పుడమి తల్లికి ఆత్మఘోష

సమస్త జీవకోటి భారాన్ని మోసేది ఈ పుడమి తల్లి. ఇది అందరికి తెలిసిన .. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఆ తల్లి దేహానికి గాయాలు చేస్తుంటారు. ఓ వైపు కాలుష్యం పెరుగు తున్నా.. అవేం పట్టించుకోకుండా.. మరో వైపు వనరులను తగ్గించేస్తూన్నారు. మనిషి అవస రాల కోసం జంతువులను చంపడం.. అడవు లను నాశనం చేసి.. ఇప్పుడు మారణీVA మంలో పడి కోట్టుమిట్టాడుతున్నాము. ఇష్టం వచ్చినట్లుగా సహజ వనరులను తగ్గించి.. ఇప్పుడు ప్రాణ వాయువు కోసం అల్లాడు తున్నారు. అభివృద్ధి పేరుతో జరిగే మితిమీరిన చేష్టలు భూమాతను నిలువునా దహించి వేస్తున్నాయి. తాగే నీరు.. పీల్చే గాలి.. నివసించే నేల ఇలా పంచభూతాలు కాలుష్యంలో చిక్కుకున్నాయి. పచ్చదనంతో పరిఢవిల్లాల్సిన భూతల్లి ఎదపై ప్రకృతి అందాలను కోల్పోయి మÖగ రోదనతో కన్నీరు కార్చుతోంది. మన భూమిని కాపాడుకుందాం అనే నినాదాలు కేవలం పుస్తకాల్లో రాతాలుగా మారి పోయాయి.-గునపర్తి సైమన్


మనిషి స్వార్థపరుడు..చెట్లను నరికేసి పక్షులకు గూళ్లు లేకుండా చేశాడు. అడవుల్ని మాయంచేసి జంతువులకు నిలువ నీడ లేకుండా చేస్తున్నాడు. అనాగరికులకు..అడవుల్లో బ్రతికే వారు తమ చుట్టూ ఉన్న ప్రకృతితో జీవనం చేస్తుంటే..అన్నీ తెలిసిన నాగ రికుడు..అభివృద్ధి, ప్రగతి పేరుతో పరిశ్రమలు స్థాపిం చి అడ్డూ అదుపూ లేకుండా ప్రకృతి వనరుల్నిదో చేస్తున్నాడు. నేల,నదులు,సముద్రాలు ఒకటేమిటి ఆఖరికి ఆకాశాన్ని సైతం తన అదుపులోనే ఉంచుకో వాలన్న అత్యాశతో మొత్తంగా భూమండలాన్ని కలు షితం చేశాడు. అలా తాను సృష్టించుకున్న కాలుష్యా నికి ఇప్పుడు తానే బలవుతున్నాడు. మనిషి సాధించిన అభివృద్ధి ఏంటీ అని ప్రశ్నిస్తోంది కరోనా.. మనిషి తెలివితో..సాధించిన అభివృద్ధితో తనను నాశనం చేయలేకపోతున్నాడని ఎగతాలిగా నవ్వుతూ ఖాళీగా ఉండే స్మశానాలను రద్దీగా మార్చింది.చంద్రుడితో పాటు,ఇతరగ్రహాల పైకి వెళ్ళీ జీవనం సాగించ డానికి వీలుందని తెలుసుకనేంత జ్ఞానం ఉన్న మనిషి.. కంటికి కనిపించని చిన్న వైరస్‌ను నాశనం చేయలేక పోవడమనేది..ఇన్ని సంవత్సరాలుగా సాధించిన అభివృద్దిని వేలెత్తి చూపిస్తుంది.పెరుగుట విరుగట కోరకే అన్ని సామెతను అక్షరాల నిజం చేసుకున్నాడు. అందనంత అభివృద్ధి సాధిస్తూ.. పుడమినే కాకుండా.. ఇతర గ్రహాలను కూడా వదలం అని విర్రవిగుతున్న మనిషికి కరోనా..నీ సత్తా ఏమిటో చూపమని సవాలు విసిరింది. ఇప్పటికైనా మనిషి .. ఈ మహమ్మారి సృష్టిస్తున్న అల్లకల్లోలం గుర్తించి.. పుడమి తల్లితోపాటు పంచభూతాలను రక్షించుకొని.. మానవ మనుగడను ప్రశాంతంగా కొనసాగించేందుకు జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి. ఏప్రిల్ 22, ధరిత్రీ దినోత్సవం మనకు ఈ విషయాలను గుర్తుచేస్తోంది.. మిగతా దేశాలకంటే భారతీయులకు భూమితో ఉన్న అనుబంధం చాలా ఎక్కువ. మన సంస్కృతి మనకు నేర్పింది పర్యావరణ పరిరక్షణే. మన భూగోళాన్ని కాపాడుకోవడం కోసం చర్యలు చేపడదాం.

1.వాహానాల వాడకం తగ్గిద్దాం. 2. అనవసర విద్యుత్ వాడకాన్ని తగ్గిద్దాం. 3. అడవులను నాశనం చేయకుండా.. చెట్లను పెంచడం అలవరచుకుందాం. 4. భూమికి హాని చేసే ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేదిద్దాం.మనిషి మనుగడకు నష్టం చేసిన కరోనా మాత్రం పుడమి తల్లికి మంచి చేస్తుందనే చెప్పుకోవాలి. మనిషి సృష్టించిన కాలుష్యం నుంచి ధరణి బయటపడేలా చేస్తుంది. మనిషిని నాలుగు గోడల మధ్య బందించి.. పక్షులూ జంతువులూ స్వేచ్ఛగా తిరగడానికి అవకాశం కల్పించింది. అలాగే వ్యర్థాలతో నిండిపోయిన నదులు మళ్లీ స్వచ్చంగా కనిపిస్తున్నాయి.
ఐక్యరాజ్య సమితి నివేదికల ప్రకారం ఏటా కోటి హెక్టార్లకుపైగా విస్తీర్ణంలో అడవులు కనుమరు గవుతున్నాయి. అత్యంత ప్రమాదకరమైన వ్యర్థ జలాలను సైతం సముద్రాలు, నదుల్లోకి విడిచిపెడు తున్నాం. గతశతాబ్ది కాలంలో సగందాకా చిత్తడి నేలలు,పగడపు దిబ్బలు అంతర్థానమయ్యాయి. ప్రకృతి సమతౌల్యం దెబ్బతినడంతో వాయుకాలుష్యం పెరిగి పోయింది. వాతావరణ మార్పుల ప్రభావంతో భూతా పం ఎక్కువై అధిక ఉష్ణోగ్రతలు, కార్చిచ్చులు, తుపాన్లు, వరదలు, కరవు కాటకాలు వంటి విపత్తులు ముప్పేట దాడి చేస్తున్నాయి. ఇటీవలి కొన్ని దశాబ్దాల కాలంలో భూతాపంలో వృద్ధి-పరిస్థితి తీవ్రతకు అద్దం పడు తోంది. భూతాపం మరింతగా పెచ్చరిల్లితే ప్రకృతి వైపరీత్యాల దుష్ప్రభావాలు ప్రమాదకరంగా ఉంటా యని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మానవాళి స్వయంకృతాపరాధమే ఈదుస్థితికి కారణమని తెలిసి నా ప్రపంచ దేశాలు తాత్సార వైఖరిని అవలంబిస్తుం డటం ఆందోళనకరం.
తరిగిపోతున్న అడవులు
భూతాపాన్ని నిలువరించి, పర్యావరణ సమ తౌల్యాన్ని కాపాడే లక్ష్యంతో ప్రపంచ దేశాలు ఏళ్ల తరబడి సమీక్షలు నిర్వహిస్తున్నాయి. వివిధ దేశాలు పర్యావరణ చట్టాలకు పదును పెడుతూ సహజ వన రుల వినియోగాన్ని నియంత్రించే లక్ష్యంతో విధానాలు రూపొందిస్తున్నాయి.వాటి కార్యాచరణ మాత్రం చురుకందుకోవడం లేదు. భూతాపాన్ని నియంత్రించేం దుకు 2015లో పారిస్ వేదికగా ప్రప దేశాల మధ్య కుదిరిన ఒప్పందం అమలులో అనిశ్చితి ఇంకా కొన సాగుతోంది.కర్బన ఉద్గారాల నియంత్రణ కోసం పర్యావరణహితకరమైన విధానాలు అమలు చేస్తామని దేశాలు ప్రతినపూనాయి.అందుకుగాను ప్రజల ఆహార భద్రత, ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యమిస్తూ సాంకేతిక పరిజ్ఞానం, ఇతర అవసరాల కోసం నిరుపేద, వర్ధమా న దేశాలకు నిధులు ఇస్తామని సంపన్న దేశాలు పేర్కొ న్నాయి.ఈ ఒప్పందం జరిగి ఎనిమిదేళ్లు గడుస్తున్నా నిధుల విడుదలలో జాప్యంచేస్తున్నాయి. నార్వే, జర్మనీ, స్వీడన్ వంటి దేశాలు స్వల్పంగా నిధులు విడుదల చేసినా అగ్రదేశాలు మాత్రం పెద్దగా స్పందించడం లేదు.భూతాపాన్ని నియంత్రించడంలో అడవులు కీలక పాత్ర పోషిస్తాయి. వనాలు జీవవైవిధ్య పరిరక్షణకు, జీవనోపాధుల కల్పన,ఆహార భద్రతకు విశేషంగా తోడ్పడతాయి. అయితే, అడవుల విస్తీర్ణం పెరగడం సంగతి అటుంచి, ప్రస్తుతమున్న దట్టమైన అడవుల విధ్వసం విచ్చలవిడిగా సాగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రపంచ ఆహార సంస్థ నివేదికల ప్రకారం వ్యవసాయ భూములు, నగరాల విస్తరణ, మౌలిక సదుపాయాలు,ఖనిజ తవ్వకాలు వంటి అభివృద్ధి కార్యక్రమాల ప్రభావం అడవులపై పడు తోంది. మÖడు దశాబ్దాల కాలంలో సుమారు 42 కోట్ల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలోని అడవులు అంతరిం చాయన్న అంచనా దిగ్భ్రాంతపరుస్తోంది.
లక్ష్యాలకు తూట్లు
పర్యావరణ పరిరక్షణలో భారత్ అనుసరి స్తున్న అనేక లోపభూయిష్ట విధానాల మÖలంగా భూగోళ పరిరక్షణ లక్ష్యాలకు తూట్లు పడుతున్నాయి. భూతాపం నియంత్రణకుగాను భారత్ వివిధ విధాన పరమైన చర్చల్లో అమెరికా వంటి అగ్ర దేశాలతో తలపడుతోంది.అయితే, వివిధ పర్యావరణ విధా నాలు,చట్టాలను పటిష్ఠంగా అమలు చేయడంలో ఇండియా విఫలమవుతోందనే విమర్శలు ఉన్నాయి. ప్రకృతి వ్యవస్థలకు నష్టం వాటిల్లకుండా, పర్యావరణ న్యాయం అమలు చేసేలక్ష్యంతో జాతీయ హరిత ట్రైబ్యునల్ చట్టం-2010 తీసుకొచ్చారు.ఈచట్టం అమలు మొదలై 13 ఏళ్లు గడుస్తున్నా అన్ని రాష్ట్రాల్లో హరిత న్యాయస్థానాలు అందుబాటులోకి రాలేదు. తీర ప్రాంత పరిరక్షణకు ఉద్దేశించిన సి. ఆర్.జెడ్. నిబంధనలు-2019 అమలులో రాష్ట్రాలు ప్రదర్శి స్తున్న అలసత్వం,తీరప్రాంతాల్లోని మడ అడవులు వంటి సున్నిత వ్యవస్థల విధ్వంసం వంటి అంశాలపై ఇటీవల కాగ్ వివిధ రాష్ట్రాలను తీవ్రంగా ఆక్షేపిం చింది. మన దేశంలో గడచిన ముప్ఫై ఏళ్ల కాలంలో లక్షలఎకరాలకు పైగా అడవులను అటవీయేతర కార్య క్రమాలకు బదలాయించినట్లు అంచనా. వీటికి ప్రత్యా మ్నాయంగా అడవుల పెంపకంలో అనుసరిస్తున్న విధానాలు లోపభూయిష్ఠంగా ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి.నష్టపరిహారంగా వచ్చే నిధులతో వనాల పెంపు కోసం 2016లోనే ప్రత్యామ్నాయ అటవీకరణ నిధి చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చినా ఆశించిన ప్రయోజనం చేకూరలేదు. రాష్ట్రాల స్థాయుల్లో వాతా వరణ మార్పులు, పర్యావరణం, తీరప్రాంతం, చిత్తడి, మడ అడవుల పరిరక్షణ వంటి సున్నితమైన పర్యా వరణ అంశాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. పర్యావరణ హితకరమైన పద్ధతులతో కూడిన జీవనశైలిని అందరూ పాటించాలి.నీరు,విద్యుత్, ఇంధనం వంటి విలువైన వనరుల వినియోగంలో పొదుపును అలవరచుకోవాలి.తద్వారా పుడమి పరి రక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ప్రభుత్వాలు సహజ వనరుల వినియోగం, కేటాయిం పుల్లో అక్రమాలకు అవకాశం ఇవ్వకుండా చిత్తశుద్ధితో వ్యవహరించాలి. అప్పుడే మానవాళిని కాపాడు తున్న ధరిత్రికి భద్రత, మన భవిష్యత్తు తరాల మనుగ డకు భరోసా అందివ్వగలం.
ప్లాస్టిక్తో ముప్పు
ప్రజల జీవనశైలి, సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చిన పెనుమార్పుల మÖలంగా ప్లాస్టిక్ వాడకం అనూహ్యంగా పెరిగింది. మితిమీరిన ప్లాస్టిక్ విని యోగం ప్రకృతి వ్యవస్థలకు తీవ్ర నష్టం కలిగిస్తోంది. తీరప్రాంతాల్ని కలిగి ఉన్న దేశాల నుంచి ఏటా లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు మహాసముద్రాల్లో పోగుపడు తున్నాయి. సముద్ర పర్యావరణ వ్యవస్థలో చేరే వ్యర్థాల్లో దాదాపు 90శాతం ప్లాస్టిక్ ఉంటోంది. భారత్లోని ప్రధాన నదులు సైతం ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్ర పర్యావరణంలోకి తీసుకెళ్ళే మార్గాలుగా మారడం ఆందోళనకరం. ప్రస్తుత ప్లాస్టిక్ ఉత్పత్తి, వినియోగం,పునర్ వినియోగ విధానాల్లో మార్పు రాకపోతే 2040నాటికి కోట్లాది టన్నుల ప్లాస్టిక్ వ్యర్థా లు సముద్రాల్లో పేరుకుపోయే ముప్పుంది. దీనివల్ల సాగర జీవుల మనుగడ ఇక్కట్లలో పడుతుంది.తీర ప్రాంత ప్రజల ఆరోగ్యమÖ దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంది.
భూమి దినం చరిత్ర
ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ ఉద్యమం మొదలైన సమయం దృష్టిలో పెట్టుకుంటే, అది 1970 ఏప్రిల్ 22న ప్రారంభమైంది. ఆరోజున సెనేటర్ గేలార్డ్ నెల్సన్ మరియు కార్యకర్త డెనిస్ హేస్ వారు తొలి సమావేశాన్ని ప్రేరేపించారు.వారు దేశవ్యా ప్తంగా 20మిలియన్ మందిని గాలి కాలుష్యం, నూనె పారులు మరియు జాతి విభిన్నత నష్టాలపై ప్రతిరోధం చేయమని విజయవంతంగా ప్రేరేపించారు.ఈ చరిత్రాత్మక ఘటన స్థాపనకు,అలాగే క్లీన్ ఎయిర్ యాక్ట్ మరియు ఎండేంజరడ్ స్పీషీస్ యాక్ట్ వంటి కీలక చట్టాల ఏర్పాటు కొరకు మార్గం సృష్టించింది. ఏప్రిల్ 22 ఏసంవత్సరం నాటికి పడ్డా,ప్రజలు ఎప్పు డూ ఆరోజున భూమి దినాన్ని జ్ఞాపకం చేసుకుం టారు. ఈ మసలేని నిబద్ధత ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులకు వారి షెడ్యూల్‌లను సరిపోల్చుకోవడానికి సమయం ఇస్తుంది. భూమి దినం 2025 ఒక గ్లోబల్ రోజు,అందరూ కలిసి మన భూమిని నివసించ దగినదిగా ఉంచేందుకు మనం భాగస్వామ్యం అయిన బాధ్యతను గౌరవించేందుకు ఇది ఒక అవసరం.
ఏప్రిల్ 22 ప్రత్యేకత ఏమిటి?
సెనేటర్ నెల్సన్ మరియు ఆయన సిబ్బంది ఈరోజు ప్రత్యేకంగా ఎంచుకున్నప్పుడు, యువతను ఆకర్షించి, వియత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల ఉత్సాహాన్ని ఉపయోగించుకోవాలని ఆశించారు. ఈ ఘటనను వసంత విరామం మరియు ఫైనల్ పరీక్షల మధ్య అంగీకరించడానికి వ్యూహాత్మకంగా షెడ్యూల్ చేశారు, తద్వారా మాక్సిమమ్ విద్యార్థి భాగస్వామ్యాన్ని ప్రేరేపించడానికి,పర్యావరణ ఉద్యమ యువత ఉత్సా హం శక్తిని తీసుకురావడాన్ని ప్రోత్సహించవచ్చని ఉద్దేశ్యించారు. ఈఏడాది 2025లో భూమి దినం వేడుకను 192 దేశాల నుండి ఒక బిలియన్ మందికి పైగా జరుపుకుంటారని అంచనా. ఇది ఈ ఘటన 55వ వార్షికోత్సవాన్ని సూచిస్తుంది. ఇది భూమి దినం ఉద్యమం,వివిధత,సమాజం మేలు కోసం ప్రజలను ఐక్యంగా చేయడంలో నిబద్ధత.1970లో లాగా ఇప్పటికీ బలంగా ఉందని చూపిస్తుంది. భూమి దిన సారాంశం ఎప్పటికీ ప్రజల శక్తి, మరియు ఈ శక్తి విప్లవాత్మక మార్పును తీసుకురావడానికీ సామర్థ్యం కలిగి ఉంది. ప్రజలు ఒక సామాన్య లక్ష్యాన్ని చేరుకోవడానికి ఐక్యంగా వచ్చేటప్పుడు, వారు పాత వ్యవస్థలను,పరిశ్రమలను అధిగమించ గలుగుతారు! పుడమి తల్లి పుట్టిన రోజునమనం అందరికీ మంచిగా ఉండే భవిష్యత్తును సృష్టించడానికి పునరుత్పత్తి శక్తి వనరులను ఉపయోగించేందుకు ఒకవాగ్దానాన్ని ఇవ్వు దాం.అది ఆరోగ్యకరమైన, స్థిరమైన, సమానమైన, మరియు ధనికమైనది.
ఈఏడాది నినాదం..“శక్తి..ప్రజలు..గ్రహం”
శక్తి:మన గ్రహం సమృద్ధిగా ఉన్న పునరుత్పత్తి శక్తి వనరులను 2030నాటికి వాటి ఉత్పత్తిని మÖడు రెట్లు పెంచడం ద్వారా ఎక్కువగా ఉపయోగించాలి. ఈ జాబితాలో సౌరశక్తి, గాలిశక్తి, జల విద్యుత్తు, భూపర్యవేక్షణ శక్తి,జలధార శక్తి ఉన్నాయి.
ప్రజలు:ఆర్థిక వృద్ధిని ప్రేరేపించడం,ఉద్యోగాలను సృష్టించడం, సమానత్వాన్ని ప్రోత్సహించడం.. అంగీ కరించేస్థాయిలో ఆరోగ్యాన్ని మెరుగుపరచడం,శుభ్ర మైన,అంగీకరించిన పునరుత్పత్తిశక్తితో ప్రపంచ కమÖ్యనిటీలను శక్తివంతం చేయడం ద్వారా బిలియన్ల మంది ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచగలుగుతాం. గ్రహం:మేము పునరుత్పత్తి శక్తి వ్యవస్థలను త్వరగా అమలు చేయడంద్వారా వాతావరణ మార్పును ఆప వచ్చు,పర్యావరణ వ్యవస్థలు మరియు జాతి విభిన్న తను కాపాడవచ్చు, మరియు మనం గోచారం వంటివి మీద ఆధారపడటం తగ్గించగలుగుతాం.
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించండి:..
శుభ్రపరచే కార్యక్రమాల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ భూమితో మీ సంబంధాన్ని బలపరచవచ్చు. గ్యారేజీ బ్యాగ్‌తో తిరుగుతూ ఎదురయ్యే ప్రతి ప్లాస్టిక్‌ను సేకరించండి.సమీపంలో ఉన్న కసాయి కాలువ లేదా గుంటను మీరు తెలుసుకోవచ్చు! గృహపరికరాలు వంటగదిలోని పాత్రలను కప్పు మరియు సిరామిక్‌తో మార్చండి,ప్లాస్టిక్ కట్టర్లను వేయకుండా వాటిని పునః ప్రయోగించండి!
చెట్లు నాటుదాం..
మన చెట్లు అద్భుతంగా ఉంటాయి. కార్బన్ ను సేకరిస్తాయి.వేడి ప్రాంతాలను చల్లబరు స్తాయి, పురాణాన్ని ప్రోత్సహిస్తాయి, రోగాల యొక్క ప్రసారం ప్రమాదాన్ని తగ్గిస్తాయి,స్థానిక ఆర్థిక వ్యవస్థలను పెంపొందిస్తాయి.ఒకేఒక చెట్టు మొత్తం యార్డ్‌లోని మొక్కల కంటే ఎక్కువ వన్యప్రాణులను ఆకర్షిస్తుందని మీరు ఊహించలేము! మీరు మీస్థానిక అధికారులుతో సంభాషించి పబ్లిక్ ప్రదేశాలలో చెట్లు మరియు స్థానిక తోటల బడ్‌లను నాటడం గురించి చర్చించండి. మీస్వంత భూమిలో కూడా వాటిని నాటవచ్చు!

    చరిత్ర పుటల్లో వందేళ్ల ఆంధ్ర విశ్వవిద్యాలయం

    ఆంధ్రప్రదేశ్‌లోని ఆంధ్ర విశ్వకళాపరిషత్ భారత దేశంలో ఉన్న గొప్ప విశ్వవిద్యాల యాల్లో ఒకటి.ఏప్రిల్ 26తో 99ఏళ్లు పూర్తి చేసుకుని 100వ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. దేశంలో వందేళ్ల చరిత్ర కలిగిన అతి కొద్ది వర్సిటీల జాబితాలో చేరింది. పేద,మధ్య తరగతి విద్యార్థు లెందరికో మెరుగైన విద్య అందించింది. ప్రపంచ వ్యాప్తంగా కీర్తి ప్రతిష్ఠలు సంపా దించు కుంది. దేశ, విదేశాల్లో ఎన్నో కీలక విభాగాల్లో ఏయÖ పూర్వ విద్యార్థులు విధులు నిర్వర్తిస్తు న్నారు. ఈనెల 11(శనివారం) నుంచి ఏయÖ శతాబ్ది ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.- జి ఎన్ వి సతీష్ 
    చరిత్ర నేపథ్యం..
    జమీందార్లు,స్థానికుల సహకారంతో 1913మే 26న బాపట్ల టౌన్ హాలులో నిర్వహించిన ఆంధ్ర మహాసభకు విశాఖకు చెందిన భయ్యా నరసింహశర్మ అధ్యక్షత వహించారు. ఆ సభలోనే కొందరు తెలుగు ప్రజలకు విశ్వవిద్యాలయం ఉండాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా అప్పటి మద్రాస్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్న అన్నెపు పరశురాం పాత్రో వర్సిటీ ఏర్పాటుకు కృషి చేశారు. 1926 ఏప్రిల్ 26న తొలుత విజయవాడలో వర్సిటీని ఏర్పాటు చేశారు. వర్సిటీకి స్థలం, నిధులు సమకూర్చుతామని విశాఖకు చెందిన పలువురు హామీ ఇవ్వడంతో 1930 సెప్టెంబరులో ఇక్కడికి తరలించారు. అప్పటికే ఉపకులపతిగా ఉన్న సర్ సీఆర్ రెడ్డి(సర్ కట్టమంచి రామలింగారెడ్డి) ఈ ప్రక్రియలో కీలకంగా వ్యవహరించారు. విజయనగరం, కురుపాం, జయపురం జమీందార్లతోపాటు నగరానికి చెందిన కొందరి సహకారంతో ఏయÖ ఏర్పడింది. శతాబ్ది ఆంధ్ర విశ్వవిద్యాలయం విస్తృత పరిశోధనలతో భారత చరిత్రను ఆవిష్కరిం చింది. ప్రపంచ చరిత్రకే దిశానిర్దేశం చేసింది. ఇక్కడ చరిత్ర, పురావస్తు విభాగాలు సుదీర్ఘ పరిశోధనా లక్ష్యాలతో ప్రముఖ కేంద్రాలుగా నిలిచాయి. చరిత్ర విభాగం 1931లో మొదలై స్వతంత్రంగా ఎదిగి, ఉన్నతస్థాయి బోధన, పరిశోధన, క్షేత్ర అధ్యయనాలకు కేంద్ర బిందువుగా మారింది. ఆచార్య మామిడి పూడి వెంకటరంగయ్య (1889-1982) తెలుగు, ఆంగ్ల భాషల్లో చేసిన రచనలు భారత స్వాతంత్య్రోద్యమం, ప్రజాస్వామ్యం, పాలన, సమాజ మార్పులు వంటి అంశా లపై తీవ్ర ప్రభావం చూపాయి. ఆంధ్రా ప్రాంతంలో స్వాతంత్య్రోద్యమ చరిత్రను విశదీకరించిన ప్రామాణిక గ్రంథం ‘ఫ్రీడ మ్ స్ట్రగుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ’. తెలుగులో ‘ఆంధ్రాలో స్వాతంత్య్ర సమరము’, ‘ఆంధ్ర దేశంలో స్వాతంత్య్ర పోరాట చరిత్ర’ గ్రంథాలను రాయడమే గాక,సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశం ప్రధాన సంపాద కునిగా ఆచార్య వెంకటరంగయ్య వ్యవహరించారు. రాజకీయ,చారిత్రక అంశాలను కూడా సామాన్య పాఠకుడికి అర్థమయ్యే శైలిలో ఆయన రాశారు. ఆధు నిక తెలుగు వ్యావహారిక భాషను పరిపుష్టం చేయడంలో కీలక పాత్ర పోషించారు. నాడు ఆయన ఈ విభాగ అభివృద్ధికి పునాదిరాయి వేశారు. భారత ప్రభుత్వం ఈయన్ని పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.ఆచార్య హిరేన్ ముఖర్జీ, మల్లంపల్లి సోమశేఖర శర్మ వంటి ప్రఖ్యాత చరిత్రకారులు తమ బోధన,పరిశోధనలతో విభాగంలో విమర్శనాత్మక చారిత్రక ఆలోచనలను ప్రోత్సహించారు. స్వాతం త్య్రానికి పూర్వం నుంచి గణతంత్ర భారత తొలి దశాబ్ది వరకు విభాగాధిపతిగా పనిచేసిన ప్రొఫెసర్ గొర్తి వెంకటరావు, మధ్యయుగ భారత చరిత్రలో తన ప్రావీ ణ్యంతో విభాగాన్ని ఉన్నతస్థితికి తీసు కొచ్చారు. అలహాబాద్ విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన వెంకటరావు బోధనతో పాటు పరిశోధనలో నాణ్యతను పెంపొం దించారు. పి.టి.శ్రీనివాస అయ్యంగార్ చేసిన ఆంగ్ల మÖల రచనకు గొర్తి వెంక టరావు సంపాదకత్వం వహించారు. మల్లంపల్లి సోమశేఖరశర్మ ఆంధ్ర విశ్వ విద్యాలయంతో అనుబంధం కలిగిన గొప్ప చరిత్రకారుడు. ఆంధ్ర చరిత్ర పరిశోధనకు పునాది వేసిన శాసన విజ్ఞాని. ముసునూరి నాయకులు, రెడ్డి రాజ్యాల చరిత్రపై ఆధార భూతమైన, ప్రామాణిక గ్రంథాలను రచిం చిన మహావిద్వాంసుడు. 1970లో ఈయన ‘విజయనగర ఎంపైర’ గ్రంథాన్ని రాశారు. పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత ప్రొఫెసర్ సర్వేపల్లి గోపాల్ అధ్యాపకునిగా ఇక్కడ సేవలందించారు. చిన్నప్పటి నుంచి స్వాతంత్రోద్యమకారులు, జాతీయ నాయ కుల మధ్య పెరిగిన వ్యక్తి.1975-1984 మధ్య కాలంలో జవహర్‌లాల్ నెహ్రూ జీవిత చరిత్ర (మÖడు సంపుటాలు) ప్రచురించారు. 1992 లో తనతండ్రి రాధా కృష్ణన్ జీవిత చరిత్రను స్వాతంత్య్రోద్య మంతో అనుసంధానం చేస్తూ ప్రచురించారు. 1965లో ‘భారతదేశంలో బ్రిటిష్ విధానం 1858-1905’ సామ్రాజ్య వాద పాలనపై విశ్లేషణ చేశారు. 1953లో లార్డ్ రిప్పన్ వైస్రాయ్ పాలన 1880-84 మధ్య¿ ±లంలో వలస పాలనా విధానాలపై పరిశో ధనా గ్రంథాన్ని ప్రచురించారు. 1957 లో ‘లార్డ్ ఇర్విన్ (1926-31) వైస్రాయ్ పాలన’,బాబ్రీ మసీదు-రామజన్మభూమి సమస్య (1991-92) ఘటనల మీద ప్రచురించిన సంకలనాలకు సంపాదకత్వం వహించారు. ‘బెంగాల్‌లో శాశ్వత భూస్థిరీకరణ విధానం-దాని ఫలితాలు (1949)’ అనే గ్రంథంలో భూ విధానంపై ప్రాథమిక పరిశో ధనాత్మక సంకలనాన్ని ప్రచురించారు. ‘ఆధునిక భారతదేశం (1967)’,‘భారత చరిత్రపై సంక్షిప్త అవలోకనం’ వంటి గ్రంథా లను రచించారు.ఆంధ్ర విశ్వవిద్యాలయం చరిత్ర విభాగంలో మరో ముఖ్యమైన మలుపు ప్రొఫెసర్ ఓరుగంటి రామచంద్రయ్య పాత్ర. ఈయనే మొదటిగా ఆంధ్రవిశ్వవిద్యాలయం చరిత్ర విభాగం నుంచి పీహెచ్‌డీ పొం దారు. అంతేగాక, కామన్‌వెల్త్ మాడిఫైడ్ ఓవర్సీస్ స్కాలర్‌షిష్ పొందిన వ్యక్తి. దీంతో ఆయన లండన్ స్కూల్ ఆఫ్ ఆర్కియాలజీ లో రెండేళ్ళు పురావస్తుశాస్త్రంలో ఉన్నత శిక్షణ పొందారు. ఆయన తిరిగి ఇక్కడకు వచ్చిన తరువాత విభాగంలో పురావస్తుశాస్త్ర బోధన మొదలయింది. ఈయన మార్గదర్శ కత్వంలో డాక్టర్ ఎ.వి.నరసింహ మÖర్తి పీహెచ్‌డీ పొందారు. ప్రముఖ భారతీయ పురావస్తు శాస్త్రవేత్త,శాసన విజ్ఞాన నిపుణు డు,నాణేల శాస్త్రవేత్తగా ఆయన ఎదిగారు. ప్రొఫెసర్ కె.ఎ.నీలకంఠశాస్త్రి శిష్యుడైన ఈయన ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండి యాలో విశేష సేవలందించి ఆంధ్ర విశ్వ విద్యాలయ ఘనచరిత్ర చాటారు.ప్రొఫెసర్ రాయప్రోలు సుబ్రహ్మణ్యం ఈచరిత్ర విభా గంలో అకడమిక్ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లారు. 1953లో భారత చరిత్ర కాంగ్రెస్ 16వ వార్షిక సమావేశాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయం చరిత్ర విభాగం నిర్వహిం చింది. దీనికి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షత వహించారు. తర్వాత తరంలో ఆచార్యసి.సోమసుందరం, ఆచార్య కె.కమ లవాసిని, ఆచార్య వై.శ్రీరామమÖర్తి వంటి పరిశోధకులు ఈ విభాగాన్ని మరింత సమర్థ వంతంగా తీర్చిదిద్దారు. సి.సోమసుం దరం ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్, ఆంధ్ర ప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్,సౌత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్‌ల విభాగాల అధ్యక్షుడిగా వ్యవహరిం చారు. కె.కమలవాసిని ఆంధ్రప్రదేశ్ ప్రాంతం లోని కళ, ఐకనోగ్రఫీ, దేవాలయ చరిత్రపై పరిశోధనలు చేసిన ప్రముఖ పండితురాలు. వై.శ్రీరామమÖర్తి 18వ శతాబ్దం మచిలీ పట్నం చరిత్ర (2000),తెన్నేటి విశ్వ నాథం-ఒక చారిత్రక అధ్యయనం (2003) గ్రంథాలు రాశారు. ఆచార్య మైనేని కృష్ణకుమారి మంచి పరిశోధన రచనలు చేశారు.మధ్యయుగ ఆంధ్రంలో అరుదైన కారైక్కాల్ అమ్మయ్యార్ శిల్పం,అలాగే ఎనిమిది సంఖ్యకు ఉన్న సామాజిక,మత ప్రాముఖ్యం వంటి కొత్త అంశాలను ఆమె వెల్లడించారు.ఒక చిత్రం వెయ్యి మాటలకు సమానం అనే భావనతో ప్రతిపాదించిన సిద్ధాంతాలు, వాదనల ఆధా రంగా అనేక రేఖాచిత్రాల్ని ఆమె విశ్లేషించారు. “సెర్మన్ ఫ్రమ్ స్టోన్స్-కంట్రిబ్యూషన్ ఆఫ్ ఆంధ్ర-ఆర్ట్,కల్చర్ అండ్ థాట”,‘మృణాల్ పెయింటింగ్స్ ఆఫ్ ఆంధ్ర’,‘ఐకనోగ్రఫీ అండ్ ఆర్ట్ ఆఫ్ ఆంధ్ర-లెసర్ నోన్ ఫ్యాక్ట్స’, ‘మల్టి ఫుల్ హెడెడ్ అండ్ హైబ్రీడ్ గాడ్స్-ఇన్ ది టెంపుల్స్ ఆఫ్ సౌత్ ఇండియా’ పరిశోధన వ్యాస సంకలనాలను ఆచార్య కృష్ణ కుమారి ప్రచురించారు.ఆంధ్ర విశ్వవిద్యాలయం చరిత్ర విభాగం ప్రాంతీయ చరిత్రను దేశచరిత్రలో శాస్త్రీయంగా పదిలపరిచింది. చరిత్ర, పురా వస్తు విభాగం భారతీయ విశ్వ విద్యాలయాల చరిత్రలో నిరంతర పరిశోధ నలను కొన సాగిస్తూ భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా నిలిచింది.శాతవాహనులు, ఇక్ష్వాకులు, చాళుక్యుల అధ్యయనాలతో పాటు, ఆధునిక రాజకీ య,సామాజిక ఉద్యమాల మీద విశేష పరిశో ధనల్ని అందిం చింది. ఈ విభాగం నుంచి ఎంతో మంది విద్యార్థులు ఉన్నతస్థాయికి ఎదిగి ప్రపంచ విద్యారంగంలో తమదైన ముద్రవేశారు.ఆంధ్ర విశ్వవిద్యాలయం చరిత్ర, పురావస్తు శాఖలు సాధించిన పరిశోధన ప్రగతిని శతాబ్ది ఉత్సవాల సందర్భంగా గుర్తు చేసు కోవడం ఎంతైనా అవసరం.డాక్టర్ సిహెచ్.మధుసూదనరావు,ప్రిన్సిపాల్,ప్రభుత్వ డిగ్రీ కళాశాల,పొందూరు పూర్వ విద్యార్థులే సర్ కట్టమంచి రామలింగారెడ్డి,సర్వేపల్లి రాధా కృష్ణన్, డాక్టర్ వీఎస్ కృష్ణ తదితరులు వర్సి టీకి ఉపకులపతులుగా పని చేశారు.సర్ సీవీ రామన్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇక్కడ పాఠాలు బోధించారు.సర్ సీవీ రామన్, మోక్ష గుండం విశ్వేశ్వరయ్య పని చేస్తున్న కాలంలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఏయÖను సందర్శిం చారు.పూర్వ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు,లోక్‌సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాల యోగి,కేంద్ర మాజీ మంత్రి కింజరాపు యర్ర న్నాయుడు,సుప్రీంకోర్టు మాజీ న్యాయమÖర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్,జస్టిస్ రామస్వామి తదితరులు ఏయÖ పూర్వ విద్యార్థులే.పూర్వ విద్యార్థుల్లో ఐదుగురు శాంతి స్వరూప్ భట్నా గర్ అవార్డులు,ఇద్దరు పద్మ విభూషణ్, ఒకరు పద్మభూషణ్, ఐదుగురు పద్మశ్రీ అవార్డులు కైవసం చేసుకున్నారు. దేశంలోనే తొలిసారిగా ఏయÖలో మెరైన్ ఇంజినీరింగ్,వాతావరణ, సముద్ర అధ్యయన శాస్త్రం,న్యూక్లియర్ ఫిజిక్స్ విభాగాలు ప్రారంభించారు. వివిధ విభాగాల్లో ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన ప్రయోగ శాలలు అందుబాటులో ఉన్నాయి.ఏటా వర్సిటీ లో చేరడానికి లక్షల మంది విద్యార్థులు దర ఖాస్తు చేసుకుంటారు. అయితే వర్సిటీలోని వివిధ కళాశాలల్లో దాదాపు 10000 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందుతున్నారు.
    శతాబ్ది ఉత్సవాల విశేషాలు..
    ఆంధ్ర విశ్వవిద్యాలయం‘శతాబ్ది మహోత్సవం’ లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఈనెల 20 నుంచి ఉత్సాహభరితంగా ప్రారంభమయ్యాయి. ఏయÖ ఇంజినీరింగ్ కాలేజ్ మైదానంలో జరిగిన ఈ వేడుకల్లో విశ్వ విద్యాలయం మరియు అనుబంధ కళాశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. వైస్-చాన్సలర్ జి.పి.రాజశేఖర్ ఈ సందర్భాన్ని గర్వకారణంగా అభివర్ణిస్తూ, శతాబ్దపు మైలురా యిని చేరుకున్న ఈ విశ్వవిద్యాలయం సమా జానికి సేవ చేయాలనే కొత్త నిబద్ధతతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

    గనుల విధానాలు..అభివృద్ధి పేరుతో హక్కుల నష్టం?

    భారతదేశం అభివృద్ధి దిశలో వేగంగా పయనిస్తోంది.పారిశ్రామికీకరణ,మౌలిక సదుపాయాల విస్తరణ,గ్లోబల్ మార్కెట్లలో పోటీ ఈ లక్ష్యాలన్నింటికీ ఖనిజ వనరులు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో గనుల రంగాన్ని ప్రోత్సహించే ప్రభుత్వ విధానాలు మరింత దూకుడుగా అమలవుతున్నాయి. దేశంలోని ఖనిజ సంపద ఎక్కువగా ఉన్న ప్రాంతాలు గిరిజన జనాభా అధికంగా ఉన్న ప్రాంతాలే. ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్,ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో భూమి,అడవులు,నీరు కేవలం వనరులు కాదు..అవి జీవనాధారం, సంస్కృతి,ఆత్మగౌరవానికి ప్రతీకలు.అలాంటి ప్రాంతాల్లో గనుల విస్తరణ కేవలం ఆర్థిక చర్య కాదు; అది జీవన విధానాలపై ప్రత్యక్ష దాడి.
    1991ఆర్థిక స్వేచ్ఛాకరణ తర్వాత గనులరంగంలో వచ్చిన మార్పులు ఈదిశగా మరింత వేగాన్ని అందించాయి. ప్రైవేట్ మరియు విదేశీ పెట్టుబడులకు మార్గం సుగమం చేయడం, అనుమతుల ప్రక్రియను సరళీకరించడం,గనుల లీజులను సులభతరం చేయడం వంటి చర్యలు పెట్టుబడులను ఆకర్షించడంలో సహాయపడినా,సామాజిక,పర్యావరణ పరిరక్షణ అంశాలను వెనక్కు నెట్టాయి.
    ఇక్కడ ప్రధానంగా ఆందోళన కలిగించే అంశం రక్షణ చట్టాల బలహీనత. గిరిజన హక్కులను కాపాడేం దుకు రూపొందించిన పంచాయతీరాజ్‌చట్టం (PజుSA),అటవీ హక్కుల చట్టం(ఖీ=A),భూసేకరణ చట్టం వంటి కీలక న్యాయ వ్యవస్థలు అమలులో తరచూ నిర్లక్ష్యం ఎదుర్కొంటున్నాయి. గ్రామ సభల అనుమతులు కేవలం రూపకల్పనగా మారిపోతుండటం,పర్యావరణ అనుమతులు వేగంగా ఇవ్వడం,ప్రజల అభిప్రాయాలను పక్కన పెట్టడం వంటి పరిణామాలు ప్రజాస్వామ్యవ్యవస్థలపట్ల నమ్మకాన్ని దెబ్బ తీస్తున్నాయి.
    గనులవల్ల కలిగే ప్రభావాలు కూడా గంభీరమైనవే.భూమి కోల్పోవడం, అడవుల నాశనం, నీటి కాలుష్యం, జీవనాధారాల నష్టం.ఇవి గణాంకాల్లో మాత్రమే కాకుండా వేలాది కుటుంబాల జీవనవాస్తవాలు. ముఖ్యంగా గిరిజన సమాజాలు అత్యధికంగా నష్టపోతున్నాయి.అభివృద్ధి పేరుతో వారు చెల్లిస్తున్న ధర అన్యాయంగా ఎక్కువ.

    ఈ పరిస్థితుల్లో ప్రజల ప్రతిఘటన సహజమే. నియామగిరి నుంచి హస్దేవ్ అరణ్య వరకు దేశవ్యాప్తంగా గిరిజనులు,స్థానిక సమాజాలు తమహక్కుల కోసం పోరాడుతున్నాయి. ఈ ఉద్యమాలు కేవలం గనుల వ్యతిరేక పోరాటాలు కాదు..అవి జీవనహక్కుల,పర్యావరణన్యాయం,స్వయం నిర్ణయాధికారాలకోసం జరుగుతున్న ప్రజాస్వామ్య పోరాటాలు.సుప్రీంకోర్టు ఇచ్చిన సమతతీర్పు వంటి నిర్ణయాలు గిరిజన హక్కులకు బలమైన రక్షణను కల్పించినా, వాటి అమలు విషయంలో ప్రభుత్వాల సంకల్పం ప్రశ్నార్థకంగా ఉంది.విధానాలు ఒక వైపు,వాస్తవాలు మరోవైపు అన్న పరిస్థితి కొనసాగుతోంది.
    ఇప్పుడు అవసరమైనది సమతుల్య దృక్పథం. అభివృద్ధి అవసరం అనేది వాస్తవం. కానీ అది గిరిజనుల హక్కులు,పర్యావరణ స్థిరత్వం, సామాజిక న్యాయాన్నిత్యాగం చేసి సాధించకూడదు. గ్రామ సభల నిజమైన భాగస్వామ్యం, పారదర్శక అనుమతి ప్రక్రియలు, న్యాయమైన పునరావాసం, లాభాల సమాన పంపిణీ ఇవి కేవలం సిద్ధాంతాలు కాకుండా ఆచరణలోకి రావాలి.
    మొత్తానికి, గనుల చర్చ కేవలం ఆర్థిక వృద్ధి గురించి కాదు. అది ప్రజాస్వామ్యం, న్యాయం, సమానత్వం గురించి. అభివృద్ధి అనే పదానికి నిజమైన అర్థం ఇవ్వాలంటే, దేశంలోని అత్యంత బలహీన వర్గాల స్వరాలు వినిపించాలి, గౌరవించాలి.అప్పుడే భారతదేశం అభివృద్ధి మార్గం నిజంగా సమగ్రం, స్థిరమైనది అవుతుంది.– రెబ్బాప్రగడ రవి,ఎడిటర్ 

    1 2