అభివృద్ధి పేరుతో అప్పులు ఎవరి కోసం?

ఆర్థికాభివృద్ధికి లోటులేదు. మన వనరులు ఆదాయం ఆంద్రోళ్లుకొల్లగొట్టారని మనకు తిప్పలు.. ఇలా తెలంగాణ గూర్చి గొప్పలు చెప్పారు. నిజమే తెలంగాణ గూర్చి కేసీఆర్‌ చెప్పిందంతా నిజమే. అయితే, తెలంగాణ వచ్చిన తర్వాత రెండు లక్షల కోట్లకు అప్పు ఎలా పెరిగింది? ఆదాయం తగ్గిందిలేదు. పైగా పెరిగింది. హైదరాబాద్‌ ఆదాయం నలుబది శాతం మద్యం ఆదాయం, ఇరువై శాతం ఉంటుంది. అప్పుల భారతాన్ని, ఈ అప్పుల రాష్ట్రాన్ని ఆ ఊబి నుంచి ఎవరు బయటపడేస్తారు? లక్షల కోట్ల అప్పు ఎలా తీరుస్తారు? ఇన్ని లక్షల కోట్ల అప్పులు ఎందుకు చేసినట్టు? ఏ అభివృద్ధి పేరుతో ఎవరు తిన్నట్టు? ఎన్నో వనరులున్న భారతదేశ అభివ ృద్ధికి అప్పులు అవసరమా? అప్పులు చేసి అభివృద్ధి చేయాలా? లక్షల కోట్ల అప్పులున్న దేశాన్ని అభివ ృద్ధి చెందిన దేశంగా ఎలా శ్లాఘించగలం? అన్నీ ప్రశ్నలే..?
అభివృద్ధి పేరుతో జరిగిన లక్షల కోట్ల అప్పు కనిపిస్తోంది తప్ప అభివ ృద్ధి కనిపిస్తుందా? ఎక్కడ కనిపిస్తుంది? ఎవరి అభివ ృద్ధి కనిపిస్తుంది? ఇన్నిన్ని కోట్ల అప్పు చేస్తే మిగిలిందేమిటీ? పేదలపాలిట కన్నీళ్లు.. మరి ఇన్ని లక్షల కోట్ల అప్పు ఎవరికొరకు చేసారు? ఎందుకు చేసారు? అప్పుమూలంగా ఎవరు లాభపడ్డారు? అభివృద్ధి కనిపించదు. అప్పు కనిపిస్తుంది ఎందుకు?
అప్పు నిజం.. అభివ ృద్ధి అబద్ధం. ఇదీ మనదేశస్థితి… ఇదీ మన తెలంగాణ స్థితి. అన్నీ ఉండి అప్పులు చేసి.. అభివృద్ధి చేస్తామని గొప్పలు చేప్పుకోవటం ఇప్పటి ప్రభుత్వాలకు అలవాటయ్యింది. ఈ అభివ ృద్ధికి అప్పు చేసామంటే ఒక అర్థముంది. ఆ అభివృద్ధి కనిపించాలి. ఈ ప్రాజెక్టుకు అక్కడి నుంచి ఇక్కడి నుంచి ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తెచ్చామంటే ప్రజలు అర్థం చేసుకుంటారు. అన్నీ ఉండి సరిపోయే ఆదాయముండి లక్షల కోట్లు అప్పు చూపిస్తే ప్రజలేమనుకుంటారు? అభివృద్ధి పేరుతో అప్పు తెచ్చి.. తమ ఆస్తులు పెంచుకున్నారని.. కోట్ల రూపాయలు దోచుకొని, దాచుకున్నారని భావిస్తారు. వాస్తవం కూడా ఇదే!
పాలకుల మీద రాజకీయ నాయకుల మీద నిందలు వేయటం సరదాకాదు. నిజానికి ప్రజలు పాలకులు, రాజకీయ నాయకులు స్వచ్ఛందంగా, ఆదర్శంగా, కడిగిన ముత్యంలా ఉండాలని భావిస్తారు. ‘’మేము ఓటువేసి గెలిపించాం కానీ దొంగైతేలిండు అని చెప్పుకోవటం ప్రజలకు కూడా అవమానమే. అభివృద్ధి పేరుతో జరుగుతున్న వేల కోట్ల అవినీతి గూర్చి నేను రాయటం, మీరు చెప్పటం కాదు, ‘రాజకీయ పక్షాలే ఒకరి నొకరు ‘నీవు దొంగ నీవు దొంగ’ అని తిట్టుకుం టున్నాయి. రాళ్లు వేసుకుంటున్నాయి. దేశంలోని అత్యున్నత నేర పరిశోధనా సంస్థ సీబీఐలోని ప్రధమ ద్వితీయ అధికారులే ఒకరినొకరు అవినీతి పరులని ఆడిపోసుకుంటున్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భావం జరిగే సమయానికి తెలంగాణ రాష్ట్రం అప్పు యాబదివేల కోట్లు. మన రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్‌ పరిపాలనలో ఏడాది క్రితం తేలిన తెలంగాణ రాష్ట్ర అప్పు రెండు లక్షల కోట్లు.. ఇప్పుడు పత్రికల కథనాల ప్రకారం రెండు లక్షల ముప్పది వేల కోట్ల అప్పు… ఇంత అప్పు తెలంగాణ ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? చేసిన అప్పు అభివ ృద్ధిలో కనిపించాలి. కనిపిస్తుందా? రెండు లక్షల ముప్పదివేల కోట్లు అంటే మామూలు మాట కాదు. ఎందుకు చేసినట్టు? తెలంగాణలో ఏఅభవృద్ధి కనిపిస్తుంది? అప్పులతో కూడిన అభివృద్ధి సంత ృప్తికలిగించదు. అభివృద్ధి కనిపించినా కొంత సంత ృప్తి కనిపిస్తుందేమో.‘అభివృద్దే’ కనిపించక పోతే…ఏ రాష్ట్రానికి ఎంత అప్పు ఉందో తెలియదు కానీ, నూతన తెలంగాణ రాష్ట్ర అప్పు రెండు లక్షల ముప్పదివేల కోట్లు. తెలంగాణ రాష్ట్ర జనాభా ఎంత? నాలుకోట్లని కొందరంటారు. మనిషికి.. అంటే తలకు ఎంత అప్పు? అరువదివేల అప్పు.. భయం వేయటం లేదూ..? తెలంగాణ కొత్త రాష్ట్రాన్ని తెచ్చుకొని.. మన రాష్ట్రాన్ని మనం పాలిస్తున్న తృప్తిలో రెండు లక్షల ముప్పదివేల కోట్ల అప్పు పెంచుకున్నాం. అవసరమా? అవసరమైన అప్పుగా భావించాలా? ఈ లెక్కలు ఇలా ఉండగా.. భారతదేశ అప్పు 50 లక్షల కోట్లు అని ఎక్కడో చదివింది జ్ఞాపకమొచ్చింది. నిజమా? అబద్దమా? లెక్క తేలటానికి అవకాశం లేదు. రకరకాల అప్పులుంటాయి కాబట్టి లెక్క తేలటం కష్టం.. సమాచార హక్కు క్రింద ఈ లెక్కలు యివ్వకపోవచ్చు.. రాష్ట్రాలు సంస్థలు.. స్వయం ప్రతిపత్తి గల రాజ్యాంగం కాబట్టి లెక్క కష్టమే.. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ‘పరిశ్రమల’ పేరుతో ఉపాధి పేరుతో బిచ్చగాళ్లలాగా ప్రపంచం చుట్టూ తిరుగుతూ ఉంది. ఎవరిచ్చారు అధికారం? అప్పుల పేరుతో అభివ ృద్ధి పేరుతో ఎవరు దోచుకున్నారు? ఎవరు సంపన్నులయ్యారు? అప్పులు లక్షల కోట్లు కనిపిస్తున్నాయి. ప్రజలు నిరుపేదలుగా ఉన్నారు. ఎవరు అభివృద్ధి చెందినట్టు? రాఫెల్‌ అవినీతిలో 30వేల కోట్ల అవినీతి ఉందని దేశం సంపద అనిల్‌ అంబానీ జేబులోకి వెళ్లిందని కాంగ్రెస్‌ నేత రాహూల్‌ లెక్కలతో చెపుతున్నారు. బడా వ్యాపారులు బ్యాంకులను ముంచిన సొమ్ము పన్నెండు లక్షల కోట్లు. ఇట్టి డబ్బు ఏదో రూపంలో ప్రభుత్వం బ్యాంకులకు యివ్వాలి. ఒకవేళ బ్యాంకులను నింపకపోతే.. బ్యాంకులు దివాలా తీస్తాయి. బ్యాంకులకు నింపాలంటే ఎలా? ఘనమైన భారత సర్కారు అప్పు చేయవల్సిందే… లేకపోతే పన్నులు పెంచాలి.. లేకపోతే పెట్రోల్‌ డిజీల్‌పై మరో పది ఇరువది దోచుకోవాలి.. ఇదే భారతదేశ అభివృద్ధి. ఇన్ని లక్షల కోట్ల అప్పు ఎందుకయింది? దేశంలో ఉన్న 80శాతం పేద ప్రజలు, శ్రమజీవులు బాగుపడ్డారా? దేశం ప్రధాన ఉత్పత్తి, జీవనాధారం వ్యవసాయం. రైతులు బాగుపడ్డారా? ఇప్పటికీ దేశవ్యాప్తంగా వేల మంది రైతులు అప్పులతో మరి ఆత్మహత్య చేసుకుంటున్నారు.ఏఅభివృద్ధికి ఈ అప్పులు? భారతదేశం ఎన్నో వనరులున్న దేశం.. ఎన్నో సంపదలున్న విశాల భారతదేశం. మానవశక్తి విపరీతంగా ఉన్న దేశం. డెబ్బది ఏండ్ల స్వాతంత్య్రంలో యాబది కోట్ల లక్షల అప్పు చేసిన ఘనత మన ప్రజాస్వామ్య పరిపాలకులది. ఆంగ్లేయ పాలకులు దేశ సంపదను దోచుకొని ఇంగ్లాడు పంపిస్తే.. మన స్వాతంత్య్ర ప్రజాస్వామ్య పాలకులు లక్షల కోట్లు అప్పులు చేసి అభివ ృద్ధి పేరుతో కార్పొరేట్‌ సామ్రాజ్యాన్ని విపరీతంగా పెంచారు. ఆర్థిక అసమానతలకు తెరదీసారు.
నిజానికి భారతదేశానికి 50 లక్షల కోట్లు అప్పు ఎందుకయ్యిందో అర్థం కాదు. ఏ అభివృద్ధి జరిగిందో అర్థం కాదు. ఉద్యోగాల కల్పన లేదు. కొత్త నిర్మాణాలు లేవు. ఎవరితో యుద్ధం లేదు. అందరూ జీతాలు రెట్టింపు చేసుకోవటం తప్ప కొత్త ఉద్యోగాలు లేవు. ఆదాయం విషయంలో గతం కంటే రెట్టింపు కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి రకరకాల ఆదాయం పెరిగింది. పెట్రోల్‌ డీజిల్‌ రెట్టింపు రేట్ల అమ్మకం ద్వారా లక్షల కోట్ల ఆదాయం పెరిగింది. పైగా కొత్తగా బొగ్గు, మైనింగ్‌ ద్వారా, ఇంటర్నెట్‌ సేవల మూలంగా లక్షల కోట్ల ఆదాయం పెరిగింది. ప్రభుత్వ ప్రతిష్టాత్మక పన్నుల చట్టం జీఎస్‌టీ ఆదాయం ఉండనే ఉంది! మరి ఈ ఆదాయమంతా ఏమైనట్టు? లక్షల కోట్ల అప్పులు ఎందుకు అయినట్టు? ప్రతి ఏటా ఇరువది లక్షల పైన బడ్జెట్‌? ఎవరు తింటున్నట్టు? తెలంగాణ ఉద్యమంలో ఇదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ పదేపదే అన్నారు. తెలంగాణకు వనరులు న్నాయి. నదులున్నాయి. పచ్చని పొలాలున్నాయి. ఆర్థికాభివృద్ధికి లోటులేదు. మన వనరులు ఆదాయం ఆంద్రోళ్లుకొల్లగొట్టారని మనకు తిప్పలు.. ఇలా తెలంగాణ గూర్చి గొప్పలు చెప్పారు. నిజమే తెలంగాణ గూర్చి కేసీఆర్‌ చెప్పిందంతా నిజమే. అయితే, తెలంగాణ వచ్చిన తర్వాత రెండు లక్షల కోట్లకు అప్పు ఎలా పెరిగింది? ఆదాయం తగ్గిందిలేదు. పైగా పెరిగింది. హైదరాబాద్‌ ఆదాయం నలుబది శాతం మద్యం ఆదాయం, ఇరువై శాతం ఉంటుంది. లక్షకోట్లు కేంద్రం నుంచి ఇచ్చామని అమిత్‌షా అన్నారు. రెండు లక్షల కోట్లకు అప్పు ఎందుకు పెరిగినట్టు?ఎవరు బోంచేసినట్టు?- – సిహెచ్‌.మధు

అడవిపై ఆదివాసీకి హక్కు ఎక్కడ?

అడవిని చట్టబద్దంగా పొందవలసిన ఆదివాసీలనూ వారి హక్కులనూ కాల రాశారు. అడవిపై ఆదివాసీల హక్కులు పూర్తి కాలరాయడంతో అనేక పరిణామాలు సంభవించాయి. అడవిలో ఉండే ఆదివాసీలను ఆక్రమణదారులుగా గుర్తించారు. అడవిలో జీవించటం, జీవనాధారాన్ని పొందటం నేరపూరిత చర్యగా భావించారు. దీనితో ఆదివాసీలలో అభద్రతా భావం మొదలైంది! ఏజెన్సీలో ఈ విధంగా జరుగుతుండటంతో పోషకార లోపంతో, ఆకలి చావులతో ఆదివాసీలు చనిపోవడం నిత్యక ృత్యం అయింది. దీనితో నిర్వాసితం అనేది ఆదివాసీల జీవితంలో ఒక భాగం అయిపోయింది. దాదాపుగా 60శాతం పైగా షెడ్యూల్డ్‌ ప్రాంత భూములు అటవీశాఖ ఆధీనంలో ఉన్నాయి. జీవనాధారానికి కొద్ది భూభాగం మాత్రమే ఆదివాసీలకి దక్కింది. ఏజెన్సీలో 50శాతం పైగా భూములు ఆదివాసేతరుల చేతిలో ఉన్నాయి.వూకె రామకృష్ణ దొర
తరతరాలుగా ఆదివాసీలు అడవులతో మమే కం అయిపోయి అవినాభావ సంబంధంలో జీవనాన్ని గడుపుతున్నారు. అడవుల నుండి పండ్లు, దుంపలు, మూలికలు ఇతర ఆహార పదార్థాలను సమకూర్చుకుంటున్నారు. ఆదివాసీలు ఆర్థిక వ్యవస్థ అంతా అడవులపైనే ఆధారపడి ఉంటుంది. కేవలం ఆర్థిక వ్యవస్థే కాదు సామాజిక, సాంస్క ృతిక, సంప్రదాయ మత జీవనాలు కూడా అడవులతోనే ముడిపడి ఉంటాయి.
ఆదిమకాలం నుంచి అడవులను ఆదివాసీలు యథేచ్ఛగా ఉపయోగించుకుంటున్నారు. ఆదివాసీ ప్రాంతాలలోకి బ్రిటీషు వారి ప్రవేశంతో సమస్యలు తలెత్తాయి. బ్రిటీషు పాలకులు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి భూమికి శిస్తు వసూలు చేయడం ప్రారంభించారు. వనరులను తమ ఆదాయన్ని పెంచే సాధనాలుగా గుర్తించి అడవులనూ అమ్ముకోవచ్చు అనుకున్నారు.
అందుకనే ఆదివాసీలనూ అడవి నుంచి తరిమి వాటిని తమ సొంత ఆస్తిగా మార్చుకోవడానికి అటవీ హక్కుల విధానాలనూ రూపొందించి అడవులపై తన అధికార పరిధిని పెంచుకుంటూ దోపిడి చేయటం ప్రారంభించారు. అనాదిగా అడవులు తమకి చెందినవని భావిస్తున్న ఆదివాసీల పట్ల అటవీ విధానాలు ఆశనిపాతాలయ్యాయి. అడవికి ఆదివాసికి మధ్య అగాధాన్ని పెంచాయి.
1894లో మొదటిసారిగా బ్రిటీషు ప్రభు త్వం అటవీ హక్కుల విధానాన్ని ప్రకటించింది. దీనితో అటవీ శాఖ వెలుగులోకి వచ్చింది. అప్పటి నుండి క్రమంగా ఆదివాసీలపై ప్రభుత్వ అధికారం మొదలయ్యింది. భారతదేశ స్వాతంత్య్ర అనంతరం ప్రభుత్వం 1952లో నూతన అటవీ విధానాన్ని తీసుకవచ్చింది. దీనిలో ఆదివాసుల హక్కులు రాయితీల స్థానానికి దిగజారిపోయాయి.
1894 అటవీ విధానానికి భిన్నంగా 1952 అటవీ విధానంలో మొత్తం అటవీప్రాంతానికి ఒకేపద్ధతి అవలంభించారు. ఈచట్టంతో అడవి భూమిని వ్యవసాయ భూమిగా మార్చడం అంగీకరించారు. పచ్చిక బయళ్ళనూ అడవుల్లో పశువులకూ ఉచితంగా మేపుకునే స్వేచ్ఛనూ ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చారు.
1952లో జాతీయ అటవీ విధానం అడవులనూ వ్యాపారానికి వాడుకునేందుకు అనువైన పరిస్థితిని రూపొందించింది. ఈ విధానమే ఆదివాసీలను అడవికి పరాయివాళ్ళను చేసింది. పారిశ్రామిక అవసరాలకు అడవులను నరకకుండా ఆపలేకపోయారు. 1980లో అటవీ సంరక్షణ చట్టం తీసుకవచ్చారు. ఈచట్టం ఆదివాసుల జీవనాన్ని భవిష్యత్‌నూ మరింత ప్రమాదంలోకి నెట్టింది.
భారత అటవీ సంరక్షణ చట్టం ద్వారా మానవ సంచారం లేకుండా ఉండే అటవీ ప్రాంతాలుగా అడవిని పునర్నిర్వించడం జరిగింది. అడవిలో ఉండే ఆదివాసీలను ఆక్రమణదారులుగా గుర్తించారు. చట్టబద్ధంగా పొందవల్సిన అటవీ ప్రాంత ఆదివాసీల హక్కులు పూర్తిగా కాలరాయబడ్డాయి. అడవిని రిజర్వ్‌ చేసే క్రమంలో ఆదివాసీ గ్రామాలు, భూములు రిజర్వులలో కలిసిపోయాయి.
అటవీశాఖ ఏకపక్షంగా, గిరిజన సంక్షేమ శాఖ, రెవిన్యూ శాఖల మధ్య సమన్వయంతో భూములు సర్వే చేయకుండానే అనేక సాగుభూములనూ ‘రిజర్వ్‌’ గా నోటీపై చేసింది. అటవీ చట్టం ప్రకారం ఆదివాసీలు తమ సొంత భూమిలోనే ఆక్రమణదారులుగా గుర్తించబడ్డారు. అడవి, ఆదివాసులకి మధ్య మరింత దూరం పెరిగింది.
ఆదివాసీ ప్రజలకు అడవికి ఉన్న సంబంధాన్ని వారి సంప్రదాయ హక్కులనూ, అవసరాలనూ కాపాడాలని 1908లో భారత అటవీ విధానం గుర్తిం చింది. దానికి అనుగుణంగా 1990 సెప్టెంబర్‌ 18న కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ: 13-1/90 ఎఫ్‌పి 1,2,3,4,5 అనే సర్క్యులర్స్‌ జారీ చేసింది. అవి ఇప్పటి వరకు అమలు జరుగలేదు.
1996లో పంచాయితీరాజ్‌ షెడ్యూల్‌ ప్రాంతాల విస్తరణ చట్టం ద్వారా ప్రభుత్వం ఆదివాసీ ప్రాంతాల్లోని అటవీ వనరులపై ఆదివాసీలకే అధికారం ఉంటుందని అంగీకరించింది. అయితే ప్రభుత్వమే దానిని ఉల్లఘించి నిర్లక్ష్యం చేసింది. 1947లో అధికార మార్పిడి జరిగిన తరువాత రిజర్వు ఫారెస్ట్‌గా వర్గీకరించేటప్పుడు ఆదివాసుల భూములనూ, ఉమ్మడి భూముల్ని హక్కుల్ని నిర్ధారించకుండానే సెటిల్‌ చేయకుండానే అడవులుగా ప్రకటించారు. ఆదివాసీల సెటిల్‌మెంట్‌ హక్కుల గురించి పట్టించుకోలేదు. 1952 నాటి జాతీయ అటవీ విధానంను భారత ప్రభుత్వం సవరించి 1980 అటవీ సంరక్షణ చట్టం ద్వారా అడవి హక్కులపై భారత ప్రభుత్వానికి పూర్తి ఆదిపత్యం వచ్చింది. ఎవరైతే వ్యాపార పరంగా అడవులను ఆదివాసీలనూ దోచుకున్నారో ఆవర్గాల నుండి వచ్చిన వారే అడవి రక్షకులుగా మారి అడవులనూ భక్షించారు.
అడవిని చట్టబద్దంగా పొందవలసిన ఆదివాసీలనూ వారి హక్కులనూ కాల రాశారు. అడవిపై ఆదివాసీల హక్కులు పూర్తి కాలరాయడంతో అనేక పరి ణామాలు సంభవించాయి. అడవిలో ఉండే ఆదివాసీలను ఆక్రమణదారులుగా గుర్తించారు. అడవిలో జీవించటం, జీవనాధారాన్ని పొందటం నేరపూరిత చర్యగా భావించారు.
దీనితో ఆదివాసీలలో అభద్రతా భావం మొదలైంది! ఏజెన్సీలో ఈ విధంగా జరుగుతుండటంతో పోషకార లోపంతో, ఆకలి చావులతో ఆదివాసీలు చనిపోవడం నిత్యక ృత్యం అయింది. దీనితో నిర్వాసితం అనేది ఆదివాసీల జీవితంలో ఒక భాగం అయిపోయింది.
దాదాపుగా 60శాతం పైగా షెడ్యూల్డ్‌ ప్రాంత భూములు అటవీశాఖ ఆధీనంలో ఉన్నాయి. జీవనాధారానికి కొద్ది భూభాగం మాత్రమే ఆదివాసీలకి దక్కింది. ఏజెన్సీలో 50శాతం పైగా భూములు ఆదివాసేతరుల చేతిలోఉన్నాయి.
రచయిత : తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ రచయితల సంఘం అధ్యక్షుడు, 9866073866

మహనీయ.. ‘స్వామి వివేకానంద’

‘‘స్వామి వివేకానంద ప్రసంగాలను, రచనలు నేను క్షుణ్ణంగా చదివాను, ఆ తరువాత నా దేశభక్తి వేయి రెట్లు అయింది. యువకుల్లారా! ఆయన రచనల చదవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను’’ అని మహాత్మాగాంధి అన్నారు. వివేకానందుడు రామకృష్ణ మఠం స్థాపించి ‘‘పేదలకు, వెనుకబడ్డ వారికి సేవ చేయడం దీని ప్రధానోద్దేశాలలో ఒకటి‘ అని ఉద్భోదించి భారతీయ యువతకు దిశానిర్దేశం చేశారు. భారతదేశాన్ని పురోగమింప చేయడానికి సంఘ సంస్కరణలు అవసరమని సమాజ నేతలు అనేకులు నొక్కివక్కాణించిన సమయంలో, భారతదేశ పతనానికి ఉన్నత వర్గం వారు పేదలను బహిష్కరించడము, దోపిడీకి గురిచేయడమూ మొదటి కారణమని ఘోషించిన మొదటి నేత స్వామి’’ – డా. దేవులపల్లి పద్మజ
ఉన్నతమైన ఆశయాలు ఏదో ఒకరోజు సర్వజనాంగీకారాన్ని పొందుతాయి. కారణం ఆ భావనలు, ఆశయాలు ప్రతి కార్యరంగంలోనూ, ప్రతీఆలోచనా విధానంలోనూ ఉత్తేజం కలిగించేవి కాబట్టి. కాషాయాంబరాలు ధరించి, పద్మాసనస్థులై, ఒకదాని మీదమరొకటిగా కరకమలాలను ఒడిలో ఉంచుకుని, అర్థనిమీలనేత్రులై ధ్యానమగ్నులై వివేకమంతమైన ఆనందం అనుభవించే స్వామి వివేకానంద లోకానికి ప్రకాశానిచ్చే ఒకజగద్గురువు. సామాజికసృహతో కూడిన ఆధ్యాత్మికతను ప్రజలకు ఉపదేశించడం, ఇంద్రియాతీత విష యాలను వివేకించటం ద్వారా ఆధ్యా త్మికసౌధాన్ని నిర్మించడం, ఆసౌ ధంలో చైతన్యమూర్తులుగా జనులను విరా జిల్లింప చేయటంస్వామి వివే కానంద అపురూప ఆశయం. విశ్వాసంతో నిరంతరాభ్యాసాన్ని చేస్తూ, మనసు పొరలలో నిభిఢీకృతమైన కొత్త విష యాలను అనుభవిస్తూ, క్రొంగొత్త శక్తులు వశీకరింపచేసుకుంటూ ఊహాతీత వ్యక్తిత్వాన్ని వికసింపచేసు కోవటానికి దివ్య ప్రేరణ స్వామి వివే కానంద. 1863వ సం.లో కలకత్తా నగరంలో జన్మించిన స్వామి వివే కానంద ఆరేళ్ళ ప్రాయంనుంచే అంత ర్ముఖ అన్వేషణలో మనసు లగ్నం చేసి ధ్యానంలో నిమగ్నుడై ఉండేవారు. జ్యోతిర్మయ ప్రకాశంలో జీవిస్తూ చిరుప్రాయంలోనే సృజనాత్మకత, ఆత్మ ప్రతిష్ట, ఆత్మప్రేరణలో దివ్యదర్శనాలు అనుభవించారు. ప్రకృతితో తాదాత్మ్యం చెంది ఆ చైతన్యంలో విరాజిల్లే అంతర్ముఖ చైతన్య స్వరూపుడు.‘‘నేను భగవంతుడిని నిన్ను చూస్తునంత స్పష్టంగా చూశాను, మతం అనేది అనుభూతి పొందవలసిన సత్యం, లోకాన్ని మనం అర్దం చేసు కోవటంకన్నా అనేక రెట్లు లోతుగా గ్రహించవలసిన విషయం’’ అని ప్రవచించే శ్రీరామకృష్ణ పరమహంస దివ్య సాన్నిధ్యంలో ఙ్ఞాన,కర్మ,భక్తి,యోగ మార్గాలలో కానరాని వెలుగు ఆస్వాదించి వారివచనాలను విపులీకరించి లోకాన్ని ఆశ్చర్యచకితులను చేసారు. పశుప్రాయులుగా జీవిస్తున్న వారిని మానవ స్థాయికి ఎదగచేయడమే ప్రధాన ధ్యేయంగా లోకాన్ని ఉద్ధరించిన మనీషి స్వామి వివేకానంద. చికాగోలో జరిగిన స్వామి ప్రసంగం బాహ్యంగా ఎగసిన ఉత్సాహ పుటలలోనే కాక, ఉద్వేగ ప్రవాహాలలోనే కాక, నరనరాల్లోకి చొచ్చుకుని పోయిన నూతన కాంతి పుంజం. దానిని గురించి ఒక్క మాటలో చెప్పటానికో, వ్రాయటానికో కుదిరేది కాదు. చికాగో ప్రసంగం స్వామి వివేకానందకు అమెరికాలో గుర్తింపు రావడమే కాదు, సాక్షాత్తు భారత దేశం కూడా గర్వించేలా చేసింది. అమెరికాలో ఎగసిన ఒక అల భారతదేశంలో సహస్ర తరంగాలను ఉత్పన్నం చేసింది. ‘‘నేను ఎవరిని? ఆసియా వాసినా? ఐరోపా వాసినా? అమెరికా వాసినా? ఈ వ్యక్తిత్వాల వింత సమ్మేళనాన్ని నాలో అనుభూతి చెందుతున్నాను’’ అనేవారు స్వామి. ప్రతి మతంలోని, ప్రతి సిద్ధాంతంలోని మంచిని గ్రహించి హృదయంలో దీప్తిస్తున్న ఆత్మజ్యోతిని అవలోకనం చేసుకుంటే సర్వమత ఏకత్వాన్ని దర్శించవచ్చని ప్రగాఢంగా నమ్మిన వ్యక్తి శ్రీవివేకానంద. హిందూమతాన్ని కించపరిస్తే సహించేవారు కాదు. దానిని తీవ్రంగా ప్రతిఘటించి హిందూ మత ఔన్నత్యాన్ని చాటిచెప్పేవారు. జీవితంలో అన్ని విషయాలపైన కఠోర నియమం, నిఘా అవసరం అని చెప్పే వారు. ‘‘ఆహార నియంత్రణ ముఖ్యంగా పాటించాలి. ఆహార నియం త్రణ లేకుండా మనస్సుని నియంత్రించటం సాధ్యం కాదు. అవసరం కన్నా ఎక్కువ తినడం అనేక హానులకు దారితీస్తుంది. మితిమీరి తినడం వలన మనశ్శరీరాలు చెడిపోతాయి’’ అనేవారు. ప్రేమ తత్వా న్ని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని సడలనీయవద్దని గట్టిగా ప్రభోదించేవాడు. మతం అనేది సిద్ధాంత రాద్ధాంతములతో లేదు అది ఆచరణలే ఆధ్యాత్మికులుగా పరిణతి చెందడంలో మాత్రమే వుంది అని విశ్వసిం చేవారు. వివేకానందను విదేశాలలో అనేకులు కుమారునిగా, సోదరు నిగా భావించారని మనం తెలుసుకున్నప్పుడు మనకు ఆయన పరిణతి కనిపిస్తుంది. భారతదేశంలో ఇటువంటి బాంధవ్యాలు కొత్త కాదు. విదేశాలలో ఇటువంటివి ఉత్పన్నమైనప్పుడు ఆయన వైఖరి విశిష్టత అర్థం అవుతుంది. జాతిమౌఢ్య, వర్ణ మౌఢ్యం విలయతాండవం చేసే రోజులలో అప్పట్లో బానిస దేశంగా పరిగణించే భారతదేశం నుండి వెళ్ళి అసంఖ్యాక మనసులను దోచుకోవడం గమనార్హం. అహిం సలో నెలకొనివున్న వ్యక్తి సాన్నిధ్యంలో వైరాలకు చోటులేదు. సత్య నిష్టుని సాన్నిహిత్యంలో అసత్యం నశించిపోతుంది. అందుకే అన్ని ఎల్లలను అతిక్రమించిన స్వామి వివేకానంద ఆత్మఙ్ఞానంలో సుప్రతి ష్టులై ఉండగా ఎలాంటి వివక్షత తలెత్తడం సాధ్యంకాదు. వివేకానంద ఆధ్యాత్మిక శక్తి గురించి విన్న విదేశీయులు ఆయనతో సన్నిహితంగా మెలగటానికి మక్కువ చూపేవారు. తాను జన్మించిన కుటుంబాన్ని పరిత్యజించి ప్రపంచమనే పెద్ద కుటుంబాన్ని స్వీకరించారు. భారత దేశం కూడా తక్కిన దేశాలతో పాటు అభివృద్ధి పొందగోరితే పేదలు, పామరులు పురోగనమం చెందాలి. అందుకే పేదలకు కూడా విద్య గరపమని ఆయన నొక్కి వక్కాణించారు. భారతదేశపు గౌరవ మర్యాద లను విదేశాలలో ఇనుమడిరపచేయటానికి అహర్నిశలు కృషి చేశారు. అప్పటికే ప్రచారంలోవున్న భారత వ్యతిరేకతను తొలగించటానికి నడుం బిగించారు. భారతీయ ఆధ్యాత్మికతలోని వివిధ పరిణామాలు ఆయన ఉపన్యాసాలలో ప్రధానాంశాలు అయినప్పటికి, ప్రతి ప్రసంగంలోనూ మన వాస్తవిక చిత్రాన్ని ఆవిష్కరించేవారు. మతాల మధ్య వ్యత్యాసాలు ఉండపచ్చు కాని వాటి మధ్యగల సామాన్య మౌలికతను గుర్తించమని చెప్పేవారు. హైందవుల శాంతి కాముకత్వాన్ని తన అహింసా తత్వం తో వెల్లడిచేసేవారు. శక్తివంతమైన ఈభారతదేశం ప్రపంచాన్ని జయి స్తుంది. అందుకే ‘‘ఓ భారతమా! నీ ఆధ్యాత్మికతతో ప్రపంచాన్ని జయించు!’’ అంటూ స్వామి సింహనాదం చేసేవారు. ప్రశాంతత, పవిత్రత, త్యాగశీలత, సౌభ్రాతృత్వాల సందేశాలను వివరించి సహన రహిత చెవిటి చెవులలో ప్రతిధ్యనులు ఉద్భవింపచేయటంలో విజ యం సాధించారు. దుస్తరమైన అద్వైతాన్ని కళాత్మకమైనదిగానూ, సజీవమైనదిగానూ వర్ణించారు. భయం కలిగించే యోగ సంప్రదా యాలను అత్యంతశాస్త్రీయంగానూ, ఆచరణ యోగ్యంగానూ వివరించే మానసిక శాస్త్రంగా వివరించేవారు. సత్యమనేది మతానికి ఆపాదిం చటం మూర్ఖత్వం అని చెప్పేవారు. విదేశాలలో ధీరగంభీరత్వంతో ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని సత్యంవైపు అడుగులు వేసారు. మనలో నిద్రాణమైవున్న శక్తిని తట్టిలేపిన మహనీయుడు. ‘‘మన జాతీయ ఆత్మ న్యూనతాభావ జాఢ్యాన్ని వదిలించుకునేలా చేసిన వ్యక్తి వివేకానంద’’ అని రాజాజీ పేర్కొన్నారు. వివేకానందుని లేఖలు భారతీయులలో దాగివున్న శక్తిని వెలువరించి చింతనను జాగృతం చేసాయి. లేఖల మూలంగానే తమ భారతీయ మహత్కార్యాన్ని ప్రారం భించారు. భగవదనుగ్రహం వలన పావనత సంతరించుకున్న మనస్సులలో ఉద్భవించిన చింతనలే లోకాన్ని కదిలించి వేస్తాయ నటంలో అతిశయోక్తిలేదు. వివేకానందుడు నిరంతరం మననం చేసు కునే కఠోపనిషత్తులోని శ్లోకం
న తత్ర సూర్యోభాతి న చంద్రతారకం
నేమా విద్యుతో భాంతి కుతో2యమగ్నిః !
తమేవ భాంతమనుభాతి సర్వం
తస్వభాసా సర్వమిదం విభాతి !!
‘‘అక్కడ సూర్యుడు ప్రకాశించడు. చంద్ర తారకలు అసలే ప్రకాశించవు. మెరుపులు కూడా మెరవవు. ఇక ఈఅగ్ని మాట ఎందుకు! ఆత్మ ప్రకాశిస్తూ ఉంటే అన్నీ దానిని అనుసరించి ప్రకాశిస్తాయి. దాని వెలుగుతోనే ఇదంతా వెలిగింపబడుతున్నది.’’
‘‘స్వామి వివేకానంద ప్రసంగాలను, రచనలు నేను క్షుణ్ణంగా చదివాను, ఆతరువాత నాదేశభక్తి వేయి రెట్లు అయింది. యువకు ల్లారా! ఆయన రచనల చదవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను’’ అని మహాత్మాగాంధి అన్నారు. వివేకానందుడు రామకృష్ణ మఠం స్థాపించి ‘‘పేదలకు, వెనుకబడ్డ వారికి సేవ చేయడం దీని ప్రధానోద్దేశాలలో ఒకటి‘ అని ఉద్భోదించి భారతీయ యువతకు దిశానిర్దేశం చేశారు. భారతదేశాన్ని పురోగమింప చేయడానికి సంఘ సంస్కరణలు అవసరమని సమాజ నేతలు అనేకులు నొక్కివక్కాణించిన సమయంలో, భారతదేశ పతనానికి ఉన్నత వర్గం వారు పేదలను బహిష్కరించడము, దోపిడీకి గురిచేయడమూ మొదటి కారణమని ఘోషించిన మొదటి నేత స్వామి. తన 33 ఏళ్ళ వయసులోనే మరణించి భారతదేశాన్నే కాకుండా యావత్తు ప్రపంచాన్ని అనాధలుగా మార్చివేశారు. మనలో ధైర్యం సడలి, దౌర్భల్యం ఆవహిస్తే ‘‘నేను ధీరుణ్ణి, వీరుణ్ణి, కామినీ కాంచనాలను నిర్జించిన శ్రీరామకృష్ణుల శిష్యుణ్ణి నేను’’ అనే భావనలు మనసులో నింపుకుంటే సమస్త దౌర్భల్యాలు, అధైర్యము మటుమాయమయుతాయి అని సర్వులకు ప్రభోదించేవారు. శ్రీవివేకానందుని జన్మదినం పురస్కరించుకుని భారతప్రభుత్వం ‘‘జాతీయ యువజన దినోత్సవం’’గా ప్రకటించింది. ‘‘జనన మరణాలు సహజం, కాని నా భావనలు మావవాళికి కొంతవరకైనా అందించగలిగితే నా జీవితం వ్యర్థం కాలేదనుకుంటాను’’ అన్న స్వామి వివేకానందుని జీవితం ప్రతిఒక్కరికి ఆదర్శప్రాయం, సర్వదా ఆచరణీయం. రచయిత :ఆంధ్రాయూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఫోను. 9849692414

1 7 8 9