ఊరి బడిని కాపాడుకుందాం..

ప్రభుత్వాలు మారినప్పుడల్లా విద్యా రంగంలో సంస్కరణలు ప్రవేశ పెట్టడం సర్వసాధారణం అయింది. ముందు క్లస్టర్ పాఠశాల వ్యవస్థను తెచ్చారు. మొత్తం ప్రాథమికోన్నత పాఠశాలలను మÖసివేసేందుకు ప్రయత్నం చేశారు. 2017లో విద్యారంగంలోకి వ్యాపార రంగంలో ఉన్న ఎఫ్.ఐ.సి.సి.ఐ అనే సంస్థను ప్రవేశ పెట్టడానికి కూడా ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే 2020లో కరోనా వచ్చింది. ఈ కాలంలోనే కనీసం చర్చ లేకుండానే కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా జాతీయ విద్యావిధానం-2020 ప్రవేశపెట్టింది.
5,8తరగతిలో పరీక్షలు, వృత్తి విద్యా కోర్సు లు, ప్రైవేట్ విద్యాసంస్థలకు ప్రోత్సాహం, నాలుగు సంవత్సరాల డిగ్రీ కోర్సు ఇవన్నీ ముందుకు వచ్చాయి. దీన్ని అమలు చేయడానికి చాలా రాష్ట్రాలు తటపటా యిస్తుండగా వైసిపి ప్రభుత్వం ఈ సంస్కరణ అమలు చేస్తూనే, ప్రపంచ బ్యాంక్ నుంచి రూ.1876 కోట్లు అప్పు తెచ్చుకుని ‘సాల్ట’ పథకాన్ని ముందుకు తెచ్చింది. సర్క్యులర్ 172ని విడుదల చేసింది.దానికి కొనసాగిం పుగా జీవో 117 విడుదల చేసింది. ఇక సంస్కరణలు వేగవంతంగా ముందుకు పోయాయి. అంతర్జాతీయ విద్యార్థిగా తయారు చేయడం మా లక్ష్యమని ఒక మంచి స్లోగన్ ముందుకు తీసుకొచ్చారు. ఏఒక్క బడి మÖసేయం,ఒక్క ఉపాధ్యాయుడిని తగ్గించం అనే మరొక క్యాచీ స్లోగన్ విద్యారంగం మీదకి వదిలారు. జీవో 117వల్ల విద్యా వ్యవస్థ విచ్ఛిన్నమవు తుందని ఉపాధ్యాయ సంఘాలు, ఎమ్మెల్సీలు, విద్యా ప్రముఖులు మొత్తుకున్నా ఇది మా పాలసీ అనే పేరుతో అత్యంత దుర్మార్గంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళింది. దీన్ని రద్దు చేయాలని పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయి.2024ఎన్నికల్లో జీవో 117ని రద్దు చేస్తా నని చెప్పిన తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది.ఇప్పటికీ జీవో నెంబర్ 117నిరద్దు చేస్తామని చెబుతూనే ఆ 117ఆధారంగా మళ్ళీ సంస్కరణలను ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తున్నది.
ప్రభుత్వ బడుల్లో తగ్గుతున్న విద్యార్థులు
2018-19విద్యా సంవత్సరంలో 39,29,019 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువు తున్నారు.2021-22లో 44,29,569 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో ్లఉన్నారు (ఇది కరోనా కాలం).2025-26లో 33,62,093 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. గత 5 సంవత్సరాలలో10,49,596 మంది విద్యా ర్థులు ప్రభుత్వ పాఠశాలలను వదిలి ప్రైవేట్ పాఠశా లలకు వెళ్ళినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో ఈ సంవత్సరం 34,02,049 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.49శాతం మంది మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో ఉంటే,51 శాతం మంది ప్రైవేటు పాఠశాలల్లో విద్యనభ్యసిస్తు న్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన సంస్కరణల వల్ల 3,4,5తరగతుల విద్యార్థులకు సబ్జెక్టు బోధన చేస్తామని చెప్పి హైస్కూల్‌కు తరలించారు. కొద్దిమంది ప్రభుత్వ హైస్కూల్‌కి వెళితే, కొద్ది మంది ప్రైవేట్‌కి వెళ్ళిపోయారు. ఇప్పుడు మరలా హైస్కూల్ కంటే మోడల్ ప్రాథమిక పాఠశాలలో ఐదుగురు ఉపాధ్యా యులుంటే నాణ్యమైన విద్య వస్తుందని చెప్తున్నారు. ఇప్పటికే హైస్కూళ్ళలో ఉన్న 3,4,5 తరగతి పిల్లలను తిరిగి మోడల్ ప్రాథమిక పాఠశాలలకు తరలిస్తామని చెబుతున్నారు.హైస్కూల్‌లో ఉన్న3,4,5తరగతి పిల్లలు ఎంతమంది తిరిగి మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో చేరతారో చెప్పలేం.ఈసంస్కరణలు ప్రభుత్వ బడులలో విద్యార్థుల సంఖ్యను పెంచలేకపోయాయి.
పాఠశాలల భవితవ్యం!
ప్రస్తుతం ప్రపంచ బ్యాంకు సంస్కరణలు, స్కీములు, జీవోల ఫలితంగా 34 వేలకు పైగా ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో 12,512 ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారిపోయాయి.10లోపురోల్ ఉన్న పాఠశాలలు 5495.11-20లోపురోల్ ఉన్న పాఠశాలలు 14,5 70 అంటే 20లోపు ఉన్న ప్రాథమిక పాఠశాలలు 20,065. ఈ ప్రాథమిక పాఠశాలలు భవిష్యత్తులో బతుకుతాయా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. 3206 పైగా ప్రాథమికోన్నత పాఠశాలల పరిస్థితి ఏమిటో స్పష్టత లేదు.దీనిలో చదివే విద్యార్థుల భవిష్య త్ అగమ్యగోచరంగా మారబోతున్నది.502 ఉన్నత పాఠశాలల్లో ప్లస్ టూ పాఠశాలలను ప్రవేశ పెట్టారు. వీటి భవిష్యత్‌పై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు.
ఉపాధ్యాయుల పరిస్థితి
రాష్ట్రంలో 27,409ఉపాధ్యాయ ఖాళీలున్నట్లు తెలుస్తున్నది.జీవో నెం 117రద్దు వల్ల ఉపాధ్యాయ పోస్టులు చాలా మిగులుగా అవుతాయి.16 వేల పోస్టులకు డిఎస్‌సి వేస్తామని ప్రభుత్వం చెబుతున్నది. కొన్ని జిల్లాల్లో ఉపాధ్యాయుల కొరతతీవ్రంగా ఉంది. ప్రత్యేకించి మున్సిపల్ పాఠశాలల్లో సబ్జెక్టుకు తగిన ఉపాధ్యాయులు లేరు. ఎయిడెడ్ పాఠశాలల్లో కూడా ఇదే పరిస్థితి.చాలా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది.కొన్ని చోట్ల విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. ఎక్కడైతే ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులతో మమేకమై విద్య అందించడానికి కృషి చేస్తున్నారో అక్కడ రోల్ పెరుగుతుందని తెలుస్తుంది. ఇక్కడ ఉపాధ్యాయుల్లో ఉన్న లోపాలను కూడా మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లలు బడిలో ఉంటేనే ఉపాధ్యాయులకు జీతాలు భద్రత ఉంటుంది. సంస్కరణలు ఉపాధ్యాయులను,పాఠశాలలను రక్షించుకునే వైపు కాకుండా వ్యక్తిగత డిమాండ్ చుట్టూ ఆలోచించే వైపు పరుగులు తీయిస్తున్నాయి. ప్రభుత్వం ఉపాధ్యాయుల బోధనా శక్తి సామర్ధ్యాలను బోధనేతర కార్యక్రమాలకు వినియోగించు కుంటున్నది. రకార కాల ట్రైనింగ్‌లు, రిపోర్టులు, పర్యవేక్షణలు, ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయడం ముందుకు వచ్చాయి. నాలుగక్ష రాలు చెప్పారా లేదా అని పర్యవేక్షణ చేసేవాళ్ళ కంటే ఆ 42రిపోర్టులు ఎందుకు పంపలేదు. ఎప్పుడు పంపి స్తారు? అని అడగడంగా విద్య మారిపోయింది.
పెరగని సామర్థ్యాలు
ఈ సంస్కరణలు విద్యార్థుల సామర్ధ్యాన్ని పెంచాయా, తగ్గించాయా పరిశీలిస్తే అసర్ లాంటి సర్వేలు చెబు తున్న దాని ప్రకారం 3వ తరగతి విద్యార్థులు 2వ తరగతి స్థాయి పుస్తకాలు 83.3శాతం మంది చదవ లేక పోతున్నారు. ఐదవ తరగతి విద్యార్థులలో రెండో తరగతి స్థాయి పుస్తకాలు 62.5శాతం మంది చదవ లేక పోతున్నారు.ఎనిమిదవ తరగతి విద్యార్థుల్లో రెండవ తరగతి స్థాయి పుస్తకాలు 47శాతం మంది చదవలేకపోతున్నారు. 8వ తరగతి చదివే విద్యార్థుల్లో 54.8శాతం మంది భాగాహారం చేయలేక పోతు న్నారు.సంస్కరణలు విద్యార్ధుల సామర్ధ్యాలను పెంచ లేకపోయాయి.
విద్యారంగానికి బడ్జెట్
విద్యా రంగానికి కేంద్ర ప్రభుత్వం జిడిపిలో ఆరు శాతం నిధులు కేటాయించాలని, రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం 30 శాతం నిధులు కేటాయించాలని కొఠారి కమిషన్ చెప్పింది. మనరాష్ట్ర బడ్జెట్లను గమనిస్తే విద్యా రంగానికి ఎక్కడా 15శాతానికి మించి ఏ సందర్భం లోనూ కేటాయింపులు చేయలేదు.2015-16 బడ్జెట్‌లో 16శాతం నిధులు కేటాయించారు. 2017 -18లో 13.60 శాతం కేటాయించారు. 2018-19లో 8 శాతం కేటాయించారు. ఇక్కడ అమ్మఒడి, నాడు నేడు నిధులను కూడా దీనిలో కలిపారు.23-24 బడ్జెట్‌లో 9.8శాతం, 2025-26 బడ్జెట్లో 9.8 శాతం మాత్రమే ఇచ్చారు. ఈ బడ్జెట్‌తో అంతర్జాతీయ విద్యార్థి ఎలా తయారవుతారు?అంతర్జాతీయ విద్యా ర్థిని తయారు చేయటమే లక్ష్యం అంటున్నారంటే ఈ రాష్ట్ర మానవ వనరులను విదేశీ వనరులుగా మార్చటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే!
ప్రస్తుత పరిస్థితి
రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణల ద్వారా”అంతర్జాతీయ విద్యార్థి,నాణ్యమైన విద్య, తరగతికి ఒక గది, తరగతికి ఒకఉపాధ్యాయుడు.బోధనేతర కార్యక్రమాలుఉపాధ్యా యులకు ఉండవు. ఒక యాప్ మాత్రమే ఉంటుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు బడి సమయం లో బోధన కార్యక్రమాలు మాత్రమే ఉంటాయి. శని వారం మాత్రమే బోధనేతర కార్యక్రమాలు. నో బ్యాగ్ డేలు.స్కూలు కాంప్లెక్స్‌లు,శిక్షణ తరగతులు. ఇక విద్యార్థి నుంచి అవుట్ కం తీసుకురావటమే మా లక్ష్యం. ఉపాధ్యాయులకు బదిలీల చట్టం, ప్రమోషన్లు సీనియార్టీల ప్రకారం జరుగుతాయి.60దాటిన ప్రాథ మిక పాఠశాలలను మోడల్ ప్రాథమిక పాఠశాలలుగా మారుస్తాము.ఉన్నత పాఠశాలల్లో ఉన్న 3,4,5 తరగ తుల విద్యార్థుల్ని ఈ మోడల్ స్కూల్‌కి మ్యాప్ చేస్తాము. అవసరమైతే ఆపంచాయతీలో ఉన్న కొన్ని ఎలి మెం టరీ పాఠశాలల్లోని 3,4,5తరగతుల విద్యార్థుల్ని ఆ పంచాయతీలో మోడల్ స్కూల్‌కి మ్యాప్ చేస్తాము. 60దాటిన ప్రాథమికోన్నత పాఠశాలలను అప్‌గ్రేడ్ చేసి ఉన్నత పాఠశాలగా మారుస్తాము.30లోపుఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలోని విద్యార్థులను దూరంగా ఉన్న హైస్కూల్‌కి తరలించి రవాణా భత్యం ఇస్తాము. 31నుంచి 59వరకు ఉన్న ప్రాథమికోన్నత పాఠశా లలను అక్కడున్న పరిస్థితుల్ని పరిశీలించి తగు నిర్ణ యం చేస్తాము. ఒక పంచాయతీలో ఏ పాఠశాలలను మోడల్ స్కూళ్లుగా మార్చాలో, దేనిని మ్యాప్ చేయాలో అనే అంశాలు ఆపంచాయతీలోని స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీల ఆమోదంతో మాత్రమే చేస్తాము. ఆ స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలు అంగీకరించకపోతే పాఠశాలలను యథాతథంగా కొనసాగిస్తాము. ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులకు వర్క్ లోడ్ తగ్గిస్తాము. ప్లస్ టు పాఠశాలలపై ఆలోచిస్తున్నాం” అని ప్రభుత్వం చెబుతుంది.ఇవన్నీ నిజంగా జరిగితే ప్రభుత్వ పాఠ శాల విద్యకు మంచి జరిగే అవకాశం ఉంది. ఆచరణలో దీనికి భిన్నంగా ఒకటి, రెండు తరగతులు మాత్రమే ఉన్న ఫౌండేషన్ పాఠశాలల సంఖ్య పెరిగే అవకాశం కన్పిస్తున్నది. రాష్ట్రంలో 13,325 గ్రామ పంచాయితీలు ఉంటే 7600 పంచాయతీల్లో మాత్ర మే మోడల్ స్కూళ్లు పెట్టే అవకాశం ఉంది. అదీ ఆ పంచాయతీలో ఉన్న కొన్ని ఎలిమెంటరీ పాఠశాలల్లోని 3,4,5తరగతుల విద్యార్థులను మ్యాప్ చేయడం ద్వారా కొన్ని పాఠశాలలు మోడల్ పాఠశాలల్లా మారు తున్నాయి.ప్రాథమికోన్నత పాఠశాలల భవిష్యత్ ప్రశ్నా ర్ధకంగా మారుతుంది. ఇంగ్లీష్ మీడియంను మాత్రమే కొనసాగించబోతున్నారు. ఎక్కడైనా బేసిక్ ప్రాథమిక పాఠశాల కొనసాగాలని స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ తీర్మానం చేస్తే, స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు ఆ మేనేజ్‌మెంట్ కమిటీలకు నచ్చజెప్పి లేదా ఏదోరకంగా కన్విన్స్ చేసి ఫౌండేషన్ స్కూళ్లుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ బలోపేతం కావాలంటే
విద్యా రంగ సంస్కరణలు ప్రభుత్వ పాఠశాలల విద్యా ర్ధుల సంఖ్యను, సామర్ధ్యాలను, ఉపాధ్యాయుల సంఖ్య ను తగ్గించాయి.విద్యకు కేటాయించే బడ్జెట్ సైతం తగ్గిపోయింది. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం తీసుకోవలసిన సంస్కరణలు ప్రభుత్వ పాఠశాలలను బలహీనపరిచే విధంగా ఉండడం గమనించాలి.దీర్ఘ కాలంలో ప్రభుత్వ పాఠశాల వ్యవస్థను బలోపేతం చేయడానికి కామన్ స్కూల్ సిస్టమ్‌ని అమలు చేయా లి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో ఒకే రకమైన సిలబ స్‌ని అనుసరించాలి. బడ్జెట్‌లో విద్యకు 30 శాతం నిధులను కేటాయించాలి.ప్రాథమిక స్థాయిలో మాతృ భాషలో బోధన,సెకండరీ స్థాయిలో తెలుగు, ఇంగ్లీషు మీడియంలో బోధన ఉండాలి. ఉపాధ్యాయులను బోధ నకు మాత్రమే పరిమితం చేయాలి.తక్షణం విద్యా వ్యవస్థను ప్రభుత్వం రంగంలో అభివృద్ధి చేయడానికి రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీలో విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ఒక మోడల్ ప్రైమరీ పాఠశాల ఐదుగురు ఉపాధ్యాయులు, ఐదు తరగతి గదులు ప్రత్యేక బడ్జెట్ అన్ని హంగులతో ఏర్పాటు చేయాలి.మిగిలిన ప్రాథమిక పాఠశాలలను యథా తథంగా కొనసాగించాలి.60మంది విద్యార్థులుఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్ చేయాలి. మిగిలిన ప్రాథమి కోన్నత పాఠశాల లను యథాతథంగా కొనసాగించాలి. ఉన్నత పాఠశా లలో సమాంతర మీడియంలను కొనసా గించాలి. ప్లస్ టు వ్యవస్థను కొనసాగించాలి. -వ్యాసకర్త : ఎన్.వెంకటేశ్వర్లు,యు.టి.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు

సమిష్ట కృషితోనే అగ్రస్థానంలో విశాఖ అభివృద్ధి

స్వర్ణాంధ్ర సాకారంలో ప్రతి ఒక్కరూ భాగస్వా మ్యం కావాలని, అధికారులు సమష్టి కృషి చేసి విశాఖపట్టణం జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ నిర్దేశించారు. ప్రజలకు సంతృప్తికర రీతిలో సేవలందిస్తూ, అభివృద్ధి – సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ, సమ్మిళిత ఆర్థిక విధానాలకు పెద్దపీట వేస్తూ ప్రతి ఒక్కరూ వారి కర్తవ్యాలను నిర్వర్తించాలని సూచించారు.ఈ నెల 25,26వ తేదీల్లో రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మÖడో విడత కలెక్టర్ల సదస్సు అంశాలను శుక్రవారం కలెక్టరేట్ మీటింగు హాలులో జరిగిన సమావేశంలో జిల్లా అధికా రులకు వివరించిన ఆయన పలు అంశాలపై వారికి దిశానిర్దేశం చేశారు. అన్ని రంగాల్లో విశాఖ జిల్లాను ప్రథమ స్థానంలో నిలపటమే లక్ష్యంగా బాధ్యతగా పని చేయాలని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన స్వర్ణాంధ్ర ఏ2047 విజన్ ప్లాన్, విశాఖపట్టణం 2025-29 ప్లాన్ ప్రాతిపదికగా ముందుకు సాగాలని అధికారులను పేర్కొన్నారు. విశాఖపట్టం రూపురేఖలు మార్చేలా ప్రతి ఒక్కరూ ప్రణాళికా బద్ధంగా పని చేయాలని, అంకిత భావం ప్రదర్శించాలని సూచించారు.మహానగరాన్ని మరింత అందంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు చేపట్టాలని, ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసేలా కృషి చేయాలన్నారు. రంగాలవారీగా వివిధ అంశాలపై పీపీటీ ఇచ్చారు.
15 శాతం వృద్ధి లక్ష్యాలను చేరుకోవాలి…
పర్యాటక రంగ అభివృద్ధికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని, ఆ దిశగా కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని, కొత్త ీVAటళ్లు, రిసార్టులు ఏర్పాటు చేసేందుకు సహకారం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రుషికొండ, గంభీరంలో అడ్వెంచర్ స్పోర్ట్స్ కాంప్లెక్సులు నిర్మించాలని సూచించారు. వీఎంఆర్డీఏ, జీవీఎంసీ పరిధిలో చేపట్టే ప్రాజెక్టులను వేగవంతం చేయాలని, అనుమతుల జారీ విషయంలో పారదర్శకత పాటించాలని, వేగం పెంచాలని సూచించారు. 15 శాతం వృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని, తలసరి ఆదాయం పెంచేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. ప్రతి నెలా ఒకటో తారీఖున ఠంచనుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి ఫింఛన్లు అందజేయాలన్నారు. రేషన్ సరకులను కూడా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి ఇవ్వాలన్నారు. ఉచిత ఇసుక విధానం పారదర్శకంగా అమలు కావాలని, మద్యం పాలసీకి అనుగుణంగా జిల్లాలో చర్యలు చేపట్టాలని, అవకవతకలు జరగకుండా జాగ్రత్త వహించాలని చెప్పారు. విద్యా, వైద్య రంగంలో ప్రమాణాలు మరింత మెరుగపడాలని, ప్రయివేటుకు ధీటుగా సేవలను విస్తృతం చేయాలని సూచించారు.
వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలి….
అధిక శాతం పట్టణీకరణ కలిగిన జిల్లా అయిన్పటికీ ఉన్న గ్రామీణ మండలాల్లో వ్యవసాయంపై ప్రధాన దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ఉద్యాన, ప్రకృతి వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి సత్ఫలితాలు సాధించాలని సూచించారు. జిల్లాలో గుంతలు లేకుండా రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని, పరిశుద్ధమైన తాగునీటిని సరఫర చేయాలని, నాణ్యమైన విద్యుత్ సరఫరా ఉండాలని పేర్కొన్నారు. దేవాలయాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వ్యవసాయ రంగంలో నూతన విధానాలను అవలంభిస్తూ ప్రజలకు చేదోడుగా నిలవాలన్నారు. వచ్చే ఏడాదికి 200 హెక్టార్ల బీడు భూములను సాగులోకి తీసుకురావాలని చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని, నగరంలో ప్రశాంత వాతావరణం ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్లో పేర్కొన్న అంశాలకు అనుగుణంగా అన్ని విభాగాల అధికారులు బాధ్యతగా పని చేయాలని, ఉత్తమ ఫలితాలను రాబట్టాలన్నారు. వివిధ వేదికల ద్వారా ప్రజల నుంచి వచ్చే వినతులకు నాణ్యమైన పరిష్కారం చూపాలని, ఉద్యోగ, ఉపాధి కల్పనకు ప్రణాళికాయుత చర్యలు తీసుకోవాలని, పరిశ్రమలు, ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ప్రతి నెలా 100 పారిశ్రామిక యÖనిట్లు నెలకొల్పేందుకు కార్యాచరణ రూపొందించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు.
ఆరు నెలల్లో మెట్రో భూసేకరణకు చర్యలు…
విశాఖలో చేపట్టనున్న మెట్రో రైలు ప్రాజెక్టు అవసరాల నిమిత్తం ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు ఆరు నెలల్లో మొదటి దశ భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉం టుందని అధికారులను కలెక్టర్ అప్రమత్తం చేశారు. మాస్టర్ ప్లాన్ రోడ్లకు సంబంధించి కార్యాచరణ మొదలు పెట్టాలని, అంతర్గత రోడ్ల విషయంలో వేగం పెంచాలని సూచించారు. మెట్రో ప్రాజెక్టు, మాస్టర్ ప్లాన్ రోడ్డు వేసే మార్గంలో కొత్తగా ఎలాంటి అనుమతులు ఇవ్వరాదని, కొత్త భవనాలు, లేఅవుట్లు వేసేందుకు ప్రణాళికలు తయారు చేయరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టేషన్ నుంచి అనుసంధానమయ్యే రోడ్ల అభివృద్ధికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉద్యోగులు కర్మయోగి సర్టిఫికేట్ కోర్సులు చేయాలని, పీ-4 సర్వేకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని,వాట్సాప్ గవర్నెన్స్‌కు ప్రాధాన్యత ఇస్తూ సేవలను మరింత విస్తృతం చేయాలని, సంబంధిత నంబర్ ను పబ్లిక్ ప్రాంతాల్లో ప్రదర్శించాలని సూచించారు.
పరిశ్రమలు నెలకొల్పేందుకు పక్కా ప్రణాళికలతో రండి…
చిన్నచిన్న యÖనిట్ల రూపంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు పారిశ్రామిక ఔత్సాహికులు పక్కా ప్రణాళికలతో రావాలని, వారికి అన్ని విధాలుగా పూర్తి సహకారం అందిస్తామని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. ఇప్పటికే పరిశ్రమలు నిర్వహిస్తున్న వారు సాంకేతిక సహాయం, నైపుణ్యం కలిగిన సిబ్బంది కొరకు ప్రతిపాదనలు పంపిస్తే పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. శుక్రవారం కలెక్టరేట్ మీటింగు హాలులో జరిగిన జిల్లా ఇండస్ట్రియల్ ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశంలో ఆయన పలు అంశాలపై చర్చించారు. పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు వచ్చే వారికి అధికారులు సంపూర్ణ సహకారం అందించాలని ఈ సందర్భంగా సూచించారు. 2025-26 వార్షిక ప్రణాళికను దృష్టిలో పెట్టుకొని ఔత్సాహికులు, అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని, వీలైనన్ని పారిశ్రామిక యÖనిట్లు నెలకొల్పాలని పేర్కొన్నారు.
జిల్లాలో నూతన పరిశ్రమల స్థాపనకు అనువైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో అధికారులు పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. వనరులను సద్వినియోగం చేసుకుంటూ పారిశ్రామికంగా అభివృద్ధి పథంలో నడిపేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. గాజువాక, ఆటోనగర్ వద్ద గల రోడ్ ఓవర్ బ్రిడ్జి(ఆర్.వో.బి.), పెద గంట్యాడ, అగనంపూడి, ఆటోనగర్లలో ఫ్లాట్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్, పీఎం విశ్వకర్మ యోజన పథకం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన ఆయన పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిర్మాణాలకు, పరిశ్రమల నిర్వహణకు అవసరమైన నీటి వనరులను సమకూర్చాలని, సౌసైటీ భవనాల నిర్మాణానికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.భూ సేకరణ,సింగిల్ విండో క్లియరెన్స్ అంశాల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. ఎంఎసఎంసీ సెక్టార్ల ఏర్పాటులో చురుగ్గా వ్యవహరించాలన్నారు. కోర్టు కేసులు, విజిలెన్స్ కేసుల విషయంలో సత్వరమే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్రమణల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, నిర్ణీత సమయంలో చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో భాగంగా ఐలా ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు ఆటోనగర్, ఐటీ హిల్స్ వద్ద కావల్సిన సదుపాయాలపై, అన్ని రకాల సమావేశాలకు, సభలకు ఉపయోగపడే విధంగా పెద్ద హాలు నిర్మాణంపై కలెక్టరుకు నివేదించారు.
రూ.23,870 కోట్లతో “పోటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన” విడుదల
విశాఖపట్నం జిల్లా అవసరాలను దృష్టిలో ఉంచు కొని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (చీAదీA=ణ) 2025-26 సంవత్సరానికి సంబంధించి రూపొందించిన “పోటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన” (PLP)ను కలెక్టర్, ఇతర అధికారుల చేతుల మీదుగా డీఐపీఈసీ సమావేశం అనంతరం విడుదల చేశారు. రూ.23,870.62 కోట్లతో క్రెడిట్ ప్లాన్ రూపొందించినట్లు నాబార్డ్ డెవలప్మెంట్ మేనేజర్ బసంత్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ ప్రణాళిక ముఖ్యంగా ఎం.ఎస్.ఎం.ఈ.లు, పునరుత్పాదక ఇంధనం, ఎగుమతి క్రెడిట్, సుస్థిర వ్యవసాయంపై దృష్టి సారించిందని పేర్కొన్నారు. ఎంఎసఎంఈ రంగానికి రూ.16,207.50 కోట్లు, ఎగుమతి ఆధారిత వ్యాపారాల కోసం రూ.612 కోట్లు, పునరుత్పాదక ఇంధన రంగానికి రూ.300.74 కోట్లు, వ్యవసాయ రంగానికి రూ.3,368.99 కోట్లు, ఇతర విభిన్న అవసరాల కోసం రూ.3,384.38 కోట్లు కేటాయించినట్లు వివరించారు.ఈ ప్రణాళిక అన్ని రంగాల అవసరాలను పరిగణనలోకి తీసుకొని సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించడంలో దోహదప డుతుందని బసంత్ కుమార్ పేర్కొన్నారు. – జి ఏ సునీల్ కుమార్

ప్రమాద స్థాయిలో భూగర్భ జలాలు

“ జనాల జీవితమంతా జలంతోనే ముడి పడి ఉంటుంది.నిత్యం దాని చుట్టూనే తిరుగుతుంది.నీరు లేనిదే ఏపనీ ముందుకు సాగదు.ఎండా కాలంలో నైతే బోలెడు కష్టాలెదుర్కొవాలి. చెరువులు, కుం టలు, నీటి వనరులు లేని ఊళ్లు పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊరి చెంతనే నది పరుగులిడితే కలిగే ప్రయోజనాలు అన్నీఇన్నీ కావు.రైతులకు పంటలు,పండిస్తుంది. చేపలు పట్టే వారికి ఉపానిస్తుంది.ఎన్నో పనులకు భరోసాగా ఉంటుంది.ఆ జీవనదిలో ఉన్న అనుబంధాల్ని మరిచపో వద్దని తమ బిడ్డలకు ఆతల్లి పేరునే పెట్టుకుంటారు. గోదావరికి ఒడ్డునే ఉన్న పలు గ్రామాలకు వెళ్తే అక్కడి వారికి నది ఎంత మేలు చేస్తుందో తెలుస్తుంది ”
టా వర్షాకాలంలో వానలకు భూగర్భ జలాలు ఉబికిరావడం..వేసవిలో పడిపోవడం సహజ ప్రక్రియ.దీనికితోడు బోర్లు, బావుల ద్వారా భూగర్భ జలాల వాడకం అధికమైతే, అక్కడ నీటిమట్టం ఇంకా పడిపోవడం కూడా సహజమే. అయితే, రాష్ట్రంలో 2,617గ్రామాల్లో నీటిని తెగ తోడేస్తున్నారు. వీటిలో 300 గ్రామాల్లో మరీ దారుణంగా పిండుకుంటున్నారు.అక్కడ ఏటా రీఛార్జి అవుతున్న నీటి కంటే వాడుతున్న జలాల పరిమాణమే ఎక్కువ. భూగర్భాన్ని ఓ జలాశయ మలుచుకుని, వర్షాకాలంలో నీటిని ఒడిసిపట్టి, అవసరాలకు తగ్గట్టు వాడుకోవాల్సి ఉండగా, దారుణంగా తోడేస్తున్నారు. కేంద్ర భూగర్భ జలవనరుల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.కరవు కాలంలో, వేసవిలో తాగునీటికి తహతహలాడే పల్లెలు ఎన్నో. కిలోమీటర్ల దూరం నుంచి నీళ్లు తెచ్చుకునే చిత్రాలు చూస్తుంటాం.ఈ నేపథ్యంలోనే భూగర్భ జలాల రక్షణ, సమర్థ వినియోగంపై కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అధ్యయనం చేస్తుంటారు. ప్రభుత్వ పరంగా నివారణ చర్యలు తీసుకు నేందుకు ఈ అధ్యయనం ఉపయుక్తమవుతుంది. గతంలో మÖణ్నాలుగేళ్లకోసారి ఈ పరిశీలన జరిగేది.కొంతకాలంగా ఏటా,అంటే ప్రతి నీటి సంవత్సరంలోనూ అధ్యయనం చేసి భూగర్భ జలాల లభ్యత, వినియోగం తీరుపై నివేదికలు తయారుచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 21 శాఖల ద్వారా ఇచ్చే సమాచారాన్ని ఇందులో విశ్లేషిస్తున్నారు.ఉదాహరణకు ఒకనీటి సంవత్స రంలో ఒక గ్రామంలో సగటున 100యÖనిట్ల భూగర్భ జలాలు రీఛార్జి అయ్యాయనుకుందాం.ఆ ఊళ్లో ఆ ఏడాది 70 యÖనిట్ల కన్నా తక్కువగా భూగర్భ జలాలు వాడుకుంటే అక్కడ వినియోగం ‘సమర్థం’గా ఉన్నట్లు లెక్క. 70-90 యÖనిట్ల మధ్య జలాలను తోడేస్తుంటే ‘ప్రమాదకర (సెమీ క్రిటికల్)’ సంకేతం 90 నుంచి 100యÖనిట్ల మధ్య తోడేస్తుంటే ‘అంత్యంత ప్రమాదకర (క్రిటికల్)’ధోరణి. కొన్నిపల్లెల్లో 110 యÖనిట్లు కూడా తోడేస్తున్నారు. ఇది ‘అతి దారుణ’ స్థాయి. గత నీటి సంవత్సరంలో చేసిన అధ్యయనం మేరకు రాష్ట్రంలోని 300 గ్రామాల్లో అతి దారుణంగా భూగర్భ జలాలు తోడేస్తున్నట్లు తేలింది. ఇక్కడ రీఛార్జి అయిన పరిమాణానికి మించి, జలాలను తోడేశారు.450గ్రామాలు ప్రమాదకర పరిస్థితుల్లో ఉండగా,మరో 1,271 గ్రామాల్లో పరిధిని మించి నీళ్లు వాడుతున్నట్లు గుర్తించారు.
కఠినంగా వాల్టా అమలు
రీఛార్జికి మించి, నీటిని తోడేస్తున్న గ్రామాల్లో అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 93,శ్రీకాకుళం-76, శ్రీసత్యసాయి-51, బాపట్ల-18, ఎన్టీఆర్-16, అనంతపురం-13, అన్నమయ్య జిల్లాలో ఒకటి చొప్పున ఉన్నాయి. ఈ ఊళ్లలో వాల్టా చట్టాన్ని కఠినంగా అమలు చేయనున్నారు. అక్కడ కొత్తగా వ్యవసాయ, పారిశ్రామిక, వ్యాపార అవసరాలకు బోర్లు తవ్వుకునేందుకు అనుమ తులివ్వరు. తాగునీటికి మాత్రమే బోర్లు వేసే అవకాశముంటుంది. ఆయా గ్రామాల్లో కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు అనుమతి ఉండదు. ఆ దర ఖాస్తులను పరిశ్రమల శాఖకు పంపకుండానే తిరస్కరిస్తారు. విద్యుత్ సంస్థలు కూడా కొత్తగా కనెక్షన్లు ఇవ్వవు. ఈ గ్రామాల్లో పంచాయతీరాజ్, అటవీ, రక్షిత నీటి సరఫరా విభాగం భూగర్భ జలాల పెంపు, రక్షణకు అవసరమైన చర్యలు చేపడతాయి. ఉపరితల నీటి వనరుల అభివృద్ధిపై దృష్టి సారిస్తాయి.
మనం నివసించే భూగోళంలో 70శాతానికిపైగా నీరే.ఇందులో శుభ్రమైన నీరు చాలా స్వల్ప భాగం మాత్రమే.మొత్తం భూగోళంలోని నీటి లో దాదాపు 2.7శాతం మాత్రమే శుభ్రమైన నీరు కాగా, ఇందులోనూ75.2శాతం ధృవప్రాంతాలలో మంచు రూపంలో ఘనీభవించివుంటే,మరో 22.6 శాతంనీరు భూగర్భంలో వుంది.మిగతా నీరు సరస్సులు,నదులు,వాతావరణం,గాలిలోని తేమ, భూమిలోని చెమ్మ,చెట్టు చేమలలో వుంటుంది. ఇంతేకాదు,సరస్సులు,నదులు,భూగర్భ జలాలలో కూడా మానవ వినియోగానికి, ఇతర అవసరా లకు చక్కగా ఉపయోగ పడగలిగిన నీరు చాలా కొద్ది పరిమాణం మాత్రమే. ప్రపంచం మొత్తంలో లభ్యమయ్యే,పరిశుభ్రమైన నీటిలో,1శాతం కంటెకూడా తక్కువ పరిమాణంలో, (లేదా, భూమిపై లభించే మొత్తంనీటిలో దాదాపు 0.00శాతం మాత్రమే) నీరు మానవ విని యోగానికి నేరుగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజూ, మనకు కనీసం 30-50 లీటర్ల పరిశుభ్రమైన, సురక్షితమైన నీరు అవసరం.కాని, ఇప్పటికీ, 88.4కోట్ల మంది( 884 మిలియన్ల మంది)ప్రజలకు సురక్షితమైన నీరు అందుబాటులో లేదు.ప్రపంచవ్యాప్తంగా,ప్రతి ఏటా,1,500ఘనకిలోమీటర్ల పరిమాణంలో,వ్యర్ధ మైన నీరు వస్తుంటుంది.వ్యర్ధ పదార్ధాలను,వ్యర్ధ మైన నీటిని పునర్వినియోగ ప్రక్రియద్వారా, ఇంధనో త్పత్తికి,వ్యవసాయ అవసరాలకు వినియోగించ వచ్చు.కాని,సాధారణంగా, అలా జరగడం లేదు. అభివృద్ధిచెందుతున్న దేశాలలో, తగిన నిబంధనలు, వనరులు లేనికార ణంగా,80శాతం వ్యర్ధాలను పున ర్వినియోగ ప్రక్రియకు మళ్ళించకుండానే పారవేస్తు న్నారు.పెరుగుతున్న జనాభా,పారిశ్రామిక ప్రగతి కూడా,కొత్తరకాల కాలుష్యానికి మÖలమవుతు న్నాయి.ఇదే దామాషాలో,పరిశుభ్రమైన నీటి అవస రం పెరుగుతున్నది.ఈకారణంగా,ఇటు వర్త మానంలోను,అటు భవిష్యత్తులోను మానవ ఆరో గ్యానికి,పర్యావరణ స్వచ్ఛతకు ముప్పుపొంచి వుంది.వేసవి వస్తోందంటేనే భయమేస్తోంది.నీటి కొరత దడ పుట్టిస్తుంది.బిందెలతో బారులు తీరే జనాలు కనిపిస్తారు.మరి నీటి సమస్య అంత విస్తృతమైనది. నీరు లభించని ప్రాంతాలలో ఎదుర య్యే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. నేల తల్లి నెర్రె లిచ్చి నీటిచుక్కకోసం ఆబగా ఎదురుచూస్తుంటే ఇక మానవమాత్రులెంత! గొంతు తడుపుకునే చుక్క నీటికోసం మైళ్లకు మైళ్లు నడిచిపోవాల్సిన పరిస్థితి. పరిశుభ్రమైన నీళ్లు దొరక్క కుంటల్లో, గుంటల్లో అడుగుబొడుగు మురికి నీటినే తాగాల్సిన దుస్థితి. భూమండలంమీద లభించే నీటిలో ఉప్పు సుమద్రా ల వాటా 97శాతం. మిగిలిన దానిలో 69 శాతం హిమపాతం, మంచుగడ్డలే. భూమి మీద లభించే నీటిలో0.008శాతం మాత్రమే స్వచ్ఛమైన నీరు.క్రీశ 2025 నాటికి 48దేశాల్లో తీవ్రమైన నీటికొరత వస్తుందని చికాగోలోని జాన్ హాప్కిన్ యÖనివర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ హెచ్చరించింది.3.575 మిలియన్ల మంది ప్రతి సంవత్సరం నీటికి సంబం ధించిన వ్యాధులతో మరణిస్తున్నారు.నీటిమÖలంగా సంభవించిన 43శాతం మరణాలకు అతిసార వ్యాధే కారణం.పైన పేర్కొన్న మరణాలలో 84 శాతంమంది 14ఏళ్ల లోపువారే.98 శాతం మర ణాలు అభివృద్ధి చెందుతున్న దేశాలలోనే సంభవి స్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ ఆసుపత్రులలో చికిత్సపొందుతున్న రోగులలో సగం మంది నీటి సంబంధ వ్యాధులతో బాధపడుతున్నవారే. భూమి మీదున్న నీటిలో ఒక్క శాతానికంటే తక్కువ మొత్తం నీళ్లు మాత్రమే మానవాళి వెనువెంటనే వాడుకు నేలా వున్నాయి.అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని మురికి వాడల్లో నివసించే ఒకవ్యక్తి రోజు మొత్తం మీద ఉపయోగించే నీరు ఒక అమెరికన్ స్నానానికి వాడే నీటితో సమానం.లీటరు నీటికి మురికివాడల్లో నివ సించే పేదలు, అదే నగంలోని ధనికులకంటే 5-10రెట్లు అధికధర చెల్లిస్తున్నారు. ఆహారం లేకుండా మనిషి కొన్ని వారాలపాటు వుండగలడు. కానీ నీరు లేకుండా కొద్దిరోజులు మాత్రమే వుండగలడు. ప్రతి 15సెకన్లకు ఒక చిన్నారి నీటి సంబంధ వ్యాధితోచనిపోతోంది. లక్షలాది మంది మహిళలు,పిల్లలు రోజుమొత్తం మీద అనేక గంటల సమయాన్ని సుదూర ప్రాంతాల నుంచి నీళ్లు తేవడం కోసం వెచ్చిస్తారు. రోగాల నివారణలో దివ్య ఔషధం నీరు వాతావర ణంలోని హైడ్రోజన్, ఆక్సిజన్‌ల కలయిక వల్ల నీరు ఏర్పడు తుంది.ఈ రెండు వాయు పదా ర్ధాలు కలిస్తే ద్రవ రూపమైన నీరు ఏర్పడును. నిత్యజీవితంలో నీటిని అనేక రకాలుగా ఉపయో గిస్తాం.నీటిని ఉపయోగించి అనేక వ్యాధులను తగ్గిం చే అవకాశం ఉంది. నీరు లేని భూమిని ఒకసారి ఊహించుకోండి.పచ్చనిచెట్లు,పారే నదులు, జీవులు, మహా సముద్రాలు ఏమీ ఉండ వు.ఇవేవీ లేకుండా ఎండిపోయిన మట్టి గడ్డలా ఉంటుంది భూమి. అంతటి అమÖల్యమైన నీటి విలువను తెలుసు కోడానికి, దానిని వృథా చేయకుండా అవగాహన కల్పించడానికి ఈ రోజును కేటాయించారు. ఐక్య రాజ్య సమితి 1993 నుంచి ప్రతి ఏడాది మార్చి 22ను అంతర్జాతీయ జలదినోత్సవంగా గుర్తిం చాలని నిర్ణయించింది. మన భూమ్మీద నీటి గురిం చి కొన్ని నిజాలు తెలుసుకుంటే అదెంత విలువ్కెనదో అర్థం అవుతుంది. భూమి ఏర్పడినప్పుడు ఎంత నీరు ఉందో ఇప్పుడూ అంతే ఉంది.పెరగడం కానీ తరగడం కానీ కాలేదు. కానీ ఆనీటిని వాడుకునే వారి జనాభా మాత్రం విపరీతంగా పెరిగి పోయిం ది. అందుకే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది నీటి కోసం కటకటలాడుతున్నారు.భూమ్మీద ఉన్న నీరు ఎండకు ఆవిరవుతూ,మేఘాలుగా మారు తూ,వర్షంగా కురుస్తూ, భూమిలో ఇంకుతూ, సముద్రంలో కలుస్తూ వేర్వేరు రూపాల్లోకి మారుతూ ఉంటుంది.భూమ్మీద మÖడొంతులు నీరే ఉంది. కానీ అందులో 97శాతం ఉప్పునీరే. కేవలం 3శాతమే మంచి నీరు. ఇందులో కూడా 2శాతం మంచురూపంలోఉంది.మిగతా ఒక శాతం నీరులో 0.59శాతం భూగర్భంలో ఉంటే, మిగతాది నదు లు,సరస్సుల్లో ప్రవహిస్తోంది.ఉన్న మంచి నీటిని మనం పొదుపుగా వాడకపోగా కలుషితం కూడా చేస్తున్నాం. ప్రపంచంలో 500కు పైగా మంచినీటి నదులు కలుషితమై పోయాయి. ప్రపంచంలో భారీ యుద్ధాల్లో చని పోయిన వారి కన్నా, కలుషిత నీటి వల్ల మరణిం చినవారే ఎక్కువ. ఏడాదికి 40లక్షల మంది కలుషిత నీరు తాగి చనిపోతున్నారు. అమెరి కాలో ఒక వ్యక్తి తన అవసరాలకి రోజుకి 500 లీటర్ల నీటిని ఉపయోగిస్తుంటే,ఆఫ్రికాలోని గాంబి యా దేశంలో ఒకవ్యక్తి రోజుకి కేవలం 4.5 లీటర్ల నీటిని మాత్రమే వినియోగిస్తున్నాడు.గాంబియా లాంటి చాలాదేశాల్లో తాగేందుకు కూడా నీరు దొరకడం లేదు.మనమేం చేయాలి?ఎక్కడ్కెనా కొళా యిల్లోంచి నీరువృధాగా పోతున్నట్టు కనిపిస్తే వెం టనే కట్టేయండి.షవర్‌తో స్నానం చేయడం మానేసి, బకెట్ నీళ్లతో చేయండి.దీనివల్ల రోజులో150 లీటర్ల నీటిని కాపాడవచ్చు. పళ్లుతోముకున్నంత సేపూ సింక్‌లోని కొళాయిని వదిలి ఉంచకండి. ఇలా చేయడంవల్ల నెలకి 200 లీటర్ల నీరు వృథా అవుతుంది. టాయిలెట్ ఫ్లష్‌లో సుమారు 8లీటర్ల నీరు పడుతుంది.లీటర్ నీరుపట్టే రెండు బాటిళ్లు తీసుకుని దానిలో ఇసుక లేదా చిన్నచిన్నరాళ్లు నింపి, టాయ్‌లెట్ ఫ్లష్‌లో పెట్టేయండి. దీనివల్ల ఒకసారి వాడే నీటిలో రెండులీటర్ల నీళ్లు ఆదా అవుతాయి. అక్వేరి యంలోని నీళ్లు పారేయకుండా మొక్కలకి పోయండి.కొళాయిలకి లీకేజీలుఉంటే దానిని అరిక ట్టండి.దీనివల్ల నెలలో 300గ్యాలన్ల నీరుఆదా అవు తాయి.ఒక వార్తాపత్రికలో వాడే కాగితం తయారీకి 300లీటర్ల నీరుఖర్చవు తుంది.గాలితరువాత జీవ రాశికి నీరుచాలా ముఖ్యం.అందువల్ల నీటి వనరు లను పొదుపుగా ఉపయోగించుకోవాలి.ఈ నీరు భూఉపరితలములో నదులు,కాలువలు, చెరువులు, కుంటలు, సరస్సు లు మరియు భూగర్భజల రూపంలో ఉన్నది.
అడవుల నరికివేత వలన వర్షపాతం కూడా తగ్గిపోయింది. భారతదేశంలో సగటున ప్రతి మనిషి అన్ని అవసరాలకి కలిపి 680 క్యూబిక్ మీటర్ల నీటిని వాడుతున్నారు. 6గురు ఉండే ఇంటికి 250 లీ నీరు అవసరమవుతుంది మన దేశంలో నదుల్లో ప్రవహించే మÖడవ వంతు నీళ్ళు సము ద్రాల్లోకి నష్టపోతున్నాం.భూగర్భ, భూఉపరితల జలాలు రెండూ కలిపి దేశంలో వాడే మొత్తం నీటిలో 4శాతంవ్యవసాయానికి,12శాతం పరిశ్ర మలకి వాడుతున్నాం.ఇంతటి విలువైన నీటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత నేటి యువతరం పై ఉంది. ప్రస్తుతం ఉన్న వర్షా భావ పరిస్థితుల్లో ప్రతి నీటిచుక్కను ఒడిసి పట్టుకొని నిల్వ చేసుకో వాల్సిన అవసరం ఉంది.నానాటికి ఇంకిపోతున్న భూగర్భ జలాల సంరక్షణ పై దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో యువత నేటితరం కోసం భావితరాల కోసం కొన్ని బాధ్యతలను విధిగా నిర్వర్తించాల్సి వుంది.నీటి సం రక్షణలో మొదటగా చేయాల్సింది నీటి వృధా అరిక ట్టడం.దైనందిన జీవితంలో మనం చాలా నీటిని వృధా చేస్తూఉంటాం. ముందుగా ప్రతి వ్యక్తి నీటి వృధాను అరికట్టే ప్రయత్నం చేయాలి.ప్రతి నీటి చుక్కా అమÖ ల్యమైందే. మంచినీటిని పొదుపుగా వినియోగిం చాల్సిన అవసరం అందరిపై ఉంది. రోజువారీ అవసరాల్లో మనకు తెలియకుండానే నీటిని వృథా చేస్తుంటాం. నీటి వనరుల పర్యవేక్షణ లో యువత తీసుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది.– జీ ఎన్ వి సతీష్

తీవ్ర వాతావరణ పరిస్థితులు..వైపరీత్యాలు..


భూగోళంపై నానాటికీ పెరుగుతున్న ఉష్ణోగ్ర తలు.. ఆ కారణంగా చోటుచేసుకుంటున్న వాతావరణ మా ర్పుల గురించి శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు హెచ్చరి స్తూనే ఉన్నారు.అందుకు తగ్గట్టే వాతావర ణంలో సహజంగా ఏర్పడే పరిస్థితులు తీవ్రరూపం దాల్చి వైపరీత్యాలుగా మారుతున్నాయి. వేసవిలో గాలి దుమారాలు సహజం. కానీ వాటి తీవ్రత ఊహించని రీతిలో పెరిగి మహానగరాలను వణికిస్తున్నాయి. మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. గాలి దుమారాలు, ధూళి తుఫాన్లు, వర్షాల తీవ్రత నానాటికీ పెరగడం ఒకెత్తయితే.. ఇలాంటి విపత్తుల సంఖ్య కూడా పెరుగుతూ పోతోంది. గతేడాది వ్యవధిలోనే దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న కొన్ని ఘటన లను పరిశీలిస్తే..
. 2024 మే 13: దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంపై ప్రచండ వేగంతో కూడిన గాలులతో ధూళి తుఫాను విరుచుపడింది.ఈధాటికి ఘట్కోపర్ ప్రాం తంలో ఓభారీ ీVAర్డింగ్ నిట్టనిలువుగా పక్కనేఉన్న పెట్రోల్ బంక్‌పై కుప్పకూలింది.దాని కింద నలిగి 14మంది ప్రాణాలు కోల్పోగా,మరో 74మంది తీవ్ర గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.ఇదే రోజు గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్, గాంధీనగర్ సహా పలు ప్రాంతాల్లో ధూళి తుఫాను బీభత్సం సృష్టిం చింది. ఆ తర్వాత ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం విరుచుకుపడింది.రహదారులపై వాహ నాల రాకపోకలను స్తంభింపజేసింది.
. మే 10: దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని ధూళి తుఫాను అతలాకుతలం చేసింది.ఈ గాలి దుమా రంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో 23 మంది గాయాల పాలయ్యారు.
. ఏప్రిల్ 13: భారత వాతావరణ శాఖ హెచ్చ రించినట్టే రాజస్థాన్‌పై అనేక ధూళి తుఫాన్లు విరుచుకు పడ్డాయి. తీవ్రమైన వేగంతో కూడిన గాలుల ధాటికి కచ్చా గృహాలు సహా అనేక నిర్మాణాలు దెబ్బతిన్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి.
భూతాపమే కారణం..
అతి భారీ వర్షాలు,తీవ్రమైన వేడి గాలులుతో పాటు తరచుగా సంభవిస్తున్న అతి తీవ్ర ధూళితుఫాన్లు,గాలి దుమారాలకు భూతాపమే కారణమని పాఠశాల విద్యార్థిని అడిగినా చెబుతాడు.ఇండియన్ ఇన్‌స్టి ట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ అధ్యయనం ప్రకారం1950 నుంచి నమోదైన ఘటనలను పరిశీ లిస్తే వాతావరణ మార్పుల కారణంగా సంభవిస్తున్న వైపరీత్యాల సంఖ్య మÖడు రెట్లు పెరిగిందని తేలింది. ఈ సమాచారాన్ని ‘నేచర్ కమÖ్యనికేషన్స’ పేరుతో నిర్వహిస్తున్నసైన్స్ మ్యాగజీన్లో ప్రచురించింది. ఇలాం టి తీవ్రమైన వాతావరణ పరిస్థితులు,విపత్తుల కార ణంగా అనూహ్య స్థాయి వరదలు సంభవిస్తూ ప్రజల ఆస్తి, ప్రాణనష్టాలు కలుగజేస్తున్నాయని పేర్కొంది. భారత్‌లో ఎక్కువగా ఉత్తర, మధ్య భారత రాష్ట్రాల్లో ఇలాంటివి చోటుచేసుకుంటున్నాయి.గుజరాత్, మహా రాష్ట్ర,మధ్యప్రదేశ్,చత్తీస్‌గఢ్,తెలంగాణ, ఒడిశా, ఝా ర్ఖండ్, అస్సాం,మేఘాలతో పాటు పశ్చిమ కనుమలకు ఆనుకున్న గోవా,కర్ణాటక కోస్తా ప్రాంతం, ఉత్తర కర్ణాటకలో ఈతరహా విపత్తులకు ఎక్కువగా నమోద వుతున్నాయి. ఇంటర్నేషనల్ ఫోరం ఫర్ ఎన్విరాన్ మెంట్, సస్టెయినబులిటీ అండ్ టెక్నాలజీ సంస్థ వ్యవస్థాపక సీఈవో చంద్ర భూషణ్ ఇసుక తుఫాన్లు పెరగడానికి కారణం భూతాపమే అని చెబుతున్నారు.
భూతాపం ఎందుకు పెరుగుతోంది.?
భూతాపాన్ని పెరగడానికి కారణాల్లో ముఖ్యమైనది భూమ్మీద గ్రీన్ హౌజ్ వాయువుల స్థాయి పెరగడమే. కార్బన్ డై ఆక్సైజ్ సహా మరికొన్ని వాయువులను గ్రీన్ హౌజ్ వాయువులుగా పేర్కొంటారు. భూగోళంపై ఇవి ఒక మోతాదులో ఉండకపోతే ప్రాణికోటి బ్రతక డం కూడా కష్టమే. సూర్య కాంతి లేని సమయంలో (రాత్రి వేళల్లో) భూమి అత్యంత శీతల పరిస్థితిని ఎదుర్కోకుండా ఈగ్రీన్ హౌజ్ వాయువులు అడ్డుకుం టాయి. ఫలితంగా రాత్రివేళల్లో జీవరాశి మనుగడ సాగించగల్గుతోంది. అయితే వీటి మోతాదు వాతావర ణంలో పెరిగే కొద్ది అనర్థాలు, వైపరీత్యాలే. కర్బన ఉద్గారాలు పెరగడంలో శిలాజ ఇంధనాల (పెట్రోలి యం ఉత్పత్తులు)తో నడిచే వాహనాలు, నేల బొగ్గుతో నడిచే విద్యుత్ కేంద్రాలు, పరిశ్రమలు వెదజల్లే వాయు కాలుష్యం వంటివి ప్రధానమైనవి. శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించేందుకు భారత ప్రభుత్వం ప్రణాళిక, లక్ష్యం నిర్దేశించుకుంది.
విపత్తులను ముందే గుర్తించగలమా?
ప్రకృతికి ఎదురొడ్డి నిలబడడం భూమ్మీద మనిషికే కాదు ఏజీవరాశికి కూడా సాధ్యం కాదు. కానీ ప్రకృతి వైపరీత్యాన్ని ముందే పసిగట్టగల్గితే..దాని బారిన పడి ప్రాణాలు పోకుండా కాపాడుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ పరిశోధన సంస్థలు వాతావర ణంలో మార్పులను పసిగట్టి తగిన హెచ్చరికలు జారీ చేస్తుంటాయి.అయితే ప్రకృతిలో సంభవించే అన్ని రకాల వైపరీత్యాలను, వాటి తీవ్రతను ముందుగానే అంచనా వేయడం అన్ని వేళలా సాధ్యం కాదు. ఎందు కంటే వాతావరణం అన్నదే అత్యంత సంక్లిష్ట మైన అంశం.సుదీర్ఘ అనుభవం,లోతైన అవగాహన, అత్యా ధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ భారత వాతావరణ శాఖ ఈ మధ్య కాలంలో చాలా అంశాల్లో ముందుగానే హెచ్చరిస్తోంది. ముఖ్యంగా హీట్ వేవ్ (వేడి గాలులు), తుఫాన్లు, వాటి తీవ్రత విషయంలో వాతావరణ శాఖ అంచనాలు దాదాపుగా నిజమవుతు న్నాయి.ఆ హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని ప్రభు త్వాలు చర్యలు తీసుకున్నప్పుడు ప్రాణనష్టాన్ని నివారిం చగల్గుతున్నాం.హీట్ వేవ్, తుఫాన్లను అంచనా వేయ గల్గినంతగా..ప్రకృతిలో సంభవించే అన్ని వైపరీత్యా లను పసిగట్టడం,లేదా వాటి తీవ్రతను అంచనా వేయ డం సాధ్యం కాదు. ఈ వైపరీత్యాలను అడ్డుకోవాలంటే తక్షణం భూతాపం పెరగకుండా చర్యలు చేపట్టడమే ఏకైక మార్గమని ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిశో ధకులు,నిపుణులు చెబుతున్నారు.
2025లో ఇదేతీవ్ర వాతావరణ పరిస్థితులు
ఇదే కారణం2024 సంవత్సరలో కళ్లువిప్పే అనుభవంగా నిలిచింది,ముఖ్యంగా వాతావరణ మార్పుల ప్రభావంపై అవగాహన లేని వారికీ కూడా. ప్రపంచంలోని ఏదో ఒక ప్రాంతంలో తీవ్ర వాతా వరణ సంఘటనలు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తం గా ఈ విపత్తుల ప్రభావం పెద్ద ఎత్తున కనిపించిన ప్పటికీ,భారత్ వాతావరణ మార్పుల కారణంగా అత్య ధికంగా ప్రభావితమైన దేశాల్లో ఒకటిగా నిలిచింది. దీన్ని బహిరంగం చేసేందుకు, న్యూ ఢిల్లీ కేంద్రంగా పనిచేసే సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (్పుSజు) విడుదల చేసిన ‘స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్వి రాన్‌మెంట్ 2025’నివేదిక ప్రకారం,2024లో గణనీ యమైన 274రోజులలో 255 రోజులు (93శాతం) కనీసం ఒక్క ప్రాంతంలో అయినా తీవ్ర వాతావరణ మార్పులను చవిచూశాయి. ఇది 2023లో నమోదైన 235రోజుల కంటే,2022లో నమోదైన 241 రోజుల కంటే ఎక్కువ.
2025 కూడా భయంకరమే!
2024 ఇంత దారుణంగా ఉంటే, 2025లో పరిస్థితి మరింత దిగజారుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేశాయి.భారత వాతావరణ విభా గం (Iవీణ)ప్రకారం,ఈ ఏడాది వేసవి మామÖ లు కంటే తొందరగా ప్రారంభమవుతోంది. గత ఏడాదితో పోలిస్తే తెగిన వేడిమి, అధిక ఉష్ణోగ్రతలు, తరచూ కనిపించే ఎండగాలి (Hవat ఔaఙవs) పరిస్థితులు ఉండబోతున్నాయి.ఇప్పటికే 2025 ఫిబ్రవరి నెలను 1901నుండి ఇప్పటివరకు నమోదైన అత్యంత వేడి కలిగిన ఫిబ్రవరి నెలగా ప్రకటించారు.
విపత్తుల ముప్పు
కేరళలోని వయనాడ్‌లో 2024 జూలైలో జరిగిన భారీ భూసలనం కారణంగా 350మంది కిపైగా ప్రాణాలు కోల్పోయారు, ఇంకా చాలా మంది కనిపించకుండా పోయి మృతులుగా ప్రకటించారు. మరోవైపు,రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఒక్కరోజులో 55% సీజన్ వర్షపాతం పడింది. ఇదే సమయంలో, లేహ్ వంటి హిమప్రాంతాల్లో కూడా 2024 జూలైలో ఉష్ణతరంగాలు(Hవatwaఙవs) నమోదయ్యాయి.
భారతదేశంలో వాతావరణ మార్పుల ప్రభావం
2024లో తీవ్ర వాతావరణ సంఘటనల కారణంగా3,238 మంది మరణించారు, ఇది 2022 లో నమోదైన 2,755మరణాలతో పోలిస్తే 18% పెరుగుదల. ప్రపంచ వ్యాప్తంగా 2024 సంవత్సరం సగటు ఉష్ణోగ్రత1.5ళ్పుీపెరిగిన మొదటి సంవ త్సరం.యÖరోపియన్ యÖనియన్ యొక్క కోపర్నికస్ క్లైమేట్ ఛేంజ్ సర్వీస్ 2024లో గ్లోబల్ సర్ఫేస్ ఎయిర్ టెంపరేచర్ 11 నెలలపాటు 1.5ళ్పుీ కంటే ఎక్కువగా నమోదైనట్లు వెల్లడించింది.
భారతదేశానికి ఎందుకు ఎక్కువ ప్రమాదం?
పుణెలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మీటియరాలజీ కి చెందిన వాతావరణ శాస్త్రవేత్త డా. రాక్సీ మాథ్యూ కోల్ ప్రకారం, భారతదేశం సమీప హీలియో గ్రాఫికల్ దృష్ట్యా ఎక్కువ సూర్యరశ్మిని గ్రహిస్తుంది.అర్బన్ ప్రాంతాల్లో cశీఅcతీవtవ వల్ల రాత్రిపూట కూడా వేడిమితగ్గదు.ఈ మార్పుల కారణంగా ఉష్ణతరంగాల తీవ్రత3-6 రెట్లు పెరిగే అవకాశం ఉంది.గ్లోబల్ ఉష్ణోగ్రతలు పెరగడం ఎలా విపత్తులకు దారి తీస్తోంది.ఓషన్లు ఎక్కువ వేడిని గ్రహిస్తున్నాయి.దీనివల్ల అధిక ఆవిరి ఉత్పత్తి జరుగు తుంది.ఈ అధిక తేమ గాలికి అదనపు శక్తిని ఇస్తుంది, చెడిపోయే వాతావరణ పరిస్థితులను(స్టార్ములు, సైక్లో న్లు) ప్రేరేపిస్తుంది.ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు సంవత్సరానికి 3మిల్లీమీటర్ల చొప్పున పెరుగుతు న్నాయి.భారతీయ మహాసముద్రం ఉష్ణోగ్రత 1.2ళ్పుీపెరిగింది, ఇది సముద్ర మట్టాలను ఇంకా వేగంగా పెంచే ప్రమాదం ఉంది.
ఆరోగ్యంపై ప్రభావం
వేడిగాలులు,అధిక ఉష్ణోగ్రతలు వేడి సంబం ధిత వ్యాధులను పెంచుతున్నాయి (ఉదాహరణకు, హీట్ స్ట్రోక్, డెంగ్యూ, మలేరియా, చికున్‌గునియా). మానవ సమÖహాలు ఎక్కువగా ఉండే నగరాల్లో మరింత భయంకరమైన ప్రభావాలు కనిపించనున్నా యి.2040నాటికి 2బిలియన్ మంది ప్రజలు 0.5ళ్పుీ అధిక ఉష్ణోగ్రతలను ఎదుర్కొనవలసి ఉంటుంది.
ప్రపంచ రాజకీయాలు చర్యలు
డైరెక్టర్ సునితా నరైన్ ప్రకారం,కొన్ని దేశాలు క్లైమేట్ చేంజ్ ను మేనేజ్ చేయడం మానేశాయి. అమెరికా వంటి దేశాలు మళ్లీ ఇంధన తవ్వకాలను (ణతీఱశ్రీశ్రీ,దీaby,ణతీఱశ్రీశ్రీ!) ప్రోత్సహిస్తున్నాయి, ఇది ఇతర దేశాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.ప్రపంచం ఇప్పటికే1.5ళ్పుీ గ్లోబల్ కార్బన్ బడ్జెట్ ను అధిగమిం చింది, కనుక మరింత ఆలస్యం మానవజాతికి చాలా తీవ్రమైన ఫలితాలు తీసుకువస్తుంది.
ముగింపు
ఇప్పటికైనా సరైన చర్యలు తీసుకోకపోతే, భవిష్యత్తులో ఇంకా తీవ్రమైన వాతావరణ మార్పులు, విపత్తులు మనల్ని చుట్టుముడతాయి. సుదీర్ఘకాలిక పరిష్కారాలు ఎప్పుడు ప్రారంభిస్తామన్నదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. (ఇన్‌ఫుట్ : రెబ్బాప్రగడ రవి)

వైద్య సేవలు ఉత్తిదే..

ప్రజలకు  వైద్య సేవలను మెరుగుపరచడం ద్వారా వారి ఆరోగ్య పరిరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి నిలిపిందని ప్రభుత్వం చెబుతున్నా.. వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. రాష్ట్రంలోని ప్రధాన ఆసుపత్రుల్లో మౌలిక వసతులను సైతం ప్రభుత్వం సమకూర్చడం లేదు. అత్యవసర సమయాల్లో అందుబాటులో ఉండాల్సిన 108 అంబు లెన్సులు ..ప్రజల అవసరాలకు తగిన సంఖ్యలో ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించలేదు. దీని వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు 108లు సకాలంలో సంఘటన స్థలానికి చేరుకోలేకపోతున్నాయని పీఎజీ అధ్యయనంలో తేలింది.
జనాభా అవసరాలకు అనుగుణంగా రాష్ట్రం లో ప్రభుత్వం 108అంబులెన్సులు నడపడం లేదు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ప్రతి50వేల మంది జనాభాకు ఒకఅంబులెన్సు ఉండాల్సి ఉన్నా.. రాష్ట్రంలో మాత్రం 65 వేల249 జనాభాకు ఒకటి మాత్రమే నడుపుతున్నారు. మాతా, శిశు మర ణాల సంఖ్య తగ్గింపు చర్యల్లో భాగంగా 279తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్‌లను నడుపుతున్నారు.ఈపథకం కింద ఇంటి నుంచి ఆసుపత్రికి గర్బిణులను..ప్రసవం అనం తరం ఆసుపత్రి నుంచి తల్లీబిడ్డను ఇంటికి చేర్చాలి. ప్రభుత్వా సుపత్రుల్లో 36 లక్షల 73 వేల ప్రసవాలు జరిగితే.. కేవలం 10లక్షల 17వేల మంది తల్లులను మాత్రమే ఈ వాహనాల ద్వారాఇళ్లకు చేర్చారు.26లక్షల 56వేల మంది తల్లులు ఈ సౌకర్యాన్ని పొందలేకపోయారని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ప్రధాన కార్యాలయం పేర్కొంది.రాష్ట్రంలో అత్యవసర సర్వీసుగా పిలిచే 108 సేవలు జనాభాకు సరిగ్గా అందడం లేదని పీఎజీ తాజా నివేదికల్లో తేలింది. పట్టణ ప్రాంతాల్లో 20నిమిషాలకు ప్రమాద ఘటన స్థలానికి అంబులెన్సు చేరుకోవాల్సి ఉన్నా..3.23 నిమిషాల ఆలస్యంగా చేరుకుంటుందని లెక్కలు చెబుతున్నాయి. దీనికి జరి మానాలు విధిస్తున్నాసమయానికి సంఘటన స్థలానికి అంబులెన్సులు చేరుకోకుంటే ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడతాయని పీఎజీ ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసినప్పుడు నిర్దేశిం చిన సమయం కంటే ముందుగానే వివరాల సేకరణ జరుగుతుందని పేర్కొంది.
కొండలు, గిరిజన ప్రాంతాల్లో నివసించే ప్రతి 20వేల జనాభాకు ఒక పీహెచ్‌సీని ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం159ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పని చేస్తు న్నాయి. గిరిజన ప్రాంతాల్లో 84అంబులెన్సులు, 122 ఫీడర్ అంబులెన్సులు నడుస్తున్నాయి. కానీ ప్రతి పీహె చ్‌సీకి ఒకటి చొప్పున 108అంబులెన్సు ఉండాల్సిన అవసరం ఉందని పీఎజీ వెల్లడించింది.సీతంపేట ఏరియా ఆసుపత్రిలోని బేసిక్ లైవ్ సపోర్టు అంబు లెన్సును పరిశీలించినప్పుడు అందులో ఎయిర్ ఫ్లో మీటర్ లేదు. రోగికి సిలిండర్ల ద్వారా ఆక్సిజన్ ఇచ్చే సమయంలో ఎయిర్ ఫ్లో మీటర్ ఉపయోగిస్తారని పీఎజీ తెలిపింది.
రోగితో వెళ్తున్న అంబులెన్స్ బ్రేక్ డౌన్
108కి అదనంగా బోధనాసుపత్రులకు అనుసం ధానంగా ఉన్న అంబులెన్సులు చాలా చోట్ల మరమ్మ తులకు గురై ఉన్నట్లు పీఏజీ తెలిపింది. అనంతపురం బోధనాసుపత్రిలో 8 అంబులెన్సుల ఉండగా వీటిలో ఆరు పనిచేయడం లేదు. శ్రీకాకుళం బోధనాసుపత్రిలో ఆరింటికి గాను మÖడు, నెల్లూరులో ఎనిమిదికి.. ఒకటి చొప్పున అంబులెన్సులు పనిచేయడం లేదు. అనంతపురం, నెల్లూరు బోధనాసుపత్రుల్లోని అంబు లెన్సుల్లో చీ.A.దీ.H. ప్రమాణాల ప్రకారం పరికరాలు లేవని పీఏజీ గుర్తించింది. కాల్ రీసివింగ్ రిజిస్టర్‌ను నిర్వహించడంలేదని తనిఖీల్లో తేలింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి జిల్లా ఆసుపత్రిలో వైరస్ రీసెర్చి అండ్ డయాగ్నస్టిక్ లేబరేటరీ ఏర్పాటు కోసం వచ్చిన సామ గ్రి వృథాగా పడి ఉందని అధికారులు గుర్తించారు. ఈలేబరేటరీ ఇక్కడ వద్దకున్నప్పటికీ ఖరీదైన సామగ్రిని మాత్రం అక్కడే ఉంచారు.సీతంపేట,నాయుడుపేట, సోంపేట ఆసుపత్రులకు అదనంగా పీడియాట్రిక్ ఐసీ యÖల కోసం వచ్చిన వెంటిలేటర్లు 2022 జనవరి, ఫిబ్రవరి నుంచి వృథాగా అక్కడే ఉన్నాయి. వీటిని ఉపయోగించే సామర్థ్యం కలిగిన సాంకేతిక నిపుణులు లేకపోవడం, స్థలాభావమే ఇందుకు కారణం. నెల్లూరు జిల్లాలో వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నడిచే ఆసుపత్రుల అవసరాల కోసం వచ్చిన 623ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను వినియోగించడంలేదు.వీటిని అవస రమైన ఇతర ఆసుపత్రులకు పంపడం లేదని పీఎజీ తనిఖీల్లో తేలింది. ఏపీవైద్య సేవలు, మౌలిక సదుపా యాల అభివృద్ధి సంస్థకు కాన్సన్‌ట్రేటర్లను అవసర మైన ఆసుపత్రులకు పంపించాలని లేఖ రాసినట్లు నెల్లూరు జిల్లా అధికారులు పీఏజీకి తెలియచేశారు. అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఏపీ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థతో సంప్రదించకుండానే నేరుగా 2020లో జాతీయ ఆరోగ్య మిషన్ నిధుల నుంచి 51 లక్షల 80వేలు వెచ్చించి 10ఎక్స్‌రే యÖనిట్లు, ఈసీజీ మిషన్లను కొనుగోలు చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి జిల్లా ఆసుపత్రికి 2021సెప్టెంబరులో ఆక్సిజన్ జనరేటర్ చేరుకున్నట్లు గుర్తించారు. ఆసుపత్రి సందర్శనలో ఇంకా వాడుకలోకి రాలేదు. కొనుగోలు ఆర్డర్ రానందున జనరేటర్‌ను ఇంకా అమర్చలేదని ఆసుపత్రి అధికారులు పీఎజీకి సమాధానం ఇచ్చారు. పీఏజీ పరిశీలించిన ఆసుపత్రుల్లో 10 ఆక్సిజన్ ప్లాంట్లలో ఆరు పనిచేయడం లేదు. నెల్లూరు, శ్రీకా కుళం బోధనాసుపత్రులు,నాయుడుపేట,కావలి, కదిరి, సీతంపేట ఏరియా ఆసుపత్రుల్లో ఈ పరిస్థితి కనిపించిందని పీఏజీ వెల్లడించింది.
ఆపదలో అంబులెన్స్‌లు
108 అంబులెన్స్‌లు కొన్నింటికి కాలం పరిమితి ముగియటంతో క్షతగాత్రులను గమ్యస్థానాలకు సరైన సమయంలో చేర్చలేకపోతున్నాయి. దీంతో బాధితులు నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వాటికి అదనంగా 146నూతన వాహనాలు కొనేం దుకు ప్రభుత్వం టెండరు ఖరారు చేసింది.104 అంబులెన్సులకు సంబంధించి 35 కోట్ల రూపాయలు సదరు సంస్థ పెండింగ్ ఉండటంతో వాహనాల రాక ఆలస్యం అవుతోంది.108 అంబులెన్సు వాహనాల్లో కొన్నింటి కాల పరిమితి ముగిసింది. దీంతో చాలా సందర్భాల్లో క్షతగాత్రులను, ఇతర బాధితులను సకా లంలో ఆసుపత్రులకు చేర్చడంలో జాప్యం జరుగు తోంది. పాతవి పని చేయక పోవడంతో పాటు కొత్త అంబులెన్సుల కొనుగోలుకు నిర్ణయం తీసుకోవడంలో జరిగిన జాప్యం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం ఉన్న వాటికి అదనంగా 146 అంబులెన్సులను ‘ఫోర్స’ నుంచి కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం టెండరు ఖరారు చేసినా…వాహనాలు యుద్ధప్రాతిపదికన సరఫరా అయ్యేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేయలేదు. మరో నెల రోజుల్లో ఇవి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆ సంస్థ ఇప్పటికే 260 కొత్త 104 అంబులెన్సుల (ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్)ను నాలుగు నెలల కిందట ప్రభుత్వానికి అందజేసింది. ఈ మేరకు ప్రభుత్వం చెల్లించాల్సిన సుమారు రూ.35 కోట్ల కోసం ఆ సంస్థ ప్రతినిధులు వైద్యారోగ్య శాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. బకాయిల చెల్లింపు పూర్తయితే తప్ప..108 అంబులెన్సులు త్వరిత గతిన అందుబాటులోనికి వచ్చే అవకాశాలు కనిపిం చడం లేదు.
దేశంలో గిరిజన జనాభా గిరిజనేతర సమÖహాలతో పోలిస్తే గణనీయమైన ఆరోగ్య సమస్యలను ఎదు ర్కొంటుంది, అంటువ్యాధులు, పోషకాహార లోపం మాతా శిశు ఆరోగ్య సమస్యలు అధికంగా ఉన్నాయి. గిరిజన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కమÖ్యనిటీ హెల్త్ వర్కర్ల ద్వారా ప్రాథమిక సంరక్షణను బలోపేతం చేయడం,సాంప్రదాయ వైద్యులను నిమగ్నం చేయడం, మౌలిక సదుపాయాలను విస్తరించడం అవసరం.
గిరిజన ఆరోగ్యంపై మరింత సమాచారం:
సవాళ్లు:..
పోషకాహార లోపం: గిరిజన జనాభాలో పోషకాహార లోపం గణనీయంగా ఉంది, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు మరియు పిల్లలలో.
అంటువ్యాధులు: గిరిజన ప్రాంతాల్లో అంటువ్యాధులు, మలేరియా, టైఫాయిడ్, డయేరియా వంటి వ్యాధులు అధికంగా ఉన్నాయి.
ఆరోగ్య మౌలిక సదుపాయాల కొరత: గిరిజన ప్రాం తాల్లో ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలు తక్కువగా ఉండటం, రోడ్లు, రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల గిరిజన ప్రజలువైద్య సేవలను పొందలేకపో తున్నారు.
సాంప్రదాయ వైద్యం: గిరిజన ప్రజలు సాంప్రదాయ వైద్య పద్ధతులను ఎక్కువగా అనుసరిస్తారు, కానీ ఆధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం చాలా అవసరం.
సామాజిక-ఆర్థిక కారకాలు: పేదరికం, నిరక్షరాస్యత, ఉపాధి అవకాశాల కొరత, సామాజిక వివక్షత వంటి సామాజిక-ఆర్థికకారకాలు గిరిజన ప్రజల ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం చూపుతాయి.
పరిష్కారాలు:
ప్రధాన ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయాలి: కమÖ్యనిటీ హెల్త్ వర్కర్ల ద్వారా ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయాలి, గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులను ఏర్పాటు చేయాలి.పోషకాహార లోపాన్ని నివారించాలి: గిరిజన ప్రజలకు పోషకాహారం అందించడం, గర్భిణీ స్త్రీలు మరియు పిల్లలకు ప్రత్యేకంగా పోషకాహార కార్యక్రమాలు నిర్వహించాలి. – జీ ఎన్ వి సతీష్ 

కులం కొలత..జాతికి కొరత

దేశం వెనుకబాటుతనానికి,జాతిదాస్య శృం ఖలాల్లో మగ్గిపోవడానికి కుళ్లిపోయిన కుల వ్యవస్థే కారణమని బాబా సాహెబ్ అంబేడ్కర్ కుండ బద్దలు కొట్టారు.నాడు దేశరాజకీయాలను శాసిస్తున్న వ్యక్తు లను ఢీకొట్టారు.‘పని విభజన’ముసుగులో వేల సంవ త్సరాలుగా కొన్ని కులాలను అణగదొక్కుతున్న విష యాన్ని అంగీకరించి,దాన్ని సరిదిద్దేందుకు నడుం కట్టక తప్పని పరిస్థితిని నాటిరాజకీయ పక్షాలకు కల్పించారు.అణగారినవర్గా విముక్తికిదారులు వేశారు. ఈప్రయాణంలో భాగంగా ఆయన భారతీయ సమా జంలో కులం సృష్టిస్తున్న విధ్వంసాన్ని సమగ్రంగా విశ్లేషిస్తూ 1936లో ఒకశక్తిమంతమైన పుస్తకం రాశా రు. కుల నిర్మూలన(ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్) అనే ఈ పుస్తకం నిజానికి లాీVAర్‌లో జరిగిన ఓ సమావే శంలో చేయాల్సిన ప్రసంగం.కులం పట్ల అంబేడ్కర్ అభిప్రాయాలు ఇందులో బలంగా వ్యక్తమయ్యాయి. ప్రసంగంలో కులానికి సంబంధించిన అంశాల సంక్షిప్త పాఠం….
శ్రమ విభజన బూటకం
కుల వ్యవస్థను సమర్ధించే వాళ్లు చాతుర్వర్ణ విభజనను ‘శ్రమ విభజన’ పద్ధతితో పోలుస్తున్నారు. అన్ని నాగరిక వ్యవస్థల్లోనూ ‘శ్రమ విభజన’ ఉందని దబాయిస్తున్నారు.కులాలవారీ విభజన-శ్రమ విభజన ఒక్కటి కాదు.భారతదేశంలో కులాల పేరుతో శ్రామి కుల మధ్య అసహజమైన, దాటలేని అడ్డుగోడలు కట్టారు. ఇలా ఏనాగరక సమాజంలోనూ లేదు. సమా జంలో కొందర్నిపై అంచెలో, కొందర్ని కింది అంచెలో పెట్టి దాన్ని శాశ్వత వారసత్వంగా మార్చారు. ఇది స్వచ్చంద విభజనకాదు. సహజ స్వభావాలను, అభిరు చుల్ని బట్టి చేసింది కాదు. ఒక వ్యక్తిని తన వృత్తిని ఎంపిక చేసుకోగలిగే స్థాయికి అభివృద్ధి చేసినపుడే అతని సామాజిక,వ్యక్తిగత సామర్థ్యాలు వ్యక్తమవు తాయి.కుల వ్యవస్థలో దీనికి అవకాశమే లేదు. జీవిత కాలం చేయాల్సిన పనులను, వృత్తులను పుట్టుక ఆధా రంగా ముందే కేటాయిస్తారు. స్వభావ సిద్ధ సామ ర్థ్యాలను బట్టి పనులు అప్పగించరు. ఇది వినాశకర పద్ధతి. ఏరంగంలోనైనా తరచూ ఆధునికీకరణ జరు గుతూ ఉంటుంది. దాంతో కొన్ని వృత్తులు విలువను కోల్పోతాయి. కాలాన్ని బట్టి వృత్తులు మార్చుకొనే స్వేచ్చ లేకపోతే బతుకుదెరవు అసాధ్యమవుతుంది. పరిస్థితులను బట్టి, శక్తి సామర్థ్యాలను బట్టి వృత్తులలో సర్దుబాట్లు జరగకుండా కుల వ్యవస్థ అడ్డుకోవడమే దేశంలో నేటి నిరుద్యోగ సమస్యకు ప్రధాన కారణం. కులం ప్రమాదకర వ్యవస్థ కుల వ్యవస్థలో వ్యక్తి ఇష్టానిష్టాలతో సంబంధం లేదు. అభిరుచికి స్థానం లేదు. అంతా కర్మ సిద్ధాంతంపై ఆధారపడి ఉంది. ఇష్టం లేకున్నా బలవంతంగా కొన్ని పనులు చేయాల్సి వస్తోంది.చాలా వృత్తులను హిందూ సమాజం హీన మైనవిగా పరిగణిస్తోంది. దాంతో ఆయా వృత్తుల్లోని వారు తమ పనిపట్ల అత్యంత ఏహ్య భావాన్ని కలిగి వున్నారు. మనిషి హృదయం కానీ, బుర్ర కానీ పెట్ట కుండా పని చేయాల్సి వస్తోంది. సాంఘికంగా ఉన్నత స్థాయిలో ఉన్న కొందరు వక్ర బుద్ధులు స్వప్ర యోజనంకోసం కల్పించిన సంఘ వ్యవస్థే నేటి కుల వ్యవస్థ. దీనికి ఏ విధమైన శాస్త్రీయ ప్రమాణంకుల వ్యవస్థ దేశ ఆర్థిక సామర్థ్యాన్ని పెంచలేదు. జాతిని సమున్నతీకరించలేదు. నిజానికి అది హిందువులను విచ్ఛిన్నం చేసింది. నైతికంగా పతితుల్ని చేసింది. హిందూ అనేదే విదేశీ పదం. మహ్మదీయులు తాము వేరే అని చెప్పుకొనేందుకు ఇక్కడి వారికి హిందువులని పేరు పెట్టారు. మహ్మదీయ దండయాత్రకు ముందు ఏ సంస్కృత గ్రంథంలోనూ హిందూ పదం కనిపిం చదు.ఈ డే ప్రజలకు ఎప్పుడూ తాము ఒక జాతి ప్రజలమన్న భావన లేదు. ఇది కేవలం కొన్ని కులాల సముదాయం.ప్రతీ కులానికి తాము బతకడమే లక్ష్యం, పరమార్థం.ఎప్పుడైనా హిందూ-ముస్లిం కొట్లాట వచ్చినపుడు తప్ప మరోకులంతో సంబంధం ఉండదు. ప్రతీ కులం ఇతర కులాలకు దూరంగా ఉండటం ద్వారా తన ప్రత్యేకతను నిలబెట్టుకోవాలను కుం టుంది. కులంలోనే వివాహాలు చేసుకుంటారు. హిందువును కన్నంలో బతికే ఎలకతో పోల్చవచ్చు. జాతీయ చైతన్యం లేదు.ఉన్నది కుల చైతన్యం మా త్రమే.
సమాజాన్ని కులమే విడదీస్తోంది
వివిధ కులాల వారు ఒకే పండుగను చేసు కుంటున్నారు. అయితే, ఆసారూప్యం వారిని ఒక్కటిగా ఉంచలేక పోతోంది.ఏవ్యక్తి అయినా ఉమ్మడి కార్య కలాపాల్లో స్వేచ్ఛగా పాల్పంచుకోవాలి. ఇతరులను ఉద్రేకపరచే భావోద్వేగాలు అతన్ని ఉత్తేజపరచాలి. ఉమ్మడి కార్యకలాపాల్లో అతన్ని భాగస్వామిని చేయా లి.ఉమ్మడి సమాజం జయాపజయాలు తనవేనని భావించేట్లు ఉండాలి.ఇదే వ్యక్తులందర్నీ కలిపి సమా జంగా బంధించగల సూత్రం.హిందువుల్లో కుల వ్యవస్థ ఉమ్మడి కార్యకలాపాలను అడ్డుకుంటోంది. తద్వారా ఏకీకృత జీవనం గల సమాజంగా ఏర్ప డటాన్ని, ఒకే సమాజానికి చెందిన వారమన్న భావన కలగడాన్ని నిరోధిస్తుంది.చాతుర్వర్ణ వ్యవస్థ వల్లే తరత రాలుగా హిందూ సమాజం ఒడిదుడుకులను తట్టు కొని మనుగడ సాగిస్తూ వచ్చిందని కొందరు సంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. తరాల తరబడి లొంగిపోయి, రాజీపడి బతకడం కూడా బతకడమేనా? ఆజీవనంలో నాణ్యత ఏదీ ? ఉప కులాలను ఎదగనివ్వరు.ఉప కులాల మధ్యా పరస్పర సంబంధాలు విషతుల్యం అయ్యాయి.మహారాష్ట్ర బ్రాహ్మణ కులంలో అనేక ఉప కులాలున్నాయి. బ్రాహ్మణులు,ఇతర కులా ల మధ్య విభేదాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో, బ్రాహ్మ ణ ఉప శాఖల మధ్యా అంతే ఘోరంగా ఉన్నాయి. ఎక్కడైతే ఒక వర్గానికి స్వప్రయోజనాలు ఉంటాయో అక్కడ వాటిని కాపాడుకోవడానికి ఆవర్గం వాళ్లు ఇతర వర్గాలక దూరంగా ఉంటారు. ఈసంఘ వ్యతి రేక తత్వం,ఈ స్వప్రయోజన రక్షణ తత్వం దేశాల మధ్య ఎంత ప్రస్ఫుటంగా కనబడుతుందో కులాల మధ్యా అదే స్థాయిలో కనిపిస్తుంది. ప్రతీ కులం తమ స్వప్రయోజనాలను రక్షించుకోవడం కోసం తక్కిన కులాలతో నిరంతర పోరాటం చేస్తూ విడివిడి గుంపు లుగానే ఉంటున్నాయి.
కులం కోసం బాధ్యత గాలికి
దేశంలో కోట్లమంది ఆదిమవాసులు ఉన్నా రు. వేల ఏళ్లనాటి నాగరికత అని గొప్పలు చెప్పుకొనే ఈ దేశంలో ఆదిమ వాసులు ఇంకా దుర్భర అనాగరక పరిస్థితుల్లో జీవిస్తున్నారు.వారిలో కొందరిని నేర జాతులుగా పరిగణిస్తున్నారు. దీనికి హిందువులు సిగ్గు పడటం లేదు. కనీసం వారిని నాగరికులుగా మార్చడానికి, గౌరవ ప్రదమైన వృత్తుల్లోకి తీసుకు రావడానికి ప్రయత్నమే చేయలేదు. జన్మ సిద్ధమైన బుద్ధి మాంద్యమే కారణమని చెప్పడానికి ప్రయత్ని స్తారు. ఆదిమవాసుల కోసం క్రైస్తవ ధార్మిక సంస్థలు చేస్తున్నది హిందువు చేయగలిగే వాడా? వాళ్లను నాగ రికుల్ని చేయడమంటే ముందు నీవాళ్లుగా భావిం చాలి. వాళ్ల మధ్య జీవించాలి.వాళ్లలో సహానుభూతిని పెంపొందించాలి. ప్రేమించాలి. హిందువుడికి ఇది ఎలా సాధ్యం అవుతుంది?హిందువుకు కులాన్ని కాపాడుకోవడమే ముఖ్యం.
మారితే ఏ కులంలో చేరాలి?
హైందవం కూడా ఒకప్పుడు క్రైస్తవం లాగే మత ప్రచారానికి పాల్పడింది. లేదంటే ఇంతటి విశాల భూభాగంలో హిందూమతం విస్తరించి ఉండేది కాదు. కుల వ్యవస్థ ఏర్పడటంతోనే మత ప్రచారానికి తెర పడింది. కుల వ్యవస్థ ఉన్నచోట మతంలోకి రావడం కుదరదు.మతం మార్చుకున్న వారికి సంఘంలో లభించే స్థానం కూడా ముఖ్యమైన విషయమే. ఈనాడెవరైనా హిందూ మతం స్వీకరించదలచుకుంటే ఏ కులంలో చేర్చుకోవాలి?ఏదో ఒక క్లబ్బులో చేరినట్లు ఏదో ఒక కులంలో చేరడానికి లేదు. కులంలో పుట్టిన వారికే కుల సభ్యత్వం. కొత్తవారిని కులంలో చేర్పించే అధికారం ఈ భూమ్మీద ఎవరికీ లేదు. ఇతర మతాల వారిని కలుపుకొని తనను విస్తరించుకొనే అవకాశం హిందువులకు లేకపోవడానికి కారణం కుల వ్యవస్థే. దాన్ని రూపు మాపనంత వరకు ఇతర మతాల్లో వెళ్లిన వాళ్లను తిరిగి తీసుకొచ్చే శుద్ధి కార్యక్రమమÖ అర్థరహి తం,నిరర్థకం.హిందువుల్లోని కులాలకు,ఇతర మతా ల్లోని కులాలకు తేడా ఉంది.ముస్లిములు, సిక్కుల్లో అన్ని కులాలను కలిపి ఉంచేఉమ్మడి అంశాలున్నాయి. హిందువు విషయం అలా కాదు.కులం కూడా చెప్పా ల్సిందే. కులానికి అదనపు పవిత్రత లేదు.
సంస్కర్తలను పుట్టనివ్వరు
మతాచారాలను, కులం కట్టుబాట్లను వ్యతిరేకించే వారిని సాంఘిక జీవనం నుంచి వెలివేస్తు న్నారు.ఇదిచావుతో సమానం.దీనికి భయపడే సంస్కర ణాభిలాషులు కూడా కులం కట్టుబాట్లతో రాజీ పడి పోతున్నారు.కులంహిందువుల ప్రజాసేవాసక్తిని చంపేసింది.గొప్పతనం కలిగినవాడు తనకులం వాడై తేనే హిందువు అతని నాయకత్వాన్ని అంగీకరిస్తాడు.
తిరగబడతాడనే భయం
చాతుర్వర్ణ విధానం అత్యంత ప్రమాదకరమైన వ్యవస్థ. బ్రాహ్మణులు జ్ఞానాన్ని అభివృద్ధి చేస్తారు. క్షత్రియులు ఆయుధాలు పట్టుకొని రాజ్య రక్షణ భారం వహిస్తారు.వైశ్యులు వ్యాపారం చూసుకుంటారు. శూద్రులు ఈ మÖడు వర్గాలకు సేవకులుగా పని చేస్తారు.వినడానికి ఇది ‘పనిసేవకులుగా పని చేస్తారు. వినడానికి ఇది పనివిభజన’ లాగే ఉంటుంది. శూద్రు లు విద్య,రక్షణ,సంపాదన కోసం కష్టపడా ల్సిన అవసరం లేదని, వారి యోగ క్షేమాల్ని మొదటి మÖడు వర్గాలు చూసుకుంటాయని మనువాదులు తీయగా చెబుతుంటారు. వారి అసలు ఉద్దేశం శూద్రుణ్ణి తొక్కి పట్టి ఉంచడమే. మనుధర్మ శాసనాలను మించిన దుష్ట శాసనాలు ప్రపంచంలో మరెక్కడా లేవు. ప్రపంచ మంతటా సాంఘిక విప్లవాలు వచ్చినా భారతదేశంలో రాలేదంటే కారణం ఇదే. దిగువ కులాలు చదువు కోలేక పోవడం వల్లే విముక్తిని గురించి ఆలోచించే శక్తిని కోల్పోయాయి. ఐరోపాలోనూ పీడిత ప్రజలు ఎన్నడూ ఇంత నిస్సహాయంగా లేరు. వారిచేతుల్లో ఎప్పుడూ ఆయుధం ఉంది. భారతదేశంలో కేవలం మౌర్యుల కాలంలోనే కింది కులాలు రాజకీయ అధి కారాన్ని అనుభవించాయి. అప్పుడే చాతుర్వర్ణ వ్యవస్థ ధ్వంసమై పోయింది. శూద్రులు రాజులయ్యారు. ఎప్పుడో శివాజీకి నాటిబ్రాహ్మణులు చేసిన అగౌర వాన్నికడుపులో పెట్టుకొని నేటికీబ్రాహ్మణేతరులు వారిని క్షమించలేకున్నారు.
కాయస్థులు తమపూర్వీకులపై అప్పటి బ్రాహ్మ ణులు వేసిన అభాండాలను దృష్టిలో పెట్టుకొని ఇప్ప టికీ వారిని క్షమించలేకున్నారు. కుల వ్యవస్థ వల్లే తరాలు మారినా గత కలహాలు అలా రగులుతు న్నాయి. జాతి ఏకీకరణకు అడ్డంకిగా నిలుస్తున్నాయి. కులం అక్కర లేని ఆదర్శప్రాయ సమాజం స్వాతం త్య్రం,సమానత్వం,సౌభ్రాతృత్వం పునాదుల మీద ఆధా రపడి నిలుస్తుంది. సమాజంలో ఒక మÖల మార్పు జరిగితే అది అన్ని మÖలల ప్రతిఫలిస్తుంది. మానవు లందరిలో సాంఘిక సోదరత్వం ఉంటుంది. కుల నిర్మూలనకు సరైనమార్గం వర్ణాంతర వివాహాలే. రక్త సమ్మిశ్రణ ఒక్కటే మానవుల్లో అన్యోన్య అనుబంధ భావాన్ని, బాంధవ్యాలను కలిగిస్తుంది. అట్టి బంధు భావ ప్రభావం లేనిదే కులం కల్పించిన విభేదాలను, వివక్షను రూపుమాపలేం.వివిధ కులాల మధ్య స్నేహానుబంధాలను కలిగించాలంటే ఆయా కులాల వ్యక్తుల నడుమ రక్త సంబంధాలను కల్పించక తప్పదు. – జి.ఎ.సునీల్ కుమార్

భూకంపాలు ఎందుకు వస్తాయి?

మార్చి 28న మయన్మార్‌లో..
ఈ తరహాలోనే మార్చి 28న మయన్మార్‌లో రిక్టర్ స్కేల్‌పై 7.7తీవ్రతతో వచ్చిన భూకంపం పెను విధ్వంసాన్ని సృష్టించింది. ఇప్పటి వరకూ కనీసం 1700 మంది ప్రాణాలు కోల్పోగా..దాదాపు 4 వేల మంది గాయపడ్డారు. అయితే, శిథిలాల కింద ఎంత మంది చిక్కుకున్నారో లెక్కేలేదు. భూకంపం సంభ వించి నాలుగు రోజుల గడిచిపోవడంతో శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలు కుళ్లిపోయి.. దుర్గంధం వెదజల్లుతోంది.దీంతో భారీ యంత్రాలు సాయం లేకుండానే స్థానికులు..ఉత్త చేతులతోనే శిథిలాలను తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.మయన్మార్‌లోని రెండో అతిపెద్ద నగరం మండేలాలో భూకంప విలయం తీవ్రంగా ఉంది. అక్కడ ప్రజలు వీధుల్లోనే నిద్రలేని రాత్రులు గడుపు తున్నారు.వరుస భూకంపాలు వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఆతర్వాత కూడా 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో సహా యక చర్యలు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. అయితే, మయన్మార్ భూకంప విధ్వంసాన్ని ఉపగ్రహ ఫోటోలు కళ్లకుకడుతున్నాయి.రోడ్లు, విమానాశ్రయాలు, వంతె నలు, భవనాలు సహా మౌలిక సదుపాయాలు ఏంతలా ధ్వంసమయ్యాయే చూపుతున్నాయి.
మరోవైపు,భూకంపంవల్ల థాయ్‌లాండ్ రాజ ధాని బ్యాకాంక్‌లో నిర్మాణ భవనం కుప్పకూలిన ఘటనలో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు రెస్క్యూ కొనసాగుతోంది.కానీ, వారు ప్రాణాలతో ఉండే అవకాశాలు చాలా తక్కువని బ్యాంకాక్ పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు శిథిలాల నుంచి బయటకు తీసిన వారిలో ఎవరూ ప్రాణాలతో లేరని చెప్పారు. పూర్తిగా తొలగించేందుకు కనీసం రెండు నెలల పడు తుందని వెల్లడించారు.ఇక,థాయ్‌లాండ్‌లో ఇప్పటి వరకు17మంది చనిపోగా..మరో 32మంది గాయాల పాలయ్యారు.కానీ, నిర్మాణంలో ఉన్న భవనం కూలిన ఘటనకు సంబంధించి అక్కడ పనిచేస్తున్న 83 మంది ఆచూకీ గల్లంతయ్యింది.
మారుతున్న భూకంప జోన్లు
ఇలా ఉండగా,భారత దేశంలోని భూకంప జోన్లు మారనున్నాయి. ప్రస్తుతం ఐదు జోన్లుండగా.. వాటి సంఖ్య ఆరుకు పెరగనుంది.1962లో తొలిసారి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఐదు జోన్లను ఏర్పాటు చేయగా..భారత ప్రమాణాల బ్యూరో (బీఐఎస్) 1970,1984లో కొన్ని మార్పులు చేసి, జోన్ల పరిధిలోని ప్రాంతాలను మార్చింది. 2002లో ‘ఐఎస్ 1893:2002’పేరుతో వాటిని అభివృద్ధి చేసింది.అప్పటి నుంచి భూమి లోపల ఫలకాల కదలిక లో వేగం(యాక్సలరేషన్) పెరుగుతూ.. ఎన్నో మార్పు లు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో..భూభౌతిక శాస్త్రవేత్తలు,జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిపుణులు, భూకంపాల పరిశోధకులు, బీఐఎస్ అధికా రులతో కొత్త జోన్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది.
అంకెలా? ఆంగ్ల వర్ణమాలా?
ప్రస్తుతం ఉన్న జోన్లు రోమన్ నంబర్లలో ఉన్నాయి. జోన్-5లో అత్యంత ప్రమాదకరమైన భూకంపాలు సంభవించే ప్రాంతాలుండగా..జోన్-2లో అత్యల్ప ప్రభావం ఉంటుంది.కొత్త జోన్లకు ఇదేవిధంగా రోమన్ నంబర్లను వాడాలా?పాత-కొత్త మధ్య అయోమ యాన్ని తొలగించేందుకు ఆంగ్లవర్ణమాలలోని ఏ, బీ,సీ,డీ,ఈ,ఎఫ్‌లను వాడాలా?అనేదానిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని ఈ కమిటీలోని ఓ అధి కారి చెప్పారు. ఈ అంశం మినహా.. ఏ జోన్ పరిధి లోకి ఏయే ప్రాంతాలు వస్తాయి? అనే దానిపై బీఐఎస్ రూపొందించిన‘ఐఎస్ 1893:2025’ని కమిటీ ఖరారు చేసిందని వివరించారు. ప్రమాదకర ఆరో జోన్‌లో ఎగువ హిమాలయాలు, శివాలిక్ శ్రేణులు ఉన్నాయని తాజా మ్యాప్ చెబుతోంది. వీటితోపాటు.. గుజరాత్ రాష్ట్రంలోని కచ్ ప్రాంతం, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు,కొంకణ్ ఈజోన్‌లో ఉన్నాయి. హిమాలయాల్లోని జమÖ్మకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, నేపాల్‌తో సరిహద్దులను పంచుకుంటున్న ఉత్తరప్రదేశ్, బిహార్‌లోని పలు ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ దీవులు ఇదే జోన్‌లో ఉన్నాయి. భూగర్భం లో ఫలకాల కదలికకు సంబంధించిన యాక్సలరేషన్ ఈప్రాంతాల్లో 5జీ(గ్రావిటీ)గా ఉంటుంది.ఈ ప్రాం తాల్లో భూగర్భంలో ఫాల్ట్స్ కారణంగా భూకంప తీవ్రత ఎక్కువగా ఉంటుందని,అంతర్-ఫలకల ప్రాంతం కావడంతో నష్టం తీవ్రంగా ఉంటుందని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ ప్రదీపకుమార్ వివరించారు.
ఐదో జోన్ కొంత భాగమే
పాత జోన్-5లో భూగర్భ ఫలకాల యాక్సలరేషన్ 0.36జీగాఉండేది.కొత్త జోన్-5లో ఈవేగం 0. 333జీగా ఉన్నట్లు సమాచారం.దిగువ హిమాల య ప్రాంతాల్లోని గంగామైదానాలు కొంత వరకు ఐదో జోన్‌లోకి వస్తాయి. ఇక్కడ కూడా రివర్స్, స్ట్రైట్‌స్లిప్ ఫాల్ట్స్ ఉన్నా..వాటి యాక్సలరేషన్ తక్కువగా ఉంటుంది. రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్, గుజరాత్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు ఈ జోన్‌లో ఉంటాయి. 0.233 గ్రావిటీ ఉండే ప్రాంతాలనుజోన్-4లో చేర్చారు. ఇక్కడ భూకంపాలు వచ్చినా.. తీవ్రత తక్కువగా ఉంటుంది. ఈ జాబితాలో న్యూఢిల్లీ, ఎన్‌సీఆర్-ఢిల్లీ, పట్నా, కోల్‌కతా నగరాలున్నాయి.
జోన్-3లో కీలక నగరాలు
జోన్-3(0.125జీ)లో లఖ్‌నవూ, పట్నా లోని కొన్ని ప్రాంతాలు,రాంచీ,భువనేశ్వర్,డామన్,ముంబై, ఏ| Óలోని అమరావతి,చెన్నై,పుదుచ్చేరి ఉన్నాయి. ఈ ప్రాం తాల్లో భూకంపాల తీవ్రత తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర ప్రాంతాలు,తెలంగాణలోని భద్రాచలం,తమిళ నాడు లోని థేని, కేరళలోని శబరిమల, పెరియార్ అడవులు కూడా ఈ జోన్‌లోనే ఉన్నాయి.
జోన్-2లో తెలంగాణ
తెలంగాణ రాష్ట్రంలో ఒక్క భద్రాచలం మినహా.. మిగతా ప్రాంతాలన్నీ గత జోన్లలో మాదిరిగానే జోన్-2లో ఉన్నాయి. ఇక్కడ భూగర్భంలో ఫలకం కదలిక 0.075 గ్రావిటీతో ఉంటుంది. ఈకారణంగా పెద్దగా ఆస్తి,ప్రాణనష్టం ఉండవని శాస్త్రవేత్తలు వివరిస్తు న్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, ఉత్తరాంధ్ర, కర్ణాటకలోని 99%ప్రాంతాలు, కేరళలోని గురు వాయÖర్ ఈ జోన్‌లోనే ఉన్నాయి.
మహా విపత్తు
భూకంపంమనిషి జ్ఞానాన్ని పరిహసించే ప్రకృతి విపత్తు.‘మానవ అహంకారం ప్రపంచాన్ని త్యాగం చేస్తుందా? ఆడంబరమైన గృహాల పట్ల దాని కోరికను తీర్చుకోడానికి? బట్టతలలా వున్న ఆ గోళాన్ని సుదూర అంతరిక్షం చూస్తుందా? ఇప్పుడు ఆ భూమాత చెప్పేది నాకు వినబడుతోంది/నన్ను ఒకప్పుడు భూమి అని పిలిచేవారు/కానీ ఇప్పుడు,ఆనందం లేకుండా ఏడుస్తు న్నాను/ చెట్లు లేని గోళం ఇకపై భూమి కాదు’ అం టారు కవి గర్విట్.మయన్మార్,థారులాండ్‌ను రెండు భారీ భూకంపాలు వణికించాయి.మరోసారి భూప్ర కంపనలు రావడంతో ప్రజలు భీతిల్లారు. రిక్టార్ స్కేల్ మీద ఈ భూకంపాల తీవ్రత 7.7,6.8గా నమో దైందని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. ఈ పెను విపత్తులో మృతుల సంఖ్య పదివేలు దాటే అవకాశం వుందని అమెరికా ఏజెన్సీ హెచ్చరించింది. పెద్దఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం సంభవించడంతోపాటు, వందల సంఖ్యలో భారీ భవనాలు, ప్రార్థనాలయాలు, సాధువుల మఠాలు పేకమేడల్లా కుప్పకూలాయి.
‘భూకంపాలు ప్రజలను చంపవు భవనాలు చంపుతాయి’ అంటాడు జపాన్‌కు చెందిన ప్రసిద్ధ ఆర్కిటెక్ట్ షిగేరు బాన్. ప్రకృతిని మనం గౌరవించ నంత కాలం ఇలాంటి వైపరీత్యాలు తప్పవు. భూ వైజ్ఞానిక పరిశోధనల ప్రకారం..టిబెట్ పీఠభూమి ప్రాంతంలో సంక్లిష్టమైన టెక్టానిక్ పలకలపై వున్నందున మయన్మార్‌కు భూకంప ముప్పు ఎక్కువ. ఇక్కడి టెక్టానిక్ పలకలు ఏటా 0.7అంగుళాల చొప్పు న పరస్పర వ్యతిరేక దిశలో కదులుతున్నాయి. ఫలి తంగా పుట్టుకొచ్చే ఒత్తిడి భూకంపాలుగా మారుతుం టుంది. ఇక్కడ దశాబ్దానికొక్క భారీ భూకంపం నమోదవుతోంది.
‘భూమాతకు గర్భశోక భారం భూకంపం’ అంటారో కవి. ప్రకృతి వైపరీత్యాల నుంచి బయట పడటానికి సంసిద్ధత కీలకం. అటువంటి శోకభారాన్ని అనుభవిస్తోన్న మయన్మార్ ప్రజలకు ‘మనమందరం ఒక తాటిపై నిలబడి, ఈ విలయాన్నుంచి బయటపడి భవిష్యత్తును పునర్నిర్మించుకోవాల్సి వుందని’ ఆ దేశ ప్రధాని మన్ విన్ పిలుపునిచ్చారు. సాయపడే ప్రతి చేయి, ప్రతి చిన్న కార్యాచరణ కూడా ఈ సమయంలో ఎంతో విలువైనవి. ప్రపంచమంతా తమ ఔదార్యం చూపాల్సిన సమయమిది. మయన్మార్‌కు గతంలో భూకంపాలను చవిచూసిన చరిత్ర వున్నప్పటికీ, తగిన సంసిద్ధత లేకపోవడం,పేలవమైన నిర్మాణాలు,ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, తగినంత అవగాహన లేకపో వడం కూడా ఇంత భారీ నష్టానికి కారణమైంది. స్థానిక ప్రభుత్వం అంతర్జాతీయ సమాజం సహకా రంతో మయన్మార్‌ను పునర్మిర్మించాలి. ప్రకృతి మళ్లీ దాడి చేసినప్పుడు ప్రజలను రక్షించగల సామర్థ్యం, సంసిద్ధతను మయన్మార్ ఏర్పరచుకోవాలి.– గునపర్తి సైమన్

గిరిజన సంప్రదాయాల్లో పురాణగాథలు

ప్రకృతి ఆరాధకులు అచ్చమైన హిందూజాతి పద్ధతులు ఆచరించే మన అడవి బిడ్డల జీవన శైలితో పాటు పురాణ గాధలతో ముడిపడి ఉన్న వారి సాంప్రదాయాల గురించి చక్కని చారిత్రక స్థానిక, ఇతిహాస కథనాలను, కలగలిపి విలువైన వ్యాసాలు పొదిగి అందించిన మంచి పుస్తకం “తెలుగు రాష్ట్రాల్లో గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు పురాగాధలు”- సమీక్షకుడు: డా: అమ్మిన శ్రీనివాసరాజు
అనేక దశాబ్దాలుగా గిరిజనుల జీవనశైలి పై పరిశోధనాత్మక అధ్యయనం చేయడంతో పాటు వారి సమస్యల గురించి పలు పోరాటాలు చేసి అనేక రచనలు చేసిన ఉద్యమ రచయిత డా: పిరాట్ల శివరామకృష్ణ గారి కలం నుంచి వెలువడిన ఈ పుస్తకంలో పలు పరిశోధక అంశాలు వెలువడ్డాయి.
ఈ ప్రామాణిక పరిశోధక పుస్తకమును పట్టికలు, కథలు, అని రెండు విభాగాలుగా విభజించి రచయిత తన భావవ్యక్తీకరణ గావించారు.మొదటి విభాగం పట్టికలో వ్యవస్థలు, వర్ణ వివక్ష, దృక్పథాలతో పాటు గిరిజన ప్రాంతాల్లోని పర్యాటక, చారి త్రక, స్థలాలు నెలలు, పండు గలు, ప్రణాళికలు, పంచాయ తీలు తోపాటు ప్రత్యేకంగా చెంచుల మనో ప్రపంచం, గ్రామపటం, ఉత్పత్తి, సంబంధా లు న్యాయాలు తదితర అంశా లు చిత్రపటాల సాయంగా సవివరంగా తెలిపారు రచయిత శివరా మకృష్ణ.గిరిజన ప్రాంత పర్యాటక చారిత్రక పట్టికలో, శ్రీకాకుళం విజయనగరం, విశాఖపట్నం,తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ప్రకాశం, కర్నూలు, మహబూబ్ నగర్, జిల్లాలలోని మండలాల వారీగా విస్తరించి ఉన్న చారిత్రక పర్యా టక ప్రాంతాల వివరాలు వివరించారు, దీని ద్వారా పర్యాటకులకే గాక పరిశోధకు లకు కూడా ఎంతో సౌలభ్యంగా ఉంది. విశాఖ జిల్లా పడ్డది మండలంలో గల చారిత్రక ప్రాంతం మత్స్య రాజుల రాజ ధాని, గూడెం కొత్త వీధిలో గల శ్రీకృష్ణ పాండవ దేవాల యం, చింతపల్లి మండలంలోని లంబసింగి పాండవుల విగ్ర హాలు, కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు దగ్గర భీముని కొలను, ఆళ్లగడ్డ వద్ద అీVAబిలం లోని చెంచులక్ష్మి నరసింహస్వామి ఆలయ వివరాలు, ఇలా గిరిజన ప్రాంతాల్లో విస్తరించి ఉన్న చారిత్రక, పురాణ ప్రాంతాల, గురించి పట్టికలో పేర్కొనడం వల్ల ఎంతో దర్శనీయ సమాచారం అందుతుంది.
అలాగే సంబంధిత నెలల్లో గిరిజనులు జరుపుకునే ప్రధాన పండుగలు వివరాలు కూడా పొందు పరిచారు.పట్టికలతో పాటు పటాల ద్వారా కూడా సమాచారాన్ని “కొండ అద్దమందు” అన్న చందం గా చక్కగా అందించారు రచయిత, వీటిల్లో దండకారణ్యం, చెంచుల మనో ప్రపంచం, చెంచు గ్రామ పటం, విశాఖ గిరిజనుల మనో ప్రపంచం, తదితర పటాలు రేఖా చిత్రాల సాయంగా విస్తృత సమాచారం క్రోడీక రించి విలువైన గిరిజన చరిత్ర సంస్కృతి, వంశ నామావళి, భావితరాల కోసం అందించిన వైనం ఎంతో ప్రయోజన కరంగా ఉంది.
రెండవ భాగంగా పేర్కొన్న “కథలు” విభాగంలో అనేక ఆసక్తి దయకమైన విలువైన విషయాలు అందించారు, వీటిల్లో కొన్ని జానపద గాథలు గాక మరికొన్ని స్థానిక చరిత్రలుగా చెప్పబడ్డాయి.
గిరిజన పురాణ గాథల్లో “మత్స్యతీర్థ స్థల పురాణం” మొదలు “నాయకపోడుల పద్మనాయక వృత్తాంతం” వరకు ప్రధానమైన పది గాథలు ఇందులో పేర్కొన్నారు.
సవర గిరిజనుల ఆరాధ్య దైవం అయిన “పూరీ జగన్నాధుడుకు చెందిన పురాణంలో పూరీకి చెందిన రాజులు సవర్లతో వేటకు వెళ్లి వారిలోనే సహజ శక్తి సామర్థ్యాలకు అబ్బురపడి అందుకు కారణమైన వారి ఆరాధ్య దైవం జగన్నాథుడిని మోసపూరితంగా సొంతం చేసుకుని ఆశక్తి సామర్థ్యాలు పూరి రాజులు కైవసం చేసుకోవడం అందుకు ఆగ్రహించిన సవరణలు జగన్నాథుడు నిలదీసి అసలు విషయం తెలుసుకుని దైవ దైవాన్ని వదిలే ప్రసక్తి లేదని పట్టు పట్టడం అందుకుగాను తిరిగి జగన్నాథుడు అక్షర బ్రహ్మగా అదే సమరదేశంలో అవతరించడం అతని అనుగ్రహంతో నిరక్షరాశులయిన సవర గిరిజనులు అక్షరాస్యులుగా మారి శుద్ధ సవర్లుగా పిలవబడుతున్నారు. ఈతెగ గిరిజనలు ప్రస్తుతం మునిగడ రాయగడ శ్రీకాకుళం ప్రాంతాల్లో విస్తరించి సొంతంగా పాఠశాలలు ఏర్పాటు చేసుకొని అక్షర బ్రహ్మను నిత్యం ఆరాధించుకుంటున్నారు ఈ జన జాతికి చెందిన “మంగయ్య సవర” సవర భాషకు నిఘంటువును సైతం వ్రాసినట్టు ఇందులో పేర్కొన్నారు.
అదేవిధంగా ప్రకృతిలో సాధు జంతువులకు కృరీర జంతువులకు గల సహజ వైరం, చేపలు మనుగడకు కావలసిన జల ప్రవాహం కోసం అవి చేసిన పోరాటం చిత్రించే విశాఖ మన్యంలో గల మత్స్య తీర్థ స్థల పురాణం గురించి కూడా ఇందులో పేర్కొనబడింది.
శతాబ్దాలుగా మధ్య భారతాన్ని పాలించిన గోండులు ఇతర తెగల మధ్య సామరస్యాన్ని బలపరిచే పురాగాథలు, పండుగలు, వివరించ డంలో భాగంగా గోండు గిరిజన జన జాతికి చెందిన అనేక విలువైన విషయాలు సహేతుకంగా చారిత్రక ఆధారాలతో వివరించి చెప్పారు రచయిత డాక్టర్ పిరాట్ల,
గోండు జాతిలో గల,కోలాము,గోండు,పరదార్, మన్నే,తోటి,నాయకపోళ్లు,గురించిన జన్మ వృత్తాంతాలు ఆసక్తి దాయకంగా వివరిస్తూ పాండవులకు వీరికి గల అవినాభావ సంబంధాలు వివరించారు, కోలాములు భీముని సాయంతో జన్మించినట్టు తెలియజేస్తూ…భీముడిని వీరు ఆరాధ్య దైవంగా పూజించడంలోనిఅంతరార్థం ఇందులో వివరించారు.
అలాగే లక్ష్మీదేవి విష్ణు మÖర్తుల సంతానంగా పేర్కొనే పద్మనాయక గిరిజనులైన నాయక పోడు గిరిజనుల జన్మ వృత్తాంతం,మరియు విశాఖ మన్యప్రాంత ఆరాధ్య దేవత మోదకొండమ్మ గేయ గాథ, కోయల మీద దాడి చేసిన కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు పశ్చాత్తాపంతో తన కొడుకును డోలిగా దత్తత ఇచ్చిన సమ్మక్క సారక్క జాతర చరిత్రను తెలిపే “మేడారం డోలి గానం ఇందులో మనం చదవవచ్చు.ఇలా అనేక ఆసక్తికరమైన గిరిజన విజ్ఞాన సమాచార వేదిక ఆయన ఈ చిరు పుస్తకం విలువ మాత్రం చాలా పెద్దది అని చెప్పాలి.
తెలుగు రాష్ట్రాల్లో గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు (పురాగాథలు)
రచయిత: డా: పిరాట్ల శివరామకృష్ణ, పేజీలు:76, వెల:100/- రూ, ప్రతులకు: సాహిత్య నికేతన్, 3-4-852, బర్కత్ పురా, హైదరాబాద్-27, ఫోను: 040-27563236.

అటవీ ఉత్పత్తులు తగ్గుతున్నాయ్

ఉత్తరాంధ్ర గిరిజన ప్రాంతాలైన అల్లూరి జిల్లా, పార్వతీ పురం మన్యం ప్రాంతాల్లో గిరిజనులకు జీవనా ధారమైన అటవీ ఉత్పత్తులు గణనీయంగా తగ్గిపోతున్నాయి. అడవిలో సహజంగా పండే ఉత్పత్తులు వాతావరణ మార్పుల్లో చోటు చేసుకున్న నేపథ్యంలో తుఫాన్ల సమ యంలో నేలకొరిగిన చెట్లు కారణంగా ఉత్పత్తి సేకరణ తగ్గిపోయాయి.పడిపోయిన చెట్లు స్థానంలో విత్తనాలు లభించక గత ఐదేళ్లగా మొక్కలు నాటక పోవడంవల్ల ఉత్పత్తులు తగ్గిపోతున్నాయని గిరిజనులు వాపోతున్నారు.– జి.ఎన్.వి.సతీష్
పార్వతీపురం మన్యం జిల్లా మెళియాపుట్టి మండలంలో ఒకప్పుడు అధికంగా ఉండే నరమా మిడి చెట్లు ఇప్పడు కనుమరుగయ్యాయి. పదేళ్ల కిందట అధికంగా కుడ్డబ, దీనబందుపురం, నాయుడు పోలూ రు తదితర గ్రామాల సమీపాన కొండల్లో ఏటా 50క్వింటాళ్ల వరకూ నరమామిడి చెక్కను జీసీసీ సిబ్బంది కొనుగోలు చేసేవారు. 2018లో సంభవిం చిన తితలీ తుఫాన్ ప్రభా వంతో చెట్లన్నీ నెలకొరి గాయి.గతఐదేళ్లుగా అటవీ శాఖద్వారా కొండల్లో మొక్క లు నాటడం లేదు. దీంతో నరమామిడి చెట్లు కనుమరుగయ్యాయని గిరిజనులు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు.
అడవుల్లో సహజ సిద్ధంగా లభ్యమయ్యే ఉత్పత్తులు తగ్గుతున్నాయి. జిల్లాలోని మెళియాపుట్టి, నందిగాం,టెక్కలి,పాతపట్నం,మందస,కొత్తూరు, హిర మండలం, మండలాల పరిధిలో అధికంగా అటవీ ఉత్పతుల సేకరణ జరిగేది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఔషధ మొక్కలు నాటి వాటి ద్వారా గిరిజనులకు ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టేవారు.జీసీసీ ద్వారా అటవీ ఉత్పత్తులు సేకరించేవారు. అయితే అడవుల్లో గతంలో ఉన్న ఔషధ మొక్కలు, చెట్లు ప్రస్తుతం కనిపించటం లేదు. ప్రకృతి వైపరీత్యాలతో చాలా చెట్లు నేలకొరిగాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో గత ఐదేళ్లూ అటవీశాఖ అధికారలుఉ కనీస స్థాయిలో మొక్కలు నాటలేదు. మరోవైపు కొంతమంది గిరిజనులు పోడు వ్యవసాయం చేసేందుకు చెట్లను నరికేస్తున్నారు. దీంతో విప్ప, నరమామిడి చెక్క, ఉసిరి, అడ్డాకులు, కొండ తామర జిగురు తదితర చెట్లు కనుమరుగ య్యాయి. ప్రస్తుతం అధికంగా కుంకుళ్లు, చింతపండు, కొండచీపుర్లు మాత్రమే గిరిజనుల నుంచి జీసీసీ అధికారులు సేకరిస్తున్నారు. విప్ప పంట ద్వారా గిరిజనులకు అధికంగా ఆదాయం వచ్చేది. ప్రస్తుతం విప్ప పంట లేక..జీసీసీ అధికా రులు కొనుగోలు చేయడం లేదు. అలాగే అటవీ ప్రాంతాల్లోని చెట్లకు ఉన్న తేనె పట్టుల నుంచి తేనె సేకరించి ఇతర రాష్ట్రాలకు తరలించేవారు. తుఫాన్ల కారణంగా చెట్లు నేలకొరగడంతో తేనెతీగల పట్లు ఎక్కడా కనిపించడం లేదు. దీంతో తేనె సేకరణ తగ్గింది. అలాగే పదేళ్ల కిందట జిల్లా నుంచి 5వేల క్వింటాళ్ల వరకూ జీసీసీ ద్వారా నరమామిడి చెక్కను గిరిజనులు సేకరించేవారు. ప్రస్తుతం నరమామిడి చెట్లు లేక 50 క్వింటాళ్లు కూడా రావడం లేదని జీసీసీ అధికారులు చెబుతున్నారు. గిరిజనులు సేకరిస్తామన్నా..చెట్లు లేని పరిస్థితి నెలకొందన్నారు.అడవుల్లో సహజంగా లభించే ఉసిరికాయల చెట్లు కూడా కనిపించడం లేదు. కొన్ని ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు నరికి ఉసిరి కాయలు సేకరిస్తున్నారు. దీంతో చెట్లు మళ్లీ చిగురించక.. ఉసిరి పంట కూడా కరువవుతోంది. గతంలో గిరిజనులు సేకరించే అడ్డాకులకు భలే గిరాకీ ఉండేది. ప్రస్తుతం ప్లాస్టిక్ వినియోగం పెరగడంతో అడ్డాకులకు డిమాండ్ తగ్గింది. దీంతో అడ్డాకుల సేకరణపై గిరిజనుల్లో ఆసక్తి సన్నగిల్లుతోంది. అలాగే అధికంగా ఔషధాలకు వినియోగించే కొండతామర జిగురు కూడా ఎక్కడా కనిపించడం లేదు. మందస, మెళియాపుట్టి, నందిగాం తదితర ప్రాంతాల్లో ఒకప్పుడు విరివిగా ఉన్న ఈ చెట్లు.. ప్రస్తుతం కనుమరుగయ్యాయి. చింత, కుంకుడు చెట్లు కూడా ముదిరిపోవడంతో ఉత్పత్తులు తగ్గుతు న్నాయి. ఒకప్పుడు లారీల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించేవారు. ప్రస్తుతం ఏడాదికి జీసీసీ ద్వారా 500 క్వింటాళ్ల కుంకుడు కాయలు, 2,500 క్వింటాళ్ల చింతపండు మాత్రమే సేకరిస్తున్నారు. కొండచీపుర్లు కూడా ఏడాదికి పదివేల కట్టలు మాత్రమే సేకరిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. అటవీ ఉత్పత్తులు తగ్గడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడవుల్లో మొక్కలు నాటాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.కూటమి ప్రభుత్వం స్పందించి అటవీశాఖ ద్వారా ఔషధాలకు వినియోగించే మొక్కలు నాటేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో ఒకప్పుడు సుమారు 20రకాల అటవీ ఉత్పత్తులు పుష్కలంగా లభించేవి. ప్రధానంగా తేనె, మైనం,చింతపండు, ఇండిగపిక్కలు, ముసి డిక పిక్కలు,మారేడు గడ్డలు,వెప్ప పువ్వు, కాగు పుప్వు,కరక్కాయలు,గచ్చకాయలు,నరమా మిడిచెక్క,కొండచీపుర్లు, కుంకుడుకాయలు,ఎండ ఉసిరిపప్పు,నల్లజీడిపిక్కలు తదితర వాటిని విక్రయిస్తూ గిరిజనులు జీవనం సాగించేవారు. అయితే కాలక్రమంలో అటవీ ప్రాంతం తగ్గడం, తదితర కారణాలవల్ల గిరిజనులు అనేక ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. కొన్ని రకాల అటవీ ఉత్పత్తులు మాత్రమే లభిస్తుండగా..వాటికి కూడా గిట్టుబాటు ధర దక్కడం లేదు.వివిధ కారణాలతో జీసీసీ అధికారులు పూర్తిస్థాయిలో అటవీ ఉత్పత్తు లను కొనుగోలు చేయడం లేదు.గిట్టుబాటు ధర కూడా కల్పించడం లేదు. దీంతో గిరిజనులు తమ అటవీ ఉత్పత్తులను నష్టానికే మైదాన ప్రాంతాల వ్యాపారులకు విక్రయించాల్సి వస్తోంది.
రెగ్యులర్ సిబ్బంది లేక ..
ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు ప్రత్యేక సేవలు అందించాల్సిన జీసీసీ డిపోలను రెగ్యులర్ సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది.దీంతో అవి ఉత్సవ విగ్రహాలుగా మారాయి. గుమ్మలక్ష్మీపురం పరిధిలో 46, సాలూరులో 38,పార్వతీపురంలో 17 డిపో లు ఉన్నాయి. మొత్తం 101డిపోల పరిధిలో 14 మంది రెగ్యులర్ సేల్స్‌మెన్ ఉన్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.18 డిపో లకు ఎటువంటి సిబ్బంది లేరు.కాగా మిగితా వాటిని కాంట్రాక్ట్ సేల్స్ మెన్, మహిళా సంఘాల, డీలర్లు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.ఇన్‌చార్జిల నేతృత్వంలోనే డిపోలను నిర్వహించాల్సిన పరిస్థితి పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో ఉంది. సీతంపేట ఐటీడీఏ పరిధిలోనూ పూర్తిస్థాయిలో సేల్స్‌మెన్‌లు లేరు.దీంతో డిపోల ద్వారా గిరిజన ప్రాంతాల ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు.
శిథిలావస్థలో డిపోలు…
పార్వతీపురం జీసీసీ పరిధిలో ఉన్న అనేక డిపోలు శిథిలావస్థలో ఉన్నాయి. ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి. దీంతో సిబ్బంది బిక్కుబిక్కు మంటూ విధులు నిర్వర్తించాల్సి వస్తోంది.భవ నాల మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేయాలని అధికారులు ప్రతిపాదనలు పంపినా మోక్షం కలగలేదు. గోదాముల పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది.
కోల్డ్ స్టోరేజీలు ఎక్కడ…
జీసీసీకి జిల్లాలో ఎక్కడా కోల్డ్ స్టోరేజీలు లేవు. దీంతో ఏటా లక్షలాది రూపాయలను ప్రైవేట్ వ్యాపారులకు కట్టబెడుతున్నారు తప్ప సొంతంగా ఏర్పాటు చేసుకోలేకపోతున్నారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం సమీపంలో ఉన్న వేములవలస వద్ద కోల్ట్‌స్టోరేజ్ నిర్మాణాన్ని చేపట్టారు. కానీ అవసరమైన యంత్రాలు రాకపోవడంతో ఆ పను లు పూర్తికాలేదు. సుమారు రూ.మÖడు నుంచి నాలుగు కోట్లు వెచ్చిస్తే..మÖడు జిల్లాల పరిధిలో గిరిజన రైతుల నుంచి కొనుగోలు చేసిన చింతపండును జీసీసీ కోల్డ్‌స్టోరేజ్‌లో నిల్వ చేసు కోవచ్చు.కానీ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు.ఇప్పటికైనా జీసీసీకి కోల్డ్‌స్టోరేజ్ ఏర్పాటు చేస్తే..ఏటా లక్షల రూపాయలు ఆదా చేసుకో వచ్చు. ప్రైవేట్ వ్యాపారులకు అద్దె ప్రాతిపదికన భారీగా చెల్లించాల్సిన అవసరం ఉండదు.గిరిజన రైతులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉం టుంది.నిరూపయోగంగా విలువైన స్థలాలు గిరిజన సహకార సంస్థకు ఉమ్మడి జిల్లాలోని గుమ్మల క్ష్మీపురం ఎస్.కోటతో పాటు విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో విలువైన స్థలాలు ఉన్నాయి. ఈ ప్రాం తాల్లో షాపింగ్ కాంప్లెక్స్ తదితర కమర్షియల్ గొడౌన్లు నిర్మిస్తే జీసీసీకి ఆదాయం ఎంతో వస్తుంది. కానీ దీనిపై అధికార యంత్రాంగం దృష్టి కేం ద్రీకరించడం లేదు.ఈ విషయాన్ని పాలకులకు చెప్పినా పట్టించుకునే వారే కరువ య్యారు.దీంతో జీసీసీకి చెందిన విలువైన స్థలాలు నిరుపయోగంగా మారాయి.
గిరిజనులకు ఊరట
గిరిజనుల నుంచి నేరుగా అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేసి.. వారికి గిట్టుబాటు ధర కల్పిం చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.సర్కారు ఆదేశాలు జారీ చేయండంతో గిరిజన కార్పొరేషన్ సంస్థ (జీసీసీ) అటవీ ఉత్పత్తుల ధరలను పెం చింది. గత ఏడాది కంటే ధరలు పెరగడంతో గిరిజనులకు కాస్త ఊరట కలగుతుందని చెప్పొచ్చు.ఇకపై వారు దళారులను ఆశ్రయిం చాల్సిన అవసరం ఉండదనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
గత ఏడాది ఇలా..
గత ఏడాది పిక్కతో కూడిన కిలో చింతపండు ధర రూ.32-40పైసలు, పిక్కతీసిన చింతపండు రూ.63,కాగుపప్పు రూ.22, విప్పపప్పు రూ.29, కొండతామర జిగురు రూ.114,ముసిడిక పిక్కలు రూ.90, కరక్కాయలు రూ.18,ఎండు ఉసిరిక పప్పు రూ.80, ఇండికా పిక్కలు రూ.50, కానీ కాయలు రూ. 17,కుంకుడుకాయలు రూ.35, సీకా కాయి రూ.40,అడవి తేనె రూ. 250, పుట్ట తేనె రూ.160, తేనె మైనం రూ.160,కొండ చీపుర్లు గ్రేడ్-1 రూ.45
తాజాగా పెరిగిన రేట్లు ప్రకారం…
పిక్కతో ఉన్న కిలో చింతపండు రూ.34,పిక్కతీసిన చింతపండు రూ.67,కాగుపప్పు రూ.25, విప్ప పప్పు రూ.32,ముసిడిక పిక్కలు రూ.వంద, నల్లజీడి పిక్కలు రూ.22,కరక్కాయలు రూ.20, ఎండు ఉసిరిక పప్పు రూ.90, కానీ కాయలు రూ.18కు పెంచారు. మిగిలిన అటవీ ఉత్పత్తుల రేట్లలో ఎలాంటి మార్పు లేదు. గత సంవత్సరంతో పోల్చుకుంటే చింతపండుకు పిక్కతో ఉన్న దానికి రూ.రెండు, పక్కి తీసిన దానికి రూ.నాలుగు పెం చారు.చింతపండు, మిగిలిన అటవీ ఉత్పత్తులను గిరిజనుల నుంచి నేరుగా జీసీసీ కొనుగోలు చేస్తేనే లక్ష్యాలు నెరవేరే అవకాశం ఉంది.గిరిజన రైతులకు కూడా ఎంతోకొంత గిట్టుబాటు అవు తుంది.దీనిపై జీసీసీ ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు.
ధరలపై అవగాహన
గిరిజనులకు జీసీసీ ధరలు, అటవీ ఉత్పత్తుల కొనుగోలుపై అవగాహన కల్పించారు. దళారులకు విక్రయిస్తే నష్టపోతారని,జీసీసీకి అమ్మితే గిట్టుబాటు ధర లభిస్తుందని వివరించారు. అనం తరం ధరల పట్టికను ప్రదర్శించారు. ఈ కార్య క్రమంలో జీసీసీ బ్రాంచి డైరెక్టర్ నూకమ్మ, సర్పంచ్ గంగమ్మ, సేల్స్‌మన్ ఎస్.రమణారావు తదితరులు పాల్గొన్నారు.

పుడమి తల్లికి ఆత్మఘోష

సమస్త జీవకోటి భారాన్ని మోసేది ఈ పుడమి తల్లి. ఇది అందరికి తెలిసిన .. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఆ తల్లి దేహానికి గాయాలు చేస్తుంటారు. ఓ వైపు కాలుష్యం పెరుగు తున్నా.. అవేం పట్టించుకోకుండా.. మరో వైపు వనరులను తగ్గించేస్తూన్నారు. మనిషి అవస రాల కోసం జంతువులను చంపడం.. అడవు లను నాశనం చేసి.. ఇప్పుడు మారణీVA మంలో పడి కోట్టుమిట్టాడుతున్నాము. ఇష్టం వచ్చినట్లుగా సహజ వనరులను తగ్గించి.. ఇప్పుడు ప్రాణ వాయువు కోసం అల్లాడు తున్నారు. అభివృద్ధి పేరుతో జరిగే మితిమీరిన చేష్టలు భూమాతను నిలువునా దహించి వేస్తున్నాయి. తాగే నీరు.. పీల్చే గాలి.. నివసించే నేల ఇలా పంచభూతాలు కాలుష్యంలో చిక్కుకున్నాయి. పచ్చదనంతో పరిఢవిల్లాల్సిన భూతల్లి ఎదపై ప్రకృతి అందాలను కోల్పోయి మÖగ రోదనతో కన్నీరు కార్చుతోంది. మన భూమిని కాపాడుకుందాం అనే నినాదాలు కేవలం పుస్తకాల్లో రాతాలుగా మారి పోయాయి – గునపర్తి సైమన్
నిషి స్వార్థపరుడు..చెట్లను నరికేసి పక్షులకు గూళ్లు లేకుండా చేశాడు. అడవుల్ని మాయంచేసి జంతువులకు నిలువ నీడ లేకుండా చేస్తున్నాడు. అనాగరికులకు..అడవుల్లో బ్రతికే వారు తమ చుట్టూ ఉన్న ప్రకృతితో జీవనం చేస్తుంటే..అన్నీ తెలిసిన నాగ రికుడు..అభివృద్ధి, ప్రగతి పేరుతో పరిశ్రమలు స్థాపిం చి అడ్డూ అదుపూ లేకుండా ప్రకృతి వనరుల్నిదో చేస్తున్నాడు. నేల,నదులు,సముద్రాలు ఒకటేమిటి ఆఖరికి ఆకాశాన్ని సైతం తన అదుపులోనే ఉంచుకో వాలన్న అత్యాశతో మొత్తంగా భూమండలాన్ని కలు షితం చేశాడు. అలా తాను సృష్టించుకున్న కాలుష్యా నికి ఇప్పుడు తానే బలవుతున్నాడు. ఏప్రిల్ 22, ధరిత్రీ దినోత్సవం మనకు ఈ విషయాలను గుర్తుచేస్తోంది.. మిగతా దేశాలకంటే భారతీయులకు భూమితో ఉన్న అనుబంధం చాలా ఎక్కువ. మన సంస్కృతి మనకు నేర్పింది పర్యావరణ పరిరక్షణే. మన భూగోళాన్ని కాపాడుకోవడం కోసం చర్యలు చేపడదాం. వాహానాల వాడకం తగ్గిద్దాం. 2. అనవసర విద్యుత్ వాడకాన్ని తగ్గిద్దాం. 3. అడవులను నాశనం చేయకుండా.. చెట్లను పెంచడం అలవరచుకుందాం. 4. భూమికి హాని చేసే ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేదిద్దాం.
మనిషి మనుగడకు నష్టం చేసిన కరోనా మాత్రం పుడమి తల్లికి మంచి చేస్తుందనే చెప్పుకోవాలి. మనిషి సృష్టించిన కాలుష్యం నుంచి ధరణి బయటపడేలా చేస్తుంది. మనిషిని నాలుగు గోడల మధ్య బందించి.. పక్షులూ జంతువులూ స్వేచ్ఛగా తిరగడానికి అవకాశం కల్పించింది. అలాగే వ్యర్థాలతో నిండిపోయిన నదులు మళ్లీ స్వచ్చంగా కనిపిస్తున్నాయి.
ఐక్యరాజ్య సమితి నివేదికల ప్రకారం ఏటా కోటి హెక్టార్లకుపైగా విస్తీర్ణంలో అడవులు కనుమరు గవుతున్నాయి. అత్యంత ప్రమాదకరమైన వ్యర్థ జలాలను సైతం సముద్రాలు, నదుల్లోకి విడిచిపెడు తున్నాం. గతశతాబ్ది కాలంలో సగందాకా చిత్తడి నేలలు,పగడపు దిబ్బలు అంతర్థానమయ్యాయి. ప్రకృతి సమతౌల్యం దెబ్బతినడంతో వాయుకాలుష్యం పెరిగి పోయింది. వాతావరణ మార్పుల ప్రభావంతో భూతా పం ఎక్కువై అధిక ఉష్ణోగ్రతలు, కార్చిచ్చులు, తుపాన్లు, వరదలు, కరవు కాటకాలు వంటి విపత్తులు ముప్పేట దాడి చేస్తున్నాయి. ఇటీవలి కొన్ని దశాబ్దాల కాలంలో భూతాపంలో వృద్ధి-పరిస్థితి తీవ్రతకు అద్దం పడు తోంది. భూతాపం మరింతగా పెచ్చరిల్లితే ప్రకృతి వైపరీత్యాల దుష్ప్రభావాలు ప్రమాదకరంగా ఉంటా యని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మానవాళి స్వయంకృతాపరాధమే ఈదుస్థితికి కారణమని తెలిసి నా ప్రపంచ దేశాలు తాత్సార వైఖరిని అవలంబిస్తుం డటం ఆందోళనకరం.
తరిగిపోతున్న అడవులు
భూతాపాన్ని నిలువరించి, పర్యావరణ సమ తౌల్యాన్ని కాపాడే లక్ష్యంతో ప్రపంచ దేశాలు ఏళ్ల తరబడి సమీక్షలు నిర్వహిస్తున్నాయి. వివిధ దేశాలు పర్యావరణ చట్టాలకు పదును పెడుతూ సహజ వన రుల వినియోగాన్ని నియంత్రించే లక్ష్యంతో విధానాలు రూపొందిస్తున్నాయి.వాటి కార్యాచరణ మాత్రం చురుకందుకోవడం లేదు. భూతాపాన్ని నియంత్రించేం దుకు 2015లో పారిస్ వేదికగా ప్రప దేశాల మధ్య కుదిరిన ఒప్పందం అమలులో అనిశ్చితి ఇంకా కొన సాగుతోంది.కర్బన ఉద్గారాల నియంత్రణ కోసం పర్యావరణహితకరమైన విధానాలు అమలు చేస్తామని దేశాలు ప్రతినపూనాయి.అందుకుగాను ప్రజల ఆహార భద్రత, ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యమిస్తూ సాంకేతిక పరిజ్ఞానం, ఇతర అవసరాల కోసం నిరుపేద, వర్ధమా న దేశాలకు నిధులు ఇస్తామని సంపన్న దేశాలు పేర్కొ న్నాయి.ఈ ఒప్పందం జరిగి ఎనిమిదేళ్లు గడుస్తున్నా నిధుల విడుదలలో జాప్యంచేస్తున్నాయి. నార్వే, జర్మనీ, స్వీడన్ వంటి దేశాలు స్వల్పంగా నిధులు విడుదల చేసినా అగ్రదేశాలు మాత్రం పెద్దగా స్పందించడం లేదు.భూతాపాన్ని నియంత్రించడంలో అడవులు కీలక పాత్ర పోషిస్తాయి. వనాలు జీవవైవిధ్య పరిరక్షణకు, జీవనోపాధుల కల్పన,ఆహార భద్రతకు విశేషంగా తోడ్పడతాయి. అయితే, అడవుల విస్తీర్ణం పెరగడం సంగతి అటుంచి, ప్రస్తుతమున్న దట్టమైన అడవుల విధ్వసం విచ్చలవిడిగా సాగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రపంచ ఆహార సంస్థ నివేదికల ప్రకారం వ్యవసాయ భూములు, నగరాల విస్తరణ, మౌలిక సదుపాయాలు,ఖనిజ తవ్వకాలు వంటి అభివృద్ధి కార్యక్రమాల ప్రభావం అడవులపై పడు తోంది. మÖడు దశాబ్దాల కాలంలో సుమారు 42 కోట్ల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలోని అడవులు అంతరిం చాయన్న అంచనా దిగ్భ్రాంతపరుస్తోంది.
లక్ష్యాలకు తూట్లు
పర్యావరణ పరిరక్షణలో భారత్ అనుసరి స్తున్న అనేక లోపభూయిష్ట విధానాల మÖలంగా భూగోళ పరిరక్షణ లక్ష్యాలకు తూట్లు పడుతున్నాయి. భూతాపం నియంత్రణకుగాను భారత్ వివిధ విధాన పరమైన చర్చల్లో అమెరికా వంటి అగ్ర దేశాలతో తలపడుతోంది.అయితే, వివిధ పర్యావరణ విధా నాలు,చట్టాలను పటిష్ఠంగా అమలు చేయడంలో ఇండియా విఫలమవుతోందనే విమర్శలు ఉన్నాయి. ప్రకృతి వ్యవస్థలకు నష్టం వాటిల్లకుండా, పర్యావరణ న్యాయం అమలు చేసేలక్ష్యంతో జాతీయ హరిత ట్రైబ్యునల్ చట్టం-2010 తీసుకొచ్చారు.ఈచట్టం అమలు మొదలై 13 ఏళ్లు గడుస్తున్నా అన్ని రాష్ట్రాల్లో హరిత న్యాయస్థానాలు అందుబాటులోకి రాలేదు. తీర ప్రాంత పరిరక్షణకు ఉద్దేశించిన సి. ఆర్.జెడ్. నిబంధనలు-2019 అమలులో రాష్ట్రాలు ప్రదర్శి స్తున్న అలసత్వం,తీరప్రాంతాల్లోని మడ అడవులు వంటి సున్నిత వ్యవస్థల విధ్వంసం వంటి అంశాలపై ఇటీవల కాగ్ వివిధ రాష్ట్రాలను తీవ్రంగా ఆక్షేపిం చింది. మన దేశంలో గడచిన ముప్ఫై ఏళ్ల కాలంలో లక్షలఎకరాలకు పైగా అడవులను అటవీయేతర కార్య క్రమాలకు బదలాయించినట్లు అంచనా. వీటికి ప్రత్యా మ్నాయంగా అడవుల పెంపకంలో అనుసరిస్తున్న విధానాలు లోపభూయిష్ఠంగా ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి.నష్టపరిహారంగా వచ్చే నిధులతో వనాల పెంపు కోసం 2016లోనే ప్రత్యామ్నాయ అటవీకరణ నిధి చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చినా ఆశించిన ప్రయోజనం చేకూరలేదు.
ప్లాస్టిక్తో ముప్పు
ప్రజల జీవనశైలి, సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చిన పెనుమార్పుల మÖలంగా ప్లాస్టిక్ వాడకం అనూహ్యంగా పెరిగింది. మితిమీరిన ప్లాస్టిక్ విని యోగం ప్రకృతి వ్యవస్థలకు తీవ్ర నష్టం కలిగిస్తోంది. తీరప్రాంతాల్ని కలిగి ఉన్న దేశాల నుంచి ఏటా లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు మహాసముద్రాల్లో పోగుపడు తున్నాయి. సముద్ర పర్యావరణ వ్యవస్థలో చేరే వ్యర్థాల్లో దాదాపు 90శాతం ప్లాస్టిక్ ఉంటోంది. భారత్లోని ప్రధాన నదులు సైతం ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్ర పర్యావరణంలోకి తీసుకెళ్ళే మార్గాలుగా మారడం ఆందోళనకరం. ప్రస్తుత ప్లాస్టిక్ ఉత్పత్తి, వినియోగం,పునర్ వినియోగ విధానాల్లో మార్పు రాకపోతే 2040నాటికి కోట్లాది టన్నుల ప్లాస్టిక్ వ్యర్థా లు సముద్రాల్లో పేరుకుపోయే ముప్పుంది. దీనివల్ల సాగర జీవుల మనుగడ ఇక్కట్లలో పడుతుంది.తీర ప్రాంత ప్రజల ఆరోగ్యమÖ దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంది.
భూమి దినం చరిత్ర
ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ ఉద్యమం మొదలైన సమయం దృష్టిలో పెట్టుకుంటే, అది 1970 ఏప్రిల్ 22న ప్రారంభమైంది. ఆరోజున సెనేటర్ గేలార్డ్ నెల్సన్ మరియు కార్యకర్త డెనిస్ హేస్ వారు తొలి సమావేశాన్ని ప్రేరేపించారు.వారు దేశవ్యా ప్తంగా 20మిలియన్ మందిని గాలి కాలుష్యం, నూనె పారులు మరియు జాతి విభిన్నత నష్టాలపై ప్రతిరోధం చేయమని విజయవంతంగా ప్రేరేపించారు.ఈ చరిత్రాత్మక ఘటన స్థాపనకు,అలాగే క్లీన్ ఎయిర్ యాక్ట్ మరియు ఎండేంజరడ్ స్పీషీస్ యాక్ట్ వంటి కీలక చట్టాల ఏర్పాటు కొరకు మార్గం సృష్టించింది. ఏప్రిల్ 22 ఏసంవత్సరం నాటికి పడ్డా,ప్రజలు ఎప్పు డూ ఆరోజున భూమి దినాన్ని జ్ఞాపకం చేసుకుం టారు. ఈ మసలేని నిబద్ధత ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులకు వారి షెడ్యూల్‌లను సరిపోల్చుకోవడానికి సమయం ఇస్తుంది. భూమి దినం 2025 ఒక గ్లోబల్ రోజు,అందరూ కలిసి మన భూమిని నివసించ దగినదిగా ఉంచేందుకు మనం భాగస్వామ్యం అయిన బాధ్యతను గౌరవించేందుకు ఇది ఒక అవసరం.
ఏప్రిల్ 22 ప్రత్యేకత ఏమిటి?
సెనేటర్ నెల్సన్ మరియు ఆయన సిబ్బంది ఈరోజు ప్రత్యేకంగా ఎంచుకున్నప్పుడు, యువతను ఆకర్షించి, వియత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల ఉత్సాహాన్ని ఉపయోగించుకోవాలని ఆశించారు. ఈ ఘటనను వసంత విరామం మరియు ఫైనల్ పరీక్షల మధ్య అంగీకరించడానికి వ్యూహాత్మకంగా షెడ్యూల్ చేశారు, తద్వారా మాక్సిమమ్ విద్యార్థి భాగస్వామ్యాన్ని ప్రేరేపించడానికి,పర్యావరణ ఉద్యమ యువత ఉత్సా హం శక్తిని తీసుకురావడాన్ని ప్రోత్సహించవచ్చని ఉద్దేశ్యించారు. ఈఏడాది 2025లో భూమి దినం వేడుకను 192 దేశాల నుండి ఒక బిలియన్ మందికి పైగా జరుపుకుంటారని అంచనా. ఇది ఈ ఘటన 55వ వార్షికోత్సవాన్ని సూచిస్తుంది. ఇది భూమి దినం ఉద్యమం,వివిధత,సమాజం మేలు కోసం ప్రజలను ఐక్యంగా చేయడంలో నిబద్ధత.1970లో లాగా ఇప్పటికీ బలంగా ఉందని చూపిస్తుంది. భూమి దిన సారాంశం ఎప్పటికీ ప్రజల శక్తి, మరియు ఈ శక్తి విప్లవాత్మక మార్పును తీసుకురావడానికీ సామర్థ్యం కలిగి ఉంది. ప్రజలు ఒక సామాన్య లక్ష్యాన్ని చేరుకోవడానికి ఐక్యంగా వచ్చేటప్పుడు, వారు పాత వ్యవస్థలను,పరిశ్రమలను అధిగమించ గలుగుతారు! పుడమి తల్లి పుట్టిన రోజునమనం అందరికీ మంచిగా ఉండే భవిష్యత్తును సృష్టించడానికి పునరుత్పత్తి శక్తి వనరులను ఉపయోగించేందుకు ఒకవాగ్దానాన్ని ఇవ్వు దాం.అది ఆరోగ్యకరమైన, స్థిరమైన, సమానమైన, మరియు ధనికమైనది.
ఈఏడాది నినాదం..“శక్తి..ప్రజలు..గ్రహం”
శక్తి:మన గ్రహం సమృద్ధిగా ఉన్న పునరుత్పత్తి శక్తి వనరులను 2030నాటికి వాటి ఉత్పత్తిని మÖడు రెట్లు పెంచడం ద్వారా ఎక్కువగా ఉపయోగించాలి. ఈ జాబితాలో సౌరశక్తి, గాలిశక్తి, జల విద్యుత్తు, భూపర్యవేక్షణ శక్తి,జలధార శక్తి ఉన్నాయి.
ప్రజలు:ఆర్థిక వృద్ధిని ప్రేరేపించడం,ఉద్యోగాలను సృష్టించడం, సమానత్వాన్ని ప్రోత్సహించడం.. అంగీ కరించేస్థాయిలో ఆరోగ్యాన్ని మెరుగుపరచడం,శుభ్ర మైన,అంగీకరించిన పునరుత్పత్తిశక్తితో ప్రపంచ కమÖ్యనిటీలను శక్తివంతం చేయడం ద్వారా బిలియన్ల మంది ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచగలుగుతాం. గ్రహం:మేము పునరుత్పత్తి శక్తి వ్యవస్థలను త్వరగా అమలు చేయడంద్వారా వాతావరణ మార్పును ఆప వచ్చు,పర్యావరణ వ్యవస్థలు మరియు జాతి విభిన్న తను కాపాడవచ్చు, మరియు మనం గోచారం వంటివి మీద ఆధారపడటం తగ్గించగలుగుతాం.
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించండి:..
శుభ్రపరచే కార్యక్రమాల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ భూమితో మీ సంబంధాన్ని బలపరచవచ్చు. గ్యారేజీ బ్యాగ్‌తో తిరుగుతూ ఎదురయ్యే ప్రతి ప్లాస్టిక్‌ను సేకరించండి.సమీపంలో ఉన్న కసాయి కాలువ లేదా గుంటను మీరు తెలుసుకోవచ్చు! గృహపరికరాలు వంటగదిలోని పాత్రలను కప్పు మరియు సిరామిక్‌తో మార్చండి,ప్లాస్టిక్ కట్టర్లను వేయకుండా వాటిని పునః ప్రయోగించండి!
చెట్లు నాటుదాం..
మన చెట్లు అద్భుతంగా ఉంటాయి. కార్బన్ ను సేకరిస్తాయి.వేడి ప్రాంతాలను చల్లబరు స్తాయి, పురాణాన్ని ప్రోత్సహిస్తాయి, రోగాల యొక్క ప్రసారం ప్రమాదాన్ని తగ్గిస్తాయి,స్థానిక ఆర్థిక వ్యవస్థలను పెంపొందిస్తాయి.ఒకేఒక చెట్టు మొత్తం యార్డ్‌లోని మొక్కల కంటే ఎక్కువ వన్యప్రాణులను ఆకర్షిస్తుందని మీరు ఊహించలేము! మీరు మీస్థానిక అధికారులుతో సంభాషించి పబ్లిక్ ప్రదేశాలలో చెట్లు మరియు స్థానిక తోటల బడ్‌లను నాటడం గురించి చర్చించండి. మీస్వంత భూమిలో కూడా వాటిని నాటవచ్చు!

1 2