Why India Needs Scheduled Tribes to Educate its Future Judges

The recent five-judge bench Supreme Court judgment in Chebrolu Leela Prasad Rao and Ors v State of AP and Ors, shows us once again how little the 5th Schedule of the Indian constitution which is meant to protect adivasi rights is understood.

The reasoning in the judgment – which struck down an Andhra Pradesh government order from 2000 providing 100% reservation for Scheduled Tribe teachers in Scheduled Areas of the state – moves perilously close to dismantling the entire edifice of the 5th Schedule.

If 100% reservation for teaching jobs is not permissible, the next step will be for someone to argue against the ban on alienation of tribal land, or overturn the Samata judgment prohibiting mining leases being given to non-tribals in 5th Schedule Areas in undivided Andhra Pradesh. After all, both these ‘discriminate’ against non-tribals. As non-adivasis from other districts flood scheduled areas leading to clear demographic change, the clamour to do away with the protective provisions of the 5th Schedule is only getting louder.

Read more

Coal blocks for tycoons: Rinchi village tribals may be declared forest land encroachers

Sunday, June 28, 2020

By Gladson Dungdung*
On June 18, 2020, the Government of India initiated the process for auctioning 41 coal blocks for commercialisation. These coal blocks are located in different states within India and most of them fall under Fifth Schedule areas. The Indian government claims that their decision to auction these coal areas is a big step towards making the country Atmanirbhar Bharat (self-reliant) in the energy sector.

The government envisages an investment of 33,000 crore, which would create 2.8 lakh jobs including 70,000 direct and 2,10,000 indirect jobs. Presently, India produces 60.40 million tons of coal per annum (2018-19), and the new initiates would be adding 15 percent to it.

Read more

డేటా వార్‌లో ఓటర్లే బలిపశువులా?

ఇందులో టిడిపి ఇరకాటం, టిఆర్‌ఎస్‌ చెలగాటం, వైసీపీ బులపాటం దాచేస్తే దాగేవి కావు. ఎవరెవరి వ్యూహ ప్రతి వ్యూహాలు ఎలా వున్నా రెండు ప్రధాన పార్టీలు పోటా పోటీగా లక్షల ఓట్లు గల్లంతు చేస్తే సగటు ఓటరు సంరక్షణెలా అన్నది కీలక ప్రశ్న. విధానాలతో విశ్వాసం పొంది ఓట్లు వేయించుకోవాలి గాని మూకు మ్మడి తొలగింపులు ఆందోళనకరం. అనుమా నాస్పదంగా మారిన ఈ డేటా వార్‌ కపట నాటకంలో పాత్రధా రులు, సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఓటర్ల న్యాయమైన హక్కుల పరిరక్షణ తక్షణ కర్తవ్యంగా తీసుకోవాలి. ఎన్నికల సంఘం కుంభకర్ణ నిద్ర మానాలి. అంతిమంగా ప్రజలు తీర్పు చెప్పే సమయం కూడా ఎంతో దూరం లేదు. ఈలోగా కుట్రలు కుత్సితాలతో, కుళ్లు కుతంత్రాలతో ఏదో సాధించేద్దామని ఎవరనుకున్నా భంగపాటు తప్పదు. ఎందుకంటే ప్రజలు కేవలం కంప్యూటర్‌ డేటా కాదు.
ఎక్కడో మునిగి ఎక్కడో తేలినట్టు ఎ.పి రాజకీయాల్లో టిడిపి-వైసిపి-టిఆర్‌ఎస్‌ వైరం చౌర్యం అంచుల వరకూ వెళ్లింది. నవ రత్నాలని ఒకరు, నవీక ృత పథకాలతో మరొకరు గెలిచేశామని ఇరు పార్టీలూ చేసిన హడావుడి వెనక్కు పోయి పరస్పరం దొంగతనం నిందారోపణలు మార్మోగుతున్నాయి. ఇరు పక్షాల పోల్‌ మేనేజిమెంట్‌ పొలిటికల్‌ మార్కెటింగ్‌ క్రీడల్లో ప్రజలు లేదా ఓటర్లు కేవలం డేటాగా మారిపోయిన దుస్థితి దాపురించింది. ఈ రెండు పార్టీలకూ లేదా వారి వారి మిత్రులకూ సంబంధించిన వివాదాన్ని రెండు తెలుగు రాష్ట్రాల పోలీసు తగాదాగా చూపించే ప్రయత్నాలు కూడా ఉధ ృతంగానే సాగుతున్నాయి. లక్షల ఓట్ల తొలగింపు, ఓటర్ల ప్రభుత్వ డేటా దొంగిలింపు వంటి తీవ్రమైన ఫిర్యాదులు భారీగా వినిపిస్తున్నా ఎ.పి, తెలంగాణ పోలీసులు, రాజకీయ వేత్తలు బాహాటంగా తిట్టిపోసు కుంటున్నా ఎన్నికల సంఘం నిమ్మకు నీరెత్తినట్టు వుండిపోయింది. అంతర్రాష్ట్ర వివాదంలాగా మారిన ఈ ప్రతిష్టంభన లో కేంద్రం చోద్యం చూస్తున్నది. తాజాగా ఏపి సిఎం ఇచ్చిన అధికారిక వివరణలోనూ రాజకీయ ఆరోపణలు, ఆక్రోశాలు తప్ప సమగ్ర సమాధానాలు, సంత ృప్తికరమైన సమాచారాలు లేవు.
ఐటి గ్రిడ్‌ వ్యవహారం : ఎ.పి ప్రభుత్వ ఔట్‌ సోర్సింగ్‌ సంస్థ బ్లూ ఫ్రాగ్‌ (విశాఖ) టిడిపి ఐటి ప్రొవైడర్‌ ‘ఐటి గ్రిడ్స్‌’ (హైదరాబాద్‌) కేంద్రంగా ఈ వివాదం మొదలైంది. మార్చి మూడవ తేదీ అర్థరాత్రి హైదరాబాద్‌ అయ్యప్ప సొసైటీ కాలనీలో ఐటి గ్రిడ్స్‌ కంపెనీలో పోలీసులు ప్రవేశించారు. ఓటర్లను తొలగించే ప్రక్రియ కోసం ఎ.పి ప్రభుత్వ డేటా అక్కడ దుర్వినియోగం అవుతున్నట్టు లోకేశ్వరరెడ్డి అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు వచ్చినట్టు చెప్పారు. నలుగురు సిబ్భందిని తీసుకువెళ్లారు. ఇంతలో ఎ.పి పోలీసులు లోకేశ్వరరెడ్డి ఇంటికి చేరుకున్నారు. తమ సిబ్బంది ఆచూకీ తెలియలేదని ‘ఐటి గ్రిడ్స్‌’ యజమాని అశోక్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వచ్చామనడంతో ఉభయ పోలీసుల మధ్య వివాదం నడిచింది. తెలంగాణ హైకోర్టులోనూ అశోక్‌ హేబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేయడంతో కోర్టు ఆ నలుగురిని హాజరు పర్చాలని ఆదేశించింది. పోలీసులు ఖాళీ కాగితాలపై విఆర్‌వోల సంతకాలు తీసుకోవడం ఏమిటని అక్షింతలు వేసింది. ఆ నలుగురు సిబ్బందిని సాక్షులుగా తీసుకున్నామే గాని అరెస్టు చేయలేదని వివరణ ఇచ్చిన పోలీసులు మరుసటి రోజు తీసుకురావడంతో కోర్టు పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఈలోగా ఎ.పి మంత్రి లోకేశ్‌, మరికొందరు తమ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ‘సేవామిత్ర’ అనే యాప్‌ తయారు చేస్తున్న ‘ఐటి గ్రిడ్స్‌’పై దాడి చేసి తెలంగాణ పోలీసులు డిస్క్‌లు, డేటా అపహరించుకుపోయారని ఆరోపించారు. హైదరాబాద్‌లో నివసించే టిడిపి వారిని వ్యాపారవేత్తలను భయభ్రాంతులను చేసేందుకు టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం మోడీ దర్శకత్వంలో వైసీపీతో కుమ్మక్కయిందని వారు ఆరోపించారు. ఇక ప్రభుత్వ డేటాను ఉపయోగించి ప్రతిపక్ష ఓటర్లను తొలగించేందుకు ప్రభావితం చేసేందుకు పెద్ద కుట్ర జరిగిందని వైసీపీ ఆరోపించింది. ఫిర్యాదు వస్తే పోలీసులు వెళ్లారు గాని ఏపి డేటాతో మాకేం అవసరమని టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసు తరహాలో చంద్రబాబును, లోకేశ్‌ను అవహేళన చేస్తూ మాట్లాడారు. వైసీపీ నేతలు టిడిపి డేటా చౌర్యం దొరికి పోయిందని ధ్వజమెత్తారు. సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌ డేటా చౌర్యంపై దర్యాప్తు చేస్తున్నామని అవసరమైతే ఎ.పి ప్రభుత్వానికి కూడా నోటీసు ఇస్తామని ప్రకటించారు. అయితే ‘సాధికార మిత్ర’తో సహా సర్కారు పథకాలకు సంబంధించిన సమాచారం సురక్షితంగా వుందని ఎ.పి అధికారి ఒకరు ప్రకటించారు. తమ పార్టీకి సంబంధించిన సేవామిత్ర యాప్‌లో డేటా దొంగిలించి వైసీపీకి ఇచ్చేందుకు టిఆర్‌ఎస్‌ కుట్ర పన్నిందని టిడిపి ఎదురుదాడి చేసింది. అశోక్‌ తమ సంరక్షణలో వున్నారని కూడా ఆ పార్టీ నేత ఒకరు వెల్లడిరచారు. మన పార్టీపై ఇంత దాడి జరుగుతుంటే మీరు మంత్రులుగా గాక టిడిపి నేతలుగా మాట్లాడ్డం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహించినట్టు మీడియా రాసింది.
ఎప్పటి నుంచో ఆరోపణలు, అరెస్టులు : అరెస్టులు, ఆరోపణలు ఇప్పుడు భగ్గుమన్నాయి గాని ఈ ప్రహసనం చాలా కాలం కిందటే మొదలైంది. ఏపిలో 59 లక్షలకు పైగా దొంగ ఓట్లు చేర్పించినట్టు ఆరు మాసాల కిందటే వైసీపీ ఆరోపించింది. ఫిబ్రవరి 4న జగన్‌ ఢల్లీిలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి వచ్చారు. అధికార పార్టీ దీనిపై మాట్లాడలేదు (పైగా టిడిపి ఓట్లకు డబ్బు ఇస్తే తీసుకోమని అన్నందుకు జగన్‌ ఓటు హక్కు రద్దు చేయాలని టిడిపి లీగల్‌ సెల్‌ వినతి పత్రం సమర్పించింది). రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య మూడున్నర కోట్లు అయితే అందులో దాదాపు 60 లక్షలు బూటకం అనడం అతిశయోక్తిగా వుందనే వ్యాఖ్యలు కూడా వచ్చాయి. అలాగే గ్రామాలలో సర్వేలంటూ జరిపి ప్రతిపక్ష ఓటర్ల సమాచారం తెలుసుకుని తొలగిస్తున్నారని వైసీపీ స్థానిక నేతలు అడ్డుపడటం వివాదానికి దారి తీసి అరెస్టులు కేసుల వరకూ వెళ్లింది. చిత్తూరు జిల్లా వంటి చోట్ల పోటా పోటీ ధర్నాలు జరిగాయి. అక్రమంగా ఓట్ల తొలగింపు జరిగిందని ఫిర్యాదు చేస్తే పోలీసులు బెదిరించిన ఘటనలు కూడా వెల్లడైనాయి. ఇంత జరుగుతున్నా ఎన్నికల సంఘం ఏ మాత్రం స్పందించలేదు. జగన్‌ ఫిర్యాదుల పైనా అధికారికంగా వ్యాఖ్యానించలేదు. వివాదం బాగా ముదిరాకనే ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీ ఓట్ల తొలగింపు సులభం కాదని మూడు దశలు దాటాలని చెప్పారు. ఓట్ల తొలగింపును కోరే ఫారం-7 దరఖాస్తులు తమకు లక్షల సంఖ్యలో వస్తే పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇంతలోనే హైదరా బాద్‌లో ఐటి గ్రిడ్‌పై దాడులు సంభవించాయి. డేటావార్‌ మొదలైంది.
ఇద్దరూ ఇద్దరే! : ఈ వార్‌ మొదలైన మరు రోజునే జగన్‌ నెల్లూరులో మాట్లాడుతూ తమ చిన్నాయన వివేకానందరెడ్డితో సహా లక్షల మంది ఓట్లను తొలగించినట్టు ఆరోపించారు. దొంగఓట్ల తొలగింపు కోసం తమ పార్టీ 8 లక్షల ఫారాలు సమర్పించిం దన్నారు. గవర్నర్‌కూ ఫిర్యాదు చేశారు. ‘అసలు మీ ఫిర్యాదు ఓట్ల తొలగింపు అయితే…మళ్లీ తొలగింపు కోసమే అన్ని లక్షల దరఖాస్తులు సమర్పించడం వైరుధ్యభరితం కాదా!’ అని నేను టీవీ చర్చల్లో అడిగాను. రెండు ప్రధాన పార్టీల మధ్య నడుస్తున్న ఈ ప్రహసనంలో ఏదో లోగుట్టు వుందని మాత్రం స్పష్టమై పోయింది. ఆ నాటకం ఏమిటో తేలాలని ఓట్ల జాబితా సక్రమంగా వుండేలా చూడాలని జనసేన -వామపక్షాలు కోరాయి. కాని ఎన్నికల సంఘం ఖండిరచడం తప్ప కదిలింది లేదు. దాంతో ‘అర్హులందరికీ ఓటు హక్కు’ అనే రాజ్యాంగ మౌలిక సూత్రం పరిరక్షణ వెనక్కుపోయి టిడిపి, వైసిపి, టిఆర్‌ఎస్‌ రాజకీయాలే ప్రధానమై డేటా వార్‌ను ఈ స్థితికి తెచ్చాయి. వైసిపి ఎం.పి విజయ సాయిరెడ్డి ఫిర్యాదు పత్రాలు చూపిస్తూ ‘ఇది బాహుబలిని మించిన కుట్ర’ అని ఆగ్రహిస్తున్న చంద్రబాబు నాయుడు ఎన్నికల సంఘానికి ఆయన చేసిన ఫిర్యాదులను ఎందుకు ముందే పట్టించుకోలేదు? అమెజాన్‌ క్లౌడ్‌లో ఈ డేటా పొందుపర్చడంపై సమాధానమేమిటి?
పొంతనలేని ప్రభుత్వాల తీరు : వార్‌ మొదలైన తర్వాత కూడా టిడిపి నాయకత్వం తడబాటుకు గురైంది. డేటా మాదైనప్పుడు తెలంగాణ పోలీసులు ఎందుకు వచ్చారంటూ మొదట్లో విమర్శ చేశారు. ఐటి గ్రిడ్స్‌ హైదరాబాదులో వుంది గనక ఈ ఆరోపణ నిలవలేదు. తామే వ్యతిరేక కూటమి వుందని ఆరోపించే చోట ఎందుకు వుంచారనే ప్రశ్న మరొకటి. రిజిస్టర్‌ కాని కంపెనీకి ఇంత ముఖ్యమైన డేటా అప్పగించడం కూడా విడ్డూరమే. ఒకే సంస్థకు ప్రభుత్వ యాప్‌ పార్టీ యాప్‌ కూడా కట్టబెట్టడం ఆరోపణలు పెంచుతుంది. పైగా ప్రభుత్వ డేటా పదిలంగా వుందని, టిడిపి యాప్‌లో సమాచారంలో రహస్యం లేదని చెబుతూ వచ్చారు. ప్రపంచమంతటా బిగ్‌ డేటా చౌర్యాలు పెరిగిపోతున్న కాలంలో అలాటి అలసత్వానికి తావే లేదు. జరిగింది డేటా సేకరణా బహుకరణా తస్కరణా అన్నది తేలవలసిందే. ఐటి గ్రిడ్స్‌పై తెలంగాణ పోలీసులు 23నే దాడి చేసి డేటా తీసుకున్నారంటున్న ఎ.పి ప్రభుత్వం అరెస్టుల విషయం రచ్చకెక్కేవరకూ కిమ్మనకపోవడానికి కారణాలు అనూహ్యం. మార్చి 4 తర్వాత కూడా ఐటి గ్రిడ్‌ తరపున హేబియస్‌ కార్పస్‌ వేశారే గాని తమ డేటా గురించి టిడిపి కేసు వేయలేదు. వైసీపీ టిఆర్‌ఎస్‌ బిజెపిలు జట్టు కట్టాయంటే దాన్ని ఎదుర్కోవడం టిడిపి రాజకీయ సమస్య తప్ప ఎ.పి,తెలంగాణ ప్రజల వివాదం కాబోదు. ఇటీవల ఎ.పికి చెందిన చిగురుపాటి జయరాం హత్య కేసు సందర్భంలో ఒక దశ తర్వాత ఇరు రాష్ట్రాల పోలీసులు సహకరించుకోవడం చూశాం. మరి ఏ.పికి సంబంధించిన డేటా సమస్యలో తెలంగాణ పోలీసులు ఎపి ప్రభుత్వానికి ఎందుకు తెలియజేయలేదన్న ప్రశ్న తలెత్తుతుంది. అందుకే వారు తెలంగాణ డేటా కూడా పోయిందని ఆలస్యంగా చెప్పడం మొదలు పెట్టారు. కేసుపై మాట్లాడే పోలీసు అధికారులు కూడా ఇప్పటికి ముగ్గురు మారారు. మాట్లాడిన ముగ్గురిలోనూ కొన్ని వైరుధ్యాలున్నాయి. కనుక ఇదంతా ఇరువైపులా పోటాపోటీ రాజకీయ ప్రయోజనాల వేట మాత్రమేనన్నది స్పష్టం. ఇందులో టిడిపి ఇరకాటం, టిఆర్‌ఎస్‌ చెలగాటం, వైసీపీ బులపాటం దాచేస్తే దాగేవి కావు. ఎవరెవరి వ్యూహ ప్రతివ్యూహాలు ఎలా వున్నా రెండు ప్రధాన పార్టీలు పోటా పోటీగా లక్షల ఓట్లు గల్లంతు చేస్తే సగటు ఓటరు సంరక్షణెలా అన్నది కీలక ప్రశ్న. విధానాలతో విశ్వాసం పొంది ఓట్లు వేయించుకోవాలి గాని మూకుమ్మడి తొలగింపులు ఆందోళనకరం. గత ఏడాది ఇలాగే భారీగా ఓట్ల తొలగింపు సమస్య తెలంగాణ ఎన్నికల్లోనూ వస్తే హైకోర్టు జోక్యం చేసుకుంది. అయినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు ఎ.పి లోనూ న్యాయపరమైన చర్యలు తీసుకోవాలే గాని రాజకీయ రచ్చ నిరర్థకం. అనర్థకం. డేటా సురక్షితంగా వుందా లేదా అన్నది తెలంగాణ పోలీసుల తుది నివేదిక తర్వాతనే మాట్లాడాల్సిన విషయం. ఒకవైపు అధికార డేటా పోలేదంటూనే ఎ.పి ప్రభుత్వం అతిగా కంగారు పడటం ఆశర్యకరం. తమ పార్టీ డేటా పోయిందని టిడిపి నాయకులూ పరువు పోయిందని ఎ.పి మంత్రులూ రాష్ట్ర పోలీసులకు, కలెక్టర్లకు ఫిర్యాదులు చేయడం రాష్ట్రాల మధ్య మధ్య వివాదానికే తప్ప పరిష్కారానికి దోవ చూపదు. ఎన్నికల సంఘం ముందు, ఉన్నత న్యాయస్థానాల ఎదుటు తేలాల్సిన సమస్యలివి. అన్ని వైపులా అనుమానాస్పదంగా మారిన ఈ డేటా వార్‌ కపట నాటకంలో పాత్రధారులు, సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఓటర్ల న్యాయమైన హక్కుల పరిరక్షణ తక్షణ కర్తవ్యంగా తీసుకోవాలి. ఎన్నికల సంఘం కుంభకర్ణ నిద్ర మానాలి. అంతిమంగా ప్రజలు తీర్పు చెప్పే సమయం కూడా ఎంతో దూరం లేదు. ఈలోగా కుట్రలు కుత్సితాలతో, కుళ్లు కుతంత్రాలతో ఏదో సాధించేద్దామని ఎవరనుకున్నా భంగపాటు తప్పదు. ఎందుకంటే ప్రజలు కేవలం కంప్యూటర్‌ డేటా కాదు. – తెలకపల్లి రవి

చంద్రన్నో..జగనన్నో..కాదు..ప్రజల పాలన కావాలి

‘‘ చంద్రన్నో, జగనన్నో కాదు.. ప్రజల పాలన కావాలి. ఉత్తరాంధ్ర వెనుకబాటు తనాన్ని పట్టించు కోకుండా నిర్లక్ష్యం చేయడంలో ఇటు తెలుగుదేశం, అటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌-రెండూ ఒక దానితో ఒకటి పోటీ పడుతున్నాయి. విభజన హామీల అమలును గాలికొది లేసిన బిజెపిని నాలుగేళ్లు టిడిపి అంటకాగితే ప్రస్తుతం వైఎస్సార్‌ సిపి అదే బాటలో నడుస్తోంది.’’- ఎ అజ శర్మ
రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్లయినా ఇంకా విభజన చట్టంలోని అనేక అంశాలు సక్రమ అమలుకు నోచుకోవడం లేదు. పోలవరం జాతీయ ప్రాజెక్టు. చట్టప్రకారం కేంద్ర ప్రభుత్వమే ఈప్రాజెక్టును నిర్మించాలి. ఇతర రాష్ట్రాల అభ్యంతరాలను పరిష్కరించాలి. వివిధ శాఖల అనుమతులు కూడా కేంద్రమే తీసుకోవాలి. దీనినిర్మాణం, నిర్మాణానికి పూర్తి నిధులూ భరించాలి. కానీ ఆచరణలో ఇవేవీ అమలు కావడం లేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఒక నినాదం కిందే మిగిలిపోయింది. వెనుకబడ్డ ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ నామమాత్రంగా మారడమేకాక అబివృద్ధి ఆవగింజంత కూడా లేదనడం అతిశ యోక్తి ఎంతమాత్రం కాదు. విద్యా సంస్థల ఏర్పాటు, నిర్మాణం నత్తనడకన నడుస్తు న్నాయి. ఎయిమ్స్‌కు నిధుల కేటాయింపు అంతంత మాత్రమే. కడప ఉక్కు ఫ్యాక్టరీ, రామాయపట్నం పోర్టు సముద్రంలో కలిసి పోయాయి. ప్రత్యేక రైల్వే జోన్‌ ఎన్నికల జిమ్మి క్కుగా ఇచ్చి శతాబ్దం పైగా చరిత్ర ఉన్న వాల్తేరు డివిజన్‌ను ఎత్తివేశారు. మొత్తంగా చూస్తే విభజన చట్టాన్ని, ఇచ్చిన హామీలను మోడీ ప్రభుత్వం ఒక ప్రహసనంలా మార్చి వేసింది. ఉత్తరాంధ్ర మరింత అన్యాయానికి గురయ్యింది. విభజన చట్టం అమలులోకి వచ్చి ఐదు సంవత్సరాల తర్వాత కూడా చట్టంలోని గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రకటనలే తప్ప, అవసరమైన కనీస చట్టపర చర్యలు కూడా మోడీ ప్రభుత్వం చేపట్టలేదు. ఫలితంగా ఇంకా తాత్కాలిక తరగతులు కూడా ప్రారంభం కాలేదు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలని ప్రజల చిరకాల కోరిక. దీనికై పెద్ద ఉద్యమమే జరిగింది. విశాఖనగరంలో మెట్రోరైలు నిర్మించాలని చట్టంలోఉన్నా దాని గురించి కేంద్రం ప్రస్తావనే లేదు. తమని గెలిపిస్తే రైల్వే జోన్‌తో సహా, ఉత్తరాంధ్ర అభివృద్ధి, విద్యా సంస్థలకు నిధుల కేటాయిం పుతో సహా అన్నివిధాలా అండగా ఉంటామని స్వయంగా మోడి గారే విశాఖ ఎన్నికలసభలో వాగ్ధానం చేశారు. వీటిని నమ్మి విశాఖ నుండి ఒక బిజెపి ఎంపిని, ఒక ఎమ్మెల్యేను ప్రజలు ఎన్నుకున్నారు. తీరా గెలిచిన తరువాత ఎలా తూట్లు పొడవాలనే చూశారు తప్ప వాటిలో ఒక్క దానిని కూడా చిత్తశుద్ధితో అమలు చేయలేదు సరికదా ప్రజలను ఇంకా మోసం చేయా లనే చూస్తున్నారు. ఉత్తరాంధ్రకు అభివృద్ధి ప్యాకేజీ కింద ముష్టి వేసినట్లు సంవత్స రానికి జిల్లాకు 50కోట్ల రూపాయల చొప్పున మూడు సంవ త్సరాలు ఇచ్చి తరువాత ఆపివేశారు. నాలగవ సంవత్సరం ఇచ్చిన నిధులు కూడా వెనక్కు తీసేసుకున్నారు. రైల్వే జోన్‌పై ఆఖరి ఘడియల వరకు తాత్సారం చేసి, చివరికి ప్రజలు ఛీ కొడతారనే భయంతో మాత్రమే, అక్కడ కూడా మోసకారితనంతోనే ఎవరికీ ఆమోదయోగ్యం కాని జోన్‌ ప్రకటించారు. ఇలామోడీ ప్రభుత్వం ఉత్తరాంధ్రకు తీరని అన్యాయం చేసింది. ఈ దుర్మార్గాన్ని ఎండగట్టి, ప్రజలను విశ్వాసంలోకి తీసుకుని కేంద్రపై ఒత్తిడి తేవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం ఆ పనిచేయక పోగా నాలుగేళ్ళు మోడీ ప్రభుత్వంతో అంటకాగింది. వారితో కలిసి కేంద్రంలో అధికారాన్ని పంచుకుంది. ఉత్తరాంధ్ర నుండి తెలుగు దేశం పార్టీ విజయనగరం ఎంపి కేంద్ర మంత్రిగా కొనసాగారు. అయినా ఎప్పుడూ ఉత్తరాంధ్ర సమస్యలను లేవనెత్తిందీ లేదు. పరిష్కరించిందీ లేదు. రాష్ట్ర అభివ ృద్ధి అంటే రాజధాని అభివృద్ధేననట్టు, పోలవరం ప్రాజెక్టేనన్నట్టు వ్యవహరించి చంద్రబాబు ఉత్తరాంధ్ర సమస్యలను నిర్లక్ష్యం చేశారు. ప్రభుత్వం ఎంత గొప్పలు చెప్పుకున్నా వాస్తవమేమిటంటే ఈ ఐదేళ్ళ కాలంలోనూ ఉత్తరాంధ్రకు ఒక్క చుక్క కూడా అదనంగా సాగు నీరు రాలేదు. ఫలితంగా ఉపాధి కోసం వలసలు ఈకాలంలో కూడా పెరుగుతూనే ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ సమస్యపై చంద్రబాబు ప్రభుత్వం ప్రకటనలే తప్ప చేసింది శూన్యం. విచిత్రమే మిటంటే ఈ జిల్లా నుండే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర మంత్రిగా ఉన్నా కిడ్నీ వ్యాధులతో వేలాది మంది ప్రాణాలు కోల్పోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. ఉపాధి అవకాశాలు పెంచకుండా, ప్రత్యేక డిఎస్‌సి ప్రకటించకుండా, ఖాళీ పోస్టులను నింపకుండా అనేక మంది గిరిజన యువకులను గంజాయి దొంగలుగా మార్చి వేస్తోంది. పరిశ్రమలు, అభివృద్ధి పేరుతో వేలాది ఎకరాల భూమిని కార్పొరేటు సంస్థలకు ధారాదత్తం చేస్తోంది. విశాఖ నగరంలోని అత్యంత విలువైన భూములను అదానీలకు, షాపింగ్‌ మాల్సుకు కట్టబెడుతూ బ్రోకరులా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఉత్తరాంధ్రలో నేడు లక్షలాది ఎకరాల భూమి పరాయిపరమైంది. దేశంలోని అన్ని రాష్ట్రాలూ మా కొద్దు బాబోరు అని నిరాకరించిన అణు విద్యుత్‌ ప్లాంటును శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో ఏర్పాటుకు ప్రభుత్వం అక్కడి ప్రజల అభిష్టానికి భిన్నంగా నిర్ణయించింది. ఉత్తరాంధ్రకు ప్రకృతి వరమైన సముద్ర తీరాన్ని కలుషితం చేసే కాలుష్య కారక పరిశ్రమలకు విచ్చలవిడిగా అనుమతిస్తోంది. తీరప్రాంత రక్షణకున్న సిఆర్‌జెడ్‌ నిబంధనలు కేంద్ర ప్రభుత్వం మార్చివేస్తుంటే, వ్యతిరేకించవలసింది పోయిఉన్న కొద్ది పాటి రక్షణను కూడా రద్దు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది.రాష్ట్ర ప్రభుత్వ ఈదగాను ఎదుర్కొని, ప్రజలకు అండగా నిలవవలసిన ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఆబాధ్యతను నిర్వర్తిం చడంలో ఘోరంగా విఫలమైంది. ఉత్తరాంధ్ర ప్రజలు ఈపార్టీ ప్రజా ప్రతినిధులను గెలిపించి అసెంబ్లీకి పంపినా, ఉత్తరాంధ్ర ఒక్క సమస్యపై కూడా ఆందోళన చేయడం కాని ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం కాని చేసిన ఉదంతం ఒక్కటి కూడా లేకపోవడం పచ్చి మోసకారితనమే. అందుకే ద్రోహం చేసిన కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట కూడా అనడం లేదు. ఉత్తరాంధ్ర విషయంలో తెలుగుదేశమూ, వైసిపి దొందూ దొందేనన్నట్టు వ్యవహరించాయనడానికి కొన్ని దృష్ట్యాంతాలు పరిశీలిద్దాం.
బాక్సైట్‌ మైనింగ్‌ : 1997లో చంద్రబాబు మైనింగ్‌ చేపడతానని ప్రకటించారు. ప్రజల ఉద్యమం ఫలితంగా వెనక్కి తగ్గారు. 2004లో రాజశేఖరరెడ్డి బాక్సైట్‌ మైనింగ్‌ మీద వేగంగా పావులు కదిపారు. ప్రజా ఉద్యమాలను దౌర్జన్యంగా అణచివేశారు. అప్పుడు బాక్సైట్‌ మైనింగ్‌ను వ్యతిరేకించిన చంద్రబాబు తాను అధికారంలోకి రాగానే తిరిగి మైనింగ్‌ చేపట్టడానికి జివో 97తెచ్చారు. ఇప్పటికీ రద్దు చేయలేదు. చంద్రబాబును ప్రతిఘటించవలసిన వైసిపి ఎమ్మెల్యేలిద్దరూ టిడిపి గూట్లో చేరారు. ఇప్పుడు జగన్‌ మళ్లీ రాజన్న రాజ్యం అంటున్నారు. బాక్సైట్‌ విషయంలో ఇద్దరికీ ఏంటి తేడా?
పంచ గ్రామాల భూసమస్య : చంద్రబాబు తెచ్చిన జివోను రద్దు చేసి ప్రజలకు న్యాయం చేస్తానని రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చారు. 2009 వరకూ ఏమీ చేయలేదు. 2014ఎన్నికలలో చంద్రబాబు పంచ గ్రామా ల భూసమస్యను 100 రోజుల్లో పరిష్కరిస్తానన్నారు. ఎన్నికల ముందు 2019లో ఒక దుర్మార్గమైన జివో తెచ్చి తన మోసకారితనాన్ని బయట పెట్టుకున్నారు. ఇక జగన్‌ ఏనాడూ పంచగ్రామాల సమస్యను పట్టించు కోలేదు. దేవస్థానానికి అక్రమంగా భూమిని దఖలు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసే దమ్ము, నిజాయితీ ఇద్దరికీ లేదు.
గంగవరం : నిర్వాసిత మత్స్యకారులపై రాజశేఖరరెడ్డి కాల్పులు జరిపించారు. చంద్రబాబు పోర్టు యాజమాన్యానికి అంటకాగి నిర్వాసి తులకు ఉద్యోగాలివ్వకుండా నాటకమాడారు. మొత్తం మీద ‘చంద్రన్న పాలన’ అయినా, ‘రాజన్న రాజ్యం’ అయినా ఉత్తరాంధ్రకు జరిగిందీ, జరిగేదీ అన్యాయమూ,వంచనా,దగాయే తప్ప న్యాయం మాత్రం జరగదు. వీరిద్దరి వంచనకూ సరైన గుణపాఠం చెప్పేలా ఉత్తరాంధ్ర ప్రజలు తీర్పు ఇవ్వాలి. ఈప్రాంతంలో నికరంగా, నిజాయితీగా ప్రజల సమస్యలపైన,గిరిజనుల,మత్స్యకారుల సమస్యలపైన, అక్రమ మైనింగ్‌ పైన, కాలుష్యకారక పరిశ్రమల పైన పోరాడిరదీ, ప్రజలను జాగృతం చేసిందీ కమ్యూనిస్టులు. ప్రభుత్వ రంగ పరిశ్రమలను పరిరక్షించుకునే ఉద్యమంలో ముందున్నదీ కమ్యూనిస్టులే. ఈకమ్యూనిస్టులు జనసే నతో, బిఎస్పీతో కలిసి ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. ఈకూటమిని బలపరచడం ద్వారా ఉత్తరాంధ్రకు కొంతైనా న్యాయం జరిగేలా చేద్దాం.

చిన్న రైతులు సతమతం

దేశంలో వ్యవసాయ కమతాలు నానాటికీ చిక్కిపోతున్నాయి. సాగు రంగానికి ఆలంబనగా ఉన్న చిన్న, సన్నకారు రైతులు అన్ని విధాలుగా చితికిపోతున్నారు. వ్యవసాయాన్ని ఏకంగా బడాసంస్థల పాలుచేసే ప్రభుత్వ ప్రయత్నాలు వారిని మరింత కుంగదీసేవే. కష్టనష్టాల కడలిలో చిక్కిన చిన్న రైతులను ఒడ్డున పడేసేందుకు సర్కారు సమగ్ర చర్యలు చేపడితేనే ప్రణాళిక లక్ష్యాలను చేరుకోగలం.దేశంలో సగానికి పైగా కమతాలు చిన్న, సన్నకారు రైతుల చేతిలోనే ఉన్నాయి. వీరి సంఖ్య పదికోట్లకు పైమాటే. వ్యవసాయమే వీరికి ప్రధాన ఆదాయ వనరు. ఏటా దాదాపు 15నుంచి 20లక్షలమంది చిన్న, సన్నకారు రైతులు అదనంగా చేరుతున్నారు.
వీరి కమతాల ఉత్పాదకత, నికర లాభాలు పెంచటానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్న దాఖలా లేదు. ఆహారభద్రత వంటి భారీ లక్ష్యాలు పెట్టుకొన్న ప్రభుత్వం,చిన్న,సన్నకారు రైతులను విస్మరిస్తే భంగపాటు తప్పదని గ్రహించాలి. వాస్తవంలో, కమతాల విస్తీర్ణం ఆధారంగానే రైతులను వర్గీకరిస్తారు. ఒకటి నుంచి రెండు హెక్టార్ల కమతమున్నవారిని చిన్న రైతులని, అర హెక్టారు నుంచి ఒక హెక్టారు కమతం విస్తీర్ణమున్న రైతులను సన్నకారు రైతులని అంటారు. దేశంలో నేడు రైతంటే చిన్న, సన్నకారు రైతులే. మొత్తం రైతుల్లో 80శాతానికి పైగా వీరే. వీరితలసరి కమతం పరిమాణం అయిదు ఎకరాలు. మనరాష్ట్రంలోనూ కమతాల విస్తీర్ణం తగ్గిపోతోంది. 2005-06లో రాష్ట్రంలో మొత్తం 1.44కోట్ల హెక్టార్ల సాగు భూమి ఉండేది. అయిదేళ్లలో అది 1.42కోట్ల హెక్టార్లకు పడిపోయింది. చిన్న కమతాల సంఖ్య పెరగటంతో కొంత భూమి సాగుకు అందకుండా పోయింది. రాష్ట్రంలో చిన్నకారు రైతుల తలసరి కమతం విస్తీర్ణం 0.7హెక్టార్లు. మొత్తం కమతాల్లో 84శాతం వీరివే. సగానికి పైగా సాగు విస్తీర్ణం ఈ రైతులదే. అధిక దిగుబడులతో ఆహార భద్రతకు వూతమిస్తున్నది చిన్న రైతాంగమే. పండ్లు, కూరగాయల సాగులో అధిక వాటా వీరిదే. 70శాతం కూరగాయలు, 55శాతం పండ్లు, 52శాతం ధాన్యపు గింజలు, 69శాతం పాల ఉత్పత్తి వీరి కృషి ఫలితమే.
అందని విస్తరణ సేవలు
పంట సాగులో రైతుల పెట్టుబడి ఖర్చులు తగ్గాలన్నా, నాణ్యమైన అధిక దిగుబడులు సాధించాలన్నా, వ్యవసాయ విస్తరణ సేవలు కీలకం. జాతీయ నమూనా సర్వే ప్రకారం రైతుకు అందుతున్న ప్రభుత్వ విస్తరణ సేవలు తొమ్మిది శాతమే. ప్రైవేటురంగమే నయం. వారినుంచి 19శాతం సలహాలు అందుతున్నాయి. కానీ, వారి సేవలవల్ల పంటల ఉత్పాదకత పెరగటం లేదన్నది నిజం. ఏటా దాదాపు లక్షకోట్ల రూపాయలకు పైగా వ్యవసాయ విస్తరణ, పరి శోధనపై ఖర్చుపెడుతున్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ, ఆపరిశోధన ఫలాలు రైతులకు అందడం లేదు. పంట రుణాల విషయంలోనూ అదే పరిస్థితి. సకాలంలో పంటల ఉత్పత్తికి కావలసిన కారకాల కొనుగోలుకు పరపతి ముఖ్యం. ప్రభుత్వాలు గొప్పగా చెబుతున్న పంట రుణాలు చిన్న రైతుకు అందటంలేదు. బ్యాంకుల నుంచి రైతులకు అందుతున్న పరపతి కేవలం 15శాతమే. చిన్న, సన్నకారు రైతుల్లో అత్యధికులు పరపతి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. పంటల మార్కెటింగ్‌లోనూ చిన్న రైతు చిత్తవుతున్నాడు. వీరి ఉత్పత్తుల పరిమాణం తక్కువగా ఉండటంవల్ల కనీస మద్దతు ధర పొందుతున్న సందర్భాలు చాలా తక్కువ. మార్కెట్ల అందుబాటూ అంతంతే. దేశంలో 30శాతం చిన్న, సన్నకారు రైతులకు నియంత్రిత మార్కెట్‌ సేవలు అందుబాటులో లేవు. వారు నేరుగా సంఘటిత మార్కెట్లోకి అడుగుమోపే అవకాశం లేదు. మార్కెటింగ్‌లో చిన్న, సన్నకారు రైతులను ఆదుకునేందుకు ‘రైతు ఉత్పత్తి సమాఖ్యలు’ ఏర్పాటు చేయాలని జాతీయ సలహా మండలి ఇటీవల ప్రభుత్వానికి నివేదించింది. దీనివల్ల చిన్న, సన్నకారు రైతులు సమాఖ్యగా ఏర్పడి, తమ ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేసుకుని, గిట్టుబాటు ధర పొందేం దుకు వీలవుతుంది. ఉత్పత్తి కారకాలు, ఆర్థిక పరపతీ ఈ సమాఖ్య నుంచే చిన్న, సన్నకారు రైతులకు అందుతాయి. ప్రస్తుత ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా చిన్న, సన్నకారు రైతులకు తగినంత పరపతి అందటం లేదు. ఈ సంఘాల్లో సభ్యత్వం పొందటానికి సొంత భూమి ఉన్న రైతులే అర్హులు. ఎక్కువ మంది చిన్న, సన్నకారు రైతులు చిన్న కమతాలతో కౌలుదారులుగా సాగు చేస్తున్నారు. పరపతి సంఘాల్లోని సభ్యుల్లో 20శాతం లోపే చిన్న, సన్నకారు రైతులున్నారు. ఈసమాఖ్యల్లో భూమితో సంబంధం లేకుండా వారికి సభ్యత్వం ఉంటుంది. దేశమంతటా ఈతరహా సమా ఖ్యలు స్థాపించి, అమలు చేయడానికి పన్నెండో పంచవర్ష ప్రణాళికలో మొత్తం రూ.3,600కోట్లు అవసరమని అంచనా. 15నుంచి 20 గ్రామాలకు కలిపి 1000 నుంచి 1200 మందితో ఒక్కో సమాఖ్య ఉంటుంది. ఒక్కో రైతుకు షేర్ల రూపంలో వాటా ఉండి-ఆ ప్రకారం ఆదాయం వస్తుంది. వీటి స్థాపన కోసం కంపెనీల చట్టంతోపాటు మార్కెట్‌ యార్డు చట్టంలోనూ మార్పులు చేయాలని సలహామండలి సిఫార్సు చేసింది. ఆ దిశలో ప్రభుత్వం ఎంత త్వరగా ముందడుగు వేస్తుందో చూడాలి!
సంస్కరణల దుష్ప్రభావం
ప్రపంచీకరణ, వాణిజ్య సరళీకరణా చిన్న రైతులపై దుష్ప్ర భావం చూపుతున్నాయి. ముఖ్యంగా పత్తి, నూనెగింజల సాగు, ధరల వంటివి విదేశీ వాణిజ్య ధోరణులపై ఆధారపడుతున్నాయి. ఈ పంట లను చిన్న, సన్నకారు రైతులే ఎక్కువగా సాగుచేస్తున్నారు. విదేశాల్లో ఎక్కువ సబ్సిడీలవల్ల ఆ ఉత్పత్తులు దేశంలోకి సులభంగా ప్రవేశించి
చిన్న, సన్నకారు రైతుల ఉత్పత్తుల మార్కెటింగ్‌ను పెంపొం దించడానికి ప్రభుత్వం కొన్ని ప్రత్యేక అవకాశాలు కల్పించాలి.ఆ ఉత్పత్తులు ప్రకృతి సహజమైనవి. ఎక్కువ సేంద్రీయ ఉత్పత్తులు. అందువల్ల వాటిని ప్రత్యేకంగా అమ్ముకోనివ్వాలి. ప్రతినియంత్రిత మార్కెట్లో మొత్తం ఉత్పత్తుల్లో 15నుంచి 20శాతం వరకు చిన్న, సన్నకారు రైతుల ఉత్పత్తులు ఉండేలా ఆదేశించాలి. మారుమూల గ్రామాల్లో సైతం తక్కువ మోతాదు ఉత్పత్తులను కనీస మద్దతుధరకు కొనుగోలు చేసే కేంద్రాలు ఏర్పాటు చేయాలి. చిన్న రైతుల కమతాలు, ఉత్పత్తులను దృష్టిలో ఉంచుకుని వారికోసం ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమాలు చేపట్టాలి. స్వయంసహాయక బృందాల మాదిరిగా ‘చిన్న రైతు సహాయక బ ృందాలు’ ఏర్పాటు చేసి, వారితోనే ఉత్పత్తులను కొనుగోలు చేయించి, ప్రభుత్వం ధర చెల్లించాలి. పన్నెండో పంచవర్ష ప్రణాళికలో సమ్మిళిత వ ృద్ధే లక్ష్యంగా పెట్టుకున్నారు. వ్యవసాయ వృద్ధిరేటు నాలుగు శాతంగా నిర్ణయించారు. ముఖ్యంగా చిన్న రైతుల అభివ ృద్ధితోనే అవి సాధ్యం. అందువల్ల వ్యవసాయ పరిశోధన, విస్తరణ కార్యక్రమాలను, వ్యవసాయ విధి విధానాలను చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం కలిగించే విధంగా రూపొందించాలి. చిన్న రైతుల చింత తీరేది అప్పుడే!-(రచయిత – డాక్టర్‌ పిడిగెం సైదయ్య)

మన మూల వాసులు

‘‘మనిషి మనుగడకు మూలం ప్రకృతి నుంచే మొదలయ్యింది. నాగరికతకు దూరంగా, ప్రక ృతిలో భాగంగా ఉండే అడవులు, కొండలు, కోనలు, వాగులు, వంకల్ని అంటిపెట్టుకొని ఇప్పటికీ కొందరు మనుషులు జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వారే దేశీయతెగలు, ఆదివాసీలైన మూలవాసులు. మనదేశంలో ఒక్కో మూల ఒక్కో ఆది వాసులకు సంబంధించిన మూలాలు కనిపిస్తాయి. మన దేశ కథ చెప్పాలంటే ముందుగా వీరి ఘట్టంతోనే మొదలుపెట్టాలి. మూలవాసులతోనే అసలైన భారతీయ సంస్క ృతిని ప్రపంచానికి చూపించాలి. అడవితో అను బంధాన్ని ఇంకా సజీవంగా మిగులుస్తోన్న ప్రకృతి బిడ్డల జీవనాన్నే ‘అబౌట్‌ ఇండియా’లో ముందుగా వివరించాలి. వివిధ ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందిన ఆతెగల ఆచారాలు, సాంప్రదాయాలకు సంబంధించిన విశేషాల సమాహారం ’’
ఆఫ్రికాలోని ఇథియోపియా, బ్రెజిల్‌లోని అమెజాన్‌ అటవీ ప్రాంతం పురాతన ఆటవిక తెగలకు స్థావరం అని ఎక్కువమందికి తెలుసు. మరి మనదేశంలోనూ అలాంటి తెగలు దాదాపు500పైగా తెగలుగా ఉన్నవారి గురించి తెలిసింది మాత్రం అతితక్కువమందికే. ఆహార్యం,భాష,నృత్యం, ఆచారాలు ఇలా ఈతెగల్లో ఎన్నోవైవిధ్యాలు ప్రత్యేకతలు కనిపిస్తాయి. అలాంటి తెగల్లో గోండ్‌తెగ ఒకటి. ఈతెగకు చెందినవారు చత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ జిల్లాతోపాటు, మహారాష్ట్ర, అంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నా అత్యధికó సంఖ్యలో గోండ్లు నివసిస్తోంది మధ్యప్రదేశ్‌లోని చింద్‌వారా జిల్లాలోనే. అడవికి దగ్గరలోని ప్రాంతాల్లో మారుమూల గ్రామాల్లో వీరు మట్టి ఇళ్ళను ఏర్పాటుచేసుకుని నివసిస్తుంటారు. ఇలా అధిక సంఖ్యలో గోండ్లు నివసించే కొన్ని ఆవాసాల్ని గోండ్ల గ్రామం అని పిలుస్తారు. ఇలాంటి మహారాష్ట్రలో మనకు ఎక్కువగా కనిపిస్తాయి. గోండ్ల గ్రామంలో ఒకగ్రామ పెద్దఉంటాడు. ఆయన్ని మాహజి/పటేల్‌ అనిపిలుస్తారు. ప్రతిగోండు గ్రామంలో గ్రామపెద్దతో పాటు ఒక మహిళ కూడా ఆ ఊరికి పెద్దదిక్కుగా ఉంటారు. వీళ్ళు జరుపుకునే పండుగల్లో వీరిరువురినీ ప్రత్యేకంగా అంలంకరించి సత్కరిస్తుంటారు. ఇక ఈతెగలో పేద ధనికలాంటి అసమానతలేవీ ఉండవు. ఈతెగ మహిళలు స్వయంగా ఎంపిక చేసుకున్న వ్యక్తులతోనే వారి వివాహాన్ని జరిపించే ఆచారం కూడా ఉంది. మహిళలు చీరల్ని మాత్రమే ధరిస్తారు. ఇక ఈతెగ మహిళల ఆహార్యం సాదాసీదాగానే ఉన్నా వృత్తాకారంలో సత్తుతో తయారుచేసిన కంఠాభరణాలతోపాటు, చెవిభాగంలో ధరించే పెద్ద రింగులతో ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తారు. మధ్యప్రదేశ్‌లో జరిగే మదాయి జాతర లో సాంప్రదాయ వస్త్రాలతో ఈతెగకు చెందిన స్త్రీ,పురుషులిరువురూ కలిసి చేసే నృత్యం కన్నుల పండుగగా ఉంటుంది. తెలంగాణలో నాగోబా జాతర గోండు తెగలు విశేషంగా జరుపుకునే పండుగ. ఈ తెగ ఎక్కువగా తీసుకునేది మాంసాహారమే అయినా, కొడొ, కుట్కి చిరుధాన్యాలతో చేసే వంటకాలను వీళ్ళు ఎక్కువగా ఆహారంగా తీసుకుంటారు. గోండీ వీరిప్రధాన భాషే అయినా, మనదేశంలో వివిధ రాష్ట్రాల్లో సంచార జీవనం కొనసాగించే ఈ తెగలో చాలా మందికి తెలుగు, హిందీ, మరాఠీ, పారీభాషలతోపాటు ఇతర ద్రవిడ భాషలూ తెలుసు. కమ్మరి, పశువుల కాపరి, డప్పు వాద్యంలాంటి వృత్తుల్లో ఈ తెగకు చెందిన పురుషులు కొనసాగుతున్నారు.
గూమర్‌ పుట్టిందిక్కడే…రాజస్థాన్‌కు చెందిన ఒక ప్రధాన తెగ భిల్‌. దుంగార్‌పూర్‌, బన్స్‌వారా జిల్లాలతోపాటు ఉదరుపూర్‌లోని సిరోహి ప్రాంతంలో ఈ తెగ నివాసాలు కనిపిస్తాయి. వీళ్ళ వస్త్రధారణ దాదాపు రాజస్థానీ సాంప్రదాయ దుస్తులని పోలుంటుంది. ఈ తెగ మహిళలు కంచుతో చేసిన వివిధ రకాల ఆభరణాల్ని ధరిస్తారు. సంగీతం, నృత్యానికి ఈతెగలో ఎక్కువ ప్రాధాన్యత కనిపిస్తుంది. భిల్‌ తెగలో జరిగే పండుగలను గ్రామ పెద్ద నిర్వహిస్తుంటారు. వారిని భగత్‌ అని పిలుస్తారు. ఈతెగ జరుపుకునే పండుగల్లో బనేశ్వర్‌ జాతర ప్రధాన పండుగ. ఈపండుగ సమయంలోనే మహిళలు గూమర్‌ నృత్యాన్ని ప్రదర్శిస్తుంటారు. అంటే..రాజస్థాన్‌ సాంస్క ృతిక ప్రతీకగా చెప్పుకునే గూమర్‌ న ృత్యానికి ఊపిరి పోసింది ఈ తెగ మహిళలేనన్న మాట. ఈ తెగలో ప్రదర్శించే మరో ప్రధాన నృత్యం గైర్‌జ. ఇక ఈ తెగలో దేవతారాధన ఉన్నా వాటికి సంబంధించి ఎలాంటి గుళ్ళూ కనిపించవు. స్థానికంగా ఉండే మిగతావాళ్ల ఆలయాల వద్దే వీరి పండుగలకు సంబంధించిన వేడుకలు జరుగుతుంటాయి. వేటతెగలో ప్రధాన లక్షణంగా ఉన్నా ప్రస్తుతం జీవనోపాధి కోసం ఎక్కువ మంది వ్యవసాయం, పశుపోషణలో కొనసాగుతున్నారు. ఇక తెగలో మహిళలు ఎక్కువ ధైర్య సాహసాల్ని కలిగుంటారు.
తిరుగుబాటు తెగ
బాంగ్లాకు చెందిన పురాతన తెగ సంతల్‌. బెంగాల్‌లోని బంకుర, పురులియా జిల్లాల్లో తెగకు చెందిన వారు కనిపిస్తారు. బాంగ్లాతోపాటు జార్ఘండ్‌్‌,ఒడిశా,అస్సోంరాష్ట్రాల్లో నివసిస్తున్న ఈ తెగ మొత్తం జనాభా 49 వేలు. వీరిప్రధాన భాష సంతలితోపాటు బెంగాలీ, ఒరియా, హిందీ భాషలను కూడా మాట్లాడుతుంటారు. వేటతోపాటు అరణ్య ప్రాంతాల్లో లభించే పళ్ళు, కాయల్ని ఈ తెగ ప్రధాన ఆహారం గా ఉంటుంది. వీరు నిర్వహించే ప్రతి చిన్న వేడుకలో నృత్యం తప్పని సరిగా ఉంటుంది. ఈ తెగలో పురుషులు ఫ్లూట్‌తోపాటు తుండక్‌, తమక్‌,జున్కొ,సింగా ఇలా రకరకాల వాద్యపరికరాలను తయారు చేస్తుంటారు. వీరునిర్వహించే పండుగల్లో కరమ్‌ ఒక ప్రధాన పండుగ. సెప్టెంబర్‌ అక్టోబర్‌ నెలల మధ్య జరపుకునే ఈ పండుగలో మహిళలు తలపై ఒక కూజాను ఉంచుకొని చేసే నృత్యం కన్నుల పండుగగా ఉంటుంది. బ్రిటీష్‌ తిరుగుబాటు ఉద్యమాల్లోనూ ప్రధాన పాత్ర పోషిం చిందీ తెగ.
మాతృస్వామిక తెగ
మిజోరాంకు చెందిన గారొ తెగ మాతృస్వామ్య వ్యవస్థ కలిగుంటుంది. ఇక్కడ అన్ని పనులకూ నాయకత్వం వహించేది మహిళలే. కుటుంబ పోషణతోపాటు, ఆర్థిక విషయాలనీ గారొ తెగలో మహిళలే చూసు కుంటారు. అలా మనదేశంలోమాతృస్వామిక వ్యవస్థ కొనసాగుతున్న తెగల్లో గారొ ప్రముఖ స్థానాన్ని దక్కించు కుంది. మిజోరాంతోపాటు మేఘాలయ, అస్సోం, త్రిపుర, నాగాల్యాండ్‌ రాష్ట్రాల్లో ఈ తెగ మనుగడ సాగిస్తోంది. గారొ తెగ వారిని చిక్‌ మంన్డే అని పిలుస్తారు. చిక్‌ మంన్డే అంటే కొండ ప్రజలు అని అర్థం. మేఘాలయాలోని ఘరో కొండ ప్రాంతంలో ఎక్కువగా నివసించే ఈ తెగ ద్వారా వారికి ఆ పేరొచ్చింది. బర్మా, టిబెట్‌ దేశాల్లో కూడా ఈ తెగ విస్తరించింది. ఈతెగలో మహిళలు వివిధ లోహాలతో తయారుచేసే ఆభరణాలను ఎక్కువగా ధరిస్తుంటారు. వంగ్ల వీళ్ళ ప్రధాన పండుగ. పండుగ సమయంలో అంద మైన వస్త్రధారణతోపాటు వీరి నృత్యాలు కన్నులపండువగా ఉంటాయి. పంచెకట్టుతోపాటు తలపాగ ఈ తెగ పురుషుల ప్రధాన వస్త్రధారణ. ఈ తెగలో ఆడ మగ ఇరువురూ కొప్పుభాగంలో ఈకల్ని తప్పనిసరిగా ధరిస్తారు. గారో తెగ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఒకటుంది. అదేంటంటే వీళ్ళు ఇళ్ళు కట్టడంలో ఆరి తేరినవారు. వెదురు వాసాలు, రెల్లు గడ్డిని ఉపయోగించి వీరు నిర్మించుకునే ఇళ్ళలో బహుళ అంతస్తులతోపాటు, గదులు గదులుగా ఈ ఇళ్ళని నిర్మించే తీరు ఆకట్టుకుంటుంది. ఈ ఇళ్ళను ఎంతో అందంగా అలంకరించుకుంటారు.
జిప్సీస్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌…
తెలుగు రాష్రాల్లో ప్రధాన తెగలుగా చెంచులు, గడబలు, గోండ్లు, అన్ధ్‌, బొండ పురజలు, కోయ, లంబాడీలు, సవరలు ఇలా కొన్ని తెగల పేర్లు వినిపిస్తాయి. చెంచులు శ్రీశైలం పర్వత ప్రాంతాలకు చెందినవారైతే, గడబ, కోయ తెగలు భద్రాచలం స్థానికత కలిగిన వారిగా చరిత్రకారులు చెబుతుంటారు. ప్రస్తుతం ఈ తెగల్లో అత్యధిక జనాభా ఉంది సవరలు, లంబాడీ తెగల్లోనే. విజయనగం, విశాఖ పట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో స్థానిక తెగలుగా ఉన్న సవరల సంఖ్య తెలుగు రాష్ట్రాల్లోని అన్ని తెగల జనాభా కంటే ఐదు శాతం ఎక్కువ. సవరలు ఎక్కువగా ఒకబృందంగా ఉంటారు. ఒక వరుసలో వీరి ఇళ్లను ఏర్పరుచుకుంటారు. ఈతెగలో ఉమ్మడి కుటుంబాలే ఎక్కువ. ఈ తెగకు చెందిన వారు ఎక్కువగా వ్యవసాయం, కమ్మరి, మేదరి, కుమ్మరి వృత్తుల్లో కొనసాగుతున్నారు. ఇలా వీరు నిర్వహించే వృత్తుల్ని బట్టి జాతి సవర, అర్సి, ములి, కిందల్‌, కంబి సవరల్లో ఉపతెగలుగా ఉన్నాయి. ఈతెగలో మహిళలు ఎక్కువగా ముక్కు బులాకీ లతో కనిపిస్తారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికంగా కనిపించే తెగ లంబాడీలు. వీరినే గోర్‌ బొయలి, బంజారా ఇలా చాలా పేర్లతో పిలుస్తుంటారు. భారత్‌లో వివిధ రాష్ట్రాలో లంబాడీ తెగను బంజారాలుగా పిలుస్తారు. వ్యవసాయం, పశుపోషణలో ఎక్కువగా ఈతెగ ప్రజలు కొనసాగుతున్నారు. లంబాడీ తెగలు నివసించే ప్రాంతాల్ని తాండ అని పిలుస్తారు. అన్ని తెగల కంటే వీరి వస్త్రధారణ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మహిళలు గాగ్రాచోళీలో బాటు తలపై ఒక వస్త్రాన్ని ధరిస్తారు. కంచు, ఇతర లోహాలతో చేసిన వివిధ రకాల ఆభరణాల్ని మహిళలు ధరిస్తారు. ఇక తెగలో మహిళలు భుజాల వరకు సత్తు, కంచుతో చేసిన గాజుల్ని ధరించడం ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఆధునిక సమాజానికి దగ్గరగా ఉండే ఈ తెగను ‘జిప్సీస్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌’గా ఒకప్పుడు బ్రిటిషర్లు పిలిచేవారు. ఎక్కువగా అలంకరణ వస్తువుల్ని ధరించి నిండుగా కనిపించే ఈ తెగమహిళల ద్వారా లంబాడీ తెగకు ఆ పేరొచ్చింది.
వీరు మాత్రమే కాదు, ఆఫ్రికా మూలాల్ని ఇప్పటికి పదిలపరుచుకున్న సిద్దీస్‌, భారత్‌లోనే ఉంటూ ఒంటరిగా కనిపించే అండమాన్‌ జార్వాలు, సెంటినల్స్‌, ఇంకా ఆదీవాసీ వైవిధ్య ఛాయల్ని మిగుల్చుకున్న ఈశాన్య రాష్ట్రాల కాసీ, ఆగామీలతో పాటు మూన్ద్‌, భూటియా, కొడవ, టోటో, ఇరులాస్‌, నైషి, వార్లి, తోడ, కురుంబన్‌, సొలుగ, లాంటి భారతీయ స్థానికతను కలిగున్న తెగలన్నీ సంస్క ృతి, సాంప్రదాయలు, ఆచారాల్లో తమ ఔన్నత్యాన్ని చాటుతున్నాయి.-అద్దేపల్లి శర్వాణి

గ్రామీణ ఉపాధి హామీకి తూట్లు

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రావటానికి కారణమైన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒకవిలక్షణ స్వభావం ఉంది. కావాలని అడిగిన తరువాత ఒకపక్షం రోజుల్లోఉపాధి అందించాలని చట్టం చెబుతోంది. అలా ఉపాధి అందించలేనప్పుడు నిరుద్యోగ భృతి చెల్లించాలని కూడా ఈచట్టం చెబుతోంది. ఈచట్టం గ్రామీణ ప్రాంతాలకే పరిమితమైందనేది నిజం. అయితే ఇది ఉపాధిని హక్కుగా మార్చింది. బాగా చర్చించిన తరువాత పార్లమెంటు ఈ చట్టాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. భారత రాజ్యాంగం సామాజిక, రాజకీయ హక్కులకు మాత్రమే హామీ ఇచ్చి ఆర్థిక హక్కులను విస్మరించిందనే లోపాన్ని…ఈ చట్టాన్ని రూపొందించి ఆచరణలో పార్లమెంట్‌ సరిదిద్దింది.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో ఒక నూతన పరిస్థితి ఏర్పడిరది. గతంలో కూడా పేదరికం నిర్మూలనకు ఉద్దేశించిన పనికి ఆహారం వంటి పథకాలున్నాయి. అయితే వాటిలో హామీలు ఏమీ లేవు. వాటికి బడ్జెట్‌ కేటాయింపులు ఉండేవి. అవి ప్రతి సంవత్సరం మారుతూ ఉండేవి. ఆకేటాయింపులు ఒక్కోసారి పెరగటం, మరోసారి తరగటం జరిగేది. అయితే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వీటికి పూర్తిగా భిన్నమైంది. ఈచట్టం ఉపాధికి హామీని ఇచ్చింది. ఆ క్రమంలో ఆర్థిక హక్కును స ృష్టించటమే కాకుండా పౌరసత్వ భావనకు లోతైన అర్థాన్ని ఇచ్చింది. బిచ్చగాళ్ళతో సహా ప్రతి పౌరుడు తాను కొన్న సరుకులపై పరోక్ష పన్నుల రూపంలో ప్రభుత్వానికి పన్ను కడతాడు. కానీగతంలో రాజ్యం అందుకు బదులుగా ఆచరణలో పౌరులకు ఏమీ చేసేదికాదు. అది పౌరులకు ‘భద్రత’ను కల్పించిందని ఎవరైనా చెబితే అదిచాలా చిన్న విషయం అవుతుంది. ఎందుకంటే పేదలకు ‘భద్రత’ కల్పించటం అర్థరహితం అవుతుంది. అందుకు భిన్నంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఒక నూతన శకానికి తెర లేపుతున్నానని వాగ్దానం చేసింది. ఈ పథకం ద్వారా రాజ్యం తన పౌరులకు కొంతవరకు ఆర్థిక భద్రతను కల్పించటానికి ముందుకు వచ్చింది. అంటే పేదలకు అది ఎంతోకొంత మేలు చేస్తుంది.
ఈపథకం కింద ఉపాధిని పొందుతున్నవారిలో 40శాతం దళిత, ఆదివాసీ కుటుంబాలకు చెందినవారే. పాలక వర్గాలకుండే కుల వివక్ష,వర్గవైషమ్యాల కారణంగాను ఈవాగ్దానం అమలులో తీవ్రమైన ఒడిదుడుకులు ఏర్పడ్డాయి. యుపిఏ-2 పాలనలో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి చేయవలసిన వాస్తవ బడ్జెట్‌ కేటాయింపులలో కోతను విధించటం ద్వారా ఈ పథకానికి తూట్లు పొడవటం మొదలయింది. ‘ఈ పథకం డిమాండ్‌ ను అనుసరించి అమలు చేసేది. కనక అవసరమైతే అదనపు కేటాయిం పులు చేయటం జరుగుతుంది. బడ్జెట్‌లో చేసిన కేటాయింపులనుబట్టి అభిప్రా యానికి రాకూడదు’ అంటూ ఈపథక కేటాయింపులకు కోత పెట్టడాన్ని ఆయన సమర్థించుకున్నారు. అయితే అలాచేయటంవల్ల కేటాయింపులకు మించి డిమాండ్‌ ఏర్పడినప్పుడు వేతన బకాయిలు పోగుపడ్డాయి. కేటాయింపుల కంటే డిమాండ్‌ నిరంతరం పెరుగుతుం డగా ఒకవేళ కేటాయింపులను పెంచకపోతే కాలక్రమంలో వేతన బకాయిలు పెరిగి పోతాయి. ప్రస్తుతం ఈవిషయంలో సరిగ్గా ఇదే జరుగుతోంది. వేతన బకాయిలు నిరంతరం పెరిగి పోతున్నాయి. అంటే సంవత్సరకాలంలో అనేక మంది కార్మికులకు వేతనాలు అందవు. అంతే కాకుండా వేతనాలను అందుకోవటానికి పట్టే సగటు కాలం కూడా నిరంతరం పెరుగుతూ ఉంటుంది. వేతనాలు సకాలంలో అందని స్థితిలో కార్మికులు ఈపథకం నుంచి నిష్క్రమించటం మొదలెడ తారు. తత్ఫలితంగా ఈ పథకంకింద పనికి వుండే డిమాండ్‌ ఏదో ఒక స్థితిలో దెబ్బ తింటుంది. అదే సమయంలో చట్టప్రకారం నిరుద్యో గానికి చేయవలసిన చెల్లింపులు చెల్లించకుండా, కనీసం తగిన సమయంలో పేర్లు నమోదు చేసుకున్న వారికి కూడా పని ఇవ్వకుండా, దరఖాస్తు దారులను రిజిస్టరు చేయకుండా డిమాండ్‌ను తగ్గించే ధోరణి కనపడుతోంది. ఒక ఆర్థిక హక్కుగా ఉండవలసిన హక్కును నిర్వీర్యం చేయటం జరుగుతోంది. రాజ్యం దయాదాక్షిణ్యాలతో పేదలకు ఎంతోకొంత ఉపశమనం అందించే మరో పేదరిక వ్యతిరేక కార్యక్ర మంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మార్చటం జరిగింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పేదరిక వ్యతిరేక కార్యక్రమంగా కూడా గణనీయమైన విస్త ృతి ఉంది. ఈకార్యక్రమం మొదలయినప్పటి నుంచి దేశం లోని ప్రతి మూడు గ్రామీణ కుటుంబాలలో ఒకదానికి ఎప్పుడో ఒకప్పుడు పని దొరికింది. 2017-18లోనే ఈ కార్యక్రమం కింద ఎనిమిది కోట్ల మంది ప్రజలకు పనిదొరికింది. ఆసంవత్సరంలో ప్రతి కుటుం బానికి సగటున 46 రోజులపాటు పని దొరికింది. ప్రపంచంలోనే అత్యంత ఉద్యోగితను స ృష్టించే పథకం ఇది. అయితే రానురాను ఈ కార్యక్రమానికి చేసే కేటాయింపులు తగ్గుతూ వస్తున్నాయి. నిజానికి ఇది ఉపాధి హామీ పథకం అవటం అటుంచి ఉపాధిని సృష్టించే కార్యక్రమంగా కూడా దీని విస్తృతి కుచించుకు పోతున్నది. ఇంతకు ముందే చెప్పినట్టు ఒకవేళ ఈపథకానికి చేస్తున్న కేటాయింపులు నిలకడగా ఉన్నట్టయితే లేక ప్రతిసంవత్సరం కావలసిన దానికంటే కేటాయింపులు తక్కువగా వుంటే కాలక్రమంలో వేతన బకాయిలు పెరుగుతాయి. అటువంటి పరిస్థితులలో నికర కేటాయింపులు, నికర వేతన బకాయిలు తగ్గుతాయి. అయితే వాస్తవంలో జరుగుతున్న దేమంటే చేస్తున్న కేటాయింపు లలో నిలకడ ఉండటం లేదు. నికర కేటాయింపులు తగ్గటం వలన నికర వేతన బకాయిలు కూడా గణనీ యంగా తగ్గాయి. ఉదాహరణకు 2017-18 సంవత్సరంలో ద్రవ్యోల్బణం సర్దుబాటు చేసిన తరువాత జరిగిన కేటాయింపు 2010-11సంవత్సరంలో జరిగిన కేటాయింపు కంటే తక్కువగా ఉంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2012-13లో కాలయాపనతో జరిగిన వేతన చెల్లింపులు 39 శాతం ఉండగా 2016-17లో కాలయాపనతో జరిగిన వేతన చెల్లింపులు 56 శాతంగా ఉండటంలో ఆశ్చర్యం ఏమీ లేదు.
వేతన బకాయిలను కూడా లెక్క లోకి తీసుకోకుండా చేసే స్థూల కేటాయింపులో తగ్గుదల స్థూల జాతీయోత్పత్తితో పోల్చి చూసిన ప్పుడు చాలా తీవ్రంగా ఉంది. ఈ కార్యక్రమం సరిjైున రీతిలో నడవాలంటే స్థూల జాతీయోత్పత్తిలో 1.7శాతం కేటాయించాలని ప్రపంచ బ్యాంకు కూడా అంచనా వేసింది. అందుకు భిన్నంగా 2017-18 సంవత్సరంలో జరిగిన కేటాయింపు (వాస్తవంలో చేసిన వ్యయం కాదు) కేవలం 0.28 శాతం మాత్రమే. 2010-11సంవత్సరంలో 0.58 శాతంగాను, 2011-12 సంవత్స రంలో 0.34 శాతంగాను ఉన్న కేటాయింపుల కంటే 2017-18 సంవత్సరంలో చేసిన కేటా యింపు తక్కువగా ఉంది. వాస్తవ వ్యయాలను, అంతకు ముందటి సంవత్సరాల నికర రుణాలను చూసినప్పుడు స్థూల జాతీయోత్పత్తిలో అటువంటి నికర వ్యయం వాటా 2012-13వ సంవత్సరంలో 0.36 శాతంఉంటే 2016-17సంవత్సరం కల్లా అది 0.30 శాతం కంటే కిందకు దిగ జారింది. కాబట్టి మనం ఏవిధంగా చూసినప్పటికీ స్థూల జాతీయోత్పత్తిలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం కేటాయిస్తున్న నిధుల శాతం సాపేక్షంగా చూసినప్పుడు కాలక్రమంలో తగ్గిపోతున్నది. అయితే వేతనాల చెల్లింపులు సకాలంలో జరగటం లేదనే వాస్తవాన్ని ప్రభుత్వం అంగీకరించటం లేదు. నిజానికి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేసే వేతనాల చెల్లింపులలో 90శాతం15రోజులలోపు జరుగుతున్నా యని ప్రభుత్వం అంటోంది. అయితే ఇది పూర్తిగా అబద్దం. 3500 గ్రామ పంచాయతీలను ఒకశాంపిల్‌గా తీసుకుని ఒక పరిశోధకుల బృందం సవివరంగా చేసిన అధ్యయనాన్ని జనవరి 4న కొత్త ఢల్లీిలో ఏర్పాటు చేసిన ఒకపత్రికా సమావేశంలో విడుదల చేశారు. ఈఅధ్య యనం ప్రకారం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జరిగిన పనికి చేయవలసిన వేతన చెల్లింపులు సగటున 50 రోజులు ఆలస్యంగా జరుగు తున్నాయి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కార్మికులకు ఎదురవు తున్న ఇతర ప్రతిబంధకాలకు అదనంగా సకాలంలో అందవలసిన వేతనాలను ఆధార్‌తో లింకు చేయాలని అంటున్నారు. తత్ఫలితంగా ఈ కార్యక్రమం కింద లభిస్తున్న పనికిగల డిమాండ్‌ మందగిస్తుంది. వాస్తవంలో డిమాండ్‌ చేసిన పనిని కూడా ఇవ్వటంలేదు. అటువంటి పరిస్థితిలో చట్ట ప్రకారం చెల్లించవలసిన నిరుద్యోగ భృతి కూడా చెల్లించటం లేదు. నిజానికి మహాత్మా గాంధీజాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఒకడిమాండ్‌ ఆధారిత కార్యక్రమంగా పని చేయటం లేదనేది సుస్పష్టం. అందుకోసం అందుబాటులో ఉంచే వనరులపై దాని విస్తృతి ఆధారపడి ఉంటుంది. ఒకడిమాండ్‌ ఆధారిత కార్యక్రమానికి వనరులు అందుబాటులో లేకపో వటమనే పరిస్థితిలో వైరుధ్యం ఉంది. అటువంటి కార్యక్రమానికి ముందుగా బడ్జెట్‌లో కేటాయింపులు ఉండాలి. నిధులు అందుబాటులోఉండటాన్ని బట్టి ప్రజల ఆర్థికహక్కును ప్రతిబింబించే అటువంటి కార్యక్రమాన్ని నిర్వహించటం జరగ కూడదు. ఇటువంటి పథకానికి నిధులను కేటాయించటం కోసం ప్రజల హక్కును ప్రతిబింబించని కార్యక్రమాలపై ప్రభుత్వం చేసే వ్యయాన్ని తగ్గించుకోవాలి. అయితే ఆచరణలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉందని మనం గమనిస్తాం. అంటే ఇతర వ్యయాలకు ప్రాధాన్యతను ఇచ్చిన తరువాత మిగిలిందే ఈ పథకానికి కేటాయింపులు జరుగుతున్నాయి. పర్యవసానంగా పనికిగల డిమాండ్‌ ను అనుసరించి చేయవలసిన వ్యయానికి సరిపడా నిధులు అందుబాటు లో ఉండటం లేదు. పైన పేర్కొన్న అధ్యయనం ప్రకారం పని కోసం వస్తున్న డిమాండ్‌లో భాగంగా అధికారికంగా రిజిష్టర్‌ చేసుకున్న వారిలో కూడా 68శాతం కంటే ఎక్కువ మందికి వాస్తవంలో పని కల్పించటం లేదు. అధికారికంగా రిజిష్టర్‌ చేసుకున్న పని డిమాండ్‌లో వాస్తవంలో సగం మందికి కూడా అందుబాటులోకి రావటం లేదు. ఈనిష్పత్తి పెరుగుతూ ఉంది. ఆవిధంగా ప్రజల ఆర్థిక హక్కు రద్దవు తోంది. ఇది ఈచట్టాన్ని చేసిన పార్లమెంటుపై దాడితో సమానం అవుతుంది. ఈపథకాన్ని ఉద్యోగితను సృష్టించే సామాన్యమైన కార్యక్ర మంగా తీసుకున్నా దీని విస్తృతి కాలక్రమంలో తగ్గిపోయింది. ఇదో విపరీత స్థితి. దేశంలో వేగంగా పెరుగుతున్న నిరుద్యోగితపై చాలా కాలం తరువాత దృష్టిని కేంద్రీకరించారు. అటువంటి నిరుద్యోగంపై అన్ని ప్రభుత్వ వ్యయాలకంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఒక బ్రహ్మాండమైన ఆయుధంగా పని చేయగలదు. ఒకవేళ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని అనుకుంటే ఈపథకాన్ని నిర్వీర్యం చేయటానికి బదులుగా దానిపై మరింతగా వ్యయం చేయాలి. అయితే ప్రస్తుత ధోరణి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేదిగానే ఉంది.- కందుకూరి సతీష్‌కుమార్‌

వేతనాల్లో వృద్ధిలేమి-ప్రభుత్వ నిర్లక్ష్యం

వివిధ దేశాల్లో చెల్లిస్తున్న వేతనాల వ ృద్ధిపై ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌(ఐఎల్‌ఒ) గత నెల26న విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం వేతనాల వృద్ధిలో, అసమానతల్లో, లింగవివక్షా పూరిత వేతనాల్లో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. సంపద ఏ స్థాయిలో పెరిగితే అదేస్థాయిలో దానికి కారకులైన వారి సంపాదనల్లోనూ మార్పు రావాలి. అలా రానప్పుడే సామాజిక సమతుల్యత దెబ్బ తింటుంది. ఐఎల్‌ఒ నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా, 2016లో 2.4శాతం వేతన వృద్ధి ఉంటే, 2017లో అది1.8శాతానికి పడిపో యింది. ఇవే వివరాల్లో చైనాను మినహా యించి చూస్తే, ప్రపంచ వేతన వృద్ధి, 2016లో 1.8శాతంగా ఉంటే 2017లో 1.1శాతానికి పడి పోయింది. చైనా ఎక్కువ జనాభా ఉన్నప్పటికీ కూడా తదనుగుణంగా ఘనమైన వేతన వ ృద్ధి సాధిస్తూ ప్రపంచ సగటుకు తోడ్పాటునిస్తున్నది. ఐఎల్‌ఒ వెలువరించిన ఈ వృద్ధి, నిజ వేతనం, అనగా ద్రవ్యోల్బణంతో సరిచూసి లెక్కించగా నమోదైంది. అయితే ఇది 2008 తరువాత అత్యంత తక్కువ వ ృద్ధిగా ఇప్పుడు నమోదయింది. అభివృద్ధి చెందిన జీ20 దేశాలలో 2015లో 1.7శాతంగా ఉంటే 2016లో 0.9 శాతానికి పడిపోయింది. 2017లో 0.4శాతానికి పడిపోయింది. ఐరోపాలో 2015లో 1.6శాతానికి, 2016లో 1.3శాతానికి, 2017 లో 0 (సున్నా)గా నమోదయింది. అమెరికాలో చూసినట్టయితే 2015 లో 2.2శాతం, 2016లో 0.7శాతం, 2017 లోనూ 0.7శాతం నమోదయింది. ఇలా తక్కువ వేతన వృద్ధి కనబరిచిన దేశాలన్నింటి లోనూ వారి వారి జీడీపీలు పెరుగుతున్నాయి. అయినప్పటికీ వేత నాలలో వృద్ధి ఎందుకు కనిపించడం లేదు? 2015లో అమెరికా సంపద 17ట్రిలియన్‌ డాలర్లు ఉంటే 2017లో 21ట్రిలియన్‌ డాలర్లకు చేరింది. మరి వేతనాలలో వృద్ధి ఎందుకు కనిపించడం లేదు? దీనిని బట్టి ఎక్కువ ఆదాయం కలిగిన దేశాలలో వేతన వృద్ధి మందగిం చిందని అర్థం. సంపద స ృష్టిస్తున్న కార్మికులకు సరైన వాటా రావటం లేదు. అందుకే గతేడాది వెలువడిన ఆక్స్‌ఫామ్‌ నివేదిక ప్రకారం ప్రపంచంలో సృష్టించిన సంపదలో 82శాతం సంపద ఒక శాతం ప్రజల దరికి చేరుతుంది అనే వాస్తవం దీనిద్వారా తేటతెల్లమవుతోంది. సంపద పోగు పడడానికి శ్రామికులకు చెల్లించకుండా ఉంటేనే సాధ్యమవు తుందనే సత్యం మళ్లీమళ్లీ రుజువుతోంది. వేతనాల వృద్ధి మందగించడానికి 3 కారణాలుగా ఐఎల్‌ఒ ప్రకటించింది. 1.ఉత్పత్తిలో గణనీయమైన నెమ్మది ఏర్పడిరది. 2. ప్రపంచ పోటీతత్వం పెరిగింది. 3. కార్మికులు బేరమాడే శక్తి కోల్పోయారు. ఉత్పత్తిలో నెమ్మదస్తత ఏర్పడటానికి కారణం సరైన డిమాండు లేకపోవడం, ఈ డిమాండు ఉండాలంటే ప్రజల్లో కొనుగోలుశక్తి ఉండాలి. ఈశక్తి ఉండాలంటే పనికిదగ్గ ప్రతిఫలం ఉండాలి. కానీ పెట్టుబడిదారుల అత్యాశను కట్టడి చేయనంత వరకు ఈసంక్లిష్టత అధిగమించడం కష్టమే. ఇక పోటీ తత్వం కారణంగా సంయోగాలూ సంలీనాలతో చిల్లర వర్తకాన్ని దెబ్బ తీయడంతో వినియోగానికి సరుకు అందుబాటు తగ్గి ఉత్పత్తి నెమ్మది స్తుంది. మొదటి రెండు కారణాలతో పాటు కార్మిక చట్టాలను నీరుగా ర్చటం, ఆశ్రిత పెట్టుబడిదారీతనం ఎక్కువవడం, పెరుగుతున్న నిరు ద్యోగం, పెరిగిన పెట్టుబడిదారీ ఆధిపత్యం దృష్ట్యా కార్మికులు బేర –జి. తిరుపతయ్య

కల్వకుంట్ల చంద్రశేఖర్‌ అనునేను

తెలంగాణలో రెండోసారి ప్రభుత్వం ఏర్పాటైంది. ఈఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌ నేతృ త్వంలోని కేసీఆర్‌కే మళ్లీ పట్టం కట్టారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు తెలంగాణ ఎన్నిక లను కూడా యావత్‌ దేశం ఆసక్తిగా పరిశీలించింది. కాంగ్రెస్‌, టీడీపీ తమ మధ్య ఉన్న వైరాన్ని పక్కనబెట్టి సీపీఐ, టీజేఎస్‌తో కలిసి ప్రజా కూటమిగా ఏర్పాటుకావడం ఒకటి కాగా..రెండోది గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు భారీ మొత్తంలో ధన ప్రవాహాన్ని పారించడం ఈఎన్నికల ప్రత్యేకతలు. ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్‌ కేంద్రాలకు పోటెత్తిన ఓటర్లు టీఆర్‌ఎస్‌కు భారీ మెజార్టీ ఇచ్చారు. మొత్తం 119 స్థానాలకు 88 సీట్లలో టీఆర్‌ఎస్‌ గెలిచింది. గత నాలుగున్నరేండ్లలో చేపట్టిన సంక్షేమ పథకాలు, సబ్సిడీలు కొనసాగించాలంటే స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే సాధ్యమవుతుందనే ఉద్దేశంతో తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు పట్టం కట్టారు. -ఎన్‌.వేణుగోపాల్‌
ప్రజలు ఇచ్చిన తీర్పును ఏరాజకీయ పార్టీ అయినా గౌరవించాల్సిందే. తెలంగాణ ప్రజలు ఇచ్చిన ఈ గొప్ప విజయంతో రెట్టింపు ఉత్సాహంతో ప్రభుత్వం పనిచేయాల్సిన బాధ్యత ఉంది. గత పర్యాయంలో ఇచ్చి నెరవేర్చలేకపోయిన హామీలను సైతం అమలు చేయడమే కాకుండా కొత్తగా మరిన్ని అభివ ృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపడితే తెలంగాణ సమాజానికి మేలు జరుగుతుంది. ప్రభుత్వ పనితీరును బట్టే ప్రజా తీర్పు ఉంటుందనే విషయాన్ని ఈఎన్నికలు స్పష్టంచేసినట్టు కనబడుతోంది. మిగతా నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు చాలా మెరుగైన ఫలితాలు వచ్చాయి. 2019 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా చెప్పుకొనే ఈ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలి వీచింది. ఎన్డీయే సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీతో పాటు నిత్యావసర ధరల పెంపుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వీటితో పాటు సీబీఐ, సుప్రీంకోర్టు, ఈడీ,ఐటీ తదితర స్వతంత్ర వ్యవస్థల్లో జోక్యం చేసు కుంటూ వాటిని నిర్వీర్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం ప్రవర్తిస్తోందనే విమర్శలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజలు ఇచ్చిన తీర్పు ఆయా రాజకీయ పార్టీలకు గుణపాఠం చెప్పేదే.
రెండోసారి గెలిచిన వెంటనే.. కోటిఎకరాల మాగాణికి సాగునీరందించడం, యువతకు ఉపాధి అవకాశాల కల్పనే తమ తక్షణ కర్తవ్య మని ప్రకటించిన కేసీఆర్‌.. ఆదిశగా సత్వరమే చర్యలు తీసుకోవాలి. విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేయాలి. ప్రజల మౌలిక అవస రాలకు సంబంధించిన అంశాల్లో కార్పొరేట్‌ వ్యవస్థల గుత్తాధిపత్యానికి చరమగీతం పాడే లా విప్లవాత్మక సంస్కరణలు తీసుకొస్తే యావత్‌ సమాజం హర్షిస్తుంది. ప్రజలు ఇచ్చి న ఈ గొప్ప అవకాశంతో రాష్ట్ర ప్రతిష్ఠను, ఆర్థిక అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేలా ప్రభుత్వం పనిచేయాలి. అలాగే, ప్రతిపక్ష పార్టీలు ఈ ఓటమితో నిరాశలో కూరుకుపో కుండా నిత్యం జనంలో తిరుగుతూ వారితో మమేకమవ్వాలి. ఓటమికి కారణాలను ఆత్మ పరిశీలన చేసుకుంటూ ప్రజలకు దగ్గరయ్యేం దుకు మరింత చొరవతో పనిచేయాలి. పాల నలో ప్రభుత్వానికి సహకరిస్తూ నిర్మాణాత్మక సూచనలు, సలహాలుఇస్తూ ముందుకెళ్లే దిశ గా ప్రయత్నం చేయాలి. ఎన్నికల్లో గెలుపోట ములు సహజం. సమైక్య రాష్ట్రంలో ప్రభు త్వాల పాలనలో తెలంగాణ గ్రామీణ ప్రజలు చాలా బలహీనపడిపోయారు. తెలంగాణ రాష్ట్రం కల సాకారమయ్యాక ఏర్పడిన ప్రభు త్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు, సబ్సిడీలు కల్పించాల్సిన అవసరాన్ని గుర్తించి.. వాటితో ప్రజలకు ఉపశమనం కలిగించింది. ఈతరు ణంలో తెలంగాణ ఓటరు ఇచ్చిన ఈగొప్ప విజయాన్నిస్ఫూర్తిగా తీసుకొని మరిన్ని సంక్షే మ కార్యక్రమాలు, సబ్సిడీలను కొనసాగించే దిశగా చర్యలు తీసుకుంటూనే ప్రజాకాం క్షలకు అద్దంపట్టేలా పాలన కొనసాగించాలి. దేశంలో ప్రతీ ఒక్కరూ తమ గురించి తామే ఆలోచించు కుంటున్నారు. సామూహిక పోరా టాలపై క్రమంగా విశ్వాసం సడలిపోతోంది. ఏప్రాంతం వారు ఆ ప్రాంతం గురించే ఆలో చించుకొనే ధోరణులు కనబడుతున్నాయి. ఇలాంటి పరిణామం ప్రజాస్వామ్య మను గడకు మంచిది కాదు. ఓవిశాలమైన దృక్ప థంతో ప్రతిఒక్కరూ ముందుకెళ్లాలి. రాజకీయ పార్టీలు కూడా సామూహికమైన అంశాలను తీసుకొని రాజకీయ ఉద్యమాలు చేపట్టాలి. అప్పుడే సామూహిక చైతన్యం వస్తుంది. సామూహిక ఉద్యమాలపై ప్రజల్లో నమ్మకం పెంచాలి. గెలుపు అనేది మనిషిలో కొత్త మార్పులను తీసుకొస్తుంది. దాంతో వచ్చిన పరిణామాలను సమతుల్యం చేసుకుంటూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలవ గలిగే వాడే గొప్ప నాయకుడు కాగలుగుతాడు. ఇప్పటి వరకు కేసీఆర్‌ సర్కార్‌ చేసిన అభి వృద్ధి పనులకు అభినందనలు. వచ్చే ఐదేండ్ల లో అభివృద్ధిపై కేంద్రీకరించండి. ఏయే అం శాలు ఆర్థిక రంగాన్ని పురోగమింప జేస్తాయో వాటిపై దృష్టి పెట్టండి. తెలంగాణ సమాజ శ్రేయస్సు కోసం ప్రభుత్వం చేపట్టే ఏ కార్యక్ర మంలోనైనా ప్రజాస్వామికవాదుల సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది.
కొత్త ప్రభుత్వానివి పాతవిధానాలేనా.. మార్పుంటుందా?
కారణాలు ఏవైనాగానీ, కారకులు ఎవరైనాగానీ, తెలంగాణ రాష్ట్ర సమితి మరొ కసారి పూర్ణ బహుమతి పొంది, ప్రభు త్వాన్ని ఏర్ప రచనున్నది. తెలంగాణ ప్రజా ఆకాంక్ష లలో, ఉద్యమ నినాదాల్లో అత్యధిక భాగాన్ని నెరవేర్చని పాలనానుభవంతో ఈ విజయం ఎలా సాధ్యమయిందని ప్రశ్నలు రావచ్చు. కౌలురైతులు, ఉద్యోగులు, కార్మి కులు, నిరు ద్యోగులు, ఆదివాసులు, ప్రజాఉద్యమ కార్య కర్తలు వంటి వివిధ ప్రజాసమూహాల అసం తృప్తిని మూట గట్టుకున్న తర్వాత కూడ ఈ విజయం ఎలా సాధ్యమయిందని సందేహాలు మిగలవచ్చు. ఎన్నికల ప్రచార సమయంలో మరొకసారి వినియోగించిన, రెచ్చగొట్టిన తెలంగాణ సెంటిమెంట్‌ ఈ విజయానికి కార ణం అనుకోవచ్చు. ప్రత్యర్థులకు విశ్వసనీయత లేకపోవడం, తప్పుడు వ్యూహాలు కారణమను కోవచ్చు. లేదా, పెన్షన్లు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ వంటి సంక్షేమ పథకాల లబ్ధిదా రులు పూర్తిగానూ, రైతుబంధు, రైతుబీమా లబ్ధిదారులు, నీటిపారుదల పథకాల కలలు కంటున్నవారు కొంతవరకు టీఆర్‌ఎస్‌కు వోటు వేశారనుకోవచ్చు. ఈఎన్నికల ఫలి తాలు ఎలా ఉన్నా, తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి నంతవరకు రానున్న ప్రభుత్వం ముందున్న సవాళ్లు, అవకాశాలు, కర్తవ్యాలు ఏమిటో చర్చించుకోవలసి ఉన్నది. ఇదేదో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం కోసం కాదు. అది ఈవిజయానికి తప్పనిసరిగా తనవిధానా లకు ప్రజల సంపూర్ణ ఆమోదం అనే తప్పుడు అర్థం చెపుతుంది. గత నాలు గున్నరేండ్ల పాల నలో అమలు చేసిన విధానా లనే యథాత థంగా కొనసాగిస్తుంది. కాని నిరంతర జాగ రూకతే ప్రజాస్వామ్యానికి చెల్లించవలసిన మూల్యం అనే విలువను నమ్మితే ప్రజానీకం నిరం తర జాగరూకంగా ఉండవలసిన అంశాలు ఇవి.
పెరిగిపోయిన రుణభారాన్ని తగ్గిం చడం, ప్రభుత్వవ్యయం పెరుగుదలను అరిక ట్టడం, విద్యారంగ అభివృద్ధి, పారిశ్రామి కాభి వృద్ధి, తద్వారానూ ఇతరంగానూ నిరు ద్యోగ సమస్య తగ్గింపు, అసంతృప్త వర్గాల సమ్మతిని చూరగొనడం వంటి ప్రధానమైన సవాళ్లు కొత్త టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముందున్నాయి. తెలం గాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రుణభారంలో తనవంతు వాటా గా రూ.61,711కోట్ల అప్పుతో ప్రారంభమ యింది. నాలుగేండ్లలో ఆ అప్పు రెండు లక్షల కోట్ల రూపాయలకు చేరింది. ఇది రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో నిష్పత్తిగా చూస్తే చట్టం అనుమ తించిన పరిధిలోపలే ఉన్నదనో, ఆఅప్పులను అభివృద్ధి పథకాలకే ఖర్చు పెడుతు న్నామనో టీఆర్‌ఎస్‌ చెప్పుకున్నది గాని బహుశా దేశం మొత్తంలోనే ఇంత తక్కువ కాలంలో ఇంత ఎక్కువ అప్పు చేసిన రాష్ట్ర ప్రభుత్వం మరొకటి లేదు. ఈఅప్పును కేంద్ర ప్రభుత్వ ఎఫ్‌ ఆర్‌బిఎం చట్టపు నిబంధనలకు లోబడే చేస్తు న్నామని ప్రభుత్వం పదే పదే చెప్పుకున్నది. అలా అది చట్టబద్ధంగా కనిపించి నప్పటికీ న్యాయబ ద్ధమైనది మాత్రం కాదు. ఎందుకంటే కాలం గడిచిన కొద్దీ తెచ్చిన అప్పంతా పాతఅప్పుల అసలు, వడ్డీల చెల్లింపుల కోసం మాత్రమే వెచ్చించవలసిన రుణభారపు విషవలయంలోకి రాష్ట్రం చేరుతుంది. ఆ అనుభవం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల, రాష్ట్రాల ప్రభుత్వాలకు ఉన్నదే. చివరికి స్వయంగా కంట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) తన 2018 నివేదికలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాత అప్పులు తీర్చడానికే కొత్త అప్పులు చేస్తున్నదని కూడ నిర్ధారిం చింది. కనుక కొత్త ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిశీలించవలసిన సవాల్‌ తన అప్పుల విధానాన్ని సమీక్షించుకోవడం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో అంతర్గత వనరుల సేకరణ సాధ్యం కాని అనివార్య పరిస్థితి లో మాత్రమే అప్పుకు వెళ్లాలని, అలా అప్పుకు వెళ్లేప్పుడైనా తక్కువ వడ్డీ అప్పులకే ప్రాధాన్యం ఇవ్వాలని తనకు తాను ముందస్తు జాగ్రత్త విధించు కోకపోతే, గత అనుభవాన్ని యథాతథంగా కొనసాగిస్తే రానున్న పదవీకాలంలో రాష్ట్ర ప్రజల మీద రుణభారం ఏనాలుగైదు లక్షల కోట్ల రూపాయలకో చేరి, రాష్ట్ర ఆర్థికవ్యవస్థ ఎన్నటికీ కోలుకోలేని స్థితికి చేరుకుంటుంది.
అలాగే ప్రభుత్వ వ్యయం పెరుగుదలను అరికట్టడం, ఇప్పటి వరకూ సాగుతున్న ప్రభుత్వ వ్యయాన్ని నిర్మొహమాటంగా సమీక్షించి, అనవసర, దుబారా వ్యయాన్ని తగ్గించడం, అవసరమైన రంగాలలో వ్యయాన్ని పెంచడం అనే ప్రక్రియ నిరంతరం జరగవలసి ఉంది. గత నాలుగున్నరేండ్ల టీఆర్‌ఎస్‌ పాలనానుభవంలో అటువంటి సమీక్ష జరిగిందో లేదో తెలియదు. కాని ప్రభుత్వ వ్యయం మాత్రం నానాటికీ పెరిగిపోయింది. అది కూడ ప్రజావసరాల మీద, ఉపాధి అవకా శాలను, ఆదాయ వనరులను పెంచే ఉత్పాదక పథకాల మీద కాకుండా వథా వ్యయంగా సాగింది. ఆడంబరాల కోసం, రక్షణ పేరు మీద పటాటోపాల కోసం సాగింది. ఎన్నికల సమయంలో ప్రజలను ఆకర్షిం చడానికి ఇచ్చే ప్రలోభాలకూ తాయిలాలకూ మరొక రూపుగా సంక్షేమ పథకాలను తయారు చేసి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుబారా చేయడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రోజుల నుంచి చూసినా ఎన్నడూ లేనంత ఎక్కువగా పోలీసు వ్యవస్థను దగ్గరికి తీసి, వారు అడిగినవీ, అడగనివీ కూడ ఇచ్చి వేలకోట్ల రూపాయలు దుబారా చేయడం జరిగింది.
ఇలా గత నాలుగున్నరేండ్లలో చేసిన ప్రభుత్వ వ్యయాన్నంతా ఒక్కసారి సమీక్షించి, వాటిలో ఏపద్దుల మీద కోత విధించవచ్చు, ఏ పద్దులను రద్దు చేయవచ్చు, ఏపద్దుల మీద వ్యయాన్ని పెంచవలసిన అవసరం ఉంది అని ఒకవివరమైన మదింపు అవసరం ఉంది. అది జరిగినప్పుడే, ప్రజలు చెల్లిస్తున్న పన్నులు, ప్రభుత్వానికి ఒనగూరు తున్న నిధులు సక్రమ వినియోగంలోకి వస్తాయి. అలా కాక, గతంలో కొనసాగిన విధానాలనే కొనసాగించవచ్చునని అనుకుంటే ఈ పదవీ కాలం ముగిసి, తర్వాతి పదవీకాలానికి వారే అధికారానికి వచ్చినా, మరొకరు అధికారానికి వచ్చినా ఆర్థిక వ్యవస్థను నిర్వహించలేని దుస్థితి ఏర్పడుతుంది. ఐదేండ్ల కొరకు ప్రజాధనానికి ధర్మకర్తగా ఉండవలసిన ప్రభుత్వానికి దాన్ని దుర్వినియోగం చేసే హక్కు లేదు. విద్యారంగ అభివృద్ధి విషయంలో గత నాలుగున్న రేండ్లలో కొన్ని గురుకులాలు ఏర్పాటు చేయడం మినహా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసినది చాల తక్కువ. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అనే నినాదం నాలుగున్నరేండ్లలో అటకెక్కింది. ఈపదవీకాలంలోనైనా ఆనినాదాన్ని సాకారం చేసే చర్యలు తీసుకోవలసి ఉంది. ఉపాధ్యాయుల నియామకం, పాఠశాలల మౌలిక సౌకర్యాలు మెరుగుపరచడం, ఎక్కువమంది పిల్లలను ప్రభుత్వ పాఠశా లలకు పంపేలా తల్లిదండ్రులను ప్రోత్సహించడం, సమాజంలో ప్రభు త్వ విద్యపట్ల ఆదరణ పెంచడం, ప్రభుత్వ పాఠశాలల పనితీరును మెరుగుపరచడం వంటి ఎన్నో చర్యలు తీసుకోవలసి ఉంది. విద్యా పరంగానూ, ఆర్థికంగానూ, సామాజికంగానూ, సాంస్కృతికంగానూ దుష్పరిణామాలకు దారి తీస్తున్న కార్పొరేట్‌ విద్యావ్యాపార సంస్థల ఉక్కు పిడికిలి నుంచి ఇంటర్మీడియట్‌ వ్యవస్థకు విముక్తి కలిగించడం, డిగ్రీ కళాశాలలను, యూనివర్సిటీలను బలోపే తం చేసి, ఎక్కువ నిధు లు కేటాయించి, మొత్తంగా ఉన్నత విద్యావ్యవస్థను తెలంగాణ అవస రాలు తీర్చేలా మెరుగు పరచడం ఈప్రభుత్వం ముందున్న సవాళ్లు. ఈ సవాళ్లను పరిష్కరించకుండా, గతనాలుగున్నరేండ్లలో అమలు చేసిన విధానాలనే కొనసాగిస్తే ఈ పదవీకాలం ముగిసేనాటికి తెలం గాణ రాష్ట్రం ప్రయివేట్‌ విద్యా వ్యాపారుల ఇష్టారాజ్యపు క్రీడాస్థలిగా మారిపోతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏవిద్యావకాశాలు కోల్పోయామని తెలంగాణ ప్రజానీకం తపన పడి ప్రత్యేక రాష్ట్రం కోరుకు న్నారో, అంతకు మించిన దుస్థితి తలెత్తు తుంది. టీఆర్‌ఎస్‌ మొదటి పదవీకాలంలో నాలుగున్నరేండ్ల పాటు పారిశ్రామికాభివృద్ధికి చేసినదేమీ లేదనే చెప్పాలి. అంతకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో మూసివేసిన తెలంగాణ పరిశ్రమలను పునరుద్ధరి స్తామని ఉద్యమకాలంలో చేసిన వాగ్దానాలను నెరవేర్చలేదు. కొన్ని ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కంపెనీలను ఆహ్వానించడం, వారికి రాయితీలు, సౌకర్యాలు ఇవ్వడం మినహా నిజంగా పారిశ్రామికాభివృద్ధి అని చెప్పదగిన పనులేవీ జరగలేదు. ఐటీ పరిశ్రమ స్వాభావికంగానే తెలంగాణ నిరుద్యోగులకు మాత్రమే ఉద్యోగకల్పన చేసే శక్తి ఉన్నది కాదు. రాయితీల వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఒరిగినదేమీ లేదు. పారిశ్రామిక ఉత్పత్తులను తయారుచేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దోహదం చేయడం, విరివిగా ఉద్యోగకల్పనకు అవకాశం ఇవ్వడం, నెలకొన్న ప్రాంతంలో మరెన్నో అనుబంధ పరిశ్రమలకు, చిన్న తరహా పరిశ్రమలకు, సేవా రంగ సంస్థలకు అవకాశం ఇవ్వడం పారిశ్రామికాభివృద్ధి ఫలితాలు కావాలి. అటువంటి పరిశ్రమలకు అవసరమైన ఖనిజ, అటవీ, వ్యవసాయ, జల, విద్యుత్‌,రవాణా వనరులన్నీ తెలంగాణలో విస్తారంగా ఉన్నాయి. మానవశక్తికైతే కొదవలేదు. కాని గత నాలుగున్నరేండ్లలో ఇటువంటి సమగ్ర విస్తత అభివ ృద్ధికి దారితీసే ఒక్క పరిశ్రమ ఏర్పాటు కూడా జరగలేదు. రానున్న పదవీకాలంలో ప్రభుత్వ రంగంలోనైనా, సంయుక్త రంగంలోనైనా, తప్పదనుకుంటే ప్రయివేటు రంగంలోనైనా ఇటువంటి పారిశ్రామికాభివృద్ధికి పూనుకోక పోతే, నిరుద్యోగం పెరుగుతుంది. రాష్ట్ర ఆర్థికవ్యవస్థకు ఆదాయం, పన్ను ఆదాయం పెరిగే వనరులు తగ్గిపోతాయి. నిరుద్యోగ సమస్యను తగ్గించడంలో పారిశ్రామికాభివృద్ధి ఒక కోణమైతే, అంతకు మించి ప్రభుత్వం చేయదగిన పనులు ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వోద్యోగాల ఖాళీలను భర్తీ చేయడం, జిల్లాల విభజన వల్ల అవసరమైన కొత్త ఉద్యోగాలను నింపడం, పదవీ విరమణ వల్ల ఏర్పడుతున్న ఖాళీలను వెంటవెంటనే భర్తీ చేయడం, ఉద్యోగ కల్పనా సంస్థలను ప్రోత్సహించడం, స్వయం ఉపాధి పథకాలు ఇబ్బడి ముబ్బడిగా రూపొందించడం తెలంగాణ ప్రభుత్వం చేయ వలసిన పనులు. కాని తన మొదటి పదవీకాలంలో టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం ఉద్యోగ కల్పనకు ఇవ్వవలసిన కనీస ప్రాధాన్యత కూడ ఇవ్వలేదు. ఉద్యమ కాలంలో ప్రధాన ఆకాంక్షగా ఉండిన ఉద్యోగకల్పన కోరికను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించు కోలేదు. రెండు, రెండున్నర లక్షల ఉద్యోగాలు రావచ్చునని ఉద్యమ సమ యంలో కన్న కలలను, ఒక లక్షా ఏడు వేలకు కుదించి, నాలుగున్న రేండ్లలో ఇరవై వేలఖాళీలు కూడా నింపని ఘనచరిత్ర టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిది. ఉన్న ఖాళీలన్నిటికి నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం, చివరికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చివరిరోజుల్లో వెలువడబోతున్న నోటిఫికేషన్‌ను ఆపు చేయించి, మేము రాగానే ఇస్తాము అని బీరాలు పలికి, నాలుగున్నరేండ్లు గడిచినా కనీసం ఆనోటిఫికేషన్‌ కూడా ఇవ్వని చరిత్ర టీఆర్‌ఎస్‌ పాలనది. కొత్త ప్రభుత్వం ఆ పాతవిధానాన్నే కొనసాగిస్తే నిరు ద్యోగుల నుంచి, ప్రజల నుంచి మరింత అసంతృప్తి మూటగ ట్టుకోవడం మాత్రమే అవుతుంది.
ఇవాళ సెంటిమెంటును రెచ్చగొట్టిఓట్లు, స్థానాలు సంపాంచ గలిగినా, గత పాలన ఎన్నోప్రజా సమూహాలను అసంతృప్తికి గురి చేసింది. ఆ అసంతృప్తి ఇవాళ వోట్లుగా మారి ఉండక పోవచ్చుగాని, రానున్న పాలనాకాలంలో ఆఅసంతృప్త సమూహాలను బుజ్జగించడా నికి, వారి ఆకాంక్షలను తీర్చడానికి ప్రయత్నించకపోతే ఆ అసంతృప్తి ఇతర రూపాల్లో విస్ఫోటనమవుతుంది. మరొకపక్క వారి ఆకాంక్షలను తీర్చడ మంటే తాయిలాలు ఇవ్వడమనో, ప్రభుత్వ వ్యయం పెంచడమనో అర్థం చెప్పుకుంటే అది మరిన్ని సమస్యలకు దారి తీస్తుంది. ఈప్రత్యక్ష ఆర్థిక సవాళ్లతో పాటు పరోక్షంగా ప్రభావం చూపే ఆర్థిక సవాళ్లు, అవి జనచైతన్యం మీద చూపే ప్రభావాలు ఉంటాయి. ఆప్రభావాలు ఎప్పటికప్పుడు వ్యక్త మయ్యే అవకాశాలు ఇవ్వకపోతే, అంటే వాక్సభాస్వాతంత్య్రాల మీద ఆంక్షలు విధిస్తే, గత పాలనాకాలంలో ప్రవర్తించినట్టు ప్రవర్తిస్తే, ఈ గెలుపు ఓటమికి సోపానమవుతుంది.

1 5 6 7