బొక్కోసిన నిధులకు పక్కాగా లెక్కలు..?

వివిధ జిల్లాల పరిధిలో సుమారు 60 వేల పనులను పరిశీలించి 1000 కోట్ల రూపాయలకు పైగా ఉపాధి నిధులు దారిమళ్లినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. ఆ దిశగానే నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. కేవలం 60 వేల పనుల్లోనే ఇంత పెద్ద మొత్తంలో దొపిడీ బయట పడిరదంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సుమారు 16 లక్షల పనులను పరిశీలిస్తే ఇంకెన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయో అన్న సందేహాలు అధికారుల్లో సైతం వ్యక్తమవుతున్నాయి. ఏడు రకాల రికార్డుల్లో: అనుకూలంగా పద్దులు 13 జిల్లాల పరిధిలోని 12,944 గ్రామ పంచా యతీల పరిధిలో 20 లక్షల రూపాయలకు పైబడిన పనులు ఇప్పటి వరకు 8, 517 జరిగాయి. అలాగే 10 లక్షల పైన 20 లక్షలలోపు 2, 548 పనులు చేపట్టారు.5 నుంచి 10 లక్షల లోపు సుమారు 1000 పనులు మంజూరు చేశారు. 2 లక్షల నుంచి 5లక్షల లోపు 426 పనులు, లక్ష నుంచి 2లక్షల లోపు 126 పనులు మంజూరు చేశారు. గడిచిన రెండు మూడు నెలల్లో చేపట్టారు. గత ఏడాది నుంచి ప్రస్తుత ఏడాది వరకు అన్ని రకాల పనులు సుమారు 16 లక్షలకు పైగా మంజూరు చేశారు. అందుకు సంబంధించి వేలకోట్ల రూపాయలను కేటా యించారు. రాష్ట్రాన్ని లోటు బడ్జెట్‌ వెంటాడుతున్నా అభివృద్ధి పనుల విషయంలో వెనుకడుగుకు ఆస్కారం లేకుండా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా వీలైనంత వరకు ఎక్కువ పనులను మంజూరు చేస్తూ రాష్ట్రంలో అభివృద్ధిని పరుగు పెట్టిస్తున్నారు.

Read more

పోలవరం నిర్వాసితులకు అండగా జాతీయ కమిషన్‌

రాజ్యంగంలో 338ఎఆర్టికల్‌ పక్రారంగా ఏర్పడిన గిరిజన తెగల జాతీయ కమిషన్‌, గిరిజనుల రక్షణ సామాజిక ఆర్థిక శ్రేయస్సు ఇంకా పరిరక్షణకు సంబంధించిన అన్ని అంశాలను పర్యవేక్షిస్తుంది. ఇందులో భాగంగా ఈజాతీయ కమిషన్‌ పోలవరాన్ని సందర్శించు కుని తమ అభిప్రాయాన్ని ఒక రిపోర్ట్‌ రూపంలో వ్యక్తపరిచింది. జాతీయ కమిషణ్‌ చైర్మన్‌ అనంతనాయక్‌ నాయకత్వంలో కమిషన్‌ బృందం సభ్యులతో,అలాగే భుబనేశ్వర్‌ నుంచి అశోక్‌ వర్ధన్‌ గారు మరియు న్యాయ సలహా దారులు రాధకాంత త్రిపాటితో ఆంధ్రపద్రేశ్లో ముంపునకు లోనవుతున్న కూనవరం, విఆర్‌పురం మండ లాలతో పాటుగా ఒడిస్సలోని మల్కనగిరిలను సందర్శించారు. బాధితగిరిజనుల భూ వాస్త వాలను నిర్ధారించడానికి,ముఖ్యంగా గిరిజన ప్రజలతో సంభాషించడానికి క్షేత్ర సందర్శనలు జరిగాయి. ఆగస్టు 24 నుంచి 28వరకు వివిధ గ్రామాలకు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం సమన్వ యంతో నిర్మాణంలో ఉన్న బహుళ ప్రయోజన పోలవరం ప్రాజెక్ట్‌ ప్రభావిత ప్రాంతాలైన పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలోని కొన్ని ప్రదేశాలు సందర్శించారు. ` జి.నివృతి, పోలవరం నిర్వాసితుల పరిశోధకరాలు

Read more

తత్వవేత్త సర్వోన్నతులు డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌

‘‘ ఎవని లీలవలన రాతినుండి కూడా అమృతం లభిస్తుందో అట్టి లక్ష్మీకాంతుడైన మహాగురువునకు నమస్కరిస్తున్నాను. అల్పబుద్దుల్కెన శిష్యులను సైతం మహా ప్రజ్ఞావంతులుగా మలచగల శక్తియుక్తులు గల గురువులకు నమస్కారము.’’

ా విద్యార్థుల కోసం గవర్నర్‌నే ఎదిరించారు
ా అరిటాకు లేక నేల మీదే అన్నం తిన్నారు
ా పూజారి కాబోయి రాష్ట్రపతి అయ్యారు

ఆయనో ఆసాధారణ ప్రజ్ఞాశాలి,రాజ నీతి కోవి దుడు, విద్యావేత్త. భారత తొలి ఉపరాష్ట్రపతిగా, రెండో రాష్ట్ర ప తిగా (1962 నుంచి67) పదవులకే వన్నెతెచ్చిన ‘భారత రత్నం’. ఆయనే డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌. ప్రజాస్వామ్య విలువలను నెలకొల్ప డంలో, విద్యకు సమున్నత స్థానాన్ని కల్పించడంలో ఆయన చూపిన బహుముఖ ప్రజ్ఞ ఆయనకు చరిత్ర లో శాశ్వత స్థానం కల్పించింది.‘తత్వవేత్తలు రాజ్యాధి పతులైనప్పుడు ఆదర్శ రాజ్యం ఏర్పడి దేశంలో సుఖశాం తులు విలసిల్లుతాయి’ అన్న గ్రీక్‌ తత్వవేత్త ప్లేటో వ్యాఖ్యలకు రాధాకృష్ణనే నిలువెత్తు నిదర్శనం. ముందుగా ఆయన జీవితంలోని మధుర ఘట్టాలను ఒకసారి స్పృశిద్దాం…

Read more

కథ చెబుతాను ఊకొడుతావా

వినదగు నెవ్వరు చెప్పిన ..వినినంతనె వేగపడక వివరింపదగున్‌.. గని కల్ల నిజము దెలిసిన.. మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ…!

చంద గహ్రణం (కథ)
మేడమీద మంచంలో లక్ష్మయ్యతాత చందమామను చూస్తూ పండుకున్నాడు. మనవడు సుధీర్‌, మనవరాలు ప్రతిమ తాత పక్కన చేరి చందమామను గూర్చి అనేక ప్రశ్నలు అమాయకంగా అడిగారు.
‘‘మేం చిన్నప్పుడు విన్న చంద్రుడికి, పుస్తకాల్లో చదువుకున్న చంద్రుడికి చాలా తేడ వుందిరా. రాహువు కేతువు అనే గ్రహాలు చంద్రుడిని, సూర్యుడిని మింగుతాయట. అలా మింగినపుడు చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ఏర్పడతాయని మా తాతముత్తాతలు చెప్పారు. చంద్రుడు చాలా అందంగా వుంటాడని, చంద్రు నిపై చెట్టు, చెట్టుకింద అవ్వ, ఆమె పక్కన కుందేలు వుంటుందని చాలా కథలు చెప్పేవారు. నేను బడిలో చేరి పుస్తకాలు చదివినప్పుడు అసలు చంద్రుడు నేను విన్నట్లు అందంగా వుండడని,చంద్రునిపై చెట్టు,అవ్వ, కుందేలు లేవని చదివాను.చంద్రుని మీద దుమ్ము,ధూళి,రాళ్ళగుట్టలు వుంటాయని చదివా. సూర్యుడికి, చంద్రుడికి మధ్యలో భూమి వస్తే చంద్రగ్రహణం వస్తుంది. ఎక్కువగా పున్నమి రోజు ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది’’- అన్నాడు తాత లక్ష్మయ్య.

Read more

సంస్కరణలు ఎవరి కోసం

‘మీరు సంస్కరణలకు అను కూలమా, లేదా ప్రతికూలమా?’ అని నిరంతరం అడుగు తుంటారు. ఏ సంస్కరణ కూడా సంపూర్ణం కాదు. ప్రతీ సంస్కరణకూ కొంత విషయం వుంటుంది, ఒక ప్రయోజనం వుంటుంది. ఏ నిర్దిష్ట సంస్కరణ కైనా మద్దతివ్వాలా లేక వ్యతిరేకిం చాలా అనేది ఇవి నిర్ణయిస్తాయి. ఈసంస్క రణలనేవి మన ప్రజల ప్రయోజనాలకు ఉపయోగపడ తాయా,వారి జీవనో పాధులు,దేశ ఆర్థిక సార్వభౌమా ధికారం బలోపే తం అవుతుందా అన్నదే ఇక్కడ కీలకమైన అంశంగా వుంటుంది. భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకు వచ్చిన ఇన్ని దశాబ్దాల కాలంలో మా వైఖరి ఇలానే వుంటూ వచ్చింది. ఇకపై కూడా ఇలాగే కొనసాగుతుంది’

మూడు దశాబ్దాలుగా భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు కొనసాగుతున్నాయి. ఈ నేప థ్యంలో కొత్తగా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా,కనీస మద్దతు ధరకు చట్ట బద్ధమైన హామీ కల్పించాలంటూ మనరైతాంగం కనివినీ ఎరుగని రీతిలో పోరాటం కొనసాగి స్తూనే వుంది. శతాబ్దం క్రితం బలవంతంగా నీలిమందు మొక్కలను పెంచడానికి నిరసనగా జరిగిన చంపా రన్‌ సత్యాగ్రహం స్మృతులు గుర్తుకు వస్తు న్నాయి. కార్పొరేట్‌ వ్యవసాయం, చిన్న మొత్తాల్లో ఉత్పత్తిని దెబ్బతీయడం (మోడీపెద్దనోట్లరద్దు),ఆహార కొర తలు…ఇవన్నీ కలిసి కరువు కాటకాలు పెంచేలా చేయవచ్చు.
పేదలను పణంగాపెట్టి గరిష్టస్థాయిలో లాభా లు ఆర్జించడం,పెరుగుతున్న దారిద్య్రం,మరింతగా విస్తరిస్తున్న ఆర్థిక అసమానతలు,అన్ని దేశాల్లో తీవ్రంగా పడిపోయిన దేశీయ డిమాండ్‌ పైనే దశా బ్దాల తరబడి సంస్కరణలు ప్రధానంగా దృష్టి పెడుతూ వస్తున్నాయని అంతర్జాతీయ, భారతదేశ అనుభవాలు తెలియచేస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక మాంద్యం,ప్రజలజీవితంపై దానిప్రభావం వినా శకరమైన రీతిలో వుంది. ఇది,కరోనాతో మరిం తగా పెరిగిపోయింది. ఇంకా ఆ ప్రభావం కొనసా గుతూనే వుంది. ఇదిమార్క్స్‌ మాటలను గుర్తు చేస్తోంది:‘పెట్టుబడిదారీ విధానం భారీఉత్పత్తి, మారకపు మార్గాలను సమకూర్చుకుంది. ఇది క్షుద్ర ప్రపంచంలో మంత్రాలు, మాయలతో శక్తులను సృష్టించే మాంత్రికుడి లాంటిది. ఆతరువాత వాటి ని అదుపు చేయడంలో ఆమాంత్రికుడు విఫల మవుతాడు.’ అంతర్జాతీయ ఫైనాన్స్‌ పెట్టుబడి ఆది óపత్యంలోని నయా ఉదారవాద విధాన నిర్మాణంలో అంతర్భాగమే భారతదేశంలో సంస్కరణల క్రమం. ఇక్కడ గరిష్ట స్థాయిలో లాభాలు ఆర్జించడమే లక్ష్యం. ఇది, పెట్టుబడిదారీ విధానం యొక్క అత్యంత అద్వాన్నమైన స్వభావాన్ని తెలియచేస్తోంది. జంతు స్ఫూర్తిని వెల్లడిస్తోంది. పెద్దఎత్తున ప్రభుత్వ ఆస్తు లను, అన్ని ప్రభుత్వ సంస్థలను, సేవలను, ఖనిజ వనరులను ప్రైవేటీకరించడానికి…ప్రజలపై యూ జర్‌ చార్జీల భారాన్ని మోపడానికి దారితీసింది. నయా ఉదారవాదమనేది అంతర్జాతీయంగా, భారత్‌లో కార్పొరేట్లకు పెద్ద లాభదాయకంగా మారింది. నయా ఉదారవాదం ప్రారంభమైనప్పటి నుండి సంపన్నులపై పన్నులు విధించడం అంతర్జా తీయంగా 79శాతం తగ్గింది.2008లోఆర్థిక మాం ద్యం తర్వాత,మూడేళ్ళ లోనే చాలామంది కోటీశ్వ రులు తమసంపదను పునరుద్ధరించు కున్నారు. 2018నాటికి వారి సంపద రెట్టింపు అయింది. ఈసంపద అంతాఉత్పత్తి ద్వారా పెరగలేదు. తీవ్రంగా వున్న ఈ ఆర్థిక మాంద్యం స్టాక్‌ మార్కెట్ల ను ఎందుకు ప్రతికూలంగా ప్రభావితం చేయలేదో వివరించిన స్పెక్యులేషన్‌ ద్వారా పెరిగింది. మరో వైపు,ప్రపంచవ్యాప్తంగా 80శాతం మంది ఆదా యం సంపాదించేవారు 2008ముందు నాటి స్థాయికి కోలుకోలేదు. సంఘటిత రంగంపై, కార్మిక వర్గ హక్కులపై దాడుల ఫలితంగా1979లో ప్రతి నలుగురిలో ఒకరికి ప్రాతినిధ్యం వహించే కార్మిక సంఘాలు… ఈనాడు ప్రతి పదిమందిలో ఒకరికి మాత్రమే ప్రాతినిధ్యంవహించే స్థాయికి క్షీణించాయి.
భారత్‌ : అసమానతల పెరుగుదల
పర్యవసానంగా ఆర్థిక అసమానతలు పెరిగిపోయాయి.‘షైనింగ్‌ ఇండియా’ (వెలిగిపో తున్న భారతదేశం) ఎల్లప్పుడూ సఫరింగ్‌ ఇండియా (బాధలు పడుతున్న భారతం) పైనే స్వారీ చేసేది. వెలిగిపోతున్న భారత్‌..కమిలిపోతున్న భారత్‌కు విలోమానుపాతంలో వుంటుంది. 2020 మార్చి నుండి భారతదేశం లోని వంద మంది కోటీశ్వరులు తమ ఆస్తులను రూ.12,97,822 కోట్లు పెంచు కున్నారు. అంటే దేశంలోని 13.8 కోట్ల మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి రూ.94,045 చొప్పున చెక్‌ ఇవ్వగలిగేంత. కరోనా సమయంలో ముఖేష్‌ అంబానీ సంపాదించే మొత్తాన్ని ఒకనైపుణ్యం లేని కార్మికుడు సంపాదించాలంటే 10 వేల సంవత్సరా లు పడుతుంది. అంబానీ ఒక సెకనులో సంపాదిం చే మొత్తాన్ని ఈకార్మికుడు మూడేళ్ళకు సంపాది స్తాడని ఆక్స్‌ఫామ్‌ నివేదిక ‘ది ఇనీక్వాలిటీ వైరస్‌’ లోని తాజా భారత్‌ అనుబంధ నివేదిక పేర్కొంది.
మరోవైపు,2020 ఏప్రిల్‌లో ప్రతి గంటకు లక్షా 70వేల మంది తమ ఉద్యోగాలను కోల్పో యారని గణాంకాలు తెలియచేస్తున్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో భారత కోటీశ్వరుల సంపద 35 శాతం పెరిగింది. 2009 నుండి చూసినట్లైతే 90 శాతం పెరిగి 42.29 వేల కోట్లకు చేరుకుంది. వాస్తవానికి, కరోనా మహమ్మారి సమయంలో భారతదేశంలో అగ్రస్థానంలో వున్న 11మంది కోటీశ్వరుల పెరిగిన సంపదతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథ కాన్ని పదేళ్ళపాటు లేదా ఆరోగ్య మంత్రిత్వ శాఖను పదేళ్ళపాటు నిర్వహించవచ్చు. పైస్థాయిలో వున్న 20 శాతం లోని 93.4 శాతంతో పోల్చుకుంటే… నిరుపేదలైన 20 శాతంలో కేవలం ఆరు శాతానికే మెరుగైన పారిశుధ్య వనరులు అందుబాటులో వున్నాయి. భారత జనాభాలో దాదాపు 59.6 శాతం మంది ఒక్క గదిలోనో లేదా అంతకంటేచిన్న జాగాలోనో బతుకు తున్నారు. ప్రభుత్వ వ్యయం వాటాను బట్టి చూసి నట్లైతే ప్రపంచంలోకెల్లా అత్యంత తక్కువ ఆరోగ్య రంగ బడ్జెట్‌వున్న దేశాలలో భారత్‌ నాల్గవ స్థానం లో వుంది. కరోనా సమయంలో పెరిగిన తమ సంపదపై కనీసం ఒక శాతం పన్నును దేశంలోని పైస్థాయిలో వున్న 11 మంది కోటీశ్వరులు కట్టినా కూడా ‘జన్‌ ఔషధి’ పథకానికి కేటాయింపులను 140 రెట్లు పెంచడానికి సరిపోతుంది.ఈ పథకం వల్ల పేదలు, అట్టడుగు వర్గాల వారికి మందులు అందుబాటులో వుంటాయి. భారతదేశంలో దశాబ్దాలుగా అమలవు తున్న సంస్కరణలు ఆర్థిక అసమానతలను తీవ్రంగా పెంచుతున్నాయి. ప్రజలను దృష్టిలో వుంచుకుని వారికి అనుకూలమైన రీతిలో కాకుండా.. పెట్టుబడి దారులు లాభాలు ఆర్జించే రీతిలో సంస్కరణలు తీసుకు వస్తున్నారు. సంపద సృష్టికర్తలను గౌరవిం చాలని ప్రధాని మోడీ మనకు ఉద్భోదిస్తున్నారు. సంపద అంటే విలువను డబ్బు రూపంలోకి మార్చడమే. ఆ విలువను సృష్టించేది కార్మిక వర్గమే. మన ప్రజల సర్వతోముఖ సంపదకు విలువను సృష్టించే వారిని గౌరవించాల్సిన అవసర ముంది.
దారిద్య్రం : అపార వృద్ధి
ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయడంతో పాటు మోడీ ప్రభుత్వం,స్వాతంత్య్రం సము పార్జించి నప్పటి నుండి భారతదేశం అనుసరిస్తూ వచ్చినదాన్ని (దారిద్య్ర స్థాయిని లెక్కించడానికి మౌలికమైన పోషకాహార నిబంధనను) విడిచిపెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక వ్యక్తికి రోజుకు 2200 క్యాలరీల పోషకాహారం వుండాలి. పట్టణభారతంలో అయితే అది 2100 క్యాలరీలుగా వుండాలన్నది నిబంధన. దీని ప్రకారం చూసినట్లైతే 1993-94లో గ్రామీణ ప్రాంతాల్లో 58 శాతం మంది, పట్టణ ప్రాంతాల్లో 57శాతం మంది ఈ దారిద్య్ర రేఖకు దిగువున వున్నారని ఎన్‌ఎస్‌ఎస్‌ నమూనా సర్వే తెలియచే స్తోంది. 2011-12లో మరోసారి నిర్వహించిన ఎన్‌ఎస్‌ఎస్‌ సర్వేలో ఈశాతాలు వరుసగా 68, 65కు పడిపోయాయి.తిరిగి 2017-18లో మరో సారి విస్తృతంగా నమూనా సర్వే నిర్వహించారు. కానీ మోడీ ప్రభుత్వం వాస్తవాన్ని కప్పిపుచ్చేందుకు ఈ ఫలితాలను వెల్లడిరచకుండా తొక్కిపట్టింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మన డేటాబేస్‌ సంస్థలను కూడా ఈ ప్రభుత్వం నాశనం చేస్తోంది. గ్రామీణ భారతంలో తలసరి వాస్తవ వినిమయం వ్యయం (కేవలం ఆహారమే కాదు) కేవలం 9శాతంగా మాత్రమే వుందని మీడియాకు లీకైన డేటా తెలియ చేసింది. కరోనా మహమ్మారి తలెత్తడానికి ముందు గానే గ్రామీణ, పట్టణభారతాల్లో సంపూర్ణ స్థాయిలో దారిద్య్రం అనూహ్యంగా పెరిగిందన్నది సుస్పష్టం. అప్పటి నుండి పరిస్థితి మరింత అద్వాన్నంగా మారింది.
కోవిడ్‌ మహమ్మారి విజృంభణ…ప్రజల ప్రాణాలను,వారిఉపాధులను కాపాడేందుకు అరకొరగా వున్న ఆరోగ్య సంరక్షణ సదుపాయాల ఇబ్బందులు…పరిస్థితులను బహిర్గతం చేశాయి. ఈనాడు మనం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక మాం ద్యం అంతర్జాతీయ నయా ఉదారవాద విధానంలో భాగమే. ఏదోవిధంగా ప్రజలను తీవ్ర స్థాయిలో దోపిడీ చేయడం ద్వారా లాభాలను గరిష్టంగా ఆర్జించాలన్నదే ఈ నయా ఉదారవాద విధానం. పొదుపు చర్యల నుండి వేతనాల్లో కోతల వరకు, ఉద్యోగాల లేఆఫ్‌లు, మరీ ముఖ్యంగా చిన్న స్థాయి లో ఉత్పత్తిని దెబ్బ తీయడం (భారత్‌లో ఇది పెద్ద నోట్ల రద్దు ద్వారా జరిగింది) వంటి చర్యల ద్వారా ప్రజలను దోపిడీ చేస్తారు. ఆర్థిక కార్యక లాపాలకు సంబంధించిన అన్ని మార్గాలను ఆక్రమించు కోవడం, ఇప్పుడు కార్పొరేట్‌ లబ్ధికోసం భారత వ్యవ సాయ రంగాన్ని నాశనం చేయడం, కాంట్రాక్ట్‌ వ్యవ సాయం,ఫలితంగా ఆహార కొరత వంటివి ఈవిషయాన్ని మనకు స్పష్టంగా తెలియ చేస్తు న్నాయి. ఈనాడు, అంతర్జాతీయ ఆకలి సూచీ భారత్‌ను ‘తీవ్రమైన కేటగిరీ’లో నిలిపింది. పోషకా హార లోపం ప్రమాదకర స్థాయిలో పెరిగిపో తోందని,మరీ ముఖ్యంగా పిల్లల్లో ఇది ఎక్కువగా వుందని, ఫలితంగా శిశుమరణాలు ఎక్కువగా నమోదవుతు న్నాయని ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌-5 తెలియ చేసింది.
మతోన్మాదం-కార్పొరేట్ల బంధం
2014 తరువాత కార్పొరేట్‌, మత రాజకీ యాల యొక్క విషపూరిత బంధం ఆవిష్కృతమైంది. జాతీయ ఆస్తులను దోపిడీ చేయడం ద్వారా గరిష్టం గా లాభాలను ఆర్జించడమన్నది చాలా దూకుడుగా అమలు చేశారు. ప్రభుత్వ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రైవేటీకరించారు. ప్రభుత్వ సంస్థలను, గనులను కూడా ప్రైవేటీకరించారు. ఫలితంగా అనూహ్యమైన స్థాయిలో ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం, రాజకీయ అవినీతి పెరిగిపోయింది. దీనికి తోడు ప్రజల ప్రజాస్వామ్య హక్కులపై, పౌర హక్కులపై, మానవ హక్కులపై నిర్దాక్షిణ్యంగా దాడులు చేశారు. అస మ్మతివాదులందరినీ జాతి వ్యతిరేకులుగా ముద్ర వేశారు. నిరంకుశ యుఎపిఎ, దేశద్రోహ చట్టం కింద ప్రజలను నిర్దాక్షిణ్యంగా అరెస్టు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమం ఇటు భారత రాజ్యాం గాన్ని,అటుప్రజలకు ఇచ్చినహామీలను దెబ్బతీసింది.
ప్రపంచ ఆర్థిక స్వేచ్ఛా సూచీ (గ్లోబల్‌ ఎకనామిక్‌ ఫ్రీడంఇండెక్స్‌)భారత్‌ను105వ స్థానం లో నిలిపింది. గతేడాది కన్నా ఇది అద్వా న్నమైన స్థితి. గతేడాది 79వస్థానంలో వుంది. మానవ హక్కుల సూచీలో భారత్‌ 94నుండి 111కి పడిపో యింది. యుఎన్‌డిపి మానవ వికాస సూచీ మనల్ని ఇంకా కిందకు..అంటే గతేడాది వున్న 129 నుండి 131వ స్థానానికి దింపేసింది. మెజారిటీ ప్రజలకు పెరుగుతున్న ఇబ్బందులతో పాటుగా పెరుగుతున్న నియంతృత్వం…ముస్సోలిని ఫాసిజానికి చెప్పిన నిర్వచనం ‘పాలనతో కార్పొరేట్ల కలయికకు’ దగ్గరగా ఉంది. ఆర్థిక వ్యవస్థలను పునరుద్ధరించడంలో నూతన ఆర్థిక విధానాలు విఫలమయ్యాయన్న సంగతి ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడుతోంది. అసమానతలు వృద్ధికి ఆటం కం కలిగించి, అసమ ర్ధతను పెంచే స్థాయికి చేరుకు న్నాయి’ అని ‘ది ఎకానమిస్ట్‌’ పత్రిక పేర్కొంది.
నయా ఉదారవాద సంస్కరణల దివాళా
పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యయాలతో కూడిన ఉద్దీపన ప్యాకేజీలను అభివృద్ధి చెందిన దేశాలన్నీ ప్రకటించాయి. ఇవి నయా ఉదారవాదానికి శాపం గా పరిణమిస్తాయి. దేశీయ డిమాండ్‌ను, ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించడానికి ఈ చర్యలు ఉద్దేశించబడ్డాయి. ‘’నేను కమ్యూనిస్టును కాను, కానీ….’’ అంటూ ప్రభుత్వ వ్యయం పెంచడాన్ని సమర్ధిస్తూ ఇటీవలే బ్రిటీష్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ప్రసంగించారు. అయితే, మోడీ ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ వ్యయం పెంచడం గురించి ఎక్కువగా మాట్లాడడం లేదు. కానీ తన ఆశ్రితులు చెల్లించని పెద్ద మొత్తంలోని రుణాలను మాత్రంరద్దు చేస్తోం ది. రోజువారీ పెట్రో ధరల పెంపు ద్వారా ప్రజ లపై భారాలు మోపుతోంది. ఫలితంగా ద్రవ్యో ల్బణం పెరిగిపోతోంది. దీనివల్ల దేశీయ డిమాండ్‌ మరింతగా క్షీణిస్తోంది. ఫలితంగా ఆర్థిక మాంద్యం పెరుగుతోంది. భారత్‌లో ఈ సంస్కరణల పంథా ను మనం తీవ్రంగా పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. మన ప్రాధాన్యాలేంటనేది పున: నిర్వచించుకోవాల్సి వుంది. వ్యవసాయాన్ని బలో పేతం చేయాలి. ఆహార భద్రతను పటిష్టపరచాలి. ఆరోగ్యం,విద్యపై పెట్టుబడి పెంచాలి. ప్రస్తుతం మనకు ఎంతగానో అవసరమైన-ఆర్థిక, సామాజిక-మౌలిక సదుపాయాల నిర్మాణంపై ప్రభుత్వ పెట్టు బడులు పెద్దఎత్తున పెరగాలి.అప్పుడే ఉద్యోగాలు సృష్టించబడతాయి.దేశీయ డిమాండ్‌ పెరుగు తుంది. కేవలం మానవతావాద ఆందోళనల తోనే కాకుండా, సమానమైన ఆర్థిక పునరుద్ధరణకు కూడా ఇదొక్కటే మార్గం. అస్పష్టత,అహేతుకత,మన సమా జాన్ని అమానవీయం చేసేలా, మనసామాజిక సామ రస్యతను దెబ్బతీసే అన్ని విచ్ఛిన్నకర ధోరణులను తిరస్కరించడం అన్నింటికంటే ముఖ్యమైనది. ప్రజా ప్రయోజనాలే కీలకమైన అటువంటి సంస్కర ణలు ఈనాడు భారతదేశానికి అవసరం. అంతేగానీ కార్పొరేట్‌ లాభార్జనే థ్యేయంగా గల సంస్కరణలు కాదు. ఇటువంటి సంస్కరణల దిశను సాకారం చేయగలిగే వేదిక ప్రజా పోరాటాలను బలోపేతం చేస్తుంది. ప్రత్యామ్నాయ సంస్కరణల పంథాను సూచించగల ప్రజాఉద్యమాలు,సమీకరణలు తగి నంత బలాన్ని పుంజుకోవాల్సి వుంది. మన ప్రజల పై మరిన్ని భారాలను మోపుతున్న, వారిని దెబ్బ తీస్తున్న భారత పాలకవర్గాల ప్రస్తుత దిశను మార్చ గలిగేలా ఈఉద్యమాలు వుండాలి. భారత దేశం లోని మూడు దశాబ్దాల సంస్కరణల క్రమం సరైన దిశ లోకి మారడానికి ఇదే సముచితమైన సమయం.
(సీతారాం ఏచూరి)(ప్రజాశక్తి సౌజన్యంతో)

కలుపు మొక్కలు

బాల్యం నుండే విద్యార్థుల్లో ప్రకృతి,పర్యా వరణం, దురాచారాలు మూఢనమ్మకాలు, సాంఘిక దురాచారాలు, ఆచార వ్యవహా రాలు మొదలైన అనేక అంశములను తెలి యజేసి విద్యార్థుల్లో విజ్ఞానం పెంపొందించే ఉద్దేశంతో విద్యార్థుల కోసం ప్రారంభిస్తున్న కొత్త శీర్షిక ‘థింసా బాల వినోదం. ప్రదర్శన యోగ్యమైన చేతి బొమ్మలాటలు, లఘునాటికలు,నాటికలు ఏక పాత్రాభి నయం మొదలగు ప్రక్రియల ద్వారా ధారా వాహికగా అందిస్తున్నాం. ఈశీర్షిక మీ అందరి మనసులు ఆనందంతోపాటు, విజ్ఞా నం, వినోదం కలిగిస్తుందని భావింస్తున్నాం. చిత్తూరు జిల్లా రిషివ్యాలి స్కూల్లో ఉపాధ్యా యులుగా పనిచేస్తున్న తెలుగు పండితులు శ్రీ గోమఠం రంగా చార్యులు అందిస్తున్నారు. ఈనెల సంచికలో ‘కలుపు మొక్కల కథ’ ప్రత్యేకమైన కొత్త శీర్షిక.

కోదండపాణి గురుకుల పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు వారం వారం కాకపోయినా నెలకొకసారైనా వాళ్ల పుస్తకాల బీరువాలు పరిశుభం చేసుకుని పుస్తకాలను ఓ క్రమపద్ధతి లో అమర్చుకుంటారు. ఓఆదివారం తెలుగు ఉపాధ్యాయుడు బుడంకాయ్‌ బీరువా పని పడదామని ఉత్సాహంగా తలుపు తెరవగానే ఉన్న ఎలుక సపరివార సంతాన సమేతంగా దూకి పారిపోయింది. అదృష్టం బాగుండి తెలుగు టీచరు బుడంకాయ్‌ మీదకు దూకలా. బుడంకాయ
అసలు పేరు సంతానం. నిక్‌ నేం బుడంకాయ్‌. బొద్దెంకను చూస్తేనే భయపడే ఆయనకి ఎలుకల సమూహాన్ని చూడగానే ఒళ్లంతా ముచ్చెమటలు పట్టాయి.నిశ్చేష్టుడైఎలుకల వైపు వాటితోకల వైపు తదేకంగా కళ్లార్పకుండా చూస్తున్న ఆయన చెవులకు ‘బుడంకాయ గారు’ అన్న కేక వినబడేసరికి ఉలిక్కిపడి గంతేసి చెయ్యెత్తి నిల్చున్న ఆ ఆకారం చూచి ఈ భంగిమలో మీరు ఉవేదాంతం సత్యనారాయణశర్మ గారి భామాకలాపంలో వున్న ‘సత్యభామలా వున్నారండి’ అన్నారు ఆ స్కూలు డాన్సు
మాస్టారు పెంచలయ్య –
పుస్తకాల బీరువా శుభ్రం చేస్తున్నారా?అన్న పెంచెలయ్య మాటలకు లేదు అభ్యంగన స్నానం చేయిద్దామని ఆలోచిస్తున్నాఅన్నాడు నిదానంగా.
ఏంటినిజంగా నీళ్లు పోసికడుగుతారా? అన్నాడు అమాయకంగా..మీరు ప్రతిసారి పిల్లలచేత చేయించే వినాయక స్తోత్రరో వున్న మూషిక వాహనానికి – దానమ్మ కడుపు మాడ నా కబ్బో ర్డులో సంతాన సమేతంగా ఉన్నదికాక మల మూత్ర విసర్జనలతో, పుణ్యాహ వాచనం చేసిందండీ! మరి నన్నేం చేయమంటారు? అని ఓ పశ్న్ర సంధించాడు బుడంకాయ గారు.
నేను మీకు చెప్పేంతటివాడినా? అడిగారు కాబట్టి – నిమ్మకాయ చెక్కతో శుభంగ్రా రుద్ది, యాంటీడాండ్ర షాంపుతో కడిగి, ఎందుకైనా మంచిది కరోనా శానటైజర్‌ కూడా స్ప్రేచేయండి అన్నారు నృత్యాచార్యుడు పెంచెలయ్య.
మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగనూనా? నా తలచుండ్రుకే మీరు చెప్పినదేదీ చెయ్యలేదు.చూస్తున్నారుగా! ఎడారిలో ఖర్జూరం మొక్కల్లా నడినెత్తిన నాలుగు వెంట్రుకలు అని దీర్ఘాలోచనలో పడ్డ ఆయనగారితో చమత్కారంగా గుండైతే ఏంటండీ? ఎంత గుండంగ్రా వుందోమీ తల అన్న పెంచెలయ్య మాటలకు యిద్దరూ హాయిగా
నవ్వుకున్నారు. ఎలుక దాని సంతానం కలసిపరీక్ష ఆన్సర్‌ పేపర్లన్నీ కొరికేశాయి పెంచెలయ్య్నా.. అని కాంభోజీ రాగం లాంటి అరుపుకు పక్కనేవున్న సంగీతం సార్‌ దేవలోకం ఉదేశభాషలందు తెలుగు తియ్యందనం ఎక్కువ అని మీరే
అంటారుగా! అందుకే తెలుగు పేపర్లన్నీ కొరికాయ్‌ అన్నాడు కాలర్‌ ఎగరేస్తూ . దేవలోకం చేసిన ఎద్దేవకు ఏం చెప్పాలో అర్థంకాని బుడంకాయ్‌ కొరికి తిన్నందుకు కాదు, అన్నిటి మీద మలమూత్రవిసర్జన చేసి కంపు చేశాయ్‌ నా అలమార అన్నాడు సావధానంగా! ఈసారివిస్తుపోయారు సంగీతం దేవలోకం, డాన్సు పెంచెలయ్య. ప్రక్కనేవున్న హిందీటీచర్‌ విద్వత్‌ ఇదంతా వింటు వుండబట్టలేక పిల్లలు వ్రాసిన స్పెల్లింగ్‌ మిస్టేక్స్‌ పేపర్లు తిన్న తరువాత వాటికి అతి మూత్రవ్యాధి విరోచనాలు పట్టుకు నుంటాయ్‌ మిస్టర్‌ బుడంకాయ్‌ అన్నాడు నవ్వుతు. ఆయనగారి సహేతుక వివరణకు ముగ్గురూ నవ్వుకున్నారు.
ముక్కుకు గుడ్డకట్టుకొని, నోటికిప్లాస్టర్‌ వేసుకుని, చేతివేళ్లకు గ్లౌజ్‌ తొడుక్కుని తలకు కండువ చుట్టుకొని చేసేదిటీచరు ఉద్యోగం. ఎన్ని జాగ్రత్తలు? ఇవన్నీ జాగ్రత్తలు అంటేపొరపాటే. బుడంకాయ్‌ గారికిలేని జబ్బు లేదనటం
సముచితంగా వుంటుంది. ఎలర్జీ,తుమ్మలు, గజ్జి,దురదలు,బి.పి,ఎక్కువ తింటేడయాబిటిక్‌, రెండు మెట్లు ఎక్కితే ఆయాసం, ఎక్కువసేపు కూచుంటే శరీర భాగాలన్నీ తిమ్మిరెక్కుతాయ్‌! ఒకటా రెండా? అన్ని వ్యాధుల సమాహారమే బుడంకాయ్‌ ఆల్‌ డిసీజెస్‌ యిన్‌ వన్‌ బాడీ! మొత్తం మీద రాక్‌ శుభం చేసి ఎలుకలు కొరికిన పరీక్ష పేపర్లు ఆ రూములోనేడస్ట్‌ బిన్‌ లో వేశాడు. వేసివెయ్యకుండానే డస్ట్‌ బిన్‌ ఈ పేపర్లు వేసేందుకు నేను తప్పితే ఇంకేం దొరకలేదా? అని అడిగినట్లనిపించింది బుడం కాయ్‌కి. ఇక్కడ కాకపోతేఎక్కడ వేస్తాను? పైగా పరీక్ష పేపర్లు. వీటన్నిటినీ తగలబెడదామా అంటేకాగితం సాక్షాత్‌ సరస్వతీదేవికి ప్రతి రూపం. ఆం ఏం కాదులే అని అవి తగల పెడితేఅగ్నిదేవుడికిఏం కోపం వస్తుందో? బుడంకాయ గారు ప్రకృతి ప్రేమికుడు కూడాను. ఈ మధ్యనేపక్షుల వీక్షణ గ్రూపులో కూడా చేరాడు. ప్రతి ఆదివారం ఉదయం చెట్లవెంబడి, పుట్టల వెంబడిపడితిరుగుతు పక్షులను గమనిస్తున్నాడు.
ఈ ఎలుకలు కొరికిన చెత్తవదిలించుకోవటం ఎలా? తల వేడెక్కింది బుడంకాయ్‌ కి.
తలపాగా తీసిగోక్కుంటే అపురూపంగా పెంచుకున్న నాలుగు వెంట్రుకల్లో ఓ వెంట్రుక కాస్తా ఊడిపడిరది. ఆ గోకుడుకి గుండు మీద గాయం రక్తం కారటం మొదలుపెట్టింది. ఏం చెయ్యాలి? డాక్టరు దగ్గరకు వెళితే 56 రకాల పరీక్షలు చేయించమని అంటాడు. దిద్దిపారేసిన పేపర్లు 156 దాకా వున్నాయి కాని జేబులో 6 రూపాయలు కూడా లేవు. పైగా నెలాఖరు.
పోనీ అప్పు చేస్తే? అనుకోగానేశ్రీమతి ఃమంగతాయారుః జ్ఞాపకం వచ్చింది. అప్పిచ్చిన వాడితల, నా తల రోకలిబండతో ముక్కల పచ్చడిచేస్తుంది. డాక్టరూ వద్దు మందూ వద్దు. అప్పు అసలే వద్దు అనుకుంటు చిన్నపిల్లవాడిలా చేతులో వున్న చాక్పీసు అరగతీసి నెత్తురుపై నెత్తికిరాసుకున్నాడు.ఆ మంటకు ఏడుపు ఆపుకోలేకపోయాడు. కళ్ల వెంట నీరు ఏకధాటిగా కారుతోంది. అటుగా వెళుతున్న విద్యార్థిచూసి ఉఏమైందిఎవరన్నా పోయారండీ? అలా ఏడుస్తున్నా రెందుకండీ?్న అని సావ ధానంగా అడిగాడు. భరించలేని మంట, కోపం, ఏం చెప్పాలో తెలియక ముందు వెనక ఆలోచించకుండా ఠక్కున ఆ హెడ్‌మాస్టారు పోయాడు అన్నాడు బుడంకాయ. పాపం పిల్లవాడూ వెక్కి వెక్కి ఏడుపు ప్రారంభించాడు. ఒకరికియింకొకరు తోడైఅక్కడ ‘ఓఏడుపుల క్లబ్‌’ తయారైంది.
అటుగా వెళుతున్న లెక్కలసారును చూడగానే నోటికి తాళాలు పడ్డాయ్‌. పిల్లలందరూ మటుమాయమయ్యారు. కాస్త ఊపిరి పీల్చుకున్నాడు బుడంకాయ. ఇప్పుడు ఇలా యింటికి వెళితే తల గాయం గూర్చి శ్రీమతి అడుగుతుంది. విషయం చెప్పీ చెప్ప కుండానే ఏడుపులు,పెడబొబ్బలు మొదలవుతాయి అనుకొని స్టాఫ్‌ రూంలోనే కూర్చున్నాడు. వచ్చేవారు వస్తున్నారు పోయేవారు పోతున్నారు. వారడిగే ప్రశ్నలకు ముక్తసరిగా సమాధానం చెప్పి వూరుకుంటున్నాడు బుడంకాయ. మనసు పరిపరివిధాలా వేధిస్తోంది.ఈ పేపర్లను ఏం చేయాలి? ఇంటికివెళ్లేలోపు ఏదో ఒకదారి దొరుకుతుందిలే అని చంకలో పేపర్లు పెట్టుకొని దర్జాగా బయలుదేరాడు.హఠాత్తుగా ఈదురుగాలి విజృంభించింది. దుమ్ము ధూళి పైకిలేచింది.పేపర్లగూర్చే ఆలోచించే ఆయన ఈ హఠాత్పరిణామాన్ని గమనించలేదు. కంట్లో దుమ్ము పడేసరికిచేతులెత్తి కళ్లుమూసు కున్నాడు. చంకలో కాగితాలు గాలిపటాల్లా సందు చివరిదాకా ఎగురుతు చెల్లాచెదురుగా భూమ్మీద కొన్ని, చెట్లకొమ్మల ఆకుల మధ్యలో కొన్ని, వీధిచివర్లో వున్న చెరువులోకి
కొన్ని కొట్టుకుపోయాయి.
ఐదేఐదు నిముషాల్లో వాయుదేవుడు విజృంభించటం, శాంతించటం జరిగి పోయింది.దుమ్ము పడ్డముఖాన్ని చెరువు నీళ్లతో కడుక్కుందామని చెరువు గట్టు దగ్గరకు చేరిచెరువులోకి చూసి మూర్ఛ పేషంటులా వూగిపోతూ కిందపడిగుడ్లు తేలేశాడు. వెంటనేతనను తాను తమాయించుకుంటు చేతులు చాచి ‘మరణ మృదంగం మీద నృత్యం చేస్తున్న’ మీన సుందరినోట్లో కాగితం తీసిచూస్తేతన శిష్యులు వ్రాసిన పరీక్ష పేపరు
ముక్క మీద మీనము అన్నది చూచి ఆ కాగి తాన్ని జేబులో వుంచీ వుంచకుండానేకేరింతలు వేస్తూ చేతిలో వున్న మీన సుందరిమృత్యువుని జయించి ఈదుకుంటు లాహిరిలాహిరి లాహిరిలో జగమేవూగెను అన్నంత ఆనందంలో చెరువు మధ్యకు చేరింది. బుడంకాయ వెళ్లిన దారినే ‘బర్డ్‌ వాచర్స్‌ క్లబ్‌’ సెక్రటరీ ఖగపతి కూడా యింటికి బయలుదేరాడు. ఆయన ధోరణిలో ఆయన కొత్తపిట్టేమైనా వచ్చిందేమో అనుకుంటు ‘బైనాక్యులర్‌’ తీసి ఓచెట్టు కొమ్మలో యిరుక్కుని ‘కీకీ’ అంటున్న పక్షిని గమనించాడు. అదిచావుబతుకుల మధ్య కొట్టుకుంటోందని అర్థమైంది. నిశితంగా గమనిస్తేదాన్నోట్లో కాగితం ముక్క. గొంతు కడ్డు పడిరదనుకొని అటుగా వెళుతున్న ఓచెలాకీవిద్యార్థిని పిలిచి చెట్టుపైవున్న పిట్టను చూపించి దాన్ని జాగ్రత్తగా కిందకు పట్టుకు రమ్మన్నారు. విద్యార్థీశతమర్కట ఉపాధ్యాయుడిమాట పూర్తయీ కాకుండానేవాడు చెట్టు సగం ఎక్కేసిపిట్టని పట్టుకుని కిందకిదిగి గురువుగారిచేతిలో ఆయన కోరుకున్న పక్షీశ్వరు ణ్ణివుంచాడు.పిట్టనోట్లో కాగితం తీసిపిట్టని పిల్లవాడి చేతిలో వుంచాడు. పరలోకానికి వెళ్లాల్సిన పిట్టపిల్లవాడిచేతుల్లో నుండి తుర్రున ఎగిరిపోయింది.చెరువు దగ్గర నుండి బుడంకాయ వీళ్లను వింతగా చూస్తూ ఏమైందండీఅని అడిగాడు. ఖగపతిగారు చేతిలోని కాగితం ముక్కను బుడంకాయ చేతిలో పెట్టాడు. బుడంకాయ కాలరెగరేసాడు ఈ కలుపు మొక్కలు సూర్యుడస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యం వారు నేర్పిన ఇంగ్లీషులో కూడా ఉన్నాయా అని అనుకున్నాడు.పక్కనేవున్న చెట్టెక్కి దిగిన విద్యార్థిఆ పేపరు నాదేనండి అదినేనే వ్రాశాను. నా ఇంగ్లీషు దస్తూ రినేను గుర్తుపట్టగలనండీ అన్నాడు. వాడి మాటలకు బుడంకాయ మళ్లీ బుర్రగీక్కున్నాడు. మిగిలివున్న మూడు ఎడారి మొక్కల్లో ఒకటి కిందకు పడిరది. నెత్తిన మిగిలి వున్న రెండు మొక్కలు ఈరోజుకు బతిక్రిపోయాం అనుకున్నాయి. పిల్లలు నాటిన యీ కలుపు మొక్కలు ఎప్పుడు వూడిపడతాయో! అనుకుంటు దిగాలుగా యిల్లు చేరాడు. చిలికి చిలికి గాలివాన తుఫానుగా మారినట్లు పరీక్ష పేపర్లు కొరికిన ఎలుకల దగ్గర నుండి చావు బ్రతుకుల మధ్య నరకం అనుభవించి బయటపడ్డమీన సుందరి, పక్షీశ్వరుల కథలు, కథలు కథలుగా స్కూలు మొత్తానికి తెలిశాయి. ఆనోట ఆనోట హెడ్‌ మాస్టరు గజవా హనుడికీ తెలిసింది. గజవాహనుడు చండశాసనుడు. స్కూలు పిల్లల్ని గడగడ లాడిస్తాడేకాని ఆయన పిల్లల్ని చూస్తే ఆయన గడగడలాడుతాడు. స్టాఫ్‌ రూంలో సరదాగా కబుర్లు చెప్పుకుంటు నవ్వులు విరగబూస్తున్న సమయంలో గజవాహనుడు వచ్చాడు. ఆయన్ను చూడగానేవాతావరణం మారిపోయింది. వాడిపోయిన కుసుమాల్లా ముఖాల్లో మార్పు వచ్చింది. ఇదంతా గమనించ లేనంత అసమర్ధుడు కాదు గజవాహ నుడు.అందర్ని చూస్తూ ఉనా రాక మీకేమైనా ఇబ్బందిగా వుందా అన్నారు.ఉచెట్టెక్కి కిందకు దింపిన పిల్లవాడి పిట్టకథ ప్రాణాపాయం నుండి బయటపడిన ఉమీన సుందరికథఉ తెలుసా? అని గద్దించాడు గజవాహనుడు. అందర్నీ ఉతికిఆరేద్దామని వచ్చి ఏదోమొదలు పెట్టబోయేలోపేబెల్‌ మోగింది. అక్కడున్నవారు అంతా ఎవరిమానాన వారు పుస్తకాలు,డస్టరు, చాక్పీసు తీసుకుని గజవాహనానికి నమస్కరిస్తూ బయటపడ్డారు. కాంపోజిషన్‌ పుస్తకాలు దిద్దుకుంటు అక్కడేకూర్చున్న బుడంకాయను సావకాశంగా ఉఏం చేస్తున్నారండి? అని అడిగిఆయవ పక్కనేకూర్చున్నాడు గజవా హనుడు. దిద్దుతున్న పుస్తకాన్ని చూపిస్తూ తెలుగు కాంపోజిషన్‌ దిద్దుతున్నా సార్‌ అని పుస్తకం పెద్దాయనకు చూపించాడు. పుస్తకంలో ప్రతిపేజీ దిద్ది వ్రాసిన సరిjైున పదాలు, వ్యాసంపైవిద్యార్థికి చేసిన సూచనలు అన్నీ చూశాడు గజవాహనుడు సావకాశంగా. ఏంటిసార్‌ 10ష్ట్రలో యింత ఘోరమా? అన్న ఆయన ప్రశ్నకు ఇదిచూడండి అంటూ యింకో పుస్తకంలో ఓపేజీ చూపిస్తూ కురుక్షేత్ర సంగ్రామంలో కాళ్లు, చేతులు,తల కోల్పోయి మొండెం ఏనుగుల కాళ్ల కిందపడి రక్తసిక్తమైన కురుక్షేత్రసంగ్రామాన్ని తలపిస్తుందియీ ఎర్రసిరా గుర్తులు అంటు తన అశక్తను తెలియజేసాడు బుడంకాయ్‌. ఆ పుస్తకంలోని అన్ని పేజీలు తిప్పి అట్టమీద పేరు చూసిదిమ్మెర పోయారు గజవాహనుడు. అదెవరిదో కాదు అక్షరాల తన పుతర్రత్నానిదే. బుడంకాయ మీద కోపం చల్లారలేదు. ఎంత కోపం బాధగా వుంటే మాత్రం ‘హెడ్మాష్టరు చచ్చాడని’ పిల్లలకు చెపుతాడా? కోపాన్ని తమాయించుకుంటున్నాడు గజవాహనుడు. వారిద్దరిమధ్య నిశ్శబ్దం ఆవరించింది. ఇంతలో ప్యూన్‌ అప్పలస్వామి ఓ ఫైల్‌ చేతికిచ్చి నిలబడ్డాడు. ‘పద. వస్తున్నా నంటు’ లేచి రూంకి బయలు దేరాడు.ఓ వారం రోజుల తరువాత గజవాహనుడు తన పుత్ర రత్నానికితెలుగు చెప్పే బుడంకాయకి కబురు చేశారు.వీలైతేయీరోజు సాయంత్రం మాఇంటి కిటీకిరాగలరా? ఓ తప్పకుండ వస్తా అంటు తిరుగు సమాధానం కబురు తెచ్చిన వ్యక్తిచేతే కబురు పంపాడు.ఏం ఆలోచించ లేదు. సాయంత్రం గజవాహనుని ఇంటికి వెళ్లాడు బుడంకాయ్‌. సాదరంగా ఆహ్వానించి లోపలకు తీసుకుని పోయి ఏవేవో పిచ్చాపాటి మాట్లాడి అసలు విషయానికివచ్చాడు.మీ గూర్చి నాకే అనుమానమూ లేదు. మీరు శక్తివంచన లేకుండా పిల్లల అభివృద్ధికికావలసిన చర్యలన్నీ తీసుకుంటు ఆహ్లాద వాతావరణంలో పాఠం బోర్‌ కొట్టకుండా చెపుతారనీ తెలుసు. పిల్లల అశద్ధ్రను ఏమాత్రం సహించరనీ తెలుసు. కానీ యీ కురుక్షేత్రసంగ్రామంలో రక్తం మరకల్లా యీ ఎర్రసిరా గుర్తులేంటిసార్‌? అన్నాడు. తెలుగు సాహితీ నందనవనంలో మొలకెత్తాల్సిన కల్పవృక్షం విద్యార్థుల చేతుల్లో పడి కలుపు మొక్కలుగా మొలిచిందండీ! కారణం ఎవరైనా కావచ్చు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమా జం, పాఠశాల యాజమాన్యం, ప్రభుత్వం తీరుతెన్ను-ఏదైనా కావచ్చు. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిపైన ఎంతమందికి ప్రేమా భిమానాలున్నాయి మాతృమూర్తి మీదేఅభిమానం చూపించలేని వీరు మాతృభాష మీదేం అభిమానం చూపిస్తారు? అంటేమనమేం చేయలేమా అన్న గజవాహనం మాటకికాంగ్రెస్‌ మొక్కలు అంటే పార్థీనియంని ఏ ఒక్కడో అంత మొందించలేడు. ఏ ఒక్క సంవత్సరంలోనో ఆ పని కాదు. రైతులందరూ సామూహికంగా కొన్ని సంవత్సరాలు అవి మొలకెత్తిన రోజుల్లోనే పీకేస్తే వాటి ఉత్పత్తి తగ్గి చివరికి అదృశ్యం కావచ్చు.తెల్లకాగితం లాంటివిద్యార్థుల మెదడులో అమోఘమైన జ్ఞాపకశక్తిఉంటుంది. అదిఆ వయసులో ఎట్లా చెపితే అట్లా వింటుంది ఆ సమయంలో సరిjైున ఉపాధ్యాయుని చేతులో విద్యార్థి పడితే సాహితీ నందన వనంలో కల్పవృక్షమే కాదు క్రియేటివిటీ అనే కామధేనువూ ఉదయిస్తుంది. దేశం మొత్తం -అన్ని శాఖల్లో – యీ కలుపుమొక్కలు ఒక్కొక్క చోట ఒక్కో పేరుతో పెరిగాయి. కలుపు మొక్కే గదా అని నాడు వదిలేశాం. అది నేడు మహా వృక్షంగా సిగ్గుసెరం లేకుండ తలెత్తుకుని భుజాలు ఎగరవేస్తోంది-ఇంతకంటే ఏం చెప్ప లేను సార్‌ అన్నాడు బుడంకాయ. గజవాహనం గారిభార్య దేవమ్మ తెచ్చిన టీతీసుకుంటు ఏమ్మా ఎలా వున్నావు? నీ రచనా వ్యాసంగం ఎలా వుంది? అని వాత్సల్యంగా అడిగారు బుడంకా య్‌. నేను మీ శిష్యురాలిని సార్‌. మీరు నా చిన్ననాడు నామీద ఉంచిన ఆశలు నిరాశలు చేయలేదు. మీ దయవల్ల నా రచనా వ్యాసంగం మూడు పువ్వులు ఆరు కాయలుగా వుందండీ అన్నదిఎంతో వినమ్రతతో. మంచి కబురు చెప్పావు. ఇదిగో యీ చాక్లెట్‌ తీసుకో అంటు చేతిలో చాక్లెట్‌ పెట్టి నేటిపిల్లలే రేపటిపౌరులు. వాళ్లను అన్ని విధాల తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద కూడ వున్నదన్న సంగతి గుర్తుంచుకోవాలి అంటూ దంపతులిద్దరినుండి సెలవు తీసుకున్నాడు బుడంకాయ. ఇంటి బయటకొస్తోంటేగార్డెన్‌లో తోటమాలి ఏకాం బరం కలుపుమొక్కలు పీకు తున్నాడు. వాడు జీవితాంతం ప్రయత్నించినా యీ కలుపు తగ్గదనుకుంటు యింటికిచేరాడు బుడంకాయ్‌ –గోమఠం రంగా చార్యులు

లేటరైట్‌ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు

లేటరైట్‌ అక్రమాల నిగ్గు తేల్చేందుకు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ రంగంలోకి దిగింది. విశాఖ ఏజెన్సీలో అక్రమంగా ఖనిజాన్ని తవ్వడంతో పాటు…రవాణాకోసం వేలాది పచ్చటి చెట్లను అడ్డంగా నరికి రోడ్డు వేసిన వైనంపై ‘నిజ నిర్ధార ణ’కు ఆదేశించింది.ఈవ్యవహారంపై విశాఖ జిల్లా నాతవరం మండలం గునుపూడికి చెందిన దళిత ఐకయ ప్రగతి సంఘం జిల్లా అధ్యక్షుడు కొండ్రు మరిడియ్య దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు స్వీకరిం చడమే కాకుండా..‘మా జోక్యం అవసరం అని భావిస్తున్నాం’అని కూడా ట్రైబ్యునల్‌ చెన్నై ధర్మాసనం వ్యాఖ్యానించింది. పిటిషనర్‌ ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన తర్వాతే ధర్మాసనం ఈఅభిప్రా యానికి వచ్చినట్టు స్పష్టమవుతోంది. దీంతో మైనింగ్‌ లీజుదారు జర్తాలక్ష్మణరావుతోపాటు పంచాయ తీరాజ్‌ సహా పలు శాఖల అధికారులు దాదాపు ఇబ్బందుల్లో పడినట్టేనని ప్రభుత్వ వర్గాలే అభిప్రా యపడుతున్నాయి. అడవిలోకి చొచ్చు కురా వడమే కాకుండా వేలాదిచెట్లు కొట్టి రోడ్డువేయడంపై స్థానిక గిరిజనులు కొంతకాలంగా ఆగ్రహంతో ఉన్నారు. న్యాయపరంగా ఉన్న మార్గా లపై జాతీయ పర్యా వరణవాదులతో కొంతకా లంగా చర్చిస్తున్నారు. ఈ క్రమంలోనే కొండ్రు మరిడియ్య జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో పిటిషన్‌ వేశారు.ఎన్జీటీ న్యాయ సభ్యుడు జస్టిస్‌ కే.రామకృష్ణన్‌,సభ్య నిపుణుడుకే సత్యగోపాల్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం జులై 26వ తేదీన పిటిషన్‌ను విచారించి,అదేరోజు జులై 30న ఆదేశాలుఇచ్చింది.
పిటిషన్‌లో ఏముందంటే..

అటవీ సంరక్షణచట్టం-1980లోని సెక్షన్‌ 2 కింద సరైన అటవీ అనుమతులు లేకుండా, అటవీ సంరక్షణ రూల్స్‌-2003ను పాటించకుండా లేటరైట్‌ తవ్వకాలు జరుగుతున్నాయి. సర్వే చేయని కొండ పోరంబోకు భూమి(యూఎసహెచ్‌పీ)లో 212 హెక్టార్ల భూమిలో 20ఏళ్లపాటు మైనింగ్‌ చే సేందుకు అనుమతులు ఇచ్చారు. గిరిజనుల కోసం ఉద్దేశించిన రహదారిని ఎలాంటి అటవీ శాఖ అనుమతులు లేకుండా మైనింగ్‌కోసం పెద్దది గా విస్తరించుకున్నారు. ఈరహదారి నిర్మాణం కూడా అటవీ హక్కుల చట్టం-2006లోని నిబంధ నలకు విరుద్దంగా చేశారు. మైనింగ్‌కోసం సమర్పిం చిన గ్రామసభ తీర్మానపత్రం వట్టిబోగస్‌. ఆ విష యం తెలిసినా దాని ఆధారంగానే మైనింగ్‌కు అను మతి ఇచ్చారు. దీంటోపాటు అటవీ హక్కుల చట్టం-2006తోపాటు ఇతర కీలకచట్టాలను కూడా ఉల్లంఘించారు. దీనివల్ల పర్యావరణకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఈనేపధ్యంలో విశాఖ,తూర్పు గోదా వరి మన్యంలో రిజర్వ్‌ ఫారెస్ట్‌ (ఆర్‌ఎఫ)తో కలిసి ఉన్నభూమిలో అటవీ సంరక్షణ చట్టం-1980, రూల్స్‌-2003ని ఉల్లంఘించి మైనింగ్‌ చేయడానికి వీల్లేదని ఆదేశించాలి. అటవీ సంరక్షణ చట్టం ఉల్లంఘించి చేపడుతున్న మైనింగ్‌ ని నిలు వరించి ఆ ప్రాంతాన్ని తిరిగి పునరుద్ధరించాలి. ఈ విష యంలో చట్టబద్ధమైన అంశాలు, నిబంధనలను అమలు చేయడంలో విఫలమైన అధికారులపై శాఖాపరమైన విచారణకు ఆదేశించాలి. సరుగుడు లోని రిజర్వ్‌ ఫారెస్టను కాపాడలేకపోయిన, తప్పులు చేసిన అధికారులపై అపరాధరుసుం విధించాలి’’
ట్రైబ్యునల్‌ ఆదేశాలివీ..
ఫిర్యాదులో పిటిషనర్‌ లేవనెత్తిన అంశా లపై విచారణకు ట్రైబ్యునల్‌ ఆదేశించింది. కేంద్ర-రాష్ట్ర అధికారులతో కూడిన జాయింట్‌ కమిటీ విచారణ చేయాలని దిశానిర్దేశం చేసింది. ఈ కమిటీలో కేంద్ర అటవీ,పర్యావరణ మంత్రిత్వ శాఖ లోని సీనియర్‌అధికారి లేదా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏదైనా స్వతంత్ర ఏజెన్సీబీ విశాఖ కలె క్టర్‌,విశాఖ జిల్లా అటవీఅధికారి(డీఎఫఓ),గనులశాఖ సీనియర్‌ అధికారి,రాష్ట్రకాలుష్య నియంత్రణమండలి (పీసీబీ) నుంచి సీనియర్‌ అధికారి ఉంటారని,కమిటీకి అవస రమైన లాజిస్టిక్‌ సహకారం,సమన్వయం కోసం రాష్ట్ర గనుల శాఖ నోడల్‌ ఏజెన్సీగా ఉంటుందని పేర్కొంది. ఈ కమిటీ క్షేత్రస్థాయికి వెళ్లి ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు, చట్టాల ఉల్లంఘనలను పరిశీ లించి,వాటిపై వాస్తవిక,కార్యాచరణ నివేదికను అందించాలని కోరింది. అంటే,మైనింగ్‌ జరుగు తున్న ప్రాంతం,రహదారులు నిర్మించిన అటవీ, డంపింగ్‌ యార్డు,పర్యావరణంపై ప్రభావం చూపే ప్రతీ పాయుంట్‌ను కమిటీ పరిశీలన చేయనుంది. అలాగే…మైనింగ్‌కోసం కేటాయించిన భూమి వాస్తవిక పరిస్థితి ఏమిటో,అక్కడ మైనింగ్‌ చేపట్ట డానికి అటవీ సంరక్షణ చట్టం-1980 ప్రకారం ఏమైనా అనుమతులు తీసుకోవాలా? ఆ ప్రాంతంలో అటవీ సంరక్షణ చట్టం, అటవీ హక్కుల చట్టంలోని నియమనిబంధనల ఉల్లంఘనలు జరిగాయా? ఒక వేళ అలాంటివేమైనా కనిపెడితే వాటిపై అటవీ శాఖ తరపున ఎలాంటి చర్యలు తీసుకున్నారో స్వతంత్ర నివేదికను అందించాలని ఆంధ్రప్రదేశ్‌ పీసీసీఎఫ్‌, అటవీ దళాల విభాగాధితి (హెచ్‌ఓ ఎఫఈ)ని ఎన్‌జీటీ ఆదేశించింది.
ఏడు అంశాల్లో విచారణ..
లేటరైట్‌ మైనింగ్‌ జరుగుతున్న ప్రాం తాన్ని తనిఖీ చేసి..వాస్తవిక పరిస్థితులను అధ్య యనం చేయడంతోపాటు ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై నివేదిక అందించాలని కమిటీకి ట్రైబ్యునల్‌ ఆదేశించింది. మొత్త ఏడు అంశాలను పరిశీలిం చాలని నిర్దేశించింది.అవి..ౌ మైనింగ్‌ జరుగు తున్న ప్రాంతం ఒరిజినల్‌ రెవెన్యూ రికార్డుల (స్వాతంత్య్రానికి ముందున్నవి) ప్రకారం ఎక్కడుందో నిర్ధారణ చేయాలి. ౌ మైనింగ్‌దారు నిబంధనల ప్రకారం, అటవీ సంరక్షణ చట్టం-1980 మేరకు అనుమతులు తీసుకొన్నారా? ౌ అక్కడ ఏ పద్ధతిలో మైనింగ్‌ జరుగుతోంది… దాని వల్ల పర్యావరణం,జీవావరణం (జంతు జాలం)పై ఎంత మేర ప్రభావం ఉంటుంది.. ఇప్పటికే ఏ మేరకు దెబ్బతీసింది? ౌ లీజుదారు ఏమైనా పరిమితికి మించిన మైనింగ్‌ చేశారా…ఒక వేళ అదే జరిగితే ఏ స్థాయిలో అది ఉంది? ౌ ఆ ప్రాంతంలో లీజుదారు ఏమైనా చట్టప రమైన అనుమతులు తీసుకోకుండా రహదారిని విస్తరించారా? ౌ లీజుదారు మైనింగ్‌కు అనుమతులు,క్లియ రెన్స్‌లు తీసుకున్నప్పుడు జారీ చేసిన నిబం ధనలను, కాలుష్యనియంత్రణ మండలి నియమనిబంధనలు పాటించారా? ౌ ఇంకా….ఏమైనా ఉల్లంఘనలకు పాల్పడ్డారా…వాటిపై సంబంధిత విభాగాలు తీసుకున్న చర్యలేమిటి? పర్యావరణ నష్టం జరిగి ఉంటే పర్యావరణ పరిహారాన్ని అంచనావేశారా? ఈ అంశాలపై సమగ్ర పరిశీలనచేసి ఆగస్టు31లోగాపీడీఎఫ్‌ రూపం లో నివేదిక సమర్పించాలని జాయింట్‌ కమిటీకి దిశానిర్దేశం చేసింది.
ఫిర్యాదుదారుకీ భాగస్వామ్యం
ట్రైబ్యునల్‌ మరోకీలకమైన ఆదేశం ఇచ్చింది. ఫిర్యాదుదారు కొండ్రు మరిడయ్యను కూడా విచారణ పరిధిలోకి తీసుకోవాలని ఎన్‌జీటీ ఆదేశించింది. విచారణ చేపట్టే సమయంలో హాజరు కావా ల్సిందిగా ఫిర్యాదుదారునికి నోటీసులు ఇవ్వాలని, మైనింగ్‌ ప్రాంతాన్ని సందర్శించే సమయంలో ఫిర్యా దుదారు కూడా ఉంటారని నిర్దేశించింది. ఈ సమ యంలో పర్యావరణ,అటవీ చట్టాల ఉల్లంఘనలు, అక్రమాలపై కమిటీకి ఆయన తన నివేదిక అందిం చొచ్చునని పేర్కొంది. కమిటీ తన నివేదికను సమ ర్పించడానికి అది(ఫిర్యాదుదారుడు ఇచ్చిన రిపోర్టు) ఉపయోగపడుతుందని ఉత్తర్వులో పేర్కొంది. జాయింట్‌ కమిటీ విచారణ వేగంగా సాగడానికి ఫిర్యాదుదారు వారం రోజుల్లోగా తన వద్ద పత్రా లు,రిపోర్టులను కమిటీ సభ్యులకు అందించాలని కోరింది.
ఇదీ నేపథ్యం..
విశాఖజిల్లా నాతవరం మండలం భమిడికలొద్ది వద్ద 121హెక్టార్లలో లేటరైట్‌ మైనిం గ్‌కు గతంలో లీజులుపొందిన వ్యక్తిని అధికార పార్టీ ముఖ్యనేతలు తమ దారికి తెచ్చుకున్నారు. గత నెల నుంచి లీజుగనిలో లేటరైట్‌ తవ్వి, తరలిం చడం మొదలుపెట్టారు. ఈ ఖనిజాన్ని తరలించ డానికి క్వారీ నుంచి తూర్పుగోదావరి జిల్లా రౌతుల పూడి మండలం జల్దాం వరకు 12 కిలోమీటర్ల మేర రహదారి నిర్మించారు. అప్పటికే ఉన్న కాలి బాటను 20-30 అడుగుల మేర వెడల్పు చేశారు. దీనికోసం ఐదు కిలోమీటర్ల మేరవిస్తరించిన ఫారెస్టు ను గుల్ల చేశారు.రెవెన్యూ,అటవీశాఖల అనుమతు లు లేకుండా ఆరేడు వేలవృక్షాలను నరికివేశారు.
చెట్టుకు రూ. ఐదు వేలు..
విశాఖ జిల్లా నాతవరం మండలం తొరడలో లేటరైట్‌ మైనింగ్‌ కోసం కిల్లో లోవరాజు అనే వ్యక్తి సుమారు పదేళ్ల క్రితం దరఖాస్తు చేసు కొన్నారు. అన్ని ప్రక్రియల అనంతరం అధికారులు ఆయనకు లీజు మంజూరుచేశారు. సుమారు 19 హెక్టార్లలో 2016-17లో తవ్వకాలు ప్రారంభించి తొమ్మిది నెలల్లో మూడు లక్షల టన్నుల లేటరైట్‌ను ఆ క్వారీలో వెలికితీశారు. సుందరకోటకు చెందిన ఓగిరిజనుడు మైనింగ్‌లో నిబంధనలు ఉల్లంఘిం చారంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు.ఖనిజం రవాణాకు 1.5కిలోమీటర్ల రహదారి నిర్మాణం కోసం దాదాపు మూడు వేల చెట్లు కొట్టివేశారని ఫిర్యాదు చేశారు. కొట్టేసిన చెట్ల ఫొటోలను హైకోర్టుకు సమర్పించారు. వీటిని పరిశీ లించిన హైకోర్టు..తక్షణమే మైనింగ్‌ నిలిపివేయాలని 2018లో ఆదేశించింది. అంతేకాక క్వారీ చుట్టూ ప్రహరీగోడ నిర్మించి, వన్యప్రాణులకు ముప్పు లేకుండా పగటిపూట మాత్రమే క్వారీ తవ్వకాలు చేపట్టాలని సూచించింది. రోడ్డు నిర్మాణం కోసం నరికివేసిన చెట్లకు ఒక్కో చెట్టుకు రూ.ఐదు వేలు వంతున మొత్తం రూ.1.5కోట్లు చెల్లించాలని ఆదేశించింది. ఇంతలో కాలుష్య నియంత్రణ మండలి,గనులశాఖ,అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. క్వారీలో తనిఖీలు చేసి, నిబం ధనలు ఉల్లంఘించారంటూ మైనింగ్‌ని నిలిపి వేశారు. తాజా ట్రైబ్యునల్‌ ఆదేశాలతో స్థానిక గిరిజనులు అప్పటి ఉదంతాన్ని గుర్తు చేసుకొం టున్నారు. ఇప్పుడూ తమకు అలాంటి న్యాయం అందించాలని కోరుకుంటున్నారు.
సీనియర్‌ జర్నలిస్టు జక్కల నాగ సత్య నారాయణ(జనాస)అందించిన వివరాలు ప్రకారం
రిజర్వ్‌ ఫారెస్ట్‌ పొడవునా రహదారుల ఏర్పాటు
పేరుకే గిరిజనుల సంక్షేమం కోసం రహ దారి..కానీ, అక్కడ జరిగింది…కాకినాడ పోర్ట్‌ కు అడ్డరోడ్డులో లేటరైట్‌ను యథేచ్ఛగా తరలించుకు పోయేందుకు రోడ్డు నిర్మాణం.జాతీయ రహదారి మీదుగా తరలిస్తే ఇబ్బందులొస్తాయని తలంచి అడవి మార్గం అయితే ఖనిజరవాణాకు గోప్యంగా ఉంటుందని భావించినట్టుంది. రిజర్వ్‌ ఫారెస్టులో రోడ్లనిర్మాణానికి అటవీశాఖ చట్టాలు అంగీకరిం చవు ..అందులోనూ ప్రజలకు సంబంధం లేకుండా ఖనిజాన్ని తరలించ డానికి రోడ్ల నిర్మాణం అంటే అస్సలు పనికాదు. దీంతో క్వారీయజమానులు కొత్త ఎత్తుగడతో ఏజెన్సీ గ్రామాలను కలుపుతూ ప్రజా ప్రయోజనంపేరిట అనుమతులు పొందారు. అను కున్నదే తడవుగా ఖనిజాన్ని తరలించేందుకు కాకి నాడ పోర్టుకు దగ్గరదారైన రౌతులపూడి మం డలం రాఘవపట్నం,జల్దాం,దబ్బాది,సిరిపురం మీదుగా బమిడికలొద్దుక్వారీ వరకూ దశల వారీగా 2అడుగుల కాలిబాటను 8అడుగులరోడ్డు కోసం అనుమతులు తెచ్చుకొని ఏకంగా 32 అడు గుల వెడల్పుతో19రోజుల్లో..17కిలోమీటర్ల మేర రోడ్డును నిర్మించేశారు. ఇప్పుడా రోడ్డుపై14 టైర్ల టిప్పర్లు వేగంగా దూసుకు పోతున్నాయి.నాతవరం మండలం సరుగుడుపంచాయితీ పరిధిలోని భమిడికలొద్దు రిజర్వ్‌ఫారెస్టులోని 121హెక్టార్లలోని సుమారు 5000కోట్ల లాటరైట్‌ ఎర్ర మట్టిని తవ్వుకు నేందుకు ఆంధ్రప్రేదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులను తీసుకున్న క్వారీ నిర్వాహకులు తొలుత రోడ్డునిర్మాణంపై దృష్టి సారించారు. రిజర్వ్‌ ఫారెస్టులోరోడ్ల నిర్మాణానికి అటవీశాఖ చట్టాలు అంగీకరించవు. అందులోనూ ప్రజలకు ఏవిధం గానూ సంబంధం లేకుండా కేవలం లాటరైట్‌ ఖనిజ సంపదను తరలించడానికి రోడ్ల నిర్మాణం అంటే అస్సలుపనికాదు. అందుకు రిజర్వ్‌ ఫారెస్టు లోని వివిధగ్రామాలను కలుపుతూ ప్రజాప్రయో జనం అనే ముసుగులో అనుమతులను పొందారు. విశాఖ జిల్లాలోని సరుగుడు,తూర్పు గోదావరి జిల్లాలోని కోటనందూరు,తుని మండలాల మీదుగా లాటరైటు ఖనిజాన్ని జాతీయ రహదారికి తరలించి అక్కడ నుంచి నేరుగా వివిధ దారుల్లో కాకినాడ పోర్టుకు చేర్చాలంటే అనేక మార్గాలు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా లోని కాకినాడ పోర్టుకు దగ్గర దారైన ప్రత్తిపాడు నియోజక వర్గం రౌతుల పూడి మండలం రాఘవ పట్నం, జల్దాం, దబ్బాది, సార్లంక, సిరిపురం మీదుగా బమిడికలొద్దు క్వారీ వరకూ దశల వారీగా సుమారు 17కిలో మీటర్ల మేరకు వివిధ భాగాలుగ పక్కాగా ఒకే మట్టిరోడ్డుగా నిర్మించాలని తలంచి రంగం సిద్దంచేసారు. దాన్ని గుట్టుగా పక్కాగా అమలు చేసారు. తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం అటవీశాఖ రేంజ్‌ పరిధి లోని రౌతులపూడి మండలం సార్లంక నుంచి విశాఖ మన్యంలోని సిరిపురం వరకు రహదారి నిర్మించాలని జూన్‌10న పంచాయతీరాజ్‌ శాఖ ఇంజనీర్‌తో అటవీశాఖకు ఓదర ఖాస్తు పెట్టారు. 15న అటవీశాఖ రేంజర్‌ వెళ్లి ప్రతిపాదిత ప్రాంతా న్ని పరిశీలించి,అది 2అడు గుల కాలి బాట అని, దాన్ని 8అడుగుల రహదారిగా మార్చాల్సిన అవ సరం లేదని రిపోర్టు ఇచ్చారు. ఆ మరుసటి రోజే జిల్లా స్థాయి కమిటీ సమావేశమై సిరిపురం, సార్లంక, దబ్బాది గ్రామాల ప్రజల రాకపోకలు, వైద్య పరమైన అవసరాల కోసం ఈ రహదారి నిర్మాణం చేపట్టాలని జిల్లాస్థాయి కమిటీ (డీఎల్‌సీ) లో జూన్‌ 16న తీర్మానించారు. ఐతేఈరోడ్డే అడిగితే లేటరైట్‌ రహదారి విషయం బయ టకు వస్తుందని తెలివిగా ఆలోచించి, ఒకేసారి 109రోడ్లను అందులో రంప చోడవరం ఐటిడిఏ మన్యం పరిధిలో 66, కాకి నాడ పంచాయితీరాజ్‌ విభాగం పరిధిలో 43కు తీర్మానించి అదేరోజు ఈ రహదార్ల నిర్మాణానికి అనుమతిస్తూ అటవీశాఖ అధికారి ఆదేశాలు ఇచ్చారు. అడవిలో రహదారులు నిర్మిం చాలంటే అటవీశాఖ,గ్రామపంచాయతీల తీర్మానం, ఐటీడీఏ అనుమతి తప్ప నిసరి.వాటికి ప్రభుత్వ నిధులూ ఉండాలి. అన్నిరకాల అనుమతులు వచ్చాక రహ దారి నిర్మాణం ప్రారంభంకావడానికి కనీసం ఐదా రు నెలల సమయం పడుతుంది. కానీ ఇక్కడ మన్యంలో మాత్రం కేవలం 19 రోజులే పట్టింది. అంటే ఇక్కడ ప్రభుత్వ నిధులతో పని లేకుండా మైనింగ్‌ సొమ్ములతో పనిపూర్తి అయ్యింది. కానీ వాస్తవానికి ఇప్పుడు ఇక్కడ 32అడుగుల మేర మట్టిరోడ్డు కనిపిస్తోంది. ఇప్పుడా రోడ్డులో14 టైర్ల టిప్పర్లు దూసుకుపోతున్నాయి.
పర్యావరణానికి భారీ నష్టం
దట్టమైనఅటవీ ప్రాంతంలో వేలాది గా ఎదిగిన పచ్చని వృక్షాలు,చెట్లు విచాక్షణ రహితంగా నరికేశారు.తమస్వార్ధం కోసం రిజర్వ్‌ ఫారెస్టును నాశనం చేసేశారు. అడవిని నరికే సమయంలో అడ్డోచ్చిన అటవీ జంతువు లను యంత్రాలతో నిర్ధాక్షణ్యంగా చంపేశారు. వేలాది చెట్లు నేలమట్టంచేసి పర్యావరణానికి తీవ్ర విఘా తం కల్పించారు. ఇంటి ముందు సొంతంగా పెంచుకున్నచెట్టు నరకాలంటేనే…రూల్స్‌ ఒప్పు కోవు! రిజర్వు ఫారెస్టలో చెట్టుపై గొడ్డలి వేటు వేస్తే…అదో పెద్ద నేరం! అక్కడ…కేంద్ర అను మతి లేకుండా ప్రభుత్వాలే చిన్నపని కూడా చేయలేవు. కానీ ప్రైవేటు వ్యక్తుల సారథ్యంలో కొండకోనల్లో వందలు,వేల సంఖ్యలో చెట్లను నరికేసి,రోడ్డు వేయడాన్ని ఏమనాలి? వాటి ఆన వాళ్లు లేకుండా చేశారు. దశాబ్దాల వయసున్న టేకు,నల్లమద్ది, తెల్లమద్ది వంటి వృక్షాలను కొట్టేసు కొంటూ పోయి..నెలన్నరలోనే రోడ్డు వేసేశారు. ఈ మార్గంలోని చెల్లూరు- భమిడికలొద్ది మధ్య నున్న అయిదు కిలోమీటర్ల పరిధి రోడ్డు పూర్తిగా రిజర్వ్‌ అడవే. రిజర్వు అడవి పరిధిలో అటవీ శాఖ అనుమతులు లేకుండా ఎలాంటి పనులు చేయకూడదు. కానీ ఇవేవీ పట్టించుకోలేదు. రహ దారికోసం అడ్డంగా ఉన్న టేకు,దండారి,నల్ల మద్ది,తెల్లమద్ది,తుమ్మిడి, తెల్లగర్ర వంటి విలువైన భారీ వృక్షాలను నేలకూల్చేశారు. చిన్నా పెద్దా కలిసి ఆరేడువేల చెట్లను నరికినట్లు స్థానికులు చెబుతున్నారు. వన్యప్రాణాలకు ముప్పు వాటిల్లు తుందనే స్పృహ కూడా లేకుండా అడ్డగోలుగా నేలకూల్చేశారు.పైగా కేవలం 425 మీటర్ల రిజర్వు ఫారెస్టు పరిధిలో 21చెట్లు మాత్రమే తొలగించామని చెప్పడం అతిపెద్ద వింత. నిజా నికి…రిజర్వు ఫారెస్టులో ఇలాంటి నిర్మాణాలు చేపట్టాలంటే సంబంధిత అధికారుల అనుమతి తప్పని సరి. కానీ ఇక్కడ ఇవేం లేకుండా టిప్పర్లు తిరిగేస్థాయిలో30 అడుగులకు మించి రహదారి నిర్మించేశారు. రిజర్వ్‌ ఫారెస్ట్‌ ప్రాంతంతో భారీ యంత్రాలు మోహరించి ఎక్కడికక్కడ చెట్లతో పాటు కొండలను కూడా గుల్లచేసేశారు.– కొండ్రు మ‌రిడియ్య‌, అధ్య‌క్షుడు ద‌ళిత ప్ర‌గ‌తి ఐక్య‌సంఘం
జిఎన్‌వి సతీష్‌

పని హక్కును ప్రాధమిక హక్కుగా గుర్తించాలి

నిరుద్యోగ సైన్యం ఎంత ఎక్కువగా వుంటే పెట్టుబడిదారీ విధానంలో అంత దోపిడీ చేయవచ్చు. వంద మంది కార్మికులు జీతాలు పెం చాలని అడిగితే రెండు వందల మంది ఇంకా చౌకగా పని చేస్తామనే విధంగా పెట్టుబడిదారీ వ్యవస్థలో అమలు జరుగు తుంది.దేశంలోని ప్రజలందరికీ చదువు చెప్పాలంటే కోట్లాది మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు దొరుకుతాయి. ప్రజలం దరికీ వైద్యం సమకూర్చాలంటే అనేక కోట్ల మందికి ఉద్యోగాలొస్తాయి. కానీ పెట్టుబడిదారీ విధా నంలో ప్రజలందరికీ కనీస సౌకర్యాలు కల్పించడానికి పాలకవర్గం ప్రయత్నించదు.
ఉపాధి కల్పించడమంటే యువతీ, యువకులను దేశ సంపద సృష్టికర్తల్లో భాగస్వాములుగా చేయ డం.వారి శారీరక,మానసిక శక్తిని ఉపయోగించు కోవడం.‘నేను పని చేస్తాను. నాకు పని కల్పించండి’ అని అడిగితే పని కల్పించలేని స్థితిలో ప్రభుత్వాలు వుండడం దేశాభివృద్ధికి,సౌభాగ్యానికి హానికరం. ఒకప్పుడు అత్యంత వెనుకబడిన దేశంగా వున్న చైనా నేడు అమెరికాతో ఢ కొట్టగలుగుతుందంటే ఆదేశ మానవ శక్తిని ఉపయోగించుకోవడమే కార ణం.‘నేటి భారతదేశం’అనే పుస్తకంలో రజనీ పామే దత్‌ చెప్పినట్లుగా ఒకమనిషికి నోరు మాత్రమే వుండదు. రెండు కాళ్లు, రెండు చేతులు వుంటాయి. ఒక మనిషి సంపదను సృష్టించి పది మందికి పెట్టగలిగిన ఆధునిక పరిజ్ఞానం నేడు పెరిగింది. పెట్టుబడిదారీ వ్యవస్థలో పెరిగిన ఆధునిక పరిజ్ఞా నాన్ని తమ లాభాల పెంపుదలకు పెట్టుబడిదా రులు ఉపయోగించుకుంటున్నారు. మానవ వనరు లు పుష్కలంగా వున్న భారతదేశంలో రోబోట్‌లను ఉపయోగించడమంటే ఇదే. పెట్టుబడిదారులు తమ లాభాల కోసమే యువతీ, యువకులను నిరుద్యోగు లుగా చేసి రోబోట్‌ వంటి యంత్రాలను ప్రోత్సహి స్తున్నారు. ఇదిపెట్టుబడిదారీ విధాన సహజ లక్ష ణం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకోవాలి. ఆసౌకర్యం ప్రజలకు కల్పిం చి,పని గంటలు తగ్గించాలి. విశ్రాంతి పెంచాలి. కానీ కాలుష్య కోరల్లోని రసాయన పరిశ్రమల్లో మనుషులతో విషాన్ని మింగించే ఎరువులు, రసా యన కంపెనీల్లో కూడా రోజుకు 8నుంచి12 గంట లు పని చేయిస్తున్నారు. సోషలిస్టు దేశాల్లో ఇటు వంటి పరిశ్రమల్లో వారానికి ఐదురోజులు, రోజుకు ఆరుగంటలు మాత్రమే పని కల్పించే పద్ధతి వుంది. మనుషుల ప్రాణాలకు సోషలిస్టు దేశాల్లో విలువ వుంటుంది.
కరోనా సమస్యను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ప్రజలందరికీ టీకాలు ఇవ్వడంలో తాత్సారం చేసింది. కరోనాతో 2021జూన్‌ 26నాటికి3.94లక్షల మంది ప్రాణా లు కోల్పోయారు. కరోనా మొదటి దశలో మిలట్రీ కర్ఫ్యూలా దేశమంతా లాక్‌డౌన్‌ విధించడంతో లక్షలాది మంది వలస కార్మికులు వేల కిలోమీటర్లు మూటా ముల్లే నెత్తిన పెట్టుకొని సొంత గ్రామాలకు కాలిబాట పట్టారు. దారిలో వేలాది మంది మర ణించారు. అంతేకాకుండా ప్రభుత్వ లెక్కల ప్రకా రం కరోనా కాలంలో 7.7 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఏప్రిల్‌, మే నెలలో 2.2 కోట్లమంది ఉద్యోగాలు కోల్పోయారు. నిరుద్యోగం 12 శాతం పెరిగింది. భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రా ల్లో నిరుద్యోగ సమస్యను 20ఏళ్లలో పరిష్కరిం చాలని ఆదేశించారు. 20 ఏళ్ల తరువాత నిరుద్యోగ సమస్య రెట్టింపు అయింది. 75 ఏళ్ల స్వాతంత్య్రా నంతరం నిరుద్యోగం అనేక రెట్లు పెరిగింది తప్ప తగ్గలేదు. కారల్‌మార్క్స్‌ చెప్పినట్లు పెట్టుబడిదారీ విధానం ఉన్నంతకాలం నిరుద్యోగ సమస్య కొనసా గుతుంది. నిరుద్యోగ సైన్యం ఎంత ఎక్కువగా వుంటే పెట్టుబడిదారీ విధానంలో అంత దోపిడీ చేయ వచ్చు. వంద మంది కార్మికులు జీతాలు పెంచాలని అడిగితే రెండు వందల మంది ఇంకా చౌకగా పని చేస్తామనే విధంగా పెట్టుబడిదారీ వ్యవస్థలో అమలు జరుగుతుంది. పెట్టుబడిదారీ వ్యవస్థలో కూడా ఉపాధి అవకాశాలు మెండుగా వుంటాయి. కానీ పాలకవర్గం ఈ అవకాశాలు కల్పించదు. దేశంలోని ప్రజలందరికీ చదువు చెప్పాలంటే కోట్లా ది మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు దొరుకుతాయి. ప్రజలందరికీ వైద్యం సమకూర్చాలంటే అనేక కోట్ల మందికి ఉద్యోగాలొస్తాయి. కానీ పెట్టుబడిదారీ విధానంలో ప్రజలందరికీ కనీస సౌకర్యాలు కల్పించడానికి పాలకవర్గం ప్రయత్నించదు. ప్రజల సంక్షేమం కంటే తమ లాభాలకు ప్రాధాన్యత ఇస్తారు.‘లియాంటివ్‌’ అర్థశాస్త్రంలో చెప్పినట్లు దేశంలో బొగ్గు ఉత్పత్తి అధికంగా వుంటుంది. బొగ్గుల ఉత్పత్తి ఎక్కువగా జరిగింది కాబట్టి బొగ్గు గనుల కార్మికులను పనిలో నుంచి తొలగిస్తారు. దాంతో కార్మిక కుటుంబం కనీసం చలి కూడా కాచుకోలేక చనిపోతుంది. ఇది పెట్టుబడిదారీ వ్య వస్థ నిజ స్వరూపం. అందుకే ఆర్థిక సంక్షోభాలు ప్రతీ పదేళ్లకు కొనసాగుతూనే వుంటాయి. సోష లిస్టు వ్యవస్థ దీనికి పూర్తి భిన్నం. సోషలిస్టు దేశాల్లో ‘పని హక్కు’ ప్రాథమిక హక్కుగా వుంటుంది. ప్రతి ఒక్కరికీ ఉచితవిద్య ప్రభుత్వమే అందిస్తుంది. 18 ఏళ్లు నిండిన తరువాత అందరికీ ఉపాధి కల్పి స్తుంది. పని హక్కు కల్పించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత. ఓటుహక్కు, భావ ప్రకటనా హక్కు వలె పని కూడా ఒకప్రాథమిక హక్కు. ప్రపంచంలో 143కోట్ల జనాభా కల్గిన చైనాలో గానీ, చిన్న దేశాలైన క్యూబా,వియత్నాం లోగానీ నిరుద్యోగ సమస్య వుండదు. అందరికీ ప్రభుత్వమే ఉద్యోగాలు కల్పిస్తుంది. క్యూబా 95 శాతం ప్రభుత్వరంగం లోనూ,5శాతం కోఆపరేటివ్‌ రంగంలోనూ ఉపాధి కల్పించింది. ఉచిత విద్య, వైద్యం, ఇంటి సౌకర్యం నామమాత్రపు రేట్లతో ప్రభుత్వమే కల్పించడం వల్ల ప్రజలపై భారాలు ఉండవు. ఒకప్పుడు రష్యా తో సహా తూర్పు జర్మనీ వరకు యూరప్‌ ఖండంలో నిరుద్యోగ సమస్య వుండేది కాదు. 1991తరు వాత పెట్టుబడిదారీ విధానం తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత స్పెయిన్‌,గ్రీస్‌ దేశాల్లో 25 నుంచి 30 శాతం వరకు నిరుద్యోగం పెరిగింది. అమెరికా లాంటి అత్యాధునిక దేశాల్లో సైతం నిరుద్యోగం 9శాతం వరకు పెరిగింది. ఇప్పటివరకు ప్రభుత్వ రంగం బలోపేతంగా వుండడం వల్ల ఆర్థిక సంక్షోభ ప్రభావం భారతదేశంలో తగినంతగా లేదు. అయి నా నిరుద్యోగం నేడు విలయతాండవం చేస్తున్నది. డిగ్రీ, పీజీ లు చేసిన వారు బంట్రోతు ఉద్యోగాల కోసం ఎగబడుతున్నారు. అతితక్కువ వేతనం లభించే చిరు ఉద్యోగాలకు లక్షల్లో దరఖాస్తులు చేస్తున్నారు.ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జూన్‌ 18న జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించింది. ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు కల్పించిందీ,వచ్చే ఏడాదిఎన్ని ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పడం మంచిదే. కానీ లేని ఉద్యోగాలు ఇచ్చినట్లు కాకిలెక్కలు చెప్పడం సరైనది కాదు. దశాబ్దాల క్రితం నుంచి ఆర్‌టిసి పర్మినెంట్‌ కార్మికులకు కొత్తగా ఉద్యోగాలు ఇచ్చి నట్లు లెక్కల్లో చూపించడం తప్పు. భర్తీ చేసినట్లు చెప్పిన6,03,756ఉద్యోగాల్లో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యో గులు3,99,791మంది వున్నారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ ఉద్యోగుల భర్తీలో చూప డం అన్యాయం. మున్సిపల్‌, విద్యుత్‌ రంగాల్లోని కాంట్రాక్టు,ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులను…ఎ.పి కాం ట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌ 93 వేల మందికి పైగా కార్మికులను పర్మినెంట్‌ కార్మికులుగా చూపిం చడం ఆశ్చర్యకరం. రాష్ట్ర ప్రభుత్వం తన ఎన్నికల ప్రణాళికలో ప్రకటించినట్లుగా ఉద్యోగాల విప్లవం వస్తుందన్న మాటలు బూటకమని రుజువైంది. గత ప్రభుత్వం ఖాళీలు నింపని ప్రభుత్వ ఉద్యోగాలను ఈ క్యాలెండర్‌లో ప్రకటించలేదు. ఆఖాళీలు హుష్‌ కాకి అయ్యాయి. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగం, రైల్వేలోని లక్షలాది ఖాళీఉద్యోగాలను రద్దు చేస్తున్నది. ఒకవేళ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలుపై ఉద్యోగాలన్నీ పర్మినెంట్‌ ఉద్యోగాలు కల్పించినా, భారతదేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదు. నిరుద్యోగ సమస్యను పెట్టుబడిదారీ విధానం పరిష్క రించదు. కార్మికవర్గం నిరుద్యోగానికి వ్యతిరేకంగా పోరాడాలి. తొలగించబడిన, ఉపాధి కోల్పోయిన కార్మికుల గురించే ట్రేడ్‌ యూనియన్లు పోరాడుతు న్నాయి. ఇది సరికాదు. రాజ్యాంగం లోని ప్రాథమిక హక్కుగా గుర్తించి నిరుద్యోగ యువతీ, యువకు లందరికీ పని హక్కు కల్పించేలా పోరాడాలి. అప్పుడే నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం. యువతీ,యువకులు నేడు జరుపుతున్న పోరాటానికి కార్మికవర్గం చేతులు కలపాలి. కార్మికవర్గం అండ వున్నప్పుడే యువతీ, యువకుల పోరాటం మరింత ముందుకు సాగుతుంది. ఇది కార్మికవర్గం బాధ్యత.
ఉపాధిపై కరోనా మహమ్మారి వేటు
కరోనాతో దేశవ్యాప్తంగా నిరుద్యోగం పెరగడమేగాక అనేకమంది జీవనోపాధి కోల్పోయి నట్లు సర్వేలు చెబుతున్నాయి. మహమ్మారి రెండో దశ విజృంభణతో ఆర్థికకార్యకలాపాలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. ఫలితంగా ఉత్పాదకత, సేవా రంగాలు తీవ్రంగా ప్రభావితమై..ఉద్యోగార్థులు, నిరుద్యోగులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.కరోనా సంక్షోభంలో అనేక సంస్థలు ఆర్థిక ఒడుదొడుకులను ఎదుర్కొంటూ, తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. భారాన్ని తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగిం చడం, వేతనాల్లో కోత విధించడంవంటి చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటికే దేశాన్ని పట్టి పీడిస్తున్న నిరుద్యోగ సమస్యకు-ఈ పరిస్థితి ఆజ్యం పోస్తోంది. ప్రభుత్వం పేదవారి ఆకలి తీర్చడానికి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా కొన్ని నిత్యావసర సరకులను అంద జేస్తున్నప్పటికీ,అవి అందరికీ సరిపోవడంలేదు. పిల్లల చదువులు, వైద్య ఖర్చులు వంటి అవసరా లకు సరిపడా ఆర్థిక వనరులు లేక తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. కొన్ని నెలలుగా మెల్లగా కోలుకుం టున్న ఉపాధిరంగంపై-కొవిడ్‌ రెండో దశ వ్యాప్తి తో తీవ్ర ప్రతికూల ప్రభావం కనిపిస్తోంది. అనేక రాష్ట్రాల్లో అమలు చేస్తున్న కఠినతరమైన కొవిడ్‌ నిబంధనలు, పాక్షిక లాక్‌డౌన్‌లతో నిరుద్యోగం కనీసం పదిశాతం మేర పెరిగినట్లు అనేక అధ్యయ నాలు వెల్లడిస్తున్నాయి.నైపుణ్య శిక్షణ అవసరం అసంఘటిత రంగంలో పనిచేసే లక్షలాది ప్రజల ఆర్థిక పరిస్థితిలో గతఏడాది కాలంగా పురోగతి లేకపోగా, తిరోగమనం కనిపిస్తోంది. కేంద్ర కార్మిక శాఖ లెక్కల ప్రకారం ఈ ఏడాది మార్చి తొమ్మిదో తేదీ వరకు ఉద్యోగ అవకాశాలను ప్రోత్సహిం చడానికి ప్రారంభించిన ఆత్మనిర్భర్‌ భారత్‌ ద్వారా సుమారు 16.5లక్షల మంది కార్మికులు లబ్ధి పొం దారు. పీఎంజీకేవై కింద38.82లక్షల మంది ఉద్యోగుల ఈపీఎఫ్‌ ఖాతాల్లో రూ.2,567.66 కోట్లు జమ చేసినట్లు ప్రకటించారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకం సైతం కరోనా కష్టకాలంలో గ్రామీణ ప్రాంతప్రజలకు ఉపాధి కల్పించడంలో కీలకపాత్ర పోషించింది. ఈ పథ కం ద్వారా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను పెద్ద యెత్తున చేపడితే నిరుద్యోగ సమస్యను కొంతవరకు ఎదుర్కోవచ్చు.‘సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండి యన్‌ ఎకానమీ’ అంచనాల ప్రకారం భారత్‌లో 4.40 కోట్లమంది నిరుద్యోగులు ఉన్నారు. వీరిలో 2.80కోట్ల మంది ఉపాధి కోసం నిత్యం ప్రయత్నా లు చేస్తున్నారు. మిగతావారు ఉపాధిని కోరుకుం టున్నా దానికోసం తీవ్రంగా ప్రయత్నించడంలేదు. ప్రస్తుతం ఉన్న నిరుద్యోగుల్లో 3.80కోట్లమంది యువకులే. పట్టణాలనుంచి గ్రామాలకు వెళ్లే శ్రామికుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉండటంతో నిరుద్యోగ సమస్య మరింత జటిల మయ్యే ప్రమాదమూ ఉంది.ఈ సంక్షోభ సమ యంలో నిరుద్యోగులను ఆదుకోవడానికి ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపట్టవలసిన అవసరం ఉంది. నిరుద్యోగ సమస్య పెరిగేకొద్దీ దేశంలో నేరాలూ పెచ్చరిల్లడం సహజం. ఉపాధి కల్పనపై దృష్టి సారించడం ద్వారా శాంతిభద్రతల సమస్య లనూ గణనీయంగా తగ్గించవచ్చు. ప్రభుత్వ శాఖల్లో అన్ని రకాల ఉద్యోగాల ఖాళీలనూ వేగంగా భర్తీ చేయా ల్సిన అవసరం ఉంది. ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పనకు అవసరమైన ప్రోత్సాహకాలను ఇవ్వాలి. స్వయం ఉపాధి కోసం ప్రయత్నించే నిరుద్యోగులకు ఆర్థిక సహాయం అందించాలి. అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, శిక్షణను కల్పించాలి. నిరుద్యోగ సమస్యను పరిష్కరించ డానికి స్వయం ఉపాధికోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై విస్తృతమైన అవగాహన కల్పించా ల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. స్థానిక సంస్థలకు కీలక బాధ్యతలు అప్పగించి, స్వయం ఉపాధిని పెంపొందించే పనులకు పెద్ద పీట వేయాలి. నూతన ఆవిష్కరణలకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. పట్టణ, గ్రామీణ మానవ వనరులను పూర్తిస్థాయిలో విని యోగించుకోవాలి.ఉపాధి కల్పన పెరిగితే దేశ ఆర్థికాభివృద్ధి రేటు సైతం ఆశించినదానికన్నా మెరు గ్గా ఉంటుంది. వలస కార్మికులకు సంబంధించిన పూర్తిస్థాయి వివరాల్ని స్థానిక ప్రభుత్వాలు విధిగా నమోదు చేసి, ప్రభుత్వ రికార్డుల్లో పొందుపరచాలి. దీనివల్ల శ్రామికులకు అవసరమైన సహాయాన్ని నేరుగా అందించడానికి అవకాశం ఉంటుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరకులు అందరికీ అందేలా చూడాలి.సరఫరా పెంచాలిగత సంవత్సరం కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి- జన్‌ధన్‌ ఖాతా కలిగిన మహిళలకు ఆర్థిక సహా యాన్ని ప్రకటించినట్లుగానే.. ఇప్పుడూ ఆర్థిక సహా యాన్ని సమకూర్చాలి. ప్రభుత్వం ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి పెద్దయెత్తున ఆర్థిక వనరులను కూడగట్టాల్సి ఉంటుంది. కరోనా కష్టకాలంలో ప్రజాసంక్షేమం కోసం ఖర్చు చేయడమే పరమావధి కావాలి. ప్రభుత్వ ఖర్చు పెరగడంవల్ల లోటు పెరిగి పోయినప్పటికీ, నేటి పరిస్థితుల దృష్ట్యా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. అందుకే ప్రభుత్వం ఉపాధి కల్పన కార్యక్రమాలకు పెద్దయెత్తున శ్రీకారం చుట్టాలి.కొవిడ్‌ వ్యాక్సిన్‌కు తీవ్రంగా కొరత ఉన్నందువల్ల- టీకాల సరఫరాను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉంది. ప్రజలందరికీ టీకా వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. ఇప్పటికే కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, రక్షణ రంగం, కొన్ని ప్రైవేటు కంపెనీలు దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌ను సరఫరా చేసేందుకు, ప్రజల్లో ధైర్యాన్ని పాదుగొల్పేందుకు పరస్పర సహకారంతో ముందుకు వెళుతున్నాయి. ప్రణాళికాబద్ధంగా ఉపాధి కల్పన, ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు అమలు జరిగినప్పుడే ప్రజలు భవిష్యత్తుపై భరోసాతో ఉంటారు. దానివల్ల ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటానికీ ఆస్కారం ఉంది.
సమస్య ఎంత తీవ్రంగా ఉందో వెల్లడిరచిన (జవీIజు)
భారత్‌లో నిరుద్యోగ సమస్య ప్రస్తావన వచ్చిన ప్రతీసారి ప్రధాని మోదీ తమ ప్రభుత్వం చాలానే చేసిందని చెబుతున్నారు. ఉపాధి, ఉద్యోగ రంగాల్లో భారత్‌ పురోగమిస్తోందని..గత నాలుగేళ్ల లో 6లక్షల మంది ప్రొఫెషనల్స్‌ ఉపాధి పొందారని ఇటీవల వెల్లడిరచారు. అయితే వాస్తవాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయని సర్వేలు,పలు నివేది కలు చెబుతున్నాయి. భారత్‌లో నిరుద్యోగ సమస్య ఎంతలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ప్రభుత్వ శాఖల్లో ఏచిన్న అటెండర్‌ పోస్టుకు నోటిఫి కేషన్‌ విడుదలైనా..పీజీలు,పీహెచ్‌డీలు చేసిన వారు కూడా దరఖాస్తులు చేసుకుంటున్న పరిస్థితి. దేశం లో నిరుద్యోగానికి సంబంధించి సెంటర్‌ ఫర్‌ మాని టరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ(జవీIజు) సంస్థ తాజాగా ఆసక్తికర విషయాలు వెల్లడిరచింది.2016 సెప్టెం బర్‌ నుంచి ఇప్పటివరకు నమోదైన నిరుద్యోగ రేటును పరిశీలిస్తే..ఫిబ్రవరిలో అత్యధికంగా 7.2 శాతం నిరుద్యోగ రేటు నమోదైంది. గతేడాది 2018, ఫిబ్రవరి నెలలోనిరుద్యోగ రేటు 5.9 శా తం ఉండగా ఇప్పుడది మరింత పెరిగింది. దేశ వ్యాప్తంగా కొన్నివేల ఇళ్లనుంచి సేకరించిన సమా చారం ప్రకారం.. ఈసర్వే నివేదికను తయారు చేసినట్టు (జవీIజు) తెలిపింది.ముంబైలోని థింక్‌ ట్యాంక్‌ సంస్థ ఛైర్మన్‌ మహేష్‌వ్యాస్‌ తెలిపిన వివ రాల ప్రకారం..గతేడాది ఫిబ్రవరి నాటికి ఇండి యాలో 406 మిలియన్ల ఉద్యోగస్తులు ఉండగా.. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి అది 400 మిలియన్లకే పరిమితమైంది. భారత్‌లో నిరుద్యోగ సమస్య ప్రస్తావన వచ్చిన ప్రతీసారి ప్రధాని మోదీ తమ ప్రభుత్వం చాలానే చేసిందని చెబుతున్నారు. ఉపాధి,ఉద్యోగ రంగాల్లో భారత్‌ పురోగమి స్తోం దని.. గతనాలుగేళ్లలో 6లక్షల మంది ప్రొఫెషన ల్స్‌ ఉపాధి పొందారని ఇటీవల వెల్లడిరచారు. అయితే వాస్తవాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయని సర్వేలు,పలు నివేదికలు చెబుతున్నాయి. నిరుద్యోగానికి సంబంధించి కొన్ని వారాల క్రితం ఓవార్తా పత్రిక కొన్ని లెక్కలను బయటపెట్టింది. అయితే అధికారులు మాత్రం దాన్ని కొట్టిపారేశారు. సదరు పత్రిక బయటపెట్టిన వివరాల ప్రకారం.. దేశంలో గత45ఏళ్లలో ఎన్నడూ లేనంతగా 2017-18లో నిరుద్యోగ సమస్య తీవ్రమైంది. జవనవరిలో (జవీIజు) విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం..పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు తర్వాత 2018లో దాదాపు 11మిలియన్ల మంది తమ ఉద్యోగాలు కోల్పోయారు.
ప్రభుత్వం మాత్రం దీనిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. నోట్ల రద్దు ప్రభావం ఉద్యోగా లు, చిన్న తరహా పరిశ్రమలపై ఎలాంటి ప్రభావం చూపించిందన్న దానికి సంబంధించి తమవద్ద ఎలాంటి డేటా లేదని గతనెలలో ప్రభుత్వం ప్రక టించింది.-(సిహెచ్‌. నర్సింగరావు /డాక్టర్‌ చిట్టెడి కృష్ణారెడ్డి)

పంటల వైవిధ్యమే పోషకాహారానికి మూలం

ప్రజాస్వామ్య సౌధానికి మూలం వైవిధ్యం. సామాజికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా వివిధ ప్రజా సమూహాలు ఈ వైవిధ్యానికి ప్రాణం పోస్తాయి. అందుకే పాలనలోనూ ఈ ప్రజాస్వామిక స్వభావాన్ని ప్రభుత్వాలు సంతరించుకోవాలి. సాధారణంగా లాభాల కోసం పని చేసే పెట్టుబడి వైవిధ్యానికి వ్యతిరేకం. పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం పని చేసే పాలకులు కూడా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. అందుకే అన్ని ప్రజాస్వామిక, నాగరిక విలువలనూ తుంగలో తొక్కి, ఏకస్వామ్య పాలన సాగిస్తుంటారు. పాలకుల సంస్కృతి ప్రజలను కూడా ప్రభావితం చేస్తుంది కనుక ప్రజలు తమ నిత్య జీవితంలోనూ అలాగే వ్యవహరిస్తుంటారు.


తెలంగాణలో పంటల వైవిధ్యం పడిపోవడం చూస్తుంటే పాలకులలోనూ, గ్రామీణ ప్రజలలోనూ ఈ మోనో కల్చర్ ధోరణులు ఎంత బలంగా పని చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ గడ్డ మొదటి నుంచి, ప్రధానంగా వర్షాధార ప్రాంతమే. ప్రత్యేక భౌగోళిక స్వభావం కలిగి ఉన్నది. కానీ ఎప్పుడూ వైవిధ్యమైన పంటలకు ఈ నేల కేంద్రంగా ఉండేది. ఫలితంగా వైవిధ్యమైన ఆహారం ప్రజల అలవాటులో భాగంగా ఉండేది. నేల సారాన్ని బట్టి, సాగునీరు అందుబాటును బట్టి ప్రజలు పంటలు వేసేవారు.
కానీ ఇప్పుడు అదంతా గడిచిపోయిన చరిత్ర. ప్రస్తుతం తెలంగాణలో కేవలం 3 లేదా 4 పంటలే 95 శాతం భూములను ఆక్రమించాయి. కాలక్రమంలో కొన్ని పంటలు కనుమరుగవుతున్నాయి. 2020 ఖరీఫ్‌లో రైతులు వరి 53,33,477, పత్తి 60,53,890, కంది 10,84,557 సోయాబీన్ 4,00,998 ఎకరాలలో సాగు చేశారు. మొత్తం 1,35,63,492 ఎకరాలలో పంటలు సాగయితే ఈ నాలుగు పంటలే 1,28,72,922 ఎకరాలలో సాగయ్యాయి. యాసంగిలో కూడా వరిని 50,58,128 ఎకరాలలో సాగు చేశారు. ఫలితంగా రెండు సీజన్లలోనూ మిగిలిన పంటల విస్తీర్ణం బాగా పడిపోయింది.
ఈ ధోరణి వల్ల, సాగునీటిపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతున్నది. అన్ని పంటల సగటు దిగుబడులు పడిపోతున్నాయి. కొన్ని పంటల విస్తీర్ణం గణనీయంగా పెరగడం వల్ల, మార్కెట్ సమస్య కూడా ఎదురవుతున్నది. నిల్వ కోసం అవసరమైన గిడ్డంగుల కొరత కూడా ఏర్పడుతున్నది. ఒకేసారి వ్యవసాయ కార్యకలాపాలు జరగడం వల్ల కూలీల కొరత సైతం ఏర్పడుతున్నది. యంత్రాల కిరాయిలతో సహా అన్ని రకాల సాగుఖర్చులు పెరిగి రైతులకు నికర ఆదాయాలు పడిపోతున్నాయి. కొన్ని వాణిజ్య పంటలకే డిమాండ్ పెరిగి, భూముల కౌలు ధరలు కూడా పెరిగిపోతున్నాయి.
ఇప్పుడు మార్కెట్ మాత్రమే రాష్ట్ర పంటల ప్రణాళికను శాసిస్తున్నది. వాతావరణంలో వస్తున్న మార్పులను ఏ మాత్రం పట్టించుకోకుండా పంటలను ప్రోత్సహించే ధోరణి తెలంగాణ పాలకులలో ఎక్కువగా ఉంది. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా భూగర్భ జలాలను అడుగంటి పోయేటట్లు చేస్తున్నా, ఫలితంగా యాసంగి సీజన్‌లో పంటలు ఎండిపోతున్నా, ప్రభుత్వానికి పట్టడం లేదు.
వాస్తవానికి రాష్ట్ర ప్రజల ఆహార అవసరాలు, పశువుల ఆహార అవసరాలు, రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ముడిసరుకు అవసరాలు దృష్టిలో ఉంచుకుని ఏ ప్రభుత్వమైనా రాష్ట్రంలో ఉన్న సాగుభూములను ఉత్పత్తికి ఉపయోగించుకోవాలి. అందుకు అనుగుణంగా రైతులతో కలసి గ్రామ, మండల స్థాయిలో ప్రణాళికలు రచించుకోవాలి. బఫర్ స్టాక్, ప్రకృతి వైపరీత్యాలు దృష్టిలో ఉంచుకుని కొంత అదనంగా ఉత్పత్తి ప్రణాళిక రూపొందించుకోవచ్చు. ఈ అవసరాలు తీరాక అంతగా భూములు మిగిలితే, అప్పుడు ప్రభుత్వ వ్యవసాయ మార్కెటింగ్ శాఖతో కేంద్రం, ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు, కంపెనీలు చేసుకునే ముందస్తు ఒప్పందాల ప్రాతిపదికన ఇతర రాష్ట్రాల కోసం, దేశాల కోసం కూడా పంటలు పండించవచ్చు.
ఈ మొత్తం ప్రక్రియలో రాష్ట్ర వాతావరణం, సాగు భూముల స్వభావం, సాగునీరు అందుబాటు, దానికోసం రైతులు తవ్వుకునే బావులు, బోర్లు, ప్రభుత్వాలు అప్పు తెచ్చి నిర్మించే ఎత్తిపోతల పథకాలు, వాటి నిర్మాణ, నిర్వహణ వ్యయం, వాటి విద్యుత్ అవసరాలకు చెల్లింపులు, ఫలితంగా పెరిగే పంటల ఉత్పత్తి ఖర్చు పరిగణనలోకి తీసుకోవాలి. కేంద్రం ప్రతి సంవత్సరం పంటల మద్దతుధరల విషయంలో అనుసరించే అపసవ్య ధోరణులు, ప్రభుత్వ సంస్థలకు పంటల సేకరణలో ఉన్న పరిమితులు కూడా దృష్టిలో ఉంచుకోవాలి. అమెరికా, యూరప్, చైనా దేశాలు అక్కడి రైతులకు వివిధ పేర్లతో ఇస్తున్న భారీ సబ్సిడీలు, ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల ఒడిదుడుకులను కూడా ఇక్కడ పంటల ప్రణాళిక సమయంలో దృష్టిలో ఉంచుకోవాలి.
వీటిపై రైతులందరికీ అవగాహన ఉండకపోవచ్చు కానీ ప్రభుత్వానికి తప్పకుండా ఉండాలి. ఈ సందర్భంలో ప్రజాపక్షంగా ఆలోచించి సూచనలు చేసే వ్యవసాయ ఆర్థిక నిపుణుల అభిప్రాయాలూ, వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటల పొందికపై వ్యవసాయ విశ్వవిద్యాలయాలు చేసే సూచనలూ ప్రభుత్వాలు ఆలకించాలి. ప్రగతి భవన్లో తీసుకునే నిర్ణయాలన్నీ పారదర్శకమైనవి, శాస్త్రీయమైనవి కావని గత 7 సంవత్సరాల పాలన నిరూపించింది.
భారత వైద్య పరిశోధనా సంస్థ (ICMR), ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 400 గ్రాముల ఆహారధాన్యాలు, 60 గ్రాముల పప్పుధాన్యాలు, 60 గ్రాముల నూనెలు, 25 గ్రాముల సుగంధ ద్రవ్యాలు, 325 గ్రాముల కూరగాయలు, 100 గ్రాముల పండ్లు ఆహారంగా తీసుకోవాలని సిఫార్సు చేసింది. అంటే ఆహార అవసరాల కోసం ఏ గ్రామం, జిల్లా, రాష్ట్రం, దేశం అయినా వీటి ఉత్పత్తికి స్థానికంగా ప్రణాళిక రూపొందించుకోవాలి. అందుకు అనుగుణంగా భూములను కేటాయించుకోవాలి. ఇంకా సాగు భూములు మిగిలితే పశుగ్రాసం కోసం, పరిశ్రమల అవసరాల కోసం, ఇతర ఆహార అవసరాల కోసం సాగు భూముల కేటాయింపు జరగాలి. అప్పటికీ భూములు మిగిలితే అప్పుడు మార్కెట్ ఆధారిత, ముందస్తు ఒప్పంద ఆధారిత పంటల ఉత్పత్తి కోసం కేటాయించుకోవాలి. స్థానికంగానే ఉత్పత్తి, నిల్వ, ప్రాసెసింగ్, పంపిణీ, మార్కెటింగ్ జరిగితే రైతులకు ఉత్పత్తి ఖర్చులు తగ్గుతాయి. వినియోగదారులకు స్థానికంగా నాణ్యమైన ఉత్పత్తులు తక్కువ ధరలకు దొరుకుతాయి. ప్రజలు ఇప్పటిలా, కేవలం తెల్ల వరి బియ్యం మాత్రమే ప్రధాన ఆహారంగా తీసుకోకుండా జొన్నలు, ఇతర చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, వివిధ రకాల నూనెలు, కూరగాయలు, పండ్లు, సుగంధద్రవ్యాలు ఆహారంలోకి తీసుకోవడం వల్ల ప్రజలకు పౌష్టికాహారం అందుతుంది. ఆరోగ్యాలు మెరుగవుతాయి. అన్నిటికీ మించి రైతులకు స్థానికంగానే అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు లాభసాటి ధరలు లభిస్తాయి. పశువులకు కూడా వైవిధ్యమైన పశుగ్రాసం దొరికి ఆరోగ్యకరమైన పాలు, మాంసం, గుడ్ల దిగుబడులు గణనీయంగా పెరుగుతాయి. ఈ మొత్తం వ్యవసాయ, పశు ఆధారిత ఉత్పత్తుల ప్రక్రియలో ఎరువుల ధరలు పెరుగుతూ, పంటల ఉత్పత్తి ఖర్చులు మరింత పెరిగే అవకాశం ఉన్నందున విష రసాయనాలను వదిలేసి సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తే ప్రజల ఆరోగ్యాలూ ,పర్యావరణమూ బాగుపడతాయి. రాష్ట్రంలో సాగునీటిపై కూడా ఒత్తిడి తగ్గుతుంది. తద్వారా విద్యుత్ వినియోగం తగ్గుతుంది. ఎందుకంటే వరి, పత్తి, పామాయిల్ లాంటి పంటలకు నీటి అవసరం ఎక్కువ. మిగిలిన పంటలు ప్రధానంగా మెట్ట పంటలు. ఇప్పటి వరకూ వీటిని అశ్రద్ధ చేయడం వల్ల రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయింది. కేంద్రం తెచ్చిన మూడు చట్టాల నేపథ్యంలో మార్కెట్ ధరలు రైతులకు అనుకూలంగా ఉండే అవకాశం లేదు. రాష్ట్రంలో రెండు మూడు పంటల విస్తీర్ణాన్నే ప్రోత్సహిస్తే వాటి మార్కెటింగ్ కష్టం అవుతుంది. ప్రభుత్వం కూడా చివరి గింజ వరకూ ఎప్పుడూ కొనే అవకాశం ఉండదు.
అందువల్ల ప్రభుత్వం కొన్ని నిర్దిష్ట చర్యలు వెంటనే ప్రారంభించాలి. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ దృష్టితో కాకుండా తెలంగాణ రాష్ట్ర అవసరాల ప్రాతిపదికన పంటల ప్రణాళిక చేపట్టాలి. రాష్ట్రస్థాయిలో చర్చించడం కాకుండా, రైతులకు అవగాహన కల్పించడం ద్వారా, గ్రామ, మండల స్థాయిలో ఈ ప్రణాళికలు రూపొందాలి. ఈ చర్చలలో స్థానికంగా ఉండే రైతు సహకార సంఘాలను, రైతు ఉత్పత్తిదారుల కంపెనీలను, గ్రామీణ మహిళా సహకార సంఘాలను, పశు పోషకులను, కోళ్ళ పెంపకందారులను భాగస్వాములను చేయాలి. ఈ సహకార సంఘాల ఆధ్వర్యంలోనే ప్రాసెసింగ్ యూనిట్లు, గిడ్డంగుల కోసం నిధులు కేటాయించవచ్చు. కస్టమ్ హైరింగ్ సెంటర్లు నిర్వహించవచ్చు.
రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల ఆధారంగా పరిశ్రమలు నడుపుతున్న పారిశ్రామికవేత్తలతో జిల్లా, రాష్ట్ర స్థాయిలో సమావేశాలు జరిపి వాళ్ళ అవసరాలు తెలుసుకోవాలి. ఇతర రాష్ట్రాలను, బడా వ్యాపారసంస్థలను సంప్రదించి, వాళ్ళకు రాష్ట్రం నుంచి అవసరమైన వ్యవసాయ, ఇతర గ్రామీణ ఉత్పత్తుల గురించి చర్చలు జరిపి, కనీస మద్దతుధరల చెల్లింపు ప్రాతిపదికన వారితో ముందస్తు ఒప్పందాలు చేసుకోవాలి. వాటిని కూడా గ్రామ, మండల స్థాయిలో పంటల ఉత్పత్తి ప్రణాళికలలోకి తీసుకురావాలి. పంటల ఉత్పత్తి ఖర్చులు, దిగుబడుల మధ్య వ్యత్యాసం వల్ల, రైతులకు వచ్చే ఆదాయాల మధ్య వ్యత్యాసం తప్పకుండా ఉంటుంది కనుక, వారు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఎకరానికి కనీస ఆదాయం గ్యారంటీ ఇవ్వాలి. అప్పుడే రైతులు భరోసాతో అన్ని పంటలను సాగు చేస్తారు. అడవి జంతువులు, ప్రకృతి వైపరీత్యాల నుంచి రైతులు తట్టుకోవడానికి సమగ్ర బీమా పథకాలను అమలు చేయాలి.
రాష్ట్రప్రభుత్వం ఈ వానాకాలం సీజన్‌కు ముందే, పాత తప్పులు పునరావృతం కాకుండా చర్చలు ప్రారంభించి నిర్దిష్ట విధానాలను అమలు చేయాలి.(ఆంధ్ర‌జ్యోతి సౌజ‌న్యంతో..)
కన్నెగంటి రవి, రైతు స్వరాజ్య వేదిక

ఆస్తుల అమ్మకంలో ఆంతర్యమేమి?

రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విశాఖ నగరం లోని భూములను వేలం ద్వారా అమ్మకానికి పెట్టాలని నిర్ణయించింది. దీని కనుగుణంగా ‘నేషనల్‌ బిల్డింగ్‌ కనస్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా’ వారు మార్చి 30వ తేదీన నగరంలోని ఐదు ప్రదేశాలలో ఉన్న 17.48 ఎకరాల భూమిని వున్నది వున్నట్లుగా అమ్మాలని ‘ఇ టెండర్ల’ను ఆహ్వానించారు. నగరం నడిబొడ్డున ఆర్కే బీచ్‌ను ఆనుకుని ఉన్న 13. 59 ఎకరాల భూమి కూడా ఇందులో ఉంది. ప్రభుత్వం భూములు ఎందుకు అమ్ముతోంది అన్నది ఒక అంశం కాగా, అలా అమ్మడం సహేతుకమేనా అన్నది మరొక అంశం. వాస్తవానికి గత సంవత్సరమే ప్రభుత్వం ఇలాంటి ప్రయత్నం చేసినా హైకోర్టు ఆర్డర్‌ వల్ల నిలిచిపోయింది.

అధికారంలోనికి వఛ్చిన సంవత్సరమే రాష్ట్ర ప్రభుత్వం ‘బిల్డ్‌ ఎ.పి మిషన్‌’ అమలుకు ముఖ్యమంత్రి అధ్యక్షతన ఒక స్టేట్‌ లెవెల్‌ మోనిటరింగ్‌ కమిటీని (ఎస్‌ఎల్‌ఎంసి) జీఓ నెం. 447 (తేదీ 5.11.02019) ద్వారా ఏర్పాటు చేసింది. అందులో మూడు అంశాలను ప్రధానంగా పేర్కొన్నారు. ఒకటి రాష్ట్ర ప్రభుత్వ ‘నవరత్నాలు, నాడు-నేడు’ వంటి పథకాల అమలుకు నిధులు సమకూర్చుకోవడం, రెండవది రాష్టంలో నిరుపయోగంగా ఉన్న స్థలాలను అమ్మడం ద్వారా ఆ నిధులు రాబట్టడం, మూడవది ఈ పనిని సమర్ధవంతంగా చేయడానికి నేషనల్‌ బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ (ఎన్‌బిసిసి) అనే కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమతో ఒప్పందం చేసుకోవడం. ఇప్పుడు ఈ సంస్థ కూడా కేంద్ర ప్రభుత్వ అమ్మకాల జాబితాలో ఉండడం గమనార్హం.

గత సంవత్సరం మార్చి 2వ తేదీన జరిగిన ఎస్‌ఎల్‌ఎంసి సమావేశంలో సుమారు పది వేల కోట్ల రూపాయల విలువచేసే 1400 ఎకరాల భూమి 250 ప్రాంతాలలో ఉందని గుర్తించారు. ఈ భూమిని వివిధ దశలలో అమ్మాలని ప్రతిపాదించారు. మొదటి దశలో విశాఖపట్నం జిల్లాలో 28, కృష్ణా జిల్లాలో 5, గుంటూరు జిల్లాలో 7 మొత్తం 40 స్థలాలను అమ్మవచ్చని ఎన్‌బిసిసి ఎంపిక చేసింది. ఈ స్థలాల నుండి అత్యధిక రాబడి సాధించేందుకు అవసరమైన సహకారానికి కెనడా రాజధాని టోరొంటో ప్రధాన కేంద్రంగా ఉన్న ‘కొలియర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రవేట్‌ లిమిటెడ్‌’, అమెరికా లోని చికాగో ప్రధాన కేంద్రంగా ఉన్న ‘జెఎల్‌ఎల్‌ ప్రాపర్టీ కన్సల్టెంట్స్‌’ సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు. ఈ రెండూ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ప్రపంచం లోనే అతి పెద్ద కంపెనీలు.

ఇలా అమ్మకానికి పెడుతున్న స్థలాలు ఎపిఐఐసి, ఇరిగేషన్‌, మునిసిపల్‌, రెవిన్యూ, ఆరోగ్య, జైళ్ల శాఖలకు చెందినవి ఉండడంతో, ఎలాంటి వివాదాలకు తావులేకుండా అమ్మకానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడానికి జిల్లా కలెక్టర్‌ అధ్యక్షులుగా, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కన్వీనరుగా డిస్ట్రిక్ట్‌ ప్లానింగ్‌ అండ్‌ ఇంప్లిమెంటేషన్‌ కమిటీని అన్ని జిల్లాలలో ఏర్పాటు చేశారు.

అసలు ఇలా భూములు అమ్మడం వివేకమేనా అనే ప్రశ్న అలా ఉండగా ఇంకా విచిత్రమైన రెండు విశేషాలు ఇందులో ఉన్నాయి. ఒకటి స్థలాల విలువ కట్టడమైతే, రెండోది ఈ స్థలాలలో ప్రస్తుతం ఏమున్నాయనేది. మార్కెట్‌ విలువ కంటే అన్ని స్థలాలలోనూ తక్కువే వస్తుందని వారు పేర్కొన్నారు. అదే సందర్భంలో సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ రేట్ల కంటే కూడా వీరు తక్కువ మార్కెట్‌ రేటును పొందుపరిచారు. దీనర్ధమేమిటంటే భూములను చవకగా అమ్మడం. వీరు అమ్మాలనుకున్న కొన్ని స్థలాలలో ప్రధానమైన ప్రభుత్వ డిపార్ట్‌మెంట్లు పని చేస్తున్నాయి. ఉదాహరణకు గుంటూరు నగరంలోని అరండల్‌ పేటలో వున్న తహసీల్దార్‌ ఆఫీసు, జైలును ఖాళీ చేయించి ఆ స్థలాన్ని అమ్మేయాలని నిర్ణయించారు. అలాగే విశాఖ నగరం లోని సీతమ్మధారలో ఉన్న తహసీల్దార్‌ ఆఫీసు, రెవిన్యూ ఉద్యోగుల క్వార్టర్లను ఖాళీ చేయించి అమ్మకానికి పెడుతున్నారు. ఇంకా విచిత్రంగా, అక్కడే ఉన్న ప్రభుత్వ కంటి ఆసుపత్రిని, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ కార్యాలయాన్ని కూడా తరలించి, ఆ పదకొండు ఎకరాల స్థలాన్ని కూడా వేలానికి పెట్టాలని నిర్ణయించారు.

ఇంకో విశేషమేమిటంటే గత ప్రభుత్వం విశాఖ నగరంలోని 13.59 ఎకరాల భూమిని ‘లులు మాల్‌’ కు కేటాయించింది. ఈ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన వెంటనే ఆ కేటాయింపును రద్దు చేసింది. ప్రభుత్వం దీనిని ప్రజావసరాలకు వినియోగిస్తుందని భావించి ప్రజలు ఈ రద్దును హర్షించారు. కానీ వారికి దిమ్మదిరిగేలా ప్రభుత్వం నేడు ఆ భూమిని కూడా అమ్మకానికి పెట్టింది. ఆ కాడికి పాత కేటాయింపును రద్దు చేయడమెందుకు? ‘లులు మాల్‌’ కే వదిలేస్తే పోయేది కదా అనే భావనతో ఇప్పుడు ఆ ప్రజలే ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదంతా చూస్తుంటే ‘బిల్డ్‌ ఎ.పి” అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడం కాకుండా అమ్మకానికి పెట్టడంలా ఉంది. ఒక పక్క అమ్మేస్తూ, ఇదెలా నిర్మించడం అవుతుందో ఆ పేరు పెట్టిన వారికే తెలియాలి.

ఈ మొత్తం వ్యవహారం అనేక సందేహాలకు తావిస్తోంది. దీనికి తోడు ప్రభుత్వ వివేచనను ప్రశ్నించేలా చేస్తోంది. ఇలా అమ్ముకుంటూ పోతే ఆస్తులు తరుగుతాయే కానీ పెరగడానికి ఇదేమీ ఊరే జల కాదు కదా! ఈ అమ్మకాలలో విదేశీ బడా రియల్‌ ఎస్టేట్‌ సంస్థలను భాగస్వామ్యం చేయడం వెనుక ఏమైనా మతలబుందా అనే సందేహం కూడా సామాన్యులకు కలగడం సహజం. ప్రభుత్వ ఆఫీసులను కూడా ఖాళీ చేయించి మరీ అమ్మకానికి పెట్టడంలో ఆంతర్యమేంటనే సందేహం కూడా కలుగుతుంది. ఇటువంటి సందేహాలను కొట్టిపారేయకుండా నివృత్తి చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇంటి రోజువారీ ఖర్చులకు ఆదాయ మార్గాలను వెతుక్కోకుండా ఇంట్లో సామాన్లన్నీ అమ్ముకుంటూ పోతే, ఆ ఇల్లు ఎలా దివాళా తీస్తుందో మన రాష్ట్ర పరిస్థితి కూడా అక్కడికే చేరుకుంటుందనడం అతిశయోక్తి కాదు.

సంక్షేమ పథకాలు అమలు చేయడం మంచిదే కానీ, ఆ పేరుతో ప్రభుత్వ ఆస్తులను అమ్ముకోవడం వివేకవంతమైన ఆలోచనేనా? అలా అమ్ముకుంటూ పోతే కొన్నాళ్ళకు ప్రభుత్వ ఆస్తులన్నీ అయిపోతే అప్పుడు ఏం చేస్తారనే ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్మేయడమే తమ విధానమని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వ బాట లోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా పయనిస్తోందా అనే భావం కూడా ప్రజలకు కలుగుతుంది. ఇప్పుడు విశాఖ భూములతో ప్రారంభించి అనేక ప్రాంతాలలో భూములను అమ్మడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా అవగతమవుతోంది.

ప్రభుత్వం ఇప్పటికైనా విజ్ఞతతో పునరాలోచించి స్థిరంగా వచ్చే ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపై దృష్టి సారించాలి. కేంద్రం నుండి రావలసిన మన వాటా నిధులకై అవసరమైతే అందరినీ కలుపుకుని ఒత్తిడి తేవాలి. అంతేకాని ఇలా ఆస్తులను అమ్ముకోవడం రాష్ట్రానికి ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. విజ్ఞత అంతకంటే అనిపించుకోదు.
ఎ. అజ శర్మ /వ్యాసకర్త ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి

1 4 5 6 7 8 9