విశాఖ కార్పొరేషన్ కూటమి కైవసం
ఆంధ్రప్రదేశ్‌లోనే అతిపెద్ద కార్పొరేషన్‌గా |రొం దిన గ్రేటర్ విశాఖ పీఠంపై తెలుగుదేశం పార్టీ విజయబావుటా ఎగురవేసింది. తీవ్ర ఉత్కంఠ రేపిన మేయర్ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి ముక్కా శ్రావణి తన ప్రత్యర్థి, వైసీపీ తరఫున నిలిచిన వరుదు కల్యాణిపై విజయాన్ని నమోదు చేసు కున్నారు. మొత్తం120వార్డులు కలిగిన విశాఖ కార్పొ రేషన్ ఎన్నికల్లో కూటమి కూర్పు తిరుగు లేని ఫలితాన్ని ఇచ్చింది. నగర ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని పార్టీవర్గాలు హర్షంవ్యక్తంచేస్తూ విజయోత్సవాల్లో మునిగిపోయాయి. డాక్టర్ ముక్కా శ్రావణి కార్పొరేషన్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కు రాలైన మÖడో మహిళా విశాఖ మేయర్‌గా సరికొత్త రికార్డు సృష్టించారు.
విశాఖపట్నం కార్పొరేషన్ (జీవీఎం సీ) పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది. కూటమి నుంచి పోటీచేసిన ముక్కా శ్రావణి మేయర్ 2.47,817 ఓట్లు భారీ మెజార్టీతో గెలిచారు. మేయర్ స్థానానికి మొత్తం15 మంది పోటీ చయగా.. కూటమి, వైఎస్సార్ సీపీ మధ్య ప్రధానపోటీ జరిగింది.జీవీఎంసీలో మొ త్తం 120డివిజన్లలో టీడీపీకి 64,జనసేన పార్టీకి 26,బీజేపీకి 8స్థానాలు వచ్చాయి.. మొ త్తం కూటమికి 98స్థానాలుదక్కాయి. వైఎస్సా ర్సీపీ13,స్వతంత్రులు8, సీపీఎం 1 డివిజన్లలో గెలిచారు.
ముక్కా శ్రావణి ఎవరు?
మహా విశాఖ నగరపాలక సంస్థ మేయరుగా కూటమి అభ్యర్థి డాక్టర్ ముక్కా శ్రావణి గెలు పొందారు.టీడీపీ,బీజేపీ,జనసేన కూటమి అభ్యర్థిగా పోటీచేసిన ఆమె..తన సమీప అభ్యర్థి, వైఎస్సార్సీపీ నాయకురాలు వరుదు కల్యాణిపై 2.30లక్షలకు పైగాఓట్ల మెజారిటీతో గెలుపొం దారు.శ్రావణి వృత్తిరీత్యా ఫిజియోథెరపిస్ట్.. ఆమె వయసు 32 సంవత్సరాలు. ముక్కా శ్రావణి 2015లో టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు.ఆతర్వాత 2021విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో 26వార్డు నుంచి కార్పొరేటరుగా గెలుపొందారు.శ్రావణిది సుదీర్ఘ రాజకీయ నేపథ్యంఉన్న కుటుం బం.ఆమెతండ్రి ముక్కా ముత్యాల నాయుడు టీడీపీ సీనియర్ నాయకుడు.పార్టీ స్థాపించి నప్పటి నుంచి ఆయన తెలుగుదేశం పార్టీ లో చురుగ్గా కొనసాగుతున్నారు. గతంలో ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ కార్పొరేటర్లుగా పనిచేశారు. డాక్టర్ ముక్కా శ్రావణి 2015 లో తెలుగుదేశం పార్టీలో చేరి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు.2021లో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో అక్కయ్యపాలెం పరిధి లోని 26వ వార్డు నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలుపొందారు.“2021 కార్పొ రేషన్ ఎన్నికలో విశాఖ ఉత్తరనియోజక వర్గంలోని 26వవార్డు నుంచిపోటీ చేశా ను.ఆనియోజకవర్గంలో17 వార్డులుంటే… అందులో టీడీపీ గెల్చుకున్న ఏకైన వార్డు నాదే” అని ముక్కా శ్రావణి చెప్పారు.ఒక వార్డు రిజర్వేషన్ కారణంగా రాజకీయాల్లోకి వచ్చిన ముక్కా శ్రావణి…ఐదేళ్లలో నగర ప్రథమ పౌరురాలిగా ఎదిగారు.జీవీఎంసీ మేయర్ స్థానం 2026లో జనరల్ మహిళా కేటగిరీకి రిజర్వ్ కావడంతో, సుదీర్ఘ చర్చల అనంతరం టీడీపీ అధిష్టానం ఆమెను కూటమి తరఫున మేయర్ అభ్యర్థిగా ఖరారు చేసింది.‘ఆరిజర్వేషనే నన్నింత దూరం తెచ్చింది’విశాఖ మేయర్ గా ఎన్నికైన ముక్కా శ్రావణి తాను రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చిందోచెప్పారు.”నిజానికి 2021ఎన్నికల్లో మాఅన్నయ్య కార్పొరేటర్ గా పోటీ చేద్దామనుకున్నారు.మానాన్న 2000లో జరిగిన ఎన్నికల్లో కార్పొరేటర్‌గా గెలిచారు. ఆయన రాజకీయ వారసుడిగా మా అన్నయ్య 26వవార్డునుంచిబరిలోదిగుదామనుకున్నారు. కానీ ఆవార్డు మహిళ లకు రిజర్వ్ కావడంతో నేను పోటీ చేయా ల్సి వచ్చింది.” అని శ్రావణి మాట్లా డుతూ గుర్తు చేసుకున్నారు. ఆనిర్ణయ యమే ఇప్పుడు తనను విశాఖ మేయర్ పీఠంపై నిలిపిం దన్నారు.
‘కార్పొరేటర్ అనుభవం మేయర్‌గా ఉపయోగం’
కార్పొరేటర్‌గా పనిచేసిన అనుభవం ఇప్పు డు విశాఖమేయరుగా పనిచేయడానికిఉప యోగ పడుతుందని శ్రావణిఅన్నారు. “కార్పొ రేటర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. జీవీ ఎంసీ సమా వేశాల్లోనూ అనేకసార్లు పాల్గొన్నా.అందుకే విశాఖనగర సమస్యలపై పూర్తి అవగాహన ఉంది.ప్రతివార్డులో అభివృద్ధిపనులు,ప్రజా సమస్యలపై నెలవారీ సమీక్షలు నిర్వహించడం తో పాటు సురక్షిత తాగు నీరు,పారిశుధ్యం,రహ దారుల మరమ్మతులపై దృష్టిపెడతా. సముద్రం లోకి మురుగు నీరు చేరకుండా చర్యలు తీసు కుంటా. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు ఏర్పాటుచేయడం,వీధి దీపాలు, పబ్లిక్ టాయిలెట్లు,ఆట స్థలాలను మెరుగు పరచడంద్వారా విశాఖను మరింత అభివృద్ధి చేస్తా”అని ముక్కాశ్రావణి తెలిపారు. “విశాఖ నగరాన్ని పరిశుభ్రమైన, పచ్చ దనంతో కూడిన క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చి దిద్దడమే నాలక్ష్యం. ప్రతివార్డులో ఆటస్థలాలను అభివృద్ధిచేసి, ప్రజ లకు మెరుగైన జీవనప్రమాణాలు కల్పిం చేందు కు కృషి చేస్తాను”అని శ్రావణి తెలిపారు.
ప్రశాంతంగా ముగిసిన జీవీఎంసీ రెండో సాధా రణఎన్నికలు
విశాఖపట్నం నగరంలో జీవీఎంసీ రెండో సాధారణ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ నవం బరు ఒకటన ప్రశాంతంగా ముగిశాయని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఎం.అభిషిక్త్ కిశోర్ తెలిపారు.ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీ రింగ్ కళాశాలలోని సివిల్ ఇంజనీ రింగ్ కాంప్లెక్స్ భవనంలో పోలీస్ కమిష నర్ శంఖ బ్రత బాగ్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్గార్గ్లతో కలిసి నిర్వహించిన విలే కరుల సమావేశంలో ఎన్నికల వివరాలను వెల్లడించారు. జీవీఎంసీ పరిధిలోని 120 వార్డుల్లో మొత్తం18,37,901మంది ఓటర్లకుగాను 9,45,915 మంది తమ ఓటు హక్కును వినియోగిం చుకు న్నారని, మొత్తం51.47శాతం పోలింగ్ నమో దైందని స్పష్టంచేశారు.వీరిలో4,55,395 మంది పురుషులు,4,90,519మంది మహిళలు ఓటువేశారని వివరించారు.మొత్తం1,990 పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛ నీయ ఘటనలు చోటుచేసుకో కుండాఎన్నికల ప్రక్రి య పూర్తయిందని,నగర వ్యాప్తంగా ఎలాంటి ఎన్నికల సంబంధిత ఫిర్యాదులు లేదా ఘటనలు నమోదు కాలే దని స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణలో సుమారు15వేల మంది సిబ్బంది పాల్గొన్నారని, 201 రూట్ల లో పోలింగ్ సిబ్బంది,ఎన్నికల సామగ్రి తరలింపునకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. నవంబర్ 3వతేదీన ఆంధ్ర విశ్వ విద్యాల యంలో ఏర్పాటు చేసిన113 కౌం టింగ్ ప్రక్రియకూడా ప్రశాంతంగా ముగిసిందన్నారు. – జి ఏ సునీల్ కుమార్
