అటవీ ఉత్పత్తులు తగ్గుతున్నాయ్

ఉత్తరాంధ్ర గిరిజన ప్రాంతాలైన అల్లూరి జిల్లా, పార్వతీ పురం మన్యం ప్రాంతాల్లో గిరిజనులకు జీవనా ధారమైన అటవీ ఉత్పత్తులు గణనీయంగా తగ్గిపోతున్నాయి. అడవిలో సహజంగా పండే ఉత్పత్తులు వాతావరణ మార్పుల్లో చోటు చేసుకున్న నేపథ్యంలో తుఫాన్ల సమ యంలో నేలకొరిగిన చెట్లు కారణంగా ఉత్పత్తి సేకరణ తగ్గిపోయాయి.పడిపోయిన చెట్లు స్థానంలో విత్తనాలు లభించక గత ఐదేళ్లగా మొక్కలు నాటక పోవడంవల్ల ఉత్పత్తులు తగ్గిపోతున్నాయని గిరిజనులు వాపోతున్నారు.– జి.ఎన్.వి.సతీష్
పార్వతీపురం మన్యం జిల్లా మెళియాపుట్టి మండలంలో ఒకప్పుడు అధికంగా ఉండే నరమా మిడి చెట్లు ఇప్పడు కనుమరుగయ్యాయి. పదేళ్ల కిందట అధికంగా కుడ్డబ, దీనబందుపురం, నాయుడు పోలూ రు తదితర గ్రామాల సమీపాన కొండల్లో ఏటా 50క్వింటాళ్ల వరకూ నరమామిడి చెక్కను జీసీసీ సిబ్బంది కొనుగోలు చేసేవారు. 2018లో సంభవిం చిన తితలీ తుఫాన్ ప్రభా వంతో చెట్లన్నీ నెలకొరి గాయి.గతఐదేళ్లుగా అటవీ శాఖద్వారా కొండల్లో మొక్క లు నాటడం లేదు. దీంతో నరమామిడి చెట్లు కనుమరుగయ్యాయని గిరిజనులు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు.
అడవుల్లో సహజ సిద్ధంగా లభ్యమయ్యే ఉత్పత్తులు తగ్గుతున్నాయి. జిల్లాలోని మెళియాపుట్టి, నందిగాం,టెక్కలి,పాతపట్నం,మందస,కొత్తూరు, హిర మండలం, మండలాల పరిధిలో అధికంగా అటవీ ఉత్పతుల సేకరణ జరిగేది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఔషధ మొక్కలు నాటి వాటి ద్వారా గిరిజనులకు ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టేవారు.జీసీసీ ద్వారా అటవీ ఉత్పత్తులు సేకరించేవారు. అయితే అడవుల్లో గతంలో ఉన్న ఔషధ మొక్కలు, చెట్లు ప్రస్తుతం కనిపించటం లేదు. ప్రకృతి వైపరీత్యాలతో చాలా చెట్లు నేలకొరిగాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో గత ఐదేళ్లూ అటవీశాఖ అధికారలుఉ కనీస స్థాయిలో మొక్కలు నాటలేదు. మరోవైపు కొంతమంది గిరిజనులు పోడు వ్యవసాయం చేసేందుకు చెట్లను నరికేస్తున్నారు. దీంతో విప్ప, నరమామిడి చెక్క, ఉసిరి, అడ్డాకులు, కొండ తామర జిగురు తదితర చెట్లు కనుమరుగ య్యాయి. ప్రస్తుతం అధికంగా కుంకుళ్లు, చింతపండు, కొండచీపుర్లు మాత్రమే గిరిజనుల నుంచి జీసీసీ అధికారులు సేకరిస్తున్నారు. విప్ప పంట ద్వారా గిరిజనులకు అధికంగా ఆదాయం వచ్చేది. ప్రస్తుతం విప్ప పంట లేక..జీసీసీ అధికా రులు కొనుగోలు చేయడం లేదు. అలాగే అటవీ ప్రాంతాల్లోని చెట్లకు ఉన్న తేనె పట్టుల నుంచి తేనె సేకరించి ఇతర రాష్ట్రాలకు తరలించేవారు. తుఫాన్ల కారణంగా చెట్లు నేలకొరగడంతో తేనెతీగల పట్లు ఎక్కడా కనిపించడం లేదు. దీంతో తేనె సేకరణ తగ్గింది. అలాగే పదేళ్ల కిందట జిల్లా నుంచి 5వేల క్వింటాళ్ల వరకూ జీసీసీ ద్వారా నరమామిడి చెక్కను గిరిజనులు సేకరించేవారు. ప్రస్తుతం నరమామిడి చెట్లు లేక 50 క్వింటాళ్లు కూడా రావడం లేదని జీసీసీ అధికారులు చెబుతున్నారు. గిరిజనులు సేకరిస్తామన్నా..చెట్లు లేని పరిస్థితి నెలకొందన్నారు.అడవుల్లో సహజంగా లభించే ఉసిరికాయల చెట్లు కూడా కనిపించడం లేదు. కొన్ని ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు నరికి ఉసిరి కాయలు సేకరిస్తున్నారు. దీంతో చెట్లు మళ్లీ చిగురించక.. ఉసిరి పంట కూడా కరువవుతోంది. గతంలో గిరిజనులు సేకరించే అడ్డాకులకు భలే గిరాకీ ఉండేది. ప్రస్తుతం ప్లాస్టిక్ వినియోగం పెరగడంతో అడ్డాకులకు డిమాండ్ తగ్గింది. దీంతో అడ్డాకుల సేకరణపై గిరిజనుల్లో ఆసక్తి సన్నగిల్లుతోంది. అలాగే అధికంగా ఔషధాలకు వినియోగించే కొండతామర జిగురు కూడా ఎక్కడా కనిపించడం లేదు. మందస, మెళియాపుట్టి, నందిగాం తదితర ప్రాంతాల్లో ఒకప్పుడు విరివిగా ఉన్న ఈ చెట్లు.. ప్రస్తుతం కనుమరుగయ్యాయి. చింత, కుంకుడు చెట్లు కూడా ముదిరిపోవడంతో ఉత్పత్తులు తగ్గుతు న్నాయి. ఒకప్పుడు లారీల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించేవారు. ప్రస్తుతం ఏడాదికి జీసీసీ ద్వారా 500 క్వింటాళ్ల కుంకుడు కాయలు, 2,500 క్వింటాళ్ల చింతపండు మాత్రమే సేకరిస్తున్నారు. కొండచీపుర్లు కూడా ఏడాదికి పదివేల కట్టలు మాత్రమే సేకరిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. అటవీ ఉత్పత్తులు తగ్గడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడవుల్లో మొక్కలు నాటాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.కూటమి ప్రభుత్వం స్పందించి అటవీశాఖ ద్వారా ఔషధాలకు వినియోగించే మొక్కలు నాటేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో ఒకప్పుడు సుమారు 20రకాల అటవీ ఉత్పత్తులు పుష్కలంగా లభించేవి. ప్రధానంగా తేనె, మైనం,చింతపండు, ఇండిగపిక్కలు, ముసి డిక పిక్కలు,మారేడు గడ్డలు,వెప్ప పువ్వు, కాగు పుప్వు,కరక్కాయలు,గచ్చకాయలు,నరమా మిడిచెక్క,కొండచీపుర్లు, కుంకుడుకాయలు,ఎండ ఉసిరిపప్పు,నల్లజీడిపిక్కలు తదితర వాటిని విక్రయిస్తూ గిరిజనులు జీవనం సాగించేవారు. అయితే కాలక్రమంలో అటవీ ప్రాంతం తగ్గడం, తదితర కారణాలవల్ల గిరిజనులు అనేక ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. కొన్ని రకాల అటవీ ఉత్పత్తులు మాత్రమే లభిస్తుండగా..వాటికి కూడా గిట్టుబాటు ధర దక్కడం లేదు.వివిధ కారణాలతో జీసీసీ అధికారులు పూర్తిస్థాయిలో అటవీ ఉత్పత్తు లను కొనుగోలు చేయడం లేదు.గిట్టుబాటు ధర కూడా కల్పించడం లేదు. దీంతో గిరిజనులు తమ అటవీ ఉత్పత్తులను నష్టానికే మైదాన ప్రాంతాల వ్యాపారులకు విక్రయించాల్సి వస్తోంది.
రెగ్యులర్ సిబ్బంది లేక ..
ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు ప్రత్యేక సేవలు అందించాల్సిన జీసీసీ డిపోలను రెగ్యులర్ సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది.దీంతో అవి ఉత్సవ విగ్రహాలుగా మారాయి. గుమ్మలక్ష్మీపురం పరిధిలో 46, సాలూరులో 38,పార్వతీపురంలో 17 డిపో లు ఉన్నాయి. మొత్తం 101డిపోల పరిధిలో 14 మంది రెగ్యులర్ సేల్స్‌మెన్ ఉన్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.18 డిపో లకు ఎటువంటి సిబ్బంది లేరు.కాగా మిగితా వాటిని కాంట్రాక్ట్ సేల్స్ మెన్, మహిళా సంఘాల, డీలర్లు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.ఇన్‌చార్జిల నేతృత్వంలోనే డిపోలను నిర్వహించాల్సిన పరిస్థితి పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో ఉంది. సీతంపేట ఐటీడీఏ పరిధిలోనూ పూర్తిస్థాయిలో సేల్స్‌మెన్‌లు లేరు.దీంతో డిపోల ద్వారా గిరిజన ప్రాంతాల ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు.
శిథిలావస్థలో డిపోలు…
పార్వతీపురం జీసీసీ పరిధిలో ఉన్న అనేక డిపోలు శిథిలావస్థలో ఉన్నాయి. ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి. దీంతో సిబ్బంది బిక్కుబిక్కు మంటూ విధులు నిర్వర్తించాల్సి వస్తోంది.భవ నాల మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేయాలని అధికారులు ప్రతిపాదనలు పంపినా మోక్షం కలగలేదు. గోదాముల పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది.
కోల్డ్ స్టోరేజీలు ఎక్కడ…
జీసీసీకి జిల్లాలో ఎక్కడా కోల్డ్ స్టోరేజీలు లేవు. దీంతో ఏటా లక్షలాది రూపాయలను ప్రైవేట్ వ్యాపారులకు కట్టబెడుతున్నారు తప్ప సొంతంగా ఏర్పాటు చేసుకోలేకపోతున్నారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం సమీపంలో ఉన్న వేములవలస వద్ద కోల్ట్‌స్టోరేజ్ నిర్మాణాన్ని చేపట్టారు. కానీ అవసరమైన యంత్రాలు రాకపోవడంతో ఆ పను లు పూర్తికాలేదు. సుమారు రూ.మÖడు నుంచి నాలుగు కోట్లు వెచ్చిస్తే..మÖడు జిల్లాల పరిధిలో గిరిజన రైతుల నుంచి కొనుగోలు చేసిన చింతపండును జీసీసీ కోల్డ్‌స్టోరేజ్‌లో నిల్వ చేసు కోవచ్చు.కానీ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు.ఇప్పటికైనా జీసీసీకి కోల్డ్‌స్టోరేజ్ ఏర్పాటు చేస్తే..ఏటా లక్షల రూపాయలు ఆదా చేసుకో వచ్చు. ప్రైవేట్ వ్యాపారులకు అద్దె ప్రాతిపదికన భారీగా చెల్లించాల్సిన అవసరం ఉండదు.గిరిజన రైతులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉం టుంది.నిరూపయోగంగా విలువైన స్థలాలు గిరిజన సహకార సంస్థకు ఉమ్మడి జిల్లాలోని గుమ్మల క్ష్మీపురం ఎస్.కోటతో పాటు విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో విలువైన స్థలాలు ఉన్నాయి. ఈ ప్రాం తాల్లో షాపింగ్ కాంప్లెక్స్ తదితర కమర్షియల్ గొడౌన్లు నిర్మిస్తే జీసీసీకి ఆదాయం ఎంతో వస్తుంది. కానీ దీనిపై అధికార యంత్రాంగం దృష్టి కేం ద్రీకరించడం లేదు.ఈ విషయాన్ని పాలకులకు చెప్పినా పట్టించుకునే వారే కరువ య్యారు.దీంతో జీసీసీకి చెందిన విలువైన స్థలాలు నిరుపయోగంగా మారాయి.
గిరిజనులకు ఊరట
గిరిజనుల నుంచి నేరుగా అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేసి.. వారికి గిట్టుబాటు ధర కల్పిం చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.సర్కారు ఆదేశాలు జారీ చేయండంతో గిరిజన కార్పొరేషన్ సంస్థ (జీసీసీ) అటవీ ఉత్పత్తుల ధరలను పెం చింది. గత ఏడాది కంటే ధరలు పెరగడంతో గిరిజనులకు కాస్త ఊరట కలగుతుందని చెప్పొచ్చు.ఇకపై వారు దళారులను ఆశ్రయిం చాల్సిన అవసరం ఉండదనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
గత ఏడాది ఇలా..
గత ఏడాది పిక్కతో కూడిన కిలో చింతపండు ధర రూ.32-40పైసలు, పిక్కతీసిన చింతపండు రూ.63,కాగుపప్పు రూ.22, విప్పపప్పు రూ.29, కొండతామర జిగురు రూ.114,ముసిడిక పిక్కలు రూ.90, కరక్కాయలు రూ.18,ఎండు ఉసిరిక పప్పు రూ.80, ఇండికా పిక్కలు రూ.50, కానీ కాయలు రూ. 17,కుంకుడుకాయలు రూ.35, సీకా కాయి రూ.40,అడవి తేనె రూ. 250, పుట్ట తేనె రూ.160, తేనె మైనం రూ.160,కొండ చీపుర్లు గ్రేడ్-1 రూ.45
తాజాగా పెరిగిన రేట్లు ప్రకారం…
పిక్కతో ఉన్న కిలో చింతపండు రూ.34,పిక్కతీసిన చింతపండు రూ.67,కాగుపప్పు రూ.25, విప్ప పప్పు రూ.32,ముసిడిక పిక్కలు రూ.వంద, నల్లజీడి పిక్కలు రూ.22,కరక్కాయలు రూ.20, ఎండు ఉసిరిక పప్పు రూ.90, కానీ కాయలు రూ.18కు పెంచారు. మిగిలిన అటవీ ఉత్పత్తుల రేట్లలో ఎలాంటి మార్పు లేదు. గత సంవత్సరంతో పోల్చుకుంటే చింతపండుకు పిక్కతో ఉన్న దానికి రూ.రెండు, పక్కి తీసిన దానికి రూ.నాలుగు పెం చారు.చింతపండు, మిగిలిన అటవీ ఉత్పత్తులను గిరిజనుల నుంచి నేరుగా జీసీసీ కొనుగోలు చేస్తేనే లక్ష్యాలు నెరవేరే అవకాశం ఉంది.గిరిజన రైతులకు కూడా ఎంతోకొంత గిట్టుబాటు అవు తుంది.దీనిపై జీసీసీ ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు.
ధరలపై అవగాహన
గిరిజనులకు జీసీసీ ధరలు, అటవీ ఉత్పత్తుల కొనుగోలుపై అవగాహన కల్పించారు. దళారులకు విక్రయిస్తే నష్టపోతారని,జీసీసీకి అమ్మితే గిట్టుబాటు ధర లభిస్తుందని వివరించారు. అనం తరం ధరల పట్టికను ప్రదర్శించారు. ఈ కార్య క్రమంలో జీసీసీ బ్రాంచి డైరెక్టర్ నూకమ్మ, సర్పంచ్ గంగమ్మ, సేల్స్‌మన్ ఎస్.రమణారావు తదితరులు పాల్గొన్నారు.