గోండు రాజుల పాలనకు నిదర్శనాలు

ఆదిలాబాద్‌ జిల్లాలో గిరిజనుల సంఖ్య ఎక్కువ. అందులో గోండు జాతీయుల సంఖ్య మరీ ఎక్కువ.. ఈ జిల్లాలో వివిధ రాజవంశీయుల పాలనా కొనసాగింది. అయితే గోండు జాతి ప్రజలు ఎవరి పాలనలోఉన్నా వారి సంప్ర దాయాలను, కట్టు బాట్లను, ఆచార వ్యవహారాలను కాపాడు కున్నారు. సిర్పూర్‌(టి) కేంద్రంగా ప్రారంభమైన వారి పాలన, వివిధ ప్రాంతాల్లో విస్తరించింది. క్రీ.శ.870 నుండి 1750 శతాబ్దము వరకు గోండ్వానా రాజ్యాన్ని గోండు రాజులు పరిపాలించారు.వీళ్ళు1350 శతా బ్దము నుండి 1600 శతాబ్దము వరకు స్వతంత్ర రాజులుగాను, ఆ తరు వాత1751శతాబ్దము వరకు సామంతరాజులుగాను,గోండ్వానా ప్రాంతాన్ని పరిపాలించారు. ఈభూభాగంలో దట్టమైన అడవి సంపద, విస్తారమైన ఖనిజ సంపద, సారవంతమైన నల్లరేగడి భూములు, అనేక రకాల చిరుధాన్యాలు , వాణిజ్య పంటలకు నిలయాలు.గోండ్వానా ప్రాం తము దక్షిణాన గోదావరి,పెన్‌గంగా వరకు ప్రాణహిత నదుల పరి వాహక ప్రాంతము నుండి ఉత్తరాన నర్మదా నది పరివా హక ప్రాంతము వరకు విస్తరించిన భూ భాగము. ఇది గోండు రాజులకు గుండెకాయ లాం టిది. క్రీ.శ.1895 కాలములోనే రాజ భీమ్‌బల్లాల్‌ సింగ్‌ గోండుల సంస్కృతి సాంప్రదాయాలు, ఆచారవ్యవహారాలకు పెద్దపీఠ వేసి వారిని సమీ కరించి ‘ సిర్‌పూర్‌’ కేంద్రముగా తన రాజ్య స్థాపన చేసాడు. ఆయన తర్వాత పరిపాలించిన గోండురాజులు హీరాసింగ్‌, కేసరిసింగ్‌, ధిన్కర్‌ షా,రామ్‌సింగ్‌,సూరజ్‌ భల్లాల్‌షా వీరిలో రాజ సూరజ్‌ భల్లాల్‌షా ‘‘ఢల్లీి’’ చక్రవర్తుల మెప్పు పొంది ‘‘శేర్‌షా’’ అనే బిరుదు పొందా డు.దక్షిణ మాండ్లాలోని గోండ్వానా ప్రాం తాన్ని కూడా బహుమతిగా పొందాడు. ఈయన కుమారుడు రాజా ఖాంద్యా భల్లాల్‌ షా సిర్‌పూర్‌ రాజధానిని ప్రస్తుత భల్లా ర్‌షాకు,ఆతర్వాత చాందాకు మార్చాడు (ప్రస్తుత చంద్రాపూర్‌).చాందా రాజధానిగా రాజా ఖాం ద్యా భల్లాల్‌షా10,000 గుఱ్ఱాలు,40,000 సైన్యం,వైరాగర్‌లో వజ్రాలగనులు కలిగి16 వ శతాబ్ద ప్రారంభము వరకు పరిపాలించాడు. కాకతీయ రాజుల పతనానంతరము గోండు రాజులు పెన్‌గంగా నది పరివాహక ప్రాంతానికి ఉత్తరాణ రాంటెక్‌,నాగపూర్‌ వరకు విస్తరిం చారు. క్రీ.శ.1412లో గోండ్వానా,బేతూల్‌ ప్రాం తంలోని ఖేరళా రాజ్యాన్ని పరిపాలించిన గోండు రాజు రాజనర్సింగు పై ఫిరోజ్‌షా బహ్మని దాడి చేసి మూడువందల (300) ఏనుగులను స్వాధీన పర్చుకొని తనకు సామంతరాజుగా చేసుకు న్నాడు.క్రీ.శ.1421లోఅహ్మద్‌షా బహ్మని గోం డ్వానాలో భాగమైన మహోర్‌ కోటపై ఐదువేల (5000) మంది సైనికులతో దాడిచేసి కలామ్‌ నగరాన్నిఅక్కడి ముత్యాలగనులను వశపర్చు కున్నాడు.బహ్మని సుల్తాన్‌ల కంటే ముందు ఉట్నూర్‌,బోథ్‌, కిన్వట్‌,ఆదిలాబాద్‌,రాజురా తాలుకాలు బీదర్‌లో భాగంగా గోండురాజులచే పరిపాలిం చబడినవి.నిర్మల్‌,లక్షెటిపేట,చెన్నూర్‌ తాలుకాలు మొదట కాకతీయరాజులు తర్వాతి బహ్మని సుల్తానులు ఆతర్వాత గోల్కొండ రాజులచే పరిపాలించబడినవి. సిర్‌పూర్‌, ఆసిఫాబాద్‌ తాలుకలు చాందా కేంద్రముగా గోండురాజుల పరిపాలనలో స్వతంత్ర రాజ్యాలుగా ఉన్నవి. క్రీ.శ.16051627 శతాబ్దములోనే మొగల్‌ చక్రవర్తి అయిన జహంగీర్‌ గోండురాజులకు వారి సరిహద్దు ప్రాంత గ్రామాలపై వారికి గల హక్కులు అధికారాలకు సంబంధించిన రాజపత్రాలు పేర సనద్‌లు జారీచేసారు. క్రీ.శ.1750లో జనగామ (ప్రస్తుత ఆసిఫాబాద్‌) గవర్నర్‌గా కొనసాగిన గోండురాజు రాజాచంద్ర అక్బర్‌షా కాలములోనే కొన్ని మోఖాసీ మరియు రాజుల కుటుంబాలు మధ్య భారత్‌ నుండి ఆదిలాబాద్‌ ప్రాంతానికి వలస వచ్చాయి. అటువంటి వారిలో ముఖ్యులు ఉట్నూర్‌ తాలుకా లక్కారం లోని ఆత్రం రాజావారి కుటుంబము, చాందా నుండి ఆసిఫాబాద్‌ తాలుకా తిర్యాణిలోని మడావి మోఖాసి వారి కుటుంబము, దేవ్‌గడ్‌ నుండి రొంపల్లిలోని పంద్ర మోఖాసీ వారి కుటుంబం నాగ్‌పూర్‌ నుండి వలస వచ్చారు. బోథ్‌ తాలుకా ఖరాత్వాడలోని దుర్వ మోఖాసీ కుటుంబము, మోవడ్‌లోమ ప్రాంతము నుండి కిన్వట్‌ తాలుకాలోని గేడాం మోఖాసీవారి కుటుంబము,మానిక్‌గడ్‌ నుండి లక్షెటిపేట్‌ తాలుకా వెంకట్రావ్‌పేటలోని ఆత్రం రాజావారి కుటుంబము,సీతాగొంది నుండి ఇంద్రవెల్లిలోని చహ్కటి రాజావారి కుటుంబము, అంకోలి నుండి అదేవిధంగా సిర్‌పూర్‌ తాలుకా తాండూర్‌కు బ్రహ్మణదేశ్‌ముఖ్‌లు మహోర్‌ ప్రాంతము నుండి వలస వచ్చి గోండుల వతన్లను స్వాదీనము చేసుకున్నారు. కాలక్రమేన గోండ్వానా ప్రాంతము 1751 నుండి 1773 వరకు మరాఠాలు ఆ తర్వాత నిజాం రాజుల ఆదీనములోనికి వచ్చాయి. గోండు రాజుల మధ్య ఐకమత్యము లేకపోవుట వారి నాయకత్వ లోపము వలన మొగలుల,మరాఠాల సైన్యము చేతిలో ఓడిపోయినారు. తర్వాత గోండు రాజులు వారి సామాజిక మరియు సాంస్కృతిక వ్యవహారాలకు సంబంధించిన సమస్యల పరిష్కా రానికి సరిపోయె మోఖాసీ గ్రామ పటేల్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. కాని రాజకీయ వ్యవహారాలను అంతగా పట్టించు కోలేదు. దీనికితోడు 18వ శతాబ్ద చివరన మరియు 19వ శతాబ్ద ప్రారంభములో ఏర్పాటు చేసిన దేశ్‌పాండే, దేశ్‌ముఖ్‌ల వ్యవస్థ వలన గోండురాజులకు, మోఖాసీలకు తీరని అన్యా యం జరిగినది. ప్రభుత్వ వ్యవస్థలోకాని పరిపాలనలోకాని భాగం కాకుండా వారి సామాజిక మరియు మతపరమైన గ్రామ పెద్దలుగా గోండుల సమస్యలను పరిష్కరించే బాధ్యతలకు మాత్రమే పరిమితమైనారు. అందుకుగాను వ్వవసాయము చేసే ప్రతి కుటుంబము నుండి సంవత్సరానికి చిన్న మొత్తంలో ధనం, ధాన్యం రూపంలో కొంత రుసుము వసూలు చేసేవారు.మొగలుల మరాఠాల కాలములో కొన్ని గ్రామాల సమూ హాన్ని ‘పరిగణ’గా గుర్తించి రెవెన్యూ వసూలు చేసే బాధ్యతను దేశ్‌ముఖ్‌లకు మరియు రెవెన్యూ పద్దులను నిర్వహించే బాధ్యతలను దేశ్‌పాండేకు అప్పగించారు. వీరికి అదనపు పారితోషికాలుగా ఆయా గ్రామాలపై పటేల్‌, సట్వారీలుగా వతన్‌ గిరి కూడా అప్పగించారు. అదే గోండురాజు లకు, మోఖాసీలకు ఎటువంటి ప్రాధాన్యము ఇవ్వకుండా వారు చెయ్యవలసిన రెవెన్యూ వసూలును మోఖాసీల ద్వారా చేపించేవారు. ఎందుకంటే దేశ్‌ముఖ్‌, దేశ్‌పాండేలు గిరజనేతర వతన్‌దార్లు, జాగిర్‌దార్లు. తమ అధికారాన్ని అమలుపర్చుటకు మోఖాసీలను గ్రామ పట్టేళ్లను ఉపయోగించేవారు. చాందా రాజధానిగా పరిపాలించిన గోండు రాజుల కాలంలో మోఖా సీలు ప్రముఖ పాత్ర పోషించారు. వారి పరిది లోని గ్రామాలలో సామాజిక, రాజకీయ, సంస్కృతి సాంప్రదాయాలలో ఆచార వ్యవహా రాలలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యము కలుగుకుండా చూసేవారు. శాంతిభద్రతలను సామరస్యంగా నిర్వహించేవారు. ఎవరైనా మోఖాసీ తీర్పు న్యాయ సమ్మతంగా లేదనుకుంటే నేరుగా రాజదర్బారుకు వెళ్ళి న్యాయము కోరే సౌకర్యము కూడా గోండు ప్రజలకు ఉండేది. రాజు తర్వాత రాజులాగ మోఖాసీలు కూడా ప్రజల ఆదరాభిమానాన్ని, గౌరవాన్ని పొందే వారు. గ్రామ స్థాయిలోని వ్యవస్థను గ్రామ పెద్దలైన పటేల్‌, మహజన్‌, దేవారి మరియు హవల్దార్‌ నిర్వహిస్తారు. కుటుంబ సమస్యలు ముఖ్యముగా భార్యాభర్తల మధ్య వచ్చే తగా దాలు, అన్నదమ్ముల మధ్య ఏర్పడే భూమి పంపకాల సమస్యలు గ్రామ పటేల్‌ ఆధ్వర్య ములో గ్రామస్తులంతా చర్చించి పరిష్కరిస్తారు. పున్నమి, అమావాస్యలప్పుడు వచ్చే గ్రామదేవ తల పండుగలు, పెండ్లిలకు సంబంధించిన తంతు జరపడానికి గ్రామదేవరి సహకారముతో పటేల్‌ నిర్వహిస్తాడు. గ్రామపెద్ద అయిన పటేల్‌ ఆదేశాలను గ్రామస్తులందరికి తెలియపర్చే బాద్యత హవల్దార్‌ది. గ్రామాల మధ్య తగా దాలు వచ్చినప్పుడు ఏ కుటుంబమైన కుల బహిష్కరణకు గురైనప్పుడు ఆ ప్రాంత మోఖాసీ ప్రవేశించి కులపెద్దల సమ్మతితో సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తాడు.ప్రొఫెసర్‌ వాన్‌ప్యూరర్‌ హెమండార్ప్‌ ప్రముఖ మానవ పరిణామ శాస్త్రవేత్త నిజాం ప్రభుత్వ వెనుక బడిన కులాల అభివృద్ధి సలహాదారు వ్రాసిన ‘ట్రైబల్‌ హైదరాబాద్‌’ ప్రకారము ఉట్నూర్‌ కేంద్రముగా పరిపాలించిన గోండురాజులు ఆత్రం కుటుంబానికి చెందిన రాజా ఇస్రాయి జంగుబాపు, రాజా లింగాయి హన్మంతరావు, రాజా జగపతిరావు 1862 వరకు మఖ్తా, వతన్‌, జాగీరు మరియు జమీందారు హక్కులు కూడా కల్గి ఉన్నారు. రాజు నివసించే కోటకు దగ్గరి పరిసర గ్రామాలను తానే స్వయంగా తన దర్బార్‌ సిబ్బందితో వెళ్ళి అక్కడి ప్రజల సాదక బాదకాలను పర్యవేక్షించేవారు. దూరముగా ఉన్న గ్రామాలను అక్కడి గ్రామ పెద్దలైన మోఖాసీ, గ్రామపటేల్‌ల ద్వార పర్యవేక్షించే వారు. అలాంటి గ్రామాల రాజులు, మోఖాసీలు ,పటేల్లను తాలుగాల వారిగా ఇక్కడ ఉదహ రించడమైనది. ఉట్నూరు తాలుకా : ఆత్రం కుంటుంబానికి చెందిన రాజా జగపత్‌రావు, రాజాదేవుషా లక్కారాం,రాజా భీమ్‌రావుపం గిడి సిర్‌పూర్‌,రాజాభగవంతరావు కంచ నపల్లి.కుమ్ర కుటుంబానికి చెందిన లాల్‌షా మోఖాసీ పరిదిలోని గ్రామాలుఆద్మీయాన్‌, శివనార,కొత్తపల్లి, కొలామా,అర్జుని, గాదిగూడ, పిప్రీ,చిత్తగూడ,కుమ్ర జంగు మోఖాసీ పరిది లోని గ్రామాలుమాన్కపూర్‌,నాగల్‌కుండ, యేంపల్లి,బాబెజరి,గణేశ్‌పూర్‌,సాంగ్వి, ఖైర్‌ దాట్వా,లోకారీ,నర్సాపూర్‌,గుంజాల,నార్నూర్‌, గుండాల. బోథ్‌ తాలుకా : దుపార్‌పేటలోని శిడాం కుటుంబానికి చెందిన మోఖాసీ పరిది, ఇచ్చోడ నుండి కడం నది పరివాహక ప్రాంత గ్రామాలు, ఖరత్వాడలోని దుర్వ యెశ్వంత రావు మోఖాసీ అక్కడి 20 గ్రామాలకు దేశ్‌ముఖ్‌ కూడ ఈయన పూర్వీకులు ఆసిఫాబాద్‌ తాలుకాలోని మోవడ్‌ లోమ ప్రాంతానికి చెందినవారు. ఆదిలాబాద్‌ తాలుకా : మర్సుకోల కుటుంబానికి చెందిన పీప్రి లచ్చు మోఖాసీ పరిది ఆదిలాబాద్‌ పట్టణంతోపాటు పెన్‌గంగా నది పరివాహక ప్రాంత గ్రామాలు.చహ్కటి కుటుంబానికి చెందిన రాజా హన్మంతరావు పరిదిలో అంకోలి,మావాల,యాపలగూడతో పాటు ఉట్నూరు తాలుకాలోని ఇంద్రవెళ్లి, తోషం,పీప్రి,దేవాపూర్‌,ముత్నూర్‌ మరియు గిన్నెర గ్రామాలు. కొరెంగ కుటుంబానికి చెందిన యెశ్వంతరావు మోఖాసీ పరిదిలో చాంద్‌పల్లి,సర్ధాపూర్‌,ఖడ్కి,చాప్రి,సోనార్‌, రుంకుమ్‌,పాఠన్‌,సోన్‌కసా,పత్తెగామ్‌, జనోలి, కరోని మరియు వడూర్‌. భాదిలోని జుంగనక కుటుంబానికి చెందిన మోఖాసీ పరిదిలో సైద్‌ పూర్‌,బోరెగామ్‌,పాటగూడ,సాంగ్వి,గార్క గూడ మరియు జామ్ని. జైనథ్‌లోని కోవ కుటుంబానికి చెందిన పోయ్‌పటేల్‌ మోఖాసీ వీరి పూర్వికులు మానిక్‌గాడ్‌ నుండి ఆదిలా బాద్‌కు వచ్చారు. కారకాన్పలోని పెందూర్‌ కుటుంబానికి చెందిన రాజా హన్మంతరావు పరిదిలో రాజురాతాలు కాలోని యేషాపూర్‌ భరిషావతన్‌, కిన్వట్‌ తాలుకాలోని పిప్పల్‌గావ్‌కోట మరియు బోథ్‌ తాలుకాలోని రaరి ప్రాంత గ్రామాలు. లక్షెటిపేట తాలుకా : వెంకట్రావుపేటలోని ఆత్రం కుటుంబానికి చెందిన సీతాగొంది ఆత్రం రాజుగారి పరిదిలో లక్షెటిపేట నుండి రాలి గడ పూర్‌ బ్లాక్‌ వరకు గల గ్రామాలు. తాళ్లపేట లోని కోవ కుటుంబానికి చెందిన మోఖాసీ పరిదిలో గోదావరినది సరిహద్దు నుండి ఉట్నూర్‌ వెళ్ళెదారిలోని ఉడుంపూర్‌ వరకు గల గ్రామాలు. ముర్రిమడ్గులోని కుమ్ర కుటుంబానికి చెందిన రాజుకు కవ్వాల్‌ పట్టీ మరియు జన్నారం ప్రాంత గ్రామాలు. యాపల్‌గూడలోని చక్రం కుటుంబానికి చెందిన మోఖాసీ పరిదిలోని గ్రామాలు కూడా లక్షెటిపేటలోనివే.
చెన్నూర్‌ తాలుగా : మర్సుకోల కుటుంబానికి చెందిన పటేల్‌కు యేంపల్లి పరిదిలోని గ్రామాలు ఉన్నాయి. ఆసిఫాబాద్‌ తాలుగా : కొరెంగ కుటుంబానికి చెందిన మోఖాసీకి మోవడ్‌, కోట్నాక కుటుంబానికి చెందిన మోఖాసీకి సాంగ్వి మరియు ఇందాని. మడావి కుటుంబానికి చెందిన మోఖాసీకి తిర్యాణి, పంద్ర కుటుంబానికి చెందిన మోఖాసీకి రొంపల్లి మరియు రాయిశిడాం కుటుంబానికి చెందిన పోయ్‌ పటేల్‌కు మంగి ప్రాంత గ్రామాలు ఉండేవి.
కిన్వట్‌ తాలుకా : గేడాం కుటుంబానికి చెందిన దేశ్‌ముఖ్‌కి కిన్వట్‌, పెందూర్‌ కుటుంబానికి చెందిన మోఖాసీకి రaరి,భిల్‌గామ్‌, కనక మోఖాసీకి పల్సి, వెడ్మ మోఖాసీకి మిన్కి ప్రాంతాలు వీరి ఏలుబడిలో ఉండేవి. రాజురా తాలుకా : సలాం,కుమ్ర,కుర్సెంగ,కనక కుటుంబాలకు చెందిన మోఖాసీలక పరిదిలో ఇంజాపూర్‌,చినై,టెంబర్‌వాయి,శేవ్‌గామ్‌ గ్రామాలు వీరి పరిదిలో ఉండెను. సుర్పమ్‌, కోట్నాక మరియు పెందూర్‌ కుటుంబాలకు చెందిన మోఖాసీల పరిదిలో మాల్ని, బంబార, మర్కల్‌ మెట్ట గ్రామాలు వీరి ఆదీనములో ఉండెను. నిర్మల్‌ మరియు సిర్‌పూర్‌ తాలుకాల పరిదిలో మోఖాసీలు లేరు. మోఖాసీల, గ్రామపటేల్‌ల బాధ్యతలలో ప్రధానముగా వారి గ్రామాల పరిదిలోని ప్రజలకు శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చూడటము, కొత్తవారెవరైన ఆ ప్రాంతానికి వస్తే వారి ఆస్తిపాస్తులను కాపాడటం, వీరు ముఖ్య మైన గ్రామపెద్దలుగా నాయకత్వము వహించి సామాజిక సాంస్కృతిక వ్యవహారాలను చక్క దిద్దటం. దసరా, దీపావళి`దండారీ లాంటి పండుగలను గొప్పగా నిర్వహిస్తూ ప్రజల గౌరవమర్యాదలు పొందటం. తమ పరిదిలో పరిష్కరించలేని క్లిష్టమైన సమస్యలు ఏమైనా ఉంటే వాటిని మోఖాసీ ద్వారా తమ పరిది లోని రాజా కుటుంబము వారి ద్వారా పరిష్క రించటం. ఈ విధముగా గోండురాజుల పరి పాలన అనేక ప్రాంతాలకు విస్తరించింది. పటిష్ట మైన పరిపాలన జరిగింది. -డాక్టర్‌. తొడసం చందూ విశ్రాంత జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సెల్‌ : 9440902142,

బాలికను బతికిద్దాం

ఆడపిల్లలపై వివక్ష కొనసాగుతున్నది. బాలికల సంఖ్య తగ్గిపోతున్నది. స్త్రీ, పురుష నిష్పత్తిలో అంతరం పెరుగుతున్నది. గత నెలలో విడు దలైన బాలికల జననాల రేటును పరిశీలిస్తే విస్మయానికి గురి చేస్తుంది. కామారెడ్డి జిల్లాలో ఆడపిల్లల పుట్టుక తగ్గిపోతుండడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నది.
గోడలకే పరిమితమైన మోదీ నినాదం
జాతీయ స్థాయిలో ఆడ పిల్లల రక్షణ, సాధికారతతో పాటు జనన రేటు పెంచేందుకు బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చినప్పటికీ ఎక్కడా సత్ఫలితాలు రావడం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ ఆర్భాటంగా పిలుపునిచ్చిన నినాదం కేవలం గోడలకే పరిమితమవుతున్నది. మారుతున్న సమాజంలో చాలా మంది తల్లిదండ్రుల్లో ఆలోచన ధోరణి మారుతు న్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం అందుకు తగిన ప్రోత్సాహాన్ని అందించడంలో విఫలమ వుతున్నది.తెలంగాణ రాష్ట్రంలో ఆడ బిడ్డలకు సీఎం కేసీఆర్‌ ఎంతో ప్రాధాన్యత నిస్తున్నారు. ఆడ బిడ్డలు పుట్టిన ఇంటికి ప్రోత్సా హాలు అందిస్తూ వివక్షను రూపుమాపుతున్నారు. అంతే కాకుండా విద్యావకాశాలను భారీగా కల్పిం చారు. ఇందుకోసం ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ప్రత్యేకంగా గురుకులాలను ఏర్పాటు చేసి ఉచితంగా విద్యను అందిస్తు న్నారు. తద్వారా తల్లిదండ్రులకు భారం అన్నది లేకుండా చేస్తున్నారు.పెండ్లీడుకు వచ్చిన ఆడ పిల్లల పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను (రూ.లక్షా 116) అందించి కొం డంత అండగా నిలుస్తున్నారు. మన రాష్ట్రంలో ఆడిపిల్లలకు రక్షణ అన్నది లభిస్తోంది.భారీ డాంబికాలు పలికే బీజేపీ మాత్రం నినాదాలతో ప్రజలను మాయమాట లతో పక్కదారి పట్టిస్తూ నిత్యం మోసంచేస్తోంది.
పురిట్లోనే వదిలించుకుంటున్నారు..
ఆడపిల్ల అని తెలిస్తే పురిట్లోనే వదిలించు కోవడం, బలవంతంగా అబార్షన్లు చేయించు కోవడమే ప్రధానంగా బాలికల జననాల రేటు పడిపోవడానికి కారణం.ఈ పరిస్థితి తండాలు, మారుమూల గ్రామాల్లో ఎక్కువగా ఉంటోంది. ఆడ పిల్లల జనన రేటు పడిపోవడానికి మరో కారణం ఉందన్న అభిప్రాయం ఉంది. అబా ర్షన్లు చేసే దవాఖానలు నిజామాబాద్‌, కామా రెడ్డి జిల్లాలో ఇంకా కొనసాగుతున్నాయని, తరచూ ఆరోపణలు వస్తున్నా వైద్యారోగ్య శాఖ తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఆడ పిల్లల సంఖ్య మరింత దారుణంగా పడిపోయే ప్రమాదం ఉంది.స్కానింగ్‌ కేంద్రాల్లో పెద్ద ఎత్తున లింగ నిర్ధార ణ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నిబంధ నలు పాటించని కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. దవాఖానల్లో కాన్పు జరిగి బిడ్డ పుడితే ఆ వివరాలు పురపాలిక, గ్రామ పంచాయతీ అధికారులకు అందించాలన్న నిబం ధన కొన్ని ప్రాంతాల్లో సరిగ్గా అమలుకావడం లేదు. దీంతో ఆడ శిశువుల విక్రయాలు, పుట్టిన తర్వాత హత మార్చడం లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్న ఆరోపణలున్నాయి. ఎప్పుడైనా ముళ్ల పొదలు,బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌లో ఆడ శిశువులను వదిలి వెళ్తే శిశు గృహకు తరలించి అధికారులు చేతులు దులుపు కొంటున్నారు. శిశువును ఎవరు వదిలి వెళ్లారు. ఎందుకు వదిలి వెళ్లారు. వారికి ఏదవాఖాన సిబ్బంది సహకారం అందించారు?అనే విష యాలపై సమగ్ర విచారణ చేపట్టకపోవడం లోటుపాట్లకు ఊతం ఇస్తోంది.
ఎగరనిద్దాం..ఎదగనిద్దాం..
ప్రపంచ జనాభాలో మూడోవంతు బాలికలే. బాలికల రక్షణ,ఎదుగుదల,ఆరోగ్యం,విద్య, సదు పాయాలన్నింటిలో అత్యంత శ్రద్ధ అవసరం. ఆరోగ్యంగా,సమాజం పట్ల అవగాహన, సమ దృష్టి పరిస్థితులలో ఎదిగినపుడే వారు నేటి సమాజానికి అవసరమైన పౌరులుగా రూపొం దుతారు. ప్రపంచవ్యాప్తంగా చిన్నారుల విషాద కర పరిస్థితులు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. సమాజ అభివృద్ధికి విద్య చాలా కీలకమైనదని విదితమే. కొన్ని అంశాలలో గతంకంటె కొంత పురోభివృద్ధి ఉన్నప్పటికీ నేటి సమాజంలో సరికొత్త సమస్యలు, బాలారిష్టాలు కొనసాగుతున్నాయి. ప్రపంచీకరణ సంస్కర ణలు, నూతన ఆర్థిక విధానాల అమలు వలన బాలికా విద్య సజావుగా జరిగే పరిస్థితులు లేవని చెప్పవచ్చు. గడిచిన రెండేళ్లలో కోవిడ్‌ ప్రభావం ఒకవైపుఉండగా ఈరెండేళ్లలో విద్యారంగ సంస్కరణల పేరుతో క్లష్టరైజేషన్‌ పేరుతో పాఠశాలల మూత కారణంగా బాలికలు విద్యకు దూరం కానున్నారు. భారత్‌వంటి దేశంలో బేటీ బచావో బేటీ పఢావో లక్ష్యం పూర్తిగా నీరు కారుతుంది. బాలికా శిశువులకు రక్షణ కల్పించి వారికి చదువుకోవడానికి అవకాశాలు కల్పిస్తామని చెప్పే ఈ పథకం నూతన విద్యా విధానం-2020 అమలుతో నిర్వీర్యం కానుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 12.9 కోట్ల మంది బాలికలు విద్యకు దూరంగా ఉన్నారని యునిసెఫ్‌ ప్రకటించింది. బాలికల విద్యకు అడ్డంకులను తొలగించే బాధ్యత ఆయా దేశాల ప్రభుత్వాలదేనని ఐక్యరాజ్యసమితి స్పష్టం చేసింది. మీ దేశాలలో అమ్మాయిలను వెనక్కి నెట్టివేసే అంశాలను గురించి మీ చర్యలను, నిబద్ధతను విస్తరించకుండా దేశ అభివృద్ధి సాధ్యం కాదని ఐరాస హెచ్చరించింది. బాలికలకు ఉచిత నిర్బంధ విద్య, విద్యాహక్కు చట్టాలు సంపూర్ణంగా అమలు చేయాలని అడిగే హక్కు బాలికలకు ఉంది. అందుకే చదువు కోసం వీరోచితంగా పోరాడిన మలాలా బాలికల ఆలోచన కావాలి. వివక్ష అనేక రూపాలలో కనిపిస్తుంది. 2030 నాటికి ప్రపంచంలో 15.8 శాతం బాలికలు పేదరికంలోకి చేరుకుంటారని ఐరాస దక్షిణాసియా ప్రాంతాల ప్రభుత్వాలకు ముందుగానే తెలియచేస్తున్నది. ప్రస్తుతం ప్రతి ఐదుగురిలో ఒకరు పేదరికంలో జీవిస్తున్నారు. కరోనా తరువాత పురుషుల కన్నా మహిళల ఉపాధి 19 శాతం అధికంగా ప్రమాదంలో పడిరదని యు.ఎన్‌ విమెన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మాంబో అన్నారు. ఇదే బాలికా విద్యకు విఘాతం కానుంది. నీరు, పరిశుభ్రతలలో కూడా లింగ వివక్షత కొనసాగుతున్నది. సంక్షోభాలు, సంఘర్షణలు బాలికలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజు 33,000 మంది బాలికలకు వివాహాలు జరుగుతున్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి ప్రణాళికలు రూపొం దించుకోవాలని ఐరాస ఆయా దేశాల పాలకులను హెచ్చరిస్తున్నది. భారతదేశంలో పద్దెనిమిదేళ్లు రాకముందే వివాహం అవుతున్న ఆడపిల్లల శాతం జాతీయ స్థాయిలో 1.9 శాతంగా వుందని (కేరళలో బాల్య వివాహాలేవీ జరగలేదని)తాజాగా కేంద్ర హోంశాఖ సర్వేలో వెల్లడైంది. బాల్య వివాహ చట్టాలయితే ఉన్నా యి కాని వాటి అమలులో ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు. రక్షణ కల్పించాల్సిన పాలకులు నేరాలను అదుపు చేయలేక పోతు న్నారు.4.6కోట్ల మంది బాలికలు, మహిళలు మనదేశం నుండి అదృశ్యం అయ్యారని క్రైమ్‌ రికార్స్డు బ్యూరో స్పష్టం చేసింది.41లక్షలమంది బాలికలు 19రకాల హింసలకు బలైనారని యుఎన్‌ఎఫ్‌పిఎ నివేదిక తెలియచేస్తున్నది. శరీర భాగాలపై వ్యాఖ్యల నుండి కన్యత్వ పరీక్షల వరకు అన్నీ మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తాయి. ఈ మధ్యకాలంలో హత్రాస్‌ ఘటన,హిజాబ్‌ ఘటన,బెనారస్‌ యూనివర్సిటి ఘటనలు,ఇరాన్‌లో హిజాబ్‌పై జరుగుతున్న పోరాటాలు, ప్రశ్నిస్తే అణచి వేయడం వంటివి అమ్మాయిల ఆత్మగౌర వాన్ని,జీవితాలను ఏవిధంగా ఛిద్రం చేస్తున్నాయో తెలుపు తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు పదిమందిలో ఒకరు లేదా ఇద్దరు బాలకార్మికులు ప్రమాదకర పనులలో పనిచేస్తున్నారు. ఎక్కువ వేతనం లేని బాల కార్మికులుగా చేస్తున్నారు.5నుండి 14 సంవ త్సరాల మధ్యఉన్న బాలికలు ఎక్కువ సమయం శ్రమిస్తున్నారు. భారత దేశంలో నేటి పాలకుల పుణ్యమా అని బాల కార్మికులలో బాలికల సంఖ్య పెరగనుంది. నూతన విద్యా విధానంలో వృత్తి విద్యా కోర్సులను చిన్న తరగతులలో ప్రవేశ పెట్టడంతో ఉన్నత చదువులు చదువుకునే అవకాశం లేకుండా పోతున్నది. బాలికలను వెట్టిచాకిరీ నుండి విముక్తి చేయాలనే చట్టాలను విస్మరిస్తున్నాయి. మీకు చదువు అవసరం లేదు. పనిలోకి వెళ్లండి. డబ్బులు సంపాదించండి…అని చెప్పడమంటే ఆర్థిక సంస్కరణల అమలు ఎంత ప్రమాద కరంగా ఉందో అర్ధం అవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా అధిక దేశాలలో విద్యకు, వైద్యానికి, సంక్షేమానికి నిధులు పూర్తిగా తగ్గించడం. లాభాపేక్ష, వ్యాపారాలకు మాత్రమే ప్రోత్స హించడం. ప్రపంచీకరణ, సరళీకరణ విధా నాలు బాలికల సమస్యలకు, సంక్షోభాలకు కారణాలుగా ఉన్నాయి. అటువంటి విధానా లకు వ్యతిరేకంగా బాలికలు,మహిళలను చైతన్యవంతులను చేయాలి. బాలికలు, మహిళలవ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి. చిన్నారుల సంక్షేమంలో మనదేశంలో కేరళ ప్రథమ స్థానంలో ఉంది.చిన్నారుల మనుగడ, పోషకాహారం,తాగునీరు,శానిటేషన్‌, విద్య,ఆరోగ్యం వంటి అంశాలలో 24 సూచికలతో నిర్వహించిన సర్వేలో కేరళ నెంబర్‌1గా ఉంది. ఈస్ఫూర్తితో ఇతర రాష్ట్రాలు, దేశాలు పని చెయ్యవచ్చు.కానీ అవి సామాజిక బాధ్యతను విస్మరిస్తున్నాయి.చివరికి ఆడపిల్లలు వాడుకునే శానిటరీ నాప్కిన్లను కూడా పూర్తి స్థాయిలో సరఫరా చేయలేక పోతున్నాయి. నాప్కిన్లపై జిఎస్టీలను వేయడంతో వారికి అవి మరింత భారం అవుతున్నాయి. సాధికారిత పొందిన బాలికలు సాధికారిత పొందిన మహిళలుగా ఎదుగుతారు. అందుకే వారిహక్కులు,విద్య,ఆరోగ్యం యొక్క సమా నత్వాన్ని డిమాండ్‌ చేయడానికి అవ సరమైన వేదికలను నిర్మించాలి. వారిని బల పరుస్తూ సమానత్వ సాధనకు ఉద్యమిద్దాం-వ్యాసకర్త : యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు- (కె.విజయగౌరి)

విజయం కోసం ప్రణాళిక అవసరం

జీవితంలో విజయం కోసం దైర్యం కోల్పోకుండా పోరాడాల్సిందే..జీవితంలో భారీ విజయం సాధించడానికి ఈఒక్క చిన్న మాట కూడా పెద్ద సాయం అవుతుంది. ధైర్యం ఉంటే ప్రతి కష్టమూ తేలిక వుతుంది. జీవితంలో గొప్ప విజయాల చరిత్రను లిఖించి న వారందరిలో ధైర్యం పెద్ద పాత్ర పోషించింది. జీవితం అనేది ఒక పోరాటం.. జీవిం చడం కోసం.. విజయం సాధించడం కోసం ప్రతి క్షణం పోరాడాలి. ఎన్ని కష్టాలు వచ్చినా వెనుకడు వేయకుండా పోరాడాలి.. జీవించడా నికి ప్రతి క్షణం ధైర్యంగా ముందడుగు వేయాలి. కర్మ మార్గంలో నడుస్తున్నప్పుడు..కొన్నిసార్లు ప్రయాణం తేలికగా సాగుతుంది. కొన్నిసార్లు సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మంచి సమయం కోసం వేచి చూడాల్సి ఉంటుంది. అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి కోలుకోవడానికి,మీ ధైర్యం లేదా సాహసం ఉపయోగ పడుతుంది.ధైర్యం అనేది ఒక పదం, అది విన్నప్పుడు, వ్యక్తిలో ఉత్సాహం మొదలవు తుంది.ఒక వ్యక్తి జీవితంలో భారీ విజయం సాధించడానికి ఈ ఒక్క చిన్న మాట కూడా పెద్ద సాయం అవుతుంది. ధైర్యం ఉంటే ప్రతి కష్ట మూ తేలికవు తుంది. జీవితంలో గొప్ప విజయాల చరిత్రను లిఖించిన వారందరిలో ధైర్యం పెద్ద పాత్ర పోషించింది. ఒక వ్యక్తి ఎప్పుడూ యుద్ధంలో ఓడిపోని ధైర్యానికి సంబంధించిన 5 అమూల్యమైన పాఠాల గురించి తెలుసుకుందాం..!– (డాక్టర్‌.దేవులపల్లి పద్మజ)
జీవితంలో ఏవ్యక్తికైనా ధైర్యం అంటే ముందుకు వెళ్లడానికి ఒక శక్తి..ఎవరైనా సరే శక్తి లేకపోయినా పరిస్థితులను చక్క బెట్టుకుంటూ ముందుకు సాగడాన్నే ధైర్యం అంటారు. జీవితంలో ఎటువంటి సందర్భంలోనైనా ఎటువంటి పరిస్థి తుల్లో నైనా ఎవరు చెప్పిన మాటలను వినడానికి ఎంత ధైర్యం అవసరమో..వాటిని అంగీకరించ డానికి అంతే ధైర్యంకావాలి.జీవితంలో అన్నీ కోల్పో యిన తర్వాత కూడా..మీరు ఇంకా ఏదైనా చేయ గల శక్తినిచ్చేది దైర్యంకలిగి ఉన్నవారికి మాత్రమే.. ధైర్యం కలిగి ఉన్నవారు..తాము జీవితం లో కోల్పో యింది ఏమీ లేదని..ముందు తాము తప్పని సరిగా ఏదోసాధిస్తామని ఖచ్చితంగా ఊహించుకుంటూ ముందుకు సాగుతారు. సగానికి పైగా ప్రజలు జీవితంలో ఏదొక సందర్భంలో విఫలమవు తారు. ఎందుకంటే సరైన సమయంలో ధైర్యాన్ని కోల్పో తారు. భయంతో వెనక్కి అడుగు వేస్తారు.మీరు ఏదైనా చేయగలరని మీకు నమ్మకంకలిగి ఉంటే.. ఆక్షణంలో మీరు సగం విజయాన్ని సొంతం చేసు కున్నట్లే..
లక్ష్యసాధన కోసం సరైన ప్రణాళిక అవసరం
ఇంతకు ముందు మనము చాలా సార్లు చెప్పుకున్న విషయమే అయినా సందర్భం మరియు ప్రస్తుతం ట్రెండ్‌ ని బట్టి చెప్పాల్సి వస్తోంది. మనిషి అన్నాక అదో ఒక లక్ష్యం తోనే బ్రతుకు సాగిస్తాడు. మన ఆకాంక్ష లేదా ద్యేయమే లక్ష్యం అని అనవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కో లక్ష్యం ఉంటుంది. మరి కొందరు బహుళ లక్ష్యాలను కలిగి ఉంటారు. కోరుకున్న లేదా ఎంచుకున్న ఫలితాన్ని చేరుకోవడానికి, సొం తం చేసుకోవడానికి ఒక ప్రణాళికను తయారు చేసుకొని ఒక క్రమ పద్ధతి ప్రకారం అభివృద్ధిని సాధిస్తూ లక్ష్యం లోని చివరి స్థానానికి చేరుకోవ డానికి విజయం పొందటానికి ప్రతి ఒక్కరు ప్రయ త్నిస్తారు. అయితే అందరూ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోవచ్చు. వ్యక్తి నిర్ణీత సమయానికి తమ లక్ష్యాన్ని చేదించనంత మాత్రాన వారికి దృఢ నిశ్చ యం లేదని వారిలో పట్టుదల తక్కువ అంచనా వేయకూడదు. అలాగే ఆ వ్యక్తి కూడా తన సామర్ధ్యం గురించి తక్కువగా ఆలోచించకూడదు.. ఈ సారి అందలేదు అంటే అందుకు గల కారణాలను అర్దం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇలాంటి విష యంలో చరిత్రలో జరిగిన ఒక సంఘటన గుర్తించు కోవాలి. గజనీ మహమ్మద్‌ 18సార్లు దండెత్తి చివరికి విజయాన్ని సాధించాడు. ఇక్కడ ఆ 17 సార్లలో ఒకసారైనా తనవల్ల ఇకకాదు అని విసుగు చెంది నిరాశ పడిఉంటే విజయం దక్కేదా…ఎన్ని సార్లు ఓడిపోయినా చివరికి దక్కే విజయం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది..నలుగురిలో మిమ్మల్ని గొప్పగా నిలబడుతుంది. అందుకే ధ్యేయం యొక్క ఉద్దేశం ఎపుడు స్థిరంగా ఉండాలి చివరి వరకు ప్రయత్నించాలి. ప్రయాణించే మార్గంలో అనుకూల తలతో పాటుగా ప్రతి చర్యలు కూడా ఎదురవు తాయి. కానీ అన్నిటినీ అధిగమించాలి. నిబద్దతతో ముందుకు సాగితే విజయం మిమ్మల్ని వరిస్తుంది. అంతే కానీ ఏ ప్రణాళిక అందుకు తగిన ప్రయత్నం లేకపోతే ఎందులోనూ విజయాన్ని సాధించలేరు ప్రతి వ్యక్తి తాను తలపెట్టే పని విజయ వంతం కావాలనే సంకల్పం చేసుకుని మొదలు పెడతాడు. కానీ విజయం అనేది అంగట్లో లభించే వస్తువు కాదు.విజయం వెనుక,శ్రమ,కృషి, పట్టు దల,ఓర్పు అంతిమంగా అదృష్టం కలిస్తే..విజయం సాధించగలం.ఎంతో శ్రమకోర్చి మానసిక దృఢ త్వంతో ప్రతీ అడుగు పధ్ధతి ప్రకారం వేస్తే విజయం తనంతట తానుగా వర్తిస్తుంది. అపజయాలకి భయ పడకుండా,కృంగిపోకుండా విజయసాధన మార్గా లు అన్వేషించాలి.ఈ గమనంలో అపజయాలు కలిగిన నిరుత్సాహపడకుండా మరల మరల ప్రయ త్నించాలి…ముందు మనం చేసే పనిపై అవ గాహనఉండాలి.లక్ష్యం సరైనదై ఉండాలి. ప్రణాళిక ప్రకారం సాగుతూ ఎదురయ్యే సవాళ్ళను కూడా అంచనా వేసుకోవాలి.సంకల్పబలం పెంచు కోవాలి.విజయం ఎపుడూ ఎవరికీ శాశ్వతం కాదు, తమవద్దే నిక్షిప్తమైపోవడానికి స్థిరమైనదీ కాదు.. మహాభారత యుద్ధంలో అర్జునుడు ధనుర్భాలను జారవిడచి వెనుకంజ వేసినపుడు శ్రీ కృష్ణుడు గీతా బోధన చేసి ధైర్యం కలిగించి యుధ్ధంలో విజయం సంప్రాప్తించేలా చేసిన విషయం మనం తెలుసు కున్నాం. ఆ సమయంలో మార్గనిర్దేశం చేసి అర్జును నకు విజయమార్గం చూపాడు.భర్తృహరి సుభాషితం ఈ విషయంలో మనకి మస్తిష్కంలో మెదలాలి.
ప్రారభ్యతే న ఖలు విఘ్నభయేన నీచైః
ప్రారభ్య విఘ్న విహితా విరమన్తి మధ్యాః
విఘ్నైర్ముహుర్ముహు రపి ప్రతిహన్యమానాః
ప్రారబ్ధ ముత్తమగుణా న పరిత్యజన్తి.
అనుమతులు విఘ్నములు సంభవించిన కార్యము నారంభింపరు.మధ్యములు ఆరంభించి విఘ్నములు వచ్చినపుడు విడిచివేయుదురు.ధీరులెన్ని విఘ్న ములు ఎదురైనప్పటికి విజయము చేపట్టు వరకూ కార్యమును విడువదు. మనము కూడా ఇదే విధ ముగా ఉత్తమ గుణసంపన్నులను అనుసరిం చవ లెను.ఇదే విధంగా అమృతభాండమునకు క్షీరసాగర మధనము జరుగు సందర్భంలో దేవతలు ముం దుగా వచ్చిన అశ్వము,గజము వంటి వాటికి విసుగు చెందలేదు. తరువాత వచ్చిన రత్న లాభము లకు తృప్తి చెంది విరమించలేదు.తుదకు అమృత భాండము లభించువరకూ వస్తున్న చంద్రుడు, రంభ,ఊర్వశి,మేనక,కామధేనువు,కల్పవృక్షం, పారిజాత వృక్షం,కౌస్తుభమణి, శంఖుచక్రాలు, మొద లైన అపురూపమైన వాటితో సంతృప్తి పడి లక్ష్యం మార్చుకోలేదు.. అమృతం లభించువరకూ కృషిచేసి విజయం చేపట్టారు. న్యాయమార్గం వీడక, సత్బుధ్ధితో ఎవరైతే గమనం సాగిస్తారో వారికి విజయము తద్యము.
ఇదేవిధంగా మరొక ఉదాహరణగా శ్రీరామచంద్రుడు సీతమ్మ వారిని తిరిగి పొంద టానికి పడిన కష్టాలు, హనుమంతుడు సీతమ్మ ఆచూకీ కనుగొనుటకు చేసిన కృషి, శ్రమ, వానరులు వారధి బంధన చేయుటలో పడిన భక్తి పూర్వక సేవ,వారి పరిశ్రమ అంతిమంగా విజయానికి దగ్గర చేసింది.ధర్మమార్గమును వీడక పాండవులు వన వాస కాలములోనూ, అ్ఞతవాస కాలంలోను పడిన కష్టం వెనుక వారికి విజయలక్ష్మి ధరించిన విషయం మనం గమనించవచ్చు. ధర్మ పోరాటానికి జయభేరి మ్రోగుతుంది.విద్యార్థులు చదువు విషయంలో వారు నిర్దేశించుకున్న లక్ష్యంకొరకు నిరంతరం ప్రయత్నం చేస్తూ గమ్యం చేరుకోవాలి. ఫలితాలపై ఆకస్మిక నిర్ణయాలు జీవితానికి భంగం కాకూడదు.. సహనముతో సమన్వయం తో జీవితాన్ని చక్కదిద్దు కోవాలి. మనకు స్వాతంత్య్రం అందించిన మహాత్ము డు పడిన,శ్రమ,ఉద్యమస్ఫూర్తి,మరువరానిది. క్రియాశీల కార్యక్రమాలతో,భారతీయులందరినీ ఐక్య మత్యంతో కలిపి ఒక త్రాటిపైకి తెచ్చి,కర్మ సిద్ధాం తాన్ని,ఆచరించడం వలన విజయం సాధించింది. నీతి నియమాలు ఆచరిస్తున్నంత కాలము, ధర్మ మార్గమును,వీడనంతవరకూ అపజయాలకు వెరపు చెందవలసిన పనిలేదు.నీతిపై ఆధారపడినపుడే జీవితంలో అభివృద్ధి గోచరిస్తుంది.నరికివేసిన వృక్షం మరల చిగురిస్తుంది. క్షీణతనొందిన చంద్రు డు తిరిగి ఎదిగి ఎదిగి సంపూర్ణ వెన్నెలను మనకు వెదజల్లుతున్నాడు. ధృడత కలిగిన వ్యక్తికి మేరు పర్వతం చిన్న రాతివలె,సింహము జింకవలె, అగ్ని జలమువలె, విషము అమృతం వలె గోచరి స్తుంది. గురితప్పని ఏకాగ్రత లక్ష్యాన్ని చేధిస్తుంది. కష్టమైన పనికూడా ఇష్టంతో చేస్తే నమ్మకం పెరుగుతుంది. అపనమ్మకం,అయిష్టతతో పనులు ప్రారంభించే కంటే చేయకపోవడం ఉత్తమం. విజ్ఞానం, వివేకం తో ధర్మ వృక్షాన్ని రెండు చేతులారా కాపాడినట్లైతే విజయం వరిస్తుంది అని అంటాడు శ్రీకృష్ణుడు అర్జనునితో.అది మనకు,మన భావితరాలకు ఆచరించమనే హెచ్చరిక.మనం ధైర్యంతో,విశ్వా సంతో,నియమ,నిబద్ధతతో ధర్మసమ్మతంగా,జీవనం సాగించి,చైతన్య వంతమైన విజయాలు చేసుకుం దాం.‘సాధనమున పనులు సమకూరు ధరలోన’అను వేమన పలుకులు స్మరిద్దాం.ప్రపంచవ్యాప్తంగా స్వాస్థ్యసంక్షోభం నుంచి త్వరలో..కోరుకుని సుసం పన్నమైన విశ్వశాంతిని పొందగలము. నిరంతర పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలకు విజయం లభించి, త్వరలో నేటి సమాజానికి అవసరమైన ఔషధం ఆవిష్కరింపబడాలని కోరుకుందాము. అదే నిస్వార్థమైన సేవ. జయిభవ..విజయీభవ.- , వ్యాసకర్త : ప్రముఖ రచయిత్రి,విశ్వశ్రీ, సాహిత్యశ్రీ విశాఖపట్టణం
ఫోను. 9849692414

పేదల జీవితాలు ఇంతేనా..?

ఆత్మహత్యలన్నీ హత్యలే, కాకపోతే.. వీటిలో నిందితులెవరో అప్పటికప్పుడు తెలియదు, వెతికి పట్టడం అంత తేలిక కాదు. స్థూలంగా సమాజమే ముద్దాయి’ అంటాడో సామాజిక వేత్త! ఇదెంత పచ్చి నిజం! వ్యక్తులు, దంపతులు, కుటుంబాలు.. ఇలా లెక్కలేనంత మంది రోజూ ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఎవరికీ పట్టడం లేదు. ప్రభుత్వాలకు చీమ కుట్టినట్టు కూడా లేదు. చచ్చేంత దయనీయ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న దీనుల్ని ఆదుకునే వ్యవస్థలే లేవు. ఉన్న వ్యవస్థల్ని కూడా పాలకులు విధ్వంసం చేస్తుంటే దాదాపు అన్ని వయసుల వారూ దిక్కులేని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎందుకీ దురవస్థ? అని ఎవరూ ప్రశ్నించడం లేదు. దీని వెనుక బలమైన కారణాలేమై ఉంటాయి? ఓ శాస్త్రీయ పరిశీలన లేదు. లోతైన అధ్యయనమూ లేదు. సర్కార్లకు సమస్య పరిష్కరించే చిత్తశుద్ధి లేదు.
డెబ్బై అయిదు సంవత్సరాల స్వాతంత్య్రం తరువాత…మన దేశంలోని ఇతర ఏ రంగం కన్నా కూడా…వ్యవసాయ రంగం ఎక్కువ సంక్షోభంలో ఉంది. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో లెక్కల ప్రకారం ఈ పాతిక్ఱేళ్లలో (1995-2020) రైతులు, వ్యవసాయ కూలీలు నాలుగు లక్షల మందికిపైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరిలో గత ఎనిమిదేళ్లలో మోడీ పాలన లోనే ఒక లక్ష మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. దళితులు, ముస్లింలలో భూమిలేని కుటుం బాల సంఖ్య 60శాతం. ఆదివాసీలు సాధా రణంగా భూమి కలిగినవారై ఉంటారు. కానీ గత 30 ఏళ్లలో భూములు గుంజుకోవడం వల్ల భూమి లేని ఆదివాసీల సంఖ్య పది శాతం పెరిగింది. ఎన్‌ఎప ˜్‌హెచ్‌ఎస్‌ వివ రాల ప్రకారం దేశంలోని భూమిలో 20 శాతం భూమి 75 ఎకరాల పైబడి ఉన్న కుటుంబాల చేతిలోనే ఉంది. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం లెక్కల ప్రకారం చట్టంలో పేర్కొన్న దానికి విరుద్ధంగా 100 రోజుల బదులు వ్యవసాయ కార్మికులకు 2021-22 ఆర్థిక సంవత్సరంలో 49 రోజులే పని దొరికింది. జూన్‌ 2022లో గ్రామీణ ఉపాధి 80 లక్షల మందికి పోయిందని సీఎం ఐఈ లెక్క తేల్చింది. మొత్తం గ్రామీణ నిరు ద్యోగం రేటు ఎనిమిది శాతం పెరగటం ఆందోళనకరం. పిరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే వివరాల ప్రకారం 2018-19లో 21-59 ఏళ్ల వయసు వారిలో 10శాతం గ్రామీణ పురుషులు, 72 శాతం గ్రామీణ మహిళలు ఏ ఉపాధి లేకుండా ఉన్నారు. ఇది కోవిడ్‌ ముందు స్థితి, ఆతర్వాత పరిస్థితి ఇంకా దిగజారింది. ఆకలి వల్ల, పోషకాహార లేమి వల్ల లక్షల్లో చనిపోతున్న గిరిజన బిడ్డల సంగతి వర్ణనాతీతం. 2021లో ప్రపంచ ఆకలి సూచీలో మన దేశం 116 దేశాల్లోనూ 101వ స్థానానికి చేరింది. భారతదేశ వ్యవసాయ సంక్షోభానికి ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. స్వాతంత్య్రానంతరం వరుస కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అవలంభించిన వ్యవసాయ విధాన లక్ష్యం, అర్ధ ఫ్యూడల్‌ భూస్వాములను పెట్టుబడిదారీ భూస్వాములుగా మార్చి ధనిక రైతాంగాన్ని సృష్టించడం. ఇది రైతాంగంలో వర్గ విభజనను తీవ్రం చేసింది. 1950లో బి.సి.మహల్‌ నోబిస్‌ అంచనా ప్రకారం దేశంలో పున:పంపిణీకి 6 కోట్ల 30 లక్షల ఎకరాల భూమి అందుబాటులో ఉండాలి. కానీ, దీనిలో ఒక్క గుంట భూమి కూడా పేద రైతులకు పంచింది లేదు. దేశంలోని భూకేంద్రీకరణలో ఏ మార్పు లేకపోగా ఇటీవల కాలంలో మరింత పెరిగింది.
మొదటి దశలో వ్యవసాయ విస్తరణకు, విద్యుత్‌కు, శాస్త్ర సాంకేతిక రంగాలకు, ధాన్యం నిల్వ చేసుకునేందుకు ప్రభుత్వం పెట్టుబడులు ఇతోధికంగా ఉండేవి. కనీస మద్దతు ధర ద్వారా ఉత్పత్తిదారులకు ప్రభుత్వం సహకరించేది. కొన్ని పంటలను సేకరించడం ద్వారా కూడా ఈ సహకారం ఉండేది. ప్రజా పంపిణీ వ్యవస్థకు కూడా ప్రభుత్వ సబ్సిడీలు ఉండేవి. బ్యాంకుల జాతీయీకరణ తర్వాత రైతాంగానికి విస్తారంగా పరపతి సౌకర్యం కల్పించబడిరది. దేశీయ మార్కెట్‌ రక్షణకై వ్యవసాయ పనిముట్ల దిగుమతిపై అనేక ఆంక్షలు పెట్టబడ్డాయి. శాస్త్ర సాంకేతిక రంగా ల్లో అధిక పెట్టుబడి వల్ల మంచి దిగుబడి నిచ్చే వంగడాలు సృష్టించబడ్డాయి. ఇదంతా హరిత విప్లవానికి దారితీసింది. ఉత్పత్తి, ఉత్పాదకత మెరుగై ఆహార ధాన్యాల ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ధి సాధించింది. అయితే ఇది రెండు రకాల అసమానతలకు దారి తీసింది. మొదటిది ప్రాంతాల మధ్య, రెండోది రైతాం గంలో అసమానత. అయినప్పటికీ 1990 వరకు వ్యవసాయ రంగంలో కొంత పురోభివృద్ధి సాధ్యమైంది. 1991లో కాంగ్రెస్‌ ప్రారంభించిన నయా ఉదారవాద విధానాలు 2014లో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత ఉధృ తంగా కొనసాగుతున్నాయి. సామ్రాజ్యవాద వత్తిడితో ఆ విధానాలు అభివృద్ధి నిరోధకంగా మారాయి. ఈ దశలో ఆర్థిక లావాదేవీల నిర్వహణలో రాజ్యం తన పాత్ర ఉపసం హరించుకుంది. పూర్తి స్థాయిలో పెట్టుబడిదార్ల వత్తిడికి తలొగ్గింది. 1995లో హిస్సార్‌లో జరిగిన ఎఐకెఎస్‌ జాతీయ మహాసభ ఈ విధా నాలను విశ్లేషించి కింది హెచ్చరికలు చేసింది. కేంద్ర ప్రభుత్వం అనుసరించే ఈ విధానాలు రైతాంగంపై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపిస్తాయి. ఇవి పేద, మధ్యతరగతి రైతాంగాన్ని మరింత నిరుపేదలుగా మారుస్తాయి. పట్టణ, గ్రామీణ నిరుద్యోగం ఎన్నడూ చూడనంతగా పెరిగి పోతున్నది. ఇతర ఎన్నో రైతు సంఘాలు ఈ వ్యవసాయ విధానాలను పొగడ్తలతో ముంచెత్తుంతుండగా ఎఐకెఎస్‌ నయా ఉదార వాద విధానాలను విశ్లేషించగలగడం ప్రత్యేకత. ఎఐకెఎస్‌ హిస్సార్‌ మహాసభ హెచ్చరికలు 30 ఏళ్ల తర్వాత ఏ విధంగా నిజమైనాయో ఇప్పుడు చూస్తున్నాం.
నూతన ఆర్థిక విధానాలు
భూ సంస్కరణలను తిరగదోడటం, భూ పరి మితి చట్టాలను నీరుగార్చటంతో పెద్ద పెద్ద భూఖండాలను భారతదేశపు బడా వ్యాపార వేత్తలకు, విదేశీ బహుళ జాతి కంపెనీలకు అమ్మటానికి లేక లీజుకివ్వటానికి అవకాశమేర్ప డిరది. దున్నేవాడికే భూమి అనే నినాదం స్థానంలో కార్పొరేట్లకే భూమి అనే నినాదం వచ్చింది. విత్తనాలు, ఎరువులు, నీటి పారుదల సౌకర్యాలు, విద్యుత్తు, ఇంకా ఇతర వ్యవసాయిక అవసరాల మీద ప్రభుత్వ సబ్సిడీలకు కోత పెట్టటంతో వ్యవసాయ సాధనాల మీద ఖర్చు విపరీతంగా పెరిగింది. ఆ ఫలితంగా ఉత్పత్తి ఖర్చులు భారీగా పెరిగాయి. వ్యవసాయ దిగుమతుల పరిమితి మీదవున్న ఆంక్షలు తొలగించటం, దిగుమతులపై పన్నులు తగ్గించటంతో సబ్సిడీ కలిగిన విదేశీ వ్యవసాయ సరుకులు వరదలాగా దేశంలోకి వచ్చిపడ్డాయి. దానితో దేశీయ వ్యవసాయ ఉత్పత్తుల ధరలు కుప్పకూలాయి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్‌టీఏఎస్‌) వల్ల కలిగిన దుష్ప్రభావాలు సైతం ఇటువంటివే. వ్యవసాయం, ఇరిగేషన్‌, విద్యుత్తు, గ్రామీణాభివృద్ధి, సైన్స్‌ అండ్‌ టెక్నా లజీ, రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌, ఇంకా ఇతర మౌలిక సదుపాయాలమీద ప్రభుత్వం పెట్టే పెట్టుబడులలో భారీగా కోత పెట్టారు. ఆయువుపట్టు లాంటి విద్యుత్తు, నీటి పారుదల సౌకర్యాల ప్రయివేటీకరణతో ఈ రెండిరటికి పెట్టాల్సిన ఖర్చు బాగా పెరిగింది. అంతేగాక, నీటి మీద గుత్తాధిపత్యాలు ఏర్పడ్డాయి సంస్థా గత రుణాలలో అతి పెద్ద భాగం కార్పొరేట్లకు మళ్ళించే విధాన నిర్ణయం మూలంగా రైతులకు, వ్యవసాయ కార్మికులకు అందుబాటులో ఉన్న రుణాలలో భారీ కోత పడ్డది. దానితో రైతాం గం అధిక వడ్డీలు వసూలు చేసే ప్రయివేట్‌ వడ్డీ వ్యాపారుల మీద ఎక్కువగా ఆధారపడాల్సి వచ్చింది. ఆహార సబ్సిడీలలో విపరీతంగా కోత విధించి, గతంలో ఉన్న సార్వత్రిక ప్రజా పంపిణీకి బదులు లక్షిత ప్రజాపంపిణీ విధానాన్ని ప్రారంభించటంతో పేద ప్రజల ఆహార భద్రత ప్రమాదంలో పడ్డది. కనీస మద్దతు ధర యంత్రాంగంలో,పంటల సేకరణ వ్యవస్థలలో దేశీయ మార్కెట్టులో జోక్యం చేసు కునే చర్యలనుండి ప్రభుత్వం తప్పుకున్నది. ఎగుమతి ఆధారిత వ్యవసాయం వైపునకు, ఆహార పంటల స్థానంలో వాణిజ్య పంటలు వైపుకు సాగును మళ్ళించటానికి ఒక విధానప రమైన ఒత్తిడి జరుగుతున్నది. సాగు నిర్వహణ లో యాంత్రీకరణ పెరుగుతున్నది. దీనితో వ్యవసాయ కార్మికుల ఉపాధి, నిజ వేతనాలు తగ్గుముఖం పట్టాయి.- (దిలీప్‌ రెడ్డి)

హరి వెంకట్‌కి అరుదైన అవకాశం

తిండికి కరువై…చదువుకు దూరమై…ఆడుతూ పాడుతూ గడపాల్సిన బాల్యం ఇలా మొగ్గలోనే వాడిపోతే ఎలా?ఈఆలోచనతోనే గమ్యం తెలియని వీధి బాలల కోసం‘ధరణి’ పేరుతో ఓ స్వచ్చంధ సంస్థను ఏర్పాటు చేసి…వారికి ప్రాథమిక విద్యే కాదు…జీవిత పాఠాలనూ నేర్పిస్తున్న హరివెంకట్‌ రమణ ప్రయాణం ఇది…
విద్య, విజ్ఞానం… రేపటి తరానికి బంగారు భవిష్యత్తును అందించాలంటే ఇవి మాత్రమే సరిపోవు. ప్రాథమిక విద్యను అందిస్తూనే… నైపుణ్య శిక్షణ కూడా ఇవ్వాలి. మానవ విలువలు నేర్పించాలి. అప్పుడే వారు జీవితంలో స్థిరపడగలుగుతారు. మనమైతే సరే… మరి వీధిబాలల పరిస్థితి ఏమిటి? ఇలాంటి చదువు ఎవరు చెబుతారు? ఆ బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారు హరి వెంకట్‌. ఇందులో ఎన్నో వ్యయప్రయాసలు, ఇబ్బం దులు ఉంటాయి. వద్దని వెనక్కి లాగినవారూ ఉన్నారు. కానీ అవేవీ పట్టించు కోకుండా ఆమె అడుగు ముందుకు వేశారు. తన నెలకొల్పిన సంస్థ ద్వారా మానవ అక్రమ రవాణా, విశాఖలోని వీధి బాలలు, బస్తీలు, అట్టడుగు వర్గాల పిల్లల కు నాణ్యమైన చదువు చెప్పిస్తున్నారు. తన కళాత్మక సృజనతో కార్టూన్లు ద్వారా అవగాహన ప్రచార మాధ్యమాలు ద్వారా,వ్యాసాలు రాస్తూ చైతన్య పరు స్తున్నారు. మనుషుల అక్రమరవాణా అన్నది భారత దేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది వ్యక్తులను ప్రభావితం చేస్తున్న ఒకనేరం. ఒకసారి రవాణా బారిన పడిన తరువాత బాధితులు బలవంతంగా వ్యభిచారం, వెట్టిచాకిరీ, భిక్షాటన, పళ్లి,మత్తు పదార్ధాల చేరవేత, పిల్ల లను ఉపయో గించి చేసే లైంగిక చిత్రాల వంటి మరెన్నో దారుణ చర్యలకు గురవుతున్నారు. మన దేశంలో మను షూల అక్రమ రవాణాను నియంత్రించే చట్టాలు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి. ఇవి భారత శిక్షాస్మృతి (ఐపిసి), 1860లోని 370-370ఎ విభాగాలు మనుషూల అక్రమ రవాణాను నిర్వచించి శిక్షారం చేస్తున్నాయి. సెక్షన్‌ 371,ఐపిసి బానిస వ్యాపారాన్ని నేరంగా పరిగణిస్తుంది బీ సెక్షన్‌ 372-373 ఐపిసి ప్రకారం వ్యభిచారం కోసం బాలికల అమ్మకాలు, కొనుగోళ్లను నిర్వహించడం నేరంబీ అనైతిక రవాణా (నియంత్రణ) చట్టం, 1956 ప్రకారం వ్యభిచారాన్ని నేరంగా పరిగణిస్తూ బాధితులను రక్షిం చడం, పునరావాసంతోపాటు వారి నైతిక ప్రవర్తనను సరిదిద్దడం గురించి చెబుతుంది. ఈ అంశాలపై పని చేస్తున్న హరికి అరుదైన అవకాశం దక్కింది. ఇంటర్నేషనల్‌ విజిటర్‌ లీడర్షిప్‌ ప్రోగ్రామ్‌కి రావాలని,‘‘లింగ ఆధారిత హింస-మానవ అక్రమ రవాణా‘‘అంశంపైఈ పర్యటన ఉంటుందని ఆహ్వా నం అమెరికన్‌ ప్రభుత్వం నుంచి ఆహ్వానం వచ్చింది. అక్కడ లింగ ఆధారిత హింస,మానవ అక్రమ రవాణా అంశాలపై పనిచేస్తున్న కొన్ని సంస్థలు కలసి మానవ అక్రమ రవాణా అరికట్టాడానికి వ్యూహాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలుపై చర్చించారు. ఈనేపథ్యంలో అక్కడ చర్చించిన అంశాలు, అధ్యయన యాత్ర అనుభవాలను ఆయన కలం నుంచి జాలు వారిన వ్యాసమే ఇది..!
అమెరికా వెళ్లాలని చాలామందికిఉంటుంది. నేను నాహైస్కూల్‌,కాలేజిరోజులలో విద్యా ర్థి సంఘంలో పనిచేసాను.ఆ ప్రభావమో,సాహిత్య ప్రభా వమో వెళ్లాలని ఎప్పుడూ అనుకోలేదు. పెట్టు బడిదారీ,బూర్జువాలాంటి పదాలువల్లెవేసిన వారి పిల్లలంతా అక్కడే ఉండటం, నాతోపాటు హైదరా బాద్‌ రూమ్‌ లోవున్న మాకజిన్స్‌ అమెరికా వెళ్ళాక అయిపూ, అజాలేక పోవడంవలన అమెరికా నాకెప్పు డూఒక ఆశ్చర్యం. డిగ్రీ తరువాత ఒకటి రెండుచిన్న ఉద్యోగాలు చేసి హైద రాబాద్‌లో యాని మేషన్‌ రంగంలో పనిచేసే వాడిని, అయితే సాహిత్యం సామజిక రంగంపై మక్కువతో 2006 సంవత్సరంలో ధరణి స్వచ్ఛంధ సంస్థను స్థాపించి నెహ్రూ యువ కేంద్ర సంఘటన్‌తో కలిసి గ్రామాలలో యువజన సంఘాలు ఏర్పాటు చేయడం, గ్రామీణ గ్రంధాలయాలు, యువతకు కెరీర్‌ గైడన్స్‌ అంశాలపై పనిచేశాను.
వీధి బాలలు,బాలకార్మికులను గుర్తించి వారిని ప్రభుత్వ బడులకు పంపడం. బాల్య వివా హాల అనర్ధాలపై ప్రచారం, బాలికల విద్య ఆవశ్య కత,గుడ్‌ టచ్‌ బాడ్‌ టచ్‌ అంశాలపై ప్రభుత్వ పాఠశాలలు,హాస్టళ్లు,అంగన్వాడీల్లో తల్లులకు పవర్‌ పాయింట్‌ ప్రెసెంటేషన్‌ ద్వారా అవగాహన కల్పిం చి ఒక ఉద్యమంలాగ దీనిని కొనసాగించాను. దాదాపు వేలాది మందికి ఈవిషయం చేరవేసే ప్రయత్నం చేసాను.పిల్లలతో, కమ్యూనిటీతో బాల్య వివాహాలనిషేధం,పిల్లలపైలైంగిక వేధింపుల నిరో ధం,బాలల భద్రత వంటి అంశాలపై గోడ పెయిం టింగ్‌లు వేయించాను.బాలికలు అక్రమ రవాణాకు గురికాకుండాపట్టణ మురికివాడలలో, పాఠశాల లలో,కళాశాలల్లో చాలా కాలం నుంచి మానవ అక్రమ రవాణా నిరోధానికి కౌమారులు తీసుకో వలసిన జాగ్రత్తలు వివరిస్తూవొచ్చాను, ఈ అంశం పై యానిమేషన్‌, పోస్టర్లు,పిల్లలకు అర్ధం కావడానికి పోస్టర్లు, పత్రికలలో వ్యాసాలు రాసేను. ఒకానొక రోజు ఇంటర్నేషనల్‌ విజిటర్‌ లీడర్షిప్‌ ప్రోగ్రామ్‌కి రావాలని,‘‘లింగ ఆధారిత హింస-మానవ అక్రమ రవాణా‘‘అంశంపైఈ పర్యటన ఉంటుందని ఆహ్వా నం అమెరికన్‌ ప్రభుత్వం నుంచివొచ్చింది. ఇంకే ముంది యెగిరి గంతేసి ప్రయాణ ఏర్పాట్లు చేసుకు న్నాను. ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్‌3వ తారీఖు వరకు జరిగిన ఈ పర్యటన ఒక మంచి విజ్ఞాన అనుభవం.
అమెరికాలో వివిధ రాష్ట్రాలలో పర్యటన
ఢల్లీి నుంచి ఆమ్స్టర్‌ డాం మీదుగా 13 ఆగస్టు నడల్లాస్‌ చేరుకున్నాము. లింగ ఆధారిత హింస, మానవ అక్రమరవాణా అంశంపై చర్చలు, మేధో మధనాలు,సలహాలు,సూచనల ఆహ్వానాలు అమె రికా రాజధాని వా షింగ్టన్‌ డి.సి.సంయుక్త రాష్ట్రా లయిన నార్త్‌ డకోటా(మైనాట్‌, బిస్మార్క్‌ నగ రాలు)సియాటల్‌(వ్వాషింగ్టన్‌ రాష్ట్రం),పెన్సో కోలా (ఫ్లోరిడారాష్ట్రం)లలో జరిగాయి. ఈ పర్యటనలో భాగంగా అమెరికా ఓవర్‌ సీస్‌ ఎడ్యుకేషన్‌ డిపా ర్ట్మెంట్‌, డిపార్ట్మెంట్‌ ఆఫ్‌ ఎక్స్టర్నల్‌ అఫైర్స్‌ (విదేశీ వ్యవహారాలు) సందర్శించడం జరిగింది అమెరి కాలో ఫెడరల్‌ వ్యవస్థ పనిచేసే విధానం,అటార్నీ జనరల్‌ అసోసియేషన్‌, గృహహింస అరికట్టడం, బాధితులకు సహాయం చేసే పనిచేసే ఎన్‌జీవోలతో వ్వాషింగ్టన్‌ డీసీలో సమావేశం అయ్యాము. నార్త్‌డ కోటా రాష్ట్రంలోట్రైబల్‌ వ్యవహారాల విభాగాన్ని సందర్శించి ఆదిమతెగలలో లింగ ఆధారిత హింస అందుకు కారణాలు,మానవ అక్రమరవాణా జరుగుతున్న విధానం తెలుసుకున్నాము.సియాటెల్‌ నగరంలో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌లో ఆ రాష్ట్ర సెనేటర్‌ మానవ అక్రమ రవాణా అరికట్టడానికి తీసుకు వొచ్చిన పలు చట్టాలు,బాధితులతోనే (సెక్స్‌ వర్కర్స్‌) నిర్వహిస్తున్న సంస్థలు,పిల్లల కొరకు అక్కడి ప్రభు త్వం ఏర్పాటు చేసిన కార్యాలయాలు,బాలలపై లైంగిక దాడులు జరిగినప్పుడు వారినుంచి వివరా లు రాబట్టడానికి అనుసరించే సృజనాత్మక విధా నాలు తెలుసుకున్నాను.
అమెరికాలో లింగ ఆధారిత హింస
మహిళలు పురుషులపై ఆధారపడటం,ఆర్ధిక స్వేఛ్చ లేకపోవడం.ఆర్ధికంగా పతనమైన వలస కుటుం బాలు,అప్పులు,కుటుంబాలకు మిగిలిన వ్యక్తులతో డ్పాటు లేకపోవడం వలన లింగ ఆధారిత హింస అమెరికాలో ఎక్కువ.ఎక్కువ గృహ హింస కేసులు ఆసియా దేశాలు అందునా భారత్‌ వంటి దేశాల నుంచి వొచ్చిన కుటుంబాల నుంచే నమోదు కావ డం వంటివి అక్కడ గృహ హింసపై పనిచేస్తోన్న ఒకస్వచ్ఛంధ సంస్థ(ఎన్‌.జీ.ఓ)చెప్పగా ఆశ్చర్య పోయాను. చాలా సందర్భాలు,కేసులు ఆర్ధిక అస్థిరత వల్లనే అవుతున్నాయి అని నాకు అనిపించింది. ప్రతీది డబ్బుతో ముడిపడిఉండటం,భద్రత లేనిఉద్యోగాలు,వీకెండ్‌ ఎంజాయిమెంట్‌కి ఎక్కువ ప్రాధా న్యత ఇవ్వటం,పదహారు సంవత్సరాల నుంచి పిల్లలుస్వతంత్రంగాఉండటం (అందువలన తప్పు లేదు గాని,మద్యం,డ్రగ్స్‌ వంటి వాటికి అడిక్ట్‌ అయ్యే వారు ఎక్కువ)కూడా కొన్నికారణాలుగా అనిపిం చింది. మన దేశంలో కుటుంబవ్యవస్థను రక్షించడం కొరకు,మగవాడు చెప్పింది చేయాలి.స్త్రీ ఇలానేఉండాలిఅనే భావాలప్రచారం వలన మనకు మహిళలపై, పిల్లలపై హింస ఎక్కువ. ఇది మన సంస్కృతిలోబాగా వేళ్ళూనుకు పోయివుంది. చిన్న తనం నుంచే మనకు మగ,ఆడ అనే బేధాలు ఎక్కువ. ఇవి మహిళలు పిల్లలపై హింసకు,లైంగిక హింసకు కారణమవుతున్నాయి.అయితే లింగ ఆధారిత హింసను ఎదుర్కోవడానికి అమెరికాలో స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ సహకారంతో క్రైసిస్‌ సెంటర్లు ఏర్పాటు చేశాయి.వీటికి5శాతం వరకు ప్రభుత్వమే నిధులు సమకూరుస్తుంది.మిగతావి డోనర్‌ ఏజెన్సీ లు,వ్యక్తిగత డోనర్లు ఈక్రైసిస్‌ సెంటర్లలో మహిళ లు రక్షణ పొంద వొచ్చు.శిక్షణ పొందవొచ్చు ,తిరిగి తమ కుటుంబాన్ని కలవాలి అనుకున్నపుడు వెళ్ళవొచ్చు. చాలా సందర్భాలలో తిరిగి మహిళలు కుటుంబం వద్దకే వెళ్లిపోతుంటారు. అయితే ఈ బాధిత కార్యాలయాలు అత్యంత గోప్యతతో నిర్వహిస్తారు. అక్కడ ఒక్కో రాష్ట్రంలో ఒక్కోచట్టం కనుక మనదేశంలోవలే జాతీ యస్థాయి చట్టాలు, అమలు విధానాలు వుండవు. ఇది కేంద్ర స్థాయిలో పనిచేయడానికి వారికి అడ్డంకిగా మారుతుంది. నేను సియాటెల్‌ నగరంలో ఒక రెఫ్యూజీ సెంటర్‌కు వెళ్ళాను..అది పూర్తిగా మహిళలే నిర్వహిస్తున్నారు. అమెరికాను పీడిస్తున్న అక్రమ రవాణా అంశం తగిన లేబర్‌ లేకపోవడం, వ్యవసాయ పనులకు లేబర్‌ కావాల్సిరావడం కూడా ఈ మానవ అక్రమ రవాణాకు కారణం,అలా తీసుకువొచ్చిన వారి పాస్పోర్టుల తీసేసుకొని వారిని సెక్స్‌ ట్రేడ్‌కు వాడు తున్నారు.ఇంకా ఇక్కడప్రాస్టిట్యూట్‌ సర్వైవర్స్‌ నడుపుతున్న ఒక ఎన్‌జీఓను కలవడం జరిగింది. వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ మీద ఇంటర్లో గాట్‌,డంకెల్‌ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా బోలెడు కార్టూన్లు వేసాను. ఇప్పుడు అదే సెంటర్లో వరల్డ్‌ అఫైర్స్‌ ఆఫీసులో మీటింగులో పాల్గొనడం ఒకచిత్రమైన అనుభూతి. ఇక్కడ కింగ్‌ కౌంటీ కౌన్సిల్‌ మెంబెర్‌ని కలిసాము,ఆమె మానవ అక్రమ రవాణా నిరోధా నికి ఎన్నోచట్టాలను గత ఇరవై ఏళ్లుగారూపొం దించి ప్రవేశ పెట్టారు. మానవ అక్రమ రవాణా నిరోధాన్ని కేవలంచట్టాలు ఎంత వరకు తగ్గిస్తా యి? అన్న నా ప్రశ్నకు సమాజంలో మానవ అక్రమ రవాణా పట్ల ఒకసాంస్కృతిక మార్పు రావాల్సి ఉంటుం దని ఆమె చెప్పారు.
ఆదిమ తెగలలో లింగ ఆధారిత హింస
లింగ ఆధారిత హింస ప్రపంచంలో ఎక్కడైనా ఒకటే. సమాన అవకాశాలు లేకపోవడం, కుటుం బాలలో ఆర్ధిక అస్థిరత,మానసిక సమస్యలు, విపరీ తమైన త్రాగుడు,డ్రగ్స్‌ తీసుకోవడం ఒక ప్రధాన కారణంగా ఇక్కడ కలిసిన వ్యక్తుల,సమూహాల చర్చలనుబట్టి అర్ధమయ్యింది. మహిళల ప్రయివసీ కాపాడటం, బహిరంగ ప్రదేశాలలో వారిని గౌరవించే విధానం ఇక్కడ చాలా బాగుంది. కానీ అటువంటి సివిక్‌ సెన్స్‌ అభివృద్ధి చెందినచోట లింగ ఆధారిత కుటుంబహింస ఎక్కువగాఉండటం ఆశ్చర్యకరం.మన దగ్గర తరాలుగా అంది పుచ్చు కున్న ‘‘మనువాద భావాలు’’ మహిళలను రెండో పౌరులుగా చూస్తే ఇక్కడ గిరిజన తెగలలో,వలస దారులలో కూడా లింగ ఆధారిత హింస ఎక్కువ ఉన్నట్లు అర్ధమవుతుంది.ఆదిమ తెగలు స్త్రీ కేంద్రం గా స్త్రీని గౌరవించే ఆచారాలు కలవి,అటువంటి చోట మెయిన్‌ స్ట్రీమ్‌సమాజం ప్రభావం పడి వాటి పై కూడా లింగఆధారిత కుటుంబ హింస పడిర ది. ఇంకా వందల ఆదిమతెగలు ఇక్కడ తమ అస్తిత్వం కోసం పెనుగులాడుతున్నాయి. ట్రైబల్‌ కోర్టులు ఉంటాయి అయితే వాటి కంటేపై స్థాయిలో స్టేట్‌, ఫెడరల్‌ కోర్టులదేపై చేయి. మిగతా సమా జంతో కలిసి అవకాశాలు అందిపుచ్చు కోవడం లో వెనుకంజ, మారుతున్న పరిస్థితులను ఆకళింపు చేసుకొని ముందుకు వెళ్లలేక పోవడం కూడా కుటుంబ,లింగ ఆధారిత హింసకు కారణంగా నాకు అనిపించింది.ఇందుకు ప్రత్యామ్నాయంగా భాషను కాపాడు కోవడం,స్కిల్స్‌ అప్‌ గ్రేడ్‌ చేసుకోవడం ఆయా తెగలు చేస్తున్నాయి. అమెరికా అనేక గిరిజన తెగలను నిర్మూలించివారి పునాదులపై సౌధాలు నిర్మించింది అన్న చరిత్ర అందరికి తెలిసిందే.
పర్యటన స్పూర్తి
ఈపర్యటన ఇచ్చిన స్పూర్తితో మానవ అక్రమ రవాణా నిరోధం అంశంపై మరింతగా పనిచేస్తాను, ముక్యంగా యువతులు,కౌమార బాలికలు, బాలురు ఈకూపంలో ఇరుక్కోకుండా వారికి విభిన్న మాధ్య మాల (మీడియా,కార్టూన్లు, పవర్‌ పాయింట్‌ ప్రెసెం టేషన్‌,యానిమేషన్‌ )ద్వారా తెలియజేస్తాను. అక్రమ రవాణాలో చిక్కుకున్న వారికి ప్రభుత్వంనుంచి సహా యం అందేలాచేయడం,ఇందుకోసం ఏర్పడిన కమి టీలు సమావేశం అయ్యేలా కృషి చేయడం, జాతీయ స్థాయి సంస్థలతో ఈఅంశంపై కలిసి కార్యాచరణ రూపొందించుకోవడం చేస్తాను. ఇటుక బట్టీలలో పనిచేసే పిల్లలను వెట్టి నుంచివిముక్తి చేయడంకోసం ప్రత్యేకంగా పనిచేయాలని నిర్ణయించుకున్నాను. ఇంటి పని వారల సంఘంతో కలిసి గృహ కార్మి కులు అక్రమ రవాణాకు గురికాకుండా ప్రచార కార్యక్రమాలు చేస్తాను. జిల్లాన్యాయ సేవాధికార సంస్థతో కలిసి కూడా కొన్ని కార్యక్రమాలు చేయ టానికి కోరుతాము.యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్స్‌ ఇంకా పిల్లలు, మహిళల కోసం పనిచేసే సంస్థలతో కలిసి పని చేయడంద్వారా బాల, బాలి కలు అక్రమ రవాణాకు గురికాకుండా ప్రయత్నించ వొచ్చు. ఇంటి పనివారు, అసంఘటిత రంగంలో పనిచేసే వారికి, విదేశాలలో వెళ్లే వారికి అవగా హన కార్యక్రమాలు నిర్వహించే ఆలోచన వుంది.
వ్యాసకర్త : బాలల హక్కుల కార్యకర్త, విశాఖపట్నం-(హరి వెంకట రమణ)

పర్యావరణ వినాశనం..

విపత్తులకు పరిమితి అంటూ ఉండదు. ఎప్పుడు ఎలా వస్తాయో ఎవరూ చెప్పలేరు. ప్రపంచం మొత్తం మీద విపత్తులు ఎదుర్కొంటున్న దేశాల్లో భారత్‌ కూడా ఉంది. ఇవి వాటిల్లినప్పుడు అన్ని వ్యవస్థల మీద, అన్నివర్గాల మీద ప్రభావం చూపిస్తాయి. ఈ భూమ్మీద ఇప్పటిదాకా ప్రకృతి విపత్తుల కోట్ల మంది చనిపోయారు. ఒక్కోసారి ఇవి కలగజేసే నష్టం తీరనిదిగా.. కోలుకోవ డానికి కొన్నేళ్లు పట్టేదిగా ఉంటుంది కూడా. సాధారణంగా విపత్తులు రెండు రకాలు. ఒకటి మానవ తప్పిదం. రెండోది ప్రకృతి వల్ల జరిగేవి. కరువు, భారీ వర్షాలు, వరదలు, తుపాన్‌,సునామీ, భూకంపాలు ప్రకృతి విపత్తులు. ప్రకృతిలో జరిగే మార్పుల వల్ల ఇవి వస్తాయి. భూమి వేడెక్కటం(గ్రీన్‌ హౌజ్‌ ఎఫెక్ట్‌), కాలు ష్యం,అడవుల నరికివేత తదితర కారణాలు మానవ తప్పిదాలు. ఈ రెండు రకాల విపత్తు లు ప్రాణ,ఆస్తి,పర్యావరణ నష్టాలకు కారణం అవుతుంటాయి.కరోనా లాంటి మహమ్మారులను సైతం విపత్తులుగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది ఇప్పుడు. ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ 2009,డిసెంబర్‌ 21న ఒక ప్రతి పాదన చేసింది. ప్రతియేటా అక్టోబర్‌ 13ను అంతర్జాతీయ విపత్తు కుదింపు(తగ్గింపు) దినోత్సవాన్ని Iఅ్‌వతీఅa్‌ఱశీఅaశ్రీ ణaవ టశీతీ ణఱంaర్‌వతీ Rఱంస Rవసబష్‌ఱశీఅఅధికారికంగా పాటించాలని నిర్ణయించింది. కానీ, 1989లోనే మొదటి దినోత్సవాన్ని పాటించారు. విపత్తులను తగ్గించుకునేందుకు చేసే ప్రయత్నాలు,రిస్క్‌ అవేర్‌నెస్‌ గురించి ప్రమోట్‌ చేస్తుంది ఈ దినో త్సవం. మొదట్లో నేచురల్‌ డిజాస్టర్‌ రెడక్షన్‌ డేగా ఉండేది. 2002లో ఐరాస ఓరెజల్యూషన్‌ పాస్‌ చేసింది.విపత్తులు సంభ వించాకే సహాయక చర్యలు మొదలుపెట్టాలి. ‘విపత్తు నిర్వహణ అంటే ఇంతే’.. అని ఒకప్పుడు అనుకునేవాళ్లు. గతంలో మన దేశంలో విపత్తులుచాలా సంభవించాయి. ఆయా సందర్భాల్లో కీలక పాత్ర పోషించింది పునరావాస విభాగాలే. అయితే విపత్తును ముందే అంచనా వేసి జాగ్రత్తలు తీసుకోలేమా. ఈదిశగా ఐక్యరాజ్య సమితి 1990లో ఒక తీర్మానం చేసింది. ఆదశాబ్దం మొత్తాన్ని ‘అంతర్జాతీయ విపత్తుల తగ్గింపు’ దశాబ్దంగా ప్రకటించింది. ‘విపత్తు నిర్వహణ అంటే.. ఆపదలు వచ్చాక సాయం చేయటం మాత్రమే కాదు. రాకముందే పరిస్థితిని అంచనా వేయాలి. ముందస్తు చర్యలు చేపట్టాలి.లోపాలను అధిగ మించాలి. ఒకవేళ విపత్తులు వస్తే త్వరగతిన సాయం అందించాలి. ఇందుకోసం టెక్నాలజీ సాయం తీసుకోవడంతో పాటు ప్రత్యేక విభాగా లను ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా నష్టాన్ని తగ్గించుకోవచ్చు’..ప్రపంచ దేశాలకు ఐరాస సూచించింది ఇదే. 2030కల్లా విపత్తులతో ప్రభావితం అయ్యే ప్రజల సంఖ్యను తగ్గిం చాలనేది ఈ క్యాంపెయిన్‌ ఉద్దేశం
మన దగ్గర..
భారత్‌లో విపత్తు నిర్వహణ ప్రయత్నాలు 1990లో ఊపందుకున్నాయి. కానీ,చట్టం వచ్చింది మాత్రం 2005లో.విపత్తు నిర్వహణ చట్టం-2005 ప్రకారం కేంద్రం,రాష్ట్రం,జిల్లా స్థాయిల్లో విపత్తు నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేంద్రంలో ప్రధాని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆయా విభాగాలకు చైర్మన్లు. ఇవి ఏర్పడ్డాక విపత్తులను ఎదుర్కొనేందుకు అనుసరించే వ్యూహం, సహాయక చర్యల్లో చాలా మార్పు వచ్చింది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు తక్షణం ఆదుకునేలా చర్యలు చేపడుతున్నాయి ఆయా ప్రభుత్వాలు. దేశంలో ఎక్కడ ఏ మూలన ఎలాంటి విపత్తు సంభవించినా ఎన్డీఆర్‌ ఎఫ్‌ (సైన్యం) తక్షణం రంగంలోకి దిగుతుంది. మరో వైపు విపత్తుల నివారణపై ప్రజలకు అవగాహన కూడా కల్పిస్తున్నారు. అయినప్పటికీ లోటుపాట్లతో నష్టం జరుగుతూనే ఉంది.
విపత్తు నిర్వహణ
జీలం,చీనాబ్‌,రావి,సట్లెజ్‌,బియాస్‌,ఘాగ్రా నదులతో కూడిన వాయవ్య నదీపరివాహక ప్రాంతం,తపతి,నర్మద,మహానది,వైతరణి, గోదా వరి,కృష్ణా,పెన్నా,కావేరి నదులతో కూడిన ద్వీప కల్ప నదీ పరివాహక ప్రాంతాలు వరదకు ప్రభావితమవుతున్నాయి.ఏపీ,తమిళనాడు, ఒడిశా,కేరళ తీరప్రాంతాలు,అసోం,ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ తరుచూ తీవ్ర వరద ముంపునకు గురవుతుంటాయి. జీవాయుధాలు కలిగించే జబ్బులను ప్రాథమిక దశలో గుర్తించలేం. ప్లేగు,స్మాల్‌ఫాక్స్‌వంటివి వేగంగా సోకే కార కాలను గుర్తించడంలో జాప్యం జరిగితే తీవ్ర ప్రభావం చూపుతాయి. పూర్వకాలంలో శత్రుసైన్యాన్ని చంపే విధానంలో భాగంగా బుబోనిక్‌ ప్లేగు (గ్రంథులు ఉబ్బడం) వ్యాధితో మరణించిన వారి శవాలను రాజు కోటలో విసిరేవారు.ఉదా: 1346 కఫా సంఘటన. 14 22 కరోల్‌స్టీన్‌ సంఘటన. విపత్తు అనేది ఒక అపాయకరమైన స్థితి. దేనివల్ల ప్రజల ప్రాణా లు,ఆస్తులకు ముప్పు వాటిల్లుతుందో ఆ స్థితిని విపత్తు (ణIూAూుజుR) అంటారు.ఒక సమాజం తన సొంత వనరులతో కోలుకోలేని విధంగా,సాధారణ సామర్థ్యానికి మించి ప్రాణ నష్టం,ఆస్తినష్టం,పర్యావరణ వనరులను విలు ప్తం చేసి,మౌలిక సౌకర్యాలకు,నిత్యావసర సేవలకు,జీవనోపాధికి,మానవ దైనందిన జీవి తానికి అంతరాయం కలిగించే ఒక సంఘటన లేదా వరుస ఘటనలను విపత్తు అంటారు.
ఐక్యరాజ్యసమితి
విపత్తును ఐక్యరాజ్యసమితి సమాజపు లేదా కమ్యూనిటీ సాధారణ నిర్మాణానికి, సాధారణ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తూ అకస్మా త్తుగా లేదా తీవ్రంగా సంభవించే ఆపద అని నిర్వచించింది. సాధారణ జీవితానికి లేదా పర్యావరణ వ్యవస్థకు అంతరాయం కలిగినప్పుడు ప్రాణాలను లేదా పర్యావరణాన్ని కాపాడి సంరక్షించడానికి అసా ధారణ అత్యవసర చర్యలు అవసరమయ్యే ఉప ద్రవ పరిస్థితి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ
ప్రభావిత కమ్యూనిటీ లేదా ప్రాంతం కోలు కోడానికి వెలుపలి నుంచి అసాధారణమైన ప్రతిస్పందన అవరమయ్యే విధంగా నష్టానికి, ఆర్థిక విధ్వంసానికి, మానవ ప్రాణ నష్టానికి ఆరోగ్యం, ఆరోగ్య సేవలను పతనం చేసే ఏదైనా సంఘటన అని నిర్వచించింది.ఒక దుర్ఘటనను విపత్తుగా పిలవాలంటే ఎన్ను కోవాల్సిన ప్రమాణాలు లేదా ఆ దుర్ఘటన జరిగిన ప్రాంతంలో కనిపించే లక్షణాలు
సమాజ సాధారణ మనుగడ దెబ్బతినడం
ధన,ప్రాణ,ఆస్తి నష్టం పెద్ద ఎత్తున జరగడం, ప్రజల జీవనోపాధి దెబ్బతినడం,విపత్తు ప్రభావానికి లోనైన సమాజానికి ఆస్తులు, అక్కడి ప్రజల పునర్నిర్మాణానికి వెలుపలి నుంచి సహా యం అవసరం అన్నంతగా దాని తీవ్రత ఉం డటం,దేశ ఆర్థిక వ్యవస్థ ప్రభావితమై,అక్కడి పర్యావరణం దెబ్బతిని, సుస్థిరాభివృద్ధికి ఆటంకం కలిగేలా ఉండటం.ముఖ్యంగా 1. వైపరీత్యం,2.దుర్బలత్వం,3 సామర్థ్యం, 4. ఆపద అనే అంశాలు ఇమిడి ఉన్నాయి. ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలో ప్రజా జీవనానికి, ఆస్తులకు, పర్యావరణానికి ప్రకృతి చేతగాని లేదా మానవ కారకంగా గాని నష్టాలు సంభ విస్తే దానిని వైపరీత్యం అంటారు.
వైపరీత్యాలను – జిఎన్‌వి సతీష్‌

కారడవులూ కార్పొరేట్లకేనా..?

కేంద్ర ప్రభుత్వం గిరిజనుల వినాశ నానికి శ్రీకారంచుట్టింది.2022 జూన్‌ 28న ‘ఫారెస్ట్‌ కన్సర్వేషన్‌ నిబంధనలు-2022’ను తీసుకు వచ్చిం ది.‘కన్సర్వేషన్‌’ (పరిరక్షణ)పేరుతో వచ్చిన ఈనిబం ధనలు అంతులేని విధ్వంసం చేయబోతు న్నాయి. ఆదివాసీలను,అడవులను,వన్యప్రాణులను, పర్యా వరణాన్ని ధ్వంసం చేయడమే వీటి ప్రధాన ఉద్దేశం. ఈనిబంధనల ప్రకారం ఎంత పెద్ద అడవి నైనా అటవీయేతర భూమిగా మార్చుకోవచ్చు. వ్యా పారఅవసరాలు,లాభాల కోసం బడా కార్పొరేట్‌ సంస్థలకు ధారాదత్తం చేయవచ్చు. రాష్ట్రంలో స్క్రీనిం గ్‌ కమిటీ, కేంద్రంలో రీజినల్‌ ఎంపవరింగ్‌ కమిటీ, ఎడ్వైజరీకమిటీలు,మొత్తం మూడు కమిటీలు ఏర్పాట వుతాయి. వీటిలో పర్యావరణవేత్తలకు, ఆదివాసీలు, సామాజిక కార్యకర్తలకు ప్రాతినిధ్యం లేదు.కొత్త నిబంధనల కింద ఎంత అడవిని,ఎంతకాలపరి మితిలో కార్పొరేట్లకు అప్పగించాలో వివరాలు ఉండటం గమనార్హం.5 నుంచి 40హెక్టార్ల అడవిని 60 రోజుల్లో నాన్‌మైనింగ్‌ అవసరాలకోసం, మైనిం గ్‌ అవసరాల కోసం75రోజుల్లో అప్పగించాలి (హెక్టారు అంటే రెండున్నర ఎకరాలు). 41నుంచి 100 హెక్టార్ల అడవిని 75 రోజుల్లో నాన్‌మైనింగ్‌ అవసరాలకోసం,మైనింగ్‌ అవసరాలకోసం 90 రోజుల్లో ఇవ్వాలి. 100 హెక్టార్ల నుంచి ఆ పైనున్న అడవిని 120రోజుల్లో నాన్‌మైనింగ్‌ అవసరాల కోసం, మైనింగ్‌ అవసరాల కోసం 150రోజుల్లో ధారాదత్తం చేయాలి. పై మూడు కమిటీలు మొత్తం ప్రక్రియను ఈ కిందివిధంగా పూర్తిచేసి అడవిని కార్పొరేట్లకు అప్పగించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్దేశించబడిన కాలపరిమితికి లోబడి ఎటువంటి జాప్యం చేయరాదు.ఎలాధ్వంసం చేయాలి?మొదటి దశలో ఆదివాసులను, వన్యప్రాణులను అక్కడినుంచి ఖాళీ చేయించాలి. తర్వాత అడవిని ప్రైవేటు వ్యక్తు లకు,బడాకార్పొరేట్లకు దఖలు చేయాలి. ఆ తర్వాత ఏయే పద్ధతులద్వారా అడవిని ఎంత క్రూరంగా ధ్వంసం చేయవచ్చో కూడాఈనిబంధనల్లో పేర్కొ న్నారు.1.క్లియర్‌ ఫెల్లింగ్‌ (పూర్తిగా నరికివేయడం), 2.అప్‌ రూటింగ్‌ (కూకటివేళ్ళతో పెకలించడం), 3.బర్నింగ్‌(అడవినితగలబెట్టడం).ఇలాంటి విధ్వం సకర చర్యలద్వారాఅటవీభూమిని,అందులో ఉన్న సంపదను కొల్లగొట్టడంకోసం వన్యప్రాణులను, ఆదివాసులను,ఇతర పేదలను నిరాశ్రయు లను చేస్తారు.తద్వారా అటవీయేతర భూమిగా మార్చు కొని వారి అవసరాల కోసం వాడుకుంటారు. రాజ్యాంగం-చట్టాల ఉల్లంఘన
రాజ్యాంగంలో5,6వ షెడ్యూళ్ల ద్వారా దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఆదివాసులకు పలు హక్కులు, రక్షణ లభిస్తున్నాయి. గిరిజన భూముల బదలాయింపు నిరోధక చట్టం, గ్రామసభలకు అధి కారాలను కలగజేస్తున్న పెసా చట్టం,అటవీ హక్కుల గుర్తింపు చట్టం-2006, భూ నిర్వాసితుల చట్టం-2013, వివిధ సందర్భాల్లో సుప్రీంకోర్టు, తదితర కోర్టులు ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం ఇచ్చిన తీర్పులతో సహా అన్ని హక్కులు బుల్డోజర్‌తో నేలమట్టం చేయబడ్డాయి. ఇప్పటివరకు అమల్లో ఉన్న చట్టాల ప్రకారం ఎంత విస్తీర్ణం గల అడవిని అటవీయేతర భూమిగా మారుస్తారో, అంత విస్తీర్ణం గల భూమిని మరోచోట కేటాయించి ప్రత్యామ్నా యంగా అడవిని పెంచాలి. కానీ కొత్త విధానం ప్రకారం ప్రత్యామ్నాయ అడవుల పెంపకం నామ మాత్రమే. రాష్ట్రాల మీదికి ఆబాధ్యత నెట్టివేసి కేంద్రం చేతులు దులుపుకొన్నది. నష్ట పరిహారం, పునరావాసం: అడవి నుంచి, భూమి నుంచి గెంటి వేయబడిన ఆదివాసీలు, ఇతర పేదలకు పునరా వాసం గానీ, నష్ట పరిహారం గురించి గానీ కేంద్రం ఎలాంటి బాధ్యత తీసుకోలేదు. నిర్దిష్ట ప్రతిపాదనలు కూడా లేవు. అడవిని పూర్తిగా వ్యక్తిగత ఆస్తిగా మార్చుకొని,ఆయజమాని లబ్ధిని పొందడం ప్రారం భమైన తర్వాతనే నిర్వాసితుల పునరావాస ప్రక్రి యపై దృష్టిపెట్టాలి. ఈ ప్రక్రియను రాష్ట్ర ప్రభు త్వాలు పర్యవేక్షణ చేయాలనేది ఈ నిబంధనల్లోని అంశం. బడా కార్పొరేట్లను నిలువరించటం రాష్ట్ర ప్రభుత్వాలకు, ఆదివాసులకు, హక్కుల సంఘాలకు సాధ్యమవుతుందా? ఇది కేంద్రం పలాయనవాదం కాదా?గిరిపుత్రులు అడవిలో పుట్టి, అడవినే నమ్ము కొని,అడవే జీవనాధారంగా ఏర్పరచుకొని, అడవిలో లభించే కందమూలాలు తింటూ నాగరికపు సమా జానికి దూరంగా స్వేచ్ఛగా జీవిస్తున్నారు. వారిని అడవి నుంచి దూరం చేయాలని, అటవీ సంపదను కార్పొరేట్‌ బడా బాబులకు, ప్రభుత్వ ఆశ్రిత పెట్టు బడిదారులకు దోచిపెట్టాలని కేంద్రం తహత హలాడుతున్నది. అనేక రాష్ట్రాల్లో అటవీ సంపదను కొల్లగొట్టడానికి బొగ్గు గనుల తవ్వకం, బా క్సైట్‌, యురేనియం లాంటి ఖనిజాల వెలికితీతకు జిం దాల్‌, వేదాంత లాంటి బహుళజాతి సంస్థలు, అంబానీ, అదానీల సంస్థలు పోటీపడుతూ గిరిజన జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. రాజ్యాం గ విలువలకు ప్రాధాన్యం ఇచ్చి, ఆదివాసీల అభివృ ద్ధికి రాజ్యాంగం కల్పించిన చట్టాలను అమలు చేస్తేనే గిరిజనుల ఆకాంక్షలు నెరవేరుతాయి.
అడవుల పెంపకం కోసం నయా ప్లాన్‌.. డ్రోన్ల సహాయంతో బృహత్తర కార్యక్రమం..
ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి ఎన్ని చెట్లు నేల కూలుతున్నాయో తెలుసా..? సుమారుగా14 వేల కోట్లుకు పైమాటేనట! మరి వీటి స్థానంలో కొత్తగా ఎన్ని మొక్కలు పుడుతున్నా అంటే..అది జస్ట్‌ సగం కూడా లేవట! అందుకే..అడవులను వేగంగా పెంచాల్సిన అవసరం ఇప్పుడు ఉందని అటవీశాఖ అధికారులు ముందుకు వచ్చారు. అటవీశాఖ ఈ సరికొత్త ప్రాజెక్ట్‌ కు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా డ్రోన్లతో విత్తనాలను నాటుతున్నారు. భారీగా మొక్క లుగా మొలిచేలా చేయడమే తమటార్గెట్‌ అనివాళ్లు చెప్తున్నారు. మామూలుగా మనుషులతో విత్తనాలు నాటాలంటే ఎక్కువ టైంలో తక్కువ పనైతది. ఎక్కువ మంది జనాలుదానికోసం పనిచేయాల్సి ఉంటుంది. దాంతో పాటు ఖర్చూ ఎక్కువే.అందుకే వాళ్లు డ్రోన్‌ టెక్నాలజీపై ఫోకస్‌ పెట్టారు. ముందుగా వాళ్లకు కావాల్సిన రకరకాల మొక్కల విత్తనాలను సెలెక్ట్‌? చేసుకుంటారు. వాటిని మట్టి, ఇతర న్యూట్రియెంట్స్‌ కలిపిన ఒక ముద్దలో పెడతారు.ఆముద్దలను ఉండలుగా చుట్టి సీడ్‌ బాల్స్‌గా మారుస్తారు. ఈ సీడ్‌ బాల్స్‌ను డ్రోన్‌లద్వారా పైనుంచి జార విడు స్తారు. దీంతో వానలు పడగానే సీడ్‌ బాల్స్‌ మొల కెత్తుతాయి.వాటి చుట్టూ ఉన్న మట్టి, న్యూట్రియెంట్స్‌ సాయంతో ఏడెనిమిది నెలల వరకూ మొక్కలు బతకగలవు. ఆలోపు వేర్లు పుట్టి, నేలలో బాగా పాతుకుపోతాయి. ఇలా.. డ్రోన్లతో ఈజీగా మొక్కలు పెంచొచ్చని వీరు ప్లాన్‌ చేశారు.ఫ్లాష్‌ ఫారెస్ట్‌ ప్రాజె క్టును గత కొద్ది రోజులుగా తెలంగాణలో ఎన్జీవోలు నిర్వహిస్తున్నాయి. అయితే ఇప్పుడు అటవీశాఖ అధి కారులు రంగంలోకి దిగారు. కామారెడ్డి జిల్లా అటవీ ప్రాంతంలో డ్రోన్‌ ద్వారా విత్తన బాల్స్‌ వేశారు. గుబ్బ కోల్డ్‌ స్టోరేజ్‌ ఆధ్వర్యంలో విత్తనాలను సేకరించినట్లుగా చెప్పారు. అడవిలో పలుచగా ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసుకుని అక్కడే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు వివరించిన అధికారులు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కామా రెడ్డిలోనే ప్రారంభించామని వెల్లడిరచారు.
పర్యావరణంలో కలిగే దుష్పరి ణామా లను అడ్డుకోడానికి చెట్లు నాటడమొక్కటే పరిష్కారం అన్న భావన గత కొన్నేళ్లుగా బలహీనపడుతోంది. కార్బన్‌ వాయువులను పీల్చుకోవడంలో అడవులు కీలకపాత్ర పోషిస్తాయని గతంలో జరిగిన పరిశోధ నలు తేల్చాయి. వాటిని నమ్మి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు విస్తారంగా అడవులను పెంచడం ప్రారంభించాయి. మొక్కల పెంపకం మీద అనేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాయి. చెట్లు పెంచితే పర్యావరణంలో దుష్పరిణామాలను ఆపవచ్చని విస్తృతంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహిం చాయి. 2030 కల్లా 350 మిలియన్‌ హెక్టార్లలో నాశనమైన అడవుల ప్రాంతంలో తిరిగి పచ్చదనం తీసుకురావాలని పలు దేశాలు ప్రతిజ్జ చేశాయి. ఇప్పటి వరకు 40 దేశాలు ఈ ప్రతిజ్జను పాటిస్తు న్నాయి. కానీసైంటిస్టులు మాత్రం మొక్కలు నాట డానికి ఉరుకులు పరుగులు పెట్టాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు. చిలేలో అడవుల పెంపకానికి ఇచ్చే సబ్సిడీలకు సంబంధించి1974 నుంచి 20 12వరకు విడుదల చేసిన డిక్రీలను పరిశీలిం చారు. వీటిని చూస్తే ప్రపంచంలో ఇదే అతి పెద్ద అడవుల పెంపకం ప్రాజెక్టు అనిఅర్ధం చేసుకో వచ్చు. కొత్తగా అడవులను పెంచడానికి ఈ చట్టం ప్రకారం 75 శాతం రాయితీలు లభిస్తాయి.వాస్తవానికి ఈ పథకం ప్రకారం అప్పటికే ఉన్న అడవులలో చెట్లు నాటకూడదు. కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా చాలామంది మొక్కల పెంపకందారులు అడవు లలోనే లాభదాయకమైన పండ్లను, ఫలాలను ఇచ్చే చెట్లను నాటడం మొదలు పెట్టారు. ఈ స్కీమ్‌ను చెట్లు ఉన్న ప్రాంతాలకు కూడా విస్తరించారు, కానీ స్థానిక అడవులున్న ప్రాంతంలో తగ్గించారు చిలే లోని అడవులు పెద్దమొత్తంలో కార్బన్‌ను నిల్వ చేసుకునే సామర్ధ్యం ఉన్నవని, కానీ కొత్తగా చేపట్టిన మొక్కల పెంపకంవల్ల అది తగ్గిపోయి, జీవవైవిధ్యం దెబ్బతిన్నదని ఈఅధ్యయనం నిర్వహించిన పరి శోధకులు అంటున్నారు. ‘’మొక్కలు పెంచడానికి చేపట్టిన పథకాలు సరిగా రూపొందించక పోయినా, అమలు చేయకపోయినా ఫలితాలు ఇలానే ఉంటా యి. డబ్బులు వృథాకావడంతోపాటు జీవవైవిధ్యం కూడా దెబ్బతింటుంది’’ అని ఈ స్టడీ పేపర్‌ సహ రచయిత స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ ఎరిక్‌ లాంబిన్‌ అన్నారు. మనం కోరుకున్న దానికన్నా పూర్తిగా భిన్నమైన ఫలితాలు ఇవి ‘ొఅని ఆయన అన్నారు. ఇక దీనిపై పని చేసిన రెండో పరిశోధనా ప్రాజెక్టు కొత్తగా నాటిన అడవులు ఎంత వరకు కార్బన్‌ వాయువులను పీల్చగలవో పరిశీ లించింది. ఇప్పటి వరకు సైంటిస్టులు మొక్కలు ఏ స్థాయిలో కార్బన్‌ వాయువులను పీల్చుకుంటాయో అంచనాలు వేసి ఒక నిర్ణీత నిష్పత్తిని నిర్ణయించారు. అయితే ఈ నిష్పత్తిపై అనుమానాలు వ్యక్తం చేసిన ఈ పరిశోధన, పరిస్థితులను బట్టి ఈ నిష్పత్తి మారు తుందని తేల్చింది. ఈ సందర్భంగా పరిశోధకులు ఉత్తర చైనాలో ప్రభుత్వం నాటించిన చెట్లతోపాటు, గోబీ ఎడారిలో నాటిన మొక్కలను కూడా పరిశీ లించారు. ఈఅడవుల నుంచి 11,000 మట్టి నమూనాలను సేకరించారు. నేలలో కార్బన్‌ లేని ప్రాంతాలలో మొక్కలు పెంచడం వల్ల ఆ ప్రాం తంలో ఆర్గానిక్‌ కార్బన్‌ పెరుగుతుందని గుర్తిం చారు. కార్బన్‌ ఎక్కువగా ఉన్న నేలల్లో అడవులను నాటడం వవలన వాటి సాంద్రతలో తగ్గుదల కనిపించింది. మొక్కలు కార్బన్‌ను పీల్చుకునే శాతాల గురించి గతంలో వేసిన అంచనాలు కాస్త అతిశ యంగా ఉన్నాయని ఈ పరిశోధకులు తేల్చారు. ‘’కర్బన ఉద్గారాలను తగ్గించాలనుకుంటే దానికి చెట్లు నాటడమొక్కటే పరిష్కారంకాదని ప్రజలు అర్ధం చేసుకోవాలి’’అని ఈ పరిశోధనకు నాయ కత్వం వహించిన కొలరాడో స్టేట్‌ యూనివర్సిటీ చెందిన డాక్టర్‌ అన్పింగ్‌ చెన్‌ అన్నారు. ‘’అడవుల పెంపకంలో చాలా సాంకేతిక అంశాలను పరిశీలిం చవలసి ఉంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా పరిస్థితులు ఉంటాయి. వాటన్నింటినీ సమతుల్యం చేయాలి, ఏదో ఒక విధానమే సమస్యకు పరిష్కారం కాదు’’ అన్నారు .- (నాదెండ్ల శ్రీనివాస్‌)

ఊరు ఉండమంటున్నది.. గోదారి పొమ్మంటున్నది…!

ఊరు ఉండమంటున్నది,గోదారి పొమ్మం టున్నది. ఊరు ఏరు రెండు ఉనికిని ఇచ్చేవే. కానీ రెండూ ఇపుడు వేలాది మందికి నిలువ నీడ లేకుండా చేశాయి. ఊరు మునిగి పోయింది, గోదావరి వరదై ముంచేసింది. ఇది మనసును ముల్లులా గుచ్చే సమస్య. చిత్రమయిన సమస్య. పోలవరం ప్రాజక్టు నిర్వాసితులు ఎదుర్కొం టున్న హృదయ విదారకమయిన సమస్య. కొన్ని వేల మంది ప్రజలు పోలవరం ప్రాజక్టు వల్ల నిర్వాసితుల య్యారు. వాళ్ల పునరావాసం మాత్రం జరగడం లేదు. వాళ్ల కోసం కొన్ని పునరావాస కాలనీలు కట్టారు. లెక్క ప్రకారం వాళ్లు ప్రాజక్టు ముంపునకు గురవుతున్న గ్రామాలు వదిలేసి, ఈ పునరావాలస కాలనీలలో స్థిరపడాలి.ఇది చెప్పుకునేందుకు చక్కటి మాట. అయితే,ఈ వేలాది మంది ప్రజలు.ఊ .ర్లొదలడానికి సిద్ధంగా లేరు. వరద ముంచుకొస్తున్నది. అధికారులు ఊర్లలోకి వచ్చి వెంటనే ఖాళీచేయండని హెచ్చరి స్తున్నారు.

Read more

ప్లాటీనం జూబిలీ స్వాత్రంత్య్ర సంబరాల సవివరంగా 

భారతదేశం సామ్రాజ్యవాదుల చేర నుండి బయటపడి స్వతంత్య్ర దేశంగా అవతరించి 75 సంవత్సరాలైంది. స్వాతంత్య్ర సాధన కోసం నేలకొరిగిన అసంఖ్యాకుల త్యాగనిరతికి పునరంకితమయ్యే ఉద్విగ్న సమయమిది. గాంధీ,నెహ్రూ,పటేల్‌ అకుంఠిత పోరాట పటిమకు ముందు రాణిలక్ష్మీబాయి,మంగల్‌ పాండే,భగత్‌ సింగ్‌,సుభాష్‌ చంద్రబోస్‌ అస్ఫకు ల్లా ఖాన్‌,రామ్‌ ప్రసాద్‌ బిస్మిల్‌ మరియు ఉద్ధం సింగ్‌ వంటి ఎందరో త్యాగధనుల ఫలితమే మనం అనుభవిస్తున్న ఈస్వాతం త్య్రం. దేశానికి స్వతంత్రాన్ని సిద్ధించి పెట్టిన అమరవీరులకు భారత జాతి సర్వదా రుణపడి ఉంటుంది. మన స్వాతంత్య్ర సంగ్రామం అజరామరమైనది.. శత్రుశేషం లేనిది. చాలా దేశాలు స్వాతంత్య్రాన్ని పొంది ఉండవచ్చు, అట్టి స్వాతంత్రం కోసం ఆదేశ సైనికులు వీరోచితంగా పోరాటం చేసి ఉండవచ్చు, కానీ మన స్వాతంత్య్ర సంగ్రామంలో అసంఖ్యాకమైన ప్రజానీకమే అన్ని రకాల సైన్యం. సత్యం, అహింసా,శాంతి ఆయుధాలుగా పోరాడి సాధించిన ప్రత్యేకత ఇది.

Read more

ఆడ‌బిడ్డ‌ల‌కు ర‌క్ష‌ణ క‌రువు

‘‘ దేశంలో మహిళలు, చిన్నారులపై ఘాయిత్యాలకు అడ్డుకట్ట పడడం లేదు. కఠిన శిక్షలు విధిస్తున్నా కామాంధులు ఆగడాలు కొనసాగుతున్నాయి. చిన్న పిల్లలపై కూడా కొందరు కామంతో కళ్లు మూసుకు పోయి, లైంగిక దాడులకు పాల్పడు తున్నారు. ఆడపిల్లలను గౌరవించేవారు కానీ…వారిని రక్షించేవారుకానీ….వారి హక్కు లను పరిరక్షించేవారు కానీ…. నేటికాలంలో నానాటికీ తగ్గిపోతూ ఉండటం,ఆడపిల్లల పట్ల వివక్ష పెరిగిపోతుండడం చాలా దుర దృష్టకరం. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆడపిల్లలపై సామూహిక అత్యాచార ఘటనలు,లైంగిక వేధింపులు పెరుగుతుండటం బాధకరమైన విషయం ’’ – జి.ఏ.ఎస్‌.కుమార్‌
‘మాకు సురక్షిత స్థలాలంటూ ఏమైనా ఉంటే అవి అమ్మ గర్భం, సమాధి మాత్రమే’ – నైతిక విలువలకు నిలువునా పాతరేస్తూ, ఆడబిడ్డలకు అడుగడుగునా నరకం చూపిస్తున్న సమాజంపై ఓ చిన్నారి ఛీత్కరింపు ఇది! గతేడాది డిసెం బరులో చెన్నరుకి చెందిన ఆ పదకొండో తరగతి విద్యార్థినిని ఒక ఉపాధ్యాయుడి కొడుకు అను నిత్యం వేధింపులకు గురిచేస్తుండగా.. సహించ లేక ఆత్మహత్య చేసుకుంది. బలవన్మర ణానికి ముందు భావోద్వేగంతో రాసిన లేఖ సమాజం లో మహిళల దుస్థితికి దర్పణం పట్టింది. ఆ చిట్టితల్లి మాటలను నిజం చేస్తూనే గుడిలో, బడిలో,బంధుమిత్రుల ఒడిలో,ఇప్పుడు ఆసు పత్రుల్లో,ఎక్కడైనా సరే,ఆడపిల్లలకు భద్రత లేని దౌర్భాగ్యపూరిత వాతావరణానికి విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మతిస్థిమితం లేని ఒక మహిళపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన అద్దంపడుతోంది. తరతరాలుగా అమ్మ దేవతలను ఆరాధిస్తూ,పరాయి స్త్రీల వంక కన్నెత్తి చూడటమే మహాపాపంగా భావించాలని చెప్పే నీతులన్నీ ఏమైపోతున్నాయి? దేశంలో మహిళ లకు రక్షణ కల్పించడమే ఒక ప్రధాన సమస్యగా మారిపోవడం సిగ్గుచేటు. మగపిల్లలను ముద్దు చేస్తూ ఆడపిల్లలను ఆంక్షల పంజరంలో బంధి స్తున్న పితస్వామ్య భావజాలం, వ్యక్తిత్వానికి వన్నెలద్దడంలో విఫలమవుతున్న విద్యా విధానం, నేరాల నియంత్రణలో ప్రభుత్వ యంత్రాంగపు ఘోర వైఫల్యాలు కలిసికట్టుగా మహిళలపై ఆకృత్యాలు పెరిగిపోవడానికి కారణ మౌతున్నాయన్న నిపుణుల మాటలు అక్షర సత్యాలు. హైదరాబాద్‌లో ‘దిశ’ ఘటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి దారు ణాలు జరగనివ్వబోమంటూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఆ క్రమంలోనే దిశ బిల్లు, దిశ పోలీసు స్టేషన్లు, దిశ వాహనాలు,దిశ యాప్‌ అంటూ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. వీటన్నింటి లోనూ ప్రచార్భాటం తప్ప ఆకృత్యాలను అడ్డుకునేందుకు చిత్తశుద్ధితో చేపట్టిన చర్యలు కానరావు. ఆదిశ బిల్లు నేటికీ చట్ట రూపం దాల్చలేదంటే పాలకుల చిత్తశుద్ధి ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఇలాంటి అకత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి. విచ్చల విడిగా సంచరిస్తున్న మానవ మగాల మాయల్లో చిక్కి విలవిల్లాడే మహిళలకు,చిన్నారులకు లెక్కే లేదు.దేశవ్యాప్తంగా నిత్యం ఇలాంటి ఘోరాలు నేరాల సంఖ్య అంతకంతకు పెరిగిపోతూనే ఉంది. చిన్నాపెద్దా తేడా లేదు..అడ్డూ అదుపూ అసలే లేదు..ఎన్ని రకాల చట్టాలు వచ్చినా, ఎంత గట్టి శిక్షలు అమలవుతున్నా అత్యంత పైశాచిక ప్రవత్తి కలిగిన మానవ మగాల పీడ వదలడం లేదు. ఉన్న చట్టాలకే చిన్నపాటి సవరణలు చేసి వాటికి నిర్భయ, దిశ అని పేర్లు పెట్టినంతనే మహిళలకు రక్షణ కల్పించినట్లు పాలకులు భావించడం వల్లే నేరస్తులు విచ్చలవిడిగా రాకాసి ప్రవత్తిని కొనసాగి స్తున్నారు. ఇలాంటి ఘటనల్లోని దోషులకు ఎలాంటి కాలయాపనా లేకుండా కఠినశిక్షలు పడేందుకు అవసరమైన చర్యలను ఇప్పటికైనా ప్రభుత్వాలు చేపట్టాల్సి వుంది. అలాగే నానాటికీ సమాజంలో విచ్చలవిడితనానికి ముకుతాడు వేసే చర్యలు చేపట్టాలి. పెడమార్గాలు పట్టిన యువత మత్తు పదార్ధాల ఊబిలో పడిపో తోంది. స్త్రీని ఒక వ్యాపార వస్తువుగా,ఆట బొమ్మగా పరిగణించే అత్యంత హేయమైన విష సంస్కతి నుంచి యువతను బయటపడేసేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. మాదక ద్రవ్యాలు, అమ్మాయిల అక్రమ రవాణా, తరచూ బాలల అదశ్యం వంటి సంఘటనల్లోనూ వాటి వెనుకనున్న అరాచక శక్తుల పీచమణిస్తే తప్ప ఇలాంటి ఘోరాలు తగ్గవు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో జరిగిన ఘటన అసాధారణమైనది. ప్రభుత్వ యంత్రాంగపు వైఫల్యం ఈ ఘటనలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. జనంతో రద్దీగా ఉండే ఆసు పత్రిలో ఒక గదిలో సామూహిక అత్యాచారానికి దుండగులు ఒడిగటుతుండే అక్కడ యంత్రాం గం ఏమైపోయింది? బాధిత తల్లిదండ్రులు ఆ బిడ్డ కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేస్తే నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసుల తీరు క్షంతవ్యం కాదు. రెండు రోజుల పాటు ఆసుపత్రిలో నిర్బంధించబడిరదన్న విషయం ఆమె తల్లిదండ్రులు చెబితే తప్ప గుర్తించలేని స్థితిలో ఆసుపత్రి, పోలీసు అధికార యంత్రాం గం మిన్నకుండడం దారుణం. వ్యవస్థలోని ఈ లోపాలన్నిటిని సరి చేస్తేనే మహిళలకు, చిన్నారు లకు రక్షణ దక్కేది. ఇలాంటి దురాగతాలు వెలుగులోకి వచ్చినప్పుడు హడావిడి చేయడం, నష్టపరిహారం ప్రకటించడంతో పాలకులు చేతులు దులిపేసుకుంటే సరిపోదు. ఇప్పటికైనా మహిళల రక్షణకు, చిన్నారుల సంరక్షణకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టాలి. ఇద్దరు పోలీసు అధికారులతోనే పరిమితం కాకుండా విజయవాడ దారుణ ఘటనటకు బాధ్యులైన వారందిరి పైనా కఠిన చర్యలు చేపట్టాలి.
స్త్రీ లేనిదే అసలు సృష్టే లేదు.
నేటి బాలికలే రేపటి స్త్రీమూర్తులు. స్త్రీ లేనిదే సమాజానికి అతీగతీ లేదు. స్త్రీ లేని సమాజాన్ని అసలు ఊహించలేం. ఒక్కమాటలో చెప్పాలంటే స్త్రీ లేనిదే అసలు సృష్టే లేదు. ఇవన్నీ అందరికీ బాగా తెలిసిన విషయాలే. తెలియనిదల్లా ఏమైనా ఉందంటే.. వారిని ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయకూడదన్నదే. ప్రపంచ మంతటా పురుషాధిక్యత పెరిగిపోయిన నేటిరోజుల్లో, ఆడపిల్లల పరిస్థితి నానాటికీ మరింత దయనీయంగానే ఉంటోంది. నేటికీ ప్రపంచంలో బడి చదువులకు దూరమైన బాలికలు కనీసం 40 మిలియన్ల మందికి పైగానే ఉన్నారని నిపుణుల అంచనా. అంతేకాదు బాల్య వివాహాలతో నరకప్రాయమైన జీవితాలను అనుభవిస్తున్నవారు ప్రపంచంలో కోట్ల సంఖ్యలోనే ఉన్నారని కూడా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.ఎంతో ఘనమైన సంస్కృతి సంప్రదాయలున్న మన దేశంలో కూడా స్త్రీల పట్ల ముఖ్యంగా బాలికల పట్ల ఎంతోకాలం నుంచి అంతులేని వివక్ష కొనసాగు తూనే ఉంది. ఆడపిల్లలు పుడితే పెద్ద భారంగా పరిణ మిస్తారని, వారిని పెంచి పెద్దచేయడం ఒక సమస్య అని, వారికి పెళ్ళి చేసి ఒక అయ్య చేతిలో పెట్టడం మరింత కష్టమని భావించే వారు పెద్దసంఖ్యలోనే ఉంటున్నారన్నది నిష్టుర సత్యం. మన కుటుంబవ్యవస్థలో బాలికల పట్ల చిన్నచూపు చూసేవారే అధికంగా ఉంటుండం బహిరంగ రహస్యం. అంతేకాదు మనదేశం లోనూ బాలికల పట్ల..మహిళలపట్ల లైంగిక దాడులు, అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలు నానాటికీ పెరిగిపోతూనే ఉన్నాయి. మహిళలపై నేరాలు ఘోరాలు,దౌర్జన్యాలు పెచ్చరిల్లిపోతూనే ఉన్నాయి. ముక్కుపచ్చలారని బాలికలపై కూడా అమానుషాలు కొనసాగుతూనే ఉన్నాయి. అనుక్షణం అభద్రతాభావంతో తల్ల డిల్లే పసిమొగ్గలు ఎందరో!..ఈ బాధలు పడలేక..’ఆడపిల్లగా పుట్టడం కంటే అడవిలో మానై పుట్టినా బావుణ్ణు’..అని మహిళాలోకం కన్నీరుపెట్టుకునే దుస్థితి ఎప్పటికి పోతుందో ఏమో!..ఆడపిల్లగా పుట్టడమే ఒక పాపంగానో, ఒక శాపంగానో భావించే దుర్గతి ఇలా ఇంకా ఎంతకాలం?పసిపాపగా పుట్టి..చెల్లిగా, ఇల్లా లిగా,తల్లిగా..ఈ కాఠిన్యపు ప్రపంచానికి ఆత్మీ యతాను బంధాలను ప్రేమానురాగాలను నేర్పేం దుకు వచ్చిన దేవతకు..ఈ లోకంలో ఎన్ని కష్టాలో..ఎన్ని కన్నీళ్ళో! చిన్నతనం నుంచే ఆడపిల్లలకు కష్టాలు ప్రారంభమవుతున్నాయి. వారి ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా వారిపై అధికారం చెలాయించడం, బాలికలు కదా అని చులకనగా చూడడం అనేక కుటుంబాల్లో సర్వ సాధారణ కృత్యమైపోతోంది. సమాజంలో ఎక్కడ చూసినా ఆడపిల్లల పట్ల చులకనభావమే కనపడుతోంది. అంతేకాదు, పుట్టినప్పుడే ఆడశిశువులను ఏ చెత్తకుప్పలోనే పారవేసే దయనీయ సంఘటనలు.. దృశ్యాలు కూడా మనం అప్పుడప్పుడూ వింటున్నవే..చూస్తున్నవే. బాలికలను అమానవీయంగా వ్యభిచారగృహాలకు తరలించే దౌర్భాగ్య ముఠాలకు కూడా కొదవ లేదనే సంగతి కూడా మనం వింటున్నదే. ఇక పేదింట్లో పుట్టిన ఆడపిల్లల సంగతి మరింత దారుణంగా ఉంటోంది. ఆడపిల్లగా పుట్టి చాకిరీకి, వంటింటి పనులకే పరిమి తమయ్యే వారి సంఖ్య లెక్కకు మిక్కుటంగానే ఉంటోంది. కుటుంబ పోషణను కూడా నెత్తినేసుకుని కూలిపనులకు కూడా వెళ్ళేవారు ఎందరో?.. సరైన పోషకాహారం కూడా లేక చిక్కి శల్యమ వుతున్న బాలికల సంఖ్య కోట్లల్లోనే ఉంది. కుటుంబ వ్యవస్థలో ఆడపిల్లలకు ప్రత్యేకస్థానంతో పాటు మంచి గౌరవం ఇవ్వడం, ఆప్యాయతానురాగాలతో వారిని పెంచి పెద్దచేయడం,వారి జీవితాలకు ఎల్ల వేళలా అండగా ఉంటూ వారిని సంరక్షించుకునే మంచిమనుషులు కూడా సమాజంలో లేక పోలేదు. అయితే పేదరికంతోనో,అవిద్య వల్లనో, అసమానత వల్లనో దేశంలో మరెంతోమంది బాలికల భవిష్యత్తు నేటికీ అంధకారమయంగానే ఉంటోంది.ప్రభుత్వాలు, పాలకులు ఎంతో మంచిమనసుతో బాలికల కోసం,మహిళల కోసం,స్త్రీల కోసం అనేక పథకాలు, వారి రక్షణ కోసం, వారి హక్కుల పరిరక్షణ కోసం ఎప్పటి కప్పుడు అనేకానేక చట్టాలు చేస్తూనే ఉన్నా.. సమాజంలో ఆడపిల్లల పట్ట, మహిళామతల్లుల పట్ల వివక్ష..అఘాయిత్యాలు తొలగిపోవడం లేదు. ఇకనైనా ఈ దుస్థితి..ఈ దుర్గతి మారాలి. ఆడపిల్ల లంటే మన ఇంటికి జీవనజ్యోతులని గ్రహించుకోవాలి. ఆడపిల్లలంటే కేవలం అబలలు కాదని,కాస్తంత ఆత్మవిశ్వాసాన్ని-ప్రోత్సాహాన్ని అందిస్తే చాలు..వాళ్ళు మనల్ని, మన కుటుంబగౌరవాన్ని,దేశ సౌభగ్యాన్ని కూడా నిలబెట్టే ధీరవనితలవుతారని,సమాజాన్ని ఆదర్శ వంతంగా,ప్రతిభావంతంగా తీర్చిదిద్దే ప్రతిభా మూర్తులని కూడా తెలుసుకోవాలి. కేవలం ప్రభుత్వాలు మాత్రమే ఇవన్నీ చూసుకోవాలనే ఆలోచనలు మానుకుని..మనవంతు బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఆడపిల్లలను, ముఖ్యంగా బాలికలను సంరక్షించుకోవాలి. ఆడపిల్ల పుట్టిందంటే మన ఇంట మహాలక్ష్మి పుట్టిందని సంతోషించాలి. వారి మనసును కష్టపెట్టకుండా మంచి చదువులు చెప్పించి, ఇష్టపడే రంగాల్లో ప్రోత్సహించి వారి అభివృద్ధికి బాటలు వేయాలి. ఈ పవిత్ర కర్తవ్యాన్ని నిండుమనసుతో నిర్వహించేందుకు ప్రతిఒక్కరూ చిత్తశుద్ధితో కృషిచేయాలి. బాలికల పట్ల ఇలాంటి సదవగాహన, సద్భావనలు కలిగించేందుకే ఐక్యరాజ్యసమితి ప్రపంచవ్యాప్తంగా ‘అంతర్జాతీయ బాలికల దినోత్సవం’గా ప్రకటిం చింది. అందుకు సార్థకత చేకూరేలా ప్రతి ఒక్కరూ కృషిచేసినప్పుడే మన జీవితాలూ సార్థకమవుతాయి. ముఖ్యంగా.. బాలికలు, మహిళలపట్ల మానవీయతతో.. ఆత్మీయతతో ఉంటూ, వారికి అన్నివిధాలా రక్షణ కలిగించాలి. అప్పుడు వారే కాదు మనం, మన కుటుంబం, మన చుట్టూ ఉన్న సమాజం, మన దేశం..మొత్తంగా ప్రపంచమంతా కూడా ఆనందంతో పల్లవిస్తుంది.. ఎనలేని సంతోష పౌభాగ్యాలతో వెల్లివిరుస్తుంది.కానీ నేటి ఆధునీక సమాజంలో ఆడపిల్లలకు రక్షణ అనేది కరువైంది. ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తెచ్చినా ఆచరణకు నోచుకోవడంలేదు. మహిళలు హక్కులను పరిరక్షించే నాధుడు కరువయ్యారు.-

1 … 6 7 8 9 10 … 13