దేశాన్ని కాపాడుకుందాం..!

ధరల పోటు,నిరుద్యోగం,ఎక్కడ చూసినా అభద్రత…ఒక్కటి కాదు అనేక సమస్యలు దేశ ప్రజల్ని చుట్టుముట్టాయి. ఎనిమిదేళ్లుగా మోడీ సర్కార్‌ తీవ్రతరం చేసిన అత్యంత ధనవంతులు, బడా కార్పొరేట్లకు అనుకూలమైన విధానాలు కొనసాగడం వల్లే సామాన్యుడు బతకలేని పరిస్థితి ఏర్పడిరది. ఇదంతా ఆగాలంటే కేంద్ర ప్రభుత్వ విధానాల్లో సమూల మార్పులు రావాలని కార్మిక, కర్షక సంఘాలు కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి. లేదంటే ప్రజా ఆందోళన మరింత ఉధృతం అవుతుందనే హెచ్చరిక చేసేందుకు మార్చి 28,29 రెండు రోజులు 48 గంటలపాటు దేశవ్యాప్త సమ్మెకు కార్మిక, కర్షక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెలో ఉద్యోగులు, రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, నిరుద్యోగులు, యువత, కళాకారులు, మేధావులు, శాస్త్రవేత్తలు… ఇలా అనేక వర్గాలు పాల్గంటున్నాయి. ‘దేశాన్ని.. ప్రజల్ని కాపాడుకుందాం’.. అనే నినాదంతో ముందుకు కదులాయి.
చారిత్రాత్మకమైన ఈ సమ్మెలో దాదాపు 25కోట్లమంది కార్మికులు పాల్గొరని ఒక అంచనా. గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగమంతా సామూహిక నిరసన కార్యక్రమాలు చేపడు తున్నారు. తయారీరంగం,బ్యాంకింగ్‌,ఆర్థిక సేవా సంస్థలు,విద్యాసంస్థలు,ప్రభుత్వ కార్యాల యాలు, రవాణా,నిర్మాణం,ఓడరేవులు…మొదలైన రంగాలన్నీ సమ్మెలో పాలుపంచు కుంటుండటంతో రెండు రోజుల పాటు కార్యక లాపాలు స్తంభించిచాయి. దేశానికి స్వాతంత్య్రం లభించి 75ఏళ్లయిన సందర్భంగా మోడీ సర్కార్‌,బిజెపి నాయకులు ‘అమృత కాలం’ మొదలైందని ప్రచారం చేసుకుంటున్నారు. కుటుంబ ఆదాయం కోల్పోయి కోట్లాది మంది రోడ్డున పడుతుంటే,నిరుద్యోగంరికార్డ్‌స్థాయికి చేరుకొంటే,అధిక ధరలతో సామాన్యుడు వణికి పోతుంటే.. ‘అమృత కాలం’ఎలా అవుతుంది? అనికార్మిక, కర్షక సంఘాల నాయకులు ప్రశ్నిస్తు న్నారు. అనేక రంగాల్ని అభద్రత ఆవహిం చింది. సమ్మె జయప్రదానికి దేశవ్యాప్తంగా ఇప్పటికే ముమ్మర ప్రచారం చేశారు. మోడీ సర్కార్‌ ఎప్పుడు ఎలాంటి ప్రకటన చేస్తుం దోనని. ప్రభుత్వరంగ ఉద్యోగులు,బ్యాంకింగ్‌ ఉద్యోగులు హడలిపోతున్నారు. కార్మిక సంఘాల డిమాండ్లు…
– 12 అంశాల డిమాండ్‌తో కార్మికులు, కర్షకులు కొన్నేళ్లుగా పోరాడుతున్నారు. కోవిడ్‌ సంక్షోభం కారణంగా కష్టపడుతును కుటుంబాలకుతక్షణ ఆర్థిక సహాయం అందించడం వంటి కొత్త సమస్యలను డిమాండ్‌ చార్టర్‌ చేర్చింది.
– నాలుగు లేబర్‌ కోడ్‌లు, ఎసెన్షియల్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ యాక్ట్‌ (ఇడిఎస్‌ఎ)నిరద్దు చేయాలి.
– వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేస్తామనిప్రధానిమోడీ ప్రకటించిన తర్వాత, పెండిరగ్‌లో ఉను ఇతర డిమాండ్ల కోసం పోరాటం కొనసాగిస్తామనిరైతు సంఘాలు ప్రకటించాయి.
– వివిధ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, ‘జాతీయ నగదీకరణ విధానాన్ని’ రద్దు చేయాలి.
-ఆదాయపు పన్ను చెల్లించని కుటుంబాలందరికీ నెలకు రూ.7,500 ఆదాయ మద్దతును అందించాలి
– ఉపాధి హామీకి కేటాయింపులను పెంచాలి. పట్టణ ప్రాంతాలకు ఉపాధి హామీ విస్తరించాలి
– అసంఘటిత రంగ కార్మికులందరికీ సామాజిక భద్రతను అందించాలి.
– అంగన్‌వాడీ,ఆశా,మధ్యాహు భోజనం, ఇతర స్కీమ్‌ వర్కర్లకు చట్టబద్ధమైన కనీస వేతనాలు, సామాజిక భద్రత కల్పించాలి.
– లక్షలాది మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, పారా మెడికల్‌, సహాయక సిబ్బంది, పారిశుధ్య కార్మికులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలి.
– వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, ఇతర కీలకమైన ప్రజా సేవల్లో ప్రభుత్వ పెట్టుబడిని పెంచాలి.
జు పెట్రోలియం ఉత్పత్తులపై సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీని గణనీయంగా తగ్గించి, ధరల పెరుగుదలను అరికట్టడానికి గట్టి చర్యలు తీసుకోవాలి.
– కాంట్రాక్ట్‌ కార్మికులు, స్కీమ్‌ వర్కర్లందరినీ రెగ్యులరైజ్‌ చేయాలి. అందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి.
పెట్రో,గ్యాస్‌ మంటలు
సామాన్యుడు చెల్లించే పెట్రో ధరల్లో సగానికి పైగా పన్నులే ఉంటున్నాయి. ఇంత పన్నుల భారం ప్రపంచంలో మరే దేశంలోనూ లేదు. మూలధరతో పన్నుల శాతం ముడిపడి ఉండటంతో ధరలు పెరిగే కొద్ది పన్నుల రూపంలో జమ అయ్యే మొత్తం పెరుగుతుంది. అందులో రాష్ట్రాలకు రావాల్సిన వాటాను ఎగ్గొట్టేందుకు వీలుగా పన్ను బదులు సర్‌ చార్జీలను పెంచుతూ పోతోంది కేంద్ర ప్రభు త్వం. ఇలా ప్రజల్ని కొల్లగొట్టి దానిని రాయితీల రూపంలో కార్పొరేట్లకు దోచిపెడు తోంది. ప్రజా క్షేమం మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా పెట్రో ధరలను నియంత్రిం చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. దీనికోసం రాష్ట్రాలు నష్టపోకుండా పన్నుల విధానంలో అవసరమైన మార్పులు చేయాలి. ప్రజలను ధరాఘాతం నుండి ఆదుకోవాలి. లేకపోతే, దాని ప్రభావం నిత్యావసర సరుకులపై పడి సామాన్యులకు గుదిబండ అవుతుంది.
వ్యవస్థలో ఆంక్షలు
అంతర్జాతీయంగా పెట్రో ఉత్పత్తుల ధరలు దౌడు తీస్తున్నాయి. 2014 తరువాత ముడి చమురు అత్యధిక ధర (బ్యారెల్‌ దాదాపుగా 100 డాలర్లు)కి చేరింది. ఐతే, ఏరోజుకా రోజు ధరలు పెరిగే మన దేశంలో 110రోజుల నుండి ఒక్క పైసా ధర కూడా పెరగలేదు. బ్యారెల్‌ ధర 82 డాలర్లు ఉన్నప్పుడు మన దేశంలో చివరిసారిగా పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగాయి. ఆతరువాత నాలుగు నెలలుగా పెట్రో ఉత్పత్తుల ధరలు పెరగకపోవడానికి కారణం ఎన్నికల రాజకీయాలేనన్నది సర్వ విదితం. ఐదు రాష్ట్రాల్లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ ముగియగానే దేశంలో పెట్రో ఉత్పత్తుల ధరలు భారీగా పెరుగుతాయని వార్తలు వస్తున్నాయి. ముడి చమురు ధర ఒక డాలరు పెరిగితే దేశంలో ఒక లీటరు పెట్రోలు, డీజల్‌పై 45 నుండి 50 పైసలు పెరుగుతుందని, ఎన్నికల కారణంగా ధరలు నియంత్రించిన గత 110 రోజుల్లో ఆయిల్‌ కంపెనీలు కోల్పోయిన మొత్తాన్ని కూడా కలుపుకుంటే ఈ పెరుగుదల 10 రూపాయల వరకు ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. వివిధ మాధ్యమాల్లో వస్తున్న ఈ విశ్లేషణలను నరేంద్రమోడీ ప్రభుత్వం ఖండిరచడం లేదు. దీనిని బట్టే రానున్న రోజుల్లో ధరాభారం ఖాయమనే స్పష్టమౌతోంది. ప్రస్తుతం నడుస్తున్న అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థను అత్యంత హేతుబద్ధమైనదిగా చిత్రీకరించి…అన్ని దేశాలనూ ఒప్పించడం ద్వారా దానిని ఉనికి లోకి తెచ్చారు. కాని ఈ వ్యవస్థ సామ్రాజ్యవాద పెత్తనాన్ని మరింత పెంచేందుకోసమే రూపొందింది. ఈ వ్యవస్థను అడ్డం పెట్టుకుని తమను ఆర్థికేతర కారణా లతో వ్యతిరేకించే దేశాలపై కక్ష సాధింపుకు సామ్రాజ్యవాదం ఉపయోగిస్తున్నది. ఉక్రెయిన్‌ నాటో కూటమిలో సభ్యదేశంగా ఉండాలా వద్దా అన్నది అంతర్జాతీయ వాణిజ్యం పరిధిలోకి రాని అంశం. కాని ఆవివాదం కారణంగానే ఇప్పుడు రష్యా మీద ఆంక్షలను విధించారు. పోకము నుపు భారతదేశానికి సోవియట్‌ యూనియన్‌ తోను, తూర్పు యూరపు సోషలిస్టు దేశాలతోను వ్యాపార లావాదేవీలలో రూపాయిలతోనే చెల్లింపులు జరిగేవి. అంతర్జా తీయంగా అమెరికన్‌ డాలర్‌ను రిజర్వు కరెన్సీగా అందరూ అంగీకరించినప్పటికీ, సరుకుల మారకానికి ఆ డాలర్‌ను కొలమానంగా ఈ లావాదేవీలలో మనం ఆ కాలంలో ఉపయో గించలేదు. రష్యన్‌ రూబుల్‌తో మన రూపాయి ఏ రేటుకు మారకం చేయాలో ఆ రేటును ముందే నిర్ణయించి, దానిని స్థిరంగా ఉంచుతూ వ్యాపారం సాగించేవారు. ఇరు దేశాల నడుమ వ్యాపార చెల్లింపులలో ఒక దేశానికి లోటు ఏర్పడితే దానిని వెంటనే సెటిల్‌ చేసేయాలనే షరతు ఏదీ ఉండేదికాదు. కాలక్రమేణా ఆ లోటు సర్దుబాటు అయ్యేది. అంతే తప్ప ఏనాడూ డాలరు కొలమానం ఉపయోగిం చలేదు. డాలర్లు తగినంత మొత్తంలో లేనందువలన ఇరు దేశాల నడుమా వ్యాపారా లు ఆగిపోయే పరిస్థితి. అందువల్లనే ఉత్పన్నం కాలేదు. పైగా డాలరు ప్రసక్తి లేకపోయేసరికి ఇరు దేశాలకూ మరింత తేలికగా, మరింత ఎక్కువగా వ్యాపారం చేసుకోగలిగిన పరిస్థితి ఉండేది. ఈ పద్ధతి చాలా సహేతుకమైది. ఇరు దేశాలలోనూ ఒకరికి అవసరమైన సరుకులు రెండో దేశం దగ్గర ఉన్నప్పుడు డాలర్లు తగిన మొత్తంలో లేకపోయినా, ఆ సరుకును కొనుగోలు చేయడానికి ఏ ఆటంకమూ ఉండదు. ఇది ఆ రెండు దేశాలకూ ప్రయోజనకరంగా ఉండిన విధానం. డాలర్ల కోసం విధిగా ఏదో సరుకును మూడో దేశానికి అమ్ముకుని, తద్వారా వచ్చిన డాలర్లతో మాత్రమే తనకు అవసరమైన సరుకును రెండో దేశం నుండి కొనుగోలు చేయవలసిన అగత్యం ఏర్పడదు. వ్యాపారం యావత్తూ డాలర్ల రూపంలోనే సాగాలంటే సంపన్న పెట్టుబడిదారీ దేశాల దగ్గరే ఆడాలర్లు ఎక్కువగా ఉంటాయి గనుక ఆ దేశాలకు కావ లసిన సరుకులను, అవి చెప్పిన రేటుకు తెగన మ్ముకోవలసిన దుస్థితి వస్తుంది. అదే డాలరు ప్రస్తావనే లేకుండా రెండు దేశాలూ వ్యాపారం చేసుకోగలిగితే అటువంటి దుస్థితి ఏర్పడదు. కాని నయా ఉదారవాద ఆర్థికవేత్తలు ఈ విధం గా డాలరుతో నిమిత్తం లేని ద్వైపాక్షిక వ్యాపారా లను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇటు వంటి ద్వైపాక్షిక వ్యాపారాలు అంతర్జాతీయ వ్యాపారాన్ని తేలికగా నిర్వహించుకోడానికి దోహదం చేస్తాయని మనం భావిస్తుంటే,వాళ్ళు మాత్రం ఈ తరహా వ్యాపారాలు అంతర్జాతీయ వ్యాపారాన్ని కుదించివేస్తాయని,పక్కదోవ పట్టిస్తాయని విమర్శించారు. తమ వద్ద ఉన్న డాలర్లకు సరిపడా సరుకులు దొరకడం లేదని, డాలరుతో నిమిత్తం లేకుండా ఆయా దేశాలు ద్వైపాక్షికంగా వ్యాపారాలు నిర్వహించుకుంటూ తమ వైపు రావలసిన వ్యాపారాన్ని పక్కకు మళ్ళిస్తున్నాయని వారు అభ్యంతరాలు లేవనె త్తారు. ఒకసారి సోవియట్‌ యూనియన్‌ కూలిపోయిన తర్వాత ఈ చర్చ నిలిచి పోయింది. డాలరు ఆధిపత్యం స్థిరపడిరది. నయా ఉదారవాదం ఎటువంటి ద్వైపాక్షిక వ్యాపారాలనూ అనుమతించదు. ప్రపంచ వ్యాప్తంగా ఒకే మారకపు రేటు ఉండాలని అది శాసిస్తుంది. విదేశీ మారకద్రవ్య వ్యాపారానికి కూడా ఈ సూత్రమే వర్తించాలని ఆదేశిస్తుంది. ఈమధ్య కాలంలో తమ ఆదేశాలను ధిక్కరిస్తున్న దేశాలపై సంపన్న పెట్టుబడిదారీ దేశాలు పలు ఆంక్షలను విధిస్తున్నాయి. ఇలా ఆంక్షలకు గురైన దేశాలు తమలో తాము ద్వైపాక్షిక వ్యాపార ఒప్పందాలను చేసుకోవడం మొదలైంది. తద్వారా తమపై విధించిన ఆంక్షల ప్రభావా న్నుంచి తప్పించుకోవాలని అవి ప్రయత్నిస్తు న్నాయి. తాజాగా ఉక్రెయిన్‌ మీద రష్యా దాడి చేసిన నేపథ్యంలో రష్యా మీద సంపన్న పెట్టుబడిదారీ దేశాలు తీవ్రంగా వ్యాపార ఆంక్షలు విధించాయి. దానికి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తీవ్రంగా స్పందిం చారు. అమెరికా, తక్కిన సంపన్న పశ్చిమ దేశాలు మాత్రమే మొత్తం ప్రపంచం కాదని, ఇంకా చాలా పెద్ద ప్రపంచం ఉందని, తమను ఓ మూలకు నెట్టాలని చూస్తే అనేక దేశాలతో తాము ద్వైపాక్షికంగా ఒప్పందాలను కుదుర్చు కోగలమని పుతిన్‌ హెచ్చరించాడు. ఈ పరిస్థితి చూస్తే మళ్ళీ ప్రపంచంలో ద్వైపాక్షిక ఒప్పందాల జోరు పెరిగేలా ఉంది.రష్యాకు చెందిన బ్యాం కులు, ఇతర ఆర్థిక సంస్థలు పశ్చిమ దేశాల ఆర్థిక నెట్‌వర్క్‌తో ఏ విధంగానూ లావా దేవీలు జరిపేందుకు వీలు లేకుండా నిషేధిం చడం ఇప్పటివరకూ విధించిన ఆంక్షలలోకెల్లా తీవ్రమైనటువంటిది. స్విఫ్ట్‌ (సొసైటీ ఫర్‌ వరల్డ్‌వైడ్‌ ఇంటర్‌బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ టెలికమ్యూనికేషన్స్‌) నెట్‌వర్క్‌ను రష్యన్‌ బ్యాంకు లకు అందుబాటులోకి లేకుండా చేయడం దీనిని సూచిస్తుంది. దీని వలన రష్యా తన దేశం నుండి విదేశాలకు చేసిన ఎగుమ తులకు ప్రతిగా డాలర్ల రూపంలో రావలసిన ఆదాయం నిలిచిపోతుంది. డాలర్లు లేకపోతే రష్యా తనకు అవసరమైన దిగుమ తులకు కొనుగోలు చేయలేదు. అటు వంట ప్పుడు రష్యా తన దిగుమతుల అవసరాల కోసం తప్పనిసరిగా డాలర్లతో ప్రమేయం లేని ద్వైపా క్షిక ఒప్పందాలను కుదుర్చుకోవలసి వస్తుంది. అందులో భాగంగా భారతదేశంతో కూడా గతంలో మాదిరిగా ద్వైపాక్షిక ఒప్పం దాలకు రష్యా సిద్ధపడవచ్చు. ఆ ఒప్పందాలు గతంలో సోవియట్‌ యూనియన్‌ ఉన్న కాలంలో చేసుకున్న ఒప్పందాలను తలపించే అవకాశం ఉంది. పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలను తట్టుకుని నిలదొక్కుకోడానికి రష్యాకు ఆ విధమైన ఒప్పందాలు ఎంతమేరకు దోహదం చేయగలవో ఆచరణలో చూడాల్సిందే. ఈవిధమైన ఆంక్షల ఫలితంగా వేలాదిమంది ప్రజలు సకాలంలో ఔషధాలు అందక వెనిజు లాలో, ఇరాన్‌లో మరణించారు. ఒకానొక ప్రభుత్వం తీసుకున్న వైఖరి అంగీకారయోగ్యంగా లేనందున ఆంక్షల పేరుతో అక్కడి పౌరులను సైతం బలి చేయాలా అన్నది చర్చ. ఐతే, రష్యా వంటి పెద్ద, బలమైన దేశం విషయంలో ఈ విధమైన చర్చ పెద్దగా వర్తించదు. పశ్చిమ పెట్టుబడిదారీ దేశాలు కాదన్నంత మాత్రాన రష్యాను పట్టించుకోకుండా దూరంగా ఉంచగ లిగిన స్థితి చాలా దేశాలకు లేదు. రష్యా బలమైన దేశమే గాక, ప్రపంచంలో దానికి చాలామంది మిత్రులు కూడా ఉన్నారు. సామ్రా జ్యవాదం విధించే ఈ ఆంక్షలు అనేక వైరు ధ్యాలతో కూడివున్నాయి. ప్రపంచ వాణిజ్యంలో సామ్రాజ్యవాదం విధించే ఆంక్షలు ప్రధానంగా అమెరికన్‌ డాలర్లు లేదా ఇతర ప్రధాన కరెన్సీలు ఆదేశాలకు అందుబాటులోకి లేకుండా చేస్తాయి. ఆవిధంగా ఆంక్షలు విధిం చిన ప్రతీ సందర్భంలోనూ ఆంక్షలకు గురైన దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిం చడం మొదలుపెడతాయి. ఆ క్రమంలో సామ్రా జ్యవాదం యొక్క పట్టు బలహీనపడడం ప్రారం భం ఔతుంది. ఆంక్షలకు గురైన దేశాల సంఖ్య పెరుగుతున్నకొద్దీ ద్వైపాక్షిక ఒప్పందాలు పెరుగు తాయి. సామ్రాజ్యవాదపు పట్టు బలహీన పడడం పెరుగుతుంది. ఆవిధంగా సామ్రాజ్య వాద ఆధిపత్యానికి ప్రత్యామ్నాయంగా ఇంకొక వాణిజ్య వ్యవస్థ తలెత్తడానికి అవకాశాలు ఏర్పడతాయి. ప్రస్తుతం నడుస్తున్న అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థను అత్యంత హేతుబద్ధమైనదిగా చిత్రీకరించి…అన్ని దేశాలనూ ఒప్పించడం ద్వారా దానిని ఉనికి లోకి తెచ్చారు.కాని ఈ వ్యవస్థ సామ్రాజ్యవాద పెత్తనాన్ని మరింత పెంచేందుకోసమే రూపొందింది. ఈ వ్యవస్థను అడ్డం పెట్టుకుని తమను ఆర్థికేతర కారణాలతో వ్యతిరేకించే దేశాలపై కక్ష సాధింపుకు సామ్రా జ్యవాదం ఉపయోగిస్తున్నది. ఉక్రెయిన్‌ నాటో కూటమిలో సభ్యదేశంగా ఉండాలా వద్దా అన్నది అంతర్జాతీయ వాణిజ్యం పరిధిలోకి రాని అంశం. కాని ఆవివాదం కారణంగానే ఇప్పుడు రష్యా మీద ఆంక్షలను విధించారు. అంతర్జాతీ య వాణిజ్యం రాజకీయ వివాదాలకు అతీ తంగా,హేతుబద్ధంగా జరగాలంటూ తొలుత ప్రతిపాదించిన సామ్రాజ్యవాదులే ఇప్పుడు ఆ సూత్రానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తు న్నారు. వారి అసలురంగు ఏమిటో దీనిని బట్టే బైట పడుతోంది. నాటో కూటమి విస్తరణతో ముడి పడిన వివాదాల కారణంగా ఆయా దేశాలు పరస్పర వాణిజ్య సంబంధాలను ప్రతికూ లంగా దిగజార్చుకోవలసిరావడం పలు దేశా లకు ఆమోదయోగ్యం కాదు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఇమిడివున్న వైరుధ్యాల పర్యవ సానాలను నేడు మనం చూస్తున్నాం. నయా ఉదారవాదం ముందుకు పోయే దారి కనిపిం చని, దిక్కుతోచని స్థితికి ఏవిధంగా చేరుకుం టున్నదీ మనం చూస్తున్నాం. రష్యా-ఉక్రెయిన్‌ ఘర్షణ రూపంలో మనకు కనిపించేవి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దీర్ఘకా లంగా కొనసా గుతున్న సంక్షోభపు చిహ్నాలు, అమెరికా ఆధిప త్యానికి పెరుగుతున్న సవాళ్ళు మాత్రమే.- (ప్రభాత్‌ పట్నాయక్‌ )