మ‌హిళా నీకో వంద‌నం..!

ఆమె..శక్తి స్వరూపిణి. సృష్టికి మూలం. ఆది అంతానికి సంధానకర్త. కుటుంబానికి సారథి. బాంధవ్యాలకు వారథి. రెప్పల మాటున కన్నీటి చుక్కలు దాచుకుని కుటుంబంపై పన్నీటిని చల్లేందుకు ప్రయత్నించే ప్రేమమయి. ఆమె త్యాగం అజరామరం. ఇంటా, బయట వివక్ష, వేధింపులే బహుమానంగా ఇస్తున్నా అంతులేని ఆత్మవిశ్వాసం ఆమె సొంతం. అదే ఆమె స్థైర్యానికి చిహ్నం. మహిళ జన్మనే కాదు.. జీవితాన్నిస్తుంది. అవసరమనుకుంటే జీవిత భారాన్ని మోస్తుంది. తాను పస్తులుండి బిడ్డల కడుపు నింపుతుంది. ఒక్కటేమిటి భారం మోసేది..బాధ్యతలు పంచుకునేది.. త్యాగానికి సిద్ధపడేది.. ఒక్క మహిళ మాత్రమే. అంతటి మాతృమూర్తిని చిన్నచూపు చూడటమా..? ఇది ఒకప్పటి మాట. ఆంక్షల చట్రాన్ని చీల్చుకుని అవకాశాల్లో క్షేత్రంలో విజయం కోసం పోరాడుతోంది నేటి మహిళ. ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం అని దూసుకు పోతున్న మహిళలు ఇప్పుడు యుద్ధక్షేత్రం లోనూ శత్రువుతో తలపడేందుకు సిద్ధమం టున్నారు. నింగి,నేల,నీరు..ఎక్కడైనా మేమున్నామని తమ శక్తియుక్తులు చాటు కుంటున్నారు. ఇలా అమ్మగా, అక్కగా, జీవన సహచరిగా బహుముఖ రూపంలో.. లాలనలోనూ, పాలనలోనూ, ఆటల్లోనూ, పాటల్లోనూ, శ్రమైక జీవన యానంలోనూ, అవనిలోనూ, అంతరిక్షంలోనూ ఆమె చెరగని సంతకం లిఖించుకుంటోంది. మార్చి 8 ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా అందిస్తున్న కథనం.
అన్నింటా ఆమె..
ఆకాశంలో సగం..అవకాశం సగం.. ఇది పాత నినాదం. అన్నింటా మేము.. కాదు కాదు అన్నిటా మేమే.. ఇదీ ఈనాటి మహిళల తాజా గళం. పట్టుదల,క్రమశిక్షణ పెట్టుబడిగా నేటి మహిళ ఓర్పు, నేర్పు, తెగువతో రాణిస్తోంది. ఇంటిని చక్కదిద్దే తత్వవేత్తగా,ఉద్యోగం చేసే మేటి వనితగా,చట్టసభల్లో సంస్కర్తగా పురుషులకు ధీటుగా ముందుకెళ్తోంది. ఒడిదుడుకుల్లో వెనుకంజ వేయకుండా అద్వితీయంగా అడుగులేస్తోంది. జిల్లాలోని పలువురు మహిళలు పేదరికాన్ని పట్టుదలగా తీసుకొని ఆత్మవిశ్వాసంతో ఎదురొడ్డి విజయం సాధిస్తున్నారు. కన్నీటి కష్టంలోనూ,కడుపు తరుక్కుపోయే విషాదంలోనూ ధీర వనితగా ప్రశంసలు అందుకుంటున్నారు. మరికొందరు పేద కుటుంబంలో పుట్టి ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఉద్యోగ బాధ్యతలు చూస్తూనే కుటుంబాన్ని అద్వితీయంగా సాకుతున్నారు. ఇంకొందరు వ్యాపార రంగంలోనూ శభాష్‌ అనిపించుకుంటున్నారు. ఈ క్రమంలో నేటి మహిళలు అడుగు పెట్టని చోటులేదు. సాధించని విజయం లేదు.ఒకప్పుడు మహిళలంటే వంటిల్లు..సంప్రదాయాలు, కట్టుబాట్లకు మధ్య గడిపే జీవితమే జీవితం. ఇవాళ దాని అర్థమే మారిపోయింది. తమకున్న ఓర్పుని,సహనాన్ని పెట్టుబడిగా పెట్టి మరీ సాధించుకున్న విజయాలకు ప్రతినిధిగా నేటి మహిళ నిలుస్తోంది.
గృహిణి నుంచి పాలకురాలిగా..
సూర్యోదయానికి ముందే స్త్రి విధి నిర్వహణ ఆరంభమవుతుంది.ఆమెకు అతిపెద్ద బాధ్యత పిల్లల పెంపకం.పిల్లలను బడికి పంపడం తొలి విధి. ఐదు నిమిషాలు ఆలస్యమైనా క్యారేజీ ఉండదనో,స్కూలు బస్సు పోతుందనో భయం. పిల్లల ఆలనాపాలనా చూసుకుంటూనే మిగిలిన పనులు చక్కబెట్టాలి. అందుకే సైకాలజిస్టులు గృహిణి పాత్రకంటే ఉద్యోగ జీవితం మేలు అంటారు. సాధారణ గృహిణి నుంచి ప్రభు త్వాలను నడిపించగల సామర్థ్యం ఉన్న శక్తిగా మహిళ ఎదిగింది. రాజకీయాలు,క్రీడలు, పాలనా..ఇలా ముఖ్యమైన అన్ని రంగాల్లో రాణిస్తూ పురుషులకు ఏ మాత్రం తీసుపోని నైపుణ్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇది నాణానికి ఒకైపు. మరోవైపు వివక్ష, అడుగడుగునా ఇబ్బందులు ఉన్నాయి. స్త్రి విలాస వస్తువు కొందరికి,ఇంటి యంత్రం మరికొందరికి. ఆమె అభిప్రాయానికి విలువ లేదు. ఆమె సూచన పట్టించుకునే వారు లేరు. ఆమె ఇష్టాఇష్టాలకు గౌరవం దక్కదు. అయినా వెరవని ధైర్యంతో ముందుకు సాగుతోంది మహిళ. బయట మాట పక్కన పెడితే ఇంట్లో కూడా గౌరవాన్ని ఆశించే చాలామంది మహిళలకు నిరాశే మిగులుతోంది. బాల్యం నుంచే స్త్రి ఇబ్బందులు ఎదుర్కొంటూ ముందుకు సాగుతోంది. చిన్నప్పుడు ఆడపిల్ల ఆనే వివక్ష, యవ్వనంలో ఆకతాయిలు, పోకిరీల సమస్య, ఉద్యోగ జీవితంలో లైంగిక వేధింపులు, పెళ్లాయాక్కైనా ఆమె జీవితానికి ఆసరా లభిస్తుం దనుకుంటే అక్కడా ఇబ్బందులు పడేవారే అధికం.అత్తింటి ఆరళ్లు, భర్త వరకట్న వేధిం పులు.. ఇలా ఎన్నో సమస్యలు వెన్నంటే నడుస్తుంటాయి. ఇంటిల్లిపాదికి బండెడు చాకిరీ చేసినా సమయానికి అల్పాహారం తీసుకునే పరిస్థితి కూడా చాలామందికి ఉండదు. దీంతో అనారోగ్య సమస్యలు వెన్నంటే ఉంటాయి. కనీసం మధ్యాహ్నమైనా సమయానికి తింటుందా అంటే ఆ అవకాశం కూడా ఉండటం లేదు. ఇంటిపని, ఆఫీస్‌ పని చేసుకునే మహిళలు తమకు తెలియకుండానే ఓ రకమైన ఒత్తిడికి గురవుతున్నారు. దాదాపు 80శాతం మంది మహిళలది ఇదే పరిస్థితి అన్నది నిపుణుల మాట. ఈ మహిళల హక్కుల కోసం వందేళ్ల క్రితం జరిపిన పోరాటం సాక్షిగా మహిళా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా మార్చి 8న మొదలైంది.1911లో మహిళలు రగిల్చిన స్ఫూర్తి ఎందరో మహిళల్లో ధైర్యాన్ని నింపింది. నేటి స్త్రీ చదువుల్లో,ఉద్యోగాల్లో ముందుండి. ఏ రంగంలోనైనా నేను సైతం అంటున్న స్త్రీని సమాజం ఇప్పటికీ ఆమె వ్యక్తిత్వాన్ని, ఇష్టా ఇష్టాలను అభిప్రాయాలను గుర్తించడం లేదు.అనంతర పరిణామాల్లో భాగంగా 1975లో యుఎన్‌ఒ స్త్రీల సమస్యలను చర్చించడానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఏదేశానికీ, ఏ జాతికి చెందిన స్త్రీ అయినా సమానంగానే అణిచివేతకు గురవుతున్న స్త్రీల సమస్యలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరగాలని ఆ సమావేశం పేర్కొంది. అప్పటి నుంచి 1975లోనే మార్చి 8వ తేదీని అంతర్జా తీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది.
ఆరోగ్యమూ అంతంత మాత్రమే..
పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా ఎన్నో పనులు, మరెన్నో బాధ్యతలు..! క్షణం తీరికలేని ఈ నిత్య సమరం ముందు ఆమె తన ఆరోగ్యాన్ని పణంగా పెడుతోంది. మహిళలు పనుల్లో పడిపోతున్నారని,ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని అనేక సర్వేల్లో తేలింది. అనారో గ్యానికి గురైనప్పుడే మాత్రమే రెగ్యులర్‌ చెకప ్‌లకు వెళుతున్నట్టు 63శాతం మంది మహిళలు అంటున్నారు.16మంది మాత్రమే రెగ్యులర్‌ చెకప్‌లకు వెళ్తున్నట్లు తెలిసింది.71 శాతం మహిళలు ఏడాదిలో ఒకటిరెండుసార్లు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. ఇన్ని సమస్యలు చుట్టుముడుతున్నా కేవలం 39శాతం మంది మహిళలకు మాత్రమే హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఉంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడంలో మగవారితో పోల్చుకుంటే కీళ్ల నొప్పులు,రక్తహీనత,హార్మోన్ల అసమతుల్యత క్యాన్సర్ల బారిన పడే అవకాశాలు మహిళల్లో ఎక్కువని ఆరోగ్య నిపుణులు చెబుతు న్నారని ఒక నివేదిక తేల్చి చెప్పింది.
మహిళల స్థితిగతులు ఇలా
వ్యవసాయేతర ఉపాధిలో మహిళలు 20 శాతమే.పట్టణ శ్రామిక శక్తిలో మహిళలు 33.9 శాతం,గ్రామాల్లో 49.9శాతం ఉన్నారు.
ఆడపిల్లను భారంగానే చూస్తున్నారు
ఆడపిల్ల పుడితే గుండెల మీద భారంగానే నేటికీ భావిస్తున్నారు. ఈ వివక్షే ఆడపిల్లకు కొనిచ్చే బొమ్మల దగ్గర నుంచి చదివించి పెళ్లిళ్లు చేసే వరకు కొనసాగుతోంది. ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటే చిన్నవాడైన తమ్ముడిని తోడు తీసుకుని వెళ్లమంటారు. అప్పటి నుంచే నువ్వు బయటకి వెళితే భద్రత ఉండదని నేర్పిస్తారు. అలా ఒక ముందడుగు వేస్తే… రెండు అడుగులు వెనక్కి లాగుతారు తల్లిదండ్రులు. ఇంటి పనుల్లో సాయం చేయ మని కూతురిని అడుగుతారు. కానీ కొడుకును అడుగరు. ఇలాంటి ఎన్నో వివక్ష మూలాలు ప్రతి ఇంట్లో..ప్రతి బిడ్డా పురిటికందుగా ఉన్నప్పటి నుంచే మొదలవుతాయి. ఇక మంచి చెడులను విడమర్చి అర్థం చేసుకునే అవకాశం కూడ లేకుండా పోయింది దీంతో. తల్లి దండ్రు లు ఆడపిల్లలను ఒకే చట్రంలో బంధిస్తున్నారు.
భయపెడుతున్న గణాంకాలు
సాంకేతికంగా ఎంత అభివద్ధి చెందినప్పటికీ బాలికల, మహిళలు పట్ల వివక్ష పెరుగుతూనే ఉందని పలు సంస్థలు చేసిన సర్వేలు చెబుతు న్నాయి. 2011జనాభా లెక్కల ప్రకారం. ఆరేళ్ల లోపు చిన్నారుల్లో ప్రతి వెయ్యిమంది మగ పిల్ల లకు కేవలం 914మందే ఆడపిల్లలు ఉన్నారు. 2001లో ఆరేళ్లలోపు మగ,ఆడపిల్లల నిష్పత్తి 1000:943 ఉండగా,పదేళ్ల అనంతరం ఆడ పిల్లల సంఖ్య మరింతగా దిగజారడం ఆందోళ నకర పరిణామం.2015 సెప్టెంబరు నాటికీ వెయ్యి మంది పురుషులకు 943 మంది ఆడపిల్లలున్నారు. అంతే కాదు, మహిళలపై జరుగుతున్న హింస కూడా పెరిగింది. ప్రత్యక్షం గా మహిళలు అన్ని రంగాల్లో ముందు న్నా సమానత్వం మాత్రం పూర్తిగా లభించలేదని చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలకు భద్రత కరువయ్యింది. అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు చట్టసభల్లో సమానత్వం ఉందని చెబుతున్నా ‘పేరుకే పెత్తనం’ అనే చందంగా వ్యవస్థ సాగుతోంది.
రాజకీయంగా రాణింపు
మహిళలు రాజకీయంగా సమాన అవకాశాలను పొందుతున్నారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లా ల నుంచి శాసనసభ, పార్లమెంటుకు నలుగురు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల జరిగిన జెడ్పీటీసీ/మండల/గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జిల్లాలో 564 మహిళా సర్పంచ్‌లు, 6117 మహిళా వార్డు మెంబర్లుగా గెలిచి గ్రామీణా భివృద్దిలో కీలకపాత్ర పోషిస్తున్నారు. రాజకీయ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి విద్యావంతులైన యువతలు చొరవ చూపి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచారు.
ఆర్థిక సాధికారత.. మహిళకు భద్రత
మన దేశంలో మహిళలు ఆర్థిక సాధికారత విషయంలో ఇంకా వెనుకబడి ఉన్నారు. విభిన్న రంగాల్లో మహిళలు ఎంతగానో పురోగమిం చినా ఆర్థిక సాధికారతలో మాత్రం వెనుక బడిపోవడానికి కుటుంబ కట్టుబాట్లు, తల్లిదం డ్రుల ఆలోచనా ధోరణులు,మహిళలు స్వయం గా విధించుకునే పరిమితులు కారణమని చెప్పవచ్చు. పని ప్రదేశాల్లో మహిళలకు పురుషులతో పోల్చితే తక్కువ వేతనాలు అందు తున్నాయి. ఆర్థికపరమైన అంశాలపై అవగా హన లేకపోవడం, కుటుంబ బాధ్యతలు, వివాహపరమైన అవరోధాలు మహిళలు ఆర్థికంగా పురోగమించకుండా అడ్డు తగులు తున్నాయి. చట్టాల్లో కూడా వారి పట్ల వివక్ష అధికంగా ఉంది. ఈ అవరోధాలన్నీ దాటు కుంటూ వారు ఆర్థిక సాధికారత సాధించడం ఎలాగంటే.. ఆర్థిక అక్షరాస్యతకు ప్రాధాన్యం భారత మహిళలు ఆర్థిక బాధ్యతలు చేపట్టేం దుకు విముఖంగా ఉంటారు. దీనివల్ల వారి వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో కూడా పురుషులదే పైచేయిగా మారుతుంది. ఉద్యోగా లు చేస్తున్న మహిళలు కూడా తమ ఆర్థిక వ్యవహారాల నిర్వహణను భర్తకు అప్పగిస్తుం టారు. దీంతో ఆర్థికపరమైన అంశాలపై అవగాహన తక్కువగా ఉండటానికి అవకాశం ఏర్పడుతుంది. పురుషులతో పోల్చితే మహిళల సగటు జీవిత కాలం అధికంగా ఉంటుంది. ఒక అధ్యయనం ప్రకారం 60 ఏళ్లు నిండే సమ యానికి పురుషుల సగటు జీవిత కాలం 77.2 సంవత్సరాలుంటే మహిళలకు 78.6 సంవత్స రాలుంది. అంటే పురుషులతో పోల్చితే మహిళలే సగటున ఎక్కువ కాలం జీవిస్తు న్నారన్న మాట. 2011 జనాభా లెక్కల ప్రకారం అవివాహితలు,విడాకులు తీసుకు న్నవారు, భర్త లేని వారు, ఒంటరి మహిళల సంఖ్య 7.4 కోట్లుంది.ఇలాంటి వారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలంటే ఆర్థిక అక్షరాస్యత ఎంతైనా అవసరం. పొదుపు పెరగాలిపురుషులతో పోల్చితే మహిళలు అందుకునే వేతనాలు తక్కువగా ఉండడం పరిపాటి. సమాన హోదాలో పనిచేస్తున్నప్పటికీ వారు తక్కువ వేతనాలు పొందుతున్నారు. దీనికి తోడు మహిళలు ఆర్థిక వ్యవహారాలు సమర్థవం తంగా నిర్వహించలేరనే అపోహ కూడా సమాజంలో ఉంది. మహిళల సగటు జీవిత కాలం అధికంగా ఉంటున్న తరుణంలో సొంతంగానే ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టు కోగల నైపుణ్యాలు సాధించడం,దీర్ఘకాలిక పొదుపుపై దృష్టి పెట్టడం అవశ్యం. వేతనాలు తక్కువ ఉన్నందు వల్ల పురుషుల కన్నా అధికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది. మహిళలు ఉద్యోగం చేసే కాలపరిమితి పురుషులతో పోల్చితే తక్కువ. మాతృత్వపు సెలవులతోపాటు కుటుంబ సభ్యులు తీవ్ర అనారోగ్యం పాలైతే వారి సంరక్షణ బాధ్యతలు నిర్వర్తించేందుకు దీర్ఘకాలిక సెలవులు తీసుకోవడం వంటివి తప్పనిసరి.
భద్రత ప్రధానంకుటుంబ సంక్షేమంతో పాటు తమ సొంత భద్రతకు మహిళలు ప్రాధాన్యం ఇవ్వాలి. తమ పిల్లల భవిష్యత్‌ కోసం పొదుపు చేయడంతో పాటు తమ రిటైర్మెంట్‌ కోసం పొదుపు చేయడంపై దృష్టి పెట్టాలి. ఇందుకు విభిన్న పొదుపు సాధనాలను ఎంచుకోవడంతో పాటు వయసుల వారీగా కేటాయింపులు చేసుకోవాలి. ఉదాహరణకు 30 ఏళ్ల వయసున్న మహిళలు తమ కోసం పొదుపు చేసుకునే మొత్తంలో 70 శాతం ఈక్విటీకి, 30 శాతం డెట్‌కు కేటాయించుకోవచ్చు. వీటిలో ఈక్విటీ ఫండ్లతో పాటు ఈపీఎఫ్‌, వీపీఎఫ్‌, పీపీఎఫ్‌, ఎన్‌పీఎస్‌ వంటి రక్షిత సాధనాలపైనా దృష్టి పెట్టాలి. పొదుపు ఒక్కటే కాదు.. ఏదైనా ఆర్థిక సంక్షోభం తలెత్తితే ఆదుకునేందుకు కనీసం నాలుగు నుంచి ఆరు నెలల పాటు కుటుంబ ఖర్చులను తట్టుకోగల అత్యవసర నిధి సమకూర్చుకోవాలి. అంతేకాకుండా వార్షిక వేతనానికి 7 నుంచి 10 రెట్లు అధికంగా బీమా రక్షణ పొందాలి. జీవిత బీమాతోపాటు ఆరోగ్య రక్షణ ప్లాన్లు, క్రిటికల్‌ ఇల్‌నెస్‌ ప్లాన్లపై దృష్టి పెట్టాలి. ఒకేసారి ఇంత భారీ మొత్తం ఇన్వెస్ట్‌ చేయడానికి తటపటాయించే ఆస్కారం ఉంది.
అత్తమామల కోసం పెట్టే పెట్టుబడిలో కొంత మొత్తాన్ని ఆరోగ్య బీమాకు కేటాయించాలి. వయసు పెరిగే కొద్ది అనారోగ్యాల రిస్క్‌ అధికంగా ఉంటుంది. ఆ రిస్క్‌ను తట్టు కోవాలంటే అత్తమామలకు బీమా ఉండి తీరాలి. అలాగే పిల్లల కోసం పెట్టుబడి పెట్టే తరుణంలో 18 ఏళ్లు నిండే సమయానికి వారి ఆర్థిక అవసరాలకు అనుగుణంగా స్వల్పకాలిక, దీర్ఘకాలిక సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. పిల్లలకు 18 ఏళ్లు నిండే నాటికి ఉన్నత విద్యాభ్యాసం, వివాహం కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం దీర్ఘకాలిక క్రమానుగత పెట్టుబడి ప్రణాళిక (సిప్‌)ను అనుసరించాలి.
నేరాలు…చట్టాలు…శిక్షలు…
ా సెక్షన్‌ 228-ఎ – లైంగిక దాడికి గురైన మహిళ అనుమతి లేకుండా మీడియాలో ఆమె పేరు,ఫొటో,వివరాలు ప్రచురించ కూడదు.
ా సెక్షన్‌ 354 – మహిళ శరీరాన్ని లైంగిక ఉద్దేశంతో చూసినా, తాకినా, కనుసైగ చేసినా నేరమే.
ా సెక్షన్‌ 376 – వైద్యం కోసం వచ్చిన మహిళను లైంగికంగా వేధిస్తే ఈ సెక్షన్‌ కింద కేసు నమోదు అవుతుంది.
ా సెక్షన్‌ 509 – మహిళలతో అవమానకరంగా మాట్లాడినా, సైగలు చేసినా, అసభ్యకరమైన వస్తువులను ప్రదర్శించినా శిక్షకు అర్హులు.
ా సెక్షన్‌ 294 – మహిళలు రోడ్డుపైన నడుస్తున్నా, బస్టాపుల్లో వేచిఉన్నా, అసభ్యకరమైన పాటలు పాడుతూ, శబ్దాలు చేసి ఇబ్బంది పెడితే ఈ సెక్షన్‌ ప్రకారం 3 నెలలు శిక్ష పడుతుంది.
18 ఏళ్లలోపు బాలికను వ్యభిచార వృత్తిలోకి దించితే సెక్షన్‌ 373 ప్రకారం పదేళ్లు జైలు శిక్ష పడుతుంది. ఒకరికన్నా ఎక్కువ మంది ఉన్న బృందంలో ఒంటరిగా ఉన్న మహిళపై లైంగిక దాడి జరిగితే ఆ బృందంలోని ప్రతి వ్యక్తీ నేరస్తుడే. సెక్షన్‌ 376-బి కింద అందరికీ శిక్ష పడుతుంది. అత్యాచారం..ఐపీసీ 375 ప్రకారం ఏడేళ్లు జైలు శిక్ష నుంచి జీవిత ఖైదు. అవమానపరిచి దాడి చేస్తే ఐపీసీ 354 ప్రకారం 5నుంచి 7వరకు జైలు శిక్ష పడు తుంది. పెళ్లయినా కానట్లు మోసగించిన పురుషులకు ఐపీసీ 496 ప్రకారం 7ఏళ్లు జైలు,జరిమానా తప్పదు. ఇలాంటి ఎన్నో కఠినమైన చట్టాలు,శిక్షణలు ఉన్నా మహిళలపై జరుగుతున్న లైంగికదాడులు,వేధింపులు ఆగకపోవడం శోచనీయం. – సైమన్‌ గునపర్తి

మన పంచాయితీ..మనదే రాజ్యాం

‘‘పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ, ప్రజలకు కావలసిన సౌక ర్యాల కల్పనలో వార్డు సభ్యుల పాత్ర చాలా కీలకం. వార్డు సభ్యులు పంచాయతీ సమావేశాల్లో, కార్యాచరణ కమిటీల్లో సభ్యులుగా తమ బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుంది. పంచాయతీ అంటే సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, వార్డు సభ్యులతో పాటు పంచాయతీ కార్యదర్శి ప్రభుత్వం తరపున ప్రధాన పరిపాలనా ఉద్యోగిగా ఉంటారు. పరిపాలనాపరమైన నిర్ణయాలను తీసుకునే అధికారం సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, వార్డు సభ్యులది కాగా, ఆ నిర్ణయా లను అమలు చేసే బాధ్యత మాత్రం కార్యదర్శిది. దీంట్లో భాగంగా గ్రామసభ విధివిధానాలను పాటిస్తూ విశాఖ జిల్లా అనంతగిరి మండలం బొర్రా పంచాయితీ గ్రామసభ సంర్పంచ్‌ జన్ని అప్పారావు అధ్యక్షతన జరిగింది. పలు అంశాలపై తీర్మాణాలు చేశారు. విశేషాధి కారులన్న పీసా చట్టంపై ప్రతి గిరిజన గ్రామం లోను గిరిజనులను చైతన్య పర్చడం, పంచా యితీకి ఆదాయవనరులపైన, గిరిజను లకు సమత తీర్పును అనుసరిస్తూ స్థానిక వనరులను కాపాడుకోవడం వంటి అంశాలను గ్రామసభలో తీర్మానించి ఆమోదించడం జరిగింది’’
బొర్రా గేటువలస పంచాయతీ సర్పంచ్‌ జన్ని అప్పారావు అధ్యక్షతన గ్రామసభ జరిగింది. పంచాయితీ పరిధిలో ఉన్న 15గ్రామాల నుంచి పంచాయితీ సభ్యులు,మరియు కొంతమంది గ్రామస్థులు,వివిధ శాఖల అధికారులు,మార్కెట్‌ యార్డ్‌ కమిటి డైరెక్టర్‌ దోనేరి పార్వతి, ఎం.పి. టి.సి.కురిసేలా అరుణ, పీసా ఉపాధ్యక్షులు దోనేరి డానియల్‌, మరియు బొర్రా స్కూల్‌ సిబ్బంది,ఉపాధి హామీ పధకం వి.ఆర్‌.పి సాంరెడ్డి గోపి,టెక్నీకల్‌ అసిస్టెంట్‌ జగన్‌,హెల్త్‌ సిబ్బంది,సచివాలయం సిబ్బంది హజర య్యారు.గ్రామసభలో పంచాయితీ సర్పంచ్‌ జన్ని అప్పారావు మాట్లాడుతూ బొర్రా పంచాయితీని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి అధికారులు,ప్రజలు సహకరించాలని కోరారు. అనంతరం సభ్యుల ఆమోదం,పంచాయితీ అభివృద్ధి చేయడానికి కావాల్సిన వనరులను రాబట్టేందకుగాను పీసా చట్టం ప్రకారం పలు అంశాలను తీర్మానిం చారు. బొర్రా గుహల వద్ద వాహన పార్కింగ్‌, ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక సంస్థ నుంచి పంచా యితీకి రావాల్సిన 20శాతం వాటా,వీధి దీపాలు ఆధునీకరణ,ఎన్‌ఆర్‌జీఎస్‌ పనిదినాలకు రావాల్సిన కూలీల సొమ్ములు, వేసవికాలం సమీపిస్తున్న నేపథ్యంలో గిరిజన ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా మంచినీటి సౌకర్యం కల్పించడం వంటి ముఖ్యమైన అంశాలను తీర్మాణించడం జరిగింది. తర్వాత సర్పంచ్‌ జన్ని అప్పారావు స్వాగతం పలికి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మేము ఆరోగ్య శ్రీ,రేషన్‌ కార్డు, పెన్షన్‌,పి.యం.కిసాన్‌, రైతు భరోసా మొదలగు పధకాల గురించి పంచాయతీ ఆఫీసు లో బోర్డు పెట్టియున్నాము. అది మీరు చదువుకొని ఏదైనా సమస్య ఉంటె మీరు సచివాలయం నకు పిర్యాదు చేయవచ్చు. అలానే మన సమస్యలు ఏమి ఉన్న ఇక్కడ చర్చించా వచ్చు. గతంలో మన గ్రామాల్లో నీటి సమస్య ఎక్కువగా ఉండేది. మరి ఇప్పుడు కొంతవరకు ఈ సమస్యను తగ్గించడం జరిగింది. ఇప్పుడు కొన్ని గ్రామాల్లో కరెంటు కొరత ఉంది. గ్రామాల్లో కరెంటు స్తంభాలు వేయాలి. ఆ సమస్య కూడా ఎలెక్ట్రిసిటీ వారితో మాట్లాడతానని చెప్పారు. సర్పంచిగా నేను మాట్లాడటం కాదు…అన్ని శాఖలు నుండి గవర్నమెంటు వారు వచ్చారు కాబట్టి ఒకొక్కరిని మాట్లాడమని పిలవడం జరిగింది. సంవత్స రానికి మూడు, నాలుగు గ్రామసభలు జరుగు తాయి. ఒకటి సాధారణ సమావేశం,మిగతావి గ్రామసభ ఇందులో మనకి ఉన్న సమస్యలు గురించి చర్చించు కోవడం. ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలకు తీర్మానాలు చేయడం జరుగుతుంది. ఈసందర్భంగా బొర్రా కేవ్స్‌ పార్కింగ్‌ గురించి ఒకతీర్మానం చేయడం జరిగింది. డి.పి.ఓ. డి.ఎల్‌.పి.ఓగారికి కూడా లెటర్‌ ఇవ్వడం జరిగింది. ఈరోజూ ట్రయిల్‌రన్‌ చేసి పి.ఓ గారి ద్వారా ఓపెన్‌ చేయడం జరుగుతుంది. పార్కింగ్‌ ఫీజు పంచాయతీ వాసులు చేస్తది. వ్యాసకర్త : కె.సతీష్‌కుమార్‌,సమత ఫీల్డ్‌కో`ఆర్డినేటర్‌

ఉపాధి బ‌హుదూరం..పెరుగుతున్న నిరుద్యోగం!

స్వాతంత్య్రం వచ్చాక గడచిన ఏడు దశాబ్దాల్లో ఎన్నడూ చూడని ఆర్థిక మాంద్యం ఇది. ఇప్పటికే కోట్లాది జనం ఉపాధి పోయి వినియోగదారుల గిరాకీ తగ్గింది. మరోపక్క కరోనాకు కవచమైన టీకా ప్రక్రియేమో మందకొడిగా సాగుతోంది. వీటన్నిటి మధ్య కరోనా కాస్తంత నెమ్మదించినా, సత్వర ఆర్థిక పురోగతిని ఆశించలేం. భారత ఆర్థిక వ్యవస్థ కరోనా ముందటి స్థాయికి మళ్ళీ చేరే సూచనలు వచ్చే 2022 మార్చి వరకైతే లేనే లేవని పలువురి ఉవాచ.నిరాశ ధ్వనించినా, ఈ హెచ్చరికలు, సర్వేలు చెబుతున్న నిరుద్యోగ గణాంకాలను పాలకులు నిశితంగా గమనించాలి. భయపెడుతున్న కొత్త వేవ్‌ల పట్ల జాగ్రత్తలు తీసుకుంటూనే, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకొనేలా చర్యలు చేపట్టాలి. అది అనివార్య పరిస్థితి. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపులు ఇస్తున్నది ఆ దృష్టితోనే! కాకపోతే, అదొక్కటే కాదు.. ఆర్థిక పునరుత్తేజానికిచ్చిన ప్యాకేజీల్లో లోటుపాట్లనూ సవరించుకోవాలి. ఉపాధి కల్పనకు వీలుగా వృత్తివిద్యా శిక్షణను పెంచాలి.
దేశ వ్యాప్తంగా నిరుద్యోగం తాండవించడంతో ఉపాధి బహు దూరమైంది. ఈ సమస్య సమీప భవిష్యత్తులో ఓమహాఉద్యమంలా మారనున్నది. సిఎమ్‌ఐఇ (సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎకానమీ) విడుదల చేసిన నిరుద్యోగ గణాంకాలు పరీశీలిస్తే..దేశంలో ఎంతమంది ఉపాధిలేక రోడ్డున పడినట్టు తెలుస్తోంది. సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) ప్రకారం..2021 డిసెంబర్‌ చివరి నాటికి దేశ వ్యాప్తంగా నిరుద్యోగ రేటు 7.91 శాతంగా నమోదైనట్టు వెల్లడిరచింది. 2021 సెప్టెంబర్‌ నుంచి ప్రతి నెల నిరుద్యోగ రేటు పెరుగుతోందని, అందులో పట్టణ నిరుద్యోగం మరింతగా పెరిగిందని తెలిపింది. పట్టణ నిరుద్యోగ రేటు 9.30 శాతం నమోదు కాగా, గ్రామీణ ప్రాంత నిరుద్యోగ రేటు 7.28 శాతంగా నమోదైనట్లు ఆ సంస్థ వివరించింది. దేశ ప్రజల జీవితంపై కరోనా మహమ్మారి చూపిన దుష్ప్రభావం ఇప్పుడు గణాంకాల సాక్షిగా మరోసారి ఆవిష్కృతమైంది. కరోనా మొదలయ్యాక నిరుద్యోగం భారీగా పెరిగిందని ఇప్పుడు ప్రభుత్వ అధికారిక లెక్కలలోనే తేలింది. గత ఏడాది 2020-21ఏప్రిల్‌-జూన్‌ త్క్రెమాసికంలో దేశంలో ‘నిరుద్యోగ రేటు’ 20.9 శాతానికి పెరిగింది. కరోనా రాక ముందు ఏడాది 2019లో ఇదే త్క్రెమాసికంలో ‘నిరుద్యోగ రేటు’ 9.1శాతమే. అంటే కరోనాతో పాటు దేశవ్యాప్తంగా నిరుద్యోగమూ విస్తరించి, రెట్టింపు అయిందన్న మాట. నిరుద్యోగ రేటు పురుషుల్లో 20.8శాతానికీ, స్త్రీలలో 21.2 శాతానికీ పెరిగింది. పట్టణ ప్రాంత నిరుద్యోగం 21 శాతమైంది. ఇవన్నీ సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ‘జాతీయ గణాంకాల కార్యాలయం’ (ఎన్‌ఎస్‌ఓ) విడుదల చేసిన తాజా ‘నియమిత కాలిక శ్రామిక శక్తి సర్వే’ (పీఎల్‌ఎఫ్‌ఎస్‌) చెప్పిన లెక్కలు. కరోనా తొలి వేవ్‌లో ఉపాధి,ఉద్యోగాలు పోయి, నెత్తి మీద తట్టాబుట్ట, చంకలో పిల్లలతో కాలిబాటన ఇంటిదోవ పట్టిన లక్షలాది కుటుంబాల విషాద దృశ్యాలను గుర్తు తెచ్చుకుంటే, ఈ లెక్కలు ఆట్టే ఆశ్చర్యం అనిపించవు. ఇంకా చెప్పాలంటే,ఈ లెక్కల్లో కనిపించని వ్యథార్థ జీవుల యథార్థ గాథలు ఇంకెన్నో అనిపిస్తుంది. పాలకుల తక్షణ కర్తవ్యమూ గుర్తుకొస్తుంది. ఎంచుకున్న శాంప్లింగ్‌ యూనిట్లను బట్టి అంకెల లెక్కలు అన్నిసార్లూ నిజాన్ని పూర్తిగా ప్రతిఫలిస్తాయని చెప్పలేం కానీ, ఎంతో కొంత వాస్తవాల బాటలో దారిదీపాలవుతాయి. దేశంలోని సామాజిక, ఆర్థిక పరిస్థితులపై ‘జాతీయ గణాంకాల కార్యాలయం’ అందించే లెక్కలు, చేసే సర్వేల నుంచి అసలు సూక్ష్మం గ్రహిం చడం కూడా ముఖ్యం. ఏడాది మొత్తంగా తీసుకొని 2019 జూలై మొదలు 2020-21 జూన్‌ వరకు చూస్తే మాత్రం నిరుద్యోగ రేటు నిరుటి 5.8 శాతం నుంచి 4.8శాతానికి తగ్గినట్టు పైకి అనిపిస్తుంది. కానీ, కరోనా తొలి వేవ్‌ సమయంలో 70 రోజుల లాక్‌డౌన్‌ సమయం అత్యంత కీలకం. ఆ కాలాన్ని లెక్కించిన ఆఖరు త్క్రెమాసికం చూస్తే, పట్టణ ప్రాంతాల్లో ఐటీ సహా సేవారంగాలన్నీ దెబ్బతిన్నాయి. ఫలితంగా గణనీయంగా నిరుద్యోగం పెరిగిందని అసలు కథ అర్థమవుతుంది. నిజానికి, నాలుగేళ్ళ క్రితం 2017 ఏప్రిల్‌ నుంచి ప్రతి త్క్రెమాసికానికీ మన దేశంలో ఇలా ‘శ్రామిక శక్తి సర్వే’ జరుగుతోంది. దేశంలోని నిరుద్యోగ స్థితిగతులను ఈ సర్వే రికార్డు చేస్తుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలు రెంటిలోనూ రకరకాల నిరుద్యోగాలు, వివిధ ఉద్యోగాలలో వస్తున్న వేతనాలు, పని గంటలకు సంబం ధించిన సమాచారాన్ని ఈ సర్వేలో సేకరిస్తారు. స్త్రీ పురుషుల్లో ఎవరెంత నిరుద్యోగులో, మొత్తం మీద ‘నిరుద్యోగ రేటు’ (యూఆర్‌) ఎంతో లెక్కిస్తారు. సూక్ష్మస్థాయిలో అయితే దేశంలో నిరుద్యోగ నిష్పత్తిని ఈ ‘యూఆర్‌’ సూచిస్తుంది. స్థూలంగా చెప్పాలంటే, ‘నిరుద్యోగ రేటు’ తక్కువగా ఉందంటే జనం చేతుల్లో డబ్బులు ఎక్కువున్నట్టు లెక్క. తద్వారా వస్తువుల గిరాకీ పెరుగుతుంది. అది ఆర్థికవృద్ధికి తోడ్పడు తుంది. కానీ, ద్రవ్యోల్బణం,మరింత ఉద్యోగ కల్పనను బట్టి ఉండే ఆర్థిక వృద్ధిని కరోనా బాగా దెబ్బతీసింది. ఇలా కరోనా కొట్టిన దెబ్బకూ, పెరుగుతున్న నిరుద్యోగ సంక్షోభానికీ మరిన్ని ఉదాహరణలు తాజా సర్వే లెక్కల్లో బయటకొచ్చాయి. నిరుటి జూలై నుంచి సెప్టెంబర్‌ త్క్రెమాసికంలో మహిళా శ్రామికుల భాగస్వామ్యం 16.1 శాతానికి పడిపోయింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లోకెల్లా అతి తక్కువ మహిళా భాగస్వామ్యం ఇదే. ప్రపంచ బ్యాంకు అంచనాలూ ఆ మాటే చెబుతున్నాయి. పొరు గున ఉన్న బంగ్లాదేశ్‌ (30.5 శాతం), శ్రీలంక (33.7 శాతం)ల కన్నా మన దగ్గర మహిళా శ్రామికుల భాగస్వామ్యం చాలా తక్కువైంది అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో మహిళలు ఎక్కువగా వ్యవసాయంలో, కర్మాగారాల్లో కార్మికులుగా, ఇంట్లో పనివాళ్ళు గానే ఉపాధి పొందుతున్నారు. దురదృష్ట వశాత్తూ, ఈ రంగాలన్నీ కరోనా కాలంలో తీవ్రంగా దెబ్బతినడం వారికి ఊహించని ఇబ్బందిగా మారింది. సర్వసాధారణంగా పట్టణాలతో పోలిస్తే, గ్రామీణ ప్రాంతాలలో స్వయం ఉపాధి ఎక్కువ. గ్రామీణ భారతంలో దాదాపు 50శాతం పైగా తమ కాళ్ళ మీద తాము నిలబడితే, పట్టణాల్లో ఆ సంఖ్య 31శాతమే అని లెక్క. అదనుకు వర్షాలు కురిసి, పంటలు చేతికి రావడంతో ఈ సర్వే కాలంలో గ్రామీణావనిలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉండ వచ్చు. కానీ, దేశంలో నిరుద్యోగుల సంఖ్య 40 లక్షలే పెరిగిందంటే నమ్మలేం. అధికారిక లెక్క కన్నా అసలు కథ ఎక్కువే ఉండడం ఖాయం. గత ఏడాది జనవరి నుంచి మార్చి వరకు కాలంతో పోలిస్తే, జూన్‌తో ముగిసిన త్క్రెమాసికం తర్వాత నిరుద్యోగం రెట్టింపు అయింది. ఆ సంగతి ఆర్థికవేత్తలే తేల్చారు. 15 ఏళ్ళు దాటిన ప్రతి అయిదుగురిలో ఒకరికి చేతిలో పనిలేదు. 15 నుంచి29ఏళ్ళ లోపు వారిలో ప్రతి మూడో వ్యక్తికీ ఉద్యోగం లేదు. షాపులు, మాల్స్‌, ఆఫీస్‌లు, స్కూళ్ళు, సంస్థలు మూతబడడంతో జనానికి చేతిలో తగినంత పని లేదు. ఇది నిష్ఠురసత్యం. కరోనా తర్వాత ఏకంగా 55లక్షల ఉద్యోగాలు పోయాయని ‘సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ’ సైతం అంచనా వేయడం గమనార్హం. నిజానికి, ఆసియాలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మనది. కరోనా కాటుతో ఈ మార్చితో ముగిసిన ఆర్థిక వత్సరంలో భారతఆర్థిక వ్యవస్థ 7.3శాతం మేర కుంచించుకు పోయింది. స్వాతంత్య్రం వచ్చాక గడచిన ఏడు దశాబ్దాల్లో ఎన్నడూ చూడని ఆర్థిక మాంద్యం ఇది. ఇప్పటికే కోట్లాది జనం ఉపాధి పోయి వినియోగదారుల గిరాకీ తగ్గింది. మరోపక్క కరోనాకు కవచమైన టీకా ప్రక్రియేమో మందకొడిగా సాగుతోంది. వీటన్నిటి మధ్య కరోనా కాస్తంత నెమ్మదించినా, సత్వర ఆర్థిక పురోగతిని ఆశించలేం. భారత ఆర్థిక వ్యవస్థ కరోనా ముందటి స్థాయికి మళ్ళీ చేరే సూచనలు వచ్చే 2022 మార్చి వరకైతే లేనే లేవని పలువురి ఉవాచ. నిరాశ ధ్వనించినా, ఈ హెచ్చరికలు, సర్వేలు చెబుతున్న నిరుద్యోగ గణాంకాలను పాలకులు నిశితంగా గమనిం చాలి. భయపెడుతున్న కొత్త వేవ్‌ల పట్ల జాగ్రత్త లు తీసుకుంటూనే, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకొనేలా చర్యలు చేపట్టాలి. అది అనివార్య పరిస్థితి. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపులు ఇస్తున్నది ఆ దృష్టితోనే! కాకపోతే, అదొక్కటే కాదు.. ఆర్థిక పునరుత్తేజానికిచ్చిన ప్యాకేజీల్లో లోటుపాట్లనూ సవరించుకోవాలి. ఉపాధి కల్పనకు వీలుగా వృత్తివిద్యా శిక్షణను పెంచాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు టీకా అస్త్రంతో అందరికీ కరోనా నుంచి ఆరోగ్య సంరక్షణ నివ్వాలి. అప్పుడు జనం సత్వర ఉపాధి అన్వేషణలో పడతారు. ఆర్థికవ్యవస్థ పురోగతిలో భాగమ వుతారు.
ఉపాధి బహుదూరం.. కోట్లలో పని లేనివారు
మేకిన్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా, ముద్రా యోజన తదితర పథకాలు నిరుద్యోగులకు అక్కరకు రావడం లేదా?ఉపాధి కల్పనలో కేంద్రం చెబుతున్న మాటలకు,చేస్తున్న ప్రకటనలకు క్షేత్రస్థాయిలో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయా? భారతదేశంలో నిరుద్యోగ సమస్య అంతకంతకూ పెరుగుతోందా? అవుననే అంటున్నాయి అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌వో) లెక్కలు! ‘ప్రపంచంలో ఉపాధి అవకాశాలు, సామాజిక కోణం సరళి’ అనే పేరుతో ఐఎల్‌వో రూపొందించిన తాజా నివేదిక భారత్‌దేశంలో నిరుద్యోగ సమస్య ఏ స్థాయిలో ఉందో కళ్లకు కట్టింది. మన దేశంలో ఒక కోటీ 83 లక్షల మంది నిరుద్యోగులు ఉండగా…2018లో అది 1.86 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తోంది. 2019 నాటికి ఇది ఇంకా పెరిగి 1.89 కోట్లకు చేరు కుంటుందనే అంచనాకు వచ్చింది ఐఎల్‌వో. 2018లో ఈ పెరుగుదల శాతం 3.4గా ఉం డొచ్చని తొలుత అంచనా వేసినా అది 3.5 శాతం దగ్గరే కొనసాగవచ్చని అభిప్రాయ పడిరది. వాస్తవానికి మన దేశంలో 2012లో 3.6 శాతంగా ఉన్న నిరుద్యోగ సమస్య 2014 నాటికి 3.4 శాతానికి తగ్గింది. కానీ 2015లో 3.5కి చేరుకుంది. అప్పటి నుంచీ అది అలాగే కొనసాగుతుండటం గమనార్హం.2017కి ముందు కూడా ఐఎల్‌వో ఈ అంశంపై ఒక నివేదిక విడుదల చేసింది. అందులో 2017 నాటికి 1.78 కోట్లు, 2018లో 1.80 కోట్లగా నిరుద్యోగుల సంఖ్య ఉంటుందని అంచనా వేసినా.. 2017లో అంచనాలకు మించి 5 లక్షలు ఎక్కువగానే నిరుద్యోగుల సంఖ్య ఉన్నట్లు గుర్తించింది. ఈ మధ్య చానళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, ఈ ఆర్థిక సంవత్సరంలో 70లక్షల ఉపాధి అవకాశాలను కల్పించినట్లు చెప్పారు. పైగా ప్రభుత్వం నిరుద్యోగులకు ఏం చేయాడం లేదనే ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. విచిత్రం ఏమంటే ప్రధాని చెప్పిన లెక్కలకు, ఐఎల్‌వో నివేదించిన అంశాలకు ఎక్కడా పొంతన లేదు.
మొత్తంగా కొంత ఊరట!
ప్రపంచవ్యాప్తంగా చూస్తే మాత్రం, నిరుద్యోగ సమస్య మూడేళ్లలో తొలిసారిగా కొంత తగ్గుముఖం పట్టడం సంతోషకరమైన విషయంగా ఐఎల్‌వో పేర్కొంది.2017లో 19.27 కోట్లగా ఉన్న నిరుద్యోగుల సంఖ్య 2018లో 19.23 కోట్లుగా ఉండొచ్చని అంచనా వేసింది. అయితే ఉపాధి కోసం ఎదురు చూసే వారి సంఖ్య 19కోట్ల దగ్గర స్థిరంగా ఉండటం ఆందోళన కలిగించే అంశం గా పేర్కొంది.
ప్రాణాలు నిలుపుకునేంత సంపాదన
ఇండియాలో నిరుద్యగ సమస్య తీవ్రంగా వుంది. కానీ, విదేశాల్లోలాగ నిరుద్యోగానికి అద్దం పట్టే పోడవాటి క్యూలు ఇక్కడ కనబడవు.సామాజిక భద్రతా వ్యవస్థ లేకపోవడం, పేదరికం వంటి కారణాలతో దేశంలో చాలామంది ప్రజలు కేవలం తమ ప్రాణాల నిలుపుకోవడానికి అవసరమైన మేరకే సంపాదించగలుగుతున్నారు. భారతదేశంలో చాలామంది నిరుద్యోగులు తమ కుటుంబాలపైనే ఆధారపడుతున్నారు. ఉపాధి కొరత కారణంగా, తక్కువ మంది చేయగలిగిన పనిని చాలామంది పంచుకుంటున్నారు. దీంతో, వారి ఆదాయం కూడా పలుచబడుతోంది. దేశంలో దాదాపు ఎనభై శాతం మంది కార్మికులు తగు ప్రమాణాలు పాటించని పరిశ్రమలలో చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నారు. వీరిలో చాలా తక్కువ మందికే ఉద్యోగ భద్రత, ఆదాయ భద్రత ఉంటోంది. దేశంలో కేవలం7శాతం మంది మాత్రమే, ఉత్తమ ప్రమాణాలున్న ఆర్థిక వ్యవస్థల్లో పనిచేస్తూ, కార్మిక ఉపకారాలు పొందుతున్నారని అంచనా.భవిష్యత్తులో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉండబోతోంది. కార్మిక శక్తి విపరీతంగా పెరుగుతోంది. రానున్న ముఫ్ఫై సంవత్సరాల్లో నెలకు దాదాపు పదిలక్షల మంది ప్రజలు కార్మికవర్గంలో భాగమవుతారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియా రెండంచెల ఆర్థిక వ్యవస్థను శాశ్వతపరుచుకునే క్రమంలో ఉంది అని ఇండియాస్‌ లాంగ్‌ రోడ్‌ పుస్తక రచయిత డాక్టర్‌ జోషి చెబుతున్నారు. కార్మిక శక్తిని అసంబద్ధంగా పంపిణీ చేయడం వల్లనే నిరుద్యోగ సమస్య తలెత్తిందని చెప్పవచ్చు. ఎక్కువ మంది కార్మికులు అవసరమైన రంగాల్లో ఉపాధి మందకొడిగా సాగుతుంటే, తక్కువ మంది కార్మికులు ఉత్పత్తి చేయగలిగిన చోట పెద్దమొత్తంలో పనిచేస్తున్నారు. ఈ కారణాలతో తక్కువ జీతాలతో,ఎటువంటి ప్రమాణాలు లేని పరిశ్రమల్లో పనిచేయాల్సి వస్తోంది.
భారత్‌ ఉపాధిని సృష్టించే అవకాశాన్ని కోల్పోయిందా
ఉపాధిని సృష్టించడం కోసం కార్మికులు ఎక్కువగా అవసరమయ్యే గార్మెంట్స్‌, లెదర్‌ మొదలైన పరిశ్రమలపై దృష్టి పెట్టాలి. లైసెన్స్‌లేని కారణాలను చూపి కబేళాలను మూసివేయడం, గోవధను నియంత్రించడం వంటి నిర్ణయాల కారణంగా ఇండియాలో లెదర్‌ ఎగుమతులు తగ్గిపోయాయి.తక్కువ ధర కలిగిన చిన్నచిన్న బొమ్మలు,నేత వస్తువుల తయారీ లాంటి పరిశ్రమల విషయంలో భారతదేశం,తన వైఫల్యాలను ఇంకా కొనసాగిస్తూనేవుందని మోర్గాన్‌ స్టాన్లీ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ ఛీఫ్‌ గ్లోబల్‌ స్ట్రాటజిస్ట్‌ రుచిన శర్మ అన్నారు. చైనా మార్కెట్‌పై ఇండియా ఆధారపడ్డానికి, ఇండియాలో నిరుద్యోగం పెరగడానికీ ఇదే ప్రధాన కారణం కావచ్చు అని కూడా రుచిర్‌ శర్మ అభిప్రాయపడ్డారు.బహుశాఉద్యోగాల కల్పన విషయంలో భారత్‌ తనఅవకాశాలను ఎప్పుడో వదిలేసిందేమో? – ఎన్‌.వి.సోమేశ్వరరావు

మ‌హానీయ స్వామి వివేకానంద‌

ఉన్నతమైన ఆశయాలు ఏదో ఒక రోజు సర్వజనాంగీకారాన్ని పొందుతాయి. కారణం ఆ భావన, ఆశయాలు ప్రతి కార్యరంగంలోనూ, ప్రతీ ఆలోచనా విధానంలోనూ ఉత్తేజం కలిగించేవి కాబట్టి. కాషా యాం బరాలు ధరించి, పద్మాసనస్థుల్కె, ఒకదాని మీద మరొకటిగా కరకమలాలను ఒడిలో ఉంచుకుని, అర్థని మీనేత్రుల్కె ధ్యానమగ్నుల్కె వివేకమంతమైన ఆనందం అనుభవించే స్వామి వివేకానంద లోకానికి ప్రకాశానిచ్చే ఒక జగద్గురువు. సామాజిక సృహతో కూడిన ఆధ్యాత్మి కతను ప్రజలకు ఉపదేశించడం, ఇంద్రియాతీత విషయా లను వివేకించటం ద్వారా ఆధ్యాత్మిక సౌధాన్ని నిర్మిం చడం, ఆసౌధంలో చ్కెతన్యమూర్తులుగా జనులను విరాజిల్లింప చేయటం స్వామి వివేకానంద అపురూప ఆశయం. విశ్వాసంతో నిరంతరాభ్యాసాన్ని చేస్తూ, మనసు పొరలలో నిభిఢీకృతమైన కొత్త విషయాలను అనుభవిస్తూ, క్రొంగొత్త శక్తుల వశీకరింపచేసుకుంటూ ఊహాతీత వ్యక్తిత్వాన్ని వికసింపచేసుకోవటానికి దివ్య ప్రేరణ స్వామి వివేకానంద.

Read more

డెల్టాన్ దాటి దుసుకుపోతున్న‌ ఒమిక్రాన్

రాష్ట్రంలో ఒమిక్రాన్‌ వ్యాప్తిపై జనాల్లో ముమ్మరంగా చర్చలు కొనసాగుతున్నాయి.డెల్టా కంటే ఒమిక్రాన్‌ వేరియంట్‌ నాలుగైదు రెట్లు స్పీడ్‌గా స్ప్రెడ్‌ అవుతోందని డబ్ల్యూ హెచ్‌వో దగ్గర్నుంచి రాష్ట్ర హెల్త్‌ డైరెక్టర్‌ వరకూ అందరూ చెప్తున్నప్పటికీ, మన రాష్ట్రంలో మాత్రం అలాంటి సూచనలే కనిపించట్లేదు. కెన్యాలో, సోమాలియాలో ఒమిక్రాన్‌ బారినపడి ఇక్కడికి వచ్చినోళ్లు వందల మందిని కాంటాక్ట్‌ అయినప్పటికీ అందులో ఒక్కరికే కొత్త వేరియంట్‌ అంటుకుంది. యూకే నుంచి హన్మకొండకు వచ్చిన మహిళకు ఒమిక్రాన్‌ పాజిటివ్‌ వచ్చింది. ఆమెతో కలిసి ఇంట్లోనే ఉన్న ఆమె భర్తకు, బిడ్డకు వైరస్‌ అంటలేదు. ఆమెను కలిసిన 30 మంది ప్రైమరీ కాంటా క్టులలో కనీసం ఒక్కరికీ వైరస్‌ సోకలేదు. జూబ్లీహిల్స్‌లో ఒమిక్రాన్‌ పేషెంట్‌కు 3రోజుల పాటు ఫుడ్‌ సర్వ్‌ చేసిన హోటల్‌ సిబ్బంది లోనూ ఎవరికీ ఈ వేరియంట్‌ అంటలేదు. ఇలా చెప్తూపోతే చాలా ఎగ్జాంపుల్సే ఉన్నయి. సౌత్‌ ఆఫ్రికా, యూకే, అమెరికా తదితర దేశాల్లో పరిస్థితి చూస్తే డబ్ల్యూహెచ్‌వో చెబుతున్నట్టు ఒమిక్రాన్‌కు స్పీడ్‌ ఎక్కువేనన్న విషయం స్పష్టం అవుతోంది. కానీ,మన దగ్గరకు వచ్చేసరికి ఒమిక్రాన్‌ స్పీడ్‌ తగ్గిపోయిన సూచ నలు కన్పిస్తున్నయి.హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ చెబు తున్న లెక్క ప్రకారం ఆదివారం నాటికి రాష్ట్రంలో ఇప్పటి వరకు 44 ఒమిక్రాన్‌ కేసులు నమోద య్యాయి. ఇందులో 40 మంది విదే శాల నుంచి వచ్చినవాళ్లు అని, ఇంకో ఇద్దరికి లోకల్‌గా స్ప్రెడ్‌ అయిందని ప్రకటించారు. ఈ ఇద్దరికీ తప్ప లోకల్‌?గా ఇంకెవరికీ స్ప్రెడ్‌ కాలే దని చెప్తోంది.

Read more

రైతు కంట క‌న్నీరు

సంక్రాంతి వచ్చేస్తోంది. అన్నదాత చేతిలో చిల్లిగవ్వ లేదు. పంట విక్రయించి పిల్లాపాపలకు కొత్త బట్టలు కొందా మంటే పండిరచిన ధాన్యం ఇంకా కొనేవారు కనిపిం చడం లేదు. ఆర్‌బికెలకు వెళ్తే తమ శాతం పేరుతో తిప్పి పంపిస్తున్నారు. ధాన్యం ఆరబెట్టాలంటే కళ్లాలు లేవు. తక్కువకు దళారులకు అమ్మలేక సతమతమవుతున్నారు. ఈ ఏడాది వరిసాగుచేస్తే వారిలో 30 శాతం మంది రైతుల పేర్లు వెబ్‌సైట్‌లో కనిపిం చడం లేదని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈసమస్య సరిదిద్దే ప్రయత్నంలో రెవెన్యూ, వ్యవ సాయశాఖలు సంయుక్తంగా పనిచేయాల్సి ఉంది. ఈ రెండు శాఖల్లో పని ఒత్తిడి కారణంగా వెబ్‌సైట్‌ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదు. మరోవైపు ఈ-క్రాప్‌ నమోదు జిల్లాలో శతశాతం పూర్తికాలేదు. దీంతో ధాన్యం విక్రయాలకు ఈ సమస్యలు అడ్డంకిగా మారుతున్నాయి. మరోపక్క తేమ శాతం ఎక్కువగా ఉండటంతో సాగుదారులు పలుమార్లు రైతు భరోసా కేంద్రాల చుట్టూ తిర గాల్సి వస్తోంది. దీంతో చేసేది లేక రైతులు దళారు లను ఆశ్రయించి అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొం టోంది. జిల్లాలో గోనె సంచుల కొరత వేదిస్తోంది. పౌరసరఫరా సంస్థనుంచి సకాలంలో గోనె సంచు లు రాక పోవడంతో ఈ సమస్య తలెత్తు తోంది.

Read more

సంఘ‌టిత పోరాట‌మే ప‌రిష్కారం కాఫ్‌-26

కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ ద పార్టీస్‌(కాప్‌`26) సదస్సు ఈ ఏడాది నవంబరులో స్కాట్లాండ్‌లో జరిగింది. ప్రతిఏటా 197దేశాలను ఒకచోట చేర్చే సదస్సు ఇది. వాతావరణ మార్పులు, దాని ద్వారా ఏర్పడే సమస్యల గురించి ఈసదస్సు ప్రధానంగా చర్చిం చింది. ఇది వాతావరణ మార్పుల పై యునైటెడ్‌ నేషన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ కన్వెన్షన్‌ ఆన్‌ క్లైమేట్‌ చేంజ్‌ (ఖచీఖీజజజ) ఆధ్వ ర్యంలో జరిగిన కన్వెన్షన్‌.పర్యావరణంపై మానవ కార్యక లాపాల ప్రభా వాన్ని పరిమితం చేయడమే లక్ష్యంగా ప్రపంచంలోని ప్రతి దేశం, ప్రతిభూభాగం అంగీకరించి సంతకం చేసిన అంతర్జాతీయ ఒప్పందం కాప్‌.1994 మార్చి 21న తొలి ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 25 సమావేశాలు జరగ్గా, ఈ ఏడాది జరగబోయేది 26వది. స్కాట్లాండ్‌లోని గ్లాస్గో నగరంలో నవంబర్‌ 1 నుంచి 12 తేదీల మధ్య ఈసదస్సు జరిగింది.కాప్‌ 26 ప్రాధాన్యత
కాప్‌ 26 సదస్సు 2015లో పారిస్‌ వాతావరణ ఒప్పందంపై సంతకాల తర్వాత, అది ఏం సాధిం చింది, ఎక్కడ విఫలమైంది అని చర్చించే మొదటి శిఖరాగ్ర సమావేశం.పారిస్‌ ఒప్పందం ప్రాథమి కంగా వాతావరణ విపత్తును నివారించడానికి మనుషులు అమలు చేయాలనుకున్న వ్యూహం. గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగా పారిశ్రామిక విప్లవానికి పూర్వం ఉన్న ఉష్ణోగ్రతలు1.5సెల్సియస్‌ పెరుగు తున్నాయి.ఈ ఉష్ణోగ్రతలు ఇలా పెరుగుతూ పోతే భూమికి తిరిగి బాగు చేసుకోలేని ప్రమాదాన్ని సృష్టి స్తాయి. ఏదైనా ఒక ప్రణాళికను ప్రకటించినప్పుడు దానికి కట్టుబడి ఉండాలి.కాప్‌సదస్సుల ఉద్దేశం కూడా అదే. కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయాలు, వ్యూహాలు సరిగ్గా పని చేస్తున్నాయా లేదా అన్నది చర్చించు కోవడానికే ఈ సదస్సును ఏర్పాటు చేశారు.
కరోనా మహమ్మారి వల్ల ఎలాంటి మార్పులు వచ్చాయి?
మహమ్మారి కారణంగా పర్యావరణ పరిరక్షణ చర్య లకు తీవ్ర ఆటంకం కలిగింది. శిఖరాగ్ర సదస్సును ఒక ఏడాదివాయిదా వేయాల్సి వచ్చింది. మరోవైపు, మహమ్మారి అనంతర ఆర్థిక స్థితి మెరుగు పరుచు కోవడంలో భాగంగా కొత్త నిర్ణయాలు తీసుకునేలా కోవిడ్‌ అవకాశం కల్పించింది.ఉదాహరణకు… మనం నిజంగా ఇన్ని ప్రయాణాలు చేయాలా,ఇంటి దగ్గరఉండి పనిచేస్తే సరిపోదా,ఇది కర్బన ఉద్గారా లను తగ్గిస్తుంది కదా,పట్టణీకరణను తగ్గించడానికి అవకాశం ఉందా?లాంటి ఆలోచనలకు దారి తీసింది.
గతంలో ట్రంప్‌ రద్దు చేసుకున్న పారిస్‌ ఒప్పందాన్ని తాను కొనసాగిస్తానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్పష్టం చేశారు. వాతావరణ అనుకూల విధానాలు అవలంబించడంవల్ల ఆర్ధిక పరంగా కూడా ఎంతో మంచిదని ఆయన భావి స్తున్నారు. ఈసారి కాప్‌లో కూడా పర్యావరణానికి సంబంధించి సరికొత్త, సాహసోపేతమైన దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించారు.వాతావరణ మార్పులకు కారణమయ్యే దేశాలలో మొదటి వరసలో పేద దేశాలే ఉన్నాయి. మరోవైపు పెరుగుతున్న సముద్ర మట్టాలు ద్వీపాలను నెమ్మదిగా ముంచెత్తుతున్నాయి. ఇటు కరువు,వేడిగాలులు పంటలను దెబ్బ తీస్తు న్నాయి. ప్రస్తుత కాప్‌26 సదస్సులో వందకు పైగా దేశాలు కొన్ని డిమాండ్లు పెట్టాయి. పర్యా వరణ సమస్యలపై చర్యలకు నిధులు,ఈ చర్యలు తీసుకున్నందుకు కలిగిన నష్టాలకు పరిహారం,తమ ఆర్థిక స్థితిగతులు బాగుపడటానికి సహకారం,ధనిక దేశాలన్నీ 2020 నాటికి 100 బిలియన్‌ డాలర్లు అంటే సుమారు రూ.75వేల కోట్ల ఇస్తామని హామీ ఇచ్చాయి. కానీ ఇప్పటి వరకు అందులో సుమారు 80శాతం మాత్రమే ఇవ్వగలిగాయి.వీటిలో ఎక్కువ భాగం రుణాలే తప్ప గ్రాంట్లు కాదు.ఈ సదస్సులో చర్చకు వస్తుందనుకుంటున్న మరో అంశం క్లైమేట్‌ ఫైనాన్స్‌. కార్బన్‌ మార్కెట్లు, కార్బన్‌ క్రెడిట్‌ల వ్యవ స్థను అమలు చేయడానికి సరైన మార్గం వెతకాల్సిన అవసరం ఉంది. కాలుష్య కారకాలను ఎక్కువగా విడుదల చేసే వారు గ్రీనర్‌ ఎకానమీలకు కార్బన్‌ క్రెడిట్‌ లను ఇచ్చే విధానం ఇది. పేద దేశాలకు సాయం అందించాలి చూడటానికి ఎంతో బాగుంది. కానీ, ధనిక దేశాలు తాము చెల్లిస్తున్నాం కాబట్టి,ఇష్టారాజ్యంగా కాలు ష్యాలను విడుదల చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? మరొక ఉదాహరణ...ఒకఅడవిని నాశనం చేసి నందువల్ల ఏర్పడిన ఉద్గారాల కోసం ఒకదేశం ఎంత చెల్లించాలో ఎవరు నిర్ణయిస్తారు? ఒకవేళ గ్లాస్గో శిఖరాగ్ర సమావేశం పైన పేర్కొన్న అన్నింటికీ ఒప్పుకున్నప్పటికీ, మనం నిర్దేశించుకున్న హరిత లక్ష్యాలకు‘కాలపరిమితులు’అవసరం. ఈ సమస్య లకు పరిష్కారం చాలా సులభం అని అనుకుం టారు. కానీ అదినిజం కాదు. క్లైమేట్‌ ఛేంజ్‌ పై సాహసోపేత చర్యలు చేపట్టాం., ప్రధాని మోదీ వెల్లడి. ఇది నిరంతర ప్రక్రియ.వాతావరణ కాలుష్య నివారణకు ఇండియా పలు సాహసోపేత చర్యలు చేపట్టిందని ప్రధాని మోదీ తెలిపారు. క్లైమేట్‌ ఛేంజ్‌ అన్నది పెనుసవాల్‌ అని,అయితే క్లీన్‌ ఎనర్జీ ఎన్వి రాన్‌ మెంట్‌ సాధించాలన్న లక్ష్యంతో ఇండియా వివిధ చర్యలకు శ్రీకారం చుట్టిందని ఆయన చెప్పారు. ఇందుకోసం అంతర్జాతీయ సౌరకూట మిని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను తమ దేశం సమర్థించిందని ప్రధాని మోడీ చెప్పారు. వాతా వరణ కాలుష్యం వల్ల తలెత్తే విపరీత పరిణా మాల కారణంగా మానవ మనుగడ ప్రమాదంలో పడుతోందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలోనే దీని మార్పు కోసం పటిష్టమైన చర్యలు అవసరమని మోదీ అభిప్రాయపడ్డారు. హరిత విప్లవ సాధన కోసం భారత, అమెరికా దేశాలు కృషి చేస్తున్నాయని అన్నారు. ఇందుకు తాను,అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌..2030 నాటికల్లా ఇండియా-యూఎస్‌ క్లైమేట్‌ అండ్‌ క్లీన్‌ ఎనర్జీకి సంబంధించిన లక్ష్య సాధన కోసం అజెండాను రూపొందించామని వెల్లడిరచారు. పలు ఇతర దేశాల్లోని కార్బన్‌ కాలు ష్యం కన్నా ఇండియాలో ఈకాలుష్యం 60 శాతాని కన్నా తక్కువగా ఉందని మోదీ చెప్పారు. దశాబ్దాల తరబడి కాలుష్య నివారణకుకృషి జరగాలని సూచిం చిన ఆయన ఈ సందర్భంగా స్వామి వివేకానందను గుర్తుచేశారు. క్లైమేట్‌ ఛేంజ్‌ పై 40దేశాల ప్రపంచ శిఖరాగ్ర సదస్సులో వర్చ్యువల్‌గా ప్రధాని పాల్గొ న్నారు. ఈ సమ్మిట్‌లో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌,బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, బ్రిటిష్‌ పీఎం బోరిస్‌ జాన్సన్‌, కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో, బ్రెజిల్‌అధ్యక్షుడు జైర్‌ బొల్సనారో తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న వాతావరణ కాలుష్య సమస్యను ఎదుర్కొనేందుకు దేశాధినేతలంతా కృషి చేయాలని తీర్మానించారు. గ్లోబల్‌ హైబ్రిడ్‌ సమ్మిట్‌ద్వారా భారతదేశాన్ని స్వచ్చ Ûమైన శక్తి దిశగా నడిపేందుకు వేదికగా ఈ సమా వేశం నిలవనుంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (RIూ) ఛైర్మన్‌,మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముఖేష్‌ అంబానీ శిఖరాగ్ర సమావేశంలో ముఖ్య వక్తగా పాల్గొనడం విశేషం. ఈ శిఖరాగ్ర సమావేశాలను ూనణ ఛాంబర్‌,చీIుI ఆయోగ్‌, పర్యావరణ మంత్రిత్వ శాఖ, పారిశ్రామిక పరిశోధన విభాగం, (జూIR),సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం సంయుక్తంగా ఏర్పాటు చేశాయి.శిఖరాగ్రసమావేశంలో, భారతదేశ హైడ్రో జన్‌ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చాయి. కాప్‌26 వాతావరణ సదస్సుతో పెరిగిన కాలుష్యం
వాతావరణ మార్పుపై ప్రపంచ శిఖరాగ్ర సమా వేశాన్ని మీరు నిర్వహించబోతున్నట్లయితే, దాన్ని సాధ్యమైనంత కాలుష్యరహితంగా నిర్వహించడానికి ప్రయత్నించాలి.ఈ ఈవెంట్‌ని ‘‘కార్బన్‌ న్యూట్రల్‌’’గా నిర్వహించడానికి కట్టుబడి ఉన్నామని యూకే ప్రభుత్వం చెప్పింది. కానీ,మాడ్రిడ్‌లో జరిగిన మునుపటి శిఖరాగ్ర సమావేశం కంటే రెట్టింపును మించి ఉద్గారాలు గ్లాస్గో శిఖరాగ్ర సమావేశ నిర్వ హణ సమయంలో జరిగాయని ఓకొత్త నివేదిక తెలిపింది.ఎక్కువ మంది ప్రతినిధులు,ఎక్కువ ఉద్గారాలు కాప్‌26సమావేశ సమయంలో విడు దల అయిన మొత్తం కార్బన్‌ ఉద్గారాలు 1,02,500 టన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌కు సమానంగా ఉండను న్నాయని యూకే ప్రభుత్వానికి అందిన ప్రాథమిక అంచనా నివేదిక ద్వారా తెలిసింది. ఇది దాదాపు 10,000 యూకేగృహాల నుండి ఒక ఏడాది మొత్తం వచ్చే ఉద్గారాలకు సమానం. 2019లో మాడ్రిడ్‌లో జరిగినచివరి వాతావరణ శిఖరాగ్ర సమావే శంలో జరిగిన ఉద్గారాలతో పోల్చితే కాప్‌26 సమావేశా నికి అయిన ఉద్గారాలు రెట్టింపు. 2019లో మాడ్రిడ్‌లో జరిగిన సదస్సులో27,000 మంది పాల్గొనగా, కోవిడ్‌ మహమ్మారి ఉన్నప్పటికీ, గ్లాస్గో ఈ సమావేశానికి 39,000 కంటే ఎక్కువ మంది హాజరయ్యారని యూకే ప్రభుత్వం తెలిపింది.
అంతర్జాతీయ విమానాలు,ప్రైవేట్‌ జెట్‌లు
నివేదిక ప్రకారం కాప్‌`26 ఉద్గారాలలో 60% అంతర్జాతీయ విమానాల ద్వారానే వచ్చినట్లు అంచనా వేశారు.విమానాల నుండి వచ్చే ఉద్గారా లను నియంత్రించడానికి,హాజరయ్యే వారు సాధ్య మైతే రోడ్డుమార్గంద్వారా ప్రయాణించాలని కోరారు. అయినా, చాలా మంది ప్రపంచ నాయకులు ప్రైవేట్‌ జెట్‌ విమానాల్లో వచ్చారు.
అంతేకాకుండా వారి సొంత కాన్వాయ్‌ వాహనాలను, హెలీకాప్టర్‌లను తీసుకురావడానికి ప్రత్యేకంగా కార్గో విమానాలను వాడారు. నవంబర్‌ 1 వరకు గ్లాస్గో చుట్టుపక్కల ప్రాంతాలకు నాలుగురోజుల్లో ప్రైవేట్‌ జెట్‌లు లేదా వీఐపీ విమానాలు అన్నీ కలుపుకుని మొత్తం 76 విమా నాలు వచ్చాయని ఏవియేషన్‌ అనలిటిక్స్‌ కంపెనీ సిరియమ్‌ రియాలిటీ చెక్‌తో చెప్పింది. సమ్మిట్‌లో కార్బన్‌ ఉద్గారాలను తగ్గించ డానికి యునైటెడ్‌ నేషన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ కన్వెన్షన్‌ ఆన్‌ క్లైమేట్‌ చేంజ్‌ (ఖచీఖీజజజ) గుర్తించిన ప్రణాళికలను అమలు చేశామని యూకే ప్రభుత్వం చెప్పింది. వీటిలో పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయో గించడం,చెట్ల పెంపకం వంటివి ఉన్నాయి. కార్బన్‌ న్యూట్రాలిటీపై అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రమాణం ూAూ2060కి అనుగుణంగా నిర్వహించిన మొదటి కాప్‌ ఇదే అని యూకే ప్రభు త్వం చెప్పింది. ఇటీవల కార్న్‌వాల్‌లో జరిగిన మూడు రోజుల జీ7సమ్మిట్‌లో 20,000 టన్నుల కార్భన్‌డయాక్సైడ్‌కి సమానమైన ఉద్గారాలు విడు దల అయినా ఇది కూడా ‘‘కార్బన్‌ న్యూట్రల్‌’’గా గుర్తింపు పొందింది.(బీబీసీ సౌజన్యంతో)
-రవీంద్రనాథ్‌ కె 

ప్ర‌కృతితోనా మ‌న‌వాళి వికృత క్రీడా

‘‘ కొవిడ్‌ మహమ్మారిని పక్కనపెడితే ప్రపంచ దేశాలకు పెను సవాల్‌?గా మారిన సమస్య భూతాపం. ఈసమస్యకు మూలం కూడా మానవుడి చర్యలే. అభివృద్ధి వర్సెస్‌ భూతా పం – అనే ఈ క్రూరమైన సందిగ్ధం వల్ల మనం ‘గ్రీన్‌హౌస్‌’ వాయువుల విడుదలను తగ్గించ లేకపోతున్నాం.ఈ తరుణంలో మన అందు బాటులో ఉన్న సాంకేతిక విజ్ఞానాన్ని, వనరుల్ని సరైన రీతిలో ఉపయోగిస్తేనే భూతా పాన్ని ఎదుర్కొని తిరిగి సాధారణ స్థితికి రాగలం. ’’ – డాక్టర్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌
మహమ్మారి నుంచి మానవాళి గ్రహించాల్సిన మరో పెద్ద పాఠం భూతాపాన్ని (గ్లోబల్‌ వార్మింగ్‌) అత్యవసర సమస్యగా సమష్టిగా ఎదుర్కోవడం! భూతాపం ప్రస్తుతం మానవ మనుగడకు ప్రమాదకరంగా పరిణమించిందని శాస్త్రీయ ఆధారాలన్నీ తేల్చి చెబుతున్నాయి. ‘గ్రీన్‌హౌస్‌’ వాయువులను ఇక ముందు నియంత్రించగలిగినా కూడా, భూమ్మీద ఇప్పటికే జరిగిన నష్టంవల్ల సరాసరి ఉష్ణోగ్రతలు సుమారు రెండు డిగ్రీల సెల్సియస్‌ మేర పెరుగుతాయి. బొగ్గుపులుసు వాయువు,మీథేన్‌, ఇతర ఉద్గారాల విడుదలను ఆపకపోతే ఉఉఉఉష్ణోగ్రతల పెరుగుదల ఇంకా ఎక్కువగా ఉం టుంది. రెండు డిగ్రీల సెల్సియస్‌ చాలా స్వల్పమే కదా అనిపించవచ్చు. కానీ రెండు డిగ్రీల సగటు ఉష్ణోగ్రత పెరుగుదలతో చోటు చేసుకునే మార్పు- మంచు యుగానికి, ఎడారీకరణకు మధ్య తేడాగా మారవచ్చు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కల్లోలం సృష్టిస్తున్నాయి. హిమనదాలను కరిగిస్తున్నాయి. సైబీరియా, గ్రీన్‌లాండ్‌ వంటి శీతల ప్రదేశాలలో మంచును కరిగిస్తున్నాయి. భారత్‌లో గంగా, ఉపఖండంలోని ఇండస్‌ వంటి హిమనదాలు ఎండిపోతుండటం, ఆర్కిటిక్‌ మహా సముద్రం కరుగుతుండటం, అంటార్కిటికాలో మంచు ఫలకం కరగడం, సముద్ర మట్టాలు పెరగడం, తీర, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికావడం, ద్వీపదేశాలు మునిగిపోవడం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్న పరిణామాలు.పలు దేశాల్లో అటవీ కార్చిచ్చులు, భారత్‌ వంటి ఉష్ణ మండల దేశాల్లో ఉష్ణోగ్రతలు భరించలేని స్థాయిలో ఉండటం, పెనుతుపానులు, టైఫూన్లు వంటి అసాధారణ, అనూహ్య వాతావరణ పోకడలు మనిషికి సవాలు విసురుతున్నాయి. ఎడారీకరణ, దోమలు, ఇతర వ్యాధికారక కీటకాల వ్యాప్తి, మహమ్మారులు విజృంభిస్తుండటం ప్రపంచవ్యాప్తంగా గుర్తించని అనేక భయోత్పాతాలకు కారణమవు తున్నాయి.ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టిమానవాళి మనుగడకు ప్రమాదకరమైన భూతాపానికి మూలం మానవుడి చర్యలే. అభివృద్ధి వర్సెస్‌ భూతాపం- అనే ఈ క్రూరమైన సందిగ్ధం వల్ల మనం ‘గ్రీన్‌హౌస్‌’ వాయువుల విడుదలను తగ్గించలేకపోతున్నాం. తలసరి ఇంధన వాడకం పెద్దయెత్తున ఉన్నది సంపన్న దేశాల్లో, వృద్ధికోసం తంటాలు పడుతున్న పేద దేశాలకు ఇంధనం వాడొద్దని, ఉత్పత్తిని నిలిపివేయాలని చెప్పడం హాస్యాస్పదం. ఇప్పుడు పునరుత్పాదక ఇంధనాన్ని పుష్కలంగా, చౌకగా- దీర్ఘకాలిక ప్రాతిపదికనైతే శిలాజ ఇంధనాల కంటే చౌకగా- చేయగలిగేలా సాంకేతిక విజ్ఞానం పరిణతి సాధించడం సంతోషకరమైన విషయం.మాంసం ఉత్పత్తిలో కర్బన ఉద్గారాల్ని తగ్గించే సాంకేతికతా మనకుంది. వరి ఉత్పత్తి లో మెరుగైన పద్ధతులు, ప్రత్యామ్నాయ ఆహారాలు ‘గ్రీన్‌హౌస్‌’ వాయువుల్ని ఇంకా తగ్గిస్తాయి. ‘కణాల కల్చర్‌’ ద్వారా మాంసం ఉత్పత్తికి సింగపూర్‌ అనుమతులిచ్చింది. అటువంటి టెక్నాలజీలవల్ల ఇక వధించేందుకు జంతువుల్ని పెంచాల్సిన అవసరం ఉండదు. ప్రపంచ మార్కెట్ల డిమాండుకు తగ్గ మాంసాన్ని రాబోయే 10-20 ఏళ్లలో కొత్త టెక్నాలజీతో తయారు చేయవచ్చు.మనకు ఇప్పటికే సౌర విద్యుత్తు, బ్యాటరీ స్టోరేజీ టెక్నాలజీ, విద్యుత్‌ కార్లు, ఇంధన పొదుపు పరికరాలు, బయో మాస్‌ను ఇంధనంగా మార్చే సెల్యులోజిక్‌ ఎంజైములు, ఇతర అద్భుత సాంకేతికతలు చవకగా అందుబాటులో ఉన్నాయి. ఉత్పత్తిని, ఆర్థిక వృద్ధిని, ఉద్యోగాల్ని కోల్పోకుండానే వచ్చే 20ఏళ్లలో శిలాజ ఇంధనాల మీద ఆధార పడాల్సిన అవసరం నుంచి పూర్తిగా బయటపడే సామర్థ్యం ఈవేళ మానవాళికి ఉంది.కొత్త ఇంధన వ్యవస్థల్ని నిర్మించి, నిర్వహించే క్రమంలో కోట్ల సంఖ్యలో నూతన ఉద్యోగాల్ని సృష్టించవచ్చు. ఇందుకు ప్రతి దేశంలో, ప్రపంచ స్థాయిలోనూ భారీగా ప్రయత్నం కావాలి. ప్రస్తుత శిలాజ ఇంధన ఆధారిత విద్యుత్‌ గ్రిడ్లనుంచి పునరుత్పాదక ఇంధన గ్రిడ్‌లకు మరలడానికి సుమారు 15-20 లక్షల డాలర్లు అవసరమవుతాయి. ప్రస్తుత విద్యుత్‌ ప్లాంట్లను మూసివేస్తే, వాటి వ్యయాన్ని ఎవరో ఒకరు చెల్లించాల్సి ఉంటుంది. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల పరిహారం కట్టాల్సి ఉంటుంది.పాత పెట్రోల్‌ బంక్‌ స్థానంలో విద్యుత్‌ కార్ల బ్యాటరీలను రీఛార్జి చేసే సౌర విద్యుత్‌ ఛార్జింగ్‌ స్టేషన్లు రావాలి. ప్రస్తుత కేంద్రీకృత గ్రిడ్‌ స్థానంలో వికేంద్రీకరించిన పంపిణీ వ్యవస్థలు ఏర్పడాలి. పగలు సౌర విద్యుత్తును ఉత్పత్తి చేస్తూనే, ప్రపంచవ్యాప్తంగా బ్యాటరీ స్టోరేజీ సామర్థ్యాన్ని నిరంతర విద్యుత్‌ అవసరాల కోసం భారీస్థాయిలో నెలకొల్పాలి. ఈ పరివర్తన (ట్రాన్సిషన్‌) కోసం తక్కువ ఖర్చుతో సమర్థంగా పనిచేసే టెక్నాలజీలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ పరివర్తన జరగాలంటే మనకు భారీ వనరులు కావాలి. కొవిడ్‌ సంక్షోభం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలూ తమ ఆర్థిక వ్యవస్థల ఉద్దీపనకు, ఆర్థిక కార్యకలాపాలు లేక కుదేలైన కార్మికులను, సంస్థలను ఆదుకునేందుకు సుమారు 15లక్షల డాలర్ల ప్రభుత్వ ధనాన్ని వెచ్చించాయి. ఈ మొత్తాన్ని కేవలం ఏడాది కాలంలో సమకూర్చగలిగాయి.శిలాజ ఇంధన గ్రిడ్ల నుంచి పునరుత్పాదక గ్రిడ్లకు మరలేందుకు మనకు కావలసిందల్లా 15 లక్షల డాలర్లు- అంటే కొవిడ్‌ ఉద్దీపనకు ఏడాది కాలంలో వినియోగించిన మొత్తాన్ని 10-15 ఏళ్ల కాలంలో వినియోగించడం. వృద్ధి, ఉపాధి, నాణ్యమైన జీవితంతో పర్యావరణహిత ఆర్థిక వ్యవస్థల్ని నిర్మించడానికి కావలసిన సాంకేతికత, వనరులు ప్రపంచానికి ఉన్నాయి. మనకు కావలసిందల్లా రాజకీయ సంకల్పం, ఆర్థిక, వ్యాపార సృజనాత్మకత, ప్రపంచ దేశాల మధ్య సహకారం! బెంబేలెత్తిస్తున్న భూతాపం ఒకవిధంగా మొత్తం మానవాళికి కొవిడ్‌ ఒక మేలుకొలుపు. అసమానతలు తగ్గించడానికి, అందరికీ అవకాశాల్ని అందించడానికి, అభివృద్ధిని పెంచడానికి, పేదరికాన్ని అంతం చేయడానికి- నాణ్యమైన, ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండే ఒక ఆరోగ్య రక్షణ వ్యవస్థ, నైపుణ్యాలు, పెట్టుబడి ప్రోత్సాహకాలు, ఉద్యోగాల కల్పన, సమ్మిశ్రిత వృద్ధి ఎంత కీలకమన్నది అన్ని దేశాలకు, ముఖ్యంగా భారత్‌కు ఇది గుర్తుచేసింది.ఇది కేవలం ఒక ఆర్థికపరమైన అవసరం కాదు, స్థిరత్వానికి కావలసిన ఓ రాజకీయ అనివార్యత. సామరస్యత, సంతోషాలకు కావలసిన ఓ సామాజిక అనివార్యత. భవిష్యత్తులో తలెత్తే అవకాశమున్న మరింత ప్రమాదకర, విధ్వంస కారక మహమ్మారుల్ని నిరోధించడానికి మనం ప్రకృతి సమతౌల్యాన్ని పునరుద్ధరించాలి. వన్యప్రాణుల్ని ఆహారంగా వినియోగించడానికి స్వస్తి చెప్పాలి. అడవుల నరికివేతను ముఖ్యంగా ఆఫ్రికా, తూర్పు ఆసియా, దక్షిణ అమెరికాల్లో ఆపుచేయాలి. చివరిగా భూతాపాన్ని ఎదుర్కొని తిరిగి సాధారణ స్థితికి మళ్లించడానికి- తద్వారా మన పిల్లలు, మొత్తం మానవాళి భవిష్యత్తును పరిరక్షించడానికి అందుబాటులో ఉన్న సాంకేతిక విజ్ఞానాన్ని, వనరుల్ని సరైన రీతిలో ఉపయోగించాలి.
వాతావరణ మార్పు అంటే ఏమిటి? భూమి వేడెక్కితే ఏం జరుగుతుంది?
గ్లోబల్‌ వార్మింగ్‌ శాస్త్రవేత్తలు హెచ్చరిక
గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రపంచానికి పెనువిపత్తుగా మారబోతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మనుషుల చర్యల వల్ల వాతవరణంలోకి కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఉద్గారాలు భారీగా పెరిగాయి. ఫలి తంగా ఉష్ణోగ్రతలు కూడా మండుతు న్నాయి. ధ్రువాల్లో మంచు కరుగుతోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు పెరుగుతున్నాయి.
వాతావరణ మార్పు అంటే..
భూమి సగటు ఉష్ణోగ్రత 15 డిగ్రీ సెంటీగ్రేడ్లు. గతంలో ఇది ఇంతకన్నా ఎక్కువగా, తక్కువగా కూడా ఉంది.ఈ ఉష్ణోగ్రతలో మార్పులు సహజమే. అయితే, మునుపటి కన్నా చాలా వేగంతో ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరుగుతు న్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.గ్రీన్‌ హౌజ్‌ ఎఫెక్ట్‌ దీనికి కారణమని వారు చెబుతున్నారు. గ్రీన్‌ హౌజ్‌ ఎఫెక్ట్‌ అంటే సూర్యుడి నుంచి భూమిపైకి వచ్చే శక్తిలో కొంత భూమిపైనే నిలిచిపోవడం. భూమిపై నుంచి పరావర్తనం చెంది అంతరిక్షంలోకి వెళ్లాల్సిన సౌరశక్తిని గ్రీన్‌ హౌజ్‌ వాయువులు గ్రహించుకుని తిరిగి భూమిపైకి చేరేలా చేస్తున్నాయి.ఫలితంగా వాతావరణం, భూ ఉపరితంల వేడెక్కు తున్నాయి. ఈ ఎఫెక్ట్‌ లేకపోతే భూమి ఇంకో 30 డిగ్రీ సెంటీగ్రేడ్స్‌ చల్లగా ఉండేది. జీవం మనుగడ కష్టమయ్యేది.అయితే,ఈ గ్రీన్‌ హౌజ్‌ ఎఫెక్ట్‌కు పరిశ్రమలు, వ్యవసాయం వల్ల వెలువడే వాయువులు తోడై మరింత శక్తిని గ్రహించి, ఉష్ణోగ్రతలను పెంచుతున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీన్నే గ్లోబల్‌ వార్మింగ్‌ (భూమి వేడెక్కడం), వాతావరణ మార్పులు అంటారు.
గ్రీన్‌ హౌజ్‌ వాయువులు ఇవే…
గ్రీన్‌ హౌజ్‌ వాయువుల్లో అత్యంత ప్రభావవంతమైంది నీటి ఆవిరి. కానీ, అది వాతావరణంలో కొన్ని రోజులపాటే ఉంటుంది. కార్బన్‌ డై ఆక్సైడ్‌ చాలా కాలం ఉంటుంది. అది పారిశ్రామికీకరణ కన్నా ముందు ఉన్న స్థాయిలకు వెళ్లాలంటే కొన్ని వందల ఏళ్లు పడుతుంది. సముద్రాల్లాంటి సహజ జలవ నరులు దాన్ని పీల్చుకోగలవు.శిలాజ ఇంధనా లను మండిరచడం వల్లే అత్యధికంగా కార్బన్‌ డై ఆక్సైడ్‌ విడుదలవుతోంది. కార్బన్‌ డై ఆక్సైడ్‌ ను పీల్చుకునే అడవులను నరికి, కాల్చేయడం వల్ల కూడా కార్బన్‌ వెలువడుతోంది. గ్లోబల్‌ వార్మింగ్‌ ఎక్కువవుతోంది.1750లో పారిశ్రామిక విప్లవం మొదలైనప్పటితో పోలిస్తే కార్బన్‌ డై ఆక్సైడ్‌ స్థాయిలు 30శాతం పెరిగాయి. గత 8 లక్షల ఏళ్లలో వాతావర ణంలో ఈ స్థాయిలో కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఎప్పుడూ లేదు. మనుషుల చర్యల వల్ల మీథేన్‌, నైట్రస్‌ ఆక్సైడ్‌ లాంటి ఇతర గ్రీన్‌ హౌజ్‌ వాయు వులు కూడా వెలువడుతున్నాయి. అయితే, కార్బన్‌ డై ఆక్సైడ్‌ అంతటి స్థాయిలో అవి లేవు.
గ్లోబల్‌ వార్మింగ్‌కు ఆధారాలు ఉన్నాయా?
పారిశ్రామిక విప్లవం కన్నా ముందునాళ్లతో పోల్చితే ప్రపంచ సగటు ఉష్ణోగ్రత ఇప్పుడు ఒక సెంటీగ్రేడ్‌ పెరిగినట్లు ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) చెబుతోంది.అత్యధిక సగటు ఉష్ణోగ్రతలు నమోదైన 20 ఏళ్లు.. గత 22 ఏళ్లలోనే ఉన్నాయి. 2005-2015 మధ్య సగటు సముద్ర మట్టం 3.6 మిల్లీమీటర్లు పెరిగింది. ఉష్ణోగ్రత పెరగడం వల్ల నీరు వ్యాకోచించి ఇది ఎక్కువగా జరిగింది. కరుగుతున్న మంచు కూడా సముద్ర మట్టాలు పెరగడానికి ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఉష్ణోగ్రత పెరుగుతున్న ప్రాంతాల్లో హిమనీనదాలు కరుగుతున్నాయి. ఆర్కిటిక్‌ సముద్ర మంచు 1979కి ఇప్పటికీ చాలా తగ్గిపోయిందని ఉపగ్రహాలు తీసిన ఫొటోలు సూచిస్తున్నాయి. గ్రీన్‌లాండ్‌పై పరుచుకున్న మంచు కూడా కొన్నేళ్లుగా రికార్డు స్థాయిలో కరుగుతోంది. పశ్చిమ అంటార్కిటికా పై ఉన్న మంచు ద్రవ్యరాశి కూడా తగ్గుతోంది. తూర్పు అంటార్కిటికాలోనూ ఈ పరిణామం మొదలవ్వొచ్చని తాజాగా ఓ అధ్యయనం హెచ్చరించింది. పంటలు, జంతువులపైనా వాతావరణ మార్పుల ప్రభావం కనిపిస్తోంది. మొక్కల్లో పూలు పూసే, పండ్లు కాసే సమయాలు ముందుకు జరుగుతున్నాయి. జంతువులు వలస వెళ్తున్నాయి.
ఉష్ణోగ్రత ఎంత పెరగవచ్చు?
భూ ఉపరితల ఉష్ణోగ్రత 1850తో పోల్చితే 21వ శతాబ్దం చివరినాటికి 1.5 డిగ్రీ సెల్సి యస్‌ పెరగొచ్చు. చాలా వరకూ అంచ నాలు ఇదే సూచిస్తున్నాయి.ప్రస్తుతం ఉన్న గ్లోబల్‌ వార్మింగ్‌ పరిస్థితులే ఇకపైనా కొనసాగితే పెరుగుదల 3 నుంచి 5 డిగ్రీ సెల్సియస్‌లు కూడా ఉండొచ్చని డబ్ల్యూఎంఓ అంటోంది.
ఉష్ణోగ్రతలో 2 డిగ్రీ సెల్సియస్‌ల పెరుగుదల ప్రమాదకర పరిస్థితులకు దారితీయొచ్చని అంచనా వేస్తున్నారు. ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీ సెల్సియస్‌లకు కట్టడి చేసుకోగలిగితే క్షేమంగానే ఉండొచ్చని ఇటీవలి కాలంలో శాస్త్రవేత్తలు, నాయకులు అంటున్నారు. ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీసెల్సియస్‌లకు అదుపు చేయాలంటే సమాజం అన్ని విధాలుగా త్వరితగతిన మారాల్సి ఉంటుందని ఇంటర్‌ గవర్న్‌మెంటల్‌ ప్యానెల్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ (ఐపీసీసీ) నివేదిక అభిప్రాయపడిరది. చైనా నుంచే అత్యధికంగా కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఉద్గారాలు వెలువడుతున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో అమెరికా,యురోపియన్‌ యూనియన్‌ సభ్య దేశాలు ఉన్నాయి. జనాభా నిష్పత్తి ప్రకారం చూస్తే, వీటిలో ఉద్గారాలు చాలా ఎక్కువ. ఇప్పటికిప్పుడు గ్రీన్‌ హౌజ్‌ వాయువుల ఉద్గారాలు గణనీయంగా తగ్గించుకున్నా, వాతా వరణంపై ప్రభావం తప్పదని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ప్రభావం ఎలా ఉంటుంది?
వాతావరణ మార్పుల ప్రభావం ఎలా ఉంటుదన్నదానిపై స్పష్టత లేదు.ప్రతికూల వాతావరణ పరిస్థితులు పెరుగతాయి. దీంతో మంచినీటి కొరత ఏర్పడొచ్చు. ఆహార ఉత్పత్తి పైనా తీవ్ర ప్రభావం పడొచ్చు. వరదలు, తుఫానులు, వడగాలుల వల్ల మరణాల సంఖ్య పెరగొచ్చు.భూతాపం పెరగడం వల్ల ఎక్కువ నీరు ఆవిరవుతుంది.
వాతావరణంలో తేమ శాతం పెరుగుతుంది. ఫలితంగా చాలా ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువవుతుంది. కొన్ని ప్రాంతాల్లో మంచుపడుతుంది. తీరాలకు దూరంగా ఉండే ప్రాంతాల్లో వేసవుల్లో కరవు ముప్పు ఎక్కువవుతుంది. సముద్ర మట్టాలు పెరుగుతాయి కాబట్టి వరదలు కూడా పెరగొచ్చు. ఈ మార్పులను తట్టుకునే సామర్థ్యం లేని పేద దేశాలపై ప్రభావం విపరీతంగా ఉండొచ్చు.పరిస్థితులకు అంత త్వరగా అలవాటుపడలేవు కాబట్టి కొన్ని రకాల మొక్కలు, జంతువులు అంతరించిపోవచ్చు. మలేరియా లాంటి వ్యాధులు, పోషకాహార లోపాల బారిన కోట్ల మంది పడొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అంచనా వేసింది. వాతావరణంలో పెరిగిన కార్బన్‌ డై ఆక్సైడ్‌ను సముద్రాలు ఎక్కువగా పీల్చుకోవడం వల్ల వాటి ఆమ్లత్వం ఇంకా పెరగొచ్చు. కోరల్‌ రీవ్స్‌కు ముప్పు ఏర్పడొచ్చు.వాతావరణ మార్పులపై స్పందించడమే ఈ శతాబ్దంలో మానవాళికి అతిపెద్ద సవాలు కాబోతోంది. (- రచయిత: (ప్రజాస్వామ్య పీఠం(ఎఫ్‌.డీ.ఆర్‌), లోక్‌సత్తా వ్యవస్థాపకులు)

-డాక్టర్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌

పెట్రో ధరలు పైపైకీ

ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్న పెట్రోలు, డీజిల్‌ ధరాఘాతంతో సామాన్యులు విలవిల్లాడిపోతున్నారు. వంద కొట్టు! పెట్రోలు బంకుల వద్ద ఇదివరకు వినిపించిన ఈ మాట ఇప్పుడు గొంతు సవరించుకోక తప్పడం లేదు. ఈ రోజు ఎంత పెరిగిందనే ఆందోళనా స్వరాలే నేడు బంకుల వద్ద ప్రతిధ్వనిస్తున్నాయి. ఇంధన ధరలు పెంచినప్పుడల్లా ఆందోళన చేస్తుంటే ఇదివరకు ‘మనకెందుకులే’ అనుకున్నవాళ్లూ ఇప్పుడు ఎర్రజెండా పట్టుకొని ‘ఇంత అన్యాయమా?’ అంటూ పాలకుల దోపిడిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇంధన ధరల పెరుగుదలను నిరసిస్తూ ప్రజాగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి.

Read more

మానవ హక్కులు కనబడుట లేదు

ఒక లక్ష్యంకోసం పోరాడినా… ఆ లక్ష్యాన్ని సాధించలేనప్పుడు,పోరాటం ఆగాలా..! పోరాటం సాగాలా..!! మహాత్మాగాంధీ అన్నట్టు ‘‘వాళ్లు నాశరీరాన్ని హింసించ వచ్చు, నా ఎముకలు విరిచేయవచ్చు,నన్ను చంపే యొచ్చు కూడా… అప్పుడైనా వాళ్లకు దొరికేది నా దేహమే నా విధేయత కాదు’’
మానవ హక్కులు దేవతావస్త్రాల్లా తయారయ్యాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా స్వామ్య దేశంగా ఘనత చాటుకునే మన భారత్‌ లోను, అతిపాత ప్రజాస్వామ్య దేశంగా జబ్బలు చరుచుకునే అగ్రరాజ్యం అమెరికాలోనూ మానవ హక్కుల ఉల్లంఘనలు యథేచ్ఛగా జరుగుతూనే ఉన్నాయి. ఇక నియంతృత్వ పాలన సాగుతున్న దేశాల పరిస్థితి ఎలా ఉంటుందో తేలికగానే అర్థం చేసుకోవచ్చు. చాలాచోట్ల ప్రభుత్వాలే నిస్సిగ్గుగా మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయి. ఇంకొన్నిచోట్ల ప్రభుత్వాలు మానవ హక్కుల పరిరక్షణకు కంటితుడుపుగా అధికారిక వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నా,అలాంటిచోట్ల ప్రభుత్వాల అధీ నంలో పనిచేసే శాంతిభద్రతల బలగాలు,రక్షణ బలగాలు ప్రజల కనీస మానవ హక్కులను కాలరా స్తున్నాయి. ప్రపంచంలోని మిగిలిన దేశాల సంగతి సరే,ముందు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఘనత పొందిన మన భారత దేశంలో మానవ హక్కుల పరిస్థితిని ఒకసారి చూద్దాం. మనరాజ్యాంగం జీవించే హక్కును,సమానత్వ హక్కును,దోపిడీకి గురి కాకుండా ఉండే హక్కును,భావప్రకటనా స్వేచ్ఛను, విద్యాహక్కును,సాంస్కృతిక స్వేచ్ఛను,మత స్వేచ్ఛను, గోప్యత హక్కును ప్రాథమిక హక్కులుగా గుర్తిం చింది. ఈ హక్కులకు భంగం వాటిల్లితే రాజ్యాంగ పరిధిలో చట్టపరంగా రక్షణపొందే హక్కును కూడా ప్రాథమిక హక్కుగా గుర్తించింది. మన రాజ్యాం గంలో హక్కులు,మన చట్టాల్లో హక్కుల పరిరక్షణ మార్గాలు చాలా పకడ్బందీగానేఉన్నా, మన దేశం లో యథేచ్ఛగా హక్కుల ఉల్లంఘనలు జరుగు తూనే ఉన్నాయి. దేశంలోమానవహక్కులకు రక్షణ కల్పించ డానికి 1993లో జాతీయ మానవహక్కుల కమిషన్‌ ఏర్పడిరది. తర్వాతి కాలంలో వివిధ రాష్ట్రాల్లోనూ మానవ హక్కుల కమిషన్‌లు ఏర్పడ్డాయి.ఇన్ని ఏర్పా ట్లు చేసుకున్నా, మానవహక్కులకు భరోసా కల్పిం చడంలో మనదేశంలో పెద్దగా సాధించి నదేమీ లేకపోగా,ఎక్కడో ఒకచోట సామాన్యుల హక్కులకు తరచుగా విఘాతం కలుగుతూనే ఉంది.

Read more
1 3 4 5 6 7 9