122 ఏళ్లలో ఎన్నడూ చూడని ఎండలు..!

మానవుని కార్యకలాపాలవల్ల ఏర్పడిన గ్లోబల్‌ వార్మింగ్‌తో ప్రాణహాని సంభవిస్తోంది. ఇది ఇప్పటికే రుజువైన సత్యం కూడా. గ్లోబల్‌ వార్మింగ్‌వల్ల ప్రపంచవ్యాప్తంగాపక్షులు, జంతువుల మనుగడ కష్టతరమౌతోంది. దీంతో యావత్‌ జీవరాశి దెబ్బతినడంతో పాటు… మనుషుల మీద కూడా ఆ ప్రభావం పడుతుంది. గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగానే.. మన దేశంలో మే నెల రాకముందే అత్యంత తీవ్రమైన వేడిగాలులు వీస్తున్నాయి. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల కంటే.. ఉత్తరాది రాష్ట్రాల్లో మునుపెన్నడూ లేనివిధంగా తీవ్రస్థాయిలో వడగాలులు వీస్తున్నాయని భారత వాతావరణశాఖ వెల్లడిరచింది.
ఈఏడాది భానుడు ప్రజలపై నిప్పులు కురిపిస్తున్నాడు.దీనివల్ల అధిక ఉష్ణోగ్రతలు,ఉక్కుపోత. దీనికి తోడు కరెంటు కోతలు తోడుకావడంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు.ఇంతకు ముందెన్నడూ చూడని స్థాయికి ఎండలు పెరుగుతున్నాయి. మార్చిలో దేశ వ్యాప్తంగా సగటు గరిష్ట ఉష్ణోగ్రత 33.10 డిగ్రీలుగా నమోదైంది.భారత వాతావరణశాఖ అందించిన వివరాల ప్రకారం..ఈ సంవత్సరం మార్చినెలలో ఉష్ణోగ్రతలు 122ఏళ్లలో నమోదైన వాటికంటే అత్యంత ఎక్కువైనవిగా పేర్కొంది. దీన్నిబట్టి వాతావరణంలో మార్పులు చాలా వేగంగా వస్తున్నట్లు మనం అర్ధం చేసుకోవాలి.
ఢల్లీి మార్చినెలలో ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విధంగా రెండు హీట్‌వేవ్స్‌ను చూసింది. సగటు గరిష్ట,కనిష్ట ఉష్ణోగ్రతలు వరసగా 32.9సెల్సియస్‌(సాధారణ సగటుకంటే 3.3సీ),17.6సీ(సాధారణ సగటు కంటే 2సీ)వద్ద సాధారణం కంటే ఎక్కువగా నమోద య్యాయి. భారత దేశంలో ప్రతి పది సంవత్సరాలకి హీట్‌వేవ్‌ రోజుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గత గణాంకాలను చూసినట్లయితే 198190లో 413 రోజుల నుంచి 200110లో 575 రోజులకు,201120 మధ్యలో ఇది 600రోజులకు పెరిగింది. దీనికి ప్రధాన కారణం పెరుగుతున్న గ్లోబల్‌ వార్మింగ్‌ అని నిపుణులు అంటున్నారు. వాతావరణమార్పులు,పెరుగుతున్న నగరీకరణ,అడవుల నరికివేత వంటి కూడా మారుతున్న వాతావరణ తీవ్రతలకు దోహదపడ్డాయని వారు చెబుతున్నారు. వీటికి తోడు దేశ వ్యాప్తంగా నమోదవుతున్న తక్కువ వర్షపాతం మరోకారణంగా తెలుస్తోంది. వర్షపాతం లోపం భారత్‌లో 72శాతం ఉండగా..దేశంలోని వాయువ్య ప్రాంతాల్లో అది అత్యధికంగా 89శాతానికి పెరిగింది. ఆకాశంలో మేఘాలు లేనందున సూర్యుని కిరణాలు నేరుగా భూమిపై పడుతున్నాయి. దీనివల్ల ఉష్ణోగ్రతలు ఊహించిన స్థాయికంటే ఎక్కువగా ఉంటున్నాయి. పొడి, వేడిగాలులు, వాయువ్య,మధ్య భారతదేశంలోకి వీస్తున్నాయి. 19602009మధ్యకాలంలో భారతదేశ సగటు ఉష్ణోగ్రత 0.5సెల్సియస్‌ పెరగడం కారణంగా వడగాల్పుల వల్ల సంభవించిన మరణాలు 146శాతం వరకు పెరిగాయి. దేశంలోని 13శాతం జిల్లాలు,15శాతం ప్రజలు ఈహీట్‌వేవ్‌లకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.దీనివల్ల పేదలు,అట్టడుగు వర్గాలు తీవ్రంగా ప్రభావితం కానున్నారు. దేశంలోని శ్రామికవయస్సు జనాభాలో అధికశాతం మంది వ్యవసాయం,నిర్మాణం,రిక్షాలాగడం వంటి బహిరంగ ఉద్యోగాల్లో ఉండటంవల్ల వారిపై వేడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల వారి ఆరోగ్యం దెబ్బతినటంతోపాటు,జీవనోపాధికి ముప్పు కలిగే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. దక్షణధృవం,ఉత్తర ధృవంలో వాతావరణం మార్పులవల్ల ఐసుగెడ్డలు కరిగిపోతుంది. దీని కారణంగా వాతావరణంలో వేడి పెరిగి సముద్ర నీటిమట్టం పెరుగుతుంది. దీనివల్ల ప్రపంచంలోని దీవులతోపాటు,భూమి మునిగిపోతుంది. ఈ పర్యావరణ మార్పులు వల్ల(క్లైమేట్‌ ఛెంజ్‌)లో పక్షలు వేడి ప్రదేశం నుంచి చల్లని ప్రదేశానికి వలసలు వస్తున్నాయి. దీనివల్ల కోవిడ్‌19 వంటి ఇంకా భయంకరమైన వ్యాధులు రావడానికి అవకాశం ఉంది ! ఈనేపథ్యంలో పర్యావరణంలో సంభవిస్తున్న మార్పుల పట్ల ప్రపంచ దేశాలన్నీ తీసుకుంటున్న చర్యల్లో ప్రజలందరూ భాగస్వాములై గ్లోబల్‌ వార్మింగ్‌ నియంత్రణకు తోడ్పడాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది.! – రెబ్బాప్ర‌గ‌డ ర‌వి,ఎడిట‌ర్