వ‌ల‌స ప‌క్షులు…మ‌న అతిథులు

ఈ సృష్టిలో పక్షులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. పురాణాల్లో దైవ స్వరూపంగా భావించే పక్షలు మానవుని స్వార్థానికి బలైపోతున్నాయి. పక్షులు సహజ సిద్ధంగా ఏర్పడే ఆహారం.. ఆవాసం.. సంతానోత్పత్తి కోసం ఒక చోట నుంచి మరో ప్రాంతానికి ప్రయాణం చేస్తుంటాయి. కొన్ని వేల కిలోమీటర్ల వరకు ప్రయాణించి సురక్షిత ప్రాంతంలో కొంత కాలం పాటు నివాసం ఏర్పాటు చేసుకుంటాయి. వలస పక్షులను పరిరక్షించుకోవడం కోసం ఐక్యరాజ్య సమితి వలస పక్షుల దినోత్సవం నిర్వహిస్తున్నది. ఏలూరు జిల్లా కొల్లేరు ఒకప్పుడు వలస పక్షుల నిలయం.. ఇప్పుడు కొల్లేరులో పక్షులు లేవు.. వేట, ప్లాస్టిక్‌ వ్యర్థాలు అధిక గాడతతో కూడిన క్రిమి సంహార మందుల వాడకం వల్ల పక్షుల సంతతి అంతరించి పోతున్నది. ప్రపంచ వలస పక్షుల దినోత్సవం.. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం…
వలస పక్షల సంరక్షణ కోసం ఐక్యరాజ్య సమితి ప్రతీ సంవత్సరం మేనెల రెండవ శనివారం, అక్టోబర్‌ నెల రెండవ శనివారాలను ప్రపంచ వలస పక్షుల దినోత్సవంగా జరపాలని నిర్ణయించింది. 2010 నుంచి వలస పక్షుల దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తు న్నారు. ‘ప్లాస్టిక్‌ వ్యర్థాల నుంచి పక్షులను సంరక్షించుకుందాం’ అనేది 2019 ప్రపంచ వలస పక్షుల దినోత్సవ ముఖ్య నినాదం..
పక్షులు ఎందుకు వలస వెళతాయంటాయి?
ప్రపంచ వ్యాప్తంగా పక్షులు తమ సంతానోత్పత్తి కోసం,శీతాకాలంలో తమ ప్రాణ రక్షణ కోసం వలసలకు సిద్ధపడుతుంటాయి. వేలాది కిలో మీటర్లు ఆకాశ మార్గంలో ప్రయాణించి తమ సంతానోత్పత్తికి అనువైన సురక్షిత ప్రాంతాలను అన్వేషించి అక్కడ కొన్ని నెలలు స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటాయి. ధృవ ప్రాంతాల నుంచి శీతాకాలంలో పక్షులు తీవ్ర చలిగాలుల నుంచి రక్షణ కోసం అనువైన ప్రాంతాలకు వలసలు కడతాయి. పక్షులు ప్రతీ సంవత్సరం ఒక ప్రత్యేక సమయంలో ప్రత్యేక ప్రాంతానికి వలసలు కడతాయని పరిశోధకులు చెబుతున్నారు. వలస పక్షులు ప్రత్యేక దారుల గుండా సూర్యగమనం, చంద్రగమనం ఆధారంగా తమ వలస ప్రాంతాలకు దారుల లక్ష్యాన్ని నిర్ధేశించుకుంటాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉత్తర ధృవం నుంచి ధక్షిణ ధృవానికి సైబీరియన్‌ ప్రాంతం నుంచి పక్షుల వలసలు సాగుతుంటాయి .పక్షులు ఆర్కిటిక్‌ ప్రాంతం నుంచి అంటార్కిటికా ప్రాంతానికి వలసలు సాగిస్తుంటాయి. ప్రపంచ వ్యాప్తంగా పరిశోధకులు తొమ్మిది ప్రాముఖ్యత గల వలస పక్షులదారులను గుర్తించారు. ఉత్తర దిక్కు నుంచి చలికాలంలో దక్షిణ దిక్కున గల ఉష్ణ మండల ప్రాంతానికి వచ్చి గుడ్లు పొదిగి పిల్లలతో తిరిగి తమ ప్రాంతానికి సురక్షితంగా వెళ్తాయి. హిమాలయాలు,ఆండిస్‌ పర్వత ప్రాం తాల్లో కూడా వలస పక్షలు నివాసాలు ఏర్పరుచుకుంటాయి.
ఆంధ్రప్రదేశ్‌లో వలస పక్షుల కేంద్రాలు
ఆంధ్రప్రదేశ్‌ వలస పక్షులకు నిలయం. పర్యా వరణహితంగా ఉండే ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా తీర ప్రాంతంలో వలస పక్షుల కేంద్రాలు కోకోల్లలుగా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో తేలినీలాపురంలో ఫెలికాన్‌,గుడాబాతు పక్షులు రష్యాలోని సైబీరియన్‌ ప్రాంతం నుంచి వలస వస్తుంటాయి. కృష్ణాగోదావరి జిల్లాల మధ్య ఉండే కొల్లేటి ప్రాంతంలో ఫెలికాన్‌,నైటికేల్‌,టిల్ట్‌ పక్షులు ఆస్ట్రేలియా,ఆసియా ప్రాంతాల నుంచి వలస వచ్చి కొన్ని నెలల పాటు సేదతీరుతుం టాయి.పులికాట్‌ తీరంలో ఫ్లెమింగో పక్షుల కేం ద్రం ఎంతోఆహ్లాదకరంగా ఉంటుంది.నెల్లూరు జిల్లాలోని నేలపాడులో ఫ్లెమింగో,హేలాన్‌ పక్షు లు వలస వచ్చి సేదతీరుతుంటాయి
కొల్లేరు వలస పక్షుల స్వర్గ ధామం
కొల్లేరు ప్రాంతం వలస పక్షులకు స్వర్గ ధామం గా నిలుస్తుంది. ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్ప డిన కొల్లేరు 72కిలోమీటర్ల వైశాల్యంతో సహజ సరస్సుగా ఏర్పాడటంతో సుదూర ప్రాంతాల నుంచి పక్షులు కొల్లేటి తీరానికి అక్టోబర్‌ నెలలో వచ్చి ఐదు నెలల పాటు స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటాయి. ఇక్కడే సంతానోత్పత్తి చేసుకుని మార్చి నెలలో పిల్లలను తీసుకుని తమ సొంత ప్రాంతానికి పోతుంటాయి. ఆసియా,ఆస్ట్రేలియా ప్రాంతాల నుంచి వచ్చే ఫెలికాన్‌,గుడాబాతు, నత్తకొట్టు,చింతఉప్పు,చిట్టిబెల్ల గువ్వాపక్షులు ఎక్కువగా సంచరిస్తుంటాయి. ఫెలికాన్‌తో పాటు టిల్ట్‌,వైట్‌ టైల్‌,భార్గని,రిటెల్‌ గ్రీబ్‌,ఫ్లోవర్‌ మొద లైన పక్షులు హిందూ మహాసముద్రం,బంగాళా ఖాతం మీదుగా ప్రయాణించి కొల్లేరు చేరు కుం టాయి. 2021పక్షుల లెక్కల ప్రకారం కొల్లేటి తీరంలో5నుంచి8ల క్షల వరకు 120రకాల పక్షుల ఆవాస ప్రాంతంగాఉందని లెక్కల్లో తేలింది.
ప్రమాదం అంచున పక్షులు
ప్రపంచ వ్యాప్తంగా పక్షులు మానవుని స్వార్థానికి బలవుతున్నాయి. ప్రతీ సంవత్సరం ఒక మిలియన్‌ పక్షులు మానవుని స్వార్థానికి బలవుతున్నాయి. మానవుడు ప్రతీ సంవత్సరం 300 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల ప్లాస్టిక్‌ వస్తువులను తయారు చేసి ఉపయోగించుకుని భూమిపై, నీటి వనరుల్లో వదిలేస్తున్నాడు. ప్లాస్టిక్‌ వ్యర్థాలు మంచినీటి వనరులను సముద్రాల్లో విపరీతంగా కలవడం వల్ల పక్షు లకు సహజసిద్ధ ఆహారంతో పాటు ప్లాస్టిక్‌ను స్వీక రిస్తున్నాయి. ఆస్ట్రేలియా,అమెరికా తీరాల్లో వలస పక్షులు ఈ ప్లాస్టిక్‌ వ్యర్థాలను తిని వంద లాదిగా మృత్యువాతకు గురవుతున్నాయి. పక్షి పరిశోధకులు మృత్యువాత పడిన పక్షులను కోసి చూస్తే వాటి పొట్ట నిండ ప్లాస్టిక్‌ వ్యర్థాలేఉండ టం వారిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. వ్యవ సాయ క్షేత్రాల్లో అధిక గాడతతో కూడిన క్రిమి సంహారక మందులు పక్షులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కొల్లేరు ప్రాంతంలో కొంత మంది వేటగాళ్లు శీతాకాల ప్రాంతంలో విషపు ఎరలు పెట్టి వందలాది పక్షులను అంతం చేసున్నారు.
ఫ్లెమింగో పక్షులు మనుగడ ప్రశ్నార్ధకం
జీవ వైవిధ్యానికి ముఖ్యంగా మానవ మనుగ డలో ముఖ్యపాత్ర వహిస్తున్న అనేక లక్షలాది స్థానిక, వలస పక్షులకు తీవ్ర ప్రమాదాన్ని కలుగచేస్తున్నాయి. విద్యుత్‌లైన్లకూ ట్రాన్స్‌ఫా ర్మర్లకు, ఎత్తయిన విద్యుత్‌ స్తంభాలకు తగిలి విద్యుత్‌ఘాతంతో పక్షులు ప్రానాలు కోల్పో తున్నాయి. ఇదేగాక బొగ్గు,నీరు,జీవఇంధనం, సముద్రం,సౌరశక్తి, పవనశక్తి ఉపయోగించి నిర్మించే విద్యుత్‌ కేంద్రాల వలన పక్షులు తమ నివాసాలను, సంతానోత్పత్తి, ఆహార స్థలములను కోల్పోవడం గాని పాడయి పోవటముగాని జరుగుతున్నది. తరగని వనరులు ఉపయోగిం చుట వలన కర్బన ఉద్గారాలు ఉత్పత్తి కాకుండా కొంత మేలయినప్పటికీ విద్యుదుత్పత్తి ప్లాంటు నిర్మాణానికి,విద్యుత్‌ సరఫరాకు సరిjైు్నన ప్రణాళిక, డిజైను రూపకల్పన,నష్టాలను అంచనా వేయటం లేదు. దీనివలన జీవ వైవి ధ్యానికి ముప్పు వాటిల్లటమే కాకుండా లక్షలాది స్థానిక, వలస పక్షులకు తీవ్రప్రమాదం కలుగుతోంది.ఫ్లెమింగోలు,స్టార్కు జాతి కొంగలు పెలికాను పక్షులు, గ్రద్ధ జాతి పక్షులు, ఇతర అనేక జాతుల పక్షులు వాటి సుదూర ప్రయా ణంలో విద్యుత్‌ తీగల గ్రిడ్‌లకు తగిలి విద్యుద్ఘా తముతో చనిపోతున్నాయి. 2011 సంవత్సరం నాటికి ప్రపంచం మొత్తం మీద 70మిలియన్ల కిలోమీటర్ల పవర్‌ లైన్లు ఉన్నట్టుగా అంచనా వేయబడినది.వలస పక్షులకు ఇప్పటికే వాటి నివాస ప్రదేశాలు, ఆహార ప్రదేశాలు సంతా నోత్పత్తి ప్రదేశములు నశించి పోవటం,పాడై పోవటం,గ్లోబల్‌ వార్మింగ్‌వల్ల ముప్పు వాటిల్ల డమే కాకుండా అదనంగా విద్యుత్‌ ఘాతము వలన వాటికి కలిగే ముప్పు తీవ్రతరమౌతున్నది. ఇదిపెద్ద పక్షి జాతులు నశించి పోయేందుకు కారణం. ప్రకృతి సిద్ధంగా వాటి సంతానోత్పత్తి తక్కువగా ఉండటం వల్ల, పెద్ద పక్షులు చనిపో వుట వలన వాటి గుడ్లు పాడై పోవటం,గూటి లోని పిల్లలు చనిపోవటం జరుగుతూ కొన్ని జాతులకు ముప్పు ఏర్పడుతోంది. తూర్పు ఐరోపాలో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉందని ‘జాన్‌ ఒసల్లివాన్‌’ రాయల్‌ సొసైటీ పక్షుల పరిరక్షణ సంస్థ మాజీ సభ్యులు తెలిపారు. దక్షిణ ఆఫ్రికాలో ప్రతి సంవత్సరం 12శాతం ‘బ్లూ క్రేన్స్‌’ (ఆ దేశ జాతీయ పక్షి) విద్యుత్‌ ఘాతము వలన చనిపోతున్నట్లుగా తెలిపారు. ఇండియాలోనూ, ఆఫ్రికాలోనూ అధిక మొత్తం లో ఎలక్ట్రిక్‌ పవర్‌ లైనులు వేస్తుండటం వలన ఈ సమస్య తలెత్తబోతుందని తెలిపారు. అయితే ఇండియాలో కూడా ఈసమస్య ఇప్పటికే ఉన్నది. గుజరాత్‌లో ప్రతి సంవత్సరం కొన్ని వందల ఫ్లెమింగో పక్షులు విద్యుత్‌ ఘాతము వలన చనిపోతున్నాయి. ఈవిద్యుత్‌ తీగలను ఫ్లెమింగో పక్షుల నివాస ప్రదేశాలు, ఆహార ప్రదేశాల గుండాను, పక్క నుంచి నిర్మించుట వలన వాటి తలల విద్యుత్‌ తీగలకు గుద్దుకొని చనిపోతు న్నాయి. ఈఫ్లెమింగో పక్షులు వందలు,వేల సంఖ్యలో ఉండి రాత్రి సమయాలలో కూడా ప్రయాణిస్తుండడం వలన కరెంటు తీగలకు చనిపోతున్నాయి. ఊర కుక్కలు వీటి ప్రదే శాలలో చేరి వీటిని చిందరవందర చేయుట వలన ఆ గాభరాలో విద్యుత్‌ తీగలకు గుద్దుకొని మరణిస్తున్నాయి. మన దేశంలో రాబందుల సంఖ్య తీవ్ర ప్రమాద స్థాయికి తగ్గిపోవుటకు కారణాలలో విద్యుత్‌ తీగలే ప్రధానం. అమెరికా, యూరప్‌లలో ఎండిపోయిన ప్రదే శాలలో విద్యుత్‌ ఘాతముచే మంటలతో కాలి పడిపోయిన పక్షుల వలన అగ్ని ప్రమాదాలు జరుగుతున్నట్టుగా ప్రిన్సన్‌’ అనే అధ్యయనవేత్త తెలిపారు. విండ్‌ పవర్‌వల్ల కూడా పక్షులు చని పోతున్నాయి. పాశ్చాత్య దేశాల్లో అధ్యయనం జరిగినట్లుగా భారత దేశంలో అధ్యయనం జరగకపోవడం విచారకరం. పక్షులకు జరిగే తీవ్ర నష్టాన్ని తగ్గించడానికి వాటి సంతానో త్పత్తి, ఆహార ప్రదేశాలకు,నివాస ప్రదేశాలకు దూరంగా విద్యుత్‌ లైనులు నిర్మించాలి. ఇన్సులేటెడ్‌ వైర్లను ఉపయోగించాలి. బల్గేరి యాలో 2009-2013 మధ్యలో గుర్తింపబడిన ‘ఈస్ట్రన్‌ ఇంపీరియల్‌ ఈగల్స్‌’ 67శాతం వరకు విద్యుత్‌ ఘాతం వలన మరణించాయి. అదే విధంగా సూడాన్‌లో కూడా ‘ఈజిప్షియన్‌ వల్చర్సు’ కూడా విద్యుత్‌ తీగల వల్ల చనిపోతు న్నాయి. దాంతో సూడానీస్‌ ఎలక్టిక్ర్‌ కంపెనీ, బల్గేరియా పక్షుల సంరక్షణ సంఘం ఇన్సులేటెడ్‌ తీగలను అమర్చి పక్షులను తీవ్ర ప్రమాదం నుంచి రక్షించడం గొప్ప విషయం. కావున జీవ వైవిధ్యంలో, మానవుని మనుగడలో ముఖ్యపాత్ర వహిస్తున్న పక్షులను రక్షించుటకు, వాటి ఆహార, నివాస, సంతానోత్పత్తి ప్రదేశాలను రక్షించుటకు వీలుగా విద్యుత్‌ ప్లాంట్లు, విద్యుత్‌ లైనుల రూపకల్పన, నిర్మాణం జరగాలి.
వలస పక్షుల దినోత్సవం ప్రత్యేకత
యూనెస్కో 2006 నుంచి వలస పక్షుల దినోత్స వాన్ని నిర్వహిస్తోంది. పక్షుల అవసరాలు, అల వాట్లు, వలస వెళ్లే ప్రాంతాల్లో వాటికి ఎదురవు తున్న సమస్యలను గుర్తించారు. వాటి పరిష్కారా నికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వలస పక్షుల ప్రదేశాల రక్షణ గురించి ప్రచారం చేస్తూ స్తానికుల్లోనూ అవగాహన కల్పిస్తున్నారు. ప్రపంచ వారసత్వ ప్రాంతాలకు వ్యర్థ పదా ర్ధాలు, కాలుష్యం వంటి కారణంగా నష్టం జరుగుతుంది. రోజురోజుకు పర్యాటకం అభివృద్ధి చెందుతోంది. ప్లాస్టిక్‌, ఇతర వస్తువు లను ఇష్టానుసారం వేయకుండా వలస పక్షులను కాపాడాల్సిన బాధ్యత కూడా పర్యాట కులపై ఉందంటూ సూచించింది యూనె స్కో. ప్రపంచ వారసత్వ ప్రదేశాలు పక్షులకు విరామ స్థలాలుగా ఉంటున్నాయి. పలు వారసత్వ ప్రదేశాల్లో జల కాలుష్యం ప్రధాన సమస్యగా ఉంటుంది. ప్లాస్టిక్‌, పారి శ్రామిక వ్యర్థాలు పక్షుల ప్రాణాలకు ముప్పుగా మారాయి. –(కోకా మృత్యుంజయరావు/ ముప్పళ్ళ అప్పారావు)