దళితులకు రక్షణ లేదా..ఎన్నాళ్లీ ఇలా..?
ఏ రాజకీయ పార్టీయినా ఎవరి ఓట్లతో అధికారం చేపడతారో అన్నీ పార్టీనేతలు వారిపైనే తనపాలనలో దమనకాండ సాగిస్తున్నారు.అటు జగన్ అయినా ఇటు చంద్రబాబు ప్రభుత్వాలైనా తప్పుల్ని ప్రశ్నిస్తే దాడులు,అణచివేతపై గొంతెత్తితే దౌర్జన్యాలు,హక్కులకోసం పోరాడితే అక్రమ కేసులు,అన్యాయంపై ఎదురు తిరిగితే హత్యలు భరించలేక పలువురి బలవన్మరణాలు ఎన్నో జరుగుతున్నాయి.ముఖ్యంగా గత5ఏళ్లుగా దళితులపై మరేరాష్ట్రంలోనూ లేనంత అత్యంత అమానవీయ సంఘటనలు ఏపీలో జరిగాయి.ఈదుశ్చర్యలకు తెగబడింది బాధితులను పరామర్శించ లేదు.ఎన్నికల వేళ మాత్రం‘నాఎస్సీనాఎస్టీ’అంటూ మాటల్లో ప్రేమకురిపిస్తున్నారు.ఇలాంటి దళితవ్యతిరేకపాలకుడికి అసలు ఎందుకు ఓట్లేయాలిగతఅయిదేళ్లుగా జరుగుతున్నదళితదాష్టీకాలను మళ్లీచూడటానికా అన్నప్రశ్నఆయావర్గాల నుంచి వినిపిస్తోంది.దీనికి కొన్నిఉదాహరణలు ఇలాఉన్నాయి..- జి ఎన్ వి సతీష్
సుబ్రమణ్యం : కాకినాడ జిల్లాలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన వద్ద డ్రైవర్‌గా పనిచేసే దళిత యువకుడు వీధి సుబ్రమణ్యాన్ని చంపేసి, ఆ మృతదేహాన్ని డోర్ డెలివరీ చేశారన్న తీవ్ర అభియో గాలు ఎదుర్కొన్నారు. ఆయనను సస్పెండ్ చేయాలంటూ అన్ని వైపుల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తే తప్ప వైఎస్సార్సీపీ అప్పట్లో ఆయనపై చర్యలు తీసుకోలేదు.ఆయన జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన తర్వాత ఆయనకు స్వాగతం పలుకుతూ వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. ముఖ్యమంత్రి సభల్లోనూ ఆయన దర్జాగా పాల్గొన్నారు.ఈ ఎన్నికల్లో రంపచోడవరం నియోజకవర్గంలో వైసీపీ తరఫున అన్నీ ఆయనే అయి నడిపిస్తున్నారు.
డాక్టర్ సుధాకర్ : కరోనా తీవ్రంగా ఉన్నప్పుడు మాస్కులు లేకుండా వైద్యం ఎలా చేయాలి? అని అడగటమే నేరమన్నట్లు డాక్టర్ సుధాకర్‌ను వైఎస్సార్సీపీ ప్రభుత్వం వేధించింది. ముందు విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఆపై చొక్కా తీసేసి చేతులు వెనక్కి విరిచేసి, తాళ్లతో కట్టి, లాఠీలతో కొట్టించారు. చివరకు మానసిక స్థితి బాగోలేదంటూ పిచ్చి ఆసుపత్రిలో చేర్పించారు. తీవ్ర మానసిక క్షోభకు గురైన ఆయన ప్రాణాలొదిలారు. మాస్కు పెట్టుకోకుండా బయట తిరుగుతున్నారంటూ దళిత యువకుడు కిరణ్ కుమార్‌ను లాఠీతో చితకబాది అతని మరణానికి కారణమయ్యారు.
ఇండుగుమల్లి వరప్రసాద్ : తూర్పుగోదావరి జిల్లాలో అధికార పార్టీ నాయకుల ఇసుక అక్రమాలపై ప్రశ్నించిన పాపానికి ఇండుగుమల్లి వరప్రసాద్ అనే యువకుడికి పోలీసుస్టేషన్లో శిరోముండనం చేశారు.
న్యాయాధికారి రామకృష్ణ : జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ న్యాయాధికారి రామకృష్ణపై దాడికి పాల్పడ్డారు. అక్రమ కేసులు బనాయించి తీవ్రంగా హింసించారు. అదే జిల్లాలో అనితారాణి అనే వైద్యురాలిని వేధించి, అసభ్య పదజాలంతో దూషించారు.నా నా అంటూ గుండెలు బాదుకునే జగన్ హయాంలో రాష్ట్రంలో దళితులపై దమనకాండ ఎంత తీవ్రస్థాయిలో జరుగుతుందో చెప్పేందుకు ఇవి కొన్నిఉదాహరణలు మాత్రమేనని చెప్పాలి.
చిన్న అచ్చెన్న : జగన్ సొంత జిల్లాలో పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా పని చేస్తున్న చిన్న అచ్చెన్నను దారుణంగా చంపేశారు. ప్రకాశం జిల్లా సీఎస్‌పురం మండలంలో ఉపాధి హామీ పథకంలో అధికార వైసీపీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేసినందుకు దాసరి వెంకట రమణయ్యను అంతమొందించారు. అనకాపల్లి జిల్లా పీఎల్‌పురం ఎస్సీ కాలనీకి చెందిన 21 ఏళ్ల వడ్లమÖరి నాగేంద్రను కాళ్లు, చేతులు కట్టేసి వ్యవసాయ బావిలో పడేసి ప్రాణాలు తీశారు. ఇలా ఒకటా రెండా? తమ ఆధిపత్యాన్ని ప్రశ్నించినా, అహాన్ని దెబ్బతీసినా, తమకు అడ్డుగా ఉన్నారని భావించినా, ఎదురుతిరిగినా, అక్రమాలపై ఫిర్యాదు చేసినా దళితులను బలి తీసుకున్నారు.
అలపు గిరీశ్‌బాబు : “కాళ్లలో రాడ్లు ఉన్నాయి. కొట్టొద్దు సార” అంటూ అలపు గిరీశ్‌బాబు అనే యువకుడు ప్రాధేయపడ్డా పోలీసులు కనికరిం చలేదు.“రాడ్లు ఎక్కడున్నాయో చెప్పు” అంటూ లాఠీకి రబ్బరు కట్టి కొట్టి రాక్షసానందం పొందారు. హత్య, మానభంగం, దేశద్రోహం వంటి కేసుల్లో సైతం ఇంత తీవ్రంగా కొట్టేలా చట్టాలు లేవు. ‘ఎస్సై కక్షపూరితంగా, రాజకీయ నాయకుల మెప్పు పొందేందుకే ఇలా చేశారు’ అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ ఎం.విక్టర్ ప్రసాద్ బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంలో వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వైసీపీ నాయకులు, పోలీసులు కలిసిపోయి గత అయిదేళ్లలో దళితుల్ని ఎంతగా వేధించారో చెప్పేందుకు కాకినాడ జిల్లాలో జరిగిన ఈ ఘటన చిన్న ఉదాహరణ మాత్రమే.
దుగ్గిరాల కరుణాకర్ : 20 లక్షలు అప్పు చేసి చెరువులో చేపలు పెంచితే వాటిని పట్టుకోనివ్వ కుండా వైసీపీ నాయకుడు, శ్రీశైలం ట్రస్టు బోర్డు సభ్యుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, ఆయన అనుచరుడు సురేశ్‌రెడ్డి అడ్డుకుంటున్నారంటూ ఎస్పీకి లేఖ రాసి నెల్లూరు జిల్లా కావలికి చెందిన దుగ్గిరాల కరుణాకర్ ఆత్మహత్య చేసుకున్నారు. తన తల్లితో కలిసి జగదీశ్వర్‌రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన కాళ్లు పట్టుకున్నా కనికరించలేదని ఆ లేఖలో ఆయన వాపోయారు. అధికార పార్టీ నాయకులు చెప్పినట్టల్లా ఆడిన పోలీసులు దళితులను చిత్రహింసలు పెట్టారు. వారిని అవమానించి, మానసిక క్షోభకు గురిచేశారు. వాటిని భరించలేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు.
ఉదయగిరి నారాయణ : నెల్లూరు జిల్లా కందమÖరుకు చెందిన ఉదయగిరి నారాయణ గతేడాది జులైలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఆయనను పోలీసులు తీవ్రంగా కొట్టి, చిత్రహింసలకు గురిచేశారని చివరకు ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతుడి కుల సంప్రదా యాలకు భిన్నంగా పోలీసులు బలవంతంగా అంత్యక్రియలు చేయించడంపై తీవ్ర దుమారం రేగింది.తప్పు చేసిన వారికి శిక్షపడుతుందనే భయం ఉంటే ఎవరైనా సరే ఆ తప్పు చేయటానికి వెనకంజ వేస్తారు. కానీఎస్సీ,ఎస్టీలపై నేరాలకు తెగబడుతున్న వారికి శిక్షలు పడేలా చేయటంలో జగన్ ప్రభుత్వం అత్యంత ఘోరంగా విఫలమైంది. మెజార్టీ కేసుల్లో అధికార పార్టీ నాయకులే నిందితులుగా ఉండటంతో లోతైన దర్యాప్తు చేయలేదు. శాస్త్రీయ ఆధారాలు సేకరించలేదు. అభియోగపత్రాలు మొక్కుబడిగా దాఖలు చేశారు. ఆ ఫలితంగానే అత్యధిక శాతం కేసులు వీగి పోయాయి. వీటిలోనూ అప్పీలుకు సైతం వెళ్లట్లేదు.2022లో 1,050 కేసుల్లో న్యాయస్థానాల్లో విచారణ పూర్తికాగా కేవలం 42 కేసుల్లోనే శిక్ష పడింది. మిగతా 1,008 కేసులు వీగిపోయాయి.2021లో నమోదైన 360 కేసుల్లో కేవలం 21 కేసుల్లోనే శిక్షపడింది. మిగతా కేసులు వీగిపోయాయి.2020లో 371 కేసుల్లో 51 కేసు ల్లోనే శిక్షపడింది. మిగతావి వీగిపోయాయి. 2019లో 560 కేసుల్లో 65 కేసుల్లోనే శిక్షపడింది. మిగతావి వీగిపోయాయి.
ఆ ఘనత జగన్‌దే : దళితులపై దాడుల్లో దక్షిణ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలిపిన ఘనత జగన్‌దే. మనకంటే పెద్ద రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడుల్లో కన్నా ఏపీలోనే ఎక్కువ నేరాలు జరిగాయి. 2019 నుంచి 2022 మధ్య ఒక్క ఏడాది మినహా మిగతా అన్ని సంవత్సరాల్లోనూ ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం దళితులపై దాడుల్లో దక్షిణ భారతదేశంలో ఏపీదే తొలి స్థానం.బాధితులైన దళితులకు రక్షణ కవచంలా ఉపయోగపడాల్సిన ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ నిరోధక చట్టాన్ని రాజకీయ ప్రత్యర్థులపై వేధింపులకు, వారిపై కక్ష సాధిం చేందుకు, అణిచేసేందుకు జగన్ ప్రభుత్వం వినియోగించింది. పోలీసులను అడ్డం పెట్టుకుని దళితులపైనే రివర్స్‌లో ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ సెక్షన్ల కింద కేసులు బనాయించింది. తన పేరిట తప్పుడు పత్రాలు సృష్టించి ధాన్యం కొనుగోళ్లలో కొందరు అక్రమాలకు పాల్పడ్డారంటూ నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన దళిత రైతు గాలి జూపాల్ పోలీసులకు ఫిర్యాదుచేయగా తిరిగి ఆయనపైనే కేసుపెట్టారు. మÖడు రాజధానులకు మద్దతుగా తలపెట్టిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న వారిని అడ్డుకుని కులం పేరుతో దూషించారంటూ అమరావతి దళిత రైతులు అయిదుగురిపై ఎట్రాసిటీ కేసు పెట్టి 18రోజులు జైల్లో ఉంచారు. పులివెందులలో హత్యాచారానికి గురైన దళిత మహిళ కుటుంబానికి న్యాయం చేయాలంటూ డీఎస్పీకి ఫిర్యాదు చేయటానికి వెళ్లిన టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత,ఎస్సీ వర్గానికి చెందిన టీడీపీ నాయకుడు ఎంఎస్ రాజులపైన ఎస్సీ,ఎస్టీ ఎట్రాసిటీ కేసు పెట్టారు. దశాబ్దాల క్రితం ప్రభుత్వం తమకు కేటాయించిన ఎసైన్డ్ భూములను ప్రభుత్వమే లాక్కోవటం ఏంటి? అని ప్రశ్నించినందుకు దళితులపై కేసులు పెట్టారు.ఐదేళ్లలో దళితులపై నేరాలు గణనీయంగా పెరిగాయి. 2020తో పోలిస్తే 2021లో3.28 శాతం మేర,2021తో పోలిస్తే 2022లో14.94 శాతం మేర నేరాలు పెరిగాయి. 2021లో దళితులపై మొత్తం 2014 నేరాలు జరగ్గా.. వాటిలో 2076 మంది బాధితు లయ్యారు. 2022లో 2,315 నేరాలు చోటుచేసు కోగా 2,431 మంది బాధితులయ్యారు.
మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి : ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారంటూ దళిత మహిళా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని వైఎస్సార్సీపీ గతేడాది మార్చిలో సస్పెండ్ చేసింది. ఆ వెంటనే వైసీపీ శ్రేణులు ఆమె కార్యాలయంపై దాడికి పాల్పడ్డాయి. సామాజిక మాధ్యమాల్లో ఆమెను, కుటుంబ సభ్యులను కించపరుస్తూ, అసభ్యకరంగా ట్రోలింగ్ చేశాయి. వైసీపీ మద్దతు ఉన్న నాయకు లు దళితులపై ఎంతటి తీవ్రమైన నేరానికి పాల్పడినా వారికి జగన్ అన్ని రకాలుగా అండ దండలు అందించారు. అదే వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే చాలు దళిత నాయకులపైనా దాడికి పాల్పడ్డారు. పెత్తందారీ కుల కాలనాగులు అవకాశమొచ్చినప్పుడల్లా అణగారిన ప్రజానీకాన్ని కాటేసి ప్రాణాలు తోడేస్తూనేవు న్నాయి. కులం వద్దు..మతం వద్దు.. భారతీయు లంతా స్వేచ్ఛా స్వతం త్రాలు అనుభవిద్దామంటూ చేసుకున్న ప్రతినలన్నీ వెక్కిరింతకు గురవుతూనే వున్నాయి. కాకినాడ జిల్లా తొండంగి మండలం శృంగ వృక్షంలో పెత్తందారీ గూండాల దాడిలో దళిత యువకుడు బలైపోవడం, మరో తొమ్మిది మంది దళితులు గాయపడటం సమాజంలో వేళ్లూనుకున్న పెత్తందారీ దురహంకారాన్ని మరో మారు బయటపెట్టింది. కొన్ని నెలల కిందటే అధికార పార్టీకి చెందిన ఒక ప్రజా ప్రతినిధి తన వద్దే డ్రైవర్‌గా పనిచేస్తున్న దళిత యువకుడిని హత్య చేసి..మృతదేహాన్ని సదరు ప్రజా ప్రతినిధే నేరుగా బాధితుడి ఇంటికి డోర్ డెలివరీ చేసిన దారుణ ఉదంతం నుంచి జిల్లా తేరుకోక మునుపై మరో ఘోరం చోటు చేసుకుంది.శృంగవృక్షమనేది కాకినాడ జిల్లాలో చిన్న గ్రామం. ప్రతి యేటా ఇక్కడ జరిగే నూకాలమ్మ జాతరలో అన్ని సామాజిక తరగతు లవారు పాల్గొనడం ఆనవా యితీ. అందరూ ఊరేగింపుగా వెళ్లి అమ్మ వారిని దర్శించుకో వడం..మొక్కులు తీర్చుకోవడం గత కొన్ని తరాలుగా అనుసరిస్తూ వస్తున్న ఆనవా యితీ. జనం రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు పరస్పరం కాళ్లూచేతులు రాసుకోవడం, ఒక్కో సందర్భంలో కిందామీదా పడటం సర్వసాధారణం.శృంగ వృక్షం జాతరలోనూ అదే జరిగింది. జనం రద్దీలో పెత్తందారీ కాలు..దళిత యువకుడి కాలు పరస్పరం రాసుకున్నాయి. ‘మన కులపోడి కాలు నెత్తిన తగిలినా బాధలేదయ్యా..దళితుడి కాలు సోకితే ఊరుకుంటామా?’ అంటూ కుగ్రా మమైన శృంగవృక్షంపై మÖకుమ్మడి దాడికి తెగబడ్డారు. జాతరలో కాలు రాసుకున్న నేరా నికి శృంగవృక్షం దళితపేటపై పెత్తందార్లు రాళ్లు, కర్రలతో విచక్షణా రహితంగా మÖకు మ్మడి దాడికి పాల్పడ్డారు. దొరికినవారిని దొరికినట్టు చితకబాదారు. ఈ దాడిలో తొండంగి గ్రామానికి చెందిన నడింపల్లి రాము అనే దళిత యువకుడు ప్రాణాలు కోల్పో యాడు. మరో తొమ్మిది మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఇంత దారుణంగా దాడికి పాల్పడినా.. పెత్తందార్ల జోలికి వెళ్లకుండా పోలీసులు మీనమేషాలు లెక్కిస్తూ ఉండిపో యారే తప్ప ఎలాంటి తక్షణ చర్యలకు ఉపక్ర మించక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. తెల్లారితే ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవాల్సిన వాళ్లం..కేసులుగీసులు ఎందుకయ్యా..సర్దుకుపోతే అందరికీ మంచి దంటూ దళితులకు మైండ్వాష్ చేసే పనిని ఖాకీలు భుజానికి ఎత్తుకోవడం దిగ్భ్రాంతి కరం.కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) వంటి ప్రజాసంఘాలు నిలదీ యకపోతే అస్సలు కేసు కూడా నమోదు చేసేవారు కాదేమో !విజయవాడలో స్వరాజ్య మైదానంలో ఆకాశాన్నంటేలా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తున్నా మని, దళితులకు, అణగా రిన ప్రజానీకానికి తాము పెద్ద పీట వేస్తున్నామని పాలకులు మాటలు చెబితే సరిపోదు.‘దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటామా?’ అంటూ ప్రశ్నించే పెత్తందారీ ఆధిపత్య భావా జాలాన్ని పూర్తిగా విడనాడాలి. రాష్ట్రంలో వైసిపి అధికా రంలోకి వచ్చిన తర్వాత దళితు లకు శిరోముండ నాలు చేయించడం,అత్యాచారాలు, హత్యలు వంటివి తరచూ చోటుచేసు కోవడం దేనికి సంకేతం.దాడులు జరిగిన ప్పుడు ఒంటికాలిపై లేవడం..అరకోపరకో పరిహారమిచ్చి చేతులు దులిపేసుకుంటే సరి పోతుందా? ఇలాంటి దాడు లకు పాల్పడిన వారి పీచమణచాలి. ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్దర వీడి దళితులు, ఆదివా సీలు, ఇతర అణగారిన ప్రజానీకం రక్షణకు గట్టి చర్యలు చేపట్టాలి. బాధిత దళితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది.
ప్రభుత్వంలో దళితులకు స్థానంలేదన్న వాస్తవం!
వైసీపీ ప్రభుత్వంలో దళితలకు స్థానం లేదు అన్నది అక్షర సత్యం. ఆ సత్యాన్ని బహుజనులు, దళిత సంఘాలు ఎప్పుడో గుర్తించాయి. ఉత్తరాంధ్రాను మొదలుకొని రాయలసీమ వరకు నిత్యం దళితలపై జరుగుతున్న దాడులు, బెదిరింపుల అనేవి లెక్కకుమించినవి. ఇంత వివక్ష ఎందుకో అర్థకాదుకానీ ..స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటివరకు కూడా ఇంతలా దేశ వ్యాప్తంగా ఇటువంటి దాడులు ఏపీలో తప్ప ఎక్కడ చోటు చేసుకోకపోవడం గమనార్హం. దళిత ఓటు బ్యాంకుతో గద్దెనెక్కిన జగన్‌కు ఈ దాడుల లెక్క పట్టదా అని దళిత మేథావులు ప్రశ్నిస్తున్నా .. దున్నపోతుమీద వాన చందమే. ప్రశ్నించిన తెలుగుదేశం నేతలపై అధికార పార్టీకి చెందిన దళిత నాయకులతో అసభ్య పదజాలంతో విరుకుపడేలా పురికొల్పు తున్నారు. దళితులు, గిరిజనులు, మైనార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారంటే చాలు వారిని నామినేషన్లు వేయకుండా అడ్డుపడటం,ఒప్పుకొకుంటే దాడులు చేయడం జగన్ రెడ్డి ప్రభుత్వంలో పరిపాటిగా మారింది. ఇందుకు ఉదాహరణే ఏపిలో మిగిలి ఉన్న స్థానిక సంస్థలకు జరగుతున్న ఎన్నికలే. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీలో నామినేషన్ వేసేందుకు వచ్చిన వెంకటేశ్ అనే దళితుడిపై 30 వైసీపీ కార్యకర్తలు ముకుంబడి చేసిన దాడి, గుంటూరు జిల్లా గురజాల మున్సిపల్ ఎన్నికలలో మైనారిటీ మహిళా సుందగిరి నజీమÖన్ నామినేషన్ చింపి, ఆమెపై దాడి, తూర్పుగోదావరి జిల్లా కూనవరం మండలం కాచవరం పంచా యితీ ఒకటో వార్డుకు నామినేషన్ వేసిన గిరిజన మహిళ శిరీష కు బెదింపులు వంటివి వైసీపీ ప్రభుత్వం పాల్పడు తున్న దమనకాండకు నిర్శనాలు కావా అని విమర్శలు వెల్లువెత్తున్నాయి. అంతిమంగా ప్రజాస్వామ్య పద్దతిలో పదవులకు పోటీ చేసే స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు దళితులకు లేదు అన్నది జరుగుతున్న ఘనటలకు సజీవ సాక్ష్యాలు.దళితుల సంక్షేమం మరిచారు ..దాడులే లక్ష్యంగా పెట్టుకున్నారు! ఉత్తరాం ధ్రాల్లో దళితులు ..బెదిరింపులు,దాడులు, శిరోముండనాలను చూస్తే ..రాయలసీమలో రక్తాలు కారేలా హింసిస్తున్నారు. వివక్షలు, చిన్నచూపు వంటివి పరిస్థితులను తరుచూ అక్కడ దళితులు ఎదుర్కొంటున్నారు. దాడులు, శిరోముండనాలు, ఎన్నికల్లో పోటీచేస్తే చంపే స్తాం అన్న అనాగరిక చర్యలు గతంలో ఎన్నడూ చూడలేదు. వైఎస్సార్సీపీ అధికారం లోకి వచ్చిన నాటినుంచి దళితలపై సాగిస్తున్న నరమేథం, ఊచకోతలు అన్నీఇన్నీకావు. చంద్ర బాబు సొంత నియోజకవర్గమైన కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో అధికారంలో వైకాపా చేస్తున్న పాపాలు అన్నీఇన్నీకావు.14వ వార్డు టీడీపీ ఎస్సీ అభ్యర్థి వెంకటేష్ పై దాడి, నామి నేషన్ పత్రాలు చించివేయడం వంటివి చూస్తే అక్కడి మున్సిపల్ ఎన్నికలు సాధరణ ఎన్నికలు తలపించేంతగా అధికార పార్టీ సృష్టించే సీన్ సర్వత్ర విస్మయానికి గురిచేస్తోంది. ఇప్పటికే కుప్పంలో అధికారపార్టీ చేస్తున్న అకృత్యాలపై మాజీ సీఎం చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. వెంక టేశ్ ను 30మందికి దాడికి దిగారని,ఆ దాడికి సంబం ధించి ఫోటోలను కూడా లేఖకు జత చేశారు. గడిచిన 30నెలలో వైసీపీ ప్రభుత్వం చేతిలో చితికిన దళితుల గురించి వివరించాలంటే ఒక గ్రంథం రాయాలి. రెండు శిరోముండనాలతో దళితులపై దాడులు సెంచరీ దాటాయి. ఇదిలా ఉంటే ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కిందా టీడీపీ హయంలో 2018 నుంచి 2020 వరకు రూ.24 వేల కోట్లును ఖర్చు చేస్తే ..వైఎస్సార్సీపీ ప్రభుత్వం 30 నెలల్లో కేవలం రూ.5వేల కోట్లు కూడా ఖర్చు చేయకా..ఆ నిధులను ఫిచన్లు, రైతు భరోసా పథకా లకు మరలించడం కడువిచారం.ఇదేక్కడి దౌర్భగ్యమోకానీ..టీడీపీ హయంలో దళితలకు భూమి కొనుగోలు పథకం కింద 5 వేల ఎకరాలు పంపిణీ చేస్తేఏపి ప్రభుత్వం జగనన్న ఇళ్ల పేరుతో 4 వేల ఎకరాల అసైన్ట్ భూములను లాక్కొంది.
స్వాతంత్య్రం వచ్చి 76 ఏండ్లు గడిచినా దళితులపై ఆగని దాష్టీకాలు.
దేశంలో దళితులకు వేధింపులు, ఛీత్కారాలు, వారిపై దాడులు మాత్రం ఆగడం లేదు. మధ్య ప్రదేశ్‌లో గ్రామపంచాయతీలో ఓదళి తుడు కుర్చీలో కూర్చున్నందుకు అగ్రకులస్థుడు అతడి తల పగలగొట్టడం.. ఉత్తరప్రదేశ్‌లోని ఔరియా జిల్లాలో తరగతి నోట్స్‌లో తప్పులు రాశాడని టీచర్ ఓదళిత విద్యార్థిని చితకబాదడంతో మరణించడం.. ఇదే యÖపీలోని లఖింపూర్‌లో ఇద్దరు దళిత అక్కాచెలెళ్లను రేప్ చేసి హత్య చేయడం..రాజస్థాన్‌లో నీటి కుండను తాకాడని ఓదళిత విద్యార్థిని తీవ్రంగా కొట్టిన ఘటన.. ఇలా దళితులపై వివక్ష చూపేలా..వారిని వేధించేలా జరుగుతున్న ఘటనలు దేశంలో కొకొల్లలు. కేంద్రంలో, రాష్ట్రాల్లో బీజేపీ గద్దెనెక్కిన తర్వాత ఈ విష ధోరణి మరింత పెచ్చరిల్లుతున్నది. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో దళితుల పరిస్థితి దయనీయంగా మారింది.
11 శాతం పెరిగిన దాడులు
2019 నుంచి 2021 వరకు దేశంలో దళితులపై దాడులు 11శాతం పెరిగాయి. జాతీయ నేర గణాంకాల సంస్థ(ఎన్సీఆర్బీ) ప్రకారం..2019లో 45,961,2021లో 50,900 కేసులు నమోద య్యాయి. దళితులపై జరుగుతున్న దాడుల్లో జాతీయ సగటు కంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అధికంగా ఉన్నది. మధ్యప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, గోవా, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌లో దళితులపై విచ్చలవిడిగా దాడులు జరుగు తున్నాయి. రాజస్థాన్, తమిళనాడు వంటి ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో కూడా ఇది కని పిస్తున్నది. దళితులపై దాడుల ఘటనలకు సంబంధించి ఫిర్యాదులు వస్తున్నా.. వాటిపై ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం తగిన విధంగా స్పందించి, చర్యలు తీసుకుంటున్న సందర్భాలు తక్కువగా కనిపిస్తున్నాయి.
లోపం చట్టాలదా? వ్యక్తులదా?
ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్లో 19ఏళ్ల దళిత యువతిపై సామÖహిక అత్యాచారం, హత్య ఆరోపణల వ్యవహారం మీడియాలో ప్రధానంగా కనిపించింది. ఈ ఘటన తర్వాత దళితులపై దాడులు, అణచివేతలపై మరోసారి ప్రశ్నలు మొదలయ్యాయి. స్వాతంత్య్రం వచ్చి 76 సంవత్సరాలైన తరువాత కూడా దళితులు ఇంకా సమానత్వం కోసం పోరాడుతూనే ఉన్నారు. దళితులపై హింసకు సంబంధించి అనేక సంఘటనలు ప్రతియేటా వినిపిస్తూనే ఉన్నాయి. 2015లో రాజస్థాన్ దంగవాస్ ఘటన,2016లో రోహిత్ వేముల మరణం, తమిళనాడులో 17ఏళ్ల దళిత బాలికపై సామÖహిక అత్యాచారం, హత్య, 2017లో సహారాన్పూర్ హింస, 2018లో భీమా కోరేగావ్ ఘటన ఇలా ప్రతి సంవత్సరం సంచల నాత్మక కేసులు వస్తూనే ఉన్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం, దళితులపై దాడులు,అత్యాచారాలు తగ్గక పోగా ఇంకా పెరిగాయి.2019 సంవత్సరం లో దళితులపై అత్యాచారాలు గతంకన్నా 7.3% ఎక్కువ కేసులు నమోదైనట్లు ఎన్సీఆర్బీ తెలిపింది. దళితులపై అఘాయిత్యాలకు సంబంధించి 2018లో 42,793 కేసులు నమోదు కాగా, 2019 సంవత్సరంలో 45, 935 కేసులు రికార్డయ్యాయి. ఇందులో సాధా రణ దాడుల కేసులు 13,273 కాగా, ఎస్సీ,ఎస్టీ (అత్యాచార నియంత్రణ) చట్టం కింద 4,129 కేసులు 3,486 అత్యాచారం కేసులు నమోద య్యాయి. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 2378 కేసులు నమోదు కాగా, మధ్యప్రదేశ్‌లో అత్య ల్పంగా రికార్డయ్యాయి. జమÖ్మ-కశ్మీర్, మణి పూర్, మేఘాలయ, మిజోరం,నాగాలాండ్, త్రిపు రలలో ఎస్సీ/ఎస్టీ చట్టం కింద ఒక్క కేసు నమో దు కాలేదు. 2019 సంవత్సరంలో షెడ్యూల్డ్ తెగలవారిపై నేరాలు 26.5శాతం పెరిగాయి. 2018లో ఎస్టీలలపై దాడులకు సంబంధించిన 6,528 కేసులు, 2019లో 8,257 కేసులు నమో దయ్యాయి. భారతదేశంలోనే కాదు విదే శాలలో కూడా దళితులపట్ల వివక్ష, దాడులకు సంబం ధించిన ఆరోపణలు వినిపిస్తున్నాయి. కులవివక్షను ఎదు ర్కొన్న 60మంది భారతీయులకు సంబంధించిన ఘటనలను ప్రచురించింది.చట్టాలకు ప్రజా చైతన్యం తోడైనప్పుడే దళితులపై అత్యాచారాలు, దాడులను రూపుమాపడం సాధ్యపడుతుంది.
