పార్లమెంట్‌లో పెరగని మహిళా ప్రాతినిధ్యం

మహిళలను జాతి నిర్మాతలుగా మలచడానికి, నారీ శక్తిని గౌర వించడానికి ప్రధాని మోడీ పార్ల మెంటులో మహిళా రిజర్వేషన్‌ బిల్లును 2023లో ఆమోదించారని, గత ఏడాది సామాజిక మాధ్యమాల్లో హోరెత్తిపోయే ప్రచారం జరిగింది. పార్లమెంట్‌ ఆమోదించిన మహిళా రిజర్వేషన్‌ చట్టం ప్రకారం పార్ల మెంటు, శాసనసభ ఎన్నికలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ అనేది 2026లో జాతీయ జనాభా గణన పూర్తయి, పార్లమెంటు స్థానాల పునర్వ్యవస్థీకరణ (డి-లిమిటేషన్‌) పూర్తయిన పిదప అమలులోకి వస్తుంది. అంటే 2029లో మాత్రమే అది అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఏదైనా కారణాలవల్ల ఈ డెడ్‌లైన్‌ మిస్‌ అయితే 2034లో జరగబోయే ఎన్నికల వరకు మహిళా రిజర్వేషన్‌ అమలయ్యే పరిస్థితి లేదని మనం అర్ధం చేసుకోవాలి.
మనదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అయ్యింది.ఆ పేరుతో ఏడాదిపాటు సంబరాలు కూడా జరుగుతున్నాయి.మరి75 ఏండ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా మహిళల పరిస్థితి దేశంలోఎలా ఉంది?మహిళలకు దక్కాల్సిన సమా న అవకాశాల పరిస్థితి ఏంటీ? ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం అనే నినాదం ఇంకా అలాగే ఎందుకు మిగిలింది?అన్ని అన్నీ రంగాల్లో సమాన హక్కులు సరే,చట్టాలు చేసి దేశాన్ని ముందుకు నడిపించే చట్టసభల్లో మహిళలకు ఏమేరకు భాగ స్వామ్యం దక్కింది?మనపార్లమెంట్‌ ఉభయ సభల్లో మహిళల ప్రాతినిధ్యం తొలిసారిగా వంద దా టింది.ప్రస్తుతం లోక్‌సభలో 81మంది,రాజ్య సభ లో29మంది మహిళా ఎంపీలుఉన్నారు. మొత్తంగా చూస్తే 14.9శాతమే.సమాన అవకాశాల నినాదం ప్రకారం చూసినా,33శాతం రిజర్వేషన్‌ బిల్లు పరంగా చూసినా చట్టసభల్లో మహిళా ప్రాతి నిధ్యం చాలా తక్కువే.ఇక ఆయా రాష్ట్రాల అసెంబ్లీ లకు ఎన్నికల పూర్తియిన తర్వాత కూడా చూస్తే పరిస్థితి మరింత దారుణంగా కనిపిస్తోంది.దేశవ్యాప్తంగా సగటున 9శాతం మంది మహిళలు మాత్రమే ఎంపీలయ్యారు.ఓటర్ల సంఖ్య విషయానికి వస్తే పురుషులకు కొంచెం అటుఇటుగా మహిళా ఓటర్లు ఉంటారు.కానీ ఎన్నికల్లో పోటీ,గెలుపు విషయానికి వచ్చేసరికి మాత్రం వారి సంఖ్య చాలా తక్కువగానే ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇదీ..
దేశంలోని మిగితా రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉన్నా..తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిస్థితి అంత గొప్పగా ఏమీ లేదు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలో కలిపి 317మంది మహిళలు పోటీ చేయగా,.27మంది మాత్రమే ఎమ్మెల్యేలుగా గెలిచారు.అంటే గెలిచిన 2018లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో 140మంది మహిళలు పోటీ చేస్తే ఆరుగురు మాత్రమే గెలిచారు.122మంది డిపాజిట్లు కోల్పోయారు.2019ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 211మంది పోటీ చేస్తే 14 మంది మహిళలు గెలవగా,174మందికి డిపాజిట్‌ దక్కలేదు.ఇక 2014లో చంద్రబాబు సీఎంగా ఏర్పడిన ఏపీ కేబినెట్‌లో పరిటాల సునీత, అఖలి ప్రియ,మృణాళిని,పీతల సుజాత మంత్రులుగా పని చేశారు. తెలంగాణా ఏర్పడ్డాక కొలువుదీరిన మొదటి కేబినెట్‌లో ఒక్కరు కూడా మహిళా మంత్రి లేరు.2018లో తెలంగాణాలో ముందుస్తు ఎన్నికలు రావడం,ఆతర్వాత మరోసారి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఇద్దరు మహిళలకు కేబినెట్‌లో చోటు దొరికింది.వారే సత్యవతి రాతోడ్‌,సబితా ఇంద్రారెడ్డి.సబితా వేరే పార్టీ నుంచి రాగా,సత్యవతి రాథోడ్‌ ఎమ్మెల్సీగా ఉన్నారు.అంటే టీఆర్‌ఎస్‌ బీ`ఫారం మీద గెలిచిన ఏ ఒక్క మహి ళా ఎమ్మెల్యే ఇప్పటి వరకు మంత్రా కాలేదు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో 2019లో ఏర్పడిన వైఎస్‌ జగన్‌ కేబినెట్‌లో పుష్పశ్రీవాణి,వనిత, సుచరిత, విడుదల రజనీ మంత్రులయ్యారు.
ఇటీవల జరిగిన 2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎప్పటి మాదిరిగానే మహిళా సభ్యుల ప్రాతినిధ్యం తీసికట్టుగానే ఉంది. ఇంకా చెప్పా లంటే తగ్గింది.74 మంది మహిళలు ఎంపీలుగా ఎన్నికయ్యారు. ఇది మొత్తం పార్లమెంట్‌ సభ్యుల్లో 13.6శాతం మాత్రమే.2019లో78మంది మహి ళలు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు.ఇది14.4 శాతంగా ఉంది.గత ఎన్నికల్లో 726మంది మహిళ లు పోటీ చేయగా,2024ఎన్నికల్లో పోటీ చేసిన వారి సంఖ్య 797కి పెరిగింది.అయినా ఎన్ని కయి న మహిళా పార్లమెంట్‌ సభ్యుల సంఖ్య తగ్గడం గమనార్హం.
ఎన్నికల్లో మహిళా ఓటర్లను ఆకర్షిం చేందుకు రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించే విషయం మనకు తెలిసిందే.రాష్ట్రాలలో శాసనసభలకు జరిగే ఎన్ని కల సందర్భంగా,మహిళలకు ప్రత్యేకంగా కొన్ని సంక్షేమ పథకాలను కూడా రాజకీయ పార్టీలు ప్రకటిస్తూ ఉంటాయి. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల లాగే,పార్లమెంట్‌ ఎన్నికల్లో కూడా మహిళా ఓటర్ల ను తమ వైపు తిప్పుకునేందుకు అనేక పార్టీలు తమ మ్యానిఫెస్టోలలో ప్రత్యేక పథకాలను పొందు పరిచాయి.ఆంధ్రప్రదేశ్‌,ఒడిషా ఎన్నికలలో పాలక, ప్రతిపక్ష పార్టీలు మహిళలే కేంద్ర బిందువుగా అనేక పథకాలు తీసుకువచ్చాయి. వీటన్నింటి ప్రభావం ఎన్నికల్లో ఉంటుందని,ఓట్లు వేయడానికి మహిళా ఓటర్లు పోటెత్తుతారని అందరూ భావించారు. కానీ విపరీతమైన ఎండ తీవ్రత,ఓటింగ్‌ పట్ల నిరాసక్తత వంటి కారణాలతో ఓటింగ్‌ శాతం తగ్గింది.
2019లో దేశవ్యాప్తంగా 67.01శాతం పురు షులు ఓట్లేయగా,67.18శాతం మహిళలు ఓట్లేశారు.ఈ ఎన్నికలలో 65.08శాతం పురు షులు ఓట్లేస్తే, 65.78శాతం మాత్రమే మహిళా ఓటింగ్‌ నమోదయ్యింది. ఈ ఎన్నికల్లో 31కోట్ల మంది మహిళా ఓటర్లు ఓట్లేసినప్పటికీ, గతంతో పోలిస్తే దాదాపు 2 శాతం మహిళా ఓటింగ్‌ తక్కువ నమోదవడం గమనార్హం. అస్సాం, ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలలో మాత్రం 80 శాతం పైబడి మహిళా ఓటింగ్‌ నమోదైంది. 2023లో ప్రపంచవ్యాప్తంగా 52దేశాల్లో పార్లమెంట్‌ ఎన్ని కలు జరిగాయి.ఇంటర్‌ పార్లమెంటరీ యూనియన్‌ (ఐపియు) సమాచారం మేరకు ప్రపంచ వ్యాప్తంగా 27.6శాతం మహిళలు పార్లమెంటు సభ్యులుగా గెలుపొందారు. ఈవిషయంలో 185ప్రపంచ దేశా ల్లో భారత్‌ స్థానం 143గా ఉంది.ఈ ఏడాది ఎన్ని కలు జరగడానికి ముందు మన దేశ పరిస్థితి ఇది. ఈ ఎన్నికల తర్వాత,మన దేశస్థానం ఇంకా దిగ జారే ప్రమాదం ఉంది.ఫిన్లాండ్‌, నార్వే, ఐస్‌లాండ్‌, న్యూజిలాండ్‌,స్వీడన్‌ దేశాలు ఎప్పుడో మహిళా సమానత్వాన్ని సాధించాయి.అక్కడి ప్రజాప్రతి నిధుల్లో అత్యధికులు మహిళలే.
మన పార్లమెంట్‌లో మహిళల భాగస్వా మ్యం అంతంత మాత్రంగా ఉంటే, అనేక దేశాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆశాజనకంగా ఉన్నాయి.ఈ మధ్యే మెక్సికోలో మొట్టమొదటి సారిగా ఓ మహిళ అధ్యక్ష పీఠానికి ఎన్నికయ్యారు. అధ్యక్ష స్థానం కోసం పోటీ పడిన ఇద్దరు అభ్యర్థు లూ మహిళలే కావడం విశేషం.ఇదేదో ఒక రోజు లో జరిగింది కాదు. మెక్సికో కూడా లిబరల్‌ దేశ మేమీ కాదు. అక్కడ కూడా ఛాందసవాద శక్తులు, గుత్త పెట్టుబడిదారీ శక్తులు వివిధ రంగాల్లో మహి ళల భాగస్వామ్యాన్ని అడ్డుకుంటూనే ఉన్నాయి. అయితే, వీటిపై పురోగామి శక్తులు,ఫెమినిస్టులు దశాబ్దాలుగా పోరాటం సాగిస్తూనే ఉన్నారు. దాని ఫలితమే ప్రస్తుతం మెక్సికోలో కొన్ని సానుకూల పరిణామాలు చోటు చేసుకున్నాయి.
మన దేశంలో పార్లమెంటరీ రంగం లోనే కాదు నిర్ణయాత్మక రంగాలలోనూ మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువుగా ఉంది. దేశం అను కున్న రీతిలో అభివృద్ధి చెందడానికి ఇది ప్రధాన అవరోధంగా ఉంది.1947లో దేశ మొత్తం అక్షరా స్యత కేవలం 12 శాతం ఉండగా నాడు మహిళల్లో అక్షరాస్యులు 6 శాతం మాత్రమే. ప్రస్తుతం మొత్తం అక్షరాస్యత 77.7శాతం ఉండగా మహిళలది 70.3 శాతంగా నమోదైంది. పురుషులతో పోలిస్తే మహిళల అక్షరాస్యత శాతం తక్కువగా ఉన్నప్పటికీ స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లతో పోలిస్తే గణనీ యంగా పెరిగింది. 1957లో కేరళలో నంబూద్రి పాద్‌ నేతృత్వంలోని వామపక్ష ప్రభుత్వం భూ సంస్కరణలు అమలు చేసింది.1977లో పశ్చిమ బెంగాల్‌లో జ్యోతిబసు ప్రభుత్వం కూడా భారీగా భూ సంస్కరణలు అమలు చేసింది. మిగులు భూమి ని పేద ప్రజలకు ఇవ్వబడిరది.తినడానికి ఆహారం, చదువుకోవడానికి విద్య ప్రజలకు లభించింది. అందుకే మానవాభివృద్ధిలో మొదటి స్థానం కేరళ రాష్ట్రానిది.100శాతం అక్షరాస్యత సాధించబ డిరది. ఈ నిర్ణయాల వల్ల కేరళ, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో మహిళల స్థితిగతులు గణనీయంగా పెరిగాయి.
1992లో 73,74రాజ్యాంగ సవరణ ల ద్వారా మహిళలకు అన్ని స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించారు. తర్వాత 2002లో పట్టణ స్థానిక సంస్థల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగాన్ని మరోసారి సవరించారు. ఆంధ్రప్రదేశ్‌,తెలంగాణ,మహారాష్ట్ర, త్రిపుర, కేరళ రాష్ట్రాల్లో పంచాయతీల్లోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు.ఫలితంగా వారి ప్రాతి నిధ్యం గణనీయంగా పెరిగింది. మరోవైపు చూస్తే చదువు,అవకాశాల్లో ఆడపిల్లల పట్ల వివక్ష, భ్రూణ హత్యలు,అత్యాచారాలు దేశంలో ఏదో మూలన నిత్యం జరుగుతూనే ఉన్నాయి.స్త్రీలకు స్వేచ్ఛ, ఆర్థిక,రాజకీయ సమానత్వానికి చట్టాలు తీసు కొచ్చినా పోరాటం తప్పడం లేదు. అసంఘటిత రంగాలలో మహిళలు వారి కనీస సదుపాయాల కోసం నిత్యం పోరాటం చేయాల్సి వస్తుంది. మణి పూర్‌లో కుకీ ప్రజలపై జరిగిన దాడులు, మహిళ లపై జరిగిన అత్యాచారాల ఘటనలపై విచారం వ్యక్తం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు చేపట్టాలని,సుప్రీంకోర్టు హెచ్చరిక చేసే వరకు కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. మన దేశంలో పురుషాధిక్య ధోరణి, లైంగిక అణచి వేత పోవాలంటే చట్ట సభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలి.దీనితో పాటుగా రాజకీయాల తీరు తెన్ను లు మారాలి. పద్దెనిమిదవ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన పార్లమెంట్‌ సభ్యులలో 93 శాతం మంది కోటీశ్వరులని, అనేకమంది ఎంపీలకు నేర చరిత్ర ఉందని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ అనే స్వచ్ఛందసంస్థ తెలియచేస్తోంది. ధన మయ,నేరమయ రాజకీయాలు రూపుమా పకుండా పురోగామి,మహిళాభ్యుదయ రాజకీయాలు సాధ్యమా అనేదే ప్రశ్న? దురదృష్టవశాత్తు మహిళా భ్యుదయంలో ముందంజలో ఉన్న కేరళ రాష్ట్రం నుంచి ఒక్క మహిళా పార్లమెంట్‌ సభ్యులు కూడా ఎన్నిక కాలేదు.
అన్ని పార్టీలూ మహిళలను నిలబెడితేనే మహిళా ప్రాతినిధ్యం సాధ్యం. కనుక పార్లమెంట్‌ లో,చట్ట సభల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచే మహిళా చట్టాన్ని తక్షణమే అమలు చేయాలి. ప్రజల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా ప్రత్యామ్నా య ఆర్థిక విధానాలతో ముందుకు వచ్చే వామపక్ష, అభ్యుదయ శక్తులను ప్రజలు ఆదరించాలి. మత వాద,చాందసవాద రాజకీయ శక్తులను ఓడిర చాలి.అన్ని రకాల వివక్షలకు వ్యతిరేకంగా పోరాడే, ప్రత్యామ్నాయ శక్తుల రాజకీయ ప్రాబల్యం పెరిగి తేనే నిజమైన మహిళాభ్యున్నతి,మహిళా సాధి కారత సాధ్యం అవుతుంది.
పార్టీల్లోనూ అంతంతే..
రాజకీయపార్టీల విషయానికివస్తే నలు గురు మహిళలు పార్టీలకు అధ్యక్షులుగా ఉండి విజయంవంతంగా ముందుకు నడిపిస్తున్నారు. మాయావతి,సోనియాగాంధీ,మమతా బెనర్జీ, మెహ బూబా ముప్తీ రాజకీయంగా ఎన్ని ఒడిదుడుకులు వస్తున్నా,పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అన్ని రకాల ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నారు. జయలలిత వంటివారు కూడా పార్టీని ఎంత సమర్ధ వంతంగా నడిపారో,ఎలా అధికారంలోకి తెచ్చారో మనకు అనుభవంలోఉన్నదే.అయితే మిగతా రాజకీయ పార్టీల్లో మహిళు ఎక్కడ ఉంటు న్నారు? వారి పాత్ర ఏమిటీ ని ఆలోచించినప్పుడు నిరాశా పూరిత వాతావారణమే కనిపిస్తుంది. ప్రెసిడెంట్‌, జనరల్‌ సెక్రటరీ,కోశాధికారి వంటి పదవులకు మహిళలు కనీసం నామినేషన్‌ వేసే పరిస్థితి కూడా పలు పార్టీల్లో లేదు.దశాబ్దాలుగా పురుషల డామి నేషన్‌ ఆయా పార్టీల్లో పరంపరంగా కొనసాగుతూ వస్తోంది.ఎంపీటికెట్లు,ఎమ్మెల్యే టికెట్లు దాటి పార్టీ పగ్గాలు చేపట్టే పరిస్థితి మెజార్టీ పార్టీల్లో మహిళలకు లేదు.
33శాతం రిజర్వేషన్‌ బిల్లు పరిస్థితి..
మహిళలకు 33శాతం రిజర్వేషన్‌ కల్పించే ఉద్దేశ్యంతో రూపొందించిన బిల్లు ఇప్పటికీ పార్లమెంట్‌ ఆమోదం పొందలేదు.2008లో తొలి సారిగా పార్లమెంట్‌ ముందుకు వచ్చిన ఈబిల్లుకు కొన్ని పార్టీలు ససేమిరా అన్నాయి.మహిళలకు ఒకసారి రిజర్వుచేస్తే శాశ్వతంగా తమకు అధికా రం దక్కదన్న భావన ఆబిల్లుకు ఆమోదం కాకుండా అడ్డుపడుతోంది.యూపీఏ హాయంలో ఈ బిల్లును ఆమోదించడానికి ప్రయత్నాలు జరిగాయి.ఆ తర్వాత వచ్చిన ఏన్డీయే ప్రభుత్వం ఈబిల్లు గురించి పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్‌ దక్కుతున్నా ఎన్ని కైన తర్వాత 90శాతం మగవారే పెత్తనం చెలాయి స్తున్నారు.పేరుకే మహిళలు సీట్లోకూర్చుంటున్నా భర్తో,అన్నో,తండ్రోవ్యవహరాలను చక్కబెడు తున్నా రు. ఇది రాజ్యాంగ విరుద్దం అని తెలిసినా చూసీ చూడనట్లు నడిచిపోతోంది.అసలు ఈ పరిస్థితి ఎందుకు తెలెత్తుతోంది?సంప్రదాయకంగా మహిళ లను ఇంటికి,ఇంటి వ్యవహారాలకు మాత్రమే పరిమితం చేయాలన్న ఆలోచన మెజారిటీ కుటుం బాల్లో ఉండటమే ప్రధాన కారణం.ఇల్లు,పిల్లలు తప్ప మరోగోల పట్టని మహిళే మెజారిటీ,వారిని ఛట్రంలోనే ఉంచుతున్నది మెజారిటీ పురుషస్వా మ్యమే అయినా అక్కడక్కడ మహిళలు కూడా ఇందుకు దోహదపడుతున్నారు.ప్రాధమికంగా చదువుకునే విషయం నుంచి ఈ వివక్ష మొదలవు తుంది.ఆడపిల్లలకు చదువుఎందుకనే చర్చ మొదలు కొని ఎక్కువ చదువుకుంటే సరైన భర్తను తేలేమన్న హిపోక్రటిక్‌ భావాలతో సమాజం నిండిపోయింది. ఇలాంటివెన్నో వారు రాజకీయంగా ఎదగకపోవ డానికి కారణాలుగా కనిపిస్తున్నాయి.- (పి.సతీష్‌)

మడ అడవుల జీవ వైవిధ్య ప్రతీకలు

మడ అడడులు..పర్యావరణ పరిరక్షణకు ప్రకృతి ప్రసాదించిన వరాలు.తీర ప్రాంతాలకు సహజ రక్షణ గోడలు.సముద్ర తీర జీవవైధ్యంలో వీటిదే కీలక పాత్ర.ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి మనుషల్ని,వన్యప్రాణుల్ని కాపాడుతు న్నాయి. కోట్ల మంది జీవనోపాధికి ఆసరాగా నిలుస్తున్నాయి.వీటినిభద్రంగా చూసుకోవాల్సిన బాధ్యత మాన వాళిపై ఉంది. జూలై26 అంతర్జా తీయ మడ అడువుల సంరక్షన దినోత్సవం సందర్భంగా…
ఉష్ణమండలం..ఉప ఉష్ణమండల ప్రాంతాలు, అత్యధిక వర్షపాతం నమోదయ్యే భూ భాగాలు,నదులు,సముద్రంలో కలిసేతీర ప్రాం తాల్లో మడ అడవులు ఏర్పడతాయి. అత్యధిక ఉప్పు సాంధ్రత,నీటినిల్వఉండి, తరచూ తుఫాన్లు సంభవించే ప్రాంతాల్లో అలలు,ఉప్పెనల ప్రభా వంతో నెలకొం టాయి.మడ అడవులు ఉన్న ప్రాంతాల్లో తుఫానుల తీవ్రత,వాటివల్ల కలిగే నష్టం తక్కువగా ఉన్నట్లు కోనసీమ ఉప్పెన సహా పలుసందర్భాల్లో తేలింది.ఇవి ఉండే చోట మత్స్య సంపద అధికంగా ఉంటున్నట్లు అధ్యయ నాల్లో వెల్లడైంది.చేపలు,రొయ్యలకు ఆహారంగా మత్స్యసంపదను పెంపొందిం చడంలోనూ తోడ్ప డుతున్నాయి. పర్యాటక పరంగానూ వేల మందికి ఉపాధిని కల్పిస్తు న్నాయి.వాతావర ణంలో కర్బన్‌ ఉద్గారాలు కార్బొన్‌ డై ఆక్సైడ్‌ను తగ్గించు డంలో కీలక పాత్ర పోషిస్తు న్నాయి. సముద్ర తీరప్రాంతంలో నీటి నాణ్యత ను పెంచేందుకు దోహదపడుతు న్నాయి. పర్యా వరణ పరిరక్షనతోపాటు జీవవైధ్యానికి అండగా నిలుస్తున్నాయి. తీర ప్రాంతాల్లో పలురకాల గ్రామీణ జీవనోపాధి అవకాశాలు కల్పించడం లో గణనీయ పాత్ర పోషిస్తున్నాయి.తుఫానులు, ఉప్పెనల నుంచి తీరప్రాంత గ్రామాలను కాపాడుతున్నాయి. బలమైన వేళ్లతో అల్లుకుపోయిన మడ అడు వులు అటుపోట్లకు అడ్డుగా నిలిచి భూమి కోతకు గురికాకుండా పరిరక్షిస్తున్నాయి. ప్రత్యేకమైన,విలువైన మరియు సున్నితమైన పర్యావరణాలుగా మడ అడవుల పర్యావరణ వ్యవస్థల ప్రాముఖ్యతపై ప్రపంచ అవగాహనను పెంచడం దీని ఉద్దేశ్యం..యునెస్కో జనరల్‌ కాన్ఫరెన్స్‌ 2015లో ఈఅంతర్జాతీయ దినోత్సవాన్ని అధికారికంగా ఆమోదిం చింది. అలాగే తాజాగా జీ20సదస్సులో వాతావరణ మార్పుల సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు మడ అడవులను పరిరక్షించుకోవాలని ప్రపంచ దేశాల నేతలు పిలుపు నిచ్చారు.సదస్సు సాక్షిగా మడ అడవుల పరిరక్షణకు ఉద్దేశించిన మాం గ్రూప్‌ ఆలయన్స్‌ ఫర్‌ క్లైమేట్‌ వేదికలో భారత్‌ భాగస్వామిక చేరినట్లు ప్రధాని మోది ప్రకటిం చారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థాలాల కేటాయంపు పేరుతో కాకినాడ తీరంలో పెద్దఎత్తున మడ అడవు లను ధ్వంసం చేయడాన్ని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) తప్పుపట్టింది.ధ్వంసం చేసిన మడ అడవులను అయిదేళ్లలో ప్రభుత్వం పునరుద్దరించాలని ఆదేశిం చింది.అందుకోసం అయిదుకోట్ల రూపా యలమేర మధ్యంతర పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించాలని ట్రైబ్యునల్‌ ఆదేశించడం సమస్య తీవ్రతకు అద్దంపడుతుంది.
భారతదేశంలోని మడ అడవులు
ఫారెస్ట్‌ సర్వే రిపోర్ట్‌ 2021ప్రకారం,2019 అంచనాతో పోలిస్తే భారతదేశంలో మడ అడవుల విస్తీర్ణం17చదరపు కిలోమీటర్లు పెరిగింది. ఇది ఇప్పుడు 4,992 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. మడ అడవులు అత్యధికంగా పెరిగిన మూడు రాష్ట్రాలు- ఒడిశా (8చదరపు కి.మీ),మహారాష్ట్ర (4చదరపు కి.మీ) మరియు కర్ణాటక (3 చ.కి.మీ).వీటిలో తీర రక్షణ: మడ అడ వులు అలలు మరియు తుఫానుల ద్వారా ఏర్పడే కోతల నుండి తీరప్రాంతాలను రక్షిస్తాయి.వాటి చిక్కుపడినట్టు ఉండే వేర్లు అవక్షేపాలను బంధించడానికి,నీటి ప్రవా హాన్ని తగ్గించడానికి సహాయ పడతాయి. ఇది ఈ సహజ ప్రమాదాల ప్రభావాన్ని తగ్గిస్తాయి.
చేపలు,వన్యప్రాణుల ఆవాసాలు : మడ అడవులు వివిధ రకాల చేపలు, షెల్ఫిష్‌లు, పక్షులు మరియు ఇతర జంతు వులకు నిలయంగా నిలుస్తాయి. మడ చెట్ల వేర్లు మరియు కొమ్మలు ఈ జంతువులకు ఆహారం మరియు ఆశ్రయాన్ని అందిస్తాయి. ఈ అడవులు అనేక జాతుల చేపలకు నర్సరీగా కూడా పనిచేస్తాయి.
నీటిని శుద్దీచేయడం: మడ అడవులు కాలుష్య కారకాలు,అవక్షేపాలను ఫిల్టర్‌ చేయడం ద్వారా నీటిని శుద్ధి చేయడా నికి సహాయపడతాయి.అవి నీటి ప్రవాహాన్ని నియంత్రించడంలో కూడా సహాయపడతాయి, ఇది వరదలను నిరోధిం చడంలో సహాయ పడుతుంది.
కార్బన్‌ నిల్వలు: మడ అడవులు ఒక ముఖ్యమైన కార్బన్‌ సింక్‌గా పనిచేస్తుంది, అంటే అవి వాతావ రణంలో ఉన్న కార్బన్‌ డయాక్సైడ్‌ను నిల్వ చేస్తాయి. ఇది వాతావరణ మార్పులను తగ్గించడానికి సహాయపడుతుంది.
నిర్లక్ష్యంతో తీరని నష్టం..
తీరప్రాంతాల్లో పర్యావరణానికి నష్టం కలిగించే రీతిలో సాగుతున్న అభివృద్ధి, వ్యవసాయ విస్తరణ,వన్యప్రాణుల వేట తదితర అంశాలు మడ అడవులకు ముప్పుగా పరిణ మిస్తున్నాయి. వీటి సంరక్ష ణకు సంబంధించిన ప్రభుత్వ యంత్రాంగంలో ఉదాసీనత పెరుగు తోంది. ప్రకృతి వైపరీ త్యాలతోపాటు మానవ చర్యలు దుష్ప్రభావం చూపుతున్నాయి.మడ అడవులు వ్యవసాయ భూములుగా మారే ముప్పు అంతకంతకూ అధికమవుతోంది.తీరం వెంబడి వేగంగా పెరుగుతున్న పారిశ్రామి కీకరణ,పారిశ్రామిక వ్యర్ధాలు,శుద్దిచేయని మురుగునీరు శాపాలుగా పరిణమిస్తు న్నాయి.తీరప్రాంతాల్లో జనాభా పెరుగుదల నేపథ్యంలో భూమికోసం పెరుగు తున్న డిమాండ్‌తోపాటు మానవ ఆవాసాలు, కలప,వంటచెరకు,పశుగ్రాసం,అటవీ ఉత్పత్తుల సేకరణ వంటివి ఆశనిపాతంలా మారాయి. అభివృద్ధి పేరట నదుల వెంబడి జరుగుతున్న పలురకాల కార్యకలాపాలు, నదీప్రవాహాల్లో మార్పులు మడ అడవుల సహజత్వాన్ని దెబ్బ తీస్తున్నాయి.కొన్నిచోట్ల వీటికి అవసరమైన నీరు కూడా సరిగ్గా అందకపోవడం తీవ్రనష్టాన్ని కలిగిస్తోంది. వాతావరణ సమస్యలు,ఉష్ణోగ్రతల్లో తేడాలు, నదీప్రవాహంలో కొట్టుకొచ్చే మట్టి మేట వేయడం,కాలువపూడిక,నీటినిల్వతో ఉప్పు శాతం పెరిగి మొక్కలు నశించడం,మొల కెత్తకపోవడం వంటి సమస్యలు ఎదురవుతు న్నాయి.మరో వైపు, మడ అడువులు నరికివేత ముప్పునూ ఎదుర్కొం టున్నాయి. ఇలాంటి అనేక సమస్యలపై ఎన్నో అధ్యయ నాలు,ఎన్నిసార్లు హెచ్చకిరలు చేస్తున్నా ప్రభుత్వ యంత్రాంగాలు సరైన చర్యలు చేపట్టకపోవడంతో నష్టం తీవ్రత అంత కంతకూ పెరుగుతోంది.ప్రపంచవ్యాప్తంగా 113దేశాల్లో 1.4కోట్ల హెక్టార్లకుపైగా విస్తీర్ణం లో మడఅడవులు ఉన్నాయి. ఇందు లో 50లక్షల హెక్టార్లకుపైగా ఆసియా ఖండంలోనే ఉండటం గమనార్హం. భారత్‌తో పాటు బంగ్లాదేశ్‌లో విస్తరించిన సుందర్‌బన్స్‌ ప్రపంచంలోనే అత్యంత పెద్దవైన మడ అడవులు కావడం విశేషం.ఇవి యునెస్కో వారసత్వసంపద గుర్తింపును సొంతం చేసుకు న్నాయి. గంగ,బ్రహ్మపుత్ర నదుల నడుమ వందకుపైగా దీవులుగా విస్తరించిన సందర్‌బన్‌ ప్రాంతం ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టాగా గుర్తింపు పొందింది.ఇక్కడ 55ఎకరాల జంతవులు,54ఎకరాల సరీసృపాలు,248రకాల పక్షలు జీవిస్తు న్నాయి.వృక్షజాతుల్లోనూ ఎంతో వైవిధ్యం కొనసాగుతోంది.రాయల్‌ బెంగాల్‌ పులులకు సుందర్‌బన్‌లే ఆవాసం.వీటితోపాటు మనదేశంలో భితర్‌కనికా,కోరింగ, పిచావరం, గుజరాత్‌ మడఅడవులు కీలకమైనవిగా పేరొందాయి.
బహుముఖ వ్యూహాలు..
మడ అడవుల సంరక్షణలో విస్తీర్ణం పెంపుదలలో ఒడిశా ఆదర్శంగా నిలు స్తోంది.నదీ తీరప్రాంతాలతోపాటు నదులు సముద్రంలో కలిసే భూభాగంలో మొక్కలు నాటడం ద్వారా విస్తీర్ణం పెరుగుతోంది.మడ అడువులు పెంచేందుకు అనువైన ప్రాంతా తలన్నింటినీ సమర్ధంగా ఉపయోగించు కుంటున్నారు. సముద్ర జలాలు చొచ్చుకుని వచ్చే ప్రాంతాల్లో వీటిని పెంచేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.దేశంలోని ఇతర ప్రాంతాల్లో సైతం మడ అడవులను సంరక్షిం చాలి.ఈ అడవుల్ని పెంచేందుకు ఎక్కడ అవకాశం ఉన్నా వదులుకోకూడదు. ఒడిశా తరహాలో విస్తరించేందుకూ కృషి చేయాలి. మడఅడువుల నిర్వహణ ప్రణా ళికలు రూపొందించి అమలు చేయడం కీలకం.మడ అడవుల వైవిధ్యం,ప్రత్యేకతలపై మరింత లోతుగా పరిశోధనలు చేయట్టాల్సిఉంది.వీటి సంరక్షణలో బహుముఖ వ్యూహాల కార్యాచరణ ఎంతో అవసరం.మడఅడువుల్ని కాపాడు కోవడంలో ప్రభుత్వాలతోపాటు.. విశ్వవిద్యా లయాలు,పరిశోధన సంస్థలు,స్థానిక సంస్థలూ కీలక భూమిక పోషించాల్సిన అవసరం ఉంది.
ఏపీలో తగ్గిన విస్తీర్ణం..
పలు రాష్ట్రాల్లో మడఅడవుల విస్తీర్ణం..ఎంత కొంత పెరుగుతుండగా,ఆంధ్రప్రదేశ్‌ మాత్రం తగ్గుతుండటం ఆందోళనకరం.ఏపీలో 1987 లో మడ అడవుల విస్తీర్ణం 495చదరపు కిలోమీటర్లు.ఇప్పుడు అది 405చదరపు కి.మీ.ఇందులో 70శాతం అంతకంటే ఎక్కువ సాంధ్రత కలిగిన దట్టమైన మడ అడవుల జాడే లేదు.213చదరపు కి.మీ ఒక మోస్తరు (40`70శాతం సాంద్రత)ఉన్నవి.మరో 162చదరపు.కి.మీ.40శాతం కంటే తక్కువ సాంద్రత కలిగినవి కావడం గమనార్హం.ఉమ్మడి తూర్పుగోదావరి,కృష్ణా,గుంటూరు జిల్లాలతో పాటు పరిమితంగా నెల్లూరు జిల్లాలోనూ మడ అడవులు విస్తరించాయి. ఏపీలోని ప్రధానమైన కోరింగ మడ అడువుల్లో 34రకాల మొక్కలు ఉన్నట్లు అంచనా.వీటి పిల్లి(మరకపిల్లి/ఏటిపిల్లి) అనే వన్యప్రాణితోపాటు అనేక రకాల జంతు వులు,పక్షులకు అవాసంగా నిలుస్తున్నాయి. విదేశీ పక్షలకూ విడిది కేంద్రంగా ఆకర్షిస్తున్నాయి.
మడ అడవుల పరిరక్షణ…
మడ అడవులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తీర ప్రాంత ప్రజల శ్రేయస్సు, ఆహార భద్రత మరియు రక్షణ కోసం ముఖ్యమైనవి.వారు చేపలు,క్రస్టేసియన్లతో సహా గొప్ప జీవవైవిధ్యా నికి మద్దతునిస్తారు.ఇవి సునామీలు, తుఫా నులు,కోత,పెరుగుతున్న సముద్ర మట్టాలకు వ్యతిరేకంగా అవరోధంగా పనిచేస్తాయి.ఇవి సముద్రం మరియు భూమి మధ్య సరిహద్దు లుగా కూడా పనిచేస్తాయి అలాగే అనేక తీర ప్రాంత వర్గాలకు రక్షణ మరియు ఆహార భద్రతను అందిస్తాయి. మడ పర్యావరణ వ్యవస్థ యొక్క నేలలు కార్బన్‌ సింక్‌లుగా పనిచేస్తాయి మరియు భూమి ఆధారిత అడవులతో పోలిస్తే 10 రెట్లు ఎక్కువ కార్బన్‌ను నిల్వ చేయగలవు.
మడఅడవులకు ఎదురౌతున్న ప్రమాదాలు
దురదృష్టవశాత్తు, గత నాలుగు దశాబ్దాలుగా, వివిధ మానవ చర్యల కారణంగా మడ అడవుల విస్తీర్ణం దాదాపు సగానికి పడిపో యింది. రొయ్యల పెంపకం ఇందులో ప్రాధ మిక ప్రమాదంగా తెలుస్తోంది. రొయ్యల పెంపకం కోసం చుట్టుపక్కల చెరువులను సృష్టించడానికి అడవిలో ఎక్కువ భాగాలను నరికేస్తున్నారు. వ్యాధులను నివారించడానికి మరియు దిగుబడిని పెంచడానికి యాంటీబ యాటిక్స్‌ మరియు రసాయనాలను అధికంగా ఉపయోగించడం వంటివి కూడా వీటికి హాని చేస్తున్నాయి. ఇది అడవుల పర్యావరణ సమతు ల్యతకు కోలుకోలేని నష్టానికి దారితీస్తుంది. అంతేకాక, ఈ అడవుల నుండి విలువైన కలప తరచుగా దోపిడీ చేయబడుతొంది మరియు గణనీయమైన లాభాలకు విక్రయిస్తున్నారు, అలాగే వీటిని బొగ్గు ఉత్పత్తిలో కూడా ఉపయో గిస్తున్నారు. అన్నింటివలన  తీవ్రమైన అటవీ నిర్మూలన జరుగుతోంది.రోడ్లు, భవనాల నిర్మాణం,నీటిపారుదల అవసరాల కోసం నదు లను మళ్లించడం మడ అడవుల ఆవాసాన్ని మరింత దెబ్బతీస్తుంది, ప్రత్యేకించి చాలా మడ అడవులు నదీతీరాల దగ్గర ఉన్నాయి.(జూలై26 అంతర్జాతీయ మడ అడువుల సంరక్షణ దినోత్సవం సందర్భంగా…)
-గునపర్తి సైమన్‌

అనుకున్నంతగా..వానల్లేవు

వేసవిలో పంట చేతికొచ్చే సమయానికి వద్దన్నా రెండు దఫాలుగా రోజులతరబడి కురిసిన భారీ వర్షాలు రైతులను అతలాకుతలం చేశాయి. చేతికొచ్చిన వరి, మామిడి, మిరప, మొక్కజొన్న, కూరగాయలు తదితర పంటలకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. వానాకాలం సీజన్‌ నెలన్నర గడుస్తున్నా ఇప్పటి వరకు భారీ వర్షాలు కురవకపోవడం గమనార్హం. ఎండాకాలం యాసంగిలో వద్దన్నా కురిసిన బారీ వర్షాలు అదే వానాకాలం వచ్చే ముఖం చాటేయ డంతో ఆరుతడి పంటల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల రాక కోసం తెలుగు రాష్ట్రాల రైతాంగం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది.-(దొంగరి నరేశ్‌)
మోస్తారు నుంచి భారీవర్షాలు లేక కంది,సోయా, మిర్చి,వేరుశనగ మొక్కజొన్న తదితర ఆరుతడి పంటలు రెండాకుల దశలోనే ఉన్నాయి. ఆశిం చిన స్థాయిలో వర్షాలు లేక మొలకదశలోనే పత్తి ఎండిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఈఏడాది రాష్ట్రంలోదాదాపు50లక్షలకు పైగా ఎకరాల్లో పత్తిసాగవుతుందని వ్యవసా యశాఖ అంచనా వేసింది.కాని వర్షాలు ముఖం చాయే టడంతో అడపదడపావానలకు కొన్ని జిల్లాల్లో రైతులు విత్తనాలు వేశారు. ఇప్పటికీ దాదాపు 20లక్షల ఎకరాల్లో వర్షాలు పడితే పత్తినాటేం దుకు రైతులు సిద్ధంగా ఉన్నారు.సాధారణం గా ఏటావర్షాకాలం ఆరంభంలో కురిసే వర్షా లతోనే రైతులు ఆతరుడి పంట విత్తనాలు వేస్తారు.వర్షాలు కురుస్తాయోమోనన్న ఆశతో ఈసారి కూడా రోహిణిలోనే పత్తివిత్తనాలు నాటారు. అయితే జూన్‌ నెలలో ఆరుతడి పంటలకు కావాల్సి నంతగా వర్షాలు కురవాల్సి ఉండగా రాష్ట్ర వ్యాప్తం గా చెప్పుకోదగిన వర్షాలు కురవలేదు. చెదురు ముదురు చినుకులకే విత్తనాలు విత్తినా అవి మొలకె త్తేందుకు, మొలకెత్తినా ప్రాణం పోసుకుని ఎ దిగేందుకు సరిపడా వర్షాలు లేక రైతులు తీవ్ర అవస్థులు ఎదుర్కొంటున్నారు.ప్రస్తుతం జులై మొదటి వారం గడిచిపోయినా కూడా వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో వానాకాలం పంట లపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. గతే డాది ఇదే సమయానికి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం రాష్ట్రవ్యాప్తంగా నమోదైంది. కాని ఈ ఏడాది జులై రెండో వారంవచ్చినా వరుణుడు కరుణించడం లేదు. సాధారణంగా జూన్‌ నెలతలో 144.1మీమీ. వర్షపాతం కురవాల్సి ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా జూన్‌లో కేవలం 66.9 మి.మీ. వర్ష పాతం అది కూడా మూడు, నాలుగు జిల్లాల్లోనే కురిసింది.దాదాపు 77.2మి.మీ లోటు వర్షపాతం జులైలో నమోదయింది. వర్షాలు పడక పత్తి మొక్క లు ఎండిపోతుండడంతో రైతులు కూలీలను పెట్టి మరి బిందెలు, ట్యాంకర్లతో మొక్కమొక్కకూ నీటిని పోస్తున్నారు.సరైన వర్షాలు లేకపోవడంతో మొక్కలు వాడిపోతున్నాయని ఆవదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు ముఖం చాటేయడంతో భూగర్భ జలాలు కూడా వృద్ధి చెందడం లేదు. దీంతో కనీసం బోరు, బావినీటితోనైనా ఆరుతడి పంటలను కాపాడుకు నేందుకు రైతులకు అవకాశం లేకుండా పోయింది. వాస్తవానికి ఏటా మాదిరిగా జూన్‌ నెలలో వర్షాలు కురిస్తే పత్తి మొక్కలు జులై రెండో వారంకల్లా మొక్క ఎదగడంతోపాటు కొమ్మలు పెట్టే దశలో ఒక అడుగు కంటే ఎక్కువ ఎత్తు పెరగాల్సి ఉంది. కాని ఈ సారి నెలన్నర వానాకాలం సీజన్‌ గడుస్తున్నా పత్తి మొక్కలు ఇంకా రెండాకుల దశ లోనే ఉన్నాయి. మొక్క ఎదుగుదల ఆశించిన స్థాయి లో లేకపోతే కొమ్మలు రాకపోతే కాత తగ్గి దిగుబడి తగ్గుతుందని రైతులు వాపోతున్నారు. మరో రెండు వారాలు వర్షాలు కురవకపోతే ఆత ర్వాత కురిసినా పత్తి పంటపై ఆశలు వదులుకోవాల్సిందేనని రైతు లు చెబుతున్నారు.
ఏ పంట..ఎప్పుడు వేసుకోవాలంటే!
వ్యవసాయ సీజన్‌ ప్రారంభమవు తున్నది. వానకాలం సాగుకు రైతులు సన్నద్ధ మవు తున్నారు. ఏ పంట ఎప్పుడు వేసుకోవా లో సరైన అవగాహన లేకపోవడంతో ప్రతి సంవ త్సరం ఏదో ఒకరకమే సాగు చేస్తూ అన్న దాతలు నష్టపోతు న్నారు. అయితే అదును చూసి సాగు చేయడం వల్ల తెగుళ్లు, చీడపీడల ఉధృతి నుంచి పంటను కాపాడుకోవ డంతో పాటు పంట నాణ్యత పెరిగి అధిక దిగుబడి వస్తుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితి నుంచి పంట బతుకుతుంది. ఈ నేపథ్యంలో ఏ పంట లను ఎప్పుడుసాగు చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసు కోవాలి? అనే అంశాలపై నిపుణుల
సూచనలు, సలహాలు.
మొక్కజొన్న : మొక్కజొన్న పంటకాలం 110 నుంచి 120 రోజులు ఉంటుంది.జూన్‌ 15 నుంచి జూలై 15లోపు విత్తనాలు విత్తుకోవాలి. మొక్కజొన్న సున్నితమైన పంట. నీరు ఎక్కువ ఉన్నా, తక్కువున్నా తట్టుకోదు.కాండం తొలుచు పురుగుతో తీవ్ర నష్టం జరుగుతుంది. పంట సాగు చేసిన 30రోజుల లోపు కాండం తొలుచు పురుగు ప్రభావం ఎక్కువగా ఉంటుంది.30రోజులు గడిచిన తర్వాత దాని ప్రభా వం పంటపై అంతగా ఉండదు. కాండం తొలుచు పురుగు ఉధృతికి జూలై చివరివారం నుంచి ఆగస్ట్‌ లో వాతావరణ అనుకూలంగా ఉంటుంది.జూన్‌ లో మొక్కజొన్న సాగు చేయడంవల్ల పంటకాలం 30రోజులుదాటి పురుగు ప్రభావం అంతగా ఉండదు. ఆలస్యంగా సాగు చేస్తే కాండం తొలుచు పురుగుతో నష్టపోవాల్సి వస్తుంది.రబీలో మొక్కజొన్న సాగు చేసే రైతులు అక్టోబర్‌ 15 నుంచి నవంబర్‌ 15 లోపు విత్తనాలు వేయాలి. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15 లోపు పంట చేతికొస్తుంది.
పెసర :పెసర పంట కాలం 60నుంచి 75 రోజులు ఉంటుంది.జూన్‌ 15నుంచి జూలై 15లోపు సాగు చేయాలి. ఆగస్టు 25 వరకు పంట చేతికొస్తుంది. ఆగస్టులో వర్షాలు ఎక్కువ పడే అవకాశం ఉండ డంతో పెసర పంట నష్టపోయే ప్రమాదం ఉం టుంది.జూన్‌ 20లోపు సాగు చేస్తే ఆగస్టు 10లోపు పంట చేతికి వస్తుంది.రబీలో సెప్టెంబర్‌ 15 నుంచి అక్టోబర్‌ 30లోపు సాగు చేయాలి నవంబర్‌ 20 నుంచి జనవరి 15వరకు పంట చేతి కొస్తుంది. పత్తి : పత్తి సాగును వీలైనంత వరకు తగ్గించాలి. పత్తి సాగుకు పెట్టుబడి ఎక్కువగా ఉండడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో ధర లేకపోవ డంతో పత్తి సాగు రైతులకు నష్టాలను మిగిల్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. నల్ల రేగడి భూమిలో పత్తి సాగు చేసే రైతులు 60 నుంచి 70మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత పత్తి గింజలు విత్తుకోవాలి. జూన్‌ 20 నుంచి జూలై 20వరకు పత్తి విత్తనాలు విత్తుకోవడం వల్ల రసం పీల్చుపురుగులు ఉధృతితక్కువగా ఉంటుంది.
కంది : కంది పంట కాలం 6 నెలలు. జూన్‌ 20 నుంచి జూలై చివరి వారం వరకు సాగు చేసు కోవాలి. డిసెంబర్‌ 31 నుంచి జనవరి 15 వరకు పంట చేతికొస్తుంది. సకాలంలో కంది సాగు చేయ డం వల్ల జనవరిలో రెండో పంటగా పెసర సాగు చేసుకొవచ్చు.నీటి వసతి ఉన్న రైతులు కందిలో అంతర పంటగా సోయాబీన్‌, మొక్కజొన్న సాగు చేయడంవల్ల అధికలాభాలు సాధించవచ్చు. సోయాచిక్కుడు : సోయా చిక్కుడు పంట కాలం నాలుగు నెలలు ఉంటుంది. పెసరతో పోలిస్తే సోయా చిక్కుడు వర్షాలను తట్టుకునే అవకాశం ఉంటుంది. నీటి వనరు ఉన్న రైతులు జూన్‌ 20 నుంచి జూలై 10వరకు సాగు చేయాలి. సెప్టెంబర్‌ 25 నుంచి అక్టోబర్‌ 20 వరకు పంట చేతికొస్తుంది. సోయాచిక్కుడు సకాలంలో సాగు చేయడం వల్ల రెండో పంటగా వేరుశెనగ, మూడో పంటగా వేసవి లో పెసరను సాగు చేసుకోవచ్చు.
మిరప : మిరప పంట కాలం ఏడు నెలలు ఆగస్టు మొదటి వారంలో నారు పోసుకుని సెప్టెంబర్‌లో నాటు వేసుకోవాలి. నకిలీ విత్తనాలు ఖరీదు చేసి మోసపోవద్దని అధికారులు చెబుతున్నారు. గుర్తింపు పొందిన డీలరు వద్ద విత్తనాలతో పాటు తప్పనిసరి గా రశీదు తీసుకోవాలి. మిరప సాగుచేసే రైతులు తొలకరి వర్షాలు కురియగానే తక్కువ కాలంలో చేతికొచ్చే పెసర రకాలను సాగు చేసి దాని తర్వాత మిరప సాగు చేసుకొవచ్చు.
వరి : దీర్ఘకాలిక వరి రకాలకు సంబంధించి జూన్‌ మొదటి వారం నుంచి చివరి లోపు నారు పోసు కోవాలి. పంటకాలం 135 నుంచి 150 రోజులు ఉంటుంది.అక్టోబర్‌ 31నుంచి నవంబర్‌ 20 లోపు పంట చేతికొస్తుంది. మధ్యకాలిక రకాల నారును జూన్‌ 20 నుంచి జులై 10లోపు పోసుకోవాలి. పంటకాలం125 నుంచి 135 రోజులు. నవంబర్‌ 5నుంచి 25లోపు పంట చేతికొస్తుంది. వానకా లంలో సాగుచేసిన పంటసకాలంలో చేతికి రావ డంతో నవంబర్‌లో వేసవి వరి సాగు చేయడానికి వీలుంటుంది. వానకాలం ఆలస్యం చేయడం వల్ల యాసంగి కూడా ఆలస్య మౌతున్నది.ఏప్రిల్‌లో వడ గండ్ల వర్షాలకు వేసవిలో సాగుచేసిన వరి నష్టపో వాల్సి వస్తున్నది. మార్చి చివరి వరకు యాసంగి పంట చేతికొస్తే వడగండ్ల వానతో వచ్చే నష్టాలను అధిగమించొచ్చు. నేరుగా పొడి దుక్కిలో వరి సాగు చేసే రైతులు స్వల్పకాలిక రకాలను జూన్‌ 20 నుంచి అక్టోబర్‌15లోపు సాగుచేయాలి.మధ్య కాలిక రకాలను జూన్‌ 20నుంచి జూలై 10లోపు సాగు చేయాలి. అక్టోబర్‌ చివరి వారం నుంచి నవంబర్‌ మొదటి వారంలో పంట చేతికొస్తుంది.
కాలానుగుణంగా పంటలు సాగు చేసుకోవాలి
రైతులు పంటలను కాలానుగుణంగా ఎంపిక చేసుకోవాలి.ఏపంటలను ఎప్పుడు సాగు చేయాల నేది పూర్తి అవగాహన చేసుకున్న తర్వాతే వేసుకో వాలి.కాలానుగుణంగా సాగుచేయడం వల్ల మంచి దిగుబడులు పొందడమే కాకుండా రోగాల ప్రభావం తగ్గుతుంది.ఏ పంటలను సాగు చేయా లన్న విత్తనాలను ఎక్కడ పడితే అక్కడ కొనకుండా గుర్తిం పు పొందిన డీలర్‌ వద్దే కొనుగోలు చేసి రశీదును తప్పక తీసుకోవాలి.
ఖరీఫ్‌ సన్నద్ధత ఏదీ?
ఈమారు తొలకరి పలకరింపు ఆలస్య మైంది. జూన్‌ మూడవవారానికీ వర్షాల్లేక ఏరు వాక కదల్లేదు. ఖరీఫ్‌ సేద్యానికి అదను పదును తప్పేలా ఉంది.తుపాన్లు,వరదలు,అకాల వానలు, వర్షాభావం నిరుడు ఖరీఫ్‌ రైతుల ఉసురు తీశా యి. పంటలకు ధర సమస్య తిష్ట వేసింది. ప్రభుత్వ నిర్లిప్తత, నిర్లక్ష్యం ఉండనే ఉన్నాయి. ఈ తడవైనా ఖరీఫ్‌ పంటలు వేయబోతే ఆదిలో హంసపాదులా నైరుతి రుతుపవనాలు ఆలస్యమయ్యాయి. సీజన్‌లో 21 రోజులు గడిచినా మబ్బు జాడలేదు. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని లేకుండా అధిక ఉష్ణోగ్రత లు, వడగాలులు, ఉక్కపోతలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికి పడాల్సిన సాధారణ వర్షంలో 61శాతానికిపైన తక్కువ పడిరది. చిత్తూరు మినహా అన్ని జిల్లాలూ 50-80 శాతం వర్షపు లోటు ఎదుర్కొంటున్నాయి.ఎ.పి.లో 679 మండ లాలుండగా 527 చోట్ల తక్కువ వర్షం పడిరది. 11 మండలాల్లో చినుకు లేదు. 91మండలాల్లో మాత్రమే నార్మల్‌, అంతకంటే కొంచెం వర్షం కురిసింది.ఈగణాంకాలు ప్రభుత్వానివి.క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. వ్యవసాయ రాష్ట్రం ఎ.పి.కి ఖరీఫ్‌ కీలకమైనది కాగా రానురా ను రైతులకు సీజన్‌ భారంగా కష్టం గా తయారైం దని సాగు లెక్కలు తెలుపుతున్నాయి. గతేడాది నిర్ణయించుకున్న సాధారణ సాగు విస్తీర్ణంలో ఐదు న్నర లక్షలఎకరాల్లో విత్తనం పడక బీడు పడ్డాయి. రబీలోనూ పది లక్షల ఎకరాల్లో పంట ల్లేక ఖాళీ పడ్డాయి. క్రమేపి సాగు తగ్గుతుండ టంతో నిర్ణయించుకునే నార్మల్‌ సాగు అంచనాలూ తగ్గిపోతున్నాయి.ఉదా హరణకు నిరుడు ఖరీఫ్‌ కంటే ఈ సారి ఖరీఫ్‌లో సాధారణ సాగు విస్తీర్ణం ఆరు లక్షల ఎకరాలు పడిపోయింది. ఒక్క సంవత్స రంలో అన్నేసి లక్షల ఎకరాల తగ్గుదల ఆందోళన కలిగిస్తుంది. రాయలసీమలో వేరుశనగ విస్తీర్ణం తగ్గి పత్తి, ఇతర వాణిజ్య పంటలు పెరుగు తున్నా యి. ధాన్యాగారాలైన గోదావరి, కృష్ణా,పెన్నా డెల్టా లలో వరి కుదించుకుపోయి ఆక్వా, ఇతర కమర్షి యల్‌ క్రాప్స్‌ వేస్తున్నారు. ఈ ధోరణులు ప్రభుత్వాల విధానాల పర్యవసానాలు. ఏపంట వేసినా పెట్టు బడులకు కనీస గ్యారంటీ లేనందున సేద్యం రైతు లకు జూదాన్ని తలపిస్తోంది. అందుకే తలో దిక్కు పోయి చేతులు కాల్చుకొని నష్టపోతున్నారు. చివరికి చిన్న, సన్నకారు, మధ్యతరగతి రైతులతో స్వంత వ్యవసాయం మాన్పించి కార్పొరేట్ల చెప్పుచేతల్లోకి చేర్చే కుట్ర జరుగుతోంది. ఇది రైతాంగానికి ప్రజల ఆహార భద్రతకు ప్రమాదం.
ఖరీఫ్‌ సన్నద్ధతకు రాష్ట్ర ప్రభుత్వం అంతగా ప్రాధాన్యత ఇవ్వనట్లే కనిపిస్తోంది. పంటలేయా లంటే రైతులకు కావాల్సినవి అదనకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పరపతి, సాగు నీరు. వర్షాలు పడలేదు కాబట్టికానీ, లేకపోతే విత్తనాల కోసం వెదుకులాటే. రాయితీ వేరుశనగ విత్తన పంపిణీని మమ అనిపిం చారు. ఇండెంట్‌ బాగా తగ్గించారు. వరి, ఇతర పంటలదీ అదే తీరు.నిరుడు నకిలీ,కల్తీ మిర్చి విత్తనాలు, నారుతో రైతులు భారీగా నష్టపోయారు. పత్తి విత్తనాలూ అంతే. ఇప్పటి వరకు రైతులకు నష్ట పరిహారం అందలేదు. కాగా ఈ ఏడాది ఖరీఫ్‌ మొదలుకాక ముందే చాలాచోట్ల నకిలీ విత్తనాలను సీజ్‌ చేశారు. పట్టుకున్నది గోరంత, పట్టుకోకుండా చెలామణి అవుతున్నది కొండంత.పురుగు మందుల అక్ర మాలు చెప్పనలవికావు. నాణ్యత విషయంలో రాజీ లేదని ప్రభుత్వం హూంకరిస్తుండగా జరిగేది జరిగి పోతోంది. నిరుడు ఎరువుల సరఫ రాలో అస్తవ్య స్తత వలన అదనుకు ఎరువులు దొరక్క రైతులు ఇబ్బందులు పడ్డారు. బ్యాంక్‌ రుణాల లక్ష్యాలు వందకు వంద శాతం చేరాయంటున్నా కౌలు రైతుల పరపతి అధమస్తంగా ఉంది. కేంద్ర బీమా పథకంలో చేరడంతో ఖరీఫ్‌ బీమా ఇంకా అంద లేదు. అకాలవర్షాల బారిన పడ్డ రైతుల్లో చాలా మందికి పరిహారం దక్కలేదు. రైతు భరోసా చాలా మందికి పడలేదు.పి.ఎంకిసాన్‌ జాడ లేదు. కేలం డర్‌ ప్రకారం కాల్వలకు నీళ్లొదులుతు న్నామం టున్నా చివరి భూములకు అందట్లేదు. మరమ్మ తుల్లేక కాల్వల్లో తగినంత నీరు పారట్లేదు. రిపేర్లు లేక చిన్న వానలకే డ్రైన్లు పొంగి పొలాలపై పడుతు న్నాయి. శ్రీశైలం దగ్గరే రిపేర్లు లేవు. ప్రభుత్వం మాత్రం ఆర్‌బికెల జపం చేస్తోంది.ఏర్పాట్లు లేకుం డా ఖరీఫ్‌ సజావుగా సాగదు. ప్రభుత్వం ఖరీఫ్‌ సన్నద్ధతపై దృష్టి నిలపాలి.
-వ్యాసకర్త : కేవీకే శాస్త్రవేత్త, గడ్డిపల్లి

మన్నెం వీరుడు అల్లూరి

మన్యం వాసుల కష్టాలను కడతేర్చటానికి, తెల్లదొరల దోపిడీని ఎదుర్కోవడానికి గిరిజనులకు అండగా నిలిచి పోరాటం చెయ్యాలని రాజు నిర్ణయించుకున్నాడు. వారికి తమ హక్కులను వివరించి, వారిలో ధైర్యాన్ని పెంపొందించి, అన్యాయాలను ఎదిరించే విధంగా తయారుచేసాడు. ప్రజలు ఆయన వద్దకు సలహాలకు, వివాద పరిష్కారాలకు వచ్చేవారు. చుట్టుపక్కల 30, 40 గ్రామాల ప్రజలకు రాజు నాయకుడయ్యాడు. మన్యం లోని గిరిజనులను సమీకరించి, వారిని దురల వాట్లకు దూరంచేసి, వారికి యుద్ధవిద్యలు, గెరిల్లా యుద్ధపద్ధతులు నేర్పి వారిని పోరా టానికి సిద్ధం చేయ్యసాగాడు. అతని అనుచరుల్లో ముఖ్యులు గాము గంటందొర, గాము మల్లుదొర, కంకిపాటి ఎండు పడాలు.
బ్రిటిష్‌ వారి నిరంకుశ పాలన నుండి భారతీయులకు దాస్యవిముక్తి కలిగించటానికి జీవన బలిదానం చేసిన మహనీయుడు అల్లూరి సీతారామరాజు. సీతారామరాజు క్రీ.శ.1897లో జూలై 4వ తేదీన విశాఖ జిల్లాలోని పాండ్రంకి గ్రామంలో నారాయ ణమ్మ, వెంకట్రామరాజు దంపతులకు జన్మించాడు. 1909లో భీమవరంలో 6వ తరగతిని, కాకినాడ పి.ఆర్‌.కళాశాలలో 8వతరగతి, ఎ.వి.యస్‌. కళాశాలలో 9వ తరగతి పూర్తి చేశాడు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన సీతారామరాజు అనేక కష్టాలను చవిచూశాడు.పేదరికం అనుభవించాడు. పినతండ్రి పెంపకంలో కొంత వరకు విధ్యాభ్యాసం చేయగలిగాడు. వత్సవాయి నీలాద్రిరాజు వద్ద జ్యోతిషం, వాస్తు, హఠయోగం వంటివి నేర్చుకున్నాడు. సూరి అబ్బయ్యశాస్త్రి వద్ద సంస్కృతం, ఆయుర్వేదం నేర్చుకున్నాడు. అపారమైన దైవభక్తి కలిగిన సీతారామరాజు కొంతకాలం రామలింగే శ్వరస్వామి ఆలయంలో తపస్సు చేశాడు. సీతారామరాజు బాల్యం నుండి దేశభక్తి ఉత్తేజ పూరితమైన వాతావరణంపెరిగాడు. బిపిన్‌ చంద్రపాల్‌ ఆంధ్రాలో ఇచ్చిన ఉపన్యాసంతో ప్రభావితుడైన సీతారామరాజు, విధ్యార్థి దశ పూర్తికాగానే దేశమంతటా పర్యటించి దేశ స్వాతంత్త్రోధ్యమ స్థితి గతులను తెలుసుకున్నాడు. ఆపర్యటనలోనే విశాపట్టణంలోని మన్యం ప్రజలు పడుతున్న కష్టాలు, బాధలు తెలుసుకుని వారికి అండగా నిలవాలని అనుకున్నాడు. మన్యం ప్రజలు పూర్తిగా అడువులపై ఆధారపడి, వాటినుండి లభించే తేనె, సీకాయ, కట్టెలు మొదలైనవి పట్టణ ప్రజలకు ఇచ్చి వాటి బదులుగా తమకు కావలసినవి తెచ్చుకు నేవారు. బ్రిటిష్‌ వారి పాలనలో ప్రభుత్వం అడవుల చట్టాన్ని ప్రవేశపెట్టినది. దీని ప్రకారం కొండజాతివారు కట్టెలను కొట్టకూడదు, పోడు వ్యవసాయం చేయరాదు. అంతే కాకుండా అనేక ఆంక్షలు ప్రవేశపెట్టినది. వారి పరిపాలన కార ణంగా అనేక ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వారు రౌలత్‌ చట్టాన్ని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం నిందితులను ఎటువంటి విచారణ చేయకుండా నిర్భంధించవచ్చును, శిక్షింపవచ్చును. దేశ రాజకీయ నాయకులందరూ దీనిని ప్రతిఘ టించారు. సహాయనిరాకరణోధ్యమాన్ని ప్రారంభించారు.విధ్యార్థులు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారు.
ఇటువంటి ఉద్యమ పరిస్థితులలో సీతారామరాజు మన్య నాయకులైన గంటందొర, మల్లు దొరలతో సంభాషణలు జరిపాడు. సీతారామరాజు అనేక యుద్ధవిధ్యలలోను,ఆయుర్వేదంలో నైపుణ్యం కలవాడగుటచే, మన్యం ప్రజలు వీరిని అమితంగా గౌరవించేవారు. వివిధ గ్రామాల ప్రజలను సమావేశ పరచి వారికి అన్ని విద్యలు నేర్పించాడు. విలు విద్యలో నిపుణులుగా తయారుచేసి, కొండదళం తయారుచేసి, దానికి తానే స్వయంగా నాయకత్వం వహించాడు. కొండ ప్రజలకు అనేక యుద్దపద్ధతులు, గెరిల్లా విద్య మొదలైనవి నేర్పాడు. కొండజాతివారిని చైతన్య వంతులుగా చేయటం గమనించిన బ్రిటిష్‌ వారు రాజు కొంత కాలం దూర ప్రాంతంలో అధికారుల పర్యవేక్షణలో ఉంచారు. ఈ ప్రవాశ శిక్ష నచ్చని సీతారామరాజు అక్కడినుండి తప్పించుకుని తిరిగి మన్యం చేరుకున్నాడు. 1922 ఆగస్టు 22వ తేదీన చింతపల్లి పోలీసు స్థేషన్‌ పై మెరుపుదాడి చేసి తూటాలను, కత్తులను, మందుగుండు సామాన్లను స్వాధీనం చేసుకున్నాడు. తరువాత కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి స్టేషన్లను కొల్లగొట్టి, జైల్లో మగ్గుతున్న వీరయ్యదొరను విడిపించాడు. ఈకొండదళం ఆచూకీ తెలుపవలసినదిగా బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రజ లను అనేక బాధలకు గురిచేసింది. చింతపల్లి, కృష్ణదేవిపేట, నర్సీపట్నం మధ్య ప్రభత్వం కల్పిం చిన టెలిఫోన్‌ సౌకర్యాలను, స్తంభాలను ఈ దళం ధ్వంసం చేసింది. పోలీసులను ముప్పుతిప్పలు పెట్టే వారు, ఆహారధాన్యాలను కొల్లగొట్టేవారు. విప్లవానికి వ్యతిరేకంగా పనిచేసేవారిని వీరు శిక్షించేవారు. ఈదళం వారిని పట్టిచ్చిన వారికి వెయ్యిరూ పాయల బహుమానం కూడా ప్రభుత్వం ప్రకటిం చింది. ఈ కొండదళం అనేక భీకర పోరులను సల్పింది. ఈ దళాన్ని ఏమీ చేయలేక ప్రభుత్వం సైన్యాన్ని తీసుకుని వచ్చింది. వారి సోధనలో మల్లుదొర పట్టుబడ్డాడు. సీతారామరాజు మన్యం ప్రజల గుండెలలో తిరుగులేని నాయకుడుగా నిలచిపో యాడని తెలుసుకుని బ్రిటిష్‌ వారు, సీతారా మరాజు ఆచూకీకై మన్యం ప్రజలను అనేక చిత్రహింసలకు గురిచేసారు. వారి బాధలను చూడలేక సీతారామ రాజు, బ్రిటిష్‌ వారితో సంధి చేసుకునేందుకు స్వయంగా పాలకుల వద్దకు వెళ్ళాడు. తమ ఎదుట పడిన సీతారామరాజును బ్రిటిష్‌ వారు నిర్ధాక్ష్యింగా కాల్చిచంపారు. వారు తుపాకీ కాలుస్తున్నప్పటికీ బెదురు చెందక సీతారామరాజు, తన వంటి సీతా రామరాజులు వేలకొలది పుట్టుకొస్తారని, వారి బ్రిటిష్‌ వారిని భారతదేశం నుండి పారద్రోలుతారని నిర్భయంగా ప్రకటించాడు. వందేమాతరం అంటూ 1924 మే 7వ తేదీన సీతారామరాడు తుదిశ్వాస విడిచాడు. రామరాజు మరణంతో మన్యం ప్రజ లలో మరింత పట్టుదల పెరిగి, ఉద్యమాన్ని ఉధృతం చేశారు. బ్రిటిష్‌వారు నిరంకుశంగా కొండ దళం నాయకులందరినీ పట్టి చెరసాలలో వేశారు. సీతారామరాజు పూరించిన విప్లవశంఖం దేశ మంతటా సంచలనం కలిగించింది. కొండదళం నాయకుడుగా సీతారామ రాజు భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోయాడు.సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్య్రం సిద్దిస్తుందని నమ్మిన పోరాట యోధుడు. మహాత్మాగాంధి ఆంధ్రదేశంలో పర్య టించే సమయంలో అల్లూరిసీతారామరాజు అనేక విధాలుగా కొనియాడారు. సాయుధ పోరాటం పట్ల తనకు సదుద్ధేశ్యం లేదని, అయినప్పటికీ సీతా రామరాజు వంటి త్యాగశీలని, ధైర్యవంతుని కొని యాడకుండా ఉండలేమని చెప్పారు. తదనంతరం జరిగిన అనేక పోరాటాలకు ఆయన మార్గదర్శ కుడయ్యాడు.
విప్లవం రెండవదశ
డిసెంబర్‌ 6 న విప్లవదళానికి మొదటి ఎదురుదెబ్బ తగిలింది. జాన్‌ ఛార్సీ, మరికొందరు అధికారుల నాయకత్వంలో ప్రభుత్వ సైన్యానికి, రాజు సైన్యానికి పెదగడ్డపాలెం వరిచేలలో పోరా టం జరిగింది. ప్రభుత్వసేనలు శక్తివంతమైన శతఘ్నులను (ఫిరంగులను) ప్రయోగించాయి. ఆరోజు జరిగిన ఎదురుకాల్పుల్లో 4మంది రాజు అనుచరులు చనిపోయారు. కొన్ని ఆయుధాలు పోలీ సుల వశమయ్యాయి. తప్పించుకొన్న విప్లవ వీరుల స్థావరంపై ప్రభుత్వదళాలు ఆరాత్రి మళ్ళీ దాడి చేశాయి. ఒకగంట పైగా సాగిన భీకరమైన పోరు లో మరొక 8మంది విప్లవకారులు మరణిం చారు.
ఆ తరువాత దాదాపు 4 నెలలపాటు దళం స్తబ్దుగా ఉండిపోయింది. రామరాజు చనిపో యాడనీ విప్లవం ఆగిపోయిందనీ పుకార్లు రేగాయి. అయినా అనుమానం తీరని ప్రభుత్వం రామ రాజును, ఇతర నాయకులను పట్టి ఇచ్చిన వారికి బహుమతులు ప్రకటించింది. స్పిన్‌, హ్యూమ్‌ వంటి అధికారులు జాగ్రత్తగా వ్యూహాలు పన్నసాగారు.
1923 ఏప్రిల్‌ 17నరాజు కొద్దిమంది అనుచరు లతో అన్నవరంలో ప్రత్యక్షమయ్యాడు. పోలీసు స్టేషనుకు వెళ్ళారు. పోలీసులు లొంగిపోయారు గానీ స్టేషనులో ఆయుధాలు మాత్రం లేవు. తరు వాత రాజు అనుచరులతో పాటు కొండపైకి వెళ్ళి సత్యనారాయణస్వామిని దర్శించుకున్నాడు. పత్రికా విలేఖరులతో కూడా మాట్లాడాడు. చెరుకూరి నరసింహమూర్తి అనే అతనికి, రాజుకు జరిగిన సంభాషణ 21-4-1923ఆంధ్ర పత్రికలో ప్రచు రింపబడిరది. 10గంటలకు బయలుదేరి శంఖ వరం వెళ్ళాడు. అక్కడి ప్రజలంతా రాజును భక్తిగా ఆదరించారు. రాజు వచ్చిన విషయం తెలిసిన కలెక్టరు అన్నవరం వచ్చి, రాజును ఆదరించి నందుకు ప్రజలపై (4,000 రూపాయలు జరి మానా) అదనపు పన్నును విధించి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈవిషయం తెలిసి ‘‘నేను సాయం కాలం 6గంటలకు శంఖవరంలో ఉంటాను. నన్ను కలవవలసినది’’ అని కలెక్టరుకు రాజు ‘‘మిరప కాయ టపా’’ పంపాడు. కాని కలెక్టరు రాజును కలవడానికి సాహసించలేదు. (ఈ విశేషాలు 19-4-1923 హిందూ పత్రికలో ప్రచురింపబడ్డాయి.) క్రమంగా రాజు దళానికి, ప్రభుత్వ దళాలకు వైరం తీవ్రరూపం దాల్చింది. ఎలాగైనా రాజును పట్టు కోవాలని ప్రభుత్వం అనేక గూఢచారుల ద్వారా ప్రయత్నిస్తోంది. తమను అనుసరిస్తున్న గూఢచారు లను రాజు దళాలు హెచ్చరించడం లేదా శిక్షిం చడం జరుగసాగింది. ప్రజలలో ఇరువర్గాల మను షులూ ప్రచ్ఛన్నంగా పనిచేస్తున్నారు. సి.యు.స్వినీ అనే అధికారి ఏజన్సీ భద్రతలకు బాధ్యుడైన అధికారిగా జూన్‌లో నియమితుడయ్యాడు. గాలింపు తీవ్రం చేశాడు. విప్లవకారులు 1923 జూన్‌ 10న ధారకొండ, కొండకంబేరు మీదుగా మల్కనగిరి వెళ్ళి పోలీసు స్టేషను, ట్రెజరీపై దాడి చేసారు కాని అక్కడ మందుగుండు సామగ్రి లేదు. ముహూ ర్తం పెట్టి జూన్‌ 13న ప్రభుత్వ సైన్యంతో తాను పోరాడగలనని, ప్రభుత్వాన్ని దించేవరకు పోరాటం సాగిస్తానని రాజు అక్కడి డిప్యూటీ తాసిల్దారు, పోలీసు ఇనస్పెక్టరులకు చెప్పాడు. ఆ రాత్రి అక్కడ విశ్రాంతి తీసికొని ధారకొండ వెళ్ళాడు. జూన్‌ 17నరాజు ఒకచోట బస చేసినట్లు ఒక ఉపాధ్యా యడు స్వినీకి వార్త పంపాడు. సైనికులు రాలేదు గాని ఈ విషయం తెలిసిన మల్లుదొర, గంటందొర నాయకత్వంలో విప్లవవీరులు ఈతదుబ్బులు గ్రామానికి వెళ్ళి, తమ ఆచూకీ తెలిపినందుకు అక్కడివారిని బెదరించి నానాబీభత్సం చేశారు. జూలై 29న ప్రభుత్వ సైన్యాలకు ఆహారపదార్ధాలు తీసుకెళ్ళే బండ్లను విప్లవవీరులు కొల్లగొట్టారు. ఆగష్టు 4న పెదవలస పోలీసు శిబిరానికి వెళ్ళే పోలీసులను పట్టుకొన్నారు. ఆగష్టు 11న కొమ్మిక గ్రామంలోను, ఆగష్టు 20న దామనూరు గ్రామం లోను ఆహార పదార్ధాలు సేకరించారు. 2-9-1923న రామవరం ప్రాంతానికి కమాండర్‌గా ఉన్న అండర్‌వుడ్‌ సైనికులకు, మన్యం వీరులకు భీకరమైన పోరాటం జరిగింది. సెప్టెంబర్‌ లో రాజు ముఖ్య అనుచ రుడైన గాము మల్లుదొర పోలీసులకు దొరికి పోయాడు. ఇతను మహా సాహసి. కాని త్రాగుడు, వ్యభిచారం వ్యసనాలకు బానిస. ఒకమారు త్రాగి పోలీసులకు దొరికిపోగా రాజు దళం విడిపిం చింది. అతనిని దళం విడచి పొమ్మని రాజు ఆనతి చ్చాడు. అలా దళానికి దూరమైన మల్లుదొర తన ఉంపుడుగత్తె ఇంటిలో ఉండగా 17-9-1923న అర్ధరాత్రి దాడిచేసి అతనిని సైనికులు నిర్బంధిం చారు. తరువాత శిక్షించి అండమాన్‌ జైలుకు పంపారు(1952లో మల్లుదొర పార్లమెంటు సభ్యు నిగా విశాఖపట్నం నియోజకవర్గం నుండి ఎన్నిక య్యాడు.1969లో మరణించాడు). విప్లవాన్ని అణచివేసే క్రమంలో పోలీసులు ప్రజలను భయభ్రాంతులను చేసారు. గ్రామాలోకి ప్రవేశించి, చిత్రహింసలకు గురి చేసారు. మన్యాన్ని దిగ్బంధనం చేసారు. ప్రజలకు ఆహారపదార్థాలు అందకుండా చేసారు. స్త్రీలు, పిల్లలు, వృద్ధులు అనే విచక్షణ లేకుండా చంపారు. సెప్టెంబరు 22న విప్లవకా రులు పాడేరు పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేశారు. 20వ తేదీన రాజు నాయ కత్వంలో ఎర్రజెర్లలో ఉన్నపుడు పోలీసులు అటకా యించి కాల్పులు జరిపారు. ఒకగ్రామ మునసబు ఆపోలీసు దళాలను తప్పుదారి పట్టించడంవల్ల వారు తప్పించుకోగ లిగారు. అక్టోబరు 26న గూడెం సైనిక స్థావరంపై దాడి చేశారు కాని స్టాండునుండి తుపాకులు తీసే విధానం తెలియక ఒక్క తుపాకీని కూడా చేజిక్కించు కోలేక పోయారు.17-4-1924న మన్యానికి కలెక్టరు (స్పెషల్‌కమిషనర్‌)గా రూథర్‌ఫర్డ్‌ నియ మితు డయ్యాడు. ఇతడు విప్లవాలను అణచడంలో నిపు ణుడని పేరుగలిగిన వాడు. విప్లవకారులలో అగ్గిరాజు (అసలు పేరు వేగిరాజు సత్యనారాయణ రాజు. అయితే శత్రువుల గుడారాలకు నిప్పుపెట్టి హడలుకొట్టే సాహసిగనుక ‘‘అగ్గిరాజు’’ అనే పేరు వచ్చింది.) అతిసాహసిగా పేరుపొందాడు. ప్రభు త్వాధికారులను, పోలీసులను ముప్పుతిప్పలు పెట్టే వాడు. ఆహారధాన్యాలు కొల్ల గొట్టేవాడు. విప్లవ ద్రోహులను దారుణంగా శిక్షించేవాడు. అతనికి ప్రాణభయం లేదు.1924 మే 6వతారీఖున జరిగిన కాల్పులలో అగ్గిరాజుకాలికి గాయమైంది. శత్రు వులకు చిక్కకుండా ఒక బావిలో దూకి మరణిం చాలని ప్రాకుతూ వెళుతుండగా సైనికులు వచ్చి పట్టుకొన్నారు. అతనిని శిక్షించి అండమానుకు పం పారు. అక్కడే మరణించాడు. ఆరాత్రి రాజు మంపగ్రామానికి వచ్చాడు. అంతకుముందు రూథర్‌ ఫర్డ్‌ నిర్వహించిన కృష్ణదేవు పేట సభకు మంప మునసబు కూడా హాజర య్యాడు. వారం రోజు లలో విప్లవకారుల ఆచూకీ తెలియజేయకపోతే ప్రజలను కాల్చివేస్తామని కృష్ణదేవు పేట సభలో రూథర్‌ ఫర్డ్‌ నిర్దాక్షిణ్యంగా ప్రకటించాడు. అతడేమి చెప్పాడో తెలుసుకుందామని రాజు ఆ మునసబు ఇంటికి వెళ్ళాడు. తన వల్ల మన్యం ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నారో వివ రించి, వారికి ఈ బాధలనుండి విముక్తి ప్రసాదించ డానికి తాను లొంగిపోవాలని నిశ్చయించుకున్నట్లు చెప్పాడు. తనను ప్రభుత్వానికి పట్టిఇచ్చినవారికి పదివేల రూపాయల బహుమతి లభిస్తుందని, కనుక తనను ప్రభుత్వానికి పట్టిఇమ్మని కోరాడు. కాని తాను అటువంటి నీచమైన పని చేయజాలనని మునసబు తిరస్కరించాడు.తరువాత,1924 మే 7న కొయ్యూ రు గ్రామ సమీపంలో ఒకఏటి వద్ద కూర్చొని, ఒక పశువుల కాపరి ద్వారా తనున్న చోటును పోలీసు లకు కబురు పంపాడట.ఏటి ఒడ్డున స్నానం చేస్తూ ఉండగా పోలీసులు చుట్టుముట్టి రాజును బంధిం చారు. కొయ్యూరులో విడిది చేసి ఉన్న మేజర్‌ గుడాల్‌ వద్ద రాజును హాజరు పరిచారు. బందీగా ఉన్న అల్లూరి సీతారామ రాజు ను (ఒక చెట్టుకు కట్టివేసి) ఏవిచారణ లేకుండా గుడాల్‌ కాల్చి చంపాడు.27ఏళ్ళ వయసులోనే అల్లూరి సీతారా మరాజు అమరవీరుడయ్యాడు.-(డా,దేవులపల్లి పద్మజ)

విలక్షణ అడవి చుక్క సీతక్క

ఒకప్పుడు మౌఖిక సాహిత్యంకే పరిమితమైన… మన ఆదివాసీ సాహిత్యం… అక్షరాస్యతలో వచ్చిన అభివృద్ధిలో భాగంగా .. వివిధ ప్రక్రియలలో పుస్తకాల రూపంలో… వస్తూ ప్రామాణికతకు చోటుచేసు కుం టుంది, ఈ గిరిజన సాహిత్యంలోని… పుస్తకాల వివరాలను ‘‘గవాక్షం’’ శీర్షికన… ‘‘థింసా పాఠకుల’’ కోసం ప్రతి నెల ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్న పరిశోధక రచయిత డా. అమ్మిన శ్రీనివాసరాజు గారు ప్రముఖ రచయిత ‘ అస్నాల శ్రీనివాస్‌ ’ కలం నుంచి జాలువారిన పరిశోధనాత్మకమైన ‘ రణధీర సీతక్క’ అనే పుస్తకంపై సమీక్ష
రెండు తెలుగు రాష్ట్రాల్లో సామాజిక మాధ్యమాల సాయంగా బాగా దగ్గరైన ఆదివాసి పోరు బిడ్డ అతి మారుమూల గిరిజన గూడెంలో పుట్టి తెలిసి తెలియని వయస్సులో విప్లవ మార్గం పట్టి అడవుల్లో అజ్ఞాత జీవితం గడిపి కుటుంబ సభ్యులను భర్తను కోల్పో యి,అనేక ఇబ్బందులుపడి చివరికి తనకు ఇష్టమైన ప్రజాసేవకు తనించుకున్న విప్లవ బంధ పనికిరాదని అనుభవ పూర్వకంగా తెలుసుకుని జనజీవన స్రవంతిలో కలిసి కష్టపడి చదువుకొని తన జనజాతి అడవి బిడ్డల అభ్యున్నతి తనఅంతిమ లక్ష్యంగా ముందుకు నడిచి రాజకీయ రంగ ప్రవేశం చేసి ఎమ్మెల్యే స్థాయి నుంచి తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్‌ మంత్రి పదవి చేపట్టిన గిరిజన ధీర వనిత సీతక్క అనపడే ‘‘దనసరి అనసూయ’’ మన మహిళాలోకానికి ఆదర్శం.
నేటి ఆధునిక యువతకు ఆమె జీవి తం హెచ్చరికతో కూడిన ఆదర్శ సందేశం ఈ విషయాన్ని గమనించిన ఉద్యమ రచయిత, విద్యావేత్త, ప్రధానాచార్యుడు అయిన అస్నాల శ్రీనివాస్‌ సీతక్కతో తలకు గల ఆత్మీయ సోపతి తో ఆమె గురించిన వార్తా కథనాల సమ్మేళ నంగా చక్కని పుస్తకం ‘‘రణధీర సీతక్క’’ పేరుతో ప్రచురిం చారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మొదలు మలిదశ తెలంగాణ పోరా టం వరకు అమరులైన వందలాది అమర వీరులకు అంకితం ఈయబడిన ఈ యోధు రాలు పుస్త కంకు,గ్వాటే మాల ఆదివాసీ నాయకురాలు ‘రిగో బెర్తామెంచు’, ప్రముఖ స్త్రీవాద రచయిత్రి వోల్గా తదితరులు అందించిన యోగ్యతా పత్రాలు అదనపు ఆకర్షణ మాత్రమే కాదు,అదనపు సమాచార యుక్తం కూడా…!!
అత్యంత ప్రజాదరణ పొందిన నాయ కురాలు పూర్వాశ్రమ వివరాలు,వార్తాంశాలు, ఇందులో పొందుపరచబడ్డాయి,‘పోరాటం కాలం చెల్లకుండా ఉండాలంటే అచంచలమైన నిబద్ధతతో పోరాట రూపాన్ని మార్చుకోక తప్పదు’ అనే సత్యా న్ని చరిత్ర చెబుతుంది. అందుకు కట్టుబడ్డ సీతక్క గిరిజనులు పేదల పట్ల గల తన నిబద్దతను కొనసా గిస్తూ..బాహ్య సమాజమే తన సేవా కేంద్రం చేసు కొని అజ్ఞాతం వదిలి జనజీవన స్రవంతిలో కలసి, ఉన్నత చదువులు పూర్తి చేసుకొని ఒక మాజీ నక్స లైట్‌ నాయకురాలు ప్రజాసేవ సాయంగా ఉద్యమ సిద్ధాంతాలకు పూర్తిగా సరిపోని ప్రాంతీయ, జాతీ య,పార్టీలతో చేతులు కలిపి రాజకీయ తెర చాపల ద్వారా తనదైన ‘ప్రజాసేవనావ’ను నడిపి స్తున్న సీతక్క జీవితం నేటి యువతరానికి విలక్షణ మైన ఆదర్శం.
ఈ వ్యాస సంపుటి రచయిత ప్రయ త్నం చాలా మంచిది అభినందించదగ్గది. భావిత రాలకు అక్షర రూపంలో భద్రపరిచిన ఈ ఉద్యమ చరిత్ర సంపద పరిశోధనలకు దారి దీపం అవు తుంది. ఇదో చారిత్రిక వాస్తవాల వ్యాస సంపుటి రూపంలో గల ఒకవ్యక్తి జీవన చిత్రం, స్ఫూర్తిదా యకంగా సాగిన అక్షర ప్రయాణం, సీతక్కను తెలంగాణ సర్వనామంగా అభివర్ణిస్తూ ప్రారంభ మైన ఈ వ్యాస సంపుటిలో మొత్తం 22 భాగాలు కనిపిస్తాయి.07 డిసెంబర్‌ 2023న తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్‌ మంత్రిగా సీతక్క ప్రమాణం చేసిన అపూర్వ సంఘటనతో ఈ పుస్తకం ప్రారంభమవు తుంది. రెండవ భాగంలో ‘వీర యోధుల శిక్షణ కేంద్రం ములుగు’అనే నేటితరానికి తెలియని విలువైన చారిత్రక అంశాన్ని ఇందులో చేర్చారు. కానీ ఆకాలానికి సీతక్క జన్మించి లేరు. అనంతర కాలంలో జన్మించిన ఈగిరిజన యువతి తన ప్రాం తంలోని పోరాట మూలాలకు చైతన్యం పొంది, తాను సైతం పోరుబాట పట్టింది అన్నదే అక్కడి ప్రధాన అంశం.‘వీరకిశోర బాలికగా సీతక్క’ అనే మూడవ విభాగంలో సీతక్క ఉన్నత విద్యాభ్యాస సమయంలో వసతి గృహంలో విద్యార్ధినిల సమ స్యల గురించి ప్రశ్నించిన తీరు ఆమెను నాయకురా లుగా తీర్చిదిద్దిన వైనం వివరించారు.నాల్గవ విభా గంలో ‘సాయుధగెరిల్లా యోధగా సీతక్క’ చేసిన పోరాటం ఎదుర్కొన్న కష్టాలు నక్సల్స్‌ ఉద్యమ చరిత్రలో తొలిగిరిజన మహిళా కమాండర్‌గా ఆమె నిర్వహించిన బరువు బాధ్యతల గురించి క్షుణ్ణంగా వివరించారు. అడవుల అజ్ఞాతం వీడిన ధనసరి అనసూయ అడవిలో సీతక్క పేరుతోనే జన స్రవంతిలో అడగండి గిరిజన విద్యాకేంద్రాల వికా సం,మహిళల సమస్యలు,అడవుల పరిరక్షణ, మేడా రం సహజత్వం కాపాడటం,కోసం అవిశ్రాంత అజ్ఞాత పోరాటాలు చేస్తూనే తన ఉన్నతికి సాయ పడే విద్య విలువలను వదలక అజ్ఞాతం వీడిన వెంటనే న్యాయ శాస్త్రంలో పట్టభద్రురాలు కావడం, ప్రజాస్వామ్య రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత కూడా అధ్యయనం సాగించి 2022లో ఉస్మాని యా విశ్వవిద్యాలయం నుంచి రాజనీతి శాస్త్రంలో పరిశోధన చేసి డాక్టరేట్‌ పట్టా పొందిన నిత్య విద్యార్థిని డాక్టర్‌ ధనసరి అనసూయ సీతక్క, 2004లో చంద్రబాబు నాయుడు దూర దృష్టిలో పడ్డ సీతక్క ఎమ్మెల్యే టికెట్‌ పొంది తన ప్రత్యక్ష రాజకీయ ప్రస్థానం ప్రారంభించింది.ప్రజల్లో తన కు గల విశేషఆదరణ సాయంగా రాజకీయాల్లో సహజమైన గెలుపోటములు ఎత్తుపల్లాలను అధిగమిస్తూనే నిత్యం ప్రజల పక్షాన నిలిచి ప్రజల కోసం పోరాడుతూ ప్రజా నాయకురాలుగా ఎదిగిన వైనం ఈవిభాగాల్లో వివరించడం జరిగింది. మలి దశ తెలంగాణ పోరాటంలో సైతం సీతక్క పాత్ర కృషి గురించిన విశ్లేషణ 12వ విభాగంలో చేశారు, ఒక సాధారణ గిరిజన కుటుంబంలో మారుమూల ప్రాంతంలో పుట్టి, అంచలంచెలుగా ఎదిగి, ఆదర్శ పోరాటం నాయకత్వం అలవర్చుకొని ఆదర్శంగా నిలిచిన ఈ క్రమంలో ఆమె ఎదుర్కొన్న కష్టాలు నష్టాలు కోల్పోయిన కుటుంబ బలగం, వివరాలు తో పాటు ప్రజల హృదయాల్లో అన్ని వయస్సుల వారిలో స్థానం పొందిన వైనం ప్రతి ఒక్కరికి ఆచర ణీయం.
చివరగా తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్‌ మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పదవీ బాధ్య తలు స్వీకరించిన డాక్టర్‌ దనసరి అనసూయ సీతక్క బాధ్యతల గురించి కూడా రచయిత ఉఠం కించటం అభినందనీయం.ప్రారంభ రచనలో ఉండే కొన్నిలోపాలు సవరణలు పక్కకుపెడితే, సంఘ టన సమాచార హారంగా అందించిన ఈ వ్యాస సంపుటి కర్త శ్రీనివాస్‌ అక్షర కృషి అభినందనీ యం. దీనికి కొనసాగింపుగా ఈ అరణ్య ధీరవనిత జీవితం గురించి భవిష్యత్తులో మరెన్నో ప్రామాణిక రచనలు పరిశోధనలు రావాలని అందుకు ఈ పుస్తకం సరైన మార్గదర్శి కావాలని ఆశిస్తూ సీతక్క అభిమానులతోపాటు,పరిశోధక విద్యార్థులు విధిగా దాచు‘కొని’చదవాల్సిన విలువైన పుస్తకం ఇది.

కొత్త న్యాయ చట్టాలు`మార్పులు ఇవే

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్‌.అత్యధిక జనాభా ఉన్న దేశం కూడా.అలాంటి దేశంలో న్యాయవ్యవస్థ కూడా అత్యంత పక్బడందీగా ఉండాలి.కానీ,మన దేశంలో ఇంరా శతాబ్ద కాలంనాటి బ్రిటీష్‌ చట్టాలే దిక్కయ్యాయి.తాము న్యాయవ్యవస్థను ప్రక్షాళన చేస్తామని చెప్పిన..భాజపా ప్రభుత్వం అనుకు న్నట్లుగానే గతేడాది ఆగస్టులో 3న్యాయ చట్టాలను తీసుకొచ్చి మార్పునకు నాంది పలికింది.కీలకమైన ఐపీసీ, సీఆర్‌పీసీ,ఐఈఏ లాంటి పాత చట్టాలకు పాతరేస్తూ న్యాయ సంహిత,నాగరిక్‌ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య చట్టాలను తీసు కొచ్చింది. వీటికి లోక్‌సభ ఆమోదం కూడా లభించడంతో..జూలై1నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి రానున్నాయి. మరి,ఆ కొత్త చట్టాలు ఏంటీ? ముఖ్యంగా జీరో ఎఫ్‌ఐఆర్‌,దేశద్రోహం చట్టాలు లాంటి చట్టాల్లో వచ్చిన మార్పులేంటి పరిశీలిద్దాం.-(గునపర్తి సైమన్‌)
బ్రిటీష్‌ కాలంనాటి చట్టాలకు తెరప డిరది.భారత న్యాయవ్యవస్థలో మూడు కొత్త నేర చట్టాలు భారతీయ న్యాయ సంహిత,భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం జూలైనెల నుంచి అమల్లోకి వచ్చాయి.భారత శిక్షా స్మృతి(ఐపీసీ) కోడ్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ప్రొసీజర్‌ (సీఆర్‌పీసీ),భారత సాక్ష్యాధర చట్టాల చరిత్ర గత నెలాఖరు అర్ధరాత్రితో ముగిసింది.కొత్త చట్టాలతో జీరో ఎఫ్‌ఐఆర్‌,ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం,ఎస్‌ఎంఎస్‌ వంటి ఎలక్ట్రానిక్‌ పద్దతిలో సమన్లు పంపడం,హేయమైన నేరాలకు సంబంధించిన క్రైమ్‌ సీన్లను తప్పనిసరి వీడియోల్లో బంధించడం వంటి ఆధునిక పద్దతులను న్యాయవ్యవస్థలో రానున్నాయి.ఆనాటిచట్టాల మా దిరిగా శిక్షకాకుండా,న్యాయం అందిం చేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు కేంద్రహోం మంత్రి అమిత్‌ షా వెల్లడిరచారు.చట్టాల పేరు మాత్రమే కాదు.. వాటి సవరణలు పూర్తి భారతీయ ఆత్మతో రూపొం దించారు. కొత్త చట్టాలు రాజకీయ,ఆర్ధిక, సామాజిక న్యాయాన్నీ అందించనున్నాయి.
ా భారతీయ శిక్షాస్మృతిలోని రాజద్రోహాన్ని ఇప్పుడు దేశద్రోహంగా మార్చారు. కులం, మతం వంటి కారణాలతో సామూహిక దాడు లు,హత్యకు పాల్పడితే ఐపీసీ ప్రకారం ఏడేళ్ల శిక్షపడుతుంది.దీనిప్పుడు యూవజ్జీవంగా మార్చారు.హేయమైన నేరాలకు సంబంధిం చిన క్రైమ్‌సీన్ల వీడియో చిత్రీకరణ తప్పనిసరి చేశారు.
ా నకిలీనోట్ల తయారీ,వాటి స్మగ్లింగ్‌ ఉగ్రవాదం పరిధిలోకి వస్తుంది.విదేశాల్లో మన ఆస్తులు ధ్వంసాన్ని ఉగ్రవాదంగా నిర్వహించారు. డిమాండ్ల సాధనకు వ్యక్తులను బంధించడం, కిడ్నాప్‌ చేయడాన్ని ఉగ్రవాదం పరిధిలోకి చేర్చారు.
ా మహిళలు,పిల్లలపై నేరాలపై కొత్త అధ్యా యాన్ని జోడిరచారు.పిల్లల్ని కొనడం, అమ్మ డం,ఘోరమైన నేరంగా మార్చారు.మైనర్‌పై సామూహిక అత్యాచారానికి మరణశిక్ష లేదా జీవిత ఖైదు నిబంధన తెచ్చారు.పెళ్లి చేసుకుం టానన్న తప్పుడు వాగ్ధానాలతో లైంగిక సంబం ధాలు పెట్టుకుని మహిళలను వదిలేయడం వంటి కేసులకు కొత్తనిబంధన పెట్టారు. మహి ళలు,పిల్లలపై నేరాల్లో బాధితులకు అన్ని ఆస్పత్రుల్లో ప్రధమ చికిత్స లేదా ఉచిత వైద్యం అందించాలి. మహిళలు,15ఏళ్లలోపు, 60ఏళ్లు పైబడిన వ్యక్తులు,వికలాంగులు, తీవ్రమైన అనారో గ్యంతో బాధపడుతున్న వారు ఇంటినుంచే పోలీసు సాయం పొంద వచ్చు.కోర్టు అనుమతి లేకుండా లైకింక దాడి గురించి ప్రచురిస్తే రెండేళ్ల జైలు శిక్ష,జరి మానా నిబంధనన చేర్చారు.
ా కొత్త చట్టాల ప్రకారం ఫిర్యాదుల నుంచి సమన్లదాకా అన్నీ ఆన్‌లైన్‌లో జరగను న్నాయి.పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లే పనిలేకుండా ఎలక్ట్రానిక్‌ కమ్యూనికేషన్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.ఎస్‌ఎంఎస్‌ ద్వారా కూడా సమన్లు పంపవచ్చు.పరిధితో సంబంధం లేకుండా ఏ పోలీస్‌ స్టేషన్‌లో అయినా ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసే జీరో ఎఫ్‌ఐఆర్‌ విధానం ప్రవేశపెట్టారు. అరెస్టయిన వ్యక్తి కుటుంబా నికి,స్నేహితులకు సమాచారాన్ని పంచుకునే వీలు కల్పించడంతో పాటు వివరాలను పోలీస్‌స్టేషన్‌లో ప్రదర్శి స్తారు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్‌ చట్టాలు ఆదివారం అర్ధరాత్రి (జులై1,2024) నుంచి అమల్లోకి వచ్చాయి. ఇంతకుముందున్న ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపీసీ),కోడ్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ప్రొసీజర్‌ (సీఆర్‌ పీసీ),ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్టుల స్థానంలో వీటిని తీసుచ్చారు.
తొలుత 2023ఆగస్టులో వీటికి సంబంధించిన బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అనం తరం వీటిని పార్లమెంట్‌ స్టాండిరగ్‌ కమిటీకి పం పించగా,కమిటీ సూచించిన మార్పులను చేర్చడం కోసం కేంద్ర ప్రభుత్వం ఆబిల్లులను వెనక్కి తీసు కుంది.మార్పులు చేర్పుల తరువాత పార్లమెంటులో దీనిపైచర్చ జరిగి ఆమోదం దక్కింది. దాంతో ఆ బిల్లులు చట్టరూపం దాల్చాయి.
ఈ కొత్త చట్టాలతో భారత న్యాయవ్యవస్థ, నేర విచారణ విధానాలలో కొత్త మార్పులు వస్తున్నాయి. జీరో ఎఫ్‌ఐఆర్‌,పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లకుండా ఆన్‌ లైన్‌లో ఫిర్యాదు చేయగలిగే అవకాశం, ఎలక్ట్రానిక్‌ మోడ్‌లో సమన్ల జారీ వంటి మార్పులను ఈ కొత్త చట్టాలు తీసుకొచ్చాయి. డిజిటల్‌ పోలీస్‌ సిటిజన్‌ సర్వీసెస్‌ కింద క్రైమ్‌ అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ అండ్‌ సిస్టమ్స్‌ ద్వారా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లకుండానే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయొచ్చు.
ఏమేం మారుతున్నాయి?
క్రిమినల్‌ కేసులకు సంబంధించి మొదటి విచారణ జరిగిన 60రోజుల్లోపు చార్జ్‌షీట్‌ దాఖలు చేయాలి. క్రిమినల్‌ కేసులలో విచారణ పూర్తయిన 45 రోజు లలోగా తీర్పు వెలువడాలి. కొత్త చట్టాలలో రాజ ద్రోహం అనే పదాన్ని తొలగించారు. అదే సమ యంలో దేశ సార్వభౌమత్వం,సమగ్రతలకు భంగం కలిగించే కార్యకలాపాలను శిక్షార్హమైన జాబితాలో చేర్చారు. చిన్నారులపై సామూహిక అత్యాచారానికి మరణశిక్ష చిన్నారులపై సామూహిక అత్యాచా రానికి పాల్పడేవారికి గరిష్ఠంగా మరణ శిక్ష విధిం చేలా కొత్త చట్టాలలో నిబంధన ఉంది.మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలకు సంబంధించి కొత్త చట్టాలలో ప్రత్యేక అధ్యాయాన్ని కేటాయించారు.
మైనర్లను కొనడం,అమ్మడం కూడా నేరమే.
పెళ్లి పేరుతో లైంగిక దోపిడీకి పదేళ్ల జైలు శిక్ష మహిళలను, బాలికలను పెళ్లి చేసుకుంటానని చెప్పి లైంగిక దోపిడీకి పాల్పడితే గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష విధించడానికి ఈ కొత్త చట్టాలు వీలు కల్పిస్తున్నాయి.
అలాగే కులం, మతం, జెండర్‌ వంటి కారణాలతో మూక దాడులకు పాల్పడితే యావజ్జీవ కారాగార శిక్ష విధించే అవకాశం ఉంది.
90 రోజుల వరకు పోలీస్‌ రిమాండ్‌
గతంలో కంటే ఎక్కువ రోజులు పోలీస్‌ రిమాండ్‌ విధించే అవకాశాన్ని కొత్త చట్టాలు కల్పిస్తున్నాయి. 60నుంచి 90రోజుల వరకు రిమాండ్‌ విధిం చొచ్చు.
అయితే, కేసు విచారణకు ముందు ఇలా సుదీర్ఘ కాలం పోలీస్‌ రిమాండ్‌కు అవకాశం కల్పిం చడంపై కొందరు న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇవన్నీ ‘ఉగ్రవాదం’ పరిధిలోకే..
ఉగ్రవాద కార్యకలాపాల గురించి తొలిసారి భారతీయ న్యాయ సంహిత (ఇండియన్‌ జ్యుడీషి యల్‌ కోడ్‌)లో ప్రవేశపెట్టారు. గతంలో వీటికి నిర్దిష్ట చట్టాలు ఉండేవి. ఇప్పుడు ఆర్థిక భద్రతకు ముప్పు కలిగించడం కూడా ఉగ్రవాద కార్యకలా పాల పరిధిలోకే తెచ్చారు.
నకిలీ నోట్ల తయారీ, నోట్ల స్మగ్లింగ్‌కు పాల్పడుతూ ఆర్థిక స్థిరత్వానికి హాని కలిగించడం ఉగ్రవాద చట్టం కిందకు వస్తుంది.
ఇప్పుడు,భారత్‌లో ప్రభుత్వం వద్ద తమ డిమాండ్లను నెరవేర్చుకోవడం కోసం వ్యక్తులను నిర్బంధించడం లేదా కిడ్నాప్‌ చేయడం వంటివి కూడా ఉగ్రవాద కార్యకలాపాల కిందకే వస్తాయి.
బాధితుడు ఇకపై నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లకుండానే ఎలక్ట్రానిక్‌ కమ్యూనికేషన్‌ ద్వారా జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేయొచ్చు.
జీరో ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం ఎవరైనా పోలీస్‌ స్టేషన్‌ పరిధితో సంబంధం లేకుండా ఎక్కడైనా ఫిర్యాదు చేయొచ్చు.
అరెస్ట్‌ అయిన బాధితుడు ఆ విషయాన్ని తన స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులకు తన పరిస్థితి తెలియజేసే వీలుంటుంది. దీనివల్ల బాధితుడికి తక్షణసాయం లభించే వీలుంటుంది.
అరెస్ట్‌ వివరాలను స్థానిక పోలీస్‌ స్టేషన్‌తోపాటు జిల్లా ప్రధాన కేంద్రాల్లోనూ బహిరంగంగా ప్రదర్శిస్తారు. దీనివల్ల బాధితుల కుటుంబ సభ్యులు, స్నేహితులకు ముఖ్యమైన సమాచారం తెలిసే వీలుంటుంది.
హేయమైన నేరాల్లో వీడియోగ్రఫీ తప్పనిసరి. దీనివల్ల దర్యాప్తులో నాణ్యత పెరిగే అవకాశం ఉంది.
మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల్లో దర్యాప్తు రెండు నెలల్లోనే పూర్తికావాలి. బాధిత మహిళలు, చిన్నారులకు ఉచితంగా ప్రాథమిక చికిత్స, వైద్య చికిత్స అందించాల్సి ఉంటుంది.
సమన్లను ఇకపై నేరుగా వెళ్లి ఇవ్వాల్సిన పనిలేదు. ఆన్‌లైన్‌లో పంపించవచ్చు.
మహిళలపై నేరాల విషయంలో బాధితురాలి వాంగ్మూలాన్ని మహిళా మేజిస్ట్రేట్‌ ఎదుట నమోదు చేయాలి. వారు లేని పక్షంలో మహిళా సిబ్బంది సమక్షంలో పురుష మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరు పరచాలి.
బాధితులతోపాటు నిందితులకు కూడా ఎఫ్‌ఐఆర్‌ కాపీ నకలును ఉచితంగా అందిస్తారు. పోలీస్‌ రిపోర్ట్‌, చార్జిషీట్‌, స్టేట్‌మెంట్లు, ఇతర డాక్యుమెంట్లను రెండువారాల్లో పొందొచ్చు.
కేసు విచారణలో అనవసర ఆలస్యాన్ని నివారించేందుకు కోర్టులు గరిష్ఠంగా రెండు వాయిదాలు మాత్రమే మంజూరు చేయాలి.
సాక్షుల రక్షణ పథకాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా అమలుచేయాలి.
అత్యాచార కేసుల్లో బాధితురాలి వాంగ్మూలాన్ని ఆడియో, వీడియో ద్వారా పోలీసులు నమోదు చేయాలి.
మహిళలు, దివ్యాంగులు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారితోపాటు 15 ఏళ్లలోపు పిల్లలు,60ఏళ్లకు మించి వయసున్నవారు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. వారు తాము నివసిస్తున్న చోటే పోలీసుల సాయం పొందొచ్చు.

ప్రైవేట్‌ స్కూల్స్‌..ఫీజల నియంత్రణ ఎక్కడ

రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రైవేటు, కార్పొరేట్‌ స్కూళ్ల ఫీజులు చూస్తే కళ్లు తిరగాల్సిందే. కార్పొరేట్‌ స్కూళ్లల్లో ఎల్‌కేజీ ఫీజులే సుమారు రూ.50వేల నుంచి రూ.లక్షన్నర మధ్యలో వసూలు చేస్తున్నారు.ఇంకా విద్యా సంవత్సరం పూర్తి కాకుం డానే ప్రైవేట్‌, కార్పొరేట్‌ స్కూళ్లు 2024-25 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ముసుగులో ఫీజుల మోత మోగిస్తున్నాయి. కొన్ని స్కూళ్లల్లోనైతే అప్పుడే అడ్మిషన్లు పూర్తయినట్లు చెబుతున్నారు.తమ పిల్ల లను నాణ్యమైన చదువులు చదివించాలన్న తల్లిదం డ్రుల కోరిక ప్రైవేట్‌ విద్యా సంస్థలకు మంచి అవకాశంగా తయారైంది. ప్రభుత్వ నిబంధనలను పక్కనపెట్టి అక్రమ వసూళ్లకు తెరతీశారు. పట్టణా ల్లో చదవాలంటే హాస్టలు వసతి కూడా వారికి అవసరమవుతుంది.దీంతో స్కూలు, హాస్టల్‌ పేరుతో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు రూ.30వేల నుంచి రూ.50వేల వరకు,ఆ తర్వాత విద్యార్థు లకు పాఠశాలనుబట్టి రూ.60వేల నుంచి సుమారు లక్షరూపాయల వరకు వసూలు చేస్తున్నారు. కార్పొరేట్‌ విద్యాసంస్థలకు తాము తక్కువ కాదం టూ కొన్ని ప్రైవేట్‌ స్కూళ్లు ఇదే సంప్రదా యానికి దిగాయి. సాధారణ చదువులతో ఐఐటి ఫౌండేషన్‌ అంటూ మరికొంత నొక్కుతున్నాయి.దీంతో విద్యా ర్థులను స్కూళ్లలో చేర్పించేందుకు వచ్చి,వెనక్కి వెళ్ళ లేక చేర్పించే సాహసం చేయలేక తలిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు.
విద్యాహక్కు చట్టం అమలు తుంగలోకి
విద్యాహక్కు చట్టం సెక్షన్‌-6 ప్రభుత్వ నిబంధనల ప్రకారం అడ్మిషన్లు జరగాలి. సెక్షన్‌-11ప్రైవేటు యాజమాన్యాలు గవర్నింగ్‌ బాడీ నిర్ణయించే ఫీజు కంటే ఎక్కువ వసూలు చేయ కూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను నోటీసు బోర్డులోపెట్టాలి.సెక్షన్‌1,2ప్రకారం స్కూల్‌ స్టాఫ్‌ సెలక్షన్‌ కమిటీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం టీచర్లను,నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ను నియ మించి వారి వివరాలు, విద్యార్హత, వారికి ఇచ్చే వేతనాల వివరా లను నోటీస్‌ బోర్డ్‌లో పెట్టాలని చట్టం చెబుతుంది. సెక్షన్‌-12ప్రకారంటీచర్‌,విద్యార్థుల నిష్పత్తి 1:20 కి మించరాదు.విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రైవేటు యాజమా న్యం 25 శాతం సీట్లను ఎస్‌సి, ఎస్‌టి, వికలాంగు లకు, మైనారిటీలకు కేటాయిం చాలి. పాఠశాల యాజమాన్యాలు నోట్‌ బుక్స్‌, యూనిఫారాలు, స్కూల్‌ బ్యాగులు, ఇతర స్టేషనరీని అమ్మరాదు. ఎక్కడ కొనుగోలు చేయాలో కూడా సూచించరాదు. విద్యార్థుల ఫీజు వివరాలను ఆన్‌లై న్‌లో ఉంచాలి. ఆట స్థలం తప్పనిసరిగా ఉండాలి. మున్సిపాలిటీ పరిధిలో పాఠశాలల్లో 1000 చదర పు మీటర్ల ఆటస్థలం, గ్రామీణ ఇతర ప్రాంతాల్లో 2000 చదరపు మీటర్ల ఆటస్థలం తప్పనిసరిగా ఉండాలి. పాఠశాల యాజమాన్యం అభం శుభం తెలియని చిన్నారుల చేతికి స్కూల్‌ ఫీజుల రసీదులు ఇస్తున్నది.మీఅమ్మనాన్న ఇంకా ఫీజు చెల్లించలే దంటూ వారిని కించ పరుస్తున్నారు. ఫీజు స్లిప్పు లను చిన్నారుల చేతికిస్తే జరిమానా ఉంటుంది. అనుమతులు లేకుండా స్కూళ్లను ప్రారంభించ కూడదు. ప్రభుత్వ అనుమతి తోనే ప్రారంభించాలి. ఆరు నెలల్లోపు అనుమతులు పొందాలి. భవనానికి ప్రహరీ ఉండి, గాలి వెలుతురు బాగా వచ్చేలా ఉండాలి.చిన్నారులు నిద్రపోవడానికి ప్రత్యేకంగా విశ్రాంతి గది ఉండాలి. మరుగుదొడ్లు, స్నానాల గదిలో టవలు, సబ్బులు ఉంచి, పరిశుభ్రత చర్యలు పాటించాలి. ప్లే స్కూల్‌కు తప్పనిసరిగా ప్లే స్కూల్‌ అని బోర్డు పెట్టాలి. ప్రవేశాలు పూర్తయిన తర్వాత తల్లిదండ్రుల కమిటీని నెలలోపు నియమించాలి. ఈ కమిటీని ఏటామారుస్తుండాలి.ప్రతి నెల సమా వేశం ఏర్పాటు చేసి ఆవివరాలను నమోదు చేయా లి.పిల్లలకు జంక్‌ఫుడ్‌ను అనుమతించ కూడదు. పోషకాలతో కూడిన ఆహారాన్ని మాత్రమే ఇవ్వాలి. ఇటువంటి నిబంధనలు చాలా స్కూళ్లు పాటించ కుండా నడుపుతున్నాయి.ప్రతిజిల్లాకు జిల్లా విద్యా శాఖ అధికారి పర్యవేక్షణలో కమిటీని ఏర్పాటు చేసి, ఫీజులను నియంత్రించే ఆలోచన చేయాలి. అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి ప్రైవేటు పాఠశాలల పైన కఠిన చర్యలు తీసుకోవాలి. అవస రమైతే పాఠశాలల గుర్తింపును రద్దు చేసే విధంగా చర్యలు చేపట్టాలి.
తమ పిల్లలకు ఇంగ్లీష్‌ మీడియం చదు వులు చెప్పించాలనే ఉద్దేశంతో అడ్మిషన్ల కోసం ప్రైవేట్‌ స్కూళ్లకు వెళుతున్న తల్లిదండ్రులు అక్కడి ఫీజులు చూసి, వాటిని కట్టడం తమ వల్ల కాదని నిరాశతో వెనుదిరిగి వస్తున్న స్థితి తెలుగు రాష్రా ్టలలో నెలకొంది. ప్రభుత్వం ఎన్ని జీవోలు, నిబంధ నలు రూపొందించినా తమ రూల్‌ తమదే అనేలా కార్పొరేట్‌, ప్రైవేట్‌ స్కూళ్లు ప్రవర్తిస్తున్నాయి. కొన్ని స్కూళ్లయితే ఒకేసారి మొత్తం అడ్మిషన్‌ ఫీజు, పాఠశాల ఫీజు కట్టాలనే నిబంధనలను అమలు చేస్తున్నాయి. లేదంటే అడ్మిషన్లు ఇవ్వబోమంటూ విద్యార్థుల తల్లిదండ్రులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. 2024-25కి గాను పలు పాఠశాలల యాజమాన్యాలు ఫీజులు భారీగా పెంచాయి. ప్రస్తు తం ఉన్న ఫీజుల కంటే ఎక్కువగా 10నుంచి 30 శాతం వరకు ఫీజులు పెంచారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులపై మోయలేని భారం పడుతోంది. అంతేకాకుండా ఈవిద్యా సంవత్సరం వార్షిక పరీక్ష లు ఇంకా ముగియక ముందే వచ్చే ఏడాదికి కట్టా ల్సిన స్కూల్‌ ఫీజుల విషయంలో కొన్ని కార్పొరేట్‌, ప్రవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రులకు వాట్సాప్‌ మెసేజ్‌లు, నోటీసులు, మెయిళ్లు పంపడం గమనార్హం. కొత్తగా తీసుకునే అడ్మిషన్లు గడువు తేదీలు ముగిశాయి. విద్యా హక్కు చట్టానికి విరుద్ధంగాస్క్రీనింగ్‌ టెస్టులు, తల్లిదండ్రులు ఇంటర్వ్యూల ఆధారంగా వారు చేస్తున్న ప్రొఫెషన్‌ తెలుసుకుని వివక్షాపూరితంగా వ్యవహరిస్తూ అసమానతలు పెంచుతున్నారు.
ఫీజులపై నియంత్రణ ఏది ?
ప్రైవేటు, కార్పొరేట్‌ ఫీజుల నియంత్రణ కోసం అన్ని రకాల ఉత్తర్వులూ వున్నాయి. కానీ ఆచరణలో అవన్నీ ఉత్తవే. 1994లో వచ్చిన జీవో నెం-1 ప్రైవేటు పాఠశాలలు స్థాపన, నిర్వహణ, అడ్మిషన్లు, ఫీజులు, ఉపాధ్యాయుల పర్యవేక్షణ, తనిఖీలు తదితర విధివిధానాలను స్పష్టం చేస్తు న్నాయి. వాటిని అమలు చేయలేమని ప్రైవేటు విద్యాసంస్థలు చెప్పేస్తున్నాయి. 2009లో వచ్చిన జీవో నెం-91లో ఫీజు స్ట్రక్చర్‌ నిర్వచించబడిరది. వాటిని అమలు చేయకుండా ప్రైవేటు యాజమా న్యాలు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో పేద విద్యార్ధుల చదువు కోసం విద్యాహక్కు చట్టం కల్పించిన ఉచిత విద్యకు తీసు కొచ్చిన జీవోనెం 46/2010పై కూడా కోర్ట్‌ స్టే తీసుకుని వచ్చారు. పాఠశాలల్లో ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు వినియోగించడం లేదు. షూ, టై, బెల్టు అమ్మే వ్యాపార కేంద్రాలుగా పాఠశాలలు మారినా చర్యలు తీసుకోకుండా అధికారులు చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు,కార్పొరేట్‌ ఫీజుల నియం త్రణకై అనేక వాదనలు జరుగుతున్నాయి. అటాన మస్‌ హోదా కల్గిన విద్యాసంస్థలలో ప్రభుత్వం జోక్యం చేసుకోరాదని యాజమాన్యం వాదనలు వినిపిస్తున్నాయి.2002లో ’’టి.ఎ.పారు.వర్సెస్‌ కర్ణాటక ప్రభుత్వం’’2003లో’’ఇస్లామిక్‌ ఎడ్యు కషన్‌ అకాడమీ వర్సెస్‌ కర్ణాటక ప్రభుత్వం’’, 2004లో’’మోడరన్‌ స్కూల్‌ వర్సెస్‌ ఢల్లీి ప్రభు త్వం’’,2005లోపి.ఎ.ఇనాందారి వర్సెస్‌ మహా రాష్ట్ర ప్రభుత్వం’’ కేసులలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులలో చాలా స్పష్టత వచ్చింది. నాన్‌ ప్రాఫిట్‌ సంస్థలైన ప్రైవేటు విద్యాసంస్థలుక్యాపిటేషన్‌ ఫీజులు వసూలు చేయకుండా సరైన యంత్రాంగం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉం దని సుప్రీం తెలిపింది. కానీ ఈ మార్గదర్శకాలు ఎక్కడా అమలు కావడం లేదు.
నియంత్రణ చట్టం అవశ్యం
ప్రైవేటు ఫీజుల దందాను నియంత్రిం చేందుకు తమిళనాడు,కర్ణాటక,మహారాష్ట్ర, రాజస్ధాన్‌,పశ్చిమ బెంగాల్‌,పంజాబ్‌ సహా15 రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తెచ్చా యి.తెలంగాణలో కూడా ఇదే బాట పట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తొలుత భావించింది.దాదాపు 11వేల ప్రైవేటు బడులను నియంత్రణ పరిధిలోకి తేవాలని భావించింది.కానీ ఆచరణలో గత ప్రభుత్వం ఈ కృషి చేయలేదు.రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్‌ 19(1) ప్రకారం విద్యను ఉచితంగా అందించాలి. ప్రైవేటు విద్యాసంస్థల నిర్వహణలో ఉపాధ్యాయుల జీతాలు ఉంటాయి కాబట్టి ప్రతి సంవత్సరం ప్రభు త్వం ఆయా సంస్థల ఎకౌంట్లను సమగ్రంగా పరిశీ లించి సరైన కారణాలు ఉన్నప్పుడు మాత్రమే నిర్వ హణ ఖర్చులు15శాతం మించకుండా పెంచుకు నేలా చట్టం చేయాలి. ప్రతి సంవత్సరం తల్లిదం డ్రులు,పాఠశాల యాజమాన్యం,విద్యావేత్తలు, జిల్లా స్థాయిలో జిల్లాకలెక్టర్‌,జడ్జి కమిటీ సభ్యులుగా ఉన్న ‘డిస్ట్రిక్ట్‌ ఫీ రెగ్యులేషన్‌ కమిటీ’ ఫీజులను నియం త్రణ చేసే నియంత్రణ వ్యవస్థ ఉండాలి. పాఠశా లలను దుకాణాలుగా మార్చి టై, బెల్ట్‌, పాఠ్యపుస్త కాలు అమ్మడంపైనా నియంత్రణ చేయాలి. ప్రత్యేక చట్టాన్ని ఆమోదించి ప్రతి సంవత్సరం ఫీజులను పక్కాగా అమలు చేయాలి. ప్రభుత్వ పర్యవేక్షణ పెంచాలి.ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులను ధిక్కరిం చిన సంస్థలపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వం కఠిన చట్టాలు రూపొందించాలి. ప్రైవేటు విద్యా సంస్థలలో ఫీజుల నియంత్రణ చట్టం కోసం విద్యా ర్థులు,తల్లిదండ్రులు,విద్యావేత్తలు,చిన్న విద్యాసంస్థ ల యాజమాన్యాలు కూడా ఉద్యమం చేపట్టాల్సి బాధ్యత ఉంది.
ఎక్కడ ఫీజుల నియంత్రణ చట్టం?
ప్రయివేట్‌,కార్పొరేట్‌ స్కూల్స్‌లో ఫీజుల మోత మోగుతోంది. ఇది ప్రతియేటా విద్యార్థుల తల్లిదండ్రులకు భారమవుతోంది.ప్రయివేట్‌, కార్పొ ంట్‌,ఇంటర్నేషనల్‌ పేరుతో నడిపిస్తున్న స్కూల్స్‌ ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇటు విద్యాశాఖాధికారులుగానీ,అటు ప్రభుత్వంగానీ ఆ స్కూల్స్‌పై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉంది. ప్రభుత్వ నిబంధనలు ఈ స్కూల్స్‌లో క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడం దారుణం. ఫీజులను కట్టడి చేస్తామంటూ సంవత్స రాల నుంచి చెబుతున్న మాటలను ఆచరణలో మాత్రం పెట్టడం లేదు. ప్రొ. తిరుపతిరావు కమిటీ అంటూ కొన్ని రోజులు, మంత్రుల కమిటీ అంటూ కొన్నిరోజులు ప్రభుత్వ పెద్దలు కాలయాపన చేశారు.చివరికి ఈ రెండు కమిటీలు ఇచ్చిన సిఫార సులను పక్కన పెట్టేశారు. దీంతో ఫీజులు మళ్లీ ఎంత పెంచుతారో అంటూ తల్లిదండ్రులు ఆందో ళన చెందుతున్నారు.రాష్ట్రంలో పైచిలుకు కార్పొ రేట్‌, ప్రయివేట్‌ స్కూల్స్‌ ఉండగా, వీటిలో దాదాపు గా లక్షల మంది చదువుతున్నారు.ఫలితంగా ప్రయి వేట్‌,కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో అడ్మిషన్ల కోసం వెళ్లిన తల్లిదండ్రులకు ఫీజులు చూస్తే దిమ్మ తిరుగు తుంది.రాష్ట్రంలో కొన్ని పాఠశాలకు పర్మిషన్‌ లేక పోయినా అద్దె భవనాలు చూపిస్తూ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న అడ్మిషన్ల పేరుతో డబ్బులు దండు కుంటున్నాయి యజమాన్యాలు. గత సంవత్సరం ఫీజు కంటే 20నుంచి 30శాతం వరకు ఫీజులు పెంచు తున్నాయి.స్కూల్స్‌ స్థాయిని,విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఫీజులు పెంపకం నడు స్తుంది.కార్పొరేట్‌స్కూల్స్‌ బ్రాంచీల పేరుతో రాష్ట్రం లో నిర్మానుష్యంగా ఉండే ప్రాంతాల్లో స్కూల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు.ఈ ప్రాంతాల్లో అడిగే నాథుడు లేడనే ఉద్దేశాలతో విద్యాలయాలు నడిపిస్తున్నారు. విద్యార్థుల తల్లితండ్రులను పరోక్షంగా భయాం దోళన గురిచేస్తున్నారు.రాష్ట్రంలో నారాయణ, శ్రీ చైతన్య,భాష్యం,సెయింట్‌ జోసెఫ్‌ పబ్లిక్‌, కృష్ణవేణి టాలెంట్‌,శాంతినికేతన్‌,నాగార్జున స్కూల్స్‌ వివిధ ప్రాంతాలలో బ్రాంచిల పేరుతో విద్యా వ్యాపారం సాగిస్తున్నారు. ఆఖరికి పపుస్తకాలు, బూట్లు, టై, బెల్ట్‌ వరకు ఇష్టం వచ్చినట్లు రేటు పెట్టి అమ్ముతు న్నారు. నిజానికి ప్రభుత్వ సూచనల మేరకు స్కూల్‌ పరిధిలో ఇవి అమ్మరాదు అని నిబంధన ఉన్న పట్టించుకోకుండా వీటిని అమ్ముతున్నారు. పూర్తిస్థాయిలో భవనాలు ఉండవు, క్రీడా స్థలాలు ఉండవు,ఇరుకైన తరగతి గదులు, మౌలిక సదుపా యాలు ఉండవు. ఫైర్‌ సేఫ్టీ ఉండవు అయినప్పటికీ ఈ స్కూలుకు రెన్యువల్‌కు దరఖాస్తు పెట్టుకుంటే విద్యాశాఖ అధికారులు అనుమతులిచ్చేస్తున్నారు. స్కూల్‌ ఫీజుల పెంపును నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓచట్టం చేయాలని నిర్ణయం తీసు కుంది. జనవరిలో జరిగిన మంత్రివర్గ సమావే శంలో మంత్రులతో ఫీజు నియంత్రణకు విధివిధా నాలు ఏర్పాటు చేసేందుకు ఉప సంఘాన్ని నియ మించారు.ఈ కమిటీకూడా ప్రతిప్రయివేట్‌, కార్పొ రేట్‌ స్కూల్లో ఫీజుల వసూళ్లపై సమగ్ర విచారణ చేసి తల్లిదండ్రులకు భారం కాకుండా ఉండే ఫీజు లు రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసులు చేసింది. వీటిపై ప్రత్యేక చట్టం చేసేందుకు అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టాలి. కానీ ఇప్పటివరకు ఆ ప్రయత్నం జరగ లేదు.అటువైపు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు, అడుగులు కూడా పడకపోవడం గమనార్హం. ప్రత్యేక చట్టం చేయాలని విద్యార్థి సంఘాలు, పేరెంట్స్‌ అసోసియేషన్‌ నిరసనలు వ్యక్తం చేస్తున్న గాని ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరం. వాస్తవానికి ఏవిద్యా సంస్థనైనా ట్రస్ట్‌ పేరిట నడ పాలి. దానికి ఒక గవర్నమెంట్‌ బాడీ ఏర్పాటు చేయాలి.అయితే కార్పొరేట్‌ పాఠశాలలో నామ మాత్రంగా గవర్నమెంట్‌ బాడీ చూపిస్తున్నా, అధి కారం మొత్తం యాజమాన్యం చేతుల్లో పెట్టుకుం టుంది.కొన్ని స్కూల్స్‌ ఒకేసారి మొత్తం ఫీజు కట్టా లని నిబంధనలను అమలు చేస్తున్నాయి. లేదంటే అడ్మిషన్లు ఇవ్వడం లేదు. అందుకే వెంటనే రాష్ట్రం లోని అన్ని ప్రయివేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలో ఫీజు నియంత్రణ ఉండేటట్టు విద్యాశాఖ అధికా రులు చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, తల్లితండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.-(టి.నాగరాజు)

సాగుకు వేళాయె..సన్నద్దత లేదయె

రాయితీపై పచ్చిరొట్టవిత్తనాల సరఫరా మందకోడిగా సాగుతోంది.వివిధ పంటల సాగుకు అవసరమైన విత్తనాలకు సంబంధించి రైతులు నుంచి ఇప్పటికీ ఇండెంట్లు సేకరించలేదు. సకా లంలో సాగు పనులు చేపట్టకపోతే,పంట చేతికొచ్చే వేళ ప్రకృతి వైపరీ త్యాలు రైతుల కష్టాన్ని మింగే స్తాయి.గతాను భవా లను దృష్టిలో ఉంచుకుని వ్యవ సాయశాఖ అధికారులు ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. ఖరీఫ్‌ సీజన్‌ కు వరుణుడు సిద్దం అంటున్నాడు.వాన జడితో మాగా ణిని సన్నద్దం చేశాడు. సిరుల పంట వేయడానికి అన్న దాత సై అంటున్నాడు.అధికార యంత్రాంగం మాత్రం ఓ అడుగు వెనకే ఉన్నానంటోంది.
వానకాలం పంటల సాగుకు రైతన్నలు సన్నద్ధమవుతున్నారు. ఈసారి వర్షాలు ముందే కురుస్తుండడంతో అంచనాతో అన్నదాతలు సమా యాత్తమవుతున్నారు. దుక్కులు దున్నుతూ వ్యవ సాయ పనుల్లో బిజీబిజీగాఉన్నారు. ప్రభుత్వ ఆదేశంతో వ్యవసాయశాఖ సైతం కర్షకులకు కావా ల్సిన విత్తనాలు, ఎరువులతోపాటు పంటల సాగుపై అంచనాలు సిద్ధం చేసింది. గతేడాతో పోలిస్తే ఈ సీజన్‌లో 25 శాతం వరిని తగ్గించడంతో పాటుగా ఇతర పంటలైన పత్తి, కంది పంటలను ప్రోత్సహిం చేలా అధికారులు రైతులను చైతన్యం చేయను న్నారు. 34.40లక్షల ఎకరాల్లో అత్యధికంగా పత్తి సాగయ్యే పరిస్థితులు ఉన్నాయి.ఈసారి పప్పు పంటలకు ప్రాధాన్యతనిచ్చే అవకాశం ఉన్నది. ఇప్పటికే ఆయా గ్రామాల్లోని రైతు వేదికల వద్ద అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. త్వరలో రైతుబంధు కింద పంట పెట్టుబడి సాయం అంద నుండడంతో మరింత ఉత్సాహంగా వ్యవసాయ పనుల్లో అన్నదాతలు నిమగ్నం కానున్నారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు కాస్త ముందుగానే జూన్‌ తొలి వారంలోనే రాష్ట్రాన్ని పలకరిస్తాయన్న వాతావరణ శాఖ చల్లని కబురు అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతలతో తల్లడిల్లుతున్న జనానికి భారీ ఉపశమనం. నిరుడు ఎల్‌నినో ప్రభావంతో రుతుపవ నాలు వైఫల్యం చెందగా ఈ మారు పసిఫిక్‌లో లానినా పరిస్థితుల వలన అధిక వర్షం కురుస్తుం దన్న సూచన రైతాంగానికి పెద్దఊరట.వ్యవ సాయ ఆధారిత ఎ.పి.కి ఖరీఫ్‌ ప్రధానమైనది. ఇప్పుడే 60-70శాతం భూమి సాగవుతుంది. కోటి ఎకరా లకు పైగా సేద్యం కోటి మందికి పైగా రైతులకు, కౌలు రైతులకు, అంతే సంఖ్యలో ఉన్న వ్యవసాయ కార్మికులకు జీవనాధారం ఇదే. రాష్ట్ర స్థూలోత్పత్తికి సైతం ఇదే ఇరుసు. కాగాగత సంవత్సరం రుతుప వనాలు ఆలస్యమయ్యాయి.వచ్చాక కూడా అంతగా ప్రభావం చూపని కారణంగా ఖరీఫ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా కరువు పరిస్థితి నెలకొంది.సీజన్‌ ముగిసే సమయానికి 400 మండలాల్లో తీవ్ర వర్షా భావం తిష్ట వేసింది.ప్రభుత్వం మాత్రం 103 మండలాల్లోనే కరువును ప్రకటించింది. రబీలోనూ అనావృష్టి కొనసాగగా, ఎన్నికల షెడ్యూల్‌ వస్తుంద నగా 87 కరువు మండలాలను ప్రకటించి చేతులు దులుపుకొంది. రైతులు లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయలేదు. వేసిన పంటల్లో లక్షల ఎకరాలు దెబ్బతిన్నాయి. కరువుతో పాటు అకాల వర్షాలు, డిసెంబర్‌లో వచ్చిన మిచౌంగ్‌ తుపాన్‌ రైతుల ఉసురు తీసింది.ఇప్పుడు ‘నైరుతి’ మోసుకొచ్చిన తీపి కబురు విపత్తులతో నష్టాలు చవిచూసిన రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి.ఖరీఫ్‌ సజావుగా సాగా లంటే రైతులకు అదనుకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పరపతి అందుబాటులో ఉంచాలి. మొన్నటి వరకు ఎన్నికల బిజీలో ప్రభుత్వ యం త్రాంగం తలమునకలైంది. పోలింగ్‌ ముగిసిన ప్పటికీ జూన్‌ 4న ఫలితాలొచ్చే వరకు కోడ్‌ అమల్లో ఉంది. అప్పటి వరకు ఇ.సి.పర్యవేక్షణలో ప్రభుత్వం నడుస్తుంది. కోడ్‌ ఉంది కదా అని సీజన్‌ ఆగదు. అందుకనుగుణంగా అధికార యంత్రాంగం ఖరీఫ్‌ కు సన్నద్ధం కావాలి. కానీ ఇప్పటి వరకు సమగ్ర సమీక్ష లేదు. సబ్సిడీ విత్తనాల సేకరణ మొదలు కాలేదు.ఎరువులపైనా ఉదాసీనతే. పరపతి పరిస్థితీ అదే తీరు. ఖరీఫ్‌లో కరువు, తుపాన్‌లతో పంట నష్టపోయిన 12లక్షల రైతులకు రూ.1,294 కోట్లు విడుదల చేస్తూ ఎన్నికల కోడ్‌ రాకముందు మార్చి 6న ముఖ్యమంత్రి బటన్‌నొక్కగా ఇప్పటికీ ఖాతాల్లో జమ కాలేదు. బీమా వ్యవహారం తేల్లేదు. విపత్తు మండలాల్లో బ్యాంకులు ఫ్రెష్‌ లోన్లు ఇవ్వలేదు. వార్షిక రుణ ప్రణాళిక మీటింగ్‌లు ఎన్నికల పేరిట వాయిదా పడ్డాయి. రైతు భరోసా కిస్తు ప్రశ్నార్ధక మైంది. కేంద్రం, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాలొచ్చే వరకు తేలేటట్లు లేదు. రబీ పంటల సేకరణను పట్టించుకునేనాథుడు లేడు. రబీ పంట నష్టాలపై అతీగతీ లేదు.రైతులకువిత్తనాలివ్వకుండా, రుణాలి ప్పించకుండా,ఎరువుల్లేకుండా,రుణాలు,పెట్టుబడి సాయం ఇవ్వకుండా సేద్యం ఎలా చేస్తారు? ఎన్ని కలయ్యాక చూసుకుందామనుకుంటే గడచిన కాలం తిరిగొస్తుందా? ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ.అది నడుస్తూనే ఉండాలి. ఎన్ని కైన ప్రభు త్వాలు అధికారంలో ఉన్నప్పుడు ప్రాధ మ్యాలు మారుతుంటాయి. ఎన్నికలున్నందునే ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టినప్పటికీ కొన్ని మాసాల ఖర్చుకు సభామోదం తీసుకుం టుంది. ఈ ఖరీఫ్‌లో స్కీములు, ఇతర వ్యవహారాలు ఓటాన్‌ బడ్జెట్‌లో పేర్కొన్న విధంగా అమలవుతా యి.కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఇతర అంశాలు నిర్ణయ మవుతాయి. ఎన్నికలు సరిగ్గా ఖరీఫ్‌ వేళ వచ్చినం దున ఈఅంశాలను ప్రభుత్వం,సి.ఎస్‌. గమనం లోకి తీసుకొని సమీక్షలు జరిపి ఖరీఫ్‌కు యావత్‌ యంత్రాంగాన్నీ సిద్ధంచేయాలి. సామాజి క పెన్షన్ల మాదిరిగాఇన్‌పుట్‌ సబ్సిడీకి,రైతు భరోసా, బీమా, సబ్సిడీ విత్తనాలకు ఇబ్బందులేమీ ఉండవు. అవసర మైతే ఇ.సి.నుంచి తగిన అనుమతులు తీసు కొని ఖరీఫ్‌ సాగడానికి అన్ని ఏర్పాట్లూ చేయాలి. పోలింగ్‌ వరకు అధికార వైసిపి, టిడిపి కూటమి పార్టీలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకున్నారు. పోలింగ్‌ ముగిశాకా అదే ధోరణితో ఉన్నారు. గెలు పోటముల అంచనాల్లో బిజీగా గడుపుతు న్నారు. వాటన్నింటినీ పక్కనపెట్టి ఖరీఫ్‌ సన్నద్ధతపై ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించే పని చేయాలి. కేంద్రం ధాన్యం కొనుగోళ్లకు నిరాకరిస్తుండటంతో రైతులకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం జొన్న, మొ క్కజొన్న,శనగలు, పొద్దుతిరుగుడు తదితర పంట లను పండిరచేలా సూచనలు ఇస్తోంది.రైతు వేదికల వద్ద ఏఈవోలు నిత్యం మధ్యాహ్నం నుంచి సాయం త్రం వరకు అందుబాటులో ఉండను న్నారు. ఇక్కడ ప్రతి వారం రెండుసార్లు రైతులకు సాగు, రైతుల సమస్యలపై ఏఈవోలు వివరించ నున్నారు. దీనివల్ల సీజన్‌లో రైతులకు విత్తనాలు వేసినప్పటి నుంచి మార్కెట్‌కు పంటలు తరలించు కునే వరకు అవసరమైన సలహాలు, సూచనలు అందించనున్నారు.సింగిల్‌విండోల ద్వారా, మార్కె ట్‌లో రైతులకు కావాల్సిన విత్తనాలను అందు బాటులో ఉంచేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేపడుతు న్నది. రైతుబంధు నిధులను కూడా త్వరలో అంద జేయనున్నది. దీంతో రైతులకు పెట్టుబడి కష్టాలు తప్పనున్నాయి. ఇప్పటికే వేసవి దుక్కులు ప్రారంభ మయ్యా యి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు కొన్ని ప్రాంతాల్లోభూములు చల్లదనం సంతరించుకొంటు న్నాయి. ఈసారి ముందస్తు వర్షాలు ఉంటాయన్న వాతావరణశాఖ సూచనలతో రైతులు వానకాలం ఆరంభంలోనే విత్తనాలు విత్తేందుకు సమాయాత్త మవుతున్నారు.భూసార పరీక్షలకు సైతం చేయించు కొంటున్నారు.
నెలలో సేద్యపు పనులు
టమాట: ఇప్పుడు టమాట చిల్లరగా వంద రూపాయల దాకా అమ్ముతున్నారు. నీళ్లున్న ఎక్కువ మంది రైతులు, టమాట సాగు వైపు మొగ్గు చూపే అకాశముంది. విస్తీర్ణం బాగా పెరిగితే పంట చేతి కొచ్చేటయానికి (విత్తిన 90 రోజులకు లేక నాటిన 60 రోజులకు పంటచేతికి రావడం మొదల వుతుంది) ధరలు తగ్గే అవకాశముంది. వర్షానికి కూడా టమాట సాగు చేయడం పలు ప్రాంతాలలో అలవాటుంది. వర్షాధార పంట చేతికొచ్చే టయా నికి టమాట ధర బాగా తగ్గే అవకాశ ముంది. విపరీత వర్షాలు, ముసురు, మేఘావృత వాతావర ణం వలన ఏ ప్రాంతంలోనైనా పంట దెబ్బతింటే అప్పుడు టమాట రేట్లు పెరుగుతాయి. టమాట ధర జూన్‌ నెలలో కూడా ఎక్కువగానే ఉండే పరిస్థితి కనబడుతున్నది.జూలై 3వవారం, ఆ తర్వా త వర్షాధార ఆకుకూరలు, కూరగాయలు మార్కె ట్‌కు వచ్చినపుడు ఈపంట ధర తగ్గే అవకాశ ముంది.
కొత్తిమీర: జూన్‌ మొదట్లో రుతుపవనాలు మొదలయ్యే వరకు వేడి వాతావరణమే ఉంటున్నం దున,ధనియాలు మొలకెత్తి, పెరగడానికి పాక్షికంగా నీడ/ఎండ ఉండి,నీటి లభ్యత ఉన్న ప్రాంతాలు కొత్తిమీర సాగుకు అనుకూలం. మొక్కజొన్నలో అంతర పంటగా పందిరి కూరగాయల పొలాల్లో, మామిడి,మునగ,కొబ్బరి మొదలగు తోట పంట ల్లోని ఖాళీ జాగాల్లో, పాలీహౌస్‌లు,నెట్‌హౌస్‌లు, షేడ్‌నెట్ల క్రింద,చెట్ల కొమ్మలతో ఏర్పాటు చేసిన పందిర్ల క్రింద,కొత్తిమీరసాగు చేసి జూన్‌లో ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చు.జూన్‌లో కూడా చల్లగా ఉన్న ఎత్తైన ప్రాంతాల్లో, తక్కువ వర్షపాతం పడే ప్రాంతాల్లో (అన్నమయ్య జిల్లా మదనపల్లి ప్రాం తంలో)కొత్తిమీరను అనుకూలంగా పండిరచి, ఇతర ప్రాంతాలకు పంపవచ్చు.
ఫ్రెంచిచిక్కుడు: ఈ పంటకూడా కొత్తిమీర లాగానే, అధిక ఎండను, వేడిని తట్టుకోలేదు. కనుక పాక్షిక ఎండ/నీడ ఉన్న ప్రదేశాలలో ఈపంటను పం డిరచి,అధిక ధరను పొందే వీలుంది.
ఆకుకూరలు: వర్షాధారంగా వచ్చే ఆకుకూరలు జూలై 3వ వారం నుండి ఎక్కువగా ఉంటాయి. ఆలోపు చేతికొచ్చే ఆకుకూరలకు ఎక్కువ ధర పొందవచ్చు. వీటిని ఎండలకు కూడా పండిరచ వచ్చు. తక్కువ పొలంలో, తక్కువ నీటితో మంచి లాభాలు పొందవచ్చు.పాలకూర,తోటకూర, చుక్కకూర,మెంతికూర,గోంగూర,పొన్నగంటి కూర,కొయ్యగూర,సోయకూర,గంగవాయిలాకు మొదలైనవి. సిరిధాన్యాలతో పాలకూర,తోటకూర, పొన్నగంటికూర,కొయ్యగూర,గంగవాయిలాకు మొదలగు ఆకుకూరలను కలిపి వండుకోవచ్చు. తక్కువ క్యాలరీలు కలిగి,ఎక్కువబల్క్‌ ఉన్న ఆహారం తయారవుతుంది. దీనిని తినే దాని వలన మధుమే హాన్ని సులభంగా కంట్రోల్‌లో ఉంచవచ్చు. ఆచ రించిన అనుభవంతో తెలుపుతున్నాను. మధుమేహ గ్రస్తులు అలవాటుపడితే ఆకుకూరలకు విపరీ తమైన గిరాకీ ఏర్పడవచ్చు. ఖచ్చితంగా సుగర్‌ వ్యాధి అదుపులోకొస్తుంది. రైతులు పండిరచిన ఆకుకూరలకు మంచిధర రావడం జరుగుతుంది. అన్నికాలాల్లో దొరికే ఆకుకూరలు (ముఖ్యంగా చప్పగా ఉన్న ఆకుకూరలు) సిరిధాన్యాల బియ్యం తో కలిపి వండుకోవడం కూడా చాలా సులభం. మధుమేహాన్ని చాలావరకు ప్రపంచం నుండి తరి మికొట్టవచ్చు.మధుమేహపు మందులను మానేయ వచ్చు.
సిరిధాన్యాలు: కొర్రలు, ఆరికలు, సామలు, ఊదలు,అండుకొర్రలు విత్తడానికి జూన్‌ నెల కూడా అనుకూలమే. వర్షాధారంగా, రసాయనిక ఎరువులు వాడకుండా పండిరచిన ఈ పంటలకు అత్యధిక ధర ఇచ్చి రైతుల వద్దకే వచ్చి కొనుక్కెళ్లే వాళ్లున్నారు.
కూరగాయలు: పలు కూరగాయ పంటలను జూన్‌ మొదటి నుండి విత్తుకోవచ్చు. భూమిలో తడిలేక పోతే నీరు పెట్టాల్సుంటుంది. వర్షం పుష్కలంగా పడితే,తేమ అనుకూలంగా ఉన్నపుడు విత్తుకో వచ్చు. కూరగాయల ఎగుమతులను విపరీతంగా పెంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
బెండ: జూన్‌లో విత్తవచ్చు.విత్తిన 45రోజుల్లో తొలి కోత మొదలుపెట్టవచ్చు.సులభంగా పంట తీసుకో వచ్చు.సొంత విత్తులను నాటితే ఖర్చు తక్కువ. అత్యధిక దిగుబడులనిచ్చే రకాలు,హైబ్రిడ్‌లు మార్కె ట్లో దండిగా దొరుకుతున్నాయి. ఎక్స్పోర్ట్‌కు అనుకూ లాలు మెండు.ఎగుమతికనువైన రకాలు:వర్ష, విశాల్‌,నాథ్‌శోభ,పంజాబ్‌ పద్మిని.
వంగ: వర్షాకాలంలో నారు పోయడానికి జూన్‌-జూలై నెలలు అనుకూలం. 30-35 రోజుల నారు నాటవచ్చు. ఏ ప్రాంతానికి అనువైన రకాలను ఆ ప్రాంతంలో సాగు చేసి, మంచి ధర పొందవచ్చు. దేశవాళీ రకాలను, సొంత విత్తనాలను, ఆర్గానిక్‌ పద్ధతి ద్వారా పెంచి, సోషల్‌ మాధ్యమం ద్వారా ప్రచారం చేసుకుంటే ఎక్కువ ధరలకు అమ్ముకో వచ్చు. ఖర్చు తక్కువ. తప్పుడు ప్రచారం చేసుకుంటే అది బెడిసికొట్టి ఆమనిషికి విలువ లేకుండా చేస్తుం ది.అనుకూలమైన రకాలు:కోస్తాఆంధ్ర: పూసా పర్పుల్‌ క్లస్టర్‌, పూసాక్రాంతి, గులాబిబీ రాయ లసీమ:రాయదుర్గం, పోలూరు వంగ, అర్కకుసు మాకర్‌బీ తెలంగాణ:శ్యామల, దేశవాళీ పచ్చ వంగ రకాలు, పూసా పర్పుల్‌ క్లస్టర్‌,పూసాక్రాంతి. గోరుచిక్కుడు: వర్షాధారంగా పండిరచే మొండి జాతి పంట.నీటిఎద్దడిని,చీడపీడలను చాలా వరకు తట్టుకుంటుంది. నీటి ఆధారంగా కూడా పండిరచి అధిక దిగుబడులు పొందవచ్చు.జూన్‌-జూలై నెల ల్లో విత్తి అధిక దిగుబడి పొందవచ్చు. పశువుల దాణాగా,పచ్చిమేతగా, పచ్చిరొట్ట ఎరువుగా, దీని గింజలు గమ్‌ తయారీకి పనికొస్తాయి. లేత కాయ లు,కూరగాయగా వాడుతారు.జూన్‌-జూలైలో విత్తవచ్చు. అనుకూలమైన రకాలు: పూసామౌసమి, పూసాసదాబహార్‌, పూసానవబహార్‌, గౌరి.పందిరి కూరగాయలు: జూన్‌-జూలైనెలల్లో విత్తు కోదగినవి.
ఆనప/సొర: రకాలు: పూసానవీన్‌, అర్కబహార్‌, పి.ఎస్‌.పి.ఎల్‌. హైబ్రిడ్లు: వరద్‌, విక్రాంత్‌, అమిత్‌ దోస: కూరదోస: ఆర్‌.ఎన్‌.ఎస్‌.ఎమ్‌-1, ఆర్‌.ఎన్‌. ఎస్‌.ఎమ్‌-3, వీటిని లేతగా ఉన్నపుడు పచ్చిదోసగా కూడా వాడవచ్చు. పచ్చిదోస రకాలు: పూస ఖీర, కొ-1, హైబ్రిడ్లు: మాలిని, జిప్సి.కాకర: రకాలు: డి.కె.-1, ప్రియ, హైబ్రిడ్లు: శ్వేత, పూనం గుమ్మడి: రకాలు: పూసా అలంకార్‌, అర్కచందన, హైబ్రిడ్‌: పూసా హైబ్రిడ్‌-1బూడిద గుమ్మడి: రకాలు: శక్తి, కో-2,‘పేట’స్వీటు తయారీకి:బి.హెచ్‌-24,బి. హెచ్‌-25
పొట్ల: పందిరిపై పెంచడానికి రకాలు: శ్వేత, కో-1,కో-2,పి.కె.ఎం.-1బీ నేలపై పెంచడానికి రకం: కో-2బీ హైబ్రిడ్‌: పందిరిపై పెంచడానికి: ఎం.డి.యు-1
బీర: రకాలు: జగిత్యాల లాంగ్‌, అర్కసుజాతబీ హైబ్రిడ్లు: ఎస్‌.ఎస్‌-403, సంజీవని
దొండ: రకాలు చిన్నదొండ,పెద్దదొండ, నేతి దొండ
కీరదోస: అలామిర్‌, కియోన్‌, సటిన్‌.
పూలు: బంతి: ఏడాది పొడవునా సాగు చేయవచ్చు. జూన్‌ రెండవ వారంలో నారు పోసుకుని, జూలై రెండవ వారంలో నాటడం అనుకూలం. మార్కె ట్‌కు అక్టోబరులో తయారవుతుంది. పండుగకు అందివ్వాలంటే సుమారు 60 రోజులు ముందుగా నాటుకోవాలి.
గులాబి: జూన్‌ నుండి జనవరి వరకు నాటుకో వచ్చు.సెప్టెంబరు,అక్టోబరు నెలల్లో నాటడం అత్యంత అనుకూలం. హైబ్రిడ్‌ టీస్‌: పింక్‌ పాం థర్‌,ఆదిత్య, రక్తిమబీ ఫ్లోరిబండాస్‌: ఆకాష్‌దీప్‌, రెడ్‌ ట్రెంప్‌, ల్యూటిన్‌బీ మినియేచర్‌: బేబి చాక్లెట్‌, ప్రీతి.
మల్లె: వర్షాకాలం ప్రారంభంలో జూన్‌-జూలైలో వేర్లు వచ్చిన పిలక మొక్కలు నాటాలి. గుండు మల్లెను 55, జాజిమల్లెను 77, కాగడమల్లెను 6ో5 అడుగుల ఎడంలో నాటాలి.
కనకాంబరం: మే-జూన్‌ నెలల్లో నారుపెంచి, ఆగస్టు-సెప్టెంబరు నెలల్లో ప్రధాన పొలంలో 60ో30 సెం.మీ.దూరంలో నాటాలి. సంవత్స రమంతా పూస్తుంది.చలికాలం,వేసవిలలో పూల దిగుబడి ఎక్కువ. వర్షాకాలంలో దిగుబడి తగ్గుతుంది.
వరి: భారతావనిలో వరి పంట దిగుబడి అవసరాల కంటే ఎక్కువైనందున ఈ పంటకు ప్రభుత్వాల ప్రోత్సాహం తగ్గుతున్నది. వరి తప్ప ఇతర పంటలు వేయలేని ఊటభూములు, కాలువల క్రింద, లోతట్టు ప్రాంతాల్లో మాత్రమే పండిరచడం మం చిది. ఇంటి వాడకానికి, ఆర్గానిక్‌ పద్ధతిలో పంట పెట్టుకోవచ్చు. అధిక దిగుబడులకు జూన్‌లో ఎంత ముందుగా వీలయితే అంతముందుగా విత్తడం పూర్తి చేయండి. నాటు పెట్టడం కూడా నీటి లభ్యత ఉంటే, ఎంత లేత నారు నాటితే అంత దిగుబడులు పెరుగుతాయి. నీటి లభ్యత సరిగా లేనిచోట, నీటి లబ్యత మెరుగైన తర్వాతనే నారు పోయుట, నాటు ట చేపట్టాల్సుంటుంది. ప్రభుత్వ ప్రొక్యూర్మెం టుపై ఆధారపడకుండా,స్వంతంగా మార్కెట్‌ చేసుకున్నా, గిరాకీ ఉన్న రకాలనే ఎంపిక చేసుకొని సాగు చేయడం బాధలను తగ్గిస్తుంది.
ప్రత్తి: చైనా నుండి దిగుమతులను కట్టడి చేయడం వలన, గులాబి రంగు పురుగు ఉధృతి ఎక్కువై నందున, దిగుబడి తగ్గినందున మార్కెట్‌లో ప్రత్తికి మంచి డిమాండ్‌ ఉంది.క్వింటాలు ప్రత్తి రూ. 10-12 వేలు పలుకుతున్నది. మంచి ప్రోత్సాహము న్నందున ఈ పంటను రైతులు పెట్టడానికి ఉత్సా హం చూపుతున్నారు. పూర్తిగా నమ్మకమైన డీలర్ల దగ్గర నమ్మకంగా క్రితం సంవత్సరంలో బాగా పండిన, గిరాకీ ఉన్న రకాలనే పండిరచండి. కొత్త రకాలు వేయాలనుకునేవాళ్లు,కొద్ది విస్తీర్ణంలో పరీ క్షించి బాగా పండితే తదుపరి సంవత్సరం, అదే రకాన్ని ఎక్కువ విస్తీర్ణంలో చేపట్టవచ్చు. అధిక సాంద్రత విధానంలో ప్రత్తిని పండిరచి, అధిక దిగుబడి పొందవచ్చు. ఈ విధానంలో ప్రత్తి పంట త్వరగా పూర్తవుతుంది. ప్రత్తి తర్వాత శనగ, పెసర, మినుము, నువ్వులు, వేరుశనగ పంటలను పెట్టుకో వచ్చు. అధిక సాంద్రత విధానాన్ని వర్షాధారం గాను, నీటితడులిచ్చి కూడా చేపట్టవచ్చు.
వేరుశనగ: జూన్‌ రెండవ పక్షం నుండి జూలై మొదటి వారంలోపు విత్తి అత్యధిక దిగుబడులు పొందవచ్చు. వేరుశనగ గింజలు పెద్దగా ఉండడం వలన, మొలకెత్తడానికి భూమిలో తగినంత తేమ అవసరం. జూలై మొదటి వారం తర్వాత ఎంత నిదానించి విత్తితే అంత దిగుబడి తగ్గుతుంది. కదిరి లేపాక్షి (కె-1812)బాగా దిగుబడి నిస్తున్నప్పటికి కన్ఫెక్షనరీ (గింజలతో తయారైన పదార్థాలు) తయారీదారులు, దీని వాడకానికి ఇష్ట పడుట లేదు. ఇందులో వగరు ఉండుట కారణ మంటున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం వారు రూపొందించినటి.సి.జి.ఎస్‌-1694 గట్టి, కమ్మటి, లావుగింజలు, సమానమైన సైజుగల గింజలు కలిగి, అత్యధిక దిగుబడులను సైతం ఇస్తున్నది. దీనిని ప్రాచుర్యంలోకి తేవ డానికి,విరివిగా విత్త నోత్పత్తి చేపట్టవచ్చు.
-జి.ఎన్‌.వి.సతీష్‌

కడలిని..కాపాడుకుందాం..!

సముద్రపు కోత
సముద్రపు నీరు ఎప్పుడూ నిశ్చలంగా ఉండదని అందరికీ తెలుసు. ఉష్ణోగ్రత, లవణీయత, సాంద్రత మొదలైన విభిన్న భౌతికలక్షణాల ప్రభావంతో సముద్రపు నీరు కదులుతూ ఉంటుంది. అందుకు సూర్యుడు, చంద్రుడు గాలుల వంటి బాహ్యశక్తుల ప్రభావం ఉంటుంది. సముద్రాల్లో ఏళ్ల తరబడి జరుగుతున్న మార్పుల కారణంగా రాకాసి అలలు సముద్రాన్ని కోతకు గురిచేస్తున్నాయి. దీంతో దగ్గర్లో నివశిస్తున్న మత్య్సకారుల జీవనం అయోమయంలో పడుతోంది.అయినా, లాభాలకోసం ఎంతకైనా తెగించే పెట్టుబడిదారీ విధ్వంసం కాలుష్యాన్ని వెదజల్లుతూనే ఉంది. ఈ కాలుష్యం వల్ల చేపలు, ఇతర జీవులు చనిపోతున్నాయి.మత్య్సకారుల జీవనం ప్రమాదంలో పడుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో కడలిని,దాన్ని నమ్ముకున్న మత్స్యకారులను కాపా డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.మన రాష్ట్రంలో ఉప్పాడ బీచ్‌ అందుకు ఓ ఉదాహరణ.
వాతావరణంలో మార్పులు
వర్షాలకు పూర్తిగా మహాసముద్రాలే కారణం. ఆవిరైన సముద్రపు నీరు నుండి వర్షంగా పడుతుంది. నీటిని మాత్రమే కాకుండా సముద్రం నుండి తీసుకున్న సౌరశక్తిని బదిలీ చేస్తుంది. అంతే కాదు.. సముద్రపు మొక్కలు ప్రపంచంలోని చాలా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తాయి. సముద్రపు నీరు గాలిలోని కార్బన్‌ డయాక్సైడ్‌లో సగం తీసుకుం టుంది. ఇది భూతాప ప్రభావాలను తగ్గిస్తుంది. సముద్రం యొక్క ప్రవాహాలు ఉష్ణమండల నుండి ధ్రువాల వైపు వెచ్చదనాన్ని తీసుకువెళతాయి. ప్రవా హాలు మారినప్పుడు, వాతావరణం కూడా మారు తుంది. వీటివల్లే మనుషులు తమ జీవనాధారమైన కార్యకలాపాలు జరుపుకుంటున్నారు. వ్యవసా యానికి అనువైన వాతావరణం కల్పించడంలో సముద్రాలే మూలకారణం.ఆ తర్వాత అడవులు. అటువంటి సముద్రాలను కొందరు చెత్తమయం చేస్తున్నారు. లక్షల టన్నుల వ్యర్థాలను సముద్రాల్లో కలుపుతున్నారు.దీంతో కాలుష్యకోరల్లో చిక్కు కొని, సముద్రజీవులు కూడా అంతరించి పోతు న్నాయి. వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి.
నీటి అడుగున ఉష్ణతరంగాలు
అమెరికాకు చెందిన నేషనల్‌ ఓషనిక్‌ అండ్‌ అట్మాస్పియర్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎన్‌ఒఎఎ) శాస్త్రవేత్తలు గత ఏడాది సముద్రం అడుగున పరిశో ధన చేశారు. వారు దిగ్భ్రాంతి కలిగించే విషయాలు కనుగొన్నారు.నీటి అడుగున ఉష్ణతరంగాలను కను గొన్న ఈ పరిశోధనకు నేతృత్వం వహిస్తున్న ఎన్‌ఒ ఎఎ ఫిజికల్‌ సైన్స్‌ లాబొరేటరీ వాతావరణ శాస్త్ర వేత్త డిల్లాన్‌ అమయా తన అనుభవం వెల్లడిర చారు. ఉత్తర అమెరికా చుట్టుపక్కల ఉన్న ఖండాం తర తక్కువ లోతు సముద్ర నీళ్లలో ఈ పరిశోధన సాగించారు. సముద్రాలుపైనే కాకుండా అడుగున కూడా నీళ్లు నిరంతరం వేడెక్కుతున్నాయని కనుగొ న్నారు. ఇది సముద్ర జీవులపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని చెప్పారు. ఉపరితలంపై ఉండే వేడి కన్నా,అడుగున మరింత ఎక్కువగానూ సుదీర్ఘ కాలం ఉంటోందని వెల్లడైంది.ఈ వేడి ఒక తీరా నికీ మరో తీరానికీ వేర్వేరుగా ఉంటుందని ఆయన వివరించారు.
పారిస్‌ ఒప్పందం అమలులో వైఫల్యం
వాతావరణ మార్పులపై ప్రపంచవ్యాప్త చర్చలకు కేంద్ర బిందువుగా పనిచేసే పారిస్‌ ఒప్పందం 2015లో కుదిరింది. ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత,గత ఎనిమిదేళ్లు (2015-2022) వరుసగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటీవల, ప్రపంచ వాతావరణ సంస్థ (ఔవీఉ) తన గ్లోబల్‌ క్లైమేట్‌ 2023 నివేదికను విడుదల చేసింది. వాతావరణ మార్పుపై పారిస్‌ ఒప్పందం, దాని ఎజెండాను నెరవేర్చడంలో ఆయా దేశాల్లో చర్యలు అసమ ర్థంగా ఉన్నాయని చెప్పింది. వాతావరణ సంక్షో భానికి ప్రధాన కారణమైన శిలాజ ఇంధనాలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వ చర్యలు శూ న్యం. వాతావరణ వ్యవస్థపై శీతలీకరణ ప్రభా వాన్ని చూపే లానినా వాతావరణ సంఘటన గత మూడేళ్లలో సంభవించకపోతే పరిస్థితి చాలా దారు ణంగా ఉండేది.
పీడిస్తున్న ప్లాస్టిక్‌ భూతం
భూమిలో కరగని ప్లాస్టిక్‌ పదార్థాలను పరిశ్రమలు సముద్రాల్లో విడుదల చేస్తున్నాయి. 2018లో అమెరికా 31 మిలియన్‌ మెట్రిక్‌ టన్ను ల ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఉత్పత్తి చేసింది. ఇది ప్రపం చంలోని ఇతర దేశాల కంటే ఎక్కువ. చెత్త, ము రుగు,చమురు లీకేజీల వంటి మానవ కార్యకలా పాల చర్యల వల్ల నిత్యం సముద్రంలో విధ్వంసం జరుగుతుంది.సముద్రంలో కలుస్తున్న ప్లాస్టిక్‌ సంచులు,డిస్పోజబుల్‌ వస్తువుల్లో చిన్న చిన్న జీవు లు,అరుదైన చేపలు చిక్కుకుపోయి చనిపో తున్నాయి.ఈ విధంగా వందల సంవత్సరాలు ప్లాస్టిక్‌ పదార్థాలను తినడంవల్ల జీవుల జీర్ణవ్య వస్థల్లో ప్లాస్టిక్‌ నిల్వ ఉంటున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.ఈ కాలుష్యపు నీటిలో అరుదైన జీవ జాతులు కూడా అంతరించిపోతున్నాయని నిపు ణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సముద్ర మొక్కలు నశించిపోతున్నాయి. ఈ విషయాలన్నీ ప్రజలకు వివరించి, సముద్రాల సుస్థిర అభివృద్ధికి కృషి చేసేలా వారికి అవగాహన కల్పించాలి.
ఎలా వచ్చిందంటే..
ప్రపంచ మహాసముద్రాల దినోత్సవాన్ని 1992లో బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జరిగిన ఎర్త్‌ సమ్మిట్‌లో మొదటిసారిగా ప్రతిపాదన వచ్చిం ది. మహాసముద్రాలు మన జీవితాలలో కీలకపాత్ర పోషిస్తాయని..వాటిని రక్షించడంలో ప్రజలకు సహాయపడే మార్గాల గురించి అవగాహన పెంచడానికి ఓరోజును పాటించాలని దేశాధి నేతలు సూచించారు. దాన్ని ఆమోదిస్తూ ఐక్యరాజ్య సమతి ప్రతి ఏటా జూన్‌ 8న ‘ప్రపంచ సముద్రాల దినోత్సవాన్ని’ నిర్వహిస్తోంది. సముద్రాలు బాగుం డాలి.. జీవులూ బాగుండాలి.. అనేది ఈ ఏడాది అంతర్జాతీయ సముద్ర దినోత్సం థీమ్‌.
నివారణకు చర్యలు
సముద్రాల దగ్గరకు వెళ్లినప్పుడు అక్కడ ప్లాస్టిక్‌ వస్తువులను పడేయకూడదు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇ-వ్యర్థాలను, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌లను తగ్గించడం, స్థిరమైన ఆహార వ్యవస్థలను అవలంబించాలి. పేపర్‌ బ్యాగులను ఉపయోగించాలి.ప్లాస్టిక్‌ బదులు ప్రత్యామ్నా యంగా పేపర్‌,అల్యూమినియం వస్తువులు వాడాలి.ఇంటి సామాగ్రికి గాజు వస్తువులను వాడాలి. ప్లాస్టిక్‌ ఉత్పత్తులను తిరిగి రీసైక్లింగ్‌కి పంపించాలి.
అవగాహన పెంపుదల
సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ కప్పులు, కత్తులు,ప్లేట్లు,టేక్‌అవే ఫుడ్‌బాక్స్‌ల తయారీ, అమ్మ కాల్ని 2016లో నిషేధించి, ప్రపంచంలో తొలి దేశంగా ఫ్రాన్స్‌ అవతరించింది. ప్లాస్టిక్‌ కాలు ష్యంపై అవగాహన పెంచడానికి దేశంలో వ్యర్థాల నిర్వహణను మెరుగుపరచడానికి బంగ్లాదేశ్‌ ప్రభు త్వం పెద్దఎత్తున రీసైక్లింగ్‌ చేపట్టింది. ఇవన్నీ ఆదర్శంగా తీసుకుని, మిగిలిన దేశాలూ అనుస రించాలి. సాగరం బాగుంటేనే సకల జీవరాశులుబాగుంటాయనే విషయాన్ని గుర్తించాలి. చైత న్యంతో అందరం కలిసి కడలిని కాపాడు కోవాలి.
వ్యాసకర్త : సముద్ర పరిరక్షణ నిపుణురాలు- (పద్మావతి)

కార్పొరేట్‌ రాజకీయ పర్యావసానాలు

ప్రజాస్వామ్యానికి ప్రాణమైన ఎన్నికల ప్రక్రియను రాజకీయ రహిత క్రీడగా మార్కెట్‌ వ్యవహారంగా మార్చడం అతి పెద్ద మార్పు.నిజానికి పరిభాష కూడా మారిపోయింది. ప్రజలను ఓటర్ల డేటాగా చూడటం.బిగ్‌ డేటా వుంటే రకరకాల పద్ధతుల్లో బుర్రలు నింపేయొచ్చని భావించడం ఇందులో మొదటిది.బిగ్‌ డేటా,డేటా ఎనలిస్టులు, మార్కెటింగ్‌ సర్వే సైన్యంతో బయలుదేరడమే. వీలైతే సొంత టీములు,లేదంటే ఉమ్మడిగా,అదీ కాదంటే నాయకులకుపార్టీలకు అనుబంధంగా వుండి డీల్‌ కుదుర్చు కోవడం.ఈ క్రమంలో వారి సమస్యలు మనోభావాలు కూడా ఓట్ల ఆకర్షణ కోణంలోనే. ఏది వారిని ప్రభావితం చేస్తుందంటే కాస్త చర్చించి ఏదో పేరుతో ఏదో రూపంలో అది చేయడం. అది కుల మత ఛాందసమా అసభ్యత అసహనం పెంచేదా వంటి కొలబద్దలేమీ వుండక్కర్లేదు. ఉద్వేగాలు పెంచడానికి పనికి వచ్చేదైతే మరీ మంచిది.అలాంటి వ్యక్తిగత అంశాలను అనుకూలంగానూ ప్రతికూలంగానూ వెతికి తెచ్చి మరీ రచ్చ చేయడం.టీవీ రేటింగులలాగే ఈ పనుల వల్ల కలిగిన లాభనష్టాలను బేరీజు వేసి మరో చోట అదే రకమైన ప్రయోగం.అంతే.దీర్ఘకాల ప్రజా ప్రయోజనం ప్రజాస్వామిక విలువల వంటి సంకోచాలే వుండక్కర్లేదు. కావాలంటే మరో పక్షాన్ని లేదా ప్రత్యర్థిని అప్రతిష్ట పాలు చేసేందుకు ఏం చేసినా ఫర్వాలేదు. పైగా ఫలానా వారు ఫలానా పార్టీలోనే వుడాలనీ లేదు. గిట్టుబాటయ్యే బేరం వస్తే పార్టీలో చీలిక తేవచ్చు. ఇప్పుడు తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ విచారణలో ఒక కోణం ఏమిటంటే బిఆర్‌ఎస్‌ రోహిత్‌ రెడ్డిని బిజెపి నేతలు కదిలించడం, మరికొందరిని కలుపుకోవాలని చూడటం, దాన్ని కెసిఆర్‌ వాడుకున్నారనే ఆరోపణ ఒకటైతే అసలా అనైతికత విషయమేంటి? వచ్చిన రాజకీయ దళారులలో వ్యాపారులు, పూజారులు కూడా వుండటమేమిటి? ఆర్థిక వనరులు పుష్కలంగా వున్న వారు ఎప్పుడు ఏ పార్టీ మారినా స్వాగతమే.తాజాగా ఆంధ్ర ప్రదేశ్‌లోనే చూస్తే ఒక కూటమిగా ఏర్పడిన పార్టీలలో కూడా అటూ ఇటూ దూకి పోటీ చేసినవారు కనిపిస్తారు. అందుకోసం అత్యధిక సంపదలు కలిగిన అభ్యర్థుల వేట. అవకాశాలతో అన్వేషణ. టికెట్‌ ఇచ్చే పార్టీకి రూ.వంద కోట్లో యాభై కోట్లో ముందే నిధి. తాము పోటీ చేసే పార్లమెంటు సీటు పరిధిలో అసెంబ్లీ స్థానాలకు పెట్టుబడి. వీలైతే ముందే అక్కడ శిబిరాలు ఏర్పాటు చేయించుకుని హంగామా చేయడం. టికెట్‌ కోసం ప్రయత్నం చేయడానికి ముందే నియోజక వర్గంలో ఓటర్ల కులాల పొందికపై ప్రత్యేక పరిశీలన. నిజం చెప్పాలంటే ప్రశాంత కిశోర్‌తో సహా ఈ వ్యూహకర్తలు ఎక్కువ సార్లు చెప్పేది కులం లెక్కలేనని పాలక పార్టీల నేతలు ఒప్పుకుంటున్నారు. ఒకే వ్యూహకర్త ఒకోసారి ఒకవైపున పని చేయడం వెంటనే మరోవైపు దూకడం ఆశ్చర్యం కలిగించే వాస్తవం. మోడీకి,రాహుల్‌ గాంధీకి ఒకే ప్రశాంత కిశోర్‌ పనిచేస్తాడు. జగన్‌కు పని చేసి మళ్లీ చంద్రబాబుతో మంతనాలు జరుపుతాడు. ఆయన పని చేసిన ఐ ప్యాక్‌ సంస్థ వారే రెండు వైపులా వుంటారు. ఈ మధ్యలో చాలా విన్యాసాలు చేస్తాడు. కానీ బడా మీడియా ఆయనకే అగ్రతాంబూలం ఇచ్చి అభిప్రాయాలు ఆణిముత్యాలన్నట్టు ప్రచారం ఇస్తుంది.ఎందుకంటే ఆ పార్టీలకూ కార్పొరేట్‌ మీడి యాకు పనిచేయించుకునే పార్టీలకూ కూడా రాజకీయ సైద్ధాంతిక పట్టింపులేమీ వుండవు. ఇవన్నీ డీల్స్‌ మాత్రమే.
ఇమేజి గేమ్‌
ఒక డ్రైవరో కండక్టరో ఎక్కిన వాళ్లను ప్యాసింజర్లుగా మాత్రమే లెక్కపెడతారు. ఒక హోటల్‌ యజమాని ఎన్ని టిఫన్లు, ఎన్ని మీల్సు లెక్క కడతాడు. అలాగే ఎన్నికలు, ఓట్లు, ఓటర్లు, వారిపై ఖర్చు అంతా మార్కెట్‌ భాషలో చూడటమే. ఈ పని రాజకీయ విధానాలతో సేవలతో కాకుం డా చిట్కాలతో ఎత్తులతో పూర్తి చేయాలి. ఓటరు ప్రొఫైల్‌ ఏమిటి? కులం, మతం, లింగం, నేపథ్యం తెలుసుకుంటే ఏవిధంగా పడగొట్టొచ్చు. ఓట్ల కొను గోలు దీనికి అదనం. దానికి కూడా మెథడాలజీ. పోల్‌ మేనేజిమెంట్‌ అంటే మనేజ్‌మెంటు అని సరదాగా అనేదందుకే. ఇవన్నీ గతంలో కార్యకర్త లు లేదా స్థానిక దాదాలు చేస్తే ఇప్పుడు కార్పొరేట్‌ స్టయిల్‌లో చేసేవాళ్లు వచ్చేశారు. మీరు సోషల్‌ మీడియాలో లేదా మీడియాలో ఏం చూస్తున్నారు మీ స్నేహితులెవరు. అభిరుచులేమిటి తెలుసుకుని ఆ రూట్లో చేరుకోవడం. మార్కెట్‌ భాషలో గ్యారం టీలు ప్రకటించడం. గ్యారంటీ వారంటీ డబుల్‌ ధమాకా ఆఫర్‌ ఇలాంటి భాష ఇప్పుడు రాజకీయా ల్లో సర్వసాధారణమైపోయింది. ఒటర్లే కాదు, అభ్య ర్థులూ సరుకులే. మొదటిది వారి బడ్జెట్‌ ఎంత? స్వంతంగా భరించగలరా లేక భరించేవారి తర పున ఏజంటుగా పనిచేస్తారా? ఈ తతంగం మార్కె టింగ్‌ టీం కూడా సహకరించే విధంగా జరగొచ్చు. ఆ మేరకు నేతలను కలిసి ఆఫర్లు ఇచ్చి పార్టీలు మార్పించడం చేర్చుకోవడం జరగొచ్చు. అది కాస్త ముగిశాక ఇమేజ్‌పెంచడం. మేకోవర్‌. మోడీ చారు వాలాగా బయిలుదేరి గారు వాలాగా మారి, రామ్‌ చే లాగా ఎదిగి ఇప్పుడు సాగర్‌ రaూ లా వూగుతు న్నారంటే ఇదంతా ఒక నిర్దిష్టమైన పథకం ప్రకారం జరుతున్నదే.ఆయన వేషభాషలు,సందేశాల సంకే తాలు మకాం వేసే నేపథ్యాలు ఏవీ ఊరికే నిర్ణయం కావు. మార్కెట్‌ ప్రొడక్టు అభ్యర్థి అయితే తనను కష్టమర్లయిన ఓటర్లకు ఆకర్షణీయంగా తయారు చేయాలి.అదే బ్రాండ్‌ ఇమేజి.మోడీ బ్రాండ్‌, చంద్ర బాబు బ్రాండ్‌, అమరావతి బ్రాండ్‌. ఇలా చాలా చెప్పొచ్చు. ఇందుకోసం ప్రత్యేక అధ్యయనాలు. అభిప్రాయ సేకరణలు చాప కింద నీరులా సాగిపో యాయి. నిజానికి ఇది 1980లో ఇందిరాగాంధీ పనిచేసే ప్రభుత్వం అంటూ తిరిగివచ్చిన సమయం లోనే మొదలైంది. తర్వాత వాజ్‌పేయి హయాంలో ఫీల్‌గుడ్‌ ఫ్యాక్టర్‌, ఇండియా షైనింగ్‌ వంటి నినాదా లు కూడా వచ్చాయి. ప్రపంచీకరణ మీడియా విస్తరణతో పాటు ఇప్పుడు ఈయంత్రాంగం కూడా విస్తరించిందన్నమాట.ఎ.పి ముఖ్యమంత్రి జగన్‌ సభల క్యాప్షన్‌,బొమ్మ ప్రసంగాలలో ఎత్తుగడ అన్నీ స్క్రిప్టులే.ఈ అయిదేళ్లు ఐప్యాక్‌ టీము ఏదో రూపం లో ఆయనతో వుంటూనే వచ్చింది కదా? విధా నాల పరమైన ప్రణాళికలు పోయి గ్యారంటీలు వాటికి మోడీ గ్యారంటీలని గొప్పలు చెప్పడం వ్యా పార భాష కదా?
వాట్సప్‌ నుంచి యూ ట్యూబ్‌
ఇక ప్రచారంలో సాధనాలు సంస్థలు కూడా సిద్ధంగా వుంటాయి. ఒక మీడియా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటే మన ప్రమోషన్‌ చూసి పెడుతుంది. ఎన్ని ఇంటర్వ్యూలు, ఎంత కవరేజి అన్నీ సాగిపోతాయి. మనను కవర్‌ చేయడంతో పాటు ప్రత్యర్థిని బద్‌నాం చేసే పని కూడా వాళ్లదే. ఇందుకు సోషల్‌ మీడియా ఆర్మీలు. అసలైన సమస్యలు పక్కన పెట్టి అవతలివారిని దెబ్బ తీయ డం మనను పైకి లేపడం మాత్రమే టార్గెట్‌గా పనిచేయడం. తక్కువ జీతాలకే యువత దొరుకు తారు గనక వారిని పనిలో పెట్టుకుంటే బతుకు తెరువు కోసం అన్నీ చేసి పెడతారు. మన ప్రచారం మోత మోగిస్తారు. 2019లో వాట్సప్‌లో మెసేజ్‌లు పంపడం ప్రధానంగా వుంటే ఈసారి నేరుగా యూ ట్యూబ్‌ ఛానళ్లు లేదా మన స్వంత ఛానల్‌ పెట్టు కుని అప్‌లోడ్‌ చేసుకోవడమే.ఎవరికీ బాధ్యత లేదు. ఏదైనా వివాదం వస్తే తప్ప, వివాదాలు పెంచడం కూడా ఇందులో భాగమే. అంటే రాజకీయ నిబద్దత ఎంత మాత్రం లేని అభ్యర్థులు వ్యూహకర్తలు ప్రచార యంత్రాంగం పనిచేసి పెడతాయి. మీడి యాలో కూడా నిబద్దతతో పని చేసేవారిని వేటాడ టం,ఆసంస్థలనే కొనేయడం రివాజుగా మారిపో యింది. ప్రణరు రారు వంటి వారు కూడా స్వంత వేదికలు ఏర్పాటు చేసుకోవడం తప్ప పెద్ద తరహా సంస్థల్లో చోటు కాపాడుకోలేని పరిస్థితి. బడా కుటుంబాలు లేదా వ్యాపారాల్లో గుట్టలు పోసుకున్న వారు కాదంటే సినిమా సెలబ్రిటీలు, కార్పొరేట్‌ వర్గాల సేవకులు ఎన్‌ఆర్‌ఐలు మీడియాలో రాజకీ యాల్లో దిగిపోవడమే. విశేషించి తెలుగు రాష్ట్రాల్లో దేశంలోనే అతి సంపన్నులైన అభ్యర్థులు రంగంలో నిలవడం దేశమంతా చర్చనీయాంశమైంది. వామ పక్షాల వరవడి వుంది గనక సమస్యలపై చర్చ కొంతైనా జరిగింది గానీ లేకపోతే కేవలం మార్కె టింగ్‌ వ్యూహాలతోనే గడిచిపోయేది. సంఘ సంస్క రణ,స్వాతంత్రోద్యమం,కమ్యూనిస్టు ఉద్యమం వంటి బలమైన సంప్రదాయాలు గల చోట కార్పొ రేట్‌ బాబులు కుల శక్తుల కుమ్ములాటగా ఎన్నికలు జరగడం దిగ్భ్రాంతి కలిగించే వాస్తవం. ఇవన్నీ సర్వసాధారణమైనట్టు భావించడం మరింత దారు ణం. ఇరువైపుల ఆటగాళ్లు ఒకేఆట ఆడుతూ ఆశ యాలు ఉద్యమాల కోసం పాటు పడేవారిని అప హాస్యం చేయడం అలక్ష్యం చేయడం ఇక్కడ కొస మెరుపు.బ్యూరోక్రసీ కూడా ఇందుకు తగినట్టే వ్యవ హరిస్తుంది.ప్రైవేట్‌ భాగస్వాములను కూడా సలహా దారులై సర్కార్లను నడిపిస్తున్నారు. ముప్పయ్యేళ్ల ప్రపంచీకరణ పర్యవసానమైన కార్పొరేట్‌ గవర్నెన్స్‌ ప్రతిఫలనమే ఇది.పైగా కార్పొరేట్‌ మార్కెటింగ్‌ రాజకీయం మితవాద, మతవాద రాజకీయాలను తప్ప ప్రగతిశీలతను సహించదు. ఎందుకంటే ఉద్యమ చైతన్యం దోపిడీని ప్రశ్నిస్తుంది గనక ఆశక్తు లను లేకుండా చేసే కుట్ర సాగిపోతుం టుంది. ఎందుకంటే ప్రపం చీకరణ మౌలికంగా ప్రజాస్వా మిక విలువలకు వ్యతిరేక మైంది. అందుకే తక్షణ రాజకీయ పోరాటంతో పాటు దీర్ఘకాలంలో ప్రజా స్వామిక పునాదులు కాపాడు కోవడానికి గట్టి కృషి అవసరం.పూర్తి ఫలితాల తర్వాత ఇందుకు సంబం ధించిన మరింత నిర్దిష్టత రావచ్చు. ప్రజాశక్తి సౌజన ్యంతో…)-(తెలకపల్లి రవి)

1 11 12 13 14 15 75