కల్వకుంట్ల చంద్రశేఖర్‌ అనునేను

తెలంగాణలో రెండోసారి ప్రభుత్వం ఏర్పాటైంది. ఈఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌ నేతృ త్వంలోని కేసీఆర్‌కే మళ్లీ పట్టం కట్టారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు తెలంగాణ ఎన్నిక లను కూడా యావత్‌ దేశం ఆసక్తిగా పరిశీలించింది. కాంగ్రెస్‌, టీడీపీ తమ మధ్య ఉన్న వైరాన్ని పక్కనబెట్టి సీపీఐ, టీజేఎస్‌తో కలిసి ప్రజా కూటమిగా ఏర్పాటుకావడం ఒకటి కాగా..రెండోది గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు భారీ మొత్తంలో ధన ప్రవాహాన్ని పారించడం ఈఎన్నికల ప్రత్యేకతలు. ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్‌ కేంద్రాలకు పోటెత్తిన ఓటర్లు టీఆర్‌ఎస్‌కు భారీ మెజార్టీ ఇచ్చారు. మొత్తం 119 స్థానాలకు 88 సీట్లలో టీఆర్‌ఎస్‌ గెలిచింది. గత నాలుగున్నరేండ్లలో చేపట్టిన సంక్షేమ పథకాలు, సబ్సిడీలు కొనసాగించాలంటే స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే సాధ్యమవుతుందనే ఉద్దేశంతో తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు పట్టం కట్టారు. -ఎన్‌.వేణుగోపాల్‌
ప్రజలు ఇచ్చిన తీర్పును ఏరాజకీయ పార్టీ అయినా గౌరవించాల్సిందే. తెలంగాణ ప్రజలు ఇచ్చిన ఈ గొప్ప విజయంతో రెట్టింపు ఉత్సాహంతో ప్రభుత్వం పనిచేయాల్సిన బాధ్యత ఉంది. గత పర్యాయంలో ఇచ్చి నెరవేర్చలేకపోయిన హామీలను సైతం అమలు చేయడమే కాకుండా కొత్తగా మరిన్ని అభివ ృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపడితే తెలంగాణ సమాజానికి మేలు జరుగుతుంది. ప్రభుత్వ పనితీరును బట్టే ప్రజా తీర్పు ఉంటుందనే విషయాన్ని ఈఎన్నికలు స్పష్టంచేసినట్టు కనబడుతోంది. మిగతా నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు చాలా మెరుగైన ఫలితాలు వచ్చాయి. 2019 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా చెప్పుకొనే ఈ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలి వీచింది. ఎన్డీయే సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీతో పాటు నిత్యావసర ధరల పెంపుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వీటితో పాటు సీబీఐ, సుప్రీంకోర్టు, ఈడీ,ఐటీ తదితర స్వతంత్ర వ్యవస్థల్లో జోక్యం చేసు కుంటూ వాటిని నిర్వీర్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం ప్రవర్తిస్తోందనే విమర్శలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజలు ఇచ్చిన తీర్పు ఆయా రాజకీయ పార్టీలకు గుణపాఠం చెప్పేదే.
రెండోసారి గెలిచిన వెంటనే.. కోటిఎకరాల మాగాణికి సాగునీరందించడం, యువతకు ఉపాధి అవకాశాల కల్పనే తమ తక్షణ కర్తవ్య మని ప్రకటించిన కేసీఆర్‌.. ఆదిశగా సత్వరమే చర్యలు తీసుకోవాలి. విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేయాలి. ప్రజల మౌలిక అవస రాలకు సంబంధించిన అంశాల్లో కార్పొరేట్‌ వ్యవస్థల గుత్తాధిపత్యానికి చరమగీతం పాడే లా విప్లవాత్మక సంస్కరణలు తీసుకొస్తే యావత్‌ సమాజం హర్షిస్తుంది. ప్రజలు ఇచ్చి న ఈ గొప్ప అవకాశంతో రాష్ట్ర ప్రతిష్ఠను, ఆర్థిక అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేలా ప్రభుత్వం పనిచేయాలి. అలాగే, ప్రతిపక్ష పార్టీలు ఈ ఓటమితో నిరాశలో కూరుకుపో కుండా నిత్యం జనంలో తిరుగుతూ వారితో మమేకమవ్వాలి. ఓటమికి కారణాలను ఆత్మ పరిశీలన చేసుకుంటూ ప్రజలకు దగ్గరయ్యేం దుకు మరింత చొరవతో పనిచేయాలి. పాల నలో ప్రభుత్వానికి సహకరిస్తూ నిర్మాణాత్మక సూచనలు, సలహాలుఇస్తూ ముందుకెళ్లే దిశ గా ప్రయత్నం చేయాలి. ఎన్నికల్లో గెలుపోట ములు సహజం. సమైక్య రాష్ట్రంలో ప్రభు త్వాల పాలనలో తెలంగాణ గ్రామీణ ప్రజలు చాలా బలహీనపడిపోయారు. తెలంగాణ రాష్ట్రం కల సాకారమయ్యాక ఏర్పడిన ప్రభు త్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు, సబ్సిడీలు కల్పించాల్సిన అవసరాన్ని గుర్తించి.. వాటితో ప్రజలకు ఉపశమనం కలిగించింది. ఈతరు ణంలో తెలంగాణ ఓటరు ఇచ్చిన ఈగొప్ప విజయాన్నిస్ఫూర్తిగా తీసుకొని మరిన్ని సంక్షే మ కార్యక్రమాలు, సబ్సిడీలను కొనసాగించే దిశగా చర్యలు తీసుకుంటూనే ప్రజాకాం క్షలకు అద్దంపట్టేలా పాలన కొనసాగించాలి. దేశంలో ప్రతీ ఒక్కరూ తమ గురించి తామే ఆలోచించు కుంటున్నారు. సామూహిక పోరా టాలపై క్రమంగా విశ్వాసం సడలిపోతోంది. ఏప్రాంతం వారు ఆ ప్రాంతం గురించే ఆలో చించుకొనే ధోరణులు కనబడుతున్నాయి. ఇలాంటి పరిణామం ప్రజాస్వామ్య మను గడకు మంచిది కాదు. ఓవిశాలమైన దృక్ప థంతో ప్రతిఒక్కరూ ముందుకెళ్లాలి. రాజకీయ పార్టీలు కూడా సామూహికమైన అంశాలను తీసుకొని రాజకీయ ఉద్యమాలు చేపట్టాలి. అప్పుడే సామూహిక చైతన్యం వస్తుంది. సామూహిక ఉద్యమాలపై ప్రజల్లో నమ్మకం పెంచాలి. గెలుపు అనేది మనిషిలో కొత్త మార్పులను తీసుకొస్తుంది. దాంతో వచ్చిన పరిణామాలను సమతుల్యం చేసుకుంటూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలవ గలిగే వాడే గొప్ప నాయకుడు కాగలుగుతాడు. ఇప్పటి వరకు కేసీఆర్‌ సర్కార్‌ చేసిన అభి వృద్ధి పనులకు అభినందనలు. వచ్చే ఐదేండ్ల లో అభివృద్ధిపై కేంద్రీకరించండి. ఏయే అం శాలు ఆర్థిక రంగాన్ని పురోగమింప జేస్తాయో వాటిపై దృష్టి పెట్టండి. తెలంగాణ సమాజ శ్రేయస్సు కోసం ప్రభుత్వం చేపట్టే ఏ కార్యక్ర మంలోనైనా ప్రజాస్వామికవాదుల సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది.
కొత్త ప్రభుత్వానివి పాతవిధానాలేనా.. మార్పుంటుందా?
కారణాలు ఏవైనాగానీ, కారకులు ఎవరైనాగానీ, తెలంగాణ రాష్ట్ర సమితి మరొ కసారి పూర్ణ బహుమతి పొంది, ప్రభు త్వాన్ని ఏర్ప రచనున్నది. తెలంగాణ ప్రజా ఆకాంక్ష లలో, ఉద్యమ నినాదాల్లో అత్యధిక భాగాన్ని నెరవేర్చని పాలనానుభవంతో ఈ విజయం ఎలా సాధ్యమయిందని ప్రశ్నలు రావచ్చు. కౌలురైతులు, ఉద్యోగులు, కార్మి కులు, నిరు ద్యోగులు, ఆదివాసులు, ప్రజాఉద్యమ కార్య కర్తలు వంటి వివిధ ప్రజాసమూహాల అసం తృప్తిని మూట గట్టుకున్న తర్వాత కూడ ఈ విజయం ఎలా సాధ్యమయిందని సందేహాలు మిగలవచ్చు. ఎన్నికల ప్రచార సమయంలో మరొకసారి వినియోగించిన, రెచ్చగొట్టిన తెలంగాణ సెంటిమెంట్‌ ఈ విజయానికి కార ణం అనుకోవచ్చు. ప్రత్యర్థులకు విశ్వసనీయత లేకపోవడం, తప్పుడు వ్యూహాలు కారణమను కోవచ్చు. లేదా, పెన్షన్లు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ వంటి సంక్షేమ పథకాల లబ్ధిదా రులు పూర్తిగానూ, రైతుబంధు, రైతుబీమా లబ్ధిదారులు, నీటిపారుదల పథకాల కలలు కంటున్నవారు కొంతవరకు టీఆర్‌ఎస్‌కు వోటు వేశారనుకోవచ్చు. ఈఎన్నికల ఫలి తాలు ఎలా ఉన్నా, తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి నంతవరకు రానున్న ప్రభుత్వం ముందున్న సవాళ్లు, అవకాశాలు, కర్తవ్యాలు ఏమిటో చర్చించుకోవలసి ఉన్నది. ఇదేదో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం కోసం కాదు. అది ఈవిజయానికి తప్పనిసరిగా తనవిధానా లకు ప్రజల సంపూర్ణ ఆమోదం అనే తప్పుడు అర్థం చెపుతుంది. గత నాలు గున్నరేండ్ల పాల నలో అమలు చేసిన విధానా లనే యథాత థంగా కొనసాగిస్తుంది. కాని నిరంతర జాగ రూకతే ప్రజాస్వామ్యానికి చెల్లించవలసిన మూల్యం అనే విలువను నమ్మితే ప్రజానీకం నిరం తర జాగరూకంగా ఉండవలసిన అంశాలు ఇవి.
పెరిగిపోయిన రుణభారాన్ని తగ్గిం చడం, ప్రభుత్వవ్యయం పెరుగుదలను అరిక ట్టడం, విద్యారంగ అభివృద్ధి, పారిశ్రామి కాభి వృద్ధి, తద్వారానూ ఇతరంగానూ నిరు ద్యోగ సమస్య తగ్గింపు, అసంతృప్త వర్గాల సమ్మతిని చూరగొనడం వంటి ప్రధానమైన సవాళ్లు కొత్త టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముందున్నాయి. తెలం గాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రుణభారంలో తనవంతు వాటా గా రూ.61,711కోట్ల అప్పుతో ప్రారంభమ యింది. నాలుగేండ్లలో ఆ అప్పు రెండు లక్షల కోట్ల రూపాయలకు చేరింది. ఇది రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో నిష్పత్తిగా చూస్తే చట్టం అనుమ తించిన పరిధిలోపలే ఉన్నదనో, ఆఅప్పులను అభివృద్ధి పథకాలకే ఖర్చు పెడుతు న్నామనో టీఆర్‌ఎస్‌ చెప్పుకున్నది గాని బహుశా దేశం మొత్తంలోనే ఇంత తక్కువ కాలంలో ఇంత ఎక్కువ అప్పు చేసిన రాష్ట్ర ప్రభుత్వం మరొకటి లేదు. ఈఅప్పును కేంద్ర ప్రభుత్వ ఎఫ్‌ ఆర్‌బిఎం చట్టపు నిబంధనలకు లోబడే చేస్తు న్నామని ప్రభుత్వం పదే పదే చెప్పుకున్నది. అలా అది చట్టబద్ధంగా కనిపించి నప్పటికీ న్యాయబ ద్ధమైనది మాత్రం కాదు. ఎందుకంటే కాలం గడిచిన కొద్దీ తెచ్చిన అప్పంతా పాతఅప్పుల అసలు, వడ్డీల చెల్లింపుల కోసం మాత్రమే వెచ్చించవలసిన రుణభారపు విషవలయంలోకి రాష్ట్రం చేరుతుంది. ఆ అనుభవం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల, రాష్ట్రాల ప్రభుత్వాలకు ఉన్నదే. చివరికి స్వయంగా కంట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) తన 2018 నివేదికలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాత అప్పులు తీర్చడానికే కొత్త అప్పులు చేస్తున్నదని కూడ నిర్ధారిం చింది. కనుక కొత్త ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిశీలించవలసిన సవాల్‌ తన అప్పుల విధానాన్ని సమీక్షించుకోవడం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో అంతర్గత వనరుల సేకరణ సాధ్యం కాని అనివార్య పరిస్థితి లో మాత్రమే అప్పుకు వెళ్లాలని, అలా అప్పుకు వెళ్లేప్పుడైనా తక్కువ వడ్డీ అప్పులకే ప్రాధాన్యం ఇవ్వాలని తనకు తాను ముందస్తు జాగ్రత్త విధించు కోకపోతే, గత అనుభవాన్ని యథాతథంగా కొనసాగిస్తే రానున్న పదవీకాలంలో రాష్ట్ర ప్రజల మీద రుణభారం ఏనాలుగైదు లక్షల కోట్ల రూపాయలకో చేరి, రాష్ట్ర ఆర్థికవ్యవస్థ ఎన్నటికీ కోలుకోలేని స్థితికి చేరుకుంటుంది.
అలాగే ప్రభుత్వ వ్యయం పెరుగుదలను అరికట్టడం, ఇప్పటి వరకూ సాగుతున్న ప్రభుత్వ వ్యయాన్ని నిర్మొహమాటంగా సమీక్షించి, అనవసర, దుబారా వ్యయాన్ని తగ్గించడం, అవసరమైన రంగాలలో వ్యయాన్ని పెంచడం అనే ప్రక్రియ నిరంతరం జరగవలసి ఉంది. గత నాలుగున్నరేండ్ల టీఆర్‌ఎస్‌ పాలనానుభవంలో అటువంటి సమీక్ష జరిగిందో లేదో తెలియదు. కాని ప్రభుత్వ వ్యయం మాత్రం నానాటికీ పెరిగిపోయింది. అది కూడ ప్రజావసరాల మీద, ఉపాధి అవకా శాలను, ఆదాయ వనరులను పెంచే ఉత్పాదక పథకాల మీద కాకుండా వథా వ్యయంగా సాగింది. ఆడంబరాల కోసం, రక్షణ పేరు మీద పటాటోపాల కోసం సాగింది. ఎన్నికల సమయంలో ప్రజలను ఆకర్షిం చడానికి ఇచ్చే ప్రలోభాలకూ తాయిలాలకూ మరొక రూపుగా సంక్షేమ పథకాలను తయారు చేసి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుబారా చేయడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రోజుల నుంచి చూసినా ఎన్నడూ లేనంత ఎక్కువగా పోలీసు వ్యవస్థను దగ్గరికి తీసి, వారు అడిగినవీ, అడగనివీ కూడ ఇచ్చి వేలకోట్ల రూపాయలు దుబారా చేయడం జరిగింది.
ఇలా గత నాలుగున్నరేండ్లలో చేసిన ప్రభుత్వ వ్యయాన్నంతా ఒక్కసారి సమీక్షించి, వాటిలో ఏపద్దుల మీద కోత విధించవచ్చు, ఏ పద్దులను రద్దు చేయవచ్చు, ఏపద్దుల మీద వ్యయాన్ని పెంచవలసిన అవసరం ఉంది అని ఒకవివరమైన మదింపు అవసరం ఉంది. అది జరిగినప్పుడే, ప్రజలు చెల్లిస్తున్న పన్నులు, ప్రభుత్వానికి ఒనగూరు తున్న నిధులు సక్రమ వినియోగంలోకి వస్తాయి. అలా కాక, గతంలో కొనసాగిన విధానాలనే కొనసాగించవచ్చునని అనుకుంటే ఈ పదవీ కాలం ముగిసి, తర్వాతి పదవీకాలానికి వారే అధికారానికి వచ్చినా, మరొకరు అధికారానికి వచ్చినా ఆర్థిక వ్యవస్థను నిర్వహించలేని దుస్థితి ఏర్పడుతుంది. ఐదేండ్ల కొరకు ప్రజాధనానికి ధర్మకర్తగా ఉండవలసిన ప్రభుత్వానికి దాన్ని దుర్వినియోగం చేసే హక్కు లేదు. విద్యారంగ అభివృద్ధి విషయంలో గత నాలుగున్న రేండ్లలో కొన్ని గురుకులాలు ఏర్పాటు చేయడం మినహా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసినది చాల తక్కువ. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అనే నినాదం నాలుగున్నరేండ్లలో అటకెక్కింది. ఈపదవీకాలంలోనైనా ఆనినాదాన్ని సాకారం చేసే చర్యలు తీసుకోవలసి ఉంది. ఉపాధ్యాయుల నియామకం, పాఠశాలల మౌలిక సౌకర్యాలు మెరుగుపరచడం, ఎక్కువమంది పిల్లలను ప్రభుత్వ పాఠశా లలకు పంపేలా తల్లిదండ్రులను ప్రోత్సహించడం, సమాజంలో ప్రభు త్వ విద్యపట్ల ఆదరణ పెంచడం, ప్రభుత్వ పాఠశాలల పనితీరును మెరుగుపరచడం వంటి ఎన్నో చర్యలు తీసుకోవలసి ఉంది. విద్యా పరంగానూ, ఆర్థికంగానూ, సామాజికంగానూ, సాంస్కృతికంగానూ దుష్పరిణామాలకు దారి తీస్తున్న కార్పొరేట్‌ విద్యావ్యాపార సంస్థల ఉక్కు పిడికిలి నుంచి ఇంటర్మీడియట్‌ వ్యవస్థకు విముక్తి కలిగించడం, డిగ్రీ కళాశాలలను, యూనివర్సిటీలను బలోపే తం చేసి, ఎక్కువ నిధు లు కేటాయించి, మొత్తంగా ఉన్నత విద్యావ్యవస్థను తెలంగాణ అవస రాలు తీర్చేలా మెరుగు పరచడం ఈప్రభుత్వం ముందున్న సవాళ్లు. ఈ సవాళ్లను పరిష్కరించకుండా, గతనాలుగున్నరేండ్లలో అమలు చేసిన విధానాలనే కొనసాగిస్తే ఈ పదవీకాలం ముగిసేనాటికి తెలం గాణ రాష్ట్రం ప్రయివేట్‌ విద్యా వ్యాపారుల ఇష్టారాజ్యపు క్రీడాస్థలిగా మారిపోతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏవిద్యావకాశాలు కోల్పోయామని తెలంగాణ ప్రజానీకం తపన పడి ప్రత్యేక రాష్ట్రం కోరుకు న్నారో, అంతకు మించిన దుస్థితి తలెత్తు తుంది. టీఆర్‌ఎస్‌ మొదటి పదవీకాలంలో నాలుగున్నరేండ్ల పాటు పారిశ్రామికాభివృద్ధికి చేసినదేమీ లేదనే చెప్పాలి. అంతకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో మూసివేసిన తెలంగాణ పరిశ్రమలను పునరుద్ధరి స్తామని ఉద్యమకాలంలో చేసిన వాగ్దానాలను నెరవేర్చలేదు. కొన్ని ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కంపెనీలను ఆహ్వానించడం, వారికి రాయితీలు, సౌకర్యాలు ఇవ్వడం మినహా నిజంగా పారిశ్రామికాభివృద్ధి అని చెప్పదగిన పనులేవీ జరగలేదు. ఐటీ పరిశ్రమ స్వాభావికంగానే తెలంగాణ నిరుద్యోగులకు మాత్రమే ఉద్యోగకల్పన చేసే శక్తి ఉన్నది కాదు. రాయితీల వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఒరిగినదేమీ లేదు. పారిశ్రామిక ఉత్పత్తులను తయారుచేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దోహదం చేయడం, విరివిగా ఉద్యోగకల్పనకు అవకాశం ఇవ్వడం, నెలకొన్న ప్రాంతంలో మరెన్నో అనుబంధ పరిశ్రమలకు, చిన్న తరహా పరిశ్రమలకు, సేవా రంగ సంస్థలకు అవకాశం ఇవ్వడం పారిశ్రామికాభివృద్ధి ఫలితాలు కావాలి. అటువంటి పరిశ్రమలకు అవసరమైన ఖనిజ, అటవీ, వ్యవసాయ, జల, విద్యుత్‌,రవాణా వనరులన్నీ తెలంగాణలో విస్తారంగా ఉన్నాయి. మానవశక్తికైతే కొదవలేదు. కాని గత నాలుగున్నరేండ్లలో ఇటువంటి సమగ్ర విస్తత అభివ ృద్ధికి దారితీసే ఒక్క పరిశ్రమ ఏర్పాటు కూడా జరగలేదు. రానున్న పదవీకాలంలో ప్రభుత్వ రంగంలోనైనా, సంయుక్త రంగంలోనైనా, తప్పదనుకుంటే ప్రయివేటు రంగంలోనైనా ఇటువంటి పారిశ్రామికాభివృద్ధికి పూనుకోక పోతే, నిరుద్యోగం పెరుగుతుంది. రాష్ట్ర ఆర్థికవ్యవస్థకు ఆదాయం, పన్ను ఆదాయం పెరిగే వనరులు తగ్గిపోతాయి. నిరుద్యోగ సమస్యను తగ్గించడంలో పారిశ్రామికాభివృద్ధి ఒక కోణమైతే, అంతకు మించి ప్రభుత్వం చేయదగిన పనులు ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వోద్యోగాల ఖాళీలను భర్తీ చేయడం, జిల్లాల విభజన వల్ల అవసరమైన కొత్త ఉద్యోగాలను నింపడం, పదవీ విరమణ వల్ల ఏర్పడుతున్న ఖాళీలను వెంటవెంటనే భర్తీ చేయడం, ఉద్యోగ కల్పనా సంస్థలను ప్రోత్సహించడం, స్వయం ఉపాధి పథకాలు ఇబ్బడి ముబ్బడిగా రూపొందించడం తెలంగాణ ప్రభుత్వం చేయ వలసిన పనులు. కాని తన మొదటి పదవీకాలంలో టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం ఉద్యోగ కల్పనకు ఇవ్వవలసిన కనీస ప్రాధాన్యత కూడ ఇవ్వలేదు. ఉద్యమ కాలంలో ప్రధాన ఆకాంక్షగా ఉండిన ఉద్యోగకల్పన కోరికను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించు కోలేదు. రెండు, రెండున్నర లక్షల ఉద్యోగాలు రావచ్చునని ఉద్యమ సమ యంలో కన్న కలలను, ఒక లక్షా ఏడు వేలకు కుదించి, నాలుగున్న రేండ్లలో ఇరవై వేలఖాళీలు కూడా నింపని ఘనచరిత్ర టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిది. ఉన్న ఖాళీలన్నిటికి నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం, చివరికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చివరిరోజుల్లో వెలువడబోతున్న నోటిఫికేషన్‌ను ఆపు చేయించి, మేము రాగానే ఇస్తాము అని బీరాలు పలికి, నాలుగున్నరేండ్లు గడిచినా కనీసం ఆనోటిఫికేషన్‌ కూడా ఇవ్వని చరిత్ర టీఆర్‌ఎస్‌ పాలనది. కొత్త ప్రభుత్వం ఆ పాతవిధానాన్నే కొనసాగిస్తే నిరు ద్యోగుల నుంచి, ప్రజల నుంచి మరింత అసంతృప్తి మూటగ ట్టుకోవడం మాత్రమే అవుతుంది.
ఇవాళ సెంటిమెంటును రెచ్చగొట్టిఓట్లు, స్థానాలు సంపాంచ గలిగినా, గత పాలన ఎన్నోప్రజా సమూహాలను అసంతృప్తికి గురి చేసింది. ఆ అసంతృప్తి ఇవాళ వోట్లుగా మారి ఉండక పోవచ్చుగాని, రానున్న పాలనాకాలంలో ఆఅసంతృప్త సమూహాలను బుజ్జగించడా నికి, వారి ఆకాంక్షలను తీర్చడానికి ప్రయత్నించకపోతే ఆ అసంతృప్తి ఇతర రూపాల్లో విస్ఫోటనమవుతుంది. మరొకపక్క వారి ఆకాంక్షలను తీర్చడ మంటే తాయిలాలు ఇవ్వడమనో, ప్రభుత్వ వ్యయం పెంచడమనో అర్థం చెప్పుకుంటే అది మరిన్ని సమస్యలకు దారి తీస్తుంది. ఈప్రత్యక్ష ఆర్థిక సవాళ్లతో పాటు పరోక్షంగా ప్రభావం చూపే ఆర్థిక సవాళ్లు, అవి జనచైతన్యం మీద చూపే ప్రభావాలు ఉంటాయి. ఆప్రభావాలు ఎప్పటికప్పుడు వ్యక్త మయ్యే అవకాశాలు ఇవ్వకపోతే, అంటే వాక్సభాస్వాతంత్య్రాల మీద ఆంక్షలు విధిస్తే, గత పాలనాకాలంలో ప్రవర్తించినట్టు ప్రవర్తిస్తే, ఈ గెలుపు ఓటమికి సోపానమవుతుంది.

గత కాలపు ఆనవాళ్లు ఆదివాసీ పజ్రలు

ఆధునిక సమాజ గత కాలపు ఆనవాళ్లు ఆదివాసీ ప్రజలు. సమిష్టి జీవన పద్ధతు లు, సహజీవనం, పారదర్శ కతకు నిలువెత్తు సాక్షులు వారు. వ్యష్టి జీవన పద్ధతులు, పరస్పర అసహనం, కని పించ ని కుట్రలు నేటి పారి శ్రామిక సమాజ లక్షణాలు. బ్రెజిల్‌, పెరూ దేశాలలో వందకుపైగా ఆదివాసి తెగలు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్నారు. పెరూలోని ‘ముచి-పిచి’ పర్యావరణ పార్కుకు కేవలం 100 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో ఈ తెగలు ఇప్పటికీ జంతుప్రాయమైన జీవనాన్ని కొనసాగిస్తున్నారు. 50-60 వేల సంవత్సరాల నుంచి అటవీ దుంపలు ప్రధాన ఆహార వనరుగా జీవిస్తూ మొక్కజొన్న, బంగాళాదుంప సాగుకు ఈ తెగలు ఎంతో తోడ్పడ్డాయి. తాము వేటాడే జంతువులకు ఎరగా వేసే క్యురారే మొక్క నేడు ఓపెన్‌ హార్ట్‌ శస్త్రచికిత్సకు ఔషధంగా మారింది. గత సునామీలో అండమాన్‌ తెగలలో ఆదివాసి తెగలు ఎవరూ చనిపోలేదు. కారణం సముద్రం వెనక్కి వెళ్లగానే వారు ఎత్తైన కొండలపైకి వేగంగా కదిలి వెళ్లారు. జారవా, సెంటినిల్‌ తెగల ఆదివాసీల్లో కళ్లుతెరచి సముద్రపు నీటిలో చేపలవేటకు అనువుగా 50 శాతం మంది కళ్లు రూపాంతరం చెందాయి. ప్రపంచంలో సుమారు ఏడు వేల భాషలు ఉంటే అందులో ఆదివాసీ తెగలు మాట్లాడే బాషలే నాలుగు వేలు ఉన్నాయి. నేడు అత్యధికులు మాట్లాడే, వాడే ఆరు భాషలు (ఇంగ్లీషుతో సహా) గతంలో అంతరించిపోయిన ఆదివాసీ తెగలు వాడినవే.
బ్రతుకు పోరాటంలో ఆరితేరిన వారు ఆదివాసీలే. వారు నివసించే ప్రాంతాలు పుష్కలమైన సహజవనరులతో కళకళలాడుతుండేవి. నేడు ఆ వనరులు దోపిడీకి గురౌతున్నాయి. ‘అతి పురాతన సనాతన ప్రజల (మూలవాసులు) తెగలు అంతరించిపోతున్నాయి. సాటి మానవులుగా అనేక దేశాలలో వారికి తగిన గుర్తింపు, రక్షణ లేదు. ఆయా దేశాలలో కనీసపు చట్టాలు కూడా లేవు. ఫలితంగా వారు మానవులుగా జీవించడానికి పోరాడవలసిన స్థితి ఏర్పడిరది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ సనాతన ప్రజలను కాపాడవలసిన బాధ్యత మనపై ఉన్నది. అందుకు ప్రతి దేశం కొత్త చట్టాలు రూపొందించడం, వాటిని అమలుచేయడం, తద్వారా జీవించేహక్కుతో సహా ఆధునిక మానవునికి గల అన్ని హక్కులూ వారికి ఇవ్వవలసి ఉన్నది’ అని 1994 డిసెంబర్‌ 23న ఐక్కరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ 49/214 తీర్మానంలో పేర్కొన్నది. ఐక్యరాజ్యసమితి తీర్మానం మేరకు ప్రతి దేశం దశాబ్ద కాలంపాటు ఆదివాసీ తెగలను గుర్తించి, వారిని చట్టపరిధిలోకి తీసుకురావాలి. ఈ పదేళ్లపాటు ఆదివాసీ తెగలను మానవులుగా గుర్తించడం, వారి జీవన పరిస్థితులను మెరుగు పర్చడం, వారి నివాస ప్రాంతాలలోని సహజవన రులన్నింటినీ వారే సమిష్టిగా వినియోగించుకునే చట్టాలు చేయవలసి ఉన్నది. ఇది 1995 నుంచి 2004 వరకు వివిధ రూపాలలో ప్రచార కార్యక్రమాలు, అధ్యయనాలు చేయవలసి ఉన్నది. రెండవ దశాబ్దంలో 2005 నుంచి 2015 వరకు ఆదివాసీ తెగల అస్తిత్వం, తగిన హోదా కల్పించవలసి ఉంది.
పై తీర్మానంపై 148 దేశాలు సంతకాలు చేసినా, కొంతమేరకు అమలుచేసిన దేశాలు కేవలం 60 మాత్రమే. ఈ 60లో భారతదేశం లేదు. ప్రపంచవ్యాప్తంగానే తొలుత ఈ తీర్మానాన్ని అమలు చేయాలని ప్రయత్నించిన వారు ప్రపంచస్థాయి ఎన్‌జిఒలు మాత్ర మే. మనదేశంలో ఇప్పటికీ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రభుత్వాలు జరపడం లేదు. ఎన్‌జిఒలు చేసే కార్యకలాపాలకు కొన్ని రాష్ట్రాలలో కేవలం ఆర్థిక తోడ్పాటును మాత్రమే ప్రభుత్వాలు అందిస్తున్నాయి. మన దేశంలో సుమారు 600 ఆదివాసీ తెగలు గుర్తించబడ్డాయి. భారత రాజ్యాంగం వీరికి చట్టపరమైన రక్షణలు కల్పించింది. అవే 5వ, 6వ షెడ్యూల్‌గా ప్రాంతీయ, పరిమిత స్వయంపాలనా హక్కు ఇవ్వబడిరది. ఆచరణకు వీలుగా పీసా చట్టం (పి.ఇ.ఎస్‌.ఎ-1996) చేయబడిరది. అయినా బూర్జువా పాలకవర్గాలు మనదేశంలో గిరిజన తెగలకు స్వయం పాలనా హక్కులు ఇవ్వలేదు.
ఆదివాసీలు-హక్కులు
వలస కాలం నుంచి మనదేశంలో ఆదివాసీ తెగలు బూర్జువా, భూస్వామ్యవర్గాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నాయి. ఒక రాజీగా అనేక రక్షణ చట్టాలు వచ్చాయి. ముఖ్యంగా 1874లోనే ప్రత్యేక షెడ్యూల్డ్‌ జిల్లాల చట్టం చేయబడిరది. 1917లో ఆదివాసీ తెగల నివాస ప్రాంతాలలో ఉమ్మడి భూమి హక్కులు ఇవ్వబడ్డాయి. అవే భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. అనేక పోరాటాల అనంతరం ఆదివాసీ తెగలకు అటవీ భూములపై హక్కులు కల్పిస్తూ 2006లో చట్టం చేయబడిరది. చట్టం ప్రకారం అటవీ భూమిపై ఆధారపడి జీవిస్తున్న ప్రతి గిరిజన కుటుంబానికీ 10 ఎకరాల వరకూ పట్టా ఇవ్వవచ్చు. వారిపై గల కేసులను ఎత్తివేయాల్సి ఉంది. మన రాష్ట్రంలో దీని అమలు అరకొరగా జరిగింది. సుమారు 25 లక్షల ఎకరాలకు పట్టాలివ్వవలసిన భూమిని గుర్తించినప్పటికీ కేవలం 9 లక్షల ఎకరాలకు మాత్రమే పట్టాలిచ్చారు. దీనిలో లక్షా యాబై ఆరు వేల మందికి 3 లక్షల ఎకరాలు మాత్రమే దక్కింది. మిగతా 6 లక్షల ఎకరాలు 2 వేల విఎస్‌ఎస్‌ల పేర (వన సంరక్షణ సమితులు) పట్టాలిచ్చి అటవీశాఖ ఆధీనంలోనే ఉంచుకున్నారు. ఇన్ని చట్టాలు ఉన్నా, స్వాతంత్య్రం వచ్చి 68 ఏళ్లు అయినా ఆదివాసీ తెగలు తమ సంప్రదాయపు భూముల నుంచి, అటవీ ప్రాంతం నుంచి నెట్టివేయబడుతున్నారు. మన రాష్ట్రంలో 1/70 చట్టం అమలులో ఉన్నది. గిరిజనుల సాంప్రదాయక భూములు గిరిజన తెగలకే దక్కాలి. గిరిజనేతరులకు షెడ్యూల్డ్‌ భూమిపై ఎట్టి హక్కూ లేదు. కానీ మన రాష్ట్రంలో షెడ్యూల్డ్‌ ప్రాంతంలో 48 శాతం సంప్రదాయక గిరిజన భూములను గిరిజనేతరులు ఆక్రమించు కున్నారు. గిరిజన విద్య పేరుతో ప్రైవేటు, కార్పొరేట్‌ సంస్థలకు ఐటిడిఎలు దోచిపెడుతున్నాయి. ఈ సొమ్ముతో ఐటిడిఎనే జూనియర్‌ కాలేజీలను పెట్టవచ్చు లేదా తాము నడుపుతున్న రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీల్లో చేర్పించవచ్చు.
ఆదివాసీ చట్టాలు-అక్కరకురాని చుట్టాలు
ఆదివాసీ చట్టాలు అక్కరకురాని చుట్టాలుగా మారాయి. పోలవరం ప్రాజెక్టు వద్దని గ్రామసభలు, పంచాయతీలు, మండల పరిషత్తులు(ఇవన్నీ షెడ్యూల్డ్‌ ఏరియాలో, పీసా చట్టం పరిధిలో ఉన్నవి) చేసిన తీర్మానాలకు రాష్ట్ర ప్రభుత్వం విలువే ఇవ్వలేదు. బాక్సైట్‌ త్రవ్వకాలు వద్దని విశాఖజిల్లాలోని గ్రామసభలు, పంచాయతీలు, మండల పరిషత్తులు చేసిన తీర్మానాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రక్కనపెట్టి ఐటిడిఎల ద్వారా బాక్సైట్‌ త్రవ్వకాలు జరుపుతామని చెబుతున్న మా టలు సుప్రీంకోర్టు ‘సమతా తీర్పును’ వెక్కిరించడం కాదా? ఆదివాసీ హక్కులను కాలరాయడానికి రాష్ట్ర ప్రభుత్వం వెనుకాడడం లేదు. షెడ్యూల్డ్‌ ప్రాంతంలో జీవో 3ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖలలోని ఉద్యోగాలన్నింటినీ స్థానిక గిరిజన అభ్యర్థులతో నింపవలసి ఉన్నది. ప్రతి కార్యాలయంలో గుమస్తా నుంచి అధికారి వరకు ప్రతి స్కూలు, ఆసుపత్రి, వివిధ కార్యాలయాలలో నేడు స్థానిక అభ్యర్థులు 10 శాతం కూడా లేరు. స్థానికేతరులు, గిరిజనేతరులు, తాత్కాలిక ప్రాతిపదికపై గతంలో నియామకాలు జరిగాయి. ఈజీవోప్రకారం వారిని తొల గించి స్థానిక గిరిజన అభ్యర్థులతో నింపవలసి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం స్కీం వర్కర్లలో ఎక్కువమంది గిరిజనేతరులనే నియమిస్తున్నది. అర్హులైన గిరిజన అభ్యర్థులు నిరుద్యోగులుగా ఉన్నారు. ప్రభుత్వం జీవో 3ను పటిష్టంగా అమలుచేసి స్థానిక గిరిజన అభ్యర్థులకే ఉద్యోగ అవకాశం కల్పించాలనే డిమాండ్‌ ముందుకు వస్తున్నది. ఆదివాసీ తెగలు ప్రత్యేక భాషలు, విశిష్టమైన సంస్క ృతిని కలిగి ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనేతర భాషలను వారిపై బలవంతంగా రుద్దుతు న్నాయి. మన రాష్ట్రంలో ప్రతి గిరిజన కుటుంబం ఇంట్లో తమ తెగ భాష మాట్లాడుతున్నారు.
స్కూలుకు వెళ్తే తెలుగు, ఇంగ్లీషులో బోధన జరుగుతున్నది. భాషా పరిజ్ఞానమేకాక సాధారణ విషయాలను కూడా అవగాహన చేసుకోవడం గిరిజన విద్యార్థులకు కష్టంగా ఉన్నది. ఫలితంగా స్కూల్‌ డ్రాపవుట్స్‌ ఎక్కువ అవుతున్నాయి. యునెస్కో సూచన మేరకు 10 వేల మంది మాట్లాడే ప్రతి భాషకూ లిపి కనిపెట్టాలని, వాడుకలో దానికి రక్షణనివ్వాలని ఉన్నది. అయినా లక్షలమంది మాట్లాడుతున్న ఆదివాసీ భాషలకు లిపి కనిపెట్టకపోవడం దారుణం. భాషా పరిశోధన సంస్క ృతి రక్షణలో భాగం. ఆదివాసీ తెగల వాయిద్య పరికరాలు, వారి న ృత్యాలు ప్రభుత్వం ప్రోత్సాహం లేక అంతరించిపోతున్నాయి. ఆదివాసీ ప్రాంతాలలోకి టూరిజం ప్రవేశించాక ఆదివాసీ కళలు వ్యాపార సరుకులుగా మారిపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పాటించాలి. నేడు జరుగుతున్న ఉత్సవాలు పాలకవర్గాల అవసరాల కోసమే తప్ప ఆదివాసీలను కాపాడడానికి కాదు. నిజమైన ఆదివాసీ దినోత్సవం, ఆదివాసుల ‘అవసరాలు- ఆకాంక్షలు’ నెరవేర్చేదిగా ఉండాలి.- జి.ఎన్‌.వి.సతీష్‌

పసిడి బాల్యమంటే అదేనా..?

ఆ ఇల్లంతా బొమ్మలే. రంగుల పుస్తకాలే. ఫోన్ల నిండా పిల్లల ఫొటోలే. స్టోరేజీ నిండా మ్యాజిక్‌ వీడియో మిక్స్‌లే. ఇప్పుడు పిల్లల్ని సెలబ్రెటీల కన్నా గొప్పగా పెంచేస్తున్న తీరు పెరిగింది. ప్రతిదీ కొనివ్వడం వరకే తల్లిదండ్రుల, కుటుంబ పెద్దల అభిమానానికి ఓపిక. చిన్నారులతో కొన్ని విలువైన సమయాల్ని గడిపే తీరికే లేదు. వెలకట్టలేని పసిదనాన్ని అమ్మకమంటూ బోర్డులు పెట్టేసే టారు కొట్ల ముందో, థీమ్డ్‌ బడుల వద్దో పెద్దలు తచ్చట్లాడుతున్నారు. బాల్యాన్ని సెలబ్రేట్‌ చేయడమంటే.. ఎవరో అమ్ముతున్నది పిల్లలకు కొనివ్వడమనే అనుకుంటున్నారు. పసిడి బాల్యమంటే అదేనా..?
పిల్లలకు ఖరీదు తెలీదు. డాడీ.. అప్పుచేసి డ్రోన్‌ కొని రిమోట్‌ చేతిలో పెట్టక్కర్లేదు. దగ్గరుండి న్యూస్‌పేపర్‌తో పతంగి తయారుచేసి ఎగరేస్తే చాలు. మబ్బుల్ని పట్టుకునేంత ఎత్తుకు చిన్నారుల ఆనందం ఎగురుతుంది. కానీ, పెద్దలకు టైంలేదు. సోషల్‌ మీడియాలో అటెండెన్స్‌ లేటవుతుంది. అటెన్షన్‌ లాస్‌ అవుతుంది. బాలలకు విలువ అర్థం కాదు. కాస్ట్‌లీ చాక్లెట్లని మమ్మీ హ్యాండ్‌ బ్యాగ్‌లోంచి తీసి ‘సర్‌ప్రైజ్‌’లివ్వకర్లేదు. తను తినే అన్నం ముద్దల్లో ఒకటి పిల్లల నోట్లోను పెట్టేంత నిదానంగా తింటే చాలు. కానీ, పెద్దలతో బిజీ బతుకు. వర్క్‌ పెండిరగ్‌లో పడుతుంది. టీమ్‌లో పేరు వెనుకబడుతుంది. చాలా ఇళ్లల్లో ఇదే పరిస్థితి. తండ్రి చాటుకు పరుగెత్తి గోరు ముద్దల అల్లరి చేసే పిల్లలకు… సొంతంగా భోజనమెలా చేయాలో నేర్పిస్తామంటూ ఎల్‌కేజీ సిలబస్‌లో కలిపేసుకున్న ప్లేస్కూళ్లు పెరిగాయి. పేరెంట్స్‌కు వంటింట్లో సాయమెలా చేయాలో కూడా మంచిపాఠమే కానీ, తాము మిగిల్చిన కాలాన్ని పెద్దలు టచ్‌స్క్రీన్‌కు బదిలీ చేస్తే పిల్లలేం కావాలి? ఇదివరకు బడి ఎగ్గొట్టేందుకు పిల్లలకు దొంగ జ్వరాలొచ్చేవి. కడుపు నొప్పి వచ్చేది. కానీ, ఇప్పుడు తల్లిదండ్రులు ఓ పూట పని మానుకుని తమ వద్దే ఉంటారని పిల్లలు జబ్బు చేస్తున్నారు.
విరిగిన బొమ్మలు
సురేష్‌కు ఫేస్‌బుక్‌ ఓ లోకం. అందులోనూ అల్లరి చేసే పిల్లల పేజీల్నీ ఫాలో అవుతుంటాడు. ఫన్నీ వీడియోలు చూస్తూ పడిపడీ నవ్వుతుంటాడు. పనిచోట ఇది నడవదు కనుక, ఇంటికెళ్లే ప్రయాణంలో ఫోన్‌ను మెడ తిప్పకుండా చూస్తుంటాడు. తీరా ఇంటికెళ్లాక పడుతూ లేస్తూ ఎదురొచ్చే కూతురిని అంతెత్తున ఎగరేసి ఎత్తుకుని, ముద్దిచ్చి మీద నుంచి దింపేస్తాడు. చకచకా రిఫ్రెష్‌ అయ్యి మళ్లీ ఫోన్‌ పట్టుకుని ఓ మూలకు చేరుతాడు. కూతురొచ్చి ఎంత బన్నీ లాగినా ‘2 మినిట్స్‌ తల్లీ.. 2 మినిట్స్‌’ అంటూ రెండు గంటలైనా వదలకుండా ఫోన్‌తోనే గడిపేస్తాడు. చిన్నారులకు ఖరీదు తెలీదు. విలువ అర్థం కాదు.. అలానే, గుర్తు ఉండదు కూడా. ఇలా ఎన్నిరోజుల్నుంచి తండ్రి పట్టించుకోకున్నా ప్రతి సాయంత్రం కూతురు అలానే ఎదురుచూస్తుంటుంది. మౌనంగా తండ్రికి దూరం జరిగి ఒక్కతే.. విరిగిన బొమ్మను మరింత విరగ్గొడుతూ మూలన కూర్చుని ఆడుకుంటుంది. ఇదో భరించలేనంత ఒంటరితనం. ఆఇంటి అట్టపెట్టె నిండా ఇలాంటి విరిగిన బొమ్మలెన్నో. అవెందుకు అలా విరిగిపోతున్నాయనే పట్టింపే లేకుండా మరో బొమ్మతో మరో వీకెండ్‌ దాటేస్తాడు సురేష్‌.
అతకని మనసులు
సంధ్యకు పనే ఓప్రపంచం. అందులోనూ పిల్లలకు గొప్ప భవిష్యత్తు ఇవ్వాలని ర్యాట్‌ రేస్‌లో చలోమంటుంది. ఒక పనిచేసే సమయంలో రెండు మూడు ప్రాజెక్టులు పూర్తిచేసేంత శక్తిని నింపుకుంటుంది. పనిచోటే ఇది నడవదు కనుక ఇంటికెళ్లేపుడు ఇవే ఆలోచనల్ని వెంటతీసుకెళుతుంది. తీరా ఇంటికెళ్లాక కళ్లూమూస్తూ నిద్రకళ్లతో తూలుతూ వచ్చే కొడుకుని గట్టిగా హత్తుకుని తల నిమిరి పక్కకు జరుపుతుంది. చకచకా డిన్నర్‌ వగైరా కానిచ్చి ఫైళ్లో, మెటీరియలో ముందేసుకుని హాల్‌ మధ్యకు చేరుతుంది. కొడుకొచ్చి ఎంత చేయిలాగినా ‘అయిపోయింది.. అయిపోయింది’ అంటూ అర్ధరాత్రైనా వదలకుండా పనితోనే గడిపేస్తుంది. చిన్నారులకు పట్టింపు ఉండదు కదా! ఎంత కాలం నుంచి తల్లి తెలీకుండానే పనిలో కూరుకుపోయినా ప్రతి రోజూ కొడుకు అలానే వేచిచూస్తాడు. అమ్మ చెప్పే బైబైలతో తలుపునో, గేటునో బలంగా తన్ని ఒంటరిగా టీవీ సెట్‌కో, తన లోకానికో అతుక్కుపోతాడు. ఇదో చెప్పలేనంత ఒంటరిభావం. ఎన్నో ఇళ్ల గదుల నిండా ఇలాంటి అతకని మనసులెన్నో. అవెందుకు ముక్కలవుతున్నాయనే పట్టింపే లేకుండా మరో ప్రాజెక్ట్‌తో వీకెండ్‌ మొదలెట్టేస్తుంది సంధ్య.
దగ్గరుండి నేర్పాలి
దారెంట ఓగ్యాస్‌బెలూన్‌ బండి కనిపిస్తే.. లోనున్న పిల్లలు అడిగి మారాం చేయకముందే కొని తీసుకెళ్తున్నారు. కొన్ని రోజులకు ఇలాంటి సర్‌ప్రైజ్‌లన్నీ చప్పబడిపోయి.. పిల్లల్లో అస్సలు స్పందన ఉండని పరిస్థితి తయారవుతుంది. జేబులు మరింత పెద్దవి చేసుకుని మరింత పెద్ద బహుమతులు, ఖరీదైన సర్‌ప్రైజ్‌లు ఇవ్వడం వరకే నేటి చాలామంది పేరెంట్స్‌ అవగాహన. దానికోసం మరింత ఉద్యోగాలకు, పనులకు అంకితమవడం.. చేజేతులారా వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్స్‌ చెడగొట్టుకోవడం… పిల్లలకు మరింత దూరమవడం.. ఇదో ఒంటరి బాల్యపు చక్రం. వినిమయ ఛట్రంలో బందీ అయిపోయిన తమ లైఫ్‌స్టైల్‌నే చిన్నతనం నుంచే పిల్లలకూ వంటబట్టించేస్తున్నారు. తల్లిదండ్రుల సమక్షంలో ఓ స్కూల్‌ కాంపిటీషన్‌లో పాల్గొన్నా చాలనుకుంటారు పిల్లలు. విజేత ఎలాగూ ఒక్కరో, ఇద్దరో ఉంటారనే విషయం వాళ్లకు తెలీకున్నా తల్లిదండ్రులకు తమ పాటో, డ్యాన్సో, ప్రసంగమో, నటనో, ఆటో.. ఏదో ఒకటి చేసి అందరూ హీరోలైపోవాలని ముందు రాత్రి నుంచే కలత నిద్రపోతున్నారు. సైకిల్‌ కొనిస్తే సరిపోతుందని పేరెంట్స్‌ ఆలోచన. దాన్ని పక్కనే ఉంటూ నేర్పించడం బాలలు కోరుకునేది. చిట్టిపాదాలు సైకిల్‌ పెడల్‌ మీద స్థిరపడేలోపు ఎన్ని విలువైన క్షణాలు, మేమున్నామనే భరోసాలు.. కుదురుకుంటాయో తెలుసా..! చేతుల్ని గాల్లోకి వదిలేసి సైకిల్‌ ముందుకు నడిపించడంలో ఎన్ని సాహసాలు, ఉద్వేగాలు, కేరింతలు.. పేరెంట్స్‌ సాంగత్యంలో కోరుకుంటున్నారో తెలుసా..! పేరెంట్సే కనుక వీలు చేసుకుంటే.. సైకిల్‌ నేర్పేటపుడే ఎన్నేసి బతుకు పాఠాలు పిల్లలకు తేలిగ్గా తిప్పి చెప్పొచ్చో. నడిచేపుడే రెండు చక్రాల మీద సైకిల్‌ ఎలా బ్యాలెన్స్‌ అవుతుందో అనే విషయానికి ఓరోజు ఇష్టమైన క్లాస్‌ చెప్పుకోవచ్చు. బురదలో పడిన సైకిల్‌ని సరదాగా కలసి కడుగుతూ బంధాన్ని ఎంత శుభ్రం చేసుకోవచ్చో..! వెనుకే కూర్చుని అటు హ్యాండిల్‌ని కంట్రోల్‌ చేయడం నేర్పిస్తూ, ఇటు పెడల్‌కు ఆసరాగా పెద్దల కాళ్లబలాన్ని అందిస్తూ.. ఒక్కరిగా కాకుండా జట్టులో ఒకరిగా ఉంటే ఏం ప్రయోజనమో విడమర్చి చెప్పొచ్చు. ఎందుకు పక్కవాడు అవసరమో చిన్నారికి ఇట్టే తెలిసిపోతుంది. మీరెన్ని పుస్తకాలు కొనిచ్చినా.. ఎన్ని క్లాసులు తీసుకున్నా… ఆవలింతలొస్తాయి గానీ, బతుకు పాఠం ఆ చిట్టి బుర్రలకు బోధపడదు. పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ కాన్సెప్ట్‌ల్ని చిన్న వయస్సు నుంచే ఎక్కడో కొని పరిచయం చేస్తున్న తల్లిదండ్రులు పేరెంటింగ్‌ పాఠాల్ని నేర్వాలి.
అఆఇఈలు అద్దెకే…
అంతంత కళ్లేసుకుని పలకనే చూస్తూ.. విరిగేంత గట్టిగా బలపాన్ని పట్టుకుని తల్లి/ తండ్రి ఒళ్లో కూర్చుని అక్షరాలు నేర్చుకుంటున్న పిల్లల ద ృశ్యాల్ని ఇప్పుడు మనం తక్కువగా చూస్తున్నాం. సరిగ్గా అడుగులు కూడా వేయలేని వాడిని ఏదో మిలట్రీ ట్రైనింగ్‌కు పంపిస్తున్నట్టు బూట్లు, యూనిఫామ్‌, బ్యాగులతో ఏడిపిస్తూ ప్లేస్కూళ్లకు పంపిస్తున్న చిత్రవిచిత్రాల్నే ఎక్కువ చూస్తున్నాం. కిండర్‌గార్టెనే ఎక్కువనుకుంటే.. నర్సరీ, అంతకన్నా ముందే అనే వెనకబాటుకు ఇప్పటి బాల్యం బాటేస్తోంది. నిద్ర కూడా పనిష్మెంట్‌ అనే చోద్యం ఆ చిట్టి గదుల్లో చూస్తున్నాం. ఇల్లు అంటే ఓ భద్రభావన. తల్లి ఒడిలో ఉన్నంత హాయిదనం. దాన్ని బలవంతంగా తెగ్గోసేస్తున్నారు ఆధునిక విద్య పేరిట. ఇళ్లంటే తల్లిదండ్రులు ఒక్కరే అవ్వడమూ బాల్యానికి చెప్పలేనంత లోపమవుతోంది. అమ్మమ్మో, నాన్నమ్మో, తాతయ్యో.. ఇంకా కుదిరితే చిన్నాన్నో, అత్తమ్మో… కలసి ఉంటే తల్లిదండ్రులు ఇంట్లో లేని లోటుని భర్తీ చేస్తారు. అఆఇఈల నుంచి మరెన్నో విషయాల్ని చక్కగా నేర్పిస్తారు. అమ్మానాన్నల్ని కాసేపైనా మరిపిస్తారు. న్యూక్లియర్‌ ఫ్యామిలీలకెలానూ బంధాల్ని నాన్నీలు, ఆయమ్మల పేరిట అద్దెకు తెచ్చుకునే అవస్థ తప్పదు. కానీ, ఇంట్లో మరో పెద్ద దిక్కు ఉన్నా.. డబ్బులు తగలేసి అనేక పాఠాలకు వేరే దిక్కుకు చూస్తున్న పేరెంట్స్‌ తిప్పలేంటో ఓ పట్టాన అర్థం కాదు. నేటితరానికి తగ్గట్టు ఇంట్లోని పెద్దలు తయారవ్వలేదనే సాకు అయితే ఉండనే ఉంది. కంప్యూటరే ఆపరేట్‌ చేయలేకపోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లో యాప్‌లే సరిగ్గా అర్థం కాకపోవచ్చు. ఇంగ్లిష్‌నీ ఇరగదీసి మాట్లాడలేకపోవచ్చు.. పోటీతత్వాన్ని అరగదీసి ఎక్కించలేకపోవచ్చు.. కానీ, పిల్లలు మరింత రిమోట్‌గా, ఐసోలేట్‌గా కానీయకుండా.. నలుగురిలో ఎదిగేలా పదిమందిలో మెలగేలా చేయగలరు. ప్రతి సమస్యను, కష్టాన్ని పంచుకుంటూ, అర్థం చేసుకుంటూ చిన్ని హ ృదయాలకు జీవితం మీద ఆశ పెంచే ప్రయత్నమైతే చేస్తారు. టీనేజర్లకూ దిగులు రోగాలు, డిప్రెషన్‌లు, పోస్ట్‌మోడ్రనిజమ్‌ ఉనికిపోరు, సెలెబ్రెటీ సిండ్రోమ్‌లు చూస్తూనే ఉన్నాం. ఎన్నో బలవంతపు చావుల్ని దిగమింగలేకపోతున్నాం. వీటన్నింటికీ కారణం.. వందలాది సోషల్‌మీడియా స్నేహాల్లో ఒక్కరూ తమకు చాలా దగ్గరగా వచ్చింది లేదు. కనీసం బాధనైనా మాటల్లోనైనా పంచుకుంది లేదు. టీనేజ్‌ తరాన్ని రిపేర్‌ చేయడం అటుంచి… బాల్యం గురించి ఎంత ఎక్కువ పట్టించుకోవాలో అర్థం చేసుకోవాలి. తర్వాతి తరంవారైనా వాళ్లు మూడేళ్లైనా నిండకుండానే ఎంతటి ఒంటరితనంలోకి బలవంతంగా తోసేయబడుతున్నారో గమనించండి. ఇక్కడ అద్దెకు తీసుకునేది.. అ, ఆ, ఇ, ఈల్ని నేర్పే క్లాసుల్ని కాదు, ఇక్కడ కొనిచ్చేది పార్ట్‌టైం తోడుని కాదు… జీవితాంతం వెన్నంటే ఒంటరితనాన్ని, ఏకాకిభావనల్ని అని తెలుసుకోవాలి.
స్టేటస్‌ సింబల్స్‌, బ్రాండ్‌ మోడల్స్‌
సొసైటీలో బాగా బతుకుతున్నారని స్టాంప్‌ వేయించుకోవడానికి… తామెలాంటి బండి తీశారు, ఎలాంటి ఇంట్లో ఉంటున్నారు.. ఎంత కాస్ట్‌లీగా లైఫ్‌స్టయిల్‌ ఉంటుందనేది.. స్టేటస్‌ సింబళ్లుగా వాడుకునేవాళ్లు. ఇప్పుడు పిల్లల్ని అందుకు వాడేస్తున్నారు. తమ ఉనికికి వారిని బ్రాండ్‌ మోడల్స్‌ని చేసేస్తున్నారు. ఓ ఫంక్షన్‌కు వెళ్లినా, నలుగురితో ఓ విహార యాత్ర చేసినా… చివరకు ఏదో పని మీద రోడ్డు మీదకు వచ్చినా పిల్లల ఆహార్యం, చేష్టల మీద విపరీతమైన ఫోకస్‌ పెడుతున్నారు. నాలుగైదు పలుకుల ఇంగ్లిష్‌, అవాక్కయ్యే బ్రాండెడ్‌ బట్టలు, హుందాగా నడవడం, కూర్చోవడం, తిరగడం.. పిల్లలు ఇప్పుడు పిల్లల్లా ఉండటం లేదు. అల్లరల్లరిగా బాల్యం ఉండటం లేదు. పదుల కొద్దీ కామెంట్లు, వందలకొద్దీ లైకుల కోసం సోషల్‌ మీడియా గోడల నిండా వారిని అనేక రకాలుగా కుదించేసి, బాల్యాన్ని అందమైన బట్టల్లోకి దిగ్గొట్టేసి ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారంతే. పరుగులు తర్వాత కనీసం కదలకుండా ఓ మంచి పోజు కోసం సెలబ్రెటీ క్రేవింగ్‌తో నలిపేస్తున్నారంతే. కనీసం ఆఫొటో సెషన్లు సాగేంత సేపన్నా ఉండటం లేదు.. ఆతల్లిదండ్రుల దగ్గరితనం. పోస్ట్‌ పెట్టడం, కామెంట్లకు రిప్లైలు ఇవ్వడంతో బిజీ అయిపోతున్నారు. మూలమూలల్లో ఉన్నవారంతా ఫ్యామిలీ గ్రూప్‌ పేరిటో, ఇంటిపేరు గ్రూప్‌తోనో, స్కూల్‌ ఇయర్‌ గ్రూప్‌తోనో, కాలేజీ బడ్డీస్‌ గ్రూప్‌తోనో.. ఓచోట కలిసే చోట ఈపిచ్చి మరీ పీక్స్‌కు చేరింది. పోటాపోటీ పిల్లల ఫ్యాన్సీ డ్రెస్‌ కాంపిటీషన్లు ప్రతిరోజూ నడిచిపోతున్నాయి. తమ ప్రతిభ, నైపుణ్యం, విజయం, ప్రత్యేకత… వదిలేసి పిల్లల స్టేటస్‌తో తమ ఉనికిని చలామణీ చేయించుకోవాలనే ఉబలాటం చాలా ప్రమాదం. చైల్డ్‌ ప్రొడిగీ.. అదేనండి ఇప్పుడు బాలమేధావులే కాదు, పెద్దలకూ అసాధ్యమైన ఫీట్లని ఆటల్లోను, పాటల్లోనూ.. ఇంకా నానారకాల సరదాల్నీ సీరియస్సుగా బతుక్కి దిగ్గొట్టుకున్న పిల్లల శిక్షణ సంస్థలు ఎక్కువవుతున్నాయి. ఆకారాగారాలు, కర్మాగారాల్లోకి పిల్లల బాల్యాన్ని ముడిసరుకు చేసేసి లాభాల్ని తమ అకౌంట్‌లో వేసుకుంటున్నట్టే మనం దీన్ని చూడాలి. ఇప్పుడు ప్రతిచోట ప్రతి ఇంట్లో బాలకార్మికుడు కనిపిస్తున్నాడు. కానీ, వేర్వేరు రూపాల శిక్షణలతో, కొత్తకొత్త మోడల్‌ పేర్లతో పిలవబడుతున్న శిక్షణశిబిరాలకు తరలుతూ.
పిల్లలకు ఆటవస్తువు కావాలి, అందమైన బొమ్మ కొనాలి.. కానీ, పెద్దల తోడు, స్నేహం, ప్రేమ పక్కనే లేకుంటే బాల్యమే కాదు తర్వాతి జీవితమూ పరిస్థితులూ, ప్రభావాల చేత ఆటబొమ్మయి పోతుంది. బాల్యస్మ ృతుల నిండా ఒంటరితనపు రీలే తిరుగుతుంది. దారం కట్టిన తూనీగలు, రెక్కలు పట్టుకున్న సీతాకోకచిలుకలు, సంకెళ్లు వేసిన ఉడతలూ, గేలంకి చిక్కుకున్న చేప పిల్లలు… ఇప్పటి బాలలు. అవి వాటికి చిక్కుకుని గిజగిజ లాడుతున్నట్టే చిన్నారులూ అనేక పోటీ ప్రపంచపు శిక్షణలు, పెంపకపు ప్రయోగాలతో పిల్లల్లానే మిగిలే… గెలవలేని ప్రయత్నం చేస్తున్నారు. ఆ గేలాల్ని, సంకెళ్లనీ కొంటోంది పెద్దలు. బోనుల్లో జింకలు, ఫిష్‌ట్యాంక్‌లో తాబేళ్లు, పంజరంలో పిట్టలు…
ఇప్పటి పిల్లలు. అవి అక్కడక్కడే టపటపా కొట్టుకున్నట్టే చిన్నారులూ అనేక క ృత్రిమత్వాల మధ్య కష్టంగానే సహజాతాలకు, సహజత్వానికి దగ్గరగా ఉండే విఫలయత్నం చేస్తున్నారు. ఆ కృత్రిమత్వమంతా కొని వారి ప్రపంచంలో నింపేసేది పెద్దలే. నిజానికి బాల్యానందం కొంటే వచ్చేది కాదు, ప్రదర్శిస్తే పెరిగేది కాదు. అమ్మానాన్నలు ఆత్మీయంగా పంచాల్సింది.. ప్రేమా, స్పర్శలతో ప్రతి క్షణం పెంపొందించాల్సింది!
బాల్యం.. నాట్‌ ఫర్‌ సేల్‌.
ఇదీ పసిమిదనం
। ‘బాల్యమంటే, మనం తెలుసుకోలేం.. గొప్ప జ్ఞాపకాల్ని, మధుర స్మృతుల్నీ తయారు చేసుకునేదని. ఏదో సరదాగా దొర్లే ఓదశ మాత్రమే కాదది’.
। ‘మీ చిన్నారి ప్రేమించే సాధారణ హ ృదయాన్ని అలానే ఎప్పుడూ ఉండనీయండి.’
। మనం పెద్దోళ్లమైపోవాలని ఎప్పుడూ కోరుకుంటాం, కానీ చివరకి తెలుసుకుంటాం.. పగిలిన హ ృదయం కంటే.. విరిగిన పెన్సిళ్లు, పూర్తిచేయని హోమ్‌వర్క్‌లే ఉత్తమమని’.
। మీ జీవితంలో గొప్ప విషయమంటూ ఒకటుంటే అది ఆనందమయమైన బాల్యం, ప్రేమించే ఇల్లు.’
। ‘భర్తీ చేయలేనిదేదో బాల్యంలో ఉంది.’
। ‘ప్రతిమనిషిలో ఒకటిమాత్రమే ప్రత్యేకంగానిలిచే కథ బాల్యం.’
। ‘జీవిత రుతువుల్లో కన్నా బాల్యమే అత్యంత అందమైన రుతువు.’
। ‘ఎవరూ చనిపోని రాజ్యమంటూ ఉంటే అదే బాల్యం.’
। ‘ఒక్కోసారి కొన్ని చిన్నిచిన్ని సంగతులే మీ హృది గదినంతా ఆక్రమించేస్తాయి.’
। ‘ఓరోజుని ఉదయమోలా చూపిస్తుందో.. మనిషిని బాల్యమలా ఉదయిస్తుంది.’
। ‘ప్రతి వసంతంలో ప్రక ృతి విరిసినట్టే.. బాల్యం తిరిగిపూస్తే ఎంత బాగుండో కదా..!’
। ‘జీవితమంతా మనగలిగేది బాల్యమే..!’
। ‘సంగీతమని చెప్పలేని దానికి కూడా నాట్యం చేసేదే బాల్యం.’
। ‘మీ పాతింటికి తిరిగి వెళితే.. మీరు కోల్పోయిందని అనుకునేది ఆ కట్టడం కాదు, మీ బాల్యం.’
। ‘బాల్యానికంటూ దాని ప్రత్యేకమైన ద ృష్టి, ఆలోచన, భావన ఉంటాయి. మన (పెద్దల) విషయాలతో దాన్ని భర్తీ చేయా లను కునేంత మూర?త్వానికి మించింది మరొకటి లేదు.’
। ‘బాల్యమొక సంభ్రమాశ్చర్యాల ప్రపంచం.’
। ‘కొన్ని నిమిషాల బాల్యాన్ని కోల్పోతే నీ జీవితకాలమంతా ఆ విషయాన్ని మర్చిపోలేరు.’
। బాల్యాన్ని ప్రేమించే కొందరు పెద్దల మాటలివి.- అజయ్‌ కుమార్‌ వారాల

రిజర్వేషన్లు పాలకుల పన్నాగాలు

‘రాజకీయాలలో మనిషికి ఒక ఓటు, ఓటుకు ఒక విలువ అనే సూత్రాన్ని గుర్తించబోతు న్నాము. కానీ మన సామాజిక, ఆర్థిక జీవితాలలో మనుషు లందరిదీ ఒకే విలువ అనే సూత్రాన్ని అంగీకరి స్తున్నామా? ఎంత కాలం ఈ వైరుధ్యాల జీవితం? ఈ అసమానతలను వీలైనంత త్వరగా అంతం చేయాలి.’
డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌,1950 జన వరి 26.ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం సమంజసమే అని అత్యు న్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఐదుగురు న్యాయమూర్తు ల్లో ముగ్గరు అనుకూలంగాను, మరో ఇద్దరు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ ఇద్దరిలో అప్పటి ప్రధాన న్యాయమూర్తి కూడా వున్నారు. ఈ రిజర్వేషన్లు పొందడానికి ప్రభుత్వం నిర్ణయించిన ఆర్థిక ప్రాతిపదిక సమంజస మేనా?ఇది నిజంగా అగ్రకులా ల్లోని అర్హులకా? అనర్హులకా? ప్రభుత్వ రంగం పెద్దఎత్తున ప్రైవేటీక రించబడుతున్న ఈస్థితిలో రిజర్వేషన్లవల్ల ప్రయో జనం ఎంత? అగ్ర కులాల్లో కాని, మొత్తం సమా జంలో కాని ఆర్థిక,సామాజిక అణచివేతకు కార ణాలు ఏమిటి? అనే ప్రశ్నలు సహజంగానే చర్చనీ యాంశం అయ్యాయి. 2019 నుండి పెండిరగ్‌లో వున్న ఈ సమస్యపై కొద్ది రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న సందర్భం గా తీర్పు రావడం వెనుక రాజకీయ ప్రయోజ నాలు ఏమీలేవు అనుకో గలమా?
బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభు త్వం అధికారం లోకి వచ్చిన తర్వాత 2019 జనవ రిలో 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్థిక వెనుకబాటు తరగతులకు10 శాతం రిజర్వేషన్లు ప్రకటించింది. విద్యా, ఉద్యోగ నియా మకాల్లో ఈ పదిశాతం కోటాను అమలు చేయా లని నిర్ణయించింది. సామాజిక అసమానత ప్రాతి పదికగా వున్న రిజర్వేషన్లను, ఆర్థిక అస మానత ప్రాతి పదికగా కూడా అమలు చేయవచ్చు అని ఈతీర్పు ప్రకటించింది. అగ్రకులాల్లో వుండే పేద లకు ప్రత్యేక సదుపాయం కల్పించడం సరైందే. నిజంగానే ఆఆర్థిక వెనుకబాటును రూపు మా పాలను కుంటే ప్రస్తుతం పాలకులు అమలు చేస్తున్న అనేక విషయాల్లో మౌలిక మార్పులు రావాలి. అది చేయకుండా కేవలం రిజర్వేషన్ల ద్వారా మాత్రమే ఏదో పరిష్కరిస్తున్నామంటే అది పేదలను చీల్చ డానికి,వారి ఐక్యతను దెబ్బతీసి మరిం త కాలం ఆర్థిక,సామాజిక అణచివేతను కొనసా గించడానికి పాలకవర్గాలు చేస్తున్న కుట్రగా భావించాలి. కార్పొరేట్‌ అనుకూల, మతో న్మాద విధానాలు అమలు చేస్తున్న కేంద్ర పాల కులు నిత్యం ప్రజల ఐక్యతకు విఘాతం కలిగించే ఎత్తు లు వేస్తూనే వున్నారు. హిందూత్వ శక్తులు-రిజర్వే షన్లు. మను ధర్మం ఆధారంగా చాతుర్వర్ణ వ్యవస్థ భావజాలంతో దేశాన్ని పాలిస్తున్న ఆర్‌ఎస్‌ ఎస్‌, బిజెపి నేతలకు సామాజిక ప్రాతిపదికన రిజర్వే షన్లు వుండడం మొదటి నుండి ఇష్టం లేదు. సామాజిక అసమాన తలు గుర్తిస్తే అస మానతలకు కారణాలను విశ్లేషించాలి. అప్పుడు హిందూత్వ నగరూపాన్ని ప్రజలు గుర్తిస్తారు. అందుకే కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండకూడదనేది హిందూత్వ శక్తుల వాదన. అనాగ రిక భావజా లంతో ఆధునిక పరిజ్ఞానాన్ని మేళ వించి,అనేక ద్వంద్వ ప్రమాణాలతో ప్రజల మధ్య చిచ్చుపెడు తున్న ఆర్‌ఎస్‌ఎస్‌… కుల వ్యవస్థను కొనసాగిస్తూనే మత రాజ్యాన్ని స్థాపించాలను కుంటుంది. ఒకే మతం,ఒకే దేశం,ఒకే జాతి లాంటి నినాదాలతో ప్రజల మద్దతును పొందా లనుకుంటుంది. మరో వైపు భారత రాజ్యాంగం వారి భావజాల విస్తరణ కు ఆటంకంగా వుంది. అందుకే వారు రాజ్యాం గంపై, అందులోని కీలక అంశాలైన లౌకికతత్వం, ఫెడరల్‌ వ్యవస్థ, సామా జిక న్యాయం, శాస్త్ర విజ్ఞాన పరిశోధనలాంటి వాటిపై అనేక రూపాల్లో దాడులు చేస్తున్నారు. అనేక తరాలుగా హిందూత్వ భావజాలంతో తీవ్రమైన సామాజిక అణచి వేతకు గురైన దళి తులు,ఉపశమనం కోసం మతం మారితే వారికి దళిత రిజర్వేషన్లు అమలు చేయ రాదని మత కోణం నుండే బిజెపి వాదిస్తున్నది. ‘మానవులంతా సమానంగా గుర్తించబడలేదు’ అని మనుధర్మ శాస్త్రం 1వస్మృతి- 31వ శ్లోకం చెబుతుంది. అలాగే ‘అగ్రవర్ణాలకు సేవ చేయడం శూద్రుల బాధ్యత, శూద్ర కులాలు చదవకూడదు, శూద్రులు వేదం వింటే చెవుల్లో సీసం కాసి పో యాలి, వేదం పలికితే నాలుక కత్తిరించాలి’ ఇలాంటి అనేక భాష్యాలతో శూద్ర, అతి శూద్ర కులాలను బానిసలుగా చేసుకొని ఆర్థికంగా దోచు కుంటూ, సామాజికంగా అణచివేసి, చదువుకు, విజ్ఞానానికి శ్రమజీవులను దూరం చేసింది అగ్ర వర్ణ బ్రాహ్మ ణాధిపత్యం.
వందేళ్ళకు పైబడ్డ రిజర్వేషన్ల చరిత్ర. దేశాన్ని బ్రిటీష్‌ వారు పరిపాలించే క్రమంలో వారి వ్యాపార ప్రయోజనాల కోసమైనా ప్రజలకు చదువు చెప్పాల్సి వచ్చింది.పరిమిత విజ్ఞానా న్న యినా శ్రామిక జనంపొందే అవకాశం వచ్చిం ది.ఈ క్రమంలోనే సమాజం నుండి సాంఘిక సమానత్వ అంశం ముందుకు వచ్చింది. 1882 లో హంటర్‌ కమిషన్‌ ముందు జ్యోతిరావ్‌ పూలే హాజరై శూద్ర, పంచమ కులాలకు విద్యా,ఉద్యో గ రంగాలలో రిజర్వేషన్లు ఉండాలని వాదిం చారు.1902లో మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ సాహు మహారాజ ఆస్థానంలో బ్రాహ్మణేతరులకు విద్యా, ఉద్యోగాల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పిం చినట్లు ఆధారాలు వున్నాయి. దక్షిణ భారత దేశంలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఉద్య మిస్తున్న క్రమంలోనే విద్యా,ఉపాధికోసం పోరా టాలు జరిగాయి.గురజాడ,కందుకూరి, ముఖ్యంగా పెరియార్‌ ఇ.వి.రామస్వామి నాయర్‌ నడిపిన అనేక పోరాటాల వల్ల నాటి మద్రాసు రాష్ట్రంలో ఎస్‌.సి,ఎస్‌.టి,క్రిస్టియన్లతో సహా వెనుకబడిన కులాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించ బడ్డాయి. బి.సి ల సమస్యలపై దేశంలో మొదటి సారిగా 1921లో నియమించిన మిల్లర్‌ కమిటీ మైసూర్‌ సంస్థానంలో,1935లో కేరళ ప్రాంతం లోని ట్రావెన్‌కోర్‌ సంస్థానంలోఈరకమైన రిజర్వే షన్‌ సదుపాయాలు కల్పించాల్సి వచ్చింది. స్వాతంత్య్రానంతరం…జాతీయోద్యమంలో భాగంగా ప్రజలు ఒకవైపు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతూనే, మరోవైపు దేశంలోని కులవివక్ష, వెట్టిచాకిరి,ఆర్థిక దోపిడి లాంటి రుగ్మ తలకు వ్యతిరేకంగా సామాజిక ఉద్యమాలు సాగించారు. సహజంగానే వీటిలో కమ్యూనిస్టులు, మానవతావాదుల చొరవ కీలకంగా వుంది. తరతరాలుగా అణచివేతకు, సాంఘిక వివక్షకు గురైన అత్యధికమంది ప్రజలకు ప్రత్యేక సదుపా యాలు కల్పించడం ద్వారానే దేశం అభివృద్ధి సాధించగలదని రాజ్యాంగ నిర్మాతలు భావిం చారు.ఈ నేపథ్యం నుండే స్వాతంత్య్రా నంతరం సామాజిక రిజర్వేషన్లను రాజ్యాంగ బద్ధంగా కల్పించారు. ఇలా పది సంవత్సరాలు ప్రత్యేక అవకాశాలు కల్పించడంద్వారా సాంఘిక సమా నత్వం సాధించడానికి తోడ్పడుతుందని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. భూస్వామ్య భావజాలం, మనువాద సిద్ధాంతం బలంగా తలలో నింపుకున్న శక్తులు ప్రారంభం నుండే రిజర్వేషన్లను వ్యతిరేకి స్తూ వచ్చారు. రిజర్వేషన్లు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 15(1)కి వ్యతిరేకమని 70 ఏళ్ళ క్రితమే కోర్టుకు వెళ్లారు. రాజ్యాంగంలోని సమాన సూత్రాలకు రిజర్వేషన్లు విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీంతో రిజర్వేషన్ల అమలు కోసం రాజ్యాంగానికి మొట్టమొదటి సవరణ చేయాల్సి వచ్చింది. భూ సమస్యను పరిష్కరించి, ప్రభుత్వ రంగాన్ని విస్తరింపచేయాల్సిన పాలకులు గ్రామీణ భూస్వామ్య వర్గంతో పెట్టుబడిదారులు రాజీపడి సామాజిక, ఆర్థిక అణచివేతను కొనసాగించారు. రిజర్వేషన్లు అవసరం లేదా? సాంఘిక, ఆర్థిక సమానత్వం సాధించేవరకు రిజర్వేషన్లు అవస రం. 76 ఏళ్ళ స్వాతంత్య్రం తరువాత కూడా కులం పేరుతో దాడులు, అసమానతలు ఎదు ర్కొంటున్న దళిత,గిరిజనులు అనేక రంగాల్లో వెనుకబడ్డారు.విద్య,ఉపాధిలో తీవ్ర అసమాన తలకు గురౌతున్నారు. ఏదో ధర్మం చేసినట్లు జన సంఖ్యతో సంబంధం లేకుండా ఈ వర్గాలకు శాతాల లెక్కన రిజర్వేషన్లు ఇస్తున్నారు. చేతివృ త్తులు,బలహీన కులాలకు చెందిన అత్యధిక మంది సామాజిక సేవారంగాల్లో పనిచేసేవారు. సాంకేతిక మార్పులు, ప్రభుత్వాల విధానాలు వీరి పరిస్థితిని తీవ్రంగా దిగజార్చాయి. బి.సి రిజర్వే షన్లకు కూడా రాజ్యాంగబద్ధంగా హక్కు కల్పిం చాలని అనేక పోరాటాలు జరిగాయి. 1976లో జనతా ప్రభుత్వంబి.పి.మండల్‌ అధ్యక్షతన వేసిన కమిషన్‌ సిఫార్సుల ఆధారంగా జనతాదళ్‌ ప్రభుత్వం 1990 ఆగస్టు 17న బి.సి కులాలకు విద్యా,ఉద్యోగాల్లో 27శాతం రిజర్వేషన్లు ప్రకటిం చింది. దీన్ని సహించలేని ఆర్‌ఎస్‌ఎస్‌, సంఘపరి వార్‌ సంస్థలు మండల్‌ కమిషన్‌కు వ్యతిరేకంగా కమండల్‌ ను లేవదీశారు. రథయాత్రలు, ఏక్‌తా యాత్ర,అయోధ్య రామమందిరం పేర్లతో మతో న్మాద చర్యలు చేపట్టారు. దేశమంతటా ముఖ్యం గా విద్యాలయాల్లో హింసను రెచ్చగొట్టారు. ఓబిసి రిజర్వేషన్లు-వైద్య కళాశాలల్లో ప్రవేశానికి దేశ వ్యాప్తంగా ఒకే ప్రవేశ పరీక్ష (నీట్‌)అమలు చేయాలని 2016లో సుప్రీంకోర్టు చెప్పింది. ఈ అడ్మిషన్లల్లో 15శాతం అండర్‌ గ్రాడ్యుయేట్‌ సీట్లు, 50 శాతం పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ సీట్లు అఖిల భారత కోటాకు ఇవ్వాలని ఈ తీర్పు ప్రకటించింది. ఇది నేరుగా రాష్ట్రాల హక్కులను కాలరాయడమే. ఈ విధానం రాజ్యాంగంలోని ఫెడరల్‌ విధానానికే వ్యతిరేకం.
ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్లు- విద్యా,ఉపాధి రంగాల్లో ప్రభుత్వ రంగానిది కీలక పాత్ర వున్న కాలంలో రిజర్వేషన్ల ప్రయోజనం కొద్దిమేరకైనా వుండేది. ప్రైవేటీకరణ ఒక ప్రళ యంలాగా సాగుతున్న ఈ పరిస్థితుల్లో రిజర్వేషన్లు ఎంత మేరుకు ఒడ్డుకు ఎక్కించగలవు? ప్రభుత్వ పెట్టుబడి, ప్రభుత్వ రాయితీలు, పన్ను మినహా యింపులు, ప్రభుత్వ రక్షణ లాంటి అనేక సదుపా యాలు పొందుతున్న కార్పొరేట్‌ సంస్థలు రిజర్వే షన్లు కలిపిస్తే ప్రతిభ దెబ్బ తింటుందనే చిలుక పలుకులు పలుకుతున్నాయి. బయటకు కనిపించే నాగరికత అంతా సామాజిక, ఆర్థిక అసమానతల ముందు దిష్టిబొమ్మలాగా మారుతుంది. దీని నుండి బయట పడడానికి ఒక ఉపశమనంగా రిజర్వేషన్లను వివిధ తరగతులు కోరుకుంటు న్నాయి. పాలకుల విధానాల వల్ల ఏర్పడి, కొనసా గుతున్న సామాజిక, ఆర్థిక అణచివేతకు ఈ రిజర్వే షన్లు మాత్రమే పరిష్కారం కాదు. అసమాన తలకు, దోపిడికి గురౌతున్న శక్తుల మధ్య ఐక్యత పెంచడం, సర్వ సమస్యలకు మూలమైన వ్యవస్థ సమూల మార్పుకోసం పోరాడడం ద్వారానే విముక్తి సాధించగలం.అందుకు ప్రగతిశీల శక్తులు కృషి చేయడమే పరిష్కారం.
సాంఘిక సమానత్వ సాధనలో రిజర్వేషన్ల ఆవశ్యకత, పరిమితులు
ఉద్యోగాలలో, చదువుల్లో దళితులకు, గిరిజను లకు, ఒబిసిలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని ఒక తాత్కాలిక ఉపశమనంగా పరిగణిస్తూనే సిపిఐ (ఎం) రిజర్వేషన్లను సమర్ధిస్తుంది. అదే సమయం లో దీర్ఘకాల పరిష్కారంగా సమూలంగా భూసంస్క రణలను చేపట్టాలని, కొద్దిమంది చేతుల్లో ఉన్న సంపద కేంద్రీకరణను బద్దలు కొట్టాలని, అన్ని తరగతులవారికీ ప్రయోజనాలు కలిగే విధంగా ఆర్థికాభివృద్ధి ఉండాలని కోరుతుంది.
దేశంలో వివిధ ప్రాంతాల్లో రిజర్వేషన్లకు సంబంధించిన సమస్యలు తలెత్తుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో పలుగ్రూపులు ఆయాతరగతుల డిమాం డ్లపై ఆందోళనలు చేపడుతున్నాయి. వారి వారి ఎన్నికల ప్రయోజనాలను నెరవేర్చుకోవడం కోసం బూర్జువా రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఈ ఆందోళనలను ప్రోత్సహిస్తు న్నాయి. అందరికన్నా ఎక్కువగా ఈ ఆందోళన లను, ఆయా తరగతుల సమస్యలను ఆర్‌.ఎస్‌.ఎస్‌ అతి శ్రద్ధగా తన సోషల్‌ ఇంజనీరింగ్‌ వ్యూహానికి అనుగుణంగా వినియోగించుకుంటోంది. ఇది ఆ యా బలహీన వర్గాలపై ప్రేమకొద్దీ చేస్తున్న పని కాదు,తన హిందూత్వ సిద్ధాంతాన్ని బలపరుచు కోవడం కోసం ఆయా కులాల్లో,సమూహాల్లో చొర బడడానికి వినియోగించుకుంటోంది.ఈ విషయం లో తన జోక్యంతో న్యాయ వ్యవస్థ సైతం కొత్త వివాదాలకు,సమస్యలకు కారణమౌతోంది. మొ త్తంగా చూసినప్పుడు ఒకవైపున రిజర్వేషన్ల వలన కలుగుతున్న ప్రయోజనాలు తగ్గిపోతూంటే, మరో వైపున తమకూ రిజర్వేషన్లు కావాలన్న తాపత్ర యం మరిన్ని తరగతులలో పెరుగుతోంది. ఇదే ప్రస్తుత పరిస్థితి లోని వైచిత్రి.
సాంఘిక సమానత్వాన్ని, న్యాయాన్ని సాధించడం లో భాగంగా సమాజంలోని దళిత, గిరిజన, తదితర బలహీన తరగతుల ప్రజలకు తోడ్పడ డానికి భారత రాజ్యాంగం పలు అవకా శాలను కల్పించింది.330,332,243-డి, 243 -టి అధికరణలు రాజకీయ రిజర్వేషన్లు కల్పిం చాయి.15,15(4),16(4),29(2) అధికరణలు విద్య,ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాయి. 17వ అధికరణ అంటరానితనాన్ని రద్దు చేసింది. 338 అధికరణ దళితులకు, గిరిజనులకు జాతీయ కమిషన్ల ఏర్పాటుకు అవకాశం కల్పించింది. సామాజిక న్యాయ సాధన దిశగా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా 1989లో ఎస్‌.సి, ఎస్‌.టి అత్యాచార నిరోధక చట్టాన్ని జారీచేశారు. 1975 తర్వాత ఎస్‌.సి,ఎస్‌.టి స్పెషల్‌ కాంపొనెంట్‌ ప్లాన్‌ను బడ్జెట్‌లో భాగంగా ప్రవేశపెట్టారు. ఐతే, బిజెపి అధికారంలోకివచ్చాక దీనినినీరుగార్చారు. మన రాజ్యాంగంలో పలు అవకాశాలు చెప్పుకో దగ్గ స్థాయిలో ఉన్నప్పటికీ, బలహీన వర్గాలకు సామాజిక న్యాయం అందాలన్న లక్ష్యం మాత్రం ఇంకాచాలా దూరంగానే ఉండి పోయింది. భారత పాలకవర్గాలలో రాజకీయ చిత్తశుద్ధి లేక పోవడమే దీనికి కారణం. మతో న్మాద, మను వాద బిజెపి కేంద్రంలో అధి కారంలోకి వచ్చాక రాజ్యాంగ స్ఫూర్తినే దెబ్బతీసి నీరుగార్చే విధంగా నేరుగా దాడి జరుగుతోంది. రిజర్వేషన్ల వలన ఎటువంటి ఉపయోగాలూ కలగకుండా చూడ డానికి పలు వక్ర మార్గాల్లో మతోన్మాద శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ప్రయత్నాలను ప్రతిఘటించి తిప్పికొట్టకపోతే బలహీన వర్గాలకు రిజర్వేషన్ల సదుపాయం లేకుండానే పోయే ప్రమాదం ఉంది.
చారిత్రికంగా అతిహీనమైన రీతిలో సామా జిక అణచివేతకు గురైన తరగతులకు ప్రస్తుత పెట్టుబడిదారీ సంబంధాలచట్రం పరిధిలో, ఆ పెట్టుబడిదారుల ప్రయోజనాలకు భంగం కలగ కుండానే, కనీసమైన ఊరటను రిజర్వేషన్లు కలిగి స్తాయన్నది సిపిఐ(ఎం) అభిప్రాయం. అంతే తప్ప పాలక వర్గాలు చెప్పుకుంటున్నట్టు రిజర్వేషన్లతోటే సామాజిక విముక్తి సాధ్యం కాదు. రిజర్వేషన్లు కులవ్యవస్థ సాంప్రదాయ పట్టును సడలింప జేయడానికి దోహదపడతాయని,కొద్దిపాటి సంఖ్యలోనైనా ‘కింది కులాల’ వారు సామాజి కంగా పైకి ఎక్కి రావడానికి వీలు కల్పించడం ద్వారా సమాజంలోని వివిధ వర్గాలలో బహుళ త్వాన్ని పెంచడానికి దోహదపడతాయని, ఆవిధం గా చూసినప్పుడు రిజర్వేషన్లు ఒక ప్రజాతంత్ర సారాంశం కలిగివున్నాయని సి.పి.ఐ(ఎం) భావిస్తుంది.ఉద్యోగాలలో, చదువుల్లో దళితులకు, గిరిజనులకు, ఒబిసిలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని ఒకతాత్కాలిక ఉపశమనంగా పరిగణిస్తూనే సిపిఐ (ఎం) రిజర్వేషన్లను సమర్ధిస్తుంది. అదే సమ యంలో దీర్ఘకాల పరిష్కారంగా సమూలంగా భూసంస్కరణలను చేపట్టాలని,కొద్దిమంది చేతుల్లో ఉన్న సంపద కేంద్రీకరణను బద్దలు కొట్టాలని, అన్ని తరగతులవారికీ ప్రయోజనాలు కలిగే విధంగా ఆర్థికాభివృద్ధి ఉండాలని కోరుతుంది. సామర్ధ్యం పేరుతోనో, మెరిట్‌ పేరుతోనో, సమా నత్వం పేరుతోనో రిజర్వేషన్లను రద్దు చేయాలన్న డిమాండ్‌ను సి.పి.ఐ(ఎం) తీవ్రంగా వ్యతిరేకి స్తుంది. సామాజిక వెనుకబాటుతనం వాస్తవంగా ఉన్న తరగతులకు రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్లనుబలపరుస్తుంది. ఇప్పటికీ రిజర్వేషన్లు అమలులోకి రాని రంగాల్లో, ప్రభుత్వ విభాగాల్లో రిజర్వేషన్లను అమలు చేయాలన్న డిమాండ్‌ను బలపరుస్తుంది. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు ఉండాలన్న డిమాండ్‌ను సమర్ధిస్తుంది. రిజర్వేషన్ల అమలులో తలెత్తుతున్న అసమానతలను సరి చేయాలన్న డిమాండ్‌ను బలపరుస్తుంది. ప్రమో షన్లలో రిజర్వేషన్లు అమలు చేయాలన్న డిమాండ్‌ ను, రిజర్వేషన్ల అమలు ఫలితంగా ఒకే కేటగిరీ లో ఉన్న వివిధకులాల మధ్యలో అసమాన ప్రయో జనాలు కలిగితే దానిని సరి చేయడానికి ఆకు లాలను వర్గీకరించాలన్న డిమాండ్‌ను సిపిఐ(ఎం) బలపరుస్తుంది. ఒబిసిలలో గణనీయంగా దొంత రలు తయారైన కారణంగా, ఒబిసి రిజర్వేషన్ల అమలులో ఆర్థిక ప్రాతిపదికను (క్రీమీ లేయర్‌) పాటించాలన్న డిమాండ్‌ ను బలపరుస్తుంది. ఆ విధంగా చేసినప్పుడే ఎవరికి నిజంగా అవసరం ఉందో వారే రిజర్వేషన్ల వలన ప్రయోజనం పొందగలుగుతారు. అదే సమయంలో దళితుల్లో, గిరిజనుల్లో కూడా ఆర్థిక ప్రాతిపదికను (క్రీమీ లేయర్‌) ప్రవేశ పెట్టాలన్న డిమాండ్‌ను సిపిఐ (ఎం) వ్యతిరేకిస్తుంది. ఆ సామాజిక తరగతుల లోపల గణనీయమైన స్థాయిలో అంతరాలు ఏర్పడనందువల్ల ఈ విధమైన డిమాండ్‌ వారికి వర్తింపజేయకూడదు. అగ్ర కులాలవారికి, ఆధి పత్య కులాలవారికి కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండకూడదన్నది సిపిఐ(ఎం) వైఖరి. ఇందుకు మినహాయింపుగా ఆర్థికంగా వెనుకబడిన అగ్రకు లాల వారికి, ఆధిపత్య కులాల వారికి రిజర్వేషన్‌ సదుపాయం కల్పించడాన్ని,అది సామాజిక వెనుక బాటుతనంతో సంబంధం లేనిదే అయినా, సిపిఐ(ఎం)సమర్థిస్తుంది. పేద తరగతుల ప్రజల్లో రిజర్వేషన్‌ సదుపాయం వర్తించనివారిలో రిజర్వే షన్‌ విధానంపట్ల ఉన్న వ్యతిరేకతను తగ్గించ డానికి,వర్గ ఐక్యతను నిలబెట్టడానికి ఇది ఉప యోగపడుతుందన్న భావనతోనే ఈ వైఖరిని సిపిఐ(ఎం) తీసుకుంది.
సమాజంలో ఏకులం జనాభా ఎంత శాతం ఉందో అంతశాతం మేరకు వారికి రిజర్వే షన్‌ కల్పించాలన్న డిమాండ్‌ను సిపిఐ(ఎం) వ్యతి రేకిస్తుంది. ఒక్క దళిత, గిరిజన తరగతుల విష యంలోనే దీనికి మినహాయింపు ఉంటుంది. సామాజిక వెనుకబాటుతనం మౌలిక ప్రాతిప దికగా ఏతరగతికైనా రిజర్వేషన్‌ కల్పించాలే తప్ప జనాభాలో ఎవరెంత శాతం ఉన్నారన్న లెక్కన కాదు. ఆ విధంగా చేస్తే అది కులవ్యవస్థ యొక్క అణచివేసే నిచ్చెనమెట్లనిర్మాణపు దుర్మార్గాన్ని కప్పిపుచ్చడమే అవుతుంది.
రిజర్వేషన్ల అమలు-ఫలితాలు
స్వతంత్ర భారతదేశంలో గత ఏడు దశాబ్దాలుగా అమలు జరిగిన రిజర్వేషన్ల వలన వచ్చిన అనుభ వాలను, ఫలితాలను దిగువ పేర్కొన్న విధంగా సంక్షిప్తీకరించవచ్చు.

  1. సామాజికంగా ప్రతికూలతను ఎదుర్కొం టున్న తరగతుల్లో విద్యావ్యాప్తికి రిజర్వేషన్లు తోడ్పడ్డాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో, ప్రభుత్వ రంగ సంస్థలలోని ఉద్యోగాల్లో అవకాశాలు పొందిన ఈతరగతుల వారు,చట్ట సభల్లో రిజర్వేషన్ల వలన పదవులు పొందినవారు సామాజి కంగా పైస్థాయికి ఎదగడానికి కొంత అవకాశాన్ని రిజర్వేషన్లు కల్పిం చాయి.
  2. అయితే, సామాజికంగా ప్రతికూలతను ఎదుర్కొంటున్నవారిలో అవసరమైన వారందరికీ రిజర్వేషన్‌ ఫలాలు అందలేదు. వారిలో అతిచిన్న భాగం మాత్రం ప్రయో జనం పొంది ఒకచిన్న మధ్యతరగతిగా రూపొం దారు. ఒకే గ్రూపులో పలు కులా లవారు ఉన్నప్పుడు ఆ కులాల్లో ఎక్కువ జనాభాగా ఉన్న కులాలవారు, సాపేక్షంగా తక్కినవారికన్నా ముందున్న కులాలవారు రిజర్వేషన్‌ కల్పించిన అవకాశాలను ఎక్కువగా దొరకబుచ్చుకోగలిగారు. వాస్త వానికి కాస్త మెరుగైన పరిస్థితిలో ఉన్న వారికే రిజర్వేషన్‌ వలన ఎక్కువగా ప్రయోజనాలు కలిగాయి.ఆ తర్వాత కూడా వారికే ఆ ప్రయోజనాలు కలుగుతూ వస్తున్నాయి. తద్వారా ఎవరికి ఎక్కువ అవసరం ఉందో వారు రిజర్వేషన్‌ ఫలా లనుపొందలేకపోతున్నారు. సామాజికంగా ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నవారిలో అత్యది óక భాగం ప్రజానీకాన్ని ఇప్పటికీ, పేదరికం, నిరక్షరాస్యత, అనారోగ్యం,నిరుద్యోగం, అణ చి వేత, వివక్షత వెన్నాడుతూనే వున్నాయి. కొద్ది మంది ప్రజలు సామాజికంగా పైకి ఎదగడానికి మాత్రమే రిజర్వేషన్లు తోడ్ప డ్డాయి తప్ప అస్థిత్వ వాదులలో పలువురు చెప్పు కుంటున్నట్టు సాంఘిక సమానత్వాన్ని సాధించడానికి తోడ్పడలేదు.
  3. నయా ఉదారవాద ఆర్థిక విధానాల అమ లు ప్రారంభమయ్యాక రిజర్వేషన్ల పరిమిత ప్రయోజనం కూడా కుదించుకుపోతూ వుంది. ప్రైవేటీకరణ, ప్రభుత్వ రంగాన్ని కూల దొయ్యడం, ఉద్యోగాల కాంట్రాక్టీ కరణ,యాంత్రీకరణ విధానాల వలన, వాటి పర్యవసానాలైన ఉపాధి రహిత అభివృద్ధివలన,విద్య వ్యాపారీకరణ వలన విద్యావకాశాలు, ఉపాధి అవకాశాలు ప్రభుత్వ రంగంలో తగ్గిపోతున్నాయి. ఆ విధంగా రిజర్వేషన్ల అమలు వర్తించే రంగాల పరిధి రోజు రోజుకూ ముడుచుకు పోతోంది.
  4. ఇలా అవకాశాలు కుదించుకు పోతున్న దానికి ప్రత్యామ్నాయంగా సామాజిక ఉ ద్యమాలు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేస్తున్నాయి. సిపిఐ(ఎం) కూడా ఈ డిమాండ్‌ను గట్టిగా బలపరుస్తోంది. కాని ప్రైవేటు రంగం చాలా తీవ్రంగా ఈ డిమాండ్‌ ను వ్యతిరేకి స్తోంది.ఒకవేళ ప్రైవేటు రంగంలో రిజర్వే షన్లను అమలు చేయాలన్న డిమాండ్‌ను ఆమోదించినా దానివలన ప్రయోజనాలు పరిమితంగానే ఉంటాయి తప్ప మౌలికమైన మార్పు ఏమీ ఉండబోదు. ఎందుకంటే సంఘటిత ప్రైవేటు రంగంలో ఉద్యోగాల లభ్యత చాలా స్వల్పం. అణచివేతకు గురౌతున్న సామాజిక తరగతులనుండి ఉద్యోగాలు కోరుతున్నవారి సంఖ్య దానితో పోల్చితే చాలా ఎక్కువ.
  5. రిజర్వేషన్‌ రొట్టె పరిమాణం తగ్గిపో తున్నకొద్దీ అలాతగ్గిపోతున్నదానిలో తాము ఎక్కువ వాటా దక్కించుకోవాలన్న పోటీ బలహీన వర్గాల లోని వివిధ తరగతుల్లో పెరుగుతోంది. దాని ఫలితంగా ఇప్పటికే తగ్గిపోతున్న అవకాశాలను పొందే ప్రయ త్నంలో వివిధ తరగతుల మధ్య, వివిధ కులాల మధ్య వైరుధ్యాలు, ఘర్షణలు పెరు గుతున్నాయి. కొత్త తరగతులు, సమూహాలు తమకు సైతం రిజర్వేషన్లు వర్తింప జేయా లన్న డిమాండ్‌ను ముందుకు తెస్తున్నాయి. దానితోబాటు ఇప్పుడున్న రిజర్వేషన్ల పరిధి లోనే వర్గీకరణ చేపట్టి అవకాశాల పంపి ణీలో మరింత సమన్యాయం చేయాలన్న డిమాండ్‌ కూడా ముందుకొచ్చింది.
  6. ఈ పరిణామాల పర్యవసానంగా రిజర్వే షన్లకు సంబంధించిన వివిధ డిమాండ్లను చేపట్టి అనేక ఆందోళనలు, ఉద్యమాలు రానురా నూ ఎక్కువౌతున్నాయి. కులం, సామాజిక అస్థిత్వం ప్రధాన అంశాలుగా ఈ ఆందోళనలలో సమీకరణలు జరుగుతు న్నాయి.(సీపీఎం వెబ్‌సైట్‌ సౌజన్యంతో..) (వ్యాసకర్త సిపిఐ(ఎం)పొలిట్‌బ్యూరో సభ్యులు)-(బి.వి.రాఘవులు)
1 … 85 86 87