సామాజిక న్యాయం ఇంకెంత దూరం

ప్రపంచ వ్యాప్తంగా మానవహక్కుల ఉల్లంఘన కొన సాగుతున్న సందర్భంలో మనం ఉన్నాం. ప్రాథమిక హక్కులను నిర్దాక్షిణ్యంగా కాలరాస్తున్న సమాజాన్ని మనమిప్పుడు చూస్తున్నాం. సామాజిక న్యాయమనేది నిఘంటువులకే పరిమితమైన అంతర్జాతీయపదం. ఏ ఒక్క దేశానికో పరిమితమైంది కాదు. నాగరిక సమా జంలో మానవాళి ఎదుర్కొంటున్న సమస్య.సమా జంలో ప్రతి మనిషికీి హక్కులు, అవకాశాలు, గౌరవం ఉండాలన్నదే సామాజికన్యాయం.కులం,వర్ణం, మ తం,లింగం భాష ఆధారంగా మనిషిని దూరం చేస్తే సామాజిక న్యాయం లేనట్లే.”వర్గపోరాటం ముగిసి నప్పుడు మాత్రమే సామాజిక న్యాయం సాధించ బడుతుంది!” అన్న కార్ల్‌మార్క్స్ మాటలు అక్షర సత్యం. మార్టిన్ లూథర్ కింగ్ నాయకత్వంలో వర్ణవివక్షకు వ్యతిరేకంగా సాగిన సామాజిక న్యాయపోరాటం చరిత్ర ఎన్నటికీ మరచి పోదు. దక్షిణాఫ్రికాలో నెల్సన్ మండేలా నాయకత్వంలో జరిగిన పోరాటాలు ప్రత్యే కంగా చెప్పా ల్సిన పనిలేదు.ఈ క్రమంలో ప్రపంచ వ్యా ప్తంగా ఏ పౌరుడైనా సామాజిక న్యాయాన్ని పొందని పక్షంలో ఐక్యరాజ్యసమితి పాత్ర ఏమిటి అన్నది ఇప్పుడు మౌలిక ప్రశ్న.
ఐరాస 1948లో మానవ హక్కుల సార్వత్రిక ప్రక టన చేసింది.ప్రపంచవ్యాప్తంగా మానవహక్కుల ఉల్లంఘన జరుగుతున్నా సామ్రాజ్యవాదం నెత్తుటి దాహం తీర్చుకుంటున్నా ఐరాస ఏమారణ కాండ ను ఆపింది లేదు. సమానవేతనం,భద్రత, గౌరవం కోసం పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. ఆదివాసీలు తమ భూమి, సంస్కృతి, భాష, మానవ హక్కులకోసం పోరాడుతూ ఉంటే పాలకులు బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈనేపథ్యంలో భారత దేశంలో జరిగిన సామాజిక న్యాయ పోరా టాలను పరిశీలిద్దాం.
తొలిసూర్యుడు బసవన్న..
పన్నెండవ శతాబ్దంలో సమానత్వం, సమాన గౌర వం శ్రమ గూర్చి మాట్లాడిన గొప్ప ఆలోచనా పరుడు బసవన్న. తన ప్రవచనాల ద్వారా సమా జంలోని అసమానతలను ప్రశ్నిం చారు. పని పట్ల గౌరవం ఉండాలని, కార్మికులను గౌరవించాలని యజమానుల శ్రమదోపిడీకి వ్యతిరేకంగా పోరా డారు. కులవివక్షకు వ్యతిరేకంగా, స్త్రీల సమాన త్వానికి, సామాజిక ఉన్నతికి కృషి చేసిన మహోన్న తుడు బసవన్న.”అనుభవ మంటపం”అనే ప్రజా స్వామ్య వేదికను ఏర్పాటు చేసి,అన్ని తరగతుల సామాజిక సమస్యలను బహిరంగంగా చర్చిం చారు. భారతదేశంలో ప్రజాస్వా మ్యానికి ఆనాడే పునాదులు వేశారు. సంపదను కూడబెట్టుకోవడం కాదని, ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టడం కూడా సామాజిక బాధ్యతలో భాగమని చెప్పారు. ఆవిధంగా సామాజిక సమానత్వం కోసం ఆచర ణాత్మక రూపాన్ని అందించారు. మÖఢనమ్మ కాల కు వ్యతిరేకంగా అనేక ప్రవచనాలు రాశారు.
విప్లవతత్వాన్ని బోధించిన సంత్ రవిదాస్..
ఉత్తర భారతదేశంలో జన్మించిన సంత్ రవిదాస్ తన ప్రవచనాలతో సామాజిక విప్లవతత్వాన్ని బోధించారు.కుల వ్యవస్థను ప్రశ్నించారు. మను షులంతా సమానమేనని.. భేదభావం లేదని, దేవు డు గుడిలో లేడని పేదవాడి హృదయంలో ఉన్నా డని, శ్రమజీవి చేతిలో ఉన్నాడని బోధించారు. మనసును శుద్ధి చేసుకోవడమే నిజమైన భక్తి అని ప్రచారం చేశారు. మనిషికి ప్రేమ, దయ, మానవత్వం ఉండాలని చెప్పారు. ద్వేషం, అసూయ, అహంకారం మనిషిని నాశనం చేస్తా యని ప్రేమతో కూడిన సమానత్వ సహజీవనమే సామాజిక న్యాయమని చెప్పారు. పేదరికం లేని సమాజం,కులం,వర్గం లేని ప్రపంచం,ఆత్మ గౌరవంతో జీవించే హక్కును కల్పించడమే సామా జిక న్యాయం అన్నారు.ఈనాటి సామాజిక ఉద్య మాలకు సంత్ రవిదాస్ ఆలోచనలు స్ఫూర్తినిస్తు న్నాయి..ప్రేరణ కలిగిస్తున్నాయి.కులం కాదు మానవత్వం,అధికారం కాదు సమానత్వం, ద్వేషం కాదు ప్రేమ అని మనిషి ఎన్నుకున్న రోజే సామా జిక న్యాయం సాధ్యమవుతుందని ప్రకటించారు.
పోతులూరి వీరబ్రహ్మం దృష్టికోణం..
సాంఘిక విప్లవకారుడుగా పేరొందిన పోతులూరి వీరబ్రహ్మం 15వశతాబ్దంలోనే విప్లవాత్మక మార్పు లు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. అధికా రం, సంపద, కులం, మతం ఆధారంగా మనుషు లను విడదీసే వ్యవస్థలను అమానవీయ వ్యవస్థ లని పేర్కొన్నారు. అటువంటి సమాజం వల్ల పురో గతి సాధ్యం కాదని బోధించారు. సమాజంలో నైతికత, ప్రజాస్వామ్యం కొరకు కలగన్నారు. ప్రధా నంగా కులరహిత సమాజం ఉండాలని, కులం జన్మతోరాదని, అది మనిషి సృష్టించిన భ్రమ అని, సమాజానికి సందేశం ఇచ్చారు. మానవ కుటుం బం అనే భావననే సామాజిక న్యాయమని ప్రకటిం చారు.ఆర్థిక సమానత్వం కావాలని, ధనం కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతమైతే సమాజం కూలి పోతుందన్నారు. పేదరికం,దోపిడీ లేని జీవన విధానం లక్ష్యమని ప్రకటించారు. ఆచారాల కంటే మానవతే గొప్పదని చాటిన మహోన్నతుడు. మతం మనిషిని విభజించకూడదనీ, మతం అనేది మనుషుల్ని ఐక్యం చేయాలనీ విభజిస్తే అది మతమే కాదని పేర్కొన్నారు. స్త్రీ-పురుష సమాన త్వం,స్త్రీని అణచివేయడం సమాజ పతనానికి కారణమని, స్త్రీకి గౌరవం,స్వేచ్ఛ, హక్కులు ఉం డకపోతే అది సమాజమే కాదని ”కాళికాంబ సప్త శతి”లో చెప్తారు. రాజ్యం నైతికపాలన,ప్రజల శ్రేయస్సు కోసమే ఉండాలని,అన్యాయం,అవి నీతి,అహంకారం పాలనలో పెరిగితే వినాశనం తప్పదని హెచ్చరించారు. శ్రమకు గౌరవం, శ్రమే సంపదకు మÖలమని, శ్రమజీవే నిజమైన సృష్టికర్త అనే భావన సమసమాజానికి పునాది అనే సిద్ధాంతం వీరబ్రహ్మం ప్రతిపాదించారు. జ్ఞానం ప్రజలదే,విద్య కొద్దిమందికే పరిమితం కాకూ డదు. ప్రజలకు జ్ఞానం అందితేనే నిజమైన మార్పు వస్తుందని ప్రకటించిన మహోన్నతుడు.వీర బ్రహ్మం ఆశించిన సమసమాజం,కులం లేని సమాజం, దోపిడీ లేని ఆర్థిక వ్యవస్థ, మానవత్వం ఆధారమైన మత చైతన్యం, సమన్యాయం, సమా నత్వం,శ్రమగౌరవం గల సమాజం అనే విప్లవ త్మకమైన ఆలోచన.
ప్రజాకవి వేమన కలలు..
వేమన రాజు కాదు, పండిత బ్రాహ్మణుడు కాదు, మతగురువు కాదు. అతను సామాన్య ప్రజాకవి. కానీ సామాజిక న్యాయం గురించి వేమన మాట్లా డినంత ధైర్యంగా, స్పష్టంగా మరెవ్వరూ మాట్లా డలేదనేది సత్యం. వేమన దృష్టిలో సామాజిక న్యా యం అంటే కేవలం చట్టాలలో ఉండే న్యాయం కాదు, మనిషి మనిషిగా గౌరవించబడే సమాజం. వేమన కులవ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించారు. కులం పేరుతో మనిషిని తక్కువ చేయడాన్ని అసహ్యించుకున్నాడు. మనిషి గొప్పతనం పుట్టిన కులంలో కాదు, చేసే కర్మలో, నడవడిలో ఉందని స్పష్టం చేశాడు. అందుకే ఆయన పద్యాలు కులాధి పత్యానికి గట్టి సవాలుగా నిలిచాయి. శ్రమకు గౌరవం, శారీరక శ్రమ చేసే వాడు తక్కువవాడు కాదన్నాడు. పొలం దున్నే రైతు, పని చేసే కూలీ, వారే సమాజానికి పునాది అని బలంగా నమ్మాడు. శ్రమను అవమానించే సమాజం ఎన్నటికీ న్యాయ సమాజం కాదన్నాడు.మÖఢనమ్మకాలపై తిరుగు బాటు,మంత్రాలు,యాగాలు,అంధవిశ్వాసాల పేరుతో ప్రజలను మోసం చేయడాన్ని నిర్దాక్షి ణ్యంగా ప్రశ్నించాడు. దేవుడి పేరుతో జరుగుతున్న అన్యాయాలను ఎత్తిచూపారు. వివేకంతో ఆలో చించే మనిషే నిజమైన ఆధ్యాత్మికుడని విశ్వసిం చడం వల్ల తెలుగు సాహిత్యంలో వేమన స్థానం చిరస్మరణీయం.
స్త్రీ-పురుష సమానత్వం..
స్త్రీని రెండో తరగతి పౌరురాలిగా చూసే సంప్ర దాయాలను వేమన అంగీకరించలేదు. స్త్రీ కూడా పురుషునితో సమానమైన మానవురాలేనని స్పష్టం చేసిన మొదటి ఫెమినిస్ట్ వేమన. ఆనాటి సమాజం లో విప్లవాత్మక ఆలోచన.ధనం కంటే ధర్మం గొప్ప దని చాటాడు. నిజాయితీ, మానవత్వం ఉన్నప్పుడే సమాజం నిలబడుతుందని ఆయన విశ్వసిం చారు. సామాజిక న్యాయానికి వెలుగు దారులు పరిచారు.
పెరియార్ ఆలోచనలు..
ఉవ్వెత్తున ఎగసిన సామాజిక ఉద్యమ కెరటం ఈ.వి.రామస్వామినాయకర్. భారతీయ సామా జిక ఉద్యమంలో పెరియార్ గూర్చి తెలియని వారుండరు. కేవలం ఆయన నాయకుడు కాదు, మనిషిని మనిషిగా నిలబెట్టిన ఉద్యమకారుడు. ద్రావిడ సమాజాన్ని ఒక్కతాటిపై నిలబెట్టిన సామా జిక ఆలోచనా తాత్వికుడు. ఆయనదృష్టిలో సామా జిక న్యాయమంటే దానం ద్వారా లభించే హక్కు లు కాదు, సమాజం నిర్మాణాత్మకంగా మారి నప్పుడు లభించే సమానత్వం. పెరియార్ తీవ్రం గా ప్రశ్నించినది అంతరాల కులవ్యవస్థని. మను వాదం పేరుతో సాగిస్తున్న దుర్మార్గాన్నీ ప్రశ్నిం చారు. కులం అనేది సహజమైనది కాదు, మనిషిని బానిసగా మార్చేందుకు సృష్టించిన వ్యవస్థ అన్నా డు.కులాన్ని నిర్మూలించకుండా సామాజిక న్యా యం సాధ్యం కాదని స్పష్టం చేశాడు. కులానికి కారణమైన బ్రాహ్మణాధిపత్యం, మతాధిపత్యంపై పోరాటం చేశాడు. పెరియార్ దృష్టిలో మతం అనేది అన్యాయాలను పవిత్రం చేసే సాధనమని బహిరంగంగానే ప్రకటించాడు.
దేవుడు, శాస్త్రాల పేరుతో జరుగుతున్న వివక్షను అతను నిర్భయంగా ఎదుర్కొన్నాడు. పెరియార్ ప్రధానంగా పేర్కొన్నది ఆత్మగౌరవ ఉద్యమం. ఈ ఉద్యమం మనిషి తలవంచే అవసరం లేదని నేర్పింది. ఆత్మగౌరవం ఉన్న సమాజమే నిజమైన న్యాయ సమాజమని ఆయన నమ్మారు. అంతేకాక స్త్రీ విముక్తి కోసం సాగిన ఉద్యమాలు పెరియార్ కాలంలోనే చాలా బలమైనవి. స్త్రీలకు ఆస్తి హక్కు, విద్య,స్వేచ్ఛ అవసరమని ప్రకటించారు. పురుషా ధిక్యత ఉన్నంతకాలం సామాజిక న్యాయం అసం పూర్ణమేనని చెప్పారు. ఇక పెరియార్ పేర్కొన్న వివేకవాదం అంధవిశ్వాసాలపై పోరాడకుండా సమానత్వం సాధ్యం కాదని విశ్వసించారు. ప్రశ్నించే మనిషే స్వేచ్ఛాయుత మనిషని నమ్మారు. పెరియార్ ఆశించిన సామాజిక న్యాయం ఇప్పుడే, ఇక్కడే అమలవ్వాలి అనేది ఆయన నినాదం. ఈ రోజూ మనం కులం,మతం,లింగం పేరుతో ఎన్నో అన్యాయాలు చూస్తున్నాం.ఆలోచించండి.. ప్రశ్నించండి.. తిరుగుబాటు చేయండి.అనే పెరి యార్ నినాదంతోనే తమిళనాట ఉద్యమం బలోపేతం అవుతూనే ఉంది. అది ద్రావిడ సమా జం సాధించిన సామాజిక న్యాయం.
అంతరాలు చెరిపేసిన మహాత్మా జ్యోతిరావు ఫూలే..
చదువు,ప్రశ్నించు,సంఘటితమవ్వు నినాదంతో సామాజిక చరిత్రలో తనే విప్లవమై మొలకెత్తిన మహాత్ముడు జ్యోతిరావు ఫూలే. ఆయన సామాజిక న్యాయదృష్టి వర్తమాన భారతదేశ చరిత్రను తిరగ రాయగలిగింది. సామాజిక న్యాయం అనేది ఫూలే దృష్టిలో నినాదం కాదు..అణచివేతకు గురైన కోట్లాది ప్రజల జీవితహక్కు.19వశతాబ్దంలో కులం పేరుతో మనిషిని మనిషిగా చూడని కాలంలో,విద్య కొద్దిమందికే పరిమితమైన సామా జిక బానిస సమాజంలో ”ఈ వ్యవస్థే అన్యాయం” అని ప్రశ్నించిన ధైర్యశాలి ఫూలే.భారత సమా జంలో అసమానతలకు మÖలం కులవ్యవస్థ అని అందరిలా అతను నమ్మారు. బ్రాహ్మణీయ ఆధిప త్యం శ్రమజీవులను బానిసలుగా మార్చిందని విమర్శించారు.కుల నిర్మూలనే నిజమైన సామా జిక న్యాయమన్నారు.ఆయన సామాజిక న్యాయా నికి ఆయుధం విద్య.”విద్య లేకపోతే జ్ఞానం లేదు, జ్ఞానం లేకపోతే న్యాయం లేదు”అని నమ్మిన మహానుభావుడు ఫూలే! అందుకే స్త్రీలకు.. శూద్రులకు.. అతి శూద్రులకు విద్య అందించడ మే తన జీవిత లక్ష్యంగా చేసుకున్నారు. సావిత్రి బాయి ఫూలేతో కలిసి దేశంలోనే తొలి బాలికల పాఠశాలలు స్థాపించారు.ఫూలే దృష్టిలో స్త్రీ విముక్తి లేకుండా సామాజికన్యాయం అసాధ్యం. స్త్రీ బాని సగా ఉన్న సమాజం ఎప్పటికీ సమానత్వ సమా జం కాలేదని బోధించారు. వితంతు వివాహానికి మద్దతు, బాల్య వివాహానికి వ్యతిరేకత, స్త్రీ విద్యకు పోరాటం, పూలే సామాజిక న్యాయ ఉద్యమంలోని కీలక అస్త్రాలు.పురాణాలు, దేవుడి పేరిట జరుగు తున్న దోపిడీని తీవ్రంగా ఖండించారు.”మతం మనిషిని విముక్తి చేయాలి, మనిషిని బానిస చేయ కూడదు”అన్నది పూలేతాత్విక సందేశం. 1873 లో స్థాపించిన సత్యశోధక సమాజం ద్వారా కుల వివక్షకు వ్యతిరేకంగా శ్రమజీవుల గౌరవం కోసం, సమానత్వ సమాజం కోసం ప్రజలను చైతన్య పరిచారు. పూలే చూపిన సామాజిక న్యాయమంటే దానం కాదు. అధికారాల పునరుద్ధరణ.అది పుస్త కాలలో కాదు. పాఠశాలల్లో, పోరాటాల్లో, ప్రజల జీవితాల్లో నడిచిన ఉద్యమం.
చూపుడువేలు అంబేద్కర్..
ఆర్థిక పెత్తనం సామాజిక న్యాయానికి అడుగ డుగునా అడ్డంకులంటూ అంబేద్కర్ ఏనాడో చెప్పాడు. ఉత్పత్తి సాధనాలను అగ్రవర్ణాలకు ఇచ్చే భౌతికశ్రమను శూద్రులకు కేటాయించింది. ఈ క్రమంలో శ్రమ విభజన మాత్రమే జరగలేదు. కుల అసమానత్వం అనే భావన ఉందని అంబే ద్కర్ గుర్తించారు. బాధితులందరూ ఉమ్మడి శత్రు వును, ఉమ్మడి కష్టాన్ని ఎదుర్కొనడానికి ఒకటిగా ఐక్యమయ్యేందుకు దోహదపడు తుందనీ.. అణ గారిన కులాలు ఐక్యంకాకుండా పాలకుల, బూర్జువా పార్టీల పన్నాగాలు, అంతా ఇంతా కావు. బి యేట్స్ అనే ఐరిష్ కవి ఇలా చెప్తారు. ”అతడు ఇప్పుడు మన సోదరులను తన వైపు తిప్పుకు న్నాడు. ఇక మన తెగవారు ఐక్యత ప్రదర్శించలేరు. మనలను కలిపి ఉంచే అంశాలను అతడు ఒక కత్తితో చీల్చాడు.. మనం చెల్లాచెదురై పోయాం!” అంటాడు. మానవ ప్రవర్తన వైరుధ్యాలకు కులం కూడా కారణం అవుతున్నది. మనస్ఫూర్తిని దహించి వేసి, మానవత్వాన్ని పరిమళించే రాజ్యాంగాన్ని, అంబేద్కర్ స్ఫూర్తిని కొనసాగిం చడంలో భారతీయ సమాజం ఇంకా వెనుకంజలోనే ఉందనిపిస్తుంది. ప్రాథమిక హక్కు లను పాలకులు నిర్ధాక్షిణ్యంగా కాలరాస్తున్నా నిమ్మకు నీరెత్తనట్లే ఉన్నాం. అంటరానితనం మÖలాలను పెకిలించాలన్న అంబేద్కర్ ఆశయ సాధన దిశగా అడుగులు వేయాలి. సామాజిక న్యాయం సాధించేందుకు మతోన్మాద వ్యతిరేక పోరాటాలు ఉధృతమవ్వాలి. సామాజికన్యాయం దయతో ఒకరిచ్చే సహాయం కాదని, అది రాజ్యాం గం ద్వారా హామీ ఇచ్చిన మానవహక్కు అని ప్రక టించారు. కులవ్యవస్థ ప్రజాస్వామ్యానికి శత్రువు అన్నారు. అసమానత లపై నిలబడి ఉన్న సమా జం నిజమైన స్వేచ్ఛను, సమానత్వాన్ని అందించ లేదని హెచ్చరించారు. ”సామాజిక ప్రజాస్వామ్యం లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం నిలబడదు.” అనే అంబేద్కర్ ఆశయం గొప్పది. అంబేద్కర్ దృష్టిలో సామాజిక న్యాయమంటే స్వేచ్ఛ, సమాన త్వం, సోదరత్వం. ఈ మÖడు లేకుండా సామా జిక న్యాయం ఒక కల మాత్రమే. ఆయన నమ్మిన ప్రధాన ఆయుధం విద్య.విద్య ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమని ప్రకటించారు. అసమాన తలను అంతం చేయవచ్చన్నారు. వివక్షలేని సమా జాన్ని చదువు ద్వారా మాత్రమే నిర్మించ వచ్చ న్నారు. విద్య ద్వారా ఆత్మగౌరవం, చైతన్యం, హక్కులపై అవగాహన సాధ్యమవుతాయని ఆయన బలంగా నమ్మారు. సామాజిక న్యాయం కుల సమస్యకే పరిమితం కాదని,అది స్త్రీల, కార్మి కుల హక్కులు, మత స్వేచ్ఛ, ఆర్థిక సమానత్వం అన్నింటినీ కలుపుకున్న సమగ్రదృష్టి అన్నారు. హిందూ కోడ్ బిల్ ద్వారా స్త్రీలకు సమాన హక్కు లు కల్పించాలని ఆయన ప్రయత్నించారు. రాజ్యాంగంలో రిజర్వేషన్లు, మౌలికహక్కులు, రాజ్యాంగ పరిహార హక్కు చేర్చడం ద్వారా సామాజిక న్యాయాన్ని చట్టబద్ధం చేశారు. అందుకే ఈ దేశంలో కులం ఉన్నంత కాలం సామాజిక న్యాయం జరగదనేది స్పష్టం. ”నేను హిందువుగా పుట్టాను, కానీ హిందువుగా మరణించను” వ్యక్తి గత నిర్ణయం కాదు, వ్యవస్థపై నిరసన. సామాజిక న్యాయానికి అంబేద్కర్ నిర్వచనం ఇస్తూ సామా జిక న్యాయం సానుభూతి కాదు, అధికారాల పునరుద్ధరణ అంటారు. ఈ క్రమంలో మన ముం దున్న బాధ్యత రాజ్యాంగ విలువలను రక్షించడం, కుల, లింగ, వర్గ వివక్షను నిర్మూలించడం. సమా నత్వ సమాజాన్ని నిర్మించడం. అప్పుడే సామాజిక న్యాయం సాధ్యం.
ఆరఎసఎస్ దృష్టిలో..
ఆరఎసఎస్‌కు మాత్రం సామాజిక న్యాయం పట్ల భిన్నమైన అభిప్రాయం ఉంది. ఆరఎసఎస్ గురూజీగా పేరొందిన మాధవ సదాశివ గోల్వా ల్కర్ అసమానత అనేది మన సమాజంలో అంత ర్భాగమని అన్నాడు. అసమానతుల్ని ప్రోత్స హించడం, మనస్మ ృతిని అమలు చేయడం వర్త మాన దేశంలో చూస్తూనే ఉన్నాం.సామాజిక న్యాయసాధనలో ఆరఎసఎస్ ఏ సందర్భంలోనూ తన పాత్ర పోషించలేదు. సమాజం పురోగామిగా ఉండడం ఆరఎసఎస్‌కి ఇష్టం లేదు. మÖఢ నమ్మకాలు, దురాచారాలు, అశాస్త్రీయత వీరి ఆయుధాలు. మనుస్మ ృతే వారికి రాజ్యాంగం. వర్ణవ్యవస్థకు మద్దతు, వర్ణవ్యవస్థను హిందూ రాజ్యానికి ప్రధానబలంగా వర్ణించారు. స్త్రీల విముక్తి, స్త్రీల సాధికారత ఏ కోశానా ఆరఎసఎస్‌కి ఇష్టం ఉండదు. ఆరఎసఎస్ ఉద్దేశంలో స్త్రీ పురుషులు సమానం కాదు. అలా సమానత్వం గురించి మాట్లాడటం మతానికి వ్యతిరేకం. అంతెందుకు స్త్రీలకు ఓటు హక్కు ఇవ్వడాన్నీ ఆరఎసఎస్ వ్యతిరేకించింది. గోల్వాల్కర్ బంచ్ ఆఫ్ థాట్స్‌లో స్త్రీలు పరిపాలించిన చోటల్లా అసమానత, అరాచకం ఊహించలేని స్థాయిలో వ్యాపించాయి అంటూ చెబుతారు. అలాగే వితంతువులను ప్రజా సంబంధిత, ప్రభుత్వ, మత సంబంధిత వేడుకల్లో నిషేధించారు. ఇదీ ఆర్ ఎసఎస్ ఆలోచన. -(కెంగార మోహన్)