బడుల్లో కరోనా భయం..తగ్గిన హాజరుశాతం..!

” పిల్లల్ని బడికి పంపాలంటే భయం, ఆపేస్తే చదువు ఏమైపోతుందోనని దిగులు’ .ఏపీలో తల్లితండ్రులు ‘‘మా పిల్లల్ని స్కూల్‌కు పంపినా పంపకపోయినా మేం తప్పు చేసినట్లే. స్కూల్‌కి పంపించాక కరోనా వచ్చినా, పంపించక చదువులో వెనుకబడినా తల్లిదండ్రులుగా సరైన నిర్ణయం తీసుకోలేకపోయామని మమ్మల్నే అంటారు. ఇలాంటి పరిస్థితి ఎవరూ కోరుకోరు. కరోనా సమయంలో పిల్లలను స్కూలుకు పంపించడం గురించి విశాఖ మురళీనగర్‌కు చెందిన సరళ ఈ మాట అన్నారు. ‘‘కరోనా ప్రొటోకాల్‌ పాటిస్తూ పిల్లలు బడికి హాజరు కావడం తప్పనిసరి. ఇప్పటీకే చాలా మంది పిల్లలు బేసిక్స్‌ మరిచిపోయారు. వాళ్లకు అదనపు సమయం కేటాయించి బ్రిడ్జ్‌ కోర్సులు చెప్తున్నాం’’ అని విశాఖ పెద జాలారిపేట ప్రాథమిక పాఠశాల టీచర్‌ రవి అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల చదువులు సందిగ్ధంలో పడ్డాయని తెలుస్తోంది. అయితే, పిల్లల చదువులు పాడవకుండా, వారు కరోనా బారినపడకుండా ఉండాలంటే ఏం చేయాలనే విషయంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వైద్యులు విషయాలు వెల్లడిరచారు” .
ఏపీ రాష్ట్రంలో కరోనా థర్డ్‌వేవ్‌ కుదిపే స్తుంది. దీనిప్రభావం అధికంగా పిల్లలపై చూపడం తో పాఠశాలలకు వచ్చిన విద్యార్థులు భయాం దోళనకు గురవుతున్నారు. దీంతో పిల్లలను బడికి పంపించాలంటేనే తల్లిదండ్రులు భయపడు తున్నా రు. బడికి వచ్చిన పిల్లలు కరోనా బారిన పడుతుం డటంతో..ఏపీవైద్య ఆరోగ్య శాఖ కీలక ప్రతిపాద నలు చేసింది. ఏదైనాస్కూల్లో ఒకేరోజు ఐదు పాజి టివ్‌ కేసులు నమోదైతే..ఆస్కూలును మూసి వేయాల్సిందేనని స్పష్టం చేసింది. విద్యార్థులు, టీచర్లకు క్వారంటైన్‌ పూర్తయ్యేవరకు క్లాసులు నిర్వ హించవద్దని…లేదంటే వైరస్‌వ్యాప్తి తీవ్రమవు తుం దని హెచ్చరించింది. పాజిటివ్‌ కేసులు నమోదైన స్కూళ్లను వెంటనే శానిటైజ్‌ చేసి ప్రతిఒక్కరికీ కరోనా టెస్టులు చేయాలని సర్కార్‌ సూచించింది. అలాగే హాస్టళ్లు,రెసిడెన్షియల్‌ పాఠ శాల్లలోని విద్యార్థులకు కరోనా లక్షణాలు కనిపిస్తే వారిని వెంటనే సమీ పంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించే బాధ్యతను వార్డెన్లు,ప్రిన్సిపాల్స్‌ తీసుకోవాలని సూచిం చింది. ప్రతిస్కూల్లో టీచర్లు, ఇతర సిబ్బందికి రెండు వారాలకు ఒకసారితప్పని సరిగా కరోనా టెస్టులు చేయాలని ఆరోగ్యశాఖ సూచించింది. చిన్నారుల్లో ఏమాత్రం లక్షణాలు కనిపించినా వెంటనే టెస్టులు చేసేలా సౌకర్యాలు కల్పించాలని పేర్కొంది. టెస్టు లకు సంబంధించిన సదుపాయలను తామే కల్పిస్తా మని ఏపీఆరోగ్య శాఖ తెలిపింది.‘పిల్లల్ని బడికి పంపాలంటే భయం,ఆపేస్తే చదువు ఏమైపోతుం దోనని ఏపీలో తల్లితండ్రులుదిగులు పడుతున్నారు. ‘మాపిల్లల్ని స్కూల్‌కు పంపినా పంప కపోయినా మేం తప్పుచేసినట్లే. స్కూల్‌కి పంపించాక కరోనా వచ్చినా,పంపించక చదువులో వెనుకబడినా తల్లిదం డ్రులుగా సరైన నిర్ణయం తీసుకోలేక పోయా మని మమ్మల్నే అంటారు. ఇలాంటి పరిస్థితి ఎవరూ కోరుకోరు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు’.కరోనా ప్రొటోకాల్‌ పాటిస్తూ పిల్లలు బడికి హాజరు కావడం తప్పనిసరి. ఇప్పటీకే చాలా మంది పిల్లలు బేసిక్స్‌ మరిచిపోయారు. వాళ్లకు అదనపు సమయం కేటా యించి బ్రిడ్జ్‌ కోర్సులు చెప్తున్నాం’’అని విశాఖ పెద జాలారిపేట ప్రాథమిక పాఠశాలటీచర్‌ రవి అన్నా రు. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల చదువులు సందిగ్ధంలో పడ్డాయని తెలు స్తోంది.
చదువులో వెనుకబడుతున్నారు
చాలా కాలంగా బడులకు దూరమైన పిల్లల చదువులో ఇప్పటికే వెనకబడిపోయారు. చాలా మంది ఇంతకు ముందు నేర్చుకున్నవి చెప్ప లేకపోతున్నారు. కొందరు అలవాటు తప్పడంతో ఏం చెప్పాలో తెలీక దిక్కులు చూస్తున్నారు. ఇలాంటి ఎన్నో వీడియోలు సోషల్‌ మీడియాలో కూడా కనిపిస్తున్నాయి. కొందరు పిల్లలు తెలిసినవి గుర్తు తెచ్చుకోవడంలో ఆలస్యం అవుతోంది. పిల్లల్లో సమస్య అయితే ఉంది. మరోవైపు కార్పొరేట్‌ స్కూళ్ల లో చదివే పిల్లలతల్లిదండ్రులు ఎక్కువగా ఉన్నత విద్యావంతులు కావడంతో వాళ్లకు ఇంటి దగ్గరైనా మంచి శిక్షణ ఇవ్వగలుతున్నారు. కానీ,ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు అన్‌లైన్‌ క్లాసులు, తల్లిదండ్రుల శిక్షణ లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే కోవిడ్‌ ప్రొటోకాల్‌ పాటించి తరగతులు నిర్వహించాలి అని ఏపీ మున్సి పాల్‌ టీచర్స్‌ఫేడరేషన్‌ (ఎఫ్‌ఏపీటీవో) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి సిద్ధార్ధ్‌ చెప్పారు. ఏ ప్రభుత్వ పాఠ శాలకైనా అక్కడున్న విద్యార్థులు, పాఠశాల విస్తీర్ణం లెక్కల ప్రకారం ప్రభుత్వం గ్రాంట్‌ రిలీజ్‌ చేస్తుంది. దానిని స్కూల్లోని మరుగుదొడ్లు పరిశుభ్రత, కరెంట్‌ బిల్లులు చెల్లింపులు,ఇతర అవసరాలకు వాడుతుం టారు. ఈనిధులనే కరోనా సమయంలో శానిటైజర్లు, మాస్కులుకొనడానికి వాడమంటున్నారని…కానీ నాడు-నేడు పథకంప్రారంభమైన తర్వాత ఆ నిధులు విడుదల కావడం లేదని ఉపాధ్యాయ సంఘాలు చెప్తున్నాయి.‘‘థర్డ్‌ వేవ్‌ నేపథ్యంతో ప్రతి పాఠశాలకు సబ్బులు,శానిటైజర్లు,మాస్కులు,థర్మల్‌ స్క్రీనింగ్‌ కిట్‌ లను పాఠశాల అభివృద్ధి నిధులతో కొనుక్కోమని అంటున్నారు. నాడు-నేడు పథకం వచ్చిన తర్వాత పాఠశాల అభివృద్ధినిధులు ఇవ్వడం లేదు. ఒకటి రెండు నెలలంటే,టీచర్లు తలాకొంత వేసుకుని భరించగలం.కానీ నెలనెలా అంటే కష్టమవుతుంది. అలాగే రెండు డోసుల వ్యాక్సీన్‌ వేసుకున్న టీచర్లతోనే టీచింగ్‌ చేయించాలి. టీచర్లందరికీ వందశాతం వ్యాక్సినేషన్‌ వెంటనే పూర్తి చేయాలి.మిడ్‌ డే మిల్స్‌ కూడా కరోనా వ్యాప్తికి కారణమయ్యే అవకాశ ముంది.అందుకే పిల్లలకు డ్రై రేషన్‌ ఇవ్వడం మంచిదని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. శ్రీకాకుళంలో 57,విజయనగరం31,విశాఖలో 68, తూర్పుగోదావిరిలో 49,పశ్చిమగోదావరిలో48, కృష్ణాలో36,గుంటూరులో55,ప్రకాశం13, నెల్లూరు 30,చిత్తూరు55,కర్నూలు44,కడప 42, అనంత పురం28…ఇలామొత్తం556మంది ఉపాధ్యా యులు కరోనాతో చనిపోయారు. ఇటీవల మరణిం చిన వారిని కూడా కలుపుకుంటే మరో 20శాతం పెరుగుతారు.విద్యార్థుల్లో కూడా కొందరు చనిపో యారు. అయితే ప్రస్తుతం పిల్లలు,ఉపాధ్యాయు లలో ఒకరినుంచి ఒకరికి కరోనాసోకకుండా కోవిడ్‌ ప్రొటోకాల్‌ పాటిస్తూ పాఠాలు చెప్తున్నాం. అయినా భయం వెంటాడుతూనే ఉంది అని ఎఫ్‌ఏపీటీవో ప్రతినిధి రవిసిద్ధార్ధ్‌ చెప్పారు.
కొన్ని స్కూళ్లలో భయాలున్నా…హాజరు పెరిగింది
కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ చాలాఎక్కువ ప్రాణాలు బలి తీసుకుంది. అందుకే, సెకండ్‌ వేవ్‌ తర్వాత బడులు ప్రారంభిచగానే తమపిల్లలను పంపించడానికి తల్లి దండ్రులు పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే క్రమంగా హాజరు శాతం పెరిగింది. అదే సమయం లోనే కరోనా థర్డ్‌ వేవ్‌ అంటూ వార్తలు వస్తుండటం వారిలో ఆందోళన కలిగిస్తోంది. బడులు ప్రారం భించినప్పుడు 20శాతం మాత్రమే హాజరయ్యారు. అలా పిల్లల హాజరు క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం 85శాతానికి చేరుకుంది. మళ్లీఇప్పుడు థర్డ్‌ వేవ్‌ భయం మొదలైంది.కోవిడ్‌ భయంతో స్కూళ్లు మూసేస్తే, ప్రభుత్వ పాఠశాల్లో పిల్లలు చదువుల్లో వెనుకబడిపోతారు.అయితే,ప్రభుత్వం కోవిడ్‌ ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంది. తల్లిదం డ్రులు ఎలాంటి సంకోచం లేకుండా తమ పిల్లలను బడికి పంపవచ్చు అని విశాఖ జిల్లా విద్యాశాఖా ధికారిణి ఎల్‌.చంద్రకళ చెప్పారు. కరోనా నిబం ధనల అమలుకు పాఠశాలల రీ ఓపెన్‌ మార్గదర్శ కాలు జారీ చేశాం. వీటి అమలుపై కూడా పర్య వేక్షణ ఉంది. విద్యాశాఖ మార్గదర్శకాల ప్రకారం బడుల్లో తరగతులు నిర్వహించాలి. అలాగే, ఏదైనా పాఠశాలలో ఐదు కంటే ఎక్కువ కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు వస్తే క్వారంటైన్‌ పీరియడ్‌ కింద 14రోజు లు మూసివేస్తున్నామఅని విశాఖ డీఈవో వెల్లడిర చారు. థర్డ్‌ వేవ్‌ హెచ్చరికల నేపథ్యంలో పిల్ల లను స్కూళ్లకు పంపడం ఎంతవరకు సేఫ్‌ అనే ప్రశ్న తల్లిదండ్రులను వేధిస్తోంది. స్కూళ్లకి పంపక పోతే పిల్లలు విద్యాసంవత్సరం నష్టపోతారనే భయం,పంపితే కరోనా వస్తుందేమోననే భయం వారిని వెంటాడుతోంది. కరోనా భయం ఉన్నప్పటికీ అన్ని జాగ్రత్తలు తీసుకుని మా పిల్లలను బడికి పంపుతున్నాం. అయితే స్కూల్‌ గేటు దగ్గర థర్మల్‌ స్క్రీనింగ్‌,మాస్కులు వంటివిచూస్తున్నా…బడి లోపల,తరగతి గదుల్లో ఎలాఉంటుందో…? అక్కడ పిల్లలు ఎలా ఉంటున్నారోననే అందోళన ఉంటుంది. కొన్ని పాఠశాలల్లో కోవిడ్‌ ప్రొటోకాల్‌ పాటించకపోవడం కూడా చూస్తున్నాం అని విశాఖ మురళీనగర్‌ కు చెందిన సరళ చెప్పారు. సరళ కూతురు చాందిని మాధవదార జీవీఎంసీ ప్రైమరీ స్కూల్లో ఐదో తరగతి చదువుతోంది.ఆన్‌లైన్‌ తరగ తులే మంచిదని సరళ భావిస్తున్నారు. మా పిల్లలు చదివే స్కూల్లో టీచరుకు కరోనా వచ్చింది. ఆ సమయంలో చాలా టెన్షన్‌ పడ్డాం. మా పిల్లలకు కూడా వచ్చిందేమోనని అనుకున్నా. మా అమ్మనాన్న కూడా పిల్లలను బడికి పంపివాళ్ల ప్రాణాలతో ఆడుకుంటారా అని తిట్టారు. దాంతో మేం చేస్తున్నది సరైనదో,కాదో అర్థం కావడంలేదు. అన్‌లైన్‌ తరగ తులే బెటరని మాకు అనిపిస్తుంది అన్నారు. ఏదైనా స్కూల్లో విద్యార్థులు,ఉపాధ్యాయుల్లో కరోనా పాజి టివ్‌ వస్తే, అది ఎవరి నుంచి ఎవరికి వచ్చిందో తెలుసుకోవడంకష్టం.పైగా బడిలోకరోనా సోకిం దా? కరోనాతో స్కూలుకు వస్తే, అది మిగతావారికి వచ్చిందా?అనేది చెప్పడం కూడా కష్టమని వైద్యులు అంటున్నారు. ఫస్ట్‌ వేవ్‌లో పెద్దలు,సెకండ్‌ వేవ్‌లో యువత,మధ్యవయస్కులు కోవిడ్‌ బారిన పడ్డారు. ఇప్పుడు వీరిలో చాలా మందికి వ్యాక్సినేషన్‌ అవ డంతో,థర్డ్‌ వేవ్‌ పిల్లలపై ప్రభావం చూపే అవకా శం ఉంది. బడులకు వెళ్లే పిల్లల తల్లిదండ్రులు, మిగతా సభ్యులందరూ వ్యాక్సీన్‌ వేయించుకున్నారా అనేది తెలుసుకోవాలి.ఆడేటా ప్రతిస్కూల్లో ఉం డాలి. రెండు డోసుల వ్యాక్సీన్‌ వేసుకోని తల్లిదం డ్రుల పిల్లలను బడికి పంపించకూడదు. లేదంటే వారి నుంచి పిల్లలకు…వారి నుంచి మిగతా పిల్ల లకు కరోనా సోకే అవకాశం ఉంది అని విశాఖ లోని చిన్నపిల్లల వైద్యులు సతీష్‌ చెప్పారు. పిల్లలకు కరోనా గురించి అవగాహన కల్పించడం కూడా ముఖ్యమని డాక్టర్‌ సతీష్‌ భావిస్తున్నారు. ప్రతి స్కూల్లో వారానికి ఒకసారి కరోనా టెస్టులు చేయాలి. అదే సమయంలో సోషల్‌ డిస్టైన్సింగ్‌, శానిటైజేషన్‌, మాస్కులు ధరించడం లాంటి అంశాలపై తరగతి గదుల్లో పిల్లలతో ట్రయల్‌ రన్‌ నిర్వహించాలి. కోవిడ్‌ ప్రొటోకాల్‌పై అవగాహన లేని పిల్లలకు శిక్షణ ఇవ్వాలి అన్నారు. అయితే కోవిడ్‌ నిబంధ నలు పాటించకపోతే ప్రస్తుతం థర్డ్‌ వేవ్‌లో పిల్లలపై ప్రభావం అధికమయ్యే అవకాశాలున్నాయని డాక్టర్‌ సతీష్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కోవిడ్‌ ప్రొటో కాల్‌ పాటిస్తున్న వారి సంఖ్య తగ్గిపోయిందని అన్నా రు. ఏదిఏమైనా కనీసం మరోఏడాది పాటైనా కోవిడ్‌ ప్రొటోకాల్‌ పాటించడం మంచిదని ఆయన సూచిం చారు.–జిఎన్‌వి సతీష్‌

క‌రోనా మహామ్మారి మార్చినాటికి తగొచ్చు..

దేశంలో కరోనా మహమ్మారి మళ్ళీ విరుచుకుపడుతోంది. ఒమిక్రాన్‌ వ్యాప్తితో గత కొన్ని రోజులుగా కోత్త కేసులు అమాంతం పెరుగుతున్నాయి. మూడోముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో వచ్చే రెండు వారాలు అత్యంత కీలకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వాలు,ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మార్చినాటికి దీని తీవ్రత తగ్గే అవకాశాలు ఉన్నట్లు వైద్యులు సూచిస్తున్నారు. ఒమిక్రాన్‌ సాధారణ జలుబు లాంటి వ్యాధి కాదు. ఆరోగ్య వ్యవస్థలపై ఇది తీవ్రప్రభావం చూపించొచ్చు.కేసులు ఆకస్మాత్తుగా..భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. పరీక్షలు చేయడం,రోగులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం,ప్రజలకు అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్యశాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్‌ వెల్లడిరచారు. భారత్‌లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని, వచ్చే రెండువారాల్లో గరిష్ట స్థాయికి చేరొచ్చని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. సీనియర్‌ ఎపిడెమిలాజిస్ట్‌ గిరిధర్‌ బాబు మాట్లాడుతూ ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే ఫిబ్రవరి తొలివారం మధ్యలో కరోనా ఉధృతి గరిష్టస్థాయిలో ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు. అయితే డెల్టా దశతో పోలిస్తే ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు దేశం సంసిద్దంగా ఉందని అన్నారు. ఆరోగ్య మౌళిక సదుపాయాలను మెరుగుపడటంతోపాటు వ్యాక్సిన్లు కూడా వైరస్‌ ఉధృతిని తగ్గించేందుకు దోహదపడతాయని చెప్పారు.
దేశ వ్యాప్తంగా కరోనా కలకలం కంటిన్యూ అవుతోంది. దీనికి తోడు ఒమిక్రాన్‌ కేసులు దేశంలో ఒమిక్రాన్‌ ప్రభావం కొత్త కేసుల సంఖ్యపై స్పష్టంగా కన్పిస్తోంది. అయితే కరోనా తీవ్రత మార్చినెలలో తగొచ్చుని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం గత కొద్ది రోజులుగా కరోనా కేసులు ఒక్కసారిగా పెరుగుపోతున్నాయి. అత్యధికంగా మహా రాష్ట్ర,ఢల్లీిలో ఒమిక్రాన్‌ ఉధృతి ఎక్కువగా ఉంది. దీంతో ఇప్పటికే ఢల్లీిలో వారాంతపు కర్ఫ్యూ విధించగా..ముంబాయిలోనూ కఠిన ఆంక్షలు అమలు చేయాలని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోను పాక్షికంగా కర్ఫ్యూ అమలువుతంది. ఇదిలా ఉండగా…నిబంధనలతోనే కరోనా మూడో దశ ఉధృతిని అదుపులోకి తేవొచ్చని కొందరు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్‌ ఆంక్షలతోపాటు వ్యాక్సినేషన్‌ రేటు తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో టీకా పంపిణీని ముమ్మరం చేస్తే కేసుల పెరుగుదలను ఆరికట్ట వచ్చని అంటున్నారు. దేశవ్యాప్తంగా మెట్రో నగరాలతోపాటు వాటి సమీప ప్రాంతాల్లో కొత్తగా నమోదువుతున్న పాజిటివ్‌ కేసుల్లో 50శాతం వరకూ ఒమిక్రాన్‌ వేరియంట్‌వే ఉంటున్నాయి. ఇలా క్రమంగా కోవిడ్‌ కేసుల్లో భారీ పెరుగుదల కనిపించడం థర్డ్‌వేవ్‌కు సూచికమే. అయినప్పటికీ భయాందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే దేశంలో 80శాతం మంది సహజంగానే వైరస్‌కు గురయ్యారు. దీనికితోడు 90శాతం మంది అర్హులు కూడా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. 65శాతం మందికి పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ అందింది అని కోవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ చీఫ్‌ డాక్టర్‌ ఎన్‌కే అరోడా వెల్లడిరచారు.
ఒక్కో దేశంలో ఒక్కోలా ఒమిక్రాన్‌
కోవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ఒక్కో దేశంలో ఒక్కోలా ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుడు డాక్టర్‌ అబ్దీ మహమద్‌ పేర్కొన్నారు.ఈ వేరియంట్‌ తొలిసారి బయటపడిన దక్షిణాఫ్రికాలో ఆసుపత్రిపాలయ్యే పరిస్థితి,మరణాల రేటు తక్కువగానే ఉందన్నారు. అయితే కొన్చిచోట్ల ఇదే తరహాలో ఉంటుందని భావించలేమని చెప్పారు. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్‌ బారిన పడినవారిలో ఆసుపత్రుల పాలు కావడం చాలా తక్కువని, మరణాలు చాలా చాలా తక్కువని తెలిపారు. అయితే ఇతర దేశాల్లోనూ ఇలాగే ఉంటుందని భావించలేమన్నారు. గతంలో ఎన్నడూలేనంతగా ఒమిక్రాన్‌లో సాంక్రమిక శక్తి కనిపిస్తోందని చెప్పారు. ఇప్పటికే 29రాష్ట్రాల్లో గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్లోకరోనా వైరస్‌ విజృంభణ
థర్డ్‌ వేవ్‌లో కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు భారీగా పెరుగుతోంది. ప్రజలు నిబంధనలు సరిగా పాటించకపోవడం, మాస్క్‌, భౌతిక దూరం పాటించకపోవడంతో వైరస్‌ వేగంగా విజృంభిస్తోంది. కొత్త ఏడాది రాష్ట్రంలో పాజిటివిటీ రేటు ఏకంగా 13శాతానికి చేరిపోయింది. కొంతకాలంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ప్రముఖులు కూడా వైరస్‌ బారిన పడుతున్నారు. సంక్రాంతి సందర్భంగా ఏపీ ప్రభుత్వం నైట్‌ కర్ఫ్యూని కూడా వాయిదా వేయడంతో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 13శాతానికి చేరింది. భవిష్యత్తులో ఇది మరింత పెరిగే ప్రమాదముంది. ప్రభుత్వం నిబంధనలు పాటించాల్సిందేనని చెబుతున్నా.. ప్రజలు మాత్రం బేఖాతరు చేస్తున్నారు. దీంతో కరోనా కేసుల సంఖ్య రోజరోజికీ రెట్టింపువు తున్నాయి. ఇప్పటివరకు కరోనా సోకిన మంత్రులు ఎమ్మెల్యేలు వివిధ కార్యక్రమాల్లో నేరుగా వెళ్లి పాల్గడంతోనే కరోనా బారిన పట్టడ్లు స్పష్టమవుతోంది. దీంతో ప్రజలు బహిరం ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని ప్రభుత్వం సూచిస్తోంది.
మరోసారి వెలుగులోకి బ్లాక్‌ ఫంగస్‌ ప్రస్తుతం మూడో వేవ్‌లో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓవ్యక్తి బ్లాక్‌ ఫంగస్‌తో ఆసుపత్రిలో చేరాడు. బ్లాక్‌ ఫంగస్‌ అతని కన్ను,ముక్కుకు వ్యాపించినట్లు వైద్య అధికారులు వెల్లడిరచారు.కరోనా థర్డ్‌ వేవ్‌లో ఇదే తొలి కేసు అని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 45 ఏళ్ళ వ్యక్తికి బ్లాక్‌ ఫంగస్‌ సోకిందని, అతనికి మధుమేహం ఉందని వైద్యవర్గాలు తెలిపాయి. గతంలో సెకండ్‌ వేవ్‌ తీవ్రంగా ఉన్న సమయంలో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు బయట పడ్డాయి. ఈ ఫంగస్‌ కారణంగా అనేక మంది కంటి చూపు సైతం కోల్పోయారు. అయితే, ఇప్పుడు తిరిగి అదే ఫంగస్‌ గుర్తించటంతో ఆందోళన మొదలైంది.– గునపర్తి సైమన్‌

ఆదివాసీ సుపరిపాలన గ్రామసభల ద్వారానే సాధ్యం!

ఆదివాసీలు అధికంగా జీవిస్తున్న చత్తీష్‌ఘడ్‌ రాష్ట్రంలో పీసాచట్టం((పంచాయితీరాజ్‌షెడ్యూలు ప్రాంతాల విస్తరణ చట్టం1996) పారదర్శకంగా అమలు పరుస్తూ ప్రజలకు సుపరిపాలన అందించడానికి ఆ ప్రభుత్వం అడుగులేస్తోంది. పీసాచట్టం రాజ్యాంగం అంతర్భాగంగా వచ్చిన ఈచట్టం ద్వారా గ్రామసభకు విశేషాధికారాలను కట్టబెట్టేందుకు కృతనిశ్చయంతో పరిపాలన సాగిస్తుండటం ప్రశంసనీయం. ఆదివాసుల ఆత్మబంధువులైన ఐఏఎస్‌ అధికారులు బీడీశర్మ,ఎస్‌ఆర్‌ శంకరన్‌,దిలీప్‌ సింగ్‌ భూరియా స్పూర్తితో ఆ రాష్ట్రప్రభుత్వం గ్రామసభ సంపూర్ణ అధికారాలను అందించి ప్రజలకు మంచిపాలన అందించడానికి కృషి చేస్తోంది. ‘‘ మావూళ్లో..మారాజ్యాం..,హైదరాబాద్‌..ఢల్లీిలో మన రాజ్యాం’’ అనే నినాదాన్ని తీసుకొచ్చిన ఆనాటి ఐఏఎస్‌ అధికారి బీడీ శర్మ ఆశయాన్ని నేడు రాష్ట్రంప్రభుత్వం గ్రామసభకు ప్రాముఖ్యత ఇస్తోంది.బీడీశర్మ,ఎస్‌ఆర్‌ శంకరన్‌,దిలీప్‌ సింగ్‌ భూరియా ముగ్గురు ఐఏఎస్‌ అధికారులు ఏజెన్సీ ప్రాంతంలో గ్రామస్వరాజ్యాన్ని స్థాపించి ఆదివాసుల సుపరిపాలన కోసం పాటు పడ్డారు. 75వ రాజ్యాంగ సవరణ ద్వారావచ్చిన పీసాచట్టాన్ని 25ఏళ్లక్రితం పార్లమెంటు ఆమోదించింది. పార్లమెంటు,రాజ్యసభ,అసెంబ్లీ,జిల్లా, బ్లాక్‌,పంచాయితీల స్థాయిలో గ్రామసభకు అధికారం ఇవ్వాలి.ఇది సమత జడ్జెమెంటు కూడా స్ఫస్టం చేసింది.
ఇటీవల కాలంలో ఛత్తీష్‌ఘఢ్‌ ప్రభుత్వం ఆదివాసీ ప్రాంతాల్లో పరిపాలన,సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల అమలుకు గ్రామసభలను కేంద్రబిదువుగా మార్చారు. స్టేట్‌ ప్లానింగ్‌ తరుపున వివిధ అంశాలపై టాస్క్‌పోర్సు నియమించింది. పీసా చట్టం,పరిపాలన విధానం,పునరావాసం,సాంకేతిక పరిజ్ఞానం ఆదివాసులకు అందించడానికి కమిటీని సిపార్సులు చేసింది. ఇక్కడ గిరిజన జనాభా ఎక్కువకావడం,అలాగే పరిపాలన అధికార యంత్రాంగం కూడా అధికశాతం గిరిజనతెగలకు చెందిన ఉద్యోగులు ఉండటంతో ఈరాష్ట్రంలో గ్రామసభకు ప్రాధాన్యత సంతరించుకుంది.వీరంతా కలసి సర్వ ఆదివాసీ సమాజ్‌ కింద ఒకసమాఖ్యను ఏర్పాటు చేసుకున్నారు. దానిద్వారా వారి సంస్కృతి సంప్రదాయాలు,కట్టుబాట్లును పరిరక్షించుకుంటూ వస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వారి ఆచార సాంప్రదాయాలు కనుమరుగు కాకుండా ఉండాలంటే గ్రామసభ మూలాధారమని భావించారు. ఈ దశగా రెండేళ్ల నుంచి పీసా చట్టానికి అనుగుణంగా పాలన సాగాలని ఆకాంక్షస్తున్నారు. ఈనేపథ్యంలోనే ్ద రాష్ట్ర పంచాయితీరాజ్‌శాఖ ద్వారా రాష్ట్ర,జిల్లా,బ్లాక్‌ల స్థాయిలో పీసా చట్టాన్ని సంపూర్ణంగా అమలు పరచి గ్రామసభకు విశిష్ట అధికారాలను కట్టబెట్టడానికి కృషిచేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం కూడా ఆదివాసీ సమూహానికి అనుగుణంగా గ్రామసభకు విలువనిస్తోంది.
పీసా చట్టం ప్రకారం గ్రామసభకు సామాజిక,ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలలో లబ్ధిదారులను గుర్తించే అధికారం ఉంది. పంచాయతీ పరిధిలోగల పాఠశాలలు,హెల్త్‌ సబ్‌ సెంటర్లు, మంచినీటి పథకాలు,ప్రభుత్వసంస్థల పనితీరును సమీక్షించి,తగు సూచనలు, సిఫారసులు చేసే అధికారం గ్రామసభలకు ఇచ్చింది. పీసా గ్రామసభలు చేసిన తీర్మానాలను ప్రభుత్వ అధికారులుగుర్తించి,తగిన చర్యలు తీసుకోవాల్సిఉంది. దాంట్లో భాగంగా గ్రామాల్లో మహిళా సార్ధకతకోసం మహిళలసభ, బాలల పరిరక్షణ కోసం బాలలసభ, గ్రామంలోఉన్న వనరుల పరిరక్షణ (అడవి,నీరు,భూమి) వంటి వాటిని పర్యవేక్షించే కమిటీలు,గ్రామాల్లో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా నియంత్రించేందుకు శాంతియుత`న్యాయ కమిటీలు,గ్రామానికి నిధులు సమీకరణ,సంస్కృతి,సంప్రాదాయాలు పరిరక్షించే పద్దతులపైగ్రామసభల ద్వారా కమిటీలను నియమించి పర్యవేక్షించడానికి తగు చర్యలు తీసుకుంటోంది. మొత్తానికి గ్రామంలో గ్రామసభకు పరిపాలనాధికారం,నియంత్రణపట్ల ఆజమాయిషీ అధికారం కలిగి ఉంటాయి.చిన్నచిన్నఖనిజాలపై గ్రామసభ పర్యవేక్షించే అధికారం కూడా ఉంటుంది.
ఇలాంటి శుభపరిణంలో ఆదివాసులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు,పీసాచట్టం గ్రామసభ ద్వారా ప్రజలకు సుపరిపాలన అందించడానికి ఆనాడు ఐఏఎస్‌ అధికారులు బీడీ శర్మ,ఎస్‌ఆర్‌ శంకరన్‌,దిలీఫ్‌సింగ్‌ భూరియా స్పూర్తి,వారి ఆశయాలు,లక్ష్యాలను నేడు ఛత్తీషఘఢ్‌ ప్రభుత్వం నెరవేర్చడానికి కృషి చేయడం అభినందనీయం. పీసాచట్టంగ్రామసభలకు విశేషాధికారాలు అప్పగించడం ద్వారానే ఆదివాసీలకు సుపరిపాలన అందివ్వగలమనే వారి ఆశయం నిజం కాబోతుంది. చత్తీష్‌ఘఢ్‌ ప్రభుత్వం రాజ్యాంగబద్దమైన నిర్ణయాలతో క్షేత్రస్థాయి ఆదివాసీ సమాజంలో గ్రామస్వరాజ్యం సాధించబడుతుందడనడంలో ఎలాంటి సందేహం లేదు! – రెబ్బాప్ర‌గ‌డ ర‌వి,ఎడిట‌ర్‌

విహార యాత్రలు.. పర్యావరణ విధ్వంసకాలు..!

ఇటీవల కాలంలో నిర్వహించిన రోదసి విహార యాత్రలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ప్రపంచ కుబేరులైన జెఫ్‌ బెజోస్‌, రిచర్డ్‌ బ్రాన్‌సన్‌ తాము రూపొందించిన స్ప్రేస్‌ క్రాఫ్ట్‌ ద్వారా రోదసి విహార పర్యటనకు వెళ్లివచ్చారు. మరో అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ కూడా తన స్పేస్‌ ఎక్స్‌ సంస్థ ద్వారా రోదసి విహార యాత్ర నిర్వహించాడు. చూడడానికి సైంటిఫిక్‌ అద్భుతంగా కనిపిస్తున్నప్పటికీ రోదసి విహార యాత్రలు అనే కాన్సెప్ట్‌ పెరిగితే పర్యావరణానికి పెద్ద హాని జరగనుంది. ఇప్పటికే ప్రపంచంలో అత్యంత ధనవంతులుగా ఉన్న ఒక్క శాతం ప్రజలు పర్యావర ణానికి తీవ్ర హాని చేస్తున్నారు. ప్రపంచ జనాభాలో సగం మంది విడుదల చేసే కర్బన ఉద్గారాల కన్నా ఈ ఒక్క శాతం ధనవంతులు విడుదల చేసే కర్బన ఉద్గారా లు రెండిరతలు అధికంగా ఉన్నాయి. తాజా రోదసి విహార యాత్రలు కూడా అత్యంత ధనవంతులు మాత్రమే చేయగలరు. వీరి వినోదం, ఉల్లాసం కోసం జరపబోయే పర్యాటక యాత్రలు ప్రపంచ మానవాళికి ప్రళయంలా మారనున్నాయి.

Read more

ఆరోగ్యం రాజ్యాంగ హ‌క్కు కావాలి

రాజ్యాంగ పరమైన ఆరోగ్య హక్కువల్ల, వెంటనే ఆర్థిక పరమైన రక్షణ లభిస్తుంది. అధికపెట్టు బడివల్ల, కుటుంబ పొదుపు, ఉద్యోగ అవకాశాలు ఒక వైపు,సుదూర భవిష్య త్తులో,ఉద్వేగపూరితమైన, మానసిక పరమైన,సామాజిక పరమైన రక్షణ విషయం లో ప్రజలపై చెప్పుకోదగ్గ ప్రభావాన్ని గమనించ గలం. ప్రపంచంలోని,చిన్న,పెద్ద దేశాలు కూడా మహమ్మారి నుండి కోలుకోవ డానికి,విధాన నిర్ణయాలలో,పెట్టుబడుల విషయంలో ముందు చూపుతో అనేక చర్యలు చేపడు తున్నాయి. భారత దేశం ఈ విషయంలో వెనుకబడరాదు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత నిర్భంధ విద్య నిస్సందేహంగా విలువైన వారసత్వాలలో ఒకటి. ధైర్యమైన నాయక త్వానికి నిజమైన నిదర్శనం.మానవునికి ఉన్న పరిమితమైన జ్ఞాపక శక్తి, తరచుగా మన సమిష్టిబాధల నుండి ఉపశ మనం పొందడానికి ఉపకరిస్తుంది. కానీ, బాధల నుండి నేర్చుకునే గుణపాఠాలు మరింత కీలకమైనవి. నోవెల్‌ కరోనావైరస్‌ మహమ్మారి ఫలితంగా,మన ప్రజలు వ్యక్తిగతంగా,సమిష్టిగా ఎదుర్కొంటున్న విషాదకరమైన పరిస్థితులను దృష్టిలోఉంచుకుని, ముందు చూపుతో అవసర మైన గుణపాఠాలను తీసు కోవడం మన నాయ కత్వం యొక్క నైతిక బాధ్యతకావాలి. దీని నుండి తీసుకోవాల్సిన గుణపాఠం ఏమంటే ‘అందరికీ ఆరోగ్య హక్కు’ అవసరాన్ని గుర్తిం చడం. కరోనా మహమ్మారి మన ఆరోగ్య రక్షణ వ్యవస్థలోని లోపాలను బహిర్గతం చేసింది.ఈ సమస్యను మనం నిర్లక్ష్యం చేయడంగానీ,నేర్చుకో కుండా ఉండడంగానీ చేయలేము.

Read more

నోబెలే గుర్తించింది..
మరి పాలకులు…?

ఏసేవకైనా,శ్రమకైనా ప్రపంచ గుర్తింపులో అత్యంత ప్రసిద్ధి గాంచినది నోబెల్‌ బహుమతి. ఈ సంవత్సరం అన్ని రంగాల్లో ప్రకటించిన నోబెల్‌ బహుమతులో ఆర్థిక శాస్త్రం మరియు శాంతికి ప్రకటించిన నోబెల్‌ బహుమతి ఇటు కార్మిక వర్గానికి అటు భావవ్యక్తీ కరణకు పరిత పించే అభ్యుదయ వాదులకు ఒకఊరట నిచ్చింది. లాభాలు పెంచుకోవడం కోసం వేతనాల కోతనే మరమౌష ధంగా భావించే పెట్టు బడిదారీవర్గానికి ఈసారి ప్రసాదించిన నోబెల్‌ బహుమతి యొక్క అంత రార్థం ఒక సమా ధానం. కనీస వేతనాల పెరు గుదల కొత్త ఉపాధి అవకాశాలను తగ్గించదని నిరూపిస్తూ చేసిన రీసెర్చ్‌కుగానూ ఈ ఏడు అర్థశాస్త్ర నోబెల్‌ బహుమతి ఇవ్వడం జరిగింది. తక్కువ వేతనా లను ఇవ్వడం ఎక్కువ పనిగం టలు పని చేయించు కోవడం వంటివే అధిక లాభాలకు ఆధా రాలుగా భావించే యాజమా న్యాలకు ఇది ఒక కనుపిప్పు కలిగించాలి. ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్‌ బహుమతి ఈఏడాది ముగ్గురిని వరించింది. అమె రికాకు చెందిన ఆర్థికవేత్తలు డేవిడ్‌ కార్డ్‌, జాషువా డి. ఆంగ్రిస్ట్‌, గైడో డబ్ల్యూ. ఇంబెన్స్‌లకు ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ అందిస్తున్నట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ప్రకటించగానే అనేకులకు ఆశ్చర్యమేసింది.అయితే ఇందులో సగం పురస్కా రాన్ని డేవిడ్‌ కార్డ్‌కు ఇవ్వగా..మిగతాసగాన్ని జాషువా,గైడో పంచుకోనున్నారు. కార్మిక ఆర్థిక అంశాలకు సంబంధించి పరిశోధనాత్మక సహకారం అందించినందుకు గానూ డేవిడ్‌ కార్డ్‌కు నోబెల్‌ అందించారు. ఇక ఆర్థిక శాస్త్రానికి సంబం ధించి విశ్లేషణాత్మకమైన పరిశోధనలపై సహకారం అందించినందుకు జాషువా, గైడోలకు కూడా పురస్కారం ఇచ్చారు. సామాజిక శాస్త్రాల్లో ఒక్కోసారి చాలా పెద్దపెద్ద ప్రశ్నలు ఎదురవు తుంటాయి.ఉపాధి,ఉద్యోగుల వేతనంపై వలస విధానం ఎలాంటి ప్రభావం చూపుతుంది?ఓవ్యక్తి సుదీర్ఘ విద్య అతని భవిష్యత్తుపై ఏ మేరకు పనిచేస్తుంది? వలసవిధానం తగ్గడం,వ్యక్తి సుదీర్ఘకాలం చదువుకోకపోవడం ఎలాంటి పరిణామలకు దారితీస్తుంది?ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం చాలా కష్టం.అయితే ఈ ప్రశ్నలకు తమ సహజ పరిశోధనలతో సమాధాన మివ్వొచ్చని శాస్త్రవేత్తలు డేవిడ్‌, జాషువా,గైడో రుజువు చేశారు.అయితే ఏ దేశ ప్రభుత్వాలైనా, ఏ రంగంలోనైనా ఇలాంటి పరిశోధనలను గుర్తించడమే కాక వాటిని తమ విధానాల్లో భాగం చేసుకున్నప్పుడే ఆర్థిక అసమానతల తొలగింపు సులభమౌతుంది. భారత దేశంలో కనీస వేతనాల చట్టం1948 లోనే తయారు చేయబడిరది. కానీ ఇది చట్టపరమైన బైండిరగ్‌ ఏమీ కాదు. కనీస వేతనాలు చెల్లించనందుకు ఇంత వరకు ఎవరినీ చట్టం శిక్షించడం లేదు. అయితే ఈ చట్టం ప్రకారం కార్మిక సంఘాలు పోరాటం చేయడం మూలాన రాష్ట్రాలు కంపెనీల యాజమాన్యాలు కొంతవరకు కనీస వేతనాలు చెల్లించడానికి చర్చలు మాత్రం జరిపుతాయి కానీ అమలుకు చిత్తశుద్ది లేదు. కనీస వేతనాలు ఒక రాష్ట్రానికి మరో రాష్ట్రానికి మరియు ఒక రంగానికి మరో రంగానికి మధ్య చాలా వ్యత్యాసాలు ఉంటాయి. షెడ్యూల్డ్‌ కంపెనీలకు, రిజిస్టర్డ్‌ కంపెనీలకు మరియు రిజిష్ట్రేషన్‌ చేయబడని కంపెనీలలో కూడా కనీస వేతనాలు వ్యత్యాసాలతో కొనసాగు తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా రిజిస్ట్రేషన్‌ పొందిన కంపెనీల్లో కూడా కింది స్థాయిలోని ఎక్కువ శాతం ఉద్యోగులు ఎలాంటి మస్టర్‌ లేకుండా డైలీ వేజ్‌ వర్కర్లుగా పని చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరికీ అదే కంపెనీలో పని చేస్తున్న వారి కన్నా తక్కువ వేతనం చెల్లించబడుతుంది. ఇది అనేక సందర్భాలలో కార్మిక సంఘాల సర్వేలలో బయట పడిరది. ప్రభుత్వ దృష్టికి కూడా వచ్చింది. అయితే భారతదేశంలో రిజిస్ట్రేషన్‌ చేయబడినవి, షెడ్యూల్లో లేని సూక్ష్మ, మధ్య తరగతి మరియు సీజనల్‌ ఇండస్ట్రీ లే ఎక్కువగా ఉంటాయి. ఇట్లాంటి చోట దోపిడీ మరింత ఎక్కువగా ఉన్నది. మన దేశంలో అత్యంత ఆర్థిక అసమానతలు ఎక్కువగా ఉండడానికి ప్రధాన కారణం ఈ రకమైన దోపిడీయే. కనీస వేతనాల చెల్లింపు నుండి సంఘటిత రంగం కూడా చాలా తెలివిగా తప్పించుకుంటున్నది. కాంట్రాక్టీకరణల ద్వారా నియమించుకున్న ఉద్యోగులకు సదరు కాంట్రాక్టర్‌ ఎంత వేతనాలు చెల్లిస్తున్నారో విధిగా తెలుసుకోవలసిన బాధ్యత పని తీసుకుంటున్న సంస్థకు ఉన్నది. ప్రావిడెంట్‌ ఫండ్‌, ఈ.ఎ.ఐ వంటివి చెల్లిస్తున్నాడా లేదా చెక్‌ చేయవలసింది కూడా కంపెనీయే. కాంట్రాక్టర్‌ కూడా తను ఏ ఏ హెడ్స్‌ కింద ఇస్తున్నాడో తెలుపవలసిన బాధ్యత ఉన్నది. అయితే ఇవన్నీ పేపర్‌ వరకే పరిమితమై బ్యాంకు క్రెడిట్‌ మరోలా ఉన్నదని కాంట్రాక్టీ కరణల ద్వారా నియమించబడుతున్న ఉద్యోగు లందరూ వాపోతుంటారు. దీనికి కాంట్రాక్టర్‌ ఇచ్చే సమాధానం ఏమంటే- ట్రైనింగు, యూని ఫామ్‌,రిఫ్రెషర్‌ ట్రైనింగ్‌ మరియు ఇతర మెయింటేనెన్సులు వంటివన్నీ మినహాయించు కున్న తర్వాత ఆ విధంగా చెల్లించవలసి వస్తుందని. దీనిలో నిజానిజాలు ఎంత ఉన్నా నష్టపోయేది కార్మికుడే. కనీస వేతనాలు అమలు కోసం రాష్ట్రాల పరిధిలో వేజ్‌ బోర్డులు అని నామకరణం చేయబడ్డాయి కానీ ఇవి నామ మాత్రంగానే ఉన్నాయి. నలుగురు వ్యక్తులు ఉన్న కుటుంబానికి- కూడు,గూడు,గుడ్డతో పాటు విద్య, వైద్యం, మరియు ఎంటర్టైన్మెంట్‌ సదుపాయాల కోసం లెక్కించి,ఆస్థానిక పరిస్థితులకు అనుగుణంగా కనీస వేతనాలు నిర్ణయించడం అవి అమలు జరిగేలా చూడటం ప్రభుత్వాల బాధ్యత. కానీ ఇది ఈ దేశమంతా అందని ద్రాక్షే. 2020లో భారత రిజర్వు బ్యాంకు జారీ చేసిన వివరాల ప్రకారం జాతీయ సగటు కనీస వేతనం కేవలం 293 రూపా యలే! కేరళ రాష్ట్రం 670రూపాయలతో మొదటి స్థానంలో వుండగా 453రూపయలతో జమ్ముకాశ్మీర్‌,438 రూపాయలతో తమిళనాడు రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో వున్నవి. అత్యల్పం మధ్యప్రధేశ్‌ రాష్ట్రంలో 205రూపాయలు చెల్లించబడగా గుజరాత్‌ బీహారుల్లో వరుసగా 233 మరియు267 గా వున్నవి.భారత దేశ టెలికాం రంగంలో సంస్కరణలను ప్రతిపాధించి నప్పుడు శ్యాంపిట్రోడా గారు కంపెనీ సి.ఈ.ఓ జీతాన్ని కంపెనీలోని అత్యధిక జీతానికన్నా మూడిరతలు చేయడం ద్వారా క్రింది స్థాయి వుద్యోగులను మరింత పిండగలరని చెప్పారు. ఈ సూత్రం వంటబట్టించుకున్న రిలయన్స్‌ జియో క్రింది స్థాయి వర్కర్లకు చాలీచాలని భృతి ఇస్తూ లాభాలు గడిస్తున్నది!. అయితే ఉద్యోగు లను పిండుకోవడం కాదు, క్రింది స్థాయి వేతనాల్లో పెరుగుదల మార్కెట్‌నూ పరుగులు పెట్టించగలదనీ ఆర్థిక మాంద్యానికి సమాధా నాలుగా సూచించినప్పుడు కీన్స్‌ అనే ఆర్థిక వేత్త కూడా అభిప్రాయపడ్డారు. కనీస వేతనాల పెరుగుదల ఉపాధి లేమికీ లాభాల్లో తగ్గుద లకూ దారి తీయదని సాక్షాత్తు ప్రపంచ ప్రసిద్ది నోబెల్‌ నిర్వహాకులే గుర్తించినందుకు మన పాలకులూ ఆ దిశగా ముందడుగు వేయాలి.

Read more

మ‌హానీయ స్వామి వివేకానంద‌

ఉన్నతమైన ఆశయాలు ఏదో ఒక రోజు సర్వజనాంగీకారాన్ని పొందుతాయి. కారణం ఆ భావన, ఆశయాలు ప్రతి కార్యరంగంలోనూ, ప్రతీ ఆలోచనా విధానంలోనూ ఉత్తేజం కలిగించేవి కాబట్టి. కాషా యాం బరాలు ధరించి, పద్మాసనస్థుల్కె, ఒకదాని మీద మరొకటిగా కరకమలాలను ఒడిలో ఉంచుకుని, అర్థని మీనేత్రుల్కె ధ్యానమగ్నుల్కె వివేకమంతమైన ఆనందం అనుభవించే స్వామి వివేకానంద లోకానికి ప్రకాశానిచ్చే ఒక జగద్గురువు. సామాజిక సృహతో కూడిన ఆధ్యాత్మి కతను ప్రజలకు ఉపదేశించడం, ఇంద్రియాతీత విషయా లను వివేకించటం ద్వారా ఆధ్యాత్మిక సౌధాన్ని నిర్మిం చడం, ఆసౌధంలో చ్కెతన్యమూర్తులుగా జనులను విరాజిల్లింప చేయటం స్వామి వివేకానంద అపురూప ఆశయం. విశ్వాసంతో నిరంతరాభ్యాసాన్ని చేస్తూ, మనసు పొరలలో నిభిఢీకృతమైన కొత్త విషయాలను అనుభవిస్తూ, క్రొంగొత్త శక్తుల వశీకరింపచేసుకుంటూ ఊహాతీత వ్యక్తిత్వాన్ని వికసింపచేసుకోవటానికి దివ్య ప్రేరణ స్వామి వివేకానంద.

Read more

డెల్టాన్ దాటి దుసుకుపోతున్న‌ ఒమిక్రాన్

రాష్ట్రంలో ఒమిక్రాన్‌ వ్యాప్తిపై జనాల్లో ముమ్మరంగా చర్చలు కొనసాగుతున్నాయి.డెల్టా కంటే ఒమిక్రాన్‌ వేరియంట్‌ నాలుగైదు రెట్లు స్పీడ్‌గా స్ప్రెడ్‌ అవుతోందని డబ్ల్యూ హెచ్‌వో దగ్గర్నుంచి రాష్ట్ర హెల్త్‌ డైరెక్టర్‌ వరకూ అందరూ చెప్తున్నప్పటికీ, మన రాష్ట్రంలో మాత్రం అలాంటి సూచనలే కనిపించట్లేదు. కెన్యాలో, సోమాలియాలో ఒమిక్రాన్‌ బారినపడి ఇక్కడికి వచ్చినోళ్లు వందల మందిని కాంటాక్ట్‌ అయినప్పటికీ అందులో ఒక్కరికే కొత్త వేరియంట్‌ అంటుకుంది. యూకే నుంచి హన్మకొండకు వచ్చిన మహిళకు ఒమిక్రాన్‌ పాజిటివ్‌ వచ్చింది. ఆమెతో కలిసి ఇంట్లోనే ఉన్న ఆమె భర్తకు, బిడ్డకు వైరస్‌ అంటలేదు. ఆమెను కలిసిన 30 మంది ప్రైమరీ కాంటా క్టులలో కనీసం ఒక్కరికీ వైరస్‌ సోకలేదు. జూబ్లీహిల్స్‌లో ఒమిక్రాన్‌ పేషెంట్‌కు 3రోజుల పాటు ఫుడ్‌ సర్వ్‌ చేసిన హోటల్‌ సిబ్బంది లోనూ ఎవరికీ ఈ వేరియంట్‌ అంటలేదు. ఇలా చెప్తూపోతే చాలా ఎగ్జాంపుల్సే ఉన్నయి. సౌత్‌ ఆఫ్రికా, యూకే, అమెరికా తదితర దేశాల్లో పరిస్థితి చూస్తే డబ్ల్యూహెచ్‌వో చెబుతున్నట్టు ఒమిక్రాన్‌కు స్పీడ్‌ ఎక్కువేనన్న విషయం స్పష్టం అవుతోంది. కానీ,మన దగ్గరకు వచ్చేసరికి ఒమిక్రాన్‌ స్పీడ్‌ తగ్గిపోయిన సూచ నలు కన్పిస్తున్నయి.హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ చెబు తున్న లెక్క ప్రకారం ఆదివారం నాటికి రాష్ట్రంలో ఇప్పటి వరకు 44 ఒమిక్రాన్‌ కేసులు నమోద య్యాయి. ఇందులో 40 మంది విదే శాల నుంచి వచ్చినవాళ్లు అని, ఇంకో ఇద్దరికి లోకల్‌గా స్ప్రెడ్‌ అయిందని ప్రకటించారు. ఈ ఇద్దరికీ తప్ప లోకల్‌?గా ఇంకెవరికీ స్ప్రెడ్‌ కాలే దని చెప్తోంది.

Read more

రైతు కంట క‌న్నీరు

సంక్రాంతి వచ్చేస్తోంది. అన్నదాత చేతిలో చిల్లిగవ్వ లేదు. పంట విక్రయించి పిల్లాపాపలకు కొత్త బట్టలు కొందా మంటే పండిరచిన ధాన్యం ఇంకా కొనేవారు కనిపిం చడం లేదు. ఆర్‌బికెలకు వెళ్తే తమ శాతం పేరుతో తిప్పి పంపిస్తున్నారు. ధాన్యం ఆరబెట్టాలంటే కళ్లాలు లేవు. తక్కువకు దళారులకు అమ్మలేక సతమతమవుతున్నారు. ఈ ఏడాది వరిసాగుచేస్తే వారిలో 30 శాతం మంది రైతుల పేర్లు వెబ్‌సైట్‌లో కనిపిం చడం లేదని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈసమస్య సరిదిద్దే ప్రయత్నంలో రెవెన్యూ, వ్యవ సాయశాఖలు సంయుక్తంగా పనిచేయాల్సి ఉంది. ఈ రెండు శాఖల్లో పని ఒత్తిడి కారణంగా వెబ్‌సైట్‌ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదు. మరోవైపు ఈ-క్రాప్‌ నమోదు జిల్లాలో శతశాతం పూర్తికాలేదు. దీంతో ధాన్యం విక్రయాలకు ఈ సమస్యలు అడ్డంకిగా మారుతున్నాయి. మరోపక్క తేమ శాతం ఎక్కువగా ఉండటంతో సాగుదారులు పలుమార్లు రైతు భరోసా కేంద్రాల చుట్టూ తిర గాల్సి వస్తోంది. దీంతో చేసేది లేక రైతులు దళారు లను ఆశ్రయించి అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొం టోంది. జిల్లాలో గోనె సంచుల కొరత వేదిస్తోంది. పౌరసరఫరా సంస్థనుంచి సకాలంలో గోనె సంచు లు రాక పోవడంతో ఈ సమస్య తలెత్తు తోంది.

Read more

ప‌చ్చ‌ని పొలాల్లో కాల్సైట్ చిచ్చు

‘‘ గిరిజనులకు ప్రధాన జీవనాధారం భూమి.ఇప్పటికీ అత్యధిక గిరిజన కుటుంబాలు వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్నారు. గతంలో ప్రతీ గిరిజను కుటుంబానికి సరిపోయనంత భూమి ఉండేది. అనేక కారణాలువల్ల గిరిజనులు తమ భూమిని కోల్పోతూ వస్తున్నారు. నిరక్షరాస్యత, అనారోగ్యం,అజ్ఞానం,ఆర్ధికదోపిడి,కనీస సౌకర్యాలలేమి వారు నిత్యం ఎదుర్కొనే సమస్యలు. వీటి కారణంగా గిరిజనులు తమ భూములు,వనరులను కాపాడుకోలేక పోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో, గిరిజనుల్లో తమ హక్కులపట్ల చైతన్యం కలిగించి ప్రభుత్వం గిరిజనేతరుల దోపిడీని ప్రతిఘటించే విధంగా వారిని సమీకరించడంపై ‘సమత’ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూలు పరిధిలోకి వచ్చే ఆదివాసీ ప్రజల సమస్యలు,వనరులు, పర్యావరణ పరిరక్షణ,వారి హక్కులను కాపాడుతూ పోరాటం సాగిస్తోంది. స్థానికులైన గిరిజనల భూములు, అన్యాక్రాంతం కాకుండా ఈ షెడ్యూలు రక్షణ కల్పిస్తుంది. అయినా రాష్ట్రంలో ముఖ్యంగా విశాఖ జిల్లా ఏజెన్సీలో చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత కూడా గిరిజనేతరులు గిరిజన భూములను ఆక్రమించుకోవడం ఆగలేదు ’’పచ్చని పొలాలపై కాల్సైట్‌ చిచ్చు రగులు తోంది. అగ్ని ఆరదూ..పురుగు చావదు చందంగా ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ,మైనింగ్‌ కాంట్రాక్టర్ల(ఏపీఎం డీసీ)కాల్సైట్‌ మైనింగ్‌ ప్రభావిత గ్రామ రైతుల మధ్య ప్రచ్ఛన్నయుద్దం జరుగుతోంది. రాజ్యాంగానికి విరుద్దంగా,పీసా చట్టం,సమత జడ్జిమెంట్‌లను ఉల్లంఘించి మైనింగ్‌ తవ్వకాలు చేపడితే సహించమని గిరిజన రైతులు ప్రతిఘటి స్తున్నారు. మరోపక్క మైనింగ్‌ కాంట్రాక్టర్ల మైనింగ్‌ ప్రభావిత గ్రామాల్లోని గిరిజనుల మధ్య విభేదాలు సృష్టించి వారిలో వారికి వివాదాలు పెట్టి కాల్సైట్‌ తవ్వకాలు చేపట్టేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ వివాదంపై ఇటీవల మూడు గ్రామాల ప్రజలు ఏర్పాటు చేసిన గ్రామసభ దీనికి తార్కాణం. విశాఖ జిల్లాలోని అనంతగిరి మం డలం కరకవలస,రాళ్లవలస,నిమ్మలపాడు మూడు గ్రామా ల గిరిజన ప్రజల మధ్య కాల్సైట్‌ మైనింగ్‌ తవ్వకాల కోసం ప్రభుత్వం ఇచ్చిన లీజులపై అప్రాంత గిరిజన ప్రజలు వ్యతిరేకిస్తు న్నారు. ప్రభు త్వం ఇచ్చిన లీజులు తక్షణమే రద్దుచేసి స్థానిక గిరిజన సొసైటీలకే మైనింగ్‌ లీజులు అప్పగించాలంటూ గిరిజన ప్రజలు గ్రామసభలో ప్రతిఘటించారు. తమకు రాజ్యాంగం కల్పించిన చట్టాలను బాధ్యతాయతంగా అమలు చేయాలని గ్రామసభ సాక్షిగా కోరారు. మైనింగ్‌ లీజులకు గ్రామసభ తీర్మాణం లేదు. సమతజెడ్జిమెంట్‌, పీసా చట్టం,అటవీహక్కులచట్టం, నియమగిరి జడ్జెమెంట్‌ వంటి గిరిజనులకు రక్షణగా ఉన్న రాజ్యాంగ బద్దమైన చట్టా లను వ్యతిరేకించి.. మైనింగ్‌ లీజులు ఇవ్వడంపై గిరిజన ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివాసుల హక్కులు, మైనింగ్‌ తవ్వకాలపై పూర్వంనుంచి సమత పలు ఉద్య మాలు చేపట్టి సుప్రీం కోర్టులో కేసు వేసి విజయం సాధించడం జరిగింది. ఫలితంగా సుప్రీం కోర్టు ఇచ్చిన సమత తీర్పును గౌరవించి అమలు చేయాల్సిన ప్రభుత్వం,అధికార యంత్రాంగాలు కంచెచేను మేసే చందంగా వ్యవహరింస్తోందని గ్రామసభ లో గిరిజనరైతులు ధ్వజమెత్తారు. ఈప్రాంతం లో నాటికి నేటికీ గిరిజన ప్రజల స్థితిగతులు ఏమాత్రం మారలేదు. నేటికీ అన్యాయాలకు, అమయక త్వానికి గురవుతునే ఉన్నారు. వారి అమాయ కత్వాన్ని ఆసరాగా తీసుకొని మళ్లీ ప్రాంతంలో మైనింగ్‌ తవ్వకాలకు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు.

Read more
1 … 60 61 62 63 64 … 87