కరోనా కట్టడిలో ఆచార సంప్రదాయాలూ మేలే

భూగోళాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని నిర్మూలించే ప్రయత్నంలో అరుదైన ఆరోగ్య ప్రదాలైన సంప్రదాయాల్ని ఓసారి మననం చేసుకోవాల్సి ఉంది. పొద్దు పొడవక ముందే ఆడవారు వాకిళ్ళలో చెత్తాచెదారం ఊడ్చేసి నీళ్ళు కల్లాపి చల్లి పేడతో అలికేవారు. తదుపరి ముగ్గు పిండితో చక్కగా ముగ్గులేసేవారు. ఏటవాలుగా పడుతున్న సూర్యరశ్మితో ఆ ఇల్లు తేజోవంతమై ఆహ్లాదంగా ఆరోగ్యకర వాతావరణాన్ని తలపించేది. నేలపై నీళ్లు చల్లడంతో దుమ్ము కణాలు అణగారి- ఆవుపేడ, సున్నంతోపాటు సూర్యరశ్మి తోడై క్రిమికీటకాలను ఆవాసంలోకి రాకుండా అడ్డుకుంటాయి.

మన దేశం సంస్కృతి,సంప్రదాయాలు, ఆచా రాలకు పుట్టినిల్లు. పూర్వం నుంచి మన వాళ్లు పాటించిన ఆచార సంప్రదాయాల వెనుక మనకు తెలియని ఎన్నో ఆరోగ్య రహస్యా లున్నాయి. పూర్వీకులు ఆచరించిన సాంప్ర దాయక, ఆధ్యాత్మిక ఆచారాల చాటున వెనుకటి మర్యాద మన్ననలే కాదు అవి ఆరోగ్యంతో కూడుకున్నవి. భారతీయ సంప్రదాయాచారాలను కొందరు మూఢ నమ్మకంగా కొట్టి పారేస్తారు. దాని మాటున శాస్త్రీయ విజ్ఞానం ఉందని ఆలోచించే పరిస్థితి ఇప్పుడు నెలకొంది. తీరిక లేని యువతతో పాటు పెద్దలు కూడా నాటి ఆహారపు అలవాట్లు అతిథి మర్యాదలు వంటి పురాతనాచారాలను అవలంబించడంపై శ్రద్ధపెట్టకపోవడంతో అవి కనుమరు గవుతున్నాయి. కరోనా లాంటి మహమ్మారులు సృష్టిస్తున్న కల్లోల సందర్భాల నేపథ్యంలో పూర్వాచారాల అమలుపై దృష్టి పెట్టక తప్పని పరిస్థితి ఏర్పడిరది. ఆచారాలలో దాగున్న శాస్త్రీయత ఆధారంగా పునరాలోచించి తిరిగి ఆచరిస్తే ఫలితముంటుందని ఆయుర్వేద వైద్యులు, ఆధ్యాత్మిక గురువులు సూచిస్తున్నారు. పెళ్లిళ్లు,వేడుకలు, పండుగలు, వాస్తు సంబంధ విషయాలలో తరచుగా కొన్ని పూర్వాచారాలు గోచరిస్తుంటాయి.
సంప్రదాయక ఆరోగ్య సూత్రాలు
వెనకటి పెద్దలు మార్గనిర్దేశం చేసిన మాటలమాటున దాగున్న ఆరోగ్య సూత్రాలు మాత్రమే నేడు అనుసరిస్తున్నాం. నికార్సయిన కొన్నింటిని విస్మరిస్తున్నాం. భూగోళాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని నిర్మూలించే ప్రయత్నంలో అరుదైన ఆరోగ్య ప్రదాలైన సంప్రదాయాల్ని ఓసారి మననం చేసుకోవాల్సి ఉంది. పొద్దు పొడవక ముందే ఆడవారు వాకిళ్ళలో చెత్తాచెదారం ఊడ్చేసి నీళ్ళు కల్లాపి చల్లి పేడతో అలికేవారు. తదుపరి ముగ్గు పిండితో చక్కగా ముగ్గులేసేవారు. ఏటవాలుగా పడుతున్న సూర్యరశ్మితో ఆ ఇల్లు తేజోవంతమై ఆహ్లాదంగా ఆరోగ్యకర వాతావరణాన్ని తలపించేది. నేలపై నీళ్లు చల్లడంతో దుమ్ము కణాలు అణగారి- ఆవుపేడ, సున్నంతోపాటు సూర్యరశ్మి తోడై క్రిమికీటకాలను ఆవాసంలోకి రాకుండా అడ్డుకుంటాయి. సహజంగా స్త్రీలు వంటపాత్రలు శుభ్రం చేసే సందర్భంలో ఎక్కువసేపు నీళ్లలోనే కాళ్లు తడపాల్సి వస్తోంది కాబట్టి కాళ్లకు పసుపు రుద్దుకునేవారు. బ్యాక్టీ రియా సోకకుండా యాంటీ సెప్టిక్‌, యాంటీ బయాటిక్‌ గా పసుపు పనిచేస్తుంది. పెళ్ళిళ్ల లోనూ వధూవరులకు నలుగు పెట్టి పసుపు నీళ్ల స్నానం చేయించడం తెలిసిందే. సాధారణంగా శరీరం నలతగా ఉన్నప్పుడు- వేడినీళ్లలో వాయిలాకు వేసి మరిగించిన నీళ్లతో స్నానం చేస్తే…ఎలాంటి నొప్పులున్నా కాస్తంత ఉపశమనం లభిస్తుంది. అలాగే గోరువెచ్చని నీళ్లలో సున్నిపిండితో స్నానం మంచిదని చెబుతారు. అమ్మవారు (వైరల్‌ ఇన్ఫెక్షన్‌) సోకితే పిల్లలకు క్రిమికీటకాల పీడ వదలడానికి వేపాకుల్ని రోగి చుట్టూ రక్షణ కవచంలా పేర్చడం వంటి ఎన్నో పూర్వాచారాల్ని మరచిపోతున్నాం. మన ఇంటికి అతిథులైనా, బంధువులైనా వచ్చారంటే వెంటనే చెంబుతో నీళ్లు ఇచ్చి స్వాగతించడం ఆనవాయితీ. బయటి నుంచి వస్తారు గనుక కాళ్లు కడుక్కుని లోపలికి రావాలని చెప్పేవారు. చెప్పులు కూడా ఆరుబయట వదిలేయడం అప్పటివారి తప్పనిసరి అలవాటు. తద్వారా క్రిములు లోపలికి రాకుండా జాగ్రత్తలు తీసుకునేవారు. అలాగే వండిన భోజనం వెంటనే తినమని పెద్దలు సూచించేవారు. చల్లారిన పదార్ధంలో క్రిములు చేరతాయని. అప్పట్లో ఆహార పదార్థాల తయారీకి మట్టి,ఇత్తడి,రాగి పాత్రలను ఉపయోగించిన తీరు అద్భుతం. వాటివల్ల పోషకాల నిల్వ పుష్కలంగా సమకూరుతుంది. కాలుష్యం బారిన పడే అవకాశమే లేదు. పర్వదినాల్లో ఇంటి గుమ్మాలకు తప్పనిసరిగా తోరణాలు కట్టేవారు. గతంలో ఇళ్లలో సూక్ష్మ క్రిముల తాకిడికి నివారణగా సాంబ్రాణి పొగ వేసేవారు. హిందూ సంప్రదాయ పండుగల్లో దర్శనమిచ్చే రకరకాల పిండి వంటకాల ప్రత్యేకతల వెనక కొన్ని ఆరోగ్య రహస్యాలు న్నాయి. తెలుగు సంవత్సరాది ‘ఉగాది’ రోజున పచ్చడిలో, శ్రీరామనవమి నాటి బెల్లం పానకం లోనూ శరీరానికి కావాల్సిన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అలాగే దసరా, సంక్రాంతి పండుగ ప్రత్యేక వంటకాల్లో వాడే బెల్లం, నువ్వులు, వాము వంటివి దీని ప్రత్యేకత కలిగి ఉన్నాయి. బతికుంటే బలుసాకు తినొచ్చు నన్న సామెత ఊరకే పుట్టలేదు. పొలాల గట్లమీద, చిత్తడినేలల్లో బలుసాకు అరుదుగా లభిస్తుంది. దీన్ని పల్లెల్లో కొందరు వినాయక చవితి సమయంలో పులుసుగా, పప్పుతోనో వండుకుని తినడం అలవాటు. దీన్ని పచ్చడిగా తింటే అతిసారం తగ్గించడానికి, ఆకలిని పెంచడానికి తోడ్పడుతుంది. ఆషాఢమాసంలో పెట్టుకునే గోరింటాకు శరీరంలో వేడిని తొలగించి ఒత్తిడిని జయిస్తుంది. పూర్వం ఆదివాసులలో సామాజిక దూరం కాస్త కఠినంగా ఉండేది. ఆడపిల్లలు రజస్వల అయితే ఇంటికి దూరంగా ఉంచేవారు. ఏ పద్ధతి పాటిం చిన మానవతా దృక్పథంతో కూడి ఉండేవి. ఆ కాలంలో జనసమూహంలో ఎవరైనా తుమ్మినా అపచారంగా భావించేవారు. దాని చెడు ప్రభావం దృష్ట్యా కొన్ని సామాజిక దూరాలు పాటించేవారు. అలాగే అశుభాలకు సంబంధించిన ఆచారాల్లోనూ అదే జాగ్రత్త కనిపించేది. క్షౌరశాలకు, అంత్య క్రియలకు వెళ్లి వస్తే దేన్నీ తాకకుండా స్నానం చేశాకే ఇంట్లోకి వెళ్లడం అప్పటి సంప్రదాయం. వ్యాధులు సంక్రమించకుండా ఓ జాగ్రత్తగా ఇది సూచించేవారు. పురుళ్ల విషయంలోనూ ఇలాంటి జాగ్రత్తలు ఉండేవి. మైల, అంటు వంటివి పాటించడంతో ఆరోగ్యమే ప్రధాన లక్ష్యం. వాటిని మూఢాచారాలుగా మార్చేసిన కొందరి వల్ల అటువంటి పద్ధతులపై విరక్తి, అనాసక్తి ఏర్పడ్డాయి. అందులోని శాస్త్రీయతను ఆరోగ్య సూత్రాలను కొట్టిపారేయలేం. మానవత్వానికి మచ్చలేని విధంగా ఆనాటి సంప్రదాయాలను పాటించడం, అనుసరించడం నేడు చాలా అవసరం.
ఇవీ ఆరోగ్యకారకాలే
వేకువ జామునే ‘సూర్యనమస్కారాలు’ చేయడం వల్ల శారీరక దృఢత్వం చేకూరటమే గాక శరీరానికి కాంతి కిరణాలు సోకి విటమిన్‌ ‘డి’ సమకూరుతుంది. వ్యక్తులు తారసపడితే చేతులు జోడిరచి నమస్కరించడం ఎంతో ఆరోగ్యకరం. నమస్కరించడంలో రెండు చేతుల వేళ్లు కలిసిపోయి ఆక్యుప్రెషర్‌ జరిగి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెదడు పనితీరూ మెరుగవుతుంది. నుదుటన కుంకుమ బొట్టు ధరించడం హైందవ ఆధ్యాత్మికతకు ప్రతీకనే గాక నుదురులోని నాడులు ఉత్తేజితమై ప్రశాంతత కలుగుతుంది. ఏకాగ్రతతో కూడిన మానసికోల్లాసం ఉట్టిపడుతుంది. పీయూష గ్రంథి ప్రేరేపించబడుతుంది. దీంతో రక్తపోటు, ఒత్తిడి, ఆందోళన వంటివి క్రమంగా తగ్గుతాయి. గుడిలో దైవాన్ని ప్రసన్నం చేసుకునే ముందు గంటలు కొట్టడం ఆధ్యాత్మి కాచారం. గంట మోగించడంతో ఆ ప్రాంతం లో ఓంకార ధ్వని విస్తరించి గాలిలో ఉండే (సూక్ష్మ) క్రిములు నశిస్తాయి. సద్దుల బతుకమ్మ సంస్కృతిలో ఆడపడుచులు సత్తుపిండి పంచిపెట్టడం వెనుక పోషకాల లేమి ఉండ కూడదనే ఆచారం వాడుకలో ఉంది. వీటిని మనం మరిచిపోయాం.ఇంటిలోకి విస్తారంగా గాలి, ధారాళంగా వెలుతురు ప్రవేశించేందుకు వాస్తు పండితులు తగు ప్రణాళికను సూచిస్తుంటారు. కిటికీల ద్వారా చల్లని గాలి (ఆమ్లజని) ప్రవేశిస్తూ, వెంటిలేటర్ల ద్వారా వేడి గాలి (బొగ్గు పులుసు వాయువు) బయటికి వెళ్ళడం వల్ల చల్లటి ఆహ్లాద వాతావరణం. చక్కటి ఆరోగ్యం సిద్ధిస్తుంది. సూర్య కిరణాలు గదులలోకి ప్రసరిస్తే క్రిమి కీటకాలు నశిస్తాయి. పెద్దలు సూచించిన ‘చద్దన్నం’ శరీరానికి చలువ కలిగించడమే గాక కడుపులో అల్సర్లు రాకుండా అడ్డుకుంటుంది. నేలపై చాప పరిచి కూర్చోని భోంచేయడం’ మన సదాచారం. ఇలా చేయడం వలన జీర్ణక్రియ సక్రమంగా జరిగి, అజీర్తి సమస్యలు సమసిపోతాయి. భోంచేసేటప్పుడు కూర్చోవడానికి బాసుపీటలు ఉపయోగిస్తే కాళ్ల నొప్పులు రావు. అరిటాకు భోజనం చాలా శ్రేష్టమైనది. అరిటాకు ద్వారా ఆహారంలోని పోషకాలు యధాతధంగా శరీరానికి చేరతాయి. ఇది కాలుష్యరహితమైనదిగా గుర్తించాలి. పూర్వం రోజుల్లో భోజనం చేయడానికి మోదుగాకులు లేదా పారెటాకులతో చేసిన విస్తరాకులను వాడేవారు. అప్పట్లో మట్టి, రాగి, కంచు పాత్రల్లో భోజనం చేసిన తీరు అద్భుతం. ముఖ్యంగా కంచు పళ్ళెంలో ఆహారం భుజిస్తే జీర్ణశక్తి, మేధోశక్తి పెరుగుతుంది. ఉదరంలో ఆమ్లత్వం గాఢత తగ్గుతుందని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు. కరోనా ముప్పు నుంచి తప్పించుకోవాలంటే ఆ తరం అలవాట్లను కొంతమేరకైనా ఒంటపట్టించుకోవాల్సిందే. విలువలతో, శాస్త్రీయతతో కూడిన మరిన్ని ఆచారాలపై భవిష్యత్తరాలకు తెలిసేలా ‘పాఠ్యాంశం’ గా ప్రవేశ పెడితే సమాజ ఆరోగ్యం, నైతిక విలువలు పెంపొందుతాయి.- గుమ్మడి లక్ష్మినారాయణ

ఆదివాసులకు పోడు భూములు అందని ద్రాక్షేనా

’పోడు భూముల సమస్య ఎక్కడ లేకుం డా ఉంది?ఖమ్మంలో ఉంది. వరంగల్‌లోఉంది. నిజామాబాద్‌లో ఉంది. 60ఏండ్లుగా ఈపెద్ద మను షులు దీనికి పరిష్కారం చూపలేదు. మేము కొంత వరకు చేశాం. కానీ వచ్చే టర్మ్‌లో ఈ పోడు భూ ములు, గిరిజన భూముల స్టోరీ ఎక్కడోకాడ అయి పోవాలి. అడవుల నరికివేత ఆగాలి. సాగు చేసుకున్న వాటికి హక్కులు రావాలి. తప్పకుండా ఈ పోడు భూములు దున్నుకునే వారికి పట్టాలి ప్పించి వారి హక్కులు కాపాడతాం. నేనే వచ్చి ఆ పని చేయిస్తా’’. ఇది 2018 డిసెంబర్‌లో కుమ్రం భీం-ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూరు నియోజకవర్గానికి ఎన్నికల ప్రచారానికి వచ్చిన సందర్బంగా సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ. కానీ జరుగుతున్నదేమిటి?
మోసమంటే తెలియని అమాయక గిరిజ నులకు సొంత ఆస్తి అంటూ ఉందంటే అవి పోడు భూములు మాత్రమే. కానీ ఇప్పుడు ఈ భూములపై పాలకుల కన్ను పడిరది. మోకాలికి బోడు గుండుకు ముడిపెట్టినట్టు అటవీ విస్తీర్ణం తగ్గిపోయిందని, దాన్ని పెంచడానికి పోడు భూముల్లో మొక్కలు నాటడానికి అటవీ శాఖాధికారులు ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి టీఆర్‌ఎస్‌ అధికారంలోకొచ్చాక ప్రభుత్వం హరితహారం పేరుతో పోడు భూముల్లో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అటవీ భూముల చుట్టూ కందకాలు తవ్వి గిరిజను లకు వెళ్లనీయకుండా చేస్తోంది. ఐదారేండ్లుగా పోడు భూముల వివాదం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. ప్రతి ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ ప్రారం భంలో అటవీ అధికారులు పోడు భూముల్లో సాగును అడ్డుకోవడం, గిరిజనులు ప్రతిఘటించడం జరుగుతోంది. కానీ రెండేండ్లుగా పోడు భూముల వ్యవహారం తారా స్థాయికి చేరింది. తమ భూము ల్లోకి వచ్చిన అటవీ శాఖాధికారులను గిరిజనులు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు.
పోడుతోనే అటవీ విస్తీర్ణం తగ్గుతోందా?
గిరిజనులు పోడు వ్యవసాయం చేయ డంతో అడవులు తగ్గిపోతున్నాయని ప్రచారం ఉంది. కానీ ఇందులో ఏమాత్రమూ వాస్తవం లేదు. విసిరేసినట్టు ఉండే గిరిజనగూడాల్లో పదుల సంఖ్య లోనే ఆవాసాలుంటాయి. వారు మహా అయితే పది ఇరవై ఎకరాల్లో పోడు సాగు చేస్తుంటారు. కానీ వారు ఆ ప్రాంతంలో ఉండడం చేత అటవీ సంరక్షణకు ఎంతగానో తోడ్పడుతుంటారు. కానీ పాలకులు గిరిజనులతోనే అడవంతా నాశనమవు తున్నట్టు వారిపై నిందలు మోపుతుంటారు. అనాదిగా అటవీ సంపదపై ఆధారపడి జీవనం సాగిస్తున్న గిరిజనులు అటవీ ఫలాలు అను భవిస్తూనే అడవులను సంరక్షిస్తున్నారనేది ముమ్మాటికీ వాస్తవం.
కలప స్మగ్లర్ల సంగతేంటి?
అడవుల విస్తీర్ణం నానాటికీ తగ్గిపో తోందన్నది జగమెరిగిన సత్యం. అయితే దీనికి ప్రధాన కారణం కలప రవాణానే అనేది అందరికీ తెలిసిందే. కానీ ప్రభుత్వం అసలు విషయాన్ని పక్కనబెట్టి పోడే కారణమని అసత్య ప్రచారం చేస్తోంది. అటవీ విస్తీర్ణం పెంచడానికి పోడు భూ ముల్లో మొక్కలు నాటడానికి యత్నిస్తోంది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలప రవాణా చేస్తూ పట్టుబడిన ఘటనలు రోజూ ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి. ఈవార్తలు లేకుండా దినపత్రికలు వెలువడవని రోజుండదంటే అతిశ యోక్తి కాదు. దీనికి రాజకీయ అండదండలు, ఇంటి దొంగల సహకారం పుష్కలంగా ఉంటోంది. ఇలా వాస్తవాలను మరుగునపడేసి ప్రభుత్వాలు అటవీ విస్తీర్ణం పెంచడానికి గిరిజనులనే సమిధులుగా చేయడం ఆక్షేపణీయం. ఇప్పటికైనా గిరిజనులు కొండకోనల్లో ఉండడంతోనే అడవులు రక్షింపబడ తాయని తెలుసుకోవాలి. వారికి న్యాయం బద్ధంగా పోడు భూములకు హక్కు పత్రాలిచ్చి బతుక్కు భరోసా కల్పించాలి. ఈ విషయంలో వామపక్షాలు నిరంతరంగా పోరాడుతూనే ఉన్నాయి.
– రాపర్తి దత్తాత్రి

ఆదివాసుల ఆపన్న హస్తం సమత సంస్థ

విపత్తులు సంభవించినప్పుడు ప్రభుత్వ యంత్రాంగంతో పోటీపడి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించే శక్తి ఎన్‌జీఓ లకు ఉందని సమత నిరూపిస్తోంది. విశాల మైన సామాజిక దృక్పథంతో కరోనావ్యాప్తి లాక్‌డైన్‌ సమయంలో అన్నార్తులకు అండగా నిలిచింది. నిబద్ధతతో సంక్షేమ కోణంలో సేవ లందిస్తున్న సమత సేవలను అటు విశాఖ స్మార్ట్‌ సిటీ మురికివాడ ప్రజలు ఇటు గిరిజ నులు ప్రశంసలు కురిపిస్తున్నారు. బొర్రా గ్రామ పంచాయతీ సర్పంచ్‌ జన్నిఅప్పారావు అధ్యక్ష తన, జరిగిన పంపిణీ బహిరంగసభకు సమత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శ్రీ రెబ్బప్రగాడ రవి ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు. ప్రజలు మహ మ్మారి కరోనావల్ల టూరిజం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న వారి కుటుం బాలు దయ నందన పరిస్థితులను ఎదుర్కొంటు న్నారన్నారు. ఈరకంగా నేను ఈసేవ చేయడం సంతోషంగా ఉందన్నారు. సర్పంచ్‌ జన్ని అప్పారావు మాట్లా డుతూ ఈకరోనా సమయంలో సమత సేవలు మరువలేనిది అంటూ అభినందన తెలిపారు. కరోనా మహమ్మారి పుణ్యమా అని ఎంతో మంది ప్రజలు ఉపాధి లేక ఆకలితో ఇబ్బంది పడుతున్న సమయంలో సమత ముందుకు వచ్చి పేద ప్రజల ఆకలి తీర్చిడం వారికి రుణపడి ఉంటామన్నారు. ఈ పంచాయితీలో సుమారుగా 500 మంది పేద తెల్లరేషన్‌ కార్డు కలిగిన కుటుంబాల వారికి సుమా రుగా 1800 వందల రూపా యలు విలువ చేసే నిత్యావసర వస్తువులు ఒక్కొకరికి పంపిణీ చేయడం జరిగింది. ఈసందర్భంగాబొర్రా పంచాయితీ సర్పంచ్‌ జన్నిఅప్పారావు 14 గిరిజనగ్రామాల తరు పున సమత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రెబ్బా ప్రగడ రవికి పుష్పగుచ్ఛాలిచ్చి ఘనంగా సత్క రించారు. తర్వాత మైనింగ్‌ పోరాట యోధులుగెమ్మెల దేవకుమర్‌, స్వర్గీయ దోనేరు రాము సతీమణి దొనేరు పోల్లు గార్లను రవిగారి చేతుల మీదగా ఘనంగా సత్కరిం చారు. కార్యక్రమంలో గ్రామప్రజలు, వార్డ్‌ నెంబర్స్‌ గైడ్‌ యూనియన్‌ సభ్యులు పాల్గొ న్నారు. విశాఖనగంర మురికివాడ ప్రాంతాలు, జిల్లా గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో సుమారు రూ.50లక్షలతో సుమారు మూడు వేల మంది కుటుంబాలకు నిత్యావసర సరకులు పంపిణీ చేసింది.
సమతకు కృతజ్ఞతలు -జన్ని అప్పారావు, సర్పంచ్‌,బొర్రా పంచాయితీ
గిరిజన పేదప్రజల ఆకలి తీర్చే నిత్యావసర సరకులు ఐదువందల కుటుంబాలకు పంపిణీ చేసిన సమత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రెబ్బాప్రగడ రవికి కృతజ్ఞతలు.యావత్‌ భారతదేశ ఆదివాసీ తెగలన్నీ సమతకు రుణపడి ఉన్నాయి. రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా తమ ప్రాంతాల్లో ఉన్న వనరులు పరిరక్షణకు సమత తీర్పు మాకు వజ్రాయుధం లాంటి తీర్పుకు రవి చేసిన పోరాటం గిరిజన భావితరాలకు స్పూర్తిదాయకం.
కందుకూరి సతీష్‌ కుమార్‌

ప్రకృతి సహజీవనమే పర్యావరణ పరిరక్షణ

పంచభూతాత్మకమైన అనంత సృష్టిలో మానవుడు ఒకభాగం, అంతే కానీ తానే సర్వస్వం కాదు, సృష్టికి ప్రతి సృష్టి చేయా లనే ఆలోచనలు వినాశనానికి దారి తీస్తాయి అనే విషయాన్ని మనం చరిత్ర నుండి గ్రహించవచ్చు. పంచభూ తాత్మకమైన ప్రకృతిలో విలీనం కానీ ఏ పదార్థమైనా అది పర్యావరణానికి సమస్యగా మారుతుంది. ఈరోజు మానవుడు తన అవసరాల కోసం కొండల్ని గుట్టల్ని తొలిచేసే సమతలం చేస్తూ అడవుల అన్నిం టిని సమూలంగా నరికివేస్తూ భూమాతను సంపదవిహీనంగా చేస్తున్నాడు, భూగర్భ జల ప్రవాహాలను వాటి సహజ మార్గాలను మార్చివేసి తనకు అనుగుణంగా మళ్ళించి వేస్తున్నాడు. భూగర్భ జలాలను అడు గంటించేస్తున్నారు దాని కారణంగా ఈ రోజున మంచినీటి కటకట ఏర్పడుతున్నది. అత్యంత విస్తృతమైన ప్రకృతి వనరులను తన గుప్పెట్లో బంధింప చూస్తు న్నాడు. తనకు తానే సర్వశక్తిమంతుడైన సృష్టి స్థితి లయ కారకుడు అని భావించు కుంటున్నాడు. ఇది ప్రకృతి ప్రకోపించనంత కాలం సాగుతుంది ఎప్పుడైతే ప్రకృతి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటుందో అప్పుడు సృష్టిలోని ఈ మానవమాత్రుడిన్ని ఎవరు రక్షించగలరు? అందుకే భారత దేశంలో ఏకాత్మతా అనుభూతి చెందే జీవనము రచించబడిరది. ప్రకృతి అనుకూల జీవన విధానంతో ప్రకృతిని కాపాడు కుంటూ వస్తోంది. దాని నుంచి బయట పడటం దానికి విరుద్ధంగా వ్యవహరించటం అనేక సమస్యలకు దారి తీస్తుంది. ఈరోజు కాలుష్యం కానీ పంచ భూతాలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచిస్తే అన్నీ కాలుష్యంతో నిండిపోయాయి. ఈ పరిస్థితి నుంచి బయట పడేందుకు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ చెయ్యాలని నినాదం చేస్తున్నారు. కానీ ప్రకృతి అనుకూలంగా జీవించాలనే మాట చెప్పడం లేదు. ప్రకృతికి అనుకూలమైన జీవనం లోకి మానవుడు ఎప్పటివరకైతే మారడో అప్పటి వరకు ఏవో సమస్యలు వచ్చి పడుతూనే ఉంటా యి. ఈరోజు జల సమస్య చాలా తీవ్రంగా ఉంది నదులు సజీవనదులుగా కనబడటం లేదు. ద్వాపర యుగ అంతంనుండి త్రివేణి సంగమం లోని సరస్వతి నది లుప్తం కావటం ప్రారంభమై ఇప్పుడు అంతర్వాహినిగా కనబ డుతున్నది ఇట్లా అనేక నదులు ఆ దిశలో ఉన్నా యి కాబట్టి నదులను,వాగులు,వంకలను కాపాడు కోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈ దిశలో చేయవలసిన ప్రయత్నం అందరూ చేయాలి. అందుకే మనం ప్రతి రోజు పర్యావరణ పరిరక్షణ గురించి ఆలోచి స్తుంటాం. అది మన జీవితంలో ఒక భాగము. అదే పాశ్చాత్య దేశాలలో సంవ త్సరంలో ఒకరోజు పర్యావరణ పరిరక్షణ అనే నినాదం చేస్తారు. పర్యావరణ విద్వంసం చెయ్యి దాటిపోయే పరిస్థితులలో ప్రపంచ దేశాలు 1974 వ సంవత్సరం ప్రపంచ సదస్సు ఏర్పాటు చేసి ప్రతి సంవ త్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం కార్యక్రమము చేస్తుంది. కరోనా ప్రపంచంలో విలయ తాండవం చేస్తున్న ఈ సమయంలో 47వ ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకొంటున్నాం. ఈ సంవత్సరం, ప్రకృతి తో సంబంధాలనుతిరిగి పునరుద్ధరించు కోవటంపై దృష్టి కేంద్రీ కరించబడిరది. 2021-2030 దశాబ్దం యుఎన్‌ లాంఛనం గా వాతావరణ సంక్షోభంపై పోరాడటానికి, ఒక మిలియన్‌ జాతుల నష్టాన్ని నివారించు కోవటానికి, మరియు ఆహారభద్రత, నీటి భద్రతా,జీవనోపాధిని పెంచడానికి క్షీణించిన నాశనం చేయబడిన పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరణనులక్ష్యంగా పెట్టుకొన్నది. మనదేశంలో కూడా గడిచినరెండు దశాబ్దాల నుండి ప్రకృతి వ్యవసాయం పై దృష్టి సారించి ఇప్పుడుదేశ వ్యాప్తంగా ఆచరణ లోకి తీసుకోని వస్తున్నది.కొద్దీ సంవత్సరాల పూర్వం దేశ వ్యాప్తంగా విశ్వమంగళ గోగ్రామ యాత్ర జరిగింది దానితో గో ఆధారిత వ్యవ సాయం ఊపు అందుకొంది,దాని కొనసాగింపు గానే, ఈ మధ్యనే భూమిసంరక్షణ, భూమిసు పోషణ,దిశలో పెద్దఎత్తున దేశమంతా ఒక ఉద్యమం ప్రారంభమైనది. ఇట్లా మన దేశంలో అనేక ప్రయత్నాలు దేశవ్యాప్తంగా మొదలైయి నాయి. నీటి సంరక్షణపై అవగాహన పెంచటా నికి ఆ నీటి వనరులను కాపాడు కోవటానికి ప్రజలను జాగృతం చేయటానికి ఇండియన్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటి) మద్రాస్‌ ‘రివర్స్‌ ఆఫ్‌ ఇండియా’ అనే మ్యూజిక్‌ వీడియో ను విడుదల చేసింది. భారతదేశంలోని 51 నదులుపేర్ల ఆధారంగా ఆ వీడియో తయారు చేయబడిరది. ఆ వీడియోలో పెరుగుతున్న జనాభాపై,నదులను కాపాడుకోవటంపై, నీటి వనరుల దోపిడీ దాని పర్యవసానాలపై, కథనం సాగుతుంది. పర్యా వరణ వ్యవస్థల విస్మరణపై హెచ్చరిస్తుంది. ఈ రంగంలో అత్యాధునిక పరిశోధనలను చేయటానికి కేంద్రం యొక్క నిబద్ధతను హైలైట్‌ చేస్తుంది.
పర్యావరణానికి తగిన గౌరవం, విలువ ఇస్తున్నామా?

ప్రపంచ పర్యావరణ దినోత్సవం అనే పేరుతో ఈ సంవత్సరం దీనిని ‘‘పర్యావరణవ్యవస్థ పునరుద్ధరణ ‘‘(జుషశీంవర్‌వఎ Rవర్‌శీతీa్‌ఱశీఅ) అన్ననినాదంతో జరుపుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామికీకరణ నేపధ్యంలో గ్లోబల్‌ వార్మింగ్‌ పెరగటంవల్ల అనేక సమస్యలు కలుగుతున్నాయి.అభివృద్ది చెందాము అని చెప్పుకునే దేశాలు తమ విధానాలవల్ల జరుగు తున్న నష్టాన్ని పట్టించుకోకుండా మాత్రం ప్రపంచానికి సుద్దులు చెపుతుంటాయి. అవి చేసే పర్యావరణ నష్టాన్ని , ఇతర దేశాల భుజాలపైకి తోసే ప్రయత్నం చేస్తున్నాయి. ఇదంతా ఒక పార్శ్వం అయితే,దేశాల అనాలో చిత నిర్ణయాల వల్ల కూడా ఈ సమస్య ఉత్పాతంగా మారే ప్రమాదం ఏర్పడుతోంది. నిజమే ప్రపంచం ఇప్పుడు సరిదిద్దుకోకపోతే తరువాత సరిదిద్దుకుందామనుకున్నా కుదరనంత చిక్కుల్లోకి పోయే పరిస్థితి ఏర్పడిరది . ఇటు వంటి విషమ పరిస్థితుల్లో ‘‘విశ్వగురువు‘‘ భారత దేశమే ప్రపంచానికి దారి చూపగలదు. పర్యావరణ పరిరక్షణలో రెండు ప్రధాన సమస్యలు మనకు కనపడతాయి. ఒకటి ప్రభుత్వ కార్యక్రమాలు, వాటి నిర్వహణ. రెండోది ప్రజల భాగస్వామ్యం. జపాన్‌,సింగాపుర్‌ వంటి దేశా లలో పరిశుభ్రత చాలా కచ్చితంగా పాటిస్తారని చెప్పుకుంటూ ఉంటాం. మరి మన దేశం గురించి వేరే దేశస్థులు ఏమి ఆలోచిస్తారో మనం కూడా చూసుకోవాలి కదా. మొదట మనం ఎన్నుకున్న ప్రభుత్వం ఏమి చెపుతోందో తెలుసుకుని, మన వంతుగా ఏమి చేయాలో ఆలోచించాలి . ప్రభుత్వం ఏమి చేస్తోంది 2014 లో ప్రధాని మోదీ శౌచాలయపు ప్రాధా న్యతను ఏకంగా ఎర్రకోట పై నుంచే చెప్పారు. ఆ తరువాత దేశవ్యాప్తంగా ఉద్యమస్థాయిలో శౌచలయాల నిర్మాణం జరిగింది. 2019లో తిరిగి ప్రధాని పీఠం ఎక్కిన తరువాత మొదలు పెట్టిన కార్యక్రమాలలో ‘స్వచ్చ భారత్‌ అభియాన్‌ ‘మొదటిది. అక్టోబర్‌ 2న గాంధీ జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతూ పర్యావరణ పరిరక్షణలో మొదటి మెట్టు స్వచ్చమైన పరిసరాలు అంటూతానే స్వయంగా చీపురు అందుకొని మొదలు పెట్టారు. ఈ స్వచ్చ భారత్‌ అభియాన్‌ ఒక ఉద్యమంగా మొదలై 2019 నాటికి బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన పూర్తిగా అరికట్టాలని లక్ష్యంతో పని చేసి దాదాపు 94%లక్ష్యం 2019లో మిగిలిన 6%తరువాతి కాలంలో సాధించ కలిగారు (ఈవెబ్‌ సైటు చూడవచ్చు ష్ట్ర్‌్‌జూం://ంషaషష్ట్రష్ట్రపష్ట్రaతీa్‌.ఎవస్త్రశీఙ.ఱఅ). అదే విధంగా ‘నమామి గాంగే‘ అన్న నినాదంతో గంగానది పరీవాహక ప్రాంతాలలో వ్యర్ధాల నిర్వహణ,కాలుష్య నివారణ,శుద్దీకరం వంటి అనేక కార్యక్రమాలను మొదలుపెట్టారు. అలాగే షaఎజూa aష్‌ ద్వారా అటవీ భూమిని ఎంత వాడుతాము అంత తిరిగి మళ్ళా అడవిని తయారు చేయటానికి అవసరమైన నిధులను తప్పని సరిగా సిద్దం చేసే చట్టాన్ని రూపొందిం చారు. దాదాపు రూ.95వేలకోట్ల నిధి సిద్దం చేశారు. పర్యావరణ రక్షణ ఒక నినాదంగా మిగిలి పోకుండా అది ఒకవిధానంగా మారేం దుకు అవసరమైన నిపుణతలను పెంచేందుకు Gతీవవఅ ూసఱశ్రీశ్రీ ణవఙవశ్రీశీజూఎవఅ్‌ ూతీశీస్త్రతీaఎ ను ంసఱశ్రీశ్రీ ఇండియాలో ఒకభాగంగా చేశారు. ఇది ఒకమంచి కార్యక్రమం ఈ వెబ్‌ సైటు ను చూడండి ష్ట్ర్‌్‌జూ://షషష.స్త్రంసజూ-వఅఙఱం. స్త్రశీఙ.ఱఅ).ప్రభుత్వం ఈపర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగానే కర్బన ఉద్గారాలను (షaతీపశీఅ వఎఱంంఱశీఅం) తగ్గించే ఉద్దేశ్యం తోనే దాదాపు పునరుత్పాదక వనరులు (తీవఅవషaపశ్రీవ వఅవతీస్త్రవ ంశీబతీషవం) అయిన సౌర శక్తి, వాయు శక్తి వాడకాన్ని ప్రోత్సహి స్తోంది. ఎలెక్ట్రిక్‌ వాహనాలు,భారత్‌ 6’ నిబం ధనలకు అనుగుణమైన వాహనాల తయారీ వంటి చర్యలు చెప్పట్టింది. ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా నిరోధించేవిధంగా గట్టి అడుగులే పడుతున్నాయి. ప్రభుత్వం వైపు నుంచి ఈ ప్రయత్నాలు జరుగుతుంటే మరి ప్రజల భాగ స్వామ్యం ఏమిటీ??
ప్రజల భాగస్వామ్యం
పర్యావరణ స్పృహ భారతీయ సంస్కృతిలో ముఖ్యమైన అంశం. మనం జరుపుకొనే ప్రతీ పండుగలో ఏదో ఒక ప్రకృతి సంబందంమైన అంశాలు ఉండటం మనం గమనించవచ్చును. అసలు మన మొదటి పండుగ యుగాది అంటేనే ప్రకృతి క్రొత్తచివురులుతొడగటం. ఆయా ఋతువులో ఏర్పడే ఆయా మార్పులను అర్ధంచేసుకొని పండుగలు జరుపుకోవడం మనకు తెలిసిన విషయమే. మరి ఇప్పుడు ఏమి జరుగుతోంది? తడిచెత్త, పొడిచెత్త వేరు చేసి ఇవ్వమని ఉచితంగా పచ్చనిరంగు, నీలి రంగు డబ్బాలులు ఇస్తే,నగరంలో కేవలం 25% మాత్రమే వాటిని వాడుతున్నారని తెలుస్తోంది. 5000 టన్నుల చెత్తనుతడి,పొడి విభజన చేయడం అసాధ్యమని, దానివల్ల ఎంతో కాలు ష్యం కలుగుతోందని ఒక మునిసిపల్‌ అధికారి వెల్లడిరచారు. నిజానికి అది ఇళ్ళలో వారికి చాలా చిన్న పని. ఇంటిలో చెత్తని తడి, పొడిగా విభజించి పారిశుద్ధ్య విభాగానికి ఇస్తే చాలు. ఇంత సులభమైన పని కూడా మనం చేయలేమా? భారతీయులు తమ మూల విధా నాలకు విలువ ఇస్తూ, ప్రకృతి తో మమేకమయ్యే అవసరం ఇప్పుడు చాలా కనిపిస్తోంది. మనం వ్యక్తిగత పరిశుభ్రతతో మొదలుపెట్టి, ఇల్లు, వీధి,గ్రామం,జిల్లా,రాష్ట్రం, దేశం ఇలా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళితే మన జీవిత కాలం లో ఏదో ఒకచిన్న సకారాత్మక మార్పునైనా చూడగలుగుతాము. పారిశ్రామిక కాలుష్య నివారణ,షaర్‌వ ఎaఅaస్త్రవఎవఅ్‌ మొదలై నవి ప్రభుత్వపు పనులేనని భావించకుండా మనం చేయాల్సిన పని మనం చేద్దాం. మన దైనందిన అంశాలలో మొట్ట మొదటగా ప్రారంభించాల్సిన విషయం, పర్యావరణ కాలు ష్యాన్ని తగ్గించడం కోసం మీ ఇంటి పరిసరా లను పరిశుభ్రంగా ఉంచుకోవటం. ఇంట్లోని చెత్తను తడిచెత్త, పొడిచెత్తగా తప్పనిసరిగా విభజించడం. ప్లాస్టిక్‌ వినియోగాన్ని బాగా తగ్గించడం. ప్రకృతి అందించే సౌరశక్తి, వాయు శక్తిని ఎక్కువ వినియోగంలోనికి తెచ్చుకోవడం. వీలైనంత వరకు సేంద్రీయ విధానం వైపుకు మారటం. జ్యూట్‌,కొబ్బరి,గుడ్డలతో తయారు కాబడ్డ సంచీలు,తాళ్ళు, ప్రకటన వస్తువుల ఉపయోగాన్ని పెంచటం. తమ తమ పరిధి మేర ఎంతో కొంత స్వచ్చ భారత్‌ అభియాన్‌ వంటి కార్యక్రమాలలో పాలు పంచుకోవటం. ఇలా అనేక చిన్న చిన్న విషయాలతో మొదలు పెట్టి దేశం కోసం స్వంత లాభం కొంత మానుకుని, మన భావితరాలకి మంచి పర్యా వరణాని అందించడం కోసం మనవంతు ప్రయ త్నం చేయకపోతే ముందు ముందు ఎన్ని ఉత్పా తాలను చూడాలో ఈ రెండు సంవత్సరాలలో బాగా అర్ధమయింది.
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి మనిషి తనవంతు ప్రయత్నంగా మొక్కలు పెంచే ప్రయ త్నం చేయాలి. ఎందుకంటే, ప్రకృతిలో సహజం గా పెరిగిన ఎన్నో చెట్లను మనిషి తనకోసం తొలగిస్తున్నారు. అందువలన మనిషి మరలా అటువంటి చెట్లు తయారుకావాలంటే సంవత్సరాల కాలం పడుతుంది. ఇంకా వాతా వరణం అనుకూలంగా లేకపోతే నాటిన ప్రతి మొక్క చెట్టుగా మరే అవకాశం తక్కువ. కాబట్టి వీలైనన్ని మొక్కలు పెంచడానికి ప్రతివారు కృషి చేయాలి. పర్యావరణ పరిరక్షణలో చెట్లు చాలా కీలకమైనవి.సమాజంలో పర్యావరణ పరిరక్షణ అంటూ అనేక నినాదాలు సంవత్సరాలుగా వస్తున్నాయి. పర్యావరణంలో చెట్ల యొక్క ప్రాముఖ్యతను సమాజంలో పెద్దలు గుర్తించారు. కానీ నరుకుతున్న చెట్లు, ఒక్కరోజులో పెరిగినవి కావు. ఏళ్ల నాటి నుండి మొక్కలుగా పెరిగి, పెరిగి చెట్లుగా ఎదిగి పెద్ద పెద్ద వృక్షాలుగా మారాయి. అటువంటి చెట్లు తొలగించే సమయానికి ఒక చెట్టుకు కనీసం పది మొక్కలు నాటి, వాటిని పెంచే ప్రయత్నం చేస్తే, అటువంటి చెట్లు భవిష్యత్తులో మానవ మనుగడకు అవసరమైనన్ని తయారు కాగలవు. మొక్కలు పెంచడానికి ఎవరికి మినహాయింపు లేదని ప్రతి ఒక్కరూ గుర్తించాలి.మనిషి మనుగడకు గాలి అవసరం. అలాగే నీరు అవసరం. నేడు చెట్లు తక్కువగా ఉండడం వలన పర్యావరణ సమతుల్యత తగ్గి వానలు సరైన సమయానికి రావడం లేదనే వాదన బలంగా ఉంది. వానలు సమృద్దిగా కురిస్తే, నీరు పుష్కలంగా ఉంటుంది. తగినంత నీరు ఉంటే, తగినంత పంటలు పండుతాయి. తగి నంత పంటలు పండితే, తగినంత ఆహార పదార్ధాలు లభిస్తాయి. శ్రమజీవులకు ఆహారం అందుతుంది. నేటి సమాజం శ్రామిక జీవుల పైనా, రైతులపైనా ఆధారపడి ఉంది.
నీటి దుర్వినియోగం పర్యావరణానికి చేటు
గత కాలంలో నీరు భూమిపై మాత్రమే ప్రవహించేది. అందువలన నీరు అయితే భూములోకి ఇంకేదీ. లేకపోతే ఎండలకు నీరు ఆవిరిగా మారి ఆకాశంలో మేఘంగా మరి మరలా భూమిపైకి వర్షించేది. ఇలా ఒక సహజమైన క్రమం జరుగుతూ ఉండేది. కానీ నేటి రోజులలో నీరు ప్రవహించేది గొట్టాలలో` వివిధ రకాల గొట్టాల ద్వారా వివిధ విధాలుగా నీటి మళ్లింపు జరుగుతుంది. అందుకోసం ఆకాశం నుండి కురిసే వానలు చాలక భూమి లో నీటిని పైకి తీసుకురావడం కూడా జరుగు తుంది.పర్యావరణ పరిరక్షణలో చెట్లు, జంతువులు, గాలి నీరు అనేక విధాలుగా పాలు పంచు కుంటాయి. వాటిని సహజంగా ఉండేలాగా కృషి చేయవలసిన బాద్యత, ప్రకృతిని వినియోగించుకుంటూ, ప్రకృతిని ఆధారంగా జీవించే ప్రతి మనిషిపైన ఉండాల్సిన అవశ్యకత ఉంది.

ఉపాధి ఊసేది?

వైసిపి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2020-21 రాష్ట్ర బడ్జెట్‌ నిజాయితీకి దూరంగా ఉంది. వాస్తవాలను పరిగణన లోకి తీసుకోకుండా మసి పూసి, మారేడుకాయ చేసే ప్రయత్నం జరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరం కరోనా సంక్షోభంతో మొదలయింది. పారిశ్రామిక, సర్వీసు రంగాలు ఘోరంగా దెబ్బ తిన్నాయి. గత ఆర్థిక సంవత్సరం లోనే ప్రభుత్వాల ఆదాయాలు తీవ్రంగా పడిపోయాయి. ఈ ఏడాది మరింత తీవ్రంగా పడిపోతాయనడంలో సందేహం లేదు. ఇటువంటి సమయంలో బడ్జెట్‌ అంచనాలు భారీగా చూపించటం ప్రజలను పక్కదారి పట్టించటానికే.
ఆదాయాలు-ఖర్చులు
ఆదాయాలు, ఖర్చుల అంచనాలే బడ్జెట్‌. అంచనా వేసిన ఆదాయం కంటే అంచనా వేసిన ఖర్చు ఎంత ఎక్కువ ఉంటే దాన్ని ద్రవ్య లోటుగా లేదా డబ్బుల లోటుగా పిలుస్తున్నారు. అప్పు తీసుకొచ్చి ప్రభుత్వం ద్రవ్యలోటును పూడుస్తుంది. అప్పుకు పర్యాయ పదమే ద్రవ్యలోటు. అప్పు తీసుకొచ్చి ఆదాయం-ఖర్చు మధ్య సమతుల్యతను ప్రభుత్వం సాధిస్తుంది. 2019-20లో అంటే మొన్న మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌ సైజు రూ.2 లక్షల 27 వేల కోట్లు. ఇదే మొత్తంలో ఆదాయాలు, ఖర్చులు ఉంటాయి. ఆదాయంలో రెవెన్యూ ఆదాయం, పెట్టుబడి ఆదాయం ఉంటాయి. ఖర్చులో రెవెన్యూ ఖర్చు, పెట్టుబడి ఖర్చు, అప్పు ఫాయిదాలు ఉంటాయి.
2019-20 ఆర్థిక సంవత్సరంలో అప్పుతో కలిపి రూ. 2లక్షల 2వేల కోట్ల ఆదాయాన్ని అంచనా వేసిన వైసిపి ప్రభుత్వం చివరికి దాన్ని రూ. లక్షా 74 వేల కోట్లకు తగ్గించింది. రెవెన్యూ ఆదాయం రూ.68 వేల కోట్ల మేర తీవ్రంగా తగ్గింది. అంచనా వేసిన దాని కంటే మరో రూ. 15వేల కోట్ల అప్పు తెచ్చి మొత్తం ఆదాయ లోటును రూ.53 వేల కోట్లకు తగ్గించింది. ఆ మేరకు ఖర్చును కూడా రెవెన్యూ ఖర్చులో రూ.43వేల కోట్లు, పెట్టుబడి ఖర్చులో రూ.19 వేల కోట్లు కోత వేసింది. అదే సమ యంలో అప్పు తీర్చే ఫాయిదాలను రూ.9 వేల కోట్లకు పెంచింది. వెరసి అంచనా వేసిన ఖర్చు కంటే పెట్టిన ఖర్చు రూ.53 వేల కోట్లకు తగ్గిం ది. ఆ మేరకు బడ్జెట్‌ సైజు కూడా రూ.53 వేల కోట్లకు తగ్గి, రూ.ఒక లక్షా 74 వేల కోట్లయింది. గత ఆర్థిక సంవత్సరంలో కేటాయింపుల కంటే వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, సాగు నీరు, పరిశ్రమలు, రవాణా వంటి ఆర్థిక సర్వీసులకు పెట్టిన ఖర్చు భారీగా రూ.48 వేల కోట్లు తగ్గింది. సాధారణ విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణం, పట్టణా భివృద్ధి, మహిళా శిశు సంక్షేమం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమం తదితర సామాజిక సర్వీసులకు రూ.9 వేల కోట్ల కోత పెట్టింది. ఈ సర్వీసులలో ఇతర రంగాలకు రూ. 23 వేల కోట్ల కోత పెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి రూ.14వేల కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టింది. వెరసి సామాజిక సర్వీసులలో రూ.9 వేల కోట్ల కోత పడిరది. కోర్టులు, జైళ్ళు, పోలీసు, రెవెన్యూ మరియు అప్పులు, వడ్డీల చెల్లింపులు, ఉద్యోగుల పెన్షన్లు వంటి సాధారణ సర్వీసులకు కేటాయించిన దాని కంటే రూ.3 వేల కోట్లు అదనంగా ఖర్చు పెట్టింది.
వర్తమాన బడ్జెట్‌
2019-20 బడ్జెట్‌ వాస్తవం తెలిస్తేగాని ప్రస్తుత 2020-21 బడ్జెట్‌ను అవగాహన చేసుకోలేము. ముందుగా గత 2019-20 బడ్జెట్‌ వాస్తవాలను పరిశీలించాం. కరోనా లేని సమయంలో 2019-20 బడ్జెట్‌ అంచనాలు వాస్తవంలో తలకిందులయ్యాయి. కరోనాతో మొదలైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2020-21 బడ్జెట్‌ అంచనాలు వాస్తవం అయ్యే అవకాశం అసలు లేదు. 2019-20 బడ్జెట్‌ 2018-19 ఆర్థిక సంవత్సరపు స్థాయికి దిగజారింది. 2020-21 బడ్జెట్‌ సైజును రూ. 2 లక్షల 25 వేల కోట్లుగా ప్రతిపాదించి నప్పటికీ వాస్తవంలో అది కూడా 2018-19 స్థాయికి కొద్దో గొప్పో తేడాతో దిగజార బోతోంది. ప్రభుత్వానికే బడ్జెట్‌ మీద నమ్మకం లేదు. ఏకంగా బడ్జెట్‌ సైజునే రూ.3 వేల కోట్ల మేర తగ్గించింది. వ్యవసాయం, గ్రామీణా భివృద్ధి, నీటిపారుదల, సాధారణ విద్య వంటి రంగాలకు కేటాయింపులోనే రూ.30 వేల కోట్లు తగ్గించింది. అదే సమయంలో సంక్షేమానికి దాదాపుగా అదే మొత్తంలో రూ. 28 వేల కోట్ల మేర పెంచింది. వివిధ రంగాలను అభివృద్ధి చేయకుండా కేవలం సంక్షేమం మాత్రమే ప్రజలకు మేలు చేయదు. అభివృద్ధికి కేటాయిం పులు తగ్గకుండా అదనంగా సంక్షేమానికి కేటాయింపులు జరిగితేనే రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం జోడు చక్రాలుగా నడుస్తాయి.
కార్మికులకు కానరాని మేలు
ఉపాధి హామీ పథకానికి పోయిన సంవత్సరం రూ.3626 కోట్లు కేటాయించిన ప్రభుత్వం రూ. 2021 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. కరోనా వలన పనులు దొరకని పరిస్థితుల్లో ఉపాధి కల్పన పెంచాల్సిన ప్రభుత్వం గతం కంటే రూ. 400 కోట్లు తగ్గించింది. ఉపాధి హామీ పథకాన్ని పట్టణాలకు కూడా విస్తరించాలన్న డిమాండ్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయి. వైయస్సార్‌ బీమా పథకం కూడా వట్టిపోయిన గొడ్డులా తయారయింది. పోయిన సారి దీనికి రూ. 400 కోట్లు కేటాయించినా… దాన్ని ఖర్చు చేయకుండా ఈ సంత్సరం రూ.262 కోట్లు మాత్రమే కేటాయించింది. బడ్జెట్‌ ప్రసంగంలో ప్రభుత్వ విధానాలు కూడా స్పష్టమవుతాయి. గత 9 సంవత్సరాలుగా షెడ్యూల్డ్‌ ఎంప్లాయిమెంట్స్‌ లోని 50 లక్షల మంది కార్మికులకు వేతన సవరణ చేయలేదు. బడ్జెట్‌ ప్రసంగంలో దీని ప్రస్తావనే లేదు. లాక్‌డౌన్‌ సమయంలో కార్మికులకు పని లేదు. వేతనాలు లేవు. ఇటువంటి సమయంలో కార్మికుల కొనుగోలు శక్తి పెంచ టానికి అవసరమైన చర్యలను కూడా బడ్జెట్‌లో ప్రకటించ లేదు. వృద్ధాప్య పెన్షన్లను ప్రభుత్వం వారికి కానుకగా చూపిస్తు న్నది. ఇతర పెన్షన్లకు అర్హత లేని వారు కూడా తాము పని చేయగలిగిన వయసులో 30, 40 సంవత్సరాల పాటు పని చేసినవారే. వారికి ఒక యజమాని అంటూ ఉండరు కాబట్టి ప్రభుత్వం పెన్షన్‌ ఇస్తోంది. దానిని కానుకగా చూపించి వైసిపి ప్రభుత్వం వారిని అవమానపరుస్తోంది. ఈ బడ్జెట్‌ కార్మికులకు మేలు చేయదు. పారిశ్రామిక, వ్యవసాయ, సర్వీసు రంగాలలో ఉపాధి పెరగదు. కార్మికులు కొనుగోలు శక్తీ పెరగదు.
సంక్షోభవేళ అరకొరగా
మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి (ఎంఎన్‌ఆర్‌ఇజిఎ) రూ.40,000 కోట్లు అదనంగా కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ఇటీవల ప్రకటించారు. మే 17న విలేకరుల సమావేశంలో అదనపు కేటాయింపుల గురించి నొక్కి చెప్తూ ఈ పథకం కింద 2019 మే నెలలో కంటే 40-50 శాతం మంది కార్మికులు అధికంగా నమోదు చేసుకుంటారని పేర్కొన్నారు. ఎంఎన్‌ఆర్‌ఇజిఎ బడ్జెట్‌కు ఈ అదనపు రూ.40,000 కోట్లు జోడిరచినప్పటికీ మంత్రిగారు వక్కాణించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి సరిపోదు.రూ.40,000 కోట్ల కేటాయింపును గొప్పగా చెప్పుకోవడం మీదే ఆర్థిక మంత్రి దృష్టి కేంద్రీకరించారు. ఎంఎన్‌ఆర్‌ఇజిఎ పథకం కింద పని కోరే వారి సంఖ్యకు సరిపడేంత బడ్జెట్‌ వుండాలన్నది ఆవిడ ఉద్దేశపూర్వకంగానే విస్మరించారు. బాధ్యత నుంచి తప్పించుకునేందుకు ఇదొక సులభమైన మార్గం అంతే. ఇప్పటికే 14 కోట్లకు పైగా వున్న ఎంఎన్‌ఆర్‌ఇజిఎ కార్మికులకు, గ్రామాలకు తిరిగి వస్తున్న కోట్లాది వలస కార్మికులకు ఉపాధి కల్పించాలన్న భారీ లక్ష్య సాధనకు ఈ మొత్తం ఏ మూలకూ సరిపోదు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ క్షేత్రస్థాయి వాస్తవాలను నిశితంగా పరిశీలించినట్లయితే ఈ విషయం తేలిగ్గానే తెలుస్తుంది.
ప్రస్తుత ప్రత్యేక పరిస్థితులలో కార్మికులకు ఏడాదికి 200 పని దినాలకు గ్యారంటీ వుండాలి. అదేవిధంగా వారికి రోజువారీ వేతనం రూ.300 (లేదా ఆయా రాష్ట్రాలలో అమలులో వున్న కనీస వేతనం అంతకంటే ఎక్కువైతే ఆ మొత్తం) ఇవ్వాలి. వ్యవసాయ కార్మిక సంఘాలు చాలా కాలంగా చేస్తున్న డిమాండ్‌ ఇది. పైగా, అనేకమంది ఆర్థికవేత్తలు కూడా గతంలో ఇటువంటి సూచనలే చేశారు. ఆ విధంగా చేస్తే గ్రామీణ కార్మికులకు కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు అది ప్రధానమైన అడుగు అవుతుంది.
2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ఎంఎన్‌ఆర్‌ఇజిఎ కి కేటాయించింది రూ.61,500 కోట్లు. వాస్తవానికి 2019-20 సంవత్సరంలో ఆ పథకం కింద చేసిన ఖర్చు కంటే ఈ కేటాయింపులు 9,500 కోట్లు తక్కువ. పైగా గతేడాది చెల్లించవలసిన బకాయిలు పెద్దమొత్తంలో పేరుకుపోయాయి. ఇప్పుడు అదనంగా ప్రకటించిన రూ.40,000 కోట్లు కలిపితే ఉపాధి హామీ పథకం కింద మొత్తం రూ. 1,01,500 కోట్లు వున్నట్లు లెక్క.
ఈ ఏడాది మే 16వ తేదీన అందుబాటులో వున్న ఎంఎన్‌ఆర్‌ఇజిఎ పోర్టల్‌ వివరాల ప్రకారం 1435.73 లక్షల మంది జాబ్‌కార్డ్‌ కోసం దరఖాస్తు చేసుకోగా, 1374.39 లక్షల మందికి కార్డులు మంజూరు అయ్యాయి. అంటే దరఖాస్తు చేసుకున్న 61,35,751 కుటుంబాలకు జాబ్‌కార్డు మంజూరు కాలేదు. ఇందులో 1166 లక్షల మంది పనిచేసేవారుండగా కార్మికులు వుండగా, అందులో 766.75 లక్షల జాబ్‌కార్డులు మాత్రమే ఉపయోగంలో వున్నాయి. గత మూడేళ్లలో కనీసం ఒక్కటంటే ఒక్క రోజు పనిచేసినా జాబ్‌కార్డు ఉపయోగంలో వున్నట్టేనట!
సులభంగా అర్థమయ్యేందుకు ఒక చిన్న లెక్క చూద్దాం. జాబ్‌కార్డులున్న 766.75 లక్షల క్రియాశీల కార్మికులకు రూ. 200 రోజువారీ వేతనం చొప్పున 100 రోజులు పని కల్పించడానికి రూ.1,53,350 కోట్లు అవసరం అవుతుంది. ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రభుత్వం తన ధోరణి మార్చుకుని, జాబ్‌కార్డులున్న కుటుంబాలన్నింటికీ 100 రోజుల పని కల్పించాలని భావిస్తే అందుకుగాను రూ.2,87,146 కోట్లు అవసరమవుతాయి. అన్నిటినీ మించి, ప్రస్తుత సంక్షోభ సమయంలో ఒక్కో ఇంటికి కనీసం 200 రోజుల పని కల్పించాల్సిన అవసరముంది. ఇలా చేస్తే, ఖజానా నుంచి రూ.3,06,700 కోట్లు ఖర్చు అవుతుంది. మరో ముఖ్యమైన అంశాన్ని గమనంలో వుంచుకోవాలి. వేతనం రూ.200 అంటే చాలా తక్కువ. అయినప్పటికీ మనం దాన్నే కనీస వేతనంగా పరిగణిస్తున్నాం. పై లెక్కలన్నీ కేవలం వేతనానికి సంబంధించినవి మాత్రమే. ఎంఎన్‌ఆర్‌ఇజిఎ పనికి సంబంధించి ఇతర ఖర్చులు కూడా వుంటాయి. గత ఆర్థిక సంవత్సరం 2019-20లో ఢల్లీి జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన వికాస్‌ రావల్‌ ఒక సూచన చేశారు. ఎంఎన్‌ఆర్‌ఇజిఎ కింద ఒక వ్యక్తి పని చేస్తే అందుకు రూ.290 ఖర్చు అవుతుంది. ఈ ఏడాది పెరిగిన వేతనం రూ.20 కూడా జోడిరచినట్లయితే అది రూ.310 అవుతుంది. ఈ లెక్కన, కార్డు వున్న వారందరికీ 100 రోజుల పాటు పని కల్పించాలంటే రూ. 4,26,975 కోట్లు అవసరమవుతాయి (13,77,33,901 జాబ్‌కార్డులకు 2019-20 ప్రకారం అయ్యే ఖర్చునకు (రోజుకు రూ.290) కొత్తగా పెరిగిన వేతనాన్ని (రోజుకు రూ.20) జోడిరచాలి).
ఈ గణాంకాలన్నీ లోగడ గ్రామాలలో వున్న శ్రామికుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని వేసిన అంచనాలు. ఇప్పుడు, గ్రామాలకు తిరిగి వస్తున్న కోట్లాది మంది వలస కూలీలను కూడా కలిపి అందరికీ పనులు కల్పించాల్సి వుంటుంది. తిరిగివచ్చిన వలస కూలీలను కూడా కలుపుకొని పని అడిగేవారి సంఖ్య పెరిగిన పరిస్థితిని ఈ అరకొర కేటాయింపులతో ఎలా న్యాయం చేస్తారన్న ప్రశ్న నుంచి హాయిగా తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. బడ్జెట్‌ కొరత ప్రభావం ఎంఎన్‌ఆర్‌ఇజిఎ పథకం అమలు మీద తీవ్రంగా వుంటోంది. దీనికితోడు, కేంద్రం విడుదల చేసే నిధులు చాలీచాలకుండా, ఒక పద్ధతిపాడు లేకుండా విడుదల అవుతుంటాయి. ఆర్థికంగా బలహీన స్థితి లోని రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటాను ఇవ్వలేకపోవడం కూడా పథకం అమలుపై ప్రభావం చూపుతోంది. జాబ్‌కార్డులు-పనుల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి సంఖ్య పెరగడం, ఆర్థిక ప్రతిబంధకాలు, ఈ ఏడాది ఏప్రిల్‌ నెల నగదు నిల్వలు తక్కువగా వుండడం వల్ల అనేక రాష్ట్రాలు ఈ పథకం కింద పనులు కల్పించలేకపోయాయి. లాక్‌డౌన్‌ అమలులో వున్నప్పటికీ మార్చి 31 తర్వాత జాబ్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య 7.1 లక్షలకు పెరిగింది. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌లో దరఖాస్తుల సంఖ్య అత్యధికంగా పెరిగింది. పట్టణ ప్రాంతాల నుంచి గ్రామాలకు వచ్చిన వలస కూలీల సంఖ్య ఈ రాష్ట్రాలన్నిట్లోను ఎక్కువగా వుంది. ప్రస్తుత సంక్షోభ సమయంలో ఎంఎన్‌ఆర్‌ఇజిఎ ప్రాధాన్యత ఎంతగా వుందనేది దీనిని బట్టే అర్థమౌతోంది.
లాక్‌డౌన్‌ వేళ గ్రామీణ కార్మికులకు కొంత ఉపశమనం కల్గించడానికి, తిరిగి వచ్చిన వలస కార్మికుల కారణంగా పడిన భారాన్ని తగ్గించడానికి ఎంఎన్‌ఆర్‌ఇజిఎ పథకాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకునే అవకాశాన్ని మనం చేజార్చుకున్నాం. సాధారణంగా ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌) లోనే ఎంఎన్‌ఆర్‌ఇజిఎ పని ఎక్కువగా జరుగుతుంది. పని డిమాండ్‌ కూడా అధికంగా వుంటుంది. ఎంఎన్‌ఆర్‌ఇజిఎ కింద ‘పూర్తయిన పని’లో సుమారు 37 శాతం ఏప్రిల్‌-జూన్‌ మాసాల్లోనే జరుగుతుంది. కోవిడ్‌-19 లాక్‌డౌన్‌ మొదటి దశ సందర్భంగా పరిస్థితిని అర్థం చేసుకోవడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం ముందస్తు ప్రణాళిక, ఆలోచన లేకుండా గుడ్డిగా ఎంఎన్‌ఆర్‌ఇజిఎ పనులను నెల రోజుల పాటు రద్దు చేసేసింది. ఒక ప్రకటన ద్వారా ఏప్రిల్‌ 15 నుంచి ఈ నిబంధనలను ఎత్తివేసినప్పటికీ అవి ఏప్రిల్‌ 20 నుంచి అమలు లోకి వచ్చాయి. లాక్‌డౌన్‌ నుంచి ఎంఎన్‌ఆర్‌ఇజిఎ ను మినహాయించినప్పటికీ ఈ పథకం కింద పనులు చాలా నిదానంగా నడుస్తున్నాయి.
ఏప్రిల్‌ మాసంలో ఎంఎన్‌ఆర్‌ఇజిఎ కింద కేవలం 30 లక్షల మంది మాత్రమే పని చేశారని (మామూలుగా పనిలో వుండేవారిలో కేవలం 17 శాతమే) అందుబాటులో వున్న ప్రభుత్వ గణాంకాలు తెలియచేస్తున్నాయి. అదే గతేడాది 1.7 కోట్ల మంది కార్మికులు పనిలో వున్నారు. అంటే ఈ ఏడాది 82 శాతం కార్మికులు తగ్గారన్నమాట. అయితే ఎంఎన్‌ఆర్‌ఇజిఎ కింద ఏప్రిల్‌ 2020లో 26.2 కోట్ల పని దినాలను సృష్టించవచ్చని గొప్పగా చెప్పారు. కోవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తి ప్రధానంగా పట్టణాలకే పరిమితమై వుంది. గ్రామాలలో దాని ప్రభావం తక్కువగా వుంది. అవన్నీ పరిగణనలోకి తీసుకుంటే ఈ పని దినాలను అనవసరంగా పోగొట్టుకున్నామన్నమాట.
కరోనాకు ముందు, సాధారణ పరిస్థితులు వున్నప్పుడు కూడా ఎంఎన్‌ఆర్‌ఇజిఎ కార్మికులకు ఎటువంటి నిరుద్యోగ భృతిని చెల్లించేవారు కాదు. అయితే దేశంలో 2019-20లో నిరుద్యోగ భృతి చెల్లించారు. ఎంఎన్‌ఆర్‌ఇజిఎ కింద కార్మికులకు ఎలాంటి నిరుద్యోగ భృతిని ఇవ్వని కేంద్ర ప్రభుత్వం ఈ లాక్‌డౌన్‌ కాలంలో వేతనాలను చెల్లించాల్సిందిగా ప్రయివేటు రంగానికి విజ్ఞప్తి చేయడం విస్తుగొల్పుతోంది.
అనేక పరిమితులు వున్నప్పటికీ, గత పదేళ్ల కాలంలో ఆర్థిక-వ్యవసాయ విపత్తు లలో సైతం గ్రామీణ భారతంలో ఎంఎన్‌ఆర్‌ఇజిఎ ఎంత ప్రయోజనకరమైనదో నిరూపణ అయ్యింది. గ్రామీణ నిరుపేదలు, అణచివేతకు గురవుతున్న వారు మనుగడ సాగించేందుకు ఈ పథకం తోడ్పడిరది. ఈ వాస్తవాన్ని గ్రామీణాభివద్ధి మంత్రిత్వ శాఖ అంగీకరించడమే గాక ఇలా పేర్కొంది. ‘’ఈ పథకం కింద పనిచేసే కార్మికులలో షెడ్యూల్డ్‌ కులానికి చెందినవారు 20 శాతం, షెడ్యూల్డ్‌ తెగ కార్మికులు 17 శాతం ఈ పథకం కింద స్థిరంగా వుంటున్నది’’. అదేవిధంగా పనిదొరికే మహిళా కార్మికుల సంఖ్య కూడా ప్రోత్సాహకరంగానే వుంది. వీరికి పని దొరకడం మాత్రమే కాదు, సమాన వేతనాలు గ్యారంటీ అయ్యేలా కూడా ఎంఎన్‌ఆర్‌ఇజిఎ సహాయపడిరది.
లాక్‌డౌన్‌ సమయంలో నిరుద్యోగం చాలా పెద్ద ఎత్తున పెరిగింది. భారత్‌లో ఇప్పటికే 14 కోట్ల ఉద్యోగాలు పోయాయని సెంటర్‌ ఫర్‌ మోనిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సిఎమ్‌ఐఆ) పేర్కొంది. లాక్‌డౌన్‌ అనంతరం భారత్‌లో 40 కోట్ల మందికి పైగా ప్రజలు తీవ్రమైన పేదరికం, ఆకలి సమస్యను ఎదుర్కోనున్నారని ఐక్యరాజ్య సమితి చెప్తోంది. ఈ పరిస్థితిలో గామీణ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపచేసేందుకుగాను కేంద్ర ప్రభుత్వం వేతన కార్మికుల మీద దృష్టి సారించి, స్పష్టమైన ప్రణాళికతో ముందుకు రావాలి.
ఆత్మ నిర్భర్‌ భారత్‌ పథకం : వ్యవ’సాయమే’ ప్రధానం!
కరోనా కష్టం నుంచి ప్రజలకు ఊరట కలిగించేందుకు ప్రధాని మోడీ ఆత్మ నిర్భార్‌ భారత్‌ పథకం ప్రకటించిన విషయం విదితమే. ఈ పథకంలో భాగంగా వివిధ రంగాల వారికి ఇచ్చే వెసులుబాట్లు.. ఆర్ధిక చేయూత గురించి కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రోజూ వారీ వివరిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు వ్యవసాయ రంగం, వ్యవసాయ ఆధారిత అనుబంధ రంగాలకు భారీ మద్దతు ప్రకటిస్తూ పలు అంశాలను వివరించారు.కరోనా కష్టం నుంచి ప్రజలకు ఊరట కలిగించేందుకు ప్రధాని మోడీ ఆత్మ నిర్భార్‌ భారత్‌ పథకం ప్రకటించిన విషయం విదితమే. ఈ పథకంలో భాగంగా వివిధ రంగాల వారికి ఇచ్చే వెసులు బాట్లు.. ఆర్ధిక చేయూత గురించి కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రోజూ వారీ వివరిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు వ్యవసాయ రంగం, వ్యవసాయ ఆధారిత అనుబంధ రంగాలకు భారీ మద్దతు ప్రకటిస్తూ పలు అంశాలను వివరించారు. వాటి వివరాలివే..పాడి పరిశ్రమకు పాలు పోశారు.. దేశంలో సంక్షోభాన్ని ఎదుర్కుంటున్న పాడి పరిశ్రమకు ఇప్పటికే ‘ఫసల్‌ బీమా యోజన’ కింద ?6,400 కోట్లు పరిహారం ఇచ్చామనీ, ?74,300 కోట్లు మేర కనీస మద్దతు ధరల ప్రకారం కొనుగోళ్లు చేశామనీ నిర్మలా సీతరామన్‌ వెల్లడిరచారు. అదేవిధంగా లాక్‌డౌన్‌ కారణంగా ఏర్పడిన మిగులు పాలను సహకార డెయిరీల ద్వారా సేకరించి తద్వారా ?4,100 కోట్ల రూపాయలను రైతులకు ప్రయోజనం చేకూర్చమని వివరించారు. ఇక భవిష్యత్తులో పాడి పరిశ్రమకు ఇవ్వబోయే చేయూత ఇదే.. పశువుల మూతి, కాళ్లకు వచ్చే వ్యాధుల నివారణకు టీకా కార్యక్రమం నిర్వహిస్తారు. దీని కోసం ?13,343 కోట్లు కేటాయించారు. పశు సంవర్థక రంగంలో మౌలిక సదుపాయాలకు ?15 వేల కోట్లు కేటాయించారు. పాడి పరిశ్రమ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించే స్థాయిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి చేస్తామని ఆర్ధిక మంత్రి ప్రకటించారు. మత్స్యరంగానికి చేదోడుగా.. మత్స్య సంపద యోజనకు ?20 వేల కోట్లు కేటాయిస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఇంకా ఆర్ధిక మంత్రి మత్స్యరంగానికి ప్రకటించిన ప్రత్యేక వెసులుబాట్లు..దేశంలో మత్స్యకార రంగంలో ఉపాధి పొందుతున్న55 లక్షల మంది. వీరందరికీ వ్యక్తిగత బోట్లు, మత్స్యకారులకు బీమా సదుపాయం. రానున్న అయిదేళ్లలో 70 లక్షల టన్నుల అదనపు మత్స్య ఉత్పత్తి సాధిస్తామని అంచనా. మౌలిక సదుపాయాలు, సామర్థ్యాల పెంపు ద్వారా ప్రతి ఒక్కరూ స్వావలంబన సాధించాలన్నదే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. ఫిషింగ్‌ హార్బర్‌, శీతల గోదాములు, మార్కెట్ల కోసం ?9 వేల కోట్లు కేటాయింపు. గడువు తీరిన ఆక్వా హేచరీలకు రిజిస్ట్రేషన్‌ గడువు మూడు నెలలు పొడిగింపు. రైతుల కోసం మరిన్ని.. నిన్న (మే 14) రైతులకు ఇస్తున్నాట్టు చెప్పిన ఆర్ధిక సహకారంతో పాటు ఈరోజు మరిన్ని రైతు సంక్షేమ విధానాలను ఆర్ధిక మంత్రి ప్రకటించారు. వ్యవసాయ రంగ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.లక్ష కోట్లు కేటాయించారు. దేశవ్యాప్తంగా ఎక్కడ ఉత్పత్తి అయిన వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులైనా ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు రైతులకు కల్పిస్తారు. ఇంతకు ముందు ఈ విషయంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగించే ఏర్పాట్లు చేస్తారు. ు అంతర్‌ రాష్ట్రాల మధ్య వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, అమ్మకాలపై పరిమితులను తొలగిస్తారు. దీని కోసం జాతీయ స్థాయిలో చట్టం తీసుకుని వస్తారు. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలకు సంబంధించి ఈ-ట్రేడ్‌ విధానం బలోపేతం చేస్తారు. లైసెన్స్‌ పొందిన వ్యాపారులకు రైతులు అమ్మాల్సిన అవసరం లేకుండా దేశవ్యాప్తంగా ఎక్కడ మంచి ధర వస్తే అక్కడే తమ పంటలు అమ్ముకోవచ్చు. – ప్రతి సీజన్‌కు ముందే ఏ పంట ఎంతకు కొంటారో చెప్పేలా చట్టపరమైన ఏర్పాటు చేస్తారు. మొత్తమ్మీద ప్రధాని ప్రకటించిన ఆర్ధిక ప్యాకేజీలో రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేసినట్టు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడిరచారు. – (వ్యాసకర్త అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్త కార్యదర్శి)-పి.అజయకుమార్‌/విక్రమ్‌ సింగ్‌

గిరిజనుల కాలికింద కాజేసే ప్రయత్నం?

గిరిజనులు తమ హక్కుల కోసం నినా దించిన మహత్తరమైన రోజుగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది. గిరిజన స్వయం నిర్ణయక హక్కు వివక్ష నుండి స్వేచ్ఛ భూమి ఇతర వనరులపై హక్కులు, గిరిజనుల సాంప్రదాయ,భాషాసంస్కృతి, విశిష్టత, విద్యా, వైద్యం, సమాచార, శ్రమ హక్కులు, అభివృద్ధి ఇతర ఆర్థిక సాంఘిక హక్కులతో పాటు గిరిజనులకు ఎదురవ్ఞతున్న ముప్పుల నుండి రక్షిం చాలనే అంశాలపై అన్ని దేశాలకు ఐక్యరాజ్య సమితి ఈ తీర్మానంలో పేర్కొన్నది. వీటిని గుర్తించాల్సిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వ్ఞన్న హక్కులను కాలరా యడానికి పూనుకుంటున్నాయి. ప్రభుత్వ విధానాల మూలంగా గిరిజనులు అడవ్ఞల నుండి బలవం తగా గెంటివేయబడుతున్నారు. లక్షలాది ఎకరాల గిరిజనుల భూములు అన్యాక్రాంతం అవ్ఞతున్నాయి.
అభివృద్ధి పేరుతో గిరిజన ప్రాంతాల్లో నిర్మి స్తున్న భారీ ప్రాజె క్టులు,పోలవరం వలన వేలాది గిరిజన గ్రామాలు లక్షలాది మంది గిరిజ నులు భూమితో పాటు సర్వ స్వం కోల్పతున్నారు. గిరిజనులకు విద్యా,వైద్యం,విద్యుత్‌,రోడ్లు, మంచినీటి వంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవ్ఞ తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా గిరిజనుల జీవిత విధానంలో సారుప్యత కనిపిస్తుంది. ఏ ప్రాంతం లోను కలవిడిలేని ప్రత్యేక సంస్కృతి, సాంప్రదాయం గిరిజనులది. భూమి అటవి వనరులపైనే గిరిజనుల సంస్కృతి,సాంప్రదాయం తమ చుట్టూ ఉన్న అడవి వనరులతోనే పెనవేసుకోని ఉంటాయి ప్రపం చంలోని 90శాతం వరకు గిరిజను లు అటవీ ప్రాంతాలలో వ్యవసాయం,వేట,అటవీ ఉత్పత్తు లపైనే ఆధారపడి జీవిసున్నారు. ప్రపంచంలోని గిరిజనుల సాధక,బాధకాలు తెలుసుకొనుటకు ఐక్యరాజ్య సమితి 1982లో ఒకకమిషన్‌ ఏర్పాటు చేసారు. గిరిజనులస్వయం,పరిపాలన హక్కు సంస్కృ తి,సాంప్రదాయాలు,భాష కాపాడే హక్కు, ఇతర ప్రజలు ఆక్రమించుకున్న భూములను తిరిగి స్వాధీన పరుచుకునే హక్కు, సంఘనిర్మాణం చేసుకొనే హక్కు, భూమిని, ప్రకృతి వనరులను స్వయంగా సర్మించు కునే హక్కును, భూమిపై గిరిజన తెగల యాజ మాన్యం పోకుండా చూసే చట్టాలను చేయవలసి నదిగా ప్రభుత్వాలను కోరేహక్కు,చట్టాల రూపకల్ప నలో గిరిజన తెగలకు కూడా తగు ప్రాతినిధ్యం కల్పించే హక్కు, ప్రభుత్వాల నుండి రాయతీలు పొందే హక్కు, ఐక్య రాజ్యసమితిలో గిరిజన తెగ లకు సభ్యత్వం కలిగివ్ఞండే హక్కు వివిధ దేశాలలో గిరిజన తెగలపై సాగుతున్న హింసాకాండను నిలిపి వేయటం వంటి హక్కులను రాజ్యాంగం కల్పిం చింది. తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల మనుగడే ప్రశ్నారక్ధంగా మారుతుంది. షెడ్యూల్డు ప్రాంతా లలో స్వయం పాలన లేకుండా అభివృద్ధి పేరుతో గిరిజనుల ను అడవ్ఞలనుండి తరిమివేసే విధానాన్ని ప్రభుత్వాలు అనుసరి స్తున్నాయి. అటవీ ప్రాంతా లలో ఖనిజ నిక్షేపాలే గిరిజనుల పాలిట శాపాలౌ తున్నాయి. గిరిజనులను బలి పశువులను చేసి అటవి సంపదను కొల్లగొట్టే కార్పొరేట్‌ శక్తులు చట్టా లను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. అటవి,ఖనిజ సంపదను కార్పొరేట్‌ సంస్థలకు, వ్యక్తులకు కట్టబెట్టేందుకు గిరిజన చట్టాలను తుంగ లో తొక్కుతున్నారు. ప్రభుత్వాలకు గిరిజనుల పట్ల చిత్తశుద్ది ఉంటేవారి హక్కులను గౌరవించాలి, పరిరక్షించాలి. గిరిజనుల సంస్కృతికి, వారి జీవన విధానానికి వారిని దూరం చేయ కుండా స్వేచ్ఛగా బ్రతకనివ్వాలి.గిరిజనుల ఆర్ధిక,సామాజిక పునాదు లపైవారి అభివృద్ధిసాగాలి.గిరిజనుల ప్రాం తానికి సంబంధించిన ఏనిర్ణయాలు తీసుకున్న వారి ప్రత్యేక గిరిజన సలహామండళ్ల అంగీకారం తప్పని సరిగా ఉండాలి. గిరిజనుల చట్టాలను పటిష్టంగా అమలు పరచాలి. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత బలహీ నులు, నిస్సహాయలగా ముద్రపడిన వర్గం గిరి జనులు, గిరిజన జాతి తరతరాలుగా అణచివేతకు, దోపిడీకి గురవ్ఞతుంది. రాజ్యాంగం కల్పించిన హక్కులను నిర్దాక్షిణ్యంగా కాలరాస్తున్నారు.
ఒకప్రక్క అభివృద్ధి పథంలో నడిపిస్తాం అం టూనే గిరిజనుల కాలికింది నేలను కూడా లాగేసుకునే దురాఘాతాలు (టి.ఆర్‌.ఎస్‌) ప్రభుత్వం లోనే తీవ్రమౌతున్నాయి. సంస్కరణల పేరుతో గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయం,భాష,ఆచార వ్యవహారలు అంతరించిపోతున్నాయి. ప్రపంచం లోని అతిపెద్ద ప్రజాస్వామ్య భారతదేశంలోని అత్యంత వెనుకబాటుకు గురౌతున్న గిరిజనుల సమగ్రాభివృద్ధికి నేటికీ ఒక సమగ్ర జాతీయ విధానం లేకపోవడం దారుణం. మనదేశంలోని 9 రాష్ట్రాలు గిరిజన ప్రాంతల పరిపాలనలో గవర్నర్లకు, గిరిజన శాసనసభ్యులతో కూడిన గిరిజన సలహా మండళ్లకు విచక్షిణాధి కారాలున్నాయి. రాజ్యంగంలోని 5,6 షెడ్యూళ్ల ద్వారా దఖ లు పడ్డ సదరు అధికారాలను ఏ గవర్నర్‌ వినియోగించుటలేదు. గిరిజన ప్రాం తాల పరిపాలనకు సంబంధించిన వ్యవహారాలను రాష్ట్రాలలో గిరిజన సలహామండళ్లు ఎప్పటికప్పుడు సమీక్షిస్తుం డాలి. గవర్నర్‌లు గిరిజన సలహా మం డళ్లు గిరిజన ప్రాంతాల పరిపాలన తీరుతెన్నులు, సిఫారుసులతో కూడిన నివేదికలను ప్రతి ఏటా రాష్ట్రపతి కేంద్ర గిరిజన సంక్షేమ శాఖకు అందజే యాలి. గిరిజన సలహా మండలిని మన రాష్ట్రంలో టి.ఆర్‌.ఎస్‌.ప్రభుత్వం నేటివరకు ఏర్పాటు చేయ లేదు.
గిరిజనులు అంటే ఎవరు?
వాడుక భాషలో గిరిజనులు అని పిలిచే వారినిరాజ్యాంగ పరంగా షెడ్యూలు తెగలు అని పిలుస్తారు. మనదేశానికిస్వాతం త్య్రం రాకముందు గిరిజనుల్ని వివిధ పదాలతో పిలిచేవారు వన వాసి,గిరిజన్‌, ఆదిమజాతి లాంటి పదాలు ఉపయో గించే వారు. పురాణాలలోను, ఇతిహాసాలలోను గిరిజనులు,ముఖ్యంగా దండకారణ్యం వివరాలు ఉన్నాయి.గిరిజనుల నాగరికత చాలా పురాతన మైనది. వారికి రాజ్యాలుఉండేవి. కోటలు ఉండేవి. వారికి భాష ఉంది. సంఖ్యా పరిజ్ఞానం,మాసాలు, ఋతువులు లాంటి లెక్కలు కూడా ఉన్నాయి. సాహి త్యం,సంగీతం,వాయి ద్య సహకారం అత్యున్నత స్థాయికి చేరుకుంది. స్వపరిపాలన వారి సంస్కృతికి మూలాలు చాలాగిరిజన సంస్కృతిలో కనిపి స్తాయి. రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణ సాధనకై ప్రజాపోరాటాలు తప్పనిసరైన పరిస్థితులు నెలకొ న్నాయి. గిరిజనులు అందరి పౌరులు లాగానే రాజ్యాంగం కల్పించిన అన్ని హక్కులకు అర్హులు. అదే కాకుండా రాష్ట్రపతిచే ప్రత్యే కంగా ‘షెడ్యూలు తెగలుగా గుర్తింపు వల్ల కొన్ని హక్కులు, రక్షణలు పొందుతారు. షెడ్యూలు ప్రాంతాలలో నివసించే గిరిజనులకు మరిన్ని రక్షణలు, సౌకర్యాలు కల్పిం చేందుకు రాజ్యాంగంలో నిర్ధేశికాలు ఉన్నాయి. ఒకపక్క రక్షణ కల్పిస్తూ,మరో పక్కన మిగిలిన ప్రజల/ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చెందేం దుకు అవకాశాలు కల్పించాలని రాజ్యాంగం సూచి స్తోంది. అయితే ఆచరణలో చిత్తశుద్ధి లేకపోవటం వల్ల అంతరాలు పెరిగి పోయి,పురోగతికి బదులు తిరోగతిని చూస్తున్నాం.-తేజావత్‌ నందకుమార్‌ నాయక్‌

మైనింగ్‌ వ్యతిరేక ఉద్యమంలో‘సూపర్‌ సైకిల్‌’ సిద్ధం చేయండి!

దశాబ్దాలుగా గనుల తవ్వకందారులు కార్పొరేట్‌ వ్యతిరేక కార్యకర్తలకు లక్ష్యంగా ఉన్నారు. ఖనిజాల వెలికితీత కలిగించే పర్యావరణ, సామాజిక ప్రభావాలపై ఉద్యమిస్తున్న వారి దృష్టిని ఆకట్టుకొంటుండగా, ఆతిథ్య దేశాలకు పెద్ద ప్రయోజనాలను చేకూర్చే పరిశ్రమ వాదనలలో వాస్తవం ఏమైనప్పటికీ, సందే హాలకు దారితీస్తున్నాయి.

ఇప్పుడు,వస్తువుల ధరలు పెరగడం ద్వారా ఈ రంగం పునరుజ్జీవింప బడుతున్నం దున, మరింత బలమైన దాడికి సామాజిక శక్తులు సిద్ధపడితే పర్యావరణ,సామాజిక,పాలన ఆధారాల పరంగా పరిశ్రమను మెరుగైన స్థితికి మార్చవచ్చు. మొదటిది వాతావరణ అనుకూల పదార్థాల గురిం చిన పరిశ్రమ కథనానికి వ్యతిరేకంగా పెరుగుతున్న ఎదురుదెబ్బ.ఇంధన ప్రాధాన్యతలు మారుతు న్నందున రాగి,కోబాల్ట్‌,లిథియం వంటి పరిశుభ్రమైన ఖనిజాలు డిమాండ్‌ పెరుగుతుంది. దాని తో చాలామంది ఖనిజ త్రవ్వకందారులు తమ హరిత ఆధారాలను చెప్పుకోవలసి వస్తున్నది. కానీ ఇది పరిశ్రమ దీర్ఘకాల విమర్శకులను వెనక్కి నెట్ట డానికి ప్రేరేపిస్తున్నది. ఉదాహరణకు,గత మార్చి లో,అటువంటి ఖనిజాలను వెలికి తీయడం ‘‘విస్తృతమైన విధ్వంస, మానవహక్కుల ఉల్లంఘనకు అపరిమిత అవకాశాలు కల్పించడం’’గావార్‌ ఆన్‌ వాంట్‌’ఒకవిశ్లేషణనుప్రచురించింది. ఏప్రిల్‌లో,ఎర్త్‌వర్క్స్‌’ మద్దతుతో జరిగిన ఒక అధ్యయనం అటువంటి పదార్థాలను వెలికితీసే అవసరాన్ని తగ్గించ డానికి రీసైక్లింగ్‌ కోసం పిలుపునిచ్చింది. ఇంధన పరిశ్రమను లక్ష్యంగా చేసుకున్న వాతావరణ కార్యకర్తలు, ఇప్పుడు ఎక్కువ ఇంధనం వినియో గించే పరిశ్రమల వైపు, ముఖ్యంగా మైనింగ్‌ వైపు దృష్టి సారిస్తున్నారు.ఒక అంచనా ప్రకారం, ప్రపంచ గ్రీన్‌ హౌస్‌ వాయు ఉద్గారాలలో అవి 4నుండి 7 శాతం వరకు బాధ్యత వహిస్తున్నాయి. రెండవది, కార్యకర్తలు వివిధ పరిశ్రమల ఖనిజాల వినియో గంపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. డిజిటల్‌, ఇతర పరికరాల్లో ఉపయోగించే లోహాలను త్రవ్వడంవల్ల పర్యావరణ ప్రభావాలు సాంకేతిక సమూహాలను లక్ష్యంగా చేసుకుని చర్చనీ యాంశం గా మారాయి. మరింత విస్తృతంగా, ప్రపంచం పెట్టుబడిదారీ ‘‘అతిగా వినియోగం’’ ట్రెడ్‌మిల్‌లోకి లాక్‌ చేయబడిరదనే ఆందోళనల మధ్య, మైనర్లు, ఎప్పటికీ అంతం కాని వనరుల వెలికితీతపై తమ దృష్టితో, మృగానికి ఆహారం ఇస్తున్నట్లు కనిపిస్తారు. మైనింగ్‌ రంగం ఎదుర్కొంటున్న మూడవ సవాలు విస్తృత సాంఘిక ఆందోళనలు. ఇక్కడ మహమ్మా రికి ఆజ్యం పోసిన సమాజ స్థితి గురించి ఆందోళన లు చాలా అరుదుగా జరుగుతాయి. ఇది అసమా నత అయినా,పర్యావరణాన్ని దెబ్బతీసినా, మైనారిటీ లేదా కార్మిక హక్కులను ఉల్లంఘించినా, శక్తివంత మైన కంపెనీలు తప్పు చేసినట్లు కనిపించినప్పుడు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. పెద్ద మైనింగ్‌ గ్రూపులకు అయితే మరేమీ కాదు. వారికార్యకలాపాలు తరచు గా విస్తారంగా ఉంటాయి. మారు మూల, కోల్పో యిన, పర్యావరణ సున్నితమైన ప్రాంతాలలో ఉంటాయి. తరచుగా మైనారిటీ సమూహాల జనాభా కలిగి ఉంటాయి. గని విస్తరణకు మార్గం చూపడా నికి పశ్చిమ ఆస్ట్రేలియాలో 46,000 సంవత్సరాల పురాతన పవిత్ర అబోరిజినల్‌ ఆశ్రయాన్ని కంపెనీ ధ్వంసం చేసిన తరువాత రియో టింటో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ గత సంవత్సరం చివర్లో తనఉద్యోగాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది. దానితో ఇప్పుడు ప్రపం చవ్యాప్తంగా మైనింగ్‌ ఎగ్జిక్యూటివ్స్‌ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఏదైనా ఉల్లంఘన జరిగితే, అంతర్లీనంగా సామజిక పరిస్థితులు సున్ని తంగా ఉంటూ ఉండడంతో తాము భారీ మూల్యం చెలింపవలసి వస్తుందని భావిస్తు న్నారు. అయితే ఈమైనింగ్‌ వ్యతిరేక క్రియాశీలత వెనుక ఉన్న ఆందోళనలకు మద్దతు ఇవ్వడానికి ఇదిఏదీ అవస రం లేదు. కొన్ని ఉద్యమాలు స్పష్టమైన ఆధారాల ఆధారంగా ఉండగా,మరికొన్ని. యధాలా పంగా, సైద్ధాంతికంగా ఉంటున్నాయి. సాంఘిక క్రియాశీ లత మునుపటి పరిస్థితులకంటే, ఈ ధోరణి ఖనిజ వ్యాపార నమూనాలను తిరిగి రూపకల్పన చేసే అవకాశం ఉంది. అయితే అవకాశాలతో పాటు నష్టాలను కూడా కలిగిస్తుంది. గతంలో, క్రియాశీ లత ప్రభావం చాలా పరిమితం ఉద్యమాలు సంస్థలకు కొన్ని ప్రతికూల పరిస్థితులను సృష్టించ వచ్చు,స్థానిక వ్యతిరేకతను రేకకెత్తింప వచ్చు. కానీ చాలా పరిమితంగా ఉంటూ ఉండెడిది. ఇప్పుడు, ఇటీవలి రెండు మార్పుల కారణంగా ఖనిజాల త్రవ్వకంవాణిజ్య ఫలితాలను ప్రభావితం చేయ డానికి ఉద్యమ కారులకు ఎక్కువ అవకాశం కలిగి స్తున్నది. పెద్ద పెట్టుబడిదారుల విస్తరించే కట్టు బాట్లు,కార్యకర్తల ప్రచారాలకు తరచుగా సున్ని తంగా ఉంటాయి, మంచి ఇ ఎస్‌ జి పనితీరు ఉన్న సంస్థలకు మాత్రమే మద్దతు ఇస్తాయిబీ టెక్నాలజీ,కార్‌ కంపెనీల వంటి లోహాల పారిశ్రా మిక కొనుగోలుదారులలో పెరుగుతున్న సున్నిత త్వం,వారి సరఫరాదారుల పరపతికి కలిగే నష్టం. ఇప్పటికే, కొంతమంది గనుల తవ్వకందారులు తమ వ్యాపార నమూనాలను సర్దుబాటు చేయడం ప్రారంభించారు. కొందరు, ఉదాహరణకు, తక్కువ ప్రత్యక్ష గ్రీన్‌ హౌస్‌ వాయు ఉద్గారాలు లేదా నీటి వాడకంతో ఆస్తులను కొనాలని కోరుతూ, తమా దస్త్రాలను పున రూపకల్పన చేసే మార్గాలను చూస్తున్నారు.ఇతరులు తమ ఖనిజాలను ‘‘బాధ్యతా యుతంగా తవ్వినవి’’ అని ధృవీకరించడానికి లేదా తాము ఉపయోగించే లోహాలను రీసైకిల్‌ చేయ డంలో సహాయపడటానికి ఉమ్మడి పథకాలను రూపొందించడానికి తమ వినియోగదారులతో కలిసి పనిచేయడం ప్రారంభించారు.
విమర్శలను తగ్గించే మార్గం కాకుండా కస్టమర్లు, పెట్టుబడిదారులతో బలమైన సంబంధాలను ఏర్పరచుకునే మార్గంగా సాధారణ థ్రెడ్‌ ఇ ఎస్‌ జి పరిశ్రమ గురించి ఆలోచించడంలో ఇది ఒక పరిణామం, ఇంకా చాలా దూరం వెళ్ళాలి – కాని ఆ కార్యకర్తలు దుర్వినియోగానికి పాల్పడుతున్నంత కాలం నిర్మాణాన్ని కొనసాగించే అవకాశం ఉంది.
(డేనియల్‌ లిట్విన్‌, సంస్థలకు స్థిరత్వం, భౌగోళిక రాజకీయ ప్రమాదం గురించి సలహా ఇచ్చే క్రిటికల్‌ రిసోర్స్‌ స్థాపకుడు, మేనేజింగ్‌ భాగస్వామి. ‘ఎంపైర్స్‌ ఆఫ్‌ ప్రాఎస్ఫిట్‌: కామర్స్‌,కాంక్వెస్ట్‌, కార్పొరేట్‌ బాధ్యత’ రచయిత)-డేనియల్‌ లిట్విన్‌

ఆ విషయంలో నిర్లక్ష్యం వద్దూ

కిశోర బాలికలో మొదటిసారి సంభవించే రుతుక్రమం సుమారు తొమ్మిది సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల వయస్సు మధ్య జరుగుతుంది. కొన్నిసార్లు తొందరగా ఎనిమిది సంవత్సరాలకు లేదా చాలా ఆలస్యంగా పందొమ్మిది సంవత్సరాల వరకు అవుతుంది. దేశంలో 70శాతం తల్లులు బహిష్టును మలినముగా భావిస్తున్నారు. బహిష్టు అంటే సిగ్గుపడే అంశమని, దాని గురించి అంతగా తెలుసుకోవాల్సిన అవసరం లేదనే సంస్కతి ప్రజల్లో వుంది. మనదేశంలో 6కోట్ల 30 లక్షలమంది కిశోర బాలికలు మరుగు దొడ్డి సౌకర్యంలేని ఇళ్లల్లో నివసిస్తున్నారు.


ఋతుస్రావం అనేది నూతన శిశువులకు జన్మనిచ్చే అత్యంత కీలకమైన మానవ ప్రత్యుత్పత్తికి చెందిన అంశం, ప్రపంచ వ్యాపితంగా మే 28వ తారీఖుని బహిష్టు ఆరోగ్య,పరిశుభ్రతా దినోత్సవంగా జరుపు తున్నారు. 2021 సంవత్సరాన్ని బహిష్టు ఆరోగ్యం, పరిశుభ్రతపై కార్యాచరణ, నిధుల వెచ్చింపు అనే అంశంగా ప్రకటించారు, 2014 సంవత్సరంలో జర్మనీకి చెందిన ‘వాష్‌ యునైటెడ్‌’ సంస్థ ఈ దినోత్సవాన్ని మొదటిసారిగా జరిపింది. ఈ కొవిడ్‌ సంక్షోభ కాలంలో బాలికలు,మహిళలు శానిటరీ నాప్కిన్లపై పెట్టే ఖర్చు గణనీయంగా తగ్గిపోయిందని స్వచ్ఛంద సంస్థల సర్వేలు చెబుతున్నాయి.
బాలికలలో బహిష్టుపై మూఢనమ్మకాలు,అపోహలు ప్రజల్లో బహిష్టుపై మూఢనమ్మకాలు ప్రచారంలో ఉండడంతో నిశ్శబ్ద వాతావరణం ఆవహించి ఉంది. అందువల్ల బాలికలు బహిష్టు పరిశుభ్రతపై తెలుసుకోవడం గాని చర్చగాని జరగకుండా మూఢనమ్మకాలు అవరోధంగా ఉన్నాయి.మనదేశంలో అవగాహన లేక డబ్బయిశాతం తల్లులు బహిష్టును మలినంగా భావిస్తున్నారు. పాలు, పెరుగు, మాంసాహారము, పచ్చళ్ళు,పండ్లను బహిష్టు సమయంలో తినకూడదని ఇంకా నమ్ముతున్నారు. భారతదేశంలో నలభైకోట్ల మంది మహిళల్లో కేవలం ఇరవై శాతం మంది మాత్రమే నాప్కిన్లని వాడుతున్నారు. అందు లోనూ పట్టణ ప్రజలే ఎక్కువగా శానిటరీ నాప్కిన్లను ఉపయోగిస్తున్నారు, గ్రామీణ ప్రాంతంలో ఇప్పటికీ ఇది చర్చించదగని విషయంగానే భావిస్తున్నారు. ఇంకా డబ్బయి ఒక్క శాతం బాలికలకు రజస్వల అయ్యేంతవరకూ తమ శరీరంలో జరిగే మార్పుల గురించి కానీ, నెలసరి గురించి కానీ అవగాహన లేదు.
కౌమార ప్రాయం అయోమయపు సందేహాల దశ. బాలకల శారీరక, మానసిక పెరుగుదలలో కీలకమైన మార్పులు ఈ దశలోనే ఏర్పడతాయి.పిల్లలు శారీరకంగా, మానసికంగా,భావోద్వేగపరంగా, సామాజికంగా వేగంగా అభివృద్ధి చెందుతూ కొత్త సామర్ధ్యాలను పెంపొందించుకొనే దశ కౌమారదశ. ఈ దశలో ఉన్నవారిని కౌమార బాలికలు అంటారు. మొదట ఋతుస్రావం యవ్వన ప్రారంభానికి సూచిక. ఈ మార్పుల్లో చాలాభాగం లైంగిక, పునరుత్పత్తి, ఆరోగ్యం,పోషణ మొదలైనవి. ఈ దశలో పాఠశాలలు, కళాశాలల్లో వారికి సరైన కౌస్సిలర్ల అవసరం పడుతుంది. బాలికలకు పాఠశాల స్థాయిలో ఈ అంశాలపట్ల సక్రమంగా అవగాహన కలిపించకపోవడం వలన పెద్దలు చెప్పిన మాటలే ఆచరిస్తూ బహిష్టు అపరిశుభ్రత వల్ల ఎదురయ్యే శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.
బహిష్టు కు సంబంధించిన సాధారణ ఆరోగ్యం లోపించి శారీరక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. రక్తహీనత, యోని సంబంధిత ఇన్ఫెక్షన్లు వ్యాపిస్తాయి. తరచుగా రక్తస్రావం వల్ల పునరుత్పత్తి నాళ ఇన్ఫెక్షన్లు వస్తాయి. అసాధారణ రుతుక్రమం వల్ల చాల వరకు రక్తస్రావం ఉండడంతో దీర్ఘకాలంలో గర్భాశయ ముఖద్వారా కాన్సర్‌ వచ్చే అవకాశమూ ఉంది. చిన్న వయసులో బాలికలకు వివాహం, క్రమంలో లేని బహిష్టుతో గర్భం దాల్చడం వలన దుర్భలమైన సమస్యలు తలెత్తుతాయి. బాలికలలో భయము,ఆందోళన,సిగ్గు,బిడియం, ఆత్మన్యూనతకు గురై మానసిక ఆరోగ్యం క్షీణిస్తుంది.
కౌమార ప్రాయంలోని వారు తరచుగా వివిధ సమస్యలు, అలజడులు, తిరుగుబాటు ధోరణులతో ఉంటారు. వాని బెంగ అంతా ‘అన్ని తప్పులను ఒప్పుగా చేయడం’ ‘న్యాయం కోసం పోరాటం’ సరైనదే చేయడం పైనే సమాజానికి ఉపయోగ పడే,సమాజ ఉత్పాదకతకు దోహదం చేసి, భాగస్వామ్య పౌరులుగా గుర్తింపు పడాలనే కోరిక వారిలో ఉంటుంది.
నివ్వెరపరిచే వాస్తవాలు, సవాళ్లు. బాలికలు, మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్య వంతమైన భవిష్యత్తరాన్ని ఈ సమాజానికి అందించవచ్చని వైద్య నిపుణుల అభిప్రాయం. బాలికల,మహిళారోగ్యంలో ప్రధానంగా చెప్పుకోవలసినది బహిష్టు పరిశుభ్రత. ఇది కేవలం బాలికల,స్త్రీల సమస్యేకాదు, దేశసుస్థిర ఆదాయం,దేశ సర్వతో ముఖాభివృద్ధితో ముడిపడిన సమస్య. కనుక ఈ సమస్యను ఎటువంటి లింగ వివక్ష లేకుండా బాలికలందరికీ విద్య, ఆరోగ్యము,పోషకాహారము, స్వచ్ఛమైన త్రాగు నీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత,మౌలిక సదుపాయాల కల్పన,నిరంతర అవగాహన కార్యక్రమాలతో అధిగమించవచ్చు. దీనిలో భాగంగానే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆదేశాల మేరకు మే 28 న అంతర్జాతీయ బహిష్టు పరిశుభ్రత దినోత్సవంగా ప్రతి సంవత్సరము జరుపుతున్నారు. అయితే మన ముందున్న వాస్తవాలు,సవాళ్లు ఇలా వున్నాయి.
ప్రపంచంలో రెండవ అత్యధిక జనాభా కల్గిన మన దేశంలో సుమారు 355 మిలియన్ల మహిళల్లో నెలసరి రుతుక్రమం జరుగుతున్నది. కిశోర బాలికలలో సుమారు 23% బాలికలు తను మొదటిసారి ఋతుస్రావం కాగానే బడికి వెళ్ళడం మానివేస్తున్నారు.
కిశోర బాలికలో మొదటిసారి సంభవించే రుతుక్రమం సుమారు తొమ్మిది సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల వయస్సు మధ్య జరుగుతుంది. కొన్నిసార్లు తొందరగా ఎనిమిది సంవత్సరాలకు లేదా చాలా ఆలస్యంగా పందొమ్మిది సంవత్సరాల వరకు అవుతుంది. దేశంలో 70శాతం తల్లులు బహిష్టును మలినముగా భావిస్తున్నారు. బహిష్టు అంటే సిగ్గుపడే అంశమని, దాని గురించి అంతగా తెలుసుకోవాల్సిన అవసరం లేదనే సంస్కతి ప్రజల్లో వుంది. మనదేశంలో 6కోట్ల 30 లక్షలమంది కిశోర బాలికలు మరుగు దొడ్డి సౌకర్యంలేని ఇళ్లల్లో నివసిస్తున్నారు.
ఒక సంవత్సరంలో పాఠశాలలు పనిచేసే రోలలో 20శాతం దినాలు బాలికలు మొదటి కారణమైన ఇంటిపని,రెండవ కారణమైన బహిష్టు వలన పాఠశాలకు గైర్హాజరవు తున్నారు.బహిష్టు సమయంలో పరిశుభ్రతను సరిగ్గా పాటించక పోవడం వలన మహిళల్లో మరియు బాలికల్లో పునరుత్పత్తి నాళ ఇన్ఫెక్షన్స్‌ 70శాతం పెరిగిపోతాయి. ప్రపంచవ్యాప్తంగా గర్భాశయ ముఖద్వార కాన్సర్లలో 27శాతం మన దేశంలో ఉండటం ఇంకో విషాదం.
సంస్థల, ప్రభుత్వాల పరిష్కారాలు
యాక్షన్‌ఎయిడ్‌ అనే స్వచ్ఛంద సంస్థ మురికివాడలలోని కౌమారబాలికలకు శానిటరీ నాప్కిన్స్‌ అందజేస్తోంది.ఇంకా ఇతర అంతర్జాతీయ సంస్థలు సయితం ఈ అంశంపై పనిచేయవలసి ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పాఠశాలల్లో నాడు ` నేడు కార్యక్రమం చేపట్టి మౌలిక సదుపాయాల కల్పనను చేపట్టింది ఇందువల్ల బాలికలు బడిమానివేసే సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. పాఠశాలల్లో శానిటరీ ప్యాడ్స్‌ను అందజేస్తున్నారు అయితే ఇవి అన్ని గ్రామీణ, గిరిజన పాఠశాలలకూ అందజేయాలి. ‘గర్ల్స్‌ ఫ్రెండ్లీ టాయ్‌లెట్‌’లను నిర్మించాలి, బాలికల కోసం శానిటరీ ప్యాడ్స్‌, సబ్బు, నీటివసతితో ఒక గది ప్రత్యేకంగా కేటాయించాలి. పనిచేసే ప్రదేశాలలో కాలేజీలలో కూడా ఈ సదుపాయాలు కల్పించాలి. పర్యావరణానికి హాని కల్గించని విధంగా తయారచేసిన శానిటరీ నాప్కిన్‌లను మాత్రమే వాడాలి. కౌమార బాలికల కోసం పాఠశాల, కళాశాలల్లో మహిళా కౌస్సిలర్లను నియమించాలి. గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని అవగాహన కార్యక్రమాలు, ప్రచారాలు చేయాలి.
-హరి వెంకట రమణ

జీవించే హక్కుకు ప్రాధాన్యత ఇవ్వండి

స్వాతంత్య్ర భారతదేశంలో ఏ ఇతర సమస్యల కన్నా కూడా భయంకరమైన హెల్త్‌ ఎమర్జెన్సీ పరిస్థితులు, పెద్ద సంఖ్యలో కోల్పోయిన ఉద్యోగాలు, ఒక్కసారిగా క్షీణించిన ప్రజల ఆదాయాలు, బాగా పెరిగిన ఆకలి దప్పులు, ఘోరమైన పౌష్టికాహార విధానం లాంటి అనేక సంక్షోభాలతో మెజారిటీగా ఉన్న కష్టజీవులు నేడు భయంతో వణికి పోతున్నారు.
వైఫల్యాలు
మే 13వ తేదీన సుప్రీంకోర్టు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు (పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌) వలస కార్మికులకు గుర్తింపు కార్డుల గురించి ఒత్తిడి చేయకుండా ఉచిత రేషన్‌ సమకూర్చాలని, రోజుకు రెండు పూటలా ఉచిత ఆహారాన్ని అందించడానికి వంటశాలలు నిర్వహించాలని ఆదేశాలను జారీ చేసింది. గత సంవత్సరం మార్చిలో విధించిన జాతీయ లాక్‌డౌన్‌ ప్రకటించిన నాటి నుంచి ఈ తీర్పుకు ప్రాధాన్యత ఏర్పడిరది. దేశంలో ఆకలి సంక్షోభాన్ని నివారించేందుకు ప్రభుత్వ తక్షణ చర్యలు అవసరమని సుప్రీంకోర్టు గుర్తించింది. కానీ ఆ తీర్పు మూడు కారణాల వల్ల ఒక మార్గాన్ని చూపడంలో విఫలమైంది : అది(తీర్పు) ఆ సౌకర్యాన్ని దేశంలో మొత్తంగా విస్తరించలేదు. ప్రభుత్వం అందించే ఉచిత ఆహారం, రేషన్‌తో పాటుగా నగదు బదిలీ కూడా చేసేందుకు ఆ సౌకర్యాన్ని విస్తరించలేదు. ఆ సౌకర్యాన్ని ఒక హక్కుగా పొందడం కన్నా, ఔదార్యంతో ఇస్తే పొందే సహాయంగా మార్చింది. ఆ తీర్పుకు సార్వత్రికంగా జీవించే హక్కును ప్రాతిపదికగా తీసుకొనివుండి వుంటే, ఆ మూడు లోపాలను అధిగమించి ఉండెడిది. కేంద్ర ప్రభుత్వం తన వ్యాక్సిన్‌ పాలసీ ద్వారా జీవించే హక్కును నిస్సిగ్గుగా ఉల్లంఘిస్తున్నది. ప్రతీ వ్యక్తి తన జీవించే హక్కును రక్షించుకోవడానికి కోవిడ్‌-19ని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్‌ వేయించుకోవడం అవసరం. ప్రతీ ఒక్కరి జీవించే హక్కును ప్రభుత్వం గౌరవించాలి కాబట్టి, వ్యాక్సిన్‌ వేయించుకునే వారి ఆర్థిక స్థోమతతో నిమిత్తం లేకుండా, ప్రభుత్వమే అందరికీ సమానంగా వ్యాక్సిన్‌ను అందుబాటులో ఉంచాలి. అది కూడా వ్యాక్సిన్‌లను ఉచితంగా అందిస్తేనే సాధ్యమవుతుంది. ప్రయివేటు వైద్య విధానం బాగా అమలవుతున్న అమెరికా లాంటి అనేక దేశాల్లో కూడా ప్రజలందరికీ వ్యాక్సిన్‌లు ఉచితంగానే వేస్తున్నారు. కానీ భారత ప్రభుత్వం మాత్రం 18-45ఏండ్ల మధ్య వయసుల వారు ప్రయివేటు ఆసుపత్రులలో డబ్బు చెల్లించి వ్యాక్సిన్‌ వేయించుకునే ఏర్పాట్లు చేస్తుంది. ఇది కరోనా మహమ్మారిని నిరోధించాడానికి ప్రభుత్వం తీసుకుంటున్న దారుణమైన, ప్రతికూలమైన వ్యూహం.
ఇది ఖచ్చితంగా భారత ప్రభుత్వం యొక్క తీవ్రమైన తప్పిదాల ఫలితమే. ప్రభుత్వం (ఎక్కువ మంది ఉత్పత్తిదారులకు తప్పని సరి లైసెన్స్‌లు ఇవ్వడం ద్వారా) తగినన్ని వ్యాక్సిన్‌ల ఉత్పత్తికి హామీ ఇవ్వలేదు. సరిపడా వ్యాక్సిన్‌ల సరఫరా కావాలని అడగలేదు. రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యాక్సిన్‌లను సమకూర్చాల్సిన బాధ్యతా ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘించింది. వ్యాక్సిన్‌ ధరలలో తారతమ్యం ఉండే విధానాన్ని ప్రవేశపెట్టి, రాష్ట్రాలు ఒకదానితో ఒకటి, రాష్ట్రాలు ప్రయివేట్‌ క్లీనిక్‌లతో పోటీ పడి వ్యాక్సిన్‌లను కొనే విధంగా ఒత్తిడి చేసి, భారత్‌ బయోటెక్‌, సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌లు ఎక్కువ ధరలు చెల్లించాలని ఒత్తిడి చేసే విధంగా అనుమతించింది. కరోనా రెండవ వేవ్‌లో ప్రభుత్వం ప్రజల జీవితాలు, వారి బాధల గురించి ఆలోచించడంలేదు. ఫలితంగా ప్రజలు తాము జీవనాధారాలను కోల్పోయి భారీగా నష్టపోతున్నారు. కనీసం 90శాతం మంది కార్మికులు అసంఘటిత రంగంలో పని చేస్తుండగా, వారికి ఏ విధమైన సామాజిక, చట్టపరమైన రక్షణ లేకుండా, గడచిన సంవత్సర కాలంలో విధించిన లాక్‌డౌన్‌లకు వారికి నష్టపరిహారాన్ని ఇవ్వకుండా నిరాకరించారు. వారిపై అనేక ఆంక్షలు విధించి, ఆర్థిక బాధలకు గురిచేశారు. కానీ అసంఘటితరంగ కార్యకలాపాలపైన ఆధారపడి పని చేస్తున్న ఒక బిలియన్‌ ప్రజల గురించి ఎటువంటి బహిరంగ నిరసనలు వ్యక్తం కాలేదు. విధాన నిర్ణేతలు ముఖ్యంగా జాతీయ స్థాయిలో ఉన్న వారు వీరిని పూర్తిగా వదిలి వేశారు. ఈ అలక్ష్యం యొక్క పరిణామాలు చాలా తీవ్రంగానూ, దీర్ఘకాలం పాటు కేవలం చెప్పలేని బాధలు అనుభవిస్తున్న ప్రజల పైన మాత్రమే కాక, దేశంపైన, భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థ నడిచే మార్గంపైన కూడా ప్రభావాన్ని చూపుతాయి.
ఇటీవల కాలంలో ఒక సమిష్టి సామాజిక సమూహాల నిర్వహణలో ‘హంగర్‌ వాచ్‌’ అని పిలువబడే ఒక అధ్యయనం, గత సంవత్సరం లాక్‌డౌన్‌ ఎత్తివేసిన రెండు నెలల తరువాత కూడా మూడిరట రెండొంతుల కుటుంబాలు లాక్‌డౌన్‌ కంటే ముందు తీసుకున్న ఆహారం కంటే తక్కువే తీసుకున్నారనీ, ఆరోగ్యాన్ని రక్షించే ఆహారంలో కూడా తగ్గుదల ఉందని తేల్చింది. సర్వే చేయబడిన కుటుంబాలలో పావు వంతు కుటుంబాల ఆదాయాలు సగానికి పడిపో యాయి. గ్రామీణ భారతంతో పోల్చితే పట్టణ ప్రాంతాల్లో ఆకలి ఎక్కువగా ఉందని ఆ సర్వేలో తేలింది. అనాలోచితంగా విధించిన లాక్‌డౌన్‌ల వలన కలిగే పరిణామాలు ఆర్థిక పునరుద్ధరణ కోసం జరిగే ప్రయత్నాలను అడ్డుకుంటాయి.
ఆర్థిక ప్యాకేజీ
ఒక అర్ధశతాబ్ద కాలంలో దేశం పెద్ద మానవ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలోనే, కరోనా మహమ్మారి వలన కలిగిన ఆరోగ్య, ఆర్థిక ప్రభావాలను ఎదుర్కొనేందుకు, చెప్పు కోదగిన ఆర్థిక ప్యాకేజీ పొందని అతి కొన్ని దేశాల్లో భారతదేశం ఒకటి. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 2020 నుంచి ఫిబ్రవరి 2021 వరకు జీడీపీలో కేవలం 2.1శాతం వడ్డీలేని ఖర్చును మాత్రమే పెంచింది. ఇది, మొదటి కరోనా వేవ్‌లో నలిగిపోయిన ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశ ఆర్థిక వ్యవస్థ నిర్వహణ ఎందుకు ఇంత దయనీయంగా ఉందో తెలియజేస్తుంది. ఇతర అనేక దేశాల్లో ప్రజలకు ఆదాయాలను సమకూర్చే దిశగా పెద్ద ఎత్తున ఆర్థిక ప్యాకేజీలను ప్రకటించారు.
ఆర్థిక వ్యవస్థ స్వస్థతకు సాధనంగా మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌లో వెనుకబడిన పనుల కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అంటున్నారు. దానికి బదులుగా ఆమె మిలియన్ల సంఖ్యలో ఉన్న పేద కార్మికులకు నగదును బదిలీ చేసే విధానంపై ఆధారపడి ఉంటే, అది ప్రజలను ఆకలి, నిరుద్యోగంలోకి నెట్టివేయకుండా రక్షించి, వద్ధి రేటును ప్రోత్సహించి ఉండేది. నగదు బదిలీ వలన ప్రజలు దేశీయంగా ఉత్పత్తి చేయబడే సాధారణ వస్తువుల కోసం ఖర్చు చేస్తారు. అందువలన ఈ నగదు బదిలీ ద్వారా ప్రజలపై చేసే ఖర్చు మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌లపై చేసే ఖర్చు (ఒకవేళ ఖర్చు చేసిఉంటే)కన్నా రెట్టింపు ప్రభావాలను చూపించి ఉండెడిది.
ఎక్కువ మొత్తంలో అవసరమైన సరుకులను, ఇప్పటికే పోగుపడిన ఆహార ధాన్యాల నుండే పంపిస్తారు కాబట్టి, సుప్రీంకోర్టు ఆదేశించిన విధంగా ఉచిత రేషన్‌, ఉచిత భోజనాల వలన కొంత మేలు జరుగుతున్నప్పటికీ, అవి ఆర్థిక వ్యవస్థపై కొద్దిపాటి విస్తరణా ప్రభావాన్నే చూపుతాయి. అందువల్ల ఉచిత రేషన్‌, ఉచిత భోజనాలను అందించడంతో పాటుగా ప్రజలకు సహాయార్ధంగా నెలకు రూ.7000 నగదును బదిలీ చేసి ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అత్యవసరంగా జీవించే హక్కుకు ప్రాధాన్యతనిచ్చే చర్యలను చేపట్టాలి. ఆ చర్యలు మాత్రమే నేడు ఆర్థిక స్వస్థతను చేకూర్చే సరైన మార్గాలు. వాటిలో ప్రధానంగా, ఉత్పత్తిని విస్తరించడానికి అనుమతించడం, కేంద్ర ప్రభుత్వమే కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ లను సేకరించి అందరికీ ఉచితంగా రోగనిరోధక శక్తిని పెంచేందుకు రాష్ట్రాలకు వాటిని పంపిణీ చేయడం, అవసరం ఉన్న ప్రతీ ఒక్కరికీ నెలకు 5కిలోల ఆహార ధాన్యాలను ఆరు నెలల పాటు అందించడం, ప్రతీ కుటుంబానికి, ఏ ఉద్యోగం లేని వారికి నెలకు కనీసం రూ.7000 చొప్పున మూడు నెలల పాటు నగదు బదిలీ చేయడం, ‘ఇంటిగ్రేటెడ్‌ చైల్డ్‌ డెవలప్మెంట్‌ సర్వీసెస్‌’ తన కార్యక్రమాలను పునరుద్ధరించి, విసృతపరచడానికి తగిన వనరులను పెంచడం.
‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని’ డిమాండ్‌కు తగిన విధంగా పని రోజులలో, కుటుంబంలో లబ్దిదారుల సంఖ్యలో ఎటువంటి పరిమితులు విధించకుండా అమలుచేయడం,అదే పథకాన్ని దేశంలోని పట్టణ ప్రాంతాల్లో విద్యావంతులైన నిరుద్యోగులకు కూడా వర్తింపజేయడం చేయాలి. వీటికి వనరులు ఎక్కడ ఉన్నాయి? అని ప్రశ్నిస్తారు. పెద్ద ఎత్తున నిరుద్యోగం, ఉపయోగించబడని సామర్థ్యం, ఉపయోగించని ఆహార ధాన్యాల నిల్వల (ప్రస్తుతం సుమారు 80 మిలియన్‌ టన్నులు)తో ఉన్న ఒక ఆర్థిక వ్యవస్థలో వనరుల సమీకరణ కోసం ఏ ఒక్కరి వినియోగాన్ని తగ్గించవలసిన అవసరం లేదు. ద్రవ్యలోటును పెంచడం వలన, అనవసరమైన సంపద అసమానతలు పెంచడం, ప్రపంచ వ్యాప్తంగా మొబైల్‌ ద్రవ్య పెట్టుబడిని భయపెట్టడం తప్ప, వచ్చే ప్రమాదం ఏమీ ఉండదు. ఈ రెండిరటినీ అడ్డుకోవాలంటే, సంపద పన్నును(పెద్ద మొత్తంలో లాభాల పన్ను కూడా తగినంత ఉన్నప్పటికీ కూడా) ప్రవేశ పెట్టే మార్గాలను అనుసరించాలి. ఒక్క శాతం కుటుంబాలపై విధించే 1.5శాతం సంపద పన్నుతో, వనరులకు అవసర మైన డబ్బు సరిపోతుంది.
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌, అమెరికా కోశాగార కార్యదర్శి జాన్నెట్‌ ఎలెన్‌లు మరింత నూతనత్వంతో కూడిన చర్యల గురించి ఆలోచిస్తున్నప్పుడు, మన రాజ్యాంగంలోని ‘జీవించే హక్కు’, ‘సమానత్వం’, ‘సౌభ్రాతత్వం’ అనే మాటలకు ప్రాముఖ్యతను, అర్థాన్నిచ్చే చర్యలను భారతదేశం చేపట్టకుండా తప్పించుకోకూడదు.
‘ద హిందూ’ సౌజన్యంతో..అనువాదం:
-బోడపట్ల రవీందర్‌

పసి దివ్వెలు వసివాడనొద్దు

బలపం పట్టాల్సిన చేతులు బండెడు చాకిరీ చేస్తున్నాయి.పేదరికంతో చదువులు చతికిల పడుతున్నాయి. కుటుంబ పోషణలో సమిధులవు తున్నారు. చదువులు, ఆటలతో గడపాల్సిన బాల్యం బజారున పడుతోంది. పేపర్బాయ్స్గా, హోటళ్లలో సర్వర్లుగా,సర్వెంట్లుగా, చెత్త ఏరుకునే వారిగా పసి హృదయాలు హృద్యమైపోతున్నాయి. అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టకపోవడంతో బాలకార్మిక చట్టం అలంకారప్రాయంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు, తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థలు,యువత, రాజకీయ నాయకులు అంతా సహకరిస్తే ఎంతో మంది బాలకార్మికులకు ఉజ్వల భవిష్యత్తు అందించవచ్చనడంలో సందే హంలేదు. జూన్‌ 12న ప్రంపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
పేదరికమే ప్రధాన కారణం
బాలకార్మిక వ్యవస్థకు అసలు కారణం పేదరికమే. జాతీయ,అంతర్జాతీయ సంస్థలు కూడా సర్వేల ద్వారా తేల్చిన విషయాలివే.. తల్లిదండ్రుల పేదరికం పిల్లలకు శాపంగా మారుతోంది. వారు చదువుకోవాల్సిన వయుసులో పనిచేస్తున్నారు. వ్యవసాయంలోనూ,ఇతరత్రా పనుల్లో తల్లిదండ్రు లకు సాయంగా వెళ్ళేవారు కొందరయితే, కర్మాగా రాల్లో, దుకాణాల్లో, ఇతరత్రా పనుల్లోకి వెళ్ళి తల్లి దండ్రులకుఆర్థికసాయాన్ని అందించేవారు మరికొందరు. తల్లిదండ్రుల అవగాహనా రాహి త్యంతో చట్టాలు అమలు కావడం లేదనే వాదన కూడా మరో వైపు వినిపిస్తోంది.ముఖ్యంగా విజయ నగరం,విశాఖపట్నం,శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు,మంగళగిరి తదితర పట్టణాల్లో మురికి వాడల్లోని తల్లిదండ్రులు పిల్లల తాత్కాలిక సంపా దన ఆశిస్తున్నారు. అలాంటి వారు తాత్కాలిక ప్రయోజనం ఆశించకూడదు. చదువు కోవాలని పిల్లలను వాళ్ల తల్లిదండ్రులు ప్రోత్సహిం చిన నాడే బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనవుతుంది.
తూతూ మంత్రం చర్యలు..
ఏటా ఏదో సందర్భోచితంగా బాలకా ర్మికులను పట్టుకొని బడిలో పడేసి చేతులు దులి పేసుకుంటున్న చర్యలు పెద్దగా ప్రయోజనం ఇవ్వ డం లేదు. ఏటా పాఠశాలలు తెరచే సమయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు.కొన్నేళ్లుగా ఈతంతు నడుస్తున్నా ఫలితం పెద్దగా కానరా వడంలేదు. లెక్కలు చూపడంతో సరిపుచ్చడంవల్ల బాలకార్మికులు ఎక్కడకక్కడే దర్శనమిస్తున్నారు. బడిలో పేరున్నా బయటే పిల్లలు ఉంటున్నారు. ఈపరిస్థితిలో మార్పు తీసుకు వచ్చేందుకు యం త్రాంగం అంతా బాధ్యత వహించాలి. బాల కార్మి కుల లెక్కలు కూడా లోపభూయిష్టంగాఉంటు న్నాయి. ఏపట్టణంలో తీసుకున్నా వందలాది మంది కన్పిస్తున్నారు. పల్లెలో అయితే పది మంది వరకు దర్శణ మిస్తున్నారు. అధికారుల లెక్కలు మాత్రం వందలోపే కన్పిస్తున్నాయి.
బోలెడు అవకాశాలు..
పల్లెల కంటే పట్టణాల్లోని మురికి వాడ ల్లో బాలకార్మికులు ఎక్కువ కన్పిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో విద్యాభ్యాసానికి అవకాశాలు కూడా ఎక్కువే. కేజీబీవీలు, వసతిగృహాలు, ఇతర సౌక ర్యాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని సద్విని యోగం చేసుకొనేలా యంత్రాంగం మురికివాడల్లోని తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. పైసా ఖర్చులేకుండా ఒకటి నుంచి డిగ్రీవరకు చదువు కోవచ్చన్న నమ్మకం కల్పించాలి. ఉపకార వేతనాలు, ఉచిత పుస్తకాలు, ఇతర సౌకర్యాలపై అవగాహన పర్చాలి.తల్లిదండ్రులకు ఉపాధి మార్గాలు వివరిం చాలి. రుణాలు మంజూరు చేయించి చిల్లర వ్యాపా రాలు చేసుకొనేలా చూడాలి.అంచనాగా ఒక్క విజయనగరం జిల్లాలో15ఏళ్ల మధ్య పిల్లలు: 6.20లక్షలు బాలకార్మికుల 7,400 మంది. కేజీబీవీలు 33.అన్ని విభాగాల వసతిగృహాలు: 155.
అవగాహన కార్యక్రమాలు
జిల్లాలోబాలకార్మిక వ్యతిరేక దినోత్స వం ర్యాలీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు సన్నద్దమవుతున్నారు. కార్మికశాఖతో పాటు బాల కార్మిక నిర్మూలనా సంస్థ, స్వచ్ఛంద సంస్థలు బాల కార్మికులను బడికి పంపించాలని అవగాహన పరచ నున్నట్లు ఆశాఖ ప్రతినిధులు తెలిపారు.ప్రకృతి విప త్తులు,యుద్ధాలు ప్రజల జీవితాలను ఛిద్రం చేస్తా యి. మరణాలు,అంగవ్కెకల్యాలతో పాటు. నిలువ నీడను,జీవనోపాధిని దెబ్బతీస్తాయి. బాధితుల బతు కులను ఛిన్నాభిన్నం చేస్తాయి. ఏటా20 కోట్ల మంది ప్రకృతి ప్రకోపానికి గురవుతున్నాయి. ఇందులో మూడో వంతు బాలలే ఉంటున్నారు. వీరికి తోడు పేదరికంలో మరెందరో మగ్గుతు న్నారు. వీరంతా పొట్ట కూటికోసం బాలకార్మికులుగా మారుతు న్నాయి. పద్నాలుగేళ్లలోపు పిల్లలు పనిలో కాదు బడిలో ఉండాలని చట్టాలు చెబుతున్నా…అవి సక్రమంగా అమలు కాని పరిస్థితులు వెక్కిరి స్తున్నాయి. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యం తీసుకురావాన్న ఆశయంతో ఏటా జూన్‌ 12న అంతర్జాతీయ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన దినంగా ఐక్యరాజ్య సమితి,అంతర్జాతీయ కార్మిక సంస్థలు పాటిస్తున్నాయి. యుద్ధాలు, విపత్తులు బాల లను దైన్యంలోకి నెడుతున్నాయన్నదే ఈ ఏడాది నినాదం.
బాలకార్మికులెంతమంది?
1998జాతీయ గణంకాల ప్రకారం 5నుంచి14సంవత్సరాలున్నవారు 253 మిలియ న్లుంటే,వారిలో12.6మిలియన్ల మంది చిన్నారులలు బాలకార్మికులే.2009-10 గణాంకాలు పరిశీలిస్తే కొంత మార్పు ఉంది.4.98 మిలియన్లకు ఈ సంఖ్య తగ్గింది. 5నుంచి 14 సంవత్సరాల లోపు మొత్తం పిల్లలజనాభా 259.64 మిలియన్లు. వీరి సంఖ్య తాజా గణాంకాల ప్రకారం చూస్తే మరింత తగ్గిందనే చెప్పాలి.
చట్టాలెన్నో..
భారతదేశంలోనే కాదు ప్రపంచ మొత్తం మీద బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఎన్నో చట్టాలున్నాయి. అయినా ఆసియా దేశాలలో ఇప్పటికీ బాలకార్మికుల సంఖ్య ఎక్కువే. భారత రాజ్యాంగంలోని24వ ఆర్టికల్తో పాటు, ద ఫ్యాక్టరీస్‌ యాక్ట్‌ ఆఫ్‌ 1948,ద ఛైల్డ్‌ లేబర్‌ యాక్ట్‌ 1986, ద జువ్కెనల్‌ జస్టిస్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ యాక్ట్‌ ఆఫ్‌ 2000, ద రైట్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఆటు ఫ్రీ అండ్‌ కంపల్సరీ ఎడ్యుకేషన్‌ యాక్ట్‌ ఆఫ్‌ 2009 వంటి చట్టాలెన్నో ఉన్నాయి.
నిర్బంధ విద్య చట్టం కూడా నీరుగారుతోంది.
పైన పేర్కొన్న చట్టాలన్నీ అమలు కాక పోవడం,విజయనగరం వంటి వెనుకబడిన జిల్లాలో బాలకార్మిక సంఖ్య అధికంగా ఉండటం మనం చూస్తున్నాం.2009లో వచ్చిన నిర్బంద విద్య చట్టం పరిశీలించినా కూడా ఇదేపరిస్థితి. ఈచట్టం ప్రకా రం ప్రాథమిక విద్యను తప్పనిసరి చేశారు. అంతేనా కార్పొరేట్‌ పాఠశాలల హవా కొనసాగుతున్న నేప థ్యంలో ప్రతీ ప్రైవేటు పాఠశాలలో25శాతం సీట్ల ను పేద విద్యార్థులకు అందివ్వాలని సూచిం చారు. అయినా ఈనిబంధనలను ఎక్కడా అమలు చేయడం లేదు.
ఇలా నిర్మూలించవచ్చు…
ె బాలకార్మిక వ్యవస్థపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి.
ె ఎదుటి వారికీ అవగాహన కల్పించాలి.
ె సమాజంలో మార్పు తీసుకువచ్చేలా ప్రతి ఒక్కరూ ఎంతోకొంత కృషిచేయాలి.
ె సంస్థలు వారి కార్యకలాపాల్లో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనను ఒక భాగంగా చేయాలి.
ె సమస్య తీవ్రతను తెలియజేసే కార్యక్రమాలు నిర్వహించాలి.
ె ముందుగా మన ఇళ్లల్లో పిల్లలు పనిచేయకుండా చూడాలి.
ె ఉపాధి చూపించే వారికి పిల్లలకు పనులు ఇవ్వొద్దని తెలియజేయాలి.
ె మన చుట్టూ ఉండే చిన్నారులు పాఠశాలలకు వెళ్లేలా చూడాలి.
ె పిల్లలను పనికి పంపేవారికి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు చూపాలి.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
విజయనగరం జిల్లాలో బాలకార్మికుల సంఖ్య గతంతో పోల్చితే తగ్గిందని చెప్పాలి. వెనుక బడిన జిల్లా కావడంతో ఇక్కడకు ఇతర జిల్లాల నుంచికానీ, ఒడిశా నుంచి కానీ వలసలు వచ్చేవారు లేరు. ఈ సంఖ్య అటు శ్రీకాకుళంలోనూ,ఇటు విశాఖలోనూ కనిపిస్తుంది. ఇటుకబట్టీల్లో గతంలో కొంతమంది చిన్నారులు పనిచేస్తుండేవారు. ఇప్పుడా ఆ పరిస్థితి మారిందనే చెప్పాలి. అయినా ఉన్న కార్మికుల సంఖ్య మరింత తగ్గించే ప్రయత్నాలు జరగలేదు. గత ఏడాది మొత్తం కేవలం 9 కేసులు మాత్రమే నమోదు చేశారు. ఒక్కటంటే ఒక్క అవగాహన సదస్సును కూడా కార్మిక శాఖ నిర్వహించలేదు. ఈ బాధ్యత అడపాదడపా ఒకటి రెండు స్వచ్ఛందసేవా సంస్థలు చేపడుతున్నాయి.
1098కి ఫోన్చేస్తే..
ఎవరైనా బాలకార్మికులను చూసినా.. లేదా ఒక చోట పనిచేస్తున్నట్టు సమాచారం ఉన్నా 1098కి ఫోన్చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఇది చ్కెల్డ్లైన్‌ టోల్ఫ్రీ నెంబరు. వెంటనే సంబంధిత చ్కెల్లైన్‌ సిబ్బం ది వచ్చి ఆపిల్లాడిని జిల్లాచ్కెల్డ్వెల్ఫేర్‌ కమిటీ ముందు హాజరుపరుస్తారు. వారు కౌన్సెలింగ్‌ ఇచ్చి జిల్లా లోని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న చిల్డ్రన్‌ హోమ్‌ తరలిస్తారు.అక్కడ ఆచిన్నారి నుంచి తగిన వివరాలు సేకరిస్తారు. తల్లిదండ్రులు ఉంటే వారిని పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చి పిల్లాడిని పాఠశాలకు పంపేలా తగిన చర్యలు తీసుకుంటారు. ఒక వేళ వారికి ఎవరూ లేరనుకుంటే వారిని సరిపడే వసతిగృహానికి పంపి విద్యాభ్యాసం కొనసాగేలా చర్యలు తీసుకుంటారు.
ఎన్సీఎల్పీని నీరుగార్చారు..
నేషనల్‌ చ్కెల్డ్లైన్‌ ప్రాజెక్టు మూడేళ్ల కిందట వరకూ బాగానే నడిచింది. దీని కింద స్వచ్చంద సేవాసంస్థలు బాలకార్మిక పాఠశాలలు నడిపేవారు. ఇప్పుడు ప్రభుత్వం వాటిని నడపడం లేదు. దేశంమొత్తం మీద 800కుపైగా జిల్లా లుంటే 273జిల్లాల్లో ఇప్పటికీ ఎన్‌ఎసీఎల్పీఉన్నట్టు రికార్డులు చూపుతున్నారు. అందులో విజయ నగరం,విశాఖ,శ్రీకాకుళం ఉండటం విశేషం. అయితే ఇక్కడ ఎటువంటి పనులు జరగడం లేదు. పేరుకే ప్రాజెక్టు ఉంది. దీనికి కారణం నిర్భంద విద్య చట్టం. ఈచట్టం వచ్చిన తరువాత ఇంకా బాలకార్మిక పాఠశాలలతో పనేముందని వాటిని ప్రభుత్వం మూసేంది.ఇంతవరకూ బాగానే ఉంది. కానీ అసలు నిర్భంధ విద్య క్షేత్రస్థాయిలో అమలువుతున్నదీ లేనిదీ మాత్రం చూడటం లేదు.
ఒక్క కార్యక్రమమూ లేదు..
363 రోజులు గుర్తురాకున్నా బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని అధికారులు పూర్తిగా మర్చిపోయింది. బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఏదో ఓ చిన్న కార్యక్రమాన్ని నిర్వహించడం రివాజు. కానీఈసారి తదను గుణంగా ఎలాంటి కార్యక్రమూ చేపట్టడం లేదు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం కానీ, జిల్లా కలెక్టర్‌ కానీ ఎటువంటి ఆదేశాలు జారీచేయలేదు.
చాలా వరకూ నిర్మూలించాం…
గతంలో చేసిన కార్యక్రమాలతో చాలా వరకూ బాలకార్మిక వ్యవస్థ తగ్గుముఖం పట్టింది. కొద్దిమంది ఎక్కడ్కెనా ఉన్నా వారికి పునరావాసం కల్పించేందుకు తగిన ఏర్పాట్లు చేశాం. చ్కెల్డ్లైన్‌ ద్వారా వారికి తగిన పునరావాసం కల్పిస్తున్నాం. ఎప్పటికప్పుడు ప్రణాళికలు కొత్తగా రూపొందిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఈ విషయమై మరింత వృద్ధి సాధించేందుకు ఇటీవలే జిల్లా కలెక్టర్‌ ప్రతిపాదనలు కోరారు. వీటిని కూడా అమలు చేసి త్వరలోనే బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలిస్తాం.

  • డీవీఎస్‌ ప్రసాద్‌, ఎన్సీఎల్పీ ప్రాజెక్టు డ్కెరెక్టర్‌
    ప్రతి ఏడాది జూన్‌ 12న ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలలో అవగాహన తీసుకురావడానికి ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఐక్యరాజ్యసమితి ప్రత్యేక విభాగమైన అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) 2002లో ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్స వంను ప్రారంభించింది.
    లక్ష్యాలు
    అన్ని వయస్సుల బాల కార్మికులకు నాణ్యతతో కూడిన ఉచిత విద్యను అందజేయడం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలకార్మికులను గర్తించి, వారికి అన్ని వసతులను కల్పించి సంపూర్ణ బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం. బాలకార్మిక వ్యవస్థకు అసలు కారణం పేదరికమే. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు కూడా సర్వేల ద్వారా తేల్చిన విషయాలివే. తల్లిదండ్రుల పేదరికం పిల్లలకు శాపంగా మారుతోంది. వారు చదువుకోవాల్సిన వయుసులో పనిచేస్తున్నారు.- సైమన్‌ గునపర్తి

1 … 10 11 12 13 14 … 16