యువతా… ఏ భావజాలాన్ని గుడ్డిగా నమ్మొవద్దు

‘యువత ఏఒక్క భావజాలాన్ని గుడ్డిగా నమ్మ వద్దు.ఎవరి ఐడియాలజీని గుడ్డిగా నమ్మి ప్రభావితం కావద్దు. మీరు ప్రభావితం అయిన భావజాలం ఈ కాలానికి సరి పోతుందా? లేదా అనేది ఒకటికిపదిసార్లు ఆలోచించి ముందుకు వెళ్లండి. భావోద్వేగా లతో కాకుండా వాస్తవికత ఆధారంగా ఆలోచనలు చేయాలని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ పిలుపు నిచ్చారు. ప్రపంచాన్ని మార్చగల శక్తివం తమైన ఆయుధం విద్య అని,సమాజ సేవే యువత ధ్యేయం కావాలని కోరారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ప్రపంచ శక్తిగా నిలిస్తే, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం లో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. తన ఆఖరిశ్వాస వరకు భవిష్యత్ తరాల కోసమే పని చేస్తా నని తెలిపారు.ఆంధ్ర విశ్వ విద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వ హించిన మెగా కల్చరల్ ఫెస్ట్ ముగింపు వేడు కలకు ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్ధులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ‘ఆంధ్ర విశ్వకళా పరిషత్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం రావడం గొప్ప గౌరవంగా భావి స్తున్నాను. యÖనివర్శిటీ గురించి మాట్లాడు కోవాలంటే మొదట చిహ్నం గురించి మాట్లాడుకోవాలి.ఆంధ్ర యÖనివర్సిటీ లోగోను ప్రత్యేక శ్రద్ధతో తయారుచేశారు. లోగోలోని ప్రతి అంశానికి అర్థం స్ఫూరిం చేలా తయారు చేశారు. కాంతి కిరణాలతో ఉదయించే సూర్యుడు విశ్వ విద్యాలయాన్ని, దాని అనేక అధ్యయన విభాగాలను సూచిస్తుంది.ఇక కమలం శ్రేయో దేవత లక్ష్మీ,జ్ఞాన దేవత సరస్వతి ఇద్దరినీ ప్రతిబిం బిస్తుంది. సూర్యకిరణాలపై ఆర్యులలో దీవెన చిహ్నమైన స్వస్తిక్ ఉంటుంది.అరవై నాలుగు తామర రేకులతో కూడిన శిఖరం బయటి వృత్తం, భారతదేశ శాస్త్రీయ సంప్రదాయంలోని అరవై నాలుగు కళ లను,శాస్త్రాలను సూచిస్తుంది.ఇక సముద్రా న్ని-విద్యార్థులు ప్రావీణ్యం పొందడానికి దోహదపడే విస్తార మైన జ్ఞానకేంద్రం అనే అర్థంలో తయారు చేశారు.ఉపనిషత్తుల లోని ‘తేజస్వినావధిత మస్తు’ అనే నినాదా న్ని కూడా లోగోలో భాగం చేశారు.దీని అర్థం ఏమిటంటే ‘దైవిక కాంతి మన అధ్యయనాలను ప్రకాశింపజేయుగాక‘ అని.ఈజ్ఞాన చిహ్నం కింద అన్ని మతాల లోనూ ప్రాశస్త్యం కలిగిన నెలవంక ఉంది. ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని కళల అభివృద్ధికి నెలకొల్పిన సంస్థ అనే అర్థంతో ‘ఆంధ్ర విశ్వకళాపరిషత’ అని దీనికి నామకరణం చేశారు. లోగోలోని దిగువభాగంలో ఉన్న రెండు సర్పాలు జ్ఞానాన్ని కోరుకునేవారిని, జ్ఞాన సంరక్షకులను సూచిస్తాయి.వేలాది మంది మేధావులను సమాజానికి అందిం చిన సంస్థ ఆంధ్ర విశ్వవిద్యాలయం గురించి పూర్వ విద్యార్ధి,నాఆత్మీయులు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి ద్వారా తెలుసు కున్నాను.ఆయన ఇదే యÖనివర్శిటీలో న్యూక్లియర్ ఫిజిక్స్‌లో మాస్టర్స్ చేశారు. ఆయన అన్ని విభాగాల గొప్పదనం గురిం చి వివరించే వారు. అలాంటి ఆంధ్ర యÖనివర్శిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తు న్నాను. ప్రపంచవ్యాప్తంగా విద్యనందించే ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు చాలా ఉన్నప్ప టికీ,కొన్ని తరాలను తీర్చిదిద్దుతూ అద్వితీ యమైన జ్ఞానాన్ని అందించే విద్యా సంస్ధలు కొన్నే ఉన్నాయి. ఈ కొద్ది సంస్థల్లో శతాబ్ద కాలంపాటు ఎన్నో వేల మంది మేధావు లను సమాజానికి అందించిన చరిత్ర ఆంధ్ర విశ్వకళా పరిషత్,ఆంధ్ర యÖని వర్శిటీకే దక్కుతుంది. ఈ ఆంధ్ర విశ్వ విద్యాలయం కేవలం ఒకప్రాంగణం మాత్రమే కాదు. విలువలతో వ్యక్తిత్వంతో దేశ నిర్మాణంలో భాగస్వామ్యంగా నిలిచి, శాతాబ్దకాలాన్ని దిగ్విజయంగా పూర్తి చేసు కున్న భారతీయ వారసత్వ సంపదకు చిహ్నం.1926లో ఉన్నత విద్యను అందిం చాలన్న గొప్ప సంకల్పంతో మేధస్సు, సంస్కృతి,దేశ నిర్మాణం అనే మÖడు స్థంభాలపై ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. ఇక్కడ విద్యను పూర్తి చేసుకుని బయటకు వెళ్లిన వారు కేవలం ఉద్యోగా లుగా కాదు..వివిధ రంగాల్లో సమాజాన్ని ముందుకు నడిపే నాయకులుగా, మేధావు లుగా, వ్యవస్థలో మార్పు తీసుకువచ్చే బలమైన శక్తిగా నిలిచారు. శతాబ్ది చరిత్ర కలిగిన ఈ స్థాయిలో ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని నేడు మనమంతా చూడగలుగుతున్నామంటే అందుకు పునాదులు వేసిన మహనీయులు డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి గారికి, అందుకు విలువైన సహకారం అందించిన మాజీ ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి,నోబెల్ అవార్డు గ్రహీత సర్ సి.వి.రామన్ మనస్ఫూర్తిగా నమస్సుమాంజ లులు తెలుపుతున్నాను.
జీవితంలో ఎటు వెళ్లాలన్న ఆలోచనలు ఇక్కడే మొదలవుతాయి
ఆంధ్ర విశ్వ విద్యాలయం శతాబ్దకాలం ఎంతో మంది చరిత్రలో నిలిచారు. ఇదే విశ్వవిద్యాల యంలో విద్యాభ్యాసం చేసిన మాజీ ఉపరాష్ట్ర పతి ఉన్నారు. మనం జీవితంలో ఎటువైపు వెళ్లాలి అనే మార్గాన్ని ఎంచుకునే ఆలోచన మనకి యÖని వర్శిటీతో మొదలవుతుంది.ఆగమ్యాన్ని ఎలా చేరుకోవాలనేది మాత్రం స్వశక్తితోనే నిర్ణయించుకోవాలి. మీరు కేవలం విశ్వ విద్యాలయం విద్యార్ధులు మాత్రమే కాదు..ఈ విశ్వ విద్యాలయం భవిష్యత్తు మీరు. ఇక్కడ గడిపే రోజులు మీజీవితంలో ముఖ్య మైన క్షణాలు. మీ ఆలోచనలు తీర్చిదిద్దే అద్భుత క్షణాలు.దేశ భవిష్య త్తుకు మీరే నావికులు.విద్య అంటే పుస్తకాల్లో ఉన్న జ్ఞానం మాత్రమే కాదు.సమస్యల్ని ఎదుర్కో గలిగే ధైర్యం.సరైన నిర్ణయాలు తీసుకునే వివేకం.సమాజానికి ఉపయోగపడే బాధ్యత. సౌతాఫ్రికా అధ్యక్షు నిగా చేసిన నెల్సన్ మండేలా మాటల్లో చెప్పాలంటే ప్రపంచాన్ని మార్చగలిగే అత్యంత శక్తివంతమైన ఆయు ధం విద్య. మీలక్ష్యం కేవలం ప్రతిభ కాదు. మీ ధ్యేయం సమాజ సేవ కూడా కావాలి. మీజ్ఞానం మీ కోసమే కాకుండా, సమాజానికి, దేశానికి ఉపయోగ పడాలి. ఈరోజు ప్రపంచ స్థాయిలో భారత దేశం ఒక బలమైన దేశంగా నిలిచింది.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆత్మ నిర్భర్ భారత్, మేకిన్ ఇండియా,వికసిత్ భారత్ 2047వంటి కార్యక్రమాలు భారత దేశాన్ని స్వయం సమృద్ధి వైపు తీసుకువెళ్తున్నాయి. రాష్ట్రంలోనూ విద్యా, సాధికారత, యువత, అవకాశాలను అంది పుచ్చుకునే ఆలోచనలతో ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తోంది.రాష్ట్రం పునర్నిర్మాణంలో యువతని భాగస్వామ్యం చేసే దశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈమార్పుని సాధించ గలిగేది యువత మాత్రమే. మన భవిష్యత్తుని మన ఆలోచనలే నిర్ణయిస్తాయి. మీ విలువులు, చర్యలే నిర్ణయి స్తాయి.మీ విజ్ఞానం మీ ఆలోచ నలు ఒక పరిష్కార మార్గాలుగా రూపాంతరం చెందాలి. “మీ జ్ఞానం ఆవిష్క రణగా మారాలి. మీ ఆలో చనలు పరిష్కా రాలుగా మారాలి. మీ కృషి సమాజానికి దేశానికి మేలు చేసే అర్థవంత మైన మార్పుగా మారాలి. బలమైన నమ్మకంతో కలలు కనండి.మీ కలల్ని తొక్కుతూ నడుస్తున్న కాళ్లని ఖండించే వరకు కలలు కనండి. నిరం తర కృషి, నిబద్దతతో ముందు సాగండి.
ఏ భావజాలాన్ని గుడ్డిగా నమ్మొద్దు
కారల్ మార్క్స్ లాంటి వ్యక్తులు,నాలాంటి వ్యక్తులు ఎవరు ఏఐడియాలజీ చెప్పినా గుడ్డిగా నమ్మి ప్రభావితం కావొద్దు. ఆ సిద్ధాంతం ఈ కాలానికి సరైనదా?కాదా?భవిష్యత్తుల్లో నిల బడుతుందా? లేదా?అని ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. కేవలం భావోద్వేగాలతో కాకుండా వాస్తవాలు,తర్కం ఆధారంగా ఆలో చించాలి.80,90ల్లో బ్యాలెన్డ్స్ లేని ఐడియాలజీ నమ్మి ఎంతో మంది అడవులకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు.ఏదైనా ఒక ఐడియాలజీ నమ్మే ముందు ధర్మబద్ధంగా ఉందా?రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉందా? దేశ సమగ్రతను కాపాడుతుందా? అని ఆలోచన చేయాలి. మనం ప్రభావితమయ్యే ఐడియాలజీ ఒక వర్గానికి,ఒక కులానికి లేదా ఒక మతానికి మాత్రమే లాభం చేకూ రుస్తూ,మిగిలిన వారిని తక్కువ చేసి చూస్తుంటే అది నైతికంగా సరైనది కాదు అని అర్థం.విశ్వ విద్యాలయాల్లో ఎంతో మంది విద్యార్ధి నాయకులు,రాజకీయ పార్టీ లకు సంబంధించిన విద్యార్థి సంఘాలు ఉం డొచ్చు.వాళ్లు ఏఐడియాలజీ చెప్పినా ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఈ మాటలు పార్టీ పెట్టిన కొత్తలో చెప్పటం లేదు.పార్టీ పెట్టి దశాబ్ధ కాలం తరువాత చెబు తున్నాను. ఎన్నో ఎదురు దెబ్బలు తిని, నలిగిన తరువాత చెబుతున్నాను.ఏదైనా ఒక ఐడియాల జీని నమ్మే ముందు భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని ఒక సమగ్రమైన నిర్ణయా నికి రండి. మీరో విస్పోటనం…ఏదీ అను కుంటే అది జరుగుతుంది దేశం యొక్క అభి వృద్ధి యువత మీద ఆధారపడి ఉంటుంది. వారి శక్తి, ఉత్సాహం, సృజనాత్మకత దేశాభి వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయి. వారిలో న్యూక్లియర్ ఎనర్జీ దాగి ఉంటుంది. తలుచు కుంటే ఒక పెద్ద విస్పోటనం సృష్టించ గలరు. నాలాంటి వాడే సమాజానికి ఇంత చేయ గలిగితే..మీరికెంత చేయగలరో ఆలోచించాలి. ఆసాధన ఫలితాలు ఇస్తుంది.యువత దేశ నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలని, మీలో ప్రతి ఒక్కరు బాధ్యతగల పౌరులుగా ఎదగాలని ఆశి స్తున్నాను” అన్నారు. – జి ఏ సునీల్ కుమార్