లాక్‌డౌన్‌ వేల శ్రామిక జీవులపై కరోనా పంజా

లాక్‌డౌన్‌ కారణంగా గ్రామీణ ప్రాంతాలలో కన్నా పట్టణ ప్రాంతాలలోనే అర్ధాకలి పస్తులు పెరిగాయన్న సంగతి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో రేషన్‌ కార్డులు లేనివారి సంఖ్య ఎక్కువగా ఉండడం మొదటి కారణం. అందువలన వారికి ప్రజా పంపిణీ ద్వారా ఆహార దినుసులు అందుబాటులో లేకుండా పోయాయి. ఈ కరోనా కష్టకాలంలో ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజానీకాన్ని కొంతవరకూ ఆదుకుంది. అటువంటి పథకం ఏదీ పట్టణ ప్రాంతా లకు లేదు. పట్టణ పేదలను ఈ కష్టకాలంలో ఆదుకునే ప్రత్యామ్నాయం ఏదీ లేకుండా పోయింది. ఇది రెండవ కారణం.

దేశంలో వేలాది మంది ప్రాణాలు, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయిన కరోనావైరస్‌ మహమ్మారి ఇంకా తన విజృంభణ ఆపలేదు. భారత్‌ కరోనావైరస్‌తో జీవనం కొనసాగిస్తుంది. ఇప్పుడు దాని తో పాటు ఆకలి ఒకపెద్ద సమస్యగా మిగిలిపోయింది. కరోనావ్యాప్తిని అరికట్టడానికి విధించిన లాక్‌ డౌన్‌ సమయంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఆకలితో ఉన్నారు. రోజువారి అవస రాలను తీర్చడానికి కష్టపడుతున్నారు.అంగన్‌వాడీ కేంద్రాలు,పాఠశాలలు మూసివేయడం వల్ల హైద రాబాద్‌లో వేలాదిమంది పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు.మార్చిలో లాక్‌ డౌన్‌ విధించినప్పటి నుంచి తెలంగాణలో అన్నిప్రభుత్వ పాఠశాలలు మూసివేయబడ్డాయి. దీనివల్ల నిరుపేద పిల్లలకు మధ్యాహ్నం భోజనం లేకపోవడం. మధ్యాహ్నం భోజనం లేకపోవడంతో,పిల్లలు పోషకాహార లోపానికి గురయ్యారు. ఈ కరోనా మహమ్మారి నుంచి తప్పించుకోవడానికి లాక్‌ డౌన్‌ను అస్త్రంగా వాడితే ఆకలి అనేమరో పెద్ద విపత్తు ప్రజల నడ్డి విరిచింది. కరోనాచావులుతోపాటు ఆకలి మరణాలు కూడా సంభవిస్తాయని ప్రభుత్వాలు మారాయి.
2020 మార్చి 24న మరో నాలుగు గంటల్లో దేశంమంతటా లాక్‌డౌన్‌ అమలు జరగనున్నట్టు నరేంద్రమోడీ ప్రకటించారు. ఆలాక్‌డౌన్‌ మే నెలాఖరు వరకూ కొనసాగింది. ఆతర్వాత కూడా స్థానికంగా అక్కడక్కడా లాక్‌డౌన్‌లు కొనసాగినా, దేశం మొత్తంమీద లాక్‌డౌన్‌ మళ్ళీ విధించలేదు. ఆలాక్‌డౌన్‌ పేద శ్రామికులకు ఎక్కడా లేని కష్టాలను తెచ్చిపెట్టింది. వారిలో ముఖ్యంగా వలస కార్మికులు పడిన పాట్లు మొత్తం ప్రపంచం దృష్టిలో సైతం పడ్డాయి. తక్కిన దేశాలలో లాక్‌డౌన్‌కి, మన భారతదేశంలో లాక్‌డౌన్‌కి ఒకతేడా ఉంది. ట్రంప్‌ హయాంలోని అమెరికాతో సహా తక్కిన దేశాల్లో లాక్‌డౌన్‌ కార ణంగా ఆదాయాలు కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇచ్చారు. మనదేశంలో మాత్రం అటువంటిదేమీ లేదు (ఎక్కడో కొద్ది మంది ఎంపిక చేసుకున్నవారికి చాలా స్వల్ప మొత్తాలు ఇచ్చారు. అంతే). లాక్‌డౌన్‌ కారణంగా ఏంతోమంది పేద శ్రామికులు ఆదాయాలు కోల్పోయి నిరాధారంగా,ఆకలి బాధతో బతకవలసిన స్థితికి నెట్టబడ్డారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసి కొన్ని నెలలు గడిచినా, వారాస్థితి నుండి ఇంకా కోలుకోనేలేదు. కొన్ని పౌరసంస్థలుకలిసి ‘హంగర్‌వాచ్‌’ అనేపేర ఒకసర్వే నిర్వహించారు. గత అక్టోబర్‌ నెలలో ఈ సర్వే జరిగింది. ఈసర్వేలో కలిసిన వారినుండి ఆదాయాల,వ్యయాల లెక్కలు,గణాంకాలు సేకరించడం కాకుండా వారికి కలిగిన అభిప్రాయాలను యథాతథంగా సేకరించారు. సర్వేలో వెల్లడైన విషయాలు చేదు వాస్తవాలను బైటపెట్టాయి. సర్వే చేసినవారు దాదాపు 4000మందిని కలిశారు. వారిలో 53.5 శాతం-అంటే సగం కన్నా ఎక్కువమంది-కుటుం బాలు మార్చి 2020లో వాడిన గోధుమ లేదా బియ్యం కన్నా అక్టోబర్‌లో వాడినది తగ్గింది. ఇక పప్పుధాన్యాలు,ఆకుకూరలు,గుడ్లు,మాంసం వంటి దినుసుల వినియోగం తగ్గిపోయిన కుటుంబాల శాతం అంతకన్నా ఎక్కువగానే ఉంది. 62శాతం కుటుంబాల ఆదాయం లాక్‌డౌన్‌ కన్నా ముందు ఉన్నస్థాయితో పోల్చితే అక్టోబర్‌ నాటికి తగ్గి పోయింది. లాక్‌డౌన్‌కు పూర్వం పనులకు పోయిన వారికన్నా ఆ తర్వాత కాలంలో పనులకు పోతున్న వారి సంఖ్య పెరిగింది. కుటుంబ ఆదాయాలు తగ్గిపోతున్నందున,ఎక్కువమంది పనులకు పోవ లసిన అగత్యం ఏర్పడిరది.సర్వే పరిమితంగానే జరిగి వుండొచ్చు. కాని జరిగిన మేరకైనా చూసి నప్పుడు లాక్‌డౌన్‌ కారణంగా కొంతమందికైనా కడుపులు నిండనిస్థితి ఏర్పడిరదని స్పష్టం అవు తోంది. హంగర్‌ వాచ్‌ సర్వే ప్రత్యేకించి బలహీన వర్గాలపైన,తరగతుల పైన కేంద్రీకరించిందిన్నది ఇక్కడ గమనంలో ఉండాలి.
గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణ ప్రాం తాలలో ఆహార దినుసుల వినియోగం తగ్గిపోయిన కుటుంబాలు (కరోనా పూర్వపు కాలంతో పోల్చి నప్పుడు) ఎక్కువశాతం ఉన్నాయని హంగర్‌ వాచ్‌ అధ్యయనంలో తేలిన అంశం మరింత ఆశ్చర్యాన్ని గొలుపుతోంది. ఇది ముందు ఊహించినదానికి భిన్నంగా ఉంది. సాధారణంగా అర్ధాకలి పస్తులు, పోషకాహారలేమి వంటివి పట్టణ ప్రాంతాల్లో కన్నా గ్రామీణప్రాంతాల్లోనే ఎక్కువ.పోషకాహారం పొంద గలుగుతున్న వారెందరన్న కొలబద్దతో పేదరి కాన్ని అంచనా వేసినప్పుడు గ్రామీణ ప్రాంతాలలోనే పేద రికం ఎక్కువగా ఉందని ప్రతిసారీ మన అధ్య యనాలు వెల్లడి చేస్తున్నాయి. అందుచేత లాక్‌డౌన్‌ కారణంగా గ్రామీణ ప్రాంతాలలో కన్నా పట్టణ ప్రాంతాలలోనే అర్ధాకలి పస్తులు పెరిగాయన్న సంగతి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ఇలా పెరగడానికి రెండు కారణాలు ఉన్నా యని చెప్పవచ్చు. పట్టణ ప్రాంతాల్లో రేషన్‌ కార్డులు లేనివారి సంఖ్య ఎక్కువగా ఉండడం మొదటి కారణం. అందువలన వారికిప్రజా పంపిణీ ద్వారా ఆహార దినుసులు అందుబాటులో లేకుండా పోయాయి. ఈ కరోనా కష్టకాలంలో ఉపాధిహామీ పథకం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజానీకాన్ని కొంత వరకూ ఆదుకుంది. అటువంటి పథకం ఏదీ పట్టణ ప్రాంతాలకు లేదు. పట్టణ పేదలను ఈ కష్టకాలంలో ఆదుకునే ప్రత్యామ్నాయం ఏదీ లేకుం డా పోయింది. ఇది రెండవ కారణం. హంగర్‌ వాచ్‌ నివేదిక నుండి కొన్ని ముఖ్యమైన నిర్ధారణలకు రావచ్చు. లాక్‌డౌన్‌ కాలంలో ఎటువంటి తోడ్పా టూ అందకపోవడం కారణంగా పేదరికం, అర్ధాకలి పెరగడం, నిరాధారంగా మిగిలిపోయిన వారు పెరగడం సంభవించింది. ఇది అనివార్యం. ఐతే,ఈ పరిస్థితి అంతే తీవ్రంగా లాక్‌డౌన్‌ అనం తర కాలంలో కూడా కొనసాగడం కొట్టవచ్చినట్టు కనపడే విషయం. సాధారణంగా లాక్‌డౌన్‌ కాలం లో ఉత్పత్తి నిలిచిపోతుందని, ఒకసారి లాక్‌డౌన్‌ ఎత్తివేశాక ఉత్పత్తి యథాతథంగా తిరిగి ప్రారంభ మౌతుందని అందరమూ భావిస్తాం. కాని లాక్‌డౌన్‌ కాలంలో శ్రామిక ప్రజలకు ఇతరత్రా ఆర్థిక తోడ్పా టు అందినట్టైతే ఈ విధంగా జరిగే వీలుంటుంది. అదే, మన దేశంలో మాదిరిగా ఎటువంటి ఆర్థిక తోడ్పాటూ అందకుండా ఉన్నట్టైతే యథాతథ స్థితి మొదలుకాదు.
లాక్‌డౌన్‌ కాలంలో శ్రామిక ప్రజల ఆదా యాలు పడిపోకుండా నిలబెట్టగలిగితే ఆహార దినుసులను, ఇతర వినిమయ వస్తువులను వారు అదే స్థాయిలో కొనుగోలు చేయగలుగుతారు. అదే విధంగావారి ఋణభారం అదనంగా పెరిగి పోదు. ఉత్పత్తి లాక్‌డౌన్‌ కాలంలో నిలిచిపోతుంది గనుక, శ్రామిక ప్రజల అవసరాలను తీర్చడానికి వ్యాపా రులు వారివద్దనుండే సరుకుల నిలవలను కరిగి స్తారు. ఒకసారి లాక్‌డౌన్‌ ఎత్తివేశాక ఉత్పత్తి తిరిగి ప్రారంభం అవుతుంది. కార్మికులకు ఆదాయాలు రావడం తిరిగి మొదలౌతుంది. వారి వినిమయం మాత్రం యథాతథంగా కొనసాగుతుంది. వ్యాపా రులు తమ వద్ద నిల్వలను తిరిగి పెంచుకోవలసి వుంది గనుక మామూలు స్థాయికన్నా ఎక్కువగా ఉత్పత్తి ని చేయవలసిన స్థితి వస్తుంది.
అదే లాక్‌డౌన్‌ కాలంలో శ్రామికులకు ఎటు వంటి ఆర్థిక తోడ్పాటూ అందకపోతే వారి ఆదా యం ఏమీ ఉండదు గనుక వారి వినిమయం బాగా తగ్గుతుంది. అలా తగ్గించుకున్నా, అందు కోసం వారు అప్పులు చేయవలసి వస్తుంది. లాక్‌ డౌన్‌ ఎత్తివేసిన తర్వాత ఉత్పత్తి యథాతథంగా పూర్వపు స్థాయిని చేరుకుందనుకున్నా శ్రామిక ప్రజల వినిమయం మాత్రం యథాతథ స్దితికి రాదు. ఎందుకంటే వారు లాక్‌డౌన్‌ కాలంలో చేసిన అప్పులు తీర్చడానికి తమకు వచ్చిన ఆదా యాల్లో నుండి కొంతభాగం కేటాయించవలసి వుంటుంది. ఆఅప్పులు పూర్తిగా తీరిపోయే వరకూ వారి వినిమయం పూర్వపు స్థాయికి చేరుకోదు. వినిమయం బట్టి ఉత్పత్తి ఉంటుంది. వినిమయం తగ్గింది గనుక ఉత్పత్తి కూడా పూర్వపు స్థాయికి చేరుకోదు. అంటే ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి, విని మయం-రెండూ కరోనా పూర్వపు స్థితికి చేరుకోవు. అందుచేత ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం కూడా అరకొరగానే జరుగుతుంది. అందుచేత ఆర్థిక వ్యవస్థ మామూలు స్థాయికి తిరిగి కోలుకోవాలన్నా, శ్రామిక ప్రజలు దుర్భర దారిద్య్ర పరిస్థితి నుండి బైట పడాలన్నా వారి ఆదాయాల స్థాయి లాక్‌డౌన్‌ కాలంలో పడిపోకుండా ఆర్థిక తోడ్పాటు అందిం చడం అవసరం. తెలివిమాలిన మోడీ ప్రభుత్వం ఈ పని చేయలేదు. శ్రామిక ప్రజలలో చాలా మంది ఆదాయాలను దాదాపు సున్నా కి తీసుకొ చ్చింది. దీని పర్యవసానాలు ఏవిధంగా ఉంటాయో హంగర్‌ వాచ్‌ వెలుగులోకి తెచ్చింది.
మధ్యంతరంగా సగంలో నిలిచిపోయిన మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కేంద్రం ఖర్చు చేయనున్నదని, దానితో ఆర్థిక వ్యవస్థ కోలుకోడానికి కావలసిన ప్రేరణ లభిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. అందు కోసం ఎంత మోతాదులో ఖర్చు చేయనున్నారన్నది అసలు ప్రశ్న. లాక్‌డౌన్‌ కు మునుపు ఏ స్థాయిలో ఖర్చు చేశారో,అదే స్థాయిలో ఇప్పుడూ చేస్తే, శ్రామిక ప్రజల కొనుగోలు శక్తి ఏమీ అదనంగా పెరగదు. లాక్‌డౌన్‌ కాలంలో చేసిన అప్పులకు వాయిదాలు కట్టడానికి కొంత భాగం పోతే తక్కిన భాగంతోటే వారు ఏ కొనుగోలు అయినా చేయగలు గుతారు. అందువల్ల మొత్తం డిమాండ్‌ లాక్‌డౌన్‌ అనంతర కాలంలో కూడా పూర్వపు స్థాయికి తిరిగి చేరుకోదు. అంటే ఆర్థిక వ్యవస్థ మామూలు స్థాయికి తిరిగి కోలుకోవడం జరగదు. అలా కోలుకో వాలం టే మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం పెట్టే ఖర్చు లాక్‌డౌన్‌ పూర్వపు కాలంలో చేసిన ఖర్చు కన్నా చాలాఎక్కువ మోతాదులో పెంచాలి. పడిపోయిన శ్రామిక ప్రజల కొనుగోలు శక్తి వలన డిమాండ్‌లో ఏర్పడే తరుగుదలను అదిభర్తీ చేయ గలిగేంతగా ఉండాలి.
ఇలా పరోక్షంగా మౌలిక వసతుల కల్పనపై ఎక్కువ ఖర్చు చేయడం కన్నా నేరుగా ఆ శ్రామిక ప్రజలకు నగదు చెల్లించడం ద్వారా వారి కొను గోలు శక్తిని నిలబెట్టడమే మెరుగు. లాక్‌డౌన్‌ అనం తరం కూడా ఆవిధంగా నగదు చెల్లింపులను కొనసాగించవచ్చు. లాక్‌డౌన్‌ అనంతరం కొంత తగ్గిన ఉత్పత్తి స్థాయి,తగ్గిన ఆదాయాల వలన ఏర్పడిక కొరతను భర్తీచేయగలిగే మేరకు ఈ నగదు చెల్లింపులు జరగాలి. అప్పుడు మాత్రమే పూర్వపు స్థాయికి వినిమయం పెరుగుతుంది. లాక్‌డౌన్‌ కాలంలో ఇటువంటి చెల్లింపులేవీ చేయనందున దాని ప్రభావం లాక్‌డౌన్‌ అనంతర కాలంలో కూడా పడుతోంది. దానివలన ఆర్థిక వ్యవస్థ కోలు కోవడం కూడా సాధ్యం కావడంలేదు.
నేరుగా శ్రామిక ప్రజలకు నగదు చెల్లింపులు చేస్తే వారి దారిద్య్రం ఉపశమించడమే గాక, వారు ఆసొమ్ముతో కొనుగోలుచేసే సరుకులన్నీ దేశీయంగా ఉత్పత్తి చేసినవే ఎక్కువగా ఉంటాయి. దిగుమతి చేసుకోవలసినవి పెద్దగా ఉండవు. అందువలన ప్రభుత్వం చేసే ఖర్చు దేశీయ డిమాండ్‌ ఎక్కువగా పెరగడానికి తోడ్పడుతుంది. అందువలన దేశంలో ఉపాధి అవకాశాలు మరింత పెరగడానికి దోహ దం చేస్తుంది. శ్రామిక ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసే ఆహార ధాన్యాలను ఇక్కడ ప్రభుత్వం చేసే నగదు చెల్లింపులలో భాగంగా పరిగణించకూడదు. ఉచితంగా ఆహార ధాన్యాలు ఇవ్వడం మంచిది. అవసరం కూడా. కాని దానివలన ఆర్థిక వ్యవస్థ పెరగడానికి ఎటువంటి ప్రేరణా కలగదు. అది కేవలం భారతీయ ఆహారసంస్థ వద్ద పేరుకు పోయిన నిల్వలను కొంత తగ్గించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. దానితోబాటు నేరుగా నగదు చెల్లింపులు చేసినప్పుడే ఆర్థిక వ్యవస్థ కోలుకోడానికి తగిన ఊపు లభిస్తుంది. ఇప్పుడు ఉపాధి లేని ప్రతీ కుటుంబానికీ నెలకు రు.6000 కనీసం చెల్లిం చాలని ప్రధానికి ప్రతిపక్ష నాయకులు లేఖ రాశారు. ఆవిధంగా ప్రతీఇంటికీ మూడు నెలల పాటు నగదు చెల్లించినా,అందుకయ్యే ఖర్చు మన జిడిపిలో కేవలం 2 శాతమే. ఆమాత్రం లోటును తేలికగా సర్దుకో వచ్చు.కాని మోడీ ప్రభుత్వానికి తెలివి తక్కువ తనంతోబాటు పిరికితనం కూడా ఉంది. అందుకే ప్రజలు ఇంత దుర్భర పేదరికంతో నలిగిపో తున్నా, ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నా ధైర్యం చేయలేకపోతోంది. అంత ర్జాతీయ ద్రవ్య పెట్టుబడి నిర్దేశించిన పరిమితులను దాటుకుని వ్యవహరించ లేకపోతోంది.

ఎంత దౌర్భాగ్యం

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో బొణిగి ఆనందయ్య అనే వ్యక్తి కరోనా నివారణ ఔషధం అంటూ ఆయుర్వేద మందును పంపిణీ చేస్తున్నాడు. దీనిపై సీఎం జగన్‌ కూడా దృష్టి సారించి, శాస్త్రీయ అధ్యయనం అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో.. నెల్లూరు జిల్లా యం త్రాంగం ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీని నిలిపివేసింది. దీనిపై నెల్లూరు జిల్లా కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌ బాబు వివరణ ఇచ్చారు. మూలికా ఔషధం పంపిణీ ఆపివేశామని.. ఈ ఔషధంకు సంబం ధించి శాంపిళ్లను డీఎం హచ్‌ఓ, ఆయుష్‌ అధికా రులు హైదరా బాదు లోని ఓ ప్రయోగశాలకు పంపారని కలెక్టర్‌. తెలిపారు . దీనిపై శాస్త్రీయ పరిశోధన చేయాల్సి ఉందని, ఆ పరిశోధనలో తెలిసే అంశాల ఆధారం గానే..ఆయుర్వేదం మందు పంపిణీకి అనుమతి లభించింది.

ప్రభుత్వ వైద్యం ఏ మూలకూ చాలదు. కార్పొరేట్‌ వైద్యం అందనంత ఖరీదు. అటువంటి దయనీయ స్థితిలో నేడు అసంఖ్యాకంగా పేదలు ఉన్నారు. ఏచిన్న ఆశ కనిపించినా, ఏ చిన్న ఆధా రం దొరికినట్టు అనిపించినా, ఆశగా దానికోసం వారు ఎగబడతారు. ఇది వారి నిస్సహాయ స్థితికి ప్రతిబింబమే కాని చైతన్యపూరితంగా ఆ ప్రజలు కోరుకునేది కాదు. కాబట్టి తమ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకుని ప్రజల మీదకు ‘వారు కోరుకుం టున్నారు’ అనే పేరుతో నెపాన్ని నెట్టేసి నాటు వైద్యాన్ని సమర్ధిం చడం తప్పు.తప్పే కాదు, నేరం కూడా.
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం దగ్గర ఆనందయ్య అనే నాటు వైద్యుడు ఇచ్చే మందు కరోనాను నయం చేస్తుందన్న ప్రచారం దుమారంలా వ్యాపించింది. రెండురోజుల క్రితం అక్కడ వేలాదిగా గుమి గూడిన జనాలను చెదరగొట్టడానికి లాఠీచార్జి కూడా చేయవలసి వచ్చింది. ఆమందును, ప్రజలపై దానిని ప్రయోగిస్తున్న విధానాన్ని పరిశీలించిన ఆయుష్‌ వైద్యుడు అదిఆమోదం పొందిన ఆయుర్వేద ఔషధం కాదని, ఆనందయ్య అర్హతలున్న ఆయుర్వేద వైద్యుడు కాడని, ఆమందు పని చేస్తుందో లేదో నిర్ధారించాల్సి వుందని స్పష్టంగా నివేదిక ఇచ్చారు. దాంతో తాత్కాలికంగా ఆ కార్యక్రమం ఆగింది. ఆనందయ్య వాడిన మందు పని చేస్తుందో లేదో తేల్చడానికి అవసరమైన పరీక్షలను జరిపి నిగ్గు తేల్చాల్సినది ఐసిఎంఆర్‌ అని, ఆనందయ్య తయారు చేసిన మందును నాటుమందుగానే పరిగణిస్తు న్నామని ఆయుష్‌ కమిషనర్‌ రాములు స్పష్టంగా ప్రకటించారు. ఈలోపు ఆనందయ్య ఇచ్చిన మందు వికటించి రోగులలో కొందరి పరిస్థితి విషమంగా తయారైనట్టు వార్తలు కూడా వచ్చాయి. కాని ఒక్కరోజు లోనే మొత్తం సీన్‌ మారిపోయింది !
తిరుపతి ఆయుర్వేద కళాశాల విశ్రాంత అధ్యాపకుడు ఒకాయన అధికార పార్టీ ఎమ్మెల్యే నిర్వహించిన పత్రికాగోష్టిలో ‘’నాటి మందు’’నే ఇప్పుడు ‘’నాటు మందు’’ అంటున్నారని తెలుగు భాషకు కొత్త భాష్యం చెప్పారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి ఆనందయ్య మందు హాని చేస్తు న్నట్టు ఎటువంటి దాఖలాలూ లేవని, ఆయుర్వేదం మందు అయితే నిబంధనలు వర్తిస్తాయి గాని, అది ఆయుర్వేదం మందు కానట్టయితే ఏ నిబంధనలూ వర్తించవని అత్యంత హాస్యాస్పదమైన, బాధ్యతా రహితమైన ప్రకటన చేశారు! ముఖ్యమంత్రి అండ తనకు ఉన్నదంటూ ఆనందయ్య మీడియా ముందు ప్రకటించాడు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆనందయ్య వైద్యానికి మద్దతు తెలిపారు. స్వయానా ఉపరాష్ట్రపతి అసాధారణ రీతిలో ఒక కేంద్ర బృం దాన్ని పంపి ఆనందయ్య మందుకు ఇమేజ్‌ పెం చారు. ఇంతమంది రంగంలో ఉంటే మనం ఎక్కడ వెనకబడిపోతామనో ఏమో గాని సిపిఐ నాయకులు నారాయణ కూడా దీనిని సమర్ధిస్తూ మాట్లాడారు.
ఆయుర్వేదం, యునానీ, హోమియో, ఆక్యు పంక్చర్‌, యోగా తదితర సాంప్రదాయ వైద్య విధా నాలు చాలానే ఉన్నాయి. వాటికి నాటు వైద్యానికి నక్కకు, నాక లోకానికి ఉన్నంత తేడా ఉంది. ఈ సాంప్రదాయ వైద్యాలను ఆధునిక శాస్త్త్ర విజ్ఞానం సహకారంతో అధ్యయనం చేసి శాస్త్రబద్ధం చేయా ల్సిన అవసరాన్ని ప్రపంచం గుర్తించి అనేక సంవత్స రాలుగా పరిశోధనలు జరుపుతోంది. ఆ క్రమం లోనే కొన్ని రకాల వైద్యాలను గుర్తించి అనుమతి చ్చింది. ఆయుర్వేదం, యునానీ, హోమియో వైద్య విద్యలకు సిలబస్‌లను రూపొందించి కళాశాలలు ఏర్పాటు చేశారు. డిగ్రీలు ప్రదానం చేసి ప్రాక్టీస్‌ కు అనుమతులిచ్చారు. కాని ఇప్పటికీ గ్రామాల్లో, పట్టణాల్లో సైతం నాటువైద్యం కొనసాగుతోంది. దానికి ఎటువంటి నియంత్రణా లేదు. కాని దానిని ప్రభుత్వం ఎక్కడా ఆమోదించి అనుమతించనూ లేదు. గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన కార్యక్ర మాలలో భాగంగా నాటువైద్యం జోలికి పోవద్దన్న ప్రచారం జరుగుతూనే వుంది. ఆశా,అంగన్‌వాడీ వర్కర్ల ద్వారా కూడా ఇటువంటి ప్రచారాలు జరి గాయి. నాటువైద్యం వికటించి ప్రాణాలు పోగొట్టు కునేవారి గాధలు నిరంతరం వినవస్తూనే వుం టాయి. ఇక తాయెత్తులు,పోగులుకట్టడం, రాగిరే కులు మంత్రించి ఇవ్వడం, భూత వైద్యం, చేతబడి, ఎరుకలసాని మందులు, పుత్తూరు వైద్యం వంటివి నాటువైద్యం రూపాలు, ప్రజల్లో పాతుకుపోయిన మూఢ విశ్వాసాలకు ప్రతీకలు. ప్రజలు వీటిని అధిగమించి ఆధునిక, శాస్త్రీయ వైద్య పద్ధతులను అనుసరించి ఆరోగ్యాలను కాపాడుకోవాలన్న లక్ష్యం తో ప్రభుత్వాలు, బాధ్యతగల అధికారులు, రాజకీయ నాయకులు వ్యవహరించాలి. అందుకు తగిన ఆధు నిక వైద్య వసతుల కల్పనకు కృషి చేయాలి. ఆరో గ్యం ప్రజల ప్రాథమిక హక్కు. అది జీవించే హక్కు లో భాగమే. దానిని కాపాడాల్సిన బాధ్యత ప్రభు త్వాలది. ప్రజల ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెట్టే నాటు వైద్యాలను నియంత్రించే బాధ్యత కూడా ప్రభు త్వాలదే. మరి ఆ బాధ్యతను విస్మరించి,అందునా, ఆరోగ్యపరంగా ఒక అత్యవసర పరిస్థితి ఏర్పడిన ప్రస్తుత తరుణంలో ప్రభుత్వాలు,కొన్ని రాజకీయ పార్టీలు,అధికారులు ఎందుకు ప్రత్యక్షంగాను,పరో క్షంగాను ఆనందయ్య మందును సమర్ధిస్తున్నారు ?ప్రజలు వేలాదిగా ఆమందుకోసం వస్తున్నారు కాబట్టి సమర్ధిస్తున్నాం అని చెప్పడంలో అర్ధం లేదు. ఎక్కడికక్కడ ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్‌ సెంటర్లు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, జనరల్‌ హాస్పిటళ్లు, ఈ కరోనా కాలంలో ప్రజల ఆరోగ్యాన్ని సరైన విధంగా, సకాలంలో సంరక్షించే సామర్ధ్యంతో నడిస్తే ప్రజలు నాటువైద్యానికి ఎందుకు వస్తారు? కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వ ఆరోగ్యవ్యవస్థను పూర్తి గా నిర్లక్ష్యం చేసిన పాపం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వా లదే. అదీ చాలదన్నట్టు, ప్రైవేట్‌ కార్పొరేట్‌ ఆస్పత్రు లను విపరీతంగా పెంచి పోషించినదీ ఈ ప్రభు త్వాలే.మెడికల్‌ రీఇంబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ వంటివి ప్రజాధనాన్ని కార్పొరేట్‌ ఆస్పత్రుల పాలు చేయ డానికి తోడ్పడిన, తోడ్పడుతున్న మార్గాలు. పైగా కార్పొరేట్‌ ఆస్పత్రులను నియంత్రణ చేసే చర్యలేవీ లేవు. లాభార్జనే కాని ప్రజారోగ్యం పట్టని కార్పొరేట్‌ ఆస్పత్రులు ఈ కరోనా కష్టకాలంలో చేతులెత్తేసి తమ చేతకానితనాన్ని బైటపెట్టుకున్నాయి. ఈ సమ యంలో కూడా లక్షలు ప్రతీ కరోనా రోగి నుండీ పిండుకుంటున్నాయి. ఈపరిస్థితి పూర్తిగా ప్రభు త్వాలు (కేంద్రం,రాష్ట్రం) కల్పించినదే.
ప్రభుత్వ వైద్యం ఏమూలకూ చాలదు, కార్పొ ంట్‌ వైద్యం అందనంత ఖరీదు. అటువంటి దయ నీయ స్థితిలో నేడు అసంఖ్యాకంగా పేదలు ఉన్నారు. ఏచిన్న ఆశ కనిపించినా, ఏ చిన్న ఆధారం దొరికినట్టు అనిపించినా, ఆశగా దానికోసం వారు ఎగబడతారు. ఇదివారి నిస్సహాయ స్థితికి ప్రతి బింబమే కాని చైతన్యపూరితంగా ఆ ప్రజలు కోరు కునేది కాదు.
కాబట్టి తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకుని ప్రజలమీదకు ‘వారు కోరుకుంటున్నారు’ అనే పేరుతో నెపాన్ని నెట్టేసి నాటువైద్యాన్ని సమర్ధించడం తప్పు. తప్పే కాదు, నేరం కూడా. ఇక ‘’అన్నీ వేదాల్లోనే ఉన్నాయా’అన్న అగ్నిహోత్రావధానుల మూర్ఖత్వాన్ని ఒక సిద్ధాంతంగా మార్చి దానిని ‘ప్రాచీన వైశిష్ట్యం’ గా చిత్రీకరించి ఆపేర రాజకీయం నడుపుతున్న ఆర్‌ఎస్‌ఎస్‌,సంఘపరివారానికి ఈకృష్టపట్నం మందు ఒకఅవకాశంగా దొరికింది. అందుకే అసా ధారణ రీతిలో నేరుగా వెంకయ్య నాయుడి గారి జోక్యం. ఆనందయ్య మందు పని చేస్తుందో లేదో తెలియదు కాని దానిపై ఏనియంత్రణా లేదు అని అన్నాక ఇక ప్రజలకు వ్యాక్సిన్లు ఇవ్వనక్కరలేదు, ఆస్పత్రులలో పడకలు అవసరం లేదు. ఆక్సిజన్‌ అక్కరలేదు. బడ్జెట్‌ కేటాయింపులూ అక్కరలేదు. యథావిధిగా సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టు కోవచ్చు,సెంట్రల్‌ విస్తా వంటి డాబు,దర్పం ప్రద ర్శించే కార్యక్రమాలకు విచ్చలవిడిగా ఖర్చు పెట్టు కోవచ్చు. నెలకో కుంభమేళా జరుపుకోవచ్చు. ప్రజలు ఇక కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల గురించి నోరెత్తరు.పైగా కృష్ణపట్నం ఒక టూరిస్టు సెంటర్‌గా మార్చుకోవచ్చు. అక్కడ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం సాగించవచ్చు. దానికి హెల్త్‌ సిటీ లాంటి పేర్లు పెట్టవచ్చు.సెమినార్లు, సంబరాలు ఎన్నైనా జరుపు కోవచ్చు. ఇంగిత జ్ఞానం విడిచిపెట్టేశాక ఇక హద్దేముంటుంది? ఎవరైనా ఇదేం అన్యాయం అని అడిగితే, ప్రజలు కోరుకుంటున్నారని నెపాన్ని ప్రజల మీదకు తోసెయ్యవచ్చు. కరోనా ప్రమాదం ఏడాది కో,రెండేళ్ళకో పోతుంది. దానికి కూడా ఓపరిమితి ఉంటుంది కాబట్టి. కాని పాలకుల,అధికారుల బాధ్య తారాహిత్యానికి, అవకాశవాదానికి పరిమితి లేదు. అదే మనకు దాపురించిన దౌర్భాగ్యం !
(కొన్నేళ్ళ క్రితం ఒకరిక్షావాలా కాలికి కట్టుకున్న పోగుతో కనపడ్డాడు. ఎందుకు కట్టుకున్నావని అడిగాను. ‘జొరం కాస్తంది బాబూ, తగ్గడం లేదు. అందుకే సాయిబు దగ్గరికెల్తే పోగు కట్టాడు.’ అన్నాడు.‘మరి జ్వరం తగ్గిందా?’ అనడిగితే, ‘సూడాల బాబూ,నిన్ననే కద,కట్టింది’అన్నాడు. ‘తగ్గుతుందనుకుంటున్నావా?’ అన్నాను. ఏవో బాబూ, నాకాడ వొయిద్దానికి రెండ్రూపాయలే ఉన్నాయి. మరిదాంతో ఏడాట్రు వొయిద్దెం సేత్తాడు ? గవుర్మెంటు ఆస్పత్రికెల్తే సీటీ మాత్రం రాస్తారు. మందులు కొనుక్కోవాల.దానికి డబ్బు లెక్కడి నుండొస్తాయి?ఈడు రెండ్రూపాయలుచ్చుకుని పోగు కట్టాడు. నాకుసేతనైన వొయిద్దెం ఇదే. మరి ఎలా గోలా బతకాల కదా బాబూ’’ అన్నాడు. కృష్ణ పట్నంలో మనం చూడాల్సింది పోటెత్తుతున్న జనా లని కాదు,మూర్తీభవించిన ప్రజల నిస్సహా యతను, కొట్టొచ్చినట్టు కనిపించే పాలకుల వైఫల్యాన్ని .
-ఎం.వి.ఎస్‌. శర్మ

పునరపి జననం

నాలుగు జీతం రాళ్లు సంపాదిస్తున్న ఈ రోజుల్లో సంసారం గడవటం అంత తేలిక కాదు. కరోనా లాక్డౌన్‌ లతో పెరిగిపోయిన ధరలను తట్టుకోవడం సామాన్యుని శక్తికి మించిన పని. ఇక ప్రైవేటు పాఠశా లల్లో పనిచేసే ఉపాధ్యాయుల సంగతి దీనికి భిన్నం కాదు. కరోనా లో లాక్‌ డౌన్‌ లో పాఠశాలలు నెలలతరబడి మూసేస్తే? గోరుచుట్టుపై రోకటి పోటే. ఉపాధ్యాయులకు యాజమాన్యం అంతంత మాత్రంగానే జీతాలు ఇస్తారు. కరోనా లో అది మానేసారు. ఆవు ఉపాధ్యాయుల బ్రతుకు కుడితిలో పడ్డ బల్లి చందమే. ఉపాధ్యాయుడు కరోనాతో తండ్రిని పోగొట్టుకుని చేతిలో చిల్లిగవ్వ లేని అతడు ఏం చేయాలో తెలియక మరణమే శరణ్యం అనుకున్నాడు. ఆ ఇంటి యజమాని ఈ ఉపాధ్యాయుడికి ఎలా జీవితంపై ఆశ కల్పించాడోచెప్పేదే ఈ కథ.

‘‘ఎంతో మందిని పొట్టనబెట్టుకున్న ఈ మహమ్మారి కోవిడ్‌ నన్ను ఎందుకు వదిలి పెట్టిందో నాకు అర్థం కావటం లేదు. నా చావు నా చేతిలోనే ఉందేమో’’ అనుకుంటూ సీసా మూత తీసి నోట్లో పోసు కుందాం అనుకుంటూ ఉండగా మధు మధు అంటూ ఎవరో తలుపు శబ్దం చేసేటప్పటికి ఉన్నపళంగా వచ్చి తలుపు తీసి చూసేసరికి హుందా గా ఉన్న ఓ అపరిచితుడు
‘‘లోపలికి రావచ్చా’’ అంటూనే లోపలికి వచ్చి కుర్చీలో కూర్చుని’ ఇదిగోండి తిరుమల
ప్రసాదం’ అని మధు చేతిలో పెట్టాడు.
అన్నం తిని ఎన్ని రోజులు అయ్యిందేమో కానీ ఆవురావురంటూ కొండ లడ్డు తిని తృప్తిగా గ్లాసుడు నీళ్లు తాగాడు మధు. అపరిచితుడు‘‘ నాపేరు శివ శంకర్‌. నేను స్వర్గీయులు అయిన మీ నాన్న గారి శిష్యుడిని.
నీవు ఉంటున్న ఇల్లు నాది. కోవిడ్‌ మూలంగా ప్రైవేట్‌ పాఠశాలలు కళాశాలల్లో పనిచేసే
ఉపాధ్యాయులకు జీతాలు లేవని, వారి బ్రతుకులు రోడ్డున పడ్డాయి అనే వార్త చదివి
ఇలా వచ్చా. నాకు కొంచెం మంచినీళ్లు ఇస్తారా’’? అని అడిగాడు శివ శంకర్‌.
మధు లోపలికి నీళ్లు తేవటానికి వెళ్లగానే టేబుల్‌ మీద మూత తీసి ఉన్న సీసాను చూచి
ఆశ్చర్య పోయాడు శివ శంకర్‌.
‘‘ ఇదిగోండి నీళ్లు.’’ అంటూ మధు నీళ్ల గ్లాసు శివశంకర్‌ కు అందించాడు. ‘‘ మీరు లోపలికి
వెళ్లగానే నా దాహం తీరింది. ఇక మీకు ఈ సీసాతో పనిలేదు, మీరు నాతో బయలుదేరండి.
ఇది మీ సోదర తుల్యుని ఆజ్ఞ అనుకోండి’’ అంటూ మధు సూట్‌ కేసు లో బట్టలు సర్ది,
చేయి పట్టుకొని బయటకు తెచ్చి, తలుపుకు తాళం వేసి, ‘‘ఎక్కండి కారు’’. అని ఇద్దరూ
కారులో కూర్చోగానే డ్రైవర్‌ కార్‌ స్టార్ట్‌ చేసి ముందుకు దూసుకుపోయాడు.
రెండు నెలలు తరువాత మధు, శివశంకర్‌ తిరిగి శంకరాపురం చేరుకున్నారు. తలుపు తాళం తీసి
‘‘ఇదిగో లక్ష రూపాయలు చెక్‌. రెండు నెలలు ముందు నీకు ఇద్దామని తెచ్చా. నీవు నా
ఇంట్లో ఉన్న రెండు నెలల్లో నా గురించి నీకు, నీ గురించి నాకు పూర్తిగా
తెలిసిపోయింది కదా ధైర్యంగా ఉండు. నీవు ఇప్పుడు ఒంటరి వాడివి కావు. కోవిడ్‌ వల్ల
తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఐదుగురు అనాధలకు తల్లి, తండ్రి, దైవం, గురువువి.’’
అంటుండగానే ఐదుగురు పిల్లల్నితీసుకొని డ్రైవర్‌ తులసిరామ్‌ వచ్చాడు.
‘ నమస్కారమండీ’ అని ఐదుగురు పిల్లలు ఒకేసారి చెప్పి ఇద్దరి కాళ్లకు దండం
పెట్టారు.
‘‘ ఈ బ్రీఫ్‌ కేస్‌ లో అనాధల పోషణకు కావాల్సిన ప్రభుత్వ అనుమతి పత్రాలు ఉన్నాయి.
ఈరోజు అందరం హోటలులో భోజనం చేద్దాం, రేపటి నుండి వంటమనిషి వస్తుంది’’ అంటూ
బ్రీఫ్కేస్‌ మధుకి ఇచ్చాడు శివశంకర్‌.
మధు బ్రీఫ్‌ కేస్‌ తెరిచి చూడగానే తన తండ్రి పేరున ‘‘గోస్వామి ఆనందరావు అనాధ
శరణాలయం’’ అని రిజిస్ట్రేషన్‌ చేయించిన పత్రాలు చూడగానే కళ్ళ వెంట ఆనంద
భాష్పాల రాలాయి.
శివశంకర్‌ ను హత్తుకున్నాడు మధు. ‘‘ నా విషయంలో ఇదేనేమో పునరపి జననం అంటే’’అంటూ ‘‘
మీరు నా మీద పెట్టుకున్న ఆశలు తప్పక నెరవేరుస్తాను. ఈ పిల్లలను అభివృద్ధిలోకి
తెచ్చే బాధ్యత నాది. మీరు నిశ్చింతగా ఉండండి’’ అంటూ నమస్కరించాడు మధు.

పోవరం ఎవరికి వరం.. ఎవరికి శాపం…!

ముంపు ప్రాంతానికి చెందిన రాము గిరిజనుడు ఈవిషయం గురించి మాట్లాడుతూ ‘‘నాపక్క పొం లోకి నీళ్లువచ్చినప్పుడు నేను ఆనీళ్లలో నాపొం లోకి రాకుండా ఎలాఆపగను? ఇదే ప్రశ్న అధికా రుని అడిగితే తర్వాత చూద్దాం అంటున్నారు. తర్వాత చూడడానికి ఏముంటుంది? మా పక్కనే ఉన్న గ్రామాు అన్ని మునుగుతాయి అంటున్నారు. కానీ మా గ్రామాల్లో మాత్రం పొలాు మాత్రమే మునుగుతాయి అని అధికాయి చెబుతున్నారు. పొలాు మునిగితే మేము ఏమి చేసుకుని బతకాలి? మా పక్క గ్రామాన్నీ మునిగినప్పుడు మా గ్రామం ఒకటే మిగిలితే కూడా ఒక్కరమే కూడా ఎలా ఉండగము? ఒకవేళ ఉంటే , మేము వేరే ఊళ్ళకి ఎలా వెళ్లాలి? రాకపోకు ఎలా జరుగుతాయి? మా ప్లిు స్కూల్కి ఎలావెళ్తారు? అందుకని ఇప్పటి ప్రాజెక్టు నీటిమట్టం, ఎత్తు ప్రకారంత్వరగా సర్వే చేసి, మాకు అతిత్వరలో స్పష్టత ఇవ్వాని కోరుకుంటున్నాను.’’


పోవరం కొన్ని దశాబ్దాుగా కొనసాగు తున్న సుదీర్ఘ గాథ! గోదావరి మాదిరిగానే దీని ప్రయాణం లోనూ ఎన్నో ముపు. ఎన్నో అభ్యంతరాను, అవరోధాను అధిగమిస్తూ చివరకు జాతీయ హోదాను పొందింది. అయినా కథ సాఫీగా నడవ డం లేదు. అనేక ఒడుదొడుకు మధ్య పయని స్తోంది. సకాంలో నిధు ఇవ్వడం లేదం టోంది రాష్ట్రం.ఇచ్చినవాటికి లెక్కు అడుగుతోంది కేంద్రం. తాను కోరుకున్న పద్ధతిలో పను సాగాం టోంది. ఇంతకు పోవరం ఆవశ్యకత ఏమిటి? ఆంధ్ర ప్రదేశ్‌ జీవనాడిగా అభివర్ణిస్తున్న పోవరం స్వరూ పం ఏమిటి?దీనిద్వారా ఎటువంటిప్రయోజ నాు కగను న్నాయి. నిర్వాసితుకు అందించే నష్టపరి హారం, పునర వాసం ఎంతవరకు జరుగుతుంది వంటి ప్రశ్నకు సమాధా నాు పరిశీలిద్దాం!
పోవరం ఓ సుదీర్ఘ ప్రయాణం…. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో1941లో తొలి సారిగా పోవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబం ధించిన ఆలోచనకు బీజంపడిరది. మద్రాసు ప్రెనిడెన్సీ చీఫ్‌ ఇంజనీర్‌ దివాన్‌బహదూర్‌ ఎల్‌.వెంకటకృష్ణ అయ్యర్‌ ఈప్రాజెక్టుపై తొలిసర్వే నిర్వహించి నిర్మా ణానికి సంబంధించిన అంచనాను సిద్ధం చేశారు. ఆనాటి నుంచి పోవరం ప్రాజెక్టు నిర్మాణం వివా దా మధ్యే నలిగిపో తున్నది. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ చొరవతో 1980లో అప్పటి ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్య మంత్రి టి.అంజయ్య పోవరం ప్రాజెక్టు పనుకు శంకు స్థాపన చేశారు. ఆయన తెంగాణకు చెందిన నాయకుడు. అప్పుడే పోవరం ప్రాజెక్టుకు ఇందిరా సాగర్‌ అని నామకరణం చేసింది కూడా అంజయ్యే. తరువాత 1983లోస్వర్గీయ నందమూరి తారకరామారావూ పోవరం ప్రాజె క్టుకు శిలాఫకం వేశారు. నాటి నుంచి నేటి వరకూ అధికారంలోకి వచ్చిన ముఖ్య మంత్రు తమ పానలో ప్రతి ఏటా బడ్జెట్‌లో నామమాత్రం గా నిధు కేటాయించి ఈప్రాజెక్టు ప్రతిపాదను పెంచుతూ పోయారేతప్ప ప్రాజెక్టునిర్మాణాన్ని మాత్రం చేపట్టలేక పోయారు. వైఎఎస్‌ఆర్‌ ముఖ్య మంత్రిగా పదవీబాధ్యతు నిర్వహించిన సమయం లో చేపట్టిన జయజ్ఞం పనుల్లో భాగంగా పో వరం ప్రాజెక్టునిర్మాణాన్ని వేగంగా ముందుకు తీసు కెళ్లారు. దశాబ్దా జాప్యం తర్వాత 2004 నుంచి ఈప్రాజెక్టు నిర్మాణం వేగం పుంజుకుంది. ఇప్పటికే 5000 కోట్ల వ్యయంతో కాువ నిర్మాణం కూడా పూర్తయింది
పోవరం వివాదంగా ఎందుకు మారింది..?
రాష్ట్రాభివృద్ధిలో భాగంగా భారీ వ్యయంతో నిర్మించ తపెట్టిన పోవరం ప్రాజెక్టు ప్రారంభం నుండీ చర్చనియాంశంగా తయారై వివాదాకు కేంద్రంగా మారింది. ఈప్రాజెక్టుసాగు ప్రయోజనాు, విద్యుత్‌ ఉత్పత్తి, ముంపు సమస్యు, ఇరుగుపొరుగు రాష్ట్రా అభ్యంతరాు ఈప్రాజెక్టును చుట్టు ముట్టాయి. గోదావరి నదిపై పోవరం ప్రాజెక్టు నిర్మాణంవ్ల వ్యవసాయం, విద్యుదుత్పత్తి,త్రాగునీరు, పారిశ్రామి కాభివృద్ధే పోవరం ప్రాజెక్టు ముఖ్యోద్దేశ్యం. కానీ ఈభారీ ప్రాజెక్టుకు నిపుణు సిఫారసును పెడ చెవినపెట్టిన అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పో వరం ప్రాజెక్టు నివేదికను 1970లో తయారుచేసి, మళ్ళీ దాని స్వరూపాన్ని 1978లో మార్చింది. ఈనేపథ్యంలో ఒరిస్సాలోని మోటు, ఛత్తీస్‌గఢ్‌ లోని కొంటా తాూకాలోని గిరిజన గ్రామాు విపరీత మైన ముంపుకు గురయ్యే ప్రమాదమున్నందున బచావత్‌ ట్రిబ్యునల్‌ ఎదుట ఆరాష్ట్రాు షరతు పెట్టాయి. పోవరం ప్రాజెక్టువద్ద 36క్ష క్యూ సెక్కు వరదప్రవాహం వుంటుందని మొదటి అంచనా వేయగా,తర్వాత వెయ్యేళ్ళకు ఒకసారి వచ్చే గరిష్ట వరదప్రవాహం యాభైక్ష క్యూసెక్కు ుగా లెక్కకట్టారు. ఈ యాభై క్ష క్యూసెక్కును పరిగణలోకి తీసుకొనిముంపును అంచనా వెయ్యా ని ఒడిస్సా అంటోంది.ఈ ప్రాజెక్టువ్ల ఒరిస్సా, చత్తీస్‌ఘఢ్‌లోని ముంపు సమస్య ఏర్పడడంతో కరక ట్ట నిర్మాణం చేపడతామని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం హామీ కూడా ఇచ్చింది. 2005లో ఈ అంచనాను అనుసరించి ముంపునకు గురయ్యే స్థలాను,గ్రామాను,అడవును గుర్తించడమే కాకుండా దానికి తగ్గట్టు నిర్వాసితు పునరావాస పథకాను రూపొందించి కేంద్రప్రభుత్వ అను మతిని,కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ అను మతిని పొందింది. అయితే పొరుగురాష్ట్రాల్లో ముం పునకు గురవుతున్న ప్రాంతా విషయమై ఆయా రాష్ట్రాతో సంప్రదించి, అనుమతు పొంద కుండానే ప్రాజెక్టు కాువ నిర్మాణ పను చేపట్ట డం,ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రపునర్‌ విభజనతో ఈ వివా దం మరోసారి రాజుకుని జాతీయ ప్రాజెక్టు హోదా దక్కించుకుంది పోవరం.
పోవరం ఓ వరం ..
గోదావరినదిపై పోవరం ప్రాజెక్టు నిర్మాణం వ్ల ఉభయగోదావరి జిల్లాు,విశాఖ,కృష్ణా జిల్లాల్లో మొత్తం 7క్ష 20వే ఎకరాకు సాగునీరు అందనుంది. వీటితోపాటు విశాఖజిల్లాలో తాగు నీరు,పారిశ్రామిక అవసరాకు మరో23.44 టీఎమ్‌సి నీటిని తరలించనున్నారు. అంతేకాదు, పోవరం ప్రాజెక్టు నిర్మాణంవ్ల 960మెగా వాట్ల విద్యుత్‌ ఉత్పతి అవుతుంది. పోవరం నిర్మాణం పూర్తయితే మొత్తం 273.04టీఎంసీ నీటిని విని యోగించుకునే మీంది. ఈప్రాజెక్టు నిర్మాణం ద్వారా80టీఎంసీ నీటిని కృష్ణానదికి మళ్ళించ వచ్చు. కుడికాువద్వారా ప్రకాశం బ్యారెజీ ఎగువ భాగంలో పోవరం నీరు కుస్తుంది. అంతేకాదు బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పు ప్రకారం ఇలా మళ్ళేంచే 80 టీఎంసీలో 21టీఎంసీు కర్నాటకకూ, 14 టీఎంసీు మహారాష్ట్రకు వెళతాయి.
పోవరం ఇక జాతీయ ప్రాజెక్టు
2010-11 ధర ప్రకారం పోవరం నిర్మాణం కోసం 10 వే కోట్ల రూపాయ వ్యయం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పటివరకూ సుమారు 5 వే కోట్ల రూపాయు ఖర్చు చేసింది. జాతీయ హోదా ఇచ్చిన తర్వాత ప్రాజెక్టు నిర్మాణానికయ్యే వ్యయంలో తొంభై శాతం కేంద్రం భరిస్తుంది. తాజా ధర ప్రకారం మరో ఇరవైశాతం నిర్మాణ వ్యయం పెరుగుతుందని అంచనా వేసుకుంటే 10 వే కోట్లకు పైగా కేంద్రం ఖర్చు చేయాల్సి వుంటుంది.
పాపం పోవరం వారికి శాపం
ఖమ్మం జిల్లా ప్రజు పూర్తిగా పోవరం ప్రాజెక్టు ను వ్యతిరేస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో తమ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుందని గిరిజను తీవ్ర భయాందోళనకు గురువుతున్నారు. పోవరం ప్రాజెక్టు నిర్మిస్తే తెంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో 278 నుంచి370 గ్రామా వరకు మాయ మవుతాయి. దాదాపుక్ష ఎకరాల్లో పంట పొలాు జ సమాధి అవుతాయి. భారీస్థాయిలో అటవీ ప్రాంతం కనుమరుగవుతుంది. ప్రకృతి ఒడిలో జీవించే గిరిజనుకు మరో జీవన విధానం తెలి యదు. అలాంటి అడవి బిడ్డకు జీవన్మరణ సమస్య సృష్టించడం అమానవీయమంటూ ప్రజాసంఘాు గత పది సంవత్సరాుగా పోరాడుతూనే ఉన్నాయి. ఇక మా రాష్ట్ర ప్రజను.. ప్రాంతాన్ని ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎలా విలీనం చేస్తారంటూ తెంగాణా వాదు గగ్గోు పెడుతున్నారు.
మొత్తానికి పోవరం ప్రాజెక్టును ఆంధ్ర ప్రాంత ప్రజానీకం ఆధునిక దేవాయంగా అభివర్ణిస్తుంటే తెంగాణా ప్రాంతానికి ముఖ్యంగా ఖమ్మం జిల్లా గిరిజను పాలిటశాపంగానే తయారైంది. అయితే ఇటువంటి భారీ ప్రాజెక్టుకు రూపక్పన జరిగి నప్పడు ఇటువంటి ఇబ్బందు ఎదురవడం అతి సహజం. అయితే ప్రభుత్వాు నిర్వాసితుకు తగు న్యాయం చేసే విధంగా.. వారి బతుకుకు భరోసా ఇచ్చేదిగా ఉండాలి.
ముంపు గ్రామాలే అసు సమస్య
పోవరం నిర్మాణంవ్ల చాలా గ్రామాు ముంపు నకు గురవుతాయి. నిర్వాసితు సంఖ్య కూడా భారీగానే వుంటుంది. రాష్ట్రంలోని 274 గ్రామా ల్లోని 44,574 కుటుంబాకు చెందిన 1,77,275 మంది నిర్వాసితువుతారు. ఇందులో ఖమ్మం జిల్లాలో 205 గ్రామాు,తూర్పుగోదావరి జిల్లాలో 32గ్రామాు,పశ్చిమగోదావరి జిల్లాలో 29 గ్రామాు ప్రాజెక్టులో కలిసిపోతాయి. ఖమ్మం జిల్లాలో నిర్వాసితు సంఖ్యలో సగానికి పైగా గిరిజనులే. అలాగే ఒడిశాలో8 గ్రామాకు చెందిన 6,316 మంది,చత్తీస్‌ఘడ్‌లో4 గ్రామాకు చెందిన 11,766మంది నిర్వాసితువుతారు. ఇంత భారీ సంఖ్యలో గ్రామాతరలింపు, నిర్వాసితుకు పునరావాసం,ప్రాజెక్టు మొత్తంవ్యవహారంలో ప్రధాన సమస్యగా చెప్పుకోవచ్చు.
నిర్వాసితు గోడు పట్టించుకొనేదేవరు?
ఈప్రాజెక్టు నిర్మాణంవ్ల 376 గ్రామాు ముంపు నకు గురవుతున్నాయి. ముంపుకు గురవుతున్న మండలాలో పశ్చిమగోదావరిజిల్లా పరిధిలోకి పో వరం,కుక్కునూరు, వేలేరుపాడు వస్తున్నాయి. తూర్పు గోదావరిజిల్లాపరిధిలోకిఎటపాక,చింతూరు, వి. ఆర్‌.పురం,కూనవరం,దేవీపట్నం. ప్రస్తు తం ఇవి అన్ని రంపచోడవరం ఐటీడిఏ పరిధిలో ఉన్నాయి. పాన ఐటీడిఏ ద్వారా జరుగుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఈఆరు మండలాు (ఎటపాక, చిం తూరు,వి.ఆర్‌.పురం,కూనవరం, కుక్కునూరు, వేలేరుపాడు) నాటి ఖమ్మంజిల్లా పరిధిలోకి వచ్చేవి. 2014లో రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈమండ లాన్నీ ఆంధ్రప్రదేశ్‌లో విలీనంచేశారు. ఈ మం డలాల్లో 90%పైగా గిరిజనులే ఉండటం విశేషం. ప్రస్తుత రికార్డు ప్రకారం 601చదరపు కిలోమీటర్లు భూమి ముంపులో ఉంది.గత రెండు నెలుగా తూర్పుగోదావరి జిల్లాలోని పు మండలాల్లో ఉన్న గ్రామాల్లో గ్రామసభు అధికా యి నిర్వహి స్తున్నారు. ఈగ్రామసభు, పోవరం ప్రాజెక్టు నిర్వా సితు భూసేకరణకి మరియు ఆర్‌ఆర్‌ ప్యాకేజీకి సంబంధించినవి. ఈగ్రామసభు జరుగు తున్నతీరుపై ప్రజు తీవ్రఆందోళనకు గురవుతు న్నారు. చింతూరు మండంలోని రామన్న పాలెం అనే ఊరిలో జరిగిన భూసేకరణ మీటింగ్లో అధికాయి ఊరిలోఉన్న 698ఎకరా భూమిలో కేవం 114 ఎకరాు మాత్రమే మంపు లో ఉందని వివరిం చారు. ఆ 114ఎకరాల్లో ఉన్న వారి పేర్లను, సర్వే నెంబర్లను చదివి వినిపించారు. ఆపొలాకి ఆను కొని ఉన్న పొలాుగ రైతు,తమ పొలాు వాటితో ఆనుకుని ఉన్నాయని వాటిలోకి నీళ్ళు వస్తే తమ పొలాల్లోకి కూడా వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి అధికాయి ఇది 1986లో వచ్చిన గోదావరి వరద ముంపు ఆధారంగా వేసిన ఒక అంచనా అని చెప్పారు. పోవరం ప్రాజెక్ట్‌ అథారిటీ వాళ్ళు మళ్ళీ కొత్త జాబితా పంపి నప్పుడు మీకు తెలియ చేస్తామని అన్నారు . ఇది సైంటిఫిక్‌ ప్రక్రియ ప్రకారం వేసిన అంచనా ఎంతమాత్రం కాదని స్పష్టమవుతోంది. అధికాయి ఇలా తమ భూము, ఇళ్ళపట్ల నిర్లక్ష్యం వహించి, ముంపునకు సంబంధించిన స్పష్టత ఇవ్వకపోతే, రేప్పొద్దున వరదు వచ్చినప్పుడు తమ పరిస్థితి ఏమిటని గ్రామస్తు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముంపు ప్రాంతానికి చెందిన రాము గిరిజనుడు ఈవిషయం గురించి మాట్లాడుతూ ‘‘నాపక్క పొం లోకి నీళ్లువచ్చినప్పుడు నేను ఆనీళ్లలో నాపొం లోకి రాకుండా ఎలాఆపగను? ఇదే ప్రశ్న అధికా రుని అడిగితే తర్వాత చూద్దాం అంటున్నారు. తర్వాత చూడడానికి ఏముంటుంది? మా పక్కనే ఉన్న గ్రామాు అన్ని మునుగుతాయి అంటున్నారు. కానీ మా గ్రామాల్లో మాత్రం పొలాు మాత్రమే మునుగుతాయి అని అధికాయి చెబుతున్నారు. పొలాు మునిగితే మేము ఏమి చేసుకుని బతకాలి? మా పక్క గ్రామాన్నీ మునిగినప్పుడు మా గ్రామం ఒకటే మిగిలితే కూడా ఒక్కరమే కూడా ఎలా ఉండగము? ఒకవేళ ఉంటే , మేము వేరే ఊళ్ళకి ఎలా వెళ్లాలి? రాకపోకు ఎలా జరుగుతాయి? మాప్లిు స్కూల్కి ఎలావెళ్తారు? అందుకని ఇప్ప టి ప్రాజెక్టు నీటిమట్టం,ఎత్తు ప్రకారంత్వరగా సర్వే చేసి,మాకు అతిత్వరలో స్పష్టత ఇవ్వాని కోరుకుం టున్నాను.’’అంటూ తనఅభిప్రాయం వ్యక్తం చేసాడు చింతూరు మండం పరిధిలో,తిమ్మిరిగూడెం ఊళ్ళోకూడా అధికాయి పొలాు మాత్రమే మునుగుతాయని చెబుతున్నారు. ఈపరిసర గ్రామా ల్లో ప్రజు కూడా ఇలాంటి ప్రశ్నతోనే సతమత మవుతున్నారు. ఇలాంటి పల్లొ ఇంకెన్నో. కొటారు గొమ్ము అనే కొండరెడ్డి గ్రామంలో ఆర్‌ఆర్‌ ప్యాకేజీకి సంబంధించిన గ్రామసభ జరిగింది. ఈ గ్రామంలో భూసేకరణ ఎప్పుడో 10సంవత్సరా మునుపు చేశారు. నష్టపరిహారం అన్ని భూముకు ఇవ్వలేదు. కారణం ఇక్కడి గిరిజను కొండపోడు అధికంగా చేస్తారు. ప్రస్తుత ఆర్‌ ఆర్‌ పాసీలో కొండ పోడు భూముకు పరిహారం ఇచ్చేసౌకర్యం లేదు. కొటారు గొమ్ములో 70శాతం మందికి కొండపోడు భూము పట్టాలే ఉన్నాయి. కావున వీళ్ళకి ప్యాకేజీ ఇవ్వక పోతే వీళ్లంతా భూమిలేని నిర్వాసితు అవు తారు. దీనితో పాటు వ్యక్తిగత ప్యాకేజీ విషయంలో కూడా చాలా సమస్యు ఎదురవుతున్నాయి.ప్రస్తుత పాసీ ప్రకారం18సంవత్సరాు నిండిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వంరూ.686,000ఇస్తుంది. దానితో పాటు వాళ్ళకి కానీలో వేరే ఇు్ల కూడా కట్టి ఇస్తారు. దీనికి ప్రతిదికగా నోటిఫికేషన్‌ ఆధారంగా అధికా యి 2017మార్చి నె కట్టాఫ్‌ డేటు గా ప్రకటిం చారు. మార్చి2017 నాటికి 18ఏళ్ళు నిండినవాళ్ళే దీనికి అర్హుగా ప్రకటించారు. కానీ నేటికీ కూడా ఆఊరిని,కానీకి తరలించలేదు. వారికి వ్యక్తిగత ప్యాకేజీ డబ్బు కూడా చెల్లించలేదు. కావున గ్రామస్తుంతా కటాఫ్‌డేటుని ఈసంవత్సరం వరకు పొడిగించాని కోరుతున్నారు. ఇలా గడువు పొడి గించడంవ్ల దాదాపు30నుంచి40మంది ఈలిస్టు లోఅర్హులై ఈపాసీతో బ్దిపొందుతారని చెప్తు న్నారు. గ్రామసభకు వచ్చినఅధికాయి ఈ విషయా న్ని పైఅధికారు నోటిస్‌కి తీసుకెళ్తామని సమా ధానం ఇచ్చి తప్పించు కుంటున్నారు. పోవరం కోసం తమ సర్వస్వాన్ని కోల్పోతున్న నిర్వాసితుకు కటాఫ్‌డేట్‌ కూడా సరిచేసి ఇవ్వలేని ప్రభుత్వం తమకు ఎటువంటి న్యాయం చేయగదంటు ఇక్కడి ప్రజు ప్రశ్నిస్తున్నారు. కొటారుగొమ్ము గ్రామస్తు రాు క్ష్మి తన మాటల్లో ‘‘భూమిలేని ఆదివాసి రోజుకూలీగా మారడం ఖాయం. ఎందుకంటే అక్కడ మేము ప్రతిఒక్కటి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు మేము ఉండే అడవిలో మాకు ఎన్నో దొరుకుతాయి.వంటకికట్టొ, కాయు, పండ్లు,దుంపు, వనమూలికు ఇలా కాలాను గుణంగా అడవి ఉత్ప త్తు భిస్తూనే ఉంటాయి. ప్రతి ఒకటి ఎంతోప్రయోజకరం. మా ఊరు గోదా వరి ఒడ్డుకి ఆను కునే ఉంటుంది. మేము రోజు గోదారి చెలిమె నించి తాగునీరు తెచ్చుకుంటాం. గోదావరిలో చేపు పట్టుకుంటాము. రోజు మా గొడ్లు వెళ్లి గోదారిలో సేదతీరి వస్తాయి వాటిని ఎవరూ మేపాల్సిన పనేలేదు. ఇంతస్వేచ్ఛగా బ్రతికే మమ్మల్ని తీసుకెళ్ళి ఆకానీలో పడేస్తే మేము ఎలా బతకాలి. ఆకానీలో ఇు్లచాలా ఇరుకుగా ఉన్నాయి. అక్కడగొడ్లను కట్టేసు కోవడానికి సరిపడా చోట కూడా లేదు.కనీసం మాకు వంట చేసుకోవ డానికి అక్కడ ప్లు కూడా దొరకవు. ప్రతి నెవంట గ్యాసు కొనాంటే మాకుచాలా ఖర్చు అవుతుంది. పైగాఅక్కడ కూలీ దొరుకు తుందో లేదో! ‘‘ అంటూ తమకు రాబోయే దుస్థితి గురించి ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు అన్ని కొండారెడ్డి పల్లెల్లో ఇది పరిస్తితి. వచ్చే రెండునెలో 8పల్లెను కానీల్లోకి తరలించనున్నారు.
ఇు్ల వదిలి కానీకు చేరిన తర్వాత
ఇటీవలే దేవీపట్నం మండంలోని కొన్ని గ్రామా ను అధికాయి ఖాళీ చేయించి వారిని కానీ లోకి తరలించారు. ఇందులో కచ్చుూరు,సుద్ధ గొమ్ము,అగ్రహారం,ఏనుగుగూడెం,సీతారం ఊళ్ళు ఉన్నాయి. అందరికీ ఆర్‌ఆర్‌ ప్యాకేజీ, ఇంటి ప్యాకేజీ ఇవ్వడం జరగలేదు. అగ్రహారం ఊరిలో 72 కుటుంబాు ఉంటే, దాదాపు 20పెండిరగ్‌ కేసు ఉన్నాయి. 18మందికి ఏకంగా ప్యాకేజీ రిజెక్ట్‌ అయింది. అయినప్పటికీ వీరిని కొత్త కానీలో నివాసం తరలించారు. కొత్త కానీలో సీసీ రోడ్డు, డ్రైనేజ్‌ వసతి,తాగునీటి వసతిలేదు. ఉన్న ఒకే ఒక్క వాటర్‌ ట్యాంకునుండి కానీకి వాడుకునే నీటిని సరఫరా చేస్తున్నారు. చాలాసార్లు సాయంత్రం అయే సరికి వాటర్‌ ట్యాంక్లో నీళ్ళు ఉండటం లేదు. ప్రజు ఈసమస్యని అధికారు సమక్షంలో లేవ లెత్తగా ఇంకొక వాటర్‌ట్యాంక్‌ కట్టిస్తాం అని అధికా యి మాట ఇచ్చి దాటవేశారు. వారి సమ స్య గురించి ప్రశ్నించినప్పుడు వాళ్ళకి ఉపాధి భించే అవకాశాు కూడా ఏవీ లేవని అగ్రహారం గ్రామ స్తు తెలియజేసారు. భూవివాదంతో చాలా మం దికి భూమికి తగ్గసాగు భూమి భించక అంతా అయోమయంలో ఉన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో పోవరం వీరికి శాపమే అని ఇక్కడి ప్రజు అభిప్రాయపడుతున్నరు. పాసీ పరంగా ఎటువంటి చర్యు తీసుకుంటే వీరికి కనీస న్యాయం చెయ్యొచ్చు. చరిత్రనిండా ఏంటో నష్టపోయి అడవుల్లో శరణు పొందిన ఆదివాసుల్ని, బవంతంగా కానీకు తరలించి వాళ్ళ జీవావ రణానికి ముప్పు తెచ్చినట్లు ఉంది ప్రస్తుత పరిస్తితి. ప్రాజెక్టు లాభాల్లో వాటాదాయిగా వీళ్ళని పరిగ ణించి,ఉన్నతమైన జీవనాన్ని అందించే వెసు బాటు లేనప్పుడు ప్రాజెక్ట్‌ కోసం వీళ్ల భూముల్ని, ఇళ్ళన్ని లాక్కోవడం సమంజసమేనా? ఈ కోణంలో ఆలోచించి, వీరి హక్కుని కాపాడుతూ నిర్వాసి తుకు తగ్గిన న్యాయాన్ని ఇవ్వాని డిమాండ్‌ చేస్తున్నారు ఆదివాసు. పోవరం ప్రాజెక్ట్‌ నిర్మా ణానికి పేసా (గ్రామ పంచాయతీ తీర్మాన చట్టం), ఎఫ్‌ఆర్‌ఏ(అటవిహక్కుచట్టం) చట్టాను పూర్తిగా ఉ్లంఘించిన ప్రభుత్వం, నిర్వాసితుకు కనీసం ఆర్‌ ఆర్‌ ప్యాకేజీలోని లోపాని సరిచేసి కొద్దో గొప్పో ఊరటనివ్వాని ఇక్కడి ప్రజు, హక్కు సంఘానేతు,పర్యావరణ కార్యకర్తు అభిప్రాయ పడుతున్నారు.

నివృతి.జి

మాఊరి పండుగలు.. స్థానిక ఆచారాలు…!

జనవరి 25 శనివారం సాయంత్రం రిషీవ్యాలి పాఠశాలో సంక్రాంతి సంబరం. మధ్యాహ్నం పాఠశాల‌లో పనిచేసే పనివారికి వ్యవసాయశాఖ (ఎస్టేటులో) భోజనాలు పెట్టారు. 3.30 నిము షాల‌కు ఆవును, ఎద్దును అంకరించి డప్పులు మేళాల‌ సందడితో పిల్ల‌న గ్రోవిల‌ పాటతో, స్త్రీ, పురుషు ఆడే జానపద నృత్యాతో సందడిగా వుంది పాఠశా. విద్యార్థు వసతి గృహా ముందు చక్కగా అలికి ముగ్గువేసి గొబ్బెమ్మతో అంకరించారు. ప్రధాన మార్గం గుండా ఆటస్థంలోకి ఆటపాటతో అందరూ చేరుకున్నారు. అక్కడ ఓ అరగంటసేపు విద్యార్థు కూడ గ్రామీణుతో కలిసి వారు చేసే నృత్యానికి అనుగుణంగా కాళ్లు చేతు కదుపుతు వృత్తాకారంలో చేయి చేయి పట్టుకొని తిరుగుతు, ఎగురుతు ఆనందిస్తున్నారు.సెల్‌ ఫోన్లలో ఆ దృశ్యాు బంధింపబడు తున్నాయి. నెమ్మదిగా భోజనశా మీదుగ నిర్జన మైదాన ప్రదేశానికి చేరుకున్నారు అందరు. ‘‘చిట్లాకుప్ప’’కు మంట వెలిగించి పశువును మూడుసార్లు ప్రదక్షిణం చేయించి గోశాకు తీసుకువెళ్లారు. నేను పాఠశాలో చేరిన కొత్తలో ఇదంతా ఓవింతగా అనిపించింది. పండుగ ఐపోయి పదిరోజు తరువాత ఈ సంక్రాంతే మిటని అనుకున్నా! ఆ విషయం అప్పుడు అక్కడితో మర్చిపోయా! జనవరి 14,15 తేదీలో సంక్రాంతి పండుగ పూర్తయితే మా ఊరిలో 25న సంక్రాంతేంటనే అనుమానం నాలాగ అందరికీ కుగుతుంది. చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధమైన పాఠశా రిషీవ్యాలి స్కూు అదే మాఊరు. దానిని జిడ్డు కృష్ణమూర్తిగారు స్థాపించారు. ప్రకృతికి, పక్షు, పశువు, కొండు, గుట్టకు సమీపంగా ప్రశాంతంగా వుండే 350 ఎకరా పాఠశాకు 3కిలో మీటర్ల దూరంలో ‘తెట్టు’అనే గ్రామం ఉంది. తెట్టు గ్రామం అసు పేరు ‘‘శేషనగరము’’. ఈ గ్రామంలో అతి ప్రాచీనమైన ‘‘సంతాన వేణుగోపాస్వామి’’ దేవాయమునకు అటు తమిళనాడు, ఇటు కర్ణాటక నుండి కూడ భక్తు వచ్చి తమతమ కోరికు నెరవేరినందున మొక్కు తీర్చుకుంటు వుంటారు. అశ్వనీ నక్షత్రముతో కూడుకున్న అమావాస్యనాడు శ్రీవారి కళ్యాణోత్సవము జరుగును. స్వామివారి విగ్రహము కోనేరులో అమావాస్యనాడు భించుటతో ఆనాటి నుండి అమావాస్యనాడే కళ్యాణోత్సవం నిర్వహించటం ఆనవాయితీ అయింది.కాక్రమేణ శేషనగరము ‘తెట్టు’ గా మారింది. సుమారు 20 కుటుంబా వారు గతంలో అక్కడ ఒక కోట నిర్మించుకొని ఏనుగు బారిన పడకుండుటకై చుట్టు ముళ్లకంపతో ఎత్తైన తెట్టు వేసుకున్నందున ఆ గ్రామానికి తెట్టు అను పేరు వచ్చింది. విశిష్టాద్వైత దర్శన ప్రవర్తకుడగు శ్రీమద్రామానుజాచార్యు వారి విగ్రహం ఆ దేవాయంలో వున్నందున రామాను జాచార్యు వారు ఆదిశేషుని అవతారం కావున ఆ ఊరికి నాడు ‘శేషనగరం’ అని పేరు వచ్చింది.ప్రస్తుతం ఈ తెట్టు చుట్టు ప్రక్క గ్రామా కంటే పెద్దది కావున ‘‘కస్ఫా’’ గ్రామం అంటారు. చుట్టుప్రక్క గ్రామీణుకు స్వామి వారిపై అమిత భక్తి కావున సంక్రాంతి, దసరా మొదగు పండుగు తెట్టు దేవా యంలో ఐన తరువాతే మిగిలిన గ్రామాల్లో చేస్తారు. ఆవిధి విధానాన నుసరించి మాపాఠశా ప్రతి సంవత్సరం శనివారం ఈ సంక్రాంతి పశువు పండుగ చేస్తాం. శనివారం మధ్యాహ్నం నుండి తరగతు వుండవు కావున విద్యార్థు చదువుకు ఏవిధమైన ఆటంకం ఉండదు. తెట్టులో సంక్రాంతి కాగానే మిగిలిన గ్రామా వారు వారివారి అనుకూతను పెద్దతో చర్చించి నిర్ణయించి జరుపుకుంటారు. గ్రామం మొత్తం ఒకేరోజు ఈ సంక్రాంతి పండుగ చేస్తారు. ఆదివారాలో చేయరు. ఆరోజు మాంసాహార భోజనం కావున. సంక్రాంతికి కొత్త అు్లళ్లను పివటం, నూతన వస్త్రాు యివ్వటం వంటి ఆచారం మా ప్రాంతంలో లేదు. ఉభయ గోదావరి జిల్లా వారు ఈ సంక్రాంతిని ‘‘పెద్దపండుగ’’ అని ఘనంగా చేస్తారు. అు్లళ్లతో, కూతుళ్లతో, మనుమడు, మనుమరాళ్లతో, హరిదాసు కీర్తనతో, గంగిరెద్దువారి విన్యాసం వంటి వినోదాతో, కోడిపందాుతో ఆనందంగా గడుపుతారు. ఈ రకమైన ఆచార వ్యవహారాు యిక్కడ వీరికి తెలియవు. మదనపల్లి దగ్గర ‘పెంచుపాడు’, పుంగనూరు తాూకా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంక్రాంతి, సంక్రాంతి రోజు కాకుండ తరువాత వచ్చే ‘మంగళవారం’ చేస్తారు. ఈరోజు అనపకాయ పితికిపప్పు, దోశొ, వడు తప్పనిసరిగా ప్రతి యింటిలో చేస్తారు. పశువు అంకరణ, ‘‘చిట్లాకుప్ప’’ ప్రదక్షిణ మామూు. బుధవారం ఊరంతా కలిసి పొట్టేును కోసి దాని రక్తం ఊరి పొలిమేరల్లో చల్లి ఆ మాంసం గ్రామస్తుంతా ప్రసాదంగా పంచుకొని వండుకుంటారు. కురబకోటలో సంక్రాంతి తరువాత కనుమ పండుగ సోమ వారం, శనివారం వస్తే చేయరు. కారణం కనుమరోజు మాంసాహారం సేవిస్తారు కాబట్టి. ఒక్కో పండక్కు ఒక్కో గ్రామంలో ఒక్కో ఆచారం పాటిస్తారు యిక్కడి ప్రజు. తమిళనాడు సరి హద్దు గ్రామాల్లోని ‘‘పానటూరు’’ గ్రామం గుడి పా మండం లోనిది. సంక్రాంతికి ఎద్దు పందా పోటీు నిర్వహిస్తారు.పోటీలో గెలిచిన ప్రథమ, ద్వితీయ, తృతీయ ఎద్దుకు వస్తు రూపేణ (బంగారం, వెండి) బహుమ తు యిస్తారు. పోటీు కాగానే గ్రామదేవతకు దివ్వెను మోసి పూజించిన తరువాత, ఊరేగించి రాత్రికి పౌరాణిక నాటకం వేయిస్తారు.కర్ణాటక రాష్ట్రానికి చెందిన చింతామణి, రాయల్‌ పాడు, శ్రీనివాసపురాు మా సమీప ప్రాంతాు. ఇంచుమించుగా మదనపల్లె పరిసరా వాళ్లు చేసే విధంగానే తేదీు నిర్ణయించుకొని సంక్రాంతి పండుగ చేస్తారు. కురబకోటలో ఉగాది కొంత ప్రత్యేకతను సంతరించుకుంది. ముస్లిము కొందరు హిందూ పూజారు ఇండ్లకు ఓరోజు ముందు వచ్చి బియ్యం,పప్పు,ఉప్పు,నెయ్యి మొదగు సంభారాు యిచ్చి ఉగాది ప్రసాదం పెట్టమంటారు. ఉగాదిరోజు ఉదయం ఉపవాసముండి మధ్యాహ్నం పూజాయి యిచ్చిన అన్నప్రసాదాన్ని తీసుకుని భక్తితో ఆరగిస్తారు. హిందూ ముస్లిము ఐక్యతకు చక్కని ఉదాహరణ ఈ ఉగాది. ఇలా ఎందుకు చేస్తారని ముస్లిమును అడిగితే మాపెద్దు చెప్పారు మేం చేస్తున్న ఆచారం అంటారు. పండుగు ఆచారాలో చెప్పుకోతగినది ఏమంటే వినాయకచవితి. ఇది ఇక్కడ తొలి పండుగగా భావింపబడుతుంది.దీన్ని ‘‘టెంకాయ పండుగ’’ అంటారు. ఉదయం ఊరుచివర వున్న ‘‘నాగ ప్రతిమను’’ కడిగి పసుపు రాసి పూతో అంకరించి దారా పోగు చుట్టు చుడతారు. పాతో అభిషేకాు చేస్తారు పుట్టలో పాు పోస్తారు. తరువాత ఇంట్లో ‘పేడ’, మట్టి వినాయకుకు పూజ చేసి ఆహార పదార్థాు ఆరగింపు చేస్తారు. పొలాకు వెళ్లి వారి తాతముత్తాత సమా ధును శుభ్రం చేసి టెంకాయు కొట్టి ఆరగింపు చేసి బట్టు పెడతారు. కొందరు దీన్ని ఉగాదిరోజు చేస్తారు.ఈ ప్రాంతంలో అన్నీ ఆవులే కావున ఆవుపేడతో వినాయకుడిని చేస్తారు. వ్యవసాయదారు వ్యవసాయపు ఎరువు ఈ పేడే. అందునా ఆవు పేడ. చనిపోయిన తల్లిదండ్రుకు పూజ వారి పొలాల్లోనే వారి సమాధుకే! మట్టితో విడవలేని మమకారానికి భక్తికి యింతకంటే ప్రత్యేకమైన ఉదాహరణ ఏమన్నా కావాలా? జిడ్డు కృష్ణమూర్తి గారు పుట్టిన మదనపల్లిలో యీ టెంకాయు కొట్టడం శ్రీరామనవమి పండుగరోజు కూడ చేస్తారు. వారివారి మీ చూచుకొని ఉగాదికి కాని, వినాయకచవితికి కాని కుదరకపోతే శ్రీరామ నవమికి చేస్తార నిజానికి ఇది వ్యవసాయదారు పండుగ. తమ పంటను విపరీతంగా పాడుచేసే ఎుకకు -ఏనుగుకు చేసే ప్రార్థన. పంట నాశనం చేయవద్దని ప్రార్థన.
ఇలా ప్రతి పండుగ సాంప్రదాయంలో ఓ చక్కని నిక్షిప్తమైన సందేశం వుంది. నేడు యీ దేశానికి కావసినది ఇదే! మట్టిలో కలిసిపోయే మనం ఆమట్టిని పూజిద్దాం! ఆ ధరిత్రి తల్లి యిచ్చే పంటని కడుపార ఆరగిద్దాం. చివరిగా ‘‘తింటే గారొ తినాలి. వింటే భారతం వినాలి’’ సామెతలో ‘భారతగాధు’ ఈ జిల్లా ప్రత్యేకత.‘‘భారతం మిట్ట’’అనే పేరుతో ఓ ఊరే వుందంటే దాని ప్రాధాన్యత ఎంతో చెప్పాలా? కుప్పం,మదనపల్లి, రామసముద్రం, కాళహస్తి, చెంబుకూరు మొదగు అనేక ప్రాంత గ్రామాల్లో యీ భారతాకు పెట్టింది పేరు. ఎండా కాంలో 18పగళ్లు,14రాత్రులో ఈ కార్యక్రమాు జరుగుతాయి. రోజుకో పర్వం, మధ్యాహ్నం హరికథా రూపంలో భాగవ తాయి చెపుతారు. రాత్రికి ఆకథనే పౌరాణిక నాటకంగా వేస్తారు. ఇందులో ‘బలిబండి’ ‘అర్జునుని తపస్సు’బీ దుర్యోధన వధ ముఖ్యమైన ఘట్టాు. పగటిపూట యివి ప్రత్యక్షంగా ప్రదర్శిస్తారు. మరో చెప్పుకోదగిన విషయం ‘ఉత్తరగోగ్రహణం’ గ్రామీణు తమ గోసంపదను ఓ చోటికి చేర్చి అర్జునుడు, ఉత్తరకుమార పాత్రతో రసవత్తరంగా కథ సాగిస్తారు. కుప్పం దగ్గర ‘‘పెద్ద బంగారు నత్తం’’ గ్రామంలో ఏకంగా ‘‘పాండవుకు దేవాయాలే వున్నాయి’’.ఈ గ్రామంలో 18 రోజు కార్యక్రమా చివరిరోజు ద్రౌపదీ కళ్యాణోత్సవం చేస్తారు. చిత్తూరు జిల్లా పండుగలో స్థానిక ఆచారాు ‘ఎంత మధురం ఎంత మనోహరం’,ఎంత సుందరం? అందరం ఆఆచార సాంప్రదాయాల్ని పండుగల్ని విశ్వాసాల్ని, నమ్మకాల్ని ముందు తరా వారికి ఆదర్శంగా కొనసాగిద్దాం!
-శ్రీ గోమఠం రంగా చార్యులు

ప్ర‌శ్నిస్తేనే…ప్ర‌గ‌తికి మార్గం

మనస్తాపానికి గురి చేసే హక్కు అనేది ప్రత్యేకంగా ఉండదు. మనస్తాపానికి గురి చేసే హక్కు… లేదా పూర్తిగా మాట్లాడే హక్కు, సంపూర్ణ భావ ప్రకటనా స్వేచ్ఛ-స్వేచ్ఛగా మాట్లాడే హక్కులో కొన్ని అంశాుంటాయి. అవి కొంతమందిని లేదా ఒక వర్గానికి చెందిన వారిని బాధ పెట్టవచ్చు. మరొకరి భావ ప్రకటనా స్వేచ్ఛ వ్ల ఒక వర్గం ప్రజు బాధపడే పరిస్థితి ఉత్పన్నమవుతోంది. ఇదే,ఈ విష యంలో కీకాంశమని నా భావన. 2012 బ్యాచ్‌ ఐఎఎస్‌ అధికారి కన్నన్‌ గోపీనాథన్‌ గారు వారి కలం నుంచి జాలువారిన ఈ ప్రత్యేక కథనం ఎంతో ఆసక్తి కలిగిస్తోంది.

నాగరికతా దృక్పథం నుంచి దీన్ని మనం చూసినట్లైతే,మనకు తర్కశాస్త్రం (తర్కం యొక్క తత్వశాస్త్రం,చర్చించే కళ) అని పిలిచే పు ఒప్పందాు లేదా శాస్త్రాలు ఉన్నాయన్న వాస్తవాన్ని మన నాగరికత గర్వంగా చెప్పుకోవాలి. మనం చర్చించుకుంటాం, పరస్పరం ఎదుర్కొంటాం, విభేదించుకుంటాం. ఆ రకంగా మనం ఇప్పుడున్న ఈ నాగరికత అనేంతవరకు వచ్చాం. భావ ప్రకటనా స్వేచ్ఛ కంటే కూడా ప్రస్తుతమున్న వాతావరణంలో మనం చేస్తున్నదేమంటే ఇతరును బాధ పెట్టేలా చేయడం. ‘నన్ను ముట్టుకోవద్దు’ (టచ్‌ మి నాట్‌) అనే సమాజంగా మనం మారి పోయాం. నాగురించి, నామతం గురించి,నా కమ్యూనిటీ, నా రాష్ట్రం, నా దేశం ఇలా…నా గురించి ఏదీ మాట్లాడవద్దు. ఎందుకంటే, మనకు మనం చాలా అభద్రమైన వాతావరణంలో ఉన్నామని భావిస్తున్నాం. మన మతం గురించి చాలా అభద్రతగా ఫీవడం మొదుపెట్టాం. అందువ్ల ఆమతాన్ని దెబ్బ తీస్తుందని భావించే ఏ రకమైన భావ ప్రకటనా స్వేచ్ఛ నుండైనా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మనం అభద్రంగా ఉండడంవ్ల మనల్ని బాధపెట్టారనే భావన చాలా తేలికగా వచ్చేస్తుంది. మీరు ఐన్‌స్టీన్‌ను మూగవాడిగా పివవచ్చు. అతడు ఏమీ ఫీల్‌ అవడు. చాలా భద్రతగా ఫీల్‌ అవుతూ కూర్చుంటాడు. తానేం చేస్తున్నాడో తనకు తొసు. ఈరకంగా మనం ఇక్కడే మన సొంత నాగరికతను, మన సొంత బలాన్ని, మన దేశాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నామని నా భావన. ఇతరును బాధ పెట్టడం లేదా మనస్తాపానికి గురి చేయడం గురించి మనం మాట్లాడేటప్పుడు మన మనస్సులోకి వచ్చే మరో అంశం ఏమంటే-ఎవ రిని బాధ పెడుతున్నాం? దేన్ని బాధ పెడుతున్నాం? నాభావనలో,ఇలా బాధపెడు తున్నామన్న అంశానికి సంబంధించి మూడు కోణాున్నాయి. మొదటిది, ప్రభుత్వాన్ని బాధపెట్టే హక్కు. వివిధరూపాల్లో ఇప్పటికే మనం దీన్ని కుదించేశాం. ఒకవేళ ప్రభుత్వ మైతే, మనకు దేశద్రోహ చట్టం-ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లోని సెక్షన్‌ 124(ఎ) ఉంది. న్యాయ వ్యవస్థ అయితే, కోర్టు ధిక్కరణను ఉపయోగించి మనం దీన్ని కుదించేశాం. చట్టసభలైతే, హక్కు తీర్మానం మనకుంది. ఆ రకంగా ఈ సంస్థన్నీ ఇతరు భావ ప్రకటనా స్వేచ్ఛవ్ల మనస్తాపానికి గురయ్యే హక్కును తమకు తాముగా ఉంచుకున్నాయి. మనస్తాపానికి గురవడంవారి హక్కు. ఇటువంటి వివిధ సెక్షన్ల ద్వారా మనస్తాపానికి గురవుతున్న వారి హక్కును మనం పరిరక్షిస్తున్నాం. మనకు స్వాతంత్య్రం భించక ముందు నుంచీ వారసత్వంగా మనకు ఈ దేశద్రోహ చట్టం ఉందనే విషయాన్ని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. విమర్శను ఎదుర్కొనే బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇదొక రక్షణ. అందువ్ల ఏతరహా విమర్శ అయినా దాన్ని దాడిగా పరిగణించవచ్చు, ప్రభుత్వం ప్రభుత్వ ఆదేశిత హింసకు ప్పాడవచ్చు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకోదగిన, నాన్‌ బెయిబుల్‌ నేరాు. ప్రభుత్వం మెచ్చనిదాన్ని మీరు చెప్పారంటే వెంటనే మిమ్మల్ని అరెస్టు చేయవచ్చు. బెయిల్‌ తిరస్కరించవచ్చు. ప్రభుత్వం గురించి మీరు మాట్లాడినా, విమర్శించినా, ప్రభుత్వానికి ఇష్టం ఉండదు. అప్పుడు మిమ్మల్ని జైల్లో పెట్టవచ్చు. రెండోది, మనస్తాపం చెందడానికి ఒక కమ్యూనిటీకి ఉండే హక్కు.153-ఎసెక్షన్‌లో ఇది ఇమిడి ఉంటుంది. రెండు కమ్యూనిటీ మధ్య సామరస్యతను పెంపొందించడానికి ఉద్దేశించినందున ఇది ఇప్పటికీ అంగీకారమే. 295-ఎ సెక్షన్‌ అసంబద్ధమైనది, ఎందుకంటే మతాన్ని అవమానించడానికి సంబంధించినది ఇది. నేను మతాన్ని అవమానించేలా ఏదైనా అంటే దాన్ని వెంటనే హింసాత్మక చర్యగా పరిగణిస్తారు. జైల్లో పెడతారు. మళ్లీ ఇక్కడ కూడా పరిగణనలోకి తీసుకోదగ్గ నేరమే, నాన్‌ బెయిబుల్‌ కేసే. మనం మన పురాణాను చదివినట్లైతే, శివపురాణం చదవండి. బ్రహ్మ గురించి ఏం చెబుతున్నదో దృష్టి పెట్టండి. నా లెక్క ప్రకారం,శివపురాణం రాసిన వాడిని ఈసెక్షన్‌ కింద జైల్లో పెట్టాలి. లేదా రాముని కాం నాటి పరిస్థితును చూడండి, ఒక చాకలివాడు ఏకంగా రాజుకే ప్రశ్ను సంధించాడు. ఆ చాకలివాడు లేవనెత్తిన ప్రశ్నతో నేను ఏకీభవించను. కానీ, ఆవ్యక్తి రాజును ప్రశ్నించగలిగాడు. అందుకుగానూ ఆచాకలి త నరకలేదు. జైల్లో పెట్టలేదు. ఆ ప్రశ్న ఏంటో విన్నారు. దానిపై చర్చించారు. ఇక మూడోది,పరువు నష్టం. ఐపీసీలోని 499, 500 సెక్షన్లు- ఇవి సివిల్‌బీ క్రిమినల్‌ పరువు నష్టాను పేర్కొంటున్నాయి. ఈనాడు మనకున్నది మనస్తాపానికి గురయ్యే హక్కును ప్రోత్సహించే చట్టబద్ధమైన చట్రపరిధి. నేను మీ మీద నిందు, అపవాదు మోపవచ్చు. ప్రభు త్వంతో నాకు తగిన సంబంధాుంటే మీరు వేధింపుకు గురవుతారు. ఈ అధికారాల్లో చాలా వాటికి ఎలాంటి అడ్డూ అదుపు లేదు. ఇక్కడ నాకు – దేశద్రోహం కేసు నమోదుకు కొన్ని మార్గదర్శకాు విధించాల్సిన అవసరం ఉందంటూ సుప్రీంకోర్టు, బాంబే హైకోర్టు అన్న- ఒక విషయం గుర్తుకు వస్తోంది. భారతదేశం తన రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత సెక్షన్‌ 124-ఎ తన కాలానుగుణ్యతను కోల్పోయిందని నేను భావిస్తున్నా. రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత ఈ చట్టాన్ని ప్రవేశ పెట్టినట్లైతే ఇది పరిశీనలో ఉండేదని నేను అనుకోను. హింసను నివారించడంలో నీకు సాయ పడేందుకు ఐపీసీలో చాలా సెక్షన్లు ఉన్నాయి. హింసను రెచ్చగొట్టడానికి వ్యతిరేకంగా సెక్షన్‌ 505 ఉంది. కానీ,ఒకమతాన్ని అవమానించడాన్ని ఎన్ని రకాుగానైనా అన్వయించుకోవచ్చు. ఎవరైనా దీనిపై ఫిర్యాదు చేయవచ్చు. కనీసం ప్రయివేటు ఫిర్యాదుకైనా మనం చెక్‌ పెట్టాల్సిన అవసరం ఉంది. సెక్షన్‌ 53 లేదా 295 కింద దాఖలైన ప్రయివేటు ఫిర్యాదును తప్పనిసరిగా అటార్నీ జనరల్‌ లేదా కనీసం పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వంటి సీనియర్‌ లా అధికారికి పంపాలి. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి ముందు వారి అనుమతి తీసుకోవాల్సి ఉంది.వ్యక్తిగతంగా ఇక్కడ నాకు సంబంధించిన కేసు ఒకటి ఉంది. ‘’షేమ్‌ ఆన్‌ యు, ప్రైమ్‌ మినిస్టర్‌’’ అన్న వ్యాసం రాసినం దుకు సెక్షన్‌ 295 కింద నా మీద కేసు దాఖలైంది. సెక్షన్‌ 295-(ఎ)ను ఎందుకు వర్తింపచేశారో నాకు తెలియదు. ఎందుకంటే 295-ఎ మతాన్ని అవమానించడానికి సంబంధించినది. కానీ ఎవరో గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 295-ఎ కింద కేసు నమోదైంది. దీన్ని ఫిర్యాదు స్థాయిలోనే నివారించడానికి చూడాలి. ఈ సెక్షన్లలో చాలావరకు-ప్రభుత్వాన్ని, కమ్యూనిటీని, న్యాయవ్యవస్థను, చట్టసభను, వ్యక్తును మనస్తాపానికి గురిచేసే హక్కు – భావ ప్రకటనా స్వేచ్ఛలోని భాగమే.ప్రస్తుతమున్న వ్యవస్థను, ప్రభుత్వాన్ని, అధికారంలో వున్నవారిని సవాు చేయడానికి మనల్ని మనమే అనుమతించుకోకపోతే మనం ఎన్నటికీ ఎదగలేం. మెరుగు పడలేం. అధికారంలో వున్న వారిని నిరంతరం సవాు చేస్తున్నందునే మనం ఇంత దూరం వచ్చాం. వారు మొగల్‌ పరిపాకులైనా, బ్రిటిష్‌ వారైనా లేదా ప్రస్తుత పాకులైనా ఎవరైనా కానివ్వండి. మనం నిరంతరంగా సవాు చేస్తూనే ఉండాలి. విమర్శిస్తూనే ఉండాలి. అధికారంలో వున్నవారి సున్నితత్వాన్ని (సెన్సిబిలిటీస్‌) తరచూ బాధపెడుతూ ఉండాలి. ఆ రకంగానే మనం ఇంత దూరం రాగలిగాం. ఈ హక్కును మనం అట్టిపెట్టుకుంటేనే మనం మరింతగా ఎదగగుగుతాం. లేనిపక్షంలో, ‘నన్నంటుకోకు’ (టచ్‌ మి నాట్‌) అన్న సమాజం స్థాయికే మనం కూడా దిగజారిపోతాం.

భావవ్యక్తీకరణ స్వేచ్ఛపై దాడి
చట్టబద్దంగా మాట్లాడే మాటను, భిన్నాభిప్రాయా వ్యక్తీకరణను కార్యనిర్వహకశాఖ నేరంగా పరిగణించడం, పూర్తిగా వాటిని తొగించడం లాంటి చర్యకు పూనుకుంటున్నది. విద్యార్థు, కార్యకర్తు, కమెడియన్‌ు, జర్నలిస్టును క్రిమినల్‌, టెర్రరిస్టు వ్యతిరేక చట్టం కింద నేరాను ఆరోపించి కేసు నమోదు చేయడం, విమర్శను అదుపు చేయడమే ప్రభుత్వ వ్యూహంగా ఉంటున్నది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు వ్యతిరేకంగా ప్రభుత్వ యుద్ధం, మతపరమైన అంశాతో ప్రజ అభిప్రాయాను నాశనం చేస్తుంది. ద్వేషపూరిత ప్రసంగాను సృష్టించే ఖూజ జిహాద్‌’, ‘కరోనా జీహాద్‌’ లాంటి ప్రదర్శన ద్వారా ఒకవైపు ముస్లింపై అపవాదు వేసే చర్యను ప్రోత్సహిస్తున్నది. మరో వైపు ప్రభుత్వం లేదా ప్రభుత్వ విధానాకు వ్యతిరేకంగా ఏ చిన్న విమర్శ చేసినా నేరారోపణు చేస్తున్నారు. ఆర్నబ్‌ గోస్వామికి వ్యతిరేకంగా నేరం మోపినపుడు, దానిని బహిరంగంగా ఖండిరచిన కేంద్ర మంత్రు, ప్రభుత్వ విధానాతో ఏకీభవించని జర్నలిస్టుకు ఆ విధమైన రక్షణను కల్పించ లేదు. ఈ అసమానతు ప్రభుత్వం యొక్క హిందూ జాతీయ ఎజెండాను ముందుకు తీసుకుపోయేందుకు ఉపయోగపడుతున్నాయి. ప్రభుత్వం సంతోషించే అభిప్రాయాను వ్యక్తం చేస్తున్న వారి కంటే అభిప్రాయాను స్వేచ్ఛగా వ్యక్తీకరించే వారికుండే హక్కును కూడా కుదిస్తుంది. నూతన వ్యవసాయ చట్టాకు వ్యతిరేకంగా నిరసన తొపుతూ, స్వేచ్ఛగా అభిప్రాయాను వ్యక్తం చేస్తున్న వారికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఇటీవ స్పందించిన తీరును, ఉదారవాద ప్రజాస్వామ్యాు విమర్శను ఎలా పరిగణనలోకి తీసుకోవో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. నిరసను వ్యక్తం చేస్తున్న రైతు పట్ల కేంద్రం వైఖరిని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే,రాజ్యాంగబద్దంగా కల్పించబడిన స్వేచ్ఛను కేంద్ర ప్రభుత్వం ఏవిధంగా వక్రీకరిస్తుందో తొసుకోవచ్చు. మొదటిది, శాంతియుతంగా జరుగుతున్న సభను అనుమ తించడానికి బదుగా,ప్రభుత్వం దాన్ని పరిమితం చేసేందుకు,సరిహద్దు నిరసన ప్రదేశాలో రోడ్లపై మేకు నాటించడం, కాంక్రీటు గోడను,బారికేడ్లను నిర్మించడంపై కేంద్రీకరించింది. బారికేడ్లుపెద్ద అవరోధమేమీ కాదు,కానీ ఈఒక్క ఉదాహరణ ప్రభుత్వ హింసాత్మక చర్యను తొపుతుంది. ఇంటర్నెట్‌, విద్యుత్తు, నీటి సరఫరాను కుదించడంతో పాటు, గౌరవప్రదమైన జీవితానికి, భావవ్య క్తీకరణ స్వేచ్ఛకు హామీ ఇచ్చే మన రాజ్యాం గంలోని ఆర్టికల్‌ 19(1),21ని పూర్తిగా నిలిపివేశారు. రెండవది,ప్రభుత్వం నిరసనను చాలా చురుగ్గా అడ్డుకుంటుంది. అనేక మంది నిరసనకారును నిర్బంధించింది. అనేక సందర్భాల్లో హింస చెరేగింది. ప్రభుత్వం, దాని మిత్రు చొచ్చుకొని పోవడం వ్లనే ఈ హింస చెరేగిందని రైతు నాయకు ఆరోపిస్తున్నారు. ఢల్లీికి రైతు రాకుండా అడ్డుకునేందుకు, నిరసనకు కేంద్రంగా ఉన్న ఆగ్రాలో రైతును హౌస్‌ అరెస్ట్‌ చేయించింది. మూడవది, రైతు ఉద్యమంపై తయారైన విమర్శ నాత్మక నివేదికలో కొన్ని అంశాను తొగించడం, నేరారోపణు చేసి కేసు బనాయిస్తామనే బెదిరింపు ద్వారా అడ్డుకునే విధానం. వ్యవసాయ చట్టాను వ్యతిరేకిస్తూ చేసిన నిరసనను, ప్రతిఘటనను అణచి వేసేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాు అంతర్జాతీయ విమర్శకు గురి అయ్యాయి. ఫిబ్రవరి 2న నిరసనలో సంభవించిన మరణా గురించి తమ నివేదిక ద్వారా తెలియజేసిన కనీసం ఎనిమిది మంది సీనియర్‌ జర్నలిస్టుపైన దేశద్రోహం కేసు, మతసామ రస్యానికి విఘాతం కలిగించారని నేరారోపణు చేస్తూ కేసు నమోదు చేశారు. ప్రభుత్వం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న విషయాను (తొగింపు అభ్యర్థన ద్వారా) తొగించడం మొదుపెట్టింది. భారతదేశంలో ప్రస్తుతం భావవ్యక్తీకరణ స్వేచ్ఛ యొక్క స్థితి,1970వ దశకంలో విధించిన జాతీయ ఎమర్జెన్సీతో పోల్చే విధంగా ఉంది. ఇక్కడ ఎవరికైనా రాజ్యాంగబద్ధమైన రెండు పరస్పర విరుద్ధ క్షణాు కనిపిస్తాయి. 42వ రాజ్యాంగ సవరణద్వారా ఇందిరాగాంధీ పాన, ప్రభుత్వానికి విస్తతమైన అధికారాను సమకూర్చి, న్యాయ సమీక్ష చేసే అవకాశాన్ని పరిమితం చేసింది. ఇది రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కును కుదించడానికి అనుమతించింది. బీజేపీ కంటే ముందున్న భారతీయ జనసంఫ్‌ు భాగస్వామిగా ఉన్న జనతా పార్టీ 1977లో అధికారాన్ని చేపట్టి, 44వ రాజ్యాంగ సవరణ ద్వారా అంతకు ముందు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేసిన మార్పున్నింటినీ రద్దు చేసింది. దాని ఫలితంగా, కేబినెట్‌ ఆమోదం లేకుండా అధికారికంగా ఎమర్జెన్సీ ప్రకటన, ప్రాథమిక హక్కు నిలిపివేత సాధ్యం కాదు. ప్రభుత్వ చర్యను సమీక్షించే కోర్టు అధికారాన్ని పునరుద్ధరించారు. ముఖ్యంగా ఆ రాజ్యాంగ సవరణ, కార్యనిర్వహకవర్గం నిర్ణయాు తీసుకునే క్రమంలో ప్రజాస్వామిక ప్రక్రియలో మివైన అంశాను పునరుద్ధరించే ప్రయత్నం చేసింది. ఇప్పుడు, జనసంఫ్‌ు ఒక కొత్త అవతారంలో బీజేపీగా అధికారం చేపట్టినప్పుడు,రాజ్యాంగంపై చేసిన దాడున్నీ అనధికారమైనవి, అయినా వాస్తవమైనవి. ఒక్క అధికారిక రాజ్యాంగ సవరణ లేకుండా, ప్రభుత్వం అనేక ప్రాథమిక హక్కు అమును రద్దు చేసింది. శాంతియుతంగా చేస్తున్న ఆందోళన, రాజకీయ చర్చ కుదింపుతో, సమకాలీన భారతదేశం దురదష్టం కొద్దీ వాస్తవ ఎమర్జెన్సీకి దగ్గరగా ఉంది. కొత్త అధికార వ్యవస్థ ప్రతీ నిరసనను ఒక ‘’అంతర్గత అ్లరిగా’’ పరిగణిస్తూ, దానిపై గట్టి చర్యకు పూనుకుంటుంది. న్యాయ విధానం కార్యనిర్వ హకవర్గం ఎవరూ అంగీకరించని రీతిలో భావప్రకటనను పరిమితం చేసినప్పుడు, న్యాయవ్యవస్థ ఈ స్వేచ్ఛను సంరక్షిస్తుందని ప్రతీ ఒక్కరూ ఆశిస్తారు. ఇక్కడ ఒక కేసును పరిశీలిస్తే, 1950లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు సంబంధించిన రెండు కేసును సుప్రీంకోర్టు ఎదుర్కొంది. మొదటిది, ‘క్రాస్‌ రోడ్స్‌’ అనే పత్రికపై మద్రాసు ప్రభుత్వం విధించిన నిషేధానికి వ్యతిరేకంగా సవాల్‌ (రొమేష్‌ థప్పర్‌ వెర్సస్‌ మద్రాసు ప్రభుత్వం). రెండవది, ‘ఆర్గనైజర్‌’ పత్రికపై కార్యనిర్వహక ఉత్తర్వు విధించిన నియంత్రణకు వ్యతిరేకంగా సవాల్‌ (బ్రిజ్‌ భూషణ్‌ ఐ ఢల్లీి ప్రభుత్వం). ఆసక్తికరంగా, ఇద్దరు పిటీషన్‌ దాయి రాజకీయ రంగంలో ఎదురెదురుగా నిబడి ఉన్నారు. ‘క్రాస్‌ రోడ్స్‌’ రొమేష్‌ థప్పర్‌ సంపాదకత్వంలో నిర్వహించబడుతున్న కమ్యూనిస్ట్‌ పత్రిక. ‘ఆర్గనైజర్‌’ ఆరెస్సెస్‌ పత్రిక. కానీ రెండూ, వారి వారి కేసుకు మద్దతుగా (భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను పొందే హక్కు) రాజకీయ మివపై ఆధారపడి ఉన్నాయి. ఇది ఖచ్చితంగా స్వేచ్ఛకు ఉండే సుగుణం. ఇది సాంప్రదాయ వాదుకు వ్యతిరేకంగా, ఉదారవాదుకు అనుకూంగా ఏ విధమైన వివక్షతను చూపదు. ఇది అసమ్మతిని తెలిపే, తప్పు చేసే, ఎగతాళిచేసే, చర్చించుకునే స్వేచ్ఛకు అనుమతిస్తుంది. రెండు కేసులో కూడా న్యాయస్థానం ప్రభుత్వానికి వ్యతిరేకంగా, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను పొందే హక్కు కోరిన పిటీషన్‌ దారుకు అనుకూంగా తీర్పు చెప్పింది. థప్పర్‌ కేసులో, ‘’భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ అన్ని ప్రజాస్వామిక సంస్థ పునాదులో ఉంటాయి, స్వేచ్ఛా యుతమైన రాజకీయ చర్చ లేకుండా ప్రభుత్వ విద్య సాధ్యపడదు, ప్రజా ప్రభుత్వ పనితీరు ప్రక్రియ సరిగా ఉండేందుకు స్వేచ్ఛ అవసరం’’ కాబట్టి చీఫ్‌ జస్టిస్‌ పతంజలి శాస్త్రి చాలా సంకుచితమైన ఆలోచనా చర్యు మాత్రమే భావప్రకటనను కుదిస్తాయని రాశాడు. రర70సంవత్సరా తరువాత, జనవరి 2021లో మునావర్‌ ఫారూఖీ బెయిల్‌ మంజూరు కోసం పెట్టుకున్న దరఖాస్తును పరిగణనలోకి తీసుకోవాని మధ్యప్రదేశ్‌ హైకోర్టును కోరాడు. అసాధారణంగా ఒక కమెడియన్‌ను, (బహుశా తాను భావించిన జోకుకు) అరెస్ట్‌ చేశారు. బెయిల్‌ మంజూరు వాదనలో, న్యాయస్థానాల్లో నేరాు చేసిన వారి తప్పును గుర్తించని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదని హైకోర్టు నిస్సంకోచంగా చెప్పింది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు సంబంధించిన రెండు సంఘటనలో రెండు కోర్టు వైఖయి భిన్నంగా ఉన్నాయి. మొదటిది, రాజ్యాంగాన్ని సంరక్షించే క్రమంలో కోర్టు వెంటనే స్పందించింది. రెండవది, ప్రభుత్వానికి ఉన్నంత అసహనాన్ని కోర్టు కూడా ప్రదర్శించింది. ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు రక్షణ కల్పించడంలో (కొన్ని మినహాయింపుతో) హైకోర్టు, సుప్రీంకోర్టు పని తీరు. సుధా భరద్వాజ్‌, వరవరరావు, ఆనంద్‌ టెల్‌ టుబ్డేతో పాటు అనేకమంది రచయితు, విద్యార్థు, జర్నలిస్టుపై నమోదు చేయబడిన నేరారోపణను కొట్టివేయాని పెట్టుకున్న దరఖాస్తును సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఏఅరెస్ట్‌కూ రాజకీయ గుర్తింపు గానీ, కోర్టు అనంగీ కారానికి ప్రభుత్వం యొక్క క్రమబద్ధమైన విధానం గానీ లేకుండా పోయింది. ఆఖరికి ప్రపంచంలో కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కోరినప్పటికీ, సుప్రీం కోర్టు జమ్మూ కాశ్మీర్‌లో 4జీ ఇంటర్నెట్‌ను పునరుద్ధరించడానికి తిరస్కరించింది. కోర్టు కూడా కండీషన్‌ బెయిల్‌ మంజూరుకు భావ వ్యక్తీకరణను పరిమితం చేసే భారమైన నియమ నిబంధనను విధించడం మొదు పెట్టాయి. ఉదాహరణకు, కేరళ హైకోర్టు 2020లో రెహానా ఫాతీమా ఆవు మాంసాన్ని వండుతున్న వీడియోను అప్‌ లోడ్‌ చేసిందన్న నేరారోపణపై అరెస్ట్‌ చేసిన తర్వాత సోషల్‌ మీడియాను ఉపయోగించకూడదన్న నిబంధనతో మాత్రమే బెయిల్‌ మంజూరు చేశారు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌కు వ్యతిరేకంగా మాట్లాడాడన్న అభియోగంపైన అరెస్ట్‌ చేయబడిన ఒక యువకుడిని సోషల్‌ మీడియాను ఉపయోగించకుండా నిషేధం విధిస్తూ అహాబాద్‌ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అలాంటి నిషేధం భావ వ్యక్తీకరణకు ప్రత్యక్షంగా ముప్పు కుగజేస్తుంది. ఈ తొల‌గింపు (సెన్సార్‌ షిప్‌) న్యాయస్థానా నుంచి వచ్చాయన్న నిజం ప్రమాదకరమైన సూచికను తెలియజేస్తుంది. ఇది సాధారణంగా న్యాయవ్యవస్థ పట్ల ప్రజకు ఉండే విశ్వసనీయతను బహీన పరుస్తుంది.

అందువన భారతదేశంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, న్యాయవ్యవస్థ, కార్యనిర్వహక శాఖ నుంచి అనేక దాడును ఎదుర్కొంటుంది. స్వేచ్ఛ అనేది ఒక రాజకీయ ఆవశ్యకత. ప్రజాస్వామ్యం పునరుత్థానం అవడానికీ, దానితోపాటు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను పొందే హక్కు కోసం సహాయం అందించిన వారికి దేశం కృతజ్ఞతు చెప్పే ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. కార్యనిర్వహక వర్గాన్ని కఠినమైన ప్రశ్ను అడిగిన ప్రతిపక్ష రాజకీయ నాయకు, రైతుకుబీ ప్రభుత్వ హింసను ధిక్కరించిన స్వతంత్ర జర్నలిస్టుకు, రాజకీయ పరిహాసాన్ని పండిరచిన కమెడియన్‌కు కూడా దేశం ఆ రోజున కృతజ్ఞతు తెలియ జేస్తుంది. కానీ చరిత్ర, భావవ్యక్తీకరణ స్వేచ్ఛను తొగించిన నిరంకుశ ప్రభుత్వం పట్ల, ఆ స్వేచ్ఛను పునరుద్ధరించడంలో విఫమైన న్యాయస్థానా పట్ల మాత్రం కనికరం చూపించదు.

  • ‘ఫ్రంట్‌ లైన్‌’ సౌజన్యంతో,అనువాదం:బోడపట్ల రవీందర్‌
    కాళీశ్వరమ్‌ రాజ్‌ / తుల‌సీ కే.రాజ్‌

బాలోత్స‌వ్

బాల్యం నుండే విద్యార్థుల్లో ప్రకృతి,పర్యావరణం, దురాచారాు మూఢనమ్మకాు, సాంఘిక దురాచారాు, ఆచార వ్యవహా రాు మొదలైన అనేక అంశమును తెలి యజేసి విద్యార్థుల్లో విజ్ఞానం పెంపొందించే ఉద్దేశంతో విద్యార్థు కోసం ప్రారంభిస్తున్న కొత్త శీర్షిక ‘థింసా బా వినోదం. ప్రదర్శన యోగ్యమైన చేతి బొమ్మలాటు, ఘునాటికు,నాటికు ఏక పాత్రాభి నయం మొదగు ప్రక్రియ ద్వారా ధారా వాహికగా అందిస్తున్నాం. ఈశీర్షిక మీ అందరి మనసు ఆనందంతోపాటు, విజ్ఞా నం,వినోదం కలిగిస్తుందని భావించే ఈ శీర్షికను చిత్తూరు జిల్లా రిషివ్యాలి స్కూల్లో ఉపాధ్యా యుగా పనిచేస్తున్న తెలుగు పండితులు శ్రీ గోమఠం రంగాచార్యులు బాల కోసం అందిస్తున్న ప్రత్యేకమైన కొత్త శీర్షిక.

-రెబ్బాప్ర‌గ‌డ ర‌వి,ఎడిట‌ర్

‘ఉదయం బాల దినోత్సవం సభ ప్రారంభోత్సవంజరిగిన చోటేరాత్రి 8గం.రిషీవ్యాలి గ్రామీణ విద్యార్థుచే తోుబొమ్మ ప్రదర్శన వుంటుంది’’ అని చెప్పినప్పటి నుండి నా మనసు మనసులో లేదు. నేను ఎప్పుడో చిన్నప్పుడు ఈతోుబొమ్మలాట ప్రదర్శనచూచా! మళ్లీ50సంవత్సరా తరువాత! అను కుంటూ మాబడిప్లితో వారుపాల్గొనాల్సిన స్టేజీ దగ్గరకు తీసుకు వెళుతున్నానన్న మాటేగాని ఎప్పుడు చీకటి పడుతుందా?ఎప్పుడు రాత్రిఅవుతుందా?అనే ధ్యాసతోనేమౌనంగా ప్లితో కలిసి నడచి భరతనాట్యం జరిగే స్టేజికి చేరుకున్నాం.ప్లిు ఎక్కువగాలేరు కానీ ఉన్నవారంతాభరతనాట్యం డ్రస్‌లో మేకప్‌ వేసుకుని చూడముచ్చటగా వున్నారు.’ మా పిల్ల‌లు పాల్గొనే కథారచనకి ఇంకా ఓగంట సమయం వుండటంతో కాసేపు అందరం అక్కడున్న కుర్చీల్లో కూర్చున్నాం. ఈ భరతనాట్యం మాప్లికు సరిగా నచ్చినట్లులేదు.‘‘జానపద నృత్యానికి వెళదాం సార్‌!’’అని అన్నారు.‘‘అక్కడ మాత్రం మీకు నచ్చుతుందన్న ఆశ నాకు లేదు. ఒకచోట కుదిరికగా కూచోలేకపోతే ఎలా?’’అని నేను అంటుండగానే మైక్‌లో..‘‘నెం.27అన్నమాచార్య కీర్తనకు నృత్యంతో మీముందుకు రాబోతోంది!’’అని వినపడగానే అందరితో’’ఈడాన్సుచూచి వెళదాం! అన్నా. వారిలో రవిఅనే ప్లివాడు‘‘అదేమిటి సార్‌! ఆఅమ్మాయికి పేరులేదా? ఖైదీల్లాగా నెంబరు 27అనిచెపుతున్నారు! అని ప్రశ్నించాడు.‘‘స్కూు పేరు,వూరుపేరు,ప్లిపేర్లు చెపితే ఆవివరా ప్రభావం న్యాయనిర్ణేతపైవుంటుంది. అందుకే ఎవరు..ఎవరు అన్నది ఎవరికీ తెలియకుండ వుండటానికని అలాకోడిరగ్‌..డీకోడిరగ్‌లో నెంబరు యిస్తారు! అన్నాను.

నా సమాధానం విన్నాక నిశ్శబ్దంగా ప్లిు కూర్చున్నారు.
నాట్యం చక్కగా చేసింది ఆఅమ్మాయి. 
మా ప్లిు కూడాచప్పట్లు కొట్టారు.
ఆ కార్యక్రమం అయ్యాక అందరూ లేచారు.
‘‘సార్‌! జానపద నృత్యంకి వెళదాం! అని అన్నారు. 
వారితోపాటు నేనూ నడిచాను.
నా అందం చూడు బావయ్యో సిరిస్లి చీర సిద్ధిపేట రైక భువనగిరి బొట్టు గజ్జ్వెల్లి గాజు
జడను చూడు జడ అందం చూడు  
జడకున్న జడగంటు చూడు
మెడను చూడు మెడ నెకలేసును చూడు..

16 మంది చేసిన ఆ జానపద నృత్యానికి చప్పట్లతో చుట్టుపక్క ప్రాంతం అంతా దద్దరిల్లింది. డ్రస్‌కోసం,మేకప్‌ కోసం,సెట్టింగ్‌ కోసం బాగానే ఖర్చు పెట్టారు ప్లిు.
అక్కడ నుండి నిదానంగా బయుదేరి కథారచనా ప్రాంగణానికి చేరుకున్నాం. మాకంటే ముందుగా వచ్చినవారు అట్టు,పెన్ను,కాగితాతో సిద్ధంగా వున్నారు. మా ప్లిూ నిదానంగా వెళ్లి కూచున్నారు. అక్కడకు దగ్గరలోనే వున్న ఓచెట్టుకింద కూర్చున్న ఓవ్యక్తిపై నాదృష్టిపడిరది. నడుచు కుంటూ ఆయవ దగ్గరకు వెళ్లి ‘‘నమస్కారమండి! మీరు?’’
‘‘నేను టీచరుని. ఇక్కడకనిపించే వాళ్లలో టీచర్లు,పేరెంట్స్‌,ప్లిు తప్ప యింకెవ్వరూ వుండరండీ!’’అన్నారు ఆయన సమాధానానికి నేను వుండ బట్టలేక ‘‘మీరు ఎన్ని సంవత్సరాు నుండి వస్తున్నారండీ?’’అనిఅడిగాను.‘6సం.రానుండి వస్తున్నా.చదువు అనే చెరసా నుండి ప్లికు విముక్తి కలిగించే యీ బాల దినోత్సవం అంటే నాకెంతో యిష్టం’’ అని ముక్తసరిగా సమాధానం చెప్పి అక్కడి నుండి లేచి వెళ్లిపోయాడు.
వచ్చేపోయే వాళ్లు చాలామంది ఆయన్ని పకరిస్తూ,నమస్కరిస్తూ, షేక్‌ హేండ్‌ చేస్తూ రెండు,మూడు మాటు మాట్లాడుతూ ఉల్లాసంగా ఉన్నారు. ఇంతలోనే మైకులో ప్లిు కథు ఎలా రాయాలి అన్నవిషయం గూర్చి ఇద్దరు ముగ్గురు కథా రచయితు వివరించి టాపిక్‌ ఎనౌన్స్‌ చేశారు. 

అబ్బా!మధ్యాహ్నం 12గంటలేనా! ఎప్పుడుతోుబొమ్మలాట చూస్తానా? అన్న ఆలోచన నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అంతలోనే మా పాఠశా నుండి నాతో వచ్చిన టీచర్లు ‘‘సార్‌ మీరు రూంకి వెళ్లివిశ్రాంతి తీసుకోండి. కథారచన పూర్తి కాగానే ప్లిల్ని తీసుకుని మేం డైనింగ్‌ హాుకి వస్తాం ఆటైంకి మీరు అక్కడికి రండి’’ అనిచెప్పి నన్ను రూంకి పంపారు. సూర్యు డి అస్తమయం చంద్రోదయం తరువాత రాత్రి వెన్నెలో 8గం. సమ యానికి తోుబొమ్మలాట కోసం అంద రం వెళ్లాం. ఇసకవేస్తేరానంతగా ప్లి తో, పెద్దతో నిండిపోయింది స్టేడి యం. మాకిప్పుడ ర్థమైంది అనుకున్న సమ యం కంటే ఓపదినిముషాు ముందుం డాలి. నిశ్శబ్దం,చీకటి కోసం లైట్లన్నీ ఆర్పే శారు. ‘‘కేతిగాడు అబ్బ బ్బ బ్బ బ్బా! అయ్యో...మీకు సింహాన్ని చూడాని వుంది కదూ! చూపిస్తా చూడండి’’ అంటు న్న మాట తీరుకు, ఆ కేతిగాడి బొమ్మ కుకుడుకు ప్లి నవ్వుకు, ఆనం దానికి హద్దుల్లేవు. సింహం గర్జిస్తూ తెర మీదకు రాగానే నిశ్శబ్దంగా మారిపోయింది వాతావరణం ‘‘చిక్కని అడవిలో నేను మగసిరి వాడను నేను’’ అంటూ పాట శ్రావ్యంగా జానపదబాణిలో సాగింది. ఏనుగు,నక్క,పులి,కోతి,పాము,పావురం,బంగారక్క, చిట్టికుందేుతో కథ సాగింది. ‘‘అమ్మఒడిలో బొమ్మలాగా ఆటలాడే వయసు నాది’’ అంటు భయంతో కుందేు బొమ్మ పాట, నడక ప్లిల్లో ఓవిధమైన గుఋ చోటు చేసుకుంది. మొత్తం మీద పాడుబడ్డ బావిలో సింహాన్ని కుందేు దూకించటం, బంగారక్క, కేతిగాడి హాస్యం ఆబావృద్ధు పర్యంతం రంజింప జేసింది.
అంతకుముందు 4గం.ఎ.సి ఆడిటోరియంలో ఓబుడతడు ‘‘విజయనగర సామ్రాజ్యాధీశ్వరుని కుమారుడు ఆగర్భ శ్రీమంతుడు..కాు కింద పెట్టనీయకుండా పెంచారు దాసదాసీ జనసందోహం.. బంగారు పళ్లెర ములో భోజనం’’..అంటూ అత్యద్భుతంగా బారాయు ఏకపాత్రలో జీవించాడు. 
చప్పట్లతో విద్యార్థు ప్లివాడిని ఉత్సాహపరిచారు. 
ఇంతలో మా స్కూు రవి ‘‘వాళ్లకు రాజు భాష ఎలా వచ్చండీ?’అని అమాయకంగా అడిగాడు. 
మైకులో ‘రిషీవ్యాలి గ్రామీణ విద్యార్థి మధుకు చిత్రలేఖనంలో తృతీయ బహుమతి’ అని ప్రకటన వింటూ రాత్రి భోజనానికి భోజనశాకు చేరాం.
మేమున్నది ఓ కల్యాణ మండపంలో. మాతోపాటు10స్కూళ్ల నుండి వచ్చిన విద్యార్థు,ఉపాధ్యాయు కూడ ఉన్నారు. భోజన,నివాస,ప్రయా ణాకు ఏయిబ్బందీ లేకుండ బాలోత్సవ్‌ నిర్వాహకు చూచుకుంటున్నారు.
 
‘ఒరేయ్‌! రాఘవ ఆ ప్లిలేరా నిన్న రాత్రి తోుబొమ్మలాడిరచింది. వాళ్ల టీచర్లు కూడ ఉన్నారు’ అన్న మాటకు మేమంతా వాళ్ల దగ్గరకు చేరి పరిచయం చేసుకున్నాం. 
నేను ‘‘వుండబట్టలేక మా ప్లితో ఓనాటకం వేయించాంటే బ్రహ్మదేవుడు దిగివచ్చినంత పనౌతుంది. మీరు’’...అంటున్న నాప్రశ్నకు సమాధానంగా త్లెగ నెరిసిన గడ్డం టీచరు ‘‘మీరంతా కూచోండి. క్లుప్తంగ మీ అనుమానాు తీరుస్తా’’ అంటూ ... ‘మదనపల్లెలో జన్మించిన జిడ్డుకృష్ణమూర్తిగారు చిన్నప్పటి విద్యా విధానంతో విసిగిపోయారు. పెద్దై తత్వవేత్త ఐన తరువాత ప్లిల్లో భయం లేకుండ, చక్కని వాతావరణంలో స్నేహపూర్వకంగా కలిసిమెలిసి వుండేఉపాధ్యాయుతో రిషీవ్యాలి పాఠశా స్థాపించారు. దానికి అనుబంధంగా గ్రామీణ విద్యార్థుకోసం గ్రామీణ విద్యాయాు స్థాపింపజేశారు. అక్కడ ప్లికు పరీక్షంటూ వుండవు. జీవితంలో చదువు ఓభాగం.’’ 
‘‘సార్‌! చదువు లేకుండా ఈతోుబొమ్మలాటు,నాటకాు, ఏక పాత్రు,భరతనాట్యం,సంగీతాలే చెపుతారా?’’అని ఉండబట్టలేక అడిగాడు రవి.
‘‘చదువుతోపాటు ఈకళలేకాదు వడ్రంగం,మట్టిపని కూడ నేర్పుతాం! బట్టీపట్టించటం,పరీక్షు రాయించటం లాంటివి వుండవు.’‘ఆప్‌ా! అదిరా స్కూంటే’’ అని టక్కున మావిద్యార్థి రమేష్‌ అనేశాడు. చిరునవ్వుతో గడ్డం మాస్టారు రమేష్‌ భుజం మీద తట్టి ‘‘ఏతరగతి చదువుతున్నావ్‌!’’ అన్నాడు. బట్టీపట్టి ప్రశ్నకు సమాధానం చెప్పినట్లు ఏకబిగువున మొత్తం చెప్పేసాడు.
ఇక్కడ జిడ్డు కృష్ణమూర్తిగారికి ఒకరితో ఒకరిని ప్చోటం అస్సు నచ్చదు.ఈ ప్చోటం వల్లే ప్లిల్లో ఎక్కువ తక్కువ అనే అభిప్రాయాు కలిగి ద్వేషబీజాు పడతాయి.
నేనేదో అడగబోయేలోపలే ‘‘మాపాఠశాల వేసవి సెవుల్లో ప్రతి పాఠశా నుండి పదిమంది చొప్పున ఒకచోటికి చేర్చి గురుకు పద్ధతిలో ఈ సాంస్కృతిక కార్యక్రమాు నేర్పి చుట్టుప్రక్క గ్రామాల్లో 2.1/2 గం. పోగ్రాం యిప్పిస్తారు’’.
‘‘ఎవరో ప్లివాడు ఎన్నిరోజు నేర్పిస్తారు? ఎంతడబ్బు తీసు కుంటారన్న’దానికి 15రోజు నేర్పిస్తాం. అంతా ఉచితంగానే.‘శాకా హారం పెడతారా? మాంసాహారమా?’’అన్న ఓఉపాధ్యాయుని ప్రశ్నకు 
‘‘రాగిసంగటి,చిరుధాన్యాతోపప్పు,సాంబారు,ఆకుకూరు పెడ తారు. ఉదయం బ్లెం వేసిన రాగిగంజి యిస్తారు. ఇలా బయటకు తీసుకువచ్చి ప్లికు బయట ప్రపంచం ఎలా వుందో చూపిస్తాం. పిక్నిక్స్‌,విహారయాత్రకు కూడా తీసుకు వెళతాం అంటూ గ్రామీణ విద్యాయా పుట్టుపూర్వోత్తారన్నీ చెపుతూ1970వసం.లోస్థాపించబడిన యీ విద్యాయం 12శాటిలైట్‌ స్కూళ్లుగా పద్మనాభరావుగారి ఆధ్వర్యంలో నిర్వహింప బడుతున్నాయి’’.
మేం చిత్తూరుజిల్లా వాసుమేనండీ! ఏర్పేడు,భాకారాపేట, మంద డం,కాళహస్తి నుండి వచ్చాం! కానీ మాకిలాంటి విద్యావిధానంతో సాగే పాఠశాలు వున్నాయన్న సంగతి మీరు చెపితేకానీ తెలియలేదండీ! మీ పాఠ శాకు మేంవచ్చి చూడచ్చా! అని ఏర్పేడు పాఠశా ఉపాధ్యాయుడు పరాంకుశం అడిగారు. 
‘‘ఓతప్పకుండా రావచ్చు. చుట్టుప్రక్క ఉన్న బెసెంట్‌ దివ్యజ్ఞాన కళాశా(బి.టి.కాలేజి) హార్సిలీహిల్స్‌,రిషికొండ, సోంపాలెం కూడ చూడదగ్గవే. ఇలా బయటకువస్తే కదాయిలాంటి విషయాు తెలిసేది! మీరెప్పుడన్నా వెన్నె రాత్రుల్లో విహరించారా? మా పాఠశా విద్యార్థును ఉదయం సూర్యోదయం ముందు, వెన్నె రాత్రులో బయటకు తీసుకువెళ్లి ప్రకృతి అందం చూపిస్తాం. లేగదూడు చెంగుచెంగున ఎగిరే దృశ్యాు, రైతు పాటు పాడుకుంటూ పొలాకు వెళ్లే దృశ్యాు చూస్తారు. తగిన రీతిలో స్పందిస్తారు’’.
‘తోుబొమ్మలాటకు పాఠశాలకు సంబంధం ఏంటనీ?’ ఒక  ఉపాధ్యాయు ప్రశ్నించారు.
‘‘ఇది సినిమాు,నాటకాు రాకముందున్న నాటి ప్రాచీన జానపద కళ. నేడు అది అంతరించిపోతోంది. ఈకళను ప్లికు పరిచయం చేయటం గూర్చి పంచతంత్ర కథు తోుబొమ్మలాటుగా తీర్చిదిద్దాం. ఐతే ప్లి పుస్తకాల్లోవున్న పాఠాు కొన్నింటిని తోుబొమ్మలాటలా ప్లిలే మార్చి వ్రాసుకుని సింథటిక్‌ పప్పెట్స్‌ తయారుచేసి తరగతిగదిలో ప్రదర్శిస్తారు. అలానే నాటకాు, ఏకపాత్రువ్రాయిస్తారు మాఉపాధ్యాయు. విద్యార్థుల్లో ఎక్కడో అంతర్గతంగా దాగివున్న కళను యీవిధంగా బయటకుతీసే ప్రయత్నం చేస్తాం! ప్రభుత్వ పాఠశాలు లేనిచోటమాత్రమే మదనపల్లె పరిసరాలో ఈశాటిలైట్‌ స్కూళ్లు  ఏర్పాటుచేసి విద్యాభివృద్ధికి మాచేయూతనిస్తాం!’’ అనే సార్‌ మాట ముగించీ ముగించకుండానే ‘‘మాపాఠశా ఉపాధ్యాయు,విద్యార్థు ముక్త కంఠంగా ఈసారి తప్పకుండ రిషీవ్యాలిపాఠశా,గ్రామీణ పాఠశాలు చూద్దాం సార్‌!’’ అన్నారు. 
నామనస్సులోవున్నది మీరు బయటకు చెప్పారనుకుంటూ తప్పకుండా వెళదాం అన్నాను. నామటుకు నాకు బాలోత్సవ్‌ మధురానుభూతు వర్ణింప లేనంత ఆనందం కలిగించాయి. 
ఈ బాలోత్సవ్‌లో ప్లిు, ఉపాధ్యాయు, తల్లిదండ్రు ఆనందో త్సాహాు వర్ణనాతీతం. తీపిజ్ఞాపకా దొంతరు నెమరు వేసుకుంటూ బాలో త్సవ్‌ ముగింపు కార్యక్రమం చూచి మావూరికి,మాపాఠశాకు నేను మా విద్యార్థుం, ఉపాధ్యాయుం సుఖంగా చేరాం. పండిట్‌ జవహర్లాల్‌ నెహ్రూ జన్మదినోత్సవాన్ని ‘‘బాలదినోత్సవంగా’’ పాఠశాల్లో జరుపుకుంటారు. నేటి విద్యార్థు క్షణం తీరిక లేకుండ చదువు బట్టీపట్టడంలో,పరీక్షతో మానసిక వత్తిడికి లోనగుచున్నారు.

ఈమానసిక వత్తిడిని దూరం చేసి విద్యార్థుల్లో దాగివున్న సృజనా త్మకతను బైటకు తీసుకురావానే ఉద్దేశం ‘‘కొత్తగూడెం క్లబ్‌’’ వారికి కల్గింది. 20కి పైగా అంశాలో 3రోజు పోటీు నిర్వహించి విజేతకు బహుమతి ప్రధానం చేసేవారు. పండుగ వాతావరణంలో వేలాదిమంది విద్యార్థు పాల్గొనే ఈ‘‘బాలోత్సవ్‌’’ కన్ను పండుగే! డా.వాసిరెడ్డి రమేష్‌ బాబుగారి ఆధ్వర్యంలో 1991నుండి 2017వరకు 25సం. కొత్తగూడెం క్లబ్‌ వారు బాలోత్సవ్‌ నిర్వహించి ఇపుడు విరమించుకున్నారు. వారి స్ఫూర్తితో భద్రాచం, కాకినాడ,గుంటూరు,అనంతపురం మొ.పట్టణాల్లో ఈ‘‘బాలోత్సవ్‌’’ నిర్వహిస్తూ బాబాలికను సృజనాత్మకత వైపుకు మళ్లించి ఉత్సాహ పరుస్తున్నారు. మానసిక వత్తిడినీ దూరం చేస్తున్నారు. ఆ బాలోత్సవ్‌లో పాల్గొన్న ఉపాధ్యాయు, విద్యార్థు గూర్చి వ్రాసిన కథే ‘బాలోత్సవ్‌’’.

గాంధీజీ స్ఫూర్తి… రైతాంగ ఉద్యమం

నాడు గాంధీజీని హత్య చేసినవారి వారసులే నేడు దేశ స్వాతంత్య్రాన్నీ విదేశీ కార్పొరేట్లకు సమర్పించడానికి తొందరపడుతున్నారు. అందుకు ముందరి మెట్టుగా కాంట్రాక్టు వ్యవసాయం పేరిట మన దేశంలో, మన భూముల్లో ఏయే పంటు ఏ విధంగా పండిరచాలో ఎవరికి, ఏ రేటుకు అమ్ముకోవాలో, ఏ ధాన్యాు, పప్పు దిగుమతి చేసుకోవాలో నిర్ణయించే హక్కును విదేశీ, స్వదేశీ కార్పొరేట్లకు కట్టబెట్టే చట్టాను చేశారు. గాంధీజీ కన్న కలను సాకారం చేయాని నేడు రైతాంగం పోరాడుతోంది. రైతు కేంద్ర స్థానంలో ఉండే వ్యవసాయాన్ని రక్షించుకుంటూ దేశ ఆహార భద్రతను కూడా పరిరక్షించడం కోసం వారు పోరాడుతున్నారు.
మహాత్ముని 73వ వర్ధంతి.గాంధీజీ బలిదానం చేసిన రోజును అమరవీరు దినంగా పాటిస్తూ దేశవ్యాప్తంగా ఒకరోజు ఉపవాస దీక్ష చేపట్టాని సంయుక్త కిసాన్‌ మోర్చా పిుపునిచ్చింది. ఈ పిుపు ద్వారా తమ ఉద్యమం పూర్తిగా అహిం సాయుతంగా జరుగుతున్న వాస్తవాన్ని మరో మారు ఆచరణ ద్వారా రైతు ఉద్యమం పునరుద్ఘాటించింది. దేశ రాజధానిలో గత 65రోజుగా అత్యంత క్రమశిక్షణతో,పట్టుదతో,శాంతియుతంగా, సమైక్యంగా సాగుతున్న రైతు ఉద్యమం మీద బిజెపి, గోడీ మీడియా అంతులేని దుష్ప్రచారాన్ని సాగిస్తూనే వుంది. ఒకటో,రెండోరాష్ట్రాల్లోని కొద్దిమంది రైతు ు మాత్రమే చేస్తున్న ఆందోళన అని సాగిన ప్రచా రం ఎంత బూటకమో దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ రిపబ్లిక్‌డే నాడు రైతాంగం పాటించిన నిరసన కార్యక్రమాు ప్రపంచానికి తెలియ జెప్పా యి. ఆరోజున ఢల్లీిలో మోడీ అనుకూ శక్తు ఢల్లీి పోలీసుతో కుమ్మక్కై సాగించిన అరాచకం లోగుట్టును సాక్ష్యాతో సహా సోషల్‌ మీడియా బహిర్గతం చేసింది. ఉద్యమంలోకి వేరుపురుగులాగా ప్రవేశించిన దీప్‌సింగ్‌ నాటకం బట్టబయలైంది. ఈరోజు దొంగ లాగా కనిపించకుండా పారిపో వసిన పరిస్థితి అతగాడికి ఎదురైంది.73 సంవ త్సరాక్రితం పట్టపగు అతికిరాతకంగా అహిం సామూర్తి గాంధీజీని కాల్చిచంపిన గాడ్సే వారసులే, హింస,విద్వేషంమూర్తీభవించిన ఆ పరివారమే నేడు శాంతియుతంగా సాగుతున్న రైతు ఉద్యమాన్ని హింసతో, దౌర్జన్యంతో అణచివేయాని ప్రయత్నిస్తు న్నారు. ఆనాడు ఏస్ఫూర్తితో గాంధీజీ పిుపు నందు కుని ప్రజు బ్రిటిష్‌ పాకు దౌర్జన్యాన్ని, హింసను ఎదుర్కొని సత్యాగ్రహ ఉద్యమాన్ని జయప్రదంగా సాగించారో, ఈనాడు అదే స్ఫూర్తితో మన రైత న్ను, అమ్ము…న్ల వ్యవసాయ చట్టా రద్దు కోసం ఉద్యమిస్తున్నారు. వీరికన్నా ఆ మహాత్మునికి గొప్ప వారసు ఇంకెవరుంటారు? ఇంతకన్నా గొప్పగా గాంధీజీకి నివాళు ఎవరు అర్పిం చగరు? వెనకటికి ఒక పరమ దుర్మార్గుడు తన కన్న తల్లిదండ్రునే హతమార్చాడు. ఆ తర్వాత కోర్టులో న్యాయమూర్తి ముందు నిబడి ‘’అయ్యా, జడ్జి గారూ, నన్ను కనికరించండి. నన్ను శిక్షించ కండి. ఎందుకంటే నేను తల్లీ, తండ్రీ లేని అనాథను’’ అని వేడుకున్నాడట. ఇప్పుడు మోడీ ప్రభుత్వం రైతు పట్ల వ్యవహరిస్తున్న తీరు ఆవిధంగానే ఉంది. రైతు చేతుల్లోంచి వ్యవసాయాన్ని ఊడలా క్కుని వారిని విదేశీ, స్వదేశీ కార్పొరేట్ల ముంగిట కట్టుబానిసుగా నిబెట్టే అత్యంత దుర్మార్గమైన చట్టాను ఏకపక్షంగా రుద్ది, ఇప్పుడు తమ ప్రభు త్వం రైతు సంక్షేమం కోసమే ఇదంతా చేసిందని సిగ్గూ, ఎగ్గూ లేకుండా చెప్పుకుంటున్నారు. తకా యను తాకట్టు పెట్టేసిన కొందరు మేధావుచేత అదే విషయాన్ని రోత పుట్టించేలా వాగిస్తున్నారు. భారతీయత గురించి తెగ వాగుతూండే సంఘ పరివారానికి ఆ భారతీయత గురించి ఓనమాు కూడా తెలియవని రైతు ఉద్యమం చాటిచెప్పింది. ‘’భారతదేశంఆత్మ గ్రామసీమల్లో, మన రైతు దగ్గర ఉంది’’ అన్న గాంధీజీ మాటు మహాత్ముడికి ఈ దేశం గురించి ఎంత గొప్ప అవగాహన ఉందో తెలియజేస్తాయి. ఆమహాత్ముడినే పొట్టన పెట్టుకున్న నీచుకు భారతీయత గురించి ఏం తొస్తుంది? గాడిదకేం తొసు గంధపు వాసన? (గాడిదు క్షమించాలి. అవి మనకు గొప్పగా చాకిరీ చేస్తాయి. కార్పొరేట్లకు మాత్రమే చాకిరీ చేసేవాళ్ళతో గాడిద ను ప్చోడం అంటే గాడిదకు అవమానమే). గాంధీజీ కలు గన్న గ్రామ స్వరాజ్యంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మొత్తం దేశానికే వెన్నెముకగా పని చేస్తుంది. గ్రామంలో రైతుదే ప్రధాన భూమిక. ఆ రైతు సుభిక్షంగా ఉంటూ, గ్రామాభ్యుదయానికి కూడా చోదకశక్తిగా పని చేస్తారు. గ్రామీణ కుటీర పరిశ్రము పెద్ద ఎత్తున ఉపాధి క్పనకు తోడ్పడ తాయి. సహకార స్ఫూర్తితో తమ వనరును కబో సుకుని గ్రామీణ ప్రజు గ్రామ స్వపరిపానను నిర్వహిస్తారు. పెట్టుబడిదారీ అభివృద్ధిక్రమం ఇందు కు పూర్తి విరుద్ధం. చిన్న రైతుల్ని, చేతివృత్తుల్ని, సహకార వ్యవస్థని, గ్రామ స్థాయి ప్రజాస్వామ్యాన్ని అది తన క్రూరమైన లాభాపేక్షతో అణచివేస్తుంది. వారందరినీ తన ఫ్యాక్టరీల్లో అత్యంత చౌకగా పని చేసేందుకు పట్టణాకు తరుముతుంది. అప్పటికే అక్కడ కునార్లిుతున్న పట్టణ పేదకు వీరిని పోటీగా నిబెడుతుంది. తమకు అవసరం లేదను కుంటే అత్యంత నిర్దాక్షిణ్యంగా వారిని ఆ పట్టణా నుండే తరిమివేస్తుంది, ఇటీవ కరోనా లాక్‌డౌన్‌ సమయంలో పదు క్ష సంఖ్యలో వసకూలీు ఎటువంటి దయనీయ స్ధితిలో తమ స్వగ్రామాకు చేరుకున్నారో ఆవ్యధార్ధ గాధ చిత్రాు ఇంకా మన కళ్ళ ముందు కదలాడుతూనే వున్నాయి. గాంధీజీ కన్న కలను సాకారం చేయాని నేడు రైతాంగం పోరాడుతోంది. రైతు కేంద్ర స్థానంలో ఉండే వ్యవసాయాన్ని రక్షించుకుంటూ దేశ ఆహార భద్రతను కూడా పరిరక్షించడం కోసం వారు పోరాడుతున్నారు. దేశ ఆహార భద్రతను గనుక కోల్పోతే మనం దేశ స్వాతంత్య్రాన్ని సైతం కోల్పో యే ప్రమాదం ముంచుకొస్తుంది. దేశంలోని రైతాం గం, కార్మికు, కష్టజీవు పోరాడి సాధించుకున్న స్వాతంత్య్రాన్ని కాపాడుకోవడం కోసం నేడు రైతు పోరాడుతున్నారు. అనేక తరగతు ప్రజు, కార్మి కు వారికి అండగా నిబడుతున్నారు.
నాడు గాంధీజీనిహత్య చేసినవారి వారసులే నేడు దేశస్వాతంత్య్రాన్నీ విదేశీకార్పొరేట్లకు సమర్పిం చడానికి తొందరపడుతున్నారు. అందుకు ముందరి మెట్టుగా కాంట్రాక్టు వ్యవసాయంపేరిట మన దేశంలో మనభూముల్లో ఏయేపంటు ఏ విధంగా పండిరచాలో ఎవరికి, ఏరేటుకు అమ్ము కోవాలో, ఏ ధాన్యాు, పప్పు దిగుమతి చేసు కోవాలో నిర్ణయించే హక్కును విదేశీ, స్వదేశీ కార్పొ రేట్లకు కట్టబెట్టే చట్టాను చేశారు. స్వతంత్ర భారత దేశం హరితవిప్లవం ద్వారా సాధించుకున్న ఆహార భద్రతను- అది ఎంత పరిమితం అయినా సరే- సమాధి చేసి తమకన్నా దేశభక్తు ఇంకెవరున్నా రంటూ రంకొ వేస్తున్నారు.
ప్రముఖ మార్క్సిస్టు నేత, సిద్ధాంతవేత్త కామ్రేడ్‌ ఇ.ఎం.ఎస్‌. నంబూద్రిపాద్‌ ‘’మహాత్ముడు-ఆయన సిద్ధాంతాు’’ అన్న ఒకగొప్ప ప్రామాణిక రచన చేశారు. నేటికి ఒక శతాబ్దం క్రితం భారతదేశంలో వచ్చిన రైతాంగ ఉద్యమ మ్లెవ గురించి ప్రస్తావి స్తూ ఈ విధంగా రాశారు. ‘’మొదటి ప్రపంచ యుద్ధం అనంతరం భారత దేశంలోనూ, యావత్‌ ప్రపంచంలోనూ జరుగుతున్న చారిత్రాత్మక పరిణా మా ఫలితంగా ప్రజలో బ్రహ్మాండమైన చైతన్య పు మ్లెవ వచ్చింది. భారతీయ రైతాంగం యొక్క ఆర్థిక పరిస్థితు క్రమక్రమంగా దిగజారుతు న్నాయి. మొదటి ప్రపంచ యుద్ధ కాంలోనూ, దాని తర్వాతనూ అవి మరీ అధ్వాన్నమైనాయి. భారత జాతీయోద్యమంలో అతివాదు బప డ్డారు. కొన్ని ప్రదేశాలో వారు రైతాంగంలోని కొన్ని తరగతు వారితో సంబంధాు పెట్టుకు న్నారు కూడా. టర్కీలోనూ, చైనాలోనూ వచ్చిన విప్లవాు, ముఖ్యంగా రష్యా విప్లవం మొదలైన అంతర్జాతీయ పరిణామాు ఆసియా ప్రజ మనస్సుకు బాగా పట్టాయి. భారతీయ రైతాం గంలో చైతన్యం వృద్ధి పొందించిన కారణాలో ఇవి కొన్నిమాత్రమే. అయితే భారతీయ రైతాం గంలో వచ్చిన చైతన్యానికి ఒక నిర్దిష్టమైన రూపం ఇవ్వడంలో గాంధీజీ వ్యక్తిత్వానికి చాలా ముఖ్యమైన పాత్ర ఉంది. ఈ నూతన చైతన్యం స్వాతంత్య్రం, ప్రజాతంత్రం కొరకు సాగుతున్న రాజకీయో ద్య మంతో ంకెపడి నడవడానికి గాంధీజీ వ్యక్తి త్వం చాలా ముఖ్యమైనపాత్ర వహించింది. పల్లె ప్రజాసా మాన్యాన్ని జాతీయ ప్రజాతం త్రోద్యమం లోకి ఆకర్షించి దానిని బపరచడంలో గాంధీజీ చేసిన సేవను విస్మరించలేం.’’ఆనాడు రైతాంగం ఉద్య మాలోకి రావడానికి దోహదంచేసిన ఆర్థిక దుర్భర పరిస్థితు తిరిగి యథాతథంగా కాకపోయినా, వ్యవసాయ రంగంలో నెకొన్నాయి. జాతీయ స్వాతంత్య్రమూ పెనుముప్పును ఎదుర్కుంటోంది. ఈ పరిస్థితుల్లో రైతు నేడు సాగిస్తున్న ఉద్యమం విజయవంతం కావడం కేవం రైతు ప్రయోజ నా కోసమో, వ్యవసాయరంగ పరిరక్షణ కోసమో మాత్రమే కాదని, విశా దేశ ప్రయోజనా కోసం కూడా అని,ముఖ్యంగా కష్టజీవుందరి ప్రయో జనా కోసమని గ్రహించాలి. రైతు ఉద్యమాన్ని గెలిపించడం కోసంకృషి చేయడం కన్నా మించిన గొప్ప దేశభక్తి వేరే ఏదీ ప్రస్తుత పరిస్థితుల్లో లేదు. దేశం పేరు చెప్పి కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ ప్రజకు తీరని ద్రోహం చేస్తున్న మోడీ విధానాను తిప్పి కొట్టడం కన్నా ముఖ్యమైన కర్తవ్యం మరోటి లేదు.‘’వృద్ధు, స్త్రీు ఉద్యమంలో ఎందు కున్నారు? వాళ్ళను ఇంటికి పంపండి. స్త్రీు లేని ఉద్యమం నమోదుచేయాలి’’ ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్య. ఈ ప్రశ్న గత ఉద్యమాల్లో ఉదయించలేదు. భారత వ్యవసాయదారుల్లో 33శాతం, వ్యవసాయ కూలీలో47శాతం స్త్రీలే. 84శాతం స్త్రీ బతుకు దెరువు వ్యవసాయమే. మరి ఉద్యమంలో ఎందు కుండరు? స్త్రీులేని ఉద్యమాు ఫలించవు. ఇది బాబ్డే భూస్వామ్య స్వభావ పురుషాధిక్య మనస్తత్వం. ‘’నేను స్త్రీని, వద్ధురాలిని, న్యాయవాదిని, న్యాయమైన ఉద్యమంలో పాల్గొంటాను’’ పద్మశ్రీ పురస్కార గ్రహీత, మానవహక్కు, లింగ సమానతా న్యాయ వాది 80ఏండ్ల ఇందిరా జైసింఫ్న్‌ బాబ్డేకు జవాబు చెప్పారు. రాజ్యాంగం5వభాగం,4వ అధ్యా యంలో సుప్రీంకోర్టుపరిధి, అధికారాు నిర్వచించ బడ్డాయి. కార్యనిర్వాహక అతిశయాను, అప్రస్తుత చట్టాను అడ్డుకునే అధికారం సుప్రీంకోర్టుకుంది. రాజ్యాంగం 7వ షెడ్యూల్‌ ప్రకారం కేంద్రం వ్యవసాయ చట్టాు చేయరాదు. చట్టా రాజ్యాంగత్వంపై మాట్లాడని కోర్టు రాజకీయ, పాన నిర్వహణలో జొరబడిర దని విద్యావేత్త, అశోక విశ్వవిద్యాయ పూర్వ ఉపాధ్యక్షు ప్రతాప్‌ భాను మెహతా ఒక వ్యాసంలో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు నిర్ణయం ప్రజాస్వామ్య సంస్థ అధికార విభజనను ఉ్లంఘించింది. రాజకీయ వివాద మధ్యవర్తిత్వం కోర్టు విధి కాదు. ప్రభుత్వానికి, ప్రజకు మధ్య రాజకీయ విధానా మధ్యవర్తిత్వం దాని బాధ్యత. కేంద్ర సాగు చట్టా తో దేశసమాఖ్య స్వభావం ప్రమాదంలో పడిరది. అన్నదాతు అన్నార్తుగా మారే దుస్థితి దాపురిం చింది. కోర్టు ఈ విషయాను పట్టించుకోలేదు. సాగు చట్టా రాజ్యాంగ వ్యతిరేకత, ఉ్లంఘన తీర్మానం కోర్టు బాధ్యత. వ్యవసాయ సంస్కరణు రైతు శ్రేయస్సుకు జరగాలి. కార్పొరేట్ల లాభాకు కాదు. రైతు ఉద్యమం వారి హక్కు పరిధిలోనే ఉంది. ప్రభుత్వం వారిని ఎంతగా రెచ్చగొట్టినా, ఎన్ని అభాండాు వేసినా ఉద్యమం దారితప్పలేదు. ప్రశాంతంగా అద్భుతంగా మానవీయ కోణాల్లో సాగుతోంది. ఈ మహత్తర సామాజిక విప్లవానికి సుప్రీంకోర్టు ఆదేశం కళ్ళెంవేసింది. ఇది ప్రజా ద్రోహానికి దారితీయవచ్చు. జనవరి 26న రైతు సంఘా ట్రాక్టర్‌ ర్యాలీని ఆపమన్న కేంద్ర విజ్ఞప్తిపై సుప్రీంకోర్టు రైతు సంఘాకు నోటీసులిచ్చింది. చట్టా అము స్టే, కమిటి రూపంలో అపరిమిత కాహరణతో ప్రభుత్వానికి బహుమతి ఇచ్చింది. వివాదాస్పద చట్టా వివరాల్లోకి పోలేదు. ఇరు వర్గా భావాు తొసుకోలేదు. రైతు బాధు వినలేదు. న్యాయ విచారణ విధానాను అనుసరిం చలేదు. రాష్ట్రా పరిధిలోని అంశాల్లో కేంద్రం చట్టాు చేయడం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటిం చలేదు. ప్రభుత్వం ఒక అవమానకర చర్య తీసుకో వసిన అనూహ్య పరిస్థితికి నెట్టివేయబడిరది. కోర్టు ఈ విచిత్ర స్థితి నుంచి ప్రభుత్వాన్ని కాపాడిరది. చలి,కరోనా పేరుతో ఉద్యమానికి అడ్డుకట్టవేసే ప్రయత్నం చేసింది. రైతుఉద్యమం చట్టరహి తమన్న భావనకు ఆస్కారమిచ్చింది. ఉద్యమానికి ప్రభుత్వాన్ని కాక రైతును బాధ్యును చేసింది. రైతు ఉద్యమం ఖలిస్థాన్‌ ఉద్యమవాహకమన్న ప్రభు త్వ వాదనకు ఉతమిచ్చే విధంగా ప్రవర్తించింది. తటస్తు, వాదిప్రతివాదుకు ఆమోద్యులైన మధ్యవర్తును అందరి అనుమతితో నియ మించాలి. కమిటి ఉద్దేశం మధ్యవర్తిత్వం కాకపోతే కోర్టు ఇరువర్గా వాదను విని నిజ నిర్ధారణతో తీర్పుచెప్పాలి. కోర్టుఏకపక్షంగా నియమించిన సభ్యు ు నుగురూ మరో అభిప్రాయానికి తావులేని ధర్మోపదేశ చతుష్టయం. వివాదాస్పద సాగు చట్టా ప్రగాఢ పక్షపాత సమర్థకు. రైతు విమర్శకు. నిటి అయోగ్‌సభ్యుడు డా.అశోక్‌ గులాటి, డా.ప్ర మోద్‌ జోషి వ్యవసాయ ఆర్థికనిపుణు. ప్రపంచీ కరణను, వ్యవసాయరంగంలో కార్పొరేట్లను సమ ర్థించిన అనిల్‌ ఘనవత్‌ శెత్కరి (రైతు) సంఘటన అధ్యక్షు. భూపిందర్‌ సింఫ్న్‌ మాన్‌ చట్టాను సమర్థిస్తున్న భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బికెయు) అధ్యక్షు. జనసంఫ్న్‌ క్రియాశీ కార్యకర్త. ఈయ నను బికెయు 14న తొగించింది. కమిటి నుంచి తప్పుకున్నారని ట్వీటింది. అశోక్‌ ఆలోచనలో పడ్డారట! కోర్టు ప్రభుత్వ ఉద్దేశాతో ప్రభావిత మైందన్న అనుమానాకు తావిచ్చింది. రైతు కమిటీ బహిష్కరణకు కారణాు అందించింది. పూర్వ ప్రధాన న్యాయమూర్తి ఆర్‌.ఎం.లోధా ఆధ్వ ర్యంలో పాత్రికేయుడు పి.సాయినాథ్‌, వ్యవసాయ నిపుణుతో కమిటి వేస్తామని సుప్రీంకోర్టు గతంలో సూచించింది. ఆరేండ్ల నుంచి ప్రభుత్వ ప్రతినిధు ప్రజావ్యాజ్యాు దాఖు చేస్తున్నట్టు ఆరోపణ ున్నాయి. కమిటి నిర్మాణంలో కోర్టు తన హామీకి భిన్నంగా ప్రవర్తించింది. 11న కమిటి నిర్మిస్తామని చెప్పి12న ప్రతివాద న్యాయవాదు లేని సమయం లో ఏకపక్షంగా కమిటిని నిర్ణయించింది. ఈ సభ్యు జాబితా కోర్టుకు ఎవరిచ్చారు? ఇందులో ప్రభుత్వ హస్తముందని అనుకునే అవకాశం లేదా? కోర్టు ఆదేశం జైల్లోఉన్న వ్యక్తికి బెయిల్‌ ఇచ్చినట్టు, రాజకీ య సంక్షోభం నుంచి మోడీ ప్రభుత్వాన్ని సంరక్షిం చింది. పార్లమెంటు చేసిన వివాదాస్పద సాగు చట్టామీద ప్రభుత్వానికి రైతుకు మధ్య ఎనిమిది తడవ చర్చు జరిగాయి.
`రచయిత: మాజీ ఎమ్మెల్సీ(ప్రజాశక్తి సౌజన్యంతో)
నిరాహారదీక్షకు దిగిన్ల అన్నదాతు..

దేశ రాజధానిలో అన్నదాత ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. నేడు గాంధీ వర్థంతి సందర్భంగా..సద్భావనా దివస్‌ను పాటించాని రైతు సంఘాు నిర్ణయించాయి. జనవరి 29 సాయంత్రం5 గంట వరకు ఢల్లీి సరిహద్దుల్లో రైతన్ను నిరాహార దీక్షకు దిగారు. ఢల్లీిలో రైతు శాంతియుత ర్యాలీకి సంఫీు భావంగా ఎపి రాష్ట్రవ్యాప్తంగా రైతు నిరాహార దీక్షు చేపడుతున్నారు.

రైతు సంఘా తీర్మానం..
బీకేయూ ప్రతినిధి రాకేష్‌ తికాయత్‌ ఉద్వేగ ప్రసంగంతో ఉవ్వెత్తున రైతు ఉద్యమం ఎగసి పడుతోంది. సరిహద్దుకు వేలాదిగా అన్న దాతు తరలివస్తున్నారు. ఉద్యమాన్ని విచ్చిన్నం చేసే కుట్ర జరుగుతోందని, తమ నేతపై అక్రమ కేసు పెడుతున్నారని ఆరోపిస్తూ రెండో దశ పోరాటం చేపట్టాని రైతు సంఘాు తీర్మానిం చాయి.
యుపి నుండి ఢల్లీికి రైతన్ను..
మరోవైపు రైతు ఆందోళనకు మద్దతుగా యుపి లోని ముజఫర్‌నగర్‌లో ప్రత్యేక సమా వేశాన్ని నిర్వహించారు. యుపికి చెందిన రైతు ఢల్లీికి తరలివచ్చి రైతు ఆందోళనకు మద్దతు పకాని ఈ సమావేశంలో నిర్ణయించారు.
20 వేకు పైగా ఆందోళనలో అన్నదాతు..
యూపీ, హర్యానా రాష్ట్రా నుంచి రైతన్ను పోటెత్తారు.మీరట్‌,బిజ్నోర్‌,బాగ్‌పట్‌, ముజఫర్‌ నగర్‌,మొరాదాబాద్‌,బుంద్‌షహర్‌ ఇలా అన్ని జిల్లా నుంచి ఘాజీపూర్‌కు వేలాదిమంది అన్న దాతు చేరుకుంటున్నారు. ప్రస్తుతం 20 వేకు పైగా రైతన్ను ఆందోళనలో ఉద్యమి స్తున్నారు. మరోవైపు,హర్యానాలోని 14జిల్లాల్లో ఈరోజు సాయంత్రం ఐదు గంట వరకు ఇంటర్‌నెట్‌ సేవను నిలిపి వేస్తున్నట్లు అది óకాయి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే జిల్లాసంఖ్య 17కు పెంచింది. తెలిపారు. ఢల్లీి సరిహద్దుతో పాటు పరి సర ప్రాంతాల్లోనూ కేంద్ర ప్రభుత్వం ఇంటర్‌నెట్‌ సేవను నిలిపి వేసింది. సోషల్‌మీడియాలో పుకార్లు వ్యాప్తి చెంద కుండా ఉండేందుకే ఇంటర్‌ నెట్‌ సేవను నిలిపివేసినట్లు ప్రభుత్వం వాదిస్తోంది.
మీతూటాకు భయపడేది లేదు : రాకేష్‌ తికాయత్‌
ఘాజీపూర్‌ సరిహద్దుల్లో స్థానికు ఆందో ళనతో అక్కడి నుంచి వెళ్లి పోవాంటూ రైతుపై పోలీసు ఒత్తిడి పెంచారు. రెండు నెలుగా ఆందోళన చేస్తున్న రైతును ఖాళీ చేయించాని చూశారు. కానీ ఖాకీ ప్రయత్నం వృథా అయిం ది. మీ తూటాకు భయపడేది లేదంటూ రాకేష్‌ తికాయత్‌ తెగేసి చెప్పారు. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని రైతన్ను కన్నీటి పర్యంతమయ్యారు.

జారుడు బండ

బా వినోదిని
బాల్యం  నుండే విద్యార్థుల్లో ప్రకృతి,పర్యా వరణం, దురాచారాు మూఢనమ్మకాలు , సాంఘిక దురాచారాలు , ఆచార వ్యవహా రాలు  మొదలైన అనేక అంశమును తెలియజేసి విద్యార్థుల్లో విజ్ఞానం పెంపొందించే ఉద్దేశంతో విద్యార్థు కోసం ప్రారంభిస్తున్న కొత్త శీర్షిక ‘థింసా బావినోదిని’. ప్రదర్శన యోగ్యమైన చేతిబొమ్మలాట, లఘునాటికలు,నాటికలు, ఏకపాత్రాభినయం మొదలగు ప్రక్రియద్వారా ధారావాహికగా ఈశీర్షికలో ప్రచురితం కాబోతు న్నాయి. ఈ శీర్షిక మీ అందరి మనసు ఆనందంతోపాటు, విజ్ఞానం, వినోదం కలిగిస్తుందని భావించే ఈ శీర్షికను చిత్తూరు జిల్లా రిషివ్యాలి స్కూల్లో ఉపాధ్యాయుగా పనిచేస్తున్న తెలుగు పండితులు శ్రీ గోమఠం రంగాచార్యులు  బాలలు  కోసం అందిస్తున్న కొత్త శీర్షిక. – రెబ్బా ప్రగడ రవి. ఎడిటర్

‘‘తనుండు విషము ఫణికిని
వెయంగా దోకనుండు వృశ్చికమునకున్‌
తతోక యనక యుండును
ఖునకు నిువ్లె విషము గదరా సుమతీ!’’

మనిషి విజ్ఞానం అతన్ని చంద్రమండం దాకా తీసుకు వెళ్ళింది. మనిషిలోని అజ్ఞానం పర్యావరణాన్ని పాతాళానికి తొక్కేస్తుంది. పర్యావరణ కాుష్యం కేవం మానవునే కాక, సర్వ ప్రాణికోటికి హానికలిగించే చేస్తోంది. చిన్న చిన్న దొంగతనాతో ప్రారంభమైన ఓ మనిషి ధనానికి బానిసగా మారి జంతువు చర్మాు,నక్షత్ర తాబేళ్లు, పూడు పాము, మోసళ్ళను, ఎర్రచందనాన్ని పోలీసు కళ్లుగప్పి విదేశాకు ఎగుమతి చేస్తూ ఉంటాడు. ఆ స్మగ్లర్‌ ని ఎర్రచందనం తరలిస్తున్న ఖరీదైన కారు తో సహా పట్టుకొని పోలీస్‌ స్టేషన్‌ లో ఉంచుతారు. అప్పుడు ఆ కారు, ఎర్రచందనం దుంగ, స్మగ్లర్‌ తో పాటు చేపు అమ్ముకునే స్త్రీ, గేదె, మోసలి, పాము బొమ్ము మాట్లాడుకుంటే? ఆ మాటల్లోని ఈ విషయం తెలియజేసి ఇతివృత్తం జారుడు బండ కథ. ప్లాస్టిక్‌ మహమ్మారి వన భూమండలానికి జరిగే హాని గురించి తెలియజేసేది యీ చేతిబొమ్మలాట లోని జారుడు బండ కథ.

కారు : ఏడంతస్థు భవనం ముందు నన్ను చూడగానే గేట్‌ తీసి వేసే వాడొకడుబీ నన్ను కడిగి తుడిచేందుకు మరొకరు. నాబాగోగు చూచుకొనేందుకు యింకొకరు…ఓ రాజ భోగాను భవించిన నేను ఈ చెక్క మూంగా
రెడ్‌శాండిల్‌ : చెక్క ముక్క అంటు నోరు పారేసుకోకు. చైనా దేశీయు నాకు పట్టే నీరాజనం ముందు బోడి నీవెంత? నీ భోగమెంత? నీమూంగానే యీ దిక్కుమాలిన పెంటదిబ్బ దగ్గర పడుండాల్సొచ్చింది.
మనిషి : నోరు మూయండి దరిద్రపు ముఖాల్లారా! మీ యిద్దరి మూంగా ఈ జైు గోడ మధ్య కంపులో ఛస్తున్నాను.
కారు : ఎండ కెండి వానకు తడిసి తుప్పు పట్టి దుమ్ము కొట్టుకు చస్తుంటే నీకేం నువ్వు ఎండ,వానకు దూరంగా 4గోడ మధ్య చిప్పకూడు తింటున్నావుగా!
రెడ్‌ శాండిల్‌: ఇదిగో ఈ రెండు కాళ్ల జంతువు మూంగా పచ్చటి నాజీవితం శవాల్ని కాల్చే కట్టెలా యీ పోలీస్‌ స్టేషన్‌ దగ్గరపడేడుస్తోంది.ఇంకో నాుగు రోజు పోతే చెదపట్టి మట్టిలో కలిసిపోతానేమో!
మనిషి నేను నిన్ను చైనా పంపి వయోలిన్‌ గానో ఆటబొమ్ముగానో అత్తరుగానోచేద్దామనుకున్నా! ఇదిగో యీ యినప ముక్కే నా కొంప నీకొంప ముంచింది.
కారు : ఒరేయ్‌ ఒరేయ్‌ దరిద్రుడా! నోటికొచ్చినట్లు వాగకురా! రాజు,ప్రధానమంత్రు,మంత్రు ఎక్కే కారులో ఈ దొంగ దుంగను వేసినన్నిరికించావ్‌ కదరా! నీబుద్ధి బురదలో పొర్లాడిరదా?ఏం?
మనిషి అవునే-రాత్రికి రాత్రే కారు డ్రైవర్ని కాస్త ఓనర్‌ కావానుకున్నా! జైు పాయ్యా!
రెడ్‌ శాండిల్‌: దాహం-దాహం-నాుగురోజు క్రితం నన్ను నరికి తెచ్చి యిక్కడ పడేశావ్‌! నాలో చెమ్మ ఆరిపోతోంది. కొంచెం నీళ్ళు జ్లరా! మళ్లా యిక్కడే చిగిరించిమొక్కనౌతా! నీకు పుణ్య ముంటుంది నా దాహం తీర్చరా!
కారు : ఒరేయ్‌-లోపున్న నాసీట్లన్నీ ఎుకు పందికొక్కు కొట్టేస్తున్నాయ్‌ రా! వైర్లని తెంపేస్తున్నాయ్‌ రా! నన్నిక్కడ నుండి నా ఓనర్‌ దగ్గరకు పంపే మార్గం చూడరా! మనిషి : మీకంటే ముందు వచ్చిన కార్లకు, రెడ్‌ శాండిల్‌ దుంగకు దిక్కు మొక్కు లేదు. నిన్నగాక మొన్నొచ్చిన మీ సంగతి చూసేందుకు ఎవరూ ముందుకు రారు. మీచావు ఇక్కడే రాసివుంది!
కారు : మా చావు యింతేనా! మాకు విముక్తి పొందే మార్గం లేదా!
రెడ్‌ శాండిల్‌: ఏరా రెండుకాళ్ల జీవీ! మరి నీ సంగతేంటిరా నువు మాతోనే చావవా?
మనిషి : ఇంకో రెండుకాళ్ల మేధావి ఏదో విధంగా నన్నుమాత్రం బైల్‌ పై బయటకు తీసుకెళతాడు. ఆకాశం న్లబడిరది. వానొచ్చేట్లుంది. దాహం అన్నావు కదే! ఎర్రచందనం దుంగా…హాయిగా వానలో స్నానం చెయ్‌. షవర్‌ బాత్‌. సముద్రం అ్లకల్లోంగా వుంది. తుఫానేమో!(పోలీస్‌ విజిల్‌ వినపడును) మా మామ పిుస్తున్నాడు.
రెడ్‌ శాండిల్‌: వాన్లు కురవాలి వానదేవుడా! చెట్లన్ని బతకాలి వానదేవుడా!
కారు : నోరుముయ్యరా చెక్క వెధవా! నీళ్లల్లో నే నానితే తుప్పుపట్టి ఎందుకూ పనికిరాకుండా పోతా!గేదె(అరుపు) (నెమ్మదిగా ప్రవేశం)మనిషిఇదేంటబ్బా-పోలీస్‌ స్టేషన్‌ దగ్గరకు వచ్చింది కొంపదీసి దాని దూడ కనబడటం లేదని కంప్లెంట్‌ యివ్వడానికి వచ్చిందా ఏం?గేదెదూడ కాదురా! నే వేసిన పేడ కనబడటం లేదని కంప్లెంట్‌ చెయ్యటానికి వచ్చారా బచ్చా!
మనిషి : బచ్చా! అడుక్కొనే బొచ్చా అంటే నేనూరుకోను. జగ్రత్తగా మాట్లాడు. మనిషితో మర్యాదగా మాట్లాడటం నేర్చుకో! గడ్డితినేపశువా!
గేదె : నేను తినేది గడ్డేరా! నీలాంటి స్మగర్ల మూంగా ఆ గడ్డి కూడ దొరక్కుండా పోయిందిరా అరణ్యంలో.
మనిషి : జనారణ్యంలోకి వచ్చావుగా! ఎక్కడపడితే అక్కడ చెత్తా- చెదారం దొరుకుతుంది. తిని బాగా బవచ్చు.
గేదె : నీలా, ఏదిపడితే అది తినే రెండుకాళ్ల పశువును కాదురా! అంతకంటే నీతిమాలిన దాన్ని కాదురా!
మనిషి : నేను నీతిమాలిన వాడినా?
రెడ్‌ శాండిల్‌: కాక మరేంటిరా! ఎక్కడో కొండ మీద పెరిగే మా గుండెల్లో చిచ్చు పెడుతున్నారు కదరా మీరు. అత్యాశతో మమ్మల్ని నరికిౌౌ.
కారు : మిమ్మల్ని నరికి అక్కడే తగలేస్తే బాగుండేది. క్ష ఖరీదు చేసే నన్ను నీలాంటి వారిని సీమ దాటించటానికి ఉపయోగించి పట్టుబడి నా బతుకు బండపాు చేశాడు. నీ మూంగానే నేను జైు పాయ్యాను.
రెడ్‌ : నీ అండ చూసుకొనే మమ్మల్ని నిువున నరికేస్తున్నారు
మనిషి : ఏం గేదె! కాసిని పాలిస్తావా! టీ తాగుతా!
గేదె : పాు కాదురా! నీ ముఖాన పేడ కళ్లాపి జ్లుతా!
మనిషి : ఆ పని మాత్రం వద్దులే! బయట పడిర తర్వాత దర్జాగా స్టార్‌ హోటల్లోనే కాఫీ తాగుతా!
స్త్రీ : చేపలోయమ్మ చేపు చేపు. కొరమీను చేపు
మనిషి : ఓ చేపనివ్వవే క్చాుకొని తిని కడుపు నింపుకుంటా. ఈ చిప్పుకూడ తినలేక చస్తున్నా.
స్త్రీ : అమ్ముకోటానికి చేపు తెచ్చాను గానీ ఫ్రీగా పంచటానికి కాదు. చ్ఱెప 100 రూ.
మనిషి : వందా నీ బొందా! రాత్రిపూట చెరువు కాడికెళితే కావల్సినన్ని దొరుకుతాయ్‌.
స్త్రీ : దొంగ వెధవ. బుద్ధి మారదు కదరా!
మనిషి : ఇస్తే ఇయ్యి! లేకపోతే పో..
గేదె : ఓ అమ్మీ! వాడికో చేపనియ్‌! నీప్లికు కావల్సిన పాు నే నీకిస్తా!
స్త్రీ : ఈ దొంగ వెధవకా! నీవు సాయం చేసేది! వీడి మూంగానే కదే అడవిలో జంతువు, పక్షు, నీటిలో చేపు చస్తున్నాయ్‌!
మనిషి : ఏయ్‌! రెడ్‌ శాండిల్స్‌ ని చంపుతున్నామంటే ఒప్పుకుంటా! అక్రమాకు ప్పాడుతున్నానంటే ఒప్పుకుంటా! నీచాతి నీచంగా జంతువును, పక్షును, జచరాన్ని చంపే జాతి కాదు మా మానవజాతి.
గేదె : నోరు ముయ్యరా! మానవజాతిట మానవజాతి. మీరు ఆహారపదార్థాు ప్లాస్టిక్‌ సంచుల్లో తెచ్చుకొని తిని, మిగిలింది దాంట్లోనే వుంచి బయట పారేస్తోంటే గడ్డి లేక ఆకలికి భరించలేక ఆవు,గేదొ, మేకు వాటిని తిని – తిన్న ఆ ప్లాస్టిక్‌ కడుపులో పేరుకుపోయి చస్తున్నాయి కదరా! ఒక్కో గేదె కడుపులో 30 కేజీ ప్లాస్టిక్‌ వుందిరా! నువు కాల్చి తినానుకున్న చేప కడుపులో కూడ ప్లాస్టిక్కేరా! పక్షు కడుపులో ప్లాస్టిక్కేరా!
మనిషి : అంటే మా కడుపులో ప్లాస్టిక్‌ లేదనా? మాకు తెలియకుండానే వాటర్‌ బాటిల్స్‌ ద్వారా, టీ, కాఫీ, పాు, వేడి పదార్థా పార్సిల్స్‌ ద్వారా హాయిగా మేమూ మీలాగే ఆరగిస్తున్నాం. ఒక లీటరు భూగర్భజంలో 15.2 మైక్రో ప్లాస్టిక్‌ కాుష్య కణాు వున్నాయి. కృష్ణాజిల్లా పెదగ్లొపల్లె పాలెం బీచ్‌ కి సముద్ర కాుష్యం వచ్చి భారీ తాబేళ్లు జచరాు కొట్టుకువస్తున్నాయి. మా అందరికీ తొసు. పాలో నీళ్లను కలిపినట్లు ప్రకృతిలో ప్లాస్టిక్‌ ను కలిపాం. వేరుచేయటం తెలియదు.
గేదె : పెంట తిన్నా అరిగించుకొనే శక్తి వున్న మీకు ప్లాస్టిక్కో లెక్కా? యాదవుల్ని ముసం నాశనం చేసినట్లు మీరు సృష్టించిన ఈ ప్లాస్టిక్‌ మిమ్మల్నే కాదు మొత్తం ప్రాణున్నింటినీ సర్వనాశనం చేస్తుందిరా!
మనిషి : నేను, నా సంతానం బ్రతకటం ముఖ్యంగానీ ఎవరెట్లా ఛస్తే నాకేం!
కారు : ఓరి స్వార్థజీవీ? నాపై స్వారీ చేసి నన్నే జైుపాు చేశావు.
రెడ్‌ శాండిల్‌: నేను విడిచిన ప్రాణవాయువును పీల్చి నన్నే జైుపాు చేశావు కదరా!
గేదె : తల్లిపాు త్రాగి రొమ్ము గుద్దే జాతిరా నీది! ఆక్‌..థూు
మొసలి ఏరా! స్మగ్లరూ ఇక్కడ తగడ్డావేం రా?
కారు : వీడు నీకు తొసా! మొసలి తొసా అని నిదానంగా అంటావేం! పులిచర్మాు, నక్షత్రతాబేళ్లు, మా మొసలి ప్లిల్ని, పుడుగుపాముల్ని స్మగ్లింగ్‌ చేసి బ్రతికే మానవులో అధముడు! వీడు తెలియక పోవటం ఏంటి? ఏరా! ఏ సరుకు విదేశాకు అక్రమంగా రవాణాచేద్దామనుకొని పట్టుపడ్డావ్‌!
మనిషి : ఇదిగో ఈ డొక్కు కారులో ఆ ఎర్రచందనం దుంగల్ని
మొసలి ఓరి నీయమ్మ కడుపు కాలా! బ్రతికున్నవాటినే కాక చంపి మరీ చెట్లను కూడా స్మగ్లింగ్‌ చేస్తున్నావా! నీతిమాలిన వెధవ! ఇంకో నాుగురోజు పోతే నీ తల్లిని గూడ అమ్మేసేట్లున్నావే!
మనిషి : ఏదో పారెస్ట్‌ డిపార్టుమెంటు పుణ్యమా అని నువ్వు బతికిపోయావని సంబరపడకు.నీ అడ్రస్‌ మొత్తం నా దగ్గరుంది జాగ్రత్త. న్గాురోజుల్లో బయటకొస్తా! నీ పని పడతా! విదేశాకు ఎగుమతి చేస్తా.
పాము : స్‌..స్‌…స్‌…(పాము బయటకొస్తుంది)
మనిషి : ఓ కార్లోంచి దర్జాగా వస్తున్నావా! వాన పడేట్లుంది. కారులోకి పోయి వెచ్చగా పడుకో నాగదేవతా!
పాము : ఇందాకట్నుంచి మీ మాటన్నీ విన్నాను రా! ఇంక నీకు భూమ్మీద నూకు చెల్లాయి రా!
మనిషి : ఏంటీ రెచ్చిపోతున్నావ్‌! మట్టితినే వానపామా!
పాము : ఆ పామునే గదరా మీ మానవజాతి దైవంగా పూజిస్తోంది. చెట్లను కూడ పూజించే మహోన్నత మానవజాతి కదరా మీది. సముద్రంలో తర్పణాలిచ్చే మహోన్నత జాతి కదరా ప్రకృతిని భగవంతుని స్వరూపంగా పూజించు మానవజాతిలో మీలాంటి స్వార్థపయి వుండకూడదురా!
మనిషి : ఎహ పో! నువ్వు నన్నేం చేస్తావ్‌?
పాము : పగ పట్టిందంటే పాము వదదన్న సిద్దాంతం ఇంకా చామందిలో వుందిరా! నేనేమీ చేయకపోవచ్చు మీ మానవజాతిని. ప్రకృతి ప్రకోపించి, ధరామండం వేడెక్కి, భూకంపం ప్రజ్వలించి సముద్రంలో ఉప్పెన లేచిన నాడు ప్లాస్టిక్‌,రసాయనాు, ప్లాస్టరాప్‌ పారిస్‌ మొదగు అందమైన పెయింట్స్‌ కనుక్కున్న శాస్త్రవేత్తు, కోటీశ్వయి, నాయకు అనామకు ఏ ఒక్కరూ మిగరురా! నేటి పరిస్థితు చూస్తే యీ భూమండం మీద ప్రాణకోటి అంతరించటానికి యుగాంతం దగ్గరలోనే వున్నదనిపిస్తోంది.
మనిషి : ‘నీకు మాటల్తో పని లేదే! చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు’ ఏది కర్ర (అటు యిటు చూస్తాడు).
పాము : ఒరేయ్‌ మూరు?డా! నేనే నీవనుకున్న వానపామును కానురా కానాగును. స్‌..స్‌.. (కాటు వేయబోయి ఆగి) నీలాంటి వాడిని కాటేస్తే నీ విషం నన్నే చంపుతుందిరా! అందుకే ఖునికి నిువెల్లా విషం అన్నారు.
పాము : మానవు ఆలోచనా ధోరణిలో మార్పు రాకపోతే – ప్రకృతి ప్రేమికు కరువైతే – సహజత్వానికి దూరమైతే – సముద్రాన్నీ ఏకమై సృష్టించు జ ప్రళయంలో సర్వజీవు మృతి పొందక తప్పదు . తప్పదు… తప్‌…తప్‌
స్త్రీ : చేపలోయమ్మ చేపు …


రచన : గోమఠం రంగాచార్యలు ,సెల్‌ ` 9052189385 (వచ్చే సంచికలో మా విద్యాయంలో…బాలోత్సవ్‌)

సంక్రాంతి శోభ

సంక్రాంతి అంటే అందరికీ గుర్తుకు వచ్చేది..పల్లెటూళ్ళు…ఆవు పిడకు, పాత సామా ను వేసి చలి కాచుకునే భోగిమంటు, మగవాళ్ళ కోడిపందేు, ఆడవాళ్లపిండి వంట హైరానా. కొత్త అు్లళ్లకు రాచమర్యాదు, రాజభోగాు, మగప్లి గాలి పటాు, ఆడప్లిు ముచ్చట గొలిపే పట్టు పావడాు, వాకిట్లో వేసే ముగ్గు, అందులో గొబ్బెమ్ము, చుట్టూ చామంతి, బంతిపూ రేకు, సాయంత్రంకాగానే పసిప్లికు పోసేభోగి పళ్ళు.. అమ్మో అంతా సందడే సందడి. ముత్తైదు వు ఒకరికి ఒకరు ఇచ్చి పుచ్చుకునే వాయన తాం బూలాు, సంక్రాంతి,కనుమ రోజుల్లో ఎక్కువగా కనపడే హరిదాసు…వారి తంబరు నాదస్వరాు ఉత్తరాయణ పుణ్యకాంలో వినడం శుభ సూచి కం..కనువిందుగా అరించిన గంగిరెద్దు విన్యాసాు, అన్నీ మన తొగు వారి సొంతం. దక్షిణాయనం నుండి ఉత్తరాయనంలోనికి సూర్యుడు ప్రవేశించే పుణ్యకాం సంక్రాంతి. ఆ రోజున పెద్దకు చేసే పూజు భావితరాకు ఆచారణీయం… పుణ్యపద్రం…కనుమ నాడు పశువును పూజించడం ఆచారంగా వస్తుంది. సేద్యం లోకి దుక్కి దున్నడంలో రైతుకు ఎంతో సహాయం చేసే పశువును, పశుసంపదను గౌరవించడం హిందూ సంప్రదాయం. ఆకాశంలోని చుక్కన్నీ నే మీదకు చేరే రోజు సంక్రాంతి..పాముంత, చెట్టుమీద పిట్ట, చేతిలో పూబుట్ట… కాదేదీ ముగ్గుకి అనర్హం!! చుక్కతో చుక్కు కుపుతూ చుక్కకే చుక్కు చూపించే గాలి పటాు, తీయ ని చెరకు గడు, కనువిందు చేసే కుమ, పూసిన పద్మాు, మల్లెమొగ్గు, గుమ్మడిపూు, అందమైన సీతాకోకచిుకు, నేమీద ఈదే చేపు, ఏనుగు అంబారీు, రాచహంసు, చిట్టి చిుకు, గంధం గిన్నొ,విస్తరాకు,కోటు,రధాు,స్వర్గ ద్వా రాు…ఎన్నో ఎన్నెనో ముగ్గు..వాకిట్లో వినోదా వింతు. ఆ ముగ్గు చుట్టూ మగువ కోలాటాు, ఎంత చెప్పుకున్నా తరగని పండుగ సంక్రాంతి. ఆకాశంలోని హరిమ్లి నేమీదకు వాలి రంగవల్లి అయినట్లు అనిపించడంలో ఆశ్చర్యం ఏముంది? ఎటు చూసినా ఆనందం సౌభాగ్యంకు చిహ్నం.
` డా.దేవుపల్లి పద్మజ

శాంతి,సౌభాగ్యం,ఐకమత్యం కగ లిసినదే పం డుగ. అందరూ పండుగగా వ్యవహరించే ఉత్సవాు వ్యక్తిగతంగాను, కుటుంబపరంగాను, బంధుగతంగాను జరుపుకుంటూ ఉంటాము. అంతవరకు వున్న కష్టాు మరచి అందరితో కసి మెసి ఆనందం పంచుకునే దినమే పండుగ. ఈపండుగ క్రమంలో వచ్చే ముఖ్య మైన పండుగలో సంక్రాంతి ఒకటి. సూర్యుడు తన ప్రయాణంలో ఒక రాశినుండి మరొక రాశి లోకి ప్రవేశించడాన్ని సంక్రమణం లేదా సంక్రాంతి అంటారు. ధనుస్సురాశినుండి మకరరాశిలోనికి ప్రవేశిస్తే మకర సంక్రమణం సంభవించి, ఉత్తరాయణ పుణ్యకాం ఆరంభమయి, మనం ఆచరించే ‘‘సంక్రాంతి’’ పండుగ వస్తుంది. సూర్యగమనం ఉత్తరాయణ, దక్షిణాయనాు నిర్ణయిస్తే, చంద్రగమనం మాసాు నిర్ణయిస్తుంది. సూర్యుడు ధనుస్సురాశిలో సంచరిస్తుండగా ధనుర్మాసం జరుగుతుంది. ఈ ధనుర్మాసం ముగియగానే సంక్రాంతి శోభు ప్రారంభమవుతాయి. కాచక్రంలోని రాశులో మకరరాశి సర్వశ్రేష్టమైనది. శ్రవణానక్షత్రములో ఉద్భవించిన శ్రీమన్నారాయణుడు అనంత పద్మనాభునిగా బ్రహ్మకు సాక్షాత్కరించినది శ్రవణానక్షత్రములో. ఈ నక్షత్రము మకర రాశికి చెందినది. ఈకారణం చేత శ్రీమహా విష్ణువుని యొక్క రాశి మకరరాశి. దీనిని మానవుని శిరస్సుగా భావిస్తారు. అటువంటి మకరరాశిలోకి సహస్రకిరణుడైన సూర్యభగ వానుడు ప్రవేశించే మహత్తర పుణ్యదినం కాబట్టి, ప్రతీవ్యక్తిలో ఆధ్యాత్మిక భావను పెంపొందించటానికి అత్యంత అనువైన కాం. వేదకాంనుంచి శిష్యు సరైన గురువు కోసం అన్వేషించటం, గురూపదేశం పొందడం, వేదపారాయణు సాగించటం వంటివి ఈ సమయంలోనే ఆరంభమవుతాయి. జగత్తు జమjైునప్పుడు శ్రీమన్నారాయణుడు ఆదివరాహమూర్తిగా అవతరించి భూమిని ఉద్ధరించిన రోజు సంక్రాంతి. వామనావతార ఘట్టములో వామనుడికి బలిచక్రవర్తి మూడడుగు భూమిని దానం చేసినది, వామనుడి పదఘట్టనతో పాతాళానికి చేరినది ఈరోజే. దీనికి సంకేతంగా మనం సంక్రాంతి పర్వదినం జరుపుకుంటాము. ఈపండుగ భోగి, సంక్రాంతి, కనుము అని మూడు రోజుగా జరుపుకునే పర్వదినం.
భోగిపండుగ
భోగి పండుగ పేరు చెప్పగానే మనకు స్ఫురించేవి భోగిపళ్ళు, భోగిమంటు. ఆవుపేడతో పిడకు తయారుచేసి యఙ్ఞదేవతను తుచుకుంటూ, పాపప్రక్షాణన జరిపించమని వేడుకుంటూ, ధర్మమార్గ పయనానికి సమాయత్తమవుతూ మంటలో సూర్యోదయం సమయంలో వీటిని వేస్తారు. ప్లిు, పెద్దు అందరూ ఈ మంట చుట్టూ చేరి ఆనందోత్సాహలలో మునిగిపోతారు. ఈ మంటలోనే పాతపడిన సామానును కూడా వేసే సాంప్రదాయం కూడా కనబడుతుంది. నూతనత్వానికి ఆహ్వానం పుకాంటే పాతదనాన్ని విడనాడాలి. ఈ మంటు వేదకామునాటి ఋషు తాము సంవత్సరారంభములో వ్రేల్చిన ‘ఆగ్రాహాయణి’ హోమాగ్నికి ప్రతిరూపం. హోమ భస్మం మంత్రసారము, అతి పవిత్రమైనది. మంటు శాంతించిన తరువాత ఈ హోమ భస్మాన్ని దైవప్రసాదంగా భావించి నుదుటిన ధరిస్తారు. ప్లికుకూడా నుదుటిమీద ఉంచి వారి ఆయురారోగ్యాకై ప్రార్థిస్తారు. దేవతారాధన, నూతన వస్త్రధారణ, పిండివంటతో భోజనము వగైరా పూర్తిచేసుకుని సాయంకాం ‘‘భోగిపళ్ళ’’ వేడుక జరుపుతారు. ప్లిను ఆశీర్వదిస్తూ పెద్దంతా వారి శిరస్సుపై రేగిపళ్ళను పోస్తారు. రేగిచెట్టును సంస్కృతంలో బదరీ వృక్షం అని పిుస్తారు. ఈవృక్షం విష్ణు ప్రీతికరమైనది. ఈ రేగిపళ్ళతోపాటు చ్లిరపైసు, నానపెట్టిన శనగు, పువ్వు ప్లి తలపై పోస్తూ, శ్రీమహావిష్ణువులాగా తేజరిల్లాని ఆశీర్వదిస్తారు. తరువాత ముతైదువుకు తాంబూలాు ఇచ్చి సంతోషపరుస్తారు.
సంక్రాంతి పండుగ
రెండవ రోజైనది సంక్రాంతి పండుగ. పండుగలో ప్రతీ రోజుకు ఒకప్రత్యేకత ఉంటుంది, వ్యవహార నియమ నిబంధన ుంటాయి. స్నానాదికాు ఎలా ఆచరించాలి, ఎటువంటి పూజు ఆచరించాలి,ఎటువంటి దానధర్మాు చేయాలి అనేవి మన శాస్త్రాు విపుంగా వివరించాయి. ఇవిశారీరిక ధారు ఢ్యాన్ని పెంపొందించి, వాతావరణ సమత్యుత కాపాడుతూ, సమతను పెంపొందిస్తాయి. నువ్వు నూనెతో అభ్యంగన స్నానం శారీరిక రుగ్మతను నివారిస్తుంది. నువ్వు సేవించటం వన ఆరోగ్య సమస్యు తగ్గుతాయి. ఈరోజు జరిపే శాంతి హోమాు, మృత్యుంజయ హో మాు, అభిషేకాు, వివిధ దైవారాధను ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించి, భగవ దానుగ్రహానికి తోడ్పతాయి. పితృదేవత స్మరణ వారి అఖండ ఆశీర్వచనానికి దోహదం చేస్తాయి. మన పెద్దు మనకిచ్చిన జన్మకు కృతజ్ఞత ప్రకటించటం ప్రతీ ఒక్కరి కర్తవ్యం. వారిని స్మరిస్తూ తగిన విధంగా తర్పణాు విడవటం, వారి ఙ్ఞాపకార్థం దాన ధర్మాు చేయటం శాస్త్ర విధి. పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. సుగంధ ద్రవ్యాతో, పంచా మృతముతో చేసే అభిషేకాకు చక్కటి ఫలితాుంటాయి. విష్ణువు అంకార ప్రియుడు. రకరకా పూమాలతో అంకరిస్తే, ఆయన అవ్యాజ కరుణ మనపై కుగుతుందని పురాణ ప్రవచనం. అపాత్ర దానం పనికిరాదు. తగిన వారికి తగినట్లు దానం చెయ్యాలి. ఎవరి అవసరాన్ని బట్టి వారికి దానం చెయ్యాలి. పేదకు కంబళ్ళు, వస్త్రాు దానమివ్వాలి. యోగ్యులైన బ్రాహ్మణుకు శక్తిననుసరించి సువర్ణ, రజిత, కాంస్య దానాు ఇవ్వాలి. ఈప్రకృతిలో భించే ప్రతీ వస్తువు ప్రతీ ఒక్కరి సొంతం అనే నిర్వచనానికి ప్రతీకలే దాన ధర్మాు. పౌష్య,మాఘ మాసము సంధిలో వచ్చే అమావాస్యనాడు సూర్యుడు మకరరాశిలో ప్రవేశం చేస్తే అట్టి సంక్రమణ కామే అర్దోదయకాము. ఇది పగటి పూట వస్తే ప్రశస్తము. మధ్యాహ్నమునకు పూర్వమే సంభవించే అర్ధోదయకామే పూర్తి ఫలితాన్నిస్తుంది. ఆ సమయంలో ఏ కొంచెము దానమిచ్చినా మేరు పర్వతమంత ఫుణ్య మిస్తుంది. అర్ధోదయకాంలో ‘‘ఏ బ్రాహ్మణడైన బ్రహ్మతో సమానం’’. ‘‘ఏపుణ్య జమైనా గంగతో సమానం’’ అని శాస్త్ర వచనం, వేదవచనం. ఈ నాడు పాయస దానము, కాంస్య పాత్ర దానము, సువర్ణలింగ దానము, కూష్మాండ దానము, పెరుగు దానము ప్రశస్తమైనవి. గొబ్బిళ్ళ సందడి సంక్రాంతి పం డుగు వేడుకలో మరొక ప్రధానమైనది. కన్నె ప్లిు చక్కటి వస్త్ర ధారణతో, తమకు కలిగిన ఆభరణాతో చూడచక్కగా అంకరించు కుంటారు. తొగుదనం ఉట్టి పడే కన్నె ప్లిను చూచి కుటుంబ సభ్యు మురిసి పోతారు. వివాహ వయస్సుకు వచ్చినారని చెప్పకనే చెబుతారు. పెద్దవారికి ఇది ఒక హెచ్చరికలాటిది. ఆవుపేడతో గుండ్రముగా బంతువలె తయారుచేసి, ఇంటి ముంగిటి రంగమ్ల మధ్య అమరుస్తారు. వాటిపై బంతిపూవు, ఇతర రంగు రంగు పూను అంకరించి, వాటి చుట్టూ తన తోటివారితో, స్నేహితుతో వయాకారంగా తిరుగుతూ, గొబ్బిపాటు పాడుతూ, యబద్ధంగా చప్పట్లు చరుస్తూ తిరుగుతారు. ఇది సంధ్యాసమయంలో జరిగే కను పంట. చూచినవారిదే భాగ్యం. మహాక్ష్మికి ప్రీతిపాత్రమైనది. ఈవిధంగా చేయటం వన కన్నెప్లికు త్వరలోనే చక్కటి వరుడు భించి వివాహం జరుగుతుందని విశ్వాసం. విఙ్ఞానశాస్త్ర పరంగా కూడా ఇది ఎంతో మంచిది. అనేక రకా క్రిమి సంహా రకంగా ఉపయోగపడుతుంది. ప్రతీ ఇంటి ముంగిట దర్శనమిచ్చే గొబ్బిళ్ళు స్వాగతం పుకుతూ,అసు సిసలైన పండుగ వాతా వరణాన్ని తపిస్తుంది. ‘‘హరి హరి గోవిందా’’ అని కీర్తిస్తూ, యబద్దంగా చిడతు వాయిస్తూ, భుజముపైనున్న వీణను స్వరబద్ధముగా మీటుతూ, అడుగు అడుగులో గజ్జె సవ్వడి నింపుతూ విలాసంగా సాగిపోయే హరిదాసు మన సంప్రదాయ చిహ్నాు. హరి నామ సంకీ ర్తన తప్ప మరొక మాయ వారి నోటివెంట మె వడదు. రంగు రంగు వస్త్రధారణతో, మెడలో పూదండతో హుందాగా నడుస్తూ సాగిపోతారు. శిరస్సుపై చక్కగా పూవుతో అంకరించిన ఇత్తడి గిన్నెను ధరించి, ఎవరైనా తమంత తాముగా ఏదైనా సమర్పించదుచుకుంటే వంగి లేదా మోకాళ్ళపై కూర్చుండి గిన్నెలోకి స్వీకరిస్తారు.ఎందుకంటే వారి వృత్తి భిక్షాటన కాదు. భగవన్నామ సంకీర్తనా ప్రచారం వారి వృత్తి, ఆయాచితంగా వచ్చినది స్వీకరించటం వారి ప్రవృత్తి. సంప్రదాయాను గౌరవించే గృహస్తు నిత్యము వారికోసం ఎదురు చూచి, తమక కలిగినది వారి సమర్పించుకుంటూ భావితరాకు ఆదర్శవంతంగా నిుస్తారు.
కనుమ
మూడవ రోజైన పండుగ కనుమ పండుగ. కనుమ నాడు మినుము తినాంటారు. అందుకే ఆవునేతితో తయారుచేసిన మినపసున్నొ, బ్లెం గారొ వంటిని తయారుచేసుకుంటారు. నోరూరించే పదార్థాు జిహ్వను మరింత పెంచగా మానసిక సంతృప్తితో కడుపారా అస్వాదిస్తారు. వ్యవసాయదాయి తమ తమ పశువును అంకరించి వాటిని స్వేచ్ఛగా తిరిగేలా చేస్తారు. బవర్థకమైన దాణావేసి విశ్రాంతిగా ఉండేలా చేస్తారు. వ్యవసాయ క్షేత్రములో వాటి అవసరం లేకుండా పంటు పండవు. నాగరిక ప్రపంచములో యంత్రా వినియోగం ఎక్కువైనప్పటికి, పశువు వినియోగం లేకుండా సాగదు. మనకు జీవనాన్ని, జీవితాన్ని ఇచ్చిన ప్రతీ ప్రాణిని గౌరవించానే సత్సాంప్రదాయము మనది. కనుమనాడి కాకి కూడా కదదు అనే నానుడి ప్రచారంలో ఉంది.శాస్త్రపద్దతిలో ఆలోచిస్తే దీనికి తగిన కారణం కనబడుతుంది. దైనందిన కార్యక్రమాకు దూరంగా ఉంటూ, కుటుంబ సభ్యుతో కసి మెసి ఆనందంగా జీవించటానికి అవకాశం కల్పించేవే కొన్ని కట్టుబాట్లు, ఆచారవ్యవహారాు. బయటకు వెళ్ళకోడదు అనే నియమం పెడితే చక్కగా ఇంటి వద్దే వుండి సంతోషంగా గడుపుతారని దీని ముఖ్యోద్ధేశము. అంతేకాకుండా మరుసటి రోజున బంధువు తమతమ స్వస్థాకు వెళ్ళిపోతారు కనుక వారి వీడ్కోుకు కావసిన కార్యక్రమ నిర్వహణకు దోహదం చేస్తుంది. వయస్సుతో నిమిత్తం లేకుండా కోడిపందేతో మగవారు ఆనందిస్తారు. ఒక ప్రాణిని హింసిస్తూ మనం ఆనందించటం ఎంత వరకూ సమర్థనీయమో విఙ్ఞు ఆలోచించాలి. ఈ మధ్య న్యాయస్థానాు కూడా కోడిపందేు నిషేదించాయి.
బొమ్మ కొువు ప్రతీ ఇంటా కొువుదీరుతుంది. సంవత్సరం పొడవునా సేకరించిన రకరకా బొమ్మను పు వరుసలో అంకరించి హృద్యమైన వాతావరణాన్ని తయారుచేస్తారు. వస్తుగ్రహణాశక్తిని పెంపొందించి, మానసిక శాంతిని కలిగిస్తుంది. సిరిసంపదు కుగుతాయని విశ్వాసం. బొమ్మ కొువు పేరుతో ఇంటిని అందంగా అంకరిస్తారు. పువురు విచ్చేసి అంకరణను వీక్షించి ముగ్దులౌతారు.
ఇంటిని అంకరించిన మామిడి తోరణాు, నూతన వస్త్ర ధారణు, వాకిట భోగి మంట వింత శోభు, నట్టింట్లో నిండు గర్భిణిలా ధాన్యపు గాదొ, వాకిట్లో హరిదాసు ఆపించే హరిభజను, తోటల్లో కోడిపందేు, పెరట్లో పశువు అంకారాు, అత్తింట్లో అు్లడుగారు ఎక్కే అకపాన్పు, వంటింట్లో అత్తగారు చేసే నేతి అరిసె ఘుమఘుము, అంగట్లో వస్త్రా సంబరాు, ఆయాలో దైవ పూజు, ముంగిట్లో వయ్యారి భాము దిద్దే ముత్యా రంగమ్లు, రంగమ్లపై శోభిల్లే గొబ్బిళ్ళు, దాన ధర్మా తృప్తిపొందిన దానగ్రహీతు….కగసి మన సంక్రాంతి.ఈవిధంగా మూడు రోజు నూతన వస్త్రాు ధరించి, యథాశక్తి పూజు, హోమాు సలిపి, దానాు చేసి, పశువును అంకరించి అందరితో కసియధాశక్తి పిండివంటు భుజించి అత్యంత ఆనందంగా గడుపుకుని, సంవత్సరమంతా పండుగలా గడవాని కోరుకుంటారు. ` డా.దేవుపల్లి పద్మజ
-విశాఖపట్టణము, ఫోను 9849692414.

1 5 6 7 8 9