భారతీయ గిరిజన వీరులు..

భారతదేశవ్యాప్తంగా విభిన్న ప్రాంతాల్లో వివిధ పేర్లతో విస్తరించి ఉన్న మÖలవాసులైన ఆదివాసుల ఉనికి చరిత్ర కారణాలు ఏమైనా కాలా నుగుణంగా వెనుకబడిన,నినిజంనిప్పు లాంటిది” అన్న సామెతలా…అణగదొక్కబడ్డ ఆదివాసుల చరిత్ర పోరాటాలు నేటి కాలపు పరిశోధక రచయితల కృషితో ఆవిష్కరించ బడుతున్న ఆధు నిక అక్షర యుగంలో మనం ఉన్నాం.

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యులు ఆచార్య ఎం.గోనానాయక్ కలం కృషితో వెలువడిన విలువైన పుస్తకం నిభారతీయ గిరిజన వీరులు”మొగలుల కాలం నుంచి ఆంగ్లే యుల పాలనవరకు సాగిన కాలంలోస్వేచ్ఛ కోసం పోరాటం చేసి అమరులైన ఆదివాసి వీరులు అనేకమంది చరిత్రకు చిక్కకుండా కాలగర్భంలో కలిసిపోయారు,
బ్రిటిష్ వారి అధికార గెజిట్లో గిరిజన యో ధుల సంఖ్య 142 కాగా, గిరిజన జాతుల జాతీయ కమిటీ వారి గణాంకాలు ప్రకారం 50 మంది గిరిజన పోరాటవీరుల వివరాలు మాత్రమే నమో దు కాబడ్డాయి,
ఇక ఈ పుస్తక రచయిత విశేష కృషి క్షేత్ర పర్యటనల సాయంగా మరో ఆరుమంది గిరిజన పోరాట వీరులు వెలుగు చూశారు దీనిలో మొత్తం 56 మంది ఆదివాసి పోరాట యోధుల వివరాలు వర్ణ చిత్రాలతోపాటు ఆంగ్ల తెలుగు మాధ్యమా లలో అందించడం ఎంతో ఉపయోగంగా ఉంది. సమాచారం సంక్షిప్తంగా ఆగుపించిన అది అనం తర కాలంలో చేయాల్సినకృషికి దారులు వేసేదిగా ఉంది.కేరళకు చెందిన‘కురిచియ్ణగిరిజన తెగకు చెందిననితలక్కల్ చందు”మొదలు పాల్వంచ ప్రాం తానికి చెందిన కోయ గిరిజన తెగకు చెందిన సోయం గంగులు వరకు గల గిరిజన పోరాట యోధుల సంక్షిప్త సమాచారాలు ‘కొండ అద్ద మందు్ణ అన్న చందంగా మనం ఈ పరిశోధనా పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు.గిరిజన పోరాట యోధులు అనగానే మనకు స్పూర్ణకు వచ్చే రాణి దుర్గావతి కొమరంభీమ్ రాంజీగౌడ్,బీర్సా ముండా అల్లూరి సీతారామరాజు వంటి కొందరితో పాటు ఎందరో అజ్ఞాత వీరుల వివరాలు ఆసక్తిదాయ కమైన విశేషాలు కలగలిపి అందించారు రచయిత గోనా నాయక్. ఇందులో మనం రెండు విధాల యోధులను గమనించవచ్చు, మొదటి విభాగంలో గిరిజనులు అయిన గిరిజన యోధులు కాగా గిరిజనులను రక్షించే లక్ష్యంతో గిరిజనుల పక్షాన నిలిచి పోరాటం చేసిన గిరిజనేతర పోరాట యోధులు.ఇటువంటి గిరిజనేతర పోరాట యోధుల వర్గంలో అల్లూరి,నారాయణ సింగ్, గోవింద్ గురు,ప్రవీర్‌చంద్ర భంజ్ దేవ్,వంటి గిరిజనే తరుల,త్యాగాలను పోరాట స్ఫూర్తిని గిరిజ నుల్లో చైతన్యం నింపి ఏకం చేయడంలో చేసిన కృషిని ఇందులో చేర్చడం జరిగింది.ఒడిశా ప్రాం తానికి చెందిన మల్కనగిరి ప్రాంత అడవి బిడ్డ తామడోరా.బ్రిటీష్ పాలకులపై చేసిన విరోచిత తిరుగు బాటు,బ్రిటిష్ వారు అందించిన ఉద్యోగ భృతిని దేశంకోసం తృణప్రాయంగా విడిచి తనను నమ్మిన తన ఆదివాసి జాతి పరిరక్షణకోసం తనను తాను అర్పించుకున్న మధ్యప్రదేశ్‌కు చెందిన భీల్ గిరిజన తెగ వీరుడు కాజా నాయక్, మహారాష్ట్రకు చెందిన గోండు వీరుడు బాబురావుషడ్మా,పోరాట పటిమ మనం ఇందులో చదువుతాము. ఈచారి త్రిక గిరిజన యోధుల పోరాట గాథల్లో ధైర్యం సాహసం నిస్వార్థం వంటి యోధుల సుగుణాలతో పాటు,స్వల్పంగా అస్మధీయులుగా సహచరులుగా తనతోటివారు చేసిన నమ్మక ద్రోహం,కుట్రలు, తద్వారా వీరులుశత్రువులకు పట్టుబడ్డ వైనాలు, వ్యూహాలు,ప్రతివ్యూహాలు ఇందులో కూలం కషంగా చదువుకోవచ్చును.గిరిజనేతరుడైన గిరిజ నుల పట్లగల వాత్సల్యంతో వారిలో చైతన్యం నింపి సంఘటితం చేసి, నూతన పోరాట విధానా లు ఆయుధాలు పరిచయం చేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు గురించి అతని కృషి సాయంగా అందించే నేపథ్యంలో అతడి వివరాలు తెలిపే క్రమంలో అల్లూరిని ‘భీల్ణ తెగకు చెందిన గిరిజన వీరుడుగా పరిచయం చేయడం కాస్త అసంబద్ధంగా అనిపించినా! అది అక్షర దోషం గానే భావించాలి తప్ప సమాచార లోపం అన రాదు.ఈ గిరిజన పోరాట యోధులలో పురు షులతోపాటు మహిళా వీర వనితల వివరాలను కూడా ఇందులో చేర్చి రచయిత తన పరిశోధన పరిధిని మరింత విస్తృతం చేశారు, మొత్తం ఆరు మంది ఆదివాసి మహిళా పోరాట యోధుల వివ రాలు పొందుపరిచారు వీరిలో రాణిమా గైడిన్యూ ,రాణి దుర్గావతిలు ప్రముఖంగా అందరికీ తెలిసిన ఆదివాసి పోరాట యోధులు కాగా, రాణి రోపుయి యాని, వీరాంగనలీపా,సింగిదాయిలతో పాటు పూలో-ఝానో ముర్ములు, అనే ఆదివాసి సోదరీ మణులు చేసిన వీరోచిత పోరాటాల గురించి ఆసక్తిదాయకమైన వివరాలు ఇందులో ఉన్నాయి. ప్రతి ఆదివాసి పోరాటయోధుల గురించిన జనన, వీర మరణ,తేదీలతోపాటు పుట్టినప్రాంతం, అలా గే ఏ గిరిజన తెగకు చెందిన వారో కూడా ఆంగ్ల తెలుగు భాషల్లో అందించి,సమాచారం పక్కనే ఆయోధుల అందమైన ఊహ వర్ణచిత్రాలు అందిం చడం ఈ పుస్తకానికి అదనపు ఆకర్షణగా ఉంది. జార్ఖండ్ ప్రాంతానికి చెందిన సంతాల్ గిరిజన జాతి వారైనా సిద్ధూ, కనుహ ముర్ము ,అనే ఇద్దరు అన్నదమ్ములు వారి తమ్ముళ్లు చాంద్, బైరన్, లతో పాటు వీరికి వరుసకు చెల్లెళ్లు అయిన పూలో, ఝానో ముర్ములు,నాటి బ్రిటిష్ వారి అమానుష పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయడమే కాక మొత్తం కుటుంబ సభ్యులందరూ స్వాతంత్ర సమ రంలో ప్రాణత్యాగం చేసిన అరుదైన విష యాన్ని ఈపుస్తక రచయిత గోనాయక్ వెల్లడి చేయడం ఆయన పరిశోధనా ప్రతిభకు నిదర్శనం.
అడవి బిడ్డలైన గిరిజనవీరులు పూలో,ఝానో, ముర్ములు మగవాళ్లకు ధీటుగా సాధారణ ఆయు ధాలైన గొడ్డళ్లు చేతబట్టి స్వరాజ్య సమరంలో నిలి చారు.ఈఅక్కాచెల్లెళ్లు చిన్నతనం నుంచే అబ్బా యిల మాదిరిగా గుర్రాలపై తిరిగేవారు తమ ప్రాంత స్త్రీలందరినీ ఏకంచేసి స్త్రీ సైన్యాన్ని ఏర్పా టు చేసిన ధీరవనితలు వీరు, పురుషులతో సమా నంగా గెరిల్లా యుద్ధాలు చేస్తూ బ్రిటీష్ సేనలపై మెరుపు దాడులు చేసేవారు.వీరు కూడా తమ అన్నల వలే సహచరుల నమ్మకద్రోహంతో శత్రువు లకు పట్టుబడి వీర మరణం చెంది అజ్ఞాత ఆది వాసి సమరయోధుల జాబితాలో చేరారు. నాటి స్వరాజ్యసమరంలో వీరమరణం పొందిన యోధు లను రెండు వర్గాలుగా విభజించాలి ఒకవర్గం బ్రిటిష్ వారితో ప్రత్యక్షంగా సాయుధ పోరాటాలు చేసి యుద్ధరంగంలో అమరులైన వారు. రెండవ వర్గం తిరుగుబాటు దారులుగా పట్టుబడి జైలు శిక్షలతో ఉరి తీయబడిన వారుగా చెప్పవచ్చు. అతి తక్కువ మంది గిరిజన వీరులు ఉరిశిక్షలతో అమరులైనారు,అందులో ప్రధాన యోధుడు మహా రాష్ట్రలోని చంద్రపూర్‌కు చెందిన గోండ్ గిరిజన యోధుడు బాబురావు షడ్మ ఒకరు.తనకు చిన్న తనం నుంచి తమ తల్లి అడవి నేర్పిన వేటల రహస్యాలే అనంతర కాలంలో బ్రిటిష్ వారి అమా నుష పాలనకు వ్యతిరేకంగా చేసిన పోరాటానికి ఉపయోగపడ్డాయి.తన ప్రాంత గిరిజన యువత ను సమీకరించుకుని‘జింగో్ణసైన్యాన్ని సిద్ధం చేసి శిక్షణలు ఇచ్చి బ్రిటిష్ సేనలపై దాడి చేసి మÖడు సార్లు విజయం సాధించాడు బాబురావు, ఆఖరికి అస్మదీయుల నమ్మకద్రోహంతో పట్టుబడి సమర ఖైదిగా చాందా జైలులో శిక్షించబడి అక్కడే 21 అక్టోబర్ 1858న ఉరి తీయబడ్డాడు.
ఇటువంటి మరుగున పడిన ఎన్నో గిరిజన వీరుల స్వరాజ్య సమర సంగతులు ఆసక్తిదా యకమైన అనేక అంశాలు,ఈ ‘భారతీయ గిరిజన వీరులు్ణపుస్తకంలో మనకు లభ్యం అవుతాయి. భావితరం పరిశోధకులకు ఇది ఒక దారి దీపం, దీని సాయంగా మన దేశ గిరిజన వీరుల వివరాల గురించిన విస్తృత పరిశోధనలు చేయాల్సిన అవ సరం అర్ధం అవుతుంది. ఆదిశగా కృషి జరిగిన నాడు గోనా నాయక్ గారి నేటి ఈఅక్షర కృషికి అర్థం పరమార్థం అందుతాయి, అది సఫలం కావాలని ఆశిస్తూ…పరిశోధక ఆసక్తి పరులే కాక ఆదివాసి ప్రేమికులంతా సొంతం చేసుకోవలసిన అక్షర వజ్రాల పేటిక ఈపుస్తకం, అనడంలో అతిశ యం లేదు.
భారతీయ గిరిజన వీరులు (వ్యాససంపుటి), పేజీలు : 134, ధర : 300/-రూ, ప్రతులకు: ఆచార్య ఎం.గోనానాయక్,హైదరాబాద్, సెల్ : 98490 93300., సమీక్షకుడు :- డా: అమ్మిన శ్రీనివాసరాజు, సెల్ :77298 83223.

యువతా… ఏ భావజాలాన్ని గుడ్డిగా నమ్మొవద్దు

‘యువత ఏఒక్క భావజాలాన్ని గుడ్డిగా నమ్మ వద్దు.ఎవరి ఐడియాలజీని గుడ్డిగా నమ్మి ప్రభావితం కావద్దు. మీరు ప్రభావితం అయిన భావజాలం ఈ కాలానికి సరి పోతుందా? లేదా అనేది ఒకటికిపదిసార్లు ఆలోచించి ముందుకు వెళ్లండి. భావోద్వేగా లతో కాకుండా వాస్తవికత ఆధారంగా ఆలోచనలు చేయాలని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ పిలుపు నిచ్చారు. ప్రపంచాన్ని మార్చగల శక్తివం తమైన ఆయుధం విద్య అని,సమాజ సేవే యువత ధ్యేయం కావాలని కోరారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ప్రపంచ శక్తిగా నిలిస్తే, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం లో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. తన ఆఖరిశ్వాస వరకు భవిష్యత్ తరాల కోసమే పని చేస్తా నని తెలిపారు.ఆంధ్ర విశ్వ విద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వ హించిన మెగా కల్చరల్ ఫెస్ట్ ముగింపు వేడు కలకు ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్ధులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ‘ఆంధ్ర విశ్వకళా పరిషత్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం రావడం గొప్ప గౌరవంగా భావి స్తున్నాను. యÖనివర్శిటీ గురించి మాట్లాడు కోవాలంటే మొదట చిహ్నం గురించి మాట్లాడుకోవాలి.ఆంధ్ర యÖనివర్సిటీ లోగోను ప్రత్యేక శ్రద్ధతో తయారుచేశారు. లోగోలోని ప్రతి అంశానికి అర్థం స్ఫూరిం చేలా తయారు చేశారు. కాంతి కిరణాలతో ఉదయించే సూర్యుడు విశ్వ విద్యాలయాన్ని, దాని అనేక అధ్యయన విభాగాలను సూచిస్తుంది.ఇక కమలం శ్రేయో దేవత లక్ష్మీ,జ్ఞాన దేవత సరస్వతి ఇద్దరినీ ప్రతిబిం బిస్తుంది. సూర్యకిరణాలపై ఆర్యులలో దీవెన చిహ్నమైన స్వస్తిక్ ఉంటుంది.అరవై నాలుగు తామర రేకులతో కూడిన శిఖరం బయటి వృత్తం, భారతదేశ శాస్త్రీయ సంప్రదాయంలోని అరవై నాలుగు కళ లను,శాస్త్రాలను సూచిస్తుంది.ఇక సముద్రా న్ని-విద్యార్థులు ప్రావీణ్యం పొందడానికి దోహదపడే విస్తార మైన జ్ఞానకేంద్రం అనే అర్థంలో తయారు చేశారు.ఉపనిషత్తుల లోని ‘తేజస్వినావధిత మస్తు’ అనే నినాదా న్ని కూడా లోగోలో భాగం చేశారు.దీని అర్థం ఏమిటంటే ‘దైవిక కాంతి మన అధ్యయనాలను ప్రకాశింపజేయుగాక‘ అని.ఈజ్ఞాన చిహ్నం కింద అన్ని మతాల లోనూ ప్రాశస్త్యం కలిగిన నెలవంక ఉంది. ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని కళల అభివృద్ధికి నెలకొల్పిన సంస్థ అనే అర్థంతో ‘ఆంధ్ర విశ్వకళాపరిషత’ అని దీనికి నామకరణం చేశారు. లోగోలోని దిగువభాగంలో ఉన్న రెండు సర్పాలు జ్ఞానాన్ని కోరుకునేవారిని, జ్ఞాన సంరక్షకులను సూచిస్తాయి.వేలాది మంది మేధావులను సమాజానికి అందిం చిన సంస్థ ఆంధ్ర విశ్వవిద్యాలయం గురించి పూర్వ విద్యార్ధి,నాఆత్మీయులు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి ద్వారా తెలుసు కున్నాను.ఆయన ఇదే యÖనివర్శిటీలో న్యూక్లియర్ ఫిజిక్స్‌లో మాస్టర్స్ చేశారు. ఆయన అన్ని విభాగాల గొప్పదనం గురిం చి వివరించే వారు. అలాంటి ఆంధ్ర యÖనివర్శిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తు న్నాను. ప్రపంచవ్యాప్తంగా విద్యనందించే ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు చాలా ఉన్నప్ప టికీ,కొన్ని తరాలను తీర్చిదిద్దుతూ అద్వితీ యమైన జ్ఞానాన్ని అందించే విద్యా సంస్ధలు కొన్నే ఉన్నాయి. ఈ కొద్ది సంస్థల్లో శతాబ్ద కాలంపాటు ఎన్నో వేల మంది మేధావు లను సమాజానికి అందించిన చరిత్ర ఆంధ్ర విశ్వకళా పరిషత్,ఆంధ్ర యÖని వర్శిటీకే దక్కుతుంది. ఈ ఆంధ్ర విశ్వ విద్యాలయం కేవలం ఒకప్రాంగణం మాత్రమే కాదు. విలువలతో వ్యక్తిత్వంతో దేశ నిర్మాణంలో భాగస్వామ్యంగా నిలిచి, శాతాబ్దకాలాన్ని దిగ్విజయంగా పూర్తి చేసు కున్న భారతీయ వారసత్వ సంపదకు చిహ్నం.1926లో ఉన్నత విద్యను అందిం చాలన్న గొప్ప సంకల్పంతో మేధస్సు, సంస్కృతి,దేశ నిర్మాణం అనే మÖడు స్థంభాలపై ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. ఇక్కడ విద్యను పూర్తి చేసుకుని బయటకు వెళ్లిన వారు కేవలం ఉద్యోగా లుగా కాదు..వివిధ రంగాల్లో సమాజాన్ని ముందుకు నడిపే నాయకులుగా, మేధావు లుగా, వ్యవస్థలో మార్పు తీసుకువచ్చే బలమైన శక్తిగా నిలిచారు. శతాబ్ది చరిత్ర కలిగిన ఈ స్థాయిలో ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని నేడు మనమంతా చూడగలుగుతున్నామంటే అందుకు పునాదులు వేసిన మహనీయులు డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి గారికి, అందుకు విలువైన సహకారం అందించిన మాజీ ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి,నోబెల్ అవార్డు గ్రహీత సర్ సి.వి.రామన్ మనస్ఫూర్తిగా నమస్సుమాంజ లులు తెలుపుతున్నాను.
జీవితంలో ఎటు వెళ్లాలన్న ఆలోచనలు ఇక్కడే మొదలవుతాయి
ఆంధ్ర విశ్వ విద్యాలయం శతాబ్దకాలం ఎంతో మంది చరిత్రలో నిలిచారు. ఇదే విశ్వవిద్యాల యంలో విద్యాభ్యాసం చేసిన మాజీ ఉపరాష్ట్ర పతి ఉన్నారు. మనం జీవితంలో ఎటువైపు వెళ్లాలి అనే మార్గాన్ని ఎంచుకునే ఆలోచన మనకి యÖని వర్శిటీతో మొదలవుతుంది.ఆగమ్యాన్ని ఎలా చేరుకోవాలనేది మాత్రం స్వశక్తితోనే నిర్ణయించుకోవాలి. మీరు కేవలం విశ్వ విద్యాలయం విద్యార్ధులు మాత్రమే కాదు..ఈ విశ్వ విద్యాలయం భవిష్యత్తు మీరు. ఇక్కడ గడిపే రోజులు మీజీవితంలో ముఖ్య మైన క్షణాలు. మీ ఆలోచనలు తీర్చిదిద్దే అద్భుత క్షణాలు.దేశ భవిష్య త్తుకు మీరే నావికులు.విద్య అంటే పుస్తకాల్లో ఉన్న జ్ఞానం మాత్రమే కాదు.సమస్యల్ని ఎదుర్కో గలిగే ధైర్యం.సరైన నిర్ణయాలు తీసుకునే వివేకం.సమాజానికి ఉపయోగపడే బాధ్యత. సౌతాఫ్రికా అధ్యక్షు నిగా చేసిన నెల్సన్ మండేలా మాటల్లో చెప్పాలంటే ప్రపంచాన్ని మార్చగలిగే అత్యంత శక్తివంతమైన ఆయు ధం విద్య. మీలక్ష్యం కేవలం ప్రతిభ కాదు. మీ ధ్యేయం సమాజ సేవ కూడా కావాలి. మీజ్ఞానం మీ కోసమే కాకుండా, సమాజానికి, దేశానికి ఉపయోగ పడాలి. ఈరోజు ప్రపంచ స్థాయిలో భారత దేశం ఒక బలమైన దేశంగా నిలిచింది.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆత్మ నిర్భర్ భారత్, మేకిన్ ఇండియా,వికసిత్ భారత్ 2047వంటి కార్యక్రమాలు భారత దేశాన్ని స్వయం సమృద్ధి వైపు తీసుకువెళ్తున్నాయి. రాష్ట్రంలోనూ విద్యా, సాధికారత, యువత, అవకాశాలను అంది పుచ్చుకునే ఆలోచనలతో ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తోంది.రాష్ట్రం పునర్నిర్మాణంలో యువతని భాగస్వామ్యం చేసే దశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈమార్పుని సాధించ గలిగేది యువత మాత్రమే. మన భవిష్యత్తుని మన ఆలోచనలే నిర్ణయిస్తాయి. మీ విలువులు, చర్యలే నిర్ణయి స్తాయి.మీ విజ్ఞానం మీ ఆలోచ నలు ఒక పరిష్కార మార్గాలుగా రూపాంతరం చెందాలి. “మీ జ్ఞానం ఆవిష్క రణగా మారాలి. మీ ఆలో చనలు పరిష్కా రాలుగా మారాలి. మీ కృషి సమాజానికి దేశానికి మేలు చేసే అర్థవంత మైన మార్పుగా మారాలి. బలమైన నమ్మకంతో కలలు కనండి.మీ కలల్ని తొక్కుతూ నడుస్తున్న కాళ్లని ఖండించే వరకు కలలు కనండి. నిరం తర కృషి, నిబద్దతతో ముందు సాగండి.
ఏ భావజాలాన్ని గుడ్డిగా నమ్మొద్దు
కారల్ మార్క్స్ లాంటి వ్యక్తులు,నాలాంటి వ్యక్తులు ఎవరు ఏఐడియాలజీ చెప్పినా గుడ్డిగా నమ్మి ప్రభావితం కావొద్దు. ఆ సిద్ధాంతం ఈ కాలానికి సరైనదా?కాదా?భవిష్యత్తుల్లో నిల బడుతుందా? లేదా?అని ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. కేవలం భావోద్వేగాలతో కాకుండా వాస్తవాలు,తర్కం ఆధారంగా ఆలో చించాలి.80,90ల్లో బ్యాలెన్డ్స్ లేని ఐడియాలజీ నమ్మి ఎంతో మంది అడవులకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు.ఏదైనా ఒక ఐడియాలజీ నమ్మే ముందు ధర్మబద్ధంగా ఉందా?రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉందా? దేశ సమగ్రతను కాపాడుతుందా? అని ఆలోచన చేయాలి. మనం ప్రభావితమయ్యే ఐడియాలజీ ఒక వర్గానికి,ఒక కులానికి లేదా ఒక మతానికి మాత్రమే లాభం చేకూ రుస్తూ,మిగిలిన వారిని తక్కువ చేసి చూస్తుంటే అది నైతికంగా సరైనది కాదు అని అర్థం.విశ్వ విద్యాలయాల్లో ఎంతో మంది విద్యార్ధి నాయకులు,రాజకీయ పార్టీ లకు సంబంధించిన విద్యార్థి సంఘాలు ఉం డొచ్చు.వాళ్లు ఏఐడియాలజీ చెప్పినా ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఈ మాటలు పార్టీ పెట్టిన కొత్తలో చెప్పటం లేదు.పార్టీ పెట్టి దశాబ్ధ కాలం తరువాత చెబు తున్నాను. ఎన్నో ఎదురు దెబ్బలు తిని, నలిగిన తరువాత చెబుతున్నాను.ఏదైనా ఒక ఐడియాల జీని నమ్మే ముందు భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని ఒక సమగ్రమైన నిర్ణయా నికి రండి. మీరో విస్పోటనం…ఏదీ అను కుంటే అది జరుగుతుంది దేశం యొక్క అభి వృద్ధి యువత మీద ఆధారపడి ఉంటుంది. వారి శక్తి, ఉత్సాహం, సృజనాత్మకత దేశాభి వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయి. వారిలో న్యూక్లియర్ ఎనర్జీ దాగి ఉంటుంది. తలుచు కుంటే ఒక పెద్ద విస్పోటనం సృష్టించ గలరు. నాలాంటి వాడే సమాజానికి ఇంత చేయ గలిగితే..మీరికెంత చేయగలరో ఆలోచించాలి. ఆసాధన ఫలితాలు ఇస్తుంది.యువత దేశ నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలని, మీలో ప్రతి ఒక్కరు బాధ్యతగల పౌరులుగా ఎదగాలని ఆశి స్తున్నాను” అన్నారు. – జి ఏ సునీల్ కుమార్ 

అటవీ ఉత్పత్తులు తగ్గుతున్నాయ్

ఉత్తరాంధ్ర గిరిజన ప్రాంతాలైన అల్లూరి జిల్లా, పార్వతీ పురం మన్యం ప్రాంతాల్లో గిరిజనులకు జీవనా ధారమైన అటవీ ఉత్పత్తులు గణనీయంగా తగ్గిపోతున్నాయి. అడవిలో సహజంగా పండే ఉత్పత్తులు వాతావరణ మార్పుల్లో చోటు చేసుకున్న నేపథ్యంలో తుఫాన్ల సమ యంలో నేలకొరిగిన చెట్లు కారణంగా ఉత్పత్తి సేకరణ తగ్గిపోయాయి.పడిపోయిన చెట్లు స్థానంలో విత్తనాలు లభించక గత ఐదేళ్లగా మొక్కలు నాటక పోవడంవల్ల ఉత్పత్తులు తగ్గిపోతున్నాయని గిరిజనులు వాపోతున్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా మెళియాపుట్టి మండలంలో ఒకప్పుడు అధికంగా ఉండే నరమా మిడి చెట్లు ఇప్పడు కనుమరుగయ్యాయి. పదేళ్ల కిందట అధికంగా కుడ్డబ, దీనబందుపురం, నాయుడు పోలూ రు తదితర గ్రామాల సమీపాన కొండల్లో ఏటా 50క్వింటాళ్ల వరకూ నరమామిడి చెక్కను జీసీసీ సిబ్బంది కొనుగోలు చేసేవారు. 2018లో సంభవిం చిన తితలీ తుఫాన్ ప్రభా వంతో చెట్లన్నీ నెలకొరి గాయి.గతఐదేళ్లుగా అటవీ శాఖద్వారా కొండల్లో మొక్క లు నాటడం లేదు. దీంతో నరమామిడి చెట్లు కనుమరుగయ్యాయని గిరిజనులు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు.
అడవుల్లో సహజ సిద్ధంగా లభ్యమయ్యే ఉత్పత్తులు తగ్గుతున్నాయి. జిల్లాలోని మెళియాపుట్టి, నందిగాం,టెక్కలి,పాతపట్నం,మందస,కొత్తూరు, హిర మండలం, మండలాల పరిధిలో అధికంగా అటవీ ఉత్పతుల సేకరణ జరిగేది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఔషధ మొక్కలు నాటి వాటి ద్వారా గిరిజనులకు ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టేవారు.జీసీసీ ద్వారా అటవీ ఉత్పత్తులు సేకరించేవారు. అయితే అడవుల్లో గతంలో ఉన్న ఔషధ మొక్కలు, చెట్లు ప్రస్తుతం కనిపించటం లేదు. ప్రకృతి వైపరీత్యాలతో చాలా చెట్లు నేలకొరిగాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో గత ఐదేళ్లూ అటవీశాఖ అధికారలుఉ కనీస స్థాయిలో మొక్కలు నాటలేదు. మరోవైపు కొంతమంది గిరిజనులు పోడు వ్యవసాయం చేసేందుకు చెట్లను నరికేస్తున్నారు. దీంతో విప్ప, నరమామిడి చెక్క, ఉసిరి, అడ్డాకులు, కొండ తామర జిగురు తదితర చెట్లు కనుమరుగ య్యాయి. ప్రస్తుతం అధికంగా కుంకుళ్లు, చింతపండు, కొండచీపుర్లు మాత్రమే గిరిజనుల నుంచి జీసీసీ అధికారులు సేకరిస్తున్నారు. విప్ప పంట ద్వారా గిరిజనులకు అధికంగా ఆదాయం వచ్చేది. ప్రస్తుతం విప్ప పంట లేక..జీసీసీ అధికా రులు కొనుగోలు చేయడం లేదు. అలాగే అటవీ ప్రాంతాల్లోని చెట్లకు ఉన్న తేనె పట్టుల నుంచి తేనె సేకరించి ఇతర రాష్ట్రాలకు తరలించేవారు. తుఫాన్ల కారణంగా చెట్లు నేలకొరగడంతో తేనెతీగల పట్లు ఎక్కడా కనిపించడం లేదు. దీంతో తేనె సేకరణ తగ్గింది. అలాగే పదేళ్ల కిందట జిల్లా నుంచి 5వేల క్వింటాళ్ల వరకూ జీసీసీ ద్వారా నరమామిడి చెక్కను గిరిజనులు సేకరించేవారు. ప్రస్తుతం నరమామిడి చెట్లు లేక 50 క్వింటాళ్లు కూడా రావడం లేదని జీసీసీ అధికారులు చెబుతున్నారు. గిరిజనులు సేకరిస్తామన్నా..చెట్లు లేని పరిస్థితి నెలకొందన్నారు.అడవుల్లో సహజంగా లభించే ఉసిరికాయల చెట్లు కూడా కనిపించడం లేదు. కొన్ని ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు నరికి ఉసిరి కాయలు సేకరిస్తున్నారు. దీంతో చెట్లు మళ్లీ చిగురించక.. ఉసిరి పంట కూడా కరువవుతోంది. గతంలో గిరిజనులు సేకరించే అడ్డాకులకు భలే గిరాకీ ఉండేది. ప్రస్తుతం ప్లాస్టిక్ వినియోగం పెరగడంతో అడ్డాకులకు డిమాండ్ తగ్గింది. దీంతో అడ్డాకుల సేకరణపై గిరిజనుల్లో ఆసక్తి సన్నగిల్లుతోంది. అలాగే అధికంగా ఔషధాలకు వినియోగించే కొండతామర జిగురు కూడా ఎక్కడా కనిపించడం లేదు. మందస, మెళియాపుట్టి, నందిగాం తదితర ప్రాంతాల్లో ఒకప్పుడు విరివిగా ఉన్న ఈ చెట్లు.. ప్రస్తుతం కనుమరుగయ్యాయి. చింత, కుంకుడు చెట్లు కూడా ముదిరిపోవడంతో ఉత్పత్తులు తగ్గుతు న్నాయి. ఒకప్పుడు లారీల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించేవారు. ప్రస్తుతం ఏడాదికి జీసీసీ ద్వారా 500 క్వింటాళ్ల కుంకుడు కాయలు, 2,500 క్వింటాళ్ల చింతపండు మాత్రమే సేకరిస్తున్నారు. కొండచీపుర్లు కూడా ఏడాదికి పదివేల కట్టలు మాత్రమే సేకరిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. అటవీ ఉత్పత్తులు తగ్గడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడవుల్లో మొక్కలు నాటాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.కూటమి ప్రభుత్వం స్పందించి అటవీశాఖ ద్వారా ఔషధాలకు వినియోగించే మొక్కలు నాటేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో ఒకప్పుడు సుమారు 20రకాల అటవీ ఉత్పత్తులు పుష్కలంగా లభించేవి. ప్రధానంగా తేనె, మైనం,చింతపండు, ఇండిగపిక్కలు, ముసి డిక పిక్కలు,మారేడు గడ్డలు,వెప్ప పువ్వు, కాగు పుప్వు,కరక్కాయలు,గచ్చకాయలు,నరమా మిడిచెక్క,కొండచీపుర్లు, కుంకుడుకాయలు,ఎండ ఉసిరిపప్పు,నల్లజీడిపిక్కలు తదితర వాటిని విక్రయిస్తూ గిరిజనులు జీవనం సాగించేవారు. అయితే కాలక్రమంలో అటవీ ప్రాంతం తగ్గడం, తదితర కారణాలవల్ల గిరిజనులు అనేక ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. కొన్ని రకాల అటవీ ఉత్పత్తులు మాత్రమే లభిస్తుండగా..వాటికి కూడా గిట్టుబాటు ధర దక్కడం లేదు.వివిధ కారణాలతో జీసీసీ అధికారులు పూర్తిస్థాయిలో అటవీ ఉత్పత్తు లను కొనుగోలు చేయడం లేదు.గిట్టుబాటు ధర కూడా కల్పించడం లేదు. దీంతో గిరిజనులు తమ అటవీ ఉత్పత్తులను నష్టానికే మైదాన ప్రాంతాల వ్యాపారులకు విక్రయించాల్సి వస్తోంది.
రెగ్యులర్ సిబ్బంది లేక ..
ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు ప్రత్యేక సేవలు అందించాల్సిన జీసీసీ డిపోలను రెగ్యులర్ సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది.దీంతో అవి ఉత్సవ విగ్రహాలుగా మారాయి. గుమ్మలక్ష్మీపురం పరిధిలో 46, సాలూరులో 38,పార్వతీపురంలో 17 డిపో లు ఉన్నాయి. మొత్తం 101డిపోల పరిధిలో 14 మంది రెగ్యులర్ సేల్స్‌మెన్ ఉన్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.18 డిపో లకు ఎటువంటి సిబ్బంది లేరు.కాగా మిగితా వాటిని కాంట్రాక్ట్ సేల్స్ మెన్, మహిళా సంఘాల, డీలర్లు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.ఇన్‌చార్జిల నేతృత్వంలోనే డిపోలను నిర్వహించాల్సిన పరిస్థితి పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో ఉంది. సీతంపేట ఐటీడీఏ పరిధిలోనూ పూర్తిస్థాయిలో సేల్స్‌మెన్‌లు లేరు.దీంతో డిపోల ద్వారా గిరిజన ప్రాంతాల ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు.
శిథిలావస్థలో డిపోలు…
పార్వతీపురం జీసీసీ పరిధిలో ఉన్న అనేక డిపోలు శిథిలావస్థలో ఉన్నాయి. ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి. దీంతో సిబ్బంది బిక్కుబిక్కు మంటూ విధులు నిర్వర్తించాల్సి వస్తోంది.భవ నాల మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేయాలని అధికారులు ప్రతిపాదనలు పంపినా మోక్షం కలగలేదు. గోదాముల పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది.
కోల్డ్ స్టోరేజీలు ఎక్కడ…
జీసీసీకి జిల్లాలో ఎక్కడా కోల్డ్ స్టోరేజీలు లేవు. దీంతో ఏటా లక్షలాది రూపాయలను ప్రైవేట్ వ్యాపారులకు కట్టబెడుతున్నారు తప్ప సొంతంగా ఏర్పాటు చేసుకోలేకపోతున్నారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం సమీపంలో ఉన్న వేములవలస వద్ద కోల్ట్‌స్టోరేజ్ నిర్మాణాన్ని చేపట్టారు. కానీ అవసరమైన యంత్రాలు రాకపోవడంతో ఆ పను లు పూర్తికాలేదు. సుమారు రూ.మÖడు నుంచి నాలుగు కోట్లు వెచ్చిస్తే..మÖడు జిల్లాల పరిధిలో గిరిజన రైతుల నుంచి కొనుగోలు చేసిన చింతపండును జీసీసీ కోల్డ్‌స్టోరేజ్‌లో నిల్వ చేసు కోవచ్చు.కానీ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు.ఇప్పటికైనా జీసీసీకి కోల్డ్‌స్టోరేజ్ ఏర్పాటు చేస్తే..ఏటా లక్షల రూపాయలు ఆదా చేసుకో వచ్చు. ప్రైవేట్ వ్యాపారులకు అద్దె ప్రాతిపదికన భారీగా చెల్లించాల్సిన అవసరం ఉండదు.గిరిజన రైతులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉం టుంది.నిరూపయోగంగా విలువైన స్థలాలు గిరిజన సహకార సంస్థకు ఉమ్మడి జిల్లాలోని గుమ్మల క్ష్మీపురం ఎస్.కోటతో పాటు విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో విలువైన స్థలాలు ఉన్నాయి. ఈ ప్రాం తాల్లో షాపింగ్ కాంప్లెక్స్ తదితర కమర్షియల్ గొడౌన్లు నిర్మిస్తే జీసీసీకి ఆదాయం ఎంతో వస్తుంది. కానీ దీనిపై అధికార యంత్రాంగం దృష్టి కేం ద్రీకరించడం లేదు.ఈ విషయాన్ని పాలకులకు చెప్పినా పట్టించుకునే వారే కరువ య్యారు.దీంతో జీసీసీకి చెందిన విలువైన స్థలాలు నిరుపయోగంగా మారాయి.
గిరిజనులకు ఊరట
గిరిజనుల నుంచి నేరుగా అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేసి.. వారికి గిట్టుబాటు ధర కల్పిం చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.సర్కారు ఆదేశాలు జారీ చేయండంతో గిరిజన కార్పొరేషన్ సంస్థ (జీసీసీ) అటవీ ఉత్పత్తుల ధరలను పెం చింది. గత ఏడాది కంటే ధరలు పెరగడంతో గిరిజనులకు కాస్త ఊరట కలగుతుందని చెప్పొచ్చు.ఇకపై వారు దళారులను ఆశ్రయిం చాల్సిన అవసరం ఉండదనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
గత ఏడాది ఇలా..
గత ఏడాది పిక్కతో కూడిన కిలో చింతపండు ధర రూ.32-40పైసలు, పిక్కతీసిన చింతపండు రూ.63,కాగుపప్పు రూ.22, విప్పపప్పు రూ.29, కొండతామర జిగురు రూ.114,ముసిడిక పిక్కలు రూ.90, కరక్కాయలు రూ.18,ఎండు ఉసిరిక పప్పు రూ.80, ఇండికా పిక్కలు రూ.50, కానీ కాయలు రూ. 17,కుంకుడుకాయలు రూ.35, సీకా కాయి రూ.40,అడవి తేనె రూ. 250, పుట్ట తేనె రూ.160, తేనె మైనం రూ.160,కొండ చీపుర్లు గ్రేడ్-1 రూ.45
తాజాగా పెరిగిన రేట్లు ప్రకారం…
పిక్కతో ఉన్న కిలో చింతపండు రూ.34,పిక్కతీసిన చింతపండు రూ.67,కాగుపప్పు రూ.25, విప్ప పప్పు రూ.32,ముసిడిక పిక్కలు రూ.వంద, నల్లజీడి పిక్కలు రూ.22,కరక్కాయలు రూ.20, ఎండు ఉసిరిక పప్పు రూ.90, కానీ కాయలు రూ.18కు పెంచారు. మిగిలిన అటవీ ఉత్పత్తుల రేట్లలో ఎలాంటి మార్పు లేదు. గత సంవత్సరంతో పోల్చుకుంటే చింతపండుకు పిక్కతో ఉన్న దానికి రూ.రెండు, పక్కి తీసిన దానికి రూ.నాలుగు పెం చారు.చింతపండు, మిగిలిన అటవీ ఉత్పత్తులను గిరిజనుల నుంచి నేరుగా జీసీసీ కొనుగోలు చేస్తేనే లక్ష్యాలు నెరవేరే అవకాశం ఉంది.గిరిజన రైతులకు కూడా ఎంతోకొంత గిట్టుబాటు అవు తుంది.దీనిపై జీసీసీ ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు.
ధరలపై అవగాహన
గిరిజనులకు జీసీసీ ధరలు, అటవీ ఉత్పత్తుల కొనుగోలుపై అవగాహన కల్పించారు. దళారులకు విక్రయిస్తే నష్టపోతారని,జీసీసీకి అమ్మితే గిట్టుబాటు ధర లభిస్తుందని వివరించారు. అనం తరం ధరల పట్టికను ప్రదర్శించారు. ఈ కార్య క్రమంలో జీసీసీ బ్రాంచి డైరెక్టర్ నూకమ్మ, సర్పంచ్ గంగమ్మ, సేల్స్‌మన్ ఎస్.రమణారావు తదితరులు పాల్గొన్నారు.
కొనుగోలు చేస్తాంజీసీసీ ద్వారా గిరిజనుల నుంచి అటవీ ఉత్పత్తు లను కొనుగోలు చేస్తాం.ఈ ఏడాది రెట్లు పెరి గాయి. ఈ విషయాన్ని గిరిజన రైతులకు తెలిjá Tజేస్తాం. వారికి మేలు జరిగేలా చూస్తాం.- ఉరిటి మహేంద్ర, డివిజనల్ మేనేజర్, జీసీసీ
అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలి
అటవీ ఫలసాయాల్లో భాగంగా గిరిజనుల పండిస్తున్న చింతపండు ధర కేజీ రూ.60 ప్రకటించి గిరిజన సహకార సంస్థ (జిసిసి )యే కొనుగోలు చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తూయి.ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కోలక అవినాష్ మాట్లా డుతూ కొండచీపుర్లు కిలో రూ.80కు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.ఆదివాసీలు అటవీ ఫలాలు సేకరించి అమ్ముతున్న పరిస్థితి గతం నుంచీ ఉందని అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జిసిసి అభివృద్ధికి నిధులు కేటాయించడం లేద న్నారు. జిసిసిల అభివృద్ధికి వెయ్యి కోట్లు కేటా యించాలని డిమాండ్ చేశారు. అలాగే అటవీ ఫలసాయాలు సేకరిస్తు న్నప్పుడు గిరిజనులు ప్రమాదాలకు గురై మృతు చెందుతున్నా ఐటిడిఎ సహకారం ఏ రకంగా కనిపించడం లేదన్నారు.– జి ఎన్ వి సతీష్ 

రాజధాని అమరావతికి రాష్ట్రపతి ఆమోదం

ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. పార్లమెంట్ ఆమోదం అనంతరం అమరావతి బిల్లు రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంది. ఈ బిల్లును పరిశీలించిన అనంతరం.. న్యాయ నిపుణులతో సంప్రదింపుల తర్వాత రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి ఆమోదం అనంతరం కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీ పునర్వవస్థీకరణ చట్టంలోని సబ్ సెక్షన్ 2లో రాజధానిగా అమరావతిని పేర్కొంటూ కేంద్ర న్యాయ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం జూన్ 2, 2024 నుంచి ఏపీ రాజధానిగా అమరావతిని పేర్కొన్నారు. ఏపీ పునర్విభజన చట్ట సవరణ 2026 బిల్లును కేంద్రం ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టగా.. ఉభయసభలు ఆమోదం తెలిపాయి. సుమారు ఐదు గంటలు లోక్‌సభ, రాజ్యసభల్లో అమరావతి బిల్లుపై చర్చ జరిగింది. అనంతరం ఎలాంటి సవరణలు ప్రతిపాదించకుండానే అమరావతికి బిల్లుకు లోక్ సభ, రాజ్యసభలు ఆమోదం తెలిపాయి. దీంతో లోక్‌సభ సచివాలయం అమరావతి బిల్లును రాష్ట్రపతి వద్దకు పంపించగా.. రాష్ట్రపతి సోమవారం రోజున అమరావతి బిల్లుకు ఆమోద ముద్ర వేశారు. దీంతో అమరావతి బిల్లు చట్టరూపం దాల్చింది.
ఆంధ్ర-తెలంగాణలు విడిపోయాక రాజధాని విషయంలో సందిగ్దత నెలకొన్నది. ఆ సందిగ్దతకు తెరదించుతూ ఇటీవలే ఏపీ అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అంటూ మార్చి 28న తీర్మానం చేసింది. ఈ క్రమంలో ఏపీ పునర్వ్య వస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5(2)ని సవరించి ఏపీ రాజధాని అమరావతిగా కేంద్ర ప్రభుత్వం గుర్తిం చింది. ఈ మేరకు ఏప్రిల్ 1, 2 తేదీలలో పార్లమెంటులో ఈ అంశంపై చర్చించారు. మÖజువాణి ఓటు ద్వారా బిల్లును ఆమోదించారు. వైసిపికి చెందిన ఇద్దరు ఎంపీలు మినహా పార్ల మెంటులోని సభ్యులందరూ అమరావతి రాజధాని బిల్లుకు మద్దతు పలికారు. దీనితో బిల్లును కేంద్రం రాష్ట్రపతి ఆమోదముద్ర కోసం పంపగా, రాజ్యాం గంలోని ఆర్టికల్ 111 ప్రకారం తన అధికారాలను అనుసరించి రాష్ట్రపతి బిల్లుకు ఆమోదముద్ర వేసారు. దీనితో కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దాని ప్రకారం 2024 జూన్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిగా గుర్తించామని నోటిఫై చేసినట్లు తెలిపింది.
చట్టబద్ధ రక్షణ ప్రక్రియ సంపూర్ణం
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ సంపూర్ణమైంది. ఇప్పటికే పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందిన ఈ బిల్లుపై రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా పడింది. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు-2026 సోమవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌కు చేరింది. సాయంత్రానికే దీనిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు. రాత్రి 10గంటలకల్లా ‘గెజిట్ నోటిఫికేషన’ కూడా వెలువడింది. దీంతో ‘అమరావతి’కి కేంద్ర స్థాయిలో చట్టబద్ధమైన రక్షణ లభించినట్లయింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర అనంతరం భారత ప్రభుత్వ కార్యదర్శి రాజీవ్ మణి ఈ గెజిట్‌ను విడుదల చేశారు. 2014నాటి రాష్ట్ర పునర్విభజన చట్టంలో… ‘పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఆ తర్వాత ఏపీకి ఒక కొత్త రాజధాని ఉంటుంది’ అని పేర్కొనగా… సవరణ చట్టంలో ‘ఏపీకి అమరావతి కొత్త రాజధానిగా ఉంటుంది’ అంటూ స్పష్టమైన వివరణ ఇచ్చారు. అలాగే సీఆర్డీయే చట్టం-2014 కింద నోటిఫై చేసిన ప్రాంతమంతా ‘అమరావతి’ పరిధిలోకి వస్తుందని మరో సవరణ చేశారు. వెరసి…2024 జూన్ 2 నుంచే రాజధానిగా అమరావతి అమలులోకి వచ్చినట్లయింది.
చకచకా అడుగులు
రాజధాని అమరావతికి చట్టబద్ధమైన రక్షణ కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కేంద్రంతో ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి.ఈ ప్రక్రియ మరింత పకడ్బందీగా జరిగేలా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాలని కేంద్రం సూచించింది. దీంతో… మార్చి 28న శాసన సభ ప్రత్యేకంగా సమావేశమైంది. 2024 జూన్ 2 నుంచే అమరావతిని రాష్ట్ర రాజధా నిగా గుర్తించేలా చట్ట సవరణ చేయాలంటూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఆమేరకు 2014చట్టంలోని సెక్షన్ 5లోని సంబంధిత సబ్ సెక్షన్లలో సవరణ చేయాలని కేంద్రాన్ని కోరింది. ఆ వెంటనే కేంద్రమÖ కదిలింది. లోక్‌సభలో ఈ నెల 1,రాజ్యసభలో 2వ తేదీన చట్ట సవరణ బిల్లుపై ఆమోద ముద్ర పడింది. దాదాపు 4.30 గంటలపాటు ఉభయసభలలో సవరణ బిల్లుపై చర్చ జరిగింది. ఇది రాష్ట్రపతి భవన్ చేరడం…రాత్రికే గెజిట్ నోటిఫికేషన్ జారీ కావడం విశేషం.
చరిత్ర నేపథ్యం..
రాజధాని అన్వేషణ దశాబ్దాల పాటు సాగిన, ఎన్నో మలుపులున్న కథ.మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచే వేరు పడి కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ఓకీలక మలుపు.ఏళ్ల పాటు ఇదే విధంగా పరిపాలన సాగినా 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది. అప్పటి నుంచి రాష్ట్రానికి రాజధాని లేదన్న లోటు ఏర్పడింది.అలాంటి సమయంలో అమరావతి ఓ వెలుగు రేఖలా కనిపించింది. సరికొత్త ఆశలు చిగురించాయి. రాజధాని నిర్మాణం అనగానే రైతులు సంతోషంగా ముందు కొచ్చారు.భూ సమీకరణకు సహకరించారు. ఆ విధంగా కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలే పునాదులుగా అమరావతి రూపకల్పనకు అడుగులు పడ్డాయి.రాజధాని అంటే కేవలం నగరం కాదు. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి అదో శాశ్వత ప్రతీక. భవిష్యత్‌కు అదో చిరు నామా. ‘అమరావతి’ అసలు ఈ పేరులోనే ఓ స్పష్టమైన దృక్పథం, ఒక దూరదృష్టి అంతర్లీ నంగా ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరవాత నవ్యాంధ్రకు రాజధాని నిర్మాణం అత్యవసరంగా మారింది. ఆ నగరా నికి ఏ పేరు పెట్టాలి అన్న మేధోమథనమÖ జరిగింది. ఆ సమయంలోనే ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు ‘అమరావతి’ పేరు ప్రతిపాదించారు. ఆప్రతిపాదనను అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదించారు. ఆ తరువాత ప్రభు త్వం అధికారికంగా అమరావతి పేరునే ఖరారు చేసింది.
నిజానికి అమరావతి ప్రాంతానికి శాతవాహనుల కాలం నుంచి చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. తపోభూమిగానూ ఖ్యాతికెక్కింది. కృష్ణా గోదావరి నదుల మధ్య విస్తరించిన ఈ భూమి,బౌద్ధ సంస్కృతికి కేంద్రంగా నిలవటంతో పాటు రాజధానిగా వికసించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. లండన్‌లోని బ్రిటీష్ మÖ్యజియంలో ఉన్న అమరావతి గ్యాలరీ ఈ ప్రాంత చరిత్రను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టింది. అదే గుర్తింపును ఆధునిక రాజధానికి అనుసం ధానం చేయడం ద్వారా గత వైభవం కొనసాగించాలని సంకల్పించుకుంది ప్రభుత్వం.తగ్గట్టుగానే ప్రజల్లోకి అమరావతి అనే పేరు చొచ్చుకుపోయింది.ఈ పేరుతో కొత్త రాజధానికి ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ కూడా ఏర్పడింది.
ప్రజల ఆశలకి కేంద్రంగా అమరావతి అభివృద్ధి,ఆత్మగౌరవం,భవిష్యత్ దిశ అనే మÖల స్తంభాలపై అమరావతి ఆవిర్భవిం చింది. విభజన తరవాతి అనిశ్చిత పరిస్థితుల్లో, ఈ రాజధాని ప్రజల ఆశలకి కేంద్రంగా మారింది. రైతుల సహకారం,ప్రభుత్వ సంకల్పం కలిసి ప్రత్యేక స్వరూపం ఇచ్చాయి. రాజకీయ మార్పులు వచ్చినా,రాజధాని లక్ష్యం మాత్రం దృఢంగా కొనసాగుతూ వచ్చింది. అమరావతి నిర్మాణం కేవలం పరిపాలనా అవసరం కాదు రాష్ట్ర పునర్నిర్మాణానికి సంకేతం అన్న అభిప్రాయం బలంగా నాటుకుపోయింది.విభజనతో ఏర్పడిన లోటు భర్తీ చేయాలనే సంకల్పానికి ఇది ప్రతిరూపం అని అంతా విశ్వసించారు.అలా ప్రభుత్వ లక్ష్యాలు,ప్రజల ఆకాంక్షలు ఒకేతాటిపైకి వచ్చాయి.ఈ మొత్తం ప్రక్రియలో ప్రధాన బలం రైతులే.స్వచ్ఛందంగా భూములు అం దించి అభివృద్ధిలో భాగస్వాములయ్యారు. సంప్రదాయ భూసేకరణకుభిన్నంగా,భాగస్వా మ్య విధానం అనుసరించడం ద్వారా కొత్త భూ సమీకరణ విధాన నమÖనా తీసుకొచ్చారు. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వ్యక్తిగత ప్రయోజనాల కంటే రాష్ట్రానికి మేలు జరగడమే ముఖ్యం అనుకున్న రైతుల త్యాగమే అమరావతికి నైతిక బలంగా నిలిచింది. దేశంలో బ్రిటిష్ పాలన ప్రారంభమైన తర్వాత తెలుగువారి రాజకీయ,పరిపాలనా ప్రాధాన్యం క్రమంగా క్షీణించింది. మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగమవడంవల్ల సొంత గుర్తింపు కోసం తెలుగువారు దీర్ఘకాలిక పోరాటం చేయాల్సి వచ్చింది. ఆఉద్యమాన్ని ముందుండి నడిపిం చారు పొట్టి శ్రీరాములు. ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాన్నే త్యాగం చేశారు. ఆ ఫలితంగానే 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్ప డి,కర్నూలు రాజధానిగా అవతరించింది. అయితే అది కూడా తాత్కాలికంగానేమిగిలింది.
రాష్ట్రానికి రాజధాని లేదనే లోటు
1956లో తెలంగాణ విలీనంతో హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. 2014 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది. ఆ సమయంలో పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని నిర్ణయిం చారు. ఆవిధంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకమైన రాజధాని లేదే అన్న లోటు ఉండిపోయింది. అప్పుడే రాజధాని నిర్మాణం చేపట్టడం అత్యవసరమైంది.అదే సమయంలో అమరా వతి ఆలోచన రూపుదిద్దుకుంది.విధాన మార్పు లు,రాజకీయ భేదాలురాజధాని నిర్మాణ ప్రయా ణాన్ని సవాళ్లతో నింపాయి. అయినప్ప టికీ స్థిరమైన రాజధాని అవసరం అనే భావన మరింత బలపడింది. అమరావతిని బ్లూ-గ్రీన్ సిటీగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యం నిర్దేశించు కున్నారు. ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, ప్రణాళికాబద్ధ నగర నిర్మాణం ద్వారా అమరా వతిని అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దాలనే దిశ స్పష్టమైంది.కేవలం పరిపాలనా కేంద్రంగానే కాకుండా పెట్టుబడులు,ఉపాధి,ఆర్థిక వృద్ధికి వేదికగా నిలవాలని భావించింది ప్రభుత్వం. అయితే అమరావతి పేరు ఖరారు చేయడం నుంచి ఇప్పటి వరకూ ఎన్నో సవాళ్లు ఎదుర య్యాయి.ఎన్నో మార్పులూ వచ్చాయి.ఇప్పుడు వాటన్నింటినీ దాటుకుని స్పష్టమైన గమ్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగుతోంది. అమరావతి రాజధానిని అద్భుతంగా తీర్చిదిద్దా లన్న దృఢ నిశ్చయం స్పష్టంగా కనిపిస్తోంది.
కీలక ఘట్టం-అమరావతి చట్టబద్ధత
ఆంధ్రప్రదేశ్ కలల రాజధాని అమరావతికి చట్టబద్ధత దిశగా కీలక ఘట్టం పూర్తయింది. లోక్‌సభలో ఆమోదం పొందిన బిల్లుకు రాజ్యసభ కూడా పచ్చజెండా ఊపింది.రాజ్య సభలో బిల్లుపై జరిగిన చర్చలో అమరావతికి తిరుగులేని మద్దతు దక్కింది.లోక్‌సభలో ఆమోదం పొందిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సవరణ బిల్లును కేంద్రమంత్రి నిత్యానంద రాయ్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు.సభ్యుల సమ్మతితో రాజ్యసభ ఛైర్మన్ సి.పి.రాధాక్రిష్ణన్ బిల్లుపై చర్చకు ఆమోదం తెలిపారు. అమరావతికి చట్టబద్ధతకు కాంగ్రెస్,ఉద్ధవ్ శివసేన పార్టీల ఎంపీలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈసందర్బంగా మాట్లాడిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలుగు ప్రజలందరికి ఇవాళ చరిత్రాత్మకమైన రోజు అని అన్నారు.“బిల్లు ప్రవేశపెట్టడాన్ని తెలుగు ప్రజలంతా గర్వంగా భావిస్తున్నారు. ప్రజా రాజధాని అమరావతి చరిత్రలో గుర్తుంటుంది. సంక్షోభాలను అవకాశాలుగా మలచుకోవడం మా నాయకుడు నేర్పించారు.మరో రాష్ట్రానికి లేదు’ అని వెల్లడించారు.
అమలు చేయనందుకు పరిహారం ఇవ్వాలి అమరావతి చట్టబద్ధత బిల్లుపై చర్చలో కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి పాల్గొన్నారు. “బిల్లు ప్రవేశపెట్టడం రైతుల విజయం. రాజధాని ఉద్యమ సమయంలో రైతులను, మహిళలను తీవ్రంగా హింసించారు. రాజ ధానిపై 12 ఏళ్లుగా అస్పష్టతగా ఉంది. అస్ప ష్టత వల్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లాయి. గత సీఎం(వైఎస్ జగన్) మÖడు రాజధానుల పేరుతో రాజధాని లేకుండా చేశారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. దుగరాజపట్నం పోర్టు ఇస్తామని హామీ నెరవేర్చలేదు. విభజన హామీలన్నీ అమలు చేయాల్సిందే. ఇప్పటివరకు హామీలు ఎందుకు నెరవేర్చలేదో చెప్పాలి. హామీలు అమలు చేయ నందుకు పరిహారం ఇవ్వాలి.12 ఏళ్ల తర్వాత ఆస్తుల పంపకం పూర్తికాలేదు” అని రేణుకా చౌదరి తెలిపారు.
తెలుగుజాతికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అనంతరం బీజేపీ రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్ మాట్లాడుతూ,“రాజధాని కోసం 29 వేలమంది రైతులు 33వేల ఎకరాలు ఇచ్చారు. భవ్య రాజధాని సాకారం కోసం ఏపీ ప్రజలు కలలు కన్నారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ సంకల్పం తీసుకున్నారు. వికసిత్ భారత్ సాకారం కోసం వికసిత్ ఆంధ్ర నిర్మాణం ఆవశ్యకం. వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం వికసిత్ రాజధాని అవసరం ఉంది. రాజధాని కోసం సుదీర్ఘంగా పోరాడిన మహిళలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు.
అమరావతికి చట్టబద్ధత బిల్లుకుమద్దతిస్తున్నాం
అనంతరం బీజేపీ రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ,“అమరావతికి చట్టబద్ధత బిల్లుకు మద్దతిస్తున్నాం. అమరా వతిని రాజధాని చేయడం ప్రజలందరికీ ఆమోదయోగ్యం.అమరావతికి చట్టబద్ధత బిల్లుపై చర్చను మంత్రి నారా లోకేశ్, లోక్‌సభ ఎంపీలు,ముఖ్య నేతలతో కలిసి గ్యాలరీలో కూర్చొని ఆసక్తిగా వీక్షిం చారు. చర్చ ముగిసి బిల్లు ఆమోదం పొంద గానే అంతా లేచి కరతాళధ్వనులతో హర్షం వ్యక్తం చేశారు. – జి ఎన్ వి సతీష్ 

ఆరోగ్య కోసం అందరం..

ప్రపంచ వ్యాప్తంగా 1950 నుంచి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.1948 ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ స్థాపన గుర్తుగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించు కుంటున్నాం.‘ఆర్థిక,సామాజిక పరిస్థితులు, జాతి లేదా మతంతో సంబంధం లేకుండా అత్యున్నత ఆరోగ్య ప్రమాణాలను అనుభవించడం ప్రతి మానవుని ప్రాథమిక హక్కు’ అన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయం. ప్రతి ఒక్కరికీ ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని నిర్మించడానికి ప్రజలను, ప్రభుత్వాలను ఏకతాటిపైకి తీసుకురావడమే ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క లక్ష్యం. మానవాళికి సంబంధించిన ముఖ్యమైన ప్రపంచ ఆరోగ్య సమస్యల వైపు ప్రపంచ దృష్టిని ఆకర్షించడమే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం యొక్క లక్ష్యం.- జి ఎన్ వి సతీష్ 
ప్రజారోగ్య సమస్యలపై ఆసక్తి ఉన్న వివిధ ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థలు దీనిని ప్రపంచవ్యాప్తంగా గుర్తిస్తాయి. ప్రతి సంవ త్సరం ఒక అంశాన్ని ఎంపిక చేసి,దానిపై అవగాహన కల్పించడంపై ఏడాది పొడవునా కార్యక్రమాలను కేంద్రీకరిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచఓ) 2026 సంవత్సరానికి గానూ”ఆరోగ్యం కోసం అందరం కలిసి.. సైన్స్‌కు తోడుగా నిలుద్దాం..” (Tశీస్త్రవtష్ట్రవతీ fశీతీ ష్ట్రవaశ్రీtష్ట్ర. Staఅd wఱtష్ట్ర scఱవఅcవ) అనే నినాదాన్ని తీసుకుంది. ఈ నినాదాన్ని ఈ సమయంలో ఎంచు కోవడానికి వెనుక కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి.ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ద్వారా ఆరోగ్యానికి సంబంధించి శాస్త్రీయ ఆధారాలు లేని చికిత్సల పుకార్లు శరవేగంగా వ్యాపిస్తున్నాయి. దీనివల్ల ప్రజలు సరైన వైద్యానికి దూరమవుతున్నారు. అందుకే ”సైన్స్‌కు తోడుగా నిలబడాలి”అనే అంశాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధానంగా నొక్కి చెబుతోంది.సైన్స్‌కి మనం తోడుగా ఉండడం అంటే ఫ్రెండ్స్ పక్కన నిలబడడం కాదు సైన్సును మనం సక్రమంగా వినియోగించు కోవాలని. శాస్త్రీయంగా ఆలోచించాలి అని. శాస్త్రీయంగా జీవించాలన్నదే ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయం.కోవిడ్ సమయంలో ప్రపంచం ఎదుర్కొన్న ఆరోగ్య సంక్షోభం ఎలాంటిదో మనం కళ్ళారా చూశాం. కోవిడ్-19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా మానవ జీవితానికి అతిపెద్ద ముప్పులలో ఒకటిగా నిలిచింది. ఇది ప్రజారోగ్యానికి మునుపెన్నడూ లేని విధంగా సవాలు విసిరింది. ఈ మహ మ్మారి వల్ల కలిగిన ఆర్థిక, సామాజిక అంతరాయం వినాశకరమైనది. ఇది ఇటీవలి ఆరోగ్య రంగాన్ని దెబ్బతీసింది.మరింత మందిని పేదరికంలోకి నెట్టింది.ఆహార అభద్రతకు దారితీసింది. అంతేకాదు మొత్తం ఆరోగ్య వ్యవస్థను అస్తవ్యస్తం చేసింది. ఆ సమ యంలో కేవలం శాస్త్రీయ పరిశోధనలు, వాటి వల్ల తయారైన వ్యాక్సిన్ల వల్లే మనం ప్రాణా లను కాపాడుకోగలిగాం.
ఆధునిక చికిత్సలు..
గతంలో కూడా ఇలాంటి సంక్షోభాలు ఎన్నో ఉన్నాయి. భవిష్యత్తులో ఇంకొన్ని సంక్షోభాలు రావచ్చు. భవిష్యత్తులో వచ్చే ఇలాంటి కొత్త విపత్తులను ఎదుర్కోవాలంటే సైన్స్ ఒక్కటే మార్గమని గుర్తుచేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నినాదాన్ని తీసుకుంది. ఆరోగ్యం అన్నది కేవలం డాక్టర్ల బాధ్యత మాత్రమే కాదు.. డాక్టర్లు జబ్బు రాకుండా సూచనలు చేయగలరు. జబ్బు వచ్చిన తర్వాత వైద్యం చేయగలరు. దానితోనే సమాజం అంతా ఆరోగ్యంగా ఉండలేదు.ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచఓ) ప్రకారం,ఆరోగ్యం అంటే కేవలం జబ్బులు లేదా వైకల్యాలు లేకపోవడం మాత్రమే జలది. శారీరకంగా, మానసికంగా, సామాజికంగా పూర్తిగా క్షేమంగా ఉండడం. ఇందుకొరకు సమాజంలోని ప్రతి ఒక్కరూ (Tశీస్త్రవtష్ట్రవతీ) భాగస్వాములు కావాలి. వాతావరణ మార్పులు,కాలుష్యం వంటి సమస్యలు ఆరోగ్యంపై చూపుతున్న ప్రభావాన్ని అరికట్టడానికి అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ భావిస్తోంది. 2026 నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), జన్యు చికిత్స(Gవఅవ Tష్ట్రవతీaజూy) వంటి అత్యాధునిక సాంకేతికతలు వైద్య రంగంలోకి వచ్చాయి. ఈ విజ్ఞాన ఫలాలు సామాన్యులకు కూడా అందేలా చూడటం, సైన్స్ పట్ల ప్రజలకు నమ్మకం కుదిరేలా చేయడం చాలా అవసరం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ ”ఆరోగ్యం కోసం అందరం కలిసి.. సైన్స్‌కు తోడుగా నిలుద్దాం” అనే నినాదాన్ని తీసుకుంది.
బాధ్యతగా గుర్తించాలి..
ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూక్తిని మనం ఎప్పటి నుంచో వింటున్నాం. ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి, కలుషిత ఆహారం, మానసిక ఒత్తిడి వల్ల అనేక కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. అందుకే ఈ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి.ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అనేది కేవలం ఒక రోజు జరుపుకునే వేడుక కాదు. ఈ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజల ముందుకు తెచ్చిన ఆరోగ్య సూత్రాన్ని జీవితకాలం ప్రజలు ఆచరించాల్సిన అవసరం ఉంది. అందరికీ ఆరోగ్యం అందాలంటే ఆరోగ్యం అనేది ఒక ప్రాథమిక హక్కుగా ఉండాలి. దీనిని ప్రభుత్వాలు తమ ప్రధాన బాధ్యతగా గుర్తించాలి. మనకున్న పేదరికంలో వైద్యానికి అవుతున్న ఖర్చులు కారణంగా ప్రజలు మరింత పేదరికంలోకి నెట్టబడుతు న్నారు. దీనిని నుంచి బయటపడాలి అంటే ప్రజలందరికీ వైద్యం అన్నివేళలా, ఎక్కడైనా ఉచితంగా అందుబాటులో ఉండే విధంగా చేయాలి. అందరూ వైద్యాన్ని పొందే విధంంగా ”ఆరోగ్య హక్కు” చట్టాన్ని తేవడం మంచిది. ఇది ప్రభుత్వ బాధ్యత. దీనితోపాటు ప్రజలం దరూ ఆరోగ్య నియమాలను పాటించాలి. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. మెరుగైన ఆహారపు అలవాట్లు, క్రమం తప్పని వ్యాయామం, కలుషితం లేని పర్యావరణం మనల్ని దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంచుతాయి.
శాస్త్రీయతే ప్రధానం..
అందరికీ ఆరోగ్యం-మనందరి బాధ్యత. మెరుగైన ఆరోగ్యం కోసం శాస్త్రీయంగా ఆలోచిద్దాం. శాస్త్రీయతను పాటిద్దాం, శాస్త్రీయ పరిశోధనలకు మద్దతును ఇద్దాం.
ఆరోగ్యకరమైన ప్రపంచం అనే ఆశయం ఒక సుదూర స్వప్నం కాదు. సాక్ష్యాధారిత ఆరోగ్య విద్య, ఆరోగ్య సమస్యలపై అవగాహనతో దీనిని సాధించవచ్చు. పాఠశాలలు, కళాశా లలు, సంఘాలు,వైద్యులు,ఆరోగ్య కేంద్రాలు, స్వచ్ఛంద సేవకులు వంటి సంస్థలతో పాటు, ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలు కూడా దీని గురించిన సమాచారాన్ని వ్యాప్తి చేయాలి. దాని కోసం కృషి చేయడానికి ఏకమైనప్పుడు మాత్రమే ఈ కల నిజమవుతుంది. అలాగే, మానవ కార్యకలాపాల వల్ల కలిగే వాతావరణ మార్పు, పర్యావరణ క్షీణత గురించి కూడా మనం ఆలోచించాలి. వాటి ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి, ప్రతి ఒక్కరికీ ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించడానికి చర్యలు తీసుకోవలసిన సమయం ఆసన్నమైంది.ఈ సందర్భంగా”ఈసురోమని మనుషులుంటే-దేశమేగతి బాగుపడునోరు” అనే గురజాడ అప్పారావు గారి మాటలను గుర్తు తెచ్చుకోవాలి. కర్షకులు, కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే సంపాదనా శక్తి పెరుగుతుంది. దేశం అభివృద్ధి చెందుతుంది. మన ఆరోగ్యం కోసం మనం బాధ్యత తీసుకోవాలి. ప్రజల కంటే ఎక్కువ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి.ప్రపంచ ఆరోగ్య సంస్థ గత75ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ప్రజారో గ్యాన్ని మెరుగుపరచడంలో ఎన్నో అద్భుతమైన విజయాలను సాధించింది. మానవ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన వ్యాధులను నిర్మూలించడంలో ఈ సంస్థ కీలకపాత్ర పోషించింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచఓ) ఏర్పాటు..
ఈ సంస్థ ఏర్పాటు వెనక ఒక సుదీర్ఘమైన ప్రక్రియ మరియు అంతర్జాతీయ సహకారం ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత, ప్రపంచ దేశాల మధ్య శాంతి, సహ కారం కోసం ‘ఐక్యరాజ్యసమితి’ (యుఎన్) ఏర్పడింది. 1945లో శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశంలో, ప్రపంచవ్యాప్త ఆరోగ్య సమస్యలను పర్యవేక్షిం చడానికి ఒక స్వతంత్ర అంతర్జాతీయ సంస్థ ఉండాలని బ్రెజిల్, చైనా ప్రతినిధులు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన మేరకు 1946 జూన్ నెలలో న్యూయార్క్‌లో ‘అంతర్జాతీయ ఆరోగ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డబ్ల్యుహెచఓ యొక్క రాజ్యాంగాన్ని రూపొందించారు.
1948 ఏప్రిల్ 7వ తేదీన డబ్ల్యుహెచఓ అధికారికంగా ఉనికిలోకి వచ్చింది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ పుట్టినరోజైన ఏప్రిల్ 7వ తేదీని ”ప్రపంచ ఆరోగ్య దినోత్సవం”గా ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ప్రపంచ ప్రజలందరికీ మంచి స్థాయి ఆరోగ్యాన్ని అందించడం దీని ఆశయం.ప్రస్తుతం ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా వ్యాధుల నిర్మూలన (ఉదాహరణకు: పోలియో,కలరా),ఆరోగ్య ప్రమాణాల నియం త్రణ,అత్యవసర ఆరోగ్య పరిస్థితుల్లో (Paఅdవఎఱcs) దేశాలకు మార్గనిర్దేశం చేస్తుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచఓ) కార్యాలయాలు
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచవ్యాప్తంగా తన కార్యకలాపాలను నిర్వహించడానికి వివిధ స్థాయిలలో కార్యాలయాలను కలిగి ఉంది. డబ్ల్యుహెచఓ యొక్క ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని జెనీవా నగరంలో ఉంది. ఇక్కడ నుండే ప్రపంచవ్యాప్త ఆరోగ్య విధానాలు, నిర్ణయాలు తీసుకోబడతాయి. ప్రపంచాన్ని ఆరు ప్రాంతాలుగా విభజించి, ఒక్కో ప్రాంతానికి ఒక ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.ఆగేయ ఆసియా ప్రాంతం కార్యాలయం భారతదేశంలోని న్యూఢిల్లీలో ఉంది. భారతదేశం ఈ విభాగం కిందకే వస్తుంది. భారతదేశంలో డబ్ల్యుహెచఓ ప్రధానంగా రెండు ముఖ్యమైన కార్యాలయాలను కలిగి ఉంది. 1.డబ్ల్యుహెచఓ ఇండియా కంట్రీ ఆఫీస్. ఇది న్యూఢిల్లీలోని ‘నిర్మాణ్ భవన’ లో ఉంది. ఇది భారత ప్రభుత్వంతో కలిసి ఆరోగ్య కార్యక్రమాలను సమన్వయం చేస్తుంది.
2.దక్షిణ-తూర్పు ఆసియా ప్రాంతీయ కార్యాలయం ). ఇది కూడా న్యూఢిల్లీలోని ‘ఇంద్రప్రస్థ ఎస్టేట’ లో ఉంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ సాధించిన విజయాలు
3.ప్రపంచ ఆరోగ్య సంస్థ గత 75 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎన్నో అద్భుతమైన విజయాలను సాధించింది. మానవ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన వ్యాధులను నిర్మూలించడంలో ఈ సంస్థ కీలకపాత్ర పోషించింది.

మశూచి నిర్మూలన
ఇది డబ్ల్యుహెచఓ సాధించిన అతిపెద్ద విజయం.1967లో ప్రారంభించిన తీవ్రమైన టీకా కార్యక్రమం ద్వారా,1980నాటికి ప్రపంచం నుండి మశూచిని పూర్తిగా తుడిచిపెట్టేశారు. మానవ చరిత్రలో శాస్త్రీయంగా ఒక వ్యాధిని పూర్తిగా నిర్మూలించడం ఇదే మొదటిసారి.

పోలియో నివారణలో పురోగతి
1988లో ‘గ్లోబల్ పోలియో ఎరాడికేషన్ ఇనిషియేటివ’ ప్రారంభించినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ వందలాది మంది పిల్లలు పక్షవాతానికి గురయ్యేవారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కృషితో ఇప్పుడు ప్రపంచంలోని 99.9% ప్రాంతాల్లో పోలియో నివారించబడింది. భారతదేశం కూడా 2014లో పోలియో రహిత దేశంగా గుర్తింపు పొందింది.

అంటువ్యాధుల నియంత్రణ..
క్షయ (టిబి), మలేరియా వ్యాధుల మరణాల రేటును తగ్గించడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ గణనీయమైన విజయం సాధించింది. ఇటీవల మలేరియాకు మొదటి టీకాను ఆమోదించడం ఒక మైలురాయి.ఎయిడ్స్ బాధితులకు అవసరమైన మందులు (Aఅtఱతీవtతీశీఙఱతీaశ్రీ tష్ట్రవతీaజూy) చౌకగా అందేలా చేసి, లక్షలాది మంది ప్రాణాలను కాపాడింది.
ఎబోలా మరియు కోవిడ్-19 అత్యవసర సమయాల్లో వ్యాక్సిన్ల అభివృద్ధిని వేగవంతం చేయడం, దేశాల మధ్య సమన్వయం సాధించడంలో ముందుండి నడిపించింది.

తల్లి-బిడ్డ ఆరోగ్యం..
ప్రసవ సమయంలో తల్లుల మరణాలను, ఐదేళ్ల లోపు పిల్లల మరణాలను తగ్గించడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ దేశాలకు మార్గదర్శకత్వం వహించింది. ముఖ్యంగా పోషకాహార లోపం, రోగనిరోధక టీకాలపై ప్రత్యేక దృష్టి సారించింది.

పొగాకు నియంత్రణ
పొగాకు వాడకాన్ని తగ్గించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రవేశపెట్టిన Tశీbaccశీ ్పుశీఅtతీశీశ్రీ (ఖ్పుీT్పు) ద్వారా అనేక దేశాల్లో బహిరంగ ప్రదేశాల్లో ధూమపానంపై నిషేధం మరియు అవగాహన కార్యక్రమాలు విజయవంతంగా అమలు అవుతున్నాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో..
2024 నాటికి భారతదేశం ట్రాకోమా (కంటికి సంబంధించిన ఇన్ఫెక్షన్) నుండి విముక్తి పొందింన దేశంగా అధికారికంగా ప్రకటించింది.

    సామాజిక న్యాయం ఇంకెంత దూరం

    ప్రపంచ వ్యాప్తంగా మానవహక్కుల ఉల్లంఘన కొన సాగుతున్న సందర్భంలో మనం ఉన్నాం. ప్రాథమిక హక్కులను నిర్దాక్షిణ్యంగా కాలరాస్తున్న సమాజాన్ని మనమిప్పుడు చూస్తున్నాం. సామాజిక న్యాయమనేది నిఘంటువులకే పరిమితమైన అంతర్జాతీయపదం. ఏ ఒక్క దేశానికో పరిమితమైంది కాదు. నాగరిక సమా జంలో మానవాళి ఎదుర్కొంటున్న సమస్య.సమా జంలో ప్రతి మనిషికీి హక్కులు, అవకాశాలు, గౌరవం ఉండాలన్నదే సామాజికన్యాయం.కులం,వర్ణం, మ తం,లింగం భాష ఆధారంగా మనిషిని దూరం చేస్తే సామాజిక న్యాయం లేనట్లే.”వర్గపోరాటం ముగిసి నప్పుడు మాత్రమే సామాజిక న్యాయం సాధించ బడుతుంది!” అన్న కార్ల్‌మార్క్స్ మాటలు అక్షర సత్యం. మార్టిన్ లూథర్ కింగ్ నాయకత్వంలో వర్ణవివక్షకు వ్యతిరేకంగా సాగిన సామాజిక న్యాయపోరాటం చరిత్ర ఎన్నటికీ మరచి పోదు. దక్షిణాఫ్రికాలో నెల్సన్ మండేలా నాయకత్వంలో జరిగిన పోరాటాలు ప్రత్యే కంగా చెప్పా ల్సిన పనిలేదు.ఈ క్రమంలో ప్రపంచ వ్యా ప్తంగా ఏ పౌరుడైనా సామాజిక న్యాయాన్ని పొందని పక్షంలో ఐక్యరాజ్యసమితి పాత్ర ఏమిటి అన్నది ఇప్పుడు మౌలిక ప్రశ్న.
    ఐరాస 1948లో మానవ హక్కుల సార్వత్రిక ప్రక టన చేసింది.ప్రపంచవ్యాప్తంగా మానవహక్కుల ఉల్లంఘన జరుగుతున్నా సామ్రాజ్యవాదం నెత్తుటి దాహం తీర్చుకుంటున్నా ఐరాస ఏమారణ కాండ ను ఆపింది లేదు. సమానవేతనం,భద్రత, గౌరవం కోసం పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. ఆదివాసీలు తమ భూమి, సంస్కృతి, భాష, మానవ హక్కులకోసం పోరాడుతూ ఉంటే పాలకులు బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈనేపథ్యంలో భారత దేశంలో జరిగిన సామాజిక న్యాయ పోరా టాలను పరిశీలిద్దాం.
    తొలిసూర్యుడు బసవన్న..
    పన్నెండవ శతాబ్దంలో సమానత్వం, సమాన గౌర వం శ్రమ గూర్చి మాట్లాడిన గొప్ప ఆలోచనా పరుడు బసవన్న. తన ప్రవచనాల ద్వారా సమా జంలోని అసమానతలను ప్రశ్నిం చారు. పని పట్ల గౌరవం ఉండాలని, కార్మికులను గౌరవించాలని యజమానుల శ్రమదోపిడీకి వ్యతిరేకంగా పోరా డారు. కులవివక్షకు వ్యతిరేకంగా, స్త్రీల సమాన త్వానికి, సామాజిక ఉన్నతికి కృషి చేసిన మహోన్న తుడు బసవన్న.”అనుభవ మంటపం”అనే ప్రజా స్వామ్య వేదికను ఏర్పాటు చేసి,అన్ని తరగతుల సామాజిక సమస్యలను బహిరంగంగా చర్చిం చారు. భారతదేశంలో ప్రజాస్వా మ్యానికి ఆనాడే పునాదులు వేశారు. సంపదను కూడబెట్టుకోవడం కాదని, ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టడం కూడా సామాజిక బాధ్యతలో భాగమని చెప్పారు. ఆవిధంగా సామాజిక సమానత్వం కోసం ఆచర ణాత్మక రూపాన్ని అందించారు. మÖఢనమ్మ కాల కు వ్యతిరేకంగా అనేక ప్రవచనాలు రాశారు.
    విప్లవతత్వాన్ని బోధించిన సంత్ రవిదాస్..
    ఉత్తర భారతదేశంలో జన్మించిన సంత్ రవిదాస్ తన ప్రవచనాలతో సామాజిక విప్లవతత్వాన్ని బోధించారు.కుల వ్యవస్థను ప్రశ్నించారు. మను షులంతా సమానమేనని.. భేదభావం లేదని, దేవు డు గుడిలో లేడని పేదవాడి హృదయంలో ఉన్నా డని, శ్రమజీవి చేతిలో ఉన్నాడని బోధించారు. మనసును శుద్ధి చేసుకోవడమే నిజమైన భక్తి అని ప్రచారం చేశారు. మనిషికి ప్రేమ, దయ, మానవత్వం ఉండాలని చెప్పారు. ద్వేషం, అసూయ, అహంకారం మనిషిని నాశనం చేస్తా యని ప్రేమతో కూడిన సమానత్వ సహజీవనమే సామాజిక న్యాయమని చెప్పారు. పేదరికం లేని సమాజం,కులం,వర్గం లేని ప్రపంచం,ఆత్మ గౌరవంతో జీవించే హక్కును కల్పించడమే సామా జిక న్యాయం అన్నారు.ఈనాటి సామాజిక ఉద్య మాలకు సంత్ రవిదాస్ ఆలోచనలు స్ఫూర్తినిస్తు న్నాయి..ప్రేరణ కలిగిస్తున్నాయి.కులం కాదు మానవత్వం,అధికారం కాదు సమానత్వం, ద్వేషం కాదు ప్రేమ అని మనిషి ఎన్నుకున్న రోజే సామా జిక న్యాయం సాధ్యమవుతుందని ప్రకటించారు.
    పోతులూరి వీరబ్రహ్మం దృష్టికోణం..
    సాంఘిక విప్లవకారుడుగా పేరొందిన పోతులూరి వీరబ్రహ్మం 15వశతాబ్దంలోనే విప్లవాత్మక మార్పు లు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. అధికా రం, సంపద, కులం, మతం ఆధారంగా మనుషు లను విడదీసే వ్యవస్థలను అమానవీయ వ్యవస్థ లని పేర్కొన్నారు. అటువంటి సమాజం వల్ల పురో గతి సాధ్యం కాదని బోధించారు. సమాజంలో నైతికత, ప్రజాస్వామ్యం కొరకు కలగన్నారు. ప్రధా నంగా కులరహిత సమాజం ఉండాలని, కులం జన్మతోరాదని, అది మనిషి సృష్టించిన భ్రమ అని, సమాజానికి సందేశం ఇచ్చారు. మానవ కుటుం బం అనే భావననే సామాజిక న్యాయమని ప్రకటిం చారు.ఆర్థిక సమానత్వం కావాలని, ధనం కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతమైతే సమాజం కూలి పోతుందన్నారు. పేదరికం,దోపిడీ లేని జీవన విధానం లక్ష్యమని ప్రకటించారు. ఆచారాల కంటే మానవతే గొప్పదని చాటిన మహోన్నతుడు. మతం మనిషిని విభజించకూడదనీ, మతం అనేది మనుషుల్ని ఐక్యం చేయాలనీ విభజిస్తే అది మతమే కాదని పేర్కొన్నారు. స్త్రీ-పురుష సమాన త్వం,స్త్రీని అణచివేయడం సమాజ పతనానికి కారణమని, స్త్రీకి గౌరవం,స్వేచ్ఛ, హక్కులు ఉం డకపోతే అది సమాజమే కాదని ”కాళికాంబ సప్త శతి”లో చెప్తారు. రాజ్యం నైతికపాలన,ప్రజల శ్రేయస్సు కోసమే ఉండాలని,అన్యాయం,అవి నీతి,అహంకారం పాలనలో పెరిగితే వినాశనం తప్పదని హెచ్చరించారు. శ్రమకు గౌరవం, శ్రమే సంపదకు మÖలమని, శ్రమజీవే నిజమైన సృష్టికర్త అనే భావన సమసమాజానికి పునాది అనే సిద్ధాంతం వీరబ్రహ్మం ప్రతిపాదించారు. జ్ఞానం ప్రజలదే,విద్య కొద్దిమందికే పరిమితం కాకూ డదు. ప్రజలకు జ్ఞానం అందితేనే నిజమైన మార్పు వస్తుందని ప్రకటించిన మహోన్నతుడు.వీర బ్రహ్మం ఆశించిన సమసమాజం,కులం లేని సమాజం, దోపిడీ లేని ఆర్థిక వ్యవస్థ, మానవత్వం ఆధారమైన మత చైతన్యం, సమన్యాయం, సమా నత్వం,శ్రమగౌరవం గల సమాజం అనే విప్లవ త్మకమైన ఆలోచన.
    ప్రజాకవి వేమన కలలు..
    వేమన రాజు కాదు, పండిత బ్రాహ్మణుడు కాదు, మతగురువు కాదు. అతను సామాన్య ప్రజాకవి. కానీ సామాజిక న్యాయం గురించి వేమన మాట్లా డినంత ధైర్యంగా, స్పష్టంగా మరెవ్వరూ మాట్లా డలేదనేది సత్యం. వేమన దృష్టిలో సామాజిక న్యా యం అంటే కేవలం చట్టాలలో ఉండే న్యాయం కాదు, మనిషి మనిషిగా గౌరవించబడే సమాజం. వేమన కులవ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించారు. కులం పేరుతో మనిషిని తక్కువ చేయడాన్ని అసహ్యించుకున్నాడు. మనిషి గొప్పతనం పుట్టిన కులంలో కాదు, చేసే కర్మలో, నడవడిలో ఉందని స్పష్టం చేశాడు. అందుకే ఆయన పద్యాలు కులాధి పత్యానికి గట్టి సవాలుగా నిలిచాయి. శ్రమకు గౌరవం, శారీరక శ్రమ చేసే వాడు తక్కువవాడు కాదన్నాడు. పొలం దున్నే రైతు, పని చేసే కూలీ, వారే సమాజానికి పునాది అని బలంగా నమ్మాడు. శ్రమను అవమానించే సమాజం ఎన్నటికీ న్యాయ సమాజం కాదన్నాడు.మÖఢనమ్మకాలపై తిరుగు బాటు,మంత్రాలు,యాగాలు,అంధవిశ్వాసాల పేరుతో ప్రజలను మోసం చేయడాన్ని నిర్దాక్షి ణ్యంగా ప్రశ్నించాడు. దేవుడి పేరుతో జరుగుతున్న అన్యాయాలను ఎత్తిచూపారు. వివేకంతో ఆలో చించే మనిషే నిజమైన ఆధ్యాత్మికుడని విశ్వసిం చడం వల్ల తెలుగు సాహిత్యంలో వేమన స్థానం చిరస్మరణీయం.
    స్త్రీ-పురుష సమానత్వం..
    స్త్రీని రెండో తరగతి పౌరురాలిగా చూసే సంప్ర దాయాలను వేమన అంగీకరించలేదు. స్త్రీ కూడా పురుషునితో సమానమైన మానవురాలేనని స్పష్టం చేసిన మొదటి ఫెమినిస్ట్ వేమన. ఆనాటి సమాజం లో విప్లవాత్మక ఆలోచన.ధనం కంటే ధర్మం గొప్ప దని చాటాడు. నిజాయితీ, మానవత్వం ఉన్నప్పుడే సమాజం నిలబడుతుందని ఆయన విశ్వసిం చారు. సామాజిక న్యాయానికి వెలుగు దారులు పరిచారు.
    పెరియార్ ఆలోచనలు..
    ఉవ్వెత్తున ఎగసిన సామాజిక ఉద్యమ కెరటం ఈ.వి.రామస్వామినాయకర్. భారతీయ సామా జిక ఉద్యమంలో పెరియార్ గూర్చి తెలియని వారుండరు. కేవలం ఆయన నాయకుడు కాదు, మనిషిని మనిషిగా నిలబెట్టిన ఉద్యమకారుడు. ద్రావిడ సమాజాన్ని ఒక్కతాటిపై నిలబెట్టిన సామా జిక ఆలోచనా తాత్వికుడు. ఆయనదృష్టిలో సామా జిక న్యాయమంటే దానం ద్వారా లభించే హక్కు లు కాదు, సమాజం నిర్మాణాత్మకంగా మారి నప్పుడు లభించే సమానత్వం. పెరియార్ తీవ్రం గా ప్రశ్నించినది అంతరాల కులవ్యవస్థని. మను వాదం పేరుతో సాగిస్తున్న దుర్మార్గాన్నీ ప్రశ్నిం చారు. కులం అనేది సహజమైనది కాదు, మనిషిని బానిసగా మార్చేందుకు సృష్టించిన వ్యవస్థ అన్నా డు.కులాన్ని నిర్మూలించకుండా సామాజిక న్యా యం సాధ్యం కాదని స్పష్టం చేశాడు. కులానికి కారణమైన బ్రాహ్మణాధిపత్యం, మతాధిపత్యంపై పోరాటం చేశాడు. పెరియార్ దృష్టిలో మతం అనేది అన్యాయాలను పవిత్రం చేసే సాధనమని బహిరంగంగానే ప్రకటించాడు.
    దేవుడు, శాస్త్రాల పేరుతో జరుగుతున్న వివక్షను అతను నిర్భయంగా ఎదుర్కొన్నాడు. పెరియార్ ప్రధానంగా పేర్కొన్నది ఆత్మగౌరవ ఉద్యమం. ఈ ఉద్యమం మనిషి తలవంచే అవసరం లేదని నేర్పింది. ఆత్మగౌరవం ఉన్న సమాజమే నిజమైన న్యాయ సమాజమని ఆయన నమ్మారు. అంతేకాక స్త్రీ విముక్తి కోసం సాగిన ఉద్యమాలు పెరియార్ కాలంలోనే చాలా బలమైనవి. స్త్రీలకు ఆస్తి హక్కు, విద్య,స్వేచ్ఛ అవసరమని ప్రకటించారు. పురుషా ధిక్యత ఉన్నంతకాలం సామాజిక న్యాయం అసం పూర్ణమేనని చెప్పారు. ఇక పెరియార్ పేర్కొన్న వివేకవాదం అంధవిశ్వాసాలపై పోరాడకుండా సమానత్వం సాధ్యం కాదని విశ్వసించారు. ప్రశ్నించే మనిషే స్వేచ్ఛాయుత మనిషని నమ్మారు. పెరియార్ ఆశించిన సామాజిక న్యాయం ఇప్పుడే, ఇక్కడే అమలవ్వాలి అనేది ఆయన నినాదం. ఈ రోజూ మనం కులం,మతం,లింగం పేరుతో ఎన్నో అన్యాయాలు చూస్తున్నాం.ఆలోచించండి.. ప్రశ్నించండి.. తిరుగుబాటు చేయండి.అనే పెరి యార్ నినాదంతోనే తమిళనాట ఉద్యమం బలోపేతం అవుతూనే ఉంది. అది ద్రావిడ సమా జం సాధించిన సామాజిక న్యాయం.
    అంతరాలు చెరిపేసిన మహాత్మా జ్యోతిరావు ఫూలే..
    చదువు,ప్రశ్నించు,సంఘటితమవ్వు నినాదంతో సామాజిక చరిత్రలో తనే విప్లవమై మొలకెత్తిన మహాత్ముడు జ్యోతిరావు ఫూలే. ఆయన సామాజిక న్యాయదృష్టి వర్తమాన భారతదేశ చరిత్రను తిరగ రాయగలిగింది. సామాజిక న్యాయం అనేది ఫూలే దృష్టిలో నినాదం కాదు..అణచివేతకు గురైన కోట్లాది ప్రజల జీవితహక్కు.19వశతాబ్దంలో కులం పేరుతో మనిషిని మనిషిగా చూడని కాలంలో,విద్య కొద్దిమందికే పరిమితమైన సామా జిక బానిస సమాజంలో ”ఈ వ్యవస్థే అన్యాయం” అని ప్రశ్నించిన ధైర్యశాలి ఫూలే.భారత సమా జంలో అసమానతలకు మÖలం కులవ్యవస్థ అని అందరిలా అతను నమ్మారు. బ్రాహ్మణీయ ఆధిప త్యం శ్రమజీవులను బానిసలుగా మార్చిందని విమర్శించారు.కుల నిర్మూలనే నిజమైన సామా జిక న్యాయమన్నారు.ఆయన సామాజిక న్యాయా నికి ఆయుధం విద్య.”విద్య లేకపోతే జ్ఞానం లేదు, జ్ఞానం లేకపోతే న్యాయం లేదు”అని నమ్మిన మహానుభావుడు ఫూలే! అందుకే స్త్రీలకు.. శూద్రులకు.. అతి శూద్రులకు విద్య అందించడ మే తన జీవిత లక్ష్యంగా చేసుకున్నారు. సావిత్రి బాయి ఫూలేతో కలిసి దేశంలోనే తొలి బాలికల పాఠశాలలు స్థాపించారు.ఫూలే దృష్టిలో స్త్రీ విముక్తి లేకుండా సామాజికన్యాయం అసాధ్యం. స్త్రీ బాని సగా ఉన్న సమాజం ఎప్పటికీ సమానత్వ సమా జం కాలేదని బోధించారు. వితంతు వివాహానికి మద్దతు, బాల్య వివాహానికి వ్యతిరేకత, స్త్రీ విద్యకు పోరాటం, పూలే సామాజిక న్యాయ ఉద్యమంలోని కీలక అస్త్రాలు.పురాణాలు, దేవుడి పేరిట జరుగు తున్న దోపిడీని తీవ్రంగా ఖండించారు.”మతం మనిషిని విముక్తి చేయాలి, మనిషిని బానిస చేయ కూడదు”అన్నది పూలేతాత్విక సందేశం. 1873 లో స్థాపించిన సత్యశోధక సమాజం ద్వారా కుల వివక్షకు వ్యతిరేకంగా శ్రమజీవుల గౌరవం కోసం, సమానత్వ సమాజం కోసం ప్రజలను చైతన్య పరిచారు. పూలే చూపిన సామాజిక న్యాయమంటే దానం కాదు. అధికారాల పునరుద్ధరణ.అది పుస్త కాలలో కాదు. పాఠశాలల్లో, పోరాటాల్లో, ప్రజల జీవితాల్లో నడిచిన ఉద్యమం.
    చూపుడువేలు అంబేద్కర్..
    ఆర్థిక పెత్తనం సామాజిక న్యాయానికి అడుగ డుగునా అడ్డంకులంటూ అంబేద్కర్ ఏనాడో చెప్పాడు. ఉత్పత్తి సాధనాలను అగ్రవర్ణాలకు ఇచ్చే భౌతికశ్రమను శూద్రులకు కేటాయించింది. ఈ క్రమంలో శ్రమ విభజన మాత్రమే జరగలేదు. కుల అసమానత్వం అనే భావన ఉందని అంబే ద్కర్ గుర్తించారు. బాధితులందరూ ఉమ్మడి శత్రు వును, ఉమ్మడి కష్టాన్ని ఎదుర్కొనడానికి ఒకటిగా ఐక్యమయ్యేందుకు దోహదపడు తుందనీ.. అణ గారిన కులాలు ఐక్యంకాకుండా పాలకుల, బూర్జువా పార్టీల పన్నాగాలు, అంతా ఇంతా కావు. బి యేట్స్ అనే ఐరిష్ కవి ఇలా చెప్తారు. ”అతడు ఇప్పుడు మన సోదరులను తన వైపు తిప్పుకు న్నాడు. ఇక మన తెగవారు ఐక్యత ప్రదర్శించలేరు. మనలను కలిపి ఉంచే అంశాలను అతడు ఒక కత్తితో చీల్చాడు.. మనం చెల్లాచెదురై పోయాం!” అంటాడు. మానవ ప్రవర్తన వైరుధ్యాలకు కులం కూడా కారణం అవుతున్నది. మనస్ఫూర్తిని దహించి వేసి, మానవత్వాన్ని పరిమళించే రాజ్యాంగాన్ని, అంబేద్కర్ స్ఫూర్తిని కొనసాగిం చడంలో భారతీయ సమాజం ఇంకా వెనుకంజలోనే ఉందనిపిస్తుంది. ప్రాథమిక హక్కు లను పాలకులు నిర్ధాక్షిణ్యంగా కాలరాస్తున్నా నిమ్మకు నీరెత్తనట్లే ఉన్నాం. అంటరానితనం మÖలాలను పెకిలించాలన్న అంబేద్కర్ ఆశయ సాధన దిశగా అడుగులు వేయాలి. సామాజిక న్యాయం సాధించేందుకు మతోన్మాద వ్యతిరేక పోరాటాలు ఉధృతమవ్వాలి. సామాజికన్యాయం దయతో ఒకరిచ్చే సహాయం కాదని, అది రాజ్యాం గం ద్వారా హామీ ఇచ్చిన మానవహక్కు అని ప్రక టించారు. కులవ్యవస్థ ప్రజాస్వామ్యానికి శత్రువు అన్నారు. అసమానత లపై నిలబడి ఉన్న సమా జం నిజమైన స్వేచ్ఛను, సమానత్వాన్ని అందించ లేదని హెచ్చరించారు. ”సామాజిక ప్రజాస్వామ్యం లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం నిలబడదు.” అనే అంబేద్కర్ ఆశయం గొప్పది. అంబేద్కర్ దృష్టిలో సామాజిక న్యాయమంటే స్వేచ్ఛ, సమాన త్వం, సోదరత్వం. ఈ మÖడు లేకుండా సామా జిక న్యాయం ఒక కల మాత్రమే. ఆయన నమ్మిన ప్రధాన ఆయుధం విద్య.విద్య ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమని ప్రకటించారు. అసమాన తలను అంతం చేయవచ్చన్నారు. వివక్షలేని సమా జాన్ని చదువు ద్వారా మాత్రమే నిర్మించ వచ్చ న్నారు. విద్య ద్వారా ఆత్మగౌరవం, చైతన్యం, హక్కులపై అవగాహన సాధ్యమవుతాయని ఆయన బలంగా నమ్మారు. సామాజిక న్యాయం కుల సమస్యకే పరిమితం కాదని,అది స్త్రీల, కార్మి కుల హక్కులు, మత స్వేచ్ఛ, ఆర్థిక సమానత్వం అన్నింటినీ కలుపుకున్న సమగ్రదృష్టి అన్నారు. హిందూ కోడ్ బిల్ ద్వారా స్త్రీలకు సమాన హక్కు లు కల్పించాలని ఆయన ప్రయత్నించారు. రాజ్యాంగంలో రిజర్వేషన్లు, మౌలికహక్కులు, రాజ్యాంగ పరిహార హక్కు చేర్చడం ద్వారా సామాజిక న్యాయాన్ని చట్టబద్ధం చేశారు. అందుకే ఈ దేశంలో కులం ఉన్నంత కాలం సామాజిక న్యాయం జరగదనేది స్పష్టం. ”నేను హిందువుగా పుట్టాను, కానీ హిందువుగా మరణించను” వ్యక్తి గత నిర్ణయం కాదు, వ్యవస్థపై నిరసన. సామాజిక న్యాయానికి అంబేద్కర్ నిర్వచనం ఇస్తూ సామా జిక న్యాయం సానుభూతి కాదు, అధికారాల పునరుద్ధరణ అంటారు. ఈ క్రమంలో మన ముం దున్న బాధ్యత రాజ్యాంగ విలువలను రక్షించడం, కుల, లింగ, వర్గ వివక్షను నిర్మూలించడం. సమా నత్వ సమాజాన్ని నిర్మించడం. అప్పుడే సామాజిక న్యాయం సాధ్యం.
    ఆరఎసఎస్ దృష్టిలో..
    ఆరఎసఎస్‌కు మాత్రం సామాజిక న్యాయం పట్ల భిన్నమైన అభిప్రాయం ఉంది. ఆరఎసఎస్ గురూజీగా పేరొందిన మాధవ సదాశివ గోల్వా ల్కర్ అసమానత అనేది మన సమాజంలో అంత ర్భాగమని అన్నాడు. అసమానతుల్ని ప్రోత్స హించడం, మనస్మ ృతిని అమలు చేయడం వర్త మాన దేశంలో చూస్తూనే ఉన్నాం.సామాజిక న్యాయసాధనలో ఆరఎసఎస్ ఏ సందర్భంలోనూ తన పాత్ర పోషించలేదు. సమాజం పురోగామిగా ఉండడం ఆరఎసఎస్‌కి ఇష్టం లేదు. మÖఢ నమ్మకాలు, దురాచారాలు, అశాస్త్రీయత వీరి ఆయుధాలు. మనుస్మ ృతే వారికి రాజ్యాంగం. వర్ణవ్యవస్థకు మద్దతు, వర్ణవ్యవస్థను హిందూ రాజ్యానికి ప్రధానబలంగా వర్ణించారు. స్త్రీల విముక్తి, స్త్రీల సాధికారత ఏ కోశానా ఆరఎసఎస్‌కి ఇష్టం ఉండదు. ఆరఎసఎస్ ఉద్దేశంలో స్త్రీ పురుషులు సమానం కాదు. అలా సమానత్వం గురించి మాట్లాడటం మతానికి వ్యతిరేకం. అంతెందుకు స్త్రీలకు ఓటు హక్కు ఇవ్వడాన్నీ ఆరఎసఎస్ వ్యతిరేకించింది. గోల్వాల్కర్ బంచ్ ఆఫ్ థాట్స్‌లో స్త్రీలు పరిపాలించిన చోటల్లా అసమానత, అరాచకం ఊహించలేని స్థాయిలో వ్యాపించాయి అంటూ చెబుతారు. అలాగే వితంతువులను ప్రజా సంబంధిత, ప్రభుత్వ, మత సంబంధిత వేడుకల్లో నిషేధించారు. ఇదీ ఆర్ ఎసఎస్ ఆలోచన. -(కెంగార మోహన్)

    దళితులకు రక్షణ లేదా..ఎన్నాళ్లీ ఇలా..?

    ఏ రాజకీయ పార్టీయినా ఎవరి ఓట్లతో అధికారం చేపడతారో అన్నీ పార్టీనేతలు వారిపైనే తనపాలనలో దమనకాండ సాగిస్తున్నారు.అటు జగన్ అయినా ఇటు చంద్రబాబు ప్రభుత్వాలైనా తప్పుల్ని ప్రశ్నిస్తే దాడులు,అణచివేతపై గొంతెత్తితే దౌర్జన్యాలు,హక్కులకోసం పోరాడితే అక్రమ కేసులు,అన్యాయంపై ఎదురు తిరిగితే హత్యలు భరించలేక పలువురి బలవన్మరణాలు ఎన్నో జరుగుతున్నాయి.ముఖ్యంగా గత5ఏళ్లుగా దళితులపై మరేరాష్ట్రంలోనూ లేనంత అత్యంత అమానవీయ సంఘటనలు ఏపీలో జరిగాయి.ఈదుశ్చర్యలకు తెగబడింది బాధితులను పరామర్శించ లేదు.ఎన్నికల వేళ మాత్రం‘నాఎస్సీనాఎస్టీ’అంటూ మాటల్లో ప్రేమకురిపిస్తున్నారు.ఇలాంటి దళితవ్యతిరేకపాలకుడికి అసలు ఎందుకు ఓట్లేయాలిగతఅయిదేళ్లుగా జరుగుతున్నదళితదాష్టీకాలను మళ్లీచూడటానికా అన్నప్రశ్నఆయావర్గాల నుంచి వినిపిస్తోంది.దీనికి కొన్నిఉదాహరణలు ఇలాఉన్నాయి..- జి ఎన్ వి సతీష్ 

    సుబ్రమణ్యం : కాకినాడ జిల్లాలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన వద్ద డ్రైవర్‌గా పనిచేసే దళిత యువకుడు వీధి సుబ్రమణ్యాన్ని చంపేసి, ఆ మృతదేహాన్ని డోర్ డెలివరీ చేశారన్న తీవ్ర అభియో గాలు ఎదుర్కొన్నారు. ఆయనను సస్పెండ్ చేయాలంటూ అన్ని వైపుల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తే తప్ప వైఎస్సార్సీపీ అప్పట్లో ఆయనపై చర్యలు తీసుకోలేదు.ఆయన జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన తర్వాత ఆయనకు స్వాగతం పలుకుతూ వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. ముఖ్యమంత్రి సభల్లోనూ ఆయన దర్జాగా పాల్గొన్నారు.ఈ ఎన్నికల్లో రంపచోడవరం నియోజకవర్గంలో వైసీపీ తరఫున అన్నీ ఆయనే అయి నడిపిస్తున్నారు.
    డాక్టర్ సుధాకర్ : కరోనా తీవ్రంగా ఉన్నప్పుడు మాస్కులు లేకుండా వైద్యం ఎలా చేయాలి? అని అడగటమే నేరమన్నట్లు డాక్టర్ సుధాకర్‌ను వైఎస్సార్సీపీ ప్రభుత్వం వేధించింది. ముందు విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఆపై చొక్కా తీసేసి చేతులు వెనక్కి విరిచేసి, తాళ్లతో కట్టి, లాఠీలతో కొట్టించారు. చివరకు మానసిక స్థితి బాగోలేదంటూ పిచ్చి ఆసుపత్రిలో చేర్పించారు. తీవ్ర మానసిక క్షోభకు గురైన ఆయన ప్రాణాలొదిలారు. మాస్కు పెట్టుకోకుండా బయట తిరుగుతున్నారంటూ దళిత యువకుడు కిరణ్ కుమార్‌ను లాఠీతో చితకబాది అతని మరణానికి కారణమయ్యారు.
    ఇండుగుమల్లి వరప్రసాద్ : తూర్పుగోదావరి జిల్లాలో అధికార పార్టీ నాయకుల ఇసుక అక్రమాలపై ప్రశ్నించిన పాపానికి ఇండుగుమల్లి వరప్రసాద్ అనే యువకుడికి పోలీసుస్టేషన్‌లో శిరోముండనం చేశారు.
    న్యాయాధికారి రామకృష్ణ : జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ న్యాయాధికారి రామకృష్ణపై దాడికి పాల్పడ్డారు. అక్రమ కేసులు బనాయించి తీవ్రంగా హింసించారు. అదే జిల్లాలో అనితారాణి అనే వైద్యురాలిని వేధించి, అసభ్య పదజాలంతో దూషించారు.నా నా అంటూ గుండెలు బాదుకునే జగన్ హయాంలో రాష్ట్రంలో దళితులపై దమనకాండ ఎంత తీవ్రస్థాయిలో జరుగుతుందో చెప్పేందుకు ఇవి కొన్నిఉదాహరణలు మాత్రమేనని చెప్పాలి.
    చిన్న అచ్చెన్న : జగన్ సొంత జిల్లాలో పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా పని చేస్తున్న చిన్న అచ్చెన్నను దారుణంగా చంపేశారు. ప్రకాశం జిల్లా సీఎస్‌పురం మండలంలో ఉపాధి హామీ పథకంలో అధికార వైసీపీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేసినందుకు దాసరి వెంకట రమణయ్యను అంతమొందించారు. అనకాపల్లి జిల్లా పీఎల్‌పురం ఎస్సీ కాలనీకి చెందిన 21 ఏళ్ల వడ్లమÖరి నాగేంద్రను కాళ్లు, చేతులు కట్టేసి వ్యవసాయ బావిలో పడేసి ప్రాణాలు తీశారు. ఇలా ఒకటా రెండా? తమ ఆధిపత్యాన్ని ప్రశ్నించినా, అహాన్ని దెబ్బతీసినా, తమకు అడ్డుగా ఉన్నారని భావించినా, ఎదురుతిరిగినా, అక్రమాలపై ఫిర్యాదు చేసినా దళితులను బలి తీసుకున్నారు.
    అలపు గిరీశ్‌బాబు : “కాళ్లలో రాడ్లు ఉన్నాయి. కొట్టొద్దు సార” అంటూ అలపు గిరీశ్‌బాబు అనే యువకుడు ప్రాధేయపడ్డా పోలీసులు కనికరిం చలేదు.“రాడ్లు ఎక్కడున్నాయో చెప్పు” అంటూ లాఠీకి రబ్బరు కట్టి కొట్టి రాక్షసానందం పొందారు. హత్య, మానభంగం, దేశద్రోహం వంటి కేసుల్లో సైతం ఇంత తీవ్రంగా కొట్టేలా చట్టాలు లేవు. ‘ఎస్సై కక్షపూరితంగా, రాజకీయ నాయకుల మెప్పు పొందేందుకే ఇలా చేశారు’ అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ ఎం.విక్టర్ ప్రసాద్ బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంలో వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వైసీపీ నాయకులు, పోలీసులు కలిసిపోయి గత అయిదేళ్లలో దళితుల్ని ఎంతగా వేధించారో చెప్పేందుకు కాకినాడ జిల్లాలో జరిగిన ఈ ఘటన చిన్న ఉదాహరణ మాత్రమే.
    దుగ్గిరాల కరుణాకర్ : 20 లక్షలు అప్పు చేసి చెరువులో చేపలు పెంచితే వాటిని పట్టుకోనివ్వ కుండా వైసీపీ నాయకుడు, శ్రీశైలం ట్రస్టు బోర్డు సభ్యుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, ఆయన అనుచరుడు సురేశ్‌రెడ్డి అడ్డుకుంటున్నారంటూ ఎస్పీకి లేఖ రాసి నెల్లూరు జిల్లా కావలికి చెందిన దుగ్గిరాల కరుణాకర్ ఆత్మహత్య చేసుకున్నారు. తన తల్లితో కలిసి జగదీశ్వర్‌రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన కాళ్లు పట్టుకున్నా కనికరించలేదని ఆ లేఖలో ఆయన వాపోయారు. అధికార పార్టీ నాయకులు చెప్పినట్టల్లా ఆడిన పోలీసులు దళితులను చిత్రహింసలు పెట్టారు. వారిని అవమానించి, మానసిక క్షోభకు గురిచేశారు. వాటిని భరించలేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు.
    ఉదయగిరి నారాయణ : నెల్లూరు జిల్లా కందమÖరుకు చెందిన ఉదయగిరి నారాయణ గతేడాది జులైలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఆయనను పోలీసులు తీవ్రంగా కొట్టి, చిత్రహింసలకు గురిచేశారని చివరకు ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతుడి కుల సంప్రదా యాలకు భిన్నంగా పోలీసులు బలవంతంగా అంత్యక్రియలు చేయించడంపై తీవ్ర దుమారం రేగింది.తప్పు చేసిన వారికి శిక్షపడుతుందనే భయం ఉంటే ఎవరైనా సరే ఆ తప్పు చేయటానికి వెనకంజ వేస్తారు. కానీఎస్సీ,ఎస్టీలపై నేరాలకు తెగబడుతున్న వారికి శిక్షలు పడేలా చేయటంలో జగన్ ప్రభుత్వం అత్యంత ఘోరంగా విఫలమైంది. మెజార్టీ కేసుల్లో అధికార పార్టీ నాయకులే నిందితులుగా ఉండటంతో లోతైన దర్యాప్తు చేయలేదు. శాస్త్రీయ ఆధారాలు సేకరించలేదు. అభియోగపత్రాలు మొక్కుబడిగా దాఖలు చేశారు. ఆ ఫలితంగానే అత్యధిక శాతం కేసులు వీగి పోయాయి. వీటిలోనూ అప్పీలుకు సైతం వెళ్లట్లేదు.2022లో 1,050 కేసుల్లో న్యాయస్థానాల్లో విచారణ పూర్తికాగా కేవలం 42 కేసుల్లోనే శిక్ష పడింది. మిగతా 1,008 కేసులు వీగిపోయాయి.2021లో నమోదైన 360 కేసుల్లో కేవలం 21 కేసుల్లోనే శిక్షపడింది. మిగతా కేసులు వీగిపోయాయి.2020లో 371 కేసుల్లో 51 కేసు ల్లోనే శిక్షపడింది. మిగతావి వీగిపోయాయి. 2019లో 560 కేసుల్లో 65 కేసుల్లోనే శిక్షపడింది. మిగతావి వీగిపోయాయి.
    ఆ ఘనత జగన్‌దే : దళితులపై దాడుల్లో దక్షిణ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలిపిన ఘనత జగన్‌దే. మనకంటే పెద్ద రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడుల్లో కన్నా ఏపీలోనే ఎక్కువ నేరాలు జరిగాయి. 2019 నుంచి 2022 మధ్య ఒక్క ఏడాది మినహా మిగతా అన్ని సంవత్సరాల్లోనూ ఎన్‌సీఆర్‌బీ గణాంకాల ప్రకారం దళితులపై దాడుల్లో దక్షిణ భారతదేశంలో ఏపీదే తొలి స్థానం.బాధితులైన దళితులకు రక్షణ కవచంలా ఉపయోగపడాల్సిన ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ నిరోధక చట్టాన్ని రాజకీయ ప్రత్యర్థులపై వేధింపులకు, వారిపై కక్ష సాధిం చేందుకు, అణిచేసేందుకు జగన్ ప్రభుత్వం వినియోగించింది. పోలీసులను అడ్డం పెట్టుకుని దళితులపైనే రివర్స్‌లో ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ సెక్షన్ల కింద కేసులు బనాయించింది. తన పేరిట తప్పుడు పత్రాలు సృష్టించి ధాన్యం కొనుగోళ్లలో కొందరు అక్రమాలకు పాల్పడ్డారంటూ నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన దళిత రైతు గాలి జూపాల్ పోలీసులకు ఫిర్యాదుచేయగా తిరిగి ఆయనపైనే కేసుపెట్టారు. మÖడు రాజధానులకు మద్దతుగా తలపెట్టిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న వారిని అడ్డుకుని కులం పేరుతో దూషించారంటూ అమరావతి దళిత రైతులు అయిదుగురిపై ఎట్రాసిటీ కేసు పెట్టి 18రోజులు జైల్లో ఉంచారు. పులివెందులలో హత్యాచారానికి గురైన దళిత మహిళ కుటుంబానికి న్యాయం చేయాలంటూ డీఎస్పీకి ఫిర్యాదు చేయటానికి వెళ్లిన టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత,ఎస్సీ వర్గానికి చెందిన టీడీపీ నాయకుడు ఎంఎస్ రాజులపైన ఎస్సీ,ఎస్టీ ఎట్రాసిటీ కేసు పెట్టారు. దశాబ్దాల క్రితం ప్రభుత్వం తమకు కేటాయించిన ఎసైన్డ్ భూములను ప్రభుత్వమే లాక్కోవటం ఏంటి? అని ప్రశ్నించినందుకు దళితులపై కేసులు పెట్టారు.ఐదేళ్లలో దళితులపై నేరాలు గణనీయంగా పెరిగాయి. 2020తో పోలిస్తే 2021లో3.28 శాతం మేర,2021తో పోలిస్తే 2022లో14.94 శాతం మేర నేరాలు పెరిగాయి. 2021లో దళితులపై మొత్తం 2014 నేరాలు జరగ్గా.. వాటిలో 2076 మంది బాధితు లయ్యారు. 2022లో 2,315 నేరాలు చోటుచేసు కోగా 2,431 మంది బాధితులయ్యారు.
    మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి : ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారంటూ దళిత మహిళా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని వైఎస్సార్సీపీ గతేడాది మార్చిలో సస్పెండ్ చేసింది. ఆ వెంటనే వైసీపీ శ్రేణులు ఆమె కార్యాలయంపై దాడికి పాల్పడ్డాయి. సామాజిక మాధ్యమాల్లో ఆమెను, కుటుంబ సభ్యులను కించపరుస్తూ, అసభ్యకరంగా ట్రోలింగ్ చేశాయి. వైసీపీ మద్దతు ఉన్న నాయకు లు దళితులపై ఎంతటి తీవ్రమైన నేరానికి పాల్పడినా వారికి జగన్ అన్ని రకాలుగా అండ దండలు అందించారు. అదే వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే చాలు దళిత నాయకులపైనా దాడికి పాల్పడ్డారు. పెత్తందారీ కుల కాలనాగులు అవకాశమొచ్చినప్పుడల్లా అణగారిన ప్రజానీకాన్ని కాటేసి ప్రాణాలు తోడేస్తూనేవు న్నాయి. కులం వద్దు..మతం వద్దు.. భారతీయు లంతా స్వేచ్ఛా స్వతం త్రాలు అనుభవిద్దామంటూ చేసుకున్న ప్రతినలన్నీ వెక్కిరింతకు గురవుతూనే వున్నాయి. కాకినాడ జిల్లా తొండంగి మండలం శృంగ వృక్షంలో పెత్తందారీ గూండాల దాడిలో దళిత యువకుడు బలైపోవడం, మరో తొమ్మిది మంది దళితులు గాయపడటం సమాజంలో వేళ్లూనుకున్న పెత్తందారీ దురహంకారాన్ని మరో మారు బయటపెట్టింది. కొన్ని నెలల కిందటే అధికార పార్టీకి చెందిన ఒక ప్రజా ప్రతినిధి తన వద్దే డ్రైవర్‌గా పనిచేస్తున్న దళిత యువకుడిని హత్య చేసి..మృతదేహాన్ని సదరు ప్రజా ప్రతినిధే నేరుగా బాధితుడి ఇంటికి డోర్ డెలివరీ చేసిన దారుణ ఉదంతం నుంచి జిల్లా తేరుకోక మునుపై మరో ఘోరం చోటు చేసుకుంది.శృంగవృక్షమనేది కాకినాడ జిల్లాలో చిన్న గ్రామం. ప్రతి యేటా ఇక్కడ జరిగే నూకాలమ్మ జాతరలో అన్ని సామాజిక తరగతు లవారు పాల్గొనడం ఆనవా యితీ. అందరూ ఊరేగింపుగా వెళ్లి అమ్మ వారిని దర్శించుకో వడం..మొక్కులు తీర్చుకోవడం గత కొన్ని తరాలుగా అనుసరిస్తూ వస్తున్న ఆనవా యితీ. జనం రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు పరస్పరం కాళ్లూచేతులు రాసుకోవడం, ఒక్కో సందర్భంలో కిందామీదా పడటం సర్వసాధారణం.శృంగ వృక్షం జాతరలోనూ అదే జరిగింది. జనం రద్దీలో పెత్తందారీ కాలు..దళిత యువకుడి కాలు పరస్పరం రాసుకున్నాయి. ‘మన కులపోడి కాలు నెత్తిన తగిలినా బాధలేదయ్యా..దళితుడి కాలు సోకితే ఊరుకుంటామా?’ అంటూ కుగ్రా మమైన శృంగవృక్షంపై మÖకుమ్మడి దాడికి తెగబడ్డారు. జాతరలో కాలు రాసుకున్న నేరా నికి శృంగవృక్షం దళితపేటపై పెత్తందార్లు రాళ్లు, కర్రలతో విచక్షణా రహితంగా మÖకు మ్మడి దాడికి పాల్పడ్డారు. దొరికినవారిని దొరికినట్టు చితకబాదారు. ఈ దాడిలో తొండంగి గ్రామానికి చెందిన నడింపల్లి రాము అనే దళిత యువకుడు ప్రాణాలు కోల్పో యాడు. మరో తొమ్మిది మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఇంత దారుణంగా దాడికి పాల్పడినా.. పెత్తందార్ల జోలికి వెళ్లకుండా పోలీసులు మీనమేషాలు లెక్కిస్తూ ఉండిపో యారే తప్ప ఎలాంటి తక్షణ చర్యలకు ఉపక్ర మించక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. తెల్లారితే ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవాల్సిన వాళ్లం..కేసులుగీసులు ఎందుకయ్యా..సర్దుకుపోతే అందరికీ మంచి దంటూ దళితులకు మైండ్‌వాష్ చేసే పనిని ఖాకీలు భుజానికి ఎత్తుకోవడం దిగ్భ్రాంతి కరం.కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) వంటి ప్రజాసంఘాలు నిలదీ యకపోతే అస్సలు కేసు కూడా నమోదు చేసేవారు కాదేమో !విజయవాడలో స్వరాజ్య మైదానంలో ఆకాశాన్నంటేలా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తున్నా మని, దళితులకు, అణగా రిన ప్రజానీకానికి తాము పెద్ద పీట వేస్తున్నామని పాలకులు మాటలు చెబితే సరిపోదు.‘దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటామా?’ అంటూ ప్రశ్నించే పెత్తందారీ ఆధిపత్య భావా జాలాన్ని పూర్తిగా విడనాడాలి. రాష్ట్రంలో వైసిపి అధికా రంలోకి వచ్చిన తర్వాత దళితు లకు శిరోముండ నాలు చేయించడం,అత్యాచారాలు, హత్యలు వంటివి తరచూ చోటుచేసు కోవడం దేనికి సంకేతం.దాడులు జరిగిన ప్పుడు ఒంటికాలిపై లేవడం..అరకోపరకో పరిహారమిచ్చి చేతులు దులిపేసుకుంటే సరి పోతుందా? ఇలాంటి దాడు లకు పాల్పడిన వారి పీచమణచాలి. ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్దర వీడి దళితులు, ఆదివా సీలు, ఇతర అణగారిన ప్రజానీకం రక్షణకు గట్టి చర్యలు చేపట్టాలి. బాధిత దళితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది.
    ప్రభుత్వంలో దళితులకు స్థానంలేదన్న వాస్తవం!
    వైసీపీ ప్రభుత్వంలో దళితలకు స్థానం లేదు అన్నది అక్షర సత్యం. ఆ సత్యాన్ని బహుజనులు, దళిత సంఘాలు ఎప్పుడో గుర్తించాయి. ఉత్తరాంధ్రాను మొదలుకొని రాయలసీమ వరకు నిత్యం దళితలపై జరుగుతున్న దాడులు, బెదిరింపుల అనేవి లెక్కకుమించినవి. ఇంత వివక్ష ఎందుకో అర్థకాదుకానీ ..స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటివరకు కూడా ఇంతలా దేశ వ్యాప్తంగా ఇటువంటి దాడులు ఏపీలో తప్ప ఎక్కడ చోటు చేసుకోకపోవడం గమనార్హం. దళిత ఓటు బ్యాంకుతో గద్దెనెక్కిన జగన్‌కు ఈ దాడుల లెక్క పట్టదా అని దళిత మేథావులు ప్రశ్నిస్తున్నా .. దున్నపోతుమీద వాన చందమే. ప్రశ్నించిన తెలుగుదేశం నేతలపై అధికార పార్టీకి చెందిన దళిత నాయకులతో అసభ్య పదజాలంతో విరుకుపడేలా పురికొల్పు తున్నారు. దళితులు, గిరిజనులు, మైనార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారంటే చాలు వారిని నామినేషన్లు వేయకుండా అడ్డుపడటం,ఒప్పుకొకుంటే దాడులు చేయడం జగన్ రెడ్డి ప్రభుత్వంలో పరిపాటిగా మారింది. ఇందుకు ఉదాహరణే ఏపిలో మిగిలి ఉన్న స్థానిక సంస్థలకు జరగుతున్న ఎన్నికలే. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీలో నామినేషన్ వేసేందుకు వచ్చిన వెంకటేశ్ అనే దళితుడిపై 30 వైసీపీ కార్యకర్తలు ముకుంబడి చేసిన దాడి, గుంటూరు జిల్లా గురజాల మున్సిపల్ ఎన్నికలలో మైనారిటీ మహిళా సుందగిరి నజీమÖన్ నామినేషన్ చింపి, ఆమెపై దాడి, తూర్పుగోదావరి జిల్లా కూనవరం మండలం కాచవరం పంచా యితీ ఒకటో వార్డుకు నామినేషన్ వేసిన గిరిజన మహిళ శిరీష కు బెదింపులు వంటివి వైసీపీ ప్రభుత్వం పాల్పడు తున్న దమనకాండకు నిర్శనాలు కావా అని విమర్శలు వెల్లువెత్తున్నాయి. అంతిమంగా ప్రజాస్వామ్య పద్దతిలో పదవులకు పోటీ చేసే స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు దళితులకు లేదు అన్నది జరుగుతున్న ఘనటలకు సజీవ సాక్ష్యాలు.దళితుల సంక్షేమం మరిచారు ..దాడులే లక్ష్యంగా పెట్టుకున్నారు! ఉత్తరాం ధ్రాల్లో దళితులు ..బెదిరింపులు,దాడులు, శిరోముండనాలను చూస్తే ..రాయలసీమలో రక్తాలు కారేలా హింసిస్తున్నారు. వివక్షలు, చిన్నచూపు వంటివి పరిస్థితులను తరుచూ అక్కడ దళితులు ఎదుర్కొంటున్నారు. దాడులు, శిరోముండనాలు, ఎన్నికల్లో పోటీచేస్తే చంపే స్తాం అన్న అనాగరిక చర్యలు గతంలో ఎన్నడూ చూడలేదు. వైఎస్సార్సీపీ అధికారం లోకి వచ్చిన నాటినుంచి దళితలపై సాగిస్తున్న నరమేథం, ఊచకోతలు అన్నీఇన్నీకావు. చంద్ర బాబు సొంత నియోజకవర్గమైన కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో అధికారంలో వైకాపా చేస్తున్న పాపాలు అన్నీఇన్నీకావు.14వ వార్డు టీడీపీ ఎస్సీ అభ్యర్థి వెంకటేష్ పై దాడి, నామి నేషన్ పత్రాలు చించివేయడం వంటివి చూస్తే అక్కడి మున్సిపల్ ఎన్నికలు సాధరణ ఎన్నికలు తలపించేంతగా అధికార పార్టీ సృష్టించే సీన్ సర్వత్ర విస్మయానికి గురిచేస్తోంది. ఇప్పటికే కుప్పంలో అధికారపార్టీ చేస్తున్న అకృత్యాలపై మాజీ సీఎం చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. వెంక టేశ్ ను 30మందికి దాడికి దిగారని,ఆ దాడికి సంబం ధించి ఫోటోలను కూడా లేఖకు జత చేశారు. గడిచిన 30నెలలో వైసీపీ ప్రభుత్వం చేతిలో చితికిన దళితుల గురించి వివరించాలంటే ఒక గ్రంథం రాయాలి. రెండు శిరోముండనాలతో దళితులపై దాడులు సెంచరీ దాటాయి. ఇదిలా ఉంటే ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కిందా టీడీపీ హయంలో 2018 నుంచి 2020 వరకు రూ.24 వేల కోట్లును ఖర్చు చేస్తే ..వైఎస్సార్సీపీ ప్రభుత్వం 30 నెలల్లో కేవలం రూ.5వేల కోట్లు కూడా ఖర్చు చేయకా..ఆ నిధులను ఫిచన్లు, రైతు భరోసా పథకా లకు మరలించడం కడువిచారం.ఇదేక్కడి దౌర్భగ్యమోకానీ..టీడీపీ హయంలో దళితలకు భూమి కొనుగోలు పథకం కింద 5 వేల ఎకరాలు పంపిణీ చేస్తేఏపి ప్రభుత్వం జగనన్న ఇళ్ల పేరుతో 4 వేల ఎకరాల అసైన్ట్ భూములను లాక్కొంది.
    స్వాతంత్య్రం వచ్చి 76 ఏండ్లు గడిచినా దళితులపై ఆగని దాష్టీకాలు.
    దేశంలో దళితులకు వేధింపులు, ఛీత్కారాలు, వారిపై దాడులు మాత్రం ఆగడం లేదు. మధ్య ప్రదేశ్‌లో గ్రామపంచాయతీలో ఓదళి తుడు కుర్చీలో కూర్చున్నందుకు అగ్రకులస్థుడు అతడి తల పగలగొట్టడం.. ఉత్తరప్రదేశ్‌లోని ఔరియా జిల్లాలో తరగతి నోట్స్‌లో తప్పులు రాశాడని టీచర్ ఓదళిత విద్యార్థిని చితకబాదడంతో మరణించడం.. ఇదే యÖపీలోని లఖింపూర్‌లో ఇద్దరు దళిత అక్కాచెలెళ్లను రేప్ చేసి హత్య చేయడం..రాజస్థాన్‌లో నీటి కుండను తాకాడని ఓదళిత విద్యార్థిని తీవ్రంగా కొట్టిన ఘటన.. ఇలా దళితులపై వివక్ష చూపేలా..వారిని వేధించేలా జరుగుతున్న ఘటనలు దేశంలో కొకొల్లలు. కేంద్రంలో, రాష్ట్రాల్లో బీజేపీ గద్దెనెక్కిన తర్వాత ఈ విష ధోరణి మరింత పెచ్చరిల్లుతున్నది. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో దళితుల పరిస్థితి దయనీయంగా మారింది.
    11 శాతం పెరిగిన దాడులు
    2019 నుంచి 2021 వరకు దేశంలో దళితులపై దాడులు 11శాతం పెరిగాయి. జాతీయ నేర గణాంకాల సంస్థ(ఎన్సీఆర్బీ) ప్రకారం..2019లో 45,961,2021లో 50,900 కేసులు నమోద య్యాయి. దళితులపై జరుగుతున్న దాడుల్లో జాతీయ సగటు కంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అధికంగా ఉన్నది. మధ్యప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, గోవా, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌లో దళితులపై విచ్చలవిడిగా దాడులు జరుగు తున్నాయి. రాజస్థాన్, తమిళనాడు వంటి ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో కూడా ఇది కని పిస్తున్నది. దళితులపై దాడుల ఘటనలకు సంబంధించి ఫిర్యాదులు వస్తున్నా.. వాటిపై ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం తగిన విధంగా స్పందించి, చర్యలు తీసుకుంటున్న సందర్భాలు తక్కువగా కనిపిస్తున్నాయి.
    లోపం చట్టాలదా? వ్యక్తులదా?
    ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్‌రస్‌లో 19ఏళ్ల దళిత యువతిపై సామÖహిక అత్యాచారం, హత్య ఆరోపణల వ్యవహారం మీడియాలో ప్రధానంగా కనిపించింది. ఈ ఘటన తర్వాత దళితులపై దాడులు, అణచివేతలపై మరోసారి ప్రశ్నలు మొదలయ్యాయి. స్వాతంత్య్రం వచ్చి 76 సంవత్సరాలైన తరువాత కూడా దళితులు ఇంకా సమానత్వం కోసం పోరాడుతూనే ఉన్నారు. దళితులపై హింసకు సంబంధించి అనేక సంఘటనలు ప్రతియేటా వినిపిస్తూనే ఉన్నాయి. 2015లో రాజస్థాన్ దంగవాస్ ఘటన,2016లో రోహిత్ వేముల మరణం, తమిళనాడులో 17ఏళ్ల దళిత బాలికపై సామÖహిక అత్యాచారం, హత్య, 2017లో సహారాన్‌పూర్ హింస, 2018లో భీమా కోరేగావ్ ఘటన ఇలా ప్రతి సంవత్సరం సంచల నాత్మక కేసులు వస్తూనే ఉన్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం, దళితులపై దాడులు,అత్యాచారాలు తగ్గక పోగా ఇంకా పెరిగాయి.2019 సంవత్సరం లో దళితులపై అత్యాచారాలు గతంకన్నా 7.3% ఎక్కువ కేసులు నమోదైనట్లు ఎన్సీఆర్‌బీ తెలిపింది. దళితులపై అఘాయిత్యాలకు సంబంధించి 2018లో 42,793 కేసులు నమోదు కాగా, 2019 సంవత్సరంలో 45, 935 కేసులు రికార్డయ్యాయి. ఇందులో సాధా రణ దాడుల కేసులు 13,273 కాగా, ఎస్సీ,ఎస్టీ (అత్యాచార నియంత్రణ) చట్టం కింద 4,129 కేసులు 3,486 అత్యాచారం కేసులు నమోద య్యాయి. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 2378 కేసులు నమోదు కాగా, మధ్యప్రదేశ్‌లో అత్య ల్పంగా రికార్డయ్యాయి. జమÖ్మ-కశ్మీర్, మణి పూర్, మేఘాలయ, మిజోరం,నాగాలాండ్, త్రిపు రలలో ఎస్సీ/ఎస్టీ చట్టం కింద ఒక్క కేసు నమో దు కాలేదు. 2019 సంవత్సరంలో షెడ్యూల్డ్ తెగలవారిపై నేరాలు 26.5శాతం పెరిగాయి. 2018లో ఎస్టీలలపై దాడులకు సంబంధించిన 6,528 కేసులు, 2019లో 8,257 కేసులు నమో దయ్యాయి. భారతదేశంలోనే కాదు విదే శాలలో కూడా దళితులపట్ల వివక్ష, దాడులకు సంబం ధించిన ఆరోపణలు వినిపిస్తున్నాయి. కులవివక్షను ఎదు ర్కొన్న 60మంది భారతీయులకు సంబంధించిన ఘటనలను ప్రచురించింది.చట్టాలకు ప్రజా చైతన్యం తోడైనప్పుడే దళితులపై అత్యాచారాలు, దాడులను రూపుమాపడం సాధ్యపడుతుంది.

    కులం కొలత..జాతికి కొరత

    • ఈ దేశంలో కులం ఒక వాస్తవం…!
    • జాతిని అణువణువునా నిర్వీర్యం చేస్తున్న వ్రణం…
    • మరి వందేళ్ల కిందటి సంగతో!
      దేశం వెనుకబాటుతనానికి,జాతిదాస్య శృం ఖలాల్లో మగ్గిపోవడానికి కుళ్లిపోయిన కుల వ్యవస్థే కారణమని బాబా సాహెబ్ అంబేడ్కర్ కుండ బద్దలు కొట్టారు.నాడు దేశరాజకీయాలను శాసిస్తున్న వ్యక్తు లను ఢీకొట్టారు.‘పని విభజన’ముసుగులో వేల సంవ త్సరాలుగా కొన్ని కులాలను అణగదొక్కుతున్న విష యాన్ని అంగీకరించి,దాన్ని సరిదిద్దేందుకు నడుం కట్టక తప్పని పరిస్థితిని నాటిరాజకీయ పక్షాలకు కల్పించారు.అణగారినవర్గా విముక్తికిదారులు వేశారు. ఈప్రయాణంలో భాగంగా ఆయన భారతీయ సమా జంలో కులం సృష్టిస్తున్న విధ్వంసాన్ని సమగ్రంగా విశ్లేషిస్తూ 1936లో ఒకశక్తిమంతమైన పుస్తకం రాశా రు. కుల నిర్మూలన(ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్) అనే ఈ పుస్తకం నిజానికి లాీVAర్‌లో జరిగిన ఓ సమావే శంలో చేయాల్సిన ప్రసంగం.కులం పట్ల అంబేడ్కర్ అభిప్రాయాలు ఇందులో బలంగా వ్యక్తమయ్యాయి. ప్రసంగంలో కులానికి సంబంధించిన అంశాల సంక్షిప్త పాఠం….- జి ఏ సునీల్ కుమార్ 
      శ్రమ విభజన బూటకం
      కుల వ్యవస్థను సమర్ధించే వాళ్లు చాతుర్వర్ణ విభజనను ‘శ్రమ విభజన’ పద్ధతితో పోలుస్తున్నారు. అన్ని నాగరిక వ్యవస్థల్లోనూ ‘శ్రమ విభజన’ ఉందని దబాయిస్తున్నారు.కులాలవారీ విభజన-శ్రమ విభజన ఒక్కటి కాదు.భారతదేశంలో కులాల పేరుతో శ్రామి కుల మధ్య అసహజమైన, దాటలేని అడ్డుగోడలు కట్టారు. ఇలా ఏనాగరక సమాజంలోనూ లేదు. సమా జంలో కొందర్నిపై అంచెలో, కొందర్ని కింది అంచెలో పెట్టి దాన్ని శాశ్వత వారసత్వంగా మార్చారు. ఇది స్వచ్చంద విభజనకాదు. సహజ స్వభావాలను, అభిరు చుల్ని బట్టి చేసింది కాదు. ఒక వ్యక్తిని తన వృత్తిని ఎంపిక చేసుకోగలిగే స్థాయికి అభివృద్ధి చేసినపుడే అతని సామాజిక,వ్యక్తిగత సామర్థ్యాలు వ్యక్తమవు తాయి.కుల వ్యవస్థలో దీనికి అవకాశమే లేదు. జీవిత కాలం చేయాల్సిన పనులను, వృత్తులను పుట్టుక ఆధా రంగా ముందే కేటాయిస్తారు. స్వభావ సిద్ధ సామ ర్థ్యాలను బట్టి పనులు అప్పగించరు. ఇది వినాశకర పద్ధతి. ఏరంగంలోనైనా తరచూ ఆధునికీకరణ జరు గుతూ ఉంటుంది. దాంతో కొన్ని వృత్తులు విలువను కోల్పోతాయి. కాలాన్ని బట్టి వృత్తులు మార్చుకొనే స్వేచ్చ లేకపోతే బతుకుదెరవు అసాధ్యమవుతుంది. పరిస్థితులను బట్టి, శక్తి సామర్థ్యాలను బట్టి వృత్తులలో సర్దుబాట్లు జరగకుండా కుల వ్యవస్థ అడ్డుకోవడమే దేశంలో నేటి నిరుద్యోగ సమస్యకు ప్రధాన కారణం. కులం ప్రమాదకర వ్యవస్థ కుల వ్యవస్థలో వ్యక్తి ఇష్టానిష్టాలతో సంబంధం లేదు. అభిరుచికి స్థానం లేదు. అంతా కర్మ సిద్ధాంతంపై ఆధారపడి ఉంది. ఇష్టం లేకున్నా బలవంతంగా కొన్ని పనులు చేయాల్సి వస్తోంది.చాలా వృత్తులను హిందూ సమాజం హీన మైనవిగా పరిగణిస్తోంది. దాంతో ఆయా వృత్తుల్లోని వారు తమ పనిపట్ల అత్యంత ఏహ్య భావాన్ని కలిగి వున్నారు. మనిషి హృదయం కానీ, బుర్ర కానీ పెట్ట కుండా పని చేయాల్సి వస్తోంది. సాంఘికంగా ఉన్నత స్థాయిలో ఉన్న కొందరు వక్ర బుద్ధులు స్వప్ర యోజనంకోసం కల్పించిన సంఘ వ్యవస్థే నేటి కుల వ్యవస్థ. దీనికి ఏ విధమైన శాస్త్రీయ ప్రమాణంకుల వ్యవస్థ దేశ ఆర్థిక సామర్థ్యాన్ని పెంచలేదు. జాతిని సమున్నతీకరించలేదు. నిజానికి అది హిందువులను విచ్ఛిన్నం చేసింది. నైతికంగా పతితుల్ని చేసింది. హిందూ అనేదే విదేశీ పదం. మహ్మదీయులు తాము వేరే అని చెప్పుకొనేందుకు ఇక్కడి వారికి హిందువులని పేరు పెట్టారు. మహ్మదీయ దండయాత్రకు ముందు ఏ సంస్కృత గ్రంథంలోనూ హిందూ పదం కనిపిం చదు.ఈ డే ప్రజలకు ఎప్పుడూ తాము ఒక జాతి ప్రజలమన్న భావన లేదు. ఇది కేవలం కొన్ని కులాల సముదాయం.ప్రతీ కులానికి తాము బతకడమే లక్ష్యం, పరమార్థం.ఎప్పుడైనా హిందూ-ముస్లిం కొట్లాట వచ్చినపుడు తప్ప మరోకులంతో సంబంధం ఉండదు. ప్రతీ కులం ఇతర కులాలకు దూరంగా ఉండటం ద్వారా తన ప్రత్యేకతను నిలబెట్టుకోవాలను కుం టుంది. కులంలోనే వివాహాలు చేసుకుంటారు. హిందువును కన్నంలో బతికే ఎలకతో పోల్చవచ్చు. జాతీయ చైతన్యం లేదు.ఉన్నది కుల చైతన్యం మా త్రమే.
      సమాజాన్ని కులమే విడదీస్తోంది
      వివిధ కులాల వారు ఒకే పండుగను చేసు కుంటున్నారు. అయితే, ఆసారూప్యం వారిని ఒక్కటిగా ఉంచలేక పోతోంది.ఏవ్యక్తి అయినా ఉమ్మడి కార్య కలాపాల్లో స్వేచ్ఛగా పాల్పంచుకోవాలి. ఇతరులను ఉద్రేకపరచే భావోద్వేగాలు అతన్ని ఉత్తేజపరచాలి. ఉమ్మడి కార్యకలాపాల్లో అతన్ని భాగస్వామిని చేయా లి.ఉమ్మడి సమాజం జయాపజయాలు తనవేనని భావించేట్లు ఉండాలి.ఇదే వ్యక్తులందర్నీ కలిపి సమా జంగా బంధించగల సూత్రం.హిందువుల్లో కుల వ్యవస్థ ఉమ్మడి కార్యకలాపాలను అడ్డుకుంటోంది. తద్వారా ఏకీకృత జీవనం గల సమాజంగా ఏర్ప డటాన్ని, ఒకే సమాజానికి చెందిన వారమన్న భావన కలగడాన్ని నిరోధిస్తుంది.చాతుర్వర్ణ వ్యవస్థ వల్లే తరత రాలుగా హిందూ సమాజం ఒడిదుడుకులను తట్టు కొని మనుగడ సాగిస్తూ వచ్చిందని కొందరు సంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. తరాల తరబడి లొంగిపోయి, రాజీపడి బతకడం కూడా బతకడమేనా? ఆజీవనంలో నాణ్యత ఏదీ?
      ఉప కులాలను ఎదగనివ్వరు
      ఉప కులాల మధ్యా పరస్పర సంబంధాలు విషతుల్యం అయ్యాయి.మహారాష్ట్ర బ్రాహ్మణ కులంలో అనేక ఉప కులాలున్నాయి. బ్రాహ్మణులు,ఇతర కులా ల మధ్య విభేదాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో, బ్రాహ్మ ణ ఉప శాఖల మధ్యా అంతే ఘోరంగా ఉన్నాయి. ఎక్కడైతే ఒక వర్గానికి స్వప్రయోజనాలు ఉంటాయో అక్కడ వాటిని కాపాడుకోవడానికి ఆవర్గం వాళ్లు ఇతర వర్గాలక దూరంగా ఉంటారు. ఈసంఘ వ్యతి రేక తత్వం,ఈ స్వప్రయోజన రక్షణ తత్వం దేశాల మధ్య ఎంత ప్రస్ఫుటంగా కనబడుతుందో కులాల మధ్యా అదే స్థాయిలో కనిపిస్తుంది. ప్రతీ కులం తమ స్వప్రయోజనాలను రక్షించుకోవడం కోసం తక్కిన కులాలతో నిరంతర పోరాటం చేస్తూ విడివిడి గుంపు లుగానే ఉంటున్నాయి.
      కులం కోసం బాధ్యత గాలికి
      దేశంలో కోట్లమంది ఆదిమవాసులు ఉన్నా రు. వేల ఏళ్లనాటి నాగరికత అని గొప్పలు చెప్పుకొనే ఈ దేశంలో ఆదిమ వాసులు ఇంకా దుర్భర అనాగరక పరిస్థితుల్లో జీవిస్తున్నారు.వారిలో కొందరిని నేర జాతులుగా పరిగణిస్తున్నారు. దీనికి హిందువులు సిగ్గు పడటం లేదు. కనీసం వారిని నాగరికులుగా మార్చడానికి, గౌరవ ప్రదమైన వృత్తుల్లోకి తీసుకు రావడానికి ప్రయత్నమే చేయలేదు. జన్మ సిద్ధమైన బుద్ధి మాంద్యమే కారణమని చెప్పడానికి ప్రయత్ని స్తారు. ఆదిమవాసుల కోసం క్రైస్తవ ధార్మిక సంస్థలు చేస్తున్నది హిందువు చేయగలిగే వాడా? వాళ్లను నాగ రికుల్ని చేయడమంటే ముందు నీవాళ్లుగా భావిం చాలి. వాళ్ల మధ్య జీవించాలి.వాళ్లలో సహానుభూతిని పెంపొందించాలి. ప్రేమించాలి. హిందువుడికి ఇది ఎలా సాధ్యం అవుతుంది?హిందువుకు కులాన్ని కాపాడుకోవడమే ముఖ్యం.
      మారితే ఏ కులంలో చేరాలి?
      హైందవం కూడా ఒకప్పుడు క్రైస్తవం లాగే మత ప్రచారానికి పాల్పడింది. లేదంటే ఇంతటి విశాల భూభాగంలో హిందూమతం విస్తరించి ఉండేది కాదు. కుల వ్యవస్థ ఏర్పడటంతోనే మత ప్రచారానికి తెర పడింది. కుల వ్యవస్థ ఉన్నచోట మతంలోకి రావడం కుదరదు.మతం మార్చుకున్న వారికి సంఘంలో లభించే స్థానం కూడా ముఖ్యమైన విషయమే. ఈనాడెవరైనా హిందూ మతం స్వీకరించదలచుకుంటే ఏ కులంలో చేర్చుకోవాలి?ఏదో ఒక క్లబ్బులో చేరినట్లు ఏదో ఒక కులంలో చేరడానికి లేదు. కులంలో పుట్టిన వారికే కుల సభ్యత్వం. కొత్తవారిని కులంలో చేర్పించే అధికారం ఈ భూమ్మీద ఎవరికీ లేదు. ఇతర మతాల వారిని కలుపుకొని తనను విస్తరించుకొనే అవకాశం హిందువులకు లేకపోవడానికి కారణం కుల వ్యవస్థే. దాన్ని రూపు మాపనంత వరకు ఇతర మతాల్లో వెళ్లిన వాళ్లను తిరిగి తీసుకొచ్చే శుద్ధి కార్యక్రమమÖ అర్థరహి తం,నిరర్థకం.హిందువుల్లోని కులాలకు,ఇతర మతా ల్లోని కులాలకు తేడా ఉంది.ముస్లిములు, సిక్కుల్లో అన్ని కులాలను కలిపి ఉంచేఉమ్మడి అంశాలున్నాయి. హిందువు విషయం అలా కాదు.కులం కూడా చెప్పా ల్సిందే. కులానికి అదనపు పవిత్రత లేదు.
      సంస్కర్తలను పుట్టనివ్వరు
      మతాచారాలను, కులం కట్టుబాట్లను వ్యతిరేకించే వారిని సాంఘిక జీవనం నుంచి వెలివేస్తు న్నారు.ఇదిచావుతో సమానం.దీనికి భయపడే సంస్కర ణాభిలాషులు కూడా కులం కట్టుబాట్లతో రాజీ పడి పోతున్నారు.కులంహిందువుల ప్రజాసేవాసక్తిని చంపేసింది.గొప్పతనం కలిగినవాడు తనకులం వాడై తేనే హిందువు అతని నాయకత్వాన్ని అంగీకరిస్తాడు.
      తిరగబడతాడనే భయం
      చాతుర్వర్ణ విధానం అత్యంత ప్రమాదకరమైన వ్యవస్థ. బ్రాహ్మణులు జ్ఞానాన్ని అభివృద్ధి చేస్తారు. క్షత్రియులు ఆయుధాలు పట్టుకొని రాజ్య రక్షణ భారం వహిస్తారు.వైశ్యులు వ్యాపారం చూసుకుంటారు. శూద్రులు ఈ మÖడు వర్గాలకు సేవకులుగా పని చేస్తారు.వినడానికి ఇది ‘పనిసేవకులుగా పని చేస్తారు. వినడానికి ఇది పనివిభజన’ లాగే ఉంటుంది. శూద్రు లు విద్య,రక్షణ,సంపాదన కోసం కష్టపడా ల్సిన అవసరం లేదని, వారి యోగ క్షేమాల్ని మొదటి మÖడు వర్గాలు చూసుకుంటాయని మనువాదులు తీయగా చెబుతుంటారు. వారి అసలు ఉద్దేశం శూద్రుణ్ణి తొక్కి పట్టి ఉంచడమే. మనుధర్మ శాసనాలను మించిన దుష్ట శాసనాలు ప్రపంచంలో మరెక్కడా లేవు. ప్రపంచ మంతటా సాంఘిక విప్లవాలు వచ్చినా భారతదేశంలో రాలేదంటే కారణం ఇదే. దిగువ కులాలు చదువు కోలేక పోవడం వల్లే విముక్తిని గురించి ఆలోచించే శక్తిని కోల్పోయాయి. ఐరోపాలోనూ పీడిత ప్రజలు ఎన్నడూ ఇంత నిస్సహాయంగా లేరు. వారిచేతుల్లో ఎప్పుడూ ఆయుధం ఉంది. భారతదేశంలో కేవలం మౌర్యుల కాలంలోనే కింది కులాలు రాజకీయ అధి కారాన్ని అనుభవించాయి. అప్పుడే చాతుర్వర్ణ వ్యవస్థ ధ్వంసమై పోయింది. శూద్రులు రాజులయ్యారు. ఎప్పుడో శివాజీకి నాటిబ్రాహ్మణులు చేసిన అగౌర వాన్నికడుపులో పెట్టుకొని నేటికీబ్రాహ్మణేతరులు వారిని క్షమించలేకున్నారు.
      కాయస్థులు తమపూర్వీకులపై అప్పటి బ్రాహ్మ ణులు వేసిన అభాండాలను దృష్టిలో పెట్టుకొని ఇప్ప టికీ వారిని క్షమించలేకున్నారు. కుల వ్యవస్థ వల్లే తరాలు మారినా గత కలహాలు అలా రగులుతు న్నాయి. జాతి ఏకీకరణకు అడ్డంకిగా నిలుస్తున్నాయి. కులం అక్కర లేని ఆదర్శప్రాయ సమాజం స్వాతం త్య్రం,సమానత్వం,సౌభ్రాతృత్వం పునాదుల మీద ఆధా రపడి నిలుస్తుంది. సమాజంలో ఒక మÖల మార్పు జరిగితే అది అన్ని మÖలల ప్రతిఫలిస్తుంది. మానవు లందరిలో సాంఘిక సోదరత్వం ఉంటుంది. కుల నిర్మూలనకు సరైనమార్గం వర్ణాంతర వివాహాలే. రక్త సమ్మిశ్రణ ఒక్కటే మానవుల్లో అన్యోన్య అనుబంధ భావాన్ని, బాంధవ్యాలను కలిగిస్తుంది. అట్టి బంధు భావ ప్రభావం లేనిదే కులం కల్పించిన విభేదాలను, వివక్షను రూపుమాపలేం.వివిధ కులాల మధ్య స్నేహానుబంధాలను కలిగించాలంటే ఆయా కులాల వ్యక్తుల నడుమ రక్త సంబంధాలను కల్పించక తప్పదు.

    కార్పొరేట్ల పరం కానున్న ఖనిజం

    మోడీ ప్రభుత్వ వికసిత్ భారత్ నుంచి ఉద్భ వించిన స్వర్ణాంధ్ర -2047 నుంచి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మరో అస్త్రం తీసింది. పారిశ్రామిక, కార్పొరేట్ శక్తులకు అత్యంత వేగంగా లాభాలు కట్టబెట్టడానికి రేర్ ఎర్త్ మినరల్ (అరుదైన ఖని జాలు) కారిడార్‌కు రూట్‌మ్యాప్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించాయి. అదానీ, అంబానీ వంటి కుబేరులకు కట్టబెడుతున్న భూములు, గనులు, ఓడరేవులు, విమానాశ్ర యాలు సరిపోక… తీర ప్రాంతాన్నీ వారి గుప్పెట్లో పెట్టాలని ప్రయత్నిస్తున్నాయి. తీర ప్రాంత ఇసుకలో లభించే అతి విలువైన, అత్యంత అరుదైన ఖనిజాలను కార్పొరేట్ శక్తులకు స్వాధీనపర్చేందుకు సమాయత్తమవుతున్నాయి. ఈ ఖనిజాలను కొల్లగొట్టుకుపోయేందుకు అమెరికా పన్నిన వ్యూహంలో భారత్ పడింది. – గుల్ల కాంతారావు
    అరుదైన ఖనిజాలకు చైనాపై అమెరికా ప్రధా నంగా ఆధారపడింది. చైనా ఇటీవల ఖనిజ ఎగుమ తులపై,వాటి శుద్ధి సాంకేతికతపై నియంత్రణ విధిం చడంతో అమెరికా భరించలేకపోతున్నది.సొంత ఉత్పత్తిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తూనే, ఆస్ట్రేలియా, కెనడా,బ్రెజిల్,భారత్ నుంచి ఎగుమతి చేసుకోవ డానికి ప్రయత్నిస్తోంది. అమెరికా మాట జవదాటని మోడీ ప్రభుత్వం,దాని ప్రయోజనాలకనుగుణంగా ఖనిజ రంగంలో భారీ మార్పులను తీసుకొస్తోంది. ఖనిజ తవ్వకాలకు నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ మోడీ ప్రభుత్వం ఏర్పాటుచేసింది.భారత్‌లో అత్య ధికంగా ఆంధ్రప్రదేశ్,ఒడిశా తీరప్రాంతంలోని ఇసుక లో భారీ పరిమాణంలో ఖనిజాలున్నాయి. సముద్ర ఇసుకలో మైనింగ్ ప్రాసెసింగ్,పరిశోధన,తయారీకి ఆంధ్రప్రదేశ్,ఒడిశా,కేరళ,తమిళనాడును ప్రత్యేక రేర్ ఎర్త్ కారిడార్లుగా ఎన్‌డిఎ ప్రభుత్వం ప్రకటించింది. 2026-27 బడ్జెట్‌లో రూ.7,280 కోట్లు కేటాయిం చింది.దేశంలో 30 మినరల్ బ్లాకులను అందుబాటు లోకి తెచ్చింది. తీర ప్రాంత ఇసుక నుంచి ఖనిజ తవ్వకాల లీజులకు ఆసక్తి కనబర్చుతున్న కార్పొరేట్ సంస్థలకు పెట్టుబడి ప్రోత్సాహం,భారీ రాయితీలు కల్పించనుంది. సముద్రంలో ఖనిజ తవ్వకాలతో వచ్చే శబ్ధాలు,ప్రకంపనలు,మత్స్య సంపద దెబ్బతినడం, ఇంధనాలు,రసాయనాలు సముద్రంలో కలవడంతో జీవ,మానవ మనుగడకు తీవ్రమైన ప్రమాదం ఏర్పడు తుందని పర్యావరణ వేత్తలు ఆందోళన చెందుతు న్నారు. తీర ప్రాంతంలో ఇసుక తవ్వకాలతో సముద్ర తీరంలోని ఇసుక దిబ్బలు తగ్గి, కోతకు గురవుతాయి. తీర సమీప నివాసిత ప్రాంతాల్లోకి ఉప్పునీరు ప్రవేశిం చడంతో తాగునీటి సమస్య ఏర్పడుతుంది. నిర్మాణాలు దెబ్బతింటాయి. జీవ వైవిధ్యానికి నష్టం జరుగుతుంది. ఇసుక శుద్ధి క్రమంలో వెలువడే వ్యర్ధాలు సముద్రం లోకి వదలడంతో చేపలు చనిపోతాయి. సముద్రంలో చేపల వేటపై ఆధారపడిబతుకుతున్న మత్స్యకారుల కొద్దిపాటి జీవనోపాధి పోతుంది.సముద్రపు ఇసుకలోని మోనజైట్ ఖనిజం నుంచి వెలువడే థోరియంతో పరిసర ప్రజలు చర్మ, క్యాన్సర్, ఊపిరితిత్తులు వంటి వ్యాధుల బారినపడతారు. ఇసుక తవ్వకాలు జరిగిన తీరంలో మత్స్యకారుల వేట పడవలు ఉంచడానికి చోటుండదు. ఇన్ని అనర్ధాలు, నష్టాలు, దుష్ఫ్రభావా లున్నా కార్పొరేట్ల ప్రయోజనాలకే ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయి.
    గతేడాది అమెరికా భారీగా సుంకాలు విధిం చినా భారత్ నోరు విప్పలేదు. అందుకని ఖనిజాలపై చైనాపై ఆధారపడ్డం తగ్గించుకొని తామేమన్నా, కాదనని భారత్‌పై అమెరికా దృష్టి పెట్టింది. కొద్ది రోజుల క్రితం భారత్ పర్యటనకు జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడిక్ మెర్జ్ వచ్చిన సందర్భంగా జరిగిన 19 అవగా హనా ఒప్పందాల్లో కీలక ఖనిజ రంగం ప్రధానంగా వుంది.
    ప్రపంచంలో మÖడో అతిపెద్ద అరుదైన, విలువైన 48.2కోట్ల టన్నుల ముడి నిల్వలున్నట్లు దేశ సముద్రతీరంలో వున్నట్లు కేంద్రం గుర్తించింది. ఎసఐఓ తాజా లెక్కల ప్రకారం రాష్ట్రంలోని 1053 కిలోమీటర్ల తీర ప్రాంతంలో బీచ్‌శాండ్ నిల్వలు 241 మిలియన్ టన్నులకు పైగా వున్నాయి. దేశంలో బీచ్‌శాండ్ నిల్వలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో వుంది.ఎలక్ట్రిక్ మొబిలిటీ, పునరుత్పాదక శక్తి, ఎలక్ట్రానిక్స్,రక్షణ రంగ వృద్ధికి ప్రపంచ వ్యాపితంగా ప్రాధాన్యత పెరుగుతుంది. 2030 నాటికి రేర్ ఎర్త్ పర్మినెంట్ మాగెట్‌ల వినియోగం రెట్టింపు అవు తుందని అంచనా. మోనజైట్ నిల్వలు 35 శాతం రాష్ట్రంలోని శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు సము ద్రతీరంలో వున్నాయి.దేశంలో 7.23 మిలియన్ టన్నుల రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వున్నట్లు అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ గుర్తించింది. 13.15 మిలియన్ టన్నుల మోనజైట్‌లో 7.23మిలియన్ టన్నుల మÖల కాలున్నాయని అంచనా.
    రాష్ట్రంలో 40వేల ఎకరాలలో,అత్యంత నాణ్యమైన ఖనిజాలు విశాఖపట్నం,శ్రీకాకుళం జిల్లా ల్లో వున్నట్లు ఎపి మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎపిఎండిసి) గుర్తించింది.విశాఖపట్నం జిల్లా భీముని పట్నం, శ్రీకాకుళం జిల్లా గార మండలాల మధ్య 2,500 ఎకరాల తీరంలో తొలుత ఖనిజ తవ్వకాలు ప్రారంభించి, సెమీ కండక్టర్ల పరిశ్రమలను ఆకర్షిం చాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విశాఖ పట్నం, శ్రీకాకుళం జిల్లాల్లోని 2,265 ఎకరాల బీచ్ శాండ్ ఖనిజ తవ్వకాలు, ప్రాసెసింగ్‌ను అదానీ గ్రూపునకు చెందిన అల్లువియల్ హెవీ మినరల్స్ లిమిటెడ్ దక్కించుకున్నట్లు సమాచారం. సముద్రతీర ఇసుకలోని ఖనిజ తవ్వకాలు, ప్రాసెసింగ్‌పై కోర్టు తీర్పులు, ఆదేశాలను పరిగణనలోకి తీసుకోవడంలేదు. తీరంలోని విలువైన ఖనిజం ప్రయివేటు వ్యక్తులకు ఇవ్వకూడదన్న నిబంధనలను పట్టించుకోవడంలేదు.
    పర్యావరణ, జీవవరణ సమస్యలు, మత్స్యకా రుల ఉపాధి బాధ్యత వదిలి, సింగ్ విండో పద్ధతిలో బీచ్‌శాండ్ తవ్వకాల అనుమతులు,భూ కేటాయిం పులు, మౌలిక సదుపాయాలు, ప్రోత్సాహకాలపైనే దృష్టి కేంద్రీకరించింది. కార్పొరేట్ల లాభాలకు తీర ప్రాంత ప్రజలను, ప్రధానంగా మత్స్యకారుల జీవనో పాధిని ఫణంగా పెట్టడానికి రెండు ప్రభుత్వాలూ సిద్ధపడ్డాయి.

    మైనింగ్ విధానాలు..అభివృద్ధి,హక్కులు

    రాంచిలోని బగైచా అనే సంస్థ ఆవరణంలో ఇటీవల ‘వాతావరణ మార్పు`ప్రజావనరుల ప్రైవేటీకరణ మరియు ప్రజాసంక్షేమం’అనే అంశంపై జాతీయ స్థాయిలో జరిగిన రెండు రోజుల సదస్సులో సమత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రెబ్బాప్రగడ రవి కీలక ఉపన్యాసం చేశారు.ఆ ఉపన్యాసంలోని కీనోట్ వివరాలు ఇలా ఉన్నాయి..భారతదేశం నేడు తన అభివృద్ధి ప్రయాణంలో ఒక కీలక మలుపు వద్ద నిలిచింది. ఒకవైపు వేగవంతమైన పారిశ్రామికీకరణ, ఆర్థిక వృద్ధి లక్ష్యాలతో గనుల రంగాన్ని ప్రోత్సహిస్తుండగా, మరోవైపు ఖనిజ సంపద సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజన,ఆదివాసీ వర్గాల జీవన విధానాలు సంక్షోభంలో పడుతున్నాయి. ఈనేపథ్యంలో మైనింగ్ విధానాలు,రక్షణ చట్టాల బలహీనత, ప్రజల ప్రతిఘటన వంటి అంశాలు సమకాలీన భారతదేశంలో ప్రధాన చర్చావిషయాలుగా మారాయి. – గునపర్తి సైమన్ 


    అభివృద్ధి నమÖనా-ఎవరి కోసం?
    ప్రస్తుత అభివృద్ధి నమÖనా ఖనిజ వనరులను పారిశ్రామిక విస్తరణ, మౌలిక సదుపాయాల నిర్మాణం, ఇంధన ఉత్పత్తికి కీలక వనరులుగా పరిగణిస్తోంది. అయితే ఈ విధానం “అభివృద్ధి ఎవరి కోసం? ఎవరి ఖర్చుతో?” అనే ప్రశ్న లను లేవనెత్తుతోంది.గనుల ప్రాజెక్టులు పెద్దఎత్తున స్థానభ్రంశం,పర్యావరణ విధ్వంసం,జీవనోపాధి కోల్పోవడానికి కారణ మవుతున్నాయి.మైనింగ్ విధానాల పరిణామం.స్వాతంత్య్రం తర్వాత ప్రభుత్వం ఆధ్వర్యంలోని మోడల్ అమల్లో ఉండగా,1991ఆర్థిక సరళీకరణ తర్వాత గనుల రంగం ప్రైవేట్ పెట్టుబడులకు తెరుచుకుంది. 1957 గనులు మరియు ఖనిజాల చట్టం, 2015 మరియు 2021 సవరణలు మైనింగ్ రంగాన్ని వేగవంతం చేయడంపై దృష్టి సారించాయి. జాతీయ ఖనిజ విధానాలు (1993,2008, 2019) పెట్టుబడులను ఆకర్షించడం, ఖనిజాల వెలికితీతను పెంచడం, నియంత్ర ణలను సులభతరం చేయడం వంటి అంశా లను ప్రోత్సహించాయి.
    గిరిజన ప్రాంతాలు-ఖనిజ సంపద మధ్య విరోధం
    ఒడిశా,జార్ఖండ్,ఛత్తీస్‌గఢ్,ఆంధ్రప్రదేశ్,తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ఖనిజ సంపద మరియు గిరిజన జనాభా అధికంగా ఉంది. గిరిజను లకు భూమి కేవలం ఆస్తి కాదు-అది వారి సంస్కృతి, జీవన విధానం, ఆధ్యాత్మికతకు మÖలం.కానీ మైనింగ్ ప్రాజెక్టులు ఈసంబం ధాన్ని దెబ్బతీస్తున్నాయి.
    రక్షణ చట్టాల బలహీనత
    భారత రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్, PజుSA చట్టం (1996),అటవీ హక్కుల చట్టం (2006) గిరిజన హక్కులను రక్షించడానికి ఉన్నప్పటికీ, అమలులో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.పర్యావరణ అనుమతుల వేగవంతం, గ్రామసభల సమ్మతి లేకుండా ప్రాజెక్టుల ఆమోదం, అటవీ భూముల మళ్లింపు వంటి చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయి.గనుల తవ్వకాల వల్ల లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ముఖ్యంగా ఆది వాసీలు తీవ్రంగా ప్రభావిత మయ్యారు. వ్యవసాయ భూమి కోల్పోవడం,అడవుల నాశనం,నీటి కాలుష్యం,జీవనోపాధి కోల్పో వడం వంటి సమస్యలు తీవ్రరూపం దాల్చాయి.
    ప్రజల ప్రతిఘటన-ప్రజాస్వామ్య పోరాటం
    దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ప్రజలు మైనింగ్ ప్రాజెక్టులను వ్యతిరేకించారు. నియాంగిరి కొండల్లో డోంగ్రియా కొంధ్ గిరిజనుల పోరాటం ఒక ముఖ్య ఉదాహరణ. గ్రామసభల నిర్ణయాన్ని గౌరవిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యానికి నిదర్శనంగా నిలిచింది. కాశీపూర్, కళింగనగర్, హస్డియో అరంద్ వంటి ప్రాంతాల్లో కూడా ఉద్యమాలు జరిగాయి.
    సమతా తీర్పు-మైలురాయి
    1997లో సుప్రీంకోర్టు ఇచ్చిన సమతా తీర్పు ప్రకారం షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గిరిజన భూము లను ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వ కూడదని స్పష్టం చేసింది. ఇది గిరిజన హక్కుల పరిరక్షణలో కీలక ఘట్టంగా నిలిచింది. ముందుకు మార్గంభారతదేశం అభివృద్ధి సాధనలో సమతుల్యత అవసరం. న్యాయమైన మైనింగ్ విధానం కోసం..గిరిజన హక్కులకు గౌరవం,గ్రామసభల నిజమైన సమ్మతి, పర్యా వరణ పరిరక్షణ,న్యాయమైన పునరావాసం ఖనిజ లాభాల సమాన పంపిణీ అత్యవసరం. మైనింగ్ చర్చ కేవలం ఆర్థికవృద్ధి గురించే కాదు; ఇది న్యాయం,హక్కులు,ప్రజాస్వామ్యం గురించినది.పర్యావరణ సుస్థిరత, సామాజిక న్యాయం, ప్రజల భాగస్వామ్యం ఆధారంగా మాత్రమే నిజమైన అభివృద్ధి సాధ్యమవు తుంది.సహజ వనరులను సంరక్షిస్తూ,గిరిజన వర్గాల హక్కులను గౌరవించినప్పుడే భారత దేశం సమానమైన, సుస్థిరమైన అభివృద్ధి దిశగా ముందుకు సాగగలదు.

    1 2