ప్రజాస్వామ్యానికి హక్కులే పునాదులు

భారత రాజ్యాంగం, దాని మౌలిక విలువలకు తిలోదకాలిస్తున్న నేటి సమాజంలో రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయంగా భారతజాతిలో సామాజిక చైతన్యం, రాజ్యాంగ అధ్యయనం అన్ని వర్గాల ప్రజలకు అనివార్యంగా ఏర్పడిరది. రెండు దశాబ్దా లకుపైగా జరిగిన సుదీర్ఘ స్వాతంత్య్ర పోరాటం ఎందరో మహనీయుల ఆత్మత్యాగాల ఫలితంగా మనదేశ దాస్యశృంఖాలాలకు విముక్తి లభించింది. స్వతంత్య్ర భారత తొలినాటి నేతలు పేదరికాన్ని మరియు దాని కవలలైన ఆకలి, అనారోగ్యం రూపుమాపి పౌరులందరికి గౌరవ ప్రదమైన జీవనానికి బాటలు వేస్తామనే ప్రతిజ్ఞలతో పాలన ఆరంభించారు. మనదేశ ప్రజల జీవితాన్ని క్రమ బద్ధంగా నిర్వహించు కొనుటకు ఏర్పడ్డదే రాజ్యాం గం. మనదేశానికి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు. దానిలోని ప్రధానాంశాలైన,శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖల వ్యవస్థీకరణ, అధికా రాలు, విధులు, పౌరుల హక్కులు, బాధ్య తలు, ఆదేశసూత్రాలు మొదలగునవన్ని పొందు పరుచు కున్న నిబంధనావళే రాజ్యాంగం. మన దేశానికి రాజ్యాంగమే మూలస్తంబం.
డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ చెప్పినట్లు గా రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కు ద్వారా వృత్తు లు,సంపద,రాజకీయాలు,విద్య,వివాహం, హిందూమతాన్ని ప్రజాస్వామ్యీ కరించాలి. ఇదే బహుజన ప్రజాస్వామిక విప్లవం.ఆవిప్లవ లక్ష్యాల పరిపూర్తి ఇంకా మిగిలే ఉంది. వాటిని సమగ్రం గా సాధించడమనేది బహుజ నుల రాజకీయ చైతన్యంపై ఆధారపడి ఉంది. మన సమాజంలో మనుషులందరూ సమానమే అన్న భావన ఏనాడూ లేదు. వర్ణవ్యవస్థ, కుల వ్యవస్థ మను షుల్లో హెచ్చుతగ్గులు సృష్టించి స్థిర పరిచాయి. భారత రాజ్యాంగం ప్రప్రథమంగా అందుకు భిన్నంగా మనుషులందరూ సమాన మేనని గుర్తించింది. ఈ దృష్ట్యా భారత రాజ్యాంగ విప్లవ స్వభావం గురించి చర్చజరగాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉంది.ఈ చర్చకు అగ్రశ్రేణి మార్క్సిస్టు మేధావి అయిన ప్రభాత్‌ పట్నాయక్‌ మన రాజ్యాంగం గురించి చేసిన వ్యాఖ్యలను పునాదిగా చేసుకోవలసి ఉంది.‘భారతీయ సామా జిక చరిత్ర వ్యవస్థీకృత అసమానతలతో నిండి పోయి ఉంది. మన రాజ్యాంగం ప్రజలకు సార్వ త్రిక ఓటుహక్కు కల్పించడం ద్వారా రాజకీయ రంగంలో సమానత్వాన్ని ఆమోదించింది. కాబట్టి రాజకీయ సమానత్వం ద్వారా సామాజిక, ఆర్థిక రంగాలలో సమానత్వాన్ని తీసుకురావాల’న్న డాక్టర్‌ అంబేడ్కర్‌ వ్యాఖ్యలను ఉటంకిస్తూ భారత రాజ్యాంగానికి విప్లవ స్వభావం ఉందని ప్రభాత్‌ పట్నాయక్‌ అన్నారు.ఈ విప్లవ స్వభావానికి రెండు రకాల రాజ్యాంగ ఉద్యమాలు పునాదిగా ఉన్నా యని ఆయన అన్నారు. మొదటిది బ్రిటిష్‌ వలస పాలన వ్యతిరేక ఉద్యమం కాగా రెండోది పూలే నుంచి అంబేడ్కర్‌ దాకా సాగిన సామాజిక విముక్తి ఉద్యమాలని ఆయన తెలిపారు. వైపరీత్యమే మంటే ఈ దేశంలోని ఏ కమ్యూనిస్టు పార్టీ కూడా భారత రాజ్యాంగ ఆవిర్భా వాన్ని దీర్ఘకాలిక విప్లవంగా గుర్తించడం లేదు. అందుకే అవి జనతా ప్రజాతంత్ర, సోషలిస్టు విప్లవ కార్యక్రమా లను ప్రకటించుకుని పనిచేస్తు న్నాయి. అన్ని కమ్యూనిస్టు పార్టీలు భారత రాజ్యాంగం బూర్జువా రాజ్యాంగమని దాన్ని కూల్చి వేయడమే లక్ష్యంగా ప్రకటించుకున్నాయి.మరి ఆపార్టీల వారే ఇటీవలి కాలంలో రాజ్యాంగ పరి రక్షణ కోసం పిలుపులు ఇస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే రాజ్యాంగం విష యంలో వారిఅంచనాలు సరైనవి కావని స్పష్ట మయింది. మన రాజ్యాంగం ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో సమానత్వాన్ని సాధించేం దుకు సామాజికన్యాయాన్ని లక్ష్యంగా ప్రకటించు కున్నది. దీనికి సంబంధించే రాజ్యాంగంలో అనేక అధికరణలు ఉన్నాయి. చట్టం ముందు అందరూ సమానులేనని 14వ అధికరణం ప్రకటించింది. మతం,జాతి,కులం,లింగం,ప్రాంతాన్ని బట్టి వివక్ష పాటించడాన్ని 15వ అధికరణం నిషేధించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకా శాలు కల్పించాలని అధికరణం 16 నిర్దేశించింది. 17వ అధికరణం అంటరానితనాన్ని నిషేధిం చింది. 19వ అధికరణం భావప్రకటన స్వేచ్ఛను, 21వ అధికరణం పౌరరక్షణ, వ్యక్తిగతస్వేచ్ఛను కల్పించాయి. వెట్టిచాకిరిని 23వ అధికరణం రద్దు చేసింది.14ఏళ్ల లోపు పిల్లలచేత ప్రమాదకర పనులు చేయించరాదని 24వ అధికరణం స్పష్టం చేసింది. సమాజంలో ఆర్థిక,రాజకీయ,సామా జిక న్యాయాన్ని సమృద్ధపరిచేందుకు ప్రభుత్వం పాటుపడాలని అధికరణం 38 పేర్కొంది. అలాగే స్త్రీపురుషులిరువురికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. పిల్లలు దోపిడీకి గురికాకుండా ఆరోగ్యంగా అభివృద్ధి చెందేందుకు అవకాశాలు కల్పించాలని ప్రకటించింది. ప్రతి పౌరుడూ సమానావకాశాలు పొందటానికి న్యాయవ్యవస్థ పనిచేసే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని అధికరణం 39(ఎ) ఆదేశించింది. ముఖ్యంగా 46వ అధికరణం బలహీన తరగతులకు చెందిన వారి పిల్లలు విద్యాపరంగా, ఆర్థికపరంగా ఎదిగేందుకు ప్రత్యేకచర్యలు చేపట్టాలని నిర్దేశించింది. ప్రత్యేకించి దళితులు, గిరిజనులను అన్ని రకాల అన్యాయాలు, దోపిడీ నుంచి రక్షిం చాలి. ప్రజలందరికీ పౌష్టికాహార స్థాయి, జీవన ప్రమాణాలు పెంచడం ప్రభుత్వ బాధ్యత అని 40వఅధికరణం చెప్పింది. ఇంకా ఎన్నో అధిక రణాలు పౌరుల సర్వతోముఖాభివృద్ధికి చేపట్ట వలసిన చర్యల గురించి వివరించాయి.
అందుకనే ‘భారత రాజ్యాంగం ప్రథ మంగా ఒక సామాజిక పత్రం’ అని గ్రాన్‌ విల్లి ఆస్టిన్‌ వ్యాఖ్యానించాడు. భారత రాజ్యాంగంలోని అత్యధిక అధికరణాలు సామాజిక న్యాయ లక్ష్యా లను సాధించడానికి లేదా సామాజిక విప్లవ ఉద్దేశాలను సాధించడానికి అవసరమైన పరిస్థితు లను స్థాపించడం కోసమే నేరుగా ఉద్దేశించినవి. కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ మొత్తం రాజ్యాంగం జాతీయ పునరుజ్జీవనాన్ని లక్ష్యంగా పెట్టుకుని సామాజిక న్యాయాన్ని సాధించడానికి మూడవ భాగంలోని ఆర్టికల్స్‌ కృషి చేస్తున్నాయి. ప్రాథమిక హక్కులు, రాజ్య విధానపు ఆదేశికసూత్రాలు ఈ లక్ష్యం వైపుగా పయనించడానికి ఉద్దేశించినవి. రాజ్యాంగంలోని 3,4వ భాగాలు అతి ముఖ్యమైన వని ఆస్టిన్‌ అంటాడు. అయితే ఇంతటి విప్లవ స్వభావం కలిగిన రాజ్యాంగాన్ని అటు కమ్యూనిస్టు శ్రేణులు ఇటు బహుజన శ్రేణులు కూడా సరిగా గుర్తించలేకపోతున్నాయి. రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కును సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా బలహీన వర్గాలవారు చట్టసభలలో తమ ప్రాతినిధ్యాన్ని పెంచుకోవచ్చు. అందుకోసం తమ కాళ్లపై తాము నిలబడే విధంగా స్వతంత్ర రాజకీ యాలు చేయాలి. తమ జనాభాకు అనుగుణంగా రాజకీయ ప్రాతినిధ్యం ఉండేలా దామాషా ఎన్ని కల పద్ధతిని వారు డిమాండ్‌ చేయవచ్చు.
ఇవాళ దేశంలో ప్రభుత్వరంగ సంస్థ లను పూర్తిగా ప్రైవేటీకరిస్తున్నారు. సంక్షేమ వ్యయా లపై కూడా ప్రభుత్వాలు కోతలు విధిస్తున్నాయి. ఈ పరిణామాలను‘సామాజిక ప్రతీఘాత విప్ల వం’గా ప్రభాత్‌ పట్నాయక్‌ విశ్లేషించారు.ఈ ప్రతీఘాత విప్లవం ప్రధానంగా దళితులు, మైనారి టీలు, మహిళలను కేంద్రంగా చేసుకుని కొనసాగు తోందని ఆయన అన్నారు. ఇటువంటి పరిస్థితు లలో అణగారిన కులాలు, తరగతులు రక్షణ పొందాలంటే వారి ప్రాతినిధ్యం పెరగాలి. అంటే శాసనాలు చేసే రాజకీయ అధికారం ఉన్నప్పుడే ప్రస్తుత పరిస్థితుల నుంచి రక్షణ పొందే అవకాశం ఉంది. అలాగే ఇప్పటివరకు 15శాతంగా ఉన్న అగ్రకులాలు రాజకీయాలలో 66.5శాతం, వాణిజ్య వ్యాపార రంగాల్లో 97శాతం,ఉపాధి 87శాతం వాటాలు పొందడం అనేది ప్రజా స్వామ్య సూత్రానికి విరుద్ధం. డాక్టర్‌ అంబేడ్కర్‌ చెప్పినట్లుగా రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కు ద్వారా వృత్తులు,సంపద, రాజకీయాలు, విద్య, వివాహం,హిందూమతాన్ని ప్రజాస్వామ్యీ కరిం చాలి.దీన్నే బహుజన ప్రజాస్వామిక విప్లవం అని అంటున్నాను. ఈ విప్లవం 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి రావడంతో ప్రారంభమైంది.ఈవిప్లవ లక్ష్యాల పరిపూర్తి ఇంకా మిగిలే ఉంది. ఆ సమున్నత లక్ష్యాలను సమగ్రంగా సాధించడమనేది బహుజనుల రాజకీయ చైతన్యం పై ఆధారపడి ఉంది.
భారత రాజ్యాంగాన్ని ఆమోదించి…
భారత రాజ్యాంగాన్ని ఆమోదించి ఇవాళ్టికి 74 ఏళ్లు.ఈ సందర్భంగా దేశవ్యా ప్తంగా రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటు న్నారు. 1949లో ఇదే రోజున(నవంబర్‌ 26) భారత రాజ్యాంగానికి రాజ్యాంగ సభ ఆమోదం తెలిపిం ది. అందుకే ప్రతి ఏటా నవంబర్‌ 26న రాజ్యాంగ దినోత్స వాన్ని జరుపుకుంటున్నారు. నవంబర్‌ 26ను నేషనల్‌ లా డే..లేదా ..సంవిధాన్‌ దివస్‌ గానూ పిలుస్తారు.1950 జవనరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
భారత రాజ్యాంగ రచనకు ఎన్నికైన రాజ్యాంగ పరిషత్‌ వివిధ అంశాల పరిశీలనకు 22 కమిటీలను,7ఉప కమిటీలను ఏర్పాటు చేసింది.వీటిలో అత్యంత ముఖ్యమైన ముసాయిదా కమిటిని 1947ఆగస్టు 29న బీఆర్‌ అంబేద్కర్‌ అధ్యక్షతన ఆరుగురు సభ్యులతో ఏర్పాటు చేశారు. రాజ్యాంగ పరిషత్‌ 11సార్లు సమావేశమైంది. ముసాయిదా తయారీలో భాగంగా అంబేద్కర్‌ స్వయంగా 60 దేశాలకు చెందిన రాజ్యాంగాలను చదివారు.మొత్తంగా రెండేళ్ల 11నెలల18 రోజులపాటు కష్టించి..సుదీర్ఘ మేధోమథనం తర్వాత ముసాయిదా కమిటీ హిందీ,ఇంగ్లీష్‌లో కాపీలను తయారు చేసింది. దీనిపై రాజ్యాంగ పరిషత్‌లో 115రోజులు చర్చించి.. 2వేల 473 సవరణలతో1949 నవంబర్‌ 26న ఆమోదిం చారు. యేటా నవంబర్‌ 26న రాజ్యాంగ దినోత్స వం జరుపుకోవాలని 2015,నవంబర్‌ 19న భారతప్రభుత్వం ప్రకటించింది. అంబేద్కర్‌ 125 వ జయంతి వేడుకలను సందర్భంగా ముంబైలో ఆయన విగ్రహానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ప్రధాని ఈ ప్రకటన చేశారు. అంబే ద్కర్‌కు నివాళిగా రాజ్యాంగ దినోత్సవం జరుపు తున్నట్టు కేంద్రం ప్రకటించింది. రాజ్యాంగ దినో త్సవం పబ్లిక్‌ హాలిడే కాదు. కానీప్రభుత్వ విభాగా ల్లో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. గత నాలుగేళ్లుగా రాజ్యాంగ దినోత్సవం జరుపుకుం టున్నా..ఈసారి వేడుకలకు మాత్రం ఓ స్పెషాలిటీ ఉంది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్ల మెంటులో ఘనంగా వేడుకలు నిర్వహించ నున్నారు.
భారత రాజ్యాంగం అమలు
1947 ఆగస్టు 15న భారత స్వాతం త్య్రం తర్వాత పీల్చిన తర్వాత రాజ్యాంగ రచనకి సన్నాహాలు జరిగాయి. రాజ్యాంగ నిర్మాణం కోసం చాలా కసరత్తులు జరిగాయి. ఎన్నో వ్యయప్ర యాసలకు ఓర్చి 2సంవత్సరాల 11నెలల 18 రోజులు కష్టపడి అంబేడ్కర్‌ సారథ్యంలో కమిటీ పూర్తి స్థాయి రాజ్యాంగాన్ని రూపొందించింది. అనేక మేథోమధనాల మధ్య భారత ప్రజల శ్రేయస్సు కోసం లిఖిత రాజ్యాంగాన్ని రచించారు. 1949 నవంబర్‌ 26న అప్పటి అసెంబ్లీ దీన్ని ఆమోదించింది. రెండు నెలలు తర్వాత 1950 జనవరి 26నభారతదేశ మ్నెదటి రాష్ట్రపతి డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ జాతీయ జెండాను ఎగురవేసి దేశాన్ని సంపూర్ణ గణతంత్ర దేశంగా ప్రకటిం చారు. ఆరోజు నుంచి దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
రాజ్యాంగ దినోత్సవం
2015లో అంబేద్కర్‌ 125వ జయం తి సందర్భంగా నవంబర్‌ 26న రాజ్యాంగ దినో త్సవంగా జరపాలని భారత ప్రభుత్వం నిర్ణయిం చింది.ఈ మేరకు నవంబరు19న కేంద్ర ప్రభు త్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. అప్పటి నుంచి నవంబర్‌ 26న రాజ్యాంగ దినోత్స వాన్ని జరుపుకుంటున్నాం.
రాజ్యాంగ దినోత్సవం అంటే ఏంటీ?
రాజ్యాంగం అనగా ప్రభుత్వం యొక్క విధానం.ఈ రాజ్యాంగంలో చట్టాలు, ప్రభుత్వాలు నడుచుకునే విధానాలు,ఆదేశికసూత్రాలు, రాజ్యాం గపరమైన విధులు విధానాలూ పొందు పరచబడి వుంటాయి.ప్రతి దేశానికి ప్రభుత్వ మనేది సర్వ సాధారణం.ప్రతి ప్రభుత్వానికి రాజ్యాంగం అను నది అతి ముఖ్యమైంది.ప్రభుత్వం అనునది శరీర మైతే,రాజ్యాంగం అనునది ఆత్మ లాంటిది. ప్రభు త్వాలకు దిశానిర్దేశాలు చూపించేదే ఈ రాజ్యాం గం.
ఎందుకు జరుపుకొంటారు?
1949 నవంబర్‌ 26న రాజ్యాంగానికి ఆమోద ముద్ర పడినా…రాజ్యాంగ దినోత్సవం నిర్వహిం చలేదు. ఆ ఆనవాయితీ 2015లో మొదలైంది. ప్రతీ ఏటా నవంబర్‌ 26న రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని భారత ప్రభుత్వం 2015 నవంబర్‌ 19న గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సుదీర్ఘకాలం పరాయి పాలనలో మగ్గిన దేశం భారతదేశం. ఎందరో స్వాతంత్య్ర సమర యోధుల త్యాగ ఫలితాలతో 1947 ఆగస్టు 15న స్వతంత్ర భారత్‌గా అవతరించింది. ఆ తర్వాత ప్రతి స్వతంత్ర దేశానికి ఒక రాజ్యాంగం వుండా లి. రాజ్యాంగం అంటే దేశానికి, ప్రజలకు, ప్రభు త్వానికి కరదీపిక వంటిది.ఆ దీపస్తంభపు వెలుగు ల్లో సర్వసత్తాక సౌర్వభౌమాధికార దేశంగా ప్రగతివైపు అడుగులు వేయాలి.అందుకనే రాజ్యాం గానికి ఆధునిక ప్రజాస్వామ్య చరిత్రలో అంతటి విశిష్టమైన స్థానముంది. కోట్లాదిమంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మనదేశం కంటే ముందు అనేకదేశాలు రాజ్యాంగాలను రచిం చాయి. అయితే భారత రాజ్యాంగ రచన ఒక సంక్లిష్టం.దీనికి కారణం..దేశంలో అనేక మతాలు, తెగలు, ఆదీవాసీలు,దళితులు, అణగా రిన, పీడనకుగురైన వర్గాలు తదితరులున్నారు.వీరి ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యాంగ రచన ఒక సవాల్‌లాంటిదే. ఈ నేపథ్యంలో భారత మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్‌ నేతృత్వంలోని రాజ్యాంగసభ డా.బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ సారధిగా డ్రాఫ్టింగ్‌ కమిటీని ఏర్పాటైంది. రాజ్యాం గ రూపకర్త అంబేద్కర్‌ భిన్నత్వ సమ్మేళితమైన దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఎంత గానో శ్రమించారు. రాజ్యాంగమంటే కేవలం ప్రభుత్వ విధివిధానాలు, శాసనసభల రూపకల్పనే కాదు కోట్లాది పీడిత ప్రజల ఆశయాలను ప్రతి బింభించాలన్నది ఆయన ప్రధానాశయం. ఆయన కృషి ఫలితంగానే ప్రపంచంలోనే కొత్తదైన రాజ్యాంగం రూపుదిద్దుకుంది. అందుకనే ప్రపం చంలోని అనేక దేశాల రాజ్యాంగాల కంటే భారత రాజ్యాంగం ఉన్నతవిలువలు కలిగిందంటూ మన్ననలు పొందింది. 1949 నవంబర్‌ 26న రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించింది. జనవరి 26,1950 నుంచి రాజ్యాంగం అమలు లోకి వచ్చింది. నవంబర్‌ 26న రాజ్యాంగసభ రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు కనుకనే ఏటా ఈ రోజును రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహి స్తున్నాం.భారత రాజ్యాంగం ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. రాజ్యాం గాన్ని అమలుపరిచిన తరువాత స్వతంత్ర భారత దేశం సర్వసత్తాక,ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది.ప్రతి సంవత్సరం ఆ రోజును గణతంత్ర దినంగా జరుపుకుంటారు. భారత ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉండాలి, పరి పాలన ఎలా జరగాలి అనే విషయాలను రాజ్యాం గం నిర్దేశించింది. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థల ఏర్పాటు, ఆయా వ్యవస్థల అధికారాలు, బాధ్యతలు, వాటి మధ్య సమన్వయం ఎలా ఉండాలో కూడా నిర్దేశిస్తోంది.
రాజ్యాంగంపైనా దాడి!
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పాలన మొదలైనప్పటి నుంచి భారత రాజ్యాంగ హననం ప్రారంభమైంది.రాజ్యాంగంలోని ప్రాథ మిక అంశాలైన సమాఖ్య స్ఫూర్తి, లౌకిక, సామ్య వాద స్ఫూర్తితో పాటు అనేక అంశాలను మారు స్తూ రాజ్యాంగ మౌలిక సిద్ధాంతాలకు విఘాతం కలిగిస్తున్నది.బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన కొత్తలో గణతంత్ర దినోత్సవం సందర్భం గా దిన పత్రికలకు విడుదల చేసిన రాజ్యాంగ పీఠిక చిత్రం ప్రకటనలో ‘లౌకిక,సామ్యవాద’ అనే పదాలను తొలగించింది.ఈఅంశమై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి.ఈ నేపథ్యంలో ఆ పదాల కత్తిరింపును ఉపసంహరించుకున్నది. 2021, డిసెంబర్‌ 3న‘రాజ్యాంగ సవరణ-2021’ పేరిట రాజ్యాంగ పీఠికకు ముసాయిదా బిల్లును ప్రవేశ పెట్టారు. దీనిపైనా తీవ్ర నిరసనలు రావ డంతో పక్కనపెట్టింది.ఎస్‌ఆర్‌ బొమ్మై వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కర్ణాటక వ్యాజ్యంలో తీర్పు చెప్తూ లౌకిక తత్వం భారత రాజ్యాంగంలో ఇమిడి ఉన్న అంతర్బా Ûగమని సర్వోన్నత న్యాయస్థానం తన ఉత్తర్వులో పేర్కొన్నది.దీన్నిబట్టి రాజ్యాంగ పీఠికలో ఉన్న పదాలను తొలగించడమంటే,రాజ్యాంగంపై దాడి గానే భావించాలి.
గోలక్‌నాథ్‌ వర్సెస్‌ పంజాబ్‌ ప్రభుత్వా నికి జరిగిన వ్యాజ్యంలో ‘రాజ్యాంగ మౌలిక స్వరూపం మార్చడం’ అనే అంశంపై సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. అప్పటి ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు రాజ్యాంగ సవరణకు పార్లమెంటుకు ఉన్న అధికారాల గురించి చెప్పిన అధికరణ-368కి ఉన్న స్థితిపై కీలక వ్యాఖ్య చేశారు. ‘రాజ్యాంగాన్ని సవరించే అధికారాన్ని అధికరణ-368 పార్లమెంట్‌కు దత్తం చేయలేదు. ఈ రకమైన అధికారాలు 245, 246, 248 అధికరణల నుంచి వచ్చాయని, ఆ అధికర ణలు పార్లమెంటుకు చట్టాలు చేసే అధికారానికే పరిమితమయ్యాయని తెలిపారు. అధికరణం 13 (2)లో చెప్పిన ప్రకారం..వాటిని చట్టాలుగానే భావించాలన్నారు.ఈఅధికరణం ప్రకారం రాజ్యం చేసే చట్టాలు రాజ్యాంగానికి అనుకూ లంగా ఉండాలి. ఆచట్టాలు రాజ్యాంగంతో పొందిక లేని మేరకు రద్దవుతాయి.ఈ తీర్పులో అత్యధిక న్యాయ మూర్తులు రాజ్యాంగ సవరణకు పార్లమెంట్‌కు పరిమిత అధికారాలే ఉన్నాయని పేర్కొన్నారు. కేరళకు చెందిన మఠాధిపతి కేశవానంద భారతి అప్పీలుపై జరిగిన విచారణలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ‘రాజ్యాంగ మౌలిక స్వరూపం’ అనే పదం సర్వోన్నత న్యాయస్థానంలో అత్యధిక న్యాయమూర్తులు తొలిసారిగా పేర్కొ న్నారు.13 మంది సర్వోన్నత న్యాయమూర్తు ల్లో 9 మంది రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం పార్లమెంట్‌కు లేదన్నారు. ఈ ‘మౌలిక స్వరూపం’ అనే పదం రాజ్యాంగంలో ఎక్కడా లేకపోయినా, అంతర్లీనంగా ఉందనే అంశాన్ని మొదట 1973లో జరిగిన ఈ కేసులో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అప్పటినుంచీ రాజ్యాంగానికి భాష్యం చెప్పడానికి, పార్లమెంటు చేసిన రాజ్యాంగ సవరణలను సమీక్షించే మధ్యవర్తిగానూ సర్వోన్నత న్యాయస్థానం కొనసాగుతున్నది.కానీ నేడు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వా లకు సంబంధిం చిన అంశాలన్నింటా జోక్యం చేసుకొని రాష్ట్రాల నడ్డి విరుస్తున్నది.జీఎస్టీ రూపం లో రాష్ట్రాల ప్రధాన ఆదాయ వనరును సొంతం చేసుకొని, ఇవ్వాల్సిన నిధులు తొక్కిపెట్టి, వాటిని తమ రాజకీ య ప్రయోజనాల కోసం వాడు కుంటున్నది.
జాతీయ అర్హత పరీక్ష (నీట్‌), ప్రణా ళికా సంఘంరద్దు జాతీయ అభివృద్ధి మం డలి రద్దు,వంటి అనేక రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధమైన చర్యలకు పాల్పడుతూ, రాష్ట్రాల అధికారాల్లోకి చొరబడి,తానే పెత్తనం చెలాయి స్తున్నది. కరోనా వల్ల ప్రజానీకం ఓపక్క అల్లాడు తుంటే,ఇదే అదనుగా అనేక రాజ్యాంగ వ్యతిరేక చట్టాలు చేసింది కేంద్ర ప్రభు త్వం.విద్యా సంస్కర ణలు,కార్మిక,విద్యుత్‌ సంస్కర ణల బిల్లు వంటివి ఇందుకు ఉదాహరణ. పాఠ్య పుస్తకాల నిండా మత అంశాలు చొప్పించి, లౌకిక వాదానికి గండి కొడుతున్నారు కేంద్ర పాలకులు. ముఖ్యంగా, జీఎస్టీతో పాటు,3వ్యవసాయ నల్లచట్టాలు చేయ డం రాష్ట్రాలహక్కులు హరించడంలో ప్రధాన మైంది. ఇక రాజ్యాంగంలో పొందుపరిచిన లౌకిక తత్వానికి వ్యతిరేకంగా, పౌరసత్వ సవరణ చట్టం ద్వారా దేశాన్ని మతరా జ్యంగా మార్చే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టమవు తున్నది. రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్థిక, సామాజిక న్యాయాన్ని పూర్తిగా వదిలివేశారు. ఎక్కువ లాభాలతో నడిచే ఎల్‌ఐసీ, విశాఖ ఉక్కు వంటి అనేక సంస్థలను ప్రైవేటీకరించే చర్యలు చేపట్టారు. పన్నుల మోత ప్రజానీకానికి పెను భారంగా మారింది. కార్మికులు, పేదలు, బడుగు బలహీనవర్గాలు, అసంఘటిత రంగ కార్మికుల బతుకులు దుర్భ రంగా మారే స్థితి కల్పించింది కేంద్ర ప్రభుత్వం. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశాన్ని ‘ఒకే జాతి, ఒకే భాష, ఒకే మతం’ అంటూ గుజరాతీ, మార్వాడీ సంస్కృతీ నిల యంగా మార్చే చర్యలు చేపట్టింది బీజేపీ ప్రభుత్వం. హిందీని బలవం తంగా రుద్దడంతో పాటు, ఏ రాష్ట్రంలోనూ ఆ రాష్ట్ర ప్రజల భాషలో న్యాయపాలనా వ్యవహా రాలు జరగకుండా అడ్డుపడి ఇంకా స్వాతంత్య్రం రానట్టుగా, బానిసత్వంలో ఉంచుతూ, ప్రజల ఆహారాన్ని కూడా నియంత్రించబూనడం వంటి చర్యలకు పూనుకున్నది.భిన్న సంస్కృతులు,భాషలు, ఆరాధనా పద్ధతులున్న భారత ఉపఖండంలో నిజమైన ఐక్యతాభావం పెంపొందాలంటే, రాజ్యా ంగస్ఫూర్తితో రాష్ట్రాల హక్కులు, ప్రత్యేకతలను గౌరవించే ప్రజాస్వామిక పాలన రావాల్సిన అవ సరం ఎంతైనా ఉన్నది.-(డాక్టర్‌ పట్టా వెంకటేశ్వర్లు/అనిసెట్టి సాయికుమార్‌)

ఇటుకల బట్టీల్లో వెట్టి చాకరి

ఇటుకల బట్టీల్లో కూలీల పరిస్థితి దయనీయంగా ఉంది. శ్రమకు తగ్గ ఫలితం లభించకపోగా, కనీస సౌకర్యాలు కూడా యజమానులు కల్పించడం లేదు. బట్టీల వద్దనే చిన్న చిన్న గుడిసెలు ఏర్పాటు చేసుకొని కుటుంబాలతో జీవనం సాగిస్తున్నారు. పగల నకా, రాత్రనకా ఇటుకలు తయారు చేయిస్తున్న యజమా నులు కోట్ల రూపాయలు గడిస్తున్నారు. ఇటుక బట్టీల నిర్వ హణకు మైనింగ్‌, కార్మికశాఖల నుంచి అనుమతులు తీసుకో వలసి ఉన్నా ఆ నిబంధనలేవీ అమలు కావడం లేదు. అధికా రులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండ టం అనుమానాలకు తావిస్తోంది. కార్మికశాఖ నిబంధనల మేరకు దినసరి కూలీలకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. అయితే అధికారుల నిర్లక్ష్యం మూలంగా నిరుపేదలైన కూలీలకు శ్రమకు తగ్గ ఫలితం అందడం లేదు.

ఇటుకల బట్టీల యజమానులు సిండికేటుగా మారి అందినకాడికి దండుకుంటున్నారు. ఒక్కో ట్రాక్టర్‌ ట్రిప్పును రూ.15 వేల నుంచి 20వేల వరకు విక్రయిస్తున్నారు. ఇటుకల తయారీకి అవసరమైన మట్టిని చెరువుల్లో నుంచి అక్రమంగా తరలిస్తూ తక్కువ పెట్టుబడులతో అధిక లాభాలు ఆర్జిస్తు న్నారు.అక్రమంగా చెరువుల మట్టి,నీరు వినియోగిస్తు ఇటుకలను మాత్రం అధిక ధరలకు అమ్ముతున్నారు. ట్రాక్టర్‌ యజమానులను మచ్చిక చేసుకొని వారికి కమీషన్లు ముట్టజెప్పుతున్నారు. బట్టీల్లో పనిచేసే కూలీలకు మాత్రం అరకొరగా వేతనాలు చెల్లిస్తున్నారు. వెయ్యి ఇటుకలకు రూ.900చెల్లిస్తున్నారు. ఇద్దరు మనుషులు ఒక రోజులో వెయ్యి ఇటుకలు మాత్రమే చేయగలుగుతారు. రోజు వారీ అడ్డా కూలీకి మగవారికి రూ.800,ఆడ వారికి రూ.600లు ఉంది. ఇటుక బట్టీల్లో పని చేసే కూలీలు శ్రమ దోపిడీకి గురవుతున్నారు.
కనీస సౌకర్యాలు కరువు
ఇటుకల బట్టీల్లో మారుమూల ప్రాంతాలకు చెందిన కూలీలు పని చేస్తుంటారు. ఇతర రాష్ట్రాలు,జిల్లాల నుంచి వచ్చి ఇక్కడి ఇటుకల బట్టీల్లో కూలీలుగా చేరుతున్నారు. అలా వచ్చిన వారు ఇటుకల బట్టీల వద్దనే తాత్కాలిక గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. అక్కడ వారికి కనీస ఏర్పాట్లు యాజమాన్యాలు చేయడం లేదు. ఇటుకల బట్టీలు ఊళ్లకు దూరంగా వాగులు,చెరువుల సమీపంలో ఉండగా అక్కడే కుటుంబాలతో కలిసి జీవనం సాగిస్తున్నారు.అనారోగ్యం తలె త్తితో వైద్య సదుపాయం కూడా అందు బాటులో లేదు. అత్య వసర సమయాల్లో ఆర్‌ఎంపీలను పిలిపిస్తూ చికిత్స చేయిస్తు న్నారు. తాగునీటి సౌకర్యం లేకపోవడంతో వాగులు, చెరువుల నీటిపైనే ఆధారపడాల్సి వస్తోంది. కూరగాయలు, రేషన్‌ సామగ్రి కోసం కిలోమీటర్ల మేర నడవాల్సిన పరిస్థి తులు ఉన్నాయి. తేళ్లు, విష సర్పాల మధ్య జీవనం గడపాల్సి వస్తోంది.
చిన్నారుల పరిస్థితి దయనీయం
ఇటుకల బట్టీల్లో పనిచేస్తున్న కూలీల పిల్లల పరిస్థితి దయనీయంగా ఉంది. పాఠశాలలు అందుబాటులో లేక వారు చదువుకొనే అవకా శాలు లేవు. దీంతో తల్లిదండ్రులతోపాటే ఇటుకల బట్టీల్లో తిరుగుతున్నారు. ఏడెనిమిది సంవత్సరాల పైబడి వయస్సు పిల్లలు తల్లిదండ్రులతోపాటు కూలీలుగా పని చేస్తున్నారు. ఇక్కడ బాలకార్మిక చట్టం అమలు కావడం లేదు. పిల్లలు అనారోగ్యానికి గురైనా ఆర్‌ఎంపీలతో చికిత్స చేయించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. తీవ్ర ఆనారోగ్యానికి గురైన ఓమూడేళ్ల చిన్నారి ఇటుకల బట్టీలోనే మృతి చెందడం విషాదాన్ని నింపింది. అలా తమ ప్రాణాలను ఫణంగా పెడుతున్న కూలీలు చాలీచాలని వేతనాలు,అరకొర వసతుల నడుమ ఇటుకల బట్టీల్లో పనిచేస్తూ దుర్భర జీవనం గడుపుతున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీలు
మహా విశాఖపట్నం వంటి మహానగరాల్లో భవన నిర్మాణాలు జోరుగా సాగుతుండడంతో చుట్టుపక్కల పల్లెల్లో ఇటుక బట్టీలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. చాలా వరకు అనుమతులు లేకుండానే కొనసాగుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నాయి. హుజూరాబాద్‌ మండలంలోని దాదాపుగా 50కి పైగానే ఇటుక బట్టీలు ఉన్నాయి. విశాఖ ఉమ్మడి జిల్లాలోని పద్మనాభం, భీమిలి, ఆనందపురం, అనకాపల్లి, పాయకరావుపేట, రావికమతం,బుచ్చియ్యపేట తదితర గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్‌,తెలంగాణకు చెందిన వ్యాపా రులు వ్యవసాయ భూమిని లీజుకు తీసుకొని ఈ వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఇటుకలను తయారీ చేయడానికి ఛత్తీస్‌గఢ్‌,ఒడిశా నుంచి కార్మికులను తీసుకువస్తుంటారు.
అనుమతులు లేకుండానే ఏర్పాట్లు
ఇటుక బట్టీల ఏర్పాటుకు ఆయా గ్రామ పంచాయతీలతో పాటు రెవెన్యూ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి నుంచి అను మతులు తప్పకుండా తీసుకోవాలి, కానీ కొందరు వ్యాపారులు మాత్రం నిబంధనలు పాటించడం లేదు. అంతేకాకుండా నిబంధ నలకు విరుద్ధంగా ప్రభుత్వ భూముల్లోనూ బట్టీలు నిర్వహిస్తున్నారు. వ్యవసాయ భూముల్లో ఇటుక బట్టీలు ఏర్పాటు చేయా లంటే నాలా సుంకం చెల్లించాలి. కానీ రైతు లకు డబ్బు ఎర చూపి నాలా సుంకం చెల్లించ కుండానే వ్యాపారం చేస్తున్నారు. వాల్టా చట్టా న్ని ఉల్లంఘించి చెరువులు, కుంటల నుంచి మట్టిని తరలిస్తూ ఇటుకల తయారీకి వినియో గిస్తున్నారు.
ప్రధాన రహదారుల వెంట బట్టీలు
పద్మనాభం,అనకాపల్లి,భీమిలి,ఆనందపురం మండలంలో రహదారుల పక్కనే ఇటుక బట్టీలు ఏర్పాటు చేయడం వల్ల వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గాలికి బూడిద కొట్టుకువచ్చి కండ్లల్లో పడడం, ఇటుకు బట్టీల నుంచి వెలువడుతున్న పొగతో రోడ్డు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నా యని ఆందోళన చెందుతున్నారు.
బట్టీల్లో బాల్యం
ఇటుక బట్టీల్లో బాల్యం బుగ్గి అవుతుండగా ఆ చిట్టిచేతులు చక్కని రాతకు, చదువుకు దూర మవుతున్నాయి.చేతిలో బలపం పట్టి చదుకోవాల్సిన చిన్నారులు ఇటుకలు మోస్తూ బట్టీల్లోనే మగ్గిపోతున్నారు. చాలిచాలనీ జీతాలు చెల్లించి కార్మికుల శ్రమను యాజమానులు దోచుకోవడంతో పాటు చిన్నారులను శ్రమ జీవులుగా మార్చి వేస్తు న్నారు. ఇటీవల ప్రభుత్వం విద్యాశాఖ సిబ్బందితో చేపట్టిన సర్వేలో ఎక్కువ మంది బడికి వెళ్లకుండా బట్టీల్లోనే పనులు చేస్తూ కనిపించడంతో వారిని దగ్గరలోని పాఠశాలల్లో చేర్పించేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఆపరేషన్‌ స్మైల్‌ కార్యక్రమంలో కూడా చాలా వరకు బట్టీల్లో పని చేస్తున్న చిన్నారులను గుర్తించారు. ఇదిలా ఉంటే ఇటుక బట్టీల నిర్వాహకులు నిబంధనలకు నీళ్లొదిలి ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ఊరికి దూరంగా ఉండ డంతో పాటు రహదారులకు దూరంగా ఉండి వాహనదారులకు ఆ బట్టీల వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాల్సింది పోయి రోడ్డు పక్కనే బట్టీలను నిర్వహిస్తూ ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలుగజే స్తున్నారు. మరోపక్క బట్టీల్లో పనిచేసే కార్మి కులకు కల్పించాల్సిన వసతుల కల్పనలో నిర్లక్ష్యం వహించడమే కాదు.ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టడం లేదు. అయినా కార్మికశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌,ఒడిశా నుంచి కార్మికులను తీసుకు వస్తుంటారు. ఇందులో బాల కార్మికులే ఎక్కు వగా ఉండడం గమ నార్హం. ప్రతి ఇటుక బట్టీ వ్యాపారి వద్ద సుమారు నలుగురు నుంచి ఐదు గురు వరకు బాల కార్మికులు పని చేస్తుంటారు.
ముందుస్తు ఒప్పందాలతో వెట్టిచాకిరి
జిల్లాలో వందల సంఖ్యలో ఇటుక బట్టీలు ఉన్నాయి. ఇందులో పని చేయడానికి బట్టీల యజమానులు ఒరిస్సా,చత్తీస్‌ఘడ్‌, మహారాష్ట్ర, బీహార్‌, జార్ఖండ్‌ తదితర రాష్ట్రాల నుంచి వలస కూలీలు కుటుంబాలతో సహ వచ్చి ఇటుక బట్టీల్లో పని చేస్తుంటారు. ఇటుక బట్టీల యాజమాన్యం ఆయా రాష్ట్రాలకు వెళ్లి కూలీలకు అడ్వాన్స్‌ చెల్లించి పనికి తీసు కోచ్చుకుంటారు. ఇదే అదునుతో విద్యాహక్కు, కార్మిక, వాల్టా చట్టాలను తుంగలో తొక్కుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తెలు స్తోంది. రోజుకు 8 గంటలు పని చేయాలనే నిబంధన ఉన్నా రాత్రింబవళ్లు పని చేయించు కుంటున్నారు. ఒప్పందం ప్రకారం కార్మికులకు వాయిదాల ప్రకారం జీతాలు చెల్లిస్తున్నారు. ఈ వాయిదాల్లో వారు ఎలాంటి అనారోగ్యా నికి గురైనా, ప్రాణాలుపోయినా యజమానులు పట్టించుకోవడం లేదు. ప్రమాదాలు జరిగితే నష్టపరిహారం సైతం అందించకపోగా వారికి ఇచ్చిన అడ్వాన్స్‌లోనే కోతపెడుతున్నారు. బీమా సౌకర్యం కల్పించడం లేదు. ఊరు కాని ఊరు కావడం, బట్టీలు దాటి బయటకు వెళ్లే దారి కనిపించకపోవడంతో తమపై దౌర్జ న్యాలు, వేధింపులు జరుగుతున్నా ఎవరికి చెప్పుకోలేని దుర్భర పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తున్నారు. గతంలో కామారెడ్డి నియోజకవర్గ పరిధిలో ఓ కార్మికునికి సైతం ఇదే తరహాలో బట్టి నిర్వాహకులు వేధిం పులకు గురిచేయడంతో ప్రాణాపాయస్థితికి చేరుకున్నాడు. ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్‌ లాంటి ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో విద్యాహక్కు చట్టంకు తూట్లు పొడుస్తూ చిన్నా రులతో పని చేయించుకోవడమే కాకుండా నిబంధనలను ఎక్కడా కూడా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.
అనారోగ్యం బారిన
ఇటుక బట్టీలు జనావాసాలకు సమీపంగా వెలుస్తుండడంతో ఇటుకలను కాల్చినప్పుడు వచ్చేపొగ వల్ల కార్మికులతో పాటు, వాటి సమీప గ్రామ ప్రజలు అనారోగ్యానికి గురవు తున్నారు. ఇటుకల నుంచి వచ్చే పొగను పీల్చ డం వల్ల చాలా మంది అస్తమా, ఉబ్బసం వంటి రోగాల బారిన పడుతున్నారని తెలు స్తోంది. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వారికి ఆరోగ్య పరీక్షలు ప్రతీనెల చేయించాల్సి ఉండగా అది ఎక్కడా కానరావడం లేదు. ప్రజలకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడేలా చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. జనావాసాలకు దగ్గర గా ఇటుక బట్టీలు వెలుస్తున్నా అనుమతి లేకుండా నడుస్తున్న కార్మికశాఖ,స్థానిక రెవె న్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసు కోక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
తూతూ మంత్రంగా తనిఖీలు
బడీడు పిల్లలు బడుల్లో చదువుకోవాలనే ఉద్దేశ్యంతో 6-14 సంవత్సరాల వరకు ప్రభుత్వం నిర్బంధ విద్యను అమలుచేస్తుంటే వాటిని అమలు పరుచడంలో అధికారులు మాత్రం విఫలమవుతున్నారు.కార్మిక, చైల్డ్‌ ప్రొటెక్షన్‌ అధికారులు బట్టీల్లో నిబంధనలకు విరుద్ధంగా పనులు చేస్తున్న పిల్లలను గుర్తించేందుకు పలు సందర్భాల్లో తనిఖీలు చేపడుతున్నా అవి తూతూ మంత్రంగానే ఉంటున్నాయనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతీ ఏటా ఆపరేషన్‌ స్మైల్‌ పేరుతో చిన్నారు లను గుర్తించడం సంబంధిత ఇటుక బట్టీల నిర్వాహకులకు చిన్నపాటి జరిమానాలు విధించి ఆ తర్వాత అటువైపు కన్నెత్తి చూడకపోవడం, కఠిన చర్యలు చేపట్టక పోవడంతోనే బట్టి నిర్వాహకులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని పేర్కొంటున్నారు. ఇటీవల విద్యాశాఖ అధికారులు చేపట్టిన బడి బయట పిల్లల సర్వేలో జిల్లాలోనే బట్టీల వద్దనే చిన్నారులు పాఠశాలలకు వెళ్లకుండా తమ తల్లిదండ్రులతో కలిసి పనులు చేయడం గుర్తించారంటే ఏ స్థాయిలో ఇతర విభాగాల పనితీరు ఉందో అర్థం చేసుకోవచ్చు.
బట్టీ కార్మికులకు భద్రత కరవు
బతుకు భారమై పొట్ట చేత పట్టుకొని ఒడిషా నుండి తెలంగాణకు తరలి వస్తున్న కార్మికుల దైనందిన జీవితం దుర్భరంగా ఉంది. ఒడిషా కార్మికులపై ఇటుక బట్టీ యజమానుల ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒక్కో ఇటుక బట్టీల్లో దాదాపు 11వేల మంది ఒడిషా వలస కార్మికులు పనిచేస్తున్నారు. అక్కడ వీరికి కనీస వసతులు లేవు. పలువురు పనిభారం ఎక్కువై అనారోగ్యం బారిన పడుతున్నారు. కూలీ చేయలేని పరిస్థితిలో ఉన్న వారిని కొట్టి మరీ పని చేయిస్తుండటం విషాదం. ఈ నేపథ్యంలోనే కొన్ని రోజుల క్రితం జిల్లాలోని పెద్దపల్లిలో కూలీ గర్భవతి నూర్జాజాహ్రాను బట్టీలోని గుమస్తా కొట్టిన దెబ్బలకు మరణించడంతో మరోసారి ఒడిషా కార్మికుల దుర్భర జీవితం తెరపైకి వచ్చింది. 2014లో చొప్పదండి పట్టణ శివారులోని ఇటుక బట్టీలో ముగ్గురు యువతులపై యజమాని లైంగిక దాడులకు పాల్పడ్డ సంఘటన రాష్టవ్య్రాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ సంఘటన మరవకముందే మరో దారుణం పెద్దపల్లిలో జరగటం ఒడిషా కార్మికుల జీవన పోరాటం ఎంతటి దుర్భ రంగా ఉందో అర్థం అవుతుంది. ఒడిషా సర్దార్లు ఎక్కువ కమీషన్లకు కక్కుర్తిపడి కార్మికులను నమ్మించి బట్టీల యజమానులకు తక్కువ కూలీతో అప్పగిస్తున్నారు. తెలం గాణలో పనిచేసే వారికి రోజు కూలీ 2వం దల రూపాయలకు పైగా ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చిన ఒడిషా కూలీలు మాత్రం శ్రమదోపిడీకి గురౌతున్నారు. రోజంతా పనిచేస్తే కనీసం 30రూపాయలైనా ఇవ్వడం లేదు. యజమానులు ఇరుకు గదుల్లో కార్మికు లను బంధించడం, వేతనం ఇవ్వకపోవడం, చిన్న పిల్లలతో పనులు చేయించడం, లైంగిక దాడులులాంటివి దారుణ అకృత్యాలు జరిగినా చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. మరోప్రక్క కూలీల పనికి అంతుపొంతన లేదు. కార్మిక చట్టం ప్రకారం రోజుకు 8గంటల పని చేయాలన్న నిబంధనలు ఇక్కడ అసలే ఉండవు. ప్రధానంగా భవన నిర్మాణరంగం, కంపెనీలు, ప్రయివేట్‌ ఏజెన్సీలు, నాపరాతి గనుల్లో నేటికీ వెట్టి కొనసాగుతోంది. వారిని ప్రభుత్వం ఆదుకున్న దాఖలాలు శూన్యం. ఉద్యోగ భద్రత కరువు, వేధింపులు తప్పడం లేదు. చివరకు తమ సమస్యలు చెప్పుకు నేందుకు సంఘాలనూ ఏర్పాటు చేసుకునే పరిస్థితి లేకుండా కొన్ని కంపెనీలు నిరంకుశ విధానాలు అవలంభిస్తున్నాయి. సమస్యల కోసమే కాదు.. సంఘాల కోసమూ సమ్మెలు చేయాల్సిన దుస్థితిని పాలకులు కల్పిస్తున్నారు. సంఘాలు పెడితే పనిలో నుంచి తొలగించే పరిస్థితిని ప్రభుత్వాలే కల్పిస్తున్నాయి.
అందులో ప్రధానమైంది అసంఘటిత రంగం. ఈ కార్మికుల జీవితాలకు భద్రత కరువైంది. దుర్భరస్థితిలో కార్మికుల జీవితాలు కొనసాగు తున్నాయి. అసంఘటిత కార్మికులకు రంగారెడ్డి జిల్లా నిలయంగా మారింది. తాండూరు ప్రాంతం నాపరాతి గనులు పాలిషింగ్‌ యూనిట్లు సుద్ధగనులకు నిలయమైతే, తూర్పు రంగారెడ్డి జిల్లా, మహబూబ్‌నగర్‌, నల్గొండ, మెదక్‌ జిల్లాల నుంచి వచ్చే వసల కార్మికులకు నిలయం.భవననిర్మాణరంగం,ఆటో,ఇటుకల బట్టీలు, క్రషర్లు, కంపనీల్లో రోజువారి కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న కార్మికుల సంఖ్య లెక్కేలేదు. ఫలితంగా ఈ ప్రాంతానికి ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది కార్మి కులు వలసొచ్చి జీవనం గడుపుతున్నారు. మరో పక్క సిమెంట్‌ ఫ్యాక్టరీలు, స్పిన్నింగ్‌ మిల్లులు వంటివి ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసంఘటిత కార్మికులు వేల సంఖ్యలో ఉన్నారు. కానీ వీరి జీవితాలకు భద్రత కరువైంది. ప్రభుత్వం ఏవిధమైన చర్యలు చేపట్టడం లేదు. ప్రభుత్వ చట్టాలు అమలుకు నోచుకోవడం లేదు. నాపరాతి గనుల్లో ఉపాధి పొందుతూ జీవితాలను గడుపుతున్న కార్మికుల స్థితిగతులు తెలుసుకునే అధికారులు, ప్రభుత్వా ధినేతలు కరువయ్యారు. కనీసం నివసించేం దుకు కావాల్సిన వసతులు కల్పించడంలో యజమానులు పట్టించుకోరు. ప్రాణాలకు ప్రమాదకరమైన స్థితి ఉన్నచోటే కార్మికులు జీవిస్తున్నారు. గుడారాలే నివాస కేంద్రాలు. లోతైన గనుల్లో నాపరాతి తవ్వకాలను చేపడు తున్నారు. అనేక సందర్భాలలో కార్మికులు ప్రమాదాలకు గురై ప్రాణాలు గాలిలో కలిసిన సందర్భాలనేకం. కరన్‌కోట్‌, ఓగ్గిపూర్‌, మల్క పూర్‌,బషీరాబాద్‌ మండలాల్లో నవల్గా, కొర్విచేడ్‌, మాసాన్‌పల్లి, జీవన్గి, బషీరాబాద్‌ గ్రామాలలో నాపరాతి గనులున్నాయి. పెద్దేముల్‌ మండలంలో నాగులపల్లి, పెద్దేముల్‌, మారేపల్లి గ్రామాల్లో సుద్ధ గనులున్నాయి. ఈ సుద్ధ గనులకు సమీపంలోనే చిన్నచిన్న కర్మాగారాలు నెలకొల్పారు. క్రషర్లూ ఉన్నాయి. మరోవైపు తాండూరు మండలంలోనే పెద్దపెద్ద సిమెంట్‌ కర్మాగారాలు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతం లో వివిధ కర్మాగారాలు ఉన్నందు వల్ల కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా, రాష్ట్రాల నుంచి వందలాదిగా కార్మికులు వలసొచ్చి తమ జీవితాలు కొనసాగిస్తున్నారు. అంతే కాకుండా తాండూరు పట్టణంలోని చుట్టూరా పాలిషింగ్‌ యూనిట్లూ వెలిశాయి. సుమారు 500 పాలిష్‌ యూనిట్లలో 3వేలకు పైగానే కార్మికులు రాత్రీపగలు పనిచేస్తున్నారు. వీరి భద్రత విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వలస కార్మికులతో యజమా నులు వెట్టిచాకిరీ చేయించుకోవడంలో తమ దైన పద్ధతిని కొనసాగిస్తున్నారు. కార్మికులకు ముందస్తుగానే వడ్డీ లేకుండా డబ్బులు ఇవ్వడం ఒకవేళ కార్మికుడు అనారోగ్యానికి గురై పనిచేయని పరిస్థితి ఉంటే కార్మికులను చితకబాది బలవంతంగా పనిచేయించుకునే దుస్థితి. సుద్ధగనుల్లో పొద్దంతా కష్టపడి సుద్ధను తవ్వినప్పటికీ వారికి తగిన కూలీ పడడం లేదు. ఇలా అసంఘటిత కార్మికుల జీవితాలకు భద్రత కరువైంది. మరోవైపు కార్మికశాఖ పనితీరు చూస్తే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా ఉంటుంది. ప్రభుత్వా లకు అసంఘటిత కార్మికులన్నా, వారి జీవిత లన్నా ఏ మాత్రం పట్టడం లేదు. కానీ కార్మి కుల ఓట్లతోనే అధికారం చేపట్టిన పాలకులూ వారి సంక్షేమం గురించి మరిచారు. ఆంధ్రప్రదేశ్‌,తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలో ఇటుకల బట్టీల్లో మగ్గుతున్న కార్మి కులూ ఉంటే, మేడ్చల్‌, శామీర్‌పేట, హయ త్‌నగర్‌,కీసర, ఘట్‌కేసర్‌ ప్రాంతాల్లో వంద లాదిగా వలిసిన మైనింగ్‌, కంకర మిషన్లు, క్రషర్లలో తమ జీవితాలను కోల్పోతున్నారు. వీరికి క్రషర్లలోపడి కార్మికులు మృతిచెందిన వారికి ఇఎస్‌ఐ,పిఎఫ్‌ వంటివి వర్తించవు. -గునపర్తి సైమన్‌

మారని ఆదివాసీల బతుకులు

స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు దాటినా ఆదివాసీల బతుకుల్లో ఎటువంటి మార్పు లేదు. ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపలేకపోతున్నాయి. ఇప్పటికీ జిల్లాలోని పలు మారుమూల గ్రామాలకు రహదారి సౌకర్యం లేదు. కిలో మీటర్ల మేర కాలినడకన, గుర్రాలపై వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఆస్పత్రులకు డోలీల్లోనే తరలించాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. జిల్లాలోని 22 మండలాల పరిధిలో తొమ్మిదిన్నర లక్షల మంది గిరిజనులు జీవిస్తున్నారు. వారిలో ఏడు లక్షల మంది గిరిజనులు పాడేరు ఏజెన్సీలో, మిలిగిన రెండున్నర లక్షల మంది రంప ఏజెన్సీలో ఉన్నారు. ప్రాంతాలు వేరైనా వారందరిదీ ఒకే రకమైన వేదన బతుకులే కావడం గమనార్హం.
రవాణా వ్యవస్థల్లో ఎంతో మార్పు చోటు చేసుకున్న ఈ రోజుల్లో సైతం ఆదివాసులు రోగులను డోలీల్లో మోయడం, తమ ప్రయా ణాలకు గుర్రాలను వినియోగిస్తుండడం గిరిజన ప్రాంతంలో రవాణా వ్యవస్థ దుస్థితికి అద్దంపడుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో సగానికిపైగా గిరిజన పల్లెలకు కనీస రోడ్డు సౌకర్యం లేని పరిస్థితి. ఏజెన్సీలో మారు మూల పల్లెలు అధికంగా ఉన్న ముంచంగి పుట్టు, పెదబయలు, జి.మాడుగుల, చింత పల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాల్లో వందలాది గ్రామాలకు చెందిన ఆదివాసులు ఇప్పటికీ గుర్రాలపైనే రాకపోకలు సాగిస్తు న్నారు. గుర్రాలను కొనుక్కోలేని పేద గిరిజనులు కాలినడకనే తమ ప్రయాణాలు సాగిస్తున్నారు. ఏజెన్సీలో మండల కేంద్రాలు, కాస్త రోడ్డు పక్కన గ్రామాలకు మాత్రమే రోడ్డు, రవాణా సదుపాయాలున్నాయి.
అందనంత దూరంలో ప్రాథమిక వైద్యం
జిల్లాలోని పాడేరు ఏజెన్సీలో ఉన్న ఏడు లక్షల మంది గిరిజనులకు వైద్య సేవలు అందిం చేందుకు ఏజెన్సీ వ్యాప్తంగా 36 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాడేరులో రెండు వందల పడకల జిల్లా ఆస్పత్రి, అరకులోయలో వంద పడకల ఏరియా ఆస్పత్రి,చింతపల్లిలో 50, ముంచంగిపుట్టులో 30పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాలు,గిరిజన పల్లెలో 202 ఆరోగ్య ఉపకేంద్రాలు, గ్రామానికి ఒకరు చొప్పున 3,800 మంది ఆశ కార్యకర్తలు న్నారు. కానీ నేటికీ గిరిజనులకు సాధారణ జ్వరం వ చ్చినా సకాలంలో వైద్యం అందని దుస్థితి కొనసాగుతోంది. గిరిజనుల వైద్యంపై సర్కారు నిర్లక్ష్యం, అధికార యంత్రాంగం అలసత్వంతో వైద్య సేవలు సకాలంలో అందడం లేదు. ఏజెన్సీ 11మండలాల్లో ఉన్న ఆస్పత్రులు, సిబ్బందిని పర్యవేక్షించాల్సిన ఐటీడీఏ పీవో,డీఎంహెచ్‌వో,ఏడీఎంహెచ్‌వో వంటి అధికారులు సైతం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. క్షేత్ర స్థాయిలో వైద్యసేవలు అందించే ఆశ కార్య కర్తల వ్యవస్థను పటిష్ఠం చేయకపోవడం, పారా మెడికల్‌ సిబ్బందిపై పర్యవేక్షణ లేమి కారణంగా గిరిజనులకు వైద్య సేవలు సక్రమంగా అందడం లేదు.
పల్లెల్లో కానరాని మౌలిక సదుపాయాలు
ఆదివాసీలు జీవించే పల్లెల్లో కనీస మౌలిక సదుపాయాలు సైతం లేని దుస్థితి నెలకొంది. రోడ్డు, రవాణా,తాగునీరు,విద్య,విద్యుత్‌ వంటి సదుపాయాలు సంపూర్ణంగా లేని పరిస్థితి. ప్రధానంగా తాగునీటి సదుపాయాలు అధ్వా నంగా ఉండడంతోనే గిరిజనులు తరచూ వ్యాధుల బారినపడుతున్నారని తెలిసినా పాలకులు రక్షిత తాగునీటి సదుపాయాల కల్పనపై ప్రత్యేక శ్రద్ధపెట్టడడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీలో భౌగోళిక మార్పుల కారణంగా అధిక సంఖ్యలో గ్రామాల్లోని బోర్లు, బావులు, గ్రావెటీ నీటి పథకాలు అడుగంటి ఇంకిపోతున్నాయి. దీంతో గతి లేక అందు బాటులో ఉన్న ఊటగెడ్డల్లో నీటిపైనే ఆధారపడుతున్నారు. సాంకేతికతను వినియో గించి గిరిజనులకు అవసరమైన రక్షిత నీటిని అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది. కనీసం పంచాయతీ కేంద్రాల్లోనైనా రక్షిత తాగునీటిని అందించేందుకు కృషి చేయాలనే డిమాండ్‌ చాలా కాలంగా ఉంది. అలాగే రోడ్డు, రవాణా విషయాలకు వస్తే మరింత దారుణ మైన పరిస్థితులు కొనసాగుతున్నాయి. నేటికీ ఏజెన్సీలో వందల సంఖ్యలోని పల్లెలకు రోడ్లు లేకపోవడంతో ఆయా ప్రాంతాలకు రవాణా సదుపాయాలు కల్పించని దుస్థితి నెలకొంది. దీంతో గిరిజనులు కాలినడకనే రాకపోకలు సాగిస్తున్నారు. ఇక విద్య విషయానికి వస్తే అంతా మేడిపండు చందంగానే ఉంది. ఏజెన్సీలో నేటికీ పదుల సంఖ్యలోని బడులకు భవనాలను లేని పరిస్థితి నెలకొనగా, ఉన్న పాఠశాలల్లోని గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదనే వాదన వినిపిస్తున్నది. ప్రధానంగా డీఈవో, ఏజెన్సీ డీఈవో కార్యాలయాల్లోనే ఇప్పటికీ అనేక కీలక పోస్టులు ఖాళీగా ఉండడంతో గిరిజన విద్యా భివృద్ధి మేడిపండు చందంగా ఉందనే విమర్శలున్నాయి.
వ్యవ‘సాయం’ కరువు
గిరిజనుల జీవనాధారమైన వ్యవసాయంపై పాలకుల నిర్లక్ష్యం చెప్పలేనిది. ఏజెన్సీలో దాదాపు 80 శాతం మంది భూమిపై ఆధారపడి జీవిస్తున్నప్పటికీ, ఆ స్థాయిలో గిరిజన రైతులకు ప్రభుత్వాల నుంచి సాయం అందడం లేదు. లోకమంతా వ్యవసాయ రంగంలో దూసుకువెళుతుంటే గిరి రైతులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే చందంగానే ఉన్నారు. గిరిజన ప్రాంతంలో వ్యవసాయ, ఉద్యాన పంటలకు ఎంతో అనుకూలమైనప్పటికీ, కేవలం ప్రభుత్వాల ప్రోత్సాహం లేని కారణంగా ఊహించిన స్థాయిలో వ్యవసాయం అభివృద్ధి చెందడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక స్వయం ఉపాధి, చిన్నతరహా పరిశ్రమల గురించి మన్యంలో మాట్లాడుకోవడానికే అవకా?శం లేని పరిస్థితి. దీంతో గిరిజనుల జీవితాల్లో ఆశించిన స్థాయిలో వెలుగులు ప్రసరించడం లేదనేది పలువురి వాదన. గిరిజనాభివృద్ధిపై పాలకులకు చిత్తశుద్ధి లేనంత కాలం ఎన్ని ఆదివాసీ దినోత్సవ వేడుకలను నిర్వహించుకున్నా… తమ బతుకుల్లో మార్పురాదని ఆదివాసీలు ముక్తకంఠంతో ఘోషిస్తున్నారు.
విశాఖ జిల్లాలోని 9 మండలాల్లో 95 వేల జనాభా గల 320 గిరిజన గ్రామాలకు స్వాతంత్య్ర ఫలాలు అందడం లేదు. విద్య, వైద్యం,రవాణా సౌకర్యం, రక్షిత మంచి నీరు అందని ద్రాక్షే. సుదీర్ఘ ప్రాంతాల నుండి గెడ్డల్లో ఊటనీళ్లు, డోలిమోతలు తప్పడం లేదు. ఏజెన్సీని ఆనుకొని ఉన్న నాన్‌ షెడ్యూల్డ్‌ గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్డ్‌లో చేర్చడంలో పాలకవర్గాలు బాధ్యతగా వ్యవహరించడం లేదని గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. జిల్లాలోని మూడు వందల పైచిలుకు గిరిజన గ్రామాలను ఐదవషెడ్యూల్‌లో చేర్చకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని గిరిజనులు ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు. వీటిని షెడ్యూల్డ్‌ ఏరియాలో చేర్పిస్తామని అధికార పార్టీ తియ్యనిమాటలు చెప్పిందేగానీ..అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించింది. గిరిజన సలహా మండలి (ట్క్రెబల్‌ ఎడ్వయిజరీ కమిటీ) 112 గిరిజన గ్రామాలకు పరిమితం చేస్తూ ఏడాది క్రితం తీర్మానం చేసింది. దీనిపై గిరిజన, ప్రజాసంఘాలు ఆందోళనకు దిగడంతో మరల తహసీల్దార్లతో క్షేత్రస్థాయి నివేదిక తెప్పించుకుంటామని పాలకులు చెప్పారు. ఇది కూడా ఏడాదికాలంగా నానుతుందే తప్ప అమలుకు నోచుకోలేదు. వందశాతం గిరిజన పంచాయతీలు ఉంటేనే ప్రతిపాదనలు పంపిస్తామని, గిరిజనేతరులతో కలిసి ఉన్న గ్రామాలను పంపించేదిలేదని తహసీల్దార్లు తెగేసి చెబుతున్నారు. నిజానికి శివారు గిరిజన గ్రామాల్లో వందశాతం గిరిజనులు నివసిస్తున్నారు. దీనిని ఇప్పుడు గుర్తించకపోతే తీవ్రనష్టం జరుగుతుందని గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే 1956,1976లో రెండుసార్లు రాష్ట్రపతి ఇచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్లో విశాఖ జిల్లాలోని తొమ్మిది మండలాల్లో గిరిజనులకు అన్యాయం జరిగిందని, ఇప్పుడు మళ్లీ అదేవిధంగా చేస్తే గిరిజనులు నష్టపోతారని ఆందోళన చెందుతున్నారు. ప్రతి శివారు గిరిజన గ్రామాన్ని గుర్తించి తహసీల్దార్లు ప్రతిపాదనలు పంపించి జిల్లా కలెక్టర్‌, ఐటీడీఏ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం పొందాలని, తరువాత అసెంబ్లీలో తీర్మానం చేసి%ౌౌ%రాష్ట్రపతి ఆమోదం ద్వారా గిరిజన గ్రామాలను ఐదవషెడ్యూల్డ్‌లో చేర్చాలని గిరిజన సంఘాలు కోరుతున్నాయి. మాయ మాటలు చెప్పడం మానుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్డ్‌లో చేర్చక పోవడంతో ఆ గ్రామాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఐటీడీఏ ద్వారా వచ్చే సంక్షేమ పథకాలు, ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు కోల్పోతున్నారు. 1/70 భూబదలా యింపు చట్టం వర్తించడం లేదు. స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరుపుకుంటున్న పాలకులు గిరిజన గ్రామాలకు కనీస సదుపాయాలు కల్పించకపోవడం సిగ్గుచేటని విమర్శిస్తున్నారు.
గిరిజన బతుకులు నేటికీ చికట్లోనే..
గిరిజనులు అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీఠ వేస్తుందని ఇటు అధికారులు, అటు ప్రజాప్రతినిధులు చేస్తున్న ప్రకటనలు పత్రికలకే పరిమితం తప్ప ఆచరణ సాధ్యం కావడం లేదు. ఏటా గిరిజనులు అభివృద్ధికి కోట్లాది రూపాయిలు ప్రభుత్వం కేటాయిస్తున్నప్పటికీ నేటికీ గిరిజనులు బతుకులు మారని గ్రామాలు అనేకం వున్నాయని చెప్పకతప్పదు. అందులో భాగంగా ఉత్తరావల్లి పంచాయతీ మధురా గ్రామం గదబపేట అని చెప్పవచ్చు. ఈ గ్రామంలో పూర్వం నుండి 10 కుటుంబాలు కొండలు, తోటలు మధ్య అడవితల్లిని నమ్ముకొని జీవనాన్ని సాగిస్తున్నారు. వారి బతుకులు దయనీయంగా వుండటంతో పాటు అగమ్యగోచరంగా వున్నాయని చెప్పకతప్పదు. నిన్నమొన్నటి వరకు తోటలు మధ్యలో పూరిపాకల్లో తలదాచుకునేవారు. అయితే ఇటీవల కాలంలో నాలుగు ఇళ్లులు ప్రభుత్వం మంజూరు చేయగా, పునాదులు ప్రాప్తికి మూడు ఇళ్లకు బిల్లులు అందగా ఒక ఇంటికి ప్రభుత్వం బిల్లులు మంజూరుచేసిన దాఖాలాలులేవు అయితే గిరిజనులు బతుకులు చూసిన ప్రతీ ఒక్కరికీ గుండె చలించక తప్పదు.గ్రామంలో మినీవాటర్‌ ట్యాంక్‌ వున్నప్పటికీ రెండు నెలలకోసారినీరు సరఫరా కావడంతో కిలో మీటరు దూరంలో వున్న బావికి వెళ్లి తాగునీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. తాగునీరు కోసం గిరిజనులు పడుతున్న బాధలు అన్నీఇన్నీకావు. అలాగే వీధి దీపాలు గత కొన్ని నెలలుగా వెలగక పోవడంతో అంధకారంలోనే కాలాన్ని గడుపుతున్నారు. పలుమార్లు ప్రజాప్రతినిధులు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ గ్రామం వైపు కనీసం కన్నెత్తి చూసిన పాపాన పోలేదని గిరిజనులు వాపోతున్నారు. గ్రామంలో వున్న రెండు విద్యుత్‌ స్థంభాలకు రెండు బల్బులు వేయటానికి నెలలుగడపటం అధికారులు నిర్లక్ష్యానికి నిదర్శనంగా చెప్పకతప్పదు.
అనుకోని రీతిలో అనారోగ్యం సంబవించినా, 108కి ఫోన్‌ ద్వారా సమాచారం అందినప్నటికీ రావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి అవసరం వచ్చినా మూడు కిలోమీటర్లు దూరంలో వున్న ఉత్తరావల్లి వెళ్లాల్సిందే. రోడ్డు సౌకర్యం అంతంత మాత్రంగానే వుంది. ఈ పది కుటుంబాలు ప్రభుత్వం పంపిణీ చేస్తున్నా పింఛన్లు, రేషన్‌ బియ్యం, అడవినుండి తెచ్చిన కట్టెలను అమ్ముకొని జీవనాన్ని సాగిస్తున్నారు. ఇంతదారుణంగా గిరిజనులు బతుకున్నప్పటి కీ పట్టించుకునే నాధుడు కరువయ్యాడు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే గిరిజనులు అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది.
వర్ణణాతీతంగా ఏజెన్సీలోని గిరిజనుల కష్టాలు
ఎన్ని ప్రభుత్వాలు మారినా వారి బతుకులు మాత్రం మారడం లేదు. వారి కష్టాలు తీరడం లేదు. విశాఖలోని గిరిజనుల కష్టాలు వర్ణణాతీతమనే చెప్పాలి. ముఖ్యంగా ఆనారోగ్య సమస్యలు వస్తే.. అంబులెన్స్‌ వెళ్లే పరిస్థితి కూడా లేదు. –(జి.ఎ.సునీల్‌ కుమార్‌)

విశాఖ ఓ అద్భుత నగరం

విశాఖ అద్భుతమైన నగరం..సిటీ ఆఫ్‌ డెస్టినీ..(గమ్య నగరం)గా విశాఖనగరం దూసుకుపోతుంది..భవిష్యత్తులో మరింతగా అభివృద్ధి చెందడానికి ఇక్కడ వనరులు పుష్కలంగా ఉన్నాయి. ఆంధ్ర మెడికల్‌ కళాశాల ఎంతోమంది వైద్య ప్రముఖలను దేశానికి అంది స్తోంది..పూర్వవిద్యార్థులురూ.50కోట్లతో క్యాబ్‌(సెంచినరీ అలుమ్ని బిల్డింగ్‌)నిర్మించడం అభినందనీయం.ఇదే స్పూర్తి మున్ముందు కొనసాగాలి. వేలాది మంది వైద్యులను అందించిన ఆంధ్ర మెడికల్‌ కళాశాల మరింత ఉన్నత స్థితికి చేరుకోవాలి.వైద్య సేవల కోసం ప్రజలు ఆసుపత్రికి రాకుండా..సంపూర్ణ వైద్యాన్నందించే కొత్త ఆవిష్కరణలకు నాంది పలకాలని భారత దేశ ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్కర్‌ ఆకాంక్షిస్తూ వైద్య విద్యార్థులకు పిలుపు నిచ్చారు.ఏఎంసీ శతాబ్ది వేడుకల్లో పాల్గోనేందుకు విశాఖ తొలిసారిగా విచ్చేసిన భారత ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ సహజ అందాల విశాఖను కొనియాడారు. అక్టోబర్‌ 28న విశాఖ ఏయూ కాన్వొకేషన్‌ సెంటర్‌లో జరిగిన సమావేశంలో మాట్లా డారు. విశాఖతోపాటు ఆంధ్రవైద్య కళాశాలపై ప్రశంసలు జల్లు కురిపించారు. ఇదే సమయంలో పాల్గొన్న గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ మాట్లాడుతూ ఏఎంసీకి అనుబంధంగా ఉన్న అసుపత్రుల ద్వారా రోజుకు రెండువేలమందికి వైద్య సేవలు అందుతున్నాయన్నారు. విశాఖనగరాన్ని దేశంలోనే కీలక గమ్యస్థానంగా మారుస్తున్న కొన్ని ప్రధాన సంస్థలు ఆత్మనిర్భర్‌ భారత దార్మనికతకు దోహదం చేస్తున్నాయన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్ర వైద్య కళాశాల మరిన్ని మైలురాళ్లు అధిరోహించాలని ఆకాంక్షించారు. తర్వాత ఎఎంసీ కళాశాలకు చేరుకున్న ఉపరాష్ట్ర పతి,గవర్నర్‌ ఆవరణంలో మొక్కలునాటి నీళ్లుపోశారు.అనంతరం శతాబ్ది వేడుకలు చిహ్నంగా ఏర్పాటు చేసిన పైలాన్‌నుఉప రాష్ట్రపతి ఆవిష్కరించారు.తర్వాత రూ.20కోట్లతో నిర్మించనున్న క్లినికల్‌ అండ్‌ బయోమెడికల్‌ పరిశోధన కేంద్రానికి శంకుస్థాపన చేశారు. అనంతరం వైద్య విద్యార్థులతో కొద్దిసేపు మాట్లాడి బృంద చిత్రం దిగారు. అక్కడ ఏర్పాటు చేసిన పొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించి విశాఖ చరిత్రను ఆసక్తిగా తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కళా శాల ప్రస్థానం,పూర్వవిద్యార్థుల చేయూత, క్యాబ్‌ ప్రాజెక్టు వివరాలను క్యాబ్‌ చైర్మన్‌ డాక్టర్‌. టి.రవి రాజు ఉపరాష్ట్రపతి,గవర్నర్‌ దృష్టికితీసు కెళ్లా రు.ఈపర్యటన కార్యక్రమంలో రాష్ట్రప్రభుత్వ ప్రతినిధి, రాష్ట్ర ఐటి,పరిశ్రమలశాఖమంత్రి గుడి వాడ అమర్‌నాథ్‌,జిల్లా ఇన్ఛార్జి,రాష్ట్ర వైద్యఆరోగ్య, శాఖమంత్రి విడదల రజని,వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్‌ జె.నివాస్‌, జిల్లా కలెక్టర్‌ డా.ఎ.మల్లి ఖార్జున,జివిఎంసి కమిషనర్‌ సాయి కాంత్‌వర్మ, సెంటినరీ సెలబ్రేషన్స్‌ కమిటీఅధ్యక్షులు డా.టి.రవి రాజు,ఎ.ఎం.సికళాశాల ప్రిన్సిపాల్‌ డా.బుచ్చి రాజు, కెజిహెచ్‌ సూపరింటెండెంట్‌ డా.పి.అశోక్‌ కుమార్‌, పలువురు జిల్లా వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.-జిఎన్‌వి సతీష్‌

ఆంధ్ర వైద్య కళాశాలకు వందేళ్లు

‘తెలుగు వారి కోసం ఏర్పాటైన వైద్య కళాశాల’ వందేళ్ల కిందట తెలుగువారి కోసం ప్రత్యేకం గా ఒక వైద్య కళాశాల ఉండాలంటూ అప్పటి మద్రాస్‌ ప్రభుత్వానికి తెలుగు ప్రజలు చేసిన విన్నపాలతో 1920లో తెలుగువారి కోసం మెడికల్‌ కళాశాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. అంతకు ముందు వరకు తెలుగు ప్రాంతాల్లో మద్రాస్‌ స్టాన్లీ మెడికల్‌ కాలేజ్‌ అనుబంధంగా లైసెన్సీయేట్‌ మెడికల్‌ సర్టిఫికేట్‌ అనే కోర్సులు మాత్రమే ఉండేవి. వాటిని మెడికల్‌ స్కూల్స్‌ అనే వారు.‘‘1902లో విశాఖలో మద్రాసు ప్రభు త్వం ప్రారంభించిన మెడికల్‌ స్కూల్‌కు కొంత కాలంతర్వాత గోడె సంస్థాన జమీందార్లు సొంత భవనం నిర్మించి ఇచ్చారు. అయితే ఇందులో కొన్ని కారణాలు వల్ల ఎటువంటి కార్యకలాపాలు జరగక పోవడంతో దానిని…దానిని తాత్కాలిక ఆరోగ్య కేంద్రంగా మార్చారు. కొంత కాలానికి కొత్త సివిల్‌ హాస్పిటల్‌ భవనం నిర్మాణం కావడంతో,ఈ తాత్కాలిక ఆరోగ్య కేంద్ర భవనంలోనే 32 మంది విద్యార్థులతో 1923 జూలై 19న మెడికల్‌ కళాశాలను అప్పటి మద్రాసు స్థానిక సంస్థల మంత్రి పానుగంటి రామఅయ్యంగర్‌ ప్రారంభించారు. ఈ కళాశాలకు తొలి ప్రిన్సిపాల్‌ గా లెప్టినెంట్‌ కర్నల్‌ ఫెడ్రిక్‌ జాస్పర్‌ అండ్రూసన్‌ పని చేశారు’’ అని విశాఖకు చెందిన చరిత్రకారులు ఎడ్వర్డ్‌ విజ్జేశ్వరం పాల్‌ చెప్పారు.మద్రాసు యూని వర్సిటీకి అనుబంధంగా పని చేసిన ఈ వైద్య కళాశాలకు ముందుగా వైజాగపటం వైద్య కళాశాల అని పేరు పెట్టారు. అప్పట్లో విశాఖపట్నాన్ని ఆంగ్లేయులు వైజాగపటం అని పిలిచేవారు.1926లో ఆంధ్ర యూని వర్సిటీ ప్రారంభమైన తర్వాత వైజాగపటం వైద్య కళాశాల ఏయూకి అనుబంధ కళాశాల గా మారింది. ఆ సమయంలో వైస్‌ ఛాన్స లర్‌గా ఉన్న సీఆర్‌ రెడ్డి దీని పేరును ఆంధ్రా మెడికల్‌ కాలేజ్‌గా మార్చాలని మద్రాస్‌ ప్రభుత్వాన్ని కోరడంతో,1940లో పేరు మారుస్తూ గెజిట్‌ విడుదల చేశారు. ఆ తర్వా త నుంచి ఈ కళాశాల ఆంధ్ర మెడికల్‌ కాలేజ్‌గానే ప్రసిద్ధి చెందింది.32 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఈ మెడికల్‌ కళాశాల…ప్రస్తుతం ఏటా 250 మంది వైద్య విద్యార్థులకు ప్రవేశాలు కల్పించే స్థాయికి చేరిందని ఏఎంసీ పూర్వ విద్యార్థి, నెఫ్రాలజిస్ట్‌ డాక్టర్‌ రవిరాజ్‌ అన్నారు.
‘మహిళల దరఖాస్తులు తిరస్కరించేవారు’
అనాటమీ, ఫిజియాలజీ, బయోలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌ విభాగాలతో ప్రారంభమైన ఈ కళా శాలలో తొలి సంవత్సరం 50మంది విద్యా ర్థులకు అవకాశం కల్పిస్తే…32 మందే ప్రవే శాలు పొందారు. ఇందులో తెలుగు జిల్లాలకు చెందిన విద్యార్థులకే ప్రాధాన్యం ఇచ్చారు. ప్రవేశాలు పొందిన వారిలో తొలి ఏడాది 59 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఏఎంసీ రికార్డులు చెప్తున్నాయి.రెండో ఏడాది ఒక మహిళ దరఖాస్తు చేసుకున్నారు. కానీ విమెన్‌ కోసం ప్రత్యేక గదులు, బాత్రూం వంటి సదుపాయాలు లేకపోవడంతో ఆమె దరఖా స్తును తిరస్కరించారు.ఆ తర్వాత కూడా సౌకర్యాల లేమి కారణంగా ఇక్కడ మహి ళలకు ప్రవేశాలు కల్పించేవారు కాదని పూర్వ విద్యార్థిని డాక్టర్‌ రాధ కుమారి తెలిపారు. 1942లో 175 మందికి సరిపడే విధంగా విద్యార్థినుల కోసం విమెన్‌ హాస్టల్‌ని నిర్మిం చారు. ప్రస్తుతం ఇక్కడ ఏటా ప్రవేశాలు పొందుతున్న వారిలో అబ్బాయిల కంటే అమ్మాయిలే అధికంగా ఉంటారని ఏఎంసీ పూర్వ విద్యార్థిని, అనాటమీ విభాగంలో పని చేస్తున్న డాక్టర్‌ సురేఖ తెలిపారు. 202 మందికి సరిపోయే విధంగా మెన్స్‌ హాస్టల్స్‌ కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ‘‘నేను కళాశాలలో చదువుకున్న విద్యార్థినినే. నాలాగే ఇక్కడ చాలా మంది పూర్వ విద్యార్థు లే ఉద్యోగులుగా కూడా ఉన్నాం.వందేళ్ల ఉత్స వాలు జరుపుకుంటున్న ఈ కళాశాలలో వైద్య రంగంలో ఎంతో పేరుపొందిన కాకర్ల సుబ్బా రావు,ఉలిమిరి రామ లింగస్వామి,శ్రీపాద పినాకపాణి,డాక్టర్‌ వ్యాఘ్రేశ్వరుడు,డాక్టర్‌ బ్రహ్మయ్యశాస్త్రి,డాక్టర్‌ రాజారామ్మెహన రెడ్డి,డాక్టర్‌ రామలింగస్వామి వంటి వైద్యులు చదువుకున్న చోటే మేం చదువుకోవడం… ఇక్కడే ఉద్యోగాలు పొందడం, ఇప్పుడు వందేళ్ల సంబరాల్లో పాలుపంచుకోవడం చాలా సంతోషంగా ఉంది’’అని సురేఖ చెప్పారు. పినాకపాణి వంటి వారు వైద్యం లోనే కాకుండా సంగీతంలో కూడా నిష్ణాతు లుగా పేరు పొందారు. అనటమీ,బయో కెమిస్ట్రీ, కార్డి యాలజీ…ఇలా 34విభాగాల్లో ఆంధ్ర మెడికల్‌ కళాశాల ప్రస్తుతం వైద్య విద్యను అంది స్తోంది.‘ఏఎంసీలో సీటు వస్తే గర్వపడతారు’ దేశంలో ఉన్న పురాతన వైద్య కళాశాలలో ఏఎంసీ ఒకటి.అలాగే దీనికి ఉన్న చరిత్ర, ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ప్రపం చం నలుమూలలా వైద్యరంగంలో ఎంతో కీర్తి ప్రతిష్టలు పొందడం వంటి అంశాలు వైద్య విద్యని అభ్యసించాలనుకునే వారిని ఆకర్షిస్తుం టాయి. దాంతో వారంతా ఇక్కడే సీటు పొం దాలని కోరుకుంటారు. ఇక్కడ సీటు పొందిం తే అది చాలా గర్వంగా చెప్పుకుంటారు అని ప్రస్తుతం ఆంధ్ర మెడికల్‌ కళాశాల విద్యార్థి నిగా ఉన్న జనిషా అన్నారు.‘‘నాకు ఆంధ్ర మెడికల్‌ కళాశాలలో సీటు రావడంతో మా కుటుంబ సభ్యులు ఆ విషయాన్ని అందరికి గర్వంగా చెప్పుకున్నారు. మేం చదువుకునే రోజుల్లోనే ఏఎంసీలోనే చదవాలనే అనుకునే వాళ్లం. వందేళ్ల చరిత్ర ఉన్న కళాశాలలో మేం చదువుకున్నమంటే అదొక గొప్ప విష యంగా అనిపిస్తుంది.’’ అని జనిషా చెప్పారు. ఆంధ్ర మెడికల్‌ కాలేజ్‌కు దేశ వ్యాప్తంగా మంచి పేరుందని ఏఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బుచ్చిరాజు చెప్పారు. అందుకే దేశంలోని అని రాష్ట్రాల నుంచి ఇక్కడ విద్యార్థులు ప్రవేశాలు పొందాలని తాపత్రయపడతారని తెలిపారు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు,తమిళనాడు, కేరళ,రాజస్థాన్‌ ఇలా అన్ని ప్రాంతాలకు చెందిన వైద్య విద్యార్థులు ఉన్నారని ఆయన చెప్పారు. ఇలా దేశవ్యాప్తంగా అందరూ విద్యార్థులు ఇక్కడే చదవాలని పోటి పడుతుండటమే ఆంధ్ర మెడికల్‌ కాలేజ్‌ విశిష్టతను చెప్తుందన్నారు.
‘ప్రారంభంలో 32, 2017 నాటికి 250’
ప్రారంభంలో మెడికల్‌ స్కూల్‌ భవనంలో ప్రారంభమైన వైద్య కళాశాలకు క్రమంగా అనుబంధ బోధన ఆసుపత్రులు వచ్చాయి. తొలి రోజుల్లో ఈ కళాశాలకు అనుబంధంగా ఉన్న ఆరోగ్య కేంద్రం కింగ్‌ జార్జ్‌ ఆసుపత్రి (కేజీహెచ్‌)గా మారింది.132 పడకలతో ఏర్పాటైన కేజీహెచ్‌ ప్రస్తుతం1600 పడకల ఆసుపత్రి స్థాయికి ఎదిగింది. అలాగే విశాఖ లో ఉన్న విక్టోరియా ఆసుపత్రి, మానసిక ఆరోగ్య వైద్యశాల, ఛాతి అంటువ్యాధుల ఆసుపత్రి, ప్రాంతీయ కంటి ఆసుపత్రి,ఈఎన్టీ ఆసుపత్రి వంటివి ఆంధ్ర వైద్య కళాశాలకు అనుబంధ బోధనాసుపత్రులుగా వచ్చాయి. వీటన్నింటిలో 2500వరకు పడకలుఉన్నాయి. 1923లో 32 మంది విద్యార్థులతో ప్రారం భమైన వైద్య కళాశాల,1990 సమ యానికి 150 మందికి,2017నాటికి 250 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించే స్థాయికి పెరిగింది. ఇక్కడ అనాటమీ,ఫిజి యాలజీ,ఫార్మకాలజీ,వంటి విభాగాల్లో పురాతన మ్యూజియాలు ఉన్నాయి.అవయవ దానం చేయాలంటూ ఏఎంసీ చాలా కాలంగా ప్రజల్లో అవగాహన తెచ్చే కార్యక్రమాలు విస్తృతంగా చేస్తోంది.
పూర్వ విద్యార్థుల ‘వందేళ్ల’ కానుక
తొలి రోజుల్లో పెద్ద సౌకర్యాలు కూడా ఉం డేవి కాదని పూర్వ విద్యార్థులు తెలిపారు. 1938 సమయంలో రూ.3 రూపాయలు హాస్టల్‌ అద్దె ఉండేదని, అలాగే మెస్‌ ఛార్జీలు నెలకు రూ.18ఉండేవని తమకు పాఠాలు చెప్పిన ప్రొఫెసర్లు చెప్పేవారని డాక్టర్‌ రవి రాజ్‌ అన్నారు. తాము చదువుకునే సమ యానికి హాస్టల్‌ వసతి వంటివి ఏర్పాడ్డాయని, ఇక్కడ చదువుకుని వైద్యరంగంలో ఎదిగిన తాము చదువుకున్న కళాశాలకు వందేళ్లు నిండుతున్న సందర్భంగా ఒక భవనాన్ని నిర్మించి ఆంధ్ర మెడికల్‌ కాలేజికు బహుమ తిగా అందించబోతున్నామని ఆయన చెప్పారు. ‘‘1.2 ఎకరాల్లో కళాశాల సమీపంలోనే ఒక భవనాన్ని నిర్మించి అందులో స్టూడెంట్‌ సెంటర్‌, లెక్చర్‌ హాల్‌, లెబ్రరీ, రీడిరగ్‌ రూం, రీక్రియేషన్‌ రూం, ఇండోర్‌ గేమ్స్‌ వంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. దీని కోసం రూ. 45 కోట్లను పూర్వ విద్యార్థులంతా విరాళాలుగా వేసుకుని నిర్మిస్తున్నాం. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏఎంసీ పూర్వ విద్యార్థులు తమ కళాశాలకు ఏదో ఒకటి చేయాలనే తపనతో వందేళ్ల సందర్భంగా ఈ భవనాన్ని నిర్మించి, కళాశాలకు అందిస్తాం. అలాగే దీని మెయింటెనెన్స్‌ ఖర్చులను పూర్వ విద్యార్థుల సంఘమే చెల్లించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం’’ అని డాక్టర్‌ రవిరాజ్‌ చెప్పారు. ఆంధ్ర వైద్య కళాశాల గొప్పదనాన్ని చాటి చెప్పేలా శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పూర్వ విద్యార్థిని, గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ రాధ కుమారి చెప్పారు. పూర్వ విద్యార్థులు నిర్మించే భవనంలో ఏడాది పొడవునా విద్యా, వైజ్ఞానిక కార్యక్రమాలు క్రమం తప్పకుండా చేపట్టేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఆమె తెలిపారు. (బీబీసీ సౌజన్యంతో..)

విద్యార్థుల చూపు ఉన్నత విద్య వైపు

విద్యారంగంపై ఏపీ ప్రభుత్వం కనబరుస్తున్న ప్రత్యేక శ్రద్ధతో పాఠశాలలు, కళాశాలలకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నాడు- నేడు మొదలుకొని విదేశీ విద్యాదీవెన వరకు తెచ్చిన పథకాలు విద్యారంగాన్ని సమూలంగా మార్చివేశాయి. రాష్ట్రంలోనే కాదు దేశంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రాస్‌ ఎన్‌ రోల్‌ మెంట్‌ రేషియో(జీఈఆర్‌) గణనీయంగా పెరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఉన్నత విద్యలో దాదాపు 12.5 శాతం చేరికలు అదనంగా నమోదయ్యాయి. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి విద్యారంగంపై ప్రత్యేకంగా దృష్టి సారించి, పలు చర్యలు చేపడుతుం డటంతో అక్షరాస్యతలో దేశ సగటును మించి ఆంధ్రప్రదేశ్‌ వృద్ధి రేటును నమోదు చేసింది.
విద్యారంగంలో ఏపీకి అరుదైన స్థానం
ఆంధ్రప్రదేశ్‌లో 2020-21లో 19,87,618 మంది ఉన్నత విద్యాభ్యాసం కోసం కళా శాలల్లో తమ పేర్లు నమోదు చేసుకు న్నారు. 2014-15లో 17,67,086 మంది మాత్రమే ఉన్నత విద్యనభ్యసించగా, 2020- 21 నాటికి ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది. పార్లమెంట్‌ సమావేశాల్లో వైఎస్సార్‌సీ ఎంపీ పరిమళ్‌ నత్వానీ ఏపీలో ఉన్నత విద్య గురించి ప్రశ్న అడిగారు. దీనికి కేంద్ర విద్యాశాఖ మంత్రి సుభాష్‌ సర్కార్‌ రాజ్యసభలో సమాధానమిస్తూ ఏపీలో విద్యారంగం ప్రగతిపథంలో ఉందని వివరించారు.
దేశవ్యాప్తంగా మహిళలే ముందంజలో
2022లో నిర్వహించిన ఆలిండియా సర్వే ఆన్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఆధారంగా, రాష్ట్రంలో ఉన్నత విద్యలో నమోదు 12.5% పెరిగిందని మంత్రి సూచించారు. ఇంకా, సర్వే ప్రకారం, %Aూ%లో ఉన్నత విద్యలో మహిళల నమోదు 2014-15లో 7,73,650 నుండి 2020-21లో 9,31,553కి పెరిగింది, ఇది 20.4% పెరిగింది. దేశవ్యాప్తంగా ఉన్నత విద్యలో చేరిన వారి సంఖ్య మొదటిసారిగా నాలుగు కోట్ల మార్కును దాటిందని మరియు 2014లో 3.42 కోట్ల నుండి 2020-21లో దాదాపు 4.14కోట్లకు పెరిగిందని కేంద్ర మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు, 2014-15లో1.57 కోట్లుగా ఉన్న మహిళా నమోదులు 2020-21లో 2.01కోట్లకు పెరిగాయి.
నూతన కళాశాలల పెరుగుదలకు తోడ్పాటు
జాతీయ స్థాయిలో, షెడ్యూల్డ్‌ కులాల విద్యార్థుల నమోదు 2014-15లో 46.06 లక్షల నుండి 2020-21లో 58.94 లక్షలకు పెరిగిందని, ఇది 28% పెరిగిందని సర్వేలో తేలింది. దేశంలో ఎస్టీ (షెడ్యూల్డ్‌ ట్రైబ్‌) విద్యార్థుల నమోదు కూడా 2014-15లో 16.40 లక్షల నుండి 47% పెరిగి 24.12 లక్షలకు చేరుకుంది. దేశంలో ఇతర వెనుక బడిన కులాల విద్యార్థుల నమోదు 2014-15లో 1.13 కోట్ల నుండి 1.48 కోట్లకు పెరిగింది, ఇది 32% పెరుగుదలను సూచిస్తుంది. 2014-15 మరియు 2020-21 మధ్య దేశంలో 353 విశ్వవిద్యాలయాలు మరియు 5,298 కళాశాలలు అదనంగా పెరిగాయి.
కళాశాలల రీ మోడలింగ్‌ తోనే సాథ్యం..!
రాష్ట్రీయ ఉచ్ఛతర్‌ శిక్షా అభియాన్‌ పథకం (రాసు) కింద, ఆర్థికంగా వెనుకబడిన జిల్లాలు మరియు ఆశావహ జిల్లాలు వంటి అన్‌సర్వ్‌డ్‌ మరియు అండర్‌సర్వ్‌డ్‌ ఏరియాల్లో 130 మోడల్‌ డిగ్రీ కాలేజీల స్థాపనకు కేంద్ర మద్దతును ఆమోదించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు.రాసు ద్వారా, కళాశాలలకు మౌలిక సదుపాయాల గ్రాంట్లు, ఎంపిక చేసిన స్వయంప్రతిపత్త కళాశాలల్లో నాణ్యత మరియు శ్రేష్ఠతను పెంపొందించడం మరియు ఇప్పటికే ఉన్న డిగ్రీ కళాశాలలను మోడల్‌ డిగ్రీ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేయడం వంటి సేవలందించని మరియు తక్కువ సేవలం దించే ప్రాంతాలలో ఉన్నత విద్యను మెరుగు పరచడానికి కూడా కేంద్ర మద్దతు అందించ బడుతుంది.
విద్యా రంగంలో నవశకం
విద్యా రంగాన్ని సమూలంగా మార్చేం దుకు కమిషన్ల ఏర్పాటురాష్ట్ర విద్యారంగంలో నవశకం ఆరంభమైంది.విద్యా వ్యవస్థలో సమూల మార్పుల దిశగా ప్రభుత్వం నాంది పలికింది.ఇందుకు సంబంధించి చరిత్రాత్మ కమైన రెండు కీలకబిల్లులను శాసనసభ ఆమోదించింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాఠశాల విద్యా నియంత్రణ,పర్యవేక్షణ కమిషన్‌ బిల్లు..ఉన్నత విద్యానియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ బిల్లులు అసెంబ్లీలో ఆమోదం పొందాయి. దీంతో ఇంత కాలం విద్యార్థులు,తల్లిదండ్రులను ఫీజుల పేరిట పీల్చిపిప్పి చేస్తున్న ప్రైవేట్‌,కార్పొరేట్‌ విద్యా వ్యాపారానికి అడ్డుకట్ట పడనుంది.ఎన్నికలకు ముందు తనసుదీర్ఘ పాదయాత్రలో రాష్ట్రం లోని విద్యారంగ పరిస్థితిని, పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు పడుతున్న అవస్థలను కళ్లారా చూసి చలించిన ముఖ్యమంత్రి ఈ రెండు బిల్లులకు రూపకల్పన చేసి,తొలి అసెంబ్లీ సమావేశంలోనే ఆమోదింపజేశారు.
ఎల్‌కేజీ మొదలు ఇంజనీరింగ్‌ వంటి ఉన్నత చదువుల వరకు పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అనేక అవస్థలు పడుతున్నారు. ఆస్తులు సైతం అమ్ముకోవడమే కాకుండా ఆచదువులు పూర్తయ్యేసరికి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ప్రైవేటు విద్యా సంస్థలు విద్యను వ్యాపారమయం చేయడంతో పేదలే కాకుండా సామాన్య, మధ్యతరగతి ప్రజలకు సైతం విద్య పెనుభారంగా మారింది. గత ప్రభుత్వం ప్రభుత్వ విద్యా సంస్థలను నిర్వీర్యం చేసి ప్రైవేటు విద్యా సంస్థలను ప్రోత్సహిం చడంతో పాటు ఇష్టానుసారం ఫీజులు దండుకొనే స్వేచ్ఛను సైతం ఇచ్చేసింది. కనీస సదుపాయాలు, బోధకులు లేకుండానే కాలేజీలు, స్కూళ్లను నిర్వహిస్తున్నాయి. పిల్లలను జైళ్ల వంటి హాస్టళ్లలో ఉంచి వారిపై విపరీతమైన ఒత్తిడి పెడుతూ వారి బలవన్మరణాలకు కారణమవుతున్నాయి. సరైన బోధన లేకుండా బట్టీ పద్ధతులను పాటిస్తూ విద్యార్థులను యంత్రాలుగా మార్చేస్తున్నాయి.
రాష్ట్ర చరిత్రలో కీలక మలుపు
పాఠశాల, ఉన్నత విద్యా నియంత్రణ, పర్య వేక్షణ కమిషన్‌ బిల్లులు ఆమోదం పొంద డంతో ఇకపై రాష్ట్రంలో విద్యా రంగ రూపు రేఖలే పూర్తిగా మారిపోనున్నాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలే ప్రామాణికం గా విద్యా రంగం పయనిస్తుందని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ బిల్లు లు రాష్ట్ర చరిత్రలో కీలక మలుపుగా పలు వురు అభివర్ణిస్తున్నారు. ఈ కమిషన్లకు ప్రభు త్వం అనేక అధికారాలు కల్పించింది. ఫీజులు, ప్రమాణాలు, విద్యార్థులు.. టీచర్ల సంక్షేమం ఇలా అన్ని కోణాల్లోనూ ఈ కమిషన్లు విద్యారం గాన్ని పర్యవేక్షిస్తాయి. హైకోర్టు రిటైర్డ్‌ జడ్జిలు ఛైర్మన్లుగా ఉండడంతో పాటు ఆయా రంగాల్లో నిపుణులు, మేధావులను సభ్యులుగా నియమించనుండడంతో విద్యారం గం పగడ్బందీగా మారుతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. వీటికి సివిల్‌ కోర్టు అధికారాలను కూడా ప్రభుత్వం కల్పిస్తోంది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణ అధికారం విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌కు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పాఠశాలలు మినహా తక్కిన అన్ని సంస్థలు ఈ కమిషన్‌ పరిధిలోకి వస్తాయి.ప్రైవేటు విద్యా సంస్థల్లోని టీచర్ల సర్వీసు కండిషన్లు, వారికి ఇస్తున్న వేతనాలు, ఇతర అంశాలను కూడా కమిషన్‌ పరిశీలి స్తుంది. ఫీజుల నిర్ణయానికి సంబంధించి స్వతంత్ర ప్రతిపత్తిగల అక్రిడిటేషన్‌ ఏజెన్సీని ఏర్పాటు చేస్తుంది. నిబంధనలు అసలు పాటిం చని సంస్థల గుర్తింపు రద్దుకు కూడా చేసే అధికారం ఉంటుంది.సివిల్‌ కోర్టు అధికారాలు కల్పిస్తున్నందున ఎవరినైనా పిలిపించి విచారిం చే అధికారం కమిషన్‌కు ఉంటుంది.ఇంటర్‌లో దోపిడీకి బ్రేకులు.ప్రస్తుతం పాఠశాల విద్య ఒక ఎత్తు అయితే ఇంటర్మీడియెట్‌ విద్య మరో ఎత్తు. రెండేళ్ల ఈ కోర్సు పేరిట ప్రవేట్‌, కార్పొరేట్‌ సంస్థలు నిలువు దోపిడీ చేస్తున్నా యి. ఇప్పుడీ కోర్సును ఉన్నత విద్యా నియం త్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఈ కాలేజీల వ్యవహరాలను పరిశీలిస్తుంది. ఇప్పటి వరకు ఇంటర్మీడియెట్‌ కాలేజీలపై ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడంతో ఆయా యాజ మాన్యాల ఇష్టానుసారం అయ్యింది. అలాగే ప్రైవేటు వర్సిటీలు కూడా ఈ రాష్ట్రంతో, ప్రభుత్వంతో సంబంధం లేనట్లు ఇష్టాను సారంగా ఫీజులు, ప్రవేశాలను కొనసాగిస్తు న్నాయి. ఈ కమిషన్‌ ఏర్పాటుతో వాటికీ అడ్డుకట్ట పడనుంది. ఉన్నత విద్యా సంస్థల్లో అత్యున్నత ప్రమాణాల సాధనకు కమిషన్‌ చర్యలు చేపడుతుంది.ప్రవేశాలు,బోధన, పరీక్షలు,పరిశోధన,బోధనా సిబ్బంది అర్హతలు, మౌలిక సదుపాయాలు, కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఆయా సంస్థల నిర్వహణ ఉందా? లేదా అన్న అంశాల పరిశీలన. జూనియర్‌,డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్‌, ఇంజనీరింగ్‌ కాలేజీలతో పాటు అన్ని ప్రైవేటు యూనివర్సిటీలు (రాష్ట్ర చట్టాలకు లోబడి ఏర్పాటైనవి) కూడా ఈ కమిషన్‌ పరిధిలోకి వస్తాయి. ఆయా సంస్థలపై చర్యలకు కమిష న్‌కు అధికారం ఉంటుంది. విద్యార్థులకు సమస్యలు తలెత్తకుండా ఆయా సంస్థల మూతకు చర్యలు తీసుకొనే అధికారం కమిషన్‌కు ఉంది. నిబంధనలు పాటించని ఉన్నత విద్యా సంస్థలకు పెనాల్టీల విధింపు అధికారం ఉంది. నిబందనలు ఉల్లంఘించే సంస్థల గుర్తింపు రద్దుకు వర్సిటీలను ఆదేశించే అధికారం. చైర్మన్‌, సభ్యులపై లేదా కమిషన ్‌పై న్యాయపరమైన కేసులు దాఖలు చేసేందుకు వీలులేదు. నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారం నడిచే విద్యా సంస్థలను మూత వేసే అధికారం ఉంటుంది. పెనాల్టీలను విధిస్తుంది. వాటిని కట్టకుంటే వాటి నిధులను, లేదా స్థలాలను స్వాధీనం చేసుకొనే అధికారం కూడా ఉంది. కాగా, కమిషన్‌ నిర్ణయాలను పరిశీలించే, సవరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది.- జీఎన్‌వి సతీష్‌

పెన్షన్‌ భిక్ష కాదు.. ఉద్యోగుల ..హక్కు..!

ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా చర్చనీ యాంశమైన అంశాల్లో పెన్షన్‌ కూడా ఒకటి.కేంద్ర ప్రభుత్వం బలవంతంగా రుద్దుతున్న నూతన పెన్షన్‌ విధానాన్ని దేశవ్యా ప్తంగా ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఉద్యోగ విరమణ అనంతరం ప్రశాంతంగా గడవ వల సిన జీవితా లు ఈ విధానంతో ప్రశ్నార్ధకంగా మారుతుం డటమే దీనికి కారణం. శక్తియుక్తులన్నీ ఉద్యోగు లుగా ఖర్చు చేసిన తరువాత, మిగిలిన జీవితాన్ని గౌరవప్రదం గా గడపడానికి ఉద్దేశించిందే పెన్షన్‌! అయితే, అటు వంటి పరిస్థితి నిజంగా ఉందా అంటే లేదు అన్నదే సమా ధానం. అనేక రంగాల మాదిరే ఈ విషయంలో నూ మనదేశానిది అథమస్థానమే. అమెరి కాకు చెందిన కన్సల్టింగ్‌ కంపెనీ మెర్సర్‌, స్వచ్ఛంద సంస్థ సిఎఫ్‌ఎ ఇన్‌స్టి ట్యూట్‌ కలిసి సంయుక్తంగా విడుదల చేసిన తాజా ప్రపంచ పెన్షన్‌ సూచీ (2023)లో భారత దేశ స్థానం చివరి నుండి మూడవది !
మొత్తం47దేశాల్లో ఆసంస్థ సర్వే నిర్వహించగా భారత్‌ 45వ స్థానంలో నిలిచింది. 2022 లో 44దేశాలకుగాను మన దేశం 41 వ స్థానంలో నిలిచింది. అంటే గత ఏడాదితో పోల్చినా మన స్థానం మరింత దిగజారిందన్న మాట. ఇదీ సీనియర్‌ సిటిజన్లకు మనం ఇస్తున్న గౌరవం! ఈవాస్తవాన్ని గుర్తించి, మెరుగైన విధా నాన్ని రూపొందించడానికి మనపాలకులు సిద్ధ పడకపోవడమే విచారకరం. ప్రపంచ ఆకలి సూచీ రిపోర్టును తిరస్కరించినట్టే దీనిని కూడా మోడీ ప్రభుత్వం తిరస్కరించింది.2021లోపెన్షన్‌ సూచీ లో భారత్‌ చివరిస్థానంలో నిలవడంతో పార్లమెం టులో ప్రస్తావనకు వచ్చింది.దీనిపై వివిరణ ఇచ్చిన ప్రభుత్వం ఆ సూచికలో విశ్వసనీయ సమా చారం లేదని,అన్ని అంశాలను పరిగణలోకి తీసు కోలేదని ప్రకటించింది. ఆ తరువాతైనా పెన్షన్‌ విధానంలో మెరుగైన మార్పులు తీసుకువచ్చిందా అంటే అదీ లేదు.ఏటికేడాది దిగదిడుపే !
నిజానికి,మెర్సర్‌-సిఎఫ్‌ఎ ఇన్‌స్టిట్యూట్‌ గత పదిహేను సంవత్సరాలుగా విడుదల చేస్తున్న గ్లోబల్‌ పెన్షన్‌ ఇండెక్స్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తిం పు ఉంది.తాజా సర్వేను 64శాతం ప్రపంచ జనాభాకు ప్రాతినిధ్యం వహించేలా 47 దేశాల్లో ఈ సర్వే జరిగింది. ఆ దేశాల్లోని పెన్షన్‌ విధానా లను సమగ్రంగా అధ్యయనం చేయడంతో పాటు, 50 అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నట్లు నిర్వా హకులు తెలిపారు. ఈ సర్వేలో 85 పాయింట్లతో నెదర్లాండ్స్‌ మొట్టమొదటి స్థానంలో నిలవగా, 83.5పాయింట్లతో ఐస్‌ల్యాండ్‌ రెండవ స్థానం లో,81.3 పాయింట్లతో డెన్మార్క్‌ మూడవ స్థానంలో నిలిచాయి.45వస్థానంలో నిలిచిన భారత్‌కు 45.9పాయింట్లు దక్కగా,42.3 పా యింట్లతో అర్జెంటీనా చిట్టచివరన నిలిచింది. అమెరికాతోపాటు మధ్యస్థంగా ఉన్న అనేక దేశాలు తీసుకురావాల్సిన మార్పులను పేర్కొన్న నివేదిక, చైనా,కొరియా సింగపూర్‌, జపాన్‌ వంటి దేశాలు మెరుగైన విధానాలను అమలు చేస్తున్నాయని తెలి పింది. అదే సమయంలో భారత్‌ పనితీరుపై అది పెదవి విరిచింది. నయా ఉదారవాద విధా నాల ఫలితంగా దుర్భరమౌతున్న బతుకులు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, జీవన ప్రమాణాల్లో వస్తున్న మార్పులు, అంతకంతకు భారమౌతున్న వైద్య ఖర్చుల తీరును ప్రస్తావించిన నివేదిక వీటిని తట్టుకునే విధంగా పెన్షన్‌ విధానాలను రూపొం దించాలని ప్రపంచ దేశాలకు సూచించింది.
మెరుగైన పెన్షన్‌ విధానం కోసం దేశంలోనూ,ప్రత్యేకించి మనరాష్ట్రంలోనూ ఉద్యోగులు,ఉపాధ్యాయులు సాగిస్తున్న పోరాటాన్ని ఈ నేపథ్యంలోనే చూడాలి.ఈ సందర్భంగా ప్రస్తా వనార్హం.ఉద్యోగ విరమణ అనంతరం గౌరవ ప్రదమైన జీవితంకోసం పాతపెన్షన్‌ విధానం కావాలని ఉద్యోగులు,ఉపాధ్యాయులు డిమాండ్‌ చేస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం ససేమిరా అం టోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి భిన్నం గా కంట్రిబ్యూషన్‌ విధానంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జిపిఎస్‌ను వీరు తిరస్కరిస్తున్నారు. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ వంటి రాష్ట్రాలు పాత పెన్షన్‌ విధానం అమలు చేస్తుం డగా,మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సాధ్యం కాదని,ఖజానాపై పెనుభారం పడుతుందని చెబు తుండటం విచిత్రం! ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ మొండి వైఖరికి నిరసనగా యుటిఎఫ్‌ ఆధ్వ ర్యంలో రాష్ట్ర స్థాయిలో నిరవధిక నిరాహార దీక్షలు ప్రారంభమైనాయి. క్షేత్రస్థాయికి పోరాటాన్ని తీసుకు పోవడంలో భాగంగా జిల్లా, మండల స్థాయిల్లో నూ దీక్షలు చేపట్టనున్నారు. పాత పెన్షన్‌ విధానా న్ని అమలు చేస్తామన్న పార్టీకే రానున్న ఎన్నికల్లో ఓటు వేయాలని ఉపాధ్యాయ నేతలు ఇచ్చిన పిలుపు అత్యంత సముచితమైనది. గౌరవప్రదమైన పెన్షన్‌ ప్రభుత్వం ఇచ్చే భిక్షకాదు.ఉద్యోగుల హక్కు! అని నినదిస్తూ ఇటీవల ఢల్లీిలో భారీర్యాలీ జరిగిం ది. రాష్ట్రంలోనూ అంచెలం చెలుగా ఈ పోరా టం విస్తృతమౌతోంది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్లు తెరవాలి. ఉద్యోగులు,ఉపా ధ్యాయల న్యాయసమ్మతమైన డిమాం డ్లను పరిష్క రించాలి.- జిఎన్‌వి సతీష్‌

ఇటుకల బట్టీల్లో వలసల బతుకులు

రాష్ట్రంలో భవన నిర్మాణాలు జోరుగా సాగుతుండడంతో ఇటుక బట్టీలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు చెందిన వ్యాపారులు వ్యవసాయ భూమిని లీజుకు తీసుకొని ఈ వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఇటుకలను తయారీ చేయడానికి ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా నుంచి కార్మికులను తీసుకువస్తుంటారు.అక్కడ నుంచి వలస వచ్చిన కూలీల పరిస్థితి దయనీయంగా ఉంది. శ్రమకు తగ్గ ఫలితం లభించకపోగా,కనీససౌకర్యాలుకూడా యజమానులు కల్పించడం లేదు. బట్టీల వద్దనే చిన్న చిన్న గుడిసెలు ఏర్పాటు చేసుకొని కుటుంబాలతో జీవనంసాగిస్తున్నారు. పగలనకా,రాత్రనకా ఇటుకలు తయారు చేయిస్తున్న కష్టపడి పనిచేస్తున్న వలస కార్మికుల శ్రమను దోచుకుంటున్న ఇటుకల బట్టీ యజమానులు కోట్లరూపాయలు గడిస్తున్నారు.బట్టీల నిర్వహణకు మైనింగ్‌,కార్మికశాఖల నుంచి అను మతులు తీసుకోవలసి ఉన్నా ఆనిబంధనలేవీ అమలు కావడం లేదు.
ఇటుక బట్టీల ఏర్పాటుకు ఆయా గ్రామ పంచాయతీలతో పాటు రెవెన్యూశాఖ,కాలుష్య నియంత్రణమండలి నుంచి అనుమతులు తప్పకుండా తీసుకోవాలి, కానీకొందరు వ్యాపారులు మాత్రం నిబంధనలు పాటించడంలేదు.అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూముల్లోనూ బట్టీలు నిర్వహిస్తున్నారు.విశాఖపట్నం,విజయనగరం,అనకాపల్లి,భీమిలితదితర మండలాల్లో రోడ్డుల పక్కనే ఇటుక బట్టీలు ఏర్పాటు చేయడంవల్ల వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.గాలికి బూడిద కొట్టుకువచ్చి కండ్లల్లో పడడం,బట్టీలనుంచి వెలువడుతున్న పొగతో రోడ్డు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన చెందుతున్నారు.
ఇక అక్షరాలు దిద్దాల్సిన వేళ్లు మట్టి పెళ్లలను పెకిలిస్తున్నాయి.పలకలు పట్టాల్సిన చేతులు ఇటుకలు మోస్తున్నాయి. నిరుపేదలుగా పుట్టటమే వారికి శాపమయ్యింది.ఆడుతూ పాడుతూ స్కూల్‌కి వెళ్లాల్సిన వయస్సులో బాలకార్మికులుగా వెట్టిచాకరి చేయిస్తున్నారు. ఈడు పిల్లలు బడిలో ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నా,స్థానిక గ్రామ సచివాలయ వ్యవస్థ, విద్యాశాఖ, రెవెన్యూ కార్మికశాఖ ఈచిన్నారుల అవస్థలు నిత్యం చూస్తున్నా..ఒక్క అధికారి కూడా పట్టిపట్టనట్లు వ్యవహరిస్తున్నారు.బాల కార్మికులతో ఇటుకలు పేర్చటం,మట్లిపోయడం,ఇటుకలు ఆరబెట్టడం,వంటి పనులు చేయిస్తున్నారు.పని చేస్తున్నకార్మికులకు కనీసవేతనం చట్టం నిబంధనలప్రకారం శ్రమతగ్గా వేతనాలు చెల్లించడంలేదు.ఆ నిబంధనలను ప్రభుత్వం పట్టించుకున్న దాఖాలు లేవు. దీంతో కార్మికులే కాకుండా వారి పిల్లల బ్రతుకులు ఇటుక బట్టీలోనే నలిగిపోతున్నాయి. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన గిరిజన కుటుంబాలతో ఎక్కువ పనిచేయించుకొని తక్కువ వేతనాలు ఇచ్చి శ్రమ ను దోచేస్తున్నారు.
ఇటుక బట్టీల అక్రమార్కులు ప్రజా ప్రతినిధులతో కుమ్మక్కై బట్టీలను నిర్వహించడంతో అధికారులు వారివైపు చూడటానికి భయపడుతున్నారు.బట్టీ యజమానులు అక్రమంగా మట్టిన త్రవ్వి వాల్దా చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. ఇటుక బట్టీ యజమానులు ఇన్నిరకాల నేరాలకు పాల్పుడుతుంటే ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.నిర్మాణరంగం పెరుగుతున్న నేపధ్యంలో ప్రభుత్వం అక్రమార్జనకే అధికప్రాధాన్యత ఇస్తుందే తప్పా వలస కార్మికులు,బాలకార్మికుల బతుకులను పట్టించు కోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం బాధ్యత వహించి ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న వారికి కనీసం నిబంధనల ప్రకారం వేతనాలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. బడిఈడు పిల్లల్ని బడికి పంపించేలా విద్యాశాఖ అధికార్లు చర్యలు తీసుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది.!- రెబ్బాప్రగడ రవి ,ఎడిటర్,

కంటకాపల్లి రైల్వే ప్రమాదంలో మృత్యుఘటికలు

ఈ ఘోర ఘటన మరువ లేనిది. ఎన్ని రైల్వే ప్రమాదాలు జరిగినా సామాన్యుడు ప్రాణాలే గాల్లో కలిసిపోతున్నాయి. ప్రభు త్వాలకు పట్టడం లేదు. అందుకే పదే పదే ఒకే తరహా ప్రమాదాలు ప్రయాణీకులను బలితీసుకుంటున్నాయి. విజయనగరం జిల్లా కంటకాపల్లి దరిలో జరిగిన ఘటనే తార్కాణం. అక్టోబర్‌ 29న పొద్దు వాలు తున్న సమాయన సంభవించిన ఘోర రైలు ప్రమాదం పదమూడు మంది అమా యకుల ప్రాణాలను కబళించింది. వంద మంది వరకు క్షతగాత్రులను చేసింది. విశాఖ నుంచి పలాస వెళుతున్న ప్యాసిం జర్‌ రైలుకు సిగల్‌ అందక కంటకాపల్లి సమీపంలో ట్రాక్‌పై నిలిపిఉంచగా, వెనక నుంచి అదే పట్టాలపై విశాఖ నుంచి రాయగడ వెళ్లే ప్యాసింజర్‌ రైలు వేగంగా ఢకొట్టిెంది.ఆ ధాటికి రాయగడ రైలు కొన్ని బోగీలు నుజ్జునుజ్జు కాగా మరికొన్ని పక్క ట్రాక్‌లోని గూడ్స్‌ రైలు మీదికి దూసుకెళ్లాయి. ఈ భీతావహంలో చని పోయిన వారిలో ఇద్దరు లోకో పైలెట్లు, గార్డు కూడా ఉండటం విషాదం. ముందుగా వెళ్లిన రైలుకు సిగల్‌ అందని పరిస్థితి ఉండగా వెనుక మరో రైలును అదే ట్రాక్‌పై పంపడం రైల్వే భద్రత డొల్లత నానికి నిదర్శనం. ఇదే రూట్‌లో ఒడిశా లోని బాలాసోర్‌ వద్ద జూన్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 296 మంది మరణించగా 1,200 మంది గాయపడ్డారు. ఆ ఘోర కలిని మర్చిపోక ముందే అదే తరహాలో సిగల్‌ వైఫల్యం కారణంగా మూడు రైళ్లు గుద్దుకు న్నాయి.ఈ నెలలోనే బీహార్‌లో పట్టాలు ఊడి పోవడాన్ని గమనించిన డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేయడంతో పెనుముప్పు తప్పింది. నాలుగు మరణాలు,70 మందికి గాయా లతో సరి పోయింది. వరుస రైలు ప్రమాదాలతో రైలు ప్రయాణ మంటేనే ప్రజలను భీతిల్లజేస్తోంది. దుర్ఘటన జరిగిన ప్రతిసారీ ప్రముఖుల సంతాపాలు, పరామర్శలు, తృణమో పణమో పరిహారాలు మినహా ప్రమాదాలపై సమగ్ర విచారణ జరిపి,కారణాలు కనుగొని,పునరావృతం కాకుండాపటిష్ట చర్యలు చేపట్టే విషయంలోకేంద్ర ప్రభు త్వం బాధ్యత తప్పింది.ప్రభుత్వం వైఫల్యాల నుంచి ప్రజలను ఏమారు స్తోంది.రైల్వే భద్రత విషయంలో మోడీ ప్రభుత్వ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యాన్ని 2022లో విడుదల చేసిన కాగ్‌ నివేదిక కుండబద్దలు కొట్టింది.దాదాపు రైలు ప్రమాదాలన్నీ పట్టాలు తప్పడం వల్లనే సంభవిస్తున్నాయని, పట్టాల పునరుద్ధరణకు నిధులు కేటాయించాల్సి ఉండగా, 2017 లో ప్రత్యేకంగా నెలకొల్పిన రాష్ట్రీయ రైలు రక్షణ నిధి నిధులు తగ్గించిన వైనాన్ని కాగ్‌ ఎత్తి చూపింది. అలాగే రైల్వేలపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్టాండిరగ్‌ కమిటీ రిపోర్టు ప్రకారం రైలు ప్రమాదాలపై రైల్వే సేఫ్టీ కమిషనర్‌ దర్యాప్తు చేసి సమర్పించిన నివేదికలపై ఎలాంటి చర్యలూ లేవు. ఇదీ ప్రయాణీకుల ప్రాణాలకు మోడీ ప్రభుత్వం ఇచ్చే విలువ. బాలాసోర్‌ ఘటన విషయానికే వస్తే సిబిఐ దర్యాప్తు చేసి ముగ్గురు అధికా రులను అరెస్టు చేసి కోర్టులో ఛార్జిషీట్‌ వేసి మమ అనిపించింది. కానీ సిగలింగ్‌ వ్యవస్థ ఏమాత్రం మారలేదని విజయనగరం ఘటన వలన తేటతెల్లమవుతోంది.కేంద్రంలో బిజెపి వచ్చాక రైల్వేల ప్రైవేటీకరణ దూకుడుగా జరుగుతోంది. వందల ప్రైవేటు రైళ్లొచ్చాయి. అదానీ వంటి కార్పొరేట్లకు రైల్వే ఆస్తులు ధారాదత్తమవుతున్నాయి. రైల్వే ప్రత్యేక బడ్జెట్‌ ఎత్తేశారు. ప్యాసింజర్‌ రైళ్లు రద్దవుతూ వందేభారత్‌, హైస్పీడ్‌ ట్రైన్లు ప్రవేశపెడు తున్నారు. 2022 చివరి నాటికి రైల్వేలలో మూడు లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని స్వయాన రైల్వేశాఖ మంత్రి రాజ్యసభలో వెల్లడిరచారు. రైళ్లల్లో ప్రతి రోజూ రెండున్నర కోట్ల మంది గమ్యస్థానాలకు చేరుతున్నారు. ఒక వైపు రైల్వేల ద్వారా ఏడాదికి రూ.2.40 లక్షల కోట్ల ఆదాయాన్ని మోడీ ప్రభుత్వం ఆర్జిస్తూ మరో వైపు ప్రయాణీకుల భద్రతకు ఏడాదికి రూ.5 వేల కోట్లు కూడా కేటాయిం చడం లేదు. సిబ్బంది లేని వేలాది లెవెల్‌ క్రాసింగ్‌లు పెట్టుకొని బుల్లెట్‌ రైళ్లనడం మోడీ ప్రభుత్వానికే చెల్లుతుంది. రైలు ప్రమాదాలను మానవ తప్పిదంగానో,కుట్రగానో చిత్రించడం తప్పించుకొనే ఎత్తు. ప్రపంచంలోనే అతి పెద్ద పబ్లిక్‌ రంగ రవాణా వ్యవస్థ మన రైల్వే. అత్యధిక ఉద్యోగులు పని చేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థగా మన రైల్వేలకు పేరుంది. రైల్వేలపట్ల ప్రభుత్వ విధానాల్లో మార్పు రానంత వరకు ప్రయాణీకుల ప్రాణాలు గాలిలో పెట్టిన దీపాల చందమే. విజయ నగరం దుర్ఘటనతోనైనా కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ మేల్కోవాలి.ప్రమాద బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలి.
సిగ్నలింగ్‌ వ్యవస్థ లోపాలు..
దేశ రైల్వేలో భద్రతా సిబ్బంది కొరత, సిగలింగ్‌ వ్యవస్థ ఆపరేషన్స్‌ నిర్వహణ విష యంలో కేంద్రంలోని మోడీ సర్కారు నిర్లక్ష్య వైఖరి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. దీంతో, గడిచిన ఆరేళ్లుగా తూర్పు కోస్తా రైల్వే పరిధి లోని వాల్తేరు డివిజన్‌లో ప్రమాదాలు క్రమేపీ పెరుగుతున్నాయి. భారీ ఘటనలు చోటుచేసు కున్నాయి. ఇక్కడ సుమారు రెండు వేల మంది ఇంజనీరింగ్‌ సిబ్బంది కొరత ఏళ్ల తరబడి వెంటాడుతోంది. 2013లో విజయ నగరం జిల్లా గొట్లాంలో జరిగిన ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒక బోగీలో పొగ వచ్చిందని, ఏదో ప్రమాదం జరగబోతుందనే కంగారులో రైలు గొలుసు లాగి పక్కనే మరో రైల్వే ట్రాక్‌లోకి ప్రయాణి కులు వెళ్తున్న క్రమంలో ఆ ట్రాక్‌పై వచ్చిన రైలు ఢకొనెడంతో మృతి చెందారు. 2016 లో కూనేరులో హీరాకుడ్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పడంతో 41 మంది మరణించారు. దేశంలోనే అతిపెద్ద రైలు ప్రమాదాల్లో ఒకటైన ఒడిశాలోని బాలాసూర్‌లో ఎదురెదురుగా వచ్చిన రైళ్లు ఢకొన్నె ఘటనలో 298 మంది ప్రాణాలు కోల్పోగా, 500 మందికిపైగా క్షతగాత్రులయ్యారు. తాజాగా వాల్తేరు డివిజన్‌ పరిధిలోని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి-అలమండ వద్ద 2023 అక్టోబర్‌ 29 రాత్రి రాయగడ-విజ యవాడ ఎక్స్‌ప్రెస్‌ రైలు పలాస పాసింజరును ఢకొనెడంతో సుమారు 13మంది విగతజీవు లయ్యారు. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ, మోడీ ప్రభుత్వం రైల్వేల భద్రతను పట్టించు కోకపోవడమే ఈ ప్రమాదాలకు కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కంటకాపల్లి-అలమండ వద్ద జరిగిన రైలు ప్రమాదంపై రైల్వే ఉన్నతాధికారులు ప్రాథమిక విశ్లేషణ ఇలా ఉంది. వాల్తేరు డివిజన్‌లో ప్రధాన, నిత్యం బిజీగా ఉండే రైల్వే లైను ఇది.మూడు రైల్వే లైన్లు ఇక్కడ ఉన్నాయి. మధ్య లైనులో ఈ తాజా ఘటన జరిగింది. హౌరా-చెన్నరు వెళ్లే రైళ్లు,కోరమండల్‌,కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌, మెయిల్‌,సరుకు రవాణా గూడ్స్‌ రైళ్లు ఈ లైన్లోనే వెళతాయి.వాల్తేరు రైల్వేలో కీలకమైన మూడు లైన్లు ఇవే అయినప్పటికీ భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఆదివారం ఘటనపై రైల్వే ప్రాథమిక అంచనాలు ఇలా ఉన్నాయి. స్నిగల్‌ వ్యవస్థల్లో రెడ్‌ (ఎరుపు)-1,గ్రీన్‌ (ఆకుపచ్చ)-2 సిగల్‌ లైట్లు ఉంటాయి. పూర్తిగా రెడ్‌ ఉంటే ఆగడం,గ్రీన్‌ ఉంటే వెళ్లడం చేయాలి.పసుపు లైట్లు రెండు ఉం టాయి. అవి రెండూ వెలిగితే ప్రొసీడ్‌ (2 సెక్షన్లు) లైన్లు క్లియర్‌గా ఉన్నాయని అర్థం. కానీ,ఒక పసుపు లైటు వెలిగి ఉంటే ఒక సెక్షన్‌ క్లియర్‌ అని, ఆగిఆగి వెళ్లాలని సంకే తం.తాజాగా జరిగిన ప్రమాదంలో రాయగడ రైలు లోకో పైలట్‌ కాస్త వేగంగా ప్రొసీడ్‌ అయ్యారని అంచనా వేస్తున్నారు.దీన్నే సిగల్‌ ఓవర్‌ సీగా రైల్వే పరిభాషలో పేర్కొం టున్నారు.
సిఆర్‌ఎస్‌ ఇన్వెస్టిగేషన్‌ ప్రారంభం
కంటకాపల్లి ఘటనపై ఇన్వెస్టిగేషన్‌కు కమిషనర్‌ రైల్వే స్టేఫ్టీ (సిఆర్‌ఎస్‌)ను కేంద్రం సోమవారం నియమించింది. ప్రత్యేక సాంకే తిక నిపుణుల బృందం వాల్తేరు డివిజన్‌లో ఈ మేరకు పరిశీలన చేయనుంది. మూడు రోజుల తర్వాత పేపర్‌ నోటిఫికేషన్‌ కూడా ఆనవాయితీ ప్రకారం విడుదల చేసి ప్రత్యక్షం గా, పరోక్షంగా ఎవరైనా ఈ ఘటనపై వివరాలు అందజేసేవారుంటే ఫలానా చోట కలవాలని ఈ కమిటీ తెలియపరచనుంది. ప్రజలు,రైల్వే సిబ్బంది, ప్రయాణికులందరినీ ఇలా విచారణ చేశాక పదిరోజుల తర్వాత ఈ ప్రమాద కారణాన్ని వెల్లడిరచనున్నారు. నానాటికీ తీసికట్టుగా భద్రత
ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే, సౌత్‌ కోస్ట్‌ రైల్వేల్లో లోకో పైలట్లకు అధిక పని ఒత్తిడి ఉందని కోర మండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదానికి ముందే కేంద్రానికి రైల్వే బోర్డు నివేదించింది.ఈస్ట్‌ కోస్ట్‌ పరిధిలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ట్రాక్‌లకు ఇరువైపులా పెన్సింగ్‌ ఏర్పాటు చేయాలని బోర్డు చెప్పినా రైల్వే శాఖకు పట్టలేదు. లోకో పైలట్ల పని 12 గంటలకు మించకుండా ఉండాలని సూచిం చింది.కానీ,12గంటలపైనే వీరితో పని చేయించుకుంటోంది.సదరన్‌ రైల్వే పరిధిలో 392 లోకో పైలట్ల పోస్టులు ఖాళీలు ఉన్నా యి.2017 నుంచి 2021 కాలానికి కేంద్ర ప్రభుత్వం భద్రతా నిధి కింద రూ.20వేల కోట్లు ఏర్పాటు చేయాలి. కానీ,రూ.4వేల కోట్ల మేరే జమ చేసింది. ఈ విషయంలో కేంద్ర వైఫల్యంపై కాగ్‌ 2021లో తప్పు పట్టింది.అదే విధంగా రైల్వే లైన్ల మరమ్మ తుల నుంచి సిబ్బంది సంఖ్యను పెంచే అంశం వరకూ వివిధ అంశాలపై వివిధ కమిటీలు, రైల్వే ట్రేడ్‌ యూనియన్లు, ప్రజాసంఘాలు ఇచ్చిన సిఫార్సులు ప్రభుత్వం ముందు కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి. వర్షాకాలంలో వానలు పడటం,వరదలు రావడం కొత్తేమీ కాదు.అతి తక్కువ రోజుల్లో అత్యధిక వర్ష పాతం నమోదు కావడమూ,ఫలితంగా అనూహ్య వరదలు సంభవించడమూ ఇటీవల కొన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉన్నదే!ఆ విష యం పక్కన పెట్టినప్పటికీ లైన్లను నిరంతరం కాపలా కాస్తూ, ఎప్పటికప్పుడు అవసరమైన చర్యల కోసం హెచ్చరికలు చేసే గ్యాంగ్‌మెన్ల వ్యవస్థ రైల్వేశాఖకు ప్రత్యేకం. కీలకమైన ఈ వ్యవస్థలో నియమకాలు కొన్ని సంవత్సరాలుగా నిలిచిపోయాయి.ఉన్న వారిని కూడా ఏదో రకంగా వదిలించుకోవడానికే రైల్వేశాఖ ప్రయత్నాలు చేస్తోంది. సమాచార సాంకేతిక విప్లవానికి ఆకాశమే హద్దుగా మారిన ప్రస్తుత రోజుల్లోనూ తాతల కాలం నాటి బూజు పట్టిన విధానాలనే రైల్వేశాఖ అమలు చేస్తోంది.ఫలితంగా రైలు పట్టాల వెంట నిరం తరం పహరా కాయాల్సిన గ్యాంగ్‌మెన్లపై పని భారం విపరీతంగా పెరుగుతోంది. ఒక్క గ్యాంగ్‌మెన్ల విషయంలోనే కాదు, ప్రయాణీ కుల భద్రతతో ముడిబడిన డ్రైవర్లు, గార్డులు, సిగలింగ్‌ సిబ్బంది, తదితర ఉద్యోగాల భర్తీ విషయంలోనూ కేంద్ర ప్రభుత్వానిది ఇదే వైఖరి. ప్రయాణీకుల భద్రతపై ఏ మాత్రం ఆలోచించే ప్రభుత్వమైనా మొట్టమొదట ఈ విషయంపై దృష్టి సారించాల్సి ఉంది. ప్రతి పక్షంలో ఉన్నప్పుడు ఇదే విషయమై విమర్శల వర్షం కురిపించిన బిజెపి నేతలు అధికారం లోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వానికన్నా అధికంగా ప్రైవేటీకరణ రాగాన్ని ఆలపిస్తు న్నారు. ఉట్టికెగిరే సత్తా లేకపోయినా ఆకాశాని కెగిరేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. మోడీ ప్రభుత్వం ఈ ఏడాది రైల్వే బడ్జెట్‌లో అట్టహాసంగా ఆవిష్కరించిన బుల్లెట్‌ ట్రైన్‌ విన్యాసమూ ఆ కోవలోనిదే. దేశవ్యాప్తంగా అత్యధిక రైలు ప్రమాదాలు పట్టాలు తప్పడం కారణంగానే జరుగుతున్నాయి. నిర్వహణ, నాణ్యత లోపాలే దీనికి కారణమని వివిధ కమిటీల నివేదికలు ఇప్పటికే నిగ్గు తేల్చాయి. గడిచిన దశాబ్ద కాలంలో సగటున ఏడాదికి 150కి పైగా ఈ తరహా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. రెండవ స్థానంలో లెవెల్‌ క్రాసింగ్‌ల వద్ద జరిగిన ప్రమాదాలు నిలి చాయి. వీటిలో అత్యధిక భాగం ప్రమాదాలకు సిబ్బందినే కారణంగా చూపుతున్న రైల్వేశాఖ వారికి అవసరమైన ఆధునిక సదుపాయాలను, తగిన సంఖ్యలో మానవ వనరులను కల్పిం చడంపై మాత్రం దృష్టి సారించ డంలేదు. ఈ ఏడాది బడ్జెట్‌లోనూ అత్యాధునిక ప్రమాద హెచ్చరిక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని రైల్వేమంత్రి ఊరించినప్పటికీ ఆదిశలో ఇప్పటి వరకు అడుగులు పడలేదు. ఆధునిక ట్రాక్‌ను ఏర్పాటు చేస్తామని, వెల్డింగ్‌లో నూతన విధానాలను అనుసరించి రైళ్లు పట్టాలు తప్పడాన్ని నిరోధిస్తామని చెప్పిన మాటలకూ ఇంతవరకు అతీగతీ లేకపోవడం విచారకరం. రైల్వే మంత్రిత్వ శాఖే నియమించిన డాక్టర్‌ అనిల్‌ కకోడ్కర్‌ నేతృత్వంలోని హైలెవల్‌ కమిటీ ఐదు సంవత్సరాల కాలంలో భద్రతా ప్రమాణాల పెంపు కోసం లక్ష కోట్ల రూపా యలను ఖర్చు చేయాలని రెండు సంవత్సరాల క్రితం సూచించింది. ఇప్పటి వరకు ఆ దిశలో కేటాయింపులు నామమాత్రమే! భద్రతకు సంబంధించిన మౌలిక వనరుల కోసం రూ.20 వేల కోట్లు ఖర్చు చేయాలని, అడ్వాన్స్‌డ్‌ సిగలింగ్‌ వ్యవస్థ కోసం మరో రూ.20 వేల కోట్లు కేటాయించాలన్న ఆ కమిటీ సిఫార్సులు కాగితాలకే పరిమితమ య్యాయి. ప్రయాణీకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని చేసిన సిఫార్సులను ఏ మాత్రం పట్టించుకోని ప్రభుత్వం ప్రైవేటీకరణ దిశలో చేసిన సూచనల అమలుకు మాత్రం తహతహ లాడుతోంది. – గునపర్తి సైమన్‌

ఉక్కు పిడికిలి బిగుస్తోంది

విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కులి పోరాటం గడచిన 950 రోజులుగా కార్మికులు చేస్తున్నారు. అయినా మోడీ ప్రభుత్వం అమ్మేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నది. లిఉక్కు రక్షణ కోసం సి.పి.ఎం ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర 6 జిల్లాలు 1050 కిలో మీటర్లు బైక్‌ యాత్ర జరుగుతున్నదిలి. ఈ నేపద్యంలో విశాఖ ఉక్కు ను ఎందుకు కాపాడుకోవాలో..! ఒకసారి ఈ వ్యాసం చదవండి..` కె.లోకనాథ్‌
ఉక్కునగరం ఉద్యమిస్తోంది.విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అని నినదిస్తోంది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. జెండాతో పనిలేకుండా సింగిల్‌ ఏజెండాతో అన్ని పార్టీలు కదం తొక్కుతున్నాయి. కార్మిక, కర్షక, ప్రజా సంఘాలు ఏకతాటిపైకి వస్తున్నాయి. అన్ని పార్టీల నేతలు, ప్రజా సంఘాల నేతలు రోడ్డుమీదకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు. కేంద్ర నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. కేంద్రం వెనక్కి తగ్గకపోతే ఉద్యమం ఉదృతం చేస్తామని హెచ్చ రిస్తున్నారు.ఏపీలో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయం సెగలు పుట్టి స్తుంది. వైజాగ్‌ స్టీల్‌ ఫ్యాక్ట రీని ప్రయివేట్‌ పరం చేయ కుండా ఆపడం కోసం పెద్ద ఎత్తున ఉద్యమానికి రాజకీయ పార్టీలు,తెలుగు ప్రజలు సన్నద్ధం అవుతు న్నారు. ఈ విష యంలో ఒక్క బీజేపీ తప్పా అన్ని రాజకీయ పార్టీలు స్పందిస్తు న్నాయి. 32 మంది బలిదా నాలు, వందలాది మంది నిర్బంధాలు, లక్ష లాది మంది ఆందో ళనలు.. వారందరీ త్యాగాల ఫలితమే..విశాఖ ఉక్కు కర్మా గారం..ఈ ఉక్కు ప్లాంట్‌ 22వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. 17 వేల మంది పర్మి నెంట్‌, 16వేల మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులతో పాటు సుమారు లక్ష మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు.స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఒక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సాగుతున్న ఉద్య మంలో భాగంగా ఈబైక్‌ యాత్ర విజయ వంతం చేయాల్సిన అవశ్యకత ఉత్తరాంధ్ర ఆరు జిల్లాల ప్రజలపై ఎంతైన ఉంది.!
రాష్ట్రాభివృద్ధితో పాటు ఉత్తరాంధ్ర అభివృ ద్ధిలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కీలక పాత్ర పోషి స్తోంది. ఉత్తరాంధ్రలో అత్యధికంగా ఉన్న గిరిజనులకు రిజర్వేషన్ల ద్వారా ఇక్కడ ఉపాధి లభిస్తోంది. దీన్ని ప్రైవేట్‌పరం చేయడమంటే దళితులు,గిరిజనులు, బిసిలు ఉపాధి కోల్పోయి సామాజిక న్యాయం హరించుకు పోతుంది. నేటికీ ప్లాంట్‌లో ఉపాధి కోసం ఎదురు చూస్తున్న 8500 మంది నిర్వాసితుల ఆశలు అడియాశలు అవుతాయి. ప్లాంట్‌ పూర్తి స్థాయిలో నడిస్తే మరో పాతిక వేల మందికి ఉపాధి అవకా శాలు పెరుగుతాయి. దీనివల్ల ఉత్తరాంధ్ర మరింత మెరుగైన ఉపాధి అవకాశాలు పొందవచ్చు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తే ఉత్తరాంధ్ర వెనుకబాటులోకే నెట్టబడు తుంది.విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను అమ్మివేయాలని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని… తెలుగు ప్రజలు పోరాడి…32 మంది ప్రాణ త్యాగాలతో,16 వేల మంది రైతుల త్యాగ ఫలంగా సాధించుకున్న ఈ ప్లాంట్‌ను రక్షించుకుని తీరతామని… స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు, ఈ ప్రాంత ప్రజలు గత వెయ్యి రోజులుగా పోరాడుతున్నారు. అయినా కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు లేదు సరికదా దీనిని అమ్మడం సాధ్యం కాకపోతే మూసివేస్తామని పార్లమెంట్‌ సాక్షిగా కేంద్ర మంత్రి బెదిరింపులకు పూనుకున్నారు. ఆలస్యం అవుతున్న కొద్దీ ప్రజలు,కార్మికులు నీరసపడిపోయి,ఉద్యమాన్ని వదిలేస్తారని నరేంద్ర మోడీ ప్రభుత్వం భావించింది. అయితే వారి అంచనాలకు భిన్నంగా రెట్టిం చిన ఉత్సాహంతో,పట్టుదలతో కార్మికులు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి, దేశవ్యాప్తంగా కూడా వీరి పోరా టానికి మద్దతు లభిస్తోంది. మన దేశంలో ఒక ప్రభుత్వ రంగ సంస్థ పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాటానికి ఇంత విశాలమైన మద్దతు లభించడం చాలా అరుదు. విభజిత ఆంధ్ర రాష్ట్రంలోనే అతి పెద్ద పరిశ్రమగా ఉండి రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఇటువంటి సంస్థను రక్షించుకోవడం ద్వారానే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోగలం. కానీ దీనికి భిన్నంగా, చాలా విచిత్రంగా రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలైన అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి, జనసేన పార్టీలు వ్యవహరిస్తున్నాయి. అధికార వైసిపి మొక్కుబడిగా అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులిపేసుకుంది. కానీ రాష్ట్ర ప్రజలను సమీకరించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి కనీస ప్రయత్నం కూడా చేయడంలేదు. ప్రతిపక్ష టిడిపి రాష్ట్ర వైసిపిని విమర్శించడం తప్ప ప్లాంటును అమ్మేస్తామని తెగేసి చెప్పిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట కూడా అనడంలేదు. ఇక ప్రశ్నిస్తానని బయలుదేరిన జనసేన అధినేత ఆ పని వదిలేసి రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న కేంద్ర మోడీ ప్రభుత్వ పంచన చేరారు. తమలో తాము కలహించు కోవడం తప్ప రాష్ట్రానికి, ఉత్తరాంధ్రకు ఎంతో ద్రోహం చేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మాత్రం పల్లెత్తు మాట అనడానికి కూడా ఈ మూడు పార్టీలు సాహసించడం లేదు. దేశంలోనే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు బిజెపి ఎజెండాను అమలు చేసేవిగా వున్నాయి తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రయోజనాల కోసం లేవనే అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి. ఇదే అవకాశంగా భావించి కేంద్ర మోడీ ప్రభుత్వం విశాఖ పట్నం స్టీల్‌ప్లాంటును అష్టదిగ్బంధనం చేస్తోంది. ఉత్పత్తిని ఏకపక్షంగా తగ్గించి వేసింది. మూడవ బ్లాస్ట్‌ ఫర్నేస్‌ను నిలిపివేసింది. విడివిడిగా ముక్కలు చేసి అమ్మాలని కుట్రలు పన్నుతోంది. ఉన్నత స్థాయి అధికారులతో సహా ఉద్యోగుల ఖాళీలను నింపడం లేదు. రోజువారీ పనులకు అవసరమైన వర్కింగ్‌ క్యాపిటల్‌ కూడా లేకుండా చేస్తోంది. దేశంలోని ప్రైవేట్‌ రంగంతో సహా అన్ని స్టీల్‌ ప్లాంట్లకు సొంత ముడి సరుకులను, గనులను కేటాయించిన కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు మాత్రం సొంతగనులు కేటాయించడానికి ససేమిరా నిరాకరిస్తోంది. దీనికి తోడు ఇప్పటి వరకు తక్కువ ధర చెల్లించి ఇనుప ఖనిజాన్ని కొంటున్న ఛత్తీస్‌గఢ్‌ లోని ఎన్‌ఎండిసి నుండి ఇక మీదట కొనుగోలుకు అనుమతించకుండా, దూర ప్రాంతంలోని కర్ణాటక నుండి కొనుగోలు చేసుకోమని తెలిపింది. తద్వారా రవాణా ఖర్చులు పెరిగి స్టీల్‌ప్లాంట్‌ మరింత కష్టాల్లోకి నెట్టబడుతుంది. మరోపక్క విదేశాల నుండి దిగుమతి చేసుకున్న ముడి సరుకులు అన్‌లోడ్‌ చేయకుండా పక్కనే ఉన్న అదానీకి చెందిన గంగవరం పోర్టు విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ను ఇబ్బందులు పెడుతూ, పెనాల్టీలు విధిస్తోంది. ప్లాంట్‌ లోని కీలకమైన ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ప్రైవేటు పరం చేస్తున్నారు. మొత్తం ప్లాంట్‌ విలువను తగ్గించి చూపి, కారుచౌకగా తమ కార్పొరేట్‌ మిత్రులకు ధారాదత్తం చేయజూ స్తున్నారు. 1400 ఎకరాల స్టీల్‌ప్లాంట్‌ భూమిని ఇప్పటికే గంగవరం పోర్టుకు ఇచ్చేశారు. ఇప్పుడు మరలా మరింత భూమిని అమ్మేయడానికి పావులు కదుపుతున్నారు. అదానీ పోర్టుకి వెయ్యి ఎకరాల భూమిని కేటాయించాలని కేంద్ర బిజెపి ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నది.
ఈ రకంగా అన్ని విధాలుగా స్టీల్‌ప్లాంట్‌ను బలహీనపరిచే చర్యలకు కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పాల్పడుతోందని స్పష్టంగా తెలుస్తోంది. అదే సందర్భంలో ఈ కేంద్ర ప్రభుత్వ దుర్మార్గాన్ని రాష్ట్రం లోని ప్రధాన మూడు రాజకీయ పార్టీలు ఎదుర్కోలేవని, అంతే కాకుండా ఈ మూడు పార్టీలు కేంద్ర బిజెపికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహకరిస్తున్నాయని కూడా తేటతెల్లమై పోయింది. అందువల్ల పోరాడి సాధించుకున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవడం కేవలం తెలుగు ప్రజల చైతన్యం మీదనే నేడు ఆధారపడి ఉంది. తెలుగు ప్రజల పౌరుషాన్ని మరొకసారి చూపించాల్సిన సమయం ఆసన్నమైంది.
ఈ ప్లాంట్‌ను అమ్మేయడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎటువంటి సహేతుకమైన కారణం కూడా లేదు. ప్రపంచంలోనే అగ్రగామి స్టీలు ఉత్పత్తి చేసే సంస్థగా మన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉంది. అతి తక్కువ మంది కార్మికులతో దేశంలోనే అత్యధిక ఉత్పాదకత కలిగిన ప్లాంట్‌ మనదే. కేంద్ర ప్రభుత్వం పెట్టిన కేవలం రూ.4500 కోట్ల పెట్టుబడికిగాను ఇప్పటివరకు మన ప్లాంట్‌ కేంద్ర ప్రభుత్వానికి పన్నులు, ఇతర మార్గాల ద్వారా రూ.45 వేల కోట్లకు పైగా చెల్లించింది. అందువల్ల నష్టాలు వస్తున్నాయి కాబట్టి దీన్ని అమ్మేస్తున్నామనే వాదన పూర్తి అసంబద్ధం. లాభాలలో ఉన్న ప్రభుత్వ సంస్థలను కూడా తెగనమ్మడమే నేటి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానంగా ప్రకటించింది. రాష్ట్రాభివృద్ధితో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధిలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కీలక పాత్ర పోషిస్తోంది. ఒకప్పుడు ఉత్తరాంధ్ర వలస ప్రాంతంగా వుండేది. విశాఖ ఇండిస్టియల్‌ హబ్‌గా ఏర్పడిన తరువాత ఎంతో కొంత ఉపాధి అవకాశాలు కల్పించబడ్డాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని రైతులు, కూలీల కుటుం బాల నుండి అనేకమంది యువకులకు విశాఖ పట్నం స్టీల్‌ప్లాంట్‌ ఉపాధి కల్పిస్తోంది. ఉత్తరాంధ్రలో అత్యధికంగా ఉన్న గిరిజనులకు రిజర్వేషన్ల ద్వారా ఇక్కడ ఉపాధి లభిస్తోంది. దీన్ని ప్రైవేట్‌ పరం చేయడమంటే దళితులు, గిరిజనులు, బిసిలు ఉపాధి కోల్పోయి సామాజిక న్యాయం హరించుకు పోతుంది. నేటికీ ప్లాంట్‌లో ఉపాధి కోసం ఎదురు చూస్తున్న 8500 మంది నిర్వాసితుల ఆశలు అడియాశలు అవుతాయి. ప్లాంట్‌ పూర్తి స్థాయిలో నడిస్తే మరో పాతిక వేల మందికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. దీనివల్ల ఉత్తరాంధ్ర మరింత మెరుగైన ఉపాధి అవకాశాలు పొందవచ్చు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తే ఉత్తరాంధ్ర వెనుకబాటులోకే నెట్టబడుతుంది. ఇప్పటికే కేంద్ర బిజెపి ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టాన్ని సక్రమంగా అమలు చేయకుండా రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీ ఇచ్చి కూడా ఆచరణలో నిరాకరిస్తోంది. వెనుకబడ్డ ఉత్తరాంధ్ర, రాయలసీమల ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీలు ఒక ప్రహసనంగా మార్చివేసింది. ఫలితంగా ఈ తొమ్మిదేళ్ళ కాలంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి కాకపోగా మరింత వెనుకబాటులోనికే నెట్టబడిరది. పేదరికం పెరిగింది. వలసలు పెరిగాయి. ఇవి చాలదన్నట్లు రాష్ట్ర విభజన చట్టంలోని విద్యాసంస్థల నిర్మాణాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది. గిరిజన యూనివర్సిటీ నిర్మాణ శంకుస్థాపనకే ఇంత కాలం పట్టింది. ఇక నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. పెట్రో యూనివర్సిటీ ఇప్పటికీ పిట్టగోడల స్థితిలోనే ఉంది. విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్‌ కేవలం ప్రకటనలకే పరిమితమైంది తప్ప నేటికీ ఆచరణ రూపం దాల్చలేదు. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలోని విశాఖపట్నం మెట్రో రైల్‌ ప్రాజెక్టు ఊసే మరిచింది. ఈ విధంగా అన్ని రకాలుగా మన రాష్ట్రానికి, ప్రాంతానికి ద్రోహం చేస్తున్న కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఎండగట్టకపోవడం రాష్ట్రానికి, ఉత్తరాంధ్రకు అన్యాయం చేయడమే అవుతుంది. రాష్ట్రాభివృద్ధితో పాటు, ఈ ప్రాంత అభివృద్ధిలో విశేష పాత్ర పోషిస్తున్న విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను పరిరక్షించు కోవడం ద్వారానే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోగలం. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఈ పని చేయలేవని ఇప్పటికే స్పష్టమైంది. అందువల్ల తెలుగు ప్రజలు విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని పోరాడి సాధించుకున్న ప్లాంటును పరిరక్షించుకోవడానికి కూడా ప్రజలే ముందుకు రావాలి. ఈ కర్తవ్య నిర్వహణలో ప్లాంట్‌ పరిరక్షణకు విస్తృతమైన ప్రజా మద్దతు కూడగట్టాలనే లక్ష్యంతో సిపిఎం పార్టీ ఉత్తరాంధ్ర మోటార్‌ సైకిల్‌ యాత్ర చేపట్టింది. ఇచ్చాపురం నుండి పాయక రావుపేట వరకు మైదాన, పట్టణ, గిరిజన ప్రాంతాల గుండా ఈ యాత్ర ఈనెల సెప్టెంబర్‌ 20 నుండి 29 వరకు పది రోజుల పాటు సాగనుంది. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ప్రతిఘటన తప్పదని, ఇంత ద్రోహానికి పాల్పడిన నరేంద్ర మోడీ ప్రభుత్వం, వారికి మద్దతిచ్చే పార్టీలు ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదనే హెచ్చరిక ఈ యాత్ర ద్వారా ఈ ప్రాంత ప్రజలు చేయాలి.
వ్యాసకర్త : సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు(ప్రజాశక్తి సౌజన్యంతో..)

1 21 22 23 24 25 75