ఉన్నత విద్యకు దూరవుతున్న దళిత,బహుజనులు

2024-25 విద్యా సంవత్సరం నుంచి దేశ వ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలలో పీహెచ్‌డీ ప్రవేశాలకు జాతీయ అర్హత పరీక్ష (నెట్‌) నిర్వహించాలనడం యూనివ ర్సిటీల స్వయంప్రతిపత్తిని ధ్వంసం చేయడమే. ఆయా వర్శిటీలు సొంతంగా నిర్వహించే ప్రవేశ పరీక్ష స్థానంలో నెట్‌ను నిర్వహించాలంటూ దళిత, బహుజన విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసే కులోన్మాద కుట్రలను విద్యార్థి లోకం తిప్పి కొట్టాలి.
మార్చి 13వతేదీన న్యూఢల్లీిలో యూని వర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ యూనివర్సి టీలు సొంతంగా నిర్వహించే పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష స్థానంలో జాతీయస్థాయిలో ఏక పరీక్ష (నెట్‌) ను ప్రవేశపెట్టారు. ఈ నూతన పరీక్ష విధా నంలో నెట్‌ను మూడు కేటగిరీలుగా విభజించారు. అందు లోని 1వకేటగిరీలో జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగానికి అర్హత ఇచ్చారు. 2వ కేటగిరిలో ఫెలోషిప్‌ ఇవ్వకుండా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగానికే అర్హత ఇచ్చారు. ఇక 3వ కేటగిరిలో ఫెలోషిప్‌ గాని, అదేవిధంగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగానికి అర్హత ఇవ్వకుండా పీహెచ్‌డీ కోర్సుల్లో చేరేందుకు మాత్రమే అర్హత ఇచ్చారు. దాన్ని కూడా ఏడాదికే పరిమితం చేశారు. నెట్‌ పరీక్ష ఇంగ్లీష్‌, హిందీ భాషల్లో ఉండటంతో దక్షిణ భారతదేశ విద్యార్థులు పరీక్షల్లో అధిక మార్కులు సాధించలేరు. దీంతో కేటగిరి-1లో వీరు ఫెలోషిప్‌ పొందలేరు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగానికి అర్హత కూడా కోల్పోతారు. వివిధ యూనివర్సిటీల్లో ఏటా పీహెచ్‌డీ ఖాళీలు భర్తీ చేసేందుకు తప్పనిసరి గా పరీక్షలు నిర్వహించాలనే విధానం లేకపోవడం వల్ల యూజీ నెట్‌లోని 3వ కేటగిరి సాధించినప్ప టికీ విద్యార్థులు ఏడాది కాల పరిమితి నిబంధన వల్ల కనీసం అడ్మిషన్‌ కూడా పొందలేని పరిస్థితి ఏర్పడనున్నది.
గ్రామీణ ప్రాంత విద్యార్థులు,రాష్ట్ర భాషలు, మాతృభాషలలో చదువుకున్న విద్యార్థులు, పేద, దళిత, బహుజన విద్యార్థులు పట్టణాల్లోని ప్రైవేట్‌, కార్పొరేట్‌ కళాశాలలో ఇంగ్లీష్‌ భాషలో చదివే విద్యార్థులకు పోటీ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడు తున్నది. అనేక కష్టనష్టాలు, అణచివేతకు, అవమా నాలకు గురై పీజీ వరకు చదువుకున్న దళిత, బహుజన విద్యార్థులు ఈనిర్ణయంతో ఉన్నత విద్యా సంస్థల నుంచి గెంటివేయబడుతారనేది నూటికి నూరుపాళ్లు వాస్తవం. పార్లమెంట్‌ ఎన్నికల కోడ్‌ వచ్చిన తర్వాత ఈ విషయాన్ని బహిర్గతం చేసిన యూజీసీ సంస్థ విద్యార్థుల ఆందోళనలను ఎలక్షన్‌ కోడ్‌ పేరుతో అణచివేసే ఉద్దేశంతోనే చేసింది. కొత్త విద్యా విధానం-2020 అమలులో భాగం గానే ఈ ఏకపరీక్ష విధానాన్ని ప్రవేశపెడుతున్నా మని ఈసందర్భంగా ప్రకటించిన యూజీసీ తొందరలోనే తన అస్తిత్వాన్ని కోల్పోయి రద్దయ్యే పరిస్థితి కూడా ఉన్నది. కొత్త విద్యా విధానంలోనే యూజీసీని రద్దు చేయాలని, ఆస్థానంలో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (హెచ్‌ఈసీఐ) ఏర్పాటు చేయాలని ఉంది.గత కొన్నేండ్లుగా ఎంతో మంది పేదవిద్యార్థులకు ఉపకార వేతనాలు అందించిన యూజీసీని కూడా కనుమరుగు చేసే పరిస్థితి నేడు నెలకొన్నది.ఈ దేశ పాలకులు అనుస రించిన విధానాలతో ఇప్పటికే భారత విద్యా విధా నంలో కొందరికే విద్య అనే పరిస్థితికి నెట్టివేయ బడిరది. విద్య కాషాయీకరణ, ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణతో పూర్తి కేంద్రీకరణకు పూను కున్నది. ప్రధాని మోదీ నాయకత్వంలో ఈ పదేండ్ల కాలంలో విద్యావ్యవస్థ భ్రష్టుపట్టిపోయింది. ఏక పరీక్ష విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్తంగా పోరాడేందుకు విద్యార్థులు ముందుకురావాలి.పీజీపూర్తి చేసి ఎంఫిల్‌, పీహెచ్‌ ఎ ప్రవేశాలు పొందిన మైనారిటీ విద్యార్థులకు ఆర్థిక వెసులుబాటులేకపోవడం ఇబ్బందికరంగా మారింది. ఈఆటంకాన్ని తొలగించడానికి 2009 లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ‘మౌలానా అబుల్‌ కలాంఆజాద్‌ జాతీయ ఫెలోషిప్‌’పేరిట ఉపకార వేతనాలను ప్రవేశ పెట్టింది. వీటితో లబ్ధిపొందు తున్నవారు ఇతర ఉపకార వేతనాలు కూడాఅందు కుంటున్నారనే నెపంతో మోదీ ప్రభుత్వంవీటిని ఈ మధ్య రద్దు చేసేసింది. దేశానికి తొలివిద్యా శాఖ మంత్రిగా పనిచేసిన మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ ముస్లిం కావడం, అల్పసంఖ్యాక వర్గాలలో సహజంగా ముస్లింలే అధికంగా ఉంటారు కనకే మోదీ ప్రభుత్వం వీటిని రద్దు చేసినట్టుకనిపిస్తోంది. దేశ జనాభాలో14.2శాతం మంది ముస్లింలు ఉంటే,కళాశాలలు,విశ్వవిద్యాలయాలలో చేరే ముస్లిం విద్యార్థులు 5.5శాతం మాత్రమే ఉన్నారు. దేశ జనాభాలో16.5శాతం ఉన్న షెడ్యూల్డ్‌ కులాల వారిలో ఉన్నత విద్య అభ్యసిస్తున్నవారు 14.7 శాతం ఉన్నారు.2019లో ఉన్నత విద్య గురించి నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
అదే కారణమా?..
ప్రభుత్వ గణాంకాల ప్రకారం2018-19లో మౌలానా ఆజాద్‌ పేరిట నెలకొల్పిన ఉపకార వేత నాలలో1000మంది వినియోగించుకుంటే అందు లో 733 మంది ముస్లింలే కావడం సహజంగానే మోదీ సర్కారుకు అభ్యంతరకరమై ఉండొచ్చు.ఈ ఉపకార వేతనాలను రద్దు చేసినందుకు విద్యా సంస్థల లోపల,వెలుపల తీవ్ర నిరసన వ్యక్తం అవు తోంది.ప్రభుత్వ నిర్ణయం అల్పసంఖ్యాక వర్గాల, ముఖ్యంగా ముస్లింల విద్యావకాశాలను దెబ్బ తీయడానికేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పని గట్టుకుని బీజేపీ ప్రభుత్వం ఈనిర్ణయం తీసు కుందని నిర్ధారణకు రావడానికి ప్రత్యేక పరిశోధన అనవసరం.12వ తేదీన వందలాది మంది విద్యా ర్థులు దిల్లీలో నిరసనకు దిగారు. పోలీసులు వారం దరినీ స్టేషను తీసుకెళ్లి కొన్ని గంటల తరవాత వదిలేశారు. రాజ్యసభలో కాంగ్రెస్‌ సభ్యుడు ఇమ్రాన్‌ ప్రతాప్‌గఢీ,బహుజన సమాజ్‌ పార్టీకి చెందిన డానీష్‌ అలీ, మజ్లిస్కు చెందిన ఇంతియాజ్‌ జలీల్‌ ఈ అంశాన్ని లేవనెత్తారు. అల్పసంఖ్యాక వర్గాలవారి వెనుకబాటుతనాన్ని రూపుమాపడానికి 2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వం దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన రాజీం దర్‌ సచార్‌ నేతృత్వంలో ఓకమిటీ ఏర్పాటు చేసిం ది.ఈ కమిటీ 2006లో సమర్పించిన నివేదికలో ముస్లింలు సామాజికంగా,విద్యాపరంగా, ఆర్థికం గా ఇతర మతాలవారితో పోలిస్తే బాగా వెనుకబడి ఉన్నారని తేలింది. కొందరు ముస్లింల పరిస్థితి దళితుల కన్నా హీనంగా ఉందని సచార్‌ కమిటీ పేర్కొంది.మైనారిటీల పరిస్థితి అధ్వానం 2001 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 20 యేండ్లకు పైబడినవారిలో ఏడు శాతం మంది ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు.ముస్లింలలో నాలుగు శాతం మాత్రమే ఉన్నారని సచార్‌ కమిటీ నివేదిక ఆందోళ న వ్యక్తం చేసింది. అవకాశాలు తక్కువగా ఉన్న ఇతర వర్గాలవారితో పోల్చి చూసినా ముస్లింల పరిస్థితి అధ్వానంగా ఉందనివివరించింది.ఆ కమి టీ సిఫారసుల పర్యవసానంగానే మౌలానా ఆజాద్‌ జాతీయ ఉపకార వేతనాల పథకం అమలులోకి వచ్చింది.ఇది ముస్లింలకేకాక అల్పసంఖ్యాక మతా లవారందరికీ వర్తిస్తుంది. మైనారిటీ విద్యార్థులు ఒకటికన్నా ఎక్కువ ఉపకార వేతనాలు అందు కుంటున్నందున మౌలానా ఆజాద్‌ పథకాన్ని రద్దు చేస్తున్నామని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రకటిం చారు.విద్యార్థులకు వివిధ పథకాల కింద ప్రయో జనం పొందే అవకాశంఉన్నా ఒక ఉపకార వేత నం మాత్రమే అందిస్తున్నారు. మౌలానా ఆజాద్‌ పథకాన్ని ఎక్కువగా వినియోగించుకుంటున్నది పీహెచ్‌ఎ పరిశోధక విద్యార్థులే. వారికి జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ వినియోగించుకునే అవకాశం ఉంది. అయితే, ఇది ప్రతిభ ఉన్నవారికే వర్తిస్తుంది. మౌలానా ఆజాద్‌పథకం రద్దు చేశారు గనక ఇతర మైనారిటీ వర్గాలవారు పరిశోధనలు కొనసాగించే అవకాశం మందగిస్తుంది. పరిశోధన మీద ఆసక్తి ఉన్నవారికి ఉపకార వేతనాలు అందితే ఉద్యోగావ కాశాలను కూడా వదులుకుని ఉన్నత విద్య కొనసా గించగలుగుతారు.లేకపోతే ఉన్నత విద్య కొన సాగించగలుగుతారు. లేకపోతే ఉన్నత విద్య ఆర్థిక స్థోమత ఉన్నవారికే పరిమితం అవుతుంది. క్రమక్రమంగా అమలు చేసిమౌలానా ఆజాద్‌ పథకం రద్దుచేయక ముందుకూడా యూజీసీ ఈ పథకం కింద దరఖాస్తులు ఆహ్వానించడాన్ని తగ్గించింది.ఈ పథకం కింద ఆఖరుసారి దరఖా స్తులు ఆహ్వానించింది 2018లోనే. 2020 మార్చి లోక్సభలో ప్రశ్న అడిగితే అప్పటి మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖార్‌ అబ్బాస్‌ నఖ్వీ ‘మార్గదర్శకాలు ఖరారు చేస్తున్నాం’అని చెప్పి తప్పించుకున్నారు.‘జాతినిర్మాణం’ ‘జాతీయ భద్రత’ పేర పౌరసత్వ సవరణచట్టం (సీఏఏ) లాంటి వాటి ద్వారా ఇదివరకే ముస్లింలను అణగదొక్కడం కొనసాగుతూనే ఉంది. విద్యారంగంలో, ముఖ్యం గా ఉన్నత విద్యారంగంలో అనేక కారణాలతో ముస్లింలు ఇప్పటికే షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు జాతుల వారికన్నా ఎక్కువగా వెనుకబడి పోయారు. అలాంటప్పుడు ఉన్న పథకాలను కూడా రద్దు చేస్తుంటే ముస్లిం వెనుకబాటుతనం మరింత పెరు గక తప్పదు.2.76శాతం మంది ముస్లింలే ఉన్నత విద్యఅభ్యసించగలుగుతున్నారు. ఇప్పటికే పరాయి వారుగా మారిపోయిన వారిని మిగతా సమాజా నికి మరింత దూరంచేసే కుట్ర జరగడం దురదృష్ట కరం.(వ్యాసకర్త : ఓయూ, హైదరాబాద్‌)
సంక్షోభంలో వసతి గృహాలు
‘సిబ్బంది కొరత, అధికారుల పర్యవేక్షణ లోపం, శిధిలావస్థలో ఉన్న భవనాలు అనేక చోట్ల దర్శన మిచ్చాయి. సిబ్బంది లేకపోవడంతో అధ్యాపకులే అన్ని పనులు చేయాల్సిన దుస్థితి. ప్రభుత్వం ఒక విద్యార్థికి ఇచ్చే 30 రూపాయలలో గ్యాస్‌, మ్యాన్‌ పవర్‌ కోసం 8 రూపాయలు ఖర్చవుతున్నాయి. మిగిలిన 22 రూపాయలతో టిఫిన్‌, లంచ్‌, స్నాక్స్‌, డిన్నర్‌,రెండుసార్లు టీ, వారానికి రెండుసార్లు నాన్‌ వెజ్‌,ఐదు రోజులు ఎగ్‌ ఇవ్వాలి.ఇది సాధ్యం కాక నిర్వాహకులు తక్కువ రేటు ఉన్న కూరగాయలతో చేసిన కూరలు,నీళ్లపప్పు,పురుగుల అన్నం పెడుతు న్నారు.పరిశుభ్రత లేనికిచెన్‌,రాత్రి మిగిలిన పదా ర్థాలు పొద్దున వాడుతున్నారు. ఇప్పటికైనా ప్రభు త్వం సంక్షేమహాస్టళ్లలో సమూల మార్పులు చేయాలి.’ పేద బడుగు బలహీనవర్గాల విద్యార్థులు ఆర్థిక వెనుకబాటు కారణంగా విద్యకు దూరం కాకూడదనే ఉన్నత ఆలోచనతో రూపొందించిన ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు నిర్లక్ష్యానికి గురవు తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం వాటిని నరకకూ పాలుగా మారుస్తోంది. గ్రామీణ విద్యార్థుల బంగా రు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, గురుకుల, మైనారిటీ వసతి గృహాలు సంక్షేమానికి దూరమై సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇటీవల జరుగుతున్న వరుస సంఘటనలే ఇందుకు నిదర్శనం. స్వరా ష్ట్రంలో విద్యా రంగానికి పెద్దపీట వేస్తారని కేజీ నుంచి పీజీ వరకు అన్ని వసతులతో కూడిన నాణ్యమైన విద్య అందిస్తారని తెలంగాణ సమాజం ఆశించినా అది కార్యరూపం దాల్చకపోగా, మరిం త నిర్వీర్యమైంది. పాఠశాల నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు హాస్టళ్లలో నాణ్యమైన భోజనం అందక, కనీస మౌలిక సౌకర్యాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. వసతిగృహలకు ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం, వార్డెన్‌, వంట మనుషులు,ఇతర సిబ్బంది నియామకాలు చేపట్టక పోవడం,సరైన సమయంలో దుప్పట్లు,బట్టలు ఇతర వస్తువులు అందించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
హామీని విస్మరించి..
కేజీ టూ పీజీ మిషన్లో భాగంగా దళిత, గిరిజన, బహుజన విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడానికి సకల సౌకర్యాలతో నాణ్యమైన విద్యను అందించడానికి గురుకులాలను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటనలు గుప్పించారు. ప్రచార అర్బాటాలతో గురుకులాల ఏర్పాటు చేశారు. వాటి అభివృద్ధిని మాత్రం అటకెక్కించారు. సరిపడా నిధులను కేటాయించలేదు. పక్కా భవనాలు నిర్మిం చలేదు. ఖాయిలా పడిన ఇంజనీరింగ్‌ కళాశాలు, ఇతర కళాశాల భవనాలను కోట్ల రూపాయలతో అద్దెకు తీసుకుని గురుకులాలను నడిపిస్తున్నారు. హైదరాబాద్‌ మహా నగరంలో సరూర్‌ నగర్‌, ఇతర అనేక ప్రాంతాలలో అపార్ట్మెంట్లలో నిర్వహి స్తున్నారంటే పరిస్థితి గురుకులాలు ఎలా ఉందో అవగతమవు తుంది.అద్దెచెల్లింపులలోనూ ఎలాంటి ప్రామాణికత, నియమ నిబంధనలు లేకపోవడంతో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ లేమి, సిబ్బంది తప్పిదాలు, నాణ్యతలేని,గడువు ముగిసిన సరుకులతో తయారు చేసిన ఆహారం విషపూరితం కావడం వంటి ఘట నలు జరిగి విద్యార్థులు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రులలోచేరుతున్నారు. అయినా ప్రభుత్వం బాధ్యులపై చర్యలకు ఉపక్రమించడం లేదు.
ఇప్పటికీ దొడ్డు బియ్యమే..
వసతిగృహాలతో పాటు,పాఠశాల మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం అందిస్తామని ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి మనువడు తినే భోజనానికి సమంగా హాస్టల్‌ విద్యార్థుల భోజనం ఉంటుందని ఊకదంపుడుఉపన్యాసలిచ్చారు. కొద్ది రోజులే సన్న బియ్యం పంపించి, తరువాత పురుగులతో కూడినముక్క పట్టిన దొడ్డు బియ్యమే సరఫరా చేస్తున్నారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఆదిలాబాద్‌ సరూర్నగర్‌,సిదిపేట,వరంగల్‌. నిర్మల్‌,గద్వాల సహా పలు జిల్లాలలో కలుషిత నీరు తాగలేమని,పురుగులతో కూడిన భోజనం తినలే మని బాలికలు రోదిస్తూ రోడ్లపైకి వచ్చారు. జగి త్యాల, సిద్ధిపేట, భూపాలపల్లి సహా పలు హాస్టల్స్లో ఫుడ్‌ పాయిజన్‌ కావడంతో విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు.గౌలిదొడ్డి గురుకులంలో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం, బాసర ట్రిపుల్‌ ఐటీ సహా పలు వసతిగృహాల భవనాల పెచ్చులూడి విద్యార్థు లకు గాయాలవ్వడం, ఉస్మానియా యూనివర్సిటీ గర్ల్స్‌ హాస్టల్‌ కిచెన్లో పాము కాటుతో సిబ్బంది మృతి చెందడం, ఆలేరు మైనారిటీ హాస్టల్లో విద్యార్థి నులపై లైంగిక వేధింపులు ఇలా అనేక సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. హాస్టల్స్‌ అంటేనే విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళన చెందే పరిస్థితి దాపురించింది.
ఎందుకీ నిర్లక్ష్యం?…
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 2,500 గురుకుల సంక్షేమ వసతి గృహాలలో ఐదు లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఉన్న పేద విద్యార్థుల విషయంలో ప్రభు త్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తోందనేది అంతు చిక్కనిప్రశ్న.ఈ నేపథ్యంలో ఏబీవీపీ బృం దం వసతిగృహాల సందర్శించింది. సిబ్బంది కొరత,అధికారుల పర్యవేక్షణ లోపం,శిధిలా వస్థలో ఉన్న భవనాలు అనేకచోట్ల దర్శన మిచ్చాయి. సిబ్బంది లేకపోవడంతో అధ్యాపకులే అన్ని పనులు చేయాల్సిన దుస్థితి. ప్రభుత్వం ఒక విద్యార్థికి ఇచ్చే 30రూపాయలలో గ్యాస్‌, మ్యాన్‌ పవర్‌ కోసం 8 రూపాయలు ఖర్చవుతున్నాయి.మిగిలిన 22 రూపాయలతో టిఫిన్‌,లంచ్‌, స్నాక్స్‌, డిన్నర్‌, రెండు సార్లు టీ,వారానికి రెండుసార్లు నాన్‌ వెజ్‌, ఐదు రోజులుఎగ్‌ ఇవ్వాలి. ఇది సాధ్యం కాక నిర్వాహ కులు తక్కువ రేటు ఉన్న కూరగాయలతో చేసిన కూరలు, నీళ్ల పప్పు, పురుగుల అన్నం పెడుతు న్నారు. పరిశుభ్రత లేని కిచెన్‌, రాత్రి మిగిలిన పదార్థాలు పొద్దున వాడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లలో సమూల మార్పులు చేయాలి. ఖాళీగా ఉన్న సిబ్బంది నియామకాలు చేపట్టాలి. తగిన వసతుల కోసం సరిపడా నిధులు కేటాయించాలి.శానిటరీ అధికారులు నిత్యం పర్య వేక్షించాలి.పక్కా భవనాలు నిర్మించాలి.మెస్‌ చార్జీలు పెంచాలి.
`(వ్యాసకర్త: పీడీఎస్‌ఎఫ్‌, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు)-(ఎం.వి.బాబు)

విపరీతం(వాక్‌ చిత్రం)

అదో అందమైన పల్లెటూరు పేరు ‘పెండ్యాల’ పట్టణానికి దగ్గరగా ఉన్న ఆ ఊర్లో, అన్ని భావాలు గల ప్రజలు కలిసి మెలిసి ఎవరి పనులు వాళ్ళు చేసుకుపోతుంటారు, అక్షర జ్ఞానంగల ప్రజలకు వర్తమాన రాజకీయాల పట్ల, నాయకుల పట్ల, అవగాహన బాగానే ఉంది, అసలే ఇది ఎండాకాలంతో కూడిన ఎన్నికల కాలం…అదిగో గ్రామ కూడలిలోని వేప చెట్టు కింద పంచాయతీ వాళ్ళు వేసిన సిమెంట్‌ బెంచీల మీద కూర్చున్న రామచంద్రయ్య,సూర్యం,కరుణాకర్‌,విశ్వక్‌, ఏదో మాట్లాడుకుంటున్నారు..
మనము చెవి వేద్దాం రండి….
రామచంద్రయ్య :-
హాయిగా ప్రొఫెసర్‌ జాబ్‌ చేసుకుంటూ లక్షలకు లక్షలు సాలరీ వచ్చే నౌకరితో బతకకుండా… ఎందుకీ లొల్లి అభ్యుదయం ఆవకాయ తొక్కు అని! ఇప్పుడేమైంది ఊరు గాని ఊర్లో జైలు కూడు తినుకుంటా‘రావు’కుహాయిగా ఉందా.!? సూర్యం :-అట్లెట్ల అనుకుంటావ్‌ చంద్రన్న కొమరం భీమ్‌ నీ లెక్కనే ఆలోచిస్తే ఇప్పుడు ఈ గోండు బిడ్డల పరిస్థితి ఎట్లుండేది!? ‘ఉద్య మం’ అంటే మనతోనే ఆగిపోయేది కాదు, అది విత్తనం తీరు భూమిలో పడి చనిపోయి కూడా కొత్త మొలకలు పుట్టిస్తది.
రా.చం :- ఏమి మొలకలో ఏమి ఉద్యమాలో అప్పుడు నడిచినయి గాని ఇప్పుడు కష్టమే…!!
సూర్యం : – నడవనిస్తేగా?? నడిచేది,ఆ మధ్య నారాయణమూర్తి పాపం అప్పులు చేసి కష్టపడి వాస్తవాలు ‘దండకారణ్యం’ సినిమాగా తీస్తే విడుదల కాకుండా ఆపారు మీ ధనవంతుల గుంపు.
రా. చం :- ఆపకపోతే ఏం చేస్తారు అన్ని అవకతవకల సినిమాలే నాయె..! 1978ల కరీంనగర్‌ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడుగా ఉన్న కిషన్‌ జీ రుద్రయాగం చేయాల్సిన వాడు ఈ రావు మాటల మాయాజాలంలో పడి విప్లవాల బాట పట్టాడు.
సూర్యం :- ఎవరు ఎవరిని మాయాజాలంలో పడేస్తారు? అన్ని అవసరాల కోసమే అయితయి…!!
రా. చం :- మీ నారాయణమూర్తి సినిమాలన్నీ..అగ్రవర్ణాలు ధనవంతులు నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లంతా విప్లవ ద్రోహులు పేదల పొట్టలు కొట్టేవారు అన్నట్టు చూపిస్తాయి గా!?
కిషన్‌ జీ అనే పరుశురాముడిని మమతా బెనర్జీ అనే ధీరశక్తి పొందిన సాయం కూడా మరిచి చివరికి ఎలా మట్టు పెట్టిందో ఎలా మర్చిపోగలం?
సూర్యం :- ఇంత అభ్యుదయ అవగాహన ఉండి ఈ యాగాలు,పూజలు, దేనికి చేస్తారు మీరు?
రా.చం :- ఈ కమ్యూనిస్టులు, నాస్తికులు, హేతువాదులు, వారి వారి భావజాలంతో సమాజాన్ని ఎంత బ్రష్టు పట్టించాలో అంతా పట్టించారు, అది చాలదు అన్నట్టు ఆడవారిని హక్కుల పేరుతో చక్కని సంసారాల్లో నుంచి బయటకు లాగి వారి జీవితాలను చెల్లా చెదురు చేశారు, ఇలాంటి అకృత్యాలు నుంచి సమాజాన్ని కాపాడాలి అంటే పూర్వం మన పెద్దలు చెప్పిన క్రమశిక్షణ విలువలు కలిగిన ఆధ్యాత్మిక భావాలు ప్రజల్లోకి వ్యాపింప జేయాల్సిన అత్యవసరం ఇప్పుడు వచ్చింది.
విశ్వక్‌ :- ఆపుండి మీ ఇద్దరి లొల్లి..శాస్త్రీయ విలువలకు పూజలకు పొంతన ఎట్ల అయితది??
రా.చం :- ఇప్పుడు కావాల్సింది శాస్త్రీయ విలువలు కాదు జాతీయ విలువలు.
విశ్వక్‌ :- మళ్లీ మీ వాదాలకే తీసుకుపోతున్నావా??
రా.చం :- నేను చెప్పేది ఏ వాదంతో కాదు మనమంతా ముందు భారతీయులం ఆతర్వాతే ఏదైనా ఈ జాతీయ విలువలన్నీ వీరుల ఆరాధన, భక్తి ఉద్యమాలు,పూజలు, హోమాలు,ద్వారా వచ్చాయి. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే శాశ్వత సత్యాలన్ని జాతీయ విలువలతో ముడిపడి ఉన్నవే!!
విశ్వక్‌ :- అదెట్ట! చిత్రంగా చెబుతున్నావ్‌?
రా.చం :- అవును వాస్తవాలు తెలియకపోతే అన్ని చిత్రంగానే ఉంటాయి..
ఇండోనేషియాలో 90% కన్నా ఎక్కువగా ముస్లింలే ఉంటారు. అయినా వారు ఆ దేశంలో రామాయణ భారతాలను వారి జాతీయ సంపదలుగా గౌరవిస్తూ సరస్వతి, గణేష్‌, మార్కండేయ, పేర్లతో విశ్వవిద్యా లయాలు ఏర్పాటు చేసుకున్నారు. యోగ, ధ్యానం, అక్కడి పవిత్ర ఆధ్యాత్మిక విషయాలు, మన భారతదేశం కొన్ని వేల సంవత్సరాల క్రితం వాటి ని ప్రపంచానికి కానుకలుగా అందించింది,అన్న విషయం నేటి మీయూత్‌లో ఎంతమందికి తెలుసు!? విశ్వక్‌ : – చంద్రం మామ..!! మరి ఆ విలు వలు అన్ని మన దగ్గర లేకుండా ఎందుకు పోయాయి??
రా.చం :- జాతీయ ఉద్యమానికి, కొందరు విదేశీ తొత్తులైన మనవాళ్లే విఘాతం కలిగిస్తు, మాయ తెలియని అమాయక ప్రజలను తప్పు తోవ పట్టిస్తున్నారు, అలాంటివారి వల్లే మన భారత జాతీయ విలువలు అన్ని ఆధునికత, నాగరికత, పేరుతో కనుమరుగైపోతున్నాయి.
విశ్వక్‌ :- మామా!!..అసలు ‘‘జాతీయత’’అంటే ఏమిటి?సూటిగా సుత్తి లేకుండా చెప్పు. రా.చం :- మనదేశంలో జాతీయత ఉపజాతీ యత కులం మతం ప్రాంతంభాష అనే వాటిని అర్థం చేసుకోకుండా ఈ హేతువాదులు నాస్తికులు ఏమీ సాధించలేరు, చేతి పార్టీ వాళ్లు దీనిని కాస్త గమనించి బీ.సీ,దళిత, మైనారిటీ, విభాగాలు ఏర్పాటు చేసింది. ఇక కమలం పువ్వు వాళ్ళు కూడా అదే దారిన ముందుకు పోతున్నారు.
కరుణాకర్‌ :- ఈ అసమానతలు పోవాలంటే కులాంతర, మతాంతర, పెళ్లిల్లు జరగాలి, అలా కులాతీత, మతాతీత, వర్గాతీత, సమాజం రావాలి అప్పుడే మన దేశం ప్రశాంతంగా అభివృద్ధి చెందుతుంది అది జరగాలి అంటే ‘‘లౌకికవాదం’’ నర నరాన జీర్ణించుకున్న మా అభయహస్తం పార్టీకి అధికారం రావాలి.
రా.చం :- ఏమిటి ఏర్పడేది? ఇప్పటి మన విప్లవ హేతువాదులంతా సాంప్రదాయ పెళ్లిళ్లు చేసుకున్న వారే!! కానీ వారి ఉపన్యాసాల ప్రభావంతో ఆదర్శ వివాహాలు చేసుకున్న వారంతా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో!!? మనస్పర్ధలతో, ఏకం చేసే వాళ్ళు లేక, తల్లిదండ్రులను ఎదిరించి వచ్చిన ఆడపిల్లలు భర్త నుంచి వేరుపడి పుట్టింటికి పోలేక, ఎన్ని అవస్థలు పడుతున్నారు ??ఆపడే వారికి తెలుస్తుంది.
విశ్వక్‌ :- మన ముచ్చట ఎక్కడో మొదలై ఎటో పోతుంది??
రా.చం :- అటువంటి ఆదర్శ వివాహాలు చిరంజీవి లాంటి ధనవంతుల కుటుంబాలకే చెల్లుతాయి, మన బోటి మధ్య తరగతి,నిరుపేద కుటుంబాల వారికి అస్సలు కుదరవు.
కరుణాకర్‌ :- ఇప్పటివరకు వరవరరావు వంతు అయిపోయింది,ఇక చిరంజీవి మిగిలి పోయాడా? ఆయన చేసిన పాపం ఏమిటో సెలవీయండి !!
రా.చం :- చిరంజీవి సినిమాలు అటు పాత తరానికి ఇటు కొత్త తరానికి మధ్యస్థంగా ఉం డటం మాట వాస్తవమే ఆ మాటకొస్తే తెలుగు సినిమాకు కొత్త డాన్సులు నేర్పిన ఘనత కూడా ఆయనదే!!
విశ్వక్‌ :- మరి అంత ఆదర్శ వారిని పట్టుకుని ఏమిటా మాటలు!?
రా.చం :- ఏమి డ్యాన్స్‌ లో !! చిరంజీవి పాటలు రికార్డింగ్‌ డాన్సులు చేసే పోరంబోకు వెధవల కామపు వలల్లో ఎన్ని అమాయకపు కుర్రలు చిక్కి జీవితాలు నాశనం చేసుకున్నా యో ఆ సినిమాల ప్రభావంతో ఎంతమంది రెండు పెళ్లిళ్లు తప్పు కాదు హక్కు అనే భావం లో పడ్డారో మీకేం తెలుసు!?
కరుణాకర్‌ :- చంద్రం..బాబాయ్‌ సినిమాల్లో అవి అన్ని మామూలే!! మనసు మనసు కలిసి నప్పుడు శరీరాలు కలవడం పెద్ద అసమంజసం ఏమీ కాదు, ఆ సూత్రం సినిమా రంగం వారికే కాదు అందరికీ వర్తిస్తుంది.
రా.చం :- రస సిద్ధాంతం లోతులు బాగానే పరిశీలించావు కరుణాకర్‌…!!
కరుణాకర్‌ :- అదే మీ సాంప్రదాయ వాదులతో వచ్చిన చిక్కు, సంస్కృతి సాంప్రదాయాలకు మీరే దిక్కు అనుకుంటారు. మీ కళాతపస్వి ని మించిన పాండిత్య ప్రకర్ష కులు ఎందరో మన సామాజిక రంగం మార్పు కోసం పాటుపడుతున్నారు, అనే విషయం మర్చిపోకండి.
విశ్వక్‌ :- సమాజం నిరంతరం సామాజిక మార్పుకై పరిణామానికై ముందుకు పోతుంది, ఒక్కోసారి ఆర్థిక ప్రాతిపదికత ఉంటుంది, ఇది స్థిరీకరించబడిన తర్వాత సాంస్కృతిక ప్రాతి పదిక ఏర్పడుతుంది, ఒకరకంగా ఇవి రెండు పరస్పర ఆశ్రితాలు.
కరుణాకర్‌ :- ఏది ఏమైనా చంద్రంబాబాయ్‌, రావు, చిరంజీవి నీకు చేసిన అన్యాయం ఏమిటి?? వాళ్ల మీద నీకు ఎందుకా ద్వేషం??
రా.చం :- ద్వేషం కాదు ప్రేమ మనం ఎవరిని బాగా ఇష్టపడతామో వాళ్ళు తప్పులు చేస్తే సహించలేం కదా?? మన బాధ వ్యధ అంతా కోపంగా మారి వారిపై మనం అగ్నిపర్వతం లెక్క విరుచుకుపడతాం.
కరుణాకర్‌ :- అంతగా మీరు ఇష్టపడేది బాధపడేది ఆ ఇద్దరిలో ఏముంది!? రా. చం :-సాధారణంగా ఎవరైనా జీవితంలో 50 సంవత్సరాల పాటు ఒక సిద్ధాంతం ప్రకారం ఒక అవగాహనతో వెళ్ళినప్పుడు అవి మనం ఆశించిన ఫలితాలు ఇవ్వనప్పుడు వాటిని పునః సమీక్షించుకొని విచారించు కోవాలి,ఉదాహరణకు 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటు పద్ధతిలోనే భారత దేశానికి స్వరాజ్యం రావాలి అంటే కుదిరేదా!
సూర్యం :- కుదరదు కానీ మొదటి ప్రపంచ యుద్ధం వల్ల రష్యా, రెండవ ప్రపంచ యుద్ధం వల్ల చైనా స్వాతంత్రం పొందాయి కదా!?
రా.చం : -అవును సాధారణ దృష్టికి అలాగే అనిపిస్తుంది, కానీ ఏ నియంతృత్వం వద్దని ‘‘లెనిన్‌’’ చెప్పాడో.. అదేవిధానంతో ‘‘స్టాలిన్‌’’ ఒక వెలుగు వెలిగాడు కదా!?
సూర్యం :-అది అట్లా ఉంచండి అసలు వరవరరావు గారిని మీరు ఎందుకు విమర్శిస్తున్నారు? మీ దృష్టిలో ఆయన ఎవరు!?
రా.చం :- బ్రాహ్మణ సంతతికి చెందిన వాడు,
సూర్యం :- అసలు బ్రాహ్మణుల వృత్తి ఏమిటి??
రా.చం :- పౌరహిత్యం అందుకే వారిని పురోహితులు అని కూడా అంటారు.
సూర్యం :- మీ వివరణ బాగానే ఉంది కానీ పురోహితుడు అంటే అర్థం ఏమిటి!?
రా.చం :- పురం యొక్క హితం కోరి అందుకోసం కృషి చేసేవాడు అని అర్థం.
సూర్యం :- అంటే ఆ ఊరిలో దేవాలయాల్లో పూజలు చేస్తూ ఆ పురం యొక్క హితం కోరుతూ.. కాలచక్రం గణిస్తూ ఏది మంచి, ఏది చెడు, ఏది ధర్మం, ఏది అధర్మం, ప్రజలకు చెబుతూ వారికి మార్గదర్శనం చేయాలి కదా!?
రా.చం :- అక్షరాల అంతే..
సూర్యం :- అయితే సమాజంలోని అసమానతలు తొలగించే పనిలో భాగంగా పేదల పక్షాన నిలిచి వారిని చైతన్యం చేయడం కూడా పురోహితమే కదా? అంటే మా కమ్యూ నిస్టులు అందరూ చేస్తున్న పని అదే కనుక మేమూ… పురోహితులమే మరి..!!
రా.చం :- మీ మొండి వాదనలు మీవే కానీ ఎవరి మాట వినరు అందుకే నేటి ప్రజాస్వా మ్యంలో మీ స్థానం ఏమిటో ప్రజలు చెబుతూనే ఉన్నారు..! మేము మాత్రం మా లక్ష్యంతో ముందుకు పోతూ సాంస్కృతిక విద్రోహులను, అరాచక వాదులను,అదుపు చేసి భారత దేశ పునర్వైభవం సాధిస్తాం. మాకు వ్యక్తులు శత్రువులు కాదు, వారు చేసే చెడు పనులే మా నిత్య శత్రువులు.
సూర్య :- మీరు చెప్పేదొకటి చేసేదొకటి దళితులు ముస్లింలను బద్ధ శత్రువులుగా చూస్తారు, మన దేశ ప్రజలే మతాలు మారుతున్నారని ఒప్పుకుంటూనే.. సెక్యులరి జంను తెరచాటుగా వ్యతిరేకిస్తారు,మేము మాత్రం మీరు వ్యతిరేకించే సెక్యులరిజం తోనే విజయం సాధిస్తాం.
రా.చం :- మీ ప్రజాస్వామ్య ధోరణి చూస్తుంటే నవ్వాలో ఏడవాలో తెలియడంలేదు,ఆనాడు నియంతృత్వ నిజాం పై,పోరాడి ఇప్పుడు ఓట్ల కోసం వాళ్ళనే నెత్తిన పెట్టుకుంటున్నారు. మన దేశానికి పక్కలో బల్లెంలావున్న ఇస్లామిక్‌ తీవ్రవాదం పట్ల, అరబ్‌ షేకుల అరాచకాల పట్ల మాట్లాడడానికి మీకు నోరు రాదు. ఇస్లామిక్‌ పురుషాధిక్యత మీకు కనిపించదు, కేవలం హిందూ పురుషాధిక్యతే మీకు కనిపిస్తుంది.
కరుణాకర్‌ :- అప్పటినుంచి వింటున్నా మీ సనుగుడు..
మీ ఇద్దరూ సాధించింది ఏమీ లేదు! సాధించలేరు కూడా..!!
మన దేశ ఆకాంక్షలను ఆశయాలను మా అభయహస్తం జాతీయ పార్టీనే తీర్చగలరు సుదీర్ఘకాలంగా మమ్మల్ని ఈ దేశ ప్రజలు అక్కున చేర్చుకుని పాలనా అధికారం అందిం చారు, ఏదో అప్పుడప్పుడు మాలో మాకు వర్గ పోరు ఎక్కువైనప్పుడు, ప్రజలకు మా మీద మొహం మొత్తినప్పుడు మధ్యలో పాలన మా అభయహస్తం చేజారి ఉండవచ్చు.. కానీ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, ప్రజలందరినీ ఏకతాటిపై నడిపించే పార్టీ మాదే!!
రా.చం :- నిజమే మీ పాలనంతా కనిపించని నియంతృత్వమే! చాప కింద నీరులా విదేశీయతను పెంచి పోషించారు. భారతదేశం అనే భౌతిక రూపానికి సంపూర్ణ బ్రిటిష్‌ వాదాన్ని నింపి స్వదేశంలో పరదేశ పాలన అందించారు.
విశ్వక్‌ :- మధ్యలో పోయిన బ్రిటిష్‌ పాలన దేనికి? మన గురించి చెప్పండి.
రా.చం :- పోయింది అనుకుంటే సరిపో తుందా ఇక్కడ అమలు జరుగుతున్నది అదే కదా? ‘‘విభజించి పాలించు’’ బ్రిటిష్‌ వాళ్ళ తొలి పాలన సూత్రం.
విశ్వక్‌ :- అది ఇప్పుడు ఎక్కడ ఉంది?
రా.చం :- సిద్ధాంతాలతో పని లేకుండా శత్రువు యొక్క శత్రువుతో స్నేహం చేయడమే ఈ అభయ హస్తం వారి పని.
విశ్వక్‌ :- అది సరేగాని మామా..మధ్యలో చిరంజీవి నిన్ను ఏమన్నాడు? అతను అందరి వాడు కదా!?
రా.చం :- నిజమే తెలుగు సినిమా రంగంలో ఏ కులం అండదండలు లేకుండా ప్రతిభతో కష్టపడి ప్రజల మనసుల్లో స్థానం పొందాడు, అంతటితో ఆగకుండా పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఎన్టీఆర్‌ లెవెల్లో పార్టీ పెట్టాడు బాగానే ఉంది..
అంత బతుకు బతికి చివరికి అభయ హస్తం పంచన ఎందుకు చేరినట్టు? తనను నమ్ముకున్న పోసాని వంటి వారిని అనాధలను చేయడానికి మనసు ఎలా వచ్చింది? సినీ నటనలో తను వలకబోసిన ఆదర్శాలను నిజజీవితంలో ఎందుకు ఆచరించలేదు??
విశ్వక్‌ :- ఇక ఆపండి మీ వాద ప్రతి వాదనలు మీ మాటల చాతుర్యంతో మీరు చేసిన చేస్తున్న పనులను చక్కగా సమర్థించు కుంటూ పథకాల పేరుతో ఉచితాలకు ప్రజలను బానిసలు చేసి, ప్రజల సొమ్మునే ప్రజలకు పంచుతూ మీ సొంత సొమ్ములు ఇస్తున్నట్లు పోజులు పెట్టకండి.
‘‘ఉచితాలే భవిష్యత్తుకు ఉరితాళ్లు’’ అనే నిజం ప్రజలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుం టున్నారు. ప్రలోభాలకు లొంగకుండా మా పవిత్ర ఓటు హక్కు వినియోగిస్తాం, నాయ కులకు ‘‘ఓటరు ప్రజలు’’ అంటే వెన్నులో వణుకు పుట్టే అసలైన ప్రజాస్వామ్యం నిర్మించుకుంటాం.
రా.చం :- విశ్వక్‌…! చిన్నవాడివైనా విలువైన మాటలు చెప్పావు ఏ పార్టీ అయినా నాయకులైన ప్రజలంతా ఏకమై కదం తొక్కితే తలలు వంచి నిలవాల్సిందే!!
విశ్వక్‌ :- అవును మామా!! మన పెద్దలు ఆశించిన అసలైన ప్రజాస్వామ్యం ఏర్పాటు కావాలంటే దానికి మా యువతే నడుం బిగించాలి, ఆధునిక ప్రజాస్వామ్యం వైపు అడుగులు వేయాలి అందుకు ఈరోజే మొదలు పెడతాం.- సెల్‌:- 98668 37741. -డా: కాసర్ల రంగారావు

గిరిజన నేస్తం

‘పుష్పవిలాపం’లో ఓబాల తనను చెట్టు నుంచి వేరు చేస్తున్నందుకు పూబాల విలపిస్తుంది, విషాదగీతం ఆలపిస్తుంది. కానీ, చిరుగాలి సవ్వడికి చెట్టుమీది నుంచి రాలే ప్రతి ఇప్పపువ్వూ ఆనందంగా గోండుల వెదురుబుట్టలోకి వెళ్లిపోతుంది. ఆహారమై ఆకలి తీర్చబోతున్నందుకూ, పలారమై పిల్లల నోళ్లు తీపిచేయబోతు న్నందుకూ, ఔషధ గుణాలతో అమ్మల చనుబాలను వృద్ధి చేస్తున్నందుకూ .. ఆ సంతోషానికి అనేక కారణాలు. తెల్లవారుజాము సమయంలో తాడ్వాయి అడవులకు వెళితే%ౌౌ% ఆ పుష్ప విలాసాన్ని కళ్లారా చూడవచ్చు. ఇది పువ్వులు రాలే కాలం. గోండుల మొహాలు పువ్వుల్లా వికసించే కాలం. ఉదయంపూట నడుస్తుంటే, పాదాలకు మెత్తని పూలు తాకుతుంటాయి. తలపైకెత్తి చూస్తే దట్టంగా ఇప్పపూల చెట్లు%ౌౌ% గొడుగులా అల్లుకొని! రాలిన పూలకు అంటిన మట్టిని సుతారంగా తుడిచి, జాగ్రత్తగా వెదురు బుట్టల్లోకి వేస్తుంటారు పిల్లలూ పెద్దలూ. అదో అందమైన దృశ్యం!
ఆ పూవు అటవీ ప్రాంత ప్రజల బతుకుదెరువు. ఇప్పచెట్లకు ఓజీవనచక్రం ఉంటుంది.ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌ వరకూ ఆకురాలే కాలం. ఆసమయంలోనే ఘాటైన పరిమళంతో పూలు వికసిస్తుంటాయి. మార్చి నుంచి మూడు నెలల వరకూ పూలు రాలే కాలం.ఒక్కో చెట్టు నుంచీ సుమారు వంద కిలోల పూలు రాలతాయి. ప్రతి పువ్వునూ జాగ్రత్తగా ఒడిసిపట్టుకుంటారు గిరిజనులు.ఎందుకంటే,వాళ్ల బతుకంతా ఇప్పతోనే ముడిపడి ఉంటుంది.ఇప్పపూల సేకరణ కోసం తెల్లవారుజామునే అడవులకు బయల్దేరతారు గోండులు.పొద్దుతిరుగుడు పువ్వు సూర్యుడి కోసం చూసినట్టు, రాలిపడే ఇప్పపూల కోసం ఎదురు చూస్తుంటారు.అలా, ఒక్కొక్కరు ఐదు నుంచి పది కిలోల వరకూ సేకరిస్తారు. సాయం త్రం బుట్టనిండా పూలతో తృప్తిగా ఇళ్లకు చేరుకుంటాం. వాటిని ఎండబెట్టి పుప్పొడి రేణువులు పోయేదాకా కర్రమొద్దులతో బాదుతారు. ఆ తర్వాత,చేటలతో చెరుగుతారు. గుమ్ముల్లో దాచు కుంటారు. ముందుజాగ్రత్తగా, వాటిలో కొన్ని వేపాకులు చల్లుతారు.దానివల్ల పువ్వు ఎక్కువ కాలం నిలువ ఉంటుంది. ఒకనాటి పువ్వు ఇప్పుడు ఆహార పదార్థం.
పువ్వుకే మనసు ఉంటే..
అందంగా పుట్టినందుకు కాదు,ఆహారమై కడుపు నింపుతున్నందుకే ఎక్కువ సంతో షిస్తుందేమో ఇప్పపువ్వు. ఏ కూర లూ లేనపుడు,నాన బెట్టిన బియ్యానికి ఇప్ప పువ్వు కలిపి అన్నం వండుకుంటారు. నాలుకకు కాస్త తీపి తగిలితే బావుండునని అనిపించినప్పుడు బెల్లం కలిపి ఉండలుగా చేసుకొంటారు. ‘ఇవి మా జీవితం. మా ఆత్మ’ అంటూ ఆరబెట్టిన ఇప్పపూలను దోసిళ్లతో చూపుతుంది మోట్లగూడానికి చెందిన అలుగుమెల్లి రజిత.
ఇప్ప గారెలు,జంతికలు
ఇప్పపువ్వు అనగానే సారా తయారు చేస్తారనేదే ఇప్పటి వరకూ ఉన్న ప్రచారం.అంతకుమించి, ఎన్నో వంటలు వండుకుంటారు గోండు మహిళలు.జొన్నపిండి ఉడక బెట్టి,అందులో ఇప్పపూలు కలిపి అంబలి చేస్తారు.వేయించి బజ్జీలు వేస్తారు.చిక్కుడు గింజలు,అలసందలు కలిపి ఉడికిస్తే ఆ అంబలి అమృతమే! ఇప్ప కుడుములు (ఇడ్లీల్లాంటివి),జొన్న-ఇప్పరొట్టె, గోంగూర-ఇప్పపూల కూర,జొన్న-ఇప్ప సత్తుపిండి ఇప్ప పడితే ఎండు గడ్డికైనా ఎక్కడలేని రుచి వస్తుంది.ఇప్పతో అరిసెలు, గారెలు, జంతికలు, మురుకులు కూడా చేసు కుంటారు.ఎర్ర జొన్న పిండి,బెల్లంతో చేసిన రెండు లడ్డూలు తింటే చాలు,రోజంతా భోజనమే అవసరం లేదు.‘చక్కెర పాకానికి ఇప్పపూవు కలిపి జామ్‌, కేక్‌ తయారు చేస్తాం’ అని చెప్పింది ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరుకు చెందిన భాగుబాయి. వైవిధ్యమైన ఇప్ప వంటకాల తయారీలో ఆమె సిద్ధహస్తురాలు. ఉట్నూరులో ఆదివాసీ ఆహార కేంద్రం నిర్వహిస్తున్నదామె. అనేక ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టే,రోజువారీ ఆహారంలో ఇప్పపూవు ఉండేలా చూసుకుంటారు గిరిజ నులు. వారి నివాసాలు కూడా ఇప్పచెట్లకు దగ్గరలోనే ఉంటాయి.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5లక్షల ఇప్ప చెట్లు ఉన్నట్లు అంచనా.ఐదు లక్షల చెట్లంటే,ఐదు లక్షల జీవితాలే.ఇప్పసారాను నైవేద్యంగా కూడా పెడతారు.ఇప్ప అంటే గోండు దేవతలకు మహా ఇష్టమని అంటారు.మంచిచేసే పువ్వును ఏ దేవుడు మాత్రం ఇష్టపడడు!
శానిటైజర్‌గా ఇప్పసారా!
‘ఆపిల్‌, మామిడి, ఎండు ద్రాక్షలతో పోలిస్తే ఇప్ప పువ్వులోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి. శరీరానికి కావలసిన ..క్యాల్షియం, ఫాస్పరస్‌, ఐరన్‌, పొటాషియం,యాంటీ ఆక్సిడెంట్లు,బి-కాంప్లెక్స్‌, విటమిన్‌-సి ఇందులో అధికం. ఇవన్నీ వ్యాధినిరోధక శక్తిని మెరుగు పరుస్తాయి. ఇప్ప పూలను దగ్గు, శ్వాసకోశ సమస్యల నివా రణకు వాడతారు. ఇప్ప కాయలను పొడిచేసి పాలలో కలుపుకొని తాగుతారు బాలింతలు. దీనివల్ల చనుబాలు వృద్ధి అవుతాయని అం టారు.‘ఇప్పసారా తయారీపై నిషేధం ఉంది. శుభకార్యాలప్పుడు అయిదు లీటర్ల వరకు తయారు చేసుకోవడానికి మాత్రం అనుమతి ఉంది. ఇప్పుడున్న పరిస్ధితుల్లో శానిటైజర్లు మారుమూల గిరిజన ప్రాంతాల్లో దొరకవు. కొన్ని ప్రాంతాలలో కరోనా వైరస్‌ నిరోధానికి ఇప్పసారాను శానిటైజర్‌గా వాడుతున్నారు’ అంటారు.
ప్రారంభమైన ఇప్పపువ్వు సేకరణ!..
ఏజెన్సీ అడవుల్లో ఇప్పపువ్వు సీజన్‌ నడుస్తుంది. ప్రతి ఏడాది మార్చి నుంచి మే చివరి దాకా ఇప్పపువ్వు సేకరణలో గిరిజనం నిమగ్నమవు తుంటారు. వేసవి కాలంలో ఉపాధినిచ్చే ఇప్పపూల కోసం మంటుటెండను సైతం లెక్కచేయకుండా చిన్నాపెద్దా తరలుతున్నారు. తెల్లవారుజామునే తట్టా బుట్టా,అంబలి బుర్రతో బయలుదేరి, సాయంత్రం కల్లా ఊళ్లకు చేరు కుంటారు.గిరిజనులకు ఇప్పపూల సేకరణే ప్రధాన ఆదాయవనరు మాత్రమే కాదు.ఇప్ప పువ్వును గిరిజనులు పవిత్రంగా భావిస్తారు. గిరిజనులు జరుపుకునే సాంప్రదాయ,వేడుకలు, సంబరాలు, పెళ్లి సమయాల్లో ఇప్పపూల నుండి తయారుచేసిన సారాయి తాగడం ఆచారంగా పాటిస్తారు.సాధారణగా ఉదయం సమయంలో రాలుతుంటాయని,30సంవత్సరాల వయస్సు గల ఒక చెట్టు నుండి సుమారు 100నుండి 150 కిలోల ఇప్పపూలు లభిస్తుంటాయని పలువురు గిరిజనులు న్యూస్‌18కు తెలియ జేశారు ఇలా రాలిపడిన పూలను సేకరించి నీడలో ఆరబెడుతారు.బాగాఎండిన తరువాత వీటిని తమ అవసరాలకు అనుగుణంగా కావాల్సినప్పుడు వాడుతుంటారు. గిరిజన ప్రాంతాల్లో ఇప్ప పువ్వు అంటే కేవలం సారా యి తయారు చేయడానికే వాడుతారు అనే భావన ఉంది.కానీ భద్రాచలం ఏజెన్సీ అడుగులలో లభించే ఈ పప్పుని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ప్రసాదం భక్తులకు విక్రయిస్తారని గిరిజనులు తెలుపుతున్నారు.
ఇదిలా ఉండగా గతంలో పలువురు శాస్త్ర వేత్తలు జరిపిన పరిశోధనలో ఇప్ప పూల నుండి పంచదార పాకం తయారు చేసి దీంతో బిస్కెట్‌,చాక్లెట్‌,జామ్‌,కేక్‌లు తయారు చేసే విధానాన్ని కనిపెట్టారు.1999లో పేటెంటు కొరకు దరఖాస్తు చేశారు. ఆయుర్వేద వైద్య విధానం ప్రకారం ఇప్ప పూలు బాలింతలకు చాలా ఉపయోగకరంగా పనిచేస్తాయి. సాధారణ శారీరక బలహీనత నుండి రక్షిస్తుంది. వీటిని నేరుగా తినడంవల్ల పిల్లలు పోషకహార లోపం నుండి బయట పడవచ్చు. గతంలో గిరిజనులందరూ ఇప్ప పూలను మంగళంలో పొడిగా చేసి వేపి,వేపిన గోంగూర గింజల పొడిని కలుపుతూ ఇప్ప నూనె కొంచెం చేర్చి ఉండలుగా చేసుకొని తినేవారు. రెండు లడ్లు తింటే ఒక రోజుకు సరిపడా శక్తి శరీరా నికి లభించేది. కొన్ని రాష్ట్రాల్లో గిరిజనులు ఈ పూలను రొట్టెల పిండిలో కలిపి తింటారు. ఇప్పపూలతో ఇప్పజామ్‌గిరిజనులకు ఇప్పపూల సేకరణే ఆధారం.
దివ్య ఔషదాల కల్పవల్లి..
కొండకోనల్లో జీవించే గిరిజనులకు ప్రకృతి వనరులే జీవనాధారంగా ఉంటాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో సహజ సిద్ధంగా లభించే వివిధ రకాల పండ్లు, పంటలు గిరిజనులకు ఆహార సంపదతో పాటు ఆదాయ వనరులుగా ఉపయోగపడుతుంటాయి. ప్రస్తుతం జీడీ, చింతపండు,కరక్కాయ వంటి సహజసిద్ద పంట లతోపాటు ఇప్పపూలు సేకరణద్వారా గిరిజ నులు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు.
వేసవిలో ఇప్పపూలు సేకరణలో గిరిజనులు బిజీగా గడుపుతుంటారు.గిరిజనులు చింత పండు,జీడి పిక్కలు సేకరణతో పాటు మరోవైపు ఇప్పపూలు సేకరణలో బిజీగా కనిపి స్తుంటారు. ఏగ్రామం చూసిన విప్పపూల సువాసన వెదజల్లుతోంది.ఇప్పపూలులో దివ్యౌషధం గుణాలు కలిగి ఉన్నాయి. ఇప్పపూలు విని యోగించేవారు విశేషమైన ఆరోగ్య లాభాలు పొందుతారు.ముఖ్యంగా కీళ్ల నొప్పులు,ఒళ్ళు పట్లు, వాతాలకు దివ్యౌషధం ఇప్పపూలు. దగ్గు,శ్వాసకోస వ్యాధులకు కూడా వాడు తుంటారు.ఇప్ప కాయలను పొడిచేసి పాలలో కలుపుకుని గిరిజన మహిళలు తాగుతారు.దీని వలన బాలింతలు చనుబాలు వృద్ధి అవుతాయని అంటుంటారు. విప్ప పువ్వు తో ఆయుర్వేదిక్‌ మందులు, నూనె లడ్డు, హల్వా, కేకులు తయారు చేస్తుంటారు. అందుకే విప్ప పువ్వుకు మార్కెట్‌ లో మంచి డిమాండ్‌.అడవుల్లో సేకరించిన విప్ప పువ్వును బాగా ఎండ బెడతారు. అనంతరం ఆ పువ్వు నుంచి గింజ లను వేరు చేసి,మళ్లీ ఎండబెడతారు. అనం తరం వాటిని గానుగ ఆడిరచి నూనె తీస్తారు. ఈ నూనెను వంటలలో ఉపయోగిస్తుంటారు. అలాగే, ఔషధాలకూ ఉపయోగిస్తుంటారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో విప్ప నూనె కిలో ధర 50రూపాయల వరకు పలుకుతుంది. గిరిజను లు ఈ నూనెను విక్రయిస్తూ, ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. గతంలో గిరిజన సహకార సంస్థ ద్వారా విప్ప పువ్వు,విప్ప నూనెను ప్రభుత్వమే కొనుగోలు చేసేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.దీంతో మార్కెటింగ్‌ కోసం గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పపూలు,గింజల నుంచి తీసే నూనెలో ఔషధపోషక గుణాలు కూడా ఉన్నా యని జాతీయ పౌషకాహార సంస్థ అధ్యయనంలో తేలిందని ట్రైఫెడ్‌ చెబుతుంది. బాలింతలకు ఆరోగ్యాన్ని ఇవ్వడంతోపాటు శారీరక బలహీ నత నివారించే గుణాలు వీటిలో ఉన్నాయని పేర్కొంటోంది.30 ఏళ్ల వయస్సున్న ఇప్ప చెట్టు సగటున 150 కిలోల పూలను ఉత్పత్తి చేస్తుంది.మట్టి అంటకుండా ఈపూలను సేకరించి నిల్వ చేస్తారు.అనంతరం వీటి నుంచి పంచదార పాకం చేసి దాంతో బిస్కెట్‌,చాక్లెట్‌, జామ్‌,కేక్‌లను తయారు చేస్తారు.కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ సహకారంతో నిర్వహించిన పరిశోధనలో ఢల్లీికి చెందిన డాక్టర్‌ ఎస్‌.ఎన్‌.నాయక్‌ ఈ ప్రక్రియపై పేటెంట్‌ కోసం కూడా దరఖాస్తు చేశారు- ఎ.పోశాద్రి

అమల్లోకి సీఏఏ

‘‘ వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) మళ్లీ తెరపైకి వచ్చింది.సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఓట్లు కురిపిస్తున్నందని భావిస్తున్న సీఏఏను మోదీ సర్కారు బ్రహ్మాస్త్రంగా బయటికి తీసింది. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్గానిస్తాన్‌ల నుంచి భారత్‌కు శరణార్ధు లుగా వచ్చిన ముస్లిమేతరులకు మన దేశ పౌరసత్వాన్ని కల్పించడం లక్ష్యంగా మార్చి 11న నోటిఫికేషన్‌ జారీ చేసింది.’’– ` గునపర్తి సైమన్‌
భిన్నత్వంలో ఏకత్వం కలిగిన లౌకిక భార తాన్ని విచ్ఛిన్నం చేసేందుకు వినాశకర పౌరసత్వ చట్ట సవరణ-2019ని ఎన్నికల ముంగిట మోడీ ప్రభుత్వం మళ్లీ ముందుకు తెచ్చింది. మతపర మైన ఉద్రిక్త తలు రెచ్చగొట్టడం దేశ సమగ్రత, సమె ౖక్యతకు గొడ్డలిపెట్టు. ఎన్నికల్లో లబ్ధిపొం దాలన్న యావతో వివాదాస్పద సిఎఎ అమలుకు అది తెగబడిరది.ఈ చట్టానికి వ్యతిరేకంగా 2019-20లో దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. ప్రభుత్వ రాక్షసత్వానికి దాదాపు వంద మంది బల య్యారు. అప్పట్లో తాత్కాలికంగా వెనక్కితగ్గి ఇన్నాళ్లూ కోల్డ్‌ స్టోరేజిలో పెట్టిన ఈ చట్టాన్ని ఎన్నికల ముంగిట అందునా రంజాన్‌ ఉపవా సాలు ప్రారంభమైన ముందురోజున నోటిఫై చేయడం దాని దుష్ట ఎజెండాలో భాగమే. విచ్ఛిన్నం చేసే మత విభజనను తెచ్చి రోజురోజుకూ పెరిగిపోతున్న ధరలు,నిరు ద్యోగం,కుంగిపోతున్న ఆర్థిక వ్యవస్థ లాంటి అంశాలన్నీ పక్కనపెట్టి భావోద్వేగ అంశాలను, మతపరమైన అంశాలను రెచ్చగొట్టడం వల్లే ప్రయోజనం పొందాలనేది బిజెపి కుతంత్రం. 2019లో ఎన్నికల ముందు పుల్వామా, సర్జికల్‌ స్ట్రైక్స్‌,దేశభక్తి లాంటి అంశాలను ముందుకు తెచ్చినట్టే ఇప్పుడూ సిఎఎ లాంటి అంశాలతో లబ్ధిపొందాలని ఆపార్టీ చూస్తోంది.పౌరసత్వ సవరణ చట్టాన్ని 2019 డిసెంబర్‌ 11న పార్లమెంట్‌లో ప్రతిపక్షాల బహిష్కరణ మధ్య అత్యంత అప్రజాస్వామిక రీతిలో ఆమోదింప జేసుకుంది.ఎన్‌డిఎ భాగస్వాము లతోపాటు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీల ఎంపిలు ఆనాడు దీనికి అనుకూలంగా ఓటు వేశారు.ఈచట్టం ప్రకారం 2014డిసెంబరు 31కి ముందు పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌, బంగ్లా దేశ్‌ల నుండి మనదేశానికి వలస వచ్చిన హిందువులు, బౌద్ధులు, జైనులు,సిక్కులు,క్రైస్తవు లు,పార్శీలకు భారత పౌరసత్వం ఇస్తారు. ఈ చట్టం అమలును జాతీయ పౌరపట్టిక ఏర్పాటుతో ముడిపెట్టడం ముస్లిం పౌరులను లక్ష్యంగా చేసుకునేందుకే. రాష్ట్రాల్లో పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే వారి గుర్తింపు,పేర్ల నమోదు క్రమం నుండి రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర లేకుండా చేయడం చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిం చిన రాష్ట్ర ప్రభుత్వాలను మినహాయించింది. ఇది భారత ఫెడరల్‌ వ్యవస్థ స్ఫూర్తికే విరుద్ధం. ఈ చట్టాన్ని మూడు దేశాలకే పరిమితం చేయడం,మతం ఆధారంగా తీసుకురావడం 1955లో తీసుకొచ్చిన సిఎఎ చట్టానికి, రాజ్యాం గ మౌలిక స్వరూపానికి వ్యతిరేకం.రాజ్యాంగం లోని 19వ అధికరణం మతప రమైన స్వేచ్ఛ ఇస్తున్నప్పుడు ముస్లిములకు తప్ప ఇతరులకే పౌరసత్వం ఇస్తామని చెప్పడం రాజ్యాంగ ఉల్లం ఘన కాదా? శ్రీలంకలో దశాబ్దాలుగా మతపర మైన హింసను ఎదుర్కొం టున్న శ్రీలంక హిందువులను ఎందుకు మినహాయించారు? తమిళులపట్ల వివక్షా? ఇప్పుడు ముస్లిములను మినహాయించిన వారు తరువాత క్రైస్తవులను, ఇతర మైనార్టీలను మినహాయిం చరా? వంటి ప్రశ్నలనేకం. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14 ప్రకారం కులం,మతం,రంగు,జాతి,ప్రాంతం, భాష ఆధారంగా ఎవరిపట్ల వివక్ష ఉండ కూడదు.కాని సిఎఎ మత ప్రాతిపదికన వివక్ష పాటిస్తుంది కనుక ఇది రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగ మౌలిక సూత్రా లను (బేసిక్‌ స్ట్రక్చర్‌ను) మార్చే అధికారం పార్ల మెంట్‌కు కూడా లేదని కేశవానంద భారతి కేసు తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.ఇవేవీ పట్టని మన పాలకులు మతాన్ని అడ్డగోలుగా రాజకీయ ప్రయోజనాలకు వినియోగిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల సమయంలో ‘జై భజరంగి’ అంటూ ఓట్లు వేయాలని ప్రధాని స్వయంగా పిలుపు నిచ్చారు.‘పాకిస్తాన్‌కు వెళ్లండి..లేదా కబరి స్థాన్‌కు వెళ్లండి’అంటూ వీరంగం వేయడం, బుల్డోజర్లతో నివాసాలను కూల్చివేయడం..కమ లం పార్టీకి,ఆ పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వా లకు నిత్యకృత్యమే.400 సీట్లు ఇవ్వండి రాజ్యాం గాన్నే మార్చేస్తాం..సెక్యులర్‌ దేశంగా భారత్‌ను ఉంచం అని బిజెపి ఎంపి అనంత హెగ్డే అన్నారు. సిఎఎను అమలు చేయబోమని ఇప్పటికే కేరళ,తమిళనాడు ప్రభుత్వాలు ప్రకటిం చగా, మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే బాటలో నడుస్తున్నాయి. భిన్న మతాలు, ఆచారా లు,సంప్రదాయాలు,సంస్కృతులకు నియమైన మన దేశానికి ఈ చట్టం ఏమాత్రం శ్రేయస్కరం కాదు.మత మారణహోమాన్ని రగిలించే మతోన్మాద శక్తుల ఆట కట్టించేందుకు యావ ద్భారత జాతి ఐక్యంగా ముందుకు ఉరకాలి. సిఎఎను తిప్పికొట్టాలి.
ఏమిటీ పౌరసత్వ సవరణ చట్టం.. అంటే..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ముఖ్య అజెండాల్లో ఒకటి.. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ). ఇప్పుడు ఎన్నికల ముంగిట ఈ అంశం వివాదాస్పదమవుతోంది. సీఏఏను వారంలో దేశమంతా అమలు చేస్తామని కేంద్రం ప్రకటిం చడం కాక రేపుతోంది. అయోధ్యలో రామాల య నిర్మాణంతోపాటు ఇప్పుడు పౌరసత్వ సవరణ చట్టం ద్వారా బీజేపీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని భావిస్తోందని విపక్షాలు విమర్శి స్తున్నాయి.ఇంతకూ ఈ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అంటే..పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్గనిస్తాన్‌ దేశాల నుంచి వచ్చిన ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం కల్పించ డం.2014 డిసెంబర్‌ 31కి ముందు ఆయా దేశాల నుంచి భార్ష కు వలస వచ్చిన వారు భారత పౌరసత్వాన్ని పొందడానికి అర్హులు. ఆయా దేశాల నుంచి వలస వచ్చిన హిందు వులు,సిక్కులు,జైనులు,బౌద్ధులు,పార్శీలు,క్క్రెస్తవులు దీని సీఏఏ కింద భారత పౌరసత్వం పొం దొచ్చు. ఆఫ్గనిస్తాన్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ నుంచి వలస వచ్చినవారికి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా,వాటి గడువు ముగిసినా భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకో వచ్చు.ఈ మేరకు 1955 నాటి పౌరసత్వ చట్టా నికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సవరణలు చేసింది. వాస్తవానికి పౌరసత్వ సవరణ చట్టం ప్రతిపాదన బిల్లును మొదట 2016లో పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అయితే అప్పుడు బీజేపీ మిత్రపక్షం అసోం గణపరిషత్‌ తోపాటు తదితర పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అనంతరం 2019లో సీఏఏ బిల్లును పార్లమెం టు ఉభయసభలు ఆమోదించాయి. తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్రతో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) రూపుదాల్చింది.అయితే దేశవ్యా ప్తంగా సీఏఏపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. విపక్షాల ఆందోళనలతో దాని అమలు ఇన్నాళ్లూ వాయిదా పడిరది. కానీ జమ్ముకాశ్మీర్‌ కు ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించడం,లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయడం,అయోధ్యలో రామా లయం నిర్మాణం వంటి చర్యలతో దూకుడు మీదున్న బీజేపీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం విషయంలోనూ అంతే పట్టుదలతో ఉం దని అంటున్నారు.ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కూడా ఎవరు అభ్యంతరం వ్యక్తం చేసినా పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయడం ఖాయమని వెల్లడిర చారు. పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం.. 2014 డిసెంబర్‌ 31కి ముందు భారత్‌కు వలస వచ్చిన మతపరమైన మైనారిటీలకు ఆరేళ్లలోపు భారత పౌరసత్వం కల్పిస్తారు. అలాగే వీరు భారత్‌ పౌరసత్వం పొందడానికి భారత్‌లో కనీసం 11ఏళ్లుగా నివసిస్తూ ఉండా లన్న నిబంధనను కూడా ఐదేళ్లకు తగ్గించారు. అయితే హిందువులకు, క్క్రెస్తవులకు, బౌద్ధులకు, పార్శీలకు పౌరసత్వం ఇస్తూ ముస్లిం మైనారిటీ లను చేర్చకపోవడం పట్ల అభ్యంతరాలు వ్యక్త మవుతున్నాయి. సీఏఏపై విపక్షాల అభ్యంతరా లెందుకు అంటే..వివిధ దేశాల నుంచి వలస వచ్చి భారత్‌లో జీవిస్తున్న వివిధ మతాలవారు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు వీరికి పౌర సత్వం కల్పిస్తే వారంతా బీజేపీకి ప్రధాన ఓటు బ్యాంకుగా మారతారని విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే ముస్లింలకు పౌరసత్వం కల్పించకపోవడం పట్ల కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే విదే శీయుల కారణంగా స్థానికంగా ఉండేవారికి ఉపాధి విషయంలో,సంస్కృతి సంప్రదాయాల విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయని ప్రతిపక్షాల అభ్యంతరంగా ఉంది.అలాగే పాకిస్థాన్‌,బంగ్లాదేశ్‌,ఆప్గనిస్తాన్‌ల నుంచి వచ్చినవారికి పౌరసత్వం కల్పిస్తూ శ్రీలంక, టిబెట్‌,మయన్మార్‌ నుంచి వచ్చినవారికి పౌర సత్వం ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తంగా సీఏఏ చట్టం రాజ్యాంగబద్ధతనే సవాలు చేస్తూ పలు పార్టీలు ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసులు వేశాయి. వీటిపై విచారణ తుది దశలో ఉంది.
చట్టం అమలుకు నిబంధనలను విడుదల
ఈ చట్టాన్ని అమలు పరచడానికి అవసరమైన నియమ నిబంధనలను కేంద్రం నోటిఫై చేసిం దని ఏఎన్‌ఐ వార్తా సంస్థ వెల్లడిరచింది. ఈ నిబంధనలకు అమల్లోకి వస్తే 2014డిసెంబర్‌ 31తర్వాత పాకిస్తాన్‌,అఫ్గానిస్తాన్‌,బంగ్లాదేశ్‌ల నుంచి నిబంధనలకు విరుద్ధంగా వలస వచ్చిన హిందువులు, సిక్కులకు భారత పౌరసత్వం దక్కే అవకాశం ఏర్పడుతుందని హోంశాఖ తన ట్వీట్‌లో పేర్కొంది.ఇందుకోసం పూర్తిగా ఆన్‌లైన్‌ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.
ఏమిటీ బిల్లు
ఈ పౌరసత్వ సవరణ బిల్లును మొదటిసారి 2016 జూలైలో పార్లమెంటులో ప్రవేశ పెట్టారు.అప్పుడు బీజేపీకి భారీ ఆధిక్యం ఉన్న పార్లమెంటు దిగువసభ (లోక్‌సభ)లో ఈ బిల్లు ఆమోదం పొందింది. అయితే..ఈశాన్య భారత దేశంలో వలసలకు వ్యతిరేకంగా హింసాత్మక నిరసనలు చెలరేగిన తర్వాత ఎగువ సభ (రాజ్యసభ)లో ఇది ఆమోదం పొందలేదు. ముఖ్యంగా..ఆగస్టు నెలలో ప్రకటించిన జాతీయ పౌరుల జాబితాలో దాదాపు ఇరవై లక్షల మంది నివాసులకు చోటు కల్పించని అస్సాం రాష్ట్రంలో నిరసనలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ పౌరసత్వ సవరణ చట్టం,ఆపౌరుల జాబి తా రెండూ ఒకటి కాకపోయినప్పటికీ..ఆ జాబి తాకు ఈ చట్టానికి సంబంధం ఉందని జనం భావిస్తున్నారు. జాతీయ పౌరుల జాబితా (నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌-ఎన్‌ఆర్‌సీ) అనేది..1971 మార్చి 24వ తేదీ నాటికి – అంటే పొరుగుదేశమైన బంగ్లాదేశ్‌ స్వతంత్ర దేశంగా మారటానికి ఒక రోజు ముందు నాటికి తాము ఈ రాష్ట్రానికి వచ్చామని నిరూపించు కోగలగిన ప్రజల జాబితా.ఆ జాబితాను ప్రచురించటానికి ముందు ఎన్‌ఆర్‌సీని బీజేపీ సమర్థించుకుంటూ వచ్చింది. కానీ.. తుది జాబితాను ప్రచురించటానికి కొన్ని రోజుల ముందు అందులో తప్పులు ఉన్నాయంటూ వైఖరి మార్చుకుంది. దానికి కారణం..బీజేపీకి బలమైన ఓట్ల పునాదిగా ఉన్న బెంగాలీ హిందు వులు చాలా మందిని కూడా ఆ జాబితా నుంచి మినహాయించారు. ఈ నియమాలు పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌,అఫ్గానిస్తాన్‌ దేశాల్లో మతపరంగా హింసకు గురవుతున్న మైనారిటీలకు మన దేశంలో పౌరసత్వాన్ని పొందేలా చేస్తాయి. ఆ దేశాల్లో నివసిస్తున్న హిందువులు,సిక్కులు, బౌద్ధులు,జైనులు,పార్సీలు,క్రైస్తవులకు మన రాజ్యాంగ నిర్మాతలు ఇచ్చిన వాగ్దానాన్ని గ్రహించి,ఈ నోటిఫికేషన్‌తో నరేంద్ర మోదీ నెరవేర్చారు’’ అని ఎక్స్‌ వేదికగా తెలిపారు. భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో ఎవరూ మతం ఆధారంగా వివక్ష చూపకూడదు.అయితే ఈ చట్టంలో ముస్లింలకు పౌరసత్వం కల్పించే నిబంధన లేదు. ఈ కారణంగానే సెక్యులరి జానికి విఘాతం కలుగుతోందన్న ఆరోపణలు వినిపించాయి.
పౌరసత్వ చట్టం చరిత్ర ఏమిటి?
అక్రమ వలసదారులు భారతదేశ పౌరులుగా మారకుండా నిషేధిస్తున్న 64సంవత్సరాల కిందటి భారత పౌరసత్వ చట్టాన్ని ఈ పౌరసత్వ సవరణ బిల్లు సవరించింది. చెల్లుబాటయ్యే పాస్‌పోర్టు, ప్రయాణ పత్రాలు లేకుండా భారతదేశంలోకి ప్రవేశించే విదేశీయులు, అనుమతించిన కాల పరిమితిని దాటి దేశంలో కొనసాగే విదేశీయులను అక్రమ వలసదారులు అని ఆ చట్టం నిర్వచిస్తోంది.ఆచట్టం ప్రకారం.. అక్రమ వలసదారులను వారి దేశాలకు తిప్పి పంపించేయటం లేదా జైలులో నిర్బంధించటం చేయవచ్చు.ఒక వ్యక్తి భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవటానికి 11సంవత్సరాల పాటు భారతదేశంలో నివసించి ఉండటం కానీ, ప్రభుత్వం కోసం పనిచేసి ఉండటం కానీ తప్పనిసరి అర్హతలుగా చెప్తున్న నిబంధనను కూడా ఈ బిల్లు సవరిస్తుంది.ఆరు మతపర మైన మైనారిటీ సమూహాలకు-హిందువులు, సిక్కులు,బౌద్ధులు,జైనులు,పార్సీలు,క్రైస్తవులకు మినహాయింపు ఉంటుంది.అయితే..వారు పాకిస్తాన్‌,అఫ్ఘానిస్తాన్‌,బంగ్లాదేశ్‌ దేశాలలో ఏదో ఒక దేశానికి చెందిన వారిమని నిరూపించు కోగలగాలి.అటువంటి వారు పౌరసత్వం పొంద టానికి అర్హులు కావాలంటే కేవలం ఆరు సంవ త్సరాల పాటు భారతదేశంలో నివసించటం లేదా పనిచేసి ఉంటేచాలు. ప్రవాస భారత పౌరులు (ఓవర్‌సీస్‌ సిటిజన్‌ ఆఫ్‌ ఇండియా- ఓసీఐ) కార్డులుగల వ్యక్తులు-భారత సంతతికి చెందిన విదేశీ పౌరులు భారతదేశంలో నిరవ ధికంగా నివసించటానికి లేదా పని చేయటానికి అనుమతించే వలస హోదా గల వ్యక్తులు.. చిన్న,పెద్ద నేరాలతో స్థానిక చట్టాలను ఉల్లం ఘించినట్లయితే వారి ఓసీఐ హోదాను కోల్పో తారని కూడా ఈ సవరణ చెప్తోంది.పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయకుండా ఉండే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందా? దేశం లోని కొన్ని బీజేపీయేతర ప్రభుత్వాలు తమ రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) అమలు చేయబోమని ప్రకటించాయి.అయితే, పౌరసత్వం కేంద్ర ప్రభుత్వ ?అధికార పరిధి లోకి వస్తుంది కదా,మరి అది సాధ్యమేనా? పౌరసత్వ సవరణ చట్టం-2019ను భారత పార్లమెంట్‌ ఆమోదించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం దీనికి సంబంధిం చిన నిబంధనలు నోటిఫై చేసింది.ఈచట్టం ప్రకారం 2014కు ముందు పాకిస్తాన్‌,బంగ్లా దేశ్‌,అఫ్గానిస్తాన్‌ దేశాల నుంచి భారత్‌లోకి ప్రవేశించిన హిందూ,బౌద్ధ,పార్సీ,క్రైస్తవ,జైన మతాలకు చెందిన వ్యక్తులు భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.వారు భారత్‌లోకి ప్రవేశించినట్లుగా నిరూపించే ధ్రువ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. దీనికి అందించా ల్సిన పత్రాలను సెక్షన్‌ 1ఏ,సెక్షన్‌ 1బీ విభాగా ల్లో పొందుపరిచారు.1ఏ పత్రాలలో జనన ధ్రువీకరణ,అద్దె ఒప్పంద పత్రం, గుర్తింపు కార్డులు, డ్రైవింగ్‌ లైసెన్స్‌,అఫ్గానిస్తాన్‌, బంగ్లా దేశ్‌,పాకిస్తాన్‌ దేశాలు జారీ చేసిన విద్య సంబంధిత ధ్రువీకరణ పత్రాలు సమర్పిం చాలి.1బీ కోసం భారత ప్రభుత్వం జారీ చేసిన వీసా,పాన్‌ కార్డు,మ్యారేజ్‌ సర్టిఫికేట్‌,సెన్సస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ అడ్మిట్‌ కార్డ్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్డులు పేర్కొన్నారు.ఈ పత్రాలు 2014కి ముందే తీసుకొని ఉండాలి. ఈ పత్రాలు అందుబాటులో ఉంటే,ఈ మూడు దేశాల ప్రజలు భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందా?పౌరసత్వం మంజూరు అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిది, అయితే ఈ చట్టాన్ని కొన్ని రాష్ట్రాల్లో అమలు చేయ కుండా ఉండటం సాధ్యమవుతుందా? ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎందుకు అలాంటి ప్రకటనలు చేస్తున్నారు? అనే ప్రశ్నలు తలెత్తు తున్నాయి.భారత రాజ్యాంగంలోని భాగం సెంట్రల్‌ లిస్ట్‌,స్టేట్‌లిస్ట్‌,కామన్‌ లిస్ట్‌ పరిధిలోకి వచ్చే విషయాలను నిర్వచిస్తుంది. కేంద్ర జాబితాలో మొత్తం 97అంశాలు ఉన్నాయి. 17వ అంశంగా ‘సిటిజన్‌షిప్‌,నాచురలైజేషన్‌, అలియన్స్‌’లను ప్రస్తావించారు.ఈ జాబితాలో ఉన్న విషయాలపై చట్టం చేసే హక్కు పూర్తిగా పార్లమెంట్‌ది.భారత పార్లమెంట్‌ ఆమోదించిన చట్టాలను రాష్ట్రాలు అమలు చేయాలి.
రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకోగలవా?
కేంద్రం చేసిన చట్టాలను రాష్ట్రాల్లో అమలు చేయడం,వ్యతిరేకించడంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత,ప్రముఖ న్యాయవాది కపిల్‌ సిబల్‌ గతం లో కొన్ని వ్యాఖ్యలు చేశారు.2020లో కేరళలో జరిగిన ‘కేరళ లిటరేచర్‌ ఫెస్టివల్‌’లో పాల్గొన్న కపిల్‌ సిబల్‌ మాట్లాడుతూ..‘సీఏఏను పార్ల మెంట్‌ ఆమోదించిన తర్వాత ఏరాష్ట్రం కూడా దాన్ని అమలు చేయబోమని చెప్పలేదు.కానీ, వ్యతిరేకించవచ్చు.అసెంబ్లీలో తీర్మానం చేయ వచ్చు. చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయవచ్చు.కానీ దానిని అమలు చేయబోమని చెప్పడం రాజ్యాంగ పరంగా సంక్లిష్టమైనది’’ అని ఆయన అన్నారు. అంతేకాదు, పౌరసత్వం కోరేవారు కేంద్ర ప్రభు త్వం రూపొందించిన వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకుంటారు. మరి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఎలా అడ్డుకుంటుంది లేదా అమలు చేయ కుండా ఉంటుందా?అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది.
‘పౌరుల రిజిస్టర్‌ తయారు చేయగలరా?’
సిటిజన్‌ షిప్స్‌, నాన్‌- సిటిజన్‌ షిప్స్‌ కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వచ్చినా,రాష్ట్ర ప్రభుత్వం మద్దతు లేకుండా ఏమీ చేయలేరని డీఎంకే అధికార ప్రతినిధి సీ రవీంద్రన్‌ అన్నారు.‘‘సీఏఏ, ఎన్‌ఆర్‌సీలు ఒకదానికొకటి అనుసంధానమైనవి. రాష్ట్ర ప్రభుత్వ సహాయం లేకుండా పౌరుల రిజిస్టర్‌ తయారుచేయవచ్చా? ఉదాహరణకు, శ్రీలంక తమిళులు ఈ సీఏఏ చట్టం ప్రకారం పౌరసత్వం పొందలేరు. వారు ఒకవేళ శ్రీలంక తమిళులని చెబితే వెళ్లగొడతారు,అది రాష్ట్ర ప్రభుత్వం చేయాలా?మేం అంగీకరించం’’ అని రవీంద్రన్‌ అన్నారు.రాజకీయాల కోసమే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చట్టాలు చేస్తుందని ఆయన ఆరోపించారు.‘‘ఉత్తర భారతదేశంలో హిందూ శక్తులు బలంగా ఉన్న ప్రాంతాలలో,బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం అని నటిస్తోంది. వాళ్లు దీన్ని పూర్తిగా అమలు చేయలేరు’’ అని రవీంద్రన్‌ ఆరోపించారు.

రైతులు మళ్లీ ఎందుకు ఉద్యమిస్తున్నారు?

‘‘కేంద్ర ప్రభుత్వం నల్లచట్టాలను దొడ్డిదారిన అమలు చేయడమే కాక, విద్యుత్‌ బిల్లు ఆధారంగా వ్యవసాయ పంపుసెట్లకు మోటర్లు బిగించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర ఒత్తిడి తెచ్చి అమలు చేయిస్తున్నది. కనీస మద్దతు ధర అమలు కోసం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అందుకే నాడు కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయమని దేశవ్యాప్తంగా రైతు సంఘాల సమాఖ్య వివిధ రూపాల్లో ఉద్యమిస్తున్నది. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మరోసారి పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల రైతులు ఢల్లీి చుట్టూ చేరి ఉద్యమిస్తున్నారు. అకస్మాత్తుగా కొందరు రైతులు చేస్తున్న పోరాటం కాదు ఇది. అనేక దశబ్దాలుగా వ్యవసాయం పట్ల, గ్రామీణ పేద, మధ్యతరగతి ప్రజల పట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటం’’
కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందో ళన కొనసాగుతోంది.ఈ చట్టాలను అడ్డు పెట్టు కుని కార్పొరేట్‌ సంస్థలు వ్యవసాయంపై గుత్తాధి పత్యం సాధిస్తాయని,అప్పుడు తాము దోపిడికి గురవుతామన్నది రైతుల భయం.అయితే కార్పొరేట్‌ రంగం వ్యవసాయం రంగంలోకి ప్రవేశిస్తే ఏం జరుగుతుందనే జాగ్రత్తగా గమనిం చాల్సిన అవస రం ఉంది. ప్రస్తుతం వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం ప్రధాన పాత్ర పోషిస్తోంది. వాస్తవానికి 23 రకాల వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వం కొనాల్సి ఉన్నా ప్రస్తుతానికి వరి,గోధుములను మాత్రమే ఎక్కువగా కొంటోంది కేంద్ర ప్రభుత్వం.గోధుమలను కొనడంలో ప్రభు త్వం తర్వాత రెండోస్థానంలో ఎవరిది? రూ.75 వేల కోట్ల విలువైన ప్రపంచస్థాయి కార్పొ రేట్‌ సంస్థ ఐటీసీ గ్రూప్‌ది.ఈ సంస్థ ఈ ఏడాది రైతుల నుంచి 2.2మిలియన్‌ టన్నుల గోధుమలను కొనుగోలు చేసింది.మహీంద్రా గ్రూప్‌ కూడా వ్యవ సాయ రంగంలో పెద్దఎత్తున వ్యాపారాలు ప్రారం భించింది.నెస్లే,గోద్రెజ్‌లాంటి బడాప్రైవేట్‌ కంపె నీలు కూడా వ్యవసాయ రంగంలోకి వస్తున్నాయి.
ఈ-చౌపాల్‌
ఐటీసీ కంపెనీకి, రైతులకు మధ్య అనుసంధానకర్త పాత్ర పోషించడంలోఈ-చౌపాల్‌ పథకం కీలకపాత్ర పోషించింది. ఈ-చౌపాల్‌ సహకారం తో 20 సంవత్సరాలుగా ఐటీసీ గ్రూప్‌ రైతులతో కలిసి వ్యాపారం చేస్తోంది.2000 సంవత్సరంలో ప్రారంభమైన ఈ-చౌపాల్‌ మోడల్‌ గ్రామాల్లో ఇంటర్నెట్‌ కియోస్క్‌లు ఏర్పాటు ఒక నెట్‌వర్క్‌గా పని చేస్తుంది.చిన్న,సన్నకారు రైతులకు తమ ఉత్పత్తుల మార్కెటింగ్‌ చేసుకోవడంలో ఇది మెల కువలు అందిస్తుంది. వివిధ మార్కెట్లలో ధరలు, వాతావరణ సూచనల్లాంటివి అందిస్తూ రైతులకు బాసటగా ఉంటుంది.
ఈ-చౌపాల్‌ మోడల్‌ ఎలా పనిచేస్తుంది?
అది 2005 సంవత్సరం. మహారాష్ట్రలోని నాగ్‌ పూర్‌ ప్రాంతంలో సోయాబీన్‌ పంటకు రైతుల నుంచి పెరుగుతున్న ఆదరణ గురించి ఒక కథనం కోసం నేను ప్రయత్నిస్తున్న సమయంలో ఈ-చౌపాల్‌ పథకం గురించి విన్నాను.
ఈ-చౌపాల్‌ పరిధిలో ఉండే మార్కెట్లకు వెళ్లి చూశాను.ఒకరిద్దరు యువకులు గ్రామాల్లో కంప్యూ టర్లు పెట్టుకుని వాతావరణ సమాచారాన్ని రైతు లకు అందించడం, అంతర్జాయతీయ మార్కెట్‌లో సోయాబీన్‌ ధరల గురించి వివరించడం గమ నించాను.ఇక్కడి ధరలు తెలుసుకున్నాక రైతులు మార్కెట్‌కు వెళ్లి సోయాబీన్‌ ధరను ముందుగా నిర్ణయించిన ధరకు ఐటీసీకి అమ్మేవారు. అప్పటికి ఆ పథకం కొత్తది. ఒక కార్పొరేట్‌ కంపెనీ, రైతులు కలిసి పని చేయడం కూడా కొత్త విషయమే. రైతులతో తమకున్న అనుబంధంపై ఐటీసీ సంస్థ ఒక వీడియో ఫిల్మ్‌ తయారు చేసిగ్రామాల్లో రైతు లకు ప్రదర్శించి చూపేది. తమ పథకాల గురించి వివరించేది. అప్పట్లో రైతులు,సంస్థా ఇద్దరూ సంతోషంగానే ఉన్నారు.కానీ ఒక సంస్థ రైతులను మోసం చేయాలను కున్నా, దోచుకోవాలనుకున్నా అది పెద్దకష్టం కాదు. ఎందుకంటే రైతుల రక్షణకు చట్టంలో ఎలాంటి నిబంధనలు లేవు.
ఈ-చౌపాల్‌లో ఇప్పుడు 40లక్షల మందిరైతుల నెట్‌వర్క్‌గా మారింది.10 రాష్ట్రాల్లో 6100 కంప్యూటర్‌ కియోస్క్‌ల ద్వారా 35,000 గ్రామాల్లో విస్తరించి ఉంది. కోటిమంది రైతులను సభ్యులుగా మార్చడమే తమ లక్ష్యమని కంపెనీ వెబ్‌సైట్‌లో పేర్కొంది.రైతులు, కంపెనీల మధ్య కాంట్రాక్ట్‌ వ్యవసాయానికి ఈ-చౌపాల్‌ ఒక మోడ ల్‌. అయితే కొత్త వ్యవసాయ చట్టం కార్పొరేట్‌ గ్రూప్‌లైన అంబానీలు,అదానీలు వ్యవసాయ రంగంలో ప్రవేశించడానికి అనుమతిస్తుంది. అందుకే రైతులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు.
వ్యవసాయోత్పత్తిలో భారత్‌ వెనకబాటు
అమెరికా తరువాత భారతదేశంలో అత్యధికంగా సాగు చేయగల భూమి ఉంది. కాని దిగుబడిలో మాత్రం భారతదేశం అమెరికా కంటే చాలా వెనకబడి ఉంది.సాంకేతిక పరిజ్ఞా నం వాడకం తక్కువగా ఉండటం,వాతావరణ పరిస్థితులపై అవగాహన కల్పించే పరిజ్జానం రైతులకు అందుబాటులో లేకపోవడం ఒక కారణ మైతే, ప్రభుత్వం అందించే మౌలిక సదుపాయాలు క్రమంగా తగ్గుతుండటం మరో కారణం. అయితే వ్యవసాయంలో ప్రభుత్వం ఎక్కువ భూమికను పోషించడం సరికాదని నిపుణులు అంటుండగా, ఉత్తర భారతదేశ రైతులు మాత్రం సర్కారుకు దూరమయ్యేందుకు సిద్ధంగా లేరు.
ఆహార భద్రతలో అదనపు భారం
ప్రజలకు ఆహార భద్రత కల్పించడం ప్రభుత్వ విధి. పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టం(పీడీఎస్‌) ద్వారా కరువుల, అంటువ్యాధుల సమయంలో ఉచితంగా ధాన్యం అందిస్తారు. కానీ ఈ పథకం పేరుతో సేకరిస్తున్న ధాన్యం అవసరమైన దానికన్నా ఎక్కువగా ఉంది.ఆహార భద్రత పేరుతో ఎక్కువ గా ధాన్యాన్ని కొనడం రాజకీయ అనివార్యతగా మారింది.‘‘ప్రభుత్వం బియ్యం,గోధుమల కోసం చాలా డబ్బు ఖర్చు చేసింది.దానికి బదులు వల్ల ఆరోగ్యం,మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేయడం మంచిది’’అని ముంబయికి చెందిన ఆర్థిక నిపుణుడు వివేక్‌ కౌల్‌ అన్నారు.
రైతులు ఏం డిమాండ్‌ చేస్తున్నారు?
కనీస మద్దతు ధరను (ఎంఎస్‌పీ) చట్టంలో చేర్చాలని,ప్రభుత్వం మండీల (మార్కె ట్లు) నుంచి కొనుగోళ్లను కొనసాగించాలని ప్రస్తుత చర్చల్లో రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే కొత్త వ్యవసాయ చట్టాలు ప్రస్తుత అవసరమని, దానివల్ల రైతులే ప్రయోజనం పొందుతారని మోదీ ప్రభుత్వం వాదిస్తోంది. ప్రస్తుత ఆందోళ నల కారణంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగు తోంది.అయితే దీనిని వాస్తవిక దృష్టితో చూడాల్సి న అవసరముంది.
వ్యవసాయంలో పెను మార్పులు
గత రెండు దశాబ్దాలలో వ్యవసాయ రంగంలో చాలా మార్పులు జరిగాయి. అయితే ఈమార్పులు ప్రభుత్వంకన్నా ప్రైవేటుశక్తుల వల్లనే ఎక్కువగా సాధ్యమయ్యాయి.టెక్నాలజీ,కొత్త విత్తనా లు,నాణ్యమైన ఎరువుల్లాంటి అంశాలు వ్యవసా యాభివృద్ధికి కారణం.ఇవే మార్పులు వ్యవసాయ రంగంలోని ప్రైవేట్‌ సంస్థలకు చోటు కల్పించా యి.కానీఏ వేగంతో మార్పులు జరుగుతున్నాయో, అందుకు అనుగుణంగా ప్రభుత్వాలు చట్టాలలో కూడా మార్పులు చేయాలన్న డిమాండ్‌ వినిపి స్తోంది.కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ కాలంలో ఈకొత్త చట్టంపై చర్చ జరిగింది. కానీ అది అమలు కాలేదు.2019 ఎన్నికల మ్యాని ఫెస్టోలో కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకు వస్తామని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది.ప్రైవేటు కంపెనీలు వ్యవసాయ రంగంలోకి రాకుండా నిరోధించలేనప్పుడు కొన్ని చట్టాలు, నిబంధనలు కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇవి ప్రైవేట్‌ కంపెనీలు తమను దోచుకోకుండా తమ ఆదాయా న్ని పెంచే విధంగా ఉండాలని రైతులు కోరుతు న్నారు. అయితే మోదీ ప్రభుత్వం ఈ మూడు చట్టాలను వాస్తవ పరిస్థితులకు అనుగుణంగానే తెచ్చామని చెబుతున్నా, తమను పరిగణనలోకి తీసుకోకుండా,హడావుడిగా ఆమోదించారని రైతులు ఆరోపిస్తున్నారు.వ్యవసాయ రంగంలో ప్రైవేటు కంపెనీలు ఇప్పటికే ఉన్నాయని, అయితే అవి రైతులను దోచుకునేందుకు అవకాశాలు పెరిగాయని, రైతుకు రక్షణ లేదని కేరళ మాజీ శాసన సభ్యుడు, రైతు ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న కృష్ణ ప్రసాద్‌ అంటున్నారు.
ప్రభుత్వం-రైతులు ఎందుకు పట్టుదలగా ఉన్నారు?
‘‘రైతులకు మరిన్ని ఆప్షన్లు ఇస్తుంటే మమ్మల్ని రైతు అనుకూలురు అంటారా లేక వ్యతి రేకులు అంటారా?కొత్తవ్యవసాయ చట్టంతో రైతు లు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ము కునే అవకాశం కల్పించాం’’అని బీజేపీ తన ట్వీట్‌ లో పేర్కొంది.కానీ ఈచట్టంపై ప్రత్యేక పార్ల మెంటు సమావేశాలు నిర్వహించి మరీ దీన్ని ఉపసంహరించుకోవాలని దర్శన్‌పాల్‌ లాంటి రైతు ఉద్యమ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. మరి ఇందులో ఎవరు గెలుస్తారు? ప్రపంచ జనాభాలో మన దేశ జనాభా 17 శాతం. ప్రపంచ భూమిలో కేవలం2.4శాతం మాత్రమే వున్న దేశం మనది. దేశ జనాభాలో 48.6శాతం మంది ప్రజలు వ్యవసాయం మీదఆధారపడి గ్రామాల్లో జీవిస్తు న్నారు.ఈ లెక్కలు మన భూమికి, వ్యవసాయానికి ఉన్న ప్రాధాన్యతలను చెబుతున్నాయి.దేశ జనాభా కు అవసరమైన ఆహారం,వారి కొనుగోలు శక్తి పెరిగి తద్వారా పారిశ్రామికాభివృద్ధి జరగాలంటే ప్రభుత్వాలు వ్యవ సాయానికి అత్యంత ప్రాధా న్యత ఇవ్వాలి.అనేక విషాదాల అనుభవాల నుండి వ్యవసాయఉత్పత్తులను పెంచుకున్నాము. 1950 -1990 మధ్య దేశ జనాభా పెరుగుదల 2.5 శాతం ఉంటే వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదల 3.4శాతానికి చేరింది.1980-90 మధ్య వ్యవ సాయ ఉత్పత్తులు సగటు నాలుగు శాతం పెరుగుదల సాధించాయి.1991నుండి ప్రారం భమైన ప్రపం చీకరణ విధానాలు వ్యవసా యాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి.1990 చివరినాటికి వ్యవ సాయం తిరోగమనంలోకి దిగజారిదాని ఉత్పత్తు లు మైనస్‌ 2శాతానికి పడిపోయాయి. దీని వల్ల ఆహారధాన్యాలను విదేశాల నుండి దిగుమతి చేసుకోవలసిన పూర్వ పరిస్థితి వచ్చింది. గత పదేళ్ళ నరేంద్ర మోడీ పాలన వ్యవసాయాన్ని పూర్తిస్థాయి సంక్షోభంలోకి నెట్టి కార్పొరేట్‌ కంపె నీలకు అప్పగించడానికి సిద్ధమయ్యింది. అందుకే రైతులు పోరాడుతున్నారు. దేశంలో 14.58 కోట్ల రైతు కుటుం బాల కింద 38.82 కోట్ల ఎకరాల సాగు భూమివుంది.ఇందులో ఐదుఎకరాల లోపు ఉన్న రైతు కుటుంబాలు12.57కోట్లు కాగా, వీరివద్ద వున్న భూమి మాత్రం18.38 కోట్ల ఎక రాలు మాత్రమే. వీరిలో అధికులు వెనుకబడిన కులాలకు చెందిన పేదలు.సెంటు సాగు భూమి లేని గ్రామీ ణ కుటుంబాలు ఏడు కోట్లకు పైగా ఉన్నాయి. వీరిలో అత్యధికులు దళితులు, మైనారి టీలు,గిరిజనులు.వ్యవసాయ రంగం మీద ఆధార పడిన కోట్లకుటుంబాలు నిత్యం అప్పుల్లో ఉండ డానికి, పేదరికంలో మగ్గుతుండడానికి ప్రధాన కారణం తగినంత సాగు భూమి నిజమైన సాగు దార్ల వద్ద లేకపోవడం.శాస్త్ర, సాంకేతికత పెరిగే కొద్ది గ్రామీణ వృత్తులు అంతరించి వాటిపై ఆధా రపడిన వారు వ్యవసాయానికి అదనపు భారమ య్యారు. ప్రభుత్వాల నుండి రైతులకు అందాల్సిన రుణ పరపతి,ఎరువులు,విత్తనాల సబ్సిడీ తగ్గిపో వడం,పంటలకు గిట్టుబాటు ధరలు అమలు కాక పోవడంతో వ్యవసాయం తీవ్రసంక్షోభంలోకి వెళ్ళి గ్రామీణ జీవితం ఛిద్రమయ్యింది.
వ్యవసాయాన్ని ముంచే మోడీ విధానాలు
వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ కంపె నీలకు అప్పగించడానికి మోడీ ప్రభుత్వం 2020 జూన్‌ 5న ఆర్డినెన్స్‌ ద్వారా మూడు నల్ల వ్యవ సాయ చట్టాలు తెచ్చింది. ఈ ఆర్డినెన్స్‌ను చట్టాలు గా మార్చుకునేందుకు అదే సంవత్సరం సెప్టెంబర్‌ 17-19తేదీల మధ్య లోక్‌సభ, రాజ్యసభలో ఆమోదం పొందారు.వ్యవసాయ ఉత్పత్తుల వ్యా పార,వాణిజ్య చట్టం,రైతు ధరల హామీ,వ్యవ సాయ సేవల ఒప్పందచట్టం,నిత్యావసర సరుకుల (సవరణ) చట్టం వల్ల వ్యవసాయంపై తీవ్రమైన దుష్ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా పంటల ఉత్పత్తుల ధరలను ప్రభుత్వాలు కాకుండా పెద్ద కంపెనీలు నిర్ణయిస్తాయి. దేశ ప్రజల అవసరాల కోసం పంటల సాగు కాకుండా, ఈ కంపెనీలకు ఏది లాభమో దానినే ఉత్పత్తి చేయించగలరు. ఇప్పటి వరకు పేదలకు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అందుతున్న కొద్దిపాటి ఆహారధాన్యాలు కూడా దూరమవుతాయి. ప్రభుత్వాలు ఎరువులు, విత్తనాల మీద ఇస్తున్న సబ్సిడీలను పూర్తిగా తొలగిస్తాయి.వ్యవసాయ రంగంలో నూతన పరి శోధనల నుండి ప్రభుత్వం తప్పుకుంటుంది. జాతీయ బ్యాంకుల నుండి రైతులకు అందుతున్న అరకొర రుణ సదుపాయం కూడా అందక పం టల పెట్టుబడికి, రైతు కుటుంబ అవసరాలకు ప్రైవేట్‌వడ్డీ వ్యాపారుల మీద ఆధారపడాల్సి వస్తుంది. వీటన్నింటివల్ల పేద,దిగువ మధ్య తర గతి రైతులు తమకున్న కొద్దిపాటి భూమిని కోల్పో యి భూమి లేని నిరుపేదల్లో చేరిపోతారు. ముఖ్యం గా ఎం.ఎస్‌.స్వామినాథన్‌ సిఫారస్సు చేసిన మొత్తం ఉత్పత్తి ఖర్చులకు 50శాతం కలిపి కనీస మద్దతు ధర నిర్ణయించాలన్న కీలక అంశం అమలుకు నోచుకునే అవకాశమే లేదు.
కనీస మద్దతు ధర ఎందుకు ?
అన్ని పంటలకు కనీస మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించి అమలు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే 23పంటలకు మాత్రమే ఈ మద్దతు ధర ప్రకటించబడుతుంది. అందులో 20 పంటలు ఆహారానికి సంబంధిం చినవి. ఇందులో వరి,గోధుమ,జొన్నలాంటి ఏడు ముతక ధాన్యాలు,ఆరు పప్పుధాన్యాలు,ఏడు నూనె గింజల పంటలు ఉన్నాయి. వాస్తవంగా వరి, గోధుమ పంటలకు మాత్రమే కొద్దిమేర ఈ కనీస మద్దతు ధర అమలవుతుంది.ఈ రెండు పంటల సేకరణలో65శాతం పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల నుండే జరుగుతుంది.ఈ రాష్ట్రాల్లో వ్యవసాయం వృద్ధి చెందడానికి వరి,గోధుమ పంటలకు మద్ద తు ధర లభించడం ఒకకారణం. పంజాబ్‌లో వరి పంట అమ్మకాలు 78శాతం,హర్యానాలో 90శాతంచిన్న,సన్నకారు రైతుల నుండి జరుగు తున్నాయి.అందుకే మోడీ నల్ల చట్టాల ప్రభావం దేశంలో ఇతర రాష్ట్రాల కంటే ఇక్కడే ఎక్కువగా ఉంటుంది.అందుకే ఈ రెండు రాష్ట్రాల రైతులు కేంద్రం పెట్టే అన్ని నిర్బంధాలను ఎదుర్కొని ఉద్యమిస్తున్నారు.2000 నుండి 2014వరకు దేశవ్యాప్తంగా 45 శాతం మంది మధ్య తరగతి రైతులు వ్యవసాయాన్ని వదిలి పెట్టినట్లు వ్యవ సాయ శాస్త్రవేత్తల అధ్యయనాలు తెలుపుతు న్నాయి.ఈచట్టాలు అమలైతే దేశంలో, మన లాంటి రాష్ట్రాల్లో రైతు వ్యవసాయం కనుమ రుగవుతుంది. దీనివల్ల పట్టణాల్లో పనులకు పోటీ పెరిగి వేతనాలు తగ్గడం, ఆకలి చావులు, ఆహార ధాన్యాల కొరత తీవ్రమవుతాయి. అందుకే ఢల్లీిలో జరుగుతున్న రైతుల ఉద్యమం దేశ ప్రజల బతుకు కోసం సాగుతున్న ఉద్యమం.
నీరో చక్రవర్తిలా మోడీ
చరిత్రలో రోమ్‌ను పాలించిన నీరో చక్రవర్తి అనగానే ‘రోమ్‌నగరం తగలబడి పోతుంటే ఫిడేల్‌ వాయించిన వ్యక్తిగా’ గుర్తుకు వస్తాడు. అది చరిత్ర. వర్తమానంలో ఢల్లీి చుట్టూ వేలాది రైతులు రెండు వారాలుగా ఆందోళన చేస్తుంటే ద్వారకలో డైవింగ్‌ చేసిన, తిరువ నంత పురంలో గగన్‌యాన్‌ అంతరిక్ష మిషన్‌ ముందు మోకరిల్లిన మన ప్రధానిని చూసి తరించే భాగ్యం దేశ ప్రజలకు పట్టుకుంది. గత 45 సంవత్సరా ల్లో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగిపో యిందని ‘స్టేట్‌ ఆఫ్‌ వర్కింగ్‌ ఇండియా-2023’ నివేదిక ప్రకటించిన,గత 11సంవత్సరాల్లో కుటుం బ ఖర్చులు ఎన్నడూ లేనంతగా భారీగా పెరిగి పోయాయని,అందుకు అనుగుణంగా ప్రజల ఆదా యం పెరగలేదని హెచ్‌సిఇఎస్‌ తాజా నివేదిక బట్టబయలు చేసినప్పటికీ ఏ మాత్రం చలించక, వేషాలు మార్చి మార్చి దేశ ప్రజలకు దర్శన భాగ్యం కల్గించగల నేర్పరి మన ప్రధాని. కొద్ది మంది దేశీయ, విదేశీ సంపన్నుల కోసం కోట్ల మంది సామాన్యుల జీవితాలతో చెలగాటమాడు తున్న మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించకుండా వ్యవ సాయాన్ని, దేశాన్ని కాపాడుకోలేం.-వి.రాంభూపాల్‌

మరో ప్రపంచం సాధ్యమే

నేపాల్‌ నుండి మరియు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30,000 మంది పాల్గొన్నారు. ఫిబ్రవరి 15-19 వరకు ఖాట్మండులో వరల్డ్‌ సోషల్‌ ఫోరమ్‌ (ఔూఖీ) కోసం హాజరవుతారు, ఇది ఇప్పటివరకు ఇక్కడ నిర్వహించ బడిన అతిపెద్ద సమావేశం.
దావోస్‌లోని వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌కు ప్రత్యా మ్నాయంగా 2001లో బ్రెజిల్‌లోని పోర్టో అలెగ్రేలో వార్షిక %ఔూఖీ% యొక్క మొదటి సమావేశం జరిగింది మరియు దాని నినాదం ‘మరో ప్రపంచం సాధ్యమే’ – ప్రపంచ వాతావరణ విచ్ఛిన్నం కారణంగా ఔచిత్యాన్ని జోడిరచిన థీమ్‌, సంఘర్షణలు మరియు నిరంకుశత్వం యొక్క వ్యాప్తి.స్థానిక ఆర్గనైజింగ్‌ కమిటీలో న్యాయం మరియు పేదరికంపై పనిచేస్తున్న నేపాలీ సమూహాలు ఉన్నాయి మరియు ఖాట్మండును వేదికగా ఎంచుకోవడం నేపాల్‌ యొక్క బహిరంగతను మరియు ప్రపంచానికి సమావేశ స్థలంగా దాని ప్రాముఖ్యతను రుజువు చేస్తుందని చెప్పారు.
ఔూఖీ యొక్క ఇంటర్నేషనల్‌ కౌన్సిల్‌ సెక్రటేరియట్‌ ఒక ప్రకటనలో ఇలా చెప్పింది: ‘ప్రపంచం రాజకీయ, ఆర్థిక మరియు పర్యావరణ సంక్షోభాల యొక్క సవాలు కాలం వైపు కదులుతోంది … ప్రపంచవాదం, సామూహిక పెట్టుబడిదారీ విధానం మరియు నయా ఉదారవాదం యొక్క శక్తులు పెరుగుతున్న అసమానతలను సృష్టిం చాయి. వాతావరణ మార్పు, ప్రపంచ ఆహార అభద్రత, మెజారిటీ హింస, కోవిడ్‌-19 మరియు భౌగోళిక రాజకీయ తిరుగుబాటుతో పాటు, మాన వాళిలో ఎక్కువ మంది బాధల్లో కూరుకు పోయారు.దాని ప్లీనరీతో పాటు, ఈ సంవత్సరం హైబ్రిడ్‌ ఔూఖీ శాంతి మరియు వాతావరణం, ప్రజాస్వామ్యం మరియు మానవ హక్కులు, ఫెమినిజం మరియు వైవిధ్యం మరియు పాలస్తీనాతో సంఫీుభావంతో వ్యవహరించే ఐదు ప్యానెల్‌లకు వేదికగా నిలిచాయి.
నేపాల్‌ సగర్వంగా సామ్యవాదానికి రాజ్యాంగ నిబద్ధత తో ప్రజాస్వామ్య దేశంగా నిలుస్తుంది … హామీ ఇవ్వ బడిన ప్రజాస్వామ్య ప్రదేశాలు మరియు మానవ హక్కులు, బలమైన ప్రజా ఉద్యమం ఉనికి ద్వారా సాధిం చిన మైలురాళ్లు.
73 దేశాల నుండి దాదాపు 900 సంస్థలు ఖాట్మం డులో పాల్గోన్నారు. ఈ ప్యానెల్‌లలో భారత్‌ దేశం నుంచి సమత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రవి రెబ్బాగ్రడ,పలు సామాజిక ఉద్యమ సంస్థలు, ట్రేడ్‌ యూనియన్‌లు, రైతులు, మహిళలు మరియు స్వదేశీ సంస్థల నుండి శాంతి,న్యాయ ఉద్యమానేతలు హజరయ్యారు.
వరల్డ్‌ సోషల్‌ ఫోరమ్‌ (డబ్ల్యూఎస్‌ఎఫ్‌` 2024) 16వ సదస్సు ఫిబ్రవరి 15 నుంచి 19 వరకు నేపాల్‌ దేశం ఖాట్మండులో ప్రారంభమైంది.‘‘మరో ప్రపంచం సాధ్యమే’’ బ్యానర్‌ క్రింద ఐదు రోజుల డబ్ల్యూఎస్‌ఎఫ్‌ -2024 పౌర సమాజ సంస్థలు,సామాజిక ఉద్య మాలు,సమత వంటి స్వచ్చంధ సంస్థల ప్రతి నిధులు, ట్రేడ్‌ యూనియన్లు,నయాఉదార వాద ప్రపంచీకరణను వ్యతిరేకించే వ్యక్తుల మధ్య సమాంతర మార్పిడిని ప్రారంభించడం లక్ష్యంగా పెట్టుకుంది.తర్వాత సంఫీుభావ యాత్ర నిర్వహించారు.భృకుటిమండపంలోని ప్రధాన వేదిక నుంచి ప్రారంభమైన సంఫీు భావ యాత్ర భద్రకాళి,కొత్తరోడ్డు గేటు,రత్నా పార్కు మీదుగా తిరిగి భృకుటిమండపం వరకు సాగడంతో కార్యక్రమం ప్రారంభ మైంది.న్యాయం,శాంతి,సమానత్వం,వివక్షకు ముగింపు పలకాలంటూ నినాదాలు చేస్తూ బ్యానర్లు,ప్లకార్డులు పట్టుకుని పాదయాత్రలో పాల్గొన్నారు. ప్రారంభ వేడుక తర్వాత వివిధ థీమ్‌లు,విషయాలపై అంతర్జాతీయ వక్తలు పాల్గొనే చర్చా కార్యక్రమాలు జరిగాయి.
డబ్ల్యూఎస్‌ఎప్‌ సెక్రటరీ జనరల్‌ అయిన ఆంటోనియో గుటెర్రెస్‌ ఔూఖీ 2024కి తన సంఫీుభావ సందేశంలో తన మద్దతును తెలియజేశారు. డబ్ల్యూఎస్‌ఎప్‌ 16వ ఎడిషన్‌ థీమ్‌ ‘మరో ప్రపంచం సాధ్యమే’. ప్రతి సంవ త్సరం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లోజరిగే వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌కు ప్రత్యామ్నాయంగా డబ్ల్యూఎస్‌ఎప్‌ 2001లో ప్రారంభమైంది.
ప్రపంచ సామాజిక వేదిక
వరల్డ్‌ సోషల్‌ ఫోరమ్‌ 2024 ‘‘ఇప్పుడు మరో ప్రపంచం.’’ అనే నినాదంతో ఖాట్మండు సరి హద్దుల్లో శాంతి, న్యాయం కోసం పిలుపు నిచ్చింది.సదస్సులో 72 దేశాల నుండి సామా జిక న్యాయవాదులు సమావేశమయ్యారు. యుద్ధం లేని ప్రపంచాన్ని స్థాపించాలని ఒక అభ్యర్ధనను జారీ చేశారు.పాలస్తీనా విముక్తి, బానిసత్వం,కులతత్వం,ఛాందసవాదం నిర్మూలనకోసం ఒత్తిడి చేస్తూ నేపాల్‌ రాజధాని వీధుల్లో ఊరేగించిన 20,000 మంది పాల్గొనే స్ఫూర్తితో కూడిన ర్యాలీతో ఫిబ్రవరి 15న ‘మరో ప్రపంచం సాధ్యమే’ అనే నినాదంతో ఈ కార్యక్రమం ప్రారం భమైంది. మానవ అక్రమ రవాణా,మహిళ లు, దళితులు మరియు అన్ని అట్టడుగు వర్గాల సాధికారత. మొత్తం 252 సెమినార్లు, వర్క్‌షాప్‌లు,సంబంధిత సెషన్‌లు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విభిన్న మానవ హక్కులు మరియు సామాజిక న్యాయవాద సంస్థలచే నిర్వహించబడ్డాయి,వాతావరణ న్యాయం, వివక్ష, సురక్షిత వలసలు మరియు అక్రమ రవాణా విరమణ వంటి అంశాల శ్రేణిని పరిష్కరించడం జరిగింది.సుమారు 9,000 మంది వ్యక్తులు చిన్న సమూహ చర్చలలో జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో సమకాలీన సామాజిక-రాజకీయ దృశ్యాలను విడదీయడం,ప్రతిబింబించడం, ఐక్యత,సంఫీుభావం మరియు ప్రజాస్వామ్య విలువల పునరుజ్జీవనం కోసం వాదించే ప్రకటనలను వ్యక్తీకరించారు.అలాగే సెమినార్‌లు,వర్క్‌షాప్‌లను నిర్వహించే కాథలిక్‌లు,వరల్డ్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ చర్చ్‌ల సభ్యు లతో సహా క్రిస్టియన్‌ డినామినేషన్‌ల నుండి గణనీయమైన హాజరుతో అనేక సామాజిక క్రైస్తవ సంస్థల నుండి భారతీయ ప్రతినిధులు గణనీయమైన ఉనికిని చాటుకున్నారు. వీటిలో, భారతదేశానికి చెందిన ఫోరమ్‌ ఆఫ్‌ జస్టిస్‌ అండ్‌ పీస్‌కు చెందిన 60మంది సభ్యులు, వారి 70మంది సహచరులతో కలిసి, పర్యా వరణ పరిరక్షణ,సమ్మిళిత సమాజాన్ని ప్రోత్సహించడానికి మైనారిటీ హక్కుల పరిరక్షణ,సురక్షితమైన,గౌరవప్రదమైన వలసలను నిర్ధారించడం వంటి అంశాలపై దృష్టి సారించే సెషన్‌లకు నాయకత్వం వహిం చారు.పర్యావరణ సారథ్యంపై చర్చల సమయంలో, హాజరైనవారు సహజ ఆవా సాలు,పర్యావరణ వ్యవస్థల క్షీణత,నీటి కాలుష్యం,సహజ వనరుల నిలకడలేని దోపి డీపై చర్చించారు,జీవజాలాన్ని నిలబెట్టడానికి శిలాజ ఇంధనాల నుండి స్వచ్ఛమైన శక్తి వైపుకు మారాలని వాదించారు.దక్షిణాసియా ప్రభుత్వాలు,ముఖ్యంగా భారతదేశం మరియు నేపాల్‌,శిలాజ ఇంధనాలను దశలవారీగా తొలగించడం మరియు పునరుత్పాదక ఇంధన వనరులకు మారడం కోసం నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చాయి. అద నంగా,అభివృద్ధి చెందిన దేశాలు ఈ పరివర్తన సమయంలో సంభవించే ఆర్థిక నష్టాలకు దక్షిణాసియా దేశాలను భర్తీ చేయాలని కోరా రు.అందరికీ ముఖ్యంగా ఈ ప్రాంతంలోని సమాజంలోని అత్యంత పేద వర్గాలకు స్థిరమైన జీవనోపాధిని కల్పించాలని కోరింది. ఫోరమ్‌ సభ్యులు మరియు వారి సహకారులు భారతదేశం మరియు పాకిస్తాన్‌లలో మైనా రిటీలు, ముఖ్యంగా క్రైస్తవులు ఎదుర్కొంటున్న వేధింపుల ఖాతాలను శ్రద్ధగా విన్నారు. ప్రఖ్యాత పాకిస్థానీ మానవ హక్కుల కార్యకర్త సయిదా డీప్‌ పాకిస్థాన్‌లోని క్రైస్తవులు, హిందువులు, అహ్మదీయాలు,షియాలపై జరిగిన వివిధ అకృత్యాలను వివరించగా, భారతదేశానికి చెందిన జెస్యూట్‌ ఫాదర్‌ బోస్కో జేవియర్‌ ప్రపంచవ్యాప్తంగా పూర్వీకు లు,వృత్తి ఆధారంగా వ్యవ స్థాగత వివక్షపై వెలుగునిచ్చారు.మైనారిటీ వర్గాలను మరియు సమాజంలోని అంచులలో ఉన్నవారిని లక్ష్యం గా చేసుకొని,మత,సాంస్కృ తిక,జాతి,భాషా వైవిధ్యానికి ప్రతిజ్ఞ చేస్తూ విద్వేషపూరిత వాతావరణం,బహిష్కరణ,హింసాత్మక వాతా వరణాన్ని అసెంబ్లీ ఖండిరచింది.దక్షిణాసియా ప్రభుత్వాలు,ముఖ్యంగా భారతదేశం,పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ మరియు శ్రీలంక, మైనారిటీలు, బలహీన వర్గాలపై వివక్ష,హింసను ఆపాలని, బదులుగా,వారి విలక్షణమైన సాంస్కృతిక, మతపరమైన వారసత్వాన్ని జరుపుకోవాలని ఒక ఉమ్మడి ప్రకటనలో ఫోరమ్‌ డిమాండ్‌ చేసింది.సురక్షితమైన గౌరవప్రదమైన వలసలు అనే అంశంపై, ఫోరమ్‌ సభ్యులు ఆర్థిక ఆకాం క్షలు,సంఘర్షణల కారణంగా దక్షిణాసియాలో విస్తృతమైన అంతర్గత,అంతర్జాతీయ వలసల వాస్తవికతను ధృవీకరించారు, వలస కార్మికు లకు బలమైన చట్టపరమైన రక్షణలు,వివక్ష మరియు అగౌరవం నుండి వారిని రక్షించే చర్యల అవసరాన్ని నొక్కి చెప్పారు. మాంట్‌ ఫోర్ట్‌ బ్రదర్‌ వర్గీస్‌ తేకనాథ్‌, ఫోరమ్‌ పార్టిసి పెంట్‌,తొలగింపులపై మూడు రోజుల ఇంటర్నేషనల్‌ ట్రిబ్యునల్‌ను ఆర్కెస్ట్రేట్‌ చేసారు, ఇందులో బలవంతపు స్థానభ్రంశం గురించి సాక్ష్యాలు సమర్పించబడ్డాయి. వివిధ ఖండా లకు చెందిన గౌరవనీయులైన మానవ హక్కు ల కార్యకర్తల బృందం అన్ని నిర్వాసితులైన వర్గాల పునరావాసానికి అనుకూలంగా తీర్పుని చ్చింది.ఫోరమ్‌ నేషనల్‌ కన్వీనర్‌ ప్రెజెంటేషన్‌ సిస్టర్‌ డోరతీ ఫెర్నాండెజ్‌, కాంగ్రెగేషన్‌ ఆఫ్‌ జీసస్‌ సిస్టర్‌ ఆన్సి,ఫాదర్‌ జేవియర్‌ మరియు ఇండియన్‌ మిషనరీస్‌ ఆఫ్‌ సొసైటీ నుండి ఫాదర్‌ ఆనంద్‌లతో కలిసి ఐదు రోజుల ఈవెంట్‌లో వివిధ కార్యక్ర మాలను నిర్వహిం చారు.కార్యక్రమంలో విభిన్న మైన సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ఉన్నా యి, భృకుటి మండ పం,ఈవెంట్‌ వేదిక, నేపాలీ శ్రావ్యమైన, నృత్యాలతో,అలాగే అనేక ఇతర ఆసియా, ఆఫ్రికన్‌,దక్షిణ అమెరికా,యూరోపియన్‌ భాషలలో సంగీత ప్రదర్శనలు.ప్రతి రోజు సాయంత్రం,వారణాసి లోని విశ్వజ్యోతి కమ్యూనికేషన్స్‌,థియేట్రికల్‌ విభాగం ప్రేరణ కళా మంచ్‌, రైతులు మరియు మైనారిటీలకు సంబంధించిన సమస్యలను ప్రస్తావిస్తూ వృత్తిపరమైన నాటకాలను ప్రదర్శించింది, పర్యావరణ ఆందోళనలు,వివక్ష ,మత కలహా లను వివరించే వీధి నాటకాలతో ప్రేక్షకులను ఆకర్షించింది.-(థింసా డెస్క్‌)

దేవుడికి ప్రాణ ప్రతిష్ట దేశానికి అప్రతిష్ట

‘సర్వం సృష్టించిన దేవుడికి ఎవడో ప్రాణ ప్రతిష్ట చేయడ మేంటో? పిచ్చిగానీ-సర్వశక్తి సంపన్నుడైన దేవుడు తనకు తానే అందులో ప్రవేశిం చాలి కదా? ఒక తుచ్ఛ మానవ మాత్రుడు ప్రాణప్రతిష్ట చేయడమేమిటీ?’-అని సామా న్యులు ఆలోచనలో పడుతుంటారు. ’’మతతత్వాన్ని మట్టుబెట్టే పని ముస్లింలు,సిక్కులు, హిందువులు, క్రైస్తవుల వంటి వారందరిదీ- ఒకరకంగా భారతీయు లందరిదీ. దీని కోసం అన్ని మతాల వారు వారి మత తత్వ దృక్పధాన్ని అధి గమించి, నిజమైన సమైక్య జాతీయవాద మనస్త త్వాన్ని అలవరుచు కోవాలి!’’-అని పిలుపునిచ్చిన సుభాస్‌చంద్రబోస్‌ మాటలు ఈ దేశప్రజల మెదళ్లలో తాజాగా కదలాడు తూనే ఉన్నాయి.
పూల్వామా,బాలాకోట్‌లు గత ఎన్నిక లకు ఉప యోగపడ్డట్టు, అయోధ్య రామాలయ ప్రారంభో త్సవం రాబోయే ఎన్నికలకు ఉపయోగ పడాలన్నది అధికారంలో ఉన్న బీజేపీ పాలకుల ఉద్దేశం.మత రాజకీయాలు చేస్తున్న నేటి కేంద్ర ప్రభుత్వం అధి కారికంగా అయోధ్యరాముడికి ప్రాణప్రతిష్ట చేస్తోంది.ఎప్పుడూ లేనివిధంగా ఒక సెక్యులర్‌ దేశ ప్రధాని, రాజ్యాంగ స్ఫూర్తికి విరు ద్ధంగా రాముడికి ప్రాణప్రతిష్ట చేయడాన్ని ప్రతిపక్ష పార్టీల కూటమి ‘ఇండియా’ నిరసిస్తోంది. దేశం లోని అన్ని పీఠాల శంక రాచార్యులంతా తమకు పంపిన ఆహ్వానాల్ని తిప్పికొట్టారు.రాముడి స్థాయి తగ్గించి మోడీ తన స్థాయి పెంచుకుం టున్నాడని దూషించారు. అసలు అతనికి ఆ అర్హతే లేదని ఆగ్రహించారు. నిర్మాణదశలో ఉన్న ఆలయంలో రాముడికి ప్రాణప్రతిష్ట చేయడ మేమిటని దేశ ప్రజలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. నాలుగు పీఠాల శంకరాచార్యులు హిందూ విరోధులా? ఆహ్వానం తిరస్క రించినా అగ్రనాయకులెవరూ నోరు మెదపడం లేదెందుకూ?-అమిత్‌ షా ఆధ్వర్యంలోబీజేపీ కార్యకర్తలు ఇల్లిల్లు తిరిగి ఆయోధ్యరామాలయానికి రావాలని ఆహ్వానాలు, అక్షింతలు పంచి పెడుతున్నారు.ఆఆహ్వానం మూడు నెలల్లో ఎప్పుడైనా ఉపయోగించుకో వచ్చని అందులో ఒకసూచన కూడా ఉంది. ప్రాణ ప్రతిష్టకు ముహూర్తం ఏపండితుడో నిర్ణయించింది కాదనీ,రాబోయే ఎలక్షన్లను దృష్టి లో ఉంచుకుని రాజకీయ నాయకులు నిర్ణ యిం చిందేనని-పలువురు ఆధ్యాత్మికవేత్తలు దుయ్య బట్టారు.ఆలయాలకు రమ్మని ఎవరూ ఎవరినీ ఆహ్వానించరు. అది వ్యక్తిగత విషయం ఎవరికి వారు నిర్ణయించు కోవాల్సింది. దేవు డికీ, భక్తు లకు మధ్య కేంద్ర ప్రభుత్వం బ్రోకర్‌పని నెత్తిన వేసు కుందా? అయినా ఒక మతానికి సంబం ధించి ఒక రాజకీయ పార్టీ తనకు తానే అన్ని హక్కులూ,అధికారాలు బలవంతంగా లాగేసుకుం టుందా? ఈ గుత్తాధిపత్యం చాలా అసహ్యంగా, ఎబ్బెట్టుగా కూడా ఉంది. అధికార పార్టీకి మీడి యా సంస్థలు తమ హద్దులు దాటి మద్దతిస్తు న్నాయి. ఉత్తర భారతదేశంలో హిందీ పత్రికలు టెలివిజన్‌ ఛానళ్లు విపరీత ధోరణిలో పని చేస్తు న్నాయి. తమ వ్యాన్‌ల మీద ‘మందిర్‌ వహీ బనాయా హై’-అని పెద్ద అక్షరాలతో రాసుకు న్నాయి.కోర్టు ఆర్డరు ఉన్నా లెక్క చేయకుండా మందిరం అక్కడే కట్టారు-అని ధైర్యంగా ప్రచారం చేస్తున్నాయి. మోడీ బొమ్మతో ‘వన్‌ నేషన్‌ వన్‌ లీడర్‌’-అని మరో హిందీ దిన పత్రిక పోస్టర్లు వేసింది. ‘రామ్‌ ఆయెంగే’ అని ఒక హిందీ ఛానెల్‌ ప్రకటిస్తే, ‘శ్రీ రామోత్సవ్‌- పేరుతో ఒక మీడియా సంస్థ వేడుక జరిపింది. దానికి ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి హాజరయ్యాడు. ఈ రకంగా దేశంలో మీడియా ప్రజాస్వామ్య విలువల్ని కాల్చి బుగ్గిచేస్తోంది.ఒకరకంగా దేశంలో పత్రికా రంగపు అధర్మ కాలం నడుస్తోంది. ఇవన్నీ కాక, ఒకప్పుడు బాబ్రీ మసీదు కూలగొట్టిన కరసేవ కుల (నేరగాళ్ల)ఇళ్లు వెతికి వెతికి వారికి పూలదండలు వేసి బహి రంగ స్థలాలలో సన్మా నిస్తున్నారు. ఈ పని ఇంకెవరు చేయ గలరూ? ఆరెస్సెస్‌-బీజేపీ కార్యకర్తలే!ఇది ఇలాగే కొనసాగితే మనుస్మృతిని భారత రాజ్యాంగంస్థానంలో ప్రతిష్టించరనీ- సనాతన ధర్మాన్ని తిరగతోడరనీ నమ్మకమేమిటీ?దేశంలో కమలం ఒక విషపు ష్పంగా,విద్వేషపుష్పంగా చరిత్రలో నిలబడు తుంది. అనుమానమే లేదు. ఇప్పుడు బీజేపీ వారు వారి పార్టీ ఫుల్‌ఫాం మార్చుకున్నారు.బి-అంటే బాయిస్‌ (22)జె-అంటే జనవరి పి-అంటే ప్రాణ-ప్రతిష్ట-అని! ఇదే రామమందిర ఆహ్వా నాన్ని తిరస్కరించిన శంకరాచార్యులు 1. నిర్మలా నంద సరస్వతి.2.భారతీకృష్ణ.3.అభిముక్తే శ్వరానంద్‌.4.సదా నంద్‌ మహరాజా-నిర్మాణం పూర్తి కాని ఆలయాన్ని ప్రారంభిస్తు న్నారంటే- అది ఎన్నికల స్టంటేనన్నది వీరంతా ముక్తకంఠంతో ఘోషించారు. అయినా ఏ దేవుడు ఎవడికి కలలో వచ్చినా తనకు గుడి కట్టమని దేబరిస్తాడెందుకో? ఓ బడి, ఓ ఆసుపత్రి-లేదా ప్రజలకు ఉపయోగ పడేది మరేదైనా కట్టించమని అడగడెందు కూ అని మనతోటి సగటు మనుషులకు అనుమానాలు వస్తుం టాయి. ఒకరోమన్‌ చక్రవర్తి మార్కస్‌ అరీలి యస్‌ ఆంటోనిసన్‌ ఇలా అన్నాడు. ’’కాంతిని ఏది ప్రసరింపజేయలేదో అదితన చీకటిని తనే సృష్టిం చుకుంటుంది-’’ఇది కేంద్ర పాలకులకు సరి పోయే విధంగా లేదూ? ఉదాహరణకు గోవాలోని బీజేపీ సర్కార్‌ అక్కడి ప్రజలకు గొప్ప చీకటిని ఇలా ప్రసరించింది.-’’మంచి పంటల కోసం ప్రతి రోజూ పొలాల్లో వేద మంత్రాలు చద వండి!’’-అని న్యూఢల్లీిలో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ అనే గొప్ప కేంద్ర ప్రభుత్వ సంస్థ పని చేస్తోంది.ఇంకాదాన్నెందుకు ఉం చారూ? మూసెయ్యాలి కదా?’’ఇరవై ఒకటవ శతాబ్డపు విద్యావిహీనులు ఎవరంటే చదవడం. రాయడం రాని వారు కాదు-అవి వచ్చినా, లాభం లేని మందమతులు-కాలంతో పాటు కొత్త విష యాలు నేర్చుకోని వారు.పనికిరాని పాత విష యాలు వదిలేయని వారు. కేవలం మూఢత్వంలో బిగుసుకు పోయినవారు’’-అన్నాడు అల్విన్‌ టోప్లర్‌. అమెరికా రచయిత. ప్యూచర్‌ షాక్‌, ద ధర్డ్‌ వేవ్‌, పవర్‌ షిఫ్ట్‌ గ్రంథాల రచయిత. టోప్లర్‌ ప్రకారం విద్యా విహీనులకున్న నిర్వచనం మార్చుకోవాల్సి ఉంది.కరోనా వైరస్‌ను పారదోలడానికి చప్పట్లు చరచాలనీ, గంటెలతో కంచాలు మోగించాలని సూచించిన ఇదే ప్రభుత్వ పెద్దలు తాజాగా ఇప్పుడు జనవరి 22న ప్రతి ఇంటా రామ జ్యో తులు వెలిగించాలని దేశ ప్రజలకు సూచించారు. వాళ్ల మూర? త్వాన్ని దేశ ప్రజలందరికీ పంచి పెట్టాలన్నది వారి ప్రయత్నమన్న మాట! ఇందులో కొత్తవి నేర్చుకున్నదీ పాతవి వదిలేసిందీ ఎక్క డుందీ?ఇటీవల ఒకబీజేపీ పార్లమెంట్‌ మెంబర్‌ ఏమన్నారో చూడండి! ’’క్షత్రియులను క్షత్రియులంటే బాధపడరు.బ్రాహ్మణులను బ్రాహ్మ ణులంటే బాధపడరు. వైశ్యుల్ని వైశ్యులంటే కలత చెందరు. కానీ శూద్రుల్ని శూద్రులంటే మాత్రం బాధప డతారు.ఎందుకో తెలుసా? వారు అజ్ఞా నులు. సమాజ వ్యవస్థ కోసం ప్రాచీన హిందూ గ్రంథాల్లో నాలుగు కులాలనే ఏర్పాటు చేశారు’’- ప్రజ్ఞా టాగూర్‌.మనుషులంతా ఒక్కటి అనే విష యం గ్రహించని వారిని మేం మూరు?లు-అని అంటాం. భారతదేశ స్వాతంత్య్రంలో పాల్గొనని వారిని దేశ ద్రోహులంటాం-మరి ఆరె ప్సెస్‌, బీజేపీ వర్గాలెందుకు ఉలిక్కి పడతాయీ? ప్రాచీన హిం దూ గ్రంథాలేమైనా జ్ఞానాన్ని పంచే వైజ్ఞానికి గ్రంథాలా? కాదు గదా? అలా అని మీరనుకుంటే అది మీ ఇష్టం.అందరూ ఒప్పు కోవాలని అనుకో కండి.21శతాబ్దంలో బతుకుతూ అన్ని ఆధు నిక వసతులు అనుభవిస్తూ ఇంకా వేలఏళ్ల నాటి మైండ్‌ సెట్‌తో మాట్లాడుతాం. మేం అలాగే ప్రవర్తి స్తాం-అంటే వీలుకాదు.వారు ఏ హోదాలో ఉన్నా మా లెక్క ప్రకారం మూరు?ల కేటగిరి లోకే వస్తారు.పొరపాటున ఎవరైనా వీరి వలలో పడ్డా రంటే వారు. వారి ఇంగిత జ్ఞానాన్ని కోల్పోతారు. ఇటీవల వీరు ఆవుపేడ ఇంధనంగా నడిచే బస్సుల గురించి ప్రచారం చేశారు. ఆవు పేడతో నడిచే ఆ బస్సులు, ఒక రూపాయి ఖర్చుతో పదిహేను కిలోమీటర్లు పోగలవన్నది. ఆ ప్రకటన సారాం శం! అందుకే కాబోలు మోడీ భక్తులంతా అన్నా లు మానేసి ఆవు మూత్రం ఆవు పేడల మీద ఆధారపడి శక్తివంతులవుతున్నారూ??బీజేపీ యం.పి ప్రజ్ఞాటాకూర్‌ ప్రకటనకు స్పందించి క్షత్రి యుడైన పరిశోధకుడు డాక్టర్‌ సంగ్రాం పాటిల్‌ ఇలా వివరణ ఇచ్చాడు-క్షత్రియులనబడే వారు హిందువులుకారని వారు శ్రమ ణులనీ అన్నాడు. వారెప్పుడూ బ్రాహ్మ ణిజాన్ని నెత్తిన మోయ లేదని-అయితే మొఘలుల కాలంలో ముస్లిం రాజులు అందరినీ ఒకేవిధంగా ‘హిందువులు’’-అని అన్నారని దాన్నే తర్వాత కాలంలో బ్రిటీష్‌ వారు కొనసాగించారని అన్నాడు. బ్రాహ్మణ వర్గీ యులు కూడా పాలకుల మాటను అంగీకరించి తామంతా హిందువులమే అని అనడం ప్రారం భించారట. ఎందుకంటే తమ సంఖ్య పెద్దది. సమాజంలో తాము అధిక సంఖ్యాకులం అని చెప్పుకోవడానికి అలా కలుపుకున్నారట. మళ్ళీ అందరికీ సమాన స్థాయి లేకుండా అందులోనే నిచ్చెనమెట్ల వ్యవస్థను సృష్టించి జనాన్ని విభజిం చారట. అసలైతే అందరూ ఈదేశ మూల వాసు లు.మూలవాసుల్ని బానిసలుగా మార్చింది. ఇరాన్‌ ప్రాం తం నుండి వలస వచ్చిన ఆర్య బ్రాహ్మణు లు. విషయాలు లోతుగా తెలుసుకుంటే కళ్లు తెరుచుకుంటాయి. తామే ఉన్నత వర్గీయులమని శతాబ్దాలుగా ఏ పనీ చేయకుండా పరాన్నజీవు లుగా బతుకుతున్నదీ-తమ మనుగడ కోసం మూఢనమ్మకాల్ని వ్యాప్తి చేస్తున్నది. బ్రాహ్మ ణార్యులే అన్నది స్పష్టం! 12వ శతాబ్దం వరకు అసలు ‘హిందూ’ అనే శబ్దమే మన పూర్వీకులకు తెలి యదు. రాజ్‌పుట్‌, ఠాకూర్‌ వంటి నవక్షత్రియ శాఖలు తర్వాతకాలంలో ఏర్పడ్డాయట. ఇప్పుడు’ ’హిందూత్వ’’పేరుతో అదేబ్రాహ్మణ వాదం దేశం లో పెత్తనం కొనసాగిస్తుందని అన్నారు డాపప సంగ్రాం.ఆలోచనా విధానంలో తేడాలు ఎలా ఉంటాయో ఇద్దరు నాయకుల అభిప్రాయాలు గమనిద్దాం!స్త్రీలపట్ల ఆరెస్సెస్‌ వారి దృక్పథమే మిటో వారి చీఫ్‌ మోహన్‌ భగవత్‌ తెలియ జేశారు.ఇల్లాలు కేవలం ఇంటి పనులకోసమే, ఆమె భర్తను అన్ని విధా లా సుఖపెట్టాలి. అయితే ఆమె అవసరాలు భర్త తీర్చాలి. ఇదే సామాజిక ఒప్పందం! దీనికి కట్టుబడి ఉన్నంతవరకే కాపురం ఉంటుంది.ఉల్లంఘిస్తే భర్త-భార్యను విడిచి పెట్టొచ్చు’-అని చెప్పాడు. ఇందులో యజమాని బానిసల సంబంధం ఉందేగాని, జీవిత భాగస్వా ముల అనుబంధం ఎక్కడ ఉందీ? అయితే మరి, యశోదాబెన్‌ ఏవిషయాలు ఉల్లంఘించిందో, ఆమెను ఆమె భర్త అనధికారికంగా ఎందుకు విడిచిపెట్టాడో చెప్పాల్సిన బాధ్యత మోహన్‌ భగవత్‌కు లేదా? ఇక పుచ్చలపల్లి సుందరయ్య యువతీ యువకులకు ఇలా సలహా ఇచ్చారు’’.- భార్యాభర్తలి ద్దరూ ఉద్యోగాలలో,వృత్తులలో చేరితే బిడ్డల పోషణ,సంరక్షణ,ఇంటి పనుల నిర్వహణలో ఇబ్బందులు ఉండొచ్చు.కానీ,ఇద్ద రూ కలిసి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ-ఇరువురూ ఆ పనులన్నింటినీ పంచుకుని ఓపికగా చేసుకోవాలి.తమ స్త్రీల మీద బరువు తగ్గిం చాలనే ధోరణి పురుషులలో, ముఖ్యంగా యువ కులలో రావాలి’’ -అని అన్నారు. అర్థవంతమైన సూచన కదా? -(డాక్టర్‌ దేవరాజు మహారాజు)

రామరాజ్యమా..లౌకిక రాజ్యామా?

ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఓట్ల కోసం ప్రజల మనోభావాలతో చెలగాటమాడటం కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బిజెపికి అలవాటు. మతాన్ని అడ్డం పెట్టుకుని ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాన్ని చాప కింద నీరులా దేశం మొత్తం వ్యాప్తి చేసే కార్యక్రమాన్ని యథేచ్ఛగా అమలు చేస్తున్నది. అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ట సందర్భంగా ప్రధాని చేసిన ఉపన్యాసమే అందుకు నిదర్శనం. ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నది సాధువులు, సన్యాసులు, బడా వ్యాపారవేత్తలు, కోట్లాధిపతులు. ఎన్నికల ముందు రామ మందిరాన్ని ప్రారంభించి ప్రజల భావోద్వే గాలను తమ వైపు మరల్చుకోవా లన్నది బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ల ప్రధాన ఎత్తుగడ. ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, ప్రధాని మోడీ కలిసి రామమందిరాన్ని ప్రారంభిం చారు. దీన్నిబట్టి మనమేం అర్థం చేసుకోవాలి? మతం ముసుగులు తొలిగిపోయాయి. ఇక అంతా బహిరంగమే! ఎన్నికలయ్యేదాకా ఎక్కడ ఏం జరుగుతుందో, ఎలాంటి మత ఉద్రిక్తతలు చెలరేగుతాయో, ఘర్షణలు జరుగుతాయో తెలియని పరిస్థితి. మతాన్ని, రాజకీయాలను వేరుచేసి చూడటం లేదు. మతానికి రాజకీయాలను అనుసంధానం చేసి అధికారం కోసం తన ఎత్తుగడలను అనుసరిస్తున్నారు మోడీ. గత 75 ఏళ్లలో ఏ ప్రభుత్వాలు చేయలేని దానిని కేంద్రం అమలు చేస్తున్నది. 1990లో ఎల్‌కె అద్వానీ రామజన్మభూమి పేరుతో రథయాత్ర ప్రారంభించి 1984లో రెండు సీట్ల నుంచి 150 సీట్లకు తీసుకొచ్చారు. అప్పటినుంచే కాషాయపు జెండా తన ఎజెండాను పూర్తిగా మార్చుకున్నది. బిజెపిగా అవతరించింది. పేరు మార్చింది. ప్రజలను ఏమార్చింది. తన విధానాలను ఆ తర్వాత అదే కార్యక్రమాన్ని రామజన్మభూమితో కొనసాగించి అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ట అంకం పూర్తయింది. ఇక మధురలో కృష్ణ దేవాలయం, ఇతర దేవాలయాలపై దృష్టి సారించింది. నిరంతరం ప్రజలను మత ఉద్వేగాల వైపు మరల్చి ఓట్లు దండుకునే కార్యక్రమాన్నే బిజెపి పెట్టుకున్నది. మత విశ్వాసాలు వ్యక్తిగతమైనవి. పరమత సహనం పాటిస్తూ అందరినీ కలపుకుపోయేదే రాజనీతి. రాజకీయాలు లౌకికత్వానికి సంబంధించినవి. వర్తమానంలో రాజకీయాలలో మతం ప్రధాన పాత్ర వహించే విధంగా బిజెపి తన ఎత్తుగడలను కొనసాగిస్తున్నది. ఇప్పుడు రామజన్మభూమి, రామాలయం వంటి అంశాలను తీసుకువచ్చి ప్రజలను మభ్యపెడుతున్నది. రామాలయాలు దేశమంతటా ఉన్నాయి. రాముడు ప్రజా సంక్షేమాన్ని కాంక్షించాడని చెప్తారు. అన్న మాట కోసం అధికారాన్ని వదిలి అడవులకు పోయాడంటారు. అయితే రామ నామం జపించే పాలకులు చేసిన వాగ్దానాలను ఉట్టి మీదకు ఎక్కించారు. నిత్యావసర ధరలను ఆకాశమార్గం పట్టించారు. సగటు పేద ప్రజలు ఆ ధరలను అందుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇది మోడీ రాజ్యంలో ప్రజల పరిస్థితి.
పదేళ్ల కిందట అధికారంలోకి రాక ముందు మోడీ మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టారు. రైల్వేస్టేషన్‌లో చారు అమ్మినవాడిగా, వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన నాయకుడిగా, అందరి కష్టసుఖాలు తెలిసిన వ్యక్తిగా పరిచయం చేసుకుని ప్రచారార్భాటం ప్రారంభిస్తే ప్రజలు నమ్మారు. బిజెపి ని అధికారంలోకి తీసుకొచ్చారు. నాడు మోడీ చేసిన వాగ్దానాలేమిటి? నేడు చేస్తున్నదేమిటి? పేద ప్రజల, కార్మికవర్గ సంక్షేమం, బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు. రైతాంగం పట్ల దోపిడీ విధానాన్ని అనుసరించే చట్టాలను సంస్కరణల పేరుతో తీసుకొచ్చారు. కార్మిక వర్గాలను పరిశ్రమల అధిపతులకు, పెట్టుబడిదారులకు బానిసలుగా మార్చే చేదు మందు లాంటి సంస్కరణలకు చక్కెరపూత పూశారు. యాజమాన్యాలకు కార్మిక వర్గం బానిసలుగా పనిచేసేలా తిరోగమన సంస్కరణలను ముందుకు తెచ్చారు. పెట్టుబడిదారుల లాభాలకు, వారి సంతోషం కోసం ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉన్నామని మోడీ ఎప్పటికప్పుడు తన విధానాల ద్వారా తెలియజేస్తూనే ఉన్నారు. కోట్లాది టన్నుల ధాన్యం గోడౌన్లలో మూలుగుతున్నా పేద ప్రజలకు పంచడానికి చేతులు రావడం లేదు కానీ అదానీ, అంబానీ లాంటి వారికి లక్షల కోట్ల రూపాయలను రాయితీలిచ్చి ప్రోత్సహిస్తున్నారు. ఈ దేశంలో నిరుద్యోగాన్ని వేగంగా పెంచి పోషిస్తున్నది ఎవరు, మోడీ కాదా? ఏటా రెండు కోట్ల ఉద్యోగాల కల్పన ఊసెక్కడీ ఉన్న ఉద్యోగాలను ఊడ పీకడమే కాకుండా పకోడీలు అమ్ముకోవడం కూడా ఉద్యోగమే అని సెలవిచ్చిన మోడీ ఈ దేశానికి ‘మహా నాయకుడు’, ‘విశ్వగురు’!
ప్రభుత్వ రంగ పరిశ్రమలను టోకుగా అమ్మడం, బడా పెట్టుబడిదారులకు కట్టబెట్టడం లాంటి చర్యలను నిస్సిగ్గుగా కొనసాగిస్తున్నారు బిజెపి పాలకులు. ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మింది, బడా పెట్టుబడిదారులకు కట్టబెడితే ఎంత సంపద వచ్చింది గొప్పగా చెపుకుంటున్నారు. కానీ దేశాన్ని దోచుకుని సరిహద్దులు దాటించిన బడా పారిశ్రామిక వేత్తలను గురించి ఒక్క రోజు కూడా మాట్లాడరు! కోట్లాది రూపాయల ప్రజల సొమ్మును పట్టపగలే బ్యాంకు రుణాల ద్వారా దోచుకున్న విజరు మాల్యా, నీరవ్‌ మోడీ లాంటి వాళ్ళ గురించి అసలు తెలియ నట్లు వ్యవహరిస్తున్నారు. నేడు ప్రపంచంలో మూడవ కుబేరుడిగా గౌతమ్‌ అదానీ ఎది గాడు! ఇది ఎవరి చలువో అందరికీ తెలిసిం దే. కేవలం మోడీ ఈ పదేళ్ల పాలనలో అదా నీలు, అంబానీలు, టాటా బిర్లాలు కోట్లాది ఆస్తులను సంపాదిస్తూ వేగంగా ప్రపంచ కుబేరులను దాటిపోతున్నారు. దగా పడ్డ ప్రజల ఆదాయం, ప్రజల జీవన స్థితులు మాత్రం మారడం లేదు. కారణం, ప్రజల్ని మతం చుట్టూ భ్రమింపజేయడం ద్వారా అంతర్గత వ్యూహాల్ని అమలు చేస్తున్నారు. నూటికి ఎనభై శాతం వ్యవసాయ దేశంలో రైతుల బతుకులు చితికిపోతున్నా వారి గురించి పట్టించుకోరు. ప్రజల సంపద బడా కోట్లాధిపతుల చేతుల్లోకి వెళ్లిపోతున్నా మాట్లాడే పరిస్థితిలో లేరు. ప్రభుత్వ సంస్థలు నిర్వీర్య మైతున్నాయి, క్షీణిస్తున్నాయి. సంబంధ మే లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. బిజెపి పాలన లో ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను కూడా ఏర్పాటు చేయలేదు. గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ప్రజలకు ఉపయోగమైన దేశానికి ప్రయోజన కరమైన బడా ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేసి అమ్మి వేయడం లేదా అంగడి దుకాణాలు ఇచ్చినట్లు కిరాయిలకు ఇస్తున్నది. ఇది దేశానికి నష్టదాయకమే కాదు, భవిష్యత్తుకు శాపం! ప్రభుత్వ పరిశ్రమలను కొనుగోలు చేసిన పెట్టుబడిదారులు మాత్రం ఒకటికి పదింతలు కోట్లాది రూపాయలను ఆర్జిస్తున్నారు, డొల్ల కంపెనీలు సృష్టించి దోచుకుంటున్నారు. మన పాలకులు ఆనందపడుతున్నారు. ఇదే అసలైన అభివృద్ధిగా చెబుతున్నారు. మరి అదానీ అసలు స్వరూపాన్ని హిండెన్‌బర్గ్‌ బయట పెడితే దీనిపై స్పందించరేం? ఈ దేశంలో కోట్లాది మంది ప్రజల సొమ్మును కొంతమంది పెట్టుబడిదారులు దోచుకోవడం, దాచుకోవ డం పరిపాటిగా పెట్టుకున్నారు. అందుకు మోడీ అండదండలే కారణమన్నది దేశ పౌరులకు తెలియంది కాదు. ఓవైపు పన్ను ఎగవేతలు, మరోవైపు భారీ కుంభకోణాలు విజృంభిస్తుంటే వాటి నియంత్రణలో కేంద్ర పాలకులు విఫలమయ్యారు.మోడీ అధికారం లోకి వచ్చినప్పుడు రూ.65 లక్షల కోట్ల అప్పు ఉన్న మన దేశం నేడు రూ.కోటి 55 లక్షల కోట్లకు ఎగబాకింది. ఇది మోడీ పాలనలో జరిగిన అప్పుల అభివృద్ధి. అప్పులు తీర్చడానికే కేంద్ర బడ్జెట్‌లో అధిక శాతం వడ్డీలకు కట్టాల్సి వస్తుంది. దేశ ప్రజలపై ఎక్కడలేని భారాలను మోపుతున్నది. దేశ ఆదాయ వనరుగా ఈ దేశంలోని కోట్లాది పేద ప్రజ లను సరుకుగా మార్చుకుంటున్నది. దుడ్డుకర్ర లాంటి వివిధ పథకాలు తెచ్చి మధ్య తరగతి, పేద వర్గాల నడ్డి విరగ్గొడుతున్నది.అధికారం చేతిలో ఉందని తనకు తోచిన విధంగా వెనక ముందు చూడకుండా తిరోగమన విధానాలు అమలు చేస్తున్నది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి చర్యలు దేశాన్ని కుదేలు చేసింది అంద రికీ తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన కరోనా మహమ్మారిని అరికట్టలేక పోవడంతో కోట్లాది మంది అసంఘటిత కార్మికుల ఉసురు తీసింది. రెక్కాడితే గాని డొక్కాడని కార్మికుల, పేద ప్రజలను దిక్కులేని వాళ్ళని చేసింది. పెద్ద నోట్ల రద్దు ద్వారా ఈ దేశంలో ఉన్న నల్లధనం బయటికి తీసకొస్తామని జబ్బలు చరిచింది. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి ఈ దేశ ప్రజల జన్‌ధన్‌ ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని చెప్పింది. ఒక్క రూపాయి నల్లధనం కూడా బయట పెట్టలేక పోయింది. దీనికితోడు ధరల్ని అదుపు చేయడంలో, నిరుద్యోగాన్ని రూపు మాప టంలో, వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో మోడీ పూర్తిగా విఫలమయ్యారు.ఇది దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న మోడీ (రామ) రాజ్యం. ఈ రాజ్యంలో ప్రజా సంక్షేమం లేకపోగా పేదల బాధలు రెట్టింపయ్యాయి. నిరుద్యోగం, ధరల పెరుగుదల తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. కార్మికుల హక్కులు కాలరాయబడ్డాయి. చదువు, వైద్యం కార్పొరేట్ల పరమైంది. మోడీ ప్రభుత్వం వైఫల్యాలను ఎప్పటికప్పుడు సిపిఐ (ఎం) లాంటి వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు ప్రతిఘటి స్తున్నా, ప్రజల దృష్టిని మరల్చేందుకు బిజెపి-ఆరెస్సెస్‌ వేస్తున్న పాచికే రామరాజ్యం. ఇదే పదేళ్లలో మోడీ దేశానికి చేసిన నిర్వాకం. లోక్‌సభ ఎన్నికలకు సమయం ఆసన్నమైన సందర్భంగా మోడీ వేస్తున్న అడుగులను ఈ దేశంలోని యువకులు, ప్రజలు, విద్యావంతులు, మేధావులు గమనించాలి. భిన్నత్వంలో ఏకత్వానికి చిహ్నమైన భారత లౌకికత్వాన్ని ఓటు ద్వారా బలపరచాలి. అంధ విశ్వాసాల నుండి దేశాన్ని కాపాడుకోవాలి.
వ్యాసకర్త సెల్‌ : జూలకంటి రంగారెడ్డి – జూలకంటి రంగారెడ్డి

మత్తు ఉచ్చులో బాలలు

‘‘డ్రగ్స్‌ చట్టంలో మనిషి నుంచి మనిషికి మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా అవ్వడాన్ని కూడా ట్రాఫికింగ్‌ అనే అంటారు. ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి అంటుకునే వ్యాధే ఈ ట్రాఫికింగ్‌. ఒక విధంగా డ్రగ్స్‌ వాడుతున్న వాళ్ళను క్షమించి వారికి కొత్త జీవితాన్ని అందించడానికి ప్రయ త్నాలు చేయడంలో తప్పు లేదు. కానీ సరఫరా చేస్తున్న డ్రగ్‌ మాఫియాను మాత్రం కూకటి వేళ్ళతో పెకలించినప్పుడే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకునే ఐక్యరాజ్యసమితి సాధారణ సభ జూన్‌ 26, 1987న చేసిన తీర్మానం మేరకు ‘డ్రగ్స్‌’ విని యోగం, అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రపంచ దేశాలన్నీ నడుం బిగించాలని విజ్ఞప్తి చేసింది. ప్రపంచ మానవాళిని మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా చైతన్యవంతం చేసేందుకుగాను నడుం బిగించింది. ఈ సంవత్సరం (2023) హానికరమైన మాదక ద్రవ్యాలను వినియోగించే వారు, వారి కుటుంబాలలో అత్యధికులు వివక్షను ఎదుర్కొంటున్నారు. ఇది వారి శారీరక, మానసిక ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించే పరిస్ధితులకు దారితీస్తుంది. వారికి అవసరమైన సహాయాన్ని పొందకుండా నిరోధించే పరిస్ధితులు బలపడేలా చేస్తున్నాయి. ఇటువంటి క్లిష్ట సమయంలో ప్రజలు ముందుగా మాదక ద్రవ్యాలు వినియోగించే వారిపై వివక్షతను తొలగించి మాదకద్రవ్యాల దుర్వినియోగం లేని ప్రపంచాన్ని సాధించడంలో సహకారాన్ని బలోపేతం చేయాలనే ప్రధాన లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి ఈ సంవత్సరం ధీమ్‌ ప్రకటించింది.’’ –గునపర్తి సైమన్‌


సరదాగా ఒక్కసారి అన్న భావనతో మత్తుమందుల వినియోగం ప్రారంభించినప్పటికీ వాటిని వినియో గించినప్పుడు కలిగే తాత్కాలిక ఆనందం తరచూ పొందాలని కోరికతో క్రమేపీ అది బానిసలుగా మార్చేస్తోంది. చివరకు మత్తు మందు తీసుకోకుంటే తట్టుకోలేని పరిస్థితికి చేరు కుంటున్నారు. వాటిని సమకూర్చు కోవడానికి ఎంతకైనా తెగించేస్తున్నారు. ఈ విధంగా సరదా గా అలవాటు చేసుకుంటున్న ప్రతి 10 మందిలో ఇద్దరు దానికి పూర్తిగా బానిసలై పోతున్నట్లు, మాదక ద్రవ్యాలను వినియోగించే ప్రతీ ముగ్గురిలో ఒక మహిళ ఉంటున్నట్లు ఈమధ్యనే భారత గ్రామీణ చైతన్య వేదిక చేసిన సర్వేలో తేల్చి చెప్పిం ది.ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌రాష్ట్రంలో మాదకద్ర వ్యాల విని యోగం అత్యంత ప్రమా దకర స్థాయిలో పెరుగుతోంది. పదేళ్ల ప్రాయం నుంచే కొందరు బాలలు వీటికి అలవాటు పడుతున్నారు. ఏకంగా 3.17లక్షల మంది బాలలు ఈ మత్తు వలలో చిక్కుకున్నారు. రాష్ట్రంలో 20.19 లక్షల మంది మాదకద్రవ్యాల వ్యసనపరులు ఉండగా.. వారిలో 15.70 శాతం మంది బాలలే ఉండ టం ఆందోళన కలిగి స్తోంది.బాలల్లో గంజాయి వినియోగం అధికం గాఉన్న రాష్ట్రాల్లో ఏపీ 12వ స్థానంలో ఉండటం మరింత కలవరపెడుతోంది. మాదక ద్రవ్యాల మత్తులో చిక్కుకొని రాష్ట్రంలోని కొందరు బాలలు అల్లాడు తున్నారు.ఓపియం, హెరాయిన్‌, గంజాయి వంటి నాటికీ వారు బాని సలవుతుండటం కలవరం రేపు తోంది. వీటిలో గంజాయి వినియో గం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలోని ఏపీ12వ స్థానంలోఉండగా.. బాలల్లో ఓపయడ్స్‌కు సంబందించిన మాదక ద్రవ్యాల వినియోగంలో పదివస్థానంలోఉంది. సెడెటివ్స్‌ వినియోగంలో ఎనిమిదివ స్థానంలో ఉంది. కేంద్ర సామాజిక న్యాయ సాధి కారిత మంత్రిత్వశాఖ స్థాయీ సంఘం తాజాగా పార్లమెంట్లో నివేదిక సమర్పించింది.
దేశంలో మత్తు పదార్ధాల బారిన పడి త్రీవంగా ప్రభావితమవుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఒకటని ఈ నివేదిక వెల్లడిరచింది. ప్రధానంగా బాలల్లో వీటి వినియోగం ఇక్కడ ఎక్కువగా ఉందని పేర్కోంది.మాదకద్రవ్యాల మైకం రాష్ట్రాన్ని ఎంత తీవ్రంగా కమ్మేసిందో చెప్పటానికి ఈ గణాంకాలే సాక్ష్యాలు.దీనివల్ల నేరాలూ పెరుగుతున్నాయి.ముప్పు ఇంతస్థాయిలో ఉన్నా సరే ప్రభుత్వం నియంత్రణకు అవసరమైన కార్యాచరణ కొరవడిరది.
మత్తు ఉచ్చులో విద్యార్థులు..కిక్కు కోసం బానిసలు
రాష్ట్రంలో గంజాయికి బానిసులుగా మారిన వారు 4.64లక్షలమంది ఉన్నారు. వారి లో 21వేలమంది బాలలే.వీరిలో 10నుంచి 17ఏళ్లలోపు వారు గంజాయి రుచిచూస్తున్నారు. మొత్తంగా మాదకద్రవ్యాలు వినియోగిస్తున్న 20.19లక్షల మందిలో 22.98శాతం మంది గంజాయి తీసుకుంటున్నారు. 10నుంచి 17ఏళ్ల మధ్య వయస్సున్న 3.17లక్షల మంది మాదకద్ర వ్యాలకు అలవాటుపడగా..,వారిలో 21వేల మంది గంజాయి సేవిస్తున్న వారే కావటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.18నుంచి 75ఏళ్లలోపువారిలో గంజాయి వినియోగం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఏపీ 11వ స్థానంలో ఉంది.గతంలో మన రాష్ట్రంలో సాగు మాత్రమే ఉండేది.గత నాలుగేళ్లలో దాని లభ్యత, వినియోగం విపరీతంగా పెరిగిపోయాయి. ఎక్కడికక్కడే లభిస్తోంది. విక్రయదారులు, సరఫ రాదారులు ఎవరో తెలిసినా వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసకోవల్లేదు.ఈ ఉదాసీనత ఫలి తంగా దానికి అడ్డుకట్ట పడట్లేదు.ఓపి యోడ్స్‌, ఇన్‌హెలెంట్స్‌,సెడిటిప్స్‌కు సంబంధించిన మాదక ద్రవ్యాల వినియోగం కూడా ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో అత్యధికంగా9.88లక్షల మంది ఓపి యెడ్స్‌కు బానిసలుగా మారారు.
రాష్ట్రంలో గాజాయి ఫుల్‌..చర్యలు నిల్‌
మాదకద్రవ్యాలకు బానిసలుగా మారిన వారిని దాన్నుంచి విముక్తి కల్పించేందుకు కేంద్రప్రభుత్వం నేషనల్‌ యాక్షన్‌ ప్లాన్‌ ఫర్‌ డ్రగ్‌ డిమాండ్‌ రిడక్షన్‌ కార్యక్రమం అమలు చేస్తోంది. దీని కింద ఏపీలో 201819లో 1,752మంది లబ్దిపొందగా,202021నాటికి వారిసంఖ్య ఏకంగా 8,878కు పెరిగింది. కేవలం రెండేళ్ల వ్యవధిలో 291.57శాతం మంది లబ్దిదారులు పెరిగారు.201920తో పోలిస్తే 20221లో ఏకంగా 233.39శాతంమంది లబ్దిదారులు పెరిగారు.రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగం, వాటి బారిన పడుతున్న వారి సంఖ్య ఎంత వేగంగా పెరుగుతుందో ఈగణాంకాలే చెబుతు న్నాయి.
గంజాయి ఊబిలో యువత..జీవితాలు నాశనం
దేశవ్యాప్తంగా 272జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగం,ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో సహకారంతో కేంద్రం గుర్తించింది.ఆజాబితాలో ఉమ్మడివిశాఖ, తూర్పు గోదావరి,పశ్చిమగోదావరి,కృష్ణా జిల్లాలు ఉన్నా యి.వీటిలో విశాఖమన్యం గాజాయి సాగు సర ఫరాకు కేంద్రంగా ఉంది. మిగితా జిల్లాలు మీదు గా గంజాయి అక్రమ రవాణా సాగుతోంది. రాష్ట్రంలో మద్యం వినియోగం చాలా తీవ్రంగా ఉంది.మద్యానికి అలవాటు పడి బానిసలైన వారు ఎక్కువమంది ఉన్న రాష్ట్రాల జాబితాలో ఏపీ ఏడో స్థానంలో ఉంది.3.86కోట్ల మందితో ఉత్తరప్రదేశ్‌ దేశంలోనే మొదటి స్థానంలో ఉం డగా..65.09లక్షల మందితో ఏపీఏడోస్థా నంలో ఉంది. పొరుగున ఉన్న తెలంగాణలో మద్యానికి అలవాటుపడ్డవారు ఏపీకంటే తక్కువగానే ఉన్నారు. అక్కడ 50.40లక్షలమంది ఉన్నారు.
డ్రగ్‌ అడిక్ట్స్‌ను గుర్తించడమెలా?
డ్రగ్స్‌కు అలవాటు పడిన వారు స్థిమితంగా ఉండలేరు. ఊరికే ఉద్రేకపడిపోతుం టారు. దేనిపైనా దృష్టి నిలపలేరు. వ్యక్తిగత శుభ్రతపై శ్రద్ధ చూపించరు. మంచి దుస్తులు వేసుకోరు. వేళకు స్నానం చేయరు. మురికిగా కనిపిస్తారు. ఒళ్లు వణుకుతుండటం, మాటలు ముద్ద ముద్దగా వస్తాయి. రక్తనాళాల్లో రక్తప్రసరణ అధికంగా జరుగుతుంటుంది. వారి ధరించిన దుస్తులు నుండి చిత్రమైన వాసన రావచ్చు. కళ్లలో ఎర్రజీరలు కనిపిస్తాయి. కనుపాపలు సాధారణ స్థితి కంటే మరింతగా విప్పారినట్లుగానో లేదా మరింతగా కుంచించుకుపోయినట్లుగానో తయా రవుతాయి. అతిగా తినడం లేకుంటే ఆకలి మంద గించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. గంటల తరబడి మత్తుగా నిద్రపోవడం లేదా నిద్రలే కుండా గంటల తరబడి గడపడం వంటి లక్షణా లు, ఫోన్‌ లో రహస్యంగా మాట్లాడటం ఎవ్వరి తోను కలవక పోవడం, ఎక్కువుగా బబుల్‌ గమ్‌, చూయింగ్‌ గమ్‌లు నమలడం, డోర్‌ లాక్‌ చేసు కుని గదిలోనే ఉండిపోవడం. ఇటువంటి లక్షణా లున్న వారు డ్రగ్స్‌ మాయలో చిక్కుకున్నట్లే.
సమిష్టి పోరుతో సత్ఫలితాలు
మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఎన్ని ప్రచారోద్యమాలు కార్యక్రమాలు చేపట్టినా వీటి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని అంతర్జాతీయ సమాజానికి మార్గనిర్దేశనం చేసినా, డ్రగ్స్‌ వినియోగం ఏమాత్రం తగ్గడం లేదు. ఉగ్ర వాదంవల్ల మరణి స్తున్నవారి కంటే ప్రపం చంలో మత్తుమందుల వల్ల కన్ను మూస్తున్నవారే ఎక్కువ ఉన్నారనేది అనేక సర్వేల్లో వెల్లడైంది. అంటే పూర్తిగా అదిప్రభుత్వ వైఫల్యంగానే చెప్పుకో వచ్చు. ప్రభుత్వాలు చేపడుతున్న ప్రతీ సర్వేలోను వీటి వినియోగం పెరిగినట్లు గణాంకాలు వస్తున్నా యి తప్ప అదుపులోకి వస్తున్న జాడ ఏ మాత్రం కనిపించడం లేదు.ఈ సమస్యకు శాశ్వత పరి ష్కారం దిశగా ముందుగా వ్యవస్ధ పునాదులును బలోపేతం చేయాలి. ఒకవైపు కఠిన చట్టాలను అమలుచేస్తూనే పిల్లలను మాదకద్రవ్యాల బారి నుంచి రక్షించుకొనేందుకు ప్రజాచైతన్య కార్యక్ర మాలు ప్రభుత్వాలు చేపట్టాలి.ఈ విషయమై ప్రభుత్వం చేపట్టే కార్యాచరణలో చిత్తశుద్ధి ఉం డాలి.అదే సమయంలో విద్యా వ్యవస్ధలో సమూల మార్పులు చేయాలి అంటే విద్యా బోధనలో నైతిక విద్యకు అగ్రతాంబూలం ఇవ్వాలి. విలువలు లేని విద్యా విధానం ఎన్ని చట్టాలు చేసినా ఇటువంటి విష సంస్కృతలకు ఎప్పటికి చరమ గీతం పాడలేం. యువశక్తిని నిర్వీర్యం చేస్తూ సకల అనర్ధాలకు, అరాచకాలకు అమానుష ధోరణులుకు కారణమై కోట్లాది జీవితాల్ని క్రూరంగా బలి గొంటున్న మాదక ఉగ్రవాదాన్ని ఉపేక్షించడం అనేది జాతి భవితకే తీరని చేటని గుర్తించి తల్లి దండ్రులు,విద్యాసంస్థలు,ప్రభుత్వాలు, సమాజం.. ఇలా అంతా కలసికట్టుగా దీనిపై పోరు సాగిస్తే తప్పక మాదక మహమ్మారిని తరిమి వేయడం సాధ్యం అవుతుంది.ఆనాడే వివేకవంతమైన సమాజం మన కళ్ళముందు సాక్షాత్కరిస్తుంది. ఇక్కడా అక్కడా అని కాదు.. ఇప్పుడు అప్పుడని కాదు.. ప్రపంచ వ్యాప్తంగా నేడు ఈ మాదకద్ర వ్యాల భూతం ఎల్లెడలా పంజా విసురుతూనే ఉంది. ప్రపంచాన్ని వణికిస్తున్న మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తిగతంగా మనిషి ఆరోగ్యం పైనే కాదు సమాజంపైనా తీవ్ర దుష్పరిమాణాలు చూపుతుంది. అందుచేతనే ప్రస్తుతం మానవాళిని పట్టిపీడిస్తున్న సమస్యల్లో ఉగ్రవాదం తరువాతి స్థానం మాదక ద్రవ్యాలదేనని ఐక్యరాజ్యసమితి స్పష్టీకరించింది. ప్రాధమిక విద్యను అభ్యసిస్తున్న చిన్నారుల నుండి 60సంవత్సరాల వయసు గల పెద్దల వరకూ భాగ్యవంత దేశాల నుండి అభి వృద్ధి చెందుతున్న దేశాల వరకూ అన్ని వర్గాల వారిని ఈమాదక మహమ్మారి మత్తుగా మింగేస్తూ ఉంది. జీవితాలను చిత్తు చేసే ఈ డ్రగ్‌ రక్కసి కోరల్లో మత్తు కోసం చిక్కుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతూ ఉంది. మత్తు కోసం మాదక ద్రవ్యాలకు బానిస అయిపోతారు. ఈ క్రమంలో వీళ్ళు గెలిచినా ఓడినా దానిని మత్తు లోనే పంచుకోవాలి అనే భావం వీరిలో క్రమేపీ బలపడిపోతుంది.
నేటి సమకాలీన సమాజంలో పరిశీలి స్తే పుస్తకాల తోటలో విహరిస్తూ పుస్తకాలు చదు వుతూ జ్ఞానాన్ని ఆర్జించవలసిన ఎందరో విద్యా ర్థులు పుస్తకాల అధ్యయనానికి బదులు పొగ పీలుస్తున్నారు. గురువులు చెప్పేది మెదడులో ఎక్కించుకోవడానికి బదులు మెదడుకు రసాయ నాల మత్తును ఎక్కిస్తూ మత్తులో తాత్కాలిక ఆనందాన్ని పొందుతూ రోజురోజుకు మాదక ద్రవ్యాల ఊబిలో కూరుకు పోతున్నారు. పట్టుమని పదహారేళ్లయినా నిండని ఈ టీనేజ్‌ పిల్లలు కిక్‌ కోసమో, థ్రిల్‌ కోసమో పొగతాగడం, మద్యం తీసుకోవడం వంటివి ముందుగా ప్రారంభిస్తారు. అయితే క్రమంగా ఇవి వదులుకోలేని వ్యసనాలుగా మారిపోతాయి.కానీ కాలక్రమంలో ఈ వ్యసనాన్ని సిగరెట్లతోనో, మద్యంతోనో సరిపెట్టుకోరు. మరింత థ్రిల్‌ కోరుకుంటారు. జీవితంలో తగిలే ఎదురుదెబ్బల నుంచి ఉపశమనం కోసం కొం దరు, స్తబ్దుగా మారిన బతుకులో కొంత ఉత్తేజం కోసం మరికొందరు డ్రగ్స్‌ వైపు అడుగులేస్తారు. సరదా కోసం ఒకటికి రెండుసార్లు వాడితే చాలు, వాటి మత్తులో పూర్తిగా కూరుకుపోతారు.
ఎవరు తెస్తున్నారో.. ఎలా సరఫరా చేస్తున్నారో తెలియదుకానీ డ్రగ్స్‌ మాత్రం బాగా అందుబాటు లోకి వచ్చాయి అనేది మాత్రం వాస్తవం. దేశం లో యువ శక్తిని నిర్వీర్యం చేస్తూ, అత్యంత విలు వైన మానవ వనరులను చీడ పురుగుల్లా తొలి చేస్తూ దేశ భవిష్యత్‌ను పెనుగండంగా మార్చి, మొత్తం సమాజాన్ని విచక్షణా రహితంగా వ్యస నాల ఊబిలోకి డ్రగ్‌ రక్కసి నిర్దాక్షిణ్యంగా నెట్టి వేస్తున్నది. ఈ సమస్యకు కారణం మాదక ద్రవ్యాల వినియోగం కన్నా ఖండాలు దాటి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న మాదక ద్రవ్యాల అక్రమ రవాణాగా చెప్పవచ్చు.
చరిత్ర..
మత్తు కోసం మత్తు కలిగించే పదార్ధా లను వాడటం ఈ మధ్య కాలంలో మొదల య్యింది మాత్రం కాదు. చారిత్రిక కాలం నుంచి ఈతరహా వ్యసనాలు అనేకం కనిపిస్తాయి. అయితే అప్పట్లో వాటికి వినియోగించిన పదార్ధాలు మాత్రం వేరు.మత్తు కోసం ఆనాడు ప్రకృతి సిద్ధం గా లభ్యమయ్యే మద్యం,గంజాయి,పొగాకు, నల్లమందు,మత్తునిచ్చే పుట్టగొడుగుల వంటి పదార్థాలను విరివిగా వాడుతుండేవారు. అయితే గత శతాబ్ద కాలం నుంచి పరిశీలిస్తే సాంప్రదా య మత్తు పదార్ధాలను తలదన్నే రీతిలో సింథటిక్‌ మత్తు పదార్థాలు ఎపిడ్రిన్‌,కొకైన్‌,ఓపియమ్‌ (నల్ల మందు),హెరాయిన్‌, బ్రౌన్‌షుగర్‌,కెటామైన్‌ పేరే దైతేనేం..ఈమత్తు పదార్థాలు ఎక్కువగా వాడుక లోనికి వచ్చేసాయి. గడచిన ఆరేడు దశా బ్దాల్లో వీటి తయారీ, సరఫరా, విక్రయాల విష యంలో మాఫియా ముఠాలు పనిచేయడం,ప్రభుత్వ నియంత్రణలు సత్ఫలితాలు ఇవ్వలేక పోవడం వలన ఈ మాదక ద్రవ్యాలు ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరించాయి. ఈమత్తు పదార్థాల విని యోగానికి క్రమేపీ యువత బానిసలు కావడం నేడు ఆందోళనకరంగామారి వారి పాలిట కాల కూట విషాలుగా పరిణమిస్తున్నాయి. ఫలితంగా యువత ఈ మాదక ద్రవ్యాల విషవలయంలో కూరుకుపోతున్నారు. వాస్తవంగా వీటి వినియోగం ద్వారా తాము బానిసలుగా తయారై జీవితాన్ని నాశనంచేసుకోవాలని ఎవ్వరూ అనుకోరు. అయితే చాలా మంది ఇది ఎలా ఉంటుంది? ఒక సారి రుచి చూద్దాం అనే కోరికతో మొదలై, దానికి బానిసలుగా మారే స్ధితికి వచ్చిన వారే అధికం. వీరితో పాటు డిప్రెషన్‌ కు గురయిన వారు, ఆందోళనలు ఎక్కువుగా ఉన్నవారు, సామాజికప రంగా వెనుకబడి ఉన్నవారు, ఆర్ధికంగా సమస్య లను ఎదుర్కొనే వారు, చదువులో వెనుకబడిన వాళ్ళు, కుటుంబం నుండి ప్రేమ ఆప్యాయతలు పొందలేని వాళ్ళు, తరచూ గొడవలు పడే భార్యా భర్తలు, జీవితంలో ఊహించని ఎదురుదెబ్బల నుంచి ఉపశమనం కోసమని, నిస్సత్తువగా మారిన బతుకులో కొంత ఉత్తేజం పొందాలని, ప్రేమలో విఫలమై ఆ బాధకు ఉపశమనం పొందాలనే ప్రయత్నంలో మాదక ద్రవ్యాలను ఆశ్రయిస్తు న్నారు. ఇంతకన్నా ముఖ్యంగా ఈనాటి ఆధునిక కుటుంబాల్లో దంపతులు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుండడం కారణంగా పిల్లలపై సరైన పర్య వేక్షణ ఉండడం లేదు. దీంతో తమను గమనించే వారు లేరన్న అవకాశాన్ని సరదా కోసం, ఫ్యాషన్‌, మోజు,స్నేహితుల ఒత్తిడి కారణాలతో మత్తు మందులు వినియోగానికి కొందరు అలవాటుపడు తున్నారు. చివరకు ఇది దీర్ఘ కాలిక సమస్యగా పరిణమించిన తరువాత ఆఉచ్చు నుండి బయట పడటం సాధ్యంకాక నిలువునా జీవితాలను బుగ్గి పాలు చేసుకుంటున్నారు.
భారత్‌లో మాదక ద్రవ్యాలు
మాదక ద్రవ్యాల విష సంస్కృతి మన దేశంలోకి కొంత ఆలస్యంగా వచ్చినప్పటికీ వ్యాప్తి మాత్రం చాప క్రింద నీరులా సాగుతూనే ఉంది. డ్రగ్స్‌ బానిసలు రోజు రోజుకు పెరిగిపోతున్న దేశాలలో భారత్‌ ఒకటి..! ఇటీవల కేంద్రం విస్తృతంగా నిర్వహించిన సర్వే ప్రకారం దేశంలో యువత కొకైన్‌, హెరాయిన్‌, గంజాయి వంటి మత్తుమందుల వాడకం గత పదేళ్లలో ఐదింతలు పెరిగినట్లు తేలింది. ఇండియా క్రైమ్‌ బ్యూరో లెక్కల ప్రకారం మన దేశంలో డ్రగ్స్‌ తీవ్రంగా వాడడం వలన 14 లక్షల మంది పిల్లలు, 80 లక్షల మంది పెద్దలు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారు. మాదకద్రవ్యాల వినియోగం కారణంగా దేశంలో ప్రతిరోజూ 23 మంది మరణిస్తున్నారని చెబుతున్న ఎన్‌సీబీ గణాంకాలు భారతావనిని కలవరపెడుతున్నాయి. మరొక పక్క మన దేశంలో సుమారు 15 కోట్లమంది మాదక ద్రవ్యాలకు బానిసలయ్యారని అంచనా. వీరందరికి ఇవి మొదట పబ్‌లు, క్లబ్‌లు,సినీ పరిశ్రమ ద్వారా సరఫరా అయితే ఇప్పుడు ఇవి నేరుగా విద్యా సంస్ధల చెంతకే అందుబాటులోనికి వచ్చేసాయి. కెల్విన్‌ అనే డ్రగ్‌ సరఫరాదారుడిని అదుపులో తీసుకున్న సందర్భంలో అతని వద్ద ఉన్న సమా చారం చూస్తే దాదాపు 130మంది పబ్లిక్‌ స్కూల్‌ చిన్నారులకు డ్రగ్స్‌ అందిస్తున్నట్లు తెలిసింది. దీనిని బట్టి స్కూల్‌ పిల్లలు కూడా ఈ ఉచ్చులో చిక్కుకు పోయారన్న చేదు నిజం బయట పడిరది.
ఐక్యరాజ్యసమితి విభాగమైన డ్రగ్స్‌ అండ్‌ క్రైమ్‌ విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకరమైన మాదకద్ర వ్యాలు ఉపయోగించేవారు 0.71శాతం ఉంటే, ప్రపంచ సగటు కంటే ఎక్కువగా ఇండియా లో 2.65శాతం ఈ ప్రమాదకరమైన డ్రగ్స్‌ వాడు తున్నారని తెలిసింది. భారత ప్రభుత్వం 1985లో నార్కోటిక్‌-డ్రగ్‌ అండ్‌ సైకోట్రాపిక్‌ సబ్‌స్టాన్సెస్‌ చట్టాన్ని అమలులోనికి తెచ్చింది. అప్పటి నుండి పరిస్ధితులకు అనుగుణంగా1988,2001, 2004లో ఈచట్టానికి సవరణలు చేపట్టారు. అయినా డ్రగ్స్‌ ఇండియాలోకి రావడం మాత్రం తగ్గడం లేదు. దేశంలో ముంబై తర్వాత పంజాబ్‌ డ్రగ్స్‌ వినియోగంలో అగ్రగామిగా ఉంది. అక్కడ దాదాపు 30లక్షల మంది డ్రగ్‌ యూజర్లు ఉన్న ట్టు అంచనా.గంజాయిసాగు విషయంలో మాత్రం ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే ముందు వరుసలో నిలిచింది.మన దేశంలో ఒకప్పుడు మెట్రో నగరా లకు మాత్రమే పరిమితమైన ఈ మాదక ద్రవ్యాలు క్రమేపీ ద్వితీయ శ్రేణినగరాలకు చివరకు గ్రామా లకు సైతం విస్తరించి ఎల్లెడలా మత్తు వాసనలు గుప్పు మంటున్నాయి. విదేశాల నుంచి తరలి వస్తున్న డ్రగ్స్‌తో పాటు స్దానికంగా నెలకొన్న ఔషధ పరిశ్రమలలో తయారయ్యే మత్తు పదార్థా లు వీటికి తోడవుతున్నాయి.
గతంలో యువకులు ఏర్పాటు చేసుకునే పార్టీలలో మద్యం ఏర్పాటు చేసుకునే వారు. అయితే ఇప్పటి పార్టీలలో మద్యంకు బదులు మాదక ద్రవ్యాలు చేరాయి. ఉన్నత విద్యా సంస్ధలలో విశ్వ విద్యాల యాల్లో చివరకు పబ్లిక్‌ స్కూల్స్‌లో సైతం మాదక ద్రవ్యం ఉదంతాలు మనం నిత్యంచూస్తూ ఉన్నాం. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం 1985లోనే మాదక ద్రవ్యాల వ్యతిరేక చట్టం‘ఎన్‌డీపీఎస్‌’ తీసుకువచ్చింది. తర్వాత ఎప్పటికప్పుడుపలు సవరణలు చేస్తూ ఈ చట్టాన్ని పటిష్టం చేసింది. అయితే ఈ చట్టం కాగితాలకే పరిమితం అయ్యింది. ఫలితంగా ప్రపంచం మొత్తంమీద మత్తులో జోగుతున్న దేశా ల్లో భారత దేశం ముందు వరుసలో నిలవడం భావి భారతానికి అత్యంత ఆందోళన కలిగించే విషయం.
డ్రగ్స్‌కు ఆకర్షితులు కావడానికి కారణాలు..
ప్రేమపూర్వకమైన వాతావరణం లేని ఇళ్లలోని పిల్లలు, ఆత్మవిశ్వాసంలేని వాళ్లు జీవి తంలో తగిలే ఎదురుదెబ్బల నుంచి ఉపశమ నం పొందాలనుకునే వాళ్ళు, ఒంటరితనం, ఓట మిని తట్టుకోలేని వాళ్ళు, చదువులు బుర్రకు ఎక్కక పోవడం, చెడు స్నేహాలు..ఒత్తిడిని తట్టుకోలేని సున్నిత మనస్కులు. పట్టణాలకు పెరుగుతున్న వలసలు.పెరిగిపోతున్న సామాజిక, ఆర్థిక అంత రాలు.కనుచూపుమేరలో దొరికే మత్తు పదార్థాలు. పరీక్షలో, ప్రేమలో, ఫెయిల్‌ అయినవారు, స్తబ్దుగా మారిన బతుకులో కొంత ఉత్తేజం కోసం ఎదురు చూసే వాళ్ళు పాశ్చాత్య పోకడలు, టీవీ, సినిమా, మీడియా ప్రభావం ఇత్యాదికారణాలవల్ల యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తమ విలువైన కాలాన్ని, ఆరోగ్యాన్ని, జీవితాన్ని కోల్పోతున్నారు. కిక్‌ కోసమో, థ్రిల్‌ కోసమో ప్రారంభించిన ఈ అలవాట్లు కాల గమనంలో ఇవి వదులుకోలేని వ్యసనాలుగా మారి క్రమేపీ యువత వీటికి బాని సలై బలైపోతున్నారు. ఒక్కసారి ఈడ్రగ్స్‌ విష వలయంలో చిక్కుకుంటే చాలు, మరలా వెనక్కి తిరిగి రావడం చాలా కష్టం. ఈలోపు కెరీర్‌ అంతా సర్వనాశనం అవుతుంది. యువత దీనికి ఎక్కువ ఆకర్షితులవుతున్నారు.డ్రగ్‌ వ్యసనం నుండి వెనక్కి తిరిగి రాలేని వాళ్ళు మరణం పాలవు తున్నారు. కొందరైతే డ్రగ్స్‌ లభించక బలవన్మ రణం పాలవుతున్నారు. మాదక ద్రవ్యాల వినియో గంలో బానిసలుగా చిక్కుకున్న యువతను దాని నుంచి బయటపడేసే విషయంలో ప్రభుత్వాలు సామాజిక సంఘాలు తమ వంతు కృషి జరుపు తున్నప్పటికీ డ్రగ్స్‌ మాఫీయా మాత్రం వెనుకడుగు వేయడం లేదు.ఎవరు తెస్తున్నారో.. ఎలా సరఫరా చేస్తున్నారో తెలియదు కానీ పోలీసులు, నిఘా సంస్ధల కళ్ళు కప్పి రహస్య ప్రాంతాల్లో ఈ డ్రగ్స్‌ దందా నిరాటంకంగా కొనసాగుతూ ఉంది. ఈ విషయంలో స్ధానిక ముఠాలు,అంతర్జాతీయ గ్యాంగులు మార్కెట్‌లో మాదక ద్రవ్యాలను కుమ్మ రిస్తూనే ఉన్నాయి. మాదకద్రవ్యాల ఉత్పత్తి, సర ఫరా,సేవనం విషయంలో కఠిన చర్యలు తీసు కుంలున్నప్పటికీ డ్రగ్స్‌మాఫియా తమ కార్య కలా పాలను మాత్రం నిర్విఘ్నంగా కొనసాగిస్తుంది.
మాదకద్రవ్యాలు తెచ్చే అనర్ధాలు
శారీరక ఆరోగ్యం,మానసిక ఆరో గ్యం,సామాజిక ఆరోగ్యం ఈమూడు కూడా సం పూర్ణ ఆరోగ్యానికి ప్రధాన హేతువులు. అయితే మాదక ద్రవ్యాల వినియోగం ద్వారా ఈ మూడు నశించి పోతున్నాయి. వీటి వినియోగం ద్వారా ప్రాధమికంగా విచక్షణ కోల్పోతారు. మాదకద్ర వ్యాలు,ఉత్ప్రేరకాలకు ఒకసారి బానిసలైన తర్వాత వీటిని పొందటం కోసం ఎంతటి అకృత్యాలు, అత్యాచారాలు, నేరాలు చేయడానికైనా యువత వెనుకాడరు. డ్రగ్స్‌ నేరుగా మెదడుపైన, కేంద్ర నాడీ వ్యవస్థపైన ప్రభావం చూపుతాయి. ఇది డ్రగ్స్‌ వల్ల తలెత్తే తక్షణ దుష్ప్రభావం. వీటిని వాడుతుండే కొద్దీ శరీరంలోని ఇతర వ్యవస్థల పైనా దారుణమైన దుష్ప్రభావాలు పెరిగిపోతా యి. చివరకు అకాల మరణాలకు కారణమవు తాయి. డ్రగ్స్‌ వల్ల శరీరానికి వాటిల్లే ప్రధానమైన అనర్థాలు చూస్తే.. గుండె లేదా ఊపిరితిత్తుల వ్యాధి, కేన్సర్‌, మానసిక అనారోగ్యం, హెచ్‌ఐవీ, హెపటైటిస్‌ సంక్రమించే అవకాశాలు ఎక్కువ. ప్రదానంగా రోగనిరోధక వ్యవస్థ బాగా దెబ్బతిం టుంది. జీర్ణవ్యవస్థ పనితీరు దెబ్బతిని, శరీరం శుష్కించిపోతుంది. లివర్‌పై విపరీతమైన ఒత్తిడి ఏర్పడి, చివరకు అది పూర్తిగా పనిచేయని స్థితి ఏర్పడుతుంది.
ఊపిరితిత్తుల పనితీరు మందగింపు
రక్తనాళాలు కుంచించుకుపోయి, రక్తప్రసరణకు ఆటంకాలు ఏర్పడతాయి. జ్ఞాపకశక్తి క్షీణించ డంతో పాటు ఏకాగ్రత లోపిస్తుంది. మెదడు దెబ్బతిని మూర్ఛ, పక్షవాతం వంటి పరిస్థితులు కూడా తలెత్తుతాయి. మూత్రపిండాలు దెబ్బతిన డం వంటి దీర్ఘకాలిక సమస్యలు వస్తాయి. ఎదురు గా ఏం జరుగుతోందో అర్థంచేసుకోలేని గందర గోళ పరిస్ధితి ఏర్పడుతుంది. పరిస్థితులను గ్రహిం చి వాటికి అనుగుణంగా స్పందించే శక్తి పూర్తిగా నశిస్తుంది. మత్తుకు బానిసలుగా మారి విచక్షణా జ్ఞానాన్ని కోల్పోతారు. వైద్య నిపుణుల పరిశోధ నలు ప్రకారం మాదక ద్రవ్యాలకు బానిస అయిన వారిలో 25 శాతం మంది శారీరక సమస్యలకు గురవుతారు.42శాతం ఒత్తిడికి,మానసిక సమస్య లతో బాధపడతారు. 25 శాతం మంది భార్యల నుండి విడాకులు కోరుతున్నారు.40శాతం నేర పూరిత ఆలోచనలతో గడుపుతున్నారు. యువత విషయంలో చూస్తే 45శాతానికి పైగా సెక్స్‌ లో విఫలమవుతున్నారు.24 శాతం మంది స్థూల కాయంలాంటి సమస్యలతో బాధపడుతుంటారు. మాదక ద్రవ్యాలకు అలవాటుపడిన యువత వారి అలవాట్లను అవసరాలను తీర్చుకునే నేపథ్యంలో సంఘ విద్రోహుల వలలో చిక్కి, అసాంఘిక శక్తులుగా మారుతున్నారు. వీటి ఫలి తంగా ఉత్సాహంతో ఉరకలెత్తాల్సిన యువత, జవసత్వాలు సన్నగిల్లి యవ్వనంలోనే శారీరకం గా మానసికంగా నిర్వీర్యమైపోతున్నారు.ఈ విధంగా డ్రగ్స్‌ మత్తులో పడి యువత నిర్వీర్యమై పోయిన దేశాలు మన కళ్ల ముందే ఎన్నో ఉన్నాయి. మానవ అక్రమరవాణా, దోపిడీలు, హత్య లు, గృహ హింస, వేధింపులు వంటి ఎన్నో నేరాలకు డ్రగ్స్‌ వినియోగమే మూల కారణమవు తోంది. ఏది ఏమైనా ఈ మాదక మహమ్మారి వినియోగం, దానికి బానిస కావడమనేది తల్లిదం డ్రుల కలలనే కాదు, మన దేశ భవిష్యత్తునే కాల రాస్తోందని చెప్పవచ్చు.
నివారణ సాధ్యమే
ఆరోగ్యాన్ని ఛిద్రం చేసి ఆయుష్షును హరించే ఈ మత్తు మహమ్మారి విష వలయంలో చిక్కుకున్న తరువాత దాని నుంచి బయటపడటం కష్టమే కానీ అసాధ్యం కాదనే చెప్పాలి. ఇందుకు అందుబాటులో ఉన్న మార్గాలలో మందులు, కౌన్సిలింగ్‌, బిహేవిరియల్‌ థేరపీ వంటి వాటి ద్వారా బయట పడవచ్చు. కాకపోతే, దీనికి కాస్త సమయం, సహనం, కృషి కావాలి. ఇది దీర్ఘకాల ప్రక్రియ. దీనికి కుటుంబం సహకారంతోపాటు వైద్య నిపుణుల అవసరం కూడా తోడవ్వాలి. ప్రధానంగా మాదకద్రవ్యాల బారి నుంచి బయట పడాలనే గట్టిసంకల్పం డ్రగ్స్‌ వాడే వారిలో ఉండాలి. అయితే ఇలా సంకల్పించిన ప్రతీ సారి ఏదో ఒక విఘ్నం తారసపడుతూనే ఉంటుంది. అటువంటి సందర్భంలో నిగ్రహంగా నిలబడి వైద్యుల సలహాలు కుటుంబ సభ్యుల సహకారం మానసిక వైద్యుల కౌన్సిలింగ్‌ తీసుకోవడం అనేది చాలా కీలక పాత్ర వహిస్తుంది.ఎందుకంటే వీరు డ్రగ్స్‌ వాడకానికి దోహద పడిన కారణాలు విశ్లేషణ చేసి దాని నుండి బయట పడటానికి అవసరమైన కౌన్సిలింగ్‌ మానసిక వైద్యులు అందిస్తారు.మాదక ద్రవ్యాల ఉచ్చు నుండి బయట పడాలంటే ముందుగా దానికి దోహద పడిన కారణాలు నిర్ములించాలి. ఇది కేవలం మానసిక వైద్యుల కౌన్సిలింగ్‌ ద్వారానే సాధ్యమవుతుంది. ఇవన్నీ తీసుకుంటూ సడలని మనో సంకల్పంతో నిలబడగలిగితే ఈవిషవలయం నుండి బయట పడటం అసాధ్యం ఏమీ కాదు. ఇవన్నీ పాటిస్తూ డ్రగ్స్‌కు బానిస అయిన వాళ్ళుకూడా గట్టి సం కల్పంతో ఈ విషవలయం నుండి బయట పడిన వాళ్ళు ఎందరో ఉన్నారు.
తల్లిదండ్రులదే ప్రధాన బాధ్యత
చాలా మంది తల్లి తండ్రులు తమ పిల్లల విషయంలో మార్కులు ర్యాంకులు మాత్రమే పరమావిధిగా చూస్తున్నారు తప్ప తమ పిల్లల మానసిక పరివర్తన వ్యవహారశైలి గురించి పట్టించుకోవడంలో శ్రద్ద చూపడం లేదు.వారికి కావలసిన పాకెట్‌ మనీ అందచేస్తూ వాళ్ళు ఏ విధంగా ఖర్చు చేస్తున్నది అసలు పరిశీలించడం లేదు. తల్లితండ్రులలో ఎక్కువ మంది తమ పిల్లలు బుద్ది మంతులని ఇల్లు బడి తప్ప మరొక ప్రపంచం తెలియదు అంటూ పిల్లలపై అపార నమ్మకం చూపిస్తారు. పిల్లలపై నమ్మకం, ప్రేమ చూపించడంలో తప్పులేదు. చూపించాలి కూడా. అయితే అదే సమయంలో ఆనమ్మకం అతి కాకూడదు. నిజంగా ఆడ్రగ్‌ మహమ్మారి మన ఇంట్లోనే మన పిల్లల చెంత తిష్ట వేసినప్ప టికీ దానిని గమనించే అవకాశాన్ని మనకు ఇవ్వదు. ఈ స్ధితిలో పరిస్ధితి చేయి దాటి పోయిన తరువాత బాధపడి ప్రయోజనం ఉండదు. అందుచేత ప్రతీ తల్లితండ్రులు తమ బిడ్డపై నమ్మ కంతో పాటు బిడ్డ వ్యవహార శైలి బట్టి అను మానం కూడా కలగాలి. అప్పుడే పెను ప్రమాదం నుండి బిడ్డను బయట పడేసే అవకాశం మనకు చిక్కుతుంది.ఈ విషయంలో తల్లి తండ్రులదే కీలక పాత్ర అని చెప్పడంలో ఎటువంటి సందే హం లేదు.డ్రగ్స్‌ బారిన పడిన వారిని దండిర చడం, బెదిరించడం, వారితో వాదించడం వారిని చిన్నబుచ్చకునేలా చేయడం ఆత్మన్యూనత కలిగేలా వ్యవహరించడం వంటి చర్యలు ద్వారా వారిని డ్రగ్స్‌ వ్యసనం నుంచి ఎట్టి పరిస్ధితులలో కూడా బయట పడేయలేమని ముందుగా తల్లి తండ్రులు గుర్తించాలి. డ్రగ్స్‌ వాడకం వలన తలెత్తే దుష్పరి ణామాల గురించి పిల్లలకు చాలా ఓపికగా వివరించాలి. ఈ వ్యసనం నుండి బయటపడితే సమాజంలో మనం తిరిగి గౌరవ ప్రద జీవితాన్ని పొందగలం అనే ఆశాజనకమైన ప్రేరణ కలిగిం చే మాటలు చెప్పాలి. దానివలన ఖచ్చితంగా అనుకూల ప్రభావాన్ని సాదించవచ్చు.
ఔషధం కన్నా కౌన్సిలింగే కీలకం
నేడు వైద్య విధానంలో డ్రగ్స్‌ నుండి విముక్తి చేయడానికి అనేక ఆధునిక ప్రక్రియలు అందుబాటులోనికి వచ్చినా డ్రగ్స్‌ బారిన పడిన వారిని బయట పడేయడానికి ఔషధాలు కన్నా కౌన్సిలింగ్‌ చాలా బలమైన ప్రభావం చూపిస్తుంద నడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మాదకద్రవ్యాలకు బానిస కావడం అనేది ఒక జబ్బు.వాటికి అలవాటు పడిన వాళ్ళను మనం ఒక రోగిలా మాత్రమే చూడాలి తప్ప నేరగాడిలా చూడకూడదు. పిల్లవాడిని నిర్బంధిస్తే ఆ మహ మ్మారి నుంచి బయట పడేయవచ్చు అని భావించే తల్లి తండ్రులు లేకపోలేదు. ఈ తరహా అభిప్రా యం సమస్యను మరింత జఠిలం చేస్తుంది తప్ప పరిష్కారం మాత్రం లభించదు.డ్రగ్స్‌ ఊబి నుంచి బయట పడాలంటే వైద్య సహాయం ఎంత అవసరమో కుటుంబ సభ్యుల సహకారం అంత కన్నా ఎక్కువ అవసరం. అందుచేత వైద్యులు రోగి కన్నా ముందు కుటుంబ సభ్యులకు కౌన్సి లింగ్‌ ఇస్తారు. ఇది వీరు పాటించగలిగితే తప్పక మంచి ఫలితాలు లభిస్తాయి. పిల్లవాడిని నువ్వు చేస్తున్నది తప్పుఅని చెప్పకుండా కౌన్సిలింగ్‌ ద్వారా తాను చేస్తున్నది తప్పు ఈఉచ్చు నుంచి నేను బయట పడాలి అనే సంకల్పం ప్రారంభం అయ్యే విధంగాచూడాలి. ఇదికనుక పిల్ల వాడిలో మనం రప్పించగలిగితే సగం విజ యం సాధించి నట్లే. దీనిని బట్టి ఔషధం కన్నా కౌన్సిలింగ్‌ కీలకం అని వైద్యుల చేపట్టిన అనేక కేసుల ద్వారా స్పష్టం అయ్యింది.
మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్ట చర్యలు
విశాఖపట్నంజిల్లాలో మాదకద్రవ్యా ల రవాణాను అరికట్టేందుకు పోలీసుశాఖ తీసు కున్న చర్యల ఫలితంగా దాదాపు రెండేళ్లుగా కేసులు తగ్గుతూ వస్తున్నాయని జిల్లాకలెక్టర్‌ డా.ఎ.మల్లిఖార్జున పేర్కొన్నారు. పోలీస్‌ శాఖ, నగర పోలీస్‌ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వార్షిక నేర సమీక్ష సమావేశం డిసెంబర్‌ 27న ఏయూ కన్వెన్షన్‌ సెంటరులో జరిగిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ డా.ఎ.మల్లిఖార్జునతోపాటు నగర పోలీస్‌ కమిషనర్‌ డా.ఎ.రవిశంకర్‌, జాయింట్‌ కలెక్టర్‌ కె.ఎస్‌.విశ్వనాథన్‌,జీవీఎంసీ కమిషనర్‌ సీఎం సాయి కాంత్‌ వర్మ, డీసీపీలు పి వెంకటరత్నం, కె.ఆనంద్‌ రెడ్డి, కె. శ్రీనివాసరావులు, రెవిన్యూ, జ్యుడీషియల్‌, ఇతర శాఖల అధికారులు హాజర య్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లా డుతూ జిల్లా స్థాయి కమిటీ సభ్యుల సూచనల మేరకు పోలీసు శాఖ తీసుకున్న చర్యల వలన మాదకద్రవ్యాల అక్రమ రవాణా అరికట్టడంలో, నివారించడంలో ప్రజలు, కళాశాల విద్యార్థుల్లో కూడా అవగాహన పెరిగినట్లు చెప్పారు. వి.ఎం. ఆర్‌.డి.ఏ, జి.వి.ఎం.సి.పోలీసు శాఖల సహకా రంతో నగరంలో ట్రాఫిక్‌ సమస్యలు తగ్గి ప్రమా దాల సంఖ్య కూడా తగ్గినట్లు కలెక్టర్‌ తెలిపారు. దీనికి పోలీసు, ఇతర శాఖల సహకారం కూడా ఉందన్నారు. నగర పోలీస్‌ కమిషనర్‌ డా.ఎ. రవిశంకర్‌ మాట్లాడుతూ జిల్లాలో మాదకద్రావ్యల అక్రమ రవాణాను అరికట్టేందుకు గట్టి నిఘాతో పాటు పటిష్ట చర్యలు చేపట్టినట్లు చెప్పారు. నగర పోలీసు అధికారులు మరింత సమర్ధవంతంగా పోలీసింగ్‌ చేయడానికి అవసరమైన విధానాల గురించి పేర్కొన్నారు. తమ శాఖ నుండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, ఈ ఏడాది కాలంలో నగరంలో లా అండ్‌ ఆర్డర్‌, ట్రాఫిక్‌, క్రైమ్‌లపై ఆయా అధికారులతో విశ్లేషించిన ఆయన ఉత్తమ పోలీసింగ్‌ కోసం రాబోవు సంవ త్సరంలో తీసుకోవలసిన చర్యలను వివరించారు. సమావేశంలో ఎస్‌.ఇ.బి అడిషనల్‌ ఎస్‌.పి బి.శ్రీనివాసరావు,ఉపరవాణా కమీషనర్‌ జి.సి. రాజరత్నం,ఆర్డీవోలు హుస్సేన్‌ సాహెబ్‌,భాస్కర రెడ్డి, ఎన్‌.హెచ్‌.ఎ.ఐ. ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ప్రభాత్‌ రంజన్‌,డీఈవో కె.చంద్రకళ, సమగ్రశిక్ష ఏ.పి.సి శ్రీనివాసరావు, నగర ఏ.డి.సి.పిలు, ఏ.సి.పిలు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

విధి విసిరే చివరి అస్త్రం ముసలితనం

వృద్ధాప్యపు బందిలదొడ్డిలో నువ్వు ఒంటరివి.వృద్ధోపనిషత్‌లోని ప్రతీ పేజీ ‘మసకే’, సాయం తక్కువ. సలహాలు ఎక్కువ. మనిషి ఏడో ఋతువే ‘‘వృద్ధాప్యం’’.కాలధర్మంలో దేహధర్మమే ‘‘వృధ్ధాప్యం’’.మంచం మీద వెల్లకిలా పడుకొని ఆకాశం వైపు చూస్తూ ఉంటావు. గగనంలో నక్షత్రాలు ఒక్కొక్కటిగా మాయమైపోతూ ఉంటాయి. ఈ లోకంలో పుట్టిన ప్రతీవాడు’’వృద్ధోపనిషత్‌’’లో భాగస్వామి కాక తప్పదు.
జీవితం భళ్లున తెల్లవారుతుంది. మెల్లగా చీకటి పడుతుంది. వృద్ధుడికి వెన్నుపై కళ్ళుంటాయన్న ఓ నానుడి వుంది. అంటే వృద్ధాప్యంలో వెనుక చూపే తప్ప ముందు చూపు వుండదు. జీవితంలో మనం ఎన్నో సాధించి ఉండవచ్చు గాక.
మన కీర్తి నాలుగు దిక్కులా ప్రసరించి ఉండొచ్చుగాక అయితే వృద్ధాప్యంలో దాన్నెవరూ గుర్తించరు. అసలు పట్టించుకోరు. ఓసారి సీనియర్‌ సిటిజన్‌ బడిలోకి అడుగుపెడితే సమాజం మనగురించి పట్టించు కోదు. పాత వస్తువులా ఓపక్కన పడేస్తుంది.‘‘ఆరోజుల్లో నేను’’ అంటూ గత వైభవ చర్విత చర్వణం తప్ప భవిష్యత్‌ ఆలోచన వుండదు.
కాళ్ళు,కీళ్ళు,ఒళ్ళు సడలి,కదల్లేక,మెదల్లేక,దేహాన్ని వదల్లేక, ఏమీ చేయలేక, వృద్ధులు పడే మనోవ్యధ అంతా ఇంతాకాదు.వృద్ధాప్యం అనేసరికి అదేదో శాపంగా భావిస్తుంటారు జనం. నిజానికి వృద్ధాప్యం శాపమోపాపమో కాదు. అది ప్రకృతి పరమధర్మం. వృద్ధాప్యంరాగానే బయటి వాళ్ళు సరే కుటుంబసభ్యులు కూడా చులకనగాచూస్తారు. నిన్న మొన్నటిదాకా తలొంచిన వానపాములు సైతం తలెగరేసి, నిలదీస్తాయి. లెక్కలు అడగటం మొదలెడతాయి. ‘‘ఏమండీ / నాన్నగారూ.’’ అంటూ విధేయంగా వుండే భార్యాపిల్లలు కూడా ధిక్కరించడం మొదలు పెడతారు. వాళ్ళేదో పుడిరగులన్నట్లు లేనిపోని సలహాలు, సూచనలిస్తుంటారు. ఏంమాట్లాడినా,యేం చేసినా వాళ్ళకు నచ్చదు సరికదా ‘చాదస్తం’ అంటూ కరివేపాకులా తీసిపారేస్తారు. లోకువ గా చూస్తారు. మధ్యతరగతి కుటుంబం అయితే,మనం సంపాదించిన డబ్బు ఆసుపత్రి ఖర్చుల కోసం ఖర్చు పెట్టాలా? లేక చూసీ చూడనట్టు మరణం కోసం వేచి ఉండాలా అన్న ఆలోచనతో మన పక్క గదిలో మనవాళ్ళే చర్చిస్తూ ఉంటారు.అర్ధరాత్రి ఏ నొప్పితోనో నీకు మెలకువ వస్తుంది. పక్క గదిలోని వారికి నిద్రాభంగం చేయాలా వద్దా అన్న ఆలోచన తోనే తెల్లవారుతుంది. ఆరాత్రి నిద్ర కరువవుతుంది.
చివరి మజిలీ !!
మనిషి జీవన ప్రయాణంలో చివరి మజిలీ వృద్ధాప్యం. మనం కాదనుకున్నా కూడా కోరి వస్తుంది వృధ్ధాప్యం. మనిషి జీవితం ఋతువు లతో ముడిపడి వుంటుంది. వసంత ఋతువుతో మొదలయ్యే కాలం శిశిరంతో ముగుస్తుంది. వసంతకాలం మన పుట్టుక అనుకుంటే,శిశిరం వృద్ధాప్యం. వసంతంలో ప్రకృతి ఆకుపచ్చగా,రంగురంగుల పూలతో మురిపిస్తుంది.మనసు ఉల్లాసభరితమవుతుంది. ఇక శిశిరానికొచ్చేసరికి ఆకులు పండి, ఎండి, రాలి, చెట్లు మోడులవుతాయి. అలాగే వృద్ధా ప్యంలో మనిషి దేహం కూడా ఒడలి, ఎండిన మోడవుతుంది. అయితే వృద్ధాప్య దశకు చేరుకున్నారంటే జీవితంలో వాళ్ళు ఎన్నెన్ని చూసివుంటారు. ఎంత అనుభవంగడిరచి వుంటారో!ఒక్క సారి ఆలోచిస్తే తెలుస్తుంది. అందుకే వృద్ధుల్ని భారంగా కాకుండా గౌరవంగా చూడాలి.వారి అనుభవాన్ని యువతరం చూపుడువేలుగా తీసుకొని ముందుకు నడవాలి.అప్పుడు వాళ్ళ భవిష్యత్తు మహత్తరంగా వుంటుంది.కానీ దురదృష్టం యేమంటే, వృద్ధుల్ని గౌరవించడం అటుంచి అసలు లెక్కేచేయరు. కొందరైతే ముసలాళ్ళను భరించలేక వృద్ధాశ్రమాల పాలు చేస్తారు. ఇవాళ మనం చేసిందే రేపు మన పిల్లలు కూడా చేస్తారన్న సోయి ఏమాత్రం వుండదు. ఏతావాతా వృద్ధాప్యం శాపంగా మారుతుంది. యవ్వనంలో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ మానేసి ఆ డబ్బు పిల్లల కాలేజీ ఫీజు కట్టేస్తాం. మధ్య వయసులో సంపాదించింది ఖర్చుపెట్టి పిల్లల్ని విదేశాలకు పంపుతాం. నాకొడుకు అమెరికా లోనో, ఇంకేదో దేశంలో వున్నాడనో, కూతురు ఆస్ట్రేలియా లోనో ఇంకేదో దేశంలో ఉన్నదనో గర్వంగా చెప్తూ ఫాల్స్‌ ప్రిస్టేజి ఫీలవుతాం. అంతా బాగానే వుంటుంది. పిల్లలూ విదేశా ల్లో సెటిలైపోయి బాగుంటారు. మన వృద్ధా ప్యంలో మాత్రం వాళ్ళు కనీసం చూడటానికి కూడా రారు. అప్పుడప్పుడు సీజనల్‌గా వచ్చే సెల్‌ ఫోన్‌ కాల్స్‌ తోనే సరిపెట్టుకోవాలి. తృప్తి పడాలి. కొడుకో, కూతురో,మనవడో గుర్తొచ్చి, వాళ్ళతో మాట్లాడాలని ఫోన్‌ చేస్తే ‘సారీ.! బిజీ.’ అంటూ సమాధాన మొస్తుంది.పుట్టిన కొత్తలో పక్క మీద శిశువు నెలల తరబడి కదలకుండా ఎలా ఉంటుందో, వృద్ధాప్యంలో తిరిగి అదే పరిస్థితి సంభవిస్తుంది. అయితే ఒకటే చిన్నప్పుడు ఆలనాపాలనా చూసుకోవ టానికి కన్నతల్లి ఉంటుంది. వృద్ధాప్యంలో ఎవరూ వుండరు. అదృష్టం బాగుంటే అప్పుడ ప్పుడూ వచ్చి పలకరించే కూతురు తప్పదన్న ట్టు సేవలు చేసే కోడలూ వుండొచ్చు. అనాథా శ్రమంలో అయితే వాళ్ళుకూడా ఉండరు. అయితే ఇది అందరికీ జరుగుతుందని కాదు.కొందరుంటారు అదృష్టవంతులు తల్లిదండ్రుల్ని ప్రేమించే పిల్లలూ వుంటారు. అలాంటివాళ్ళు తల్లిదండ్రులు వృద్ధులైనా నెత్తిన పెట్టుకొని ఎంతో ప్రేమతో చూసుకుం టారు. బతుకంతా బుద్ధిబలం మీద ఆధార పడ్డ వారికి ముసలితనం కన్నా పెద్ద శిక్ష వుండదేమో? బాగాబతికిన మహామహులే ముసలితనం రాగానే దిగజారి హీనమై పోవడం చూస్తూనే ఉంటాం. ఇలాంటి అవస్థనుతలుచుకుంటేనే భయమేస్తుంది. భగవాన్‌.!ఇలాంటి దురవస్థ ఎవరికీ రాకూడదు. ఇందులో నుంచి అందర్నీ తప్పించు తండ్రీ.
వృద్ధాప్యం శాపం కాదు..ఓ వరం.
ఏకాంతంలో సంగీతాన్ని వింటూ కాలక్షేపం చెయ్యొచ్చు.ఓపిక, సదుపాయముంటే పెరటి మొక్కల్ని పరిరక్షిస్తూ కాలం గడపోచ్చు.చిన్న పిల్లలుంటే కొద్ది సేపు వారికి ఇంటరెస్టు ఉన్న టాపిక్స్‌ కబుర్లు చెప్పుకోవచ్చు, ఆడుకో వచ్చు.ఏం చేసినా అఫెక్షన్‌ బ్యాంక్‌లో ఆప్యాయతని క్రెడిట్‌ చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైతే మనం మానసికంగా ఇలా ప్రిపేర్‌ అవుతామో?మన వృద్ధాప్యాన్ని ఓ పది సంవత్సరాలపాటు వాయిదా వెయ్యొచ్చు. సో..ఇప్పటికే సీనియర్‌ సిటిజన్స్‌ అయిన వారు, భవిష్యత్తులో సీనియర్‌ సిటిజన్స్‌ కాబోయేవారు జీవితాల మీద ఓలుక్కేసి వుంచుకోండి.!?
వృద్ధాప్య సంరక్షణ కోసం కొత్త దృష్టి
భారతదేశం పెరుగుతున్న పట్టణీకరణ మరియు కుటుంబాలు చిన్న యూనిట్లుగా విడిపోవడంతో,వృద్ధుల కోసం గృహాలు పుట్టుకొచ్చాయి. వృద్ధుల సంరక్షణ అనేది వృద్ధాప్య సేవలపై ఆసక్తి ఉన్న నిపుణులు లేదా స్వచ్ఛంద సంస్థలచే నిర్వహించబడు తుంది. అర్బన్‌ మరియు సెమీ అర్బన్‌ ఇండి యాలో ఇటువంటి సంరక్షణ గృహాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ గృహాలు చెల్లించ బడతాయి లేదా ఉచిత లేదా సబ్సిడీ సేవను అందిస్తాయి. సాధారణంగా, ఇటువంటి గృహాలు ప్రభుత్వం నుండి మద్దతుతో ఎన్‌జీఓ లు మతపరమైన లేదా స్వచ్ఛంద సంస్థలు లేదా స్థానిక పరోపకారిచే నిర్వహించబడ తాయి.వారు తమ నివాసి తులకు వసతి, సకాలంలో సంరక్షణ మరియు భద్రతా భావాన్ని అందిస్తారు.ఈ గృహాలకు నియం త్రణ పర్యవేక్షణ లేకపోవడంతో సేవ యొక్క నాణ్యత మారుతూ ఉంటుంది. చాలా గృహా లలో స్పష్టంగా స్థాపించబడిన ప్రామా ణిక ఆపరేటింగ్‌ విధానాలు లేవు మరియు ఆరోగ్య సంరక్షణకు వారి రిఫరల్‌ మార్గాలు అనధికారి కంగా ఉంటాయి. వారి నివాసితుల మానసిక ఆరోగ్యంపై ఈగృహాల ప్రభావంతో సహా అటు వంటి సంస్థలలో జీవన నాణ్యతను అర్థం చేసుకోవడం అత్యవసరం.వృద్ధుల గృహాలకు అధికారిక విధానం భారతదేశానికి ఒక ముఖ్యమైన విధానం మరియు ప్రణాళిక సమస్య. భారతదేశం యొక్క వృద్ధాప్య జనాభా (60 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు) 2050 నాటికి దాదాపు 8% నుండి దాదాపు 20%కి పెరుగుతుందని వరల్డ్‌ పాపులేషన్‌ ఏజింగ్‌ రిపోర్ట్‌ పేర్కొంది.2050 నాటికి, వృద్ధుల శాతం 326 పెరుగు తుంది, 80 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయ స్సు ఉన్న వారి సంఖ్య 700 పెరగ నుంది, దీనితో వారు భారతదేశంలో అత్యంత వేగం గా అభివృద్ధి చెందుతున్న వయస్సు గల సమూ హంగా మారతారు. ఈ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, మా పాలసీ ఫ్రేమ్‌వర్క్‌ మరియు సామాజిక ప్రతిస్పందనలు ఈవాస్తవి కతకు అనుగుణంగా ఉండటం చాలా అవసరం. వృద్ధాప్యం అంటే భారమేనా?
జీవన ప్రమాణాలు పెరిగినందుకు సంతోషించాలా? వయోభారాన్ని పెద్దలు మరికొంతకాలం మోయాల్సి వస్తున్నందుకు చింతించాలా? అత్యాధునిక వైద్య పరిజ్ఞా నానికి మురిసిపోవాలా? కార్పొరేట్‌ దవాఖా నల మోతలను తలుచుకునివణికి పోవాలా? ఎలా చూసినా.. వృద్ధాప్యం సంక్షోభంలో పడుతున్న ఛాయలే కనిపిస్తున్నాయి.వయసుతో పాటు వచ్చే ఆరోగ్య సమస్యలతో పాటు.. ఆర్థికం నుంచి సామాజికం వరకు అనేకానేక సవాళ్లు చిరాకుపెడుతుంటాయి. వాటన్నిటికి పరిష్కారాలు అసాధ్యం కానేకాదు. ముందు జాగ్రత్తతో, పరిపూర్ణ అవగాహనతో ఆ సంక్షో భాన్ని దాటేయవచ్చు. వి.ఎస్‌.అచ్యుతా నందన్‌! భారతీయ ఫిడెల్‌ క్యాస్ట్రోగా పేరు పొందిన ఈ కమ్యూనిస్టు నేత ముఖ్యమంత్రి పదవి చేపట్టే సమయానికి, ఆయన వయసు 83 ఏండ్లు. లాటరీ మాఫియా, అక్రమ కట్టడాల కూల్చివేత లాంటి విషయాల్లో దూకుడుగా వ్యవహరించారు.97ఏండ్లు వచ్చే వరకూ పార్టీలో క్రియాశీలకంగానే ఉన్నారు. మన్మోహన్‌ సింగ్‌! చరిష్మా లేకున్నా, మాటల మాంత్రికుడు కాకున్నా వ్యక్తిత్వంతో, మేధస్సు తో అత్యున్నత స్థానానికి చేరుకున్న వ్యక్తి. 82 ఏండ్ల వయసులోనూ దేశాన్ని నడిపించిన మౌని. మన్మోహన్‌ ప్రధానిగా ఉన్నప్పుడు ప్రతి పక్ష నేతగా ఉన్న అద్వానీ కూడా ఎనిమిది పదులు దాటినవారే. ఇలాంటి నేతలెందరో, వయసును ఓ సంఖ్యగానే భావించారు. చురుకైన ప్రజా జీవితం గడిపారు. ఆ మాట కొస్తే నేతలే కాదు అన్నా హజారే లాంటి సామాజిక కార్యకర్తలు సైతం రాజీలేని పోరుతో సమాజాన్ని ప్రభావితం చేస్తున్నారు. మిలీనియల్‌ తరం మధ్య ఉంటూనే తాము నమ్మిన విలువల కోసం పోరాడుతున్నారు. గుల్జార్‌, శ్యామ్‌ బెనెగల్‌,రోమిలా థాపర్‌..80 ఏండ్లు దాటినా తమవైన రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ ఓ వ్యక్తిగా కాకుండా, వ్యవస్థకు మార్గ దర్శిగా ఉన్న వృద్ధుల జీవితాలు ఏమేరకు సౌకర్యంగా ఉన్నాయి? అనే ప్రశ్నకు సవాళ్లే జవాబుగా నిలుస్తున్నాయి.
వైద్యం.. ఖరీదైన వ్యవహారం
వృద్ధుల ఆరోగ్య సమస్యల గురించి చాలా మందికి అవగాహన ఉండే ఉంటుంది. కణ విభజనలో లోపంవల్ల వయసుతో పాటు అవయవాలూ బలహీనపడుతూ ఉంటాయి. ఇక డయాబెటిస్‌ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు, వార్ధక్యంలోని ఒంటరితనంతో వచ్చే కుంగుబాటు లాంటి సమస్యలు సరేసరి. ఆ వయసులో వీటికి మందులు వాడటమే ఆర్థికంగా పెను భారం. ఇక హాస్పిటల్‌లో చేరాలన్నా, శస్త్రచికిత్స అవసరమైనా..ఆస్తుల మీద ఆశ వదులుకోవాల్సిన పరిస్థితి. కారణం! ఆసుపత్రి ఖర్చులకు అండగా నిలిచే ఆరోగ్య బీమా వీరికి అంత తేలికగా వర్తిం చదు. ఓఅయిదు లక్షల పాలసీ తీసుకో వాలన్నా.. నెలనెలా వేలకు వేలు ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. ఇక దీర్ఘకాలిక అనారో గ్యం ఉన్నవారిని బీమా సంస్థలు అంత త్వరగా కరుణించవు. ఓ ప్రముఖ ఆరోగ్య బీమా సంస్థ టారిఫ్‌ ప్రకారం..రక్తపోటు, మధుమేహం ఉన్న ఎనభై ఏండ్ల వ్యక్తికి పదిలక్షల మొత్తానికి ఆరోగ్య బీమా కావా లంటే వార్షిక ప్రీమియం అక్షరాలా 84వేలు. మరేదో కంపెనీ అందులో సగానికి సగం ప్రీమియం వసూలు చేసినా.. నెలకు దాదాపు నాలుగు వేలు చెల్లించాల్సి ఉంటుంది. దశా బ్దాల క్రితమే రిటైర్‌ అయిపోయి..అప్పటి లెక్కల ప్రకారం పెన్షన్‌ పొందుతున్న వృద్ధు లకు ఇదంతా ఎంత భారం! ఈ సమస్యకు పరిష్కారాలు లేకపోవు. అప్పటికప్పుడు కాకుండా, తక్కువ వయసులోనే పాలసీ తీసుకుంటే.. ప్రీమియంలో రాయితీ వస్తుంది. మిత్రులంతా కలిసి గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ తీసుకునే సౌలభ్యం కూడా ఇప్పుడిప్పుడే మొదలవు తున్నది. ఆరోగ్యం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి..ఆస్తిలో, ఆదాయంలో కొంత భాగాన్ని వైద్యానికి దాచి ఉంచడం మరో పద్ధతి. ఇలాంటి సందర్భాల్లో సమా చారమే కీలకంగా మారుతుంది. కొన్ని స్వచ్ఛంద సంస్థలు మధుమేహం, క్యాన్సర్‌, కుంగుబాటు తదితర సమస్యల మీద కృషి చేస్తూ ఉంటాయి. వాటిని సంప్రదిస్తే తగిన సూచనలు, సలహాలు ఇస్తాయి. ఆ ఎన్జీవోలు నిర్వహించే వైద్య శిబిరాలను కూడా వినియో గించుకోవచ్చు. వృత్తిపరమైన సంఘాల్లో సభ్యు లుగా కొన్ని రాయితీలు దక్కించుకోవచ్చు.ఇక ప్రభుత్వాల తరఫు నుంచి కూడా ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన,ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు ఉన్నాయి. అవి ఎంతవరకు వర్తిస్తా యి అనే అవగాహన కూడా ముఖ్యమే.
టెక్నాలజీ ఆసరా
కంప్యూటర్ల ప్రవేశంతో సాంకేతికత విస్తరిం చింది. కంప్యూటర్‌ వాడని కార్యాలయం.. స్మార్ట్‌ ఫోన్‌ లేని ఇల్లు కనిపించడం లేదు. టెక్నాలజీ ఊసే లేకుండా చదువు, కెరీర్‌ దాటేసిన తరం..హఠాత్తుగా వాటి మీద పట్టు సాధించడం కష్టమే. అందుకు చాలా కార ణాలే ఉన్నాయి.గతంలో ఎన్నడూ పరిచయం లేని క్లిష్టమైన విషయాన్ని నేర్చుకునేందుకు సంకోచించడం.దృష్టి సమస్య కారణంగా.. స్క్రీన్‌ మీది అక్షరాలను చదవలేకపోవడం. ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ ప్రకారం 23 శాతం మంది వృద్ధులు ఈ ఇబ్బందితోనే ఆన్‌లైన్‌కు దూరంగా ఉంటున్నారు. చేతులు వణకడం లేదా వేళ్లు మొద్దుబారిపోవడంవల్ల టచ్‌ స్క్రీన్‌ ఉపయోగించలేకపోవడం.
-(జి.ఎ.సునీల్‌ కుమార్‌)

1 2 3 4 5 6 … 14