పెరుగుతున్న అసమానతలు

ఆదాయం,సంపద పంపిణీలో అసమానతలు అనూహ్యంగా తీవ్రమవుతున్నాయి. ఆధిపత్య ధోరణులు బలపడుతున్నాయి. లింగ వివక్ష, జాత్యహంకారం, కుల వివక్ష్మ, మైనారిటీల మీద దాడులు వికృతంగా పెరుగుతున్నాయి. అమానవీయత, పెత్తనం, క్రూరత్వం, హింస, నేటి వ్యవస్థ సహజ లక్షణాలైనాయి. ఇవన్నీ అత్యధిక ప్రజల జీవితాలను విధ్వంసం చేస్తున్నాయి. కొవిడ్‌ విలయంతో ఈ సంక్షోభం మరింత జటిలం అయ్యింది. గత మూడు దశాబ్దాలుగా చేపట్టిన సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాల వినాశకర క్రమం గురించి చర్చించటాన్ని అభావం చేయడంతోపాటు సంపద సృజన, కేంద్రీకరణ, కుబేరుల సంఖ్య, సంపదలో పెరుగుదలే ముఖ్యం అన్న భావజాలాన్ని కూడా బలంగా ప్రచారం చేస్తోన్నారు. ప్రస్తుతం ఉనికిలో ఉన్న ఆర్థిక నిర్మాణాలే, వాటిని పెంచి పోషించిన ధోరణులే ఈ స్థాయిలో అసమానతలు తీవ్రం కావడానికి కారణం అన్నది అందరికీ తెలిసిందే. మన దేశ స్వాతంత్రోద్యమం బ్రిటన్‌లో వలే భూస్వామ్య శక్తులకు వ్యతిరేకంగా ప్రభవించిన ఉద్యమం వంటిది కాదు. వలస పాలనపై పోరుతో 1947 ఆగష్టు 15న దళారీ బడా బూర్జువా, బడా భూస్వామ్య వర్ణాలకు అధికార బదిలీ జరిగింది. భారత్‌లో ప్రజాతంత్ర విప్లవం జరుగలేదు కనుకనే భూ సంస్కరణలు అమలు కాలేదు. విదేశీ ఆస్తులు జాతీయం కాలేదు సరికదా, బ్రిటిష్‌ సామ్రాజ్యవాద పెట్టుబడులకు తోడు వివిధ సామ్రాజ్యవాద దేశాల పెట్టుబడులు దేశంలోకి చొర బడ్డాయి. సామ్రాజ్యవాద పెట్టుబడి దేశీయ స్వతంత్ర పెట్టుబడిని ఎదుగనివ్వదు. దేశీయ పెట్టుబడిని తనకు తొత్తుగా మార్చుకుంటుంది. అందువల్లనే ఏడున్నర దశాబ్దాలు గడిచినా భూస్వామ్య మత విలువలు, విదేశీ పెట్టుబడి దోపిడీ అంతం కాలేదు. అది మరింత పెరిగింది. ఫలితంగా ప్రజాస్వామ్యం పేరుతో ధనస్వామ్యం అధికారం చెలాయిస్తోంది. 1947 ఆగష్టు 15న నెహ్రూ ప్రసంగంలో పేదరికాన్ని, అజ్ఞానాన్ని, అవకాశాలలో అసమానతలను రూపుమాపడమే దేశం ముందున్న కర్తవ్యమని ఉద్దాటించారు. మన ప్రభుత్వాలు అమలు చేసిన ప్రణాళికబద్ధ అభివృద్ధి బడా బూర్జువా,బడా భూస్వామ్య వర్గాల పురోగతికి తోడ్పడిరది తప్ప ప్రజల మౌలిక సమస్యల పరిష్కారానికి ఉపయోగపడలేదన్నది ఏడు దశాబ్దాల అనుభవం రుజువు చేస్తోంది,
1990వ దశకం నుంచి సామ్రాజ్య వాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాల అమలు పేరుతో సాగుతున్న విధ్వంసం దేశ ఆర్థిక వ్యవస్థను అల్లకల్లోలం చేస్తున్నది. పెట్టుబడిదారీ, సామ్రాజ్య వాద ధోరణులు జొరబడి మౌలికరంగాలపై గుత్తాధి వత్యాన్ని చెలాయిస్తున్నాయి. ఇప్పుడు సామ్రాజ్యవాద దేశాలన్ని భారత్‌వైపే చూస్తున్నాయి. ఇక్కడి మార్కెట్‌ను,సహజ వనరులను కొల్లగొట్టడానికి భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. అంతకు కొన్ని వందల రెట్లు లాభాలను ఆర్జిస్తున్నాయి. దేశ సంపదను పరోక్షంగా దోచుకుంటున్నాయి. ఇవాళ ప్రపంచ బహుళజాతిసంస్థలు,ద్రవ్యసంస్థలు భారత ప్రభుత్వంతో పలుఒప్పందాలు చేసుకుంటు న్నాయి. ప్రపంచీకరణవల్ల కార్పొరేట్‌ దిగ్గజాలకు తప్ప సామాన్యుడికి ఒరుగుతున్న లాభం ఏమీలేదు. శ్రమ దోపిడీ,పర్యావరణ విధ్వంసం మరింతగా పెరిగిపో తున్నది. దేశం అనుసరిస్తున్న విధానాలు ఈ శక్తు లను పెంచి పోషించేవిగా ఉండడం దురదృష్ట కరం. ఏడు దశాబ్దాలపైగా దేశీయ పాలనలో దేశం ఎంతో పురోగమించిందని దోపిడీ పాలకులు తొణక్కుండా ప్రకటిస్తున్నారు.కానీనానాటికీ దిగ జారుతున్న జీవన ప్రమాణాలతో శ్రామిక ప్రజానీ కం దిక్కుతోచకున్నారు. నిజానికి కరోనా సృష్టించిన సంక్షోభం కంటే మనపాలకులు,ముఖ్యంగా ఎనిమి దేళ్లుగా మోడీప్రభుత్వం అమలు చేస్తోన్న రాజకీ యార్థిక విధానాలతో ప్రజాజీవనం కకావికలౌ తున్నది. కరోనా ఆంక్షల నడుమ ప్రజా ప్రతిఘటన ఇబ్బందిని ఎదుర్కొనకుండానే ప్రజా వ్యతిరేక విధా నాలను నల్లేరు మీద నడకలా అమలు చేస్తూ పోతు న్న నేపథ్యమిది. మోడీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలైన జిఎస్‌టి, పెద్దనోట్ల రద్దు, కార్మిక చట్టాల సవరణ వంటి విధానాలన్నీ సామ్రాజ్యవాద, బడా కార్పొరేట్లకే తోడ్బ్చడ్డాయి.
చిన్న మధ్య తరహ పరిశ్రమలు, చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. చిల్లర వర్తకం లోకి 100 శాతం విదేశీ పెట్టుబడికి అనుమతిం చడం, దేశానికి స్వావలంబనకు వెన్నెముకలాంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం వంటి విధానాలతో పాటు ప్రజా ఉద్యమాలపై, మేధావు లపై, జర్నలిస్టులపై, కళాకారులపై, ప్రజాసంఘా లపై దేశద్రోహ చట్టాన్ని,ఉపా చట్టాన్ని విచ్చల విడిగా ప్రయోగిస్తున్నారు.దేశంలో భావ వ్యక్తీకర తణ స్వేచ్ఛ తీవ్ర సంక్షోభంలో ఉంది. మీడియా, ముఖ్యంగా స్వతంత్ర జర్నలిస్టులపై అప్రకటిత ఎమర్జెన్సీని దేశంలోని నేటి పరిస్థితులు రుజువు చేస్తున్నాయి.భిన్నాభిప్రాయాలను నేరంగా పరిగ ణించి,విద్యార్థులు,సామాజికకార్యకర్తలు, జర్నలి స్టులపై క్రిమినల్‌, టెర్రరిస్టు వ్యతిరేక చట్టాల కింద నేరాలు ఆరోపించి కేసులు నమోదు చేస్తున్నది. పెట్టుబడిదారీ ఆర్థిక సంక్షోభం 2008 నుంచి ప్రపంచాన్ని చుట్టుముట్టింది. అన్ని ఖండాల్లోని పెట్టుబడిదారీ దేశాలన్నిటా ఆకలి కేకలు వినిపిస్తు న్నాయి. నిరుద్యోగం ప్రబలింది. ఆర్థిక అసమాన తలు పెరిగాయి. భారతదేశ పరిస్థితి దీనికి భిన్నంగా ఏమీ లేదు. ఆర్థిక సంక్షోభానికి తోడు కరోనా మహమ్మారి కాలంలో పెట్టుబడిదారీ సానుకూల ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రపంచీకరణ విధానాలు శ్రామిక ప్రజల జీవనాన్ని మరింత దుర్భరం చేస్తున్నాయి. 1980వ దశకంలో అట్టహాసంగా ప్రకటించిన ప్రపంచీకరణ ఆర్థిక విధానాలు పెట్టు బడిదారీ వ్యవస్థలోని అన్ని సమస్యలకూ సర్వరోగ నివారిణిగా ప్రచారం చేసుకున్నారు. కానీ మూడు దశాబ్దాలు గడిచేసరికి ఆవిధానాల డొల్లతనం ప్రస్తుత ఆర్థిక సంక్షోభ రూపంలో వ్యక్తమవుతోంది. భూములు, గనులు, అడవులు, అంతరి క్షంలోని టెలికాంస్పెక్టమ్‌లు అన్నిం టినీ కార్పొరేట్లకు అర్చించేస్తున్నారు.అందుకు చట్టాలు ఆటంకంగా ఉంటే ఆ చట్టాలనే మార్చేస్తు న్నారు. రాజ్యాంగాన్ని బేఖాతరు చేస్తున్నారు. ఇవాళ దేశంలో పాలకవర్గ పార్టీలన్నీ తమ కండబలం, ధనబలంతో పాటు వివిధ ప్రజాకర్షక పథకాలపై ఆధారపడుతూ ప్రజ లను పరాధీనులుగా చేస్తున్నారు. దేశంలో ప్రపంచీ కరణ విధానాల దుష్ఫలితాలు నేడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరో వైపున రైతుల,కార్మికుల ఇతర(శ్రమ జీవులహక్కులు హరించబడు తున్నా యి. మొత్తంగా ప్రజాతంత్ర, పౌరహక్కులే ప్రమా దంలో పడిపోయాయి. ప్రభుత్వం నుండి ఏక కాలంలో తీవ్రతరమైన ఈ దాడు లు దేశంలోని కార్మిక,రైతాంగ ఇతర శ్రామిక వర్గా లన్నీ ఏకమై ఎదిరించాల్సిన అనివార్య పరిస్థితులను కూడా కల్పిస్తున్నాయి. విపరీతంగా పెరిగిపోతున్న ఆర్థిక అసమానతల గురించి ఈ మధ్య కథనాలు చాలా వచ్చాయి.‘‘చంపుతున్న అస మానతలు’’అన్న పేరుతో ఇటీవలే ఆక్స్‌ ఫామ్‌ ఒక నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం 2021లో84శాతం కుటుంబాల ఆదాయం పడి పోయింది. అయితే అదే సంవత్సరంలో బిలియనీర్ల సంఖ్య 102 నుంచి 142కి పెరిగింది. దేశంలో 100 మంది కుబేరుల సంపద అదే సంవత్సరంలో 57.3 లక్షల కోట్లకు పెరిగింది. దిగువ 50 శాతం కుటుంబాల సంపద జాతీయఆదాయంలో 6శాతం మాత్రమే కలిగి ఉన్నారు.భారత్‌ అభివృద్ధి చెందుతున్న దేశం. ఆర్థిక వ్యవస్థ పెరుగుతోంది. అదే సమయంలో నిరు ద్యోగం,పేదరికంపెరుగుతోంది. మన ఆర్థిక వ్యవస్థ ఉపాధి రహిత వృద్ధికి తోద్బడుతుంది. మోడీప్ర భుత్వం కార్మికులు,రైతాంగం,గిరిజనులు, యువ కులు,మహిళలు, దళితులు, మైనారిటీలు ఎదుర్కొం టున్న ఏఒక్క సమస్యను పరిష్కరించడం లేదు. రాష్ట్రంలో, కేంద్రంలో ఏపార్టీ అధికారంలోకి వచ్చి నా ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారం కావడం అసాధ్యమని గతఏడున్నర దశాబ్దాల పైగా సాగిన పాలన అనుభవం రుజువు చేస్తోంది. అందువల్ల భారత పాలక వర్గాల ప్రజా వ్యతిరేక భూస్వామ్య, స్వదేశీ,విదేశీ పెట్టుబడి అనుకూల విధానాలకు, హిందూత్వ ఫాసిస్టు పాల నకు వ్యతిరేకంగా ప్రజలు సంఘటిత కావాలి. దోపిడీ,పీడన,సామ్రాజ్యవాద ఆధిపత్యాలకు వ్యతి రేకంగా పోరాడటం తప్ప మరో మార్గం లేదు. బడా బూర్జువా,భూస్వామ్య పార్లమెంటరీ రాజకీయాలను నమ్మడం ఇకపై సాధ్యం కాదు. భారతదేశ ప్రజలందరికి స్వాతం త్య్రం నూతన పొందికతో ఆవిర్భవించాలి. ప్రజా తంత్ర ప్రత్యామ్నాయంగా కార్యక్రమం రూపొందిం చుకోవాలి. అది ప్రజల రాజకీయ, ఆర్థిక, సామా జిక విముక్తి లక్ష్యాలను కలిగి ఉండాలి. ఆ కార్య క్రమం, కార్మిక, కర్షక, యువత సంఘటిత ప్రతి ఘటన ప్రజా ఉద్యమాల ద్వారానే ప్రత్యామ్నాయం ఆవిర్భవిస్తుంది. ప్రజా స్వామ్య,లౌకిక,అభ్యుదయ శ్రేణులు ప్రజా ఉద్య మానికి దన్నుగా నిలువాలి. – -` ఎ.నర్సింహారెడ్డి,(వ్యాసకర్త:సీనియర్‌ పాత్రికేయులు, హైదరాబాద్‌)

ఆదివాసీల హీరో బిర్సా ముండా

తెల్లవారి పాలనపై తిరుగుబాటు జెండా ఎగరేసిన విప్లవ కారుడు..బిర్సా ముండా..స్వాతంత్య్ర సమరయోధుడు.. గిరిజిన నాయకుడు అయిన ఈయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే..కొందరు ప్రముఖుల పేర్లు తప్ప ఈయన పేరును ఈ తరం యువత పెద్దగా విని ఉండరు.. దేశం కోసం నెత్తురు చిందించిన మహానుభావులలో ఒకరు.ఈయన గురించి తెలుసుకోవడం మన భాధ్యత. ఈసందర్భంగా బిర్సా జీవితంలోని పలు కీలక ఘట్టాలను తెలుసుకుందాం..!
ఆదివాసీ పోరాటాల వారసత్వానికి ప్రతీకగా ఆవిర్భవించిన యోధుడు బిర్సా ముండా. ఆదివా సీలపై జరుగుతున్న అణచివేతను చిన్నతనం నుంచీ చూసిన బిర్సాముండా అగ్రవర్ణాల దోపిడీపై గళం విప్పాడు. వడ్డీ వ్యాపారుల ఆగడాలపై సమరశం ఖం పూరించాడు. ఆదివాసీల ప్రాథమిక హక్కుల కోసం, జల్‌, జంగ్‌, జమీన్‌ కోసం విల్లంబులు అందుకుని పోరుబాట పట్టాడు. ఆంగ్లేయుల రాకతో విచ్ఛిన్నమైన ఆదివాసీ రాజ్యాలను చూసి తట్టుకోలేకపోయిన బిర్సాముండా నల్ల దొరలతోపాటు, తెల్ల దొరలపైనా ఆయుధాలు ఎక్కుపెట్టాడు. 19వ శతాబ్దపు చివరి రోజుల్లో బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌ ప్రాంతా ల్లో సాగిన ‘మిలినేరియన్‌’ ఉద్యమానికి నాయ కత్వం వహించాడు. బిర్సాను దొంగ చాటుగా బంధించిన తెల్ల దొరలు 1900 జూన్‌ 9న రాంచీ జైలులో హత మార్చారు. భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో బిర్సాముండా పోరాటం ఒక ప్రధాన ఘట్టం. నేటి పాలకవర్గ సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనా ఆదివాసీ సమాజాన్ని అంతం చేస్తోంది. పరి శ్రమలు, ప్రాజెక్ట్‌ల పేరు మీదు లక్షలాది ఆదివాసీ కుటుంబాల వారు నిర్వాసితుల య్యారు. దేశం లోని 570 గిరిజన తెగలలో కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ లెక్కల ప్రకా రం 75వరకు తెగలు అత్యంత వెనుకబడి ఉన్నాయి. వీటిలో 19 తెగల ఆదివాసీ జనాభా వెయ్యికంటే తక్కువ. ఈ తెగలు కనుమరు గయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితిలో అగ్రకులాలను ఎస్టీ జాబితాలో కల పాలని ప్రభుత్వం యత్నిస్తోంది. ఇప్పటికే లంబా డీలు ఆదివాసీల రిజర్వేషన్లను దోచుకున్నారు. ఇందుకు దళారీ పాలకవర్గ విధానాలే కారణం. ఈ నేపథ్యంలో బిర్సాముండా పోరాట స్ఫూర్తిని అందిపు చ్చుకుని, ఆదివాసీలను చైతన్యపరిచి, వారి ప్రజాస్వా మిక హక్కుల కోసం పోరాడాల్సిన బాధ్యత మేధా వులు, విద్యావంతులపై ఉంది…..!
భూమికోసం, భుక్తి కోసం గిరిపు త్రుల స్వేచ్ఛా, స్వతంత్రాల కోసం సమరశం ఖాన్ని పూరించి, శతాబ్దాల బ్రిటిష్‌ ఆరాచక పాలనపై ఉక్కు పిడికిలి బిగించిన సాయుధ విప్లవ కొదమ సింహం,మన్యం వీరుడు అల్లూరి కంటే ఐదు దశాబ్దాల ముందే ఆయుధం పట్టిన ధీరుడు బిర్సా ముండా. బ్రిటిష్‌ దొరల అండదండలతో గిరిజన ప్రాంతాలను భూస్వాములు, జాగీర్‌ దారులు ఆక్రమించి గిరిజనుల భూమిపై ఆధిపత్యం చెలాయిస్తున్న రోజులవి. బ్రిటీష్‌ ప్రభుత్వ అరాచక పాలనలో ఆదివాసులకు అడవిపై హక్కు ఉండేది కాదు.19వ శతాబ్దం చివరలో ప్రజాగ్రహం కట్టలు తెంచుకొని ఈ క్రూర మైన దోపిడీకి, ఆధిపత్యానికి, దురాగ తాలకు వ్యతిరేకంగా గిరిపుత్రులు మారణ యుద్ధం చేశారు. ఇటు వంటి ఎన్నో అణిచి వేతలకు గురికాబడిన చోటానాగ్‌పూర్‌ ప్రాంత ప్రజలకు బిర్సా ఆరా ధ్యుడు. నిత్యం పేదరికం, బాధలతో ఉండే చోటానాగ్‌పూర్‌ ప్రాంతం, ఒకవైపు ఆకలి, మరోవైపు భూస్వాములు,బ్రిటీష్‌ పాలకుల దోపిడీ,అణిచివేతలతో కారు చీకట్లతో కప్పబడి ఉండేది.ఈ ప్రాంతంలోని ఉలిహాటు అనే గ్రామంలో నవంబర్‌ 15,1875లో సుగు ణా ముండా, కార్మిహటు అనే దంపతులకు బిర్సా జన్మించాడు. తన బాల్యం మొత్తం తీవ్ర మైన పేదరికం, ఆకలితో గడిపాడు. తన తల్లి దండ్రుల అతి పేదరికం కారణంగా బిర్సా కొన్నిరోజులు తన మేనత్త దగ్గర, మరికొన్ని రోజులు తన మేనమామ దగ్గర ఉండాల్సి వచ్చింది. తన మేనమామ దగ్గర ఉండే రోజు లలో జయపాల్‌నాగ్‌ అనే ఉపా ధ్యాయుడి సహకారంతో బిర్సా ప్రాథమిక విద్యాభ్యాసం ప్రారంభించాడు. ఆతరువాత ప్రాథమికోన్నత విద్యాభ్యాసం కోసం మిషనరీ పాఠశాలలో ప్రవేశం పొందాడు. ఆరోజులలో చదువుతో పాటు,మత మార్పిడి కూడా జరిగేది.తన చదువు కోసం బిర్సా అతని తండ్రి బాప్తిజం స్వీకరించారు. పాఠశాలలో బిర్సా చురుకుద నాన్ని,మేధస్సుని గుర్తించిన ఉపా ధ్యాయులు, చారుభాషా పట్టణంలోని జెర్మన్‌ లూథరన్‌ మిషనరీ స్కూల్‌కు ఉన్నత చదువుల కోసం పంపించారు. అయితే బ్రిటిష్‌ వారు భారతీ యులకు చదువు నేర్పించడానికి ప్రధాన కారణం,వారి ఆజ్ఞ ప్రకారం పని చేసే సేవకు లను తయారు చేసుకోవడానికి మాత్రమే. ఏదే మైనప్పటికీ ఆ విద్య వలన ప్రజలతో నూతన ఆలోచనల వ్యాప్తి పెరిగింది. ఆచదువు ప్రజా హక్కులను వారిపై జరుగుతున్న అన్యాయాలను, అణిచి నేతలను తెలుసుకునేలా చేసింది. ఇదిలా ఉండగా, ప్రభుత్వ అధికారుల సహకారంతో మిషనరీలు గిరిజనుల భూములను ఆక్రమించు కునే పనిని మొదలు పెట్టాయి. ఈ యుక్తులకు వ్యతిరేకంగా ముండా తెగ ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. బిర్సా తనఉపాధ్యాయుల ద్వారా యూనియన్‌ ప్రజలు తమ భూమి మీద అతి తక్కువ శిస్తులు చెల్లిస్తారని తెలుసుకొని, శిస్తులను బహిష్కరించాలని తన ప్రజలకు పిలుపునిచ్చాడు. ఒక రోజు మిషనరీ మతపెద్ద బిర్సా తరగతి గదిలో ముండాల పోరాటాన్ని తీవ్రంగా ఖండిస్తుండగా,బిర్సా ఒక్క ఉదుటున లేచి నిరసన వ్యక్తం చేశాడు. తన బాల్యంలో చదువుకోవాలనే తపనతో మిషనరీ పాఠశాలో చేరిన బిర్సా,చట్టబద్దమైన ముండా తెగ ప్రజల పోరాటాన్ని మిషనరీలు ధిక్కరించడాన్ని జీర్ణిం చుకోలేక అక్కడి నుండి బయటకొచ్చాడు. 1894లో బ్రిటిష్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన అటవీ హక్కు చట్టం-8(1882), భూస్వాములకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. పాలమూ,మన్‌భమ్‌, చోటానాగ్‌పూర్‌ ప్రాంతాలలోని గిరిజన భూము లను బలవంతంగా స్వాధీనపర్చుకొని వారిని ఇండ్ల నుండి తరిమికొట్టారు.ఈ దురా గతాలకు వ్యతిరేకంగా బిర్సా ఆరు గ్రామాల ప్రజలను ఐక్యం చేసి ప్రభుత్వానికి మెమో రాండం అందించారు. కానీ ప్రభుత్వం వారి డిమాం డ్లను పూర్తిగా తిరస్కరించింది.ఈ పరి ణామా లను గమనిస్తున్న బిర్సా కేవలం,భూస్వా ములు,జాగీర్‌దారుల మీద పోరాటం చేస్తే సరిపోదని, ఈ పోరాటం వలసవాద బ్రిటిష్‌ ప్రభుత్వం మీద కూడా చేయాలని నిర్ణయించు కున్నాడు. ఆధునిక విద్యా,శాస్త్రీయ విద్య అభ్య సించిన కారణంగా బిర్సా మూఢ నమ్మకాలను ఎప్పుడు వ్యతిరేకించేవాడు.తన జాతిలోని వివిధ సంఘాలను,మత విశ్వాసా లను ఏకం చేయాలని,తన ప్రజలకు ఆధునిక విద్య అందకపోవడం వలనే ప్రకృతి వైపరి త్యాలను, వ్యాధులను ఎదుర్కోలేక పోతున్నారని భావించాడు. మూఢ నమ్మకాలు,క్షుద్ర పూజలను,అసంఖ్యాకంగా ఉన్న దేవుళ్లని అరాధించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. అత్యంత తక్కువ వ్యవధిలో ఈ ఉద్యమం ముండా తెగ ప్రజలలో నూతన విశ్వాసం నింపడంతోపాటు ఉద్యమ సైద్ధాంతిక శక్తిని కూడా పెంచింది. చుట్టుపక్కల అనేక గ్రామాల ప్రజలతో చల్‌కాడ్‌ ప్రాంతం జనసంద్రం కాగా, 20ఏండ్ల ఆ యువకుడిని ప్రజలు వారి నాయకుడిగా ఎన్నుకున్నారు. ప్రజా ఐక్యతను పెను ముప్పుగా భావించిన భూస్వాములు, మిషనరీలు బిర్సా మీద వ్యతిరేక ప్రచారం చేశాయి. ఈనేపథ్యంలో బిర్సాను, తన అను చరులను 24 సెప్టెంబర్‌ 1895లో అరెస్ట్‌ చేయించారు. రెండేండ్ల తర్వాత జైలు నుండి విడుదలైన బిర్సా సాయుధ బలగాన్ని నిర్మిం చాల్సిన ఆవశ్యకతను గుర్తించాడు. రాత్రి పగలు తేడా లేకుండా తీవ్రమైన కరువు, వ్యాధుల మీద ఆయన చేసిన పోరాటం అక్కడి ప్రజలను ఎంతో ఆలోచింపజేసింది. పీడిత ప్రజలు బిర్సా పోరాట పటిమను గుర్తించారు. ఆయన అనుచరులు చాలా గోప్యంగా బిర్సా సిద్ధాం తాలను జనంలోకి తీసుకెళ్లారు. జన సంచారం లేని దట్టమైన అడవుల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించేవారు. సంఘం పని బాధ్యతలను విభజించి తన ప్రధాన శిష్యులైన డొంక, గయాముండా, డిరకాముండా, తైత్రౌం ముండా, రిషిముండాలకు అప్పగించారు. అనవసరంగా ఎవరినీ చంపకూడదని, తన అనుచరులకు ఎప్పుడూ చెబుతుండే వాడు. ఆయుధ తిరుగుబాటు చేసి, దోపిడీకి గురికాబడే పీడిత వర్గాలను ఏకం చేసి దీర్ఘకాలిక ఉద్య మాన్ని నడపాలని పిలుపునిచ్చాడు. డిసెంబర్‌ 24,1899న రాంచీ, చారుభాషా ప్రాంతాలలో మొదలైన తిరుగుబాటు అత్యంత తక్కువ వ్యవధి లో చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపిం చింది. పోలీసులను, భూస్వాములను, వ్యాపారు లను తనను హింసించిన వారినందరినీ కసి తీరా కడతేర్చారు. జనవరి 7,1900నాడు రెండు కంపెనీల మిలటరీ బలగాలతో బ్రిటీష్‌ ప్రభుత్వం గిరిపుత్రుల మీద తూటాల వర్షం కురిపించింది. అక్కడితో ఆగకుండా గ్రామాల మీద దాడులు చేశారు. లైంగికదాడులు, హత్యలు, దోపిడీ… ఒక విధంగా చెప్పాలంటే ఊళ్లను వళ్లకాడులా మార్చేశారు. బిర్సా ముండాను పట్టుకోవడానికి ఎంతోమంది అమాయక గిరిజనులను హింసించారు. అంతిమంగా డబ్బుకు అమ్ముడుపోయిన ఒక ద్రోహి ద్వారా బిర్సాను పట్టుకోగలిగారు. 3మార్చి 1990 నాడు తమ ప్రియతమ నాయకుడిని చూసేందుకు వేలాది మంది గిరిజనులు చారుభాషా జైలుకు తరలివెళ్లారు. బిర్సాను ఉరితీస్తే పరిస్థితి అదుపుతప్పుతుందని భావించిన అధికారులు, కేసు కోర్టులో ఉండ గానే ఆహారంలో విషం కలిపి చంపేశారు. బయటి ప్రపంచానికి మాత్రం కలరా వ్యాధితో చనిపోయాడని నమ్మించారు. ఆనాడు దురాగ తాలకు, దోపిడీకి, అన్యాయానికి, హింసకు వ్యతిరేకంగా పోరాడి నేలకొరిగిన ఆ అమ రుడి త్యాగం,గొప్పతనం,నేడు దోపిడీకీ,అణివేతలకు వ్యతిరేకంగా పోరాడే ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి. ఆయన మరణం కేవలం ఒక తెగ స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసమే కాదు. బాధిత, పీడిత వర్గాల ఐక్యత కోసం. దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ దోపిడీ మాత్రం కొనసాగుతూ ఉంది. జనాభా ప్రాతిపాదికన మా రిజర్వేషన్లు మాకివ్వం డయ్యా..అని అడిగిన గిరిజనులపై లాఠీలు రaలిపించారు. మన వెలమ దొర పాలనలో దళిత, గిరిజన, బహుజనులపై జరుగుతున్న దురాగతాలు కోకోల్లలు. బిర్సా స్ఫూర్తితో అధిక సంఖ్యలో ఉన్న బాధిత, పీడిత ప్రజానీకం ఏకమై మన రాజ్యాన్ని మనమే పాలించుకోవాలి. –(మూడ్‌ శోభన్‌నాయక్‌)

వాతావరణానికి ఏమైంది?

వాతావరణం మారిపోయింది. ప్రతి నోటా ఇప్పుడు ఇదేమాట. ఆకస్మిక వరదలతో మహానగరాలు అతలాకుతలం అవుతున్నాయి. అనావృష్టితో ఎడారిని తలపించే అనంతపురం, కర్నూలు వంటి జిల్లాల్లో ఉన్నఫళంగా భారీ వర్షాలు దంచికొడతాయి. చలికాలంలో రోళ్లు పగిలే ఎండలు.. వర్షాకాలంలో ఎముకలు కొరికే చలి.. కాలాలకతీతంగా వాతావరణంలో వైపరీత్యాలు చూస్తున్నాం. శిశిరం, గ్రీష్మం, హేమంత రుతువులన్నీ ఏక మవుతున్న పరిస్థితి. ధ్రువ ప్రాంతాల్లో మంచు మేటలు కరిగిపోతున్నాయి. సముద్ర జలాలు తీరం దాటి ముంచు కొస్తున్నాయి. ప్రపంచమంతటా ప్రకృతి విపత్తులే. భూమం డలంలో సంభవిస్తున్న ఈ వైపరీత్యాలకు భూతాపం పెరిగిపోవడమే ప్రధాన కారణం. మానవాళి కొనితెచ్చు కున్న ఈ విపత్తును నివారించకపోతే వాతావరణ మార్పుల ప్రభావం మానవ మనుగడకే ముప్పు తెస్తుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. భూతాపాన్ని తగ్గించాలంటే కర్బన ఉద్గారాలను తగ్గించు కోవాలి. పారిశ్రామిక విప్లవ నేపథ్యంలో అమెరికా, బ్రిటన్‌ లాంటి సామ్రాజ్యవాద దేశాలు ప్రపంచంలోని మిగిలిన అన్ని దేశాలకంటే ముందే కర్బన ఉద్గారాలు యథేచ్ఛగా వెదజల్లి పర్యావరణాన్ని పాడు చేశాయి. కర్బన ఉద్గారాల్లో ఇప్పటికీ పెట్టుబడిదారీ దేశాలదే మెజార్టీ వాటా. కానీ పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే త్యాగాలు తప్ప వంటూ … ఆ త్యాగం పేద దేశాలు, వర్ధమాన దేశాలు చేయాలన్నదే అమెరికా, దాని అనుంగు దేశాల వాదన. ప్రపంచ దేశాల మధ్య యుద్ధోన్మాదాన్ని రగిలిస్తూ ఐక్యతను దెబ్బతీస్తున్న ఈ పెట్టుబడిదారీ దేశాలు ఇటు ప్రజలకే కాకుండా పర్యావరణానికి కూడా ప్రధాన శత్రువులే అనేందుకు వారు చేస్తున్న ఈ వాదనే నిదర్శనం.
భూమండలంపై పెరుగుతున్న ఉష్ణో గ్రతలను1.5సెంటిగ్రేడ్‌ డిగ్రీలకు పరిమితం చేయాలన్నది 2015లో పారిస్‌ ఒప్పందంలో ప్రపంచ దేశాలకు నిర్దేశించిన ప్రధాన కర్తవ్యం. కానీ అమెరికా లాంటి దేశాలు ఈ ఒప్పందం నుంచి వైదొలిగి నేలతల్లికి ద్రోహం చేశాయి. జీవా వరణాన్ని ధ్వంసం చేసిన పెట్టుబడిదారీ దేశాలే మిన్నకుండిపోతే ఇక పేద,వర్ధమాన దేశాలు చేసే దేముంది? భూతాపం అందుకే పెను ప్రమాదంగా మారుతోంది. భూతాపాన్ని తగ్గించేందుకు ప్రస్తుతం ప్రపంచ దేశాలు తీసుకుంటున్న చర్యలు ఏ మూ లకూ చాలవని ఐక్యరాజ్యసమితి సైతం ఆందోళన వ్యక్తం చేసిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. భూమండలం వాతావరణ సంబంధిత తుపానులు, వడగాలులు, వరదలతో ఇబ్బందులు పడుతోందని, ఉష్ణోగ్రతలు కూడా పారిశ్రామిక యుగానికి ముందు నాటి స్థాయిల కన్నా ఎక్కువగా 1.2 డిగ్రీల సెల్సి యస్‌కు చేరుకుందని ఐక్యరాజ్య సమితి వాతావరణ నిపుణులు హెచ్చరించారు. పెట్రోలు, డీజిలు వంటి శిలాజ ఇంధనాల వినియోగంవల్ల గాల్లోకి వెదజల్లే గ్రీన్‌హౌస్‌ వాయువులే భూతాపానికి కారణం. భూమండలానికి రక్షణగా ఉన్న ఓజోన్‌ పొరను ఈ గ్రీన్‌హౌస్‌ వాయువులు ధ్వంసం చేయడం వల్ల సూర్య కిరణాలు నేరుగా భూమిని తాకడంతో భూతాపం పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా 1.5 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రతలను పరిమితం చేసేందుకు అనుసరించాల్సిన పంథాకు కనీసం దగ్గరలో కూడా లేమన్నది ఐక్యరాజ్య సమితి వాతా వరణ మార్పుల విభాగం ఆందోళన. 2010 స్థాయిలతో పోలిస్తే 2030 నాటికి కాలుష్య వాయు వులు43శాతం తగ్గాల్సిన అవసరం వుంది. అప్పుడే పారిస్‌ ఒప్పంద లక్ష్యాన్ని సాధించగలం. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే 2030 నాటికి కాలుష్యాలు 10.6శాతం పెరిగాయని ఐరాస నివేదిక పేర్కొన డం మానవాళి ముందున్న ప్రమాదాన్ని తెలియ జేస్తోంది.శిలాజ ఇంధనాల వినియోగంతో పెరిగి పోతున్న కాలుష్యం ప్రజల ప్రాణాలనూ తోడే స్తోంది. భారత్‌లో 2021లో ఏకంగా 3,30,000 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ‘ద లాన్సెట్‌’ మెడిక ల్‌ జర్నల్‌ నివేదించింది. ప్రతి రెండు నిమిషాలకు ఒకరు కాలుష్య కాటుకు బలైపోతున్నారన్నమాట. పర్యావరణ, వైద్యారోగ్య నిపుణుల హెచ్చరికలు పారిశ్రామిక యుగంలో తెగబలిసిన పెట్టుబడిదారీ దేశాల ప్రభుత్వాధినేతలకు తలకెక్కడం లేదు. ఈజిప్టులో నవంబరు 6 నుంచి 18 వరకూ కాన్ఫ రెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌ (కాప్‌) 27 సదస్సు జరగనుంది. వాతావరణ మార్పుల సమస్యను చక్కదిద్దేందుకు చేపట్టాల్సిన కార్యాచరణను రూపొందించడమే ఈ సదస్సు ముఖ్యోద్దేశం. బ్రిటన్‌ నూతన ప్రధానమంత్రి రిషి సునాక్‌ ఈసదస్సుకు హాజరుకాబోరని కథనాలు వెలువడ్డాయి. పర్యావరణ పరిరక్షణకు తమ మద్ద తు ఉంటుందని సుభాషితాలు వల్లించే ఆధిపత్య దేశాల అధినేతలు కాప్‌ వంటి సదస్సులకు డుమ్మా కొట్టడం వారి అసలు నైజాన్ని చాటుతోంది. పర్యా వరణం అంటే మన చుట్టూ ఉండే జీవావరణమే. దీనిని రక్షించుకోవడం మనందరి బాధ్యత.
ఎందుకీ అధిక వర్షాలు.. అసలు కారణాలేంటి?
కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి దాకా ఒకటేవర్షాలు. అదికూడా రోజుల తరబడి. గతం లో ఎప్పుడూ ఇలాంటి వాతావరణం లేదు. వాగులు పొంగుతున్నాయి. వంకలు పొర్లుతున్నా యి. చెరువులు అలుగులు పోస్తున్నాయి. నదులు ఉప్పొంగుతున్నాయి. పట్టణాలు నీట మునుగుతు న్నాయి. నగరాలు కాకావికలమవుతున్నాయి. కాలం కాని కాలంలో వర్షాలు కురుస్తుండడంతో మనిషి జీవితం అస్తవ్యస్తమవుతోంది. పంటలన్నీ చేతికొచ్చే సమయంలో జలార్పణమవుతున్నాయి.రోడ్లు కొట్టుకుపోతుండటంతో ప్రభుత్వానికి ?కోట్లల్లో నష్టం వాటిల్లుతోంది. గతంలో ఒకటి లేదా రెండు మహా అయితే మూడు రోజుల వరకే వర్షం పరిమి తమయ్యేది. తర్వాత కొంచెం గ్యాప్‌ ఇచ్చి కురిసేది. కానీ కొన్నేళ్ల నుంచి వర్షం కురిస్తే రోజుల తరబడి ఉంటున్నది.
ఎందుకు ఈ అకాల వర్షాలు
వాతావరణంలో ఆకస్మాత్తుగా చోటు చేసుకుంటున్న మార్పులకు అసలు కారణం భూమి వేడెక్కడం..సైన్స్‌ పరిభాషలో చెప్పాలంటే గ్లోబల్‌ వార్మింగ్‌. భూమి మీద వాతావరణం సూర్యరశ్మీని గ్రహించి వేడెక్కుతుంది. ఆ వేడిని చుట్టూ వ్యాపింప చేస్తుంది. ఇదే లేకపోతే భూమిచల్లగా ఉండి అసలు జీవించడానికి పనికొచ్చేది కాదు. అయితే సహజం గా ఏర్పడే ఈగ్రీన్‌ హౌస్‌ ఎఫెక్ట్‌కు మనుషులు చేసే పనులు మరింత వేడిని పెంచుతున్నాయి. ఆధునిక వ్యవసాయం, పురుగు మందుల వాడకం పెరగటం,కాలుష్యంవల్ల మరిన్ని ఉద్ఘారాలు విడు దలై వాతావరణంలో వేడిని మరింత ఎక్కువ చేస్తు న్నాయి. వాస్తవానికి వాతావరణంలో కార్బన్‌ డై యాక్సైడ్‌ సహజంగా ఉంటే ప్రకృతి సమతుల్యం అసలు చెడిపోదు.కానీ పెట్రోలు ఉత్పత్తుల వాడకం పెంచడంతోపాటు వాటి నుంచి వెలువడే కార్బన్డ యాక్సైడ్‌ ను గ్రహించే చెట్లను ఇష్టానుసారంగా కొట్టేస్తుండటంతో కర్బన సంబంధ,సల్ఫర్‌ సంబంధ ఉద్గరాలు పెరిగిపోతున్నాయి.పారిశ్రామిక అభివృద్ధి తర్వాత గాలిలో కార్బన్‌ డయాక్సైడ్‌ స్థాయిలు 30 శాతం,వాయువులు 140శాతంపెరిగాయని పర్యా వరణవేత్తలు చెబుతున్నారు. పైన మండే సూర్యుడు కింద చల్లని సముద్రాలు ఉండగా పర్యావరణానికి మనం కలిగించగల నష్టం ఏపాటిదిలే అనుకున్న మనిషిదాన్ని ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. గనుల్ని ఇష్టానుసారంగా తవ్వడం, పరిశ్రమలు ఏర్పాటు చేసి ఘన, ద్రవ, వాయు వ్యర్థాలను ఇష్టాను సారంగా గాలిలోకి, నీటిలోకి వదలడం వల్ల పర్యా వరణ చక్రం గతి తప్పుతోంది. విద్యుత్‌ అవసరా లకు బొగ్గును మండిచడం, వ్యవసాయ అవసరా లకు,గృహఅవసరాలకు అడవులను ఇష్టాను సారం గా కొట్టేయడం,సముద్రాలను డంపింగ్‌ యార్డ్‌ లుగా మార్చడంవల్ల జరగాల్సిన నష్టంజరిగి పోతోంది.
ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి
మనిషి శరీర ఉష్ణోగ్రత రెండు డిగ్రీలు పెరిగితేనే తట్టుకోలేడు. కొంతకాలంగా భూమి ఉష్ణోగ్రత పెరుగుతూ వస్తోంది. మనిషి చేస్తున్న విధ్వంస పనులే భూమి వేడిని అంతకంతకు పెంచు తున్నాయి. ఈ ఉష్ణోగ్రతల పెరగడం వల్ల ధ్రువ ప్రాంతాల్లో మంచు వేగంగా కరుగుతోంది. అక్కడ మంచు కరిగితే మనకొచ్చే ముప్పు చాలా తీవ్రంగా ఉంటుంది. అదే తీరిన కరుగుతూ ఉంటే ఈ శతాబ్దం అంతానికి సముద్ర నీటిమట్టం ఒక మీటర్‌ వరకు పెరుగొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తు న్నారు. అదే జరిగితే మాల్దీవులు,సీ షెల్స్‌ వంటి ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన దీవులన్నీ మునిగిపోతా యి. లండన్‌, వియత్నాం నెదర్లాండ్స్‌ బంగ్లాదేశ్‌ లాంటి దేశాల్లో చాలా భాగం ముంపునకు గురవు తుంది. అధికంగా సముద్రతీరం ఉన్న మనదేశం లోనూ నష్టం అపారంగా ఉంటుంది. కలకత్తా, చెన్నై,ముంబాయి, కేరళ వంటి వాటిపై ఆశలు వదులుకోవాల్సి ఉంటుంది.-జిఎన్‌వి సతీష్‌

ప్లాస్టిక్‌ రహితం..ఇంకెంత దూరం.?

దశాబ్దాలుగా ప్లాస్టిక్‌ వినియోగం తీవ్రస్థాయికి చేరుకోవటం ఎన్ని సమస్యలు సృష్టిస్తోందో.. కళ్లకు కడుతూనే ఉంది. నిషేధిస్తున్నా మంటూ ప్రభుత్వాలు ప్రకటించటం..ఈ నిర్లక్ష్యం కారణంగానే ప్రజారోగ్యం బలి అవుతోంది.అటు మూగజీవాల ప్రాణాలకూ ముప్పుపొంచి ఉంటోంది. ఇలా నిత్య జీవన విధానం ఫాస్టిక్‌ మయంగా మారింది.రోజురోజుకీ పెరుగుతోన్న ప్లాస్టిక్‌ వినియోగం అనివార్యంగా మారుతోన్న తరుణంలో మానవ ఉనికినే ప్రశ్నర్థాకంగా మార్చేస్తోంది.
మొన్నటి వరకు సముద్రాలు,నదుల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్‌ వ్యర్థాల గురించి మాట్లాడు కున్నాం, కానీ ఇప్పుడు మానవ శరీరంలోకి చేరుతోన్న ప్లాస్టిక్‌ గురించి మాట్లాడుకునే రోజులువచ్చాయి. మనుషుల రక్తంలో ప్లాస్టిక్‌ రేణువులను శాస్త్రవేత్తలు గుర్తించారు. తల్లి పాలల్లో దీని అవశేషాలున్నట్లు గుర్తించడం విశేషం. ప్లాస్టిక్‌,కాలుష్యం అధికమై వాతావరణంలో పెనుమార్పులు సంభవిస్తున్నాయి. మంచుకొండలు కరిగిపోయి సముద్రంనీటిమట్టం పెరిగిపోతుంది. అకాలతుఫాన్లు ప్రభావంతో యావత్తు ప్రపంచ దేశాలు అతాలకుతలమై పోతున్నాయి.
జశీఅటవతీవఅషవ శీట ్‌ష్ట్రవ ూaత్‌ీఱవం (కాన్ఫెరెన్స్‌ఆఫ్‌ ద పార్టీస్‌)దీనినే షార్ట్‌గా (కాఫ్‌) జూఅని పిలుస్తారు. ప్రతిఏటా197 దేశాలను ఒకచోట చేర్చే సదస్సు ఇది.వాతావరణ మార్పులు,దాని ద్వారా ఏర్పడే సమస్యల గురించి ఈ సదస్సు ప్రధానంగా చర్చిస్తుంది.వాతావరణ మార్పులపై యునైటెడ్‌ నేషన్స్‌ ఆధ్వర్యంలో జరిగే కన్వెన్షన్‌ ఇది. పర్యావరణంపై మానవ కార్యకలాపాల ప్రభావాన్ని పరిమితం చేయడమే లక్ష్యంగా ప్రపంచంలోని ప్రతిదేశం,ప్రతి భూభాగం అంగీకరించి సంతకం చేసిన అంతర్జాతీయ ఒప్పందం కాప్‌.ఇలాంటి సదస్సలు ఇప్పటి వరకు 26 జరిగాయి. కాఫ్‌సదస్సుల్లో ఎన్నినిర్ణయాలు తీసుకున్నా ఏదేశం కూడా అమలు పర్చడంలో నిర్లక్ష్యవైఖరి అవలంబించడం శోచనీయం.
అంతర్జాతీయంగా మానవజాతిని అవహిస్తున్న ప్లాస్టిక్‌ను పూర్తిస్థాయిలో బాన్‌ చేయాల్సిన అవసశ్యకత ఎంతైనా ఉంది.ప్లాస్టిక్‌ను నియంత్రిస్తున్నమని ప్రగాల్బలు పలికే దేశాలు,రాష్ట్రాలు కేవలం ముక్కుబడిగానే అమలు చేస్తున్నాయి తప్పా కఠినమైన వైఖరిని అవలంబించడం లేదనే అందరికీ తెలిసిన విషయమే.ఎందుకంటే ప్రతివ్యక్తి జీవితంతో ప్లాస్టిక్‌ ముడిపిడి ఉంది.దీని నియంత్రణకు చట్టాలు,ప్రభుత్వాలున్నాయి.ఐక్య రాజ్య సమితి సైతం పదేపదే హెచ్చరిస్తూనే ఉంది.అయినా మానవ జాతిలో మార్పులురావడం లేదు. కంటికి కనిపించని సూక్ష్మమైన ప్లాస్టిక్‌ రేణువులు పీల్చేగాలి,చెత్తా ప్లాస్టిక్‌ అంతా డ్రైనేజీ,సముద్రాలు,చెరువులు,నదులు..ఇలా ఎక్కడ పడితే అక్కడ వ్యర్థాలు ఉండిపో తున్నాయి. ఫలితంగా యావత్తు మానవ శిశువులతోపాటుగా,జంతువులు,పక్షులు,జలచరాలు,కీటకాలు అన్ని చనిపోతున్నాయి.ప్రస్తుతం ప్లాస్టిక్‌ వ్యవర్థాలను భూమిపై పడేయడంతో అవి భూమిలో కరిగిపోకుండా ఎంతో ప్రమాదాన్ని తెచ్చిపెడుతోంది.
రెండు దశాబ్దాల క్రితం తూర్పు కనుమల్లో గిరిజన ప్రాంతాలు ప్రకృతి అందాలో ఆహ్లాదక రంగా ఉండేది. ప్రస్తుతం నేడుకొండకోనల్లోను ప్లాస్టిక్‌భూతం అవహించింది.రోజువారీ వాడి పారేసిన వస్తువులు,భూమిలో పూర్తిగా కరిగిపోవడం,పచ్చని పొలాలపై దీని ప్రభావం పడుతోంది. రైతులు పండిరచే పంటలు దిగుబడి తగ్గిపోతోంది. ప్లాస్టిక్‌ నియంత్రణపై పరిపాలనలో మార్పులు రావాలి. ప్లాస్టిక్‌ వాడకం తగ్గాలంటే దీని తయారి పరిశ్రమలను శాశ్వతంగా నియంత్రించాలి. అందుకు ప్రభుత్వాలు నిర్ధిష్టమైన,కఠినమైన నిర్ణయాలు తీసుకొని అమలు పర్చాలి.అలాగే పంచాయితీ స్థాయిలో ప్లాస్టిక్‌ రహిత సమాజాన్ని రూపుదిద్దేలాచర్యలు తీసుకోవాలి. ప్లాస్టిక్‌ రహిత సమాజంగా తీర్చిదిద్దాలి. ఇలాంటి మార్పును ప్రజలు సైతం స్వాగతించకపోతే,కాలుష్యం,ప్లాస్టిక్‌ మానవ జీవితాన్ని మరింతగా కృంగదీసి ప్రమాదాలు సంభవించే అవకాశాలున్నాయి.- రెబ్బాప్రగడ రవి ,ఎడిటర్. 

నిరుద్యోగంతో..ఆకలి కేకలు

ప్రపంచవ్యాప్తంగా ఆహార అభద్రత నానాటికీ పెరిగిపోతుండటం ఆందోళనకరంగా మారింది. ఐక్యరాజ్యసమితి ఇటీవల విడుదల చేసిన ‘ప్రపంచంలో ఆహార భద్రత, పోషకాహార పరిస్థితి నివేదిక-2019’ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నది. దీని ప్రకారం ప్రపంచంలో ఆకలితో అలమటిస్తున్నవారు 82 కోట్ల మంది (దాదాపు 11శాతం) ఉన్నారు. అయితే భారత్‌లో కూడా ఆకలి చావులు నమోదవు తున్న నేపథ్యంలో..
దేశంలో ఏటేటా పెరగుతున్న నిరుద్యోగ సమస్యే దీనికి ప్రధాన కారణమని ఐరాస నొక్కి చెప్పడం గమనార్హం.‘2017-18 నుంచి భారత్‌లో పెరుగుతున్న నిరుద్యోగం, దేశ ఆర్థిక పరిస్థితి అంతకంతకూ దిగజారుతుండటం ఆకలి బాధలకు కారణమవుతున్నది’ అని యూఎన్‌ పేర్కొన్నది. భారత్‌లో నిరుద్యోగ సమస్య ఇప్పటిది కాకపోయినా గడిచిన మూడేం డ్లుగా అది మునుపెన్నడూ లేనంతగా పెరిగిపోతున్నది. తాము అధికారం లోకి వస్తే ఏటా రెండుకోట్ల ఉద్యోగాలిస్తామని గద్దె నెక్కినమోడీ సర్కారు. తద నంతర కాలంలో ఆహామీని తుంగలోతొక్కింది.ఉపాధి దొరక్క, తిండి లభించక కోట్లాది మంది పస్తులుంటున్నారు. ఈఏడాది జనవరిలో నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఆఫ్‌ ఆర్గనై జేషన్‌ (ఎన్‌ఎస్‌ఎస్‌వో) గణాంకాల ప్రకారం..దేశంలో నిరుద్యోగిత రేటు 45ఏండ్ల గరిష్టానికి (6.1శాతం)చేరుకున్నది. 2017-18కి సం బంధించిన ఆ నివేదికను తొలుత దాచిపెట్టిన మోడీ సర్కారు..ఎన్నికలు ముగిసిన తర్వాత విడుదల చేయడం గమ నార్హం.2016 నవంబర్‌లో ప్రధాని మోడీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దు తర్వాత దేశంలో వేలాదిమంది నిరుద్యో గులుగా మారారని జాతీయ,అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు గొంతెత్తి మొత్తుకున్నా మోడీ సర్కారు దానిని పెడచెవిన పెడు తున్నది. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అసలే ఉద్యోగాలు కోల్పో యి ఇబ్బందులెదుర్కొంటున్న ప్రజలపై బీజేపీ సర్కారు జీఎస్టీ పేరిట మరో మోయలేని భారం మోపింది.‘ఒకే దేశం-ఒకే పన్ను’ అంటూ తీసుకొచ్చిన జీఎస్టీ..చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలను కోలుకోలేని దెబ్బ తీసిందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు…! దీంతో ఆయా రంగాల్లో పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. పెద్దనోట్ల రద్దు,జీఎస్టీ వంటి ఆర్థిక పరమైన నిర్ణయాలే గాక దేశంలో వ్యవ సాయం మీద మోడీ సర్కారు చూపుతున్న అశ్రద్ద కూడా గ్రామీణ పేదల ఆకలికి కారణమవుతున్నదనేది విశ్లేషకుల వాదన. ఒవైపు వర్షాలు కురవక, వరుస కరువుతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మరోవైపు రైతాంగంపై అప్పుల భారం వారిని ఆత్మ హత్య లకు ఉసిగొల్పు తున్నది. గిట్టుబాటు ధరల్లేక ఆర్థికంగా చితికి పోయిన రైతులు ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తుంటే మోడీ సర్కారు మాత్రం వ్యవసాయా న్ని కార్పొరేట్‌లకు అప్పగించి రైతు ఆదా యాన్ని పెంచుతామని చెబుతుండటం విడ్డూరం.
వేలెత్తి చూపిస్తున్న ఆకలిచావులు
ప్రపంచ ఆరోగ్య సూచీ నివేదిక ప్రకారం భారత్‌లో 2016-18 నాటికి 19.44కోట్ల (దేశ జనాభాలో సుమారు 14.5శాతం) మంది ఆకలితో అలమటిస్తున్నారు. గతంతో పోల్చు కుంటే 2015 వరకు ఆకలి సమస్య కొంతమేర తగ్గినా ఆ ఏడాది నుంచి మళ్లీ అవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ఆహార అభద్రత కారణం గా జార్ఖండ్‌లో నమోదవుతున్న ఆకలి చావులు విశ్వ యవనికపై భారత్‌ను వేలెత్తి చూపుతు న్నాయి. అనధికారిక లెక్కల ప్రకారం.. గడిచిన రెండేండ్లలో జార?ండ్‌లో సుమారు 20 మంది ఆకలి బాధలు తట్టుకోలేక మరణించారు. రాష్ట్రంలోని బీజేపీ సర్కారు పేదలకు రేషన్‌కార్డు లివ్వకపోవడం దీనికి ఒక సమస్యైతే, రేషన్‌ కార్డులకు ఆధార్‌ను అనుసంధానం చేయడం కూడా ఈ చావులకు కారణమైందని హక్కుల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఆకలితో అలమ టించేవారే గాక పోషకాహార లోపం కూడా దేశంలో ప్రధాన సమస్యగా ఉన్నది. అధికారిక లెక్కల ప్రకారం..దేశంలో పదిశాతం పిల్లలు మాత్రమే సమతుల్య ఆహారాన్ని తీసుకుంటు న్నారు. ఆర్నెళ్లలోపు ఉన్న చిన్నారుల్లో 54 శాతం మంది మాత్రమే తల్లిపాలు తాగుతు న్నారు. దీనిని 2025 నాటికి 25శాతానికి తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నా ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమయ్యే పని కాదని న్యూట్రీషన్‌ నిపుణుడు డాక్టర్‌ అంత ర్యామి దాస్‌ తెలిపారు.
ప్రపంచ ఆకలి సూచిక లో దిగజారిన భారత్‌
పాక్‌, బంగ్లాదేశ్‌ కన్నా వెనుకబడ్డ ఇండియా
గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌,2022లో 121 దేశా లలో భారతదేశం ఆరు స్థానాలు దిగజారి 101 నుంచి 107వ ర్యాంక్‌కు పడిపోయింది. యుద్ధంతో దెబ్బతిన్న ఆఫ్ఘనిస్తాన్‌ మినహా దక్షిణాసియాలోని చాలా దేశాల కంటే వెనుక బడి ఉంది. 29.1స్కోర్‌తో,గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ ప్రచురణకర్తలు,యూరోపియన్‌ ఎన్‌జి ఓలు కన్సర్న్‌ వరల్డ్‌వైడ్‌ మరియు వెల్తుంగర్‌ హిల్ఫ్‌, ఆకలి స్థాయిని తీవ్రమైనదిగా ట్యాగ్‌ చేశారు.121 దేశాలGనIలో ఎనిమిది స్థానాలు దిగజారి 84వ ర్యాంక్‌కు చేరుకున్న బంగ్లాదేశ్‌, గతేడాది 76వర్యాంక్‌తో పోలిస్తే చాలా మెరుగు పడిరది. దాదాపు అన్ని పొరుగు దేశాలు బాగా మండిపడ్డాయి. పాకిస్థాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, నేపాల్‌ మరియు మయ న్మార్‌ వరుసగా 99, 64,84,81మరియు 71స్థానాల్లో నిలిచాయి. ఐదు కంటే తక్కువ స్కోర్‌తో మొత్తం 17 దేశా లు సమిష్టిగా1మరియు 17మధ్య ర్యాంక్‌ పొందాయి.
గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ అనేది ప్రపంచవ్యాప్తంగా అలాగే ప్రాంతాల వారీగా మరియు దేశం వారీగా ఆకలిని కొలిచే మరియు ట్రాక్‌ చేసే సాధనం. 2022 గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ అనేక దేశాలలో భయంకరమైన ఆకలి కుంభకోణాన్ని ప్రతిబింబిస్తుంది, అలాగే ఆకలిని ఎదుర్కోవడంలో దశాబ్దాల పురోగతి క్షీణిస్తున్న దేశాలలో మారుతున్న పథం రెండిరటినీ ప్రతి బింబిస్తుంది. ఆకలిసూచిక స్కోర్‌లు నాలుగు కాంపోనెంట్‌ ఇండికేటర్‌ల విలువలపై ఆధారపడి ఉంటాయి: పోషకాహార లోపం, పిల్లల పెరుగుదల,పిల్లల వృధా మరియు పిల్లల మరణాలు. పోషకాహార లోపం తగినంత కేలరీల తీసుకోవడంతో జనాభాలో వాటాను సూచిస్తుంది. ఇండెక్స్‌లో ఎక్కువ స్కోర్‌ అంటే ఆకలి పరిస్థితి మరింత దిగజారడం. సున్నా అనేది ఉత్తమ స్కోర్‌..ఆకలి లేదని సూచిస్తుంది.
ప్రతిపక్షాల విమర్శలు ఆకలిసూచీలో భారత్‌ ర్యాంక్‌ పడిపోవడంపై తెలంగాణ మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ మరియు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ మంత్రి కెటి రామారావు ట్విట్టర్‌లో ఇలా వ్రాశారు. ఇంకో రోజు చీూA ప్రభుత్వం సాధించిన మరో అద్భుతమైన విజయం. గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌లో భారత్‌ 101వ స్థానం నుంచి 107వ ర్యాంక్‌కు పడిపోయింది. వైఫల్యాన్ని అంగీకరించే బదులు, బీజేపీ జోకర్లు ఈ నివేదికను ఇప్పుడు భారత వ్యతిరేక నివేదిక గా కొట్టిపారేస్తారని నేను ఖచ్చితంగా అనుకుం టున్నాను.
కరోనాతో సమస్య..
ఈ సూచీలో భారత్‌ స్థానం 101కాగా, పాకి స్తాన్‌ 92వ స్థానంలో, నేపాల్‌, బంగ్లాదేశ్‌ 76వ స్థానంలో, మయన్మార్‌ 71వ స్థానంలో నిలిచాయి. ఇవి భారత్‌ కన్నా మెరుగ్గా ఉన్నప్ప టికీ.. ఇవి కూడా తమ దేశ ప్రజల ఆకలిని తీర్చడంలో ప్రమాదకర స్థాయిలోనే ఉన్నాయని నివేదిక తెలిపింది. కరోనా కారణంగా చాలా దేశాల హంగర్‌ ఇండెక్స్‌ దిగజారిందని వెల్ల డిరచింది. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఆకలిపై పోరాటం సరైన మార్గంలో సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, ఐదేళ్ల లోపు పిల్లల మరణాల విషయంలో భారత్‌ మెరుగైన ఫలితాలను సాధించింది. కరోనా సంబంధిత ఆర్థిక, ఆరోగ్య సవాళ్లు,వాతావరణ మార్పు, ప్రపంచ దేశాల మధ్య ఘర్షణలు.. ఆహార భద్రతను దెబ్బతీస్తున్నాయని ఈ నివేదిక వెల్లడిరచింది. దేశాలు,ప్రాంతాలు,వర్గాల మధ్య అసమానతలు తొలగనంతవరకు సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాలను సాధించలేమని స్పష్టం చేసింది.
ఆకలి సూచికలపై కాషాయ దళాల మండిపాటు
తాజాగా ప్రకటించిన 2022 ప్రపంచ ఆకలి సూచికలో మన దేశ స్థానం మరింత దిగ జారింది. గతేడాది 116 దేశాలకు గాను 101వదిగా ఉంటే ఇప్పుడు 121లో 107వ స్థానం. గత ఎనిమిది సంవత్సరాలుగా ఆకలి సూచికలో మనకు దక్కుతున్న స్థానం గురించి ప్రతి ఏటా కాషాయ దళాలతో పాటు మరి కొందరు తప్పు పడుతున్నారు. అసలు ఆ లెక్కలే తప్పు, లెక్కించిన పద్ధతే తప్పు, పరిగణన లోకి తీసుకున్న అంశాలే సరైనవి కాదు, ప్రభుత్వేతర సంస్థలు (ఎన్‌జిఓ) చెప్పే వాటిని లెక్కలోకి తీసుకోనవసరం లేదని వాదనలు చేస్తున్నారు. మూడు వేల మందిని ప్రశ్నించి దాన్నే దేశమంతటికీ వర్తింపచేయటం ఏమిటి అని ఆశ్చర్యం నటిస్తున్నారు. నిజమే ఇలాంటి వాదన లను ప్రభుత్వం కూడా చేస్తున్నది,ఖండి స్తూ ప్రకటనలు చేస్తున్నది. ఐరాసలో 193 దేశాలకు సభ్యత్వం ఉంది, మరో రెండు పరిశీలక దేశాలు, అసలు చేరని దేశాలూ ఉన్నాయి. ఇప్పుడు నివేదిక రూపొందించిన సంస్థలకు సమగ్రంగా తమ సమాచారం ఇచ్చిన దేశాలు 121 మాత్రమే. అది స్వచ్ఛందం తప్ప ఇవ్వక పోతే తల తీసేదేమీ ఉండదు.ఒక్క ఆకలి సూచికనే కాదు, అనేక సూచికలను ఎప్పుడైనా మోడీ సర్కార్‌ లేదా దాని మద్దతుదార్లు అంగీక రించారా? లేదు, ఎందుకంటే అన్నింటా అథమ స్థానాలే. ఆకలి సూచికలను రూపొందిం చేందుకు ప్రాతిపదికగా తీసుకున్న నాలిగింటిలో మూడు పిల్లల ఆరోగ్యానికి సంబంధించినవి, వాటిని మొత్తం జనాభాకు ఎలా వర్తింప చేస్తారు అన్నది కేంద్ర ప్రభుత్వ అభ్యంతరాల్లో ఒకటి. అయితే అన్ని దేశాలకూ ఒకటే పద్ధతిని అనుసరించారు కదా! పోషకాహార లేమికి గాను కేవలం మూడు వేల మందితో జరిపిన సర్వేను ఎలా ప్రాతిపదికగా తీసుకుంటారు అన్నది మరొక అభ్యంతరం. ఇది కూడా అన్ని దేశా లకూ ఒకటే పద్ధతి. నివేదికను రూపొం దించిన సంస్థలు తాముగా ఎలాంటి సర్వేలు జరపలేదు. ప్రభుత్వం చెబుతున్న మూడు వేల మందిని సర్వే జరిపింది ఐరాస సంస్థలలో ఒకటైన ఆహార మరియు వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ).అది కూడా వేరే సంస్థ ద్వారా చేయించింది. ఆ సమాచారాన్నే నివేదికను రూపొందించిన ‘వెల్ట్‌ హంగర్‌ హిల్ఫ్‌, కన్సర్న్‌ వరల్డ్‌ వైడ్‌’ తీసుకున్నాయి. అనేక అధికారిక సంస్థల సమాచారాన్ని కూడా అవి తీసుకు న్నాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ నేత అశ్వనీ మహాజన్‌ స్వదేశీ జాగరణ మంచ్‌ సహ కన్వీనర్‌గా పని చేస్తున్నారు.-సైమన్‌ గునపర్తి

హరిస్తున్న వలస కార్మికుల హక్కులు

అత్యధిక మంది వలస కార్మికులు వ్యవసాయం, పరిశ్రమలు, నిర్మాణ రంగాలలో కనిపిస్తారు. దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో10శాతం వలస కార్మికుల శ్రమ నుండే వస్తోంది.అయితే, వలస కార్మికులు ఎంతమందివున్నారు? వారు ఏ రంగంలో పని చేస్తున్నారు? ఎక్కడ నుండి ఎక్కడకు వెళ్తున్నారు? తెలుసుకునే వ్యవస్థ లేదు. పర్మినెంట్‌ వర్కర్ల కంటే ఏడు రెట్లు అధికంగా వలస కార్మికులు వున్నట్లు జాతీయ శాంపిల్‌ సర్వే ఆర్గనైజేషన్‌ గణాంకాలు తెలియ జేస్తున్నాయి. దుర్బలమైన, ప్రమాదకరమైన, ఎటువంటి భద్రత లేని పరిస్థితులు ఈ రంగం లో నెలకొన్నాయి.2011జనాభా లెక్కల ప్రకారం45కోట్ల 60లక్షల మంది వలస కార్మి కులు ఉన్నారు. వీరిలో 41శాతం మంది తమంతట తాముగా వలస కార్మికులుగా మారలేదు. తమ ప్రాంతాలలో నెలకొన్న నిరుద్యోగం వలస వెళ్ళాల్సిన పరిస్థితికి నెట్టింది. వీరి జనాభా లెక్కలు సరిగా వుండవు. వాటి మీద ఆధారపడలేం. ఐక్యరాజ్యసమితిలో భాగంగా ఉన్న విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ 2013లో దేశంలో అంతర్గతంగా తిరిగే వలస కార్మికులు కోటిన్నర నుండి10కోట్ల మంది ఉన్నట్లు అంచనా వేసింది. ఏరకంగా చూసినా భారతదేశంలో వలస కార్మికులు అసంఘటిత రంగంలో అత్యధికంగా ఉన్నట్లు తేలుతుంది. అందుకని వీరి పట్ల అధిక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది.ముఖ్యంగా పేదరికం,దుర్బలత,అభద్రత,ఉద్యోగంలో పెట్టుకునే పద్ధతికి…ఈ కార్మికుల సామాజిక స్థాయికి మధ్య ఉన్న సంబంధాన్ని అర్ధం చేసు కోవాలి. ఈ కారణంగా వీరు ప్రమాదక రమైన,అతి తక్కువ వేతనాలున్న పనులను చేయాల్సి వస్తోంది. కుల,లింగవివక్షలను ఎదుర్కొంటున్నారు.కీలక రంగాలైన వ్యవ సాయం,పరిశ్రమలు,నిర్మాణరంగాల కార్య కలాపాలు వీరు లేనిదే నడవవు. కానీ వీరి కనీస భద్రత, న్యాయమైన వేతనాలను పట్టించు కునే దిక్కులేదు. వలస కార్మికులకు వర్తించే ప్రస్తుత చట్టాలు లేబర్‌ కోడ్లలో భాగం కాను న్నాయి. లేబర్‌ కోడ్‌లు అమలులోకి వచ్చే లోపు ‘అంతర్‌ రాష్ట్ర వలస కార్మికుల చట్టం-1979, భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల (పని మరియు సర్వీసు కండిషన్ల క్రమబద్ధీకరణ) చట్టం-1996, అసంఘటిత కార్మికులసామాజిక భద్రతా చట్టం-2008 అమలులో వుంటాయి. కోవిడ్‌ సమయంలో వలస కార్మికులు ఎదు ర్కొన్న విషాదకర పరిస్థితులను, ఆరోగ్య-సామా జిక భద్రతా వైఫల్యాలను గమనించిన అత్యు న్నత న్యాయస్థానం తనంత తానుగా వీరి తరపు న కేసు తీసుకొని అనేక నిర్ధారణలకు వచ్చింది. అయితే ఈలోగా వలస కార్మికుల చట్టం-1997ను ప్రభుత్వం రద్దు చేసినప్పటికీ, ప్రభుత్వానికి అనేక ఆదేశాలను, సిఫార్సులను పంపింది.అత్యున్నత న్యాయస్థానం 2020 మే 28న, 2020 జూన్‌ 9న ఇచ్చిన తీర్పుల ద్వారా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యాలను, లోపాలను ఎత్తిచూపింది. ఈ కార్మికుల సంక్షేమాన్ని మెరుగుపర్చటానికి అనేక ఆదేశాలు ఇచ్చింది. కాని ఇవి ప్రధానంగా వలస కార్మికులకు ఉన్న పథకాలు, విధానాలకు పరిమితమైనవి. స్వస్థలాలకు తిరిగి వెళ్ళిన కార్మికుల సంఖ్యను గుర్తించమన్నది. 2020, జులై 31న ఇచ్చిన ఆదేశాలలో మాత్రం పైన పేర్కొన్న కార్మిక చట్టాల అమలు వివరాలను కూడా అన్ని ప్రభుత్వాలు తనకు సమర్పించమని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించిన సందర్భాలలో రాష్ట్ర ప్రభుత్వాలు వలస కార్మికులకు ఉపశమనం కలిగించాయి. తమ ఖర్చుతో రైళ్ళు,బస్సులను నడిపించాయి. తాను ఇచ్చిన ఆదేశాల అనంతరం…రాష్ట్ర ప్రభు త్వాలు,కేంద్ర పాలిత ప్రాంతాలు సమర్పించిన సమాచారంలో…వాస్తవాలను,గణాంకాలను పేర్కొనలేదని సుప్రీంకోర్టు గుర్తించింది. అందు కని చట్టాల అమలులో భాగంగా వలస కార్మికు లను పెట్టుకునే సంస్థలను రిజిస్టర్‌ చేయాలని, లైసెన్సులను జారీ చేయాలని ప్రభుత్వాలను ఆదేశించింది. ‘వలస కార్మికుల కష్టాలు-సమస్యలు’లో భాగంగా అసంఘటిత కార్మికుల రిజిస్ట్రేషన్‌ స్థితిపై ప్రమాణ పత్రాన్ని దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు (2021మే 24న) ఆదేశించింది. అంతకు ముందు కేంద్ర ప్రభుత్వం స్పందించిన తీరుపై సుప్రీంకోర్టు సంతృప్తి చెందకపోవటంతో ఈ ఆదేశాలు ఇచ్చింది. దీనితో కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో 2021 ఆగస్టు 26న రూ.704 కోట్ల ఖర్చుతో వలస కార్మికులతో సహా అసంఘటిత కార్మికుల రిజిస్ట్రేషన్‌కు ‘ఈ-శ్రమ’ వ్యవస్థను ప్రవేశ పెట్టింది. 2021 డిసెంబర్‌ ఆఖరులోగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అసంఘటిత కార్మికులు/వలస కార్మికుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది.ఈ-శ్రమ’ రిజిస్ట్రేషన్‌కు కార్మికుల నుండి స్పందన చాలా పరిమితంగా వుంది. అందులో వారికి ఎలాంటి ప్రయెజనం కనపడకపోవడం అందుకు కారణం. పైగా‘ఈ-శ్రమ’ నెట్‌ సౌకర్యంతో కూడుకున్నది కావడంతో కార్మికులు దీనిలో తమంత తాముగా రిజిస్ట్రేషన్‌ చేసుకోలేరు.ఇప్పటికే నిర్మాణ (సెస్సు-సంక్షేమ పథకాలు), వ్యవసాయ రంగాలలో (రైతు బంధు పథకం) పరిమితమైన ఇతర పథకాలు ఉన్నాయి.140 రకాల వృత్తులలో కార్మికులు పనిచేస్తున్నట్లుగా గుర్తించామని మోడీ ప్రభుత్వం చెప్పింది. కానీ తాము ఏరకమైన సామాజిక భద్రతను ప్రవేశపెట్టేదీ ఇంత వరకు నిర్ణయిం చలేదు. ‘ఈ-శ్రమ’ లో రిజిస్ట్రేషన్‌కు ఇ.పి.ఎఫ్‌, ఇ.ఎస్‌.ఐ ఉన్న వారు అర్హులు కారు. సంఘటిత రంగంలో పని చేసే లక్షలాది మంది కాంట్రాక్టు వర్కర్లు, చిన్న మధ్యతరహా సంస్థల్లో పని చేసే కార్మికులకు ఈ రెండూ ఇప్పటికే ఉంటాయి. కాబట్టి వారు రిజిస్ట్రేషన్‌ చేసుకోలేరు. వలస కార్మికులకు సామాజిక భద్రతను కల్పించాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకుండా ‘వలస కార్మికుల చట్టం-1979’ రద్దును ప్రకటించింది. దీనికి బదులుగా వచ్చేటటువంటి కోడ్‌ కాంట్రాక్ట్‌ కార్మికుల కష్టాలను పెంచుతుంది. 1979 చట్టం యజమానులకు, కాంట్రాక్టర్లకు, సబ్‌ కాంట్రాక్టర్లకు నిర్ద్ఱేశిత ఆదేశాలు ఇచ్చింది. కాంట్రాక్టు కార్మికులను పెట్టుకోవాలంటే ముందుగా వీరు రిజిస్టరై ఉండాలి. ప్రతి వలస కార్మికుని సమాచారాన్ని, వారికి చెల్లించే వేతనాల వివరాల నమోదును స్పష్టీకరించింది. ఇవన్నీ ఇప్పుడు కోడ్‌లో లేవు. ఇటీవల అగ్ని ప్రమాదాలలో కార్మికులు చనిపోయినప్పుడు వారి గుర్తింపుకు వ్యక్తిగత రికార్డులు లేక పోవటం ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడు తుంది. వారు పలానా వారు అని గుర్తించ టానికి వంశీకుల డిఎన్‌ఎ లను పరీక్షించాల్సి వచ్చింది. యజమానులు తమ దగ్గర ఉన్న వలస కార్మికుల నియామకం,నమోదు, రవాణా, నివాసం,కనీస వేతనం,కాలనుగుణ వేతనాలు తదితర సమాచారాన్ని తప్పకుండా నిర్వహిం చాలని 1979చట్టం నిర్దేశించింది.వేతనాల చెల్లింపు,ఆరోగ్య సౌకర్యాల కల్పన,పని ప్రదేశం లో రక్షణ కల్పించే డ్రస్సులు,మంచినీటి సౌక ర్యం,క్యాంటిన్‌,మరుగుదొడ్లు, విశ్రాంతి గదుల ఏర్పాటు, ప్రయాణ ఖర్చులను గ్యారంటీ చెయ్య టానికి-అయ్యే మొత్తం ఖర్చులో40శాతాన్ని సెక్యూరిటీ డిపాజిట్‌గా లైసెన్సింగ్‌ అధికారి తీసుకుంటారు. కాంట్రాక్టర్లుగానీ, ముఖ్య యజమాని గానీ వేతనాలు చెల్లించకపోతే ఈ నిధి నుండి చెల్లిస్తారు.ఈహామీలను లేబర్‌ కోడ్‌లో ఉపసంహరించారు.1979 చట్టంలో ఇంకొక ముఖ్యమైన నిబంధన ప్రకారం వలస కార్మికులు పారిశ్రామిక వివాదాల పరిష్కార యంత్రాంగాన్ని…తాము పనిచేసే ప్రాంతాలు, స్వస్థలాలు రెంటిలోనూ వినియోగించుకునే అవకాశం ఉంది. ఈ విధంగా వలస కార్మికు లకు వర్తించే ఇటువంటి 4 చట్టాలను కూడా కోడ్‌ ఒక్క కలం పోటుతో స్వాహా చేసింది.వీధి వ్యాపారులతో సహా అందరికీ సామాజిక భద్రత కల్పించబడుతుందని కేంద్ర కార్మిక మంత్రి ప్రకటించారు. ఇంత వరకు దానికి సంబం ధించిన ఎటువంటి పథకం తయారు కాలేదు. కానీ వలస కార్మికుల రిజిస్ట్రేషన్‌ పరిమితి 5 నెలల నుండి 10 నెలల వరకు పొడిగించారు. రిజిస్ట్రేషన్‌ వలన వలస కార్మికులకు పెద్దగా ఒరిగిందేమీ లేదు.పెద్ద సంఖ్యలో వలస కార్మి కుల హక్కులు నిరాకరించబడ్డాయి. అంతకు ముందున్న అనేక సౌకర్యాలను వలస కార్మికులు కోల్పోతారు.
మీకు ఉద్యోగం కావాలా, హక్కులు కావాలా?’’
ఒక నిరుద్యోగి ఉద్యోగం కోరుకుంటాడా, హక్కు లు కోరుకుంటాడా? భారత్‌లో కులవ్యవస్థ కార్మి కులపై ఎలాంటి ప్రభావం చూపుతోంది? కార్మి కుల హక్కులు, సంక్షేమం, ఐక్యత కోసం సుదీర్ఘ కాలం కృషిచేసిన భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ ఈఅంశాలపై ఏమన్నారు?
‘‘ఒక నిరుద్యోగికి ఎంతో కొంత వేతనమున్న, నిర్దిష్టమైన పనిగంటలు లేని ఒక ఉద్యోగం ఆఫర్‌ చేశారు. అతడికి ఒక షరతు పెట్టారు. ఉద్యోగ సంఘంలో చేరే హక్కు, భావ ప్రకటనా హక్కు, నచ్చిన మతాన్ని ఆచరించే హక్కు, ఇతర హక్కులు ఉండవని చెప్పారు. ఇప్పుడు ఆ నిరుద్యోగి ఏ నిర్ణయం తీసుకుంటారనేది స్పష్టం. ఆకలి భయం, ఇల్లూవాకిలీ కోల్పోతాననే భయం, ఏమైనా పొదుపు చేసుకొనుంటే ఖర్చయి పోతుందేమోనన్న భయం ఆ నిరుద్యోగికి కలుగు తాయి. ఈ భయాందోళనలు చాలా బలమైనవి. వీటివల్ల ఎవరూ తమ ప్రాథమిక హక్కుల కోసం నిలబడలేరు’’ అని అంబేడ్కర్‌ చెప్పారు. కేవలం లాభార్జనే ధ్యేయమైన ఆర్థిక వ్యవస్థ పౌరుడి ప్రాథమిక హక్కులను ఎలా దెబ్బ తీయగలదో సోదాహరణంగా చెబుతూ ఆయన ఒక సందర్భంలో ఇలా రాశారు. ఎనిమిది గంటల పనిగంటలు మొదలుకొని, ప్రసూతి సెలవుల వరకు కార్మికుల ప్రయోజ నాలు కాపాడేందుకు ఆయన చూపిన చొరవ ఫలితా లను కార్మిక వర్గం నేటికీ పొందుతోంది. లాభా ర్జనే ధ్యేయమైన ఆర్థిక వ్యవస్థ రెండు రాజకీయ ప్రజాస్వామిక సూత్రా లకు విఘాతం కలిగిస్తుం దని అంబేడ్కర్‌ చెప్పారు. వ్యక్తుల జీవితాలను రాజ్యవ్యవస్థ కాకుండా, ప్రైవేటు యాజమా న్యాలు నిర్దేశిస్తాయని, అలాగే జీవనోపాధి కోసం పౌరులు తమ రాజ్యాంగ హక్కులను కోల్పో వాల్సి రావొచ్చని పేర్కొన్నారు.‘కుల వ్యవస్థ పనినే కాదు, కార్మికులనూ విభజిస్తుంది’ భారత సమాజ తీరును లోతుగా పరిశోధించిన అంబే డ్కర్‌, కులానికి, పనికీ సంబంధముందని గుర్తించారు. కుల వ్యవస్థ పని విభజనకు సంబంధించినదనే వాదనను ఆయన తిరస్క రించారు.ఈ సమాజం పనినే కాకుండా కార్మికు లను కూడా విభజించి చూస్తోందని, ఇది అసహజమైనదని, ఏ నాగరిక సమాజంలోనూ ఇలా ఉండదని వ్యాఖ్యానించారు. కార్మికుల విభజనను హిందూ సమాజ నిర్మాణమే ఆమో దించి, కొనసాగిస్తోందని, ఈ విభజనలో ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అనే వర్గీకరణ ఉందని చెప్పారు. కార్మికులను ఇలా చూసే పని విభజన మరే దేశంలోనూ లేదన్నారు.పని విభజన వ్యక్తుల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉండాలని, కానీ కుల వ్యవస్థ సృష్టించిన కార్మిక విభజన వ్యక్తుల ఇష్టాయిష్టాలపై ఆధారపడినది కాదని అంబేడ్కర్‌ వివరించారు.వ్యక్తి తన సామ ర్థ్యాల ప్రాతిపదికన కాకుండా అతడు పుట్టిన కులం ప్రాతిపదికగా పని చేయాల్సి వస్తోందని చెప్పారు. అంటరాని కులాలుగా పిలిచే కులాలకు అపరిశుభ్రమైన,తక్కువ స్థాయి పనులను, ఇతర కులాలకు శుభ్రమైన, గౌరవప్రదమైన పనులను కుల వ్యవస్థే కేటాయిస్తుందని ఆయన ప్రస్తావించారు.– అమితవ్‌ గుహ

అటవీ సంరక్షణ చట్ట సవరణ అటవీ హక్కుల నిరాకరణ

గుండుగుత్తుగా కార్పొరేట్లకు అడవులపై చట్టబద్దత కల్పించడానికి మోడీ ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. వంద నుంచి వెయ్యి హెక్టార్లకు పైగా అటవీ భూమిని అటవీయేతర భూమిగా మార్చడానికి ప్రయత్నిస్తున్నది. దీనివల్ల రాబోయే కాలంలో అటవీ ప్రాంత విస్తీర్ణం తగ్గనుంది. అటవీ భూమిని ఇతర అవసరాలకు మళ్ళిం చాలంటే అటవీ హక్కుల గుర్తింపు చట్టం కింద అటవీ హక్కులను సంపూర్ణంగా అమలు జరపాలని 2009లో కేంద్ర ప్రభుత్వ అటవీ మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొన్నది. అయితే ఈ అవసరం లేకుండానే ప్రభుత్వ, ప్రయివేట్‌ కంపెనీలకు అటవీ భూమిని మళ్లించేందుకు నూతన అటవీ సంరక్షణ చట్టంలో వీలు కల్పిస్తున్నది. ఈ నియ మాలు అమలైతే అడవి నుండి ఆదివాసీలు నెట్టివేయబడతారు. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇటీవల జారీ చేసిన నూతన అటవీ సంరక్షణ నియమాలు ఆదివాసుల అటవీ హక్కులను దెబ్బతీసే విధంగా వున్నాయి. ఆది వాసుల అటవీ హక్కులను తుంగలో తొక్కి, కార్పొరేట్లకు ప్రయోజనం చేకూర్చడానికి కేంద్ర ప్రభుత్వం అటవీ సంరక్షణ చట్టం సవరణ చేస్తున్నది.
అడవిలో లీనియర్‌ ప్రాజెక్టుల నిర్మాణం ఐదో షెడ్యూల్‌ ప్రాంతంలో అంతర్జాతీయ సంస్థలు,బహుళ జాతి కంపెనీల ప్రవేశానికి అటవీ చట్టాలు అడ్డంకిగా వున్నాయి. విలువైన సహజ వనరులు, ఖనిజ సంపదను కార్పొరేట్లకు అప్పగించేందుకు ఆటంకంగా వున్న చట్టాలను వారికి అనుకూలంగా సవరించే పని మోడీ ప్రభుత్వం నెత్తినెత్తుకుంది. అందుకు కొత్త నియమ నిబంధనలు ప్రతిపాదించారు. అటవీ ప్రాంతంలో లీనియర్‌ ప్రాజెక్టులను (జాతీయ రహదారులు, పైపులైన్లు, ట్రాన్స్‌మిషన్‌…) ప్రైవేటు, కార్పొరేట్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. లీనియర్‌ ప్రాజెక్టుల నిర్మాణానికి గిరిజన గ్రామ సభ అనుమతి అక్కర్లేదని 2013లో కేంద్ర అటవీ మంత్రిత్వశాఖ జారీ చేసిన ఉత్తర్వులను 2019లో ఎ.పి హైకోర్టు కొట్టేసింది. గిరిజన గ్రామసభకు వున్న విస్తృత అధికారాన్ని న్యాయ స్థానం గుర్తించడంతో, ముసాయిదా బిల్లులో గ్రామసభను సంప్రదించాలని మాత్రమే కేంద్ర బిజెపి ప్రభుత్వం పేర్కొంది.అటవీ సంరక్షణ చట్టం 1980 ప్రకారం అటవీ భూమిని ఇతర ప్రయోజనాలకు వినియో గించాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ కింది నిబంధనలు పాటిం చాలి.1.ముందుస్తు గ్రామసభ అనుమతి తీసుకోవాలి.2. నిర్వా సితులకు నష్టపరిహారం చెల్లించాలి.3.అడవు లు పెంచడానికి ప్రత్యేక భూమి కేటాయించాలి. ఈ నిబంధనలు కార్పొరేట్‌ శక్తులకు అడ్డుగా వుండడంతో వాటిని సవరించబూనుకుంది. మైనింగ్‌ కోసం ఐదు హెక్టార్ల భూమిని డి-రిజర్వ్‌ చేయడానికి, ఆక్ర మణ భూమిని క్రమబద్ధీకరించడానికి కేంద్ర ప్రభుత్వ సలహా కమిటీ సిఫార్సు అవసరమని, 2003లో జారీ చేసిన నియమాలను పక్కనబెట్టి, మోడీ సర్కారు కొత్త నియమాలు తీసుకొస్తోంది. క్లాజ్‌ 9(బి)-1 ప్రకారం గ్రామసభ లేదా హక్కుల పరిష్కార ప్రస్తావన లేదు. క్లాజ్‌ 9(బి)-2 ప్రకారం డి-రిజర్వుడు ఆర్డర్‌ను జారీ చేయడానికి గ్రామసభకు వున్న అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం బలవంతంగా లాక్కొన్నది. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే ఆదివాసుల హక్కులు హరించ బడతాయి. అటవీ హక్కుల చట్టానికి తూట్లు తీవ్రవాద కార్యకలాపాలు జరిగే ప్రాంతంలో అవుట్‌ పోస్టు నిర్మాణానికి అటవీ భూమి వినియోగ పరిమితి విషయంలో ఒక హెక్టార్‌ భూమిని రిజర్వ్‌ ఫారెస్టు భూమి నుండి మినహాయించడం 2005లో ప్రారంభమైంది. ఈ మినహాయింపు క్రమంగా 40 హెక్టార్లకు పెరిగింది. గుండు గుత్తుగా కార్పొరేట్లకు అడవులపై చట్టబద్దత కల్పించడానికి మోడీ ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. వంద నుంచి వెయ్యి హెక్టార్లకు పైగా అటవీ భూమిని అటవీయేతర భూమిగా మార్చడానికి ప్రయత్నిస్తున్నది. దీనివల్ల రాబోయే కాలంలో అటవీ ప్రాంత విస్తీర్ణం తగ్గనుంది. అటవీ భూమిని ఇతర అవసరాలకు మళ్ళించా లంటే అటవీ హక్కుల గుర్తింపు చట్టం కింద అటవీ హక్కులను సంపూర్ణంగా అమలు జరపాలని 2009లో కేంద్ర ప్రభుత్వ అటవీ మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొన్నది. అయితే ఈ అవసరం లేకుండానే ప్రభుత్వ, ప్రయివేట్‌ కంపెనీలకు అటవీ భూమిని మళ్లించేందుకు నూతన అటవీ సంరక్షణ చట్టంలో వీలు కల్పిస్తున్నది. ఈ నియ మాలు అమలైతే అడవి నుండి ఆదివాసీలు నెట్టివేయబడతారు.
చట్ట సవరణ సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధం
ఆదివాసుల సాంప్రదాయ హక్కులతో ముడిపడిన హక్కుల నిర్ధారణ తర్వాతే…అటవీ భూమి మళ్లింపు అనుమతులను పరిశీలించాలని ఒడిశా మైనింగ్‌ కార్పొరేషన్‌కు కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ మధ్య నడిచిన కేసులో…2013 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అటవీ హక్కుల అమలు విషయంలో గ్రామసభ పాత్రను, అటవీ భూమి మళ్లింపు విషయంలో వాటి అనుమతి అవసరాన్ని తీర్పులో స్పష్టం చేసింది. అయినా మోడీ మొండిగా గ్రామసభ, అటవీ హక్కుల చట్టాన్ని నీరుగార్చుతూ సుప్రీంకోర్టు ఉత్తర్వులను లెక్క చేయకుండా రాజ్యాంగ హక్కులను హరిస్తున్నారు. రాజ్యాంగ శాసనంగా పేర్కొన్న పీసా చట్టానికి భిన్నంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాసనాలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసినా, నూతన అటవీ సంరక్షణ చట్టసవరణలతో రాజ్యాంగ లక్ష్యాలకు తూట్లుపొడుస్తున్నది. వనరుల నిర్వహణ, హక్కుల నిర్ధారణ, అమలు చేసే అధికారం గ్రామసభలకు ఉంటుందని 2010 లో కేంద్ర గిరిజన సంక్షేమశాఖ ఉత్త ర్వులు జారీ చేసింది. నూతన అటవీ సంరక్షణ చట్ట నియమాల్లో కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ పాత్రను కనీసం ప్రస్తావించ లేదంటే ఆదివాసీ లపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి వుందో అర్ధమవుతుంది. మైనింగ్‌ యేతర పనులకు భూమి వినియోగానికి వంద రోజుల్లో, మైనింగ్‌ కార్యకలాపాలకు 150 రోజుల్లో అటవీ, పర్యావరణ అనుమతి జారీ చేసేలా స్క్రీనింగ్‌ కమిటీకి అధికారం అప్పగిస్తూ నియమాలు రూపొందించారు. రక్షిత అడవుల్లో లినియర్‌ ప్రాజెక్ట్లు నిర్మాణమవుతాయని, భూమిని పూర్తిగా వినియోగించే అవకాశం వుంటుందని పేర్కొంది. అటవీ పెంపకం కోసం ల్యాండ్‌ బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలని పేర్కొనడం సరికాదు. క్షీణించిన అటవీ భూమిని ప్లాంటేషన్‌ కోసం ప్రైవేట్‌ కంపెనీలకు లీజుకిచ్చే అంశంపై గతంలో ప్రణాళిక సంఘం ఏర్పాటు చేసిన ఎస్‌.సి సక్సేనా కమిటీ చాలా విలువైన సూచనలు చేసింది. అడవులు కోట్లాది మంది ప్రజలకు జీవనోపాధిని కల్పిస్తాయని నిర్ధారించినా… నేడు ఈ లక్షలాది మంది ప్రజలకు ఏమౌతుందో నిబంధనలలో ప్రస్తావించనేలేదు. జాతీయ మోనెటైజేషన్‌ పథకం అమలు రైల్వే శాఖకు అభయారణ్యాలు, నేషనల్‌ పార్క్‌లలో కొన్ని నిబంధనల నుండి 2009 లోనే మినహాయింపు ఇచ్చారు. ప్రభుత్వ, సామాజిక ఆస్తులను ప్రైవేటు, కార్పొరేట్‌ కంపెనీలకు లీజుకు ఇవ్వడానికిగాను జాతీయ మోనెటైజేషన్‌ పథకం 2022-2025 అమలుకు కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. రైల్వే శాఖ, రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖల పరిధిలో సుమారు 18 లక్షల ఎకరాల అటవీ భూమిని మోనెటైజేషన్‌ చేయదగ్గవిగా గుర్తించారు. దానికి వీలుగా అన్ని రకాల నిబంధనల నుంచి మొత్తం మినహాయింపు ఇవ్వాలని, ప్రభుత్వ భూములకు ఇచ్చే మినహాయింపులన్నీ, ప్రైవేటు కార్పొరేట్‌ సంస్థలకు కూడా వర్తింపజేయాలని నిబంధనలలో ప్రతిపాదించారు. కేంద్రం ఆధీనంలోని అనేక గనులను మోనెటైజేషన్‌ ద్వారా కార్పొరేట్‌ సంస్థలకు లీజుకిచ్చి రూ.28,747 కోట్లు ఆర్జించాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వరంగ గనులను ప్రవేట్‌ పరం చేసేందుకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చేయడం పభుత్వ లక్ష్యంగా కనబడుతున్నది. ఇది ఆదివాసుల రాజ్యాంగ హామీలకు పూర్తిగా విరుద్ధం. అంతేగాక ఐదవ, ఆరవ షెడ్యూల్డ్‌, పీసా, సవరించిన వన్య ప్రాణుల రక్షణ చట్టం, అటవీ హక్కుల గుర్తింపు చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది.-పి. అప్పలనర్స

పేదల జీవితాలు ఇంతేనా..?

ఆత్మహత్యలన్నీ హత్యలే, కాకపోతే.. వీటిలో నిందితులెవరో అప్పటికప్పుడు తెలియదు, వెతికి పట్టడం అంత తేలిక కాదు. స్థూలంగా సమాజమే ముద్దాయి’ అంటాడో సామాజిక వేత్త! ఇదెంత పచ్చి నిజం! వ్యక్తులు, దంపతులు, కుటుంబాలు.. ఇలా లెక్కలేనంత మంది రోజూ ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఎవరికీ పట్టడం లేదు. ప్రభుత్వాలకు చీమ కుట్టినట్టు కూడా లేదు. చచ్చేంత దయనీయ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న దీనుల్ని ఆదుకునే వ్యవస్థలే లేవు. ఉన్న వ్యవస్థల్ని కూడా పాలకులు విధ్వంసం చేస్తుంటే దాదాపు అన్ని వయసుల వారూ దిక్కులేని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎందుకీ దురవస్థ? అని ఎవరూ ప్రశ్నించడం లేదు. దీని వెనుక బలమైన కారణాలేమై ఉంటాయి? ఓ శాస్త్రీయ పరిశీలన లేదు. లోతైన అధ్యయనమూ లేదు. సర్కార్లకు సమస్య పరిష్కరించే చిత్తశుద్ధి లేదు.
డెబ్బై అయిదు సంవత్సరాల స్వాతంత్య్రం తరువాత…మన దేశంలోని ఇతర ఏ రంగం కన్నా కూడా…వ్యవసాయ రంగం ఎక్కువ సంక్షోభంలో ఉంది. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో లెక్కల ప్రకారం ఈ పాతిక్ఱేళ్లలో (1995-2020) రైతులు, వ్యవసాయ కూలీలు నాలుగు లక్షల మందికిపైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరిలో గత ఎనిమిదేళ్లలో మోడీ పాలన లోనే ఒక లక్ష మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. దళితులు, ముస్లింలలో భూమిలేని కుటుం బాల సంఖ్య 60శాతం. ఆదివాసీలు సాధా రణంగా భూమి కలిగినవారై ఉంటారు. కానీ గత 30 ఏళ్లలో భూములు గుంజుకోవడం వల్ల భూమి లేని ఆదివాసీల సంఖ్య పది శాతం పెరిగింది. ఎన్‌ఎప ˜్‌హెచ్‌ఎస్‌ వివ రాల ప్రకారం దేశంలోని భూమిలో 20 శాతం భూమి 75 ఎకరాల పైబడి ఉన్న కుటుంబాల చేతిలోనే ఉంది. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం లెక్కల ప్రకారం చట్టంలో పేర్కొన్న దానికి విరుద్ధంగా 100 రోజుల బదులు వ్యవసాయ కార్మికులకు 2021-22 ఆర్థిక సంవత్సరంలో 49 రోజులే పని దొరికింది. జూన్‌ 2022లో గ్రామీణ ఉపాధి 80 లక్షల మందికి పోయిందని సీఎం ఐఈ లెక్క తేల్చింది. మొత్తం గ్రామీణ నిరు ద్యోగం రేటు ఎనిమిది శాతం పెరగటం ఆందోళనకరం. పిరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే వివరాల ప్రకారం 2018-19లో 21-59 ఏళ్ల వయసు వారిలో 10శాతం గ్రామీణ పురుషులు, 72 శాతం గ్రామీణ మహిళలు ఏ ఉపాధి లేకుండా ఉన్నారు. ఇది కోవిడ్‌ ముందు స్థితి, ఆతర్వాత పరిస్థితి ఇంకా దిగజారింది. ఆకలి వల్ల, పోషకాహార లేమి వల్ల లక్షల్లో చనిపోతున్న గిరిజన బిడ్డల సంగతి వర్ణనాతీతం. 2021లో ప్రపంచ ఆకలి సూచీలో మన దేశం 116 దేశాల్లోనూ 101వ స్థానానికి చేరింది. భారతదేశ వ్యవసాయ సంక్షోభానికి ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. స్వాతంత్య్రానంతరం వరుస కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అవలంభించిన వ్యవసాయ విధాన లక్ష్యం, అర్ధ ఫ్యూడల్‌ భూస్వాములను పెట్టుబడిదారీ భూస్వాములుగా మార్చి ధనిక రైతాంగాన్ని సృష్టించడం. ఇది రైతాంగంలో వర్గ విభజనను తీవ్రం చేసింది. 1950లో బి.సి.మహల్‌ నోబిస్‌ అంచనా ప్రకారం దేశంలో పున:పంపిణీకి 6 కోట్ల 30 లక్షల ఎకరాల భూమి అందుబాటులో ఉండాలి. కానీ, దీనిలో ఒక్క గుంట భూమి కూడా పేద రైతులకు పంచింది లేదు. దేశంలోని భూకేంద్రీకరణలో ఏ మార్పు లేకపోగా ఇటీవల కాలంలో మరింత పెరిగింది.
మొదటి దశలో వ్యవసాయ విస్తరణకు, విద్యుత్‌కు, శాస్త్ర సాంకేతిక రంగాలకు, ధాన్యం నిల్వ చేసుకునేందుకు ప్రభుత్వం పెట్టుబడులు ఇతోధికంగా ఉండేవి. కనీస మద్దతు ధర ద్వారా ఉత్పత్తిదారులకు ప్రభుత్వం సహకరించేది. కొన్ని పంటలను సేకరించడం ద్వారా కూడా ఈ సహకారం ఉండేది. ప్రజా పంపిణీ వ్యవస్థకు కూడా ప్రభుత్వ సబ్సిడీలు ఉండేవి. బ్యాంకుల జాతీయీకరణ తర్వాత రైతాంగానికి విస్తారంగా పరపతి సౌకర్యం కల్పించబడిరది. దేశీయ మార్కెట్‌ రక్షణకై వ్యవసాయ పనిముట్ల దిగుమతిపై అనేక ఆంక్షలు పెట్టబడ్డాయి. శాస్త్ర సాంకేతిక రంగా ల్లో అధిక పెట్టుబడి వల్ల మంచి దిగుబడి నిచ్చే వంగడాలు సృష్టించబడ్డాయి. ఇదంతా హరిత విప్లవానికి దారితీసింది. ఉత్పత్తి, ఉత్పాదకత మెరుగై ఆహార ధాన్యాల ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ధి సాధించింది. అయితే ఇది రెండు రకాల అసమానతలకు దారి తీసింది. మొదటిది ప్రాంతాల మధ్య, రెండోది రైతాం గంలో అసమానత. అయినప్పటికీ 1990 వరకు వ్యవసాయ రంగంలో కొంత పురోభివృద్ధి సాధ్యమైంది. 1991లో కాంగ్రెస్‌ ప్రారంభించిన నయా ఉదారవాద విధానాలు 2014లో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత ఉధృ తంగా కొనసాగుతున్నాయి. సామ్రాజ్యవాద వత్తిడితో ఆ విధానాలు అభివృద్ధి నిరోధకంగా మారాయి. ఈ దశలో ఆర్థిక లావాదేవీల నిర్వహణలో రాజ్యం తన పాత్ర ఉపసం హరించుకుంది. పూర్తి స్థాయిలో పెట్టుబడిదార్ల వత్తిడికి తలొగ్గింది. 1995లో హిస్సార్‌లో జరిగిన ఎఐకెఎస్‌ జాతీయ మహాసభ ఈ విధా నాలను విశ్లేషించి కింది హెచ్చరికలు చేసింది. కేంద్ర ప్రభుత్వం అనుసరించే ఈ విధానాలు రైతాంగంపై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపిస్తాయి. ఇవి పేద, మధ్యతరగతి రైతాంగాన్ని మరింత నిరుపేదలుగా మారుస్తాయి. పట్టణ, గ్రామీణ నిరుద్యోగం ఎన్నడూ చూడనంతగా పెరిగి పోతున్నది. ఇతర ఎన్నో రైతు సంఘాలు ఈ వ్యవసాయ విధానాలను పొగడ్తలతో ముంచెత్తుంతుండగా ఎఐకెఎస్‌ నయా ఉదార వాద విధానాలను విశ్లేషించగలగడం ప్రత్యేకత. ఎఐకెఎస్‌ హిస్సార్‌ మహాసభ హెచ్చరికలు 30 ఏళ్ల తర్వాత ఏ విధంగా నిజమైనాయో ఇప్పుడు చూస్తున్నాం.
నూతన ఆర్థిక విధానాలు
భూ సంస్కరణలను తిరగదోడటం, భూ పరి మితి చట్టాలను నీరుగార్చటంతో పెద్ద పెద్ద భూఖండాలను భారతదేశపు బడా వ్యాపార వేత్తలకు, విదేశీ బహుళ జాతి కంపెనీలకు అమ్మటానికి లేక లీజుకివ్వటానికి అవకాశమేర్ప డిరది. దున్నేవాడికే భూమి అనే నినాదం స్థానంలో కార్పొరేట్లకే భూమి అనే నినాదం వచ్చింది. విత్తనాలు, ఎరువులు, నీటి పారుదల సౌకర్యాలు, విద్యుత్తు, ఇంకా ఇతర వ్యవసాయిక అవసరాల మీద ప్రభుత్వ సబ్సిడీలకు కోత పెట్టటంతో వ్యవసాయ సాధనాల మీద ఖర్చు విపరీతంగా పెరిగింది. ఆ ఫలితంగా ఉత్పత్తి ఖర్చులు భారీగా పెరిగాయి. వ్యవసాయ దిగుమతుల పరిమితి మీదవున్న ఆంక్షలు తొలగించటం, దిగుమతులపై పన్నులు తగ్గించటంతో సబ్సిడీ కలిగిన విదేశీ వ్యవసాయ సరుకులు వరదలాగా దేశంలోకి వచ్చిపడ్డాయి. దానితో దేశీయ వ్యవసాయ ఉత్పత్తుల ధరలు కుప్పకూలాయి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్‌టీఏఎస్‌) వల్ల కలిగిన దుష్ప్రభావాలు సైతం ఇటువంటివే. వ్యవసాయం, ఇరిగేషన్‌, విద్యుత్తు, గ్రామీణాభివృద్ధి, సైన్స్‌ అండ్‌ టెక్నా లజీ, రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌, ఇంకా ఇతర మౌలిక సదుపాయాలమీద ప్రభుత్వం పెట్టే పెట్టుబడులలో భారీగా కోత పెట్టారు. ఆయువుపట్టు లాంటి విద్యుత్తు, నీటి పారుదల సౌకర్యాల ప్రయివేటీకరణతో ఈ రెండిరటికి పెట్టాల్సిన ఖర్చు బాగా పెరిగింది. అంతేగాక, నీటి మీద గుత్తాధిపత్యాలు ఏర్పడ్డాయి సంస్థా గత రుణాలలో అతి పెద్ద భాగం కార్పొరేట్లకు మళ్ళించే విధాన నిర్ణయం మూలంగా రైతులకు, వ్యవసాయ కార్మికులకు అందుబాటులో ఉన్న రుణాలలో భారీ కోత పడ్డది. దానితో రైతాం గం అధిక వడ్డీలు వసూలు చేసే ప్రయివేట్‌ వడ్డీ వ్యాపారుల మీద ఎక్కువగా ఆధారపడాల్సి వచ్చింది. ఆహార సబ్సిడీలలో విపరీతంగా కోత విధించి, గతంలో ఉన్న సార్వత్రిక ప్రజా పంపిణీకి బదులు లక్షిత ప్రజాపంపిణీ విధానాన్ని ప్రారంభించటంతో పేద ప్రజల ఆహార భద్రత ప్రమాదంలో పడ్డది. కనీస మద్దతు ధర యంత్రాంగంలో,పంటల సేకరణ వ్యవస్థలలో దేశీయ మార్కెట్టులో జోక్యం చేసు కునే చర్యలనుండి ప్రభుత్వం తప్పుకున్నది. ఎగుమతి ఆధారిత వ్యవసాయం వైపునకు, ఆహార పంటల స్థానంలో వాణిజ్య పంటలు వైపుకు సాగును మళ్ళించటానికి ఒక విధానప రమైన ఒత్తిడి జరుగుతున్నది. సాగు నిర్వహణ లో యాంత్రీకరణ పెరుగుతున్నది. దీనితో వ్యవసాయ కార్మికుల ఉపాధి, నిజ వేతనాలు తగ్గుముఖం పట్టాయి.- (దిలీప్‌ రెడ్డి)

హరి వెంకట్‌కి అరుదైన అవకాశం

తిండికి కరువై…చదువుకు దూరమై…ఆడుతూ పాడుతూ గడపాల్సిన బాల్యం ఇలా మొగ్గలోనే వాడిపోతే ఎలా?ఈఆలోచనతోనే గమ్యం తెలియని వీధి బాలల కోసం‘ధరణి’ పేరుతో ఓ స్వచ్చంధ సంస్థను ఏర్పాటు చేసి…వారికి ప్రాథమిక విద్యే కాదు…జీవిత పాఠాలనూ నేర్పిస్తున్న హరివెంకట్‌ రమణ ప్రయాణం ఇది…
విద్య, విజ్ఞానం… రేపటి తరానికి బంగారు భవిష్యత్తును అందించాలంటే ఇవి మాత్రమే సరిపోవు. ప్రాథమిక విద్యను అందిస్తూనే… నైపుణ్య శిక్షణ కూడా ఇవ్వాలి. మానవ విలువలు నేర్పించాలి. అప్పుడే వారు జీవితంలో స్థిరపడగలుగుతారు. మనమైతే సరే… మరి వీధిబాలల పరిస్థితి ఏమిటి? ఇలాంటి చదువు ఎవరు చెబుతారు? ఆ బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారు హరి వెంకట్‌. ఇందులో ఎన్నో వ్యయప్రయాసలు, ఇబ్బం దులు ఉంటాయి. వద్దని వెనక్కి లాగినవారూ ఉన్నారు. కానీ అవేవీ పట్టించు కోకుండా ఆమె అడుగు ముందుకు వేశారు. తన నెలకొల్పిన సంస్థ ద్వారా మానవ అక్రమ రవాణా, విశాఖలోని వీధి బాలలు, బస్తీలు, అట్టడుగు వర్గాల పిల్లల కు నాణ్యమైన చదువు చెప్పిస్తున్నారు. తన కళాత్మక సృజనతో కార్టూన్లు ద్వారా అవగాహన ప్రచార మాధ్యమాలు ద్వారా,వ్యాసాలు రాస్తూ చైతన్య పరు స్తున్నారు. మనుషుల అక్రమరవాణా అన్నది భారత దేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది వ్యక్తులను ప్రభావితం చేస్తున్న ఒకనేరం. ఒకసారి రవాణా బారిన పడిన తరువాత బాధితులు బలవంతంగా వ్యభిచారం, వెట్టిచాకిరీ, భిక్షాటన, పళ్లి,మత్తు పదార్ధాల చేరవేత, పిల్ల లను ఉపయో గించి చేసే లైంగిక చిత్రాల వంటి మరెన్నో దారుణ చర్యలకు గురవుతున్నారు. మన దేశంలో మను షూల అక్రమ రవాణాను నియంత్రించే చట్టాలు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి. ఇవి భారత శిక్షాస్మృతి (ఐపిసి), 1860లోని 370-370ఎ విభాగాలు మనుషూల అక్రమ రవాణాను నిర్వచించి శిక్షారం చేస్తున్నాయి. సెక్షన్‌ 371,ఐపిసి బానిస వ్యాపారాన్ని నేరంగా పరిగణిస్తుంది బీ సెక్షన్‌ 372-373 ఐపిసి ప్రకారం వ్యభిచారం కోసం బాలికల అమ్మకాలు, కొనుగోళ్లను నిర్వహించడం నేరంబీ అనైతిక రవాణా (నియంత్రణ) చట్టం, 1956 ప్రకారం వ్యభిచారాన్ని నేరంగా పరిగణిస్తూ బాధితులను రక్షిం చడం, పునరావాసంతోపాటు వారి నైతిక ప్రవర్తనను సరిదిద్దడం గురించి చెబుతుంది. ఈ అంశాలపై పని చేస్తున్న హరికి అరుదైన అవకాశం దక్కింది. ఇంటర్నేషనల్‌ విజిటర్‌ లీడర్షిప్‌ ప్రోగ్రామ్‌కి రావాలని,‘‘లింగ ఆధారిత హింస-మానవ అక్రమ రవాణా‘‘అంశంపైఈ పర్యటన ఉంటుందని ఆహ్వా నం అమెరికన్‌ ప్రభుత్వం నుంచి ఆహ్వానం వచ్చింది. అక్కడ లింగ ఆధారిత హింస,మానవ అక్రమ రవాణా అంశాలపై పనిచేస్తున్న కొన్ని సంస్థలు కలసి మానవ అక్రమ రవాణా అరికట్టాడానికి వ్యూహాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలుపై చర్చించారు. ఈనేపథ్యంలో అక్కడ చర్చించిన అంశాలు, అధ్యయన యాత్ర అనుభవాలను ఆయన కలం నుంచి జాలు వారిన వ్యాసమే ఇది..!
అమెరికా వెళ్లాలని చాలామందికిఉంటుంది. నేను నాహైస్కూల్‌,కాలేజిరోజులలో విద్యా ర్థి సంఘంలో పనిచేసాను.ఆ ప్రభావమో,సాహిత్య ప్రభా వమో వెళ్లాలని ఎప్పుడూ అనుకోలేదు. పెట్టు బడిదారీ,బూర్జువాలాంటి పదాలువల్లెవేసిన వారి పిల్లలంతా అక్కడే ఉండటం, నాతోపాటు హైదరా బాద్‌ రూమ్‌ లోవున్న మాకజిన్స్‌ అమెరికా వెళ్ళాక అయిపూ, అజాలేక పోవడంవలన అమెరికా నాకెప్పు డూఒక ఆశ్చర్యం. డిగ్రీ తరువాత ఒకటి రెండుచిన్న ఉద్యోగాలు చేసి హైద రాబాద్‌లో యాని మేషన్‌ రంగంలో పనిచేసే వాడిని, అయితే సాహిత్యం సామజిక రంగంపై మక్కువతో 2006 సంవత్సరంలో ధరణి స్వచ్ఛంధ సంస్థను స్థాపించి నెహ్రూ యువ కేంద్ర సంఘటన్‌తో కలిసి గ్రామాలలో యువజన సంఘాలు ఏర్పాటు చేయడం, గ్రామీణ గ్రంధాలయాలు, యువతకు కెరీర్‌ గైడన్స్‌ అంశాలపై పనిచేశాను.
వీధి బాలలు,బాలకార్మికులను గుర్తించి వారిని ప్రభుత్వ బడులకు పంపడం. బాల్య వివా హాల అనర్ధాలపై ప్రచారం, బాలికల విద్య ఆవశ్య కత,గుడ్‌ టచ్‌ బాడ్‌ టచ్‌ అంశాలపై ప్రభుత్వ పాఠశాలలు,హాస్టళ్లు,అంగన్వాడీల్లో తల్లులకు పవర్‌ పాయింట్‌ ప్రెసెంటేషన్‌ ద్వారా అవగాహన కల్పిం చి ఒక ఉద్యమంలాగ దీనిని కొనసాగించాను. దాదాపు వేలాది మందికి ఈవిషయం చేరవేసే ప్రయత్నం చేసాను.పిల్లలతో, కమ్యూనిటీతో బాల్య వివాహాలనిషేధం,పిల్లలపైలైంగిక వేధింపుల నిరో ధం,బాలల భద్రత వంటి అంశాలపై గోడ పెయిం టింగ్‌లు వేయించాను.బాలికలు అక్రమ రవాణాకు గురికాకుండాపట్టణ మురికివాడలలో, పాఠశాల లలో,కళాశాలల్లో చాలా కాలం నుంచి మానవ అక్రమ రవాణా నిరోధానికి కౌమారులు తీసుకో వలసిన జాగ్రత్తలు వివరిస్తూవొచ్చాను, ఈ అంశం పై యానిమేషన్‌, పోస్టర్లు,పిల్లలకు అర్ధం కావడానికి పోస్టర్లు, పత్రికలలో వ్యాసాలు రాసేను. ఒకానొక రోజు ఇంటర్నేషనల్‌ విజిటర్‌ లీడర్షిప్‌ ప్రోగ్రామ్‌కి రావాలని,‘‘లింగ ఆధారిత హింస-మానవ అక్రమ రవాణా‘‘అంశంపైఈ పర్యటన ఉంటుందని ఆహ్వా నం అమెరికన్‌ ప్రభుత్వం నుంచివొచ్చింది. ఇంకే ముంది యెగిరి గంతేసి ప్రయాణ ఏర్పాట్లు చేసుకు న్నాను. ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్‌3వ తారీఖు వరకు జరిగిన ఈ పర్యటన ఒక మంచి విజ్ఞాన అనుభవం.
అమెరికాలో వివిధ రాష్ట్రాలలో పర్యటన
ఢల్లీి నుంచి ఆమ్స్టర్‌ డాం మీదుగా 13 ఆగస్టు నడల్లాస్‌ చేరుకున్నాము. లింగ ఆధారిత హింస, మానవ అక్రమరవాణా అంశంపై చర్చలు, మేధో మధనాలు,సలహాలు,సూచనల ఆహ్వానాలు అమె రికా రాజధాని వా షింగ్టన్‌ డి.సి.సంయుక్త రాష్ట్రా లయిన నార్త్‌ డకోటా(మైనాట్‌, బిస్మార్క్‌ నగ రాలు)సియాటల్‌(వ్వాషింగ్టన్‌ రాష్ట్రం),పెన్సో కోలా (ఫ్లోరిడారాష్ట్రం)లలో జరిగాయి. ఈ పర్యటనలో భాగంగా అమెరికా ఓవర్‌ సీస్‌ ఎడ్యుకేషన్‌ డిపా ర్ట్మెంట్‌, డిపార్ట్మెంట్‌ ఆఫ్‌ ఎక్స్టర్నల్‌ అఫైర్స్‌ (విదేశీ వ్యవహారాలు) సందర్శించడం జరిగింది అమెరి కాలో ఫెడరల్‌ వ్యవస్థ పనిచేసే విధానం,అటార్నీ జనరల్‌ అసోసియేషన్‌, గృహహింస అరికట్టడం, బాధితులకు సహాయం చేసే పనిచేసే ఎన్‌జీవోలతో వ్వాషింగ్టన్‌ డీసీలో సమావేశం అయ్యాము. నార్త్‌డ కోటా రాష్ట్రంలోట్రైబల్‌ వ్యవహారాల విభాగాన్ని సందర్శించి ఆదిమతెగలలో లింగ ఆధారిత హింస అందుకు కారణాలు,మానవ అక్రమరవాణా జరుగుతున్న విధానం తెలుసుకున్నాము.సియాటెల్‌ నగరంలో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌లో ఆ రాష్ట్ర సెనేటర్‌ మానవ అక్రమ రవాణా అరికట్టడానికి తీసుకు వొచ్చిన పలు చట్టాలు,బాధితులతోనే (సెక్స్‌ వర్కర్స్‌) నిర్వహిస్తున్న సంస్థలు,పిల్లల కొరకు అక్కడి ప్రభు త్వం ఏర్పాటు చేసిన కార్యాలయాలు,బాలలపై లైంగిక దాడులు జరిగినప్పుడు వారినుంచి వివరా లు రాబట్టడానికి అనుసరించే సృజనాత్మక విధా నాలు తెలుసుకున్నాను.
అమెరికాలో లింగ ఆధారిత హింస
మహిళలు పురుషులపై ఆధారపడటం,ఆర్ధిక స్వేఛ్చ లేకపోవడం.ఆర్ధికంగా పతనమైన వలస కుటుం బాలు,అప్పులు,కుటుంబాలకు మిగిలిన వ్యక్తులతో డ్పాటు లేకపోవడం వలన లింగ ఆధారిత హింస అమెరికాలో ఎక్కువ.ఎక్కువ గృహ హింస కేసులు ఆసియా దేశాలు అందునా భారత్‌ వంటి దేశాల నుంచి వొచ్చిన కుటుంబాల నుంచే నమోదు కావ డం వంటివి అక్కడ గృహ హింసపై పనిచేస్తోన్న ఒకస్వచ్ఛంధ సంస్థ(ఎన్‌.జీ.ఓ)చెప్పగా ఆశ్చర్య పోయాను. చాలా సందర్భాలు,కేసులు ఆర్ధిక అస్థిరత వల్లనే అవుతున్నాయి అని నాకు అనిపించింది. ప్రతీది డబ్బుతో ముడిపడిఉండటం,భద్రత లేనిఉద్యోగాలు,వీకెండ్‌ ఎంజాయిమెంట్‌కి ఎక్కువ ప్రాధా న్యత ఇవ్వటం,పదహారు సంవత్సరాల నుంచి పిల్లలుస్వతంత్రంగాఉండటం (అందువలన తప్పు లేదు గాని,మద్యం,డ్రగ్స్‌ వంటి వాటికి అడిక్ట్‌ అయ్యే వారు ఎక్కువ)కూడా కొన్నికారణాలుగా అనిపిం చింది. మన దేశంలో కుటుంబవ్యవస్థను రక్షించడం కొరకు,మగవాడు చెప్పింది చేయాలి.స్త్రీ ఇలానేఉండాలిఅనే భావాలప్రచారం వలన మనకు మహిళలపై, పిల్లలపై హింస ఎక్కువ. ఇది మన సంస్కృతిలోబాగా వేళ్ళూనుకు పోయివుంది. చిన్న తనం నుంచే మనకు మగ,ఆడ అనే బేధాలు ఎక్కువ. ఇవి మహిళలు పిల్లలపై హింసకు,లైంగిక హింసకు కారణమవుతున్నాయి.అయితే లింగ ఆధారిత హింసను ఎదుర్కోవడానికి అమెరికాలో స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ సహకారంతో క్రైసిస్‌ సెంటర్లు ఏర్పాటు చేశాయి.వీటికి5శాతం వరకు ప్రభుత్వమే నిధులు సమకూరుస్తుంది.మిగతావి డోనర్‌ ఏజెన్సీ లు,వ్యక్తిగత డోనర్లు ఈక్రైసిస్‌ సెంటర్లలో మహిళ లు రక్షణ పొంద వొచ్చు.శిక్షణ పొందవొచ్చు ,తిరిగి తమ కుటుంబాన్ని కలవాలి అనుకున్నపుడు వెళ్ళవొచ్చు. చాలా సందర్భాలలో తిరిగి మహిళలు కుటుంబం వద్దకే వెళ్లిపోతుంటారు. అయితే ఈ బాధిత కార్యాలయాలు అత్యంత గోప్యతతో నిర్వహిస్తారు. అక్కడ ఒక్కో రాష్ట్రంలో ఒక్కోచట్టం కనుక మనదేశంలోవలే జాతీ యస్థాయి చట్టాలు, అమలు విధానాలు వుండవు. ఇది కేంద్ర స్థాయిలో పనిచేయడానికి వారికి అడ్డంకిగా మారుతుంది. నేను సియాటెల్‌ నగరంలో ఒక రెఫ్యూజీ సెంటర్‌కు వెళ్ళాను..అది పూర్తిగా మహిళలే నిర్వహిస్తున్నారు. అమెరికాను పీడిస్తున్న అక్రమ రవాణా అంశం తగిన లేబర్‌ లేకపోవడం, వ్యవసాయ పనులకు లేబర్‌ కావాల్సిరావడం కూడా ఈ మానవ అక్రమ రవాణాకు కారణం,అలా తీసుకువొచ్చిన వారి పాస్పోర్టుల తీసేసుకొని వారిని సెక్స్‌ ట్రేడ్‌కు వాడు తున్నారు.ఇంకా ఇక్కడప్రాస్టిట్యూట్‌ సర్వైవర్స్‌ నడుపుతున్న ఒక ఎన్‌జీఓను కలవడం జరిగింది. వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ మీద ఇంటర్లో గాట్‌,డంకెల్‌ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా బోలెడు కార్టూన్లు వేసాను. ఇప్పుడు అదే సెంటర్లో వరల్డ్‌ అఫైర్స్‌ ఆఫీసులో మీటింగులో పాల్గొనడం ఒకచిత్రమైన అనుభూతి. ఇక్కడ కింగ్‌ కౌంటీ కౌన్సిల్‌ మెంబెర్‌ని కలిసాము,ఆమె మానవ అక్రమ రవాణా నిరోధా నికి ఎన్నోచట్టాలను గత ఇరవై ఏళ్లుగారూపొం దించి ప్రవేశ పెట్టారు. మానవ అక్రమ రవాణా నిరోధాన్ని కేవలంచట్టాలు ఎంత వరకు తగ్గిస్తా యి? అన్న నా ప్రశ్నకు సమాజంలో మానవ అక్రమ రవాణా పట్ల ఒకసాంస్కృతిక మార్పు రావాల్సి ఉంటుం దని ఆమె చెప్పారు.
ఆదిమ తెగలలో లింగ ఆధారిత హింస
లింగ ఆధారిత హింస ప్రపంచంలో ఎక్కడైనా ఒకటే. సమాన అవకాశాలు లేకపోవడం, కుటుం బాలలో ఆర్ధిక అస్థిరత,మానసిక సమస్యలు, విపరీ తమైన త్రాగుడు,డ్రగ్స్‌ తీసుకోవడం ఒక ప్రధాన కారణంగా ఇక్కడ కలిసిన వ్యక్తుల,సమూహాల చర్చలనుబట్టి అర్ధమయ్యింది. మహిళల ప్రయివసీ కాపాడటం, బహిరంగ ప్రదేశాలలో వారిని గౌరవించే విధానం ఇక్కడ చాలా బాగుంది. కానీ అటువంటి సివిక్‌ సెన్స్‌ అభివృద్ధి చెందినచోట లింగ ఆధారిత కుటుంబహింస ఎక్కువగాఉండటం ఆశ్చర్యకరం.మన దగ్గర తరాలుగా అంది పుచ్చు కున్న ‘‘మనువాద భావాలు’’ మహిళలను రెండో పౌరులుగా చూస్తే ఇక్కడ గిరిజన తెగలలో,వలస దారులలో కూడా లింగ ఆధారిత హింస ఎక్కువ ఉన్నట్లు అర్ధమవుతుంది.ఆదిమ తెగలు స్త్రీ కేంద్రం గా స్త్రీని గౌరవించే ఆచారాలు కలవి,అటువంటి చోట మెయిన్‌ స్ట్రీమ్‌సమాజం ప్రభావం పడి వాటి పై కూడా లింగఆధారిత కుటుంబ హింస పడిర ది. ఇంకా వందల ఆదిమతెగలు ఇక్కడ తమ అస్తిత్వం కోసం పెనుగులాడుతున్నాయి. ట్రైబల్‌ కోర్టులు ఉంటాయి అయితే వాటి కంటేపై స్థాయిలో స్టేట్‌, ఫెడరల్‌ కోర్టులదేపై చేయి. మిగతా సమా జంతో కలిసి అవకాశాలు అందిపుచ్చు కోవడం లో వెనుకంజ, మారుతున్న పరిస్థితులను ఆకళింపు చేసుకొని ముందుకు వెళ్లలేక పోవడం కూడా కుటుంబ,లింగ ఆధారిత హింసకు కారణంగా నాకు అనిపించింది.ఇందుకు ప్రత్యామ్నాయంగా భాషను కాపాడు కోవడం,స్కిల్స్‌ అప్‌ గ్రేడ్‌ చేసుకోవడం ఆయా తెగలు చేస్తున్నాయి. అమెరికా అనేక గిరిజన తెగలను నిర్మూలించివారి పునాదులపై సౌధాలు నిర్మించింది అన్న చరిత్ర అందరికి తెలిసిందే.
పర్యటన స్పూర్తి
ఈపర్యటన ఇచ్చిన స్పూర్తితో మానవ అక్రమ రవాణా నిరోధం అంశంపై మరింతగా పనిచేస్తాను, ముక్యంగా యువతులు,కౌమార బాలికలు, బాలురు ఈకూపంలో ఇరుక్కోకుండా వారికి విభిన్న మాధ్య మాల (మీడియా,కార్టూన్లు, పవర్‌ పాయింట్‌ ప్రెసెం టేషన్‌,యానిమేషన్‌ )ద్వారా తెలియజేస్తాను. అక్రమ రవాణాలో చిక్కుకున్న వారికి ప్రభుత్వంనుంచి సహా యం అందేలాచేయడం,ఇందుకోసం ఏర్పడిన కమి టీలు సమావేశం అయ్యేలా కృషి చేయడం, జాతీయ స్థాయి సంస్థలతో ఈఅంశంపై కలిసి కార్యాచరణ రూపొందించుకోవడం చేస్తాను. ఇటుక బట్టీలలో పనిచేసే పిల్లలను వెట్టి నుంచివిముక్తి చేయడంకోసం ప్రత్యేకంగా పనిచేయాలని నిర్ణయించుకున్నాను. ఇంటి పని వారల సంఘంతో కలిసి గృహ కార్మి కులు అక్రమ రవాణాకు గురికాకుండా ప్రచార కార్యక్రమాలు చేస్తాను. జిల్లాన్యాయ సేవాధికార సంస్థతో కలిసి కూడా కొన్ని కార్యక్రమాలు చేయ టానికి కోరుతాము.యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్స్‌ ఇంకా పిల్లలు, మహిళల కోసం పనిచేసే సంస్థలతో కలిసి పని చేయడంద్వారా బాల, బాలి కలు అక్రమ రవాణాకు గురికాకుండా ప్రయత్నించ వొచ్చు. ఇంటి పనివారు, అసంఘటిత రంగంలో పనిచేసే వారికి, విదేశాలలో వెళ్లే వారికి అవగా హన కార్యక్రమాలు నిర్వహించే ఆలోచన వుంది.
వ్యాసకర్త : బాలల హక్కుల కార్యకర్త, విశాఖపట్నం-(హరి వెంకట రమణ)

రుణ యాప్‌ల కారకులెవరు?

పేద, దిగువ మధ్యతరగతి ప్రజలు బ్యాంకు ద్వారా అప్పు పొందాలంటే ఎన్నో నింబంధనలు. అనేక ఆధారాలు చూపాలి. బ్యాంకులు అడిగిన వాటిని తీసుకురాలేని వారికి అప్పు ఇచ్చే అవకాశమే లేదు. వారంతా ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గరకు వెళ్లాల్సి వస్తుంది. బ్యాంకింగ్‌ వ్యవస్థను బలహీనం చేయాలనే సరళీకరణ విధానాల వల్ల చిన్న, చిన్న మొత్తాలు బ్యాంకుల్లో ఇచ్చే పరిస్థితి లేదు. లక్షలు, కోట్లు అప్పు తీసుకునే ‘విలువైన విని యోగదారుల’ సేవలో బ్యాంకులు తరిస్తున్నాయి. ఇలాంటి అప్పులు తీసుకున్న వారు వాటిని చెల్లించ కుండా ఎలా దేశాలు దాటిపోతున్నారో, ఎలా ప్రపంచ కోటీశ్వరులు అవుతున్నారో చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో అత్యధికమంది వినియోగదారుల అవసరాలను సొమ్ము చేసుకునేందుకు ఈ రుణయాప్‌లు అందుబాటులోకి వచ్చాయి.
‘అప్పు అంటే ముప్పే’అన్న మాట రుణ యాప్‌ల దారుణాలు చూస్తుంటే అక్షర సత్యమని పిస్తుంది. పేద,మధ్యతరగతి ప్రజల అవసరాలను అవకాశంగా తీసుకొని ఫోన్లద్వారా అప్పులు ఇచ్చేం దుకు నెట్‌లో వందలసంఖ్యలో రుణయాప్‌లు వున్నా యి.ఈయాప్‌లు అప్పుతీసుకునే వారికోసం మొదట వేట ప్రారంభిస్తాయి.ఆవేటలో చిక్కిన రుణగ్రహీత లను దారుణంగా వేధించి వసూళ్ళు చేస్తాయి. ఈ ఒత్తిళ్ళను తట్టుకోలేనివారు ఆత్మహత్యలు చేసు కుంటున్నారు. మన రాష్ట్రంలో గత రెండు నెలల్లో పది మందికిపైగా రుణయాప్‌ బాధితులు ఆత్మహ త్యలు చేసుకున్నారు.ఈరుణయాప్‌ల గురించి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు, రిజర్వు బ్యాంకు గతనెల లోనే మూడు,నాలుగుసార్లు హెచ్చరికలు,విధాన నిర్ణయాలు చేశాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా వుందో అర్థమవుతుంది.
నిత్యావసరాలు,అత్యవసరాలకు డబ్బు అవసరం అవుతుంది. ఆ డబ్బు మానసిక, శారీరక శ్రమలు చేయడం ద్వారానైనా రావాలి. లేదా ఆ శ్రమలు చేసిన వారిని దోచుకోవడం ద్వారానైనా రావాలి.ఈ వ్యవస్థలో అత్యధికులు శ్రమ చేయడం, అతి కొద్దిమంది శ్రమను దోచుకోవడం జరుగు తుంది. అందువల్ల ఉత్పత్తి, అందుకు అవసరమైన శ్రమఈవ్యవస్థను నడపడంలో అత్యంత ముఖ్యమైన అంశాలు. యంత్రవిజ్ఞానాన్ని అన్ని రంగాల్లో విని యోగించడంవల్ల శ్రమతేలిక కావాలి. శ్రమ జీవికి విశ్రాంతి కలగాలి.కాని పని చేయగలిగిన వారంద రికి పనులు దొరకని పరిస్థితి ఏర్పడడమే ఈ వ్య వస్థ బలహీనతలన్నింటికీ మూలం. ఉన్న కొద్దిపాటి పనులకు పోటీ పెరుగుతుంది. దీన్ని అవకాశంగా తీసుకున్న యజమానులు వేతనాలు తగ్గిస్తారు. ఇది చివరకు నిత్యావసరమైన వాటిని కూడా కొనలేని స్థితికి ప్రజలను దిగజారుస్తుంది. కోవిడ్‌ సంక్షోభ సమయంలో చేసిన అప్పుల భారం, పనులు తగ్గడం శ్రమజీవుల జీవనాన్ని మరింత వేగంగా దిగజా ర్చింది.ఈ ప్రత్యేక పరిస్థితుల్లో పేదలందరికీ నెలకు రూ.7,500ఇవ్వాలనే కనీస డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. అందువల్ల గతంలో చేసే అప్పులకు తోడు కోవిడ్‌ తర్వాత పేద,దిగువ మధ్యతరగతి ప్రజలు రోజువారీ అవస రాలకు కూడా అప్పులు చేయాల్సి వచ్చింది.వీటికి తోడు బిజెపి పాలనా కాలంలో వేగంగా అమలవు తున్న సరళీకరణ విధానాలు ఒకవైపు ఉపాధిని తగ్గించి,మరోవైపు ధరల భారాన్ని పెంచాయి. వీటికితోడు వస్తు వ్యామోహాన్ని విపరీతంగా పెం చేస్తున్నారు. తమ ఆర్థిక పరిస్థితితో సంబంధంలేని జీవనాన్ని ఈఆర్థిక విధానాలు అలవాటు చేస్తు న్నాయి. అత్యధిక మందిని ఆధునిక జీవన ఆశల ఊహల్లో పోటీ పడేటట్లు,భౌతికజీవనాన్ని మధ్య యుగాల నాటి మూఢనమ్మకాలు, విశ్వాసాల్లో నిలి చేటట్లు పాలకవర్గాలు ఉద్దేశ్యపూర్వకంగానే చేస్తు న్నాయి. ఈసరళీకరణ విధానాల కత్తికి రెండు పక్కలా పదును వుంది. ఒకవైపు కార్పొరేట్‌ కంపె నీల సరుకులను ఎగబడి కొనేటట్లు చేయడం, మరోవైపు మతతత్వ శక్తుల భావజాలాన్ని ఆచరించే టట్లు చూడడం. అందుకే ఈ విధానాలను అన్ని వైపుల నుండి పాలక పార్టీలు ప్రోత్సహిస్తున్నాయి. విచిత్రమేమిటంటే ఎవరైతే ఉపాధి తగ్గించి, వేత నాలు తగ్గించి ప్రజల కష్టాలకు కారణమవు తున్నా రో వారే తమ సరుకులను అమ్ముకోవడానికి, కొను గోలుదార్లను ఆకర్షించడానికి తీవ్రంగా పోటీ పడు తున్నారు. సీరియళ్లు,సినిమాలు,మీడియా ప్రకట నలు,హోర్డింగులు,అందమైన షాపింగ్‌ మాల్స్‌, ఆకర్షణీయమైన రాయితీలతో పాటు రుణ సదుపా యాలు ఇచ్చి కృత్రిమ కొనుగోలు పెంచి సరుకులు అమ్ముకోవాలని చూస్తున్నారు.-(వి.రాంభూపాల్‌)

1 12 13 14 15 16 48