కాలుష్యకోరల్లో ఢల్లీి..

ఇప్పటికే చుట్టుముట్టిన వాయు కాలుష్యం, ఇంతలోనే దీపావళి పండుగ, సుప్రీంకోర్టు వద్దని చెప్పిన వినకుండా స్థానికులు భారీ స్థాయిలో పటాసులు పేల్చారు. ఇంకేముంది ఢల్లీి వ్యాప్తంగా తీవ్ర వాయు కాలుష్యం అలుముకుంది. పండుగ మరుసటి రోజు, మంగళవారం ఉదయం కాలుష్యం తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. మంగళవారం ఉదయమైతే విషపూరిత పొగమంచు దేశ రాజధానిని పూర్తిగా కమ్మేసింది. దీపావళి రోజున సుప్రీంకోర్టు విధించిన పటాకుల నిషేధాన్ని నివాసితులు ఉల్లంఘించిన రెండు రోజుల తర్వాత ఢల్లీిలో గాలి నాణ్యత తీవ్రంగా క్షీణించింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (%జజదీ%) తెలిపిన వివరాల ప్రకారం దేశ రాజధానిని విషపూరి పొగమంచు చుట్టుముట్టింది. చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచిక తీవ్రమైన కేటగిరీగా నమోదైంది. చాలా చోట్ల ఏక్యూఐ 400 దాటింది. మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో బవానాలో గాలి నాణ్యత సూచిక(ఏక్యూఐ) 434, ద్వారకా సెక్టార్‌ 8లో 404, ఐటీఓలో 430, ముండ్కాలో 418, నరేలాలో 418, ఓఖ్లాలో 402, రోహిణి, ఆర్కేపురంలలో 417గా నమోదైంది.
ఢల్లీిలో పెరిగిన విషవాయువుల తీవ్రత
ఢల్లీిని కాలుష్యం వెంటాడుతూనే ఉంది. అసలే చలికాలం దట్టమైన పొగమంచు కమ్మేస్తుంది. దీనికి తోడూ చుట్టు పక్కల నుంచి వస్తున్న విషవాయువులు ఢల్లీి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరో మూడు, నాలుగు రోజులు పరిస్థితి ఇలాగే కొనసాగే అవకాశం ఉందంటున్నారు వాతావరణ నిపుణులు. మన్నటి వరకూ వాయువుల వేగంతో పాటూ గాలి దిశ మార్పుతో కొంత వరకూ ఉపశ మనం లభించింది. దీంతో కాలుష్యతీవ్రత కొంత మేర తగ్గిందని భావించారు స్థానికులు. దీంతో అధికారులు కొన్నింటిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశారు.
ప్రస్తుతం గాలిలో ఉధృతి ఏర్పడి అది కాలుష్యానికి కారణం అవుతోంది. తద్వారా విజిబులిటీ సమస్య తీవ్రంగా మారింది. మంగళవారం ఢల్లీిలోని ఐదు ప్రాంతాల్లో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 400కు పైగా నమోదైంది. మధ్యాహ్నం 2గంటలకే రహదారులు కనిపించకుండా మసగగా మారిపోయాయి. దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో సూర్యరశ్మి బలహీనంగా మారింది. సాధారణంగా 2వేల మీటర్ల వరకూ కనిపించే రహదారి.. ప్రస్తుతం 1000 నుంచి 1500 మీటర్ల పరిధిలోనే కనిపిస్తోంది. దీనిపై స్పందించిన సెంట్రల్‌ పొల్యూషన్‌ బోర్డు కొన్ని కీలక అంశాలను వెల్లడిరచింది. సాధారణం కంటే ఒకడిగ్రీ ఉష్ణోగ్రత తక్కువగా నమోదైనట్లు ప్రకటించింది. నిన్న దేశ రాజధాని ఢల్లీిలో గరిష్ట ఉష్ణోగ్రత 26.2 డిగ్రీలు కాగా కనిష్ట ఉష్ణోగ్రత 11.5గా నమోదైనట్లు వెల్లడిర చింది. గాలిలో తేమ భారీగా పడిపోయింది. రెండు రోజుల క్రితం 95శాతం ఉండగా నిన్న 56శాతం ఉన్నట్లు పేర్కొంది. చుట్టు పక్కల నెలకొన్న పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం, దట్టమైన పొగ కారణంగా మరిన్ని రోజులు పరిస్థితి ఇలాగే కొనసాగవచ్చని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించాలని సూచిస్తు న్నారు. అప్పుడప్పుడూ వేడి నీళ్లతో ఆవిరి పట్టుకొవడం వల్ల శ్వాస సంబంధిత వ్యాధులు తలెత్తకుండా కాపాడు కోవచ్చని వైద్యులు చెబుతున్నారు.
ఎన్సీఆర్‌లో చలి పంజా..
దేశ రాజధాని ఢల్లీి సహా ఉత్తరభారతదేశాన్ని చలి వణికిస్తున్నది. పలు రాష్ట్రాల్లో భారీగా చలిగాలులు వీస్తున్నాయి. దీంతో కొన్ని రోజుల నుంచి ఢల్లీిలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపో తున్నాయి. చలిగాలులు మరో రెండు రోజులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం సైతం ఢల్లీిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. గరిష్ఠ ఉష్ణోగ్రత సాధారణం కంటే ఆరు డిగ్రీలు తక్కువగా 15.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు డిగ్రీలు తగ్గి.. 5 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత 16.2, కనిష్ట ఉష్ణోగ్రత 5.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. రెండు మూడు రోజుల పాటు చలిగాలులు, చలిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది.పొగ మంచు కారణంగా ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జమ్మూ కశ్మీర్‌లో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీలకంటే తక్కువగా నమోదవుతున్నాయి. పర్వతాల నుంచి వీస్తున్న చలిగాలుల కారణంగా ఉత్తర భారతదేశంలోని మైదాన ప్రాంతాల ప్రజలు చలితో వణుకుతున్నారు. పంజాబ్‌, హర్యానా, చండీగఢ్‌లో ఢల్లీిలోని చాలా ప్రాంతాలు, ఉత్తరాఖండ్‌, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌, రాజ స్థాన్‌లోని చాలా చోట్ల చలితీవ్రత పెరిగింది. ఢల్లీి నగర శివారుల్లోని ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాలోని సెక్టార్‌ 62,సెక్టార్‌ 1,సెక్టార్‌ 116వద్దగాలి నాణ్యత పరిస్థితి తీవ్రంగా ఉన్న ట్లు అధికారులు వ్లెడిరచారు. అనవసరమైన నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.‘శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడే వారి సంఖ్య గణనీ యంగా పెరిగింది.చాలా మంది దగ్గు, జలు బు, కళ్లనుంచి నీరు కారడం,కళ్లు మండడం వంటి సమస్యలతో బాధపడతున్నారు’ అని ఓ వైద్యుడు చెప్పారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో రాజధానిలో అయిదు రోజుల పాటు నిర్మాణ కార్యక లాపాలు చేపట్టరాదని ఢల్లీి పర్యావ రణ మంత్రి గోపాల్‌ రాయ్‌ ఆదేశాలు జారీ చేశారు. వాహనాలనుంచి వచ్చే కాలుష్యాన్ని తగ్గించేందుకు నగరంలో రెడ్‌ సిగ్నల్‌ పడగానే వాహనాల ఇంజిన్‌ను అపేసే కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే కాలుష్యాన్ని వెదజల్లే పాతకాలపు వాహనాలు, కమర్షియల్‌ వాహ నాలపైనా నిషేధం విధించారు. దీంతో పాటు గా వెయ్యి సిఎన్‌జి బస్పులను ప్రవేశ పెట్టేం దుకు యత్నాలు చేస్తున్నారు. మరో వైపు ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలకు ఇదివరకే రెండు రోజులు సెలవులు ప్రకటిం చారు.అయితే వాయుకాలుష్యం బెడద ఒక్క ఢల్లీి నగరానికి పరిమితం కాలేదు. పొరుగు రాష్ట్రాలయిన హర్యానా, రాజస్థాన్‌, యుపిల లోని పలు నగరాల్లో పరిస్థితి కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాయి.
తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఢల్లీి వాసులు
దేశ రాజధానిని మంచు దుప్పటి కప్పేసింది. ఢల్లీిలో దట్టమైన పొగమంచు అలుముకుంది. పట్టపగలే రహదారులన్నీ రాత్రిని తలపిస్తుం డటంతో లైట్లు వేసుకుని ప్రయాణిస్తున్నారు వాహనదారులు.దేశ రాజధానిలో 7డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఒకవైపు పొగమంచు..మరోవైపు కాలుష్యంతో ఢల్లీి వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
-(బి.సూర్య ప్రకాష్‌ యాదవ్‌)

గిరిజన సంస్కృతి వాచకం…

ఒకప్పుడు మౌఖిక సాహిత్యంకే పరిమితమైన… మన ఆదివాసీ సాహిత్యం… అక్షరాస్యతలో వచ్చిన అభివృద్ధిలో భాగంగా .. వివిధ ప్రక్రియలలో పుస్తకాల రూపంలో… వస్తూ ప్రామాణికతకు చోటుచేసు కుం టుంది, ఈ గిరిజన సాహిత్యంలోని… పుస్తకాల వివరాలను ‘‘గవాక్షం’’ శీర్షికన… ‘‘థింసా పాఠకుల’’ కోసం ప్రతి నెల ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్న పరిశోధక రచయిత డా. అమ్మిన శ్రీనివాసరాజు గారు ప్రముఖ రచయిత డా: పిరాట్ల శివరామకృష్ణ కలం నుంచి జాలువారిన ‘‘ గిరిజనులు సంస్కృతి పగ్రతికి సవాళు ’’ అనే పుస్తకంపై సమీక్షడా. అమ్మిన శ్రీనివాసరాజు
మన దేశ సంస్కృతి సారథి స్వామి వివేకానంద 150వ జయంతి సందర్భంగా వెలువరించబడ్డ ‘‘ఆంధ్రప్రదేశ్‌ లో గిరిజనులు సంస్కృతి ప్రగతికి సవాళ్లు….’’ అనే పుస్తకాన్ని ప్రముఖ గిరిజన పరిశోధకు రచయిత డా: పిరాట్ల శివరామకృష్ణ రాశారు. గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాల గురించి ఇప్పటి వరకు చాలా పుస్తకాలు విలువడ్డాయి కానీ వాటి అన్నిటికన్నా భిన్నమైనది సంక్షిప్తంగా సమగ్ర సమాచారాన్ని అందించింది ఈ పుస్తకం,70 పేజీలుగల ఈ రచన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లోని అన్ని గిరిజన ప్రాంతాలను స్పృశిస్తూ చారిత్రక, భౌగోళిక, సంస్కృతి, సాంప్రదాయాలను కూలంకషంగా అందిం చింది.
రచయిత శివరామకృష్ణ తెలుగు ప్రాంతా లలోని గిరిజన ఆవాసాలు విస్తృతంగా పర్యటించి ప్రత్యక్షంగా అక్కడి వారి స్థితిగతులు అర్థం చేసుకున్న అనుభవంతోనే ఈ పరిశోధనాత్మక రచన చేశారు, ప్రసిద్ధ ఒరియా రచయిత ‘‘గోపీనాథ మహంతి’’ వ్రాసిన అమృత సంతానం నవల చదివి గిరిజనులకు వారిదైన ఒక ప్రాపంచిక దృక్పథం ఉంటుందని దానిని తెలుసుకోకుండా మనం వారిని అర్థం చేసుకోలేము అనే విషయాన్ని అర్థం చేసుకున్న స్వానుభవంకూడా రచయిత ఈ రచనకు తోడు తీసుకున్నారు. గిడుగు రామ్మూర్తి, హైమన్‌ డార్ప్‌లతో పాటు యానాదుల పరిశోధకుడు వెన్నెల కంటి రాఘవయ్య, వంటి వారు సైతం ఆయా గిరిజనుల గురించిన పరిశోధన కృషి చేసేటప్పుడు వారి సమాచారాన్ని సేకరించటం కన్నా వారి ప్రపంచంలో సంచరించడం మీదే ఎక్కువ దృష్టి పెట్టారనే అంశం ఈ రచయిత స్పష్టం చేశారు, ఇది భావి పరిశోధకులు అందరికీ శిరోధార్యం అయిన విషయం.
‘‘గణరాజ్యాలు’’ మొదలు ‘‘గిరిజనులు రాజ్యాంగ హక్కులు అభివృద్ధిలో వాటాలను కోల్పోతున్నారా?’’ అనే శీర్షిక వరకు ముచ్చటగా మూడు ప్రధాన శీర్షికలు గల ఈ పుస్తకంలో గిరిజనులకు సంబంధించిన చారిత్రక, సాంస్కృతిక, వర్తమాన, సాంఘిక, సమాచారం గణాంకాలతో సైతం సమగ్రంగా అందించబడిరది. గణరాజ్యాల యందు నాటి చక్రవర్తులకు గిరిజనుల కు మధ్య ఎలాంటి సత్సంబంధాలు ఉండేవి, నల్లమల అడవుల్లో గిరిదుర్గాలు చెంచుల నాయకత్వంలో ఉన్న విషయం, కొండ రెడ్ల జాతి ఆవిర్భావం,గోండు జాతి గిరిజనులలోగల ఉపతెగల వివరాలు, మన్యం కొట్టాలు,బోయకొట్టాలు,పితూరీలు, ఏర్పాటుతో పాటు అవి చేసిన కృషి ఫలితాల గురించిన విశ్లేషణ ఇందులో చదవవచ్చు. అలాగే మార్గ, దేశి, గిరిజన సంప్రదాయాలు, సంచార గిరిజన తెగల గురించి చెబుతూ భారతదేశంలో ప్రధాన భాషలు పదుల సంఖ్యలో ఉంటే గిరిజనుల భాషలు వందల సంఖ్యలో ఉన్నాయన్న ఆసక్తికర విషయం రచయిత ఇందులో లేవనెత్తారు. మనకు సాధారణంగా తెలిసిన గిరిజనుల పండు గలతో పాటు, వివిధ ప్రాంతాల్లో స్థానికంగా చేసుకునే విలక్షణ పండుగల సమాచారం కూడా ఈ పుస్తకానికి అదనపు ఆకర్షణ. అరకులోయలోని ఆదివాసులు పాటించే కాలచక్రం చాలా విలువైన భౌగోళిక సమాచారం అందిస్తుంది, ఆ విషయాల గురించి రచయిత ఇందులో కూలం కషంగా వివరించారు. గిరిజనులు చేసుకునే ‘‘నంది పండుగ’’ మొదలు తెలుగు నెలల వారీగా చేసుకునే గిరిజనుల పండుగలు విశేషాలు తెలిస్తే అడవి బిడ్డలకు తెలుగు భాష పట్ల గల అభిమానం అర్థం అవుతుంది. కళింగ రాజ్యంలోని శ్రీముఖలింగం క్షేత్రంలో గల మధుకేశ్వర స్వామి అవతరణలో ఆరాజ్య సవర గిరిజన రాజు కుమార్తె, సవరరాజుల ప్రస్థావనతో ఆ ప్రాంతంలో గిరిజన రాజులస్థానం. అలాగే పూరీ జగన్నాథుడు సవర గిరిజనుల దేవుడుగా ఉన్న విషయం, కాకతీయుల సేనా ధిపతుల్లో 12 వేల విలుకాండ్ల దళానికి నాయకుడైన కోయరాజు ‘‘సీతాపతి రాజు’’ విషయంతో పాటు అతడు ‘‘శితాబ్‌ ఖాన్‌’’ గా మార్చబడ్డ వైనం ఇందులో చర్చించబడిరది.
ఇలా ఎన్నో ఆసక్తికర గిరిజన చారిత్రక సంఘటనలు ఈ పుస్తకంలో మనం చదవవచ్చు.
రెండవ విభాగం నిండా నిజాం, బ్రిటిష్‌ ,పాలకులతో గిరిజనులు చేసిన ప్రత్యక్ష పోరాటాలు వివరాలు వ్రాయబడ్డాయి.
నైజాంతో పోరాడి అమరుడైన కొమరం భీమ్‌ గురించి ఇందులో ప్రధానంగా చెప్పబడిరది, ఏడు నెలల పాటు జోడెడ్‌ ఘాట్‌ ప్రాంతంలో జరిగిన అభీకర పోరాటం వివరాలు కూడా ఇందులో పొందుపరిచారు. ఇక తూర్పు కనుమల్లో గిరిజనులు చేసిన స్థానిక తిరుగుబాట్లు, పితురీలతో పాటు 1920- 24 సంవత్సరాల మధ్య అల్లూరి సీతారా మరాజు నాయకత్వంలో జరిగిన గిరిజన పోరాటాలు తిరుగుబాటుల గురించి కూలంకషంగా వివరించ బడ్డాయి.ఈ పోరా టాల సమగ్ర అధ్య యనం ద్వారా తెలిసే విషయాలు, వివిధ ప్రాంతాలలోని గిరిజనులు అంతా సమీప రాజులు, జమీందారులతో సత్సం బంధాలతో స్నేహం చేస్తూ… వారి పాలనలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ సైనికుల వలే ముందుండి నడిచే వారిని. కొన్ని రాజ్యాలకు సామంత రాజులుగా కూడా వ్యవహరించే వారనే విషయాలు ఈ సందర్భంగా తేటతెలమవుతాయి. అదేవిధంగా స్వాతంత్ర పోరాటంలో కూడా తెలుగు ప్రాంతాలలోని గిరిజనుల పాత్ర అజ్ఞాతంగా ఉండేదనే విషయం అర్థమవుతుంది. స్వాతంత్ర అనంతరం కూడా గిరిజన సమాజంలో అలజడులు పోరాటాలు కొనసాగడానికి కారణాలను కూడా సామాజికవేత్తలు అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది అనే విషయం రచయిత సూచించారు. స్వతంత్ర భారతదేశంలో పాలనాపరమైన రాజ్యాంగం అమలై… గిరిజనుల కోసం ప్రత్యేక చట్టాలు, నిధులు, కేటాయించిన, వాటి అమలులో చూపిస్తున్న అశ్రద్ధ కారణంగా కొన్ని గిరిజన తెగలు నేటికీ వెనుకబడి అన్ని విధాలా నష్టపో తున్నారు అసంతృప్తితో రగిలి పోతున్నారు అనే విషయం కూడా రచయిత రేఖామాత్రంగా పేర్కొన్నారు.మూడవ విభాగంలో ‘‘గిరిజనులు రాజ్యాంగ హక్కు లను అభివృద్ధిలో వాటాలను కోల్పో తున్నారా?’’ అంటూ తెలుగు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన షెడ్యూలు ప్రాంతాల వివరాలు, ప్రాంతాల వారీగా జనాభా గణన,జిల్లాల వారీగా గిరిజన తెగల వ్యాప్తి, వారిలో గల విభిన్న సంస్కృ తులు. గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వాలు అమలు చేసిన పంచశీల విధానాలతో పాటు భారత రాజ్యాంగంలో ఆర్టికల్‌ 46 ప్రకారం గిరిజన అభివృద్ధికి తీసుకున్న ప్రత్యేక చర్యలు, అటవీ హక్కుల చట్టం 2006, పిసా చట్టం, వంటి ప్రధాన చట్టాల గురించిన సమాచారంతోపాటు గిరిజనులు హిందూజాతి వారే అనడానికి సహేతుక కారణాలు వివరిస్తూ గిరిజన అభివృద్ధిలో వనవాసి కళ్యాణ ఆశ్రమం కృషి తదితర విలువైన సమాచారం ఇందులో అందించారు. గిరిజనుల సమగ్ర సమాచారం ‘‘కొండ అద్దమందు’’ అన్న చందంగా ఆవిష్కరించబడ్డ ఈ పుస్తకం సమస్త పరిశోధకులకు గిరిజన ఆధ్యయనకర్తలకు చక్కని దారి దీపంలా పనిచేస్తుంది, అనడంలో నిండైన నిజం ఉంది.
పుస్తకం పేరు:- ‘‘ఆంధ్రప్రదేశ్‌ లో గిరిజనుల సంస్కృతి ప్రగతికి సవాళ్లు..’’
రచయిత: డా: పిరాట్ల శివరామకృష్ణ,. పేజీలు: 72, వెల: 20/- రూపాయలు.
ప్రతులకు: సాహిత్య నికేతన్‌, బర్కత్‌ పురం, హైదరాబాద్‌ – 27, ఫోన్‌: 040- 27563236.
సమీక్షకుడు :- డా: అమ్మిన శ్రీనివాసరాజు, సెల్‌: 7729883223.

జనం ప్రేమ గెలుచుకున్న కోయ దొరసాని

అనసూయ అలియాస్‌ సీతక్క నేడు తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సాధారణ మహిళ లేదా రాజకీయ వారసత్వం అందుకున్న మహిళ అయితే అందులో ప్రత్యేకత ఏమీ లేదు.కానీ మావో యిస్టుగా ఉండి తర్వాత జనజీవన స్రవంతిలో కలిసి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తర్వాత మంత్రి కావడం అంటే ఆషామాషీ కాదు. అందులోనూ ఒక గిరిజన మహిళ అన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొని,కేసులను తలపడి.. చివరకు రాజ్యాంగాన్ని రచించే టీంలో భాగస్వామ్యులవుతున్నారంటే ఒక్క సీతక్కకే సాధ్యం. ప్రజల్లో ఉంటూ..నిత్యం వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడే వాళ్లకు ఎక్కడా అపజయం ఉండదు అనడానికి సీతక్క జీవితమే ఉదాహరణ…
ఆదివాసీ సమూహాలలో ఇప్పటికీ చాలావరకు మాత్రుస్వామిక కుటుంబ వ్యవస్థ తాలూకు లక్షణాలు కొనసాగుతున్నాయి. వాటిలో ‘కోయ’ తెగ ఆదివాసీ తెగ మాతృస్వామిక సంస్కృతికి ఒక ఆదిమ జాడ వంటిది. అమ్మాయి ఇతర కులం అబ్బాయిని పెళ్లి చేసుకుంటే అతని నాలుకమీద కాల్చిన ఇనపకడ్డీతో వాత పెట్టి,అల్లుడికి తమ ఇంటిపేరు ఇచ్చినాకగానీ వాళ్ళు అతన్ని ఇంట్లోకి రానివ్వరు…అటువంటి తెగలో పుట్టిన ఆమె ఓ కొండ దొరసాని…ఆదివాసుల సాధికారతను కాలరాసిన మధ్యయుగా లనాటి రాజ్య దురహంకారంమీద వీరోచితంగా పోరాడి తమ స్వాభిమా నాన్ని చాటిన సమ్మక్క,సారలమ్మల పోరు వారసత్వం ఆమెది.ఆమె ‘రణధీర’ తనకి యుద్ధం కొత్తకాదు,ధిక్కారం తన రక్తంలోనే వారసత్వంగా తెచ్చు కుంది. అందుకే చిన్నతనంలో కత్తిపట్టి అడవి బాట పట్టినా ఎమ్మెల్యే అయ్యాక తన మనుషుల ఆకలి తీర్చడానికి కొండలు కోనలు దాటినా జనం కోసమే! ఆమె పేరు ‘ధనసరి అనసూయ’ అలియాస్‌ ‘సీతక్క’.అడవిలో పుట్టి అడవిలో పెరిగిన సీతక్కకి కష్టాలు,కడగండ్ల గురించి పుస్తకాలలో చదవా ల్సిన పనిలేదు. గ్రంధాలయాలలో వుండే పుస్తకా లకు మించిన జ్ఞానం ఆమెకి అనుభవాలనుంచి అబ్బింది. పట్టణాలకు, గ్రామాలకు దూరంగా విసిరేసిన కోయ గూడెంలో అరకొర సౌకర్యాలు, అగచాట్లమధ్య పెరిగిన తనకి ఆకలి రుచి తెలుసు. అలాగే, సాయుధదళాలలో అడవి లోత ట్టు ప్రాంతాలలో తిరుగుతున్నప్పుడు కనీసం తిన డానికి తిండి, తాగడానికి మంచినీరు కూడా లేక పస్తులతో నడిచినరోజులు, పాచి పట్టిన అన్నా న్ని ఎండబెట్టుకుని తిన్నరోజులూ తెలుసు.
అడవిలో దొరికే ఆకూ,అలమా ఏరు కొచ్చుకుని,పోడు వ్యవసాయంలో పండిన రాగి గింజలతో అంబలి కాసుకుతాగే ధనసరి సమ్మక్క, సమ్మయ్యల రెండవ సంతానం‘అనసూయ’. తన కంటే ముందు అన్న‘సాంబయ్య’ వున్నాడు. సమ్మ క్క, సమ్మయ్యల బిడ్డగా మొదలైన అనసూయ ‘సీతక్క’ గా మారడం వెనకవున్నది బతుకునుంచి వచ్చిన తిరగబడే తత్వమే! వుమ్మడి వరంగల్‌ జిల్లా, (ప్రస్తుత ములుగుజిల్లా) ములుగు మండ లం, జగ్గన్నపేటలో పుట్టింది. అటవీ గ్రామమైన తమ గూడెంకి తరచూ ‘అన్నలు’ వచ్చి కరప త్రాలు పంచి, పాటలు పాడి, జనానికి దొరల దౌర్జన్యాలను ప్రశ్నించే చైతన్యాన్ని అందించేవారు. అనసూయ మేనమామ ఆమె బాల్యంలోనే అన్న లలో కలసిపోయాడు. ఆమె అన్న‘సాంబయ్య’ కూడా జనశక్తి పార్టీ కొరియర్‌గా వున్నాడు. హై స్కూలు రోజులనుంచే విద్యార్ధి ఉద్యమాలలో క్రియాశీలకంగా వుండే అనసూయ పదో తరగతి అయ్యాక జనశక్తి పార్టీ వుద్యమకారిణిగా సాయుధ దళాలలోకి వెళ్ళింది. అక్కడే వుద్యమ తరగతు లకు హాజరై సిద్ధాంతపరమైన పుస్తకాలు, సాహి త్యం చదివింది. ఆయుధాలు ఉపయోగించడం, దళాలను ఆర్గనైజ్‌ చెయ్యడంలో నేర్పుగలిగిన కార్యకర్తగా గుర్తింపు పొందడంతోపాటు తక్కువ సమయంలోనే దళ కమాండర్‌ స్థాయికి ఎదిగి మూడు జిల్లాలకు తన కార్యక్రమాలను విస్తరింప జేసింది.దళ కమాండర్‌గా వున్నప్పుడు తన మారు పేరు ‘రణధీర్‌’.నల్లగా,పొడుగ్గా,చలాకీగా ఖాకీ యూనిఫారంలో అచ్చం అబ్బాయిలాగే వుండేది. అయితే అక్కడ వుండే పితృస్వామిక ధోరణి ‘రణధీర్‌’ని ‘సీత’ని చేసింది.ఉద్యమ పెద్దలు ‘కుంజా రాము’ అనే నాయకుడితో పెళ్లి చెయ్యాలని నిర్ణయించి,పార్టీ పద్ధతుల్లోనే పెళ్లి జరిపినా, ఆ రాముడికి సహచరిగా ఆమె‘సీత’,‘సీతక్క’ అయ్యిం ది.ఖమ్మం జిల్లాకొత్తగూడెం వాడైన రాము కూడా కోయ జాతికి చెందిన తన దూరపు బంధువు కావడం విశేషం.
సీత గర్భవతిగా వున్నప్పుడు పోలీసు లకి చిక్కిఅరెస్టై, జైలు జీవితం గడిపింది. ప్రసవం సమయానికి బైటికొచ్చి పుట్టిన రెండునెలల బాబుని బంధువులకు అప్పగించి మళ్ళీ రసహ్య జీవితం లోకి వెళ్ళింది. తర్వాత బంధువుల నుంచి బాబు ని ఆమెతల్లి తీసుకెళ్ళి పెంచి హాస్టల్‌లో చేర్చింది. సుమారు ఎనిమిదేళ్ళు జనశక్తి నక్సలైట్‌గా,దళ కమాండర్‌గా వుద్యమానికి అంకితమై చావైనా, బతుకైనా జనం కోసమే అనుకున్న సీతక్కకి పార్టీ లో ఏర్పడిన సిద్ధాంతపరమైన విభేదాలు, చీలిక లు ఆమెని జనజీవన స్రవంతిలోకిరాక తప్పనిస్థితి కలిగించాయి. ఈలోపల తనభర్త రాముతో కూడా విభేదాలు వచ్చి విడిపోయింది. రాము జనశక్తి పార్టీలోనే కొనసాగి కొన్నాళ్ళ తర్వాత ఎన్కౌంటర్‌ లో చనిపోయాడు. తన ఉద్యమ సహచరులంతా తలోదారి చూసుకున్నప్పుడు సీతక్క కూడా బైటి కొచ్చి మధ్యలో ఆగిపోయిన చదువుని కొనసాగిం చింది. హైదరాబాద్‌లో ఒక చిన్న రూమ్‌ తీసు కుని ఐదుసంవత్సరాల న్యాయశాస్త్రంలో ఎల్‌ ఎల్‌బీ పూర్తి చేసింది.తన ఖర్చులు,చదువు కోసం ఆదివాసుల సమస్యలమీద పనిచేసే ‘యక్షి’ అనే ఒక ఎన్‌.జి.ఓలో వుద్యోగంలో చేరింది. నక్సలైట్‌ గా తెలంగాణలో బాగా గుర్తింపు పొందిన సీతక్క బైట ‘లా’ స్టూడెంట్‌ ‘ధనసరి అనసూయ’గా మళ్ళీ రహస్య జీవితం గడపాల్సి వచ్చింది. అయినా పాత కేసులు ఆమెని ప్రశాంతంగా బతకనివ్వ లేదు. ఎప్పుడుబడితే అప్పుడు పోలీసు స్టేషన్లకి పిలిపించేవారు.ఒకవైపు ఆర్ధికఇబ్బందులు, మరో వైపు కేసులు…ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో చేరాల్సిందిగా ఆ పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన పిలుపు ఆమె రాజకీయాలను అనూహ్య మైన మలుపు తిప్పాయి.‘లా’ పూర్తయ్యాక వరం గల్‌ వెళ్లి గతంలో తనకేసులు వాదించిన సీని యర్‌ అడ్వకేట్‌,వెంకటస్వామిరెడ్డిగారి దగ్గర జూనియర్‌ లాయర్‌గా చేరి కొన్ని నెలలు పని చేశాక 2004 ఎలక్షన్లకు ముందు కొందరు మిత్రుల ప్రోద్బలంతో ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించింది. ఆ బూర్జువా పార్టీకి కూడా జన సామాన్యంలో పాపులారిటీ వున్న ‘సీతక్క’ అనే మాజీ నక్సలైట్‌ ఇమేజ్‌ మీదనే మక్కువ కాబట్టి మళ్ళీ ‘ధనసరి అనసూయ’ ప్రజానాయకురాలు ‘సీతక్క’ అయ్యింది.
తెలుగుదేశం పార్టీ(టీడీపీ) తరపున పోటీ చెయ్యడానికి పార్టీలో ఎప్పటినుంచో కొన సాగుతున్నా సీటు దక్కని వాళ్ళున్నప్పటికీ ప్రజా జీవితంలో మమేకమై గుర్తింపు పొందిన సీతక్కకి ములుగు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో షెడ్యూలు ట్రైబ్స్‌కి రిజర్వు అయిన ములుగు అసెంబ్లీ నియోజ కవర్గం సీటురావడం సులభతరం అయింది. కానీ,2004లో రాజశేఖర్‌ రెడ్డి ప్రభావంతో ఆమె కాంగ్రెస్‌ అభ్యర్ధి‘మోదం వీరయ్య’చేతిలో ఓడి పోయింది. అయినప్పటికీ ఆమె వెనుకంజ వెయ్య కుండా అటు జనంలోనూ,ఇటు పార్టీలోనూ తన ప్రభావం పెంచుకుంటూ 2009 అసెంబ్లీ ఎన్నిక ల్లో అదే మోదం వీరయ్య మీద బంపర్‌ మెజారిటీ తో గెలిచింది.అయితే అప్పటికే మలి దశ తెలం గాణా ఉద్యమం ఊపందుకుంది. తాను ఎమ్మెల్యే గా గెలిచినప్పటికీ తమపార్టీ ఓడిపోవడంతో ప్రజలకు సీతక్క ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే స్థితి లేకపోగా తాను తెలంగాణా బిడ్డగా తన ఆంధ్రా పార్టీ అభీష్టానికి వ్యతిరేకంగా తెలంగాణా ఉద్యమానికి సంఫీుభావం ప్రకటించాల్సి రావడం ఆమెని తీవ్ర ఘర్షణకు లోను చేసింది. అయిన ప్పటికీ తన తెలంగాణా అస్తిత్వ ప్రకటన చేస్తూ కాకతీయ యూనివర్సిటీ విద్యార్ధుల సమ్మెకి మద్దతు పలికి వారితో పాటు ఎనిమిది రోజుల ఆమరణ నిరాహార దీక్షలో పాల్గొని అరెస్టై రెండు రోజులు జైలు శిక్ష అనుభవించింది.2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విడిపోయి ప్రత్యేక తెలం గాణా రాష్ట్రం ఏర్పడినా సీతక్క తెలుగుదేశం పార్టీలో వుండడం వలన ఆమెకి రాజకీయ లబ్ది జరగలేదు. తెలంగాణా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తన అస్తిత్వాన్ని కోల్పోయింది. ఈ క్రమం లోనే ఆమెకి కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఒకవైపు, తెలంగాణా రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) నుంచి ఒకవైపు ఆహ్వానాలురావడం, ఆమె తెలంగాణాని ఇచ్చిందనే అభిమానంవల్ల,టీడీపీ రేవంత్‌ రెడ్డి కుటుంబంతో సీతక్కకి వున్న సాన్నిహిత్యంవల్ల ఆమె కాంగ్రెస్‌ పార్టీవైపే మొగ్గుచూపింది. మళ్ళీ ములుగు నియోజకవర్గం నుంచే కాంగ్రెస్‌ అభ్యర్ధి గా పోటీచేసి ఈసారి కాంగ్రెస్‌ ప్రభావం తగ్గి పోవడం వలన తన ప్రత్యర్ధి టీడీపీ అభ్యర్ధి చందూ లాల్‌ చేతిలో ఓడిపోయి 2018 అసెంబ్లీ ఎన్ని కలలో అదే చందూలాల్‌ మీద కాంగ్రెస్‌ అభ్యర్ధిగా గెలిచి రెండోసారి ఎమ్మెల్యే అయింది. సీతక్క. మొదట తెలుగుదేశం పార్టీ పాలిట్‌ బ్యూరో సభ్యు రాలి స్థాయికి ఎదిగిన ఆమె తర్వాత కాంగ్రెస్‌ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై జనబాహుళ్యంలో గొప్ప ప్రాబల్యం, చరి ష్మా కలిగిన నాయకురాలిగా, తనపార్టీలోనేకాక తెలంగాణా రాష్ట్రంలోనే ఒక ప్రజామోదం పొం దిన మేటి నాయకురాలిగా గుర్తింపు పొందు తుంది.
పోరాట పటిమకు మారుపేరు సీతక్క పట్టుదలకు, పోరాట పటిమకు మారు పేరైన సీతక్క విప్లవ పార్టీలలోనే కాక బూర్జువా పార్టీల ప్రత్యక్ష రాజకీయాలలో కూడా తనదైన ముద్ర వేసింది. ఆమె విప్లవ పార్టీలో నక్సలైట్‌ గా సీతక్క బాగా సాహసోపేతమైన నాయకురాలి గా, రెబల్‌ గా పేరుతెచ్చుకుంది. తన నాయకత్వం లోని దళం ఆడవాళ్ళమీద దౌర్జ్యన్యాలు చేసే మగ వర్గశత్రువులకు మర్మాంగాలను తెగ్గోయడం, గుండు కొట్టించి ఊరేగించడంవంటి శిక్షలు విధిం చేవారు. ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చాక ప్రతి పక్ష పార్టీలో ఉన్నప్పటికీ ఆదివాసుల సమ్మక్క, సారలమ్మ దేవతల మేడారం జాతరలో కోయ తెగవారికి భాగస్వామ్యం లేకపోవడంపై ప్రభుత్వ అధికారులతో చర్చించి ఆదేవతల వారసులకు జాతరలోచోటు కల్పించడానికి కృషి చేసి సాధిం చింది. అలాగే ఆదివాసుల స్వయం ప్రతిపత్తికి సంబంధించిన ‘వన్‌ ఆఫ్‌ సెవెంటీ’ చట్టంపై అసెంబ్లీలో తరచుగా ఆలోచనాత్మకమైన చర్చ లేవనెత్తుతూ వస్తుంది. ఆదివాసీ తెగల ప్రధాన సమస్యలైన మౌలిక వసతులు లేకపోవడంపైన అసెంబ్లీలో గళమెత్తింది. ఆదివాసులు నివసించే అటవీ ప్రాంతంలో రవాణా సౌకర్యాలు, రోడ్లు, మంచినీరు,పాఠశాలలు,హాస్పటళ్ళు లేకపో వడం పైన ఆమె నిత్యం అధికారులతో చర్చించి కొంత మేరకు సాధించగలిగింది. అడవి లోపల గూడే లలో జీవించేవారికి రేషన్‌ కార్డులు, ఆధార్‌ కార్డు లు లేకపోవడంపై ఆమె ఆందోళన చేస్తుంది. ఆమె ఎమ్మెల్యే గా గెలిచిన రెండుసార్లూ తానున్న పార్టీలు గెలవక ఆమె ప్రతిపక్షంలోనే ఉండాల్సి వచ్చినా ఎప్పుడూ బాధ పడలేదు. తన స్వభావమే అధికార,ఆధిపత్య వ్యవస్థలకు వ్యతిరేకమైన ప్రతి పక్ష ధోరణి కాబట్టి ఎక్కడున్నా ప్రజా సమస్యల మీద గొంతెత్తి మాట్లాడడాన్ని కొనసాగించింది. తెలంగాణా రాష్ట్రం వస్తే అన్ని సమ స్యలు పరిష్కారమౌతాయని ప్రజలకు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన అధికార పార్టీ రాష్ట్రం ఇచ్చిన వారితోపాటు ప్రజల్ని కూడా వంచించి తమ కుటుంబ పాలనని కొనసాగిస్తున్నదని సీతక్క ఆరోపణ. నీళ్ళు,నిధులు,నియామకాలు వస్తాయ ని చెప్పే ముఖ్యమంత్రి,ఆయన సహచర మంత్రు లు వాటిని గాలికి వదిలెయ్యడమే కాక ప్రజా సమస్యల మీద మాట్లాడేవారిని నేరస్తులని చేసి శిక్షిస్తున్నారని, హైదరాబాద్‌ లో ఒకప్పుడు ప్రజలు తమ నిరసనని వ్యక్తం చేసుకునే ధర్నా చౌక్‌ కూడా లేకుండా పోవడమే ఆపరిస్థితికి చక్కటి తార్కాణం అని ఆరోపిస్తుంది. ప్రజలు ఆశించిన తెలంగాణా రాలేదని, ఇది దొరల పాలన అని ఆమె విమర్శ. కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తున్నా ఇక్కడి పాలకులు ప్రజలకు కనీసం మాస్కులు కూడా పంపిణీ చెయ్యడం లేదని, బైట వ్యాపారులు మాస్కులను అధికరేట్లకు అమ్ముతున్నారని అసెంబ్లీ లో సీతక్క మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి ఇంత మంది మంత్రులకు లేనిబాద ఈమెకెందుకని ఆమె మాటలకు ఎగతాళిగా నవ్వి హేళన చేసి నప్పుడు సీతక్క అవమానంగా భావించింది. నవ్విన నాపచేనే పండుతుంది అనుకుని లాక్దౌన్‌ ప్రకటించి నాక తన స్నేహితులు, శ్రేయోభిలాషులు ఇచ్చిన ఆర్ధిక సహకారంతో ములుగు నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల ప్రజలకు,ముఖ్యంగా రవాణా సౌకర్యాలు లేని ఆదివాసీ తండాల ప్రజ లకు నిత్యావసర వస్తువులు పంపిణీ మొదలు పెట్టింది.గత మార్చి 23నుంచి ఇప్పటివరకు సుమారు నాలుగొందలు గ్రామాల ఆదివాసులకు, దళితులకు సరుకులు పంచింది. మాస్కులతో పాటు బియ్యం,కూరగాయలు,నూనె సబ్బులు ట్రాక్టర్‌, జీపులలో వేసుకుని అటవీ ప్రాంతంలో వెళ్ళగలిగినంత మేరకు వాహనాలలో వెళ్లి ఇంకా లోతట్టు గూడేలకు తన సహచరులతోపాటు స్వయంగా తానుకూడా సరుకుల మూటలు మోస్తూ ఎగుడు దిగుడు అడవి బాటల్లో, వాగులు, వంకలు దాటుకుని వెళ్తుంది. అడవి బిడ్డలకు పౌష్టికా హారం గురించి, కరోనా వ్యాధి సోకకుం డా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన పరిశుభ్రతలను వివరిస్తుంది. ఆడవాళ్ళను, పిల్లల ను కూర్చోబెట్టుకుని నేను కూడా ఇటువంటు గూడేలలో సరైన తిండి, వసతి లేకుండా పెరిగిన దాన్నే అని వారిలో ఒకదానిగా వివరిస్తుంది సీత క్క. ఆమె సేవగురించి పత్రికలూ,సోషల్‌ మీడి యా వేనోళ్ళ కొనియాడుతుంటే అధికార పార్టీకి అక్కసుగా ఉండి ఆమెమీద అవాకులూ, చవాకు లూ పేలుతుంది.మరికొందరు గిట్టనివాళ్ళు ఆమె తన సొంత డబ్బుతో సరుకులు ఇస్తుందా? అని విమర్శిస్తున్నారు.సీతక్కకి మోతాదు మించి ప్రచా రం లభిస్తున్నదని అసూయతో తప్ప ఆమెలా జనంతో మమేకమయ్యే నాయకులు దాదాపు లేరనే చెప్పాలి.ప్రధాన స్రవంతి రాజకీయాలలో వున్న ప్పుడు కొన్ని ఎత్తుగడలు వెయ్యాల్సిరావడం ఎవరి కైనా తప్పదు. అంతమాత్రాన తన నియోజకవర్గ ప్రజలపట్ల, ఆదివాసీ బిడ్డల పట్ల ఆమెకున్న శ్రద్ధ, ప్రేమలను సీతక్క పనితీరును దగ్గరగా గమనించిన వారెవరూ కాదనలేరు. సీతక్క అంటే ఆర్ధికంగా, సామాజికంగా వెనుకబడి కనీస సౌకర్యాలకు నోచు కోని అభం శుభం తెలియని ఆదివాసీ ప్రజలకు తమజాతిలోంచి ఉద్భవించిన ఒక మణి మాణి క్యం.సీతక్క చైతన్యవంతమైన సాహిత్యాన్ని చదవడమేకాక ‘వెన్నెల’ అనే కలం పేరుతో కవి త్వం రాసేది.‘యక్షి’ అనే సంస్థలో పనిచేస్తున్న పుడు ఆదివాసీల ఉనికిమీద వ్యాసాలు కూడా రాసింది. ‘వన్‌ ఆఫ్‌ సెవెంటీ’ చట్టంమీద, ఆదివా సుల హక్కులమీద ఆలోచనాత్మకమైన వ్యాసాలు, కవితలు రాసింది. ఆమెకి కష్టపడి పనిచెయ్యడం ముందునుంచీ అలవాటే! నక్సలైట్‌ గా బైటికొచ్చి హైదరాబాద్‌ లో చదువు కొనసాగించేటప్పుడు కూడా తనసొంత ఊరెళ్ళి తునికాకు పనికి, వ్యవ సాయ పనులకి వెళ్లి వచ్చిన కూలి డబ్బులతో ఫీజులు కట్టుకునేది. బాబు ‘సూర్య’ని కష్టపడి ఎం.టెక్‌ దాకా చదివించింది, తనుకూడా తల్లి కష్టం చూసి బాగా పట్టుదలతో చదివి నాగపూర్‌ ట్రిపుల్‌ ఐటిలో సీటు తెచ్చుకున్నాడు. ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చాక సీతక్క ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పొలిటికల్లో సైన్స్‌ లో ఎమ్మే పూర్తిచేసి ఇప్పుడు అదే యూనివర్సిటీలో గొత్తి కోయల జీవన ప్రమాణాలు-స్థితిగతులమీద పీహెచ్‌.డీ చేస్తుంది.
సీతక్కది అచ్చమైన ఆదివాసీ స్వాభి మానం, స్వయం పాలనని, స్వేచ్ఛని ప్రేమించే గుణం.నగరంలో వుండి ఎమ్మే,ఎల్‌.ఎల్‌.బి చేసినా,ఎమెల్యే అయినా ఆదివాసి సంస్కృతి అంటే తనకి సహజాతంలా వచ్చిన ప్రేమ వెలిసిపోలేదు. రెండేళ్లకోసారి వచ్చే వనదేవతల మేడారం జాతరతోపాటు ఆదివాసుల గూడేలలో జరిగే పండగ పబ్బాలకు, శుభకార్యాలకు, చావులకు ఆమె తప్పకుండా హాజరవ్వడమే కాక వారి సంస్కృతిలో భాగమైన ఆట, పాటలలో పాల్గొం టుంది. పెళ్ళికి,చావుకీ తప్పనిసరిగా మోగే డోలు వాయిద్యమంటే ఆమెకి ఇష్టం,డోలు శబ్దం విన గానే అప్రయత్నంగానే తనకాళ్ళు చిందేస్తాయి. అందుకే, తన కొడుకు ‘సూర్య’ వివాహానికి చత్తీస్‌ ఘడ్‌ నుంచి డోలు వాయిద్యకారులైన గొత్తికోయ లను పిలిపించింది. నక్సలైట్‌గా తను తిరిగిన అటవీ గ్రామాలే కాదు,మైదాన ప్రాంతాలలో కూడా ప్రతివూరు,పల్లె,వాగు,వంకా తనకి పరిచ యమే. తన నియోజకవర్గంలో వుండే సుమారు వంద ఏజెన్సీ గ్రామాలలో ప్రతి చిన్న ఆదివాసీ గూడెం పేరును గుర్తు పెట్టుకుంటుంది. అగ్రకుల బూర్జువా పార్టీలలో చేరినప్పటికీ సీతక్క జనంతో తనకున్న ప్రత్యక్ష సంబంధాలను మాత్రం వదులు కోలేదు. ఆమెని తమ బిడ్డగా భావించే ములుగు ప్రాంతపు గ్రామాలలో ఆమె జనంలోకి చొచ్చుకుని పోతుంది. అందరితో ప్రేమగా వారి పరిస్థితు లను లోపలి వ్యక్తిగా అర్ధం చేసుకునే సీతక్కకి తనని ఎవరన్నా ‘మేడం’ అని సంబోధిస్తే ఇష్టం ఉండదు, ‘మేడం’అంటే దూరం పెట్టినట్టుగా, ‘అక్క’ అంటే ఇంట్లోవాళ్ళం అన్నట్టు వుంటుంది అని తను కూడా తన పార్టీ కార్యకర్తలను, అనుచ రులను ‘అన్నా, అక్కా’ అనే పిలుస్తుంది.
తనకి మామూలు అర్ధంలో దేవుడు, మతం అనేవాటిపైన నమ్మకం లేదు,గుళ్ళూ, గోపురాలకు వెళ్ళదు. కానీ, ఆదివాసీ అస్తిత్వాన్ని చాటే ఆదివాసుల పిత్రుదేవతారాధన,ప్రకృతికి సంబంధించిన జాతరలలో ఇష్టంగా పాల్గొం టుంది. సీతక్కది అసలైన ఆదివాసీ రూపంబీ నల్లని రంగుతో సాదాసీదా ముతక చీరలు కట్టు కుని జనంతో కలసిపోయే సీతక్క అంటే అడవి బిడ్డలకు ఒక సమ్మక్కనో,ఆమె బిడ్డ సారలమ్మనో చూసినట్టుంటుంది. జనం ప్రేమలను గెలుచుకున్న కోయ దొరసాని ఆమె. ఆమె ఆదివాసీ సాధికార తకు ప్రతీక, ముందునుంచీ స్వతంత్ర వ్యక్తిత్వం, ధైర్య సాహసాలు ఆమెకి పెట్టని ఆభరణాలు. తాను గన్‌ పట్టినా,గన్‌ మెన్‌తో వున్నా ఆమెది పోరాటదృష్టే! ఒకపుడు తనవెంట పడిన పోలీ సులు ఇప్పుడు తనకి రక్షణగా వెంట నడవడం చూసి నవ్వుకుంటుంది ఈ అడవి చుక్క. ఆమె మాటల్లోనే ‘ఎన్నిసార్లు చంపినా మళ్ళీ మళ్ళీ పుట్టడం/ఎన్నిసార్లు పడినా మళ్ళీ మళ్ళీ లేచి నిలబడడం’ ఆమె నైజం.
‘అనంతయానం’లో తొలి ఆదివాసీ కేబినెట్‌ మంత్రి` సీతక్క
గత ముప్పై ఐదేళ్ల క్రితం ఆదివాసుల సమస్యలను ఎదిరించడానికి అడవిబాట పట్టిన ‘ఆమె’ నేడు అధికార పక్షంలో ఒక ముఖ్యమైన పాలనాదీశురాలు.తెలంగాణ రాజకీయ చరిత్రలో ఆమె మకుటం లేని మహారాణిగా నిలిచింది. నేటి ప్రజా ప్రభుత్వంలో ఆమె తెలంగాణ కేబినెట్‌ మంత్రి. ఆమె పేరే ధనసరి అనసూయ అలియాస్‌ సీతక్క. డిసెంబర్‌ 7న మూడో శాసన సభలో కొలువుదీరిన ఆమె ఎల్బి స్టేడియంలో హర్షద్వా నాల మధ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ  శాసనసభలోనే ఇప్పటివరకు సీతక్క తొలి ఆదివాసీ మంత్రి కావడం విశేషం. ములు గు ప్రజలకే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కు సీతక్కగా సుపరిచితమైన డాక్టర్‌ ధనసరి అనసూ య రాజకీయ రంగంలో అంచెలు అంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు అధికార కాంగ్రెస్‌ ప్రభుత్వం లో పంచాయతీరాజ్‌,మహిళా,శిశు సంక్షేమ శాఖా మంత్రిగా కొలువుదీరారు. డాక్టర్‌ అనసూయ నిరుపేద గిరిజన కుటుంబంలో పుట్టింది. ఆది వాసీ కోయతెగకు చెందిన ఆమె ఉమ్మడి వరంగల్‌ జిల్లా ములుగు దగ్గరలోని జగ్గన్నగూడెంలో ధనసరి సమ్మక్క, సమ్మయ్య దంపతులకు 1971, జులై 9న జన్మించింది. బాల్యం నుంచి బాగా చదుకోవాలని పట్టుదలతో బడికి వెళుతున్న సంద ర్బంలో ఆమెకు కొన్ని ఆటంకాలు వెంబడిర చాయి. తన14ఏళ్ళ వయసులోనే అన్నయ్య సాం బయ్య ను పోలీసులు అకారణంగా ఎన్‌ కౌంటర్‌ చేశారు. ఈ సంఘటనతో కలత చెందిన ఆమె ప్రజా వ్యతిరేక శక్తులను ఎదిరించడానికి 1988 లో అన్నల బాట (అడవి దారి) పట్టింది. అప్పుడే ఆమె అడవిలో ‘సీతక్క’గా మారింది. కొన్నాళ్ళ తర్వాత పోలీసుల చేతికిచిక్కి కొద్ది రోజులు జైలు జీవితం గడిపింది.జైలు నుండి విడుదలయ్యాక ఇంటర్‌, డిగ్రీ దూరవిద్య ద్వారా పూర్తి చేసుకొని అప్పటి పరిస్థితులను బట్టి మళ్ళీ బుల్లెట్‌ పట్టింది. వార్‌ ఉద్యమంలో కమాండర్‌ స్థాయికి ఎదిగింది. తన సహచరుడు అయిన కొత్తగూడ మండలం మోకాళ్లపల్లికి చెందిన కుంజా రామును పెళ్లి చేసుకుంది. కుమారుడు సూర్య జన్మించాక అమ్మ మ్మ ఇంట్లోనే పెట్టి ఉద్యమాన్ని,కుటుంబాన్ని వేరుగా చూసింది. 2001లో బుల్లెట్‌ను వీడి ప్రజా జీవితంలోకి ప్రవేశించింది. తన కుటుం బాన్ని చూసుకుంటూనే ప్రజా సమస్యల పరిష్కారా నికి బ్యాలట్‌ వైపు మొగ్గు చూపింది.అప్పటి ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు ములుగు (ఎస్టీ)టికెట్‌ను సీతక్కకు కేటాయించారు. తెలం గాణ అసెంబ్లీలో ఆదివాసీల తరపున అటవీ హక్కులు, గూడేలా అభివృద్ధి గురించి ప్రశ్నించే గొంతుకగా మారింది. మరోవైపు 2014లో మహాకూటమి నుండి ఓడిపోగా 2017లో కాంగ్రెస్‌ పార్టీలో చేరినారు. అనంతరం సీతక్కకు ఏ.ఐ.సి.సి.అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏ. ఐ.ఎన్‌.సిమహిళా కమిటీలో ప్రధాన కార్యద ర్శిగా నియమించారు.తను రాజకీయ జీవితాన్ని అనుభ విస్తూ కూడా న్యాయ శాస్త్రంలో పోస్ట్‌ గ్రాడ్యు యేషన్‌ ( ఎల్‌ఎల్‌ ఎం ) చదువుకున్నారు. 2018 లో కాంగ్రెస్‌ నుంచి గెలిచినా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వచ్చింది. మొక్కవోని దీక్ష లాగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ మరోపక్క ఉస్మానియా యూనివర్సిటీ నుండి పొలిటికల్‌ సైన్స్‌లో ‘‘ తెలం గాణకు గొత్తి కోయలు వలస రావడానికి గల సామాజిక అంతరాలు ‘‘ అనే అంశం మీద పి. హెచ్‌.డి పట్టా పొందినారు.ఎమ్మెల్యే గా ఉంటూ డాక్టరేట్‌ పొందిన తొలి ఆదివాసీ మహిళ మరి యు డాక్టర్‌ సీతక్కగా రికార్డ్‌ సొంతం చేసుకు న్నారు.  2019-20 మధ్య కరోనా మహ మ్మారికి కకావికలమైన ఆదివాసులు మంగపేట, వెంకటాపురం పరిధిలోని అడవిలో నిరాశ్రయు లుగా మిగిలారు.బంధాలు,బంధుత్వాలు తెగి పోయిన పరిస్థితుల్లోనూ‘‘నేనున్నా’’నంటూ కాలి నడక నడుస్తూ గోత్తికోయలను ఆదుకున్నది ఈ సీతమ్మ.2022,ఏప్రిల్‌ 28న మంగపేట మండ లంలోని శనిగకుంట అనే ఆదివాసీ గ్రామంలో ఎరగడివల్ల సుమారు 40దగ్ధం అయినవి. సర్వం కోల్పోయి నిలువ నీడలేని ఆదివాసులకు సీతక్క అండగా నిలిచింది.ఈ సంఘటనను తను సోషల్‌ మీడియాలో ప్రచారం చేయడంతో వారికి తగిన పునరావాసం కలిగింది. ఈఏడాది (2023) ఆగష్టులో కురిసిన భారీ వర్షాలకు ములుగు నియోజకవర్గంలోని ఏటూరునాగారం మండలం మల్యాల,కొండాయి,దొడ్ల తదితర ఆదివాసీ గ్రామాలు నీట మునిగినవి. అలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతిపక్ష నాయకురాలి హోదాలోనూ పునరావాస సేవలు స్వశక్తితో అందించారు. ప్రభు త్వం నుండి  ఆదివాసులకు ఎలాంటి సహా యం అందలేదు.తన నియోజక పరిధిలోని కొన్ని ఏజెన్సీ గ్రామాల్లోని పాఠశాలల విద్యార్థులకు నోట్‌ బుక్స్‌,స్టడీ మెటీరియల్‌, ఎగ్జామ్స్‌ మెటీరియల్‌ పంచి పెట్టారు. అక్కడి జనాలని కదిలిస్తే ‘‘ మాతరం లో  కాకతీయుల ఆరాచకాలపై తిరగబడ్డ వీరవనితలు సమ్మక్క సారక్కలను చూడలేదు కాని ప్రజా సమస్యలపై వీర్చోతింగా పోరాడుతూ నేడు తెలంగాణ సేవకురాలిగా నిలిచిన సీతక్క ను చూడటం తమ అదృష్టంగా భావిస్తున్నామ’’ ని ఆదివాసులు,గిరిజనేతరులు సైతం పేర్కొనటంవిశేషం.నేడుతెలంగాణ మంత్రి మండలిలో సీతక్క డిసెంబర్‌ 14(2023) న పంచాయతీ రాజ్‌, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రిగా విధులు స్వీకరించారు. భవిష్యత్తులోనూ మరిన్ని సంక్షేమ కార్యక్రమాలతో యావత్తు తెలం గాణ ప్రజలకు సేవచేస్తారని,ప్రత్యేకించి గిరిజనుల హక్కులకు భరోసా కల్పిస్తారని ఆశిద్దాం!- (చల్లపల్లి స్వరూపరాణి/గుమ్మడి లక్ష్మీనారాయణ)

ఇది అందరి పండుగ

రంగు రంగుల హరివిల్లులతో, రివ్వురివ్వున ఎగిరేగాలిపటాలతో, ఇంటికొచ్చే హరిదాసు లతో,అందంగాఅలంకరించిన బసవన్నలతో కనువిందు చేసే తెలుగువెలుగుల కాంతి మన రంగవల్లుల సంక్రాంతి. ఆప్యాయతలతో అనురాగాలతో ప్రేమాను బంధాలతోఅసలు సిసలైన ఆనందాల పూతోట మన ప్రియమైన సంక్రాంతి. వన్నెలద్దుకున్న గుమ్మాల వింత కాంతులతో కళకళలాడే నట్టింటి సోయగం మన ముచ్చటైనసంక్రాంతి. మావిడాకులతో, పూబంతీ చామంతులతో, తోరణాలతో అలం కరించుకున్న పందిరి మనపచ్చదనాల సంక్రాంతి. కొత్త అల్లుళ్ళతో, కొంటెమరదళ్ళతో మేళవించుకున్న సన్నాయి రాగంమన ఆట పాటల సంక్రాంతి. కోళ్ల పందాలతో,ఎడ్ల పందాలతో ఊరంతా హ్రోరెత్తిపోయే సంతో షాల వడిఈ సంబరాల సంక్రాంతి. నేతి అరిసె లతో కొబ్బరిబూరెలతో కలగలపు కూర లతో ఘుమఘుమలాడిరచే అరిటాకు భోజనం మన కమ్మనైనసంక్రాంతి. ఊరంతా పేరంటాల తో వాడంతా ఉత్సవాలతో ఇళ్లన్నీ కొత్త కాంతు లతో అంబరాన్నంటే ముంగిళ్ల కాంతి మన తెలుగు ఇంటి మమకారాల సంక్రాంతి. సంక్రాంతి సిసలైన రైతుల పండగ. శ్రామికుల పండగ. అల్లుళ్ల పండగ.గునపర్తి సైమన్‌
గిరిజన పల్లెకు ..సంక్రాంతి పల్లకి..
గిరిజన గూడెల్లో ముందస్తు సంక్రాంతి సందడి నెలకొంది..! ఏజెన్సీ గ్రామాల్లో అడవి బిడ్డలు సంబరాల ఊపందుకున్నాయి. జనవరి నెల వచ్చిందంటే చాలు..ఏజెన్సీ వ్యాప్తంగా సందడి వాతావరణం మొదలౌతుంది. ముఖ్యంగా మన్యంలోని గిరిజనుల సంప్ర దాయ సంక్రాంతి పండగను పుష్య పౌర్ణమి నుంచి ప్రారంభించారు. ప్రతి ఏడాది పుష్యమాసం ఆఖరు రెండు వారాల్లో ఎక్కడో చోట సంక్రాంతి పండగను గిరిజనులు ఉత్సా హంగా జరుపుకొంటారు. పుష్యమాసం వచ్చిన రెండో వారం తర్వాత గిరిజనులు భోగి చేసు కుంటారు. గ్రామంలోని పాత వస్తువులు, చీపుర్లు, కర్రలను భోగి మంటలో వేస్తారు. కొత్త కుండలో కొత్త బియ్యం, పప్పులతో పులగం తయారు చేసి గ్రామంలో అందరికీ పంచుతారు.భోగి రోజు నుంచి ప్రతి రోజూ రాత్రి వేళల్లో డప్పు వాయిద్యాలు,థింసా నృత్యాలతో సందడిగా ఉంటుంది. వ్యవసా యాధారంగా జీవనం సాగించే గిరిజనులు తమ వ్యవసాయ పనిముట్లకు పూజలు నిర్వహించే రోజునే సంక్రాంతిగా భావిస్తారు. దీంతో భోగి మరుసటి రోజు సంక్రాంతి పండగ నిర్వహించుకుని, తమ పనిముట్లకు పూజలు చేస్తారు. మైదాన ప్రాంతంలో కనుమగా నిర్వహించే మూడో రోజును ఏజెన్సీలో పప్పల పండగ అంటారు. ఈ పం డగను కేవలం పశువుల కోసమే చేస్తారు. పశువులను శుభ్రంగా కడిగి,వాటి కొమ్ములకు రగ్గులు పూసి,అరెశలు,బూరెలు,గారెలతో చేసిన దండలను వాటికి వేస్తారు. ప్రత్యేకంగా పులగాలను వండి వాటికి ఆహారంగా పెడతారు.
పుష్యమాసాంతం వరకు సందడి
గిరిజనులు సంప్రదాయం ప్రకారం పుష్య మాసం రెండో వారం(పౌర్ణమి) నుంచి పక్షం రోజులు సంక్రాంతి పండగను నిర్వహి స్తారు. దీనిని స్థానిక భాషలో ’పుష్య పోరోబ్‌’ అంటారు. జనవరి 17 నుంచి 31వ తేదీ వరకు ఏజెన్సీ పల్లెల్లో సంక్రాంతి సందడి కొనసాగుతుంది. ప్రధానంగా ఇతర గ్రామాల్లో వారి బంధువులను తమ గ్రామాలకు ఆహ్వానించుకుంటారు. వారికి మద్యం, మాంసంతో విందు భోజనాలు పెడతారు. అలాగే కొత్త బట్టలను పెడతారు. అలాగే పుష్యమాసం ముగిసే వరకు ప్రతి రోజు రాత్రుళ్లు మహిళలు థింసా నృత్యాలు, పురు షులు డప్పువాయిద్యాలతో సందడి చేస్తారు. పురుషులు మాత్రమే వివిధ వేషధారణలతో గ్రామాల్లో తిరుగుతుంటారు. దీంతో పుష్య మాసంలో ఏజెన్సీలోని వారపు సంతలు సైతం జనంతో కళకళలాడతాయి. సంక్రాంతి నాడు పండిరచిన తొలిచూరి బియ్యంతో పులగం తయారు చేస్తారు. తమకు వ్యవసాయ జీవనాధారమైన పాడి పశువులకు ప్రత్యేకంగా పూజలు చేస్తారు..ఇప్పటికే కొన్ని గిరిజన పాడేరు మండలం వనుగుపల్లి పంచాయితీ లో సంక్రాంతి సందడిగా సాగుతోంది. క్యాలెండర్‌తో సంబంధం లేకుండా సాధా రణంగా అందరూ జరుపుకునే సంక్రాంతికి ముందు గ్రామ దేవతకు గంగాలమ్మకు పూజలు చేస్తారు. ఇక్కడ గిరిజనులు. అదే రోజు రాత్రి భోగి మంటలు వేసి భోగి పండగ జరుపుకుంటారు.పండిన వ్యవసాయ జీవనా ధారమైన పాడి పశువులకు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. కొత్త వస్త్రం…కొత్త కన్నె..తాడు.. పూజలు నిర్వహిస్తారు. ఏడాది పండిరచిన కొత్త ధాన్యాన్ని పులగం ఆహారంగా తయారుచేసి పశువులకు తినిపిస్తారు.పశువుల మెడలో దుంపల్ని కడతారు.అంతా సందడిగా సంబరాలు చేసు కుంటారు.మరుసటి రోజు కనుమ పండుగ చేసుకుంటారు ఇక్కడే ఆదివాసీలు. పూర్వం నుండి వస్తున్న ఆచారాన్ని, సాంప్రదాయాలను గిరిజనులు ఇప్పటికీ పాటిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా గిరిజన మహిళలు ప్రత్యేక వస్తదారణతో ఆకట్టుకుంటారు. థింసా నృత్యం చేస్తూ ఆడి పాడతారు.
మైదాన ప్రాంతాల్లో ఇలా…
పిల్లల పండగ.పెద్దలు,వృద్ధుల పండగ. బీదాబిక్కి పండగ. కళకళలాడుతున్న పంట పొలాలను, పండబోయే దిగుబడిని తలుచు కొని సంతోషపడుతుంటారు. జనావళికి అన్నం పెట్టే అన్నదాత ఆనందానికి మించిన పండుగ ఇంకేముంటుంది? అందుకే శ్రమకు, సంప దకు గొప్ప స్థానమిచ్చే ఈ సంక్రాంతి పండు గను బీద,గొప్ప అనే తేడా లేకుండా అందరూ ఘనంగా జరుపుకు కర్షకులు ఆనందంలో పాలుపంచుకుంటారు. సంక్రాంతికి విడుద లయ్యే సినిమాల సంగతి చెప్పనక్కరలేదు. సంక్రాంతి నాడు చేసే స్నాన, దాన, జపా దులు విశేష ఫలదాయకం. అన్నిటికన్నా ఉదయ కాల స్నానం ముఖ్యం. సంక్రాంతి నాడు స్నానం చేయని వారికి వ్యాధులు సంక్రమిస్తాయని శాస్త్రోక్తి. స్నానం చేసిన తరువాత నువ్వుల నూనెతో దీపం వెలిగిం చాలి. నువ్వులు, బియ్యం కలిపి శివుని అర్చిం చిన పిమ్మట ఆవునేతితో అభిషేకం చేయాలి. విష్ణువును, పౌష్యలక్ష్మిని పూజించి విష్ణుసహస్ర నామ పఠనం చేయాలి. తర్వాత లోక బాంధవుడు, ప్రత్యక్షనారాయణుడైన సూర్యభగవానుడిని పూజించి కొత్తబియ్యంతో పొంగలి, పులగం తయారుచేసి, పాలు పొంగించి భక్తిప్రపత్తులతో ఆయనకు నివేదించడం శుభప్రదం.భోజనంలో మంచి గుమ్మడి కూర ఉండేట్లు చూసుకోవాలి.చక్కెర పా నువ్వులు కలిపి చేసిన మిఠాయిలు తినడం, వాటిని చుట్టుపక్కల వారికి, స్నేహి తులకు, హితులకు పంచిపెట్టడం వల్ల బాంధవ్యాలు పెంపొందుతాయి. మకర సంక్రాంతి పితృపూజలకు అనుకూలమైన దినం కాబట్టి నువ్వులతో పితరులకు తర్పణ విడవాలి. పితృదేవతలకు పుణ్యప్రదమైన ఈ సంక్రమణం కాలంలో ఒకపూట భోజనం చేయడం మంచిది.
అనుబంధాల పెన్నిధి
బిడ్డలు..ఉద్యోగ,ఉపాధి అవకాశాలను అన్వేషిస్తూ..వేర్వేరుప్రాంతాలకు వెళ్లి స్థిరపడు తుంటారు.పల్లెకు,తల్లిదండ్రులకు అది బాదైనా..ఎక్కడున్నా తమ బిడ్డలు చల్లగా ఉండాలని దీవిస్తుంటారు.అలా వెళ్లిన వారంతా ఈ పండగకు సొంత ఊళ్లకు తరలి రావడం..పల్లెకు,ప్రతి ఇంటికి సంక్రాంతే.
సమైక్యతల సన్నిధి
సంక్రాంతి..ప్రజల సమైక్యతను చాటుతుంది.దాన గుణాన్ని పెంపొందిం చడంతోపాటు ధని,పేద తారతమ్యం మరచి,ప్రతి ఇంట పౌష్యిలక్ష్మీని ఆహ్వానిస్తూ,జరిగే కార్యక్రమాలు గ్రామాలకు నూతన శోభను తెస్తుంటాయి.ఏడాది పొడవునా వచ్చే పండుగలు ఆ రోజుకు ఆరోజే చేసుకుంటారు. సంక్రాంతికి మాత్రం ముందుస్తు ఏర్పాట్లు జరుగుతుంటాయి. ప్రధానంగా అరిసెల తయారీ ఇరుగుపొరుగువారందరూ కలసిమెలసి చేసుకోవడం ఆకట్టుకుంటుంది.
చెక్కు చెదర‘నిధి’
మకర సంక్రాంతిని అత్యంత విశిష్టంగా భావిస్తుంటారు.తమ ఇంట కాలం చేసిన పెద్దలను పితృదేవతులుగా భావిస్తూ,వారిని నూతన వస్త్రాలునివేదించి..తమున్నతికి వారుచేసిన కృషిని గుర్తు చేసుకుంటూ భాష్పాంజలి సమర్పిస్తుంటారు.తమ హృదయాల్లో కొలువైన తమ వారి గురించి సంతానానికి తెలిపి,తర్వాత తరానికి దిశా నిర్ధేశం చేయడం అబ్బురమనిపిస్తుంది. ప్రకృతి వేళ ఆలయాల్లోనే కాదు..వేపచెట్టు మహాలక్ష్మీ,పోలేరమ్మ ప్రతిరూపాలుగా భావిస్తూ పూజలు చేయడం మన ఆన వాయితీ.సాప్ట్‌వేర్‌ ఇతర ఉద్యోగాల కోసం నగరాలు,ఇతర సుదూరాలకు వెళ్లినవారు సైతం గ్రామాలకు వచ్చిన తర్వాత ఈ ఉత్స హాలు అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. పంక్తి భోజనాలతోపాటుకనుమనాడు తమజీవన గమనంలో తోడుగా నిలిచిన పశువులను అలంకరించి..గౌరవించడం ఎంతో ప్రత్యేకం.
సాంప్రదాయ వారధి
గతంలో పుష్యమాసంలో హరిదాసుల కీర్తనలు,గంగిరెద్దుల విన్యాసాలు,పిట్టల దొరల గొప్పలు..కాలక్రమంలో కనుమరుగవుతున్నా.. సంక్రాంతి సంప్రదాయం నిర్వఘ్నంగా కొనసాగుతోంది.అప్పట్లో చెడుగుడు,కబడ్డీ పోటీలు జరిగేవి.ఇప్పుడు వాటి స్థానంలో క్రికెట్‌,వాలీబాల్‌ చేరాయి.ఇంటి ముంగిళ్లలో ముగ్గులు,గొబ్బిళ్లు మాత్రం ఇప్పటికీ చెక్కు చెదరలేదు.
శాంతి,సౌభాగ్యం,ఐకమత్యం కలగ లిసినదే పండుగ. అందరూ పండుగగా వ్యవహరించే ఉత్సవాలు వ్యక్తిగతంగాను, కుటుంబ పరం గాను, బంధుగతంగాను జరుపుకుంటూ ఉం టాము. అంతవరకు వున్న కష్టాలు మరచి అందరితో కలసి మెలసి ఆనందం పంచుకునే దినమే పండుగ. ఈపండుగల క్రమంలో వచ్చే ముఖ్య మైన పండుగలలో సంక్రాంతి ఒకటి. సూర్యుడు తన ప్రయాణంలో ఒక రాశినుండి మరొక రాశి లోకి ప్రవేశించడాన్ని సంక్రమణం లేదా సంక్రాంతి అంటారు. ధనుస్సురాశినుండి మకరరాశిలోనికి ప్రవేశిస్తే మకర సంక్రమణం సంభవించి, ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమయి, మనం ఆచరించే ‘‘సంక్రాంతి’’ పండుగ వస్తుంది. సూర్యగమనం ఉత్తరాయణ, దక్షిణాయనాలు నిర్ణయిస్తే, చంద్రగమనం మాసాలు నిర్ణయిస్తుంది. సూర్యుడు ధనుస్సురాశిలో సంచరిస్తుండగా ధనుర్మాసం జరుగుతుంది. ఈ ధనుర్మాసం ముగియగానే సంక్రాంతి శోభలు ప్రారం భమవుతాయి. కాలచక్రంలోని రాశులలో మకరరాశి సర్వశ్రేష్టమైనది. శ్రవణానక్షత్ర ములో ఉద్భవించిన శ్రీమన్నారాయణుడు అనంత పద్మనాభునిగా బ్రహ్మకు సాక్షాత్కరిం చినది శ్రవణానక్షత్రములో. ఈ నక్షత్రము మకర రాశికి చెందినది.ఈకారణం చేత శ్రీమహా విష్ణువుని యొక్క రాశి మకరరాశి. దీనిని మానవుని శిరస్సుగా భావిస్తారు. అటువంటి మకరరాశిలోకి సహస్రకిరణుడైన సూర్యభగ వానుడు ప్రవేశించే మహత్తర పుణ్యదినం కాబట్టి, ప్రతీవ్యక్తిలో ఆధ్యాత్మిక భావనలు పెంపొందించటానికి అత్యంత అనువైన కాలం. వేదకాలంనుంచి శిష్యులు సరైన గురువు కోసం అన్వేషించటం, గురూ పదేశం పొందడం, వేదపారాయణలు సాగించటం వంటివి ఈ సమయంలోనే ఆరంభమవుతాయి. జగత్తు జలమjైునప్పుడు శ్రీమన్నారాయణుడు ఆదివరాహమూర్తిగా అవతరించి భూమిని ఉద్ధరించిన రోజు సంక్రాంతి. వామనావతార ఘట్టములో వామనుడికి బలిచక్రవర్తి మూడడుగుల భూమిని దానం చేసినది, వామనుడి పదఘట్టనతో పాతాళానికి చేరినది ఈరోజే. దీనికి సంకేతంగా మనం సంక్రాంతి పర్వదినం జరుపుకుంటాము. ఈపండుగ భోగి, సంక్రాంతి, కనుము అని మూడు రోజులుగా జరుపుకునే పర్వదినం.
భోగిపండుగ
భోగి పండుగ పేరు చెప్పగానే మనకు స్ఫురించేవి భోగిపళ్ళు, భోగిమంటలు. ఆవుపేడతో పిడకలు తయారుచేసి యఙ్ఞ దేవతను తలుచుకుంటూ, పాపప్రక్షాణన జరిపించమని వేడుకుంటూ, ధర్మమార్గ పయనానికి సమాయత్తమవుతూ మంటలలో సూర్యోదయం సమయంలో వీటిని వేస్తారు. పిల్లలు, పెద్దలు అందరూ ఈ మంటల చుట్టూ చేరి ఆనందోత్సాహలలో మునిగిపోతారు. ఈ మంటలలోనే పాతపడిన సామానులను కూడా వేసే సాంప్రదాయం కూడా కనబడుతుంది. నూతనత్వానికి ఆహ్వానం పలుకాలంటే పాతదనాన్ని విడనాడాలి.ఈ మంటలు వేదకాలమునాటి ఋషులు తాము సంవత్సరారంభములో వ్రేల్చిన ‘ఆగ్రాహాయణి’ హోమాగ్నికి ప్రతి రూపం. హోమ భస్మం మంత్రసారము, అతి పవిత్రమైనది. మంటలు శాంతించిన తరువాత ఈ హోమ భస్మాన్ని దైవప్రసా దంగా భావించి నుదుటిన ధరిస్తారు. పిల్లలకుకూడా నుదుటిమీద ఉంచి వారి ఆయురారోగ్యాలకై ప్రార్థిస్తారు. దేవతారాధన, నూతన వస్త్రధారణ, పిండివంటలతో భోజనము వగైరా పూర్తిచేసుకుని సాయంకాలం ‘‘భోగిపళ్ళ’’ వేడుక జరుపుతారు. పిల్లలను ఆశీర్వదిస్తూ పెద్దలంతా వారి శిరస్సుపై రేగిపళ్ళను పోస్తారు. రేగిచెట్టును సంస్కృతంలో బదరీ వృక్షం అని పిలుస్తారు. ఈవృక్షం విష్ణు ప్రీతికరమైనది. ఈ రేగిపళ్ళతోపాటు చిల్లర పైసలు, నానపెట్టిన శనగలు, పువ్వులు పిల్లల తలలపై పోస్తూ, శ్రీమహావిష్ణువులాగా తేజరి ల్లాలని ఆశీర్వదిస్తారు. తరువాత ముతై దువు లకు తాంబూలాలు ఇచ్చి సంతోషపరు స్తారు.
సంక్రాంతి పండుగ
రెండవ రోజైనది సంక్రాంతి పండుగ. పండుగలలో ప్రతీ రోజుకు ఒకప్రత్యేకత ఉంటుంది, వ్యవహార నియమ నిబంధన లుంటాయి. స్నానాదికాలు ఎలా ఆచరిం చాలి, ఎటువంటి పూజలు ఆచరించాలి, ఎటువంటి దానధర్మాలు చేయాలి అనేవి మన శాస్త్రాలు విపులంగా వివరించాయి. ఇవిశారీరిక ధారు ఢ్యాన్ని పెంపొందించి, వాతావరణ సమతుల్యత కాపాడుతూ, సమతలను పెంపొందిస్తాయి.నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం శారీరిక రుగ్మతలను నివారిస్తుంది. నువ్వులు సేవించటం వలన ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.ఈరోజు జరిపే శాంతి హోమాలు, మృత్యుంజయ హో మాలు, అభిషేకాలు, వివిధ దైవారాధనలు ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించి, భగవ దానుగ్రహానికి తోడ్పతాయి. పితృదేవతల స్మరణ వారి అఖండ ఆశీర్వచనానికి దోహదం చేస్తాయి. ఇది పగటి పూట వస్తే ప్రశస్తము. మధ్యాహ్నమునకు పూర్వమే సంభవించే అర్ధోదయకాలమే పూర్తి ఫలితాన్ని స్తుంది. గొబ్బిళ్ళ సందడి సంక్రాంతి పం డుగు వేడుకలలో మరొక ప్రధానమైనది. కన్నె పిల్లలు చక్కటి వస్త్ర ధారణతో, తమకు కలిగిన ఆభరణాలతో చూడచక్కగా అలంక రించు కుంటారు. తెలుగుదనం ఉట్టి పడే కన్నె పిల్లలను చూచి కుటుంబ సభ్యులు మురిసి పోతారు. వివాహ వయస్సుకు వచ్చినారని చెప్పకనే చెబుతారు. పెద్దవారికి ఇది ఒక హెచ్చరికలాటిది. ఆవుపేడతో గుండ్రముగా బంతులవలె తయారుచేసి, ఇంటి ముంగిటి రంగవల్లుల మధ్య అమరుస్తారు. వాటిపై బంతిపూవులు, ఇతర రంగు రంగు పూలను అలంకరించి, వాటి చుట్టూ తన తోటివారితో, స్నేహితులతో వలయాకారంగా తిరుగుతూ, గొబ్బిపాటలు పాడుతూ,లయబద్ధంగా చప్పట్లు చరుస్తూ తిరుగుతారు. ఇది సంధ్యా సమయంలో జరిగే కనుల పంట. చూచిన వారిదే భాగ్యం. మహాలక్ష్మికి ప్రీతిపాత్ర మైనది. ఈవిధంగా చేయటం వలన కన్నెపిల్ల లకు త్వరలోనే చక్కటి వరుడు లభించి వివాహం జరుగుతుందని విశ్వాసం. లయ బద్దంగా చిడతలు వాయిస్తూ, భుజము పైనున్న వీణను స్వరబద్ధముగా మీటుతూ, అడుగు అడుగులో గజ్జెల సవ్వడి నింపుతూ విలాసంగా సాగిపోయే హరిదా సులు మన సంప్రదాయ చిహ్నాలు. హరి నామ సంకీ ర్తన తప్ప మరొక మాయ వారి నోటి వెంట వెలు వడదు. రంగు రంగుల వస్త్రధారణతో, మెడలో పూదండతో హుందాగా నడుస్తూ సాగిపోతారు.
కనుమ
మూడవ రోజైన పండుగ కనుమ పండుగ. కనుమ నాడు మినుము తినాలంటారు. అందుకే ఆవునేతితో తయారుచేసిన మినపసు న్నెలు, బెల్లం గారెలు వంటిని తయారుచేసు కుంటారు.నోరూరించే పదార్థాలు జిహ్వను మరింత పెంచగా మానసిక సంతృప్తితో కడుపారా అస్వాదిస్తారు. వ్యవసాయదారులు తమ తమ పశువులను అలంకరించి వాటిని స్వేచ్ఛగా తిరిగేలా చేస్తారు. బలవర్థకమైన దాణావేసి విశ్రాంతిగా ఉండేలా చేస్తారు. వ్యవసాయ క్షేత్రములో వాటి అవసరం లేకుండా పంటలు పండవు.నాగరిక ప్రపంచ ములో యంత్రాల విని యోగం ఎక్కువైనప్ప టికి, పశువుల వినియోగం లేకుండా సాగదు. మనకు జీవనాన్ని,జీవి తాన్ని ఇచ్చిన ప్రతీ ప్రాణిని గౌరవించాలనే సత్సాంప్రదాయము మనది. కనుమనాడి కాకి కూడా కదలదు అనే నానుడి ప్రచారంలోఉంది. శాస్త్రపద్దతిలో ఆలోచిస్తే దీనికి తగిన కారణం కనబడు తుంది. దైనం దిన కార్యక్ర మాలకు దూరంగా ఉంటూ, కుటుంబ సభ్యు లతో కలసి మెలసి ఆనందంగా జీవించటానికి అవకాశం కల్పించేవే కొన్ని కట్టుబాట్లు, ఆచారవ్య వహారాలు. బయటకు వెళ్ళకోడదు అనే నియమం పెడితే చక్కగా ఇంటి వద్దే వుండి సంతోషంగా గడుపుతారని దీని ముఖ్యోద్ధే శము. అంతేకాకుండా మరుసటి రోజున బంధువులు తమతమ స్వస్థాలకు వెళ్ళిపోతారు కనుక వారి వీడ్కోలుకు కావలసిన కార్యక్రమ నిర్వహణకు దోహదం చేస్తుంది. వయస్సుతో నిమిత్తం లేకుండా కోడిపందేలతో మగవారు ఆనందిస్తారు.
బొమ్మల కొలువు ప్రతీ ఇంటా కొలువుదీరుతుంది. సంవత్సరం పొడవునా సేకరించిన రకరకాల బొమ్మలను పలు వరుసలలో అలంకరించి హృద్యమైన వాతావరణాన్ని తయారుచేస్తారు. వస్తుగ్రహ ణాశక్తిని పెంపొందించి, మానసిక శాంతిని కలిగిస్తుంది. సిరిసంపదలు కలుగుతాయని విశ్వాసం. బొమ్మల కొలువు పేరుతో ఇంటిని అందంగా అలంకరిస్తారు. పలువురు విచ్చేసి అలంకరణలను వీక్షించి ముగ్దులౌతారు. ఇంటిని అలంకరించిన మామిడి తోరణాలు, నూతన వస్త్ర ధారణలు,వాకిట భోగి మంటల వింత శోభలు,నట్టింట్లో నిండు గర్భిణిలా ధాన్యపు గాదెలు, వాకిట్లో హరిదాసులు ఆలపించే హరిభ జనలు, తోటల్లో కోడిపందేలు, పెరట్లో పశువుల అలంకా రాలు,అత్తింట్లో అల్లుడు గారు ఎక్కే అలక పాన్పులు, వంటింట్లో అత్తగారు చేసే నేతి అరిసెల ఘుమఘుమలు, అంగట్లో వస్త్రాల సంబరాలు, ఆలయాలలో దైవ పూజలు, ముంగిట్లో వయ్యారి భామలు దిద్దే ముత్యాల రంగవల్లులు, రంగవల్లులపై శోభిల్లే గొబ్బిళ్ళు, దాన ధర్మాల తృప్తిపొందిన దానగ్రహీ తలు.. కలగలసి మన సంక్రాంతి. ఈవిధంగా మూడు రోజులు నూతన వస్త్రాలు ధరించి, యథాశక్తి పూజలు, హో మాలు సలిపి, దానాలు చేసి, పశువులను అలంకరించి అందరితో కలసియధాశక్తి పిండివంటలు భుజించి అత్యంత ఆనందంగా గడుపుకుని, సంవత్సరమంతా పండుగలా గడవాలని కోరుకుంటారు.

జీవితాన్ని అంకితమిచ్చిన సామాజిక ఉద్యమ నేతలు

తమ ఆరోగ్యాలను సైతం లెక్కచేయకుండా ప్రతిక్షణం గిరిజన,దళిత ప్రజల ఆకాంక్షలు, కలలనే ఊపిరిగా చేసుకుని బతికిన సామాజిక స్పూర్తిదాతలు,పర్యావరణవేత్త శ్రీధర్‌ రామ్మూర్తి, సామాజికవేత్త విలియమ్‌ స్టాన్లీ,అలుపెరగని పోరాట యోధుడు,సామాజిక సేవకు అద్దంపట్టే మరోఆత్మ కె.రాజేంద్ర కుమార్‌లు ఒకే నెల జనవరిలో మనమధ్య నుంచి దూరమవ్వడం మర్చిపోలేని సంఘటన.ఈ ముగ్గురు సామాజిక యోధులతో నాకున్న అంకుఠిత పరిచయం చిరస్మరణీయమైనది.నాతోటి సహచారులు మనలో లేరంటే నా హృదయం పరితపిస్తోంది.
వివిధ రంగాల్లో నిర్మాణాత్మకమైన సామాజిక ఉద్యమాలను నడిపించారు.సమాజ శ్రేయస్సుకు..సమూహ ప్రయోజనాలు అందించారు. వర్తమాన సామాజిక ఉద్యమాల చరిత్రలో చెరిగిపోని సంతకాలగా వారి సామాజిక సేవలు నిలిచిపోయాయి.సామాజిక అసమానతలపై సమరం సాగిస్తూ,సమాజాన్ని సంస్కరించడం కోసం,అలుపెరగని కృషి చేసిన పోరాట యోధులు.
శ్రీధర్‌ అనంతమైన ఆలోచనలు,విశ్లేషణలతో కూడిన పరిశోధకుడు.శాస్త్రవేత్త.దేశంలోనే కాకుండా అనేక దేశాలలో ఆదివాసీ ప్రజలకు ఆలోచనలు అందించారు. ఒకశాస్త్రవేత్త,ఒకకార్యకర్త, ఒకసాహసికుడు,ఒక స్వాప్నికుడుగా తన జీవితమంతా అట్టడుగున ఉన్నవారి కోసం, పర్యావరణంకోసం, సహజవనరులపై సమాజాల నియంత్రణకోసం అలుపెరగని పోరాటాలు చేశారు.
ఇక విలియమ్‌ స్టాన్లీ ఒడిస్సా,చత్తీష్‌ఘర్‌ ఆదిమతెగల జీవితాల్లో వెలుగు నింపాడు.అనాగరిక గిరిజన ప్రజల హృదయాల్లో సుస్థిరస్థానం సంపాదించారు.వందలాది గిరిజన గ్రామాలకు త్రాగునీరు, విద్యుత్‌,ఇతరమౌళిక సదుపాయాలు కల్పించారు.గిరిజన యువతకు మార్గదర్శిగా ఉంటూ సామా జిక,ఆర్ధిక,రాజకీయరంగాల్లో ఎందరో యువకులకు భవిష్యత్తునిచ్చారు.
ఇక అలుపెరగని సామాజిక యోధుడు రాజేంద్ర నాతోటే పయనించారు.అత్యంత అట్టడుగున దళిత కుటుంబంలో జన్మించిన రాజేంద్ర తన దళిత,గిరిజనుల జీవితాల కోసం రక్తాన్ని ధారపోసిన హృదయం.ఒకఆత్మ స్థిరమైన ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి మార్గాల కోసం అనంతంగా అన్వేషించిన నిస్వార్ధపరుడు.రాజేంద్ర చేసినసుదీర్ఘ పోరాటాలు ఎన్నో నేటికి చెరగని ముద్రవేసుకున్నాయి.కాలుష్యకోరల్లో కొట్టిమిట్టులాడుతున్న క్వారీ ప్రజలకు అండగా నిలిచారు.ఏలేరు నిర్వాసితులకు పునరావాసం సుదీర్ఘ పాదయాత్ర చేశారు.అత్యాచారానికి గురైన దళిత బిడ్డకు అండగా నిలిచి న్యాయంపోరాటం చేసి గెలిచారు.కాకినాడ జిల్లా తీరప్రాంతంలో ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రత్యేక ఆర్ధిక మండలి(స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌`(ఎస్‌ఈజెడ్‌) పేరుతో రైతులు,మత్స్యకారుల భూములు ప్రభుత్వం స్వాదీనపర్చు కోవడంపై తరుపున సుదీర్ఘ పోరాటంచేసి కొద్దిరోజులు జైలుజీవితాన్నికూడా అనుభవించారు. వంతాడ ఆదివాసీ వనరుల పరిరక్షణపై(లేటరైట్‌)పోరాటంచేసి విజయం సాధించారు.
సామాజిక సేవలో కుటుంబాన్ని,ఆరోగ్యాన్నిసైతం విస్మరించారు.వారి జీవితాన్ని ప్రజా ప్రయోజనాల కోసం అలుపెరగని సేవలందించారు.వాస్తవానికి సామాజిక సేవ చేసే ప్రతి కార్యకర్త ప్రజలతోనే మమేకంగా ఉంటారే తప్పా వారి ఆరోగ్యం,కుటుంబం సంక్షేమకోసం పట్టించుకోవడం తక్కువ.ఈనేపథ్యంలోనే ఈ ముగ్గురు సహచరులు హాఠత్తుమరణానికి గురికావాల్సి వచ్చింది. మనిషికి మరణమనేది ఏరకంగా సంభవిస్తుందో తెలియని పరిస్థితి. ఈనేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపట్ల నిర్లక్ష్యం వహించకూడదు. అనారోగ్యం రాకుండానే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.ప్రస్తుత మానవ జీవనవిధానం కలుషితమయంగా మారింది.కలుషితమైన ఆహారపదార్ధాలనే తీసుకుంటున్నాం.ముఖ్యంగా సమాజంలో సామాజిక మార్పులు తీసుకొచ్చే శ్రేణులు ఆరోగ్యపరిరక్షణ పట్ల మరింత శ్రద్ద తీసుకోవాల్సిన అవశ్యకత ఉంది.జీవిత విలువ తెలుసుకొనే ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకూడదు.!- రవి రెబ్బాప్రగడ ,ఎడిటర్ 

శతాబ్దాల సాంస్కృతి సమాహారం

స్వచ్ఛమైన సెలయేళ్లు..దట్టమైన అడవులు.. గంభీరమైన కొండలు.. పక్షుల కిలకిలారా వాలు. పచ్చని ప్రకృతి అందాలు వీటి మధ్య శతాబ్దాల సంస్కృతులకు గుర్తుగా, వెనకబాటుత నానికి సజీవ సాక్ష్యంగా. పాలకుల ఆలన కోసం ఎదురు చూస్తూ అమాయక ఆదివాసీ జనం నివసి స్తోంది. అడవితల్లి బిడ్డలుగా ,ప్రకృతి ఒడే అవాసంగా దశాబ్దాలుగా పోడు వ్యవసాయం చేసుకుని, ప్రకృతి ప్రసాదిత ఫలాలతో సహవాసం చేస్తోంది. విద్య,వైద్యం వంటి మౌళిక సదుపాయాలకు నోచుకోని గూడే లెన్నో కనిపిస్తాయి. ఇప్పుడిప్పుడే వారి జీవితాల్లో వెలుగులు నింపే సర్కారు వచ్చింది.వారి కష్టాలు తీర్చేందుకు బృహత్తర కార్యక్రమాలు అమలు చేస్తోంది.-(భమిడిపాటి గౌరీశంకర్‌)
జాతులు..భాషలు
జిల్లాలో 2.36 లక్షల మంది గిరిజనులున్నారు. వీరిలోట్రైబల్‌ సబ్లన్‌ మండలాల్లో నివసించే సంఖ్య1.87 లక్షలుగా ఉంది. గిరిజనుల్లో 36 జాతులున్నాయి.ఉత్తరాం ధ్ర జిల్లాల్లో సవర, కొండదొర, గదబ, వాల్మీకి,జాతాపు, కోయ, భగత జాతులు ప్రధానమైనవి. సవరభాష శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒకేలాఉంటుంది. వీరి అభ్యున్నతికి ఏర్పాటైన ఐటీడీఏకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు కేటాయిస్తున్నాయి. సగటున ఒక్కో ఐటీడీఏకి ఏటా రూ.300 కోట్ల నిధులు వస్తున్నాయి. కానీ అందులో గిరిజనులకు ఈ నిధుల్లో చేరేది నామమాత్రమే. నిక్కచ్చిగా ఈ నిధులన్నీ గిరిజనులకే ఖర్చుచేసి ఉంటే గిరిజనుల ఎప్పుడో మారిపోయి ఉండేవి.
సజీవ సంప్రదాయాలకు నిలయం
గిరిజన జీవనం విభిన్నంగా ఉంటుంది. సంబరాలు, వివాహ వేడుకలు, ఆరాధనల ఆచారాలు, మనిషి మూలాలను తేటతెల్లం చేస్తుంటాయి. తరాలు మారినా వారి అలవాట్లు, కట్టుబాట్లు ఇప్పటికీ మారలేదు. ఇక్కడ జరిగే వివాహ వేడుకల్లోని సంప్రదాయాల్లో భాగంగా చెట్టును ఆరాధిం చే విధానాలు ప్రపంచ శాంతి సౌభాగ్యానికి సందేశాన్ని పంపుతుంటాయి. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని ఏ పల్లెకు వెళ్లినా సవరజాతి గిరిజనుల సంబరాలు, పండుగ సందడులన్నీ ఒకే రకంగా కొనసాగితే పెళ్లిళ్లు మాత్రం ప్రకృతి ఆరాధనతో ముడిపడి ఉంటాయి. ప్రాణాధారమైన నీరు, అది లభించడానికి అవసరమైన చెట్టు చుట్టూనే వారి తంతు తిరుగుతుంది. సవర భాషలో పాటలు, థింసా నృత్యాలు ఇక్కడి గిరిజనుల పండుగలు, శుభకార్యాల్లో భాగం.ఆడవేషంలోవున్న యజ్ఞుడు అనే పురోహితుని పాత్రలో పెళ్లితంతు నిర్వపి వధూవరులను మేనమామలు భుజాలపై ఎక్కించుకొని నృత్యం చేస్తూ ఊరేగించడం నేటికీ కొనసాగుతున్న సంప్రదాయం.
కనీస సౌకర్యాలు కరువు
నేటికీ గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపా యాలు లేవు. కనీసం తాగునీరు, రోడ్డు మార్గం లేదు. వైద్య సదుపాయాలు లేక ఏటా వందలాది మంది మృత్యువాత పడుతున్నారు. గర్భిణులు, వృద్ధులు అత్యవసర సమయాల్లో వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారు. నేటికీ వైద్యం కోసం, విద్య కోసం గిరిజనులు కొండలు గుట్టలు దాటి కాలినడకనచ,డోలీ సాయంతో మైదాన ప్రాంతాలకు రావాల్సిందే. వీరి తండాలకు విద్యుత్‌ సౌకర్యం లేదు.ఉండ టానికి ఇళ్లు లేవు. ఇవ్వాల్సినవి ఇవ్వకపోగా వారి వనరులను లాక్కుంటున్నారు. క్వారీలు నడుపుతూ ఖనిజ సంపదను కొల్లగొడు తున్నారు. బాక్సైట్‌, గ్రానైట్‌ దోచుకుంటున్నారు. పిండిచేసి గిరిజనులకు పోడు వ్యవసాయం చేసి అవకాశం లేకుండా చేస్తున్నారు. ఈ పరిస్థితులను మార్చేందుకు సీఎం వైఎస్‌ జగన్మోహన్రెడ్డి సంకల్పించారు. గిరిజనుల జీవితాల్లో మార్పునకు సీఎం వైఎస్‌ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. తొలిత కురుపాం,సాలూరు గిరిజన రిజర్వర్డు నియోజకవర్గాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్టు ఇచ్చారు. ఎన్నిక ల్లో గెలిచిన వెంటనే తన తొలి కేబినెట్లో కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణికి స్థానం కల్పించారు. గిరిజన శాఖ మంత్రి పదవిని ఇవ్వడంతో పాటు ఉపముఖ్యమంత్రి హోదానిచ్చి ఉన్నత స్థానం కల్పించారు. తర్వాత సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొరకు గిరిజిన సంక్షేమశాఖ మంత్రి పదవినిచ్చారు. గత ప్రభుత్వాలు ఎస్టీ సప్లాన్‌ నిధులను ఇతర ఖర్చులకు వాడేసేవి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నెల్లూరులో దళితతేజం సభ నిర్వహణకు సబ్‌ ప్లాన్‌ ఖర్చు చేశారు. ఇలాంటి వాటిని అరి కట్టడానికి అధికారం గిరిజనుల చేతుల్లో ఉండాలి. గిరిజనులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండా లని గిరిజనులు ఎప్పటి నుంచో కోరుతుండే వారు. సాంఘిక సంక్షేమ శాఖలో మిళితమై ఉండటంవల్ల గిరిజనులకు అన్యాయం జరుగు తుందని వేడుకునేవారు. వారి గోడువిన్న జగన్‌ గిరిజనులకు ప్రత్యేక మంత్రిని ఇచ్చారు. గిరిజనుల బతుకులు బాగుచేయాలనే ఉద్దేశం తో గిరిజన సలహామండలిని ఉపముఖ్యమంత్రి నేతృత్వంలో,గిరిజన ఎమ్మెల్యేల భాగస్వా మ్యంతో సీఎం ఏర్పాటు చేశారు. గత ప్రభు త్వంలో అప్పటి పాలకులు పదవిలో ఉన్నన్నా ళ్లూ గిరిజన సలహా మండలి ఊసెత్తలేదు. ప్రజా సంకల్ప యాత్రలో ఎస్సీ,ఎస్టీలకు ఉచిత విద్యుత్‌ అందిస్తానని హామీ ఇచ్చి, సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే దానిని నెరవేర్చారు.200 యూనిట్ల వరకూ విద్యుత్‌ వినియోగాన్ని ఉచితం చేశారు.దీనివల్ల రాష్ట్రంలో ఉన్న ఎస్సీ కుటుంబాలకు ప్రయో జనం చేకూరుతోంది.
సవరల సంస్కృతి మరియు సంప్రదాయాలను పరిరక్షించే ప్రయత్నాలు
గిరిజనులకు సమాజంలో ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది, వారి ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయం మరియు భాషకు ధన్యవాదాలు. వారి స్వంత లిపి లేనప్పటికీ, ప్రత్యేకమైన వారసత్వం ఏదో ఒకవిధంగా శతాబ్దాలుగా తరువాతి తరానికి అందించబడుతోంది.కానీ ప్రస్తుత తరం ఆంగ్లం,తెలుగు ఒడియా భాషలలో సాధారణ విద్య,అధ్యయనానికి ప్రాధాన్యత ఇస్తుండటంతో, సవర కమ్యూనిటీకి చెందిన గిరిజన పెద్దలు తమ సంస్కృతి, సంప్రదాయం భావితరాల కోసం భాషను పరిరక్షించడంపై ఆందోళన చెందుతున్నారు.
సవర సంస్కృతీ దర్పణాలు గిడుగు కథలు
సవర భాష కోసం నిరంతరం పరిశ్రమించిన పండిత మాన్యుడు గిడుగు రామమూర్తి పంతులు.సవరల భాష, యాస, సంస్కృతుల పట్ల ఆయనకు 1880లోనే ఆసక్తి కలిగింది. మన్యప్రాంతంలో ఉపాధ్యాయుడిగా పనిచే యటం ఇందుకు ప్రధాన కారణమనిపిస్తుంది. కొందరు ఆలోచించి వదిలేస్తారు. కొంతమంది మాత్రమే ఆలోచించి ఆచరిస్తారు.అతి కొద్ది మంది మాత్రమే లోతైన అధ్యయనంతో విజయం సాధిస్తారు. గిడుగు రామమూర్తి ఇటువంటివారే. సవరభాషకు ఓ లిపిని ఏర్పాటు చేయడమే కాక, వారి జీవనసంస్కృతి మూలాల లోనికి దగ్గరగా వెళ్ళారు. అధ్యయనం చేశారు. వారి జీవితాలను చరిత్రగా రికార్డు చేశారు. సవరభాషకు నిఘంటువు, వ్యాకరణం కూర్చారు. పాటలని సేకరించారు. వాచకాలను రూపొందించారు. సవరభాష నేర్చుకోవటం తేలిక అనేది ఆయన భావన. గిడుగు రామమూర్తి పాండిత్యం ఎంతో నిర్మాణాత్మమెనది. గ్రాంథిక భాషను ఖండిరచడం వెనుక ఉన్నది ఈ అంశమే! సవర భాష విషయంలో ఆయన చేసిన స్వయంకృషి శ్లాఘనీయం.
సవరల జీవన విధానంలోని సంస్కృతి సంప్రదాయాలను వ్యక్తిగమెన కార్యనిర్వహణ రంగాలను గిడుగువారు దగ్గరగా పరిశీలించారు. వాటిని ‘సవర కథలు’గా రాశారు. ‘సవర భాషలో నేను వ్రాసిన మొదటి పుస్తకంలోని కథలకు ఇంచుమించుగా సరైన తెలుగు చేసి ఈ పుస్తకం వ్రాసినాను. ఈ సవర %-పుస్తకంలోని కథలన్నీ ఇంగ్లీష్‌లో ఉన్న ఈసపు కథలను పట్టి వ్రాసినాను’ అని ఆయన ఆ పుస్తకం ముందుమాటలో చెప్పారు. ప్రతి వాక్యాన్ని సవరలకు వినిపించి, వారి సవరణలు, సలహాలు, సూచలను అనుసరించి తిరగ రాశారు. కథలలోని విషయాలు సవరల వ్యవహారాన్ని అనుసరించి వాళ్ళకు తెలిసేటట్లు చేర్పులు మార్పులు చేశారు. కనుక ఈ సవర కథలు సవరల నిజజీవన చిత్రణ దృశ్యాలు.. సాక్ష్యాలు. ‘కోదుల భాషలో ముగ్గురు నలుగురు కొన్ని పుస్తకములు వ్రాసినారు. కాని.. సవర భాషలో ఇదివరకు ఎవరూ పుస్తకాలను వ్రాయలేదు. నేను వ్రాసినవే మొదటి పుస్తకాలని’ గిడుగువారు చెప్పుకున్నారు. ఫిక్షన్‌ అండ్‌ ది రీడిరగ్‌ పబ్లిక్‌’ అనే పుస్తక రచయిత క్యు.డి.లీవీస్‌ కథను గూర్చి చెబుతూ కథ ప్రధాన లక్షణమైన క్లుప్తత కేవలం రూపానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు. జీవితానికి, జీవిత దృక్ప థానికి రూపం. జీవితంలోని ఒక ముక్కను తీసుకుని దానికి వ్యక్తిత్వం ఇవ్వాలన్న ఆకాంక్ష లోంచి కథకు రూపం వచ్చిందంటారు. కథల్లో కొద్దిమంది లేదా ఒక జీవితం కొన్ని శకలా లుగా గోచరమవడం పాఠకులకు కొత్త కాదు. కానీ తనకు తెలియని ప్రపంచంలోని భాష, వ్యక్తులు, జీవన విధానాలను కథలుగా మలచడంలో ఎన్నో ఇబ్బందులున్నాయి. చదువరి వీటిని తనవిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరో గురించి వారంటే తెలియని వారు ఎందుకు తెలుసుకోవాలి? అటువంటి కథలు ఎందుకు చదవాలి? ఇవి సామాన్య చదువరుల ప్రశ్నలు. ప్రపంచీకరణ నేపథ్యంలో సాహిత్యం కొత్త సిద్ధాంతాలను, వాతావరణాలను సృష్టించుకుంటూ వస్తున్నది. మన చుట్టూ ఉన్న సమాజం నాగరికత ఆనవాళ్ళు అభివృద్ధి పరంగా శరవేగంగా మార్పుకు లోనవుతున్నది. కాని అలాలేని జీవితాలున్నాయి. జీవన గమనాలున్నాయి. ఎటువంటి కృతక వర్ణాలను అంటించుకోని స్వచ్ఛమైన మన్యాలున్నాయి. వాటిలో ప్రజాసమూహాలున్నాయి. ప్రకృతి వారికి పాఠశాల..కూడు, గుడ్డ, భాష కూడా అక్కడ నుంచి వచ్చినదే. భయంకమెన క్రూరమృగాలు, సాధు జంతువులు వారిని దగ్గరగానే చూస్తాయి. వారు కూడా వాటితో సహజీవనం చేస్తారు. సవరలు ఇందుకు మినహాయింపు కాదు. సవర దక్షిణ ముండాభాష. ఆస్ట్రో-ఏషియాటిక్‌ భాషా కుటుంబంలో ఒక శాఖ ముండాభాషలు. ఒడిషాలోని గంజాం జిల్లాలో ఆంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా కనిపించే సవరల జనాభా ఐదులక్షలకు పైనే. వీరు పోడు వ్యవసాయం చేస్తారు. వీరి గృహాలు ఒకదానికెదురుగా మరొకటి ఉంటాయి. వీరి భాషలో గ్రామాన్ని గొర్భాం అంటారు. అంటువ్యాధుల వల్ల, పులి, అగ్ని వంటి వాటి ప్రమాదాల వల్ల జనం చనిపోతే ఆ గ్రామాన్ని వదిలి వేరే చోటుకు వెళ్ళిపోతారు. నేటికీ వారిని అనాగరికులుగానే సభ్య సమాజం గుర్తిస్తుంది. మనిషికి ఆత్మకు మధ్య ఉన్న సంబంధాన్ని గాఢంగా నమ్ముతారు. ఆత్మల్లోకి మనుషులు ప్రవేశించగలరనే విశ్వాసాలు ఉన్నాయి వారికి. వీటిని గిడుగువారు దగ్గరగా చూశారు. తనవిగా భావించారు. వారితో కలసిమెలసి సవరభాషకు ఓ శాశ్వతను తీసుకువచ్చారు. వీటినే ‘సవర కథలు’ ద్వారా అందించారు. ‘సవర కథలు’ చాలావరకు చిన్న పిల్లల కథలు వలే ఉన్నా సవరల మనస్త త్వాన్ని చెబుతాయి. సవరల జీవితాల్లోని ఓ తాత్వికతతో కూడిన విశ్వాసాలున్నాయి. వాటి వెనుక నీతివంతమైన వ్యవహారా లున్నాయి. కష్టపడే తత్వాన్ని నీతి ఆవహిస్తే స్వచ్ఛత కనిపిస్తుంది. ఇది ప్రకృతి గుణం. ‘నక్కా-గద్దా’,‘మూడు పిల్లులు- కోతి’,‘గొప్ప వాడి కథ’, ‘అత్యాశగల ఒక మనిషి’ వంటి కథలలోని నీతిని సవరల జీవనవిధానంలోని భాగంగా భావించడం కన్నా,వారి మనస్త త్వాన్ని, మానవతా దృక్పథాన్ని పరోక్షంగా చెబుతాయి. ఈ కథలలోని రెండవ పుస్తకం ముందుమాటలో ‘ఇందులోని కథలు అన్నీ సవర వాళ్ళు నాఎదుట చెప్పినవే. ఇంచు మించుగా వాళ్ళ మాటలే’ అంటారా యన. ఈ సంపుటంలోని కొన్ని కథలు వారు విన్నవి. కొన్ని కల్పనలు. కొన్ని కథలు వారివే. సవరలు పచ్చిబూతులు యథేచ్ఛగా ఉపయోగిస్తారు. అవి ఈ కథల్లో లేకుండా చూశారు గిడుగువారు. ఈ కథల్లో సవర జీవన విధానంతో పాటు వారి భాషను కూడా ఆయన సహజంగా గిడుగువారు ప్రతిపాదిం చారు. నాలుగో భాగం సవర కథల్లో పూర్తిగా సవరలకు సంబంధించిన జీవన విధానపు భాషా వ్యవహారం కనిపిస్తుంది.ఇళ్ళు,పొలం,సంత,తగవులు, పూజలు,కల్లు తాగడం,సోది,కేసులు, పోలీసు లు,జడ్జిలు, రోగాలు వంటి సందర్భాల్లో వారి సంభాష ణలోని సహజ త్వాన్ని గిడుగు అందించారు. సవర భాషాలిపికర్తగా,వ్యవ హారిక భాషా ఉద్యమ కారుడిగా చరిత్రకెక్కిన ఆయనకు, వర్తమానం లో ఎదురవుతున్న అవరోధాలన్నిటి నుంచి తెలుగు భాషను కాపాడుకోవటమే మన అర్పించే నిమెన నివాళి.
గిరిజనుల ప్రకృతి ఆరాధనే
వ్యవసాయమే ప్రధాన వృత్తిగా విశేషమైన పశు సంపద తో అటవీ వాతావరణంలో నివసించే గిరిజనులు ఏటా తమ సంప్రదా యాన్ని ప్రతిబింబించేలా సీత్లా పండుగ జరుపుకొంటారు. సామూహిక జీవితంలో అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఐక్యతను చాటేలా నిర్వహించే ఈ పండుగ వారి సంప్రదాయానికి అద్దం పడుతున్నది. పంటలు బాగా పండాలని, పశు సంపద అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో పాటు ప్రకృతి ఆరాధన ఆ పండుగ అంతర్లీనంగా ఉం టుంది. అత్యధికంగా తండాలు కలిగిన పాలకవీడు మండలం లోపాటు బొమ్మల రామారం,తుర్కపల్లి మండలాల్లోనూ సీత్లా పండుగ సందడి నెలకొన్నది. లాలితండా, బెట్టెతండా,పాడ్యాతండా,చెర్వుతండా, కల్మటితండా,కొత్తతండా,శూన్యంపహాడ్‌, దేవ్లాతండా,మీగడంపహాడ్‌ తండా, లక్ష్మీతం డాల్లో పండుగలు జోరందుకున్నాయి. గిరిజ నుల తొలి పండుగ సీత్లా. ఆషాఢ మాసం పెద్ద పుష్యాల తొలి పాదంలో ఈ పండుగను జరుపుకొంటారు. తండాలోని కుటుంబాలన్నీ సామూహంగా ఏర్పడి ప్రకృతి దేవతలైన సీత్లా భవానీతో పాటు ఆరుగురు భవానీల ప్రతిమ లను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహి స్తారు. వర్షాలు బాగా కురువాలని పాడి పంటలతో పల్లెలు, తండాలు సస్యశ్యా మలంగా ఉం డాలని కోరుతూ మొక్కులు చెల్లించు కొం టారు. ఏడు రకాల వంట కాలతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కరూ ఉత్సాహంగా పాల్గొని ఆటా పాటలతో గిరిజన సంప్రదాయ నృత్యాలతో సందడి చేస్తారు.ఈ తంతులో కుల పెద్దలు ప్రముఖ పాత్ర పోషిస్తారు. సాయంత్రం వేళ అమ్మ వార్లకు గొర్రె పోతు లను బలి ఇచ్చి,పేగు పైనుంచి పశువులను దాటిస్తారు. దీనినే దాటుడు పండుగ అని అంటారు.

ఆర్ధిక ఇబ్బంద్లో రైతు భరోసా

రైతు భరోసా పథకం అనేది డైనమిక్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమలు చేసిన రైతు మద్దతు,సాధికారత కార్యక్రమం.ఈసమగ్ర పథకం రైతులకు ఆర్థిక సహాయం మరియు ఇతర ప్రయోజనాలను అందించడం, వారి సామాజిక-ఆర్థిక శ్రేయస్సు మరియు అభ్యున్నతికి భరోసా కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది.
వైఎస్సార్‌ రైతు భరోసా అనేది రాష్ట్ర ప్రభుత్వంరూ.7500,కేంద్ర ప్రభుత్వం రూ.6000 విరాళంగా ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధితో కలిపి సంవత్సరానికి 13,500 రూపా యల మొత్తాన్ని మూడు విడతలుగా జమ చేయ డం ద్వారా రైతులకు ఆర్థికంగా సహాయం చేయ డానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం.ఇప్పటి వరకు ఐదువిడతలుగా రైతులకు రైతుభరోసా నిధులు అందజేశారు. వైఎ స్సార్‌ రైతు భరోసా-ప్రధానమంత్రి కిసాన్‌ పథ కం కింద రైతులకు సంవత్సరానికి రూ.13, 500 ఆర్థికసహాయం అందుతుంది. ఈ మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.7,500,భారత ప్రభుత్వం రూ.6,000 భరిస్తుంది.కౌలు రైతులు కూడా ఈ పథకానికి అర్హులుగా పరిగణించబడుతారు. అన్న దాతలు రైతు భరోసా కేంద్రానికి వెళ్లి సంప్రదిస్తే వైఎస్సార్‌ రైతు భరోసా పథకంలోకి చేర్చుకుం టారు. రైతులు పొలం పట్టా,ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు లాంటి డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉం టుంది. అర్హులకు వైఎస్సార్‌ రైతు భరోసా స్కీమ్‌ కింద ఏపీ ప్రభుత్వం ప్రతిఏటా13,500 రూపా యలను మూడు విడతలుగా వారి బ్యాంక్‌ ఖాతా ల్లోకి నేరుగా జమ చేస్తుంది.
రైతుల్లో సంతోషం..
ఆంధ్రప్రదేశ్‌ లోని 38లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చడానికి రూ.3785కోట్లను విడుదల చేస్తూ 2019అక్టోబర్‌ 15న రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వైఎస్‌ఆర్‌ రైతు భరోసాను ప్రారంభించారు.మొక్కలు,ఎరువులు, విత్తనాలు సరఫరా చేసేందుకు రైతుభరోసా కేంద్రా లను2020 మే30న ప్రారంభించారు. హార్టికల్చర్‌, ఆక్వాకల్చర్‌ మరియు వ్యవసాయ రంగాలకు 2019-20ఆర్ధిక సంవత్సరానికి మొత్తం రూ.6, 173 కోట్లు, 2020-21కి గాను రూ.6,928 కోట్లు ఖర్చు చేయబడిరది.%ళి6రి% రైతులకి ఆర్ధిక సహాయం కొనసాగించడానికి 2020-21ఆర్ధిక సంవత్సరానికిగాను హార్టికల్చర్‌, ఆక్వా కల్చర్‌ మరియు వ్యవసాయ రంగాలకు ఖర్చు చేసే రూ 6,928 కొట్లలో వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకానికె సగానికి పైగా అంటే రూ 3,615.60 కోట్లు కేటాయించడం జరిగింది
అంతర్జాతీయ గుర్తింపు
విత్తనం నుంచి విక్రయాల దాకా రైతన్నలకు చేదోడువాదోడుగా నిలిచి గ్రామాల్లోనే సేవలందిస్తున్న వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రా లకు (ఆర్బీకే) ఇప్పుడు అంతర్జాతీయంగా అరుదైన ఖ్యాతిని గడిరచనున్నాయి. ఐక్యరాజ్య సమితి అను బంధ సంస్థ ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏవో) అందించే ప్రతిష్టాత్మక ‘ఛాంపియన్‌’ పురష్కారానికి ఆర్బీకేలను కేంద్ర ప్రభుత్వం 2022 మే నెలలో నామినేట్‌ చేసింది.
అర్హత ప్రమాణం:..
రైతు భరోసా పథకం యొక్క ప్రయోజనాలను పొందేందుకు, రైతులు కొన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేయాలి. వీటితొ పాటు రైతు ఆంధ్రప్రదేశ్‌ నివాసి అయి ఉండాలి.రైతుకు సాగు భూమిని కలిగి ఉండాలి.రైతుకు చెల్లుబాటు అయ్యే ఆధార్‌ కార్డు ఉండాలి.
వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకం ప్రయోజనాలు:..
రైతు భరోసా పథకం రైతులకు అనేక ప్రయోజ నాలను అందిస్తుంది, వీటిలో ఇవి ఉన్నాయి ఆర్థిక సహాయం ఒక్కో రైతుకు ఏడాదికి 13,500/-రూ.నీటిపారుదల సౌకర్యాన్ని అందించడానికి ఉచిత బోర్‌వెల్‌ డ్రిల్లింగ్‌.నష్టాలను తగ్గించడానికి పంట బీమా కవరేజీ.వ్యవసాయ కార్యకలా పాలకు మద్దతుగా వడ్డీలేని రుణాలు.కోత అనం తర నష్టాలను నివారించడానికి కోల్డ్‌స్టోరేజీ సౌకర్యాలు. మహిళా స్వయం సహాయక సంఘాల ఏర్పాటు ద్వారా మహిళా రైతులకు మద్దతు. నాణ్యమైన విత్తనాలు మరియు ఎరువులను సబ్సిడీ ధరలకు అందుబాటులో ఉంచడం. హార్టికల్చర్‌ మరియు అనుబంధ కార్యకలాపాలకు పెట్టుబడి మద్దతు.
అమలు ప్రక్రియ..
రైతు భరోసా పథకం విజయవంతంగా అమలు కావడానికి ఈ క్రింది దశలను కలిగి ఉన్న క్రమ బద్ధమైన విధానాన్ని అనుసరించడం అవసరం: గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా అర్హులైన రైతుల గుర్తింపు మరియు ధృవీకరణ. అవసరమైన వివ రాలు మరియు పత్రాలను సేకరించడం ద్వారా పథకంలో రైతుల నమోదు.రైతుల బ్యాంకు ఖాతా ల్లోకి నేరుగా ఆర్థిక సహాయం పంపిణీ. పారద ర్శకత మరియు ప్రభావాన్ని నిర్ధారించడానికి నిరంతర పర్యవేక్షణ మరియు మూల్యాంకనం.
ఆర్థిక సహాయం అందించబడిరది
వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకం కింద అర్హత కలిగిన రైతులకు సంవత్సరానికి 13,500/-రూ.ఆర్థిక సహాయం మూడు విడతలుగా అందజేయగా, మొదటి విడతగా 7,500/-రూ. మరియు రెండవ విడత మొత్తం 4,000/-రూ. మరియు ఖరీఫ్‌,రబీ,యాసంగి సీజన్లలో వరుసగా 2,000/-రూ. రైతుల తక్షణ అవసరాలను తీర్చ డం మరియు వారి వ్యవసాయ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం ఆర్థిక సహాయం లక్ష్యం.
టైమ్‌లైన్‌లు మరియు షెడ్యూల్‌
రైతు భరోసా పథకం రైతులకు సకాలంలో ప్రయో జనాలను అందజేయడానికి చక్కగా నిర్వచించ బడిన కాలక్రమం మరియు షెడ్యూల్‌ను అనుసరి స్తుంది. ఆర్థిక సహాయం మరియు ఇతర సహాయ సేవల పంపిణీ ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం నిర్వహించబడుతుంది, ఇది అధికారిక వెబ్‌సైట్‌లు,నోటిఫికేషన్‌లు మరియు స్థానిక పరి పాలనతో సహా వివిధ మార్గాల ద్వారా రైతులకు తెలియజేయబడుతుంది.
రైతులపై ప్రభావం..
వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకం ఆంధ్రప్రదేశ్‌లోని రైతులపై గణనీయమైన సానుకూల ప్రభావాన్ని చూపింది. ఇది ఆర్థిక స్థిరత్వాన్ని అందించడం, వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడం రైతులకు సాధికారత కల్పించడం ద్వారా సామా జిక-ఆర్థిక పరివర్తనను తీసుకువచ్చింది.ఈ పథకం రైతుల జీవనోపాధిని మెరుగుపరిచింది, గ్రామీణ ప్రాంతాల్లో కష్టాలను తగ్గించింది మరి యు మొత్తం గ్రామీణ అభివృద్ధికి దోహదపడిరది.
టెక్నాలజీ పాత్ర..
వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకాన్ని విజయవంతం గా అమలు చేయడంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుంది. ఇది పథకం యొక్క సమర్థవంతమైన నిర్వహణ మరియు పర్యవేక్షణను సులభతరం చేస్తుంది,పారదర్శకత మరియు జవాబుదారీ తనాన్ని నిర్ధారిస్తుంది. ఆన్‌లైన్‌ పోర్టల్‌లు మరియు మొబైల్‌ అప్లికేషన్‌ల వంటి డిజిటల్‌ ప్లాట్‌ఫార మ్‌ల ఉపయోగం అతుకులు లేని నమోదు, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ మరియు పురోగతిని నిజ-సమయ ట్రాకింగ్‌ని అనుమతిస్తుంది, ఈ పథకాన్ని మరింత ప్రాప్యత మరియు రైతు-స్నేహపూర్వ కంగా చేస్తుంది.
విజయ గాథలు..
రైతు భరోసా పథకం అనేక విజయగాథలను చూసింది, రైతులకు సాధికారత కల్పించడంలో దాని ప్రభావాన్ని ప్రదర్శిస్తుంది. అనేక మంది లబ్ధిదారులు తమ వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోగలిగారు,వారి ఆదాయ వనరు లను విస్తరింపజేసుకున్నారు మరియు మెరుగైన జీవన ప్రమాణాలను కలిగి ఉన్నారు. ఈ విజయ గాథలు ఇతర రైతులకు స్ఫూర్తిగా నిలుస్తాయి మరియు గ్రామీణ వర్గాలపై పథకం యొక్క పరివర్తన ప్రభావాన్ని హైలైట్‌ చేస్తాయి.
ఎదుర్కొన్న సవాళ్లు..
విజయాలు సాధించినప్పటికీ,వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకం కొన్ని సవాళ్లను ఎదుర్కొంటుంది, వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. కొన్ని ప్రధాన సవాళ్లలో ఇవి ఉన్నాయి..
నిజమైన లబ్ధిదారుల గుర్తింపు మరియు ధృవీకరణ.అర్హులైన రైతులందరికీ సమానమైన ప్రయోజనాల పంపిణీని నిర్ధారించడం. మారుమూల మరియు ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాలలో ప్రభావవంతమైన అమలు. దుర్వినియోగం లేదా అవినీతిని నిరోధించడానికి నిరంతర పర్యవేక్షణ మరియు మూల్యాంకనం.
భవిష్యత్తు పరిధి మరియు మెరుగుదలలు..
రైతు భరోసా పథకం భవిష్యత్తులో మెరుగుదలలు మరియు విస్తరణకు అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది.అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందు పరచడం,సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్స హించడం మరియు రైతులకు ఆదాయ వనరు లను వైవిధ్యపరచడం ద్వారా పథకాన్ని బలో పేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టు కుంది. ఈ పథకం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రా మ్‌లను ప్రవేశపెట్టడంతోపాటు అనుబంధ రంగా ల్లో ఉపాధి అవకాశాలను కూడా కల్పించాలని యోచిస్తోంది.
ప్రభుత్వ కార్యక్రమాలు..
వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకాన్ని పూర్తి చేసేం దుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనేక కార్యక్ర మాలను చేపట్టింది.
నిధులను విడుదల..
రైతన్న బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వం తమదని, గత ప్రభుత్వానికి మనందరి ప్రభుత్వానికి మధ్య ఎంత తేడా ఉందనేది ప్రతి రైతన్నా ఆలోచించాలని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. వైయస్సార్‌ రైతు భరోసా- పీఎం కిసాన్‌ కింద వరుసగా ఐదో ఏడాది 2వ విడత పెట్టు బడి సాయాన్ని అందించే కార్యక్రమాన్ని సీఎం జగన్‌ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ప్రారం భించారు. ఈ సందర్బంగా నిర్వహించిన బహి రంగ సభలో సీఎం జగన్‌ రైమాట్లాడుతూ… రాష్ట్రంలోని 53.53లక్షల మంది రైతన్నలకు మంచి జరిగిస్తూ ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్‌ నొక్కి నేరుగా దాదాపు రూ.2,200 కోట్లు జమ చేసే మంచి కార్యక్ర మానికి శ్రీకారం చుడుతున్నామని సీఎం పేర్కొ న్నారు. ఈరోజు రేపటి లోపు మన ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సిన రూ.1,200 కోట్లు నేరుగా ప్రతి రైతన్న ఖాతాలో జమ అవుతుందన్నారు. ఇక పీఎం కిసాన్‌ కింద రావాల్సిన రూ.1,000 కోట్లు వాళ్లు ఇచ్చిన వెంటనే ప్రతి రైతన్న ఖాతాలో జమ అవుతుందన్నారు.
రైతు ప్రభుత్వం మనది..
ఈ 53 నెలల్లోనే రైతుకు, రైతాంగానికి మనందరి ప్రభుత్వం ఎంతగా మద్దతిచ్చిందో అందరికీ తెలిసిందేనని సీఎం జగన్‌ పేర్కొన్నారు. చంద్ర బాబు 14 సంవత్సరాలు సీఎంగా ఉండి కూడా ఎందుకు మీ బిడ్డ జగన్‌ చేసిన పనులను చేయలేక పోయాడో ఆలోచన చేయాలన్నారు.ఈ 53 నెలల కాలంలో 53 లక్షల పైచిలుకు రైతన్నలకు మంచి జరిగిస్తూ, ప్రతి రైతన్నకు నేరుగా బటన్‌ నొక్కి ఖాతాల్లోకి జమచేయడంవల్ల ఒక్కొక్కరికి దాదాపు రూ.65,500 ఇవ్వడం జరిగిందన్నారు. అయిదో విడత కింద రూ. 4వేలను ఒక్కో రైతు ఖాతాల్లో జమచేసేందుకు రూ.2,200 కోట్లు ఇచ్చే కార్యక్ర మానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. కేంద్రంతో సంప్రదించి రూ.1000 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరతానని సీఎం జగన్‌ తెలిపారు. కేవలం రైతు భరోసా పథకం ద్వారానే దాదాపు 53లక్షల పైచిలుకు రైతులకు రూ.33,209 కోట్లు ఆఅయిదేళ్లలోవారి ఖాతాల్లోకి నేరుగా పంప గలిగామన్నారు.
నిరుపేదలకు మంచి చేశాం కాబట్టే ..ప్రజలు వారి గుండెల్లో పెట్టుకున్నారు..
గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు చేపట్టిన సామాజిక సాధికార యాత్రకు స్పందన బాగుందని సీఎం జగన్‌ తెలి పారు. రైతులుగానీ, అవ్వాతాతలుగానీ, అక్కచెల్లె మ్మలుగానీ,చదువుకొనే పిల్లలుగానీ నా ఎస్సీ,నా ఎస్టీ,నా బీసీ,నా మైనార్టీ నా నిరుపేద వర్గాలు గానీ,ఈ వర్గాలకు మంచి చేస్తే,ఇచ్చిన ప్రతి మాటా నిలబెట్టుకుంటే వారెంతగా తమ గుండెల్లో స్థానం ఇస్తారని చెప్పడానికి ఒకవైయస్సార్‌ గారిని చూసినా ఒక జగన్‌ ను చూసినా అర్థం అవుతుం దన్నారు. ఇదే విషయం సామాజిక సాధికార యాత్రలను చూసినా కనిపిస్తోందన్నారు.నా ఎస్సీలను,నాఎస్టీలను,నా బీసీలను, నా మైనార్టీలను నాయకత్వ రోల్‌లోకి తీసుకొచ్చి వాళ్ల చేత మీటిం గులు పెట్టిస్తున్నా తండోపతండాలుగా జనాలు కదిలి వస్తున్నారంటే ఎంతగా ప్రతి పేద వాడి గుండెల్లో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ స్థానం ఉందో నిదర్శనంగా కనిపిస్తోందన్నారు. మీ బిడ్డ జగన్‌ కు ఎంత స్థానం ఉందో చెప్పడానికి ఈ మీటింగులే నిదర్శనమని, ప్రతి అడుగూ రైతన్నకు మంచి జరగాలి, పేద వాడికి మంచి జరగాలి, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీ,లు, నా మైనా ర్టీలు బాగుండాలి, కుటుంబాలు బాగుండాలి, పిల్లలు బాగుండాలి, గొప్పగా చదవాలి, ఎదగా లని ఎంతో తపిస్తూ అడుగులు వేసిన ప్రభుత్వం మనదని సీఎం స్పష్టం చేశారు.
చంద్రబాబుకు మంచి చేయాలనే ఆలోచనలు ఎందుకు రాలేదు?..
గతంలో ఎప్పుడూ జరగని విధంగా, వైయస్సార్‌ రైతు భరోసా ద్వారా ఏటా53లక్షల మంది పైచిలుకు రైతులకు,వారితోపాటు నాఎస్సీ,నా ఎస్టీ, నాబీసీ,నామైనార్టీ రైతులకు,ఆర్వోఎఫ్‌ ఆర్‌ రైతు లకు రూ.13500 చొప్పు న ఇచ్చిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా?14సంవత్స రాలు సీఎంగా ఉండి,మూడుసార్లు ముఖ్యమంత్రి కుర్చీ లో కూర్చుని కూడా రైతులకు మంచి చేయా లనే ఆలోచన చంద్రబాబుబుర్రలో ఎందుకు రాలే దని సీఎం జగన్‌ ప్రశ్నించారు. విత్తనం నుంచి పంట అమ్మకం వరకు ప్రతి రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపించేందుకు 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పగటిపూటే 9 గంటలు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నది మన ప్రభు త్వం మాత్రమేనని,గతంలో పగలూ,రాత్రి రెండు సమయాల్లో కలిపినా కూడా కనీసం 7 గంటలు కూడా వ్యవసాయానికి ఎందుకు కరెంటు ఇవ్వ లేదని సీఎం జగన్‌ ప్రశ్నించారు.వ్యవసాయ ఫీడర్ల సామర్థ్యం పెంచేందుకు 1700కోట్లు ఖర్చు చేశా మన్నారు. పంటల బీమాగా రైతన్న ఒక్క రూపా యి కూడా కట్టకుండా తాను చెల్లించాల్సిన మొత్తం ప్రీమియంను కూడా మనందరి ప్రభుత్వమే చెల్లిస్తూ,రైతన్నకు తోడుగా నిలబడుతున్న పరిస్థి తులు చూస్తున్నామని సీఎం తెలిపారు. 53 నెలల కాలంలో దేవుడి దయతో నాలుగేళ్లలో ఎక్కడా కరువు లేదన్నారు.చంద్రబాబు హయాంలో వరుసగా 5సంవత్సరాలు కరువే కరువు అని ఎద్దేవా చేశారు.
ప్రజలు ఆలోచించాలి.. అబ్దాలను నమ్మవద్దు
స్కిల్‌ డెవపల్‌ మెంట్‌ ఒకస్కామ్‌,ఫైబర్‌ గ్రిడ్‌, మద్యం,ఇసుక ఇంకో స్కామ్‌. రాజధాని భూములు ఇంకో స్కాం ఇలా చంద్రబాబు పేరు చెబతే స్కామ్‌లే గుర్తుకు వస్తాయని, స్కీములు గుర్తుకు రావని సీఎం జగన్‌ పేర్కొన్నారు. రైతన్నకు తోడుగా నిలబడాలి. అలాంటి పరిస్థితుల్లో రైతన్న కు చంద్రబాబు ఏం చేశాడు? చంద్రబాబు అధికా రంలోకి రావడానికి రూ.87,612 కోట్ల వ్యవ సాయ రుణాలు మాఫీ చేస్తానన్నాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. ఆ మాటలు నమ్మి రైతులు ఓటేస్తే అధికారంలోకి వచ్చాడు. రైతులను మోసం చేశాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం వేలం వేసేట్టుగా చేశాడు. రుణాల మాఫీ కథ దేవుడెరుగు.. అప్పటిదాకా ఇస్తున్న సున్నా వడ్డీ పథకాన్ని సైతం నీరుగార్చాడు. ముస్టి వేసినట్లు రూ.15 వేల కోట్లు విదిల్చిన పరిస్థితులు. ఈరోజు మీ బిడ్డ హయాంలో నాలుగు సంవత్సరాల కాలం 53నెలల పాలనలో ఎక్కడాకరువు మండ లంగా డిక్లేర్‌ చేయాల్సిన పరిస్థితి రాలేదు. రాష్ట్రం లో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయాలి.చంద్రబాబుకు అధికారం ఎందుకు కావాలన్నది ఆలోచన చేయాలి. ప్రజలకు, రైతన్నలకు, అక్కచెల్లెమ్మలకు, అవ్వా తాతలకు, చదువుకుంటున్న పిల్లలకు, నిరుద్యో గులకు మంచి చేయడం కోసం కాదు. -జిఎన్‌వి సతీష్‌

ఆహార అభద్రతలో ఆదివాసీలు

ఆహార భద్రత ప్రధాన లక్షణంగా జీవించే స్వయం సమృద్ధ ఆదివాసీ జీవన విధానంలోకి వాణిజ్య పంటలను చొప్పించడం ఎంత వరకు సమంజసం? గిరిజన జీవన శైలిలో అన్నిటికన్నా నాకు నచ్చిన విషయం వారికి డబ్బు సంపాదించాలనే యావ, ఆధునిక సౌకర్యాల పైన మోజు లేకపోవడం. తినడానికి కావలసినంత కష్టపడటం, తర్వాతంతా కావలసినంత తీరిక. రంప చోడవరం ఏజెన్సీలోని కొండరెడ్లేతోనే కాదు, నా పనిలో భాగంగా నల్లమల లోని చెంచు లతో, ఆదిలాబాద్‌ లోని గోండులతో, జార్ఖండ్‌లోని ముండా తెగ వారితో,పశ్చిమ బెంగాల్‌ లోని సంథాల్‌ లతో ఇలా ఎన్నో గిరిజన తెగల వారితో పని చేయడం జరిగింది. ఈ అన్ని ప్రాంతాలలోను నేను గమనించింది ఒకటే. అభివృద్ధి, నాగరికతల పేరుతో జరుగుతున్న గిరిజనుల సంత ృప్తికరమైన, స్వయం సమృద్ధమైన జీవితాల విధ్వంసం. ఆదివాసీ సంస్కృతి పై, వనరులపై జరిగే మరోదాడి పర్యాటకం అనే రూపంలో కూడా కొనసాగడం నేను గమనిం చిన మరొక అంశం. పశ్చిమ బెంగాల్‌ లోని భీర్‌భమ్‌ జిల్లాలోని బోల్‌పూర్‌ (ఇక్కడే రవీంద్రుని శాంతినికేతన్‌, ప్రస్తుత విశ్వ భారతి యూనివర్సిటీ ఉంది) దగ్గర ఒక సంతాల్‌ గిరిజన గ్రామాన్ని గతంలో నేను సందర్శించడం జరిగింది. గిరిజనుల సంస్క ృతి సంప్రదాయాలలోని విభిన్నతను, వైవిధ్యాన్ని నాగరీకులకు తెలియచేయాలనే ఉద్దేశ్యంతోఆ రాష్ట్ర పర్యాటక శాఖ ఆ గ్రామాన్ని రూరల్‌ టూరిజం (గ్రామీణ పర్యాటక) కేంద్రంగా మార్చింది. పర్యాటకులు అక్కడ బస చేసేందుకు కాటేజ్‌ లు నిర్మించి, అక్కడి ఆదివాసీలలో కొందరికి గైడ్లుగా శిక్షణ ఇచ్చి చేతులు దులుపుకుంది. శాంతినికేతన్‌ కు వచ్చే పర్యాటకులు అక్కడికి కేవలం మూడు నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో పచ్చటి అడవిలో ఉన్న ఈ గ్రామంలో విడిది చేయడం, కాలుష్యానికి కల్మషానికి దూరంగా ప్రశాంతంగా ఉన్న ఆ గిరిజన గ్రామాన్ని చెత్త, కాలుష్యంతో నింపేయడం తప్ప ఈ పర్యాటక కేంద్ర హోదా వల్ల ఆ ఆదివాసీలకు ఒరిగిందేమీ లేదు. కొంచెం బియ్యం, కారం దొంగతనం చేశాడనే ఆరోపణపై ఇటీవల కేరళలో కొట్టి చంపబడిన ఆదివాసీ యువకుడు మధు ఉదంతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. ప్రధాన, సామాజిక మీడియాలలో విస్త ృతంగా చర్చించబడ్డ ఈ సంఘటన నిజంగానే ఒక దారుణం. మానవత్వాన్నే ప్రశ్నార్థకంగా మార్చిన దురెటన. ఎవరైతే మధుని కొట్టి చంపారో ఆ గుంపులోని వ్యక్తులే ఆ సంఘటనను చిత్రీకరించి సోషల్‌ మీడియా లో పోస్ట్‌ చేయడంతో ఈ విషయం వెంటనే వెలుగులోకి వచ్చింది కానీ నిజానికి ఈ మధు ఒంటరి వాడు కాదు. ఆదివాసీలపై ఇటువంటి వివక్ష, దాడులు కొత్త కూడా కాదు.కొన్ని సంవత్సరాల క్రితం గిరిజనులకు సంబంధించిన ఒక అధ్యయనంలో భాగంగా సుబ్బారావు గారనే ఒక గిరిజన వైద్యుడితో మాట్లాడటం జరిగింది. రంపచోడవరం ఏజెన్సీలోని ఒక చిన్న గిరిజన గ్రామం ఈయనది. ఆ ఏజెన్సీ లో ప్రతి చెట్టు, ఆకు, కొమ్మ, కాండం అన్నీ ఆయనకు తెలుసు. దేనిలో ఏ ఔషధ విలువలు ఉన్నాయో ఏ చెట్టులో ఏ భాగాన్ని ఎటువంటి వైద్యానికి వాడాలో ఆయనకు వారసత్వంగా వచ్చిన విద్య. అక్కడి కొండ రెడ్ల జీవితం అడవితో ఎలా పెనవేసుకుని ఉంటుందో ఎంతో చక్కగా వివరించారాయన. కలపేతర అటవీ ఉత్పత్తులను సేకరించి వాటిని దగ్గరలో ఉన్న వారపు సంతలో అమ్ముకోవడం, ఉన్న కొద్దిపాటి కొండ పోడు లో వ్యవసాయం చేసుకోవడం అక్కడి గిరిజనుల ప్రధాన జీవనోపాధులు. ఒక ఎకరం కొండ పోడు ఉంటే వరి, కొర్రలు, ఆవాలు, కందులు ఇలాంటివి పదకొండు రకాల పంటలు ఒక ఏడాదిలో పండిస్తారని చెప్పారాయన. ఆ పంటలు, అడవిలో దొరికే పండ్లు, కాయలతో వారికి ఆహార భద్రతకి లోటు ఉండదు అని ఆయన చెబుతుండగానే పెద్ద శబ్దం చేస్తూ రెండు లారీలు కొండవైపుకి వెళ్లడం చూశాం. వాటి నిండా యేవో మొక్కలు ఉన్నట్లు కనపడి అవి ఏమిటి అని అడిగాను ఆయనను. కాఫీ మొక్కలు అని చెప్పారాయన. మా గిరిజనులకు వ్యవసాయం చేయడం తెలియక ఎక్కువ లాభాలు పొందలేక పోతున్నామని మా కొండ పోడు లో ఈ కాఫీ మొక్కలు పెడతారట గవర్నమెంట్‌ వాళ్ళు. వీటితో మాకు లాభాలు బాగా వస్తాయని చెబుతున్నారు అన్నారు ఆయన. మరి మీ ఆహార పంటలు ఏమవుతాయి, అవి లేకపోతే మీరేమి తింటారు? అంటే మీ అందరి లాగా మార్కెట్‌లో కొనుక్కోవాలి ఇక అన్నారు సుబ్బారావు గారు నిట్టూరుస్తూ. ఆహార భద్రత ప్రధాన లక్షణంగా జీవించే స్వయం సమ ృద్ధ జీవన విధానంలోకి వాణిజ్య పంటలను చొప్పించడం ఎంత వరకు సమంజసం అనుకుంటూ తిరిగి వచ్చాను ఆ ఊరి నుండి నేను. వారి జీవన విధానంలో అన్నిటికన్నా నాకు నచ్చిన విషయం వారికి డబ్బు సంపాదించాలనే యావ లేదు. ఆధునిక సౌకర్యాల పైన మోజు లేదు. తినడానికి కావలసినంత కష్టపడటం,తర్వాతంతా కావలసినంత తీరిక.ఈ రంపచోడవరం ఏజెన్సీలోని కొండరెడ్లేతోనే కాదు, నా పనిలో భాగంగా నల్లమల లోని చెంచులతో, ఆదిలా బాద్‌ లోని గోండులతో, జార్ఖాండ్‌లోని ముండా తెగ వారితో, పశ్చిమ బెంగాల్‌ లోని సంథాల్‌ లతో ఇలా ఎన్నో గిరిజన తెగల వారితో పని చేయడం జరిగింది. ఈ అన్ని ప్రాంతాలలోను నేను గమనించింది ఒకటే. అభివృద్ధి, నాగరికతల పేరుతో జరుగుతున్న గిరిజనుల సంత ృప్తికరమైన, స్వయం సమ ృద్ధమైన జీవితాల విధ్వంసం.2001 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో 8.10 శాతం ఆదివాసీలు. వీరి ఆవాసాలు అడవులు, కొండ ప్రాంతాలే. పోడు వ్యవసాయం, కలపేతర అటవీ ఉత్పత్తుల సేకరణ వీరి ప్రధాన వృత్తులు. స్వయం సమ ృద్ధ జీవన విధానం, ప్రత్యేకమైన సంస్కృతి సంప్రదాయాలు, తమవైన కట్టుబాట్లు ఆచారాలతో దేశంలోని అనేక గిరిజన తెగలు నాగరిక సమాజానికి దూరంగా జీవనం సాగిస్తున్నారు. వీరి ఆవాసాలు ఉండే ప్రాంతాలు మౌలిక సదుపాయాల కల్పనకు అనుకూలంగా లేకపోవడం, ఆసౌకర్యాల గురించి గట్టిగా ప్రశ్నించే గొంతు గిరిజనులకు కొరవడడంతో ఈనాటికీ అనేక ఆదివాసీ గ్రామాలు త్రాగునీరు, విద్యుత్తు, రవాణా సదుపాయాలు వంటి కనీస మౌలిక వసతులు కూడా కరవై అభివ ృద్ధికి ఆమడ దూరంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇక విద్య, వైద్యం వంటి సదుపాయాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆ మధ్య ఒడిస్సా లో ఒక గిరిజనుడు అంబులెన్సు సదుపాయం అందుబాటులో లేక పక్కన వెక్కి వెక్కి ఏడుస్తున్న కూతురు వెంటరాగా తన భార్య శవాన్ని భుజాన వేసుకుని మైళ్ళ కొద్దీ నడిచిన సంఘటన ప్రతి ఒక్కరికీ బాధ కలిగించింది. ఇక విద్యా సదుపాయాల విషయానికి వస్తే చాలా వరకు గిరిజన గ్రామాలలో పాఠశాలలే లేవు. ఉన్నా వాటిపై పర్యవేక్షణా లోపంతో ఉపాధ్యాయుల లో జవాబుదారీతనం లేదు. ఒకవేళ మంచి టీచర్లు ఉండి బోధన జరిగినా తమ జీవన విధానానికి ఏ మాత్రం సంబం ధంలేని పాఠ్యాంశాలు ఆ గిరిజన బాల బాలికలను అయోమయానికి గురి చేయడం తప్ప వారికి అవసరమైన విద్య, పరిజ్ఞానాన్ని అందివ్వలేకపోతున్నాయి. గిరిజనుల మరొక ప్రధాన సమస్య భూమిపై హక్కు. వ్యవసాయం చేసుకునే భూమిపై పట్టా లేకపోవడం కొందరి సమస్య అయితే భూ రికార్డుల నిర్వహణలో అవకతవకలు, వాటికి తోడు గిరిజనుల పేదరికం, నిరక్షరాస్యతల వల్ల వారి భూములు చాలా వరకు స్వార్ధపరులైన నాగరీకుల చేతులలోకి వెళ్లిపోయాయి. మన తెలంగాణా చరిత్రను ఒక్క సారి చూస్తే 1940లలో ఆదిలాబాద్‌ జిల్లాలో కొమరం భీం నాయక త్వాన గోండు తెగకు చెందిన గిరిజనులు జరిపిన పోరాటం తమ భూమికోసమేఆ భూమిపై హక్కు కోసమే. బ్రిటిష్‌ కాలంలో మెరుగుపడిన రవాణా వ్యవస్థ గిరిజనులు మైదాన ప్రాంతాలకు ప్రయాణించేందుకు వెసులుబాటు కల్పించినదానికన్నా నాగరీకులు గిరిజన ప్రాంతాలలోకి చొరబడి వారి భూములు, వనరులు లాక్కునేందుకు ఎక్కువ అవకాశం కల్పించింది. దీనితో ఆ ఆదివాసీలు ఎదురు తిరిగి తమ భూమి కోసం ఉద్యమం చేసినప్పటికీ భూ రికార్డులు సరిగా లేకపోవడంతో ఆ భూములు తమవే అని నిరూపించుకోలేక తరతరాలుగా సాగుచేసుకుంటున్న భూమిని కోల్పోవాల్సి వచ్చింది. 1946-51 మధ్య వచ్చిన తెలంగాణా సాయుధ పోరాటం, పశ్చిమ బెంగాల్‌ లో మొదలై ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాలకు విస్తరించిన నక్సల్బరీ ఉద్యమం, 1980లో ఇంద్రవెల్లి తిరుగుబాటు అన్నీ భూ పోరాటాల చరిత్రలే. 1990లలో వచ్చిన పీసా (ూజుూA- ూaఅషష్ట్రaవa్‌ జుఞ్‌వఅంఱశీఅ ్‌శీ ూషష్ట్రవసబశ్రీవస Aతీవaం),2006 నాటి అటవీ హక్కుల చట్టం వంటి బలమైన శాసనాలు కూడా అమలులో చిత్తశుద్ధి లోపం, ఆదివాసీల అవగాహనా రాహిత్యంవల్ల ఎందుకూ కొరగానివిగా అయి పోయాయి. నిజానికి అత్యధిక శాతం ఆదివాసీలకు వారి సంక్షేమం కోసం రూపొందించబడిన ఎన్నో పథకాల పేర్లు కూడా తెలియవు. భారత దేశంలోని గిరిజనుల జీవితాలపై విస్త ృతంగా అధ్యయనం చేసిన హేమాండార్‌ా అనే సామాజిక శాస్త్రవేత్త ప్రకారం మైదాన ప్రాంతాల నుండి వలస వెళ్లిన నాగరీకులు గిరిజనులకు మద్యం, డ్రగ్స్‌ (మత్తుమందులు) అలవాటు చేసి వారి భూములను, విలువైన వనరులను దోచుకోవడం మొదలు పెట్టారు. రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో దీనిని నేను స్వయంగా చూశాను. అక్కడి గిరిజనులు వారమంతా అడవిలో తిరిగి గమ్‌ కరయా, కరక్కాయ, తిప్పతీగ (దీనిని మలేరియా తీగ అని పిలుస్తారు), తేనె వంటి కలపేతర అటవీ ఉత్పత్తులను సేకరించి అడ్డతీగల వారపు సంతలో అమ్ముకుని వారికి కావాల్సిన ఉప్పు, పప్పులను కొనుక్కుని వారి వారి గ్రామాలకు తిరిగి వెళతారు. ఈ సంతలో ఒకరోజు గడిపిన మాకు బయట మార్కెట్‌ లో దాదాపు కిలో రెండువేల ఖరీదు చేసే గమ్‌ కరయా (దీనిని ఫార్మా పరిశ్రమలో ఎక్కువగా వినియోగిస్తారు)ను సారాదుకాణం లో ఇచ్చి ఒక సీసా చీప్‌ లిక్కర్‌ తీసుకుని తాగుతున్న గిరిజన దంపతులను చూసి బాధ కలిగింది. ఆ గిరిజ నుల బలహీనతలను, అమాయకత్వాన్ని తమ దోపిడీకి వాడుకునే నాగరీకులను నిజంగా నాగరీకులు అనవచ్చా అనే సందేహం కలిగింది. తేనె, కరక్కాయ, ఉసిరి, కుంకుడుకాయలు ఇలా ఏ అటవీ ఉత్పత్తి తీసుకున్నా మార్కెట్‌ ధరలో ఆ గిరిజనులకు దక్కేది రూపాయలో పది పైసలు మాత్రమే. వారు ఎంతో శ్రమపడి తెచ్చిన ఉత్పత్తులను ఇంత తక్కువ ధరకు తీసుకోవడం అన్యాయం కదా అని దళారీని అడిగితే ’వాళ్ళకి అడవిలో ఉచితంగా దొరికే వాటికి ఈ మాత్రం ఇవ్వడమే ఎక్కువ’ అనేశారాయన. అవి సేకరించేందుకు వారు ఖర్చు పెట్టిన సమయం, శ్రమ, తీసుకున్న రిస్క్‌ లకు ఏ మాత్రం విలువ లేదు వారి ద ృష్టిలో. తాడుకట్టుకుని కొండ అంచునుండి తలకిం దులుగా వేలాడుతూ కొద్దిపాటి కొండ తేనె సేకరించేందుకు ఒక గిరిజనుడు తన ప్రాణాలనే రిస్క్‌ చేస్తుంటాడు. కానీ మన ద ృష్టిలో అది ఉచితంగా దొరికే పదార్ధం. ఇలా వారి భూములు, వనరులు కారు చౌకగా లేదా ఉచితంగా నాగరీకులు దోచుకుని ఆదివాసీ లను నిరుపేదలుగా, నిస్సహాయులుగా మారు స్తున్నారు. ఇక దేశంలో పెద్ద ఎత్తున ఏ అభివ ృద్ధి ప్రాజెక్ట్‌ లు చేపట్టినా అందులో ప్రధానం గా నిర్వాసితులయ్యేది గిరిజనులే. భారీ నీటి పారుదల ప్రాజెక్ట్‌ లు, గనుల తవ్వకాలు, పారిశ్రామిక అభివ ృద్ధి ఇలా ఏది చేపట్టినా నిర్వాసితులయ్యే జనాభాలో దాదాపు మూడిర ట ఒకటో వంతు గిరిజనులే ఉంటున్నా రని అనేక అధ్యయనాలలో వెల్లడయింది. ఛత్తీస్‌ గఢ్‌, జార్ఖండ్‌్‌ వంటి రాష్ట్రాలలో వేళ్ళూను కునిపోయిన నక్సల్‌ ఉద్య మం కూడా ఆదివా సీల జీవితాలను అతలా కుతలం చేసింది. తమపై జరుగుతున్న దోపిడీ, దౌర్జన్యాలకు ఆగ్రహించిన కొంత మంది ఆదివాసీలు నక్సల్‌ ఉద్యమాన్ని బలంగా సమర్ధించి దానికి తోడ్పాటు నందించగా ఆ ఉద్యమాలను అణచివేసేందుకు ప్రభుత్వాలు, కాపాడుకు నేందుకు నక్సలైట్‌లు పరస్పరం తలపడడంతో జరుగుతున్న ఘర్షణలో నలిగిపోతున్నది కూడా ఆదివాసీలే. అందుకే పెద్దఎత్తున ఆ ప్రాంతా లలోని ఆదివాసీలు తమ ఆవాసాలను వదిలి మన తెలంగాణాలోని భద్రాచలం చుట్టుపక్కల ప్రాంతాలలో కూలి నాలీ చేసుకుంటూ బతకడం మొదలుపెట్టారు. ఆదివాసీ సంస్క ృతి పై, వనరులపై జరిగే మరోదాడి పర్యాటకం అనే రూపంలో కూడా కొన సాగడం నేను గమనించిన మరొక అంశం. పశ్చిమ బెంగాల్‌ లోని భీర్‌భమ్‌ జిల్లాలోని బోల్‌పూర్‌ (ఇక్కడే రవీంద్రుని శాంతినికేతన్‌, ప్రస్తుత విశ్వ భారతి యూనివర్సిటీ ఉంది) దగ్గర ఒక సంతాల్‌ గిరిజన గ్రామాన్ని గతంలో నేను సందర్శించడం జరిగింది. గిరిజనుల సంస్క ృతి సంప్రదాయాలలోని విభిన్నతను, వైవిధ్యాన్ని నాగరీకులకు తెలియచేయాలనే ఉద్దేశ్యంతో ఆ రాష్ట్ర పర్యాటక శాఖ ఆ గ్రామాన్ని రూరల్‌ టూరిజం (గ్రామీణ పర్యాటక) కేంద్రంగా మార్చింది. పర్యాటకులు అక్కడ బస చేసేందుకు కాటేజ్‌ లు నిర్మించి, అక్కడి ఆదివాసీలలో కొందరికి గైడ్లుగా శిక్షణ ఇచ్చి చేతులు దులుపుకుంది. శాంతినికేతన్‌ కు వచ్చే పర్యాటకులు అక్కడికి కేవలం మూడు నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో పచ్చటి అడవిలో ఉన్న ఈ గ్రామంలో విడిది చేయడం, కాలుష్యానికి కల్మషానికి దూరంగా ప్రశాంతంగా ఉన్న ఆ గిరిజన గ్రామాన్ని చెత్త, కాలుష్యంతో నింపేయడం తప్ప ఈ పర్యాటక కేంద్ర హోదా వల్ల ఆ ఆదివాసీలకు ఒరిగిందేమీ లేదు. తెలంగాణ రాష్ట్రంలోని ఉట్నూర్‌, ఏటూరు నాగారం, భద్రాచలం. ఈ మూడు ఏజెన్సీ ప్రాంతాలలోని గిరిజనులదీ ఇదే పరిస్థితి. ఎప్పుడో 1970ల లోనే హేమాండార్‌ ఉట్నూర్‌ ప్రాంతాన్ని సందర్శించి మహారాష్ట్ర నుండి, గుజరాత్‌ నుండి వచ్చిన గిరిజనేతరులు ఆ ప్రాంతంలో బలమైన వర్గంగా మారడం గమనించారు. ఏదో కొద్ది మంది గుజరాతీలు చిన్న పాటి దుకాణాలు, వడ్డీ వ్యాపారం వంటి వ ృత్తులలో స్థిరపడగా చాలా వరకు ఈ వలస దారులు అక్కడి గిరిజనుల భూములను ఆక్రమించుకుని వారిని వారి స్వంత ప్రాంతంలోనే ఒక మైనారిటీ వర్గంగా మార్చేయడం జరిగింది. గిరిజనుల భూములు, వనరులపై జరుగుతున్న దోపిడీ మాత్రమే ఇదంతా. ఇక నిస్సహాయులైన, అమాయకులైన గిరిజన స్త్రీలపై జరిగే అక ృత్యాల గురించి రాయాలంటే పేజీలు సరిపోవు. ఒక్కసారి వాకపల్లి ఉదంతం గుర్తు చేసుకుంటే చాలు, దుఃఖం పొంగుకొస్తుంది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌, ఒడిశా,చత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌ ఇలా ఏ ప్రాంతం తీసుకున్నా గిరిజనుల ప్రాంతాలను ఆక్రమించి, వారి సంస్క ృతి సంప్రదాయాలను విచ్చిన్నం చేసి, వారికి జీవనోపాధి లేకుండా చేసి వారిని బలహీనులుగా, నిస్సహాయులుగా మార్చినది నాగరీకులం అని చెప్పుకునే మనవంటి వారి స్వార్ధం, క్రూరత్వమే. అప్పుడప్పుడు బయట పడే మధు లాంటి వారి ఉదంతాలు మన నాగరికత విక ృత రూపాన్ని బయట పెడుతున్నాయి. మనం సామూ హికంగా సిగ్గుపడాల్సిన సందరాÄలేలో అది ఒకటి మాత్రమే.-(జి.ఎ.సునీల్‌ కుమార్‌)

మహిళల శ్రమకు కొలమానం ఏదీ?

జాతీయ సమయ వినియోగ సర్వే’ ప్రకారం 81.2 శాతం మహిళలు ఎటువంటి చెల్లింపు లేని ఇంటి చాకిరిలో నిమగమై ఉన్నారు. అదే పురుషుల విషయానికి వచ్చేసరికి 26.1 శాతం మాత్రమే అటువంటి పనిలో వున్నారు. పురుషులు వారానికి సగటున 42 గంటల పాటు సాంప్రదాయకంగా ఆర్థిక కార్యకలా పంగా పరిగణించే ఉత్పత్తి పనుల్లో పాల్గొంటారు. స్త్రీలు 19 గంటలు పాల్గొం టున్నారు. అయినప్పటికీ మహిళలు గృహ నిర్వహణ, పిల్లలు-వృద్ధుల సంరక్షణ, కుటుం బంలో జబ్బు పడిన వారి కోసం 34.6 గంటలు వెచ్చిస్తారు. పురుషులు ఈ విధమైన పనులకు వెచ్చించేది 3.6 గంటలు. అంటే స్త్రీలు పురుషుల కంటే 10 రెట్లు ఎక్కువగా కుటుంబ నిర్వహణ పనులలో వుంటారన్న మాట. నేడు భారతదేశంలో మహిళా కార్మిక భాగస్వామ్య రేటు…ప్రభుత్వ గణాంకాల ప్రకారం 32.8శాతం వుండగా, ప్రపంచ బ్యాంకు ప్రకారం 24శాతం వుంది. అదే చైనాలో 61శాతం,బంగ్లాదేశ్‌లో 38శాతం, నేపాల్‌లో 29శాతం,పాకిస్తాన్‌లో 25శాతం వుంది. మహిళా సాధికారతను కల్పించేందుకు శ్రమలో స్త్రీల వాటా పెంచాలని భారత్‌ భావించినట్లయితే…మహిళల పనికి సంబంధించిన అపోహలు తొలగిపోవాలి. స్త్రీల పనిని సముచితంగా లెక్కించాలి. వారు శ్రమ చేయడానికి మద్దతు ఇవ్వాలి.
తల్లిదండ్రులు ఇంటి బయట పని చేస్తున్నప్పుడు వారి బిడ్డల ఆలనాపాలనా చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలనేది విశ్వవ్యాప్తంగా అంగీకరించిన సత్యం. భారతదేశంలోని కుటుంబ నిర్మాణాలు చారిత్రాత్మకంగా తరచూ ఈ అవసరాన్ని పూరించాయి. తండ్రులు ఇంటి వెలుపల పని చేస్తారు. పిల్లలు, పెద్దల సంరక్షణ పనులను తల్లులు చేస్తారు. అయితే, ఈ విధమైన కుటుంబ నిర్మాణం…పెరుగుతున్న భారత దేశ ఆశయాలకు అనుకూలంగా లేదు. దేశం 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగా లంటే, మహిళల భాగస్వామ్యం వుండాలి. అందుకు రెండు ప్రత్యేక మార్గాలు ఉన్నాయి: మహిళల పని (తరచుగా పిల్లలు, పెద్దల సంరక్షణ పని)ని సక్రమంగా విలువ కట్టాలి. ఇంటి బయట ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనడానికి మహిళలకు తగిన మద్దతు ఇవ్వాలి. మహిళలందరూ పని చేస్తారు. కానీ వారందరికీ జీతం అందదు. 2023 నోబెల్‌ గ్రహీత, ఆర్థికవేత్త క్లాడియా గోల్డిన్‌ అమెరికా చరిత్రపై చేసిన కృషి ఈ అంశాన్నే తెలియ చేస్తుంది. నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌ 2020లో విడుదల చేసిన భారతదేశపు మొట్టమొదటి ‘జాతీయ సమయ వినియోగ సర్వే’ ప్రకారం 81.2 శాతం మహిళలు ఎటువంటి చెల్లింపు లేని ఇంటి చాకిరిలో నిమగమై ఉన్నారు. అదే పురుషుల విషయానికి వచ్చేసరికి 26.1 శాతం మాత్రమే అటువంటి పనిలో వున్నారు. పురుషులు వారానికి సగటున 42 గంటల పాటు సాంప్రదాయకంగా ఆర్థిక కార్యకలాపంగా పరిగణించే ఉత్పత్తి పనుల్లో పాల్గొంటారు. స్త్రీలు 19 గంటలు పాల్గొంటున్నారు. అయినప్పటికీ మహిళలు…గృహ నిర్వహణ, పిల్లలు-వృద్ధుల సంరక్షణ, కుటుంబంలో జబ్బు పడిన వారి కోసం 34.6 గంటలు వెచ్చిస్తారు. పురుషులు ఈ విధమైన పనులకు వెచ్చించేది 3.6 గంటలు. అంటే స్త్రీలు పురుషుల కంటే 10 రెట్లు ఎక్కువగా కుటుంబ నిర్వహణ పనులలో వుంటారన్నమాట. దీనికి రెండు ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి- శ్రామిక మహిళలు భయంకరమైన ‘’రెట్టింపు భారాన్ని’’ ఎదుర్కొంటారు. ఇక్కడ ఇంటి బయట పని చేయడం, కుటుంబ ఆదాయానికి తోడ్పడడం వల్ల వారి ఇంటి చాకిరి ఏమీ తగ్గదు. రెండు-పిల్లలు, వృద్ధుల సంరక్షణకు వారు చేసే పనులేవీ ఆర్థిక కార్యకలాపాలుగా లెక్కించబడవు. ఈ పనులతో అలసిపోయిన మహిళలకు పురుషులతో పోల్చుకుంటే వారంలో అతి తక్కువ విశ్రాంతి సమయమే మిగులుతుంది. ఎస్‌బిఐ నివేదిక ప్రకారం ఎటువంటి చెల్లింపు లేకుండా మహిళలు చేస్తున్న పని ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నది. ఇది జిడిపిలో 7.5 శాతానికి బాధ్యత వహిస్తుంది. మరో మాటలో చెప్పా లంటే, మహిళలు ఇంటి పని భారాన్ని మోయడమే కాకుండా, ఈ ప్రక్రియలో వారు జిడిపిని కూడా పెంచుతారు. అయినా అధికారిక రికార్డుల ప్రకారం వారు పనిచేయనట్టే లెక్క.మహిళలు చేసే శ్రమను లెక్కించే విధానాన్ని ప్రభుత్వాలు మార్చు కోవాలి. అంతర్జాతీయంగా నిర్వచించబడిన ‘జాతీయ ఖాతాల వ్యవస్థ’ ప్రమాణాలలో మార్పు కోసం భారతదేశం పిలుపు ఇవ్వ వచ్చు. ఆ కృషికి నాయకత్వం వహించవచ్చు. తద్వారా జిడిపి గణన నుండి జనాభా గణనకు ఉద్దేశించబడిన ప్రశ్నాపత్రాలన్నింటిలో మార్పులు, చేర్పులు చేయవచ్చు. లెక్కించనప్పుడు మహిళల చాకిరీ కనిపించదు. దీని ప్రభావం కార్మిక, ఉపాధి విధానాలపై ఉంటుంది. శ్రమ లెక్కల్లో కనిపించకపోవడంతో ఇంటి చాకిరి చేసే వీరు ‘’రక్షిత కార్మిక చట్టాల పరిధి వెలుపలే’’ వుండిపోతారు. అంతేగాక ఇది పనిదినాన్ని పరిమితం చేస్తుంది. కార్మిక పరిస్థితులను నియంత్రిస్తుంది. భారతదేశంలో స్త్రీలు పురుషుల కంటే రోజుకు 1.5 గంటలు ఎక్కువ పని చేస్తారు. అది కూడా ఏ విధమైన జీతం లేకుండా, అపరిశుభ్రమైన పరిస్థితుల్లో పని చేస్తారు.
ఈ అంశానికి మరొక కోణం ఉంది. అదే-ఇంటి వెలుపల పని చేసే మహిళలకు మద్దతు ఇవ్వడం. తక్కువ-ఆదాయ కుటుంబాలలో, ఒక్కరే ఆదాయ వనరుగా వుండడమనేది అసంభవం. తల్లిదండ్రులు ఇద్దరూ పని చేయాల్సి ఉంటుంది. అంటే, డబ్బు సంపాదిం చేవారికి, కుటుంబ సంరక్షణ చూసే వారికి ఇప్పటి వరకు వున్న నమూనా విచ్ఛిన్నం కావడం ప్రారంభమవుతుంది. తక్కువ ఆదాయ మహిళలు మనం ఊహించన దానికంటే ఎక్కువగా ఎవరి మద్దతు లేకుండానే పని చేస్తున్నారు. అయితే ఈ పనిలో కనిపించే అస్థిరత కారణంగా వీరి శ్రమ గణాంకాల్లో ప్రతిబింబించదు. మహి ళల పని కాలానుగుణంగా వుంటుంది. చెదురుమదురుగాను, క్రమరహితంగా కూడా వుంటుంది. వీరు తరచుగా ఇంట్లోంచే కుటుంబ వ్యాపారాలకు తోడ్పాటునందిస్తారు. నాలుగు నెలల వ్యవధిని పరిగణనలోకి తీసుకున్నప్పుడు దాదాపు 44 శాతం మహిళలు శ్రామిక శక్తిలో భాగంగా వున్నారని ఒక అధ్యయనం వెల్లడిరచింది. అయితే దానికి కొనసాగింపుగా నాలుగు సంవత్సరాల వ్యవధిని పరిగణనలోకి తీసుకున్నప్పుడు కేవలం 2 శాతం మహిళలు మాత్రమే లెక్కల్లో వున్నారు. ఇంటి బాధ్యతలు వారిని సాధారణ ఉద్యోగం నుండి దూరంగా ఉంచు తాయి. వారు పని చేసినప్పుడు సాధారణంగా పిల్లలు వెంటే వుంటారు. నిర్మాణ ప్రదేశాలలో ప్రమాదకరమైన పరికరాలు, అధిక కాలుష్యం నీడలో పిల్లలు ఆడుతున్నారని 2013లో హార్వర్డ్‌ పరిశోధకులు వివరించారు. ఇది మెదడు అభివృద్ధికి అత్యంత కీలకమైన వయస్సులో (మూడేళ్ల లోపు) వారి జీవితా లను, ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుంది. విద్య, ఆరోగ్యం, నైపుణ్యం కోసం ఉద్దేశించిన అన్ని తదుపరి ప్రయత్నాలు, ప్రజా నిధులు బలహీనమైన పునాదిపైనే నిర్మితమయ్యాయి. పిల్లల కోసం ప్రభుత్వం ఇప్పటికే ప్రపం చంలోకెల్లా అతి పెద్ద ప్రజా వ్యవస్థ-అంగన్‌వాడీ వ్యవస్థను నడుపుతోంది. 14 లక్షల అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఆరు సంవత్సరాలలోపు 8 కోట్ల మంది పిల్లలకు ఈ సేవలు అందుతాయి. అయినప్పటికీ, ఈ కేంద్రాలు ఉదయం 9నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయి. కాబట్టి, మహిళలు పూర్తిగా ఎనిమిది గంటల పని చేయాలంటే వారికి అదనంగా సంరక్షణ కేంద్రాలు అందుబాటులో వుండడం అవసరం. వేగంగా పట్టణీకరణ చెందుతున్న భారతదేశంలో మహిళలు శ్రమ చేసేందుకు వీలుగా వీరికి పలు సౌకర్యాలు కల్పించాలి. క్రెచ్‌లు ఒక పరిష్కారాన్ని అందిస్తాయి. 2020 నాటికి ‘జాతీయ క్రెచ్‌ పథకం’ దేశవ్యాప్తంగా దాదాపు 6,500 క్రెచ్‌లను నిర్వహిస్తోంది. తల్లులు ఒక స్థిరమైన వృత్తిని/ఉద్యోగాన్ని ఎంచుకుని పని చేయడానికి ఈ క్రెచ్‌లు సహాయ పడతాయి. అలాగే పిల్లలు సురక్షి తంగా, ఆరోగ్యకరంగా ఎదిగే వాతావరణాన్ని అందిస్తాయి. ప్రైవేట్‌ రంగం ఈ అవసరాన్ని గుర్తించి అధిక-ఆదాయ కుటుంబాలకు ఈ సేవలను అందిస్తుంది. పిల్లల సంరక్షణ/ప్రీస్కూల్‌ అనేది రూ.31,256 కోట్ల పరిశ్రమ. 2028 నాటికి వార్షిక రాబడి (సిఎజిఆర్‌) 11.2 శాతం వరకు వృద్ధి చెందుతుందని అంచనా. కాబట్టి ఆదాయ అసమానతను అధిగమించడానికి, అందరికీ నాణ్యత కల్గిన బాలల సంరక్షణ సేవలు అందిం చడానికి…ప్రభుత్వ రంగం ఇప్పటికే మొదలెట్టిన ప్రయత్నాలను వేగవంతం చేయాల్సి వుంది. నేడు భారతదేశంలో మహిళా కార్మిక భాగస్వామ్య రేటు…ప్రభుత్వ గణాంకాల ప్రకారం 32.8 శాతం వుండగా, ప్రపంచ బ్యాంకు ప్రకారం 24 శాతం వుంది. అదే చైనాలో 61 శాతం, బంగ్లాదేశ్‌లో 38 శాతం, నేపాల్‌లో 29శాతం, పాకిస్తాన్‌లో 25 శాతం వుంది. మహిళా సాధికారతను కల్పించేందుకు శ్రమలో స్త్రీల వాటా పెంచా లని భారత్‌ భావించినట్లయితే…మహిళల పనికి సంబంధించిన అపోహలు తొలగిపోవాలి. స్త్రీల పనిని సముచితంగా లెక్కించాలి. వారు శ్రమ చేయడానికి మద్దతు ఇవ్వాలి.
భారత్‌లో మహిళల స్థితిగతులు చట్టాలు
భారతీయ సమాజం మహిళను ఆకాశంలో సగం అన్నట్లుగా పురుషునితో సమానంగా వర్ణించింది. కానీ ఆచరణలో మహిళపై అడుగడుగునా ఆంక్షలు విధించింది. మహి ళను అనాదిగా ఇంటికే పరిమితం చేసి అబలగా చిత్రించింది. నేటి ఆధునిక కాలంలో కూడా ఆ వివక్ష కొనసాగుతూనే ఉంది. ఇంత సామాజిక నిర్భందంలోనూ ఎంతోమంది మహిళా మేధావులు తమ ఉనికిని గొప్పగా చాటారు. పురుషునితో పోల్చితే మహిళ ఎందులోనూ తక్కువ కాదని నిరూపించారు. కానీ పురుషాధిక్య సమాజంలో అంత త్వరగా మార్పు లేదు. గృహ హింస, దాడులు, అణచివేత కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితి నుంచి మహిళకు చట్టపరమైన రక్షణ కల్పించేందుకు ప్రభుత్వాలు అనేక చట్టాలు చేశాయి. లింగపరమైన స్తరీకరణ: మానవ సమాజం మొదటగా స్త్రీలు, పురుషులు అని స్తరీకరిం చబడిరది. అందుకే ఇయాన్‌ రాబర్ట్‌సన్‌ కులాలు, వర్గాలు, వర్ణాల కంటే ముందు మగవారికి ఉన్నత స్థానాన్ని, స్త్రీలకు సమాజంలో రెండో స్థానం ఇచ్చారని గమనించవచ్చు.
ా ఈ లింగపరమైన స్తరీకరణ ఒక తరం నుంచి మరొక తరానికి సంస్కృతిలో భాగంగా అందించబడుతుంది.
ా ఇందులో ప్రధాన కారణాలు లింగ పరమైన పాక్షిక అభిప్రాయాలుస్మెల్‌సర్‌ అభిప్రాయంలో
ా జైవికపరమైన తేడాలు
ా లింగపరమైన గుర్తింపు
ా లింగపరమైన ఆదర్శాలు
ా లింగపరమైన పాత్రలు పాటించడాన్ని బట్టి లింగపరమైన స్తరీకరణ చోటు చేసుకున్నదని అభిప్రాయపడ్డారు. లింగపరమైన శ్రమ విభజన
సమాజంలో పురుషులు మాత్రమే చేయాల్సిన పనులని, స్త్రీలు మాత్రమే చేయాల్సిన పనులని, లింగం ఆధారంగా సామాజిక పాత్రలు, బాధ్యతలు విభజించడం. తక్కువ శ్రమ, తక్కువ విలువ, గృహసంబధ శ్రమను స్త్రీలకు ఆపాదించి సమాజంలో రెండో స్థానం పొందటానికి కారణమైంది. రిచర్డ్‌ ఫ్లెక్స్‌నర్‌ ప్రకారం లింగతత్వం అంటే ఒక లింగం వారికంటే మరొక లింగంవారు అధికమయ్యే టువంటి పాక్షిక భావనలు, గుడ్డి నమ్మకాలు, విచక్షణ పూరిత వైకరులు. లైంగికత, లింగంఅనేవి వేర్వేరు అంశాలు, లైంగికత అనేది ఎటువంటి సామాజిక, చారిత్రక పరిస్థితుల్లోనైనా మార్పు చెందదు. దానికి సంబంధించి నిర్వహించే పాత్రలు మారవు. కానీ ఆధారంగా ఆయా స్త్రీ, పురుషులు అనుసరించాల్సిన సామాజిక, సాంస్కృతిక పాత్రలను తెలుపుతుంది.స్త్రీవాదులు స్త్రీలంటే భయంమిసోగని అంటే స్త్రీల పట్ల తగని ద్వేషంఫిలోగని అంటే పురుషుల పట్ల తగని ద్వేషం భారతీయ సమాజంలో స్త్రీల స్థానంవేదకాలంలో స్త్రీ-పురుషుల మధ్య అసమా నతలు లేవుస్త్రీల పట్ల విభిన్న వైఖరిని ప్రదర్శించినవాడు మనువు స్త్రీలకు విద్య అవకాశాలున్నాయి. బాల్య వివాహాలు లేవు, స్త్రీలకు కూడా బ్రహ్మచర్య ఆశ్రయం, ఉపన యన సంస్కారం కూడా ఉంది.స్వయం వరాలు, గాంధర్వ వివాహాలున్నాయి. బహు భార్యత్వం కేవలం ఉన్నతవర్గాల వారికే పరిమితం.రుషులతో పాటు రుషీమణులు కూడా ఉన్నారు. వితంతు వివాహాలను వియోగ అనే పద్ధతిలో పాటించేవారు. వరకట్నాలు లేవు.కుటుంబమే ఉత్పత్తి కేంద్రం కనుక స్త్రీలు పురుషులతో సమానంగా ఉత్పత్తి లో పాలు పంచుకొనేవారు. స్త్రీలకు వారసత్వ హక్కులు లేవు. కానీ స్త్రీధనంపై పూర్తి హక్కులు కలవు.వేదానంతర కాలంలో స్త్రీల స్థాయి ఆదర్శ స్త్రీ లక్షణాలు చిత్రించబడినవి ఉదా..రామాయణంలో సీత పురాణాలు, ఇతిహాసాల ప్రాధాన్యంతో స్త్రీల స్థాయి,స్వేచ్ఛ హరించిపోయాయి. తొలి, మధ్య యుగాల నుంచి విదేశీ సంస్కృతులతో సమ్మేళనం, భూస్వామ్య లక్షణాలు, వేదాలకు వక్రభాష్యం వంటి కారణాలవల్ల సతి ఆచారం, పరదాపద్ధతి, బహుభార్యత్వం లాంటివి ప్రారంభమయ్యాయి. ఇందుకు ఆర్యులకు, అనార్యులకు మధ్య జరిగిన వివాహాలు, ప్రతిలోమ వివాహాలు, బ్రాహ్మణ భావజాలం కూడా కారణాలుగా పనిచేశాయి. మధ్య యుగంలో జైన, బౌద్దం బలహీనపడటంతో రాజపుత్రులు, ఇస్లాం రాజ్యాల విస్తరణ జరగడంతో స్త్రీల స్థాయి వారి వారి సాంస్కృతిక విధానాలకు అడుగడుగునా దిగజారుతూ వచ్చింది.భారత జాతీయవాది అరవింద్‌ఘోష్‌ మొదటిసారిగా 1893లో భారతదేశంలో ఉద్భవించిన నూతన సామా జిక వర్గాన్ని మధ్య తరగతి వర్గం అని పిలిచారు.
ఈ సామాజిక వర్గం ఏర్పడటానికి కారణాలు..

  1. పరిశ్రమల ఏర్పాటుతో కులవృత్తులతో, భూ సంపదతో సంబంధం లేకుండా సంపద, హోదాని పొందే అవకాశాలు రావడం.
  2. బ్రిటిష్‌ వారు తమ పరిపాలనలో భాగంగా ఎంపిక చేసుకున్న భారతీయ అధికారగణం.
  3. లార్డ్‌ మెకాలే విద్యావిధానంతో ఆధునిక విద్య, వృత్తి విద్య అభ్యసించి ఉద్భవించిన నూతన భారతీయ మేధావి వర్గం. ఇలా పై కారణాలతో మొదటిసారి భారతీయ సమాజంలో సామాజిక సంబంధం లేని (వర్ణం, కులం) ఆర్థిక హోదా, నైపుణ్యాలు, వృత్తి వర్గాలు ఏర్పడ్డాయి.
    గృహహింస నిరోధక చట్టం..
    గృహంలో చిన్న పిల్లలకు సంబంధించిన హింసా చర్యలకు కూడా వర్తిస్తుంది. దేశంలో మొదటిసారిగా ఈ చట్టం గృహ హింసను సమగ్రంగా నిర్వచించింది.కింది అంశాలన్నీ గృహ హింస పరిధిలో వస్తాయి.వరకట్నాన్ని డిమాండ్‌ చేయడం. (అదనపు కట్నం) మానసిక, శారీరక, లైంగిక, మౌఖిక పరమైన ఇబ్బందులకు గురిచేసే చర్యలు.భార్యను కొట్టడం, శారీరకంగా హింసించడం.చట్టాన్ని అతిక్రమించినవారికి ఏడాది వరకు జైలుశిక్ష, రూ. 20 వేల వరకు జరిమానా.ఈ చట్టం కింద జిల్లా స్థాయిలో ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ నియామకం జరుగుతుంది. వారు బాధితురాలికి అవసరమైన న్యాయ, పునరావాస, నివాసపరమైన అంశాల్లో మార్గదర్శకత్వాన్ని అందించాలి. ఈ చట్టం కింద బాధిత మహిళలకు షెల్టర్‌ హోమ్స్‌, గృహహింస కౌన్సెలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.పనిచేసే చోట లైంగిక వేధింపుల చట్టం-2013 మహిళలు పనిచేసే చోట లైంగిక వేధింపులను నిరోధించడం, నియం త్రించడం, మహిళలపై వేధింపులకు సంబం ధించిన సమస్యలను సత్వరమే పరిష్కరించడం కోసం 2013లో ఈ చట్టాన్ని రూపొం దించారు.2013 డిసెంబర్‌ 9 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది.స్వేచ్ఛగా జీవించే హక్కు,1979 ని ప్రపంచవ్యాప్తంగా ఆమోదించారు. ఈ కన్వెన్షన్‌పై 1993 జూన్‌ 25న భారత్‌ సంతకం చేసింది. దీనికి కొనసాగింపుగానే పనిచేసే చోట లైంగిక వేధింపుల చట్టాన్ని తీసుకొనివచ్చింది. ఈ చట్టం దేశీయంగా ఇళ్లలో పనులుచేసే మహిళలకు (%ణశీఎవర్‌ఱష ఔశీఎవఅ ఔశీతీసవతీం%), ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే మహిళలకు, కాంట్రాక్టు మహిళా కార్మికులకు, ఒప్పంద మహిళా కార్మికులకు, మహిళా శిక్షకులకు వర్తిస్తుంది.సెక్షన్‌- 4 ప్రకారం 10మంది కంటే ఎక్కువ మంది మహిళలు పనిచేస్తున్న చోట వారికి ఉద్యోగాన్ని ఇచ్చిన ఎంప్లాయర్‌ తప్పకుండా ఇంటర్నల్‌ కైంప్లెంట్‌ కమిటీని ఏర్పాటు చేయాలి.
    ఆ సంస్థకు చెందిన సీనియర్‌ మహిళని విచారణ అధికారిగా, ఇద్దరు ఇతర ఉద్యోగులను, స్వచ్ఛంద సంస్థలకు చెందిన ఒక ప్రతినిధిని కలిపిని ఏర్పాటు చేయాలి.వచ్చిన కైంప్లెంట్స్‌పై 90రోజుల్లో విచారణ పూర్త య్యేలా కమిటీ చర్యలు చేపట్టాలి.నమోదైన కేసులకు సంబంధించి సంస్థలోని ఏ ఉద్యోగికి అయినా నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాల్సిందిగా ఆజ్ఞ జారీచేయవచ్చు.కేసుకు సంబంధించి ఏవిధమైన డాక్యుమెంట్‌ను అయినా సంస్థ నుంచి కోరవచ్చు.-జి.ఎన్‌.వి.సతీష్‌

పాలస్తీనాకు సంఫీుభావ ప్రకటన

లుపు,గోధుమ మరియు స్వదేశీ ప్రజలను పునర్వినియోగపరచలేని అన్యాయ వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఉద్యమాలుగా,జాత్యహంకార మరియు వలసవాద దోపిడీ మరియు ఆధిపత్య వ్యవస్థలచే బలిదానంచేయబడుతున్నాయి,ఆక్రమణ మరియు వర్ణవివక్షకు వ్యతిరేకంగా పాలస్తీనా ప్రజల పోరాటాన్ని మాసమిష్టిలో భాగంగా మరియు పార్శిల్‌గా చూస్తాము.వాతావరణం,జాతి,ఆర్థిక మరియు రాజకీయ న్యాయం కోసం మరియు అణచివేత లేకుండా ప్రతి ఒక్కరూ గౌరవంగా జీవించే హక్కు ఉన్న ప్రపంచం కోసం పోరాటం.
అక్టోబరు 7 నుండి జరిగిన పాలస్తీనియన్‌ మరియు ఇజ్రాయెల్‌ – – పౌరులందరి ప్రాణా లను కోల్పోవడం పట్ల మేము ఆగ్రహంతో ఉన్నాము మరియు సమానంగా దుఃఖిస్తున్నాము మరియు వారి చర్యలకు బాధ్యులు బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు.అనేక ఉత్తర ప్రభుత్వాలకు, పాలస్తీనియన్‌ జీవితాలు ఇజ్రాయెల్‌ పౌరుల వలె తక్కువ విలువ మరియు విలువైనవిగా పరిగణించబడుతున్నాయనే వాస్తవాన్ని మేము ఖండిస్తున్నాము. ఇది పదివేల మంది పాలస్తీనియన్లను చంపడానికి అనుమ తించింది.పాలస్తీనాపై ఇజ్రాయెల్‌ అక్రమ ఆక్రమణ ఫలితంగా దశాబ్దాలుగా శిక్షార్హత లేకుండా ఉంది. ప్రపంచ దక్షిణాదిలోని మన ప్రజల వంటి వారి పేర్లు మరియు కలలు వలసవాదానికి త్యాగం చేసిన వ్యక్తులు.గాజాపై తాజా విచక్షణారహిత బాంబు దాడిలో, ఇజ్రాయెల్‌ ఇప్పటికే 5000కంటే ఎక్కువ మంది పాలస్తీనియన్లను చంపింది, తూర్పున 2360 మంది పిల్లలతో సహా,1మిలియన్‌ మందికి పైగా ప్రజలను స్థానభ్రంశం చేసింది, ఇది పాలస్తీనా ప్రజలను సమిష్టిగా శిక్షిస్తుంది. కేవలం ఒక వారం,7-12అక్టోబర్‌ మధ్య, ఇజ్రాయెల్‌ తన అక్రమ ఆక్రమణలో నివసిస్తున్న పాలస్తీనా ప్రజలపై 6,000 బాంబులను జారవిడిచింది, ఆఫ్ఘనిస్తాన్‌పై యుద్ధంలో ఖూ ఒక సంవత్సరం మొత్తంలో వేసిన దానికంటే ఎక్కువ. హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ ఇజ్రా యెల్‌ నిషేధిత రసాయన ఆయుధాన్ని-వైట్‌ ఫాస్పరస్‌-గాజా స్ట్రిప్‌లోని పౌర ప్రాంతాలలో ఉపయోగించిం దని, దీనివల్ల తీవ్ర మైన కాలిన గాయాలు మరియు అదుపు చేయలేని మంటలు ఉన్నా యని ధృవీకరించింది.
మహిళలు,పిల్లలు,వైద్యులు,నర్సులు మరియు ఇజ్రాయెల్‌ ప్రతీకార బాంబు దాడి నుండి ఆశ్రయం పొందుతున్న వారితో సహా 471 మంది గాయపడిన మరియు అనారోగ్యంతో ఉన్న పాలస్తీనియన్లను చంపిన గాజాలోని అల్‌-అహ్లీ అరబ్‌ హాస్పిటల్‌పై బాంబు దాడి చేయడంతో మేము విధ్వంసానికి గురయ్యాము.ఈరోజు వరకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్య కార్యకర్తలపై 76 దాడులను నమోదు చేసింది,17ఆసుపత్రులతో సహా 26 ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు దాడి చేయబడ్డాయి, అలాగే పాలస్తీనియన్లు భద్రత కోసం ఆశ్రయం పొందుతున్న ఖచీ పాఠశాలలపై దాడులను నమోదు చేసింది.
ఆక్రమిత పాలస్తీనియన్‌ టెరిటరీ ఆఫ్‌ గాజా‘‘పూర్తి ముట్టడి’’ని ఎదుర్కొంటోంది, అంతర్జాతీయ చట్టం ప్రకారం యుద్ధ నేరాలుగా పరిగణించబడే ఆసుపత్రులు మరియు పాఠశాలలు వంటి పౌర మౌలిక సదుపాయాలపై ఉద్దేశపూర్వక లక్ష్యంతో ఉంది. ఇజ్రా యెల్‌ కూడా బందీలుగా ఉన్న 2.3 మిలియన్ల పాలస్తీని యన్లకు ఆహారం, నీరు, ఇంధనం మరియు ఔషధాలను అడ్డుకుంటుంది, వీరిలో సగం మంది పిల్లలు, యుద్ధ ఆయుధంగా ఉన్నారు. వెస్ట్‌ బ్యాంక్‌ ఆక్రమిత పాలస్తీనా భూభాగంలో ఉండగా, ఇజ్రాయెల్‌ మొత్తం దిగ్బంధనాన్ని విధించింది. గాజా స్ట్రిప్‌లో మారణ హోమాన్ని నిరసిస్తున్న పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్‌ సైన్యం ప్రాణాంతకమైన సైనిక బలంతో దాడి చేస్తోంది మరియు పాలస్తీనియన్లపై దాడి చేసి చంపుతున్న వెస్ట్‌ బ్యాంక్‌ లోపల ఇజ్రాయెల్‌ స్థిరపడినవారికి వేల ఆయుధాలను అందిస్తోంది. ఇజ్రాయెల్‌ బహిరంగంగా ‘గాజా శిథిలావస్థకు చేరుకుంటుంది’ మరియు పాలస్తీనియన్లను ‘మానవ జంతువులు’అని జాతి నిర్మూ లన ప్రకటనలు చేసింది. వాతావరణ న్యాయ ఉద్యమాలుగా మేము జాత్యహంకారం మరియు వలసవాదం యొక్క భాషను గుర్తిం చాము. ఇది గ్లోబల్‌ సౌత్‌ అంతటా మన ప్రజలలో చాలా మందిని బలి ఇవ్వడం మరియు చంపడాన్ని సమర్థించడానికి ఉపయోగించ బడిరది.
గాజాలో ప్రస్తుత యుద్ధం ఒక వివిక్త సంఘటన కాదు కానీ కొనసాగుతున్న వలసరాజ్యంలో లోతుగా పాతుకుపోయింది.చట్టవిరుద్దమైన ఆక్రమణ,వ్యవస్థాగత అన్యాయాలు మరియు వర్ణవివక్ష రాజ్యం ద్వారా పాలస్తీనాపై చారిత్రక అణచి వేత,పౌరులకు రక్షణ కల్పించాలనిడిమాండ్‌ చేసే అంతర్జాతీయ మానవతా చట్టం మరియు మానవహక్కుల సూత్రాలను ఇజ్రాయేల్‌ పదేపదే విస్మరించింది. ముఖ్యంగా సంఘర్షణ ప్రాంతాలలో,దాని తీవ్రతరం గాజాలో మారణోమ దాడులు.ఇజ్రాయెల్‌ ఉత్తర గాజాలో పాలస్తీనియన్లను విచక్షణారహితంగా చంపే ఉద్దేశంతో భూదాహానికి ప్రణాళిక చేస్తోంది: మరియు 1948లో 750,000 మంది పాలస్తీనియన్లు వారి ఇళ్ల నుండి బహిష్కరించబడినన నక్బా (అరబిక్‌లో ‘విపత్తు’) కంటే ఒకే రోజులో ఎక్కువ మంది పాలస్తీనియన్లను జాతిపరంగా ప్రక్షాలన చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. లేదా పాలస్తీనాలో వారి కొనసాగుతున్న స్థిరనివాసుల`వలసవాద ఆక్రమణలో ఏరోజు అయినా.గాజాలోని పాలస్తీనియన్లలో అత్యధికులు నక్బా నుండి వచ్చిన శరణార్థులు.
పరిస్థితి ఇంతకంటే అత్యవసరం కాదు.యునైటెడ్‌ నేషన్స్‌ రిలీఫ్‌ అండ్‌ వర్క్స్‌ ఏజెన్సీ ఫర్‌ పాలస్తీనియన్‌ శరణార్థుల (ఖచీRఔA) డైరెక్టర్‌ మాటలలో,‘‘గాజా జీవితం లేకుండా పోతోంది’’.ముఖ్యమైన వనరులు అయిపోయినందున మరియు గాజు యొక్క 16ఏళ్ల దిగ్భందనం మరియు కాలాగుణ బాంబు దాడులతో దెబ్బతిన్నాయి. ‘మన కళ్ల ముందు కుప్పకూలడం’గాజా యోక్క మిగిలిన ఆసుప్రతులు శవాగారాలుగా మారుతున్నాయి.
మేము తక్షణ కాల్పుల విరమణ కోసం మరియు అంతర్జాతీయ సమాజం దిగ్బంధనాన్ని విచ్ఛిన్నం చేయాలని మరియు పాలస్తీనా ప్రజల సామూహిక శిక్షను ముగించాలని పిలుపునిస్తున్నాము. వర్ణవివక్ష మరియు వృత్తిని మనం అంతం చేయాలి.
గాజా స్ట్రిప్‌కు మానవతావాద సహాయాన్ని అనుమతించడానికి కాల్పుల విరమణ కోసం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తీర్మానాలకు మద్దతు ఇవ్వడానికి ఖూ మరియు ఖఖ నిరాకరిం చడం పట్ల మేము విస్మయం చెందాము. ఇజ్రాయెల్‌ ఈ చర్యలను శిక్షార్హత లేకుండా నిర్వహించడంలో శక్తివంతమైన పాశ్చాత్య దేశాలు సహకరించడం తీవ్ర ఆందోళన కలిగించే విషయం. మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన ఆధారాలు పెరుగుతున్నప్పటికీ, ఈ దేశాల నుండి ఇజ్రాయెల్‌కు సైనిక మరియు ఆర్థిక సహాయాన్ని అందించడం నిరాటంకంగా కొనసాగుతోంది.పాలస్తీనా ప్రజల జీవితాలను నిర్లక్ష్యం చేయడం క్షమించరానిది మరియు ఇజ్రాయెల్‌పై వారి ఆయుధాలను ముగించడం మరియు మానవ హక్కులకు ప్రాధాన్యత ఇవ్వడం ఈ దేశాలపై బాధ్యత.
పాలస్తీనియన్‌ ప్రజల ఇస్లామోఫోబిక్‌ వాక్చాతుర్యాన్ని మరియు అమానవీయీకరణకు ఆజ్యం పోస్తున్న ఉత్తరాది మీడియా నేతృత్వంలోని రాజకీయ నాయకులు మరియు అంతర్జాతీయ మీడియా పాత్ర మరియు పక్షపాతాన్ని కూడా మేము పిలుస్తాము.ద్వేషపూరిత ప్రసంగం మరియు నకిలీ వార్తలు.
ఉత్తరాది ప్రభుత్వాలు-జర్మనీ,ఫ్రాన్స్‌ నుండి ఖఖ వరకు,మా ఉద్య మాలను నేరంగా పరిగణించి,పాలస్తీనా కోసం న్యాయం కోసం పిలుపునివ్వకుండా మా ఉద్యమాలను నిషేధించడానికి ప్రయత్నించడాన్ని మేము ఖండిస్తున్నాము. నిరసన తెలిపే మన హక్కుపై జరుగుతున్న దాడులు ఈ అన్యాయాలకు అత్యంత బాధ్యత వహించే దేశాలలో జరుగుతున్న వాతావరణ నిరసనలపై దాడులకు అద్దం పడుతున్నాయి.
మేము గాజా ప్రజలకు మరియు క్రూరత్వానికి గురైన వారందరికీ అచంచలమైన సంఫీుభావాన్ని తెలియజేస్తున్నాము మరియు అమాయక పౌరులను రక్షించడానికి అంతర్జాతీయ చట్టం మరియు మానవ హక్కుల సూత్రాలను సమర్థించాలని డిమాండ్‌ చేస్తున్నాము.
మేము కూడా పాలస్తీనీయున్లకు సంఫీుభావంగా నిలబడతాము.మరియు ఇజ్రాయెల్‌ను నిరసిస్తూన్న యూదులు గాజాపై బాంబుదాడి మరియు దాని కోసం వాదించడం ప్రాంతాంలో శాంతి రియు న్యాయం. మేము ఖండిస్తున్నాం.
చుట్టూ అనేక ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు ఈ నిరసనలు మరియు అరెస్టులను శాంతియుత ప్రపంచం ఆపాలి.శాంతియుత ప్రదర్శనకారులు.
న్యాయం లేకుండా శాంతి ఉండదు మరియు అది ప్రపంచ సమాజానికి నైతిక అవసరం.పీడితులతో ఐక్యంగా నిలబడతారు.మేము పిలుస్తాము.అన్నీ మన ప్రభుత్వాలు మరియు అంతర్జాతీయ సంస్థలు యుద్దాన్ని ముగించడానకి మరియు అందరినీ తీసుకురావడానికి కలిసి పనిచేయండి.న్యాయానికి యుద్ద నేరాలకు బాధ్యులు.మేము ఆక్రమణ మరియు మారరణోమం అంతం చేయాలని డిమాండ్‌.పాలస్తీనా ప్రజల మరియు పరిష్కారం కోసం కోరాం.అది పాలస్తీనియన్లు మరియు ఇజ్రాయిలీలు భద్రతతో,గౌరవంగా జీవించేలా తీర్మానం చేయాలని కోరుతున్నాము.వర్ణ వివక్షత కలిగిన ఇజ్రాయెల్‌ దేశం గాజాలో కొనసాగుతున్న హింస మరియు భయంకరమైన మానవ హక్కుల ఉల్లంఘనల దృష్ట్యా, మేము ఈ క్రింది అత్యవసర చర్యల కోసం పిలుపునిస్తున్నాము :
జు తక్షణ కాల్పుల విరమణ: గాజాలో తక్షణ కాల్పుల విరమణ కోసం ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ మరియు మానవతా మరియు మానవ హక్కుల సంస్థల పిలుపులను మేము ప్రతిధ్వనిస్తున్నాము.
జు చట్టవిరుద్ధమైన దిగ్బంధనాన్ని ముగించండి: పౌరులకు అత్యవసర మానవతా మరియు అత్యవసర సహాయం గాజాలో అందించాలి.గాజా ప్రజలకు వైద్య సామాగ్రి,ఆహారం,నీరు మరియు ఇతర అవసరమైన వనరులు చాలా అవసరం, వీటిని అత్యవసరంగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది.
జు యుద్ధ నేరాలను ఆపండి: ఆసుపత్రులపై దాడులు, బలవంతంగా తరలింపులు మరియు గాజాపై దశాబ్దాలుగా అక్రమ దిగ్బంధనంతో సహా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించే చర్యలకు ఇజ్రాయెల్‌ బాధ్యత వహించాలి.
జు ముగింపు శిక్ష: ఇజ్రాయెల్‌ రాష్ట్రంతో సహా యుద్ధ నేరాలకు బాధ్యులైన వారందరినీ నిర్బంధించాలి.వారి చర్యలకు ఖాతా.నేరారోపణ లేదా విచారణ లేకుండా నిర్బంధించబడిన వేలాది మంది పాలస్తీనా రాజకీయ ఖైదీలతో సహా అన్ని పౌర బందీలను విడుదల చేయాలి.పాశ్చాత్య శక్తులు ఇజ్రాయెల్‌కు తమ మద్దతును నిలిపివేయాలి. ప్రత్యేకించి మానవ హక్కుల ఉల్లంఘనల సందర్భంలో ఇజ్రాయెల్‌కు ఆయుధాల విక్రయాలను ముగించాలి మరియు ఇజ్రాయెల్‌కు అన్ని మద్దతు మరియు నిధులను వెంటనే నిలిపివేయాలి. రాజకీయ పొత్తులు మనుషుల జీవితాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదు.
జు వర్ణవివక్ష మరియు వృత్తిని ముగించండి: మేము పాలస్తీనా ప్రజల స్వీయ-నిర్ణయానికి మద్దతు ఇస్తున్నాము. మేము వర్ణవివక్ష వ్యవస్థను అంతం చేయాలని మరియు పాలస్తీనా శరణార్థులకు తిరిగి వచ్చే హక్కు మరియు పరిహారం కోసం ఇజ్రాయెల్‌కు పిలుపునిచ్చింది. ఇజ్రాయెల్‌ రాష్ట్రంతో పాటు సురక్షితమైన,సురక్షితమైన మరియు ఆచరణీయమైన పాలస్తీనా రాష్ట్రం కోసం ఖచీ తీర్మానాలను ఎట్టకేలకు సమర్థించాలని మేము అంతర్జాతీయ సమాజాన్ని కోరుతున్నాము.
జాత్యహంకారం, ఇస్లామోఫోబియా మరియు సెమిటిజంను ఆపండి: మేము మా కామ్రేడ్‌లకు సంఫీుభావంగా నిలుస్తాము జాత్యహంకార దాడుల పెరుగుదలను ఎదుర్కొంటున్న యూదు మరియు ముస్లిం సంఘాలు. వాతావరణ న్యాయం కోసం పోరాటం జాతి న్యాయం కోసం పోరాటం.-(సేకరణ : సాలిడారిటీ స్టేట్‌మెంట్‌ ఆధారంతో…స్వేఛ్చా అనువాదం..)

1 19 20 21 22 23 75