విద్యా హక్కు చట్టానికి 16 ఏళ్లు
దేశంలో 6 నుంచి 14 ఏండ్లలోపు ఉన్న బాలలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించటానికి ఉద్దేశించిన చట్టమే విద్య హక్కు చట్టం` 2009. ఈ విద్యా హక్కు చట్టం 2009 ఆగస్టు 28న రాష్ట్రపతి ఆమోదం పొందింది. కేంద్ర ప్రభుత్వం 2009 ఆగస్టు 26న ఈ బిల్లును ఆమోదించింది. జమ్ముకశ్మీర్ మినహా దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ చట్టం 2010 ఏప్రిల్ 1న అమల్లోకి వచ్చింది. ఈ చట్టంలో 7 అధ్యాయాలు, 38 సెక్షన్లు, ఒక అనుబంధ షెడ్యూలఉన్నాయి. అయితే ఈ చట్టం ప్రవేశ పెట్టి నేటికి 16 ఏళ్లు అవుతున్న నేటికీ సంపూర్ణంగా అమలు కాలేదనేది నిర్వాదాంశమే. – జి ఏ సునీల్ కుమార్
విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చి 16 సంవ త్సరాల్లోకి అడుగుపెట్టింది.2010 ఏప్రిల్ 1నుంచి అమలులోకి వచ్చింది.6 నుంచి 14 ఏళ్ల వయస్సు బాలలందరికీ ఉచిత నిర్బంధ విద్య అందించాలనే ఏర్పడి విద్యాహక్కు చట్టం వచ్చి ఏప్రిల్ 1కి పదహేరేళ్లు పూర్తయ్యాయి. కానీ ఇప్పటి వరకూ అది నెరవేరనేలేదు. పలు పరిశ్రమల్లోను..చెత్త ఏరుకుంటు..ఇలా పలు పనులలో బాలబాలికలు మగ్గిపోతుండటమే దీనికి నిదర్శనం.ఈ చట్టాన్ని అమలు చేయ టంలో రాష్ట్ర ప్రభుత్వాల ఉదాసీ నతే దీనికి కారణంగా కనిపిస్తోంది. విద్యాహక్కు చట్టాన్ని నిర్లక్ష్యం చేస్తున్న అంశంపై సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది.బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్యనందించాల్సి ఉన్నా,గ్రామీణ,పేద విద్యార్థు లకు నాణ్యమైన విద్య అందడం లేదు. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఆర్ధికంగా వెనకబడిన వర్గాలకు 25శాతం రిజర్వేషన్లు కల్పించాలని చట్టంలో పేర్కొన్నారు.ఎక్కడా అమలు కావడం లేదు. ప్రభుత్వం సర్కారు స్కూళ్లును బలోపేతం చేయ డంతోపాటు,ప్రైవేటు స్కూళ్లు ఫీజుల దోపిడీని ఆరికట్టాలి. కేంద్రర ప్రభుత్వం 86వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో ఆర్టికల్స్ 21ఎ, 45,51(కె)లను చేరుస్తూ దేశంలోని 6నుంచి 14సంవత్సరాల వయసు గల బాల, బాలికలకు ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్ధేశించింది. ఆర్టికల్ 21ఎప్రకారం దేశంలోని 6నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయాలి.ఆర్టికల్ 45ప్రకారం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బాల, బాలికలకు 6సంవత్సరాల వయస్సు వరకు ఉచిత విద్యా సదుపాయాలు కల్పించాలి.ఆర్టికల్ 51(కె)ప్రకారంబాల,బాలికల తల్లిదండ్రులు లేదా సంరక్షకులు వారి సంతానానికి 6నుంచి14ఏండ్ల వరకు విద్యనందించే సదుపా యాలు ఏర్పాటు చేయాలి.
విద్యాహక్కు చట్టం రూల్స్
విద్యాహక్కు చట్టం సెక్షన్ 26ప్రకారం టీచర్స్ ఖాళీలు10శాతానికి మించకుండా ఉండాలి.(ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉంది) సెక్షన్ 23 ప్రకారం ఉపాధ్యాయ నియామక అర్హతలు తప్పనిసరి చేయాలి.28 ప్రకారం గవర్నమెంట్ టీచర్స్ ప్రైవేటు విద్యాసంస్థల్లో టీచింగ్ చేయ కూడదు. సెక్షన్ 12ప్రకారం బడుగు బలహీన వర్గాల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం ప్రవేశాలు కల్పించి, ఉచిత నిర్బంధ విద్య అందిం చాలి. ఇలా చట్టంలో ఎన్నో అంశాలు విద్యాహక్కు చట్టంలో పొందు పరిచినా..అవి అమలుకు నోచుకోకపోవటం విచారకరం.దీనిపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రత్యక్షంగా కనిపిపస్తోంది.
విద్యాహక్కు చట్టం ఉద్ధేశాలు
విద్యను బాలల ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ విద్యను హక్కు పొందాలని ఈ చట్టం ముఖ్య ఉద్ధేశ్యం.6-14 ఏళ్ల మధ్య వయసు బాలబాలి కలందరూ తప్పనిసరిగా పాఠశాలల్లో చేరి చదువుకునేలా చూస్తూ, వారికి ఉచిత విద్య అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6-14 ఏళ్ల మధ్య వయసు బాలబాలికలు 92లక్షల మందికిపైగా పాఠశాల చదువులకు దూర మయి ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. పాఠశాలల్లో చేరని, లేదా మధ్యలోనే చదువు మానేసిన వీరందరినీ తిరిగి చదువుల బాట పట్టించటం విద్యాహక్కు చట్టం ముఖ్యోద్దేశం. స్కూలు నిర్వహణ కమిటీ లేదా స్థానిక ప్రభుత్వం పాఠశాల చదువులకు దూరంగా ఉండిపోతున్న ఆరేళ్లపైబడిన బాలిబాలిక లందరినీ గుర్తించి, వారికి తగిన శిక్షణ ఇప్పించి, పాఠశాలలో తగిన తరగతిలో చేర్పించాలి.ఏ విద్యార్థికీ పాఠశాలలు అడ్మిషన్‌ను నిరాకరించటానికి వీల్లేదు.ప్రైవేటు పాఠశాలలు సైతం 25%సీట్లను బలహీన,పేద వర్గాలకు కేటాయించాలి.దీనికి సంబంధించిన వారి ఖర్చులను ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. అంటే దానికి సంబంధించిన నిధులను 55-45 శాతం కేంద్రం రాష్ట్రాలు భరించాలి.
విద్యాహక్కు చట్టంలోని ముఖ్యంశాలు
దేశం స్వాతంత్య్రం పొందిన దాదాపు అరవై ఏళ్లకు దేశ చరిత్రలో విద్యకి సంబంధించిన కీలక చట్టం అమల్లోకి వచ్చింది. అదే విద్యా హక్కు చట్టం- 2009.యÖపీఏ ప్రభుత్వ హయాంలో 2009, ఆగస్టు 26న విద్యాహక్కు బిల్లు ఆమోదం పొందింది. 2009, ఆగస్టు 27న అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ సంత కాలతో గెజిట్ రూపంలో ఆవిర్భవించింది.ఈ బిల్లు బాలల మౌలిక హక్కు (అధికరణ 21)లో సవరణ చేయడంతో రూపొందింది. దీన్నే 21అధికరణ అంటారు.రాజ్యాంగంలో ఈ సవరణను 86వ సవరణగా పిలుస్తారు. ఈ బిల్లు 2010, ఏప్రిల్ 1నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చింది. విద్య అనేది ప్రాథమిక హక్కుగా మారడం దేశ చరిత్రలో ఒక చారిత్రక ఘట్టం.దేశంలో ప్రతీ బాలబాలికలు బడిలోనే ఉండాలి..ఇదే విద్యాహక్కు చట్టం యొక్క ముఖ్య ఉద్ధేశ్యం.
విద్యాహక్కు చట్టం అమలు ఏది?
పాఠశాలకు వెళ్లాల్సిన బడి ఈడు పిల్లలు బడిలో చేరడం, చేరినవారు కొనసాగడం, వారందరూ ఆనందంగా అర్థవంతంగా నేర్చుకోవడానికి అనువైన, ప్రోత్సాహకరమైన, స్వేచ్ఛాపూరిత వాతావరణం పాఠశాలల్లో కల్పించడానికి 13 ఏళ్ల క్రితం ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య హక్కు చట్టం అమల్లోకి వచ్చింది. 6 నుంచి 14 సంవత్సరాల వయస్సుగల పిల్లలందరికీ ప్రాథమిక విద్యను హక్కుగా మారుస్తూ సమున్నత ఆదర్శాలతో పట్టాలెక్కిన ఈ చట్టం ఆచరణలో చతికిల పడింది. దేశంలోని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశా లలన్నీ పాతిక శాతం సీట్లను నిరుపేద విద్యార్థు లకు కేటాయించాలనే ఈ చట్టం నిబంధనను ఖాతరు చేస్తున్న వారు కనిపించడం లేదు. అడ్డంగా చట్టం నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్పటికీ పాఠశాలలను నియంత్రించే సరైన పర్యవేక్షణ లేదు. దీంతో క్షేత్రస్థాయిలో చట్టం అమలు అభాసుపాలు అవుతున్నది. విద్యాహక్కు చట్టం సక్రమంగా అమలు కాకపోవడంవల్ల దేశంలో 6కోట్ల మంది పిల్లలు పాఠశాల మొహమే చూడడం లేదు. అన్నిటినీ మించి బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం (ఎనఇపి) విద్యాహక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసేలా వుంది.
చట్టం అమలులో నిర్లక్ష్యం
సమాజంలో కొంత మంది పిల్లలు బడి బయట ఉండిపోవడం, బాల కార్మికులుగా పనుల్లో కారా?నాల్లో గనుల్లో పని చేయడం, వారి ప్రవేశానికి పాఠశాల నియమ నిబంధనలు అడ్డంకి రావడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రాథమిక హక్కుగా మారిన విద్యను పిల్లలందరూ పొందడానికిగాను ఉచిత నిర్బంధ విద్యకు ‘బాలల విద్యా హక్కు చట్టం-2009’ దేశవ్యాప్తంగా 2010 ఏప్రిల్ 1 నుండి అమలులోకి వచ్చింది. చట్టం అమలులోకి వచ్చిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ అప్పటి ప్రధాని మాట్లాడుతూ జాతి,మత, కులాలకు అతీతంగా దేశంలోని బాలలందరిని బడిలోకి చేర్పించి నాణ్యమైన విద్యను చట్టం ద్వారా అందిస్తా మన్నారు. కానీ నేటికీ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం నెరవేరలేదు. చట్టం సక్రమంగా అమలు కావాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో 6 శాతం నిధులను విద్యాభివృద్ధికి కేటాయించాలి. అరకొర కేటా యింపులతో అద్భుత ఫలితాలు సాధించడం సాధ్యం కాదనే విషయాన్ని గతంలో సుప్రీంకోర్టు తేల్చి చెప్పినప్పటికీ ప్రభుత్వాలు విద్యాభివృద్ధికి కేటాయిస్తున్న నిధులు పేలవంగా ఉంటున్నాయి. నేటికీ ప్రాథమిక పాఠశాల లేని గ్రామాలు, మౌలిక సదుపాయాలు లేమి, ఉపాధ్యాయుల కొరతతో విద్యా రంగం అవస్తలు పడుతోంది. కరోనా కాలంలో దేశంలో 92 లక్షల బాలబాలికలు బడికి దూరం అయ్యారని పలు గణాంకాలు విశ్లేషణ చేస్తున్నాయి. అలాగే ఇటీవల కాలంలో మన రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు నాలుగు లక్షలకు పైగా తగ్గారని గణాంకాలు తెలియజేస్తున్నాయి. విద్యాహక్కు చట్టం అమలులో భాగంగా బడి ముఖం చూడని పిల్లలను పాఠశాలలో చేర్పించేందుకు ఉద్దేశించిన పథకం సమగ్ర శిక్షా అభియాన్ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఎందుకూ కొరగానిదిగా మారింది.
అమలుకు నోచుకోని చట్టం నిబంధనలు
విద్యా హక్కు చట్టం సెక్షన్ 12ప్రకారం దేశంలోని ప్రతి కార్పొరేట్, ప్రవేట్ పాఠశాలలు ప్రతి విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి ప్రవే శాల్లో 25 శాతం సీట్లు బలహీన వర్గాలకు ఉచి తంగా కేటాయించాలి. ఇందులో భాగంగా విక లాంగులు, అనాథలు, వీధి బాలలకు 5శాతం, ఎస్‌సి బాలలకు 10శాతం, గిరిజన బాలలకు 4శాతం, వెనుకబడిన వర్గాల పిల్లలకు 6శాతం సీట్లను ఉచితంగా కేటాయించాలి. కానీ అటు దేశంలో ఇటు రాష్ట్రంలో అధిక శాతం పాఠశా లలు ఈ చట్టం నిబంధనలను పాటించడం లేదు. అలాగే సెక్షన్ 13 ప్రకారం ప్రాథమిక స్థాయిలో వివిధ పాఠశాలల్లో పిల్లల ఎంపిక కోసం ఎలాంటి ఎంట్రన్స్‌లను నిర్వహించ కూడదు. కానీ ఈ చట్టం నిబంధనలు ఉల్లం ఘిస్తూ మన రాష్ట్రంలో గురుకుల,ఆదర్శ పాఠశాలల్లో విద్యార్థుల ఎంపిక కోసం ఎంపిక పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థుల ప్రవేశం కోసం ఎలాంటి క్యాపిటేషన్ రుసుములు తీసుకో కూడదు. కానీ ఈ చట్టం నిబంధనలు బేఖాతరు చేస్తూ డొనేషన్, అడ్మిషన్ ఫీజులను ఇబ్బడి ముబ్బడిగా వసూలు చేస్తున్నాయి. అలాగే సెక్షన్ 18 ప్రకారం గుర్తింపు లేకుండా ప్రైవేట్ పాఠశాలలు నడపరాదు. అలా నడిపితే ఈ చట్టం నిబంధనల ప్రకారం జరిమానాలు వసూలు చేయవచ్చు. కానీ చాలా గ్రామీణ ప్రాంతాలలో, మారుమÖల ప్రాంతాల్లో ప్రైవేట్ పాఠశాలలు నెలకొల్పుతూ ఎలాంటి అనుమ తులు లేకుండా పాఠశాలలను నడుపుతున్నారు. దీనిపై ప్రభుత్వాల సరైన పర్యవేక్షణ లేకపో వడం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారు.
చట్టం అమలుకు చర్యలు తీసుకోవాలి
ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య హక్కు చట్టం సత్ఫలితాలను ఇవ్వాలంటే%……%విద్యా హక్కు చట్టం సెక్షన్ 25 ప్రకారం మొదట పాఠశా లల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి. ప్రస్తుతం దేశంలో 9 లక్షల ఉపాధ్యా య పోస్టులు, అలాగే రాష్ట్రంలో 30 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు ఉన్నాయి. విద్యా హక్కు చట్టం నిబంధనలకు అనుగు ణంగా వాటిని వెంటనే భర్తీ చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి. బాలకార్మి కులను ‘ఆపరేషన్ స్మైల’ వంటి ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ఎప్పటికప్పుడు గుర్తిస్తూ బడి ఈడు పిల్లలందరూ బడిలో కొనసాగేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. పిల్లల సంపూర్ణ వ్యక్తిత్వ వికాసమే లక్ష్యంగా పాఠశాల విద్య ఉండాలి. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు,పౌర సమాజం ఏకతాటిపై నిలిచి మొక్కవోని దీక్షతో కృషి చేస్తే విద్యా హక్కు చట్టం లక్ష్యాలు నెరవేరతాయి. విద్యా హక్కు చట్టానికి 15 సంవత్సరాల్లోకి అడుగు పెట్టింది. పూర్తయిన సందర్భంగానైనా చట్టం అమలుపై సమీక్ష జరిగి పూర్తి స్థాయిలో అమలుకు చర్యలు తీసుకుంటారని..ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి..భావిపౌరులకు గుణాత్మక విద్య అందాలని ఆశిద్దాం..!
