భారతీయ గిరిజన వీరులు..
భారతదేశవ్యాప్తంగా విభిన్న ప్రాంతాల్లో వివిధ పేర్లతో విస్తరించి ఉన్న మÖలవాసులైన ఆదివాసుల ఉనికి చరిత్ర కారణాలు ఏమైనా కాలా నుగుణంగా వెనుకబడిన,నినిజంనిప్పు లాంటిది” అన్న సామెతలా…అణగదొక్కబడ్డ ఆదివాసుల చరిత్ర పోరాటాలు నేటి కాలపు పరిశోధక రచయితల కృషితో ఆవిష్కరించ బడుతున్న ఆధు నిక అక్షర యుగంలో మనం ఉన్నాం.
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యులు ఆచార్య ఎం.గోనానాయక్ కలం కృషితో వెలువడిన విలువైన పుస్తకం నిభారతీయ గిరిజన వీరులు”మొగలుల కాలం నుంచి ఆంగ్లే యుల పాలనవరకు సాగిన కాలంలోస్వేచ్ఛ కోసం పోరాటం చేసి అమరులైన ఆదివాసి వీరులు అనేకమంది చరిత్రకు చిక్కకుండా కాలగర్భంలో కలిసిపోయారు,
బ్రిటిష్ వారి అధికార గెజిట్‌లో గిరిజన యో ధుల సంఖ్య 142 కాగా, గిరిజన జాతుల జాతీయ కమిటీ వారి గణాంకాలు ప్రకారం 50 మంది గిరిజన పోరాటవీరుల వివరాలు మాత్రమే నమో దు కాబడ్డాయి,
ఇక ఈ పుస్తక రచయిత విశేష కృషి క్షేత్ర పర్యటనల సాయంగా మరో ఆరుమంది గిరిజన పోరాట వీరులు వెలుగు చూశారు దీనిలో మొత్తం 56 మంది ఆదివాసి పోరాట యోధుల వివరాలు వర్ణ చిత్రాలతోపాటు ఆంగ్ల తెలుగు మాధ్యమా లలో అందించడం ఎంతో ఉపయోగంగా ఉంది. సమాచారం సంక్షిప్తంగా ఆగుపించిన అది అనం తర కాలంలో చేయాల్సినకృషికి దారులు వేసేదిగా ఉంది.కేరళకు చెందిన‘కురిచియ్ణగిరిజన తెగకు చెందిననితలక్కల్ చందు”మొదలు పాల్వంచ ప్రాం తానికి చెందిన కోయ గిరిజన తెగకు చెందిన సోయం గంగులు వరకు గల గిరిజన పోరాట యోధుల సంక్షిప్త సమాచారాలు ‘కొండ అద్ద మందు్ణ అన్న చందంగా మనం ఈ పరిశోధనా పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు.గిరిజన పోరాట యోధులు అనగానే మనకు స్పూర్ణకు వచ్చే రాణి దుర్గావతి కొమరంభీమ్ రాంజీగౌడ్,బీర్సా ముండా అల్లూరి సీతారామరాజు వంటి కొందరితో పాటు ఎందరో అజ్ఞాత వీరుల వివరాలు ఆసక్తిదాయ కమైన విశేషాలు కలగలిపి అందించారు రచయిత గోనా నాయక్. ఇందులో మనం రెండు విధాల యోధులను గమనించవచ్చు, మొదటి విభాగంలో గిరిజనులు అయిన గిరిజన యోధులు కాగా గిరిజనులను రక్షించే లక్ష్యంతో గిరిజనుల పక్షాన నిలిచి పోరాటం చేసిన గిరిజనేతర పోరాట యోధులు.ఇటువంటి గిరిజనేతర పోరాట యోధుల వర్గంలో అల్లూరి,నారాయణ సింగ్, గోవింద్ గురు,ప్రవీర్‌చంద్ర భంజ్ దేవ్,వంటి గిరిజనే తరుల,త్యాగాలను పోరాట స్ఫూర్తిని గిరిజ నుల్లో చైతన్యం నింపి ఏకం చేయడంలో చేసిన కృషిని ఇందులో చేర్చడం జరిగింది.ఒడిశా ప్రాం తానికి చెందిన మల్కనగిరి ప్రాంత అడవి బిడ్డ తామడోరా.బ్రిటీష్ పాలకులపై చేసిన విరోచిత తిరుగు బాటు,బ్రిటిష్ వారు అందించిన ఉద్యోగ భృతిని దేశంకోసం తృణప్రాయంగా విడిచి తనను నమ్మిన తన ఆదివాసి జాతి పరిరక్షణకోసం తనను తాను అర్పించుకున్న మధ్యప్రదేశ్‌కు చెందిన భీల్ గిరిజన తెగ వీరుడు కాజా నాయక్, మహారాష్ట్రకు చెందిన గోండు వీరుడు బాబురావుషడ్మా,పోరాట పటిమ మనం ఇందులో చదువుతాము. ఈచారి త్రిక గిరిజన యోధుల పోరాట గాథల్లో ధైర్యం సాహసం నిస్వార్థం వంటి యోధుల సుగుణాలతో పాటు,స్వల్పంగా అస్మధీయులుగా సహచరులుగా తనతోటివారు చేసిన నమ్మక ద్రోహం,కుట్రలు, తద్వారా వీరులుశత్రువులకు పట్టుబడ్డ వైనాలు, వ్యూహాలు,ప్రతివ్యూహాలు ఇందులో కూలం కషంగా చదువుకోవచ్చును.గిరిజనేతరుడైన గిరిజ నుల పట్లగల వాత్సల్యంతో వారిలో చైతన్యం నింపి సంఘటితం చేసి, నూతన పోరాట విధానా లు ఆయుధాలు పరిచయం చేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు గురించి అతని కృషి సాయంగా అందించే నేపథ్యంలో అతడి వివరాలు తెలిపే క్రమంలో అల్లూరిని ‘భీల్ణ తెగకు చెందిన గిరిజన వీరుడుగా పరిచయం చేయడం కాస్త అసంబద్ధంగా అనిపించినా! అది అక్షర దోషం గానే భావించాలి తప్ప సమాచార లోపం అన రాదు.ఈ గిరిజన పోరాట యోధులలో పురు షులతోపాటు మహిళా వీర వనితల వివరాలను కూడా ఇందులో చేర్చి రచయిత తన పరిశోధన పరిధిని మరింత విస్తృతం చేశారు, మొత్తం ఆరు మంది ఆదివాసి మహిళా పోరాట యోధుల వివ రాలు పొందుపరిచారు వీరిలో రాణిమా గైడిన్యూ ,రాణి దుర్గావతిలు ప్రముఖంగా అందరికీ తెలిసిన ఆదివాసి పోరాట యోధులు కాగా, రాణి రోపుయి యాని, వీరాంగనలీపా,సింగిదాయిలతో పాటు పూలో-ఝానో ముర్ములు, అనే ఆదివాసి సోదరీ మణులు చేసిన వీరోచిత పోరాటాల గురించి ఆసక్తిదాయకమైన వివరాలు ఇందులో ఉన్నాయి. ప్రతి ఆదివాసి పోరాటయోధుల గురించిన జనన, వీర మరణ,తేదీలతోపాటు పుట్టినప్రాంతం, అలా గే ఏ గిరిజన తెగకు చెందిన వారో కూడా ఆంగ్ల తెలుగు భాషల్లో అందించి,సమాచారం పక్కనే ఆయోధుల అందమైన ఊహ వర్ణచిత్రాలు అందిం చడం ఈ పుస్తకానికి అదనపు ఆకర్షణగా ఉంది. జార్ఖండ్ ప్రాంతానికి చెందిన సంతాల్ గిరిజన జాతి వారైనా సిద్ధూ, కనుహ ముర్ము ,అనే ఇద్దరు అన్నదమ్ములు వారి తమ్ముళ్లు చాంద్, బైరన్, లతో పాటు వీరికి వరుసకు చెల్లెళ్లు అయిన పూలో, ఝానో ముర్ములు,నాటి బ్రిటిష్ వారి అమానుష పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయడమే కాక మొత్తం కుటుంబ సభ్యులందరూ స్వాతంత్ర సమ రంలో ప్రాణత్యాగం చేసిన అరుదైన విష యాన్ని ఈపుస్తక రచయిత గోనాయక్ వెల్లడి చేయడం ఆయన పరిశోధనా ప్రతిభకు నిదర్శనం.
అడవి బిడ్డలైన గిరిజనవీరులు పూలో,ఝానో, ముర్ములు మగవాళ్లకు ధీటుగా సాధారణ ఆయు ధాలైన గొడ్డళ్లు చేతబట్టి స్వరాజ్య సమరంలో నిలి చారు.ఈఅక్కాచెల్లెళ్లు చిన్నతనం నుంచే అబ్బా యిల మాదిరిగా గుర్రాలపై తిరిగేవారు తమ ప్రాంత స్త్రీలందరినీ ఏకంచేసి స్త్రీ సైన్యాన్ని ఏర్పా టు చేసిన ధీరవనితలు వీరు, పురుషులతో సమా నంగా గెరిల్లా యుద్ధాలు చేస్తూ బ్రిటీష్ సేనలపై మెరుపు దాడులు చేసేవారు.వీరు కూడా తమ అన్నల వలే సహచరుల నమ్మకద్రోహంతో శత్రువు లకు పట్టుబడి వీర మరణం చెంది అజ్ఞాత ఆది వాసి సమరయోధుల జాబితాలో చేరారు. నాటి స్వరాజ్యసమరంలో వీరమరణం పొందిన యోధు లను రెండు వర్గాలుగా విభజించాలి ఒకవర్గం బ్రిటిష్ వారితో ప్రత్యక్షంగా సాయుధ పోరాటాలు చేసి యుద్ధరంగంలో అమరులైన వారు. రెండవ వర్గం తిరుగుబాటు దారులుగా పట్టుబడి జైలు శిక్షలతో ఉరి తీయబడిన వారుగా చెప్పవచ్చు. అతి తక్కువ మంది గిరిజన వీరులు ఉరిశిక్షలతో అమరులైనారు,అందులో ప్రధాన యోధుడు మహా రాష్ట్రలోని చంద్రపూర్‌కు చెందిన గోండ్ గిరిజన యోధుడు బాబురావు షడ్మ ఒకరు.తనకు చిన్న తనం నుంచి తమ తల్లి అడవి నేర్పిన వేటల రహస్యాలే అనంతర కాలంలో బ్రిటిష్ వారి అమా నుష పాలనకు వ్యతిరేకంగా చేసిన పోరాటానికి ఉపయోగపడ్డాయి.తన ప్రాంత గిరిజన యువత ను సమీకరించుకుని‘జింగో్ణసైన్యాన్ని సిద్ధం చేసి శిక్షణలు ఇచ్చి బ్రిటిష్ సేనలపై దాడి చేసి మÖడు సార్లు విజయం సాధించాడు బాబురావు, ఆఖరికి అస్మదీయుల నమ్మకద్రోహంతో పట్టుబడి సమర ఖైదిగా చాందా జైలులో శిక్షించబడి అక్కడే 21 అక్టోబర్ 1858న ఉరి తీయబడ్డాడు.
ఇటువంటి మరుగున పడిన ఎన్నో గిరిజన వీరుల స్వరాజ్య సమర సంగతులు ఆసక్తిదా యకమైన అనేక అంశాలు,ఈ ‘భారతీయ గిరిజన వీరులు్ణపుస్తకంలో మనకు లభ్యం అవుతాయి. భావితరం పరిశోధకులకు ఇది ఒక దారి దీపం, దీని సాయంగా మన దేశ గిరిజన వీరుల వివరాల గురించిన విస్తృత పరిశోధనలు చేయాల్సిన అవ సరం అర్ధం అవుతుంది. ఆదిశగా కృషి జరిగిన నాడు గోనా నాయక్ గారి నేటి ఈఅక్షర కృషికి అర్థం పరమార్థం అందుతాయి, అది సఫలం కావాలని ఆశిస్తూ…పరిశోధక ఆసక్తి పరులే కాక ఆదివాసి ప్రేమికులంతా సొంతం చేసుకోవలసిన అక్షర వజ్రాల పేటిక ఈపుస్తకం, అనడంలో అతిశ యం లేదు.
భారతీయ గిరిజన వీరులు (వ్యాససంపుటి), పేజీలు : 134, ధర : 300/-రూ, ప్రతులకు: ఆచార్య ఎం.గోనానాయక్,హైదరాబాద్, సెల్ : 98490 93300., సమీక్షకుడు :- డా: అమ్మిన శ్రీనివాసరాజు, సెల్ :77298 83223.
