కారడవులూ కార్పొరేట్లకేనా..?

కేంద్ర ప్రభుత్వం గిరిజనుల వినాశ నానికి శ్రీకారంచుట్టింది.2022 జూన్‌ 28న ‘ఫారెస్ట్‌ కన్సర్వేషన్‌ నిబంధనలు-2022’ను తీసుకు వచ్చిం ది.‘కన్సర్వేషన్‌’ (పరిరక్షణ)పేరుతో వచ్చిన ఈనిబం ధనలు అంతులేని విధ్వంసం చేయబోతు న్నాయి. ఆదివాసీలను,అడవులను,వన్యప్రాణులను, పర్యా వరణాన్ని ధ్వంసం చేయడమే వీటి ప్రధాన ఉద్దేశం. ఈనిబంధనల ప్రకారం ఎంత పెద్ద అడవి నైనా అటవీయేతర భూమిగా మార్చుకోవచ్చు. వ్యా పారఅవసరాలు,లాభాల కోసం బడా కార్పొరేట్‌ సంస్థలకు ధారాదత్తం చేయవచ్చు. రాష్ట్రంలో స్క్రీనిం గ్‌ కమిటీ, కేంద్రంలో రీజినల్‌ ఎంపవరింగ్‌ కమిటీ, ఎడ్వైజరీకమిటీలు,మొత్తం మూడు కమిటీలు ఏర్పాట వుతాయి. వీటిలో పర్యావరణవేత్తలకు, ఆదివాసీలు, సామాజిక కార్యకర్తలకు ప్రాతినిధ్యం లేదు.కొత్త నిబంధనల కింద ఎంత అడవిని,ఎంతకాలపరి మితిలో కార్పొరేట్లకు అప్పగించాలో వివరాలు ఉండటం గమనార్హం.5 నుంచి 40హెక్టార్ల అడవిని 60 రోజుల్లో నాన్‌మైనింగ్‌ అవసరాలకోసం, మైనిం గ్‌ అవసరాల కోసం75రోజుల్లో అప్పగించాలి (హెక్టారు అంటే రెండున్నర ఎకరాలు). 41నుంచి 100 హెక్టార్ల అడవిని 75 రోజుల్లో నాన్‌మైనింగ్‌ అవసరాలకోసం,మైనింగ్‌ అవసరాలకోసం 90 రోజుల్లో ఇవ్వాలి. 100 హెక్టార్ల నుంచి ఆ పైనున్న అడవిని 120రోజుల్లో నాన్‌మైనింగ్‌ అవసరాల కోసం, మైనింగ్‌ అవసరాల కోసం 150రోజుల్లో ధారాదత్తం చేయాలి. పై మూడు కమిటీలు మొత్తం ప్రక్రియను ఈ కిందివిధంగా పూర్తిచేసి అడవిని కార్పొరేట్లకు అప్పగించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్దేశించబడిన కాలపరిమితికి లోబడి ఎటువంటి జాప్యం చేయరాదు.ఎలాధ్వంసం చేయాలి?మొదటి దశలో ఆదివాసులను, వన్యప్రాణులను అక్కడినుంచి ఖాళీ చేయించాలి. తర్వాత అడవిని ప్రైవేటు వ్యక్తు లకు,బడాకార్పొరేట్లకు దఖలు చేయాలి. ఆ తర్వాత ఏయే పద్ధతులద్వారా అడవిని ఎంత క్రూరంగా ధ్వంసం చేయవచ్చో కూడాఈనిబంధనల్లో పేర్కొ న్నారు.1.క్లియర్‌ ఫెల్లింగ్‌ (పూర్తిగా నరికివేయడం), 2.అప్‌ రూటింగ్‌ (కూకటివేళ్ళతో పెకలించడం), 3.బర్నింగ్‌(అడవినితగలబెట్టడం).ఇలాంటి విధ్వం సకర చర్యలద్వారాఅటవీభూమిని,అందులో ఉన్న సంపదను కొల్లగొట్టడంకోసం వన్యప్రాణులను, ఆదివాసులను,ఇతర పేదలను నిరాశ్రయు లను చేస్తారు.తద్వారా అటవీయేతర భూమిగా మార్చు కొని వారి అవసరాల కోసం వాడుకుంటారు. రాజ్యాంగం-చట్టాల ఉల్లంఘన
రాజ్యాంగంలో5,6వ షెడ్యూళ్ల ద్వారా దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఆదివాసులకు పలు హక్కులు, రక్షణ లభిస్తున్నాయి. గిరిజన భూముల బదలాయింపు నిరోధక చట్టం, గ్రామసభలకు అధి కారాలను కలగజేస్తున్న పెసా చట్టం,అటవీ హక్కుల గుర్తింపు చట్టం-2006, భూ నిర్వాసితుల చట్టం-2013, వివిధ సందర్భాల్లో సుప్రీంకోర్టు, తదితర కోర్టులు ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం ఇచ్చిన తీర్పులతో సహా అన్ని హక్కులు బుల్డోజర్‌తో నేలమట్టం చేయబడ్డాయి. ఇప్పటివరకు అమల్లో ఉన్న చట్టాల ప్రకారం ఎంత విస్తీర్ణం గల అడవిని అటవీయేతర భూమిగా మారుస్తారో, అంత విస్తీర్ణం గల భూమిని మరోచోట కేటాయించి ప్రత్యామ్నా యంగా అడవిని పెంచాలి. కానీ కొత్త విధానం ప్రకారం ప్రత్యామ్నాయ అడవుల పెంపకం నామ మాత్రమే. రాష్ట్రాల మీదికి ఆబాధ్యత నెట్టివేసి కేంద్రం చేతులు దులుపుకొన్నది. నష్ట పరిహారం, పునరావాసం: అడవి నుంచి, భూమి నుంచి గెంటి వేయబడిన ఆదివాసీలు, ఇతర పేదలకు పునరా వాసం గానీ, నష్ట పరిహారం గురించి గానీ కేంద్రం ఎలాంటి బాధ్యత తీసుకోలేదు. నిర్దిష్ట ప్రతిపాదనలు కూడా లేవు. అడవిని పూర్తిగా వ్యక్తిగత ఆస్తిగా మార్చుకొని,ఆయజమాని లబ్ధిని పొందడం ప్రారం భమైన తర్వాతనే నిర్వాసితుల పునరావాస ప్రక్రి యపై దృష్టిపెట్టాలి. ఈ ప్రక్రియను రాష్ట్ర ప్రభు త్వాలు పర్యవేక్షణ చేయాలనేది ఈ నిబంధనల్లోని అంశం. బడా కార్పొరేట్లను నిలువరించటం రాష్ట్ర ప్రభుత్వాలకు, ఆదివాసులకు, హక్కుల సంఘాలకు సాధ్యమవుతుందా? ఇది కేంద్రం పలాయనవాదం కాదా?గిరిపుత్రులు అడవిలో పుట్టి, అడవినే నమ్ము కొని,అడవే జీవనాధారంగా ఏర్పరచుకొని, అడవిలో లభించే కందమూలాలు తింటూ నాగరికపు సమా జానికి దూరంగా స్వేచ్ఛగా జీవిస్తున్నారు. వారిని అడవి నుంచి దూరం చేయాలని, అటవీ సంపదను కార్పొరేట్‌ బడా బాబులకు, ప్రభుత్వ ఆశ్రిత పెట్టు బడిదారులకు దోచిపెట్టాలని కేంద్రం తహత హలాడుతున్నది. అనేక రాష్ట్రాల్లో అటవీ సంపదను కొల్లగొట్టడానికి బొగ్గు గనుల తవ్వకం, బా క్సైట్‌, యురేనియం లాంటి ఖనిజాల వెలికితీతకు జిం దాల్‌, వేదాంత లాంటి బహుళజాతి సంస్థలు, అంబానీ, అదానీల సంస్థలు పోటీపడుతూ గిరిజన జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. రాజ్యాం గ విలువలకు ప్రాధాన్యం ఇచ్చి, ఆదివాసీల అభివృ ద్ధికి రాజ్యాంగం కల్పించిన చట్టాలను అమలు చేస్తేనే గిరిజనుల ఆకాంక్షలు నెరవేరుతాయి.
అడవుల పెంపకం కోసం నయా ప్లాన్‌.. డ్రోన్ల సహాయంతో బృహత్తర కార్యక్రమం..
ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి ఎన్ని చెట్లు నేల కూలుతున్నాయో తెలుసా..? సుమారుగా14 వేల కోట్లుకు పైమాటేనట! మరి వీటి స్థానంలో కొత్తగా ఎన్ని మొక్కలు పుడుతున్నా అంటే..అది జస్ట్‌ సగం కూడా లేవట! అందుకే..అడవులను వేగంగా పెంచాల్సిన అవసరం ఇప్పుడు ఉందని అటవీశాఖ అధికారులు ముందుకు వచ్చారు. అటవీశాఖ ఈ సరికొత్త ప్రాజెక్ట్‌ కు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా డ్రోన్లతో విత్తనాలను నాటుతున్నారు. భారీగా మొక్క లుగా మొలిచేలా చేయడమే తమటార్గెట్‌ అనివాళ్లు చెప్తున్నారు. మామూలుగా మనుషులతో విత్తనాలు నాటాలంటే ఎక్కువ టైంలో తక్కువ పనైతది. ఎక్కువ మంది జనాలుదానికోసం పనిచేయాల్సి ఉంటుంది. దాంతో పాటు ఖర్చూ ఎక్కువే.అందుకే వాళ్లు డ్రోన్‌ టెక్నాలజీపై ఫోకస్‌ పెట్టారు. ముందుగా వాళ్లకు కావాల్సిన రకరకాల మొక్కల విత్తనాలను సెలెక్ట్‌? చేసుకుంటారు. వాటిని మట్టి, ఇతర న్యూట్రియెంట్స్‌ కలిపిన ఒక ముద్దలో పెడతారు.ఆముద్దలను ఉండలుగా చుట్టి సీడ్‌ బాల్స్‌గా మారుస్తారు. ఈ సీడ్‌ బాల్స్‌ను డ్రోన్‌లద్వారా పైనుంచి జార విడు స్తారు. దీంతో వానలు పడగానే సీడ్‌ బాల్స్‌ మొల కెత్తుతాయి.వాటి చుట్టూ ఉన్న మట్టి, న్యూట్రియెంట్స్‌ సాయంతో ఏడెనిమిది నెలల వరకూ మొక్కలు బతకగలవు. ఆలోపు వేర్లు పుట్టి, నేలలో బాగా పాతుకుపోతాయి. ఇలా.. డ్రోన్లతో ఈజీగా మొక్కలు పెంచొచ్చని వీరు ప్లాన్‌ చేశారు.ఫ్లాష్‌ ఫారెస్ట్‌ ప్రాజె క్టును గత కొద్ది రోజులుగా తెలంగాణలో ఎన్జీవోలు నిర్వహిస్తున్నాయి. అయితే ఇప్పుడు అటవీశాఖ అధి కారులు రంగంలోకి దిగారు. కామారెడ్డి జిల్లా అటవీ ప్రాంతంలో డ్రోన్‌ ద్వారా విత్తన బాల్స్‌ వేశారు. గుబ్బ కోల్డ్‌ స్టోరేజ్‌ ఆధ్వర్యంలో విత్తనాలను సేకరించినట్లుగా చెప్పారు. అడవిలో పలుచగా ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసుకుని అక్కడే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు వివరించిన అధికారులు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కామా రెడ్డిలోనే ప్రారంభించామని వెల్లడిరచారు.
పర్యావరణంలో కలిగే దుష్పరి ణామా లను అడ్డుకోడానికి చెట్లు నాటడమొక్కటే పరిష్కారం అన్న భావన గత కొన్నేళ్లుగా బలహీనపడుతోంది. కార్బన్‌ వాయువులను పీల్చుకోవడంలో అడవులు కీలకపాత్ర పోషిస్తాయని గతంలో జరిగిన పరిశోధ నలు తేల్చాయి. వాటిని నమ్మి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు విస్తారంగా అడవులను పెంచడం ప్రారంభించాయి. మొక్కల పెంపకం మీద అనేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాయి. చెట్లు పెంచితే పర్యావరణంలో దుష్పరిణామాలను ఆపవచ్చని విస్తృతంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహిం చాయి. 2030 కల్లా 350 మిలియన్‌ హెక్టార్లలో నాశనమైన అడవుల ప్రాంతంలో తిరిగి పచ్చదనం తీసుకురావాలని పలు దేశాలు ప్రతిజ్జ చేశాయి. ఇప్పటి వరకు 40 దేశాలు ఈ ప్రతిజ్జను పాటిస్తు న్నాయి. కానీసైంటిస్టులు మాత్రం మొక్కలు నాట డానికి ఉరుకులు పరుగులు పెట్టాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు. చిలేలో అడవుల పెంపకానికి ఇచ్చే సబ్సిడీలకు సంబంధించి1974 నుంచి 20 12వరకు విడుదల చేసిన డిక్రీలను పరిశీలిం చారు. వీటిని చూస్తే ప్రపంచంలో ఇదే అతి పెద్ద అడవుల పెంపకం ప్రాజెక్టు అనిఅర్ధం చేసుకో వచ్చు. కొత్తగా అడవులను పెంచడానికి ఈ చట్టం ప్రకారం 75 శాతం రాయితీలు లభిస్తాయి.వాస్తవానికి ఈ పథకం ప్రకారం అప్పటికే ఉన్న అడవులలో చెట్లు నాటకూడదు. కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా చాలామంది మొక్కల పెంపకందారులు అడవు లలోనే లాభదాయకమైన పండ్లను, ఫలాలను ఇచ్చే చెట్లను నాటడం మొదలు పెట్టారు. ఈ స్కీమ్‌ను చెట్లు ఉన్న ప్రాంతాలకు కూడా విస్తరించారు, కానీ స్థానిక అడవులున్న ప్రాంతంలో తగ్గించారు చిలే లోని అడవులు పెద్దమొత్తంలో కార్బన్‌ను నిల్వ చేసుకునే సామర్ధ్యం ఉన్నవని, కానీ కొత్తగా చేపట్టిన మొక్కల పెంపకంవల్ల అది తగ్గిపోయి, జీవవైవిధ్యం దెబ్బతిన్నదని ఈఅధ్యయనం నిర్వహించిన పరి శోధకులు అంటున్నారు. ‘’మొక్కలు పెంచడానికి చేపట్టిన పథకాలు సరిగా రూపొందించక పోయినా, అమలు చేయకపోయినా ఫలితాలు ఇలానే ఉంటా యి. డబ్బులు వృథాకావడంతోపాటు జీవవైవిధ్యం కూడా దెబ్బతింటుంది’’ అని ఈ స్టడీ పేపర్‌ సహ రచయిత స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ ఎరిక్‌ లాంబిన్‌ అన్నారు. మనం కోరుకున్న దానికన్నా పూర్తిగా భిన్నమైన ఫలితాలు ఇవి ‘ొఅని ఆయన అన్నారు. ఇక దీనిపై పని చేసిన రెండో పరిశోధనా ప్రాజెక్టు కొత్తగా నాటిన అడవులు ఎంత వరకు కార్బన్‌ వాయువులను పీల్చగలవో పరిశీ లించింది. ఇప్పటి వరకు సైంటిస్టులు మొక్కలు ఏ స్థాయిలో కార్బన్‌ వాయువులను పీల్చుకుంటాయో అంచనాలు వేసి ఒక నిర్ణీత నిష్పత్తిని నిర్ణయించారు. అయితే ఈ నిష్పత్తిపై అనుమానాలు వ్యక్తం చేసిన ఈ పరిశోధన, పరిస్థితులను బట్టి ఈ నిష్పత్తి మారు తుందని తేల్చింది. ఈ సందర్భంగా పరిశోధకులు ఉత్తర చైనాలో ప్రభుత్వం నాటించిన చెట్లతోపాటు, గోబీ ఎడారిలో నాటిన మొక్కలను కూడా పరిశీ లించారు. ఈఅడవుల నుంచి 11,000 మట్టి నమూనాలను సేకరించారు. నేలలో కార్బన్‌ లేని ప్రాంతాలలో మొక్కలు పెంచడం వల్ల ఆ ప్రాం తంలో ఆర్గానిక్‌ కార్బన్‌ పెరుగుతుందని గుర్తిం చారు. కార్బన్‌ ఎక్కువగా ఉన్న నేలల్లో అడవులను నాటడం వవలన వాటి సాంద్రతలో తగ్గుదల కనిపించింది. మొక్కలు కార్బన్‌ను పీల్చుకునే శాతాల గురించి గతంలో వేసిన అంచనాలు కాస్త అతిశ యంగా ఉన్నాయని ఈ పరిశోధకులు తేల్చారు. ‘’కర్బన ఉద్గారాలను తగ్గించాలనుకుంటే దానికి చెట్లు నాటడమొక్కటే పరిష్కారంకాదని ప్రజలు అర్ధం చేసుకోవాలి’’అని ఈ పరిశోధనకు నాయ కత్వం వహించిన కొలరాడో స్టేట్‌ యూనివర్సిటీ చెందిన డాక్టర్‌ అన్పింగ్‌ చెన్‌ అన్నారు. ‘’అడవుల పెంపకంలో చాలా సాంకేతిక అంశాలను పరిశీలిం చవలసి ఉంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా పరిస్థితులు ఉంటాయి. వాటన్నింటినీ సమతుల్యం చేయాలి, ఏదో ఒక విధానమే సమస్యకు పరిష్కారం కాదు’’ అన్నారు .- (నాదెండ్ల శ్రీనివాస్‌)