కనిపిస్తున్నాయి.
ఇంతకాలం భూగర్భంలో భగ భగమని మండు తోన్న ఉష్ణం ఉబికివచ్చే తరుణం వచ్చేసింది. సమస్త జీవరాసులను వణికిస్తూ మానవాళిని వెంటాడే స్తుంది నిప్పులు చిమ్మకుంటూ వచ్చే ఆ ప్రచంఢాగ్నికి సర్వం వినాశమవు తుంది. ధ్రువాల మంచు కరడగం,సముద్ర మట్టాలు పెరగ డం,ద్వీపసమూ హాలన్ని సముద్ర గర్భంలో నిక్షప్తమ వవ్వడం ఇవన్నీ జరుగుతాయి.ఈ విపత్కర పరిణా మాలే కాదు.సమీప భవిష్యత్తులో కరువు కాటకాలు, వరదలు, తుపానులు భూమండలాన్ని అతలాకుత లం చేస్తా యని అమెరికన్‌ శాస్త్రవేత్తలు హెచ్చరి స్తున్నారు.భూమ్మీద నిత్యం విడుదల అవుతున్న ఉష్టం మొత్తం బయటకు వెళ్లడం లేదు. అందులో సగానికి సగం భూమ్మీదే దాగి వుంటోంది.ఏదో సమయంలో అది ఉబికి రావచ్చు.అదే జరిగితే ఊహించడానికే భయ మేస్తోంది.రోడ్లపై క్షణం తీరక లేకుండా తిరుగా డుతున్న వాహనాలు. నిరంతరం పొగలు కక్కుతున్న ఫ్యాక్టరీలు. ఇలాంటి వాటిల్లో ఇంధనం దహనం కావడంవల్ల విడుద లయ్యే ఉష్టం భూమి నుంచి విడుదల అవుతున్న దానికి సమానంగా వుండాలి. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు.వాతావరణంలోకి ప్రవేశించే ఉష్టం కంటే బయటికి పోయే ఉష్టం తక్కువవుతోందని అమఎరికాలోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ అట్మాస్ఫి యర్‌కు చెందిన జాన్‌ ఫసుల్లో అభిప్రా యపడు తున్నాడు.భూమ్మీద ఎంత ఉష్టం విడుదల అయిందో అంతే ఉష్టంవాతావరణం నుంచి బయటకు వెళుతున్నట్టు ఉపగ్రహ సెన్సర్లు ఇతర పరిక రాలు గుర్తించాలి.అయితే అలా జరగడం లేదు.ఆ ఉష్ణ మంతా సముద్ర గర్భంలోవుంటోంది. దీని కారణం గానే పసిఫిక్‌ మహాసముద్రంలోని ఎల్‌ని నోలు సంభవించి ఉష్ట ప్రాంత భూముల్లో వర్షాభావ పరిస్థితులు వస్తాయి.మరికొన్నిచోట్ల కనివినీ ఎరు గని రీతిలో వరదలు ముంచెత్తుతాయి.కాలం కాని కాలంలో వర్షాలు కురుస్తాయి. అతివృష్టి అనావృష్టి వరసపెట్టి వస్తాయి. వాతావరణంలో జరుగుతున్న మార్పులన్నింటికీ మనమే బాధ్యులం.భూమిపై పెరు గుతోన్న ఉష్టోగ్రతలకు మనమే కారణం ముం దస్తు హెచ్చరికలు లేకుండా ముంచుకొస్తున్న పెను విపత్తులకు మనమే కారకులం. ధ్రువాల మంచు కరిగే శాతం ఎక్కువైంది. ప్రపంచవ్యాప్తంగా పెరిగి న ఇంధన వాడకమే గ్లోబ ల్‌ వార్మింగ్‌కు ప్రధాన కారణం..మరో పక్క ఓజోన్‌ పొరకు చిల్లు ఏర్పడ టం వల్ల భూమిపై ఉష్టోగ్రతలు పెరుగుతున్నాయి. -(జి.ఎ.సునీల్‌ కుమార్‌)

గిరిజన నేస్తం

‘పుష్పవిలాపం’లో ఓబాల తనను చెట్టు నుంచి వేరు చేస్తున్నందుకు పూబాల విలపిస్తుంది, విషాదగీతం ఆలపిస్తుంది. కానీ, చిరుగాలి సవ్వడికి చెట్టుమీది నుంచి రాలే ప్రతి ఇప్పపువ్వూ ఆనందంగా గోండుల వెదురుబుట్టలోకి వెళ్లిపోతుంది. ఆహారమై ఆకలి తీర్చబోతున్నందుకూ, పలారమై పిల్లల నోళ్లు తీపిచేయబోతు న్నందుకూ, ఔషధ గుణాలతో అమ్మల చనుబాలను వృద్ధి చేస్తున్నందుకూ .. ఆ సంతోషానికి అనేక కారణాలు. తెల్లవారుజాము సమయంలో తాడ్వాయి అడవులకు వెళితే%ౌౌ% ఆ పుష్ప విలాసాన్ని కళ్లారా చూడవచ్చు. ఇది పువ్వులు రాలే కాలం. గోండుల మొహాలు పువ్వుల్లా వికసించే కాలం. ఉదయంపూట నడుస్తుంటే, పాదాలకు మెత్తని పూలు తాకుతుంటాయి. తలపైకెత్తి చూస్తే దట్టంగా ఇప్పపూల చెట్లు%ౌౌ% గొడుగులా అల్లుకొని! రాలిన పూలకు అంటిన మట్టిని సుతారంగా తుడిచి, జాగ్రత్తగా వెదురు బుట్టల్లోకి వేస్తుంటారు పిల్లలూ పెద్దలూ. అదో అందమైన దృశ్యం!
ఆ పూవు అటవీ ప్రాంత ప్రజల బతుకుదెరువు. ఇప్పచెట్లకు ఓజీవనచక్రం ఉంటుంది.ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌ వరకూ ఆకురాలే కాలం. ఆసమయంలోనే ఘాటైన పరిమళంతో పూలు వికసిస్తుంటాయి. మార్చి నుంచి మూడు నెలల వరకూ పూలు రాలే కాలం.ఒక్కో చెట్టు నుంచీ సుమారు వంద కిలోల పూలు రాలతాయి. ప్రతి పువ్వునూ జాగ్రత్తగా ఒడిసిపట్టుకుంటారు గిరిజనులు.ఎందుకంటే,వాళ్ల బతుకంతా ఇప్పతోనే ముడిపడి ఉంటుంది.ఇప్పపూల సేకరణ కోసం తెల్లవారుజామునే అడవులకు బయల్దేరతారు గోండులు.పొద్దుతిరుగుడు పువ్వు సూర్యుడి కోసం చూసినట్టు, రాలిపడే ఇప్పపూల కోసం ఎదురు చూస్తుంటారు.అలా, ఒక్కొక్కరు ఐదు నుంచి పది కిలోల వరకూ సేకరిస్తారు. సాయం త్రం బుట్టనిండా పూలతో తృప్తిగా ఇళ్లకు చేరుకుంటాం. వాటిని ఎండబెట్టి పుప్పొడి రేణువులు పోయేదాకా కర్రమొద్దులతో బాదుతారు. ఆ తర్వాత,చేటలతో చెరుగుతారు. గుమ్ముల్లో దాచు కుంటారు. ముందుజాగ్రత్తగా, వాటిలో కొన్ని వేపాకులు చల్లుతారు.దానివల్ల పువ్వు ఎక్కువ కాలం నిలువ ఉంటుంది. ఒకనాటి పువ్వు ఇప్పుడు ఆహార పదార్థం.
పువ్వుకే మనసు ఉంటే..
అందంగా పుట్టినందుకు కాదు,ఆహారమై కడుపు నింపుతున్నందుకే ఎక్కువ సంతో షిస్తుందేమో ఇప్పపువ్వు. ఏ కూర లూ లేనపుడు,నాన బెట్టిన బియ్యానికి ఇప్ప పువ్వు కలిపి అన్నం వండుకుంటారు. నాలుకకు కాస్త తీపి తగిలితే బావుండునని అనిపించినప్పుడు బెల్లం కలిపి ఉండలుగా చేసుకొంటారు. ‘ఇవి మా జీవితం. మా ఆత్మ’ అంటూ ఆరబెట్టిన ఇప్పపూలను దోసిళ్లతో చూపుతుంది మోట్లగూడానికి చెందిన అలుగుమెల్లి రజిత.
ఇప్ప గారెలు,జంతికలు
ఇప్పపువ్వు అనగానే సారా తయారు చేస్తారనేదే ఇప్పటి వరకూ ఉన్న ప్రచారం.అంతకుమించి, ఎన్నో వంటలు వండుకుంటారు గోండు మహిళలు.జొన్నపిండి ఉడక బెట్టి,అందులో ఇప్పపూలు కలిపి అంబలి చేస్తారు.వేయించి బజ్జీలు వేస్తారు.చిక్కుడు గింజలు,అలసందలు కలిపి ఉడికిస్తే ఆ అంబలి అమృతమే! ఇప్ప కుడుములు (ఇడ్లీల్లాంటివి),జొన్న-ఇప్పరొట్టె, గోంగూర-ఇప్పపూల కూర,జొన్న-ఇప్ప సత్తుపిండి ఇప్ప పడితే ఎండు గడ్డికైనా ఎక్కడలేని రుచి వస్తుంది.ఇప్పతో అరిసెలు, గారెలు, జంతికలు, మురుకులు కూడా చేసు కుంటారు.ఎర్ర జొన్న పిండి,బెల్లంతో చేసిన రెండు లడ్డూలు తింటే చాలు,రోజంతా భోజనమే అవసరం లేదు.‘చక్కెర పాకానికి ఇప్పపూవు కలిపి జామ్‌, కేక్‌ తయారు చేస్తాం’ అని చెప్పింది ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరుకు చెందిన భాగుబాయి. వైవిధ్యమైన ఇప్ప వంటకాల తయారీలో ఆమె సిద్ధహస్తురాలు. ఉట్నూరులో ఆదివాసీ ఆహార కేంద్రం నిర్వహిస్తున్నదామె. అనేక ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టే,రోజువారీ ఆహారంలో ఇప్పపూవు ఉండేలా చూసుకుంటారు గిరిజ నులు. వారి నివాసాలు కూడా ఇప్పచెట్లకు దగ్గరలోనే ఉంటాయి.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5లక్షల ఇప్ప చెట్లు ఉన్నట్లు అంచనా.ఐదు లక్షల చెట్లంటే,ఐదు లక్షల జీవితాలే.ఇప్పసారాను నైవేద్యంగా కూడా పెడతారు.ఇప్ప అంటే గోండు దేవతలకు మహా ఇష్టమని అంటారు.మంచిచేసే పువ్వును ఏ దేవుడు మాత్రం ఇష్టపడడు!
శానిటైజర్‌గా ఇప్పసారా!
‘ఆపిల్‌, మామిడి, ఎండు ద్రాక్షలతో పోలిస్తే ఇప్ప పువ్వులోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి. శరీరానికి కావలసిన ..క్యాల్షియం, ఫాస్పరస్‌, ఐరన్‌, పొటాషియం,యాంటీ ఆక్సిడెంట్లు,బి-కాంప్లెక్స్‌, విటమిన్‌-సి ఇందులో అధికం. ఇవన్నీ వ్యాధినిరోధక శక్తిని మెరుగు పరుస్తాయి. ఇప్ప పూలను దగ్గు, శ్వాసకోశ సమస్యల నివా రణకు వాడతారు. ఇప్ప కాయలను పొడిచేసి పాలలో కలుపుకొని తాగుతారు బాలింతలు. దీనివల్ల చనుబాలు వృద్ధి అవుతాయని అం టారు.‘ఇప్పసారా తయారీపై నిషేధం ఉంది. శుభకార్యాలప్పుడు అయిదు లీటర్ల వరకు తయారు చేసుకోవడానికి మాత్రం అనుమతి ఉంది. ఇప్పుడున్న పరిస్ధితుల్లో శానిటైజర్లు మారుమూల గిరిజన ప్రాంతాల్లో దొరకవు. కొన్ని ప్రాంతాలలో కరోనా వైరస్‌ నిరోధానికి ఇప్పసారాను శానిటైజర్‌గా వాడుతున్నారు’ అంటారు.
ప్రారంభమైన ఇప్పపువ్వు సేకరణ!..
ఏజెన్సీ అడవుల్లో ఇప్పపువ్వు సీజన్‌ నడుస్తుంది. ప్రతి ఏడాది మార్చి నుంచి మే చివరి దాకా ఇప్పపువ్వు సేకరణలో గిరిజనం నిమగ్నమవు తుంటారు. వేసవి కాలంలో ఉపాధినిచ్చే ఇప్పపూల కోసం మంటుటెండను సైతం లెక్కచేయకుండా చిన్నాపెద్దా తరలుతున్నారు. తెల్లవారుజామునే తట్టా బుట్టా,అంబలి బుర్రతో బయలుదేరి, సాయంత్రం కల్లా ఊళ్లకు చేరు కుంటారు.గిరిజనులకు ఇప్పపూల సేకరణే ప్రధాన ఆదాయవనరు మాత్రమే కాదు.ఇప్ప పువ్వును గిరిజనులు పవిత్రంగా భావిస్తారు. గిరిజనులు జరుపుకునే సాంప్రదాయ,వేడుకలు, సంబరాలు, పెళ్లి సమయాల్లో ఇప్పపూల నుండి తయారుచేసిన సారాయి తాగడం ఆచారంగా పాటిస్తారు.సాధారణగా ఉదయం సమయంలో రాలుతుంటాయని,30సంవత్సరాల వయస్సు గల ఒక చెట్టు నుండి సుమారు 100నుండి 150 కిలోల ఇప్పపూలు లభిస్తుంటాయని పలువురు గిరిజనులు న్యూస్‌18కు తెలియ జేశారు ఇలా రాలిపడిన పూలను సేకరించి నీడలో ఆరబెడుతారు.బాగాఎండిన తరువాత వీటిని తమ అవసరాలకు అనుగుణంగా కావాల్సినప్పుడు వాడుతుంటారు. గిరిజన ప్రాంతాల్లో ఇప్ప పువ్వు అంటే కేవలం సారా యి తయారు చేయడానికే వాడుతారు అనే భావన ఉంది.కానీ భద్రాచలం ఏజెన్సీ అడుగులలో లభించే ఈ పప్పుని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ప్రసాదం భక్తులకు విక్రయిస్తారని గిరిజనులు తెలుపుతున్నారు.
ఇదిలా ఉండగా గతంలో పలువురు శాస్త్ర వేత్తలు జరిపిన పరిశోధనలో ఇప్ప పూల నుండి పంచదార పాకం తయారు చేసి దీంతో బిస్కెట్‌,చాక్లెట్‌,జామ్‌,కేక్‌లు తయారు చేసే విధానాన్ని కనిపెట్టారు.1999లో పేటెంటు కొరకు దరఖాస్తు చేశారు. ఆయుర్వేద వైద్య విధానం ప్రకారం ఇప్ప పూలు బాలింతలకు చాలా ఉపయోగకరంగా పనిచేస్తాయి. సాధారణ శారీరక బలహీనత నుండి రక్షిస్తుంది. వీటిని నేరుగా తినడంవల్ల పిల్లలు పోషకహార లోపం నుండి బయట పడవచ్చు. గతంలో గిరిజనులందరూ ఇప్ప పూలను మంగళంలో పొడిగా చేసి వేపి,వేపిన గోంగూర గింజల పొడిని కలుపుతూ ఇప్ప నూనె కొంచెం చేర్చి ఉండలుగా చేసుకొని తినేవారు. రెండు లడ్లు తింటే ఒక రోజుకు సరిపడా శక్తి శరీరా నికి లభించేది. కొన్ని రాష్ట్రాల్లో గిరిజనులు ఈ పూలను రొట్టెల పిండిలో కలిపి తింటారు. ఇప్పపూలతో ఇప్పజామ్‌గిరిజనులకు ఇప్పపూల సేకరణే ఆధారం.
దివ్య ఔషదాల కల్పవల్లి..
కొండకోనల్లో జీవించే గిరిజనులకు ప్రకృతి వనరులే జీవనాధారంగా ఉంటాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో సహజ సిద్ధంగా లభించే వివిధ రకాల పండ్లు, పంటలు గిరిజనులకు ఆహార సంపదతో పాటు ఆదాయ వనరులుగా ఉపయోగపడుతుంటాయి. ప్రస్తుతం జీడీ, చింతపండు,కరక్కాయ వంటి సహజసిద్ద పంట లతోపాటు ఇప్పపూలు సేకరణద్వారా గిరిజ నులు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు.
వేసవిలో ఇప్పపూలు సేకరణలో గిరిజనులు బిజీగా గడుపుతుంటారు.గిరిజనులు చింత పండు,జీడి పిక్కలు సేకరణతో పాటు మరోవైపు ఇప్పపూలు సేకరణలో బిజీగా కనిపి స్తుంటారు. ఏగ్రామం చూసిన విప్పపూల సువాసన వెదజల్లుతోంది.ఇప్పపూలులో దివ్యౌషధం గుణాలు కలిగి ఉన్నాయి. ఇప్పపూలు విని యోగించేవారు విశేషమైన ఆరోగ్య లాభాలు పొందుతారు.ముఖ్యంగా కీళ్ల నొప్పులు,ఒళ్ళు పట్లు, వాతాలకు దివ్యౌషధం ఇప్పపూలు. దగ్గు,శ్వాసకోస వ్యాధులకు కూడా వాడు తుంటారు.ఇప్ప కాయలను పొడిచేసి పాలలో కలుపుకుని గిరిజన మహిళలు తాగుతారు.దీని వలన బాలింతలు చనుబాలు వృద్ధి అవుతాయని అంటుంటారు. విప్ప పువ్వు తో ఆయుర్వేదిక్‌ మందులు, నూనె లడ్డు, హల్వా, కేకులు తయారు చేస్తుంటారు. అందుకే విప్ప పువ్వుకు మార్కెట్‌ లో మంచి డిమాండ్‌.అడవుల్లో సేకరించిన విప్ప పువ్వును బాగా ఎండ బెడతారు. అనంతరం ఆ పువ్వు నుంచి గింజ లను వేరు చేసి,మళ్లీ ఎండబెడతారు. అనం తరం వాటిని గానుగ ఆడిరచి నూనె తీస్తారు. ఈ నూనెను వంటలలో ఉపయోగిస్తుంటారు. అలాగే, ఔషధాలకూ ఉపయోగిస్తుంటారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో విప్ప నూనె కిలో ధర 50రూపాయల వరకు పలుకుతుంది. గిరిజను లు ఈ నూనెను విక్రయిస్తూ, ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. గతంలో గిరిజన సహకార సంస్థ ద్వారా విప్ప పువ్వు,విప్ప నూనెను ప్రభుత్వమే కొనుగోలు చేసేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.దీంతో మార్కెటింగ్‌ కోసం గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పపూలు,గింజల నుంచి తీసే నూనెలో ఔషధపోషక గుణాలు కూడా ఉన్నా యని జాతీయ పౌషకాహార సంస్థ అధ్యయనంలో తేలిందని ట్రైఫెడ్‌ చెబుతుంది. బాలింతలకు ఆరోగ్యాన్ని ఇవ్వడంతోపాటు శారీరక బలహీ నత నివారించే గుణాలు వీటిలో ఉన్నాయని పేర్కొంటోంది.30 ఏళ్ల వయస్సున్న ఇప్ప చెట్టు సగటున 150 కిలోల పూలను ఉత్పత్తి చేస్తుంది.మట్టి అంటకుండా ఈపూలను సేకరించి నిల్వ చేస్తారు.అనంతరం వీటి నుంచి పంచదార పాకం చేసి దాంతో బిస్కెట్‌,చాక్లెట్‌, జామ్‌,కేక్‌లను తయారు చేస్తారు.కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ సహకారంతో నిర్వహించిన పరిశోధనలో ఢల్లీికి చెందిన డాక్టర్‌ ఎస్‌.ఎన్‌.నాయక్‌ ఈ ప్రక్రియపై పేటెంట్‌ కోసం కూడా దరఖాస్తు చేశారు- ఎ.పోశాద్రి

అమల్లోకి సీఏఏ

‘‘ వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) మళ్లీ తెరపైకి వచ్చింది.సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఓట్లు కురిపిస్తున్నందని భావిస్తున్న సీఏఏను మోదీ సర్కారు బ్రహ్మాస్త్రంగా బయటికి తీసింది. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్గానిస్తాన్‌ల నుంచి భారత్‌కు శరణార్ధు లుగా వచ్చిన ముస్లిమేతరులకు మన దేశ పౌరసత్వాన్ని కల్పించడం లక్ష్యంగా మార్చి 11న నోటిఫికేషన్‌ జారీ చేసింది.’’ ` గునపర్తి సైమన్‌
భిన్నత్వంలో ఏకత్వం కలిగిన లౌకిక భార తాన్ని విచ్ఛిన్నం చేసేందుకు వినాశకర పౌరసత్వ చట్ట సవరణ-2019ని ఎన్నికల ముంగిట మోడీ ప్రభుత్వం మళ్లీ ముందుకు తెచ్చింది. మతపర మైన ఉద్రిక్త తలు రెచ్చగొట్టడం దేశ సమగ్రత, సమె ౖక్యతకు గొడ్డలిపెట్టు. ఎన్నికల్లో లబ్ధిపొం దాలన్న యావతో వివాదాస్పద సిఎఎ అమలుకు అది తెగబడిరది.ఈ చట్టానికి వ్యతిరేకంగా 2019-20లో దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. ప్రభుత్వ రాక్షసత్వానికి దాదాపు వంద మంది బల య్యారు. అప్పట్లో తాత్కాలికంగా వెనక్కితగ్గి ఇన్నాళ్లూ కోల్డ్‌ స్టోరేజిలో పెట్టిన ఈ చట్టాన్ని ఎన్నికల ముంగిట అందునా రంజాన్‌ ఉపవా సాలు ప్రారంభమైన ముందురోజున నోటిఫై చేయడం దాని దుష్ట ఎజెండాలో భాగమే. విచ్ఛిన్నం చేసే మత విభజనను తెచ్చి రోజురోజుకూ పెరిగిపోతున్న ధరలు,నిరు ద్యోగం,కుంగిపోతున్న ఆర్థిక వ్యవస్థ లాంటి అంశాలన్నీ పక్కనపెట్టి భావోద్వేగ అంశాలను, మతపరమైన అంశాలను రెచ్చగొట్టడం వల్లే ప్రయోజనం పొందాలనేది బిజెపి కుతంత్రం. 2019లో ఎన్నికల ముందు పుల్వామా, సర్జికల్‌ స్ట్రైక్స్‌,దేశభక్తి లాంటి అంశాలను ముందుకు తెచ్చినట్టే ఇప్పుడూ సిఎఎ లాంటి అంశాలతో లబ్ధిపొందాలని ఆపార్టీ చూస్తోంది.పౌరసత్వ సవరణ చట్టాన్ని 2019 డిసెంబర్‌ 11న పార్లమెంట్‌లో ప్రతిపక్షాల బహిష్కరణ మధ్య అత్యంత అప్రజాస్వామిక రీతిలో ఆమోదింప జేసుకుంది.ఎన్‌డిఎ భాగస్వాము లతోపాటు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీల ఎంపిలు ఆనాడు దీనికి అనుకూలంగా ఓటు వేశారు.ఈచట్టం ప్రకారం 2014డిసెంబరు 31కి ముందు పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌, బంగ్లా దేశ్‌ల నుండి మనదేశానికి వలస వచ్చిన హిందువులు, బౌద్ధులు, జైనులు,సిక్కులు,క్రైస్తవు లు,పార్శీలకు భారత పౌరసత్వం ఇస్తారు. ఈ చట్టం అమలును జాతీయ పౌరపట్టిక ఏర్పాటుతో ముడిపెట్టడం ముస్లిం పౌరులను లక్ష్యంగా చేసుకునేందుకే. రాష్ట్రాల్లో పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే వారి గుర్తింపు,పేర్ల నమోదు క్రమం నుండి రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర లేకుండా చేయడం చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిం చిన రాష్ట్ర ప్రభుత్వాలను మినహాయించింది. ఇది భారత ఫెడరల్‌ వ్యవస్థ స్ఫూర్తికే విరుద్ధం. ఈ చట్టాన్ని మూడు దేశాలకే పరిమితం చేయడం,మతం ఆధారంగా తీసుకురావడం 1955లో తీసుకొచ్చిన సిఎఎ చట్టానికి, రాజ్యాం గ మౌలిక స్వరూపానికి వ్యతిరేకం.రాజ్యాంగం లోని 19వ అధికరణం మతప రమైన స్వేచ్ఛ ఇస్తున్నప్పుడు ముస్లిములకు తప్ప ఇతరులకే పౌరసత్వం ఇస్తామని చెప్పడం రాజ్యాంగ ఉల్లం ఘన కాదా? శ్రీలంకలో దశాబ్దాలుగా మతపర మైన హింసను ఎదుర్కొం టున్న శ్రీలంక హిందువులను ఎందుకు మినహాయించారు? తమిళులపట్ల వివక్షా? ఇప్పుడు ముస్లిములను మినహాయించిన వారు తరువాత క్రైస్తవులను, ఇతర మైనార్టీలను మినహాయిం చరా? వంటి ప్రశ్నలనేకం. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14 ప్రకారం కులం,మతం,రంగు,జాతి,ప్రాంతం, భాష ఆధారంగా ఎవరిపట్ల వివక్ష ఉండ కూడదు.కాని సిఎఎ మత ప్రాతిపదికన వివక్ష పాటిస్తుంది కనుక ఇది రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగ మౌలిక సూత్రా లను (బేసిక్‌ స్ట్రక్చర్‌ను) మార్చే అధికారం పార్ల మెంట్‌కు కూడా లేదని కేశవానంద భారతి కేసు తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.ఇవేవీ పట్టని మన పాలకులు మతాన్ని అడ్డగోలుగా రాజకీయ ప్రయోజనాలకు వినియోగిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల సమయంలో ‘జై భజరంగి’ అంటూ ఓట్లు వేయాలని ప్రధాని స్వయంగా పిలుపు నిచ్చారు.‘పాకిస్తాన్‌కు వెళ్లండి..లేదా కబరి స్థాన్‌కు వెళ్లండి’అంటూ వీరంగం వేయడం, బుల్డోజర్లతో నివాసాలను కూల్చివేయడం..కమ లం పార్టీకి,ఆ పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వా లకు నిత్యకృత్యమే.400 సీట్లు ఇవ్వండి రాజ్యాం గాన్నే మార్చేస్తాం..సెక్యులర్‌ దేశంగా భారత్‌ను ఉంచం అని బిజెపి ఎంపి అనంత హెగ్డే అన్నారు. సిఎఎను అమలు చేయబోమని ఇప్పటికే కేరళ,తమిళనాడు ప్రభుత్వాలు ప్రకటిం చగా, మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే బాటలో నడుస్తున్నాయి. భిన్న మతాలు, ఆచారా లు,సంప్రదాయాలు,సంస్కృతులకు నియమైన మన దేశానికి ఈ చట్టం ఏమాత్రం శ్రేయస్కరం కాదు.మత మారణహోమాన్ని రగిలించే మతోన్మాద శక్తుల ఆట కట్టించేందుకు యావ ద్భారత జాతి ఐక్యంగా ముందుకు ఉరకాలి. సిఎఎను తిప్పికొట్టాలి.
ఏమిటీ పౌరసత్వ సవరణ చట్టం.. అంటే..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ముఖ్య అజెండాల్లో ఒకటి.. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ). ఇప్పుడు ఎన్నికల ముంగిట ఈ అంశం వివాదాస్పదమవుతోంది. సీఏఏను వారంలో దేశమంతా అమలు చేస్తామని కేంద్రం ప్రకటిం చడం కాక రేపుతోంది. అయోధ్యలో రామాల య నిర్మాణంతోపాటు ఇప్పుడు పౌరసత్వ సవరణ చట్టం ద్వారా బీజేపీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని భావిస్తోందని విపక్షాలు విమర్శి స్తున్నాయి.ఇంతకూ ఈ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అంటే..పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్గనిస్తాన్‌ దేశాల నుంచి వచ్చిన ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం కల్పించ డం.2014 డిసెంబర్‌ 31కి ముందు ఆయా దేశాల నుంచి భార్ష కు వలస వచ్చిన వారు భారత పౌరసత్వాన్ని పొందడానికి అర్హులు. ఆయా దేశాల నుంచి వలస వచ్చిన హిందు వులు,సిక్కులు,జైనులు,బౌద్ధులు,పార్శీలు,క్క్రెస్తవులు దీని సీఏఏ కింద భారత పౌరసత్వం పొం దొచ్చు. ఆఫ్గనిస్తాన్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ నుంచి వలస వచ్చినవారికి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా,వాటి గడువు ముగిసినా భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకో వచ్చు.ఈ మేరకు 1955 నాటి పౌరసత్వ చట్టా నికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సవరణలు చేసింది. వాస్తవానికి పౌరసత్వ సవరణ చట్టం ప్రతిపాదన బిల్లును మొదట 2016లో పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అయితే అప్పుడు బీజేపీ మిత్రపక్షం అసోం గణపరిషత్‌ తోపాటు తదితర పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అనంతరం 2019లో సీఏఏ బిల్లును పార్లమెం టు ఉభయసభలు ఆమోదించాయి. తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్రతో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) రూపుదాల్చింది.అయితే దేశవ్యా ప్తంగా సీఏఏపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. విపక్షాల ఆందోళనలతో దాని అమలు ఇన్నాళ్లూ వాయిదా పడిరది. కానీ జమ్ముకాశ్మీర్‌ కు ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించడం,లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయడం,అయోధ్యలో రామా లయం నిర్మాణం వంటి చర్యలతో దూకుడు మీదున్న బీజేపీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం విషయంలోనూ అంతే పట్టుదలతో ఉం దని అంటున్నారు.ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కూడా ఎవరు అభ్యంతరం వ్యక్తం చేసినా పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయడం ఖాయమని వెల్లడిర చారు. పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం.. 2014 డిసెంబర్‌ 31కి ముందు భారత్‌కు వలస వచ్చిన మతపరమైన మైనారిటీలకు ఆరేళ్లలోపు భారత పౌరసత్వం కల్పిస్తారు. అలాగే వీరు భారత్‌ పౌరసత్వం పొందడానికి భారత్‌లో కనీసం 11ఏళ్లుగా నివసిస్తూ ఉండా లన్న నిబంధనను కూడా ఐదేళ్లకు తగ్గించారు. అయితే హిందువులకు, క్క్రెస్తవులకు, బౌద్ధులకు, పార్శీలకు పౌరసత్వం ఇస్తూ ముస్లిం మైనారిటీ లను చేర్చకపోవడం పట్ల అభ్యంతరాలు వ్యక్త మవుతున్నాయి. సీఏఏపై విపక్షాల అభ్యంతరా లెందుకు అంటే..వివిధ దేశాల నుంచి వలస వచ్చి భారత్‌లో జీవిస్తున్న వివిధ మతాలవారు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు వీరికి పౌర సత్వం కల్పిస్తే వారంతా బీజేపీకి ప్రధాన ఓటు బ్యాంకుగా మారతారని విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే ముస్లింలకు పౌరసత్వం కల్పించకపోవడం పట్ల కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే విదే శీయుల కారణంగా స్థానికంగా ఉండేవారికి ఉపాధి విషయంలో,సంస్కృతి సంప్రదాయాల విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయని ప్రతిపక్షాల అభ్యంతరంగా ఉంది.అలాగే పాకిస్థాన్‌,బంగ్లాదేశ్‌,ఆప్గనిస్తాన్‌ల నుంచి వచ్చినవారికి పౌరసత్వం కల్పిస్తూ శ్రీలంక, టిబెట్‌,మయన్మార్‌ నుంచి వచ్చినవారికి పౌర సత్వం ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తంగా సీఏఏ చట్టం రాజ్యాంగబద్ధతనే సవాలు చేస్తూ పలు పార్టీలు ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసులు వేశాయి. వీటిపై విచారణ తుది దశలో ఉంది.
చట్టం అమలుకు నిబంధనలను విడుదల
ఈ చట్టాన్ని అమలు పరచడానికి అవసరమైన నియమ నిబంధనలను కేంద్రం నోటిఫై చేసిం దని ఏఎన్‌ఐ వార్తా సంస్థ వెల్లడిరచింది. ఈ నిబంధనలకు అమల్లోకి వస్తే 2014డిసెంబర్‌ 31తర్వాత పాకిస్తాన్‌,అఫ్గానిస్తాన్‌,బంగ్లాదేశ్‌ల నుంచి నిబంధనలకు విరుద్ధంగా వలస వచ్చిన హిందువులు, సిక్కులకు భారత పౌరసత్వం దక్కే అవకాశం ఏర్పడుతుందని హోంశాఖ తన ట్వీట్‌లో పేర్కొంది.ఇందుకోసం పూర్తిగా ఆన్‌లైన్‌ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.
ఏమిటీ బిల్లు
ఈ పౌరసత్వ సవరణ బిల్లును మొదటిసారి 2016 జూలైలో పార్లమెంటులో ప్రవేశ పెట్టారు.అప్పుడు బీజేపీకి భారీ ఆధిక్యం ఉన్న పార్లమెంటు దిగువసభ (లోక్‌సభ)లో ఈ బిల్లు ఆమోదం పొందింది. అయితే..ఈశాన్య భారత దేశంలో వలసలకు వ్యతిరేకంగా హింసాత్మక నిరసనలు చెలరేగిన తర్వాత ఎగువ సభ (రాజ్యసభ)లో ఇది ఆమోదం పొందలేదు. ముఖ్యంగా..ఆగస్టు నెలలో ప్రకటించిన జాతీయ పౌరుల జాబితాలో దాదాపు ఇరవై లక్షల మంది నివాసులకు చోటు కల్పించని అస్సాం రాష్ట్రంలో నిరసనలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ పౌరసత్వ సవరణ చట్టం,ఆపౌరుల జాబి తా రెండూ ఒకటి కాకపోయినప్పటికీ..ఆ జాబి తాకు ఈ చట్టానికి సంబంధం ఉందని జనం భావిస్తున్నారు. జాతీయ పౌరుల జాబితా (నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌-ఎన్‌ఆర్‌సీ) అనేది..1971 మార్చి 24వ తేదీ నాటికి – అంటే పొరుగుదేశమైన బంగ్లాదేశ్‌ స్వతంత్ర దేశంగా మారటానికి ఒక రోజు ముందు నాటికి తాము ఈ రాష్ట్రానికి వచ్చామని నిరూపించు కోగలగిన ప్రజల జాబితా.ఆ జాబితాను ప్రచురించటానికి ముందు ఎన్‌ఆర్‌సీని బీజేపీ సమర్థించుకుంటూ వచ్చింది. కానీ.. తుది జాబితాను ప్రచురించటానికి కొన్ని రోజుల ముందు అందులో తప్పులు ఉన్నాయంటూ వైఖరి మార్చుకుంది. దానికి కారణం..బీజేపీకి బలమైన ఓట్ల పునాదిగా ఉన్న బెంగాలీ హిందు వులు చాలా మందిని కూడా ఆ జాబితా నుంచి మినహాయించారు. ఈ నియమాలు పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌,అఫ్గానిస్తాన్‌ దేశాల్లో మతపరంగా హింసకు గురవుతున్న మైనారిటీలకు మన దేశంలో పౌరసత్వాన్ని పొందేలా చేస్తాయి. ఆ దేశాల్లో నివసిస్తున్న హిందువులు,సిక్కులు, బౌద్ధులు,జైనులు,పార్సీలు,క్రైస్తవులకు మన రాజ్యాంగ నిర్మాతలు ఇచ్చిన వాగ్దానాన్ని గ్రహించి,ఈ నోటిఫికేషన్‌తో నరేంద్ర మోదీ నెరవేర్చారు’’ అని ఎక్స్‌ వేదికగా తెలిపారు. భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో ఎవరూ మతం ఆధారంగా వివక్ష చూపకూడదు.అయితే ఈ చట్టంలో ముస్లింలకు పౌరసత్వం కల్పించే నిబంధన లేదు. ఈ కారణంగానే సెక్యులరి జానికి విఘాతం కలుగుతోందన్న ఆరోపణలు వినిపించాయి.
పౌరసత్వ చట్టం చరిత్ర ఏమిటి?
అక్రమ వలసదారులు భారతదేశ పౌరులుగా మారకుండా నిషేధిస్తున్న 64సంవత్సరాల కిందటి భారత పౌరసత్వ చట్టాన్ని ఈ పౌరసత్వ సవరణ బిల్లు సవరించింది. చెల్లుబాటయ్యే పాస్‌పోర్టు, ప్రయాణ పత్రాలు లేకుండా భారతదేశంలోకి ప్రవేశించే విదేశీయులు, అనుమతించిన కాల పరిమితిని దాటి దేశంలో కొనసాగే విదేశీయులను అక్రమ వలసదారులు అని ఆ చట్టం నిర్వచిస్తోంది.ఆచట్టం ప్రకారం.. అక్రమ వలసదారులను వారి దేశాలకు తిప్పి పంపించేయటం లేదా జైలులో నిర్బంధించటం చేయవచ్చు.ఒక వ్యక్తి భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవటానికి 11సంవత్సరాల పాటు భారతదేశంలో నివసించి ఉండటం కానీ, ప్రభుత్వం కోసం పనిచేసి ఉండటం కానీ తప్పనిసరి అర్హతలుగా చెప్తున్న నిబంధనను కూడా ఈ బిల్లు సవరిస్తుంది.ఆరు మతపర మైన మైనారిటీ సమూహాలకు-హిందువులు, సిక్కులు,బౌద్ధులు,జైనులు,పార్సీలు,క్రైస్తవులకు మినహాయింపు ఉంటుంది.అయితే..వారు పాకిస్తాన్‌,అఫ్ఘానిస్తాన్‌,బంగ్లాదేశ్‌ దేశాలలో ఏదో ఒక దేశానికి చెందిన వారిమని నిరూపించు కోగలగాలి.అటువంటి వారు పౌరసత్వం పొంద టానికి అర్హులు కావాలంటే కేవలం ఆరు సంవ త్సరాల పాటు భారతదేశంలో నివసించటం లేదా పనిచేసి ఉంటేచాలు. ప్రవాస భారత పౌరులు (ఓవర్‌సీస్‌ సిటిజన్‌ ఆఫ్‌ ఇండియా- ఓసీఐ) కార్డులుగల వ్యక్తులు-భారత సంతతికి చెందిన విదేశీ పౌరులు భారతదేశంలో నిరవ ధికంగా నివసించటానికి లేదా పని చేయటానికి అనుమతించే వలస హోదా గల వ్యక్తులు.. చిన్న,పెద్ద నేరాలతో స్థానిక చట్టాలను ఉల్లం ఘించినట్లయితే వారి ఓసీఐ హోదాను కోల్పో తారని కూడా ఈ సవరణ చెప్తోంది.పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయకుండా ఉండే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందా? దేశం లోని కొన్ని బీజేపీయేతర ప్రభుత్వాలు తమ రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) అమలు చేయబోమని ప్రకటించాయి.అయితే, పౌరసత్వం కేంద్ర ప్రభుత్వ ?అధికార పరిధి లోకి వస్తుంది కదా,మరి అది సాధ్యమేనా? పౌరసత్వ సవరణ చట్టం-2019ను భారత పార్లమెంట్‌ ఆమోదించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం దీనికి సంబంధిం చిన నిబంధనలు నోటిఫై చేసింది.ఈచట్టం ప్రకారం 2014కు ముందు పాకిస్తాన్‌,బంగ్లా దేశ్‌,అఫ్గానిస్తాన్‌ దేశాల నుంచి భారత్‌లోకి ప్రవేశించిన హిందూ,బౌద్ధ,పార్సీ,క్రైస్తవ,జైన మతాలకు చెందిన వ్యక్తులు భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.వారు భారత్‌లోకి ప్రవేశించినట్లుగా నిరూపించే ధ్రువ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. దీనికి అందించా ల్సిన పత్రాలను సెక్షన్‌ 1ఏ,సెక్షన్‌ 1బీ విభాగా ల్లో పొందుపరిచారు.1ఏ పత్రాలలో జనన ధ్రువీకరణ,అద్దె ఒప్పంద పత్రం, గుర్తింపు కార్డులు, డ్రైవింగ్‌ లైసెన్స్‌,అఫ్గానిస్తాన్‌, బంగ్లా దేశ్‌,పాకిస్తాన్‌ దేశాలు జారీ చేసిన విద్య సంబంధిత ధ్రువీకరణ పత్రాలు సమర్పిం చాలి.1బీ కోసం భారత ప్రభుత్వం జారీ చేసిన వీసా,పాన్‌ కార్డు,మ్యారేజ్‌ సర్టిఫికేట్‌,సెన్సస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ అడ్మిట్‌ కార్డ్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్డులు పేర్కొన్నారు.ఈ పత్రాలు 2014కి ముందే తీసుకొని ఉండాలి. ఈ పత్రాలు అందుబాటులో ఉంటే,ఈ మూడు దేశాల ప్రజలు భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందా?పౌరసత్వం మంజూరు అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిది, అయితే ఈ చట్టాన్ని కొన్ని రాష్ట్రాల్లో అమలు చేయ కుండా ఉండటం సాధ్యమవుతుందా? ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎందుకు అలాంటి ప్రకటనలు చేస్తున్నారు? అనే ప్రశ్నలు తలెత్తు తున్నాయి.భారత రాజ్యాంగంలోని భాగం సెంట్రల్‌ లిస్ట్‌,స్టేట్‌లిస్ట్‌,కామన్‌ లిస్ట్‌ పరిధిలోకి వచ్చే విషయాలను నిర్వచిస్తుంది. కేంద్ర జాబితాలో మొత్తం 97అంశాలు ఉన్నాయి. 17వ అంశంగా ‘సిటిజన్‌షిప్‌,నాచురలైజేషన్‌, అలియన్స్‌’లను ప్రస్తావించారు.ఈ జాబితాలో ఉన్న విషయాలపై చట్టం చేసే హక్కు పూర్తిగా పార్లమెంట్‌ది.భారత పార్లమెంట్‌ ఆమోదించిన చట్టాలను రాష్ట్రాలు అమలు చేయాలి.
రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకోగలవా?
కేంద్రం చేసిన చట్టాలను రాష్ట్రాల్లో అమలు చేయడం,వ్యతిరేకించడంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత,ప్రముఖ న్యాయవాది కపిల్‌ సిబల్‌ గతం లో కొన్ని వ్యాఖ్యలు చేశారు.2020లో కేరళలో జరిగిన ‘కేరళ లిటరేచర్‌ ఫెస్టివల్‌’లో పాల్గొన్న కపిల్‌ సిబల్‌ మాట్లాడుతూ..‘సీఏఏను పార్ల మెంట్‌ ఆమోదించిన తర్వాత ఏరాష్ట్రం కూడా దాన్ని అమలు చేయబోమని చెప్పలేదు.కానీ, వ్యతిరేకించవచ్చు.అసెంబ్లీలో తీర్మానం చేయ వచ్చు. చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయవచ్చు.కానీ దానిని అమలు చేయబోమని చెప్పడం రాజ్యాంగ పరంగా సంక్లిష్టమైనది’’ అని ఆయన అన్నారు. అంతేకాదు, పౌరసత్వం కోరేవారు కేంద్ర ప్రభు త్వం రూపొందించిన వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకుంటారు. మరి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఎలా అడ్డుకుంటుంది లేదా అమలు చేయ కుండా ఉంటుందా?అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది.
‘పౌరుల రిజిస్టర్‌ తయారు చేయగలరా?’
సిటిజన్‌ షిప్స్‌, నాన్‌- సిటిజన్‌ షిప్స్‌ కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వచ్చినా,రాష్ట్ర ప్రభుత్వం మద్దతు లేకుండా ఏమీ చేయలేరని డీఎంకే అధికార ప్రతినిధి సీ రవీంద్రన్‌ అన్నారు.‘‘సీఏఏ, ఎన్‌ఆర్‌సీలు ఒకదానికొకటి అనుసంధానమైనవి. రాష్ట్ర ప్రభుత్వ సహాయం లేకుండా పౌరుల రిజిస్టర్‌ తయారుచేయవచ్చా? ఉదాహరణకు, శ్రీలంక తమిళులు ఈ సీఏఏ చట్టం ప్రకారం పౌరసత్వం పొందలేరు. వారు ఒకవేళ శ్రీలంక తమిళులని చెబితే వెళ్లగొడతారు,అది రాష్ట్ర ప్రభుత్వం చేయాలా?మేం అంగీకరించం’’ అని రవీంద్రన్‌ అన్నారు.రాజకీయాల కోసమే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చట్టాలు చేస్తుందని ఆయన ఆరోపించారు.‘‘ఉత్తర భారతదేశంలో హిందూ శక్తులు బలంగా ఉన్న ప్రాంతాలలో,బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం అని నటిస్తోంది. వాళ్లు దీన్ని పూర్తిగా అమలు చేయలేరు’’ అని రవీంద్రన్‌ ఆరోపించారు.

ఏపీలో ఎన్నికల కోడ్‌`2024

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. లోక్‌సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసింది. ఏపీ, ఒడిశా, అరుణాచల్‌, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌తో పాటు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది సీఈసీ. అలాగే దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా నిర్వహించనున్నట్లు తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. రాష్ట్ర సరిహద్దుతో పాటుగా జిల్లాల సరిహద్దుల్లో కూడా అవసరమైన చోట చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. పోలీసులు వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.డబ్బులు, బంగారం, వెండి,మద్యం,విలువైన వస్తువులు భారీగా పట్టుబడుతోంది.దీంతో ఎంత వరకు డబ్బు,బంగార,వెండిని వెంట తీసుకె ళ్లొచ్చు..ఒకవేళ తీసుకెళితే ఎలాంటి ఆధారాలు ఉండాలి అనే నిబంధనలపై చర్చ జరుగుతోంది.ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం..పరిమితికి మించి తీసుకెళ్తే తప్పనిసరిగా లెక్క చూపించాలి. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం రూ.50వేలు వరకు మాత్రమే డబ్బులు తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. ఒకవేళ అంతకంటే ఎక్కువ తీసుకెళ్లాల్సి వస్తే..ఆ నగదుకు సంబంధించిన వివరాలు, సరైన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి.. ఎక్కడికి తీసుకెళుతున్నారు వంటి అంశాలను చెప్పాల్సిందే. ఒకవేళ డబ్బులు తీసుకెళ్లేవారు ఇచ్చే డాక్యుమెంట్లు, చెప్పే విషయాల్లో నిజాలు లేకపోతే ఆ డబ్బుల్ని స్వాధీనం చేసుకుంటారు. సరైన పత్రాలు చూపించిన తర్వాతే తిరిగి ఆ నగదును అప్పగిస్తారు. అప్పటి వరకు ఆ డబ్బులు కోర్టు కస్టడీలో ఉంటాయి. ఎన్నికల కౌంటింగ్‌ పూర్తయ్యే వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయి. డబ్బులు మాత్రమే కాదు.. బంగారం, వెండి తదితర ఆభరణాలు, విలువైన వస్తువుల్ని కూడా పరిమితికి మించి తీసుకెళ్లకూడదు..
నియమావళి అంటే ఏమిటి, పాటించకపోతే ఏమవుతుంది?
లోక్‌ సభతోపాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ లకు ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ ప్రకటించింది. దీంతో 2024 జనరల్‌ ఎలక్షన్స్‌కు కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రక్రియ మొదలు పెట్టినట్లయింది.ఏడు దశల్లో జరిగే ఈ ఎన్నికల్లో కోట్లమంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడంతో ఎన్నికల నియ మావళి(ఎలక్షన్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌) కూడా అమల్లోకి వస్తుందని ఎన్నికల సంఘం తెలిపింది.దేశంలో ఎన్నికలు నిష్పాక్షికంగా జరిగేందుకు ఎన్నికల సంఘం రూపొందించిన నిబంధనలనే ‘‘ఎన్నికల నియమావళి’’గా పిలుస్తారు.ఎన్నికల నియమావళిని అమలుచేసిన తర్వాత ప్రభుత్వ పరిపాలన యంత్రాంగంలో కొన్ని కీలకమైన మార్పులు చోటుచేసుకుంటాయి. కొందరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు ఎన్నికల కమిషన్‌ (ఈసీ) సిబ్బందిగా పని చేస్తారు.ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు వీరు ఈసీ కోసమే పనిచేస్తారు. ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన తర్వాత,ఒక పార్టీకి ప్రయో జనాలు చేకూర్చేలా ప్రజాధనాన్ని ఉపయోగించ కూడదు. ఒకసారి కోడ్‌ అమలులోకి వచ్చిన తర్వాత,కొత్త ప్రభుత్వ పథకాలు,భూమి పూజలు,శంకుస్థాపనలు,ప్రకటనలు చేయ కూడదు.ప్రభుత్వ వాహనాలు,విమానాలు, ప్రభుత్వ భవనాలను ఎన్నికల ప్రచారం కోసం ఉపయోగించుకోకూడదు.ఎన్నికల ర్యాలీలు, పాదయాత్రలు,బహిరంగ సభలు లాంటి ప్రజా కార్యక్రమాలు నిర్వహించే పార్టీలు,అభ్యర్థులు, వారి మద్దతుదారులు ముందుగా పోలీసుల నుంచి అనుమతి తీసుకోవడం తప్పనిసరి. మతం,కులంపేరుతో ఏరాజకీయ పార్టీ ఓట్లు వేయాలని అభ్యర్థించకూడదు.మత ఘర్షణలు రెచ్చగొట్టేలా లేదా కులాల మధ్య చిచ్చు పెట్టేలా లేదా భాష పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టేలా అభ్యర్థులు లేదా రాజకీయ పార్టీలు ఎలాంటి ప్రకటనలు లేదా వ్యాఖ్యలు చేయకూడదు. పార్టీలు లేదా అభ్యర్థుల విమర్శలు..విధాన నిర్ణయాలు,పథకాలు,కార్యక్రమాలు,గతంలో ప్రవేశపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కావాలి.అభ్యర్థుల వ్యక్తిగత అంశాలు, ప్రజా జీవితంతో సంబంధంలేని అంశాల జోలికి పోకూడదు. నిరూపించలేని ఆరోప ణలను చేయకూడదు.ఎన్నికల ప్రచారంలో భాగంగా మసీదులు, చర్చ్‌లు, దేవాలయాలు ఇతర ప్రార్థనా స్థలాలను ఉపయోగించుకో కూడదు.ఎన్నికల చట్టంలో నేరాలుగా పరిగణించే ‘‘అవినీతి‘’ విధానాల జోలికి అభ్యర్థులు, పార్టీలు వెళ్లకూడదు.ఓటర్లకు డబ్బులు లేదా బహుమతులు ఇచ్చి ప్రలోభ పెట్టడం,భయపెట్టడం,దొంగ ఓట్లు వేయడం లాంటివి చేయకూడదు.పార్టీలు ఓటర్లకు లంచం ఇవ్వడం/బెదిరించడం/అవమానించడం లాంటవి చేయకూడదు.ఓటర్లను పోలింగ్‌ స్టేషన్‌లకు, అక్కడి నుంచి బయటకు వెళ్లేందుకు రవాణా సదుపాయాలు కల్పించకూడదు. పోలింగ్‌ రోజున మద్యం సేవించడం/పంపిణీ చేయడం నిషేధం.పోలింగ్‌ కేంద్రాలకు వంద మీటర్ల దూరంలో ఎలాంటి ప్రచార బోర్డులు ఏర్పాటుచేయకూడదు. పోలింగ్‌కు ముందు 48 గంటల సమయంలో ఎలాంటి ప్రచార కార్యక్రమాలూ నిర్వహించకూడదు.ఎన్నికల కార్యక్రమాలను దగ్గరుండి పరిశీలించేందుకు ఎన్నికల కమిషన్‌ ఎన్నికల పరిశీలకులను నియమిస్తుంది.
ప్రవర్తనా నియమావళి ఎప్పుడు ప్రారంభమైంది?
భారత్‌లో 1960లో కేరళ అసెంబ్లీ ఎన్నికలతో ప్రవర్తనా నియమావళి (కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌) తీసుకొచ్చారు. రాజకీయ పార్టీల అంగీకారంతో వారితో సంప్రదింపులు జరిపి ప్రవర్తనా నియమావళిని రూపొందించారు. పార్టీలు, అభ్యర్థులు ఏ నియమాలను అనుసరించాలో నిర్ణయించుకున్నారు.1967 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో ప్రవర్తనా నియమావళి అమలు చేశారు. దానికి కొన్ని కొత్త విషయాలు, నియ మాలు పొందుపరిచారు.కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ఏ చట్టంలోనూ భాగం కాదు.కానీ దానిలోని కొన్ని నిబంధనలు ఐపీసీలోని సెక్షన్ల ఆధారంగా అమలవుతాయి. ఎన్నికల సంఘం సెప్టెంబర్‌ 1979లో రాజకీయ పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రవర్తనా నియమావళిని సవరిం చింది.1979 అక్టోబరులో జరిగిన సాధారణ ఎన్నికల నుంచి దీన్ని అమలుచేశారు.ప్రవర్తనా నియమావళి విషయంలో 1991జనరల్‌ ఎల క్షన్స్‌ అత్యంత ముఖ్యమైనవి.ఈ సమయంలో ప్రవర్తనా నియమావళిని విస్తరించారు.దీనిని అమలుపరచడంలో ఎన్నికల సంఘం అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిచింది. తేదీలు (షెడ్యూల్‌) ప్రకటించిన రోజు నుంచే ప్రవర్తనా నియమావళి అమల్లోకి తెచ్చేలా చూడాలని ఎన్నికల కమిషన్‌ భావించగా,నోటిఫికేషన్‌ వెలువడిన రోజు నుంచే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించింది.ఈ వ్యవహారం చివరకు కోర్టుల వరకు వెళ్లింది.కానీ,అక్కడి నుంచి స్పష్టత రాకపోవడంతో చివరకు 2001 ఏప్రిల్‌ 16రాజకీయ పార్టీలు,ఎన్నికల సంఘం మధ్య జరిగిన చర్చల తర్వాత,షెడ్యూల్‌ విడుద లైన రోజు నుంచి ప్రవర్తనా నియమావళి (కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌)ను అమలు చేయడానికి ఇరు వర్గాలు అంగీకారానికి వచ్చాయి.అయితే, ఎన్నికల తేదీకీ, నోటిఫికేషన్‌కు మధ్య కనీసం మూడు వారాల (21రోజుల) గడువు ఉండా లన్న షరతు పెట్టారు.

ఏపీ ఎన్నికల `2024 షెడ్యూల్‌ ఇదీ..
ఏప్రిల్‌ 18న ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్‌
ఏప్రిల్‌ 25 నామినేషన్ల స్వీకరణకు తుదిగడువు
ఏప్రిల్‌ 26న నామినేషన్ల పరిశీలన
ఏప్రిల్‌ 29న నామినేషన్ల ఉపసంహరణ గడువు
ఆంధ్రప్రదేశ్‌లో మే 13న ఎన్నికలు
తెలంగాణలోనూ మే 13న ఎన్నికలు
సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీకి మే 13న ఉప ఎన్నిక
జూన్‌ 4న ఓట్ల లెక్కింపు ..ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ సీట్లకు, 25 లోక్‌ సభ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు

` సైమన్‌

నిరంతర స్పూర్తిప్రదాత

నూట ముప్పైయేళ్లు క్రితం భారతీయ సమాజంలో పుట్టిన ఆ మహా విప్లవం పేరు.అంబేద్కర్‌.133 ఏళ్ల తర్వాత.. ఈకోట్లాది మహాభారతావనికి బాబా సాహెబ్‌ రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాదు.ఈ దేశ గతిరీతులకు విధాత.నేటికీ ఆయనే మన సామాజిక పథ నిర్ధేత.కులం పునాదులను పెకలించాలని పిడికిలెత్తిన సామాజిక విప్లవకారులకు మహో పాధ్యా యుడు. దేశంలో అణగారిన కోట్లాది ప్రజలకు న్యాయం అందించే గొంతుక.ఆ ప్రజల చైతన్యాన్ని శాసిస్తున్న నడిపిస్తున్న, విప్లవింపచేస్తున్న మరణం లేని ప్రవక్త. మన బడ్జెట్లకూ,ఆర్ధిక విధానాలకు నిత్య నిర్ధేశకుడు అంబేద్కరే.ఈ దేశ రాజకీయ రంగాన్ని శాసిస్తున్న మహాశక్తి.-జీఎన్‌వీ సతీష్‌
ఆయన రాసిన ప్రతి అక్షరం,పలికిన ప్రతి మాటా ఈ దేశానికి ఒక సందేశం.ఆ నిత్య స్పూర్తిమంతుని 133వజయంతిని జరుపు కోవడం,సేవలను మన నం చేసుకోవడం ఒకగొప్ప అనుభవం.చారిత్రక అవసరం. అస్పృశ్యతా శాపానికి గురైన మహర్‌ కుటుంబంలో పుట్టిన అంబేద్కర్‌,ఆవర్గంలో మెట్రిక్యు లేషన్‌ చేసిన మొదటి విద్యార్ధి.బరోడా మహారాజు ఆర్ధిక సాయంతో ముంబైలో డిగ్రీపూర్తిచేసి,ఉన్నత విద్యకు కొలంబియా (అమెరికా)వెళ్లారు.అక్కడ ఉన్న భారతదేశ సమస్యల గురించి ఆయన ఆలోచించే వారు.సంఘానికి సంబంధించి నంతవరకు అస్పృశ్యులు వేరు కాదు.వారు భారతీయ సంస్కృతిలో అవిభక్త భాగమే అని ఇండియన్‌ రేస్‌ అనే తనవ్యాసంలో స్పష్టం చేశారు.తర్వాత ఆయన చేసిన పరిశోధనలకు ఈ సిద్దాంతమే ఆధారం.
అంబేడ్కర్‌ తొలి పత్రిక ‘’మూక్‌ నాయక్‌’’కు 104 ఏళ్లు
‘‘ఇక్కడి సామాజిక వ్యవస్థను ఓసినిమాలా ప్రేక్షకుడి కోణంలో చూస్తే ఈదేశం అన్యాయా లకు పెట్టని కోటలా కనిపిస్తుంది.కచ్చితంగా అలానే అనిపి స్తుంది’’.సరిగ్గా 104 సంవత్స రాల క్రితం,31జనవరి 1920నాడు‘ ‘మూక్‌నాయక్‌’’జర్నల్‌ తొలి సంచిక కోసం అంబేడ్కర్‌ రాసిన తొలి కథనం ప్రారంభ వ్యాఖ్యలు ఇవి. అప్పటితో పోల్చిచూస్తే..నేడు చాలా మార్పులు వచ్చాయి.అయితే, మారాల్సినంత మార లేదు.మీడియాతో అంబేడ్కర్‌కు విడదీయరాని బంధాలు పెనవేసుకుని ఉండేవి.ఆయన సొంతంగా మీడియా సంస్థలను ప్రారంభించారు. సంపాద కుడిగా పనిచేశారు.ప్రత్యేక వ్యాసాలూ రాశారు.ఆతర్వాత ఆయనే పత్రికల వార్తల్లో నిలిచారు.అప్పట్లో ఎక్కువమందికి చేరువైన,సామాజిక ఉద్య మాలను ఒంటి చేత్తో నడిపించిన అగ్రనా యకుల్లో అంబేడ్కర్‌ ఒకరు. కాంగ్రెస్‌ తరహాలో ఆయనకు ఆర్థిక,సామాజిక సాయం అందలేదు.అయితే,పేదల ఉద్య మంగా ఆయన దీన్ని నడిపించారు.భూమికి లేదా యజమానులకు బానిసలైన వెనుక బడిన బలహీన వర్గాలే ఆయన అనుచ రులు. దీంతో ఆయ నకు ఆర్థికంగాఎలాంటి సాయమూ అందేదికాదు. బయట నుంచి ఎలాంటి మద్దతూ లేకుం డానే తన భుజాలపై అంబేడ్కర్‌ ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపిం చాల్సి వచ్చేది. మీడియా కవరేజీలోనూ ఇది స్పష్టంగా కనపడేది.
అంతర్జాతీయ మీడియాలోనూ..
అంబేడ్కర్‌ కృషి దేశీయ మీడియాతోపాటు అంతర్జాతీయ మీడియాలోనూ కనిపించేది. దేశీయ మీడియాలో ఆయన రాసిన కథనాలు, వ్యాసాల గురించి మనకు కొంతవరకు తెలుసు. అయితే, అంతర్జాతీయ మీడియాలో ఆయనకు సంబంధించిన కవరేజీ చాలా వరకు మరుగున పడిపోయింది. ప్రఖ్యాత అంతర్జాతీయ పత్రిక లైన లండన్‌లోని ద టైమ్స్‌,బాల్టీమోర్‌ ఆఫ్రో అమెరికన్‌, ద నార్‌ఫోక్‌ జర్నల్‌లను అపట్లో నల్లజాతీయులు నడిపించేవారు.అంబేడ్కర్‌ అంటరానితనంపై నడిపించిన ఉద్యమాన్ని ఈ పత్రికలు విస్తృతంగా కవర్‌ చేశాయి.గాంధీతో ఆయన విభేదాలపైనా వార్తలు ప్రచురించాయి. రాజ్యాంగ రూపకల్పనలో అంబేడ్కర్‌ పాత్ర, పార్లమెంటులో ఆయన చర్చలు,నెహ్రూ ప్రభు త్వం నుంచి ఆయన రాజీనామా తదితర పరిణామాలను ప్రపంచం క్షుణ్నంగా గమనిం చింది.అంతర్జాతీయ పత్రికల్లో అంబేడ్కర్‌పై వచ్చిన కథనాలు, ఆయన రాసిన కథనాలపై ‘’అంబేడ్కర్‌ ఇన్‌ బ్లాక్‌ అమెరికా’’ పేరుతో నేను ఓ పుస్తకాన్ని కూడా త్వరలో ప్రచురించబోతు న్నాను.దేశీయంగానూ తన సామాజిక ఉద్యమా న్ని ముందుకు నడిపించేందుకు అంబేడ్కర్‌ మీడియానే మాధ్యమంగా ఎంచుకున్నారు.దీని కోసం ప్రాంతీయతకు పెద్దపీట వేస్తూ ఆయన మరాఠీలో తొలి జర్నల్‌ ‘’మూక్‌ నాయక్‌’’ను ప్రారంభించారు.
అణగారిన వర్గాల హక్కుల కోసం..
అణగారిన వర్గాల హక్కుల కోసం తన పత్రికలు, జర్నల్స్‌ సాయంతో అంబేడ్కర్‌ పోరాడేవారు. మూక్‌ నాయక్‌ తొలి 12 ఎడిష న్లకు ఆయనే సంపాదకుడిగా వ్యవహరించారు. ఆయన తర్వాత డీడీ ఘోలప్‌ ఆ బాధ్యతలను తలకెత్తుకున్నారు. అయితే 1923లో మూక్‌ నాయక్‌ మూతపడిరది.ఉన్నత చదువుల కోసం అంబేడ్కర్‌ విదేశాలకు వెళ్లడం,ప్రకటనలు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.తొలి నాళ్లలో రాజశ్రీ షాహు మహరాజ్‌ ఈమ్యాగజైన్‌కు సాయం అందిం చారు.అంటరాని వారి స్వాతంత్య్ర ఉద్యమానికి మూక్‌ నాయక్‌ బాటలు వేసిందని అంబేడ్కర్‌ జర్నలిజంపై పరిశోధన చేస్తున్న గంగాధర్‌ పంత్‌వానే వ్యాఖ్యానించారు.అణగారిన వర్గాల్లో ఈ జర్నల్‌ కొత్త ఊపిరులు నింపిందని ఆయన అన్నారు.
బహిష్కృత్‌ భారత్‌ పేరుతో మరొకటి..
‘’మూక్‌ నాయక్‌’’ అనంతరం ‘’బహిష్కృత్‌ భారత్‌’’ పేరుతో3 ఏప్రిల్‌ 1927లో మరో జర్నల్‌తో అంబేడ్కర్‌ ముందుకు వచ్చారు. మహద్‌ ఉద్యమంతో ఆయన ప్రజల్లోకి వెళ్తున్న సమయంలో దీన్ని మొదలుపెట్టారు.ఇది 15, నంబరు 1929 వరకు నడిచింది. అయితే ఈ జర్నల్‌ కూడా ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులకు తలొగ్గాల్సి వచ్చింది. మూక్‌ నాయక్‌, బహిష్కృత్‌ భారత్‌ల ఒక్కో ఎడిషన్‌ ధర ఒకటిన్నర అణాలు మాత్రమే.వార్షిక సబ్‌స్క్రిప్షన్‌ అయితే పోస్టల్‌ చార్జీలతో కలిపి మూడు రూపాయలకే ఇచ్చే వారు. ఇదే సమయంలో ‘’సమత(1928)’’ జర్నల్‌ మొదలైంది.ఆతర్వాత బహిష్కృత్‌ భారత్‌ పేరును ‘జనతా’గా మార్చి24నవంబరు 1930 న దీన్ని మళ్లీ పునఃప్రారంభించారు.దళితుల కోసం ప్రత్యేకంగా నడిపించిన పత్రికగా జనతా రికార్డులకు ఎక్కింది.దాదాపు 25ఏళ్లపాటు ఈ పత్రిక నడిచింది.ఆ తర్వాత కాలంలో అంబే డ్కర్‌ ఉద్యమంలో మార్పులకు అనుగుణంగా దీని పేరును ‘’ప్రబుద్ధ భారత్‌’’గా మార్చారు. ఇది 1956 నుంచి 1961 వరకు నడిచింది. దీంతో బహిష్కృత్‌ భారత్‌ మొత్తంగా 33ఏళ్లు నడిచిందని,భారత్‌లో దళితుల కోసం సుదీర్ఘ కాలం పనిచేసిన పత్రిక ఇదేనని చెబుతారు.
అందరినీ కలుపుకుంటూ..
ఈ కాలంలోనే ఉన్నత కులాల పాత్రికేయుల్ని తన మిషన్‌లో అంబేడ్కర్‌ కలుపుకుంటూ వెళ్లారు. అప్పట్లో చాలా పత్రికలను బ్రాహ్మ ణులు నడిపించేవారు.డీవీ నాయక్‌ (సమత, బ్రాహ్మణ్‌ బ్రాహ్మణేతర్‌),బీఆర్‌ కాద్రేకర్‌ (జనతా),జీఎన్‌ సహశ్రబుద్ధి (బహిష్కృత్‌ భారత్‌, జనతా) తదితరులు ఆయనతో పనిచేసిన వారిలో ఉన్నారు.బీసీ కాంబ్లే, యశ్వంత్‌ అంబేడ్కర్‌ తదితర దళిత ఎడిటర్లు జనతాలో కీలకపాత్ర పోషించారు.అయితే,బహిష్కృత్‌ భారత్‌లో ఎడిటర్ల కొరత ఉండేది.ఒక్కోసారి ఒక ఎడిటరే 24-24కాలమ్స్‌ రాయాల్సి వచ్చేది.యశ్వంత్‌ అంబేడ్కర్‌, ముకుందరావ్‌ అంబేడ్కర్‌,డీటీ రూపవస్తే,శంకర్రావు కారాట్‌, బీఆర్‌ కాద్రేకర్‌ల సాయంతో ప్రబుద్ధ భారత్‌ ముందుకు నడిచింది.
దళిత జర్నలిజం
అంబేడ్కర్‌కు ముందు దళితుల కోసం పనిచేసిన జర్నల్స్‌ చాలాతక్కువగా ఉండేవి.ఫూలే ప్రారం భించిన ‘సత్యశోధక్‌ ఉద్యమం’ దళితుల కోసం పనిచేసింది.సత్యశోధక్‌ సమాజం సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా జనవరి 1, 1877లో కృష్ణరావ్‌ భాలేకర్‌‘దీన్‌ బంధు’ జర్న ల్‌ ప్రారంభించారు.దళితుల ఆలోచనలు,అభి ప్రాయాలకు దీన్‌బంధు స్థానం కల్పించేది. మధ్య మధ్యలో అంతరాయాలతో దాదాపు 100ఏళ్లు ఈ జర్నల్‌ నడిచింది.తొలి దళిత జర్నలిస్టులుగా పేరొందిన వారిలో మహర్‌ వర్గానికి చెందిన గోపాల్‌ బాబా వాలాంగ్కర్‌ ఒకరు. ఆయన వ్యాసాలు,కథనాలు..‘దీన్‌ మిత్ర’,‘దీన్‌బంధు’,‘సూధ్రక్‌’తదితర జర్నల్స్‌ కోసం ఆయన పనిచేశారు.హిందూ ధర్మాలపై ఆయన విమర్శలను ‘’విటాల్‌ విధ్వంసక్‌’’ పేరుతో ఓపుస్తకం కూడా ప్రచురించారు. దీనిలో శంకరాచార్య సహా ప్రముఖ హిందూ నాయకులకు 26 ప్రశ్నలు సంధించారు.
మరికొందరు కూడా..
మహర్‌ నాయకుడైన శివరామ్‌ జన్బా కాంబ్లే కూడా అణగారిన వర్గాల హక్కుల కోసం పోరా డారు.తొలి దళిత దినపత్రిక ‘’సోమ్‌వాన్షీయ మిత్ర’’ను ఆయన జులై 1,1908లో ప్రారం భించారు.దళితుల ఉద్యమ నాయకుల్లో కిసాన్‌ బాన్సోడే పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. మరోవైపు కార్మిక నాయకుడు ఎంప్రెస్‌ మిల్‌.. నాగ్‌పుర్‌లో స్వతంత్ర మీడియా సంస్థను కూడా ఏర్పాటుచేశారు. ఇక్కడి నుంచే ‘మజూర్‌ పత్రిక’ (1918-22),‘చోఖామేలా(1936)’లను ఆయన నడిపించారు.1941లో రచయిత చోఖామేలా ఆత్మకథనూ ఆయన ప్రచురించారు. ‘సోమ్‌ వాన్షీయ మిత్ర’కు ముందు కిసాన్‌ బాన్సోడే.. ‘మరాఠా దీన్‌బంధు’ (1901)‘అత్యంజ్‌ విలాప్‌’ (1906),‘మహారాంచ సూధ్రక్‌’(1907)ల పేరుతో మూడు దిన పత్రికలను ఆయన నడిపించారు.అయితే,ఈ పత్రికల కాపీలు ఏ ప్రాచీన పుస్తక భాండాగారాల్లోనూ లభించడంలేదు. అయితే అప్పటి పరిణా మాలపై పరిశోధనలు చేసిన కొందరు..ఈ పత్రికలను బాన్సోడే నడిపించారని తేల్చారు. ముఖ్యంగా అణగారిన వర్గాలను ఏకం చేయ డమే ఈ పత్రికల లక్ష్యం.అంబేడ్కర్‌ ఉద్య మాన్ని ముందుకు తీసుకెళ్లిన పత్రికల్లో దాదాసా హెబ్‌ శిర్కే మొదలుపెట్టిన ‘గరుడ్‌’(1926), పీఎన్‌ రాజభోజ్‌ ప్రారంభించిన ‘దళిత్‌ బంధు’ పతిత్‌పావండాస్‌ నడిపించిన పతిత్‌పావన్‌ (1932),ఎల్‌ఎన్‌ హరదాస్‌ ప్రారంభించిన మహారత్తా(1933),దళిత్‌ నినాద్‌(1947)ఉన్నా యి. కులాలపై గాంధీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లేందుకు వీఎన్‌ బార్వే..‘దళిత్‌ సేవక్‌’ను మొదలుపెట్టారు.తొలినాళ్లలో అంబేడ్కర్‌ జర్నలిజంపై..‘దళితాంచి వృతపత్రే’ పేరుతో 1962లో అప్పాసాహెబ్‌ రాన్‌పిసే ఓపుస్తకాన్ని ప్రచురించారు.మరోవైపు దళిత జర్నలిజంపై గంగాధర్‌ పంతవానే 1987లో ఓపరిశోధక పత్రాన్ని ప్రచురించారు. ఆతర్వాత అంబేడ్కర్‌ దళిత జర్నలిజంపై పరిశోధనలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి.
కళాత్మకంగా…
అంబేడ్కర్‌ రచనలు చాలా కళాత్మకంగా ఉంటా యి. వీటిలో ఆయన గట్టి విమర్శలు చేసేవారు. మరోవైపు అణగారిన వర్గాల కోసం ప్రవేశపెట్టే పథకాలను సమీక్షించడంతోపాటు బడుగు వర్గాలపై జరిగే అకృత్యాలను ఎత్తిచూపేవారు. ప్రభుత్వ విధానాలు,రాజకీయ పార్టీల వాద నలు,సామాజిక,రాజకీయ సంస్కరణలపై అంబేడ్కర్‌ సంపాదకీయాలూ రాసేవారు. అంబేడ్కర్‌ ఆలోచనా విధానాలను క్షుణ్నంగా పరిశీలించేందుకు ఆయన కథనాలు,వ్యాసాలు మనకు చక్కటి అవకాశం కల్పిస్తాయి.ఆయన మంచి వ్యాసకర్త,ఆలోచనా పరుడు. ఆయన ప్రచురించిన జర్నల్స్‌లో దళిత ఉద్యమకారుల చిత్రాలు,దళిత కళాకారుల సృజనాత్మకత కనిపించేవి.జూన్‌ 15,1927లో‘బహిష్కృత్‌ భారత్‌’లో రాసిన ఓకథనంలో బ్రాహ్మణులపై అంబేడ్కర్‌ ధ్వజమెత్తారు.ముంబయి ప్రాంతంలో చేపట్టిన ఓసర్వేను ఈ సందర్భంగా ఆయన ఉదహరించారు.ప్రతి రెండులక్షల మంది విద్యావంతుల్లో బ్రాహ్మణులు వెయ్యి మంది వరకు ఉంటే…అంటరాని వారి ప్రాతినిధ్యం సున్నా అని గణాంకాలను ఉటంకించారు.దళిత ఉద్యమాలతో జర్నలిజానికి విడదీయరాని బంధముంది.దళితుల సామాజిక,రాజకీయ ఉద్యమాలు ప్రతిబింబించేలా వారు ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక పత్రికల్లో కవరేజీ ఉండేది. అయితే,అంబేడ్కర్‌ కాలంలానే నేటీకీ ప్రధాన పత్రికల్లో వారికి సముచిత స్థానం దక్కడం లేదు. (హార్వర్డ్‌ కెనడీ స్కూల్‌లోని షోరెన్‌స్టీన్‌ సెంటర్‌ ఆన్‌ మీడియా,పాలిటిక్స్‌,పబ్లిక్‌ పాలసీలో సూరజ్‌ యెంగ్డే పరిశోధకుడు)

ఓటరా..మేలుకో..!

‘‘ లోక్‌ సభ ఎన్నికలకు నగారా మోగింది. పార్లమెంట్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌ సహా 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. పజల ఆకాంక్షలకు పాలకులు చరమ గీతం పాడిన రోజున ప్రజల తమ తిరుగుబాటు ద్వారా తమకు అనువైన రాజకీయ వ్యవస్థను నిర్మించు కుంటారని హెచ్చరించడాన్ని బట్టి ప్రత్యామ్నయ ప్రభుత్వాల ఆవశ్యకతను అర్ధం చేసుకోవచ్చు.అదే సందర్భంలో విద్య,వైద్య,సామాజిక న్యాయం ప్రజలం దరికీ ఉచితంగా అందిన రోజున వ్యక్తి ఎదుగుదల ఉన్నతంగా ఉంటుం దని, మెరుగైన సమాజ నిర్మాణంలో వారు చురుగ్గా పాల్గొం టారని డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ దిశానిర్దేశం చేవారు. రాజ నీతిజ్ఞతతో దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోసించ వలసిన పాలకులు అవకాశ వాదులుగా మారుతున్న సందర్భంలో ప్రభుత్వాల కుట్రలను ఛేధించడానికి అంబేద్కర్‌ చేసిన ప్రయత్నాలు, హెచ్చరికలు ప్రజల చైతన్యాన్ని మరింతగా పెంచవలసిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి.’’
‘ప్రశ్నించేతత్వాన్ని పెంచిపోషించే విద్య ను మాత్రం ఉచితంగా అందివ్వరు’అని చురకలు అంటించారు.డాక్టర్‌బి.ఆర్‌అంబేద్కర్‌.విద్య, వైద్యం, న్యాయం ఉచితంగా అందితే ప్రజలు చైతన్యవంతు లై శాసించేస్థాయికి వస్తారనేది ఇందులోని అంరా ర్దం.ప్రశ్నించేతత్వాన్ని పెంచిపోషించే అత్యంత చురుకైన సాధనం‘విద్య’ అని ప్రపంచవ్యా ప్తంగా ఏకాభిప్రాయం ఉంది. ఇందుకు ఎలాంటి మినహా యింపులు లేవు.కానీ,ఈప్రశ్నించేతత్వాన్ని నీరుగార్చే ప్రయత్నాలు కూడా సమాంతరంగా జరుగుతున్న మాట వాస్తవం కాదా?మతం,మూఢ విశ్వాసాలు, అతివినయం,మనకు సంబందం లేదని గిరి తీసుకు నేతత్వం,సామాజిక స్పృహ లేకపోవడం,పరిధి దాటి రాకపోవడం,ప్రబుత్వాల కుట్రవంటి అనేక అంశా లు కూడా ప్రశ్నించే తత్వాన్ని సమాజంలో ఎదగ కుండా చేస్తున్నవని చెప్పుకోవచ్చు. ఇన్ని అవరోధా లను అధిగమించి,అసాంఫీుక శక్తుల కబంధహాస్తాల నుంచి విముక్తి చెంది,సానుకూల దృక్పథాన్ని పెంచి పోషించడానికి,లక్ష్యాలనుచేరుకోవడానికి,ఆత్మ విశ్వాసం నింపడానికి,సామాజిక రుగ్మతలను చీల్చి చెండాడి మెరుగైన సమాజ నిర్మాణానికి దోహదపడే ప్రయాణంలో ‘ప్రశ్నించడం’అనివార్యమైంది.
ఏయే అంశాలలో..
ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు జన జీవితాలను విచ్ఛన్నం చేస్తున్నప్పడు,అసాంఫీుక శక్తులు ప్రశాంత తను కొల్లగొడుతున్నప్పుడు, అసామానతలు, అంతరాలు,వివక్షత సమాజంలో ఎల్లెడలా వ్యా పించినప్పుడు,జాతిసంపదను సంపన్నులు, పెట్టుబడిదారులకు ధారాదత్తం చేసి సామాన్య జనాలను నిర్లక్ష్యం చేసినప్పడు ప్రశ్నిం చడమే పరిష్కారంగా పనిచేస్తుంది. ప్రభుత్వాలు ప్రజా జీవితంలో చొరబడి,స్వేఛ్చా స్వాతం త్య్రాలను హరించివేసి,బానిసలుగా తయారు చేసుకొని, అధికారాన్ని శాశ్వతం చేసుకునే క్రమంలో ‘ప్రశ్నించి యజమానులుగా మారుతారా? లేక లొంగిపోయి బానిలుగా జీవిస్తారా? ’తేల్చు కొమ్మన్నారు డాక్టర్‌.బి.ఆర్‌.అంబేద్కర్‌.ఈ హెచ్చరిక వెనుకఉన్న నేపథ్యం విద్యను ఆయు ధంగా చేసుకుని సమాజాన్ని శాసించాలని ఆశించడమే.అందుకే అంబేద్కర్‌ ‘ప్రభుత్వాలు అంత సులభంగా విద్యను ప్రజలకు ఉచితంగా అందించడానికి సిద్దపడవు’ అని జ్ఞానోదయం కలిగించిన సందర్భాన్ని మనం సమయస్పూర్తి తో సద్వినియోగం చేసుకోవలసిన అవసరం ఉంది.అంబేద్కర్‌ సూచనలు మేరకు ప్రశ్నింప నేర్పే నాన్యమైన విద్యను ఉచితంగా అందుకోవ డానికి మరో పోరాటం చేయక తప్పడం లేదని తేలిపోతున్నది కదా!?.కేరళ,ఢల్లీి, రాష్ట్రప్రభు త్వాలు విద్యారంగంలో నువ్వా?నేనా?అనే స్థాయిలో పోటీపడుతున్నాయి.విద్యకు 24,25 శాతం నిదులను కేటాయించి అంతర్జాతీయస్థాయి విద్యను ఉచితంగా అందిస్తున్న సందర్భాలను మిగ తా రాష్ట్ర ప్రభుత్వాలు ఆకలింపు చేసుకుంటే మంచిది.ఢల్లీి ప్రభుత్వం వేలాది తరగతి గదులను సర్వాంగ సుందరంగా,విశాలంగా తీర్చిదిద్ది విద్య ను ఉచితంగా అందిస్తూ,కార్పొరేటు పాఠశా లలను పరోక్షంగా మూసివేయడానికి తీసుకుంటున్న చర్యలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శం కావాలి.ఢల్లీి లాంటి రాష్ట్రాలలో నిబంధనలను తుంగలోతొక్కిన ప్రైవేటు పాఠశాలలను ప్రభుత్వాలే మూసివేసి జరి మానా విధించిన సంఘటనలు చూస్తున్నాం. ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణ వంటి రాష్ట్రాలలో విద్య అంగడి సరు కుగా మారిందని భావించక తప్పదు.
ఉచితం ఉండాలి..
రాజ్యాంగ రచన సందర్భంలోనూ,స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలోనూ జరిగిన అనేక సభలు, సమావేశాల సందర్భంగా డాక్టర్‌ బి.ఆర్‌. అంబే ద్కర్‌ చేసిన అనేక సూచనలు లేదా హెచ్చరికలు నేటి పాలకులకు కనువిప్పు కావాలి.ప్రజల ఆకాం క్షలకు పాలకులు చరమగీతం పాడిన రోజున ప్రజలు తమ తిరుగుబాటు ద్వారా తమకు అను వైన రాజకీయ వ్యవస్థను నిర్మించుకుంటారని హెచ్చ రించడాన్ని బట్టి ప్రత్యామ్నాయ ప్రభుత్వాల ఆవశ్య కతను అర్దం చేసుకోవచ్చు.అదే సందర్భంలో విద్య, వైద్య,సామాజికన్యాయం ప్రజలందరికీ ఉచితంగా అందిన రోజున వ్యక్తిఎగుదుల ఉన్నతంగా ఉం టుందని,మెరుగైన సమాజం నిర్మాణంలో వారుచు రుగ్గా పాల్గొంటారని అంబేద్కర్‌ దిశానిర్ధేశం చేశా రు.రాజనీతిజ్ఞతతో దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించవలసిన పాలకులు అవకాశ వాదులుగా మారుతున్న సందర్భంలో ప్రభుత్వాల కుట్రలను ఛేధించడానికి అంబేద్కర్‌ చేసిన ప్రయ త్నాలు, హెచ్చరికలు ప్రజల చైతన్యాన్ని మరింతగా పెంచ వలసిన అవసరాన్ని నొక్కి చెబుతుంది.
పాలకులు ఎప్పుడు కూడా సంపన్న వర్గాల పక్షాన నిలిచి పనిచేస్తారనే ముందుచూపు, ప్రజల ఐక్య ఉద్యమాలు,పోరాటాలద్వారా ఏర్పడే నిజమైన చట్టాల ముందు పాలకులు తలవంచక తప్పదనే హెచ్చరిక వారి మాటలలో కనబడు తుంది.కేంద్ర ప్రభుత్వం విద్య,వైద్యానికి నామ మాత్రపు నిదులను కేటాయిస్తూ ప్రైవేటుపరం చేయడానికి ఉత్సాహపడుతుంది.రాష్ట్రాల ప్రభు త్వాలు కూడా ఆయా రంగాలను గాలికి వదిలి, ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేయ డంలో పోటీ పడుతున్న తరుణంలో ఐక్య ఉద్యమా లే పరిష్కారమని సూచన కూడా మన ముం దు చర్జనీయాంశంగా నిలిచింది.దేవ గౌరవాన్ని, జాతి ప్రతిష్టను,ప్రజల ఆకాంక్షలను, రాజ్యాంగ స్పూర్తిని కాపాడుకోవడానికి పిడికిలి బిగించి నినదించడమే మన ముందున్న ఏకైక పరిష్కారం. ఎన్నికల వేళ అలాంటి పార్టీలకే తమ ఓటు అనే డిమాండ్‌ తెర మీదకు రావాలి.
ఓటు ఓ వజ్రాయుధం
రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగను న్నాయి. రాజ కీయ పార్టీల ఎన్నికల్లో గెలవడానికి ప్రచారములో తీవ్రంగా పోటీ పడుతున్నాయి. అమలుకు నోచు కోని హామీలు ఉచితాలు’ ఆర్థిక ప్రలోభాలు ప్రకటి స్తూ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నం చేస్తు న్నాయి.ఓటర్లు తమ కున్న ఓటు హక్కును ఉత్తమ అభ్యర్థుని ఎన్నుకోవడంలో విజ్ఞతప్రదర్శించాలి. ఎన్నికలపై నిర్లక్ష్యం తగదు..ఎన్నికలు అంటే అవి నాయకులకే పరిమితమైనవని సాధారణ పౌర సమాజం ఎన్నికలపట్ల ఆసక్తి చూపక పోవ డంవల్ల అవినీతి పరులు చట్ట సభలకు ఎన్నికై రాజకీయ అవినీతికి పాల్పడి కోట్లాది సంపాదనకు రాజకీయా లు మార్గమైనాయి. ప్రాజెక్టుల పేరు మీద ప్రజల సొమ్మును దోపిడిచేస్తూ దోసుకో’దాసుకో అనే నినా దాన్ని తమ పాలన విధానంగా మార్చివేసి పేద’ మధ్యతరగతి బిసి బడుగు బలహీనర్గాలను చట్ట సభల్లోకి ప్రవేశించకుండా అడ్డు కునే వికృత రాజ కీయ క్రీడ కొనసాగడంశోచ నీయం. బ్రిటిష్‌ పాలన నుండి దేశ ప్రజల విముక్తి కొరకు జరిగిన పోరా టాల్లో ప్రాణాలకు తెగించి పోరాడిన భారతదేశ ప్రజలు స్వాతంత్య్ర అనంతరం చట్టసభలకు జరిగే సార్వత్రికఎన్నికల్లో ఉదా సీన వైఖరి అవలంభించ డంవల్ల చట్టసభలు నేరచరితులరౌడీల’మాఫి యా ల’ ధన స్వాముల పరమైనాయి. ఎన్నికలు గెలుపు గుర్రాలు ఎన్నికలు అంటే గెలుపు గుర్రాలకు మాత్ర మే రాజకీయ పార్టీలు ప్రాధాన్యత ఇస్తు పార్టీ కొరకు ప్రజా ఉద్యమాలు చేసిన త్యాగశీలురు అంకిత బావం సిద్ధాంత నిబద్ధత కలిగిన సీనియర్‌ కార్యర్త లకు టికెట్లు ఇవ్వక పోవడంవల్ల చట్టసభలకు జరిగే ఎన్నికలు ధనికులకు‘మాఫియా‘డాన్‌ కార్పొరేట్‌ శక్తులకు రిజర్వ్‌ చేయబడ్డాయన్న మానసిక భావన సమాజంలో స్థిరపడి పోయింది.మన తలరాతను మార్చేది ఎన్నికలే..మనం ఎన్నికల ఓటింగ్‌ గురించి పట్టించు కోక పోయిన మనసమాజంలో ఆర్థిక ‘సామాజిక సాంస్కృతిక ‘సాంఘికఉద్యోగ’ ఉపాధి ‘పెట్టుబడి ఉత్పత్తి’ఉత్పాదకత ‘స్వదేశీవిదేశీ వర్తకం’ వ్యారం ‘విధ్య వైద్యం ‘ఆరోగ్యం ‘విదేశీ విధానాల రూపకల్పనలో మౌలికమార్పులు తెచ్చి మన జీవి తాలను భవిష్యత్తును మనపిల్లల భవిష్యత్తును మార్చ గలిగేది చట్ట సభలకు జరిగే ఎన్నికలు మాత్రమే నన్నది చారిత్రిక వాస్తవం .ఎన్నికలు అంటే సమాజ ములో అందరివి కొందరివి కాదు లేదా కొన్ని సామాజిక వర్గాల ఏకస్వామ్యంకాదు. కుటుం భాలగుత్తాధి పత్యంకాదు.ఓటర్లు పోలింగులో సంపూర్ణ భాగస్వాముల్కె‘‘తమ స్థితగతులను ‘‘మా ర్చు కునే పరిస్థితిగా గుర్తించాలి. ఓటు మన జన్మ హక్కు..నిజమైన సార్వభౌమాధికారం ఓటరు చేతి లోనే వుంటుంది.ఐదేళ్లకు ఒక సారి మన సేవకులను చట్ట సభలకు అభ్యర్థులుగా ఎన్నుకుంటాం. పరి పాలన దక్షున్ని రాజ్యాంగ చట్టాలపట్ల ప్రజా సంక్షే మ పథకాలు చట్టాల పట్ల అవగాహన పరిజ్ఞానం వున్న అభ్యర్థిని ఎన్నుకొని సుపరిపాలనకు దిశ దశ నిర్ణయించడంలో ఓటే కీలకం.నోటుకు ఓటును అమ్ముకోవద్దు.ఓటుద్వారా తమ తల రాతను మార్చే శక్తి వుంది.ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించి సమాజాన్ని ప్రగతి పథంలో నడిపించే శక్తి సామర్థ్యాలు ఉన్న అభ్యర్థిని ఎన్నుకొని ప్రజల జీవనప్రమాణాలు మెరుగుపరిచే ఉత్తమ అభ్యర్థులకు ఓటువెయ్యాలి.ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభు వులు ప్రజలు తమకున్న ఓటుహక్కుతో ఐదు సంవ త్సరాల పదవీ కాలానికి ప్రజా ప్రతినిధులను ఎన్ను కొని ప్రభుత్వాల ఏర్పాటులో క్రియా శీలకంగ పాల్గొనాలి. ఓటుమార్పుకు ఆయుధం.. ఓటు అనే ఆయుధంతో ఓటరు తమ ఆకాంక్షలు అవసరాలు తీర్చే ప్రభుత్వాలకు అధికారం ఇస్తాడు. అభివృధ్ది సాధకులకు ఎన్నుకోవాలి..జాతి తల రాతలు మార్చే సమాజ సేవకులను సామర్థ్యం’ సత్తాగల అభివృద్ధి సాథకులనుచట్ట సభలకు అభ్యర్థులుగా ఎన్ను కోవాలి. ఓటు వేసే ముందు గత ఎన్నికల్లో పార్టీలు ఇచ్చిన వాగ్దానాల అమలునుఎన్నికల మేనిఫెస్టో పట్ల ఆలోచించాలి.
తలరాతను మార్చేది ఓటు..
బాధ్యత గల పౌరుడిగా మన జీవితాన్ని తద్వారా జాతి తల రాతను మార్చేది మన ఓటుతోనే వీలవు తుందనే వాస్తవాన్ని మరువరాదు. ఎవరికి ఓటు వెయ్యాలి? ఎందుకు ఓటు వేయాలి? జాతిభవి ష్యత్తు ‘దేశఐక్యతా సమగ్రత’ దేశ సార్వభౌమా ధికార రక్షణ భద్రత దేశ రక్షణ ఆర్థిక వ్యవస్థ, వ్యవ సాయం ‘పారిశ్రామిక అభివృధి ‘సేవా రంగాల విస్తరణ స్వయంసమృది సుస్తిరాభివృద్ది‘ఉపాధిఉత్పా దక’సామర్థ్యం ప్రజల జీవన ప్రమాణాల స్థాయిని మెరుగు పరిచే పార్టీ అభ్యర్థులను చట్ట సభ సభ్యు లుగా ఎన్నుకోవాలి. ఓటు వేసే ముందు రాజకీయ పార్టీల విదానాలు సిద్ధాంతాలు కట్టుబాట్లు నిబద్ధత నిజాయితీ ప్రజాసమస్యల పరిష్కారం కోసం అవ లంబించే సామర్థ్యం ఉన్న వారిని ఎన్నుకోవాలి. ఓటర్లుఎన్నికల మేనిఫెస్టో పరిశీలించాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వాటి అమలు ప్రాజెక్టుల నిర్మాణం నాణ్యత లభిదారుల సమస్యలు పరిష్కారాలు పరిశీ లించాలి.ఓటు వేసే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించి అభివృధ్దికి పాటు పడేవారికి ఓటు వెయ్యాలి.ఏపార్టీ,మన దేశాన్ని,మన ధర్మాన్ని రక్షిం చడానికి కట్టుబడి ఉంది?ఏపార్టీ లంచగొండితనం తో కూరుకుపోయి ప్రజాధనాన్ని దుర్వి నియోగం చేస్తుంది. అభివృధ్ది సంక్షేమం పేరున అమలౌతున్న పథకాల ప్రయోజనాలు అధికారంలో ఉన్న వారి కుటుంబానికి లబ్దిచేకూరుస్తున్నాయనే అంశాల మీద ఓటర్లు అవగాహన కలిగి వుండాలి. సహజ వనరు లు మానవ వనరుల అభివృద్ధికి ఉపయోగపడే దీర్ఘ కాలిక ప్రయోజనాలకు పెద్ద పీట వేసి పేదరికం నిరుద్యోగం తగ్గించి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే సరైన పార్టీకి ఓటు వేసి ప్రగతి శీల సమాజ స్థాపనకు చేయూత నివ్వాలి. మన ఓటు తోనే ప్రభుత్వాలు ఏర్పడతాయి! మనం ఓటు వేసేది ఎవరికో అధికారం ఇవ్వటానికి కాదు. మన జాతి తలరాతను మార్చి ఉజ్జ్వల భవిష్యత్తు కోసం ఓటరు ఓటు వేసే ముందుపార్టీల మేనిఫెస్టో అంశాలు నిర్ణీత పదవీకాలంలో అమలుఅవుతాయా? లేదా? తెలుసుకోవాలి.రాజకీయాల పట్లఎన్నికల పట్ల ఎన్ను కునే ప్రతి పౌరుడు ఆసక్తి అవగాహన కలిగి వుం డాలి.మనం రాజకీయం చేయక పోయినా రాజకీ యాలు తెలుసు కోవటం నేటి తక్షణ అవసరం. ఓటు నిశ్శబ్ద విప్లవం.. దేశ రాజకీయాలకు వెగటు పుట్టిస్తున్నధన’ రౌడీ రాజకీయాలతో పరువు మాస్తున్న ఎన్నికల ప్రక్రియను ప్రక్షాళన చేయడానికి తమ ఓటు హక్కు వినియోగం ద్వారా అవినీతి అక్రమాల చెర లోంచి జనస్వామ్యానికి స్వేచ్ఛ ప్రసాదించే ప్రజాఉద్యమానికి విజ్ఞతగల ఓటర్లు నేతృత్వం వహించాలి. ఓటు బుల్లెట్‌ కంటే బలమైంది.ఓటు ఒక నిషబ్ధ విప్లవం ఓటే మన ఆయుధం! దానితోనే మనం పోరాడాలి.మన ధర్మాన్ని మనం నిల బెట్టు కోవాలి!మన బతుకులు మనం చక్కపరచు కోవాలి! ఎన్నికల్లో ప్రతిఓటరు క్రియా శీలక బాగ స్వామి కావాలి.ఓటింగులో తప్పని సరిగా పాల్గొనాలి ఇతర ఓటర్లను యువతను తమఓటు హక్కు వినియోగించుకొని తమ తల రాతను మార్చే పార్టీ లకు అభ్యర్థులకు ఓటు.వెయ్యాలి. పోటీ చేసే అభ్య ర్థుల గునగణాలు వారి సామాజిక సేవా అంశాల మీధ విరివిగా చర్చించాలి. నోటుకు ఓటు అమ్ము కో వద్దు..ఓటువేసే ముందు విజ్ఞత ఓటరు రాజకీ య పార్టీల హామీల ఓట్ల వేలం పాటల హోరులో హైరానా పడి నోటుకు ఓటు అమ్ముకోవద్దు. మన ఓటు తెలంగాణ అభివృద్ధికి మన కులం వాడని, మన జిల్లా వాడని, మన ప్రాంతం వాడని భావించ కుండ కులమతాలకు అతీతంగా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కలిగించే వారిని ఎన్నుకోవాలి. ఎన్నిక ల్లో పోటీ చేసే అభ్యర్థి ఏపార్టీ వాడని చూడకు ఏ పాటి అభివృద్ధికి పాటుపడే వాడో ఆలోచించు. మనంవేసే ఓటు ప్రజాస్వామ్యాన్ని పది కాలాల పాటు ఉద్దరించ గలగాలి.ఓటుకు ఒక ప్రత్యేక త వుంది.దాని ప్రాధాన్యం ఎంత చెప్పిన తక్కువే. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా కాకుండా ముందే జాగ్రత్త పడాలి.నీతినిజా యితీగా పనిచేసే వాడికి,రాష్ట్ర భవిష్యత్తు అభివృధ్దికి సంక్షే మానికి ప్రజారక్షణలో క్రమశిక్షణ కలిగిన సైనికు డిగా అండగా నిలబడే పార్టీకి/ అభ్యర్థికి ఓటు వెయ్యాలి రాష్ట్ర ప్రజల ఉజ్జ్వల భవిష్యత్తుకు పాటు పడే పార్టీ/ అభ్యర్థులకు ఓటు..పేద బడుగు బలహీన వర్గాల జీవితాలలో జీవన ప్రమాణాలు మెరుగు పరిచి సామాన్య పేద ప్రజల సంక్షేమాన్ని ఆకాంక్షిం చే వ్యక్తికి /అభ్యర్థికి ఓటు వేస్తే తెలంగాణా ప్రజల ఉజ్జ్వల భవిష్యత్తుకు సుఖమయ జీవితానికి దోహ దపడే నూతన అభివృధ్ది వ్యూహా లతో ముందుకు వచ్చే పార్టీకి/ అభ్యర్థులకు ఓటు వేయండి.ప్రజా సంక్షేమానికి పాటు పడని నేతలను ఓటు ద్వారా నిగ్గ తీయండి.ప్రజాఆకాంక్షలు తీర్చని వారిని శం కర గిరి మాన్యాలు పట్టించే శక్తిని సమకూర్చేది ఓటు హక్కేనని విజ్ఞతగల ఓటర్లు.గుర్తించాలి. ఓటర్లు జాతి తలరాతను మార్చి రాసేవిధాలుగా అవతరించాలి.ఓటర్లు నిర్లక్ష్యాన్ని నిర్లిప్తత ను సోమ రితనం విడనాడి ఓటింగులో చురుకుగా పాల్గొ నాలి.తమ ఓటుద్వారా ప్రభుత్వ నిర్మాణం జరుగు తుందనినే వాస్తవాన్ని మరువద్దు.ప్రజాస్వామ్య రక్షణ ప్రతి ఓటరు సామాజిక బాధ్యతగా గుర్తించాలి. ప్రజాస్వామ్యాన్ని జనస్వామ్యంగా మార్చే ప్రక్రియ లో ఓటర్లదే తుది తీర్పు .ఓటు పదున్కెన ఆయుధం. దీన్ని ఏవిధంగా సందిస్తే మన జీవితాలు మారుతా యనేది ఆలోచించాలి.ఎది ఏమైనా మనం వేసే ‘‘ఓటుకోహినూర్‌’’వజ్రంకంటే అత్యంత విలువై నది.ఓటు ఓగొప్ప మార్పుకు సంకేతం. ఓటు ప్రగ తికి మేలుకొలుపులాఉండాలి.మనం తోడుకున్న గోతిలో మనం పడకూడదు.ఓటరా మేలుకో ప్రజా స్వామ్యాన్ని రక్షించుకో (గునపర్తి సైమన్‌)

నిర్విర్యీమవుతున్న ప్రజాస్వామ్యం!

రాజ్యాంగేతర శక్తులతో ప్రజాస్వామ్యం నిర్వీర్యమైపోతుంది.వారి నియంత్రత్వధోరణి ప్రదర్శనతో ప్రతిపక్షాలను నోరెత్తకుండా చేస్తోన్నాయి.రాజ్యాంగం,చట్టం,న్యాయ వ్యవస్థలపై రాజకీయపెత్తనం గణనీయంగా పెరుగుతోంది.ఇటీవల వెలుగు చూసిన ఎలక్టోరల్‌ బాండ్ల పథకం ద్వారానే తేటతెల్లమైంది.ఈఘటన ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ను తల దించుకొనేలా చేసింది.పటిష్టమైన రాజ్యాంగబద్ద వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.బహుళజాతి వ్యాపార సంస్థల రాజకీయ విరాళాలు రాజకీయ పార్టీలకు సంపద ఆర్థిక,రాజకీయ కేంద్రీకరణకు దారితీస్తోంది.పటిష్టమైన రాజ్యాంగబద్ద వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.రాజ్యాంగబద్ద సంస్థలతోపాటు ఆర్థికంగా పరిపుష్టి సాధించిన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు పరం చేసేందుకు కేంద్రప్రభుత్వం తహతహలా డుతున్నారని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిణామాలు దుష్పలితాలిస్తాయని ప్రతి పక్షాలు భావిస్తున్న విషయం తెలిసిందే!.ఎన్నికల్లో హిందువుల ఓట్లు సాధించేందుకు మత దురహాకార విధానాన్ని పెంచుతూ,ముస్లిం మైనారిటీలకు హాని కలిగిస్తోంది.
నితో పాటు,నాటి పెద్దనోట్లరద్దు నిర్ణయంలో కూడా ప్రజలు తీవ్ర గందరగోళానికి గురయ్యారు.ఈడీమోనిటైజేషన్‌ తర్వాత విచారణలో జస్టిస్‌ బివినాగరత్న తన అసమ్మతి వెల్లడిరచడం ప్రశంసనీయం.ఈదేశంలో రాజ్యాంగ ప్రజాస్వామ్యాన్ని సమర్థించడంలో ధైర్యం,విశ్వాసాన్ని వెల్లడిరచిన ఏకైక న్యాయమూర్తి ఆమె.అంతేకాకుండా స్వతంత్రంగా వ్యవహరించాల్సిన సర్వోత్తమ కేంద్ర ఎన్నికల కమిషన్‌ను సైతం కేంద్రంలోనిప్రభుత్వం నిర్వీర్యం చేయడం గమనార్హం.
ప్రతి సాధారణఎన్నికలను సజావుగా నిర్వహిస్తున్న ఘన చరిత్ర కేంద్ర ఎన్నికల కమిషన్‌కు దక్కుతుంది.అలాంటి గొప్పచారిత్రక నేపథ్యం ఉన్న కేంద్ర ఎన్నికల కమిషన్‌ను ప్రభుత్వం తన కనుసన్నల్లో పెట్టుకోవాలని చూడటం, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేదిగా వ్యవహరించడం ఆందోళనకరమని ప్రతిపక్షాలు సైతం ఆవేదనలు వ్యక్తం చేస్తున్నాయి.ఈనేపథ్యంలో దేశంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలు స్వేచ్ఛాయుతమైన,నిష్పక్షపాతమైన వాతావరణంలో జరగవేమోనని ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోంది.
ప్రస్తుతం ప్రజాస్వామ్య గుంపులో నియంత్రత్వధోరణి నడుస్తోంది.అంబాని కుమారుడు అనంత అంబాని వివాహానికి ఓచిన్న విమానాశ్రాయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చేశారు. అంటే బడా పారిశ్రామికవేత్తల గుప్పెట్లో ప్రజాస్వామ్యం విలవిలలాడుతోందని జగమెరిగిన సత్యం. 1947 ఆగష్టు 15న వచ్చిందిస్వాతంత్య్రం కాదు..తెల్లదొరల నుండి నల్లదొరలకు అధికార మార్పిడి మాత్రమేనన్న అంచనా నిజమని అంతకంతకూ రుజువుతోంది.మన దేశానికి రాజ్యాంగమే అత్యున్నత శాసనం.దేశంలోని వ్యక్తులు,సంస్థలు ప్రభుత్వాలు రాజ్యాంగ నియమాలకు లోబడి వ్యవహరించాలి. కేంద్ర,రాష్ట్రా ప్రభుత్వాలు రాజ్యాంగం ఆధారంగా ఏర్పడి,దానిద్వారానే అధికారాలు పొంది దాని పరిధికి లోబడి పనిచేయాలి.
రాబోయే ఎన్నికల్లో అలాంటి సమాఖ్య వ్యవస్థను ఎంచుకోవాలి.దేశాన్ని కాపాడుటానికి బలమైన కేంద్రీకృత యంత్రాంగం కావాలి.దాని కోసం ఏకకేంద్రపద్దతిని అనుసరించాలి.కేంద్ర,రాష్ట్రాల మధ్య అధికారాలను,విధులను స్పష్టంగా విభజించాలి.సంక్లిష్టమైన వైవిధ్యమైన దేశాన్ని పాలించ డానికి,జాతి ఐక్యతను రక్షించడానికి ఆచారణాత్మక విధానాన్ని రూపొందించాల్సిన వ్యవస్థ అవశ్యం.-రెబ్బాప్రగడ రవి ,ఎడిటర్ 

విద్యలో వండర్‌ ఎడెక్స్‌

పేద, మధ్య తరగతి విద్యార్థులు సైతం అంతర్జాతీయ వర్సిటీలు అందించే కోర్సులను ఉచితంగా చదివేందుకు వీలు కల్పిస్తూ, ఉన్నత విద్యారంగంలో మరో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టిన జగనన్న ప్రభుత్వం. ప్రముఖ ఆన్లైన్‌ కోర్సుల సంస్థ ‘ఎడెక్స్‌’తో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం చేసుకోనుంది. ప్రపంచ స్థాయి వర్సిటీ కోర్సులను అందించే ప్రముఖ ఈ-లెర్నింగ్‌ ప్లాట్ఫామ్‌ ‘‘ఎడెక్స్‌’’ల మధ్య ఒప్పందం జరగనుంది.టీచింగ్‌, లెర్నింగ్‌ కోసం కొత్త టెక్నాలజీ, బోధనా విధానాలను సంయుక్తంగా రూపొందించిన ఎడెక్స్‌, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ.
‘‘ఎడెక్స్‌ ఒప్పందం’’ ముఖ్యాంశాలు
హార్వర్డ్‌,ఎంఐటీ, ఎల్‌ఎస్‌ఈ,కొలంబియా సహా పలు అత్యుత్తమ వర్సిటీల నుంచి ఆ కోర్సు సర్టిఫికెట్లు, క్రెడిట్లు జారీ..తద్వారా మన విద్యార్థులకు మంచి వేతనాలతో కూడిన జాతీయ మరియు అంతర్జాతీయ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు..
‘‘ఎడెక్స్‌ ఒప్పందం’’తో ప్రయోజనాలు
విదేశాలకు వెళ్లి అక్కడి మేటి కాలేజీల్లో చదువుకోలేని ఎంతో మంది విద్యార్థులు హార్వర్డ్‌,ఎంఐటీ,కొలంబియా,లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌, న్యూయార్క్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌, ఇంపీరియల్‌ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌ వంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన యూనివర్సి టీలు రూపొందించిన కోర్సులను సులభంగా నేర్చుకునే వెసులు బాటు.. ఆ యూనివర్సిటీ వారే ఆ సబ్జెక్టులకు ఆన్లైన్లో ఎగ్జామ్స్‌ నిర్వహించి సర్టిఫికెట్లు ఇస్తారు. ఆ క్రెడిట్స్‌ మన కరిక్యులమ్లో భాగమవుతాయి.తద్వారా మన పిల్లలు గ్లోబల్‌ స్టూడెంట్స్‌గా ఎదుగు తారు. ఉన్నత విద్యలో జగనన్న ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు..పేద విద్యార్థులు సైతం ఉన్నత విద్యను అభ్యసిం చేందుకు వీలు కల్పిస్తూ జగనన్న విద్యా దీవెనద్వారా పూర్తి ఫీజు రీయింబ ర్స్మెంట్‌.. జగనన్న వసతి దీవెన ద్వారా భోజన, వసతి సౌకర్యాలు, ప్రతి విద్యా సంవత్సరం మొదట్లోనే (జూన్‌ / జులై), చివరిలో ప్రతి ఏప్రిల్లోనూ ఇస్తూ. జగనన్న విదేశీ విద్యా దీవెన ద్వారా క్యూఎస్‌/టైమ్స్‌ ర్యాంకింగ్స్‌ 21 ఫ్యాకల్టీలలో టాప్‌ 50 ర్యాంకుల్లో ఉన్న 320 కాలేజీల్లో సీట్లు పొందిన విద్యార్థులకు రూ.1.25 కోట్ల వరకు ఆర్థిక సాయం.జాబ్‌ ఓరియెంటెడ్‌ కరిక్యు లమ్‌తో నాలుగేళ్ల ఆనర్స్‌ కోర్సులు. విద్యా ర్థులలో నైపుణ్యాలను పెంచి వారు వెంటనే ఉపాధి పొందేలా 30శాతం నైపుణ్యాభివృద్ధి కోర్సులు.కరిక్యులమ్‌లో భాగంగా సర్టిఫైడ్‌ ఆన్లైన్‌ వర్టికల్స్‌.తద్వారా విద్యార్థులు తాము చదువుతున్నకోర్సులతో పాటు ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు ఆన్‌లైన్‌లో నేర్చుకునే వెసులుబాటు. కరిక్యులమ్‌లో 10 నెలల కంపల్సరీ ఇంటర్న్‌షిప్‌ పెట్టడం ద్వారా విద్యా ర్థులను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్దిదిద్దడం. ఇప్పటికే 7లక్షల మంది విద్యార్థు లు 2 నెలల కమ్యూనిటీ సర్వీస్‌ ప్రాజెక్ట్స్‌, 5.2లక్షల మంది 2నెలల షార్ట్‌టర్మ్‌ ఇంటర్న్‌ షిప్‌ మరియు 2లక్షల మంది 6నెలల లాంగ్‌ టర్మ్‌ ఇంటర్న్‌ షిప్స్‌ పూర్తి చేయగా మరో 3 లక్షల మంది విద్యార్థులు లాంగ్‌ టర్మ్‌ ఇంట ర్న్‌ షిప్స్‌ పూర్తి చేయనున్నారు. థియరీతో పాటు Iఅసబర్‌తీవ శీతీఱవఅ్‌వస జశీబతీంవం చేయడం వల్ల 2018-19 విద్యా సంవత్స రంలో 37,000 ఉన్నప్లేస్‌ మెంట్స్‌ ఇప్పుడు (2022-23లో) 1 లక్షకు పెరిగింది.నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌,సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌ లతో ఒప్పందం.50బ్యాచిలర్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ ప్రోగ్రామ్‌ లతోపాటు 159 సింగిల్‌ మేజర్‌ కోర్సులు.డిగ్రీ కోర్సులో 2వ సెమిస్టర్‌ నుంచి మెషిన్‌ లెర్నింగ్‌,డేటా సైన్స్‌,రియల్‌ ఎస్టేట్‌ మేనేజ్‌ మెంట్‌,కమర్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌ అనాలసిస్‌ ఇన్వెస్ట్‌ మెంట్స్‌,లాజిస్టిక్స్‌, రిస్క్‌ మేనేజ్‌ మెంట్‌,స్టాక్‌ ఎక్చేంజ్‌,సైబర్‌ ఫోరెన్సిక్స్‌ ఫైనాన్షియల్‌ మార్కెట్‌ అనాలసిస్‌, వెల్త్‌ మేనేజ్మెంట్‌, ఇన్వెస్ట్మెంట్‌ బ్యాంకింగ్‌ వంటి మైనర్‌ కోర్సులు ఆన్లైన్‌ వర్టికల్స్‌ ద్వారా అందుబాటులోకి. డిజిటల్‌ విద్యలో భాగంగా డిగ్రీలో కూడా బైలింగువల్‌ పాఠ్యపుస్తకాలు.. 400కు పైగా ద్విభాషా పాడ్‌ క్యాస్టులు. రాష్ట్రంలోని 18యూనివర్శిటీల్లో ఖాళీగా ఉన్న 3,295 పోస్టుల భర్తీకి మన జగనన్న ప్రభు త్వం సన్నాహాలు. ఇప్పటికే కోర్టు కేసులు అధిగమించి, నియామక ప్రక్రియ ప్రారంభం. మన విద్యార్థులను గ్లోబల్‌ విద్యార్థులుగా తయారు చేసే క్రమంలో ప్రపంచ ప్రముఖ యూనివర్సిటీలైన స్టెయిన్‌ బీస్‌- జర్మనీ, మెల్బోర్న్‌ ఆస్ట్రేలియా, కెంపెన్‌-జర్మనీ, బ్లెకింగ్‌-స్వీడన్‌, ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ- బ్యాంకాక్‌ లతో అవగాహన ఒప్పందాలు. ఉన్నత విద్యలో నూతన సాంకేతిక పరిజ్ఞానం మరియు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ పూర్తి స్థాయి వినియోగానికి చర్యలు. యూనివర్సిటీల్లో కంప్యూటర్‌ విజన్‌, ఇమేజ్‌ ప్రాసెసింగ్‌, మెటావర్స్‌ లెర్నింగ్‌ జోన్‌ల ఏర్పాటు. ఒక్కో జోన్‌ కు రూ.10 కోట్ల పెట్టుబడి..ఇప్పటికే పద్మావతి మహిళా యూనివర్సిటీలో ప్రారంభం. యువతలో సామాజిక సృహ, సమాజం పట్ల బాధ్యత పెంపొందించటానికి దీశీaతీస టశీతీ జశీఎఎబఅఱ్‌వ ణవఙవశ్రీశీజూఎవఅ్‌ ్‌ష్ట్రతీశీబస్త్రష్ట్ర జుసబషa్‌ఱశీఅ (దీజణజు )ఏర్పాటు రాష్ట్ర వ్యాప్తంగా 553 ఇంక్యుబేషన్‌ సెంటర్స్‌ ఏర్పాటు.. ఇప్పటి వరకు 10వేల మందికి పైగా నమోదు. 2019 నాటికి 257 ఉన్నత విద్యాసంస్థలు మాత్రమే చీAAజ గుర్తింపు పొందగా, ఈరోజు రాష్ట్రంలో చీAAజ గుర్తిం పు పొందిన 437విద్యా సంస్థలు.
ఎడెక్స్‌తో ఒప్పందం..
ఏపీ ప్రభుత్వం ఉన్నత విద్యారంగంలో కీలక ఒప్పందం చేసుకుంది ప్రముఖ విద్యా పోర్టల్‌ ఎడ్‌క్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.ఫిబ్రవరి 15న సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఏపీ విద్యా శాఖ ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఎంవో యూకి సీఎంజగన్‌ అధ్యక్షత వహించి మాట్లా డారు.ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో విద్యారంగం చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయంగా నిలిచిపో తుందని అన్నారు. రైట్‌ టు ఎడ్యుకేషన్‌ అన్నది పాత విధానం.. నాణ్యమైన విద్య అన్నది హక్కు.. ఇది కొత్త నినాదం అని అన్నారు.నాణ్యమైన విద్య ను అందించడంలో మనం వెనకబడితే.. మిగతా వళ్లు మనల్ని దాటి ముందుకు వెళ్లిపోతారని, ఈ దేశంలో ఉన్నవారితో కాదు మన పోటీ.. ప్రపంచంతో మనం పోటీపడుతున్నామని జగన్‌ అన్నారు. మన పిల్లలు మంచి మంచి జీతాలతో మెరుగైన ఉద్యోగాలు సాధించాలని అది జరగా లంటే నాణ్యమైన విద్య ద్వారానే సాధ్యం అవుతుం దని సీఎం జగన్‌ అన్నారు. విద్యలో అంతర్జాతీయ ప్రమాణాలు ఉండాలి.ఉన్నత విద్యలో మనం వేస్తున్న అడుగులు..ఫలాలు ఇవ్వా లంటే బహు శా నాలుగైదేళ్లు పట్టొచ్చని, కానీ, మనం వేసిన ప్రతి అడుగుకూడా ప్రాథమిక విద్య స్థాయి నుంచి ఉన్నతవిద్య వరకూ కూడా సమూలంగా మార్చు కుంటూ వస్తున్నామని చెప్పారు. మానవ వనరుల మీద పెట్టుబడి అన్నది ఒక ప్రధాన అంశంగా మన ప్రభుత్వం భావిస్తోందని, అందుకనే ప్రతి అడుగులోనూ చిత్తశుద్ది, అంకిత భావం చూపి స్తున్నామని సీఎంజగన్‌ చెప్పారు. ప్రభుత్వ స్కూళ్ల లో ఇంగ్లీష్‌ మీడియాంను ప్రవేశ పెట్టామని, గ్లోబల్‌ సిటిజన్‌ కావాలంటే మనం మాట్లాడే భాషలో మార్పు రావాలని అన్నారు. అందుకే ఇంగ్లిష్‌ మీడియం నుంచి నాడు`నేడు, అమ్మఒడి,గోరుమద్దతో మన ప్రయాణం ప్రారంభ మైందని,అక్కడితో మనం ఆగిపోలేదని జగన్‌ పేర్కొన్నారు.వచ్చే పదేళ్లలో టెన్త్‌ విద్యార్థి ఐబీ విద్యాబోధనఅందించే దిశగా అడుగులు వేస్తు న్నామని,ఐవీ వాళ్లతో ఎంఓయూ చేసుకున్నాం.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి తరగతి గదిని డిజిటలైజేషన్‌ చేస్తున్నామని జగన్‌ అన్నారు. బైజూస్‌ కంటెంట్‌తో అనుసంధానం చేశామని, ఈ ప్రయాణం, ఇక్కడితో ఆగిపోకూడదని, అత్యు తన్నత విద్యలో కూడా ఇలాంటి అడుగులు వేయా ల్సిన అవసరాన్ని భావించి దానిపై కూడా దృష్టి పెట్టామని తెలిపారు.ఎడ్‌క్స్‌తో ఈరోజు చేసుకుం టున్న ఒప్పందం మరో అడుగు అని సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. దాదాపు 2వేలకుపైగా కోర్సులు మన పాఠ్యప్రణాళికలో వర్టికల్స్‌కింద మన పిల్లలకు అందుబాటులోకి వస్తున్నాయి.
ఐంఐటీ, ఎల్‌ఎస్‌ఈ, హార్వర్డ్‌ ఇంకా ప్రఖ్యాత కాలేజీల కోర్సులుకూడా దీనిద్వారా నేర్చుకోవచ్చు.క్రెడిట్స్‌ మన పాఠ్యప్రణాళికలో భాగం అవుతాయి. మన దగ్గర అందుబాటులో లేని కోర్సులు కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది.అత్యుత్తమ యూనివర్శిటీల నుంచి సర్టిఫి కెట్లు ఉండడంవల్ల ఉద్యోగం సాధనమరింత సులభతరం అవుతుందని, మన పిల్లలకు ఇవ్వగ లిగిన ఆస్తి విద్య మాత్రమేనని జగన్‌ అన్నారు. నాణ్యమైన విద్యవారికి అదించగలిగితే వాళ్లు పేదరికం నుంచి బయటపడతారు. మంచి కంపె నీల్లో ఉద్యోగాలు లభిస్తాయి. టాప్‌-50 ర్యాం కింగ్స్‌లో ఉన్న 320కాలేజీల్లో సీటు వస్తే.. రూ. 1.2 కోట్ల వరకూ కూడా ప్రభుత్వమే చెల్లిస్తోందని సీఎం జగన్‌ చెప్పారు.-జి.ఎన్‌.వి.సతీష్‌

సాహస వనితలు సమ్మక్క సారాక్క

తెలంగాణ రాష్ట్రంలో వరంగల్‌ జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో రెండు సంవత్సరాలకు ఒకసారి సమ్మక్క సార క్కల జాతర జరుగుతుంది. దీనికి చుట్టు పక్కల రాష్ట్రాల నుండి కూడా అధిక సంఖ్యలో జనం వస్తుంటారు.సమ్మక్క సారక్కలు గిరిజనులు కానట్టు ‘దేవతలు’-అని చెప్పడం ఒక మోసం! సమ్మక్క సారక్కలు, పగిడిద్దరాజు,జంపన్నలు ఆది వాసీ గిరిజనులు.వీరు తమ హక్కుల కోసం పోరాడుతూ అమరులైన వారు. కేవలం గిరిజన వీరులు మాత్రమే!
వీరి చారిత్రక నేపథ్యం ఇలా ఉంది. సాధారణ శకం 12వశతాబ్దం ఓరుగల్లును కాకతీ యులు నిరంకుశంగా పాలిస్తున్న రోజులు. ఇతర ప్రాంతాలపై ఆధిపత్యం కోసం తాపత్రయపడిన ప్రతాపరుద్రుడు గిరిజనుల నాయకుడైన పగిడిద్ద రాజును ఆహ్వానించి, గిరిజనులతో తన పాలన లోకి రావాలని కోరాడు.అతను అందుకు సమ్మ తించకపోవడంతో అనేక విధా లుగా ప్రయత్నిం చాడు.ఏప్రయత్నమూ ఫలించకపోవడంతో విపరీ తంగా ఒత్తిడి పెంచాడు. పగిడిద్దరాజు నాయక త్వంలో ఉన్న గిరిజనులెవరూ లెక్కచేయలేదు -అసహనంతో రగిలిపోయిన ప్రతాపరుద్రుడు’’తన ఆజ్ఞను అతిక్రమించిన వారికి మరణ దండన తప్పదని’’ బెదిరించాడు. స్వేచ్ఛగా బతుకుతున్న ఆదివాసీ గిరిజనులు మరొకరి అదుపు ఆజ్ఞలతో ఉండడానికి ఇష్టపడలేదు. కాకతీయ రాజు ప్రతా పరుద్రుని మాట తిరస్కరించారు. ప్రతాపరుద్రుడు గిరిజనులపై యుద్ధం ప్రకటించి, నానా బీభత్సం సృష్టించాడు.వారి జీవితాల్ని అతలాకుతలం చేశాడు.ఆ యుద్ధానికి సంబంధించిన పూర్వా పరాలు ఇలాఉన్నాయి-గిరిజనుల రాజైన మేడ రాజు,పెంపుడు కూతురు సమ్మక్కను తన మేన ల్లుడైన పగిడిద్దరాజుకు ఇచ్చి వివాహం జరిపి స్తాడు. ఆ దంపతులకు సారలమ్మ,నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం.మేడారం పాల కుడైన పగిడిద్దరాజు కాకతీయులకు సామంతుడు. రాజ్యకాంక్షతో ప్రతాపరుద్రుడు,మేడరాజు పాలిం చే పొలబాసపై దండెత్తుతాడు.ఆదాడి తట్టు కోలేక మేడరాజు తనకూతురు దగ్గరికి మేడారం పారి పోయి అక్కడ ఆజ్ఞాతవాసం గడుపుతుంటాడు. ఆ సమయంలో వచ్చిన కరువు కాటకాల వల్ల పగిడిద్దరాజు కాకతీయులకు కప్పం చెల్లించలేక పోతాడు.కప్పం చెల్లించకపోవడం ఒక కారణ మైతే, తన మామగారైన మేడరాజుకు ఆశ్రయం కల్పించడం మరో కారణం. తనకు లొంగిపోనని చెప్పిన పగిడిద్దరాజును ఇక యుద్ధంతోనే లొంగ దీసుకోవాలనుకుని, తన మంత్రి యుగంధరుడితో కలిసి, ప్రతాపరుద్రుడు పగిడిద్దరాజుపై యుద్ధం ప్రకటించాడు. తన కొడుకు జంపన్నను తీసుకుని, బలగాలను సమాయత్తంచేసి,కాకతీయ సైన్యాలను ఎదుర్కొంటాడుపగిడిద్దరాజు.వీరోచితంగా పోరా డుతూ పగిడిద్దరాజు,గోవిందరాజులు ప్రాణాలు వదిలేస్తారు. దాంతో, సమస్య తీరిందని ప్రతాపరు ద్రుడు సంబరపడ్డాడు. కానీ,ఆ సంతోషం ఎంతో సేపు నిలువలేదు. గిరిజన మహిళలు సంఘటి తమై మళ్లీ విజయ దుందుభి మోగించారు. ఈ సారి సమ్మక్క, తన కూతురు సారక్కతో కలిసి సారథ్యం వహించింది. అతి పెద్దదైన, సుశిక్షితు లైన కాకతీయ సైనికులతో గిరిజన మహిళలు గెలవలేకపోయారు. సమ్మక్క,సారక్క,నాగమ్మ అనేక మంది గిరిజనులు వీరమరణం పొందారు. ఓటమిని భరించలేక జంపన్న దగ్గరగా ఉన్న సంపెంగవాగులో దూకి ఆత్మహత్య చేసుకుం టాడు. ఆనాటి నుండి సంపెంగవాగు జంపన్న వాగుగా పిలవబడుతోంది. కాక తీయుల దృష్టిలో ఇది ఒక సంఘటన మాత్రమే. గిరిజన ప్రాంతాలు స్వాధీనం చేసుకోగలిగినందుకు విజయోత్సవాలు జరుపు కున్నారు. కానీ, గిరిజనుల దృష్టిలో ఇది ఒక మహోజ్వల చారిత్రక ఘట్టం! బలవం తుడైన కాకతీయరాజును ఎదుర్కొని తమ గిరిజన అస్థిత్వాన్ని నిలుపుకోవడానికి వీరోచితంగా పోరా డిన సాహసోపేతమైన ఘనకార్యం!! అసువులు బాసిన గిరిజన అమర వీరుల్ని స్మరించుకోవడా నికి ఏర్పడ్డ గొప్ప అవకాశం. దాన్ని వారు శతా బ్దాలుగా కొనసాగిస్తూ వస్తున్నారు. అదే కార్యక్ర మంలో సమ్మక్క సారక్క జాతరగా స్థిరపడిరది. కాకతీయులతో పోరాడి వీరమరణం పొందిన పగిడిద్దరాజు,సమ్మక్క,సారక్క, జంపన్నలను రెం డేళ్లకు ఒకసారి గుర్తు చేసుకుంటారు. అదే మేడా రం జాతర.ఆసందర్భానికి చుట్టు పక్కల ప్రాంతా ల నుండి గిరిజనులు,ఆదివాసులు,కొంతమంది గ్రామస్తులు అక్కడికి చేరుకుంటారు. పల్లెల నుండి మాత్రమే కాకుండా, పట్టణాలు, నగరాల నుండి కూడా జనం అధిక సంఖ్యలో అక్కడికి చేరుతుం డడంతో 1967లో అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభు త్వం ఆజాతరను తన పరిధిలోకి తీసుకుంది. ప్రభుత్వ ఎండోమెంట్‌శాఖ,వచ్చిపోయే వారికి రవాణాసౌకర్యం కల్పించింది.ఇంత వరకు బాగా నే ఉంది.కానీ,తరువాత జరుగుతూ వచ్చిన ప్రచారం మూఢనమ్మకాల వ్యాప్తికి దారితీసింది. ప్రభుత్వ జోక్యంతో స్థాయి పెంచుకున్న ఈ జాతర, ఇతర రాష్ట్రాలనుండి కూడా జనాన్ని ఆకర్షి స్తోంది.వ్యాపారాలు వృద్ధి చెందాయి. ప్రభుత్వ ఆదాయం పెరిగింది.కానీ,వాస్తవంగా అనేక అకృ త్యాలకు అది నిలయమవుతూ వచ్చింది. పరిసర ప్రాంతాలన్నీమలమూత్రాలతో కలుషితమ య్యాయి. అధిక సంఖ్యలో వచ్చిపోయే వాహనా లతో అక్కడ కార్బన్‌ మొనాక్వైడ్‌ స్థాయి పెరిగి, శుభ్రమైన గాలి దొరక్కుండా పోయింది. గిరిజన సంస్కృతిని గిరిజన సంస్కృతిగా ఉండనీయక, నగరవాసులు దాన్నొక షాపింగ్‌ మాల్‌లాగా మా ర్చారు. అంతకుముందు చుట్టుపక్కల ఉన్న గ్రామా లన్నీ తాగునీటి కోసం జంపన్న వాగుపై ఆధార పడేవి.జాతర వల్ల వాగు నీరు మురికై పోవడం వల్ల,అనేక గ్రామాలు తాగునీటికై ఇబ్బంది పడు తున్నాయి.కలరా,అతిసార వంటి అంటువ్యాధులు వ్యాపిస్తున్నాయి. తమ జీవన స్థితిగతుల గూర్చి ఆలోచించండని గిరిజనులు ఎన్నోసార్లు ప్రభు త్వానికి నివేదికలిచ్చారు. జన జీవితాన్ని అస్తవ్య స్తం చేసే జాతరలు అవసరమా? అంటే, ప్రభు త్వానికి వాటివల్ల వచ్చే ఆదాయం అవసరం! రెండేళ్ళకోసారి వారం పది రోజులు జరిగే సమ్మ క్క సారక్క జాతర అక్కడి ప్రజా జీవితాన్ని నాశ నం చేస్తోంది. ఆదివాసీలను, వారి విశ్వాసాల్ని ప్రభుత్వ ఎండోమెంట్‌శాఖ,చాకచాక్యంగా దోపిడీ చేస్తున్నట్టుగా ఉంది.మరీ ముఖ్యంగా వీరనారీ మణుల్ని’’దేవతలుగా’’ప్రచారం చేయడంతో ప్రజ ల్ని అంధవిశ్వాసాల్లో ముంచి ఎదగకుండా చేస్తోంది. అది చాలా ప్రమాదం! దేశ వ్యాప్తంగా వైదిక మతం ఆదివాసీ,గిరిజన, జానపద సంస్కృ తులను ధ్వంసం చేస్తోందనడానికి ఇదొక మంచి ఉదాహరణ! దీనికి మనువాదుల ప్రభావంలో కొట్టుకుపోయినప్రభుత్వాధినేతలే కారణం-సమ్మక్క సారక్కలు వీరవనితలన్నది జనం మరిచి పోయా రు.వారిని కోరికలు తీర్చే దేవతలయినట్టు భావి స్తున్నారు. వారి సంస్కృతికి శ్రద్ధాంజలి ఘటిస్తు న్నట్టు కాకుండా,ఆనందోత్సాహాలతో పండగ చేసుకుంటున్నారు. ఇలాంటిదే మరొక విషయం చూద్దాం! తమిళనాడులోని ఇరళర్లే- తెలుగులో ఇరగాలోళ్లుఅయ్యింది. వీరిది అడవిని ఆధారం చేసుకునిబతికే ఒకప్రాచీన తెగ.నెల్లూరు ప్రాంతం లో వీరినే యానాదులు అంటున్నారు. వేటాడటం, పాములు పట్టడం వీరివృత్తి.నెల్లూరు ఒక గ్రామం గా ఉన్నప్పుడు అక్కడ అధిక సంఖ్యాకులైన ఇరగా లోళ్లు నెల్లూరు చెరువుకి ఉత్తరం గట్టున నెల కొల్పుకున్న గ్రామ దేవత-ఇరగాలమ్మ. కాలక్ర మంలో వైదిక మతస్తుల ప్రభావంతో ఆ దేవత ఇరుకళల పరమేశ్వరి అమ్మగా రూపాంతరం చెందింది. గోపురం ధ్వజస్తంభం వెలసి, ధూప దీపనైవేద్యాలతో హిందూ దేవాలయమై పో యింది. నెల్లూరు జిల్లా సుళ్ళూరిపేటలోని చెంగా లమ్మ గుడికథ కూడా దాదాపు ఇలాంటిదే. యానాదులను కొన్ని ప్రాంతాల్లో చెంచోర్లు అని కూడా పిలిచేవారు. వారు నెలకొల్పుకున్న దేవత పేరు చెంచోరు లేదా చెంచోరమ్మ అని వ్యవహరిం చేవారు.ఆపేరే కాలక్రమంలో చెంగాళమ్మ అయ్యింది.ప్రస్తుతం అమ్మపేరు ‘తెన్‌ కాళి అమ్మ’గా మారిపోయింది. అక్కడ ఇరుకళల పర మేశ్వరి అమ్మకు అమరిన హంగులన్నీ-ఇక్కడ తెన్‌కాళి అమ్మకు కూడా అమిరాయి. శ్రీశైలం గుడి చెంచు లదే అన్న విషయం అందరికీ తెలిసిపోయింది. అయినా,ఇప్పుడు ఈగుడులేవీ చెంచులవి, యానాదులవి కావు.వైదిక మత ప్రభావంతో అవన్నీ ఆదివాసీ చేయి దాటిపోయాయి. అంతే కాదు ఒకప్పటి వాటి మూల సంస్కృతిని పోగొట్టు కున్నాయి.ఇకపోతే,గోదావరి జిల్లాల్లోని నూకా లమ్మ ‘నూకాంబిక’ అయ్యింది. తెలంగాణ గ్రామా ల్లోని ఎల్లమ్మ ఎల్లమాంబా దేవి అయ్యింది. ఆది వాసీల జానపదుల గుళ్లన్నీ హిందూ దేవాల యాలుగా మన కళ్ల ముందే రూపాంతరం చెందు తూ వచ్చాయి. పోలేరమ్మ జాతర, పంబాలోళ్ల వేడుకలన్నీ మార్పునకు గురయ్యాయి. ఒక వైపు హైందవం,మరో వైపు క్రైస్తవం గిరిజనులు, దళి తుల మూలల్ని ఒక పథకం ప్రకారం ధ్వంసం చేస్తూ వచ్చాయి. ఒకప్పుడు బౌద్ధ, జైన ఆలయాల్ని ధ్వంసం చేసి హిందూ దేవాలయాలుగా మార్చు కున్నట్టు-తర్వాత కాలంలో గిరిజన, ఆదివాసీ, దళిత,శూద్రజాతులు నెలకొల్పుకున్న దేవుళ్లను, గుళ్లను హైందవం తీవ్రంగా దెబ్బతీసింది. ఆల యాల గోడలపై స్త్రీ పురుషుల నగశిల్పాల్ని చెక్కు కుని ఆలయాల్ని కామ కలాపాలకు వాడుకున్నది వైదికమతం. దేవదాసీ వ్యవస్థను ప్రోత్సహించి, బలవంతపు వ్యభిచారం నడిపించిన ఘనత సనాతన వాదులదే కదా? ఇప్పుడు ఆ మూలాల్ని, ఆ మూల సంస్కృతిని నిలుపుకోవడం మన వల్ల కాకపోవచ్చు. కానీ, సనాతనవాదుల అడ్డగోలు వాదనలు ఎదుర్కోవాలంటే, కనీసం మన మూలాల గూర్చి కొంతలో కొంతైనా తెలుసు కోవాలి కదా? గతం తెలుసుకున్న వారే భవిష్య త్తుకు దారులు వేయగలరు.
-వ్యాసకర్త : కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత, జీవశాస్త్రవేత్త -మెల్బోర్న్‌ నుంచి-(డా.దేవరాజు మహారాజు)

దేశ చరిత్రలోనే తొలిసారిగా..

చరిత్రలోనే తొలిసారి పేదలకు 31.19 లక్షల ఇంటి స్థలాల రిజిస్టర్డ్‌ కన్వేయన్స్‌ డీడ్స్‌ అందజేస్తున్నాం.58 నెలల్లో ప్రతి అడుగు పేదల అభ్యున్నతి కోసమే..ఎన్నికలకు మనం సిద్ధం అంటే..కుప్పంలో ప్రజలు బాబుకి బైబై అంటున్నారు.మన ప్రభుత్వంలో పెత్తందారు లకు కాదు పేదలకే పదవులు ఒంగోలు మున్సి పల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 20,840 ఇళ్ల స్థలాల రిజిస్టర్డ్‌ కన్వేయన్స్‌ డీడ్స్‌ పంపిణీ ప్రారంభ సభలో సీఎం జగన్‌ ప్రసంగించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 20,840 మంది పేద అక్కచెల్లెమ్మలకు సర్వ హక్కులతో రిజిస్టర్‌ చేసిన ఇంటి స్థలం భూ బదిలీ పత్రం, కట్టుకోడానికి ఇళ్లు కూడా మంజూరు చేసి, ఆ పత్రాలు కూడా పంపిణీని సీఎం జగన్‌ ప్రారంభించారు. దీంతో పాటు ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ కింద రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా పంపిణీ చేసిన 31.19 లక్షల ఇళ్ల స్థలాలను ఆ పేద అక్కచెల్లెమ్మల పేరు మీదుగానే సంపూర్ణ హక్కులు కల్పిస్తూ, రిజిస్ట్రేషన్‌ కూడా చేసి కన్వేయన్స్‌ డీడ్స్‌ అందించే కార్యక్రమాన్ని సీఎం జగన్‌ ఒంగోలు వేదికగా లాంఛనంగా ప్రారంభించారు. అర్హులైన 20,840 మంది పేద అక్కచెల్లె మ్మలకు ఇంటి స్థలాల కోసం ప్రభుత్వం మల్లేశ్వరపురం,అగ్రహారం,యరజర్ల, వెంగ ముక్కల పాలెం గ్రామాల్లో 536.11ఎకరా లను భూసేకరణ ద్వారా సమీకరించి రిజిస్టర్‌ చేసిన ఇంటి స్థలం కన్వేయన్స్‌ డీడ్స్‌ అందజేసి నట్లు సీఎం జగన్‌ వివరించారు. భూమి కొను గోలు,జగనన్న టౌన్‌ షిప్‌ల అభివృద్ధికి రూ.210 కోట్లు..లే అవుట్ల అభివృద్ధికి రూ. 21.33 కోట్లు కేటాయించినట్లు వివరించారు.
మన ప్రభుత్వంలో పెత్తందారులకు కాదు పేదలకే పదవులు
గతంలో పెత్తందారులకు మాత్రమే నామినేటెడ్‌ పదవులు ఉండేవని, మన ప్రభుత్వంలో బలహీన వర్గాలకు పదవులు ఇచ్చామని సీఎం జగన్‌ పేర్కొన్నారు. పెత్తందారులతో జరిగే ఈ యద్ధంలో ప్రజలు గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా గమనించాలని విజ్ణప్తి చేశారు.పేదల ఆత్మ గౌరవం గురించి గతంలో ఏప్రభుత్వం ఆలో చన చేయలేదన్నారు. అక్కచెల్లెమ్మల కోసం అనేక పథకాలు తెచ్చామని, మన ప్రభుత్వంలో అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారత పెరిగిందని సీఎం జగన్‌ పేర్కొన్నారు.ప్రకాశం జిల్లా ఒంగోలు ఎన్‌.అగ్రహారంలో నిర్వహించిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీని సీఎం జగన్‌ ప్రారంభించారు. అంతకు ముందు ఒంగోలు తాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్‌ మాట్లాడుతూ మన ప్రభుత్వంలో పేద మహిళల సాధికారత కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చి ఆర్థిక అంత రాలు తొలగించామన్నారు. రిజిస్ట్రేషన్‌ పట్టా లు ఇవ్వడం వల్ల అక్క చెల్లెమ్మలకు ఆస్తి మీద పూర్తి హక్కులు లభించాయని, భవిష్యత్తులో రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్‌ చేసే అవకాశం ఎవరికీ ఉండక పోవడంతో పాటు రిజిస్ట్రేషన్‌ పట్టాలు ఉండడం వల్ల కబ్జాలకు చెక్‌ పడుతుం దన్నారు. ఈ మేరకు ఇళ్ల పట్టాలకు సంబంధించి గ్రామ సచివాలయాల నుంచి సర్టిఫైడ్‌ కాపీలు అందిస్తున్నట్లు సీఎం జగన్‌ వివరించారు.పేదల కోసం పెత్తందారులపై అనేక పోరాటాలు చేశామని, ఇంటింటికీ తలుపు వద్దే ప్రభుత్వ సేవలు అందిస్తున్నా మన్నారు.
నాడు నేడుతో విద్య, వైద్య ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు
నాడు నేడుతో విద్య,వైద్య ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చినట్లు సీఎం జగన్‌ తెలిపారు. పేదలకు కార్పొరేట్‌ వైద్యం అంది స్తుండటంతో పాటు చికిత్స కోసం వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింప చేస్తూ ఆరోగ్యశ్రీ పరిధిని రూ.25 లక్షలకు పెంచి నట్లు వివరించారు.ఎక్కువ వ్యాధులను ఆరోగ్య శ్రీ కింద కవర్‌ అయ్యేలా ప్రొసీజర్స్‌ను 3,300 కు పెంచామన్నారు. పేదల ఇంటి వద్దకే ఫ్యామిలీ డాక్టర్‌ విధానం అమలు చేస్తూ రోగులు కోలుకునేంత వరకు ప్రభుత్వమే ఆసరా అందిస్తుందన్నారు. పోటీ ప్రపంచంలో నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశ్యంతో ఆంగ్ల విద్యను తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇంగ్లీష్‌, తెలుగు మీడియాల్లో పుస్తకాలు అందిస్తూనే ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించి కార్పొరేట్‌ స్కూళ్లకు పోటీగా ప్రభుత్వ బడుల్లో డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లు ఏర్పాటు చేశామని సీఎం జగన్‌ పేర్కొన్నారు.
ఎస్సీ కులాల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న వ్యక్తి చంద్రబాబు
ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటూ చంద్రబాబు ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా పుట్టాలను కుంటారా అని అన్యాయమైన స్టేట్‌ మెంట్‌ ఇచ్చి, ఎస్సీలంతా గుణపాఠం చెబుతారనే భయం లేకుండా, బాబు రాజకీయంగా బరితెగించి ఉండగలుగుతున్నాడంటే ఇంతక న్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా?అని సీఎం జగన్‌ ప్రశ్నించారు.బీసీల తోకలు కత్తిరిస్తా, ఖబడ్దార్‌ అని కూడా బాబు ఈ రాష్ట్ర రాజకీయాల్లో బీసీలంతా తనకు గుణపాఠం చెబుతారన్న విషయం చంద్రబాబు అర్ధం కావడం లేదా అన్నారు. పేద వర్గాలకు ఇళ్ల నిర్మాణం చేయకపోయినా, రైతులకు బేషరతుగా పూర్తిగా రుణమాఫీ చేస్తానని మోసం చేసిన ఈ మాయలోడు ఏ జంకూ గొంకూ లేకుండా ఇప్పటికీ ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉండటం కంటే దారుణం మరొకటి ఉండదన్నారు. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు మొదటి సంతకంతోనే రుణాలుమాఫీ చేస్తానని ఒక్క రూపాయి కూడా మాఫీ చేయని చంద్రబాబుకు ప్రజలే గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో 650 వాగ్దానాలిచ్చి మేనిఫెస్టోగా చూపించి ప్రతి సామాజికవర్గానికి అది చేస్తా ఇది చేస్తానని 10శాతం కూడా అమలు చేయకపోయినా, ప్రజలు తనను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మడం లేదని తెలిసినా, నిస్సిగ్గుగా మళ్లీ ఎన్నికలొచ్చేసరికి కొత్త మేనిఫెస్టో తెచ్చి ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంజ్‌ కారు కొనిస్తానంటూ చంద్రబాబు ప్రజ లను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
మనం సిద్ధం అంటే.. కుప్పంలో ప్రజలు బాబుకి బైబై అంటున్నారు.
చంద్రబాబు తన 14ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గ్రామ గ్రామానికీ ఈ మంచి జరిగిందని సమాధానం చెప్పలేరని సీఎం జగన్‌ విమర్శించారు. పేదలకు జగన్‌ మాదిరిగా బటన్‌ నొక్కాను 2.55 లక్షల కోట్లు పేదల ఖాతాల్లోకి జమ చేశాను అని ఈ పెద్దమనిషి నోట్లో నుంచి మాటలు రావన్నారు. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతున్న పరిస్థితుల్లతో మనం సిద్ధం అంటుంటే.. మరోవంక బాబు భార్య మా అయన సిద్ధంగా లేడు అంటోందని చామత్కరించారు. ఏకంగా కుప్పంలో బైబై బాబు అంటూ ఆయన అర్ధాంగి నోటే పంచ్‌ డైలాగులు వస్తున్నా యన్నారు. ఇలాంటి బాబును ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు సమర్థించడం లేదని కుప్పంలో ఉన్న ప్రజలు కూడా సమర్థిం చలేదని సీఎం జగన్‌ విమర్శించారు. ఏనాడూ ఏపీలో లేని వారు, ఏపీకి రాని వారు,సొంత ఊరు ఏదంటే తెలియని వారు,వారికి మన రాష్ట్రంలో ఓటే లేని వారు,ఇక్కడ దోచుకో వడం,దోచుకున్నది పంచుకోవడానికి అల వాటైన వారే అలాంటి నాన్‌ రెసిడెంట్‌ ఆంధ్రాస్‌ మాత్రమే చంద్రబాబును సమర్థి స్తారని అన్నారు. మీ బిడ్డగా అందరితో కోరేది ఒక్కటే. మీ ఇంట్లో మాత్రం మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడి స్టార్‌ క్యాంపెయినర్లుగా ఉండాలన్నారు.పేద అక్కచెల్లమ్మల సొంతింటి కలను సాకారం చేస్తూ..రికార్డు స్థాయిలో 31 లక్షలకు పైగా ఇళ్లపట్టాలు అందించడమే గాక దేశంలోనే తొలిసారిగా లబ్ధిదారులకు ఆ స్థలా లపై సర్వహక్కులు కల్పిస్తూ వారి పేరు మీదనే ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసి కన్వేయన్స్‌ డీడ్స్‌ అందించిన సీఎం జగన్‌ ప్రభుత్వం….
రిజిస్టర్డ్‌ కన్వేయన్స్‌ డీడ్స్‌ ద్వారా కలిగే ప్రయోజనాలు ఇవీ.
పదేళ్ల తర్వాత ఇంటి స్థలంపై అన్ని హక్కులు ఉండేలా లబ్ధిదారుల పేరిట గ్రామ/వార్డు సచివాలయాల్లోనే, ఇప్పుడే ఉచితంగా స్థలాల రిజిస్ట్రేషన్‌ చేసి కన్వేయన్స్‌ డీడ్స్‌ కూడా అందజేత చేశారు.రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ చేపట్టారు. ఇప్పటికే దాదాపు 15 లక్షల రిజిస్ట్రేషన్లు పూర్తి.. శరవేగంగా మిగిలిన రిజిస్ట్రేషన్ల కార్యక్రమం కొనసాగిస్తారు.గ్రామ/వార్డు సచివాలయాల్లో ఉన్న జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ (జెఎస్‌ఆర్వో) డేటాబేస్లో వివరాలన్నీ పదిలం..ఎప్పుడైనా ఈ జెఎస్‌ఆర్వోలలో సర్టిఫైడ్‌ కాపీ పొందే అవకాశం..ఫోర్జరీ గానీ,ట్యాంపర్‌ చేయడానికి గానీ ఆస్కారమే ఉండదు.పదేళ్ల తర్వాత ఆటోమేటిక్‌గా క్రయ, విక్రయ,దాన,వారసత్వ హక్కులతో సహా పూర్తి హక్కులు..అత్యవసర సమయాల్లో ఇంటిని అమ్ముకునే వీలు..అమ్ము కునే సమయంలో ఎన్వోసీ కోసం అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.ఎలాంటి లింకు డాక్యుమెంట్ల అవసరం లేకుండానే నేరుగా రిజిస్ట్రేషన్‌. పేదలకు పక్కా గృహాల కల్పనలో దేశంలోనే అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది.
అక్కచెల్లెమ్మలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా దేశంలో ఎక్కడా లేని విధంగా 71,811ఎకరాల్లో 31.19లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఉచితంగా ఇళ్ల పట్టాల పంపిణీ.
ఒక్కోప్లాట్‌ విలువ ప్రాంతాన్ని బట్టి రూ.2.5 లక్షల నుంచి రూ.15 లక్షల దాకా పలుకు తున్న నేపథ్యంలో ఆ కనీస విలువ రూ.2.5 లక్షల చొప్పున లెక్కించినా ఇళ్ల పట్టాల విలువ రూ.76,000 కోట్లు. దీంతోపాటు సుమారు రూ.60,000 కోట్ల వ్యయంతో 22 లక్షల ఇళ్ల నిర్మాణం. ఇందులో ఇప్పటికే 8.9లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందిం చింది. జగనన్న ప్రభుత్వం.రాష్ట్ర వ్యాప్తంగా 17,005 జగనన్న లేఅవుట్లలో రూ.32,909 కోట్ల వ్యయంతో నీటి సరఫరా,విద్యుత్‌, డ్రైనేజీ, సీవరేజ్‌, రోడ్లు వంటి మౌలిక వసతుల కల్పన. ఇంటి స్థలం ఉచితంగా ఇవ్వడమే కాకుండా యూనిట్‌ కు రూ.1.80 లక్షల చొప్పున ఇంటి నిర్మాణానికి అందిస్తూనే.. మరోవైపు పావలా వడ్డీకి రూ.35 వేలు చొప్పున బ్యాంకు రుణం.. దీంతో పాటు ఉచితంగా ఇసుక ఇవ్వడం ద్వారా రూ.15 వేలు, సిమెంట్‌, స్టీల్‌, మెటల్‌ ఫ్రేమ్స్‌, ఇంకా ఇతర నిర్మాణ సామాగ్రిని తక్కువ ధరకే అందించడంతో ఇంకో రూ.40 వేల మేర లబ్ధి..మొత్తంగా ఒక్కో లబ్ధిదారునికి రూ. 2.70 లక్షల మేర లబ్ధి చేకూరుస్తున్న జగనన్న ప్రభుత్వం.. మౌలిక వసతుల కల్పనతో ప్రతి ఇంటికి సగటున మరో రూ. 1 లక్ష లబ్ధి. తద్వారా ప్రతి పేద అక్కచెల్లెమ్మకు ప్రాంతాన్ని బట్టి ఆ ఇంటి విలువ రూపేణా కనీసం రూ. 6 లక్షల నుండి రూ.20లక్షల వరకు లబ్ధి.. రాష్ట్ర వ్యాప్తంగా పేద అక్కచెల్లెమ్మల చేతుల్లో కనీసం రూ.2లక్షల కోట్ల నుండి రూ.3 లక్షల కోట్ల సంపద. అడ్డంకులను అధిగమిస్తూ రాష్ట్రంలో శరవేగంగా ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్య సాధన దశగా గత ఐదేళ్ల పాలనలో ప్రజలు సుభిక్షాన్ని కోరుకుంది. -జిఎన్‌వి సతీష్‌

1 15 16 17 18 19 75