నెరవేరని జాతీయ కనీస వేతన వ్యధ…!

పార్లమెంట్‌లో పాస్‌ అయిన వేతనాల కోడ్‌ ప్రకారం కనీస వేతన నిర్ణయం కోసం కనీస వేతనాల సలహా బోర్డుల సలహాలు తీసుకోవాలి. అంతిమంగా సదరు ప్రభుత్వాలు కనీస వేతనాన్ని ఖరారు చేయడానికి… కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వేతనాల కోడ్‌ నిబంధనల ప్రకారం… 15వ భారత కార్మిక మహాసభ సిఫార్సులను, సుప్రీంకోర్టు తీర్పులను ప్రాతిపదికగా తీసుకోవాలి. కాని తాను పాస్‌ చేసిన ఈ చట్టానికి వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
జాతీయ కనీస వేతనం తిరిగి చర్చనీయాం శమైంది. మోడీ ప్రభుత్వం 2017లో పార్లమెంట్‌ లో వేతనాల కోడ్‌ బిల్లు ప్రవేశపెట్టిన తరువాత జాతీయ కనీస వేతన సిఫార్సు కోసం ‘వి.వి.గిరి జాతీయ కార్మిక సంస్థ’కు చెందిన డాక్టర్‌ సత్పతి అధ్యక్షతన ఒక కమిటీ వేసింది. అనేక పరిమితులతో ఆ కమిటి చేసిన కొద్దిపాటి సిఫార్సులను కూడా ఆమోదించకుండా ఏకపక్షంగా జాతీయ కనీస వేత నాన్ని రోజుకు రూ.176గా నిర్ణయించింది. దేశ మంతా ఈ నిర్ణయంపై గగ్గోలు పెట్టిన తరువాత దాన్ని రూ.2 పెంచి రూ.178 చేసింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం వేతనాల కోడ్‌ నిబంధనలను ప్రతిపాదించిన తదుపరి ఇప్పుడు కొత్తగా జాతీయ కనీస వేతనంపైనే కాకుండా కేంద్ర మరియు రాష్ట్రాల లేబర్‌ కమిషనర్లు నిర్ణయించే కనీస వేతనంపై కూడా సిఫార్సులు చెయ్యమని గణాంక శాస్త్రజ్ఞుడు ఎస్‌.పిముఖర్జీ అధ్యక్షతన కమిటీ వేసింది.దాంతో జాతీయ కనీస వేతనం మరోసారి చర్చకు వచ్చింది.
ఈ ఏడాది మార్చి 28,29 తేదీల్లో కార్మిక సంఘాలు మరియు స్వతంత్ర ఉద్యోగ సంఘాల ఫెడరేషన్లు చేయబోయే రెండు రోజుల అఖిల భారత సమ్మె కోర్కెలలో నెలకు కనీస వేతనం రూ. 26,000 ఇవ్వాలనేది ప్రధానమైనది. జాతీయ కనీస వేతనం అయినా,కనీస వేతనం అయినా ఒకటిగానే ఉండాలి. వాటి నిర్ణయానికి ప్రామాణి కాలు ఒకటిగానే ఉండాలి. కాని మోడీ ప్రభుత్వం వేతనాల కోడ్‌ ప్రతిపాదిత నిబంధనలలో కనీస వేతన నిర్ణయానికి 1957లో జరిగిన 15వ భారత కార్మిక మహాసభ సిఫార్సులను, 1992 సుప్రీంకోర్టు తీర్పులను ప్రామాణికాలుగా తీసుకోవాలని చేర్చింది. జాతీయ కనీస వేతనానికి మాత్రం ఈ ప్రామాణికాలు పెట్టలేదు. వేతనాల కోడ్‌ లోనూ, దాని నిబంధనలలోనూ కొత్తగా జాతీయ కనీస వేతనాన్ని చేర్చింది. ఇంతకు ముందటి కనీస వేతన చట్టంలో ఇది భాగంగా లేదు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం దానికి చట్టబద్ధత తెచ్చింది.పైగా జాతీ య కనీస వేతనానికి తక్కువగా కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు మరియు ప్రైవేటు యాజమాన్యాలు కనీస వేతనాన్ని నిర్ణయించగూడదని చేర్చింది (జాతీయ కనీస వేతనం రూ.178 గానే వుంది).
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7వ పే కమిషన్‌ భారత కార్మిక మహాసభ సిఫార్సులు మరియు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నెలకు రూ.18 వేలను కనీస వేతనంగా సిఫార్సు చేస్తే కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించింది. చదువులు, ఆరోగ్య అవసరాలు, వినోదం, పండగలు పబ్బాలు, భవి ష్యత్‌ అవసరాల కోసం కనీస వేతనంలో 25 శాతం ఉండాలన్న సుప్రీంకోర్టు తీర్పును 15 శాతా నికి తగ్గించింది. 15వ భారత కార్మిక మహాసభ సిఫార్సులలోని అద్దెకోసం సంబంధించిన ప్రామాణి కాన్ని కూడా తీసుకోకుండా, దాన్ని నెలకు 18 వేలుగా చేసింది. ఈ సిఫార్సును కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తిరస్కరించి తమకు 2015 ధరలలో నెలకు రూ.26 వేలు కనీస వేతనంగా ఇవ్వాలని కొంత కాలంపాటు ఆందోళన చేసినా మోడీ ప్రభు త్వం రూ.18 వేలనే ఖరారు చేసింది. ఆ ప్రకారం చూసినా ఇప్పటి ధరల్లో కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.
2017లో మోడీ ప్రభుత్వం జాతీయ కనీస వేతనంపై వేసిన కమిటీ 2011-2012 జాతీయ శాంపిల్‌ సర్వే (ఎన్‌ఎస్‌ఎస్‌) తాలుకా వినిమయ ఖర్చులను,ప్లానింగ్‌ కమిషన్‌ పేదరిక రేఖను నిర్ణయించటానికి తీసుకున్న ఆహార కేలరీల లెక్కను పరిగణనలోకి తీసుకొని జాతీయ స్థాయిలో కనీస వేతనాన్ని రోజుకు రూ.375, నెలకు రూ.9750 గా సిఫార్సు చేసింది. భారత కార్మిక మహాసభ సిఫార్సు చేసిన 2700 కేలరీల ఆహారాన్ని 2400కు తగ్గించింది. దీనికి నేషనల్‌ శాంపిల్‌ సర్వేను ప్రాతి పదికగా తీసుకుంది. పేదరిక రేఖ మాత్రమే ఈ కమిటీకి ప్రాతిపదిక అయ్యింది. ఆర్థిక వెనుకబాటు తనం వల్ల వినిమయాన్ని తగ్గించుకుంటే దాన్ని కూడా లెక్కలోకి తీసుకుంది. అదనంగా పట్ట ణాలలో ఇంటి అద్దెకు రూ.1430 ఇవ్వాలన్నది. పల్లెటూళ్లల్లో అత్యధిక మంది సొంత ఇళ్లల్లో ఉంటారని సర్వేలో తేలినందున వారికి ఇంటి అద్దెను సిఫార్సు చెయ్యలేదు. ప్రత్యామ్నాయంగా దేశంలో ఉన్న రాష్ట్రాలను 5 జోన్లుగా విభజించి 5 రకాల వేతనాలను తక్కువ స్థాయిలో రోజుకు రూ.341, నెలకు రూ.8878 గా,అధిక స్థాయిలో రోజుకు రూ.446,నెలకు రూ.11610లను సిఫార్సు చేసిం ది. కార్మికులు, వారి కుటుంబాల కనీస అవస రాల కోసం ఈ వేతనాలు సరిపోతాయని వాటిని చట్టబద్దం చెయ్యవచ్చని చెప్పింది. మోడీ ప్రభుత్వం అతి తక్కువగా ఉన్న ఈవేతనాలను కూడా ఆమోదించకుండా జాతీయ కనీస వేతనాన్ని రోజుకి రూ.178,నెలకు రూ.4628గా నిర్ణయించి ప్రకటించింది. ఈ జాతీయ కనీస వేతనం ఎలా వచ్చింది, ఎక్కడ ప్రారంభమయ్యింది, ఇప్పటికీ రూ.178గానే ఎందుకు వుందనేది తెలుసుకుంటే దేశంలోని పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్థ అసలు రూపం బయటపడుతుంది.1991లో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ మరియు గ్రామీణ కార్మికుల వేతనంపై వేసిన కమిటీ చేసిన సిఫార్సులు అత్యంత కార్మిక వ్యతిరేకమైనవిగా ఉన్నాయి. 1979-80 ధరల్లో నేషనల్‌ శాంపిల్‌ సర్వే నివేదిక ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 2400 కేలరీల ఆహారానికి (పేదరిక స్థాయి) గాను ఒక్కో వ్యక్తి వినిమయ ఖర్చు సరాసరిన నెలకు రూ.76. ఆ సమయంలో వ్యవసాయ కార్మికుల వినిమయ సూచి పాయింట్లు 360 ఉన్నాయి.దీనిని 1990 అక్టోబర్‌లో తాజా పరిచి అప్పటి వినిమయ సూచి 804 పాయింట్ల దగ్గర నెలకు రూ. 170గా కమిటీ తేల్చింది (360 నుండి 804పాయింట్లు 223.33 శాతానికి పెరిగాయి కాబట్టి రూ. 76 లను కూడా 223.33 శాతానికి పెంచి రూ.170 చేసింది.ఒక్కో పాయిం ట్‌ ప్రాతినిధ్యం వహించే రూపాయలలో ఉండే ధరల పెరుగుదలను లెక్కలోకి తీసుకోలేదు. ఇప్పటికీ ఇదే పద్ధతి కొనసాగుతోంది).కుటుంబానికి ముగ్గురు గా లెక్కించి కుటుంబం మొత్తానికి నెలకు రూ.510, సంవత్సరానికి రూ.6120గా లెక్కేసింది. సర్వే ప్రకారం కుటుంబంలో 1.89 మంది పనిలో ఉన్నారని చెప్పి రూ.6120లను1.89 మందికి పంచి రూ.3238.09గా చేసింది. కాని సంవత్స రంలో 159 రోజులే పనులు దొరుకుతున్నందున ఆ వచ్చిన మొత్తాన్ని 159తో భాగించి రోజుకు రూ.20.37 లుగా తేల్చింది. దీన్ని రౌండ్‌ ఫిగర్‌గా మార్చిన తరువాత వచ్చిన రూ.20లను, 1996లో అప్పటి వినిమయ సూచి ప్రకారం రూ.35 చేశారు. ప్రతి రెండు సంవత్సరాలకీ దీన్ని మార్చుతూ 2017లో రోజుకు రూ.176గాప్రకటించారు. 2017లో ఇదే సమయంలో వ్యవసాయ కార్మికుల (క్యాజువల్‌ లేబర్‌) కనీస వేతనం లేబర్‌ కమిషనర్‌ నిర్ణయం ప్రకారం రూ.244.25 పైసలు ఉంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర లేబర్‌ కమిషనర్‌ జారీ చేసే జీవో లలో వ్యవసాయేతర పనులకు ఇండెక్స్‌లో ప్రతి పాయింట్‌కు ఎక్కువ ఎంప్లారుమెంట్లలో రూ.6.55 పైసలు విడిఎ వస్తోంది. కాని గ్రామీణ కార్మికుల వేతనాల కోసం నియమించిన కమిటీ పెరిగిన పాయింట్లను మాత్రమే పరిగణన లోకి తీసుకొని పాయింట్లలో పెరిగిన శాతాన్ని బట్టి మాత్రమే రోజు వేతనాన్ని పెంచటాన్ని సిఫార్సు చేసింది. దీని వలన జాతీయ కనీస వేతనంలో ఎటువంటి ఎదుగుదల లేకుండా గొర్రె తోక లాగ ఉండిపోయింది. ఈవేతనం ఇప్పుడు మోడీ ప్రభుత్వానికి ఆచరణయోగ్యంగా కనపడిరది. 2017లో జాతీయ కనీస వేతనంపై వేసిన కమిటీ చేసిన సిఫార్సు రోజుకు రూ.375లను కూడా కాదనిరూ.176 లనే ఖరారు చేసింది. పైగా దీనికి ఇప్పుడు చట్టబద్దత తెచ్చింది.
తాజాగా కార్మిక సంఘాలు నెలకు రూ.26, 000 కనీస వేతనాన్ని డిమాండ్‌ చేస్తున్న పరిస్థి తులలో…మోడీ ప్రభుత్వం మోసపూరితంగా… జాతీయ కనీస వేతనం మరియు లేబర్‌ కమిషనర్లు నిర్ణయించే కనీస వేతనం పైన కూడా సిఫార్సు చెయ్యమని ఎస్‌.పిముఖర్జీ అధ్యక్షతన కమిటీ వేసింది. పార్లమెంట్‌లో పాస్‌ అయిన వేతనాల కోడ్‌ ప్రకారం కనీస వేతన నిర్ణయం కోసం కనీస వేతనాల సలహా బోర్డుల సలహాలు తీసుకోవాలి. అంతిమంగా సదరు ప్రభుత్వాలు కనీస వేతనాన్ని ఖరారు చేయడానికి… కేంద్ర ప్రభుత్వం ప్రతి పాదించిన వేతనాల కోడ్‌ నిబంధనల ప్రకారం… 15వ భారత కార్మిక మహాసభ సిఫార్సులను, సుప్రీంకోర్టు తీర్పులను ప్రాతిపదికగా తీసుకోవాలి. కాని తాను పాస్‌ చేసిన ఈ చట్టానికి వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కార్మిక వ్యతిరేక మోడీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలు, కార్మికులు పోరాడి నెలకు రూ.26,000 కనీస వేతనంగా సాధించుకోవాలి. పేదరికంలో ఉన్న కార్మికులను పేదరికంలోనే ఉంచేలా రోజు వేతనాన్నిరూ.176గానిర్ణయించటాన్ని తిప్పికొట్టాలి.
వ్యాసకర్త : సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు- (పి.అజయ కుమార్‌)

చిన్న జిల్లాలు సామాజిక పరివర్తన సాధనాలు

‘‘స్మాల్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’’ అని ఎప్పుడో అన్నాడు సుప్రసిద్ధ ఆంగ్ల కవి ఇయఫ్‌.స్కుమాచెర్‌. అఅనుభూతి ఆచరణలోకి వచ్చింది తెలంగాణాలో అదీ దశరా పర్వదినాన. ఇరవైనొక్క కొత్త జిల్లాల ఆవిర్భావంతో వాడవాడలా,పల్లె పల్లెన,పట్టణాల్లో వెల్లివిరిసిన ఆనందోత్సవాలు చూసి తరించాల్సిందే తప్ప వర్ణశక్యం కాదు.అదిలాబాద్‌, మెదక్‌ వంటి పెద్ద జిల్లాల్లో-వైశాల్యం దృష్ట్యా-జిల్లా అధికారిగా పనిచేసిన అనుభవంతో ఈపరిణామాన్ని ఆహ్వా నించే వాళ్ళలో నేనొకడిని. మారుమూల ప్రాం తాలైన బెజ్జూరు,దహెగాం,తిర్యాణి మండలాల నుండి జిల్లాకేంద్రమైన అదిలాబాద్‌ చేరుకోవా లన్నా, అలాగే జగదేవ్‌పూర్‌,దుబ్బాక నుండి సంగా రెడ్డి (మెదక్‌ జిల్లా కేంద్రం) రావాలన్నా సామాన్య ప్రజానీకం పడే బాధలు అనుభవిస్తే తప్ప అర్థం కావు. అవి అలివి కాని ఇక్కట్లు. అందుకే అనుకుం టాను నానివాసం (క్యాంపు ఆఫీసు) ముందు ప్రొద్దు న్నే ధరఖాస్తుదార్లు వేచివుండడం చూసి మనసు కరిగి పోయేది. అంతకు క్రితం రోజంతా బస్సులో ప్రయాణించి, దూరా భారాలు ఓర్చి,రాత్రికి కలెక్టరేటు ఆరు బయట ప్రదేశంలో తలదాచు కుని ప్రొద్దున్నే జిల్లాఅధికార్ల సందర్శనార్థం ఎదురుచూసే ఈ అభాగ్య జీవులకష్టాలు ఎపుడు గట్టెక్కుతాయా అని ఆక్రోశించేవాణ్ణి. అయినాపని పూర్తవుతుందన్న నమ్మకం లేదు. పదిగంటలు దాటిందంటే దౌరా (టూరు)కు పోవటమో, మీటింగుల్లో మునిగి పోవ టమో జరిగితే, అధికార్లు అందుబాటులో లేకపోతే, మరొకరోజు జిల్లాహెడ్‌ క్వార్టరులోఉండాల్సి వచ్చే ది. అదృష్టవశాత్తు పెద్దగా రద్దీలేని సంగారెడ్డి, అదిలాబాద్‌ లాంటి పట్టణాల్లో, ఆఫీసుల ఆవరణ లోనే మకాం. వీళ్ల కోసం దేవాలయ ప్రాంగణాల్లో వున్నట్లు సత్రాలు ఏర్పటు చేస్తే బాగుం టుదేమో అన్న ఆలోచన కూడా మెదిలేది. ప్రత్యామ్నా యంగా సాంఘిక సంక్షేమ హాస్టళ్ళు, రెసిడెన్షియల్‌ స్కూళ్ళ ఆవరణలో వాళ్ళకు ఆశ్రయం కల్పించేవిధంగా చర్యలు తీసుకోవడం జరిగేది. ఇప్పుడు ఆబాధలు తప్పినట్లే.
చిన్న జిల్లాల ఏర్పాటుతో తెలంగాణా ప్రభుత్వం ప్రజానీకానికి ఎంతో వెసులుబాటు కల్పిం చింది. దూరాలు దగ్గరయ్యాయి కదా అని అలస త్వంతో జిల్లా అధికార్లు ప్రజానీకానికి అందుబాటు లో లేకపోయినా,వారి ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేసినా,హెడ్‌ క్వార్టర్‌ లో మకాం లేకపోయి నా,చిన్నజిల్లాలకు,పెద్దజిల్లాలకు అట్టే తేడా వుండ దు. సగటు మనిషి ఆశలు ఆడియాసలు కాకుండా చూసుకోవడం అధికార్ల బాధ్యత.
జాతీయ సగటుకు మూడు రెట్లు విస్తీర్ణం
జాతీయ స్థాయిలో జిల్లాల సగటు విస్తీర్ణం4000 చదరపుకిలోమీటర్లు వుంటే తెలంగాణలో 11,000 చ.కి.మీ.వుండేది గతంలో.జనాభా రీత్యా చూసినా, జాతీయ సగటుకు రెట్టింపు జనసాంద్రత వుండేది. తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణంలో నలభైశాతం వున్న పంజాబు,హర్యానా,రాష్ట్రాల్లో నలభై, యాభై జిల్లాలు ఉండడం ఈదిశగా గమనార్హం.చిన్నజిల్లాల సంఖ్యా పరంగా చూస్తే, జాతీయ స్థాయిలో తెలంగాణాది 9వ స్థానం.జనాభా రీత్యా,12వ స్థానంలో వుంది. ఈ లెక్కన చూస్తే, 31జిల్లాల తెలంగాణ రాష్ట్రం సముచితమే అనిపిస్తుంది. పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా కూడా. ఎన్ని జిల్లాలు వుండాలి? ఆ జిల్లా ప్రధాన కార్యాలయాలు ఎక్కడ పెట్టాలి? రెవెన్యూ డివిజన్లు, మండలాలుఎన్ని?అన్న విశ్లేషణ ఎడ తెగని తర్కం.అదినిరంతర ప్రక్రియ.విధాన నిర్ణ యాల్ని పాలకులవిజ్ఞతకు వదిలేసి,అధికార్లు, ఉద్యోగులు జిల్లాల పునర్విభజానంతరం ఉద్యమ స్ఫూర్తితో,ఈ మార్పులు చేర్పులు ప్రజోపయోగం కోసమే కానీతమకోసం కాదన్న వాస్తవాన్ని గ్రహించి, చిన్న జిల్లాల ఏర్పాటు ఉద్దేశ్యం నెరవేరేలాగున పని చేయటం తక్షణ కర్తవ్యం.
బూజుపట్టిన బ్రిటిష్‌ కాలంనాటి వ్యవస్థ
ప్రస్తుతం మనదేశంలో వేళ్ళూనుకున్న పాలనా వ్యవస్థ బ్రిటీషు వారి కాలంలో రూపొందింది. ఒకవిధంగా చెప్పాలంటే శిస్తువసూలు వ్యవస్థ అది .దానికి కాల దోషం పట్టటం సహజం. 1984లో మొదలైన గ్రామ పరిపాలనా, మండలీకరణ వంటి విప్లవాత్మక నిర్ణయాలు నేటికి చిన్నజిల్లాల ఏర్పాటు తో రూపాంతరం చెందటం ఆహ్వానించదగ్గ పరిణా మం.ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పునర్వ వ్యస్థీకరణ పాలన. గ్రామాలు పాలనా వ్యవస్థ ఆయు వుపట్టులు. పునాది రాళ్ళ. గ్రామపాలన ప్రాచీన కాలం నుండి గ్రామాధికారులు చూస్తుండేవారు. వంశపారంపర్య గ్రామాధి కార్ల వ్యవస్థ రద్దై ముప్పై ఏళ్ళుదాటినా,పటిష్టమైన, ప్రత్యా మ్నాయ గ్రామపా లనాయంత్రాంగం లేదు. ఉదా హరణకు మాలీ పటేళ్ళ వ్యవస్థ. మద్రాసు ప్రెసిడెన్సీ పాలనకు భిన్నంగా,తెలంగాణా ప్రాంతంలో పోలీస్‌ పటేల్‌ (గ్రామమునసబ్‌),పట్వారీ(గ్రామకరణం), మాలీ పటేల్‌ గ్రామాధికార్లుగా వుండేవారు. మాలీ పటేళ్ళ అజమాయిషీలో గ్రామీణ సాగు నీటి వనరులుగ్రా మస్థులు సమష్టి కృషితో నిర్వహింపబడేవి.
సుపరిపాలన దృష్ట్యా వ్యవస్థలో మార్పులు
సుపరిపాలన దృష్ట్యా, ఇప్పటివరకు కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు, మండల వ్యవస్థలో మార్పులు చోటుచేసుకున్నాయి,కానీ గ్రామాల పునర్వ వ్యవస్థీకరణ అలాగే వుండిపోయింది. ఇప్పటికీ ఎంతో పెద్ద రెవెన్యూ గ్రామాలు, వాటికి అనుబం ధంగా మజరాలు (హమ్లెట్లు) డిపాపులేటెడ్‌ మరి యు ఫారెస్టు గ్రామాల శివార్లు అలాగే వుండిపో యాయి. భూకమతాల సంఖ్య, విస్తీర్ణం దృష్ట్యా, పట్టేదార్ల వారిగా చిన్న చిన్న రెవెన్యూ గ్రామాలుగా విడగొడితే పాలనా సౌలభ్యం, పర్యవేక్షణ పటిష్టం కావటానికి వీలుపడుతుంది. గ్రామస్థాయిలో సర్వే సిబ్బంది నియామకం తెలంగాణా జిల్లాలో తక్షణా వసరం. మరీ ముఖ్యంగా రెవెన్యూ, ఫారెస్టు తగా దాల దృష్ట్యా. మజల్ని ప్రత్యేక రెవెన్యూ గ్రామాలుగా నోటిఫై చేయాల్సిన అవసరం పరిశీలనా యోగ్యం, సమాంతరంగా (పంచాయితీలవిభజన కూడా సబబుగా వుంటుంది. మేజర్‌,మైనర్‌,నోటిఫైడ్‌ అన్న బేధంలేకుండా,పరిపాలనకు అనువుగాచిన్న పంచా యితీల్ని ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసి, వాటికి మిగులు నిధులు,విధులు,తగినంత మంది సిబ్బం దిని సమకూరుస్తే సమగ్ర గ్రామీణాభివృద్ధి చేకూరు తుంది. జనాభా సాంధ్రత, పంచాయితీ విస్తీర్ణం ప్రామాణీకలుగా,చిన్న చిన్న పరిపాలనా సౌలభ్య యూనిట్లు ఈ దిశలో ఎంతో అవసరం. షెడ్యూలు కులాలు,తెగలు అవాసముంటున్న పల్లెల్ని, తండా ల్ని ప్రత్యేక గ్రామపంచాయితీలుగా ప్రకటిస్తే, పంక్తి లో చివరి వ్యక్తి వరకూ అభివృద్ధి ఫలాలు చేరాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరినట్లే. ఇప్పటికే ఈదిశలో తెలంగాణా ప్రభుత్వం చొరవతీసికోవటం ఆహ్వా నించదగ్గ పరిణామం.
అట్టడుగు ప్రజల అభివృద్ధికి వీలు
చిన్న జిల్లాలు సామాజిక పరివర్తనకు సాధనాలు కావాలి. గతంలో తెలంగాణా ప్రాంతంలో నెల కొన్న అనిశ్చిత,సాంఘిక,ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, చిన్న జిల్లాలు బడుగు, బలహీన వర్గాల ప్రయో జనాలు కాపాడటంలో అట్టడుగు ప్రజల బాగోగుల పట్ల శ్రద్ద వహించటానికి వీలవుతుంది కూడా. తనను కాపాడే ప్రభుత్వ యంత్రాంగం తన చెంతనే వుందన్న భరోసా సామాన్యుడికి ఎంతో ఊరట నిస్తుంది.అదే వరవడిని జిల్లాలో కొనసాగిస్తే మం చిది. అలాగే జిల్లా అధికార్లందరూ కేంద్ర కార్యాల యాల్లో వుండే పని చేయాల్సిన అగత్యమూ లేదు. వారి పర్యవేక్షణ, నిపుణత ఏఏమండలాల్లో కావల్సి వస్తుందో, ఆ సామీప్యంలోనే వారి హెడ్‌క్వార్టర్‌ వుంటే మంచిది. ప్రయాస, దుబారా ఖర్చులు వుం డవు. అవసరమైతే రెండు మూడు జిల్లాలకు కలిపి ఒకే అధికారిని నియమించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తే బాగు. క్షేత్రస్థాయి అనుభవం బట్టి, నేను జిల్లా అధికారిగావున్న రోజుల్లో కొన్ని శాఖల జిల్లా అధికార్ల ముఖాలు కూడా చూసివుండను. ఉదాహ రణకు, కమర్షియల్‌ ట్యాక్స్‌,రిజిస్ట్రేషన్‌, మైనింగ్‌, జియాలజి,దేవాదాయశాఖ,నీటివనరులశాఖ ప్రత్యేక డివిజన్ల అధికార్ల వునికే జనానికి ఎరుకే వుండదు.
మెరికల్లాంటి గ్రూప్‌1,2 అధికారులు
సిబ్బంది కొరత,నిపుణత లోపించటం వంటి పలు కులు పాలనావ్యవస్థలోపరిపాటి.ఎప్పుడూ వుండేదే. అవసరం వున్న శాఖల్లో సిబ్బంది కరువు. అవగా హన లేని సంస్థల్లో పనిలేక యాతన పడేవాళ్ళు ఎందరో.మరీ ముఖ్యంగా జిల్లా, డివిజన్ల స్థాయిల్లో, పబ్లిక్‌ సర్వీసు కమీషన్‌ద్వారానియామకమైన సిబ్బం ది, అధికార్లు మెరికల్లాంటివారు. అఖిల భారతీయ సర్వీసు అధికార్లకు ఏమాత్రం తీసిపోరు కొన్ని సంద ర్భాల్లో.మరీ ముఖ్యంగా గ్రూప్‌-1,2సర్వీసు అధి కార్లు. రిక్రూట్‌ అయినప్పటినుండి అదేశాఖలో మగ్గిపోవాల్సినదుస్థితి.అలాగాకుండా ఓపదేళ్ళు ఆయాశాఖల్లో పనిచేసి నిపుణతను సంతరించుకున్న తరువాత జనరల్‌ పూల్‌లోకి లాక్కొని వారి సేవలు అన్ని శాఖలకు విస్తరింపచేస్తే మంచిది. ఆ క్రమంలోనే స్టేట్‌ ఆడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసుకు చెందిన వారిగా పరిగణించి (గతంలో హైద్రాబాద్‌ సివిల్‌ సర్వీసు, ఆంధ్రప్రదేశ్‌ ఆడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసు ల్లాగా), వాళ్ళ నుండే ఐ.ఎ.ఎస్‌, ఐ.పి.ఎస్‌ వంటి అఖిల భారతీయ సర్వీసులోకి ఎంపిక జరిగేలా చూడాలి. దీంతో ఒక సర్వీసు గొప్పది. మరొక సర్వీసు చిన్నది అన్న భావన తాజాగా పోతుంది.
పాలనా పద్ధతులు మారాలి
చిన్న జిల్లాల ఏర్పాటుతో పాటు పాలనా పరమైన పద్ధతులు, సంప్రదాయాలు, మ్యాన్యువల్స్‌ మార్చా ల్సిన అవసరం ప్రభుత్వం ఈపాటికే గుర్తించి వుం టుంది. ఏప్రతిపాదనలు వచ్చినా,ఏదరఖాస్తు వచ్చినా రొటీన్‌ గా ‘తగుచర్య నిమిత్తం’, పరిశీల నార్థం (ప్లీజ్‌ ఎగ్జామిన్‌) అని అంటూ విలువైన సమయాన్ని,శక్తి యుక్తుల్ని వృధా చేయరాదు. అలాగే కిందిస్థాయి నుండి నివేదికలు కోరటం కూడా తప్పే. ఉదాహరణకు ఏదరఖాస్తు దారుడైనా క్రింది స్థాయిలో పని కావటం లేదని ఫిర్యాదు చేస్తే, నా పైనా,నాపని తీరు పట్లపై అధికార్లకు కంప్లైంట్‌ చేస్తావా అని కక్షకట్టిన సందర్భాలు ఎవరివల్ల తన పని కావటం లేదో,అదే అధికారికి ఆపిర్యాదును తగు చర్య నిమిత్తం పంపటమో, నివేదిక కోరటం లో ఔన్నత్యం లేదు. ఇలాంటి సందర్భాల్లో దరఖాస్తు దారు సంబంధిత అధికార్లను సంప్ర దించినపుడు, ‘‘నన్ను కాదని పై అధికార్ల దగ్గరికి పోయావు కదా! అక్కడే నీ పని చేయించుకోపో’’ అంటూ వ్యంగంగా వ్యవహరించటం కూడా కద్దు. ఈఅడ్మినిస్ట్రేటివ్‌ పద్ధతులు అవమానీయం.ఆక్షేపణీయం.
విప్లవాత్మక సంస్థాగత మార్పులు అవసరం
తెలంగాణాలో పట్టణాల సంఖ్య అతి తక్కువ అని మనకు తెలిసిందే. ఇప్పటికే నలభై శాతం జనాభా పట్టణాల్లో నగరాల్లో నివాసమున్నట్లుగా గణాం కాలు సూచిస్తున్నాయి. రాబోయే పది సంవత్సరాల్లో జనసాంధ్రత యాభైశాతానికి మించిపోయే అంచ నాలు. ఉదాహరణకు 38ఏళ్ళ క్రితం(1978)లో ఏర్పాటైన కొత్త జిల్లా రంగారెడ్డి జిల్లా. హైదరాబాద్‌ మహానగరం చుట్టూ వలయంగా, నాడు 6లక్షల జనాభాతో,6అసెంబ్లీ నియోజక వర్గాలతో ప్రారం భమైన జిల్లానేడు 14అసెంబ్లీ నియోజక వర్గాలతో 52లక్షలజనాభాతో మరో మహనగరానికి తెరలే పింది. అలాగే ఇప్పుడు ఏర్పాటైన కొత్త మండల, డివిజన్‌,జిల్లాకేంద్రాలురాబోయే రోజుల్లో పట్టణా కృతుల్ని సంతరించుకునే అవకాశం వుంది.
ఈ గ్రోత్‌ సెంటర్ల క్రమబద్దీకరణకు ఇప్పటి నుండే పునాదులు వెయ్యాలి. ప్రణాళికలు తయారు చేసు కోవాలి. ఈ దిశలో టౌన్‌ మరియు కంట్రీ ప్లానింగు శాఖను అన్ని గ్రామ,మండల,జిల్లా కేంద్రాల పరిధి లో విస్తరించాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఈశాఖ రియల్‌ ఎస్టేటు, డెవల పర్లకే కాకుండ, సామాన్యప్రజానీకానికి ఉపయోగ పడేలా రూపాం తరం చెందాలి. ఈశాఖ ఆధ్వ ర్యంలో ప్రణాళిక బద్దమైన నమూనాలకు లోబడి, గ్రామ, మునిసిపల్‌, పట్టణాభివృద్ధి సంస్థలు మాస్టర్‌ ప్లాన్లు సవరించు కోవవాలి. గతంలో ఈ నమూ నాలు కాగితాలకే పరిమితం కావటం కద్దు. ఈది శలో విప్లవాత్మ కమైన సంస్థాగత మార్పులు అవ సరం. లేదంటే భవిష్యత్తులో వగచాల్సి వస్తుంది. ఇపుడు జంటనగ రాలు ఎదుర్కొంటున్న రుగ్మతులు అధిగమించాల్సిన అవసరం పట్టణీకరణ దిశలో ఎంతైనా వుంది.
తెలంగాణ జిల్లాలు పసికూనలు
రెండున్నర ఏళ్ళు కూడా నిండని పసికూనలు తెలం గాణా కొత్త జిల్లాలు. ముప్పై ఒక్క చేతులతో (జిల్లాల సంఖ్యాపరంగా) పొదివి పట్టుకొని, ఉద్యమ స్ఫూర్తి తో సాధించుకున్న రాష్ట్రాన్ని, సవరించుకుని సాదు కోవాల్సిన తరుణమిది అంటూ ప్రభుత్వాది నేత పలు సందర్భాల్లో గుర్తు చేయటం గమనార్హం. ఇటీవలే సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌ (సెస్‌) వెల్లడిరచిన మానవ వనరుల అభివృద్ధి సూచికలు (హెచ్‌.డి.ఐ)గుర్తించి రాష్ట్రప్రభుత్వ పని తీరును మెరుగు పర్చాల్సి వుంటుంది. గతంలో వున్న పదిజిల్లాలో,ఏడు జిల్లాలు పారిశ్ర మీకరణలో శరవేగంగా ముందుకు దూసుకుపోతు న్నాయి. వ్యవసాయపరంగా మూడుజిల్లాలు ముందుడగులో వున్నాయి. అక్షరాస్యత,అరోగ్య పోషణాపరంగా ఇంకా సాధించాల్సింది ఎంతైనా వుంది.
ఐటీ చిరునామా రంగారెడ్డి జిల్లా
విభజించిన జిల్లాలపరంగా చూస్తే, ఐ.టి.రంగా నికి రంగారెడ్డి జిల్లా చిరునామా. పారిశ్రామికంగా మేడ్చెల్‌, సంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాలకు పెద్దపీట వేయాల్సి వుంటుంది. విత్తన క్షేత్రంగా కరీంనగర్‌, సాగునీటిపరంగా ఖమ్మం నేతన్నల జిల్లాగా సిరి సిల్ల,అడవుల జిల్లాగా అదిలాబాద్‌,సాంస్కృతిక వార సత్వ జిల్లాలుగా వరంగల్‌,యాదాద్రి,భద్రాద్రి, జగి త్యాల జిల్లాలు మచ్చుకుకొన్ని. సాంస్కృతిక వారసత్వ పరంగా కూడా తెలంగాణాకు ప్రత్యేకం కృష్ణా, గోదావరి లాంటి పవిత్ర నదీమ తల్లుల నట్టనడుమ మైదాన ప్రాంతంగా ఆవరించిన గడ్డ, పాలపిట్ట, తంగేడు చెట్టు జింక ప్రభుత్వ చిహ్నలు ఈ ప్రాంతపు ఆచార, వ్యవహారాలకు ప్రతిబింబం. బతుకునే దేవతగా చేసి పూజించే పుణ్య భూమి. అదే బతు కమ్మ వేడుక.తెలంగాణాకే ప్రత్యేక ఆకర్షణ.
రచయిత: – డా.దాసరి శ్రీనివాసులు ఐ.ఎ.యస్‌., సంచారి ఉద్యమ కార్యకర్త.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌-26 కొత్త జిల్లాలు

పాలన వికేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యమని, కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్‌ చేపట్టిన జిల్లాల విభజనలో హేతుబద్ధతలేదు. ప్రజాభిప్రాయం మేరకు జిల్లాల విభజన చేయాలి. భౌగోళిక, ప్రాంతీయ సమతూకం పాటించకుండా కేవలం రాజకీయ ప్రయోజ నాలు,స్వార్థంతో విభజన చేపట్టడం సబబు కాదు.రాజకీయ స్వార్థంతో కాకుండా ప్రజల అవసరాల ఆధారంగా జిల్లాల విభజన జరగాల్సిన అవశ్యకత ఉంది.
జిల్లాల విభజనలో హేతుబద్ధత కరువు ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక చిత్ర పటం మరొకసారి మారి పోతోంది. 2014 రాష్ట్ర విభజన తర్వాత మిగిలిన పదమూడు జిల్లాలను 26 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి క్యాబినెట్‌ ఆమోదించిన వెంటనే దీని పనులు శరవేగంగా సాగుతు న్నాయి. నూతన జిల్లా కేంద్రాలయాల్లో ఆఫీసులు,స్థలాలు,ఉద్యోగుల విభజన వంటి పనులు జరుగుతున్నాయి. ఉగాదినాటికి కొత్త జిల్లాలో పాలన కొనసాగాలని ప్రభుత్వం భావి స్తోంది. జిల్లా కార్యాలయాలు ప్రజల సమీ పానికి వస్తాయనేది చిన్న జిల్లాల ఏర్పాటును సమర్థించుకుంటూ ప్రచారమవు తున్న సిద్ధాం తం. దీనివల్ల పాలనాపరమయిన ప్రయోజనాలు చాలా ఉన్నాయని అంగీకరిస్తూనే ఈ ఆశయం నెరవేరే పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో కొత్త జిల్లాలు తీసుకువచ్చిన పరిపాలనలో గుణా త్మక మార్పేమి లేకపోవ డాన్ని చాలా మంది ఉదహరిస్తున్నారు. ఇప్పు డున్న జిల్లాల సరిహ ద్దులు చెరిపేసి ప్రజలకు అనుకూల మయిన కొత్త సరిహద్దులను సృష్టించడం వల్ల పాలన మెరుగుపడుతుందని, ఆయా ప్రాంతాల అభి వృద్ది సుగమం అవు తుందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో పేర్కొన్నారు. ఇది కేవలం భ్రమ అని,రాజకీయలబ్ది కోసమే జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు కొన్ని జిల్లాల ఏర్పాటును చూస్తే అర్థమవుతుందని చాలా మేధావులు, రాజకీయ నాయకులు చెప్పారు.
ప్రజల ముంగిట పాలన
కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడాన్ని పాలనా వికేంద్రీకరణగా,ప్రజల ముంగిటికి పాలన తీసుకెళ్లడంగా,పాలనా సంస్కరణగా ప్రభు త్వాలు పిలుస్తున్నాయి. ప్రజల ముంగిటికి పాలన అనేమాట 1986లో మొదట వినిపిం చింది. అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సరిగ్గా ఈ నినాదంతోనే ఒక శతా బ్దానికిపైగా చరిత్ర ఉన్న విశాల తాలూకాలను విడదీసి మండళ్లను ఏర్పాటు చేశారు. తాహ శీల్దార్‌ పదవికి ఉన్న హోదాను,హంగును తీసే శారు.‘పవర్‌ ఫుల్‌’ తాహశీల్దార్‌ని మండల రెవిన్యూ అధికారిగా మార్చి జనం మధ్యకు తీసుకువచ్చారు. అయితే, తర్వాత సంస్కరణలు ఆగిపోయాయి. జిల్లాను సంస్కరించే పని ఎవరూ చేయలేదు. ఇప్పుడు,ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ విభజన తర్వాత,ఎప్పుడో బ్రిటిష్‌ కాలం లో ఏర్పాటు చేసిన జిల్లాల సరిహద్దులను చెరి పేసి చిన్న జిల్లాలను సృష్టించి కలెక్టర్‌ పదవిని కూడా జనం మధ్యకు తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది.ఇది సుపరిపాలనకు దారితీ స్తుందా? లేక పాలనా వ్యవస్థని ఇంకా బలహీ నం చేసి ముఖ్యమంత్రులను ఇంకా శక్తివం తులను చేస్తుందా అనేది ప్రశ్న.కలెక్టర్‌,ఎస్పీల గ్లామర్‌ తగ్గుతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో 26 జిల్లా లను సృష్టించడంతో జిల్లా కలెక్టర్‌ అధికార విస్తృతి,దర్పం తగ్గిపోతాయి. కలెక్టర్లు ఇపుడు డివిజన్‌ హెడ్‌ క్వార్టర్‌ కంటే చిన్న ఊర్లలో కూర్చోవలసి వస్తుంది. ఇదే పరిస్థితి జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌కి కూడా ఎదురవు తుంది. ఉదాహరణకు కడప జిల్లాను విడదీసి రాయచోటి జిల్లాను సృష్టించారు. ఇది డివిజినల్‌ హెడ్‌ క్వార్టర్‌ కూడా కాదు. ఇప్పుడు ఈఊరి లో కలెక్టర్‌ ఆఫీస్‌ వస్తుంది. ఎప్పుడో గాని కన్పించని కలెక్టర్‌ని,జిల్లా ఎస్‌పీని ఈఊరి ప్రజ లు రోజూ చూస్తారు. వారితో పాటు జాయింట్‌ కలెక్టర్‌, ఎందరో జిల్లా అధికారులు, పోలీసు అధికారులు ఆ చిన్న ఊర్లో రోజూ తారసప డతారు. ఇలా కొత్త జిల్లాలు ఒక వినూత్న పాలనానుభవాన్ని తీసుకువస్తున్నాయి. ‘సాధార ణంగా ప్రజల్లో ‘అబ్బో కలెక్టర్‌ ఆఫీస్‌ చాలా దూరం, కలెక్టర్‌ని కలుసుకోవడం చాలా కష్టం,’ అనే భయభావం ఉంటుంది. దీని వల్లే సాధా రణ ప్రజలకు ఈ ఆఫీసుల్లోకి వెళ్లేందుకు ఒక మధ్యవర్తి జోక్యంగాని,రాజకీయ నాయకుడి సాయంగాని అవసరమయింది,ఊరికి దూరం, ఉన్నతాధికారి అంటే ఉన్న భయభావం చిన్న జిల్లాల ఏర్పాటుతో పోయే అవకాశం ఉంది’’ ‘‘అంటే చిన్న జిల్లాల ఏర్పాటు వల్ల పైరవీ కారుల అవసరం తగ్గే వీలుంది. అదే సమ యంలో చిన్న జిల్లాల అధికారులకు పెద్ద జిల్లాల నాటి హుంగు ఆర్భాటాలు తగ్గిపో తాయి. ఇది ఆశించదగ్గ పరిణామం’’ అని ఉస్మానియా విశ్వవిద్యాలయం రాజనీతి శాస్త్ర విశ్రాంత ఆచార్యుడు ప్రొఫెసర్‌ శ్రీనివాసులు అన్నారు. ఇలాగే ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన మరొక విశ్రాంత ఆర్థిక శాస్త్ర ఆచార్యుడు ప్రొఫెసర్‌ కేఎస్‌ చలం కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతించారు.‘‘1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినపుడు9జిల్లాలుండేవి.ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడ్డాక 1970 ఫిబ్రవరి 1న గుంటూరు,నెల్లూరు,కర్నూలు జిల్లాలోని కొన్ని తాలూకాలను కలిపి ప్రకాశం జిల్లా ఏర్పాటు చేశారు. ఆపైన 1979 జూన్‌ 1న విజయ నగరం జిల్లా ఏర్పడిరది. అప్పటి నుంచి ఇప్పటి దాకా జనాభా పెరుగూతూ వచ్చింది. తెలం గాణ నుంచి కొన్ని మండలాలు కలవడంతో తూర్పుగోదావరి జిల్లా విస్తీర్ణం పెరిగింది. ఈ కారణాలతో కొత్తగా చిన్న జిల్లాలను సృష్టిం చడం ఒక ఆహ్వానించదగ్గ సంస్కరణ. ముఖ్యం గా గిరిజన ప్రాంతాలకు సంబంధించి కొంత మేలు జరుగుతుంది’’‘‘ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్టణం నుంచి తూర్పుగోదావరి జిల్లా జంగారెడి గూడెందాకా 500 కి.మీ పరిధి గిరిజన ప్రాంతం ఒకే ఎంపీ కింద ఉండేది. ఈ ప్రాంతాన్ని ఇప్పుడు రెండు జిల్లాలుగా మార్చారు. జిల్లాల పరిమాణం బాగా కుంచించుకుపోతుంది. ఇదొక మంచి ప్రయోగం’’ అని ప్రొఫెసర్‌ చలం అన్నారు.
చిన్న జిల్లాల పెద్ద ఆశయం నెరువేరుతుందా?
ఆశయపరంగా చిన్న జిల్లాలను సృష్టించడం చాలా మంచి నిర్ణయం అనే విషయంలో పార్టీలతో నిమిత్తం లేకుండా అందరిలో ఏకాభిప్రాయం ఉంది. అయితే, ఈ ఆశయం ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థల్లో నెరవేరుతుందా అనే దాని మీద అందరిలో అనుమానా లున్నాయి. ప్రజలకు పరిపాలన చేరువ కావడం అంటే ఏమిటి?జిల్లా కలెక్టర్‌ కార్యాలయాన్ని 250 కి.మీ దూరం నుంచి 100కి.మీ దూరా నికి మార్చినందున పరిపాలన దగ్గరవుతుందా? పరిపాలన వికేంద్రీకరణ అంటే ఏమిటి? చిన్న జిల్లా ఏర్పాటు పాలనా వికేంద్రీకరణ అవుతుందా?ఈ ప్రశ్నలకు ఇటీవల కొత్త జిల్లాలను ఏర్పాటుచేసిన తెలంగాణలో సమా ధానం దొరకడం లేదు. రేపు ఆంధ్రలో కూడా ఇదే పరిస్థతి వస్తుంది. జిల్లాలొస్తాయి గాని, ఆశయాలు నెరవేరుతాయన్న గ్యారంటీ లేదు.1986లో తెలుగుదేశం ప్రభుత్వం ‘ప్రజల వద్దకు పాలన’అని నినాదమీయడంలో ఒక అర్థం ఉంది. ఎందుకంటే అప్పటికి స్మార్ట్‌ఫోన్లు లేవు. ఇంటర్నెట్‌ లేదు. మీ-సేవా కేంద్రాలు, ఇ-సేవా కేంద్రాలు లేవు.ఏదయినా సర్టిఫికేట్‌, రిజస్ట్రేషన్‌, దరఖాస్తు అవసరమయితే, ఎపుడొస్తుందో తెలియని ఆర్టీసీ ఎర్రబస్సును నమ్ముకుని తాలూకా కేంద్రానికి, జిల్లా కేంద్రా నికి వెళ్లాల్సి వచ్చేది. ఆర్టీసి బస్సు అంటే ‘రాదు, తెలియదు, చెప్పలేము’ అని నవ్వులాటగా ఉండే రోజులవి. అపుడు జిల్లా కార్యాలయానికి రావాలంటే చాలా కష్టమయ్యేది. ఇపుడా పరిస్థితి లేదు. ఒకవైపు ప్రభుత్వ కార్యాల యాలకు ప్రజలు రానవసరమేలేకుండా ఆన్‌లైన్‌ సేవలు వచ్చాయి. చాలా చోట్ల ప్రజలను కార్యాలయాల్లోకి రానీయడం లేదు. మీ-సేవా కేంద్రాలు వచ్చాయి. ఇ-సేవలు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచే దరఖాస్తు చేసు కోవచ్చు. అంతేకాదు, కొన్ని రకాలసేవలను ప్రజలు స్మార్ట్‌ ఫోన్‌ ఉపయోగించి పొందుతు న్నారు. వర్క్‌ ఫ్రం హోం, ఆన్‌లైన్‌ పాఠశా లలు,ఆన్‌లైన్‌ వైద్యం, జూమ్‌ మీటింగులు అందుబాటులోకి వచ్చాయి. అధార్‌ కార్యాల యానికి వెళ్లకుండా ఆధార్‌ కార్డు వస్తున్నది. ఇలాగే ఇన్‌కంటాక్స్‌ ఆఫీస్‌ ముఖం చూడకుండా పాన్‌ కార్డు వస్తూ ఉంది. ఇలాంటపుడు ప్రజలు ఇంకా ప్రభుత్వకార్యాలయాలకు రావడం ఎందుకు? కొత్త జిల్లాలు ఎందుకు? కాకపోతే, ఎప్పుడో ప్రారంభమయిన ఉపప్రాం తీయ జిల్లా డిమాండ్లు ఇప్పటికీ ఉన్నాయి. భావోద్వేగం సృష్టిస్తున్నాయి. అందువల్ల కొత్త జిల్లా ఏర్పాటు కూడా, కొత్త రాష్ట్రం ఏర్పాటు లాగా రాజకీయంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడయితే, కొత్త జిల్లా ఏర్పాటు కేంద్రంలో ‘రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌ ’ తీసుకువస్తుంది.ప్రజల భావోద్వేగాలను వాడుకునేందుకు తప్ప కొత్త జిల్లాలు అదనపు ప్రయోజనం తీసుకువచ్చే అవకాశం లేదని పలువురు రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ‘కొత్త జిల్లాల సృష్టి అవసరమే. అయితే, కొత్త జిల్లాల ఏర్పాటు వెనక ఉన్న ఉన్నతాశయం నెరవేర్చే వనరులు ప్రభుత్వం దగ్గర ఉన్నాయా?’’ అని ఆయన ప్రశ్నించారు.‘‘ఆంధ్రప్రదేశ్‌లో ముందు చూపు లేకుండా ప్రారంభించిన అనేక పథకాలు విఫలమయ్యాయి. ప్రభుత్వం మీద ఆర్థిక భారం మోపాయి. ఉదాహరణకు రైతు భరోసా కేంద్రాలు (ఆర్‌బిసి)లను తెరిచారు. మూసే శారు. ఇపుడు ఉద్యోగస్థులకు జీతాలు కూడా చెల్లించే స్థితి లేదు. వాళ్ళకి పిఆర్‌సి అమలుచేయకుండా తప్పించుకునేందుకు ప్రభుత్వం చూస్తోంది. ఇలాంటపుడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి దానికి కావలసిన భవనాలు, ఇతర వసతులు సమకూర్చుకు నేందుకు వ్యయం తడిసి మోపెడవుతుంది. ఈ నిధులెక్కడి నుంచి తెస్తారు?’’ ‘‘మొదట ప్రభుత్వం అనవసర వ్యయం తగ్గించి, రాబడి పెంచుకుని,కొత్త జిల్లాల గురించి ఆలోచిం చాల్సి ఉంది. అయితే, జగన్‌ ప్రభుత్వానికి ప్రజాసౌలభ్యం కంటే రాజకీయ సౌలభ్యం ముఖ్యం. ఏదో ఒక కొత్త నిర్ణయం ప్రకటించి, అసలు సమస్య నుంచి ప్రజల దృష్టి పక్కకు మళ్లించేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారు. కొత్త జిల్లాలందుకే తప్ప, పరిపాలనను ప్రజల ముంగిటికి తీసుకెళ్లడం కాదు’’ అని అంటు న్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు హేతుబద్ధత లేదు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనేది పాలన వికేంద్రీకరణ కోసం అని, పరిపాలనను ప్రజలకు చేరువచేయడం అనే ప్రభుత్వం ప్రకటిస్తున్నా, చాలా చోట్లా అది ఆశయాన్ని దెబ్బతీసింది. ఇలాంటపుడు కొత్త జిల్లాలు కొత్త సమస్య తీసుకువస్తాయని రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి, కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి డాక్టర్‌ ఇఎఎస్‌ శర్మ అన్నారు. ఆలోచించదగ్గ రెండు అంశాలను ఆయన పేర్కొన్నారు.1) కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం వల్ల కొన్ని గిరిజన గ్రామాలకు జిల్లా హెడ్‌ క్వార్టర్లు దూరమవు తున్నాయి. ఉదాహరణకు, విశాఖపట్నం జిల్లా గూడెం కొత్తవీధి మండలం సీలేరు నుండి అరకు కొత్త జిల్లా కేంద్రానికి రావాలంటే అక్కడి గ్రామస్థులు 5 నుండి 7 గంటలు ప్రయాణిం చవలసి ఉంది. దూరాలను తగ్గించకపోగా దాన్ని పెంచే విధంగా ఉండే పునర్వ్యవస్థీకరణ వల్ల ఉపయోగం ఉండదు. 2) కొత్త జిల్లాల కారణంగా షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో హెడ్‌ క్వార్టర్‌ లో జన సాంద్రత పెరగడం, గిరిజనేతరులు పెద్ద ఎత్తున రావడం వలన అక్కడ గిరిజన సంస్కృతికి, సంప్రదాయాలకు భంగం కలుగు తుంది. అది కాకుండా భూ బదలాయింపు నిషేధ చట్టానికి విరుద్ధంగా గిరిజనేతరులు గిరిజనుల భూములను ఆక్రమించే ప్రమాదం ఉంటుంది’’ అని ఆయన అన్నారు. ఈ విషయం మీద ముఖ్యమంత్రికి లేఖ రాస్తూ, గిరిజన గ్రామాలకు రాజ్యాంగం నుంచి సంక్రమించిన అధికారాలివ్వకుండా కొత్త జిల్లాలను సృష్టించి వికేంద్రీకరణ ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నిం చారు. ‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, 1986లో షెడ్యూల్డ్‌ ప్రాంతాలకు ఆనుకుని, గిరిజనులు అధికంగా నివసిస్తున్న 800కు పైగా గ్రామాలను షెడ్యూల్డ్‌ ఏరియాలో కలపాలనే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపిం చింది. కేంద్రం ఆ ప్రతిపాదనకు సూత్రప్రా యంగా అనుమతి తెలిపింది. ‘‘మండలాల వారీగా ఆ గ్రామాల లిస్టులను పంపించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత, ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటివి 500కు పైగా గ్రామాలు ఉన్నాయి. ఏళ్ల తరబడి తెలుగు రాష్ట్రాలు రెండు ఆ విష యంలో కేంద్రానికి ఇంతవరకు జవాబు ఇవ్వ కుండా ఆలస్యం చేస్తూవస్తున్నాయి. దీని వలన గిరిజనులకు అపారమైన నష్టం కలిగింది. ఈ గ్రామాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసి ఉండవలసింది’’ అని ఆయన లేఖలో పేర్కొన్నారు. ప్రొఫెసర్‌ కేఎస్‌ చలం కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. 50శాతం గిరిజన జనాభా ఉన్న మండలాలను షెడ్యూల్‌ 5లో చేర్చాలి. ‘‘ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లాలో సరవకోట, పాతపట్నం, మెళియపుట్టి మండలాలు ఈ కోవలోకి వస్తాయి. వీటిని గిరిజన జిల్లాలో చేర్చాలి లేదా జిల్లాగా ఏర్పాటు చేయాలి. ఇలాగే,73వ, 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం 29 అధికారాలను పంచాయతీలకు బదలాయించాలి. ఇదింత వరకు జరగలేదు. పాలన వికేంద్రీకరణ నిజం కావాలంటే అధికారాల వికేంద్రీకరణ జరిగి తీరాలి. అపుడే కొత్త జిల్లాల ఏర్పాటు ఆశయం నెరవేరుతుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. -జి.ఎన్‌.వి.సతీష్‌

భారత రాజ్యాంగం లౌకిక స్వభావం

భారతదేశం బహు మతాలకు, భిన్న సంస్కృతులకు, భాషలకు నిలయం. భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి ఉంటూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచే స్థాయిలో ఉండటం గర్వించాల్సిన విషయం. మత సామరస్యం కోసంలౌకిక రాజ్యంగా ప్రకటించడం జరిగింది. అయినా కొన్ని సందర్భాల్లో మత విశ్వా సాలకు, ఆధునిక అభివృద్ధికి, ప్రజల మనోభావాలకు మధ్య ఘర్షణ ఏర్పడుతోంది. వివిధ సందర్భాల్లో స్థానికంగా మతం రాజకీయ సమీకరణకు ప్రాతిపదిక అవుతూ వచ్చింది. ఈ పరిణా మాల నేపథ్యంలో రాజ్యాంగ లౌకిక మూలాలు, ప్రకరణలు, చట్టాలను పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఆధునిక ప్రజాస్వామ్య ప్రభుత్వాలు చాలా వరకు లౌకిక రాజ్యాలే.లౌకిక రాజ్యమంటే ప్రజలు,ప్రభుత్వానికి మధ్య సంబంధాలు,పరిపా లన..మత విశ్వాసాల ప్రాతిపదికన కాకుండా రాజ్యం, చట్టపరంగా నిర్ణయించి కొనసాగించడం. లౌకికం అంటే భౌతికప్రపంచం గురించి ఆలోచిం చడం. మనకు తెలిసిన ప్రాపంచిక విషయాలను మన అనుభవం,పరిశీలనతో వ్యాఖ్యానించడం లేదా వివరించడం. మతం మనకు తెలియని మరో లోకాన్ని గురించిఊహించి చెప్పేప్రయత్నం చేస్తుంది. లౌకికవాదం అనే పదాన్ని 19వ శతా బ్దానికి చెందిన సామాజిక శాస్త్రవేత్త జార్జి జాకబ్‌ హోలియోక్‌ మొదటి సారిగా వాడుకలోకి తెచ్చారు. ఈ పదం లాటిన్‌ భాషలోని ూవషబశ్రీబఎ (సెక్యులమ్‌) అనే పదం నుంచి ఉద్భవించింది. తరం (జనరేషన్‌)అని దీనిఅర్థం. ఆ తర్వాత వాడు కలో ప్రభుత్వాన్ని,పరిపాలనను.. మతం ముఖ్యంగా చర్చి నుంచి వేరుచేయడం..పాలనచట్టం, రాజ్యాం గం ప్రకారం కొనసాగించడం అనే భావనలు లౌకికవాదంగా ప్రాచుర్యం పొందాయి.
లౌకిక భావన, వివిధ పార్శ్వాలు
లౌకిక భావనకు రాజకీయ, సామాజిక పార్శ్వాలున్నాయి. రాజకీయ కోణంలో పరిశీలించి నప్పుడు లౌకికవాదం అనేది చారిత్రక నేపథ్యంలో రాజ్యానికి-చర్చికి జరిగిన సంఘర్షణ.పూర్వ కాలం లో ప్రజల అన్ని విషయాలను మతం,మతాచార్యు లే నిర్దేశించేవారు. రాజు కూడా వీరు చెప్పినట్లే న డుచుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కాబట్టి లౌకిక భావన అనేది రాజ్యాన్ని మత నియంత్రణ నుంచి వేరు చేసే ప్రయత్నంలో జరిగిన సంఘర్షణగా చెప్పొచ్చు.సామాజిక కోణంలో చూస్తే లౌకిక భావన అనేది ప్రజలు తమ జీవన విధానాన్ని స్వతంత్రంగా మలచుకొనే దశలో మితిమీరిన మత జోక్యాన్ని, ప్రభావాన్ని నిరసించే సామాజిక తిరుగుబాటుగా వర్ణించొచ్చు.
భారతీయ భావన భిన్నం
పైన ఉదహరించిన రెండు అంశాలు పాశ్చాత్య సమాజానికి సంబంధించిన పరిణా మాలు. అయితే భారతదేశంలో అలా లేదు. భిన్న మతాలు,విశ్వాసాలు,జాతులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి రెండు ప్రధాన ప్రాథమ్యా లుంటాయి. మొదటిది మతాన్ని రాజకీయాల నుంచి వేరు చేయడం,రెండోది భిన్నమతాల మధ్య సామర స్యాన్ని సాధించడానికి అన్ని మతాలకు సమాన గౌరవాన్ని కల్పించడం. ఈ నే పథ్యంలోనే భారత రాజ్యాంగ నిర్మాతలు లౌకికతత్వాన్ని రాజ్యాంగంలో పొందుపరిచారు. ప్రఖ్యాత భారతీయ తత్వవేత్త, భారతదేశ రెండో రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధా కృష్ణన్‌ భారతీయ లౌకిక భావనను ఈ విధంగా వర్ణించారు. ‘లౌకికవాదం అంటే మతరహిత సమాజం కాదు. మత వ్యతిరేకం కూడా కాదు. ప్రాపంచిక సుఖాలు అంతకంటే కాదు.విశ్వ వ్యాప్త మైన ఆధ్యాత్మిక విలువలను విభిన్న మార్గాల్లో అన్వేషించడమే’.
లక్షణాలు
ా ప్రభుత్వానికి అధికార మతం ఉండరాదు.
ా అన్ని మతాలకు సమాన గుర్తింపు, గౌరవం, సమాన అవకాశాలు. మత వివక్షకు తావు లేదు.
ా మత విశ్వాసాలను హేతుబద్ధతతో పాటించడం. మూఢ విశ్వాసాలను త్యజించడం.
ా న్యాయమైన, మానవీయమైన జీవన పరిస్థితులను కల్పించడం.
ా మతం పూర్తిగా వ్యక్తిగతం. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా మాత్రమే ప్రభుత్వ జోక్యం ఉండాలి.
ా రాజ్యాంగ సవరణ-లౌకిక భావన ద్విగుణీకృతం
ా లౌకికతత్వం (సెక్యులర్‌) అనే పదాన్ని మౌలిక రాజ్యాంగంలో ప్రస్తావించలేదు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో పొందుపరిచారు. ఈ పదం చేరికతో రాజ్యాంగాన్ని లౌకికతత్వం మరింత స్పష్టీకరించడంతోపాటు ద్విగుణీకృతం చేసింది. అంతేకాకుండా మౌలిక నిర్మాణంలో అంతర్భాగంగా పరిగణనలో ఉంది.
లౌకికతత్వం- రాజ్యాంగ ప్రకరణలు
రాజ్యాంగం వివిధ ప్రకరణల్లో లౌకికతత్వాన్ని స్పష్టీకరించింది. దీనికి అనుగుణంగా పార్లమెంటు.. చట్టాలను కూడా రూపొందించింది. ప్రవేశికలో లౌకికతత్వం అనే పదం చేరిక, ప్రాథమిక హక్కు లలో మత స్వేచ్ఛను గుర్తించడం, నిర్దేశిక నియమా లలో ఉమ్మడి పౌర నియమాలను ప్రస్తావించడం, ప్రాథమిక విధుల్లో పరమత సహనాన్ని ప్రతి పౌరు డు కలిగి ఉండాలని కోరడం,లౌకికతత్వానికి మచ్చు తునకలుగా చెప్పొచ్చు. వాటిని ఈ కింది విధంగా పరిశీలించొచ్చు.
ప్రవేశిక – లౌకిక భావన
భారత రాజ్యాంగ ఆత్మ, హృదయంగా పరిగణించే ప్రవేశికలో లౌకికం అని చేర్చడం, ప్రతి వ్యక్తికి ఆరాధన,విశ్వాసం,నమ్మకం అనే అం శాలలో స్వేచ్ఛను గుర్తించడం లౌకికతత్వానికి ప్రతీకగా పేర్కొనొచ్చు.రాజ్యాంగం మూడో భాగం లో మత స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా పేర్కొనడం విశేషంగా పరిగణించాలి.(వ్యాసకర్త:డెరైక్టర్‌, క్లాస్‌-వన్‌ స్టడీ సర్కిల్‌)
లౌకిక రాజ్యాంగానికి విఘాతం కల్గించవద్దూ..
ప్రస్తుత బి.జె.పి ప్రభుత్వం ఆర్‌.ఎస్‌. ఎస్‌ భావాలను అమలు చేయటమే కాక, మత విభజన ద్వారా ప్రజలలో తన రాజకీయ ప్రాబ ల్యాన్ని కొనసాగించటానికి ప్రయత్నిస్తున్నది. దీనివలన లౌకిక రాజ్యాంగ ఆశయాలు, లక్ష్యాలు దెబ్బ తింటాయి. లౌకిక రాజ్యాంగానికి విఘాతం కలుగు తుంది. దేశంలోని ప్రజలు, మేధావులు, ప్రగతిశీల శక్తులు,కార్మికులు,ఉద్యోగులు ఉపాధ్యా యులలో విస్తృతంగా ప్రచారం చేసి మతోన్మాద, మతతత్వ శక్తులను ఏకాకులను చేయాలి. భారత రాజ్యాంగం అమలు లోకి వచ్చి 72 ఏళ్లు పూర్తి చేసుకుని 73వ సంవత్సరంలో అడుగు పెడు తున్నది. రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్‌. అంబేద్కర్‌ నాయకత్వాన ముసాయిదా కమిటీ అరవైకి పైగా రాజ్యాంగాలను తులనాత్మక అధ్యయనం చేసి భారతీయ భిన్నత్వానికి, బహుళత్వానికి అనుగుణం గా రాజ్యాంగాన్ని రూపొందించింది. రాజ్యాంగ పీఠికలో రాజ్యాంగలక్ష్యాలను,ఆశయాలను పొందుపరచారు.గిరిజన ప్రాంతాలకు5,6షెడ్యూళ్ల ద్వారా ప్రత్యేక హక్కులుకల్పించారు. జమ్ము-కాశ్మీర్‌ ఆనాడు ప్రత్యేక పరిస్థితులలో ఇండియన్‌ యూని యన్‌లో చేరటంతో370వ నిబంధన ద్వారా ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చారు. తరతరాలుగా అణచి వేతకు గురైన షెడ్యూల్‌ కులాలు,షెడ్యూల్‌ తెగలు, వెనుక బడిన తరగతుల ప్రజల కోసం రాజ్యాంగం 16వ భాగంలో రిజర్వేషన్లతోపాటు కొన్ని ప్రత్యేక రక్షణలు కల్పించారు.
భారతీయ ఉమ్మడి సంస్కృతి
భారతీయ సంస్కృతి ఉమ్మడి సంస్కృతి అని రాజ్యాంగంలోని51(ఎ)నిబంధనలో పేర్కొ న్నారు.భారతదేశం భిన్నమతాలకు, సాంప్రదా యాలకు, సంస్కృతులకు, ఆచారాలకు నెలవుగా ఉన్నది. దేశంలోహిందూ మతం, ఇస్లాం, క్రైస్తవం, జైనం,బౌద్ధం,పార్సీ,సిక్కు మతాలతో కూడిన సం స్కృతీ సాంప్రదాయలు ఉమ్మడి సంస్కృతిగా రూపు దిద్దుకున్నాయి. బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులు ‘’విభ జించు-పాలించు’’సూత్రంలో భాగంగా హిందు వులు-ముస్లింల మధ్య మతతత్వ భావనలు రెచ్చ గొట్టారు. ఫలితంగానే జాతీయోద్యమ కాలంలో ముస్లిం లీగ్‌,హిందూ మహాసభ,రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్న్‌ వంటి సంస్థలు పుట్టుకొచ్చాయి. మత తత్వ ధోరణులకు కొనసాగింపుగానే1947లో దేశ విభజన జరిగింది. సమకాలీన భారతదేశంలో మతతత్వ ధోరణులను, మతోన్మాదాన్ని రెచ్చగొట్ట టానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజలను మతపరంగా చీల్చటానికి సంఘ పరివార్‌, బిజెపి అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. వీటన్నింటిని ఎదు ర్కొని భారతీయ ఉమ్మడి సంస్కృతిని రాజ్యాంగంలో చెప్పిన విధంగా పరిరక్షించుకోవాలి.
రాజ్యాంగంలో లౌకిక విధానాలు
భారత రాజ్యాంగం దేశాన్ని లౌకిక రాజ్యంగా ప్రకటించింది. ఈమేరకు పీఠికలో చేర్చారు. ప్రాథమిక హక్కులలో 25నుండి 28 వరకు గల నిబంధనలు ప్రజలకు మత స్వేచ్ఛను కల్పించాయి. ప్రతి పౌరుడు తనకు నచ్చిన మతాన్ని ‘’స్వీకరించటానికి,ఆచరించటానికి,ప్రచారం చేసు కోవటానికి’’ హక్కు కలిగి ఉన్నాడు. మతపరమైన సంస్థలను నిర్వహించుకోవటానికి, సేవా కార్యక్ర మాలు నిర్వహించటానికి రాజ్యాంగం అనుమతి ఇచ్చింది. వ్యక్తిగతమైన మత విశ్వాసాలు కలిగి ఉండవచ్చని చెప్పింది. ప్రాథమిక హక్కులలో విద్యా,సాంస్కృతికహక్కులను29,30 నిబంధనలలో పేర్కొని వాటి ద్వారా మైనారిటీలు తమ భాషను, సంస్కృతిని,విద్యను అభివృద్ధి చేసుకోవటానికి విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చని రాజ్యాంగం పేర్కొన్నది. రాజ్యాంగనిర్మాతల ప్రధానలక్ష్యం భారతదేశంలోని భిన్నమతాల ప్రజలు లౌకిక విధా నాలతో జీవిస్తూ సహజీవనం చేయాలని భావిం చారు. లౌకిక విధానాల ద్వారానే దేశ సమైక్యత, సమగ్రత కొనసాగుతుందని భావించారు.
బిజెపి మతతత్వ విధానాలు
దేశంలో హిందూత్వ విధానాలను అమ లు చేయటంతో పాటు హిందూ రాజ్యం ఏర్ప డాలని, హిందూ ఆధిక్యత కొనసాగాలని ఆర్‌.ఎస్‌. ఎస్‌ సిద్ధాంత భావజాలంలో స్పష్టంగా పేర్కొన్నది. ఈ భావజాలాన్ని అమలు చేయటానికి సంఘ పరివార్‌తో పాటు రాజకీయంగా భారతీయ జనతా పార్టీని ఆలంబనగా చేసుకున్నది.2014లో నరేంద్ర మోడీ నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం గత8ఏళ్లగా మతోన్మాదాన్ని, మత తత్వాన్ని రెచ్చగొట్టడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. బిజెపి అధికారంలోకి వచ్చాక ఆర్‌.ఎస్‌.ఎస్‌ భావ జాలంతోహిందూత్వ శక్తులు విజృంభిస్తు న్నాయి. మత విద్వేషాలను రెచ్చగొడుతూ మైనా రిటీల పైన, దళితుల పైన దాడులు చేస్తున్నారు. భారత దేశాన్ని హిందూ దేశంగా చిత్రీకరిస్తూ అఖండ భారత్‌ స్థాపన కోసం ప్రజలు ముందుకు రావాలని రెచ్చగొడుతున్నారు.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేప థ్యంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రసం గాలు చేస్తు న్నారు. ఇటీవల హరిద్వార్‌లో జరిగిన ధర్మ సంసద్‌ సమావేశాలలో హిందూత్వ శక్తులు మైనారిటీలను ఊచకోత కోయాలని ప్రసంగాలు చేశారు. ఉత్తర ప్రదేశ్‌లో నరేంద్ర మోడీ-యోగిల ద్వయం చేపడు తున్న చర్యలు మైనారిటీలలో భయానక వాతావర ణాన్ని సృష్టించేవిగా ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తర భారత దేశాలలో భారతీయ జనతా పార్టీ మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చ గొట్టటానికి, మతపరమైన చీలికలు తేవడానికి పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నది. జనవరి 26న జరగబోయే రిపబ్లిక్‌ డే పరేడ్‌లో బిజెపి అనుకూల రాష్ట్రాల శకటాలను అనుమతించి,బెంగాల్‌, తమి ళనాడు,కేరళ,తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మొద లగు రాష్ట్రాల శకటాలను అను మతించక పోవటం వివక్షతలో భాగమే. 2019లో నరేంద్ర మోడీ రెండవసారి అధికారం లోకి వచ్చినప్పటి నుండి గత మూడే ళ్లుగా చేస్తున్న నిర్ణయాల ద్వారా ప్రజల మధ్య మత పరమైన అగాధాన్ని సృష్టించటానికి ప్రయత్నం చేస్తున్నారు. జమ్ము-కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న 370వ నిబంధనను రద్దు చేయటమేకాక, కాశ్మీర్‌ రాష్ట్ర ప్రతిపత్తిని కూడా రద్దు చేయటం దీనిలో భాగమే (ఇప్పుడు కార్పొరేట్లు కాశ్మీర్‌లో భూముల కోసం ఎగబడుతున్నారు).అంతేకాకుండా పౌరసత్వ అంశాన్ని ముందుకు తెచ్చి పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) చేయడం, నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌ (ఎన్‌పిఆర్‌) మొదలగు వాటిని ప్రతిపాదించటం మతపరమైన భావాలను రెచ్చగొట్టడంలో భాగమే. పైఅంశాలన్నీ పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి.
ఎ.పిలో మతతత్వ శక్తుల కార్యకలాపాలు
ఆంధ్రప్రదేశ్‌లో కూడా మతోన్మాదాన్ని రెచ్చగొట్టటానికి మతతత్వ శక్తులు ప్రయత్నిస్తు న్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో భజన సంఘాలు,పండగలు,ఉత్సవాల పేరుతో తమ భావజాలవ్యాప్తికి ఉపయోగించుకుం టున్నా రు. ఇటీవల గుంటూరులో జిన్నా టవర్‌ పేరు మార్చాలని, కూల్చివేయాలని ప్రచారం ప్రారంభిం చారు. హిందూ ఐక్యవేదిక పేరుతో ప్రదర్శనకు పిలుపు ఇచ్చారు. విశాఖపట్నంలో కింగ్‌ జార్జ్‌ హాస్పిటల్‌ పేరు మార్చాలని పిలుపు ఇచ్చారు. ఆత్మకూరులో మసీదు అంశాన్ని బిజెపి నాయకులు వివాదంగా మార్చి ఘర్షణకు దిగారు. కడప జిల్లా లో టిప్పు సుల్తాన్‌ విగ్రహ ప్రతిష్టాపనకు వ్యతిరే కంగా క్యాంపెయిన్‌ చేశారు. శ్రీశైలంలో దుకా ణాలు పెట్టుకున్న ముస్లింలపై దాడులు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు బిజెపి ప్రభుత్వం అన్యా యం చేసింది. ప్రత్యేక హోదా ఇవ్వలేదు. విభజన చట్ట హామీలు అమలు జరపలేదు. విశాఖ పట్నం ఉక్కుకర్మాగారం ప్రైవేటీకరణకు పూను కున్నది. ప్రజలలో వీటిపై చర్చ లేకుండా మతో న్మాద భావల వైపు మళ్లించాలన్నది బి.జె.పి ఆలోచనా విధానం. ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీగాని, ప్రతిపక్ష పార్టీ లైన తెలుగుదేశం, జనసేన గాని బి.జె.పిమతోన్మాద విధానాలను ఖండిరచటం లేదు.
ప్రస్తుత బి.జె.పిప్రభుత్వం ఆర్‌.ఎస్‌.ఎస్‌ భావాలను అమలు చేయటమే కాక, మత విభజన ద్వారా ప్రజలలో తనరాజకీయ ప్రాబల్యాన్ని కొన సాగించటానికి ప్రయత్నిస్తున్నది. దీనివలన లౌకిక రాజ్యాంగ ఆశయాలు,లక్ష్యాలు దెబ్బ తింటాయి. లౌకిక రాజ్యాంగానికి విఘాతం కలుగుతుంది. దేశంలోని ప్రజలు, మేధావులు, ప్రగతిశీల శక్తులు, కార్మికులు,ఉద్యోగులు ఉపాధ్యాయులలో విస్తృతంగా ప్రచారం చేసి మతోన్మాద, మతతత్వ శక్తులను ఏకాకులను చేయాలి.
వ్యాసకర్త :శాసనమండలి సభ్యులు,లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక కన్వీనర్‌- (బి.కృష్ణారెడ్డి/కె.యస్‌. లక్ష్మణరావు)

అరకులోయలో ఆదివాసీల అంతరంగం

“చూసే కళ్ళకు మనసుంటే-ఆ మనసుకు కూడా కళ్ళుంటే’పనిమట్లు, విత్తనాలు, ధింసా ఆటలు, గిరిజనుల జీవితం చిత్రించే బొమ్మల కొలువులు.. ఇవి అరకులోయ మ్యూజియంలో. చుట్టూ కాఫీ తోటలు, జలపాతాలు, బొర్రా గుహలు,బొంగుచికెన్‌ వంట కాలు కనిపిస్తాయి. కాని తెలుసు కుంటే కాని తెలియనివి,పల్లెలలో ఏడాది పొడుగునా గిరిజనులు చేసుకునే పనిపాట్లు,కట్టుబాట్లు,రాజులు/ప్రభు త్వాలు, ప్రజల మధ్యసంబంధాలు, పండుగలు, మొక్కులు, వంటలు, కష్టసుఖాలు.వాటిలో రాగం,తానం, లయలవలె అల్లుకుపోయిన ఆటపాటలు,కధలు,సామెతలు సాహిత్యం,లెక్కలు,ఆశయాలు ఆదర్శాలు….! అరకు,ఒడియా గిరిజన మాండలికం మాట్లాడే బగతలు, కొటియాలు,కొండదొరలుబీ తమ,తమ భాషలుగల కోదు(సామంత),పోర్జా/జోడియా వగైరా తెగలు నివసించే అరకులోయ బహుభాషల ప్రాంతం.”
అరకులోయలో జీవితకాలం గిరిజనాభివృద్ధికి పనిచేసిన కెనడా దేశీయుడు గుస్తాఫ్‌, ఆదివాసీ ఒడియా,తెలుగు అనువాదంతో తయారుచేసిన ‘ఆదివాసీ పండుగలు’ను 1976 లో పాడేరు గిరిజనాభివృద్ధి సంస్థ ప్రచురించింది. 76-82 మధ్య శక్తి శివరామకృష్ణ సేకరించిన తెలుగు గిరిజన గీతాలు’ మీద, 1991లో సమత రవి ఏర్పాటుచేసిన ప్రసంగాన్ని విన్న, నాటి ప్రాజెక్ట్‌ అధికారి సోమేశ్‌ కుమార్‌, 200 కాపీలు కొని ఉపాధ్యాయులకు పంచిపెట్టారు. దాన్ని పరివర్ధిత ముద్రణగా తెచ్చే ప్రయత్నంలో 2002లో పాడేరు చుట్టూ తిరుగుతున్నప్పుడు, అప్పుడు Aష్‌ఱశీఅ ఎయిడ్‌లో, ఇప్పుడు అజిత్‌ ప్రేమ్‌జీ (Ajaఎ ూతీవఎjఱ) ఫౌండేషన్‌లో పని చేస్తున్న మిత్రుడు రఘు దగ్గర ఈగుస్తాఫ్‌ పుస్తకం దొరికింది.
ఇదేకాక తెలుగేతర తెగఅయిన కొంధులమీద ప్రముఖ భాషాశాస్త్రవేత్త భద్రిరాజు కృష్ణమూర్తి 1960 లో అధ్యయనం చేసారు. 65లో ఈ తెగలన్నిటిమీద జనగణన,ఎథ్నోగ్రాఫిక్‌ నోట్స్‌ తో పాటు,కొండిబా,లంప్తాపుట్టు, జెర్రిల, అన్నవరం గ్రామాలమీద మోనోగ్రాఫ్‌లు ప్రచు రించింది. కొండదొరలమీద రాఘవరావు 75 లో ఆంధ్ర విశ్వవిద్యాలయంనుండి డాక్టరేట్‌ పొందారు.1863,1907లో వచ్చిన విశాఖ డిస్త్రిక్‌ గజెటిర్‌లోగల అన్నిరంగాల చరిత్ర వీటన్నిటికి పునాది.నేటి అనంతగిరి,అరకు, డుంబ్రిగూడ,పెదబయలు,ముంచెంగిపుట్‌ మండలాలు,హుకుం పేట మండలంలో పెదగరువుదాకా,కొండదొరలు పాలించిన ఒక నాటి ఒడిశా జేపోర్‌ సంస్థానంలో పాడువా తాలూకాలోనివి. స్వతంత్రం తరువాత ఈ తాలూకాలో ఈమండలాలు ఆంధ్రప్రదేశ్‌ లో కలిసిపోయాయి. ఆ సంస్థానం ఆఖరి పాల కుడు విక్రమదేవవర్మ ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రోచాన్సెలర్‌. వారి బంధువులు కురుపాం, మేరంగి,సాలూరు,ఆంద్ర,పాచిపెంట పాలకులు, తమ రాజ్యాలను ప్రగతి పధంలో నడిపిస్తూ, దిగువనున్న విజయనగరం,బొబ్బిలి సంస్థా నాలకు పోటీగా,విశాఖనగరం అభివృద్ధి చేసారు. ఇక్కడి ఒకనాటి కాశీపట్నం జమిందారీలోది,ఘాటీ ఎక్కుతుంటే వచ్చే, అనంతగిరి మండలంలో పుణ్యగిరి తీర్ధం/ధారల గంగమ్మ. అక్కడ గూగుల్‌ ఎర్త్‌ మ్యాప్‌లో ‘విరాట పర్వతం’అని ఎవరో నోట్‌ చేసారు. నిజమే. ఈ ప్రాంతం 14శతాబ్దివరకు వడ్డాది రాజధానిగా పాలించిన మత్స్యరాజుల విరాట రాజ్యం. వారూ ,జేపోర్‌ వారు బంధువులు. విరాటరాజ్యంలో అజ్ఞాత వాసం గడుపుతున్న పాండవులుగా గిరిజనులు తమను పోల్చుకుంటూ ‘పంచ పాండవుల పంట-దుర్యోధనుడి వంట’ అంటూ భారతకదను తమకు అనువుగా మార్చుకుని పిప్పలి, పసుపు,చిక్కుళ్ళు,అల్లం,అనాస వగైరా తము ప్రత్యేకంగా పండిరచే పంటల దోపిడిని ‘నందిపదం’లో పాడుకుంటారు.ఆసియా అంతా, పాండవులు, వ్యవసాయ సంస్కృతితో ముడిపడి ఉన్నారు.అలాగే ధారల గంగమ్మ, అటువంటి క్షేత్రమే పాడేరు మండలంలో మత్స్యగుండం. ఈ నీటి వనరులు ప్రపంచ మంతా జలకన్యలవి, (ఙఱతీస్త్రఱఅం, అవఎజూష్ట్రం, ఎవతీఎaఱసం), క్రూరజంతువులతో నిండిన అడవులు కొండ రాజులు/దేవతలవిగా భావించి మొక్కే, మన ఆచారాల మూలాలు,గిరిజన సంస్కృతిలో ప్రస్పుటంగా కనిపిస్తాయి. ‘తెలుగు గిరిజన గీతాలు’(91),పరివర్ధిత ముద్రణ ‘కొండకోనల్లో తెలుగు గిరిజ నులు’ (2007) తెలుగు తెగల ఈ వారసత్వాన్ని, నందిపదం వంటి వారిసాహిత్యంలో వ్యవసాయ విజ్ఞానం, సంస్కృతిని సమగ్రంగా తెలియచేస్తూ అరకులోయ సంస్కృతినికూడా అర్ధం చేసుకోటానికి సహకరిస్తుంది. తెలుగు గిరిజనుల నుడికారం తెలిస్తేనే,ఇతర తెగల భాషలు మనకు బాగా తెలుస్తాయి అంటారు భద్రిరాజు కృష్ణమూర్తి.. ఇక గుస్తాఫ్‌ పుస్తకం గిరిజన జీవితాన్ని నెలలవారీగా వర్ణిస్తూ, మనకు తెలియని గిరిజనుల ప్రపంచానికి తలుపులు తెరుస్తుంది. సహజ వ్యవసాయ విధానం అమలు చేస్తున్న మితృలకోసం ఇక్కడి వ్యవసాయ సంస్కృతిని పరిచయం చేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమాలలో పాల్గొంటున్న గిరిజనులకోసం,ఈ పుస్తకాన్ని ముందు సంక్షిప్తంగా పరిచయం చేసి, క్రమంగా మిగిలిన పరిశోధనలను జోడిరచటం కొన సాగుతుంది..
చైత్రం/ఏప్రిల్‌-మే
‘విరాటరాజు దేశం ఇటికె పండుగలు, కాశివారి దేశం గంగ పండుగలు’ అని నందిపదం’లో పాడుకునే, ఈ నెలలో చేసే ఇటుకల/వేటల పండుగ గిరిజనులకు పెద్ద పండుగ .ఈ నెలలో ఆడవాళ్లదే రాజ్యం.ప్రతి ఇంటి మగ వాడు, తెల్లవారగానే ఆడవాళ్లు ఊగటానికి ఉయ్యాల కడతాడు.మగవారిని వేటకోసం కొండకు తరిమాక,ఆడవారు పాటలు పాడుతూ ఉయ్యాలలూగుతారు. ఈ పండుగకుముందు, కొండమామిడికాయలు తినరు.ఫాల్గుణం/పొగు నులో హోలీ కాల్చిన రోజునుండి పాడే సంగడి ఆటపాటలు ఈ నెలతో ముగుస్తాయి.ఆటకు రానివారిదగ్గర ఆడవారు పన్ను(పెజోర్‌) వసూలు చేస్తారు.మఖ,కృత్తిక,చిత్త.స్వాతిు-ఇలా ఎవరికి ఏ నక్షత్రం అనుకూలమో చూసి విత్తనాలు వేసుకుంటారు.
వైశాఖం మే-జూన్‌
ఈ నెల వేసగిలో వర్షాలు వడగండ్లతో పడతాయట.పెళ్ళిళ్ళ కాలం.ప్రకృతి అంతా పెండ్లిలో అయిరేని/బోయ్‌ కుండలలాగా రంగురంగులతో నిండి ఉంటుంది.వేటలు ముగుస్తాయి. గొట్న పండుగ చేసి,తోపహల్వా వండి, గౌడు పశువులకాపు మొదలు పెడ తాడు.గొట్న అంటే భోజనంకుండ. ఈ పండుగ తరువాతే పొలంపనిచేసే వారికి భోజనం తీసుకెళ్లటం మొదలు పెడతారు. పుష్య మాసం లో నియమించుకున్న పని వాళ్ళందరికీ ఆయా పొలాలు కేటాయిస్తారు.ఇటుకల పండుగలో వసూలు చేసిన పన్ను డబ్బులతో ఆడవారు పిట్టు వండుకుంటారు.
లండిజేట్‌/జ్యేష్టం
లండి/సామ పొట్టిజడలు వేస్తుంది.ఈనెలలో పొర్ణమి అయ్యాక సామలుచల్లరు.మెట్టుధాన్యం, చోడిలాంటి కొద్దిరోజుల పంటలు చల్లుతారు. ఆషాఢంబీమేఘాలు కమ్మి వర్షాలు కురుస్తాయి. గింజలు నూర్చేటప్పుడు పంట దిగుబడి ఎక్కువ గా ఉండాలని జన్ని పండుగ చేస్తారు. అడవి జంతువుల బారిన పడకుండా వచ్చిన పశువులకు నైవేద్యం పడతాడు.సామ పంటతో పూజారి నైవేద్యం పెడతాడు.
భాద్రపదం/బందపని
జాకరిమెట్టలో కొర్రపంటకు కొత్తల పండుగ చేసారు. కొత్తకుండ,కొత్తజిబ్బి,కొత్త తెడ్డులతో, తరగాయ్‌ దుంపలు,గుమ్మడికూర,కొత్త చింత కాయజాకరికి పెడతారు.’లోల్లోసే అన్నవారికి లోపలొక పిల్ల,సైలోరే అన్నవారికి చంకనొక పి ల్ల’లోల్లోసి/సైలోరి పాటలు మొదలుపెడతారు.
ఓస/ఆశ్వయుజం
పెద్ద పెద్ద వర్షాలు కురుస్తాయి.కొత్తధాన్యం అందుతుంది. పాలకులలో ఇసుకపోసి విత్తనాలు వేసి,పసుపునీళ్ళతో పెంచి మొలకె త్తాక ఆ పువ్వులను బల్లి/లక్ష్మి పువ్వులు అంటారు.ఆ పూలతో నేస్తం కట్టుకుంటారు. బల్లిపాటలు పాడతారు.ఈ నెలనుండి చలి మొదలవుతుంది. పంటలు నేలకొరిగి పరుచు కుని పోతాయి.ఓస అంటే ఒడియాలో పరుచు కొనుట అని అర్ధం .
దసరా
దసరాలో దుర్గ/మెరియా పడుతుందని నమ్మకం.జంతువులు కూడేనెల.నెలపొడిచి పదిరోజులయ్యాక (దశమి)దసరా పండుగ చేస్తారు.
దీపావళి
పంటలన్నీ పచ్చగా పండుతుంటాయి. జల కన్యల ప్రతినిధి కప్పదేవతకు పండుగ చేస్తారు. దీపావళి నాలుగురోజులు అన్నంపప్పు మాత్రమే తింటారు.
మార్గశిర
మంచు ముద్దలు ముద్దలుగా పడుతుంది.ఇళ్ళు, వాకిళ్ళు అలకటం తలంటి పోసుకోటం,లక్ష్మి దిగుతుంది. మూడురోజులు బల్లి పండుగ చేస్తారు.బల్లి నాటకాలు అడతారు.’బంగరాల బల్లి,బాలగొంతెమ్మ’ అంటూ పాండవుల తల్లి కుంతిని పిలుచుకుంటారు తెలుగు గిరిజనులు
పుష్యం/సంక్రాంతి
దీపావళికి తలస్నానం చేసినప్పటినుంచి మొదలైన దిమ్సా ఆటలు,పాల్గుణ పుష్య మాసాలలో ముగుస్తాయి.డప్పు,ఢంకా,కిరిడి, సన్నాయి,పిల్లనగ్రోవి,జోడుకొమ్ములు వాయిద్యాల కనుగుణంగా14 గతులలో గిరిజన జీవితాన్ని అభినయించేదే ధింసా ఆట..ఆడ వాళ్ళవి సైలోరిపాటలు,మగవాళ్ళది కోలాటం.
మాఘం
‘మాఘంలో మేఘం ఫాల్గుణంలో వర్షం’. పుట్టమట్టితో ఒకనంది/ఎద్దును, దుంపలతో ఒక నందిని తయారుచేసి వాటికీ పెళ్లి చేస్తారు. బస్కి పూలతో నేస్తాలు కట్టుకుంటారు.
ఫాల్గుణం /పొగును.
దీపావళిలో మొదలైన చలి పొగును మంటలో కాలిపోతుంది.నందిపండుగలో ఇచ్చిన విత్త నాలను హోలీ బూడిదలో వేస్తారు.హోలీ పాటలు పాడతారు.దుక్కులు మొదలు పెడతారు.
వ్యవసాయ వారసత్వం సమత టీంలో, దేవుళ్ళు సంజీవని సంస్థ,1990 నుండి రాష్ట్రమంతటినుండి విత్తనాల జాబితా పోగుచేయిస్తున్న డెక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ స్పూర్తితో డుంబ్రిగూడ మండలంలో ప్రారం భించిన విత్తనాలసేకరణ, పండుగలు చేయ టం,కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందింది.ఈ సొసైటీ కృషిలో సహకరించిన కామేశ్వర శర్మ, రవి విశ్వవిద్యాలయాలలో పర్యావరణ,వృక్ష శాస్త్రవేత్తలు. ఇతర శాస్త్రవేత్తలు,సంస్థలు తమ పక్కనే ఉంటూ చేసినకృషిని,అందరు శాస్త్రవేత్త లలాగే వీరుకూడా పట్టించుకోలేదు భద్రిరాజు కృష్ణమూర్తి నాయకత్వంలో 1960లోనే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి రైతులనుండి సేకరించిన పదసంపదతో కూర్చిన వ్యవసాయ మాండలిక వృత్తి పదకోశంలో,427 వడ్లరకాలు,100 రకాల జొన్న,18 రాగి,ఆరికలు 5,కొర్ర 37, ఉలవలు 13,బొబ్బర 8,సెనగలు 8,నువ్వు 19,ఆముదాలు 7,చెరకు 2,పత్తి 12,పొగాకు 15,మిరప 10,కొబ్బరి 51,అరటి 15,నిమ్మ 8 రకాలు పేర్కొన్నారు. అయితే ఈ పదకోశంలో గిరిజనప్రాంతాల వివరాలు లేవు. దేవుళ్ళు వగైరాలు తయారు చేసిన విత్తనాల జాబితా ఈలోటును పూరిస్తుంది.భద్రిరాజు కృష్ణమూర్తి గారి ఇల్లు,నేడు వ్యవసాయరంగంలో పనిచేస్తున్న ‘వాసన్‌’ వగైరాల మాతృసంస్థ Aష్‌ఱశీఅ టశీతీ షశీతీశ్రీస ంశీశ్రీఱసaతీఱ్‌వ పక్కనే ఉండేది.కానీ ఆయన వ్యవసాయపదకోశాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఈ పదకోశాల నిర్మాణంలో పాల్గొన్న చేకూరి రామారావు,బూదరాజు రాధాకృష్ణ పత్రికా రంగంమీద విశేష కృషి చేసారు.కాని వారు ఈ రైతుల పదసంపదను పత్రికలకు గుర్తుచేయ లేదు.Rబతీaశ్రీ సవఙశీశ్రీశీజూఎవఅ్‌,ూబ్‌్‌ఱఅస్త్ర శ్రీaర్‌ ్‌ష్ట్రఱఅస్త్రం టఱతీర్‌(83)బీఖీaతీఎవతీం ఖీఱతీర్‌(89) పుస్తకాలు రాసి, రైతును గూర్చి ముందు తెలుసుకోవాలని ఉద్బోధిస్తూ ూRAవిధానాలను ప్రచారం చేసిన రాబర్ట్‌ చాంబర్స్‌తో పనిచేసిన శాస్త్ర వేత్త సంఘి ( మేనేజ్‌) ఈ సంస్థలతో సన్నిహితంగా పనిచేసేవారు.అప్పట్లో పెర్మా కల్చర్‌ బిల్‌ మోలిసన్‌తో వీరందరూ ఒక కార్య శాల నిర్వహించారు.తూర్పు కనుమలలో చెద పురుగుల సమస్యగూర్చి అడిగినపుడు,చెదలున్న భూముల్లో చింత,పనసలు బాగా వస్తాయి. అవికూడా పంటలే.ప్రకృతికి ఎదురీదవద్దు అని, బిల్‌, హెచ్చరించారు. క్రమంగా ఈ ప్రాధా న్యతలు, పద్ధతులు మారిపోయాయి. అత్యధిక వర్షపాతం పొందే ఈప్రాంతంలో కొండ వాగులు,జోరెలగర్భంలో మళ్ళు కట్టి వరి పండిస్తారు.ఈ జోరెలలోనే నీటిమొక్కలు టవతీఅ, షవషaసలు అనాదిగా పెరుగుతున్నాయి. ఈ మొక్కలు, కొండప్రాంతాలలో తీవ్రసమస్య భూమికోతను అరికడుతున్నాయి. వ్యవసాయం పెరిగినకొద్దీ నరికి వేయటంతో ఇవి అంత రించాయి. .హైదరాబాద్‌లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న నాగరత్నం నాయుడు, ఇటువంటి షవషaసలను, అడవులలో దొరికే aతీషష్ట్రఱస పూలను పెంచి అంతర్జాతీయ మార్కెట్‌ లో అమ్ముతున్నారు. జీలుగుకొమ్మలను పోలిన ఈ టవతీఅను గిరిజనులు ‘కన్నెజీలుగు’ (జలకన్యల),నీటిమీద పరుగెత్తే జూశీఅస ంసa్‌వతీ ను ‘గన్నికల పురుగు’ అంటారు. వారి మనో ప్రపంచంలో కప్ప,చేప,ఎండ్రిక మొదలైన జల చరాలు జలకన్యల ప్రతినిధులు.విశాఖ మన్యం లో అత్యున్నత శిఖరంపేరు ‘ఎండ్రిక’ పర్వతం. విశాఖ గజేటిర్‌, జేపోర్‌ రాజులు వారణాసి నుండి మాలీలను రప్పించిపూలు,పొందరల చేత కూరగాయలు ,వ్యవసాయానికి అవసరమైన ఇతర వృత్తులు ప్రోత్సహించారు అని తెలియ చేస్తుంది.. జేపోర్‌, అత్యధిక వరివంగడాలుగల ప్రాంతంగా శాస్త్రవేత్త రిచారియా 1970 లలోనే ప్రపంచానికి చాటారు. హరితవిప్లవం వ్యాప్తిలో పడి నిర్లక్ష్యం చేసిన,ఈ జన్యు సంప దను, ఆ విప్లవ పితామహుడు స్వామినాథన్‌ ఫౌండేషన్‌, ఇక్కడి 340 వరిరకాలు,వాటిలో 24 సువాసన కలవి,27 వరద,2 నిలవ నీళ్ళను,1 కరువును తట్టుకునేవి.8 రకాలు చిరు ధాన్యాలు,9 రకాల పప్పులు,5 నూనె గింజలు,3 పిచు చెట్లు,7 రకాల కూరగాయలు జాబితా ఇంతవరకు తయారు చేసింది.. ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ (ఖీAూ), భారతదేశంలోగల మూడుప్రదేశాలలో ఒకటిగా,జేపోర్‌ వ్యవ సాయ వారసత్వాన్నిగుర్తించింది.దశాబ్దాలుగా ఈ అరకులోయలో నేచర్‌,వికాస మొదలైన స్వచ్చంద సంస్థలు నాబార్డ్‌ మొదలైన సంస్థల విధానాలబట్టి వ్యవసాయాభివృద్ధి చేస్తూ , రైతు సంఘాలు నడిపిస్తున్నారు.మారుమూల ఉన్న సొవ్వ పంచాయితీలో పండే కూరగాయలను విశాఖలో అమ్మించటంలో దేవుళ్ళు విశేషమైన కృషి చేస్తున్నారు కాని,రవాణా ఖర్చులు పోగా మిగిలేది తక్కువ అని గిరిజనులు వాపోతు న్నారు. కేరళలో ఈ మాత్రంకూడా భూములు లేని గిరిజనులు ఇంటిచుట్టూ మిరియం పండిర చుకుని గడిస్తున్నారు. ఇక్కడ భూమికంటే అడవి ఎక్కువ.కాబట్టి అటవీ హక్కులగుర్తింపు ద్వారా అడవి కాపాడుతూ లాభం పొందే ప్రయత్నం చేయాలి, ఇందుకోసం గతంలో ధింసా గిరిజన సమాఖ్య 27 పంచాయతిలలోగల 217 అవాసాల సంప్ర దాయ వనరులపటాలు తయారుచేసింది. పోడు భూముల కొలతలు తక్కువగా చూపి నందుకు ఆందోళన జరి గింది.. ఆ కృషిని కొనసాగించాలి.ఆ ప్రయత్నం గ్రామసభలకు ప్రాణం పోస్తుంది. సరిjైున భూమి హక్కుల నమోదు,ఆ పధకాలకు ఇచ్చే రాయితీలను పొందటంలో న్యాయం చేస్తుంది. ‘వాసన్‌’ సొవ్వ పంచాయతీ అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేసి నిధులకోసం ప్రయత్నిస్తున్నది. గ్రామసభలతో సంబధం లేకుండా తామే లభ్దిదారులను ఎంచుకొని,వారి ఖాతాలో ఇంటర్‌ నెట్‌ ద్వారా పధకాల తాలూకు సొమ్ము జమచేయటం,అవి దక్కించుకోటంలో అవకతవకలు, పడేపాట్లు,లోపాలను ‘నగదు బదిలీ సఫలమా,విఫలమా’ వ్యాసంలో (ఆంధ్రజ్యోతి) లో లిటేక్‌ చక్రధర్‌ ఎత్తిచూపారు. సహజ వ్యవసాయం ప్రకారం పేడపానకం వగైరా తయారుచేయటం గిరిజనులు నేర్చు కుంటుంటే , ఇదే సమయంలో కంపనీలు తయారు చేసిన ఈ పోషకాలనుకూడా అధి కారులు పంచుతున్నారు.సహజ వ్యవసాయం వల్ల పెట్టుబడులు తగ్గాయి కాబట్టి దిగుబడి తక్కువైనా పరవాలేదు అని గిరిజనులు అనుకుంటున్నారు.. గిరిజన సంక్షేమశాఖలో పనిచేసిన అధికారులు ప్రభుత్వకార్యక్రమాలలో తమ అనుభవాలతో అనేక రచనలు చేసారు. కాని వారి రచనలలో గిరిజన సంస్కృతిగూర్చి పొడి మాటలు మించి ఏమీ ఉండదు. అటు వంటి అధికారుల అధ్వర్యంలో నడిచే IుణA పాఠశాలలో చదివి ఉపాధ్యాయుడైన, సవర రచయిత మల్లిపురం జగదీశ్‌ ‘స్వతంత్రం వచ్చిన తరువాత ఏడు దశాబ్దాలలో,నాలుగు దశాబ్దాల గిరిజనాభివృద్ధి సంస్థల పాలనలో గిరిజనుడి పరాయీకరణ ముమ్మరమైంది. చట్టాల అమలు ప్రశ్నార్ధకమైంది.అతడు లబ్దిదారుగా మారి, దరఖాస్తు దారుగా క్యూలో నుంచున్నాడు. గిరిజనసాహిత్యం అంటే ఉద్యమసాహిత్యం అనే పేరు పడిపోయింది. గిరిజన విద్యాలయాలనుండి, తన సంస్కృతి గురించి చెప్పుకోగల గిరిజన రచయిత ఎందుకు రాలేదు? (‘బహుళ’.పెర్స్పెక్టివ్స్‌ ప్రచు రణ 2019) అని నిలదీస్తున్నాడు.ఇలా.. ప్రజల జ్ఞానాన్ని, సంస్కృతిని పట్టించుకోకుండా, శాస్త్ర వేత్తలు,అధికారులు,సంస్థలు, ఎవరిదారిది వారుగా‘అభివృద్ధి’చేస్తూ జనాన్ని ముష్టివాళ్ళుగా మార్చారు. వీరంతా, ఇటువంటి ప్రశ్నలే వేసుకుని, ఇప్పుడైనా దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. సహజవ్యవసాయం ప్రచారం చేసే ప్రవక్తలు, సంస్కృతి అధ్యాత్మికతలంటూ పెద్ద పెద్ద ఉపదేశాలిస్తారు. వారిలో ఒకరు, వికారా బాదులో ఈ వ్యవసాయంచేసే విజయ రాంగారు, గత సంచికలో తెలియచేసినట్లు, అక్కడ చిరకాలంగా పనిచేసేణణూవలెనే,అక్కడి ప్రజలు పాడుకునే పాటలు,పండుగలు తెలుసు కునే ప్రయత్నం చేయలేదు. ఆయన ప్రసంగా లలో అక్కడి గ్రామీణులు తలుచుకునే పాండ వులు,పర్వతాల,అనుముల బ్రహ్మారెడ్డివంటి కధలు,కార్తెలు,దుక్కులు,సామెతలేవీ నిపించవు. కొత్త పరిభాషను,పదజాలాన్ని,పండుగలు, యాత్రలను అలవాటు చేస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖలో ఉన్నతాధికారి వీరభద్రుడు తన ‘నేను నడిచిన దారులు’లో, అరకులో అభివృద్ధిని అధ్యయనం చేయటానికి వచ్చిన విద్యార్ధి బృందానికి,పైన చెప్పినట్లు, చుట్టూ కనిపించే విషయాలు వివరిస్తారు. గుస్తాఫ్‌ చేసే అభివృద్ధిని స్కేల్‌ అప్‌ చేయాల్సిన అవసరం బోధిస్తారు. కాని గుస్తాఫ్‌ గ్రంధస్తం చేసిన సంస్కృతి ప్రసక్తి తేలేదు..దేవుళ్ళు క్లాస్‌ మేట్‌,నేడు కాకినాడలో పశుసంవర్ధక శాఖ అధికారి సత్యనారాయణగారు,తన కుమార్తె అభివృద్ధి (ణవఙశీశ్రీశీజూఎవఅ్‌ ూ్‌బసఱవం) విద్యార్ధి వైష్ణవితో, అరకులోయలోని సొవ్వలో, అనకాపల్లి వ్యవసాయశాఖవారు,పోషక సామగ్రి,పనిముట్ల పంపిణికి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వచ్చారు. అప్పుడు వారిద్దరితో సంస్కృతిలో ఈ కనిపించని విషయాలు,చరిత్ర గుర్తు చేసే వీలు దొరికింది.విశాఖలో డుంబ్రి గూడ మండలం సర్పంచ్‌లతో వాసన్‌ నిర్వ హించిన సమావేశాలు,చొరవ తీసుకుని అరకు లోయలో చేసిన పర్యటనలో చూసిన పరిశీల నలు,60ఏళ్ల అభివృద్ధి చరిత్ర నేప ధ్యాన్ని కాగి తం మీద పెట్టటానికి తొందర పెట్టాయి.- (రచయిత : శక్తి స్వచ్ఛంద సంస్థ
వ్యవస్థాపకులు,శివ రామకృష్ణ

కొత్త జిల్లాల ఏర్పాటు సుపరిపాలనకు దారితీస్తుందా?

రాజ్యాంగంలో పొందుపరిచిన వారిహక్కులను ప్రభుత్వాలే కాలరాస్తున్నాయి. అన్నిరంగాల్లో అన్ని రకాలుగా ఆదివాసీలు ఏడుశతాబ్దాలుగా అస్తిత్వం,ఆత్మగౌరవం,స్వయంప్రతిపత్తి కోసం మనుగడ కోసం నిరంతరంవారుపోరాటంచేస్తున్నారు. ఈనాటికి వారికి న్యాయం దొరకడం లేదు. ప్రజలముంగిటికిపాలన అనేమాట1984లో మొదట వినిపించింది. అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సరిగ్గా ఈనినాదంతోనే ఒక శతాబ్దానికిపైగా చరిత్రఉన్న విశాల తాలూకాలను విడదీసి మండళ్లను ఏర్పాటు చేశారు. తాలూకాల నుంచి మండలాలు విభజనలో నేపథ్యంలో ఉమ్మిడి ఏపీలో సుమారు 800 గిరిజన గ్రామాలకు చాలా అన్యా యానికి గురయ్యఆరు. దాంట్లో తూర్పుగోదావరి జిల్లా సబ్‌ప్లాన్‌ ఏరియా పెదమల్లాపురానికి ఆనుకొని ఉన్న 56 గిరిజన గ్రామాల గిరిజనులు రాజ్యాంగం కల్పించిన హక్కులకు దూరమయ్యారు. అలాగే విశాఖజిల్లా కొయ్యూరు తాలూక పరిదిలో ఉండే సరుగుడు, కేవీశరభవరం,చమ్మచింత తదితర నాలుగు పంచాయితీలను మైదానప్రాంతమైన నాతవరం మండలంలో విలీనం చేయడంవల్ల ఆప్రాంతగిరిజనులంతా అభివృద్ధికి నోచుకోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,1984లో షెడ్యూల్డ్‌ ప్రాంతాలకు ఆనుకొని ఉన్న 800కుపైగా గిరిజన గ్రామాలను షెడ్యూల్డ్‌ ఏరియాలో కలపాలనే ప్రతిపాదన చేసినా దాన్ని రాష్ట్రప్రభుత్వం సక్రమంగా అమలు పర్చలేదు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నియోజవర్గ పునర్విభజనలో భాగంగా అరకు లోక్‌సభనియోజకవర్గం అన్యాయానికి గురైంది. 25లోక్‌సభ నియోజక వర్గంలో 7అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.2008లో నూతనంగా చేసిన నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం పార్వతీపురం లోక్‌సభ నియోజకవర్గాన్ని రద్దుచేసి, దానిస్థానంలో అరకు లోక్‌సభ నియోకవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఎస్టీలకు రిజర్వ్‌ చేయబడిరది. ఈనియోజకవర్గం 4జిల్లాలలో విస్తరించి ఉంది.విశాఖపట్నం,విజయనగరం,శ్రీకాకుళంజిల్లాలలోని భాగాలతోపాటు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కొత్తగా ఏర్పడిన రంపచోడవరం అసెంబ్లీ సెగ్మెంట్‌ ఈలోక్‌సభ నియోజకవర్గంలో కలిసింది. భౌగోళికంగా ఇదిచాలా పెద్ద లోక్‌సభ నియోజకవర్గంగా పేరుగాంచింది. పాలకొండ నుండి రంపచోడవరం వరకు విస్త రించి ఉన్న ఈనియోజకవర్గం ఆచివరి నుండి ఈచివరికి 250కిలోమీటర్ల పైగానే దూరం ఉంది. అంతేకాకుండా ఈ నియోజకవర్గ పరిధిలోని 7 సెగ్మెంట్లకుగాను 6 సెగ్మెంట్లు ఎస్టీలకీ ఇంకా 1సెగ్మెంట్‌ ఎస్సీలకీ రిజర్వ్‌ చేయబడ్డాయి.
2014`2015మధ్య రాష్ట్ర విభజనలో రాష్ట్ర విభజన జరిగింది. ఈసమయంలో కూడా ఆదివాసీలు సామాజిక, ఆర్ధిక, రాజకీయ,సాంస్కృతి,సాంప్రదాయాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు మరోకసారి ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక చిత్రపటం మారిపోతోంది. అంతే కాకుండా ఇటీవల నగరీకరణలో భాగంగా విశాఖపట్నం మెట్రోపాలిటిన్‌ రీజయన్‌ డవలప్‌మెంట్‌ అధార్టీ(వీఎంఆర్‌డీఏ) సరుగుడు ఏరియా గిరిజన పంచాయితీలను విలీనం చేసి ఆ ప్రాంత గిరిజనులకు చారిత్రీక అన్యాయానికి గురిచేశారు.అదే విధంగా విజయనగరం జిల్లా గిరిజనాభివృద్ధికి చేరువలో ఉన్న పార్వతీపురం ఐటిడీఏను తొలగించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తోంది. ఇది కూడా తీరని అన్యాయమే అవుతుంది. ప్రభుత్వ అనాలోచిత విధానాలు కారణంగా గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాలు, సంస్కృతి సంప్రాదాయలు కనుమరుగయ్యే అవకాశం అధికంగా కన్పిస్తోంది. షెడ్యూల్‌ ప్రాంతమైన ఏజెన్సీ ప్రాంతం మధ్యలో నుంచి రాజమండ్రి నుంచి విజయనగరం వరకు 516వ జాతీయ రహదారిని406కిలోమీటర్ల పొడవునా నిర్మాణపనులు వేగంగా జరుగు తున్నాయి. దీనివల్ల గిరిజనుల భూములు,వారి జీవన విధానం దెబ్బతింటోంది. ఆదివాసుల కల్చరల్‌ దెబ్బతింటోంది.
ప్రస్తుతం ఏపీలో ఉన్న పదమూడు జిల్లాలను 26 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి క్యాబినెట్‌ ఆమోదించిన అనంతరం దీని పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పుడు,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత, ఎప్పుడో బ్రిటిష్‌ కాలంలో ఏర్పాటు చేసిన జిల్లాల సరిహద్దులను చెరిపేసి చిన్నజిల్లాలను సృష్టిస్తున్నారు. ఇది సుపరిపాలనకు దారితీ స్తుందా? లేక పాలనా వ్యవస్థని ఇంకా బలహీనంచేసి పాలనా యంత్రాంగాన్ని ఇంకా శక్తివంతులను చేస్తుందా అనేది ప్రశ్న. పాలన వికేంద్రీకరణ నిజం కావాలంటే అధికారాల వికేంద్రీకరణ జరిగితీరాలి. స్థానిక గిరిసజనుల మనోభవాలు పరిగణనలోకి తీసుకోవాలి. ముఖ్యంగావారి సాంస్కృతి,సాంప్రదాయాలు,కట్టుబాట్లు దెబ్బతినకుండా గిరిజనులకు ప్రయోజకరకంగా ఉండేలా విభజన వ్యవహారాన్ని కొనసాగించాల్సిన అవశ్యకత ఉంది.!– రెబ్బాప్ర‌గ‌డ ర‌వి,ఎడిట‌ర్‌

భిన్న‌త్వంలో ఏక‌త్వం..మాన‌వ వాదం

మనం ఉన్నది గురుత్వాకర్షణ శక్తి ఉన్న గ్రహం మీద! పైకి వెళ్ళిన ప్రతిదీ తప్పక కింద పడా ల్సిందే!! తప్పదు.. వస్తువులైనా,మనుషులైనా, కింద అందరినీ కలిపేది మానవత్వం. కింద ఉన్నవారిని,పైకి లేచిన వారినీ, పైకి లేచి కింద పడినవారినీ, అందరినీ! ప్రపంచంలోని అన్యా యాన్ని చూస్తూ ఉండకూడదు.అది మన వెలు గుల్ని స్వాహా చేయడాన్ని అసలే ఒప్పుకో గూడదు.. సహించగూడదు. ఆలక్షణమే మనం బతికి ఉన్నామని చెప్పుకోవడానికి ఒక సాక్ష్యం! అదే మానవత్వ ఆకర్షణ శక్తి!
భిన్న మతాలు, భిన్న సంస్కృతులు సంగమించే పవిత్రభూమి భారతదేశం.బౌద్ధ,జైన,సిక్కు మతాలు అవసరానుగుణంగా సమయ సంద ర్భాలననుసరించి ఈ దేశంలో ఉద్భవిం చాయి. అంతేకాదు.. విదేశాల నుంచి వచ్చిన ఇస్లాం, క్రైస్తవం, జుడాయిజంలను కూడా భారతదేశం స్వాగతించి అక్కున చేర్చుకున్నది. ఆ పరమే శ్వరుడు ఏకత్వంలో భిన్నత్వాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాలా ఇష్టపడతాడు. లేకుంటే సృష్టిలో తాను ఒకే కులాన్ని, ఒకే మతాన్ని ఏర్పరచి ఉండేవాడు. కానీ అలా చేయలేదే! కనుక భగవంతుని సంకల్పం మేరకే ఈనాడు ప్రపంచంలో ఇన్ని మతాలు, విశ్వాసాలు, ఆచార వ్యవహారాలు, ఆహార పానీయాదులు, జీవన విధానాలు, సంస్కృతులు, సాంప్ర దాయాలు సమాంతరంగా కొనసాగుతున్నాయి. ప్రపంచంలో ఉన్నవారంతా ఒకే మతానికి చెందిన వారైతే అన్ని సమస్యలూ పరిష్కార మవుతాయని ఎవరైనా భావిస్తే పొరపాటు అవుతుంది. సత్యదూరమే అవుతుంది. ఊహాజనితమైనదై, వాస్తవికతకు దూరంగా జరిగినట్లవుతుంది. ఇపుడు మానవాళి ముందున్న ప్రధాన సమస్య భిన్నమతాలు కాదు. నిజమైన సమస్యలు పేదరికం, అనారోగ్యం, నిరుద్యోగం, కరువు కాటకాలు మొదలైనవి. ఇవి మతాలు పరిష్కరించే సమస్యలు కావు. భిన్నత్వమనేది కేవలం మత సాంప్రదాయాలకు సంబంధించిన అంశం కాదు. భగవంతుడు సృష్టి చేసినపుడు పిల్లి, కుక్క, నక్క ఉంటే చాలనుకోలేదు.84 లక్షల జీవరాసులను సృష్టిం చాడు. ఒకచోట రాత్రి,ఒకచోట పగలు, ఒక ప్రాం తంలో వేడి, మరో చోట ఎండ ఉన్నాయి. మన చేతికున్న ఐదు వేళ్లు ఒకేరకంగా లేవు. అంటే వైవిధ్యం సృష్టి ధర్మం. ఈ వైవిధ్యంలో,భిన్నత్వంలో ఉన్న ఏకత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.వైవిధ్యభరితమైన సృష్టికి మూలం, కర్త, కర్మ, క్రియ అన్నీ భగవం తుడే. భగవంతుని ఒక రూపానికి, నామానికి పరిమితం చేయకుండా సృష్టి, స్థితి లయలకు కారణభూతమైన విశ్వ చైతన్య శక్తిగా మనం గ్రహించగల్గితే సమస్యలుండవు. మానవ దేహానికి చైతన్యం ఉన్నంత సేపు ఆశరీరం శివం. అంటే మంగళకరం. దేహం నుండి చైతన్యం వెలుపలకు వెళ్లిపోతే శ్వాస ఆగిపోతుంది. చలనరహితమవుతుంది. అప్పుడు ఆశరీరాన్ని ఫలానా వారి పార్థివ శరీరమంటాం.ఒక శరీరానికి ఈ చైతన్యం ఎటువంటిదో సకల జగత్తుకూ అలా ఆధారభూతమైనది విశ్వ చైతన్య శక్తే. ఇదే విశ్వమంతటా నిండి నిబిడీకృతమైన ఏకత్వం. మనకు కంటికి కన్పించే, చెవికి విన్పించే అంశాలలో మాత్రమే భిన్నత్వం. కానీ నిత్య సత్యమైనది, భిన్నత్వంలోనున్న ఏకత్వమే (విశ్వ చైతన్య శక్తి). ఏకత్వం నుండే భిన్నత్వం ఆవిర్భవించింది. తుదకు భిన్నత్వమంతా ఏకత్వంలో సంలీనమవుతుంది. ఈనాడున్న అన్ని మతాలనూ మనం ఈ రీతిగానే చూడాలి. ఆరాధనా పద్ధతులను, ఆచారవ్యవహారాలను ఈ రకంగానే అవగాహన చేసుకోవాలి. అన్ని మతాలలో ఉన్న ఏకత్వం ఏమిటంటే.. అవన్నీ కూడా ఉత్తమమైన జీవన విధానాన్నే ప్రబోధిస్తాయి. మానవతా విలువలకే ప్రాధాన్యమిస్తాయి. శాంతి సామరస్యాలనే వాంఛిస్తాయి. పరోపకారం, క్షమ, త్యాగనిరతినే అభిలషిస్తాయి. భేదమంతా సృష్టిని, సృష్టి యందున్న భిన్నత్వాన్ని, భిన్నత్వంలో గల ఏక త్వాన్ని అర్థం చేసుకోలేని సగటు మనిషి మదిలోనే ఉంది.ధనవంతుడు సముద్రం లాంటివాడు. సముద్రంలో ఎన్ని నీళ్ళున్నా ఒక్కడి దాహం కూడా తీరదు. ధనవంతుడు కూడా తీర్చలేడు. సంస్కార వంతుడు బావి లాంటివాడు. బావి తన దగ్గరున్న కొద్ది నీళ్ళతో అందరి దాహం తీరుస్తుంది. అదే మానవత్వం! మా’నవ’ వాదానికి మరో నిర్వచనం అక్కరలేదు. జాతి, మత, ప్రాంతీయ, వర్గ,వర్ణ విభజనలు చూడకుండా బావి అందరి దాహం తీరుస్తుంది. ఇది మా బావి అనీ, అది మీ బావి అని మానవత్వంలేని వారు బావుల్ని, చెరువుల్ని విభజించుకున్నారు. అది మళ్ళీ వేరే విషయం. సరే.. అక్క పెండ్లికి మంచి బహుమతి ఇద్దామని ఇద్దరు చెల్లెళ్ళు కష్టపడి, అతి కష్టం మీద ఐదువేలు దాచిపెట్టుకున్నారు. ఇంతలో ఫేస్‌బుక్‌ ద్వారా కరీంనగర్‌లోని న్యూ ఎస్టీ కాలనీలోని బత్తిని అంజవ్వ గురించి తెలుసుకున్నారు. ఆమె భర్త చనిపోయాడు. చిన్న పాప ఉంది. ఆమెకు కాలేయవ్యాధి – విషయం తెలుసుకున్న ఆ ఆడపిల్లలు వారు దాచి పెట్టుకున్న డబ్బు వెంటనే అంజవ్వకు పంపారు. స్వార్థాన్ని వదులుకుని ఇతరులకు సహాయపడటమే మానవత్వం. ఇలాంటి సంఘటనలు అరుదుగా అక్కడక్కడా జరుగుతూనే ఉంటాయి. బొంబాయి వాసి అమన్‌, రహదారిపై నాలుగు రోజుల పాప ఏడుపు విన్నాడు. నిర్మానుతష్యమైన ప్రదేశం… ఏం చేయాలో తోచక పాపను తనతో తీసుకెళ్ళాడు. అయితే ఆ పసిగుడ్డును పెంచేది ఎలాగో అతనికి తెలియదు. వెంటనే ట్విట్టర్‌లో ఓ పోస్టు పెట్టాడు. అందులో పోలీసులు తనను ఆదుకోవాలని అభ్యర్థించాడు. విషయం పోలీసులకు చేరింది. వాళ్ళు వెంటనే స్పందించి,వచ్చి..పాపను ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయించారు. తర్వాత బాలల అనాథాశ్రయంలో చేర్పించారు. అబద్దాలతో సోషల్‌ మీడియాను కలుషితం చేస్తున్నవారి సంఖ్య చాలా పెద్దది. అయినా, నిజాల్ని నిజంగా బయటికి తెచ్చే వారి సంఖ్యను మనం పెంచుకుని, ఒక ఉద్యమంగా చేసుకోవాలి. కరోనా కాలంలో ఒక సంఘటన జరిగింది. అది మానవ వాదానికి బలాన్నిచ్చింది. అనంతపురంలో ఒక బ్రాహ్మణుడు కరోనాతో చనిపోయాడు. చూడటానికి కానీ, అంత్య క్రియలు జరిపించడానికి గానీ అతని బంధు మిత్రులూ, స్నేహితులు ఎవరూ రాలేదు. రంజాన్‌ ఉపవాసంలో ఉన్న కొందరు ముస్లింలు అక్కడికి వచ్చారు. ఎవరి నుండీ ఏ స్పందనా రాకపోవడంతో వారే పాడె ఏర్పాటు చేశారు. పాడె మోశారు. అంత్యక్రియలు నిర్వహించారు. మానవత్వం ముందు మతం ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుందని ప్రకటించకనే ప్రకటించారు. కొన్ని జీవన సత్యాల్ని మనం పిల్లలకు, యువకులకు అందిస్తూ ఉండాలి. ఎందుకంటే అవి తెలుసకోవడానికి మనతరంలో సగం జీవితం అయిపోయింది కదా?తర్వాత తరాలకు అంత సమయం ఎందుకు పట్టాలి? మన తరం వారు చాలా ఆలస్యంగా నేర్చుకున్నవి రాబోయే తరాలు సత్వరం నేర్చుకోవాలి. దానివల్ల సమాజ పురోగతి వేగం పుంజుకుంటుంది. మానవత్వానికి సంబంధించిన విషయాలు ఊరికే మూర్ఖులతో వాదిస్తూ సమయం వృధా చేసుకోగూడదు. వాళ్ళకు వాళ్ళ మత విశ్వాసాలు, భ్రమలే ముఖ్యం. వాటిని నిలబెట్టుకోవడానికి అడ్డ దిడ్డంగా మాట్లాడుతూ అరుస్తూ ఉంటారు. మనోభావాలు దెబ్బతిన్నాయని బూతులు మాట్లాడుతుంటారు..తప్పించి, నిజాలేమిటో, వాస్తవాలేమిటో వారెంత మాత్రమూ పట్టించుకోరు. 2014 అస్సాం పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్ష పాసయి జ్యోతి అనే అమ్మాయి అసిస్టెంట్‌ ఇన్‌కంటాక్స్‌ కమిషనర్‌ ఉద్యోం సంపాదించింది. ఆ అమ్మాయి 2013లో కంప్యూటర్‌ సైన్సులో డిగ్రీ తీసుకుని, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలు రాసింది. కూతురు ఉద్యోగం సంపాదించిన విషయం తెలుసుకుని ఆమె తండ్రి సోబెరన్‌ ఆనందంలో కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. ఒక జీవిని,ఒక జీవితాన్ని నిలబెట్టిన మానవత్వపు విజయరేఖ అతని కళ్ళలో కనిపించింది. అతిసామాన్యుడే అయినా, ఎంతో మంది గొప్పవాళ్ళకంటే గొప్పవాడు.. సొబెరన్‌! అతను తోపుడు బండిపై కూర గాయలు అమ్ముకునే చిన్నపాటి వ్యాపారి. అతి కష్టం మీద కూతుర్ని చదివించి పెద్ద చేశాడు. అతను గతాన్ని గుర్తు చేసుకుని ఓమాట చెప్పాడు. ‘’నాకు చెత్తకుండీలో అమ్మాయి దొరకలేదు. బొగ్గు గనిలో ఒక వజ్రం దొరికింది’’ అని! ఆమె ఎవరి బిడ్డో అతనికి తెలియదు. కానీ, తల్లీ,దండ్రీ అన్నీతానై ఒక ప్రాణిని బతికించాడు. ఒక జీవితాన్ని నిలబెట్టాడు. అందుకు, అందరూ అతణ్ణి అభినందించాల్సిందే! కొన్నేళ్ళ క్రితం బండి తోసుకుంటూ వెళుతున్నప్పుడు ఒక నిర్జన ప్రదేశంలో చెత్తకుప్పమీద ఏడుస్తూ ఒక ఆడశిశువు కనిపించింది. వెనకా, ముందూ ఏమీ ఆలోచించకుండా పరుగెత్తి ఆశిశువును చేతుల్లోకి తీసుకున్నాడు. అంతే! భారతీయ సమాజంలో ఆదరణ లేక, అవకాశాల్లేక… అవకాశాలివ్వక… ఎన్నో జాతులు శతాబ్దాలుగా నిర్లక్ష్యం చేయబడ్డాయి. ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకోవాలి! మానవత్వాన్ని మేల్కొల్పాలి!! ఒక కూరలమ్ముకుని బతికే వాడికి ఉన్న ఔదార్యం ప్రభుత్వాలకూ, కార్పొరేట్లకూ లేకపోతే ఎలా?చాలా మంది సీతాసాహూ అనే మహిళ పేరు విని ఉండకపోవచ్చు. ఒకప్పుడు విన్నా, మరిచిపోయి ఉండొచ్చు. మన మీడియా ఇలాంటి వారిని పట్టించుకోదు కదా? సీతాసాహూ ఈ దేశానికి రెండు ప్రత్యేక ఒలంపిక్‌ మెడల్స్‌ తెచ్చిన మహిళ. జీవిక కోసం ప్రస్తుతం పానీపురి అమ్ముకుని బతుకుతూ ఉంది. కొందరికి అప్పనంగా ప్రజల సొమ్ము కోట్లకు కోట్లు కట్టబెట్టే మన ప్రభుత్వాలకు కళ్ళూ, చెవులూ రెండూ లేనట్టేనా? ఉత్త పుణ్యానికి భారతరత్న పొంది కోట్లకు కోట్లు సంపాదించిన ఓ క్రికెట్‌ ఆటగాడి పేరు చెబితే.. దేశం యావత్తూ గుర్తుపడుతుంది. అతనేమో ఉచితంగా వచ్చిన తన ఫరారీ కారుకు రాయితీ కావాలని ప్రభుత్వానికి అర్జీపెట్టుకుంటాడు. అలాంటి వారిని నెత్తిన మోసే ప్రభుత్వాలు సీతా సాహూ లాంటివారిని ఎందుకు పట్టించుకోవూ? ఇలాంటి అంశాలు ఎత్తి చూపడం ఎందుకంటే దేశంలో అసమానతలు, వివక్షలు ఉండకూడదని! దీనికి జస్టిస్‌ చంద్ర చూడ్‌ 2018 ఆగస్టు30న ఒక మంచి వివరణ ఇచ్చారు..‘’ప్రజాస్వామ్యానికి అసమ్మతి అనేది ఒక ‘సేఫ్టీవాల్వు’ లాంటిది. దాన్ని అనుమతించకపోతే,ఏకంగా ప్రజాస్వామ్య ప్రెజర్‌ కుక్కర్‌ పేలిపోతుంది!’’ అని. కేవలం మన దేశంలోనే ప్రపంచంలో ఎక్కడా జరగని చిత్ర, విచిత్రాలు జరుగుతుంటాయి. కరోనా వ్యాక్సిన్‌లు అందరితో కలిపి కాకుండా,తమ ‘అగ్రవర్ణం’ వారికి విడిగా వేయాలని కొందరు డిమాండ్‌ చేస్తారు. ఆసుపత్రిలోని పేషంట్లు కొందరు, తమ ‘కులపోడి’ రక్తమే కావాలని డిమాండ్‌ చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో కేరళ రాష్ట్రంలో ఒక అద్భుతం జరిగింది. అక్కడ 1.24లక్షల మంది విద్యార్థులకు కులం లేదు. కేరళ ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో చేరే విద్యార్థులు తాము ఏ కులానికీ, ఏమతానికీ చెందమని స్పష్టం చేశారు.’ప్రతి సంవత్సరం ఇలాంటి చిన్నారుల సంఖ్య తమ రాష్ట్రంలో గణ నీయంగా పెరుగుతూ ఉందని’’ అసెంబ్లీలో కేరళ విద్యామంత్రి సి. రవీంద్రనాథ్‌ ప్రకటిం చారు. దేశంలో ఈ మార్పు ఎంతో ఆశాజ నకంగా కనిపిస్తోంది. ఇతర రాష్ట్ర ప్రభుత్వా లకు స్ఫూర్తినిస్తోంది. కులం-మతం కాలమ్స్‌ వదిలేసి విద్యార్థులు ఇస్తున్న డిక్లరేషన్‌ సంచల నం సృష్టిస్తోంది. ముందు ముందు ఆ కాలమ్స్‌ అప్లికేషన్లలో ప్రింట్‌ చేయకుండా ఉండే పరిస్థితి రావాలని కోరుకుందాం! నార్వేలో ఒక మంచి పద్ధతి వాడుకలో ఉంది. ఉదాహరణకు ఒక మహిళ మరో ఇద్దరిని తీసుకుని రెస్టారెంట్‌కు వెళ్ళిందనుకుందాం. ముగ్గురికి మూడు మీల్స్‌ అని డబ్బు చెల్లిస్తే సరిపోతుంది. ఆమె ఇతర నిస్సహాయులకు సహాయపడాలను కుంటే… మరో రెండు భోజనాలకు అదనంగా డబ్బు చెల్లిస్తుంది. ‘’ఫైవ్‌ మీల్స్‌, టూ సస్పెండెడ్‌’’ అని అంటుంది. ఐదు భోజనాలకు డబ్బు చెల్లించి, మూడు మాత్రమే తీసుకుంటుంది. ఎవరైనా అతిదీన స్థితిలో ఉండి, డబ్బు చెల్లించి భోజనం చేయలేని వాళ్ళు వచ్చి అడిగితే… ఆ రెస్టారెంట్‌ వాళ్ళు వారికి భోజనం పెడతారు! ‘ఎనీ సస్పెండెడ్‌ మీల్స్‌’ అని అడిగిన వారికి ‘’ఎనీ సస్పెండెడ్‌ కాఫీ’’ అని అడిగిన వారికి రెస్టారెంట్‌ సహకరిస్తుంది. అదేదో దానం చేస్తున్నట్టు కాక, కస్టమర్స్‌ గౌరవభావంతో డొనేట్‌ చేస్తారు. అంతే గౌరవభావంతో రెస్టారెంట్‌వాళ్ళూ, పేదలకు అందిస్తారు. మానవీయ విలువలు గల హుందాతనంతో.. అలా ముక్కూ మొహం తెలియకుండా కూడా గౌరవభావంతో చేసే ఆ సహాయం ఎంత గొప్పది? ‘డబ్బులు అదనంగా వస్తున్నాయి కదా? వెనకేసుకుందాం’ అనే వ్యాపార ధోరణీ, కక్కుర్తీ ప్రదర్శించకుండా నిజాయితీగా ప్రజలకు సేవ చేసే మంచి మనసు కూడా రెస్టారెంట్‌ యాజమాన్యానికి ఉంటుంది. విషమ పరిస్థితులు ఎదురై ఆర్థికంగా దిగజారిన వారు కూడా, మానసికంగా కృంగిపోక – హుందాగా ‘ఎనీ సస్పెండెడ్‌ మీల్స్‌’ అని అడగడమే కాదు, తాము కూడా ప్రయోజకులై – సస్పెండెడ్‌ కాఫీ, టిఫిన్‌, మీల్స్‌కు డబ్బు చెల్లించాలని ఉబలాట పడతారు కూడా! అందుకే తెలుగు కవి ఆలూరి బైరాగి అంటారు…‘’కత్తిరించిన ఒత్తులే / వెలుగు తాయి దివ్యంగా-బాధా దగ్ధకంఠాలే పలుకు తాయి శ్రావ్యంగా’’ అని! అందుకే మనకిప్పుడు ఎవరి అవసరం ఉందో తెలుసా? ఈ సమా జంలో ఆర్థిక, సాంఘిక, ప్రాంతీయ అసమా నతలు ఉండకూడదని మానవ జాతి అంతా ఒకటే అని నినదిస్తూ రచనలు చేసే రచయితలు కావాలి. గళమెత్తే గాయకులు కావాలి. ఆ భావాన్ని ప్రతిబింబించే చిత్రకారులూ, శిల్పులూ కావాలి. ఆచరణలో పెట్టగల కార్యకర్తలు, సమాజ సేవకులూ కావాలి! ‘సేవ’ అనే ముసుగు ధరించి రాజకీయాలు చేసే ముసుగు వీరులు వృథా! వృథా!! సమా జాన్ని పాతరాతి యుగంలోకి ఈడ్చుకు పోయే ప్రభుత్వాలు అంతకన్నా వృథా. వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

జిల్లా మినరల్‌ ఫౌండేషన్‌ నిధులు పనితీరు
వినియోగం

ప్రభుత్వం 2015లో డిస్ట్రిక్ట్‌ మినరల్‌ ఫౌండేషన్‌ ఫండ్స్‌ (డీఎంఎఫ్‌)పథకాన్ని మైనింగ్‌-బాధిత వర్గాలతో ప్రయోజనం-భాగస్వామ్య పథకంగా ప్రవేశపెట్టింది.ఈపథకం కింద, మైనింగ్‌ కంపెనీలు 2015కి ముందు మంజూరు చేసిన లీజులకు రాయల్టీ మొత్తంలో 30శాతం,2015 తర్వాత వేలం యంత్రాంగంద్వారా మంజూరు చేయబడిన లీజుల ద్వారా పది శాతం చెల్లి స్తాయి. ఈనిధులు ప్రధాన మంత్రి ఖనిజ్‌ క్షేత్ర కళ్యాణ్‌ యోజనకి అనుసం ధానించబడిన లాభాపేక్షలేని మరియు స్వతంత్ర ట్రస్టులు. మైనింగ్‌ ప్రభావిత సంఘాలు మరియు పర్యావరణం కోసం ఇది వివిధ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంది. ఈ నిధులలో కనీసం 60 శాతం అధిక ప్రాధాన్యత గల ప్రాంతాలకు వినియోగించాలి. ఈ గమనిక యుటిలైజేషన్‌ ఇండెక్స్‌ ద్వారా భారతదేశంలోని టాప్‌ 12 మైనింగ్‌ రాష్ట్రాలలో సేకరణ, కేటాయింపు మరియు వ్యయ విధానాలను విశ్లేషిస్తుంది. సేకరణ నిష్పత్తికి కేటాయింపు మరియు సేకరణ నిష్పత్తికి వ్యయం మరియు అధిక-ప్రాధాన్య ప్రాంతాలకు (డీఎంఎఫ్‌) కేటాయింపు శాతం,ప్రాధాన్యతా ప్రాంతాలలో విస్తరించడం వంటి గుణాత్మక సూచికలు వంటి పరిమాణాత్మక సూచికలపై రాష్ట్రాలను విశ్లేషిస్తుంది. ఛత్తీస్‌గఢ్‌ నంబర్‌ వన్‌ స్థానంలో ఉంది మరియు అన్ని సూచికలలో ఇతర రాష్ట్రాల కంటే నిలకడగా మెరుగ్గా ఉంది. మైనింగ్‌ అనేది తయారీ రంగాలకు ముడిసరుకును అందించే ముఖ్యమైన ప్రాథమిక రంగం. మైనింగ్‌ కార్యకలాపాలు స్థానిక కమ్యూనిటీలకు ఉపాధి అవకాశాలు మరియు అవస్థాపన సౌకర్యాలను అందజేస్తుండగా, ఇవి ప్రతికూల పర్యావరణ, ఆరోగ్యం,జీవనోపాధి ప్రభావాలతో సహా ప్రతికూల బాహ్య ప్రభావాలకు కూడా దారితీయవచ్చు (ఆంటోసి, రుస్సు, టిక్కీ, 2019). గిరిజనఅటవీ-నివాస వర్గాలతో సహామైనింగ్‌ ప్రభావిత వర్గాల సంక్షేమాన్ని భారత ప్రభుత్వం గుర్తిం చింది.అందువల్ల గనులు మరియు ఖని జాలు (అభివృద్ధి మరియు నియంత్రణ) కింద మార్చి 2015లో డిస్ట్రిక్ట్‌ మినరల్‌ ఫౌండేషన్‌ (డీఎంఎఫ్‌) నిధిని ప్రవేశపెట్టింది. సవరణ చట్టం 2015. సవరణ చట్టం 2015లోని సెక్షన్‌ 9మైనింగ్‌ కార్యకలాపాల వల్ల ప్రభావి తమైన ప్రతి జిల్లాలో (డీఎంఎఫ్‌)నిధిని ఏర్పాటు చేయాలని సూచించింది. (డీఎంఎఫ్‌) పథకం కింద, మైనింగ్‌ కంపెనీలు 2015కి ముందు మంజూరు చేసిన లీజులకు రాయల్టీ మొత్తంలో 30 శాతం మరియు 2015 తర్వాత వేలం యంత్రాంగం ద్వారా మంజూరు చేయబడిన లీజుల ద్వారా పదిశాతం చెల్లిస్తాయి. మైనింగ్‌ సంబంధిత కార్యకలాపాల ద్వారా ప్రభా వితమైన వ్యక్తులు మరియు ప్రాంతాల ఆసక్తి మరియు ప్రయోజనం కోసం పని చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది (మినిస్ట్రీ ఆఫ్‌ మైన్స్‌, 2015). (డీఎంఎఫ్‌)ఫండ్‌ స్థానిక కమ్యూ నిటీలను సహజ వనరుల ఆధారిత అభివృద్ధి పర్యావరణ పరిరక్షణలో సమాన భాగస్వా ములుగా గుర్తిస్తుంది. మైనింగ్‌-ప్రభావిత కమ్యూనిటీలతో ప్రయోజనం-భాగస్వామ్యానికి ఫండ్‌ ఒక యంత్రాంగాన్ని అందిస్తుంది. ఇది ఏదైనా నిర్దిష్ట పథకం లేదా పని ప్రాంతంతో ముడిపడి ఉండని ఒక ప్రత్యేక నిధి,ప్రతి ఆర్థిక సంవత్సరం చివరిలో ఇది ముగియదు. బదు లుగా, ఉపయోగించని నిధులు సంవత్సరాలుగా పేరుకుపోతాయి. ప్రస్తుతం, భారతదేశంలోని 22 రాష్ట్రాల్లోని 600 మైనింగ్‌ ప్రభావిత జిల్లాల్లో (డీఎంఎఫ్‌)నిధులు ఏర్పాటు చేయ బడ్డాయి. లాభాపేక్ష లేని ట్రస్టులు ఈ నిధులను నిర్వహిస్తాయి. ప్రతి జిల్లాకు ప్రత్యేక ట్రస్ట్‌ ఉంది.ప్రజల జీవన ప్రమాణాలను మార్చేందుకు మైనింగ్‌ ప్రభావిత ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు సెప్టెంబరు 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఖనీజ్‌ క్షేత్ర కళ్యాణ్‌ యోజనని ప్రకటించింది. పథకం మొత్తం లక్ష్యాలు క్రింది విధంగా ఉన్నాయి (మినిస్ట్రీ ఆఫ్‌ మైన్స్‌, 2017)
(ఎ) మైనింగ్‌ ప్రభావిత ప్రాంతాల్లో వివిధ అభివృద్ధి మరియు సంక్షేమ ప్రాజెక్టులు/ కార్యక్రమాలను అమలు చేయడం. ఈ ప్రాజెక్ట్‌లు/కార్యక్రమాలు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల ప్రస్తుత కొనసాగుతున్న పథకాలు/ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తాయి.
(బి) మైనింగ్‌ జిల్లాల్లోని ప్రజల పర్యావరణం, ఆరోగ్యం మరియు సామాజిక-ఆర్థికాలపై మైనింగ్‌ సమయంలో మరియు తరువాత ప్రతికూల ప్రభావాలను తగ్గించడం/ తగ్గించడం.
(సి) మైనింగ్‌ ప్రాంతాలలో బాధిత ప్రజలకు దీర్ఘకాలిక స్థిరమైన జీవనోపాధిని నిర్ధారించడం.
(డీఎంఎఫ్‌)చట్టంలోని సెక్షన్‌ 20 ప్రకారం, అన్ని రాష్ట్రాలు నియమాలలో చేర్చుతాయి. దీని ప్రకారం, (డీఎంఎఫ్‌)లు తమ తమ జిల్లాల్లోని అమలు చేస్తారు. (ఎ) తాగునీటి సరఫరా, (బి) పర్యావరణ పరిరక్షణ,కాలుష్య నియంత్రణ చర్యలు, (సి) ఆరోగ్య సంరక్షణ, (డి) విద్య, (ఇ) సంక్షేమం వంటి వాటితో సహా, డిఎంఎఫ్‌ నిధులలో కనీసం 60శాతం అధిక ప్రాధాన్యత గల ప్రాంతాలకు వినియోగించబడుతుంది. మహిళలు మరియు పిల్లలు, (ఎఫ్‌) వృద్ధులు వికలాంగుల సంక్షేమం, (జి) నైపుణ్యాభివృద్ధి మరియు (హెచ్‌) పారిశుధ్యం. మిగిలిన నిధులను ఇతర ప్రయోజనాల కోసం వినియోగిస్తారు: (ఎ) భౌతిక మౌలిక సదుపాయాలు, (బి) నీటిపారుదల, (సి) ఇంధనం మరియు వాటర్‌షెడ్‌ అభివృద్ధి మరియు (డి) మైనింగ్‌ జిల్లాల్లో పర్యావరణ నాణ్యతను పెంపొందించడానికి ఏవైనా ఇతర చర్యలు.మార్చి 2020లో, కేంద్ర ప్రభుత్వం (డీఎంఎఫ్‌)నిధులకు సంబంధించి అదనపు సూచనలను జారీ చేసింది.30శాతం నిధులను కోవిడ్‌-19కి సంబంధించిన ఖర్చుల కోసం ఉపయోగించవచ్చని మార్గదర్శకాలు సూచిం చాయి. సవరణ చట్టం 2021 ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వాలు (డీఎంఎఫ్‌)రాజ్యాంగం,విధులను నిర్దేశిస్తూనే ఉండగా, కేంద్ర ప్రభుత్వం కూడా నిధుల కూర్పు మరియు వినియోగానికి సంబం ధించి దిశానిర్దేశం చేయవచ్చు. జూలై 12, 2021న, కేంద్ర ప్రభుత్వం ఒక ఉత్తర్వును జారీ చేసింది, (డీఎంఎఫ్‌) ఫండ్‌ నుండి ఏదైనా ఖర్చులకు ఎలాంటి అనుమతి లేదా ఆమోదం రాష్ట్ర ప్రభుత్వం లేదా ఏదైనా రాష్ట్ర స్థాయి ఏజెన్సీ ద్వారా జరగదు’’ (గనుల మంత్రిత్వ శాఖ, 2021`ప).2015 సెప్టెంబర్‌ 2021 మధ్య (డీఎంఎఫ్‌)నిధుల కోసం రూ.53,830 కోట్లు సేకరించబడ్డాయి. బొగ్గు మరియు లిగ్నైట్‌ నుండి దాదాపు 39శాతం (రూ.20,766 కోట్లు), బొగ్గు మరియు లిగ్నైట్‌ కాకుండా ఇతర ప్రధాన ఖనిజాల నుండి 50శాతం (రూ. 27, 108 కోట్లు),మిగిలిన వాటి నుండి సేకరించ బడిరది. మైనర్‌ ఖనిజాల నుండి 11శాతం (రూ. 5,956 కోట్లు) (మినిస్ట్రీ ఆఫ్‌ మైన్స్‌, 2021). భారతదేశంలో ముఖ్యమైన మైనింగ్‌ రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌,ఛత్తీస్‌గఢ్‌,గోవా, గుజ రాత్‌, జార్ఖండ్‌,కర్ణాటక,మధ్యప్రదేశ్‌, మహా రాష్ట్ర,ఒడిశా,రాజస్థాన్‌,తమిళనాడు,తెలంగాణ. ఈ అగ్ర12 మైనింగ్‌ రాష్ట్రాలు దేశంలోని మొత్తం (డీఎంఎఫ్‌)సేకరణలో 96.4శాతం వాటా కలిగి ఉన్నాయి. అగ్ర 12 మైనింగ్‌ రాష్ట్రాలు సేకరించిన, కేటాయించిన మరియు ఖర్చు చేసిన మొత్తాలను ఇలా ఉన్నాయి. మొదటి నాలుగు రాష్ట్రాలు-ఒడిశా (రూ. 14,934 కోట్లు),ఛత్తీస్‌గఢ్‌ (రూ. 7,651 కోట్లు), జార్ఖండ్‌ (రూ.7,393 కోట్లు), రాజ స్థాన్‌ (రూ. 5,468 కోట్లు) దేశంలోని మొత్తం డిఎమ్‌ఎఫ్‌ వసూళ్లలో దాదాపు 66శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఒడిశా (77శాతం), రాజస్థాన్‌ (82 శాతం) మరియు కర్ణాటక (85 శాతం)(డీఎంఎఫ్‌)ఫండ్‌లో ఎక్కువ భాగం ప్రధాన ఇంధనేతర ఖనిజాల నుండి వచ్చిన ప్పటికీ,జార్ఖండ్‌ తన (డీఎంఎఫ్‌)లో 78శాతం బొగ్గు మరియు లిగ్నైట్‌ నుండి సేకరిస్తుంది (మూర్తి 2). బొగ్గు మరియు లిగ్నైట్‌ నుండి అధిక(డీఎంఎఫ్‌)సేకరణ ఉన్న ఇతర రాష్ట్రాలు తెలంగాణ (89శాతం),మహారాష్ట్ర (88 శాతం),మధ్యప్రదేశ్‌ (70 శాతం),ఛత్తీస్‌గఢ్‌ (54శాతం).ఒడిశాలో అత్యధికంగా రూ.14, 934 కోట్ల డీఎంఎఫ్‌ వసూళ్లు ఉండగా, అందులో కేవలం 50శాతం మాత్రమే ఖర్చు చేసింది. మరోవైపు,ఛత్తీస్‌గఢ్‌ రూ.7,651 కోట్లు వసూలు చేసి 68శాతం ఖర్చుచేసింది. నాలుగు రాష్ట్రాలు ఒడిశా,తెలంగాణ,గుజరాత్‌ ,కర్ణాటక (డీఎంఎఫ్‌)నిధుల సేకరణ కంటే ఎక్కువ మొత్తాన్ని కేటాయించాయి. అయితే, నిధుల కేటాయింపు తప్పనిసరిగా వాస్తవ వ్యయంలోకి అనువదించబడదు. ఉదాహరణకు, ఒడిశా అత్యధిక మొత్తాన్ని కేటాయించగా, అది 49 శాతం మాత్రమే ఖర్చు చేసింది. అదేవిధంగా, కర్ణాటక దాని %ణవీఖీ% సేకరణకు దాదాపు 1.26 రెట్లు కేటాయించింది, అయితే దాని కేటాయించిన నిధులలో 31 శాతం మాత్రమే ఖర్చు చేసింది (మొత్తం సేకరణలో 39 శాతం).సెక్షన్‌ 1లో పేర్కొన్నట్లుగా, మార్గదర్శకాలు కనీసం 60 శాతం(డీఎంఎఫ్‌) నిధులను అధిక ప్రాధాన్యత గల ప్రాంతాల్లో ఉపయోగించాలని సూచిస్తున్నాయి. అయిన ప్పటికీ, అధిక ప్రాధాన్యత మరియు ఇతర ప్రాధాన్యత ప్రాంతాలలో పంపిణీ నిర్దేశించబడలేదు. డేటా,ఇతర సమాచారం లేకపోవడంతో,కొన్నింటిపై వినియోగాన్ని కేంద్రీకరించడం కంటే ప్రాధాన్యతా ప్రాంతా లలో సమానమైన పంపిణీ ఉత్తమమని మేము భావిస్తున్నాము. (డీఎంఎఫ్‌)నిధుల వినియోగాన్ని అంచనా వేయడానికి ఒక మంచి కొలమానం వ్యయానికి సంబంధించిన వివిధ రంగాలలో వైవిధ్యం యొక్క గుణకం (ప్రామాణిక విచలనం సగటు ద్వారా విభజించబడిరది). వైవిధ్యం యొక్క తక్కువ గుణకం మెరుగైన పంపిణీని సూచిస్తుంది. 12 అగ్ర మైనింగ్‌ రాష్ట్రాల్లో 10 (డేటా లభ్యత సమస్యలు)లో రంగాల వారీగా కేటాయింపుల పంపిణీని టేబుల్‌ 3 చూపు తుంది. జార్ఖండ్‌ తన(డీఎంఎఫ్‌)నిధులలో అత్యధిక భాగాన్ని అధిక ప్రాధాన్యత గల ప్రాంతాలకు (89 శాతం) కేటాయించింది. ఏది ఏమైనప్పటికీ, రాష్ట్రం అధిక-ప్రాధాన్య ప్రాంతాలు మరియు ఇతర ప్రాధాన్యతా ప్రాంతాలలో వైవిధ్యం యొక్క పేలవమైన గుణకాన్ని చూపుతుంది.
లక్ష్యాలు
త్రాగునీటి సరఫరా, విద్య, ఆరోగ్యం, పర్యా వరణ పరిరక్షణ మరియు పరిరక్షణ, స్త్రీలు మరియు శిశు సంక్షేమం, వృద్ధులు మరియు వికలాంగుల సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి మరియు పారిశుధ్యం (మినిస్ట్రీ) వంటి అధిక ప్రాధాన్యతా రంగాలకు (డీఎంఎఫ్‌)నిధిలో కనీసం 60 శాతం కేటాయించాలని సూచిస్తుంది. మైన్స్‌, 2015%ప). మిగిలిన నిధిని భౌతిక మౌలిక సదుపాయాలు, నీటి పారుదల,శక్తి అభివృద్ధి మరియు మైనింగ్‌ ప్రాంతాల పర్యావరణ నాణ్యతను పెంపొం దించడానికి ఏవైనా ఇతర చర్యలతో సహా ఇతర ప్రాధాన్యతా రంగాలకు ఉపయోగించ వచ్చు. (డీఎంఎఫ్‌)యుటిలైజేషన్‌ ఇండెక్స్‌ అనేది ఫండ్‌ ఎంత బాగా ఖర్చు చేయబడిరదో అంచనా వేయడానికి పరిమాణాత్మక,గుణాత్మక చర్యల మిశ్రమంగా గణించబడుతుంది. ఒక రాష్ట్రం లేదా జిల్లా మొత్తం (డీఎంఎఫ్‌) కేటాయింపు వ్యయం (డీఎంఎఫ్‌)వినియోగం యొక్క పరిమాణాత్మక సూచిక అయితే, వివిధ ప్రాధాన్యతా రంగాలలో గుణాత్మక వ్యాప్తిని విశ్లేషించడం కూడా అంతే ముఖ్యం. కొన్ని రాష్ట్రాలు లక్ష్యాలను సాధించడంలో ఇతరుల కంటే మెరుగ్గా ఉన్నాయి. రాష్ట్రంలోని జిల్లాలు వాటి ఖర్చుల పరిమాణం మరియు నాణ్యతలో కూడా విభిన్నంగా ఉంటాయి. అయితే, అన్ని రాష్ట్రాలు,జిల్లాలకు నవీకరించబడిన మరియు సంబంధిత డేటా అందుబాటులో లేదు. అందు బాటులో ఉన్న డేటా ఆధారంగా, ప్రస్తుత అధ్యయనం ఆంధ్రప్రదేశ్‌,ఛత్తీస్‌గఢ్‌,గుజరాత్‌, జార్ఖండ్‌,కర్ణాటక,మహారాష్ట్ర,ఒడిషా,రాజస్థాన్‌, తమిళనాడు,తెలంగాణ వంటి పది రాష్ట్రాలకు (డీఎంఎఫ్‌)ని గణిస్తుంది.
మెథడాలజీ
12అగ్రశ్రేణి మైనింగ్‌ రాష్ట్రాలలో10,అంటే ఆంధ్రప్రదేశ్‌,ఛత్తీస్‌గఢ్‌,గుజరాత్‌, జార్ఖండ్‌, కర్ణాటక,మహారాష్ట్ర,ఒడిశా,రాజస్థాన్‌, తమి ళనాడు మరియు తెలంగాణలలో వ్యయ విధా నాలను అధ్యయనం చేయడానికి రాష్ట్ర స్థాయి సూచిక ప్రయత్నిస్తుంది. ఈ రాష్ట్రాలు ఐదు వేర్వేరు సూచికలపై విశ్లేషించబడ్డాయి సేకరణ నిష్పత్తికి కేటాయింపు,సేకరణ నిష్పత్తికి వ్యయం వంటి పరిమాణాత్మక సూచికలుబీ మరియు (సి) అధిక ప్రాధాన్యత గల ప్రాంతాలపై కేటాయింపుల వాటా, (డి) అధిక-ప్రాధాన్య ప్రాంతాలలో కేటాయింపుల వ్యాప్తి మరియు (ఇ) ఇతర ప్రాధాన్య ప్రాంతాలలో కేటాయిం పుల వ్యాప్తి వంటి గుణాత్మక సూచికలు. ఇతర రెండు రాష్ట్రాలు, అంటే గోవా,మధ్యప్రదేశ్‌, అవసరమైన డేటా అందుబాటులో లేనందున సూచిక చేయబడలేదు. పరిమాణాత్మక సూచికలకు 50 శాతం బరువు ఇవ్వబ డుతుంది-మూడిరట ఒక వంతు కేటాయింపు/సేకరణ మరియు మిగిలిన మూడిరట రెండు వంతుల వ్యయం/సేకరణ. కేటాయింపు డేటా ఉద్దేశాలను సూచిస్తున్నప్పుడు, వ్యయాలు పూర్తి చేయబడిన పనిని సూచిస్తాయి మరియు అందు వల్ల కేటాయింపు/సేకరణ కంటే ఖర్చు/సేకరణకు అధిక బరువు కేటాయించబడుతుంది. మిగిలిన 50 శాతం మూడు గుణాత్మక సూచికల మధ్య సమానంగా విభజించబడిరది. ప్రతి రాష్ట్రం యొక్క తుది స్కోర్‌ను లెక్కించడానికి ఈ ఐదు సూచికల సగటు ఉపయోగించబడుతుంది. బరువు రేఖాచిత్రం టేబుల్‌4లో ఇవ్వబడిరది.
(డీఎంఎఫ్‌)ఇండెక్స్‌ అధ్యయనం సెంటర్‌ ఫర్‌ సోషల్‌ అండ్‌ ఎకనామిక్‌ ప్రోగ్రెస్‌ (జూజుూ) సస్టైనబుల్‌ మైనింగ్‌ అట్రాక్టివ్‌నెస్‌ ఇండెక్స్‌ (చద్దా,కపూర్‌,శివమణి, 2021) ఫ్రేజర్‌ ఇన్‌స్టిట్యూట్‌ (కెనడా) ద్వారా మైనింగ్‌ కంపెనీల వార్షిక సర్వే (స్టీడ్‌మ్యాన్‌, యునిస్‌, అలియాక్‌బారి, 2020) మరియు నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ ఎకనామిక్‌ రీసెర్చ్‌ (చీజAజుR) ద్వారా స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పొటెన్షియల్‌ ఇండెక్స్పరిమాణాత్మక మరియు గుణాత్మక సూచికల మధ్య బరువు పంపిణీని అనుకరించడం ద్వారా వెయిటింగ్‌ రేఖాచిత్రం వైవిధ్యత కోసం తనిఖీ చేయబడిరది. పరిమా ణాత్మక సూచికల బరువును 60 శాతానికి పెంచడం మరియు గుణాత్మక సూచికలను 40 శాతానికి తగ్గించడం ఫలితాల క్రమాన్ని ప్రభా వితం చేయలేదు. ఇంకా, పరిమాణాత్మక సూచికల బరువును 40 శాతానికి తగ్గించడం మరియు గుణాత్మక సూచికలను 60 శాతానికి పెంచడం ద్వారా ఇదే విధమైన అనుకరణ అసలైన సమాన-బరువుల ఫలితాల క్రమాన్ని వక్రీకరించలేదు. అందువల్ల, పరిమాణాత్మక మరియు గుణాత్మక సూచికల మధ్య సమాన బరువులు ఎంపిక చేయబడ్డాయి.
డేటా సోర్సెస్‌
మునుపటి విభాగంలో పేర్కొన్న ఐదు సూచికలపై వివిధ ద్వితీయ మూలాల ద్వారా డేటా సేకరించబడిరది. ఈ మూలాల్లో కేంద్ర రాష్ట్ర స్థాయిల నుండి ప్రభుత్వ డేటా ఉంటుం ది. టేబుల్‌ 5 ఈ మూలాల యొక్క వివరణా త్మక జాబితాను అందిస్తుంది. ఆరు రాష్ట్రాలు తమ డైరెక్టరేట్‌ ఆఫ్‌ మైన్స్‌ అండ్‌ జియాలజీ (ణవీG) వెబ్‌సైట్‌లో తాజా డేటాను కలిగి న్నాయి. అయితే, నాలుగు రాష్ట్రాలకు, నవంబర్‌ 2019 నాటికి రంగాల వారీగా కేటాయిం పులను అందించే సెంటర్‌ ఫర్‌ సోషల్‌ అండ్‌ ఎకనా మిక్‌ ప్రోగ్రెస్‌ నివేదిక (శల్య,2020) నుండి డేటా ఉపయోగించబడిరది.
సేకరణ నిష్పత్తికి కేటాయింపు
ఈ నిష్పత్తి సెంటర్‌ ఫర్‌ సోషల్‌ అండ్‌ ఎకనామిక్‌ ప్రోగ్రెస్‌ నిధులను ఖర్చు చేయడంలో రాష్ట్రాల దీర్ఘకాలిక ఉద్దేశాలకు ముఖ్యమైన సూచిక. అధిక నిష్పత్తి సెంటర్‌ ఫర్‌ సోషల్‌ అండ్‌ ఎకనామిక్‌ ప్రోగ్రెస్‌ సేకరణ యొక్క మెరుగైన కేటాయింపును సూచిస్తుంది. సెక్షన్‌ 2లో పేర్కొన్నట్లుగా, కర్ణాటక తన సెంటర్‌ ఫర్‌ సోషల్‌ అండ్‌ ఎకనామిక్‌ ప్రోగ్రెస్‌ సేకరణలో 125శాతం కేటాయించగా,గోవా మొత్తం సెం టర్‌ ఫర్‌ సోషల్‌ అండ్‌ ఎకనామిక్‌ ప్రోగ్రెస్‌ సేకరణలో32శాతం మాత్రమే కేటాయించింది.
సేకరణ నిష్పత్తికి వ్యయం
సేకరణ నిష్పత్తికి వ్యయం అనేది రాష్ట్ర నిజ-సమయ వ్యయ నమూనాల సూచిక. అధిక నిష్పత్తి మెరుగైన ప్రస్తుత/కొనసాగుతున్న పనితీరును సూచిస్తుంది. కర్ణాటక తన సెంటర్‌ ఫర్‌ సోషల్‌ అండ్‌ ఎకనామిక్‌ ప్రోగ్రెస్‌ సేకరణలో 125 శాతం కేటాయించింది, అయితే దాని మొత్తం సేకరణలో 39 శాతం మాత్రమే వివిధ ప్రాజెక్టులకు ఖర్చు చేసింది. %ణవీఖీ% సేకరణలో దాదాపు 98 శాతం కేటాయించినప్పటికీ ఛత్తీస్‌గఢ్‌సెంటర్‌ ఫర్‌ సోషల్‌ అండ్‌ ఎకనామిక్‌ ప్రోగ్రెస్‌ సేకరణలో అత్యధిక శాతం (68శాతం) ఖర్చు చేసింది.
అధిక-ప్రాధాన్య ప్రాంతాలకు మొత్తం కేటాయింపుల శాతం
రాష్ట్రాలు,జిల్లాలు వాటి సంబంధిత కేటాయిం పులు,వ్యయ నమూనాల ఆధారంగా నేరుగా గ్రేడ్‌ చేయబడి ఉండవచ్చు. అయితే, అదే సమయంలో, వారి కేటాయింపు నమూనాల గుణాత్మక అంశాలను సంగ్రహించడం ముఖ్యం. ఉదాహరణకు,గుజరాత్‌ తన సెంటర్‌ ఫర్‌ సోషల్‌ అండ్‌ ఎకనామిక్‌ ప్రోగ్రెస్‌ సేకరణలో దాదాపు 82 శాతం అధిక ప్రాధాన్యత గల ప్రాంతాలకు కేటాయించగా, తమిళనాడు అత్యల్ప శాతం (54శాతం) అధిక ప్రాధాన్యత గల ప్రాంతాలకు కేటాయించింది. ఈనియమాలకు కట్టుబడి ఉండడాన్ని సంగ్రహిం చడంలో మాకు సహాయపడుతుంది,ఇది కనీసం 60శాతం అధిక ప్రాధాన్యతగల ప్రాంతాలపై ఖర్చు చేయబడుతుందని పేర్కొంది.- (రాజేష్‌ చద్దా /ఇషితా కపూర్‌)

పాఠ‌శాల చుట్టూ సామాజిక ఉద్య‌మాన్ని నిర్మిద్దాం..!

ఓవైపు మనమంతా 23 శాతం ఫిట్‌మెంట్‌ వద్దని, మెరుగైన పిఆర్‌సి కావాలనే డిమాండ్లతో పోరాటం చేస్తూ వున్నాం. మరొకపక్క ప్రభుత్వం అనుకున్న విధంగా ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయబోతున్నది. కనుక ‘మాకు ఊరు బడి వుండాల’నే తల్లిదండ్రులను కదిలించి వారితో కలిసి ఉద్యమించాలి. ప్రాథమిక పాఠశాల యథాతథంగా వుంచాలి. సమాంతర మీడియంలను కొనసాగించాలి. ఖాళీగా వున్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి…అనే డిమాండ్లతో సామాజిక ఉద్యమాన్ని నిర్మించాలి. ఇందుకు కలిసి వచ్చే శక్తులను కలుపుకొందాం.
పిఆర్‌సిలో అన్యాయం జరిగితే రోడ్డు మీదకు వచ్చి ప్రతిఘటించింది ఉపాధ్యాయులు. పాఠశాలలను రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా వారిదే. పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కు లను ఊడగొడతూ, కొత్త హక్కుల మాట ఎత్తకుండా చేస్తూ ఎందరికో విద్యా పునాది వేసిన ప్రాథమిక పాఠశాల వ్యవస్థను ధ్వంసం చేసే ప్రయత్నాలను అడ్డుకోవాలి. పాఠశాల చుట్టూ సామాజిక ఉద్య మాన్ని నిర్మించాలి. ప్రాథమిక పాఠశాల-ప్రభుత్వ వైఖరి వచ్చే20ఏళ్ళ తరువాత పోటీ పరీక్షలకు విద్యార్థు లను సిద్ధంచేసేలా ఒకటవ తరగతిలోనే బీజం వేసే ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నాం. 96 శాతం మంది తల్లులు తమ బిడ్డలు ఇంగ్లీషు మీడియంలో చదువుకోవాలని కోరుతున్నారు.అందువల్ల ప్రీప్రె ౖమరీ నుండి ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెడుతు న్నామని ప్రభుత్వం ప్రకటించింది. దానికి అను గుణంగా విద్యాశాఖ వేగంగా చర్యలు తీసుకుం టున్నది.రాష్ట్రంలో పది మంది లోపు విద్యార్థులున్న ప్రాథమిక పాఠ శాలలు1010వుండగా,40లోపు విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలలు 16827. 30లోపువున్న ప్రాథమికోన్నత పాఠశాలలు 1531. వంద లోపు విద్యార్థులున్న ఉన్నత పాఠశాలలు 483.వీటన్నింటిలో46,769మంది ఉపాధ్యా యులు పనిచేస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:30వుండవలసి వుండగా1:16 మాత్రమే వుందని, అలాగే ప్రాథమి కోన్నత పాఠశాలల్లో 1:35 కి బదులుగా 1:7.8 వుందని, ఉన్నత పాఠశాలల్లో 1:40కు బదులుగా 1:24 మాత్రమే వుందని చెబుతున్నారు. కనుక ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిని సవరించాలి. అలాగే తక్కువ విద్యార్థులున్న పాఠశాలలను ప్రత్యామ్నాయ పాఠశాలలుగా మార్చి విద్యా వలంటీర్లతో నడిపితే ఎలా వుంటుందో ఆలోచన చేస్తున్నారు. ఈగణాం కాలను పరిగణ లోకి తీసుకొని మే 30,2020న సర్క్యులర్‌172తీసుకొచ్చారు. మూడు రకాల పాఠ శాల వ్యవస్థను ముందుకుతెచ్చి ప్రాథమిక పాఠశా లల్లోని 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాలని చెప్పారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులు, ఎమ్మెల్సీల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆరురకాల పాఠశాలల వ్య వస్థను ముందుకు తెచ్చి, ఉన్నత పాఠశాలకి 500 మీటర్ల దూరంలోని ప్రాథమిక పాఠశాలలోని 3,4,5 తరగుతులను మాత్రమే విలీనం చేస్తామని చెప్పారు. గతంలో సర్క్యులర్‌ 172కి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి కనుక దానిని యథాతథంగా అమలు చేయడం లేదని తాత్కాలికంగా వెనక్కి తగ్గినా,తర్వాత ఆర్‌.సి.నెం.151 (18-10-20 21) ఉత్త ర్వులు ఇచ్చి దూకుడుగా తాము అనుకున్న విధానాల అమలుకు సిద్ధమయ్యారు. విద్యా హక్కు చట్టానికి భిన్నంగా జీవో 85 తీసుకొచ్చారు.ఈ ఉత్తర్వులలో ఎన్‌ఇపి 2020ని, ప్రాథమిక విద్యాహక్కు చట్టాన్ని ఉటంకిస్తూ…1,2 తరగతుల ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:30గా చూడాలని, ఒకే మీడియంను పరిగణలోకి తీసుకోవాలని, వారానికి 30 నుండి 32 గంటల బోధన సమయం వుండాలని,45 పిరియడ్స్‌ వుండాలని…ప్రాథ మికోన్నత పాఠశాలలో 35లోపు విద్యార్థులున్న చోట, అలాగే 75లోపు విద్యార్థులున్న ఉన్నత పాఠ శాలల్లో స్కూల్‌ అసిస్టెంట్లు ఎందరు వున్నారో లెక్క తేల్చాలని,20లోపు విద్యార్థులున్న ప్రాథమిక పాఠ శాలల్లో పనిచేస్తూ ఉన్నతవిద్య అభ్యసించిన ఉపాధ్యాయుల వివరాలు సేకరించాలని కోరారు. ప్రాథమిక పాఠశాలలు విలీనం అయ్యే ఉన్నత పాఠశాలల్లో సరిపడా గదులు లేకపోతే ఉపాధ్యాయులు ప్రాథమిక పాఠశాలకు వెళ్ళి బోధించాలని, 3కిమీ లోపు ఉన్న ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలలో విలీనం చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. ఉత్తర్వుల సారాంశంగా ప్రాథమిక పాఠశాలల వ్యవస్థ అస్తవ్యస్ధంగా వున్నదని, 3వ తరగతి నుండే సబ్జెక్ట్‌ బోధన, నాణ్యమైన విద్య అందించాలని, అంగన్‌వాడీతో కలిపి 1,2 తరగతులకు పునాది విద్య అందిస్తామని చెబుతున్నారు. పాఠశాల వ్యవస్థ ఎందుకు బలహీనంగా వుందో అధ్యయనం చేసి బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రయత్నం చేయకుండా పాఠశాల వ్యవస్ధను మాయం చేయడానికి చర్యలు తీసుకోవడాన్ని వ్యతిరేకించాలి.
సమాధానం లేని ప్రశ్నలు దేశంలో ఏరాష్ట్రంలో లేని 3-10 తరగతుల వ్యవస్థను ఆంధ్ర ప్రదేశ్‌లో ఎందుకు ప్రవేశపెడుతున్నారు. ఇప్పటికే గిరిజన సంక్షేమ పాఠశాలల్లో చేసిన ఇలాంటి ప్రయోగం విఫలం అయ్యింది కదా! 1-5 తరగతుల విద్యార్థి సామర్థ్యాలు,6-10 తరగతుల సామర్థ్యాలు వేరువేరుగా వుంటాయి కదా. పిరియడ్స్‌ వ్యవస్థ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు బోధన నుండి దూరం చేస్తుంది కదా! ప్లే స్కూల్‌గా వున్న అంగన్‌వాడీ కేంద్రాలలోకి 1,2 తరగతుల పిల్లలను చేర్చడం చదువు నేర్పడానికేనా? ‘ఒక్క పాఠశాల మూసివేయం. ఒక పోస్టు తగ్గించం’ అని ప్రభుత్వం చెబుతూ 1:30 నిష్పత్తిని ముందుకు తీసుకురావడాన్ని ఎలా చూడాలి? పునాది విద్యను నేర్పే ప్రాథమిక పాఠశాలను విడదీసిన తరువాత విద్యార్థికి చదువు దూరం కాదా! 1 కిమీలో పాఠశాల వుండాలనే ప్రాథమిక విద్యా హక్కు చట్టం నిబంధనకు ప్రస్తుత ఉత్తర్వులు విరుద్ధం కాదా! ఎన్‌ఇపి 2020 లోని 8వ తరగతి లోపు మాతృభాషలో విద్య అనేది ఎందుకు విస్మరించారు. ఎన్‌ఇపి 2020లో 3,4,5 తరగతులను ప్రాథమిక విద్య నుండి విడదీయాలని ఎక్కడైనా వుందా! తమ నివాస ప్రాంతాలలో స్కూలు లేకపోతే… దూరం పోలేని, దూరం పంపించడానికి ఇష్టపడని విద్యార్థులు పాఠశాలకు దూరం కారా! ఇప్పటికే ఖాళీగా వున్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి పాఠశాల వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకోకుండా మరిన్ని ఉపాధ్యాయ పోస్టులను మిగులుగా చూపించడానికి చేసే ప్రయత్నం కాదా! ఒకే మీడియం వల్ల ఇప్పటికే ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న సబ్జెక్ట్‌ ఉపాధ్యాయులు మిగులుగా మారిపోతే, 3,4,5 తరగతులు ఉన్నత పాఠశాలల్లో విలీనం వల్ల వచ్చే ఎస్‌జిటి ఉపాధ్యాయులకు పదోన్నతులు రావు కదా! మొత్తం విద్యార్థులు, మొత్తం ఉపాధ్యాయులను పరిగణ లోనికి తీసుకొని ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తిని నిర్ధారించడం అశాస్త్రీయం కదా! ఉన్నత పాఠశాలల్లో సెక్షన్ల వారీ ఉపాధ్యాయుల సంఖ్యను కేటాయించాలి కదా! ఇంకా ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం లేకపోగా… విప్లవాత్మకమైన మార్పులను మీరు అంగీకరించాలని చెబుతున్నారు. ఐనా ‘ఒక్క సంవత్సరం ఆగండి. మా సంస్కరణలు మంచి ఫలితాలు ఇస్తాయ’ని చెబుతున్నారు.
ఏం జరగబోతున్నది ?
75 సంవత్సరాలుగా ప్రజలందరికి అమ్మ ఒడి లాంటి ప్రాథమిక వ్యవస్థ కనుమరుగవుతుంది. విద్యార్థులు లేక కొన్ని, విలీనం వల్ల అన్ని ప్రాథమిక పాఠశాలలతో పాటు ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు కొన్ని మాయమవుతాయి. ఉపాధ్యాయుల సంఖ్య (సుమారు 54 వేలు) తగ్గిపోతుంది. 1-2 తరగతుల విద్యార్థులకు నాణ్యమైన బోధన వుండదు. ఇప్పటికే బడి బయట వున్న విద్యార్థులకు తోడు మరింత మంది విద్యార్థులు చదువుకు దూరం అవుతారు.
ఏం చేయాలి ?
ఓవైపు మనమంతా 23శాతం ఫిట్‌మెంట్‌ వద్దని, మెరుగైన పిఆర్‌సి కావాలనే డిమాండ్లతో పోరాటం చేస్తూ వున్నాం. మరొకపక్క ప్రభుత్వం అనుకున్న విధంగా ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయబోతున్నది. కనుక ‘మాకు ఊరు బడి వుండాల’నే తల్లిదండ్రులను కదిలించి వారితో కలిసి ఉద్యమించాలి. ప్రాథమిక పాఠశాల యథాతథంగా వుంచాలి. సమాంతర మీడియంలను కొనసాగించాలి. ఖాళీగా వున్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి…అనే డిమాండ్లతో సామాజిక ఉద్యమాన్ని నిర్మించాలి. ఇందుకు కలిసి వచ్చే శక్తులను కలుపుకొందాం. వ్యాసకర్త : యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు- ఎన్‌. వెంకటేశ్వర్లు

మన పంచాయితీ..మనదే రాజ్యాం

‘‘పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ, ప్రజలకు కావలసిన సౌక ర్యాల కల్పనలో వార్డు సభ్యుల పాత్ర చాలా కీలకం. వార్డు సభ్యులు పంచాయతీ సమావేశాల్లో, కార్యాచరణ కమిటీల్లో సభ్యులుగా తమ బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుంది. పంచాయతీ అంటే సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, వార్డు సభ్యులతో పాటు పంచాయతీ కార్యదర్శి ప్రభుత్వం తరపున ప్రధాన పరిపాలనా ఉద్యోగిగా ఉంటారు. పరిపాలనాపరమైన నిర్ణయాలను తీసుకునే అధికారం సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, వార్డు సభ్యులది కాగా, ఆ నిర్ణయా లను అమలు చేసే బాధ్యత మాత్రం కార్యదర్శిది. దీంట్లో భాగంగా గ్రామసభ విధివిధానాలను పాటిస్తూ విశాఖ జిల్లా అనంతగిరి మండలం బొర్రా పంచాయితీ గ్రామసభ సంర్పంచ్‌ జన్ని అప్పారావు అధ్యక్షతన జరిగింది. పలు అంశాలపై తీర్మాణాలు చేశారు. విశేషాధి కారులన్న పీసా చట్టంపై ప్రతి గిరిజన గ్రామం లోను గిరిజనులను చైతన్య పర్చడం, పంచా యితీకి ఆదాయవనరులపైన, గిరిజను లకు సమత తీర్పును అనుసరిస్తూ స్థానిక వనరులను కాపాడుకోవడం వంటి అంశాలను గ్రామసభలో తీర్మానించి ఆమోదించడం జరిగింది’’
బొర్రా గేటువలస పంచాయతీ సర్పంచ్‌ జన్ని అప్పారావు అధ్యక్షతన గ్రామసభ జరిగింది. పంచాయితీ పరిధిలో ఉన్న 15గ్రామాల నుంచి పంచాయితీ సభ్యులు,మరియు కొంతమంది గ్రామస్థులు,వివిధ శాఖల అధికారులు,మార్కెట్‌ యార్డ్‌ కమిటి డైరెక్టర్‌ దోనేరి పార్వతి, ఎం.పి. టి.సి.కురిసేలా అరుణ, పీసా ఉపాధ్యక్షులు దోనేరి డానియల్‌, మరియు బొర్రా స్కూల్‌ సిబ్బంది,ఉపాధి హామీ పధకం వి.ఆర్‌.పి సాంరెడ్డి గోపి,టెక్నీకల్‌ అసిస్టెంట్‌ జగన్‌,హెల్త్‌ సిబ్బంది,సచివాలయం సిబ్బంది హజర య్యారు.గ్రామసభలో పంచాయితీ సర్పంచ్‌ జన్ని అప్పారావు మాట్లాడుతూ బొర్రా పంచాయితీని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి అధికారులు,ప్రజలు సహకరించాలని కోరారు. అనంతరం సభ్యుల ఆమోదం,పంచాయితీ అభివృద్ధి చేయడానికి కావాల్సిన వనరులను రాబట్టేందకుగాను పీసా చట్టం ప్రకారం పలు అంశాలను తీర్మానిం చారు. బొర్రా గుహల వద్ద వాహన పార్కింగ్‌, ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక సంస్థ నుంచి పంచా యితీకి రావాల్సిన 20శాతం వాటా,వీధి దీపాలు ఆధునీకరణ,ఎన్‌ఆర్‌జీఎస్‌ పనిదినాలకు రావాల్సిన కూలీల సొమ్ములు, వేసవికాలం సమీపిస్తున్న నేపథ్యంలో గిరిజన ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా మంచినీటి సౌకర్యం కల్పించడం వంటి ముఖ్యమైన అంశాలను తీర్మాణించడం జరిగింది. తర్వాత సర్పంచ్‌ జన్ని అప్పారావు స్వాగతం పలికి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మేము ఆరోగ్య శ్రీ,రేషన్‌ కార్డు, పెన్షన్‌,పి.యం.కిసాన్‌, రైతు భరోసా మొదలగు పధకాల గురించి పంచాయతీ ఆఫీసు లో బోర్డు పెట్టియున్నాము. అది మీరు చదువుకొని ఏదైనా సమస్య ఉంటె మీరు సచివాలయం నకు పిర్యాదు చేయవచ్చు. అలానే మన సమస్యలు ఏమి ఉన్న ఇక్కడ చర్చించా వచ్చు. గతంలో మన గ్రామాల్లో నీటి సమస్య ఎక్కువగా ఉండేది. మరి ఇప్పుడు కొంతవరకు ఈ సమస్యను తగ్గించడం జరిగింది. ఇప్పుడు కొన్ని గ్రామాల్లో కరెంటు కొరత ఉంది. గ్రామాల్లో కరెంటు స్తంభాలు వేయాలి. ఆ సమస్య కూడా ఎలెక్ట్రిసిటీ వారితో మాట్లాడతానని చెప్పారు. సర్పంచిగా నేను మాట్లాడటం కాదు…అన్ని శాఖలు నుండి గవర్నమెంటు వారు వచ్చారు కాబట్టి ఒకొక్కరిని మాట్లాడమని పిలవడం జరిగింది. సంవత్స రానికి మూడు, నాలుగు గ్రామసభలు జరుగు తాయి. ఒకటి సాధారణ సమావేశం,మిగతావి గ్రామసభ ఇందులో మనకి ఉన్న సమస్యలు గురించి చర్చించు కోవడం. ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలకు తీర్మానాలు చేయడం జరుగుతుంది. ఈసందర్భంగా బొర్రా కేవ్స్‌ పార్కింగ్‌ గురించి ఒకతీర్మానం చేయడం జరిగింది. డి.పి.ఓ. డి.ఎల్‌.పి.ఓగారికి కూడా లెటర్‌ ఇవ్వడం జరిగింది. ఈరోజూ ట్రయిల్‌రన్‌ చేసి పి.ఓ గారి ద్వారా ఓపెన్‌ చేయడం జరుగుతుంది. పార్కింగ్‌ ఫీజు పంచాయతీ వాసులు చేస్తది. వ్యాసకర్త : కె.సతీష్‌కుమార్‌,సమత ఫీల్డ్‌కో`ఆర్డినేటర్‌

1 20 21 22 23 24 48