కులం కొలత..జాతికి కొరత
దేశం వెనుకబాటుతనానికి,జాతిదాస్య శృం ఖలాల్లో మగ్గిపోవడానికి కుళ్లిపోయిన కుల వ్యవస్థే కారణమని బాబా సాహెబ్ అంబేడ్కర్ కుండ బద్దలు కొట్టారు.నాడు దేశరాజకీయాలను శాసిస్తున్న వ్యక్తు లను ఢీకొట్టారు.‘పని విభజన’ముసుగులో వేల సంవ త్సరాలుగా కొన్ని కులాలను అణగదొక్కుతున్న విష యాన్ని అంగీకరించి,దాన్ని సరిదిద్దేందుకు నడుం కట్టక తప్పని పరిస్థితిని నాటిరాజకీయ పక్షాలకు కల్పించారు.అణగారినవర్గా విముక్తికిదారులు వేశారు. ఈప్రయాణంలో భాగంగా ఆయన భారతీయ సమా జంలో కులం సృష్టిస్తున్న విధ్వంసాన్ని సమగ్రంగా విశ్లేషిస్తూ 1936లో ఒకశక్తిమంతమైన పుస్తకం రాశా రు. కుల నిర్మూలన(ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్) అనే ఈ పుస్తకం నిజానికి లాీVAర్‌లో జరిగిన ఓ సమావే శంలో చేయాల్సిన ప్రసంగం.కులం పట్ల అంబేడ్కర్ అభిప్రాయాలు ఇందులో బలంగా వ్యక్తమయ్యాయి. ప్రసంగంలో కులానికి సంబంధించిన అంశాల సంక్షిప్త పాఠం….
శ్రమ విభజన బూటకం
కుల వ్యవస్థను సమర్ధించే వాళ్లు చాతుర్వర్ణ విభజనను ‘శ్రమ విభజన’ పద్ధతితో పోలుస్తున్నారు. అన్ని నాగరిక వ్యవస్థల్లోనూ ‘శ్రమ విభజన’ ఉందని దబాయిస్తున్నారు.కులాలవారీ విభజన-శ్రమ విభజన ఒక్కటి కాదు.భారతదేశంలో కులాల పేరుతో శ్రామి కుల మధ్య అసహజమైన, దాటలేని అడ్డుగోడలు కట్టారు. ఇలా ఏనాగరక సమాజంలోనూ లేదు. సమా జంలో కొందర్నిపై అంచెలో, కొందర్ని కింది అంచెలో పెట్టి దాన్ని శాశ్వత వారసత్వంగా మార్చారు. ఇది స్వచ్చంద విభజనకాదు. సహజ స్వభావాలను, అభిరు చుల్ని బట్టి చేసింది కాదు. ఒక వ్యక్తిని తన వృత్తిని ఎంపిక చేసుకోగలిగే స్థాయికి అభివృద్ధి చేసినపుడే అతని సామాజిక,వ్యక్తిగత సామర్థ్యాలు వ్యక్తమవు తాయి.కుల వ్యవస్థలో దీనికి అవకాశమే లేదు. జీవిత కాలం చేయాల్సిన పనులను, వృత్తులను పుట్టుక ఆధా రంగా ముందే కేటాయిస్తారు. స్వభావ సిద్ధ సామ ర్థ్యాలను బట్టి పనులు అప్పగించరు. ఇది వినాశకర పద్ధతి. ఏరంగంలోనైనా తరచూ ఆధునికీకరణ జరు గుతూ ఉంటుంది. దాంతో కొన్ని వృత్తులు విలువను కోల్పోతాయి. కాలాన్ని బట్టి వృత్తులు మార్చుకొనే స్వేచ్చ లేకపోతే బతుకుదెరవు అసాధ్యమవుతుంది. పరిస్థితులను బట్టి, శక్తి సామర్థ్యాలను బట్టి వృత్తులలో సర్దుబాట్లు జరగకుండా కుల వ్యవస్థ అడ్డుకోవడమే దేశంలో నేటి నిరుద్యోగ సమస్యకు ప్రధాన కారణం. కులం ప్రమాదకర వ్యవస్థ కుల వ్యవస్థలో వ్యక్తి ఇష్టానిష్టాలతో సంబంధం లేదు. అభిరుచికి స్థానం లేదు. అంతా కర్మ సిద్ధాంతంపై ఆధారపడి ఉంది. ఇష్టం లేకున్నా బలవంతంగా కొన్ని పనులు చేయాల్సి వస్తోంది.చాలా వృత్తులను హిందూ సమాజం హీన మైనవిగా పరిగణిస్తోంది. దాంతో ఆయా వృత్తుల్లోని వారు తమ పనిపట్ల అత్యంత ఏహ్య భావాన్ని కలిగి వున్నారు. మనిషి హృదయం కానీ, బుర్ర కానీ పెట్ట కుండా పని చేయాల్సి వస్తోంది. సాంఘికంగా ఉన్నత స్థాయిలో ఉన్న కొందరు వక్ర బుద్ధులు స్వప్ర యోజనంకోసం కల్పించిన సంఘ వ్యవస్థే నేటి కుల వ్యవస్థ. దీనికి ఏ విధమైన శాస్త్రీయ ప్రమాణంకుల వ్యవస్థ దేశ ఆర్థిక సామర్థ్యాన్ని పెంచలేదు. జాతిని సమున్నతీకరించలేదు. నిజానికి అది హిందువులను విచ్ఛిన్నం చేసింది. నైతికంగా పతితుల్ని చేసింది. హిందూ అనేదే విదేశీ పదం. మహ్మదీయులు తాము వేరే అని చెప్పుకొనేందుకు ఇక్కడి వారికి హిందువులని పేరు పెట్టారు. మహ్మదీయ దండయాత్రకు ముందు ఏ సంస్కృత గ్రంథంలోనూ హిందూ పదం కనిపిం చదు.ఈ డే ప్రజలకు ఎప్పుడూ తాము ఒక జాతి ప్రజలమన్న భావన లేదు. ఇది కేవలం కొన్ని కులాల సముదాయం.ప్రతీ కులానికి తాము బతకడమే లక్ష్యం, పరమార్థం.ఎప్పుడైనా హిందూ-ముస్లిం కొట్లాట వచ్చినపుడు తప్ప మరోకులంతో సంబంధం ఉండదు. ప్రతీ కులం ఇతర కులాలకు దూరంగా ఉండటం ద్వారా తన ప్రత్యేకతను నిలబెట్టుకోవాలను కుం టుంది. కులంలోనే వివాహాలు చేసుకుంటారు. హిందువును కన్నంలో బతికే ఎలకతో పోల్చవచ్చు. జాతీయ చైతన్యం లేదు.ఉన్నది కుల చైతన్యం మా త్రమే.
సమాజాన్ని కులమే విడదీస్తోంది
వివిధ కులాల వారు ఒకే పండుగను చేసు కుంటున్నారు. అయితే, ఆసారూప్యం వారిని ఒక్కటిగా ఉంచలేక పోతోంది.ఏవ్యక్తి అయినా ఉమ్మడి కార్య కలాపాల్లో స్వేచ్ఛగా పాల్పంచుకోవాలి. ఇతరులను ఉద్రేకపరచే భావోద్వేగాలు అతన్ని ఉత్తేజపరచాలి. ఉమ్మడి కార్యకలాపాల్లో అతన్ని భాగస్వామిని చేయా లి.ఉమ్మడి సమాజం జయాపజయాలు తనవేనని భావించేట్లు ఉండాలి.ఇదే వ్యక్తులందర్నీ కలిపి సమా జంగా బంధించగల సూత్రం.హిందువుల్లో కుల వ్యవస్థ ఉమ్మడి కార్యకలాపాలను అడ్డుకుంటోంది. తద్వారా ఏకీకృత జీవనం గల సమాజంగా ఏర్ప డటాన్ని, ఒకే సమాజానికి చెందిన వారమన్న భావన కలగడాన్ని నిరోధిస్తుంది.చాతుర్వర్ణ వ్యవస్థ వల్లే తరత రాలుగా హిందూ సమాజం ఒడిదుడుకులను తట్టు కొని మనుగడ సాగిస్తూ వచ్చిందని కొందరు సంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. తరాల తరబడి లొంగిపోయి, రాజీపడి బతకడం కూడా బతకడమేనా? ఆజీవనంలో నాణ్యత ఏదీ ? ఉప కులాలను ఎదగనివ్వరు.ఉప కులాల మధ్యా పరస్పర సంబంధాలు విషతుల్యం అయ్యాయి.మహారాష్ట్ర బ్రాహ్మణ కులంలో అనేక ఉప కులాలున్నాయి. బ్రాహ్మణులు,ఇతర కులా ల మధ్య విభేదాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో, బ్రాహ్మ ణ ఉప శాఖల మధ్యా అంతే ఘోరంగా ఉన్నాయి. ఎక్కడైతే ఒక వర్గానికి స్వప్రయోజనాలు ఉంటాయో అక్కడ వాటిని కాపాడుకోవడానికి ఆవర్గం వాళ్లు ఇతర వర్గాలక దూరంగా ఉంటారు. ఈసంఘ వ్యతి రేక తత్వం,ఈ స్వప్రయోజన రక్షణ తత్వం దేశాల మధ్య ఎంత ప్రస్ఫుటంగా కనబడుతుందో కులాల మధ్యా అదే స్థాయిలో కనిపిస్తుంది. ప్రతీ కులం తమ స్వప్రయోజనాలను రక్షించుకోవడం కోసం తక్కిన కులాలతో నిరంతర పోరాటం చేస్తూ విడివిడి గుంపు లుగానే ఉంటున్నాయి.
కులం కోసం బాధ్యత గాలికి
దేశంలో కోట్లమంది ఆదిమవాసులు ఉన్నా రు. వేల ఏళ్లనాటి నాగరికత అని గొప్పలు చెప్పుకొనే ఈ దేశంలో ఆదిమ వాసులు ఇంకా దుర్భర అనాగరక పరిస్థితుల్లో జీవిస్తున్నారు.వారిలో కొందరిని నేర జాతులుగా పరిగణిస్తున్నారు. దీనికి హిందువులు సిగ్గు పడటం లేదు. కనీసం వారిని నాగరికులుగా మార్చడానికి, గౌరవ ప్రదమైన వృత్తుల్లోకి తీసుకు రావడానికి ప్రయత్నమే చేయలేదు. జన్మ సిద్ధమైన బుద్ధి మాంద్యమే కారణమని చెప్పడానికి ప్రయత్ని స్తారు. ఆదిమవాసుల కోసం క్రైస్తవ ధార్మిక సంస్థలు చేస్తున్నది హిందువు చేయగలిగే వాడా? వాళ్లను నాగ రికుల్ని చేయడమంటే ముందు నీవాళ్లుగా భావిం చాలి. వాళ్ల మధ్య జీవించాలి.వాళ్లలో సహానుభూతిని పెంపొందించాలి. ప్రేమించాలి. హిందువుడికి ఇది ఎలా సాధ్యం అవుతుంది?హిందువుకు కులాన్ని కాపాడుకోవడమే ముఖ్యం.
మారితే ఏ కులంలో చేరాలి?
హైందవం కూడా ఒకప్పుడు క్రైస్తవం లాగే మత ప్రచారానికి పాల్పడింది. లేదంటే ఇంతటి విశాల భూభాగంలో హిందూమతం విస్తరించి ఉండేది కాదు. కుల వ్యవస్థ ఏర్పడటంతోనే మత ప్రచారానికి తెర పడింది. కుల వ్యవస్థ ఉన్నచోట మతంలోకి రావడం కుదరదు.మతం మార్చుకున్న వారికి సంఘంలో లభించే స్థానం కూడా ముఖ్యమైన విషయమే. ఈనాడెవరైనా హిందూ మతం స్వీకరించదలచుకుంటే ఏ కులంలో చేర్చుకోవాలి?ఏదో ఒక క్లబ్బులో చేరినట్లు ఏదో ఒక కులంలో చేరడానికి లేదు. కులంలో పుట్టిన వారికే కుల సభ్యత్వం. కొత్తవారిని కులంలో చేర్పించే అధికారం ఈ భూమ్మీద ఎవరికీ లేదు. ఇతర మతాల వారిని కలుపుకొని తనను విస్తరించుకొనే అవకాశం హిందువులకు లేకపోవడానికి కారణం కుల వ్యవస్థే. దాన్ని రూపు మాపనంత వరకు ఇతర మతాల్లో వెళ్లిన వాళ్లను తిరిగి తీసుకొచ్చే శుద్ధి కార్యక్రమమÖ అర్థరహి తం,నిరర్థకం.హిందువుల్లోని కులాలకు,ఇతర మతా ల్లోని కులాలకు తేడా ఉంది.ముస్లిములు, సిక్కుల్లో అన్ని కులాలను కలిపి ఉంచేఉమ్మడి అంశాలున్నాయి. హిందువు విషయం అలా కాదు.కులం కూడా చెప్పా ల్సిందే. కులానికి అదనపు పవిత్రత లేదు.
సంస్కర్తలను పుట్టనివ్వరు
మతాచారాలను, కులం కట్టుబాట్లను వ్యతిరేకించే వారిని సాంఘిక జీవనం నుంచి వెలివేస్తు న్నారు.ఇదిచావుతో సమానం.దీనికి భయపడే సంస్కర ణాభిలాషులు కూడా కులం కట్టుబాట్లతో రాజీ పడి పోతున్నారు.కులంహిందువుల ప్రజాసేవాసక్తిని చంపేసింది.గొప్పతనం కలిగినవాడు తనకులం వాడై తేనే హిందువు అతని నాయకత్వాన్ని అంగీకరిస్తాడు.
తిరగబడతాడనే భయం
చాతుర్వర్ణ విధానం అత్యంత ప్రమాదకరమైన వ్యవస్థ. బ్రాహ్మణులు జ్ఞానాన్ని అభివృద్ధి చేస్తారు. క్షత్రియులు ఆయుధాలు పట్టుకొని రాజ్య రక్షణ భారం వహిస్తారు.వైశ్యులు వ్యాపారం చూసుకుంటారు. శూద్రులు ఈ మÖడు వర్గాలకు సేవకులుగా పని చేస్తారు.వినడానికి ఇది ‘పనిసేవకులుగా పని చేస్తారు. వినడానికి ఇది పనివిభజన’ లాగే ఉంటుంది. శూద్రు లు విద్య,రక్షణ,సంపాదన కోసం కష్టపడా ల్సిన అవసరం లేదని, వారి యోగ క్షేమాల్ని మొదటి మÖడు వర్గాలు చూసుకుంటాయని మనువాదులు తీయగా చెబుతుంటారు. వారి అసలు ఉద్దేశం శూద్రుణ్ణి తొక్కి పట్టి ఉంచడమే. మనుధర్మ శాసనాలను మించిన దుష్ట శాసనాలు ప్రపంచంలో మరెక్కడా లేవు. ప్రపంచ మంతటా సాంఘిక విప్లవాలు వచ్చినా భారతదేశంలో రాలేదంటే కారణం ఇదే. దిగువ కులాలు చదువు కోలేక పోవడం వల్లే విముక్తిని గురించి ఆలోచించే శక్తిని కోల్పోయాయి. ఐరోపాలోనూ పీడిత ప్రజలు ఎన్నడూ ఇంత నిస్సహాయంగా లేరు. వారిచేతుల్లో ఎప్పుడూ ఆయుధం ఉంది. భారతదేశంలో కేవలం మౌర్యుల కాలంలోనే కింది కులాలు రాజకీయ అధి కారాన్ని అనుభవించాయి. అప్పుడే చాతుర్వర్ణ వ్యవస్థ ధ్వంసమై పోయింది. శూద్రులు రాజులయ్యారు. ఎప్పుడో శివాజీకి నాటిబ్రాహ్మణులు చేసిన అగౌర వాన్నికడుపులో పెట్టుకొని నేటికీబ్రాహ్మణేతరులు వారిని క్షమించలేకున్నారు.
కాయస్థులు తమపూర్వీకులపై అప్పటి బ్రాహ్మ ణులు వేసిన అభాండాలను దృష్టిలో పెట్టుకొని ఇప్ప టికీ వారిని క్షమించలేకున్నారు. కుల వ్యవస్థ వల్లే తరాలు మారినా గత కలహాలు అలా రగులుతు న్నాయి. జాతి ఏకీకరణకు అడ్డంకిగా నిలుస్తున్నాయి. కులం అక్కర లేని ఆదర్శప్రాయ సమాజం స్వాతం త్య్రం,సమానత్వం,సౌభ్రాతృత్వం పునాదుల మీద ఆధా రపడి నిలుస్తుంది. సమాజంలో ఒక మÖల మార్పు జరిగితే అది అన్ని మÖలల ప్రతిఫలిస్తుంది. మానవు లందరిలో సాంఘిక సోదరత్వం ఉంటుంది. కుల నిర్మూలనకు సరైనమార్గం వర్ణాంతర వివాహాలే. రక్త సమ్మిశ్రణ ఒక్కటే మానవుల్లో అన్యోన్య అనుబంధ భావాన్ని, బాంధవ్యాలను కలిగిస్తుంది. అట్టి బంధు భావ ప్రభావం లేనిదే కులం కల్పించిన విభేదాలను, వివక్షను రూపుమాపలేం.వివిధ కులాల మధ్య స్నేహానుబంధాలను కలిగించాలంటే ఆయా కులాల వ్యక్తుల నడుమ రక్త సంబంధాలను కల్పించక తప్పదు. – జి.ఎ.సునీల్ కుమార్
