రాజధాని అమరావతికి రాష్ట్రపతి ఆమోదం
ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. పార్లమెంట్ ఆమోదం అనంతరం అమరావతి బిల్లు రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంది. ఈ బిల్లును పరిశీలించిన అనంతరం.. న్యాయ నిపుణులతో సంప్రదింపుల తర్వాత రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి ఆమోదం అనంతరం కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీ పునర్వవస్థీకరణ చట్టంలోని సబ్ సెక్షన్ 2లో రాజధానిగా అమరావతిని పేర్కొంటూ కేంద్ర న్యాయ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం జూన్ 2, 2024 నుంచి ఏపీ రాజధానిగా అమరావతిని పేర్కొన్నారు. ఏపీ పునర్విభజన చట్ట సవరణ 2026 బిల్లును కేంద్రం ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టగా.. ఉభయసభలు ఆమోదం తెలిపాయి. సుమారు ఐదు గంటలు లోక్‌సభ, రాజ్యసభల్లో అమరావతి బిల్లుపై చర్చ జరిగింది. అనంతరం ఎలాంటి సవరణలు ప్రతిపాదించకుండానే అమరావతికి బిల్లుకు లోక్ సభ, రాజ్యసభలు ఆమోదం తెలిపాయి. దీంతో లోక్‌సభ సచివాలయం అమరావతి బిల్లును రాష్ట్రపతి వద్దకు పంపించగా.. రాష్ట్రపతి సోమవారం రోజున అమరావతి బిల్లుకు ఆమోద ముద్ర వేశారు. దీంతో అమరావతి బిల్లు చట్టరూపం దాల్చింది.
ఆంధ్ర-తెలంగాణలు విడిపోయాక రాజధాని విషయంలో సందిగ్దత నెలకొన్నది. ఆ సందిగ్దతకు తెరదించుతూ ఇటీవలే ఏపీ అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అంటూ మార్చి 28న తీర్మానం చేసింది. ఈ క్రమంలో ఏపీ పునర్వ్య వస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5(2)ని సవరించి ఏపీ రాజధాని అమరావతిగా కేంద్ర ప్రభుత్వం గుర్తిం చింది. ఈ మేరకు ఏప్రిల్ 1, 2 తేదీలలో పార్లమెంటులో ఈ అంశంపై చర్చించారు. మÖజువాణి ఓటు ద్వారా బిల్లును ఆమోదించారు. వైసిపికి చెందిన ఇద్దరు ఎంపీలు మినహా పార్ల మెంటులోని సభ్యులందరూ అమరావతి రాజధాని బిల్లుకు మద్దతు పలికారు. దీనితో బిల్లును కేంద్రం రాష్ట్రపతి ఆమోదముద్ర కోసం పంపగా, రాజ్యాం గంలోని ఆర్టికల్ 111 ప్రకారం తన అధికారాలను అనుసరించి రాష్ట్రపతి బిల్లుకు ఆమోదముద్ర వేసారు. దీనితో కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దాని ప్రకారం 2024 జూన్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిగా గుర్తించామని నోటిఫై చేసినట్లు తెలిపింది.
చట్టబద్ధ రక్షణ ప్రక్రియ సంపూర్ణం
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ సంపూర్ణమైంది. ఇప్పటికే పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందిన ఈ బిల్లుపై రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా పడింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు-2026 సోమవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌కు చేరింది. సాయంత్రానికే దీనిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు. రాత్రి 10గంటలకల్లా ‘గెజిట్ నోటిఫికేషన’ కూడా వెలువడింది. దీంతో ‘అమరావతి’కి కేంద్ర స్థాయిలో చట్టబద్ధమైన రక్షణ లభించినట్లయింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర అనంతరం భారత ప్రభుత్వ కార్యదర్శి రాజీవ్ మణి ఈ గెజిట్‌ను విడుదల చేశారు. 2014నాటి రాష్ట్ర పునర్విభజన చట్టంలో… ‘పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఆ తర్వాత ఏపీకి ఒక కొత్త రాజధాని ఉంటుంది’ అని పేర్కొనగా… సవరణ చట్టంలో ‘ఏపీకి అమరావతి కొత్త రాజధానిగా ఉంటుంది’ అంటూ స్పష్టమైన వివరణ ఇచ్చారు. అలాగే సీఆర్డీయే చట్టం-2014 కింద నోటిఫై చేసిన ప్రాంతమంతా ‘అమరావతి’ పరిధిలోకి వస్తుందని మరో సవరణ చేశారు. వెరసి…2024 జూన్ 2 నుంచే రాజధానిగా అమరావతి అమలులోకి వచ్చినట్లయింది.
చకచకా అడుగులు
రాజధాని అమరావతికి చట్టబద్ధమైన రక్షణ కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కేంద్రంతో ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి.ఈ ప్రక్రియ మరింత పకడ్బందీగా జరిగేలా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాలని కేంద్రం సూచించింది. దీంతో… మార్చి 28న శాసన సభ ప్రత్యేకంగా సమావేశమైంది. 2024 జూన్ 2 నుంచే అమరావతిని రాష్ట్ర రాజధా నిగా గుర్తించేలా చట్ట సవరణ చేయాలంటూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఆమేరకు 2014చట్టంలోని సెక్షన్ 5లోని సంబంధిత సబ్ సెక్షన్లలో సవరణ చేయాలని కేంద్రాన్ని కోరింది. ఆ వెంటనే కేంద్రమÖ కదిలింది. లోక్‌సభలో ఈ నెల 1,రాజ్యసభలో 2వ తేదీన చట్ట సవరణ బిల్లుపై ఆమోద ముద్ర పడింది. దాదాపు 4.30 గంటలపాటు ఉభయసభలలో సవరణ బిల్లుపై చర్చ జరిగింది. ఇది రాష్ట్రపతి భవన్ చేరడం…రాత్రికే గెజిట్ నోటిఫికేషన్ జారీ కావడం విశేషం.
చరిత్ర నేపథ్యం..
రాజధాని అన్వేషణ దశాబ్దాల పాటు సాగిన, ఎన్నో మలుపులున్న కథ.మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచే వేరు పడి కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ఓకీలక మలుపు.ఏళ్ల పాటు ఇదే విధంగా పరిపాలన సాగినా 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది. అప్పటి నుంచి రాష్ట్రానికి రాజధాని లేదన్న లోటు ఏర్పడింది.అలాంటి సమయంలో అమరావతి ఓ వెలుగు రేఖలా కనిపించింది. సరికొత్త ఆశలు చిగురించాయి. రాజధాని నిర్మాణం అనగానే రైతులు సంతోషంగా ముందు కొచ్చారు.భూ సమీకరణకు సహకరించారు. ఆ విధంగా కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలే పునాదులుగా అమరావతి రూపకల్పనకు అడుగులు పడ్డాయి.రాజధాని అంటే కేవలం నగరం కాదు. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి అదో శాశ్వత ప్రతీక. భవిష్యత్‌కు అదో చిరు నామా. ‘అమరావతి’ అసలు ఈ పేరులోనే ఓ స్పష్టమైన దృక్పథం, ఒక దూరదృష్టి అంతర్లీ నంగా ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరవాత నవ్యాంధ్రకు రాజధాని నిర్మాణం అత్యవసరంగా మారింది. ఆ నగరా నికి ఏ పేరు పెట్టాలి అన్న మేధోమథనమÖ జరిగింది. ఆ సమయంలోనే ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు ‘అమరావతి’ పేరు ప్రతిపాదించారు. ఆప్రతిపాదనను అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదించారు. ఆ తరువాత ప్రభు త్వం అధికారికంగా అమరావతి పేరునే ఖరారు చేసింది.
నిజానికి అమరావతి ప్రాంతానికి శాతవాహనుల కాలం నుంచి చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. తపోభూమిగానూ ఖ్యాతికెక్కింది. కృష్ణా గోదావరి నదుల మధ్య విస్తరించిన ఈ భూమి,బౌద్ధ సంస్కృతికి కేంద్రంగా నిలవటంతో పాటు రాజధానిగా వికసించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. లండన్‌లోని బ్రిటీష్ మÖ్యజియంలో ఉన్న అమరావతి గ్యాలరీ ఈ ప్రాంత చరిత్రను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టింది. అదే గుర్తింపును ఆధునిక రాజధానికి అనుసం ధానం చేయడం ద్వారా గత వైభవం కొనసాగించాలని సంకల్పించుకుంది ప్రభుత్వం.తగ్గట్టుగానే ప్రజల్లోకి అమరావతి అనే పేరు చొచ్చుకుపోయింది.ఈ పేరుతో కొత్త రాజధానికి ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ కూడా ఏర్పడింది.
ప్రజల ఆశలకి కేంద్రంగా అమరావతి అభివృద్ధి,ఆత్మగౌరవం,భవిష్యత్ దిశ అనే మÖల స్తంభాలపై అమరావతి ఆవిర్భవిం చింది. విభజన తరవాతి అనిశ్చిత పరిస్థితుల్లో, ఈ రాజధాని ప్రజల ఆశలకి కేంద్రంగా మారింది. రైతుల సహకారం,ప్రభుత్వ సంకల్పం కలిసి ప్రత్యేక స్వరూపం ఇచ్చాయి. రాజకీయ మార్పులు వచ్చినా,రాజధాని లక్ష్యం మాత్రం దృఢంగా కొనసాగుతూ వచ్చింది. అమరావతి నిర్మాణం కేవలం పరిపాలనా అవసరం కాదు రాష్ట్ర పునర్నిర్మాణానికి సంకేతం అన్న అభిప్రాయం బలంగా నాటుకుపోయింది.విభజనతో ఏర్పడిన లోటు భర్తీ చేయాలనే సంకల్పానికి ఇది ప్రతిరూపం అని అంతా విశ్వసించారు.అలా ప్రభుత్వ లక్ష్యాలు,ప్రజల ఆకాంక్షలు ఒకేతాటిపైకి వచ్చాయి.ఈ మొత్తం ప్రక్రియలో ప్రధాన బలం రైతులే.స్వచ్ఛందంగా భూములు అం దించి అభివృద్ధిలో భాగస్వాములయ్యారు. సంప్రదాయ భూసేకరణకుభిన్నంగా,భాగస్వా మ్య విధానం అనుసరించడం ద్వారా కొత్త భూ సమీకరణ విధాన నమÖనా తీసుకొచ్చారు. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వ్యక్తిగత ప్రయోజనాల కంటే రాష్ట్రానికి మేలు జరగడమే ముఖ్యం అనుకున్న రైతుల త్యాగమే అమరావతికి నైతిక బలంగా నిలిచింది. దేశంలో బ్రిటిష్ పాలన ప్రారంభమైన తర్వాత తెలుగువారి రాజకీయ,పరిపాలనా ప్రాధాన్యం క్రమంగా క్షీణించింది. మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగమవడంవల్ల సొంత గుర్తింపు కోసం తెలుగువారు దీర్ఘకాలిక పోరాటం చేయాల్సి వచ్చింది. ఆఉద్యమాన్ని ముందుండి నడిపిం చారు పొట్టి శ్రీరాములు. ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాన్నే త్యాగం చేశారు. ఆ ఫలితంగానే 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్ప డి,కర్నూలు రాజధానిగా అవతరించింది. అయితే అది కూడా తాత్కాలికంగానేమిగిలింది.
రాష్ట్రానికి రాజధాని లేదనే లోటు
1956లో తెలంగాణ విలీనంతో హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. 2014 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది. ఆ సమయంలో పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని నిర్ణయిం చారు. ఆవిధంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకమైన రాజధాని లేదే అన్న లోటు ఉండిపోయింది. అప్పుడే రాజధాని నిర్మాణం చేపట్టడం అత్యవసరమైంది.అదే సమయంలో అమరా వతి ఆలోచన రూపుదిద్దుకుంది.విధాన మార్పు లు,రాజకీయ భేదాలురాజధాని నిర్మాణ ప్రయా ణాన్ని సవాళ్లతో నింపాయి. అయినప్ప టికీ స్థిరమైన రాజధాని అవసరం అనే భావన మరింత బలపడింది. అమరావతిని బ్లూ-గ్రీన్ సిటీగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యం నిర్దేశించు కున్నారు. ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, ప్రణాళికాబద్ధ నగర నిర్మాణం ద్వారా అమరా వతిని అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దాలనే దిశ స్పష్టమైంది.కేవలం పరిపాలనా కేంద్రంగానే కాకుండా పెట్టుబడులు,ఉపాధి,ఆర్థిక వృద్ధికి వేదికగా నిలవాలని భావించింది ప్రభుత్వం. అయితే అమరావతి పేరు ఖరారు చేయడం నుంచి ఇప్పటి వరకూ ఎన్నో సవాళ్లు ఎదుర య్యాయి.ఎన్నో మార్పులూ వచ్చాయి.ఇప్పుడు వాటన్నింటినీ దాటుకుని స్పష్టమైన గమ్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగుతోంది. అమరావతి రాజధానిని అద్భుతంగా తీర్చిదిద్దా లన్న దృఢ నిశ్చయం స్పష్టంగా కనిపిస్తోంది.
కీలక ఘట్టం-అమరావతి చట్టబద్ధత
ఆంధ్రప్రదేశ్ కలల రాజధాని అమరావతికి చట్టబద్ధత దిశగా కీలక ఘట్టం పూర్తయింది. లోక్‌సభలో ఆమోదం పొందిన బిల్లుకు రాజ్యసభ కూడా పచ్చజెండా ఊపింది.రాజ్య సభలో బిల్లుపై జరిగిన చర్చలో అమరావతికి తిరుగులేని మద్దతు దక్కింది.లోక్‌సభలో ఆమోదం పొందిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సవరణ బిల్లును కేంద్రమంత్రి నిత్యానంద రాయ్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు.సభ్యుల సమ్మతితో రాజ్యసభ ఛైర్మన్ సి.పి.రాధాక్రిష్ణన్ బిల్లుపై చర్చకు ఆమోదం తెలిపారు. అమరావతికి చట్టబద్ధతకు కాంగ్రెస్,ఉద్ధవ్ శివసేన పార్టీల ఎంపీలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈసందర్బంగా మాట్లాడిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలుగు ప్రజలందరికి ఇవాళ చరిత్రాత్మకమైన రోజు అని అన్నారు.“బిల్లు ప్రవేశపెట్టడాన్ని తెలుగు ప్రజలంతా గర్వంగా భావిస్తున్నారు. ప్రజా రాజధాని అమరావతి చరిత్రలో గుర్తుంటుంది. సంక్షోభాలను అవకాశాలుగా మలచుకోవడం మా నాయకుడు నేర్పించారు.మరో రాష్ట్రానికి లేదు’ అని వెల్లడించారు.
అమలు చేయనందుకు పరిహారం ఇవ్వాలి అమరావతి చట్టబద్ధత బిల్లుపై చర్చలో కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి పాల్గొన్నారు. “బిల్లు ప్రవేశపెట్టడం రైతుల విజయం. రాజధాని ఉద్యమ సమయంలో రైతులను, మహిళలను తీవ్రంగా హింసించారు. రాజ ధానిపై 12 ఏళ్లుగా అస్పష్టతగా ఉంది. అస్ప ష్టత వల్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లాయి. గత సీఎం(వైఎస్ జగన్) మÖడు రాజధానుల పేరుతో రాజధాని లేకుండా చేశారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. దుగరాజపట్నం పోర్టు ఇస్తామని హామీ నెరవేర్చలేదు. విభజన హామీలన్నీ అమలు చేయాల్సిందే. ఇప్పటివరకు హామీలు ఎందుకు నెరవేర్చలేదో చెప్పాలి. హామీలు అమలు చేయ నందుకు పరిహారం ఇవ్వాలి.12 ఏళ్ల తర్వాత ఆస్తుల పంపకం పూర్తికాలేదు” అని రేణుకా చౌదరి తెలిపారు.
తెలుగుజాతికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అనంతరం బీజేపీ రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్ మాట్లాడుతూ,“రాజధాని కోసం 29 వేలమంది రైతులు 33వేల ఎకరాలు ఇచ్చారు. భవ్య రాజధాని సాకారం కోసం ఏపీ ప్రజలు కలలు కన్నారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ సంకల్పం తీసుకున్నారు. వికసిత్ భారత్ సాకారం కోసం వికసిత్ ఆంధ్ర నిర్మాణం ఆవశ్యకం. వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం వికసిత్ రాజధాని అవసరం ఉంది. రాజధాని కోసం సుదీర్ఘంగా పోరాడిన మహిళలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు.
అమరావతికి చట్టబద్ధత బిల్లుకుమద్దతిస్తున్నాం
అనంతరం బీజేపీ రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ,“అమరావతికి చట్టబద్ధత బిల్లుకు మద్దతిస్తున్నాం. అమరా వతిని రాజధాని చేయడం ప్రజలందరికీ ఆమోదయోగ్యం.అమరావతికి చట్టబద్ధత బిల్లుపై చర్చను మంత్రి నారా లోకేశ్, లోక్‌సభ ఎంపీలు,ముఖ్య నేతలతో కలిసి గ్యాలరీలో కూర్చొని ఆసక్తిగా వీక్షిం చారు. చర్చ ముగిసి బిల్లు ఆమోదం పొంద గానే అంతా లేచి కరతాళధ్వనులతో హర్షం వ్యక్తం చేశారు. – జి ఎన్ వి సతీష్
