రైతు కంట క‌న్నీరు

సంక్రాంతి వచ్చేస్తోంది. అన్నదాత చేతిలో చిల్లిగవ్వ లేదు. పంట విక్రయించి పిల్లాపాపలకు కొత్త బట్టలు కొందా మంటే పండిరచిన ధాన్యం ఇంకా కొనేవారు కనిపిం చడం లేదు. ఆర్‌బికెలకు వెళ్తే తమ శాతం పేరుతో తిప్పి పంపిస్తున్నారు. ధాన్యం ఆరబెట్టాలంటే కళ్లాలు లేవు. తక్కువకు దళారులకు అమ్మలేక సతమతమవుతున్నారు. ఈ ఏడాది వరిసాగుచేస్తే వారిలో 30 శాతం మంది రైతుల పేర్లు వెబ్‌సైట్‌లో కనిపిం చడం లేదని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈసమస్య సరిదిద్దే ప్రయత్నంలో రెవెన్యూ, వ్యవ సాయశాఖలు సంయుక్తంగా పనిచేయాల్సి ఉంది. ఈ రెండు శాఖల్లో పని ఒత్తిడి కారణంగా వెబ్‌సైట్‌ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదు. మరోవైపు ఈ-క్రాప్‌ నమోదు జిల్లాలో శతశాతం పూర్తికాలేదు. దీంతో ధాన్యం విక్రయాలకు ఈ సమస్యలు అడ్డంకిగా మారుతున్నాయి. మరోపక్క తేమ శాతం ఎక్కువగా ఉండటంతో సాగుదారులు పలుమార్లు రైతు భరోసా కేంద్రాల చుట్టూ తిర గాల్సి వస్తోంది. దీంతో చేసేది లేక రైతులు దళారు లను ఆశ్రయించి అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొం టోంది. జిల్లాలో గోనె సంచుల కొరత వేదిస్తోంది. పౌరసరఫరా సంస్థనుంచి సకాలంలో గోనె సంచు లు రాక పోవడంతో ఈ సమస్య తలెత్తు తోంది.

అధికంగా తేమ శాతం
యంత్రాలతో కోస్తున్న వరి ధాన్యంలో ఈ ఏడాది తేమ శాతం అధికంగా ఉంది. ఇప్పటికే వర్షాల వల్ల తడిచి ముద్దవడం,ప్రస్తుతం ఉష్ణోగ్రతలు తగ్గ డం వల్ల ధాన్యం ఆరబెట్టే పరిస్థితి లేదు. దీంతో కళ్లం వద్దే తేమ శాతం పరీక్షలు చేస్తే ఈ ఏడాది 22నుంచి23శాతం నమోదవుతున్నట్టు వ్యవ సాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ నిబం ధనల ప్రకారం17శాతానికి మించి తేమ ఉంటే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేయడం లేదు. తేమ శాతాన్ని తగ్గే వరకు ఆరబెట్టి తీసుకురా వాలని తిప్పిపంపిస్తున్నారు. కానీపగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణస్థితిలో ఉంటేఐదారు రోజుల పాటు ఆరబెట్టాల్సి వస్తుంది. కానీ ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు తగ్గడంతో తేమ శాతం తగ్గడం లేదు.

దళారులను ఆశ్రయిస్తున్న రైతులు
కళ్లాల్లేక ధాన్యాన్ని వేరే ప్రాంతాలకు తరలించి ఆరబెట్టే పరిస్థితులు లేక రైతులు అవస్థలు పడుతు న్నారు. పండిరచిన ధాన్యం ఇతరప్రాంతానికి తర లించి,అక్కడ ఆరబెట్టాలంటే అదనపు ఖర్చు అవు తోంది. దీనికితోడు ఐదారు రోజుల పాటు రెయిం బవళ్లు అక్కడ కాపలా కాయాల్సినపరిస్థితి ఉంది. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినా చేసేది లేక ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. ప్రతి కేంద్రానికీ ఒక తేమ యంత్రం, కనీసం ఐదుగురు సిబ్బంది ఉండాలి.తేమశాతాన్ని పరీక్షించడం,డేటాను కంప్యూటర్‌లో నమోదు చేసేందుకు ఆపరేటర్లు ఉండాలి. వీరుసరిపడా లేరు. సుమారు 60 నుంచి 70లక్షల మధ్య గోనె సంచులు ఉండాలి. ఇంత వరకు కేవలం ఆరు లక్షలే కేంద్రాలకు చేర్చినట్లు అధికారులు చెబుతున్నారు.మిల్లర్ల వద్ద ఉన్న సంచు లు వాడుకోమంటున్నారు. కేంద్రాలకు అను సంధానం చేసిన మిల్లర్లు నిబంధనల మేరకు బ్యాం కు గ్యారెంటీలు సమర్పించాలి. రూ.50లక్షల నుంచి రూ.కోటి చూపించాలి. ఇంతవరకు సగానికి పైగా మిల్లర్లు సమర్పించలేదు. కొనుగోలు చేసే సిబ్బంది శిక్షణ పూర్తి చేయలేదు. మార్కెట్‌ కమిటీ, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, రైతు భరోసా కేంద్రాల సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి.

వసతుల కొరత
జిల్లా వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం నిల్వ చేసేందుకు సరైన వసతులు లేవు. గ్రేడ్‌-1 రకం రూ.1960,కామన్‌ రకంరూ.1940 చొప్పున ప్రభుత్వం ధరను నిర్ణయించింది. ఆధరకు కొను గోలు చేసేందుకు మిల్లర్లు ముందుకు రావడం లేదు. గతంలో ఉభయ గోదావరి జిల్లాల నుంచి వ్యాపారుల వచ్చి పెద్దఎత్తున కొనేవారు. ఇప్పుడు వారి జాడ కూడా లేదు.

కంపెనీలకు కాసులు… రైతుకు కన్నీరు..
కౌలురైతు లక్ష్మీ నర సింహారావు గుంటూరుజిల్లా సత్తెనపల్లి మండలం, రెంటపాళ్ల గ్రామస్థుడు. ఈఏడాది మూడు ఎకరాల్లో మిరప పంట వేశా డు. తామర పురుగు వల్ల పంట దెబ్బ తింది. మూడెకరాలకు కౌలుతోపాటు మూడున్నర లక్షలు పెట్టుబడిపెట్టారు. ఒక్క రూపా యీ రాదు. మరో మూడు ఎకరాల్లో పత్తి పంట వేస్తే కొంతపంటను గులాబి రంగు పురుగు తినేసింది. మిగిలిన కొంత పంటలో ఆధిక వర్షాల కారణంగా ఉన్న పత్తికా యలు కుళ్లిపోయాయి. ఇందులో రెండు ఎకరాలు కౌలు తీసుకున్నారు. ఆ రైతుకు 15లక్షల అప్పు ఉంది. ఎలా తీర్చాలో దిక్కుతోచని పరిస్థితి. మల్లవ రపు మాధవరావు కౌలు రైతు. కృష్ణాజిల్లా గంపల గూడెం మండలం, తునికిపాడు గ్రామ స్థుడు. రెండున్నర ఎకరాలను మిర్చి పంట వేయ డానికి రూ.80వేలు చెల్లించి కౌలుకు తీసుకున్నా డు. తామరపురుగు సోకి మిర్చిపంట పూర్తిగా దెబ్బ తింది. పంటను రక్షించుకు నేందుకు మాధ వరావు వారం రోజుల్లో రూ.15 వేల విలువైన మందులు పిచికారీ చేశాడు. ఫలితం లేదు. రెండు నుంచి మూడు రూపాయల వడ్డీకి అప్పు తెచ్చి రెండున్నర లక్షలు పెట్టుబడి పెట్టాడు. పదేళ్లుగా కౌలుకు సాగు చేస్తున్నాడు. ఇప్పుడు ఉన్నది ఊడ్చి పెట్టుకు పోవడమేగాకలక్షల్లో అప్పు తేలింది. ఆరు గురు కుటుంబ సభ్యులను ఎలా బతికించు కోవాలో అర్థంకానిపరిస్థితుల్లోఅతడు కొట్టుమిట్టాడుతున్నాడు. రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఫెస్టిసైడ్‌ షాపులవారు..పురుగు మందులు ఎక్కువగా కొడితే పంటను కాపాడు కోవచ్చని సంబంధం లేని పురుగు మందులను రైతులకు అంటకడుతున్నారు. ఆశతో పురుగు మందులు కొని పిచికారీ చేస్తున్నారు. షాపు వారికి అప్పులు కూడా పెట్టడానికి లేదు. రొక్కం చెల్లించి మరీ పురుగు మందులు కొనుక్కోవాల్సిన పరిస్థితి. మిర్చి పండిరచే ప్రాంతాల్లోని పురుగు మందుల షాపుల్లో రసాయన మందులు, బయో ఉత్పత్తులు పూర్తిగా ఖాళీ అయిపోయాయి. పురుగు మందుల షాపుల వారికి కాసులు మిగుల్చుతుంటే మిర్చి రైతులకు కన్నీరే మిగులుతోంది. ఒక వైపు అధిక వర్షాలు,కల్తీ,నాశిరకం విత్తనాలు. మరో వైపు వైరస్‌, తామర పురుగు వలన మిరప వేసిన రైతులు కుదేలు అవుతున్నారు. ఏజిల్లాలో చూసినా మిర్చి రైతుల ఆవేదన వర్ణనాతీతంగాఉంటోంది. ఏరైతు ను పలక రించినా కన్నీటి పర్యంతమవుతున్నారు. కళ్ళ ముందే పంట నాశనమవుతుంటే దిక్కు తోచని పరిస్థితి. వ్యవసాయ ఆధికారుల సూచనలు లేవు. ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావటంలేదు. లక్షలాది రూపాయల పెట్టుబడి పెట్టి చివరికి దున్నే స్తున్నారు. కౌలు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఎకరానికి రూ.30వేలునుండి రూ.40 వేలు ముందుగానే కౌలు నగదు రూపంలో చెల్లించి చేలో దిగాలి. పంటకు మరో రూ.లక్ష పెట్టుబడి పెట్టారు. కౌలు రైతులకు బ్యాంకులు అప్పులు ఇవ్వవు. రెండు నుంచి మూడు రూపాయలకు వడ్డీకితెచ్చి పెట్టు బడులు పెట్టారు.బొబ్బర తెగులు (జెమిని వైరస్‌)కు తామర పురుగు తోడైంది. కొన్నేళ్లుగా జెమిని వైరస్‌ ఉధృతంగాఉంది. ఇది సోకినమిరప మొక్కల ఆకులు మడతలు పడి కుంచించుకు పోతు న్నాయి. ఆమొక్కలు తొలగించినా ఫలితం ఉండటం లేదు. కొత్తగా వచ్చిన తామర పురుగు మిరప పంటను ఆశించి పూతను త్రీవంగా నష్టపరుస్తోంది. ఎన్ని మందులు పిచికారీ చేసినా ఫలితం ఉండటం లేదు. మరో గత్యంతరం లేక పంటను దున్నేస్తు న్నారు. నిరుడు మిరపపంటకు మంచిధర ఉండటంతో ఎక్కువ మంది మిరప పంట వైపు మొగ్గారు.2021-22 ఖరీఫ్‌ సీజన్లో రికార్డు స్థాయి లో 4 లక్షలా 59 వేల ఎకరాల్లో మిరప వేశారు. నిరుడుకంటే ఈ యేడు 1.11లక్షలఎకరాల్లో ఎక్కు వగా మిరప సాగైంది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 2.41లక్షల ఎకరాలు, ప్రకాశం జిల్లాలో 94 వేలు, కర్నూలు జిల్లాలో 58వేలు,కృష్ణా జిల్లాలో 35 వేలఎకరాల్లో మిరప సాగు జరిగింది. మూడే ళ్ళుగా మిరప పంట సాగు పెరుగుతూ వచ్చింది. మన రాష్ట్రంలో మిరప సాగులో 90శాతం కౌలు రైతులే ఉన్నారు. 2019లో3.40లక్షలు, 2020లో 3.47 లక్షలు,2021లో 4.58 లక్షల ఎకరాల్లో మిరప వేశారు. దీనికి కారణం నిరుడు గులాబీ రంగు పురుగు వల్ల పత్తి పంట దెబ్బ తినటంతో కటకట ఏర్పడి మిర్చి పంటకు ధర బాగా వచ్చింది. దీంతో సాగుదార్లు మిరప వైపు మళ్ళారు. ప్రపంచం లోనే అత్యధికంగా మిరప పండిరచే దేశంగా భారత దేశానికి మంచి పేరుం ది. మిరప ముఖ్య మైన వాణిజ్య పంట. దేశంలో 9నుంచి10లక్షల హెక్టార్ల లో మిరప సాగవుతోంది. 18.72లక్షల టన్నులు దిగుబడి వస్తోంది. ఉత్పత్తిలో దేశంలోనే అత్యధిక ఉత్పాదకత ఒక హెక్టారుకు 3468 క్విం టాళ్లతో ప్రథమ స్థానంలో ఉంది. మిరప పంట పండిరచ డంలో దేశం లోనే ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉంది.5.14లక్షల టన్నులుపంట పండి స్తోంది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటక,తమిళనాడు,ఒడిషా రాష్ట్రాల్లో ఈ పంట పండుతోంది.భారత్‌ నుండి మిరపను శ్రీలంక,అమెరికా,కెనడా,ఇంగ్లాండ్‌,సౌదీ అరేబియా,సింగపూర్‌,జర్మనీ తదితర దేశాలు దిగు మతి చేసు కుంటున్నాయి. మనదేశంతో పాటుచైనా, పాకి స్తాన్‌,మొరాకో,టర్కీ,బంగ్లాదేశ్‌లు పోటీదా రులుగా ఉన్నాయి. ఈకొత్తరకం తామర పురుగులు ఇండో నేషియా నుంచి2015లో మన దేశంలోకి ప్రవేశిం చినట్లు డాక్టర్‌ వై.ఎస్‌.ఆర్‌.హెచ్‌.యు వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ జానకిరామ్‌, పరిశోధన సంచాల కులుడాక్టర్‌ఆర్‌.వి.ఎస్‌.కె రెడ్డి తెలిపారు. హవాయి,ఇండోనేషియా దేశాల్లో ఈతామర పురు గులు సొల్‌నేసియా కుటుంబానికి చెందిన మిరపతోపాటు టొమాటో,వంగ,బంగాళ దుంపల వంటి కూరగాయల మొక్కలను, అలంక రణ మొక్కలను ఎక్కువగా ఆశించే ముప్పు పొంచి ఉందని నిపుణులు చెబు తున్నారు. నిరుడు జనవరి, ఫిబ్రవరిల్లో మన రాష్ట్రంలో చిలకలూరిపేట, ప్రత్తిపాడు, యడ్లపాడు మండ లాల్లో మొట్టమొదటి సారిగా ఈ తామరపురుగు ఆశిస్తున్నట్లు ఉద్యానవన పరిశోధన శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ లోని వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో లక్షలాది హెక్టార్లలో తామర పురుగు ఆశించి పంట నష్టపరు స్తోంది. 2015లోనే ఈ తామర పురుగు వచ్చిన ప్పుడు దీన్ని నివారించడంలో శాస్త్రవేత్తలు ఏం చేశారన్నది ప్రశ్నగా మిగిలిపోయింది. పెద్ద ఎత్తున రైతాంగం నష్టపోతుంటే కేంద్ర,రాష్ట్ర ప్రభు త్వాలు చోద్యం చూస్తున్నాయి. రైతాంగమే కాదు. ఈ మిరప పంట మీద ఆధారపడి బతికే లక్షలాది మంది వ్యవసాయ కార్మికులు ఉపాధి కోల్పోతారు. ఒక్క గుంటూరు జిల్లాలోనే ప్రతి యేటా 50వేల మంది వలస కూలీలకు ఉపాధి దొరుకుతోంది. దీన్నిబట్టి చూస్తే రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ కూలీల పరిస్థితి దారుణంగా మారుతోంది.ఈయేడు మిరప పంటను పూర్తిగా నష్టపోయిన పంటగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి పరిహారం చెల్లించాలి. ప్రతి ఎకరానికి లక్షరూపాయలకు పైగా నష్టం జరిగింది. వాతావరణ బీమా పథకాన్ని వర్తింప చేస్తే బీమా పరిహారం వస్తుంది. ఆదిశగా ప్రభుత్వం దృష్టి సారించాలి. లేకపోతే రైతులు,కౌలు రైతులకు త్రీవంగా నష్టం జరిగి అప్పులఊబిలో కూరుకు పోతారు. ఇప్పటికే ఆత్మహత్యలకు పాల్పడుతు న్నారు. ఇవి పెరిగే అవకాశం ఉంది. ఇది ప్రమాద కరం. వెంటనే ప్రభుత్వం వాస్తవ సాగుదారులైన కౌలు రైతులను గుర్తించి పరిహారం చెల్లించి రైతాం గానికి భరోసా కల్పించాల్సిన బాధ్యత పాలకులకు ఉంది.

కష్టాల సుడిగుండంలో కౌలు రైతులు
నవంబర్‌లో వచ్చిన వానల వలన 13.27లక్షల ఎకరాల్లో ఆహార, ఉద్యానవన పంటలు దెబ్బతి న్నాయి. రూ.3300 కోట్ల నష్టం జరిగింది. వరి పంట ఊడ్చుకుపోయింది. సెనగ పోలంలోనే కుళ్ళిపోయింది. మినుము, మొక్కజొన్న తదితర పంటలు లక్షలఎకరాల్లో చేతికొచ్చే పరిస్థితి లేకుం డా పోయింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. ఎరువుల ధరలు ఆకాశాన్నంటాయి. మొత్తం మీద గతసంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎకరానికి రూ.5 నుండి రూ.7 వేల వరకు సాగు ఖర్చులు పెరిగాయి. ఎకరానికి రూ.40 వేలు పెట్టుబడి పెట్టారు. భూ యజమానికి 25బస్తాల కౌలు ఇవ్వాలి. సార్వ పంట వరదల పాలైంది. దాళ్వ పంటకు నీరు ఇచ్చేది లేదని ప్రభుత్వం చెబుతున్నది. తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం గ్రామంలో గత 20సంవత్సరాల నుంచి కౌలు వ్యవసాయం చేస్తున్న మధురసాయి బాబుకు చెందిన పంట మొత్తం నీట మునిగి పోవడంతో అప్పుల బెంగతో గుండెపోటుతో మరణించాడు. భార్యా బిడ్డలు దిక్కులేని వారయ్యారు.గిట్టుబాటుధర లేదు. మద్దతు ధర మాయమైపోతున్నది. మార్కెట్‌ ధర దిక్కైంది. లక్షలాది ఎకరాల్లో మిరప పంట తామరపురుగు తినేసింది. పంటను దున్నివేయడం తప్ప మరో మార్గం కౌలురైతులకు కనపడటం లేదు. కొన్ని ప్రాంతాల్లో కోతుల బెడద ఉంది. మందలకు మం దలు పోలాల్లో పడి పంటలను దూసివేస్తు న్నాయి. ఎకరానికి రూ.80వేల నుండి రూ.లక్ష పెట్టుబడి పెట్టారు. కౌలు రూ.40 వేల పైమాటే. బొబ్బరను తట్టుకొనే రకాలని కల్తీ,నాశిరకం విత్తనాలు, మిరప నారు అమ్మకం విచ్చలవిడిగా జరుగు తున్నది. ఈసంవత్సరం నాశిరకం విత్తనాలు అంట గట్టారు. ఆశ్చర్యం ఎమిటంటే ఈ కంపెనీలన్నీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘రైతుభరోసా’ కేంద్రాల్లో ఉన్నాయి. ఇంత వరకు ఒక్కరి పైన కూడ కేసులు పెట్టలేదు. ఒక్క పైసా కూడా పరిహారం ఇవ్వలేదు. ఖరీఫ్‌ సీజ నంతా తుఫానులు,వరదలు,తెగుళ్లు, నాశిరకం, కల్తీ విత్తనాలతో మొత్తం నష్టపోయారు.రబీలో వేసిన సెనగ, మినుము పంటలు కుడా దెబ్బతి న్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకుం టామని చెప్పి చేతులు దులుపుకొంది. వరదలు, తుఫాన్లు, తామర పురుగు, నకిలీ విత్తనాల వలన పంట నష్టపోయిన కౌలు రైతులను గుర్తించి పంటల వారీగా నష్ట పరిహారం చెల్లించాలి. ఎన్యుమరేషన్‌ సందర్భంలో ఇ-క్రాప్‌ బుకింగ్‌తో సంబంధం లేకుం డానే కౌలు రైతుల పేర్లను నమోదుచేసి వారికే బ్యాంకు ఖాతాలో డైరెక్టుగా పరిహార సొమ్మును జమ చేయాలి. తడిసిన ధాన్యాన్ని ఎటువంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలి. పదే పదే నాసిరకం విత్తనాలు అమ్ముతున్న కంపెనీలపై, యాజ మాన్యంపై కొరడా రaుళిపించాలి. క్రిమినల్‌ కేసులు పెట్టి తక్షణమే అరెస్ట్‌ చేయాలి. అటువంటి కంపెనీలను రైతుభరోసా కేంద్రాల నుండి తొలగిం చాలి. కొన్ని సంవత్సరాల పాటు మార్కెట్లో విత్తనా లు అమ్మకుండా నిషేధించాలి. ఇ-క్రాప్‌ బుకింగ్‌ చేయించుకున్న కౌలురైతులకు రైతు భరోసా, పంట రుణాలు తక్షణమే అందించి ఆదుకోవాలి. మిరప, అరటి తదితర పంటలకు వాతా వరణ బీమా పథకాన్ని వర్తింపచేసి కౌలురైతులకు పరిహారం అందేలాచర్యలు తీసుకోవాలని కోరు తున్నారు. -పి.జమలయ్య