విశాఖలో అడ్డగోలుగా భూ ఆక్రమణ

గతంలో తెలుగుదేశం ప్రభుత్వం వున్నప్పుడే భూమి ఆక్రమణలకు గురైంది. ల్యాండ్‌ ట్యాంపరింగ్‌ అయింది. ఆ సందర్భంగానే సిట్‌ను వేసి దర్యాప్తు చేశారు. మరలా వైఎస్‌ఆర్‌సిపి అధికారంలోకి రాగానే మరో సిట్‌ వేసి దర్యాప్తు చేశారు. ఈ రెండు సిట్‌ ల నివేదికలను నేటికీ ఎందుకు బహిర్గతం చేయడంలేదు? నాడు చంద్రబాబు, నేడు జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వాలు భూ కబ్జాదారులను కాపాడే పనిలో నిమగమ య్యాయనేది జగమెరిగిన సత్యం. ఈ భూముల కుంభకోణంలో అధికార, ప్రతిపక్ష పార్టీ పెద్దలం దరూ భాగస్వాములుగా ఉన్నారు కాబట్టే నివేదికలు బయటకు రానివ్వకుండా పరస్పరం సహకరించు కుంటున్నారు.
పరిపాలనా రాజధాని ప్రకటనకు ముందు,తరువాత విశాఖలో భూకబ్జాదారుల ఆగ డాలు విపరీతంగా పెరిగాయి. ఇటీవల కాలంలో భూకబ్జాలలో రాజకీయ నాయకులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల బంధం మరింత పెనవేసుకుంది. అది వైసిపి లేదా టిడిపి ఏపార్టీ అధికారంలో వున్నా భూ దోపిడీ యథేచ్ఛగా సాగిపోతోంది. బిల్డర్లు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు రాజకీయ నాయకుల అవతారం ఎత్తి తమ వ్యాపారాలను మూడు పువ్వులు,ఆరు కాయలుగా అభివృద్ధి చేసుకుం టున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా భూ కుంభకోణా లకు నిలయంగా మారింది. రాజకీయ నాయకులు ప్రజల ఆస్తులను కొల్లగొడుతూ తమ ఆస్తులు, బంధువుల ఆస్తులు పెంచుకొనే పనిలో నిమగమై వున్నారు. తీగ లాగితే డొంక కదిలినట్లు ఉమ్మడి విశాఖలో ఒక్కొక్కటిగా భూ కుంభకోణాలు బయట కొస్తున్నాయి. చివరకు భూ కుంభకోణాలు పత్రికల్లో, ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తలు చూసి లోకా యుక్త సుమోటోగా తీసుకుందంటేనే భూ కబ్జాలు ఏ స్థాయిలో జరిగాయో మనం అర్ధం చేసుకోవచ్చు. కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూము లను కాపాడాల్సిన అధికార పార్టీ పెద్దలే కబ్జాలు చేస్తున్నారు. ప్రభుత్వరంగ కేంద్రంగా,ఆర్థిక రాజ ధానిగా ఉన్న విశాఖలో భూ కబ్జాదారులు స్వాహా చేసిన భూముల వివరాలు క్లుప్తంగా పరిశీలిద్దాం.
రుషికొండ విధ్వంసం
విశాఖలో రుషికొండ పర్యాటకులకు అత్యంత ఆకర్షణీయమైన ప్రాంతం. గతంలో ఈ కొండ చుట్టూ టూరిజం డిపార్టుమెంట్‌ ఆధ్వర్యం లో అనేక రిసార్టులు నడిచాయి. పచ్చని ప్రకృతి నిలయాలుగా ఉన్న ఈ రిసార్టులు దేశ, విదేశాల నుంచి వచ్చిన పర్యాటకులకు ఎంతో ఆహ్లాదాన్ని అందించేవి. నేడు ఈపచ్చని కొండలను తవ్వి పర్యా వరణ విధ్వంసానికి కారకులయ్యారు. ఈ కొండల విధ్వంసంపై హైకోర్టు అనేక దఫాలు హెచ్చరించి నా రాష్ట్ర ప్రభుత్వం, భూకబ్జాదారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దీనిని పరిశీలించ డానికి వచ్చిన హైకోర్టు ప్రముఖ న్యాయవాది కె.ఎస్‌.మూర్తిపై అక్రమ కేసులు బనాయించారు. కొండల విధ్వంసం కొనసాగుతూనే వుంది. అదే రుషికొండ స్వర్ణభారతి నగర్‌ సర్వే నెంబర్‌ 17/1,2,5లో ఆర్థికంగా వెనుకబడిన ఈడబ్ల్యుఎస్‌ స్కీం కింద400 మందికి 60గజాల చొప్పున లేఅవుట్లు వేసి రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. వీటితో పాటు పార్కులు,రోడ్లు తదితర మౌలిక సదుపాయా లకు కేటాయించిన భూమి సుమారు 1.5 ఎకరాలు కబ్జాకు గురైంది.
దసపల్లా భూములు ప్రభుత్వానివి కావట !
దసపల్లా భూములు ప్రభుత్వ భూములు కావని స్వయానా ఎం.పి విజయసాయిరెడ్డి చెబుతు న్నారు. అత్యంత ఖరీదైన ఈ 15ఎకరాల భూముల విలువ సుమారు రూ.2000కోట్లు.దసపల్లా భూ ముల యజమానులుగా చెప్పుకుంటున్న 64 మంది ఒకే మాటపై వచ్చి తమకు 29శాతం వాటా, బిల్డర్‌కు 71శాతం అని అంగీకరించారు. దసపల్లా భూములు సీలింగ్‌ భూములు. సీలింగ్‌ భూము లంటేనే ప్రభుత్వ భూములు. ప్రభుత్వ భూములు కానప్పుడు దశాబ్దాలుగా ప్రభుత్వం ఎందుకు కోర్టులు చుట్టూ తిరిగింది?ఆ భూములకు 22(ఎ)గా ఎందుకు ప్రకటన చేసింది? సుప్రీం కోర్టు తీర్పు ఆ భూములను భూ యజమానులకు కట్టబెట్టాలని చెప్పిందా? తీర్పు రాకముందే దసపల్లా భూములకు సంబంధించి 22(ఎ)ను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఎత్తివేసింది? దశాబ్దాలుగా ఈ భూములు కొనుగోలు చేసిన యాజమాన్యాలు ఏదోరకంగా సమస్య పరిష్కారం అయితే మంచిదని భావించిన తరుణం లో ఎష్యూర్‌ ఎస్టేట్స్‌ డెవలపర్స్‌ ఎల్‌ఎల్‌సి సంస్థతో ఒప్పందం ఎందుకు కుదుర్చుకున్నారు? 22 (ఎ) భూముల సమస్య ఒక్కవిశాఖలోనే కాదు, రాష్ట్రంలో అనేకప్రాంతాల్లో వుంది. ఆ ప్రాంతాల్లో 22 (ఎ) ఎత్తివేయకుండా దసపల్లా భూముల విషయంలోనే ఎందుకు ఎత్తివేసి ఇంతప్రేమ చూపించారు? ఇతర భూములలో వున్న వారు ప్రజలు కాదా? దసపల్లా భూముల వ్యవహారం ఇలా వుంటే…విశాఖ ఎం.పి కూర్మన్నపాలెంలో నిర్మిస్తున్న భారీ వెంచరు కథ మరోలా వుంది. భూ యజమానులకు కేవలం 1 శాతం మాత్రమే వాటా ఇచ్చి తమ డెవలప్‌మెంట్‌ వాటాగా 99 శాతం తీసుకున్నారు. ప్రజాసేవకు అంకితం అవ్వాల్సిన ఎంపీలు ప్రజల ఆస్తులను లూటీ చేయడం ఎంతవరకు సమంజసం !
దబ్బంద గ్రామ భూములు స్వాహా
ఆనందపురం మండలం, మామిడి లోవ పంచాయతీ దబ్బంద గ్రామం సర్వే నెంబర్‌ 23లో 1970వ దశకంలో ప్రభుత్వం 120 మంది పేదలకు 80ఎకరాల సాగుకోసం భూమిని కేటా యించింది. 2015లో ప్రభుత్వం టిడ్కో ఇళ్ల కోసం దళితులు, గిరిజనులైన వీరి నుండి ఈ భూమిని తిరిగి ల్యాండ్‌ పూలింగ్‌ చేసింది. వీటిలో 66 ఎకరాలను టిడ్కో ఇళ్లు మరియు అర్బన్‌ హౌసింగ్‌ కోసం కేటాయించారు. మిగతా 14ఎకరాలను ఒక బడా వ్యక్తి స్వాధీనం చేసుకొని తోటలు వేసుకొని అనుభవిస్తున్నాడు. వీటితోపాటు సర్వేనెంబర్‌ 10లో ఉన్న నరసింహ చెరువును ఆక్రమించి సుమారు 6.8 ఎకరాల్లో జీడి, మామిడి, కొబ్బరి తోటలు వేశాడు.సర్వే నెంబర్‌9/1, 12/4,13/1,13/2,14/2లో సుమారు12.50ఎకరాల భూమి ఈ పెద్ద మనిషికబ్జాÛలోనే ఉన్నది. ఇవి దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులకు చెందిన భూములు.
కుసులవాడ భూములపై పెద్దల కన్ను
ఆనందపురం మండలం కుసుల వాడలో 1970వదశకంలో ల్యాండ్‌ సీలింగ్‌ మిగు లు భూమి సుమారు 43 ఎకరాలు సర్వే నంబరు 98,108లో ఎస్‌సి,బిసిలు43కుటుంబాలకు ప్రభు త్వం కేటాయించింది.పద్మనాభం,శొంఠ్యాం ప్రాం తాల మధ్య ఉన్న ఈభూమి విలువ సుమారు రూ. 100కోట్లు ఉంటుంది. వీటిపైఅధికార పార్టీ పెద్దల కన్ను పడిరది. పేదలను బెదిరిస్తూ ల్యాండ్‌ పూలిం గ్‌కు పథకం వేశారు.పేదలను లొంగదీసుకొని ఎక రాకు రూ.13లక్షల చొప్పున చెల్లించి భూములు లాక్కోవాలని చూస్తున్నారు.
బయ్యవరం భూముల బలవంతపు కొనుగోళ్లు
ప్రస్తుత అనకాపల్లి జిల్లా కశింకోట మండలం బయ్యవరం రెవెన్యూ పరిధిలోని విస్స న్నపేట పరిసర ప్రాంతాల్లో సుమారు500 ఎకరాల డీపట్టా, అసైన్డ్‌ భూములను రైతుల నుండి బలవం తంగా కొనుగోలు చేయడమే కాకుండా ఈ భూము ల చుట్టూ ఉన్న వాగులు, ఇతర ప్రభుత్వ భూములు కూడా ఆక్రమించారు. అక్కడున్న కొండలను కూడా అక్రమంగా తవ్వేశారు. సర్వే నెంబరు 624లో రెండు కొండల మధ్య ఉన్న వాగును పూడ్చేశారు. ఆ ప్రాంతంలో 403ఎకరాల భూమిలో 230 మౌంట్‌ విల్లాలు పేరుతో రిసార్ట్స్‌ నిర్మించాలనే లక్ష్యంతో భూ వ్యాపారులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ భూముల్లో అనేక అక్రమాలు జరిగాయని నాడు ఆర్డీవో,గనులశాఖఏ.డి,తహశీల్దార్‌, ఇనాం తహ శీల్దార్‌ గుర్తించారు.అందులో నీటి వాగులు, గోర్జీలు వంటివి కూడా కబ్జాకు గురి అయ్యాయని తెలియ జేశారు. అసలు అసైన్‌మెంట్‌ చట్టం ప్రకారం ఆ భూములకు సంబంధించి ఎటువంటి అమ్మకాలు, కొనుగోలు జరపరాదు. దీనికి భిన్నంగా విస్సన్న పేటలో జరిగిందని, రాజకీయ నాయకుల ప్రమే యం వుందని తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించు కోలేదు.
రెండు సిట్‌ నివేదికలు బహిర్గతం చేయాలి
గతంలో తెలుగుదేశం ప్రభుత్వం వున్న ప్పుడే విశాఖఅర్బన్‌,రూరల్‌ మండలాలు, భీమిలి, ఆనందపురం,పెందుర్తి,గాజువాక, పెదగంట్యాడ, సబ్బవరం,పరవాడ,అనకాపల్లి ప్రాంతాల్లో 1 లక్ష 6వేల 239ఎకరాల భూమి ఆక్రమణలకు గురైంది. ల్యాండ్‌ ట్యాంపరింగ్‌ అయింది. మాజీ సైనికుల భూములకు జిల్లా కలెక్టర్లు ఎన్‌ఒసిలు ఇచ్చారనే కథనాలు వచ్చాయి. ఆ సందర్భంగానే సిట్‌ను వేసి దర్యాప్తు చేశారు. మరలా వైఎస్‌ఆర్‌సిపి అధికారం లోకి రాగానే మరో సిట్‌ వేసి దర్యాప్తు చేశారు. ఈ రెండు సిట్‌ల నివేదికలను నేటికీ ఎందుకు బహిర్గతం చేయడంలేదు? నాడు చంద్రబాబు, నేడు జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వాలు భూ కబ్జాదా రులను కాపాడే పనిలో నిమగమయ్యాయనేది జగమెరిగిన సత్యం. ఈ భూముల కుంభకోణంలో అధికార, ప్రతిపక్ష పార్టీ పెద్దలందరూ భాగస్వాము లుగా ఉన్నారు కాబట్టే నివేదికలు బయటకు రానివ్వ కుండా పరస్పరం సహకరించుకుంటున్నారు. డి-ఫామ్‌ పట్టా భూములకు ఎంత రక్షణ ఉందో ఎక్స్‌ సర్వీస్‌మెన్‌కు కేటాయించే భూములకు అన్ని నిబంధనలూఉన్నాయి. అయినప్పటికీ రాష్ట్ర రెవెన్యూ మంత్రి సిఫార్సుతో ఎన్‌ఓసిలు ఇచ్చి భూములు అమ్మకాలు,కొనుగోళ్ళు జరిగాయని రెవెన్యూ మంత్రి పై ఆరోపణలు ఎదుర్కొంటు న్నారు. అనేకచోట్ల మంత్రులు,ఎమ్మెల్యేలు బినామీలతో భూములు అక్ర మంగా స్వాధీనం చేసుకుంటున్నారు. కబ్జాలకు గురైన భూముల వివరాలను రెండు సిట్‌ కమిటీలకు సిపిఎం ఆధారాలతో సహా ఇచ్చింది. పారదర్శకత కోసం రోజూ మాట్లాడే వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వానికి చిత్తశుద్ధి వుంటే వెంటనే రెండు సిట్‌ నివేదికలను బహిర్గతం చేస్తే భూకబ్జాదారులెవరో ప్రజలకు అర్ధ మౌతుంది. ఉమ్మడి విశాఖ నగరానికి ఆనుకొని ఉన్న గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టిన ల్యాండ్‌ పూలిం గ్‌లో కూడా అనేక భూబాగోతాలకు పాల్పడ్డారు.
ప్రశాంతతకు మారు పేరుగా ఉన్న విశాఖ నేడు భూ బకాసురుల కంబంధ హస్తాల్లో చిక్కుకొని వుంది. దాని నుండి రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై వుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూములను పరిరక్షించే నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలి. కబ్జాకోరుల చేతుల్లో చిక్కుకు పోయిన పేదల భూములన్నింటినీ తిరిగి పేదలకు అప్పగించాలి.
వందేళ్ల సమస్యకు పరిష్కారం
బ్రిటీష్‌ హయాంలో రీసెటిల్మెంట్‌ ఖాతా పేరుతో భూ కేటాయింపులు యాజమాన్య హక్కులే ధ్యేయంగా సమగ్ర భూ సర్వే రీ సెటిల్మెంట్‌ బుక్స్‌ నుంచి భూముల డిజిటలైజేషన్‌ భూ సమస్యలకు సీఎం జగన్‌ చరిత్రాత్మక పరిష్కారం చూపించారు. స్వాతంత్య్రం రాక ముందు కేవలం సాగు చేసుకునే తాత్కాలిక హక్కుతో కేటాయించిన భూములు అవి. సదరు భూములపై ఇప్పటికీ రైతన్నలకు యాజ మాన్య హక్కులు లేవు. వందేళ్లు గడిచిపోయినా యాజమాన్య హక్కులకోసం నిత్యం రెవెన్యూ కార్యా లయాల చుట్టూ రైతన్నల పడిగాపులు కాస్తూనే ఉన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా.. తరాలు మారుతున్నా.. ఎన్ని ప్రభుత్వాలు మారినా సమస్యకు పరిష్కారం మాత్రం చూపలేకపోయాయి. కానీ ఆర్థిక అవసరాలకోసం క్రయవిక్రయాలకు వీలులేని అసైన్డ్‌భూములు (22ఏ) సమస్య పరిష్కా రం కోసం వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం నడుం బిగిం చింది. సీఎం జగన్‌ దార్శనికతతో చిక్కుల్లేని భూ రికార్డుల కోసం సమగ్ర భూసర్వే పథకాన్ని తీసు కొచ్చారు. దీంతో అసైన్డ్‌ భూముల నిజమైన హక్కు దారులకు యాజమాన్య హక్కుల లభించనున్నాయి.
బ్రిటీష్‌ హయాంలో భూముల కేటాయింపులు
ప్రస్తుతం మార్కెట్‌ లో భూముల క్రయ విక్రయాల ప్రక్రియ 1908 రిజిస్ట్రేషన్‌ చట్టం ప్రకాం మే జరుగుతోంది.బ్రిటీష్‌ పాలనలో రైతులకు సాగు కోసం షరతులతో కూడిన భూమలను కేటాయిం చారు. ఈ భూములు కేవలం సాగు చేసుకునేలా మాత్రమే రికార్డుల్లో నమోదు చేశారు. భూయాజ మాన్య హక్కులను రైతులకు కల్పించలేదు. బ్రిటిష్‌ ప్రభుత్వం హయాంలో 1930 వరకు షరతులతో కూడిన భూ పట్టాల పేరుతో వివిధ వర్గాల రైతులకు భూ కేటాయింపులు జరిగాయి. ఆయా భూములను రకరకాల కేటగిరీల పేరుతో రికార్డుల్లో చేర్చారు. మెట్ట,తరి,డొంక,వంక,వాగు,గ్రామ కంఠం, ప్రభు త్వ భూములుగా రెవెన్యూ రికార్డుల్లో పేర్కొన్నా రు1932 నుంచి1934 మధ్యలో రికార్డులన్నీ కూడా రీసెటిల్‌మెంట్‌ బుక్స్‌లో చేర్చారు. పట్టా దారుల భూముల వివరాలను,సర్వే నంబర్లను ఈ పుస్తకాల్లో నమోదు చేశారు. అటువంటి భూములను 1932-34 నుంచి రైతుల తరాలు అనుభవిస్తు న్నారు. ఏళ్ల కొద్దీ సాగు చేస్తున్నా ఈ భూములపై రైతన్నలకు యాజమాన్య హక్కుల లభించడం లేదు.
ప్రత్యేక కమిటీలతో పరిశీలన..
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలు పెండిరగ్‌ లో ఉన్న ప్రతి కేసును కూలంకుషంగా అధ్యయనం చేస్తాయి. వాటికి సంబంధించి ఉన్న అన్ని రికార్డులను అధికారుల సమక్షంలో పరిశీలి స్తాయి. కమిటీలు గుర్తించిన అంశాలతో నివేదికలు రూపొందించి జిల్లా కలెక్టర్లకు సిఫారసు చేస్తాయి. కలెక్టర్‌ స్థాయిలో పరిశీలించి వాటిని నిషేధిత జాబితా నుంచి తొలగించేలా సిఫార్సులు ఉండాలి. ఒకవేళ కలెక్టర్‌ స్థాయిలో పరిష్కరించలేనివి ఉంటే వాటిని ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది. అదే విధంగారూ.50కోట్లకు పైగా విలువైన భూ ములుంటే వాటిని సీసీఎల్‌ఏ ద్వారా ప్రభుత్వానికి తెలపాలి. ఈవిధంగా వందేళ్లుగా పెండిరగ్‌లో ఉన్న అసైన్డ్‌ భూముల సమస్యలను పరిష్కరించి, నిషేధిత జాబితా నుంచి భూములను తొలగిం చాలనే చిత్తశుద్ధితో ప్రభుత్వం పని చేస్తోంది. తద్వారా లక్షలాది మంది తమ భూముల క్రయవిక్ర యాల కోసం రిజిస్ట్రేషన్ల విషయంలో ఎదుర్కుం టున్న సమస్యలను పరిష్కరించాలని భావిస్తోంది. అతి త్వరలో ప్రభుత్వం నియమించిన కమిటీలు సమావేశమై యుద్ధప్రాతిపదికన ఫిర్యాదులను పరిశీలించి నివేదికలు రూపొందించనున్నాయి.
శాశ్వత పరిష్కారమే ధ్యేయం
ప్రభుత్వం మాత్రం అన్ని రకాల అవకా శాలను పరిశీలించి వందేళ్ల చుక్కల భూముల సమస్యకు శాశ్వతపరిష్కారం కల్పించాలని నిర్ణయిం చింది. అందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి జోన్లవారీగా కమిటీలు నియ మించి,క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయాలని ఆదేశిం చారు. తొలి దశలో విజయవాడ, తిరుపతి, విశాఖ పట్నం కేంద్రాలుగా ఈ కమిటీలు అధ్యయనం చేయనున్నాయి.ఈ కమిటీల్లో విశ్రాంత జిల్లా న్యాయ మూర్తి, విశ్రాంత స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌, భూరికార్డులశాఖ విశ్రాంత ఏడీ, సర్వే విభాగం ఏడీ, సంబంధిత జిల్లాల జాయింట్‌ కలెక్టర్‌, సబ్‌ కలెక్టర్‌ లేదా ఆర్డీవో, జిల్లాల రిజిస్ట్రార్లు సభ్యులుగా వ్యవహరిస్తారు.ఈ కమిటీలకు ప్రభుత్వమే వేతనాలు చెల్లించేలా జీవో 681ని విడుదల చేశారు. ఈ భూముల రీసర్వే కోసం ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురుకాదు ఏకంగా15 వేల మందిని సర్వేయ ర్లను రిక్రూట్‌ చేసి, కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక పరికరాలను కొనుగోలు చేశారు. అంతే కాకుండా ఆధునిక టెక్నాలజీ.. కోర్స్‌(కంటిన్యూస్‌ ఆపరేటింగ్‌ రిఫరెన్స్‌ సిస్టం) బేస్‌ సిస్టంను తీసుకొచ్చి, విమానాలను, హెలీకాప్టర్‌లను, డ్రోన్లను, రోవర్లను ఉపయోగిస్తున్నారు. రీ-సర్వేలో భాగంగా హద్దు లను మళ్లీ కొత్తగా మార్కు చేసి, రికార్డులన్నింటినీ అప్‌డేట్‌ చేసి,సబ్‌డివిజన్‌లు,మ్యుటేషన్స్‌ పక్కాగా చేపట్టనున్నారు.రాష్ట్రంలో మొత్తం 17వేలకు పైగా గ్రామాలుండగా నవంబరులో 1500 గ్రామాలలో సర్వే పూర్తి చేసి,హద్దులు రీమార్క్‌ చేసి,అక్కడ ఉన్న సమస్యలు పరిష్కరించి అందరికీ భూహక్కు పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవన్నీ పూర్తి చేసి అక్కడే సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం కూడా గ్రామాల్లో ఉండేటట్టుగాఅడుగులు వేస్తోంది. నవంబరు నుంచి 1500 గ్రామాల్లో మొదలుపెట్టే ప్రతి నెలా కొన్ని వందల గ్రామాలను చేరుస్తూ వచ్చే ఏడాది(2023) చివరి నాటికి మొత్తం 17 వేల పై చిలుకు గ్రామాల్లో పూర్తి చేసే కార్యక్రమం జరుగుతుంది.
2023 చివరికల్లా సంపూర్ణంగా రీ సర్వే..
రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూ సర్వే కార్యక్రమం వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తి కానుంది. అనంతరం షరతులు గల పట్టా పేరుతో నిషేధితజాబితాలో అంటే 22(ఏ)1 లో ఉన్న ఈభూముల సమస్యలను పరిష్కరిస్తూ.. రైతు లకు క్లియరెన్స్‌ పత్రాలను జారీ చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 355గ్రామాలలో 22 (ఏ) నిషేధిత జాబితాలో ఉన్న18,889 సర్వే నం బర్లకు సంబంధించి మొత్తం 35,669 ఎకరాల భూముల సమస్యకు పరిష్కారం చూపింది. అవనిగడ్డలో ఆయా భూముల్లో సాగుచేసుకుంటున్న 22,042 మంది రైతులకు తమ భూములపై వారికి హక్కు కల్పించడం జరిగింది. వ్యాసకర్త :సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు-(కె.లోకనాథం)

హరిస్తున్న వలస కార్మికుల హక్కులు

అత్యధిక మంది వలస కార్మికులు వ్యవసాయం, పరిశ్రమలు, నిర్మాణ రంగాలలో కనిపిస్తారు. దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో10శాతం వలస కార్మికుల శ్రమ నుండే వస్తోంది.అయితే, వలస కార్మికులు ఎంతమందివున్నారు? వారు ఏ రంగంలో పని చేస్తున్నారు? ఎక్కడ నుండి ఎక్కడకు వెళ్తున్నారు? తెలుసుకునే వ్యవస్థ లేదు. పర్మినెంట్‌ వర్కర్ల కంటే ఏడు రెట్లు అధికంగా వలస కార్మికులు వున్నట్లు జాతీయ శాంపిల్‌ సర్వే ఆర్గనైజేషన్‌ గణాంకాలు తెలియ జేస్తున్నాయి. దుర్బలమైన, ప్రమాదకరమైన, ఎటువంటి భద్రత లేని పరిస్థితులు ఈ రంగం లో నెలకొన్నాయి.2011జనాభా లెక్కల ప్రకారం45కోట్ల 60లక్షల మంది వలస కార్మి కులు ఉన్నారు. వీరిలో 41శాతం మంది తమంతట తాముగా వలస కార్మికులుగా మారలేదు. తమ ప్రాంతాలలో నెలకొన్న నిరుద్యోగం వలస వెళ్ళాల్సిన పరిస్థితికి నెట్టింది. వీరి జనాభా లెక్కలు సరిగా వుండవు. వాటి మీద ఆధారపడలేం. ఐక్యరాజ్యసమితిలో భాగంగా ఉన్న విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ 2013లో దేశంలో అంతర్గతంగా తిరిగే వలస కార్మికులు కోటిన్నర నుండి10కోట్ల మంది ఉన్నట్లు అంచనా వేసింది. ఏరకంగా చూసినా భారతదేశంలో వలస కార్మికులు అసంఘటిత రంగంలో అత్యధికంగా ఉన్నట్లు తేలుతుంది. అందుకని వీరి పట్ల అధిక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది.ముఖ్యంగా పేదరికం,దుర్బలత,అభద్రత,ఉద్యోగంలో పెట్టుకునే పద్ధతికి…ఈ కార్మికుల సామాజిక స్థాయికి మధ్య ఉన్న సంబంధాన్ని అర్ధం చేసు కోవాలి. ఈ కారణంగా వీరు ప్రమాదక రమైన,అతి తక్కువ వేతనాలున్న పనులను చేయాల్సి వస్తోంది. కుల,లింగవివక్షలను ఎదుర్కొంటున్నారు.కీలక రంగాలైన వ్యవ సాయం,పరిశ్రమలు,నిర్మాణరంగాల కార్య కలాపాలు వీరు లేనిదే నడవవు. కానీ వీరి కనీస భద్రత, న్యాయమైన వేతనాలను పట్టించు కునే దిక్కులేదు. వలస కార్మికులకు వర్తించే ప్రస్తుత చట్టాలు లేబర్‌ కోడ్లలో భాగం కాను న్నాయి. లేబర్‌ కోడ్‌లు అమలులోకి వచ్చే లోపు ‘అంతర్‌ రాష్ట్ర వలస కార్మికుల చట్టం-1979, భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల (పని మరియు సర్వీసు కండిషన్ల క్రమబద్ధీకరణ) చట్టం-1996, అసంఘటిత కార్మికులసామాజిక భద్రతా చట్టం-2008 అమలులో వుంటాయి. కోవిడ్‌ సమయంలో వలస కార్మికులు ఎదు ర్కొన్న విషాదకర పరిస్థితులను, ఆరోగ్య-సామా జిక భద్రతా వైఫల్యాలను గమనించిన అత్యు న్నత న్యాయస్థానం తనంత తానుగా వీరి తరపు న కేసు తీసుకొని అనేక నిర్ధారణలకు వచ్చింది. అయితే ఈలోగా వలస కార్మికుల చట్టం-1997ను ప్రభుత్వం రద్దు చేసినప్పటికీ, ప్రభుత్వానికి అనేక ఆదేశాలను, సిఫార్సులను పంపింది.అత్యున్నత న్యాయస్థానం 2020 మే 28న, 2020 జూన్‌ 9న ఇచ్చిన తీర్పుల ద్వారా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యాలను, లోపాలను ఎత్తిచూపింది. ఈ కార్మికుల సంక్షేమాన్ని మెరుగుపర్చటానికి అనేక ఆదేశాలు ఇచ్చింది. కాని ఇవి ప్రధానంగా వలస కార్మికులకు ఉన్న పథకాలు, విధానాలకు పరిమితమైనవి. స్వస్థలాలకు తిరిగి వెళ్ళిన కార్మికుల సంఖ్యను గుర్తించమన్నది. 2020, జులై 31న ఇచ్చిన ఆదేశాలలో మాత్రం పైన పేర్కొన్న కార్మిక చట్టాల అమలు వివరాలను కూడా అన్ని ప్రభుత్వాలు తనకు సమర్పించమని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించిన సందర్భాలలో రాష్ట్ర ప్రభుత్వాలు వలస కార్మికులకు ఉపశమనం కలిగించాయి. తమ ఖర్చుతో రైళ్ళు,బస్సులను నడిపించాయి. తాను ఇచ్చిన ఆదేశాల అనంతరం…రాష్ట్ర ప్రభు త్వాలు,కేంద్ర పాలిత ప్రాంతాలు సమర్పించిన సమాచారంలో…వాస్తవాలను,గణాంకాలను పేర్కొనలేదని సుప్రీంకోర్టు గుర్తించింది. అందు కని చట్టాల అమలులో భాగంగా వలస కార్మికు లను పెట్టుకునే సంస్థలను రిజిస్టర్‌ చేయాలని, లైసెన్సులను జారీ చేయాలని ప్రభుత్వాలను ఆదేశించింది. ‘వలస కార్మికుల కష్టాలు-సమస్యలు’లో భాగంగా అసంఘటిత కార్మికుల రిజిస్ట్రేషన్‌ స్థితిపై ప్రమాణ పత్రాన్ని దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు (2021మే 24న) ఆదేశించింది. అంతకు ముందు కేంద్ర ప్రభుత్వం స్పందించిన తీరుపై సుప్రీంకోర్టు సంతృప్తి చెందకపోవటంతో ఈ ఆదేశాలు ఇచ్చింది. దీనితో కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో 2021 ఆగస్టు 26న రూ.704 కోట్ల ఖర్చుతో వలస కార్మికులతో సహా అసంఘటిత కార్మికుల రిజిస్ట్రేషన్‌కు ‘ఈ-శ్రమ’ వ్యవస్థను ప్రవేశ పెట్టింది. 2021 డిసెంబర్‌ ఆఖరులోగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అసంఘటిత కార్మికులు/వలస కార్మికుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది.ఈ-శ్రమ’ రిజిస్ట్రేషన్‌కు కార్మికుల నుండి స్పందన చాలా పరిమితంగా వుంది. అందులో వారికి ఎలాంటి ప్రయెజనం కనపడకపోవడం అందుకు కారణం. పైగా‘ఈ-శ్రమ’ నెట్‌ సౌకర్యంతో కూడుకున్నది కావడంతో కార్మికులు దీనిలో తమంత తాముగా రిజిస్ట్రేషన్‌ చేసుకోలేరు.ఇప్పటికే నిర్మాణ (సెస్సు-సంక్షేమ పథకాలు), వ్యవసాయ రంగాలలో (రైతు బంధు పథకం) పరిమితమైన ఇతర పథకాలు ఉన్నాయి.140 రకాల వృత్తులలో కార్మికులు పనిచేస్తున్నట్లుగా గుర్తించామని మోడీ ప్రభుత్వం చెప్పింది. కానీ తాము ఏరకమైన సామాజిక భద్రతను ప్రవేశపెట్టేదీ ఇంత వరకు నిర్ణయిం చలేదు. ‘ఈ-శ్రమ’ లో రిజిస్ట్రేషన్‌కు ఇ.పి.ఎఫ్‌, ఇ.ఎస్‌.ఐ ఉన్న వారు అర్హులు కారు. సంఘటిత రంగంలో పని చేసే లక్షలాది మంది కాంట్రాక్టు వర్కర్లు, చిన్న మధ్యతరహా సంస్థల్లో పని చేసే కార్మికులకు ఈ రెండూ ఇప్పటికే ఉంటాయి. కాబట్టి వారు రిజిస్ట్రేషన్‌ చేసుకోలేరు. వలస కార్మికులకు సామాజిక భద్రతను కల్పించాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకుండా ‘వలస కార్మికుల చట్టం-1979’ రద్దును ప్రకటించింది. దీనికి బదులుగా వచ్చేటటువంటి కోడ్‌ కాంట్రాక్ట్‌ కార్మికుల కష్టాలను పెంచుతుంది. 1979 చట్టం యజమానులకు, కాంట్రాక్టర్లకు, సబ్‌ కాంట్రాక్టర్లకు నిర్ద్ఱేశిత ఆదేశాలు ఇచ్చింది. కాంట్రాక్టు కార్మికులను పెట్టుకోవాలంటే ముందుగా వీరు రిజిస్టరై ఉండాలి. ప్రతి వలస కార్మికుని సమాచారాన్ని, వారికి చెల్లించే వేతనాల వివరాల నమోదును స్పష్టీకరించింది. ఇవన్నీ ఇప్పుడు కోడ్‌లో లేవు. ఇటీవల అగ్ని ప్రమాదాలలో కార్మికులు చనిపోయినప్పుడు వారి గుర్తింపుకు వ్యక్తిగత రికార్డులు లేక పోవటం ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడు తుంది. వారు పలానా వారు అని గుర్తించ టానికి వంశీకుల డిఎన్‌ఎ లను పరీక్షించాల్సి వచ్చింది. యజమానులు తమ దగ్గర ఉన్న వలస కార్మికుల నియామకం,నమోదు, రవాణా, నివాసం,కనీస వేతనం,కాలనుగుణ వేతనాలు తదితర సమాచారాన్ని తప్పకుండా నిర్వహిం చాలని 1979చట్టం నిర్దేశించింది.వేతనాల చెల్లింపు,ఆరోగ్య సౌకర్యాల కల్పన,పని ప్రదేశం లో రక్షణ కల్పించే డ్రస్సులు,మంచినీటి సౌక ర్యం,క్యాంటిన్‌,మరుగుదొడ్లు, విశ్రాంతి గదుల ఏర్పాటు, ప్రయాణ ఖర్చులను గ్యారంటీ చెయ్య టానికి-అయ్యే మొత్తం ఖర్చులో40శాతాన్ని సెక్యూరిటీ డిపాజిట్‌గా లైసెన్సింగ్‌ అధికారి తీసుకుంటారు. కాంట్రాక్టర్లుగానీ, ముఖ్య యజమాని గానీ వేతనాలు చెల్లించకపోతే ఈ నిధి నుండి చెల్లిస్తారు.ఈహామీలను లేబర్‌ కోడ్‌లో ఉపసంహరించారు.1979 చట్టంలో ఇంకొక ముఖ్యమైన నిబంధన ప్రకారం వలస కార్మికులు పారిశ్రామిక వివాదాల పరిష్కార యంత్రాంగాన్ని…తాము పనిచేసే ప్రాంతాలు, స్వస్థలాలు రెంటిలోనూ వినియోగించుకునే అవకాశం ఉంది. ఈ విధంగా వలస కార్మికు లకు వర్తించే ఇటువంటి 4 చట్టాలను కూడా కోడ్‌ ఒక్క కలం పోటుతో స్వాహా చేసింది.వీధి వ్యాపారులతో సహా అందరికీ సామాజిక భద్రత కల్పించబడుతుందని కేంద్ర కార్మిక మంత్రి ప్రకటించారు. ఇంత వరకు దానికి సంబం ధించిన ఎటువంటి పథకం తయారు కాలేదు. కానీ వలస కార్మికుల రిజిస్ట్రేషన్‌ పరిమితి 5 నెలల నుండి 10 నెలల వరకు పొడిగించారు. రిజిస్ట్రేషన్‌ వలన వలస కార్మికులకు పెద్దగా ఒరిగిందేమీ లేదు.పెద్ద సంఖ్యలో వలస కార్మి కుల హక్కులు నిరాకరించబడ్డాయి. అంతకు ముందున్న అనేక సౌకర్యాలను వలస కార్మికులు కోల్పోతారు.
మీకు ఉద్యోగం కావాలా, హక్కులు కావాలా?’’
ఒక నిరుద్యోగి ఉద్యోగం కోరుకుంటాడా, హక్కు లు కోరుకుంటాడా? భారత్‌లో కులవ్యవస్థ కార్మి కులపై ఎలాంటి ప్రభావం చూపుతోంది? కార్మి కుల హక్కులు, సంక్షేమం, ఐక్యత కోసం సుదీర్ఘ కాలం కృషిచేసిన భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ ఈఅంశాలపై ఏమన్నారు?
‘‘ఒక నిరుద్యోగికి ఎంతో కొంత వేతనమున్న, నిర్దిష్టమైన పనిగంటలు లేని ఒక ఉద్యోగం ఆఫర్‌ చేశారు. అతడికి ఒక షరతు పెట్టారు. ఉద్యోగ సంఘంలో చేరే హక్కు, భావ ప్రకటనా హక్కు, నచ్చిన మతాన్ని ఆచరించే హక్కు, ఇతర హక్కులు ఉండవని చెప్పారు. ఇప్పుడు ఆ నిరుద్యోగి ఏ నిర్ణయం తీసుకుంటారనేది స్పష్టం. ఆకలి భయం, ఇల్లూవాకిలీ కోల్పోతాననే భయం, ఏమైనా పొదుపు చేసుకొనుంటే ఖర్చయి పోతుందేమోనన్న భయం ఆ నిరుద్యోగికి కలుగు తాయి. ఈ భయాందోళనలు చాలా బలమైనవి. వీటివల్ల ఎవరూ తమ ప్రాథమిక హక్కుల కోసం నిలబడలేరు’’ అని అంబేడ్కర్‌ చెప్పారు. కేవలం లాభార్జనే ధ్యేయమైన ఆర్థిక వ్యవస్థ పౌరుడి ప్రాథమిక హక్కులను ఎలా దెబ్బ తీయగలదో సోదాహరణంగా చెబుతూ ఆయన ఒక సందర్భంలో ఇలా రాశారు. ఎనిమిది గంటల పనిగంటలు మొదలుకొని, ప్రసూతి సెలవుల వరకు కార్మికుల ప్రయోజ నాలు కాపాడేందుకు ఆయన చూపిన చొరవ ఫలితా లను కార్మిక వర్గం నేటికీ పొందుతోంది. లాభా ర్జనే ధ్యేయమైన ఆర్థిక వ్యవస్థ రెండు రాజకీయ ప్రజాస్వామిక సూత్రా లకు విఘాతం కలిగిస్తుం దని అంబేడ్కర్‌ చెప్పారు. వ్యక్తుల జీవితాలను రాజ్యవ్యవస్థ కాకుండా, ప్రైవేటు యాజమా న్యాలు నిర్దేశిస్తాయని, అలాగే జీవనోపాధి కోసం పౌరులు తమ రాజ్యాంగ హక్కులను కోల్పో వాల్సి రావొచ్చని పేర్కొన్నారు.‘కుల వ్యవస్థ పనినే కాదు, కార్మికులనూ విభజిస్తుంది’ భారత సమాజ తీరును లోతుగా పరిశోధించిన అంబే డ్కర్‌, కులానికి, పనికీ సంబంధముందని గుర్తించారు. కుల వ్యవస్థ పని విభజనకు సంబంధించినదనే వాదనను ఆయన తిరస్క రించారు.ఈ సమాజం పనినే కాకుండా కార్మికు లను కూడా విభజించి చూస్తోందని, ఇది అసహజమైనదని, ఏ నాగరిక సమాజంలోనూ ఇలా ఉండదని వ్యాఖ్యానించారు. కార్మికుల విభజనను హిందూ సమాజ నిర్మాణమే ఆమో దించి, కొనసాగిస్తోందని, ఈ విభజనలో ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అనే వర్గీకరణ ఉందని చెప్పారు. కార్మికులను ఇలా చూసే పని విభజన మరే దేశంలోనూ లేదన్నారు.పని విభజన వ్యక్తుల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉండాలని, కానీ కుల వ్యవస్థ సృష్టించిన కార్మిక విభజన వ్యక్తుల ఇష్టాయిష్టాలపై ఆధారపడినది కాదని అంబేడ్కర్‌ వివరించారు.వ్యక్తి తన సామ ర్థ్యాల ప్రాతిపదికన కాకుండా అతడు పుట్టిన కులం ప్రాతిపదికగా పని చేయాల్సి వస్తోందని చెప్పారు. అంటరాని కులాలుగా పిలిచే కులాలకు అపరిశుభ్రమైన,తక్కువ స్థాయి పనులను, ఇతర కులాలకు శుభ్రమైన, గౌరవప్రదమైన పనులను కుల వ్యవస్థే కేటాయిస్తుందని ఆయన ప్రస్తావించారు.– అమితవ్‌ గుహ

అటవీ సంరక్షణ చట్ట సవరణ అటవీ హక్కుల నిరాకరణ

గుండుగుత్తుగా కార్పొరేట్లకు అడవులపై చట్టబద్దత కల్పించడానికి మోడీ ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. వంద నుంచి వెయ్యి హెక్టార్లకు పైగా అటవీ భూమిని అటవీయేతర భూమిగా మార్చడానికి ప్రయత్నిస్తున్నది. దీనివల్ల రాబోయే కాలంలో అటవీ ప్రాంత విస్తీర్ణం తగ్గనుంది. అటవీ భూమిని ఇతర అవసరాలకు మళ్ళిం చాలంటే అటవీ హక్కుల గుర్తింపు చట్టం కింద అటవీ హక్కులను సంపూర్ణంగా అమలు జరపాలని 2009లో కేంద్ర ప్రభుత్వ అటవీ మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొన్నది. అయితే ఈ అవసరం లేకుండానే ప్రభుత్వ, ప్రయివేట్‌ కంపెనీలకు అటవీ భూమిని మళ్లించేందుకు నూతన అటవీ సంరక్షణ చట్టంలో వీలు కల్పిస్తున్నది. ఈ నియ మాలు అమలైతే అడవి నుండి ఆదివాసీలు నెట్టివేయబడతారు. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇటీవల జారీ చేసిన నూతన అటవీ సంరక్షణ నియమాలు ఆదివాసుల అటవీ హక్కులను దెబ్బతీసే విధంగా వున్నాయి. ఆది వాసుల అటవీ హక్కులను తుంగలో తొక్కి, కార్పొరేట్లకు ప్రయోజనం చేకూర్చడానికి కేంద్ర ప్రభుత్వం అటవీ సంరక్షణ చట్టం సవరణ చేస్తున్నది.
అడవిలో లీనియర్‌ ప్రాజెక్టుల నిర్మాణం ఐదో షెడ్యూల్‌ ప్రాంతంలో అంతర్జాతీయ సంస్థలు,బహుళ జాతి కంపెనీల ప్రవేశానికి అటవీ చట్టాలు అడ్డంకిగా వున్నాయి. విలువైన సహజ వనరులు, ఖనిజ సంపదను కార్పొరేట్లకు అప్పగించేందుకు ఆటంకంగా వున్న చట్టాలను వారికి అనుకూలంగా సవరించే పని మోడీ ప్రభుత్వం నెత్తినెత్తుకుంది. అందుకు కొత్త నియమ నిబంధనలు ప్రతిపాదించారు. అటవీ ప్రాంతంలో లీనియర్‌ ప్రాజెక్టులను (జాతీయ రహదారులు, పైపులైన్లు, ట్రాన్స్‌మిషన్‌…) ప్రైవేటు, కార్పొరేట్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. లీనియర్‌ ప్రాజెక్టుల నిర్మాణానికి గిరిజన గ్రామ సభ అనుమతి అక్కర్లేదని 2013లో కేంద్ర అటవీ మంత్రిత్వశాఖ జారీ చేసిన ఉత్తర్వులను 2019లో ఎ.పి హైకోర్టు కొట్టేసింది. గిరిజన గ్రామసభకు వున్న విస్తృత అధికారాన్ని న్యాయ స్థానం గుర్తించడంతో, ముసాయిదా బిల్లులో గ్రామసభను సంప్రదించాలని మాత్రమే కేంద్ర బిజెపి ప్రభుత్వం పేర్కొంది.అటవీ సంరక్షణ చట్టం 1980 ప్రకారం అటవీ భూమిని ఇతర ప్రయోజనాలకు వినియో గించాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ కింది నిబంధనలు పాటిం చాలి.1.ముందుస్తు గ్రామసభ అనుమతి తీసుకోవాలి.2. నిర్వా సితులకు నష్టపరిహారం చెల్లించాలి.3.అడవు లు పెంచడానికి ప్రత్యేక భూమి కేటాయించాలి. ఈ నిబంధనలు కార్పొరేట్‌ శక్తులకు అడ్డుగా వుండడంతో వాటిని సవరించబూనుకుంది. మైనింగ్‌ కోసం ఐదు హెక్టార్ల భూమిని డి-రిజర్వ్‌ చేయడానికి, ఆక్ర మణ భూమిని క్రమబద్ధీకరించడానికి కేంద్ర ప్రభుత్వ సలహా కమిటీ సిఫార్సు అవసరమని, 2003లో జారీ చేసిన నియమాలను పక్కనబెట్టి, మోడీ సర్కారు కొత్త నియమాలు తీసుకొస్తోంది. క్లాజ్‌ 9(బి)-1 ప్రకారం గ్రామసభ లేదా హక్కుల పరిష్కార ప్రస్తావన లేదు. క్లాజ్‌ 9(బి)-2 ప్రకారం డి-రిజర్వుడు ఆర్డర్‌ను జారీ చేయడానికి గ్రామసభకు వున్న అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం బలవంతంగా లాక్కొన్నది. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే ఆదివాసుల హక్కులు హరించ బడతాయి. అటవీ హక్కుల చట్టానికి తూట్లు తీవ్రవాద కార్యకలాపాలు జరిగే ప్రాంతంలో అవుట్‌ పోస్టు నిర్మాణానికి అటవీ భూమి వినియోగ పరిమితి విషయంలో ఒక హెక్టార్‌ భూమిని రిజర్వ్‌ ఫారెస్టు భూమి నుండి మినహాయించడం 2005లో ప్రారంభమైంది. ఈ మినహాయింపు క్రమంగా 40 హెక్టార్లకు పెరిగింది. గుండు గుత్తుగా కార్పొరేట్లకు అడవులపై చట్టబద్దత కల్పించడానికి మోడీ ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. వంద నుంచి వెయ్యి హెక్టార్లకు పైగా అటవీ భూమిని అటవీయేతర భూమిగా మార్చడానికి ప్రయత్నిస్తున్నది. దీనివల్ల రాబోయే కాలంలో అటవీ ప్రాంత విస్తీర్ణం తగ్గనుంది. అటవీ భూమిని ఇతర అవసరాలకు మళ్ళించా లంటే అటవీ హక్కుల గుర్తింపు చట్టం కింద అటవీ హక్కులను సంపూర్ణంగా అమలు జరపాలని 2009లో కేంద్ర ప్రభుత్వ అటవీ మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొన్నది. అయితే ఈ అవసరం లేకుండానే ప్రభుత్వ, ప్రయివేట్‌ కంపెనీలకు అటవీ భూమిని మళ్లించేందుకు నూతన అటవీ సంరక్షణ చట్టంలో వీలు కల్పిస్తున్నది. ఈ నియ మాలు అమలైతే అడవి నుండి ఆదివాసీలు నెట్టివేయబడతారు.
చట్ట సవరణ సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధం
ఆదివాసుల సాంప్రదాయ హక్కులతో ముడిపడిన హక్కుల నిర్ధారణ తర్వాతే…అటవీ భూమి మళ్లింపు అనుమతులను పరిశీలించాలని ఒడిశా మైనింగ్‌ కార్పొరేషన్‌కు కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ మధ్య నడిచిన కేసులో…2013 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అటవీ హక్కుల అమలు విషయంలో గ్రామసభ పాత్రను, అటవీ భూమి మళ్లింపు విషయంలో వాటి అనుమతి అవసరాన్ని తీర్పులో స్పష్టం చేసింది. అయినా మోడీ మొండిగా గ్రామసభ, అటవీ హక్కుల చట్టాన్ని నీరుగార్చుతూ సుప్రీంకోర్టు ఉత్తర్వులను లెక్క చేయకుండా రాజ్యాంగ హక్కులను హరిస్తున్నారు. రాజ్యాంగ శాసనంగా పేర్కొన్న పీసా చట్టానికి భిన్నంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాసనాలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసినా, నూతన అటవీ సంరక్షణ చట్టసవరణలతో రాజ్యాంగ లక్ష్యాలకు తూట్లుపొడుస్తున్నది. వనరుల నిర్వహణ, హక్కుల నిర్ధారణ, అమలు చేసే అధికారం గ్రామసభలకు ఉంటుందని 2010 లో కేంద్ర గిరిజన సంక్షేమశాఖ ఉత్త ర్వులు జారీ చేసింది. నూతన అటవీ సంరక్షణ చట్ట నియమాల్లో కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ పాత్రను కనీసం ప్రస్తావించ లేదంటే ఆదివాసీ లపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి వుందో అర్ధమవుతుంది. మైనింగ్‌ యేతర పనులకు భూమి వినియోగానికి వంద రోజుల్లో, మైనింగ్‌ కార్యకలాపాలకు 150 రోజుల్లో అటవీ, పర్యావరణ అనుమతి జారీ చేసేలా స్క్రీనింగ్‌ కమిటీకి అధికారం అప్పగిస్తూ నియమాలు రూపొందించారు. రక్షిత అడవుల్లో లినియర్‌ ప్రాజెక్ట్లు నిర్మాణమవుతాయని, భూమిని పూర్తిగా వినియోగించే అవకాశం వుంటుందని పేర్కొంది. అటవీ పెంపకం కోసం ల్యాండ్‌ బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలని పేర్కొనడం సరికాదు. క్షీణించిన అటవీ భూమిని ప్లాంటేషన్‌ కోసం ప్రైవేట్‌ కంపెనీలకు లీజుకిచ్చే అంశంపై గతంలో ప్రణాళిక సంఘం ఏర్పాటు చేసిన ఎస్‌.సి సక్సేనా కమిటీ చాలా విలువైన సూచనలు చేసింది. అడవులు కోట్లాది మంది ప్రజలకు జీవనోపాధిని కల్పిస్తాయని నిర్ధారించినా… నేడు ఈ లక్షలాది మంది ప్రజలకు ఏమౌతుందో నిబంధనలలో ప్రస్తావించనేలేదు. జాతీయ మోనెటైజేషన్‌ పథకం అమలు రైల్వే శాఖకు అభయారణ్యాలు, నేషనల్‌ పార్క్‌లలో కొన్ని నిబంధనల నుండి 2009 లోనే మినహాయింపు ఇచ్చారు. ప్రభుత్వ, సామాజిక ఆస్తులను ప్రైవేటు, కార్పొరేట్‌ కంపెనీలకు లీజుకు ఇవ్వడానికిగాను జాతీయ మోనెటైజేషన్‌ పథకం 2022-2025 అమలుకు కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. రైల్వే శాఖ, రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖల పరిధిలో సుమారు 18 లక్షల ఎకరాల అటవీ భూమిని మోనెటైజేషన్‌ చేయదగ్గవిగా గుర్తించారు. దానికి వీలుగా అన్ని రకాల నిబంధనల నుంచి మొత్తం మినహాయింపు ఇవ్వాలని, ప్రభుత్వ భూములకు ఇచ్చే మినహాయింపులన్నీ, ప్రైవేటు కార్పొరేట్‌ సంస్థలకు కూడా వర్తింపజేయాలని నిబంధనలలో ప్రతిపాదించారు. కేంద్రం ఆధీనంలోని అనేక గనులను మోనెటైజేషన్‌ ద్వారా కార్పొరేట్‌ సంస్థలకు లీజుకిచ్చి రూ.28,747 కోట్లు ఆర్జించాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వరంగ గనులను ప్రవేట్‌ పరం చేసేందుకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చేయడం పభుత్వ లక్ష్యంగా కనబడుతున్నది. ఇది ఆదివాసుల రాజ్యాంగ హామీలకు పూర్తిగా విరుద్ధం. అంతేగాక ఐదవ, ఆరవ షెడ్యూల్డ్‌, పీసా, సవరించిన వన్య ప్రాణుల రక్షణ చట్టం, అటవీ హక్కుల గుర్తింపు చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది.-పి. అప్పలనర్స

కౌలు రైతుల క‌ష్టాలు

తగినంత భూమి లేని రైతులు పొలాన్ని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. సొంత భూమి ఉన్న రైతులే పంటలు చేతికి రాక, వచ్చిన పంటలకు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారు. అప్పుల పాలవుతున్నారు. బ్యాంకుల సాయం అందక కౌలు రైతుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కౌలు రైతులకు రుణాలు ఇప్పించి ఆదుకుంటామని ప్రభుత్వం చెప్పడమే కానీ ఆచరణలో లేదు. భూమిని కౌలుకు తీసు కొని సాగుచేస్తున్నా, సాగుదారుగా గుర్తింపు లేకపోవటం వలన కౌలుదారులు రైతుగా పొందవలసిన ఏ మేలు అందుకోలేక పోతు న్నారు. కౌలు ఒప్పందాలన్నీ నోటి మాట మీదే ఇప్పటికీ జరుగుతున్నాయి. కౌలు రైతులు భూమి సాగుచేస్తున్నా పంట రుణాలు, రైతు బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీలు,పంట నష్ట పరిహారం-ఇలా రైతులకు అందే ఏ సహాయం వారికి అందడం లేదు. కౌలు కాగితమో, రికార్డు లలో పేరో ఉంటేనే ఏ మేలైనా వారికి దక్కేది. నకిలీ విత్తనాలు, ప్రకృతి బీభత్సాలు, గిట్టుబాటు ధర లేకపోవడం మొదలైన అంశాల వలన కౌలు రైతులూ నష్టపోతున్నారు. సొంత భూమి కలిగి సేద్యం చేస్తున్న వారికయ్యే సగటు ఖర్చులతో పోల్చితే కౌలుదారులకు రెట్టింపు పెట్టుబడి అవుతుంది. -గునపర్తి సైమన్‌
భారతదేశంలో 60శాతం పైగా జనాభాకు ప్రధాన ఆధారమైన వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలో ఉన్నది. గత మూడు దశాబ్దాలుగా అమలు జరుగుతున్న ఆర్థిక సంస్కర ణలు వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని ఊబిలోకి నెట్టాయి. అనేక రాష్ట్రాలలో వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు తగ్గిపోవటం, సబ్సిడీలలో కోత, గిట్టుబాటు ధర లభించక పోవటం, నీటిపారుదల రంగంపై నిర్లక్ష్యం మొదలగు అంశాల న్నీ సంక్షోభాన్ని తీవ్రతరం చేశాయి. ఈ రెండు దశాబ్దాలలో విస్తృతంగా పెరిగిన కౌలురైతాంగం కూడా ఎటువంటి రక్షణ లు లేక తీవ్ర సమస్యలు ఎదుర్కొం టున్నది. స్వంత భూమి కలిగిన రైతులే సేద్యం లాభసాటిగా లేక సంక్షోభం ఎదుర్కొం టుంటే, కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా రూపొందింది. ఆంధ్రప్రదేశ్‌లో 26 జిల్లాలలో సుమారు 35లక్షల మంది కౌలు రైతులు ఉం టారని అంచనా. పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు వంటి జిల్లాలలో 70శాతం సాగు భూమిని కౌలురైతులే పండిస్తున్నారు. భూమిని కౌలుకు తీసుకొని సాగుచేస్తున్నా, సాగుదారుగా గుర్తింపు లేకపోవటం వలన సాగుదార్లుగా పొందవలసిన ఏ మేలు అందుకో లేకపోతు న్నారు. కౌలు ఒప్పందాలన్నీ నోటి మాట మీదే ఇప్పటికీ జరుగుతున్నాయి. కౌలు రైతులు భూమి సాగుచేస్తున్నా పంట రుణాలు, రైతు బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీలు, పంట నష్ట పరిహారం-ఇలా రైతులకు అందే ఏ సహాయం వారికి అందడం లేదు. కౌలు కాగితమో,రికార్డులలో పేరో ఉం టేనే ఏమేలైనా వారికి దక్కేది. నకిలీ విత్తనాలు, ప్రకృతి బీభత్సాలు, గిట్టుబాటు ధర లేకపోవడం మొదలైన అంశాల వలన కౌలు రైతుల్షు నష్టపో తున్నారు. సొంత భూమి కలిగి సేద్యం చేస్తున్న వారికయ్యే సగటు ఖర్చులతో పోల్చితే కౌలు దారులకు రెట్టింపు పెట్టుబడి అవుతుంది. కొన్ని ప్రాంతాలలో, కొన్ని పంటలకు భూయజమానికి కౌలు ముందే చెల్లించవలసి ఉంటుంది.
కౌలురైతు – సామాజిక ఆర్థిక కారణం
సాగునీటి పారుదల ప్రాంతాలలోని పెద్ద రైతులు 1970,80దశకాలలో వ్యవసాయ రంగంలో హరిత విప్లవం వలన లబ్ధి పొంది ఆపై అధిక లాభసాటైన వ్యవసాయేతర రంగా లకు వలసపోయారు. ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో అనేక మంది రైతులు సాగును వదిలి ఇతర రంగాలకు మళ్లి, భూములను కౌలుకు ఇచ్చారు. రైతుబిడ్డలు చదువుకుని తమ గ్రామంలో కాకుండా విదేశాలలో,పెద్దపెద్ద నగరాలలో స్ధిరపడి తమ భూములు కౌలుకు ఇస్తున్నారు. ఆదాయపు పన్ను మినహాయింపు తదితర కారణాల వలన కొంతమంది సంప న్నులు స్థిరాస్తులుగా భూములు కొనుగోలు చేసి కౌలుకిస్తున్నారు. కౌలు రైతులలో 80శాతం వెనుకబడిన తరగతులు,దళిత కుటుంబాలకు చెందిన వారే.ఈసామాజిక కోణాన్ని విశాల దృక్ప థంతో రాజకీయ పార్టీలు, ప్రభుత్వం, అధికారులు అర్థం చేసుకోవాలి. గ్రామాల్లో చిన్న, సన్నకార రైతులు, భూమి లేని వ్యవసాయ కూలీలు, పేదలు వ్యవసాయమే దిక్కుగా ఈ భూములను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. వ్యవసాయాన్ని వదిలేస్తున్న భూ యాజమానుల నుండి సొంత భూమిలేని రైతులు, కూలీలు కూడా పొలాలను కౌలుకు తీసుకొని సేద్యం చేస్తున్నారు. పట్టా భూము లున్న రైతులకన్నా కౌలుదారుల సంఖ్య క్రమేణా పెరుగుతున్నది. మొత్తం సాగుభూమిలో 50 శాతంపైగా కౌలుదారులే సాగు చేస్తున్నారని వ్యవ సాయ శాస్త్రవేత్తలు నిర్వహించిన అనేక అధ్యయ నాలు వెల్లడి చేస్తున్నాయి. అయితే కౌలు రైతులకు ఎటువంటి హక్కులు లేకపోవడంవలన వీరికి బ్యాంకు రుణాలు లభించలేదు. కౌలు రైతుల కోసం ప్రత్యేక చట్టాలు చేయవలసిన అవసరం ఏర్పడిరది.
2011-అధీకృత సాగుదారుల చట్టం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాటి ప్రభుత్వం కౌలు రైతుల కోసం 2011లో అధీకృత సాగుదారుల చట్టం ఆమోదించి, అమలు చేసింది. ఈచట్టం ప్రకారం కౌలు రైతులకు ఎల్‌ఇసి కార్డులు ఇచ్చి, లక్ష రూపాయల వరకు రుణం ఇచ్చే అవకాశం బ్యాంకర్లకు ఉన్నది. ఎల్‌ఇసి కార్డు ఉన్నప్పుడే రుణం పొందడానికి,ఇన్‌పుట్‌ సబ్సిడీ,పంటల బీమా నష్ట పరిహారం పొందడానికి అర్హులు అవుతారు. కాని ఆచరణలో రుణ అర్హత కార్డులు ఇవ్వడంలో ప్రభుత్వాలు విఫలం చెందాయి.ఈచట్టం ద్వారా 2011లో5లక్షల మందికి,2012లో నాలుగు లక్షల మందికి, 2016లో4లక్షల మందికి, 2018-19లో ఆరు లక్షల మందికి రుణ అర్హత కార్డులు ఇచ్చారు. వీరిలో40శాతం మందికి మాత్రమే బ్యాంక్‌ల ద్వారా రుణాలు లభించాయి.ఈరుణాలు కూడా ఎక్కువ భాగం జాయింట్‌ లైబిలిటీ గ్రూపుల ద్వారా ఇచ్చారు. ఎక్కువ సందర్భాలలో భూ యజ మాని అప్పటికే ఆ భూమిపై రుణం పొంది ఉండడం వలన బ్యాంక్‌ అధికారులు కౌలు రైతుకు పంట రుణాలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు.ఆరుణాలు కూడా ఎకరానికి సగటున 5 వేలకు మించి ఇవ్వలేదు. చట్టం అమలుపై చిత్తశుద్ధి లోపించటం,రాజకీ య సంకల్పం లేకపోవడం, బ్యాంకర్ల భయాలు మొదలగు అంశాల వలన 2011-అధీకృత సాగుదారుల చట్టం తగిన ఫలితాలు ఇవ్వలేదు.
2019-కౌలు రైతుల చట్టం
వై.ఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వం పాత చట్టాలను రద్దు చేసి 2019-కౌలు రైతుల చట్టం చేసింది. ఈచట్టం వలన కౌలు రైతు పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడినట్లు అయింది. భూయజమాని సంతకం తప్పనిసరి చేస్తూ చట్టంలో నిబంధనలు విధించటంతో సమస్య జటిలమైంది. భూ యజమానులు సంతకం పెట్టకపోవడంతో అధికారులు సిసిఆర్‌సి కార్డులు మంజూరు చేయడం లేదు. రాష్ట్రంలో దాదాపు 35లక్షల మంది కౌలు రైతులుఉండగా,ఈ సంవత్సరం 5,74,000 కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుని, ఇప్పటకీ రాష్ట్రం మొత్తం 3 లక్షల కార్డులు మాత్రమే ఇచ్చారు. ఉదాహరణకు గుంటూరు విడిపోయిన జిల్లాలో లక్షమందికి పైగా కౌలు రైతులు ఉండగా 37,228 మంది రైతులకు సిసిఆర్‌సి కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటి వరకు 12,418 కార్డులు మంజూరు చేయడం జరిగింది. రైతు భరోసాలో కూడా కౌలు రైతు లకు అన్యాయం జరుగుతున్నది. భూమిలేని ఒ.సికౌలు రైతులకు రైతుభరోసా ఇవ్వడం లేదు.ఈ సంవత్సరం కార్డు లేని కౌలు రైతులకు ‘ఇ-క్రాపింగ్‌’ కూడా చేయడం లేదు. దీని వలన కౌలు రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారు. సిసిఆర్‌సి కార్డులను భూ యజ మానులు తమ బంధువులకు, స్నేహితులకు, అను చరులకు ఇప్పిస్తున్నారు. వాస్తవంగా కౌలు చేస్తున్న వారిలో కొద్ది మందికే సిసిఆర్‌సి కార్డులు ఇస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం చేసిన కౌలు దారుల రక్షణ చట్టం ఘోరంగా విఫలమైంది. చట్టంలో అనేక నిబంధనలు మార్చాలి.
కౌలురైతులు – వివిధ కమిటీలు

  1. మారిన పరిస్థితులలో భూ యాజమాన్య హక్కులకు భంగం వాటిల్లకుండా భూకమతాల గరిష్ట పరిమితికి లోబడి కౌలుదారీ చట్టాన్ని చేయాలని, కౌలు రైతులకు బ్యాంక్‌ రుణాలతో సహా అన్ని సౌకర్యాలు అందించాలని…2016లో ఆంధ్రప్రదేశ్‌లో సమ్మిళిత, సుస్థిర వ్యవసాయ అభివృద్ధి కోసం వేసిన ప్రొఫెసర్‌ రాధాకృష్ణ కమిషన్‌ చెప్పింది.
  2. దేశంలో వ్యవసాయ భూమి కౌలులో సమత్వం,సమర్థత లక్ష్యంగా కౌలు చట్టాలు రూపొందించాలని…నీతి ఆయోగ్‌ ప్రొఫెసర్‌ టి.హక్‌ నేతృత్వంలో నియమించిన కమిటీ…అన్ని రాష్ట్రాలకు సూచించింది. వీరి సూచనల ప్రకారం కౌలు వలన భూమిపై యాజమాన్య హక్కులకు ఎలాంటి ప్రమాదం ఉండదు. కౌలుదారు బ్యాంక్‌ రుణం, ఇతర రాయితీలు పొందవచ్చు.
  3. వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా వ్యవసాయంపై నియమించిన ప్రొఫెసర్‌ జయతీ ఘోష్‌ కమిషన్‌ కౌలురైతుల రక్షణకు అనేక సూచనలు చేసింది. ప్రభుత్వం వాటిని అధ్యయనం చేయాలి.
  4. కౌలురైతుల గురించి వ్యవసాయ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ స్వామినాథన్‌ కమిషన్‌ చేసిన సిఫార్సులు అమలు జరపాలి.
    రాష్ట్రంలో ఏం జరగాలి?
    ఆంధ్రప్రదేశ్‌లో సాగు 70-80శాతం కౌలురైతులపై ఆధారపడి ఉన్నది.కౌలు రైతు లకు ప్రభుత్వం న్యాయం చేయటం లేదు. గుంటూరు జిల్లాలో గత నాలుగు సంవత్సరాలలో ఆత్మ హత్యలు చేసుకున్న రైతులలో 90 శాతం కౌలురైతులే. కౌలు రైతులకు న్యాయం జరగాలంటే దిగువ అంశాలను పరిశీలించాలి.ఈ నేపథ్యంలో భూ యజమానులు కౌలుపెంచి రైతుల కష్టార్జితాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం జిఓ 425 తెచ్చి పేదలు సాగు చేస్తున్న దేవాలయ భూములకు బహిరంగవేలం పెట్టి ఎకరాకు రూ.30 వేల నుండి 60 వేలు పెంచారని పేర్కొన్నారు. దేవుని పేరు చెప్పి నిరుపేదలకు అన్యాయం చేస్తున్నారని వివరించారు. అనాలోచితంగా తీసుకొచ్చిన నూతన కౌలుచట్టం సబ్సిడీ పథకాలు పొందడానికి అవకాశం లేకుండా చేసిందని, సెంటు భూమి కూడా సాగుచేయని భూ యజమానులే పంట రుణాలు పొందుతున్నారని వివరించారు. కౌలు రైతులు ఎనిమిది లక్షల మంది ఉంటే రైతు భరోసా 50 వేల మందికి మించి ఇవ్వడం లేదని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో పంటలు అమ్ముకునే పరిస్థితి లేదని తెలిపారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వడం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఏ పథకాలూ కౌలు రైతులకు వర్తింపజేయడం లేదని, ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు, వ్యవసాయ యంత్ర పరికరాలు ధరలు 30 నుండి 50 శాతం పెరిగాయని తెలిపారు. ట్రాక్టర్‌ డీజిల్‌ ధరలు పెరగడంతో అద్దెలు పెరిగి సాగు ఖర్చులు గతం కంటే ఈ ఏడాది రూ.ఐదువేల నుండి రూ.ఏడువేలు అదనంగా పెరిగిందని వివరించారు. రైతులకు మాత్రం పంటలకు కనీస మద్దతు ధర కూడా అందడం లేదని వివరించారు. రైతుల నష్టాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇప్పటికే ముందుగా కౌలు చెల్లించిన వారికి వచ్చే ఏడాదికి జమచేసుకునే విధంగా చూడాలని కోరారు.
    రుణాలకు బ్యాంకుల విముఖత
    కౌలు రైతులు కష్టాల కడలిలో ఎదురీదు తున్నారు. బ్యాంకులు రుణాలు ఇవ్వక, ప్రభు త్వాల సాయం అందక పెట్టుబడుల కోసం అవస్థలు పడుతున్నారు. వడ్డీలకు తెచ్చి పంటలు సాగు చేస్తున్నారు. కష్టాలకోర్చి పంటలు సాగు చేసినా చివరి దశలో ప్రకృతి కన్నెర్ర చేయడం, మద్దతు ధర లభించకపోవడం, ధాన్యం విక్ర యాల్లో ఇబ్బందులు ఎదురవడం వంటివి కౌలు రైతులను అప్పుల ఊబిలోకి నెడుతున్నాయి. రైతుబంధు, పీఎం కిసాన్‌ పథకాలు పట్టా దారులకే వరంగా మారాయి.కౌలు ధరలు కూడా పట్టాదారు రైతులకే లాభాలు చేకూరు స్తున్నాయి. భూ తల్లిని నమ్ముకున్న కౌలు రైతులు మాత్రం ఆర్థిక భరోసా లేక దిగుబడిపై నమ్మ కంలేక ప్రకృతిపై భారం వేసి సాగుబడి చేస్తు న్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో దాదాపు 60 వేల మందికిపైగా కౌలు రైతులు ఉపాధి పొందుతున్నారు. కౌలురైతులను ప్రభుత్వ పథకాలకు పరిగణలోకి తీసుకోవడం లేదు. పంట పెట్టుబడి రుణాలు కూడా అందని పరిస్థితి. దీంతో పంట పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. కౌలు రైతులను అధికారికంగా గుర్తిస్తామన్న హామీ కూడా నేరవేరడం లేదు. కౌలు రైతులను గుర్తించి రుణ అర్హత కార్డులు అందజేస్తే బ్యాంకుల ద్వారా రుణాలు పొందే అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పట్టాదారులు, ధనిక రైతులు నగరాల్లో ఉంటూ భూములను కౌలుకు ఇస్తున్నారు. కనీసం కౌలు ధరలు కూడా తగ్గించడం లేదు. ఏటా పెంచుతూనే ఉన్నారు. భూమి, నీటి వసతిని బట్టి కౌలు డిమాండ్‌ పెరుగుతుంది. ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం కౌలు విధానం కూడా చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కావడంతో భూములను కౌలుకు తీసుకుంటున్నారు. కౌలు ధరలతోపాటు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల ధరలు పెరిగిపోతున్నాయి. దీనికి తోడు వరికోతలు, పత్తి ఏరడం, కలుపు తీయడం వంటి సమయాల్లో కూలీల కొరత అదనపు భారంగా మారింది. పంట చేతికి వచ్చే సమయంలో నష్టాన్ని చవిచూసే రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారు.
    ఏడాదంతా కష్టపడి వ్యవసాయం చేసినా కౌలు రైతులకు నోటికి.. చేతికి దూరం తగ్గడం లేదు. కౌలుతో సహా విత్తనాలు, ఎరువులు, పురుగుమందులకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇంత వెచ్చించినా ప్రకృతి విపత్తులతో పంట చేతికి రాని సందర్భాలే ఎక్కువ. దీంతో భారీగా కౌలు రైతులు నష్టపోతున్నారు. వీరికి సీసీఆర్‌ (క్రాప్‌ కల్టివేటర్‌ రైట్‌) కార్డులు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం కనీసంగా అందించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా జిల్లా వ్యాప్తంగా 90 శాతం మంది కౌలు రైతులు గుర్తింపునకు నోచుకోవడం లేదు. పెట్టుబడి సాయం, పంట ఉత్పత్తులను అమ్ముకోవడం, నష్ట పరిహారం లేదా ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంటల బీమా, పంటల రుణం ఇలా ఏది వర్తించాలన్నా సీసీఆర్‌ కార్డు ఉండాల్సిందే. వీటన్నిటికి ఈ కార్డు ఉంటేనే కౌలు రైతులకు అర్హత ఉంటుంది. కానీ ఉన్నతాధికారులు జిల్లావ్యాప్తంగా కౌలు రైతులందరికీ సీసీఆర్‌ కార్డులు ఇవ్వడానికి చర్యలు తీసుకోవడం లేదు. ఖరీఫ్‌ సీజన్‌ మొదలైందని… ఈసారైనా అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తే తమకు సీపీఆర్‌ కార్డులు అందుతాయని కౌలు రైతులు అంటున్నారు.
    సకాలంలో అందేనా?
    జిల్లాలో ఖరీఫ్‌ సాగు పనులు మొదలయ్యాయి. సొంత భూమి ఉన్న రైతులు ప్రభుత్వం అందించే అరకొర రాయితీ విత్తనాలకు తోడు, ఇప్పటికే వారి ఖాతాలో జమ అయిన రైతు భరోసా చేదోడుతో సాగుకు సిద్ధమవుతున్నారు. కానీ కౌలు రైతుల పరిస్థితి అగమ్య గోచరం. వారికి ఏ ఆసరా లేదు. ప్రభుత్వం ఏటా వారికి అందించే సీసీఆర్‌సీ పత్రాలు ఇప్పటికీ అందలేదు. గతంలో కార్డులు ఉన్న రైతులు కూడా మళ్లీ రెన్యువల్‌ చేయించుకుంటేనే మనుగడలోకి వస్తుంది. భూ యజమాని అనుమతితో కార్డును రెన్యువల్‌ చేయించు కోవాలి. ఈ ప్రక్రియ మొత్తం మే నెలాఖరు వరకు ముగించి ఖరీఫ్‌ ప్రారంభమయ్యే జూన్‌ నెల మొదటి రెండు వారాల్లో రైతులకు కార్డులు ఇవ్వాలి. కానీ జిల్లా వ్యవసాయ శాఖ ఈ పనిని ఇప్పుడు మొదలుపెట్టింది. సంబంధిత పత్రా లను కౌలు రైతులు సమర్పిస్తే వీఆర్వో ఆమో దంతో కార్డులు కౌలు రైతులకు అందుతాయి. ఈ ప్రక్రియ అంతా జరిగి కార్డులు అందేసరికి జూన్‌ ముగిసిపోవడం ఖాయం. దీని వల్ల కౌలు రైతుల సాగుకు అవసరమైన రాయితీ విత్తనాలు, రైతు భరోసా సాయం కూడా అందదు. సొంత భూమి ఉన్న రైతులే ఖరీఫ్‌ పెట్టుబడుల కోసం నానా అగచాట్లు పడుతోంటే సీసీఆర్‌ కార్డులు లేని కౌలు రైతుల కష్టాలు ఊహించవచ్చు.
    అవగాహన లేకపోవడమే..
    సీసీఆర్‌ కార్డులు అందరికీ అందకపోవడానికి కారణం భూ యజమానులకు వీటిపై అవగాహన లేకపోవడమే. కౌలుదారులకు న్యాయం చేయాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే ముందు భూ యజమానులకు సీసీఆర్‌ కార్డులపై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలి. కౌలు రైతులకు ఈ కార్డు ఇవ్వడానికి అంగీకరిస్తే తమ భూహక్కుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలియజెప్పాలి. ఈ కార్డు మనుగడలో ఉండేది కేవలం 11 నెలలే కాబట్టి తరువాత యజమాని కౌలుదారును మార్చుకున్నా లేక కౌలును రద్దు చేసుకున్నా ఎలాంటి ఇబ్బంది ఉండదని వివరించాలి. కానీ క్షేత్ర స్థాయిలో వీటి మీద అవగాహన కల్పించాల్సిన యంత్రాంగం అంతగా శ్రద్ధ చూపడం లేదు. దీనివల్ల జిల్లా వ్యాప్తంగా 10 శాతం మంది మాత్రమే కౌలు రైతులుగా గుర్తింపు పొందుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తే కౌలు రైతులకు మేలు జరుగుతుందని రైతు సంఘ నాయకులు అంటున్నారు.
    ఏటికేడు తగ్గుతున్న కౌలు రైతులు..
    వ్యవసాయం లాభసాటి కాకపోవడంతో భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేయడం దుర్భరంగా మారింది. దీని వల్ల కౌలు రైతుల సంఖ్య జిల్లాలో బాగా తగ్గిపోతోంది. నీటి సౌకర్యం బాగా ఉంటే ఎకరాకు వేలకు వేలు కౌలు కట్టాలి. తీరా ప్రకృతి విపత్తులతో నష్టం వచ్చినా కౌలు చెల్లించాల్సిందే! మార్కెట్‌లో ధర లేకపోయినా నష్టపోవాల్సిందే. ఈ బాధలు పడలేక చాలామంది కౌలు వ్యవసాయం చేయడానికి సాహసించడం లేదు.
    అంతంత మాత్రంగానే..
    జిల్లా వ్యాప్తంగా దాదాపు మూడు లక్షల మంది రైతులు ఉన్నారు. వీరిలో 25 నుంచి 30 వేల మంది కౌలు రైతులు ఉంటారని అంచనా. వారిలో సీసీఆర్‌ కార్డులు చాలా కొద్ది మందికే ఉన్నాయి. గత ఏడాది ఉమ్మడి జిల్లాలోనే ఈ సంఖ్య 35 వేలు దాటలేదు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు.. కార్డుల జారీ ప్రక్రియ ఎంత లోపభూయిష్టంగా ఉందో. సీసీఆర్‌ కౌలు రైతుల కష్టాలన్నింటినీ తీర్చే సంజీవని అని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. కానీ క్షేత్రస్థాయిలో వాస్తవాలు మరోలా ఉన్నాయి. వాతావరణ పరిస్థితుల వల్ల పంట నష్టపోతే అందించే బీమా…దిగుబడు లకు ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర అన్నింటికీ సీసీఆర్‌సీ లింకు తప్పనిసరి. గత ప్రభుత్వంలో ఈ మెలిక లేకపోవడంతో కౌలు రైతులకు కొన్ని ఫలాలు అందేవి. రైతు సంక్షేమమే తమ ధ్యేయ మని వల్లె వేసే వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణలు, ప్రక్షాళనల వల్ల కనీ సంగా కూడా తమను మేలు జరగడం లేదని కౌలు రైతులు ఆవేదన చెందుతున్నారు.

మానసిక ఒత్తిడిళ్లుల్లో ఉపాధ్యాయులు

ఉపాధ్యాయుల సమయమంతా ‘యాప్‌’లతోనే గడిచిపోతున్నది. ఇటీవల ప్రవేశపెట్టిన ‘ముఖ చిత్ర అటెండెన్స్‌ యాప్‌’ను ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నాడు-నేడు పనులు, మధ్యాహ్న భోజన పనులతో ఉపాధ్యా యులు బోధనపై దృష్టి పెట్టలేకపోతున్నారు. టెక్నాలజీ వినియోగించాలంటే ఇంటర్నెట్‌తో సహా సౌకర్యాలు అవసరం. ఆంధ్రప్ర దేశ్‌లో 670 మండలాలలో దాదాపు 400 మండ లాల్లో ఇంటర్నెటట్‌ సరిగా పనిచేయని పరిస్థితి ఉన్నది. ఉపాధ్యా యులను బోధనేతర పనుల నుంచి విముక్తులను చేయాలి.
ప్రముఖ తత్వవేత్త ఎపిక్యూరస్‌ ‘’విద్య మనిషి నుండి వేరు చేయలేని సంపద’’ అనిపేర్కొన్నా డు.‘’విద్య అనే వృక్షం వేళ్లు చేదుగాను,ఫలాలు తియ్యగాను ఉంటాయని’’ గ్రీక్‌ తత్వవేత్త అరి స్టాటిల్‌ చెప్పాడు. మనిషి తన మనుగడ కోసం ప్రకృతి శక్తులతో పోరాడే క్రమంలో పొందిన అనుభవ పూర్వకమైన జ్ఞానమే విద్య. మానవ సమాజం ఆవిర్భవించిన నాటి నుండి మాన వుడు తాను తెలుసుకున్న జ్ఞానాన్ని, సాధించిన నైపుణ్యాలను తరువాత తరాలకు అందించ టానికి విద్య ద్వారా ప్రయత్నంచేస్తూనే ఉన్నాడు. మానవ సమాజం సామూహికంగా సంపా దించిన జ్ఞాన, అనుభవాలసారాన్ని అందించ టమే విద్యగా నిర్వచించవచ్చు.అటువంటి విద్య ప్రజలందరికి అందుబాటులో ఉండాలి. భారత రాజ్యాంగంలో 45వ నిబంధన ప్రకారం 14 సంవత్సరాల లోపు పిల్లలందరికి ఉచిత, నిర్బం ధ విద్య అందించాలి. 2002లో చేసిన 86వ రాజ్యాంగ సవరణ ప్రాథమిక హక్కులలో 21-ఎ నిబంధన చేర్చి, ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా మార్చింది. 2010లో అమలులోకి వచ్చిన జాతీయ విద్యా హక్కు చట్టం కూడా 14 సంవత్సరాల లోపు పిల్లలందరూ బడిలో ఉండాలని చెప్పింది. కానీ, ప్రజలందరికి అందుబాటులో ఉండవలసిన విద్య భారత దేశంలో,ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ చెందింది. ముఖ్యంగా 1991 లో ప్రవేశపెట్టిన ప్రైవేటీకరణ-సరళీకరణ-ప్రపంచీకరణ విధానాల ప్రభావం విద్యారం గంపై పడి రెండు సమాంతర వ్యవస్థలు ఏర్ప డ్డాయి. పేద విద్యార్థులు, అణచివేతకు గురైన వర్గాల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో ఉండగా, ఆర్థిక సామాజిక స్తోమత కలిగిన వారి పిల్లలు ప్రైవేట్‌,కార్పొరేట్‌ పాఠశాలలో సంస్థలలో చదువుతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ పాఠ శాలల్లో 73 లక్షల మంది పిల్లలు చదువుతుం డగా వారిలో 40లక్షల మంది ప్రభుత్వ పాఠ శాలల్లో,33లక్షలమంది ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠ శాలల్లో చదువుతున్నారు. రాష్ట్రంలో 1,90,0 00 మంది ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశా లల్లో పనిచేస్తుండగా,1,20,000 మంది ప్రైవేట్‌ పాఠశాలల్లో పనిచేస్తున్నారు. విద్యారంగంలో వచ్చిన మార్పులకు ఉపాధ్యాయులు కూడా తీవ్ర మైన ఒత్తిడికి గురవుతున్నారు.
ఉపాధ్యాయుడు -సృజనాత్మకత
ప్రాచీన కాలం నుండి ఇప్పటిదాకా విద్య నేర్పటంలో ఉపాధ్యాయుడు ప్రాధాన్యతగల సృజనాత్మక పాత్ర పోషిస్తు న్నాడు. విద్యార్థి సామాజికీకరణ చెందటంలో సామాజిక విలువ లు పెంపొందటంలో ఉపాధ్యాయుడే ముఖ్య పాత్ర కలిగి ఉంటా డు. ఉపాధ్యాయుడు ‘విద్యా ర్థి కేంద్రీకృత’ బోధన చేయడంతో పాటు విద్యార్థిలో ప్రశ్నించేతత్వాన్ని పెంపొందించాలి. తరగతి గదిలోని ప్రతి విద్యార్థిపై ఉపాధ్యా యుడికి అవగాహన ఉండాలి. విద్యార్థులలో స్ఫూర్తిని కలిగిస్తూ విద్యార్థులకు లక్ష్యాలను నిర్దేశించాలి. ఉపాధ్యాయులు వృత్తిపరమైన నైపుణ్యాలు పెంచు కుంటూ, బోధన పరికరా లు, అవసరమైన టెక్నాలజీ వినియోగిం చుకో వాలి. విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథం,లౌకిక భావనలు, ప్రజాస్వామ్య ఆలోచనలు పెంపొం దించటానికి కృషి జరగాలి.
టెక్నాలజీ ప్రత్యామ్నాయం కాదు
వేగంగా పెరుగుతున్న టెక్నాలజీ, వర్చువల్‌ క్లాస్‌రూం విధానం ఉపాధ్యాయులకు ప్రత్యా మ్నాయంగా మారుతుందని కొంతమంది భావించారు.కాని టెక్నాలజీ ఉపాధ్యాయుడిగా సహాయకారిగా ఉపయోగపడుతుందిగాని, ప్రత్యామ్నాయం కాదని ఆచరణలో రుజువైంది. కరోనా వలన గత రెండేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా మన దేశంలో ఉపయోగించిన ‘ఆన్‌లైన్‌’ టీచింగ్‌ విధానంతో విద్యార్థులలో విపరీతమైన ‘ప్రవర్తనా పరమైన’ ఇబ్బందులు తలెత్తాయి. తల్లిదండ్రులు ముక్తకంఠంతో ఆన్‌లైన్‌ విధానం కంటే ఉపాధ్యాయుల బోధనే అవసరమని అంగీకరిస్తున్నారు. ఇటీవల జరిగిన అనేక అధ్యయనాలు కూడా ఈ విషయాలను ధృవీకరించాయి. అనేక పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ‘స్మార్ట్‌ క్లాస్‌రూం’లు కూడా ఉపాధ్యా యుడు ఉపయోగిం చిన చోటే విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఇటీవల ప్రపంచబ్యాంక్‌ నివేదికలో విద్యారంగంలో మానవ వనరుల కంటే టెక్నాలజీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నది. దీని అర్థం ఉపాధ్యాయుల సంఖ్య తగ్గించటమే. ప్రభుత్వాలు ప్రపంచబ్యాంక్‌ విధానాలను అమలు చేస్తూ ఉపాధ్యాయుల సంఖ్య తగ్గించటానికి భిన్నమైన పద్ధతులలో ప్రయత్నిస్తున్నాయి.
తీవ్ర ఒత్తిడి…
విద్యారంగంలో ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంస్కరణల వలన ఉపాధ్యాయులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. బోధన కంటే బోద óనేతర పనులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తు న్నది. ఉపాధ్యాయులు 14రకాల యాప్‌లు ఉప యోగించవలసిన పరిస్థితి ఏర్పడిరది. ఉపాధ్యా యుల సమయమంతా ‘యాప్‌’లతోనే గడిచిపో తున్నది. ఇటీవల ప్రవేశపెట్టిన ‘ముఖచిత్ర అటెం డెన్స్‌ యాప్‌’ను ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరే కిస్తున్నారు. నాడు-నేడు పనులు, మధ్యాహ్న భోజన పనులతో ఉపాధ్యాయులు బోధనపై దృష్టి పెట్టలేకపోతున్నారు. టెక్నాలజీ వినియో గించాలంటే ఇంటర్నెట్‌తో సహా సౌకర్యాలు అవసరం. ఆంధ్రప్రదేశ్‌లో 670 మండలాలలో దాదాపు 400 మండలాల్లో ఇంటర్నెట్‌ సరిగా పనిచేయని పరిస్థితి ఉన్నది. ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి విముక్తులను చేయాలి.
3,4,5 తరగతుల తరలింపు
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను దగ్గరలోగల హైస్కూళ్లకు తరలించాలనే నిర్ణయం వివాదా స్పదమైనది. నిర్ణయాన్ని పేద తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పాఠశాల విద్యా పరిరక్షణ కమిటీ శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి అనంతపురం జిల్లా పెనుగొండ వరకు నిర్వహించిన బడి కోసం బస్సు యాత్ర కూడా ఈ ఆందోళనను గమనించింది. 3,4,5 తరగ తుల తరలింపు జాతీయ విద్యా హక్కు చట్టానికి పూర్తిగా విరుద్ధమైనది. దీని వలన బలహీన వర్గాలకు చెందిన పిల్లలు, బాలికలు డ్రాపౌట్లు గా మారే ప్రమాదమున్నది. తరగతులు తరలించకుండా ప్రాథమిక పాఠశాలలను పటిష్టపరచాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ సంస్కరణల ద్వారా పాఠశాలల సంఖ్యను 45 వేల నుంచి15 వేలకు తగ్గించటానికి, 50 వేల ఉపాధ్యాయ పోస్టులు తగ్గించటానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది.
ప్రైవేట్‌ ఉపాధ్యాయులు
రాష్ట్రంలో దాదాపు16 వేల ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో 1,20,000 వేల మంది ప్రైవేట్‌రంగ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు.వీరిలో ఎక్కువ మంది అతి తక్కువ వేతనాలతో,ఉద్యోగ భద్రత లేకుండా, సామాజిక భద్రత లేకుండా పనిచేస్తున్నారు. కరోనా కాలంలో దాదాపు 15నెలలపాటు వీరికి వేతనాలు లేక కూలీలుగా మారవలసిన పరిస్థితి ఏర్పడిరది. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రైవేట్‌ ఉపాధ్యాయుల రక్షణకోసంచట్టం చేసి, గుర్తింపు కార్డులు ఇవ్వని వారికి వేతన భద్రత, ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రభుత్వ సహాయం అందించాలి.
కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉపాధ్యాయులు
రాష్ట్రంలో 352 కస్తూరిబా విద్యాలయాలలో దాదాపు 4 వేల మంది కాంట్రాక్టు ఉపాధ్యా యులు, ఆంధ్రప్రదేశ్‌ గురుకుల పాఠశాలలలో 2 వేల మంది కాంట్రాక్టు, గెస్ట్‌ ఉపాధ్యాయులు గా, సాంఘిక సంక్షేమ-గిరిజన సంక్షేమ-బి.సి సంక్షేమ గురుకుల పాఠశాలల్లో దాదాపు 3 వేల మందికి పైగా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీరికి ఉద్యోగ భద్రత లేదు. తక్కువ వేతనాలతో పనిచేస్తు న్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 3,400 మంది కాంట్రాక్టు అధ్యాపకులు, డిగ్రీ, పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 1000కి పైగా కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారు. రాష్ట్రంలో వివిధ విశ్వవిద్యాలయాలలో 5 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉపాధ్యాయులను, అధ్యాపకులను క్రమబద్ధీకరించవలసిన అవస రమున్నది. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి వాగ్దానం చేసిన విధంగా కాంట్రాక్టు ఉపా ధ్యాయులకు, ఔట్‌సోర్సింగ్‌, పార్ట్‌టైం, గెస్ట్‌ ఉపా ధ్యాయులకు కూడా న్యాయం చేయాలి.
రాజ్యాంగ లక్ష్యాలు -విద్య
విద్యా రంగంలో మార్పులు,సంస్కరణలు రాజ్యాంగ లక్ష్యాలు నెరవేర్చేవిగా అందరికీ విద్య అందించేవిగా ఉండాలి. కాని ఆంధ్రప్రదేశ్‌లో సంస్కరణలు విద్యా రంగాన్ని ‘మార్కెట్‌’ దిశగా తీసుకువెళుతున్నాయి. విద్య ద్వారా ‘సామాజిక మనుషులను’ కాకుండా ‘మార్కెట్‌ మనుషులను’ తయారుచేస్తున్నారు. మార్కెట్‌కు అవసరమైన కోర్సులు మాత్రమే ప్రవేశ పెడుతున్నారు. పాఠశాల స్థాయిలో కూడా మార్పులు, గ్రేడ్‌ పాయింట్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ పరి ణామాల నేపథ్యంలో ఉపాధ్యాయులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. ప్రభుత్వం ఉపాధ్యా యులను బోధనకే పరిమితం చేసి, వారి చేత సృజనాత్మకంగా బోధన చేయించే వాతావరణం నెలకొల్పాలి.- (కె.ఎస్‌.లక్ష్మణరావు)

భారత దేశంలో అమలు కానీ ఐక్య రాజ్య సమితి నియమాలు

ప్రపంచ వ్యాప్తంగా179 దేశాలలోని ఆదివాసీ ప్రజలు దట్టమైన అడవులు కొండ ప్రాంతాల్లో నది పరివాహక ప్రాంతాలలో అభివృద్ధికి దూరంగా విలక్షణమైన జీవనాన్ని అవలంబిస్తూ పకృతి పై ఆధారపడి, ప్రత్యేక సంస్కృతి సాంప్ర దాయాలు, భాష, వేషధారణ కలిగి38కోట్ల జనాభాతో7000 భాషలు మాట్లాడుతూ, 50 00 రకాల బిన్న సంస్కృతులు పాటిస్తున్నారు. భారతదేశం లో అధికారికంగా చూసినపుడు 2011జనాభా లెక్కల ప్రకారం భారత దేశ జనాభాలో ఆదివాసీల జనాభా 8.6శాతం కాగ అందులో10,42,81,034 జనాభాగల ఆది వాసీలు, 6,92,027 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో గల దట్టమైన అడవిప్రాంతంలో 26 రాష్ట్రాలలో కేంద్ర పాలిత ప్రాంతాలలో,188 ఆదివాసి జిల్లాలలో ఉన్నారు. దేశ విస్తీర్ణంలో 60శాతం అడవి ఆదివాసి ప్రాంతంలోనే ఉం డగా పకృతిలో మమేకమైన తెగలను భారత రాజ్యాంగంలో 705షెడ్యూల్‌ తెగలుగా గుర్తించింది, ఇందులో అత్యంత ఆట విక లక్షణాలు కలిగిన ప్రిమినిటివ్‌ ట్రైబల్‌ గ్రూప్‌ (పిటిజి)లు75 తెగలు కలిగి 27,68,322 జనాభా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో9రకాల ఆదిమతెగలు కోయ, గోండు, కొలం,పర్ధాన్‌,తోటి, నాయకపొడు, మన్నేవార్‌, కొలవార్‌, కొండ రెడ్డి, అంద్‌,చెంచు,గోతి కోయ, లాంటి ఆదిమ తెగలు గోదావరి పరివాహక ప్రాంతం ప్రాణహిత, కిన్నెరసాని,కృష్ణ నది లాంటి పరివాహక ప్రాంతాల్లో దట్టమైన అడవుల్లో నివాసం ఏర్పరుచు కొని,17352 చరపు కిలోమీటర్ల షెడ్యూల్‌ ఏరియా భూభాగంలో నివాసం ఉం టున్నారు. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా,దేశ వ్యాప్తంగా,రాష్ట్ర వ్యాప్తంగా, ఆదిమ తెగల మనుగడ పై కొన్ని అంశాలను మి ముందు విశ్లేషణ చేయాలనేది ఈ వ్యాసం సారాంశం.
1982 ఆగస్టు 9న ఐక్యరాజ్య సమితి(ఖచీూ) ఆధ్వర్యంలో ‘జెనీవా’లో ప్రపంచ వ్యాప్త ఆదిమ తెగల సమస్యలపై,26 మంది స్వతంత్ర మానవ హక్కుల మేధావులతో వర్కింగ్‌ గ్రూప్‌ల సమా వేశాన్ని నిర్వహించటం జరిగింది. ఈ సమా వేశంలో 140దేశాల ప్రతినిదులు పాల్గొన్నారు. ఆదివాసీల గుర్తింపు కోసం కూడా ప్రపంచ వ్యాప్తంగా ఒకరోజు ఉండాలని ఐక్యరాజ్య సమితి కమిటీ కోరగా,ఆదివాసుల సంరక్షణ, హక్కులు, చట్టాల రక్షణకు ఐక్య రాజ్య సమితి ఆమోదం తెలిపింది. అనంతరం ఈ కమిటీ 1982నుండి1992 వరకు,పది సంవ్సరాల పాటు ప్రపంచ వ్యాప్తంగా క్షేత్రపర్యటన చేసి ఆదివాసీల సమస్యలను సమగ్రంగా అధ్య యనంచేసి,విశ్లేషించి,23 డిసెంబర్‌ 1994 నుండి 2004 వరకు ఆమధ్య కాలన్ని ఆదివాసీ అభివృద్ధి కాలంగా పరిగణించి,ఆగస్టు9వ తేది నీ అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవంగా ప్రకిం చింది. ఆదివాసి తెగలలో మానవ హక్కుల ఉల్లంఘనలు ఎక్కువ జరుగుతున్నాయని మానవ హక్కుల రక్షణ కోసం హై కమిషన్‌ సెప్టెంబర్‌ 13,2007న జనరల్‌ అసెంబ్లీ ద్వారా ఐక్య రాజ్య సమితి ఒకడిక్లరేషన్‌ (ఖచీణRI) ప్రకటించింది.అందులో‘ఆర్టికల్‌ 45’లో ఆదిమ తెగల సంస్కృతి రక్షణ,సంస్కృతి రక్షణలో ఆది ఆదివాసీల అభిప్రాయాలను గౌరవించటం,తెగలభాష రక్షణ,విద్య వ్యవస్థలో ఆదివాసి భాష కూర్పు,విద్య అభివృధి లాంటివి చేర్చినారు.‘ఆర్టికల్‌ 46’లో ప్రభుత్వం ఆదివాసి ప్రాంతాల్లో అభివృధి విషయంలోచేసే అన్ని నిర్ణయాలలో ఆదివాసీలను బాగా స్వామి చేయటం,అదే విధంగా బారిప్రాజెక్ట్‌ల మూ లంగా,ఖనిజ త్రవ్వకాల మూలంగా నిర్వాసి తులుగామారి,జీవన ఆధారం కోల్పోయిన ఆదివాసీలకు న్యాయమైన హక్కుగా నష్ట పరి హారం,రిహబిటేషన్‌ కల్పించి రక్షించటంతో పాటు, ములవాసిల పట్ల వివక్షతను చూపటం నీ నిషేధించింది,వారి యొక్క నిర్ణయం లేకుండా ఎటువంటి చర్యలు చేపట్టడం నిషేధం, అభివృధిలో బాగంగావారి ఆర్థిక,సామాజిక, పరిస్థితులను వారి విభిన్నమైన జీవనశైలికి అను గుణంగా వ్యవహరించాలని ఈ డిక్లరేషన్‌ తెలి పింది. దీనితో పాటు2017లో ఆదివాసి పదం తోపాటు,‘ఇంటర్నేషనల్‌ ఇండిజినియస్‌ పీపిల్స్‌ డే’గా ప్రకటించింది. ఆదివాసి తెగల భాష రక్షణకు కూడా2022 నుండి 2032 కాలాన్ని ఆదిమ భాషల రక్షణకు అన్ని దేశాలకు నివేదిం చింది.2022 సంవత్సరాన్ని ఆదిమభాషల పరి రక్షణ దినోత్సవం గా ప్రకటించింది.పై తీర్మా నలపై148 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సంతకాలు చేసినవి,అందులో అమలు చేసిన దేశాలు కేవలం 60మాత్రమే. ఈ అమలు చేసిన 60దేశాల జాబితాలో భారతదేశం లేదు అంటే,ఈ దేశంకి ఆదివాసిల అభివృధిపట్ల ఎంతశ్రద్ధ ఉంది అర్థం చేసుకోవచ్చు.ఏసమా జానికి అయినబాష అనేది అత్యంతకీలకం. ప్రపంచవ్యాప్తంగాఉన్న 7000ఆదివాసీ తెగల సజీవభాషలలో,దాదాపు 3000భాషలు అంత రించిపోతున్న భాషలుగా పరిగణించబడ్డాయి. ఇప్పటి వరకు ఖచీజుూజూ ప్రపంచంలోని అంతరించిపోతున్న భాషల జాబితాలో అసుర్‌, బిర్వోర్‌,కొర్వాలను ఉంచింది,బిర్వోర్‌ను క్లిష్టంగా అంతరించిపోతున్న భాషగా వర్గీకరించారు. కేవలం 2000మంది మాత్రమే ఈభాష మాట్లా డుతారు.భారతదేశంలో ఐదు ఆదిమభాషలు అంతరించిపోతున్నాయి అని తెలిపింది. అందులో సిక్కింలోని మారిaభాష అత్యంత ప్రమాదకర భాష అనీ భాష నిపుణులు చెబు తున్నారు,‘పీపుల్స్‌ లింగ్విస్టిక్‌ సర్వే ఆఫ్‌ ఇండి యా’ నిర్వహించిన పరిశోధన ప్రకారం ప్రస్తుతం ‘‘మారిa’’ మాట్లాడే వ్యక్తులు కేవలం నలుగురు మాత్రమే ఉన్నారు, వారందరూ కూడా ఒకే కుటుంబానికి చెందినవారుగా పేర్కొంది. అదేవిధంగా తూర్పు భారత దేశంలో ‘‘మహాలీ’’బాష,అరుణాచల్‌ ప్రదేశ్‌ లోని ‘‘కోరో’’,గుజరాత్‌లోని ‘‘ సిడి’’,అస్సాం లోని ‘‘దిమాస’’ భాషలు అంతరించిపోతున్నాయి అని తెలిపింది.ఖచీూ చెప్పినట్లుగా అత్యంత దారుణ పరిస్థితిలో ఈదేశంలో ఆదిమభాషల పరిస్థితిఉన్న కూడా భాషకు రక్షణ చర్యలు మాత్రం ప్రభుత్వాలు చేసే పరిస్థితులు కనిపిం చవు.ఐక్యరాజ్య సమితి నివేదించిన ఏఒక్క నియమాలను గౌరవించటం లేదు భారత దేశం,ఛత్తీస్గఢ్‌ రాష్ట్రంలో ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌ పేరిట,లక్షలాది ఆర్మీ క్యాంపులు ఏర్పాటు చేసి, పకృతి ఒడిలో జీవించే ఆదివాసీలను అడవిలోకి పశువుల్ని మేపటానికి వెళ్లిన,పకృతితో మమే కమైన పండుగలు జరిపే క్రమంలో,ఒకగూడెం నుండి ఇంకొక గూడెంకి సత్సంబంధాలు నెల కొల్పే క్రమంలో,ఎందరో సామాన్య ఆదివాసీల ను కాల్చి చంపిన ఘటనలు అనేకం.ఖనిజ త్రవ్వకాల పేరిట,టాటా,బిర్లా, ఆధానిలకు ఈ దేశ సంపదను అమ్మి వేస్తూ అడవితల్లిని, విధ్వంసంను అపమన్నదుకు అడవితల్లి నెల కోసం పోరాడినదుకు,అస్తిత్వంకోసం తిరగ బడి నందుకు,వేలాదిమంది ఆదివాసులపై అక్రమ కేసులు,ఊపాచట్టాలు,మహిళలపై అత్యాచా రాలు. సల్వా జుడుం లాంటి సంస్థలను నెల కొల్పి ఈ దేశ ములావాసులపై ఎటువంటి మారణ హోమం,లైంగిక హింస అడవిబిడ్డపై కొనసాగింది కళ్ళారా చూసాము. జంగల్‌ మహల్‌ పచింబెగాల్‌లో కానీ, కాంద మహల్‌ ఒరిస్సాలోగాని,నియంగిరి కొండలలోని బాక్సైట్‌ త్రవకంకానీ,జార్కండ్‌లో టాటా బిర్లా ఉక్కు కర్మాగారంగాని,ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం పేరిట ముచిన 300గ్రామాల ఆదివాసి ప్రజల జలసమాధి కానీ,గుజరాత్‌ మధ్య ప్రదేశ్‌లో నర్మదనదిపై ఏర్పాటు చేసిన సర్దార్‌ సరోవర్‌ ప్రాజెక్ట్‌ క్రింద మునిగిన 1000గ్రామాల ఆది వాసీల ఆర్తనాదాలు కానీ, ఈదేశంలో ఆదిమ తెగలకు స్థానం లేదు వారికి బ్రతుకుకు విలువ లేదు. అసలు మనుషులుగానే చూడబడటం లేదు అనటానికి నిదర్శనం.వర్జీనియస్‌ కాక కమీ షన్‌ 2014’నివేదించిన ప్రకారం ఈదేశంలో 47శాతం ఆదివాసీలు నిర్వాసితులు అయ్యారని తెలిపింది,బారిప్రాజెక్ట్‌లు డ్యాంలు కట్టడం వలన, మైనింగ్‌ త్రవ్వకాలవలన,వైల్డ్‌ లైఫ్‌ శాంచరీ,పులుల అభయ అరణ్యాల వలన, పరి శ్రమల ఏర్పాటు వలన,స్వాతంత్య్రం వచ్చిన నుండి నేటి వరకు 21మిలియన్‌ ఆదివాసి ప్రజలకు ప్రభుత్వం పునరావాసం కల్పించలేదు. పైగా అసలు ఏమయ్యరో ఈప్రజలు అనేది కూడా స్పష్టత లేదు నేటి వరకు.పైగా ‘‘కేంద్ర పునరావాస చట్టం 2013’’లాంటివి ఉన్నా ఉపయోగం లేదు. ఇంకా దారిద్య్రపు రేఖకి దిగువన ఈదేశంలో 36శాతం ఆదివాసి ప్రజలు ఉన్నారు అందులో జార్ఖండ్‌ రాష్ట్రం 54.2శాతంకాగా, ఒరిస్సా 75.6శాతం అధిక స్థానంలో అత్యంత పేదరికంలో ఉంది కానీ ఈ దేశంలో అత్యధి కంగా మైనింగ్‌ కలిగిన రాష్ట్రాలు కూడా ఇవే కానీ ఆది ఆదివాసీలకు మాత్రం కడు పేదరికం వెంటాడుతుంది అనేది గ్రహించాలి. ప్రభుత్వం మైనింగ్‌ త్రవ్వకాలపై ఉన్న శ్రద్ధ ఆదివాసి కడుపు నింపటంలో లేదు. మానవ హక్కుల ఉల్లంఘనలు అనేది ఒక సహజ అంశంగా మారింది. భారత రాజ్యాం గం ఆదివాసీల రక్షణకు ఉన్న 5,6షెడ్యూల్‌ లను అందులోని సారాన్ని కూడా తొక్కి వేస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఆదివాసి ప్రాంతా ల్లోని నాన్‌ ట్రైబల్‌ వలసలను పూర్తిగా నిషేదం అని ఉన్న నేడు వలసలు అధికం అయ్యాయి. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని సొన్‌ భద్రలో జూలై 17,2018 న10 మంది ఆదివాసీలను ఇతర కులస్థులు నాన్‌ ట్రైబల్‌ క్రూరంగా ఊచకోత కోసిన,అందులో 3గురు మహిళలు ఉన్న ఇంత దురగతానీ ఏఒక్క రాజకీయపార్టీ,లేదా ప్రభు త్వం పట్టించు కోని పరిస్థితి. ఇలాంటి సంఘటనలు దేశంలో అనేకం. పార్లమెంట్‌ సమావేశం జరిగే సమయంలో ఈఘటన జరిగిన 47మంది ఆదివాసీలు ఎంపీలు ఈదేశంలో ఉన్న మాట్లాడని దుస్థితి వెలు ముద్దర రాజకీ యాలును ఈ దేశరాజకీయ పార్టీలు ప్రోత్సహి స్తున్న తీరు అర్థం అవుతుంది. కానీ ఇలాంటి ఘటనలు నిరోధించాల్సిన ప్రభుత్వాలు ‘‘నేషనల్‌ సిటిజన్‌ షిప్‌ బిల్‌ 2018,పౌర సత్వం చట్టం 2019పేరిట ఈ ప్రాంతాలను చాలా క్రింద నీరులా ధ్వంసం చేశాయి.ఈ దేశంకి నాగరికత నేర్పిన ఆదివాసి,నేడు అనాగరికునిగా ముద్ర వేయబడి వేలివేయ బడ్తున్నాడు,బ్రతుకు ధ్వంసం చేయబడి గెంటివేయ బడుతున్నాడు. ‘1996 సమత వర్సెస్‌ ఆంధ్ర ప్రదేశ్‌’కేసులో 5వ షెడ్యూల్‌ ప్రాంతంలో ప్రభుత్వం కూడా నాన్‌ ట్రైబల్‌ గానే చూడాలని తీర్పు ఇచిన,ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో ‘‘గిర్‌గ్లాని కమిషన్‌ 2004,కోనేరు రంగారావు కమిటీ 2006’’లు చాలా స్పష్టంగా ఆంధ్ర వలసలు తెలంగాణ ఆదివాసి ప్రాంతంలో అత్యధికంగా పెరిగి, 7,50,000 ఎకరాల ఆది ఆదివాసీల భూము లు,దాదాపు 48శాతం ఆదివాసీల భుములు నాన్‌ ట్రైబల్‌ చేతిలో అన్యాక్రాంతం అయ్యాయి అని నివేదించిన, 1/70/ (ఎల్టిఆర్‌) లాంటి చట్టాలు పకడ్బందీగా ఉన్న ఆదివాసీలకు న్యా యం జరిగే పరిస్థితులు లేవు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన వలస ఆంధ్రలదే షెడ్యూల్‌ ఏరియాలో పెత్తనం నడుస్తుంది ఇంకా ఆది వాసీలకు దిక్కేది.ఈ దేశంలో ప్రస్తుతం అడవిపై హక్కు అనే సమస్య ఆదివాసీలకు ప్రధాన సమస్యగా మారింది. తరతరాలుగా ఆదివాసీలు జల్‌ జంగిల్‌ జమీన్‌ కోసం అడవిపై హక్కు కోసం వేలాది మంది చారిత్రక పోరాటాలు చేసి అమరులు అయ్యారని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2002లో ఎస్‌ఆర్‌ శంకరన్‌ కమిటీనీ నియమించి. ఈ కమిటీ నివేదిక ఆధారంగా అటవీ భూములపై హక్కులు కల్పిస్తు పార్లమెంట్‌ లో ‘2006 డిసెంబర్‌13న’’ అటవీ హక్కుల చట్టంచేయబడిరది. ఈచట్టం ప్రకారం అటవీ భూమిపై ఆధారపడి జీవిస్తున్న ప్రతి గిరిజన కుటుంబానికి 10ఎకరాల లోపు వరకు హక్కు పత్రం ఇవ్వ వచ్చు. పైగా‘‘అడవుల పై హక్కు లు ఆదివాసులకే ఉన్నాయని 2010 జూలై 14న జాతీయ అభివృద్ధి మండలి సమావేశంలో నాటి ప్రధాని మన్మోహన్‌ సిగ్‌ కూడా ప్రకటిం చారు’’ దానిలో భాగంగా కొంత మేరకుయుపిఎ ప్రభుత్వం ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు అందించింది. ఆదివాసీలు అడవిపై ఉమ్మడి హక్కు నీ కూడా కల్పించింది కానీ కేంద్రంలో బీజేపీ కూటమి వచ్చాక అటవీ హక్కుల చట్టం`2006కి ఎటువంటి రక్షణ ఇవ్వక పోవడం మూలంగా, సుప్రీం కోర్టు ఈచట్టానీ కొట్టి వేసింది. తదుపరి దేశ వ్యాప్త ఆందోళనతో ప్రతుతం ఈ తీర్పుపై ‘‘స్టే’’ విధించింది కానీ ఇంకా పూర్తి స్థాయి నిర్ణ యాలు ఆదివాసీల పక్షాన చేయక ముందే, నూతన అటవీ విధానం తీసుకు వచ్చి అసలు ఆదివాసీల సంబంధం లేకుండానే,అడవుల నుండి ఆదివాసీలను కాలి చేసి కార్పొరేట్‌ శక్తులకు అడవులను అమ్ముకునే కుట్రలుకు జీవం పోసింది.ఈ పోడు భూమి సమస్యనీ తెలంగాణ రాష్ట్రంలో చూసినపుడు నిజాం నిరంకుశ పాలన మళ్లీ మొదలు అయిందా అనే ప్రశ్న లు తలెత్తుతాయి, అటవీశాఖ ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూములను టార్గెట్‌ చేసి వారి భూముల్లో హరితహరం పేరిట మొక్కలు పెట్టడం,దానికి అడ్డుగా వచ్చిన వారిపై ‘‘పిడి యాక్ట్‌’’లు పెట్టడం,మహిళలపై హింస, గర్భి ణీలకు చెట్లకు కట్టేసి కొట్టడం,10రోజుల బాలిం తలు అని చూడకుండా జైళ్లకు పంపడం, మొన్న టికి మొన్న ఆదిలాబాద్‌ జిల్లా ‘‘కోయ పోష గూడ’’లోని గోండు మహిళపైదాడి చేసి మహి ళను అర్ధనగ్నంగా గుంజుకోని పోవడం,ఇవన్ని కూడా మానవ హక్కుల ఉల్లంఘన చర్యలు లాగే పరిగణించ బడుతాయి.ఒకపక్క ఆది వాసీ లకు పట్టలిస్తాము అని ప్రభుత్వం దరఖాస్తులు తీసుకొని,ఇంకో పక్క అటవీశాఖ వచ్చి దాడు లు చేయటం అనేది ఎంత వరకు సమంజసం? అసలు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను కూడా అటవీశాఖ పాటించే పరిస్థితి లేదు ఏమైనా అంటే మావి కేంద్ర చట్టాలు అంటుంది అటవీ శాఖ, ఆదివాసీల న్యాయమైన పోడుభూములకు పట్టాలు అందించే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలపై ఉన్న పట్టించుకునే పరిస్థితి లేక అదొక హింసల మారింది పోడు సమస్య..తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ఏర్పాటు నుండి నానాటికీ ఆదిమ తెగల మనుగడ జీవనం ప్రశ్నార్థకమే అవ్తుంది గిరిజన కేంద్రీయ విశ్వ విద్యాలయం ‘‘ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం 2014’’తో నే వచ్చిన,దానిని గోదావరి పరివాహక ప్రాంతం లో ఆదిమతెగల జీవనం దగ్గర కాకుండా మైదాన ప్రాంతాల్లో ఏర్పాటు చేసి, ఆదివాసీలకు విద్య నీ దూరం చేయాలని చూస్తున్నారు. షెడ్యూల్స్‌ ప్రాంతంలోని ఐటీడీఏల పరిధిలో 29శాఖలలో ‘ఆర్టికల్‌ 342’ ప్రకారం షెడ్యూల్‌ ఏరియా సర్టిఫికేట్‌ల ద్వారా రావాల్సిన ఉద్యో గాలను మొత్తం కూడా నేడు నిలిపివేశారు. జీఓ నెంబర్‌ ‘3’ పేరిట సుప్రీం కోర్టు 100శాతం రిజర్వేషన్లు చెల్లవు అని తీర్పు ఇవ్వడంతో, న్యాయపరమైన అంశంగా తయారు చేసి, ఆది వాసి నిరోధ్యుగులకు చేయా ల్సిన అన్యాయం చేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసిన, కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం చెసే పరిస్థితి లేదు, 5వ షెడ్యూల్‌నీ నిర్దేశం చేసే హక్కు, దానిలో నీ నియమాలను నిరోధించే హక్కు, సుప్రీం కోర్టు లేదు. అయిన కానీ రాజకీయ కుట్రలో ఆదివాసి ప్రాంతం, భూభాగం,బందిగా మారే పరిస్థి తులు నెల కొన్నాయి. వీటికి పరిష్కారం చూపించాల్సిన కోర్టులు, ప్రభుత్వాలు,ఆదివాసిలకు వ్యతిరేకంగా ఉన్న పుడు ఇంకా ఆదివాసీ లుకు దిక్కు ఏది?.ఏది ఏమైనా ఈ దేశంలోగాని వివిధ రాష్ట్రాలలో గాని ఆదివాసిల మనుగడ నానాటికీ అంతరి స్తుంది. ఆదివాసి భూబాగాలపై ఒత్తిడి పెరి గింది.ప్రభుత్వాలు కూడా వ్యతిరేక చర్యలే చేపడుతున్నాయి అనేది వాస్తవం. అందుకే ‘‘ఆగస్ట్‌ 9’’ ని‘1982లో ఐక్యరాజ్య సమితి’’ గుర్తించిన, నేటికీ 40సంవత్సారాలు అవుతున్న కానీ భారత దేశం మాత్రం నేటికీ గుర్తించలేదు, పైగా ఐక్య రాజ్య సమితి ఆదివాసిల అభివృద్ధికి చేసే ఏనియమంని లెక్క చేయటం లేదు. తెగలు అంతరిస్తున్న ఆదివాసీల మూలాలు ధ్వంసం అవ్తున్న, అస్తిత్వం కనుమరుగు అవుతున్న, ఇంకా అనాగరిక చర్యలే చేస్తుంది ప్రభుత్వం.ఇకనైనా ఆదివాసీల దినోత్సవం గుర్తించి భారత ప్రభు త్వం అధికారికంగా నిర్వహణ చేయాలి.రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహణ చేయాలి.ప్రతి ప్రభుత్వ కార్యాలయాలలో అధికారికంగా నిర్వహించాలి. ఆదివాసీలు ఆత్మగౌరవంతో జీవించేలా ప్రభు త్వం చర్యలు చేపట్టాలి. భూమి పుత్రుల హక్కు లను చట్టాలను రక్షించాలి. ఆదివాసిస్వయం పాలన హక్కులను రక్షించి ఆదివాసిల అస్తిత్వం నీ సుస్థిరం చేయాలి. నాణ్యమైన విద్య అందిం చాలి. మాలిక సదుపాయాలు కల్పించాలి. మానవ హక్కుల ఉల్లంఘనలు చర్యలు నిలిపివేయాలి.ఈ దేశ పౌరులు అయిన ఆదివాసిలపై హింసనీ నిలిపివేయాలి.మధ్య భారతదేశంలో ఈశాన్య భారతదేశంలో ఆదివాసిలపై వారి స్వయంప్రతిపతి హక్కులపై అధికారాలు కల్పించి సమస్య పరిష్కారం చూపాలి. భారీప్రాజెక్ట్‌లు అక్రమ ఖనిజ తవ్వకాలు నిలిపివేయాలి,ప్రధానంగా రాష్ట్ర పతి తెగ కి చెందిన సంతాల్‌ ,ఒరాన్‌,ముండా తెగల ఆదివాసి ప్రజలను బ్రిటిష్‌ పాలనలో అస్సాం కాపీ తేయాకు తోటల లలో పని చేయటానికి 60 లక్షల మందిని బలవంతంగా తీసుకెళ్లినారు స్వాతంత్య్ర అనంతరం వారు అక్కడే ఉండి పోవడం జరిగింది కానీ వాటిని అస్సాం ప్రభుత్వం షెడ్యూల్‌ ట్రైబల్‌ గా గుర్తించలేదు వారికి ఎస్టీ హోదా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. లేదంటే ఈ దేశం ప్రధమ పౌరురాలు రాష్ట్రపతిగా ఆదివాసి చేయ గలిగింది కానీ దానికి ప్రయోజనం మాత్రం చేకుర్చలేదు అనేది భవిష్యత్‌లో తేలిపోతుంది అనేది గ్రహించ వలసిన విషయం.
వ్యాసకర్త : అనువర్తిత భాషశాస్త్రం,తెలుగు యూనివర్సిటీ హైద్రాబాద్‌,సెల్‌:9392283453– కాక నవ్య

సముద్రం పొండిన వేళ..

మీరు ఎప్పుడైన సముద్రాన్ని చూసారా? చాలా బాగుటుంది కదా. పెద్దగా శబ్ధం చేస్తూ పెద్ద పెద్ద అలలు ఒడ్డుకు వస్తుంటాయి. ఒక అల వచ్చి వెళ్ళిన తరువాత ఇంకొక అల వస్తుంటుంది. కంటికి కనిపించేంత దూరం నీళ్ళుంటాయి. ఇన్ని నీళ్ళు సముద్రంలోకి ఎక్కడునించి వచ్చాయి అనే అనుమానం కలుగుతుంది. మనకు తెలుసు నదులన్ని సముద్రంలో కలుస్తాయని. మనదేశంలోని జీవనదులు గంగ, బ్రహ్మపుత్ర, గోదావరి లాంటివి, ఇంకా అమేజాన్‌, నైలు లాంటి ఇతర దేశాలలోని నదులన్ని సముద్రాలలో కలుస్తుంటాయి. మరి ప్రతి రోజు ఇన్ని నదులలోంచి నీళ్ళు కొన్నివేళ సంవత్సరాలుగా సముద్రంలో కలుస్తుంటే అందులో నీరు ఎక్కువైపోయి సముద్రం పొంగాలి కదా, ఎప్పుడు సముద్రం పొంగినట్లు మనం వార్తల్లో వినలేదు (ఒక్క సునామి వచ్చినప్పుడు తప్ప). కారణం ఏంటో చెప్పుకొందామా!
మన భూమిని నీటి గ్రహం (షa్‌వతీ జూశ్రీaఅవ్‌) అంటారు. ఎందుకంటే భూమి 70% నీటితో నిండి ఉంది. భూమి మీద ఉండే నీటిలో 97.2% సముద్రాలలోనే ఉంటుంది. మిగితా 2.8% నీరు నదులతో, చెరువుల్లో, మంచుకొండల్లో (ద్రువాలు, హిమాలయాలలో) ఉంటుంది. పర్వతాల మీద మంచు కరిగి ఆ నీరు జీవనదులుగా ప్రవహిస్తుంటుంది. సముద్రం నీరు ఉప్పుగా ఉండడానికి కారణం ఈ జీవనదులు తమ నీటితో పాటు భూమి మీది లవణాలను నిరంతరం సముద్రంలో కలవడం వల్ల ఆ నీరు ఉప్పుగా మారింది. భూమి మీద సముద్రం చంద్రుని వైశాల్యం కంటే 9 రేట్లు ఎక్కువగా ఉంటుంది. ఇంత విస్తీర్ణం ఉన్న సముద్రంలోనే నీరు ప్రతిరోజు ఎండ తాకిడికి ఆవిరిగా మారి వాతావరణంలో కలుస్తుంది. ఈ ఆవిరి మేఘాలుగా మారి చల్లబడి వానలుగా కురుస్తాయి. ఇలా సముద్రంలోన నీరు ప్రతినిత్యం నీటి ఆవిరిగా మారి వాతావరణంలో కలవడం వల్ల నదులు నుండి వచ్చే నీరు సముద్రంలోకి ఎక్కువ అవదు. ఈ విధంగా భూమి మీద సముద్రాలు ఏర్పడిన నాటి నుండి ఈనాటి వరకు సముద్రాలలో నీటి పరిమాణం మారకుండా ప్రకృతి నియంత్రిస్తుంది. దీనినే హైడ్రోలాజిక్‌ సైకిల్‌ (నవసతీశీశ్రీశీస్త్రఱష జవషశ్రీవ) అంటారు. భూమి మీద నీరు ఎప్పుడూ ఒకే పరిమాణంలో ఉంటుంది. అది నీరు, నీటి ఆవిరి లేక మంచు రూపంలో ఉంటుంది. ఇలా నీరు నిరంతరం తన రూపం మార్చుకోవడం వల్ల మనిషి బ్రతకగలుగుతున్నాడు. దీని కారణం ప్రకృతి. కాబట్టి ప్రకృతిని కాపాడుకుందాం.! `ఆధారం: ఆనంద్‌,(వికాస్‌పీడియో)

  • ప్రపంచమంతటా ఇదే దుస్థితి ా ఉత్తరార్ధ గోళంలో తీవ్ర దుర్భిక్షం ా 230కోట్ల మందికి నీటి కొరత
  • జర్మనీ,ఇటలీ ఫ్రాన్స్‌,స్పెయిన్‌,చైనా,అమెరికా, ఇరాక్‌ వంటి దేశాల్లో నిత్యంనిండుగా ప్రవహించే జీవ నదులన్నీ నిలువునా ఎండిపోతున్నాయి. దాంతో వాటికి అనుసంధానంగా ఉన్న రిజర్వాయర్లు కూడా గుడ్లు తేలేస్తున్నాయి.ఫలితంగా కోట్లాదిమంది తాగు, సాగు నీటికి అల్లాడుతున్నారు.రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంవల్ల చాలాదేశాలను వేధిస్తున్న ఆహార ధాన్యాల కొరతకాస్తా ఈకరువు దెబ్బకు రెట్టిం పౖంది.2022లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 230 కోట్ల మంది నీటికొరత బారిన పడ్డట్టు ఐరాస నివేదిక చెబుతోంది. లానినో పరిస్థితుల దెబ్బకు యూరప్‌లో47శాతంపై దుర్భిక్షం ఛాయలు కమ్ముకు న్నాయని గ్లోబల్‌ డ్రాట్‌ అబ్జర్వేటరీ తాజా నివేదిక చెబుతోంది.
  • బయట పడుతున్న చారిత్రక అవశేషాలు
  • మహా నదులన్నీ ఎండిపోతుండటంతో ఎన్నడూ చూడని చారిత్రక అవశేషాలు వాటి గర్భం నుంచి బయటపడుతున్నాయి. అమెరికాలో కొల రాడో నది గర్భంలో లక్షలాది ఏళ్లనాటి డైనోసార్‌ అడుగుజాడలు బయటపడ్డాయి. స్పెయిన్‌లో బార్సె లోనా సమీపంలోని రిజర్వాయర్లో నీరు ఆవిరవ డంతో9వశతాబ్దానికి చెందిన చర్చి బయట పడిర ది.మాడ్రిడ్‌లో వందల ఏళ్ల కింద నీట మునిగిన ఓ గ్రామ శిథిలాలు వెలుగు చూశాయి. స్పెయిన్‌ లోనే కాసెరస్‌ ప్రావిన్స్‌లో క్రీస్తుపూర్వం 5వేల ఏళ్లనాటి రాతి పలకలు చైనాలో యాంగ్జీ నదిలో బుద్ధ విగ్రహాలు బయటపడ్డాయి. ఇరాక్‌లో టైగ్రిస్‌ నది ఎండినచోట మెసపటోమియా నగరికత కాలం నాటి రాజమహల్‌, నాటి నగరం బయట పడ్డాయి.
  • నదులన్నింటా కన్నీళ్లే…
  • జర్మనీ, నెదర్లాండ్స్‌, స్విట్జర్లాండ్‌ దేశాల ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా చెప్పే రెయిన్‌ నది పరిస్థితి ఎంతో దైన్యంగా ఉంది.
  • 2,900 కిలోమీటర్లు ప్రవహించి నల్ల సముద్రంలోకలిసే ఈనది ఎన్నోచోట్ల ఎండి పోయింది.
  • రెయిన్‌, దాని ఉపనదులు, కాల్వల ద్వారా ఏటా ఏకంగా8,000 కోట్ల డాలర్ల (రూ.6.4 లక్షలకోట్ల) విలువైన సరుకు రవాణా జరుగు తుంటుంది. అలాంటిది రవాణా నౌకలు కొంత కాలంగా చూద్దామన్నా కన్పించడం లేదు.
  • ఆల్ఫ్స్‌ పర్వతాల్లో కరిగే మంచుతో నిత్యం నీటితో కళకళలాడే పో నది కూడా ఎండల దెబ్బకు జీవచ్ఛవంగా మారిపోయింది.
  • ఇటలీలో 30 శాతం వ్యవసాయం ఈ నది మీదే ఆధారపడిరది. ఇప్పుడు అదీ కుదేలైంది. గత కొన్ని దశాబ్దాల్లో ఇంతటి దుర్భిక్షాన్ని ఎన్నడూ చూడలేదంటూ ఇటలీ వాతావరణ నిపుణులు వాపోతున్నారు.
  • ఇక ప్రపంచ ప్రసిద్ధ ఫ్రెంచ్‌ వైన్‌ తయారీకి ఆధారమైన లోయెర్‌ నదిలో కూడా నీరు అతి వేగంగా అడుగంటుతోంది. ఫ్రాన్స్‌లో 600 కిలోమీటర్ల మేర ప్రవహించే ఈ నదిలో జలమట్టాన్ని కాపాడుకునేందుకు అనేక రిజర్వాయర్ల నుంచి నీటిని వదులుతున్నారు.
  • యూరప్‌లో 10దేశాల గుండా పారే అతి పొడవైననది డాన్యూబ్‌కూడా చిక్కిపో తోంది.
  • అమెరికాలో డెన్వర్‌ నుంచి లాస్‌ఏంజెలెస్‌ దాకా 4 కోట్ల మంది నీటి అవసరాలు తీర్చే కొలరాడో నదిదీ ఇదే దుస్థితి!
  • 45 లక్షల ఎకరాలకు నీరందించి ఏటా 1.4 లక్షల కోట్ల డాలర్ల వ్యవసాయ, తదితర ఆదాయాన్ని సమకూర్చే ఈ నది ఎండల ధాటికి చేతులెత్తేస్తోంది.
  • నిత్యం ఉధృతంగా ప్రవహించే చైనాలోని యాంగ్జీ నది మరింత దుస్థితిలో ఉంది. సిచువాన్‌ ప్రావిన్స్‌కు జీవనాధారమైన ఈ నదిలో ఎక్కడచూసినా నీరు అడుగంటి నదీ గర్భం పైకి కన్పిస్తోంది. దాంతో ప్రభుత్వం కరువు హెచ్చరికలు జారీ చేసింది.
  • అమెరికాతో సహా యూరప్‌, ఆసియా ఖండాల్లోని పలు దేశాలు తీవ్ర దుర్భిక్షం బారిన పడుతున్నాయి. పెచ్చుమీరిన వేసవి తాపం, అత్తెసరు వర్షపాతం, నానాటికీ పెరిగిపోతున్న భూతాపం దెబ్బకు మహా మహా నదులన్నీ అక్షరాలా మటుమాయమే అవుతు న్నాయి. ముఖ్యంగా ఉత్తరార్ధ గోళం కనీవినీ ఎరుగని సంక్షోభంలో చిక్కికొట్టుమిట్టాడుతోంది. పారిశ్రా మిక, ఆహార ధాన్యాల ఉత్పత్తులు, సరుకు రవాణా, జల విద్యుదుత్పత్తి రంగాలన్నీ కుదేలవుతున్నాయి. ఈ దుర్భిక్షం గత 500ఏళ్లలో ఎన్నడూ చూడని విపరిణామాలకు కారణమవుతోంది.
  • మాయమైపోతున్న మంచినీరు
  • ప్రపంచం మీదడైబ్బైశాతం నీరే వుండి అందులో ఒక్కశాతం మాత్రమే మంచినీరుగా ఉప యోగపడుతున్నపుడు దాన్ని ధ్వంసం చేసుకున్న జాతిని ఏమనాలి అసలు. మన కుంటలు,వాగులు, వంకలు,వర్రెలు,బావులు,చెరువులు,నదులు ఒక్కొక్కటిగా ఎట్లా ధ్వంసమైపోయాయి. జీవనదులు జీవం లేకుండా ఇసుక పర్రెలుగా ఎందుకు మిగిలి పోయాయి. వానాకాలంలో నీరు వరదలై పొంగు తుంటే కాపాడుకోవడానికి నగరంలో నిజాం కాలం లో హైదరాబాద్‌ నగరంలో3000పైగా వున్న చిన్న పెద్ద కుంటలు ఒక్కటికూడా ఆచూకీ లేకుండా, అందులో అక్రమ నిర్మాణాలు ఎలా వెలిసాయి? పై నుంచి పడ్డ నీరు నిలిచ్చే చోటు దొరకక సము ద్రం పాలవుతుంటే,వున్న కొద్ది భూగర్భ జలాలూ అడుగంటుతున్న దుస్థితి. మనం చేసిన పాప ఫలి తమే కదా ఇదంతా లేకపోతే ఏమిటి? ఇవాళ ప్రపంచవ్యాప్తంగా780మిలియన్ల ప్రజలు స్వచ్ఛమైన నీటికోసం అల్లాడిపోతున్నారు. ఆఫ్రికాలో ఓతెగ ప్రజలు మంచినీళ్లు దొరకక, వేకువజామునే కిలో మీటర్లకొద్దీ నడిచి అడవుల్లో ఆకుల మీద కారుతున్న మంచు బిందువులను ఒక్కొక్కటిగాసేకరించి మంచి నీరుగా వాడుకుంటారట. ఒకనాడు నదులు పొంగిన జీవగడ్డ భారతావనికూడా ఇవాళ మంచినీటి చుక్క కోసం విలవిలలాడిపోతోంది. అటుచూస్తే ఏళ్ల తరబడి నీటిజాడ కనబడక అనంతపురం జిల్లా ఎడారిదారి పట్టింది. చిత్తూరు జిల్లాలో శిలాజాల లోపలకి వెయ్యి అడుగుల లోతునబోర్లు వేస్తే తప్ప నీటి చుక్క దొరికే అవకాశం లేదు. కృష్ణానది మైళ్లకు మైళ్లు ప్రవహిస్తున్నా పాలమూరు జిల్లాగొంతు తడ వడం లేదు. ఫ్లోరిన్‌నీళ్లు నల్లగొండకు నిద్ర పట్టనీ యడం లేదు. పుష్కలంగా నీటి వనరులన్న ప్రాం తాలు రసాయన ఎరువులు,పురుగు విషాలతో విష తుల్యమైపోయాయి. అసలు వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ నాలుగు వందల అడుగులకు మించి నీళ్లు రకర కాల రసాయనాలతో విషపూరితమైనవి కాబట్టి వాటిని మంచినీటిగా ఉపయోగించకూడదని చెప్పింది. మరోప్రక్క కలుషితమైన నీటివల్ల ప్రపంచ వ్యాప్తంగా రోజుకు ఆరువేల మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. అంటే,మనం రెండు గుక్కలనీళ్లు తాగిగ్లాసు కిందపెట్టే లోపు ఒక చిన్నారి ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోతోంది.
  • అడవుల్ని కొట్టేసి,కొండల్నిపిండేసి, నదుల్నిఎండేసి,గాలినికాలుష్యంతోనింపేసి,తిండిని రసాయ నాల్తో కలిపేసి, ఇంకా ఎన్ని దుర్మార్గాలు కళ్లముందే జరుగుతున్నా ఇప్పటి దాకా మౌనంగానే వున్నాం. ఆఖరికి తాగే నీళ్లలో కూడా ఇన్ని రసాయ నాలు వున్నాయంటే చుక్క కూడా గొంతు దిగడం లేదు. అలాగని తాగకుండా వుండనూలేము, చిన్న చిన్నపిల్లలు తాగే పాలే కాదు, నీళ్లు కూడా విషమని తెలిసాక ఇక మాట్లాడకుండా ఎలా వుండగలం.
  • ఇందుకు మనమేం చేద్దాం
  • నీరు లేనప్పుడు ఇబ్బందులు పడడం కంటే అందుబాటులో వున్న చుక్కనీటిని కూడా వృధా చేయకపోవడం అవసరం. నగరాల్లో, పల్లెల్లో ఎక్కడిక్కడఇంకుడు గుంతలు,కందకాలు, చెక్‌డ్యా మ్‌లు,వాటర్‌షెడ్‌లు నిర్మించుకోవాలి. వాన నీటిని ఒడిసి పట్టుకునే చాలా వరకు మంచినీటి కొరతను అధిగమించవచ్చు. సముద్రతీర ప్రాంతం కావడం తో ప్రకాశం జిల్లాలలోని ఉప్పు నీళ్ళు ఎక్కువగా వుంటాయి కాబట్టి అక్కడ చాలా ప్రాంతాల్లో సంప్ర దాయికంగా వాననీటిని ఒడిసిపట్టి సంవత్సరమంతా మంచినీటిగా ఉపయోగిస్తారు.ఎడారి రాష్ట్రం రాజా స్థాన్‌లోని గ్రామాల్లో తరతరాలుగా వాననీటిని మంచినీటిగా వాడుకునే సంప్రదాయం వుంది.అతి తక్కువ వర్షపాతం పడే అనంతపురం ప్రాంతంలో కూడా(400-500మి.మీ.వర్షపాతం)200 చద రపు అడుగుల వైశాల్యంలో వుండే ప్రభుత్వ కట్టి చ్చిన ఇందిరమ్మ ఇంటిమీద 10000 లీటర్లు నీరు నిల్వ చేసుకోవచ్చు. ఈ నీటిని రోజుకు 20 లీటర్ల చొప్పున వాడినా ఒక కుటుంబానికి దాదాపు 500 రోజులకు సరిపోతుంది.మహారాష్ట్రరాలెగావ్‌ సిద్దిలో అన్నాహజారే,రాజస్థాన్‌లో రాజేంద్రసింగ్‌ చేసిన నీటి సంరక్షణ ఉద్యమాలను స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆ కోవలో ఎండిపోయిన బావుల్ని, వట్టిపోయిన చెరువుల్ని,జీవం వచ్చిన నదుల్ని తిరిగి బతికించు కునే ప్రయత్నం చేయాలి. వనసంరక్షణే జన సంర క్షణగాభావించాలి. పిల్లలకు పర్యావరణ పరిరక్షణ, అడవుల ఉపయోగాలపై అవగాహన కల్పించి చిన్నప్పటి నుంచి ప్రకృతిని వాళ్ల జీవితంలో భాగం చేయాలి.అడవులు,నదులు,వానలు, రుతుపవనాలు, కాలాలు ఇలా ప్రకృతిలో ఒకదానికొకదానికి మధ్య ఉన్న అనుసంధానాన్ని అవగాహన చేసుకుని మనం వివేకంతో వ్యవహరించాలి. నీరు లేకపోతే మనకు వర్తమానమూ లేదు, భవిష్యత్‌ అంతకన్నా లేదన్న నిజాన్ని మనమంతా నిర్భయంగా అంగీకరించాలి. నీటిని వ్యాపార వస్తువుగా మార్చిన సమస్త పరిస్థి తులను వ్యతిరేకించాలి.ప్రతి నీటి చుక్కను గుండె లకు హత్తుకుని పదిలంగా కాపాడుకోవాలి.

అలుపెరగని పోరాటాలు…

కష్టం ఎంతైనా తరగని చిరునవ్వు.. తరాలు మారినా మారని సంస్కృతి ఆదివాసీలకే సొంతం. అడవితల్లిని నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసీ గిరిజనుల సంప్రదాయాలు నేటికీ అద్దం పడుతున్నాయి. ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రస్తుత ఆధునిక సమాజంలోనూ వారి సంస్కృతిని కాపాడుకుంటూ తరువాత తరాలకు అందిస్తున్నారు. గుస్సాడీ ఉత్సవాలతో గ్రామాల మధ్య ఐక్యతను చాటుతూ దండోరా సంబరాలతో ఆకట్టుకుంటున్నారు. గుస్సాడి వేషధారణతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. వారి ఆహార అలవాట్లు వారి ఆరోగ్యానికి శ్రీరామరక్షగా నిలుస్తున్నాయి. నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా వారి అలవాట్లు, వేషభాషలపై ప్రత్యేక కథనం… – గునపర్తి సైమన్‌

Read more

ఆదివాసీల భాషా మాటేమిటి ?

ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన అనంతరం తెలుగుకు ఎనలేని ప్రాధాన్యం ఇవ్వటం జరిగింది. బహు భాషల్లో ఉన్న విద్యావిధానం క్రమంగా తెలుగు మయమ్కెంది. ఆదివాసీ పిల్లల మీద తెలుగు బలవంతంగా రుద్దబడిరది. దీనికి తోడు తెలుగు సినిమాలు, తదనంతరం వచ్చిన టి.వి. సంస్కృతి ఆదివాసీ భాషలను ధ్వంసం చేసింది. తెలుగు భాషాభిమానులు, పండి తులు తెలుగు భాష ఇంగ్లీష్‌ ప్రపంచంలో కొట్టుకుపోతుందని ఎక్కడలేని బాధను వ్యక్తపరుస్తున్నారు. ఎవరి భాషను వారు అభిమానించటంలో, పరభాష నుంచి తమ భాషను రక్షించుకోవటంలో తప్పు ఏమీలేదు. నా బాధంతా తెలుగు ప్రపంచంలో ఆదివాసీ భాషలు ఏవిధంగా కొట్టుకుపోతున్నాయో ఈ పండితులు, ప్రభుత్వం ఆలోచించాలి. ఈ సదస్సులో ఆదివాసులను తెలుగు ప్రజలుగా చిత్రించే ప్రయత్నం జరుగుతోంది. ఇది ఆదివాసీ భాషల ఉనికినే తుడిచిపట్టే ప్రమాదం ఉంది.

Read more

పథకాల మీద కన్నేసిన పాలకులు

వేళ్ళ మీదలెక్క పెట్టగలిగిన బడా కార్పొరేట్‌ కంపెనీల యజమానులకు గత ఏడు సంవత్సరాల మోడీపాలనలో రూ.10లక్షల 72వేల కోట్లరూణాలు రద్దు చేశారు.13కంపెనీలు బ్యాం కుల్లో తీసుకున్న రూ.4లక్షల50వేల కోట్ల రుణాలను రూ.లక్ష 61వేల కోట్ల తగ్గింపుతో ‘సెటిల్‌మెంట్‌’ చేశారు.ఈ మొత్తం డబ్బు గ్రామీణపేదల ఉపాధి హామీ పథకానికి ఖర్చు చేసి వుంటే సుమారు 14 సంవత్సరాల వరకు పేదలకు పని కల్పించి కొద్ది మేరకు ఆకలి తీర్చివుండవచ్చు. అలా చేయలేదు కాబట్టే ప్రపంచ ఆకలి సూచి 116దేశాల జాబితా లో మన దేశం101వ స్థానంలో నిలిచింది. మన కంటే ఆకలితో అల్లాడుతున్న దేశాలు కేవలం 15 మాత్రమే. ఇది మన అన్నపూర్ణకు పట్టిన ఆధోగతి.

Read more
1 … 6 7 8 9 10 … 16