Coal blocks for tycoons: Rinchi village tribals may be declared forest land encroachers

Sunday, June 28, 2020

By Gladson Dungdung*
On June 18, 2020, the Government of India initiated the process for auctioning 41 coal blocks for commercialisation. These coal blocks are located in different states within India and most of them fall under Fifth Schedule areas. The Indian government claims that their decision to auction these coal areas is a big step towards making the country Atmanirbhar Bharat (self-reliant) in the energy sector.

The government envisages an investment of 33,000 crore, which would create 2.8 lakh jobs including 70,000 direct and 2,10,000 indirect jobs. Presently, India produces 60.40 million tons of coal per annum (2018-19), and the new initiates would be adding 15 percent to it.

Read more

కొత్త కొత్తగా ఎన్నికల్లో సరికొత్త అంశాలు

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలపై ఉండే బ్యాలెట్‌ పత్రాల్లో అభ్యర్థుల పేర్లు, ఇంటిపేర్లు, గుర్తులు మాత్రమే ఉండేవి. అవిఒకే విధంగా ఉండటంతో క్రాస్‌ఓటింగ్‌ పెరిగి విజయావకాశాలు తారుమారవుతాయని పలుపార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈనేపథ్యంలో ఎన్నికలసంఘం ఈసారి బ్యాలెట్‌ పత్రాల్లో అభ్యర్థుల పేర్లు, గుర్తుల పక్కనే అభ్యర్థుల ఫొటోలను కొత్తగా ముద్రించింది.
ఓటరు చీటీల్లో పూర్తి సమాచారం
అధికారులు గతంలో పంపిణీ చేసే పోలింగ్‌ చీటీల్లో కేవలం ఓటర్ల పేర్లు, తండ్రి/భర్త పేరు,ఇంటిసంఖ్య, గ్రామం తదితర వివరాలు మాత్రమే ఉండేవి. ఈసారి ఓటరు చీటీలు కొత్త రూపు సంతరించుకున్నాయి. వాటిలో గూగుల్‌ ఎర్త్‌ సహకారంతో పోలింగ్‌ కేంద్రాల చిరునామాను రూట్‌ మ్యాప్‌తో సహా ముద్రించారు. ఓటర్ల అనుమానాల నివ ృత్తికి బూత్‌స్థాయి అధికారుల సెల్‌ నంబర్లను, జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన హెల్ప్‌లైన్‌, టోల్‌ఫ్రీ నంబర్లనూ ముద్రించారు. ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌నూ పేర్కొన్నారు.
మహిళలకు ప్రత్యేక పోలింగ్‌ కేంద్రాలు
మహిళల పోలింగ్‌ శాతం తగ్గుతుందని గుర్తించిన ఎన్నికల సంఘం ఈసారి కొత్తగా పింక్‌ పోలింగ్‌ కేంద్రాల పేరిట ప్రత్యేకంగా మహిళా కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఒకమహిళా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వీటిలో మహిళా ఉద్యోగులే విధులు నిర్వర్తిస్తారు.
దివ్యాంగులకు సదుపాయాలు
వరుసలో ఎక్కువ సమయం నిలబడలేక దివ్యాంగులు ఓటు హక్కుకు దూరమవుతున్నారు. దీంతో వారు ఓటు హక్కును వినియోగించడానికి వీలుగా ఎన్నికల సంఘం ప్రత్యేక సదుపాయాలను కల్పించింది. గ్రామంలో 70 మంది దివ్యాంగులు ఉంటే వారికి ప్రత్యేక వాహనాన్ని కేటాయించింది. దివ్యాంగులను ఈవాహనాల్లో పోలింగ్‌ కేంద్రం ఆవరణ వరకు తీసుకెళతారు. ఆవరణ నుంచి పోలింగ్‌ గదిలోకి వెళ్లడానికిగాను చక్రాల కుర్చీలు, ట్రైసైకిళ్లను ఏర్పాటు చేశారు. 80 సంవత్సరాలు దాటిన వృద్ధులకూ ఈ సదుపాయాలు వర్తిస్తాయి.
ఓటు నమోదుపై అవగాహన
అర్హులైన యువకులను ఓటర్లుగా నమోదు చేయడానికి ఎన్నికల సంఘం ఈసారి పలు వినూత్న విధానాలను అనుసరించింది. ప్రధానంగా యువకులు సెల్ఫీలు దిగడానికి ప్రాధాన్యమిస్తారు. యువకులను ఆకర్షించడానికి పట్టణ ప్రాంతాల్లో ‘ఐ ఓట్‌ బికాజ్‌..’ పేరిట పట్టణాల్లో సెల్ఫీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఓటర్లకు చైతన్యం పెంపొందించేలా హోర్డింగులను ఏర్పాటు చేసి గాలి బెలూన్లను ఏర్పాటు చేసింది. వీటితోపాటు ఓటు హక్కును వినియోగించాలంటూ ఈసారి కళాబృందాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేపట్టింది.
అంధుల కోసం బ్రెయిలీ లిపి
ప్రతి ఎన్నికల్లో అంధులు ఓటు హక్కును వినియోగించు కోవడం ఇబ్బందికరంగా మారింది. చాలామంది అంధులు ఓటు హక్కును వినియోగించుకోలేక పోతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్నికల సంఘం అంధుల కోసం ఈవీఎంలలో బ్రెయిలీ లిపీని అందుబాటులోకి తీసుకొచ్చింది. వీరికి బెయిలీ లిపితో కూడిన ఓటరు చీటీలను పంపిణీ చేశారు.
రెండు ఓట్లను గుర్తించొచ్చు
రెండు చోట్ల ఉన్న ఓట్లను తొలగించి ఏదైనా ఒకే ప్రాంతం లో ఓటు హక్కు కల్పించాలనే ఉద్దేశంతో ప్రస్తుతం ఎన్నికల సంఘం ‘ఈఆర్వోనెట్‌.వీ2.0 వర్షన్‌’ సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టింది. ఎన్నికల సంఘం అధికారులు ఈ సాఫ్ట్‌వేర్‌ ఆధారంగా ఓటర్ల రెండో ఓటును తొలగించారు.
ఫిర్యాదులకు సి-విజిల్‌
అభ్యర్థులు పంపిణీ చేస్తున్న డబ్బు, మద్యం గురించి గతంలో సంబంధిత కార్యాలయాలకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సి ఉండేది. వీటిపై ఓటర్లు ఫిర్యాదు చేస్తూ మద్యం, డబ్బు పంపిణీని అరికట్టడానికి ప్రస్తుతం ఎన్నికల సంఘం సీ-విజిల్‌ యాప్‌ను ప్రవేశపెట్టింది. మద్యం, డబ్బులు పంపిణీ చేస్తున్న వ్యక్తుల చిత్రాలు తీసి ఈయాప్‌లో నమోదు చేయగానే.. సంబంధిత అధికారులకు సమాచారం అందుతుంది. ఈఎన్నికల్లో కొత్తగా ప్రవేశపెట్టిన యాప్‌కు ఓటర్ల నుంచి మంచి స్పందన వచ్చింది.
సందేహాల నివ ృత్తికి ‘సమాధాన్‌’..
ఎన్నికల సమయంలో ఓటర్లు తమ సందేహాలను నివ ృత్తి చేసుకోవడానికి గతంలో అధికారులు, ఆర్డీవో, జిల్లా పాలనాధికారి కార్యాలయాల వద్దకు వెళ్లాల్సి వచ్చేంది. ఈసారి ఓటర్లు తమ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి వీలుగా ‘సమాధాన్‌’ యాప్‌ను ప్రవేశపెట్టింది. స్మార్ట్‌ చరవాణిలో సి`విజిల్‌ యాప్‌ను దిగుమతి చేసుకొని ఆయాప్‌ ద్వారా సందేహాల్ని నివ ృత్తి చేసుకోవచ్చు.
నూతన రాష్ట్రంలో తొలి ఎన్నికలు
ప్రత్యేక హోదా సాధన కోసం ఏర్పాటు చేసిన జనసేనాపార్టీ నేతృత్వంలో బీఎస్పీ, వామపక్షాలు కలసి కూటమిగా ఈఎన్నికల బరిలో ప్రధానపార్టీనేతల్లో దఢ పుట్టిస్తోంది.
నిన్నటి శత్రువులు..నేటి మిత్రులు
రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం, శాశ్వత మిత్రుత్వం ఉండవన్న అంశాన్ని నిజంచేస్తూ ఈసారి ప్రజాకూటమి పేరిట కాంగ్రెస్‌, తెదేపాలు ఒకే గొడుగు కిందకు చేరాయి. తెలుగుదేశం పార్టీ గతంలో వివిధ సందర్భాల్లో తెరాస, భాజపాలతో జట్టు కట్టిన ప్పటికీ కాంగ్రెస్‌కు స్నేహ ‘హస్తం’ చాచడం ఆసక్తి కరంగా మారింది.
ఈవీఎంలు ఎలా పనిచేస్తాయి?
80 కోట్ల మంది ఓటర్లు, 2000కు పైగా రాజకీయ పార్టీలు పాల్గొనే సాధారణ ఎన్నికలను నిర్వహించడం భారత్‌ వంటి దేశంలో ఓ పెద్దసవాలే. ఇంత సంక్లిష్ట ప్రక్రియలోని విశ్వసనీయత అంతా దాని పారదర్శకతపైనే ఆధారపడి ఉంటుంది. రాజకీయ పార్టీలకు చెందిన అల్లరి మూకలు పోలింగ్‌ కేంద్రాలను లూటీ చేయడం, బ్యాలట్‌ బాక్సులను ఎత్తుకెళ్లిపోవడం వంటి చర్యల కారణంగా దశాబ్దాలపాటు ఎన్నికల నిర్వహణ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (ఈవీఎం) ప్రవేశంతో ఈపరిస్థితికి అడ్డుకట్ట పడిరది. కానీ వీటిపై ఎన్నో అనుమానాలు,విమర్శలు. ఈయంత్రాలను హ్యాకింగ్‌ చేయవచ్చని, రిగ్గింగ్‌కు పాల్పడవచ్చంటూ ఎన్నికల్లో పరాజ యం పాలైన పార్టీలు ఆరోపించడం సాధారణమైపోయింది. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ అనుమానాలు మరోసారి తెరపైకి వచ్చాయి. 2014 ఎన్నికల్లో ఈవీఎంలను హ్యాక్‌ చేశారని, అందువల్లే నరేంద్ర మోదీ నేత ృత్వంలోని బీజేపీ భారీ ఆధిక్యంతో అధికారాన్ని కైవసం చేసుకుందని అమెరికాలో నివసిస్తున్న భారత సైబర్‌ నిపుణుడు సయ్యద్‌ షుజా చేసిన ఆరోపణలను భారత ఎన్నికల సంఘం ఖండిరచింది. కానీ, ఈవీఎంల్లో వాడే సాంకేతికతపై అనుమా నాలు మాత్రం ఇంకా తొలగిపోలేదు. కోర్టుల్లో ఈవీఎంల కచ్చిత త్వంపై కనీసం 7కేసులు నడుస్తున్నాయి. అయితే భారత్‌లో వినియో గిస్తున్న ఈవీఎంలను హ్యాకింగ్‌ చేయలేరని ఎన్నికల సంఘం వర్గాలు చెబుతూనే వస్తున్నాయి.
ఈవీఎంల భద్రత
భారత్‌లో వినియోగిస్తున్న 1.6 కోట్ల ఓటింగ్‌ యంత్రాల్లో ఒక్కోదానిలో 2000 ఓట్లు నమోదు చేయవచ్చు (ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో 1500 మందికి మించి ఓటర్లు ఉండరాదు). 64 మంది అభ్యర్థుల పేర్లను చూపించవచ్చు. భారత్‌లోనే తయారయ్యే ఈ మెషీన్లను బ్యాటరీ పవర్‌తో కూడా ఉపయోగించవచ్చు. దీనివల్ల కరెంటు సౌకర్యం సరిగా లేని మారుమూల గ్రామాల్లో సైతం వీటితో ఎన్నికలు నిర్వహించవచ్చు. దీనిలో ఉపయోగించే సాఫ్ట్‌వేర్‌ను ఈసీఐఎల్‌ ఇంజనీర్ల బృందం అభివృద్ధి చేసింది. ఈ బృందానికి తప్ప వేరెవరికీ ఈ సాఫ్ట్‌వేర్‌ గురించి గానీ, ఈవీఎంలకు సంబంధిం చిన ఇతర వివరాల గురించి గానీ తెలిసే అవకాశం లేదని ఈసీఐఎల్‌ వర్గాలు స్పష్టం చేశాయి. ఎవరైనా బలవంతంగా, నిబంధనలకు విరుద్ధంగా ఓట్లు వేయాలని ప్రయత్నిస్తే, మెషీన్‌ పనిచేయకుండా చేసేలా ఈవీఎంపై ఓబటన్‌ కూడా ఉంది. పోలింగ్‌ స్టేషన్‌లోని సిబ్బంది అవసరమైన సమయంలో దీన్ని నొక్కవచ్చు. పోలింగ్‌ ముగి సిన తర్వాత దీనికి పాతపద్ధతిలోనే లక్కతో సీల్‌ వేసి, దానిపై ఓ స్టిక్కర్‌ అతికించి, స్టాంప్‌ వేస్తారు. దీంతోఎలాంటి మార్పులకూ అవకా శం ఉండదు. ఇప్పటి వరకూ మూడు సాధారణ ఎన్నికలు, 113 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించారు. బ్యాలెట్‌ పద్ధతిలో పోలింగ్‌ జరిగినప్పుడు ఒక్కో పార్లమెంటరీ నియోజక వర్గంలో ఫలితం తేలాలంటే కనీసం 40 గంటలు పట్టేది. ఈవీఎంల వినియోగంతో అది 5 గంటలకు తగ్గిపోయింది. ఎలాంటి అవకతవ కలకు, మానవ తప్పిదాలకు ఆస్కారం లేకుండా ఎన్నికలు నిర్వహిం చేందుకు వీలు కలిగిందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈవీఎంల ప్రభావం అనే అంశంపై పరిశోధనలు చేసిన శిశిర్‌ దేవ్‌నాథ్‌, ముదిత్‌ కపూర్‌, షమికా రవి తమ పరిశీలనలను 2017లో సమర్పించారు. ఈవీఎంల ప్రవేశం కారణంగా అందరూ తమ ఓటు హక్కు నిర్భ యంగా వినియోగించుకునే అవకాశం కలిగిందని, ఎన్నికల్లో అక్రమా లకు అడ్డుకట్ట పడిరదని, ఎన్నికలను మరింత సమర్థంగా నిర్వహించే వెసులుబాటు కలిగిందని తమ నివేదికలో వీరు పేర్కొన్నారు.
వీఎంల హ్యాకింగ్‌ సాధ్యమేనా?
ఈవీఎంలకు ఓ చిన్న పరికరం అమర్చి, మొబైల్‌ ద్వారా ఎస్‌ఎంఎస్‌ పంపించడం ద్వారా ఓట్లను తారుమారు చేయవచ్చని ఎనిమిదేళ్ల క్రితం మిచిగాన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ప్రకటించారు. కానీ ఈసీ అధికారులు ఇదిఅసాధ్యమంటూ ఆఆరోపణలను కొట్టి పారేశారు. ఇన్నివేల ఈవీఎంలను హ్యాక్‌ చేయాలంటే చాలా డబ్బు అవసరమని, ఒకవేళ చేయాలనుకున్నా దానికి ఈవీఎంల తయారీలో భాగమైన ఇంజినీర్ల సాయం అవసరమని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ)కు చెందిన నిపుణుడు ధీరజ్‌ సిన్హా అభిప్రాయ పడ్డారు. దీనికి ఓ చిన్న రిసీవర్‌ సర్క్యూట్‌, మానవ కంటికి కనబడని ఓ యాంటెన్నా అవసరమని ఆయన అన్నారు. అయితే భారత్‌లో వినియోగిస్తున్న ఈవీఎంలకు ఎలాంటి యాంటెన్నాలు, ఎలక్ట్రానిక్‌ సర్క్యూట్లు లేవని ఎన్నికల సంఘం అధికారులు స్పష్టం చేశారు. ఇంత భారీస్థాయిలో హ్యాకింగ్‌ అసాధ్యమని అన్నారు.
ఇతర దేశాల్లో పరిస్థితి ఎలా ఉంది?
దాదాపు 33దేశాల్లో ఈవీఎంల ద్వారా ఓటింగ్‌ జరుగు తోంది. కొన్ని దేశాల్లో వీటి విశ్వసనీయతపై సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఈవీఎంల ద్వారా జరిగిన 2017 వెనెజ్వేలా ఎన్నికల్లో నమోదైన ఓట్లకన్నా దాదాపు 10 లక్షల అదనపు ఓట్లు ఎక్కువ పడ్డాయని వచ్చిన ఆరోపణలను అక్కడి ప్రభుత్వం తోసిపుచ్చింది. బ్యాలట్ల గోప్యత, ఫలితాల తారుమారు వంటి సమస్యలను ప్రస్తావిస్తూ అర్జెంటీనా కూడా 2017లో ఈ-ఓటింగ్‌ ప్రతిపాదనలను తిరస్కరిం చింది. 2018 ఇరాక్‌ పార్లమెంటు ఎన్నికల్లో ఈవీఎంలలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయంటూ కొన్ని చోట్ల రీకౌంటింగ్‌ నిర్వహించాల్సి వచ్చింది. డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోలో గత డిసెంబరులో జరిగిన అధ్యక్ష ఎన్నికలు పెద్ద వివాదాన్నే రేపాయి. ఈవీఎంలను సరిగ్గా పరీక్షించకుండానే పోలింగ్‌లో వినియోగించారనే ఆరోపణలు వచ్చాయి. అమెరికాలో 15 ఏళ్ల క్రితం ఓటింగ్‌ యంత్రాల వినియోగం ప్రారంభమైంది. ఇప్పుడు అక్కడ దాదాపు 35 వేల మెషీన్లు ఉన్నాయి. అయితే అక్కడా కొన్ని ఆరోపణలున్నాయి.
వీవీప్యాట్లతో సందేహాలు తొలగుతాయా?
‘‘టెక్నాలజీ వినియోగాన్ని ఎంతగా వీలైతే అంతగా తగ్గిం చాలి. ఏ ఓటరు ఏఅభ్యర్థికి ఓటేశాడో తెలియకూడదని అంటు న్నారు, అసలు సాఫ్ట్‌వేర్‌ అనుకున్న విధంగానే పనిచేస్తోందో లేదో తెలుసుకు నేందుకు కూడా సరైన మార్గం లేదు’’ అని ఈ-ఓటింగ్‌పై అధ్యయనం చేస్తున్న యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ కరోలినా ప్రొఫెసర్‌ డంకన్‌ బ్యూల్‌ వ్యాఖ్యానించారు. భారత్‌లో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిం చేందుకు అధికారులు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. అన్ని ఈవీఎంలకు వీవీప్యాట్‌లను ఏర్పాటు చేయాలని ఐదేళ్ల క్రితం సుప్రీం కోర్టు ఆదేశించింది. ఒక ఓటు నమోదుకాగానే, సీరియల్‌ నంబరు, పోటీలో ఉన్న అభ్యర్థి పేరు, పార్టీ గుర్తుల వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. 7 సెకండ్ల తర్వాత ఈవివరాలతో ప్రింట్‌ అయిన రసీదు ఓసీల్డు బాక్సులో పడిపోతుంది. వీవీప్యాట్ల ద్వారా వచ్చే పేపర్‌ స్లిప్‌లను మెషీన్లలో నమోద య్యే ఓట్ల సంఖ్యతో పోల్చి చూడాలని అధికారులు నిర్ణయిం చారు. ప్రతి అసెంబ్లీ స్థానంలో కనీసం 5%కేంద్రాల్లో ఇలా చేయాలని భావిస్తు న్నారు. ఓటర్ల మనసుల్లో ఉన్న అనుమానాలు వీవీప్యాట్‌ల ద్వారా తొలగవచ్చని మాజీ సీఈసీ ఎస్‌వై ఖురేషీ అభిప్రాయపడ్డారు.‘‘2015 నుంచి అన్ని రాష్ట్రాల ఎన్నికల్లో వీవీ ప్యాట్లను ఉపయోగిస్తున్నారు. వీటిలో దాదాపు1500 మెషీన్లకు ఉన్న పేపర్‌ స్లిప్‌లను పోలైన ఓట్లతో కలిపి లెక్కించారు. ఒక్కటి కూడా తేడా రాలేదు’’ అని ఆయన అన్నారు. ఈవీఎంలో ఓట్లు ఎలా లెక్కిస్తారు? వీవీ ప్యాట్‌లు అంటే ఏంటి? ఈవీఎం మెషీన్లలో నిక్షిప్తమై ఉన్న ఓట్లు ఎవరికి అధికారం కట్టబెడ తాయో అన్న ఉత్కంఠతో అందరూ ఎదురు చూస్తున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ అంతా రాజకీయపార్టీలు, ఏజెంట్ల సమక్షంలో జరుగుతుంది. ప్రతి రౌండ్‌లోనూ వారు సంతృప్తి చెందిన తర్వాతే ఫలితాలను అధికారులు వెల్లడిస్తారు. ఈనేపథ్యంలో అసలు ఈవీఎం మెషీన్లలో ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతుం దో చూద్దాం. ఆసమయంలో లెక్కింపు సిబ్బంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూద్దాం. ఓట్లను లెక్కించేందుకు ముందుగా ఈవీఎంలోని ఫలితాల విభాగానికి ఉన్న సీల్‌ను తొలగిస్తారు. ఈవీఎం బయటి కప్పు మాత్రమే తెరుస్తారు. లోపలి భాగాన్ని తెరవకుండా అలాగే ఉంచు తారు. తర్వాత ఈవీఎం పవర్‌ ఆన్‌ చేస్తారు. బ్యాటరీలో ఛార్జింగ్‌ తక్కువగా ఉంటే ఆ మెషీన్‌కి ఉండే డిజిటల్‌ తెర మిణుకు మిణుకుమని వెలుగుతుంది. లేదంటే ఖాళీగా కనిపిస్తుంది. అప్పుడు కొత్త బ్యాటరీ అమర్చాలి. అనంతరం లోపల బటన్‌ మాదిరిగా కనిపిం చే సీల్‌ను తొలగిస్తే లోపల రిజల్ట్స్‌ మీట కనిపిస్తుంది. ఆమీట నొక్కగానే ఏఅభ్యర్థికి ఎన్నిఓట్లు పోలయ్యాయో తెరపై కనిపిస్తుంది.ఆ వివరాలను జాగ్రత్తగా నోట్‌ చేసుకుంటారు.
వీవీపాట్‌ అంటే ఏమిటి? అదెలా పనిచేస్తుంది?
ఎన్నికల సంఘం ఓటింగ్‌ విషయంలో అనేక సంస్కరణలు, విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూనే ఉంది. బ్యాలెట్‌ బాక్స్‌ల నుంచి ఈవీఎంల వరకు కొత్త సాంకేతికతను వినియోగిస్తూనే ఉంది. అయితే, ఓటింగ్‌లో మరింత పాదర్శకతకు పేపర్‌ బ్యాలెట్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని 16 రాజకీయ పార్టీలు గతంలో ఎన్నికల సంఘాన్ని కోరాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం వీవీపాట్‌ను తీసుకొచ్చింది. వీవీపా ట్‌.. ఇకమై మీ ఓటును ప్రింట్‌ తీసుకోవచ్చు. ఓటర్‌ వెరిఫైడ్‌ పేపర్‌ అడిట్‌ ట్రయిల్‌కు సంక్షిప్త రూపమే వీవీపాట్‌. ఇది ఒక చిన్న ప్రింటిర్‌ లాంటిది. వీవీపాట్‌ను ఈవీఎంలకు అనుసంధానిస్తారు. తాము వేసిన ఓటు ఎవరికి పడిరదో ఓటర్లు చూసుకునేందుకు వీలుగా ఎన్నికల సంఘం దీన్ని తీసుకొచ్చింది. మనంఏపార్టీకి ఓటు వేశామనదే వీవీ పాట్‌లద్వారా వెంటనే తెలుసుకునే అవకాశం ఉంది. ఈవీఎంలో మనకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసిన తర్వాత వీవీపాట్‌ ఒక స్లిప్‌లో ఆఅభ్యర్థి పేరు, గుర్తు వచ్చేలా ప్రింట్‌ తీసి సీల్డ్‌ బాక్స్‌లో పడేస్తుంది. ఓటు వేసిన ఏడు సెకన్ల తర్వాత వీవీపాట్‌ బీప్‌ శబ్దం చేస్తూ ప్రింట్‌ను చూపిస్తుంది. 2013లో నాగాలాండ్‌లోని నొక్సెన్‌ అసెంబ్లీ నియోజక వర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో తొలిసారి వీవీపాట్‌లను ఎన్నికల సంఘం ఉపయోగించింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 2014 సాధారణ ఎన్నికల్లో కొన్ని పోలింగ్‌ బూత్‌లలో వీవీపాట్‌లను ఎన్నికల సంఘం ఉపయోగించింది.-కందుకూరి సతీష్‌కుమార్‌

హామీల ఉల్లంఘనలు సరికొత్త వాగ్దానాలు

గత ఎన్నికల సందర్భంగా రైతులకు, డ్వాక్రా మహిళలకు, చేనేత కార్మికులకు రుణ మాఫీ చేస్తానని, చంద్రబాబు నాయుడు వాగ్దానం చేశారు. ఇప్పుడు పసుపు కుంకుమల వల వేశారు. దాన్ని కూడా నమ్మరన్న అనుమానం వచ్చింది కాబోలు! మళ్లీ అధికారంలోకి వస్తే మరోసారి పసుపు కుంకుమ ఇస్తానని కొత్త వాగ్దానం ప్రకటించారు. జగన్‌ కూడా డ్వాక్రా రుణ మాఫీ అంటున్నారు.
రూ.16 వేల కోట్లు రుణమాఫీ చేశామంటూ అబద్ధాలు చెప్పుకుంటూ ఈ కాలమంతా ప్రచారం చేశారు. 2014 డిసెంబరు 31నాటికి డ్వాక్రా సభ్యులు రూ.13 వేల 844 కోట్లు బ్యాంకులకు బకాయి ఉన్నారు. రూ.2 వేల 174కోట్లు ఓవర్‌ డ్యూఅయ్యాయి. రూ.888 కోట్లు ఎన్‌పిఎ గా ప్రకటించబడ్డాయి. రుణాలు ప్రభుత్వం జమ చేసినట్లయితే మహిళలు వడ్డీల మీద వడ్డీలు కట్టాల్సిన దుస్థితి వచ్చేది కాదు. 2018లో సెప్టెంబరులో జరిగిన శాసనసభ సమావే శాల్లో డ్వాక్రా రుణ మాఫీ వాగ్దానం ప్రకారం ఎంత రుణమాఫీ చేశా రని ప్రశ్నించగా ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయలేదన్న కఠోర వాస్తవం సంబంధిత శాఖామంత్రి ఇచ్చిన సమాధానంలో వెల్లడైంది. గత ఎన్నికలలో హామి ఇచ్చిన ప్రకారం రుణ మాఫీ చెయ్యలేదనేది కఠోర వాస్తవం. మద్య నిషేధ హామీతో అధికారంలోకి వచ్చిన ఎన్‌టిఆర్‌ స్థానంలో చంద్రబాబు నాయుడు అర్ధంతరంగా అధికారంలోకి వచ్చిన కాలంలోనూ అంతే. మద్య నిషేధ హామీకి తూట్లు పొడిచారు. కల్తీ మద్యం నిరోధం పేరిట మద్యం షాపులకు లైసెన్స్‌ ఇవ్వడం ప్రారంభించి, డ్వాక్రా పేరిట మహిళలకు వల వేశారు. 1000 రూపాయలు పొదుపు చేసుకొంటే రూ.1000 జమ చేస్తానని పెద్ద ఎత్తున స్వయం సహాయక గ్రూపులను ఏర్పాటు చేశారు. లక్షల మంది మహిళలను సమీకరించేందుకు డ్వాక్రాను ఒక సాధనంగా మార్చుకున్నారు.
నిరంకుశ పెత్తనం
మహిళలు, పిల్లల అభివృద్ధి కోసం ప్రవేశ పెట్టబడిరది డ్వాక్రాపథకం. గ్రూపు పొదుపు చేసుకున్న డబ్బులకు నాలుగు రెట్ల నుండి 10 రెట్ల వరకు అదనంగా బ్యాంకు రుణ సౌకర్యాన్ని కల్పిం చాలని రిజర్వుబ్యాంక్‌ ఆదేశించింది. అయితే ప్రారంభం నుంచే ఈ స్వయం సహాయక గ్రూపులు రాజకీయ ప్రయోజనాలకు అను గుణంగా తీర్చిదిద్దబడ్డాయి. ఎమ్‌ఎల్‌ఎలు, మంత్రులు, ముఖ్య మంత్రుల సభలు జయప్రదం చెయ్యడానికి వీరిని వాడుకోవడం మొదలుపెట్టారు. డిఆర్‌డిఎ ఉద్యోగులకు గ్రామ సేవికలకు అధికారా లను కట్టబెట్టారు. రుణం మంజూరు కావాలంటే సభలకు హాజరు కావలసిందేనని నమ్మబలికారు. గ్రూపుల తీర్మానాలను నామ మాత్రం చేసి అధికారుల ఇష్టారాజ్యంగా, అధికార పార్టీ ప్రయోజనాలకు అను గుణంగా గ్రూపులు నిర్వహించబడుతూ వచ్చాయి. మహిళలు, పిల్లల సమగ్ర అభివృద్ధికి ఉద్దేశించబడిన స్వయం సహాయక గ్రూపులు, పొదుపు రుణాల గ్రూపులుగా మార్చబడ్డాయి. మహిళల చొరవ, నిర్ణయాధికారం, చైతన్యవంతమైన కృషి, ఆర్థిక స్వావలంబన అణచి వేయబడ్డాయి. మహిళలు నాయకులుగా ఎదిగే క్రమాన్ని నీరు గార్చాయి.
గోరంత లబ్ధి, కొండంత భారం
స్వప్రయోజనాల సాధనే లక్ష్యంగా, ఆంధ్ర ప్రదేశ్‌లో అధికార పార్టీలు పొదుపు గ్రూపు లను ప్రోత్సహించాయి. ఫలితంగా గోరంత లబ్ధి, కొండంత భారంగా గ్రూపులు నడుస్తు న్నాయి. మహిళల శ్రమను కారు చౌకగా బ్యాంకులు, ప్రభుత్వం వినియోగించు కొంటున్నాయి. డ్వాక్రా మహిళలు పొదుపు చేసుకున్న వేలకోట్ల రూపాయలను వడ్డీ లేకుం డానే బ్యాంకులు ఉపయోగించు కుంటు న్నాయి. పొదుపు డబ్బులను బ్యాంకుల నుండి తీసుకోవడానికి ఆంక్షలు పెడుతున్నాయి. గ్రూపుల నిర్వహణ ఖర్చులు, గ్రామసేవికల వేతనాలు డ్వాక్రా మహిళలే చెల్లించుకుం టున్నారు. బలవంతపు డిపాజిట్లు, ఇన్సూ రెన్సులు కట్టించి వడ్డీ రేట్ల భారాన్ని మహిళల మీద మోపారు. వీటితో పాటు అధికార పార్టీ సభలకు బలవంతపు ప్రేక్షకులుగా మార్చ బడ్డారు. 2008లో సెస్‌ అంచనాల మెరకు 2004-5, 2010-11 మధ్య బ్యాంకుల నుండి డ్వాక్రా గ్రూపులకు రూ.1200 కోట్లు నుంచి 8,600 కోట్లు రుణాలు మంజూరు పెరిగింది. 2012నాటికి రాష్ట్రంలో12.5 లక్షల గ్రూపుల్లో1.36 కోట్ల మంది మహి ళలు ఉన్నారు. ఈ మొత్తం గ్రూపులకు వడ్డీల మొత్తం జమ చేయాల్సివస్తే రూ.1,400 కోట్లువడ్డీల కింద చెల్లించాల్సి వస్తుందని లెక్కించబడిరది. అంటే డ్వాక్రా గ్రూపులకు పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చెయ్యడం ద్వారాప్రభుత్వం,బ్యాంకులు లబ్ధిపొందాయి.
పసుపు కుంకుమల మాయ
2014లో రుణ మాఫీ హామీ ద్వారా టిడిపి ఓట్లు వేయించుకుని అధికారాన్ని పొందింది. మహిళలు మాత్రం పెనాల్టీలు కట్టారు. ముక్కు పోగులు, చెవి కమ్మలు, అమ్ముకుని అప్పులు చెల్లించారు. అవి కూడా లేని వాళ్ళ గ్రూపులు రద్దయ్యాయి. అప్పటికి గ్రూపులు చెల్లించవలసిన మొత్తం రూ.2,514 కోట్లు మాత్రమే. ఈ మొత్తం కూడా చెల్లించనందున డ్వాక్రా గ్రూపులు రుణగ్రస్త గ్రూపులుగా మారి పోయాయి. అధిక వడ్డీలకు అప్పులు చేసి, లేక సొంతంగా అప్పులు చెల్లించగలిగిన వాళ్ళు చెల్లించగా, మిగిలిన వాళ్ళు బ్యాంకుల నుండి నోటీసులను అందుకున్నారు. ఇప్పుడు పసుపు కుంకుమ కింద ఇచ్చిన డబ్బులు కొన్ని చోట్ల పాత బకాయిలకు చెల్లవేశారు. పసుపు, కుంకుమ చెక్కుల పంపిణీ చేస్తూ తెలుగు దేశానికి ఓట్లు వేస్తామని, బాబు మళ్ళీ రావా లని ప్రమాణాలు చేయించుకున్నారు.
వడ్డీ లేని రుణాలు
2012లో డ్వాక్రా గ్రూపులకు వడ్డీ లేని రుణా లు ఇస్తామని జీవో జారీ చేసింది. ఆ మేరకు సంవత్సరానికి రెండున్నర వేలకోట్ల రుపా యలు వడ్డీ కింద మంజూరు చేయాలి. సకాలంలో వడ్డీలు చెల్లించినట్లయితే గ్రూపు లకు అదనపు వడ్డీ భారం పడదు. కాని ఆ ప్రకారం టిడిపి ప్రభుత్వం వడ్డీ చెల్లించ నందున, అదనపువడ్డీల భారం గ్రూపుల మీద పడుతుంది.
ఐక్యతతో అధిగమించాలి
టిడిపి ప్రభుత్వం ఇచ్చిన రుణ మాఫీ హామీతో సుమారుగా మూడున్నర లక్షల గ్రూపులు రుణాల ఊబిలో కురుకుపోయి రద్దయ్యాయి. ప్రభుత్వం చేసిన తొలి సంతకానికి విలువ ఇచ్చి కనీసం రెండున్నర వేల కోట్ల రూపా యలు జమ చేస్తే అన్ని గ్రూపులు సజీవంగా ఉండటమే కాక, వారి ఆర్థిక కార్యక్రమాలు పెరిగేందుకు దోహద పడేది. ఇప్పుడు ఎన్ని కల ముందు ఆర్భాటంగా ప్రకటించిన పసు పు, కుంకుమ ఆనాడే రుణ మాఫీకి జమ చేస్తే రాష్ట్రానికి, మహిళలకు, బ్యాంకులకు ఎంతో లబ్ధి చేకూరేది. ఎన్‌ఆర్‌ఎల్‌ఎమ్‌ (నేష నల్‌, రూరల్‌ లైవ్లో హడ్‌ మిషన్‌) పథకం కింద రూ.10 లక్షల వరకూ 7 శాతం వడ్డీకే లింకేజి లోన్‌ ఇవ్వగలిగే అవకాశం వుంది. కాని దానిని అమలు చేయడానికి ప్రభుత్వం నుంచి ప్రయత్నమే లేదు. నైపుణ్య శిక్షణ, ఉత్పత్తి యూనిట్లు, మార్కెటింగ్‌ సదుపా యాలు కాగితాలకే పరిమితమయ్యాయి. స్త్రీ నిధి రుణాల పై కూడా వడ్డీ జమ చేయాలి. ప్రభుత్వం ఈ రుణాలకు ముక్కు పిండి మరీ వడ్డీ వసూలు చేస్తోంది.
పసుపు కుంకుమలు, రుణ మాఫీ వాగ్దానాలు ఓట్ల కోసం వేసే వల మాత్రమే. స్వయం సహాయక గ్రూపులు స్వయం నిర్ణయాధి కారంతో నడవాలి. అందుకు ప్రభుత్వం సహా యం ఇవ్వాలి. నిర్వహణకోసం అయ్యే ఖర్చు లు, ఫెసిలిటేటర్లు (ఏనిమేటర్లు) జీతాల ఖర్చు లు ప్రభుత్వమే భరించాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ వడ్డీ రాయితీని ఏనెలకా నెల జమ చేయాలి. నైపుణ్య శిక్షణ,మార్కెటింగ్‌ సదు పాయాల కోసం బహుళ జాతి కంపెనీల మీద ఆధారపడడంగాక ప్రత్యామ్నాయ పద్ధ తులు రూపొందించాలి. సామాజిక చైతన్యం తో సమస్యల పరిష్కారంలో డ్వాక్రా మహిళలు భాగస్వాములైతే పాలక వర్గాల వంచనలు సాగవు. సాగబోవు.-డి.రమాదేవి

క్షమించరాని..నిర్లక్ష్యం

‘శ్రీకాకుళం జిల్లాకు ఇతర ప్రాంతాల నుండి వలసలు వచ్చే విధంగా చేసే బాధ్యత నాది. కిడ్నీల వ్యాధిని నిర్మూలించడానికి సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్మించే బాధ్యత నాది’ అని ఇటీవల శ్రీకాకుళం ఎన్నికల బహిరంగ సభలో పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు. ‘ఇలాంటి అమలు కాని వాగ్ధానాలు చేస్తే మాదేశంలో ఉరి వేస్తార’ని హైదరాబాదులో జరిగిన సెమినార్‌లో ఓ విదేశీ ప్రతినిధి అన్నారు. ఇది జరిగినప్పుడు చంద్రబాబు వేదిక పైనే ఉన్నారు. రెండూ వేర్వేరు సందర్భాలలో అన్నమాటలే అయినప్పటికీ నేతలు అలా నోటికొచ్చిన వాగ్దానాలు చేస్తూనే వున్నారు. సోంపేట, కాకరాపల్లిలో ధర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లకు సంబంధించిన ప్రతిపాదనలు వైఎస్సార్‌ హయాం లోనే వచ్చాయి. మొత్తంమీద ఇటు చంద్రబాబు…అటు వైఎస్సార్‌… వీరిద్దరి పాలనలోనూ ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగింది. జగన్‌ సైతం ఆ ప్రాంత అభివృద్ధికి ఎన్నో శుష్క వాగ్దానాలు చేశారు. చేస్తూనే ఉన్నారు. శ్రీకాకుళం, విజయ నగరం, విశాఖల నుంచి వలసలు వెళ్తున్నవారు హిమాలయ పర్వతాల నుంచి అండమాను దీవుల వరకు విస్తరించి వున్నారు. ఎక్కడో మహబూబ్‌ నగర్‌ జిల్లాలో ఒక చిన్నపరిశ్రమ పెడితే అక్కడికీ శ్రీకాకుళం వాళ్లు కార్మికులుగా వెళ్తున్నారు. దీన్నిబట్టే ఉత్తర కోస్తా నుంచి వెళ్లే వలసలు ఎంత ప్రమాదకరంగా వున్నాయో అర్థమౌతోంది. వాస్తవానికి ఉత్తర కోస్తా జిల్లాలలో దేశంలోనే అత్యధిక వర్షపాతం 1150 మి.మీ నమోదవుతోంది. ఈ నీటిని సద్వినియోగం చేసుకుంటే ఆజిల్లాల నుంచి ప్రజలు వలసలు పోయే పరిస్థితే రాదు. కానిఆదిశగా ప్రభుత్వాలు పని చేయవు. పైగా పరిశ్రమల కోసం పేదల నుంచి భూములు లాక్కున్నాయి. పోలీసుల నిర్బంధం ప్రయోగించి, అక్రమ కేసులు బనాయించి, జైళ్లలో పెట్టి, లాఠీ ఛార్జీలు చేసి, బలవంతంగా భూముల నుండి పేదలను వెళ్లగొట్టారు. చివరికి అణువిద్యుత్‌ కేంద్రానికి కూడా శ్రీకాకు ళంనే ఎంచుకున్నారు.మూడు జిల్లాల్లో దాదాపుగా 30లక్షల ఎకరాల సాగుభూమి లో 3లక్షల ఎకరాలకు మాత్ర మే నీటి వనరులు న్నాయి. చెరువులు వున్నప్పటికీ మరమ్మతులు లేక పెద్దగా వినియోగంలో లేవు. తాగునీటి కోసం విజయనగరం నుంచి తాడిపూడి ప్రాజెక్టును విశాఖపట్నం కార్పొరేషన్‌ నిర్మాణం చేసి నీటిని వినియోగిం చుకున్నది. నిర్ణీత 25 సంవత్సరాల గడువు పూర్తి అయిన తర్వాత స్థానిక జిల్లాకు ఆ ప్రాజెక్టును అప్పగించారు. కానీ,నేటికీ విశాఖపట్నానికే నీరు వెళుతోంది. దీంతో ప్రాజెక్టు చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు తాగు నీరు లేని పరిస్థితి. 2009లో ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని రూ.7214 కోట్లతో చేపట్టారు. ఈ ప్రాజెక్టు వల్ల శ్రీకాకుళంలో 0.85 లక్షల ఎకరాలు, విజయనగరంలో 3.94 లక్షల ఎకరాలు, విశాఖపట్నంలో 3.21 లక్షల ఎకరాలు మొత్తం 8 లక్షల ఎకరాలకు నీరిస్తామని చెప్పారు. కానీ, 2016-17లో రూ.రెండు కోట్లు, 2017-18లో రూ.రెండు కోట్లు కేటాయించారు. 2018-19 రాష్ట్ర బడ్జెట్‌లో మొత్తం ఇరిగేషన్‌కు రూ.14,229 కోట్లు కేటాయించారు. అందులో రూ.420 కోట్లు మాత్రమే మూడు జిల్లాల ప్రాజెక్టుకు కేటాయించినా వ్యయం చేయలేదు. వంశధార-2 ప్రారంభించి దశాబ్దం గడుస్తున్నా పూర్తి కాలేదు. ఇలా ఉత్తరాంధ్ర లోని ప్రాజెక్టులు దశాబ్దాల తరబడి తీవ్ర నిర్లక్షానికి గురౌతున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కావలసినన్ని వాగులు, వంకలు, నదులు ఉన్నా, ఈ నీరంతా సముద్రం పాలవు తూనే వుంది. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు 2003 వరకు 9సంవత్స రాల పాటు ఉమ్మడి రాష్ట్ర ముఖ్య మంత్రిగా,2014-19ప్రత్యేక ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పని చేశారు. ఈ15 సంవత్సరాలలోను గుర్తించని అంశాన్ని కొత్తగా గుర్తించినట్లు ప్రకటించడం హాస్యాస్పదం. వలసలను నిరోధించాలంటే ఆ జిల్లాల జీవనాదాయం పెరగాలి. ప్రతిసారీ ‘అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటాను’ అంటూ చేస్తున్న ప్రచారం చెవిలో మోగుతూనే ఉంది. పాలకుల దృష్టి అంతా ఉత్తరాంధ్రలో వున్న ఖనిజ సంప దను, బహుళ జాతి సంస్థల ద్వారా అమ్మించాలన్న ప్రయత్నమే తప్ప ఆ ప్రాంతాన్ని బాగు చేయాలన్న దృష్టి కాదు. బంగాళఖాతంలో వచ్చిన ప్రతి తుపాను ఉత్తర కోస్తాను నష్టపరుస్తూనే ఉంది. హుదూద్‌, పైతాన్‌ లాంటి తుపానుల వల్ల జరిగిన నష్టానికి ప్రభుత్వం ఇంత వరకు పరిహారం ఇవ్వ లేదు. పైగా నష్టం ఇస్తున్నట్లు విపరీతమైన ప్రచారం చేసింది. ఈ పరిహా రాన్ని కూడా ఉద్యోగుల సహకారంతో పాలక వర్గాలు పెద్దఎత్తున అవినీతికి పాల్పడిన ఘటనలు ఉన్నాయి. ఈ జిల్లా లు విద్యకు బహు దూరంలో వున్నాయి. ప్రతిపక్షంలో వున్న వైఎస్సార్‌ పార్టీ ఈ అంశాలపై గట్టిగా ఒత్తిడి చేయనూ లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా అక్షరాస్యత గురించి పట్టించుకోలేదు. వైద్య సౌకర్యం ఆమడ దూరంలో వుంది. అక్కడ లేని జబ్బులు లేవు. పైగా, ఫార్మా సంస్థలు గిరిజనులపై తమ మందులను ప్రయో గించి పరీక్షలు చేస్తాయి.దీంతో వారి బతుకులు అర్ధాంతరంగా ముగుస్తున్నాయి. ఫార్మా కంపెనీలకు దాసోహంగా ఉండే ప్రభుత్వాలు పేద, దళిత గిరిజనుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. పిహెచ్‌సీ సెంటర్లు వున్నా వైద్యులు, మందులు ఉండవు. కిడ్నీలకు సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్మాణం ప్రారంభిస్తామన్న ఏలికలకు ఈ ప్రాంతంలో మలేరియాతో ఏటా 3వేల మంది చనిపోతున్న విషయం తెలుసా? మొబైల్‌ వ్యాను ద్వారా మెడికల్‌ సహాయం చేయడానికి ఆటంకాలేంటి? మరణిస్తున్న గర్భిణీలు, నవజాత శిశువుల గణాంకాలు ఈ పాలకులు ఎప్పుడైనా గమనించారా? రవాణా సౌకర్యాలు పరిశీలిస్తే ఎన్‌హెచ్‌-5 (చెన్నై-కోల్‌ కతా), రైల్వే లైన్‌ మినహా గిరిజన పల్లెలకు కల్పించిన రహదారి సౌకర్యం నామ మాత్రమే. ఒక వైపున ఈ మూడు జిల్లాలలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారి సంఖ్య ఏటేటా పెరుగుతుండగా అక్కడ ఎంపికైన శాసన సభ్యులు, మంత్రులు మాత్రం కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ప్రజలకు ఆదామా షాలో ఆదాయం పెరిగిందా? ఈమూడు జిల్లాల్లో 2014 నుండి 2019 వరకు ప్రజల కొనుగోలు శక్తి పెరుగుదలకు ఎంత కేటాయించి వ్యయం చేశారో ప్రభుత్వం శ్వేత పత్రం ప్రకటించాలి. కిడ్నీ బాధితు లకు పాలక వర్గాల నాయకులు సానుభూతులు మాత్రమే ప్రకటించి వచ్చారు తప్ప, నివారణకు ఏ చర్యలూ తీసుకోలేదు. ఫ్లోరైడ్‌ నీటి వినియోగం వల్ల కిడ్నీ వ్యాధులు దశాబ్దాలుగా వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రులన్నీ వైద్యులు లేక, మందుల కొరత వల్ల కునారిల్లుతున్నాయి. ఈ సంగతి పాలకు లకు తెలియదా? సాగునీటి వనరులను ఒక్క సంవత్సరంలో పూర్తి చేసి, వారికి పౌష్టికాహారం అందించడం, జీవనాదాయం పెంచడం, విద్యా వైద్య సౌకర్యం కల్పించడంతో పాటు కాలుష్య నివారణా చర్యలు చేపట్టినప్పుడు ఉత్తర కోస్తాను ‘కోస్తా’గా గుర్తించవచ్చు. అంతేగానీ, కోస్తా పేరు చెప్పి ఇంతకాలం చేస్తున్న నిర్లక్ష్యం క్షంతవ్యం కాదు. శ్రీకాకుళం జిల్లాకు బయటి నుండి వలసలు రావటం కాదు, ఇక్కడి నుంచి వెళ్లే వలసలను నివారించగలిగితేనే పాలక పార్టీ లక్ష్యం నెరవేరుతుంది- వ్యాసకర్త : వ్యవసాయ రంగ నిపుణులు -సారంపల్లి మల్లారెడ్డి

కరువు కోరల్లో బీడ్‌ కదలని ప్రభుత్వం

ఈఏడాది జనవరి నాటికే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్ర ప్రభు త్వాలు 300జిల్లాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించాయి. వీటిలో మహారాష్ట్రలోని బీడ్‌జిల్లా ఒకటి. గతేడాది అక్టోబర్‌లోనే ఈ జిల్లాను కరువు ప్రాంతంగా గుర్తించారు. సీపీఐ(ఎం), కిసాన్‌ సభ జిల్లా నాయకులతో కలిసి నేను వివిధ తాలూకాల్లోని 25గ్రామాలలో వందలాది మంది బాధితులను కలిశాను. ఇప్పటికీ అక్కడ ఎటువంటి సహాయక చర్యలు కనుచూపు మేరలో కనిపించటం లేదు. పంట నష్టాన్ని అంచనా వేయటానికి ఒక్క ప్రభుత్వ బ ృందం కూడా గ్రామాల్ని సందర్శించలేదు.
ఎండిన పంటలను పొలాల నుంచి తొలగించాల్సి ఉన్నా అవి తీసేస్తే తమకు బీమా సొమ్ము అందదేమోనన్న భయంతో రైతులు వాటిని అలాగే ఉంచేశారు. మేం కలిసిన ప్రతి రైతూ అప్పుల్లో కూరుకు పోయి ఉన్నారు. అయినా ప్రభుత్వ సహకారం అందుతుందన్న ఆశ వారికి ఏమాత్రం లేదు. వ్యవసాయ కార్మికులు ముఖ్యంగా మహిళా కార్మికుల దుర్భర పరిస్థితి కొట్టొచ్చినట్టు కనిపించి మా మనసుల్ని కలచివేసింది. చాలా గ్రామాలలో కుటుంబంలోని పురుషులు ఇతర పనులు వెతుక్కుంటూ వలస వెళ్లిపోయారు.ఈప్రాంతం కరువు ప్రభావిత జిల్లాగా గుర్తించినప్పటికీ గ్రామీణ ఉపాధి పథకం కింద అవసరానికన్నా చాలా తక్కువ పని దొరకటం దీనికి ప్రధాన కారణం. బీడ్‌జిల్లాలో 2018-19సంవత్సరానికి కేవలం 43రోజులు మాత్రమే ప్రభుత్వం పని కల్పించింది.
జిల్లావ్యాప్తంగా గ్రామస్థాయి సమావేశాలు వేసి వాటిలో వచ్చిన అభిప్రాయాలు, వాస్తవ పరిస్థితిపై ప్రతినిధి బృందం కలెక్టర్‌కు నివేదిక అందజేసింది. మోడీ ప్రభుత్వం తయారు చేసిన ‘కరువు సహాయక మార్గదర్శకాలు 2016’లో కూడా ఈజిల్లా రైతులకు అన్యాయం చేశాయనేది వారి అనుభవం ద్వారా తెలుస్తోంది.
నష్ట తీవ్రత-పరిహారం, సహాయం
బీడ్‌లోని మొత్తం 11తాలూకాలను కరువు ప్రాంతాలుగా గుర్తించారు. అయితే నష్టాన్ని అంచనా వేయలేదు. నష్ట పరిహారం, బీమా చెల్లింపునకు ఇదే కీలకం. గతంలో జరిగినట్టే నష్టశాతాన్ని తక్కువ చేసి చూపించి సరైన పరిహారం ఇవ్వకుండా ఎగవేస్తారని రైతులు భయపడుతున్నారు. ఈ ఐదేండ్లలో కేవలం 2017లో మాత్రమే వర్షాలు పడటంవల్ల మిగిలిన నాలుగేండ్లూ ప్రజలు కరువుతో సతమత మయ్యారు. ఈ ప్రాంతంలో చెరకు, పత్తి, సోయా, కందులు, సజ్జలు, జొన్న సాగు చేస్తారు. కరువుకు తోడు 2016నుంచి బీటీ పత్తికి ‘బొండాలి’ పురుగు సోకుతోంది. దీని నివారణకు ఎరువులు, పురుగు మందులూ అధికంగా వాడటం వల్ల ఎకరాకి అయ్యే ఖర్చు పెరిగింది. రైతులు చెప్పినదాన్ని బట్టి వర్షాభావం వల్ల 80శాతం ఖరీఫ్‌ పంట, దానికి కొంచెం అటూ ఇటూగా రబీ పాడైంది. అప్పుల్లో మునిగిపోయి, గత 8నెలలుగా ఆదాయం లేక తల్లడిల్లుతున్న రైతులకు ప్రభుత్వ సహాయంగాని, బీమా పరిహారంగానీ ఇచ్చేందుకు అటు ప్రభుత్వం, ఇటు అధికారులు ఎలాంటి శ్రద్ధా చూపలేదు.
అరకొర రుణాలు-అప్పుల గాయాలు
ఒకవైపు ప్రభుత్వం పంట రుణ పథకాల గురించి ఊదర కొడుతున్నప్పటికీ మేం కలిసిన రైతుల్లో చాలామంది బ్యాంకుల నుంచి రుణాలను పొందలేదు. అనేక ఆందోళనలు చేసినా బ్యాంకుల నుంచి ఎలాంటి సమాధానం లేదు. పర్లి తాలూకా మందఖేల్‌ గ్రామంలో రుణం కోసం బ్యాంకుకు వెళ్లిన చెరుకు రైతులను ‘షుగర్‌ మిల్లు యజమానుల నుంచి గ్యారంటీ లెటర్‌ తెస్తేనే లోన్లు ఇస్తామ’ని అధికారులు తిప్పి పంపేశారు. ఇప్పటికే రాజకీయ ప్రాబల్యం కలిగిన యజమానులకు ఈచర్య మరింత బలాన్ని ఇవ్వటమే కాక చెరుకు రైతులపై వారి పట్టు మరింత బిగుస్తుంది. ఆప్రాంతంలోని అన్ని బ్యాంకులలో ఇదే పరిస్థితి ఉంది.
మహారాష్ట్ర ప్రభుత్వ రుణ మాఫీ పథకం వల్ల లాభపడిన ఒక్క రైతు కూడా మాకు కనిపించలేదు. బ్యాంకులు తమకు రుణాలు ఇవ్వకుండా వివక్ష చూపి తమను శిక్షిస్తున్నాయని వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులుచేసి ఇబ్బందులపాలవుతున్న రైతులు వాపోయారు. ధానూ ర్లో జరిగిన సమావేశంలో రైతు బాబా సాహెబ్‌ పవార్‌ మాట్లాడుతూ ‘బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడం వల్లే రైతులు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు చేస్తున్నారు. అటువంటి వారికి ప్రభుత్వం ఇప్పుడు కరువు సాయం అందించననటం న్యాయమా?’ అని కన్నీటితో ప్రశ్నించాడు. అయితే తమ అప్పుల వివరాలను బహిరంగంగా చెప్పటానికి రైతులు నిరాకరించారు. ‘మాకు ఎంత అప్పు ఉన్నదీ పబ్లిగ్గా చెబితే మా పరువు పోవటమే కాదు. రేపు ఇంకా ఎక్కడా అప్పు పుట్టదు. అందుకే మేము ఆ వివరాలు చెప్పలేం’ అని ఒకవృద్ధ రైతు సమావేశం అనంతరం మాతో తమ వ్యధ చెప్పుకున్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితి? ఒక వైపు అప్పుల భారాన్ని తమ భుజాలపై మోస్తున్నా దాని బరువును బయట పెట్టటానికి రైతులు ఒప్పుకోరు. కానీ ఆ భారంవల్ల కలిగే బాధను దాచుకోవటం సాధ్యమా?
యంత్రాలు మాట్లాడవు!
బీమా కంపెనీలతో రైతులకు అనేక చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఈఏడాది బీడ్‌ జిల్లాలో చెరుకు రైతులకు బీమా సౌకర్యం లేదు. ఎందుకని అడిగితే ప్రీమియం చాలా ఎక్కువ వున్నదని, రైతులు దానిని కట్టలేరని అధికారుల సమాధానం. అయితే వారు అసలు తమని ఎప్పుడూ సంప్రదించలేదని రైతులు చెప్పారు. ఈ విషయంలో మరింత లోతైన విచారణ జరగాల్సి ఉంది.
మజల్‌గావ్‌ ప్రాంతంలోని ధర్మేవాడి గ్రామంలో రైతులబ ృందం తమ అనుభవాలను తెలిపారు. పత్తి రైతు సందీపన్‌ భుంభ్లే మాట్లాడుతూ.. ‘2017లో నేను ఎకరా పత్తి పంటకు రూ.1200 బీమా చెల్లించా. వర్షం బాగానే ఉన్నా బొందాలి పురుగు ఆశించడంతో 10క్వింటాళ్లకి బదులు 6క్వింటాళ్లే పండిరది. బీమా కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడం చాలా కష్టమైంది. మా ఊళ్లో ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌ చాలా బలహీనంగా ఉంటుంది. దీనివల్ల ఆన్‌లైన్‌లో పూర్తిచేయాటానికి చాలా సమయం వృధా అయింది. నేను చెల్లించిన ప్రీమియం రసీదు నా దగ్గరే ఉంది కానీ ఏం ఉపయోగం? గతంలో బీమా ఏజంటుని మేం నేరుగా కలుసుకుని మా అనుమానాలన్నీ అడిగే వాళ్ళం. ఇప్పుడు మిషను మాత్రమే ఉంటుంది. యంత్రాన్ని ఏమని అడగగలం? నా పంట నష్టాన్ని అంచనా వేసి, బీమా సొమ్ము ఇవ్వటానికి ఎవరైనా వస్తారేమోనని ఎదురు చూసేవాణ్ణి. ఎవ్వరూ రాలేదు. పరిహారం కింద ఒక్క పైసా కూడా అందలేదు. బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసుకి వెళ్ళటంవల్ల సమయం వ ృధాయేనని వదిలేశా’.
పశువులు – పశుగ్రాసం
అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో మొత్తం 5లక్షల ఆవులు, 2.6లక్షల ఎడ్లు, 2.4లక్షల గేదెలూఉన్నాయి. పశువులపోషణ, డైరీ ఫారం నిర్వహణ ఇక్కడి ముఖ్య ఆదాయ వనరు. అయితే పశుగ్రాసం, నీళ్లు కొరత వల్ల పశువులను పోషించటం చాలా కష్టంగా ఉంది. అందువల్ల అన్ని గ్రామాలలోను పశువుల మందను అమ్మ టానికి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాలేడ్‌ పంచాయితీ సమావేశంలో రైతులు చెప్పిన ప్రకారం ఒక జత ఎద్దులకు నెలకు సుమారు 8క్వింటాళ్ల గ్రాసం కావాలి. క్వింటాల్‌ రూ.2000 చొప్పున ఏడాదికి రూ.72,000 కేవలం గడ్డి కొనటానికే అవుతుంది. నీళ్ళ కొరత ఇంకొక పెద్ద సమస్య. పశువుల సంగతి తరువాత. మనుషుల అవసరాలకు సరిపడా ట్యాంకర్లు కూడా అందుబాటులో లేవు. ఇక గోరక్షణ పేరుతో బీజేపీ చేపడుతున్న విధానాల వల్ల మొత్తం పశువుల వ్యాపారమే బాగా దెబ్బతిన్నదని రైతులు వాపోయారు. దానికి తోడు కరువు వల్ల ధరలు కూడా బాగా పడిపోయాయి. తప్పనిసరి పరిస్థితుల్లో పశువుల్ని అయినకాడికి అమ్మటంవల్ల బాగా నష్టాలొ చ్చాయి. హామీ ఇచ్చిన ప్రభుత్వం గ్రామాలలో ఇంకా పశువుల కొట్టాలు ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వమే గ్రామంలో పశుగ్రాసం సరఫరా చేయాలని రైతులు అడిగినా వాటిని మేత కోసం పశువుల కొట్టానికి తీసికెళ్లాలంటే ఒక మనిషి ఒక రోజు పనీ, ఆదాయాన్నీ వదులుకోవాలి.
కానరాని అదనపు సేవలు-సహకారం
ప్రభుత్వం నిర్వహించాల్సిన అదనపు సేవలు దాదాపు కను మరుగయ్యాయనే చెప్పవచ్చు. ఏరకమైన పంట వేయాలనే విషయంపై రైతులకు తాము అవగాహన కల్పిస్తామని, దానికనుగుణంగా రైతులు తమ పంటలను మార్చుకునేందుకు అవసరమైన సహకారం అంది స్తామని ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ ఉంది. కానీ ఇప్పటివరకు అటువంటిదేమీ అమల్లోలేదు. పైగా బీటీ కాటన్‌ విత్తనాలు, ఎరువుల అమ్మకానికి ప్రయివేటు ఏజన్సీలను అధికారులు ప్రోత్సహిస్తున్నారనీ, చక్కెర మిల్లు యజమానులకు పూర్తి మద్దతు ఇస్తున్నారనీ చెప్పారు. చక్కెర మిల్లులకు ప్రభుత్వమే విద్యుత్‌ ఇవ్వటం దీనికిసాక్ష్యం. ఇటు వంటి పరిస్థితుల్లో కరువు సమయాల్లో ఆచరించాల్సిన పద్ధతుల గురిం చి, ప్రణాళికల అమలు గురించి ఎక్కడా ఊసేలేదు. అదనపు సేవలు, మేలైన విత్తనాల ఉత్పాదనకు ప్రయోగాలు, నిరంతర వ్యవ సాయాన్ని పెంపొందించే చర్యలు మొదలైన వాటి లేమివల్ల వ్యవ సాయ ఉత్పాదకత, రైతుల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. వీటి అమలులో ప్రభుత్వం తన కనీస బాధ్యత నుంచి కూడా తప్పుకుంటోంది.
అధికారుల పాత్ర
అన్ని గ్రామాల్లోను రుణాలు, ఇన్సూరెన్స్‌ విషయాలలో రైతులు సమస్యలెదుర్కొంటున్నారని చెప్పినప్పుడు ‘సమస్య కొన్ని బ్లాకులలోనే ఉన్నదనేది’ కలెక్టర్‌ స్పందన. నిజానికి ఆన్‌లైన్‌లో ఇన్సూ రెన్స్‌ రిజిస్ట్రేషన్‌ విధానం రైతులకు చాలాకష్టం. అలాగే బీమా ప్రీమి యం కట్టించుకోవటంలో కంపెనీల బాధ్యత శూన్యం. ప్రభుత్వమే దానిని నిర్ణయిస్తుంది. బీమా ప్రీమియం ఖరారు, నష్టం అంచనాలో జాప్యానికి అధికారుల అలసత్వమే కారణమని కలెక్టర్‌ అంగీకరించారు. కరువు అంచనాకు సంబంధించిన కొత్త నిబంధనల ప్రకారం ఇకముందు గ్రామస్థాయి ప్రత్యక్ష తనిఖీ అవసరం లేదు. బ్లాకు లేదా జిల్లాస్థాయిలో సగటు దిగుబడి ఆధారంగా అంచనా కడతారు. దీనివల్ల భూస్వాములు,ధనిక,మధ్య తరగతి, చిన్నరైతుల మధ్య పెద్ద వ్యత్యాసం ఉండదు. నీటి పారుదలకు సంబంధించి సేకరించిన లెక్కలు కూడా అందుబాటులో లేవు. కొన్నిప్రాంతాలలో సంపన్నులైన రైతులు పంపులు, బోర్ల ద్వారా పొలాలకు నీరు పెట్టుకోగలుగుతారు కాబట్టి సహజంగానే వారి పంట దిగుబడి అధికంగానే ఉంటుంది. వారిని కూడా పేద రైతులతో సమానంగా లెక్కగడుతున్నారు. ఇది చాలా అన్యాయం. ఇప్పుడు కరువు నష్టం అంచనా విషయంలో కూడా ఏవో కొత్త పద్ధతుల ద్వారా వాస్తవ పరిస్థితిని మరుగున పడేసి తనకు అనుకూలంగా నివేదికలను తెప్పించుకునే అవకాశం లేకపోలేదు.
ఇటీవలే మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన ‘కరువు విధాన పత్రం – 2016’ను పరిశీలిస్తే దానిలో పొందుపరచిన అంశాలు కరువు తీవ్రతను తగ్గించి చూపేందుకు ప్రయత్నించినట్టు కనిపిస్తోంది. ఒక జిల్లాను కరువు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించేందుకు తీసుకున్న ‘మధ్యస్థం’, ‘తీవ్రం’, ‘అతి తీవ్రం’ అనే కొలబద్దల స్వభావం మానవీ య విలువలతో కాక పూర్తిగా సాంకేతికంగా, కఠినంగా ఉన్నది. కరువు అంచనా వేయటంలో శాస్త్రీయ విధానమైన ప్రత్యక్ష తనిఖీని పూర్తిగా ఎత్తేశారు. పైన తెల్పిన మూడు కేటగిరీలు నిధుల కేటాయిం పులో కీలక పాత్ర వహిస్తాయి. కానీ నిధుల విషయానికి వచ్చేసరికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలే వాటిని భరించాలని తేల్చేశారు. సహాయ నిధుల్లో 2రకాలు ఉంటాయి. ఒకటి, ఎస్‌డీఆర్‌ఎఫ్‌-దీనిలో 75శాతం కేంద్ర ప్రభుత్వం, 25శాతం రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటుంది. రెండవది,ఎన్‌డీఆర్‌ఎఫ్‌-ఇది మొత్తం కేంద్ర నిధుల నుంచే చెల్లించాలి. ఈ విధానపత్రం ప్రకారం మహారాష్ట్రలో కేవలం 3జిల్లాలు మాత్రమే కరువు ప్రభావిత ప్రాంతాల కిందికి వస్తాయి. రైతుల నుంచి తీవ్ర నిరసనా రాజకీయ తిరుగుబాటూ ఎదుర్కొంటున్న రాష్ట్ర సర్కార్‌ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయక తప్పలేదు. అయితే ఈ అంశంలో నిధుల కేటాయింపు కీలకం అయినందున కరువు తీవ్రత ప్రభావం ఇంకా నిర్ణయించాల్సి ఉంది. ఇప్పటికే బీడ్‌ జిల్లాలో కరువు సహాయానికి నిధుల కేటాయింపులో జరిగిన తీవ్ర జాప్యం వల్ల అక్కడి రైతుల దుస్థితి మరింత పెరిగింది. ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యమే దీనికంతటికీ కారణం!- బృందాకరత్‌

ఆదివాసీ సమస్యలపై అలసత్వం

ఆదివాసీ హక్కుల పరిరక్షణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలసత్వం ప్రదర్శిస్తున్నాయి. వారి సంక్షేమం కోసం రూపొందించిన చట్టాల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. గిరిజనుల గ్రామసభలకు సర్వాధికారాలు దఖలుపరచే పంచాయతీరాజ్‌-షెడ్యూలు ప్రాంతాల విస్తరణ చట్టం (పీసా చట్టం- 1996) అమలులోకి వచ్చి 22 ఏళ్లు అయింది. గిరిజనులకు అడవిపై గల హక్కుల విషయంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దే ఉద్దేశంతో అటవీ హక్కుల గుర్తింపు చట్టం అమలులోకి వచ్చి 12 ఏళ్లు గడుస్తోంది. గిరిజనుల సంప్రదాయ హక్కులు, జీవనోపాధి, పరిపాలన వంటి కీలకమైన అంశాలతో ముడివడివున్న ఈ చట్టాల అమలులో ప్రభుత్వ వ్యవస్థలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి. ప్రధాన చట్టాలను బలవంతంగా రుద్దడంతో ఆదివాసుల పరిస్థితి గందరగోళంగా మారింది. ఈ పరిస్థితిని నివారించేందుకే గిరిజన సంప్రదాయాలను గౌరవించి, వారి పద్ధతులకు సముచిత ప్రాధాన్యమిచ్చేందుకు పీసా చట్టం ద్వారా గ్రామసభలకు అధికారాలు కల్పించారు. వాస్తవంలో అవి ఎండమావుల్ని తలపిస్తున్నాయి.
పసలేని చట్టం… పట్టని ప్రభుత్వంగ్రామసభలకు విశేష అధికారాలు
రెండు దశాబ్దాల క్రితం పీసా చట్టం కోసం దేశవ్యాప్తంగా గిరిజనులు పోరాడారు. 73వ రాజ్యాంగ సవరణతో 1991లో అమలులోకి వచ్చిన పంచాయతీరాజ్‌ చట్టాన్ని దేశమంతటా ఒకేరీతిన అమలు చేయడంతో గిరిజనుల్లో తీవ్ర నిరసన మొదలైంది. వారు ఉద్యమబాట పట్టారు. దీంతో కేంద్ర ప్రభుత్వం దిలీప్‌సింగ్‌ భూరియా నేత ృత్వంలోని ఓ కమిటీని నియమించింది. కమిటీ సిఫార్సులతో 1996 డిసెంబరులో పీసా చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చారు. ఈ చట్టం ప్రకారం ఆదివాసీ ప్రాంతాల్లో గ్రామపంచాయతీని కాకుండా గ్రామసభను కేంద్రబిందువు చేశారు. గ్రామసభకు విశేషాధికారాలను కల్పించారు. ఒక ప్రాంతంలో నివసించే ఓటుహక్కు కలిగి ఉన్న నివాసితులంతా గ్రామసభ పరిధిలోకి వస్తారు. వీరు తాము నివసించే ప్రాంతాల చుట్టూ గల సహజ వనరులు, అటవీ సంపదపై యాజమాన్య హక్కులు కలిగి ఉంటారు. ఆ వనరులను స్వీయ అవసరాల కోసం వినియోగించుకుంటూ, గిరిజన సంప్రదాయ పరిరక్షణకు దోహదపడతారు. ఆయా గ్రామాల్లో, ప్రాంతాల్లో ఏర్పాటయ్యే పాఠశాలలు, వైద్య కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను గ్రామసభలకు అప్పగించారు. అభివ ృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, నష్ట పరిహారం పంపిణీ, గనుల తవ్వకాలకు సంబంధించిన లీజులు, సామాజిక, ఆర్ధిక అభివ ృద్ధి కార్యమ్రాలకు సంబంధించిన ప్రణాళికల రూపకల్పన, ఉప ప్రణాళిక నిధుల ఖర్చుకు సైతం గ్రామసభల అనుమతి తీసుకోవాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో లబ్ధిదారుల గుర్తింపు, చిన్న తరహా అటవీ ఉత్పత్తులపై యాజమాన్య హక్కులు, మద్యం అమ్మకాలు, వడ్డీ వ్యాపారాలపై నియంత్రణ, నీటివనరుల నిర్వహణ తదితర విషయాల్లోనూ గ్రామసభలకే సర్వాధికారాలు కల్పించారు. గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ అభివ ృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన జమాఖర్చుల ధ్రువపత్రాన్ని జారీ చేసే అధికారం సైతం గ్రామసభలకు ఉంటుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2011లో చట్టంలో కొత్తగా కొన్ని నిబంధనలు పొందుపరచింది. గ్రామసభలకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఇందులో ఉన్నాయి. వీటిని క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో వైఫల్యం కనపడుతోంది. 2013 సెప్టెంబరులో గిరిజన సంక్షేమ శాఖ జిల్లా, మండల, పంచాయతీల వారీగా గ్రామసభలను గుర్తించి, జాబితాను నోటిఫై చేసింది. అంతేతప్ప పీసా చట్టం అమలు ద్వారా క్షేతస్థాయిలో గిరిజనులకు జరగాల్సిన మేలు, లభించాల్సిన హక్కులపై శ్రద్ద చూపలేదు. అయిదో షెడ్యూలు ప్రాంత పరిధిలోకి వచ్చే పర్వత శ్రేణుల్లో బాక్సైట్‌ ఖనిజం తవ్వకాల విషయంలో అక్కడి డోంగ్రియా ఆదివాసులు ఒడిశా ప్రభుత్వంపై చేసిన న్యాయపోరాటం ఫలించడానికి పీసా గ్రామసభ దిక్సూచిగా నిలిచింది. 2013లో పీసా చట్టం ప్రకారం అక్కడి గ్రామసభల అనుమతులు తీసుకున్నాకే ఖనిజ తవ్వకాలు చేపట్టాలని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడంతో గ్రామసభలు కీలకమయ్యాయి.
గడచిన రెండు దశాబ్దాల్లో పీసా అమలు తీరుతెన్నులను విశ్లేషించేందుకు ఉన్నతస్థాయి కమిటీని నియమించారు. ఆదివాసీ ప్రాంతాల్లో చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేస్తే ప్రభుత్వ వ్యవస్థలపై గిరిజనులకు నమ్మకం పెరుగుతుందని ఆ కమిటీలు పేర్కొన్నాయి. భూసేకరణ, గనుల తవ్వకాల లీజులు వంటి విషయాల్లో గ్రామసభలను విస్మరించడం వల్ల ఆదివాసుల్లో అసంత ృప్తి, అశాంతి పెచ్చరిల్లుతాయని హెచ్చరించాయి. 2005నాటి రెండో పాలన సంస్కరణల సంఘం, తీవ్రవాద ప్రాంతాల్లో అభివ ృద్ధి, సవాళ్లపై 2008లో ఏర్పాటైన ప్రణాళికా సంఘ నిపుణుల కమిటీ, చిన్నతరహా అటవీ ఉత్పత్తుల యాజమాన్యం అంశంపై ఏర్పాటైన ఎ.కె.శర్మ కమిటీ, నిర్వాసిత సమస్య, అభివ ృద్ధి అంశాలపై అధ్యయనం చేసిన రాఘవచంద్ర కమిటీలతో పాటు, యూపీఏ ప్రభుత్వంలోని జాతీయ సలహా మండలి- పీసా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాయి. అయిదేళ్ల క్రితం అప్పటి జాతీయ సలహా మండలి ‘గ్రామసభ’ నిర్వచనానికి స్పష్టత తీసుకొస్తూ సవరణ బిల్లును సైతం రూపొందించింది. ఆ తరవాత వచ్చిన ప్రభుత్వాలు దీనిపై శ్రద్ధ చూపలేదు. ఆదివాసీ ప్రాంతాల్లో భూములు, గనులు, అడవులు, ఇతర సహజ వనరుల ఇష్టారాజ్య దోపిడిని అడ్డుకునేందుకు గొప్ప ఆయుధంగా పీసా చట్టం దోహదపడుతుందన్న ఆశలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉదాసీన వైఖరితో అడియాశలయ్యాయి. చాలా రాష్ట్రాలు చట్టం అమలుకు సంబంధించి కనీసం కార్యనిర్వాహక యంత్రాంగాలను ఏర్పాటు చేయలేదు. 1996లో కేంద్రం అమలులోకి తీసుకొచ్చిన చట్టంలో తమ రాష్ట్రాల్లోని గిరిజనుల కట్టుబాట్లు, వనరుల యాజమాన్యంలో సంప్రదాయ పద్ధతులకు అనుగుణంగా మార్పులు చేపట్టవచ్చని పేర్కొనడాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సాకుగా తీసుకున్నాయి. కేంద్ర చట్ట స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాలు చట్టాన్ని అన్వయించు కోవడంతో దాని స్వరూపమే మారిపోయింది. ఉదాహరణకు షెడ్యూలు ప్రాంతాల్లో ఏదైనా అభివ ృద్ధి ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ కోసం ముందు గ్రామసభలను సంప్రతించాలి. ఆ ప్రాజెక్టు వల్ల నష్టం అనర్ధం వాటిల్లక ముందే నష్ట పరిహారం, పునరావాసం కల్పించాలని కేంద్ర చట్టం చెబుతోంది. ఈ నిబంధనను కొన్ని రాష్ట్రాలు మార్చేశాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూపొందించిన పీసా చట్టంలో భూసేకరణకు ముందు మండల పరిషత్‌లను సంప్రతించాలని పేర్కొంది. అంతేకాక అభివృద్ధి ప్రాజెక్టుల ప్రణాళికలు, పర్యవేక్షణ రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషీలో ఉండేలా మార్పులు చేసింది. రaార?ండ్‌ రాష్ట్రం తీసుకువచ్చిన చట్టంలో అసలు ఈ వెసులుబాటే లేకుండా చేశారు. భూసేకరణకు ముందు తాలూకా పంచాయతీలను సంప్రతించాలని గుజరాత్‌ చట్టం చెబుతోంది. జిల్లా పంచాయతీ, రెవిన్యూ అధికారుల అజమాయిషీలో భూసేకరణ జరిగేలా ఒడిశా ప్రభుత్వం చట్టంలో మార్పులు చేసింది. గనుల లీజులు, నీటి పారుదల నిర్వహణ, అటవీ ఉత్పత్తుల యాజమాన్యం…ఇలా అనేక అంశాల్లో కేంద్ర చట్టం స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాలు తమ చట్టాల్లో మార్పులు చేశాయి. ప్రధాని నరేంద్రమోదీ ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ 2022 నాటికి నూతన, శక్తిమంతమైన భారతదేశాన్ని నిర్మించే లక్ష్యంతో వ్యూహ ప్రణాళికను ప్రకటించారు. ఇందులో భాగంగా దేశంలో వామపక్ష తీవ్రవాదం అధికంగా గల 115 జిల్లాల సామాజిక, ఆర్థిక, పరిపాలన పరమైన అభివ ృద్ధిపై ద ృష్టి సారిస్తామని వెల్లడిరచారు. ఈ జిల్లాలకు కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి హోదాలోని అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించడానికి కార్యాచరణ సిద్ధమైంది. గాయం ఒక చోట అయితే మందు మరో చోట పూస్తున్నట్టుగా ప్రభుత్వ వ్యవహారశైలి ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దేశంలో అత్యంత వెనకబాటుకు గురవుతున్న జిల్లాలు అన్నీ దాదాపుగా ఆదివాసులు నివసిస్తున్న ప్రాంతాలే. ఈ ప్రాంతాల్లో వామపక్ష తీవ్రవాదం ఉనికి బలంగా ఉంది. అటవీ వనరులపై హక్కులు కల్పించి, గ్రామసభల స్థాయిలో పరిపాలన పరమైన సామర్థ్యాన్ని పెంచినప్పుడే గిరిజనుల్లో నిజమైన సాధికారత సాధ్యమవుతుంది. విద్య, వైద్యం, రహదారులు, విద్యుత్‌ వంటి మౌలిక సౌకర్యాల కల్పనలో గ్రామసభలను మమేకం చేయాల్సిన అవసరం ఉంది. పంచాయతీ రాజ్‌ చట్టం మాదిరే మున్సిపల్‌ చట్టాన్ని గిరిజన ప్రాంతాలకు విస్తరించాలనే ప్రతిపాదన దశాబ్దకాలంగా కాగితాలకే పరిమితమైంది. దీంతో గిరిజన ప్రాంతాల్లో అధిక జనాభా ఉన్న పంచాయతీలను పురపాలక సంఘాలుగా మార్చడానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. పీసా, అటవీ హక్కుల గుర్తింపు చట్టంతోపాటు రాజ్యాంగంలోని అయిదో షెడ్యూలు నిబంధనలను అమలు చేయడానికి రాష్ట్రాల్లో వ్యవస్థాగత యంత్రాంగం లేదు. ఈ చట్టాలకు సంబంధించిన నిబంధనలపై అవగాహన కల్పించే, అమలు తీరును పర్యవేక్షించే యంత్రాంగాలూ లేవు. తగినంత మంది సిబ్బంది లేరు. నిధులూ కొరవడ్డాయి. పీసా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసే దిశగా ప్రభుత్వాలు చురుకందుకోవాల్సిన తరుణమిది. క్షేత్రస్థాయిలో సత్ఫలితాలు ప్రతి ఒక్కరికీ అందినప్పుడే చట్టానికి సార్థకత ఉంటుంది!- జి.ఎన్‌.వి.సతీష్‌

వీర జవాన్లకు జాతి నివాళి

‘‘ జమ్మూ- కాశ్మీర్‌ చరిత్రలోనే కనీవినీ ఎరుగుని దుర్ఘటన. ఉగ్రదాడిలో 46మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోడం దేశ ప్రజలను దిగ్భ్రాంతిలో ముంచింది. జమ్మూ నుంచి ఫిబ్రవరి 14 తెల్లవారుజామున బయలు దేరిన జవాన్ల 78వాహనశ్రేణిని అక్కడకు 241కిలోమీటర్ల దూరంలోని అవంతిపొరా పట్టణ సమీపంలో జేషే మహ్మద్‌ సంస్థకు చెందిన ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు 350కిలోల అత్యాధునిక పేలుడు పదార్థం (ఐఈడీ)తో నిండిన వాహనంతో ఢకొట్టెడంతో ఈ ఘోరం సంభవించింది. 2000సంవత్సరంలో ఇదే ఉగ్ర సంస్థ జరిపిన దాడిలో 29మంది చనిపోయిన తరువాత జమ్మూ- కాశ్మీర్‌లో జరిగిన అతిపెద్ద సంఘటన ఇది.’’- గునపర్తి సైమన్‌

సరిహద్దుల్లో ఉగ్రమూకలు మరింత రెచ్చిపోయాయి. స్థానికంగా శిక్షణ ఇచ్చి తయారుచేసిన ముష్కరులే ఈఘాతు కాలకు పాల్పడుతున్నారు.భరతమాత ముద్దుబిడ్డలని చెప్పుకునే వీరసైనికులు ప్రాణత్యాగాలుచేసారు. కుటుంబసభ్యులతో సెలవులు గడిపి జ్ఞాపకాలు నెమరేసు కుంటూ విధుల్లోనికి వస్తున్న సిఆర్‌పిఎఫ్‌ జవాన్ల వాణాలపై ఉగ్రమూకలు పంజావిసిరి 42 మందిని బలిగొన్నాయి. ఉగ్రమూకలకు, ఉగ్రస్థావరాలకు ఆశ్రయం కల్పించేదేశంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుపొందిన పాకిస్తాన్‌లోని జైషేముహ్మద్‌ ఉగ్రవాదసంస్థపనే ఇది అని ప్రకటించుకుంది. పైపెచ్చుఎలా ఉంది మా ప్రతీకారం అన్నట్లుగా సంకేతాలు వదులుతూ ఇలాంటివే మరిన్ని చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతోంది. జెఎఎం సంస్థకు చెందిన ఒక ముష్కరుని ఆత్మాహుతి దాడితో ఘోరం జరిగి పోయింది. భద్రతాదళాలు త్యాగాలు వృదాగా పోనివ్వమని పాలకులు చెపుతున్నా ఆకుటుంబాల్లోని పుత్రశోకం భరతమాత సైతం తీర్చలేనిది. గురువారం సాయంత్రం 2500 మందికిపైగా సిఆర్‌పిఎఫ్‌ జవాన్లు 78 వాహనాల్లో జమ్మునుంచి బయలుదేరారు. సూర్యాస్తమయంలోపు వీరంతా శ్రీనగర్‌చేరుకోవాలిస ఉంది అనేక మంది సెలవరలతర్వాత కశ్మీర్‌ విధుల్లో చేరేందుకు వస్తున్నారు. ఇక లక్ష్యానికి చేరువవుతున్న 20 కిలోమీటర్ల దూరంలోనే అఘోరం జరిగిపోయింది. పేలుడుపదార్ధాలతో నిండిన ఒక స్కార్పియో వాహనం వేగంగా దూసు కొచ్చింది. కాన్వ్నాులోని బస్సును ఢీకొట్టింది. దీనితో అక్కడికక్కడే ఆ బస్సు తునాతునకలైంది. వాహనంలో 76వ బెటాలియన్‌కు చెందిన 44మంది జవాన్లు ఉన్నారు. అక్కడకిక్కడే పలువురు మరణిస్తే మరికొందరు ఆసుప్రతిలో చికిత్స పొందుతో మరణించారు. 350 కిలోల పేలుడు పదార్ధాలతో ఉన్న ఈవాహనాన్ని నడిపిన ఉగ్రవాది దాడికి ముందు సైతం కరుడుగట్టిన వ్యాఖ్యలుచేసాడు. ’’మీరుస్వర్గంచూసేటప్పటికీ నేనే స్వర్గంలో ఉంటాఅనిచేసిన వ్యాఖ్యలు మరణానికి సైతం నేను సిద్ధమేనన్నట్లుగా ఉన్నాయి. కేవలం భారత్‌పై ప్రతీకారం తీర్చు కోవాలన్న కుట్ర, కసి, కరుడు గట్టిన ఉగ్రవాదమే ఇందుకు పురిగొలిపిందని చెప్పాలి. సైనికబలగాలకు ఇదే కొత్తకాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగి నెత్తురును ప్రవహింపచేసాయి. అమర సైనికుల ప్రాణత్యాగాలకు భారత్‌ గుణపాఠం చెపుతూనే ఉంది. అయినప్పటికీ ఎక్కడా ఆగిన దాఖలాలులేవు. 2001 తర్వాత కారుబాంబు దాడుల్లో ఈ సంఘటన అతిపెద్దదిగా చెపుతున్నారు.
2017 డిసెంబరులో కూడాదక్షిణ కశ్మీర్‌లోని లేత్‌పరాలో జెఇఎం బిఎస్‌ఎఫ్‌ దళాలకు మధ్యజరిగిన కాల్పుల్లో ఐదుగురు సిబ్బంది, ముగ్గురుపౌరులు మరణించారు. అలాగే 2016 జమ్ములోని సైనికశిబిరంపై ఉగ్రవాదులు మెరుపుదాడికితెగబడ్డారు. ఇద్దరు అధికారులు, ఐదుగురు సైనికులుమ ృతిచెందారు. పఠాన్‌కోట్‌లోని వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు దాడిజరిపితే ఏడుగురుసిబ్బందితోపాటు నలుగురు మిలిటెంట్లుసైతం చనిపోయారు. అహ్మద్‌నగర్‌, షోపియాన్‌, పుల్వామా ప్రాంతాల్లో ఒకేరోజు వేరువేరుదాడులుజరిగితే ఎనిమిది మంది సైనికులు, ముగ్గురుపోలీసులు, ఇద్దరుపౌరులతోపాటు మిలిటెంట్లుసైతం ఎనిమిది మందిని మన సైనికులు మట్టుపెట్టారు. అక్కడితో ఆగిందా అంటే అదీలేదు. శ్రీనగర్‌శివార్లలోని హైదర్‌పోరా, సర్బాల్‌క్రాసింగ్‌వద్ద సైనికులపై బాంబుదాడులు జరిపితే పదిమంది అమరులయ్యారు. డాల్‌లేక్‌మీదుగా వెళ్లే రాష్ట్రీయరైఫిల్స్‌ వాహనశ్రేణిపై మిలిటెంట్లు విరుచుకుపడితే 30మంది చనిపోయారు. వీరిలో తొమ్మిదిమంది సైనికులే ఉన్నారు. ఇలా 1999 నుంచి ఇప్పటిరకూ వాహన శ్రేణులపై దాడులుచేస్తూనే ఉన్నారు. మెరుపుదాడులు జరిగిన తర్వాత కూడా ఇవేమీ ఎక్కడా ఆగలేదు.పాకిస్తాన్‌లోని కరాచీలో ఏర్పాటుచేసిన జైషేముహమ్మద్‌ సంస్థకు మౌలానా మసూద్‌ అజహర్‌ అధ్యక్షుడు. ఆతనే వ్యవష్తాపకుడు కూడా. భారత్‌ విమానాన్నిహైజాక్‌చేయడంద్వారా మనదేశ జైలునుంచి 1999లో విడుదలయినప్పటినుంచి మసూద్‌ కరుడుగట్టిన కిరాతకాలకు పథకరచనచేస్తున్నాడు. లష్కరే తాయిబాతరహాలోనే జైషేము హమ్మద్‌కూడా ఉగ్రవాదుల సరఫరా, భారత్‌పై దాడులకు తెగబడటం వెనుక పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్‌ఐ నిధులు,విధులు, కుట్రలకు ప్రోత్సాహం పథకరచన అందిస్తున్నదనడంలో ఎలాంటి సందేహంలేదు.ఈ ఉగ్రసంస్థలకు మజ్లిస్‌ ఎ తవాన్‌ ఎ ఇస్లామికి చెందిన ముఫ్తీ నిజాముద్దీన్‌ షంజాయి, దార్‌ ఉల్‌ఇఫ్తా ఎ వల్‌ ఇర్షాద్‌కు చెందిన మౌలానా ముఫ్తీ రషీద్‌ అహ్మద్‌, షేర్‌ ఉల్‌ హడిత్‌దార్‌ ఉల్‌ హకానియా సంస్థల పెద్దలు ఈ కుట్రలకు మద్దతునిస్తున్నట్లు అమెరికాసైతం గుర్తించింది. మసూద్‌ అజర్‌ జైలునుంచి విడుదలయన తర్వాత ఏర్పడిన ఉగ్రసంస్థ ఆవిర్భవించింది. తాజాగాజరిగిన పుల్వామా దాడి 2001 తర్వాత ఇదే అతిపెద్ద దాడిగా చెపుతున్నారు. పాకిస్తాన్‌కు గట్టి గుణపాఠం చెప్పాల్సిందేనని ముక్తకంఠంతో భారతీయులు నినదిస్తున్నారు.

ఎన్నికల సంస్కరణలు

ప్రజాస్వామ్యంలో ప్రజలు తమను తామే పాలించుకొంటారు. జనాభా తక్కువగా ఉంటే ప్రత్యక్ష, ప్రజాస్వామ్యాన్ని అమలు చేయవచ్చు. జనాభా లక్షల్లోనూ, కోట్లలోనూ ఉంటే ప్రాతినిథ్య ప్రజాస్వామ్యాన్ని అమలు చేయాలి. ప్రపంచమంతా ప్రాతినిథ్య ప్రజాస్వామ్యమే నడుస్తున్నది. ప్రాతినిథ్య ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ప్రధాన పాత్ర కలిగి ఉంటాయి. ప్రజలు ఎన్నికల ద్వారా తమ పాలకులను ఎన్నుకొంటారు. 1950నుంచి ఇప్పటి వరకు చాలా సార్లు చట్టసభలకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల విధానంలోని లోపాలను అప్పుడప్పుడు కొద్దిగా సవరించు కుంటూ వస్తున్నారు.
ఎన్నికల వ్యయం విపరీతంగా ఉండటం, ఓటర్లకు అర్హతలు సరిగా నిర్ణయించకపోవటం, ఓటర్లు డబ్బులకు ఓట్లు అమ్ముకోవటం, ఓట్ల లెక్కింపు విధానం సరిగా లేకపోవటం, రహస్య ఓటింగుతో పాటు బహిరంగ ఓటింగు లేకపోవటం, దొంగ ఓట్లు వేయటం, పోలింగు కేంద్రాలను ఆక్రమించి రిగ్గింగు చేయటం, బలహీనవర్గాలను పోలింగు కేంద్రాలకు రానీయకుండా అడ్డుకోవ డటం, ఎన్నికల్లో మితిమీరిన హింస, తక్కువ శాతం పోలింగు కావటం, నేర చరిత్ర ఉన్న వ్యక్తులు ఎన్నికల్లో పాల్గొనటం, కుల, మత, ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టటం, అధికార యంత్రాంగాన్ని ఎన్నికల్లో దుర్వినియోగం చేయటం, వ్యక్తిగత దూషణలకు పాల్పడటం, అసంబద్ధమైన వాగ్దానాలు చేయటం, సాధారణ ఎన్నికలు, మధ్యంతర ఎన్నికలు, ఉపఎన్నికలతో సంవత్సరం పొడవునా, ఐదు సంవత్సరాల పాటు ఎన్నికల వాతావరణం నెలకొనటం, రాజకీయ పార్టీల నియంత్రణ చట్టం లేకపోవటం, ఎన్నికల సంఘానికి ఎక్కువ అధికారాలు లేకపోవటం, ప్రభుత్వ, ప్రైవేటు మీడియాను దుర్వనియోగం చేయటం, పార్టీ ఫిరాయింపులు మొదలగునవి మన ఎన్నికల విధానంలోని ముఖ్యమైన లోపాలు. ప్రజాస్వామ్యం, ఎన్నికల వ్యవస్థ బలంగా ఉండాలంటే రాజకీయ పార్టీల నియంత్రణ చట్టం చాలా అవసరం. రాజకీయ పార్టీల వ్యవహారాన్ని అంతరంగిక వ్యవహారంగా భావించరాదు. అవికూడా ప్రజలకు, న్యాయ స్థానాలకు, ఎన్నికల సంఘానికి జవాబుదారీగా ఉండాలి. రాజకీయ పార్టీల ఎన్నికలు ఎన్నికల సంఘం పర్యవేక్షణలో ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి. రాజకీయ పార్టీల ఆదాయ, వ్యయాలను ‘కాగ్‌’ పరిధిలోకి తేవాలి. ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం కలిగిన రాజకీయ పార్టీలను మాత్రమే అనుమతించాలి. సాధారణ ఎన్నికల నిర్వహణ సుదీర్ఘకాలంపాటు ఉంటున్నది. దశలు ఎక్కువగా ఉండటం, ఒక్కొక్క దశకు ఎక్కువ కాలపరిమితి ఉండటం వలన సుదీర్ఘ ప్రక్రియగా మారింది. ప్రజా ప్రాతినిథ్య చట్టంలోనే ఎన్నికలను నాలుగు దశలలోనే జరపాలన్న నిబంధన ఉండాలి. ఒక్కొక్క దశకు నాలుగు రోజుల వ్యవధి మాత్రమే ఉండాలి. ఎన్నికల ప్రకటన తేదీ నుంచి లెక్కింపు తేదీ మధ్య రెండు నెలలకు మించి ఉండకూడదు. పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల సంఖ్యలో నాలుగింట మూడు వంతుల స్థానాలను అభ్యర్థులను ఎన్నుకోవటం ద్వారాను, స్థానాలను పార్టీలకు వచ్చిన ఓట్ల నిష్పత్తి ప్రకారం రాజకీయ పార్టీలు సూచించిన అభ్యర్థులను ఎంపిక చేయాలి. పార్లమెంటరీ విధానం వలన మన దేశం లాభపడిరదో లేక నష్టపోయిందో అర్థం కావటం లేదు. సాధారణ ఎన్నికల్లో మెజారిటీ రాని చోట్ల సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడటం, కొద్ది రోజుల్లోనే పార్టీ ఫిరాయింపుల వలన అవి కూలిపోవటం, మళ్లీ ఎన్నికలు ఎదుర్కొనవలసి రావటం గత 60 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. చట్టసభల కాలపరిమితి ఐదు సంవత్సరాలని చెప్పినప్పటికీ చాలాసార్లు మధ్యలోనే రద్దవుతున్నాయి. పార్లమెంటరీ విధానంలో ఇదొక పెద్దలోపం. దేశంలోని అన్ని వ్యవస్థలకు ఒకేసారి ఎన్నికలు జరిగే విధంగా రాజ్యాం, చట్టసవరణలు చేసుకోవాలి. కాలపరిమితి ప్రకారమే సాధారణ ఎన్నికలు జరగాలి. పార్ల మెంటు, అసెంబ్లీ ఎన్నికలు పార్టీ చిహ్నాల మీద జరిగితే, స్థానిక సంస్థలు, ఇతర సహకార సంఘాల ఎన్నికలుపార్టీ రహితంగా జరగాలి. స్థానిక సంస్థల ఎన్నికలు ఏకగ్రీవం లేక లాటరీ విధానం అనుకరిస్తే ఇంకా మంచిది. ప్రభు త్వాలు, రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకోవటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. పోటీ చేసే అభ్యర్థులు ఓట్లను కొనటానికి తెగబడుతున్నారు. ఓటర్లు కూడా చాలామంది ఓట్లు అమ్ముకోవటం తప్పు కాదన్నట్లుగా ప్రవర్తిస్తు న్నారు. ఓటుకు ఇంత ఇవ్వాలని పట్టుబట్టే స్థితికి ఓటర్లు వచ్చారు. దీన్ని నివారించటానికి రహస్య ఓటింగుతో పాటు బహిరంగ ఓటువిధానాన్ని ప్రవేశపెట్టాలి. బహిరంగ ఓటింగు విధానం ప్రజాస్వామ్యాన్ని మరింత బలపరు స్తుంది. ఓటర్లకు కొన్ని అదనపు అర్హతలను నిర్ణయించాలి. ఓట్ల లెక్కింపు విధానంలో మార్పులు చేయాలి. ఓటర్లను మూడు తరగతులుగా వర్గీకరించాలి. పూర్తిఅర్హత కలిగిన ఓటర్లు, సగం అర్హత కలిగిన ఓటర్లు, పూర్తిగా అర్హతలేని ఓటర్లుగా విభజించాలి. ఎటువంటి సివిల్‌, క్రిమినల్‌ కేసులు లేని వాళ్లు, ప్రభుత్వాలకు, ఇతర ప్రభుత్వరంగ సంస్థలకు, స్థానిక సంస్థలకు ఎటువంటి బకాయిలు లేని వాళ్ళను పూర్తి అర్హత కలిగిన ఓటర్లుగా భావించాలి. సివిల్‌, క్రిమినల్‌ కేసుల్లో ఉన్నవారు, ప్రభుత్వ సంస్థలకు, స్థానిక సంస్థలకు బకాయిలు ఉన్నవారు సగం అర్హత కలిగిన ఓటర్లుగా భావించాలి. సివిల్‌, క్రిమినల్‌ కేసుల్లో చార్జిషీట్‌ పెడితే సగం అర్హతే ఉంటుంది. సివిల్‌, క్రిమినల్‌ కేసుల్లో శిక్ష పడినవారు, మతి స్థిమితం లేనివారు, ప్రభుత్వ సంస్థలకు దీర్ఘకాలంగా బకాయిలు ఉన్నవారు, పన్నులు ఎగవేసినవారు, దివాలా తీసినవారు పూర్తిగా అర్హతలేని ఓటర్లుగా భావించాలి. మొదటి, రెండవ తరగతి ఓటర్లకు ఓటు వేసే హక్కు ఉంటుంది. మొదటి తరగతి ఓటర్లను ఒక రకం బ్యాలట్‌ బాక్స్‌, రెండవ రకం ఓటర్లకు మరొక రకం బ్యాలట్‌ బాక్సు ఉండాలి. ఓట్ల లెక్కింపులో మొదట మొదటి రకం బాక్స్‌లోని ఓట్లను లెక్కించాలి. ఓట్లు సమానంగా వచ్చినప్పుడు లేక అతి తక్కువ మెజారిటీ వచ్చినపుడు రెండవ రకం బాక్స్‌ ఓట్లను లెక్కించాలి. ఈపద్ధతి వలన ఓటర్లు బాధ్యత కలిగి ఉంటారు. ప్రభు త్వాలకు బకాయిలు పెట్టరు. బాధ్యతతో మెలిగే ఓటర్లుకు విలువ పెరుగుతుంది. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యం దేశం భారత దేశమేనని అందరూ చెబుతుంటారు. మన ప్రజాస్వామ్యం, ఎన్నికల వ్యవస్థ మేడిపండులాగానో, నేతి బీరకాయలాగానో మారకూడదు. ఎన్నికల సంస్కరణలను త్వరగా ప్రవేశపెట్టి భారత ప్రజాస్వామ్యం, ఎన్నికల వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శంగా చూపాలి. అప్పుడే మన స్వాతంత్య్రం సమరయోధుల పోరాటాలు ఫలవంతమవుఆయి. ఈదిశగా అన్ని రాజకీయ పక్షాలు నడుం బిగించి ఎన్నికల సంస్కరణల కొరకు పోరాడాలి.
రాజ్యసభ ఎన్నికల విధానం:
శాసనసభ్యులుగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు మాత్రమే ఓటర్లు, ఆయా రాష్ట్రాల నుండి పార్లమెంటు ఎగువసభకు పంపవలసిన ప్రజాప్రతి నిధులను వీరే ఎన్నుకోవాలి. ఎమ్మెల్యేలు మాత్రమే అభ్యర్థు లను ప్రతిపాదించాలి కూడా! ఇటువంటి ప్రత్యేక అంశాలను ఎన్నికల కమిషన్‌ విస్మరించింది. దీనికన్నా ఎన్నికల ప్రక్రియ నేరమయం కావడంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు అత్యంత కీలకమైనవి! భారత ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయినప్పటి నుండే లోటుపాట్లపై చర్చ కూడా మొదలైంది. మేధావులు, ప్రజాస్వామ్య వాదులు ఎన్నో సూచనలు చేశారు. అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు సైతం ఎన్నికల రణరంగంలో నీరుగారుతున్న ప్రజాస్వామ్య స్ఫూర్తిపై ఆవేదన వ్యక్తం చేసింది. గడిచిన రెండేళ్లలోనే అరడజను సార్లకు పైగా దేశ సర్వోన్నత న్యాయస్థానం ఎన్నికల ప్రక్రియ అపహాస్యమవుతున్న తీరుపై స్పందించిందంటే మన ప్రజాస్వామ్యం నేతి బీరకాయలో నెయ్యి చందంగా ఎలా మారుతోందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల బరిలో నేరచరితులు దిగడంపై సుప్రీంకోర్టు తాజాగా వ్యక్తం చేసిన ధర్మాగ్రహాన్ని సైతం ఈ కోవలోనే చూడాలి. ఈఅంశంపై కూడా అత్యున్నత న్యాయస్థానం స్పందించడం ఇదే మొదటిసారి కాదు. ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులపై నేరారోపణలపై విచారణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించింది. 1951 నాటి ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 8 ప్రకారం నేరం రుజువైన వ్యక్తి శిక్ష అమలులోకి వచ్చిన తేదీ నుండి జైలు నుండి విడుదలైన ఆరు సంవత్సరాల వరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడవుతారు. అయితే, ఇదే చట్టంలోని సెక్షన్‌ 8 సబ్‌సెక్షన్‌ 4 ఎన్నికైన ప్రజాప్రతినిధులకు కొన్ని మినహాయింపులిచ్చింది. ఈ మినహాయింపు ప్రకారం అప్పటికే ఎంపి, ఎంఎల్‌ఏగా ఉన్న వ్యక్తి చేసిన నేరం రుజువై శిక్ష పడినా మూడు నెలల వరకు అనర్హత నిబంధన అమలులోకి రాదు. ఈ లొసుగును అడ్డం పెట్టుకుని పై కోర్టులకు అప్పీలు చేస్తూ నేరస్తులు తమ పబ్బం గడుపుకుంటున్నారు. ఈ మినహాయింపే నేరస్తులు దొడ్డ్డిదోవలో అధికారం చేజిక్కించుకునేందుకు ఊతమిస్తోంది. ఫలితంగా చట్టసభల్లో నేరస్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉంది. 15వ లోక్‌సభలో 128 మంది సభ్యులపై క్రిమినల్‌ కేసులుండగా, ప్రస్తుత లోక్‌సభలో ఆ సంఖ్య 162కు పెరిగింది. హత్యలు, కిడ్నాప్‌లు, మానభంగాల వంటి తీవ్ర స్వభావం గల నేరారోపణలు ఎదుర్కుంటున్న వారు 15వ లోక్‌సభలో 58 మంది ఉండగా, ప్రస్తుతం వీరి సంఖ్య 76కు చేరింది. అంటే 18 శాతం పెరిగింది. పార్లమెంటుతో పాటు రాష్ట్రాల శాసనసభల్లోనూ కలిపి 30శాతం మందికి పైగా సభ్యులు నేరారోప ణలు ఎదుర్కుంటున్నారని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే కొన్ని సంవత్సరాల క్రితం సుప్రీంకోర్టుకు నివేదించింది. ఈ సంఖ్యలు చాలు చట్టసభల్లో ఎవరు తిష్టవేస్తున్నారో, ఎవరికోసం పని చేస్తున్నారో తెలుసుకోవడానికి! నేర చరిత్ర ఉన్న వారిని చట్టసభ్యులుగా పంపడంలో బిజెపి,కాంగ్రెస్‌లు పోటీ పడుతు న్నాయి. 19 శాతం బిజెపి లోక్‌సభ సభ్యులపైనా, 13శాతం కాంగ్రెస్‌ సభ్యుల పైనా క్రిమినల్‌ కేసులున్నట్లు నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ ప్రకటించడం గమనార్హం. ఇక వివిధ ప్రజా సమస్యలపై పోరాటం చేసే వామపక్ష పార్టీల నేతలపైనా తప్పుడు కేసులు బనాయించి నేరచరితులుగా రికార్డుల కెక్కించడం, ఇతర పార్టీలకూ వాటికి తేడా లేదన్నట్లు గా చిత్రీకరించడం పాలకవర్గ పార్టీల కుతంత్రంలో భాగం! ఈ నేపథ్యంలోనే రాజకీయ పార్టీలు ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల నేర చరిత్రను బహిరంగంగా ప్రకటించేలా నిబంధన తీసుకురావాలని, అలా ప్రకటించని పార్టీల గుర్తింపు రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశిస్తామని హెచ్చరించాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు ఈ స్పందన ఆహ్వానించదగినదే అయినప్పటికీ దాని వల్ల ఫలితం సందేహాస్పదమే. ఇటువంటి వివరాలు ఇప్పటికే ఎన్నికల కమిషన్‌కు అభ్యర్థులు నివేదిస్తున్న విషయం తెలిసిందే! నిజానికి మెజార్టీ మార్కు మాయాజాలం తో సాగే ప్రక్రియే మన ఎన్నికల వ్యవస్థ లోని దుష్పరిణామాలకు కారణం. దీనిని సాధించడానికే పాలకవర్గ పార్టీలు రూ. వందల కోట్లు ఖర్చు పెట్టగలిగే కార్పొరేట్లను, నేరస్తులను అభ్యర్థులుగా ముందుకు తెస్తున్నాయి. కొన్ని సమయాలలో తక్కువ శాతం ఓట్లతోనూ అధికారాన్ని చేజిక్కించుకుంటున్నాయి. వీటి నుండి భారత ప్రజాస్వామ్యం బయట పడాలంటే దామాషా ప్రాతినిధ్య ఎన్నికల విధానమే మార్గం! ఆ దిశలో విస్త ృత స్థాయిలో చర్చ జరపడానికి మేధావులు, ప్రజాస్వామ్య వాదులు ముందుకు రావాలి.- సైమన్‌ గునపర్తి

స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసంమే..

‘‘రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ తీర్మాణాన్ని అడ్డగోలు సవరణలు చేసి రెండవ సారి పంపింది. తెలుగుదేశం, వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రేస్‌ పార్టీల్లో ఉన్న ఎస్టీ ఎమ్మేల్యేలు, గిరిజన సలహా మండలి (టిఎసి) సభ్యులే భాద్యత వహించాలి!. ఆదివాసీ రిజర్వేషన్లపై పాలక పక్షలు అనుసరిస్తున్న వ్యతిరేక విధనాలను నిరసిస్తూ, బోయవాల్మీకీ, మత్సకార, వడ్డేర, రజక కులాను ఎస్టీ జాబితాలో చేర్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిద్దాం! ఆదివాసుల మనుగడను కాపాడు కొందాం!!’’ రామారావు దొర

2017 డిసెంబర్‌ 12 న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుమారుగా ఏబై లక్షల మంది జనాభా కలిగిన బోయవాల్మీకీ పద్దెనిమిదికి పైగా దాని ఉపకులాలను షెడ్యూల్డ్‌తెగల(ఎస్టీ) జాబితాలో చేర్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మాణం చేసింది. ఇప్పుడు మత్సకార, వడ్డేర, రజక కులాలను కూడా ఎస్టీ జాబితాలోకి చేర్చడానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం సోషల్‌ వర్క్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రొఫసర్‌ ఆర్‌.డి సంపత్‌ కుమార్‌ నేతృత్వంలో ప్రొఫెసర్‌ రంగరావు, ఆంత్రోపాలజిస్టు ప్రొఫెసర్‌ పి.డిసత్యపాల్‌ కుమార్‌ లతో కూడిన త్రి సభ్య కమిటిని నియమించింది. 2014 లో భ్రుత్వం ఏర్పడ్డ వెంటనే మరో రెండు కులాలను చేర్చింది. 1976 లో లంబడా, ఎరుకుల, యానాది కులాలను ఎస్టీ జాబితాలో చేర్చారు. పై మూడు సందర్బల్లో కూడా బిసిఎ జాబితాలో ఉన్న రిజర్వుడ్‌ కులాల్నే కలపడం జరిగింది. కాని అన్ని సందర్బల్లో పాలకుల అంతిమ లక్ష్యం మాత్రం రాజకీయంగా ప్రయోజనం పొందడం. మహారాష్ట్రలో బిసిలుగా, కర్ణా టకలో ఎస్సీలుగా,రాజస్థాన్‌లో ఒసిలుగాదేశంలో వివిద రాష్ట్రల్లో వివిధ సామాజిక హోదల్లోఉన్న లంబడాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎస్టీలు గా గుర్తించినందుకు ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ మెధక్‌ జిల్లా (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌) నుండి పోటి చేసి గెలుపొంది దేశప్రధాని అయ్యిం ది. నేడు కూడా నాయుడు గారు మరోసారి పొందడానికి, రెడ్డి గారు తొలి సారి అధికారంలోకి రావడానికి ఆదివాసులను బలి చేయడానికి పూనుకొన్నారు. ఆదివాసుల ఉనికిని దెబ్బతీసి, ప్రకృతి వనరులను బహుళాజాతి కంపెనీలకు దొచిపెట్టడానికి సిద్దమయ్యారు. దీనికి అన్ని రాజకీయ పక్షలు మద్దతుగా నిలుస్తున్నారు. రాజకీయలు అటుంచి భారత రాజ్యంగంలో రిజర్వేషన్లునిర్థేసించిన ఉద్దెశాలు, లక్ష్యలు ఎవరికి పట్టడంలేదు. ఈ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో బిన్నత్వంలో ఏకత్వం ఉన్నట్టే! ఏకత్వంలో అనేక భిన్నదృక్పదాలు కనిపిస్తాయి. మన రాజ్యం గం నిర్ధేశించి అమలులోఉన్న అతి ముఖ్యమైనది మూడు రకాల రిజర్వేఫన్లు. మొదటిది ఆదివాసులు (ఎస్టీ), రెండవది దళితులు (ఎస్సీలు), మూడవది వెనుకబడిన తరగతులు (బిసిలు). వెనుకబడిన తరగతులకు సామాజిక, ఆర్ధిక వెనబాటు ప్రామనికం కాగా, దళితులకు అంటరాని తనం, సామాజిక అసమానతలు ప్రమనికమైంది. అదే ఆదివాసుల విషయానికొస్తే అన్నిటికంటే భిన్నంగా సాంస్కృతిక, సాంప్ర దాయక విలువలకు ప్రాదన్యత ఇచ్చారు. ప్రపంచంలో ఏ రాజ్యంగం లోలేని విధంగా 5వ,6వషెడ్యూల్స్‌ ద్వారా భూహక్కులతో సహా రిజర్వు చేయబడిరది. దీనికి కారణం మనది సర్వశత్తక గణతంత్ర రాజ్యమైనం దుకు మామ్రే కాదు! ఈ దేశమే ఆదివాసులదైైనందుకు!. తిల్కా మంజీ, బిర్సా ముండా,కొమురంభీం, గాంగంటందొర, మర్రికామయ్య వంటి అనేక మంది ఆదివాసీ యోధుల తిరుగుబాట్లువల్ల సాధ్యమైంది. కాని నేడు ఆదిపత్య కులాల బ్లాక్‌ మెయిలింగ్‌ స్వార్థ రాజకీయలకు రిజర్వే షన్లు అంగడి సరుకుగా మారింది. ఇప్పటి వరకు అనేక కులాలను ఎస్టీ జాబితాలో కలపడానికి మాత్రమే కమిటిలు వేస్తున్నారు. షెడ్యూల్డ్‌ తెగల జాబితాలో ఇతర కులాలను చేర్చడం వల్ల రాజ్యంగం అమల్లోకి వచ్చింది మొదలు విద్య,ఉద్యోగ,సామాజిక,ఆర్ధిక,రాజకీయ దోపిడియే కాకా! ఆదిమ తెగల గుర్తింపు, ఉనికికి పునాదులైన సంస్కృతి, సాంప్రాదాయక విలువలతోపాటు, ఆదిమజాతుల నిర్ములనకు విద్వాం శకర ప్రక్రియా జరుగుతున్నది. ఆనష్టాన్ని అంచన వేయడానికి ఇప్పటి వరకు ఒక కమిటి గాని, కమీషన్‌ గానీ వేయలేదు!. ఆ…ప్రయత్నం కూడా ఏ…నాడు జరగలేదు!. ఇప్పుడు ‘‘సామాజికన్యామం’’ అనే నినాదంతో ఈదేశ సంపదనంత మేమే! తినేసినట్టు! అన్ని కులాల వారు ఎస్టీలో చేరిస్తేనే అభివృద్ధి చెందుతామని, ఎస్టీల్లో చేర్పిస్తే తప్ప! చదువు రా…దని!, అభివృద్ధి చెందలే…రని ఆదిపత్య కుల పాలకులు సైతం ప్రజలను రెచ్చగొట్టి తెగల మీదికి ఉసగొలుపతున్నారు. రాజ్యం గం నిర్ధేశించిన స్పూర్తికి విరుద్దంగా ఎటువంటి సాంకేతిక ప్రమాణాలు పాటించకుండా పాలకులు తమ స్వార్ధరాజకీయ ప్రయోజ నల కోసం అభివృద్ధి చెందిన కుల సమాజన్ని ఆదిమజాతుల్లోకి చేరుస్తు వస్తున్నారు. 39 కులాలు తెగలజాబితాలో కలపాలనీ కోరుతున్నట్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‘ట్రైబల్‌ ఎడ్వజరీ కౌన్సిల్‌ (టిఎసి)’ గుర్తించింది. పైకు లాలను తెగల్లో చేర్చడానికి ఆయా కులాలకు తగిత అర్హాతలు లేవని‘‘గిరిజన సాంస్కృతిక పరిశోదన మరియు శిక్షణ కేంద్రం (టి.సి.ఆర్‌ అండ్‌ టి.సి) జరిపిన మానవ సామాజిక అధ్యయనం (ఎత్నోగ్రషఫిక్‌ స్టడీ) ద్వారా గుర్తించి వెల్లడిరచింది. ఆజాబితాలోనే బోయవాల్మీకీ,మత్సకార,వడ్డేర,రజక కులాలు కూడా ఉన్నాయి. తగిన అర్హాత కలిగి లేరని నిర్ధరణ అయినప్పటికి ఆయా కులాలు వారు తమని ఎస్టీ జాబితాలో కలపమని పదే పదే విన్నవిస్తున్నందున, ఇకమీదట ఏకులాలను తెగల్లోకి కలపమని సిపారసు చేయకూడద’’ని తీర్మణించింది. రాజ్యంగంనిర్ధేశించిన ప్రమాణాలకు లోబడి పని చేసే ప్రభుత్వ సంస్థ అయిన టి.సి.ఆర్‌ అండ్‌ టి.సి రిపోర్టును, టిఎసి తీర్మా ణాన్ని తుంగలోకి తొక్కిన ప్రభుత్వం ప్రొఫెసర్‌ పిడి సత్యపాల్‌ కుమార్‌ రిపోర్టునే తీసుకొని బోయవాల్మీకీ కులాలను ఎస్టీ జాబితాలో కలపడం, మళ్ళీ అదే ప్రొఫెసర్‌ను త్రి సభ్య కమిటిలో సభునిగా నియమించడం వెనుక తెలుగు రాష్ట్రల్లో నాలుగు నుండి ఐదుకోట్ల మంది కుల సమాజ జనాభాను తెగల్లోకి విలీనం చేసి ఆదిమజాతులు ఉనికిని దెబ్బతీసి ప్రకృతి వనరుల దోపిడికి పాల్పడనుంది. పాలకుల కుట్ర పన్నగానికి సహోదర దళితుడు, కుహాన మేధావిjైున ప్రొఫెసర్‌ పిడి సత్యపాల్‌ కుమార్‌ లాంటివారు సహాకరిస్తారు. ఈ మాట ఎందుకంటున్ననంటే విశాఖ ఏజేన్సికి ఆయనకున్న అనుబంధం, అవగహాన మరో ఏ ఆంత్రో పాలాజిస్టుకు కూడా ఉండవేమో! ఆదివాసులపైన అద్యాయనం పేరుతో ప్రతీ సంవత్సరం ఎంతో మంది తన విద్యార్ధులను ఏజేన్సి కొండల మీదికి తరలించేవాడు. ఇక్కడ వాల్మీకీ తెగ జీవనవిధానం, అచార సాంప్రదాయలకు, రాయలసీమ జిల్లాల్లో నేరచరితులుగా ముద్ర వేయబడి బ్రతుకు తెరువు కోసం రెడ్లు, కమ్మ పెత్తందారి కులాల వద్ద ప్యాక్షనిజంచేసి బ్రతికిన బోయ,బోయవాల్మీ కులాలకు పోలికలున్న యనీ, వీరిని ఎస్టీ జాబితాలో కలపాలనీ సిపారసు చేసారు. ఇందులో రాజకీయ ప్రయోజనమా! ఆర్ధిక ప్రయోజనమా! ఏదైనా ఉండవచ్చు! ఉంటుంది. ఈరిపోర్టు వెనక చంద్రబాబునాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావడం, ప్రతిపక్షనేత జగన్మోహన్‌ రెడ్డి గారు ముఖ్య మంత్రి పదవి దక్కించుకోవడంతోపాటు, ఆదివాసుల ఉనికిని సమూ లంగా నిర్మూలించాలనే కాంక్ష స్పష్టంగా కనబడుతుంది. దీనికి మిత్రుడు ఇచ్చిన రిపోర్టు సారంసం వనరుగా ఉపయోగపడుతుంది కనుక రిజర్వే న్లను ఆదిపత్య కులాలుబ్లాక్‌ మెయిలింగ్‌ రాజకీయలకు వాడు కొంటున్నారు: బోయ,బోయవాల్మీకీ కులాలను కలపడం పరికొత్త అంశంగా కనబడినా బలవంతులైన ఆదిపత్య కులాలకు విద్య, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగల్లో బలహీనులైనా తెగలపై ఆదిపత్యం కొనసాగిస్తునే ఉన్నారు. 1935 లో భారత ప్రభుత్వ చట్టం (బ్రిటీషుచట్టం) దేశంలో 212ఆదిమ తెగలను షెడ్యూల్డ్‌ తెగలుగా గుర్తించగా, రాజ్యంగంఅమల్లోకి వచ్చేనాటికి (1950) ఆజాబితా 429కి పెరిగింది. అనేక రాజకీయ ఒత్తిడ్ల కారణంగా నేడది 790కి పైగా పెరిగిపోయింది. అయినా ఇంకా చేరుస్తునే ఉన్నారు. అన్ని రంగల్లో ఆదివాసుల కంటే చైతన్యవంత కులాలను రాజకీయ అవస రాలకోసం కలుపుతున్నారు. అందరిని ఒకేవిధంగా పరిగనించడం వలన సాంకేతికంగా తరువాత చేర్చబడిన వారే మొత్తం ప్రయోజనం పొందుతుతారు. మాతెగలకు కేటాయించిన రిజర్వేషన్‌ ఫలాలైనా విద్య,ఉద్యోగ,ఉపాది,ఆర్థిక,రాజకీయ ప్రయోజనలు అందుకోలేక ఆయా రంగాల్లో నిలదొక్కుకోనే అవకాశన్ని కోల్పోతున్నాము. అంతే కాకుండా ఆదివాసులు, దళితులు, స్త్రీలు, వెనుకబడిన తరగతులు, ముస్లీం మైనార్టీప్రజలు అందరితో సమానస్థాయికి ఎదగడానికి ఉద్దేశించిన రిజర్వేషన్లు అగ్రవర్ణ పాలకుల ‘‘బ్లాక్‌ మెయిలింగ్‌’’ రాకీయా లకు (తెలుగురాష్ట్రల్లో రెడ్డి,కమ్మ,వెలమ) వనరులుగా వాడుకొంటు న్నారు. తప్పితేఅయా వర్గలకు ఒరగబెట్టిందేమిలేదంటే అతిశయోక్తి కాదు. 50శాతం కంటే మించి రిజర్వేషన్లు ఉండకూడదనే నియమం అత్యున్నత ధర్మాశనం చెప్పినప్పటికి, కాపులకు ప్రత్యేక కేటటగిరిలో 5శాతం ఇవ్వడానికి నిర్ణయించింది పాలకపక్షం. కానీ బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలన్నప్పుడు అలాంటి నియమం ఏమి లేకుండా ఇప్పుడున్న 6శాతన్నే! వచ్చే ఏబై లక్షల మందికి పంచిపెడుతుంది. అదిక జనాభా కలిగి అభివృద్దికి చేరువైన కులాలను ఎస్టీల్లో కలిపి అంత శాతం రిజర్వేషన్‌ పెయచితే సరిపోతుందని అనవచ్చును. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి, దబాయించడానికి పనికొస్తుంది. తప్పితే! పరిష్కారం ఎంత మాత్రం కానే…కాదు. లంబడా, ఎరుకుల, యానాది కులాలను కలిపినప్పుడు అప్పటి పాలకులు కూడా ఇదే నిర్లక్ష్య వైకరిని ప్రదర్శించింది. ఆదివాసీ తెగల్లో ఆవయించి ఉన్న నిరక్షరాస్యత, నిరుద్యోగం, పేదరికం రాజకీయ నిరాశక్తత వంటివి పరిగణన తీసుకోకుండా నాలుగు శాతంగాఉన్న ఎస్టీ రిజర్వేషన్‌ ఆరు శాతానికి పెంచింది. 6 శాతంలో కొద్ది మేరకైనా అందుకోలేక పోగా! 4 శాతం కూడా కోల్పోయిన స్థితిని చూస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా సాంస్కృతిక సాంప్రదాయక విలువలకు ఏసందర్బంలో కూడా ప్రామా ణికంగా తీసుకొన్న దాకలాలు లేవు. సామాజిక న్యాయమంటూ రాజకీయ పరమైన ఒత్తిడ్లే ప్రధాన అర్హాతగా తీసుకొన్నారు. బోయల విషయంలో అదే జరిగింది. కలపబోయే మత్సకారులు, వడ్డేరా, రజకుల విషయంలో ఇదే జరుగబోతుంది. మరిన్ని కులాల డిమాం డ్లన్ని రాజకీయ పార్టీల పరిశీలనలో ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, జగన్మోన్‌ రెడ్డి గార్ల పరిశీలనలో ఉంది. ఓట్ల పంపకాల లెక్కలు తెలాక ఎన్నికల వేల మన ముందుకు రానుంది. కులాలను తెగల జాబితాలో చేర్చే క్రమంలో షెడ్యూల్ద్‌ ప్రాంతల్లో విపరీతమైన వలసలు పెరిగుతుంది. ఇతర వలస జనాభా వలన ఒత్తిడికి తట్టుకోలేక, స్థానిక సమూహాలు అంతరించిపోతున్న పరిస్థితులు వివ్వవ్యప్తంగా చూస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో లంబడాలనుఎస్టీ జాబితా లో చేర్పినపుడు అదే జరిగింది. 1971 జనాభా లెక్కల ప్రకారం ఒక లక్ష 32 వేల 464 మందిగా ఉన్న లంబడా జనాభా 1981 నాటికి ఆ సంఖ్య 11 లక్షల 58వేల 342కు చేరుకొందని గణంకాలు స్పష్టం చేస్తుంది. అంటే పదేళ్ళలో దేశానలు మూలల నుండి 11లక్షలకు పైగా జనాభా వలస వచ్చి చేరిపోయారు. నేడు విశ్వవ్యప్తంగా గుర్తింపు పొందిన ‘గోండు, కోయ’ వంటి సమూహాలు తీవ్రమైన ఒత్తిడిలో ఉంది. ఈపరిణామం గుణపాఠంగా మన ముందున్న సవాలు. షెడ్యూల్డ్‌ తెగల్లోకి ఇతరకులాలను చొప్పించే కుతంత్రలను అడ్డుకోవడం మా ఆదివాసుల మనుగడ సమస్య మాత్రమే.. కాదు. విశ్వమానవ మానవ మనుగడ సమస్య కూడా?.

రాజ్యాంగ మౌలిక విలువలకు ముప్పు

స్వాతంత్య్రానంతరం…సుమారు రెండేండ్లపాటు దేశవ్యాప్తంగా జరిగిన చర్చోపచర్చ ల పర్యవసానంగా దేశం గణతంత్రంగా అవతరించింది. ఎందరో త్యాగధనుల పోరాటాల ఫలితంగా సముపార్జించిన స్వాతంత్రాన్ని..అంతకు ముందున్న రాజులూ మహారాజుల చేతుల్లో పెట్టకుండా.. ప్రజలనే ప్రభువులుగా ప్రకటిస్తూ ప్రజాతంత్రంగా మారడం.. గణతంత్ర దినోత్సవ విశిష్టతకు నిదర్శనం. నేడు దేశంలో స్వైరవిహారం చేస్తున్న మతోన్మాద మనువాద మూకలు.. నాడు.. పంద్రాగస్టుకు, చబ్బీస్‌ జనవరికి మధ్యనున్న రెండేండ్ల సంధి కాలంలో సైతం జబర్ధస్తీ చేస్తూ.. తమతిరోగామి పంథాని దేశ ప్రజల మీదరుద్దాలని ప్రయత్నించారు. స్వతంత్ర భారతం ఏపంథాలో నడవాలి..దేశంలో ఏరాజకీయ వ్యవస్థను నిలపాలిఅనే అంశంపై ఆరెస్సెస్‌, హిందూమహాసభ,రామరాజ్య పరిషద్‌ ఇత్యాది సంస్థలు.. తమ రాచరిక అనుకూల ధోరణులకు అనుగుణమైన ప్రతిపాదనలు తీసుకొచ్చారు. పైగాతాము చెప్పినదే సనాతన భారతీయ పంథా అంటూ.. ప్రజాస్వామ్యమనే విదేశీ పోకడలు మనకొద్దు అంటూ దుష్ప్రచారం మొదలుపెట్టారు. బ్రిటిష్‌ వాడిని వెల్లగొట్టాము కాబట్టి..ఆబ్రిటీషువాడు ఎవరినైతే కూలదోసాడో..ఆదేశీయ రాజులు, మహారాజులను మళ్లీ తీసుకొచ్చి, వాళ్లకి మళ్లీ పట్టం కట్టి, అధికారం వాళ్ళ చేతుల్లో పెట్టడమే స్వాతంత్య్రానికి నిజమైనఅర్థం అంటూ విపరీత వ్యాఖ్యానాలు చేశారు. ఈకుత్సిత వాదనల న్నింటినీ గాంధీ,నెహ్రూ,పటేల్‌,అంబేద్కర్‌,మౌలానా అబ్దుల్‌ కలాం..ఇతరజాతీయ నాయకులు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. ఇక వెనక్కి పోయేది లేదు..దేశం చూపుముందు వైపేఉంటుందటూ స్పష్టీకరించారు. దేశాన్నిసర్వసత్తాక,ప్రజాస్వామ్య గణతంత్రంవైపు నడిపించారు.
బ్రిటిష్‌ వాడి వలసవాద సంకెళ్ళు మన దేశాన్ని చుట్టు ముట్టక ముందు.. వలస వాదంతో పోలిస్తే మరింత విషపూరితమైన మనువాద వ్యవస్థ ఈదేశంలో రాజ్యమేలింది. సుమారు మూడు వేల ఏండ్ల పాటు మనువాద వ్యవస్థ పన్నిన విషవలయంలో ఈదేశం బందీ అయింది..బానిసగా బతికింది. మనిషిని మనిషిగా చూడ నిరాకరించిన అమానుష వ్యవస్థ-మనుధర్మం. కాయకష్టం చేసి సంపదను సృష్టించే శ్రమజీవులను శూద్రులను, ఛండాలు రను చేసి..ఏపనీ చేయకుండా సోమరిపోతులుగా మెలగుతూ,పక్క వాడి కష్టార్జితాన్ని దోచుకుతినే స్వార్థపరులను ఉన్నత స్థానంలో నిలబెట్టింది ఈ మను వ్యవస్థ. 90 శాతంగా ఉన్న శ్రామిక జనాలను బానిసలుగా మార్చేసింది. రాజ్యమేదైనా, రాజులెవరైనా, వంశమేదైనా..భారతఉపఖండమంతటా మనుస్మృతియే రాజ్యాంగంగా అమలయింది. భారతీయులందరూ వేల ఏండ్లుగా పూజించిన గ్రంధాలన్నీ ఒకటే నీతిబోధించేవి. రాజులు ఎవరైనా సరే..ధర్మం తప్పక పరిపాలన కొనసాగించాలని. ధర్మమంటే.. మనుధర్మమే! శ్రీరాముడంతటివాడు సైతంశంభూకుడి తలను నిర్దాక్షి ణ్యంగా తెగనరికింది..అందుకోసమే! మన రాజ్యాంగం విశిష్టత ఏమి టంటే.. రెండువందల ఏండ్ల బ్రిటిష్‌ వాడి బానిస త్వాన్ని నిర్మూలించడం తోటే ఆగిపోలేదది. బ్రిటీషువాడు రాకముందు.. మూడు వేల ఏండ్ల పాటు ఈ దేశంలో రాజ్యమేలిన మనుస్మృతి తీసుకొచ్చిన కులవ్యవస్థ బానిసత్వాన్ని సైతం రాజ్యాంగం భూస్థాపితం చేసింది. వేలయేండ్ల మన దేశ చరిత్రలో.. రాజ్యాంగ అవతరణ తర్వాతనే.. మొట్టమొదటి సారిగా దేశ ప్రజలందరికీ కుల మత ప్రాంత లింగ విభేదాలు లేకుండా సమాన హోదా లభించింది. మనిషిని మనిషిగా చూసింది.. మనుషు లందరికీ ఈదేశంలో మొదటిసారిగా సమాన హక్కులనిచ్చిందీ… రాజ్యాంగమే. ఈ గడ్డ మీద పుట్టిన మనుషులందరూ సమానులేనన్న మానవతా సూత్రాన్ని మొట్టమొదటిసారిగా శాసన బద్ధం చేసింది మన భారత రాజ్యాంగం! సామాజిక విప్లవ మూర్తులు బుద్ధుడు పూలే అంబేద్కర్‌లు కొట్టిన సమ్మెట దెబ్బల కారణంగా తమప్రాభవాన్ని కోల్పోయిన కులదురహంకారుల ముఠా..తమ స్వార్థప్రయోజనాలకు రక్షణగా ఉన్న కుత్సిత మనుధర్మాన్ని ఎట్లాగైనా దేశం మొత్తం మీద పునస్థాపిం చాలనే కుతంత్రంలో భాగంగానే 1925లో ఆరెస్సెస్‌ను స్థాపించారు. 18వ శతాబ్దంలో…మహారాష్ట్రలో పీష్వాలు గా రాజ్యాధికారం చెలా యించిన ‘’చితపవన్‌’’ బ్రాహ్మణులు…మనువ్యవస్థను నూటికి నూరు పాళ్ళూ నిర్దాక్షిణ్యంగా అమలు పరిచారు. దళితులను పశువుల కంటే హీనంగా చూసే ‘’ముడ్డికి చీపురు…మూతికి ముంత’’ విధానం వీళ్ళ హయాంలోనే అమలయింది. దేశ ప్రజలలో స్వేచ్ఛా స్ఫూర్తిని నింపిన ఇంగ్లీష్‌ విద్యకు తోడు.. మానవతామూర్తులు తీసుకొచ్చిన సాంఘిక తిరుగుబాట్ల కారణంగా.. మరణశయ్యకు చేరువైన మనుధర్మాన్ని… జాతీయత, దేశభక్తి అనే మాయమాటలతో…ఎలాగోలా పునరుజ్జీవింప చేయాలనే తలంపే ఆరెస్సెస్‌ ఆవిర్భావానికి కారణమయింది. మహారాష్ట్ర లోని నాగపూర్‌ ఈ సంస్ధకు కేంద్ర స్ధానం కావడం.. హిందూత్వ నాయకులంతా మహారాష్ట్ర ‘చితపవన్‌’ బ్రాహ్మణులే కావడము వెనుకనున్న మతలబు అదే! మనుస్ముృతి ఆరెస్సెస్‌ దృష్టిలో అతి పవిత్రమైనది. హిందూ మతానికి మనువాదం, కులవ్యవస్థే కీలకమనీ…అవిలేకపోతే హిందూమతమే లేదని ఆరెస్సెస్‌వారు ప్రగాఢంగా విశ్వసిస్తారు… ఆచరిస్తారు. ‘’వేదాల తర్వాత.. హిందువులకు అత్యంత పవిత్రమైనది మనుస్మతి’’ అనిసావర్కార్‌ పేర్కొంటాడు. ఆరెస్సెస్‌ రెండవ సర్‌ సంఫ్‌చాలక్‌ గోల్వాల్కర్‌ తన రచన ‘బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌’లో.. ‘’అసమానతలు పకతిలో భాగం…కులాల పేరిట అసమానతల్లో తప్పేమీలేదు’’ అనిస్పష్టీకరిస్తాడు. ప్రపంచంలోనే గొప్ప స్మతికారుడైన మనువు రాసిన చట్టాలను హిందువులందరూ విధిగా పాటించాల్సిందేనని తేల్చి చెబుతాడు. దేశ ప్రజలని కులాల వారీగాచీల్చి దేశఅనైక్యతకు, వెనుకబాటు తనానికీ మూలకారణంగా నిలిచిన మనుస్మతియే అసలు రాజ్యాంగంగా భావిస్తున్న మనువాద శక్తులు.. మొదటి నుంచి భారత రాజ్యాంగాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. అందులోనూ.. మనుస్మతి ప్రకారం హీనజాతి వాడైన అంబేటద్కర్‌ ఆధ్వర్యంలో రాజ్యాంగ రచన జరగడం మనువాదులకు మింగుడు పడని విషయంగా పరిణ మించింది. ‘’మనువు స్థానంలో పంచముడైన అంబేద్కర్ని ఎట్లా ఒప్పుకుంటాం..?’’అంటూ దురహం కార పూరితంగా హుంకరించారు. స్వతంత్ర భారత రాజ్యాంగం.. మనుధర్మ సూత్రాలకు అనుగుణంగా ఉండాలంటూ డిమాండ్‌ చేసారు. 26 నవంబరు 1949న దేశ రాజ్యాంగసభ రాజ్యాంగాన్ని స్వీకరించిన తరువాత..30 నవంబరు 1949 సంచికలో ఆరెస్సెస్‌ అధికార పత్రిక ‘’ఆర్గనైజర్‌’’ భారత రాజ్యాంగాన్ని తూలనాడుతూ ఇలా రాసింది: ‘’భారతదేశానికి రాజ్యాం గం ఇప్పుడు కొత్తగా రాయాల్సిన అవసరం లేదు. ప్రాచీన కాలంలో మనువు రాసిన సూత్రాలు ఉన్నప్పటికీ వాటి ప్రస్తావనే రాజ్యాంగంలో లేకపోవడం పెద్ద అపరాధం. ప్రపంచానికే ఉత్తేజంతో దారి చూపగల ఆరాధనపూరితమైన మనుధర్మ శాస్త్రం.. అంబేద్కర్‌కూ, రాజ్యాంగ పండితులకూ గుర్తు కూడా రాలేదు’’
నేటి దేశ ప్రధాని నరేంద్ర మోడీ తన గురువుగా చెప్పుకునే ఎం. ఎస్‌. గోల్వాల్కర్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌ రెండవ సర్‌ సంఘచాలక్‌) అంబే ద్కర్‌ రచించిన రాజ్యాంగం అసలు విలువ లేనిదంటూ తేల్చిపారేశాడు. ‘’పాశ్చాత్య దేశాల రాజ్యాంగాల నుంచి అక్కడో ముక్క, ఇక్కడో ముక్క పేర్చి..భారత రాజ్యాంగ మంటూ వీళ్ళు మనకు చూపెడుతున్నారు. అంబేద్కర్‌ రాసిన ఈరాజ్యాంగంలో భారతీయమైనదంటూ ఏదీ లేదు.. అంతా పరాయిదే’’ నంటూ తేల్చేసాడాయన. కులం పేరుతో తన సోదరులను బానిసలుగా చూడడం గోల్వాల్కర్‌ గారి దృష్టిలో భారతీ యత. దేశ ప్రజలందరూ సమానులేనని చెబితే.. అది పరాయి భావన. ఇలా ఉన్నది ఈ దేశ భక్తుల కుతర్కం! నాడు దేశ స్వాతంత్య్ర సంగ్రా మంలో పాల్గొనకుండా విదేశీ ప్రభువులకు వత్తాసు పలికిన సంఘ పరివారం..నేడు స్వతంత్ర భారత రాజకీయ అధికారాన్ని చేజిక్కించు కుని ఢల్లీి గద్దెపై కూర్చున్నది. తన రాజకీయ అంగమైన బీజేపీ ద్వారా నేడు ఆర్‌ఎస్‌ఎస్‌ దేశ పరిపాలనను తనచేతుల్లోకి తీసుకున్నది. స్వయంగా ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త అయిన నరేంద్రమోడీ నేడు రాజ్యాం గం మీద ప్రమాణం చేసి దేశ ప్రధాని పదవిలో కూర్చున్నాడు. అయితే సంఘ పరివారపు భావజాలంలో భారత రాజ్యాంగం పట్ల వ్యతిరేకత ఏమాత్రమూ తగ్గలేదు. అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం కాదు..మనుస్మ తియే మాకు శిరోధార్యమంటూ ఎన్నోసార్లు ఆర్‌ఎ స్‌ఎస్‌ నేతలు తేల్చి చెప్పారు.1992లో డిసెంబర్‌ ఆరెస్సెస్‌ ఏర్పాటు చేసిన ధర్మ సంసద్‌లో ప్రస్తుత రాజ్యాంగం హిందూవ్యతిరేకమైనదనీ..మనుస్మ తిని రాజ్యాంగంగా స్వీకరించాలంటూ ఏకగ్రీవంగా తీర్మానించారు. మోడీ క్యాబినెట్‌ లోని మంత్రి అనంత్‌ కుమార్‌ హెగ్డే 2016 డిసెంబర్‌ లో కర్ణాటకలో ఒకకుల సమావేశంలో మాట్లాడుతూ..బీజేపీ అధికారం లోకి వచ్చిందే రాజ్యాం గాన్ని మార్చడానికి..కాబట్టి ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మార్చి తీరుతామని తేల్చి చెప్పాడు.
నేడు కేంద్రంలో అధికారాన్ని అనుభవిస్తున్న సంఫ్‌ పరివార్‌ నేతలు భారత రాజ్యాంగంపట్ల కపట భక్తిని ప్రదర్శిస్తున్నారు. మానవతా మూర్తులైన సాంఘిక విప్లవ కారులు తీసుకొచ్చిన మార్పుల వలన నేడు మనువాదం బలహీన పడిరది కాబట్టి.. సమయంకోసం వేచి చూస్తున్నారు. దేశ ప్రజల్లో క్రమక్రమంగా మతోన్మాద,మనువాద విషబీజాలను నాటి దేశంలో మళ్లీ మనువాద రాజ్యాన్ని స్థాపించాలనేదే వారి కుట్రల సారాంశం. దేశ ప్రజలలో సమతా, మమతా వెల్లివిరిసి.. అభివద్ధి పధంలో దేశం సమున్నతంగా ముందడుగు వేయాలని ఆకాంక్షించే దేశభక్త పౌరులందరూ నేడు మతోన్మాద-మనువాద ముఠాల కుతంత్రాల పట్ల జాగ్రత్త వహించాలి. ఈ దేశంలో సామాజిక న్యాయం వెల్లివిరియడం, అసమానతల మనువ్యవస్థ అంతం కావడమనేది ఏకొందరి ప్రయోజనాల కోసమో కానే కాదు. మను వాదం అంతమయితేనే భారత జాతి ఐక్యంగా నిలబడగలదు. భారత దేశ ఐక్యత, సమగ్రత..భారతరాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రజాస్వామ్యం, లౌకికత్వం, సమసమాజ భావనల పైన ఆధారపడి ఉన్నది. మనువాదుల విషపు పడగల నుండి భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడం, నేడు దేశ భక్త పౌరులందరి ప్రథమ కర్తవ్యంగా నిలిచి ఉన్నది. – ఆర్‌.రాజేశమ్‌

1 8 9 10 11